\id PSA - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h కీర్తనలు \toc1 కీర్తనల గ్రంథం \toc2 కీర్తనలు \toc3 కీర్తన \mt1 కీర్తనల \mt2 గ్రంథం \c 1 \ms మొదటి గ్రంథము \mr కీర్తనలు 1–41 \cl కీర్తన 1 \q1 \v 1 దుష్టుల సలహాను పాటించక \q2 పాపులు కోరుకునే మార్గంలో నిలబడక \q1 ఎగతాళి చేసేవారి \q2 గుంపుతో కూర్చోక, \q1 \v 2 యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, \q2 రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు. \q1 \v 3 వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, \q2 ఆకులు వాడిపోకుండ, \q1 సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు \q2 వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు. \b \q1 \v 4 అయితే దుష్టులు అలా ఉండరు! \q2 వారు గాలికి కొట్టుకుపోయే \q2 పొట్టులా ఉంటారు. \q1 \v 5 కాబట్టి న్యాయతీర్పులో దుష్టులు, \q2 నీతిమంతుల సభలో పాపులు నిలబడరు. \b \q1 \v 6 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, \q2 దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది. \c 2 \cl కీర్తన 2 \q1 \v 1 దేశాలు ఎందుకు కుట్ర\f + \fr 2:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కోపం\fqa*\f* చేస్తున్నాయి? \q2 ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు? \q1 \v 2 యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా \q2 భూరాజులు లేచి \q2 పాలకులందరు ఒకటిగా చేరి, \q1 \v 3 “మనం వారి గొలుసులను తెంపుదాం \q2 వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు. \b \q1 \v 4 ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; \q2 ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు. \q1 \v 5 ఆయన కోపంతో వారిని గద్దించి \q2 తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు, \q1 \v 6 “నా పవిత్ర పర్వతమైన సీయోనును\f + \fr 2:6 \fr*\ft లేదా \ft*\fqa యెరూషలేము\fqa*\f* \q2 నా రాజు ఏలుతున్నారు.” \p \v 7 నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: \q1 ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; \q2 ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను. \q1 \v 8 నన్ను అడిగితే, \q2 నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, \q2 భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను. \q1 \v 9 ఇనుపదండంతో\f + \fr 2:9 \fr*\ft లేదా \ft*\fqa ఇనుపదండంతో వారిని పరిపాలిస్తావు\fqa*\f* నీవు వారిని నలగ్గొడతావు; \q2 పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.” \b \q1 \v 10 కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; \q2 భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి. \q1 \v 11 యెహోవాను భయంతో సేవించండి \q2 వణుకుతూ ఆనందించండి. \q1 \v 12 ఆయన కుమారున్ని ముద్దాడండి, \q2 లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. \q2 మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, \q1 ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. \q2 ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. \c 3 \cl కీర్తన 3 \d దావీదు కీర్తన. తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు వ్రాసినది. \q1 \v 1 యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! \q2 నామీదికి ఎంతోమంది లేస్తారు! \q1 \v 2 “దేవుడు అతన్ని విడిపించడు” \q2 అని అనేకులు నా గురించి చెప్తున్నారు. \qs సెలా\qs*\f + \fr 3:2 \fr*\fq సెలా \fq*\ft హెబ్రీ భాషలో ఈ పదానికి స్పష్టమైన అర్థం లేదు. ఈ పదం కీర్తనలో తరచుగా వస్తుంది: ఇది సంగీతానికి సంబంధించిన పదం అయి ఉండవచ్చు. \+xt కీర్తన 3:4; కీర్తన 3:8\+xt* \ft*\ft లో కూడా\ft*\f* \b \q1 \v 3 కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, \q2 నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు. \q1 \v 4 నేను యెహోవాకు మొరపెడతాను, \q2 ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. \qs సెలా\qs* \b \q1 \v 5 నేను పడుకుని నిద్రపోతాను; \q2 యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను. \q1 \v 6 అన్ని వైపుల నుండి \q2 పదివేలమంది నాపై పడినా నేను భయపడను. \b \q1 \v 7 యెహోవా, లెండి! \q2 నా దేవా, నన్ను విడిపించండి! \q1 నా శత్రువులందరిని దవడపై కొట్టండి; \q2 దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి. \b \q1 \v 8 రక్షణ యెహోవా నుండి వస్తుంది. \q2 మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. \qs సెలా\qs* \c 4 \cl కీర్తన 4 \d సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. \q1 \v 1 నీతిమంతుడవైన నా దేవా, \q2 నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి\f + \fr 4:1 \fr*\ft సంభోదన విభక్తి\ft*\f*. \q1 నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి; \q2 నాపై దయచూపి నా ప్రార్థన వినండి. \b \q1 \v 2 ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? \q2 మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను\f + \fr 4:2 \fr*\ft లేదా \ft*\fqa తప్పుడు దేవుళ్ళను వెదుకుతారు\fqa*\f* అనుసరిస్తారు? \qs సెలా\qs* \q1 \v 3 యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి; \q2 నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు. \b \q1 \v 4 వణకండి,\f + \fr 4:4 \fr*\ft లేదా \ft*\fqa మీ కోపంలో\fqa*\f* పాపం చేయకండి. \q2 మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ \q2 ప్రశాంతంగా ఉండండి. \qs సెలా\qs* \q1 \v 5 నీతియుక్తమైన బలులను అర్పించి \q2 యెహోవాపై నమ్మకముంచండి. \b \q1 \v 6 యెహోవా, “మాకు అభివృద్ధి ఎవరు తెస్తారు?” \q2 అని అనేకులు అడుగుతున్నారు \q2 మీ ముఖకాంతిని మామీద ప్రకాశించనీయండి. \q1 \v 7 ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నా \q2 ఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు. \b \q1 \v 8 నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను. \q2 ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే \q2 నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు. \c 5 \cl కీర్తన 5 \d సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నా మాటలు ఆలకించండి, \q2 నా నిట్టూర్పు గురించి ఆలోచించండి. \q1 \v 2 నా రాజా నా దేవా, \q2 సాయం కోసం నేను చేసే మొరను వినండి, \q2 మీకే నేను ప్రార్థిస్తున్నాను. \b \q1 \v 3 యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు; \q2 ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి \q2 ఆశతో వేచి ఉంటాను. \q1 \v 4 మీరు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కారు; \q2 చెడు చేసేవారికి మీ దగ్గర చోటు లేదు. \q1 \v 5 అహంకారులు మీ సన్నిధిలో నిలువలేరు; \q2 చెడు చేసేవారందరిని \q1 మీరు ద్వేషిస్తారు, అబద్ధాలాడే వారిని \q2 \v 6 మీరు నాశనం చేస్తారు. \q1 రక్తపిపాసులను మోసగాండ్రను, \q2 యెహోవా అసహ్యించుకుంటారు. \q1 \v 7 కాని నేనైతే మీ మారని ప్రేమను బట్టి \q2 మీ మందిరంలోనికి రాగలను; \q1 మీ పరిశుద్ధాలయం వైపు తిరిగి \q2 నేను భక్తితో నమస్కరిస్తాను. \b \q1 \v 8 యెహోవా, నా శత్రువులను బట్టి \q2 మీ నీతిలో నన్ను నడిపించండి. \q2 మీ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి. \q1 \v 9 వారి నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా నమ్మదగినది కాదు. \q2 వారి హృదయం అసూయతో నిండి ఉంది. \q1 వారి గొంతు తెరిచిన సమాధి; \q2 వారు నాలుకలతో అబద్ధాలు చెప్తారు.\f + \fr 5:9 \fr*\ft \+xt రోమా 3:13\+xt*\ft*\f* \q1 \v 10 ఓ దేవా! వారిని దోషులుగా ప్రకటించండి, \q2 వారి పన్నాగాలే వారి పతనానికి కారణం అవ్వాలి. \q1 వారు చేసిన అనేక పాపాలను బట్టి వారిని వెళ్లగొట్టండి, \q2 వారు మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. \q1 \v 11 అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు; \q2 వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు. \q1 మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా, \q2 మీరు వారిని కాపాడండి. \b \q1 \v 12 యెహోవా, నీతిమంతులను మీరు తప్పక దీవిస్తారు; \q2 డాలుతో కప్పినట్లు మీరు వారిని దయతో కప్పుతారు. \c 6 \cl కీర్తన 6 \d సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది.బహుశ షమినీతు\f + \fr 6 \fr*\fq షమినీతు: \fq*\ft బహుశ సంగీత పదం కావచ్చు\ft*\f* ఎనిమిది తంతుల వాయిద్యం కావచ్చు.దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి \q2 మీ ఉగ్రతలో నన్ను శిక్షించకండి. \q1 \v 2 యెహోవా, నేను బలహీనుడను, నాపై దయ చూపండి; \q2 యెహోవా, నా ఎముకలు వేదనలో ఉన్నాయి, నన్ను బాగుచేయండి. \q1 \v 3 నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది. \q2 ఎంతకాలం, యెహోవా, ఇంకెంత కాలం? \b \q1 \v 4 యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి; \q2 మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి. \q1 \v 5 మృతులు ఉండే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు \q2 సమాధి నుండి ఎవరు మీకు స్తుతులు చెల్లిస్తారు? \b \q1 \v 6 మూలుగుతూ నేను అలిసిపోయాను. \b \q1 రాత్రంతా నేను కార్చిన కన్నీటిలో నా పరుపు తడిసిపోతుంది \q2 కన్నీటిలో నా మంచం మునిగిపోతుంది. \q1 \v 7 విచారంతో నా కళ్లు మసకబారుతున్నాయి. \q2 నా శత్రువులందరిని బట్టి అవి క్షీణిస్తున్నాయి. \b \q1 \v 8 యెహోవా నా మొర ఆలకించారు, \q2 కాబట్టి చెడు చేసేవారలారా, నా నుండి దూరంగా వెళ్లండి. \q1 \v 9 కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; \q2 యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు. \q1 \v 10 నా శత్రువులందరు సిగ్గుపడి అధిక వేదన పొందుతారు; \q2 వారు హఠాత్తుగా సిగ్గుపడి వెనుదిరుగుతారు. \c 7 \cl కీర్తన 7 \d దావీదు వీణతో పాడిన కీర్తన. బెన్యామీనీయుడైన కూషు విషయంలో దావీదు యెహోవాకు పాడిన కీర్తన. \q1 \v 1 యెహోవా నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను; \q2 నన్ను వెంటాడే వారందరి నుండి నన్ను రక్షించి విడిపించండి, \q1 \v 2 లేకపోతే వారు సింహంలా చీల్చివేస్తారు \q2 ఎవరు విడిపించలేనంతగా నన్ను ముక్కలు చేస్తారు. \b \q1 \v 3 యెహోవా నా దేవా, ఒకవేళ నేను \q2 అన్యాయమైన చర్యలకు పాల్పడితే \q1 \v 4 నాతో సమాధానంగా ఉన్నవానికి కీడు చేస్తే \q2 కారణం లేకుండ నా శత్రువును నేను దోచుకుంటే \q1 \v 5 అప్పుడు నా శత్రువు నన్ను వెంటాడి పట్టుకొనును గాక; \q2 నా ప్రాణాన్ని నేల మీద అణగద్రొక్కి \q2 నా ప్రతిష్ఠను మట్టిపాలు చేయును గాక. \qs సెలా\qs* \b \q1 \v 6 యెహోవా, కోపంతో లేవండి; \q2 నా శత్రువుల ఆగ్రహానికి వ్యతిరేకంగా లేవండి. \q2 నా దేవా, మేల్కొనండి; న్యాయాన్ని శాసించండి. \q1 \v 7 మీరు వారికి పైగా ఉన్నత సింహాసనంపై ఆసీనులై ఉండగా, \q2 ఆయా జాతుల ప్రజలు మీ చుట్టూ గుమికూడనివ్వండి. \q2 \v 8 యెహోవా జనులకు తీర్పు తీర్చును గాక. \q1 యెహోవా, నా నీతిని బట్టి, ఓ మహోన్నతుడా, \q2 నా యథార్థతను బట్టి నాకు శిక్షావిముక్తి చేయండి. \q1 \v 9 మనస్సులను హృదయాలను పరిశీలించే, \q2 నీతిమంతుడవైన దేవా, \q1 దుష్టుల దుర్మార్గాన్ని అంతం చేసి, \q2 నీతిమంతులను భద్రపరచండి. \b \q1 \v 10 యథార్థ హృదయులను కాపాడే \q2 సర్వోన్నతుడైన దేవుడే నాకు డాలు.\f + \fr 7:10 \fr*\ft లేదా \ft*\fqa ప్రభువు\fqa*\f* \q1 \v 11 దేవుడు నీతిగల న్యాయమూర్తి, \q2 ఆయన దుష్టులపై ప్రతిరోజు తన ఉగ్రతను చూపిస్తారు. \q1 \v 12 ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపపడకపోతే, \q2 దేవుడు\f + \fr 7:12 \fr*\ft ప్రా.ప్ర.లలో \ft*\fqa ఆయన\fqa*\f* తన ఖడ్గాన్ని పదునుపెడతారు; \q2 ఆయన తన విల్లు ఎక్కుపెట్టి బాణం సిద్ధపరుస్తారు. \q1 \v 13 ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; \q2 ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు. \b \q1 \v 14 దుష్టులు చెడును గర్భం దాలుస్తారు, \q2 కీడును గర్భంలో మోసి అబద్ధాలకు జన్మనిస్తారు. \q1 \v 15 ఇతరుల కోసం గుంటను త్రవ్వుతారు \q2 తాము త్రవ్విన గుంటలో వారే పడతారు. \q1 \v 16 వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది; \q2 వారు చేసిన హింస వారి తల మీదికే వస్తుంది. \b \q1 \v 17 యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; \q2 మహోన్నతుడైన యెహోవా నామానికి నేను స్తుతులు పాడతాను. \c 8 \cl కీర్తన 8 \d సంగీత దర్శకునికి. గిత్తీతు రాగములో పాడదగినది. దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, మా ప్రభువా, \q2 భూలోకమంతట మీ నామం ఎంతో ప్రభావవంతమైనది! \b \q1 మీరు ఆకాశాల్లో \q2 మీ మహిమను ఉంచారు. \q1 \v 2 చిన్నపిల్లల చంటిబిడ్డల స్తుతుల ద్వారా, \q2 మీ శత్రువుల పగవారి నోరు మూయించడానికి \q2 మీ శత్రువులకు వ్యతిరేకంగా మీరు బలమైన కోటను స్థాపించారు. \q1 \v 3 మీ చేతి పనియైన \q2 మీ ఆకాశాలను, \q1 మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన \q2 చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు, \q1 \v 4 మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు? \q2 మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు? \b \q1 \v 5 మీరు వారిని\f + \fr 8:5 \fr*\ft లేదా \ft*\fqa అతన్ని\fqa*\f* దేవదూతల\f + \fr 8:5 \fr*\ft లేదా \ft*\fqa దేవుని\fqa*\f* కంటే కొంచెం తక్కువగా చేశారు, \q2 మహిమ ఘనతను వారికి\f + \cat dup\cat*\fr 8:5 \fr*\ft లేదా \ft*\fqa అతనికి\fqa*\f* కిరీటంగా పెట్టారు. \q1 \v 6 మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; \q2 మీరు సమస్తాన్ని అనగా: \q1 \v 7-8 గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, \q2 అడవి జంతువులను, \q1 ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, \q2 సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను \q2 వారి పాదాల క్రింద ఉంచారు. \b \q1 \v 9 యెహోవా, మా ప్రభువా, \q2 భూమి అంతట మీ నామం ఎంతో ఘనమైనది! \c 9 \cl కీర్తన 9\f + \fr 9 \fr*\ft 9 10 కీర్తనలు మొదట ఒకే అక్రోస్టిక్ పద్యం అయి ఉండవచ్చు, దీనిలో హెబ్రీ అక్షరాల యొక్క వరుస అక్షరాలతో ప్రత్యామ్నాయ పంక్తులు ప్రారంభమయ్యాయి. సెప్టూజంట్ లో ఇవి రెండు ఒకే కీర్తనగా ఉన్నాయి.\ft*\f* \d సంగీత దర్శకునికి. “కుమారుని మరణం” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నేను నా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తాను; \q2 మీ అద్భుతమైన క్రియల గురించి నేను చెప్తాను. \q1 \v 2 మీలో నేను ఆనందించి సంతోషిస్తాను; \q2 ఓ మహోన్నతుడా, మీ నామాన్ని బట్టి నేను స్తుతులు పాడతాను. \b \q1 \v 3 నా శత్రువులు వెనుకకు తిరుగుతారు; \q2 మీ ముందు వారు తడబడి నశిస్తారు. \q1 \v 4 నీతిమంతుడవైన న్యాయమూర్తిగా సింహాసనంపై కూర్చుని, \q2 నా పక్షంగా న్యాయం తీర్చుతున్నారు. \q1 \v 5 మీరు దేశాలను మందలించి దుష్టులను నిర్మూలం చేశారు; \q2 మీరు వారి పేరును ఎప్పటికీ లేకుండ తుడిచివేశారు. \q1 \v 6 అంతులేని పతనం నా శత్రువులు పతనమై పూర్తిగా నశిస్తారు, \q2 మీరు వారి పట్టణాలను పెల్లగించారు; \q2 వాటి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది. \b \q1 \v 7 యెహోవా నిరంతరం పరిపాలిస్తారు; \q2 తీర్పు కోసం ఆయన తన సింహాసనాన్ని స్థాపించారు. \q1 \v 8 ఆయన నీతితో లోకాన్ని పరిపాలిస్తారు \q2 ఆయన దేశాలను న్యాయంగా తీర్పు తీరుస్తారు. \q1 \v 9 అణచివేయబడిన వారికి యెహోవా ఆశ్రయం, \q2 కష్ట సమయాల్లో బలమైన కోట. \q1 \v 10 మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, \q2 ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు. \b \q1 \v 11 సీయోనులో సింహాసనాసీనుడైయున్న యెహోవాను గురించి స్తుతులు పాడండి; \q2 దేశాల మధ్య ఆయన చేసిన వాటిని ప్రకటించండి. \q1 \v 12 ఎందుకంటే రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు జ్ఞాపకముంచుకుంటాడు; \q2 బాధితుల మొరను ఆయన విస్మరించరు. \b \q1 \v 13 యెహోవా, నా శత్రువులు నన్ను ఎలా హింసించారో చూడండి! \q2 నన్ను కరుణించి మరణ ద్వారాల నుండి నన్ను తప్పించండి, \q1 \v 14 తద్వార నేను మీ స్తుతులను \q2 సీయోను కుమారీ ద్వారాల దగ్గర ప్రకటిస్తాను, \q2 మీ రక్షణలో నేనానందిస్తాను. \b \q1 \v 15 తాము త్రవ్విన గోతిలోనే దేశాలు పడిపోయాయి; \q2 తాము పన్నిన వలలోనే వారి పాదాలు చిక్కుకున్నాయి. \q1 \v 16 తన న్యాయమైన క్రియల ద్వార యెహోవా బయలుపరచబడతారు; \q2 దుష్టులు తాము చేసిన దానిలోనే చిక్కుకుంటారు.\f + \fr 9:16 \fr*\ft ఈ పదానికి అర్థం అనిశ్చితం\ft*\f* \qs సెలా\qs* \q1 \v 17 దుష్టులు పాతాళంలో పడిపోతారు, \q2 దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే. \q1 \v 18 కాని అవసరతలో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ మరచిపోరు; \q2 బాధితుల నిరీక్షణ ఎప్పటికీ నశించదు. \b \q1 \v 19 యెహోవా, లెండి, మనుష్యులను గెలువనీయకండి; \q2 మీ సమక్షంలో రాజ్యాలకు తీర్పు తీర్చండి. \q1 \v 20 యెహోవా, వారిని భయభ్రాంతులకు గురి చేయండి; \q2 తాము కేవలం మానవమాత్రులే అని దేశాలను తెలుసుకోనివ్వండి. \qs సెలా\qs* \c 10 \cl కీర్తన 10\f + \fr 10 \fr*\ft 9 10 కీర్తనలు మొదట ఒకే అక్రోస్టిక్ పద్యం అయి ఉండవచ్చు, దీనిలో హెబ్రీ అక్షరాల యొక్క వరుస అక్షరాలతో ప్రత్యామ్నాయ పంక్తులు ప్రారంభమయ్యాయి. సెప్టూజంట్ లో ఇవి రెండు ఒకే కీర్తనగా ఉన్నాయి.\ft*\f* \q1 \v 1 యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు? \q2 నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు? \b \q1 \v 2 దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు, \q2 వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు. \q1 \v 3 వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు; \q2 వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు. \q1 \v 4 దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు; \q2 వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు. \q1 \v 5 వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి; \q2 వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు; \q2 వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు. \q1 \v 6 “ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు” \q2 అని వారు తమలో తాము అనుకుంటారు. \b \q1 \v 7 వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి; \q2 ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి. \q1 \v 8 వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు; \q2 చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు. \q1 నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి; \q2 \v 9 గుహలో సింహంలా వారు వేచి ఉంటారు. \q1 నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు; \q2 వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు. \q1 \v 10 బాధితులు నలిగి కుప్పకూలిపోతారు; \q2 వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు. \q1 \v 11 “దేవుడు ఎప్పటికీ గమనించరు; \q2 ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు” \q2 అని వారు తమలో తాము అనుకుంటారు. \b \q1 \v 12 యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి. \q2 నిస్సహాయులను మరువకండి. \q1 \v 13 దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు? \q2 “దేవుడు నన్ను లెక్క అడగరు” \q2 అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు? \q1 \v 14 దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు; \q2 వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు. \q1 నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు; \q2 తండ్రిలేనివారికి మీరే సహాయకులు. \q1 \v 15 దుష్టుల చేతిని విరగ్గొట్టండి. \q2 కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండి \q2 ఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి. \b \q1 \v 16 యెహోవా నిరంతరం రాజై ఉన్నారు; \q2 దేశాల ప్రజలు ఆయన భూభాగంలో నుండి నశిస్తారు. \q1 \v 17 యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు; \q2 మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు. \q1 \v 18 తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు, \q2 అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు. \c 11 \cl కీర్తన 11 \d సంగీత దర్శకునికి.దావీదు కీర్తన. \q1 \v 1 నేను యెహోవాను ఆశ్రయించాను. \q2 “పక్షిలా మీ కొండ మీదికి పారిపో. \q1 \v 2 దుష్టులు తమ విల్లును ఎక్కుపెట్టారు, \q2 చీకటిలో పొంచి ఉండి \q1 యథార్థ హృదయుల పైకి వేయడానికి \q2 బాణాలు సిద్ధం చేస్తున్నారు. \q1 \v 3 పునాదులు నాశనమై పోతుంటే, \q2 నీతిమంతులు ఏం చేయగలరు?” \q2 అని నాతో మీరెలా అంటారు? \b \q1 \v 4 యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; \q2 యెహోవా తన పరలోక సింహాసనంపై ఆసీనులై ఉన్నారు; \q1 ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నారు; \q2 ఆయన కళ్లు వారిని పరీక్షిస్తున్నాయి. \q1 \v 5 యెహోవా నీతిమంతులను పరీక్షిస్తారు, \q2 కాని దుష్టులను, దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని \q2 ఆయన అసహ్యించుకుంటారు. \q1 \v 6 దుష్టుల మీద ఆయన \q2 నిప్పు కణాలు అగ్ని గంధకం కురిపిస్తారు; \q2 వడగాలి వారి భాగం అవుతుంది. \b \q1 \v 7 యెహోవా నీతిమంతుడు, \q2 ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు; \q2 యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు. \c 12 \cl కీర్తన 12 \d సంగీత దర్శకునికి. షెమినీతు\f + \fr 12 \fr*\fq షెమినీతు \fq*\ft బహుశ సంగీత పదం కావచ్చు\ft*\f* వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, సహాయం చేయండి, ఎందుకంటే ఒక్కరైన నమ్మకమైనవారు లేరు; \q2 నమ్మకమైనవారు మనుష్యజాతి నుండి గతించిపోయారు. \q1 \v 2 ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు; \q2 వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకుని \q2 తమ పెదవులతో పొగడుతారు. \b \q1 \v 3 పొగిడే ప్రతి పెదవిని \q2 గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక. \q1 \v 4 “మా నాలుకలతో మేము గెలుస్తాం; \q2 మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?” \q2 అని వారంటారు. \b \q1 \v 5 “దీనులు దోపిడికి గురవుతున్నారు, \q2 అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, \q1 నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” \q2 అని యెహోవా అంటున్నారు. \q1 \v 6 యెహోవా మాటలు నిర్దోషమైనవి, \q2 అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి, \q2 ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి. \b \q1 \v 7 యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారు \q2 ఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు, \q1 \v 8 మానవులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు, \q2 దుష్టులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. \c 13 \cl కీర్తన 13 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతారు? \q2 ఎంతకాలం మీ ముఖాన్ని నా నుండి దాచిపెడతారు? \q1 \v 2 ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి? \q2 ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి? \q2 ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు? \b \q1 \v 3 యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి, \q2 నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను. \q1 \v 4 “మేము అతన్ని ఓడించాము” అని నా శత్రువులు చెప్పుకోనివ్వకండి, \q2 నేను పడిపోయినప్పుడు నా శత్రువులను ఆనందించనివ్వకండి. \b \q1 \v 5 అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను; \q2 మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది. \q1 \v 6 యెహోవా నా మీద దయ చూపారు, \q2 కాబట్టి నేను ఆయనకు స్తుతి పాడతాను. \c 14 \cl కీర్తన 14 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 “దేవుడు లేడు” \q2 అని మూర్ఖులు\f + \fr 14:1 \fr*\ft నైతికంగా లోపం ఉన్నవారు\ft*\f* తమ హృదయంలో అనుకుంటారు. \q1 వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి; \q2 మంచి చేసేవారు ఒక్కరు లేరు. \b \q1 \v 2 వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా \q2 అని యెహోవా పరలోకం నుండి \q2 మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు. \q1 \v 3 అందరు దారి తప్పి చెడిపోయారు; \q2 మంచి చేసేవారు ఎవరూ లేరు. \q2 ఒక్కరు కూడా లేరు. \b \q1 \v 4 కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? \b \q1 వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; \q2 వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు. \q1 \v 5 వారు అక్కడ, భయంతో మునిగిపోయి ఉన్నారు, \q2 ఎందుకంటే దేవుడు నీతిమంతుల గుంపులో ఉన్నారు. \q1 \v 6 కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు, \q2 కాని యెహోవా వారి ఆశ్రయము. \b \q1 \v 7 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది; \q2 యెహోవా తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, \q2 యాకోబు సంతోషించును గాక ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక! \c 15 \cl కీర్తన 15 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు? \q2 మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు? \b \q1 \v 2 నిందారహితంగా నడుచుకొనేవారు, \q2 నీతిని జరిగించేవారు, \q2 తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు; \q1 \v 3 తమ నాలుకతో అపవాదులు వేయనివారు, \q2 పొరుగువారికి కీడు చేయనివారు, \q2 స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు; \q1 \v 4 నీచులను అసహ్యించుకుని \q2 యెహోవాకు భయపడేవారిని గౌరవించేవారు; \q1 తమకు బాధ కలిగినా తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేవారు, \q2 తమ మనస్సు మార్చుకొననివారు; \q1 \v 5 వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు; \q2 నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు. \b \q1 వీటిని చేసేవారు \q2 ఎన్నటికి కదిలించబడరు. \c 16 \cl కీర్తన 16 \d దావీదు శ్రేష్ఠమైన\f + \fr 16 \fr*\ft బహుశ సంగీత పదం కావచ్చు\ft*\f* కీర్తన. \q1 \v 1 నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, \q2 నన్ను కాపాడండి. \b \q1 \v 2 యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు; \q2 మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను. \q1 \v 3 భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను, \q2 “వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.” \q1 \v 4 వేరే దేవుళ్ళ వెంటపడేవారికి కష్టాలు ఎక్కువవుతాయి. \q2 వారి రక్తార్పణలలో నేను పాల్గొనను \q2 నా పెదవులతో వారి పేర్లు కూడా పలకను. \b \q1 \v 5 యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర. \q2 మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు. \q1 \v 6 మనోహరమైన స్థలాల్లో నా కోసం హద్దులు గీసి ఉన్నాయి; \q2 ఖచ్చితంగా నాకు ఆనందకరమైన వారసత్వం ఉంది. \q1 \v 7 నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను, \q2 రాత్రివేళలో కూడా నా హృదయం నాకు హితవు చెప్తుంది. \q1 \v 8 ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను. \q2 ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను. \b \q1 \v 9 కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది; \q2 నా శరీరం కూడా క్షేమంగా విశ్రమిస్తుంది. \q1 \v 10 ఎందుకంటే, మీరు నన్ను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు, \q2 మీ పరిశుద్ధుని\f + \fr 16:10 \fr*\ft లేదా \ft*\fqa నమ్మకస్థుడిని\fqa*\f* కుళ్లిపోనీయరు. \q1 \v 11 మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు; \q2 మీ సన్నిధిలోని ఆనందంతో \q2 మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో\f + \fr 16:11 \fr*\ft \+xt అపొ. కా. 2:28\+xt* \ft*\ft తో పోల్చండి\ft*\f* నన్ను నింపుతారు. \c 17 \cl కీర్తన 17 \d దావీదు ప్రార్థన. \q1 \v 1 యెహోవా, న్యాయమైన నా మనవి వినండి; \q2 నా మొర ఆలకించండి. \q1 నా ప్రార్థన వినండి \q2 అది మోసపూరితమైన పెదవుల నుండి రాలేదు. \q1 \v 2 నాకు న్యాయమైన తీర్పు మీ నుండి రావాలి; \q2 మీ కళ్లు సరియైన దాన్ని చూడాలి. \b \q1 \v 3 మీరు నా హృదయాన్ని పరిశీలించినప్పటికి, \q2 రాత్రివేళ మీరు నన్ను పరిశీలించి పరీక్షించినప్పటికీ, \q1 నాలో ఏ చెడు ఉద్దేశం మీకు కనబడలేదు; \q2 నా నోరు అతిక్రమించి మాట్లాడలేదు. \q1 \v 4 మనుష్యులు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, \q2 మీ పెదవులు ఆజ్ఞాపించిన దానిని బట్టి \q2 నేను హింసాత్మక మార్గాలకు దూరంగా ఉన్నాను. \q1 \v 5 నా అడుగులు మీ మార్గాల్లో నిలిచి ఉన్నాయి; \q2 నా పాదాలు తడబడలేదు. \b \q1 \v 6 నా దేవా! నేను మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు; \q2 మీ చెవి నా వైపు త్రిప్పి నా ప్రార్థన ఆలకించండి. \q1 \v 7 మారని మీ ప్రేమలోని అద్భుతాలను నాకు చూపించండి, \q2 తమ శత్రువుల నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఆశ్రయించే వారిని \q2 మీ కుడిచేతితో మీరు రక్షిస్తారు. \q1 \v 8-9 నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుష్టుల నుండి, \q2 నన్ను చుట్టుముట్టి నా ప్రాణం తీయాలనుకుంటున్న శత్రువుల నుండి \q1 మీ కనుపాపలా నన్ను కాపాడండి; \q2 మీ రెక్కల నీడలో నన్ను దాచండి. \b \q1 \v 10 వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు, \q2 వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి. \q1 \v 11 వారు నన్ను పసిగట్టి నన్ను చుట్టుముట్టారు, \q2 నన్ను నేలకూల్చాలని చూస్తున్నారు. \q1 \v 12 వేట కోసం ఆకలిగొని ఉన్న సింహంలా, \q2 చాటున పొంచి ఉన్న కొదమసింహంలా వారు ఉన్నారు. \b \q1 \v 13 యెహోవా, లెండి, వారిని ఎదిరించండి, వారిని కూలద్రోయండి; \q2 మీ ఖడ్గంతో దుష్టుల నుండి నన్ను విడిపించండి. \q1 \v 14 ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుండి \q2 యెహోవా, మీ చేతితో నన్ను రక్షించండి. \q1 మీరు దుష్టుల కొరకు దాచిన దానితో వారి కడుపులను నింపుతారు; \q2 వారి పిల్లలు దానితో సంతృప్తి చెందుతారు, \q2 మిగిలిన దానిని తమ పిల్లలకు విడిచిపెడతారు. \b \q1 \v 15 నేనైతే, నీతిగలవాడనై మీ ముఖాన్ని చూస్తాను; \q2 నేను మేల్కొనినప్పుడు, మీ స్వరూపాన్ని చూస్తూ తృప్తి పొందుతాను. \c 18 \cl కీర్తన 18 \d సంగీత దర్శకునికి. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి సౌలు చేతి నుండి విడిపించినప్పుడు అతడు పాడిన పాట. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. \b \q1 \v 2 యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; \q2 నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, \q2 నా డాలు\f + \fr 18:2 \fr*\ft లేదా \ft*\fqa అధిపతి\fqa*\f* నా రక్షణ కొమ్ము\f + \fr 18:2 \fr*\fq కొమ్ము \fq*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తుంది\ft*\f*, నా బలమైన కోట. \b \q1 \v 3 స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, \q2 నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను. \q1 \v 4 మరణపు ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; \q2 దుష్టులు వరదలా పొంగి నన్ను ముంచెత్తుతారు. \q1 \v 5 సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; \q2 మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి. \b \q1 \v 6 నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; \q2 సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. \q1 తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; \q2 నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది. \q1 \v 7 భూమి కంపించి అదిరింది, \q2 పర్వతాల పునాదులు కదిలాయి; \q2 ఆయన కోపానికి అవి వణికాయి. \q1 \v 8 ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; \q2 ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, \q2 దానిలో నిప్పులు మండుతున్నాయి. \q1 \v 9 ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; \q2 ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. \q1 \v 10 ఆయన కెరూబుల\f + \fr 18:10 \fr*\fq కెరూబుల \fq*\ft సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.\ft*\f* మీద ఎక్కి వచ్చారు; \q2 ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు. \q1 \v 11 ఆయన చీకటిని తన కప్పుగా, \q2 కారు మేఘాలను తన చుట్టూ పందిరిగా చేసుకున్నారు. \q1 \v 12 ఆయన సన్నిధి కాంతి నుండి మేఘాలు, \q2 వడగండ్లు, మండుతున్న నిప్పులు కురిసాయి. \q1 \v 13 యెహోవా పరలోకం నుండి ఉరిమారు; \q2 మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.\f + \fr 18:13 \fr*\ft కొ. ప్రా.ప్ర. లలో ఇది వాడబడలేదు. \+xt 2 సమూ 22:14\+xt* చూడండి.\ft*\f* \q1 \v 14 ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు, \q2 మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు. \q1 \v 15 యెహోవా, మీ గద్దింపుకు, \q2 మీ నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి, \q1 సముద్రపు అగాధాలు కనబడ్డాయి \q2 భూమి పునాదులు బయటపడ్డాయి. \b \q1 \v 16 ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; \q2 లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు. \q1 \v 17 శక్తివంతమైన నా శత్రువు నుండి, \q2 నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు. \q1 \v 18 నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, \q2 కాని యెహోవా నాకు అండగా ఉన్నారు. \q1 \v 19 ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; \q2 ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు. \b \q1 \v 20 నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు; \q2 నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు. \q1 \v 21 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; \q2 దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు. \q1 \v 22 ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి; \q2 ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు. \q1 \v 23 ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, \q2 నేను పాపానికి దూరంగా ఉన్నాను. \q1 \v 24 నా నీతిని బట్టి, ఆయన దృష్టిలో నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి, \q2 యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు. \b \q1 \v 25 నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు. \q2 యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు, \q1 \v 26 నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు, \q2 కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు. \q1 \v 27 మీరు దీనులను రక్షిస్తారు \q2 కాని అహంకారులను అణిచివేస్తారు. \q1 \v 28 యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే; \q2 నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు. \q1 \v 29 మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; \q2 నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను. \b \q1 \v 30 దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; \q2 యెహోవా వాక్కు లోపం లేనిది; \q2 ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు. \q1 \v 31 యెహోవా తప్ప దేవుడెవరు? \q2 మన దేవుని మించిన కొండ\f + \fr 18:31 \fr*\fq కొండ \fq*\ft ఇక్కడ కాపాడేవాడు అని అర్థం\ft*\f* ఎవరు? \q1 \v 32 బలంతో నన్ను సాయుధునిగా చేసేది, \q2 నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే. \q1 \v 33 నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; \q2 ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు. \q1 \v 34 నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు; \q2 నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు. \q1 \v 35 మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు, \q2 మీ కుడిచేయి నన్ను ఆదరిస్తుంది; \q2 మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది. \q1 \v 36 నా చీలమండలాలు జారిపోకుండ \q2 మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. \b \q1 \v 37 నేను నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను; \q2 వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు. \q1 \v 38 వారు మళ్ళీ లేవకుండా వారిని నలుగగొట్టాను; \q2 వారు నా పాదాల క్రింద పడ్డారు. \q1 \v 39 మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు; \q2 మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు. \q1 \v 40 మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, \q2 నేను నా విరోధులను నాశనం చేశాను. \q1 \v 41 వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు \q2 యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు. \q1 \v 42 గాలికి కొట్టుకుపోయే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; \q2 వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను\f + \fr 18:42 \fr*\ft చాలా హెబ్రీ ప్రతులలో, కొ.ప్ర.లలో \ft*\fqa బయట పారబోశాను.\fqa*\f* \q1 \v 43 ప్రజల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; \q2 జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. \q1 నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు. \q2 \v 44 విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; \q2 నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు. \q1 \v 45 వారందరి గుండె జారిపోతుంది; \q2 వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు. \b \q1 \v 46 యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! \q2 నా రక్షకుడైన దేవునికి మహిమ! \q1 \v 47 నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, \q2 దేశాలను నాకు లోబరచేది ఆయనే. \q2 \v 48 నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే. \q1 నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు; \q2 హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు. \q1 \v 49 అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను; \q2 మీ నామ సంకీర్తన చేస్తాను. \b \q1 \v 50 ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; \q2 ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, \q2 తన మారని ప్రేమను చూపిస్తారు. \c 19 \cl కీర్తన 19 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి; \q2 అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది. \q1 \v 2 పగటికి పగలు బోధ చేస్తుంది; \q2 రాత్రికి రాత్రి జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది. \q1 \v 3 వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు; \q2 వాటి స్వరం వినబడదు. \q1 \v 4 అయినా వాటి స్వరం\f + \fr 19:4 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కొలమానం\fqa*\f* భూమి అంతటికి, \q2 వాటి మాటలు భూదిగంతాలకు వెళ్తాయి. \q1 దేవుడు ఆకాశంలో సూర్యునికి డేరా వేశారు. \q2 \v 5 సూర్యుడు తన మంటపంలో నుండి బయటకు వస్తున్న పెండ్లికుమారునిలా, \q2 తన పందెం పరుగెత్తడంలో ఆనందిస్తున్న వీరునిలా వస్తున్నాడు. \q1 \v 6 ఆకాశంలో ఒక చివర ఉదయించి \q2 మరొక చివర వరకు దాని చుట్టూ తిరిగి వస్తాడు. \q2 దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు. \b \q1 \v 7 యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, \q2 అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. \q1 యెహోవా కట్టడలు నమ్మదగినవి, \q2 అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి. \q1 \v 8 యెహోవా కట్టడలు సరియైనవి, \q2 హృదయానికి ఆనందం కలిగిస్తాయి. \q1 యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి, \q2 కళ్లకు కాంతి కలిగిస్తాయి. \q1 \v 9 యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది, \q2 నిరంతరం నిలుస్తుంది. \q1 యెహోవా శాసనాలు నమ్మదగినవి, \q2 అవన్నీ నీతియుక్తమైనవి. \b \q1 \v 10 అవి బంగారం కంటే, \q2 మేలిమి బంగారం కంటే విలువైనవి; \q1 తేనె కంటే, తేనెపట్టు నుండి వచ్చే \q2 ధారల కంటే మధురమైనవి. \q1 \v 11 వాటి వల్ల మీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు; \q2 వాటిని పాటించడం వలన గొప్ప బహుమానం దొరుకుతుంది. \q1 \v 12 తమ తప్పిదాలను ఎవరు తెలుసుకోగలరు? \q2 నేను దాచిన తప్పులను క్షమించండి. \q1 \v 13 కావాలని చేసే పాపాల నుండి మీ సేవకున్ని తప్పించండి; \q2 అవి నా మీద పెత్తనం చేయకుండా అరికట్టండి. \q1 అప్పుడు నేను యథార్థవంతుడనై \q2 ఘోరమైన అతిక్రమాలు చేయకుండ నిర్దోషిగా ఉంటాను. \b \q1 \v 14 యెహోవా, నా కొండ, నా విమోచకా, \q2 నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం \q2 మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక. \c 20 \cl కీర్తన 20 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక; \q2 యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక. \q1 \v 2 తన పరిశుద్ధస్థలం నుండి ఆయన మీకు సహాయం పంపాలి, \q2 సీయోను నుండి మీకు మద్ధతు ఇవ్వాలి. \q1 \v 3 మీ అర్పణలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి \q2 మీ దహనబలులను అంగీకరించాలి. \qs సెలా\qs* \q1 \v 4 ఆయన మీ హృదయ వాంఛను తీర్చాలి, \q2 మీ ప్రణాళికలన్నిటిని సఫలం చేయాలి. \q1 \v 5 యెహోవా మీ రక్షణను బట్టి మేము ఆనందంతో కేకలు వేయాలి, \q2 మా దేవుని పేరట విజయపతాకాలు ఎగరవేయాలి. \b \q1 యెహోవా మీ మనవులన్నిటిని అనుగ్రహించాలి. \b \q1 \v 6 యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారని \q2 ఇప్పుడు నాకు తెలిసింది. \q1 రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతో \q2 ఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు. \q1 \v 7 కొందరు రథాలను కొందరు గుర్రాలను నమ్ముతారు, \q2 కాని మేమైతే మా దేవుడైన యెహోవా నామాన్ని నమ్ముతాము. \q1 \v 8 వారు పూర్తిగా పతనం చేయబడ్డారు, \q2 కాని మేము లేచి స్థిరంగా నిలబడతాము. \q1 \v 9 యెహోవా, రాజుకు విజయం ఇవ్వండి! \q2 మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబివ్వండి! \c 21 \cl కీర్తన 21 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా! మీ బలంలోనే రాజు ఆనందిస్తాడు. \q2 మీ రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషిస్తాడు! \b \q1 \v 2 అతని హృదయ కోరికను మీరు తీర్చారు \q2 అతని పెదవుల నుండి వచ్చిన మనవిని మీరు ఇవ్వక మానలేదు. \qs సెలా\qs* \q1 \v 3 మీరు అతనిని గొప్పగా ఆశీర్వదించారు \q2 మేలిమి బంగారు కిరీటం అతని తలపై పెట్టారు. \q1 \v 4 అతడు మిమ్మల్ని ఆయుష్షును అడుగగా, \q2 మీరు అతనికి శాశ్వతకాలం ఉండే దీర్ఘాయువును ఇచ్చారు. \q1 \v 5 మీరు ఇచ్చిన విజయాల వలన అతని గొప్ప కీర్తి కలిగింది; \q2 మీరు ఘనతా ప్రభావాలతో అతడిని అలంకరించారు. \q1 \v 6 నిశ్చయంగా మీరు అతనికి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చారు \q2 మీ సన్నిధిలోని ఆనందంతో అతన్ని సంతోష పెట్టారు. \q1 \v 7 రాజు యెహోవాను నమ్ముతాడు; \q2 మహోన్నతుని మారని ప్రేమను బట్టి \q2 అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు. \b \q1 \v 8 మీ చేయి మీ శత్రువులందరినీ పట్టుకుంటుంది; \q2 మీ కుడిచేయి మీ శత్రువులను ఆక్రమిస్తుంది. \q1 \v 9 మీరు యుద్ధం చేయడానికి ప్రత్యక్షమైనప్పుడు, \q2 మీరు వారిని అగ్నిగుండంలో కాల్చివేస్తారు. \q1 యెహోవా తన ఉగ్రతతో వారిని మ్రింగివేస్తారు, \q2 ఆయన అగ్ని వారిని దహించి వేస్తుంది. \q1 \v 10 భూమి మీద వారి సంతానాన్ని మీరు నిర్మూలం చేస్తారు, \q2 నరులలో వారి సంతతిని నిర్మూలం చేస్తారు. \q1 \v 11 వారు మీకు వ్యతిరేకంగా కీడు చేయాలని కుట్రపన్నినా \q2 దుష్ట పన్నాగాలు వేసినా, వారు విజయం సాధించలేరు. \q1 \v 12 మీరు వారివైపు గురి చూసి విల్లు ఎక్కుపెట్టి \q2 వారు వెనుతిరిగి వెళ్లేలా చేయగలరు. \b \q1 \v 13 యెహోవా, మీ బలంలో మీరు లేవండి; \q2 మీ శక్తిని గురించి మేము పాడి స్తుతిస్తాము. \c 22 \cl కీర్తన 22 \d సంగీత దర్శకునికి. “ఉదయకాలపు జింక పిల్ల” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన \q1 \v 1 నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు? \q2 నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు, \q2 వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు? \q1 \v 2 నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను, \q2 కాని మీరు జవాబివ్వడం లేదు, \q2 రాత్రి నేను మౌనంగా ఉండడం లేదు. \b \q1 \v 3 మీరు పరిశుద్ధులు; \q2 ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనులై ఉన్నారు. \q1 \v 4 మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు; \q2 వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు. \q1 \v 5 వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు; \q2 మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు. \b \q1 \v 6 నేను మనిషిని కాను ఒక పురుగును, \q2 మనుష్యుల చేత తిరస్కరించబడి, ప్రజలచే అవమానించబడ్డాను. \q1 \v 7 నన్ను చూసినవారందరు నన్ను ఎగతాళి చేస్తారు; \q2 వారు వెక్కిరిస్తూ, తలలు ఊపుతూ ఎగతాళి చేస్తారు. \q1 \v 8 “వాడు యెహోవాను నమ్మాడు, \q2 యెహోవా వాన్ని విడిపించనివ్వండి. \q1 అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి, \q2 ఆయనే వాన్ని విడిపించనివ్వండి” అని వారంటున్నారు. \b \q1 \v 9 నా తల్లి గర్భం నుండి మీరే నన్ను బయటకు తెచ్చారు; \q2 నా తల్లి రొమ్మున ఉన్నప్పుడే మీపై నమ్మకం పుట్టించారు. \q1 \v 10 నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను; \q2 నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు. \b \q1 \v 11 శ్రమ నాకు సమీపంగా ఉంది, \q2 నాకు సహాయం చేయడానికి ఒక్కరు లేరు, \q2 నాకు దూరంగా ఉండవద్దు. \b \q1 \v 12 ఎన్నో ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి; \q2 బాషాను బలమైన ఎద్దులు నన్ను చుట్టూ మూగాయి. \q1 \v 13 గర్జిస్తూ ఎరను చీల్చే సింహాల్లా \q2 వారు తమ నోరు పెద్దగా తెరిచారు. \q1 \v 14 నేను నీటిలా పారబోయబడ్డాను, \q2 నా ఎముకలు కీళ్ళ నుండి తప్పాయి. \q1 నా హృదయం మైనంలా; \q2 నాలో కరిగిపోయింది. \q1 \v 15 నా బలం ఎండిన కుండపెంకులా అయింది, \q2 నా నాలుక నా అంగిలికి అంటుకుపోయింది; \q2 మీరు నన్ను మరణ ధూళిలో పడవేశారు. \b \q1 \v 16 కుక్కలు నా చుట్టూ గుమికూడాయి, \q2 దుష్టుల మూక నా చుట్టూ మూగింది; \q2 వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు.\f + \fr 22:16 \fr*\ft కొ.ప్రా.ప్ర.లలో \ft*\fqa సింహం చేసినట్టు\fqa*\f* \q1 \v 17 నా ఎముకలన్నీ బయటకు కనబడుతున్నాయి; \q2 ప్రజలు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వుతున్నారు. \q1 \v 18 నా వస్త్రాలు పంచుకుని \q2 నా అంగీ కోసం చీట్లు వేస్తారు. \b \q1 \v 19 అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. \q2 మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి. \q1 \v 20 ఖడ్గం నుండి నన్ను విడిపించండి, \q2 కుక్కల బలం నుండి నా విలువైన ప్రాణాన్ని కాపాడండి. \q1 \v 21 సింహాల నోటి నుండి నన్ను కాపాడండి; \q2 అడవి దున్నల కొమ్ముల నుండి నన్ను విడిపించండి. \b \q1 \v 22 నేను మీ నామాన్ని నా ప్రజలకు ప్రకటిస్తాను; \q2 సమాజంలో మిమ్మల్ని స్తుతిస్తాను. \q1 \v 23 యెహోవాకు భయపడేవారలారా, ఆయనను స్తుతించండి. \q2 యాకోబు సర్వ వంశస్థులారా, ఆయనను ఘనపరచండి! \q2 ఇశ్రాయేలు సర్వ వంశస్థులారా, ఆయనను పూజించండి. \q1 \v 24 బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు \q2 వారిని చూసి అసహ్యపడలేదు; \q1 ఆయన ముఖం వారి నుండి దాచలేదు. \q2 ఆయన వారి మొర ఆలకించారు. \b \q1 \v 25 మహా సమాజంలో మీకే నేను స్తుతి చెల్లిస్తాను; \q2 మీకు భయపడు వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెలిస్తాను. \q1 \v 26 దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; \q2 యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, \q2 మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి. \b \q1 \v 27 భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని \q2 ఆయన వైపు తిరుగుతారు, \q1 దేశాల్లోని కుటుంబాలన్నీ \q2 ఆయనకు నమస్కారం చేస్తాయి. \q1 \v 28 రాజ్యాధికారం యెహోవాదే \q2 ఆయనే దేశాలను పరిపాలిస్తారు. \b \q1 \v 29 లోకంలోని ధనికులంతా విందు చేస్తూ ఆరాధిస్తారు; \q2 తమ ప్రాణాలు కాపాడుకోలేక \q2 మట్టిలో కలిసిపోయే వారంతా ఆయన ఎదుట మోకరిస్తారు. \q1 \v 30 ఒక తరం వారు ఆయనను సేవిస్తారు; \q2 రాబోయే తరాలకు ప్రభువు గురించి చెబుతారు. \q1 \v 31 వారు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి, \q2 ఇంకా పుట్టని ప్రజలకు చెప్పి \q2 ఆయన నీతిని తెలియజేస్తారు! \c 23 \cl కీర్తన 23 \d దావీదు కీర్తన \q1 \v 1 యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు. \q2 \v 2 పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు. \q1 ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు. \q2 \v 3 ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు. \q1 ఆయన తన నామం కోసం \q2 నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు. \q1 \v 4 మృత్యు నీడలా ఉన్న లోయలో\f + \fr 23:4 \fr*\ft లేదా \ft*\fqa గాఢాంధకారపు లోయలో\fqa*\f* \q2 నేను నడిచినా, \q1 ఏ కీడుకు భయపడను, \q2 ఎందుకంటే మీరు నాతో ఉన్నారు; \q1 మీ దండం మీ చేతికర్ర \q2 నన్ను ఆదరిస్తాయి. \b \q1 \v 5 నా శత్రువులు ఉన్న చోటనే \q2 మీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు. \q1 నూనెతో నా తల అభిషేకించారు; \q2 నా పాత్ర నిండి పొర్లుతుంది. \q1 \v 6 నిశ్చయంగా నా జీవితకాలమంతా \q2 మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి. \q1 నేను నిరంతరం \q2 యెహోవా మందిరంలో నివసిస్తాను. \c 24 \cl కీర్తన 24 \d దావీదు కీర్తన. \q1 \v 1 భూమి, దానిలో ఉండే సమస్తం, \q2 లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు. \q1 \v 2 ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు. \q2 జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు. \b \q1 \v 3 యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు? \q2 ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు? \q1 \v 4 ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, \q2 ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, \q2 ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు\f + \fr 24:4 \fr*\ft లేదా \ft*\fqa తప్పుడు దేవుళ్ళు\fqa*\f* చేయరో, వారే కదా! \b \q1 \v 5 వారు యెహోవా నుండి దీవెన పొందుతారు \q2 వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు. \q1 \v 6 ఆయనను వెదికే తరం ఇదే, \q2 యాకోబు దేవా, మీ ముఖకాంతిని వెదకేవారు అలాంటివారే. \qs సెలా\qs* \b \q1 \v 7 గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; \q2 మహిమగల రాజు ప్రవేశించేలా \q2 పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి. \q1 \v 8 ఈ మహిమగల రాజు ఎవరు? \q2 శక్తిమంతుడు బలశాలియైన యెహోవా, \q2 యుద్ధ శూరుడైన యెహోవా. \q1 \v 9 గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; \q2 మహిమగల రాజు ప్రవేశించేలా \q2 పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి. \q1 \v 10 ఈ మహిమగల రాజు ఎవరు? \q2 సైన్యాలకు అధిపతియైన యెహోవాయే \q2 ఆయనే ఈ మహిమగల రాజు. \qs సెలా\qs* \c 25 \cl కీర్తన 25\f + \fr 25 \fr*\ft ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి\ft*\f* \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నా దేవా, \q2 నేను మీపై నమ్మిక ఉంచాను. \b \q1 \v 2 నా దేవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; \q2 నాకు అవమానం కలగనివ్వకండి, \q2 నా శత్రువులకు నాపై విజయాన్ని ఇవ్వకండి. \q1 \v 3 మీ కోసం ఎదురు చూసే వారెవరూ \q2 ఎన్నటికి సిగ్గుపరచబడరు; ఎన్నడూ ఆశాభంగం చెందరు, \q1 కారణం లేకుండ ద్రోహం చేసేవారి మీదకు \q2 అవమానం వస్తుంది. \b \q1 \v 4 యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి. \q2 మీ పద్ధతులను నాకు ఉపదేశించండి. \q1 \v 5 మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి, \q2 మీరే నా రక్షకుడవైన నా దేవుడవు, \q2 మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను. \q1 \v 6 యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి, \q2 ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి. \q1 \v 7 యవ్వనంలో నేను చేసిన పాపాలు, \q2 నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి; \q1 మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి. \q2 ఎందుకంటే యెహోవా మీరు మంచివారు. \b \q1 \v 8 యెహోవా మంచివాడు యథార్థవంతుడు; \q2 కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు. \q1 \v 9 న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు, \q2 తన మార్గాలను వారికి బోధిస్తారు. \q1 \v 10 తన నిబంధనలను శాసనాలను పాటించేవారి విషయంలో \q2 యెహోవా మార్గాలు, ఆయన మారని ప్రేమ నమ్మదగినవి. \q1 \v 11 యెహోవా, నా దోషం ఘోరమైనది \q2 మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి. \b \q1 \v 12 అప్పుడు యెహోవాకు భయపడేవారికి \q2 వారు కోరుకోవలసిన మార్గాలను ఆయన బోధిస్తారు. \q1 \v 13 వారు క్షేమం కలిగి జీవిస్తారు, \q2 వారి వారసులు భూమిని వారసత్వంగా పొందుతారు. \q1 \v 14 ఆయన పట్ల భయభక్తులు గలవారికి యెహోవా రహస్యాలు తెలుస్తాయి; \q2 ఆయన తన నిబంధనను వారికి తెలియపరుస్తారు. \q1 \v 15 నా కళ్లు ఎప్పుడూ యెహోవా మీద ఉన్నాయి, \q2 ఎందుకంటే ఆయన మాత్రమే వలలో నుండి నా పాదాలు విడిపిస్తారు. \b \q1 \v 16 నా వైపు తిరిగి నాపై దయ చూపండి, \q2 నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను. \q1 \v 17 నా హృదయంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి \q2 నా వేదన నుండి విడిపించండి. \q1 \v 18 నా వేదన బాధను చూడండి \q2 నా పాపాలన్నిటిని క్షమించండి. \q1 \v 19 నా శత్రువులు ఎంతమంది ఉన్నారో చూడండి \q2 వారు ఎంత తీవ్రంగా నన్ను ద్వేషిస్తున్నారో చూడండి! \b \q1 \v 20 నా ప్రాణాన్ని కాపాడండి నన్ను రక్షించండి; \q2 నాకు అవమానం కలగనివ్వకండి, \q2 ఎందుకంటే నేను మిమ్మల్నే ఆశ్రయించాను. \q1 \v 21 నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది, \q2 కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి. \b \q1 \v 22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను \q2 వారి ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి. \c 26 \cl కీర్తన 26 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను, \q2 నాకు న్యాయం తీర్చండి; \q1 నేను ఏ సందేహం లేకుండ \q2 యెహోవాను నమ్మాను. \q1 \v 2 యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి, \q2 నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి; \q1 \v 3 నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను \q2 మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను. \b \q1 \v 4 నేను మోసగాళ్ళతో కూర్చోను, \q2 వేషధారులతో నేను సహవాసం చేయను. \q1 \v 5 కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం \q2 దుష్టులతో నేను కూర్చోను. \q1 \v 6-7 యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని, \q2 బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూ \q1 మీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూ \q2 మీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను. \b \q1 \v 8 యెహోవా, మీరు నివసించే ఆవరణం, \q2 మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము. \q1 \v 9 పాపులతో పాటు నా ప్రాణాన్ని \q2 నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి. \q1 \v 10 వారి చేతుల్లో దుష్ట పన్నాగాలు ఉన్నాయి, \q2 వారి కుడి చేతులు లంచాలతో నిండి ఉన్నాయి. \q1 \v 11 నేను నిందారహితంగా బ్రతుకుతాను; \q2 నన్ను విమోచించండి నన్ను కరుణించండి. \b \q1 \v 12 నా పాదాలను సమతలమైన నేల మీద నిలిపాను; \q2 గొప్ప సమాజాలలో నేను యెహోవాను స్తుతిస్తాను. \c 27 \cl కీర్తన 27 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ \q2 నేను ఎవరికి భయపడతాను? \q1 దేవుడే నా జీవితానికి బలమైన కోట \q2 నేను ఎవరికి భయపడతాను? \b \q1 \v 2 నన్ను మ్రింగివేయాలని \q2 దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, \q1 నా శత్రువులు నా పగవారు \q2 తూలి పడిపోతారు. \q1 \v 3 సైన్యం నన్ను ముట్టడించినా, \q2 నా హృదయం భయపడదు; \q1 నా మీదికి యుద్ధానికి వచ్చినా, \q2 నేను ధైర్యం కోల్పోను. \b \q1 \v 4 యెహోవాను ఒకటి అడిగాను, \q2 నేను కోరింది ఇదే; \q1 యెహోవా ప్రసన్నతను చూస్తూ \q2 ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ \q1 నా జీవితకాలమంతా \q2 నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను. \q1 \v 5 ఆపద సంభవించిన దినాన \q2 ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు; \q1 తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు, \q2 ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు. \b \q1 \v 6 నన్ను చుట్టూ ముట్టిన శత్రువుల కంటే, \q2 నా తల పైకెత్తబడుతుంది \q1 ఆయన పవిత్ర గుడారం దగ్గర ఆనంద బలులర్పిస్తాను; \q2 నేను పాడి యెహోవాను స్తుతిస్తాను. \b \q1 \v 7 యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా స్వరాన్ని ఆలకించండి; \q2 నాపై కరుణ చూపించి నాకు జవాబివ్వండి. \q1 \v 8 “ఆయన ముఖాన్ని వెదకు!” అని నా హృదయం మీ గురించి అంటుంది, \q2 యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను. \q1 \v 9 మీ ముఖాన్ని నా నుండి దాచకండి, \q2 కోపంతో మీ దాసున్ని త్రోసివేయకండి; \q2 మీరే నాకు సహాయము. \q1 దేవా నా రక్షకా, \q2 నన్ను త్రోసివేయకండి నన్ను విడిచిపెట్టకండి. \q1 \v 10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, \q2 యెహోవా నన్ను చేరదీస్తారు. \q1 \v 11 యెహోవా, మీ మార్గం నాకు బోధించండి; \q2 నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు, \q2 కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి. \q1 \v 12 నా శత్రువుల కోరికకు నన్ను అప్పగించకండి, \q2 ఎందుకంటే అబద్ధ సాక్షులు నామీదికి లేచి, \q2 హానికరమైన ఆరోపణలను చేస్తున్నారు. \b \q1 \v 13 నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను: \q2 సజీవులన్న చోట \q2 నేను యెహోవా మంచితనాన్ని చూస్తాను. \q1 \v 14 యెహోవా కోసం కనిపెట్టండి \q2 నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి \q2 యెహోవా కోసం కనిపెట్టండి. \c 28 \cl కీర్తన 28 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నేను మీకు మొరపెట్టుకుంటున్నాను; \q2 మీరు నా కొండయై ఉన్నారు, \q2 నా మొరను నిర్లక్ష్యం చేయకండి. \q1 ఒకవేళ మీరు మౌనంగా ఉంటే, \q2 నేను గుంటలోకి దిగిపోయే వారిలా అవుతాను. \q1 \v 2 నీ పరిశుద్ధాలయం వైపు \q2 నా చేతులెత్తి, \q1 కరుణ కొరకై నేను చేసే మొర \q2 సహాయం కొరకై నేను చేసే ప్రార్థన ఆలకించండి. \b \q1 \v 3 దుష్టులతో, చెడు చేసేవారితో పాటు \q2 నన్ను లాక్కు వెళ్లకండి. \q1 వారు పొరుగువారితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు కాని, \q2 వారి హృదయాల్లో దుర్మార్గం పెట్టుకుంటారు. \q1 \v 4 వారి క్రియలకు \q2 వారి చెడు పనికి తగ్గట్టుగా చెల్లించండి. \q1 చేతులార వారు చేసిందానికి ప్రతీకారం చేయండి; \q2 వారికి తగిన ప్రతిఫలమివ్వండి. \b \q1 \v 5 యెహోవా క్రియలను గాని \q2 ఆయన తన చేతులతో చేసిన వాటిని గాని వారు గ్రహించరు, \q1 కాబట్టి ఆయన వారిని పడగొడతారు \q2 మరలా వారిని నిలబెట్టరు. \b \q1 \v 6 యెహోవా నా విజ్ఞాపన మొర విన్నారు \q2 కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక. \q1 \v 7 యెహోవాయే నా బలం నా డాలు; \q2 హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది. \q1 నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది. \q2 నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను. \b \q1 \v 8 యెహోవాయే తన ప్రజలకు బలము. \q2 తన అభిషిక్తుడికి ఆయనే రక్షణ దుర్గము. \q1 \v 9 మీ ప్రజలను రక్షించండి మీ వారసత్వాన్ని దీవించండి; \q2 వారికి కాపరివై ఎల్లప్పుడూ వారిని మోయండి. \c 29 \cl కీర్తన 29 \d దావీదు కీర్తన. \q1 \v 1 దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, \q2 మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి. \q1 \v 2 యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి; \q2 ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి. \b \q1 \v 3 యెహోవా స్వరం సముద్రం మీద ప్రతిధ్వనిస్తుంది; \q2 మహిమగల దేవుడు ఉరుముతారు \q2 మహాజలాల మీద యెహోవా స్వరం ప్రతిధ్వనిస్తోంది. \q1 \v 4 యెహోవా స్వరం శక్తివంతమైనది; \q2 యెహోవా స్వరం ఘనమైనది. \q1 \v 5 యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరిగి పడిపోతాయి; \q2 లెబానోను దేవదారు చెట్లను యెహోవా ముక్కలుగా చేస్తారు. \q1 \v 6 ఆయన లెబానోను పర్యతాలను దూడలా, \q2 షిర్యోనును\f + \fr 29:6 \fr*\ft అంటే, హెర్మోను పర్వతం\ft*\f* అడవి దూడలా చెంగున గంతులు వేసేలా చేస్తారు. \q1 \v 7 యెహోవా స్వరం \q2 అగ్ని జ్వాలలను పుట్టిస్తుంది; \q1 \v 8 యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది. \q2 యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తారు. \q1 \v 9 యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది \q2 అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది. \q1 ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి. \b \q1 \v 10 యెహోవా ప్రళయజలాల మీద ఆసీనులయ్యారు; \q2 ఆయనే నిరంతరం రాజుగా పరిపాలిస్తున్నారు. \q1 \v 11 యెహోవా తన ప్రజలకు బలాన్ని దయచేస్తారు; \q2 యెహోవా సమాధానంతో తన ప్రజలను ఆశీర్వదిస్తారు. \c 30 \cl కీర్తన 30 \d దేవాలయ ప్రతిష్ఠ కొరకైన పాట; దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, \q2 ఎందుకంటే నా శత్రువులు నాపై విజయం సాధించకుండ \q2 మీరు నన్ను పైకి లేవనెత్తారు. \q1 \v 2 యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, \q2 మీరు నన్ను స్వస్థపరిచారు. \q1 \v 3 యెహోవా, పాతాళం నుండి నా ప్రాణానికి పైకి లేవనెత్తారు; \q2 సమాధిలోనికి వెళ్లకుండా నన్ను కాపాడారు. \b \q1 \v 4 యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించండి; \q2 ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించండి. \q1 \v 5 ఆయన కోపం క్షణికం, \q2 కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది; \q1 రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ, \q2 ఉదయాన్నే ఆనంద కలుగుతుంది. \b \q1 \v 6 నేను క్షేమంగా ఉన్నప్పుడు, \q2 “నేను ఎప్పటికీ కదల్చబడను” అని అన్నాను. \q1 \v 7 యెహోవా, మీ దయతో \q2 నన్ను పర్వతంలా\f + \fr 30:7 \fr*\ft అంటే, సీయోను పర్వతం\ft*\f* స్థిరపరిచారు. \q1 కాని మీరు మీ ముఖాన్ని దాచినప్పుడు \q2 నేను కలవరపడ్డాను. \b \q1 \v 8 యెహోవా నేను మీకు మొరపెట్టాను; \q2 ప్రభువా కరుణ కోసం నేను మీకు మొరపెట్టాను: \q1 \v 9 “నేను నా రక్తాన్ని కార్చితే ఏమి లాభం? \q2 సమాధిలోనికి వెళ్తే ఏమి లాభం? \q1 మట్టి మిమ్మల్ని స్తుతిస్తుందా? \q2 అది మీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తుందా? \q1 \v 10 యెహోవా! ఆలకించండి కరుణించండి. \q2 యెహోవా, నాకు సహాయంగా ఉండండి.” \b \q1 \v 11 మీరు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చారు; \q2 మీరు నా గోనెపట్టను తీసివేసి ఆనంద వస్త్రాన్ని తొడిగించారు. \q1 \v 12 నా హృదయం మౌనంగా ఉండక మీకు స్తుతులు పాడుతుంది. \q2 యెహోవా, నా దేవా, నేను మిమ్మల్ని ఎల్లప్పుడు స్తుతిస్తాను. \c 31 \cl కీర్తన 31 \d ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; \q2 నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి; \q2 మీ నీతిని బట్టి నన్ను విడిపించండి. \q1 \v 2 మీరు నా వైపు చెవియొగ్గి, \q2 నన్ను విడిపించడానికి త్వరగా రండి; \q1 నా ఆశ్రయదుర్గమై, \q2 బలమైన కోటవై నన్ను కాపాడండి. \q1 \v 3 మీరు నా కొండ, నా కోట; \q2 మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి. \q1 \v 4 నా కోసం ఏర్పాటు చేయబడిన ఉచ్చులో పడకుండ నన్ను తప్పించండి, \q2 ఎందుకంటే మీరు నా ఆశ్రయమై ఉన్నారు. \q1 \v 5 మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. \q2 యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి. \b \q1 \v 6 విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; \q2 నేనైతే యెహోవాలో నమ్మకముంచాను. \q1 \v 7 మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను, \q2 నా బాధను మీరు చూశారు \q2 నా వేదన మీకు తెలుసు. \q1 \v 8 మీరు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు \q2 నా పాదాలను విశాలమైన స్థలంలో ఉంచారు. \b \q1 \v 9 యెహోవా, నేను బాధలో ఉన్నాను నన్ను కరుణించండి; \q2 నా కళ్లు విచారంతో బలహీనం అవుతున్నాయి, \q2 నా ప్రాణం దేహం దుఃఖంతో క్షీణిస్తున్నాయి. \q1 \v 10 నా బ్రతుకు వేదనలో గడుస్తుంది \q2 నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. \q1 నా పాపాన్ని బట్టి నా బలమంతా హరించుకు పోతోంది, \q2 నా ఎముకల్లో సత్తువలేదు. \q1 \v 11 నా శత్రువులందరి కారణంగా \q2 పొరుగువారు నన్ను ఎగతాళి చేస్తున్నారు \q1 నన్ను చూసి నా స్నేహితులు భయపడుతున్నారు \q2 వీధిలో నన్ను చూసేవారు నా నుండి పారిపోతున్నారు. \q1 \v 12 చనిపోయిన వాడిగా నన్ను మరచిపోయారు; \q2 నేను పగిలిన కుండలా అయ్యాను. \q1 \v 13 అనేకమంది గుసగుసలాడడం నేను విన్నాను, \q2 “అన్నివైపులా భయమే!” \q1 నామీద వారు దురాలోచన చేస్తున్నారు \q2 నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు. \b \q1 \v 14 కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; \q2 “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను. \q1 \v 15 నా బ్రతుకంతా మీ చేతిలోనే ఉంది; \q2 నన్ను వెంటాడే వారి నుండి, \q2 నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించండి. \q1 \v 16 మీ దాసుని మీద మీ ముఖకాంతిని ప్రకాశించనీయండి; \q2 మీ మారని ప్రేమతో నన్ను రక్షించండి. \q1 \v 17 యెహోవా, నేను మీకు మొరపెట్టాను, \q2 నన్ను సిగ్గుపడనీయకండి; \q1 అయితే దుష్టులు అవమానపరచబడాలి \q2 వారు పాతాళంలో మౌనంగా ఉండాలి. \q1 \v 18 అహంకారంతో ధిక్కారంతో \q2 గర్వంతో నీతిమంతులను దూషించే వారి \q2 అబద్ధపు పెదవులు మూయబడాలి. \b \q1 \v 19 మీకు భయపడేవారి కోసం \q2 మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! \q1 మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా, \q2 మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది! \q1 \v 20 మనుష్యుల కుట్రలకు గురికాకుండ \q2 మీ సన్నిధి గుడారంలో వారిని దాచిపెడతారు; \q1 నిందించే నాలుకల నుండి తప్పించి \q2 వారిని మీ నివాసంలో భద్రంగా ఉంచుతారు. \b \q1 \v 21 యెహోవాకు స్తుతి, ఎందుకంటే \q2 ముట్టడించబడిన పట్టణంలో నేను ఉన్నప్పుడు \q2 తన మార్పుచెందని ప్రేమలోని అద్భుతాలను ఆయన నాకు చూపించారు. \q1 \v 22 “మీ దృష్టి నుండి తొలగించబడ్డాను” \q2 అని నేను ఆందోళన చెందాను. \q1 సాయం చేయమనే ప్రాధేయపడి వేడుకున్నప్పుడు \q2 నా విన్నపాన్ని విన్నారు. \b \q1 \v 23 యెహోవా భక్తులారా, ఆయనను ప్రేమించండి. \q2 యెహోవాను నమ్మినవారిని ఆయన కాపాడతారు. \q2 గర్విష్ఠులకు గొప్ప ప్రతీకారం చేస్తారు. \q1 \v 24 యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! \q2 నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి. \c 32 \cl కీర్తన 32 \d దావీదు ధ్యానకీర్తన. \q1 \v 1 తమ పాపాలు క్షమించబడినవారు \q2 తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు. \q1 \v 2 యెహోవాచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు \q2 ఆత్మలో మోసం లేనివారు ధన్యులు. \b \q1 \v 3 నేను మౌనంగా ఉండి, \q2 రోజంతా మూలుగుతూ ఉన్నందుకు \q2 నా ఎముకలు కృశించాయి. \q1 \v 4 రాత్రింబగళ్ళు మీ చేయి నాపై \q2 భారంగా ఉంది; \q1 వేసవిలో నీరు ఎండిపోయినట్లు \q2 నాలో సారం యింకి పోయింది. \qs సెలా\qs* \b \q1 \v 5 అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను \q2 నా దోషాన్ని నేను దాచుకోలేదు. \q1 “యెహోవా ఎదుట \q2 నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను. \q1 అప్పుడు నా అతిక్రమాన్ని \q2 మీరు క్షమించారు. \qs సెలా\qs* \b \q1 \v 6 మీరు దొరికే సమయంలోనే \q2 నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక; \q1 జలప్రవాహాలు ఉప్పొంగినా \q2 వారిని చేరవు. \q1 \v 7 నా దాగుచోటు మీరే; \q2 కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు \q2 విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. \qs సెలా\qs* \b \q1 \v 8 మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను; \q2 మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను. \q1 \v 9 వివేచనలేని గుర్రంలా \q2 కంచరగాడిదలా ప్రవర్తించకండి \q1 కళ్లెంతో పగ్గంతో వాటిని అదుపు చేయాలి \q2 లేకపోతే మీరు వాటిని వశపరచుకోలేరు. \q1 \v 10 దుష్టులకు చాలా బాధలు కలుగుతాయి, \q2 కాని యెహోవాను నమ్ముకున్న వారి చుట్టూ \q2 ఆయన మారని ప్రేమ ఆవరించి ఉంటుంది. \b \q1 \v 11 నీతిమంతులారా యెహోవాలో ఆనందించి సంతోషించండి. \q2 యథార్థ హృదయులారా, మీరు పాడండి. \c 33 \cl కీర్తన 33 \q1 \v 1 నీతిమంతులారా, యెహోవాకు ఆనందంతో పాడండి; \q2 ఆయనను స్తుతించడం యథార్థవంతులకు తగినది. \q1 \v 2 సితారాతో యెహోవాను స్తుతించండి; \q2 పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి. \q1 \v 3 ఆయనకు క్రొత్త పాట పాడండి; \q2 నైపుణ్యతతో వాయించండి, ఆనందంతో కేకలు వేయండి. \b \q1 \v 4 యెహోవా వాక్కు న్యాయమైనది; \q2 ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది. \q1 \v 5 యెహోవా నీతిన్యాయాలను ప్రేమిస్తారు; \q2 భూమంతా ఆయన మారని ప్రేమతో నిండిపోయింది. \b \q1 \v 6 యెహోవా మాటతో ఆకాశాలు చేయబడ్డాయి, \q2 ఆయన నోటి శ్వాసతో నక్షత్ర కూటమి కలిగింది. \q1 \v 7 ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూర్చుతారు; \q2 అగాధాలను ఆయన గోదాములలో ఉంచుతారు. \q1 \v 8 భూమంతా యెహోవాకు భయపడును గాక; \q2 లోక ప్రజలందరు ఆయనను గౌరవించుదురు గాక. \q1 \v 9 ఆయన మాట్లాడారు అది జరిగింది; \q2 ఆయన ఆజ్ఞాపించారు అది దృఢంగా నిలబడింది. \b \q1 \v 10 యెహోవా దేశాల ప్రణాళికలను విఫలం చేస్తారు; \q2 ప్రజల ఉద్దేశాలను ఆయన అడ్డుకుంటారు. \q1 \v 11 కానీ యెహోవా ప్రణాళికలు శాశ్వతంగా నిలుస్తాయి, \q2 ఆయన హృదయ ఉద్దేశాలు అన్ని తరాల వరకు ఉంటాయి. \b \q1 \v 12 యెహోవాను దేవునిగా కలిగిన దేశం ధన్యమైనది. \q2 తన వారసత్వంగా ఆయన తన కోసం ఎంచుకున్న ప్రజలు ధన్యులు. \q1 \v 13 ఆకాశం నుండి యెహోవా క్రిందకు చూస్తున్నారు \q2 ఆయన మనుష్యులందరిని కనిపెడుతున్నారు. \q1 \v 14 ఆయన తన నివాసస్థలం నుండి \q2 భూమిపై నివసించే వారందరినీ పరిశీలిస్తున్నారు. \q1 \v 15 అందరి హృదయాలను రూపించింది ఆయనే, \q2 వారు చేసే ప్రతిదీ ఆయన గమనిస్తారు. \b \q1 \v 16 ఏ రాజు తన సైనిక బలంతో రక్షించబడడు; \q2 ఏ యోధుడు తన గొప్ప శక్తితో తప్పించుకోడు. \q1 \v 17 విడుదల పొందడానికి గుర్రం ఉపయోగపడదు; \q2 దానికి గొప్ప బలం ఉన్నా అది ఎవరిని రక్షించలేదు. \q1 \v 18 కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన, \q2 తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి. \q1 \v 19 ఆయన మరణం నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తారు, \q2 కరువు సమయంలో వారిని సజీవులుగా ఉంచుతారు. \b \q1 \v 20 మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; \q2 మనకు సహాయం మనకు డాలు ఆయనే. \q1 \v 21 మన హృదయాలు ఆయనలో ఆనందిస్తాయి, \q2 ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని నమ్ముకున్నాము. \q1 \v 22 యెహోవా, మేము మా నిరీక్షణ మీలో ఉంచాం కాబట్టి, \q2 యెహోవా, మీ మారని ప్రేమ మాతో ఉండును గాక. \c 34 \cl కీర్తన 34\f + \fr 34 \fr*\ft ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి\ft*\f* \d అబీమెలెకు ఎదుట వెర్రి వానిలా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు వ్రాసిన కీర్తన. \q1 \v 1 నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను; \q2 ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది. \q1 \v 2 నేను యెహోవాలో అతిశయిస్తాను. \q2 బాధించబడినవారు ఇది విని సంతోషించుదురు గాక! \q1 \v 3 నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; \q2 మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. \b \q1 \v 4 నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; \q2 నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు. \q1 \v 5 ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది; \q2 వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు. \q1 \v 6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు \q2 కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు. \q1 \v 7 యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, \q2 వారిని విడిపిస్తాడు. \b \q1 \v 8 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; \q2 ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు. \q1 \v 9 యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి, \q2 ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు. \q1 \v 10 సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు, \q2 కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు. \q1 \v 11 నా పిల్లలారా, రండి, నా మాట వినండి; \q2 నేను మీకు యెహోవా పట్ల భయాన్ని బోధిస్తాను. \q1 \v 12 మీలో ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో \q2 ఎవరు ఎక్కువ మంచి రోజులను చూడాలనుకుంటారో \q1 \v 13 మీరు చెడు పలుకకుండ మీ నాలుకను, \q2 అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి. \q1 \v 14 కీడు చేయడం మాని మేలు చేయాలి; \q2 సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. \b \q1 \v 15 యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, \q2 ఆయన చెవులు వారి మొరను వింటాయి; \q1 \v 16 అయితే కీడుచేసేవారి జ్ఞాపకాన్ని భూమి మీద లేకుండా చేయడానికి \q2 యెహోవా ముఖం వారికి విరోధంగా ఉన్నది. \b \q1 \v 17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారు; \q2 వారి ఇబ్బందులన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారు. \q1 \v 18 విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు. \q2 ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు. \b \q1 \v 19 నీతిమంతులకు అనేక శ్రమలు కలుగవచ్చు, \q2 కాని, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు. \q1 \v 20 వారి ఎముకలన్నిటిని ఆయన కాపాడతారు, \q2 ఒక్క ఎముక కూడా విరగదు. \b \q1 \v 21 చెడుతనం దుష్టులను నాశనం చేస్తుంది; \q2 నీతిమంతుల శత్రువులు శిక్షింపబడతారు. \q1 \v 22 యెహోవా తన సేవకులను విడిపిస్తారు; \q2 ఆయనను ఆశ్రయించిన వారిలో ఎవరూ శిక్షింపబడరు. \c 35 \cl కీర్తన 35 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; \q2 నాతో పోరాడే వారితో పోరాడండి. \q1 \v 2 కవచం ధరించి, డాలు తీసుకుని \q2 యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి. \q1 \v 3 నన్ను వెంటాడుతున్న వారి మీదికి, \q2 మీ ఈటెను విసరండి \q1 “నేనే మీ రక్షణ” అని \q2 మీరు నాతో చెప్పండి. \b \q1 \v 4 నా ప్రాణాన్ని తీయాలని చూసేవారు \q2 అవమానపాలై సిగ్గుపడుదురు గాక; \q1 నా పతనానికి కుట్రపన్నిన వారు \q2 భయపడుదురు గాక. \q1 \v 5 యెహోవా దూత వారిని తరుముతుండగా \q2 వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉందురు గాక. \q1 \v 6 యెహోవా దూత వారిని తరుముతుండగా \q2 వారి మార్గం చీకటిమయమై జారేదిగా ఉండును గాక. \b \q1 \v 7 కారణం లేకుండా వారు తమ వలను నా కోసం దాచారు \q2 నన్ను చిక్కించుకోడానికి వారు ఒక గొయ్యి తవ్వారు. \q1 \v 8 వారికి తెలియకుండానే వారి పైకి నాశనం వచ్చును గాక \q2 వారు నా కోసం దాచిన వలలో వారే చిక్కుకొందురు గాక! \q2 నా కోసం త్రవ్విన గొయ్యిలో వారే పడుదురు గాక. \q1 \v 9 నా ప్రాణం యెహోవాలో ఆనందిస్తుంది \q2 ఆయన రక్షణలో సంతోషిస్తుంది. \q1 \v 10 “యెహోవా, నిన్ను పోలినవారెవరు? \q2 బలవంతుల చేతిలో నుండి మీరు బాధితులను విడిపిస్తారు, \q1 దోపిడి దొంగల నుండి మీరు దీనులను నిరుపేదలను విడిపిస్తారు” \q2 అని నా శక్తి అంతటితో నేను అంటాను. \b \q1 \v 11 అబద్ధ సాక్షులు బయలుదేరుతున్నారు; \q2 నాకు తెలియని విషయాలను గురించి వారు నన్ను ప్రశ్నిస్తారు. \q1 \v 12 మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తారు, \q2 నేను ఒంటరి వాడినయ్యాను. \q1 \v 13 అయినాసరే వారికి జబ్బు చేసినప్పుడు, \q2 నేను గోనెపట్ట చుట్టుకున్నాను, \q2 ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకున్నాను. \q1 నా ప్రార్థనలకు జవాబు రానప్పుడు, \q2 \v 14 వారు నా స్నేహితులో సోదరులో అన్నట్లు \q2 నేను దుఃఖించాను. \q1 నా తల్లి కోసం ఏడుస్తున్నట్లు \q2 నేను దుఃఖంతో క్రుంగిపోయాను. \q1 \v 15 నేను తడబడినప్పుడు వారు సంతోషంతో సమకూడారు; \q2 నాకు తెలియకుండానే దుండగులు నా మీదికి వచ్చారు. \q2 ఆపకుండ వారు నా మీద అపవాదు వేశారు. \q1 \v 16 భక్తిహీనుల్లా వారు ద్వేషం వెళ్లగ్రక్కుతూ ఎగతాళి చేశారు; \q2 వారు నన్ను చూసి పళ్ళు కొరికారు. \b \q1 \v 17 ప్రభువా, ఎంతకాలం మీరిలా చూస్తూ ఉంటారు? \q2 వారి విధ్వంసం నుండి నన్ను కాపాడి, \q2 ఈ సింహాల నుండి నా విలువైన ప్రాణాన్ని విడిపించండి. \q1 \v 18 మహా సమాజంలో నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; \q2 అనేకమంది ప్రజలమధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను. \q1 \v 19 కారణం లేకుండా నాకు శత్రువులైనవారిని \q2 నన్ను చూసి సంతోషించనివ్వకండి. \q1 కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు \q2 దురుద్దేశంతో కన్నుగీట నివ్వకండి. \q1 \v 20 వారు సమాధానంగా మాట్లాడరు, \q2 దేశంలో ప్రశాంతంగా నివసించే వారిపై \q2 తప్పుడు ఆరోపణలు చేస్తారు. \q1 \v 21 వారు నన్ను వెక్కిరిస్తూ \q2 “ఆహా! ఆహా! మా కళ్లతో మేము చూశాం” అని అంటారు. \b \q1 \v 22 యెహోవా, ఇదంతా మీరు చూశారు; మౌనంగా ఉండకండి. \q2 ప్రభువా, నాకు దూరంగా ఉండకండి. \q1 \v 23 మేల్కొనండి, నన్ను రక్షించడానికి లేవండి! \q2 నా దేవా, నా ప్రభువా, నా పక్షాన వాదించండి. \q1 \v 24 యెహోవా, నా దేవా! మీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చండి; \q2 నన్ను బట్టి వారిని ఆనందించనివ్వకండి. \q1 \v 25 “ఆహా, మేము కోరుకున్నదే జరిగింది!” అని అనుకోనివ్వకండి, \q2 “మేము అతన్ని మ్రింగివేశాం” అని అననివ్వకండి. \b \q1 \v 26 నా బాధను చూసి ఆనందిస్తున్న వారందరు \q2 అవమానంతో సిగ్గుపడాలి; \q1 నా మీద గర్వించే వారందరు \q2 సిగ్గుతో అపకీర్తి పాలవుదురు గాక. \q1 \v 27 నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు \q2 ఆనంద సంతోషాలతో కేకలు వేయుదురు గాక; \q1 “తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించే యెహోవా \q2 ఘనపరచబడును గాక” అని వారు నిత్యం అందురు గాక. \b \q1 \v 28 నా నాలుక మీ నీతిని ప్రకటిస్తుంది, \q2 దినమంతా మిమ్మల్ని స్తుతిస్తుంది. \c 36 \cl కీర్తన 36 \d సంగీత దర్శకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. \q1 \v 1 దుష్టుల పాప స్వభావాన్ని గురించి \q2 నా హృదయంలో నేను దేవుని నుండి వర్తమానం పొందుకున్నాను; \q1 వారి కళ్లలో \q2 దేవుని భయం లేదు. \b \q1 \v 2 తమ పాపం బయటపడి దాన్ని ద్వేషించే వరకు \q2 వారు తమను తాము పొగడుకొంటారు. \q1 \v 3 వారి నోటి మాటల్లో దుష్టత్వం, మోసం నిండి ఉన్నాయి; \q2 వారు తెలివిగా వ్యవహరించడంలో, మంచి చేయడంలో విఫలమవుతారు. \q1 \v 4 వారి పడకలపై ఉండగానే చెడుకు కుట్ర చేస్తారు; \q2 వారు తమ పాప మార్గాల్లో వెళ్తారు \q2 తప్పును తిరస్కరించరు. \b \q1 \v 5 యెహోవా! మీ మారని ప్రేమ ఆకాశాన్ని \q2 మీ విశ్వాస్యత అంతరిక్షాన్ని తాకుతుంది. \q1 \v 6 మీ నీతి దేవుని ఉన్నత పర్వతాల్లా, \q2 మీ న్యాయం అగాధ సముద్రంలా ఉన్నాయి. \q2 యెహోవా! మీరు మనుష్యులను జంతువులను సంరక్షిస్తున్నారు. \q1 \v 7 దేవా! మీ మారని ప్రేమ ఎంత అమూల్యమైనది! \q2 నరులు మీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. \q1 \v 8 మీ మందిరంలోని సమృద్ధి వల్ల వారు సంతృప్తి పొందుతున్నారు; \q2 మీ ఆనంద నది నుండి మీరు వారికి త్రాగడానికి ఇస్తారు. \q1 \v 9 ఎందుకంటే మీ దగ్గర జీవపుఊట ఉంది; \q2 మీ వెలుగులోనే మేము వెలుగును చూడగలము. \b \q1 \v 10 మిమ్మల్ని ఎరిగిన వారిపైన మీ మారని ప్రేమను, \q2 యథార్థ హృదయులపై మీ నీతిని కొనసాగించండి. \q1 \v 11 గర్విష్ఠుల పాదం నాపైకి రానివ్వకండి, \q2 దుష్టుల చేతులు నన్ను తరుమనివ్వకండి. \q1 \v 12 కీడుచేసేవారు ఎలా కూలిపోయారో, \q2 క్రిందకు త్రోయబడి, మళ్ళీ లేవలేకుండ ఎలా ఉన్నారో చూడండి! \c 37 \cl కీర్తన 37\f + \cat dup\cat*\fr 37 \fr*\ft ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి\ft*\f* \d దావీదు కీర్తన. \q1 \v 1 దుష్టులను బట్టి బాధపడకు \q2 తప్పు చేసేవారిని చూసి అసూయపడకు; \q1 \v 2 గడ్డిలా వారు త్వరలోనే వాడిపోతారు, \q2 పచ్చ మొక్కల్లా వారు త్వరలోనే ఎండిపోతారు. \b \q1 \v 3 యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; \q2 దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు. \q1 \v 4 యెహోవాయందు ఆనందించు, \q2 ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తారు. \b \q1 \v 5 నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి; \q2 ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు. \q1 \v 6 ఆయన నీ నీతిని తెల్లవారు వెలుగులా ప్రకాశింపజేస్తారు, \q2 నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశింపజేస్తారు. \b \q1 \v 7 యెహోవా ముందు మౌనంగా ఉండు \q2 ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు. \q1 ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు \q2 వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు. \b \q1 \v 8 కోపం మాని ఆగ్రహాన్ని విడిచిపెట్టు; \q2 చింతించకు అది కీడుకే దారి తీస్తుంది. \q1 \v 9 చెడ్డవారు నాశనం చేయబడతారు, \q2 కాని యెహోవా కోసం నిరీక్షించే వారు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. \b \q1 \v 10 దుష్టులు కొంతకాలం తర్వాత కనుమరుగవుతారు; \q2 వారి కోసం వెదకినా వారు కనబడరు. \q1 \v 11 కాని సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు \q2 సమాధానం అభివృద్ధి కలిగి జీవిస్తారు. \b \q1 \v 12 దుష్టులు నీతిమంతుల మీద కుట్రలు పన్నుతారు, \q2 వారిని చూసి పళ్ళు కొరుకుతారు. \q1 \v 13 వారి సమయం దగ్గరపడింది, \q2 కాబట్టి ప్రభువు దుష్టులను చూసి నవ్వుతారు. \b \q1 \v 14 దుష్టులు కత్తి దూసి, \q2 విల్లు ఎక్కుపెట్టి, \q1 అవసరతలో ఉన్న దీనులను నిరుపేదలను పతనం చేయాలని \q2 యథార్థవంతులను హతమార్చాలని చూస్తారు. \q1 \v 15 వారి ఖడ్గాలు వారి గుండెల్లోకే దూసుకుపోతాయి, \q2 వారి విండ్లు విరిగిపోతాయి. \b \q1 \v 16 అనేకమంది దుష్టుల ధనం కంటే \q2 నీతిమంతుల దగ్గర ఉన్న కొంచెం మేలు. \q1 \v 17 దుష్టుల చేతులు విరిగిపోతాయి, \q2 నీతిమంతులను యెహోవా సంరక్షిస్తారు. \b \q1 \v 18 నిందారహితులు తమ రోజులు యెహోవా సంరక్షణలో గడుపుతారు, \q2 వారి వారసత్వం శాశ్వతంగా ఉంటుంది. \q1 \v 19 విపత్తు సమయాల్లో వారు వాడిపోరు; \q2 కరువు దినాల్లో వారు సమృద్ధిని అనుభవిస్తారు. \b \q1 \v 20 కాని దుష్టులు నశిస్తారు: \q2 యెహోవా శత్రువులు పొలంలో ఉండే పూవుల్లా ఉన్నా, \q2 వారు కాల్చబడతారు పొగలా పైకి వెళ్తారు. \b \q1 \v 21 దుష్టులు అప్పు తెచ్చుకుంటారు కాని తీర్చరు, \q2 కాని నీతిమంతులు దయ కలిగి ఇస్తారు. \q1 \v 22 యెహోవా ఆశీర్వదించినవారు భూమిని స్వాధీనపరచుకుంటారు, \q2 కాని ఆయన శపించినవారు నాశనమౌతారు. \b \q1 \v 23 తనను బట్టి ఆనందించేవారి అడుగులను \q2 యెహోవా స్థిరపరుస్తారు; \q1 \v 24 యెహోవా వారి చేతిని పట్టుకుంటారు, \q2 కాబట్టి వారు తొట్రిల్లినా పడిపోరు. \b \q1 \v 25 ఒకప్పుడు నేను యవ్వనస్థుడను ఇప్పుడు ముసలివాడినయ్యాను, \q2 అయినాసరే నీతిమంతులు విడిచిపెట్టబడడం \q2 వారి పిల్లలు ఆహారం అడుక్కోవడం నేనెప్పుడు చూడలేదు. \q1 \v 26 వారు ఎల్లప్పుడు దయ గలవారై ఉచితంగా అప్పు ఇస్తారు; \q2 వారి పిల్లలు దీవెనకరంగా ఉంటారు.