\id SNG - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h పరమ \toc1 పరమ గీతములు \toc2 పరమ \toc3 పరమ \mt1 పరమ గీతములు \c 1 \p \v 1 సొలొమోను రచించిన పరమ గీతములు. \b \sp యువతి\f + \fr 1:2 \fr*\ft ప్రధానంగా మగ ఆడ ఉపన్యాసకులు (ప్రధానంగా సంబంధిత హెబ్రీ రూపాలలో లింగం ఆధారంగా గుర్తించబడ్డాయి) సర్వనామముల ద్వారా సూచించబడతారు, అనగా \ft*\fqa అతడు ఆమె \fqa*\ft ఇతర వాటికి \ft*\fqa చెలికత్తెలు. \fqa*\ft కొన్ని సందర్భాలలో ఇవి చర్చనీయాంశంగా ఉంటాయి.\ft*\f* \q1 \v 2 అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి, \q2 నీ ప్రేమ ద్రాక్షరసం కంటే ఆహ్లాదకరమైనది. \q1 \v 3 మీ పరిమళ ద్రవ్యాల సువాసన హృదయానికి ఆనందాన్నిస్తుంది; \q2 మీ పేరు పోయబడిన పరిమళం లాంటిది. \q2 కాబట్టి యువతులు నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు! \q1 \v 4 నన్ను మీతో దూరానికి తీసుకెళ్లండి; త్వరగా! \q2 రాజు తన అంతఃపురాల్లోకి నన్ను తీసుకెళ్లనివ్వండి. \sp చెలికత్తెలు \q1 నీ విషయం మేము గొప్పగా సంతోషిస్తున్నాము; \q2 నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా పొగడుతాము. \sp యువతి \q1 వారు నిన్ను పొగడడం ఎంత మంచి విషయం! \b \q1 \v 5 యెరూషలేము కుమార్తెలారా, \q2 నల్లనిదానను, అయినా నేను సౌందర్యవతిని, \q1 కేదారు డేరాలవంటిదానను, \q2 సొలొమోను గుడారపు తెరల్లా నేనూ నల్లనిదాన్ని. \q1 \v 6 నల్లపిల్ల అని చెప్పి నన్నిలా తేరిచూస్తారేమి? \q2 ఎండకు నేను నల్లగా అయ్యాను. \q1 నా తల్లి కుమారులకు నా మీద కోపం \q2 నన్ను ద్రాక్షతోటను కావలి కాయడానికి పెట్టారు; \q2 అందుకే నా సొంత ద్రాక్షతోటను కాయలేక పోయాను. \q1 \v 7 నేను ప్రేమిస్తున్నవాడా, \q2 నీ గొర్రెల మందను ఎక్కడ మేపుతున్నావో \q2 మధ్యాహ్నం మీ మందను విశ్రాంతికి ఎక్కడ ఉంచుతున్నావో చెప్పు. \q1 మీ స్నేహితుల మందల ప్రక్కన \q2 నేను ముసుగు వేసుకున్న స్త్రీలా ఎందుకు ఉండాలి? \sp చెలికత్తెలు \q1 \v 8 స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఒకవేళ నీకు తెలియకపోతే, \q2 మందల అడుగుజాడలను బట్టి వెళ్లు, \q1 కాపరుల డేరాల ప్రక్కన \q2 నీ మేక పిల్లలను మేపుకో. \sp యువకుడు \q1 \v 9 నా ప్రియురాలా, నీవు అద్భుతం \q2 నీవు ఫరో రథం యొక్క గుర్రాల్లా ఉన్నావు. \q1 \v 10 మీ బుగ్గలు చెవిపోగులతో, \q2 నీ మెడ హారాలతో అందంగా ఉన్నాయి. \q1 \v 11 బంగారు చెవిపోగులు చేస్తాము \q2 వెండి పూసలతో అలంకరిస్తాము. \sp యువతి \q1 \v 12 రాజు బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు, \q2 నా పరిమళపు సువాసన అంతా గుబాళించింది. \q1 \v 13 నా ప్రియుడు నా స్తనముల మధ్య ఉన్న, \q2 బోళం సంచిలా ఉన్నాడు. \q1 \v 14 ఎన్-గేదీ ద్రాక్షవనంలో \q2 వికసించిన గోరింట పూలగుత్తి లాంటివాడు నా ప్రియుడు. \sp