\id ZEC - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h జెకర్యా \toc1 జెకర్యా ప్రవచనం \toc2 జెకర్యా \toc3 జెకర్యా \mt1 జెకర్యా \mt2 ప్రవచనం \c 1 \s1 యెహోవా వైపు తిరగమని పిలుపు \p \v 1 దర్యావేషు పరిపాలన రెండవ సంవత్సరం ఎనిమిదో నెలలో, ఇద్దో కుమారుడు బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు: \p \v 2 “యెహోవా మీ పూర్వికుల మీద చాలా కోపంగా ఉన్నారు. \v 3 కాబట్టి నీవు ఈ ప్రజలతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను’ అని సైన్యాల యెహోవా అంటున్నారు. \v 4 ప్రవక్తలు మీ పూర్వికులతో, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ చెడు అలవాట్లన్నింటినీ మానుకోండి’ అని చెప్పినప్పుడు వినని, పట్టించుకోని మీ పూర్వికుల్లా మీరు ఉండకండి, అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 5 ఇప్పుడు మీ పూర్వికులు ఏమయ్యారు? ఆ ప్రవక్తలు ఏమయ్యారు, వారు ఎల్లకాలం బ్రతికి ఉంటారా? \v 6 అయితే నా సేవకులైన ప్రవక్తలకు నేను ఆదేశించిన మాటలు శాసనాలు మీ పూర్వికుల విషయంలో నెరవేరలేదా? \p “అవి నెరవేరినప్పుడు వారు పశ్చాత్తాపపడి, ‘మన ప్రవర్తనకు మన పనులకు తగినట్లుగా సైన్యాల యెహోవా తాను చేయాలనుకున్న ప్రకారం మనకు చేశారు’ అని చెప్పుకున్నారు.” \s1 గొంజిచెట్ల మధ్యలో ఉన్న మనిషి \p \v 7 దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం శెబాతు అనే పదకొండవ నెల ఇరవై నాల్గవ రోజున ఇద్దో కుమారుడైన బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు. \p \v 8 రాత్రి సమయంలో నాకు దర్శనం వచ్చింది, అక్కడ నా ఎదుట ఎర్రని గుర్రంపై ఎక్కిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక లోయలోని గొంజిచెట్ల మధ్య నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, గోధుమరంగు గుర్రాలు, తెలుపు గుర్రాలు ఉన్నాయి. \p \v 9 అప్పుడు నేను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను. \p నాతో మాట్లాడుతున్న ఆ దూత, “అవేంటో నీకు చూపిస్తాను” అని చెప్పాడు. \p \v 10 అప్పుడు గొంజిచెట్ల మధ్యలో నిలబడిన వ్యక్తి, “ఇవి భూమి అంతా తిరగడానికి యెహోవా పంపించిన గుర్రాలు” అని చెప్పాడు. \p \v 11 వారు గొంజిచెట్ల మధ్యలో నిలబడిన యెహోవా దూతతో, “మేము లోకమంతటా తిరిగి వచ్చాము. లోకమంతా ప్రశాంతంగా సమాధానంగా ఉండడం చూశాం” అన్నారు. \p \v 12 అప్పుడు యెహోవా దూత, “సైన్యాల యెహోవా, డెబ్బై సంవత్సరాలుగా మీరు యెరూషలేము మీద, యూదా పట్టణాల మీద కోపంతో ఉన్నారు, ఇంకెన్నాళ్లు వరకు కనికరించకుండా ఉంటారు?” అని మనవి చేశాడు. \v 13 కాబట్టి నాతో మాట్లాడుతున్న ఆ దూతకు యెహోవా దయగల ఆదరణ కలిగించే మాటలు చెప్పారు. \p \v 14 ఆ తర్వాత నాతో మాట్లాడుతున్న దూత ఇలా అన్నాడు, “నీవు ఈ మాటను ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెరూషలేము, సీయోను గురించి నేనెంతో ఆసక్తి కలిగి ఉన్నాను. \v 15 నిశ్చింతగా బ్రతుకుతున్న ఇతర జాతులపై నేను చాలా కోపంగా ఉన్నాను. గతంలో నేను కొంచెమే కోప్పడ్డాను, కానీ వారు ఆ శిక్షను చాలా తీవ్రం చేసుకున్నారు.’ \p \v 16 “కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: ‘నేను కనికరంతో యెరూషలేము వైపు తిరుగుతాను, అక్కడ నా మందిరం తిరిగి కట్టబడుతుంది. యెరూషలేము మీద నిర్మాణకులు కొలతలు వేస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. \p \v 17 “ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ” \s1 నాలుగు కొమ్ములు, నలుగురు కంసాలులు \p \v 18 తర్వాత నేను పైకి చూసినప్పుడు అక్కడ నాలుగు కొమ్ములు కనిపించాయి. \v 19 నాతో మాట్లాడుతున్న దూతను, “ఇవి ఏంటి?” అని అడిగాను. \p అందుకతడు, “ఇవి యూదా, ఇశ్రాయేలు, యెరూషలేములను చెదరగొట్టిన కొమ్ములు” అని చెప్పాడు. \p \v 20 అప్పుడు యెహోవా నాకు నలుగురు కంసాలులను చూపించారు. \v 21 “వీరు ఏమి చేయడానికి వస్తున్నారు?” అని నేను అడిగాను. \p అందుకాయన, “ఎవ్వరూ తమ తల ఎత్తకుండ యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే కంసాలులు వారిని భయభ్రాంతులకు గురిచేసి, యూదా దేశంలోని ప్రజలను చెదరగొట్టడానికి తమ కొమ్ములను ఎత్తిన దేశాల కొమ్ములను పడగొట్టడానికి వచ్చారు” అని అన్నారు. \c 2 \s1 కొలమానం పట్టుకున్న వ్యక్తి \p \v 1 ఆ తర్వాత నేను పైకి చూసినప్పుడు నా ఎదుట కొలమానం పట్టుకున్న వ్యక్తి కనబడ్డాడు. \v 2 “నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని నేను అడిగాను. \p అందుకతడు, “యెరూషలేము పొడవు, వెడల్పు ఎంత ఉందో కొలిచి తెలుసుకోవడానికి వెళ్తున్నాను” అన్నాడు. \p \v 3 అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత వెళ్లిపోతుండగా, మరొక దూత అతన్ని కలుసుకోడానికి వచ్చి, \v 4 అతనితో ఇలా అన్నాడు: “నీవు ఆ యువకుని దగ్గరికి పరుగెత్తుకొని వెళ్లి ఇలా చెప్పు, ‘యెరూషలేములో మనుష్యులు పశువులు విస్తారంగా ఉన్నందుకు, అది గోడలులేని పట్టణంలా ఉంటుంది. \v 5 నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో నివసించి దానికి ఘనతగా ఉంటాను’ అని యెహోవా చెప్తున్నారు. \p \v 6 “రండి! ఉత్తర దేశం నుండి తప్పించుకుని రండి, ఆకాశం నాలుగు దిక్కులకు వీచే