\id NUM - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h సంఖ్యా \toc1 సంఖ్యాకాండం \toc2 సంఖ్యా \toc3 సంఖ్యా \mt1 సంఖ్యాకాండం \c 1 \s1 జనాభా లెక్కలు \p \v 1 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెల\f + \fr 1:1 \fr*\ft ప్రాచీన హెబ్రీయులు చంద్రునికి సంబంధించిన క్యాలెండర్ ఉపయోగించేవారు. దాని ప్రకారం రెండవ నెల అంటే ఏప్రిల్ లేదా మే\ft*\f* మొదటి రోజు సీనాయి ఎడారిలో ఉన్న సమావేశ గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు: \v 2 మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి. \v 3 నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి. \v 4 ప్రతీ గోత్రం నుండి ఒకడు తన కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతీ ఒకడు మీకు సహాయం చేయాలి. \b \lh \v 5 “మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: \b \li1 “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు; \li1 \v 6 షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు; \li1 \v 7 యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను; \li1 \v 8 ఇశ్శాఖారు గోత్రం నుండి సూయరు కుమారుడైన నెతనేలు; \li1 \v 9 జెబూలూను గోత్రం నుండి హేలోను కుమారుడైన ఏలీయాబు; \li1 \v 10 యోసేపు కుమారుల నుండి: \li2 ఎఫ్రాయిం గోత్రం నుండి అమీహూదు కుమారుడైన ఎలీషామా; \li2 మనష్షే గోత్రం నుండి పెదాసూరు కుమారుడైన గమలీయేలు; \li1 \v 11 బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కుమారుడైన అబీదాను; \li1 \v 12 దాను గోత్రం నుండి అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు; \li1 \v 13 ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కుమారుడైన పగీయేలు; \li1 \v 14 గాదు గోత్రం నుండి దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు; \li1 \v 15 నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కుమారుడైన అహీర.” \b \lf \v 16 వీరు సమాజంలో వారి పితరుల గోత్రాల నుండి నాయకులుగా ఏర్పాటు చేయబడినవారు. వీరు ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు. \b \p \v 17 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే అహరోనులు పేర్లు పేర్కొనబడిన వారిని తీసుకుని, \v 18 రెండవ నెల మొదటి రోజున సమాజమంతటిని సమావేశ పరిచారు. ప్రజలు వారి వారి గోత్రాలు, వారి వారి కుటుంబాల ప్రకారం తమ వంశాన్ని నమోదు చేసుకున్నారు. యిరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సున్న వారు ఒకరి తర్వాత ఒకరి పేరు నమోదు చేశారు. \v 19 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే సీనాయి ఎడారిలో వారిని లెక్కించాడు: \b \li1 \v 20 ఇశ్రాయేలు మొదటి సంతానమైన రూబేను సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 21 రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500. \b \li1 \v 22 షిమ్యోను సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 23 షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300. \b \li1 \v 24 గాదు సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 25 గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650. \b \li1 \v 26 యూదా సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 27 యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600. \b \li1 \v 28 ఇశ్శాఖారు సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 29 ఇశ్శాఖారు గోత్రం నుండి లెక్కించబడినవారు 54,400. \b \li1 \v 30 జెబూలూను సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 31 జెబూలూను గోత్రం నుండి లెక్కించబడినవారు 57,400. \b \lh \v 32 యోసేపు కుమారులు: \li1 ఎఫ్రాయిం సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 33 ఎఫ్రాయిం గోత్రం నుండి లెక్కించబడినవారు 40,500. \li1 \v 34 మనష్షే సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 35 మనష్షే గోత్రం నుండి లెక్కించబడినవారు 32,200. \b \li1 \v 36 బెన్యామీను సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 37 బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400. \b \li1 \v 38 దాను సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 39 దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700. \b \li1 \v 40 ఆషేరు సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 41 ఆషేరు గోత్రం నుండి లెక్కించబడినవారు 41,500. \b \li1 \v 42 నఫ్తాలి సంతతివారి నుండి: \li2 యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు. \v 43 నఫ్తాలి గోత్రం నుండి లెక్కించబడినవారు 53,400. \b \lf \v 44 వీరంతా ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల నాయకులతో కలిసి మోషే అహరోనులచేత లెక్కించబడినవారు. \v 45 ఇశ్రాయేలీయులందరిలో ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సుండి ఇశ్రాయేలు సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. \v 46 వీరి మొత్తం సంఖ్య 6,03,550. \b \p \v 47 అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు. \v 48 యెహోవా మోషేతో ఇలా అన్నారు: \v 49 “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు. \v 50 దానికి బదులుగా సాక్షి గుడారం లేదా సాక్షి గుడారం మీద, దాని ఉపకరణాల మీద, దానికి సంబంధించిన అన్నిటి మీద లేవీయులను నియమించు. వారు సమావేశ గుడారాన్ని, దాని ఉపకరణాలన్నిటిని మోయాలి; వారు దాని చుట్టూ ఉంటూ దానిని చూసుకోవాలి. \v 51 సమావేశ గుడారాన్ని తరలించాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దానిని క్రిందికి దించాలి, అలాగే సమావేశ గుడారాన్ని వేయాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దాన్ని వేయాలి. ఇతరులు దానిని సమీపిస్తే వారికి మరణశిక్ష విధించాలి. \v 52 ఇశ్రాయేలీయులు తమ తమ గోత్ర విభజన ప్రకారం సొంత జెండాలతో తమ డేరాలు వేసుకోవాలి. \v 53 అయితే నా కోపం ఇశ్రాయేలీయుల సమాజం మీదికి రాకుండా లేవీయులు సాక్షి గుడారం చుట్టూ డేరాలు వేసుకోవాలి. సాక్షి గుడారాన్ని కాపాడే బాధ్యత లేవీయులదే.” \p \v 54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు. \c 2 \s1 గోత్రాలవారిగా శిబిరాల ఏర్పాటు \p \v 1 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు: \v 2 “ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.” \b \lh \v 3 తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు: \li1 యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు. \v 4 అతని దళంలో ఉన్నవారు 74,600. \li1 \v 5 వారి ప్రక్కన ఇశ్శాఖారు గోత్రం వారు దిగాలి. సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు ప్రజల నాయకుడు. \v 6 అతని దళంలో ఉన్నవారు 54,400. \li1 \v 7 వారి ప్రక్కన జెబూలూను గోత్రము. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను ప్రజల నాయకుడు. \v 8 అతని విభజనలో ఉన్నవారు 57,400. \lf \v 9 యూదా శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన పురుషులందరు, 1,86,400. వారు ముందుగా వెళ్తారు. \b \lh \v 10 దక్షిణం వైపు: \li1 రూబేను గోత్రం వారు వారి జెండా క్రింద ఉండాలి. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను ప్రజల నాయకుడు. \v 11 అతని దళంలో ఉన్నవారు 46,500. \li1 \v 12 వారి ప్రక్కన షిమ్యోను గోత్రం వారు దిగాలి. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను ప్రజల నాయకుడు. \v 13 అతని దళంలో ఉన్నవారు 59,300. \li1 \v 14 వారి ప్రక్కన గాదు గోత్రం వారు దిగాలి. రగూయేలు\f + \fr 2:14 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa డెయుయేలు అని వాడబడింది\fqa*\f* కుమారుడైన ఎలీయాసాపు గాదు ప్రజల నాయకుడు. \v 15 అతని దళంలో ఉన్నవారు 45,650. \lf \v 16 రూబేను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,51,450. వీళ్ళు రెండవ గుంపుగా వెళ్తారు. \b \li1 \v 17 తర్వాత సమావేశ గుడారం, శిబిరాల మధ్యలో లేవీయుల శిబిరం ఉంటుంది. వారు ఉన్న ఈ క్రమంలోనే, ప్రతి ఒక్కరూ తమ జెండా క్రింద తమ స్థలంలో ఉంటారు. \b \lh \v 18 పడమర వైపు: \li1 ఎఫ్రాయిం గోత్రం వారి జెండా ప్రకారం ఉండాలి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం ప్రజల నాయకుడు. \v 19 అతని దళంలో ఉన్నవారు 40,500. \li1 \v 20 మనష్షే గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే ప్రజల నాయకుడు \v 21 అతని దళంలో ఉన్నవారు 32,200. \li1 \v 22 వారి ప్రక్కన బెన్యామీను గోత్రం వారు దిగాలి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను ప్రజల నాయకుడు. \v 23 అతని దళంలో ఉన్నవారు 35,400. \lf \v 24 ఎఫ్రాయిం శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,08,100. వీరు మూడవ గుంపుగా వెళ్తారు. \b \lh \v 25 ఉత్తరం వైపున: \li1 దాను గోత్రం వారు వారి జెండా దగ్గర ఉండాలి. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను ప్రజల నాయకుడు. \v 26 అతని దళంలో ఉన్న వారి సంఖ్య 62,700. \li1 \v 27 ఆషేరు గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు ప్రజల నాయకుడు. \v 28 అతని దళంలో ఉన్నవారు 41,500. \li1 \v 29 వారి ప్రక్కన నఫ్తాలి గోత్రం వారు దిగాలి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి ప్రజల నాయకుడు. \v 30 అతని దళంలో ఉన్నవారు 53,400. \lf \v 31 దాను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,57,600. వీళ్ళు తమ ధ్వజాల ప్రకారం చివరి గుంపుగా జెండాల క్రింద వెళ్తారు. \b \lf \v 32 వారి వారి కుటుంబాల పరంగా లెక్కించబడినవారు ఇశ్రాయేలీయులు వీరు. విభజనల ప్రకారం శిబిరాలలో ఉన్న పురుషులు 6,03,550. \v 33 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులను ఇతర ఇశ్రాయేలీయులతో లెక్కించలేదు. \b \p \v 34 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలీయులు చేశారు; ఆ ప్రకారం వారు గుడారాలు వేసుకున్నారు, ఆ విధంగా వారి వారి వంశం, కుటుంబంతో ప్రయాణిస్తారు. \c 3 \s1 లేవీయులు \p \v 1 యెహోవా మోషేతో సీనాయి కొండమీద మాట్లాడిన సమయంలో ఉన్న అహరోను మోషేల వంశావళి ఇదే. \b \p \v 2 అహరోను కుమారుల పేర్లు: మొదటి సంతానమైన నాదాబు, అబీహు, ఎలియాజరు ఈతామారు. \v 3 అవి అహరోను కుమారుల పేర్లు; వీరు అభిషేకించబడిన యాజకులు; వీరు యాజకులుగా సేవ చేయడానికి ప్రతిష్ఠించబడ్డారు. \v 4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యంలో యెహోవా ఎదుట అనధికార అగ్నితో అర్పణ అర్పించినందుకు ఆయన ఎదుటే చనిపోయారు. వారికి కుమారులు లేరు కాబట్టి అహరోను జీవితకాలమంతా, తన కుమారులైన ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు. \p \v 5 యెహోవా మోషేతో ఇలా చెప్పారు, \v 6 “లేవీ గోత్రం వారిని తీసుకువచ్చి యాజకుడైన అహరోనుకు సహాయం చేయడానికి అతని ఎదుట నిలబెట్టు. \v 7 వారు సమావేశ గుడారపు సేవ చేస్తూ సమావేశ గుడారం దగ్గర అతని తరపున సమాజమంతటి తరపున విధులు నిర్వర్తిస్తారు. \v 8 ప్రత్యక్ష గుడారపు పని చేయడం ద్వారా ఇశ్రాయేలీయుల బాధ్యతలను నెరవేరుస్తూ, వారు సమావేశ గుడారపు సామాగ్రి అంతా చూసుకోవాలి. \v 9 లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించు; వారు సంపూర్ణంగా అతని\f + \fr 3:9 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa నాకు\fqa*\f* స్వాధీనం చేయబడిన ఇశ్రాయేలీయులు. \v 10 యాజకులుగా సేవ చేయడానికి అహరోనును, అతని కుమారులను నియమించు; ఎవరైనా పరిశుద్ధాలయం దగ్గరకు వస్తే వారికి మరణశిక్ష విధించబడుతుంది.” \p \v 11 యెహోవా మోషేతో ఇలా కూడా చెప్పారు, \v 12 “ఇశ్రాయేలు ప్రజల్లో తొలి మగ సంతానం స్థానంలో నేను లేవీయులను తీసుకున్నాను. లేవీయులు నావారు, \v 13 ఎందుకంటే తొలిసంతానమంతా నావారు. ఈజిప్టు తొలిసంతానాన్ని నేను మొత్తినప్పుడు, ఇశ్రాయేలీయులలో మనుష్యుల్లో, పశువుల్లో ప్రతి తొలిసంతానాన్ని, నా కోసం ప్రత్యేకపరచుకున్నాను. వారు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను.” \p \v 14 సీనాయి ఎడారిలో యెహోవా మోషేతో ఇలా అన్నారు. \v 15 “లేవీయులను వారి కుటుంబాలు వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారినందరిని లెక్కించు.” \v 16 కాబట్టి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వారిని లెక్కించాడు. \b \li1 \v 17 లేవీ కుమారుల పేర్లు ఇవి: \li2 గెర్షోను, కహాతు, మెరారి. \li1 \v 18 గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: \li2 లిబ్నీ, షిమీ. \li1 \v 19 కహాతు వంశస్థుల పేర్లు ఇవి: \li2 అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. \li1 \v 20 మెరారి వంశస్థులు: \li2 మహలి, మూషి. \b \lf వీరు వారి వారి కుటుంబాల ప్రకారం లేవీ వంశస్థులు. \b \lh \v 21 లిబ్నీయులు, షిమీయులు వంశస్థులు గెర్షోనుకు చెందినవారు; వీరు గెర్షోను వంశస్థులు. \li1 \v 22 వీరిలో ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 7,500. \li1 \v 23 గెర్షోను వంశస్థులు సమావేశ గుడారం వెనుక పశ్చిమ వైపు దిగాలి. \li1 \v 24 లాయేలు కుమారుడైన ఎలీయాసాపు గెర్షోను కుటుంబాల నాయకుడు. \li1 \v 25 గెర్షోనీయులు కాపాడవలసినవి: సమావేశ గుడారం, గుడారం, దాని పైకప్పు, సమావేశ గుడార ద్వారం యొక్క తెర, \v 26 ఆవరణం యొక్క తెరలు, గుడారం బలిపీఠం చుట్టూ ఉన్న ద్వారపు తెర, దాని త్రాళ్లు, వాటికి ఉపయోగించబడే ప్రతి వస్తువు. \b \lh \v 27 అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు కహాతుకు చెందినవారు; వీరు కహాతు వంశస్థులు. \li1 \v 28 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరు 8,600\f + \fr 3:28 \fr*\ft హెబ్రీలో; కొన్ని గ్రీకు ప్రతులలో \ft*\fqa 8,300 \fqa*\ft మంది అని వ్రాయబడింది\ft*\f* మంది. \li1 పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత కహాతీయులది. \li1 \v 29 కహాతు వంశస్థులు సమావేశ గుడారం యొక్క దక్షిణ వైపు దిగాలి. \li1 \v 30 ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతు వంశస్థుల కుటుంబాల నాయకుడు. \li1 \v 31 వారు మందసం, బల్ల, దీపస్తంభం, బలిపీఠాలు, పరిచర్య కోసం పరిశుద్ధాలయం లోని వస్తువులు, తెర వాటికి ఉపయోగించబడే ప్రతి వస్తువు విషయం బాధ్యత వహించాలి. \li1 \v 32 యాజకుడును అహరోను కుమారుడునైన ఎలియాజరు లేవీయుల ప్రధాన నాయకుడు. పరిశుద్ధాలయాన్ని కాపాడే వారి మీద ఇతడు ముఖ్య నాయకునిగా నియమించబడ్డాడు. \b \lh \v 33 మహలీయులు, మూషీయుల వంశస్థులు మెరారికి చెందినవారు. వీరు మెరారి వంశస్థులు. \li1 \v 34 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200. \li1 \v 35 అబీహయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశస్థుల కుటుంబాల నాయకుడు. \li1 వీరు సమావేశ గుడారం యొక్క ఉత్తర వైపున దిగాలి. \li1 \v 36 మెరారీయులు సమావేశ గుడారం యొక్క పలకలు, దాని అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, దాని ప్రతి ఉపకరణాలు వాటికి సంబంధించినవన్నీ, \v 37 అలాగే ఆవరణం చుట్టూ ఉన్న ప్రాకార స్తంభాలు, వాటి దిమ్మలు, వాటి మేకులు త్రాళ్లను కాపాడడానికి నియమింపబడ్డారు. \b \li1 \v 38 మోషే, అహరోను, అతని కుమారులు సమావేశ గుడారానికి తూర్పున, అనగా సూర్యుడు ఉదయించే వైపున సమావేశ గుడారానికి ఎదురుగా ఉండాలి. \li1 ఇశ్రాయేలీయుల పక్షంగా పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత వీరిది. \li1 ఇతరులెవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే వారికి మరణశిక్ష. \b \lf \v 39 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే అహరోనుల ద్వారా లెక్కించబడిన లేవీయులు, వారి వారి వంశాల ప్రకారం ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 22,000. \b \p \v 40 యెహోవా మోషేతో, “ఒక నెల లేదా ఆపై వయస్సున్న ఇశ్రాయేలీయుల తొలిసంతానమైన మగవారిని లెక్కించండి, వారి పేర్ల జాబితాను తయారుచేయండి. \v 41 ఇశ్రాయేలీయుల్లోని తొలిసంతానానికి బదులు లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకోవాలి. నేను యెహోవానై యున్నాను.” \p \v 42 కాబట్టి మోషే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులలో తొలిసంతానాన్ని లెక్కించాడు. \v 43 ఒక నెల లేదా ఆ పైబడి వయస్సుగల మొదటి సంతానమైన మగవారందరు 22,273 మంది. \p \v 44 యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు. \v 45 “ఇశ్రాయేలీయుల తొలి సంతానమంతటికి బదులు లేవీయులను, వారి పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకో. లేవీయులు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను. \v 46 లేవీయుల కంటే ఇశ్రాయేలీయులు 273 మంది ఎక్కువ ఉన్నారు. వీరిని విడిపించడానికి, \v 47 పరిశుద్ధాలయం యొక్క షెకెల్ చొప్పున, ఒక్క షెకెల్ అంటే ఇరవై గెరాలు, ఒక్కొక్కరికి అయిదు షెకెళ్ళ\f + \fr 3:47 \fr*\ft అంటే సుమారు 58 గ్రాములు\ft*\f* వెండి తీసుకోవాలి. \v 48 ఆ మిగిలిన ఇశ్రాయేలీయుల విమోచన కోసం అహరోనుకు అతని కుమారులకు ఆ డబ్బు ఇవ్వాలి.” \p \v 49 కాబట్టి మోషే లేవీయుల ద్వారా విడిపించబడిన వారికంటే ఎక్కువగా ఉన్న వారి నుండి విమోచన డబ్బు తీసుకున్నాడు. \v 50 ఇశ్రాయేలీయులలో తొలిసంతానం నుండి పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం మోషే 1,365 షెకెళ్ళ\f + \fr 3:50 \fr*\ft అంటే సుమారు 16 కి. గ్రా. లు\ft*\f* వెండి తీసుకున్నాడు. \v 51 యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే విమోచన డబ్బును అహరోను అతని కుమారులకు ఇచ్చాడు. \c 4 \s1 కహాతీయులు \p \v 1 యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పారు: \v 2 “లేవీ గోత్రంలో కహాతు వంశాల, కుటుంబాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి. \v 3 సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సున్న పురుషులందరినీ లెక్కించు. \p \v 4 “కహాతీయులు సమావేశ గుడారంలో చేయాల్సిన పని: అతిపరిశుద్ధమైనవాటిని జాగ్రత్తగా చూసుకోవడము. \v 5 ప్రజలు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వెళ్లి అడ్డతెర దించి నిబంధన మందసం మీద కప్పాలి. \v 6 తర్వాత వారు ఆ తెరను మన్నికైన తోలుతో\f + \fr 4:6 \fr*\ft బహుశ పాలిచ్చే పెద్ద నీటి జంతువుల తోళ్ళు; \+xt 8|link-href="NUM 4:8"\+xt*, \+xt 10|link-href="NUM 4:10"\+xt*, \+xt 11|link-href="NUM 4:11"\+xt*, \+xt 12|link-href="NUM 4:12"\+xt*, \+xt 14|link-href="NUM 4:14"\+xt*, \+xt 25 వచనాల్లో|link-href="NUM 4:25"\+xt* కూడా ఉంది.