\f + \fr 37:26 \fr*\ft లేదా \ft*\fqa వారి పిల్లల పేర్లు దీవించడానికి వాడబడతాయి \+xt ఆది 48:20\+xt*\fqa*\f* \b \q1 \v 27 కీడు చేయడం మాని మేలు చేయి; \q2 అప్పుడు నీవు శాశ్వతంగా దేశంలో నివసిస్తావు. \q1 \v 28 యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు \q2 తన నమ్మకస్థులను ఆయన విడిచిపెట్టరు. \b \q1 ఆయన వారిని శాశ్వతంగా భద్రపరుస్తారు; \q2 కాని దుష్టుల సంతానం నశిస్తుంది. \q1 \v 29 నీతిమంతులు భూమిని వారసత్వంగా పొందుకొని \q2 అందులో చిరకాలం నివసిస్తారు. \b \q1 \v 30 నీతిమంతుల నోరు జ్ఞానాన్ని పలుకుతుంది, \q2 వారి నాలుక న్యాయమైనది మాట్లాడుతుంది. \q1 \v 31 వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉంది; \q2 వారి పాదాలు జారవు. \b \q1 \v 32 దుష్టులు నీతిమంతులను చంపాలని \q2 దారిలో పొంచి ఉంటారు. \q1 \v 33 కాని యెహోవా వారిని దుష్టుల చేతికి అప్పగించరు, \q2 వారు విచారణకు వచ్చినప్పుడు వారిని శిక్షింపబడనీయరు. \b \q1 \v 34 యెహోవాయందు నిరీక్షణ ఉంచి \q2 ఆయన మార్గాన్ని అనుసరించు. \q1 భూమిని వారసత్వంగా పొందేలా ఆయన నిన్ను హెచ్చిస్తారు; \q2 దుష్టులు నాశనమైనప్పుడు నీవు చూస్తావు. \b \q1 \v 35 నేను దుష్టులను, క్రూరులైన మనుష్యులను చూశాను; \q2 వారు స్వస్థలంలో ఏపుగా పెరుగుతున్న చెట్టులా ఉన్నారు. \q1 \v 36 కాని అంతలోనే వారు గతించిపోయారు; \q2 నేను వారి కోసం వెదికినా వారు కనబడలేదు. \b \q1 \v 37 నిర్దోషులను గమనించు, యథార్థ హృదయులను గమనించు; \q2 సమాధానం వెదకే వారి కోసం భవిష్యత్తు వేచి ఉంది. \q1 \v 38 కాని పాపులందరు నశిస్తారు, \q2 దుష్టులకు భవిష్యత్తు ఉండదు. \b \q1 \v 39 నీతిమంతుల రక్షణ యెహోవా నుండి వస్తుంది; \q2 కష్ట సమయంలో ఆయన వారికి బలమైన కోట. \q1 \v 40 యెహోవా వారికి సాయం చేసి వారిని విడిపిస్తారు; \q2 వారు ఆయనను ఆశ్రయిస్తారు కాబట్టి, \q2 దుష్టుల చేతి నుండి ఆయన వారిని విడిపించి రక్షిస్తారు. \c 38 \cl కీర్తన 38 \d దావీదు దేవునికి విన్నవించుకున్న కీర్తన \q1 \v 1 యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి \q2 ఉగ్రతలో నన్ను శిక్షించకండి. \q1 \v 2 మీ బాణాలు నాకు గుచ్చుకున్నాయి, \q2 మీ చేయి నా మీద బరువుగా పడింది. \q1 \v 3 మీ ఉగ్రత వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు; \q2 నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో నెమ్మది లేదు. \q1 \v 4 నా దోషం భరించలేని భారంలా \q2 నన్ను ముంచెత్తింది. \b \q1 \v 5 నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల \q2 నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి. \q1 \v 6 నేను చాలా క్రుంగిపోయాను; \q2 దినమంతా దుఃఖంలోనే ఉన్నాను. \q1 \v 7 నా వీపు తీవ్రమైన బాధతో ఉంది \q2 నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది, \q1 \v 8 నేను బలహీనంగా ఉన్నాను పూర్తిగా నలిగిపోయాను; \q2 నేను హృదయ వేదనతో మూలుగుతున్నాను. \b \q1 \v 9 ప్రభువా, నా కోరికలన్నీ మీ ముందు ఉన్నాయి; \q2 నా నిట్టూర్పు మీ నుండి ఉంది. \q1 \v 10 నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది; \q2 నా కంటి చూపు తగ్గిపోతుంది. \q1 \v 11 నా గాయాల వల్ల నా స్నేహితులు నా సహచరులు నన్ను దూరం పెడుతున్నారు; \q2 నా పొరుగువారు నన్ను దూరంగా ఉంచుతున్నారు. \q1 \v 12 నన్ను చంపాలనుకున్నవారు ఉచ్చులు బిగుస్తున్నారు, \q2 నాకు హాని కలిగించేవారు నా పతనం గురించి మాట్లాడుతున్నారు; \q2 రోజంతా వారు కుట్రలు చేస్తున్నారు. \b \q1 \v 13 చెవిటివానిలా నేను వినక ఉన్నాను, \q2 మూగవానిలా మాట్లాడక ఉన్నాను; \q1 \v 14 నేను వినలేనివానిగా అయ్యాను, \q2 జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను. \q1 \v 15 యెహోవా, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను; \q2 ప్రభువా నా దేవా, మీరు జవాబిస్తారు. \q1 \v 16 నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు \q2 వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను. \b \q1 \v 17 నేను పడిపోయేలా ఉన్నాను, \q2 నా బాధ నిత్యం నాతోనే ఉంది. \q1 \v 18 నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను; \q2 నా పాపాన్ని గురించి బాధపడుతున్నాను. \q1 \v 19 కారణం లేకుండ అనేకులు నాకు శత్రువులయ్యారు; \q2 కారణం లేకుండ అనేకులు నన్ను ద్వేషిస్తున్నారు; \q1 \v 20 నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు, \q2 నేను మంచిని మాత్రమే అనుసరిస్తున్నా సరే, \q2 వారు నన్ను వ్యతిరేకిస్తున్నారు. \b \q1 \v 21 యెహోవా, నన్ను విడువకండి; \q2 నా దేవా, నాకు దూరంగా ఉండకండి. \q1 \v 22 నా ప్రభువా నా రక్షకా, \q2 త్వరగా వచ్చి నాకు సాయం చేయండి. \c 39 \cl కీర్తన 39 \d సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన. \q1 \v 1 నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి \q2 నా మార్గాలను సరిచూసుకుంటాను; \q1 దుష్టులు నా దగ్గర ఉన్నప్పుడు \q2 నా నోటికి చిక్కం పెట్టుకుంటాను” అని అన్నాను. \q1 \v 2 అందువల్ల నేను ఏమీ మాట్లాడకుండా \q2 పూర్తిగా మౌనంగా ఉండిపోయాను. \q1 కానీ నా వేదన అధికమయ్యింది; \q2 \v 3 నా గుండె నాలో వేడెక్కింది. \q1 నేను ధ్యానిస్తూ ఉండగా మంట రగులుకుంది; \q2 అప్పుడు నోరు తెరచిమాట్లాడాను: \b \q1 \v 4 “యెహోవా, నా జీవిత ముగింపు \q2 నా రోజుల సంఖ్యను నాకు చూపించండి; \q2 నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి. \q1 \v 5 మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు; \q2 నా జీవితకాలం మీ ఎదుట శూన్యము. \q1 భద్రత గలవారిగా అనిపించినా, \q2 మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. \qs సెలా\qs* \b \q1 \v 6 “నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు; \q2 వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే \q2 వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు. \b \q1 \v 7 “కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను? \q2 మీలోనే నా నిరీక్షణ. \q1 \v 8 నా అతిక్రమాలన్నిటి నుండి నన్ను విడిపించండి; \q2 మూర్ఖులు ఎగతాళి చేయడానికి నన్ను లక్ష్యంగా చేయకండి. \q1 \v 9 ఇదంతా చేసింది మీరే కాబట్టి \q2 నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను. \q1 \v 10 దయచేసి నన్ను కొట్టడం ఆపేయండి; \q2 మీ చేతి దెబ్బలకు నేను అలసిపోతున్నాను. \q1 \v 11 మీరు మనుష్యులను వారి పాపం విషయంలో మందలించినప్పుడు, \q2 చిమ్మెటలా మీరు వారి సంపదను హరించివేస్తారు. \q2 మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. \qs సెలా\qs* \b \q1 \v 12 “యెహోవా, నా ప్రార్థన వినండి, \q2 నా మొర ఆలకించండి. \q1 నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. \q2 నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను. \q1 \v 13 నేను గతించిపోకముందు మళ్ళీ ఆనందించేలా \q2 మీ చూపును నా నుండి త్రిప్పివేయండి.” \c 40 \cl కీర్తన 40 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; \q2 ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు. \q1 \v 2 నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు, \q2 బురద ఊబిలో నుండి లేపి \q1 నా పాదాలను బండ మీద నిలిపారు. \q2 నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు. \q1 \v 3 మన దేవునికి ఒక స్తుతి పాటను, \q2 ఆయన నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు. \q1 అనేకులు ఆయన చేసింది చూసి ఆయనకు భయపడతారు. \q2 వారు యెహోవాలో నమ్మకం ఉంచుతారు. \b \q1 \v 4 గర్విష్ఠుల వైపు చూడక \q2 అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక, \q2 యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు. \q1 \v 5 యెహోవా నా దేవా, \q2 మీరు మాకోసం ఎన్నో అద్భుతాలు చేశారు, \q2 ఎన్నో ప్రణాళికలు వేశారు. \q1 మీతో పోల్చదగిన వారు లేరు; \q2 మీ క్రియల గురించి నేను చెప్పాలనుకుంటే \q2 అవి లెక్కకు మించినవి. \b \q1 \v 6 బలిని అర్పణను మీరు కోరలేదు, \q2 కాని మీరు నా చెవులు తెరిచారు, \q2 హోమాలు పాపపరిహార బలులు\f + \fr 40:6 \fr*\ft లేదా \ft*\fqa శుద్ధీకరణ అర్పణలు\fqa*\f* మీరు కోరలేదు. \q1 \v 7 అప్పుడు నేను ఇలా అన్నాను, “ఇదిగో నేను ఉన్నాను. \q2 గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాసి ఉంది. \q1 \v 8 నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; \q2 మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.” \b \q1 \v 9 యెహోవా! మీకు తెలిసినట్టుగా, \q2 నేను నా పెదవులు మూసుకోకుండ \q2 మహా సమాజంలో మీ నీతిని గురించిన సువార్త ప్రకటించాను. \q1 \v 10 మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను; \q2 మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను. \q1 మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి \q2 మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను. \b \q1 \v 11 యెహోవా, మీ కరుణను నాకు దూరం చేయకండి; \q2 మీ మారని ప్రేమ మీ విశ్వాస్యత నిత్యం నన్ను కాపాడును గాక. \q1 \v 12 లెక్కలేనన్ని ఆపదలు నన్ను చుట్టి ఉన్నాయి; \q2 నా పాపాలు నన్ను పట్టుకున్నాయి, \q2 నేనేమి చూడలేని స్థితిలో ఉన్నాను. \q1 అవి నా తలవెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి, \q2 నా గుండె చెదిరిపోతుంది. \q1 \v 13 యెహోవా, సంతోషంగా నన్ను రక్షించడానికి, \q2 యెహోవా నాకు సాయం చేయడానికి త్వరగా రండి. \b \q1 \v 14 నా ప్రాణం తీయాలని కోరేవారందరు \q2 సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; \q1 నా పతనాన్ని కోరేవారందరు \q2 అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి. \q1 \v 15 నన్ను చూసి, “ఆహా! ఆహా!” అనేవారు \q2 వారికి కలిగే అవమానానికి ఆశ్చర్యానికి గురి కావాలి. \q1 \v 16 అయితే మిమ్మల్ని వెదికేవారంతా \q2 మీలో ఆనందించి సంతోషించాలి; \q1 మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, \q2 “యెహోవా గొప్పవాడు!” అని అనాలి. \b \q1 \v 17 కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను; \q2 ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక. \q1 మీరే నా సహాయం, నా విమోచకుడు; \q2 మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి. \c 41 \cl కీర్తన 41 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 పేదవారిపై శ్రద్ధచూపువారు ధన్యులు; \q2 అలాంటి వారిని యెహోవా కష్ట దినాన విడిపిస్తారు. \q1 \v 2 యెహోవా వారిని కాపాడి సజీవంగా ఉంచుతారు, \q2 వారు దేశంలో ఆశీర్వదింపబడిన వారుగా పిలువబడతారు. \q2 ఆయన వారిని తమ శత్రువుల కోరికకు అప్పగించరు. \q1 \v 3 యెహోవా వారి రోగ పడక మీద వారికి స్వస్థత కలిగిస్తారు; \q2 వారి అనారోగ్యం నుండి మీరు వారికి స్వస్థత కలుగ చేస్తారు. \b \q1 \v 4 “యెహోవా, నన్ను కరుణించండి; \q2 నన్ను స్వస్థపరచండి, మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.” \q1 \v 5 నా శత్రువులు, \q2 “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” \q2 అని నా గురించి చెప్పుకుంటున్నారు. \q1 \v 6 నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు, \q2 వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు; \q2 వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు. \b \q1 \v 7 నా శత్రువులంతా ఏకమై నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు; \q2 నాకు కీడును తలపెడుతున్నారు. \q1 \v 8 “దుష్టమైన వ్యాధి అతనికి కలిగింది; \q2 కాబట్టి వాడు పడక నుండి మళ్ళీ లేవడు” అంటున్నారు. \q1 \v 9 నేను నమ్మిన \q2 నా దగ్గరి స్నేహితుడు, \q1 నా ఆహారం తిన్నవాడే, \q2 నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు. \b \q1 \v 10 యెహోవా, నన్ను కరుణించి; \q2 వారి మీద ప్రతీకారం తీర్చుకొనేలా నన్ను పైకి లేవనెత్తండి. \q1 \v 11 నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి, \q2 నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను. \q1 \v 12 నా నిజాయితీని బట్టి మీరు నన్ను నిలబెట్టారు, \q2 మీరు నన్ను నిత్యం మీ సన్నిధిలో స్థిరపరిచారు. \b \b \q1 \v 13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే \q2 నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతింపబడును గాక! \qc ఆమేన్. ఆమేన్. \c 42 \ms రెండవ గ్రంథము \mr కీర్తనలు 42–72 \cl కీర్తన 42 \d సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. \q1 \v 1 నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు, \q2 నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది. \q1 \v 2 నా ప్రాణం దేవుని కోసం సజీవుడైన దేవుని కోసం దప్పికతో ఉన్నది. \q2 నేనెప్పుడు ఆయన సన్నిధికి వెళ్లి ఆయనను కలుస్తాను? \q1 \v 3 “మీ దేవుడు ఎక్కడున్నాడు?” \q2 అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు, \q2 నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి. \q1 \v 4 ఒకప్పుడు జనసమూహంతో కలిసి \q2 పెద్ద ఊరేగింపుగా, \q1 ఆనందోత్సాహాలతో స్తుతులు చెల్లిస్తూ \q2 దేవుని మందిరానికి ఎలా వెళ్లేవాడినో \q1 జ్ఞాపకం చేసుకుని \q2 నా ప్రాణం నాలో క్రుంగిపోతుంది. \b \q1 \v 5 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? \q2 నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? \q1 దేవుని మీద నిరీక్షణ ఉంచు, \q2 ఆయనే నా రక్షకుడు నా దేవుడు, \q2 నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను. \b \q1 \v 6 నా దేవా, ఈ బరువు మోయలేక నా మనస్సు క్రుంగిపోయింది; \q2 యొర్దాను ప్రాంతం నుండి \q1 హెర్మోను పర్వత శిఖరాల నుండి మిసారు గుట్టలపై నుండి \q2 నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. \q1 \v 7 మీ ప్రవాహాల గర్జనతో \q2 అగాధం అగాధాన్ని పిలుస్తుంది; \q1 మీ తరంగాలు అలలు \q2 నా మీదుగా పొర్లి పారుతున్నాయి. \b \q1 \v 8 పగటివేళ యెహోవా తన మారని ప్రేమ కుమ్మరిస్తారు, \q2 రాత్రివేళ ఆయన పాట నాకు తోడై ఉండి \q2 నా జీవదాతయైన దేవునికి ఒక ప్రార్థనగా ధ్వనిస్తుంది. \b \q1 \v 9 నా కొండ అయిన దేవునితో, \q2 “మీరు నన్నెందుకు మరచిపోయారు? \q1 శత్రువులు నన్ను అణగద్రొక్కుతుంటే \q2 శోకంతో నేనెందుకిలా వెళ్లాలి?” అని మొరపెట్టాను. \q1 \v 10 రోజుంతా అదే పనిగా నా విరోధులు, \q2 “మీ దేవుడెక్కడ?” అని అంటూ \q1 నన్ను గేలి చేస్తూ ఉంటే \q2 నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి. \b \q1 \v 11 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? \q2 నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? \q1 దేవుని మీద నిరీక్షణ ఉంచు, \q2 ఆయనే నా రక్షకుడు నా దేవుడు \q2 నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను. \c 43 \cl కీర్తన 43 \q1 \v 1 నా దేవా, నాకు న్యాయం తీర్చండి, \q2 భక్తిహీనులైన ప్రజలకు వ్యతిరేకంగా \q2 నా పక్షంగా వాదించి, \q1 మోసగాళ్ల నుండి దుష్టుల నుండి \q2 నన్ను విడిపించండి. \q1 \v 2 మీరే దేవుడు, నా బలమైన కోట. \q2 నన్నెందుకు ఇలా తిరస్కరించారు? \q1 శత్రువులచేత అణచివేయబడుతూ \q2 నేనెందుకు దుఃఖంతో గడపాలి? \q1 \v 3 మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి; \q2 అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి \q2 మీ నివాసస్థలానికి నడిపిస్తాయి. \q1 \v 4 అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్తాను, \q2 నా ఆనందం సంతోషం కలిగించే దేవుని దగ్గరకు వెళ్తాను. \q1 దేవా! నా దేవా! \q2 వీణతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను. \b \q1 \v 5 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? \q2 నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? \q1 దేవుని మీద నిరీక్షణ ఉంచు, \q2 ఆయనే నా రక్షకుడు నా దేవుడు \q2 నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను. \c 44 \cl కీర్తన 44 \d సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. \q1 \v 1 ఓ దేవా! మా పూర్వికుల రోజుల్లో \q2 పురాతన కాలంలో \q1 మీరు చేసినదంతా \q2 మా పితరులు మాకు చెప్పారు. \q1 \v 2 మీ స్వహస్తంతో దేశాలను వెళ్లగొట్టారు \q2 మా పూర్వికులను అక్కడ నిలబెట్టారు; \q1 ఆయా జాతుల ప్రజలను నాశనం చేసి \q2 మా పూర్వికులను వర్ధిల్లేలా చేశారు. \q1 \v 3 తమ ఖడ్గంతో ఈ దేశాన్ని వారు వశం చేసుకోలేదు, \q2 తమ భుజబలంతో విజయం సాధించలేదు; \q1 మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీ కుడిచేయి మీ భుజబలం \q2 మీ ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది. \b \q1 \v 4 మీరే మా రాజు, మీరే మా దేవుడు, \q2 యాకోబు ప్రజలకు విజయం కలగాలని ఆజ్ఞాపిస్తారు. \q1 \v 5 మీ వలన విరోధులను పడగొట్టగలం; \q2 మా మీదికి ఎగబడే వారిని మీ పేరట అణచివేయగలము. \q1 \v 6 మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు, \q2 మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు. \q1 \v 7 మా విరోధులపై మాకు విజయమిచ్చేది మీరే, \q2 మీరే పగవారికి సిగ్గుపడేలా చేశారు. \q1 \v 8 దేవుని యందు మేము దినమంతా అతిశయిస్తాం \q2 మీ నామాన్ని నిత్యం స్తుతిస్తాము. \qs సెలా\qs* \b \q1 \v 9 కాని ఇప్పుడైతే మీరు మమ్మల్ని త్రోసివేసి అవమానపరిచారు; \q2 మా సైన్యంతో మీరు రావడం లేదు. \q1 \v 10 శత్రువుల ముందు పారిపోవలసి వచ్చింది, \q2 పగవారు మమ్మల్ని దోచుకున్నారు. \q1 \v 11 గొర్రెలను ఆహారంగా ఇచ్చినట్లు మమ్మల్ని వారికిచ్చారు \q2 దేశాల మధ్యకు మమ్మల్ని చెదరగొట్టారు. \q1 \v 12 లాభం చూసుకోకుండా నీ ప్రజలను, \q2 తక్కువ వెలకు అమ్మేశారు. \b \q1 \v 13 పొరుగువారు మమ్మల్ని నిందించేలా చేశారు; \q2 మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఎగతాళి చేసేలా చేశారు. \q1 \v 14 మమ్మల్ని జనాల నోట సామెతలా చేశారు; \q2 జనాంగాలు తలలూపుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. \q1 \v 15-16 నిందిస్తూ హేళన చేసేవారి కారణంగా \q2 పగ తీర్చుకోవాలనుకునే శత్రువుల కారణంగా \q2 శత్రువులు మా ఎదుటకు వస్తే, \q1 దినమంతా మాకు అవమానమే; \q2 సిగ్గు మా ముఖాన్ని కమ్మివేసింది. \b \q1 \v 17 ఇదంతా మా మీదికి వచ్చిపడినా, \q2 మేము మిమ్మల్ని మరవలేదు; \q2 మీ నిబంధన విషయం నమ్మకద్రోహులం కాలేదు. \q1 \v 18 మా హృదయం వెనుదీయలేదు; \q2 మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు. \q1 \v 19 నక్కలు తిరిగే చోట మీరు మమ్మల్ని నలగ్గొట్టి పడేశారు; \q2 చావు నీడ మమ్మల్ని ఆవరించి ఉన్నది. \b \q1 \v 20 ఒకవేళ మేము మా దేవుని పేరు మరచినా, \q2 పరదేశి దేవుని వైపు చేతులు చాపినా, \q1 \v 21 హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు \q2 ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా? \q1 \v 22 అయినా రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; \q2 వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు. \b \q1 \v 23 ప్రభువా, లెండి! ఎందుకీ నిద్ర? \q2 లెండి మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టకండి. \q1 \v 24 మీ ముఖాన్ని మా నుండి ఎందుకు దాచుకుంటున్నారు? \q2 నా బాధను నా హింసను మరచిపోయారా? \b \q1 \v 25 మేము క్రుంగి నేలకు ఒరిగిపోయాము; \q2 మా దేహాలు నేలకు అంటుకుపోయాయి. \q1 \v 26 లేచి మాకు సాయం చేయండి; \q2 మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి. \c 45 \cl కీర్తన 45 \d సంగీత దర్శకునికి. షోషనీయులను రాగం మీద పాడదగినది. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. పెళ్ళి గీతము. \q1 \v 1 నేను రాజు కోసం వ్రాసిన పద్యాలు వల్లించేటప్పుడు, \q2 నా హృదయం ఓ మంచి అంశంతో ఉప్పొంగింది; \q2 నా నాలుక నైపుణ్యం కలిగిన రచయిత కలము. \b \q1 \v 2 మీరు మనుష్యుల్లో అత్యంత అద్భుతమైనవారు \q2 మీ పెదవులపై దయ నిండి ఉంది, \q2 దేవుడు మిమ్మల్ని నిత్యం ఆశీర్వదిస్తారు. \b \q1 \v 3 బలాఢ్యుడా, మీ ఖడ్గాన్ని నడుముకు కట్టుకోండి; \q2 వైభవం ప్రభావాలను ధరించుకోండి. \q1 \v 4 సత్యం, వినయం, న్యాయం కోసం \q2 మీ వైభవంతో విజయవంతంగా ముందుకు సాగిపోండి. \q2 మీ కుడిచేయి భీకరమైన క్రియలు సాధించాలి. \q1 \v 5 పదునైన మీ బాణాలు శత్రురాజుల గుండెలను చీల్చుకునిపోతాయి. \q2 మీ పాదాల క్రింద జనాలు కూలి పడతారు. \q1 \v 6 ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; \q2 మీ న్యాయ దండమే మీ రాజ్య దండం. \q1 \v 7 మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తారు; \q2 కాబట్టి దేవుడు, మీ దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, \q2 మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు. \q1 \v 8 మీరు ధరించిన వస్త్రాలన్ని గోపరసం, అగరు, లవంగపట్ట సుగంధంతో గుభాళిస్తున్నాయి. \q2 దంతం చేత అలంకరించబడిన భవనాలలో నుండి \q2 తంతి వాయిద్యాలు మోగుతూ ఉంటే మీకెంతో ఆనందము. \q1 \v 9 ఘనత వహించిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. \q2 ఓఫీరు దేశపు సువర్ణాభరణాలతో అలంకరించుకుని రాణి మీ కుడి ప్రక్కన నిలిచి ఉంది. \b \q1 \v 10 కుమారీ, విను, శ్రద్ధగా ఈ మాటలు విను: \q2 నీ సొంత ప్రజలను నీ పుట్టింటిని మరచిపో. \q1 \v 11 రాజు నీ అందానికి పరవశించును గాక; \q2 ఆయన నీ ప్రభువు, ఆయనను ఘనపరచు. \q1 \v 12 తూరు నగర కుమారి కానుకలతో మీ దగ్గరకు వస్తుంది, \q2 ధనికులు మీ దయ కోసం చూస్తారు. \q1 \v 13 అంతఃపురంలో రాజకుమారి వైభవంలో నిండుతనం ఉంది. \q2 ఆమె ధరించిన ఖరీదైన వస్త్రాలు బంగారంతో బుట్టా వేసినవి. \q1 \v 14 అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు ఆమె ధరించింది. \q2 ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తారు; \q2 ఆమె వెంట చెలికత్తెలు కన్యలు వస్తారు. \q1 \v 15 వారిని ఆనందోత్సాహాలతో తీసుకురాగా, \q2 వారు రాజభవనంలో ప్రవేశిస్తారు. \b \q1 \v 16 నీ కుమారులు నీ పూర్వికుల స్థానాన్ని తీసుకుంటారు; \q2 వారిని దేశమంతట అధికారులుగా నియమిస్తావు. \b \q1 \v 17 నీ నామం తరతరాలు జ్ఞాపకం ఉండేలా చేస్తాను; \q2 ఈ కారణంగా జనములు నిత్యం నీకు కృతజ్ఞతలు చెప్తారు. \c 46 \cl కీర్తన 46 \d సంగీత దర్శకునికి. అలామోతు రాగంలో కోరహు కుమారుల గీతము. \q1 \v 1 దేవుడు మనకు ఆశ్రయం బలం, \q2 ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం \q1 \v 2 కాబట్టి భూమి మార్పుచెందినా, \q2 నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము. \q1 \v 3 జలాలు గర్జించినా నురుగు కట్టినా \q2 పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. \qs సెలా\qs* \b \q1 \v 4 అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి, \q2 అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము. \q1 \v 5 అందులో దేవుడున్నారు, అది కూలదు; \q2 తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు. \q1 \v 6 దేశాలు గందరగోళంలో ఉన్నాయి, రాజ్యాలు కూలిపోతాయి; \q2 దేవుని స్వరం ఉరుముతుంది, భూమి కరుగుతుంది. \b \q1 \v 7 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; \q2 యాకోబు దేవుడు మనకు కోట. \qs సెలా\qs* \b \q1 \v 8 రండి యెహోవా చేసిన క్రియలను చూడండి, \q2 లోకంలో నాశనాన్ని ఆయన ఎలా తెస్తారో చూడండి. \q1 \v 9 ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద \q2 యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు. \q1 విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు; \q2 రథాలను\f + \fr 46:9 \fr*\ft లేదా \ft*\fqa కవచాలు\fqa*\f* అగ్నితో కాల్చేస్తారు. \q1 \v 10 “ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; \q2 దేశాల్లో నేను హెచ్చింపబడతాను, \q2 భూమి మీద నేను హెచ్చింపబడతాను.” \b \q1 \v 11 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; \q2 యాకోబు దేవుడు మనకు కోట. \qs సెలా\qs* \c 47 \cl కీర్తన 47 \d సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. \q1 \v 1 సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; \q2 దేవునికి ఆనందంతో కేకలు వేయండి. \b \q1 \v 2 మహోన్నతుడైన యెహోవా భయంకరుడు, \q2 భూమి అంతటికి ఆయన గొప్ప రాజు. \q1 \v 3 ఆయన దేశాలను మన వశం చేశారు, \q2 జనాలను మన పాదాల క్రింద ఉంచారు. \q1 \v 4 మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు. \q2 అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము. \qs సెలా\qs* \b \q1 \v 5 దేవుడు జయధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు, \q2 యెహోవా బూరధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు. \q1 \v 6 దేవునికి స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి; \q2 మన రాజుకు స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి. \q1 \v 7 దేవుడు భూమి అంతటికి రాజు; \q2 ఆయనకు స్తుతికీర్తన పాడండి. \b \q1 \v 8 దేవుడు దేశాలను పరిపాలిస్తున్నారు; \q2 దేవుడు తన పవిత్ర సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. \q1 \v 9 దేశాల అధిపతులు సమకూడతారు \q2 అబ్రాహాము దేవుని ప్రజలుగా సమకూడతారు \q1 భూమి మీద డాళ్లు\f + \fr 47:9 \fr*\ft లేదా \ft*\fqa రాజులు\fqa*\f* దేవునికి చెందినవి; \q2 ఆయన గొప్పగా హెచ్చింపబడ్డారు. \c 48 \cl కీర్తన 48 \d ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. \q1 \v 1 మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద \q2 యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రార్హుడు. \b \q1 \v 2 మహారాజు పట్టణమైన సీయోను పర్వతం \q2 సాఫోన్\f + \fr 48:2 \fr*\fq సాఫోన్ \fq*\ft కనానీయుల చేత అతి పవిత్ర పర్వతముగా పరిగణించబడింది.\ft*\f* ఎత్తైన స్థలంలా \q1 అందంగా కనిపిస్తూ \q2 సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది. \q1 \v 3 దేవుడు ఆమె\f + \fr 48:3 \fr*\fq ఆమె \fq*\ft ఇక్కడ యెరూషలేమును సూచిస్తుంది.\ft*\f* కోటలలో ఉన్నారు; \q2 ఆయనే దానికి కోట అని చూపించారు. \b \q1 \v 4 రాజులు దళాలతో కలిసి, \q2 వారు ముందుకు వచ్చినప్పుడు, \q1 \v 5 వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు; \q2 వారు భయంతో పారిపోయారు. \q1 \v 6 వారిలో వణుకు పుట్టింది, \q2 ప్రసవ వేదనలాంటి బాధ వారికి కలిగింది. \q1 \v 7 తూర్పు గాలితో బద్దలైన తర్షీషు ఓడల్లా \q2 మీరు వారిని నాశనం చేశారు. \b \q1 \v 8 మనం విన్నదే, \q2 మనం చూశాం; \q1 సైన్యాల యెహోవా పట్టణంలో, \q2 మన దేవుని పట్టణంలో, \q1 దేవుడు దాన్ని నిత్యం \q2 సుస్థిరంగా ఉండేలా చేస్తారు. \qs సెలా\qs* \b \q1 \v 9 దేవా! మీ మందిరం మధ్యలో \q2 మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము. \q1 \v 10 ఓ దేవా, మీ పేరులా, \q2 మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది; \q2 మీ కుడిచేయి నీతితో నిండి ఉంది. \q1 \v 11 మీ తీర్పులను బట్టి \q2 సీయోను పర్వతం ఆనందిస్తుంది \q2 యూదా పట్టణాలు\f + \fr 48:11 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కుమార్తెలు అని వాడబడింది\fqa*\f* సంతోషంగా ఉన్నాయి. \b \q1 \v 12 సీయోను వైపు వెళ్లండి, దాని చుట్టూ నడవండి, \q2 దాని బురుజులెన్నో లెక్కించండి. \q1 \v 13 ఆమె గురించి రాబోయే తరం వారికి \q2 మీరు చెప్పగలిగేలా, \q1 దాని కోటగోడలను పరిశీలించండి, \q2 దాని కోటలను చూడండి. \b \q1 \v 14 ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు; \q2 ఆయన చివరి వరకు నడిపిస్తారు. \c 49 \cl కీర్తన 49 \d సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. \q1 \v 1 సర్వజనులారా, ఈ విషయం వినండి; \q2 సర్వ లోకవాసులారా, ఆలకించండి, \q1 \v 2 సామాన్యులారా, గొప్పవారలారా \q2 ధనికులారా పేదలారా అందరు వినండి: \q1 \v 3 నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది; \q2 నా హృదయ ధ్యానం మీకు అవగాహన ఇస్తుంది. \q1 \v 4 నేను నా చెవిని సామెత వైపు త్రిప్పుతాను \q2 వీణతో నేను నా పొడుపు కథను విప్పుతాను: \b \q1 \v 5 దుర్దినాలు వచ్చినప్పుడు, నా శత్రువుల పాపం \q2 నన్ను చుట్టుముట్టినప్పుడు నేనెందుకు భయపడాలి? \q1 \v 6 వారు తమ సంపదను నమ్మి, \q2 తమ ఐశ్వర్యాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటారు. \q1 \v 7 ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు \q2 వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు. \q1 \v 8-9 వారు కుళ్లు చూడక, \q2 నిత్యం బ్రతకాలంటే \q1 వారి ప్రాణ విమోచన వెల చాలా ఎక్కువ \q2 అది ఎన్నటికి చెల్లించబడలేదు. \q1 \v 10 తమ సంపదను ఇతరులకు వదిలేసి \q2 జ్ఞానులు చనిపోవడం, \q2 మూర్ఖులు తెలివిలేనివారు నశించడం అందరు చూస్తారు. \q1 \v 11 వారు తమ భూములకు తమ పేర్లే పెట్టుకున్నప్పటికి \q2 సమాధే వారి నిత్య నివాసము \q2 అక్కడే వారు నిత్యం నివసిస్తారు. \b \q1 \v 12 మనుష్యులు ఎంత సంపద ఉన్నా నశించకుండ ఉండలేరు; \q2 నశించే జంతువుల్లా వారు ఉన్నారు. \b \q1 \v 13 తమను తాము నమ్ముకొనే బుద్ధిహీనులకు, \q2 వారు చెప్పేది వింటూ వారిని అనుసరించేవారికి ఇదే గతి. \qs సెలా\qs* \q1 \v 14 వారు గొర్రెల్లా ఉండి మరణానికి నడిపించబడతారు; \q2 మరణమే వారికి కాపరి. \q2 యథార్థవంతులు ఉదయం వారిని పరిపాలిస్తారు. \q1 వారి రాజభవనాలకు దూరంగా, \q2 సమాధిలో వారి మృతదేహాలు కుళ్ళిపోతాయి. \q1 \v 15 కానీ దేవుడు పాతాళం నుండి నన్ను విడిపిస్తారు; \q2 ఆయన తప్పకుండ నన్ను తన దగ్గరకు తీసుకెళ్తారు. \qs సెలా\qs* \q1 \v 16 కాబట్టి ఇతరులు ధనవంతులుగా ఎదిగినప్పుడు, \q2 వారి ఇండ్ల వైభవం అధికమైనప్పుడు భయపడవద్దు. \q1 \v 17 ఎందుకంటే వారు చనిపోయినప్పుడు వారు తమతో ఏమీ తీసుకెళ్లరు, \q2 వారి వైభవం వారి వెంట దిగిపోదు. \q1 \v 18 వారు బ్రతికి ఉన్నప్పుడు ఆశీర్వదింపబడిన వారిగా తమను తాము పిలుచుకున్నా, \q2 వారు అభివృద్ధి చెందినప్పుడు ప్రజలు వారిని పొగిడినా, \q1 \v 19 వారు తమకంటే ముందుగా వెళ్లిపోయినవారిని చేరుకుంటారు, \q2 వారు మరి ఎన్నడూ జీవపు వెలుగును చూడరు. \b \q1 \v 20 సంపద ఉండి వివేకంలేని మనుష్యులు \q2 నశించే జంతువుల్లాంటి వారు. \c 50 \cl కీర్తన 50 \d ఆసాపు కీర్తన. \q1 \v 1 దేవుడైన యెహోవా, బలాఢ్యుడు, \q2 భూమితో మాట్లాడతారు, \q2 సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు వారందరిని పిలుస్తారు. \q1 \v 2 సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి, \q2 దేవుడు ప్రకాశిస్తారు. \q1 \v 3 మన దేవుడు వస్తారు \q2 మౌనంగా ఉండరు; \q1 ఆయన ముందు మ్రింగివేసే అగ్ని ఉంది \q2 ఆయన చుట్టూ బలమైన తుఫాను చెలరేగుతుంది. \q1 \v 4 తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి \q2 పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు. \q1 \v 5 “బలి అర్పణల వల్ల నాతో నిబంధన చేసుకున్న \q2 భక్తులను నా ఎదుట సమావేశపరచండి.” \q1 \v 6 ఆకాశాలు దేవుని నీతిని ప్రకటిస్తాయి, \q2 ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. \qs సెలా\qs* \b \q1 \v 7 “నా ప్రజలారా! వినండి. నేను మాట్లాడతాను; \q2 ఇశ్రాయేలు, మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాను: \q2 నేను దేవుడను, మీ దేవుడను. \q1 \v 8 మీ బలుల గురించి లేదా ఎప్పుడు నా ఎదుటే ఉండే మీ దహనబలుల గురించి, \q2 నేను మీకు వ్యతిరేకంగా ఎటువంటి ఆరోపణలు చేయను. \q1 \v 9 మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు. \q2 మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు. \q1 \v 10 అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే \q2 వేయి కొండలపై ఉన్న పశువులు నావే. \q1 \v 11 పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, \q2 పొలాల్లో ఉన్న జంతువులు నావే. \q1 \v 12 నాకు ఆకలిగా ఉంటే నేను మీకు చెప్పను, \q2 లోకం నాది, అందులో ఉన్నవన్నీ నావి. \q1 \v 13 ఎడ్ల మాంసం నేను తింటానా? \q2 మేకపోతుల రక్తం త్రాగుతానా? \b \q1 \v 14 “దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి \q2 మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించండి. \q1 \v 15 ఆపద్దినాన నన్ను పిలువండి; \q2 నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు.” \p \v 16 దుష్టులతో దేవుడు ఇలా అంటున్నారు: \q1 “నా న్యాయవిధులు ఉచ్చరించే \q2 నా నిబంధనను మీ పెదాల మీదికి తీసుకునే హక్కు మీకెక్కడిది? \q1 \v 17 నా సూచనను మీరు అసహ్యించుకుంటారు, \q2 నా మాటల్ని మీ వెనుకకు పారవేస్తారు. \q1 \v 18 మీరు ఒక దొంగను చూస్తే, వాడితో కలిసిపోతారు; \q2 మీ భాగాన్ని వ్యభిచారులతో పంచుకొంటారు. \q1 \v 19 మీ నోటిని చెడుకు వాడుతారు \q2 మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు. \q1 \v 20 మీరు కూర్చుని మీ సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు, \q2 మీ సొంత తల్లి కుమారుని మీద అభాండాలు వేస్తారు. \q1 \v 21 మీరు ఇవి చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను, \q2 నేను మీలాంటి వాణ్ణే అని మీరనుకున్నారు. \q1 కాని నేనిప్పుడు మిమ్మల్ని నిలదీస్తున్నాను, \q2 నా ఆరోపణలను మీ ముందు పెడుతున్నాను. \b \q1 \v 22 “దేవున్ని మరచే మీరు, కొంచెం ఆలోచించండి, \q2 లేకపోతే మిమ్మల్ని ఎవరు విడిపించలేనంతగా చీల్చి ముక్కలు చేస్తాను: \q1 \v 23 కృతజ్ఞతార్పణలు అర్పించేవారు నన్ను ఘనపరుస్తారు, \q2 నిందారహితులకు\f + \fr 50:23 \fr*\ft హెబ్రీ భాషలో ఈ పదం యొక్క అర్థం తెలియదు.\ft*\f* దేవుని రక్షణ చూపిస్తాను.” \c 51 \cl కీర్తన 51 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. దావీదు బత్షెబతో వ్యభిచరించిన తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చిన సందర్భంలో వ్రాశాడు. \q1 \v 1 ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి \q2 నన్ను కరుణించండి; \q1 మీ గొప్ప కనికరాన్ని బట్టి, \q2 నా పాపాలను తుడిచివేయండి. \q1 \v 2 నా దోషాలన్నింటిని కడిగి, \q2 నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి. \b \q1 \v 3 నా అతిక్రమాలు నాకు తెలుసు \q2 నా పాపం ఎల్లప్పుడు నా కళ్లెదుటే ఉంది. \q1 \v 4 కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను, \q2 మీ దృష్టికి చెడు చేశాను; \q1 మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు \q2 మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది. \q1 \v 5 నేను పాపిగా పుట్టాను, \q2 నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని. \q1 \v 6 మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు; \q2 ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు. \b \q1 \v 7 హిస్సోపుతో నన్ను శుద్ధీకరించండి, నేను శుద్ధునిగా ఉంటాను; \q2 నన్ను కడగండి, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను. \q1 \v 8 నన్ను ఆనందాన్ని సంతోషాన్ని విననివ్వండి; \q2 మీరు విరిచిన ఎముకలను సంతోషించనివ్వండి. \q1 \v 9 నా పాపముల నుండి మీ ముఖాన్ని దాచండి \q2 నా దోషమంతటిని తుడిచివేయండి. \b \q1 \v 10 ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి, \q2 నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి. \q1 \v 11 మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, \q2 మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి. \q1 \v 12 మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, \q2 నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి. \b \q1 \v 13 అప్పుడు అతిక్రమం చేసేవారికి మీ మార్గాలను బోధిస్తాను, \q2 తద్వార పాపులు మీ దగ్గరకు తిరిగి వస్తారు. \q1 \v 14 మీరు దేవుడు, నా రక్షకుడు, \q2 ఓ దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించండి, \q2 నా నాలుక మీ నీతిని గురించి పాడుతుంది. \q1 \v 15 ప్రభువా, నా పెదవులను తెరవండి, \q2 నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది. \q1 \v 16 మీరు బలులను బట్టి ఆనందించరు, లేకపోతే నేను తెచ్చేవాన్ని; \q2 మీరు దహనబలులను ఇష్టపడరు. \q1 \v 17 విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; \q2 పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని \q2 దేవా, మీరు నిరాకరించరు. \b \q1 \v 18 మీ దయతో సీయోనుకు మంచి చేయండి; \q2 యెరూషలేము గోడలు కట్టించండి. \q1 \v 19 అప్పుడు మీరు నీతిమంతుల బలులలో, \q2 దహన బలులలో, సర్వాంగ హోమములలో ఆనందిస్తారు; \q2 అప్పుడు మీ బలిపీఠం మీద ఎద్దులు అర్పించబడతాయి. \c 52 \cl కీర్తన 52 \d సంగీత దర్శకునికి. దావీదు ధ్యానకీర్తన. ఎదోమీయుడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వెళ్లాడని అతనితో చెప్పినప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. \q1 \v 1 బలాఢ్యుడా, చేసిన కీడు గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? \q2 దేవుని దృష్టిలో అవమానకరమైన నీవు, \q2 రోజంతా ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు? \q1 \v 2 మోసం చేసేవాడా, \q2 నీ నాలుక పదునైన క్షౌరం చేసే కత్తి; \q2 అది నాశనాన్ని చేస్తుంది. \q1 \v 3 మేలు కంటే కీడు చేయడం, \q2 నీతి కంటే అబద్ధం చెప్పడమే నీకు ఇష్టం. \qs సెలా\qs* \q1 \v 4 మోసపూరితమైన నాలుక గలవాడా, \q2 నీకు హానికరమైన మాటలే ఇష్టం. \b \q1 \v 5 ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యనాశనానికి గురి చేస్తారు: \q2 ఆయన నిన్ను మీ గుడారంలో నుండి పెరికివేస్తారు; \q2 సజీవుల దేశంలో నుండి నిన్ను పెరికివేస్తారు. \qs సెలా\qs* \q1 \v 6 నీతిమంతులు ఇదంతా చూసి భయభక్తులతో \q2 వారు నవ్వుతూ ఇలా అంటారు, \q1 \v 7 “ఇతన్ని చూడండి, \q2 దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ \q1 తనకున్న సంపదలను నమ్ముకుని \q2 ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!” \b \q1 \v 8 కానీ నేను దేవుని నివాసంలో \q2 పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; \q1 నేను ఎల్లప్పుడు, \q2 మారని దేవుని ప్రేమను నమ్ముతాను. \q1 \v 9 మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు \q2 మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను. \q1 మీ నామం ఉత్తమమైనది, \q2 కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను. \c 53 \cl కీర్తన 53 \d సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. \q1 \v 1 “దేవుడు లేడు” అని \q2 బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. \q1 వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి; \q2 మంచి చేసేవారు ఒక్కరు లేరు. \b \q1 \v 2 అర్థం చేసుకునేవారు, \q2 దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా \q1 అని దేవుడు పరలోకం నుండి \q2 మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు \q1 \v 3 ప్రతిఒక్కరు దారి తప్పి చెడిపోయారు; \q2 మంచి చేసేవారు ఎవరూ లేరు \q2 ఒక్కరు కూడా లేరు. \b \q1 \v 4 కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? \b \q1 వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; \q2 వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు. \q1 \v 5 అయితే భయపడడానికి ఏమిలేని దగ్గర, \q2 వారు, భయంతో మునిగిపోయి ఉన్నారు. \q1 మీమీద దాడి చేసిన వారి ఎముకలను దేవుడు చెదరగొట్టారు; \q2 దేవుడు వారిని తృణీకరించారు, కాబట్టి మీరు వారిని సిగ్గుపడేలా చేశారు. \b \q1 \v 6 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది! \q2 దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, \q2 యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక! \c 54 \cl కీర్తన 54 \d సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగి ఉండడం లేదా? అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించినది. \q1 \v 1 ఓ దేవా, మీ నామమును బట్టి నన్ను రక్షించండి; \q2 మీ బలాన్నిబట్టి శిక్షా విముక్తిని చేయండి. \q1 \v 2 ఓ దేవా! నా ప్రార్థన వినండి; \q2 నా నోటి మాటలను ఆలకించండి. \b \q1 \v 3 అపరిచితులు నాపై దాడి చేస్తున్నారు; \q2 దయలేని మనుష్యులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు \q2 వారు దేవుడంటే గౌరవం లేని మనుష్యులు. \qs సెలా\qs* \b \q1 \v 4 ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; \q2 ప్రభువే నన్ను సంరక్షించేవారు. \b \q1 \v 5 నన్ను దూషించే వారు భయంతో వెనుకకు మరలి వెళ్లిపోవాలి; \q2 మీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నిర్మూలం చేయండి. \b \q1 \v 6 యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను; \q2 మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది. \q1 \v 7 మీరు ఇబ్బందులన్నిటి నుండి నన్ను విడిపించారు, \q2 నా కళ్లు నా శత్రువుల మీదికి విజయోత్సాహంతో చూశాయి. \c 55 \cl కీర్తన 55 \d సంగీత దర్శకునికి.తంతివాద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. \q1 \v 1 ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, \q2 నా విజ్ఞప్తిని విస్మరించకండి; \q2 \v 2 నా మనవి విని నాకు జవాబివ్వండి. \q1 నా ఆలోచనలతో నాకు నెమ్మది లేదు. \q2 \v 3 నా శత్రువు నాతో అంటున్న దాన్ని బట్టి, \q2 దుష్టుల బెదిరింపులను బట్టి నాకు నెమ్మది లేదు; \q1 వారు నన్ను శ్రమ పెడుతున్నారు \q2 వారు వారి కోపంలో నా మీద దాడి చేస్తున్నారు. \b \q1 \v 4 నా హృదయం నాలో వేదన పడుతుంది; \q2 మరణభయం నన్ను చుట్టుకుంది. \q1 \v 5 భయం వణుకు నన్ను చుట్టుముట్టాయి; \q2 భీతి నన్ను ముంచేస్తుంది. \q1 \v 6 “ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే! \q2 ఎగిరిపోయి హాయిగా ఉండేవాన్ని కదా! \q1 \v 7 నేను దూరంగా ఎగిరిపోయి \q2 ఎడారిలో ఉండేవాన్ని. \qs సెలా\qs* \q1 \v 8 గాలివానకు తుఫానుకు దూరంగా, \q2 నా ఆశ్రయ స్థలానికి తప్పించుకుని త్వరగా వెళ్తాను.” \b \q1 \v 9 నాకు పట్టణంలో హింస, గొడవలు కనబడుతున్నాయి, \q2 ప్రభువా, దుష్టులను గందరగోళానికి గురి చేయండి, \q2 వారి మాటలను తారుమారు చేయండి. \q1 \v 10 రాత్రింబగళ్ళు పట్టణ గోడల మీద శత్రువులు తిరుగుతున్నారు; \q2 అయితే అక్కడ దుష్టత్వం విధ్వంసం ఉన్నాయి. \q1 \v 11 పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి; \q2 బెదిరింపులు మోసాలు దాని వీధుల్లో నిత్యం ఉంటాయి. \b \q1 \v 12 ఒకవేళ ఒక శత్రువు నన్ను అవమానిస్తుంటే, \q2 నేను దానిని భరించగలను; \q1 నాకు వ్యతిరేకంగా శత్రువు లేస్తున్నట్లయితే, \q2 నేను దాక్కోగలను. \q1 \v 13 కాని ఆ పని చేసిన నీవు నాలాంటి మనిషివి, \q2 నా సహచరుడవు, నా ప్రియ స్నేహితుడవు \q1 \v 14 ఒకప్పుడు దేవుని మందిరానికి \q2 ఆరాధికులతో పాటు \q1 ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు \q2 మనం మధురమైన సహవాసం కలిగి ఉన్నాము. \b \q1 \v 15 చెడుతనం నా శత్రువుల నివాసాల్లో వారి హృదయాల్లో ఉంది; \q2 కాబట్టి మరణం ఆకస్మికంగా వారి మీదికి వచ్చును గాక, \q2 ప్రాణంతోనే వారు క్రింద పాతాళానికి దిగిపోవుదురు గాక. \b \q1 \v 16 నేను మాత్రం, దేవునికి మొరపెడతాను, \q2 యెహోవా నన్ను రక్షిస్తారు. \q1 \v 17 సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం \q2 నేను బాధలో మొరపెడతాను, \q2 ఆయన నా స్వరం వింటారు. \q1 \v 18 అనేకులు నన్ను వ్యతిరేకించినప్పటికి, \q2 నాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం నుండి \q2 నా ప్రాణాన్ని సమాధానంలో విమోచిస్తారు. \q1 \v 19 పూర్వం నుండి సింహాసనాసీనుడైయున్న మారని దేవుడు, \q2 అది విని వారిని అణచివేస్తారు, \qs సెలా\qs* \q1 వారు మారడానికి ఒప్పుకోరు \q2 ఎందుకంటే వారికి దేవుని భయం లేదు. \b \q1 \v 20 నా సహచరుడు తన స్నేహితుల మీద దాడి చేసి; \q2 వారితో తాను చేసిన నిబంధనకు తానే భంగం కలిగిస్తాడు. \q1 \v 21 అతని మాటలు వెన్నలా మృదువుగా ఉంటాయి, \q2 కాని అతని హృదయంలో యుద్ధం ఉంటుంది; \q1 అతని మాటలు నూనె కన్న నున్నగా ఉంటాయి \q2 కానీ అవి దూసిన ఖడ్గాల్లాంటివి. \b \q1 \v 22 మీ భారాన్ని యెహోవాపై మోపండి \q2 ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు; \q2 నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు. \q1 \v 23 కాని దేవా, మీరు దుష్టులను \q2 నాశనకూపంలో పడవేస్తారు; \q1 రక్తపిపాసులు మోసగాళ్లు \q2 వారి ఆయుష్షులో సగం కూడ జీవించరు. \b \q1 కానీ నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నాను. \c 56 \cl కీర్తన 56 \d సంగీత దర్శకునికి. “దూరపు సింధూర వృక్షాల మీద ఉన్న ఒక పావురం” అనే రాగం మీద పాడదగినది. శ్రేష్ఠమైన దావీదు కీర్తన. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. \q1 \v 1 నా దేవా! నాపై దయ చూపండి, \q2 ఎందుకంటే నా శత్రువులు వేగంగా వెంటాడుతున్నారు; \q2 రోజంతా వారు తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. \q1 \v 2 నా విరోధులు రోజంతా నన్ను వెంటాడుతున్నారు; \q2 వారి అహంకారంలో అనేకులు నా మీద దాడి చేస్తున్నారు. \b \q1 \v 3 నాకు భయం వేసినప్పుడు, నేను మీయందు నమ్మకం ఉంచుతాను. \q2 \v 4 దేవునిలో ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను \q1 దేవునిలో నేను నమ్ముతాను భయపడను. \q2 మానవమాత్రులు నన్నేమి చేయగలరు? \b \q1 \v 5 రోజంతా వారు నా మాటలను వక్రీకరిస్తారు; \q2 వారి పథకాలన్నీ నా పతనం కొరకే. \q1 \v 6 నా ప్రాణం తీయాలనే ఆశతో \q2 వారు కుట్ర చేస్తారు, పొంచి ఉంటారు, \q2 నా కదలికలు గమనిస్తారు. \q1 \v 7 వారి దుష్టత్వాన్ని బట్టి వారు తప్పించుకోనివ్వకండి; \q2 దేవా, మీ కోపంలో వారి దేశాలను కూలద్రోయండి. \b \q1 \v 8 నా బాధలను లెక్కించండి; \q2 నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి \q2 అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా? \q1 \v 9 నేను మీకు మొరపెట్టినప్పుడు \q2 నా శత్రువులు వెనుకకు తగ్గుతారు. \q2 దాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను తెలుసుకుంటాను. \b \q1 \v 10 దేవునిలో, ఆయన వాగ్దానాన్ని స్తుతిస్తాను, \q2 అవును, యెహోవాయందు, ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను. \q1 \v 11 నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను. \q2 మనుష్యులు నన్నేమి చేయగలరు? \b \q1 \v 12 నా దేవా, నేను మీకు మ్రొక్కుబడులను చెల్లించాల్సి ఉంది; \q2 నా కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తాను. \q1 \v 13 ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు \q2 తొట్రిల్లకుండ నా పాదాలను \q1 దేవుని ఎదుట నేను జీవపువెలుగులో \q2 నడవడానికి శక్తినిచ్చారు. \c 57 \cl కీర్తన 57 \d సంగీత దర్శకునికి. “నాశనం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. గుహలో దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది. \q1 \v 1 నా దేవా, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి, \q2 ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించాను. \q1 విపత్తు గడిచేవరకు \q2 నేను మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాను. \b \q1 \v 2 నా కార్యం సఫలపరచే, \q2 మహోన్నతుడైన దేవునికి మొరపెట్టుకుంటాను. \q1 \v 3 పరలోకం నుండి సాయం పంపి నన్ను విడిపిస్తారు, \q2 నన్ను దిగమ్రింగాలని చూస్తూ నా మీద చాడీలు పలికే వారి బారి నుండి నన్ను తప్పిస్తారు. \qs సెలా\qs* \q2 దేవుడు తన మారని ప్రేమను, నమ్మకత్వాన్ని పంపుతారు. \b \q1 \v 4 నేను సింహాల మధ్య ఉన్నాను; \q2 నేను క్రూరమైన జంతువుల మధ్య నివసిస్తున్నాను \q1 వారు ఈటెలు బాణాల వంటి పళ్ళు కలిగిన మనుష్యులు, \q2 వారి నాలుకలు పదునైన కత్తుల వంటివి. \b \q1 \v 5 దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. \q2 భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక. \b \q1 \v 6 నా పాదాల చుట్టూ వలలు వేశారు, \q2 నేను బాధతో క్రుంగి ఉన్నాను \q1 నా దారిలో వారు గుంట త్రవ్వారు \q2 కాని అందులో వారే పడ్డారు. \qs సెలా\qs* \b \q1 \v 7 ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది, \q2 నా హృదయం స్థిరంగా ఉంది; \q2 నేను పాడతాను సంగీతం వాయిస్తాను, \q1 \v 8 నా ప్రాణమా, మేలుకో! \q2 సితారా వీణా, మేలుకోండి! \q2 ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను. \b \q1 \v 9 ప్రభువా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను \q2 జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను. \q1 \v 10 ఎందుకంటే మీ మారని ప్రేమ, ఆకాశాలను అంటుతుంది; \q2 మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది. \b \q1 \v 11 దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. \q2 భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక. \c 58 \cl కీర్తన 58 \d సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. \q1 \v 1 పాలకులారా, నిజంగా మీరు న్యాయంగా మాట్లాడతారా? \q2 మీరు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తారా? \q1 \v 2 లేదు, మీ హృదయంలో అన్యాయం చేస్తున్నారు, \q2 దేశంలో హింసను పెంచుతున్నారు. \b \q1 \v 3 ఈ దుష్టులు పుట్టుకతోనే దారి తప్పినవారు; \q2 గర్భం నుండే వారు అబద్ధాలాడుతారు. \q1 \v 4 వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది \q2 చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు \q1 \v 5 పాములు ఆడించేవారు ఎంత నైపుణ్యంగా వాయించినా \q2 ఆ సంగీతాన్ని వినని పాముల్లా వారున్నారు. \b \q1 \v 6 దేవా! వారి నోటి పళ్ళు విరగ్గొట్టండి; \q2 యెహోవా! ఈ కొదమ సింహాల కోరలను ఊడదీయండి. \q1 \v 7 ప్రవహించే నీటిలా వారు మాయమవుదురు గాక; \q2 వారు విల్లు ఎక్కుపెట్టినప్పుడు వారి బాణాలు గురిని చేరకుండును గాక. \q1 \v 8 వారు నడుస్తూ కరిగి నశించిపోయే నత్తల్లా వారుంటారు. \q2 గర్భస్రావమై వెలుగు చూడని పిండంలా వారవుతారు. \b \q1 \v 9 మీ కుండలకు ముండ్లకంపల సెగ తగలకముందే, \q2 పచ్చివైనా ఎండినవైనా అంటే చిన్నా పెద్దా తేడా లేకుండ దుష్టులు తుడిచివేయబడతారు. \q1 \v 10 ప్రతీకారం జరిగినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు, \q2 దుష్టుల రక్తంలో వారు కాళ్లు కడుక్కుంటారు. \q1 \v 11 తర్వాత ప్రజలు అది చూసి, \q2 “నీతిమంతులకు తప్పక బహుమానం ఉంటుంది; \q2 ఖచ్చితంగా ఈ లోకంలో తీర్పు తీర్చే దేవుడు ఉన్నారు” అంటారు. \c 59 \cl కీర్తన 59 \d సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. ఒక మిక్తము.