\id REV - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h ప్రకటన \toc1 ప్రకటన గ్రంథం \toc2 ప్రకటన \toc3 ప్రక \mt1 ప్రకటన \mt2 గ్రంథం \c 1 \s1 ప్రారంభ భాగం \p \v 1 త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు చూపించడానికి యేసు క్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేశారు. \v 2 అతడు దేవుని వాక్యం గురించి, యేసు క్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసిన వాటన్నిటిని గురించి సాక్ష్యమిస్తున్నాడు. \v 3 సమయం సమీపంగా ఉంది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవారు ధన్యులు, దానిలో వ్రాయబడిన వాటిని విని వాటి ప్రకారం నడుచుకొనేవారు ధన్యులు. \b \s1 వందనం ఆశీర్వచనం \po \v 4 యోహాను, \po ఆసియా ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు వ్రాయునది: \po గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు రానున్నవాడైన దేవుని సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల\f + \fr 1:4 \fr*\ft అంటే ఏడంతల ఆత్మ\ft*\f* నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక \v 5 నమ్మకమైన సాక్షిగా మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. \b \p మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి, \v 6 తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్. \q1 \v 7 “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు.\f + \fr 1:7 \fr*\ft \+xt దాని 7:13\+xt*\ft*\f* \q2 ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, \q1 ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; \q2 భూమి మీద ఉన్న జనులందరు, “ఆయనను చూసి దుఃఖిస్తూ విలపిస్తారు.”\f + \fr 1:7 \fr*\ft \+xt జెకర్యా 12:10\+xt*\ft*\f* \qc అలా జరుగును గాక! ఆమేన్. \p \v 8 “అల్ఫా ఒమేగాను నేనే, గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడను రానున్నవాడను నేనే” అని సర్వశక్తిగల ప్రభువైన దేవుడు చెప్తున్నారు. \b \s1 యోహాను చూసిన క్రీస్తు దర్శనం \p \v 9 యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాను. \v 10 ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై ఉన్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది. \v 11 ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపుచుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను. \p \v 12 నేను నాతో మాట్లాడిన స్వరం ఎవరా అని చూడడానికి వెనుకకు తిరిగాను. నేను అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. \v 13 ఆ దీపస్తంభాల మధ్య, కాళ్ల అంచుల వరకు పొడవైన వస్త్రాలను ధరించుకొని, తన రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని మనుష్యకుమారునిలా ఉన్న ఒకరిని చూశాను.\f + \cat dup\cat*\fr 1:13 \fr*\ft \+xt దాని 7:13\+xt*\ft*\f* \v 14 ఆయన తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్లు మండుతున్న అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. \v 15 ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ ధగధగ మెరుస్తున్న ఇత్తడిలా ఉన్నాయి; ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల ధ్వనిలా వినిపించింది. \v 16 ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకున్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. \p \v 17 నేను ఆయనను చూడగానే చనిపోయిన వానిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడిచేతిని నా మీద పెట్టి నాతో, “భయపడకు, నేను మొదటివాడను చివరివాడను. \v 18 జీవించేవాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడూ ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా ఆధీనంలోనే ఉన్నాయి. \p \v 19 “కాబట్టి నీవు చూసినవాటిని, ఇప్పుడు ఉన్నవాటిని, వాటి తర్వాత జరుగబోయే వాటిని వ్రాసి పెట్టు. \v 20 నా కుడిచేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రాల గురించి, ఏడు దీపస్తంభాల గురించి మర్మం ఇదే: ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాల ఏడు దూతలు, ఏడు దీపస్తంభాలు అంటే ఏడు సంఘాలు. \c 2 \s1 ఎఫెసు సంఘానికి వర్తమానం \p \v 1 “ఎఫెసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: \b \pi1 ఏడు నక్షత్రాలు తన కుడిచేతిలో పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య నడిచేవాడు ఈ మాటలు చెప్తున్నాడు. \b \pi1 \v 2 నీ క్రియలు నీ కష్టం నీ పట్టుదల నాకు తెలుసు. నీవు దుష్టులను సహించలేవని నాకు తెలుసు. అపొస్తలులు కాకపోయినా మేము అపొస్తలులం అని చెప్పుకొనే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు తెలుసుకున్నావు. \v 3 నా పేరు కోసం నీవు ఓర్పుతో అలసిపోకుండా కష్టాలను సహించావని నాకు తెలుసు. \pi1 \v 4 అయినాసరే నేను నీ మీద తప్పు మోపవలసి ఉంది: నీకు ఉండిన మొదట్లో నీకున్న ప్రేమను నీవు వదిలేశావు. \v 5 నీవు ఎంతగా పడిపోయావో గుర్తించు! నీవు పశ్చాత్తాపపడి మొదట చేసిన పనులు చేయి. నీవు పశ్చాత్తాపపడకపోతే నేను నీ దగ్గరకు వచ్చి, నీ దీపస్తంభాన్ని దాని స్థానంలో నుండి తీసివేస్తాను. \v 6 అయితే నేను నీకొలాయితు పద్ధతులను ద్వేషించినట్లు నీవు కూడా ద్వేషిస్తున్నావు కాబట్టి అది నీకు అనుకూలంగా ఉన్న మంచి విషయము. \pi1 \v 7 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తాను. \s1 స్ముర్న సంఘానికి వర్తమానం \p \v 8 “స్ముర్నలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: \b \pi1 మొదటి వాడును చివరి వాడునై మరణించి తిరిగి లేచినవాడు ఈ మాటలు చెప్తున్నాడు. \b \pi1 \v 9 నీ శ్రమలు, నీ పేదరికం నాకు తెలుసు అయినా నీవు ధనవంతుడవే! యూదులు కాకుండానే తాము యూదులమని చెప్పుకొనే సాతాను సమాజమందిరానికి చెందినవారు నీపై చేసే దూషణ నాకు తెలుసు. \v 10 నీకు కలుగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. నిన్ను శోధించడానికి అపవాది మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు, కాబట్టి పది రోజులు హింస పొందుతారు అని తెలియజేస్తున్నాను. అయినా మరణం వరకు నమ్మకంగా ఉండండి. అప్పుడు నేను మీకు జీవాన్ని మీ విజయ కిరీటంగా బహూకరిస్తాను. \pi1 \v 11 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! జయించినవారికి రెండవ మరణం హాని చేయదు. \s1 పెర్గము సంఘానికి వర్తమానం \p \v 12 “పెర్గములో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: \b \pi1 పదునైన రెండు అంచులు గల ఖడ్గం కలవాడు ఈ మాటలు చెప్తున్నాడు. \b \pi1 \v 13 సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నా నామానికి నిజంగా కట్టుబడి ఉన్నావు. సాతాను నివసించే నీ పట్టణంలో నాకు నమ్మకమైన సాక్షిగా ఉన్న అంతిప అనేవాడు హతసాక్షిగా చంపబడిన దినాల్లో కూడ నాలో నీ విశ్వాసాన్ని వదలకుండా ఉన్నావు. \pi1 \v 14 అయినా, నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉంది: అవేమనగా విగ్రహాలకు అర్పించిన ఆహారం తినేలా, లైంగిక దుర్నీతి జరిగించేలా ఇశ్రాయేలీయులను వేధించమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. \v 15 అలాగే నీకొలాయితు చేసే బోధలను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. \v 16 కాబట్టి పశ్చాత్తాపపడు! లేకపోతే నేను త్వరలో నీ దగ్గరకు వచ్చినా నోటినుండి వచ్చే ఖడ్గంతో వారితో యుద్ధం చేస్తాను. \pi1 \v 17 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి నేను దాచి ఉంచిన మన్నాను ఇస్తాను. నేను వారికి తెల్లని రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును ఇస్తాను. దాన్ని పొందినవారికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది. \s1 తుయతైర సంఘానికి వర్తమానం \p \v 18 “తుయతైరలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: \b \pi1 అగ్ని జ్వాలల్లాంటి కళ్లు, తళతళ మెరుస్తున్న కంచును పోలిన పాదాలు గల దేవుని కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు: \b \pi1 \v 19 నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ సేవ, నీ పట్టుదల, నాకు తెలుసు. నీవు ఇప్పుడు చేసే క్రియలు ముందు చేసిన క్రియల కంటే గొప్పవని నాకు తెలుసు. \pi1 \v 20 అయినా నేను నీ మీద తప్పు మోపవలసివున్నది: తాను ప్రవక్తిని అని చెప్పుకొనే యెజెబెలును మీరు సహిస్తున్నారు. లైంగిక దుర్నీతి, విగ్రహాలకు అర్పించిన ఆహారం తినాలని నా సేవకులకు బోధిస్తూ ఆమె వారిని మోసం చేస్తుంది. \v 21 ఆమె లైంగిక దుర్నీతి గురించి పశ్చాత్తాపపడడానికి నేను సమయం ఇచ్చాను కాని ఆమె దానికి ఇష్టపడలేదు. \v 22 కాబట్టి నేను ఆమెను శ్రమల పడకపై పడవేస్తాను. అలాగే ఆమెతో వ్యభిచరించిన వారు పశ్చాత్తాపపడకపోతే వారిని కూడా తీవ్రమైన బాధలకు గురిచేస్తాను. \v 23 ఆమె పిల్లలను నేను మరణానికి అప్పగిస్తాను. అప్పుడు సంఘాలన్ని నేను అంతరంగాలను, హృదయాలను పరిశోధిస్తానని, మీలో అందరికి మీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తానని తెలుసుకుంటాయి. \pi1 \v 24 అయితే తుయతైరలో యెజెబెలు బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన మర్మాలను నేర్చుకోకుండా ఉన్న తక్కిన వారందరికి, ‘నేను ఇక ఏ భారం నీమీద మోపనని చెప్తున్నాను. \v 25 కాని నేను వచ్చేవరకు నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.’ \pi1 \v 26 అంతం వరకు నా చిత్తాన్ని నెరవేరుస్తూ జయించినవారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద వారికి అధికారం ఇస్తాను. \v 27 ‘వారు ఇనుపదండంతో రాజ్యాలను పరిపాలిస్తారు, వారిని మట్టి కుండలను పగలగొట్టినట్లు పగలగొడతారు.’