\id ROM - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h రోమా పత్రిక \toc1 రోమీయులకు వ్రాసిన పత్రిక \toc2 రోమా పత్రిక \toc3 రోమా \mt1 రోమీయులకు \mt2 వ్రాసిన పత్రిక \c 1 \po \v 1 అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కోసం ప్రత్యేకపరచబడిన పౌలు అనే నేను క్రీస్తు యేసు దాసుడను. \v 2 ఈ సువార్త ఏమంటే దేవుడు తన కుమారుని గురించి పరిశుద్ధ లేఖనాల్లో ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశారు. \v 3 ఆయన కుమారుని విషయానికి వస్తే, శరీరానుసారంగా ఆయన దావీదు సంతానానికి చెందినవారు. \v 4 ఆయన పునరుత్థానం ద్వారా పరిశుద్ధమైన ఆత్మను బట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారునిగా అధికారంతో\f + \fr 1:4 \fr*\ft లేదా \ft*\fqa దేవుని కుమారుడని బలముతో ప్రకటించబడెను\fqa*\f* నిరూపించబడ్డారు. \v 5 సమస్త ప్రజలందరిని ఆయన నామం కోసం విశ్వాసం నుండి వచ్చే విధేయతలోకి పిలువడానికి ఆయన ద్వారా మేము కృపను అపొస్తలత్వాన్ని పొందాము. \v 6 యేసు క్రీస్తుకు చెందినవారిగా ఉండడానికి పిలువబడిన ఆ ప్రజలతో పాటు మీరు కూడా ఉన్నారు. \po \v 7 రోమాలో ఉన్న దేవునిచే ప్రేమించబడుతున్న వారికి ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారందరికి పౌలు వ్రాయునది: \po మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. \s1 రోమాను దర్శించాలని పౌలు కోరిక \p \v 8 మీ విశ్వాసం గురించి లోకమంతా చాటించబడుతూ ఉంది అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. \v 9 నేను నిరంతరం నా ప్రార్థనలలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను అనడానికి, తన కుమారుని గురించిన సువార్తను ప్రకటిస్తూ నా ఆత్మలో నేను సేవిస్తున్న ఆ దేవుడే సాక్షి. \v 10 దేవుని చిత్తమైతే నేను మీ దగ్గరకు రావడానికి కనీసం ఇప్పటికైనా నాకు అవకాశం రావాలని ప్రార్థిస్తున్నాను. \p \v 11 మిమ్మల్ని బలపరచడానికి, ఆధ్యాత్మిక వరం ఏదైనా మీకు అందించడానికి మిమ్మల్ని చూడాలని నేను ఆరాటపడుతున్నాను. \v 12 తద్వారా, మీరు నేను పరస్పరం ఒకరి విశ్వాసం ద్వారా ఒకరం ప్రోత్సాహించబడతాము. \v 13 సహోదరీ సహోదరులారా, యూదేతరుల మధ్యలో నేను ఫలం పొందినట్లు మీ మధ్యలో కూడా ఫలం పొందాలని మీ దగ్గరకు రావడానికి చాలాసార్లు ప్రయత్నించాను గాని ఇప్పటివరకు నాకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఇది మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. \p \v 14 గ్రీసు దేశస్థులు, గ్రీసు దేశస్థులు కాని వారు, జ్ఞానులు అజ్ఞానుల పట్ల నేను బాధ్యత కలిగి ఉన్నాను. \v 15 అందువల్ల, రోమాలో ఉన్న మీకు కూడా సువార్తను ప్రకటించాలని నేను చాలా ఆసక్తితో ఉన్నాను. \p \v 16 సువార్త గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు రక్షణ కలుగజేయడానికి సువార్త దేవుని శక్తి. \v 17 “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు”\f + \fr 1:17 \fr*\ft \+xt హబ 2:4\+xt*\ft*\f* అని వ్రాయబడి ఉన్న ప్రకారం, విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా సువార్తలో దేవుని నీతి వెల్లడి చేయబడింది. \s1 పాపులైన మానవులపై దేవుని ఉగ్రత \p \v 18 ప్రజలు తమ దుష్టత్వం చేత సత్యాన్ని అణచివేస్తున్నారు, కాబట్టి వారిలో ఉన్న భక్తిహీనత, దుష్టత్వమంతటి మీదకు దేవుని ఉగ్రత పరలోకం నుండి వెల్లడి చేయబడుతుంది. \v 19 దేవుడే వారికి తెలియజేశారు కాబట్టి దేవుని గురించి తెలుసుకోవలసిన సంగతులు వారికి స్పష్టంగా ఉన్నాయి. \v 20 లోకం సృష్టింపబడినప్పటి నుండి, చేయబడిన ప్రతీదాని ద్వారా దేవుని అదృశ్యలక్షణాలైన శాశ్వతమైన శక్తి దైవిక స్వభావం స్పష్టంగా కనిపించాయి. కాబట్టి దేవున్ని తెలుసుకోలేకపోడానికి ప్రజలకు ఏ సాకు లేదు. \p \v 21 వారు దేవున్ని ఎరిగినప్పటికీ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, కాని వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి వారి మూర్ఖపు హృదయాలు చీకటిమయం అయ్యాయి. \v 22 వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు. \v 23 వారు నిత్యుడైన దేవుని మహిమను నాశనమయ్యే మనుష్యులు, పక్షులు, జంతువులు, ప్రాకే ప్రాణుల రూపాలలో తయారుచేసిన విగ్రహాలకు ఆపాదించారు. \p \v 24 కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించారు. \v 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు. అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్. \p \v 26 అందువల్ల, దేవుడు వారిని అవమానకరమైన వ్యామోహాలకు అప్పగించారు. వారి స్త్రీలు కూడా సహజమైన లైంగిక సంబంధాలకు బదులు అసహజమైన లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నారు. \v 27 అలాగే పురుషులు కూడా స్త్రీతో ఉండాల్సిన సహజ సంబంధాన్ని వదిలేసి, కామాగ్నితో రగిలిపోతూ పురుషులతో పురుషులు సంబంధాలు పెట్టుకున్నారు. పురుషులు పురుషులతో కలిసి అవమానకరమైన పనులు చేసే తమ తప్పులకు తగిన శిక్షను పొందారు. \p \v 28 అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం విలువైనదిగా భావించలేదు, కాబట్టి వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు. \v 29 వారు ప్రతి విధమైన దుర్మార్గంతో, చెడుతనంతో, దురాశలతో, దుర్నీతితో నిండి ఉన్నారు. వారు అసూయ కలిగినవారిగా హత్యలు చేసేవారిగా, కొట్లాటలను మోసాన్ని ఓర్వలేనితనాన్ని కలిగి ఉన్నారు. వారు వదరుబోతులు, \v 30 నిందలు వేసేవారు, దైవ ద్వేషులు, గర్విష్ఠులు, దురహంకారులు, గొప్పలు చెప్పుకునేవారు; వారు చెడు చేయడానికి మార్గాలను కనిపెడతారు; వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులు; \v 31 వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. \v 32 ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు. \c 2 \s1 న్యాయమైన దేవుని తీర్పు \p \v 1 ఇతరులకు తీర్పు తీర్చే వారెవరైనా సరే తప్పించుకునే అవకాశం లేదు. మీరు ఏ విషయంలో ఇతరులకు తీర్పు తీరుస్తున్నారో ఆ విషయంలో మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు, ఎందుకంటే తీర్పు తీరుస్తున్న మీరు కూడా అవే పనులు చేస్తున్నారు. \v 2 అలాంటి కార్యాలు చేసేవారి పట్ల సత్యాన్ని అనుసరించి దేవుని తీర్పు ఉంటుందని మనకు తెలుసు. \v 3 కాబట్టి అలాంటివి చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తూ ఉన్న సాధారణ మనుష్యులైన మీరు దేవుని తీర్పును తప్పించుకోగలరని అనుకుంటున్నారా? \v 4 దేవుని దయ మిమ్మల్ని పశ్చాత్తాపం వైపు నడిపిస్తుందని తెలియక ఆయన దయ, సహనం, ఓర్పు అనే ఐశ్వర్యాన్ని త్రోసివేస్తారా? \p \v 5 అయితే మీ మొండితనం, పశ్చాత్తాపంలేని హృదయాన్నిబట్టి దేవుని న్యాయమైన తీర్పు తీర్చబడే దేవుని ఉగ్రత దినాన దేవుని ఉగ్రతను మీకు మీరే పోగు చేసుకుంటున్నారు. \v 6 దేవుడు “వారందరికి వారు చేసిన కార్యాలను బట్టి ప్రతిఫలమిస్తారు.”\f + \fr 2:6 \fr*\ft \+xt కీర్తన 62:12; సామెత 24:12\+xt*\ft*\f* \v 7 పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమ, ఘనత, నిత్యత్వాన్ని వెదికేవారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు. \v 8 కానీ స్వలాభాన్ని చూసుకుంటూ సత్యాన్ని తిరస్కరించి చెడ్డపనులను చేసేవారి మీదికి దేవుని కోపం, ఉగ్రత వస్తుంది. \v 9 చెడు చేసే ప్రతీ వ్యక్తికి అనగా మొదట యూదులకు, తర్వాత యూదేతరులకు ఇబ్బంది, బాధ ఉంటుంది; \v 10 అయితే మంచి పనులు చేసే వారందరికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి. \v 11 ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపించరు. \p \v 12 ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారందరు ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. ధర్మశాస్త్రం క్రింద ఉండి పాపం చేసేవారు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పుపొందుతారు. \v 13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కాని దానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు. \v 14 ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వతహాగా ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులు చేస్తే, వారు ధర్మశాస్త్రం లేనివారైనప్పటికీ, తమకు తామే ధర్మశాస్త్రంగా ఉన్నారు. \v 15 ధర్మశాస్త్ర సారం తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు. అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి. \v 16 నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పు తీర్చే దినాన ఇలా జరుగుతుంది. \s1 యూదులు, ధర్మశాస్త్రం \p \v 17 ఒకవేళ మిమ్మల్ని మీరు యూదులుగా పిలుచుకుంటూ, మీరు ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవునిలో అతిశయిస్తున్నట్లయితే; \v 18 మీరు ఆయన చిత్తాన్ని తెలుసుకొని, ఉన్నతమైనదాన్ని ఆమోదిస్తే, మీరు ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం వల్లనే. \v 19 మీరు గ్రుడ్డివారికి మార్గదర్శి అని, చీకటిలో ఉన్నవారికి వెలుగు అని మీకు నమ్మకం ఉంటే, \v 20 చీకటిలో ఉన్నవారికి వెలుగు అని, మూర్ఖులకు బోధకులు అని, చిన్న పిల్లలకు గురువులు అని మీకు మీరు అనుకుంటే, ఎందుకంటే ధర్మశాస్త్రంలో జ్ఞానం సత్యం మిళితమై ఉన్నాయి \v 21 అలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరు, మీకు