యువకుడు \q1 \v 15 నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు! \q2 ఓ, ఎంతో అందాలరాశివి! \q2 నీ కళ్లు గువ్వలు. \sp యువతి \q1 \v 16 నా ప్రియుడా! నీవు ఎంత సౌందర్యమూర్తివి! \q2 ఓ, నీవు ఎంతో అందమైనవాడవు! \q2 మనకు పడక ప్రశాంతము. \sp యువకుడు \q1 \v 17 మన గృహం దేవదారు దూలాలు! \q2 మన వాసాలు సరళవృక్షాల మ్రానులు. \c 2 \sp యువతి\f + \fr 2:1 \fr*\ft లేదా \ft*\fqa యువకుడు\fqa*\f* \q1 \v 1 నేను షారోను పొలంలో పూసిన గులాబిని, \q2 లోయల్లో వికసించిన తామర పువ్వును. \sp యువకుడు \q1 \v 2 ముళ్ళ మధ్య తామర పువ్వులా \q2 నా ప్రియురాలు ఈ కన్యకల మధ్య కనిపిస్తూ ఉన్నది. \sp యువతి \q1 \v 3 అడవి చెట్ల మధ్య ఆపిల్ వృక్షంలా \q2 నా ప్రియుడు యువకుల మధ్య ఉన్నాడు, \q1 ఆయన నీడలో ఆనందమయినై కూర్చుండిపోయాను, \q2 ఆయన ఫలం నా రుచికి మధురము. \q1 \v 4 నన్ను ఆయన విందుశాలకు నడిపించారు, \q2 ఆయన నన్ను ప్రేమతో కప్పివేశారు. \q1 \v 5 ఎండు ద్రాక్షపండ్లతో నన్ను బలోపేతం చేయండి, \q2 ఆపిల్ పండ్లతో తినిపించండి. \q2 ఎందుకంటే నేను ప్రేమతో మూర్ఛపోయాను. \q1 \v 6 ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు, \q2 కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు. \q1 \v 7 యెరూషలేము కుమార్తెలారా! \q2 పొలములోని జింకలను బట్టి లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను: \q1 సరియైన సమయం వచ్చేవరకు \q2 ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి. \b \q1 \v 8 వినండి! నా ప్రియుడు! \q2 చూడండి! ఆయన వచ్చాడు, \q1 పర్వతాల మీదుగా గంతులు వేస్తూ, \q2 కొండల మీదుగా దూకుతూ. \q1 \v 9 నా ప్రియుడు జింకలాంటి వాడు, లేదా లేడిపిల్ల లాంటివాడు. \q2 చూడండి! అక్కడ అతడు మా గోడ వెనుక నిలబడి \q1 కిటికీల గుండా చూస్తూ, \q2 జాలక గుండా దాచుకుని చూస్తున్నాడు. \q1 \v 10 నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు, \q2 నా ప్రియురాలా, లే, \q2 నా సౌందర్యవతి, నాతో రా. \q1 \v 11 చూడండి! శీతాకాలం గడిచిపోయింది; \q2 వర్షాలు అయిపోయాయి. \q1 \v 12 భూమిపై పువ్వులు ప్రత్యక్షమవుతాయి; \q2 పాడే రుతువు\f + \fr 2:12 \fr*\ft లేదా \ft*\fqa ద్రాక్ష కొమ్మలను కత్తిరించే కాలము.\fqa*\f* వచ్చేసింది. \q1 మన దేశంలో \q2 పావురాల కూత వినిపిస్తూ ఉంది. \q1 \v 13 అంజూర చెట్టు దాని తొలి ఫలాలను కాస్తుంది; \q2 ద్రాక్షచెట్లు వికసించి సువాసనను వెదజల్లుతున్నాయి. \q1 నా ప్రియురాలా, లేచి, రా, \q2 నా సౌందర్యవతి, నాతో రా. \sp యువకుడు \q1 \v 14 బండ సందుల్లో, \q2 పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా, \q1 నీ ముఖాన్ని నాకు చూపించు, \q2 నీ స్వరాన్ని విననివ్వు; \q1 ఎందుకంటే నీ స్వరం మధురం \q2 నీ ముఖం మనోహరము. \q1 \v 15 నక్కలను పట్టుకోండి, \q2 గుంట నక్కలను పట్టుకోండి \q1 ఎందుకంటే అవి ద్రాక్షతోటలను పాడు చేస్తాయి, \q2 మన ద్రాక్షతోట పూతకు వచ్చింది. \sp యువతి \q1 \v 16 నా ప్రియుడు నావాడు నేను ఆయన దానను; \q2 తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.