\id PRO - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h సామెతలు \toc1 సామెతల గ్రంథం \toc2 సామెతలు \toc3 సామెత \mt1 సామెతల \mt2 గ్రంథం \c 1 \ms1 ఉద్దేశ్యం అంశం \p \v 1 దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు: \q1 \v 2 జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందడం కోసం; \q2 అంతరార్థంతో కూడిన పదాలను గ్రహించడం కోసం; \q1 \v 3 వివేకంతో కూడిన ప్రవర్తన కోసం, \q2 సరియైనది, న్యాయమైనది చేయడానికి ఉపదేశం పొందడం కోసం; \q1 \v 4 సామాన్యులకు\f + \fr 1:4 \fr*\fq సామాన్యులకు \fq*\ft సామెతల గ్రంథంలో, హెబ్రీలో ఉపయోగించబడిన పదం \ft*\ft నైతిక దిశ లేకుండా, చెడు వైపు మొగ్గు చూపే, తెలివితక్కువ వ్యక్తిని సూచిస్తుంది.\ft*\f* బుద్ధి కలిగించడం కోసం, \q2 యవ్వనస్థులకు తెలివి వివేకం కలిగించడం కోసం, \q1 \v 5 జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు, \q2 వివేకంగలవారు ఉపదేశం పొందుకుంటారు. \q1 \v 6 వారు సామెతలు, నీతికథలు, \q2 జ్ఞానుల సూక్తులు, చిక్కుప్రశ్నలను గ్రహిస్తారు. \b \q1 \v 7 యెహోవాయందు భయం తెలివికి మూలం, \q2 అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు. \ms1 ముందుమాట: జ్ఞానాన్ని హత్తుకోమని హెచ్చరికలు \s1 పాపిష్ఠి మనుష్యుల ఆహ్వానానికి వ్యతిరేకంగా హెచ్చరిక \q1 \v 8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను \q2 నీ తల్లి బోధను త్రోసివేయవద్దు. \q1 \v 9 అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా \q2 నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి. \b \q1 \v 10 నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే, \q2 నీవు వారికి లొంగిపోవద్దు. \q1 \v 11 ఒకవేళ వారు, “మాతో కూడా రా; \q2 నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి దాగి ఉందాం; \q2 హాని చేయని ప్రాణం మీద ఆకస్మిక దాడి చేద్దాం; \q1 \v 12 పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం, \q2 సమాధిలోనికి దిగువారి వలె పూర్ణబలంతో ఉండగానే వారిని మ్రింగివేద్దాం; \q1 \v 13 అన్ని రకాల విలువైన వస్తువులు మనం తెచ్చి \q2 మన ఇళ్ళను దోపుడు సొమ్ముతో నింపుకొందాం; \q1 \v 14 మాతో చీట్లు వేయండి; \q2 మనం దొంగిలించిన దానిని మనమందరం పంచుకుందాము.” \q1 \v 15 నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి, \q2 వారి దారుల్లో నీ పాదాలు పెట్టకు; \q1 \v 16 కీడు చేయడానికి వారి పాదాలు పరుగెత్తుతాయి, \q2 మనుష్యులను చంపడానికి త్వరపడతారు. \q1 \v 17 రెక్కలు గల పక్షులు చూస్తుండగా \q2 వల వేయడం నిష్ప్రయోజనం! \q1 \v 18 అయితే ఈ మనుష్యులు తమ నాశనానికే పొంచి ఉంటారు; \q2 తమ ప్రాణాన్ని తామే తీసుకోవడానికి వారు దాక్కొని ఉంటారు! \q1 \v 19 అక్రమ సంపాదన వెంటపడే వారందరి దారులు అలాంటివే; \q2 అది దానిని సొంతం చేసుకున్న వారి ప్రాణాలు తీస్తుంది. \s1 జ్ఞానం యొక్క మందలింపు \q1 \v 20 జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది, \q2 అది బహిరంగ స్థలాల్లో తన గొంతు గట్టిగా వినిపిస్తుంది; \q1 \v 21 అధిక రద్దీ ఉండే వీధి చివర్లలో అది కేక వేస్తుంది, \q2 పట్టణ ద్వారాల దగ్గర ఆమె తన ప్రసంగం చేస్తుంది: \b \q1 \v 22 “బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు? \q2 ఎగతాళి చేసేవారు ఎన్నాళ్ళు ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు? \q2 బుద్ధిహీనులు ఎన్నాళ్ళు తెలివిని అసహ్యించుకుంటారు? \q1 \v 23 నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి! \q2 అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను, \q2 నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను. \q1 \v 24 కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున \q2 నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున, \q1 \v 25 మీరు నా సలహాను లెక్కచేయనందున \q2 నా గద్దింపును అంగీకరించనందున, \q1 \v 26 ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను; \q2 విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను, \q1 \v 27 విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు, \q2 ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు, \q2 మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను. \b \q1 \v 28 “అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను; \q2 నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను, \q1 \v 29 వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు, \q2 యెహోవాకు భయపడాలని వారు కోరలేదు కాబట్టి. \q1 \v 30 వారు నా సలహాను అంగీకరించలేదు \q2 నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి, \q1 \v 31 వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు \q2 వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు. \q1 \v 32 మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు, \q2 బుద్ధిహీనుల నిర్లక్ష్యం వారిని నాశనం చేస్తుంది; \q1 \v 33 నా మాటలను వినేవారు క్షేమంగా నివసిస్తారు; \q2 కీడు కలుగుతుందనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు.” \c 2 \s1 జ్ఞానం యొక్క నైతిక ప్రయోజనాలు \q1 \v 1 నా కుమారుడా, నీవు నా మాటలను విని \q2 నా ఆజ్ఞలను నీలో దాచుకొంటే, \q1 \v 2 జ్ఞానం వైపు నీవు చెవిపెట్టి, \q2 హృదయపూర్వకంగా అవగాహన చేసుకోవాలి. \q1 \v 3 నీవు అంతరార్థం కోసం మొరపెడితే, \q2 వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే, \q1 \v 4 వెండిని వెదికినట్లు దానిని వెదికితే, \q2 దాచబడిన నిధులను వెదికినట్లు దానిని వెదికితే, \q1 \v 5 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు, \q2 దేవుని తెలివిని కనుగొంటావు. \q1 \v 6 ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు; \q2 తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి. \q1 \v 7 యథార్థవంతులకు విజయం దాచి ఉంచేది ఆయనే, \q2 నిందారహితులుగా నడుచుకొనే వారికి ఆయనే డాలు. \q1 \v 8 ఎందుకంటే న్యాయం యొక్క కాలగతులు కాపాడేది ఆయనే, \q2 తన నమ్మకమైన వారిని కాపాడేది ఆయనే. \b \q1 \v 9 అప్పుడు నీవు నీతిన్యాయాలను యథార్థతను, \q2 ప్రతి మంచి మార్గాన్ని గ్రహిస్తావు. \q1 \v 10 జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది, \q2 తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది. \q1 \v 11 బుద్ధి నిన్ను కాపాడుతుంది, \q2 వివేకం నీకు కావలి కాస్తుంది. \b \q1 \v 12 దుష్టుల చెడు మార్గాల నుండి, \q2 మూర్ఖంగా మాట్లాడేవారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది. \q1 \v 13 అలాంటివారు చీకటిదారిలో నడవడానికి, \q2 తిన్నని మార్గాలను విడిచిపెడతారు. \q1 \v 14 చెడు చేయడంలో సంతోషిస్తారు, \q2 దుర్మార్గుల మూర్ఖత్వాన్ని బట్టి ఆనందిస్తారు. \q1 \v 15 వారి త్రోవలు సరియైనవి కావు \q2 వారు వంచనతో ఆలోచిస్తారు. \b \q1 \v 16 జ్ఞానం నిన్ను వ్యభిచార స్త్రీ నుండి, \q2 మోహపు మాట్లాడే దారితప్పిన స్త్రీ నుండి కాపాడుతుంది. \q1 \v 17 అలాంటి స్త్రీ తన యవ్వన కాలపు భర్తను విడిచిపెట్టి \q2 దేవుని ఎదుట తాను చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. \q1 \v 18 ఖచ్చితంగా దాని ఇల్లు మరణం దగ్గరకు నడిపిస్తుంది, \q2 దాని త్రోవలు చనిపోయినవారి దగ్గరకు దారితీస్తాయి. \q1 \v 19 ఆ స్త్రీ దగ్గరకు వెళ్లిన ఎవరూ తిరిగి రారు \q2 జీవమార్గాలను వారు చేరుకోలేరు. \b \q1 \v 20 కాబట్టి నీవు మంచి మార్గాల్లో నడుచుకోవాలి, \q2 నీతిమంతుల ప్రవర్తనను అనుసరించాలి. \q1 \v 21 యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, \q2 ఏ తప్పుచేయని వారే దానిలో నిలిచి ఉంటారు. \q1 \v 22 కాని దుర్మార్గులు దేశం నుండి తొలగించబడతారు \q2 ద్రోహులు దాని నుండి నిర్మూలం చేయబడతారు. \c 3 \s1 జ్ఞానం క్షేమాన్ని కలిగిస్తుంది \q1 \v 1 నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు, \q2 నా ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో, \q1 \v 2 అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి, \q2 నీకు సమాధానాన్ని వృద్ధిని కలిగిస్తాయి. \b \q1 \v 3 ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు; \q2 నీ మెడలో వాటిని ధరించుకో, \q2 నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో. \q1 \v 4 అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను \q2 దయపొంది మంచివాడవని అనిపించుకుంటావు. \b \q1 \v 5 నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు \q2 నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు; \q1 \v 6 నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు, \q2 అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు. \b \q1 \v 7 నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు; \q2 యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు. \q1 \v 8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, \q2 నీ ఎముకలకు బలం కలుగుతుంది. \b \q1 \v 9 నీ ధనముతో, \q2 నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు; \q1 \v 10 అప్పుడు నీ ధాన్యాగారాలు నిండి సమృద్ధిగా ఉంటాయి, \q2 నీ గానుగ తొట్టెలు క్రొత్త ద్రాక్షరసంతో పొంగిపొర్లుతాయి. \b \q1 \v 11 నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు \q2 ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు. \q1 \v 12 ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు, \q2 యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు. \b \q1 \v 13 జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు, \q2 వివేచన కలిగినవారు ధన్యులు. \q1 \v 14 ఎందుకంటే ఆమె\f + \fr 3:14 \fr*\fq ఆమె \fq*\fqa జ్ఞానాన్ని \fqa*\ft సూచిస్తుంది\ft*\f* వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం, \q2 ఆమె బంగారం కంటే ఎక్కువ లాభం తెస్తుంది. \q1 \v 15 ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది; \q2 నీకు ఇష్టమైనవేవి ఆమెతో సమానం కావు. \q1 \v 16 దాని కుడి చేతిలో దీర్ఘాయువు; \q2 ఎడమ చేతిలో ఐశ్వర్యం ఘనతలు ఉన్నాయి. \q1 \v 17 దాని మార్గాలు ఎంతో అనుకూలమైనవి \q2 దాని త్రోవలన్ని సమాధానకరమైనవి. \q1 \v 18 ఆమెను కలిగి ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది; \q2 దానిని స్థిరంగా పట్టుకుని ఉన్నవారు ధన్యులు. \b \q1 \v 19 యెహోవా జ్ఞానం వలన భూమికి పునాదులు వేశారు, \q2 ఆయన తెలివి వలన ఆకాశ విశాలాన్ని ఏర్పరిచారు; \q1 \v 20 ఆయన తెలివి వలన అగాధజలాలు విభజించబడ్డాయి. \q2 మేఘాల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి. \b \q1 \v 21 నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో, \q2 వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు; \q1 \v 22 అవి నీకు జీవంగా, \q2 నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి. \q1 \v 23 అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు, \q2 నీ పాదం తడబడదు. \q1 \v 24 నీవు పడుకున్నప్పుడు, భయపడవు; \q2 నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది. \q1 \v 25 హఠాత్తుగా భయం కలిగినప్పుడు, \q2 దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు. \q1 \v 26 యెహోవా నీ ప్రక్కన ఉంటారు, \q2 నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు. \b \q1 \v 27 నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు, \q2 అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు. \q1 \v 28 నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి, \q2 “రేపు రా నేను ప్రయత్నిస్తాను” \q2 అని నీ పొరుగువానితో అనవద్దు. \q1 \v 29 నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు \q2 వారికి హాని తలపెట్టవద్దు. \q1 \v 30 నీకు హాని చేయని మనుష్యులతో, \q2 కారణం లేకుండా వాదించవద్దు. \b \q1 \v 31 హింసాత్మకమైనవారిని అసూయ పడకు, \q2 వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు. \b \q1 \v 32 మూర్ఖులు యెహోవాకు అసహ్యులు \q2 కాని యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు. \q1 \v 33 దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది, \q2 కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు. \q1 \v 34 ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు \q2 కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు. \q1 \v 35 జ్ఞానులు ఘనతను పొందుతారు, \q2 మూర్ఖులు అవమానాన్ని పొందుతారు. \c 4 \s1 ఎలాగైనా జ్ఞానం సంపాదించండి \q1 \v 1 నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి; \q2 వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి. \q1 \v 2 మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను, \q2 కాబట్టి నా బోధను త్రోసివేయకండి. \q1 \v 3 నేను కూడా నా తండ్రికి కుమారుడను, \q2 నా తల్లికి నేను ఏకైక సుకుమారుడను. \q1 \v 4 నా తండ్రి నాకు బోధించి, నాతో చెప్పిందేమిటంటే, \q2 “నీ హృదయపూర్వకంగా నా మాటలను గట్టిగా పట్టుకో; \q2 నా ఆజ్ఞలను పాటించు, నీవు బ్రతుకుతావు. \q1 \v 5 జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో; \q2 నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు. \q1 \v 6 నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది; \q2 నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది. \q1 \v 7 జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో. \q2 నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో. \q1 \v 8 దానిని నీవు గారాబం చేస్తే, అది నిన్ను హెచ్చిస్తుంది; \q2 దానిని నీవు హత్తుకుంటే అది నీకు ఘనత కలిగిస్తుంది. \q1 \v 9 అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది \q2 అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.” \b \q1 \v 10 నా కుమారుడా, ఆలకించు, నేను చెప్తుంది అంగీకరించు, \q2 నీవు దీర్ఘకాలం జీవిస్తావు. \q1 \v 11 నేను జ్ఞాన మార్గంలో నీకు బోధిస్తాను \q2 తిన్నని మార్గాల్లో నిన్ను నడిపిస్తాను. \q1 \v 12 నీవు నడుస్తున్నప్పుడు, నీ అడుగు ఇరుకున పడదు. \q2 నీవు పరుగెత్తినప్పుడు, నీ పాదాలు తడబడవు. \q1 \v 13 ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు; \q2 అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో. \q1 \v 14 దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు \q2 కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు. \q1 \v 15 దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు; \q2 దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో. \q1 \v 16 కీడు చేయనిదే వారు నిద్రపోలేరు; \q2 ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు. \q1 \v 17 వారు దుర్మార్గమనే ఆహారం తింటారు \q2 హింస అనే ద్రాక్షరసాన్ని త్రాగుతారు. \b \q1 \v 18 నీతిమంతుల మార్గం ఉదయించే సూర్యునిలా, \q2 పూర్తి పగటి వెలుగు వచ్చేవరకు ప్రకాశిస్తుంది. \q1 \v 19 కాని దుష్టుల మార్గం కటిక చీకటిమయం; \q2 వారు దేని చేత తొట్రిల్లుతున్నారో వారికే తెలియదు. \b \q1 \v 20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; \q2 నా వాక్యాలకు నీ చెవియొగ్గు. \q1 \v 21 నీ కళ్ళెదుట నుండి నా మాటలు తొలగిపోనివ్వకు, \q2 నీ హృదయంలో నా మాటలు భద్రపరచుకో. \q1 \v 22 వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని, \q2 వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. \q1 \v 23 అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో, \q2 ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి. \q1 \v 24 నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో; \q2 మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో. \q1 \v 25 నీ కళ్లు నేరుగా చూచును గాక; \q2 నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక. \q1 \v 26 నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో \q2 నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి. \q1 \v 27 నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు. \q2 నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి. \c 5 \s1 వ్యభిచారానికి వ్యతిరేకంగా హెచ్చరిక \q1 \v 1 నా కుమారుడా, జ్ఞానంగల నా మాటలు విను, \q2 అంతరార్థం గల నా మాటలకు నీ చెవిని త్రిప్పు, \q1 \v 2 అప్పుడు నీవు విచక్షణ కలిగి ఉంటావు \q2 నీ పెదవులు తెలివిని కాపాడతాయి. \q1 \v 3 వ్యభిచారం చేసే స్త్రీ పెదవులు తేనె బిందువులాంటివి, \q2 దాని నోరు నూనె కంటే నునుపైనది; \q1 \v 4 కాని చివరకు అది పైత్యరసమంత చేదుగా, \q2 రెండంచులు గల ఖడ్గమంత పదునుగా ఉంటుంది. \q1 \v 5 దాని పాదాలు మరణానికి దిగుతాయి; \q2 దాని అడుగులు నేరుగా సమాధి వైపుకు వెళ్తాయి. \q1 \v 6 అది జీవన విధానానికి ఎటువంటి ఆలోచన ఇవ్వదు; \q2 దాని మార్గాలు లక్ష్యం లేకుండా తిరుగుతాయి, కానీ దానికి ఆ విషయం తెలియదు. \b \q1 \v 7 నా కుమారులారా, నా మాట ఆలకించండి; \q2 నేను చెప్పే వాటినుండి ప్రక్కకు తొలగవద్దు. \q1 \v 8 దానికి దూరంగా ఉన్న దారిలో ఉండండి, \q2 దాని ఇంటి తలుపు దగ్గరకు వెళ్లవద్దు, \q1 \v 9 పరులకు మీ వైభవాన్ని\f + \fr 5:9 \fr*\ft లేదా \ft*\fqa ఒకవేళ ఇస్తే, నీవు నీ గౌరవాన్ని పోగొట్టుకుంటావు\fqa*\f* ఇవ్వవద్దు, \q2 మీ హుందాతనాన్ని క్రూరులకు ఇవ్వవద్దు. \q1 \v 10 అపరిచితులు మీ సంపదను తినివేయకూడదు \q2 మీ శ్రమ మరొకరి ఇంటిని సుసంపన్నం చేయకూడదు. \q1 \v 11 మీ జీవితం చివరి దశలో \q2 మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు. \q1 \v 12 అప్పుడు మీరంటారు, “నేను క్రమశిక్షణను అసహ్యించుకోవడమేంటి! \q2 నా హృదయం దిద్దుబాటును తిరస్కరించడమేంటి! \q1 \v 13 నేను నా బోధకులకు లోబడలేదు, \q2 నా ఉపదేశకులకు నేను చెవియొగ్గ లేదు. \q1 \v 14 సర్వసమాజం మధ్య \q2 నేను దాదాపు పతనానికి వచ్చాను అనుకుంటూ బాధపడతారు.” \b \q1 \v 15 మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి, \q2 మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి. \q1 \v 16 మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? \q2 వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా? \q1 \v 17 వాటిని మీకు మాత్రమే చెందినవిగా ఉండనివ్వండి, \q2 అపరిచితులతో ఎన్నడు పంచుకోవద్దు. \q1 \v 18 నీ ఊట ఆశీర్వదించబడును గాక, \q2 నీ యవ్వన కాలమందు నీ భార్య యందు సంతోషించు. \q1 \v 19 ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి \q2 ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడు తృప్తి కలుగజేయును గాక, \q2 ఆమె ప్రేమతో నీవు ఎల్లప్పుడు మత్తులో ఉందువు గాక. \q1 \v 20 ఎందుకు, నా కుమారుడా, మరొకని భార్యతో మత్తులో ఉంటావు? \q2 దారితప్పిన స్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుంటావు? \b \q1 \v 21 ఎందుకంటే మనుష్యుల మార్గాలు యెహోవా కళ్ళెదుట ఉన్నాయి, \q2 ఆయన వారి మార్గాలన్నిటిని పరిశీలిస్తారు. \q1 \v 22 దుష్టుల చెడు క్రియలు వారిని చిక్కుల్లో పెడతాయి; \q2 వారి పాపపు త్రాళ్లు వారిని గట్టిగా బిగిస్తాయి. \q1 \v 23 క్రమశిక్షణ లేకపోవడం వల్ల వారు చస్తారు, \q2 వారి సొంత అతి మూర్ఖత్వం ద్వార దారి తప్పారు. \c 6 \s1 మూర్ఖత్వానికి వ్యతిరేకంగా హెచ్చరికలు \q1 \v 1 నా కుమారుడా, నీవు నీ పొరుగువాని రుణానికి భద్రత ఇచ్చివుంటే, \q2 చేతిలో చేయి వేసి అపరిచితునికి హామీ ఇచ్చివుంటే, \q1 \v 2 నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు, \q2 నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. \q1 \v 3 నా కుమారుడా, నీవు నీ పొరుగువారి చేతుల్లో పడ్డావు, \q2 కాబట్టి నిన్ను నీవు విడిపించుకోడానికి ఇలా చేయాలి: \q1 వెళ్లి అలసిపోయేవరకు,\f + \fr 6:3 \fr*\ft లేదా \ft*\fqa నిన్ను నీవు తగ్గించుకొని\fqa*\f* \q2 నీ పొరుగువారికి విశ్రాంతి ఇవ్వకు! \q1 \v 4 నీ కళ్ళకు నిద్ర గాని, \q2 నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు. \q1 \v 5 వేటగాని చేతి నుండి జింక తప్పించుకున్నట్లుగా, \q2 బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా, నీవు తప్పించుకో. \b \q1 \v 6 సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు; \q2 అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో. \q1 \v 7 వాటికి అధిపతులు లేరు, \q2 పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు, \q1 \v 8 అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, \q2 కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి. \b \q1 \v 9 సోమరీ, ఎప్పటి వరకు నీవు పడుకుంటావు? \q2 ఎప్పుడు నిద్ర లేస్తావు? \q1 \v 10 ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, \q2 ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను అంటావు. \q1 \v 11 పేదరికం నీ మీదికి దొంగలా, \q2 లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది. \b \q1 \v 12 వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, \q2 పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు. \q2 \v 13 వాడు ద్వేషపూరితంగా కన్నుగీటుతూ, \q2 తన పాదాలతో సైగలు చేస్తూ \q2 తన వ్రేళ్ళతో సంజ్ఞలు చేస్తాడు. \q2 \v 14 అతడు తన హృదయంలో వికృత ఆలోచనలతో కీడును తలపెడతాడు, \q2 అతడు అన్ని సమయాల్లో వివాదాన్ని వ్యాప్తి చేస్తాడు. \q1 \v 15 కాబట్టి దుష్టుని మీదికి విపత్తు అకస్మాత్తుగా వస్తుంది; \q2 వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే కూలిపోతాడు. \b \li1 \v 16 యెహోవాకు హేయమైనవి ఆరు, \li2 ఆయనకు హేయమైనవి ఏడు కలవు. \li3 \v 17 అవి ఏమనగా, అహంకారపు కళ్లు, \li3 అబద్ధమాడే నాలుక, \li3 నిర్దోషులను చంపే చేతులు. \li3 \v 18 చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, \li3 కీడు చేయడానికి త్వరపడే పాదాలు, \li3 \v 19 అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, \li3 సమాజంలో గొడవ రేపే వ్యక్తి. \s1 వ్యభిచారానికి వ్యతిరేకంగా హెచ్చరిక \q1 \v 20 నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు పాటించు \q2 నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు. \q1 \v 21 వాటిని ఎప్పుడు నీ హృదయంలో పదిలంగా ఉంచుకో; \q2 నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో. \q1 \v 22 నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి; \q2 నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి. \q2 నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి. \q1 \v 23 ఈ ఆజ్ఞ దీపంగా \q2 ఈ బోధ వెలుగుగా \q1 క్రమశిక్షణ కోసమైన దిద్దుబాట్లుగా \q2 జీవమార్గాలుగా ఉండి, \q1 \v 24 వ్యభిచార స్త్రీ దగ్గరకు వెళ్లకుండ \q2 దారితప్పిన స్త్రీ పలికే మాటలకు లొంగిపోకుండ నిన్ను కాపాడతాయి. \b \q1 \v 25 నీ హృదయంలో ఆమె అందాన్ని మోహించకు \q2 తన కళ్లతో నిన్ను వశపరచుకోనియ్యకు. \b \q1 \v 26 ఎందుకంటే ఒక వేశ్యను రొట్టె ముక్కకైనా పొందవచ్చు, \q2 కానీ మరొకని భార్య నీ జీవితాన్నే వేటాడుతుంది. \q1 \v 27 ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ \q2 తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా? \q1 \v 28 తన పాదాలు కాలకుండ \q2 ఎవరైనా నిప్పుల మీద నడవగలరా? \q1 \v 29 మరొకని భార్యతో పడుకునే వాడు కూడా అంతే; \q2 ఆమెను తాకేవాడు శిక్షను తప్పించుకోలేడు. \b \q1 \v 30 ఆకలితో అలమటిస్తూ ఉండి ఆకలి తీర్చుకోవడానికి \q2 దొంగ దొంగతనం చేస్తే ప్రజలు వాన్ని చులకనగా చూడరు. \q1 \v 31 అయినాసరే వాడు దొరికితే, వాడు ఏడంతలు చెల్లించాలి, \q2 దానికి తన ఇంటి సంపదంతా ఖర్చైనా సరే. \q1 \v 32 అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు; \q2 అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు. \q1 \v 33 దెబ్బలు, అవమానం వాని భాగం, \q2 వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు. \b \q1 \v 34 ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది, \q2 ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు. \q1 \v 35 అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు; \q2 ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు. \c 7 \s1 వ్యభిచార స్త్రీకి వ్యతిరేకంగా హెచ్చరిక \q1 \v 1 నా కుమారుడా, నా మాటలు పాటించు, \q2 నా ఆజ్ఞలను నీలో భద్రపరచుకో. \q1 \v 2 నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు బ్రతుకుతావు; \q2 నా బోధనలను నీ కనుపాపలా కాపాడు. \q1 \v 3 నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో; \q2 నీ హృదయ పలక మీద వ్రాసుకో. \q1 \v 4 జ్ఞానంతో, “నీవు నా సోదరివి” \q2 అంతరార్థంతో, “నీవు నాకు బంధువువనియు చెప్పు.” \q1 \v 5 అవి నిన్ను వ్యభిచారిణి నుండి కాపాడతాయి, \q2 దారితప్పిన స్త్రీ యొక్క మోహపు మాటల నుండి నిన్ను కాపాడతాయి. \b \q1 \v 6 నేను నా ఇంటి కిటికీ దగ్గర \q2 జాలి గుండా బయటకు చూశాను. \q1 \v 7 బుద్ధిహీనుల మధ్య, \q2 యువకుల మధ్య, \q2 వివేచనలేని ఒక యువకుని నేను చూశాను. \q1 \v 8 అతడు వ్యభిచారి మూలన ఉండే సందు దగ్గరకు వెళ్తున్నాడు, \q2 దాని ఇంటి వైపే నడుస్తున్నాడు \q1 \v 9 అది సాయంత్రం ముగిసి, \q2 చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి. \b \q1 \v 10 అంతలో వేశ్యలా ముస్తాబై జిత్తులమారి ఉద్దేశంతో, \q2 ఒక స్త్రీ అతన్ని కలవడానికి వచ్చింది. \q1 \v 11 (ఆమె కట్టుబాట్లు లేనిది తిరుగుబాటు చేసేది, \q2 దాని కాళ్లు దాని ఇంట్లో నిలువవు; \q1 \v 12 అది వీధుల్లో తిరుగుతుంది, \q2 ఎవరైనా దొరుకుతారేమోనని ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది.) \q1 \v 13 అది ఆ యవ్వనస్థుని పట్టుకుని ముద్దు పెట్టుకుంది \q2 సిగ్గులేని ముఖం పెట్టుకొని ఇలా అన్నది: \b \q1 \v 14 “నేడు నేను నా మ్రొక్కుబడులు చెల్లించాను, \q2 ఇంటి దగ్గర నా సమాధానబలి అర్పణలోని ఆహారం ఉంది. \q1 \v 15 కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను; \q2 నిన్ను వెదుకుతూ బయలుదేరగా నీవే కనబడ్డావు! \q1 \v 16 నా మంచం మీద ఈజిప్టు నుండి తెచ్చిన \q2 రంగుల నార దుప్పట్లు పరిచాను. \q1 \v 17 నా పరుపు మీద నేను మంచి సువాసనగల \q2 గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను. \q1 \v 18 తెల్లవారే వరకు వలపు తీర తృప్తి పొందుదాం; \q2 మనం హాయిగా అనుభవించుదాం! \q1 \v 19 నా భర్త ఇంట్లో లేడు; \q2 దూర ప్రయాణం వెళ్లాడు. \q1 \v 20 అతడు దూర ప్రయాణానికి సరిపడేంత డబ్బు సంచి చేతిలో పట్టుకుని వెళ్లాడు. \q2 రెండు వారాల వరకు తిరిగి రాడు.” \b \q1 \v 21 ఆ యువకుని వశపరచుకోవడానికి ఆ వేశ్య శతవిధాల ప్రయత్నించింది; \q2 దాని మృదువైన మాటలు అతన్ని మాయ చేశాయి. \q1 \v 22 అతడు మూర్ఖునిలా ఒక్కసారిగా \q2 వధకు వెళ్లే ఎద్దులా, \q1 ఉచ్చులోకి దిగిన జింకలా\f + \fr 7:22 \fr*\ft హెబ్రీలో \ft*\fqa బుద్ధిహీనుని\fqa*\f* దాని వెంటపడ్డాడు, \q2 \v 23 తన ప్రాణానికి అపాయం ఉందని తెలియక, \q1 ఉరి దగ్గరకు పక్షి త్వరపడునట్లు, \q2 వాని గుండెను బాణంతో చీల్చే వరకు వాడు దాని వెంట వెళ్లాడు. \b \q1 \v 24 కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి; \q2 నా మాటలు విను. \q1 \v 25 వేశ్య మార్గాల తట్టు నీ హృదయాన్ని వెళ్లనీయకు \q2 దారి తప్పి అది వెళ్లే దారిలో వెళ్లకు. \q1 \v 26 అది గాయపరచి చంపినవారు లెక్కలేనంత మంది; \q2 అది పడద్రోసిన వారు అనేకులు. \q1 \v 27 దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, \q2 దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది. \c 8 \s1 జ్ఞానం యొక్క ప్రకటన \q1 \v 1 జ్ఞానం ప్రకటించడం లేదా? \q2 తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా? \q1 \v 2 కొండ శిఖరాల మీదను, మార్గము ప్రక్కగా, \q2 దారులు కలిసే చోట ఆమె నిలువబడి ఉన్నది; \q1 \v 3 పట్టణంలోకి వెళ్లే గుమ్మముల ప్రక్కన, \q2 ప్రవేశం దగ్గర, జ్ఞానం నిలువబడి, ఇలా కేకలు వేస్తుంది: \q1 \v 4 మనుష్యులారా, మిమ్మల్నే నేను పిలుస్తున్నాను; \q2 మనుష్యులందరికి నా కంఠస్వరం వినిపిస్తున్నాను. \q1 \v 5 అజ్ఞానులారా, వివేకాన్ని సంపాదించుకోండి, \q2 మూర్ఖులారా; వివేకంపై మనస్సు పెట్టండి.\f + \fr 8:5 \fr*\ft హెబ్రీలో \ft*\fqa మీ హృదయాలకు ఉపదేశించండి\fqa*\f* \q1 \v 6 వినండి, నేను ఎంతో మంచి సంగతులను చెప్తున్నాను; \q2 నా పెదవులు న్యాయాన్ని మాత్రమే పలుకుతాయి. \q1 \v 7 నా నోరు సత్యం మాట్లాడుతుంది, \q2 నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి. \q1 \v 8 నా నోటి మాటలన్నీ న్యాయమైనవి; \q2 వాటిలో క్రూరత్వం గాని అబద్ధం గాని లేవు. \q1 \v 9 నా మాటలు వివేచనగలవానికి యథార్థమైనవిగా; \q2 జ్ఞానవంతునికి తేటగా ఉంటాయి. \q1 \v 10 వెండికి ఆశపడక నేను చెప్పు మాటలను అంగీకరించండి, \q2 మేలిమి బంగారానికి ఆశపడక తెలివిని సంపాదించండి. \q1 \v 11 జ్ఞానం, ముత్యాల కంటే శ్రేష్ఠమైనది, \q2 విలువగల వస్తువులు ఏమియు దానితో సరికావు. \b \q1 \v 12 “నేను, జ్ఞానం, వివేకంతో కలిసి నివసిస్తాను; \q2 నాకు జ్ఞానం, విచక్షణ ఉన్నాయి. \q1 \v 13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; \q2 గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, \q2 అబద్ధపు మాటలు నాకు అసహ్యము. \q1 \v 14 ఆలోచన చెప్పడం, మంచి జ్ఞానాన్ని ఇవ్వడం నా పని; \q2 నేను అంతరార్థం కలిగి ఉన్నాను, పరాక్రమం నాదే. \q1 \v 15 నా వలననే రాజులు రాజ్యాలను పరిపాలిస్తారు; \q2 పాలకులు న్యాయాన్ని బట్టి పరిపాలన చేస్తారు. \q1 \v 16 నా వలననే రాజకుమారులు ఏలుతారు, \q2 నీతిగల అధిపతులు భూమిమీద ప్రభుత్వం చేస్తారు. \q1 \v 17 నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, \q2 నన్ను వెదకేవారికి దొరుకుతాను. \q1 \v 18 ఐశ్వర్యం, గౌరవం, \q2 స్ధిరమైన ఆస్తి, నీతి నా దగ్గర ఉన్నాయి. \q1 \v 19 మేలిమి బంగారముకంటెను నా వలన కలిగే ఫలం మంచిది; \q2 శ్రేష్ఠమైన వెండికంటెను నా వలన కలిగే లాభం గొప్పది. \q1 \v 20 నీతి మార్గాల్లోను, \q2 న్యాయమైన మార్గాల్లోను నేను నడుస్తూ ఉన్నాను. \q1 \v 21 నన్ను ప్రేమించేవారిని కలిమికి కర్తలుగా చేస్తాను \q2 వారి ధనాగారాన్ని సమృద్ధితో నింపుతాను. \b \q1 \v 22 “యెహోవా తన సృష్టి ఆరంభ దినాన తాను చేసినపనులలో \q2 మొదటి పనిగా నన్ను చేశారు; \q1 \v 23 మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని \q2 నేను నియమించబడ్డాను. \q1 \v 24 ప్రవహించే కాలువలు లేనప్పుడు \q2 నీళ్లతో నిండి ఉన్న నీటి ఊటలు లేనప్పుడు నేను పుట్టాను. \q1 \v 25 పర్వతములు సృష్టించబడక ముందు, \q2 కొండలు కూడా లేనపుడు, \q1 \v 26 భూమిని, మైదానములను దేవుడు చేయక ముందు, \q2 నేల మట్టి కొంచెము కూడా సృష్టించబడక ముందు నేను పుట్టితిని. \q1 \v 27 దేవుడు ఆకాశ, విశాలములను సృష్టించి \q2 ఎంతో నీటి మీద మండలమును, సృష్టించినపుడు నేను పుట్టితిని. \q1 \v 28 దేవుడు పైన మేఘాలను