\f + \fr 59 \fr*\ft బహుశ సంగీత పదం అయి ఉంటుంది\ft*\f* దావీదును చంపడానికి సౌలు పంపినవారు అతని ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు వ్రాసినది. \q1 \v 1 దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; \q2 నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి. \q1 \v 2 కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, \q2 హంతకుల నుండి నన్ను రక్షించండి. \b \q1 \v 3 నా కోసం వారు ఎలా పొంచి ఉన్నారో చూడండి! \q2 యెహోవా, చేయని నేరం గాని పాపం గాని లేకుండానే \q2 భయంకరమైన పురుషులు నాపై కుట్ర చేస్తున్నారు. \q1 \v 4 నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా మీద దాడి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. \q2 నాకు సహాయం చేయడానికి లేవండి; నా దుస్థితిని చూడండి! \q1 \v 5 సైన్యాల యెహోవా దేవా, \q2 ఇశ్రాయేలు దేవా! \q1 సర్వ దేశాలను శిక్షించడానికి లేవండి; \q2 దుష్టులైన దేశద్రోహులకు దయ చూపకండి. \qs సెలా\qs* \b \q1 \v 6 వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, \q2 కుక్కల్లా మొరుగుతూ, \q2 వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు. \q1 \v 7 వారు వారి నోటి నుండి ఏమి చిమ్ముతారో చూడండి; \q2 వారి పెదవుల నుండి వచ్చే మాటలు పదునైన ఖడ్గాల్లాంటివి, \q2 “మా మాటలు ఎవరు వింటారు?” అని వారనుకుంటారు. \q1 \v 8 కాని యెహోవా! మీరు వారిని చూసి నవ్వుతారు; \q2 ఆ దేశాలన్నిటిని చూసి, పరిహసిస్తారు. \b \q1 \v 9 మీరే నా బలం, మీ కోసమే నేను వేచి ఉంటాను; \q2 దేవా, మీరు, నాకు ఎత్తైన కోట, \q2 \v 10 తన మారని ప్రేమను బట్టి, నా దేవుడు నాతో ఉంటారు. \b \q1 ఆయన నాకు ముందుగా వెళ్తారు \q2 నన్ను అపవాదు చేసిన వారిపై నేను సంతోషించేలా చేస్తారు. \q1 \v 11 కాని వారిని చంపకండి, ప్రభువా మా డాలు, \q2 వారు చస్తే నా ప్రజలు మరచిపోతారు. \q1 మీ బలముతో వారిని వేర్లతో పెకిలించి \q2 వారిని అణచివేయండి. \q1 \v 12 వారి నోళ్ళ పాపాల కోసం, \q2 వారి పెదవుల మాటల కోసం, \q2 వారి గర్వంలో వారు పట్టబడుదురు గాక. \q1 వారు పలికే శాపాలు అబద్ధాలను బట్టి, \q2 \v 13 మీ ఉగ్రతలో వారిని దహించివేయండి, \q2 వారు ఇక లేకుండునంతగా వారిని దహించివేయండి. \q1 అప్పుడు దేవుడు యాకోబును పరిపాలిస్తున్నారని \q2 భూదిగంతాల వరకు తెలియపరచబడుతుంది. \qs సెలా\qs* \b \q1 \v 14 వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, \q2 కుక్కల్లా మొరుగుతూ, \q2 వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు. \q1 \v 15 వారు ఆహారం కోసం తిరుగుతారు \q2 సంతృప్తి చెందకపోతే కేకలు వేస్తారు. \q1 \v 16 కానీ నేను మీ బలాన్ని గురించి పాడతాను, \q2 ఉదయం మీ ప్రేమను గురించి పాడతాను; \q1 ఎందుకంటే మీరు నా కోట, \q2 కష్ట సమయాల్లో నా ఆశ్రయము. \b \q1 \v 17 మీరు నా బలం, నేను మీకు స్తుతిగానం చేస్తున్నాను; \q2 దేవా, మీరు, నా కోట, \q2 నన్ను ప్రేమించే నా దేవుడు. \c 60 \cl కీర్తన 60 \d సంగీత దర్శకునికి. “నిబంధన పుష్పం” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. దావీదు అరాము నహరయీము వారితోను\f + \fr 60 \fr*\ft అది వాయువ్య మెసొపొటేమియాకు ఉత్తరపశ్చిమాన ఉన్న అరాములో ఒక భాగము. ఇది రెండు నదుల మధ్య ఉన్నది.\ft*\f* అరాము సోబా వారితోను\f + \fr 60 \fr*\ft అది మధ్య సిరియా\ft*\f* యుద్ధము చేయగా యోవాబు ఉప్పు లోయలో పన్నెండువేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు వ్రాసినది. \q1 \v 1 దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు; \q2 మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి! \q1 \v 2 మీరు దేశాన్ని కంపింపజేసి దానిని చీల్చివేశారు; \q2 దాని పగుళ్లను పూడ్చండి, ఎందుకంటే అది కంపిస్తూ ఉంది. \q1 \v 3 మీరు మీ ప్రజలకు కఠిన సమయాలను చూపించారు; \q2 మమ్మల్ని తడబడేలా చేసే మద్యాన్ని మీరు మాకు ఇచ్చారు. \q1 \v 4 సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి \q2 మీకు భయపడేవారికి మీరొక జెండాను ఇచ్చారు. \qs సెలా\qs* \b \q1 \v 5 మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, \q2 మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి. \q1 \v 6 దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట: \q2 “విజయంతో నేను షెకెమును పంచుతాను \q2 సుక్కోతు లోయను కొలుస్తాను. \q1 \v 7 గిలాదు నాది, మనష్షే నాది; \q2 ఎఫ్రాయిం నా శిరస్త్రాణం, \q2 యూదా నా రాజదండం. \q1 \v 8 మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, \q2 ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను, \q2 ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.” \b \q1 \v 9 కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు? \q2 ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు? \q1 \v 10 దేవా, ఇప్పుడు మమ్మల్ని విసర్జించింది మీరు కాదా? \q2 మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా? \q1 \v 11 శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి, \q2 ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది. \q1 \v 12 దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, \q2 ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు. \c 61 \cl కీర్తన 61 \d సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. \q1 \v 1 ఓ దేవా! నా మనవి వినండి; \q2 నా ప్రార్థన ఆలకించండి. \b \q1 \v 2 భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను, \q2 నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను; \q2 నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి. \q1 \v 3 ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం, \q2 శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము. \b \q1 \v 4 మీ గుడారంలో చిరకాలం నివసించాలని \q2 మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను. \qs సెలా\qs* \q1 \v 5 దేవా! మీరు, నా మ్రొక్కుబడులు విన్నారు; \q2 మీ నామానికి భయపడేవారి స్వాస్థ్యం మీరు నాకు ఇచ్చారు. \b \q1 \v 6 రాజు జీవితకాల దినాలను పొడిగించండి, \q2 అనేక తరాలకు అతని సంవత్సరాలు తరతరాలకు కొనసాగించండి. \q1 \v 7 అతడు శాశ్వతంగా దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడై ఉంటారు; \q2 మీ మారని ప్రేమ, మీ నమ్మకత్వం అతన్ని కాపాడాలి. \b \q1 \v 8 అప్పుడు నేను ఎడతెగక మీ నామాన్ని బట్టి స్తుతి పాడతాను \q2 దినదినం నా మ్రొక్కుబడులు నెరవేరుస్తాను. \c 62 \cl కీర్తన 62 \d సంగీత దర్శకునికి. యెదూతూను అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన. \q1 \v 1 నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను; \q2 ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది. \q1 \v 2 ఆయనే నా కొండ నా రక్షణ; \q2 ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను. \b \q1 \v 3 ఎంతకాలం మీరు ఒక్కడి మీద దాడి చేస్తారు? \q2 వాలుతున్న గోడను, పడిపోతున్న కంచెను పడద్రోసినట్లు \q2 మీరంతా నన్ను పడద్రోస్తారు? \q1 \v 4 ఖచ్చితంగా వారు నన్ను నా ఉన్నత స్థానం నుండి \q2 పడగొట్టాలని నిర్ణయించారు; \q2 వారు అబద్ధాలు చెప్పడంలో ఆనందిస్తారు. \q1 వారు నోటితో దీవిస్తారు, \q2 కాని వారి హృదయాల్లో శపిస్తారు. \qs సెలా\qs* \b \q1 \v 5 అవును, నా ఆత్మ దేవునిలోనే విశ్రాంతి పొందుతుంది; \q2 ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. \q1 \v 6 ఆయన నా కొండ నా రక్షణ; \q2 ఆయన నా కోట, నేను కదల్చబడను. \q1 \v 7 నా రక్షణ నా ఘనత దేవుని పైనే ఆధారపడి ఉన్నాయి;\f + \fr 62:7 \fr*\ft లేదా \ft*\fqa మహోన్నతుడైన దేవుడే నా రక్షణ నా ఘనత\fqa*\f* \q2 ఆయన నాకు శక్తివంతమైన కొండ, నా ఆశ్రయము. \q1 \v 8 ప్రజలారా, ఎల్లప్పుడూ ఆయనను నమ్మండి; \q2 మీ హృదయాలను ఆయన ఎదుట క్రుమ్మరించండి, \q2 ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము. \qs సెలా\qs* \b \q1 \v 9 సామాన్య మనుష్యులు ఊపిరిలాంటివారు, \q2 ఉన్నత గోత్రం కేవలం మాయ \q1 త్రాసులో పెట్టి తూస్తే \q2 వారిద్దరు కలిసి ఊపిరి కంటే తేలికగా ఉంటారు. \q1 \v 10 బలాత్కారాన్ని నమ్ముకోకండి \q2 దోపిడీలు చేసి ధనవంతులై విర్రవీగకండి. \q1 ధనం ఎక్కువైనా సరే, \q2 దాని మీద మనస్సు పెట్టకండి. \b \q1 \v 11 దేవుడు ఒక్క సంగతి మాట్లాడారు, \q2 రెండు సార్లు విన్నాను: \q1 “దేవా, శక్తి మీకే చెందుతుంది, \q2 \v 12 ప్రభువా, మీరు మారని ప్రేమగలవారు; \q1 మీరు మనుష్యులందరికి \q2 వారి క్రియలను తగ్గట్టుగా ప్రతిఫలమిస్తారు.” \c 63 \cl కీర్తన 63 \d దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. \q1 \v 1 దేవా, మీరు నా దేవుడు, \q2 నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను; \q1 నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో, \q2 నేను మీ కోసం దప్పిగొన్నాను, \q1 నా శరీరమంతా \q2 మీ కోసం ఆశపడుతుంది. \b \q1 \v 2 పరిశుద్ధాలయంలో నేను మిమ్మల్ని చూశాను. \q2 మీ ఘనతా మహిమను తేరి చూశాను \q1 \v 3 మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం \q2 నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి. \q1 \v 4 నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను. \q2 మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను. \q1 \v 5 శ్రేష్ఠమైన ఆహారం\f + \fr 63:5 \fr*\ft లేదా \ft*\fqa క్రొవ్వు, మూలిగ\fqa*\f* దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను; \q2 సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది. \b \q1 \v 6 పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను; \q2 రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను. \q1 \v 7 మీరు నాకు సహాయం కాబట్టి \q2 మీ రెక్కల నీడలో నేను ఆనందంతో పాడతాను. \q1 \v 8 నేను మీకు అంటిపెట్టుకుని ఉంటాను; \q2 మీ కుడిచేయి నన్ను ఆదుకుంటుంది. \b \q1 \v 9 నన్ను ఎవరు చంపాలని చూస్తారో వారే నాశనం అవుతారు; \q2 వారు భూమి అగాధ స్థలాలకు దిగిపోతారు. \q1 \v 10 వారు ఖడ్గానికి అప్పగించబడి \q2 నక్కలకు ఆహారం అవుతారు. \b \q1 \v 11 కాని రాజు దేవునియందే ఆనందిస్తాడు; \q2 దేవుని మీద ప్రమాణం చేసే వారందరు ఆయనయందు అతిశయిస్తారు. \q2 కాని అబద్ధికుల నోళ్ళు మౌనంగా ఉంటాయి. \c 64 \cl కీర్తన 64 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 నా దేవా, నా ఫిర్యాదు వినండి; \q2 శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి. \b \q1 \v 2 దుష్టుల కుట్ర నుండి, \q2 కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి. \q1 \v 3 వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు \q2 మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు. \q1 \v 4 చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు. \q2 వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు. \b \q1 \v 5 కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. \q2 వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు; \q2 వారంటారు, “దీన్ని\f + \fr 64:5 \fr*\ft లేదా \ft*\fqa మనల్ని\fqa*\f* ఎవరు చూస్తారు?” \q1 \v 6 వారు అన్యాయాలను రూపొందించి అంటారు, \q2 “మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!” \q2 నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి. \b \q1 \v 7 కాని, దేవుడు తన బాణాలను వాళ్ళ మీదికి విసురుతారు; \q2 వారు అకస్మాత్తుగా కొట్టబడతారు. \q1 \v 8 ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి \q2 వారిని పతనానికి తెస్తారు; \q2 వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు. \q1 \v 9 మనుష్యులందరు భయపడతారు; \q2 దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు \q2 ఆయన చేసిన దానిని గ్రహిస్తారు. \b \q1 \v 10 నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక. \q2 ఆయననే ఆశ్రయించెదరు గాక. \q2 యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక! \c 65 \cl కీర్తన 65 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఒక గీతము. \q1 \v 1 మా దేవా, సీయోనులో మీరు స్తుతికి యోగ్యులు; \q2 మా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాము. \q1 \v 2 మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు, \q2 ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు. \q1 \v 3 మేము పాపాల్లో మునిగి ఉన్నప్పుడు, \q2 మీరు మా అతిక్రమాలను క్షమించారు\f + \fr 65:3 \fr*\ft లేదా \ft*\fqa ప్రాయశ్చిత్తం చేశారు\fqa*\f*. \q1 \v 4 మీ ఆవరణాల్లో నివసించడానికి \q2 మీరు ఎన్నుకుని మీ దగ్గరకు తెచ్చుకున్న వారు ధన్యులు! \q1 మీ పరిశుద్ధ మందిరం యొక్క, \q2 మీ గృహంలోని ఆశీర్వాదాలతో మేము తృప్తిచెందుతాం. \b \q1 \v 5 మీరు భీకరమైన నీతి క్రియలతో మాకు జవాబు ఇస్తారు, \q2 దేవా మా రక్షకా, \q1 భూదిగంతాలన్నిటికి \q2 సుదూర సముద్రాలకు మీరే నిరీక్షణ. \q1 \v 6 బలమును ఆయుధంగా ధరించుకొని, \q2 మీరు మీ మహాశక్తితో పర్వతాలను సృజించారు. \q1 \v 7 సముద్రం యొక్క హోరును, \q2 అలల యొక్క ఘోషను \q2 దేశాల్లోని కలకలాన్ని నిమ్మళం చేసేవారు ఆయనే. \q1 \v 8 భూదిగంతాలలో నివసించే వారందరు మీ అద్భుతాలకు భయంతో నిండి ఉన్నారు; \q2 ఉదయం సాయంత్రాలను మీరు \q2 ఆనందంతో కేకలు వేసేలా చేస్తారు. \b \q1 \v 9 మీరు భూమిని గమనించి నీరు పోస్తారు; \q2 మీరు దానిని సమృద్ధిగా సుసంపన్నం చేస్తారు. \q1 ప్రజలకు ధాన్యాన్ని అందించడానికి \q2 దేవుని ప్రవాహాలు నీటితో నిండి ఉన్నాయి \q2 ఎందుకంటే దానిని మీరు అలా నియమించారు. \q1 \v 10 మీరు దున్నిన భూమిని వర్షంతో తడిపి, గడ్డలను కరిగించి, గట్లు సమం చేస్తారు. \q2 మీరు వానజల్లులతో భూమిని మృదువుగా చేసి, దాని పంటలను ఆశీర్వదిస్తారు. \q1 \v 11 మీరు మీ దయతో సంవత్సరానికి కిరీటం ధరింపచేస్తారు, \q2 మార్గాలు కూడ సమృద్ధితో పొంగిపోతాయి. \q1 \v 12 అరణ్యం యొక్క తుక్కు భూములు పొంగిపొర్లుతాయి; \q2 కొండలు ఆనందాన్ని ధరించుకొని ఉన్నాయి. \q1 \v 13 పచ్చికబయళ్లు మందల చేత కప్పబడ్డాయి \q2 లోయలు ధాన్యంతో కప్పబడి ఉన్నాయి; \q2 వారు ఆనందంతో కేక వేస్తూ పాడతారు. \c 66 \cl కీర్తన 66 \d సంగీత దర్శకునికి. ఒక కీర్తన. ఒక గీతము. \q1 \v 1 సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి! \q2 \v 2 ఆయన నామాన్ని కీర్తించండి \q2 ఆయనను స్తుతించి మహిమపరచండి. \q1 \v 3 దేవునితో ఇలా అనండి, “మీ క్రియలు ఎంత అద్భుతం! \q2 మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి \q2 మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు. \q1 \v 4 సర్వ లోకం మీకు నమస్కరిస్తుంది; \q2 మీకు స్తుతి పాడతారు \q2 మీ నామాన్ని స్తుతిస్తారు.” \qs సెలా\qs* \b \q1 \v 5 దేవుడు ఏం చేశారో వచ్చి చూడండి, \q2 మనుషులకు ఆయన చేసిన భీకరమైన క్రియలు చూడండి! \q1 \v 6 సముద్రాన్ని ఆరిన నేలగా చేశారు, \q2 వారు కాలినడకన నది దాటి వెళ్లారు \q2 రండి, మనం ఆయనలో ఆనందిస్తాము. \q1 \v 7 ఆయన తన శక్తితో నిత్యం పరిపాలిస్తారు, \q2 ఆయన కళ్లు దేశాలను చూస్తాయి, \q2 తిరుగుబాటు చేసేవారు తమను తాము హెచ్చించుకోకూడదు. \qs సెలా\qs* \b \q1 \v 8 సర్వజనులారా, మన దేవున్ని స్తుతించండి, \q2 ఆయనను స్తుతిస్తున్న ధ్వని వినబడును గాక; \q1 \v 9 ఆయన మనల్ని సజీవంగా ఉంచారు \q2 మన పాదాలు జారిపోకుండ చేశారు. \q1 \v 10 దేవా, మీరు మమ్మల్ని పరీక్షించారు; \q2 వెండిలా మమ్మల్ని శుద్ధి చేశారు. \q1 \v 11 మీరు మమ్మల్ని వలలో బంధించారు, \q2 మా నడుముల మీద భారాన్ని మోపారు. \q1 \v 12 మీరు మా తలలపై స్వారీ చేయడానికి ప్రజలను అనుమతించారు; \q2 అగ్ని జలాల గుండా మేము వెళ్లాము, \q2 అయినా మీరు మమ్మల్ని సమృద్ధిగల స్థలంలోనికి తెచ్చారు. \b \q1 \v 13 దహన బలులతో మీ ఆలయానికి వచ్చి \q2 నా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాను. \q1 \v 14 నేను శ్రమల్లో ఉన్నప్పుడు నా పెదవులు ప్రమాణం చేసిన, \q2 నా నోరు పలికిన మ్రొక్కుబడులు చెల్లిస్తాను. \q1 \v 15 నేను మీకు క్రొవ్విన జంతువులను \q2 పొట్టేళ్ళను సువాసనగల దహనబలిగా అర్పిస్తాను; \q2 నేను ఎద్దులను మేకలను అర్పిస్తాను. \qs సెలా\qs* \b \q1 \v 16 దేవుడంటే భయం భక్తి ఉన్నవారలారా, మీరంతా రండి వినండి; \q2 ఆయన నా కోసం ఏం చేశారో మీకు చెప్తాను. \q1 \v 17 నేను నా నోటితో ఆయనకు మొరపెట్టాను; \q2 ఆయన స్తుతి నా నాలుక మీద ఉంది. \q1 \v 18 నా హృదయంలో దుష్టత్వం ఉంటే, \q2 ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు. \q1 \v 19 కాని దేవుడు నిశ్చయంగా ఆలకించారు \q2 నా ప్రార్థన విన్నారు. \q1 \v 20 నా ప్రార్థనను త్రోసివేయని \q2 తన మారని ప్రేమను నా నుండి తొలగించని, \q2 దేవునికి స్తుతి కలుగును గాక! \c 67 \cl కీర్తన 67 \d ప్రధాన గాయకునికి. తంతివాద్యాలతో పాడదగినది. ఒక కీర్తన. ఒక గీతము. \q1 \v 1 దేవుడు మామీద దయచూపి దీవించును గాక, \q2 ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. \qs సెలా\qs* \q1 \v 2 తద్వార భూమి మీద మీ మార్గాలు \q2 దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి, \b \q1 \v 3 దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; \q2 సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక. \q1 \v 4 దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, \q2 ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు \q2 భూమి మీద దేశాలను పాలిస్తారు. \qs సెలా\qs* \q1 \v 5 దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; \q2 సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక. \b \q1 \v 6 భూమి దాని పంటను ఇస్తుంది; \q2 దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు. \q1 \v 7 అవును, దేవుడు మనల్ని దీవించును గాక, \q2 తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక. \c 68 \cl కీర్తన 68 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన గీతము. \q1 \v 1 దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక; \q2 ఆయన విరోధులు ఆయన ఎదుట నుండి పారిపోవుదురు గాక. \q1 \v 2 మీరు వారిని పొగలా ఊదివేయండి; \q2 మైనం అగ్నికి కరిగి పోయినట్టు \q2 దుష్టులు దేవుని ఎదుట నశించెదరు గాక. \q1 \v 3 కాని నీతిమంతులు సంతోషించి \q2 దేవుని ఎదుట ఆనందించుదురు గాక \q2 వారు సంతోషంగా ఆనందంగా ఉందురు గాక. \b \q1 \v 4 దేవునికి పాడండి, ఆయన నామాన్ని బట్టి స్తుతి పాడండి, \q2 మేఘాల మీద స్వారీ చేసే ఆయనను కీర్తించండి; \q2 ఆయన పేరు యెహోవా; ఆయన ఎదుట ఆనందించండి. \q1 \v 5 తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు, \q2 తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు. \q1 \v 6 దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో\f + \fr 68:6 \fr*\ft లేదా \ft*\fqa నిర్జనంగా ఉన్నవారిని మాతృ భూమిలో\fqa*\f* ఉంచుతారు, \q2 బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు; \q2 కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు. \b \q1 \v 7 దేవా! మీ ప్రజలకు ముందుగా మీరు వెళ్లారు, \q2 అరణ్యం గుండా మీరు నడిచారు. \qs సెలా\qs* \q1 \v 8 సీనాయి యొక్క ఏకైక దేవుని ముందు, \q2 ఇశ్రాయేలు దేవుని ముందు, \q2 భూమి కంపించింది, ఆకాశాలు వాన కురిపించాయి. \q1 \v 9 దేవా, మీరు స్వచ్ఛందంగా సమృద్ధి వర్షాన్ని ఇచ్చారు; \q2 నీరసించిన మీ వారసత్వాన్ని మీరు ఉత్తేజపరచారు. \q1 \v 10 మీ జనులు అందులో స్థిరపడ్డారు, \q2 దేవా, మీ దయతో పేదలకు అవసరమైనవి ఇచ్చారు. \b \q1 \v 11 ప్రభువు తన మాటను చాటించారు, \q2 స్త్రీలు శుభవార్తను ప్రకటిస్తారు: \q1 \v 12 “శత్రు రాజులు సైన్యాలు త్వరపడి పారిపోతారు; \q2 ఇంటి పట్టున ఉన్న స్త్రీలు దోపుడుసొమ్ము పంచుకుంటారు. \q1 \v 13 గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పడుకున్నప్పుడు కూడా, \q2 నా పావురం యొక్క రెక్కలు వెండితో, \q2 దాని ఈకలు మెరిసే బంగారంతో కప్పబడి ఉంటాయి.” \q1 \v 14 సర్వశక్తిమంతుడు ఈ రాజులను చెదరగొట్టినప్పుడు \q2 సల్మోను కొండమీద మంచు కురిసినట్లు కనిపించింది. \b \q1 \v 15 దేవుని పర్వతమా, పర్వత శిఖరమా, \q2 బాషాను పర్వతమా, కఠినమైన పర్వతమా, \q1 \v 16 కఠినమైన పర్వతమా, దేవుడు పరిపాలించడానికి ఎన్నుకున్న పర్వతం వైపు \q2 ఎల్లకాలమూ యెహోవా నివసించే స్థలం వైపు \q2 ఎందుకు అసూయతో చూస్తావు? \q1 \v 17 దేవుని రథాలు వేలాది కొలది \q2 కోట్ల కొలదిగా ఉన్నాయి; \q2 వాటి మధ్యలో, ప్రభువు సీనాయి పర్వతం నుండి తన పరిశుద్ధాలయానికి వచ్చి ఉన్నారు. \q1 \v 18 యెహోవా దేవా, మీరు నిత్యం పాలించడానికి \q2 పైకి ఆరోహణమైనప్పుడు, \q2 మీరు అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లారు; \q1 మీరు మనుష్యుల నుండి ఈవులు స్వీకరించారు, \q2 తిరుగుబాటుదారుల నుండి కూడా స్వీకరించారు. \b \q1 \v 19 అనుదినం మన భారాలు భరించే \q2 మన రక్షకుడైన దేవునికి, ప్రభువునకు స్తుతి కలుగును గాక. \qs సెలా\qs* \q1 \v 20 మన దేవుడు రక్షించే దేవుడు; \q2 ప్రభువైన యెహోవా నుండి మరణ విడుదల కలుగుతుంది. \q1 \v 21 దేవుడు ఖచ్చితంగా తన శత్రువుల తలలను చితకగొడతారు, \q2 అపరాధ మార్గాలను ప్రేమించేవారి నడినెత్తులను చితకగొడతారు. \q1 \v 22 ప్రభువు అంటున్నారు, “బాషానులో నుండి మిమ్మల్ని రప్పిస్తాను; \q2 సముద్రం లోతుల్లో నుండి మిమ్మల్ని తెస్తాను.” \q1 \v 23 మీ శత్రువుల రక్తంలో తమ పాదాలు ముంచుతారు, \q2 మీ కుక్కలు నాలుకలతో నాకుతాయి. \b \q1 \v 24 దేవా! మీ ఊరేగింపు కనబడుతుంది, \q2 పరిశుద్ధాలయం లోనికి వస్తున్న నా రాజైన దేవుని యొక్క ఊరేగింపు. \q1 \v 25 ముందు గాయకులు, తర్వాత సంగీతకారులు; \q2 వారితో ఉన్నారు కంజరలు వాయిస్తున్న యవ్వన స్త్రీలు. \q1 \v 26 మహా సమాజాలలో దేవుని స్తుతించండి; \q2 ఇశ్రాయేలు సమాజంలో యెహోవాను స్తుతించండి. \q1 \v 27 చిన్నదైన బెన్యామీను గోత్రం వారిని నడిపిస్తుంది, \q2 యూదా నాయకుల గొప్ప సమూహం, \q2 జెబూలూను నఫ్తాలి నాయకులు కూడా ఉన్నారు. \b \q1 \v 28 దేవా, మీ శక్తిని రమ్మని పిలువండి; \q2 ఇంతకుముందు మీరు చేసినట్టుగా, మా దేవా, \q2 మీ బలాన్ని మాకు చూపండి, \q1 \v 29 యెరూషలేములో ఉన్న మీ దేవాలయాన్ని బట్టి \q2 రాజులు మీకు కానుకలు తెస్తారు. \q1 \v 30 దేవా! రెల్లు మధ్యలో ఉండే మృగాన్ని, \q2 అడవి జంతువుల లాంటి దేశాల మధ్యలో ఉన్న ఎడ్ల గుంపును గద్దించండి. \q1 అవి తగ్గించబడి వెండి కడ్డీలను పన్నుగా తెచ్చును గాక \q2 యుద్ధాలంటే ఇష్టపడే దేశాలను చెదరగొట్టండి. \q1 \v 31 ఈజిప్టు నుండి రాయబారులు వస్తారు. \q2 కూషు\f + \fr 68:31 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం\ft*\f* తనను తాను దేవునికి సమర్పించుకుంటుంది. \b \q1 \v 32 భూలోక రాజ్యాల్లారా, దేవునికి పాడండి, \q2 ప్రభువుకు స్తుతి పాడండి. \qs సెలా\qs* \q1 \v 33 అనాది కాలం నుండి మహా ఆకాశాల్లో స్వారీ చేసే, \q2 తన స్వరంతో ఉరిమే ఆయనను కీర్తించండి. \q1 \v 34 దేవుని శక్తిని ప్రకటించండి, \q2 ఆయన ప్రభావం ఇశ్రాయేలుపై ఉన్నది, \q2 ఆయన శక్తి అంతరిక్షంలో ఉంది. \q1 \v 35 దేవా, మీరు మీ పరిశుద్ధాలయంలో భీకరులు; \q2 ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల ప్రభావాన్ని ఇస్తారు. \b \q1 దేవునికే స్తుతి కలుగును గాక! \c 69 \cl కీర్తన 69 \d సంగీత దర్శకునికి. “కలువ పువ్వులు” అనే రాగము మీద పాడదగినది. దావీదు కీర్తన. \q1 \v 1 దేవా, నన్ను రక్షించండి, \q2 నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి. \q1 \v 2 లోతైన ఊబిలో నేను దిగబడిపోతున్నాను, \q2 నేను నిలబడలేకపోతున్నాను. \q1 నేను అగాధ జలాల్లో ఉన్నాను; \q2 వరదలు నన్ను ముంచేస్తున్నాయి. \q1 \v 3 సాయం కోసం అరిచి అలసిపోయాను; \q2 నా గొంతు ఆరిపోయింది. \q1 నా దేవుని కోసం చూస్తూ, \q2 నా కళ్లు క్షీణిస్తున్నాయి. \q1 \v 4 నిష్కారణంగా నన్ను ద్వేషించేవారు \q2 నా తలవెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నారు. \q1 నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, \q2 వారు నిష్కారణంగా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. \q1 నేను దొంగతనం చేయని దానిని \q2 నేను బలవంతంగా తిరిగి ఇవ్వవలసి వచ్చింది. \b \q1 \v 5 దేవా! నా బుద్ధిహీనత మీకు తెలుసు; \q2 నా అపరాధాలు మీ నుండి దాచబడలేదు. \b \q1 \v 6 సైన్యాల అధిపతియైన యెహోవా, \q2 మీలో నిరీక్షణ ఉంచినవారు \q2 నా వలన అవమానానికి గురికావద్దు; \q1 ఇశ్రాయేలు దేవా, మిమ్మల్ని వెదకేవారు \q2 నా వలన సిగ్గుపడకూడదు. \q1 \v 7 మీ కోసం నేను నిందల పాలయ్యాను, \q2 సిగ్గు నా ముఖాన్ని కప్పేసింది. \q1 \v 8 నా కుటుంబానికే నేను పరాయివాడిని అయ్యాను, \q2 నా సొంత తల్లి కుమారులకే నేను అపరిచితుని అయ్యాను; \q1 \v 9 మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దహించి వేస్తుంది, \q2 మిమ్మల్ని అవమానపరచే వారి అవమానాలు నా మీద పడును గాక. \q1 \v 10 నేను ఉపవాసముండి ఏడ్చినప్పుడు \q2 అది నా నిందకు కారణమైంది. \q1 \v 11 నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు \q2 వారు నన్ను హేళనకు సామెతగా చేశారు. \q1 \v 12 గుమ్మం దగ్గర కూర్చునేవారు నన్ను ఎగతాళి చేస్తారు, \q2 త్రాగుబోతులు నా గురించి పాటలు పాడుతున్నారు. \b \q1 \v 13 అయితే యెహోవా, ఇది మీ దయ చూపే సమయమని \q2 నేను మీకు ప్రార్థిస్తున్నాను. \q1 దేవా, మీ గొప్ప ప్రేమతో, \q2 మీ నమ్మకమైన రక్షణతో నాకు జవాబు ఇవ్వండి. \q1 \v 14 ఊబిలో నుండి నన్ను విడిపించండి, \q2 నన్ను మునిగి పోనివ్వకండి; \q1 నన్ను ద్వేషించేవారి నుండి \q2 లోతైన నీటిలో నుండి నన్ను కాపాడండి. \q1 \v 15 వరదలు నన్ను ముంచనీయకండి, \q2 అగాధాలు నన్ను మ్రింగనివ్వకండి \q2 గుంటలో నన్ను పడనివ్వకండి. \b \q1 \v 16 యెహోవా, మీ ప్రేమలోని మంచితనంతో నాకు జవాబు ఇవ్వండి; \q2 మీ గొప్ప కనికరాన్ని బట్టి నా వైపు తిరగండి. \q1 \v 17 మీ సేవకుని నుండి మీ ముఖాన్ని దాచకండి; \q2 నేను ఇబ్బందిలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వండి. \q1 \v 18 నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడండి; \q2 నా శత్రువుల నుండి నన్ను విడిపించండి. \b \q1 \v 19 నన్ను ఎలా హేళన చేశారో, అవమానపరిచారో, \q2 సిగ్గుపరిచారో మీకు తెలుసు; \q2 నా శత్రువులంతా మీ ఎదుటే ఉన్నారు. \q1 \v 20 వారు చేసిన అవమానాలకు నా గుండె బద్దలయ్యింది. \q2 నేను నిరాశలో ఉన్నాను; \q1 నేను సానుభూతి కోసం చూశాను, కానీ ఎవరూ లేరు \q2 ఆదరించేవారి కోసం చూశాను, కానీ ఒక్కరూ దొరకలేదు. \q1 \v 21 నా ఆహారంలో వారు చేదు కలిపారు \q2 దాహమైతే పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు. \b \q1 \v 22 వారి ఎదుట ఉన్న భోజనబల్ల వారికి ఉరి అవును గాక; \q2 వారి క్షేమం వారికి ఉచ్చు అవును గాక. \q1 \v 23 వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక, \q2 వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక. \q1 \v 24 మీ ఉగ్రతను వారి మీద కుమ్మరించండి; \q2 మీ కోపాగ్ని వారిని తాకనివ్వండి. \q1 \v 25 వారి స్థలం పాడైపోవును గాక; \q2 వారి డేరాలలో ఎవరు నివసించకుందురు గాక. \q1 \v 26 మీరు గాయం చేసిన వారిని వారు హింసిస్తారు \q2 మీరు బాధపెట్టిన వారి బాధ గురించి మాట్లాడతారు. \q1 \v 27 నేరం మీద నేరం వారిపై మోపండి; \q2 మీ నీతిలో వారిని పాలు పంచుకోనివ్వకండి. \q1 \v 28 జీవగ్రంథంలో నుండి వారు తుడిచివేయబడుదురు గాక, \q2 నీతిమంతుల జాబితాలో వారి నమోదు చేయబడకుండును గాక. \b \q1 \v 29 కాని నా మట్టుకైతే నేను బాధించబడి వేదనలో ఉన్నాను, \q2 దేవా! మీ రక్షణ నన్ను కాపాడును గాక. \b \q1 \v 30 నేను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాను. \q2 కృతజ్ఞత చెల్లించి ఆయనను కీర్తిస్తాను. \q1 \v 31 ఎద్దును, కొమ్ములు డెక్కలు కలిగిన కోడెను అర్పించడం కంటే, \q2 ఆయనను స్తుతించడం యెహోవాకు ఇష్టము. \q1 \v 32 దీనులు చూసి ఆనందిస్తారు; \q2 దేవున్ని వెదికేవారి హృదయాలు తిరిగి బ్రతుకును గాక. \q1 \v 33 అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, \q2 బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు. \b \q1 \v 34 ఆకాశం భూమి ఆయనను స్తుతించును గాక, \q2 సముద్రాలు వాటిలో ఉండే జలచరాలన్నీ ఆయనను స్తుతించును గాక. \q1 \v 35 ఎందుకంటే దేవుడు సీయోనును రక్షిస్తారు, \q2 యూదా పట్టణాలను తిరిగి కడతారు. \q1 అప్పుడు ప్రజలు అక్కడ నివసించి దానిని స్వాధీనం చేసుకుంటారు. \q2 \v 36 దేవుని సేవకుల సంతానం ఆ భూమిని వారసత్వంగా పొందుతారు. \q2 ఆయన నామాన్ని ప్రేమించేవారు అక్కడ నివసిస్తారు. \c 70 \cl కీర్తన 70 \d సంగీత దర్శకునికి. దావీదు అభ్యర్థన కీర్తన. \q1 \v 1 దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి; \q2 యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి. \b \q1 \v 2 నా ప్రాణం తీయాలని కోరేవారు \q2 సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; \q1 నా పతనాన్ని కోరేవారందరు \q2 అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి. \q1 \v 3 నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు \q2 సిగ్గుపడి ఆశాభంగం పొందాలి. \q1 \v 4 అయితే మిమ్మల్ని వెదికేవారంతా \q2 మీలో ఆనందించి సంతోషించాలి; \q1 మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, \q2 “యెహోవా గొప్పవాడు!” అని అనాలి. \b \q1 \v 5 కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; \q2 దేవా! నా దగ్గరకు త్వరగా రండి, \q1 మీరే నా సహాయం, నా విమోచకుడు; \q2 యెహోవా, ఆలస్యం చేయకండి. \c 71 \cl కీర్తన 71 \q1 \v 1 యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; \q2 నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి. \q1 \v 2 మీ నీతిని బట్టి నన్ను రక్షించి విడిపించండి; \q2 నా వైపు చెవి ఉంచి నన్ను రక్షించండి. \q1 \v 3 నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే, \q2 నా ఆశ్రయదుర్గంగా ఉండండి; \q1 మీరు నా కొండ నా కోట కాబట్టి, \q2 నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి. \q1 \v 4 నా దేవా, దుష్టుల చేతి నుండి, \q2 చెడ్డవారు, క్రూరుల పట్టు నుండి నన్ను విడిపించండి. \b \q1 \v 5 ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ, \q2 నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం. \q1 \v 6 పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను; \q2 నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే. \q2 నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను. \q1 \v 7 అనేకులకు నేనొక సూచనగా ఉన్నాను; \q2 మీరే నాకు బలమైన ఆశ్రయం. \q1 \v 8 నా నోరు మీ స్తుతితో నిండి ఉంది; \q2 నేను రోజంతా మీ వైభవాన్ని ప్రకటిస్తాను. \b \q1 \v 9 నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నన్ను త్రోసివేయకండి; \q2 నా బలం తగ్గిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టకండి. \q1 \v 10 నా శత్రువులు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు; \q2 నన్ను చంపాలని చూసేవారంతా కలిసి కుట్ర చేస్తున్నారు. \q1 \v 11 “దేవుడు అతన్ని విడిచిపెట్టారు; \q2 అతన్ని విడిపించడానికి ఒక్కరు లేరు, \q2 అతన్ని వెంటాడి పట్టుకోండి” అని వారంటారు. \q1 \v 12 నా దేవా, నాకు దూరంగా ఉండకండి; \q2 దేవా, సాయం చేయడానికి త్వరగా రండి. \q1 \v 13 నాపై నేరం మోపేవారు సిగ్గుతో నశించుదురు గాక; \q2 నాకు హాని చేయాలని కోరేవారు \q2 ఎగతాళిచేయబడి అవమానపరచబడుదురు గాక. \b \q1 \v 14 నా మట్టుకైతే, నేనెల్లప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాను; \q2 నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని స్తుతిస్తాను. \b \q1 \v 15 రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి, \q2 రక్షణక్రియలను గురించి చెప్తుంది. \q2 అవి నా గ్రహింపుకు అందనివి. \q1 \v 16 ప్రభువైన యెహోవా, నేను వచ్చి మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను; \q2 కేవలం మీ నీతిక్రియలను మాత్రమే నేను ప్రకటిస్తాను. \q1 \v 17 దేవా! నా యవ్వనం నుండి మీరు నాకు బోధించారు, \q2 ఈ రోజు వరకు నేను మీ అద్భుత క్రియలను ప్రకటిస్తున్నాను. \q1 \v 18 నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి, \q2 నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని, \q1 రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు \q2 నన్ను విడిచిపెట్టకండి. \b \q1 \v 19 దేవా, మీ నీతి ఎత్తయిన ఆకాశాలకు ఉన్నతమైనది, \q2 మీరు గొప్ప వాటిని చేశారు. \q2 దేవా, మీలాంటి వారెవరు? \q1 \v 20 మీరు నన్ను అనేకమైన ఇబ్బందులు, \q2 చేదైన వాటిని చూసేలా చేసినప్పటికీ, \q2 మీరు నన్ను మళ్ళీ జీవించేలా చేస్తారు; \q1 భూమి యొక్క లోతుల నుండి \q2 మీరు నన్ను మళ్ళీ పైకి తెస్తారు. \q1 \v 21 మీరు నా గౌరవాన్ని పెంచుతారు \q2 మరోసారి నన్ను ఓదార్చుతారు. \b \q1 \v 22 నా దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి \q2 నేను సితారాతో మిమ్మల్ని స్తుతిస్తాను; \q1 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా, \q2 నేను వీణతో మిమ్మల్ని స్తుతిస్తాను. \q1 \v 23 మీరు విడిపించిన నేను \q2 మీకు స్తుతి పాడినప్పుడు \q2 నా పెదవులు ఆనందంతో కేకలు వేస్తాయి. \q1 \v 24 రోజంతా నా నాలుక \q2 మీ నీతిక్రియలను గురించి చెప్తుంది, \q1 ఎందుకంటే నాకు హాని చేయాలని కోరుకున్నవారు \q2 అవమానం పొంది గందరగోళానికి గురి అయ్యారు. \c 72 \cl కీర్తన 72 \d సొలొమోను కీర్తన. \q1 \v 1 ఓ దేవా, రాజుకు మీ న్యాయాన్ని, \q2 రాకుమారునికి మీ నీతిని ప్రసాదించండి. \q1 \v 2 ఆయన మీ ప్రజలకు నీతితో \q2 బాధితులకు న్యాయంతో తీర్పు తీర్చును గాక. \b \q1 \v 3 పర్వతాలు ప్రజలకు వృద్ధిని, \q2 కొండలు నీతి ఫలములు ఇచ్చును గాక. \q1 \v 4 ప్రజల్లో బాధపడుతున్నవారిని ఆయన రక్షించును గాక \q2 అవసరతలో ఉన్న వారి పిల్లలను రక్షించును గాక; \q2 బాధించేవారిని త్రొక్కివేయును గాక. \q1 \v 5 సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, \q2 అన్ని తరాల వరకు వారు ఆయనకు భయపడుదురు గాక. \q1 \v 6 ఆయన కోయబడిన తుక్కుపై కురిసే వర్షంలా, \q2 భూమిని తడిపే నీటి జల్లులా ఉండును గాక. \q1 \v 7 ఆయన రోజుల్లో నీతిమంతులు వృద్ధిచెందుతారు \q2 చంద్రుడు లేకుండ పోయే వరకు అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. \b \q1 \v 8 సముద్రం నుండి సముద్రం వరకు, \q2 యూఫ్రటీసు నుండి భూమ్యంతాల వరకు ఆయన పరిపాలిస్తారు. \q1 \v 9 ఎడారిలో నివసించే ప్రజలు ఆయన ముందు తలవంచుతారు. \q2 తన శత్రువులు మట్టిని నాకుతారు. \q1 \v 10 తర్షీషు రాజులు దూర దేశపు రాజులు, \q2 ఆయనకు పన్నులు చెల్లిస్తారు. \q1 షేబ సెబా రాజులు \q2 కానుకలు తెస్తారు. \q1 \v 11 రాజులందరూ ఆయనకు నమస్కరించుదురు గాక \q2 దేశాలన్నీ ఆయనకు సేవలు చేయును గాక. \b \q1 \v 12 అవసరతలో ఉండి మొరపెట్టే వారిని, \q2 సహాయపడడానికి ఎవరు లేని బాధితులను ఆయన విడిపిస్తారు. \q1 \v 13 ఆయన బలహీనులపై పేదవారిపై జాలి చూపుతారు, \q2 పేదవారిని మరణం నుండి రక్షిస్తారు. \q1 \v 14 ఆయన వారిని అణచివేత నుండి హింస నుండి విడిపిస్తారు, \q2 ఎందుకంటే ఆయన దృష్టిలో వారి రక్తం విలువైనది. \b \q1 \v 15 రాజు దీర్ఘకాలం జీవించును గాక! \q2 షేబ నుండి ఆయనకు బంగారం ఇవ్వబడును గాక. \q1 ప్రజలు నిత్యం ఆయన కోసం ప్రార్థించుదురు గాక. \q2 రోజంతా ఆయనను స్తుతించుదురు గాక. \q1 \v 16 దేశం అంతటా ధాన్యం సమృద్ధిగా ఉండును గాక; \q2 కొండల పైభాగాన అది ఆడించబడును గాక. \q1 పండ్లచెట్లు లెబానోను చెట్లలా వర్ధిల్లును గాక \q2 ప్రజలు పొలం లోని పచ్చికబయళ్లుగా వృద్ధి చెందును గాక. \q1 \v 17 ఆయన పేరు నిరంతరం ఉండును గాక; \q2 అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక. \b \q1 అప్పుడు ఆయన ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి,\f + \fr 72:17 \fr*\ft లేదా \ft*\fqa ఆశీర్వాదాలలో ఆయన నామమును వాడుతారు \fqa*\ft \+xt ఆది 48:20\+xt*\ft*\f* \q2 వారు ఆయనను ధన్యుడు అని పిలుస్తారు. \b \b \q1 \v 18 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవునికి స్తుతి, \q2 ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తారు. \q1 \v 19 ఆయన మహిమగల నామం సదాకాలం స్తుతింపబడును గాక; \q2 భూమంతా ఆయన మహిమతో నింపబడును గాక. \qc ఆమేన్ ఆమేన్. \b \b \q1 \v 20 దీనితో యెష్షయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిశాయి. \c 73 \ms మూడవ గ్రంథము \mr కీర్తనలు 73–89 \cl కీర్తన 73 \d ఆసాపు కీర్తన. \q1 \v 1 ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయులకు \q2 దేవుడు ఖచ్చితంగా మంచివాడు. \b \q1 \v 2 కానీ నా మట్టుకైతే, నా పాదాలు దాదాపు జారిపోయాయి; \q2 నా పాదం దాదాపు పట్టును కోల్పోయింది. \q1 \v 3 దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు \q2 నేను అహంకారుల మీద అసూయ పడ్డాను. \b \q1 \v 4 వారికి ఏ బాధలు లేవు; \q2 వారి శరీరాలు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి. \q1 \v 5 సాధారణంగా మనుష్యులకు ఉండే భారాలు వారికి లేవు; \q2 మనుష్యులకు కలిగే అనారోగ్యమనే తెగులు వారికి లేదు. \q1 \v 6 కాబట్టి గర్వం వారికి కంఠహారంగా ఉంది; \q2 హింసను వారు వస్త్రంగా ధరించారు. \q1 \v 7 వారి కఠిన హృదయాల నుండి దోషం బయటికి వస్తుంది, \q2 వారి చెడు ఊహలకు హద్దులు లేవు. \q1 \v 8 వారు ఎగతాళి చేస్తారు, దురుద్దేశంతో మాట్లాడతారు; \q2 అహంకారంతో అణచివేస్తామని బెదిరిస్తారు. \q1 \v 9 వారి నోళ్ళు పరలోకంలో పాలిస్తున్నట్లు మాట్లాడుతాయి, \q2 వారి నాలుకలు భూమిపై ఆధిపత్యమున్నట్లు ప్రకటిస్తాయి. \q1 \v 10 అందువల్ల వారి ప్రజలు వారివైపు తిరుగుతారు \q2 వారి మాటలను మంచినీరు త్రాగినట్లు త్రాగుతారు. \q1 \v 11 “దేవునికి ఎలా తెలుస్తుంది? \q2 మహోన్నతునికి ఏదైనా తెలుసా?” అని వారనుకుంటారు. \b \q1 \v 12 దుష్టులు ఇలా ఉంటారు. \q2 ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు. \b \q1 \v 13 నేను నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే \q2 నేను నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే. \q1 \v 14 రోజంతా నేను బాధింపబడ్డాను, \q2 ప్రతి ఉదయం నూతన శిక్షలు వస్తున్నాయి. \b \q1 \v 15 నేను అలా మాట్లాడాలని అనుకుని ఉంటే, \q2 నేను మీ పిల్లలను మోసం చేసినట్టే. \q1 \v 16-17 ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, \q2 నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు \q1 అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది; \q2 అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను. \b \q1 \v 18 ఖచ్చితంగా మీరు వారిని జారే నేలపై ఉంచారు; \q2 మీరు వారిని పతనానికి పడవేస్తారు. \q1 \v 19 వారు అకస్మాత్తుగా నాశనమవుతారు, \q2 వారు భయంతో పూర్తిగా నశిస్తారు! \q1 \v 20 ప్రభువా, మీరు లేచినప్పుడు, \q2 ఒకరు మేల్కొన్నప్పుడు ఒక కలలో చూసినవి మరచినట్లు; \q2 మీరు వారి ఉనికిని తృణీకరిస్తారు. \b \q1 \v 21 నా హృదయం దుఃఖించినప్పుడు \q2 నా ఆత్మ నీరసించినప్పుడు, \q1 \v 22 నేను తెలివిలేని వాడను, అజ్ఞానిని; \q2 మీ ఎదుట నేను క్రూరమైన మృగంలా ఉన్నాను. \b \q1 \v 23 అయినా నేనెల్లప్పుడు మీతో ఉన్నాను; \q2 మీరు నా కుడిచేయి పట్టుకున్నారు. \q1 \v 24 మీ ఆలోచనచేత నన్ను నడిపిస్తున్నారు, \q2 తర్వాత నన్ను పరలోక మహిమలో చేర్చుకుంటారు. \q1 \v 25 పరలోకంలో మీరు తప్ప నాకెవరున్నారు? \q2 మీరు తప్ప ఈ లోకంలో నాకేమి అక్కర్లేదు. \q1 \v 26 నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో, \q2 కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలం \q2 నిత్యం నా స్వాస్థ్యం. \b \q1 \v 27 మీకు దూరంగా ఉన్నవారు నశిస్తారు; \q2 మిమ్మల్ని విడిచి వ్యభిచారులుగా ప్రవర్తించే వారందరినీ మీరు నాశనం చేస్తారు. \q1 \v 28 కాని నా మట్టుకైతే, నేను దేవునికి సమీపంగా ఉంటాను. \q2 నేను ప్రభువైన యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నాను; \q2 మీ క్రియలన్నిటిని గురించి నేను ప్రకటిస్తాను. \c 74 \cl కీర్తన 74 \d ఆసాపు ధ్యానకీర్తన. \q1 \v 1 దేవా, మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు తిరస్కరించారు? \q2 మీ పచ్చికలోని గొర్రెల మీద మీ కోపం ఎందుకు రగులుకొంది? \q1 \v 2 మీ స్వాస్థ్య గోత్రాన్ని మీరు పూర్వం సంపాదించుకుని \q2 విమోచించిన మీ వారసత్వ సమాజాన్ని, \q2 మీరు నివసించిన సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి. \q1 \v 3 ఈ నిత్య శిధిలాల వైపు, \q2 శత్రువు పరిశుద్ధాలయం మీదికి తెచ్చిన ఈ విధ్వంసం అంతటి వైపు \q2 మీ అడుగులు తిప్పండి. \b \q1 \v 4 మీరు మాతో కలిసిన ప్రదేశంలో మీ శత్రువులు గర్జించారు; \q2 వారు తమ ధ్వజాలను సంకేతాలుగా ఏర్పరచుకున్నారు. \q1 \v 5 దట్టమైన పొదలను నరికే పురుషుల్లా \q2 వారు గొడ్డళ్ళు పట్టుకున్నారు. \q1 \v 6 చెక్కిన పలకను వారు \q2 తమ గొడ్డళ్ళతో చేతిగొడ్డళ్ళతో పగల కొట్టారు. \q1 \v 7 మీ పవిత్రాలయానికి నిప్పు పెట్టి నేలమట్టం చేశారు; \q2 మీ నామం కలిగియున్న నివాస స్థలాన్ని అపవిత్రం చేశారు. \q1 \v 8 వారు తమ హృదయాల్లో, “దేవుని ఆరాధన స్థలాలను పూర్తిగా ధ్వంసం చేద్దాం!” అనుకుని, \q2 దేశంలో దేవుడు ఆరాధించబడే ప్రతీ స్థలాన్ని తగలబెట్టారు. \b \q1 \v 9 దేవుని నుండి మాకు ఏ సంకేతాలు లేవు; \q2 ప్రవక్తలు లేరు గతించిపోయారు, \q2 ఇదంతా చివరికి ఏమవుతుందో చెప్పే వాడెవడూ మా మధ్యలేడు. \q1 \v 10 దేవా, ఎంతకాలం శత్రువు మిమ్మల్ని వెక్కిరిస్తాడు? \q2 శత్రువు శాశ్వతంగా మీ పేరును దూషిస్తాడా? \q1 \v 11 మీరు ఎందుకు మీ కుడిచేతిని వెనక్కి తీసుకున్నారు? \q2 జీవబల ప్రభావాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు? \q2 పిడికిలి బిగించి, చేయి చాచి వారిని దెబ్బకొట్టు. నాశనం చేయి! \b \q1 \v 12 అతి ప్రాచీన కాలం నుండి దేవుడే నా రాజు; \q2 దేశమంతా మీరే నాకు మహారక్షణ అనుగ్రహించావు. \b \q1 \v 13 ఎర్ర సముద్రాన్ని మీ బలం చేత రెండు పాయలుగా విభజించావు, \q2 సముద్ర దేవత తలల్ని చితకకొట్టావు. \q1 \v 14 లెవియాథన్ తలలను చితక్కొట్టింది మీరే \q2 మహా మొసలి తల చితుక కొట్టావు. \q1 \v 15 మీ ఆజ్ఞమేరకు నీటిబుగ్గలు నదులు ప్రజలకు మీరు సరఫరా చేశారు. \q2 జీవనది యొర్దాను ప్రవాహాన్ని ఇంకి పోయేట్టు చేసి వారికి దారి ఏర్పరచింది. \q1 \v 16 పగలు మీదే. రాత్రి కూడా మీదే. \q2 వెలిగే నక్షత్రాలు మీవే! సూర్యున్ని మీరే చేశారు. \q1 \v 17 సమస్త ప్రకృతి మీ చేతుల్లో ఉంది. \q2 మీరే వేసవికాలం చలికాలం ఏర్పరిచారు. \b \q1 \v 18 దేవా! ఈ శత్రువులు నిన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో చూడు. \q2 ఓ యెహోవా దేవా! ఈ మూర్ఖపు జనం మీ నామాన్ని దూషించారు జ్ఞాపకం తెచ్చుకోండి. \q1 \v 19 మీ పావురపు ప్రాణాన్ని అడవి జంతువులకు అప్పగించవద్దు; \q2 నీ బాధించబడిన ప్రజల జీవితాలను ఎప్పటికీ మరచిపోవద్దు. \q1 \v 20 మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, \q2 దేశమంతా చీకటితో నిండి ఉంది. క్రూరులతో నిండి ఉంది. \q1 \v 21 నలిగినవారిని మరల అపకీర్తి పాలు కానివ్వకండి. \q2 బీదలు అవసరతలో ఉన్న ఈ ప్రజలు మీ నామం స్తుతించుదురు గాక. \q1 \v 22 దేవా, లేచి, మీ కారణాన్ని సమర్థించండి; \q2 బుద్ధిహీనులు రోజంతా మిమ్మల్ని ఎగతాళి చేసేది జ్ఞాపకముంచుకోండి. \q1 \v 23 మీ విరోధుల గొడవను, \q2 నిరంతరం పెరిగే మీ శత్రువుల గందరగోళాన్ని విస్మరించవద్దు. \c 75 \cl కీర్తన 75 \d సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగము మీద పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. \q1 \v 1 దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము; \q2 మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం; \q2 ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు. \b \q1 \v 2 “నేను నిర్ణీత సమయంలో; \q2 న్యాయంగా తీర్పు తీరుస్తాను. \q1 \v 3 భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు, \q2 దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే. \qs సెలా\qs* \q1 \v 4 అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అని \q2 దుష్టులతో, ‘మీ కొమ్ములను\f + \fr 75:4 \fr*\fq కొమ్ములను \fq*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తున్నాయి; \+xt 5|link-href="PSA 75:5"\+xt* \+xt 10 వచనాల్లో|link-href="PSA 75:10"\+xt* కూడా\ft*\f* ఎత్తకండి. \q1 \v 5 ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి; \q2 అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు. \b \q1 \v 6 తూర్పు నుండి కాని పడమర నుండి కాని \q2 అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు. \q1 \v 7 దేవుడే తీర్పు తీరుస్తారు: \q2 ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు. \q1 \v 8 యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది \q2 అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది; \q1 ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు \q2 మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు. \b \q1 \v 9 నేనైతే నిత్యం ప్రకటిస్తాను; \q2 యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను. \q1 \v 10 ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను, \q2 కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు. \c 76 \cl కీర్తన 76 \d సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. \q1 \v 1 యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు; \q2 ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది. \q1 \v 2 షాలేములో ఆయన గుడారం ఉంది. \q2 సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది. \q1 \v 3 అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు, \q2 డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు. \qs సెలా\qs* \b \q1 \v 4 వేటకు ప్రసిద్ధి చెందిన పర్వతాల కంటే, \q2 మీరు గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్నారు. \q1 \v 5 బలవంతులు దోపిడి చేయబడ్డారు, \q2 వారు నిద్రపోయారు. \q1 ఏ ఒక్క యోధుడు \q2 మాకు వ్యతిరేకంగా చేయి ఎత్తలేడు. \q1 \v 6 యాకోబు దేవా! మీరు గద్దిస్తే \q2 గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి. \b \q1 \v 7 మీ ఒక్కరికే భయపడాలి. \q2 మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు? \q1 \v 8 పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు, \q2 దేశం భయపడి మౌనం వహించింది. \q1 \v 9 ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి, \q2 తీర్పు తీర్చడానికి మీరు లేచారు. \qs సెలా\qs* \q1 \v 10 మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, \q2 మీ ఉగ్రత నుండి తప్పించుకున్న వారిని మీరు ఆయుధంగా ధరించుకుంటారు.