\f + \fr 2:16 \fr*\ft లేదా \ft*\fqa గొర్రెలను మేపుతున్నాడు.\fqa*\f* \q1 \v 17 తెల్లవారుజాము వచ్చి \q2 నీడలు పారిపోకముందు, \q1 నా ప్రియుడా, నా దగ్గరకు తిరిగి రా, \q2 నీవు జింకలా దుప్పిలా \q2 ఎగుడు దిగుడు కొండల\f + \fr 2:17 \fr*\ft లేదా \ft*\fqa బేతేరు కొండలు.\fqa*\f* మీది నుండి చెంగు చెంగున రా. \b \c 3 \q1 \v 1 రాత్రంతా నేను పడుకుని \q2 నా హృదయం ప్రేమించేవాని కోసం నేను చూశాను; \q2 ఆయన కోసం చూశాను కాని ఆయన రాలేదు. \q1 \v 2 నేను ఇప్పుడే లేచి పట్టణం వైపు వెళ్తాను, \q2 పట్టణ వీధుల్లో రహదారుల్లో వెదకుతాను; \q1 నా హృదయం ప్రేమిస్తున్నవాని కోసం నేను వెదకుతాను. \q2 కాబట్టి నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనపడలేదు. \q1 \v 3 పట్టణంలో గస్తీ తిరుగుతున్న కావలివారు నాకు ఎదురుపడితే \q2 “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని వారినడిగాను. \q1 \v 4 నేను దాదాపుగా వారిని దాటి వెళ్లాను \q2 అప్పుడు నా ప్రేమికుడు నాకు కనిపించాడు. \q1 ఆయనను గట్టిగా పట్టుకున్నాను \q2 ఆయనను నా తల్లి గృహానికి, \q2 నన్ను కనిన గది లోనికి తెచ్చే వరకు నేను వదల్లేదు. \q1 \v 5 యెరూషలేము కుమార్తెలారా! పొలములోని జింకలను బట్టి \q2 లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను: \q1 సరియైన సమయం వచ్చేవరకు \q2 ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి. \b \q1 \v 6 ధూమ స్తంభాకరంలో \q2 వర్తకుల దగ్గర సుగంధ చూర్ణాలన్నిటితో తయారుచేయబడిన \q1 బోళం పరిమళ వాసనతో \q2 అరణ్య మార్గాన నడిచి వస్తున్నదేంటి? \q1 \v 7 చూడండి! ఆ వచ్చేది సొలొమోను పల్లకి, \q2 అరవైమంది శూరుల భద్రతలో \q2 ఇశ్రాయేలీయులలో అతి జ్ఞానముగల యోధులు, \q1 \v 8 వారిలో అందరు ఖడ్గమును ధరించిన వారు, \q2 యుద్ధంలో అనుభవం కలవారు, \q1 ప్రతి ఒక్కరు రాత్రి కలిగే దాడులకు సిద్ధపడి, \q2 ఖడ్గం ధరించి సన్నద్ధులై వస్తున్నారు. \q1 \v 9 సొలొమోను రాజు చేయించిన పల్లకి అది; \q2 లెబానోను మ్రానుతో తయారైన పల్లకి. \q1 \v 10 దాని స్తంభాలు వెండివి, \q2 అడుగుభాగం బంగారం, \q1 దాని ఆసనం ఊదా రంగు బట్టతో అలంకరించబడింది, \q2 దాని లోపలి భాగం యెరూషలేము కుమార్తెల ద్వార ప్రేమతో \q1 అలంకరించబడింది. \v 11 బయటకు రండి, \q2 సీయోను కుమార్తెలారా, చూడండి, \q1 చూడండి, సొలొమోను రాజు కిరీటాన్ని ధరించారు, \q2 ఆ కిరీటం ఆయన పెళ్ళి రోజున \q1 ఆయన హృదయం ఆనందించిన దినాన \q2 ఆయన తల్లి ఆయనకు ధరింపజేసిన కిరీటము. \c 4 \sp యువకుడు \q1 \v 1 నా ప్రియురాలా, నీవు ఎంత అందంగా ఉన్నావు! \q2 ఓ, ఎంత అందం! \q2 మీ ముసుగు వెనుక మీ కళ్లు గువ్వల్లా ఉన్నాయి. \q1 నీ శిరోజాలు గిలాదు పర్వతం మీది నుండి \q2 దిగివొచ్చే మేకల మందల్లా కనిపిస్తున్నాయి. \q1 \v 2 నీ పళ్ళు అప్పుడే కత్తెర వేయబడి, \q2 కడుగబడి పైకి వస్తున్న గొర్రె మందలా ఉన్నాయి. \q1 ప్రతిదీ జంటగా ఉన్నాయి, \q2 వాటిలో ఒక్కటి కూడా ఒంటరిగా లేదు. \q1 \v 3 నీ పెదవులు ఎర్ర త్రాడులా ఉన్నాయి; \q2 నీ నోరు మనోహరము. \q1 నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, \q2 సగం దానిమ్మ పండులా ఉన్నాయి. \q1 \v 4 నీ మెడ అందంగా నిర్మించబడిన \q2 దావీదు గోపురంలా ఉన్నది; \q1 దాని మీద వేయి డాళ్లు వ్రేలాడుతున్నాయి; \q2 అవన్నీ శూరుల డాళ్లు. \q1 \v 5 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, \q2 తామర పువ్వుల మధ్య మేసే \q2 దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి. \q1 \v 6 తెల్లవారుజాము రాకముందు \q2 నీడలు పారిపోకముందు, \q1 నేను బోళం కొండకు \q2 బోళం పర్వతానికి వెళ్తాను. \q1 \v 7 నా ప్రియురాలా, నీవు అధిక మనోహరం; \q2 నీలో ఏ కంళంకమూ లేదు. \b \q1 \v 8 నా వధువు, లెబానోను నుండి నాతో రా, \q2 లెబానోను నుండి నాతో రా. \q1 అమాన పర్వత శిఖరం నుండి, \q2 శెనీరు, హెర్మోను శిఖరాల నుంచీ, \q1 సింహాల బోనుల నుండి, \q2 చిరుత పులులు సంచరించే కొండల నుండి దిగిరా. \q1 \v 9 నా సోదరీ, నా వధువా, నీవు నా హృదయం దొంగిలించావు; \q2 నీ ఒక్క చూపుతో, \q1 నీ హారంలోని ఒక్క ఆభరణంతో \q2 నీవు నా హృదయాన్ని దొంగిలించావు. \q1 \v 10 నా సోదరీ, నా వధువా, నీ ప్రేమ ఎంత ఆహ్లాదకరం! \q2 ద్రాక్షరసం కంటే నీ ప్రేమ ఆనందమయం, \q1 నీవు పూసుకున్న పరిమళ తైల సువాసన \q2 సుగంధ ద్రవ్యాలన్నిటినీ మించింది! \q1 \v 11 నా వధువు! నీ పెదవులు తేనెతెట్టెలా మాధుర్యాన్ని వదులుతున్నాయి; \q2 నీ నాలుక క్రింద పాలు తేనె ఉన్నాయి. \q1 నీ వస్త్ర సువాసన \q2 లెబానోను సువాసనగా ఉంది. \q1 \v 12 నా సోదరీ, నా వధువు! \q2 నీవు మూసివేయబడిన తోటవు నీవు చుట్టబడిన ఊటవు, మూయబడిన సరస్సువు. \q1 \v 13 నీ మొక్కలు ఒక దానిమ్మతోట \q2 కోరుకున్న ఫలములతో, \q2 గోరింట జటామాంసి చెట్లతో, \q2 \v 14 జటామాంసి కుంకుమ పువ్వు, \q2 వోమ దాల్చిన చెక్క, \q2 ప్రతి విధమైన పరిమళ చెట్టుతో, \q2 బోళం కలబంద, \q2 అన్ని సుగంధద్రవ్యాలు. \q1 \v 15 నీవు ఉద్యానవనంలోని జలాశయానివి, \q2 లెబానోను నుండి దిగువకు ప్రవహించే, \q2 నీటి ఊటలు కల బావివి. \sp యువతి \q1 \v 16 ఉత్తర వాయువూ, మేలుకో, \q2 దక్షిణ వాయువూ, రా! \q1 నా ఉద్యానవనం మీద వీచండి, \q2 తద్వారా అందలి పరిమళ వాసన అన్ని వైపుల వ్యాపించాలి. \q1 నా ప్రియుడు తన ఉద్యాన వనానికి వచ్చి \q2 నచ్చిన పండ్లు రుచి చేయును గాక. \c 5 \sp