\f + \fr 2:27 \fr*\ft \+xt కీర్తన 2:9\+xt*\ft*\f* \v 28 నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను. \v 29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. \c 3 \s1 సార్దీసు సంఘానికి వర్తమానం \p \v 1 “సార్దీసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: \b \pi1 దేవుని ఏడు ఆత్మలు, ఏడు నక్షత్రాలు కలవాడు ఈ మాటలు చెప్తున్నాడు. \b \pi1 నీ క్రియలు నాకు తెలుసు; నీవు బ్రతికున్నావని పేరు ఉంది కాని నీవు చచ్చిన దానివే. \v 2 మేల్కో! నా దేవుని దృష్టిలో నీ క్రియలు సంపూర్తి అయినట్లు నాకు కనిపించలేదు కాబట్టి చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచు. \v 3 కాబట్టి నీవు పొందిన వాటిని విన్నవాటిని జ్ఞాపకం చేసుకుని, వాటిని పాటిస్తూ గట్టిగా పట్టుకుని పశ్చాత్తాపపడు. కాని నీవు మేలుకోక పోతే నేను దొంగలా వస్తాను, నేను ఏ సమయంలో నీ దగ్గరకు వస్తానో నీకు తెలియదు. \pi1 \v 4 అయినా సార్దీసులో నీ దగ్గర ఉన్న కొందరు తమ వస్త్రాలను మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు కాబట్టి వారు తెల్లని వస్త్రాలను ధరించుకొని నాతో పాటు నడుస్తారు. \v 5 జయించేవారు వారిలా తెల్లని వస్త్రాలు ధరించుకొంటారు. వాని పేరును నేను జీవగ్రంథంలో నుండి ఎన్నడు తుడిచివేయను. నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు వాని పేరును ఒప్పుకుంటాను. \v 6 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. \s1 ఫిలదెల్ఫియ సంఘానికి వర్తమానం \p \v 7 “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: \b \pi1 దావీదు తాళపు చెవిని కలిగి ఉన్న సత్యవంతుడైన పరిశుద్ధుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన తెరచిన దాన్ని ఎవరూ మూయలేరు, ఆయన మూసిన దాన్ని ఎవరూ తెరవలేరు. \b \pi1 \v 8 నీ క్రియలు నాకు తెలుసు. ఎవరు మూయలేని ద్వారం నేను నీ ముందు తెరచి ఉంచాను. నీకు కొద్ది బలమే ఉన్నా నీవు నా వాక్యాన్ని పాటించి జీవిస్తూ నా పేరును తిరస్కరించలేదని నాకు తెలుసు. \v 9 యూదులు కాకుండానే తాము యూదులమని అబద్ధాలు చెప్పుకొనే సాతాను సమాజమందిరానికి చెందిన వారందరిని నీ దగ్గరకు రప్పించి నీ పాదాల ముందు సాగిలపడి నేను నిన్ను ప్రేమిస్తున్నానని వారు ఒప్పుకునేలా చేస్తాను. \v 10 నేను నీకు ఆజ్ఞాపించినట్లే నీవు సహనంతో సహించావు కాబట్టి భూనివాసులు అందరిని పరీక్షించడానికి లోకం మీద రానున్న శోధన సమయంలో నేను నిన్ను కాపాడతాను. \pi1 \v 11 నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ఎవరు నీ కిరీటాన్ని తీసుకోకుండా నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. \v 12 జయించినవారిని నా దేవాలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. అప్పుడు వారు దానిలో నుండి ఎన్నడూ బయటకు వెళ్లరు. వారి మీద నేను నా దేవుని పేరును పరలోకంలో ఉన్న నా దేవుని నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అనే నా దేవుని పట్టణం పేరును, నా క్రొత్త పేరును కూడా వ్రాస్తాను. \v 13 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. \s1 లవొదికయ సంఘానికి వర్తమానం \p \v 14 “లవొదికయలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: \b \pi1 ఆమేన్ అనేవాడు, నమ్మకమైనవాడు, సత్య సాక్షి, దేవుని సృష్టిని పరిపాలించేవాడు ఈ మాటలు చెప్తున్నాడు. \b \pi1 \v 15 నీ క్రియలు నాకు తెలుసు, నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేవు. నీవు చల్లగా కాని వెచ్చగా కాని ఉంటే మంచిది. \v 16 నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేకుండా నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను. \v 17 నీవు, ‘నేను ధనవంతున్ని నేను చాలా ఆస్తులను సమకూర్చుకొన్నాను కాబట్టి నాకు ఏ లోటులేదని’ అంటున్నావు కాని నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, బీదవాడవు, గ్రుడ్డివాడివి, దిగంబరివని నీకు తెలియదు. \v 18 నీవు ధనవంతునివి అయ్యేలా అగ్నిలో పుటం వేసిన బంగారాన్ని, అవమానకరమైన నీ దిగంబరత్వం కనబడకుండా ధరించుకోవడానికి తెల్లని వస్త్రాన్ని, నీవు చూడగలిగేలా నీ కళ్లకు మందు నా దగ్గర కొనుక్కో అని నేను నీకు సలహా ఇస్తున్నాను. \pi1 \v 19 నేను ప్రేమించేవారిని గద్దించి శిక్షిస్తాను కాబట్టి నీవు ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడు. \v 20 ఇదిగో! నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వారితో నేను, నాతో వారు భోజనం చేస్తాము. \pi1 \v 21 నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే జయించినవారిని నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోనిస్తాను. \v 22 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి.” \c 4 \s1 పరలోకంలో జరిగే ఆరాధన \p \v 1 ఆ తర్వాత, నేను చూస్తూ ఉండగా పరలోకంలో ఒక తలుపు తెరవబడి కనిపించింది. నేను మొదట విన్న బూరధ్వని వంటి స్వరం నాతో, “ఇక్కడకు ఎక్కి రా, తర్వాత జరగాల్సిన దాన్ని నేను నీకు చూపిస్తాను” అని చెప్పింది. \v 2 వెంటనే నేను ఆత్మవశుడనై ఉండగా నా ముందు పరలోకంలో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఒకరు కూర్చుని ఉండడం చూశాను. \v 3 అక్కడ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలా కెంపులా మెరుస్తూ కనబడ్డాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తున్న వానవిల్లు ఆవరించి ఉండింది. \v 4 ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవైనాలుగు సింహాసనాలు, వాటి మీద ఇరవైనలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద బంగారు కిరీటాలు కలిగి ఉన్నారు. \v 5 ఆ సింహాసనం నుండి మెరుపులు, ఉరుముల గొప్ప శబ్దాలు వచ్చాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. \v 6 ఆ సింహాసనం ముందు స్ఫటికం లాంటి ఒక గాజు సముద్రం ఉంది. \p మధ్యభాగంలో, ఆ సింహాసనం చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులకు ముందు వెనుక కళ్లు ఉన్నాయి. \v 7 మొదటి ప్రాణి సింహంలా, రెండవ ప్రాణి దూడలా, మూడవ ప్రాణి ముఖం మనిషిలా, నాలుగవ ప్రాణి ఎగురుతున్న పక్షిరాజులా ఉన్నాయి. \v 8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్లతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం ఇలా అంటున్నాయి: \qc “గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు, \qc రానున్నవాడైన, ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు,\f + \fr 4:8 \fr*\ft \+xt యెషయా 6:3\+xt*\ft*\f* \qc పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.’ ” \m \v 9 ఆ ప్రాణులు సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత కృతజ్ఞతలు అర్పిస్తుండగా, \v 10 ఇరవైనలుగురు పెద్దలు లేచి సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్నవాని ముందు సాగిలపడి ఆరాధిస్తూ, గౌరవంతో తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ముందు వేసి ఇలా చెప్పారు: \q1 \v 11 “ఓ ప్రభువా, మా దేవా! \q2 నీవు సమస్తాన్ని సృష్టించావు, \q1 నీ చిత్త ప్రకారమే అవి సృష్టించబడ్డాయి, \q2 కాబట్టి మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి \q2 నీవే యోగ్యుడవు.” \c 5 \s1 గ్రంథపుచుట్ట, గొర్రెపిల్ల \p \v 1 అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని కుడిచేతిలో ఇరువైపుల వ్రాయబడి ఏడు ముద్రలతో ముద్రించబడి ఉన్న ఒక గ్రంథపుచుట్టను నేను చూశాను. \v 2 అప్పుడు శక్తిగల ఒక దేవదూత బిగ్గరగా, “చుట్టబడి ఉన్న ఈ ముద్రలను విప్పి గ్రంథపుచుట్టను తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని ప్రకటన చేస్తుంటే నేను చూశాను. \v 3 అయితే పరలోకంలో కాని, భూమి మీద కాని, భూమి క్రింద కాని ఉన్నవారిలో కాని ఎవరూ ఆ గ్రంథపుచుట్టను విప్పలేకపోయారు, కనీసం దానిలోనికి చూడలేకపోయారు. \v 4 ఆ గ్రంథపుచుట్టను తెరవడానికి కాని దాని లోపలకి చూడడానికి కాని సామర్థ్యం కలవారు ఎవరూ లేరని నేను చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు, \v 5 పెద్దలలో ఒకరు నాతో, “ఏడవకు, ఇదిగో, దావీదు వేరు నుండి వచ్చిన యూదా గోత్రపు సింహం జయాన్ని పొందాడు. ఆయనే ఆ ఏడు ముద్రలను విప్పి ఆ గ్రంథపుచుట్టను తెరవగలరు” అన్నాడు. \p \v 6 అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూశాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ల ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు. \v 7 ఆ గొర్రెపిల్ల, సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని దగ్గరకు వెళ్లి ఆయన కుడిచేతిలో ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకున్నాడు. \v 8 ఆయన ఆ గ్రంథపుచుట్టను తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులు, ఆ ఇరవైనలుగురు పెద్దలు వధించబడిన ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరు తంతి వీణను పరిశుద్ధుల ప్రార్థనలనే ధూపంతో నిండిన బంగారు గిన్నెలను పట్టుకున్నారు. \v 9 వారు ఒక క్రొత్త పాటను పాడారు, \q1 “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకుని, \q2 దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! \q1 ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, \q2 ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, \q2 దేవుని కోసం విడిపించడానికి నీవు వధించబడి నీ రక్తంతో కొన్నావు. \q1 \v 10 నీవు వారిని దేవుని సేవించే రాజ్యంగా యాజకులుగా చేశావు, \q2 భూమిని పరిపాలించడానికి వారిని నియమించావు.” \p \v 11 అప్పుడు నేను చూస్తూ ఉండగా, సింహాసనం చుట్టూ ఉన్న నాలుగు ప్రాణుల పెద్దల చుట్టూ ఉన్న వేలాదివేల కోటానుకోట్ల దేవదూతల స్వరం నాకు వినబడింది. \v 12 వారు పెద్ద స్వరంతో ఇలా అంటున్నారు: \q1 “శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, \q2 గౌరవం, మహిమ, స్తుతులను పొందడానికి \q2 యోగ్యుడు వధించబడిన గొర్రెపిల్లయే!” \p \v 13 అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టించబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను: \q1 “సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి, వధించబడిన గొర్రెపిల్లకు \q2 స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం, \qc నిరంతరం కలుగును గాక!” \m \v 14 ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని చెప్పాయి, అప్పుడు ఆ పెద్దలందరు సాగిలపడి ఆరాధించారు. \c 6 \s1 ముద్రలు \p \v 1 వధించబడిన గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పుతున్నప్పుడు నేను చూశాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి ఉరుముతున్న స్వరంతో, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. \v 2 నేను చూస్తుండగా ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్లాడు. \p \v 3 ఆ వధించబడిన గొర్రెపిల్ల రెండవ ముద్రను విప్పినప్పుడు, రెండవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. \v 4 అప్పుడు మండుతున్న ఎర్రని మరొక గుర్రం బయలుదేరింది; దాని మీద స్వారీ చేసేవానికి భూమి మీద నుండి సమాధానం తీసివేయడానికి, ప్రజలు ఒకరిని ఒకరు చంపుకొనేలా చేయటానికి అధికారం ఇవ్వబడింది. అతనికి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. \p \v 5 ఆ వధించబడిన గొర్రెపిల్ల మూడవ ముద్రను విప్పినప్పుడు, మూడవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు నాకు ఒక నల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాడు చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు. \v 6 ఆ నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “ఒక రోజు జీతానికి ఒక కిలో గోధుమలు, ఒక రోజు జీతానికి మూడు కిలోల యవల గింజలు. అయితే ఒలీవల నూనెను ద్రాక్షారసాన్ని పాడుచేయవద్దు!” అని చెప్పడం విన్నాను. \p \v 7 ఆ వధించబడిన గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పినప్పుడు, నాలుగవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. \v 8 అప్పుడు నాకు బూడిద రంగు గుర్రం కనబడింది. దాని మీద సవారిచేసేవాని పేరు మృత్యువు, పాతాళం అతన్ని అతి సమీపంగా వెంబడిస్తుంది. ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో ఇంకా భూమి మీద ఉండే క్రూర మృగాలతో ప్రజలను చంపడానికి భూమి నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వబడింది. \p \v 9 ఆ వధించబడిన గొర్రెపిల్ల అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూశాను. \v 10 వారు పెద్ద స్వరంతో, “ఓ సర్వశక్తిగల ప్రభువా! పరిశుద్ధుడా, సత్యవంతుడా, మా రక్తానికి ప్రతిగా భూనివాసులను తీర్పు తీర్చడానికి ఇంకా ఎంతకాలం?” అని కేకలు వేశారు. \v 11 అప్పుడు వారిలో అందరికి తెల్లని వస్త్రాలను ఇచ్చి, “మీలాగే ఇంకా హతులైన మీ తోటి సేవకుల, సహోదరీ సహోదరుల సంఖ్య పూర్తయ్యే వరకు ఇంకా కొంతకాలం వేచి ఉండాలి” అని వారికి చెప్పబడింది. \p \v 12 ఆ వధించబడిన గొర్రెపిల్ల ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. అప్పుడు సూర్యుడు మేక బొచ్చుతో చేసిన గోనెపట్టలా నల్లగా మారాడు, చంద్రుడు రక్తంలా ఎర్రగా మారాడు. \v 13 బలమైన గాలికి అంజూర చెట్టు నుండి రాలిపడిన కాయల్లా ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద రాలాయి. \v 14 ఆకాశం ఒక గ్రంథపుచుట్టలా చుట్టుకుపోయింది, ప్రతి పర్వతం ప్రతి ద్వీపం వాటి వాటి స్థలాల నుండి తొలగిపోయాయి. \p \v 15 భూ రాజులు, రాకుమారులు, ప్రధానులు, ధనవంతులు, బలవంతులు, దాసులు, స్వతంత్రులు ప్రతి ఒక్కరు గుహల్లో, కొండల రాళ్ల సందుల్లో దాక్కున్నారు. \v 16 వారు కొండలతో, బండలతో, “మీరు మామీద వచ్చి పడండి! సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని ముఖం నుండి వధించబడిన గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని దాచి పెట్టండి!\f + \fr 6:16 \fr*\ft \+xt హోషేయ 10:8\+xt*\ft*\f* \v 17 ఎందుకంటే వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది, దాన్ని ఎవరు తట్టుకోగలరు?” అని వేడుకొంటున్నారు. \c 7 \s1 ముద్రింపబడినవారు 1,44,000 \p \v 1 ఈ సంగతుల తర్వాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి భూమిమీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు. \v 2 అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పుదిక్కు నుండి పైకి రావడం చూశాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించడానికి అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా, \v 3 “మేము మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు” అని చెప్పడం నేను విన్నాను. \v 4 ఆ తర్వాత నేను వారి సంఖ్య చెప్తుంటే విన్నాను. ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు అన్నిటిలో ముద్రింపబడినవారు 1,44,000: \b \li1 \v 5 యూదా గోత్రంలో 12,000; \li1 రూబేను గోత్రంలో 12,000; \li1 గాదు గోత్రంలో 12,000; \li1 \v 6 ఆషేరు గోత్రంలో 12,000; \li1 నఫ్తాలి గోత్రంలో 12,000; \li1 మనష్షే గోత్రంలో 12,000; \li1 \v 7 షిమ్యోను గోత్రంలో 12,000; \li1 లేవీ గోత్రంలో 12,000; \li1 ఇశ్శాఖారు గోత్రంలో 12,000; \li1 \v 8 జెబూలూను గోత్రంలో 12,000; \li1 యోసేపు గోత్రంలో 12,000; \li1 బెన్యామీను గోత్రంలో 12,000 ముద్రించబడ్డారు. \s1 తెల్లని వస్త్రాలు ధరించిన గొప్ప సమూహం \p \v 9 ఈ సంగతుల తర్వాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చారు. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూశాను. \v 10 వారు తమ స్వరాలను ఎత్తి బిగ్గరగా ఇలా అన్నారు: \q1 “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, \q1 వధించబడిన గొర్రెపిల్లకే, \q1 రక్షణ చెందుతుంది.” \m \v 11 అప్పుడు దేవదూతలు అందరు సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడ్డారు; వారు సింహాసనం ముందు తమ ముఖాలను నేలకు ఆనిస్తూ సాగిలపడి దేవుని ఆరాధిస్తూ, \v 12 ఇలా అన్నారు: \q1 “ఆమేన్! \q1 మా దేవునికి స్తుతి, మహిమ, \q1 జ్ఞానం, కృతజ్ఞతాస్తుతులు, \q1 ఘనత, శక్తి, \q1 ప్రభావం నిరంతరం కలుగును గాక \q1 ఆమేన్.” \p \v 13 అప్పుడు పెద్దలలో ఒకడు, “తెల్లని వస్త్రాలను ధరించుకొన్న వీరు ఎవరు? వీరు ఎక్కడ నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు. \p \v 14 అప్పుడు నేను, “అయ్యా, అది మీకే తెలుసు కదా” అని చెప్పాను. \p అతడు నాతో ఇలా అన్నాడు, “వీరు మహా హింసలలో నుండి వచ్చినవారు. వీరు వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు. \v 15 అందుకే, \q1 “వీరు దేవుని సింహాసనం ముందు ఉండి, \q2 ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు, \q1 కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు \q2 తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. \q1 \v 16 ‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు \q2 దాహం ఉండదు; \q1 సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగలదు’\f + \fr 7:16 \fr*\ft \+xt యెషయా 49:10\+xt*\ft*\f* \q2 ఏ వేడి వారిని కాల్చదు. \q1 \v 17 ఎందుకంటే, సింహాసనం మధ్యలో ఉన్న వధించబడిన గొర్రెపిల్ల \q2 వారికి కాపరిగా ఉండి \q1 ‘జీవజలాల ఊటల దగ్గరకు వారిని నడిపిస్తాడు.’\f + \cat dup\cat*\fr 7:17 \fr*\ft \+xt యెషయా 49:10\+xt*\ft*\f* \q2 ‘దేవుడు వారి కళ్లలో నుండి కారే ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు.’\f + \fr 7:17 \fr*\ft \+xt యెషయా 25:8\+xt*\ft*\f*” \c 8 \s1 ఏడవ ముద్ర, ధూపం వేసే బంగారు పాత్ర \p \v 1 ఆ వధించబడిన గొర్రెపిల్ల ఏడవ ముద్రను విప్పినప్పుడు అక్కడ పరలోకంలో సుమారు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. \p \v 2 అప్పుడు నేను దేవుని ముందు నిలబడిన ఏడుగురు దేవదూతలను చూశాను, వారికి ఏడు బూరలు ఇవ్వబడ్డాయి. \p \v 3 ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకున్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి చాలా ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి. \v 4 అప్పుడు దూత చేతి నుండి ఆ ధూపద్రవ్యాల పొగ దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిసి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. \v 5 ఆ దూత బలిపీఠం నుండి తీసిన అగ్నితో ధూపం వేసే పాత్రను నింపి దాన్ని భూమి మీదికి విసిరివేశాడు. అప్పుడు గర్జన లాంటి శబ్దాలు, ఉరుములు, మెరుపుల ధ్వనులు, భూకంపం వచ్చాయి. \s1 ఏడు బూరలు \p \v 6 అప్పుడు ఏడు బూరలను పట్టుకుని ఉన్న ఆ ఏడు దూతలు వాటిని ఊదడానికి సిద్ధపడ్డారు. \p \v 7 మొదటి దూత తన బూరను ఊదినప్పుడు రక్తంతో కలిసి ఉన్న అగ్ని వడగండ్లు భూమి మీదికి కురిసాయి. అప్పుడు భూమి మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం కాలిపోయింది, పచ్చని గడ్డంతా కాలిపోయింది. \p \v 8 రెండవ దూత తన బూరను ఊదినప్పుడు అగ్నితో మండుతున్న పర్వతం లాంటిది సముద్రంలో పడింది. అప్పుడు సముద్రంలోని మూడవ భాగం రక్తంగా మారింది. \v 9 దానితో సముద్రంలోని ప్రాణుల్లో మూడవ భాగం చనిపోయాయి. ఇంకా ఓడలలో మూడవ భాగం నాశనమయ్యాయి. \p \v 10 మూడవ దూత తన బూరను ఊదినప్పుడు దివిటీలా ప్రకాశిస్తున్న ఒక గొప్ప నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటలలో పడింది. \v 11 ఆ నక్షత్రం పేరు “చేదు”\f + \fr 8:11 \fr*\fq చేదు \fq*\fqa మాచిపత్రి\fqa*\f* అది పడినప్పుడు నీటిలో మూడవ భాగం చేదుగా మారింది. ఆ చేదు నీటి వల్ల చాలామంది చనిపోయారు. \p \v 12 నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్యుని మూడవ భాగం, చంద్రుని మూడవ భాగం, నక్షత్రాల మూడవ భాగం దెబ్బతిన్నాయి. కాబట్టి అవన్నీ మూడవ భాగం వెలుగును కోల్పోయాయి. పగటి వెలుగులో మూడవ భాగం ప్రకాశం ఇవ్వలేదు అలాగే రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది. \p \v 13 నేను చూస్తూ ఉండగా ఒక పక్షిరాజు మధ్య ఆకాశంలో ఎగురుతూ పెద్ద స్వరంతో, “అయ్యో, శ్రమ! శ్రమ! మిగతా ముగ్గురు దేవదూతలు బూరల ధ్వని చేయబోతున్నారు కాబట్టి భూనివాసులకు శ్రమ” అని అరుస్తుంటే నేను విన్నాను. \c 9 \p \v 1 అయిదవ దూత తన బూరను ఊదినప్పుడు ఆకాశం నుండి రాలి భూమి మీద పడిన ఒక నక్షత్రాన్ని నేను చూశాను. అగాధానికి వెళ్లే గొయ్యి తాళపుచెవులు ఆ నక్షత్రానికి ఇవ్వబడ్డాయి. \v 2 అతడు ఆ అగాధాన్ని తెరిచినప్పుడు, చాలా పెద్ద కొలిమిలో నుండి పొగ వచ్చినట్లు ఆ అగాధం నుండి దట్టమైన పొగ పైకి లేచింది. అగాధం నుండి వచ్చిన ఆ పొగకు సూర్యునికి ఆకాశంలో చీకటి కమ్మింది. \v 3 ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాయి. వాటికి భూమిపై ఉండే తేళ్ళకు ఉన్న శక్తి ఇవ్వబడింది. \v 4 భూమి మీద మొలిచే గడ్డికి కాని, పచ్చని మొక్కలకు కాని, చెట్లకు కాని హాని చేయకూడదు కాని ఏ మనిషి నుదుటి మీద దేవుని ముద్ర లేదో వానికే హాని చేయాలని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. \v 5 ఆ మిడతలకు అయిదు నెలలపాటు మనుష్యులను వేధించడానికి అధికారం ఇవ్వబడింది కాని వారిని చంపడానికి అనుమతి ఇవ్వబడలేదు. అవి కుట్టినప్పుడు వారికి తేలు కుట్టినంతగా బాధ ఉంటుంది. \v 6 ఆ రోజుల్లో మనుష్యులు మరణాన్ని వెదకుతారు కాని అది వారికి దొరకదు; వారు చావాలని కోరుకుంటారు కాని మరణం వారి నుండి పారిపోతుంది. \p \v 7 ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలల మీద బంగారు కిరీటాల వంటివి ఉన్నాయి; వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి. \v 8 వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహపు కోరల్లా ఉన్నాయి. \v 9 వాటి ఛాతీ ఇనుప కవచంలా ఉంది. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరుగెత్తే అనేక గుర్రాల రథాల ధ్వనిలా ఉంది. \v 10 వాటికి తేళ్ళ తోకల వంటి తోకలు ఉన్నాయి. అవి అయిదు నెలల వరకు తమ తోకలతో మనుష్యులకు హాని చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి. \v 11 అగాధాన్ని పాలించే దూత వాటికి రాజుగా ఉన్నాడు. వాడి పేరు హెబ్రీ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపొల్యోను అనగా నాశనం చేసేవాడు అని అర్థము. \p \v 12 మొదటి శ్రమ గతించిపోయింది. ఇదిగో, ఇంకా రెండు శ్రమలు రానున్నాయి. \p \v 13 ఆరో దూత బూర ఊదినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న బంగారు బలిపీఠపు నాలుగు కొమ్ముల నుండి ఒక స్వరం నాకు వినిపించింది. \v 14 ఆ స్వరం బూర ఊదిన ఆరో దేవదూతతో, “యూఫ్రటీసు అనే మహా నది దగ్గర బంధించబడి ఉన్న నలుగురు దూతలను విడిపించు” అని చెప్పడం విన్నాను. \v 15 అయితే ఆ సంవత్సరం, ఆ నెల, ఆ రోజు, ఆ గంట కోసం సిద్ధం చేయబడిన ఆ నలుగురు దూతలు మనుష్యుల్లో మూడవ భాగాన్ని చంపడానికి విడుదల చేయబడ్డారు. \v 16 స్వారీ చేసేవారి సైన్యం లెక్క ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇంత అని నేను విన్నాను. \p \v 17 నా దర్శనంలో ఆ గుర్రాలు, వాటిపై స్వారీ చేసేవారు ఇలా ఉన్నారు; నిప్పులాంటి ఎరుపురంగు, ముదురు నీలం రంగు, గంధకం లాంటి పసుపురంగు కవచాలను వారు తమ ఛాతీ మీద ధరించి ఉండడం నేను చూశాను. ఆ గుర్రాల తలలు సింహపు తలల్లా కనిపించాయి. వాటి నోటి నుండి అగ్ని, పొగ, గంధకం బయలుదేరాయి. \v 18 వాటి నోళ్ల నుండి వచ్చిన అగ్ని, పొగ, గంధకాల వలన మూడు తెగుళ్ళు మనుష్యుల్లో మూడవ భాగం చంపేశాయి. \v 19 ఆ గుర్రాల శక్తి వాటి నోటిలో వాటి తోకలలో ఉంది. వాటి తోకలు పాముల్లా తలలు కలిగి మనుష్యులను గాయపర్చేవిగా ఉన్నాయి. \p \v 20 ఈ తెగుళ్ళ చేత బాధించబడి చావకుండ మిగిలిన ప్రజలు బంగారు, వెండి, ఇత్తడి, రాయి, కొయ్యలతో తయారుచేసుకొన్న విగ్రహాలను, దయ్యాలను పూజచేయడం మానలేదు. ఆ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు. అయినా అవి కేవలం తమ చేతి పని అని వారు గ్రహించలేదు. వాటిని దేవునిగా పూజించడం తప్పు అని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగలేదు. \v 21 వారు చేసే హత్యలు, మంత్రపు ప్రయోగాలు, లైంగిక దుర్నీతి, దొంగతనం అనేవి తప్పు అని గ్రహించి పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగలేదు. \c 10 \s1 చిన్న గ్రంథపుచుట్ట, దేవదూత \p \v 1 బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తలమీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్లు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి. \v 2 అతడు తెరిచి ఉన్న ఒక చిన్న గ్రంథపుచుట్టను తన చేతిలో పట్టుకుని తన కుడికాలు సముద్రం మీద, ఎడమకాలు భూమి మీద పెట్టి, \v 3 సింహగర్జన వంటి పెద్ద కేక వేశాడు. అతడు కేక వేసినప్పుడు ఏడు ఉరుములు తిరిగి గర్జించాయి. \v 4 ఆ ఏడు ఉరుముల గర్జనలను విన్న నేను వాటి గురించి వ్రాయబోయాను; కానీ పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఈ గర్జనలను గురించి వ్రాయకు, ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేసి వాటిని రహస్యంగా ఉంచాలి” అని చెప్పడం విన్నాను. \p \v 5 అప్పుడు సముద్రం మీద, భూమి మీద నిలబడి ఉన్నట్లు నేను చూసిన ఆ దేవదూత తన కుడిచేతిని ఆకాశం వైపు ఎత్తాడు. \v 6 ఆ తర్వాత అతడు ఎల్లకాలం జీవిస్తూ పరలోకాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని, భూమిని దానిలో ఉన్నవాటన్నిటిని, సముద్రాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని సృజించినవాని తోడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, “ఇక ఏ ఆలస్యం ఉండదు! \v 7 కాని ఏడవ దూత తన బూరను ఊదబోయే సమయంలో, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందే తెలిపిన విధంగా దేవుని మర్మం నెరవేరుతుంది” అని చెప్పాడు. \p \v 8 అప్పుడు పరలోకం నుండి నాతో మాట్లాడిన స్వరం మళ్ళీ నాతో, “వెళ్లు, సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న దేవదూత చేతిలో తెరిచి ఉన్న ఆ చిన్న గ్రంథపుచుట్టను తీసుకో” అని చెప్పడం విన్నాను. \p \v 9 కాబట్టి నేను ఆ దేవదూత దగ్గరకు వెళ్లి ఆ చిన్న గ్రంథపుచుట్టను నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు అతడు నాతో, “దీనిని తీసుకుని తిను, ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది కాని నీ నోటికి తేనెలా తియ్యగా ఉంటుంది”\f + \fr 10:9 \fr*\ft \+xt యెహె 3:3\+xt*\ft*\f* అని చెప్పాడు. \v 10 అప్పుడు నేను ఆ చిన్న గ్రంథపుచుట్టను ఆ దేవదూత చేతిలో నుండి తీసుకుని తినగా అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కాని నేను దాన్ని తిన్న తర్వాత నా కడుపులో చేదుగా మారింది. \v 11 అప్పుడు ఆయన నాతో, “నీవు అనేక ప్రజలు, దేశాలు, రాజులు, వివిధ భాషలు మాట్లాడేవారి గురించి మళ్ళీ ప్రవచించాలి” అని చెప్పాడు. \c 11 \s1 ఇద్దరు సాక్షులు \p \v 1 అప్పుడు ఒక దేవదూత నా చేతికి కొలిచే కర్రను ఇచ్చి నాతో, “లేచి, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలిచి ఆరాధిస్తున్నవారి సంఖ్యను లెక్కించు. \v 2 అయితే ఆలయం బయటి ఆవరణాన్ని కొలత తీసుకోకుండా విడిచిపెట్టాలి, ఎందుకంటే అది యూదేతరులకు ఇవ్వబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని అణగద్రొక్కుతారు. \v 3 1,260 రోజులు గోనెపట్ట కట్టుకొని ప్రవచించడానికి నా ఇద్దరు సాక్షులను నేను నియమిస్తున్నాను” అని చెప్పాడు. \v 4 వారు “రెండు ఒలీవచెట్లు” రెండు దీపస్తంభాలుగా ఉన్నారు; “వారు భూలోకానికి ప్రభువైనవాని ఎదుట నిలబడి ఉన్నారు.”\f + \fr 11:4 \fr*\ft \+xt జెకర్యా 4:3,11,14\+xt*\ft*\f* \v 5 ఎవరైనా వారికి హాని చేయాలని ప్రయత్నిస్తే, వారి నోటి నుండి అగ్ని వచ్చి వారి శత్రువులను దహించి వేస్తుంది. కాబట్టి వీరికి హాని చేయాలనుకునేవారు ఇలా చావాల్సిందే. \v 6 వారు ప్రవచించే రోజుల్లో భూమి మీద వాన కురవకుండా ఆకాశాన్ని మూయగలిగే అధికారం వారికి ఉంది. అలాగే వారికి కావలసినప్పుడెల్లా నీటిని రక్తంగా మార్చి, అన్ని రకాల వ్యాధులతో భూమిని బాధించడానికి అధికారం వారికి ఉంది. \p \v 7 ఆ ఇద్దరు సాక్షులు సాక్ష్యం ఇవ్వడం పూర్తి చేసిన తర్వాత, అగాధం నుండి ఒక మృగం వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించి చంపుతుంది. \v 8 వారి మృతదేహాలు ఆ గొప్ప పట్టణపు వీధిలో పడి ఉంటాయి. ఆ పట్టణం ఉపమానరీతిలో సొదొమ అని, ఈజిప్టు అని పిలువబడుతుంది. వారి ప్రభువు కూడా సిలువ వేయబడింది అక్కడే. \v 9 మూడున్నర రోజుల వరకు ప్రజల్లో అన్ని గోత్రాల వారు, అన్ని భాషల వారు, అన్ని జాతులవారు వీరి శవాలను చూస్తారు, వాటిని సమాధి చేయనివ్వరు. \v 10 ఆ ఇద్దరు ప్రవక్తలు భూమి మీద జీవించేవారిని వేధించారు కాబట్టి భూనివాసులందరు వారి చావును బట్టి సంతోష సంబరాలు జరుపుకొంటూ ఒకరికొకరు బహుమానాలు ఇచ్చిపుచ్చుకొంటారు. \p \v 11 కానీ మూడున్నర రోజుల తర్వాత దేవుని నుండి జీవవాయువు\f + \fr 11:11 \fr*\ft \+xt యెహె 37:5,14\+xt*\ft*\f* వారిలోనికి ప్రవేశించి వారు తమ కాళ్లమీద లేచి నిలబడినప్పుడు వారిని చూసిన వారందరికి విపరీతమైన భయం కలిగింది. \v 12 అప్పుడు పరలోకం నుండి ఒక గొప్ప స్వరం వారితో, “ఇక్కడకు ఎక్కి రండి!” అని చెప్పడం ఆ సాక్షులు విన్నారు. అప్పుడు వారి శత్రువులు వారిని చూస్తూ ఉండగానే వారు ఒక మేఘం మీద పరలోకానికి ఎక్కి వెళ్లిపోయారు. \p \v 13 సరిగ్గా అదే గంటలో ఒక పెద్ద భూకంపం వచ్చి ఆ పట్టణంలో పదవ భాగం కూలిపోయింది. ఏడు వేలమంది ప్రజలు చనిపోయారు, అయితే మిగిలిన వారికి భయం కలిగి పరలోకం నుండి పరిపాలిస్తున్న దేవుని మహిమపరిచారు. \p \v 14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ అతిత్వరలో రానుంది. \s1 ఏడవ బూర \p \v 15 ఏడవ దేవదూత తన బూరను ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు, ఇలా చెప్పడం వినిపించింది, \q1 “భూలోక రాజ్యం \q2 ప్రభు రాజ్యంగా ఆయన క్రీస్తు రాజ్యంగా మారాయి \q2 కాబట్టి ఆయన ఎల్లకాలం పరిపాలిస్తారు.” \m \v 16 అప్పుడు, దేవుని సన్నిధిలో తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవైనలుగురు పెద్దలు సాగిలపడి ఇలా దేవుని ఆరాధించారు, \q1 \v 17 “గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడవైన \q2 సర్వశక్తిగల ప్రభువైన దేవా, \q1 నీ మహాశక్తిని బట్టి నీవు పరిపాలిస్తున్నావు, \q2 కాబట్టి మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. \q1 \v 18 దేశాలు కోప్పడినందుకు \q2 నీ ఉగ్రత వచ్చింది. \q1 ఇక చచ్చినవారికి తీర్పు తీర్చడానికి, \q2 సేవకులైన ప్రవక్తలకు, నీ పేరుకు భయపడే నీ ప్రజలకు \q1 సామాన్యుల నుండి గొప్పవారి వరకు \q2 ప్రతిఫలాన్ని ఇవ్వడానికి, \q1 భూమిని నాశనం చేసేవారిని నాశనం చేయడానికి సమయం వచ్చింది.” \p \v 19 అప్పుడు పరలోకంలోని దేవాలయం తెరచుకొంది, దేవుని నిబంధన మందసం ఆయన దేవాలయంలో కనిపించింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపం, తీవ్రమైన వడగండ్ల వాన వచ్చాయి. \c 12 \s1 స్త్రీ, మహా ఘటసర్పం \p \v 1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది. \v 2 ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. \v 3 అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి. \v 4 దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీదికి విసిరివేసింది. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న స్త్రీ బిడ్డకు జన్మ ఇవ్వగానే ఆ బిడ్డను మ్రింగివేయాలని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ముందు నిలబడింది. \v 5 ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు “ఇనుప దండాన్ని పట్టుకుని అన్ని దేశాలను పరిపాలిస్తాడు.