\f + \fr 76:10 \fr*\ft లేదా \ft*\fqa మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్నవారు \fqa*\fqa నియంత్రించబడతారు\fqa*\f* \b \q1 \v 11 దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి; \q2 పొరుగు దేశాలన్నీ \q2 భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక. \q1 \v 12 పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు; \q2 భూరాజులు ఆయనను చూసి భయపడాలి. \c 77 \cl కీర్తన 77 \d సంగీత దర్శకుడైన యెదూతూనుకు. ఒక ఆసాపు కీర్తన. \q1 \v 1 నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; \q2 ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను. \q1 \v 2 నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; \q2 అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, \q2 నాకు ఆదరణ కలుగలేదు. \b \q1 \v 3 దేవా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖించాను; \q2 నేను ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ సొమ్మసిల్లింది. \qs సెలా\qs* \q1 \v 4 మీరు నా కనురెప్పలు తెరిచి ఉంచారు \q2 నేను మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను. \q1 \v 5 మునుపటి రోజులను గురించి, \q2 చాలా కాలంనాటి సంవత్సరాలను గురించి నేను ఆలోచించాను. \q1 \v 6 రాత్రివేళ నేను నా పాటలు జ్ఞాపకం చేసుకున్నాను. \q2 నా హృదయం ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ అడిగింది: \b \q1 \v 7 “ప్రభువు నన్ను శాశ్వతంగా తృణీకరిస్తారా? \q2 ఆయన ఎప్పటికీ తన దయను చూపించరా? \q1 \v 8 ఆయన మారని ప్రేమ శాశ్వతంగా పోయినట్లేనా? \q2 ఆయన వాగ్దానం ఎప్పటికీ నెరవేరదా? \q1 \v 9 దేవుడు కరుణించడం మరచిపోయారా? \q2 ఆయన తన కోపంలో కనికరాన్ని చూపకుండ ఉంటారా?” \qs సెలా\qs* \b \q1 \v 10 అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి: \q2 మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు. \q1 \v 11 యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను; \q2 అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. \q1 \v 12 మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను, \q2 మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను.” \b \q1 \v 13 దేవా, మీ మార్గాలు పరిశుద్ధమైనవి. \q2 మన దేవునిలాంటి గొప్ప దేవుడెవరున్నారు? \q1 \v 14 మీరు అద్భుతాలు చేసే దేవుడు; \q2 మీరు ప్రజలమధ్య మీ శక్తిని చూపిస్తారు. \q1 \v 15 మీ శక్తివంతమైన చేతితో యాకోబు, యోసేపు సంతతివారైన \q2 మీ ప్రజలను విమోచించారు. \qs సెలా\qs* \b \q1 \v 16 దేవా, జలాలు మిమ్మల్ని చూశాయి, \q2 జలాలు మిమ్మల్ని చూసి త్రుళ్ళిపడ్డాయి; \q2 అగాధాలు వణికిపోయాయి. \q1 \v 17 మేఘాలు వర్షించాయి. \q2 ఆకాశాలు ఉరుములతో ప్రతిధ్వనించాయి. \q2 మీ బాణాలు అన్నివైపులా తళుక్కుమన్నాయి. \q1 \v 18 మీ ఉరుము సుడిగాలిలో వినిపించింది, \q2 మీ మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది; \q2 భూమి వణికి కంపించింది. \q1 \v 19 మీ అడుగుజాడలు కనిపించనప్పటికీ, \q2 మీ మార్గం సముద్రం గుండా, \q2 శక్తివంతమైన జలాల గుండా వెళ్లింది. \b \q1 \v 20 మోషే అహరోనుల ద్వార \q2 మీరు మీ ప్రజలను మందలా నడిపించారు. \c 78 \cl కీర్తన 78 \d ఆసాపు ధ్యానకీర్తన. \q1 \v 1 నా ప్రజలారా! నా ఉపదేశం వినండి; \q2 నా నోటి మాటలు వినండి. \q1 \v 2 నేను ఉపమానం చెప్పడానికి నా నోరు తెరుస్తాను; \q2 పూర్వకాలం నుండి దాచబడి ఉన్న విషయాలను నేను తెలియజేస్తాను. \q1 \v 3 మనం విన్నవి మనకు తెలిసినవి \q2 మన పూర్వికులు మనకు చెప్పిన సంగతులను చెప్తాను. \q1 \v 4 వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము; \q2 యెహోవా చేసిన స్త్రోత్రార్హమైన కార్యాలను, \q1 ఆయన శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను గురించి \q2 తర్వాతి తరానికి మేము చెప్తాం. \q1 \v 5 ఆయన యాకోబుకు చట్టాలు విధించారు \q2 ఇశ్రాయేలులో నిబంధనలను స్థాపించారు, \q1 వారి పిల్లలకు దానిని బోధించుమని \q2 మన పూర్వికులకు ఆజ్ఞాపించారు. \q1 \v 6 తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు, \q2 ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా తెలుసుకుంటారు, \q2 వారు వారి పిల్లలకు బోధిస్తారు. \q1 \v 7 అప్పుడు వారు దేవునిలో నమ్మకం ఉంచుతారు \q2 ఆయన కార్యాలను మరచిపోరు \q2 ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. \q1 \v 8 వారు తమ పితరుల్లా అనగా \q2 మొండితనం తిరుగుబాటు స్వభావం కలిగిన తరం గాను, \q1 దేవుని పట్ల నమ్మకమైన హృదయాలు లేనివారిగాను \q2 ఆయన పట్ల విశ్వసనీయత లేని ఆత్మలు గలవారి గాను ఉండరు. \b \q1 \v 9 ఎఫ్రాయిం వారు విల్లులను ఆయుధాలుగా ధరించినప్పటికీ, \q2 యుద్ధ దినాన వెనుకకు తిరిగారు; \q1 \v 10 వారు దేవుని నిబంధనను పాటించలేదు, \q2 ఆయన న్యాయవిధుల ప్రకారం జీవించడానికి నిరాకరించారు. \q1 \v 11 వారు ఆయన చేసిన కార్యాలు, \q2 ఆయన వారికి చూపిన అద్భుతాలను మరచిపోయారు. \q1 \v 12 ఆయన వారి పూర్వికుల ఎదుట \q2 ఈజిప్టు దేశంలో, సోయను ప్రాంతంలో అద్భుతకార్యాలు చేశారు. \q1 \v 13 ఆయన సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో వారిని నడిపించారు; \q2 ఆయన నీటిని గోడలా నిలబడేలా చేశారు. \q1 \v 14 పగలు మేఘస్తంభమై, \q2 రాత్రి అగ్ని స్తంభమై వారికి దారి చూపారు. \q1 \v 15 అరణ్యంలో బండలు చీల్చి త్రాగడానికి నీరిచ్చారు. \q2 సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని ఇచ్చారు. \q1 \v 16 ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు \q2 నీటిని నదుల్లా ప్రవహింపజేశారు. \b \q1 \v 17 కాని వారు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు \q2 అరణ్యంలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేశారు. \q1 \v 18 తాము ఆశపడిన ఆహారాన్ని అడుగుతూ \q2 వారు ఉద్దేశపూర్వకంగా దేవున్ని పరీక్షించారు. \q1 \v 19 వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు; \q2 వారు, “ఈ ఎడారిలో దేవుడు \q2 మనకు భోజనం సరఫరా చేయగలడా? \q1 \v 20 నిజమే, ఆయన బండరాయిని కొట్టారు, \q2 నీరు బయటకు వచ్చింది, \q2 ప్రవాహాలు సమృద్ధిగా ప్రవహించాయి, \q1 కాని ఆయన మనకు రొట్టె కూడా ఇవ్వగలరా? \q2 ఆయన తన ప్రజలకు మాంసం అందించగలడా?” అన్నారు. \q1 \v 21 యెహోవా వారి మాట విని కోపగించారు; \q2 ఆయన అగ్ని యాకోబుకు వ్యతిరేకంగా రగులుకొంది, \q2 ఆయన ఉగ్రత ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచింది. \q1 \v 22 ఎందుకంటే వారు దేవునిలో విశ్వాసముంచలేదు. \q2 ఆయన ఇచ్చే విడుదలలో నమ్మకముంచలేదు. \q1 \v 23 అయినా ఆయన పైనున్న ఆకాశాలను \q2 ఆకాశద్వారాలు తెరిచారు. \q1 \v 24 తినడానికి ప్రజలకు ఆయన మన్నా కురిపించారు. \q2 పరలోకం నుండి ధాన్యం ఇచ్చారు. \q1 \v 25 మానవులు దేవదూతల ఆహారం తిన్నారు; \q2 ఆయన వారికి సమృద్ధిగా ఆహారం పంపారు. \q1 \v 26 ఆకాశం నుండి ఆయన తూర్పు గాలిని వదిలారు. \q2 తన శక్తితో దక్షిణ గాలి విసిరేలా చేశారు. \q1 \v 27 ఆయన ధూళి అంత విస్తారంగా మాంసాన్ని, \q2 సముద్రపు ఇసుక రేణువుల్లా పక్షుల్ని వారి మీద కుమ్మరించారు. \q1 \v 28 ఆయన వాటిని వారి దండులో \q2 వారి గుడారాల చుట్టూ వంగేలా చేశారు. \q1 \v 29 వారడిగిందే దేవుడిచ్చాడు, \q2 వారు కడుపునిండా తిన్నారు. \q1 \v 30 కానీ వారి ఆశ తీరకముందే, \q2 ఇంకా ఆహారం వారి నోటిలో ఉండగానే, \q1 \v 31 దేవుని కోపం వారి మీదికి రగులుకొంది; \q2 వారిలో బలిష్ఠులను ఆయన హతమార్చారు, \q2 ఇశ్రాయేలీయులలో యువకులను సంహరించారు. \b \q1 \v 32 ఇంత జరిగినా వారింకా పాపం చేస్తూనే ఉన్నారు; \q2 ఆయన అద్భుతాలు చేస్తున్నా వారు నమ్మలేదు. \q1 \v 33 అందువల్ల ఆయన వారి రోజులను నిష్ఫలంగా \q2 వారి సంవత్సరాలు భయంలో ముగిసిపోయేలా చేశారు. \q1 \v 34 దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు; \q2 వారు మరలా ఆసక్తిగా ఆయన వైపు తిరిగారు. \q1 \v 35 దేవుడు తమకు కొండ అని, \q2 సర్వోన్నతుడైన దేవుడు తమ విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు. \q1 \v 36 అయితే వారు ఆయనను నోటితో పొగడుతూ \q2 తమ నాలుకలతో ఆయనకు అబద్ధాలు చెప్పారు; \q1 \v 37 వారి హృదయాలు దేవుని పట్ల విధేయతగా లేవు, \q2 వారు ఆయన నిబంధన పట్ల నమ్మకంగా లేరు. \q1 \v 38 అయినా దేవుడు దయ చూపించి; \q2 వారి పాపాలను క్షమించారు \q2 వారిని నాశనం చేయలేదు. \q1 మాటిమాటికి ఆయన తన కోపాన్ని అదుపు చేసుకున్నారు \q2 ఆయన పూర్తి ఉగ్రతను రేపలేదు. \q1 \v 39 వారు కేవలం శరీరులే అని, \q2 విసరి వెళ్లి మరలి రాని గాలి లాంటి వారని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. \b \q1 \v 40 అరణ్యంలో వారు ఆయన మీద అనేకసార్లు తిరుగుబాటు చేశారు, \q2 ఎడారిలో ఆయన హృదయాన్ని దుఃఖపెట్టారు. \q1 \v 41 పదే పదే వారు దేవున్ని పరీక్షించారు; \q2 వారు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని బాధపెట్టారు. \q1 \v 42 వారు ఆయన శక్తిని గాని, \q2 శత్రువుల నుండి వారిని విడిపించిన దినాన్ని కాని, \q1 \v 43 ఆయన ఈజిప్టులో చేసిన సూచకక్రియలను, \q2 సోయను ప్రాంతంలో అద్భుతక్రియలు చూపించిన దినాన్ని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు. \q1 \v 44 ఆయన వారి నైలు నది కాలువలను రక్తంగా మార్చారు; \q2 వారు తమ ప్రవాహాల నుండి త్రాగలేకపోయారు. \q1 \v 45 ఆయన జోరీగల గుంపులను పంపగా అవి వారిని మ్రింగివేశాయి, \q2 కప్పలు వారిని నాశనం చేశాయి. \q1 \v 46 ఆయన వారి చేలను పురుగులకు, \q2 వారి పంటలను మిడతలకు అప్పగించారు. \q1 \v 47 వడగండ్లతో వారి ద్రాక్షతీగెలను, \q2 మంచుతో వారి మేడిచెట్లను ఆయన నాశనం చేశారు. \q1 \v 48 ఆయన వారి పశువులను వడగండ్లకు, \q2 వారి మందలను పిడుగులకు అప్పగించారు. \q1 \v 49 నాశనం కలుగచేసే దూతల సేనను పంపినట్లు \q2 ఆయన వారి మీదికి తన కోపాన్ని \q2 తన ఉగ్రతను, ఆగ్రహాన్ని క్రోధాన్ని పంపారు. \q1 \v 50 ఆయన తన కోపానికి మార్గాన్ని సిద్ధపరచారు; \q2 ఆయన వారిని మరణం నుండి తప్పించకుండ, \q2 వారి ప్రాణాలను తెగుళ్ళకు అప్పగించారు. \q1 \v 51 ఆయన ఈజిప్టులో జ్యేష్ఠులందరిని, \q2 హాము గుడారాల్లో వారి పురుషత్వానికి గుర్తుగా ఉన్న మొదటి సంతానాన్ని చంపారు. \q1 \v 52 అయితే ఆయన తన ప్రజలను గొర్రెల మందలా బయటకు తెచ్చారు; \q2 గొర్రెలను నడిపించినట్లు అరణ్యం గుండా ఆయన వారిని నడిపించారు. \q1 \v 53 ఆయన వారిని క్షేమంగా నడిపించారు, \q2 కాబట్టి వారు భయం లేకుండ ఉన్నారు; \q2 సముద్రంలో వారి శత్రువులను ముంచివేశారు. \q1 \v 54 ఆయన వారిని తన పవిత్ర దేశ సరిహద్దుకు, \q2 ఆయన కుడి హస్తం సంపాదించిన కొండ ప్రదేశానికి తీసుకువచ్చారు. \q1 \v 55 వారి ఎదుట నుండి ఇతర దేశాలను తరిమివేసి, \q2 ఆయన వారి భూములను వారికి వారసత్వంగా కేటాయించారు; \q2 ఆయన ఇశ్రాయేలు గోత్రాలను వారి నివాసాల్లో స్థిరపరిచారు. \b \q1 \v 56 కాని వారు దేవున్ని పరీక్షించారు \q2 మహోన్నతుని మీద తిరగబడ్డారు; \q2 వారు ఆయన శాసనాలను పాటించలేదు. \q1 \v 57 వారి పూర్వికుల్లా వారు ద్రోహులు అపనమ్మకస్తులు, \q2 పనికిరాని విల్లులా నిష్ప్రయోజకులు. \q1 \v 58 వారి క్షేత్రాలతో దేవునికి కోపం తెప్పించారు; \q2 వారు విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించారు. \q1 \v 59 దేవుడు వారి కేకలు విన్నప్పుడు, ఆయన ఆగ్రహించారు; \q2 ఆయన ఇశ్రాయేలును పూర్తిగా త్రోసివేశారు. \q1 \v 60 షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, \q2 మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు. \q1 \v 61 ఆయన తన బలానికి సూచనగా ఉన్న మందసాన్ని బందీఖానాకు, \q2 తన వైభవాన్ని శత్రువుల చేతికి అప్పగించారు. \q1 \v 62 ఆయన తన ప్రజలను ఖడ్గానికి అప్పగించారు; \q2 ఆయన తన వారసత్వం మీద ఆగ్రహించారు. \q1 \v 63 అగ్ని వారి యువకులను దహించివేసింది, \q2 వారి యువతులకు పెళ్ళి పాటలు లేవు; \q1 \v 64 వారి యాజకులు ఖడ్గానికి అప్పగించబడ్డారు \q2 వారి విధవరాండ్రు ఏడవలేకపోయారు. \b \q1 \v 65 అప్పుడు నిద్ర నుండి లేచినవానిలా, \q2 ద్రాక్షారస మత్తు నుండి మేల్కొన్న యోధునిలా దేవుడు మేల్కొన్నారు. \q1 \v 66 ఆయన తన శత్రువుల మీద ప్రతి దాడి చేశారు; \q2 వారికి నిత్య అవమానాన్ని కలిగించారు. \q1 \v 67 అప్పుడు ఆయన యోసేపు గుడారాలను నిరాకరించారు, \q2 ఆయన ఎఫ్రాయిం గోత్రాన్ని ఏర్పరచుకోలేదు; \q1 \v 68 కాని ఆయన యూదా గోత్రాన్ని, \q2 తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు. \q1 \v 69 ఆయన పరిశుద్ధాలయాన్ని ఆకాశమంత ఎత్తుగా, \q2 భూమిలా దృఢంగా శాశ్వతంగా నిర్మించుకున్నారు. \q1 \v 70 ఆయన తన సేవకుడైన దావీదును ఎన్నుకుని, \q2 గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించారు; \q1 \v 71 గొర్రెలను మేపుతుండగా అతన్ని తీసుకువచ్చి \q2 తన ప్రజలైన యాకోబు మీద, \q2 తన వారసత్వమైన ఇశ్రాయేలు మీద కాపరిగా నియమించారు. \q1 \v 72 దావీదు యథార్థ హృదయంతో వారిని పాలించాడు; \q2 జ్ఞానం కలవాడై వారిని నడిపించాడు. \c 79 \cl కీర్తన 79 \d ఆసాపు కీర్తన. \q1 \v 1 ఓ దేవా, పరదేశులు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు; \q2 అవి మీ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేశారు, \q2 యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు. \q1 \v 2 వారు మీ సేవకుల కళేబరాలను \q2 ఆకాశపక్షులకు ఆహారంగా, \q2 మీ సొంత ప్రజల మాంసాన్ని అడవి మృగాలకు ఆహారంగా వదిలేశారు. \q1 \v 3 వారు యెరూషలేము చుట్టూ \q2 రక్తాన్ని నీటిలా పారబోశారు, \q2 చనిపోయినవారిని పాతిపెట్టడానికి ఎవరూ లేరు. \q1 \v 4 మా పొరుగువారికి మేము అసహ్యులం అయ్యాం, \q2 మా చుట్టుపక్కల వారు మమ్మల్ని వెక్కిరించి హేళన చేస్తున్నారు. \b \q1 \v 5 ఎంతకాలం, యెహోవా? మీరు ఎప్పటికీ కోప్పడతారా? \q2 ఎంతకాలం మీ రోషం అగ్నిలా మండుతుంది? \q1 \v 6 మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, \q2 మీ పేరట మొరపెట్టని, \q1 రాజ్యాల మీద, \q2 మీ ఉగ్రతను కుమ్మరించండి. \q1 \v 7 వారు యాకోబును మ్రింగివేశారు \q2 అతని నివాసాన్ని నాశనం చేశారు. \b \q1 \v 8 గత తరాల పాపాలను మాకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోకండి; \q2 మీ కరుణను త్వరగా మాపై చూపండి, \q2 ఎందుకంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాము. \q1 \v 9 దేవా మా రక్షకా, మీ నామ మహిమార్థమై \q2 మాకు సాయం చేయండి; \q1 మీ నామాన్ని బట్టి \q2 మమ్మల్ని విడిపించి మా పాపాలను క్షమించండి. \q1 \v 10 “వారి దేవుడు ఎక్కడ?” \q2 అని ఇతర దేశాలు ఎందుకు అనాలి? \b \q1 మీ సేవకుల రక్తానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారని \q2 మా కళ్ళెదుట ఇతర దేశాల వారికి తెలియజేయండి. \q1 \v 11 ఖైదీల నిట్టూర్పులు మీ ఎదుటకు వచ్చును గాక; \q2 మీ బలమైన చేతితో మరణశిక్ష విధించబడిన వారిని కాపాడండి. \q1 \v 12 ప్రభువా, మా పొరుగువారు మీమీద చూపిన ధిక్కారణకు ప్రతిగా \q2 వారి ఒడిలోకి ఏడంతలు తిరిగి చెల్లించండి. \q1 \v 13 అప్పుడు మీ ప్రజలు, మీరు మేపే గొర్రెలమైన మేము, \q2 మిమ్మల్ని నిత్యం స్తుతిస్తాము; \q2 తరతరాలకు మీ కీర్తిని ప్రకటిస్తాం. \c 80 \cl కీర్తన 80 \d సంగీత దర్శకునికి. “నిబంధన కలువలు” అనే రాగము మీద పాడదగినది. ఆసాపు కీర్తన. \q1 \v 1 ఇశ్రాయేలు ప్రజల కాపరీ, \q2 యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి. \q1 కెరూబుల\f + \fr 80:1 \fr*\fq కెరూబుల \fq*\ft సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.\ft*\f* మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా, \q2 \v 2 ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రాల ఎదుట ప్రకాశించండి. \q1 మీ పరాక్రమాన్ని చూపించండి; \q2 వచ్చి మమ్మల్ని రక్షించండి. \b \q1 \v 3 ఓ దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; \q2 మేము రక్షింపబడేలా \q2 మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి. \b \q1 \v 4 సైన్యాల యెహోవా దేవా, \q2 ఎంతకాలం మీ ప్రజల ప్రార్థనలకు వ్యతిరేకంగా \q2 మీ కోపం మండుతుంది? \q1 \v 5 మీరు వారికి కన్నీటిని ఆహారంగా ఇచ్చారు; \q2 మీరు వారిని గిన్నె నిండ కన్నీరు త్రాగేలా చేశారు. \q1 \v 6 మమ్మల్ని మా పొరుగువారికి హాస్యాస్పదంగా\f + \fr 80:6 \fr*\ft బహుశ ప్రా. ప్ర. లలో \ft*\fqa వివాదాస్పదం\fqa*\f* చేశారు. \q2 మా శత్రువులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. \b \q1 \v 7 సైన్యాలకు అధిపతియైన దేవా, మమ్మల్ని పునరుద్ధరించండి; \q2 మేము రక్షింపబడేలా \q2 మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి. \b \q1 \v 8 మీరు ఈజిప్టు నుండి తెచ్చిన ద్రాక్షతీగను నాటారు; \q2 మీరు దేశాలను వెళ్లగొట్టి దాన్ని నాటారు. \q1 \v 9 మీరు దాని కోసం భూమిని శుభ్రం చేశారు, \q2 అది వేళ్ళూనుకొని భూమిని నింపింది. \q1 \v 10 దాని నీడ పర్వతాలను కప్పింది, \q2 దాని తీగలు దేవదారు చెట్లను కప్పాయి. \q1 \v 11 దాని కొమ్మలు సముద్రం\f + \fr 80:11 \fr*\ft బహుశ మధ్యధరా సముద్రం కావచ్చు\ft*\f* వరకు, \q2 దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకు వ్యాపించాయి. \b \q1 \v 12 దారిని వెళ్లేవారంతా దాని ద్రాక్షలు తెంపేలా \q2 దాని కంచెలను మీరెందుకు పడగొట్టారు? \q1 \v 13 అడవి పందులు దానిని నాశనం చేస్తున్నాయి, \q2 పొలాల నుండి వచ్చే కీటకాలు దానిని తింటున్నాయి. \q1 \v 14 సైన్యాలకు అధిపతియైన దేవా, మా దగ్గరకు తిరిగి రండి! \q2 ఆకాశం నుండి ఇటు చూడండి! \q1 ఈ ద్రాక్షవల్లిని గమనించండి. \q2 \v 15 అది మీ కుడి హస్తం నాటిన వేరు, \q2 మీ కోసం మీరు పెంచుకొన్న కుమారుడు.\f + \fr 80:15 \fr*\ft లేదా \ft*\fqa కొమ్మ\fqa*\f* \b \q1 \v 16 మా ద్రాక్షవల్లి నరకబడి అగ్నితో కాల్చబడింది; \q2 మీ గద్దింపుకు మీ ప్రజలు నశిస్తారు. \q1 \v 17 మీ కుడి వైపున ఉన్న మనుష్యుని మీద, \q2 మీ కోసం మీరు పెంచిన మనుష్యకుమారుని మీద మీ హస్తాన్ని ఉంచండి. \q1 \v 18 అప్పుడు మేము మీ దగ్గర నుండి వెళ్లము; \q2 మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, మీ పేరట మేము ప్రార్థిస్తాము. \b \q1 \v 19 సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; \q2 మేము రక్షింపబడేలా, \q2 మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి. \c 81 \cl కీర్తన 81 \d సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. ఆసాపు కీర్తన. \q1 \v 1 మనకు బలంగా ఉన్న దేవునికి ఆనంద గానం చేయండి; \q2 యాకోబు దేవునికి బిగ్గరగా కేకలు వేయండి! \q1 \v 2 సంగీతం మొదలుపెట్టండి, కంజర వాయించండి. \q2 మధురంగా సితారా వీణ మీటండి. \b \q1 \v 3 అమావాస్య దినాన కొమ్ము ఊదండి, \q2 పౌర్ణమి పండుగ దినాన కొమ్ము ఊదండి; \q1 \v 4 ఇశ్రాయేలీయులకు ఇది శాసనం; \q2 ఇది యాకోబు దేవుడు ఇచ్చిన నియమము. \q1 \v 5 దేవుడు ఈజిప్టు మీదికి దండెత్తినప్పుడు, \q2 ఆయన దానిని యోసేపుకు శాసనంలా స్థాపించారు. \b \q1 తెలియని స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: \b \q1 \v 6 “నేను వారి భుజాల మీది నుండి భారం తొలగించాను; \q2 వారి చేతులు గంపలెత్తుట నుండి విడిపించబడ్డాయి. \q1 \v 7 మీ బాధలో మీరు మొరపెట్టగా నేను మిమ్మల్ని రక్షించాను, \q2 ఉరుములతో కూడిన మేఘంలో నుండి నేను మీకు జవాబు ఇచ్చాను; \q2 మెరీబా జలాల దగ్గర నేను మిమ్మల్ని పరీక్షించాను. \qs సెలా\qs* \q1 \v 8 నా ప్రజలారా, నా మాట వినండి, నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను \q2 ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట మాత్రం వింటే ఎంత మేలు! \q1 \v 9 మీ మధ్య ఇతర దేవుడు ఉండకూడదు; \q2 మీరు నన్ను తప్ప వేరే ఏ దేవున్ని పూజించకూడదు. \q1 \v 10 నేను మీ దేవుడనైన యెహోవాను, \q2 మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వాడను. \q1 మీ నోరు బాగా తెరవండి నేను దాన్ని నింపుతాను. \b \q1 \v 11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు; \q2 ఇశ్రాయేలు నాకు లోబడలేదు. \q1 \v 12 కాబట్టి వారి సొంత ఉపాయాలను అనుసరిస్తే ఎంత మేలు! \q2 నేను వారి మొండి హృదయాలకు వారిని అప్పగించాను. \b \q1 \v 13 “నా ప్రజలు నా మాట మాత్రమే వింటే, \q2 ఇశ్రాయేలు నా మార్గాలను మాత్రమే అనుసరిస్తే, \q1 \v 14 అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచివేసేవాన్ని, \q2 వారి శత్రువులపై నా చేయి ఎత్తేవాన్ని! \q1 \v 15 యెహోవాను ద్వేషించేవారు ఆయన ఎదుట భయంతో దాక్కుంటారు, \q2 వారి శిక్ష శాశ్వతంగా ఉంటుంది. \q1 \v 16 కానీ మిమ్మల్ని నేను శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాను; \q2 బండ నుండి తీసిన తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను.” \c 82 \cl కీర్తన 82 \d ఆసాపు కీర్తన. \q1 \v 1 దేవుడు గొప్ప సభలో నిలబడి ఉన్నారు; \q2 ఆయన దైవముల మధ్య తీర్పు ఇస్తారు: \b \q1 \v 2 “మీరు ఎంతకాలం అన్యాయాలను సమర్థిస్తారు \q2 దుష్టులకు పక్షపాతం చూపిస్తారు? \qs సెలా\qs* \q1 \v 3 బలహీనులు, తండ్రిలేనివారి పక్షం వహించండి; \q2 పేదలకు అణచివేయబడిన వారికి న్యాయం చేయండి. \q1 \v 4 బలహీనులను అవసరతలో ఉన్నవారిని కాపాడండి; \q2 దుష్టుల చేతి నుండి వారిని విడిపించండి. \b \q1 \v 5 “వారికి ఏమి తెలియదు, వారు ఏమి గ్రహించరు. \q2 వారు చీకటిలో తిరుగుతారు; \q2 భూమి పునాదులు కదిలిపోయాయి. \b \q1 \v 6 “ ‘మీరు “దేవుళ్ళు”; \q2 మీరంతా మహోన్నతుని కుమారులు.’ \q1 \v 7 అయితే మీరు ఇతర మనుష్యుల్లా చస్తారు; \q2 ఇతర పాలకుల్లా మీరు కూలిపోతారు, అని నేనన్నాను.” \b \q1 \v 8 ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి, \q2 ఎందుకంటే అన్ని దేశాలు మీ వారసత్వంగా ఉన్నాయి. \c 83 \cl కీర్తన 83 \d ఒక గీతము. ఆసాపు కీర్తన. \q1 \v 1 ఓ దేవా! మౌనంగా ఉండకండి; \q2 ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి, \q2 నిశ్చలంగా ఉండకండి. \q1 \v 2 మీ శత్రువులు ఎలా కేకలు వేస్తున్నారో చూడండి, \q2 మిమ్మల్ని ద్వేషించేవారు తలలు పైకెత్తుతున్నారు. \q1 \v 3 వారు మీ ప్రజలకు హాని చేయాలని చూస్తున్నారు; \q2 మీరు ఆదరించే వారికి వ్యతిరేకంగా వారు కుట్రలు చేస్తారు. \q1 \v 4 “రండి, వారి దేశాన్ని లేకుండ నాశనం చేద్దాం \q2 అప్పుడు ఇశ్రాయేలీయుల పేరు ఇక జ్ఞాపకం ఉండదు” అని వారు అంటున్నారు. \b \q1 \v 5 వారు ఏకమనస్సుతో కుట్ర చేశారు; \q2 వారు మీకు వ్యతిరేకంగా ఒప్పందం చేసుకున్నారు. \q1 \v 6 గుడారాల్లో నివసించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, \q2 మోయాబీయులు, హగ్రీయీలు, \q1 \v 7 గెబాలు, అమ్మోను అమాలేకు, \q2 ఫిలిష్తియా, తూరు ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు. \q1 \v 8 లోతు వారసులను బలోపేతం చేయడానికి \q2 అష్షూరు కూడా వారితో చేరింది. \qs సెలా\qs* \b \q1 \v 9 మిద్యానుకు చేసినట్లుగా, \q2 కీషోను నది దగ్గర సీసెరా యాబీనుకు చేసినట్లుగా వారికి చేయండి. \q1 \v 10 వారు ఎన్-దోరు దగ్గర నశించారు \q2 నేల మీద పేడలా అయ్యారు. \q1 \v 11 ఓరేబుకు జెయేబుకు చేసినట్లు వారి సంస్థానాధిపతులకు \q2 జెబహుకు సల్మున్నాకు వారి యువరాజులందరికి చేయండి. \q1 \v 12 వారు, “దేవుని పచ్చికబయళ్లను \q2 స్వాధీనం చేసుకుందాం” అని అన్నారు. \b \q1 \v 13 నా దేవా, వారిని సుడి తిరిగే దుమ్ములా, \q2 గాలి ముందు కొట్టుకుపోయే పొట్టులా చేయండి. \q1 \v 14 అగ్ని అడవిని దహించునట్లు \q2 కారుచిచ్చు పర్వతాలను తగలబెట్టినట్లు, \q1 \v 15 మీ తుఫానుతో వారిని వెంటాడండి \q2 మీ సుడిగాలితో వారిని భయపెట్టండి. \q1 \v 16 వారు మీ నామాన్ని వెదకునట్లుగా, \q2 యెహోవా, సిగ్గుతో వారి ముఖాలు కప్పండి. \b \q1 \v 17 వారు ఎప్పటికీ సిగ్గుపడాలి భయపడాలి; \q2 వారు అవమానంలో నశించెదరు గాక. \q1 \v 18 యెహోవా అనే నామం గల మీరు \q2 భూమి మీద అందరిలో మహోన్నతుడవని వారు తెలుసుకోవాలి. \c 84 \cl కీర్తన 84 \d సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన. \q1 \v 1 సైన్యాల యెహోవా, \q2 మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో! \q1 \v 2 యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని, \q2 నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది; \q1 సజీవుడైన దేవుని కోసం \q2 నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి. \q1 \v 3 సైన్యాల యెహోవా, నా రాజా నా దేవా, \q2 మీ బలిపీఠం దగ్గరే, \q2 పిచ్చుకలకు నివాసం దొరికింది, \q1 వాన కోయిలకు గూడు దొరికింది, \q2 అక్కడే అది తన పిల్లలను పెంచుతుంది. \q1 \v 4 మీ మందిరంలో నివసించేవారు ధన్యులు; \q2 వారు నిత్యం మిమ్మల్ని స్తుతిస్తారు. \qs సెలా\qs* \b \q1 \v 5 మీ నుండి బలం పొందే మనుష్యులు ధన్యులు, \q2 వారి హృదయాలు సీయోనుకు వెళ్లే రహదారుల మీదే ఉంటాయి. \q1 \v 6 వారు బాకా లోయ గుండా వెళ్తున్నప్పుడు, \q2 వారు దానిని ఊటల ప్రదేశంగా మారుస్తారు; \q2 తొలకరి వాన దానిని ఆశీర్వాదాలతో\f + \fr 84:6 \fr*\ft లేదా \ft*\fqa కొలనూలు\fqa*\f* కప్పివేస్తుంది. \q1 \v 7 వారిలో ప్రతిఒక్కరు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడే వరకు \q2 వారి బలం అధికమవుతుంది. \b \q1 \v 8 సైన్యాల యెహోవా దేవా, నా ప్రార్థన వినండి; \q2 యాకోబు దేవా, ఆలకించండి. \qs సెలా\qs* \q1 \v 9 మా డాలువైన\f + \fr 84:9 \fr*\ft లేదా \ft*\fqa ప్రభువా\fqa*\f* ఓ దేవా! మా వైపు చూడండి; \q2 మీ అభిషిక్తునిపై దయ చూపండి. \b \q1 \v 10 బయట గడిపిన వెయ్యి దినాలకంటే \q2 మీ మందిరంలో ఒక్కరోజు గడపడం మేలు. \q1 దుష్టుల గుడారాల్లో నివసించడం కంటే \q2 నేను నా దేవుని మందిరంలో ఒక ద్వారపాలకునిగా ఉండడం నాకిష్టము. \q1 \v 11 యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు; \q2 యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు; \q1 నిందారహితులుగా నడుచుకునే వారికి \q2 ఆయన ఏ మేలు చేయకుండ మానరు. \b \q1 \v 12 సైన్యాల యెహోవా, \q2 మీయందు నమ్మకముంచే మనుష్యులు ధన్యులు. \c 85 \cl కీర్తన 85 \d సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. \q1 \v 1 యెహోవా, మీ దేశానికి మీరు దయ చూపారు; \q2 యాకోబును చెర నుండి తిరిగి తీసుకువచ్చారు. \q1 \v 2 మీరు మీ ప్రజల దోషాన్ని క్షమించారు \q2 వారి పాపాలన్నీ కప్పివేశారు. \qs సెలా\qs* \q1 \v 3 మీ ఉగ్రతను మీరు ప్రక్కన పెట్టారు \q2 మీ భయంకర కోపాగ్నిని చల్లార్చుకున్నారు. \b \q1 \v 4 మా రక్షకుడవైన దేవా, మమ్మల్ని మరల పునరుద్ధరించండి. \q2 మామీద ఉన్న మీ కోపాన్ని విడిచిపెట్టండి. \q1 \v 5 ఎప్పటికీ మీరు మామీద కోప్పడతారా? \q2 తరతరాల వరకు మామీద మీరు కోప్పడుతూనే ఉంటారా? \q1 \v 6 మీ ప్రజలు మీలో ఆనందించేలా \q2 మీరు మమ్మల్ని మరల బ్రతికించరా? \q1 \v 7 యెహోవా, మీ మారని ప్రేమను మా పట్ల చూపించండి, \q2 మీ రక్షణ మాకు అనుగ్రహించండి. \b \q1 \v 8 దేవుడైన యెహోవా చెప్తున్నదంతా నేను ఆలకిస్తాను; \q2 ఆయన తన ప్రజలకు, నమ్మకమైన దాసులకు సమాధానాన్ని వాగ్దానం చేస్తారు; \q2 అయితే వారు బుద్ధిహీనత వైపు తిరుగకుందురు గాక. \q1 \v 9 మన దేశంలో ఆయన మహిమ నివసించేలా, \q2 ఆయనకు భయపడేవారికి ఆయన రక్షణ ఎంతో సమీపంగా ఉంటుంది. \b \q1 \v 10 మారని ప్రేమ నమ్మకత్వం కలుసుకుంటాయి; \q2 నీతి సమాధానం పరస్పరం ముద్దు పెట్టుకుంటాయి. \q1 \v 11 నమ్మకత్వం భూమిలో నుండి మొలుస్తుంది, \q2 నీతి ఆకాశం నుండి తొంగి చూస్తుంది. \q1 \v 12 యెహోవా మేలైనది అనుగ్రహిస్తారు, \q2 మన భూమి తన పంటనిస్తుంది. \q1 \v 13 ఆయనకు ముందుగా నీతి వెళ్తూ \q2 ఆయన అడుగు జాడలకు మార్గం సిద్ధం చేస్తుంది. \c 86 \cl కీర్తన 86 \d ఒక దావీదు ప్రార్థన. \q1 \v 1 యెహోవా, చెవియొగ్గి ఆలకించండి, నాకు జవాబివ్వండి, \q2 ఎందుకంటే నేను దీనుడను నిరుపేదను. \q1 \v 2 మీపట్ల విశ్వాసంగా ఉన్న నా ప్రాణాన్ని కాపాడండి; \q2 మీయందు నమ్మకం ఉంచిన సేవకుడిని రక్షించండి. మీరే నా దేవుడు; \q1 \v 3 ప్రభువా! నాపై దయచూపండి. \q2 దినమంతా నేను మీకు మొరపెడుతున్నాను. \q1 \v 4 ప్రభువా, మీ సేవకునికి ఆనందం ప్రసాదించండి, \q2 ఎందుకంటే నేను మీయందు నమ్మకం ఉంచాను. \b \q1 \v 5 ప్రభువా, మీరు మంచివారు క్షమించేవారు, \q2 మీకు మొరపెట్టే వారందరి పట్ల మారని ప్రేమ కలిగి ఉన్నారు. \q1 \v 6 యెహోవా, నా ప్రార్థన వినండి; \q2 నా మనవుల ధ్వని ఆలకించండి. \q1 \v 7 నేను బాధలో ఉన్నప్పుడు మీకు మొరపెడతాను, \q2 మీరు నాకు జవాబిస్తారు. \b \q1 \v 8 ప్రభువా, దేవుళ్ళలో మీవంటి వారు లేరు; \q2 మీ క్రియలకు ఏది సాటిలేదు. \q1 \v 9 ప్రభువా, మీరు సృజించిన దేశాలన్నీ వచ్చి \q2 మీ ముందు ఆరాధిస్తారు; \q2 వారు మీ నామానికి కీర్తి తెస్తారు. \q1 \v 10 మీరు గొప్ప దేవుడు. మీ అద్భుతాలు గొప్పవి; \q2 మీరే ఏకైక దేవుడు. \b \q1 \v 11 యెహోవా, మీ సత్యాన్ని అనుసరించి జీవించేలా, \q2 మీ మార్గాలు మాకు బోధించండి, \q1 నేను మీ నామానికి భయపడేలా \q2 నా హృదయానికి ఏకాగ్రత దయచేయండి. \q1 \v 12 ప్రభువా నా దేవా, నా పూర్ణహృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను; \q2 నేను మీ నామాన్ని నిరంతరం మహిమపరుస్తాను. \q1 \v 13 ఎందుకంటే నా పట్ల మీ మారని ప్రేమ ఎంతో గొప్పది; \q2 అగాధాల్లో నుండి, \q2 పాతాళంలో నుండి మీరు నన్ను విడిపించారు. \b \q1 \v 14 ఓ దేవా, గర్విష్ఠులైన శత్రువులు నాపై దాడి చేస్తున్నారు; \q2 క్రూరులైన ప్రజలు నన్ను చంపాలని గుమికూడుతున్నారు \q2 వారు మిమ్మల్ని లక్ష్యపెట్టరు. \q1 \v 15 కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు, \q2 త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు. \q1 \v 16 నా వైపు తిరగండి నా మీద కరుణ చూపండి; \q2 మీ సేవకునికి మీ బలాన్ని ప్రసాదించండి; \q1 నన్ను రక్షించండి, ఎందుకంటే \q2 నేను మీ దాసురాలి కుమారుడను. \q1 \v 17 నాకు మీ ఆదరణ గుర్తు ఇవ్వండి, \q2 నన్ను ద్వేషించేవారు అది చూసి సిగ్గుపడతారు, \q2 ఎందుకంటే యెహోవా, మీరు నాకు సహాయం చేశారు నన్ను ఆదరించారు. \c 87 \cl కీర్తన 87 \d కోరహు కుమారుల కీర్తన. ఒక గీతము. \q1 \v 1 యెహోవా తన పట్టణాన్ని పరిశుద్ధ పర్వతంపై స్థాపించారు. \q1 \v 2 యాకోబు ఇతర నివాసాలన్నిటికంటె \q2 యెహోవా సీయోను గుమ్మాలను ఎక్కువగా ప్రేమిస్తారు. \b \q1 \v 3 దేవుని పట్టణమా, నీ గురించి \q2 గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. \qs సెలా\qs* \q1 \v 4 “నేను రాహాబు\f + \fr 87:4 \fr*\ft ఈజిప్టు యొక్క కావ్య నామము. పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక సముద్ర రాక్షసుడి పేరు.\ft*\f* బబులోనును \q2 నన్ను గుర్తించిన వారిగా లెక్కిస్తాను \q1 అలాగే ఫిలిష్తియా, తూరు కూషు\f + \fr 87:4 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం\ft*\f* కూడా, \q2 ‘ఇది సీయోనులో పుట్టింది’ ” అని వారంటారు. \q1 \v 5 నిజమే, సీయోను గురించి ఇలా అంటారు, \q2 “ఇది అది కూడా ఆమెలోనే జన్మించాయి, \q2 మహోన్నతుడు తానే సీయోనును స్థాపిస్తారు.” \q1 \v 6 యెహోవా పౌరుల పేర్లు నమోదు చేసేటప్పుడు \q2 “ఇది సీయోనులో జన్మించింది” అని గుర్తిస్తారు. \qs సెలా\qs* \b \q1 \v 7 వారు వాయిద్యాలు వాయిస్తుండగా, \q2 “నా ఊటలన్నీ మీలోనే ఉన్నాయి” అని వారు పాడతారు. \c 88 \cl కీర్తన 88 \d ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. సంగీత దర్శకునికి. మహలతు లయన్నోత్ అనే రాగం మీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను ధ్యానకీర్తన. \q1 \v 1 యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు; \q2 రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను. \q1 \v 2 నా ప్రార్థనలు మీ ఎదుటకు వచ్చును గాక; \q2 చెవియొగ్గి నా మొర ఆలకించండి. \b \q1 \v 3 నేను ఇబ్బందుల్లో మునిగి ఉన్నాను \q2 నా ప్రాణం మరణానికి చేరువగా ఉంది. \q1 \v 4 సమాధికి వెళ్లే వారితో నేను లెక్కించబడ్డాను; \q2 నేను బలం లేనివాడిలా ఉన్నాను. \q1 \v 5 సమాధిలో పడి ఉన్న హతులైనవారిలా, \q2 నేను చచ్చినవారితో విడిచిపెట్టబడ్డాను, \q1 వారిని మీరు ఎన్నటికి జ్ఞాపకముంచుకోరు, \q2 వారు మీ సంరక్షణ నుండి తొలగిపోయారు. \b \q1 \v 6 మీరు నన్ను లోతైన గుంటలో, \q2 చీకటి గుంటలో ఉంచారు. \q1 \v 7 మీ ఉగ్రత నా మీద భారంగా ఉంది; \q2 మీ అలలతో నన్ను ముంచివేశారు. \qs సెలా\qs* \q1 \v 8 నా దగ్గరి స్నేహితులను నా నుండి దూరం చేశారు \q2 నన్ను వారికి అసహ్యమైన వానిగా చేశారు. \q1 నేను నిర్బంధించబడ్డాను నేను తప్పించుకోలేను; \q2 \v 9 దుఃఖంతో నా కళ్లు మసకబారాయి. \b \q1 యెహోవా, ప్రతిరోజు నేను మీకు మొరపెడుతున్నాను; \q2 మీ వైపు నా చేతులు చాచాను. \q1 \v 10 మృతులకు మీరు అద్భుతాలు చూపిస్తారా? \q2 వారి ఆత్మలు లేచి మిమ్మల్ని స్తుతిస్తాయా? \qs సెలా\qs* \q1 \v 11 సమాధిలో మీ మారని ప్రేమ ప్రకటించబడుతుందా? \q2 నాశనకూపంలో\f + \fr 88:11 \fr*\ft హెబ్రీలో \ft*\fqa అబద్దోను\fqa*\f* మీ నమ్మకత్వం ప్రకటించబడుతుందా? \q1 \v 12 చీకటి స్థలంలో మీ అద్భుతాలు తెలుస్తాయా? \q2 మరుపుకు గురియైన దేశంలో మీ నీతి క్రియలు తెలుస్తాయా? \b \q1 \v 13 కాని యెహోవా, నేను సహాయం కోసం మీకు మొరపెడతాను; \q2 ఉదయం నా ప్రార్థన మీ ఎదుటకు వస్తుంది. \q1 \v 14 యెహోవా, మీరు ఎందుకు నన్ను తృణీకరిస్తూ \q2 నా నుండి మీ ముఖాన్ని దాచుకుంటున్నారు? \b \q1 \v 15 నా యవ్వనం నుండి నేను బాధను అనుభవించి మరణానికి దగ్గరగా ఉన్నాను; \q2 నేను మీ భయాలను భరించి నిరాశలో ఉన్నాను. \q1 \v 16 మీ ఉగ్రత నన్ను ముంచేసింది; \q2 మీ భయాలు నన్ను నిర్మూలం చేశాయి. \q1 \v 17 అవి రోజంతా ప్రవాహంలా నన్ను చుట్టుముట్టాయి; \q2 అవి నన్ను పూర్తిగా ముంచేశాయి. \q1 \v 18 నా స్నేహితులను నా పొరుగువారిని నాకు దూరం చేశారు \q2 చీకటే నాకు దగ్గరి స్నేహితుడు. \c 89 \cl కీర్తన 89 \d ఎజ్రాహీయుడైన ఏతాను ధ్యానకీర్తన. \q1 \v 1 యెహోవా యొక్క మారని ప్రేమను గురించి నేను ఎల్లప్పుడూ పాడతాను; \q2 నా నోటితో మీ నమ్మకత్వాన్ని \q2 అన్ని తరాలకు తెలియజేస్తాను. \q1 \v 2 మీ ప్రేమ ఎల్లప్పుడు దృఢంగా నిలిచి ఉంటుందని, \q2 మీ నమ్మకత్వాన్ని మీరు పరలోకంలోనే స్థాపించారని నేను ప్రకటిస్తాను. \q1 \v 3 “నేను ఏర్పరచుకున్న వానితో నేను ఒడంబడిక చేశాను, \q2 నా సేవకుడైన దావీదుకు ప్రమాణం చేశాను. \q1 \v 4 ‘మీ వంశాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను \q2 మీ సింహాసనాన్ని అన్ని తరాలకు స్థిరపరుస్తాను’ ” అని మీరన్నారు. \qs సెలా\qs* \b \q1 \v 5 యెహోవా, ఆకాశాలు మీ అద్భుతాలను స్తుతిస్తున్నాయి, \q2 అలాగే పరిశుద్ధుల సభలో మీ నమ్మకత్వం స్తుతించబడుతుంది. \q1 \v 6 అంతరిక్షాల్లో యెహోవాతో పోల్చదగిన వారు ఎవరు? \q2 దైవపుత్రులలో ఆయనకు సాటి ఎవరు? \q1 \v 7 పరిశుద్ధుల సభలో దేవుడు మహా భీకరుడు; \q2 తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన అధిక గౌరవనీయుడు. \q1 \v 8 సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు? \q2 యెహోవా మీరు మహా బలాఢ్యులు, \q2 మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది. \b \q1 \v 9 పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు; \q2 అలలను మీరు అణచివేస్తారు. \q1 \v 10 చచ్చిన దానితో సమానంగా మీరు రాహాబును\f + \fr 89:10 \fr*\ft \+xt కీర్తన 74:13\+xt* చూడండి.\ft*\f* నలగ్గొట్టారు; \q2 మీ బలమైన బాహువు శత్రువులను చెదరగొట్టింది. \q1 \v 11 ఆకాశాలు మీవే, భూమి కూడ మీదే; \q2 లోకాన్ని దానిలో ఉన్నదంతా మీరే స్థాపించారు. \q1 \v 12 ఉత్తర దక్షిణ దిక్కులను మీరే సృజించారు; \q2 తాబోరు హెర్మోను పర్వతాలు మీ నామాన్ని బట్టి ఆనంద గానం చేస్తున్నాయి. \q1 \v 13 మీ బాహువు శక్తి కలది; \q2 మీ చేయి బలమైనది, మీ కుడిచేయి ఘనమైనది. \b \q1 \v 14 నీతి న్యాయం మీ సింహాసనానికి పునాదులు; \q2 మారని ప్రేమ, నమ్మకత్వం మీ ఎదుట నడుస్తాయి. \q1 \v 15 యెహోవా, మీ గురించి ఆనంద కేకలు వేసేవారు ధన్యులు, \q2 మీ సన్నిధి కాంతిలో వారు నడుస్తారు. \q1 \v 16 రోజంతా మీ నామాన్ని బట్టి వారు ఆనందిస్తారు; \q2 మీ నీతిని బట్టి వారు హర్షిస్తారు. \q1 \v 17 ఎందుకంటే వారి మహిమ వారి బలం మీరే, \q2 మీ దయతో మా కొమ్మును\f + \fr 89:17 \fr*\ft కొమ్ము \ft*\ft ఇక్కడ బలానికి సూచిస్తుంది\ft*\f* హెచ్చిస్తారు. \q1 \v 18 నిజానికి, మా డాలు యెహోవాకు చెందినది, \q2 మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధునికి చెందిన వాడు. \b \q1 \v 19 ఒకనాడు మీరు దర్శనంలో మాట్లాడుతూ, \q2 మీకు నమ్మకమైన వారితో మీరిలా అన్నారు: \q1 “నేను వీరుడికి సాయం చేశాను. \q2 ఒక యువకుడిని ప్రజల్లో నుండి లేవనెత్తాను. \q1 \v 20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను; \q2 నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను. \q1 \v 21 అతనికి నా చేయి తోడుగా ఉంది; \q2 నా బాహువు అతన్ని బలపరుస్తుంది. \q1 \v 22 శత్రువు అతని నుండి పన్ను వసూలు చేయలేడు; \q2 దుష్టులు అతన్ని అణచివేయలేరు. \q1 \v 23 అతని ఎదుటనే అతని పగవారిని పడగొడతాను, \q2 అతన్ని ద్వేషించేవారిని మొత్తుతాను. \q1 \v 24 నా నమ్మకత్వం నా మారని ప్రేమ అతనితో ఉంటాయి, \q2 నా నామాన్ని బట్టి అతని కొమ్ము\f + \fr 89:24 \fr*\fq కొమ్ము \fq*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తుంది\ft*\f* హెచ్చంపబడుతుంది. \q1 \v 25 నేను అతని చేతిని సముద్రం మీద, \q2 అతని కుడి హస్తాన్ని నదుల మీద ఉంచుతాను. \q1 \v 26 ‘మీరు నా తండ్రి, నా దేవుడు \q2 నా కొండ, నా రక్షకుడు’ అని అతడు నాకు మొరపెడతాడు. \q1 \v 27 అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చూసుకుంటాను, \q2 భూరాజులందరిలో అతన్ని మహా ఉన్నతమైనవానిగా చేస్తాను. \q1 \v 28 నేను అతని పట్ల నా మారని ప్రేమను నిత్యం కొనసాగిస్తాను, \q2 అతనితో నా నిబంధన స్థిరమైనది. \q1 \v 29 అతని వంశాన్ని నిత్యం స్థాపిస్తాను, \q2 అతని సింహాసనం ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది. \b \q1 \v 30 “అతని కుమారులు నా న్యాయవిధుల నుండి తొలగిపోయినా \q2 నా చట్టాలను పాటించకపోయినా \q1 \v 31 ఒకవేళ వారు నా శాసనాలను ఉల్లంఘించినా \q2 నా ఆజ్ఞలను గైకొనకపోయినా, \q1 \v 32 నేను వారి పాపాన్ని దండంతో, \q2 వారి దోషాన్ని దెబ్బలతోను శిక్షిస్తాను; \q1 \v 33 అయితే వారికి నా ప్రేమను పూర్తిగా దూరం చేయను, \q2 నా నమ్మకత్వాన్ని ఎన్నటికి విడిచిపెట్టను. \q1 \v 34 నా నిబంధనను నేను భంగం కానివ్వను. \q2 నేను చెప్పినదానిలో ఒక మాట కూడా తప్పిపోదు. \q1 \v 35 నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాను, \q2 నేను దావీదుతో అబద్ధం చెప్పను. \q1 \v 36 అతని వంశం నిత్యం ఉంటుందని, \q2 సూర్యుడు ఉన్నంత వరకు అతని సింహాసనం నా ఎదుట ఉంటుందని; \q1 \v 37 ఆకాశంలో విశ్వసనీయమైన సాక్ష్యంగా ఉన్న చంద్రునిలా, \q2 అది శాశ్వతంగా స్థిరపరచబడి ఉంటుంది” అని అన్నాను. \qs సెలా\qs* \b \q1 \v 38 కాని మీరు నన్ను తిరస్కరించి త్రోసివేశారు, \q2 మీరు అభిషేకించిన వానిపై మీరు చాలా కోపంగా ఉన్నారు. \q1 \v 39 మీరు మీ సేవకునితో చేసిన ఒడంబడికను విడిచిపెట్టి, \q2 అతని కిరీటాన్ని ధూళిలో పడవేసి అపవిత్రం చేశారు. \q1 \v 40 మీరు అతని ప్రాకారపు గోడలు పడగొట్టారు \q2 అతని బలమైన కోటలను పాడుచేశారు. \q1 \v 41 దారిన వెళ్లే వారందరూ అతన్ని దోచుకున్నారు; \q2 అతని పొరుగువారు అతడిని అపహాస్యం చేశారు. \q1 \v 42 మీరు అతని శత్రువుల కుడిచేతిని బలపరిచారు; \q2 అతని శత్రువులందరు ఆనందించేలా చేశారు. \q1 \v 43 నిజానికి, మీరు అతని ఖడ్గం అంచును వెనుకకు తిప్పారు \q2 యుద్ధంలో అతనికి సాయం చేయలేదు. \q1 \v 44 మీరు అతని వైభవాన్ని అంతం చేశారు \q2 అతని సింహాసనాన్ని నేలమీద పడవేశారు. \q1 \v 45 అతని యవ్వన దినాలను తగ్గించారు; \q2 అవమానంతో అతన్ని కప్పారు. \qs సెలా\qs* \b \q1 \v 46 ఎంతకాలం, యెహోవా? ఎప్పటికీ మీరు మరుగై ఉంటారా? \q2 ఎంతకాలం మీ ఉగ్రత అగ్నిలా మండుతూ ఉంటుంది? \q1 \v 47 నా ఆయుష్షు ఎంత నిలకడలేనిదో జ్ఞాపకం చేసుకోండి, \q2 వ్యర్థంగా మీరు మనుష్యులందరిని సృష్టించారు కదా! \q1 \v 48 మరణం చూడకుండ ఎవరు బ్రతకగలరు? \q2 సమాధి బలం నుండి మనిషిని ఎవరు రక్షించగలరు? \qs సెలా\qs* \q1 \v 49 ప్రభువా, మీ నమ్మకత్వంతో మీరు దావీదుకు వాగ్దానం చేసి \q2 మీరు మొదట చూపిన ఆ మారని ప్రేమ ఎక్కడ? \q1 \v 50 ప్రభువా, మీ సేవకులు ఎలా ఎగతాళి చేయబడ్డారో, \q2 అన్ని దేశాల నిందలను నేను నా హృదయంలో ఎలా భరిస్తున్నానో \q1 \v 51 యెహోవా, అవి మీ శత్రువులు ఎగతాళిగా చేసిన నిందలు, \q2 అడుగడుగునా మీ అభిషిక్తుని వారు చేసిన ఎగతాళి జ్ఞాపకం తెచ్చుకోండి. \b \b \q1 \v 52 యెహోవాకే నిత్యం స్తుతి కలుగును గాక! \qc ఆమేన్ ఆమేన్. \c 90 \ms నాలుగవ గ్రంథము \mr కీర్తనలు 90–106 \cl కీర్తన 90 \d దైవజనుడైన మోషే చేసిన ఒక ప్రార్థన. \q1 \v 1 ప్రభువా, తరతరాల నుండి \q2 మీరే మా నివాస స్థలంగా ఉన్నారు. \q1 \v 2 పర్వతాలు పుట్టక ముందే, \q2 మీరు లోకమంతటిని చేయక ముందే \q2 నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరే దేవుడు. \b \q1 \v 3 “మనుష్యులారా, మీరు మంటికి తిరిగి వెళ్లండి” అని అంటూ, \q2 మీరు ప్రజలను ధూళి వైపుకు తిరిగి త్రిప్పుతారు. \q1 \v 4 మీ దృష్టిలో వెయ్యి సంవత్సరాలు \q2 ఇప్పుడే గడిచిన రోజులా, \q2 రాత్రి జాముల్లా ఉన్నాయి. \q1 \v 5 అయినప్పటికీ మీరు మరణ నిద్రలో ప్రజలను ప్రవాహంలా తుడిచివేస్తారు; \q2 వారు ప్రొద్దున్నే మొలిచిన గడ్డిలా ఉన్నారు. \q1 \v 6 అది ఉదయం క్రొత్తగా పుడుతుంది, \q2 సాయంకాలానికల్లా వాడి ఎండిపోతుంది. \b \q1 \v 7 మేము మీ కోపాగ్నికి దహించుకు పోతున్నాము \q2 మీ ఆగ్రహానికి భయపడుతున్నాము. \q1 \v 8 మీరు మా దోషాలను మీ ఎదుట, \q2 మా రహస్య పాపాలను మీ సన్నిధి కాంతిలో ఉంచారు. \q1 \v 9 మా దినాలన్ని మీ ఉగ్రత లోనే గడిచిపోయాయి; \q2 మేము మా సంవత్సరాలను మూలుగుతో ముగిస్తాము. \q1 \v 10 మా ఆయుష్షు డెబ్బై సంవత్సరాలు, \q2 అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు; \q1 అయినా వాటి వైభవం నాశనం దుష్టత్వం, \q2 అవి త్వరగా గడచిపోతాయి, మేము ఎగిరిపోతాం. \q1 \v 11 ఒకవేళ మీ కోపం యొక్క శక్తి ఎవరు గ్రహించగలరు! \q2 మీ ఉగ్రత మీకు చెందిన భయంలా భీకరంగా ఉంటుంది. \q1 \v 12 మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి, \q2 తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము. \b \q1 \v 13 యెహోవా, మా దగ్గరకు తిరిగి రండి! ఇంకెంత కాలం? \q2 మీ దాసుల మీద కనికరం చూపండి. \q1 \v 14 ఉదయం మీ మారని ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచండి, \q2 తద్వార బ్రతికినన్నాళ్ళు ఆనంద గానం చేస్తూ ఆనందిస్తాము. \q1 \v 15 మమ్మల్ని బాధించినన్ని దినాలు, \q2 మమ్మల్ని ఇబ్బంది పెట్టినన్నాళ్ళు మమ్మల్ని సంతోషింపజేయండి. \q1 \v 16 మీ క్రియలు మీ సేవకులకు, \q2 మీ ప్రభావము వారి పిల్లలకు కనుపరచబడును గాక. \b \q1 \v 17 మన ప్రభువైన దేవుని దయ\f + \fr 90:17 \fr*\ft లేదా \ft*\fqa సౌందర్యం\fqa*\f* మనమీద ఉండును గాక; \q2 మా చేతి పనులను మాకోసం స్థిరపరచండి, \q2 అవును, మా చేతి పనులను స్థిరపరచండి. \c 91 \cl కీర్తన 91 \q1 \v 1 మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు \q2 సర్వశక్తిమంతుని\f + \fr 91:1 \fr*\ft మూ.భా.