\ft*\f* కప్పి, దానిపై నీలిరంగు బట్ట పరిచి మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి. \p \v 7 “వారు సన్నిధి బల్లమీద నీలిరంగు బట్టను పరిచి దాని మీద పళ్లాలను, పాత్రలు, గిన్నెలు, పానార్పణ కోసం జాడీలను ఉంచాలి; రొట్టె ఎప్పుడూ దాని మీద ఉండాలి. \v 8 వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి, మన్నికైన తోలుతో దాన్ని కప్పి, మోతకర్రలను ఉంగరాల్లో దూర్చాలి. \p \v 9 “వారు నీలిరంగు బట్ట తీసుకుని దీపస్తంభాన్ని, దాని దీపాలను, వత్తులు కత్తిరించే కత్తెరలను, వాటి పళ్లాలను, దీపాల్లో పోసే ఒలీవనూనె జాడీలన్నిటిని కప్పాలి. \v 10 తర్వాత వారు దానిని, దాని ఉపకరణాలన్నిటిని మన్నికైన తోలుతో చుట్టి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి. \p \v 11 “బంగారు బలిపీఠం మీద వారు నీలిరంగు బట్ట పరిచి, దాన్ని మన్నికైన తోలుతో కప్పి, మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి. \p \v 12 “వారు పరిశుద్ధాలయంలో పరిచర్య కోసం వాడే వస్తువులన్నిటిని తీసుకుని వాటిని నీలి బట్టలో చుట్టి, మన్నికైన తోలుతో కప్పి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి. \p \v 13 “వారు ఇత్తడి బలిపీఠం మీది నుండి బూడిదను తీసివేసి, దాని మీద ఊదా బట్ట కప్పాలి. \v 14 తర్వాత వారు బలిపీఠం దగ్గర పరిచర్యకు వాడే అన్ని పాత్రలను, నిప్పు పెనాలు, ముళ్ళ గరిటెలు, పారలు, ప్రోక్షణ గిన్నెలతో సహా దాని మీద పెట్టాలి. దాని మీద మన్నికైన తోలు కప్పి, మోతకర్రలను వాటి స్థలంలో దూర్చాలి. \p \v 15 “అహరోను అతని కుమారులు పరిశుద్ధ సామాగ్రి, పరిశుద్ధ ఉపకరణాలన్నిటిని కప్పడం పూర్తి చేసిన తర్వాత, ప్రజలు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కహాతీయులు వచ్చి దానిని మోయాలి. అయితే వారు పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదు, ముట్టుకుంటే వారు చస్తారు. కహాతీయులు సమావేశ గుడారంలో ఉన్నవాటిని మోయాలి. \p \v 16 “అహరోను కుమారుడును యాజకుడునైన ఎలియాజరు, దీపానికి నూనె, పరిమళ వాసనగల ధూపద్రవ్యం, నిత్యం అర్పించే భోజనార్పణ, అభిషేక తైలం మొదలగువాటిని పర్యవేక్షిస్తాడు. అతడు సమావేశ గుడారమంతటిని, అందులో ఉన్న సామాగ్రిని, పరిశుద్ధ ఉపకరణాలతో పాటు ప్రతిదీ పర్యవేక్షిస్తాడు.” \p \v 17 యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు, \v 18 “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి. \v 19 వారు అతిపరిశుద్ధమైన వాటి దగ్గరకు వచ్చినప్పుడు చావకుండ బ్రతికి ఉండేలా మీరు వారి కోసం ఇలా చేయండి: అహరోను అతని కుమారులు పరిశుద్ధాలయంలోకి వెళ్లి, వారందరికి వారు చేయాల్సిన పనిని, వారు మోయాల్సిన వాటిని వారికి అప్పగించాలి. \v 20 అయితే కహాతీయులు పరిశుద్ధమైన వాటిని చూడాలని, కనీసం ఒక్క క్షణమైనా లోనికి వెళ్లకూడదు, వెళ్తే వారు చస్తారు.” \s1 గెర్షోనీయులు \p \v 21 యెహోవా మోషేతో ఇలా అన్నారు, \v 22 “గెర్షోనీయులను కూడా వారి కుటుంబాలు, వంశాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి. \v 23 సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి. \p \v 24 “మోయడంలో, అలాగే వారి ఇతర పనులలో గెర్షోను వంశస్థుల సేవ ఇదే: \v 25 ప్రత్యక్ష గుడారం యొక్క తెరలు అంటే సమావేశ గుడారం దాని కప్పు అలాగే మన్నికైన తోలుతో చేయబడిన వెలుపటి కప్పు ఇంకా సమావేశ గుడార ద్వారం యొక్క తెరలు, \v 26 సమావేశ గుడారం, బలిపీఠం చుట్టూ ఉన్న ఆవరణ తెరలు, ఆవరణ ప్రవేశ ద్వారపు తెరలు, వాటి త్రాళ్లు గుడారంలో సేవకు ఉపయోగించే వస్తువులన్నిటిని మోయాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ గెర్షోనీయులు చేయాలి. \v 27 గెర్షోనీయులు మోసుకెళ్లే పనైనా లేదా వేరే పనైనా వారి సేవ అంతా అహరోను అతని కుమారుల ఆధ్వర్యంలోనే జరగాలి. వారు మోయాల్సిన బాధ్యతను మీరు వారికి అప్పగించాలి. \v 28 సమావేశ గుడారం దగ్గర గెర్షోను వంశస్థులు చేయాల్సిన సేవ ఇదే. వారి విధులను అహరోను కుమారుడును యాజకుడునైన ఈతామారు పర్యవేక్షణలో జరగాలి. \s1 మెరారీయులు \p \v 29 “మెరారీయుల కుటుంబాలను వారి వంశాల ప్రకారం జనాభా లెక్క తీసుకోండి. \v 30 సమావేశ గుడారంలో పని చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి. \v 31 గుడారంలో వారి సేవలో భాగంగా వారు గుడారపు పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, \v 32 అంతేకాక, ఆవరణం చుట్టూ ఉండే స్తంభాలు వాటి దిమ్మలు, మేకులు, త్రాళ్లు వాటికి సంబంధించినవన్నీ వారే మోయాలి. ప్రతి ఒక్కరు మోయడానికి నిర్దిష్టమైన వాటిని అప్పగించండి. \v 33 సమావేశ గుడారం దగ్గర అహరోను కుమారుడు, యాజకుడైన ఈతామారు పర్యవేక్షణలో మెరారి వంశస్థులు చేసే సేవ ఇది.” \s1 లేవీ వంశస్థుల జనాభా లెక్క \li1 \v 34 మోషే, అహరోనులు సమాజ నాయకులతో కలిసి కహాతీయులను వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం లెక్కించారు. \li2 \v 35-36 వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులంతా 2,750 మంది. \v 37 సమావేశ గుడారం దగ్గర సేవచేసే కహాతు వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు. \b \li1 \v 38 గెర్షోనీయులు వారి వంశాలు, కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు. \li2 \v 39-40 వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి, సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులందరు 2,630 మంది. \v 41 సమావేశ గుడారం దగ్గర సేవ చేసిన గెర్షోను వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు. \b \li1 \v 42 మెరారీయులు వారి వంశాలు కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు. \li2 \v 43-44 వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులందరు 3,200 మంది. \v 45 మెరారి వంశాల మొత్తం లెక్క ఇది. మోషే ద్వారా వచ్చిన యెహోవా ఆజ్ఞమేరకు మోషే అహరోనులు వారిని లెక్కించారు. \b \lf \v 46 మోషే, అహరోను ఇశ్రాయేలు నాయకులు కలిసి లేవీయులందరిని వంశాల, కుటుంబాల ప్రకారం లెక్కించారు. \v 47 వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి దాన్ని మోయడానికి వచ్చిన వారి \v 48 సంఖ్య 8,580. \v 49 మోషే ద్వార వచ్చిన యెహోవా ఆజ్ఞ ప్రకారం, వారందరికి వారి వారి పనులు, వారు మోయాల్సినవి అప్పగించబడ్డాయి. \b \p యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, వారు లెక్కించబడ్డారు. \c 5 \s1 శిబిరం యొక్క పవిత్రత \p \v 1 యెహోవా మోషేతో ఇలా అన్నారు, \v 2 “ఎవరికైనా అపవిత్రమైన కుష్ఠువ్యాధి\f + \fr 5:2 \fr*\ft హెబ్రీ భాషలో ఏ చర్మ వ్యాధి గురించియైనా \ft*\fqa కుష్ఠువ్యాధి \fqa*\ft అని వాడబడింది\ft*\f* ఉన్నా లేదా ఏదైనా స్రావము కలిగి ఉన్నా లేదా శవాన్ని ముట్టుకొని ఆచారరీత్య అపవిత్రమై ఉన్నా, అలాంటి వారిని శిబిరంలో నుండి పంపివేయాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు. \v 3 పురుషులనైనా స్త్రీలనైనా పంపివేయాలి; నేను ప్రజలమధ్య నివసిస్తాను కాబట్టి వారు శిబిరాన్ని అపవిత్రం చేయకుండేలా వారిని పంపివేయాలి.” \v 4 ఇశ్రాయేలీయులు అలాగే చేశారు; వారిని శిబిరం బయటకు పంపివేశారు. యెహోవా మోషేకు సూచించిన ప్రకారం వారు చేశారు. \s1 పాపాలకు నష్టపరిహారం \p \v 5 యెహోవా మోషేతో ఇలా చెప్పారు, \v 6 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏ స్త్రీ గాని, పురుషుడు గాని యెహోవా పట్ల ద్రోహులై మనుష్యులు చేసే పాపాల్లో దేనినైనా చేసి అపరాధులైతే, \v 7 వారు వారి పాపాన్ని ఒప్పుకుని వారు చేసిన అపరాధానికి పూర్ణ ప్రాయశ్చిత్తం చేయాలి, చేసిన తప్పుకు అయిదవ వంతు చేర్చి ఎవరికి విరుద్ధంగా తప్పు చేశారో వారికి ఇవ్వాలి. \v 8 అయితే ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించడానికి సమీపబంధువు లేకపోతే, ఆ నష్టపరిహారం యెహోవాది, అది ప్రాయశ్చిత్త బలిగా ఇవ్వబడే పొట్టేలుతో పాటు యాజకునికి ఇవ్వబడాలి. \v 9 ఇశ్రాయేలీయులు ఒక యాజకునికి తీసుకొనివచ్చే పవిత్రమైన విరాళాలన్నీ అతనికే చెందుతాయి. \v 10 పవిత్రమైనవి వాటి యజమానులకు చెందుతాయి, కానీ వారు యాజకునికి ఇచ్చేది యాజకునికే చెందుతుంది.’ ” \s1 నమ్మకద్రోహియైన భార్యకు పరీక్ష \p \v 11 యెహోవా మోషేతో ఇలా అన్నారు, \v 12 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ‘ఒకవేళ ఒక వ్యక్తి భార్య దారితప్పి అతనికి నమ్మకద్రోహం చేసి, \v 13 మరొక వ్యక్తి ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకొని, ఆ విషయం తన భర్తకు తెలియకుండ దాచబడి ఆమె అపవిత్రపరచబడింది అనడానికి సాక్ష్యం లేకపోయినా, ఆమె పట్టుబడకపోయినా, \v 14 ఒకవేళ అతడు తన భార్య మీద అసూయపడి ఆమెను అనుమానించినప్పుడు, ఆమె నిజంగానే అపవిత్రమైతే, ఒకవేళ ఆమె అపవిత్రం కాకపోయినా అతడు ఆమెను అనుమానిస్తే, \v 15 అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకెళ్లాలి. అతడు ఆమె పక్షంగా ఒక ఓమెరు\f + \fr 5:15 \fr*\ft అంటే, సుమారు 1.6 కి. గ్రా. లు\ft*\f* యవల పిండి తీసుకురావాలి. దాని మీద ఒలీవనూనె పోయకూడదు ధూపం వేయకూడదు ఎందుకంటే అది అసూయ కోసం అర్పించే భోజనార్పణ, చేసిన తప్పును జ్ఞాపకం చేసే జ్ఞాపక అర్పణ. \p \v 16 “ ‘యాజకుడు ఆమెను తీసుకువచ్చి యెహోవా ఎదుట నిలబెట్టాలి. \v 17 తర్వాత యాజకుడు ఓ మట్టి కూజలో పవిత్ర జలం తీసుకుని సమావేశ గుడారంలోని నేల మట్టిని ఆ నీటిలో వేయాలి. \v 18 యాజకుడు యెహోవా ఎదుట ఆమెను నిలబెట్టిన తర్వాత, ఆమె జుట్టును విప్పి, శాపాన్ని తెచ్చే చేదు నీటిని యాజకుడు పట్టుకుని, జ్ఞాపక అర్పణను అంటే అనుమానం కొరకైన జ్ఞాపక అర్పణను ఆమె చేతుల్లో పెట్టాలి. \v 19 తర్వాత యాజకుడు ఆ స్త్రీతో ప్రమాణం చేయించి, “ఏ మనుష్యుడు నీతో లైంగిక సంబంధం లేకపోతే, నీ భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు నీవు త్రోవ తప్పకుండ, అపవిత్రం కాకుండ ఉంటే, శాపం తెచ్చే ఈ చేదు నీళ్ల నుండి నీవు నిర్దోషివి అవుతావు. \v 20 అయితే నీ భర్తతో పెళ్ళి చేసుకున్న తర్వాత నీవు త్రోవ తప్పి, నీ భర్త కాకుండా వేరొక వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా నిన్ను నీవు అపవిత్రపరచుకుని ఉంటే,” \v 21 యాజకుడు ఆమె మీదికి, “యెహోవా నిన్ను నీ ప్రజలమధ్య ఒక శాపంగా\f + \fr 5:21 \fr*\ft అంటే, శపించడానికి నీ పేరు వాడబడేలా ఆయన చేయును గాక శాపానికి మీ పేరు కారణంగా ఉంటుంది \+xt యిర్మీయా 29:22\+xt*; లేదా నీవు శపించబడడం ఇతరులు చూడాలి; \+xt 27|link-href="NUM 5:27"\+xt* వచనంలో ఉన్నట్లుగా\ft*\f* చేసి, నీ గర్భం పోవునట్లు, నీ ఉదరం ఉబ్బిపోయేలా చేయును గాక. \v 22 శాపం తెచ్చే ఈ నీరు నీ శరీరంలోనికి ప్రవేశించి నీ ఉదరం ఉబ్బిపోయేలా లేదా నీ గర్భం పోవునట్లు చేయును గాక” అని శాపం పలుకుతాడు. \p “ ‘అప్పుడు ఆ స్త్రీ, “ఆమేన్, అలాగే జరుగును గాక” అని అనాలి. \p \v 23 “ ‘యాజకుడు ఈ శాపాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి దానిని చేదు నీటితో కడగాలి. \v 24 శాపం తెచ్చే ఆ చేదు నీటిని ఆమెతో త్రాగించాలి, అప్పుడు శాపం తెచ్చే ఆ నీరు ఆమెలో చేదు పుట్టిస్తుంది. \v 25 యాజకుడు ఆమె చేతి నుండి అసూయ కొరకైన భోజనార్పణను తీసుకుని, యెహోవా ఎదుట పైకెత్తి దానిని బలిపీఠం దగ్గరకు తీసుకురావాలి. \v 26 యాజకుడు ఆ భోజనార్పణలో నుండి పిడికెడు తీసుకుని దాన్ని బలిపీఠం మీద జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి; తర్వాత అతడు ఆ స్త్రీతో ఆ నీరు త్రాగించాలి. \v 27 ఆమె తనను తాను అపవిత్రపరచుకుని ఉంటే, తన భర్తకు నమ్మకద్రోహం చేసి ఉంటే, ఫలితం ఇలా ఉంటుంది: శాపం తెచ్చే ఆ నీళ్లను ఆమె త్రాగినప్పుడు, ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె కడుపు ఉబ్బుతుంది, ఆమె గర్భం పోతుంది ఆమె శాపంగా మారుతుంది. \v 28 అయితే ఆమె తనను తాను అపవిత్రం చేసుకోకుండ పవిత్రంగా ఉంటే, తాను నిర్దోషిగా ఉండి పిల్లలను కనగలుగుతుంది. \p \v 29 “ ‘ఇది అసూయకు సంబంధించిన నియమము. ఒక స్త్రీ తన భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు త్రోవ తప్పి తనను తాను అపవిత్రపరచుకుంటే, \v 30 లేదా ఒక వ్యక్తి తన భార్య మీద అసూయ పడినప్పుడు వర్తించే న్యాయవిధి. యాజకుడు ఆమెను యెహోవా ఎదుట నిలబెట్టి ఈ నియమాన్ని ఆ స్త్రీకి అన్వయింపచేయాలి. \v 31 అప్పుడు ఆ భర్త ఏ తప్పు చేసినా నిర్దోషిగా ఉంటాడు. కానీ స్త్రీ తన పాపపు పరిణామాలను భరిస్తుంది.’ ” \c 6 \s1 నాజీరు నియమం \p \v 1 యెహోవా మోషేతో, \v 2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘పురుషుడు గాని స్త్రీ గాని ఒక ప్రత్యేకమైన మ్రొక్కుబడి చేయాలనుకుంటే అనగా, యెహోవాకు నాజీరుగా ప్రతిష్ఠించుకునే మ్రొక్కుబడి చేయాలనుకుంటే, \v 3 వారు ద్రాక్షరసం, మద్యానికి వేరుగా ఉండాలి, ద్రాక్షరసం నుండి గాని మద్యం నుండి గాని తయారుచేసిన చిరక త్రాగవద్దు. వారు ఏ ద్రాక్షరసం త్రాగకూడదు, పండు ద్రాక్షలు గాని ఎండు ద్రాక్షలు గాని తినకూడదు. \v 4 వారు నాజీరుగా ఉన్నంత కాలం ద్రాక్షరసం నుండి వచ్చే ఏవైన, విత్తనాలైనా లేదా వాటి ఎండిన తినకూడదు. \p \v 5 “ ‘నాజీరుగా మ్రొక్కుబడి చేసుకున్న కాలమంతా, వారి వెంట్రుకలు కత్తిరించకూడదు. తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకున్న కాలమంతా వారు ముగిసేవరకు పవిత్రులుగా ఉండాలి; వారి వెంట్రుకలు పెరిగేలా వదిలేయాలి. \p \v 6 “ ‘వారు యెహోవాకు తాము ప్రత్యేకించుకున్న కాలమంతా శవం దగ్గరకు వెళ్లకూడదు. \v 7 వారి సొంత తండ్రి లేదా తల్లి లేదా సోదరుడు లేదా సోదరి మరణించినా కూడా, వారు తమను తాము ఆచారబద్ధంగా అపవిత్రం చేసుకోవద్దు, ఎందుకంటే దేవునికి వారు అంకితం చేసుకున్న చిహ్నం వారి తలపై ఉంటుంది. \v 8 వారి సమర్పణ కాలం అంతా, వారు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు. \p \v 9 “ ‘నాజీరు చేయబడినవారు ఉన్నచోట ఎవరైనా చనిపోయి, తాము ప్రతిష్ఠించుకున్న దానికి సూచనగా ఉన్న వారి వెంట్రుకలు అపవిత్రం అయితే, వారు ఏడవ రోజున, శుభ్ర పరచుకునే రోజున తమ తల గొరిగించుకోవాలి. \v 10 తర్వాత ఎనిమిదవ రోజు రెండు తెల్ల గువ్వలను, రెండు పావురపు పిల్లలను సమావేశ గుడారం ద్వారం దగ్గర యాజకుడి దగ్గరకు తేవాలి. \v 11 నాజీరు శవం దగ్గర ఉండడం పాపమవుతుంది, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా,\f + \fr 6:11 \fr*\ft లేదా \ft*\fqa శుద్ధీకరణ అర్పణ \fqa*\ft అలాగే \+xt 1|link-href="NUM 6:14"\+xt*; \+xt 16|link-href="NUM 6:16"\+xt* వచనాల్లో కూడా\ft*\f* ఇంకొక దానిని దహనబలిగా అర్పించాలి. అదే రోజు తమ తలను మరలా పవిత్రం చేసుకోవాలి. \v 12 వారు ప్రత్యేకించుకున్న కాలాన్ని నియమించుకొని తిరిగి తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకుని ఒక ఏడాది గొర్రెపిల్లను అపరాధపరిహారబలి కోసం తేవాలి. ప్రత్యేకించుకున్న కాలంలో అపవిత్రులయ్యారు కాబట్టి మునుపటి రోజులు లెక్కకు రావు. \p \v 13 “ ‘ప్రత్యేకించుకున్న కాలం ముగిసినప్పుడు నాజీరు పాటించవలసిన నియమమేదంటే వారు సమావేశ గుడారం ద్వారం దగ్గరకు రావాలి. \v 14 అక్కడ వారు యెహోవాకు తమ అర్పణలు అర్పించాలి: దహనబలి కోసం లోపం లేని ఏడాది మగ గొర్రెపిల్ల, పాపపరిహారబలి కోసం లోపం లేని ఆడ గొర్రెపిల్ల, సమాధానబలి కోసం లోపం లేని పొట్టేలు, \v 15 వీటితో పాటు భోజనార్పణలు, పానార్పణలు, ఒక గంపెడు నూనె కలిపిన పులుపు కలపకుండ చేసిన నాణ్యమైన పిండి వంటలు ఒలీవనూనె కలిపిన మందమైన రొట్టెలు, ఒలీవనూనె పూసిన అప్పడాలు తీసుకురావాలి. \p \v 16 “ ‘ఇవన్నీ యాజకుడు యెహోవా ఎదుట ఉంచి పాపపరిహారబలి, దహనబలి అర్పించాలి. \v 17 అతడు గంపెడు పులియని రొట్టెలతో పాటు పొట్టేలును భోజనార్పణ పానార్పణంతో పాటు యెహోవాకు సమాధానబలిగా అర్పించాలి. \p \v 18 “ ‘అప్పుడు సమావేశ గుడారం ద్వారం దగ్గర, నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకోవాలి. ఆ వెంట్రుకలు సమాధానబలి అగ్నిలో వేసేయాలి. \p \v 19 “ ‘నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకున్న తర్వాత వండిన పొట్టేలు జబ్బను, గంపలోని ఒక పులుపు కలపకుండ చేసిన మందమైన రొట్టెను, ఒక అప్పడాన్ని యాజకుడు నాజీరు చేయబడిన వాని చేతిలో పెట్టాలి. \v 20 యాజకుడు అప్పుడు వాటిని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి; పైకెత్తబడి అర్పించబడిన రొమ్ము, ప్రత్యేక అర్పణగా సమర్పించబడిన తొడ పరిశుద్ధమైనవి, అవి యాజకునికి చెందినవి. ఆ తర్వాత, నాజీరు చేయబడిన వాడు ద్రాక్షరసం త్రాగవచ్చు. \p \v 21 “ ‘తాము ప్రత్యేకించుకున్న దాని ప్రకారం యెహోవాకు అర్పణలను తెస్తామని మ్రొక్కుబడి చేసే నాజీరుల నియమము. వారు తేగలిగితే అధనపు అర్పణలను కూడా తీసుకురావచ్చు. నాజీరు నియమం ప్రకారం వారు చేసిన మ్రొక్కుబడులను వారు తప్పక నెరవేర్చాలి.’ ” \s1 యాజక దీవెన \p \v 22 యెహోవా మోషేతో ఇలా చెప్పారు, \v 23 “అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి: \q1 \v 24 “ ‘ “యెహోవా నిన్ను ఆశీర్వదించి \q2 కాపాడును గాక; \q1 \v 25 యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి \q2 నిన్ను కరుణించును గాక; \q1 \v 26 యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక \q2 సమాధానం ఇచ్చును గాక.” ’ \p \v 27 “ఇలా అహరోను అతని కుమారులను ఇశ్రాయేలీయులను నా నామమున దీవించినప్పుడు, నేనే స్వయంగా ఆశీర్వదిస్తాను.” \c 7 \s1 సమావేశ గుడారాన్ని ప్రతిష్ఠించడానికి అర్పణలు \p \v 1 మోషే సమావేశ గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు దాన్ని అభిషేకించి, దాన్ని, దాని సామాగ్రినంతటిని ప్రతిష్ఠించాడు. అతడు బలిపీఠాన్ని, దాని వస్తువులను కూడా ప్రతిష్ఠించాడు. \v 2 తర్వాత ఇశ్రాయేలు నాయకులు, లెక్కించబడిన వారిపట్ల బాధ్యత వహించిన గోత్ర నాయకులు యైన కుటుంబ పెద్దలు అర్పణలు అర్పించారు. \v 3 వారు యెహోవా ఎదుటకు ప్రతి నాయకుడి నుండి ఒక ఎద్దు, ప్రతి ఇద్దరి నుండి ఒక బండి చొప్పున ఆరు పైకప్పు ఉన్న బండ్లు, పన్నెండు ఎద్దులను తమ బహుమతులుగా తెచ్చారు. వీటిని వారు సమావేశం గుడారం ముందు సమర్పించారు. \p \v 4 యెహోవా మోషేతో, \v 5 “సమావేశ గుడారం సేవలో వాడబడేలా వారి నుండి వీటిని స్వీకరించు. ప్రతీ వ్యక్తి యొక్క పనికి అవసరం ఉన్న ప్రకారం, వాటిని లేవీయులకు ఇవ్వు.” \p \v 6 కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాడు. \v 7 అతడు రెండు బండ్లు, నాలుగు ఎద్దులను గెర్షోనీయులకు, వారి పనికి అవసరం ఉన్న ప్రకారం ఇచ్చాడు, \v 8 అలాగే నాలుగు బండ్లు, ఎనిమిది ఎద్దులను మెరారీయులకు ఇచ్చాడు. వారందరు యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో ఉన్నారు. \v 9 కానీ మోషే కహాతీయులకు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే వారు వారి బాధ్యత ప్రకారం, పరిశుద్ధ వస్తువులను వారి భుజాలపై మోసేవారు. \p \v 10 బలిపీఠాన్ని అభిషేకించినప్పుడు, నాయకులు ప్రతిష్ఠార్పణలు తెచ్చి, బలిపీఠం ముందుంచారు. \v 11 యెహోవా మోషేతో, “బలిపీఠం ప్రతిష్ఠించడం కోసం ప్రతిరోజు ఒక్కొక్క నాయకుడు తమ అర్పణను తీసుకురావాలి.” \b \lh \v 12 మొదటి రోజు తన అర్పణను తెచ్చిన వారు యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. \li1 \v 13 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ\f + \fr 7:13 \fr*\ft అంటే సుమారు 1.5 కి. గ్రా. లు; ఈ అధ్యాయంలో మిగతా వచనాల్లో కూడా\ft*\f* బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, డెబ్బై షెకెళ్ళ\f + \fr 7:13 \fr*\ft అంటే సుమారు 800 గ్రాములు; ఈ అధ్యాయంలో మిగతా వచనాల్లో కూడా\ft*\f* బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 14 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ\f + \fr 7:14 \fr*\ft అంటే సుమారు 115 గ్రాములు; ఈ అధ్యాయంలో మిగతా వచనాల్లో కూడా\ft*\f* బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 15 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 16 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 17 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తెచ్చిన అర్పణ. \b \lh \v 18 రెండవ రోజు అర్పణను తెచ్చిన వారు ఇశ్శాఖారు గోత్ర నాయకుడు, నెతనేలు కుమారుడైన సూయరు. \li1 \v 19 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 20 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 21 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 22 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 23 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, ఒక సంవత్సరపు అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది నెతనేలు కుమారుడైన సూయరు తెచ్చిన అర్పణ. \b \lh \v 24 మూడవ రోజు అర్పణను తెచ్చిన వారు జెబూలూను గోత్ర నాయకుడు, హేలోను కుమారుడైన ఏలీయాబు. \li1 \v 25 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 26 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 27 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 28 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 29 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు తెచ్చిన అర్పణ. \b \lh \v 30 నాలుగవ రోజు అర్పణను తెచ్చిన వారు రూబేను గోత్ర నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఎలీసూరు. \li1 \v 31 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 32 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 33 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 34 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 35 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది ఎలీసూరు కుమారుడైన షెదేయూరు తెచ్చిన అర్పణ. \b \lh \v 36 అయిదవ రోజు అర్పణను తెచ్చిన వారు షిమ్యోను గోత్ర నాయకుడు, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు. \li1 \v 37 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 38 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 39 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 40 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 41 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు తెచ్చిన అర్పణ. \b \lh \v 42 ఆరవరోజు అర్పణను తెచ్చిన వారు గాదు గోత్ర నాయకుడు, దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు. \li1 \v 43 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 44 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 45 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 46 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 47 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు తెచ్చిన అర్పణ. \b \lh \v 48 ఏడవ రోజు అర్పణను తెచ్చిన వారు ఎఫ్రాయిం గోత్ర నాయకుడు, అమీహూదు కుమారుడైన ఎలీషామా. \li1 \v 49 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 50 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 51 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 52 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 53 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా తెచ్చిన అర్పణ. \b \lh \v 54 ఎనిమిదవ రోజు అర్పణను తెచ్చిన వారు మనష్షే గోత్ర నాయకుడు, పెదాసూరు కుమారుడైన గమలీయేలు. \li1 \v 55 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 56 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 57 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 58 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 59 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు తెచ్చిన అర్పణ. \b \lh \v 60 తొమ్మిదవ రోజు అర్పణను తెచ్చిన వారు బెన్యామీను గోత్ర నాయకుడు, గిద్యోనీ కుమారుడైన అబీదాను. \li1 \v 61 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 62 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 63 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 64 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 65 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను తెచ్చిన అర్పణ. \b \lh \v 66 పదవ రోజు అర్పణను తెచ్చిన వారు దాను గోత్ర నాయకుడు, అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు. \li1 \v 67 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 68 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 69 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 70 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 71 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు తెచ్చిన అర్పణ. \b \lh \v 72 పదకొండవ రోజు అర్పణను తెచ్చిన వారు ఆషేరు గోత్ర నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు. \li1 \v 73 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 74 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 75 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 76 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 77 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు తెచ్చిన అర్పణ. \b \lh \v 78 పన్నెండవ రోజు అర్పణను తెచ్చిన వారు నఫ్తాలి గోత్ర నాయకుడు, ఏనాను కుమారుడైన అహీర. \li1 \v 79 అతని అర్పణ: \li2 పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి; \li2 \v 80 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం; \li2 \v 81 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల; \li2 \v 82 పాపపరిహారబలి కోసం మేకపోతు; \li2 \v 83 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. \lf ఇది ఏనాను కుమారుడైన అహీర తెచ్చిన అర్పణ. \b \li1 \v 84 బలిపీఠం అభిషేకించబడినప్పుడు దాని ప్రతిష్ఠించడానికి ఇశ్రాయేలీయుల నాయకులు సమర్పించిన అర్పణలు ఇవి: \li2 పన్నెండు వెండి పళ్ళాలు, పన్నెండు వెండి పాత్రలు పన్నెండు బంగారు పాత్రలు. \v 85 వెండి పళ్ళెం ఒక్కొక్కటి నూట ముప్పై షెకెళ్ళు, వెండి పాత్ర ఒక్కొక్కటి డెబ్బై షెకెళ్ళు. అంతా కలిపితే వెండి పాత్రల బరువు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం రెండువేల నాలుగు వందల షెకెళ్ళు.\f + \fr 7:85 \fr*\ft అంటే సుమారు 28 కి. గ్రా. లు\ft*\f* \v 86 ధూపద్రవ్యాలతో నిండియున్న బంగారు పళ్ళాలు, పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం పది షెకెళ్ళ బరువు గలవి పన్నెండు. అంతా కలిపితే, బంగారు పాత్రల బరువు నూట యిరవై షెకెళ్ళు.\f + \fr 7:86 \fr*\ft అంటే సుమారు 1.4 కి. గ్రా. లు\ft*\f* \li2 \v 87 దహనబలి కోసం వాటి భోజనార్పణతో పాటు ఇవ్వబడిన పశువులు మొత్తం పన్నెండు కోడెలు, పన్నెండు పొట్టేళ్లు. పన్నెండు ఏడాది గొర్రెపిల్లలు. పన్నెండు మేకపోతులు పాపపరిహారబలి కోసం వాడబడ్డాయి. \li2 \v 88 సమాధానబలి కోసం ఇవ్వబడిన పశువులు మొత్తం యిరవై నాలుగు ఎడ్లు, అరవై పొట్టేళ్లు, అరవై మేకపోతులు అరవై ఏడాది గొర్రెపిల్లలు. \b \lf బలిపీఠం అభిషేకించి ప్రతిష్ఠించినప్పుడు అర్పించిన అర్పణలు ఇవి. \b \p \v 89 యెహోవాతో మాట్లాడటానికి మోషే సమావేశ గుడారంలో ప్రవేశించినప్పుడు, నిబంధన మందసం పైనున్న ప్రాయశ్చిత్త మూత మీదుగా ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి అతనితో మాట్లాడటం అతనికి వినిపించింది. ఇలా యెహోవా అతనితో మాట్లాడారు. \c 8 \s1 దీపాలను సిద్ధం చేయడం \p \v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు. \v 2 “అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, ‘దీపాలను వెలిగించినప్పుడు, దీపస్తంభం ముందు ఉన్న స్థలమంతా ప్రకాశించేలా మొత్తం ఏడు దీపాలు వెలిగేలా చూడాలి.’ ” \p \v 3 అహరోను అలాగే చేశాడు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు దీపస్తంభం మీద దీపాలు వెలుగు ఇచ్చేలా అమర్చాడు. \v 4 దీపస్తంభం ఇలా చేయబడింది: అది దాని స్తంభం నుండి దాని పుష్పాల వరకు సుత్తెతో సాగగొట్టబడిన బంగారంతో చేయబడింది. యెహోవా మోషేకు చూపిన నమూన ప్రకారం అది తయారుచేయబడింది. \s1 లేవీయులను ప్రత్యేకించడం \p \v 5 యెహోవా మోషేతో ఇలా చెప్పారు. \v 6 “ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను ప్రత్యేకపరచి వారిని ఆచార ప్రకారం పవిత్రపరచు. \v 7 వారిని పవిత్రపరచడానికి ఇలా చేయాలి: వారి మీద శుద్ధి జలం ప్రోక్షించాలి; తర్వాత వారు తమ శరీరాలంతా క్షవరం చేయించుకొని తమ బట్టలు ఉతుక్కోవాలి. అలా తమను తాము పవిత్రపరచుకుంటారు. \v 8 వారు ఒక కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండిని భోజనార్పణగా తేవాలి; తర్వాత వారి నుండి రెండవ కోడెను పాపపరిహారబలి కోసం తీసుకోవాలి. \v 9 లేవీయులను సమావేశ గుడారం ముందుకు తీసుకువచ్చి మొత్తం ఇశ్రాయేలీయుల సమాజాన్ని సమావేశపరచు. \v 10 యెహోవా ముందుకు లేవీయులను నీవు తీసుకురావాలి, ఇశ్రాయేలీయులు వారి మీద చేతులుంచాలి. \v 11 అహరోను తన చేతులు పైకెత్తి, ఇశ్రాయేలు ప్రజల నుండి ప్రత్యేక అర్పణగా లేవీయులను యెహోవాకు సమర్పించాలి, తద్వారా వారు యెహోవా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. \p \v 12 “అప్పుడు లేవీయులు కోడెల తలలపై వారి చేతులుంచి, ఒకటి పాపపరిహారబలిగా ఇంకొకటి లేవీయుల ప్రాయశ్చిత్తం కోసం దహనబలిగా యెహోవాకు అర్పించాలి. \v 13 లేవీయులను అహరోను, అతని కుమారుల ఎదుట నిలబెట్టి, చేతులు పైకెత్తి యెహోవాకు వారిని ప్రత్యేక అర్పణగా సమర్పించాలి. \v 14 ఈ విధంగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించాలి, లేవీయులంతా నా వారుగా ఉంటారు. \p \v 15 “లేవీయులను పవిత్రపరచిన తర్వాత, చేతులు పైకెత్తి వారిని ప్రత్యేక అర్పణగా సమర్పించిన తర్వాత, వారు సమావేశ గుడారంలో సేవ చేయడానికి రావాలి. \v 16 వీరు ఇశ్రాయేలీయులలో నుండి సంపూర్ణంగా ఇవ్వబడాల్సిన లేవీయులు. ప్రతి ఇశ్రాయేలు స్త్రీ యొక్క మొదటి మగ సంతానానికి బదులు వీరిని నా సొంతవారిగా తీసుకున్నాను. \v 17 ఇశ్రాయేలులో మనుష్యుల్లోను పశువుల్లోను ప్రతి తొలిచూలు మగ సంతతి నాదే. ఈజిప్టులో జ్యేష్ఠ సంతతిని మొత్తాను కాబట్టి వీరిని నాకు నేను ప్రత్యేకపరచుకున్నాను. \v 18 ఇశ్రాయేలులో జ్యేష్ఠులైన మగవారికి ప్రత్యామ్నాయంగా నేను లేవీయులను ఏర్పరచుకున్నాను. \v 19 ఇశ్రాయేలీయులందరిలో లేవీయులను అహరోనుకు, అతని కుమారులకు కానుకగా ఇచ్చాను. వీరు సమావేశ గుడారంలో సేవ చేస్తారు, ఇశ్రాయేలీయులు పరిశుద్ధాలయాన్ని సమీపించినప్పుడు వారికి తెగులు రాకుండ వారి పక్షాన ప్రాయశ్చిత్తం చేస్తారు.” \p \v 20 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే, అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజం లేవీయుల పట్ల చేశారు. \v 21 లేవీయులు తమను తాము పవిత్రపరచుకుని వారి బట్టలు ఉతుక్కున్నారు. తర్వాత అహరోను తన చేతులు పైకెత్తి ప్రత్యేక అర్పణగా వారిని యెహోవా ఎదుట సమర్పించి వారిని శుద్ధీకరించడానికి ప్రాయశ్చిత్తం చేశాడు. \v 22 ఆ తర్వాత, లేవీయులు అహరోను అతని కుమారుల క్రింద సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వారు లేవీయులకు చేశారు. \p \v 23 యెహోవా మోషేకు ఇలా ఆదేశించారు, \v 24 “లేవీయులు ఈ నియమాలు పాటించాలి: యిరవై సంవత్సరాలు ఆ పైబడి వయస్సు గలవారు సమావేశ గుడారంలో సేవలో భాగంగా ఉండడానికి రాగలరు, \v 25 అయితే, యాభై సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వారు ఇంకా పని నుండి విరమించుకోవాలి. \v 26 విరమణ తర్వాత సమావేశ గుడారంలో వారి సహోదరులకు సహకారంగా ఉండవచ్చు కానీ వారంతట వారు పని చేయకూడదు. ఇలా నీవు లేవీయులకు వారి బాధ్యతలను అప్పగించాలి.” \c 9 \s1 పస్కా పండుగ నియమాలు \p \v 1 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెలలో సీనాయి అరణ్యంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారు, \v 2 “ఇశ్రాయేలీయులు నిర్ణీత సమయంలో పస్కా పండుగ జరుపుకోవాలి. \v 3 దాని నిర్ణీత సమయంలో అనగా, ఈ నెల పద్నాలుగవ రోజు సాయంకాల సమయంలో, నియమ నిబంధనలతో ఈ పండుగ జరుపుకోవాలి.” \p \v 4 కాబట్టి మోషే పస్కాను జరుపుకోమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు, \v 5 వారంతా అదే విధంగా మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంకాలం సీనాయి అరణ్యంలో పస్కాను జరుపుకుంటారు. ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశారు. \p \v 6 అయితే కొందరు మనుష్యులు మృతదేహాన్ని బట్టి ఆచారరీత్య అపవిత్రులైనందుకు ఆ రోజున పస్కాను జరుపుకోలేకపోయారు. కాబట్టి అదే రోజు వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి, \v 7 వారు మోషేతో, “ఒక మనుష్యుని మృతదేహాన్ని బట్టి మేము అపవిత్రులం అయ్యాము, అయితే యెహోవా అర్పణను ఇతర ఇశ్రాయేలీయులతో పాటు నిర్ణీత సమయంలో మేము ఎందుకు సమర్పించకూడదు?” అని అడిగారు. \p \v 8 అందుకు మోషే వారితో, “మీ గురించి యెహోవా ఏమి ఆజ్ఞాపిస్తారో తెలుసుకునే వరకు ఆగండి” అని జవాబిచ్చాడు. \p \v 9 అప్పుడు యెహోవా మోషేతో, \v 10 “ఇశ్రాయేలీయులతో చెప్పు: ‘ఇప్పుడున్న మీలో ఎవరైనా లేదా రాబోయే తరాల వారైనా మృతదేహాన్ని బట్టి గాని దూర ప్రయాణాన్ని బట్టి గాని అపవిత్రులైతే, వారు యెహోవా పస్కాను జరుపుకోవచ్చు, \v 11 అయితే వారు రెండవ నెల పద్నాలుగవ రోజు సాయంకాలం జరుపుకోవాలి. వారు పులియని రొట్టెలతో, చేదు కూరలతో పాటు గొర్రెపిల్లను తినాలి. \v 12 తెల్లవారేటప్పడికి దానిలో ఏది మిగులకూడదు లేదా దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు. పస్కాను జరుపుకున్నప్పుడు వారు నియమాలన్నీ పాటించాలి. \v 13 అయితే ఎవరైనా ఆచార ప్రకారం పవిత్రంగా ఉంటూ ప్రయాణంలో లేదా ఉన్న చోటే ఉంటూ, పస్కాను జరుపుకోకుండా ఉంటే, నిర్ణీత సమయంలో యెహోవాకు అర్పణను అర్పించనందుకు వారిని ప్రజల నుండి తొలగించాలి. వారి పాపానికి వారే పాపశిక్షను భరిస్తారు. \p \v 14 “ ‘మీ మధ్యలో ఉంటున్న విదేశీయులు కూడా యెహోవా పస్కాను నియమ నిబంధనలతో జరుపుకోవాలి. విదేశీయులకు స్వదేశీయులకు ఒకే నియమాలు ఉండాలి.’ ” \s1 సమావేశ గుడారంపై మేఘం \p \v 15 నిబంధన గుడారమైన సమావేశ గుడారం సిద్ధపరచబడిన రోజున దాన్ని మేఘం కమ్మింది. సాయంత్రం నుండి ఉదయం వరకు సమావేశ గుడారం మీద మేఘం అగ్నిలా కనిపించింది. \v 16 అది నిత్యం అలాగే ఉంది; మేఘం దాన్ని కమ్మింది, రాత్రివేళ ఆ మేఘం అగ్నిలా కనిపించేది. \v 17 గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు, ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు; ఎక్కడ మేఘం ఆగితే వారు అక్కడ గుడారాలు వేసుకునేవారు. \v 18 యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేవారు, ఆయన ఆజ్ఞ ప్రకారం అక్కడ ఉండేవారు. మేఘం సమావేశ గుడారం మీద నిలిచి ఉన్నంత వరకు వారు శిబిరంలో ఉండేవారు. \v 19 మేఘం ఎక్కువకాలం సమావేశ గుడారం మీద ఆగితే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు కారు. \v 20 కొన్నిసార్లు మేఘం సమావేశ గుడారానికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది; యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు శిబిరం చేస్తారు, ఆయన ఆజ్ఞ ప్రకారం వారు ప్రయాణం చేస్తారు. \v 21 కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి ఉదయం వరకు మాత్రమే ఉండేది, ఉదయం ఎత్తినప్పుడు, వారు ప్రయాణించేవారు. పగలైన, రాత్రైనా, మేఘం ఎత్తినప్పుడల్లా వారు ప్రయాణించేవారు. \v 22 మేఘం సమావేశ గుడారంలో రెండు రోజులు లేదా ఒక నెల లేదా ఒక సంవత్సరం పాటు ఉండిపోతే, ఇశ్రాయేలీయులు శిబిరంలోనే ఉండేవారు; కానీ అది ఎత్తినప్పుడు, వారు బయలుదేరేవారు. \v 23 యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు గుడారాలు వేసుకునేవారు, యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు బయలుదేరేవారు. మోషే ద్వారా ఇవ్వబడిన యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు లోబడ్డారు. \c 10 \s1 వెండి బూరలు \p \v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు: \v 2 “సుత్తెతో సాగగొట్టబడిన వెండితో రెండు బూరలు తయారుచేసి, సమాజం కూడుకోడానికి, శిబిరాలు బయలుదేరడాన్ని సూచించడానికి వాటిని వాడాలి. \v 3 రెండు బూరలు ఒకేసారి మ్రోగితే ఆ శబ్దానికి సమాజమంతా నీ ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర కూడుకోవాలి. \v 4 ఒక బూర మాత్రమే మ్రోగితే, నాయకులు అంటే ఇశ్రాయేలు గోత్రాల అధిపతులు నీ ముందు సమకూడాలి. \v 5 బూరధ్వని వినబడినప్పుడు, తూర్పున ఉన్న గోత్రాలు బయలుదేరాలి. \v 6 రెండవ ధ్వని వినబడినప్పుడు, దక్షిణాన ఉన్న దండ్లు బయలుదేరాలి. బయలుదేరడానికి ధ్వని ఒక సూచన. \v 7 సమాజం కూడుకోడానికి, బూరలు ఊదండి, అయితే బయలుదేరడానికి ఊదే విధంగా కాదు. \p \v 8 “యాజకులైన అహరోను కుమారులు, బూరలు ఊదాలి. ఇది మీకు రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. \v 9 మీ భూమిలో మిమ్మల్ని బాధపరిచే మీ శత్రువులపై యుద్ధం చేయబోతున్నప్పుడు బూరధ్వని చేయాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ శత్రువుల నుండి మిమ్మల్ని విడిపిస్తారు. \v 10 అంతేకాక మీ సంతోష సమయాల్లో అంటే నియమించబడిన పండుగలు, అమావాస్య వేడుకలప్పుడు మీ దహనబలులు, మీ సమాధాన బలులపై బూరధ్వని చేయండి. అవి మీ దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉంటాయి. నేను మీ దేవుడనైన యెహోవానై ఉన్నాను.” \s1 ఇశ్రాయేలీయులు సీనాయిని విడిచివెళ్లడం \p \v 11 రెండవ సంవత్సరం రెండవ నెల ఇరవయ్యవ రోజున, మేఘం సాక్షి గుడారం మీది నుండి కదిలింది. \v 12 ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి బయలుదేరి మేఘం పారాను అరణ్యంలో ఆగేవరకు స్థలం నుండి స్థలానికి ప్రయాణించారు. \v 13 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మొదటిసారిగా, వారు బయలుదేరారు. \p \v 14 యూదా శిబిరం యొక్క విభజనలు వారి పతాకాన్ని పట్టుకుని ముందుగా వెళ్లాయి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా గోత్రం వారిని నడిపించాడు. \v 15 అదే విధంగా సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు గోత్రం, \v 16 ఏలీయాబు కుమారుడైన హేలోను జెబూలూను గోత్రానికి నియమించబడ్డారు. \v 17 తర్వాత గుడారాన్ని తీసివేశారు, గెర్షోను, మెరారి వంశస్థులు దానిని మోస్తూ బయలుదేరారు. \p \v 18 వారి తర్వాత రూబేను శిబిరం వారు వారి సేనల ప్రకారం వెళ్లారు. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను గోత్ర నాయకుడు సైన్యాధిపతి. \v 19 సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను గోత్రం మీద, \v 20 దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు గోత్రం మీద నియమించబడ్డారు. \v 21 తర్వాత కహాతు వంశస్థులు పవిత్ర వస్తువులను మోస్తూ బయలుదేరారు. వీరు తర్వాతి శిబిరాన్ని చేరకముందే సమావేశ గుడారం సిద్ధం చేయబడాలి. \p \v 22 వారి తర్వాత ఎఫ్రాయిం శిబిరం వారు వారి సేనల ప్రకారం బయలుదేరారు. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం గోత్ర సైన్యాధిపతి. \v 23 తర్వాత మనష్షే గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు పెదాసూరు కుమారుడైన గమలీయేలు, \v 24 తర్వాత బెన్యామీను గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు గిద్యోనీ కుమారుడైన అబీదాను సైన్యాధిపతి. \p \v 25 చివరకు, అన్ని శిబిరాల వెనుక దాను శిబిరం వారు వారి సేనల ప్రకారం బయలుదేరారు. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు న్యాయాధిపతి. \v 26 తర్వాత ఆషేరు గోత్రం వారు వెళ్లారు. వారు నాయకుడు ఒక్రాను కుమారుడైన పగీయేలు. \v 27 తర్వాత నఫ్తాలి గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు ఏనాను కుమారుడైన అహీర సైన్యాధిపతి. \v 28 ఈ క్రమంలో తమ తమ సేనలతో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు. \p \v 29 ఒక రోజు మోషే తన మామ మిద్యానీయుడైన రెయూయేలు కుమారుడైన హోబాబుతో, “యెహోవా, ‘నేను మీకు ఇస్తాను’ అని చెప్పిన స్థలానికి వెళ్తున్నాము. నీవు మాతో వచ్చెయ్యి, మేము నిన్ను మంచిగా చూసుకుంటాం, ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలుకు మంచి వాటిని వాగ్దానం చేశారు” అని చెప్పాడు. \p \v 30 అతడు, “నేను రాను, నా స్వదేశానికి, నా బంధువుల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అని జవాబిచ్చాడు. \p \v 31 అయితే మోషే, “దయచేసి మమ్మల్ని వదిలి వెళ్లకు. ఈ అరణ్యంలో ఎక్కడ దిగాలో నీకు దారి బాగా తెలుసు, నీవు మాకు దారి చూపించగలవు. \v 32 నీవు కాబట్టి మాతో వస్తే యెహోవా మాకు ఇచ్చే మేలులు నీతో పంచుకుంటాం” అని చెప్పాడు. \p \v 33 కాబట్టి వారు యెహోవా పర్వతం నుండి బయలుదేరి మూడు రోజులు ప్రయాణించారు. వారి విశ్రాంతి స్థలం కోసం ఈ మూడు రోజులు యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా వెళ్లింది. \v 34 వారు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు యెహోవా మేఘము పగలు వారి మీద ఉంది. \p \v 35 మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా, \q1 “యెహోవా, లేవండి! \q2 మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక; \q2 మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక” \m అని అనేవాడు. \p \v 36 మందసం ఆగినప్పుడు, అతడు, \q1 “యెహోవా, లెక్కలేనంతగా ఉన్న \q2 వేలాది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రండి” \m అని అనేవాడు. \c 11 \s1 యెహోవా దగ్గరి నుండి అగ్ని \p \v 1 దాని తర్వాత యెహోవా వినేలా ప్రజలు తమ కష్టాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన అవి వినగానే ఆయన కోపం రగులుకుంది. అప్పుడు యెహోవా నుండి అగ్ని వారి మధ్యకు వచ్చి శిబిరం శివార్లలో కొంత భాగాన్ని దహించివేసింది. \v 2 ప్రజలు మోషేకు మొరపెట్టగా, అతడు యెహోవాకు ప్రార్థించాడు, ఆ అగ్ని ఆరిపోయింది. \v 3 అందుకు ఆ స్థలానికి తబేరా\f + \fr 11:3 \fr*\fq తబేరా \fq*\ft అంటే \ft*\fqa మంట\fqa*\f* అని పేరు పెట్టారు, ఎందుకంటే యెహోవా నుండి వచ్చిన అగ్ని వారి మధ్యలో వచ్చింది కాబట్టి. \s1 యెహోవా దగ్గరి నుండి పూరేళ్ళు \p \v 4 వారితో ఉన్న అల్లరి గుంపు వేరే ఆహారం ఆశించడం ప్రారంభించారు, అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు ఏడ్వడం మొదలుపెట్టి, “మనకు తినడానికి మాంసం మాత్రం ఉంటే ఎంత బాగుండేది! \v 5 ఈజిప్టులో చేపలు, దోసకాయలు, పుచ్చకాయలు, ఒక రకమైన ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు ఉచితంగా తిన్నాము. \v 6 కానీ ఇప్పుడు మాకు తిండి మీద ఇష్టం లేకుండ పోయింది; ఈ మన్నా తప్ప మాకేమి కనిపించడం లేదు!” అని అన్నారు. \p \v 7 మన్నా కొత్తిమెర గింజల్లా ఉండి గుగ్గిలంలా కనబడుతుంది. \v 8 ప్రజలు బయటకు వెళ్లి, తిరుగుతూ దానిని సేకరించుకొని, దానిని తిరగలితో విసరేవారు లేదా రోటిలో దంచేవారు. కుండలో దానిని ఉడకబెట్టి దానితో రొట్టెలు చేసుకునేవారు. దాని రుచి నూనెతో చేసిన అప్పడంలా ఉంటుంది. \v 9 రాత్రివేళ శిబిరంలో మంచు కురిసినప్పుడు మన్నా దాని వెంటనే పడేది. \p \v 10 మోషే ప్రతి కుటుంబంలోని ప్రజలు వారి డేరాల దగ్గర ఏడుస్తూ ఉండడం విన్నాడు. యెహోవా చాలా కోప్పడ్డారు మోషే బాధపడ్డాడు. \v 11 మోషే యెహోవాతో, “మీ సేవకునిపై ఈ కష్టం ఎందుకు తెచ్చారు? వీరందరి భారం నా మీద వేయకుండ మీ దృష్టిలో నేనెందుకు దయను పొందలేకపోయాను? \v 12 వీరందరిని నేను గర్భందాల్చానా? నేను వీరిని కన్నానా? దాది శిశువును ఎత్తుకున్నట్లు, మీ పూర్వికులకు మీరు ప్రమాణం వాగ్దానం చేసిన స్థలానికి నడిపించడానికి వీరిని నా చేతిలో ఎందుకు మోయమన్నారు? \v 13 వీరందరి కోసం మాంసం ఎక్కడ నుండి తేవాలి? నన్ను చూసి, ‘మాకు తినడానికి మాంసం ఇవ్వు!’ అంటూ ఏడుస్తున్నారు. \v 14 నా అంతట నేను ఈ ప్రజలందరినీ మోయలేను; భారం నాకు చాల భారీగా ఉంది. \v 15 ఒకవేళ నాతో మీరు ఇలా వ్యవహరించ తలిస్తే దయచేసి నన్ను చంపేయండి; నా మీద మీకు దయ కలిగితే నా దురవస్థను నేను చూడకుండ నన్ను చంపేయండి” అని చెప్పాడు. \p \v 16 యెహోవా మోషేతో: “ఇశ్రాయేలు గోత్ర పెద్దలను డెబ్బై మందిని నాయకులుగా, ఎవరైతే పెద్దలుగా ఉన్నవారు నీకు తెలిసినవారిని తీసుకురా. నీతో వారు నిలబడేలా వారు సమావేశ గుడారం దగ్గరకు రావాలి. \v 17 నేను దిగివచ్చి నీతో మాట్లాడతాను. నీ మీద ఉన్న ఆత్మ యొక్క శక్తిలో కొద్ది భాగం వారి మీద పెడతాను. వారు నీతో కలిసి ప్రజల భారం పంచుకుంటారు అప్పుడు నీవు ఒంటరిగా మోయనవసరం ఉండదు. \p \v 18 “నీవు ప్రజలకు ఇలా చెప్పు: ‘రేపటి కోసం మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపు మీరు మాంసం తినబోతున్నారు. మీరు, “మాకు మాంసం మాత్రం ఉంటే బాగుండేది! ఈజిప్టులో మాకు బాగుండేది!” అని ఏడ్వడం యెహోవా విన్నారు కాబట్టి యెహోవా మీకు మాంసం ఇస్తారు, మీరు తింటారు. \v 19 దానిని మీరు తినడం ఒక రోజు కాదు, రెండు రోజులు, అయిదు రోజులు, పది రోజులు, యిరవై రోజులు కాదు, \v 20 ఒక నెలంతా మీ నాసికా రంధ్రాల నుండి బయటకు వచ్చి మీరు అసహ్యించుకునే వరకు తింటారు; ఎందుకంటే మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిరాకరించి, “మేము అసలు ఈజిప్టును ఎందుకు విడిచిపెట్టామో?” అంటూ ఆయన ఎదుట ఏడ్చారు.’ ” \p \v 21 అయితే మోషే, “నేను ఆరు లక్షలమంది పాదాచారుల మధ్య ఉన్నాను, మీరేమో, ‘నేను వారికి నెలరోజులు తినడానికి సరిపడే మాంసం ఇస్తాను!’ అని అన్నారు. \v 22 ఉన్న పశువులు, మందలు అన్నిటిని వధించినా వీరికి సరిపోతుందా? సముద్రంలో చేపలన్నీ పట్టినా వీరికి సరిపోతాయా?” \p \v 23 యెహోవా మోషేకు జవాబిస్తూ, “యెహోవా బాహుబలం తక్కువయ్యిందా? నేను చెప్పింది జరుగుతుందో లేదో నీవు చూస్తావు” అని అన్నారు. \p \v 24 మోషే బయటకు వెళ్లి యెహోవా చెప్పిందంతా ప్రజలకు తెలియజేశాడు. డెబ్బైమంది గోత్ర పెద్దలను తెచ్చి మందిరం చుట్టూ నిలబెట్టాడు. \v 25 అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో మాట్లాడారు. అతనిపై ఉన్న ఆత్మ శక్తిలో కొంత ఆ డెబ్బై గోత్ర పెద్దలపై ఉంచినప్పుడు ఆత్మ వారిమీద నిలిచి వారు ప్రవచించారు అయితే, తర్వాత ఎన్నడు ప్రవచించలేదు. \p \v 26 అయితే, ఇద్దరు, శిబిరంలోనే ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. వారు గోత్ర పెద్దలలో ఉన్నవారే, కానీ గుడారం బయటకు వెళ్లలేదు. అయినప్పటికీ ఆత్మ వారి మీద ఉంది, వారు శిబిరంలో ప్రవచించారు. \v 27 ఒక యువకుడు మోషే దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఎల్దాదు, మేదాదు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు. \p \v 28 నూను కుమారుడైన యెహోషువ, యవ్వనకాలం నుండి మోషే దగ్గరే ఉన్నవాడు, అతడు మాట్లాడుతూ, “మోషే, నా ప్రభువా, వారిని ఆపండి!” అని అన్నాడు. \p \v 29 కానీ మోషే అతనితో, “నా పక్షంగా నీవు అసూయపడుతున్నావా? నేనైతే యెహోవా ప్రజలంతా ప్రవక్తలు కావాలని, యెహోవా తన ఆత్మ వారందరి మీద ఉంచాలని కోరతాను!” అని జవాబిచ్చాడు. \v 30 తర్వాత మోషే, ఇశ్రాయేలు గోత్ర పెద్దలు, శిబిరానికి తిరిగి వెళ్లారు. \p \v 31 తర్వాత యెహోవా దగ్గరి నుండి గాలి వెళ్లి సముద్రం దిక్కునుండి పూరేళ్ళను తీసుకువచ్చింది. అది వాటిని రెండు మూరల\f + \fr 11:31 \fr*\ft అంటే సుమారు 90 సెం.మీ.