చేసినప్పుడు \q2 నీటి ధారలను ఆయన చేసినప్పుడు, \q1 \v 29 నీరు తమ హద్దులు దాటి రాకుండా \q2 దేవుడు సముద్రానికి పొలిమేరను ఏర్పరచినప్పుడు, \q1 ఆయన భూమి యొక్క పునాదులు నిర్ణయించినపుడు. \q2 \v 30 నేను దేవుని యొద్ద నైపుణ్యత కలిగిన పనివానిగా, \q1 ప్రతిరోజు సంతోషిస్తూ, \q2 ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాను, \q1 \v 31 దేవుడు కలుగజేసిన స్వర్గాన్ని బట్టి సంతోషిస్తూ \q2 మనుష్యులను చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. \b \q1 \v 32 “కాబట్టి పిల్లలారా, నా మాట వినండి; \q2 నా దారిని అనుసరించేవారు ధన్యులు. \q1 \v 33 నా ఉపదేశాన్ని విని జ్ఞానం గలవారిగా ఉండండి; \q2 దానిని నిర్లక్ష్యం చేయకండి. \q1 \v 34 ప్రతిదినం నా గడప దగ్గర కనిపెట్టుకొని, \q2 నా వాకిటి దగ్గర కాచుకుని \q2 నా బోధను వినే మనుష్యులు ధన్యులు. \q1 \v 35 నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, \q2 వారు యెహోవా దయ పొందుకుంటారు. \q1 \v 36 నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకుంటాడు; \q2 నేనంటే అసహ్యపడేవాడు మరణాన్ని ప్రేమించినవాడు.” \c 9 \s1 జ్ఞానం, బుద్ధిహీనత \q1 \v 1 జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; \q2 దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది. \q1 \v 2 ఆమె మాంసాహారం తయారుచేసి తన ద్రాక్షరసాన్ని కలిపింది; \q2 తన భోజనబల్లను సిద్ధము చేసి ఉన్నది. \q1 \v 3 ఆమె తన దాసులను బయటకు పంపి, \q2 పట్టణంలోని ఎత్తైన స్థలము మీద నిలువబడి, \q2 \v 4 “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! \q1 బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది: \q2 \v 5 “రండి, నేను సిద్ధం చేసిన ఆహారం తినండి. \q2 నేను కలిపిన ద్రాక్షరసం త్రాగండి. \q1 \v 6 ఇకపై తెలివి లేనివారిగా ఉండకుండా బ్రతుకండి; \q2 తెలివిని కలిగించు దారిలో చక్కగా నడపండి.” \b \q1 \v 7 వెక్కిరించు వానికి బుద్ధి చెప్పు వాడు తనకు అవమానాన్ని తెచ్చుకుంటాడు; \q2 దుష్టులు వానిని గద్దించు వారు నిందను తెచ్చుకుంటారు. \q1 \v 8 హేళనగా మాట్లాడు వానిని గద్దించకు లేకపోతే వాడు నిన్ను ద్వేషిస్తాడు; \q2 తెలివిగల వానిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. \q1 \v 9 జ్ఞానం గలవానికి బోధించగా వాడు మరింత జ్ఞానంగలవానిగా ఉంటారు; \q2 మంచివానికి బోధ చేయగా వాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. \b \q1 \v 10 యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం, \q2 పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం. \q1 \v 11 జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, \q2 నీవు జీవించే ఎక్కువవుతాయి. \q1 \v 12 నీవు తెలివి కలిగిన వానివైతే నీ తెలివి వలన నీకే లాభము; \q2 జ్ఞానమును ఎగతాళి చేసిన ఎడల దానిని నీవే భరించవలెను. \b \q1 \v 13 బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది; \q2 ఆమె తెలివితక్కువది దానికి ఏమీ తెలియదు. \q1 \v 14 ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును, \q2 ఊరి ప్రధాన వీధుల్లో కుర్చీమీద అది కూర్చుండును, \q1 \v 15 ఆ దారిలో వెళ్లు వారిని చూసి, \q2 తమ మార్గములో చక్కగా వెళ్లు వారిని చూసి, \q2 \v 16 “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! \q1 బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది: \q2 \v 17 “దొంగతనం చేసిన నీళ్లు తీపి, \q2 రహస్యంగా చేసిన భోజనం రుచి!” \q1 \v 18 అయితే అక్కడ మృతులు ఉన్నారని, \q2 దాని అతిథులు పాతాళంలో ఉన్నారని వారికి కొంతవరకే తెలుసు. \c 10 \ms1 సొలొమోను యొక్క సామెతలు \p \v 1 సొలొమోను యొక్క సామెతలు: \q1 జ్ఞానం కలిగిన పిల్లలు తండ్రికి ఆనందం కలిగిస్తారు, \q2 కాని మూర్ఖపు పిల్లలు తమ తల్లికి దుఃఖాన్ని కలిగిస్తారు. \b \q1 \v 2 అన్యాయపు ధనం యొక్క విలువ నిలువదు, \q2 అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది. \b \q1 \v 3 యెహోవా నీతిమంతులను ఆకలి గొననివ్వడు, \q2 కాని దుష్టుల కోరికను ఆయన పాడుచేస్తారు. \b \q1 \v 4 సోమరి చేతులు దరిద్రత తెస్తాయి, \q2 కాని శ్రద్ధగా పని చేసేవారి చేతులు ధనాన్ని తెస్తాయి. \b \q1 \v 5 వేసవిలో పంటను కూర్చేవారు వివేకంగల పిల్లలు, \q2 అయితే కోతకాలంలో నిద్రించేవారు అవమానాన్ని తెచ్చే పిల్లలు. \b \q1 \v 6 నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి, \q2 కాని దుర్మార్గుల నోరు హింసను దాచిపెడుతుంది. \b \q1 \v 7 నీతిమంతుల పేరు ఆశీర్వాదాలలో వాడబడుతుంది,\f + \fr 10:7 \fr*\ft \+xt ఆది 48:20\+xt* చూడండి\ft*\f* \q2 కాని దుర్మార్గుల పేరు కుళ్ళిపోతుంది. \b \q1 \v 8 జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, \q2 మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు. \b \q1 \v 9 యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు, \q2 కానీ మోసం చేసేవారు పట్టుబడతారు. \b \q1 \v 10 కళ్లతో సైగ చేసేవారు దుఃఖాన్ని కలిగిస్తారు, \q2 వ్యర్థ కబుర్లు చెప్పే మూర్ఖులు నాశనమవుతారు. \b \q1 \v 11 నీతిమంతుల నోరు జీవపుఊట, \q2 కాని దుష్టుల నోరు హింసను దాచిపెడుతుంది. \b \q1 \v 12 పగ తగాదాలను కలుగజేస్తుంది, \q2 ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది. \b \q1 \v 13 వివేచన గలవారి పెదవుల మీద జ్ఞానం కనబడుతుంది, \q2 కాని తెలివిలేని వారి వీపు మీద బెత్తంతో కొట్టబడతారు. \b \q1 \v 14 జ్ఞానులు తెలివిని సంపాదించుకుంటారు, \q2 బుద్ధిహీనుల నాశనాన్ని ఆహ్వానిస్తుంది. \b \q1 \v 15 ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం, \q2 కాని దరిద్రత పేదవారి నాశనం. \b \q1 \v 16 నీతిమంతుల కష్టార్జితం జీవం, \q2 కాని దుష్టుల సంపాదన పాపం, మరణం. \b \q1 \v 17 క్రమశిక్షణ పాటించేవారు జీవితానికి మార్గం చూపుతారు, \q2 కాని దిద్దుబాటును పట్టించుకోనివారు ఇతరులను దారి తప్పిస్తారు. \b \q1 \v 18 పగను దాచిపెట్టేవారు అబద్ధికులు, \q2 ఇతరుల మీద నిందలు వేసేవారు మూర్ఖులు. \b \q1 \v 19 విస్తారమైన మాటల్లో పాపానికి అంతం ఉండదు, \q2 కాని వివేకులు నాలుకను అదుపులో పెడతారు. \b \q1 \v 20 నీతిమంతుల నాలుక విలువైన వెండి వంటిది, \q2 కాని దుష్టుల హృదయం విలువలేనిది. \b \q1 \v 21 నీతిమంతుల పెదవులు అనేకులకు మేలు చేస్తాయి, \q2 కాని బుద్ధిహీనులు తెలివిలేక చస్తారు. \b \q1 \v 22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, \q2 బాధ దుఃఖం దానికి జోడించబడవు. \b \q1 \v 23 బుద్ధిహీనులు దుష్ట పన్నాగాల్లో ఆనందిస్తారు, \q2 కాని వివేకంగలవారు జ్ఞానాన్నిబట్టి ఆనందిస్తారు. \b \q1 \v 24 దుష్టులు దేనికి భయపడతారో అదే వారి మీదికి వస్తుంది, \q2 నీతిమంతులు ఆశించిందే వారికి ఇవ్వబడుతుంది. \b \q1 \v 25 సుడిగాలి వచ్చినపుడు దుష్టులు లేకుండా పోతారు, \q2 కానీ నీతిమంతులు దృఢంగా నిలిచి ఉంటారు. \b \q1 \v 26 పళ్ళకు పులిసిన ద్రాక్షరసంలా కళ్లకు పొగలా, \q2 తమను పంపినవారికి సోమరివారు అలా ఉంటారు. \b \q1 \v 27 యెహోవాయందలి భయం దీర్ఘాయువును ఇస్తుంది, \q2 కాని దుష్టుల సంవత్సరాలు కుదించబడతాయి. \b \q1 \v 28 నీతిమంతుల ఆశలు ఆనందాన్నిస్తాయి \q2 కాని దుష్టుల ఆశలు ఫలించవు. \b \q1 \v 29 నింద లేనివారికి యెహోవా మార్గం ఒక ఆశ్రయం, \q2 కాని కీడు చేసేవారికి అది పతనము. \b \q1 \v 30 నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, \q2 కాని దుష్టులు దేశంలో ఉండరు. \b \q1 \v 31 నీతిమంతుల నోటి నుండి జ్ఞాన ఫలం వస్తుంది, \q2 అయితే వక్ర బుద్ధిగల నాలుక మూసివేయబడుతుంది. \b \q1 \v 32 నీతిమంతుల నోటికి దయ పొందడం తెలుసు, \q2 కాని దుష్టుల నోటికి వక్ర మాటలే తెలుసు. \b \c 11 \q1 \v 1 మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు, \q2 న్యాయమైన తూకం అంటే ఆయనకు ఇష్టము. \b \q1 \v 2 గర్వము వెంబడి అవమానం వస్తుంది, \q2 కాని వినయం వెంట జ్ఞానం వస్తుంది. \b \q1 \v 3 యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది, \q2 కానీ నమ్మకద్రోహులు వారి వంచనతో నాశనమవుతారు. \b \q1 \v 4 ఉగ్రత దినాన సంపద విలువలేనిది, \q2 అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది. \b \q1 \v 5 నిందలేనివారి నీతి వారి మార్గాలను తిన్నవిగా చేస్తాయి, \q2 కాని దుష్టులు తమ దుష్టత్వాన్ని బట్టి పడిపోతారు. \b \q1 \v 6 యథార్థవంతుల నీతి వారిని విడిపిస్తుంది, \q2 కాని నమ్మకద్రోహులు వారి చెడు కోరికల చేత పట్టబడతారు. \b \q1 \v 7 దుష్టులైన మనుష్యుల ఆశ వారితోనే చస్తుంది; \q2 వారు బలవంతులుగా ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలన్ని శూన్యమవుతాయి. \b \q1 \v 8 నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు \q2 కాని దుష్టులు దానిలో పడతారు. \b \q1 \v 9 దుష్టులువాడు తన నోటి మాట వలన తన పొరుగువానికి నాశనం కలుగుతుంది, \q2 తెలివిచేత నీతిమంతులు తప్పించుకుంటారు. \b \q1 \v 10 నీతిమంతులు అభివృద్ధి చెందుట పట్టణానికి సంతోషకరం; \q2 దుష్టులు నశించినపుడు ఆనంద కేకలు వినబడతాయి. \b \q1 \v 11 యథార్థవంతుని దీవెన వలన పట్టణం హెచ్చింపబడుతుంది, \q2 కాని దుష్టుని నోటి వలన అది నాశనమవుతుంది. \b \q1 \v 12 తన పొరుగువానిని గేలి చేసేవారు బుద్ధిహీనులు, \q2 కాని వివేకులు తమ నాలుకను అదుపులో పెట్టుకుంటారు. \b \q1 \v 13 పుకారు ఆత్మవిశ్వాసాన్ని మోసం చేస్తుంది, \q2 కాని నమ్మదగినవారు రహస్యాలను దాస్తారు. \b \q1 \v 14 ఎందుకంటే మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల దేశం పడిపోతుంది, \q2 కాని అనేక సలహాదారుల ద్వారా విజయం కలుగుతుంది. \b \q1 \v 15 ఎవరైతే అపరిచితునికి భద్రత కల్పిస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు, \q2 కాని ప్రతిజ్ఞలో చేతులు దులుపుకునేవాడు క్షేమంగా ఉంటాడు. \b \q1 \v 16 దయ మర్యాద కలిగిన స్త్రీ గౌరవాన్ని సంపాదిస్తుంది, \q2 క్రూరులు కేవలం ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు. \b \q1 \v 17 దయగలవారు తమకు తాము మేలు చేసుకుంటారు, \q2 కాని క్రూరులు తమ మీదికి తామే శరీరమునకే పతనం తెచ్చుకుంటారు. \b \q1 \v 18 దుష్టులు మోసపూరితమైన జీతం పొందుతారు, \q2 కానీ నీతిగా జీవించేవారు నిజంగా ప్రతిఫలాన్ని పొందుతారు. \b \q1 \v 19 నీతిమంతుడు నిజంగా జీవాన్ని పొందుతాడు, \q2 చెడును వెంటాడేవాడు మరణాన్ని కనుగొంటాడు. \b \q1 \v 20 వక్ర హృదయాలు గలవారిని యెహోవా అసహ్యించుకుంటారు, \q2 అయితే నిందారహితమైన మార్గాలు గలవారిని బట్టి ఆయన సంతోషిస్తారు. \b \q1 \v 21 ఇది ఖచ్చితం అని తెలుసుకోండి: దుష్టులు శిక్షించబడకుండా తప్పించుకోరు, \q2 నీతిమంతులు విడిపించబడతారు. \b \q1 \v 22 మంచిచెడులు తెలియని అందమైన స్త్రీ \q2 పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మివంటిది. \b \q1 \v 23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, \q2 దుష్టుల కోరిక గర్వంతో నిండి ఉంటుంది. \b \q1 \v 24 ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు కలరు; \q2 ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తూ దరిద్రులైన వారు కలరు. \b \q1 \v 25 దీవించే మనస్సు గలవారు వృద్ధిచెందుతారు, \q2 నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడతాయి. \b \q1 \v 26 ధాన్యాన్ని అమ్మకుండా దాచుకునేవాన్ని ప్రజలు శపిస్తారు, \q2 వాటిని అమ్మే వాని తల మీదికి దీవెనలు వస్తాయి. \b \q1 \v 27 మేలు చేయాలని కోరేవారు దయను పొందుతారు, \q2 కీడు చేసేవారికి కీడే కలుగుతుంది. \b \q1 \v 28 సంపదను నమ్ముకునేవారు పాడైపోతారు, \q2 నీతిమంతులు చిగురాకువలే అభివృద్ధి పొందుతారు. \b \q1 \v 29 తన ఇంటివారిని బాధపెట్టేవారు ఏమీ సంపాదించుకోలేరు, \q2 మూర్ఖులు జ్ఞానంగలవారికి దాసులుగా ఉంటారు. \b \q1 \v 30 నీతిమంతుల ఫలం జీవవృక్షంలా ఉంటుంది, \q2 జ్ఞానంగలవారు జీవితాలను కాపాడతారు. \b \q1 \v 31 నీతిమంతులు భూమి మీద తమ ప్రతిఫలం పొందితే, \q2 భక్తిహీనులు, పాపాత్ముల గతి ఖచ్చితంగా అలాగే ఉంటుంది కదా! \b \c 12 \q1 \v 1 శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు, \q2 కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు. \b \q1 \v 2 మంచివారు యెహోవా దయ పొందుతారు, \q2 చెడు ఆలోచనలు చేసేవారికి శిక్ష విధిస్తారు. \b \q1 \v 3 చెడుతనం ద్వారా మనుష్యులు స్ధిరపరచబడరు, \q2 అయితే నీతిమంతులు ఎప్పటికిని పెరికివేయబడరు. \b \q1 \v 4 మంచి భార్య తన భర్తకు కిరీటం వంటిది \q2 కానీ అపకీర్తిగల భార్య వాని యెముకల్లో కుళ్ళువంటిది. \b \q1 \v 5 నీతిమంతుల ఆలోచనలు న్యాయమైనవి \q2 దుష్టుల సలహాలు మోసకరమైనవి. \b \q1 \v 6 దుష్టుల మాటలు ఒక హత్యకు పొంచి ఉన్న వారి లాంటివి, \q2 యథార్థవంతుల మాటలు వారిని విడిపిస్తాయి. \b \q1 \v 7 దుష్టులు చనిపోయి కనుమరుగవుతారు, \q2 అయితే నీతిమంతుల ఇల్లు స్థిరంగా నిలుస్తుంది. \b \q1 \v 8 మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, \q2 అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు. \b \q1 \v 9 ఏమీ కాకపోయినా ఏదో గొప్పవానిగా నటిస్తూ ఆహారం కూడా లేని వానికంటె \q2 ఏమీ కాని వాడైనా ఒక సేవకుని కలిగి ఉన్నవాడు మేలు. \b \q1 \v 10 నీతిమంతులు తన పశువులను జాగ్రత్తగా చూసుకుంటారు, \q2 కానీ దుష్టులు చేసే అత్యంత జాలిగల పనులు కౄరంగా ఉంటాయి. \b \q1 \v 11 తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, \q2 కానీ పగటి కలల వెంటపడేవారికి బుద్ధి ఉండదు. \b \q1 \v 12 దుష్టులు కీడుచేసేవారి బలమైన కోటను కోరుకుంటారు, \q2 అయితే నీతిమంతుల వేరు చిగురిస్తుంది. \b \q1 \v 13 కీడుచేసేవారు వారి పాపిష్ఠి మాటచేత చిక్కుకుంటారు, \q2 నిర్దోషులు ఆపద నుండి తప్పించుకుంటారు. \b \q1 \v 14 ప్రజలు తాము చెప్పే మాటల వలన మేలు పొందుతారు, \q2 ఎవరు చేసిన పనికి వారికే ప్రతిఫలం కలుగుతుంది. \b \q1 \v 15 మూర్ఖుల దారి వారి దృష్టికి సరియైనదిగా కనబడుతుంది, \q2 కాని జ్ఞానులు సలహాలు వింటారు. \b \q1 \v 16 మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు, \q2 కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు. \b \q1 \v 17 నమ్మకమైన సాక్షులు న్యాయం మాట్లాడతారు, \q2 కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు మాట్లాడతారు. \b \q1 \v 18 నిర్లక్ష్యపు మాటలు ఖడ్గాల్లా గుచ్చుతాయి, \q2 కాని జ్ఞానుల నాలుకలు స్వస్థత కలిగిస్తాయి. \b \q1 \v 19 నిజాయితీగల పెదవులు శాశ్వతంగా ఉంటాయి, \q2 అబద్ధాలు మాట్లాడే నాలుక క్షణికమే ఉంటుంది. \b \q1 \v 20 కీడును కలిగించువారి హృదయంలో మోసము కలదు \q2 సమాధానపరచడానికి ఆలోచన చెప్పువారు సంతోషముగా ఉందురు. \b \q1 \v 21 నీతిమంతులకు ఏ ఆపద రాదు \q2 దుష్టులువాని ఇల్లు కీడుతో నిండి ఉంటుంది. \b \q1 \v 22 అబద్ధాలు మాట్లాడేవారు యెహోవాకు అసహ్యం \q2 నమ్మదగినవారు ఆయనకు ఇష్టులు. \b \q1 \v 23 వివేకంగల మనుష్యులు తమ తెలివిని దాచిపెడతారు \q2 కానీ మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని ప్రచారం చేసుకుంటారు. \b \q1 \v 24 శ్రద్ధగా పని చేసేవారు అధికారులవుతారు \q2 కానీ సోమరులు బానిసలవుతారు. \b \q1 \v 25 ఒకని హృదయంలో దిగులు వానిని క్రుంగిపోయేలా చేస్తుంది, \q2 దయ గల మాటలు వానిని సంతోషపెడతాయి. \b \q1 \v 26 నీతిమంతులు తమ పొరుగువారికి దారి చూపుతారు, \q2 కానీ దుష్టుని ప్రవర్తన వానిని దారి తప్పిస్తుంది. \b \q1 \v 27 సోమరి మనుష్యులు తాము వేటాడిన మాంసాన్ని కాల్చరు, \q2 కానీ శ్రద్ధగల వారు తమకు దొరికిన ప్రతీదానిని ఉపయోగిస్తారు. \b \q1 \v 28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; \q2 ఆ మార్గం