యువకుడు \q1 \v 1 నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను; \q2 నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను. \q1 నేను తేనెతెట్టె తేనె తిన్నాను; \q2 నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను. \sp చెలికత్తెలు \q1 స్నేహితులారా, తినండి త్రాగండి; \q2 ప్రేమికులారా! తృప్తిగా సేవించండి. \sp యువతి \q1 \v 2 నేను నిద్ర పోతున్నానన్న మాటే గాని, నా హృదయం మేలుకొని ఉంది. \q2 వినండి! నా ప్రియుడు తలుపు తడుతూ: \q1 “తలుపు తియ్యి, నా సోదరీ, నా ప్రియురాలా! \q2 నా పావురమా, నిష్కళంకురాలా. \q1 నా తల మంచుకు తడిసింది, \q2 రాత్రి తేమకు నా వెంట్రుకలన్నీ తడిసిపోయాయి.” \q1 \v 3 నేను నా వస్త్రాన్ని తీసివేశాను \q2 దాన్ని మళ్ళీ ధరించాలా? \q1 నేను నా కాళ్లు కడుక్కున్నాను \q2 మళ్ళీ వాటిని మురికి చేసుకోవాలా? \q1 \v 4 నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టంగానే; \q2 నా గుండె అతని కోసం కొట్టుకోవడం ప్రారంభించింది. \q1 \v 5 నా ప్రియునికి తలుపు తీద్దామని లేచాను. \q2 నా చేతులు బోళముతో తడిసి, \q1 నా వ్రేళ్ళ నుండి బోళం, \q2 తలుపు గడియ మీదికి స్రవించింది. \q1 \v 6 నా ప్రియుడికి, నేను తలుపు తీసేలోగా, \q2 ఆయన వెళ్లిపోయాడు. \q2 నా ప్రాణం స్పృహ తప్పింది. \q1 నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనబడలేదు. \q2 నేను ఆయనను పిలిచాను కాని ఆయన పలుకలేదు. \q1 \v 7 పట్టణంలో గస్తీ తిరిగేవారు \q2 నాకెదురై వారు నన్ను కొట్టి, గాయపరిచారు; \q1 నా ముసుగును తొలగించారు, \q2 వారు ప్రాకారం మీద కావలివారు. \q1 \v 8 యెరూషలేము కుమార్తెలారా, \q2 నా ప్రియుడు మీకు కనిపిస్తే, \q1 ఆయనకు మీరు ఏమి చెప్తారు? \q2 ప్రేమను బట్టి నాకు స్పృహ తప్పిందని చెప్తామని ప్రమాణం చేయండి. \sp చెలికత్తెలు \q1 \v 9 స్త్రీలలో అత్యంత అందమైనదానా, \q2 ఇతరులకంటే నీ ప్రియుడి విశిష్టత యేమి? \q1 ఇంతగా మాచేత ప్రమాణం చేయించుకున్నావు, \q2 ఇంతకు నీ ప్రియుడి విశేషమేమి? \sp యువతి \q1 \v 10 నా ప్రియుడు ప్రకాశమానమైన వాడు ఎర్రని వాడు, \q2 పదివేలమంది కన్న గొప్పవాడు. \q1 \v 11 ఆయన తల మేలిమి బంగారం; \q2 ఆయనది ఉంగరాల జుట్టు, \q2 కాకి నలుపంత నల్లగా ఉన్నాయి. \q1 \v 12 ఆయన నేత్రాలు \q2 నదీ తీరాన ఎగిరే గువ్వల్లాంటివి, \q1 అవి పాలలో స్నానమాడినట్లున్నాయి, \q2 ఆభరణాల్లా చెక్కబడ్డాయి. \q1 \v 13 ఆయన చెక్కిళ్ళు సువాసన ఇచ్చే \q2 పరిమళ పడకల్లాంటివి, \q1 ఆయన పెదవులు తామరలాంటివి \q2 వాటిలో నుండి బోళం స్రవిస్తుంది. \q1 \v 14 ఆయన చేతులు గోమేధికం పొదిగిన \q2 బంగారు కడ్డీలు, \q1 ఆయన ఉదరం నీలమణి, వైడూర్యం పొదిగిన \q2 దంత కళాఖండము. \q1 \v 15 ఆయన కాళ్లు మేలిమి బంగారు దిమ్మల మీద నిలిపిన \q2 పాలరాతి స్తంభాలు. \q1 ఆయన రూపం