మీరు బోధించుకోరా? దొంగతనం చేయవద్దని ప్రకటిస్తున్న మీరే దొంగతనం చేస్తారా? \v 22 వ్యభిచరించవద్దు అని ప్రజలకు చెప్పే మీరే వ్యభిచరిస్తారా? విగ్రహాలను అసహ్యించుకునే మీరే గుళ్లను దోచుకుంటారా? \v 23 ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించే మీరే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ దేవున్ని అవమానిస్తారా? \v 24 “నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది”\f + \fr 2:24 \fr*\ft \+xt యెషయా 52:5; యెహె 36:20,22\+xt*\ft*\f* అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. \p \v 25 మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే సున్నతికి విలువ ఉంటుంది గాని మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, మీరు సున్నతి చేయబడని వారుగా అయ్యారు. \v 26 అలా అని సున్నతి పొందనివారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, వారు సున్నతి చేయబడినవారిగా ఎంచబడరా? \v 27 శారీరకంగా సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నవారు, ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలిగి ఉన్నప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్న మీకు తీర్పు తీరుస్తారు. \p \v 28 పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; శరీరంలో బాహ్యంగా పొందిన సున్నతి నిజంగా సున్నతి కాదు. \v 29 అయితే అంతరంగంలో కూడా యూదులుగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది. \c 3 \s1 దేవుని విశ్వసనీయత \p \v 1 అయితే యూదునిగా ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? సున్నతిలో ఉన్న విలువేమిటి? \v 2 ప్రతీ విషయంలోను ఎక్కువే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి. \p \v 3 వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా? \v 4 ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు కాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, \q1 “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు \q2 తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.”\f + \fr 3:4 \fr*\ft \+xt కీర్తన 51:4\+xt*\ft*\f* \p \v 5 అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మనమీద చూపితే ఆయన అన్యాయస్థులు అవుతారా? నేను మానవరీతిగా మాట్లాడుతున్నాను. \v 6 ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలరు? \v 7 అయితే కొందరు, “ఒకవేళ నా అబద్ధం వలన దేవుని సత్యం వ్యాపించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడాలి?” అని వాదిస్తారు. \v 8 “మంచి జరగడానికి చెడు చేద్దాం” అని మేము చెప్తున్నామని కొందరు దూషిస్తున్నట్లుగా మేమెందుకు చెప్పకూడదు? అలాంటి వారికి వచ్చే శిక్ష న్యాయమైనదే! \s1 ఎవరూ నీతిమంతులు కారు \p \v 9 అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము. \v 10 దీని గురించి లేఖనాల్లో ఈ విధంగా, \q1 “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు; \q2 \v 11 గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; \q2 దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు. \q1 \v 12 అందరు దారి తప్పి చెడిపోయారు, \q2 వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; \q1 మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు, \q2 ఒక్కరు కూడా లేరు.”\f + \fr 3:12 \fr*\ft \+xt కీర్తన 14:1-3; 53:1-3; ప్రసంగి 7:20\+xt*\ft*\f* \q1 \v 13 “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; \q2 వారు నాలుకలతో మోసం చేస్తారు.”\f + \fr 3:13 \fr*\ft \+xt కీర్తన 5:9\+xt*\ft*\f* \q1 “వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది.”\f + \fr 3:13 \fr*\ft \+xt కీర్తన 140:3\+xt*\ft*\f* \q2 \v 14 “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.”\f + \fr 3:14 \fr*\ft \+xt కీర్తన 10:7\+xt*\ft*\f* \q1 \v 15 “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి; \q2 \v 16 వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి, \q1 \v 17 సమాధాన మార్గం వారికి తెలియదు.”\f + \fr 3:17 \fr*\ft \+xt యెషయా 59:7,8\+xt*\ft*\f* \q2 \v 18 “వారి కళ్లలో దేవుని భయం లేదు.”\f + \fr 3:18 \fr*\ft \+xt కీర్తన 36:1\+xt*\ft*\f* \p \v 19 ప్రతి నోరు మౌనంగా ఉండేలా, లోకమంతా దేవునికి లెక్క అప్పగించేలా ధర్మశాస్త్రం చెప్పేవన్నీ ధర్మశాస్త్రానికి లోబడేవారికి చెప్తుందని మనం తెలుసు. \v 20 కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకుంటాము. \s1 విశ్వాసం ద్వారా నీతి \p \v 21 అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియజేయబడుతుంది. దానిని గురించి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. \v 22 యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన\f + \fr 3:22 \fr*\fq ద్వారా నమ్మిన \fq*\ft యేసు క్రీస్తు \ft*\fqa విశ్వాసం ద్వారా\fqa*\f* వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు. \v 23 అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. \v 24 కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. \v 25 క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు. \v 26 ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు. \p \v 27 అయితే అతిశయించడానికి కారణం ఎక్కడ? అది రద్దు చేయబడింది. ఏ నియమాన్ని బట్టి? క్రియల నియమాన్ని బట్టియా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టియే. \v 28 కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా విశ్వాసం ద్వారానే ఒకరు నీతిమంతునిగా తీర్చబడతారని మనం నిశ్చయించుకున్నాము. \v 29 దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడా? యూదేతరులకు ఆయన దేవుడు కాడా? అవును, ఆయన యూదేతరులకు కూడా దేవుడే. \v 30 దేవుడు ఒక్కడే కాబట్టి సున్నతి పొందినవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేనివారిని కూడా అదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చుతారు. \v 31 అయితే ఈ విశ్వాసం బట్టి మనం ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నామా? ఎన్నటికి కాదు! మనం ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము. \c 4 \s1 అబ్రాహాము విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు \p \v 1 అయితే శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాము ఈ విషయంలో ఏమి తెలుసుకున్నాడని మనం అనవచ్చు? \v 2 ఒకవేళ, నిజంగానే, అబ్రాహాము క్రియలమూలంగా నీతిమంతునిగా ఎంచబడి ఉంటే అతడు అతిశయించడానికి కారణం ఉండేది కాని దేవుని ఎదుట కాదు. \v 3 లేఖనాలు ఏమి చెప్తున్నాయి? “అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది”\f + \fr 4:3 \fr*\ft \+xt ఆది 15:6\+xt* \+xt 22|link-href="ROM 4:22"\+xt* వచనములో\ft*\f* అనే కదా! \p \v 4 పని చేసేవారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు. \v 5 అయితే, ఒకరు పని చేయకుండా, భక్తిహీనున్ని కూడా నీతిమంతునిగా తీర్చగల దేవునిపై నమ్మకముంచితే వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. \v 6 క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు. \q1 \v 7 “తమ అతిక్రమాలు క్షమించబడినవారు, \q2 తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు. \q1 \v 8 ప్రభువుచేత పాపం లేనివారిగా \q2 పరిగణించబడినవారు ధన్యులు.”\f + \fr 4:8 \fr*\ft \+xt కీర్తన 32:1,2\+xt*\ft*\f* \p \v 9 ఈ ఆశీర్వాదం కేవలం సున్నతి పొందినవారికి మాత్రమేనా లేదా సున్నతి పొందని వారికి కూడా వర్తిస్తుందా? అబ్రాహాము విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడిందని మనం చెప్తున్నాం కదా. \v 10 ఏ పరిస్థితుల్లో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తర్వాత లేదా సున్నతి పొందక ముందా? సున్నతి పొందక ముందే కదా! \v 11 అతడు ఇంకా సున్నతి పొందక ముందే, తనకు ఉన్న విశ్వాసం ద్వారా నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. కాబట్టి సున్నతి పొందకపోయిన విశ్వసించిన వారందరికి అది నీతిగా ఎంచబడేలా అబ్రాహాము వారందరికి తండ్రి అయ్యాడు. \v 12 అంతేకాక సున్నతి పొందినవారిలో ఎవరైతే మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందక ముందు నడిచిన విశ్వాసపు అడుగుజాడలను అనుసరించి జీవిస్తున్నారో వారికి కూడా అబ్రాహాము తండ్రి అయ్యాడు. \p \v 13 అతడు ఈ లోకానికి వారసుడు అవుతాడనే వాగ్దానాన్ని అబ్రాహాము అతని సంతానం ధర్మశాస్త్రం మూలంగా పొందలేదు కాని, విశ్వాసమూలంగా వచ్చిన నీతి ద్వారా మాత్రమే పొందుకున్నారు. \v 14 ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారసులైతే, విశ్వాసానికి అర్థం ఉండదు, వాగ్దానానికి ఎటువంటి విలువ ఉండదు. \v 15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను తెస్తుంది. ఎక్కడైతే ధర్మశాస్త్రం లేనిచోట దానిని అతిక్రమించడం కూడా ఉండదు. \p \v 16 కాబట్టి, వాగ్దానం విశ్వాసమూలంగానే వస్తుంది. ఆ వాగ్దానం అబ్రాహాము