మరణానికి దారితీయదు. \b \c 13 \q1 \v 1 జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు, \q2 కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు. \b \q1 \v 2 తమ పెదవుల ఫలం నుండి ప్రజలు మేలైన వాటిని ఆస్వాదిస్తారు, \q2 కాని నమ్మకద్రోహులు హింస పట్ల ఆకలిగొని ఉంటారు. \b \q1 \v 3 తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు, \q2 కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు. \b \q1 \v 4 సోమరి ఆకలి ఎన్నటికి తీరదు, \q2 కాని శ్రద్ధగా పని చేసేవారు తృప్తి చెందుతారు. \b \q1 \v 5 నీతిమంతులు అబద్ధమైన దానిని అసహ్యించుకుంటారు, \q2 దుర్మార్గులు తమను తాము దుర్గంధం చేసుకుంటారు \q2 తమ మీదికి అవమానం తెచ్చుకుంటారు. \b \q1 \v 6 నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది, \q2 కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది. \b \q1 \v 7 కొందరు ఏమి లేకపోయినా ధనవంతులుగా నటిస్తారు; \q2 మరికొందరు బాగా ధనము కలిగి ఉండి కూడా, పేదవారిగా నటిస్తారు. \b \q1 \v 8 ఒకని ఐశ్వర్యం వారి ప్రాణాన్ని విమోచించవచ్చు, \q2 కాని పేదవాడు బెదిరింపు మాటలను వినడు. \b \q1 \v 9 నీతిమంతుల వెలుగు అంతకంతకు ప్రకాశించును, \q2 కాని దుర్మార్గుల దీపం ఆరిపోతుంది. \b \q1 \v 10 గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది, \q2 కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది. \b \q1 \v 11 నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది, \q2 కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు. \b \q1 \v 12 వాయిదా వేయబడిన ఆశ హృదయానికి జబ్బు కలిగిస్తుంది, \q2 అయితే కోరిక తీరుట జీవవృక్షము. \b \q1 \v 13 బోధను ఎగతాళి చేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు, \q2 కాని ఆజ్ఞను గౌరవించేవారు ఫలం పొందుతారు. \b \q1 \v 14 జ్ఞానుల బోధ ఒక జీవపుఊట, \q2 అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది. \b \q1 \v 15 మంచి తీర్పు దయను గెలుస్తుంది, \q2 కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది. \b \q1 \v 16 వివేకులైనవారందరు తెలివితో వ్యవహరిస్తారు, \q2 కాని మూర్ఖులు వారి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తారు. \b \q1 \v 17 దుష్టులైన దూతలు కీడు చేయడానికి లోబడతారు, \q2 నమ్మకమైన రాయబారులు స్వస్థత కలిగిస్తారు. \b \q1 \v 18 శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి \q2 అయితే దిద్దుబాటును స్వీకరించేవారు ఘనత పొందుతారు. \b \q1 \v 19 ఆశ తీరుట వలన ప్రాణానికి తీపి \q2 చెడుతనాన్ని విడిచిపెట్టడం బుద్ధిలేనివారికి అసహ్యము. \b \q1 \v 20 జ్ఞానులతో స్నేహం చేసేవారు జ్ఞానులవుతారు \q2 బుద్ధిలేనివారితో స్నేహం చేసేవారు చెడిపోతారు. \b \q1 \v 21 కష్టం పాపులను వెంటాడుతుంది, \q2 నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. \b \q1 \v 22 మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు, \q2 పాపుల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది. \b \q1 \v 23 దున్నబడని క్రొత్త భూమి పేదవారికి పంటనిస్తుంది \q2 కాని అన్యాయస్థులు రు. \b \q1 \v 24 బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి \q2 కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడు. \b \q1 \v 25 నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు, \q2 కానీ దుష్టులైన వారి కడుపు నిండదు. \b \c 14 \q1 \v 1 జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, \q2 కాని మూర్ఖురాలు తన స్వహస్తాలతో తన ఇల్లు కూల్చివేస్తుంది. \b \q1 \v 2 యెహోవాకు భయపడేవారు యథార్థంగా నడుస్తారు, \q2 ఆయనను తృణీకరించేవారు వారి మార్గాల్లో వంచకులు. \b \q1 \v 3 మూర్ఖుల నోరు అరుస్తుంది, \q2 జ్ఞానం గలవారి పెదవులు వారిని కాపాడతాయి. \b \q1 \v 4 ఎద్దులు లేనిచోట, పశువుల దొడ్డి ఖాళీగా ఉంటుంది, \q2 కాని ఒక ఎద్దు బలం చేత విస్తారమైన పంట వస్తుంది. \b \q1 \v 5 నమ్మకమైన సాక్షులు మోసం చేయరు, \q2 కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు కుమ్మరిస్తారు. \b \q1 \v 6 ఎగతాళి చేసేవారు జ్ఞానం వెదకుతారు కాని దొరకదు, \q2 అయితే వివేకులకు తెలివి సులభంగా కలుగుతుంది. \b \q1 \v 7 బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపొమ్ము, \q2 జ్ఞానపు మాటలు వానియందు కనబడవు కదా. \b \q1 \v 8 వివేకవంతుల జ్ఞానం వారి మార్గాలను ఆలోచించడం, \q2 కానీ మూర్ఖుల మూర్ఖత్వం మోసము. \b \q1 \v 9 పాపానికి సవరణలు చేయడంలో మూర్ఖులు ఎగతాళి చేస్తారు, \q2 కాని యథార్థవంతులు ఆయన నుండి దయ పొందుతారు. \b \q1 \v 10 హృదయంలో ఉన్న బాధ దానికే తెలుస్తుంది, \q2 దాని సంతోషంలో మరొకరు పాలివారు కాలేరు. \b \q1 \v 11 దుష్టుల ఇల్లు నాశనమవుతుంది, \q2 కాని యథార్థవంతుల గుడారం అభివృద్ధి చెందును. \b \q1 \v 12 ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, \q2 అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది. \b \q1 \v 13 ఒకడు బయటకు నవ్వుతూ కనిపించినా, హృదయంలో బాధ ఉండవచ్చు \q2 చివరికి సంతోషం దుఃఖంగా మారుతుంది. \b \q1 \v 14 విశ్వాసభ్రష్టులు తమ క్రియలకు తగిన మూల్యం పొందుతారు, \q2 మంచివారు వారి క్రియలకు తగిన బహుమానం పొందుతారు. \b \q1 \v 15 బుద్ధిహీనులు దేన్నైనా నమ్ముతారు, \q2 కానీ వివేకం కలవారు తన నడవడికను బాగుగా కనిపెడతారు. \b \q1 \v 16 జ్ఞాని యెహోవాకు భయపడి చెడు నుండి తప్పుకుంటాడు, \q2 మూర్ఖులు కోపిష్ఠులై కూడా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు. \b \q1 \v 17 తొందరగా కోప్పడేవారు మూర్ఖమైనవి చేస్తారు, \q2 దుష్ట పన్నాగాలు వేసేవారు ద్వేషించబడతారు. \b \q1 \v 18 జ్ఞానం లేనివారికి వారి మూర్ఖత్వమే ఆస్తి. \q2 వివేకంగలవారు తెలివిని కిరీటంగా ధరించుకుంటారు. \b \q1 \v 19 చెడ్డవారు మంచివారి ఎదుటను, \q2 దుష్టులు నీతిమంతుల గుమ్మాల దగ్గర వంగుతారు. \b \q1 \v 20 పేదవారు తన పొరుగువారికి అసహ్యులు, \q2 ధనవంతులను ప్రేమించేవారు అనేకులు. \b \q1 \v 21 తన పొరుగువానిని తిరస్కరించేవారు పాపులు, \q2 బీదలకు దయ చూపేవాడు ధన్యుడు. \b \q1 \v 22 కీడు తలపెట్టేవారు తప్పిపోతారు? \q2 మేలు చేసేవారు, కృపా సత్యములను పొందుతారు. \b \q1 \v 23 ఏ కష్టం చేసినను లాభమే కలుగును, \q2 వట్టిమాటలు దరిద్రమునకు కారణము. \b \q1 \v 24 జ్ఞానుల ఐశ్వర్యం వారికి కిరీటం, \q2 బుద్ధిహీనుల మూర్ఖత్వం మూర్ఖత్వమే. \b \q1 \v 25 నిజం పలికే సాక్షి ప్రాణాలను రక్షిస్తారు, \q2 కానీ అబద్ధసాక్షి వట్టి మోసగాడు. \b \q1 \v 26 యెహోవాకు భయపడేవారందరికి సురక్షితమైన కోట ఉంది, \q2 వారి పిల్లలకు అది ఆశ్రయంగా ఉంటుంది. \b \q1 \v 27 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవపుఊట, \q2 అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది. \b \q1 \v 28 జనాభా ఎక్కువ ఉండడం చేత రాజులకు ఘనత వస్తుంది, \q2 జనులు తగ్గిపోవడం రాజులకు నాశనకరము. \b \q1 \v 29 ఎక్కువ ఓర్పు కలవారు మహా వివేకులు, \q2 త్వరగా కోప్పడేవారు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారు. \b \q1 \v 30 సమాధానం గల హృదయం శరీరానికి జీవం, \q2 అసూయ ఎముకలకు కుళ్ళు. \b \q1 \v 31 పేదవాని బాధపెట్టేవారు వాని సృష్టికర్తను నిందించేవారు, \q2 బీదలను కనికరించేవారు ఆయనను ఘనపరిచేవారు. \b \q1 \v 32 అపాయం వచ్చినప్పుడు దుష్టులు నశిస్తారు, \q2 చనిపోయే సమయంలో కూడ నీతిమంతులకు దేవునిలో ఆశ్రయం దొరుకుతుంది. \b \q1 \v 33 వివేకం గలవాని హృదయంలో జ్ఞానం నివాసం చేస్తుంది, \q2 మూర్ఖుల మధ్య కూడా అది తనను తాను తెలియపరచుకుంటుంది. \b \q1 \v 34 నీతి ఒక దేశాన్ని ఘనతకెక్కేలా చేస్తుంది, \q2 పాపం ప్రజలకు అవమానం తెస్తుంది. \b \q1 \v 35 జ్ఞానంగల సేవకుడు రాజులకు ఇష్టుడు, \q2 అవమానకరమైన సేవకుడు రాజుకు కోపం రేపుతాడు. \b \c 15 \q1 \v 1 మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది, \q2 నొప్పించే మాట కోపం రేపుతుంది. \b \q1 \v 2 జ్ఞానుల నాలుక తెలివితో అలంకరించబడుతుంది, \q2 బుద్ధిహీనుని నోరు మూర్ఖత్వాన్ని కుమ్మరిస్తుంది. \b \q1 \v 3 యెహోవా కళ్లు ప్రతిచోట ఉంటాయి, \q2 చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాయి. \b \q1 \v 4 నెమ్మది గల నాలుక జీవ వృక్షము \q2 కాని పనికిమాలిన నాలుక ఆత్మకు భంగము కలుగజేస్తుంది. \b \q1 \v 5 మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు \q2 కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు. \b \q1 \v 6 నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది, \q2 కాని దుష్టుని కలుగు వచ్చుబడి కష్టానికి కారణము. \b \q1 \v 7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును \q2 బుద్ధిహీనుల హృదయం నిలకడయైనది కాదు. \b \q1 \v 8 భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, \q2 అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము. \b \q1 \v 9 దుష్టుల మార్గాన్ని యెహోవా అసహ్యించుకుంటారు, \q2 నీతిని అనుసరించేవారిని ఆయన ప్రేమిస్తారు. \b \q1 \v 10 దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును, \q2 గద్దింపును ద్వేషించువారు చావునొందుదురు. \b \q1 \v 11 మరణం, నాశనం\f + \fr 15:11 \fr*\ft మూ. భా. లో \ft*\fqa అబద్దోను\fqa*\f* యెహోవాకు కనబడతాయి, \q2 ఆయనకు మనుష్యుల హృదయాలు ఇంకా తేటగా కనిపిస్తాయి కదా! \b \q1 \v 12 ఎగతాళి చేసేవారికి సరిదిద్దేవారంటే ఇష్టముండదు, \q2 కాబట్టి జ్ఞానుల దగ్గరకు వెళ్లరు. \b \q1 \v 13 హృదయంలో ఆనందం ముఖాన్ని వికసింపజేస్తుంది, \q2 మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది. \b \q1 \v 14 వివేకంగల హృదయం తెలివిని వెదకుతుంది, \q2 కాని బుద్ధిహీనునికి మూర్ఖత్వమే ఆహారము. \b \q1 \v 15 బాధింపబడుచున్న వారి రోజులన్నీ బాధాకరమే, \q2 కాని సంతోష హృదయం గలవారికి ఎప్పుడూ విందే. \b \q1 \v 16 నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, \q2 కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు. \b \q1 \v 17 ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే, \q2 ప్రేమ ఉన్నచోట ఆకుకూరల భోజనం తినడం మేలు. \b \q1 \v 18 ఉద్రేకంతో కూడిన కోపం తగాదా రేపుతుంది, \q2 దీర్ఘశాంతం తగాదాను శాంతింపజేస్తుంది. \b \q1 \v 19 సోమరి వాని బాట ముండ్లకంచె, \q2 యథార్థవంతుల త్రోవ రహదారి. \b \q1 \v 20 జ్ఞానంగల పిల్లలు తండ్రిని సంతోషపరుస్తారు, \q2 కానీ మూర్ఖపు మనుష్యులు తమ తల్లిని తృణీకరిస్తారు. \b \q1 \v 21 బుద్ధిహీనుని వానికి అవివేకం ఆనందాన్నిస్తుంది, \q2 కాని అవగాహన ఉన్నవాడు చక్కగా నడుచుకొనును. \b \q1 \v 22 ఆలోచనలు చెప్పువారు లేనిచోట తలంపులు వృధాయగును, \q2 ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్న ఎడల తలంపులు బలపడును. \b \q1 \v 23 సరిగా జవాబునిచ్చిన వానికి దాని వలన సంతోషము కలుగును, \q2 సమయానికి తగిన మాట ఎంతో మంచిది. \b \q1 \v 24 క్రిందనున్న మరణాన్ని తప్పించుకోవాలని, \q2 వివేకవంతులను జీవమార్గం పైకి నడిపిస్తుంది. \b \q1 \v 25 గర్వించువారి ఇల్లు యెహోవా పెరికివేయును, \q2 భర్తలేని స్త్రీ పొలిమేరను ఆయన స్ధాపించును. \b \q1 \v 26 దుష్టుల ఆలోచనలు యెహోవాకు అసహ్యం, \q2 దయగల మాటలు ఆయనకు పవిత్రము. \b \q1 \v 27 అత్యాశ తన ఇంటివారి మీదికి పతనాన్ని తెస్తుంది, \q2 లంచాన్ని అసహ్యించుకునేవారు బ్రతుకుతారు. \b \q1 \v 28 నీతిమంతుల హృదయం సరియైన జవాబివ్వడానికి ప్రయత్నిస్తుంది, \q2 భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది. \b \q1 \v 29 భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటారు, \q2 నీతిమంతుల ప్రార్ధన ఆయన అంగీకరిస్తారు. \b \q1 \v 30 సంతోషకరమైన చూపు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది, \q2 మంచి వార్త ఎముకలకు బలాన్నిస్తుంది. \b \q1 \v 31 జీవితాన్ని ప్రసాదించే దిద్దుబాటును అంగీకరించేవారు \q2 జ్ఞానుల సహవాసంలో ఉంటారు. \b \q1 \v 32 క్రమశిక్షణను తృణీకరించేవారు తమను తాము తృణీకరిస్తారు, \q2 అయితే దిద్దుబాటును అంగీకరించేవారు గ్రహింపు పొందుతారు. \b \q1 \v 33 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనము \q2 ఘనతకు ముందు వినయం ఉంటుంది. \b \c 16 \q1 \v 1 హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి, \q2 కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది. \b \q1 \v 2 ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, \q2 అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి. \b \q1 \v 3 మీ పనులను యెహోవాకు అప్పగించండి, \q2 మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి. \b \q1 \v 4 యెహోవా ప్రతిదీ దాని దాని పని కోసం కలుగజేశారు \q2 నాశన దినానికి ఆయన భక్తిలేని వారిని కలుగజేశారు. \b \q1 \v 5 గర్వ హృదయులందరిని యెహోవా అసహ్యించుకుంటారు. \q2 ఇది నిశ్చయం: వారు శిక్షింపబడకపోరు. \b \q1 \v 6 ప్రేమ, నమ్మకత్వం వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది; \q2 యెహోవాయందలి భయం వలన కీడు తొలగిపోతుంది. \b \q1 \v 7 ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు నచ్చినప్పుడు, \q2 అతడు వాని శత్రువులను వానితో సమాధానపరుస్తారు. \b \q1 \v 8 అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, \q2 నీతితో కూడిన కొంచెము మేలు. \b \q1 \v 9 మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు, \q2 యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు. \b \q1 \v 10 రాజు పెదవులు దైవ వాక్కులా మాట్లాడతాయి, \q2 అతని నోరు న్యాయ ద్రోహం చేయదు. \b \q1 \v 11 న్యాయమైన త్రాసు, తూనిక రాళ్లు యెహోవా ఏర్పాట్లు, \q2 సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించారు. \b \q1 \v 12 రాజులు చెడ్డపనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు, \q2 నీతి వలన సింహాసనం స్ధిరపరచబడుతుంది. \b \q1 \v 13 రాజులు నిజాయితీగల పెదవులను ఇష్టపడతారు, \q2 యథార్థంగా మాట్లాడేవారికి వారు విలువనిస్తారు. \b \q1 \v 14 రాజు ఆగ్రహం మరణ దూత వంటిది, \q2 అయితే జ్ఞానులు దాన్ని శాంతింపజేస్తారు. \b \q1 \v 15 రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది, \q2 వారి దయ వసంత రుతువులో వర్షం మేఘం లాంటిది. \b \q1 \v 16 బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం, \q2 వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు! \b \q1 \v 17 యథార్థవంతుల రాజమార్గం చెడును తప్పిస్తుంది; \q2 తమ మార్గాలను కాపాడుకునేవారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు. \b \q1 \v 18 నాశనానికి ముందు గర్వం, \q2 పతనానికి ముందు అహంకారం వెళ్తాయి. \b \q1 \v 19 గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే, \q2 అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు. \b \q1 \v 20 ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, \q2 యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. \b \q1 \v 21 జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు, \q2 దయగల మాటలు ఒప్పింపజేస్తాయి. \b \q1 \v 22 వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట, \q2 కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది. \b \q1 \v 23 జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగిస్తుంది, \q2 వాని పెదవులకు విద్య ఎక్కువయేలా చేస్తుంది. \b \q1 \v 24 దయ గల మాటలు తేనెతెట్టె వంటివి, \q2 అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి. \b \q1 \v 25 ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, \q2 అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది. \b \q1 \v 26 కష్టం చేసేవారి ఆకలి వానిచేత కష్టం చేయిస్తుంది, \q2 వారి ఆకలి వారిని ముందుకు నడిపిస్తుంది. \b \q1 \v 27 పనికిమాలినవారు కీడును పన్నాగం వేస్తారు, \q2 వారి మాటలు మండుతున్న అగ్నిలాంటివి. \b \q1 \v 28 మూర్ఖులు తగవు రేపుతారు, \q2 పుకార్లు సన్నిహితులైన స్నేహితులను వేరు చేస్తాయి. \b \q1 \v 29 హింసాత్మకమైన వారు వారి పొరుగువారిని ఆశపెడతారు, \q2 సరియైనది కాని మార్గంలో వారిని నడిపిస్తారు. \b \q1 \v 30 తమ కన్ను గీటేవారు కుట్ర పన్నుతున్నారు; \q2 తన పెదవులు బిగబట్టేవారు కీడు వైపు మొగ్గు చూపుతారు. \b \q1 \v 31 నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, \q2 అది నీతి మార్గంలో సాధించబడుతుంది. \b \q1 \v 32 యుద్ధవీరునికంటే సహనం గలవాడు, \q2 పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవానికంటే తన మనస్సును అదుపు చేసుకోగలవాడు మేలు. \b \q1 \v 33 చీట్లు ఒడిలో వేయబడవచ్చు, \q2 కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము. \b \c 17 \q1 \v 1 తగాదాలతో కూడిన విందు కలిగి ఉన్న ఇంటి కంటే, \q2 సమాధానం నిశ్శబ్దంతో ఎండిన రొట్టె ముక్క తినుట మేలు. \b \q1 \v 2 వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు \q2 కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు. \b \q1 \v 3 వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, \q2 అయితే హృదయాన్ని యెహోవా పరిశోధిస్తారు. \b \q1 \v 4 చెడు నడవడి కలవాడు మోసపు మాటలు వినును, \q2 అబద్ధికుడు నాశనకరమైన నాలుక మాటలు వింటాడు. \b \q1 \v 5 పేదవారిని ఎగతాళి చేసేవాడు వారిని చేసిన వానిని నిందించేవాడు, \q2 ఆపదను చూసి సంతోషించేవాడు శిక్ష నుండి తప్పించుకోడు. \b \q1 \v 6 పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం, \q2 తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము. \b \q1 \v 7 అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు, \q2 అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం! \b \q1 \v 8 లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది, \q2 ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు. \b \q1 \v 9 ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు, \q2 జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు. \b \q1 \v 10 బుద్ధిహీనునికి పడే వంద దెబ్బల కంటే, \q2 వివేకంగల వానికి ఒక గద్దింపు ప్రభావం చూపుతుంది. \b \q1 \v 11 ఎదిరించువాడు కీడు చేయుటకే కోరును, \q2 అట్టివాని వెంట దయలేని దూత పంపబడును. \b \q1 \v 12 మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే \q2 పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు. \b \q1 \v 13 మేలుకు బదులుగా కీడు చేయువాని \q2 ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు. \b \q1 \v 14 గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది; \q2 కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి. \b \q1 \v 15 దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, \q2 రెండు యెహోవాకు అసహ్యమే. \b \q1 \v 16 బుద్ధిహీనులు జ్ఞానాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు, \q2 వారి విద్యాభ్యాసానికి డబ్బు చెల్లించడం దేనికి? \b \q1 \v 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, \q2 ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు. \b \q1 \v 18 బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు \q2 పొరుగువానికి హామీగా ఉంటాడు. \b \q1 \v 19 తగాదాను ప్రేమించేవాడు పాపాన్ని ప్రేమిస్తాడు, \q2 తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదుకువాడు. \b \q1 \v 20 అసూయగలవాడు మేలుపొందడు \q2 తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును. \b \q1 \v 21 మూర్ఖుని కనిన వానికి విచారం కలుగుతుంది, \q2 బుద్ధిహీనుని కనిన తండ్రికి సంతోషం ఉండదు. \b \q1 \v 22 సంతోషం గల హృదయం ఆరోగ్యకారణం, \q2 నలిగిన హృదయం ఎముకలను ఎండిపోజేస్తుంది. \b \q1 \v 23 న్యాయం తప్పుదారి పట్టించడానికి \q2 దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు. \b \q1 \v 24 వివేకం ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు, \q2 కాని మూర్ఖుడి కళ్లు భూమి చివర వరకు తిరుగుతాయి. \b \q1 \v 25 బుద్ధిలేని పిల్లలు తమ తండ్రికి దుఃఖం తెస్తారు, \q2 తమను కనిన తల్లికి అట్టివారు శోకం కలిగిస్తారు. \b \q1 \v 26 అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే, \q2 నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు. \b \q1 \v 27 తక్కువగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, \q2 శాంత గుణముగలవాడు మంచిచెడులు ఎరిగినవాడు. \b \q1 \v 28 ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును, \q2 తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును. \b \c 18 \q1 \v 1 స్నేహం లేని వ్యక్తి స్వార్థ ప్రయోజనాలను వెంటాడుతాడు, \q2 అన్ని మంచి తీర్పులకు వ్యతిరేకంగా గొడవలు ప్రారంభిస్తాడు. \b \q1 \v 2 మూర్ఖులు అర్థం చేసుకోవడంలో ఆనందం పొందరు \q2 కాని వారి సొంత అభిప్రాయాలను ప్రసారం చేయడంలో ఆనందం పొందుతారు. \b \q1 \v 3 దుష్టత్వం వచ్చినప్పుడు ధిక్కారం కూడా వస్తుంది, \q2 అవమానముతో నింద వస్తుంది. \b \q1 \v 4 నోటి మాటలు అగాధజలాలు, \q2 కాని జ్ఞానం యొక్క ఊట పరుగెత్తే ప్రవాహము. \b \q1 \v 5 తీర్పుతీర్చుటలో దుష్టుని ఎడల పక్షపాతము చూపుటయు, \q2 అమాయకులకు న్యాయం తప్పించుటయు సరికాదు. \b \q1 \v 6 మూర్ఖుల మాటలు తగాదాకు సిద్ధముగా ఉన్నది, \q2 వారి నోళ్ళు దెబ్బలు ఆహ్వానిస్తాయి. \b \q1 \v 7 మూర్ఖుని నోరు వానికి నాశనము తెచ్చును, \q2 వాని పెదవులు వాని ప్రాణాలకు ఉరి. \b \q1 \v 8 పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి \q2 అవి అంతరంగం లోనికి దిగిపోతాయి. \b \q1 \v 9 పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, \q2 వినాశకునికి సోదరుడు. \b \q1 \v 10 యెహోవా నామం బలమైన కోట, \q2 నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు. \b \q1 \v 11 ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం; \q2 వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ. \b \q1 \v 12 నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది, \q2 ఘనతకు ముందు వినయం ఉంటుంది. \b \q1 \v 13 సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు \q2 తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు. \b \q1 \v 14 నరుని ఆత్మ వాని రోగాన్ని సహిస్తుంది, \q2 కానీ నలిగిన హృదయాన్ని ఎవరు భరించగలరు? \b \q1 \v 15 వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది, \q2 జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి. \b \q1 \v 16 ఒక బహుమతి మార్గం తెరుస్తుంది \q2 అది ఇచ్చిన వ్యక్తిని గొప్పవారి ఎదుటకు రప్పిస్తుంది. \b \q1 \v 17 ప్రతివాది వచ్చి ప్రతివాదన చేసే వరకు, \q2 వాదోపవాదాలలో మొదట మాట్లాడేది న్యాయంగా అనిపిస్తుంది. \b \q1 \v 18 చీట్లు వేయడం వివాదాలను పరిష్కరిస్తుంది \q2 బలమైన ప్రత్యర్థులను వేరుగా ఉంచుతుంది. \b \q1 \v 19 కోటగోడలు గల పట్టణం కంటే అభ్యంతరం చెందిన సహోదరుని తిరిగి గెలవడం కష్టము. \q2 వివాదాలు కోటకు అడ్డుగా ఉండే ద్వారాల్లాంటివి. \b \q1 \v 20 నోటి ఫలం చేత ఒక వ్యక్తి కడుపు నిండుతుంది, \q2 తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తినొందుతాడు. \b \q1 \v 21 చావు బ్రతుకులు నాలుక వశంలో ఉన్నాయి, \q2 దానిని ప్రేమించేవారు దాని ఫలాన్ని తింటారు. \b \q1 \v 22 భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, \q2 వాడు యెహోవా నుండి దయ పొందుతాడు. \b \q1 \v 23 పేదవాడు దయ కోసం విజ్ఞప్తి చేస్తాడు, \q2 కాని ధనికుడు కఠినంగా సమాధానం ఇస్తారు. \b \q1 \v 24 నమ్మదగని స్నేహితులను కలిగి ఉన్నవాడు త్వరలోనే పతనానికి సమీపిస్తాడు, \q2 కాని ఒక స్నేహితుడు ఉన్నాడు సోదరుడి కంటే దగ్గరగా అంటిపెట్టుకుని ఉండేవాడు. \b \c 19 \q1 \v 1 నిజాయితీ లేనివాడు మూర్ఖుడు కావడం కంటే \q2 నిజాయితీగా ఉంటే మంచిది. \b \q1 \v 2 ఒక వ్యక్తి తెలివిలేనివాడుగా ఉండడం మంచిది కాదు, \q2 తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. \b \q1 \v 3 ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వారి నాశనానికి దారితీస్తుంది, \q2 వారి హృదయంలో వారికి యెహోవా మీద కోపం వస్తుంది. \b \q1 \v 4 డబ్బుగల వానికి స్నేహితులు ఎక్కువగా ఉందురు, \q2 పేదవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. \b \q1 \v 5 అబద్ధసాక్షి శిక్షను పొందక పోదు \q2 అబద్ధాలాడే వాడు తప్పించుకోడు. \b \q1 \v 6 అనేకులు గొప్పవారి దయ వెదుకుతారు, \q2 బహుమతులు ఇచ్చేవారికి ప్రతి ఒక్కరూ స్నేహితులే. \b \q1 \v 7 పేదవారిని తమ బంధువులందరు దూరంగా ఉంచుతారు, \q2 అలాంటప్పుడు వారి స్నేహితులు ఇంకెంత దూరంగా ఉంచుతారు! \q1 పేదవారు బ్రతిమిలాడుతూ వారిని వెంటాడినా, \q2 వారు ఎక్కడా కనిపించలేదు. \b \q1 \v 8 తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు; \q2 మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును. \b \q1 \v 9 అబద్ధపు సాక్షి శిక్షను పొందును, \q2 అబద్ధాలాడే వాడు నశించును. \b \q1 \v 10 భోగములను అనుభవించుట బుద్ధిలేని వానికి తగదు, \q2 రాజుల మీద పెత్తనము చెలాయించుట పనివానికి బొత్తిగా తగదు. \b \q1 \v 11 ఒక వ్యక్తి తెలివి వానికి ఓర్పును కలిగిస్తుంది; \q2 ఒక నేరాన్ని పట్టించుకోకపోవడం ఒక వ్యక్తికి ఘనత కలిగిస్తుంది. \b \q1 \v 12 రాజు కోపం సింహగర్జన వంటిది, \q2 అతని దయ తుక్కు మీద కురియు మంచు వంటిది. \b \q1 \v 13 బుద్ధిహీనుని పిల్లలు తన తండ్రికి నష్టము తెచ్చును, \q2 భార్యతోటిపోరు ఆగకుండా పడుచుండు \q2 నీటిబొట్లతో సమానము. \b \q1 \v 14 ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, \q2 వివేకంగల భార్య యెహోవా యొక్క దానము. \b \q1 \v 15 సోమరితనం గాఢనిద్ర కలుగజేస్తుంది, \q2 సోమరివాడు తిండి లేక ఉంటాడు. \b \q1 \v 16 ఆజ్ఞను పాటించేవాడు తనను తాను కాపాడుకుంటాడు, \q2 కానీ తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తలేనివాడు చస్తాడు. \b \q1 \v 17 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, \q2 వాని ఉపకారానికి ఆయన తిరిగి ఉపకారం చేస్తారు. \b \q1 \v 18 ఎందుకంటే అందులో ఆశ ఉన్నప్పుడే మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి; \q2 అయితే వాడు మరణించాలని కోరుకోవద్దు. \b \q1 \v 19 మహా కోపం గలవాడు శిక్ష తప్పించుకోడు, \q2 వాని తప్పించినను వాడు మరల కోప్పడుతూనే ఉంటాడు. \b \q1 \v 20 నీవు ముందుకు జ్ఞానివగుటకై, \q2 ఆలోచన విని బోధను అంగీకరించు. \b \q1 \v 21 ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, \q2 అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము. \b \q1 \v 22 ఒక వ్యక్తి కోరుకునేది నమ్మకమైన ప్రేమను, \q2 అబద్ధికునిగా కంటే పేదవానిగా ఉండడం మేలు. \b \q1 \v 23 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవమునకు దారి; \q2 అది కలిగినవాడు తృప్తి కలిగినవాడై అపాయం లేకుండా బ్రతుకును. \b \q1 \v 24 సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; \q2 తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. \b \q1 \v 25 ఎగతాళి చేసేవారు శిక్షింపబడగా చూసి సామాన్యులు వివేకం నేర్చుకుంటారు; \q2 మంచిచెడులు నెరిగిన వారిని గద్దింపగా వారు తెలివిని అభివృద్ధి చేసికొందురు. \b \q1 \v 26 తండ్రిని దోచుకునేవాడు, తల్లిని వెళ్లగొట్టేవాడు, \q2 అవమానాన్ని అపకీర్తిని కలుగజేసేవాడు. \b \q1 \v 27 నా కుమారుడా, ఒకవేళ నీవు ఉపదేశాన్ని వినుట మానిన ఎడల, \q2 నీవు తెలివిగల మాటల నుండి తప్పిపోతావు. \b \q1 \v 28 అవినీతిపరుడైన సాక్షి న్యాయాన్ని ఎగతాళి చేస్తాడు, \q2 దుష్టుల నోరు పాపాన్ని జుర్రుకొంటుంది. \b \q1 \v 29 హేళన చేయువారికి తీర్పులును \q2 బుద్ధిలేని వారి వీపులకు దెబ్బలను ఏర్పాటు చేయబడినవి. \b \c 20 \q1 \v 1 మద్యం సేవించేవారు అపహాసకులు బీరు సేవించేవారు కలహప్రియులు; \q2 వాటి ద్వార తూలేవారు జ్ఞానం లేనివారు. \b \q1 \v 2 రాజు వలన కలుగు భయము సింహగర్జన వంటిది; \q2 రాజునకు కోపం పుట్టించు వారు తమకు ప్రాణహాని తెచ్చుకుంటారు. \b \q1 \v 3 తగవులకు దూరముగా ఉండడం మనుష్యులకు ఘనత, \q2 మూర్ఖులు జగడాన్నే కోరును. \b \q1 \v 4 విత్తనం వేసే సమయంలో సోమరి దున్నడు; \q2 కోత సమయంలో పంటను గురించి వాడు తెలుసుకునేసరికి వానికేమియు ఉండదు. \b \q1 \v 5 మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది, \q2 వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు. \b \q1 \v 6 తమకు ఎడతెగని ప్రేమ ఉందని చాలామంది చెప్పుకుంటారు, \q2 కానీ నమ్మకమైన మనుష్యులు ఎవరికి కనబడతారు? \b \q1 \v 7 నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు; \q2 వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు. \b \q1 \v 8 న్యాయసింహాసనంపై కూర్చున్న రాజు, \q2 తన కంటి చూపులతో చెడుతనమంతయు చెదరగొడతారు. \b \q1 \v 9 “నా హృదయాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచుకున్నాను; \q2 పాపం లేకుండ నేను శుద్ధునిగా ఉన్నాను” అని అనదగిన వారెవరు? \b \q1 \v 10 తప్పుడు తూనిక రాళ్లు తప్పుడు త్రాసులు, \q2 ఈ రెండును యెహోవాకు అసహ్యం. \b \q1 \v 11 చిన్న పిల్లలు తమ ప్రవర్తన స్వచ్ఛమైనదో కాదో యథార్థమైనదో కాదో \q2 తమ చేష్టల ద్వారా తెలియజేస్తారు. \b \q1 \v 12 వినుటకు చెవి చూచుటకు కన్ను \q2 ఈ రెండును యెహోవా కలుగజేసినవే. \b \q1 \v 13 నిద్రను ప్రేమించకు దరిద్రుడవవుతావు; \q2 నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం మిగులుతుంది. \b \q1 \v 14 కొనేవాడు, “అది బాగోలేదు ఇది బాగోలేదు” అని అంటూ బేరమాడతాడు \q2 కాని కొన్న తర్వాత తాను బేరమాడిన దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటాడు. \b \q1 \v 15 బంగారం ఉంది సమృద్ధిగా ముత్యాలు ఉన్నాయి, \q2 కాని తెలివితో మాట్లాడే పెదవులు అరుదైన ఆభరణం. \b \q1 \v 16 అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; \q2 ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి. \b \q1 \v 17 మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుష్యులకు బహు తీపిగా ఉంటుంది. \q2 తర్వాత వాని నోరు మట్టితో నింపబడుతుంది. \b \q1 \v 18 ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి, \q2 మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి. \b \q1 \v 19 పుకార్లు చెప్తూ తిరిగేవారు నమ్మకద్రోహం చేసేవారు \q2 కాబట్టి ఎక్కువగా మాట్లాడేవారిని దూరం ఉంచాలి. \b \q1 \v 20 తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని \q2 దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది. \b \q1 \v 21 జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం \q2 అంతంలో దీవించబడదు. \b \q1 \v 22 కీడుకు తిరిగి కీడు చేయాలనుకోవద్దు, \q2 యెహోవా కోసం వేచియుండు ఆయన నిన్ను రక్షిస్తారు. \b \q1 \v 23 మోసపు తూనిక రాళ్లు యెహోవాకు అసహ్యం, \q2 దొంగత్రాసు ఆయనకు అయిష్టం. \b \q1 \v 24 ఒక వ్యక్తి అడుగులను