లెబానోనులా, \q2 దాని దేవదారు వృక్షాలలా ఉంది. \q1 \v 16 ఆయన నోరు అతిమధురం; \q2 ఆయన మనోహరము. \q1 యెరూషలేము కుమార్తెలారా! \q2 ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు. \c 6 \sp చెలికత్తెలు \q1 \v 1 స్త్రీలలో అత్యంత అందమైనదానా, \q2 నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు? \q1 నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు \q2 మేమూ నీతో పాటు ఆయనను వెదకడానికి. \sp యువతి \q1 \v 2 నా ప్రియుడు తన తోటకు వెళ్లాడు, \q2 పరిమళ మొక్కల పాన్పుల దగ్గరకు, \q1 తోటలో మందను మేపడానికి, \q2 తామరలను ఏరుకోడానికి. \q1 \v 3 నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు; \q2 తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు. \sp యువకుడు \q1 \v 4 నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు, \q2 యెరూషలేములా మనోహరంగా ఉన్నావు, \q2 జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు. \q1 \v 5 నీ కళ్లను నా వైపు నుండి త్రిప్పు; \q2 అవి నన్ను వశపరచుకుంటాయి. \q1 నీ శిరోజాలు గిలాదు వంపుల నుండి \q2 దిగివస్తున్న మేకల మందల్లా ఉన్నాయి. \q1 \v 6 నీ పళ్ళు అప్పుడే కడుగబడి పైకి వస్తున్న \q2 గొర్రె మందలా ఉన్నాయి. \q1 ప్రతిదీ జంటగా ఉన్నాయి. \q2 వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. \q1 \v 7 నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, \q2 విచ్చిన ఒక దానిమ్మ పండులా ఉన్నాయి. \q1 \v 8 అరవైమంది రాణులు, \q2 ఎనభైమంది ఉంపుడుగత్తెలు, \q2 అసంఖ్యాకులైన కన్యకలు ఉండవచ్చు; \q1 \v 9 కాని నా పావురం, నా అందాలరాశి, ఒకతే, \q2 తన తల్లికి ఒక్కగానొక్క కుమార్తె, \q2 తనను కన్నదానికి ఇష్టమైనది. \q1 యువతులు ఆమెను చూసి ఆమెను ధన్యురాలు అని పిలిచారు; \q2 రాణులు ఉంపుడుగత్తెలు ఆమెను ప్రశంసించారు. \sp చెలికత్తెలు \q1 \v 10 తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, \q2 సూర్యునిలా ప్రకాశవంతంగా, \q2 నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు? \sp యువకుడు \q1 \v 11 లోయలో గుబురుగా పెరిగిన అక్షోట చెట్ల దగ్గరకు \q2 లోయలో నూతన చిగురులను చూడాలని, \q1 ద్రాక్షచెట్లు చిగిరించాయో లేదో, \q2 దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్లాను. \q1 \v 12 నేను గ్రహించేలోపే, \q2 నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది. \sp చెలికత్తెలు \q1 \v 13 ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా; \q2 తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా! \sp యువకుడు \q1 మహనాయీము నాట్యాన్ని చూసినట్లు \q2 మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు? \b \c 7 \q1 \v 1 ఓ రాకుమారుని కుమార్తె! \q2 