సంతానమంతటికి అనగా, కేవలం ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారికి మాత్రమే కాకుండా అబ్రాహాము ఏ విశ్వాసాన్నైతే కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నవారందరికి కృప ద్వారా వర్తిస్తుంది. అతడు మనందరికి తండ్రి. \v 17 “నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను”\f + \fr 4:17 \fr*\ft \+xt ఆది 17:5\+xt*\ft*\f* అని వ్రాయబడి ఉన్నది. అబ్రాహాము విశ్వాసముంచిన దేవుడు చనిపోయినవారికి జీవమిచ్చేవారు, లేనివాటిని ఉన్నవాటిగా పిలిచేవారు. అలాంటి దేవుని దృష్టిలో అతడు మనకు తండ్రి. \p \v 18 “నీ సంతానం అలా ఉంటుంది”\f + \fr 4:18 \fr*\ft \+xt ఆది 15:5\+xt*\ft*\f* అని అతనితో చెప్పినప్పుడు అబ్రాహాము నిరీక్షణలేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి నమ్మాడు, అందుకే అతడు అనేక జనాలకు తండ్రి అయ్యాడు. \v 19 తనకు వంద సంవత్సరాల వయస్సు కాబట్టి తన శరీరం మృతతుల్యంగా ఉందని శారా గర్భం కూడా మృతతుల్యంగా ఉందనే వాస్తవం తెలిసినప్పటికీ అతడు తన విశ్వాసంలో బలహీనపడనే లేదు. \v 20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు. \v 21 దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల శక్తిగలవాడని అతడు గట్టిగా నమ్మాడు. \v 22 అందుకే “అది అతనికి నీతిగా ఎంచబడింది.” \v 23 “అది అతనికి నీతిగా ఎంచబడింది” అని వ్రాయబడిన మాటలు కేవలం అతని ఒక్కడి కోసం మాత్రమే కాదు, \v 24 మరణం నుండి సజీవంగా తిరిగి లేచిన మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచి దేవునిచే నీతిమంతులుగా తీర్చబడిన మన కోసం కూడా ఆ వాక్యం వ్రాయబడింది. \v 25 యేసు క్రీస్తు మన పాపాల కోసం మరణానికి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మరణం నుండి సజీవంగా తిరిగి లేచారు. \c 5 \s1 సమాధానం, నిరీక్షణ \p \v 1 మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగి ఉన్నాము. \v 2 ఆయన ద్వారానే విశ్వాసం చేత ఇప్పుడు మనం నిలిచి ఉన్న కృపలోనికి రాగలిగాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయిద్దాం. \v 3 అంతేకాక, శ్రమలు ఓర్పును పుట్టిస్తాయని మనకు తెలుసు; కాబట్టి శ్రమలలో కూడా మనం ఆనందించగలము. \v 4 ఓర్పు వలన గుణము, గుణము వలన నిరీక్షణ కలుగుతుంది. \v 5 మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రుమ్మరింపబడుతుంది, కాబట్టి నిరీక్షణ వలన మనకు ఎన్నడూ నిరాశ కలుగదు. \p \v 6 మనం ఇంకను బలహీనులమై ఉన్నప్పుడే, సరియైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం మరణించారు. \v 7 ఒక మంచివాని కోసం ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు. \v 8 కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు. \p \v 9 ఇప్పుడైతే ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం మరింత ఖచ్చితంగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం! \v 10 ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము. \v 11 అంతే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాము. \s1 ఆదాము ద్వారా మరణం, క్రీస్తు ద్వారా జీవం \p \v 12 ఒక్క మనుష్యుని ద్వారా ఈ లోకంలోనికి పాపం, పాపం ద్వారా మరణం ఎలా ప్రవేశించాయో, అలాగే అందరు పాపం చేశారు కాబట్టి మరణం ప్రజలందరికి వచ్చింది. \p \v 13 ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే ఈ లోకంలో పాపం ఉంది కాని, ధర్మశాస్త్రం లేని సమయంలో ఎవరి మీద పాపం మోపబడలేదు. \v 14 అయితే, ఆదాములా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకపోయినప్పటికి, ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు మరణం పరిపాలించింది. ఆదాము రాబోవుతున్న వానికి మాదిరిగా ఉన్నాడు. \p \v 15 అయితే కృపావరమనేది అతిక్రమం వంటిది కాదు. ఒకవేళ ఒకని అతిక్రమాన్ని బట్టి అనేకమంది మరణిస్తే దేవుని కృప, యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని కృప చేత వచ్చిన కృపావరం అనేకమందికి విస్తరిస్తుంది కదా! \v 16 దేవుని వరం ఒక మనుష్యుని పాపం యొక్క ఫలితంతో పోల్చబడలేదు: ఒక పాపం వలన తీర్పు వచ్చి శిక్షను తీసుకువచ్చింది, కాని అనేక అతిక్రమాల తర్వాత వచ్చిన వరం నీతిమంతులుగా చేసింది. \v 17 ఒకవేళ ఒక్క మనుష్యుని అతిక్రమం వల్ల ఆ ఒక్క మనుష్యుని ద్వారా మరణం రాజ్యమేలితే, దేవుని కృపాసమృద్ధిని, నీతి అనే వరాన్ని పొందినవారు యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని ద్వారా ఇంకెంత ఎక్కువగా జీవంలో రాజ్యమేలుతారు! \p \v 18 అదేరీతిగా ఒక్కని అతిక్రమం ఫలితంగా ప్రజలందరికి శిక్ష విధించబడినట్లే ఒక్కని నీతిక్రియ ఫలితంగా ప్రజలందరికి జీవప్రదమైన నీతి అనుగ్రహించబడింది. \v 19 ఒక్క మనుష్యుని అవిధేయత వల్ల అనేకమంది పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒక్క మానవుని విధేయత వల్లనే అనేకమంది నీతిమంతులుగా చేయబడ్డారు. \p \v 20 అతిక్రమం ఎక్కువ కావడానికి ధర్మశాస్త్రం తీసుకు వచ్చినట్టైంది. అయితే పాపం ఎక్కువైనా కొద్ది, దేవుని కృప మరింత విస్తరించింది. \v 21 కాబట్టి, పాపం మరణంలో రాజ్యం చేసినట్లుగానే, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిత్యజీవాన్ని తేవడానికి నీతి ద్వారా కృప రాజ్యం చేస్తుంది. \c 6 \s1 పాపానికి మరణం, క్రీస్తులో జీవం \p \v 1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? \v 2 ఎన్నడు అలా చెప్పకూడదు. పాపాన్ని బట్టి మరణించిన మనం దానిలో ఎలా జీవించి ఉండగలం? \v 3 క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనం ఆయన మరణంలో కూడా బాప్తిస్మం పొందామని మీకు తెలియదా? \v 4 తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాము. \p \v 5 మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతో ఐక్యమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఐక్యమవుతాము. \v 6 మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించేలా,\f + \fr 6:6 \fr*\ft లేదా \ft*\fqa శక్తి లేనిదిగా అయ్యేలా\fqa*\f* మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు. \v 7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. \p \v 8 కాబట్టి మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. \v 9 క్రీస్తు మరణం నుండి తిరిగి సజీవంగా లేచారు, ఆయన మరి ఎన్నడూ మరణించరు; ఇకపై మరణానికి ఆయన మీద అధికారం లేదు. \v 10 ఆయన మనందరి పాపాల కోసం మరణించారు గాని ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు. \p \v 11 అలాగే పాప విషయంలో చనిపోయాం కాని యేసు క్రీస్తులో దేవుని కోసం సజీవంగానే ఉన్నామని మిమ్మల్ని మీరు ఎంచుకోండి. \v 12 కాబట్టి మీ శరీర దురాశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి. \v 13 దుష్టత్వానికి పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి అప్పగించవద్దు. అయితే మరణం నుండి జీవంలోనికి తీసుకురాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించాలి. \v 14 మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు కాని, కృప కలిగి ఉన్నారు కాబట్టి ఇకమీదట పాపం మీమీద అధికారాన్ని కలిగి ఉండదు. \s1 నీతికి దాసులు \p \v 15 అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగి ఉన్నాం కాబట్టి మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు! \v 16 మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేదా నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా? \v 17 ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికీ, ఏ ఉపదేశానికైతే మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి మీరు హృదయమంతటితో లోబడ్డారు. కాబట్టి దేవునికి వందనాలు. \v 18 మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు. \p \v 19 మీ శరీర బలహీనతలను బట్టి అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒకప్పుడు మరింత దుష్టత్వంలోనికి నడిపించే అపవిత్రతకు, దుష్టత్వానికి మిమ్మల్ని మీరు ఎలా దాసులుగా అప్పగించుకున్నారో అలాగే ఇప్పుడు పరిశుద్ధత వైపుకు నడిపించే నీతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. \v 20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో ఈ ఆటంకం లేనివారిగా ఉన్నారు. \v 21 గతకాలంలో మీరు చేసిన పనుల వల్ల కలిగిన ప్రయోజనమేమిటి? వాటివలన మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా! ఆ పనుల ఫలం మరణమే! \v 22 అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులయ్యారు. దాని వలన మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు. \v 23 పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసు క్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది. \c 7 \s1 ధర్మశాస్త్రం నుండి విడుదల, క్రీస్తుతో బంధం \p \v 1 సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారితో నేను మాట్లాతున్నాను. ఒక మనిషి జీవించి ఉన్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రానికి అతనిపై అధికారం ఉంటుందని మీకు తెలుసా? \v 2 ఉదాహరణకు, ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకున్న స్త్రీ ఆ వ్యక్తి బ్రతికి ఉన్నంత వరకు అతనితో బంధం కలిగి ఉంటుంది గాని భర్త చనిపోతే అతనితో ఆమెకు బంధాన్ని ఏర్పరచిన ధర్మం నుండి ఆమె విడుదల పొందుతుంది. \v 3 అయితే ఆమె తన భర్త బ్రతికి ఉండగానే మరొక వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటే ఆమె వ్యభిచారిణి అవుతుంది. ఒకవేళ ఆమె భర్త చనిపోతే ఆ ధర్మం నుండి ఆమె విడుదల పొందుకున్నది కాబట్టి ఆమె మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే ఆమె వ్యభిచారిణి కాదు. \p \v 4 కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని కోసం ఫలించేలా, మరణించి సజీవంగా తిరిగి లేచిన క్రీస్తును చేరుకునేలా మీరు కూడా క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మరణించారు. \v 5 మనం శరీర సంబంధులుగా\f + \fr 7:5 \fr*\fq శరీర సంబంధులుగా \fq*\ft ఈ సందర్భాలలో గ్రీకు పదం మానవుల పాపస్ధితిని తెలియచేస్తుంది.