లో \ft*\fqa షద్దాయ్\fqa*\f* నీడలో స్థిరంగా ఉంటారు. \q1 \v 2 యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, “ఆయనే నా ఆశ్రయం నా కోట, \q2 నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను.” \b \q1 \v 3 వేటగాని వల నుండి, \q2 మరణకరమైన తెగులు నుండి, \q2 ఆయన తప్పక విడిపిస్తారు. \q1 \v 4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు, \q2 ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం; \q2 ఆయన నమ్మకత్వం నీకు డాలుగాను గోడగాను ఉంటుంది. \q1 \v 5 రాత్రి భయాలకు గాని, \q2 పగటి పూట ఎగిరి వచ్చే బాణాలకు గాని, \q1 \v 6 చీకటిలో సంచరించే తెగులుకు గాని, \q2 మధ్యహ్నం హఠాత్తుగా కలిగే నాశనానికి గాని, \q2 నీవు భయపడాల్సిన అవసరం లేదు. \q1 \v 7 నీ ప్రక్కన వేయిమంది, \q2 నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలవచ్చు, \q2 అయినా, అది నీ దగ్గరకు రాదు. \q1 \v 8 నీవు నీ కళ్లతో గమనిస్తావు \q2 దుష్టులు శిక్ష పొందడం నీవు చూస్తావు. \b \q1 \v 9 “యెహోవా నాకు ఆశ్రయం” అని ఒకవేళ నీవు అని, \q2 మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే, \q1 \v 10 ఏ హాని నీ మీదికి రాదు, \q2 ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు. \q1 \v 11 నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని \q2 నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. \q1 \v 12 నీ పాదాలకు రాయి తగలకుండ, \q2 వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. \q1 \v 13 నీవు సింహం మీద నాగుపాము మీద నడిచి వెళ్తావు; \q2 కొదమ సింహాన్ని సర్పాన్ని త్రొక్కివేస్తావు. \b \q1 \v 14 “అతడు\f + \fr 91:14 \fr*\ft అంటే, బహుశ రాజు\ft*\f* నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను” \q2 అని యెహోవా అంటున్నారు; \q2 అతడు నా నామాన్ని గుర్తిస్తాడు, కాబట్టి నేను అతన్ని కాపాడతాను. \q1 \v 15 అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను; \q2 కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను, \q2 అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను. \q1 \v 16 దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, \q2 నా రక్షణ అతనికి చూపిస్తాను. \c 92 \cl కీర్తన 92 \d సబ్బాతు దినానికి తగిన కీర్తన. ఒక గీతము. \q1 \v 1 యెహోవాను స్తుతించడం మంచిది. \q2 మహోన్నతుడా, మీ నామాన్ని కీర్తించడం మంచిది. \q1 \v 2-3 ఉదయకాలం మీ మారని ప్రేమను \q2 రాత్రివేళ మీ నమ్మకత్వాన్ని \q1 పది తంతుల వీణ \q2 సితారా మాధుర్యంతో ప్రకటించడం మంచిది. \b \q1 \v 4 ఎందుకంటే యెహోవా, మీ కార్యముల చేత నాకు సంతోషం కలిగిస్తారు; \q2 మీ చేతులు చేసిన వాటిని బట్టి నేను ఆనంద గానం చేస్తాను. \q1 \v 5 యెహోవా, మీ క్రియలు ఎంత గొప్పవి, \q2 మీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి! \q1 \v 6-7 దుష్టులు గడ్డిలా మొలకెత్తినా, \q2 కీడుచేసేవారంతా వర్ధిల్లుతున్నా, \q1 వారు శాశ్వతంగా నాశనమవుతారని, \q2 తెలివిలేనివారికి తెలియదు, \q2 మూర్ఖులు గ్రహించరు. \b \q1 \v 8 కాని యెహోవా, మీరు శాశ్వతంగా హెచ్చింపబడి ఉన్నారు. \b \q1 \v 9 యెహోవా, మీ శత్రువులు, \q2 నిజంగా మీ శత్రువులు నశిస్తారు; \q2 కీడుచేసేవారంతా చెదరిపోతారు. \q1 \v 10 మీరు నా కొమ్మును\f + \fr 92:10 \fr*\fq కొమ్ము \fq*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తుంది\ft*\f* అడవి ఎద్దులా హెచ్చించారు; \q2 చక్కని నూనెలు నాపై పోయబడ్డాయి. \q1 \v 11 నా విరోధుల ఓటమిని నేను కళ్లారా చూశాను; \q2 నా దుష్టుల పూర్తి పరాజయాన్ని నా చెవులారా విన్నాను. \b \q1 \v 12 నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు, \q2 లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు. \q1 \v 13 వారు యెహోవా దేవాలయంలో నాటబడి, \q2 మన దేవుని ఆవరణాల్లో వర్థిల్లుతారు. \q1 \v 14 వారు వృద్ధాప్యంలో కూడా సఫలమైన జీవితంలో \q2 సారవంతంగా హాయిగా బ్రతుకుతారు, \q1 \v 15 “యెహోవా యథార్థవంతుడు, ఆయన నా కొండ, \q2 ఆయనయందు ఏ దుష్టత్వం లేదు” అని వారు ప్రకటిస్తూ ఉంటారు. \c 93 \cl కీర్తన 93 \q1 \v 1 యెహోవా పరిపాలిస్తున్నారు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు; \q2 యెహోవా ప్రభావాన్ని వస్త్రంగా బలాన్ని ఆయుధంగా ధరించుకున్నారు; \q2 నిజానికి, ప్రపంచం దృఢంగా క్షేమంగా స్థాపించబడింది. \q1 \v 2 మీ సింహాసనం ఆది నుండి సుస్థిరమే. \q2 అనాది కాలం నుండి మీరున్నారు. \b \q1 \v 3 యెహోవా, నదులలో వరదలు లేచాయి, \q2 నదులు ఉరుములా గర్జిస్తున్నాయి, \q2 అలలు చెలరేగుతున్నాయి. \q1 \v 4 జలప్రవాహాల ఘోష కన్నా \q2 బలమైన సముద్ర తరంగాల కన్నా, \q2 యెహోవా బలాఢ్యుడై ఉన్నాడు. \b \q1 \v 5 యెహోవా, మీ శాసనాలు స్థిరమైనవి; \q2 యెహోవా మీ మందిరం \q2 అంతం లేనన్ని దినాలు పరిశుద్ధతతో అలంకరించబడుతుంది. \c 94 \cl కీర్తన 94 \q1 \v 1 యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. \q2 ప్రతీకారం సాధించే దేవా, ప్రకాశించండి. \q1 \v 2 లోక న్యాయాధిపతి, లేవండి; \q2 గర్విష్ఠులకు తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. \q1 \v 3 యెహోవా, ఎంతకాలం దుష్టులు, \q2 ఎంతకాలం దుష్టులు ఆనందిస్తారు? \b \q1 \v 4 వారు అహంకారపు మాటలు మాట్లాడతారు; \q2 కీడుచేసేవారంతా గొప్పలు చెప్పుకుంటారు. \q1 \v 5 యెహోవా, వారు మీ ప్రజలను నలిపివేస్తారు; \q2 మీ వారసత్వాన్ని అణచివేస్తారు. \q1 \v 6 విధవరాండ్రను విదేశీయులను చంపేస్తారు; \q2 వారు తండ్రిలేనివారిని హత్య చేస్తారు. \q1 \v 7 వారంటారు, “యెహోవా చూడడం లేదు; \q2 యాకోబు దేవుడు గమనించడంలేదు.” \b \q1 \v 8 ప్రజల్లో తెలివిలేని మీరు, గమనించండి; \q2 అవివేకులారా, మీరు ఎప్పుడు జ్ఞానులవుతారు? \q1 \v 9 చెవులిచ్చినవాడు వినడా? \q2 కళ్ళిచ్చిన వాడు చూడడా? \q1 \v 10 దేశాలను శిక్షణ చేసేవాడు మిమ్మల్ని శిక్షించడా? \q2 నరులకు బోధించేవానికి తెలివిలేదా? \q1 \v 11 మనుష్యుల ప్రణాళికలన్నీ యెహోవాకు తెలుసు; \q2 అవి వ్యర్థమైనవి అని ఆయనకు తెలుసు. \b \q1 \v 12 యెహోవా శిక్షణ చేసినవారు ధన్యులు, \q2 వారికి మీ ధర్మశాస్త్రం నుండి మీరు బోధిస్తారు. \q1 \v 13 దుష్టుని కోసం గొయ్యి త్రవ్వబడే వరకు, \q2 ఇబ్బంది దినాల నుండి మీరు వారికి ఉపశమనం కలిగిస్తారు. \q1 \v 14 యెహోవా తన ప్రజలను తృణీకరించరు; \q2 ఆయన తన వారసత్వాన్ని ఎన్నడు విడిచిపెట్టరు. \q1 \v 15 తీర్పు మళ్ళీ నీతి మీద స్థాపించబడుతుంది, \q2 యథార్థవంతులందరు దానిని అనుసరిస్తారు. \b \q1 \v 16 నా కోసం దుష్టునికి వ్యతిరేకంగా ఎవరు లేస్తారు? \q2 కీడు చేసేవారిని నా కోసం ఎవరు వ్యతిరేకిస్తారు? \q1 \v 17 యెహోవా నాకు సాయం చేసి ఉండకపోతే, \q2 నేను మౌన నిద్రలో నివసించేవాన్ని. \q1 \v 18 “నా కాలు జారింది” అని నేను అన్నప్పుడు, \q2 యెహోవా, మీ మారని ప్రేమ నన్ను ఎత్తి పట్టుకున్నది. \q1 \v 19 ఆందోళన కలిగించే తలంపులు ఎక్కువ అవుతున్నాయి. \q2 మీ ఓదార్పు నాకు ఆనందాన్ని కలిగించింది. \b \q1 \v 20 శాసనాల ద్వారా కష్టాలు తెచ్చే అవినీతి సింహాసనం \q2 మీతో పొత్తు పెట్టుకోగలదా? \q1 \v 21 నీతిమంతుల ప్రాణాలు తియ్యటానికి దుష్టులు దుమ్మీగా వచ్చి పైకి ఎగబడతారు. \q2 నిర్దోషులపై నేరాలు మోపి మరణశిక్ష విధిస్తారు. \q1 \v 22 యెహోవా నాకు ఎత్తైన కోట. \q2 నా దేవుడు నేను ఆశ్రయించే కొండ. \q1 \v 23 వారి పాపాలకు ఆయన వారికి తిరిగి చెల్లిస్తారు \q2 వారి దుష్టత్వాన్ని బట్టి వారిని నాశనం చేస్తారు; \q2 మన దేవుడైన యెహోవా వారిని నాశనం చేస్తారు. \c 95 \cl కీర్తన 95 \q1 \v 1 రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం; \q2 రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము. \q1 \v 2 కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం, \q2 సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము. \b \q1 \v 3 యెహోవా గొప్ప దేవుడు, \q2 దైవములందరి పైన గొప్ప రాజు. \q1 \v 4 భూమి యొక్క అగాధాలు ఆయన చేతిలో ఉన్నాయి, \q2 పర్వత శిఖరాలు ఆయనకు చెందినవే. \q1 \v 5 సముద్రం ఆయనదే, ఆయనే దాన్ని చేశారు, \q2 ఆయన హస్తాలు ఆరిన నేలను రూపొందించాయి. \b \q1 \v 6 రండి, సాగిలపడి ఆరాధించుదాం, \q2 మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం; \q1 \v 7 ఎందుకంటే ఆయన మన దేవుడు \q2 మనం ఆయన పచ్చికలోని ప్రజలం, \q2 ఆయన శ్రద్ధచూపే మంద. \b \q1 నేడు, ఆయన స్వరాన్ని ఒకవేళ మీరు వింటే మంచిది, \q1 \v 8 “మీరు మెరీబా\f + \fr 95:8 \fr*\fq మెరీబా \fq*\ft అంటే \ft*\fqa గొడవపడుట.\fqa*\f* దగ్గర చేసినట్టుగా, \q2 అరణ్యంలో మస్సా\f + \fr 95:8 \fr*\fq మస్సా \fq*\ft అంటే \ft*\fqa పరీక్షించుట\fqa*\f* దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి. \q1 \v 9 అక్కడ మీ పూర్వికులు నన్ను సందేహించారు; \q2 నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా నన్ను పరీక్షించారు. \q1 \v 10 నలువది సంవత్సరాలు నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను: \q2 ‘వారు హృదయాలు పెడత్రోవ పట్టిన ప్రజలు, \q2 వారు నా మార్గాలను తెలుసుకోలేదు’ \q1 \v 11 కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ \q2 అని నేను కోపంలో ప్రమాణం చేశాను.” \c 96 \cl కీర్తన 96 \q1 \v 1 యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి; \q2 సమస్త భూలోకమా, యెహోవాకు పాడండి. \q1 \v 2 యెహోవాకు పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి; \q2 అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి. \q1 \v 3 దేశాల్లో ఆయన మహిమను, \q2 సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి. \b \q1 \v 4 యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; \q2 దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు. \q1 \v 5 ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు, \q2 కాని యెహోవా ఆకాశాలను సృజించారు. \q1 \v 6 వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి; \q2 బలం, మహిమ ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాయి. \b \q1 \v 7 ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, \q2 మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి. \q1 \v 8 యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే చెల్లించండి. \q2 అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి. \q1 \v 9 తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి; \q2 సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి. \q1 \v 10 “యెహోవా పరిపాలిస్తారు” అని జనాంగాలలో ప్రకటించండి, \q2 లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు; \q2 ఆయన జనాంగాలకు న్యాయంగా తీర్పు తీరుస్తారు. \b \q1 \v 11 ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి; \q2 సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి. \q2 ఆయన మహిమను ప్రచురించాలి. \q1 \v 12 పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి. \q2 అడవి చెట్లు ఆనందంతో పాటలు పాడాలి. \q1 \v 13 యెహోవా రాబోతున్నారు. \q2 భూలోకానికి తీర్పు తీరుస్తారు. \q1 నీతిని బట్టి లోకానికి, \q2 తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు. \c 97 \cl కీర్తన 97 \q1 \v 1 యెహోవా పరిపాలిస్తారు, భూతలం ఆనందిస్తుంది; \q2 ద్వీపాలు, సముద్ర తీర ప్రదేశాలు సంతోషిస్తాయి. \q1 \v 2 ఆయన చుట్టూరా మోఘాలు సాంద్రమైన చీకటితో ఆవరించి ఉన్నాయి; \q2 ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు పునాదులు. \q1 \v 3 ఆయన ఎదుట నుండి మంటలు బయలుదేరి \q2 చుట్టూరా చేరి ఉన్న శత్రువులను దహించి వేస్తాయి. \q1 \v 4 ఆయన మెరుపులు లోకాన్ని వెలుగిస్తాయి; \q2 అది చూసి భూమి కంపిస్తుంది. \q1 \v 5 యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి, \q2 ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు. \q1 \v 6 ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తాయి, \q2 ప్రజలంతా ఆయన మహిమను చూస్తారు. \b \q1 \v 7 వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ, \q2 చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు \q2 సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి! \b \q1 \v 8 యెహోవా! మీ తీర్పులను బట్టి \q2 సీయోను విని సంతోషిస్తూ ఉంది \q2 యూదా కుమార్తెలు\f + \fr 97:8 \fr*\ft ఇక్కడ, కుమార్తెలు గ్రామాలకు వర్తిస్తుంది.\ft*\f* ఆనందిస్తున్నారు. \q1 \v 9 యెహోవా, భూమి అంతటికి పైగా ఉన్నావు; \q2 దేవుళ్ళందరి పైన మీరు మహోన్నతులు. \q1 \v 10 యెహోవాను ప్రేమించేవారు కీడును ద్వేషించుదురు గాక, \q2 ఎందుకంటే తన నమ్మకమైన వారి జీవితాలను ఆయన కావలి కాస్తారు \q2 దుష్టుల చేతి నుండి ఆయన విడిపిస్తారు. \q1 \v 11 నీతిమంతుల మీద వెలుగు \q2 యథార్థవంతుల మీద ఆనందం ప్రకాశిస్తాయి. \q1 \v 12 నీతిమంతులారా, యెహోవాయందు ఆనందించండి, \q2 ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకోండి. \c 98 \cl కీర్తన 98 \d ఒక కీర్తన. \q1 \v 1 యెహోవాకు క్రొత్త పాట పాడండి, \q2 ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; \q1 ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు \q2 విజయాన్ని కలిగిస్తాయి. \q1 \v 2 యెహోవా రక్షణను వెల్లడించారు. \q2 దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు. \q1 \v 3 ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని \q2 చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; \q1 మన దేవుని రక్షణ \q2 భూమ్యంతాల వరకు కనపడింది. \b \q1 \v 4 భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, \q2 సంగీతంతో ఉత్సాహ గానం చేయి; \q1 \v 5 వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, \q2 వీణతో, గాన ధ్వనితో, \q1 \v 6 బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, \q2 రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి. \b \q1 \v 7 సముద్రం, అందులో ఉన్నదంతా, \q2 లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక. \q1 \v 8 యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి. \q2 పర్వతాలు ఆనందంగా పాడతాయి. \q1 \v 9 యెహోవా లోకానికి తీర్పరిగా, \q2 రాజుగా రాబోతున్నారు. \q1 ఆయన పరిపాలన ఆయన తీర్పులు \q2 న్యాయసమ్మతమైనవి. \c 99 \cl కీర్తన 99 \q1 \v 1 యెహోవా పరిపాలిస్తారు, \q2 ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు; \q1 కెరూబులకు\f + \fr 99:1 \fr*\fq కెరూబుల \fq*\ft సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.\ft*\f* పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు, \q2 భూమి కంపించాలి. \q1 \v 2 సీయోను పట్టణంలో యెహోవా వైభవోపేతంగా \q2 అందరికంటే పైన ఉన్నారు. \q1 \v 3 వారు మీ భీకరమైన గొప్ప నామాన్ని స్తుతిస్తారు, \q2 మీరు పరిశుద్ధులు. \b \q1 \v 4 రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు \q2 కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు; \q1 యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల \q2 నీతి నాయ్యాలు జరిగిస్తారు. \q1 \v 5 మన దేవుడైన యెహోవాను మహిమపరచండి \q2 ఆయన పాదపీఠం దగ్గర ఆరాధించండి; \q2 ఆయన పవిత్రులు. \b \q1 \v 6 దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, \q2 యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు; \q1 వారు దేవునికి ప్రార్థన చేశారు, \q2 ఆయన జవాబిచ్చారు. \q1 \v 7 మేఘస్తంభంలో నుండి ఆయన మాట్లాడారు. \q2 వారు ఆయన చట్టాలు పాటించారు ఆయన ఇచ్చిన శాసనాలను వారు అమలుచేశారు. \b \q1 \v 8 యెహోవా మా దేవా, \q2 మీరు వారికి జవాబిచ్చారు. \q1 మీరు వారికి క్షమించే దేవుడు, \q2 కాని వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని శిక్షించారు. \q1 \v 9 మన దేవుడైన యెహోవాను ఘనపరచండి \q2 ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయనను ఆరాధించండి. \q2 ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. \c 100 \cl కీర్తన 100 \d స్తుతి అర్పణ కీర్తన \q1 \v 1 భూలోకమంతా యెహోవాను స్తుతిస్తూ ఆనంద ధ్వనులు చేయాలి. \q2 \v 2 సంతోష పూర్వకంగా యెహోవాను సేవించండి; \q2 పాడుతూ ఆయన సన్నిధిలోకి రండి. \q1 \v 3 యెహోవాయే దేవుడని గ్రహించండి. \q2 ఆయనే మన సృష్టికర్త, మనం ఆయన వారం; \q2 మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. \b \q1 \v 4 కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి, \q2 స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి; \q2 ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి. \q1 \v 5 యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది; \q2 ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది. \c 101 \cl కీర్తన 101 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను; \q2 మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను. \q1 \v 2 నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను, \q2 మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు? \b \q1 నేను నిందారహితమైన హృదయంతో \q2 నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను. \q1 \v 3 నీచమైన దేనినైనా సరే \q2 నేను నా కళ్లెదుట ఉంచను. \b \q1 విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; \q2 అందులో నేను పాలుపంచుకోను. \q1 \v 4 కుటిల హృదయం నాకు దూరమై పోవాలి; \q2 చెడుతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. \b \q1 \v 5 రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని, \q2 నేను నాశనం చేస్తాను. \q1 అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని \q2 నేను సహించను. \b \q1 \v 6 నా కళ్లు దేశంలోని నమ్మకస్థులపై ఉంటాయి, \q2 వారు నాతో నివసించాలని; \q1 నిందారహితంగా జీవించేవారు \q2 నాకు సేవ చేస్తారని. \b \q1 \v 7 మోసం చేసే వారెవరూ \q2 నా భవనంలో నివసించరు; \q1 అబద్ధాలాడే వారెవరూ \q2 నా ఎదుట నిలబడరు. \b \q1 \v 8 ప్రతి ఉదయం దేశంలోని దుష్టులందరిని \q2 నేను మౌనంగా ఉంచుతాను; \q1 యెహోవా పట్టణంలో నుండి \q2 కీడు చేసేవారిని పంపివేస్తాను. \c 102 \cl కీర్తన 102 \d దుఃఖముచేత ప్రాణము సొమ్మసిల్లినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. \q1 \v 1 యెహోవా, నా ప్రార్థన వినండి; \q2 సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక. \q1 \v 2 నేను కష్టంలో ఉన్నప్పుడు \q2 మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి. \q1 మీ చెవి నా వైపు త్రిప్పండి; \q2 నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి. \b \q1 \v 3 నా దినాలు పొగలా కనుమరుగు అవుతున్నాయి; \q2 నా ఎముకలు నిప్పుకణాల్లా కాలిపోతున్నాయి. \q1 \v 4 దెబ్బకు వాడిన గడ్డిలా ఉంది నా హృదయం; \q2 నేను భోజనం చేయడం మరచిపోతున్నాను. \q1 \v 5 నా బాధలో నేను గట్టిగా మూలుగుతూ ఉన్నందుకు \q2 నేను అస్థిపంజరంలా ఉన్నాను. \q1 \v 6 నేను ఎడారి గుడ్లగూబలా, \q2 శిధిలాల మధ్య బిగ్గరగా అరిచే గుడ్లగూబలా ఉన్నాను. \q1 \v 7 నేను మేల్కొని ఉన్నాను; \q2 ఇంటికప్పు మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలా ఉన్నాను. \q1 \v 8 రోజంతా నా శత్రువులు నన్ను తిడతారు; \q2 నన్ను ఎగతాళి చేసేవారు నా పేరును శాపంగా ఉపయోగిస్తారు. \q1 \v 9 నేను బూడిదను ఆహారంగా తింటున్నాను \q2 పానీయంలో కన్నీరు కలిపి త్రాగుతున్నాను. \q1 \v 10 మీ ఉగ్రతను బట్టి; \q2 మీరు నన్ను ఎత్తి అవతల విసిరివేశారు. \q1 \v 11 నా రోజులు సాయంకాలపు నీడలా ఉన్నాయి; \q2 నేను గడ్డిలా వాడిపోతున్నాను. \b \q1 \v 12 కాని యెహోవా, మీరు ఎప్పటికీ ఆసీనులై ఉంటారు; \q2 మీ జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది. \q1 \v 13 మీరు లేచి సీయోనుపై కనికరం చూపిస్తారు, \q2 ఎందుకంటే ఆమెపై దయ చూపే సమయం వచ్చింది; \q2 నిర్ణీత సమయం వచ్చింది. \q1 \v 14 దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి; \q2 దుమ్ము వారికి దయ కలిగించింది. \q1 \v 15 జనులు యెహోవా నామానికి భయపడతారు, \q2 భూరాజులంతా మీ మహిమ ఎదుట వణకుతారు. \q1 \v 16 ఎందుకంటే యెహోవా సీయోనును పునర్నిర్మించి \q2 తన మహిమతో ప్రత్యక్షమవుతారు. \q1 \v 17 దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు; \q2 ఆయన వారి మనవులను త్రోసివేయరు. \b \q1 \v 18 ఇది రాబోయే తరాల కోసం వ్రాయబడును గాక, \q2 ఇంకా సృజించబడని ప్రజలు యెహోవాను స్తుతించుదురు గాక: \q1 \v 19-20 “బందీల మూలుగులు వినడానికి \q2 మరణశిక్ష విధించబడిన వారిని విడుదల చేయడానికి, \q1 యెహోవా ఎత్తైన పరిశుద్ధాలయం నుండి క్రిందికి వంగిచూశారు, \q2 పరలోకంలో నుండి భూమిని చూశారు.” \q1 \v 21-22 ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు రాజ్యాలు \q2 యెహోవాను ఆరాధించడానికి సమాజముగా కూడుతారో \q1 అప్పుడు సీయోనులో యెహోవా నామం ప్రకటించబడుతుంది \q2 యెరూషలేములో ఆయన స్తుతించబడతారు. \b \q1 \v 23 నా జీవిత గమనంలో\f + \fr 102:23 \fr*\ft లేదా \ft*\fqa తన శక్తిచేత\fqa*\f* నా బలాన్ని కృంగదీశారు; \q2 ఆయన నా రోజుల్ని తగ్గించారు. \q1 \v 24 అందుకు నేనన్నాను: \q1 నా దేవా, నా దినాల మధ్యలో నన్ను తీసుకెళ్లకండి; \q2 మీ సంవత్సరాలు తరతరాలకు సాగిపోతూనే ఉంటాయి. \q1 \v 25 ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, \q2 ఆకాశాలు మీ చేతి పని. \q1 \v 26 అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; \q2 ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి. \q1 మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు \q2 అవి అంతరిస్తాయి. \q1 \v 27 కాని మీరు అలాగే ఉంటారు, \q2 మీ సంవత్సరాలకు అంతం ఉండదు. \q1 \v 28 మీ సేవకుల పిల్లలు మీ సన్నిధిలో నివాసం చేస్తారు; \q2 వారి పిల్లలు మీ సమక్షంలో స్థిరంగా ఉంటారు. \c 103 \cl కీర్తన 103 \d దావీదు కీర్తన. \q1 \v 1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; \q2 నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు. \q1 \v 2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, \q2 ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు. \q1 \v 3 ఆయన నీ పాపాలను క్షమిస్తారు, \q2 నీ రోగాలను స్వస్థపరుస్తారు. \q1 \v 4 నరకంలో\f + \fr 103:4 \fr*\ft మూ. భా. లో \ft*\fqa గోతి\fqa*\f* నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు \q2 నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు, \q1 \v 5 నీ యవ్వనం గ్రద్ద యవ్వనంలా క్రొత్తగా ఉండేలా, \q2 మంచి ఈవులతో నీ కోరికలను తృప్తిపరుస్తారు. \b \q1 \v 6 అణగారిన వారికందరికి యెహోవా \q2 నీతిని న్యాయాన్ని జరిగిస్తారు. \b \q1 \v 7 ఆయన మోషేకు తన మార్గాలను, \q2 ఇశ్రాయేలీయులకు తన క్రియలను తెలియజేశారు. \q1 \v 8 యెహోవా కృపా కనికరం గలవారు, \q2 త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు. \q1 \v 9 ఆయన ఎల్లప్పుడూ మనమీద నేరారోపణ చేయరు, \q2 శాశ్వతంగా కోపం పెట్టుకోరు; \q1 \v 10 మన పాపాలకు తగినట్లుగా ఆయన మనతో వ్యవహరించలేదు \q2 మన దోషాలకు ప్రతిగా మనకు తిరిగి చెల్లించలేదు. \q1 \v 11 భూమికంటె ఆకాశం ఎంత ఎత్తున ఉందో, \q2 తనకు భయపడేవారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతం. \q1 \v 12 పడమటికి తూర్పు ఎంత దూరమో, \q2 అంత దూరం ఆయన మన అతిక్రమాలను తొలగించారు. \b \q1 \v 13 తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు, \q2 తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు; \q1 \v 14 మనం ఎలా రూపించబడ్డామో ఆయనకు తెలుసు, \q2 మనం మట్టి అని ఆయనకు తెలుసు. \q1 \v 15 మానవుల జీవితం గడ్డిలాంటిది, \q2 పొలంలో పువ్వు పూసినట్లు పూస్తారు; \q1 \v 16 దాని మీద గాలి వీస్తే అది లేకుండా పోతుంది, \q2 దాని చోటుకు అది జ్ఞాపకం కూడా ఉండదు. \q1 \v 17 ఆయనకు భయపడేవారి పట్ల \q2 యెహోవా మారని ప్రేమ \q2 వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది, \q1 \v 18 ఆయన నిబంధనను పాటించేవారిపట్ల, \q2 ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది. \b \q1 \v 19 యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశారు, \q2 ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేస్తున్నారు. \b \q1 \v 20 యెహోవా దూతలారా, \q2 ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే \q2 బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి. \q1 \v 21 యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా, \q2 మీరంతా యెహోవాను స్తుతించండి. \q1 \v 22 ప్రతిచోట ఆయన పరిపాలనలో ఉన్న సర్వ సృష్టి \q2 యెహోవాను స్తుతించండి. \b \q1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. \c 104 \cl కీర్తన 104 \q1 \v 1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. \b \q1 యెహోవా నా దేవా, మీరు చాలా గొప్పవారు; \q2 ఘనత ప్రభావాన్ని ధరించుకున్నారు. \b \q1 \v 2 యెహోవా వెలుగును వస్త్రంలా ధరిస్తారు; \q2 ఆయన ఒక గుడారంలా ఆకాశాన్ని విస్తరించి \q2 \v 3 తన గదుల కిరణాలను వాటి నీటిపై వేస్తారు. \q1 ఆయన మేఘాలను తన రథంగా చేసుకుని \q2 వాయు రెక్కలపై స్వారీ చేస్తారు. \q1 \v 4 ఆయన వాయువులను తనకు దూతలుగా, \q2 అగ్ని జ్వాలలను తనకు సేవకులుగా చేస్తారు. \b \q1 \v 5 భూమిని దాని పునాదులపై నిలిపారు; \q2 అది ఎన్నటికి కదలదు. \q1 \v 6 మీరు దానిని ఒక వస్త్రంలా నీటి అగాధాలతో కప్పారు; \q2 జలాలు పర్వతాలకు పైగా నిలిచాయి. \q1 \v 7 మీ మందలింపుతో జలాలు పారిపోయాయి, \q2 మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి; \q1 \v 8 అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి, \q2 అవి లోయల్లోకి దిగిపోయాయి, \q2 వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి. \q1 \v 9 అవి దాటలేని సరిహద్దును మీరు ఏర్పరిచారు; \q2 అవి ఎన్నటికి భూమిని ముంచివేయవు. \b \q1 \v 10 ఆయన ఊటలను కనుమలలోకి నీటిని కుమ్మరింపజేస్తారు; \q2 అవి పర్వతాల మధ్య ప్రవహిస్తున్నాయి. \q1 \v 11 అవి పొలాలలోని అడవి మృగాలకు నీరు అందిస్తాయి; \q2 అడవి గాడిదలు తమ దాహం తీర్చుకుంటాయి. \q1 \v 12 ఆ జలాల ప్రక్కన ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి; \q2 కొమ్మల మధ్య అవి పాడతాయి. \q1 \v 13 తన ఆకాశ గదుల్లో నుండి ఆయన పర్వతాలను తడుపుతారు; \q2 ఆయన క్రియా ఫలం చేత భూమి తృప్తి చెందుతుంది. \q1 \v 14 ఆయన పశువుల కోసం గడ్డి పెరిగేలా చేస్తున్నారు, \q2 మనుష్యులు శ్రమించి సాగుచేయడానికి మొక్కలను మొలిపిస్తున్నారు, \q2 అలా భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నారు: \q1 \v 15 మానవ హృదయాలకు సంతోషం కలిగించడానికి ద్రాక్షరసాన్ని, \q2 వారి ముఖాలను ప్రకాశించేలా చేయడానికి నూనెను, \q2 వారి హృదయాలను బలపరిచే ఆహారాన్ని ఇస్తున్నారు. \q1 \v 16 యెహోవా వృక్షాలు, \q2 లెబానోనులో దేవదారు చెట్లు చాలినంత నీరు కలిగి ఉన్నాయి. \q1 \v 17 అక్కడ పక్షులు వాటిలో గూళ్ళు కట్టుకుంటాయి; \q2 కొంగలు సరళ వృక్షాలపై నివాసముంటాయి. \q1 \v 18 అడవి మేకపోతులు ఎత్తైన పర్వతాలమీద మేస్తూ ఉంటాయి; \q2 కుందేళ్ళు బండ సందులను ఆశ్రయిస్తాయి. \b \q1 \v 19 రుతువుల్ని సూచించడానికి ఆయన చంద్రుని చేశారు, \q2 ఎప్పుడు అస్తమించాలో సూర్యునికి తెలుసు. \q1 \v 20 మీరు చీకటి కలుగజేస్తారు, అది రాత్రి అవుతుంది, \q2 అడవి మృగాలన్నీ వేట కోసం సంచరిస్తాయి. \q1 \v 21 సింహాలు వాటి వేట కోసం గర్జిస్తాయి, \q2 అవి దేవుని నుండి ఆహారం వెదకుతాయి. \q1 \v 22 సూర్యుడు ఉదయించగానే, అవి వెళ్లిపోతాయి; \q2 అవి గుహలకు వెళ్లి పడుకుంటాయి. \q1 \v 23 అప్పుడు మనుష్యులు వారి పనులకు వెళ్లిపోతారు, \q2 సాయంకాలం వరకు వారు కష్టపడతారు. \b \q1 \v 24 యెహోవా! మీ కార్యాలు ఎన్నో! \q2 మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు; \q2 భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది. \q1 \v 25 అదిగో విశాలమైన, మహా సముద్రం, \q2 అందులో లెక్కలేనన్ని జలచరాలు \q2 దానిలో జీవులు చిన్నవి పెద్దవి ఉన్నాయి. \q1 \v 26 అందులో ఓడలు ఇటు అటు తిరుగుతాయి, \q2 సముద్రంలో ఆడుకోడానికి మీరు సృజించిన లెవియాథన్ అక్కడ ఉంది. \b \q1 \v 27 సకాలంలో మీరు వాటికి వాటి ఆహారం పెడతారని, \q2 జీవులన్నీ మీ వైపే చూస్తున్నాయి. \q1 \v 28 మీరు దానిని వారికి ఇచ్చినప్పుడు, \q2 అవి సమకూర్చుకుంటాయి; \q1 మీరు గుప్పిలి విప్పి పెడుతుంటే \q2 అవి తిని తృప్తి చెందుతాయి. \q1 \v 29 మీ ముఖం మరుగైతే \q2 అవి కంగారు పడతాయి; \q1 మీరు వాటి ఊపిరిని ఆపివేసినప్పుడు, \q2 అవి చనిపోయి మట్టి పాలవుతాయి. \q1 \v 30 మీరు మీ ఆత్మను పంపినప్పుడు, \q2 అవి సృజించబడ్డాయి, \q2 మీరే భూతలాన్ని నూతనపరుస్తారు. \b \q1 \v 31 యెహోవా మహిమ నిరంతరం ఉండును గాక; \q2 యెహోవా తన క్రియలలో ఆనందించును గాక. \q1 \v 32 ఆయన భూమిని చూస్తే, అది కంపిస్తుంది, \q2 ఆయన పర్వతాలను తాకితే, అవి పొగలు గ్రక్కుతాయి. \b \q1 \v 33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను; \q2 నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను. \q1 \v 34 నేను యెహోవాయందు ఆనందిస్తుండగా, \q2 నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక. \q1 \v 35 అయితే పాపులు భూమి మీద నుండి పూర్తిగా తుడిచివేయబడుదురు గాక \q2 దుష్టులు ఇక ఉండక పోవుదురు గాక. \b \q1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. \b \q1 యెహోవాను స్తుతించు.\f + \fr 104:35 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\f* \c 105 \cl కీర్తన 105 \q1 \v 1 యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; \q2 ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి. \q1 \v 2 ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి; \q2 ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి. \q1 \v 3 ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి; \q2 యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక \q1 \v 4 యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; \q2 ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి. \b \q1 \v 5-6 ఆయన సేవకులైన అబ్రాహాము సంతానమా, \q2 ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతానమా, \q1 ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను, \q2 ఆయన అద్భుతాలను, ఆయన ప్రకటించిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. \q1 \v 7 ఆయన మన దేవుడైన యెహోవా; \q2 ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి. \b \q1 \v 8 ఆయన తన నిబంధనను, \q2 తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు, \q1 \v 9 అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను, \q2 ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు. \q1 \v 10 ఆయన దానిని యాకోబుకు శాసనంగా, \q2 ఇశ్రాయేలుకు శాశ్వతమైన నిబంధనగా స్థిరపరిచారు: \q1 \v 11 “నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను \q2 మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.” \b \q1 \v 12 వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు, \q2 ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడు, \q1 \v 13 వారు దేశం నుండి దేశానికి, \q2 ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు. \q1 \v 14 ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు; \q2 వారి కోసం ఆయన రాజులను మందలించారు: \q1 \v 15 “నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు; \q2 నా ప్రవక్తలకు హాని చేయకూడదు.” \b \q1 \v 16 ఆయన భూమిపై కరువును పిలిచారు \q2 వారి ఆహార సరఫరా అంతా నాశనం చేశారు; \q1 \v 17 వారికి ముందుగా ఒక మనుష్యుని పంపారు, \q2 ఒక బానిసగా అమ్మబడిన యోసేపును, \q1 \v 18-19 తాను చెప్పింది జరిగే వరకు, \q2 యెహోవా యోసేపు ప్రవర్తనను పరీక్షించారు, \q1 వారు అతని పాదాలను సంకెళ్ళతో గాయపరిచారు, \q2 అతని మెడ సంకెళ్ళలో ఉంచబడింది. \q1 \v 20 రాజు కబురుపెట్టి, అతన్ని విడుదల చేశాడు, \q2 జనాంగాల పాలకుడు అతన్ని విడిపించాడు. \q1 \v 21-22 అతడు యోసేపును తన ఇంటి యజమానిగా, \q2 తన స్వాస్థ్యమంతటి మీద పాలకునిగా చేశాడు, \q1 తనకు నచ్చిన విధంగా తన యువరాజులకు సూచించడానికి \q2 పెద్దలకు జ్ఞానాన్ని బోధించడానికి అధికారం ఇచ్చాడు. \b \q1 \v 23 యాకోబు అనబడిన ఇశ్రాయేలు ఆ తర్వాత హాము దేశమైన ఈజిప్టుకు వెళ్లి, \q2 అక్కడే ప్రవాసం చేశాడు. \q1 \v 24 యెహోవా తన ప్రజలకు అధిక సంతాన మిచ్చాడు; \q2 వారిని శత్రువుల కన్నా బలవంతులుగా చేశారు. \q1 \v 25 తన ప్రజలను వారు ద్వేషించేలా ఆయన వారి హృదయాలు మార్చివేశారు, \q2 తన సేవకులకు వ్యతిరేకంగా కుట్ర చేసేలా వారిని పురికొల్పారు. \q1 \v 26 ఆయన తన సేవకుడైన మోషేను \q2 తాను ఏర్పరచుకున్న అహరోనును పంపారు. \q1 \v 27 ఈజిప్టువారి మధ్య సూచక క్రియలు, \q2 హాము దేశంలో అద్భుతాలు జరిగించారు. \q1 \v 28 యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు; \q2 వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు. \q1 \v 29 ఆయన వారి జలాలను రక్తంగా మార్చారు, \q2 వారి చేపలన్నిటిని చనిపోయేలా చేశారు. \q1 \v 30 వారి దేశం కప్పలతో నిండిపోయింది, \q2 వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి. \q1 \v 31 ఆయన ఆజ్ఞ ఇవ్వగా, జోరీగలు వచ్చాయి, \q2 వారి దేశమంతటా దోమలు వచ్చాయి. \q1 \v 32 దేశమంతటా ఆయన మెరుపులు మెరిపిస్తూ, \q2 వడగండ్ల వాన కురిపించారు. \q1 \v 33 ఆయన వారి ద్రాక్షతీగెలను అంజూర చెట్లను పడగొట్టారు \q2 వారి దేశంలోని వృక్షాలను విరగ్గొట్టారు. \q1 \v 34 ఆయన ఆజ్ఞ ఇవ్వగా మిడతలు, \q2 లెక్కలేనన్ని చీడ పురుగులు వచ్చి పడ్డాయి. \q1 \v 35 ఆ దేశంలో కూరగాయల మొక్కలన్నిటినీ పురుగులు తినేశాయి, \q2 భూమి పంటలను తినేశాయి. \q1 \v 36 వారి దేశంలో ఉన్న జ్యేష్ఠులందరిని \q2 వారి ప్రథమ సంతానమంతటిని ఆయన హతమార్చారు. \q1 \v 37 ఇశ్రాయేలీయులను వెండి బంగారములతో దేవుడు బయిటకి రప్పించాడు. \q2 ఆయన ఇశ్రాయేలు గోత్రాల్లో ఎవరూ తొట్రుపడరు. \q1 \v 38 వారంటే ఈజిప్టువారికి భయం పట్టుకుంది, \q2 వారు వెళ్లి పోతుంటే, వీరు సంతోషించారు. \b \q1 \v 39 దేవుడు పరచిన మేఘపు దుప్పి వారిని కప్పింది, \q2 రాత్రివేళ వెలుగు కోసం అగ్ని నిచ్చాడు దేవుడు. \q1 \v 40 వారు కోరుకున్నట్లే దేవుడు పూరేడుపిట్టలను పంపించాడు. \q2 ఆకాశం నుండి వచ్చే ఆహారంతో వారంతా తృప్తి చెందారు. \q1 \v 41 దేవుడు బండను చీల్చాడు. అందులో నుండి నీరు ఉబికి బయటకు వచ్చింది. \q2 ఆ మీరు నదీ ప్రవాహంలా ఎడారి స్థలాల్లో పారింది. \b \q1 \v 42 ఆయన తన సేవకుడైన అబ్రాహాముకు చేసిన \q2 పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. \q1 \v 43 తన ప్రజలను సంతోషంతో బయిటకి తెచ్చాడు. \q2 తాను ఎన్నుకున్న ప్రజలను ఆనంద ధ్వనులతో రప్పించాడు. \q1 \v 44 ఆయన వారికి దేశాల భూములను ఇచ్చారు, \q2 ఇతరులు శ్రమించినదానికి వారు వారసులయ్యారు. \q1 \v 45 వారు ఆయన కట్టడలను అనుసరించాలని \q2 ఆయన న్యాయవిధులను పాటించాలని. \b \q1 యెహోవాను స్తుతించండి!\f + \cat dup\cat*\fr 105:45 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\f* \c 106 \cl కీర్తన 106 \q1 \v 1 యెహోవాను స్తుతించండి.\f + \fr 106:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా \fqa*\ft 48 వచనంలో కూడా\ft*\f* \b \q1 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; \q2 ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది. \b \q1 \v 2 యెహోవా యొక్క గొప్ప కార్యాలను ఎవరు ప్రచురించగలరు? \q2 ఆయన స్తుతిని సంపూర్ణంగా ఎవరు ప్రకటిస్తారు? \q1 \v 3 న్యాయంగా ప్రవర్తించేవారు ధన్యులు, \q2 వారు ఎల్లప్పుడు సరియైనది చేస్తారు. \b \q1 \v 4 యెహోవా, మీ ప్రజలపై మీరు దయ చూపినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, \q2 మీరు వారిని రక్షించినప్పుడు నాకు సాయం చేయడానికి రండి, \q1 \v 5 మీరు ఏర్పరచుకున్న వారి అభివృద్ధిని నేను ఆస్వాదించగలను, \q2 మీ దేశము యొక్క ఆనందంలో పాలుపంచుకోగలను \q2 మిమ్మల్ని స్తుతించడంలో మీ వారసులతో చేరతాను. \b \q1 \v 6 మా పూర్వికుల్లాగే మేమూ పాపాలు చేశాము; \q2 మేము తప్పు చేశాం దుష్టత్వంతో ప్రవర్తించాం. \q1 \v 7 మా పూర్వికులు ఈజిప్టులో ఉన్నప్పుడు \q2 నేను చేసిన అద్భుతాలను గ్రహించలేదు; \q1 మీ దయాసమృద్ధిని వారు తలపోయ లేదు, \q2 ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు. \q1 \v 8 అయినా ఆయన తన బలప్రభావాలను తెలియపరచడానికి, \q2 తన పేరు కోసం వారిని రక్షించాడు. \q1 \v 9 ఎర్ర సముద్రాన్ని గద్దించాడు. అది ఎండిపోయింది; \q2 ఎడారిలో నడిచినట్లే జలాగాధంలో వారు నడిచారు. \q2 దేవుడు వారిని నడిపించాడు. \q1 \v 10 పగవారి బారి నుండి దేవుడే వారిని తప్పించాడు; \q2 విడుదల ప్రసాదించాడు. \q1 \v 11 విరోధులంతా నీటిలో మునిగి చచ్చారు. \q2 ఒక్కడూ మిగల్లేదు. \q1 \v 12 ఇశ్రాయేలీయులు అప్పుడు కాని దేవుని మాట నమ్మలేదు. \q2 స్తుతిస్తూ పాటలు పాడారు. \b \q1 \v 13 దేవుని క్రియలు వారు త్వరలోనే మరచిపోయారు. \q2 ఆయన సలహాలను వారు లక్ష్యపెట్టు వారు కారు. \q1 \v 14 ఎడారిలో పేరాశకు లోనయ్యారు; \q2 పాడు ప్రదేశమది. దేవుడిని శోధించారు. \q1 \v 15 దేవుడు వారి కోరిక తీర్చాడు, \q2 అయినా వారి ప్రాణాలు క్షీణించిపోయాయి. \b \q1 \v 16 దండులో మోషే మీద, \q2 యెహోవాకు పరిశుద్ధుడైన, అహరోను మీద అసూయ ఏర్పడింది. \q1 \v 17 భూమి నోరు తెరిచి దాతానును మ్రింగివేసింది; \q2 అబీరాము గుంపును కప్పేసింది. \q1 \v 18 వారి అనుచరులలో మంటలు చెలరేగాయి; \q2 ఒక జ్వాల దుష్టులను కాల్చివేసింది. \q1 \v 19 హోరేబు పర్వతం దగ్గర వారు దూడ విగ్రహం చేయించుకున్నారు. \q2 పోత విగ్రహం ముందు విగ్రహారాధన చేశారు. \q1 \v 20 వారు మహిమగల దేవునికి బదులు \q2 తుక్కు మేసే ఎద్దు బొమ్మను ఉంచారు. \q1 \v 21 వారిని రక్షించిన దేవున్ని, \q2 ఈజిప్టులో ఆయన చేసిన గొప్ప కార్యాలను వారు మరచిపోయారు, \q1 \v 22 హాము దేశంలో అద్భుతకార్యాలు \q2 ఎర్ర సముద్రం ఒడ్డున ఆయన చేసిన భీకర క్రియలు. \q1 \v 23 “వీరిని నాశనం చేస్తాను” అన్నాడు దేవుడు. \q2 మోషే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. \q1 ఆయన వచ్చి దేవుని ఎదుట సందులో నిలిచి \q2 విజ్ఞాపన చేస్తే ఆయన ఉగ్రత వారిని ధ్వంసం చేయకుండా ఆపింది. \b \q1 \v 24 మనోహరమైన దేశాన్ని వారు తిరస్కరించారు; \q2 వారాయన మాట నమ్మలేదు. \q1 \v 25 యెహోవా మాట వినక, \q2 డేరాలలో సణగ సాగారు. \q1 \v 26 కాబట్టి ఆయన తన చేయెత్తి, \q2 వారిని ఎడారిలో పతనమయ్యేలా చేస్తాను, \q1 \v 27 వారి సంతతివారిని దేశాల మధ్య పతనమయ్యేలా చేస్తాను, \q2 దేశాలకు వారిని చెదరగొడతాను, అని ప్రమాణం చేశారు. \b \q1 \v 28 వారు బయల్-పెయోరు దగ్గరి విగ్రహం దగ్గర చేరారు. \q2 నిర్జీవ విగ్రహాలకు పెట్టిన నైవేద్య బలులు తిన్నారు. \q1 \v 29 తమ దుష్ట చర్యల చేత వారు దేవునికి కోపం రేపారు. \q2 అందుకు వారి మధ్యకు తెగులు మొదలైంది. \q1 \v 30 ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు. \q2 తెగులు ఆగిపోయింది. \q1 \v 31 అది అంతులేని తరాలకు \q2 అతనికి నీతిగా ఎంచబడింది. \q1 \v 32 మెరీబా నీళ్ల దగ్గర వారంతా దేవుని కోపాగ్ని రేపారు, \q2 వారి మూలంగా మోషేకు బాధ. \q1 \v 33 వారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, \q2 అతని పెదవుల వెంట కాని మాటలు వచ్చాయి. \b \q1 \v 34 యెహోవా నాశనం చేస్తానన్న జాతులను \q2 వీరు విడిచిపెట్టారు. \q1 \v 35 ఇతర జనాంగాలలో కలిసిపోయి, \q2 వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు. \q1 \v 36 వారి విగ్రహాలను పూజించారు. \q2 అవే వారికి ఉరి అయ్యాయి. \q1 \v 37 తమ కుమారులను, కుమార్తెలను \q2 దయ్యానికి బలి ఇచ్చారు. \q1 \v 38 నిరపరాధుల రక్తం, \q2 తమ కుమారుల రక్తం, కుమార్తెల రక్తం వారు చిందించారు. \q1 కనాను దేశపు విగ్రహాలకు తమ సొంత పిల్లల్ని బలి ఇచ్చారు. \q2 ఈ రక్తపాతం చేత దేశమంతా అపవిత్రమైనది. \q1 \v 39 వారు తమ దుష్ట క్రియల చేత అపవిత్రులయ్యారు; \q2 విగ్రహాల మీద వారికి గల ప్రేమ యెహోవా దృష్టిలో వ్యభిచారము చేశారు. \b \q1 \v 40 యెహోవా కోపం వారి మీదికి వచ్చింది, \q2 తన వారసత్వం తన ప్రజలు అయినా వారంటే ఆయనకు అసహ్యం వేసింది. \q1 \v 41 ఇతర దేశాలకు వారిని అప్పగించాడు. \q2 అయినా వారి మీద ప్రభుత్వం చేశారు. \q1 \v 42 శత్రువులే వారిని అణగద్రొక్కారు \q2 వారి చేతి క్రింద తల వొగ్గారు. \q1 \v 43 చాలాసార్లు ఆయన విడిపించాడు, \q2 అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. \q2 తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు. \q1 \v 44 అయినా వారు మొరపెట్టగానే ఆయన విన్నాడు. \q2 వారి కష్టంను చూచాడు. \q1 \v 45 దేవుడు తన నిబంధనను తలచుకొన్నాడు. \q2 వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు. \q2 తన మారని ప్రేమను బట్టి వారిని కనికరించాడు. \q1 \v 46 చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. \q2 అది దైవనిర్ణయమే. \b \q1 \v 47 మా దేవా యెహోవా, మమ్మల్ని రక్షించండి; \q2 ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చండి, \q1 అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, \q2 మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాం. \b \b \q1 \v 48 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు \q2 నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! \b \q1 ప్రజలంతా, “ఆమేన్!” అనాలి. \b \q1 యెహోవాను స్తుతించండి! \c 107 \ms అయిదవ గ్రంథము \mr కీర్తనలు 107–150 \cl కీర్తన 107 \q1 \v 1 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు; \q2 ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది. \b \q1 \v 2 యెహోవాచేత విమోచింపబడినవారు, \q2 విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు, \q1 \v 3 వివిధ దేశాల నుండి, తూర్పు పడమర, \q2 ఉత్తర దక్షిణాల\f + \fr 107:3 \fr*\ft హెబ్రీలో \ft*\fq దక్షిణాల \fq*\fqa సముద్రాల\fqa*\f* నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక. \b \q1 \v 4 కొందరు ఏకాంతంగా ఎడారిలో తిరిగారు; \q2 నివాసయోగ్యమైన పట్టణం ఒక్కటి వారికి కనిపించలేదు. \q1 \v 5 వారు ఆకలి దప్పికతో ఉన్నారు, \q2 వారి ప్రాణాలు సొమ్మసిల్లాయి. \q1 \v 6 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, \q2 ఆయన వారిని వారి బాధలనుండి విడిపించారు. \q1 \v 7 ఆయన వారిని తిన్నని బాటలో \q2 నివాసయోగ్యమైన పట్టణానికి నడిపించారు. \q1 \v 8 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం \q2 నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, \q1 \v 9 దాహంతో ఉన్న వారి దాహాన్ని ఆయన తీరుస్తారు, \q2 మేలైన వాటితో ఆయన ఆకలి తీర్చుతారు. \b \q1 \v 10 కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి, \q2 చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు, \q1 \v 11 వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, \q2 మహోన్నతుని ప్రణాళికలను తృణీకరించారు. \q1 \v 12 కాబట్టి ఆయన వారిని వెట్టిచాకిరికి అప్పగించారు; \q2 వారు తొట్రిల్లారు సాయం చేసేవాడు ఒక్కడూ లేడు. \q1 \v 13 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, \q2 ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు. \q1 \v 14 ఆయన వారిని చీకటి, కటిక చీకటిలో నుండి బయటకు తెచ్చారు, \q2 వారి సంకెళ్ళను తుత్తునియలుగా చేశారు. \q1 \v 15 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం \q2 నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, \q1 \v 16 ఎందుకంటే ఆయన ఇత్తడి ద్వారాలను పగలగొడతారు \q2 ఇనుప గడియలను విరగ్గొడతారు. \b \q1 \v 17 కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు \q2 వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు. \q1 \v 18 వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు \q2 మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు. \q1 \v 19 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, \q2 ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు. \q1 \v 20 తన వాక్కును పంపి \q2 దేవుడు వారిని స్వస్థపరిచాడు. \q1 \v 21 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం \q2 మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, \q1 \v 22 కృతజ్ఞతార్పణలు అర్పించాలి. \q2 ఆనంద ధ్వనులతో దేవుని క్రియలను ప్రకటించాలి. \b \q1 \v 23 ఓడలలో సముద్ర ప్రయాణం చేస్తూ మహాజలాల మీద వెళుతూ, \q2 కొందరు వ్యాపారం చేస్తారు. \q1 \v 24 వారంతా యెహోవా చేసిన క్రియలు చూచారు, \q2 సముద్రంలో యెహోవా చేసిన అద్భుతాలు చూచారు. \q1 \v 25 దైవాజ్ఞకు తుఫాను లేచింది, \q2 అలలు రేగాయి. \q1 \v 26 వారు ఆకాశానికి పైకి ఎక్కారు, జలాగాధంలోకి దిగిపోయారు; \q2 వారి జీవం దురవస్థ చేత కరిగిపోయింది. \q1 \v 27 వారు త్రాగుబోతుల్లా తూలుతూ, అటూ ఇటూ ఊగుతూ ఉన్నారు; \q2 వారు తెలివి తప్పి ఉన్నారు. \q1 \v 28 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు \q2 ఆయన వారిని వారి బాధ నుండి విడిపించారు. \q1 \v 29 అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు, \q2 సముద్ర తరంగాలు సద్దుమణిగాయి. \q1 \v 30 అలలు తగ్గాయి వారెంతో సంతోషించారు. \q2 వారు వెళ్లాలనుకున్న రేవుకు దేవుడు వారిని చేర్చాడు. \q1 \v 31 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం \q2 మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, \q1 \v 32 ప్రజా సమాజాలలో ఆయనకే మహిమ. \q2 పెద్దల సభలలో ఆయనకే ప్రఖ్యాతి! \b \q1 \v 33-34 అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి, \q2 ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు. \q1 మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు. \q2 సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు. \q1 \v 35 అలాగే ఎడారులు నీటి మడుగులయ్యాయి. \q2 ఎండిన భూమి నీటి ఊటల స్థలమైంది. \q1 \v 36 ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసించడానికి తీసుకువచ్చారు, \q2 వారు అక్కడ నివాసయోగ్యమైన పట్టణాన్ని ఏర్పరచుకున్నారు. \q1 \v 37 వారు పొలాల్లో విత్తారు ద్రాక్షతోటలు నాటారు. \q2 ఫలసాయం బాగా దొరికింది. \q1 \v 38 దేవుడు వారిని ఆశీర్వదించాడు. \q2 వారు అధికంగా అభివృద్ధి చెందారు. \q2 పశుసంపద ఏమాత్రం తగ్గలేదు. \b \q1 \v 39 వారి మీదికి ఎంతో ఒత్తిడి వచ్చింది. తెగుళ్ళు, బాధ, శోకము. \q2 వారంతా కృశించి పోయారు. సంఖ్యకూడా క్షీణించింది. \q1 \v 40 సంస్థానాధిపతులపై ధిక్కారం క్రుమ్మరించేవాడు \q2 వారిని గుర్తించలేని వ్యర్థంలో వారు తిరిగేలా చేశారు. \q1 \v 41 కానీ ఆయన అవసరతలో ఉన్నవారిని వారి కష్టాల నుండి పైకి లేవనెత్తారు \q2 గొర్రెల మందల్లా వృద్ధి వారి కుటుంబాలు వృద్ధిచేశారు. \q1 \v 42 యథార్థవంతులకు ఇదంతా చూస్తే ఆనందము. \q2 దుష్టులంతా నోరు మూసుకోవాలి. \b \q1 \v 43 జ్ఞానులు ఈ విషయాలను ఆలోచిస్తారు, \q2 యెహోవా ప్రేమా క్రియలను తలపోస్తారు. \c 108 \cl కీర్తన 108 \d ఒక గీతము. దావీదు కీర్తన. \q1 \v 1 ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది; \q2 నా ప్రాణమంతటితో నేను పాడతాను సంగీతం వాయిస్తాను. \q1 \v 2 సితారా వీణా, మేలుకోండి! \q2 ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను. \q1 \v 3 యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను; \q2 జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను. \q1 \v 4 ఎందుకంటే మీ మారని ప్రేమ గొప్పది, అది ఆకాశాల కంటే ఎత్తైనది; \q2 మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది. \q1 \v 5 దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి; \q2 భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక. \b \q1 \v 6 మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, \q2 మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి. \q1 \v 7 దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట: \q2 “విజయంతో నేను షెకెమును పంచుతాను \q2 సుక్కోతు లోయను కొలుస్తాను. \q1 \v 8 గిలాదు నాది, మనష్షే నాది; \q2 ఎఫ్రాయిం నా శిరస్త్రాణం, \q2 యూదా నా రాజదండం. \q1 \v 9 మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, \q2 ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను; \q2 ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.” \b \q1 \v 10 కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు? \q2 ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు? \q1 \v 11 దేవా, మమ్మల్ని విసర్జించిన మీరు కాదా? \q2 మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా? \q1 \v 12 శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి, \q2 ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది. \q1 \v 13 దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, \q2 ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు. \c 109 \cl కీర్తన 109 \d సంగీత దర్శకునికి. దావీదు కీర్తన \q1 \v 1 నేను స్తుతించే, నా దేవా, \q2 మౌనంగా ఉండకండి, \q1 \v 2 ఎందుకంటే దుష్టులు మోసగాళ్ళు \q2 నాకు వ్యతిరేకంగా తమ నోళ్ళు తెరిచి; \q2 అబద్ధాలాడే నాలుకలతో వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు. \q1 \v 3 ద్వేషపూరిత మాటలతో వారు నన్ను చుట్టుముడతారు; \q2 వారు కారణం లేకుండా నా మీద దాడి చేస్తారు. \q1 \v 4 వారు నా ప్రేమకు ప్రతిగా నా మీద ఆరోపణలు చేస్తారు, \q2 కాని నేనైతే ప్రార్థిస్తూ ఉంటాను. \q1 \v 5 నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తారు. \q2 నా ప్రేమకు ప్రతిగా ద్వేషం చూపుతారు. \b \q1 \v 6 నా శత్రువు మీద ఒక దుష్టుని నియమించండి; \q2 అతని కుడి ప్రక్కన ఒక నేరం మోపేవాడు నిలబడాలి. \q1 \v 7 తీర్పు సమయంలో అతడు దోషిగా వెల్లడి కావాలి, \q2 అప్పుడు అతని ప్రార్థనలు పాపంగా లెక్కించబడతాయి. \q1 \v 8 అతడు బ్రతికే రోజులు కొద్దివిగా ఉండును గాక; \q2 అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక. \q1 \v 9 అతని పిల్లలు తండ్రిలేనివారు కావాలి, \q2 అతని భార్య విధవరాలు అవ్వాలి. \q1 \v 10 అతని పిల్లలు బిక్షకులై తిరుగుదురు గాక, \q2 వారు పాడుబడిన నివాసాల తోలివేయబడుదురు గాక. \q1 \v 11 అప్పిచ్చేవాడు అతని దగ్గర ఉన్నవన్నీ స్వాధీనం చేసుకోవాలి; \q2 అపరిచితులు అతని కష్టార్జితాన్ని దోచుకోవాలి. \q1 \v 12 అతని మీద ఎవరు దయ చూపకూడదు, \q2 తన తండ్రిలేని పిల్లలపై ఎవరికీ కనికరం చూపకూడదు. \q1 \v 13 అతని వంశం అంతరించాలి, \q2 వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి. \q1 \v 14 అతని పూర్వికుల దోషాలు యెహోవా మరువకూడదు, \q2 అతని తల్లి పాపాన్ని దేవుడు ఎన్నటికి తుడిచివేయకూడదు. \q1 \v 15 వారి పాపాలన్నీ ఎప్పుడూ యెహోవా ఎదుట ఉండాలి, \q2 తద్వార భూమి మీద నుండి అతని పిల్లల జ్ఞాపకాన్ని ఆయన తుడిచివేస్తారు. \b \q1 \v 16 దయ చూపించాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు; \q2 కాని అతడు నలిగినవారిని పేదవారిని వేధించాడు \q2 ధైర్యము కోల్పోయిన వారిని హతమార్చాడు. \q1 \v 17 శపించటం అతనికి ఇష్టం కాబట్టి \q2 అది అతని మీదికే వచ్చింది. \q1 అతడు ఎవరినీ ఆశీర్వదించాలని కోరలేదు కాబట్టి \q2 అతడు ఆశీర్వాదాన్ని అనుభవించలేదు. \q1 \v 18 అతడు శాపాన్ని వస్త్రంగా ధరించాడు; \q2 అది నీరులా అతని కడుపులోకి, \q2 నూనెలా అతని ఎముకల్లోకి చొచ్చుకు పోయింది. \q1 \v 19 అది అతని చుట్టూ చుట్టబడిన వస్త్రంలా, \q2 అది నడుము దట్టిలా నిత్యం అతని చుట్టూ ఉండును గాక. \q1 \v 20 నా మీద నేరం మోపేవారికి నా గురించి చెడుగా మాట్లాడేవారికి, \q2 యెహోవా వారికి జీతం చెల్లించును గాక. \b \q1 \v 21 అయితే, ప్రభువైన యెహోవా, \q2 మీ నామ ఘనత కోసం నాకు సహాయం చేయండి; \q2 శ్రేష్ఠమైన మీ మారని ప్రేమను బట్టి, నన్ను విడుదలచేయండి. \q1 \v 22 ఎందుకంటే నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను, \q2 నా హృదయం నాలో గాయపడి ఉంది. \q1 \v 23 నేను సాయంత్రం నీడలా మసకబారుతున్నాను; \q2 మిడతలా నేను దులిపివేయబడ్డాను. \q1 \v 24 ఉపవాసాలు ఉండి నా మోకాళ్లు వణికిపోతున్నాయి; \q2 నేను అస్థిపంజరంలా అయ్యాను. \q1 \v 25 నా మీద నేరం మోపేవారికి నేను ఎగతాళి హాస్యాస్పదం అయ్యాను; \q2 వారు నన్ను చూసినప్పుడు, వారు వెటకారంగా వారి తలలాడిస్తారు. \b \q1 \v 26 యెహోవా, నా దేవా! నాకు సాయం చేయండి; \q2 మీ మారని ప్రేమను బట్టి నన్ను కాపాడండి. \q1 \v 27 ఇది చేసింది మీ హస్తమేనని, \q2 యెహోవాయే చేశారని వారికి తెలియనివ్వండి. \q1 \v 28 వారు నన్ను శపించినప్పుడు మీరు నన్ను దీవిస్తారు; \q2 వారు నాపై దాడి చేసినప్పుడు వారు అవమానానికి గురవుతారు, \q2 కాని మీ సేవకుడు సంతోషించును గాక. \q1 \v 29 నా మీద నేరం మోపేవారు అవమానాన్ని వస్త్రంగా ధరించుదురు గాక \q2 ఒక వస్త్రంలో అయినట్టుగా సిగ్గుతో చుట్టబడతారు. \b \q1 \v 30 నేను నోరార యెహోవాను కీర్తిస్తాను; \q2 ఆరాధికుల గొప్ప సమూహంలో నేను ఆయనను స్తుతిస్తాను. \q1 \v 31 ఎందుకంటే అవసరతలో ఉన్న వారి పక్షాన ఆయన నిలబడతారు, \q2 వారికి తీర్పు తీర్చే వారి నుండి వారి ప్రాణాలను కాపాడడానికి. \c 110 \cl కీర్తన 110 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా నా ప్రభువుతో\f + \fr 110:1 \fr*\ft లేదా \ft*\fqa ప్రభువు\fqa*\f* చెప్పిన మాట: \b \q1 “నేను నీ శత్రువులను \q2 నీ పాదపీఠంగా చేసే వరకు \q2 నీవు నా కుడిచేతి వైపున కూర్చో.” \b \q1 \v 2 యెహోవా, “నీ శత్రువుల మధ్య పరిపాలించు!” అని అంటూ, \q2 సీయోను నుండి మీ శక్తివంతమైన రాజదండాన్ని విస్తరిస్తూ, అంటారు, \q1 \v 3 మీ యుద్ధ దినాన \q2 మీ దళాలు ఇష్టపూర్వకంగా వస్తాయి. \q1 పవిత్ర వైభవాన్ని ధరించుకున్నవారై \q2 ఉదయపు గర్భం నుండి మంచులా \q2 మీ యువకులు మీ దగ్గరకు వస్తారు. \b \q1 \v 4 “మెల్కీసెదెకు క్రమంలో, \q2 నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు” \q1 అని యెహోవా ప్రమాణం చేశారు \q2 ఆయన తన మనస్సు మార్చుకోరు. \b \q1 \v 5 ప్రభువు\f + \fr 110:5 \fr*\ft లేదా \ft*\fqa నా ప్రభువు మీ కుడి ప్రక్కనే ఉన్నారు;\fqa*\f* మీ కుడి ప్రక్కనే ఉన్నాడు; \q2 తన ఉగ్రత దినాన ఆయన రాజులను తుత్తునియలుగా చేస్తాడు. \q1 \v 6 అతడు దేశాలను శిక్షిస్తాడు వారి భూములను శవాలతో నింపుతాడు; \q2 అతడు సర్వ భూమిపై పాలకులను ముక్కలు చేస్తాడు. \q1 \v 7 దారిలో అతడు వాగు నీళ్లు త్రాగుతాడు, \q2 కాబట్టి అతడు తల పైకెత్తుతాడు. \c 111 \cl కీర్తన 111\f + \fr 111 \fr*\ft ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.