చెప్పులతో మీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! \q1 మీ అందమైన కాళ్లు ఆభరణాలు వంటివి, \q2 నైపుణ్యం కలిగిన హస్తకళాకారుని పని. \q1 \v 2 నీ నాభి గుండ్రని ఒక మద్యపాన పాత్ర \q2 అందులో ద్రాక్షరస మిశ్రమం ఎప్పుడూ కొరతగా ఉండదు. \q1 నీ నడుము తామరల చేత చుట్టబడిన \q2 గోధుమ రాశిలాగ ఉంది. \q1 \v 3 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, \q2 దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి. \q1 \v 4 నీ మెడ దంతపు గోపురం లాంటిది. \q1 మీ కళ్లు బాత్-రబ్బీం ద్వారం దగ్గర ఉన్న \q2 హెష్బోను కొలనులాంటివి. \q1 మీ ముక్కు దమస్కు వైపు చూస్తున్న \q2 లెబానోను గోపురం లాంటిది. \q1 \v 5 నీ శిరస్సు కర్మెలు పర్వతము. \q2 నీ శిరోజాలు రాజు ధరించే ఊదా వస్త్రంలా ఉన్నాయి; \q2 వాటి చుట్టలో రాజు బందీగా పట్టుబడ్డాడు. \q1 \v 6 నా ప్రియులారా, నీకు ఆనందకరమైన వాటితో, \q2 నీవు ఎంత అందంగా ఉన్నావు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నావు. \q1 \v 7 నీ రూపం తాటి చెట్టులా \q2 నీ స్తనములు గెలల్లా ఉన్నాయి. \q1 \v 8 నేనన్నాను, “నేను తాటి చెట్టు ఎక్కుతాను; \q2 దాని ఫలములు పట్టుకుంటాను.” \q1 నీ స్తనములు ద్రాక్షవల్లికి ఉండే ద్రాక్ష గెలల్లా ఉండును గాక. \q2 నీ శ్వాస యొక్క పరిమళం ఆపిల్ పండ్ల వాసనలా ఉంది. \q2 \v 9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షరసంలా ఉంది. \sp యువతి \q1 ద్రాక్షరసం పెదవులు పళ్ల మీదుగా సున్నితంగా ప్రవహిస్తూ \q2 నా ప్రియుని దగ్గరకు వెళ్లును గాక. \q1 \v 10 నేను నా ప్రియుని దానను, \q2 ఆయనకు నా పట్ల వాంఛ. \q1 \v 11 నా ప్రియుడా, రా, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాము, \q2 గ్రామాల్లో\f + \fr 7:11 \fr*\ft లేదా \ft*\fqa గోరింట పొదల్లో\fqa*\f* రాత్రి గడుపుదాము. \q1 \v 12 ప్రొద్దున్నే లేచి, ద్రాక్ష తోటలకు వెళ్లిపోదాం \q2 ద్రాక్షవల్లులు చిగిర్చాయేమో, \q1 పూలు పూచాయేమో, \q2 దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేయో, చూద్దాము రా! \q2 అక్కడ నా ప్రేమ నీకు వ్యక్తం చేస్తాను. \q1 \v 13 పుత్రదాత ఫలం సువాసన ఇస్తున్నది, \q2 నా ప్రియుడా, మా ద్వారబంధాల దగ్గరే అనేక రకాల శ్రేష్ఠఫలాలున్నాయి, \q1 నీకోసం వాటిని దాచి వుంచాను, \q2 క్రొత్తవి పాతవి అందులో ఉన్నాయి. \b \c 8 \q1 \v 1 ఒకవేళ నీవు నాకు సోదరుడిలా ఉంటే, \q2 నా తల్లి స్తనముల దగ్గర పెంచబడిన వాడవైయుంటే! \q1 అప్పుడు, నేను నిన్ను బయట కనుగొని ఉంటే, \q2 నిన్ను ముద్దాడేదాన్ని, \q2 నన్ను ఎవరూ నిందించేవారు కారు. \q1 \v 2 నేను నిన్ను తోలుకొని \q2 నాకు ఉపదేశం చేసిన, \q2 నా తల్లి ఇంటికి తీసుకెళ్లేదాన్ని. \q1 నీవు త్రాగడానికి నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసాన్ని, \q2 