గాలిలా నేను మిమ్మల్ని చెదరగొట్టాను” అని యెహోవా చెప్తున్నారు. \p \v 7 “సీయోను ప్రజలారా, రండి! బబులోను దేశంలో నివసిస్తున్న మీరు తప్పించుకుని రండి!” \v 8 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మిమ్మల్ని ముట్టుకున్న వారు యెహోవా కనుగుడ్డును ముట్టినట్లే అని తలంచి తనకు ఘనత కలిగేలా మహిమాన్వితుడు మిమ్మల్ని దోచుకున్న దేశాల మీదికి నన్ను పంపించారు. \v 9 నేను వారి మీద నా చేయి ఎత్తుతాను అప్పుడు వారి బానిసలు వారిని దోచుకుంటారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు. \p \v 10 “సీయోను కుమార్తె, కేకవేయి, సంతోషించు. నేను వస్తున్నాను, మీ మధ్య నివసిస్తాను” అని యెహోవా చెప్తున్నారు. \v 11 “ఆ రోజున అనేక దేశాలు యెహోవా దగ్గరకు చేరి నా ప్రజలవుతారు. నేను మీ మధ్య నివసిస్తాను, అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు. \v 12 పరిశుద్ధ దేశంలో యెహోవా యూదాను తన స్వాస్థ్యంగా సొంతం చేసుకుంటారు, యెరూషలేమును మళ్ళీ ఎన్నుకుంటారు. \v 13 సర్వజనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నారు కాబట్టి ఆయన ఎదుట మౌనంగా ఉండండి.” \c 3 \s1 ప్రధాన యాజకునికి శుభ్రమైన వస్త్రాలు \p \v 1 అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను\f + \fr 3:1 \fr*\ft మూ.భా.లో \ft*\fq సాతాను \fq*\ft అనగా \ft*\fqa విరోధి\fqa*\f* అతని కుడి ప్రక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు. \v 2 అప్పుడు యెహోవా సాతానుతో, “సాతానా, యెహోవా నిన్ను గద్దిస్తారు! యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తారు! ఈ మనిషి మంటలో నుండి తీసిన మండుతున్న కర్రలాంటి వాడు కాదా?” అని అన్నారు. \p \v 3 అయితే యెహోషువ మురికిబట్టలు వేసుకుని దేవదూత ముందు నిలబడి ఉన్నాడు. \v 4 దూత తన ముందు నిలబడి ఉన్నవారితో, “అతని మురికిబట్టలు తీసివేయండి” అని చెప్పాడు. \p అప్పుడు అతడు యెహోషువతో, “చూడు, నేను నీ పాపాన్ని తీసివేశాను, నీకు మంచి వస్త్రాలు వేస్తాను” అన్నాడు. \p \v 5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా పెట్టండి” అని చెప్పగా, యెహోవా దూత ప్రక్కన నిలబడి ఉండగా వారు అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచి, అతనికి బట్టలు తొడిగించారు. \p \v 6 తర్వాత యెహోవా దూత యెహోషువకు ఈ ఆదేశం ఇచ్చాడు: \v 7 “సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు నాకు లోబడి జీవిస్తూ, నా మార్గాలను పాటిస్తే, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణాల మీద అధికారం కలిగి ఉంటావు. ఇక్కడ నిలబడి ఉన్న వారి మధ్యలో నేను నీకు స్థానం ఇస్తాను. \p \v 8 “ ‘ప్రధాన యాజకుడవైన యెహోషువా! విను; నీవూ, నీ ఎదుట కూర్చుని ఉన్న నీ సహచరులు జరగబోయే వాటికి సూచనలుగా ఉన్నారు: చిగురు అనే నా సేవకుడిని నేను తీసుకురాబోతున్నాను. \v 9 నేను యెహోషువ ఎదుట ఉంచిన రాతిని చూడండి. ఆ రాయికి ఏడు కళ్లు ఉన్నాయి,\f + \fr 3:9 \fr*\ft లేదా \ft*\fqa కోణాలు\fqa*\f* నేను దాని మీద ఒక శాసనం చెక్కుతాను, ఒకే రోజులోనే నేను ఈ దేశపు పాపాన్ని తొలగిస్తాను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. \p \v 10 “ ‘ఆ రోజున మీ ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద కూర్చోడానికి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారిని పిలుస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.” \c 4 \s1 బంగారు దీపస్తంభం, రెండు ఒలీవచెట్లు \p \v 1 అప్పుడు నాతో మాట్లాడిన దూత తిరిగివచ్చి నిద్రపోతున్న వాన్ని లేపినట్లు నన్ను లేపాడు. \v 2 “నీకు ఏం కనబడుతుంది?” అని నన్ను అడిగాడు. \p అందుకు నేను, “బంగారు దీపస్తంభం, దాని మీద ఉన్న గిన్నె, ఏడు దీపాలు, దీపాలకున్న ఏడు గొట్టాలు నాకు కనిపిస్తున్నాయి. \v 3 అంతే కాకుండా ఆ దీపస్తంభానికి కుడి వైపున ఒకటి ఎడమవైపున ఒకటి ఉన్న రెండు ఒలీవచెట్లు అక్కడ కనిపిస్తున్నాయి” అన్నాను. \p \v 4 నాతో మాట్లాడిన దూతను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను. \p \v 5 అందుకా దూత, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. \p అందుకు నేను, “నా ప్రభువా, నాకు తెలియదు” అని చెప్పాను. \p \v 6 అప్పుడతడు నాతో ఇలా చెప్పాడు, “జెరుబ్బాబెలు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: ‘శక్తి వలన గాని బలం వలన గాని ఇది జరుగదు కాని నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. \p \v 7 “మహా పర్వతమా! నీవు ఎంతటి దానివి? జెరుబ్బాబెలు ఎదుట నీవు నేలమట్టం అవుతావు. అప్పుడు ‘దేవుడు దీవిస్తారు గాక! దేవుడు దీవిస్తారు గాక!’ అని కేకలు వేస్తుండగా అతడు పైరాయిని తీసుకువస్తాడు.” \p \v 8 తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరకు ఇలా వచ్చింది: \v 9 “జెరుబ్బాబెలు చేతులు ఈ ఆలయపు పునాదిని వేశాయి; అంతే కాకుండా అతని చేతులే దానిని ముగిస్తాయి. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను మీ దగ్గరకు పంపారని మీరు తెలుసుకుంటారు. \p \v 10 “చిన్న విషయాలు జరిగే రోజును తృణకీరించే ధైర్యం ఎవరికైనా ఉందా? భూమి అంతా సంచరించే యెహోవా యొక్క ఏడు కళ్లు జెరుబ్బాబెలు చేతిలోని మట్టపు గుండును చూసి సంతోషిస్తాయి.” \p \v 11 అప్పుడు నేను ఆ దూతను, “దీపస్తంభానికి కుడి ఎడమలకు ఉన్న ఈ రెండు ఒలీవచెట్లు ఏంటి?” అని అడిగాను. \p \v 12 నేను మరలా, “ఆ రెండు బంగారు గొట్టాలలో నుండి బంగారు నూనె కుమ్మరించే ఆ రెండు ఒలీవ చెట్ల కొమ్మలు ఏంటి?” అని అతన్ని అడిగాను. \p \v 13 అందుకతడు, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. \p “నా ప్రభువా, నాకు తెలియదు” అన్నాను. \p \v 14 అందుకతడు, “ఈ ఇద్దరూ సర్వలోక ప్రభువు దగ్గర నిలబడి సేవ చేయడానికి అభిషేకించబడ్డవారు” అని చెప్పాడు. \c 5 \s1 ఎగిరే గ్రంథం \p \v 1 నేను మళ్ళీ చూసినప్పుడు ఎగురుతున్న గ్రంథపుచుట్ట ఒకటి కనిపించింది. \p \v 2 అతడు నన్ను, “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. \p నేను, “ఇరవై మూరల పొడవు, పది మూరల\f + \fr 5:2 \fr*\ft అంటే సుమారు 4.5 మీ.\ft*\f* వెడల్పు కలిగి ఎగురుతున్న గ్రంథపుచుట్టను చూస్తున్నాను” అని జవాబిచ్చాను. \p \v 3 అందుకతడు నాతో ఇలా అన్నాడు, “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం; దానికి ఒకవైపు వ్రాసి ఉన్న ప్రకారం దొంగలు నాశనమవుతారు, రెండవ వైపు వ్రాసి ఉన్న ప్రకారం అబద్ధ ప్రమాణం చేసేవారంతా దేశ బహిష్కరణ శిక్ష పొందుతారు. \v 4 సైన్యాల యెహోవా చెప్తున్న మాట ఇదే, ‘నేను దానిని బయటకు పంపుతాను, అది దొంగల ఇంట్లోకి, నా పేరిట అబద్ధ ప్రమాణం చెప్పే అందరి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉంటూ దాని దూలాలు, రాళ్లతో సహా సమస్తాన్ని నాశనం చేస్తుంది.’ ” \s1 బుట్టలో స్త్రీ \p \v 5 అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత ముందుకు వచ్చి, “నీ కళ్లు పైకెత్తి ఏమి కనిపిస్తుందో చూడు” అన్నాడు. \p \v 6 “అది ఏమిటి?” అని నేను అడిగాను. \p అందుకతడు, “అది ఓ బుట్ట, అది దేశమంతటిలో ఉన్న ప్రజల దోషం” అని చెప్పాడు. \p \v 7 తర్వాత సీసంతో చేసిన మూత తీసినప్పుడు ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని కనబడింది. \v 8 అతడు, “ఇది దుర్మార్గం” అని చెప్పి బుట్టలోనికి దానిని నెట్టి సీసం మూత మూసి వేశాడు. \p \v 9 నేను మరలా పైకి చూడగా నా ఎదుట ఇద్దరు స్త్రీలు కనిపించారు, వారికున్న రెక్కలు గాలికి కదులుతున్నాయి. కొంగ రెక్కలవంటి రెక్కలు వారికున్నాయి, అవి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ బుట్టను ఎత్తాయి. \p \v 10 నాతో మాట్లాడుతున్న దూతను, “బుట్టను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని అడిగాను. \p \v 11 అతడు జవాబిస్తూ, “దానికి ఇల్లు కట్టడానికి బబులోను\f + \fr 5:11 \fr*\ft హెబ్రీలో \ft*\fqa షీనారు\fqa*\f* దేశానికి తీసుకెళ్తున్నారు. ఇల్లు సిద్ధమైనప్పుడు ఆ బుట్ట అక్కడ దాని స్థానంలో ఉంచుతారు” అన్నాడు. \c 6 \s1 నాలుగు రథాలు \p \v 1 నేను మళ్ళీ పైకి చూస్తే, నా ఎదుట రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతూ కనిపించాయి. అవి ఇత్తడి పర్వతాలు. \v 2 మొదటి రథానికి ఎర్రటి గుర్రాలు, రెండవ రథానికి నల్లని గుర్రాలు, \v 3 మూడవ రథానికి తెల్లని గుర్రాలు, నాలుగవ రథానికి చుక్కలు ఉన్న గుర్రాలు ఉన్నాయి. అవన్నీ బలమైనవి. \v 4 నాతో మాట్లాడుతున్న దూతను, “నా ప్రభువా, ఇవి ఏమిటి?” అని అడిగాను. \p \v 5 దూత నాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఇవి సర్వలోక ప్రభువు సన్నిధి నుండి బయలుదేరిన నాలుగు పరలోకపు ఆత్మలు\f + \fr 6:5 \fr*\ft లేదా \ft*\fqa గాలులు\fqa*\f*. \v 6 నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశం వైపు, తెల్లని గుర్రాలున్న రథం పడమర వైపు, చుక్కలున్న గుర్రాలున్న రథం దక్షిణం వైపు వెళ్తాయి.” \p \v 7 ఆ బలమైన గుర్రాలు బయలుదేరి భూమి అంతా తిరగడానికి సిద్ధంగా ఉండగా అతడు, “వెళ్లి భూమి అంతా తిరగండి!” అని అన్నాడు. కాబట్టి అవి భూమి అంతటా వెళ్లాయి. \p \v 8 అప్పుడు అతడు నన్ను పిలిచి, “ఉత్తర దేశం వైపు వెళ్లేవాటిని చూడు, అవి ఉత్తర దేశంలో నా ఆత్మకు నెమ్మది కలిగిస్తాయి” అన్నాడు. \s1 యెహోషువకు కిరీటం \p \v 9 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 10 “బందీలుగా వెళ్లిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయాల నుండి వెండి బంగారాలు తీసుకో. ఆ రోజే జెఫన్యా కుమారుడైన యోషీయా ఇంటికి వెళ్లు. \v 11 వారి నుండి వెండి బంగారాలు తీసుకుని కిరీటం చేసి దానిని ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద పెట్టి, \v 12 అతనితో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘చిగురు అనే పేరుగల వ్యక్తి ఉన్నాడు. అతడు తన స్థలంలో నుండి చిగురిస్తూ, యెహోవా మందిరం కడతాడు. \v 13 యెహోవా మందిరాన్ని కట్టేవాడు అతడే; అతడు వైభవాన్ని కలిగి సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాడు. అతడు తన సింహాసనం మీద యాజకునిగా ఉంటాడు. ఆ ఇద్దరి మధ్య సమాధానకరమైన ఆలోచన ఉంటుంది.’ \v 14 ఆ కిరీటం యెహోవా మందిరంలో జ్ఞాపకార్థంగా హేలెము, టోబీయా, యెదాయాలకు, జెఫన్యా కుమారుడైన హేనుకు ఇవ్వబడుతుంది. \v 15 దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా మందిరాన్ని కట్టడానికి సహాయం చేస్తారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను మీ దగ్గరకు పంపారని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జ్రాగత్తగా వింటే ఇలా జరుగుతుంది.” \c 7 \s1 ఉపవాసం కన్నా న్యాయం కనికరం మేలు \p \v 1 రాజైన దర్యావేషు పరిపాలన నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగో రోజున యెహోవా వాక్కు జెకర్యా దగ్గరకు వచ్చింది. \v 2 బేతేలు ప్రజలు యెహోవాను వేడుకోడానికి షెరెజెరును రెగెమ్మెలెకును తమ మనుష్యులతో పాటు పంపి, \v 3 “అనేక సంవత్సరాలుగా మేము చేస్తున్నట్లుగా అయిదవ నెలలో దుఃఖిస్తూ ఉపవాసం ఉండాలా?” అని సైన్యాల యెహోవా మందిరంలోని యాజకులను, ప్రవక్తలను అడిగారు. \p \v 4 అప్పుడు సైన్యాల యెహోవా వాక్కు నాకు వచ్చి: \v 5 “దేశ ప్రజలందరినీ, యాజకులను ఇలా అడుగు, ‘మీరు గత డెబ్బై సంవత్సరాలుగా అయిదవ నెలలో, ఏడవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించినప్పుడు, మీరు నిజంగా నా కోసం ఉపవాసం ఉన్నారా? \v 6 మీరు తినేటప్పుడు త్రాగేటప్పుడు కేవలం మీ కోసం మాత్రమే విందు చేసుకోలేదా? \v 7 యెరూషలేము, దాని ప్రక్కన ఉన్న పట్టణాలన్ని విశ్రాంతిగా క్షేమంగా ఉన్నప్పుడు, దక్షిణ ప్రదేశం, పడమటి మైదానాల్లో ప్రజలు విస్తరించి ఉన్నప్పుడు పూర్వకాలపు ప్రవక్తల ద్వారా యెహోవా ఈ మాటలను ప్రకటించలేదా?’ ” \p \v 8 మరోసారి యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చి: \v 9 “సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘సత్యంతో న్యాయం తీర్చండి; ఒకరిపట్ల ఒకరు కనికరం, దయ కలిగి ఉండండి. \v 10 విధవరాండ్రను తండ్రిలేనివారిని విదేశీయులను బీదలను హింసించకండి. ఒకరి మీద ఒకరు కుట్ర చేయకండి’ అని చెప్పింది. \p \v 11 “కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు. \v 12 తమ హృదయాలను చెకుముకి రాయిలా గట్టిగా చేసుకున్నారు, సైన్యాల యెహోవా తన ఆత్మ ద్వారా పూర్వ ప్రవక్తలకు ఇచ్చిన ఉపదేశాన్ని, మాటలను వినలేదు. కాబట్టి సైన్యాల యెహోవా చాలా కోప్పడ్డారు. \p \v 13 “ ‘నేను పిలిచినప్పుడు, వారు వినలేదు; కాబట్టి వారు పిలిచినప్పుడు నేను వినను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. \v 14 ‘వారికి తెలియని ఇతర దేశ ప్రజల మధ్యలోని నేను వారిని సుడిగాలిలా చెదరగొట్టాను. వారు వదిలి వెళ్లిన దేశం గుండా ఎవరూ ప్రయాణించలేనంతగా అది పాడైపోయింది. ఇలా మనోహరమైన తమ దేశాన్ని వారు పాడుచేశారు.’ ” \c 8 \s1 యెరూషలేమును ఆశీర్వదిస్తానని యెహోవా వాగ్దానం \p \v 1 సైన్యాల యెహోవా వాక్కు నాకు వచ్చింది. \p \v 2 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోను గురించి చాలా ఆసక్తి కలిగి ఉన్నాను; ఆమె పట్ల ఉన్న ఆసక్తి నన్ను దహించివేస్తుంది.” \p \v 3 యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోనుకు తిరిగివచ్చి యెరూషలేములో నివసిస్తాను. అప్పుడు యెరూషలేము నమ్మకమైన పట్టణమని, సైన్యాల యెహోవా పర్వతమని, పవిత్ర పర్వతమని పిలువబడుతుంది.” \p \v 4 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మరోసారి వృద్ధులైన స్త్రీ పురుషులు తమ చేతికర్ర పట్టుకొని ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు. \v 5 పట్టణ వీధులు ఆటలాడే అబ్బాయిలతో అమ్మాయిలతో నిండిపోతాయి.” \p \v 6 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ సమయంలో ఈ ప్రజల్లో మిగిలిన ఉన్నవారికి ఇది ఆశ్చర్యకరంగా ఉండవచ్చు కాని నాకు ఆశ్చర్యంగా ఉంటుందా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు. \p \v 7 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను తూర్పు, పడమర దేశాల నుండి నా ప్రజలను రక్షిస్తాను. \v 8 యెరూషలేములో నివసించేందుకు వారిని తిరిగి తీసుకువస్తాను; వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవునిగా నమ్మకంగా నీతితో ఉంటాను.” \p \v 9 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఇప్పుడు ఈ మాటలు వినండి, ‘మందిరాన్ని కట్టడానికి మీ చేతులను బలపరచుకోండి.’ సైన్యాల యెహోవా మందిర పునాది వేసినప్పుడు ఉన్న ప్రవక్తలు చెప్పింది ఇదే. \v 10 అంతకుముందు మనుష్యులకు జీతం గాని, పశువులకు బాడిగ గాని దొరకలేదు. నేను ఒకరిపై ఒకరికి వ్యతిరేకత కలిగించాను కాబట్టి ఎవరూ క్షేమంగా తమ పనిని చేయలేకపోయారు. \v 11 అయితే పూర్వకాలంలో నేను చేసినట్లుగా ఇప్పుడు మిగిలి ఉన్నవారిపట్ల చేయను” అని సైన్యాల యెహోవా అంటున్నారు. \p \v 12 “సమాధానమనే విత్తనం చక్కగా మొలకెత్తుతుంది, ద్రాక్షచెట్టు తన ఫలాన్ని ఇస్తుంది, భూమి తన పంటను ఇస్తుంది, ఆకాశం మంచు కురిపిస్తుంది. ఈ ప్రజల్లో మిగిలి ఉన్నవారికి వీటన్నిటిని వారసత్వంగా ఇస్తాను. \v 13 యూదా, ఇశ్రాయేలూ, మీరు ఇతర ప్రజల్లో ఎలా శాపానికి గురై ఉన్నారో అలాగే మీరు దీవెనకరంగా ఉండేలా నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు దీవెనకరంగా ఉంటారు. భయపడకండి, మీ చేతులు బలం కలిగి ఉండనివ్వండి.” \p \v 14 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మీ పూర్వికులు నాకు కోపం పుట్టించినప్పుడు దయ చూపించకుండ నేను మీకు కీడు చేయాలని అనుకున్నట్టే” అని