\id TIT - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h తీతు పత్రిక \toc1 తీతుకు వ్రాసిన పత్రిక \toc2 తీతు పత్రిక \toc3 తీతు \mt1 తీతుకు \mt2 వ్రాసిన పత్రిక \c 1 \po \v 1 దేవుని దాసుడును యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడనైన పౌలు అనే నేను దేవుడు ఏర్పరచుకున్నవారికి విశ్వాసాన్ని ప్రకటించడానికి, దైవిక జీవితాలను ఎలా జీవించాలో వారికి చూపించే సత్యాన్ని తెలుసుకోవడం నేర్పడానికి, \v 2 ఈ సత్యం వారికి అబద్ధమాడని దేవుడు యుగయుగాలకు ముందే వాగ్దానం చేసిన నిత్యజీవాన్ని గురించిన నిరీక్షణతో, \v 3 ఆ నిత్యజీవం గురించి అబద్ధమాడని దేవుడు సృష్టి ఆరంభానికి ముందే వాగ్దానం చేశాడు. \po \v 4 విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు, తీతుకు: \po మన తండ్రియైన దేవుని నుండి, రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపా సమాధానాలు కలుగును గాక. \s1 మంచిని ప్రేమించేవారిని సంఘపెద్దలుగా నియమించుట \p \v 5 నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఇంకా పూర్తి చేయవలసిన వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలో సంఘ పెద్దలను నియమించు. \v 6 ఒక సంఘపెద్ద నిందారహితునిగా, తన భార్యకు నమ్మకమైనవానిగా ఉండాలి, అతని పిల్లలు విశ్వాసం కలవారిగా ఉండి, దుష్టమైన పనులు చేశారని అవిధేయులు అనే నిందలేనివారిగా ఉండాలి. \v 7 సంఘపెద్ద దేవుని కుటుంబాన్ని నడిపిస్తాడు కాబట్టి, అతడు నిందారహితునిగా ఉండాలి, అయితే అహంకారిగా, త్వరగా కోప్పడేవానిగా, త్రాగుబోతుగా, దౌర్జన్యం చేసేవానిగా, అక్రమ సంపాదన ఆశించేవానిగా ఉండకూడదు. \v 8 దానికి బదులు, అతడు ఆతిథ్యాన్ని ఇచ్చేవానిగా, మంచిని ప్రేమించేవానిగా, స్వీయ నియంత్రణ కలవానిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, క్రమశిక్షణ కలవాడై ఉండాలి. \v 9 బోధించబడిన రీతిలో ఈ నమ్మకమైన వాక్యాన్ని అతడు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అతడు తాను నేర్చుకున్న సత్య బోధతో ఇతరులను ప్రోత్సాహించి దానిని వ్యతిరేకించే వారిని ఖండించగలడు. \s1 మంచి చేయడంలో విఫలమైన వారిని గద్దించుట \p \v 10 ఎందుకంటే మీలో అనేకమంది, ముఖ్యంగా సున్నతి పొందినవారిలో కొందరు, తిరుగుబాటు స్వభావం కలిగి, అర్థంలేని మాటలు మాట్లాడేవారిగా, మోసగించేవారిగా ఉన్నారు. \v 11 వారి నోళ్ళు ఖచ్చితంగా మూయించాలి, ఎందుకంటే వారు తమ అవినీతి సంపాదన కోసం బోధించకూడని తప్పుడు బోధలు చేస్తూ, కుటుంబాలన్నిటిని చెడగొడుతున్నారు. \v 12 క్రేతు ప్రవక్తల్లో ఒకడు తన సొంత ప్రజల గురించి చెప్తూ, “క్రేతు దేశస్థులు ఎప్పుడు అబద్ధికులుగా, క్రూరులుగా, సోమరులుగా, తిండిబోతులుగా ఉన్నారు” అన్నాడు. \v 13 వారి గురించి అతడు చెప్పింది సత్యమే. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండేలా, \v 14 యూదుల కట్టుకథలను లేదా సత్యాన్ని తిరస్కరించిన మనుష్యుల ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా నీవు వారిని తీవ్రంగా గద్దించు. \v 15 ఎందుకంటే, పవిత్రులకు అన్ని పవిత్రంగానే ఉంటాయి కాని, నమ్మనివారికి, చెడిపోయినవారికి ఏది పవిత్రంగా ఉండదు. నిజానికి అలాంటివారి మనస్సులు, మనస్సాక్షి కూడా చెడిపోయాయి. \v 16 వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నప్పటికి, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు. \c 2 \s1 సువార్త కోసం మంచి చేయుట \p \v 1 నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి. \v 2 వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండమని బోధించు. \p \v 3 అదే విధంగా, వృద్ధ స్త్రీలకు, భక్తి జీవితాన్ని కలిగి ఉండి, అపవాదులు వేసేవారిగా లేదా మద్యానికి బానిసలుగా ఉండకుండా, ఏది మంచిదో దానిని బోధించేవారిగా ఉండమని బోధించు. \v 4 అప్పుడు వారు యవ్వన స్త్రీలకు తమ భర్తలను బిడ్డలను ప్రేమించుమని, \v 5 స్వీయ నియంత్రణ కలిగి పవిత్రులుగా ఉండమని, తమ గృహాలలో పనులను చేసుకుంటూ దయ కలిగి ఉండమని, తన భర్తలకు విధేయత కలిగి ఉండమని