నిర్దేశించేవారు యెహోవా, \q2 అలాంటప్పుడు తమ మార్గాన్ని వారు ఎట్లు గ్రహించగలరు? \b \q1 \v 25 మనుష్యులు తొందరపడి దేవునికి మ్రొక్కుబడి చేయడం ఒక ఉచ్చులాంటిది, \q2 తర్వాత తెలుస్తుంది దాని మూల్యం ఎంత అనేది. \b \q1 \v 26 జ్ఞానంగల రాజు దుష్టులను చెదరగొడతాడు \q2 అతడు వారి మీదికి చక్రం దొర్లిస్తాడు. \b \q1 \v 27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం \q2 అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది. \b \q1 \v 28 దయ, సత్యాలు రాజును కాపాడతాయి \q2 దయ వలన అతడు తన సింహాసనాన్ని నిలుపుకుంటాడు. \b \q1 \v 29 బలము యవ్వనస్థుల కీర్తి \q2 నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం. \b \q1 \v 30 బాధపరిచే సంగతులు హృదయంలోకి వెళ్లి \q2 చెడుతనాన్ని తొలగిస్తాయి. \b \c 21 \q1 \v 1 యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ \q2 ఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు. \b \q1 \v 2 ఒకడు తన సొంత మార్గాలు సరియైనవి అనుకుంటాడు, \q2 కాని యెహోవా హృదయాలను పరీక్షిస్తారు. \b \q1 \v 3 మనం బలులు అర్పించడం కంటే \q2 మనం సరియైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఎక్కువ ఇష్టము. \b \q1 \v 4 అహంకారపు చూపు గర్వ హృదయం \q2 దుష్ట క్రియలన్నీ పాపమే. \b \q1 \v 5 శ్రద్ధగలవారి ప్రణాళికలు లాభాన్ని కలిగిస్తాయి, \q2 తొందరపాటుతనం దారిద్ర్యానికి దారితీస్తుంది. \b \q1 \v 6 అబద్ధమాడే నాలుక ద్వారా వచ్చే ఐశ్వర్యం \q2 క్షణికమైన ఆవిరి ఘోరమైన ఉచ్చు. \b \q1 \v 7 దుష్టుల దౌర్జన్యం వారిని లేకుండ తుడిచివేస్తుంది, \q2 ఎందుకంటే వారు సరియైనది చేయడానికి తిరస్కరిస్తారు. \b \q1 \v 8 అపరాధి యొక్క మార్గం వంకర, \q2 అయితే నిర్దోషుల ప్రవర్తన యథార్థమైనది. \b \q1 \v 9 గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే, \q2 మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు. \b \q1 \v 10 దుష్టుని హృదయం కీడు చేయాలని కోరుతుంది; \q2 తన పొరుగువారి మీద వాడు దయచూపించడు. \b \q1 \v 11 ఎగతాళి చేసేవాడు శిక్షించబడినప్పుడు, సామాన్యుడు జ్ఞానాన్ని పొందుతాడు; \q2 జ్ఞానుల పట్ల శ్రద్ధ చూపడం ద్వారా వారు తెలివి సంపాదిస్తారు. \b \q1 \v 12 నీతిమంతుడు దుష్టుల ఇంటిని గమనించి, \q2 దుష్టులను నాశనం చేస్తాడు. \b \q1 \v 13 బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు, \q2 తాను మొరపెట్టినప్పుడు జవాబు రాదు. \b \q1 \v 14 చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది, \q2 ఒడిలో ఉంచబడిన లంచం పగను సమాధానపరుస్తుంది. \b \q1 \v 15 న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరం \q2 కాని చెడు చేసేవారికి అది భయంకరము. \b \q1 \v 16 వివేకమైన మార్గం నుండి తొలగిపోయే వ్యక్తి \q2 మృతుల గుంపులో అంతమవుతాడు. \b \q1 \v 17 సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది; \q2 ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది. \b \q1 \v 18 నీతిమంతుల కోసం భక్తిలేనివారు, \q2 అలాగే యథార్థవంతులకు నమ్మకద్రోహులు క్రయధనమవుతారు. \b \q1 \v 19 ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే \q2 అడవిలో నివసించడం మంచిది. \b \q1 \v 20 జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి, \q2 కానీ బుద్ధిలేని మనుష్యులు తాము పొందుకున్నదంతా ఖర్చు చేస్తారు. \b \q1 \v 21 నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు \q2 ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు. \b \q1 \v 22 జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లి \q2 వారు నమ్ముకున్న బలమైన కోటను కూల్చివేయగలడు. \b \q1 \v 23 నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు \q2 కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు, \b \q1 \v 24 అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరు \q2 వారు మిక్కిలి గర్వంతో నడుచుకుంటారు. \b \q1 \v 25 సోమరుల కోరికలు వారిని చంపుతాయి, \q2 ఎందుకంటే వారి చేతులు పని చేయడానికి నిరాకరిస్తాయి. \q1 \v 26 పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు, \q2 కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు. \b \q1 \v 27 దుష్టుల బలులు అసహ్యం, \q2 చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో! \b \q1 \v 28 అబద్ధ సాక్షులు నశిస్తారు, \q2 కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు. \b \q1 \v 29 దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, \q2 కాని యథార్థవంతులు తమ మార్గాల గురించి ఆలోచిస్తారు. \b \q1 \v 30 యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల \q2 జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు. \b \q1 \v 31 యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి, \q2 కాని విజయం యెహోవా దగ్గర ఉంది. \b \c 22 \q1 \v 1 గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది \q2 వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి. \b \q1 \v 2 ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: \q2 వారందరిని కలుగజేసినవాడు యెహోవా. \b \q1 \v 3 వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, \q2 సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు. \b \q1 \v 4 యెహోవాయందలి భయం వినయం; \q2 ఐశ్వర్యం గౌరవం దీర్ఘాయువు దాని వేతనాలు. \b \q1 \v 5 దుష్టుల మార్గాల్లో వలలు, ఆపదలు ఉన్నాయి, \q2 అయితే తమ ప్రాణాలు కాపాడుకునేవారు వాటికి దూరముగా ఉంటారు. \b \q1 \v 6 మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి, \q2 వారు పెద్దవారయ్యాక కూడా దాని నుండి తొలగిపోరు. \b \q1 \v 7 ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు, \q2 అప్పుచేసేవాడు అప్పిచ్చినవానికి బానిస. \b \q1 \v 8 దుర్మార్గాన్ని విత్తేవాడు కీడు అనే పంటను కోస్తాడు, \q2 వారి భీభత్స పాలన అంతం అవుతుంది. \b \q1 \v 9 ధారాళంగా ఉన్నవారు ధన్యులు, \q2 ఎందుకంటే వారు బీదలను పోషిస్తారు. \b \q1 \v 10 ఎగతాళి చేసేవాన్ని తోలివేస్తే కలహాలు తొలగిపోతాయి; \q2 తగాదాలు అవమానాలు ముగిశాయి. \b \q1 \v 11 శుద్ధహృదయాన్ని ప్రేమించేవాడు దయ గల మాటలు మాట్లాడేవాడు \q2 రాజును స్నేహితునిగా కలిగి ఉంటాడు. \b \q1 \v 12 యెహోవా కళ్లు తెలివిని గమనిస్తూ ఉంటాయి, \q2 కాని విశ్వాసం లేనివారి మాటలను ఆయన నిరాశపరుస్తారు. \b \q1 \v 13 సోమరి అంటాడు, “బయట సింహమున్నది! \q2 వీధుల్లో నేను చంపబడతాను!” \b \q1 \v 14 వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట; \q2 యెహోవా ఉగ్రత క్రింద ఉన్నవాడు దానిలో పడతాడు. \b \q1 \v 15 యవ్వనస్థుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది, \q2 క్రమశిక్షణ దండము దానిని వానిలో నుండి దూరంగా తొలగిస్తుంది. \b \q1 \v 16 లాభము పొందాలని పేదవారికి అన్యాయం చేసేవారికి \q2 ధనవంతులకు బహుమానాలు ఇచ్చేవానికి నష్టమే కలుగుతుంది. \ms1 జ్ఞానులు చెప్పిన ముప్పై సూక్తులు \s2 సూక్తి 1 \q1 \v 17 చెవియొగ్గి జ్ఞానుల సూక్తులను వినండి; \q2 నేను ఉపదేశించే దానికి మీ హృదయాన్ని వర్తింపజేయండి. \q1 \v 18 ఎందుకంటే వాటిని మీ హృదయంలో ఉంచడం \q2 వాటన్నిటిని మీ పెదవుల మీద ఉంచడం మంచిది. \q1 \v 19 మీ నమ్మకం యెహోవా మీద ఉండాలని, \q2 నేను ఈ రోజున వీటిని మీకు, మీకే బోధిస్తున్నాను. \q1 \v 20-21 మీరు నిజాయితీగా ఉండాలని సత్యాన్ని మాట్లాడాలని \q2 తద్వారా మిమ్మల్ని పంపినవారికి మీరు సరియైన నివేదిక ఇవ్వాలని, \q1 సలహాలతో తెలివితో కూడిన, \q2 ముప్పది సూక్తులను \q2 నేను మీ కోసం వ్రాయలేదా? \s2 సూక్తి 2 \q1 \v 22 పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు \q2 అవసరతలో ఉన్నవారిని ఆవరణంలో అణచివేయవద్దు, \q1 \v 23 యెహోవా వారి వైపున వాదిస్తారు \q2 ఎవరైనా వారిని పతనం చేసేవారిని ఆయన పతనం చేస్తారు. \s2 సూక్తి 3 \q1 \v 24 కోపిష్ఠియైన వ్యక్తితో స్నేహం చేయవద్దు, \q2 ఊరకనే కోప్పడే వ్యక్తితో సహవాసం చేయవద్దు, \q1 \v 25 నీవు వాని మార్గాలను అనుసరించి \q2 నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో. \s2 సూక్తి 4 \q1 \v 26 చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని \q2 అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు; \q1 \v 27 ఇవ్వడానికి నీయొద్ద ఏమీ లేకపోతే, \q2 వాడు నీ క్రిందనుండి నీ పరుపునే తీసుకెళ్తాడు. \s2 సూక్తి 5 \q1 \v 28 నీ పితరులు వేసిన \q2 పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. \s2 సూక్తి 6 \q1 \v 29 తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా? \q2 అల్పులైన వారి ఎదుట కాదు \q2 వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు. \c 23 \s2 సూక్తి 7 \q1 \v 1 మీరు ఒక పాలకుడితో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, \q2 మీ ముందు ఉన్న దాన్ని బాగా గమనించండి. \q1 \v 2 నీవు తిండిబోతువైన ఎడల \q2 నీ గొంతుకు కత్తి పెట్టుకో. \q1 \v 3 అతని రుచిగల పదార్థాలకు ఆశపడకు, \q2 అవి మోసగించే ఆహారపదార్థాలు. \s2 సూక్తి 8 \q1 \v 4 సంపదను పొందడానికి ప్రయాసపడకండి; \q2 నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు. \q1 \v 5 కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది, \q2 ఎందుకంటే అది రెక్కలు ధరించి \q2 గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది. \s2 సూక్తి 9 \q1 \v 6 ఎదుటివాని అభివృద్ధి చూసి పిసినారి వానితో కలిసి భోజనము చేయకండి, \q2 అతని రుచిగల పదార్థాలకు ఆశపడవద్దు, \q1 \v 7 ఎందుకంటే అట్టి వాడు తన హృదయంలో \q2 ఎప్పుడూ ఖరీదు గురించి ఆలోచిస్తాడు. \q1 “తినండి త్రాగండి” అని అతడు నీతో చెప్తాడు, \q2 కాని అది అతని హృదయంలోనుండి వచ్చుమాట కాదు. \q1 \v 8 నీవు తినిన కొంచెము కక్కివేస్తావు \q2 నీవు పలికిన అభినందనలు వృధా అవుతాయి. \s2 సూక్తి 10 \q1 \v 9 బుద్ధిహీనులతో మాట్లాడకండి, \q2 ఎందుకంటే వారు మీ వివేకవంతమైన మాటలను ఎగతాళి చేస్తారు. \s2 సూక్తి 11 \q1 \v 10 పురాతన సరిహద్దు రాయిని కదిలించవద్దు \q2 తండ్రిలేనివారి పొలములోనికి చొరబడవద్దు, \q1 \v 11 ఎందుకంటే వారిని కాపాడేవాడు బలవంతుడు; \q2 నీకు వ్యతిరేకంగా ఆయన వారి పక్షంగా నీతో పోరాడతారు. \s2 సూక్తి 12 \q1 \v 12 ఉపదేశానికి నీ హృదయాన్ని \q2 తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు. \s2 సూక్తి 13 \q1 \v 13 నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము; \q2 ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు. \q1 \v 14 బెత్తముతో వాని శిక్షించి \q2 చావు నుండి వారిని కాపాడండి. \s2 సూక్తి 14 \q1 \v 15 నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, \q2 అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది; \q1 \v 16 నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు, \q2 నా అంతరింద్రియం సంతోషిస్తుంది. \s2 సూక్తి 15 \q1 \v 17 పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు, \q2 కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు. \q1 \v 18 నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది, \q2 నీ నిరీక్షణ తొలగించబడదు. \s2 సూక్తి 16 \q1 \v 19 నా కుమారుడా, ఆలకించి జ్ఞానిగా ఉండు \q2 నీ హృదయాన్ని సరియైన మార్గంలో నిలుపుకో. \q1 \v 20 అతిగా ద్రాక్షరసం త్రాగువారితోనైను, \q2 మాంసం ఎక్కువగా తినే వారితోనైను స్నేహము చేయవద్దు. \q1 \v 21 ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులౌతారు, \q2 మగత వారిని దుప్పట్లలో వస్త్రాల్లా ధరిస్తుంది. \s2 సూక్తి 17 \q1 \v 22 నీకు జీవితాన్నిచ్చిన, నీ తండ్రి మాటను ఆలకించు, \q2 నీ తల్లి ముసలితనంలో ఆమెను నిర్లక్ష్యం చేయకు. \q1 \v 23 సత్యాన్ని కొనుక్కో దాన్ని అమ్మకు \q2 జ్ఞానాన్ని, బోధను, అంతరార్థాన్ని కూడా కొని ఉంచుకో. \q1 \v 24 నీతిమంతులైన పిల్లల తండ్రికి గొప్ప ఆనందం; \q2 జ్ఞానం గలవానికి తండ్రిగా ఉన్నవాడు వాని వలన సంతోషిస్తాడు. \q1 \v 25 నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక; \q2 నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక! \s2 సూక్తి 18 \q1 \v 26 నా కుమారుడా, నీ హృదయాన్ని నాకివ్వు \q2 నీ కళ్లు నా మార్గాలను అనుసరించుట యందు ఆనందించును గాక, \q1 \v 27 ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, \q2 దారితప్పిన భార్య ఇరుకైన బావి. \q1 \v 28 బందిపోటులా అది పొంచి ఉంటుంది \q2 అది అనేకమంది మనుష్యులను నమ్మకద్రోహులుగా చేస్తుంది. \s2 సూక్తి 19 \q1 \v 29 ఎవరికి శ్రమ ఉంది? ఎవరికి దుఃఖం ఉంది? \q2 ఎవరికి కలహాలు ఉన్నాయి? ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయి? \q2 ఎవరికి అవసరంలేని గాయాలు? ఎవరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి? \q1 \v 30 మద్యంతో ప్రొద్దుపుచ్చేవారు, \q2 నమూనా మద్యమాల మిశ్రమాలను రుచిచూడడానికి వెళ్లేవారు. \q1 \v 31 మద్యం ఎర్రగా ఉన్నప్పుడు, \q2 గిన్నెలో తళతళలాడుతూ, \q2 గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు! \q1 \v 32 అంతంలో అది పాములా కరుస్తుంది \q2 కట్లపాములా విషం చిమ్ముతుంది. \q1 \v 33 నీ కళ్లు వింత దృశ్యాలను చూస్తాయి, \q2 నీ మనస్సు గందరగోళమైన వాటిని ఊహిస్తుంది. \q1 \v 34 నీవు నడిసముద్రంలో \q2 పడుకునేవానిలా ఉంటావు. స్తంభాన్ని పట్టుకుని ఉన్నావు. \q1 \v 35 “వారు నన్ను కొట్టారు, కాని గాయం కాలేదు! \q2 వారు నన్ను కొట్టారు, కాని నాకు తెలియలేదు! \q1 మరి కాస్త మద్యం త్రాగడానికి \q2 నేనెప్పుడు నిద్ర లేస్తాను?” \c 24 \s2 సూక్తి 20 \q1 \v 1 చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, \q2 వారి సహవాసం కోరుకోవద్దు; \q1 \v 2 వారి హృదయాలు హింసను చేయాలని యోచిస్తాయి, \q2 వారి పెదవులు ఇబ్బంది పెట్టడం గురించి మాట్లాడతాయి. \s2 సూక్తి 21 \q1 \v 3 జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, \q2 గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది. \q1 \v 4 తెలివిచేత దాని గదులు \q2 అరుదైన అందమైన నిధులతో నింపబడతాయి. \s2 సూక్తి 22 \q1 \v 5 జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, \q2 తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు. \q1 \v 6 ఖచ్చితంగా యుద్ధం చేయడానికి మీకు నడిపించేవారు అవసరం \q2 అనేకమంది సలహాదారుల ద్వారా విజయం సాధ్యమవుతుంది. \s2 సూక్తి 23 \q1 \v 7 మూర్ఖులకు జ్ఞానం ఎంతో ఎత్తులో ఉంటుంది; \q2 సమాజ గవిని దగ్గర వారు మాట్లాడడానికి ఏమి లేదు. \s2 సూక్తి 24 \q1 \v 8 కీడు చేయాలని చూసే వ్యక్తి \q2 కుట్రలు చేసే వ్యక్తి అని పిలువబడతాడు. \q1 \v 9 మూర్ఖుల పథకాలు పాపం, \q2 ఎగతాళి చేసేవారిని నరులు అసహ్యించుకుంటారు. \s2 సూక్తి 25 \q1 \v 10 ఒకవేళ మీరు ఇబ్బందుల సమయంలో తడబడితే, \q2 మీ బలం ఎంత సూక్ష్మమైనది! \q1 \v 11 చావుకు కొనిపోబడుతున్న వారిని రక్షించు; \q2 మరణం వైపు తూగుతున్న వారిని వెనుకకు లాగు. \q1 \v 12 “కాని దీని గురించి మాకు ఏమి తెలియదు” అని నీవంటే, \q2 హృదయాలను తూకం వేసేవాడు నీ మాటను గ్రహించడా? \q1 నీ ప్రాణాన్ని కాచేవానికి తెలియదా? \q2 ప్రతి వ్యక్తికి తన క్రియలకు తగినట్టుగా తిరిగి చెల్లించడా? \s2 సూక్తి 26 \q1 \v 13 నా కుమారుడా, తేనె తిను, అది మంచిది; \q2 తేనెపట్టు నుండి తేనె తిను అది రుచికి తీపిగా ఉంటుంది. \q1 \v 14 జ్ఞానం నీకు తేనెలాంటిది అని తెలుసుకో: \q2 అది నీకు దొరికితే, నీ భవిష్యత్తుకు నిరీక్షణ ఉంటుంది, \q2 