సైన్యాల యెహోవా అంటున్నారు, \v 15 “ఇప్పుడు నేను యెరూషలేము యూదాలకు మేలు చేయాలని నిశ్చయించుకున్నాను. భయపడకండి. \v 16 మీరు చేయవలసిన పనులేవంటే: ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, మీ న్యాయస్థానాల్లో సమాధానకరమైన తీర్పు ఇవ్వాలి; \v 17 ఒకరిపై ఒకరు కుట్ర చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడవద్దు. ఇవన్నీ నేను ద్వేషిస్తాను” అని యెహోవా చెప్తున్నారు. \p \v 18 సైన్యాల యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది. \p \v 19 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నాలుగు, అయిదు, ఏడు పదవ నెలల్లో మీరు చేసే ఉపవాసాలు యూదా వారికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించే సంతోషకరమైన పండుగలుగా మారుతాయి. కాబట్టి సత్యాన్ని సమాధానాన్ని ప్రేమించండి.” \p \v 20 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “అనేకమంది ప్రజలు ఎన్నో పట్టణాల నివాసులు ఇంకా వస్తారు, \v 21 ఒక పట్టణం వారు మరో పట్టణం వారి దగ్గరకు వెళ్లి, ‘సైన్యాల యెహోవాను వెదకి, యెహోవాను వేడుకోడానికి వెంటనే వెళ్దాం రండి’ అని చెప్పగా వారు, ‘మేము కూడా వస్తాం’ అని అంటారు. \v 22 అన్నిటిని పరిపాలించే సైన్యాల యెహోవాను వెదకడానికి, ఆయన దయను కోరడానికి అనేకమంది ప్రజలు, శక్తివంతమైన దేశాలు యెరూషలేముకు వస్తారు.” \p \v 23 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ రోజుల్లో, ఇతర ప్రజల్లో ఆయా భాషల్లో మాట్లాడే పదిమంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ‘దేవుడు మీకు తోడుగా ఉన్నారని మేము విన్నాము. మేము కూడా మీతో వస్తాం’ అంటారు.” \c 9 \s1 ఇశ్రాయేలు శత్రువులపై తీర్పు \p \v 1 ప్రవచనం: \q1 హద్రాకు దేశం గురించి దమస్కు పట్టణం గురించి \q2 వచ్చిన యెహోవా వాక్కు: \q1 మనుష్యులందరి కళ్లు, ఇశ్రాయేలు గోత్రాలన్నిటి కళ్లు \q2 యెహోవా మీద ఉన్నాయి. \q1 \v 2 అంతేకాక, దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతు గురించి, \q2 చాలా నిపుణులైన తూరు సీదోను ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు. \q1 \v 3 తూరు తన కోసం బలమైన దుర్గం కట్టుకుంది; \q2 ధూళి అంత విస్తారంగా వెండిని, \q2 వీధుల్లోని మట్టి అంత విస్తారంగా బంగారాన్ని పోగుచేసింది. \q1 \v 4 అయితే యెహోవా దాని సంపదలు తీసివేసి, \q2 సముద్రంలో ఉన్న దాని శక్తిని నాశనం చేస్తారు. \q2 అది అగ్నితో కాల్చబడుతుంది. \q1 \v 5 అష్కెలోను దానిని చూసి భయపడుతుంది; \q2 గాజా వేదనతో విలపిస్తుంది \q2 ఎక్రోను కూడా తన నిరీక్షణ కోల్పోతుంది. \q1 గాజా తన రాజును కోల్పోతుంది \q2 అష్కెలోను ఎడారిగా మారుతుంది. \q1 \v 6 సంకరజాతి ప్రజలు అష్డోదును ఆక్రమిస్తారు, \q2 ఫిలిష్తీయుల గర్వాన్ని నేను అంతం చేస్తాను. \q1 \v 7 వారి నోటిలో నుండి రక్తాన్ని, \q2 వారి పళ్ల మధ్య నుండి తినకూడని ఆహారాన్ని నేను తీసివేస్తాను. \q1 వారిలో మిగిలి ఉన్నవారు మన దేవుని వారై \q2 యూదాలో ఒక వంశంగా ఉంటారు. \q2 ఎక్రోను వారు యెబూసీయుల్లా ఉంటారు. \q1 \v 8 నేను కళ్లారా చూస్తున్నాను కాబట్టి \q2 బాధించేవారు నా ప్రజలపై మరలా ఎన్నడూ దాడి చేయకుండా \q1 దోపిడి మూకలు నా మందిరం మీదికి రాకుండా కాపాడడానికి \q2 నేను దాని దగ్గర శిబిరం ఏర్పాటు చేస్తాను. \s1 సీయోను రాజు వచ్చుట \q1 \v 9 సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! \q2 యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! \q1 ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు \q2 దీనుడిగా గాడిద మీద, \q1 గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ \q2 మీ దగ్గరకు వస్తున్నాడు. \q1 \v 10 నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను \q2 యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను \q2 యుద్ధపు విల్లు విరిగిపోతుంది. \q1 ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు. \q2 ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు \q2 నది\f + \fr 9:10 \fr*\ft అంటే, యూఫ్రటీసు\ft*\f* నుండి భూమి అంచుల వరకు ఉంటుంది. \q1 \v 11 నేను మీతో చేసిన నిబంధన రక్తాన్ని బట్టి \q2 బందీలుగా ఉన్న మీ వారిని నీరులేని గోతిలో నుండి విడిపిస్తాను. \q1 \v 12 నిరీక్షణగల బందీల్లారా, మీ కోటకు తిరిగి రండి. \q2 నేను మీకు రెండింతలు మేలు చేస్తానని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. \q1 \v 13 నా విల్లును వంచినట్లు నేను యూదాను వంచుతాను \q2 ఎఫ్రాయిము అనే నా బాణంతో దానిని నింపుతాను. \q1 సీయోనూ, నీ కుమారులను పురికొల్పి \q2 నిన్ను యోధుని కత్తిలా మార్చుతాను; \q2 గ్రీసు దేశస్థులారా! సీయోను కుమారులను మీ మీదికి పురికొల్పుతాను. \s1 యెహోవా ప్రత్యక్షమవుతారు \q1 \v 14 అప్పుడు యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవుతారు; \q2 ఆయన బాణాలు మెరుపులా వస్తాయి. \q1 ప్రభువైన యెహోవా బాకా మోగిస్తూ \q2 దక్షిణపు తుఫాను గాలులతో ముందుకు సాగుతారు, \q2 \v 15 సైన్యాల యెహోవా వారిని కాపాడతారు. \q1 వారు నాశనం చేస్తూ \q2 వడిసెల రాళ్లతో గెలుస్తారు. \q1 వారు