\ft*\f* మనం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వలన కలిగే పాప ఆలోచనలు మనలో పని చేస్తున్నాయి కాబట్టి మనం మరణాన్ని ఫలంగా పొందుకుంటున్నాము. \v 6 కాని ఇప్పుడు, మనల్ని బంధించి ఉంచిన దాని విషయమై చనిపోయి, ధర్మశాస్త్రం నుండి విడుదలను పొందాము కాబట్టి, వ్రాయబడి ఉన్న నియమం ప్రకారం కాకుండా ఆత్మానుసారమైన నూతన మార్గంలో మనం సేవిస్తాము. \s1 ధర్మశాస్త్రం, పాపం \p \v 7 అయితే మనం ఏమనాలి? ధర్మశాస్త్రాన్ని పాపమనా? కానే కాదు! ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. “మీరు ఆశించకూడదు”\f + \fr 7:7 \fr*\ft \+xt నిర్గమ 20:17; ద్వితీ 5:21\+xt*\ft*\f* అని ధర్మశాస్త్రం చెప్పకపోతే ఆశించడం అంటే ఏమిటో నిజంగా నాకు తెలిసేది కాదు. \v 8 అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నాలో అన్ని రకాల దురాశలను పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం మరణిస్తుంది. \v 9 ఒకప్పుడు ధర్మశాస్త్రం లేకపోయిన నేను సజీవంగానే ఉన్నాను, అయితే ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు పాపం జీవంలోనికి వచ్చింది, నేను మరణించాను. \v 10 జీవాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడిన ఆ ఆజ్ఞలే మరణాన్ని తీసుకువచ్చాయని నేను తెలుసుకున్నాను. \v 11 అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నన్ను మోసగించి ఆ ఆజ్ఞల ద్వారానే నన్ను మరణానికి గురిచేసింది. \v 12 కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి, మంచివి. \p \v 13 అయితే మంచిది నాకు మరణాన్ని తీసుకువచ్చిందా? ఎన్నడు కాదు! అయితే, పాపం మంచిని ఉపయోగించి నాకు మరణాన్ని తెచ్చింది. పాపాన్ని పాపంగా చూపించే క్రమంలో ఆజ్ఞల ద్వారా పాపం మరింత పాపపూరితమైనది. \p \v 14 ధర్మశాస్త్రం ఆత్మకు సంబంధించిందని మనకు తెలుసు, కాని నేను ఆత్మహీనుడను కాబట్టి పాపానికి దాసునిగా అమ్ముడుపోయాను. \v 15 నేను చేసిన దానిని నేను గ్రహించలేదు. నేను చేయాలనుకున్న దానిని చేయలేదు కాని దేనిని ద్వేషిస్తానో దానినే చేశాను. \v 16 చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. \v 17 ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. \v 18 నాకున్న పాప స్వభావాన్ని\f + \fr 7:18 \fr*\ft లేదా \ft*\fqa శరీరాన్ని\fqa*\f* బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కాబట్టి, మంచి చేయాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను చేయలేకపోతున్నాను. \v 19 నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, చేయకూడదని అనుకుంటున్న చెడునే నేను చేస్తున్నాను. \v 20 అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. \p \v 21 కాబట్టి నేను మంచి చేయాలని అనుకుంటున్నప్పటికి నాలో చెడు ఉందనే నియమాన్ని నేను గమనించాను. \v 22 నా అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. \v 23 కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనస్సులోని నియమంతో పోరాడుతూ నాలో పని చేస్తున్న పాపనియమానికి నన్ను బందీగా చేస్తుంది. \v 24 నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బందీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు? \v 25 మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు! \p అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో\f + \fr 7:25 \fr*\ft లేదా \ft*\fqa శరీరంలో\fqa*\f* నేను పాపనియమానికి దాసుడను. \c 8 \s1 ఆత్మ ద్వారా జీవం \p \v 1 కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు. \v 2 ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని\f + \fr 8:2 \fr*\ft గ్రీకులో ఏకవచనం; కొన్ని ప్రతులలో \ft*\fqa నన్ను\fqa*\f* పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది. \v 3 శరీరాన్ని\f + \fr 8:3 \fr*\fq శరీరాన్ని \fq*\ft ఈ సందర్భాలలో గ్రీకు పదం మానవుల పాపస్ధితిని తెలియచేస్తుంది.\ft*\f* బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయలేకపోయిందో దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారబలిగా తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు. \v 4 శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్రం యొక్క నీతి నియమాలను నెరవేర్చడానికి ఇలా జరిగింది. \p \v 5 శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది. \v 6 శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది. \v 7 శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు. \v 8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. \p \v 9 అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కాబట్టి శరీర స్వభావం కలిగి ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు క్రీస్తుకు చెందినవారు కారు. \v 10 క్రీస్తు మీలో ఉన్నట్లయితే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది\f + \fr 8:10 \fr*\fq జీవిస్తుంది \fq*\fqa లేదా పాపం వలన మీ శరీరం మరణించినా మీ ఆత్మ జీవించి ఉంటుంది\fqa*\f*. \v 11 యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన నాశనమయ్యే మీ శరీరాలకు కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇవ్వగలరు. \p \v 12 కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము. \v 13 మీరు శరీరానుసారంగా జీవిస్తే మీరు మరణిస్తారు. కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే మీరు బ్రతుకుతారు. \p \v 14 ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. \v 15 మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు. అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం, “అబ్బా, తండ్రీ” అని మొరపెడుతున్నాము. \v 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. \v 17 మనం పిల్లలమైతే వారసులం, అంటే దేవుని వారసులం; క్రీస్తు మహిమను మనం కూడా పొందడానికి ఆయనతో శ్రమపడితే క్రీస్తు సహ వారసులమవుతాం. \s1 ప్రస్తుత శ్రమ, భవిష్యత్ మహిమ \p \v 18 మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను. \v 19 దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది. \v 20 తన ఇష్ట ప్రకారం కాక దానిని అప్పగించినవాని చిత్తప్రకారం నిరాశకు గురైన సృష్టి నిరీక్షణ కలిగి ఉంది. \v 21 సృష్టి, నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ. \p \v 22 నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు. \v 23 అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కోసం ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము. \v 24 ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. తాము చూస్తున్న వాటికోసం ఎవరు నిరీక్షిస్తారు? \v 25 అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము. \p \v 26 అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. \v 27 మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కోసం దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. \p \v 28 దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు. \v 29 అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు. \v 30 ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు; ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు; ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు. \s1 దేవుని ప్రేమ నుండి ఏదీ మనలను వేరుచేయలేదు \p \v 31 అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు? \v 32 దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించినప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలరు? \v 33 దేవుడు ఏర్పరచుకున్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే కదా! \v 34 అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మన కోసం దేవుని వేడుకొనే యేసు క్రీస్తే తప్ప మరి ఎవరూ కాదు. \v 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా? \v 36 లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: \q1 “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; \q2 వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.”