\f + \fr 12:5 \fr*\ft \+xt కీర్తన 2:9\+xt*\ft*\f*” ఆ శిశువు దేవుని దగ్గరకు ఆయన సింహాసనం దగ్గరకు తీసుకుపోబడ్డాడు. \v 6 ఆ స్త్రీ 1,260 రోజుల వరకు సంరక్షింపబడేలా దేవుడు ఆమె కోసం అరణ్యంలో సిద్ధం చేసిన స్థలానికి ఆమె పారిపోయింది. \p \v 7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాఘటసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా ఘటసర్పం దాని సైన్యం కూడా యుద్ధంలో పోరాడాయి. \v 8 కాని వానికి తగినంత బలం లేకపోవడంతో గెలువలేక పరలోకంలో తమ స్థానాన్ని పోగొట్టుకొన్నారు. \v 9 ఆ తర్వాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేదా అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు. \p \v 10 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, \q1 “ఇదిగో, రక్షణ, అధికారం, \q2 రాజ్యం మన దేవునివి అయ్యాయి. \q2 ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. \q1 ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద \q2 రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న \q2 అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు. \q1 \v 11 వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, \q2 తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి \q2 అపవాది మీద విజయం పొందారు; \q1 వారు చావడానికి వెనుకంజ వేయలేదు \q2 తమ ప్రాణాలను ప్రేమించలేదు. \q1 \v 12 కాబట్టి ఆకాశాల్లారా, \q2 వాటిలో నివసించేవారలారా ఆనందించండి! \q1 అయితే భూమికి సముద్రానికి శ్రమ! \q2 ఎందుకంటే, అపవాది మీ దగ్గరకు దిగివచ్చాడు! \q1 తనకు కొద్ది కాలమే మిగిలి ఉందని అతనికి తెలుసు \q2 కాబట్టి అతడు తీవ్రమైన కోపంతో ఉన్నాడు” \m అని ప్రకటించడం నేను విన్నాను. \p \v 13 తాను భూమి మీద పడద్రోయబడడాన్ని ఘటసర్పం చూసినప్పుడు, అతడు మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ స్త్రీని వెంటాడు. \v 14 ఒక కాలం కాలాలు సగకాలం వరకు సర్పానికి అందకుండ తన ఆకలిదప్పులు తీర్చుకొనేలా అరణ్యంలో ఆమె కోసం సిద్ధపరచిన స్థలానికి ఎగిరి వెళ్లడానికి ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి. \v 15 అప్పుడు, ఆ స్త్రీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదిలా కుమ్మరించింది. \v 16 కాని ఆ స్త్రీకి సహాయం చేయడానికి భూమి తన నోరు తెరిచి ఆ ఘటసర్పం నోటి నుండి వచ్చిన నదిని మ్రింగివేసింది. \v 17 అందుకు ఆ ఘటసర్పం ఆ స్త్రీపై కోపంతో మండిపడి ఆమె మిగిలిన సంతానంతో అనగా నమ్మకంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతూ యేసు క్రీస్తు కోసం సాక్షులుగా జీవిస్తున్న వారితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్లింది. \c 13 \s1 సముద్రం నుండి వచ్చిన మృగం \p \v 1 ఆ ఘటసర్పం సముద్రపు ఒడ్డున నిలబడింది. ఇంతలో సముద్రంలో నుండి ఒక మృగం బయటకు రావడం నేను చూశాను. దానికి ఏడు తలలు పది కొమ్ములు, దాని కొమ్ములకు పది కిరీటాలు, దాని ప్రతి తలమీద దైవదూషణ చేసే పేరు ఉంది. \v 2 నేను చూసిన ఆ మృగం చిరుతపులిని పోలి ఉంది, కాని దాని కాళ్లు ఎలుగుబంటి కాళ్లలా, దాని నోరు సింహం నోరులా ఉన్నాయి. ఆ ఘటసర్పం తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఆ మృగానికి ఇచ్చింది. \v 3 ఆ మృగం తలల్లో ఒకదానికి చనిపోయేంతగా గాయం తగిలినట్లు ఉన్నది కానీ ఆ గాయం పూర్తిగా మానిపోయింది. అందుకు భూలోక ప్రజలంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని వెంబడించారు. \v 4 ఘటసర్పం ఆ మృగానికి అధికారం ఇచ్చింది కాబట్టి ప్రజలు దాన్ని పూజించారు. వారు మృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ మృగం వంటివారు ఎవరు? ఈ మృగంతో యుద్ధం చేసి గెలవగలవారు ఎవరు?” అని చెప్పుకున్నారు. \p \v 5 ఆ మృగానికి దేవునికి విరుద్ధంగా తన గొప్పలు చెప్తూ దైవదూషణ చేసే నోరు ఉంది. నలభై రెండు నెలల వరకు అధికారం చెలాయించడానికి అనుమతి ఇవ్వబడింది. \v 6 ఆ మృగం దేవుని దూషించడానికి, దేవుని నామాన్ని, ఆయన నివాస స్థలాన్ని, దేవునితో జీవించే పరలోక నివాసులను దూషించడానికి నోరు తెరిచింది. \v 7 దేవుని ప్రజల మీద యుద్ధం చేసి వారిని జయించడానికి ఆ మృగానికి అనుమతి ఇవ్వబడింది. ప్రతి గోత్రాన్ని, ప్రజలను, ప్రతి భాష మాట్లాడేవారిని, ప్రతి దేశాన్ని ఏలడానికి దానికి అధికారం ఇవ్వబడింది. \v 8 లోకం సృష్టించబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని పూజిస్తారు. \p \v 9 చెవులుగలవారు విందురు గాక! \q1 \v 10 “చెరలోనికి వెళ్లవలసినవారు \q2 చెరలోనికి వెళ్తారు. \q1 ఖడ్గంతో హతం కావలసిన వారు \q2 ఖడ్గంతో హతం అవుతారు.”\f + \fr 13:10 \fr*\ft \+xt యిర్మీయా 15:2\+xt*\ft*\f* \m ఇది దేవుని ప్రజలు తమ విశ్వాసానికి నమ్మకంగా ఉండి సహనాన్ని చూపించాల్సిన సమయం. \s1 భూమిలో నుండి వచ్చిన మృగం \p \v 11 దాని తర్వాత రెండవ మృగం భూమిలో నుండి రావడం నేను చూశాను. దానికి గొర్రెపిల్లను పోలిన రెండు కొమ్ములు ఉన్నాయి, కాని అది ఘటసర్పంలా మాట్లాడింది. \v 12 ఆ రెండవ మృగం మొదటి మృగానికి ఉన్న అధికారమంతటిని చెలాయిస్తూ, చనిపోయేంత గాయం నుండి స్వస్థపడిన ఆ మొదటి మృగాన్ని భూమి దాని నివాసులు ఆరాధించేలా చేసింది. \v 13 అది గొప్ప సూచనలు చేస్తూ, మనుష్యులు చూస్తున్నప్పుడే ఆకాశం నుండి భూమి మీద అగ్నిని కురిసేలా చేస్తుంది. \v 14 రెండవ మృగం మొదటి మృగం పక్షంగా దాని కోసం అద్భుతాలను చేస్తూ భూనివాసులందరినీ మోసగిస్తుంది. ఆ రెండవ మృగం ఖడ్గంతో గాయపడి బ్రతికిన ఆ మొదటి మృగం కోసం విగ్రహం చేయమని వారిని ఆదేశించింది. \v 15 అంతేకాక మొదటి మృగం యొక్క విగ్రహానికి ఊపిరి పోసి అది మాట్లాడేలా చేయడానికి, తద్వారా ఆ విగ్రహాన్ని పూజించని వారందరిని చంపించడానికి దానికి అధికారం ఇవ్వబడింది. \v 16 ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా సరే అందరు తమ కుడిచేతి మీద గాని నుదుటి మీద గాని ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది. \v 17 ఎందుకంటే ఈ ముద్రను వేసుకునేవారు తప్ప మరి ఎవరూ అమ్ముకోలేరు కొనుక్కోలేరు. ఈ ముద్ర మృగం పేరుకు ఆ మృగం పేరుకు గల సంఖ్యకు నిదర్శనంగా ఉంది. \p \v 18 దానిలో జ్ఞానం ఉంది. పరిజ్ఞానం కలవాడు ఆ మృగపు సంఖ్యను లెక్కించి తెలుసుకొనును గాక! అది ఒక మానవుని సంఖ్య. ఆ సంఖ్య 666. \c 14 \s1 గొర్రెపిల్ల, 1,44,000 మంది \p \v 1 ఆ తర్వాత నా ఎదుట సీయోను పర్వతం మీద వధించబడిన గొర్రెపిల్ల, ఆయనతో 1,44,000 మంది తమ నుదుటి మీద ఆయన పేరును ఆయన తండ్రి పేరును వ్రాయబడినవారు నిలబడి ఉండడం చూశాను. \v 2 అప్పుడు నేను పరలోకం నుండి ప్రవాహ జలాల ధ్వనిలా, గొప్ప ఉరుములా ఒక శబ్దాన్ని విన్నాను. అది నాకు వీణ వాయిద్యకారులు తమ వాయిద్యాలను వాయిస్తున్న ధ్వనిలా వినిపించింది. \v 3 వారు సింహాసనం ముందు, నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచన పొందిన ఈ 1,44,000 మంది తప్ప ఆ పాటను ఎవరు నేర్చుకోలేరు. \v 4 వీరు ఏ స్త్రీతో తమను అపవిత్రం చేసుకోకుండా పవిత్రంగా జీవించారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు దాన్ని అనుసరించారు. వారు మానవుల నుండి దేవునికి, గొర్రెపిల్లకు తొలిఫలంగా అర్పించడానికి కొనబడ్డవారు. \v 5 వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు. \s1 ముగ్గురు దేవదూతలు \p \v 6 ఆ తర్వాత నేను ఇంకొక దేవదూత ఆకాశం మధ్య ఎగిరివెళ్తూ భూమి మీద జీవిస్తున్న ప్రతి దేశానికి, ప్రతి జాతి వారికి, ప్రతి భాష మాట్లాడేవారికి, ప్రతి జనులకు శాశ్వతమైన సువార్తను ప్రకటించడాన్ని చూశాను. \v 7 అతడు పెద్ద స్వరంతో, “దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించండి! ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చింది! ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని నీటి ఊటలను సృష్టించిన దేవుని ఆరాధించండి!” అని చెప్పాడు. \p \v 8 రెండవ దేవదూత అతని వెంబడించి, “ ‘కూలిపోయింది! బబులోను మహా పట్టణం కూలిపోయింది!’\f + \fr 14:8 \fr*\ft \+xt యెషయా 21:9\+xt*\ft*\f* అది తన వ్యభిచార మద్యాన్ని అన్ని దేశాలకు త్రాగించింది” అని చెప్పాడు. \p \v 9 మూడవ దేవదూత వారిని వెంబడించి పెద్ద స్వరంతో, “మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించి, తమ నుదుటి మీద లేదా చేతి మీద దాని ముద్ర వేయించుకొంటే, \v 10 వారు ఏమి కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యాన్ని త్రాగుతారు. పవిత్ర దేవదూతల ఎదుట వధించబడిన గొర్రెపిల్ల సన్నిధిలో అగ్ని గంధకంతో బాధించబడతారు. \v 11 ఆ మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించిన లేదా దాని పేరు ముద్రను వేయించుకొన్నవారు విశ్రాంతి లేకుండా రాత్రింబగళ్ళు వేదన పొందుతారు. ఆ వేదన పొగ ఎల్లప్పుడు లేస్తూనే ఉంటుంది” అని బిగ్గరగా చెప్పాడు. \v 12 ఇది యేసు క్రీస్తుకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్న దేవుని ప్రజలు సహనాన్ని చూపించాల్సిన సమయం. \p \v 13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “ఇప్పటినుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు! అని వ్రాసి పెట్టు” అని చెప్పింది. \p దేవుని ఆత్మ, “అవును నిజమే, తమ ప్రయాస నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది. \s1 భూమిపై పంటను కోయుట, ద్రాక్ష గానుగ త్రొక్కుట \p \v 14 నేను చూస్తుండగా ఒక తెల్లని మేఘం మీద మనుష్యకుమారునిలా\f + \fr 14:14 \fr*\ft \+xt దాని 7:13\+xt*\ft*\f* ఉన్న ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు తన తలమీద బంగారు కిరీటాన్ని ధరించి చేతిలో పదునైన కొడవలిని పట్టుకుని ఉన్నాడు. \v 15 అప్పుడు మరొక దేవదూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘం మీద కూర్చున్న వానితో, “భూమి మీద పంట పూర్తిగా పండి పోయింది కాబట్టి నీ కొడవలి తీసుకుని పండిన పంటను కోయాలి” అని బిగ్గరగా చెప్పాడు. \v 16 కాబట్టి మేఘం మీద కూర్చున్న వాడు తన కొడవలిని భూమి మీద తిప్పగానే భూమి పంటంతా కోయబడింది. \p \v 17 మరొక దేవదూత పరలోక దేవాలయంలో నుండి బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా పదునైన కొడవలి ఉంది. \v 18 మరో దేవదూత బలిపీఠం నుండి వచ్చాడు. అతనికి బలిపీఠం మీద ఉన్న అగ్నిపై అధికారం ఉంది. అతడు పదునైన కొడవలి గలవానితో బిగ్గరగా, “భూమి మీద ఉన్న ద్రాక్షపండ్లు పండిపోయాయి కాబట్టి నీ పదునైన కొడవలితో ద్రాక్షపండ్ల గుత్తులను కోయాలి” అని చెప్పాడు. \v 19 అప్పుడు ఆ దేవదూత తన కొడవలిని భూమి మీద త్రిప్పి ద్రాక్షపండ్లను కోసి దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు. \v 20 ఆ ద్రాక్ష గానుగ పట్టణానికి బయట ఉంది. అక్కడ ద్రాక్షపండ్లను త్రొక్కడంతో ఆ ద్రాక్ష గానుగ నుండి 1,600 స్టాడియా\f + \fr 14:20 \fr*\ft అంటే, సుమారు మూడువందల కిలోమీటర్లు\ft*\f* దూరం వరకు గుర్రాల కళ్లెమంత ఎత్తులో ఆ రక్తం నదిలా ప్రవహించింది. \c 15 \s1 ఏడుగురు దేవదూతలు, ఏడు తెగుళ్ళు \p \v 1 నేను పరలోకంలో మరొక గొప్ప అద్భుతమైన సూచన చూశాను: ఏడుగురు దేవదూతలు చివరి ఏడు తెగుళ్ళను పట్టుకుని వస్తున్నారు. అవి చివరివి ఎందుకంటే ఈ తెగుళ్ళతో దేవుని కోపం తీరిపోతుంది. \v 2 నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూశాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, దాని విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకుని ఉన్నారు. \v 3 వారు దేవుని సేవకుడైన మోషే పాట, వధించబడిన గొర్రెపిల్ల పాడిన పాట పాడుతూ, \q1 “మా ప్రభువైన సర్వశక్తిగల దేవా! \q2 నీవు చేసిన క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి! \q1 సకల రాజ్యాలకు\f + \fr 15:3 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa యుగములకు\fqa*\f* రాజా! \q2 నీ మార్గాలు యథార్థంగా న్యాయంగా ఉన్నాయి! \q1 \v 4 ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు, \q2 కాబట్టి