\id ZEP - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h జెఫన్యా \toc1 జెఫన్యా ప్రవచనం \toc2 జెఫన్యా \toc3 జెఫన్యా \mt1 జెఫన్యా \mt2 ప్రవచనం \c 1 \p \v 1 ఇది యూదా రాజైన ఆమోను కుమారుడు యోషీయా పాలనలో జెఫన్యాకు యెహోవా నుండి వచ్చిన వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు, కూషీ గెదల్యా కుమారుడు, గెదల్యా అమర్యా కుమారుడు, అమర్యా హిజ్కియాకు కుమారుడు. \b \s1 యెహోవా దినాన భూమి అంతటికి తీర్పు \q1 \v 2 “భూమి మీద ఏమీ మిగలకుండా \q2 నేను సమస్తాన్ని తుడిచివేస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 3 “మనుష్యులను మృగాలను తుడిచివేస్తాను; \q2 ఆకాశంలో ఎగిరే పక్షులను, \q2 సముద్రంలోని చేపలను తుడిచివేస్తాను, \q2 దుర్మార్గులను పడిపోయేలా చేసే విగ్రహాలను తుడిచివేస్తాను.” \b \q1 “నేను మానవజాతి అంతటిని \q2 భూమి మీద ఉండకుండా చేస్తాను” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 4 “యూదా వారి మీద, \q2 యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను. \q1 ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను \q2 ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను. \q1 \v 5 మిద్దెమీద ఎక్కి \q2 ఆకాశ నక్షత్ర సమూహాన్ని పూజించేవారిని, \q1 యెహోవా పేర మోలెకు\f + \fr 1:5 \fr*\ft హెబ్రీలో \ft*\fqa మల్కాము\fqa*\f* దేవత పేర \q2 మొక్కి ఒట్టు వేసుకునేవారిని నేను నాశనం చేస్తాను. \q1 \v 6 యెహోవాను అనుసరించకుండా ప్రక్కకు తిరిగినవారిని \q2 ఆయనను వెదకకుండ, ఆయన దగ్గర విచారణ చేయనివారిని నాశనం చేస్తాను.” \b \q1 \v 7 ప్రభువైన యెహోవా దినం సమీపించింది, \q2 కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. \q1 యెహోవా బలి సిద్ధం చేశారు; \q2 తాను ఆహ్వానించిన వారిని ఆయన పవిత్రపరిచారు. \b \q1 \v 8 “యెహోవా ఏర్పరచిన బలి దినాన \q2 నేను అధికారులను, రాజకుమారులను, \q1 విదేశీయుల్లా దుస్తులు \q2 వేసుకున్నవారందరిని శిక్షిస్తాను. \q1 \v 9 ఆ రోజున, ఇంటి గుమ్మం\f + \fr 1:9 \fr*\ft \+xt 1 సమూ 5:5\+xt*\ft*\f* దాటివచ్చి, \q2 తమ దేవతల మందిరాన్ని హింసతో \q2 మోసంతో నింపేవారందరినీ నేను శిక్షిస్తాను. \b \q1 \v 10 “ఆ దినాన యెరూషలేములో ఉన్న \q2 చేప ద్వారం నుండి ఏడుపు, \q1 పట్టణ దిగువ భాగం నుండి రోదన, \q2 కొండల దిక్కునుండి గొప్ప నాశనం వస్తుంది, \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 11 వర్తక ప్రాంతంలో\f + \fr 1:11 \fr*\ft లేదా \ft*\fqa మోర్తారు\fqa*\f* నివసించేవారలారా! రోదించండి; \q2 నీ వర్తకులంతా తుడిచివేయబడతారు, \q2 వెండితో వ్యాపారం చేసేవారంతా నాశనం చేయబడతారు. \q1 \v 12 ఆ కాలంలో నేను దీపాలు పట్టుకుని యెరూషలేమును సోదా చేస్తాను, \q2 మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం లాంటివారై \q2 ‘యెహోవా మేలు గాని కీడు గాని ఏదీ చేయడు’ అనుకుంటూ, \q1 ఆత్మసంతృప్తితో ఉన్నవారిని \q2 నేను శిక్షిస్తాను. \q1 \v 13 వారి ధనం దోపిడి అవుతుంది, \q2 వారి ఇల్లు పాడవుతాయి. \q1 వారు ఇళ్ళు కట్టుకున్నా \q2 వాటిలో నివసించలేరు; \q1 వారు ద్రాక్షతోటలు నాటినా \q2 వాటి ద్రాక్షరసం త్రాగలేరు.” \b \q1 \v 14 యెహోవా మహాదినం సమీపంగా ఉంది, \q2 అది ఆసన్నమై త్వరగా రాబోతుంది. \q1 యెహోవా దినాన ఏడ్పు భయంకరంగా ఉంటుంది; \q2 ఆ దినాన బలాఢ్యులు ఘోరంగా ఏడుస్తారు. \q1 \v 15 ఆ దినం ఉగ్రత దినం; \q2 బాధ, వేదన కలుగుతుంది. \q3 అది నాశనం, ధ్వంసం, \q2 చీకటి అంధకారం కమ్మే దినం, \q3 మబ్బులు, గాఢాంధకారం కమ్మే రోజు. \q2 \v 16 ప్రాకార పట్టణాల దగ్గర \q1 ఎత్తైన గోపురాల దగ్గర యుద్ధఘోష, \q2 బాకానాదం వినబడే రోజు. \b \q1 \v 17 “ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, \q2 కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా \q2 వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు. \q1 వారి రక్తం దుమ్ములా, \q2 వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది. \q1 \v 18 యెహోవా ఉగ్రత దినాన \q2 వారి వెండి బంగారాలు \q2 వారిని తప్పించలేవు.” \b \q1 ఆయన రోషాగ్ని చేత \q2 లోకమంతా దగ్దమవుతుంది, \q1 ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ \q2 సర్వనాశనం చేయబోతున్నారు. \c 2 \s1 దేశాలతో పాటు యూదా యెరూషలేము కూడా తీర్పుకు గురయ్యాయి \s2 పశ్చాత్తాపపడాలని యూదాకు పిలుపు \q1 \v 1 సిగ్గుమాలిన దేశమా, \q2 సమకూడండి, మిమ్మల్ని మీరు సమకూర్చుకొండి \q1 \v 2 శాసనం అమలులోకి రాకముందే \q2 ఆ దినం గాలికి కొట్టుకుపోయే పొట్టులా కనుమరుగు కాక ముందే, \q1 యెహోవా కోపాగ్ని \q2 మీ మీదికి రాకముందే, \q1 యెహోవా ఉగ్రత దినం \q2 మీ మీదికి రాకముందే సమకూడండి. \q1 \v 3 దేశంలోని సమస్త దీనులారా, \q2 ఆయన ఆజ్ఞను పాటించేవారలారా, యెహోవాను వెదకండి. \q1 నీతిని వెదకండి, దీనత్వాన్ని వెదకండి; \q2 యెహోవా కోప్పడే దినాన \q2 బహుశ మీకు ఆశ్రయం దొరకవచ్చు. \s2 ఫిలిష్తీయ \q1 \v 4 గాజా విడిచిపెట్టబడుతుంది, \q2 అష్కెలోను పాడైపోతుంది. \q1 మధ్యాహ్న సమయంలో అష్డోదు ఖాళీ చేయబడుతుంది, \q2 ఎక్రోను పట్టణం పెళ్ళగించబడుతుంది. \q1 \v 5 సముద్రతీరాన కాపురమున్న \q2 కెరేతీయులారా! మీకు శ్రమ. \q1 ఫిలిష్తీయ ప్రజలు కాపురమున్న కనాను దేశమా! \q2 యెహోవా వాక్కు నీకు వ్యతిరేకంగా ఉంది, \q1 “నీలో ఎవరూ మిగలకుండా \q2 నేను నిన్ను నాశనం చేస్తాను” అని ఆయన అంటున్నారు. \q1 \v 6 సముద్రతీరాన ఉన్న దేశం, \q2 గొర్రెల కాపరులకు పచ్చికబయళ్లుగా అవుతుంది; \q2 బావులు, మందల కోసం దొడ్లు ఉంటాయి. \q1 \v 7 ఆ ప్రాంతం యూదా వంశంలో \q2 మిగిలిన వారికి స్వాధీనం అవుతుంది. \q2 వారి దేవుడు యెహోవా వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు, \q1 వారు బందీలుగా వెళ్లిన స్థలాల నుండి \q2 ఆయన వారిని రప్పిస్తారు. \q1 వారు ఆ ప్రాంతంలో తమ మందలు మేపుతారు. \q2 సాయంకాల సమయంలో అష్కెలోను ఇళ్ళలో పడుకుంటారు. \s2 మోయాబు, అమ్మోను \q1 \v 8 “నా ప్రజల ప్రాంతంలోకి ప్రవేశించి \q2 వారిని దూషించిన, \q1 మోయాబు వారు చేసిన అవమానాల గురించి, \q2 అమ్మోనీయుల దూషణల గురించి నేను విన్నాను. \q1 \v 9 కాబట్టి, నా జీవం తోడు, \q2 మోయాబు సొదొమలా, \q2 అమ్మోను గొమొర్రాలా అవుతుంది. \q1 కలుపు మొక్కలు ఉప్పు గుంటలతో, \q2 అవి ఎప్పటికీ బంజరు భూమిగానే ఉంటాయి. \q1 నా ప్రజల్లో శేషించినవారు వారిని దోచుకుంటారు; \q2 నా దేశంలో