\f + \fr 8:36 \fr*\ft \+xt కీర్తన 44:22\+xt*\ft*\f* \m \v 37 అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము. \v 38 మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా, \v 39 ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను ఒప్పుకుంటున్నాను. \c 9 \s1 ఇశ్రాయేలీయుల కోసం పౌలు ఆవేదన \p \v 1 నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది. \v 2 నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. \v 3 నా సొంత జాతి వారైన ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను. \v 4 వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే. \v 5 పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవునిగా వారిలోనే పుట్టారు. ఆయన నిత్యం స్తోత్రార్హుడు! ఆమేన్. \s1 దేవుని సార్వభౌమ ఎంపిక \p \v 6 దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరు ఇశ్రాయేలీయులు కారు. \v 7 అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే, “ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగిన వారిగానే నీ సంతానం లెక్కించబడుతుంది.”\f + \fr 9:7 \fr*\ft \+xt ఆది 21:12\+xt*\ft*\f* \v 8 మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలే అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు. \v 9 అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు”\f + \fr 9:9 \fr*\ft \+xt ఆది 18:10,14\+xt*\ft*\f* అని వాగ్దానం ఇవ్వబడింది. \p \v 10 అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భవతియైన సమయంలో, \v 11 కవలలు ఇంకా పుట్టి మంచి చెడు ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం, దేవుని ఉద్దేశం, క్రియలమూలంగా కాకుండా, \v 12 పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి, “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు”\f + \fr 9:12 \fr*\ft \+xt ఆది 25:23\+xt*\ft*\f* అని ఆమెతో చెప్పబడింది. \v 13 “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను”\f + \fr 9:13 \fr*\ft \+xt మలాకీ 1:2,3\+xt*\ft*\f* అని వ్రాయబడి ఉన్నది. \p \v 14 అయితే మనం ఏమనాలి? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! \v 15 ఎందుకంటే ఆయన మోషేతో, \q1 “నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను, \q2 నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను”\f + \fr 9:15 \fr*\ft \+xt నిర్గమ 33:19\+xt*\ft*\f* అని చెప్పారు. \m \v 16 కాబట్టి ఇది ఒకరి కోరిక మీద గాని ప్రయాస మీద గాని ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరం వలనే అవుతుంది. \v 17 అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో చూపించాలని, భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను నియమించాను.”\f + \fr 9:17 \fr*\ft \+xt నిర్గమ 9:16\+xt*\ft*\f* \v 18 కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తారు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నారో వారి పట్ల కఠినంగా ఉంటారు. \p \v 19 మీరు నాతో, “అలాగైతే ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని ఎవరు అడ్డుకోగలరు?” అనవచ్చు, \v 20 కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”\f + \fr 9:20 \fr*\ft \+xt యెషయా 29:16; 45:9\+xt*\ft*\f* \v 21 ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా? \p \v 22 దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి కోరుకున్నప్పటికి, నాశనం కోసం సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి? \v 23 మహిమ కోసం ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి, \v 24 అనగా యూదులలో నుండి మాత్రమే కాక యూదేతరులలో నుండి ఆయన పిలిచిన మన కోసం తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి? \v 25 హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం, \q1 “నా ప్రజలు కాని వారిని ‘నా ప్రజలు’ అని పిలుస్తాను; \q2 నాకు ప్రియురాలు కాని దానిని ‘నా ప్రియురాలు’ అని పిలుస్తాను,”\f + \fr 9:25 \fr*\ft \+xt హోషేయ 2:23\+xt*\ft*\f* \m \v 26 ఇంకా, \q1 “ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, \q2 అదే స్థలంలో వారు \q2 ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.”\f + \fr 9:26 \fr*\ft \+xt హోషేయ 1:10\+xt*\ft*\f* \m \v 27 ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు: \q1 “ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, \q2 వారిలో మిగిలి ఉన్నవారే రక్షించబడతారు. \q1 \v 28 ప్రభువు తాను చెప్పిన మాటను \q2 భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తారు.”\f + \fr 9:28 \fr*\ft \+xt యెషయా 10:22,23\+xt*\ft*\f* \m \v 29 యెషయా గతంలో చెప్పినట్లుగా, \q1 “సైన్యాల ప్రభువు \q2 మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే \q1 మనం సొదొమలా మారేవారం, \q2 గొమొర్రాను పోలి ఉండేవారము.”\f + \fr 9:29 \fr*\ft \+xt యెషయా 1:9\+xt*\ft*\f* \s1 ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసం \p \v 30 అయితే దీనిని బట్టి మనం ఏమి చెప్పగలం? నీతిని అనుసరించని యూదేతరులు విశ్వాసాన్నిబట్టి నీతిని పొందుకున్నారు. \v 31 కాని నీతి మార్గంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. \v 32 వారెందుకు చేరుకోలేకపోయారు? వారు నీతిని విశ్వాసంతో కాకుండా క్రియలతో అనుసరించారు. ఆటంకంగా అడ్డురాయి ఎదురైనప్పుడు వారు తడబడ్డారు. \v 33 దీని కోసం ఇలా వ్రాయబడి ఉంది: \q1 “ఇదిగో, నేను సీయోనులో ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయిని, \q2 వారు పడిపోయేలా చేసే అడ్డుబండను వేశాను, \q2 ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు.”\f + \fr 9:33 \fr*\ft \+xt యెషయా 8:14; 28:16\+xt*\ft*\f* \c 10 \p \v 1 సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలనేది నా హృదయవాంఛ, దాని గురించి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. \v 2 అప్పుడు వారు దేవుని పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నారని అయితే వారి అత్యాసక్తి జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదని నేను సాక్ష్యమివ్వగలను. \v 3 దేవుని నీతి వారికి తెలియకపోయినా తమ స్వనీతిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వారు దేవుని నీతికి లోబడలేదు. \v 4 విశ్వసించే వారందరికి నీతిగా ఉండడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నారు. \p \v 5 ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వారి గురించి మోషే, “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు”\f + \fr 10:5 \fr*\ft \+xt లేవీ 18:5\+xt*\ft*\f* అని వ్రాశాడు. \v 6 అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: “క్రీస్తును క్రిందకు తేవడానికే ‘పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్తారు?’ అని మీ హృదయంలో అనుకోవద్దు.”\f + \fr 10:6 \fr*\ft \+xt ద్వితీ 30:12\+xt*\ft*\f* \v 7 “లేదా ‘క్రీస్తును మృతులలో నుండి పైకి తేవడానికే అగాధం లోనికి ఎవరు దిగి వెళ్తారు?’ ”\f + \fr 10:7 \fr*\ft \+xt ద్వితీ 30:13\+xt*\ft*\f* అని మీ హృదయాల్లో అనుకోవద్దు. \v 8 అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.”\f + \fr 10:8 \fr*\ft \+xt ద్వితీ 30:14\+xt*\ft*\f* అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే. \v 9 మీరు మీ నోటితో “యేసు ప్రభువు” అని ఒప్పుకుని, మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు. \v 10 అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు. \v 11 “ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు”\f + \fr 10:11 \fr*\ft \+xt యెషయా 28:16\+xt*\ft*\f* అని లేఖనం చెప్తుంది. \v 12 యూదులకు, యూదేతరులకు భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. \v 13 ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.”\f + \fr 10:13 \fr*\ft \+xt యోవేలు 2:32\+xt*\ft*\f* \p \v 14 అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? \v 15 ప్రకటించేవారిని పంపకపోతే ఎలా ప్రకటించగలరు? దీని గురించి, “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!”\f + \fr 10:15 \fr*\ft \+xt యెషయా 52:7\+xt*\ft*\f* అని వ్రాయబడి ఉంది. \p \v 16 అయితే, “ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్ముతారు?”\f + \fr 10:16 \fr*\ft \+xt యెషయా 53:1\+xt*\ft*\f* అని యెషయా చెప్పిన ప్రకారం, సువార్తను ఇశ్రాయేలు ప్రజలందరూ అంగీకరించలేదు. \v 17 కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు. \v 18 కాని నేనడిగేదేంటంటే: వారు సువార్తను వినలేదా? వారు ఖచ్చితంగా విన్నారు: \q1 “వారి స్వరం భూలోకమంతా వినబడింది, \q2 వారి మాటలు భూదిగంతాల వరకు వ్యాపించాయి.”\f + \fr 10:18 \fr*\ft \+xt కీర్తన 19:4\+xt*\ft*\f* \m \v 19 నేను మళ్ళీ అడుగుతున్నా: ఇశ్రాయేలు ప్రజలు దానిని గ్రహించలేదా? మొదట మోషే ఇలా అన్నాడు, \q1 “జనులు కాని వారిచేత నేను మిమ్మల్ని అసూయపడేలా చేస్తాను, \q2 అవగాహన లేని జనుల వలన మీకు కోపం వచ్చేలా చేస్తాను.”\f + \fr 10:19 \fr*\ft \+xt ద్వితీ 32:21\+xt*\ft*\f* \m \v 20 యెషయా ఇలా ధైర్యంగా చెప్పాడు, \q1 “నన్ను వెదకనివారికి నేను దొరికాను, \q2 నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకున్నాను.”\f + \fr 10:20 \fr*\ft \+xt యెషయా 65:1\+xt*\ft*\f* \m \v 21 అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి అతడు ఇలా చెప్పాడు, \q1 “అవిధేయులు మూర్ఖులైన ప్రజలకు \q2 నేను దినమంతా నా చేతులు చాపాను.”\f + \fr 10:21 \fr*\ft \+xt యెషయా 65:2\+xt*\ft*\f* \c 11 \s1 ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలి ఉన్నవారు \p \v 1 అందుకు నా ప్రశ్న ఏంటంటే: దేవుడు తన ప్రజలను తిరస్కరిస్తారా? ఎన్నటికీ కాదు! నేను కూడా ఇశ్రాయేలుకు చెందినవాన్నే, అబ్రాహాము సంతానాన్నే, బెన్యామీను గోత్రానికి చెందినవాన్నే. \v 2 తన ప్రజలను అనగా తాను ముందుగానే ఎరిగి ఉన్నవారిని దేవుడు తిరస్కరించరు. ఏలీయా గురించిన భాగంలో లేఖనం ఏమి చెప్తుందో మీకు తెలియదా? ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా అతడు దేవునికి ప్రార్థన చేస్తూ, \v 3 “ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను కూల్చివేశారు, నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు”\f + \fr 11:3 \fr*\ft \+xt 1 రాజులు 19:10,14\+xt*\ft*\f* అని ఎంతగానో మొరపెట్టుకున్నాడు. \v 4 అయితే దేవుడు అతనికిచ్చిన సమాధానం ఏంటి? “బయలుకు మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకించుకున్నాను”\f + \fr 11:4 \fr*\ft \+xt 1 రాజులు 19:18\+xt*\ft*\f* అని. \v 5 అదే విధంగా ప్రస్తుత సమయంలో కూడా కృప ద్వారా ఏర్పాటు చేయబడినవారు మిగిలే ఉన్నారు. \v 6 అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు. \p \v 7 అప్పుడు ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఆసక్తితో దేనిని వెదికారో అది వారికి దొరకలేదు. వారిలో ఏర్పరచబడినవారికే అది దొరికింది. కాని మిగిలిన వారు కఠినంగా అయ్యారు. \v 8 దాని గురించి ఇలా వ్రాయబడింది: \q1 “నేటి వరకు \q2 దేవుడు వారికి మైకంగల ఆత్మను, \q2 చూడలేని కళ్లను \q1 వినలేని చెవులను ఇచ్చారు.”\f + \fr 11:8 \fr*\ft \+xt ద్వితీ 29:4; యెషయా 29:10\+xt*\ft*\f* \m \v 9 దావీదు, \q1 “వారి భోజనబల్ల వారికి ఉచ్చుగా బోనుగా మారి \q2 వారికి అడ్డుబండగా తగిన శాస్తిగా ఉండును గాక. \q1 \v 10 వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక, \q2 వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక”\f + \fr 11:10 \fr*\ft \+xt కీర్తన 69:22,23\+xt*\ft*\f* అని చెప్తున్నాడు. \s1 అంటుకట్టబడిన కొమ్మలు \p \v 11 మరలా నేను: వారు తిరిగి తేరుకోలేనంతగా తొట్రిల్లి పడిపోతారా? అని అడుగుతున్నా, అలా ఎన్నటికి కాదు, వారు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు అసూయపడేలా చేయడానికి యూదేతరులకు రక్షణ లభించింది. \v 12 అయితే వారి ఆజ్ఞాతిక్రమం లోకానికి ఐశ్వర్యంగా, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉంటే వారి పరిపూర్ణత మరి ఎంత ఎక్కువ ఐశ్వర్యాన్ని తెస్తుందో కదా! \p \v 13 యూదేతరులైన మీతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూదేతరులకు అపొస్తలునిగా నేను ఉన్నాను కాబట్టి నా పరచర్యలో నేను గర్వపడుతూ, \v 14 ఏదో ఒక విధంగా నా సొంత ప్రజలకు అసూయను కలిగించి వారిలో కొందరినైనా రక్షించాలనేది నా కోరిక. \v 15 తిరస్కారం లోకానికి సమాధానం తెస్తే, వారి అంగీకారం వల్ల ఏం జరుగుతుంది. మరణం నుండి జీవం వస్తుందా? \v 16 ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ఆ ముద్ద అంతా పరిశుద్ధమే; అలాగే చెట్టు వేరు పరిశుద్ధమైతే ఆ చెట్టు కొమ్మలు కూడా పరిశుద్ధమే. \p \v 17 అయితే ఒలీవచెట్టు కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవచెట్టు కొమ్మలాంటి నీవు మిగిలిన కొమ్మల మధ్యలో అంటుకట్టబడి, ఆ ఒలీవచెట్టు వేరు నుండి వచ్చే సారంలో పాలుపొందినప్పుడు, \v 18 మిగిలిన కొమ్మల కన్నా నీవు గొప్పవానిగా భావించవద్దు. నీవు అలా భావిస్తే, నీవు వేరుకు ఆధారం కాదు గాని వేరే నీకు ఆధారంగా ఉందని తెలుసుకో. \v 19 “నేను అంటుకట్టబడాలని ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి” అని నీవు చెప్పవచ్చు. \v 20 నిజమే. వారు అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు, విశ్వాసం వల్ల నీవు నిలిచి ఉన్నావు. కాబట్టి అహంకారంగా ఉండక భయంతో ఉండు. \v 21 దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు ఆయన నిన్ను కూడా విడిచిపెట్టరు కదా. \p \v 22 దేవుడు చూపించే దయను, కఠినత్వాన్ని తెలుసుకోండి: పడిపోయిన వారి పట్ల ఆయన కఠినంగా ఉన్నారు కాని, నీ పట్ల దయ చూపించి నీవు ఆయన దయలో కొనసాగేలా చేశారు. లేకపోతే నీవు కూడా నరికివేయబడతావు. \v 23 వారు అవిశ్వాసంలో కొనసాగకపోతే దేవుడు వారిని తిరిగి అంటుకట్టగల సమర్ధుడు కాబట్టి వారు మరలా అంటుకట్టబడతారు. \v 24 సహజంగా అడవి ఒలీవచెట్టు నుండి కోయబడిన కొమ్మవైన నీవే స్వభావానికి విరుద్ధంగా మంచి ఒలీవచెట్టుకు అంటుకట్టబడితే, సహజమైన కొమ్మలు మరింత సులభంగా వాటి సొంత ఒలీవచెట్టుకు అంటుకట్టబడతాయి గదా! \s1 ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించబడతారు \p \v 25 సహోదరీ సహోదరులారా, మీరు అహంకారులుగా ఉండకూడదని మీకు ఈ మర్మం తెలియాలని నేను కోరుకుంటున్నాను. అది ఏంటంటే యూదేతరులంతా లోపలికి ప్రవేశించే వరకు ఇశ్రాయేలు ప్రజలు కొంతవరకు కఠినం చేయబడ్డారు. \v 26 అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలందరు రక్షించబడతారు. దీనిని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, \q1 “సీయోనులో నుండి విమోచకుడు వస్తాడు, \q2 యాకోబులో నుండి భక్తిహీనతను అతడు తీసివేస్తాడు. \q1 \v 27 నేను వారి పాపాలను వారి నుండి తీసివేసినప్పుడు \q2 నేను వారితో చేసే నా నిబంధన ఇదే.”\f + \fr 11:27 \fr*\ft \+xt యెషయా 59:20,21; 27:9\+xt*; \+xt యిర్మీయా 31:33,34\+xt*\ft*\f* \p \v 28 సువార్తకు సంబంధించినంత వరకు మిమ్మల్ని బట్టి వారు శత్రువులుగా ఉన్నారు, కాని ఎన్నికకు సంబంధించినంత వరకు వారు పితరులను బట్టి ప్రేమించబడినవారు. \v 29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. \v 30 గతంలో దేవునికి అవిధేయులుగా ఉండి, ఇప్పుడు వారి అవిధేయత ఫలితంగా దేవుని కృపను పొందారు. \v 31 అదే విధంగా మీకు చూపిన దేవుని కృపను బట్టి వారు కృపను పొందుకొనే క్రమంలో వారు నేడు అవిధేయులుగా ఉన్నారు. \v 32 దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు. \s1 దేవుని కీర్తించుట \q1 \v 33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంతో లోతైనది! \q2 ఆయన తీర్పులు ఎంతో నిగూఢమైనవి, \q2 ఆయన మార్గాలు మన ఊహకు అందనివి! \q1 \v 34 “ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు? \q2 ఆయనకు ఆలోచన చెప్పగలవారెవరు?”\f + \fr 11:34 \fr*\ft \+xt యెషయా 40:13\+xt*\ft*\f* \q1 \v 35 “ముందుగానే దేవునికి ఇచ్చి \q2 ఆయన నుండి తిరిగి పొందగలవారు ఎవరు?”\f + \fr 11:35 \fr*\ft \+xt యోబు 41:11\+xt*\ft*\f* \q1 \v 36 ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కోసమే సమస్తం ఉన్నాయి \q2 కాబట్టి ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్. \c 12 \s1 సజీవ యాగం \p \v 1 కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన. \v 2 ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు. \s1 క్రీస్తు శరీరంలో వినయంతో పరిచర్య \p \v 3 నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో అందరికి నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో అందరికి పంచి ఇచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి. \v 4 ఎలాగైతే మనకు ఉన్న ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నా అవన్నీ ఒకే పని ఎలా చేయవో, \v 5 అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే. \v 6 మనలో అందరికి అనుగ్రహించబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగి ఉన్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు. \v 7 ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు; \v 8 ఒకవేళ అది ప్రోత్సహించడమైతే ప్రోత్సహించు; ఒకవేళ అది దానం చేయడమైతే ధారళంగా దానం చేయి; ఒకవేళ ఇతరులను నడిపించడమైతే శ్రద్ధగా నడిపించు, ఒకవేళ అది కనికరం చూపించడమైతే, సంతోషంగా చూపించండి. \s1 క్రియలలో ప్రేమ \p \v 9 ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. చెడ్డదాన్ని ద్వేషించి మంచిని పట్టుకోవాలి. \v 10 ప్రేమలో ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి. \v 11 అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి. \v 12 నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి. \v 13 అవసరంలో ఉన్న పరిశుద్ధులతో పంచుకోండి. ఆతిథ్యం ఇవ్వండి. \p \v 14 మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు. \v 15 ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. \v 16 ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం ఉండవద్దు. \p \v 17 చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. అందరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి. \v 18 మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి. \v 19 నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని\f + \fr 12:19 \fr*\ft \+xt ద్వితీ 32:35\+xt*\ft*\f* ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి. \v 20 అయితే, \q1 “మీ శత్రువు ఆకలితో ఉంటే వానికి ఆహారం పెట్టండి; \q2 అతడు దాహంతో ఉంటే వానికి త్రాగడానికి ఇవ్వండి. \q1 మీరు ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తారు.”