నీ నిరీక్షణ తొలిగిపోదు. \s2 సూక్తి 27 \q1 \v 15 నీతిమంతుల నివాసం దగ్గర దొంగలా పొంచి ఉండవద్దు, \q2 వారి నివాస స్థలాన్ని దోచుకోవద్దు; \q1 \v 16 ఎందుకంటే నీతిమంతులు ఏడుమారులు పడినను తిరిగి లేస్తారు, \q2 కాని విపత్తు సంభవించినప్పుడు దుష్టులు తడబడతారు. \s2 సూక్తి 28 \q1 \v 17 నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు; \q2 వాడు తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషించనీయకు, \q1 \v 18 లేదా యెహోవా అది చూసి అయిష్టత కలిగి \q2 వారి మీద నుండి తన కోపం చాలించుకుంటారేమో. \s2 సూక్తి 29 \q1 \v 19 కీడు చేసేవారిని చూసి నీవు చిరాకుపడకు \q2 దుష్టుల ఎడల అసూయ పడకు. \q1 \v 20 ఎందుకంటే కీడు చేసేవారికి భవిష్యత్ నిరీక్షణ లేదు, \q2 దుష్టుల దీపము ఆరిపోతుంది. \s2 సూక్తి 30 \q1 \v 21 నా కుమారుడా, యెహోవాకు రాజుకు భయపడు, \q2 తిరుగుబాటు చేసే అధికారులతో జతకలవకు. \q1 \v 22 ఎందుకంటే అవి రెండు వారి మీదికి హఠాత్ నాశనాన్ని పంపుతాయి, \q2 అవి ఎలాంటి ఆపదలు తెస్తాయో ఎవరికి తెలుసు? \ms1 జ్ఞానులు చెప్పిన మరిన్ని సూక్తులు \p \v 23 ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే: \q1 న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు \q1 \v 24 “నీవు అమాయకుడవు” అని దోషులతో చెప్పేవారిని, \q2 ప్రజలు శపిస్తారు దేశాలు అసహ్యించుకుంటారు. \q1 \v 25 న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును \q2 అధికమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును. \b \q1 \v 26 నిజాయితీగల జవాబు \q2 పెదవులపై పెట్టే ముద్దు లాంటిది. \b \q1 \v 27 ముందుగా నీ బయటి పని చక్క పెట్టుకో \q2 నీ పొలాలను సిద్ధపరచుకో; \q2 దాని తర్వాత, నీ ఇల్లు కట్టుకో. \b \q1 \v 28 కారణం లేకుండ నీ పొరుగువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దు; \q2 నీ పెదవులతో తప్పుత్రోవ పట్టిస్తావా? \q1 \v 29 “వారు నాకు చేసినట్లు నేను వారికి చేస్తాను; \q2 వారు చేసిన దానికి వారికి తిరిగి చెల్లిస్తాను” అని అనుకోవద్దు. \b \q1 \v 30 నేను ఒక సోమరివాని చేను దాటి వెళ్లాను, \q2 నేను బుద్ధిలేని ఒక వ్యక్తి ద్రాక్షతోటను దాటి వెళ్లాను; \q1 \v 31 అంతట ముళ్ళ కంపలు పెరిగాయి, \q2 నేలంతా కలుపు మొక్కల చేత కప్పబడి ఉంది, \q2 దాని రాతి గోడ శిథిలావస్థలో ఉంది. \q1 \v 32 నేను దాన్ని చూసి దాని గురించి యోచన చేసి \q2 దాని నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. \q1 \v 33 ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, \q2 ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను. \q1 \v 34 పేదరికం నీ మీదికి దొంగలా, \q2 లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది. \c 25 \ms1 సొలొమోను వ్రాసిన మరిన్ని సామెతలు \p \v 1 ఇవి కూడా సొలొమోను యొక్క సామెతలు, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని పోగుచేశారు. \q1 \v 2 ఒక విషయాన్ని దాచిపెట్టడం దేవుని గొప్పతనం; \q2 ఒక విషయాన్ని బయటకు లాగడం రాజుల గొప్పతనము. \q1 \v 3 ఆకాశాల ఎత్తు భూమి లోతు ఎలా కనుగొనలేమో, \q2 అలాగే రాజుల హృదయాలు కూడా శోధించలేనివి. \b \q1 \v 4 వెండిలోని లోహపు మడ్డిని తీసివేసి, \q2 కంసాలివాడు ఒక పాత్రను తయారుచేయగలడు; \q1 \v 5 రాజు ఎదుట నుండి చెడ్డ అధికారులను తొలగించండి, \q2 నీతి ద్వారా ఆయన సింహాసనం స్థాపించబడుతుంది. \b \q1 \v 6 రాజు ఎదుట నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, \q2 ఆయన దగ్గర ఉండే గొప్పవారి మధ్య చోటు కావాలని కోరవద్దు. \q1 \v 7 సంస్థానాధిపతుల ముందు రాజు నిన్ను అవమానించడం కంటే, \q2 “ఇక్కడకు రండి” అని ఆయన నీతో చెప్పడం బాగుంటుంది కదా. \b \q1 మీరు ఏదో చూసిన దానిని బట్టి, \q2 \v 8 తొందరపడి న్యాయస్థానానికి వెళ్లకండి, \q1 ఎందుకంటే ఒకవేళ నీ పొరుగువాడు నిన్ను అవమానపరిస్తే \q2 తర్వాత నీవేమి చేస్తావు? \b \q1 \v 9 ఒకవేళ నీవు నీ పొరుగువాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లినా, \q2 ఇంకొకరి గుట్టు బయట పెట్టకు. \q1 \v 10 అది వినినవాడు నిన్ను అవమానపరచవచ్చు, \q2 అప్పుడు నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు. \b \q1 \v 11 సకాలంలో మాట్లాడిన మాట, \q2 చిత్రమైన వెండి పళ్ళాల్లో ఉంచబడిన బంగారు ఆపిల్\f + \fr 25:11 \fr*\ft లేదా బహుశ \ft*\fqa నేరేడు పళ్ళు\fqa*\f* పళ్ళలాంటిది. \q1 \v 12 బంగారు చెవి పోగు ఎలా ఉంటుందో లేదా మేలిమి బంగారు ఆభరణం ఎలా ఉంటుందో \q2 వినే చెవికి జ్ఞానియైన న్యాయమూర్తి యొక్క గద్దింపు అలా ఉంటుంది. \b \q1 \v 13 నమ్మకమైన పనివాడు తనను పంపువారికి \q2 కోతకాలంలో మంచు చల్లదనము వంటివాడు; \q2 వాడు తన యజమానుల హృదయాలను తెప్పరిల్లజేస్తాడు. \q1 \v 14 బహుమతి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వ్యక్తి \q2 వర్షము కురిపించని మబ్బు గాలి లాంటివాడు. \b \q1 \v 15 సహనం ద్వారా ఒక పాలకుడిని ఒప్పించవచ్చు, \q2 మృదువైన నాలుక ఎముకను విరుగ గొట్ట గలదు. \b \q1 \v 16 నీకు తేనె దొరికితే సరిపడగా తిను \q2 ఎక్కువ తింటే కక్కివేస్తావు. \q1 \v 17 నీ పొరుగువారింటికి మాటిమాటికి వెళ్లకు, \q2 వారు నీ వలన విసిగిపోయి నిన్ను ద్వేషించవచ్చు. \b \q1 \v 18 తన పొరుగువాని మీద అబద్ధసాక్ష్యం చెప్పేవాడు \q2 సమ్మెట ఖడ్గము లేదా వాడిగల బాణాన్ని పోలినవాడు. \q1 \v 19 కష్ట సమయంలో నమ్మకద్రోహిని ఆశ్రయించడమంటే \q2 విరిగిన పళ్లు లేదా కుంటి పాదం లాంటిది. \q1 \v 20 బాధలోనున్న వానికి పాటలు వినిపించేవాడు, \q2 బాగా చలిగా ఉన్నపుడు పై బట్టతీసివేయు వానితోను, \q2 పచ్చిపుండు మీద పుల్లని ద్రాక్షరసం పోసేవానితోను సమానము. \b \q1 \v 21 నీ శత్రువు ఆకలితో ఉంటే, తినడానికి భోజనము పెట్టు; \q2 అతడు దాహంతో ఉంటే, త్రాగడానికి నీళ్లు ఇవ్వు. \q1 \v 22 ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తావు, \q2 యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తారు. \b \q1 \v 23 ఊహించని వర్షాన్ని తెచ్చే ఉత్తర గాలిలా \q2 కపటమైన నాలుక భయానకంగా కనిపించేలా చేస్తుంది. \b \q1 \v 24 గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే \q2 మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు. \b \q1 \v 25 అలసిన ప్రాణానికి చల్లటి నీరు ఎలా ఉంటుందో \q2 దూరదేశము నుండి వచ్చిన మంచి వార్త అలా ఉంటుంది. \q1 \v 26 నీతిమంతుడు దుష్టునికి మార్గం ఇవ్వడం \q2 ఊటను బురదమయం లేదా బావిని కలుషితం చేయడం లాంటిది. \b \q1 \v 27 తేనె ఎక్కువగా తినడం మంచిది కాదు, \q2 ప్రజలు తమ సొంత కీర్తిని కోరుకోవడం గౌరవప్రదం కాదు. \b \q1 \v 28 మనస్సు అదుపు చేసుకోలేని వ్యక్తి \q2 ప్రాకారాలు కూలిన పట్టణం లాంటివాడు. \c 26 \q1 \v 1 వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో, \q2 అలాగే బుద్ధిలేని వానికి ఘనత కూడా సరిపడదు. \q1 \v 2 ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో, \q2 కారణం లేని శాపం కూడా నిలువదు. \q1 \v 3 గుర్రానికి కొరడా, గాడిదకు కళ్లెం, \q2 బుద్ధిహీనుని వీపుకు బెత్తం! \q1 \v 4 వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు, \q2 ఇచ్చిన ఎడల నీవును వాని వలెనే ఉందువు. \q1 \v 5 వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి, \q2 లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు. \q1 \v 6 బుద్ధిహీనునిచేత వార్తను పంపేవాడు, \q2 కాళ్లు తెగగొట్టుకొని విషం త్రాగిన వానితో సమానుడు. \q1 \v 7 కుంటివానికి కాళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదు, \q2 అలాగే బుద్ధిహీనుని నోట సామెత ఉన్నా ఉపయోగం ఉండదు. \q1 \v 8 బుద్ధిహీనుని గౌరవించువాడు, \q2 వడిసెలలోని రాయి కదలకుండ కట్టు వానితో సమానుడు. \q1 \v 9 బుద్ధిహీనుని నోట సామెత, \q2 మత్తుడైన వాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును. \q1 \v 10 యాదృచ్ఛికంగా గాయపడిన విలుకాడు వలె \q2 బుద్ధిహీనుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. \q1 \v 11 తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు \q2 తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు. \q1 \v 12 తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? \q2 వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ. \b \q1 \v 13 సోమరి అంటాడు, “దారిలో సింహముంది, \q2 వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!” \q1 \v 14 కీలుపై తలుపు తిరుగుతుంది \q2 అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు. \q1 \v 15 సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; \q2 తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. \q1 \v 16 కారణాలు చూపగల ఏడుగురి కంటే \q2 సోమరి తన కళ్ళకు తానే జ్ఞానిని అనుకుంటాడు. \b \q1 \v 17 తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు \q2 దాటిపోవుచున్న కుక్కచెవులు పట్టుకొను వానితో సమానుడు. \b \q1 \v 18-19 తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన \q2 “నేను సరదాగా చేశాను!” అని అనేవాడు \q1 మండుతున్న బాణాలు విసిరే \q2 ఉన్మాది లాంటివాడు. \b \q1 \v 20 కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది; \q2 అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది. \q1 \v 21 నిప్పు కణాలకు బొగ్గు, అగ్నికి కట్టెలో \q2 గొడవలు రేపడానికి గొడవప్రియుడు. \q1 \v 22 పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి \q2 అవి అంతరంగం లోనికి దిగిపోతాయి. \b \q1 \v 23 చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన\f + \fr 26:23 \fr*\ft హెబ్రీలో \ft*\fqa మృదువైన\fqa*\f* మాటలు \q2 మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి. \q1 \v 24 పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి \q2 హృదయాల్లో కపటాన్ని దాచుకుంటారు. \q1 \v 25 వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు, \q2 వారి హృదయాలు ఏడు అసహ్యకరమైన వాటితో నిండి ఉంటాయి. \q1 \v 26 వారి దుర్మార్గం మోసం ద్వారా దాచబడవచ్చు, \q2 కాని వారి దుష్టత్వం సమాజం ముందు బయటపడుతుంది. \q1 \v 27 గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు \q2 రాతిని దొర్లించేవారి మీదికే అది తిరిగి దొర్లుతుంది. \q1 \v 28 అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది, \q2 అలాగే పొగిడే నోరు నాశనం కలిగిస్తుంది. \b \c 27 \q1 \v 1 రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు, \q2 ఎందుకంటే ఏ రోజు ఏమి తెస్తుందో నీకు తెలియదు. \b \q1 \v 2 నీ నోటితో కాదు, మరొకరు నిన్ను పొగడనివ్వండి; \q2 నీ పెదవులతో కాదు, ఇతరులు నిన్ను పొగడనివ్వండి. \b \q1 \v 3 రాయి భారం ఇసుక ఒక భారం, \q2 మూర్ఖుని కోపం ఆ రెంటికంటె భారము. \b \q1 \v 4 కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది. \q2 కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు? \b \q1 \v 5 అంతరంగంలో ప్రేమించడం కంటే \q2 బహిరంగంగా గద్దించడం మేలు. \b \q1 \v 6 స్నేహితుడు కలిగించే గాయములు నమ్మదగినవి, \q2 కాని పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. \b \q1 \v 7 కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. \q2 ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తియ్యగా ఉంటుంది. \b \q1 \v 8 తన ఇల్లు విడిచి తిరిగేవాడు \q2 గూడు విడచి తిరిగే పక్షితో సమానుడు. \b \q1 \v 9 అత్తరు ధూపం హృదయానికి సంతోషం కలిగిస్తాయి, \q2 స్నేహితుని వల్ల కలిగే వినోదం \q2 వారి హృదయపూర్వక సలహా ద్వార వస్తుంది. \b \q1 \v 10 నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు, \q2 నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు, \q2 దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు. \b \q1 \v 11 నా కుమారుడా! తెలివిని సంపాదించి నా మనస్సును సంతోషపరచుము; \q2 అప్పుడు నిన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును. \b \q1 \v 12 వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, \q2 సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు. \b \q1 \v 13 అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; \q2 ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి. \b \q1 \v 14 ఎవడైన తెల్లవారు జాముననే లేచి గొప్ప స్వరంతో తన స్నేహితుని దీవిస్తే, \q2 అది శాపంగా పరిగణించబడింది. \b \q1 \v 15 ముసురు రోజున తెంపులేకుండా కారు నీళ్లును \q2 గయ్యాళియైన భార్యయు సమానము. \q1 \v 16 దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను \q2 తన కుడిచేత నూనె పట్టుకొను వానితోను సమానుడు. \b \q1 \v 17 ఇనుము చేత ఇనుము పదునైనట్లు \q2 ఒక మనుష్యుడు మరొక మనిషి వాడిగా చేస్తాడు. \b \q1 \v 18 అంజూర చెట్టును పెంచేవాడు దాని ఫలం తింటాడు, \q2 తన యజమానుని క్షమించేవాడు ఘనత పొందుతాడు. \b \q1 \v 19 నీరు ముఖాన్ని ప్రతిబింబించినట్లు, \q2 మనుష్యుని జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. \b \q1 \v 20 పాతాళానికి, లోతైన గుంటకును తృప్తికానేరదు. \q2 అలాగున మనుష్యుల చూపు తృప్తికానేరదు. \b \q1 \v 21 వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, \q2 అయితే ప్రజలు తమ కీర్తిచేత పరీక్షించబడతారు. \b \q1 \v 22 బుద్ధిహీనున్ని రోటిలోని \q2 గోధుమలలో వేసి రోకటితో దంచినా సరే \q2 వాని మూర్ఖత్వం వదిలిపోదు. \b \q1 \v 23 నీ గొర్రెల మందల పరిస్థితి జాగ్రత్తగా తెలుసుకో, \q2 నీ మందల మీద జాగ్రత్తగా మనస్సు పెట్టు; \q1 \v 24 ఐశ్వర్యం శాశ్వతం కాదు, \q2 కిరీటం తరతరాల వరకు ఉండదు. \q1 \v 25 ఎండుగడ్డి తొలగించబడి, క్రొత్తది ఎదగడం కనిపిస్తున్నప్పుడు. \q2 కొండ మీది నుండి గడ్డిని పోగుచేసినప్పుడు. \q1 \v 26 నీ బట్టల కోసం గొర్రెపిల్లలు ఉన్నాయి \q2 ఒక చేను కొను డబ్బుకు మేకపోతులు సరిపోతాయి. \q1 \v 27 నీ ఆహారానికి, నీ ఇంటివారి ఆహారానికి \q2 నీ పనికత్తెల పోషణలు మేకపాలు సమృద్ధి అవుతాయి. \b \c 28 \q1 \v 1 ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు, \q2 కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు. \b \q1 \v 2 ఒక దేశం తిరుగుబాటు చేసినప్పుడు, దానికి చాలామంది పాలకులు ఉంటారు, \q2 కానీ వివేచన జ్ఞానంగల మనుష్యులు క్రమాన్ని పాటిస్తారు. \b \q1 \v 3 పేదలను హింసించే ఒక పేదవాడు \q2 పంటను తుడిచిపెట్టుకుపోయే వర్షం లాంటివాడు. \b \q1 \v 4 బోధనను విడిచిపెట్టిన వారు దుష్టులను పొగడుతారు, \q2 కాని దానిని లక్ష్యపెట్టేవారు దుష్టులను వ్యతిరేకిస్తారు. \b \q1 \v 5 కీడుచేసేవారు సరియైనది గ్రహించరు, \q2 కాని యెహోవాను ఆశ్రయించువారు దాన్ని పూర్తిగా గ్రహిస్తారు. \b \q1 \v 6 మూర్ఖమైన మార్గాలు అనుసరించే ధనికుని కంటే, \q2 నిందారహితంగా నడుచుకొనే పేదవాడు మేలు. \b \q1 \v 7 వివేకవంతుడైన కుమారుడు బోధనకు శ్రద్ధ వహిస్తాడు, \q2 కాని తిండిబోతు సహచరుడు తన తండ్రిని అవమానపరుస్తాడు. \b \q1 \v 8 పేదవాని నుండి వడ్డిచేత గాని లేదా లాభంచేత గాని ఆస్తి పెంచుకొనువాడు \q2 పేదవారి పట్ల దయ చూపే మరొకరికి దాన్ని కూడ పెడుతున్నాడు. \b \q1 \v 9 ఒకవేళ ఎవరైనా నా బోధను పెడచెవిని పెడితే, \q2 వారి ప్రార్థనలు కూడా అసహ్యకరమైనవి. \b \q1 \v 10 యథార్థమైన వారిని చెడు దారిలోకి నడిపించేవారు, \q2 తమ ఉచ్చులో తామే పడతారు, \q2 కాని నిందారహితులు మంచి వారసత్వాన్ని పొందుకుంటారు. \b \q1 \v 11 ధనవంతులు తమ కళ్లకు తామే జ్ఞానులు; \q2 వివేకంగల పేదవారు వారు ఎంత మోసపూరితమైనవారో