బ్రతికినవారు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారు” \q1 అని ఇశ్రాయేలు దేవుడైన \q2 సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 10 ఈ విధంగా వారు గర్వంతో, \q2 సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు, \q2 ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు. \q1 \v 11 ఆయన భూమ్మీద ఉన్న దేవతలందరినీ నాశనం చేసినప్పుడు \q2 యెహోవా వారికి భయంకరంగా ఉంటాడు. \q1 ద్వీపాల్లో నివసించే జనులంతా తమ స్థలాల నుండి, \q2 ఆయనకు నమస్కారం చేస్తారు. \s2 కూషు \q1 \v 12 “కూషీయులారా, మీరు కూడా \q2 నా ఖడ్గం చేత చంపబడతారు.” \s2 అష్షూరు \q1 \v 13 ఆయన తన చేయి ఉత్తరం వైపు చాచి \q2 అష్షూరును నాశనం చేస్తారు. \q1 నీనెవెను పూర్తిగా నిర్జనమై \q2 ఎడారిలా ఎండిపోయేలా చేస్తారు. \q1 \v 14 గొర్రెల మందలు, పశువుల మందలు, \q2 దేశంలోని అన్ని రకాల జీవులు అక్కడ పడుకుంటాయి. \q1 ఎడారి గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ \q2 దాని స్తంభాలపై కూర్చుంటాయి. \q1 వారి కూత కిటికీల గుండా ప్రతిధ్వనిస్తుంది, \q2 రాళ్లతో తలుపులు నిండిపోతాయి, \q2 దేవదారు దూలాలు నాశనమవుతాయి. \q1 \v 15 ఇది క్షేమకరమైన \q2 ఆనందకరమైన పట్టణము. \q1 ఆమె తనలో తాను, \q2 “నా వంటి పట్టణం మరొకటి లేదని అనుకున్నది. \q1 ఆమె ఎంతగా పాడైపోయింది,” \q2 క్రూరమృగాలకు గుహలా మారింది! \q1 ఆ దారి గుండా వెళ్లే వారందరూ \q2 ఎగతాళి చేస్తూ చేతులు ఆడిస్తున్నారు. \c 3 \s2 యెరూషలేము \q1 \v 1 అణచివేత, తిరుగుబాటుతనం, \q2 అపవిత్రత నిండిన పట్టణానికి శ్రమ! \q1 \v 2 ఆమె ఎవరికీ లోబడదు, \q2 ఆమె దిద్దుబాటును అంగీకరించదు. \q1 ఆమె యెహోవా మీద నమ్మకముంచదు, \q2 ఆమె తన దేవున్ని సమీపించదు. \q1 \v 3 దానిలో ఉన్న అధికారులు \q2 గర్జించే సింహాలు; \q1 దాని పాలకులు రాత్రివేళ తిరుగుతూ, \q2 ఉదయానికి ఏమీ మిగల్చకుండా తినే తోడేళ్లు. \q1 \v 4 దాని ప్రవక్తలు నీతిలేనివారు; \q2 వారు నమ్మకద్రోహులు. \q1 దాని యాజకులు పరిశుద్ధస్థలాన్ని అపవిత్రం చేస్తారు \q2 ధర్మశాస్త్రాన్ని హింసిస్తారు. \q1 \v 5 అయితే యెహోవా నీతిమంతుడు; \q2 ఆయన తప్పు చేయరు. \q1 అనుదినం ఆయన మానకుండా, \q2 ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు, \q2 అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు. \s2 పశ్చాత్తాపపడని యెరూషలేము \q1 \v 6 “నేను దేశాలను నాశనం చేశాను; \q2 వాటి కోటలు పడగొట్టబడ్డాయి. \q1 నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను, \q2 ఎవరూ వాటి గుండా వెళ్లరు. \q1 వాటిలో ఎవరూ నివసించకుండా \q2 వారి పట్టణాలను నిర్జనంగా చేశాను. \q1 \v 7 నేను యెరూషలేము గురించి, \q2 ‘ఖచ్చితంగా నీవు నాకు భయపడి \q2 దిద్దుబాటును అంగీకరిస్తావు! \q1 అప్పుడు దాని ఆశ్రయ స్థలం\f + \fr 3:7 \fr*\ft లేదా \ft*\fqa పరిశుద్ధాలయం\fqa*\f* నాశనం చేయబడదు, \q2 నా శిక్షలేవీ దాని మీదికి\f + \fr 3:7 \fr*\ft లేదా \ft*\fqa నేను దాని మీదికి నియమించినవన్నీ\fqa*\f* రావు’ అని అనుకున్నాను. \q1 కాని వారు అన్ని రకాల \q2 చెడుపనులు చేయాలని ఆతృతగా ఉన్నారు. \q1 \v 8 కాబట్టి నా కోసం వేచి ఉండండి,” \q2 అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. \q2 “నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడే రోజు కోసం వేచి ఉండండి.