\f + \fr 12:20 \fr*\ft \+xt సామెత 25:21,22\+xt*\ft*\f* \m \v 21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి. \c 13 \s1 అధికారుల అధికారానికి లోబడుట \p \v 1 దేవుడు ఇచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు కాబట్టి ప్రతీ వ్యక్తి తన పైఅధికారులకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే. \v 2 కాబట్టి ఎవరైతే అధికారాన్ని ఎదిరిస్తున్నారో వారు దేవుడు నియమించిన దాన్ని ఎదిరిస్తున్నారు. అలా చేసేవారు తమ మీదకు తామే తీర్పు తెచ్చుకుంటారు. \v 3 మంచి పనులు చేసేవారిని పరిపాలకులు భయపెట్టరు; అయితే తప్పు చేసే వారికే వారంటే భయం. అధికారంలో ఉన్నవారికి భయపడకుండా ఉండాలంటే మీరు మంచి పనులు చేయాలి. \v 4 మీ మంచి కోసం అధికారంలో ఉన్నవారు దేవుని సేవకులు. మీరు తప్పు చేస్తే భయపడండి, ఎందుకంటే పరిపాలకులు కారణం లేకుండా ఖడ్గాన్ని పట్టుకోరు. వారు తప్పు చేసేవారిపై కోపాన్ని చూపించి శిక్ష విధించే దేవుని సేవకులు. \v 5 కాబట్టి, శిక్ష విధించబడుతుందని కాక మనస్సాక్షిని బట్టి మనం అధికారులకు లోబడి ఉండాలి. \p \v 6 అధికారులు దేవుని సేవకులు, వారు తమ సమయమంతా పాలనకే ఇస్తారు, అందుకే మనం వారికి పన్నులు చెల్లిస్తున్నాము. \v 7 మీరు ఎవరికి ఏమి రుణపడి ఉంటే వారికి అది చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే ఆదాయపన్ను చెల్లించండి; మర్యాదైతే మర్యాద; గౌరవమైతే గౌరవం ఇవ్వండి. \s1 ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది \p \v 8 ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో తప్ప మరి దేనిలో ఎవరికి రుణపడి ఉండవద్దు. \v 9 “మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు హత్య చేయకూడదు, మీరు దొంగతనం చేయకూడదు, ఇతరులదేదీ మీరు ఆశించకూడదు”\f + \fr 13:9 \fr*\ft \+xt నిర్గమ 20:13-15,17; ద్వితీ 5:17-19,21\+xt*\ft*\f* అనే ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు ఉన్నప్పటికీ అవన్నీ, “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి”\f + \fr 13:9 \fr*\ft \+xt లేవీ 19:18\+xt*\ft*\f* అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. \v 10 ప్రేమ పొరుగువారికి హాని కలిగించదు. కాబట్టి ప్రేమ చూపించడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. \s1 ప్రభువు దినం సమీపంగా ఉంది \p \v 11 ప్రస్తుత సమయాన్ని తెలుసుకుని మీరు నిద్రమత్తు నుండి మేల్కోవలసిన సమయం వచ్చిందని గ్రహించండి. ఎందుకంటే మనం మొదట్లో నమ్మినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరింత సమీపంగా ఉంది. \v 12 రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కాబట్టి మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాము. \v 13 అతి త్రాగి మత్తులు కావడం, హద్దు అదుపు లేని లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వ్యభిచారం చేయడం, గొడవపడడం, అసూయపడడం మొదలైన వాటిని విడిచి, పగటివేళ నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం. \v 14 మీరు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించకండి. \c 14 \s1 బలహీనుడు, బలవంతుడు \p \v 1 వివాదాస్పదమైన అంశాలపై వాదన పెట్టుకోక విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చేర్చుకోండి. \v 2 ఒకరేమో తన విశ్వాసాన్నిబట్టి అన్నీ తినవచ్చు అని నమ్ముతున్నారు, మరొకరు తన బలహీనమైన విశ్వాసాన్నిబట్టి కేవలం కూరగాయలే తింటున్నారు. \v 3 అన్నిటిని తినేవారు అలా తినని వారిని చులకనగా చూడకూడదు, అలాగే అన్నిటిని తిననివారు తినేవారి మీద నింద వేయకూడదు. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించారు. \v 4 వేరేవాళ్ళ సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరవు? అతడు నిలబడినా పడిపోయినా అది అతని యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కాబట్టి వారు నిలబడతారు. \p \v 5 ఒకరు ఒక రోజును మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు. మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సుల్లో దానిని పూర్తిగా నమ్ముతారు. \v 6 ఒక రోజును మంచి రోజుగా భావించేవారు ప్రభువు కొరకే భావిస్తున్నారు. మాంసాన్ని తినేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కాబట్టి వారు ప్రభువు కొరకే తింటున్నారు. తిననివారు కూడా ప్రభువు కొరకే తినడం మాని, దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు. \v 7 మనలో ఎవరు కేవలం తన కోసం మాత్రమే జీవించరు, తన కోసం మాత్రమే చావరు. \v 8 మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే, కాబట్టి మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారమే. \v 9 ఈ కారణంగానే, చనిపోయినవారికి జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉండడానికి క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేచారు. \p \v 10 అయితే మనమందరం దేవుని న్యాయసింహాసనం ఎదుట నిలబడవలసి ఉండగా మీరు మీ సహోదరీ సహోదరులకు ఎందుకు తీర్పు తీర్చుతున్నారు? మీరు వారిని ఎందుకు తిరస్కరిస్తున్నారు? \v 11 దీని కోసం లేఖనంలో, \q1 “ప్రభువు ఇలా చెప్తున్నారు, ‘నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను, \q1 ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, \q2 ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది’\f + \fr 14:11 \fr*\ft \+xt యెషయా 45:23\+xt*\ft*\f*” \m అని వ్రాయబడి ఉంది. \p \v 12 కాబట్టి, మనలో ప్రతి ఒక్కరు మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి. \p \v 13 కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మాని సహోదరి లేదా సహోదరుని మార్గానికి ఆటంకం కలిగించము అని తీర్మానం చేసుకుందాం. \v 14 సహజంగా ఏదీ అపవిత్రమైనది కాదని యేసు ప్రభువులో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే ఎవరైనా ఒకదాన్ని అపవిత్రమైనదని భావిస్తే వానికి అది అపవిత్రమైనదే. \v 15 మీరు తినే దాన్ని బట్టి మీ సహోదరి గాని సహోదరుడు గాని బాధపడితే, మీలో ప్రేమ లేదన్నట్టే. ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో వారిని మీరు తినే దాన్ని బట్టి పాడు చేయకు. \v 16 కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. \v 17 దేవుని రాజ్యం తినడం త్రాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. \v 18 ఎందుకంటే క్రీస్తుకు సేవ చేసేవారు దేవునికి ఇష్టులును మానవుల దృష్టికి యోగ్యులుగా ఉన్నారు. \p \v 19 కాబట్టి మనకు సమాధానాన్ని, పరస్పర వృద్ధిని కలిగించే దానినే మనం చేద్దాం. \v 20 ఆహారం గురించి దేవుని పనిని నాశనం చేయవద్దు. ఆహారమంతా శుభ్రమైనదే, కాని ఒకరు తినేది మరొకరికి ఆటంకాన్ని కలిగిస్తే అది తప్పవుతుంది. \v 21 మాంసం తినడం గాని మద్యం త్రాగడం గాని లేదా మరేదైనా మీ సహోదరులకు సహోదరీలకు ఆటంకంగా ఉంటే అది చేయకపోవడమే మంచిది. \p \v 22 వీటి గురించి మీకున్న నమ్మకాన్ని మీకు దేవునికి మధ్యనే ఉండనివ్వండి. తాను అంగీకరించిన వాటిని బట్టి తనకు తాను తీర్పు తీర్చుకొననివారు దీవించబడినవారు. \v 23 అయితే సందేహంతో తినేవారు విశ్వాసం లేకుండా తింటారు కాబట్టి శిక్ష పొందుతారు. విశ్వాసం లేకుండా చేసే ప్రతిదీ పాపమే అవుతుంది. \c 15 \p \v 1 బలవంతులమైన మనం, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము. \v 2 మనలో ప్రతి ఒక్కరూ తన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కోసం వారిని సంతోషపెట్టాలి. \v 3 క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి”\f + \fr 15:3 \fr*\ft \+xt కీర్తన 69:9\+xt*\ft*\f* అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు. \v 4 గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కోసం మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి. \p \v 5 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవున్ని మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా, \v 6 మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న వైఖరి మనం ఒకరిపట్ల ఒకరం కలిగి ఉండేలా మనకు అనుగ్రహించును గాక. \p \v 7 క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి. \v 8-9 పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: \q1 “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. \q2 నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.”