చూస్తారు. \b \q1 \v 12 నీతిమంతులు విజయం సాధించినప్పుడు, గొప్ప ఉల్లాసం ఉంటుంది; \q2 కాని దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రజలు దాక్కుంటారు. \b \q1 \v 13 తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, \q2 కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు. \b \q1 \v 14 దేవుని ఎదుట ఎప్పుడూ భయంతో వణికేవారు ధన్యులు, \q2 కాని తమ హృదయాలను కఠినం చేసుకొనే వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారు. \b \q1 \v 15 నిస్సహాయ ప్రజలను పైన ఉన్న దుష్ట పాలకుడు \q2 గర్జించే సింహం లేదా దాడి చేసే ఎలుగుబంటిలాంటి వాడు. \b \q1 \v 16 ఒక నిరంకుశ పాలకుడు బలాత్కారాన్ని అభ్యసిస్తాడు, \q2 కాని చెడుతో సంపాదించిన లాభాన్ని ద్వేషించేవాడు సుదీర్ఘ పాలనను అనుభవిస్తాడు. \b \q1 \v 17 హత్యచేసిన అపరాధభావంతో బాధించబడే వారు \q2 సమాధిలో ఆశ్రయం వెదకుతారు; \q2 ఎవరు వారిని ఆపకూడదు. \b \q1 \v 18 ఎవరి నడక నిందారహితంగా ఉంటుందో వారు భద్రంగా ఉంచబడతారు, \q2 కాని ఎవరి మార్గాలు మూర్ఖంగా ఉంటాయో వారు హఠాత్తుగా గొయ్యిలో పడిపోతారు. \b \q1 \v 19 తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, \q2 కానీ పగటి కలల వెంటపడేవారికి దరిద్రత నిండుతుంది. \b \q1 \v 20 నమ్మకమైన వ్యక్తి అధికంగా దీవించబడతాడు, \q2 కాని ధనము సంపాదించాలని ఆరాటపడేవాడు శిక్ష పొందక మానడు. \b \q1 \v 21 పక్షపాతం చూపడం మంచిది కాదు \q2 అయినా రొట్టె ముక్క కోసం మనుష్యులు తప్పు చేస్తారు. \b \q1 \v 22 పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు \q2 అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు. \b \q1 \v 23 నాలుకతో పొగిడే వారికన్నా, \q2 మనుష్యులను గద్దించేవారే చివరికి ఎక్కువ ఇష్టమవుతారు. \b \q1 \v 24 తన తల్లిదండ్రులను దోచుకొని \q2 “ఇది ద్రోహం కాదు” అనేవాడు \q2 నాశనం చేసేవానికి భాగస్వామి. \b \q1 \v 25 దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు, \q2 కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు. \b \q1 \v 26 తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు, \q2 కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు. \b \q1 \v 27 పేదవారికి ఇచ్చేవారికి ఏదీ కొదువ కాదు, \q2 కాని వారి పట్ల కళ్లు మూసుకొనే వారికి అనేక శాపాలు కలుగుతాయి. \b \q1 \v 28 దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు; \q2 కాని దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు వృద్ధిచెందుతారు. \b \c 29 \q1 \v 1 ఎన్నిమారులు గద్దించినను మాట విననివాడు \q2 తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు. \b \q1 \v 2 నీతిమంతులు వృద్ధి చెందినప్పుడు ప్రజలు సంతోషిస్తారు; \q2 దుష్టులు ఏలునపుడు, ప్రజలు మూల్గుతారు. \b \q1 \v 3 జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రికి ఆనందం కలిగిస్తాడు, \q2 కానీ వేశ్యల సహచరుడు తన సంపదను నాశనం చేస్తాడు. \b \q1 \v 4 న్యాయం ద్వారా ఒక రాజు దేశానికి స్థిరత్వాన్ని ఇస్తాడు, \q2 కాని లంచం కోసం అత్యాశపడేవారు దానిని కూల్చివేస్తారు. \b \q1 \v 5 పొరుగువారిని పొగడేవారు \q2 వారి పాదాలకు వలలు వేస్తున్నారు. \b \q1 \v 6 కీడుచేసేవారు తమ సొంత పాపం ద్వార చిక్కుకుంటారు, \q2 కాని నీతిమంతుడు ఆనందంతో కేకలు వేస్తాడు సంతోషంగా ఉంటాడు. \b \q1 \v 7 నీతిమంతులు పేదవారికి న్యాయం జరగాలని చూస్తారు, \q2 కాని దుష్టులకు అలాంటి ఆలోచించరు. \b \q1 \v 8 ఎగతాళి చేసేవారు పట్టణాన్ని తల్లడిల్లజేస్తారు, \q2 జ్ఞానులు కోపం చల్లార్చెదరు. \b \q1 \v 9 ఒకవేళ జ్ఞానియైన వ్యక్తి మూర్ఖునితో న్యాయస్థానానికి వెళ్తే, \q2 బుద్ధిహీనుడు కోపంతో ఎగతాళి చేస్తాడు, అప్పుడు అక్కడ వారికి సమాధానం ఉండదు. \b \q1 \v 10 రక్తపిపాసులు నిజాయితీ కల వ్యక్తిని ద్వేషిస్తారు \q2 యథార్థవంతులను చంపాలని చూస్తారు. \b \q1 \v 11 మూర్ఖులు వారి కోపాన్ని వెదజల్లుతారు, \q2 కాని జ్ఞానులు చివరికి ప్రశాంతత తెస్తారు. \b \q1 \v 12 ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే, \q2 తన అధికారులంతా దుష్టులవుతారు. \b \q1 \v 13 పేదవారు అణగారినవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: \q2 వీరిద్దరి కళ్లకు చూపు ఇచ్చేవాడు యెహోవా. \b \q1 \v 14 ఏ రాజు పేదలకు సత్యంగా న్యాయం తీరుస్తాడో, \q2 ఆ రాజు సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది. \b \q1 \v 15 బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది, \q2 కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు. \b \q1 \v 16 దుష్టులు వృద్ధిచెందునప్పుడు పాపం కూడా వృద్ధిచెందుతుంది, \q2 అయితే వారి పతనాన్ని నీతిమంతులు కళ్లారా చూస్తారు. \b \q1 \v 17 మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు; \q2 మీరు కోరుకునే ఆనందాన్ని వారు మీకు ఇస్తారు. \b \q1 \v 18 దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు; \q2 కాని జ్ఞానం యొక్క బోధ పట్ల శ్రద్ధ చూపేవాడు ధన్యుడు. \b \q1 \v 19 సేవకులు కేవలం మాటల ద్వారా సరిదిద్దబడరు; \q2 వారు గ్రహించినా సరే స్పందించరు. \b \q1 \v 20 త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా? \q2 వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ. \b \q1 \v 21 చిన్నప్పటి నుండి గారాబం పొందుకున్న దాసుడు \q2 పెంకితనం గలవానిగా అవుతాడు. \b \q1 \v 22 ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు \q2 మహా కోపిష్ఠియైన వ్యక్తి అనేక పాపాలు చేస్తాడు. \b \q1 \v 23 గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, \q2 అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు. \b \q1 \v 24 దొంగల సహచరుడు తనను తాను గాయపరచుకుంటాడు; \q2 మీరు నిజం చెప్పమని ప్రమాణం చేశారు, కాని మీరు సాక్ష్యం చెప్పే ధైర్యం లేదు. \b \q1 \v 25 మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, \q2 కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు. \b \q1 \v 26 పాలకునితో ప్రేక్షకులు ఉండాలని చాలామంది కోరుకుంటారు, \q2 అయితే న్యాయం యెహోవా నుండి వస్తుంది. \b \q1 \v 27 నీతిమంతులు నిజాయితీ లేనివారిని అసహ్యించుకుంటారు; \q2 దుష్టులు యథార్థవంతులను అసహ్యించుకుంటారు. \c 30 \ms1 అగూరు యొక్క సూక్తులు \p \v 1 యాకె కుమారుడైన అగూరు సూక్తులు. \q1 ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట: \b \q1 “దేవా, నేను అలసిపోయాను, \q2 కాని నేను గెలుస్తాను. \q1 \v 2 నిజంగా నేను క్రూరమైనవాన్ని, మనుష్యుని కాదు; \q2 మనుష్యులకు ఉండే ఇంగిత జ్ఞానం నాకు లేదు. \q1 \v 3 నేను జ్ఞానాన్ని అభ్యాసం చేయలేదు, \q2 పరిశుద్ధుని గురించిన తెలివి నాకు లేదు. \q1 \v 4 ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు? \q2 తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు? \q1 బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు? \q2 భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు? \q1 ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? \q2 ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి! \b \b \q1 \v 5 “దేవుని మాటలు పరీక్షించబడినవి; \q2 ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు. \q1 \v 6 ఆయన మాటలకు కలపవద్దు, \q2 ఆయన నిన్ను గద్దించి నిన్ను అబద్ధికుడవని నిరూపిస్తారు. \b \q1 \v 7 “యెహోవా, నేను మీ నుండి రెండింటిని అడిగాను; \q2 నేను చనిపోకముందు వాటిని నాకు ఇవ్వండి: \q1 \v 8 అసత్యాన్ని అబద్ధాలను నాకు దూరంగా ఉంచండి; \q2 దరిద్రతను గాని ధనాన్ని గాని నాకు ఇవ్వకండి, \q2 కాని నా వాటాను మాత్రం నాకు ఇవ్వండి. \q1 \v 9 ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి, \q2 ‘యెహోవా ఎవరు?’ అని అంటానేమో \q1 పేదవాడినైతే దొంగతనం చేసి \q2 నా దేవుని నామానికి అవమానం తెస్తానేమో. \b \q1 \v 10 “పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు, \q2 వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు. \b \q1 \v 11 “తమ తండ్రిని శపించేవారు \q2 తమ తల్లిని దీవించని వారు ఉన్నారు; \q1 \v 12 తమ కళ్లకు తాము పవిత్రులై \q2 తమ మలినం కడుగబడని వారు ఉన్నారు; \q1 \v 13 అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు, \q2 వారి చూపులు అసహ్యం; \q1 \v 14 భూమి మీద ఉండకుండా వారు పేదవారిని మ్రింగుదురు \q2 మనుష్యుల్లో బీదలు లేకుండా నశింపజేయుదురు \q1 కత్తి వంటి పళ్ళును, \q2 కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. \b \q1 \v 15 “జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, \q2 వారు ‘ఇవ్వు, ఇవ్వు!’ అని అరుస్తారు. \b \li1 “తృప్తిలేనివి మూడు కలవు, \li2 ‘చాలు!’ అననివి నాలుగు కలవు: \li3 \v 16 అవి ఏమనగా పాతాళం, \li3 పిల్లలు కనని గర్భం; \li3 నీరు చాలు అనని భూమి \li3 నీరు చాలు అనని అగ్ని. \b \q1 \v 17 “తండ్రిని ఎగతాళి చేసి \q2 తల్లి మాట వినని \q1 వాని కన్ను లోయకాకులు పీకుతాయి \q2 పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి. \b \li1 \v 18 “మూడు అద్భుతమైనవి కలవు, \li2 నాకు అర్థం కానివి నాలుగు కలవు: \li3 \v 19 అవేమనగా ఆకాశాన గ్రద్ద జాడ, \li3 బండ మీద పాము జాడ, \li3 అగాధ సముద్రంలో ఓడ నడుచు జాడ, \li3 పెండ్లికాని స్త్రీతో పురుషుని జాడ. \b \q1 \v 20 “వేశ్య యొక్క పనియు అట్టిదే; \q2 అది తిని నోరు తుడుచుకుని \q2 నేను ఏ చెడు చేయలేదు అని అంటుంది. \b \li1 \v 21 “భూమిని వణికించునవి మూడు కలవు, \li2 అవి భరించలేనివి నాలుగు కలవు. \li3 \v 22 అవి ఏమనగా రాజరికానికి వచ్చిన దాసుడు, \li3 తినడానికి పుష్కలంగా ఉన్న దైవభక్తి లేని మూర్ఖుడు, \li3 \v 23 పెళ్ళి చేసుకున్న ధిక్కార స్త్రీ, \li3 యజమానురాలి స్థానాన్ని తీసుకున్న చేసికొన్న దాసి. \b \li1 \v 24 “భూమి మీద చిన్నవి నాలుగు కలవు \li2 అయినా అవి మిక్కిలి తెలివిగలవి. \li2 \v 25 చీమలు బలంలేని ప్రాణులైనా, \li3 అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి. \li2 \v 26 చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా, \li3 అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి. \li2 \v 27 మిడతలకు రాజు లేడు, \li3 అయినా అవి బారులు తీరి సాగిపోతాయి. \li2 \v 28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు \li3 అయినా రాజుల ఇండ్లలో అది ఉంటుంది. \b \li1 \v 29 “డంబంగా నడిచేవి మూడు కలవు, \li2 బడాయిగా నడిచేవి నాలుగు కలవు: \li3 \v 30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది. \li3 \v 31 కోడిపుంజు, \li3 మేకపోతు \li3 తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు. \b \q1 \v 32 “నీవు బుద్ధిలేనివాడవై గర్వపడిన యెడల \q2 కీడు ఆలోచించిన యెడల \q2 నీ చేతితో నోరు మూసుకో. \q1 \v 33 పాలు తరచగా వెన్న వస్తుంది \q2 ముక్కు పిండగా రక్తం వస్తుంది \q2 కోపం రేపగా తగవు పుడుతుంది.” \c 31 \ms1 రాజైన లెమూయేలు సూక్తులు \p \v 1 రాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు. \q1 \v 2 నా కుమారుడా! ఆలకించు, నా గర్భంలో మోసిన నా కుమారుడా, ఆలకించు \q2 నా మ్రొక్కుబడులకు జవాబైన నా కుమారుడా, ఆలకించు! \q1 \v 3 నీ బలమును ఆడవారి కోసం ఖర్చు చేయవద్దు, \q2 రాజులను పతనము చేసేవారి కోసం నీ శక్తిని ఖర్చు చేయవద్దు. \b \q1 \v 4 లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, \q2 మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, \q2 పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు, \q1 \v 5 ఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు, \q2 అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు. \q1 \v 6 నశిస్తున్న వారికి సారా, \q2 హృదయ వేదనగల వారికి మద్యము. \q1 \v 7 వారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారు \q2 తమ కష్టాన్ని ఇక తలంచరు. \b \q1 \v 8 తమ గురించి తాము మాట్లాడలేని వారి కోసం, \q2 నిరాశ్రయులందరి హక్కుల కోసం మాట్లాడండి. \q1 \v 9 మాట్లాడండి న్యాయంగా తీర్పు తీర్చండి; \q2 దీనుల, అవసరతలో ఉన్న వారి హక్కులను పరిరక్షించండి. \ms1 ముగింపు: గుణవతియైన భార్య \q1 \v 10 \f + \fr 31:10 \fr*\ft \+xt 31:10-31|link-href="PRO 31:10-31"\+xt* వచనాలు ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి\ft*\f* గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? \q2 ఆమె ముత్యాల కంటే విలువైనది. \q1 \v 11 ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు \q2 అతనికి లాభం తక్కువకాదు. \q1 \v 12 ఆమె బ్రతుకు దినాలన్ని, \q2 అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు. \q1 \v 13 ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, \q2 ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది. \q1 \v 14 ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, \q2 వర్తకుల ఓడల లాంటిది. \q1 \v 15 ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది; \q2 తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది; \q2 తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది. \q1 \v 16 ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది; \q2 తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది. \q1 \v 17 ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, \q2 ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి. \q1 \v 18 ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది, \q2 రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. \q1 \v 19 ఆమె పంటను చేత పట్టుకుంటుంది, \q2 తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది. \q1 \v 20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, \q2 దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. \q1 \v 21 మంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు, \q2 ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు. \q1 \v 22 ఆమె పరుపులను తయారుచేసుకుంటుంది, \q2 ఆమె బట్టలు సన్నని నారబట్టలు ఎరుపు వస్త్రాలు. \q1 \v 23 ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు, \q2 అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు. \q1 \v 24 ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది, \q2 వర్తకులకు నడికట్లను అమ్ముతుంది. \q1 \v 25 బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది; \q2 ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు. \q1 \v 26 ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, \q2 దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది. \q1 \v 27 ఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది, \q2 పని చేయకుండ ఆమె భోజనం చేయదు. \q1 \v 28 ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; \q2 ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు: \q1 \v 29 “చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు, \q2 కాని వారందరినీ నీవు మించినదానవు.” \q1 \v 30 అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం; \q2 యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది. \q1 \v 31 చేసే పనిని బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది, \q2 ప్రజల ఎదుట ఆమె పనులు ఆమెను పొగడుతాయి.