త్రాగి, ద్రాక్షారసాన్ని త్రాగినట్లుగా వారు గర్జిస్తారు; \q2 బలిపీఠం మూలల్లో చిలకరించడానికి ఉపయోగించే గిన్నెలా \q2 వారు నిండుగా ఉంటారు. \q1 \v 16 కాపరి తన గొర్రెల మందను కాపాడినట్లు \q2 ఆ రోజున వారి దేవుడైన యెహోవా వారిని కాపాడతారు. \q1 వారు కిరీటంలోని ప్రశస్తమైన రాళ్లలా \q2 ఆయన దేశంలో ఉంటారు. \q1 \v 17 ధాన్యంతో యువకులు \q2 క్రొత్త ద్రాక్షరసంతో యువతులు వర్ధిల్లుతారు. \q2 వారు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు! \c 10 \s1 యెహోవా యూదాను సంరక్షిస్తారు \q1 \v 1 వసంతకాలంలో వర్షం కోసం యెహోవాను అడగండి; \q2 ఉరుములతో ఉన్న తుఫానును పంపేది యెహోవాయే. \q1 అందరి పొలానికి మొక్కలు పెరిగేలా, \q2 ఆయన ప్రజలందరికి వర్షాన్ని కురిపిస్తారు. \q1 \v 2 గృహదేవతలు మోసపు మాటలు మాట్లాడతాయి, \q2 సోదె చెప్పేవారు అబద్ధపు దర్శనాలు చూస్తారు; \q1 వారు మోసంతో కలల భావాలు చెప్తారు, \q2 వ్యర్థమైన ఓదార్పు ఇస్తారు. \q1 కాబట్టి కాపరి లేకపోవడం వలన బాధించబడిన గొర్రెలు తిరిగినట్లు \q2 ప్రజలు తిరుగుతారు. \b \q1 \v 3 “కాపరుల మీద నా కోపం రగులుకుంది, \q2 నేను నాయకులను శిక్షిస్తాను; \q1 సైన్యాల యెహోవా తన మందయైన \q2 యూదా ప్రజల మీద శ్రద్ధ చూపుతారు \q2 ఆయన వారిని గర్వించే యుద్ధ గుర్రాల్లా చేస్తారు. \q1 \v 4 యూదా నుండి మూలరాయి వస్తుంది, \q2 అతని నుండి డేరా మేకు, \q1 అతని నుండి యుద్ధ విల్లు వస్తాయి, \q2 అతని నుండి ప్రతి పాలకుడు వస్తాడు. \q1 \v 5 వారందరు కలిసి యుద్ధంలోని వీరుల్లా \q2 వీధుల బురదలో తమ శత్రువులను త్రొక్కుతారు. \q1 యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు పోరాడతారు, \q2 శత్రువుల గుర్రపురౌతులను సిగ్గుపడేలా చేస్తారు. \b \q1 \v 6 “నేను యూదాను బలపరుస్తాను \q2 యోసేపు గోత్రాలను రక్షిస్తాను. \q1 వారి పట్ల నాకు దయ ఉంది కాబట్టి, \q2 నేను వారిని తిరిగి రప్పిస్తాను. \q1 నేను వారిని విడిచిపెట్టిన సంగతిని \q2 వారు మరిచిపోతారు, \q1 ఎందుకంటే నేను వారి దేవుడనైన యెహోవాను, \q2 నేను వారికి జవాబిస్తాను. \q1 \v 7 ఎఫ్రాయిమువారు వీరుల్లా అవుతారు, \q2 ద్రాక్షరసం త్రాగినట్లుగా వారి హృదయాలు సంతోషిస్తాయి. \q1 వారి పిల్లలు అది చూసి సంతోషిస్తారు; \q2 యెహోవాను బట్టి వారి హృదయాలు ఆనందిస్తాయి. \q1 \v 8 నేను వారికి ఈలవేసి పిలిచి \q2 వారిని సమకూరుస్తాను. \q1 ఖచ్చితంగా నేను వారిని విమోచిస్తాను; \q2 వారు మునుపటిలా అనేకులుగా ఉంటారు. \q1 \v 9 నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి చెదరగొట్టినా \q2 దూరదేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొంటారు. \q1 వారు వారి సంతానం \q2 సజీవులుగా తిరిగి వస్తారు. \q1 \v 10 నేను వారిని ఈజిప్టు నుండి తిరిగి తీసుకువస్తాను \q2 అష్షూరు దేశం నుండి సమకూరుస్తాను. \q1 నేను వారిని గిలాదు, లెబానోను దేశాలకు తీసుకువస్తాను \q2 అక్కడ ఉన్న స్థలం వారికి సరిపోదు. \q1 \v 11 వారు దుఃఖ సముద్రాన్ని దాటుతారు; \q2 సముద్రపు అలలు అణచివేయబడతాయి \q2 నైలు నదిలోని లోతైన స్థలాలన్నీ ఎండిపోతాయి. \q1 అష్షూరు యొక్క గర్వం అణచివేయబడుతుంది, \q2 ఈజిప్టు రాజదండం తీసివేయబడుతుంది. \q1 \v 12 నేను వారిని యెహోవాలో బలపరుస్తాను. \q2 ఆయన నామం బట్టి వారు క్షేమంగా జీవిస్తారు,” \q2 అని యెహోవా చెప్తున్నారు. \b \c 11 \q1 \v 1 లెబానోనూ! అగ్ని వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేయునట్లు, \q2 నీ తలుపులు తీయి. \q1 \v 2 సరళ వృక్షాల్లారా, రోదించండి! దేవదారు చెట్లు కూలిపోయాయి; \q2 మహా వృక్షాలు నాశనమైపోయాయి! \q1 బాషాను యొక్క సింధూర వృక్షాల్లారా, రోదించండి: \q2 దట్టమైన అడవి నరకబడింది. \q1 \v 3 గొర్రెల కాపరుల ఏడ్పు వినండి; \q2 వారి శ్రేష్ఠమైన పచ్చికబయళ్లు నాశనమైపోయాయి! \q1 సింహాల గర్జన వినండి; \q2 యొర్దాను లోయలోని దట్టమైన అడవులు పాడైపోయాయి! \s1 ఇద్దరు గొర్రెల కాపరులు \p \v 4 నా దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు కాపరిగా ఉండు. \v 5 వాటిని కొనేవారు వాటిని వధించి శిక్ష పొందకుండా ఉన్నారు. వాటిని అమ్మేవారు, ‘యెహోవాకు స్తోత్రం, మాకు డబ్బు వచ్చింది!’ అని అంటారు. వాటి సొంత కాపరులే వాటి మీద జాలిపడరు. \v 6 ఇకనుండి నేను ఈ దేశ ప్రజలపై కనికరం చూపించను. వారందరిని వారి పొరుగువారి చేతికి, వారి రాజు చేతికి నేను అప్పగిస్తాను. వారు దేశాన్ని పాడుచేస్తారు, నేను వారి చేతుల్లో నుండి ఎవరినీ విడిపించను” అని యెహోవా అంటున్నారు. \p \v 7 కాబట్టి వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు, ముఖ్యంగా మందలో బాధించబడిన వాటికి నేను కాపరిగా ఉన్నాను. రెండు కర్రలు పట్టుకుని కాపరిగా కాచాను. ఒక కర్రకు దయ అని, రెండవ కర్రకు బంధం అని పేరు పెట్టాను. \v 8 ఒకే నెలలో నేను ముగ్గురు కాపరులను తీసివేశాను. \p మంద నన్ను అసహ్యించుకుంది; నేను వారిని చూసి విసిగిపోయి, \v 9 “నేను మీ కాపరిగా ఉండను. చచ్చేవారు చావవచ్చు, నశించేవారు నశించవచ్చు. మిగిలి ఉన్నవారు ఒకరి మాంసాన్ని ఒకరు తింటే తినవచ్చు” అన్నాను. \p \v 10 తర్వాత నేను దేశాలన్నిటినితో చేసిన నిబంధనను రద్దు చేయడానికి