నీకు భయపడని వారు ఎవరు? \q1 నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు? \q1 నీ నీతి క్రియలు తెలియజేయబడ్డాయి, \q2 కాబట్టి భూజనులందరు \q1 నీ ఎదుటకు వచ్చి ఆరాధిస్తారు,”\f + \fr 15:4 \fr*\ft \+xt కీర్తన 111:2,3; ద్వితీ 32:4; యిర్మీయా 10:7; కీర్తన 86:9; కీర్తన 98:2\+xt*\ft*\f* అని దేవుని స్తుతించారు. \p \v 5 దీని తర్వాత నేను చూస్తూ ఉండగా, పరలోక దేవాలయం అనగా సాక్షి గుడారం తెరవబడింది. \v 6 ఆ పరలోక దేవాలయం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళు తీసుకువచ్చారు. వారు ప్రకాశిస్తున్న తెల్లని వస్త్రాలను ధరించి తమ రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని ఉన్నారు. \v 7 అప్పుడు నాలుగు ప్రాణులలోని ఒక ప్రాణి నిరంతరం జీవించే దేవుని ఉగ్రతతో నింపబడిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చాడు. \v 8 అప్పుడు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో ఆ దేవాలయమంతా నిండిపోయి ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు. \c 16 \s1 దేవుని ఏడు ఉగ్రత పాత్రలు \p \v 1 అప్పుడు దేవాలయంలో నుండి ఒక పెద్ద స్వరం ఏడుగురు దేవదూతలతో, “మీరు వెళ్లి దేవుని ఉగ్రత గల ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించండి” అని బిగ్గరగా చెప్పడం విన్నాను. \p \v 2 మొదటి దేవదూత వెళ్లి భూమి మీద తన పాత్రను కుమ్మరించాడు. అప్పుడు ఆ మృగం యొక్క ముద్రగలవారికి, దాని విగ్రహాన్ని పూజించేవారికి భయంకరమైన నొప్పి కలిగించే అసహ్యమైన కురుపులు పుట్టాయి. \p \v 3 రెండవ దేవదూత సముద్రం మీద తన పాత్రను కుమ్మరించిన వెంటనే సముద్రపు నీరు చనిపోయినవారి రక్తంలా మారింది; దానిలోని ప్రతి ప్రాణి చనిపోయింది. \p \v 4 మూడవ దేవదూత తన పాత్రను నదులు, నీటి ఊటల మీద కుమ్మరించినప్పుడు అవి రక్తంగా మారాయి. \v 5 అప్పుడు జలాల మీద అధికారం కలిగిన దేవదూత ఇలా చెప్పడం విన్నాను, \q1 “ఓ పరిశుద్ధుడా! నీవు ఉన్నవాడవు, ఉండిన వాడవు, \q2 ఈ తీర్పు తీర్చడానికి నీవు న్యాయవంతుడవు. \q1 \v 6 వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కాబట్టి, \q2 వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు.” \m \v 7 అప్పుడు బలిపీఠం ఈ విధంగా బదులిచ్చింది: \q1 “అవును, ఓ సర్వశక్తిమంతుడా ప్రభువైన దేవా, \q2 నీ తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి.” \p \v 8 నాలుగవ దేవదూత సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు అగ్నితో ప్రజలను కాల్చడానికి సూర్యునికి అనుమతి ఇవ్వబడింది. \v 9 ప్రజలు ఆ భయంకరమైన వేడికి కాలిపోయి ఈ తెగుళ్ళపై అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించారే తప్ప పశ్చాత్తాపపడి ఆయనను మహిమపరచలేదు. \p \v 10 అయిదవ దేవదూత తన పాత్రను ఆ మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించినప్పుడు దాని రాజ్యమంతా చీకటి కమ్మింది. ప్రజలు ఆ వేదనను తట్టుకోలేక తమ నాలుకలను కొరుక్కున్నారు. \v 11 వారికి కలిగిన వేదనకు, కురుపులకు వారు పరలోక దేవుని దూషించారు కానీ తాము చేసిన వాటి గురించి పశ్చాత్తాపపడలేదు. \p \v 12 ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహా నది మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు, తూర్పు నుండి రాజులు వచ్చేలా మార్గం సిద్ధపరచడానికి ఆ నది పూర్తిగా ఎండిపోయింది. \v 13 తర్వాత కప్పలను పోలిన మూడు అపవిత్రాత్మలు నాకు కనబడ్డాయి; అవి ఘటసర్పం నోటి నుండి, మృగం నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి బయటకు వచ్చాయి. \v 14 అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి. \b \mi \v 15 “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి వస్త్రం ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!” \b \m \v 16 ఆ అపవిత్రాత్మలు రాజులనందరిని హెబ్రీ భాషలో “హర్మగిద్దోను” అని పిలువబడే స్థలంలో పోగుచేశాయి. \p \v 17 ఏడవ దేవదూత గాలిలో తన పాత్రను కుమ్మరించినప్పుడు, దేవాలయంలోని సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక సమాప్తం అయింది!” అని చెప్పింది. \v 18 అప్పుడు మెరుపుల వెలుగులు, ధ్వనులు, ఉరుములు, భయంకరమైన భూకంపం వచ్చాయి. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండి ఇలాంటి భూకంపం కలుగలేదు. అది చాలా భయంకరమైన భూకంపము. \v 19 ప్రసిద్ధిగాంచిన ఆ గొప్ప పట్టణం మూడు భాగాలుగా చీలిపోయింది, దేశాల పట్టణాలు కుప్పకూలాయి. దేవుడు బబులోను మహాపట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని తన ఉగ్రత అనే మద్యంతో నిండిన పాత్రను ఆమెకు ఇచ్చారు. \v 20 అప్పుడు ప్రతి ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనబడలేదు. \v 21 ఆకాశం నుండి మనుష్యుల మీద భారీ వడగండ్లు పడ్డాయి. ఆ వడగండ్లు ఒక్కొక్కటి సుమారు నలభై అయిదు కిలోల బరువు ఉన్నాయి. ఆ వడగండ్ల తెగులు చాలా భయంకరంగా ఉండడంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రజలు దేవుని దూషించారు. \c 17 \s1 మృగం మీద ఉన్న బబులోను అనే మహావేశ్య \p \v 1 ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి నాతో, “ఇక్కడకు రా, అనేక జలాల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు విధించబడిన శిక్షను నీకు చూపిస్తాను. \v 2 భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె వ్యభిచారమనే మద్యంతో భూనివాసులందరు మత్తులయ్యారు” అని చెప్పాడు. \p \v 3 అప్పుడు ఆ దేవదూత నన్ను ఆత్మలో ఎడారిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు రంగులో ఉన్న మృగం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. ఆ మృగం నిండా దైవదూషణ పేర్లు ఉన్నాయి; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. \v 4 ఆ స్త్రీ ఊదా, ఎరుపురంగు వస్త్రాలను ధరించి, మెరిసే బంగారం, విలువైన రాళ్లు, ముత్యాలతో అలంకరించబడి ఉంది. ఆమె తన చేతితో ఒక బంగారు పాత్ర పట్టుకుని ఉంది. ఆ పాత్ర ఆమె చేసిన అసహ్యమైన పనులు, వ్యభిచారమనే మురికితో నిండి ఉంది. \v 5 ఆమె నుదిటి మీద వ్రాసి ఉన్న పేరులో ఒక రహస్యం ఉంది: \pc \sc “మహా బబులోను పట్టణం,\sc* \pc \sc వేశ్యలకు తల్లి\sc* \pc \sc భూమి మీద జరిగే ప్రతి అసహ్యమైన కార్యానికి తల్లి.”\sc* \m \v 6 ఈ స్త్రీ దేవుని పరిశుద్ధ ప్రజల రక్తాన్ని అనగా యేసు హతసాక్షుల రక్తాన్ని త్రాగి మత్తులో ఉండడం నేను చూశాను. \p నేను ఆమెను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను. \v 7 అప్పుడు ఆ దేవదూత నాతో, “నీవెందుకు ఆశ్చర్యపడుతున్నావు? హతసాక్షుల స్వారీ చేసిన ఏడు తలలు పది కొమ్ములు కలిగిన మృగానికి సంబంధించిన రహస్యాన్ని నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు. \v 8 నీవు చూసిన ఆ మృగం ఒకప్పుడు ఉండేది కాని ఇప్పుడు లేదు. అది అగాధం నుండి పైకి వచ్చి నాశనమై పోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ మృగం ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అది మళ్ళీ వస్తుంది కాబట్టి సృష్టికి పునాది వేయబడక ముందు నుండి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని చూసి ఆశ్చర్యపడతారు. \p \v 9 ఈ విషయాన్ని గుర్తించడానికి జ్ఞానంగల మనస్సు అవసరం. ఆ స్త్రీ కూర్చుని ఉన్న ఏడు తలలు ఏడు కొండలు. \v 10 ఆ ఏడు తలలు ఏడుగురు రాజులను సూచిస్తున్నాయి. వారిలో అయిదుగురు పడిపోయారు, ఒక రాజు యేలుతున్నాడు, మరొక రాజు ఇంకా రాలేదు. కాని అతడు వచ్చినప్పుడు అతడు కేవలం కొంతకాలమే యేలుతాడు. \v 11 ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేని ఆ మృగమే ఎనిమిదవ రాజు. ఆ మృగమే ఏడుగురిలో ఒకడు, అతడు తన నాశనం కోసమే రాబోతున్నాడు. \p \v 12 నీవు చూసిన పది కొమ్ములు పదిమంది రాజులు. వారు ఇంకా రాజ్యాన్ని పొందలేదు, కాని మృగంతో పాటు కలిసి ఒక గంట సమయం రాజుల్లా యేలడానికి వారికి అధికారం ఇవ్వబడుతుంది. \v 13 వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు. \v 14 ఈ రాజులందరూ మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కాబట్టి ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతో పాటు ఆయనచే పిలువబడిన వారు, ఏర్పరచబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు. \p \v 15 అప్పుడు ఆ దేవదూత నాతో, “ఆ వేశ్య కూర్చుని ఉన్న ఆ జలాలే ప్రజలు, జనసమూహాలు, దేశాలు, వివిధ భాషలు మాట్లాడేవారు. \v 16 నీవు చూసిన ఆ మృగం ఆ పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమెను దిక్కులేని దానిగా, దిగంబరిగా చేయడానికి ఆమెను తీసుకొస్తాయి. అవి ఆమె మాంసాన్ని తిని, ఆమె శరీరాన్ని అగ్నితో కాల్చివేస్తాయి. \v 17 ఎందుకంటే దేవుడు ముందుగానే పలికిన మాటలు నెరవేరే వరకు వారు తమ రాజ్యాధికారాన్ని ఆ మృగానికి అప్పగించడానికి అంగీకరించడం ద్వారా ఆయన ఉద్దేశాలు పూర్తయ్యే వరకు దేవుడు దీన్ని వారి హృదయాల్లో ఉంచారు. \v 18 నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను యేలుతున్న ఆ మహా పట్టణం” అని చెప్పాడు. \c 18 \s1 కూలిపోయిన బబులోను గురించి విలాపం \p \v 1 తర్వాత మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను; అతనికి గొప్ప అధికారం ఉంది, అతని వెలుగుతో భూమి ప్రకాశించింది. \v 2 అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, \q1 “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది!\f + \fr 18:2 \fr*\ft \+xt యెషయా 21:9\+xt*\ft*\f* \q2 అది దయ్యాలు సంచరించే స్థలంగా, \q1 ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా, \q2 ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, \q2 ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది. \q1 \v 3 ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి \q2 దేశాలన్నీ మత్తులయ్యాయి. \q1 భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. \q2 భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.” \s1 బబులోను తీర్పును తప్పించుకోవడానికి హెచ్చరిక \p \v 4 అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: \q1 “ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’\f + \fr 18:4 \fr*\ft \+xt యిర్మీయా 51:45\+xt*\ft*\f* \q2 ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా, \q2 ఆమెలో నుండి బయటకు రండి; \q1 \v 5 ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి, \q2 దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు. \q1 \v 6 ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి; \q2 ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి. \q2 ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి! \q1 \v 7 ఆమె తనను తాను హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో, \q2 అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి. \q1 ఎందుకంటే, ఆమె తన హృదయంలో, \q2 ‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను. \q1 నేను విధవరాలిని కాను,\f + \fr 18:7 \fr*\ft \+xt యెషయా 47:7,8\+xt*\ft*\f* \q2 ఇక ఎన్నడు సంతాపం అనుభవించను’ అని అనుకుంది. \q1 \v 8 కాబట్టి ఒక్క రోజులోనే ఆమె తెగుళ్ళన్ని ఆమెను పట్టుకుంటాయి, \q2 ఆమె మీదికి మరణం, దుఃఖం, కరువు వస్తాయి. \q1 ఆమెకు తీర్పు తీర్చే ప్రభువైన దేవుడు శక్తిగలవాడు, \q2 కాబట్టి ఆమె అగ్నితో కాల్చివేయబడుతుంది.” \s1 బబులోను మహా పట్టణం పతనానికి మూడు రెట్ల విపత్తు \p \v 9 ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. \v 10 ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి ఇలా రోదిస్తారు: \q1 “మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! \q2 బబులోను మహా పట్టణమా, \q1 ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది.” \p \v 11 భూలోక వ్యాపారులు ఇకపై తమ సరుకులు కొనేవారెవరు లేరని ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు. \v 12 వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు; సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో ఇత్తడి ఇనుము నునుపురాళ్లతో తయారుచేసిన అన్ని రకాల వస్తువులు; \v 13 దాల్చిన చెక్క, సుగంధద్రవ్యాలు, ధూపద్రవ్యాలు, బోళం సాంబ్రాణి, ద్రాక్షరసం ఒలీవనూనె, శ్రేష్ఠమైన పిండి గోధుమలు; పశువులు గొర్రెలు, గుర్రాలు రథాలు; మానవులు కేవలం భౌతిక శరీరాలు మాత్రమే కాదు, మనుష్యుల ప్రాణాలు, బానిసలు. \p \v 14 అప్పుడు వర్తకులు ఆ పట్టణంతో, “నీ ప్రాణం కోరుకున్న ఫలం నిన్ను విడిచిపోయింది, నీకున్న సుఖవిలాసం, వైభవాలు ఇంకెన్నడు నీకు కనిపించకుండా మాయమైపోయాయి” అని అన్నారు. \v 15 ఈ సరుకులను అమ్ముతూ ఆమె వలన ధనవంతులైన వ్యాపారులు ఆమె అనుభవించే వేదన చూసి భయంతో దూరంగా నిలబడ్డారు. వారు ఏడుస్తూ రోదిస్తూ, \v 16 బిగ్గరగా ఇలా రోదించారు, \q1 “ ‘మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! \q2 సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, ఎరుపురంగు బట్టలు ధరించుకొని, \q2 బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో అలంకరించుకుని మెరుస్తున్నదానా, \q1 \v 17 ఒక్క గంటలోనే ఈ నీ గొప్ప ధనసంపద అంతా వ్యర్థమైపోయిందా?’ \p “ప్రతి ఓడ అధిపతి, ఓడ ప్రయాణికులందరు, నావికులు, సముద్ర వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు దూరంగా నిలబడ్డారు. \v 18 కాలిపోతున్న ఆమె నుండి వస్తున్న పొగను చూసి, ‘ఈ మహా పట్టణం వంటి గొప్ప పట్టణం ఎప్పుడైనా ఉన్నదా?’ అని బిగ్గరగా కేకలు వేస్తారు. \v 19 వారు తమ తలలపై దుమ్మును పోసుకుంటూ కన్నీరు కార్చుతూ దుఃఖిస్తూ బిగ్గరగా రోదిస్తూ, \q1 “ ‘మహా పట్టణమా, నీకు శ్రమ! శ్రమ! \q2 సముద్రంలో ఓడలున్న వారందరు \q2 ఆమె ధన సమృద్ధితో ధనికులయ్యారు. \q1 గాని ఒక్క గంటలోనే ఆమె నశించిపోయిందే అని చెప్పుకుంటారు.’ \b \q1 \v 20 “పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. \q2 దేవుని ప్రజలారా, ఆనందించండి. \q2 అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. \q1 ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి \q2 దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.” \s1 బబులోను పతనం యొక్క అంతిమఘట్టం \p \v 21 ఆ తర్వాత ఒక బలమైన దేవదూత ఒక పెద్ద తిరుగలి రాయంత బండరాయిని తీసుకుని సముద్రంలో పడవేసి, \q1 “ఇలాంటి హింసలతో \q2 బబులోను మహా పట్టణం క్రిందికి త్రోయబడుతుంది \q2 మరి ఎన్నడు అది కనబడదు. \q1 \v 22 వీణ వాయించేవారి, పిల్లన గ్రోవులు బూరలు ఊదేవారి సంగీతం \q2 మరి ఎన్నడు నీలో వినబడదు. \q1 వ్యాపారం చేసే ఏ పనివాడైనా \q2 నీలో ఎన్నడు కనిపించడు. \q1 తిరుగలి రాయి తిప్పే శబ్దం \q2 మరెన్నడు నీలో వినబడదు. \q1 \v 23 ఇక ఒక దీపపు వెలుగైనా \q2 నీలో ఎన్నడూ ప్రకాశించదు. \q1 ఇక వధువు స్వరం వరుని స్వరం \q2 నీలో ఎన్నడూ వినిపించదు. \q1 నీ వర్తకులు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినవారిగా ఉన్నారు. \q2 నీ మాయ మంత్రాలతో దేశాలన్నీ మోసపోయాయి. \q1 \v 24 ప్రవక్తల రక్తం దేవుని పరిశుద్ధ ప్రజల రక్తం, \q2 భూమి మీద వధించబడిన వారందరి రక్తం ఆమెలో కనిపిస్తుంది.” \c 19 \s1 బబులోను పతనాన్ని బట్టి మూడింతల హల్లెలూయా \p \v 1 ఈ సంగతుల తర్వాత పరలోకంలో ఒక గొప్ప జనసమూహం అరుస్తున్న శబ్దం వంటి శబ్దాన్ని నేను విన్నాను: \q1 “హల్లెలూయా! రక్షణ, మహిమ, బలం మన దేవునివే! \q2 \v 2 ఎందుకంటే ఆయన తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి. \q1 భూమిని తన వ్యభిచారంతో చెడగొట్టిన, \q2 ఆ మహావేశ్యకు ఆయన శిక్ష విధించారు. \q1 తన సేవకుల రక్తాన్ని కార్చిన ఆమెపై ఆయన పగతీర్చుకున్నారు.” \p \v 3 మరొకసారి వారు ఇలా బిగ్గరగా కేకలు వేశారు: \q1 “హల్లెలూయా! ఆమె నుండి వస్తున్న పొగ \q1 ఎల్లకాలం పైకి లేస్తూనే ఉంటుంది!” \p \v 4 అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి బిగ్గరగా ఇలా అన్నారు: \q1 “ఆమేన్! హల్లెలూయా!” \m అంటూ ఆరాధించారు. \p \v 5 అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం, \q1 “దేవునికి భయపడేవారలారా, \q2 ఓ దేవుని సేవకులారా! \q1 చిన్నవారైన పెద్దవారైన అందరు \q2 మన దేవుని స్తుతించండి” \m అని పలికింది. \p \v 6 అప్పుడు మహా గొప్ప జనసమూహం వంటి శబ్దాన్ని, పారే జలాల గర్జనను ఉరుముల ధ్వనిని పోలిన స్వరం ఇలా అన్నది, \q1 “హల్లెలూయా! సర్వశక్తిగల మన ప్రభువైన \q2 దేవుడు పరిపాలిస్తున్నారు. \q1 \v 7 కాబట్టి మనం ఆనందించి ఉత్సాహ ధ్వనులతో \q2 ఆయనను కీర్తించుదాం! \q1 ఎందుకంటే ఇదిగో గొర్రెపిల్ల పెళ్ళి రోజు వచ్చేసింది \q2 ఆయన వధువు తనను తాను సిద్ధపరచుకుంది. \q1 \v 8 ఆమె ధరించడానికి ప్రకాశమైన శుద్ధమైన, \q2 సున్నితమైన నార వస్త్రాలు ఆమెకు ఇవ్వబడ్డాయి.” \m సన్నని నారబట్టలు అనగా దేవుని పరిశుద్ధ ప్రజలు చేసిన నీతి క్రియలు అని అర్థము. \b \p \v 9 ఆ తర్వాత దేవదూత నాతో, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం పొందినవారు ధన్యులు! ఇది వ్రాయి. ఇవి దేవుని సత్య వాక్కులు” అని చెప్పాడు. \p \v 10 అప్పుడు అతన్ని ఆరాధించడానికి నేను ఆ దేవదూత పాదాల ముందు సాగిలపడ్డాను. కాని అతడు నాతో, “వద్దు! ఇలా చేయకు! నేను ఇతర విశ్వాసుల వలె యేసు కోసం సాక్ష్యమిచ్చే నీలాంటి సేవకుడనే. దేవునినే పూజించు! ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం కలిగి ఉండడమే ప్రవచించే ఆత్మ” అని నాతో చెప్పాడు. \s1 పరలోక వీరుడు మృగాన్ని ఓడించుట \p \v 11 అప్పుడు పరలోకం తెరవబడి నా ముందు ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద స్వారీ చేసే వ్యక్తి నమ్మకమైన సత్యవంతుడు అని పిలువబడతాడు. ఆయన న్యాయమైన తీర్పును ఇస్తూ యుద్ధం చేస్తాడు. \v 12 ఆయన కళ్లు అగ్నిజ్వాలల్లా ఉంటాయి. ఆయన తలమీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది, అది ఆయనకు తప్ప మరి ఎవరికి తెలియదు. \v 13 రక్తంలో ముంచబడిన వస్త్రాలను ఆయన ధరించి ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యమని పేరు. \v 14 తెల్లని, పవిత్రమైన సన్నని నారబట్టలను ధరించి తెల్లని గుర్రాల మీద స్వారీ చేస్తున్న పరలోక సైన్యాలు ఆయనను వెంబడిస్తున్నాయి. \v 15 దేశాలను నరకడానికి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. “ఆయన ఒక ఇనుపదండంతో వారిని పరిపాలిస్తారు.\f + \fr 19:15 \fr*\ft \+xt కీర్తన 2:9\+xt*\ft*\f*” ఆయన సర్వశక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిని త్రొక్కుతారు. \v 16 ఆయన ధరించిన వస్త్రాల మీద ఆయన తొడ మీద ఈ పేరు వ్రాసి ఉంది: \pc \sc రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు.\sc* \p \v 17 అప్పుడు సూర్యుని మీద నిలబడిన ఒక దూతను నేను చూశాను, అతడు బిగ్గరగా మధ్య ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటినీ పిలుస్తూ వాటితో, “రండి! దేవుని గొప్ప విందుకు కలిసి రండి! \v 18 గుర్రాలు, రాజుల మాంసాన్ని, సైన్యాధికారుల మాంసాన్ని, బలవంతుల మాంసాన్ని, గుర్రాల, వాటి మీద స్వారీ చేసేవారి మాంసాన్ని, స్వతంత్రులు బానిసలు సామాన్యులు గొప్పవారితో సహా ప్రజలందరి మాంసాన్ని తినడానికి రండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు. \p \v 19 అప్పుడు నేను ఆ గుర్రం మీద స్వారీ చేసేవానితో ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి ఆ మృగం భూ రాజులు, వారి సైన్యాలతో కలిసి రావడం నేను చూశాను. \v 20 అయితే ఆ మృగం పట్టుబడింది, దాంతో పాటు దాని పక్షాన సూచకక్రియలు చేసిన అబద్ధ ప్రవక్త కూడా పట్టుబడ్డాడు. అతడు ఈ సూచకక్రియలతో మృగం యొక్క ముద్ర వేయబడి దాని విగ్రహాన్ని పూజించిన వారిని మోసగించాడు. వీరిద్దరు ప్రాణాలతో మండుతున్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడ్డారు. \v 21 మిగిలిన వారు ఆ గుర్రం మీద కూర్చుని స్వారీ చేస్తూ వస్తున్న వాని నోటి నుండి బయటకు వస్తున్న ఖడ్గంతో చంపబడ్డారు. అప్పుడు పక్షులన్నీ వారి మాంసాన్ని కడుపారా తిన్నాయి. \c 20 \s1 వెయ్యి సంవత్సరాలు \p \v 1 ఆ తర్వాత ఒక దేవదూత తన చేతిలో అగాధపు తాళపు చెవిని ఒక పెద్ద గొలుసును పట్టుకుని పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను. \v 2 ఆ దేవదూత ఆదిసర్పం అనే ఘటసర్పాన్ని అనగా అపవాది అనే సాతానుని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకు బంధించాడు. \v 3 ఆ దూత అతన్ని పాతాళంలో పడవేసి, అతడు వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యే వరకు దేశాలను ఎంత మాత్రం మోసం చేయకుండా ఉండడానికి దానికి తాళం వేసి ముద్ర వేశాడు. ఆ తర్వాత అతడు కొంతకాలం వరకు వదిలిపెట్టబడతాడు. \p \v 4 అప్పుడు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడినవారు కూర్చుని ఉన్న సింహాసనాలను నేను చూశాను. యేసును గురించి సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి తలలు నరికివేయబడి హతులైనవారి ఆత్మలను నేను చూశాను. వారు ఆ మృగాన్ని గాని వాని విగ్రహాన్ని గాని పూజించలేదు, వారు దాని ముద్రను తమ నుదుటి మీద గాని చేతి మీద గాని వేయించుకోలేదు. వారు బ్రతికివచ్చి క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు. \v 5 చనిపోయినవారిలో