\f + \fr 3:8 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa దోచుకోడానికి లేస్తాను\fqa*\f* \q1 నేను దేశాలను పోగుచేయాలని, \q2 రాజ్యాలను సమకూర్చాలని \q1 వాటి మీద నా ఉగ్రతను \q2 నా కోపాగ్ని అంతటిని కుమ్మరించాలని నిర్ణయించుకున్నాను. \q1 రోషంతో కూడిన నా కోపానికి \q2 లోకమంతా దహించబడుతుంది. \s1 మిగిలి ఉన్న ఇశ్రాయేలును పునరుద్ధరించుట \q1 \v 9 “నేను ప్రజల పెదవులను శుద్ధి చేస్తాను, \q2 అప్పుడు వారంతా యెహోవా నామానికి మొరపెట్టి \q2 ఏక మనసుతో ఆయనను సేవిస్తారు. \q1 \v 10 చెదిరిపోయిన నన్ను ఆరాధించే నా ప్రజలు \q2 కూషు\f + \fr 3:10 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం\ft*\f* నదుల అవతల నుండి \q2 నాకు అర్పణలు తెస్తారు. \q1 \v 11 ఆ దినాన యెరూషలేమా, \q2 నీవు నా మీద తిరుగబడి చేసిన పనుల గురించి నీవు సిగ్గుపడవు, \q1 ఎందుకంటే నీ గర్వాన్ని బట్టి సంతోషించేవారిని \q2 నేను నీలో నుండి తొలగిస్తాను. \q1 నా పరిశుద్ధ కొండపై \q2 ఇంకెప్పుడు నీవు గర్వపడవు. \q1 \v 12 అయితే నేను మీలో \q2 సాత్వికులను, దీనులను వదిలివేస్తాను. \q1 ఇశ్రాయేలులో మిగిలినవారు \q2 యెహోవా నామాన్ని నమ్ముతారు. \q1 \v 13 ఇశ్రాయేలులో మిగిలినవారు ఏ తప్పు చేయరు; \q2 వారు అబద్ధాలు చెప్పరు. \q1 మోసపూరిత నాలుక \q2 వారి నోళ్లలో ఉండదు. \q1 వారు తిని పడుకుంటారు \q2 వారికి ఎవరి భయం ఉండదు.” \b \q1 \v 14 సీయోను కుమారీ, పాట పాడు; \q2 ఇశ్రాయేలూ, బిగ్గరగా కేకవేయి! \q1 యెరూషలేము కుమారీ, \q2 నీ పూర్ణహృదయంతో సంతోషించి ఆనందించు! \q1 \v 15 యెహోవా నీ శిక్షను తొలగించారు, \q2 నీ శత్రువును తిప్పికొట్టారు. \q1 ఇశ్రాయేలు రాజైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు; \q2 ఇంకెప్పుడు ఏ హానికి నీవు భయపడవు. \q1 \v 16 ఆ రోజున \q2 వారు యెరూషలేముతో, \q1 “సీయోనూ, భయపడకు; \q2 నీ చేతులను బలహీన పడనివ్వవద్దు. \q1 \v 17 నీ దేవుడైన యెహోవా, \q2 రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు. \q1 ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు; \q2 ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు, \q2 పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు.” \b \q1 \v 18 “నీ నియమించబడిన పండుగలకు రాలేక దుఃఖించే వారందరినీ \q2 నేను మీ మధ్య నుండి తొలగిస్తాను. \q2 వారు మీకు భారంగా నిందగా ఉన్నారు. \q1 \v 19 ఆ సమయంలో \q2 నిన్ను హింసించిన వారందరిని నేను శిక్షిస్తాను. \q1 కుంటివారిని నేను రక్షిస్తాను; \q2 చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. \q1 వారు అవమానానికి గురైన ప్రతి దేశంలో \q2 నేను వారికి కీర్తిని, ఘనతను ఇస్తాను. \q1 \v 20 ఆ సమయంలో నేను మిమ్మల్ని సమకూర్చుతాను; \q2 ఆ సమయంలో నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువస్తాను. \q1 నేను మిమ్మల్ని \q2 చెరలో నుండి తిరిగి తీసుకువచ్చినప్పుడు \q1 భూమ్మీద ఉన్న ప్రజలందరిలో \q2 నేను మీకు కీర్తిని, ఘనతను ఇస్తాను” \q2 అని యెహోవా అంటున్నారు.