బోధించగలరు, అప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరూ దూషించలేరు. \p \v 6 అదే విధంగా, స్వీయ నియంత్రణ కలిగి ఉండమని యవ్వన పురుషులను ప్రోత్సహించు. \v 7 నీవు ప్రతి విషయంలో వారికి మాదిరిగా జీవిస్తూ, ఏది మంచిదో అదే చేస్తూ, నీ బోధలలో నిజాయితీని, గంభీరతను చూపిస్తూ, \v 8 మంచి మాటలనే ఉపయోగించు, అప్పుడు నిన్ను వ్యతిరేకించేవారికి నీ గురించి చెడుగా చెప్పడానికి ఏమి ఉండదు, కాబట్టి వారు సిగ్గుపడతారు. \p \v 9 దాసులుగా ఉన్నవారు తమ యజమానులకు ప్రతి విషయంలో లోబడి ఉండాలని, అన్ని విధాలుగా వారిని సంతోషపరచడానికి ప్రయత్నించాలని, వారికి ఎదురు చెప్పకూడదని, \v 10 యజమానుల నుండి ఏదీ దొంగతనం చేయకుండా, తాము నమ్మదగిన వారని నిరూపించుకోవాలని దాసులకు బోధించు, అప్పుడు వారు ప్రతి విషయంలో మన రక్షకుడైన దేవుని బోధను ఆకర్షణీయంగా చేస్తారు. \p \v 11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. \v 12-13 మనం భక్తిహీనతను ఈ లోక కోరికలను తృణీకరించి, దివ్య నిరీక్షణ కోసం అనగా, మన గొప్ప దేవుడును రక్షకుడైన యేసు క్రీస్తు తన మహిమతో కనబడతాడనే ఆ దివ్య నిరీక్షణ కలిగి ఎదురుచూస్తూ, స్వీయ నియంత్రణ కలిగి, ఈ ప్రస్తుత యుగంలో న్యాయంగా భక్తి కలిగి జీవించమని ఆ కృపయే మనకు బోధిస్తుంది. \v 14 యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు. \p \v 15 కాబట్టి ఈ విషయాలను నీవు వారికి బోధించాలి, నీకు ఇవ్వబడిన పూర్తి అధికారంతో వారిని హెచ్చరించి గద్దించు. నిన్ను ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా చూసుకో. \c 3 \s1 రక్షించబడిందే మంచి చేయడానికి \p \v 1 పరిపాలకులకు అధికారులకు లోబడుతూ విధేయత కలిగి మంచి పనులను చేయడానికి సిద్ధంగా ఉండాలని, \v 2 ఎవరినీ నిందించకూడదని, శాంతియుతంగా వివేకం కలిగి ఉండాలని, అందరి పట్ల ఎల్లప్పుడూ సౌమ్యంగా మెలగాలని ప్రజలకు జ్ఞాపకం చేయి. \p \v 3 ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాము. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము. \v 4 మన రక్షకుడైన దేవుడు తన దయ ప్రేమను వెల్లడి చేసినప్పుడు, \v 5 ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన పాపాలను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రొత్త జన్మనిచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. \v 6 ఆయన మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనపై ధారాళంగా ఆత్మను కుమ్మరించాడు. \v 7 ఆయన కృప వల్ల మనల్ని నీతిమంతులుగా ప్రకటించి, మనం నిత్యజీవాన్ని పొందుతామని నమ్మకాన్ని ఇచ్చాడు. \v 8 ఇది నమ్మదగిన మాట. కాబట్టి దేవుని నమ్మినవారు మంచి పనులను చేయడానికి శ్రద్ధతో పూనుకొనేలా నీవు ఈ విషయాలను మరింత గట్టిగా బోధించాలని చెప్తున్నాను. ఇవి ఉత్తమమైనవి, అందరికి ప్రయోజనకరమైనవి. \p \v 9 అయితే మూర్ఖమైన వివాదాలకు, వంశావళులకు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదాలకు కలహాలకు దూరంగా ఉండు, ఎందుకంటే అవి నిష్ఫలమైనవి వ్యర్థమైనవి. \v 10 విభజనలు కలిగించేవారిని మొదటిసారి గద్దించు, రెండవసారి హెచ్చరించు. ఆ తర్వాత వారిని వదిలేయి. \v 11 అలాంటివారు చెడిపోయినవారు, పాపాత్ములు; వారు తమను తామే నిందించుకుంటారని నీకు ఖచ్చితంగా తెలుసు. \b \s1 తుది హెచ్చరికలు \p \v 12 నేను నికొపోలిలో శీతాకాలం గడపాలని అనుకుంటున్నాను, కాబట్టి నేను ఆర్తెమాను లేదా తుకికును నీ దగ్గరకు పంపిన వెంటనే నీవు బయలుదేరి నికొపోలిలో నా దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉండు. \v 13 న్యాయవాది జేనాసు అపొల్లోను జాగ్రత్తగా పంపించు, వారి ప్రయాణానికి కావలసినవన్ని సమకూర్చి తగిన సహాయం చేయి. \b \p \v 14 మన ప్రజలు నిష్ఫలమైన జీవితాలను జీవించకుండా అవసరాలకు తగినట్లు మంచి పనులు చేయడంలో శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి. \b \p \v 15 నాతో ఉన్నవారందరు నీకు శుభాలు తెలియజేస్తున్నారు. \p విశ్వాసాన్నిబట్టి మమ్మల్ని ప్రేమించేవారందరికి మా వందనాలు తెలియజేయి. \b \p దేవుని కృప మీ అందరితో ఉండును గాక.