దయ అనే కర్రను తీసుకుని దానిని విరిచాను. \v 11 ఆ రోజు ఆ నిబంధన రద్దయింది కాబట్టి నేను చెప్పింది యెహోవా వాక్కు అని మందలోని అణచివేతకు గురై నా వైపు చూస్తున్నవారు తెలుసుకున్నారు. \p \v 12 నేను వారితో, “మీకు మంచిదనిపిస్తే నా జీతం ఇవ్వండి; లేదంటే మానేయండి” అన్నాను. కాబట్టి వారు నాకు ముప్పై వెండి నాణేలు చెల్లించారు. \p \v 13 అప్పుడు వారు నాకు చెల్లించిన దానిని కుమ్మరి దగ్గర పారవేయమని యెహోవా నాకు ఆజ్ఞాపించారు కాబట్టి నేను ఆ ముప్పై వెండి నాణేలు తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను. \p \v 14 తర్వాత యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధాన్ని తెంచడానికి బంధమనే నా రెండవ కర్రను విరిచాను. \p \v 15 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “బుద్ధిలేని గొర్రెల కాపరి సామాగ్రిని మరల తీసుకో. \v 16 ఎందుకంటే ఈ దేశంలో నేను నియమించబోయే కాపరి తప్పిపోయిన వాటిని పట్టించుకోడు, పిల్లలను వెదకడు, గాయపడ్డ వాటిని బాగు చేయడు, ఆరోగ్యకరమైన వాటిని పోషించడు, కాని క్రొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసాన్ని తింటాడు. \q1 \v 17 “మందను విడిచిపెట్టిన \q2 పనికిమాలిన కాపరికి శ్రమ! \q1 ఖడ్గం అతని చేయి, కుడికన్నును నరుకుతుంది గాక! \q2 అతని చేయి పూర్తిగా ఎండిపోవాలి, \q2 అతని కుడికన్ను పూర్తిగా గ్రుడ్డిదవ్వాలి.” \c 12 \s1 యెరూషలేము శత్రువులు నాశనం చేయబడతారు \p \v 1 ఇది ప్రవచనం: ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు. \b \p ఆకాశాలను విశాలపరచి, భూమికి పునాది వేసి, ఒక వ్యక్తిలో మానవ ఆత్మను సృష్టించిన యెహోవా చెప్తున్న మాట: \v 2 “నేను యెరూషలేమును చుట్టూ ఉన్న ప్రజలందరికి మత్తెక్కించే పాత్రగా చేయబోతున్నాను. యూదా యెరూషలేము ముట్టడి చేయబడతాయి. \v 3 భూమిపై ఉన్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా సమకూడినప్పుడు, ఆ రోజున నేను యెరూషలేమును అన్ని దేశాలకు బరువైన బండగా చేస్తాను. దాన్ని తొలగించడానికి ప్రయత్నించే వారందరూ తమను తాము గాయపరచుకుంటారు. \v 4 ఆ రోజున నేను ప్రతి గుర్రానికి భయాన్ని, దాని రౌతుకు వెర్రిని పుట్టిస్తాను” అని యెహోవా చెప్తున్నారు. “నేను యూదాపై నా దృష్టి ఉంచి ఇతర ప్రజల గుర్రాలన్నిటికి గుడ్డితనం కలిగిస్తాను. \v 5 అప్పుడు యూదా నాయకులు తమ హృదయాల్లో, ‘యెరూషలేము ప్రజలకు వారి దేవుడైన సైన్యాల యెహోవా తోడుగా ఉన్నందుకు వారు బలంగా ఉన్నారు’ అనుకుంటారు. \p \v 6 “ఆ రోజున నేను యూదా నాయకులను కట్టెల క్రింద నిప్పులా పనల క్రింద దివిటీలా చేస్తాను. వారు నాలుగు వైపుల ఉన్న ప్రజలందరినీ కాల్చివేస్తారు, కాని యెరూషలేము దాని స్థానంలో చెక్కుచెదరకుండా ఉంటుంది. \p \v 7 “దావీదు వంశీయులకు యెరూషలేము నివాసులకు ఉన్న ఘనత యూదా వారికంటే గొప్పది కాకుండా యెహోవా మొట్టమొదట యూదా వారి నివాస స్థలాలను రక్షిస్తారు. \v 8 ఆ రోజున, యెహోవా యెరూషలేములో నివసించేవారిని కాపాడతారు, అప్పుడు వారిలో బలహీనులు దావీదులా, దావీదు వంశీయులు దేవుని వంటివారిగా, వారి ముందు నడిచే యెహోవా దూతలా ఉంటారు. \v 9 ఆ రోజున యెరూషలేముపై దాడి చేసే దేశాలన్నిటిని నాశనం చేయడానికి నేను బయలుదేరుతాను. \s1 వారు పొడిచిన వాని గురించి దుఃఖించుట \p \v 10 “అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు. \v 11 ఆ రోజు, మెగిద్దో మైదానంలో హదద్-రిమ్మోనులో జరిగిన రోదన కంటే యెరూషలేములోని రోదన అధికంగా ఉంటుంది. \v 12 దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా తమ భార్యలతో పాటు రోదిస్తాయి: దావీదు రాజవంశీయులు వారి భార్యలు, నాతాను వంశీయులు వారి భార్యలు, \v 13 లేవీ వంశీయులు వారి భార్యలు, షిమీ వంశీయులు వారి భార్యలు, \v 14 మిగిలిన వంశీయులు వారి భార్యలు అందరు ఎవరికి వారు రోదిస్తారు. \c 13 \s1 పాపం నుండి శుద్ధి \p \v 1 “ఆ రోజున పాపాన్ని అపవిత్రతను శుభ్రం చేసుకోవడానికి దావీదు వంశీయులకు, యెరూషలేము నివాసులకు ఒక నీటి ఊట తెరవబడుతుంది. \p \v 2 “ఆ రోజున విగ్రహాల పేర్లు ఎప్పటికీ జ్ఞాపకం రాకుండా దేశంలోని నుండి నేను వాటిని నిర్మూలిస్తాను. ప్రవక్తలను అపవిత్ర ఆత్మను దేశంలో లేకుండా చేస్తాను” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. \v 3 “ఇంకా ఎవరైనా ప్రవచనాలు చెప్తూ ఉంటే, ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులు వారితో, ‘నీవు యెహోవా పేరట అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి నీవు చావాలి’ అని అంటారు. వారు ప్రవచనం చెప్తే, వారి కన్న తల్లిదండ్రులే వారిని పొడుస్తారు. \p \v 4 “ఆ రోజున ప్రతి ప్రవక్త తాము చెప్పిన ప్రవచనం బట్టి దర్శనం బట్టి సిగ్గుపడి ఇకపై ప్రజలను మోసగించడానికి ప్రవక్త గొంగళి ధరించడం మానేస్తారు. \v 5 ప్రతి ఒక్కరు, ‘నేను ప్రవక్తను కాను. నేను ఒక రైతును; నా చిన్నప్పటి నుండి నన్ను కొన్న వాని దగ్గర పొలంలో పని చేస్తున్నాను’ అంటారు. \v 6 ‘నీ చేతులకు గాయాలేంటి?’ అని ఎవరైనా వారిని అడిగితే, ‘ఇవి నేను నా స్నేహితుల ఇంట్లో ఉన్నప్పుడు తగిలిన గాయాలు’ అంటారు. \s1 కాపరి కొట్టబడుట, గొర్రెలు చెదరిపోవుట \q1 \v 7 “ఖడ్గమా, మేలుకో, నా గొర్రెల కాపరి మీద \q2 నా సన్నిహితుడి మీద పడు!” \q2 అని సైన్యాల యెహోవా అంటున్నారు. \q1 “కాపరిని కొడతాను, \q2 గొర్రెలు చెదిరిపోతాయి, \q2 చిన్నవారి మీద నేను నా చేతిని ఉంచుతాను.” \q1 \v 8 యెహోవా అంటున్నారు, “దేశమంతటిలో \q2 మూడింట రెండు వంతుల ప్రజలు హతమై నశిస్తారు; \q2 అయినా దేశంలో మూడవ వంతు ప్రజలు మిగిలి ఉంటారు. \q1 \v 9 ఈ మూడవ వంతు ప్రజలను నేను అగ్నిలో నుండి \q2 వెండిని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను \q2 బంగారాన్ని పరీక్షించినట్లు వారిని పరీక్షిస్తాను. \q1 వారు నా పేరట మొరపెడతారు, \q2 నేను వారికి జవాబిస్తాను. \q1 ‘వారు నా ప్రజలు’ అని నేనంటాను, \q2 ‘యెహోవా మా దేవుడు’ అని వారంటారు.” \c 14 \s1 యెహోవా వచ్చి పరిపాలిస్తారు \p \v 1 యెరూషలేమా, యెహోవా దినం రాబోతుంది, అప్పుడు మీ దగ్గర కొల్లగొట్టబడిన ఆస్తులు మీ మధ్యనే పంచుతారు. \p \v 2 యెరూషలేము మీద యుద్ధం చేయడానికి అన్ని దేశాలను నేను సమకూరుస్తాను; వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఇల్లు దోచుకుంటారు, స్త్రీలను అత్యాచారం చేస్తారు. పట్టణ ప్రజల్లో సగం మంది బందీలుగా వెళ్తారు. అయితే మిగిలి ఉన్న ప్రజలు నాశనం కాకుండా పట్టణంలోనే ఉండిపోతారు. \v 3 అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలంలో పోరాడే విధంగా ఆ దేశాలతో యుద్ధం చేస్తారు. \v 4 ఆ రోజున ఆయన యెరూషలేముకు తూర్పుగా ఉన్న ఒలీవకొండ మీద తన పాదాలు ఉంచగా ఒలీవకొండ తూర్పు నుండి పడమరకు రెండుగా చీలిపోయి, సగం కొండ ఉత్తరదిక్కుకు, మరో సగం కొండ దక్షిణ దిక్కుకు జరిగి మధ్యలో విశాలమైన లోయ ఏర్పడుతుంది. \v 5 కొండల మధ్య నేను ఏర్పరచిన ఆ లోయ ఆజేలు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆ కొండలోయ గుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయినట్లు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడైన యెహోవా తన పరిశుద్ధులందరితో కలిసి వస్తారు. \p \v 6 ఆ రోజున సూర్యకాంతి ఉండదు, చలి ఉండదు, చీకటి ఉండదు. \v 7 అది యెహోవాకు మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన రోజు. అది పగలు కాదు, రాత్రి కాదు. సాయంకాలమైనా వెలుగు ఉంటుంది. \p \v 8 ఆ రోజున యెరూషలేములో నుండి జీవజలాలు బయలుదేరి వాటిలో సగం మృత సముద్రానికి తూర్పుగా మరో సగం మధ్యధరా సముద్రానికి పడమరగా ప్రవహిస్తాయి. వేసవికాలంలో చలికాలంలో కూడా ఇలాగే ప్రవహిస్తాయి. \p \v 9 యెహోవా సర్వభూమికి రాజుగా ఉంటారు. ఆ రోజున యెహోవా ఒక్కరే ఉంటారు, ఆయన పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది. \p \v 10 యెరూషలేముకు దక్షిణాన ఉన్న గెబా నుండి రిమ్మోను వరకు ఉన్న దేశమంతా అరాబాలా మైదానంలా అవుతుంది. అయితే యెరూషలేము బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు అనగా మొదటి ద్వారం ఉన్న స్థలం వరకు, హనానేలు గోపురం నుండి రాజ ద్రాక్షగానుగల వరకు వ్యాపించి ఉంటుంది. \v 11 మనుష్యులు దానిలో నివసిస్తారు; ఇక ఎన్నడు అది నాశనం కాదు. యెరూషలేము క్షేమంగా ఉంటుంది. \p \v 12 యెరూషలేము మీద యుద్ధం చేసిన దేశాలన్నిటి మీదికి యెహోవా రప్పించే తెగులు ఇలా ఉంటుంది: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి, వారి కళ్లు కంటి కుహరాల్లో ఉండి కూడా కుళ్ళిపోతాయి, వారి నాలుకలు వారి నోటిలోనే కుళ్ళిపోతాయి. \v 13 ఆ రోజున యెహోవా ప్రజల్లో గొప్ప భయాన్ని పుట్టిస్తారు. వారంతా శత్రువులుగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. \v 14 యూదా వారు కూడా యెరూషలేము దగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న దేశాల నుండి విస్తారమైన బంగారం, వెండి, వస్త్రాలు, సంపదలు పోగు చేయబడతాయి. \v 15 అలాగే వారి గుర్రాలకు, కంచరగాడిదలకు, ఒంటెలకు, గాడిదలకు శిబిరాలలో ఉన్న పశువులన్నిటికి తెగులు సోకుతుంది. \p \v 16 అప్పుడు యెరూషలేముపై దాడి చేసిన దేశాలన్నిటిలో మిగిలి ఉన్నవారంతా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి గుడారాల పండుగ ఆచరించడానికి ఏటేటా యెరూషలేముకు వస్తారు. \v 17 ఒకవేళ భూప్రజల కుటుంబాలలో ఎవరైనా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు రాకపోతే, వారికి వాన కురవదు. \v 18 ఒకవేళ ఈజిప్టు కుటుంబాలు బయలుదేరి వెళ్లి పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. గుడారాల పండుగ ఆచరించడానికి రాని దేశాలకు యెహోవా నియమించిన తెగులును ఆయన వారికి సోకేలా చేస్తారు. \v 19 ఈజిప్టుకు, గుడారాల పండుగ ఆచరించడానికి వెళ్లని దేశాలకు విధించే శిక్ష ఇదే! \p \v 20 ఆ రోజున గుర్రాలకు కట్టిన గంటల మీద, “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాయబడి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంట పాత్రలు బలిపీఠం ఎదుట ఉన్న పవిత్ర పాత్రల వలె ఉంటాయి. \v 21 యెరూషలేములో, యూదాలో ఉన్న ప్రతి పాత్ర సైన్యాల యెహోవాకు ప్రతిష్ఠించబడతాయి, బలి అర్పించడానికి వచ్చే వారంతా ఆ పాత్రల్లో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వంట చేసుకుంటారు. ఆ రోజు ఏ కనానీయుడు\f + \fr 14:21 \fr*\ft లేదా \ft*\fqa వ్యాపారి\fqa*\f* సైన్యాల యెహోవా మందిరంలో ఉండడు.