దానిమ్మపండ్ల మకరందం ఇచ్చేదాన్ని. \q1 \v 3 ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు, \q2 కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు. \q1 \v 4 యెరూషలేము కుమార్తెలారా! మీతో ప్రమాణము చేయిస్తున్నాను: \q2 సరియైన సమయం వచ్చేవరకు \q2 ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి. \sp చెలికత్తెలు \q1 \v 5 తన ప్రియుని ఆనుకుని \q2 అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు? \sp యువకుడు \q1 ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను; \q2 అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది, \q2 అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది. \q1 \v 6 నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా, \q2 మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో; \q1 ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది, \q2 దాని అసూయ సమాధిలా క్రూరమైనది. \q1 ఇది మండుతున్న అగ్నిలా, \q2 శక్తివంతమైన మంటలా\f + \fr 8:6 \fr*\ft లేదా \ft*\ft యెహోవా యొక్క మంటలా\ft*\f* కాలుతుంది. \q1 \v 7 పెరుగుతున్న జలాలు ప్రేమను అణచివేయలేవు; \q2 నదీజలాలు ప్రేమను తుడిచివేయలేవు. \q1 ప్రేమకు ప్రతిగా \q2 తనకున్నదంతా ఇచ్చినా, \q2 దానికి\f + \fr 8:7 \fr*\ft లేదా \ft*\fqa అతడు\fqa*\f* తిరస్కారమే లభిస్తుంది. \sp చెలికత్తెలు \q1 \v 8 మాకో చిన్న చెల్లెలుంది, \q2 దానికింకా స్తనములు రాలేదు. \q1 దానికి పెళ్ళి నిశ్చయమైతే \q2 ఏం చేయాలి? \q1 \v 9 ఒకవేళ ఆమె ప్రాకారమైతే, \q2 ఆమెపై మేము వెండి గోపురం కట్టిస్తాము. \q1 ఒకవేళ ఆమె ద్వారం అయితే, \q2 దేవదారు పలకలతో దానికి భద్రత ఏర్పరుస్తాము. \sp యువతి \q1 \v 10 నేను ప్రాకారాన్ని, \q2 నా స్తనములు గోపురాల్లాంటివి. \q1 అందుకే అతని దృష్టికి \q2 క్షేమం పొందదగినదానిగా ఉన్నాను. \q1 \v 11 బయల్-హామోను దగ్గర సొలొమోనుకు ద్రాక్షతోట ఉంది; \q2 అతడు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చాడు. \q1 దాని ఫలానికి ఒక్కొక్కడు \q2 వెయ్యి వెండి షెకెళ్ళ\f + \fr 8:11 \fr*\ft అది సుమారు 12 కి. గ్రా. లు; \+xt పరమ 8:12\+xt* కూడా\ft*\f* శిస్తు చెల్లించాలి. \q1 \v 12 కాని, నా ద్రాక్షవనం నా స్వాధీనంలోనే ఉంది; \q2 సొలొమోను రాజా, నీ వెయ్యి షెకెళ్ళు నీకే చెందుతాయి. \q2 వాటిని చూసుకునే వారికి రెండువందలు షెకెళ్ళు\f + \fr 8:12 \fr*\ft అంటే, సుమారు 2.3 కి. గ్రా. లు\ft*\f* గిట్టుతాయి. \sp యువకుడు \q1 \v 13 ఉద్యానవనాల్లో నివసించేదానా \q2 నీ చెలికత్తెలు నీతో ఉండగా, \q2 నీ స్వరం విననివ్వు. \sp యువతి \q1 \v 14 నా ప్రియుడా, దూరంగా రా, \q2 జింకలా, దుప్పిలా \q1 పరిమళముల పర్వతాల మీదుగా \q2 గంతులు వేస్తూ రా.