మిగిలినవారు ఈ వెయ్యి సంవత్సరాలు గడిచేవరకు మళ్ళీ బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. \v 6 మొదటి పునరుత్థానంలో పాలుపొందినవారు ధన్యులు పరిశుద్ధులు. రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు. అయితే వారు దేవునికి క్రీస్తుకు యాజకులుగా ఉంటూ ఆయనతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు. \s1 సాతానుకు తీర్పు \p \v 7 వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను చెరలో నుండి విడుదల చేయబడతాడు. \v 8 ఆ సాతాను భూమి నలుదిక్కుల ఉన్న దేశాలను గోగు మాగోగు అనే వారిని మోసపుచ్చి యుద్ధానికి సమకూర్చడానికి బయలుదేరి వెళ్తాడు. వారి సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా లెక్కకు మించి ఉంది. \v 9 వారు భూమి అంతటా ప్రయాణించి దేవుని ప్రజలు ఉన్నచోటును, ఆయన ప్రేమించిన పట్టణాన్ని ముట్టడిస్తారు. కానీ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. \v 10 అప్పుడు వారిని మోసగించిన సాతాను అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడతాడు. అక్కడే ఆ మృగం, అబద్ధ ప్రవక్త పడవేయబడ్డారు. అక్కడ వారు నిరంతరం రాత్రింబగళ్ళు వేధించబడతారు. \s1 మృతులకు తీర్పు \p \v 11 అప్పుడు నేను ఒక తెల్లని సింహాసనాన్ని దాని మీద కూర్చున్న ఒకరిని చూశాను. భూమి ఆకాశాలు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి వాటికి ఎక్కడ స్థలం లేదు. \v 12 ఆ తర్వాత దేవుని సింహాసనం ముందు సామాన్యులు గొప్పవారితో సహా చనిపోయిన వారందరూ నిలబడి ఉండడం నేను చూశాను. గ్రంథాలు తెరవబడ్డాయి. వాటిలో జీవగ్రంథం అనబడే మరొక గ్రంథం తెరవబడింది. జీవగ్రంథంలో వ్రాయబడిన ప్రకారం చనిపోయినవారు తాము చేసిన పనులను బట్టి తీర్పు తీర్చబడ్డారు. \v 13 సముద్రం దానిలో చనిపోయినవారిని అప్పగించింది. అలాగే మరణం పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. అప్పుడు ప్రతి ఒక్కరు తాము చేసిన పనుల ప్రకారం తీర్పు తీర్చబడ్డారు. \v 14 అప్పుడు మరణం పాతాళం అగ్నిగుండంలో పడవేయబడ్డాయి. ఈ అగ్నిగుండమే రెండవ మరణము. \v 15 జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడనివారిని ఈ అగ్నిసరస్సులో పడవేశారు. \c 21 \s1 క్రొత్త భూమి క్రొత్త ఆకాశం \p \v 1 అప్పుడు నేను “క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని”\f + \fr 21:1 \fr*\ft \+xt యెషయా 65:17\+xt*\ft*\f* చూశాను. మొదట ఉన్న ఆకాశం, భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేకపోయింది. \v 2 అప్పుడు తన భర్త కోసం అలంకరించుకొని సిద్ధపడిన ఒక వధువులా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలో దేవుని దగ్గర నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను. \v 3 అప్పుడు దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, “ఇదిగో, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యుల మధ్యలో ఉంది, ఆయన వారితో నివసిస్తారు. అప్పుడు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారికి దేవుడై ఉంటారు. \v 4 ‘ఆయన వారి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు. మొదటి సంగతులు గతించి పోయాయి కాబట్టి అక్కడ చావు\f + \fr 21:4 \fr*\ft \+xt యెషయా 25:8\+xt*\ft*\f* ఉండదు, దుఃఖం గాని ఏడ్పు గాని బాధ గాని ఎన్నడూ ఉండదు’ ” అని చెప్తుంటే నేను విన్నాను. \p \v 5 అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవుడు, “ఇదిగో, సమస్తాన్ని నూతనపరుస్తున్నాను” అని చెప్పి, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి కాబట్టి వీటిని వ్రాసి పెట్టు” అన్నారు. \p \v 6 ఆయన నాతో, “సమాప్తమైనది. అల్ఫా ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. \v 7 జయించేవారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు. \v 8 అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు. \s1 నూతన యెరూషలేము, గొర్రెపిల్ల వధువు \p \v 9 చివరి ఏడు తెగుళ్ళు నిండి ఉన్న ఏడు పాత్రలను పట్టుకున్న ఏడు దేవదూతలలోని ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి నాతో, “ఇటురా! నేను పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లకు కాబోయే భార్యను నీకు చూపిస్తాను” అని చెప్పాడు. \v 10 అప్పుడు ఆ దేవదూత ఆత్మలో నన్ను ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీదికి తీసుకెళ్లి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి క్రిందకు దిగి రావడం చూపించాడు. \v 11 అది దేవుని మహిమతో సూర్యకాంతం అనే బహు అమూల్యమైన రత్నపు తేజస్సు కలిగి స్ఫటికంలా మెరుస్తుంది. \v 12 ఆ పట్టణానికి గొప్ప ఎత్తైన గోడ ఉన్నది, దానికి పన్నెండు ద్వారాలు, ఆ ద్వారాల దగ్గర పన్నెండుమంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాసి ఉన్నాయి. \v 13 మూడు ద్వారాలు తూర్పున, మూడు ద్వారాలు ఉత్తరాన, మూడు ద్వారాలు దక్షిణాన, మూడు ద్వారాలు పశ్చిమాన ఉన్నాయి. \v 14 పట్టణపు గోడకు పన్నెండు పునాదులు ఉన్నాయి, వాటి మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండుమంది అపొస్తలుల పేర్లు ఉన్నాయి. \p \v 15 నాతో మాట్లాడిన ఆ దేవదూత చేతిలో ఆ పట్టణాన్ని, దాని ద్వారాలను దాని గోడలను కొలవడానికి ఒక బంగారు కొలిచే కర్ర ఉంది. \v 16 ఆ పట్టణం చదరపు ఆకారంలో ఉంది, దాని పొడవు, వెడల్పు కొలతలు సమానంగా ఉన్నాయి. ఆ కొలిచే కర్రతో పట్టణం కొలిచినప్పుడు అది 12,000 స్టాడియాల\f + \fr 21:16 \fr*\ft అంటే, సుమారు 2,200 కిలోమీటర్లు\ft*\f* పొడవు ఉంది; దాని వెడల్పు, ఎత్తు సమానంగా ఉన్నాయి. \v 17 అతడు దాని గోడలను కొలిచినప్పుడు మనుష్యుల కొలత ప్రకారం అది 144 మూరల\f + \fr 21:17 \fr*\ft అంటే, సుమారు 65 మీటర్లు\ft*\f* మందం ఉంది. \v 18 ఆ గోడ సూర్యకాంత మణులతో కట్టబడింది. ఆ పట్టణం స్వచ్ఛమైన బంగారంతో చేయబడి గాజులా స్వచ్ఛంగా ఉంది. \v 19 ఆ పట్టణపు గోడ పునాదులు అమూల్యమైన వివిధ రత్నాలతో అలంకరించబడ్డాయి. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, \v 20 అయిదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణల శునీయం, పదకొండవది పద్మరాగం, పన్నెండవది కురువింద మణి. \v 21 పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు, ప్రతి ద్వారం ఒక ముత్యంతో చేయబడింది. ఆ పట్టణపు ప్రధాన వీధి బంగారంతో చేయబడి, గాజులా స్వచ్ఛంగా ఉంది. \p \v 22 ఆ పట్టణంలో ఏ దేవాలయం నాకు కనిపించలేదు ఎందుకంటే సర్వశక్తిగల ప్రభువైన దేవుడును గొర్రెపిల్ల ఆ పట్టణానికి దేవాలయంగా ఉన్నారు. \v 23 ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము. \v 24 ప్రజలు దాని వెలుగులో నడుస్తారు, ఇంకా భూ రాజులు తమ వైభవాన్ని దానిలోనికి తెస్తారు. \v 25 ఏ రోజు దాని ద్వారాలు మూయబడవు ఎందుకంటే అక్కడ రాత్రి ఉండదు. \v 26 దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి. \v 27 గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడినవారు మాత్రమే ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. అపవిత్రమైనవి అసహ్యకరమైనవి మోసకరమైనవి చేసేవారెవరు దానిలోనికి ఎన్నడూ ప్రవేశించరు. \c 22 \s1 ఏదెను వనం పునరుద్ధరించబడుట \p \v 1 అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన స్ఫటికం లాంటి జీవజలనది నాకు చూపించాడు. \v 2 ఆ నది ఆ పట్టణపు ప్రధాన వీధి మధ్యన ప్రవహిస్తుంది. ఆ నదికి ఇరువైపుల జీవవృక్షం ఉంది. అది ప్రతి నెల ఫలాన్ని ఇస్తూ పన్నెండు పంటలను ఇస్తుంది. ఇంకా ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉన్నాయి. \v 3 అక్కడ ఏ శాపం ఉండదు. దేవుని గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఆ పట్టణంలో ఉంటాయి. ఆయన సేవకులు ఆయనను సేవిస్తుంటారు. \v 4 వారు ఆయన ముఖాన్ని చూస్తారు, వారి నుదుటి మీద ఆయన పేరు ఉంటుంది. \v 5 అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు. \s1 యోహాను దేవదూత \p \v 6 అప్పుడు ఆ దేవదూత నాతో, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలను ప్రేరేపించే ప్రభువైన దేవుడు తన సేవకులకు త్వరలో జరుగబోయే సంగతులను చూపించడానికి తన దూతను పంపారు” అని చెప్పాడు. \b \p \v 7 “ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపుచుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!” \b \p \v 8 యోహాను అనే నేను ఈ సంగతులను విని చూశాను. నేను వాటిని విని చూసినప్పుడు, నాకు వాటిని చూపిస్తున్న దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు సాష్టాంగపడ్డాను. \v 9 కాని అతడు నాతో, “నీవు అలా చేయవద్దు! ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన మాటలను పాటించేవారిలా, నీ తోటి ప్రవక్తల్లా నేను కూడా నీ తోటి సేవకుడనే. కాబట్టి దేవున్నే ఆరాధించు!” అని చెప్పాడు. \p \v 10 తర్వాత అతడు నాతో, “ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను ముద్ర వేయకు ఎందుకంటే సమయం సమీపంగా ఉంది. \v 11 అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు. \b \s1 చివరి మాటలు: ఆహ్వానం, హెచ్చరిక \p \v 12 “ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను! ప్రతివారికి వారు చేసిన పనుల చొప్పున వారికి ఇవ్వడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది. \v 13 అల్ఫా ఒమేగాను నేనే, మొదటివాడను చివరివాడను నేనే, ఆది అంతం నేనే! \b \p \v 14 “జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు. \v 15 అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు. \b \p \v 16 “యేసు అనే నేను సంఘాల కోసమైన ఈ సాక్ష్యం మీకు ఇవ్వమని నా దూతను పంపాను. నేను దావీదు వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ చుక్కను.” \b \p \v 17 “రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి. \b \p \v 18 ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను వినే ప్రతిఒక్కరికి నేను ఖచ్చితంగా హెచ్చరించేది ఏమంటే: ఎవరైనా ఈ ప్రవచనాలకు దేనినైనా కలిపితే ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన తెగుళ్ళను దేవుడు వానిపైకి రప్పిస్తారు. \v 19 అలాగే ఈ గ్రంథపుచుట్టలో ప్రవచనం నుండి ఏ మాటలనైనా తీసివేస్తే దేవుడు వానికి ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన పరిశుద్ధ పట్టణంలోని జీవవృక్ష ఫలంలో ఏ భాగం లేకుండా చేస్తారు. \b \p \v 20 ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. \p ఆమేన్! రండి, ప్రభువైన యేసు! \b \p \v 21 ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలతో ఉండును గాక ఆమేన్.