\ft*\f* \q1 \v 1 యెహోవాను స్తుతించండి.\f + \fr 111:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\f* \b \q1 యథార్థవంతుల సభలో సమాజంలో \q2 నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను. \b \q1 \v 2 యెహోవా కార్యాలు గొప్పవి; \q2 వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు. \q1 \v 3 ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి, \q2 ఆయన నీతి నిరంతరం ఉంటుంది. \q1 \v 4 మనుష్యులకు జ్ఞాపకముండేటట్లు ఆయన అద్భుతాలు చేస్తారు; \q2 యెహోవా దయామయుడు. కనికరం గలవారు. \q1 \v 5 భయభక్తులు గలవారిని పోషిస్తారు. \q2 ఆయన తన నిబంధన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు. \b \q1 \v 6 తన ప్రజలకు ఇతర దేశాలను వారసత్వంగా ఇచ్చి, \q2 తన క్రియలలోని బలప్రభావాలను వారికి వెల్లడించారు. \q1 \v 7 ఆయన చేతుల పనులు విశ్వసనీయమైనవి న్యాయమైనవి; \q2 ఆయన కట్టడలు నమ్మదగినవి. \q1 \v 8 అవి శాశ్వతంగా స్థాపించబడ్డాయి, \q2 నమ్మకత్వంతో యథార్థతతో అవి చేయబడ్డాయి. \q1 \v 9 ఆయన తన ప్రజలకు విమోచన సమకూర్చారు; \q2 ఆయన తన ఒడంబడికను శాశ్వతంగా నియమించారు, \q2 ఆయన నామం పరిశుద్ధమైనది భీకరమైనది. \b \q1 \v 10 యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం; \q2 ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు. \q2 స్తుతి నిత్యం ఆయనకే చెందును. \c 112 \cl కీర్తన 112\f + \fr 112 \fr*\ft ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.\ft*\f* \q1 \v 1 యెహోవాను స్తుతించండి.\f + \fr 112:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\f* \b \q1 యెహోవాకు భయపడేవారు ధన్యులు, \q2 వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు. \b \q1 \v 2 వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు; \q2 యథార్థవంతుల తరం దీవించబడుతుంది. \q1 \v 3 వారి ఇళ్ళలో ధనం, ఐశ్వర్యం ఉన్నాయి, \q2 వారి నీతి నిత్యం నిలిచి ఉంటుంది. \q1 \v 4 దయ కనికరం గలవారికి నీతిమంతులకు, \q2 యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది. \q1 \v 5 దయతో అప్పు ఇచ్చేవారికి, \q2 తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది. \b \q1 \v 6 నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు; \q2 వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు. \q1 \v 7 దుర్వార్తల వలన వారు భయపడరు; \q2 యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది. \q1 \v 8 వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు; \q2 చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు. \q1 \v 9 వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు, \q2 వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది; \q2 వారి కొమ్ము\f + \fr 112:9 \fr*\ft కొమ్ము \ft*\fqa ఇక్కడ ఠీవిని సూచిస్తుంది.\fqa*\f* ఘనత పొంది హెచ్చింపబడుతుంది. \b \q1 \v 10 దుష్టులు చూసి విసుగుచెందుతారు, \q2 వారు పండ్లు కొరుకుతూ క్షీణించి పోతారు; \q2 దుష్టుల ఆశలు విఫలమవుతాయి. \c 113 \cl కీర్తన 113 \q1 \v 1 యెహోవాను స్తుతించండి.\f + \fr 113:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\f* \b \q1 యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి; \q2 యెహోవా నామాన్ని స్తుతించండి. \q1 \v 2 ఇప్పుడు ఎల్లప్పుడు సదా \q2 యెహోవా నామం స్తుతింపబడును గాక. \q1 \v 3 సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, \q2 యెహోవా నామం స్తుతింపబడును గాక. \b \q1 \v 4 దేశాలన్నిటికి పైగా యెహోవా హెచ్చింపబడ్డారు, \q2 ఆయన మహిమ ఆకాశాలకు పైగా విస్తరించి ఉంది. \q1 \v 5 మన దేవుడైన యెహోవా లాంటి వారెవరు, \q2 ఎత్తైన సింహాసనంపై ఆసీనులై ఉన్నవారు, \q1 \v 6 అక్కడినుండి ఆకాశాన్ని, \q2 భూమిని వంగి చూడగలవారెవరు? \b \q1 \v 7 దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది \q2 పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; \q1 \v 8 ఆయన వారిని రాకుమారులతో, \q2 తన ప్రజల రాకుమారులతో కూర్చోబెడతారు. \q1 \v 9 అతడు సంతానం లేని స్త్రీని \q2 తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు. \b \q1 యెహోవాను స్తుతించండి. \c 114 \cl కీర్తన 114 \q1 \v 1 ఇశ్రాయేలు ఈజిప్టు నుండి, \q2 యాకోబు పర భాష మాట్లాడే ప్రజలమధ్య నుండి బయటకు వచ్చాక, \q1 \v 2 యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, \q2 ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది. \b \q1 \v 3 అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది, \q2 యొర్దాను వెనుకకు తిరిగింది; \q1 \v 4 పర్వతాలు పొట్టేళ్లలా, \q2 కొండలు గొర్రెపిల్లల్లా గంతులేశాయి. \b \q1 \v 5 సముద్రమా, నీవెందుకు పారిపోయావు? \q2 యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు? \q1 \v 6 పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, \q2 కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు? \b \q1 \v 7 ఓ భూమి, ప్రభువు సన్నిధిలో \q2 యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి. \q1 \v 8 ఆయన బండను నీటి ఊటగా మార్చేవారు, \q2 చెకుముకి రాతిని నీటి బుగ్గగా మార్చేవారు. \c 115 \cl కీర్తన 115 \q1 \v 1 మాకు కాదు, యెహోవా, మాకు కాదు, \q2 మీ మారని ప్రేమ, నమ్మకత్వాన్ని బట్టి, \q2 మీ నామానికే మహిమ కలగాలి. \b \q1 \v 2 “వారి దేవుడు ఎక్కడ?” \q2 అని జనులు ఎందుకు అంటున్నారు? \q1 \v 3 మన దేవుడు పరలోకంలో ఉన్నారు; \q2 ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు. \q1 \v 4 అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, \q2 అవి మనుష్యుల చేతిపనులు. \q1 \v 5 వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు, \q2 కళ్లున్నాయి, కాని చూడలేవు. \q1 \v 6 వాటికి చెవులున్నాయి, కాని వినలేవు, \q2 ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు. \q1 \v 7 వారికి చేతులు ఉన్నాయి, కానీ అనుభూతి చెందవు, \q2 పాదాలున్నాయి, కాని నడవలేవు, \q2 కనీసం వాటి గొంతులతో శబ్దం చేయలేవు. \q1 \v 8 వాటిని తయారుచేసేవారు, \q2 వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు. \b \q1 \v 9 సర్వ ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి \q2 ఆయనే వారికి సహాయం డాలు. \q1 \v 10 అహరోను వంశమా, యెహోవాను నమ్ముకోండి \q2 ఆయనే వారికి సహాయం డాలు. \q1 \v 11 యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి \q2 ఆయనే వారికి సహాయం డాలు. \b \q1 \v 12 యెహోవా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు మనల్ని దీవిస్తారు: \q2 ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తారు, \q2 అహరోను వంశాన్ని దీవిస్తారు. \q1 \v 13 యెహోవాకు భయపడేవారిని అనగా \q2 పిల్లలను పెద్దలను ఆయన దీవిస్తారు. \b \q1 \v 14 యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను, \q2 వృద్ధి చేయును గాక. \q1 \v 15 ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవాచేత, \q2 మీరు దీవించబడుదురు గాక. \b \q1 \v 16 ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, \q2 అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు. \q1 \v 17 యెహోవాను స్తుతించేది చనిపోయినవారు కాదు, \q2 నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లేవారు కాదు; \q1 \v 18 మనమే యెహోవాను కీర్తించేవారం, \q2 ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము. \b \q1 యెహోవాను స్తుతించండి.\f + \cat dup\cat*\fr 115:18 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\f* \c 116 \cl కీర్తన 116 \q1 \v 1 నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు; \q2 కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు. \q1 \v 2 ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి, \q2 నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను. \b \q1 \v 3 మరణపాశాలు నన్ను చుట్టివేశాయి, \q2 సమాధి వేదన నా మీదికి వచ్చింది. \q2 బాధ దుఃఖం నన్ను అధిగమించాయి. \q1 \v 4 అప్పుడు నేను యెహోవా నామమున మొరపెట్టాను: \q2 “యెహోవా, నన్ను రక్షించండి!” \b \q1 \v 5 యెహోవా దయగలవాడు నీతిమంతుడు; \q2 మన దేవుడు కనికరం కలవాడు. \q1 \v 6 యెహోవా సామాన్యులను కాపాడతారు; \q2 నేను దుర్దశలో ఉన్నప్పుడు, ఆయన నన్ను రక్షించారు. \b \q1 \v 7 నా ప్రాణమా, నీ విశ్రాంతికి తిరిగి వెళ్లు, \q2 ఎందుకంటే యెహోవా నీ పట్ల గొప్పగా వ్యవహరించారు. \b \q1 \v 8 యెహోవా, మీరు, మరణం నుండి నన్ను, \q2 కన్నీటి నుండి నా కళ్ళను, \q2 జారిపడకుండా నా పాదాలను విడిపించారు. \q1 \v 9 నేను సజీవుల భూమిలో \q2 యెహోవా ఎదుట నడుస్తాను. \b \q1 \v 10 “నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు, \q2 నేను యెహోవాపై నమ్మకం ఉంచాను; \q1 \v 11 నా కంగారులో నేను, \q2 “మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను. \b \q1 \v 12 యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి \q2 నేను ఆయనకు తిరిగి ఏమివ్వగలను? \b \q1 \v 13 నేను రక్షణ పాత్రను పైకెత్తి \q2 యెహోవా పేరట మొరపెడతాను. \q1 \v 14 ఆయన ప్రజలందరి సమక్షంలో, \q2 నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు తీర్చుకుంటాను. \b \q1 \v 15 యెహోవా దృష్టిలో విలువైనది \q2 ఆయన నమ్మకమైన సేవకుల మరణము. \q1 \v 16 యెహోవా, నేను మీ సేవకుడిని మీ పనిమనిషి కుమారున్ని, \q2 నా తల్లి చేసినట్లే నేను మీకు సేవ చేస్తాను; \q2 మీరు నా సంకెళ్ళ నుండి నన్ను విడిపించారు. \b \q1 \v 17 నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను \q2 యెహోవా నేను మీ పేరట మొరపెడతాను. \q1 \v 18-19 ఆయన ప్రజలందరి సమక్షంలోను, \q2 యెహోవా మందిర ఆవరణాల్లోను, \q1 యెరూషలేమా, మీ మధ్యను, \q2 నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను. \b \q1 యెహోవాను స్తుతించండి.\f + \cat dup\cat*\fr 116:19 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\f* \c 117 \cl కీర్తన 117 \q1 \v 1 సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి; \q2 సర్వజనులారా, ఆయనను కీర్తించండి. \q1 \v 2 మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది, \q2 ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది. \b \q1 యెహోవాను స్తుతించండి.\f + \cat dup\cat*\fr 117:2 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\f* \c 118 \cl కీర్తన 118 \q1 \v 1 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; \q2 ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \b \q1 \v 2 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” \q2 అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక. \q1 \v 3 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” \q2 అని అహరోను వంశం చెప్పుదురు గాక. \q1 \v 4 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” \q2 అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక. \b \q1 \v 5 నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను; \q2 ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు. \q1 \v 6 యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను. \q2 నరమాత్రులు నన్నేమి చేయగలరు? \q1 \v 7 యెహోవా నా పక్షాన ఉన్నారు; ఆయన నా సహాయకుడు. \q2 నా శత్రువుల వైపు నేను విజయం పొందినవానిగా చూస్తాను. \b \q1 \v 8 మనుష్యులను నమ్మడం కంటే \q2 యెహోవాను ఆశ్రయించడం మంచిది. \q1 \v 9 రాజులను నమ్మడం కంటే \q2 యెహోవాను ఆశ్రయించడం మంచిది. \q1 \v 10 దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, \q2 కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను. \q1 \v 11 వారు ప్రతి వైపు నుండి నన్ను చుట్టుముట్టారు, \q2 కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను. \q1 \v 12 వారు కందిరీగల్లా నా చుట్టూ తిరిగారు, \q2 కాని మండుతున్న ముళ్ళపొదల్లా వారు త్వరగా కాలిపోయారు; \q2 యెహోవా పేరట నేను వారిని ఛేదించాను. \q1 \v 13 శత్రువు నన్ను బలంగా గెంటివేశాడు, \q2 నేను పడిపోయి ఉండే వాడినే కాని యెహోవా నాకు సహాయం చేశారు. \q1 \v 14 యెహోవా నా శక్తి, నా బలం\f + \fr 118:14 \fr*\ft లేదా \ft*\fqa పాట\fqa*\f*; \q2 ఆయనే నా రక్షణ అయ్యారు. \b \q1 \v 15 నీతిమంతుల గుడారాల్లో \q2 రక్షణానంద కేకలు ప్రతిధ్వనిస్తాయి: \q1 “యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది! \q2 \v 16 యెహోవా కుడి హస్తం పైకి ఎత్తబడింది; \q2 యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!” \q1 \v 17 నేను చావను కాని బ్రతికి ఉండి, \q2 యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను. \q1 \v 18 యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించారు, \q2 కాని ఆయన నన్ను చావుకు అప్పగించలేదు. \q1 \v 19 నా కొరకు నీతిమంతుల గుమ్మాలను తెరవండి; \q2 నేను లోపలికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. \q1 \v 20 ఇది యెహోవా గుమ్మం \q2 నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు. \q1 \v 21 మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; \q2 మీరు నాకు రక్షణ అయ్యారు. \b \q1 \v 22 ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి \q2 మూలరాయి అయ్యింది; \q1 \v 23 ఇది యెహోవా చేశారు, \q2 ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది. \q1 \v 24 ఇది యెహోవా చేసిన దినం \q2 ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము. \b \q1 \v 25 యెహోవా, మమ్మల్ని రక్షించండి! \q2 యెహోవా, మాకు విజయం ప్రసాదించండి! \b \q1 \v 26 యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక! \q2 యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము. \q1 \v 27 యెహోవాయే దేవుడు, \q2 ఆయన తన వెలుగును మనమీద ప్రకాశింపజేశారు. \q1 త్రాళ్లతో అర్పణను \q2 బలిపీఠం కొమ్ములకు కట్టెయ్యండి. \b \q1 \v 28 మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని స్తుతిస్తాను; \q2 మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. \b \q1 \v 29 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; \q2 ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \c 119 \cl కీర్తన 119\f + \fr 119 \fr*\ft ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.\ft*\f* \qa א ఆలెఫ్ \q1 \v 1 నిందారహిత మార్గాలను అనుసరిస్తూ, \q2 యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. \q1 \v 2 ఆయన శాసనాలను పాటిస్తూ \q2 తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు, \q1 \v 3 వారు అన్యాయం చేయక \q2 ఆయన మార్గాలను అనుసరిస్తారు. \q1 \v 4 అత్యంత జాగ్రత్తగా పాటించాలని \q2 మీరు వారికి శాసనాలిచ్చారు. \q1 \v 5 మీ శాసనాలను అనుసరించుటలో \q2 నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది! \q1 \v 6 అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు \q2 నేను అవమానపాలు కాను. \q1 \v 7 నేను మీ నీతి న్యాయవిధులను తెలుసుకున్న కొలది \q2 యథార్థ హృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను. \q1 \v 8 నేను మీ శాసనాలకు లోబడతాను. \q2 దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి. \qa ב బేత్ \q1 \v 9 యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు? \q2 మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే. \q1 \v 10 నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; \q2 మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి. \q1 \v 11 నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని \q2 మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను. \q1 \v 12 యెహోవా, మీకు స్తుతి కలుగును గాక; \q2 మీ శాసనాలను నాకు బోధించండి. \q1 \v 13 మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని \q2 నా పెదవులతో వివరిస్తాను. \q1 \v 14 ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించునట్లు \q2 నేను మీ శాసనాలను పాటించడంలో సంతోషిస్తాను. \q1 \v 15 మీ శాసనాలను నేను ధ్యానిస్తాను \q2 మీ మార్గాలను పరిగణిస్తాను. \q1 \v 16 మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; \q2 నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను. \qa ג గీమెల్ \q1 \v 17 నేను బ్రతికి ఉండి మీ వాక్యానికి లోబడేలా, \q2 మీ సేవకునిపట్ల దయగా ఉండండి. \q1 \v 18 మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని \q2 నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి. \q1 \v 19 ఈ లోకంలో నేను అపరిచితున్ని; \q2 మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి. \q1 \v 20 అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం \q2 తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది. \q1 \v 21 శపించబడినవారైన అహంకారులను మీరు గద్దిస్తారు, \q2 వారు మీ ఆజ్ఞల నుండి తొలగిపోయినవారు. \q1 \v 22 నేను మీ శాసనాలను పాటిస్తున్నాను, \q2 వారి అపహాస్యాన్ని ధిక్కారాన్ని నా నుండి తొలగించండి. \q1 \v 23 పాలకులు కలిసి కూర్చుని నన్ను అపవాదు చేసినప్పటికీ, \q2 మీ సేవకుడు మీ శాసనాలను ధ్యానిస్తాడు. \q1 \v 24 మీ శాసనాలే నాకు ఆనందం; \q2 అవి నాకు ఆలోచన చెప్తాయి. \qa ד దాలెత్ \q1 \v 25 నేను నేల మీద పడిపోయాను; \q2 మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. \q1 \v 26 నా జీవిత పరిస్థితులను మీకు వివరించాను, మీరు నాకు జవాబిచ్చారు; \q2 మీ శాసనాలు నాకు బోధించండి. \q1 \v 27 నేను మీ కట్టడల అర్థాన్ని గ్రహించేలా చేయండి, \q2 తద్వారా మీ అద్భుత కార్యాలను నేను ధ్యానిస్తాను. \q1 \v 28 దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; \q2 మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి. \q1 \v 29 మోసపూరిత మార్గాల నుండి నన్ను తప్పించండి; \q2 నా మీద దయచూపి మీ ధర్మశాస్త్రం నాకు బోధించండి. \q1 \v 30 నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను; \q2 మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను. \q1 \v 31 యెహోవా, మీ శాసనాలను గట్టిగా పట్టుకుని ఉంటాను; \q2 నాకు అవమానం కలగనివ్వకండి. \q1 \v 32 మీ ఆజ్ఞల మార్గాన నేను పరుగెడతాను, \q2 ఎందుకంటే మీరు నా గ్రహింపును విశాలపరిచారు. \qa ה హే \q1 \v 33 యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి, \q2 అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను.\f + \fr 119:33 \fr*\ft లేదా \ft*\fqa బహుమానం కోసం\fqa*\f* \q1 \v 34 మీ ధర్మశాస్త్రం నేను అనుసరించేలా \q2 హృదయపూర్వకంగా వాటికి విధేయత చూపేలా, \q2 నాకు గ్రహింపు దయచేయండి. \q1 \v 35 మీ ఆజ్ఞల మార్గాన నన్ను నడిపించండి, \q2 అక్కడే నాకు ఆనందము. \q1 \v 36 నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక \q2 మీ శాసనాల వైపుకు త్రిప్పండి. \q1 \v 37 పనికిరాని వాటినుండి నా కళ్లను త్రిప్పండి; \q2 మీ మార్గాల\f + \fr 119:37 \fr*\ft కొ. ప్రా.ప్ర. లలో \ft*\fqa మీ వాక్కు\fqa*\f* ద్వార నా జీవితాన్ని కాపాడండి. \q1 \v 38 మీ సేవకునిపట్ల మీ మాటను నెరవేర్చండి, \q2 తద్వారా ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు. \q1 \v 39 నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి, \q2 ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి. \q1 \v 40 మీ కట్టడల కోసం నేను ఎంతగా తహతహ లాడుతున్నాను! \q2 మీ నీతిలో నా జీవితాన్ని కాపాడండి. \qa ו వావ్ \q1 \v 41 యెహోవా, మీ మారని ప్రేమ, \q2 మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక. \q1 \v 42 అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, \q2 ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము. \q1 \v 43 మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి, \q2 ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను. \q1 \v 44 నేను ఎల్లప్పుడు అంటే నిరంతరం, \q2 మీ ధర్మశాస్త్రానికి లోబడతాను. \q1 \v 45 నేను మీ కట్టడలను వెదికాను, \q2 కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను. \q1 \v 46 రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను \q2 నేను సిగ్గుపడను, \q1 \v 47 నేను మీ ఆజ్ఞలలో ఆనందిస్తాను \q2 ఎందుకంటే అవంటే నాకు ప్రేమ. \q1 \v 48 నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను, \q2 తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను. \qa ז జాయిన్ \q1 \v 49 మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, \q2 ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు. \q1 \v 50 నా శ్రమలో నా ఆదరణ ఇదే: \q2 మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది. \q1 \v 51 అహంకారులు కనికరం లేకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, \q2 కాని నేను మీ ధర్మశాస్త్రం నుండి తిరిగిపోను. \q1 \v 52 యెహోవా, మీ అనాది న్యాయవిధులు నాకు జ్ఞాపకం ఉన్నాయి, \q2 వాటిలో నాకెంతో ఆదరణ. \q1 \v 53 మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన దుష్టులను బట్టి, \q2 నాకు చాలా కోపం వస్తుంది. \q1 \v 54 నేను ఎక్కడ బస చేసినా \q2 మీ శాసనాలే నా పాటల సారాంశము. \q1 \v 55 యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి \q2 రాత్రివేళ మీ పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను. \q1 \v 56 నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను \q2 ఇది నాకు అభ్యాసంగా ఉన్నది. \qa ח హేత్ \q1 \v 57 యెహోవా, మీరే నా వాటా; \q2 మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. \q1 \v 58 నేను నా హృదయపూర్వకంగా మీ దయ కోసం వెదికాను; \q2 మీ వాగ్దానం మేరకు నా మీద దయచూపండి. \q1 \v 59 నేను నా మార్గాలను గమనించి \q2 నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను. \q1 \v 60 మీ ఆజ్ఞలను అనుసరించడానికి \q2 నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను. \q1 \v 61 దుష్టులు నన్ను త్రాళ్లతో ఉచ్చులా బిగించినా, \q2 నేను మీ ధర్మశాస్త్రం మరచిపోను. \q1 \v 62 మీ నీతిగల న్యాయవిధులను బట్టి \q2 మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నేను మధ్యరాత్రి లేస్తున్నాను. \q1 \v 63 మీకు భయపడేవారందరికి, \q2 మీ కట్టడలను అనుసరించే వారందరికి నేను స్నేహితుడను. \q1 \v 64 యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది; \q2 మీ శాసనాలు నాకు బోధించండి. \qa ט టేత్ \q1 \v 65 యెహోవా, మీ మాట ప్రకారం \q2 మీ సేవకునికి మేలు చేయండి. \q1 \v 66 నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను, \q2 నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి. \q1 \v 67 నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను, \q2 కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను. \q1 \v 68 మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; \q2 మీ శాసనాలు నాకు బోధించండి. \q1 \v 69 అహంకారులు నన్ను అబద్ధాలతో అరిచినప్పటికీ, \q2 నేను హృదయపూర్వకంగా మీ కట్టడలను అనుసరిస్తాను. \q1 \v 70 వారి హృదయాలు క్రొవ్వులా మందగించాయి, \q2 కాని నేను మీ ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తాను. \q1 \v 71 నాకు బాధ కలగడం మేలైంది \q2 తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను. \q1 \v 72 వేలాది వెండి బంగారు నాణేలకంటే \q2 మీ నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రం నాకు అమూల్యమైనది. \qa י యోద్ \q1 \v 73 మీ హస్తములు నన్ను నిర్మించి నన్ను రూపించాయి; \q2 మీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు గ్రహింపును ఇవ్వండి. \q1 \v 74 మీకు భయపడేవారు నన్ను చూసినప్పుడు సంతోషించుదురు గాక, \q2 ఎందుకంటే నేను మీ మాటలో నా నిరీక్షణ ఉంచాను. \q1 \v 75 యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు, \q2 నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు. \q1 \v 76 మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం, \q2 మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది. \q1 \v 77 నేను బ్రతికేలా మీ కనికరం నా దగ్గరకు రానివ్వండి, \q2 మీ ధర్మశాస్త్రంలోనే నాకు ఆనందము. \q1 \v 78 కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక; \q2 కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను. \q1 \v 79 మీకు భయపడేవారు, \q2 మీ శాసనాలు గ్రహించేవారు నా వైపు తిరుగుదురు గాక. \q1 \v 80 నేను అవమానానికి గురి కాకుండ, \q2 మీ శాసనాలను పూర్ణహృదయంతో అనుసరించి నిందారహితునిగా ఉంటాను. \qa כ కఫ్ \q1 \v 81 మీరు కలిగించే రక్షణ కోసం ఎదురుచూస్తూ నా ప్రాణం సొమ్మసిల్లి పోతుంది; \q2 కాని నేను మీ మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాను. \q1 \v 82 మీ వాగ్దానం కోసం ఎదురుచూస్తూ నా కళ్లు క్షీణిస్తున్నాయి; \q2 “మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారు?” అని నేను అంటాను. \q1 \v 83 నేను పొగలో ఆరిన ద్రాక్ష తిత్తిలా ఉన్నా, \q2 నేను మీ శాసనాలను మరువను. \q1 \v 84 మీ సేవకుడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? \q2 నన్ను హింసించేవారిని మీరు ఎప్పుడు శిక్షిస్తారు? \q1 \v 85 అహంకారులు మీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, \q2 నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు. \q1 \v 86 మీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి; \q2 నేను నిష్కారణంగా హింసింపబడుచున్నాను, నాకు సహాయం చేయండి. \q1 \v 87 వారు దాదాపు నన్ను ఈ భూమి మీద లేకుండ చేసేసారు, \q2 అయితే నేను మీ కట్టడలను విడిచిపెట్టలేదు. \q1 \v 88 మీ మారని ప్రేమతో నా జీవితాన్ని కాపాడండి, \q2 తద్వార మీ నోటి శాసనాలను నేను పాటిస్తాను. \qa ל లామెద్ \q1 \v 89 యెహోవా! మీ వాక్కు శాశ్వతం; \q2 అది పరలోకంలో సుస్థిరంగా ఉంది. \q1 \v 90 మీ నమ్మకత్వం తరతరాలకు నిలుస్తుంది. \q2 మీరు భూమిని స్థాపించారు, అది సుస్థిరంగా ఉంటుంది. \q1 \v 91 మీ న్యాయవిధులు ఈ రోజు వరకు కొనసాగుతాయి, \q2 ఎందుకంటే అన్ని మీకు సేవ చేస్తాయి. \q1 \v 92 ఒకవేళ మీ ధర్మశాస్త్రం నా ఆనందమై ఉండకపోతే, \q2 నేను బాధలో నశించి పోయి ఉండేవాన్ని. \q1 \v 93 నేను మీ కట్టడలు ఎన్నడు మరువను, \q2 ఎందుకంటే వాటి ద్వార మీరు నా జీవితాన్ని కాపాడారు. \q1 \v 94 నేను మీ వాడను, నన్ను రక్షించండి; \q2 నేను మీ కట్టడలను వెదికాను. \q1 \v 95 దుష్టులు నన్ను చంపాలని కాచుకుని ఉన్నారు, \q2 కాని నేనైతే మీ శాసనాలను గురించి ఆలోచిస్తాను. \q1 \v 96 సంపూర్ణతకు కూడా ఉంది పరిమితి! \q2 కానీ, మీ ధర్మశాస్త్రోపదేశం అపరిమితము. \qa מ మేమ్ \q1 \v 97 ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో! \q2 నేను రోజంతా దానిని ధ్యానిస్తాను. \q1 \v 98 మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి \q2 నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి. \q1 \v 99 నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి \q2 నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను. \q1 \v 100 నేను మీ కట్టడలను ఆచరిస్తాను కాబట్టి \q2 వృద్ధులకు మించిన గ్రహింపు నేను కలిగి ఉన్నాను. \q1 \v 101 మీ వాక్యం చెప్పినట్లే చేద్దామని \q2 చెడు మార్గాల నుండి నా పాదాలు తొలగించుకున్నాను. \q1 \v 102 నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, \q2 ఎందుకంటే మీరే నాకు బోధించారు. \q1 \v 103 మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం, \q2 అవి తేనెకంటె తియ్యనివి! \q1 \v 104 మీ కట్టడల వల్ల నేను గ్రహింపు పొందాను; \q2 కాబట్టి తప్పుడు త్రోవలంటే నాకు అసహ్యము. \qa נ నూన్ \q1 \v 105 మీ వాక్కు నా పాదాలకు దీపం, \q2 నా త్రోవకు వెలుగు. \q1 \v 106 నేను మీ నీతిగల న్యాయవిధులను పాటిస్తానని \q2 ప్రమాణం చేసి ధృవీకరించాను. \q1 \v 107 యెహోవా, నేను చాలా బాధపడ్డాను; \q2 మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. \q1 \v 108 యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి, \q2 మీ న్యాయవిధులు నాకు బోధించండి. \q1 \v 109 నేను నిరంతరం నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పటికీ, \q2 నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవను. \q1 \v 110 దుష్టులు నన్ను చిక్కించుకోవాలని ఉరులు ఒడ్డారు, \q2 అయినా నేను మాత్రం మీ కట్టడల నుండి తొలగిపోలేదు. \q1 \v 111 మీ శాసనాలు నాకు శాశ్వత వారసత్వం; \q2 అవి నా హృదయానికి ఆనందం. \q1 \v 112 అంతం వరకు మీ శాసనాలను పాటించాలని \q2 నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను. \qa ס సామెక్ \q1 \v 113 ద్విమనస్కులంటే నాకు అసహ్యం, \q2 కాని మీ ధర్మశాస్త్రం నాకు ఇష్టం. \q1 \v 114 మీరు నా ఆశ్రయం నా డాలు; \q2 నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను. \q1 \v 115 నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా, \q2 కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి! \q1 \v 116 మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; \q2 నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి. \q1 \v 117 నన్ను ఎత్తిపట్టుకోండి, నేను విడిపించబడతాను; \q2 మీ శాసనాలను నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను. \q1 \v 118 మీ శాసనాల నుండి తప్పుకున్న వారిని మీరు తిరస్కరిస్తారు, \q2 వారి భ్రమలు ఏమీ కాకుండా పోతాయి. \q1 \v 119 భూమి మీద ఉన్న దుష్టులందరిని మీరు లోహపు మడ్డిలా విస్మరిస్తారు; \q2 కాబట్టి నేను మీ శాసనాలను ప్రేమిస్తాను. \q1 \v 120 మీ భయానికి నా శరీరం వణకుతుంది; \q2 మీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. \qa ע అయిన్ \q1 \v 121 నేను నీతియుక్తమైనది న్యాయమైనది చేశాను; \q2 నన్ను బాధించేవారికి నన్ను వదిలేయకండి. \q1 \v 122 మీ సేవకుడి శ్రేయస్సుకు హామీ ఇవ్వండి; \q2 అహంకారులు నన్ను అణచివేయనివ్వకండి. \q1 \v 123 మీ నీతియుక్తమైన వాగ్దానం కోసం, \q2 మీ రక్షణ కోసం ఎదురుచూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి. \q1 \v 124 మీ మారని ప్రేమకు తగినట్టుగా మీ సేవకునితో వ్యవహరించండి \q2 అలాగే మీ శాసనాలు నాకు బోధించండి. \q1 \v 125 నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా \q2 నాకు వివేచన ఇవ్వండి. \q1 \v 126 మీ ధర్మశాస్త్రం ఉల్లంఘించబడుతుంది; \q2 యెహోవా, మీరు చర్య తీసుకోవలసిన సమయం ఇదే. \q1 \v 127 ఎందుకంటే నేను మీ ఆజ్ఞలను \q2 బంగారం కంటే, మేలిమి బంగారం కంటే ఎక్కువ ప్రేమిస్తాను, \q1 \v 128 నేను మీ కట్టడలన్నిటిని యథార్థమైనవిగా పరిగణిస్తాను, \q2 ప్రతి తప్పుడు మార్గం నాకసహ్యము. \qa פపే \q1 \v 129 మీ శాసనాలు అద్భుతం; \q2 కాబట్టి నేను వాటికి లోబడతాను. \q1 \v 130 మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది. \q2 అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది. \q1 \v 131 మీ ఆజ్ఞల కోసం ఆరాటపడుతూ, \q2 నేను నా నోరు తెరిచి రొప్పుతున్నాను. \q1 \v 132 మీ పేరును ఇష్టపడేవారికి మీరు ఎప్పుడూ చేసినట్టు, \q2 నా వైపు తిరిగి నాపై దయచూపండి. \q1 \v 133 మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; \q2 ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక. \q1 \v 134 నేను మీ కట్టడలకు లోబడేలా, \q2 మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి. \q1 \v 135 మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి \q2 మీ శాసనాలను నాకు బోధించండి. \q1 \v 136 ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, \q2 నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది. \qa צ సాదె \q1 \v 137 యెహోవా, మీరు నీతిమంతులు, \q2 మీ న్యాయవిధులు యథార్థమైనవి. \q1 \v 138 మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి; \q2 అవి పూర్తిగా నమ్మదగినవి. \q1 \v 139 నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, \q2 నా ఆసక్తి నన్ను తినేస్తుంది. \q1 \v 140 మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి, \q2 మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు. \q1 \v 141 నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, \q2 నేను మీ కట్టడలు మరచిపోను. \q1 \v 142 మీ నీతి శాశ్వతమైనది \q2 మీ ధర్మశాస్త్రం సత్యమైనది. \q1 \v 143 ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, \q2 కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. \q1 \v 144 మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి; \q2 నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి. \qa ק ఖాఫ్ \q1 \v 145 యెహోవా, నా హృదయమంతటితో నేను మొరపెడుతున్నాను; నాకు జవాబివ్వండి, \q2 నేను మీ శాసనాలకు లోబడతాను. \q1 \v 146 నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి \q2 నేను మీ శాసనాలను పాటిస్తాను. \q1 \v 147 నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను; \q2 నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను. \q1 \v 148 మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా, \q2 రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి. \q1 \v 149 మీ మారని ప్రేమను బట్టి నా స్వరాన్ని వినండి; \q2 యెహోవా, మీ న్యాయవిధుల ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. \q1 \v 150 దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, \q2 కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు. \q1 \v 151 అయినాసరే యెహోవా, మీరు నా దగ్గరే ఉన్నారు, \q2 మీ ఆజ్ఞలన్నీ నిజం. \q1 \v 152 మీ శాసనాలు నిత్యం నిలిచి ఉండేలా మీరు స్థాపించారని, \q2 చాలా కాలం క్రితం నేను తెలుసుకున్నాను. \qa ר రేష్ \q1 \v 153 నా శ్రమను చూసి నన్ను విడిపించండి, \q2 ఎందుకంటే నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవలేదు. \q1 \v 154 నా కారణాన్ని సమర్థించి నన్ను విమోచించండి; \q2 మీ వాగ్దాన ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. \q1 \v 155 రక్షణ దుష్టులకు దూరం, \q2 ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు. \q1 \v 156 యెహోవా, మీ కనికరం గొప్పది; \q2 మీ న్యాయవిధులను బట్టి నా జీవితాన్ని కాపాడండి. \q1 \v 157 నన్ను హింసించే శత్రువులు చాలామంది, \q2 అయినా నేను మీ శాసనాల నుండి తప్పుకోలేదు. \q1 \v 158 నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, \q2 ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు. \q1 \v 159 నేను మీ కట్టడలు ఎంతగా ప్రేమిస్తున్నానో చూడండి; \q2 యెహోవా, మీ మారని ప్రేమ చేత, నా జీవితాన్ని కాపాడండి. \q1 \v 160 మీ వాక్కులన్నీ నిజం; \q2 మీ నీతియుక్తమైన న్యాయవిధులు నిత్యం నిలుస్తాయి. \qa ש సిన్ లేక షీన్ \q1 \v 161 కారణం లేకుండ అధికారులు నన్ను హింసిస్తున్నారు, \q2 అయినా నా హృదయం మీ వాక్కుకు వణికిపోతుంది. \q1 \v 162 ఒకడు దోపుడుసొమ్మును చూసి సంతోషించినట్లు \q2 నేను మీ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తాను. \q1 \v 163 అబద్ధం అంటే నాకు అసహ్యం ద్వేషం \q2 కాని మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను. \q1 \v 164 రోజుకు ఏడుసార్లు మిమ్మల్ని స్తుతిస్తాను \q2 ఎందుకంటే మీ న్యాయవిధులు నీతియుక్తమైనవి. \q1 \v 165 మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు గొప్ప సమాధానం కలిగి ఉంటారు, \q2 ఏదీ వారిని తొట్రిల్లేలా చేయలేదు. \q1 \v 166 యెహోవా! మీ రక్షణ కోసం నేను ఎదురుచూస్తాను, \q2 నేను మీ ఆజ్ఞలను అనుసరిస్తాను. \q1 \v 167 నేను మీ శాసనాలను పాటిస్తాను, \q2 ఎందుకంటే నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తాను. \q1 \v 168 నేను మీ కట్టడలకు మీ శాసనాలకు లోబడతాను, \q2 ఎందుకంటే నా మార్గాలన్నీ మీకు తెలుసు. \qa ת తౌ \q1 \v 169 యెహోవా, నా మొర మీ సన్నిధికి చేరును గాక; \q2 మీ మాట ప్రకారం నాకు గ్రహింపును దయచేయండి. \q1 \v 170 నా విన్నపం మీ సన్నిధికి చేరును గాక; \q2 మీ వాగ్దానం ప్రకారం నన్ను విడిపించండి. \q1 \v 171 నా పెదవులు స్తుతితో పొంగిపారును గాక, \q2 ఎందుకంటే మీరు మీ శాసనాలను నాకు బోధిస్తారు. \q1 \v 172 నా నాలుక మీ మాటను పాడును గాక, \q2 ఎందుకంటే మీ ఆజ్ఞలన్నియు నీతియుక్తమైనవి. \q1 \v 173 మీ చేయి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండును గాక, \q2 ఎందుకంటే నేను మీ కట్టడలను ఎంచుకున్నాను. \q1 \v 174 యెహోవా, నేను మీ రక్షణ కోసం ఆశతో ఎదురు చూస్తున్నాను, \q2 మీ ధర్మశాస్త్రం నాకెంతో ఆనందాన్నిస్తుంది. \q1 \v 175 నేను మిమ్మల్ని స్తుతించేలా నన్ను బ్రతకనివ్వండి, \q2 మీ న్యాయవిధులు నన్ను సంరక్షిస్తాయి. \q1 \v 176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరుగుతున్నాను. \q2 మీ సేవకుడిని వెదకండి, \q2 నేను మీ ఆజ్ఞలను మరవలేదు. \c 120 \cl కీర్తన 120 \d యాత్రకీర్తన. \q1 \v 1 నా బాధలో యెహోవాకు మొరపెడతాను, \q2 ఆయన నాకు జవాబిస్తారు. \q1 \v 2 యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి \q2 మోసకరమైన నాలుక నుండి \q2 నన్ను రక్షించండి. \b \q1 \v 3 ఓ మోసకరమైన నాలుకా, \q2 దేవుడు నీకేం చేస్తారు? \q2 ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు? \q1 \v 4 వీరుల పదునైన బాణాలతో, \q2 మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు. \b \q1 \v 5 నేను మెషెకులో నివసించినందుకు, \q2 కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ! \q1 \v 6 సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో \q2 చాలా కాలం నివసించాను. \q1 \v 7 నేను సమాధానం కోరుతున్నాను; \q2 కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు. \c 121 \cl కీర్తన 121 \d యాత్రకీర్తన. \q1 \v 1 కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, \q2 నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? \q1 \v 2 ఆకాశాన్ని భూమిని సృజించిన \q2 యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది. \b \q1 \v 3 ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, \q2 నిన్ను కాపాడేవాడు కునుకడు. \q1 \v 4 నిజానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు \q2 కునుకడు న్రిదపోడు. \b \q1 \v 5 యెహోవా నిన్ను కాపాడతారు, \q2 యెహోవా మీ కుడి వైపున మీకు నీడగా ఉంటారు. \q1 \v 6 పగటివేళ సూర్యుడు కాని లేదా, \q2 రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు. \b \q1 \v 7 సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు \q2 ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు. \q1 \v 8 ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో \q2 యెహోవా నిన్ను కాపాడును. \c 122 \cl కీర్తన 122 \d దావీదు యాత్రకీర్తన. \q1 \v 1 “యెహోవా ఆలయానికి వెళ్దాం” అని \q2 నాతో అన్న వారితో నేను సంతోషించాను. \q1 \v 2 ఓ యెరూషలేమా, మీ గుమ్మాల్లో \q2 మా పాదాలు నిలిచి ఉన్నాయి. \b \q1 \v 3 యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము; \q2 అది దగ్గరగా కుదించబడింది. \q1 \v 4 ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనం ప్రకారం \q2 యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి \q1 వారి గోత్రాలు అనగా \q2 యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్తాయి. \q1 \v 5 అక్కడ తీర్పు కొరకైన సింహాసనాలు ఉన్నాయి, \q2 అవి దావీదు ఇంటివారి సింహాసనాలు. \b \q1 \v 6 యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. \q2 “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక! \q1 \v 7 మీ ప్రాకారాలలో సమాధానం \q2 మీ కోట గోడలలో అభివృద్ధి ఉండును గాక!” \q1 \v 8 నా సోదరులు నా స్నేహితుల కోసం \q2 “మీలో సమాధానం ఉండును గాక” అని నేను అంటాను. \q1 \v 9 మన దేవుడైన యెహోవా మందిరం కోసం \q2 మీ వృద్ధిని నేను కోరతాను. \c 123 \cl కీర్తన 123 \d యాత్రకీర్తన. \q1 \v 1 పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా, \q2 మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను. \q1 \v 2 దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు, \q2 దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు, \q1 మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు \q2 మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి. \b \q1 \v 3 మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి, \q2 ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము. \q1 \v 4 మేము గర్విష్ఠుల \q2 అంతులేని ఎగతాళిని, \q2 అహంకారుల ధిక్కారాన్ని భరించాము. \c 124 \cl కీర్తన 124 \d దావీదు యాత్రకీర్తన. \q1 \v 1-5 మనుష్యులు మనపై దాడి చేసినప్పుడు \q2 వారి కోపం మనపై రగులుకొన్నప్పుడు \q1 యెహోవా మనకు తోడై ఉండకపోతే \q2 వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు; \q1 వరద మన మీదుగా పొర్లి ఉండేది, \q2 జలప్రవాహం మనల్ని ముంచేసి \q1 జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది \q2 అని ఇశ్రాయేలు చెప్పును గాక. \b \q1 \v 6 వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని \q2 యెహోవాకు స్తుతి చెల్లును గాక. \q1 \v 7 వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా \q2 మనం తప్పించుకున్నాము; \q1 ఉరి తెగిపోయింది, \q2 మనం తప్పించుకున్నాము. \q1 \v 8 భూమ్యాకాశాలను సృజించిన \q2 యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది. \c 125 \cl కీర్తన 125 \d యాత్రకీర్తన. \q1 \v 1 యెహోవాపై నమ్మకము ఉంచేవారు \q2 కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు. \q1 \v 2 యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, \q2 ఇప్పుడు ఎల్లప్పుడు \q2 యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు. \b \q1 \v 3 నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద \q2 దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు, \q1 లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి \q2 తమ చేతులను ఉపయోగిస్తారు. \b \q1 \v 4 యెహోవా, మంచివారికి \q2 యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. \q1 \v 5 అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని \q2 దుష్టులతో పాటు బహిష్కరిస్తారు. \b \q1 ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. \c 126 \cl కీర్తన 126 \d యాత్రకీర్తన. \q1 \v 1 యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు, \q2 మనం కలలుగన్న వారిలా ఉన్నాము. \q1 \v 2 మన నోరు నవ్వుతో నింపబడింది, \q2 మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి. \q1 “యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని \q2 ఇతర దేశాలు చెప్పుకున్నాయి. \q1 \v 3 యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు, \q2 మనం ఆనందభరితులం అయ్యాము. \b \q1 \v 4 దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా, \q2 యెహోవా, మా భాగ్యాలను\f + \fr 126:4 \fr*\ft లేదా \ft*\fqa చెరలోనున్న మా వారిని తిరిగి రప్పించండి\fqa*\f* తిరిగి రప్పించండి. \q1 \v 5 కన్నీటితో విత్తేవారు \q2 సంతోషగానాలతో పంట కోస్తారు. \q1 \v 6 విత్తనాలను పట్టుకుని, \q2 ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు, \q2 సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు. \c 127 \cl కీర్తన 127 \d సొలొమోను యాత్రకీర్తన. \q1 \v 1 యెహోవా ఇల్లు కడితేనే తప్ప \q2 దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. \q1 యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే \q2 దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే. \q1 \v 2 మీరు ప్రొద్దున్నే లేచి \q2 ఆలస్యంగా పడుకొంటూ, \q1 కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే. \q2 ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు. \b \q1 \v 3 పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, \q2 గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. \q1 \v 4 యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు \q2 వీరుని చేతిలో బాణాలవంటివారు. \q1 \v 5 వారితో తన అంబులపొదిని \q2 నింపుకున్నవాడు ధన్యుడు. \q1 గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు \q2 వారు అవమానం పొందరు. \c 128 \cl కీర్తన 128 \d యాత్రకీర్తన. \q1 \v 1 యెహోవా పట్ల భయం కలిగి, \q2 ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు. \q1 \v 2 మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; \q2 ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది. \q1 \v 3 మీ ఇంట్లో మీ భార్య \q2 ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది; \q1 మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు \q2 ఒలీవ మొక్కల్లా ఉంటారు. \q1 \v 4 యెహోవా పట్ల భయం కలవారు \q2 ఈ విధంగా ఆశీర్వదించబడతారు. \b \q1 \v 5 సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; \q2 మీ జీవితకాలమంతా \q2 యెరూషలేము అభివృద్ధిని చూస్తారు. \q1 \v 6 మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు \q2 ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. \c 129 \cl కీర్తన 129 \d యాత్రకీర్తన. \q1 \v 1 “నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు” \q2 అని ఇశ్రాయేలు అనాలి; \q1 \v 2 “నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు, \q2 కాని వారు నాపై విజయాన్ని పొందలేరు. \q1 \v 3 దున్నువారు దున్నినట్లు \q2 నా వీపుపై పొడవైన చాళ్ళలాంటి గాయాలు చేశారు. \q1 \v 4 అయితే యెహోవా నీతిమంతుడు; \q2 దుష్టులు కట్టిన తాళ్లను తెంచి ఆయన నన్ను విడిపించారు.” \b \q1 \v 5 సీయోనును ద్వేషించే వారందరు \q2 సిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక. \q1 \v 6 వారు ఎదగక ముందే ఎండిపోయిన \q2 ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక. \q1 \v 7 దానితో కోత కోసేవారు తమ చేతిని గాని \q2 పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు. \q1 \v 8 “యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక; \q2 యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” \q2 అని బాటసారులు అనకుందురు గాక. \c 130 \cl కీర్తన 130 \d యాత్రకీర్తన. \q1 \v 1 యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను; \q2 \v 2 ప్రభువా, నా స్వరం వినండి. \q1 దయ కోసం నేను చేసే మొర \q2 మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి. \b \q1 \v 3 యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే, \q2 ప్రభువా, ఎవరు నిలవగలరు? \q1 \v 4 కాని మీ దగ్గర క్షమాపణ లభిస్తుంది, \q2 కాబట్టి మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించగలము. \b \q1 \v 5 యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, \q2 ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను. \q1 \v 6 కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా \q2 అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, \q2 నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను. \b \q1 \v 7 ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు, \q2 ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది \q2 ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది. \q1 \v 8 ఆయనే ఇశ్రాయేలీయులను \q2 వారి అన్ని పాపాల నుండి విడిపిస్తారు. \c 131 \cl కీర్తన 131 \d దావీదు యాత్రకీర్తన. \q1 \v 1 యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, \q2 నా కళ్లు అహంకారం కలిగిలేవు. \q1 నేను గ్రహించలేని గొప్ప విషయాలను \q2 నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను. \q1 \v 2 పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు, \q2 అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు, \q2 నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను. \b \q1 \v 3 ఓ ఇశ్రాయేలు, ఇప్పటినుండి నిరంతరం \q2 యెహోవా పైనే నీ నిరీక్షణ ఉంచు. \c 132 \cl కీర్తన 132 \d యాత్రకీర్తన. \q1 \v 1 యెహోవా, దావీదును, \q2 అతనికి కలిగిన అన్ని బాధలను జ్ఞాపకము చేసుకోండి. \b \q1 \v 2 అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు, \q2 యాకోబు యొక్క బలవంతునికి మ్రొక్కుబడి చేశాడు: \q1 \v 3-5 “యెహోవాకు నేను ఒక స్థలం కనుగొనేవరకు, \q2 యాకోబు యొక్క బలవంతునికి ఒక నివాసస్థలం చూచే వరకు, \q1 నేను నా ఇంట్లోకి ప్రవేశించను, \q2 నా మంచం మీద పడుకోను, \q1 నా కళ్ళకు నిద్ర లేదా \q2 నా కనురెప్పలకు కునుకు రానివ్వను.” \b \q1 \v 6 దాని గురించి ఎఫ్రాతాలో మేము విన్నాం, \q2 యాయరు పొలాల్లో అది మాకు దొరికింది.\f + \fr 132:6 \fr*\ft అలాగే \+xt 1 దిన 13:5-6\+xt* \ft*\ft లో కూడా ఉంది.\ft*\f* \q1 \v 7 “ఆయన నివాసస్థలానికి వెళ్దాం రండి, \q2 ఆయన పాదపీఠం ఎదుట ఆరాధిద్దాం రండి. \q1 \v 8 ‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, \q2 మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి. \q1 \v 9 మీ యాజకులు మీ నీతిని ధరించుకొందురు గాక; \q2 నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషగానం చేయుదురు గాక.’ ” \b \q1 \v 10 మీ సేవకుడైన దావీదు నిమిత్తం, \q2 మీ అభిషిక్తుని తిరస్కరించకండి. \b \q1 \v 11 యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు, \q2 అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు: \q1 “మీ సంతానంలో ఒకనిని \q2 మీ సింహాసనం మీద కూర్చోబెడతాను. \q1 \v 12 మీ కుమారులు నా ఒడంబడికను \q2 వారికి బోధించిన చట్టాలను పాటిస్తే, \q1 వారి కుమారులు కూడా \q2 నిత్యం మీ సింహాసనం మీద కూర్చుంటారు” అని చెప్పారు. \b \q1 \v 13 యెహోవా సీయోనును ఏర్పరచుకున్నారు, \q2 దానిని తన నివాస స్థలంగా ఆయన కోరుకున్నారు. \q1 \v 14 “ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది; \q2 ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను, \q2 ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను. \q1 \v 15 ఆమెను సమృద్ధి ఆహారంతో దీవిస్తాను; \q2 ఆమెలోని పేదవారిని ఆహారంతో తృప్తిపరుస్తాను. \q1 \v 16 ఆమె యాజకులకు రక్షణ వస్త్రాలను ధరింపచేస్తాను, \q2 ఆమెలో నమ్మకస్థులైన ప్రజలు నిత్యం సంతోషగానం చేస్తారు. \b \q1 \v 17 “అక్కడ దావీదుకు కొమ్ము మొలిచేలా చేస్తాను \q2 నా అభిషిక్తుని కోసం ఒక దీపం సిద్ధపరుస్తాను. \q1 \v 18 అతని శత్రువులకు అవమాన వస్త్రాలను ధరింపచేస్తాను, \q2 కాని అతని తల ప్రకాశవంతమైన కిరీటంతో అలంకరించబడుతుంది.” \c 133 \cl కీర్తన 133 \d దావీదు యాత్రకీర్తన \q1 \v 1 సహోదరులు ఐక్యత కలిగి నివసించడం \q2 ఎంత మేలు! ఎంత మనోహరం! \b \q1 \v 2 అది అహరోను తలమీద పోయబడి \q2 అతని గడ్డం మీదుగా కారుతూ, \q1 వస్త్రపు అంచు వరకు కారిన \q2 ప్రశస్తమైన తైలం వంటిది. \q1 \v 3 అది సీయోను కొండలమీదికి దిగివచ్చే \q2 హెర్మోను మంచులా ఉంటుంది. \q1 యెహోవా తన ఆశీర్వాదాన్ని, \q2 జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు. \c 134 \cl కీర్తన 134 \d యాత్రకీర్తన. \q1 \v 1 యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే \q2 యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి. \q1 \v 2 పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి \q2 యెహోవాను స్తుతించండి. \b \q1 \v 3 ఆకాశాన్ని భూమిని సృష్టించిన \q2 యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక. \c 135 \cl కీర్తన 135 \q1 \v 1 యెహోవాను స్తుతించండి.\f + \fr 135:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\ft ; \+xt 3|link-href="PSA 135:3"\+xt*, \+xt 21 వచనాల్లో|link-href="PSA 135:21"\+xt* వచనాల్లో కూడ\ft*\f* \b \q1 యెహోవా నామాన్ని స్తుతించండి; \q2 యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి, \q1 \v 2 యెహోవా మందిరంలో, మన దేవుని మందిర ఆవరణాల్లో \q2 సేవ చేసేవారలారా, ఆయనను స్తుతించండి. \b \q1 \v 3 యెహోవా మంచివాడు కాబట్టి యెహోవాను స్తుతించండి; \q2 ఆయన నామానికి స్తుతులు పాడండి, అది మనోహరమైనది. \q1 \v 4 యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. \q2 ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు. \b \q1 \v 5 యెహోవా గొప్పవాడని, \q2 దేవుళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడని నాకు తెలుసు. \q1 \v 6 ఆకాశాల్లో భూమిమీద, \q2 సముద్రాల్లో జలాగాధాలలో, \q2 యెహోవా తనకిష్టమైన దానిని జరిగిస్తారు. \q1 \v 7 ఆయన భూమి అంచుల నుండి మేఘాలను లేచేలా చేస్తారు; \q2 వర్షంతో పాటు మెరుపులను పంపిస్తారు \q2 తన కోటలో నుండి గాలిని బయటకు పంపిస్తారు. \b \q1 \v 8 ఈజిప్టులో మొదటి సంతానాన్ని ఆయన మొత్తారు, \q2 మనుష్యుల పశువుల మొదటి సంతానాన్ని ఆయన హతం చేశారు. \q1 \v 9 ఓ ఈజిప్టు, మీ మధ్యలో ఫరోకు, అతని సేవకులకు వ్యతిరేకంగా \q2 ఆయన ఆశ్చర్యకార్యాలను అద్భుతాలను పంపారు. \q1 \v 10 ఆయన అనేక జాతులను మొత్తారు \q2 బలాఢ్యులైన రాజులను హతం చేశారు. \q1 \v 11 అమోరీయుల రాజైన సీహోను, \q2 బాషాను రాజైన ఓగు, \q2 కనాను రాజులందరూ, \q1 \v 12 ఆయన వారి దేశాన్ని వారసత్వంగా, \q2 తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చారు. \b \q1 \v 13 యెహోవా, మీ నామం నిత్యం ఉంటుంది. \q2 యెహోవా, మీ కీర్తి తరతరాలులో నిలిచి ఉంటుంది. \q1 \v 14 యెహోవా తన ప్రజలకు శిక్ష విముక్తి జరిగిస్తారు, \q2 ఆయన సేవకులపై దయ కలిగి ఉంటారు. \b \q1 \v 15 దేశాల విగ్రహాలు వెండి బంగారాలు, \q2 అవి మనుష్యుల చేతిపనులు. \q1 \v 16 వాటికి నోళ్ళున్నాయి కాని మాట్లాడలేవు, \q2 కళ్లున్నాయి కాని చూడలేవు. \q1 \v 17 చెవులున్నాయి కాని వినలేవు, \q2 వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు. \q1 \v 18 వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు \q2 వాటి లాగే ఉంటారు. \b \q1 \v 19 ఓ ఇశ్రాయేలు గృహమా, యెహోవాను స్తుతించు; \q2 ఓ అహరోను గృహమా, యెహోవాను స్తుతించు; \q1 \v 20 ఓ లేవీ గృహమా, యెహోవాను స్తుతించు; \q2 యెహోవాకు పట్ల భయము కలవారలారా, యెహోవాను స్తుతించండి. \q1 \v 21 సీయోనులో నుండి యెహోవా స్తుతించబడును గాక, \q2 ఆయన యెరూషలేములో నివసిస్తారు. \b \q1 యెహోవాను స్తుతించండి. \c 136 \cl కీర్తన 136 \q1 \v 1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 2 దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 3 ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \b \q1 \v 4 మహాద్భుతాలు చేసేది ఆయన ఒక్కడే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 5 ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 6 నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి. \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 7 మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 8 పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 9 రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \b \q1 \v 10 ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు, \qr ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 11 వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 12 చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \b \q1 \v 13 ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 14 దాని మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను దాటించింది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 15 ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \b \q1 \v 16 అరణ్యం గుండా తన ప్రజలను నడిపించిన దేవునికి స్తుతులు చెల్లించండి, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \b \q1 \v 17 గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 18 బలాఢ్యులైన రాజులను చంపింది ఆయనే \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 19 అమోరీయుల రాజైన సీహోనును చంపింది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 20 బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 21 వారి దేశాన్ని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 22 తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \b \q1 \v 23 మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 24 మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \q1 \v 25 ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది ఆయనే, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \b \q1 \v 26 పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, \qr ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. \c 137 \cl కీర్తన 137 \q1 \v 1 బబులోను నదుల దగ్గర మనం కూర్చుని \q2 సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము. \q1 \v 2 దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు \q2 మన సితారాలు తగిలించాము. \q1 \v 3 మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు, \q2 మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు; \q2 “సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు. \b \q1 \v 4 పరాయి దేశంలో ఉండగా \q2 యెహోవా పాటలు మనం ఎలా పాడగలము? \q1 \v 5 యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, \q2 నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి. \q1 \v 6 నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, \q2 యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది \q1 అని నేను భావించకపోతే \q2 నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి. \b \q1 \v 7 యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజున \q2 ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకోండి. \q1 “దానిని నాశనం చేయండి. \q2 పునాదుల వరకు దానిని ధ్వంసం చేయండి!” అని వారు అరిచారు. \q1 \v 8 త్వరలో నాశనమవ్వబోతున్న బబులోను కుమారీ, \q2 నీవు మాకు చేసిన కీడును బట్టి \q2 నీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు. \q1 \v 9 మీ పసిపిల్లల్ని పట్టుకుని \q2 వారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు. \c 138 \cl కీర్తన 138 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నా పూర్ణహృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను; \q2 “దేవుళ్ళ” ఎదుట నేను మీకు స్తుతులు పాడతాను. \q1 \v 2 మీ పరిశుద్ధాలయం వైపు నమస్కరిస్తూ, \q2 మీ మారని ప్రేమను బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి, \q2 మీ నామాన్ని స్తుతిస్తాను, \q1 ఎందుకంటే మీ ప్రఖ్యాతి కంటే మీ శాసనాలను \q2 మీరు అధికంగా ఘనపరిచారు. \q1 \v 3 నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు జవాబిచ్చారు; \q2 మీరు నన్ను ధైర్యపరిచారు. \b \q1 \v 4 యెహోవా, భూరాజులందరూ మీ నోటి నుండి మీ శాసనాలు విన్నప్పుడు \q2 మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. \q1 \v 5 యెహోవా మహిమ గొప్పది కాబట్టి, \q2 వారు యెహోవా యొక్క మార్గాల గురించి పాడుదురు గాక. \b \q1 \v 6 యెహోవా మహోన్నతుడైనప్పటికి ఆయన దీనులపై దయ చూపిస్తారు; \q2 ఆయన దూరం నుండే గర్విష్ఠులను పసిగడతారు. \q1 \v 7 నేను కష్టంలో చిక్కుకున్నా \q2 మీరు నా జీవితాన్ని కాపాడండి. \q1 నా శత్రువుల కోపం నుండి నన్ను కాపాడడానికి మీ చేతిని చాచారు; \q2 మీ కుడిచేతితో నన్ను రక్షిస్తారు. \q1 \v 8 యెహోవా నాకు శిక్ష విముక్తి చేస్తారు; \q2 యెహోవా, మీ మారని ప్రేమ శాశ్వతమైనది, \q2 మీ చేతిపనిని వదిలిపెట్టకండి. \c 139 \cl కీర్తన 139 \d ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా మీరు నన్ను పరిశోధించారు, \q2 మీరు నన్ను తెలుసుకొన్నారు. \q1 \v 2 నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు; \q2 దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు. \q1 \v 3 నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు; \q2 నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు. \q1 \v 4 యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే, \q2 అదేమిటో మీకు పూర్తిగా తెలుసు. \q1 \v 5 నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు, \q2 మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు. \q1 \v 6 అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది, \q2 నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది. \b \q1 \v 7 మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను? \q2 మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? \q1 \v 8 ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కి వెళ్తే, అక్కడా మీరు ఉన్నారు; \q2 నేను పాతాళంలో నా పడకను సిద్ధం చేసుకుంటే, అక్కడా మీరు ఉన్నారు. \q1 \v 9 ఒకవేళ నేను ఉదయపు రెక్కలపై ఎగిరిపోయి, \q2 నేను సముద్రం యొక్క సుదూరాన స్థిరపడితే, \q1 \v 10 అక్కడ కూడా మీ చేయి నన్ను నడిపిస్తుంది, \q2 మీ కుడిచేయి నన్ను గట్టిగా పట్టుకుంటుంది. \q1 \v 11 “చీకటి నన్ను దాచివేస్తుంది, \q2 నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిగా మారుతుంది” అని నేననుకుంటే, \q1 \v 12 చీకటి కూడ మీకు చీకటి కాదు; \q2 రాత్రి పగటివలె మెరుస్తుంది, \q2 ఎందుకంటే చీకటి మీకు వెలుగు లాంటిది. \b \q1 \v 13 నా అంతరంగాన్ని మీరు సృష్టించారు; \q2 నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు. \q1 \v 14 నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. \q2 మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి, \q2 అది నాకు పూర్తిగా తెలుసు. \q1 \v 15 రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు, \q2 భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు, \q2 నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు. \q1 \v 16 నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి; \q2 నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే \q2 అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. \q1 \v 17 దేవా, మీ ఆలోచనలు\f + \fr 139:17 \fr*\ft నా గురించిన మీ ఆలోచనలు ఎంత అద్భుతం!\ft*\f* నాకెంతో అమూల్యమైనవి! \q2 వాటి మొత్తం ఎంత విస్తారమైనది! \q1 \v 18 వాటిని లెక్కించడానికి నేను ప్రయత్నిస్తే, \q2 అవి ఇసుకరేణువుల కంటే లెక్కకు మించినవి, \q2 నేను మేల్కొనినప్పుడు నేను ఇంకా మీ దగ్గరే ఉన్నాను. \b \q1 \v 19 ఓ దేవా, మీరే దుష్టులను హతం చేస్తే మంచిది; \q2 హంతకులారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి. \q1 \v 20 వారు చెడు ఉద్దేశ్యంతో మీ గురించి మాట్లాడతారు; \q2 మీ శత్రువులు మీ నామాన్ని దుర్వినియోగం చేస్తారు. \q1 \v 21 యెహోవా, మిమ్మల్ని ద్వేషించేవారిని నేను ద్వేషించనా, \q2 మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని అసహ్యించుకోనా? \q1 \v 22 వారి పట్ల ద్వేషము తప్ప ఇంకొకటి లేదు; \q2 వారిని నా శత్రువులుగా లెక్కగడతాను. \q1 \v 23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి; \q2 నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి. \q1 \v 24 చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి, \q2 నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.\f + \fr 139:24 \fr*\ft \+xt కీర్తన 3:8\+xt* ఫుట్‌నోట్ చూడండి\ft*\f* \c 140 \cl కీర్తన 140 \d ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, కీడుచేసే మనుష్యుల నుండి నన్ను రక్షించండి; \q2 హింసించేవారి నుండి నన్ను కాపాడండి, \q1 \v 2 వారు హృదయాల్లో చెడు విషయాలే కల్పించుకుంటారు \q2 రోజు యుద్ధము రేపుతారు. \q1 \v 3 వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; \q2 వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. \qs సెలా\qs* \b \q1 \v 4 యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడండి; \q2 దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడండి, \q2 నా కాళ్లను పట్టుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు. \q1 \v 5 అహంకారులు చాటుగా వల ఉంచారు; \q2 వారు వల దాడులు పరచారు, \q2 నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు. \qs సెలా\qs* \b \q1 \v 6 నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను. \q2 యెహోవా, దయతో మొరను ఆలకించండి. \q1 \v 7 ప్రభువైన యెహోవా, బలాడ్యుడవైన నా రక్షకా, \q2 యుద్ధ దినాన మీరు నా తలను రక్షిస్తారు. \q1 \v 8 యెహోవా, దుష్టుల కోరికలను వారికి ఇవ్వకండి; \q2 వారి ప్రణాళికలు విజయవంతం కానివ్వకండి. \qs సెలా\qs* \b \q1 \v 9 నన్ను చుట్టుముట్టినవారు గర్వముతో తలలు ఎత్తుతారు; \q2 వారి పెదవుల కీడు వారిని మ్రింగివేయాలి. \q1 \v 10 మండుతున్న నిప్పు రవ్వలు వారిపై పడాలి; \q2 వారు అగ్నిలో పడవేయబడాలి, \q2 తిరిగి లేవకుండా మట్టి గొయ్యిలో పడవేయబడాలి. \q1 \v 11 దూషకులు భూమి మీద స్థిరపడకుందురు గాక; \q2 విపత్తులు, దౌర్జన్యపరులను వేటాడతాయి. \b \q1 \v 12 యెహోవా దరిద్రులకు న్యాయం చేకూరుస్తారని, \q2 అవసరతలో ఉన్నవారికి న్యాయం సమకూరుస్తారని నాకు తెలుసు. \q1 \v 13 నిశ్చయంగా నీతిమంతులు మీ నామాన్ని స్తుతిస్తారు, \q2 యథార్థవంతులు మీ సన్నిధిలో ఉంటారు. \c 141 \cl కీర్తన 141 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, \q2 నా దగ్గరకు త్వరగా రండి; \q2 నా స్వరాన్ని ఆలకించండి. \q1 \v 2 నా ప్రార్థన దూపమువలే మీకు అంగీకారమగును గాక; \q2 నా చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యంలా ఉండును గాక. \b \q1 \v 3 యెహోవా నా నోటికి కావలి పెట్టండి; \q2 నా పెదవులు వాకిట కావలి ఉంచండి. \q1 \v 4 కీడు చేసేవారితో కలిసి \q2 వారి దుష్ట క్రియలలో నేను పాల్గొనకుండునట్లు, \q1 నా హృదయాన్ని చెడు వైపు తిరగనివ్వకండి; \q2 వారి రుచిగల పదార్థాలు నేను తినకుండ ఉండనివ్వండి! \b \q1 \v 5 నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే; \q2 వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే. \q1 నా తల దానిని నిరాకరించదు, \q2 కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను. \b \q1 \v 6 వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు, \q2 అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు. \q1 \v 7 “ఒకరు భూమిలో దున్నినట్లు, \q2 మా ఎముకలు మృత్యులోక ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి” అని వారంటారు. \b \q1 \v 8 ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను; \q2 మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి. \q1 \v 9 కీడుచేసేవారి ఉచ్చుల నుండి, \q2 వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి. \q1 \v 10 దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు, \q2 నేనైతే తప్పించుకు వెళ్తాను. \c 142 \cl కీర్తన 142 \d దావీదు యొక్క ధ్యానకీర్తన; గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. \q1 \v 1 నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను; \q2 దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను. \q1 \v 2 ఆయన ఎదుట నా ఫిర్యాదు వెల్లడి చేసుకుంటాను; \q2 నా కష్టాల గురించి ఆయనకు చెప్పుకుంటాను. \b \q1 \v 3 నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు \q2 మీరే నా నడకను చూస్తారు. \q1 నేను నడచే దారిలో, \q2 శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు. \q1 \v 4 చూడండి, నా కుడివైపు ఎవరు లేరు; \q2 ఎవరు నా గురించి పట్టించుకోరు \q1 నాకు ఆశ్రయం లేదు; \q2 ఒక్కరైన నాపై దయ చూపించరు. \b \q1 \v 5 యెహోవా, మీకు మొరపెట్టుకుంటున్నాను; \q2 “నా ఆశ్రయం మీరే, \q2 సజీవుల దేశంలో నా స్వాస్థ్యం మీరే” అని నేనంటాను. \b \q1 \v 6 నేను చాలా క్రుంగిపోయాను, \q2 నా మొరను ఆలకించండి. \q1 నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి, \q2 వారు నాకంటే బలంగా ఉన్నారు. \q1 \v 7 నేను మీ నామాన్ని స్తుతించేలా, \q2 చెరసాలలో నుండి నన్ను విడిపించండి. \q1 అప్పుడు మీరు చేసిన ఉపకారం చూసి, \q2 నీతిమంతులు నా చుట్టూరా చేరతారు. \c 143 \cl కీర్తన 143 \d దావీదు కీర్తన. \q1 \v 1 యెహోవా, నా ప్రార్థన వినండి; \q2 దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి; \q1 మీ నమ్మకత్వం నీతిని బట్టి \q2 నాకు జవాబివ్వండి. \q1 \v 2 మీ సేవకున్ని తీర్పులోనికి తీసుకురాకండి, \q2 ఎందుకంటే సజీవులెవ్వరూ మీ దృష్టిలో నీతిమంతులు కారు. \q1 \v 3 శత్రువు నన్ను వెంటాడుతున్నాడు, \q2 అతడు నా జీవితాన్ని నలిపివేస్తాడు; \q1 ఎప్పుడో చచ్చిన వారిలా \q2 అతడు నన్ను చీకటిలో నివసించేలా చేస్తాడు. \q1 \v 4 నా ఆత్మ నాలో సొమ్మసిల్లిపోయింది; \q2 నా హృదయం నాలో బెదిరిపోయింది. \q1 \v 5 వెనుకటి రోజులు జ్ఞాపకము చేసుకుంటున్నాను; \q2 మీ క్రియలను గురించి ధ్యానిస్తున్నాను, \q2 మీ చేతిపనిని గురించి ఆలోచిస్తాను. \q1 \v 6 మీ వైవు నా చేతులు చాపుతున్నాను; \q2 ఎండిపోయిన నేల వలె మీ కోసం దప్పిక కలిగి ఉన్నాను. \qs సెలా\qs* \b \q1 \v 7 యెహోవా, నాకు త్వరగా జవాబివ్వండి; \q2 ఆత్మ నీరసించి పోతూ ఉంది. \q1 మీ ముఖాన్ని మరుగు చేయకండి, \q2 లేకపోతే గొయ్యిలో దిగిపోయిన వారిలా నేనుంటాను. \q1 \v 8 నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి, \q2 ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక. \q1 నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను, \q2 నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి. \q1 \v 9 నా కాపుదల కోసం మీ దగ్గరకు పరుగెత్తుతున్నాను, \q2 యెహోవా నా శత్రువుల నుండి నన్ను రక్షించండి. \q1 \v 10 మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి, \q2 మీరు నా దేవుడు; \q1 మీ మంచి ఆత్మ \q2 సమతల నేల మీద నన్ను నడిపించును గాక. \b \q1 \v 11 యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి; \q2 మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి. \q1 \v 12 మీ మారని ప్రేమను బట్టి నా శత్రువులను మౌనం చేయండి; \q2 నేను మీ సేవకుని కాబట్టి, \q2 నా శత్రువులను నాశనం చేయండి. \c 144 \cl కీర్తన 144 \d దావీదు కీర్తన. \q1 \v 1 నా కొండయైన యెహోవాకు స్తుతి కలుగును గాక, \q2 యుద్ధము కోసం నా చేతులకు శిక్షణ, \q2 నా వ్రేళ్ళకు పోరాటం నేర్పారు. \q1 \v 2 ఆయన నా ప్రేమగల దేవుడు, నా కోట, \q2 నా బలమైన కోట, నన్ను విడిపించేవారు. \q1 ఆయనే ప్రజలను నాకు లోబరచే, \q2 నా డాలు నా ఆశ్రయము. \b \q1 \v 3 యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు? \q2 వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు? \q1 \v 4 నరులు కేవలం ఊపిరిలాంటివారు; \q2 దాటిపోయే నీడలా వారి రోజులు ఉంటాయి. \b \q1 \v 5 యెహోవా ఆకాశాలను చీల్చుకొని క్రిందికి దిగిరండి; \q2 పర్వతాలు పొగలు వదిలేలా, వాటిని ముట్టండి. \q1 \v 6 మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి; \q2 బాణాలు వేసి వారిని ఓడించండి. \q1 \v 7 పైనుండి మీ చేయి చాపండి; \q2 గొప్ప జలాల నుండి, \q1 విదేశీయుల చేతుల్లో నుండి, \q2 నన్ను విడిపించండి. \q1 \v 8 వారి నోళ్ళ నిండ అబద్ధాలు, \q2 వారి కుడి చేతులు మోసకరమైనవి. \b \q1 \v 9 నా దేవా, మీకు ఒక క్రొత్త పాట పాడతాను. \q2 పదితంతు వీణతో మీకు సంగీతం చేస్తాను. \q1 \v 10 రాజులకు విజయమిచ్చేది, \q2 మీ సేవకుడైన దావీదును రక్షించేది మీరే. \b \q1 భయంకరమైన ఖడ్గము నుండి \v 11 నన్ను విడిపించండి; \q2 విదేశీయుల చేతుల నుండి నన్ను కాపాడండి \q1 వారి నోళ్ళ నిండ అబద్ధాలు, \q2 వారి కుడి చేతులు మోసకరమైనవి. \b \q1 \v 12 అప్పుడు మా పిల్లలు పెరిగిన మొక్కల్లా, \q2 తమ యవ్వన దశలో ఉంటారు. \q1 మా కుమార్తెలు, \q2 రాజభవనం అలంకరించడం కోసం చెక్కబడిన స్తంభాల్లా ఉంటారు. \q1 \v 13 మా కొట్లు \q2 అన్ని రకాల ధాన్యాలతో నిండి ఉంటాయి. \q1 మా పచ్చికబయళ్లలో గొర్రెల మందలు \q2 వేలల్లో, పది వేలల్లో విస్తరిస్తాయి. \q2 \v 14 మా ఎద్దులు బాగా బరువులు మోస్తాయి. \q1 గోడలు నాశనం కాకూడదు. \q2 చెరలోనికి వెళ్లకూడదు \q2 దుఃఖ ధ్వని వీధుల్లో వినబడ కూడదు. \q1 \v 15 ఇలాంటి స్థితిని అనుభవించే ప్రజలు ధన్యులు; \q2 యెహోవా తమకు దేవునిగా కలిగి ఉండే ప్రజలు ధన్యులు. \c 145 \cl కీర్తన 145\f + \fr 145 \fr*\ft ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.\ft*\f* \d దావీదు వ్రాసిన స్తుతికీర్తన. \q1 \v 1 నా దేవా, నా రాజా! మిమ్మల్ని ఘనపరుస్తాను. \q2 మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను. \q1 \v 2 ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తాను \q2 మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను. \b \q1 \v 3 యెహోవా గొప్పవారు ఆయన స్తుతికి ఎంతో అర్హుడు; \q2 ఆయన గొప్పతనం ఎవరూ గ్రహించలేరు. \q1 \v 4 ఒక తరం వారు మరో తరానికి మీ క్రియలను కొనియాడుతూ చెపుతారు; \q2 మీ బలమైన చర్యలను గురించి చెపుతారు. \q1 \v 5 వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు, \q2 నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను. \q1 \v 6 వారు మీ అద్భుత కార్యాల శక్తి గురించి చెపుతారు, \q2 నేను మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను. \q1 \v 7 వారు మీ సమృద్ధి మంచితనాన్ని స్తుతిస్తారు, \q2 మీ నీతి గురించి సంతోషంగా పాడతారు. \b \q1 \v 8 యెహోవా కృప కలవారు, దయ గలవారు, \q2 త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు. \b \q1 \v 9 యెహోవా అందరికి మంచివారు; \q2 ఆయన చేసిన సృష్టి అంతటి మీద దయ గలవాడు. \q1 \v 10 యెహోవా మీ సృష్టంతా మిమ్మల్ని స్తుతిస్తుంది; \q2 నమ్మకమైన మీ ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు. \q1 \v 11 మీ రాజ్య మహిమ గురించి వారు చెపుతారు \q2 మీ బలము గురించి మాట్లాడతారు, \q1 \v 12 అప్పుడు మనుష్యులందరు మీ గొప్ప చర్యలను \q2 మీ రాజ్యము యొక్క మహిమా వైభవాన్ని తెలుసుకుంటారు. \q1 \v 13 మీ రాజ్యం శాశ్వత రాజ్యం, \q2 మీ ఆధిపత్యం తరతరాలకు నిలుస్తుంది. \b \q1 యెహోవా చేసే వాగ్దానాలన్నిటిలో ఆయన నమ్మదగినవాడు \q2 ఆయన చేసేవాటన్నిటిలో ఆయన నమ్మదగినవాడు.\f + \fr 145:13 \fr*\ft చాలా ప్రా.ప్ర. లలో చివరి రెండు వాక్యాలు లేవు\ft*\f* \q1 \v 14 యెహోవా పడిపోతున్న వారికి సహాయం చేస్తారు, \q2 అలిసిపోయిన వారిని లేవనెత్తుతారు. \q1 \v 15 అందరి కళ్లు మీ వైపు చూస్తాయి, \q2 సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు. \q1 \v 16 మీరు మీ గుప్పిలి విప్పి \q2 జీవులన్నిటి కోరికలు తీరుస్తారు. \b \q1 \v 17 యెహోవా తన మార్గాలన్నిటిలో నీతిమంతుడు. \q2 ఆయన క్రియలన్నిటిలో నమ్మకమైనవాడు. \q1 \v 18 ఆయనకు మొరపెట్టు వారందరికి, \q2 నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు. \q1 \v 19 ఆయనయందు భయము గలవారి కోరికలు తీరుస్తారు; \q2 వారి మొర విని వారిని రక్షిస్తారు. \q1 \v 20 యెహోవా తనను ప్రేమించే వారందరిని కాపాడతారు, \q2 కాని దుష్టులను ఆయన నాశనం చేస్తారు. \b \q1 \v 21 నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది. \q2 శరీరులంతా ఆయన పవిత్ర నామాన్ని \q2 శాశ్వతంగా కీర్తించాలి. \c 146 \cl కీర్తన 146 \q1 \v 1 యెహోవాను స్తుతించండి, \b \q1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. \b \q1 \v 2 జీవితమంతా యెహోవాను స్తుతిస్తాను; \q2 నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి స్తుతి పాడతాను. \q1 \v 3 రాజుల మీద నమ్మకం ఉంచకండి, \q2 నరులు మిమ్మల్ని రక్షించలేరు. \q1 \v 4 వారి ఆత్మ వారిని విడిచినప్పుడు, మట్టిలో కలిసిపోతారు; \q2 వారి ప్రణాళికలు ఆ రోజే అంతరించిపోతాయి. \q1 \v 5 ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో, \q2 ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు. \b \q1 \v 6 ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, \q2 వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. \q2 ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు. \q1 \v 7 ఆయన అణగారిన వారికి న్యాయం చేకూరుస్తారు, \q2 ఆకలిగొనిన వారికి ఆహారం ఇస్తారు. \q1 యెహోవా చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తారు, \q2 \v 8 యెహోవా గుడ్డివారికి చూపునిస్తారు, \q1 యెహోవా క్రుంగి ఉన్నవారిని లేవనెత్తుతారు, \q2 యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు. \q1 \v 9 యెహోవా పరదేశీయులను కాపాడతారు. \q2 తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు. \q2 కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు. \b \q1 \v 10 యెహోవా శాశ్వతకాలం పరిపాలిస్తారు. \q2 సీయోను, మీ దేవుడు తరతరాలకు రాజ్యమేలుతారు. \b \q1 యెహోవాను స్తుతించండి. \c 147 \cl కీర్తన 147 \q1 \v 1 యెహోవాను స్తుతించండి,\f + \fr 147:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\ft ; 20 వచనంలో కూడ చూడండి\ft*\f* \b \q1 మన దేవుని స్తుతించడం ఎంత మంచిది, \q2 ఆయనను స్తుతించడం ఎంత మనోహరమైనది, తగినది! \b \q1 \v 2 యెహోవా యెరూషలేమును కట్టిస్తారు; \q2 ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు. \q1 \v 3 విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. \q2 వారి గాయాలను నయం చేస్తారు. \q1 \v 4 ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు, \q2 సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు. \q1 \v 5 మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలవాడు; \q2 ఆయన గ్రహింపుకు పరిమితి లేదు. \q1 \v 6 యెహోవా దీనులను ఆదరిస్తారు \q2 కాని దుష్టులను నేలమట్టం చేస్తారు. \b \q1 \v 7 యెహోవాకు కృతజ్ఞత స్తుతులు పాడండి; \q2 సితారా మీటి దేవునికి స్తుతులు పాడండి. \b \q1 \v 8 ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు; \q2 భూమికి వర్షమిచ్చి \q2 కొండలపై గడ్డి మొలిపిస్తారు. \q1 \v 9 ఆయన పశువులకు కూసే కాకులకు \q2 ఆహారం సమకూరుస్తారు. \b \q1 \v 10 గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు. \q2 యోధుల కాల్బలంలో ఆనందించరు. \q1 \v 11 ఆయనకు భయపడు వారిని బట్టి, ఆయన మారని ప్రేమ యందు నిరీక్షణ గలవారిని బట్టి \q2 యెహోవా ఆనందిస్తారు. \b \q1 \v 12 యెరూషలేమా, యెహోవాను ఘనపరచు; \q2 సీయోనూ, నీ దేవుని స్తుతించు. \b \q1 \v 13 ఆయన మీ గుమ్మాల గడియలు బలపరుస్తారు \q2 మీలో మీ ప్రజలను దీవిస్తారు. \q1 \v 14 ఆయన మీ పొలిమేరల్లో సమాధానం అనుగ్రహిస్తారు \q2 మంచి గోధుమలతో పంటనిచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారు. \b \q1 \v 15 ఆయన భూమిని ఆజ్ఞాపిస్తారు; \q2 ఆయన శాసనం వేగంగా పరుగెత్తుకొని పోతుంది. \q1 \v 16 ఆయన మంచును తెల్లని ఉన్నిలా పంపిస్తారు \q2 మంచు కణాలను బూడిదలా చెదరగొడతారు. \q1 \v 17 ఆయన వడగండ్లను గులకరాళ్లలా విసిరివేస్తాడు. \q2 ఆయన పుట్టించే తీవ్రమైన చలికి ఎవరు తట్టుకోగలరు? \q1 \v 18 ఆయన తన మాటను పంపుతారు, అవన్నీ కరిగిపోతాయి; \q2 గాలి వీచేటట్టు చేస్తారు, నీళ్లు పారతాయి. \b \q1 \v 19 ఆయన యాకోబుకు తన వాక్కును, \q2 ఇశ్రాయేలుకు తన న్యాయవిధులను శాసనాలను బయలుపరచారు. \q1 \v 20 ఏ ఇతర జాతికి కూడా ఆయన ఈ విధంగా జరిగించలేదు; \q2 ఆయన న్యాయవిధులు వారికి తెలియవు.\f + \fr 147:20 \fr*\ft కొ.ప్రా.ప్ర.లలో \ft*\fqa ఆయన తన న్యాయవిధులు వారికి తెలియపరచలేదు\fqa*\f* \b \q1 యెహోవాను స్తుతించండి. \c 148 \cl కీర్తన 148 \q1 \v 1 యెహోవాను స్తుతించండి.\f + \fr 148:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\ft ; 14 వచనంలో కూడ చూడండి\ft*\f* \b \q1 పరలోకము నుండి యెహోవాను స్తుతించండి; \q2 ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి. \q1 \v 2 యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి; \q2 పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి. \q1 \v 3 సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి. \q2 మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి. \q1 \v 4 ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా \q2 ఆయనను స్తుతించండి. \b \q1 \v 5 అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక, \q2 ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి, \q1 \v 6 ఆయన వాటిని నిత్యం నుండి నిత్యం వరకు స్థాపించారు, \q2 ఆయన ఎన్నటికీ రద్దు చేయబడని శాసనం జారీ చేశారు. \b \q1 \v 7 భూమి మీద ఉన్న గొప్ప సముద్ర జీవులారా యెహోవాను స్తుతించండి, \q2 సమస్త సముద్రపు అగాధాల్లారా, \q1 \v 8 మెరుపులు, వడగళ్ళు, మంచు, మేఘాలు, \q2 ఈదురు గాలులు, \q1 \v 9 పర్వతాల్లారా, సమస్తమైన కొండలారా, \q2 ఫలమిచ్చే చెట్లు, సమస్త దేవదారు వృక్షాల్లారా, \q1 \v 10 మృగాలు, సమస్త పశువులారా, \q2 నేలపై ప్రాకే జీవులు ఎగిరే పక్షులారా, \q1 \v 11 భూరాజులారా సమస్త దేశ ప్రజలారా, \q2 రాకుమారులారా, పాలకులారా, \q1 \v 12 యువకులారా, కన్యలారా, \q2 వృద్ధులారా, పిల్లలారా, యెహోవాను స్తుతించండి. \b \q1 \v 13 వారు యెహోవా నామాన్ని స్తుతించుదురు గాక. \q2 ఆయన నామము మాత్రమే మహోన్నతం; \q2 ఆయన వైభవం భూమిపై ఆకాశంపై ఉన్నది. \q1 \v 14 ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు,\f + \fr 148:14 \fr*\fq కొమ్ము \fq*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తుంది\ft*\f* \q2 అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు, \q2 ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి. \b \q1 యెహోవాను స్తుతించండి. \c 149 \cl కీర్తన 149 \q1 \v 1 యెహోవాను స్తుతించండి.\f + \fr 149:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa హల్లెలూయా\fqa*\ft ; 9 వచనంలో కూడ\ft*\f* \b \q1 యెహోవాకు క్రొత్త పాట పాడండి, \q2 ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి. \b \q1 \v 2 ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక; \q2 సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక. \q1 \v 3 వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు \q2 తంబురతో సితారాతో గానం చేస్తారు. \q1 \v 4 యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు; \q2 దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు. \q1 \v 5 ఆయన యొక్క నమ్మకమైన ప్రజలు ఈ ఘనతలో సంతోషించుదురు గాక. \q2 వారు వారి పడకలో ఆనందంతో పాడుదురు గాక. \b \q1 \v 6 వారి నోళ్ళలో దేవుని స్తుతి \q2 వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక. \q1 \v 7 దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి \q2 ప్రజలను శిక్షించడానికి, \q1 \v 8-9 వారి రాజులను సంకెళ్ళతో, \q2 ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి, \q1 వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది, \q2 ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది. \b \q1 యెహోవాను స్తుతించండి. \c 150 \cl కీర్తన 150 \q1 \v 1 యెహోవాను స్తుతించండి.\f + \fr 150:1 \fr*\ft హల్లెలూయా\ft*\ft ; 6 వచనంలో కూడ\ft*\f* \b \q1 పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి; \q2 ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి. \q1 \v 2 ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి; \q2 ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి. \q1 \v 3 బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, \q2 సితారా, వీణలతో ఆయనను స్తుతించండి. \q1 \v 4 కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి, \q2 తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి. \q1 \v 5 తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో, \q2 ఆయనను స్తుతించండి. \b \q1 \v 6 ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి. \b \q1 యెహోవాను స్తుతించండి.