\f + \fr 15:9 \fr*\ft \+xt 2 సమూ 22:50; కీర్తన 18:49\+xt*\ft*\f* \m \v 10 అలాగే మరొక చోట, \q1 “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.”\f + \fr 15:10 \fr*\ft \+xt ద్వితీ 32:43\+xt*\ft*\f* \m \v 11 మరియొక చోట, \q1 “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; \q2 సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.”\f + \fr 15:11 \fr*\ft \+xt కీర్తన 117:1\+xt*\ft*\f* \m \v 12 మరోచోట యెషయా ఇలా చెప్పాడు, \q1 “యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది \q2 అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు, \q2 యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగి ఉంటారు.”\f + \fr 15:12 \fr*\ft \+xt యెషయా 11:10\+xt*\ft*\f* \p \v 13 పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక. \s1 యూదేతరులకు పరిచారకునిగా పౌలు \p \v 14 నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను. \v 15-16 అయినా నేను కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుచేయాలని చాలా ధైర్యంగా మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే నాకు ఇవ్వబడిన దేవుని కృపను బట్టి నేను యూదేతరులకు యేసు క్రీస్తు పరిచారకునిగా ఉన్నాను. పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచబడి దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణగా యూదేతరులు మారేలా దేవుని సువార్తను ప్రకటించడమనే యాజక ధర్మాన్ని ఆయన నాకు ఇచ్చారు. \p \v 17 అందువల్ల నేను దేవునికి చేస్తున్న సేవను బట్టి క్రీస్తు యేసులో అతిశయపడుతున్నాను. \v 18 పరిశుద్ధాత్మ శక్తిచేత నేను చెప్పిన మాటలు, చేసిన క్రియలు, అద్భుతాలు, సూచక క్రియల ద్వారా యూదేతరులను దేవునికి విధేయత చూపించేలా నడిపించడంలో క్రీస్తు నా ద్వారా నెరవేర్చిన దానిని గురించి తప్ప నేను దేని గురించి మాట్లాడడానికి సాహసించను. \v 19 కాబట్టి యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు ఉన్న అన్ని ప్రదేశాల్లో క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించాను. \v 20 మరొకరు వేసిన పునాది మీద నేను కట్టకూడదని క్రీస్తు గురించి తెలియని చోట్ల సువార్త ప్రకటించాలనేది ఎల్లప్పుడు నా ఆశగా ఉండింది. \v 21 ఎందుకంటే, ఇలా వ్రాయబడి ఉంది: \q1 “ఆయన గురించి ఎవరికి చెప్పబడలేదో వారు చూస్తారు, \q2 ఆయన గురించి ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”\f + \fr 15:21 \fr*\ft \+xt యెషయా 52:15\+xt*\ft*\f* \m \v 22 దీనిబట్టే నేను మీ దగ్గరకు రాకుండా చాలాసార్లు నాకు ఆటంకాలు ఎదురయ్యాయి. \s1 రోమాను దర్శించాలని పౌలు కోరిక \p \v 23 అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నేను పని చేయడానికి నాకిక స్థలమేమి లేదు. మిమ్మల్ని దర్శించాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ఆశపడుతున్నాను. \v 24 కాబట్టి నేను స్పెయినుకు వెళ్లేటప్పుడు అక్కడికి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని చూడాలని కొంతకాలం మీ సహవాసంలో ఆనందించిన తర్వాత అక్కడినుండి మీరు నన్ను సాగనంపాలని ఆశిస్తున్నాను. \v 25 అయితే ఇప్పుడు, నేను యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు సేవ చేయడానికి అక్కడికి వెళ్తున్నాను. \v 26 యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల మధ్యలో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి మాసిదోనియా అకాయ వారు కొంత విరాళాన్ని ఇవ్వడానికి సంతోషించారు. \v 27 వారు దాన్ని సంతోషంతో చేశారు. నిజానికి వారు వీరికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు యూదుల ఆత్మ సంబంధమైన దీవెనలను పంచుకున్నారు కాబట్టి తమ భౌతిక సంబంధమైన దీవెనలను యూదులతో పంచుకుని వారు రుణపడి ఉన్నారు. \v 28 నేను ఈ పనిని ముగించాక ఖచ్చితంగా విరాళం వారికందించి, తర్వాత అక్కడినుండి స్పెయినుకు బయలుదేరి మార్గంలో మిమ్మల్ని కలుస్తాను. \v 29 నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తు పరిపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు. \p \v 30 సహోదరీ సహోదరులారా, నా కోసం దేవునికి ప్రార్థించడం ద్వారా మీరు కూడా నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆత్మలోని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. \v 31 యూదయలో ఉన్న అవిశ్వాసుల నుండి నేను తప్పించుకునేలా, యెరూషలేముకు నేను తీసుకెళ్తున్న విరాళాన్ని అక్కడ ఉన్న పరిశుద్ధులు సంతోషంగా స్వీకరించేలా ప్రార్థించండి. \v 32 అప్పుడు నేను దేవుని చిత్తమైతే సంతోషంగా మీ దగ్గరకు వచ్చి మీ సహవాసంలో విశ్రాంతి తీసుకుంటాను. \v 33 సమాధానకర్తయైన దేవుడు మీ అందరితో ఉండును గాక. ఆమేన్. \b \c 16 \s1 వ్యక్తిగత శుభాలు \p \v 1 కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలైన\f + \fr 16:1 \fr*\ft పరిచారకులు అనే పదం ప్రవక్తలకు, సంఘ పెద్దలకు వివిధ విధాలుగా సేవ చేసేవారిని సూచిస్తుంది\ft*\f* మన సహోదరి ఫీబే గురించి మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. \v 2 నేను మిమ్మల్ని కోరేదేంటంటే ఆమెను ఆయన ప్రజలకు తగినట్లు ప్రభువులో చేర్చుకొని, ఆమెకు ఏమైనా సహాయం అవసరమైతే చేయండి. ఎందుకంటే ఆమె నాతో పాటు అనేకమందికి ప్రయోజనకరంగా ఉంది. \b \p \v 3 యేసు క్రీస్తులో నా తోటిపనివారైన అకుల ప్రిస్కిల్లకు\f + \fr 16:3 \fr*\ft గ్రీకులో \ft*\fqa ప్రిస్కా \fqa*\ft ప్రిస్కిల్లకు మరో రూపం\ft*\f* వందనాలు తెలియజేయండి. \v 4 వారు నా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. నేనే కాదు యూదేతరుల సంఘాల వారందరు వారికి కృతజ్ఞులై ఉన్నారు. \p \v 5 అలాగే వారి ఇంట్లో కూడుకునే సంఘానికి కూడా వందనాలు తెలియజేయండి. \p ఆసియా ప్రాంతంలో మొదటిగా క్రీస్తును అంగీకరించిన నా స్నేహితుడైన ఎపైనెటుకు వందనాలు తెలియజేయండి. \p \v 6 మీ కోసం ఎంతో కష్టపడిన మరియకు వందనాలు తెలియజేయండి. \p \v 7 నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు శుభాలు చెప్పండి. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో ఉన్నవారు. \p \v 8 ప్రభువులో నాకు ప్రియ స్నేహితుడైన అంప్లీయతుకు వందనాలు తెలియజేయండి. \p \v 9 క్రీస్తులో మన తోటిపనివాడైన ఊర్బాను నా ప్రియ స్నేహితుడైన స్టాకులకు వందనాలు తెలియజేయండి. \p \v 10 క్రీస్తులోని విశ్వాసానికి పరీక్షను ఎదుర్కొని నిలబడిన అపెల్లెకు వందనాలు తెలియజేయండి. \p అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వారికి వందనాలు తెలియజేయండి. \p \v 11 నా తోటి యూదుడైన హెరోదియోనుకు వందనాలు తెలియజేయండి. \p నార్కిస్సు కుటుంబంలో ప్రభువులో ఉన్నవారందరికి వందనాలు తెలియజేయండి. \p \v 12 ప్రభువులో ప్రయాసపడిన స్త్రీలు త్రుపైనాకు త్రుఫోసాలకు వందనాలు తెలియజేయండి. \p ప్రభువులో ఎంతో కష్టపడిన నా స్నేహితురాలైన పెర్సిసుకు వందనాలు తెలియజేయండి. \p \v 13 ప్రభువులో ఏర్పరచబడిన రూఫసుకు అతని తల్లికి వందనాలు తెలియజేయండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిదే. \p \v 14 అసుంక్రితు, ప్లెగోను, హెర్మెసు, పత్రొబ, హెర్మా, వారితో పాటు ఉంటున్న సహోదరీ సహోదరులకు వందనాలు తెలియజేయండి. \p \v 15 పిలొలొగు, జూలియా, నేరియ, అతని సహోదరి ఒలింపాకు, వారితో పాటు ఉన్న పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి. \p \v 16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు తెలియజేసుకోండి. \p క్రీస్తు సంఘాలన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాయి. \b \p \v 17 సహోదరీ సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధలకు వ్యతిరేకంగా మీ మార్గాల్లో ఆటంకాలు కలిగిస్తూ భేదాలు పుట్టించేవారిని జాగ్రత్తగా గమనించమని వేడుకుంటున్నాను. వారికి దూరంగా ఉండండి. \v 18 ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ ఆకలినే తీర్చుకుంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు. \v 19 మీ విధేయత గురించి ప్రతి ఒక్కరు విన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషులుగా ఉండాలని నేను కోరుతున్నాను. \b \p \v 20 సమాధానకర్తయైన దేవుడు త్వరలో తన పాదాల క్రింద సాతానును నలిపివేస్తారు. \b \p మన ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక. \b \p \v 21 నా సహపనివాడైన తిమోతి అలాగే నా తోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు. \p \v 22 ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. \p \v 23 నేను అలాగే సంఘమంతా ఆనందించేలా ఆతిథ్యమిచ్చే గాయి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. \p ఈ పట్టణ ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిగా ఉన్న ఎరస్తు, మన సహోదరుడైన క్వర్తు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు. \b \p \v 24 మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్.\f + \fr 16:24 \fr*\ft కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు\ft*\f* \b \p \v 25-27 యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.