\ft*\f* ఎత్తుగా, ఏ దిశలోనైనా ఒక రోజు నడకంత దూరంగా శిబిరం చుట్టూరా చెదరగొట్టింది. \v 32 ఆ దినమంతా, రాత్రంతా, మరుసటి రోజంతా, ప్రజలు బయటకు వెళ్లి పూరేళ్ళను సమకూర్చుకున్నారు. ఏ ఒక్కరు కూడా పది హోమెర్ల\f + \fr 11:32 \fr*\ft అంటే సుమారు 1.75 టన్నులు\ft*\f* కంటే తక్కువ పోగు చేసుకోలేదు. వాటిని శిబిరం చుట్టూ పరిచారు. \v 33 అయితే, మాంసం పళ్ళ సందుల్లో ఉండగానే దానిని నమిలి మ్రింగకముందే, యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని భయంకరమైన తెగులుతో మొత్తారు. \v 34 ఆ స్థలంలో ఇతర ఆహారం కోసం ఆశపడిన వారిని పాతిపెట్టినందుకు ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా\f + \fr 11:34 \fr*\ft అంటే \ft*\fqa కోరిక సమాధులు\fqa*\f* అనే పేరు పెట్టారు. \p \v 35 ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణం చేసి అక్కడే ఉండిపోయారు. \c 12 \s1 మోషేను విమర్శించిన మిర్యాము అహరోనులు \p \v 1 మోషే కూషీయురాలిని పెళ్ళి చేసుకున్నందుకు, అతనికి వ్యతిరేకంగా మిర్యాము, అహరోనులు మాట్లాడడం ప్రారంభించారు, \v 2 “యెహోవా కేవలం మోషే ద్వారానే మాట్లాడారా?” అని, “ఆయన మా ద్వారా కూడా మాట్లాడలేక?” అని అన్నారు. యెహోవా వారి మాటలు విన్నారు. \p \v 3 మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు. \p \v 4 వెంటనే యెహోవా మోషే, అహరోను మిర్యాములతో, “మీ ముగ్గురు, సమావేశ గుడారం దగ్గరకు రండి” అని చెప్పారు. కాబట్టి ముగ్గురు వెళ్లారు. \v 5 అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చారు; ఆయన గుడార ద్వారం దగ్గర నిలబడి అహరోను, మిర్యాములను పిలిచారు. ఆ ఇద్దరు ముందుకు వచ్చినప్పుడు, \v 6 ఆయన, “నా మాటలు వినండి: \q1 “ఒకవేళ మీ మధ్య ప్రవక్త ఉంటే, \q2 యెహోవానైన నేను దర్శనాలలో వారికి ప్రత్యక్షమవుతాను, \q2 కలలలో నేను వారితో మాట్లాడతాను. \q1 \v 7 అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; \q2 అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. \q1 \v 8 అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, \q2 పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను. \q2 అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు. \q1 అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా \q2 నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?” \p \v 9 యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని విడిచి వెళ్లారు. \p \v 10 మేఘం గుడారం నుండి పైకి వెళ్లిపోయాక, మిర్యాముకు కుష్ఠువ్యాధి వచ్చి చర్మం మంచులా తెల్లగా మారింది. అహరోను ఆమె వైపు చూసి, ఆమెకు కుష్ఠువ్యాధి వచ్చిందని గ్రహించి, \v 11 అహరోను మోషేతో, “నా ప్రభువా, మేము తెలివితక్కువగా చేసిన పాపాన్ని మా మీదకు తేవద్దు. \v 12 తల్లి గర్భంలో సగం మాంసం కుళ్ళిన శిశువులా ఆమెను కానివ్వకండి” అని అన్నాడు. \p \v 13 కాబట్టి మోషే యెహోవాకు, “దేవా, దయచేసి ఈమెను స్వస్థపరచు!” అని మొరపెట్టాడు. \p \v 14 అందుకు యెహోవా మోషేతో, “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేస్తే, ఆమె ఏడు రోజులు అవమానంలో ఉండదా? ఆమెను శిబిరం బయట ఏడు రోజులు ఉంచు; ఆ తర్వాత ఆమెను వెనుకకు తీసుకురావచ్చు” అని జవాబిచ్చారు. \v 15 కాబట్టి మిర్యాము శిబిరం బయట ఏడు రోజులు ఉన్నది, ఆమెను తిరిగి తీసుకువచ్చే వరకు ప్రజలు ముందుకు వెళ్లలేదు. \p \v 16 ఆ పిమ్మట ప్రజలు హజేరోతు నుండి బయలుదేరి పారాను ఎడారిలో గుడారాలు వేసుకున్నారు. \c 13 \s1 కనాను వేగుచూచుట \p \v 1 యెహోవా మోషేతో ఇలా అన్నారు, \v 2 “కనాను దేశాన్ని పరిశీలించడానికి కొంతమంది పురుషులను పంపు, ఈ దేశం ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్నాను. ప్రతి పితరుల గోత్ర నాయకుల్లో ఒకరిని పంపు.” \p \v 3 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారిని పారాను ఎడారి నుండి పంపాడు. వారందరు ఇశ్రాయేలీయుల నాయకులు. \b \lh \v 4 వారి పేర్లు ఇవి: \b \li1 రూబేను గోత్రం నుండి, జక్కూరు కుమారుడైన షమ్మూయ; \li1 \v 5 షిమ్యోను గోత్రం నుండి, హోరీ కుమారుడైన షాపాతు; \li1 \v 6 యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు; \li1 \v 7 ఇశ్శాఖారు గోత్రం నుండి, యోసేపు కుమారుడైన ఇగాలు; \li1 \v 8 ఎఫ్రాయిం గోత్రం నుండి, నూను కుమారుడైన హోషేయ; \li1 \v 9 బెన్యామీను గోత్రం నుండి, రాఫు కుమారుడైన పల్తీ; \li1 \v 10 జెబూలూను గోత్రం నుండి, సోది కుమారుడైన గదీయేలు; \li1 \v 11 మనష్షే (యోసేపు గోత్రం) గోత్రం నుండి, సూసీ కుమారుడైన గద్దీ; \li1 \v 12 దాను గోత్రం నుండి, గెమలి కుమారుడైన అమ్మీయేలు; \li1 \v 13 ఆషేరు గోత్రం నుండి, మిఖాయేలు కుమారుడైన సెతూరు; \li1 \v 14 నఫ్తాలి గోత్రం నుండి, వోఫ్సీ కుమారుడైన నహబీ; \li1 \v 15 గాదు గోత్రం నుండి, మాకీ కుమారుడైన గెయుయేలు. \b \lf \v 16 ఇవి వాగ్దాన దేశాన్ని చూడడానికి మోషే పంపిన వారి పేర్లు. (నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ అని పేరు పెట్టాడు.) \b \p \v 17 మోషే వారిని కనాను దేశాన్ని పరిశీలించమని పంపినప్పుడు, అతడు ఇలా చెప్పాడు, “మీరు దక్షిణ మార్గం గుండా వెళ్లి, కొండసీమ వైపు వెళ్లండి. \v 18 ఆ దేశం ఎలా ఉందో, అందులోని ప్రజలు బలవంతులా, బలహీనులా, తక్కువగా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా అని చూడండి. \v 19 వారు ఎలాంటి భూమిలో నివసిస్తున్నారు? అది మంచిదా చెడ్డదా? వారు ఎలాంటి పట్టణాల్లో నివసిస్తున్నారు? అవి కోటగోడలు లేనివా? లేదా కోటగోడలు కలవా? \v 20 ఆ దేశపు మట్టి ఎలా ఉంది? అది సారవంతమైనదా కాదా? అక్కడ చెట్లున్నాయా లేవా? అక్కడి పండ్లలో కొన్ని తీసుకురావడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి.” (అది ప్రథమ ద్రాక్షపండ్ల కాలము.) \p \v 21 కాబట్టి వారు వెళ్లి సీను ఎడారి నుండి లెబో హమాతు వైపున, రెహోబు వరకు ఆ దేశాన్ని పరిశీలించారు. \v 22 దక్షిణ దిక్కునుండి వెళ్లి, హెబ్రోనుకు వచ్చారు, అక్కడ అహీమాను, షేషయి, తల్మయి అనే అనాకు వంశస్థులు నివసించారు. (హెబ్రోను, ఈజిప్టులోని సోయను కంటే ఏడు సంవత్సరాల ముందే కట్టబడిన పురాతన పట్టణము.) \v 23 వారు ఎష్కోలు\f + \fr 13:23 \fr*\ft అంటే \ft*\fqa గెల; \+xt 24|link-href="NUM 13:24"\+xt* వచనంలో కూడా\fqa*\f* లోయకు చేరుకున్నప్పుడు ఒకే గెల ఉన్న ద్రాక్షచెట్టు కొమ్మను నరికారు. దానిని ఇద్దరు వారి మధ్య కర్ర మీద మోసారు, దానితో పాటు కొన్ని దానిమ్మలు, అంజూరాలు కూడా తీసుకున్నారు. \v 24 అక్కడ ఇశ్రాయేలీయులు ద్రాక్ష గెలను కోసినందుకు ఆ స్థలం ఎష్కోలు లోయ అని పిలువబడింది. \v 25 ఆ దేశాన్ని పరిశీలించిన నలభైరోజల తర్వాత వారు తిరిగి వచ్చారు. \s1 పరిశీలన యొక్క నివేదిక \p \v 26 వారు పారాను ఎడారిలో కాదేషులో ఉన్న మోషే అహరోనులు, ఇశ్రాయేలు సర్వసమాజం దగ్గరకు వచ్చారు. అక్కడ వారికి, సర్వ సమాజానికి విశేషాలు చెప్పి, ఆ దేశ పండ్లను వారికి చూపించారు. \v 27 వారు మోషేకు ఇచ్చిన నివేదిక ఇది: “మీరు పంపిన దేశానికి మేము వెళ్లాము. నిజంగా పాలు తేనెలు అక్కడ పారుతున్నాయి. ఇవి ఆ దేశంలోని పండ్లు. \v 28 అయితే అక్కడి నివాసులు బలిష్ఠులు, వారి పట్టణాలు కోటగోడలు కలిగి ఉన్నాయి, చాలా పెద్దవి. అక్కడ అనాకీయులను కూడా చూశాము. \v 29 అమాలేకీయులు దక్షిణాదిలో నివసిస్తారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ సీమలో ఉంటారు. కనానీయులు సముద్రతీరాన యొర్దాను నది ఒడ్డున నివసిస్తారు.” \p \v 30 అప్పుడు కాలేబు మోషే ఎదుట ప్రజలను శాంత పరుస్తూ, “తప్పకుండా మనం వెళ్లి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఖచ్చితంగా చేయగలం” అని అన్నాడు. \p \v 31 కానీ అతనితో కలసి వెళ్లినవారు, “మనం వారిపై దాడి చేయలేము; అక్కడి ప్రజలు మనకన్నా బలమైన వారు” అని అన్నారు. \v 32 వారు పరిశీలించిన దేశం గురించి ఇశ్రాయేలీయుల మధ్య చెడ్డ నివేదికను వ్యాప్తి చేశారు. వారు, “మేము వేగు చూసిన భూమి దానిలో నివసించేవారిని మ్రింగివేస్తుంది. అక్కడ మేము చూసిన ప్రజలందరూ చాలా పెద్దగా ఉన్నారు. \v 33 మేము అక్కడ ఆజానుబాహులను (అనాకు వంశస్థులు నెఫిలీము నుండి వచ్చినవారు) చూశాము. మా దృష్టిలో మేము మిడతల్లా కనిపించాం, వారికి కూడా అలాగే కనిపించాం” అని అన్నారు. \c 14 \s1 ప్రజల తిరుగుబాటు \p \v 1 ఆ రాత్రి సమాజంలో ఉన్న అందరు స్వరాలెత్తి బిగ్గరగా ఏడ్చారు. \v 2 ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల మీద సణిగి, సమాజమంతా, “మేము ఈజిప్టులో గాని ఎడారిలో గాని చనిపోయుంటే బాగుండేది! \v 3 మేము ఖడ్గం చేత చావడానికి మమ్మల్ని యెహోవా ఈ దేశానికి ఎందుకు తెస్తున్నారు? మా భార్య పిల్లలు చెరగా కొనిపోబడతారు. ఈజిప్టుకు తిరిగి వెళ్లడం మాకు మంచిది కాదా?” అని వారితో అన్నారు. \v 4 వారు ఒకరితో ఒకరు, “మనం ఒక నాయకుని ఎన్నుకుని ఈజిప్టుకు తిరిగి వెళ్దాం” అని మాట్లాడుకున్నారు. \p \v 5 అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలు సమాజమందరి ఎదుట సాష్టాంగపడ్డారు. \v 6 ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్లిన వారిలో ఉన్న నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు తమ బట్టలు చింపుకొని, \v 7 ఇశ్రాయేలు సమాజమంతటితో ఇలా అన్నారు: “మేము వెళ్లి పరిశీలించిన దేశం చాలా మంచిగా ఉంది. \v 8 యెహోవా మనయందు ఆనందిస్తే, ఆ దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనలను నడిపిస్తారు, దానిని మనకు ఇస్తారు. \v 9 మీరు మాత్రం యెహోవా మీద తిరగబడకండి. అక్కడి ప్రజలకు భయపడకండి ఎందుకంటే వారిని మనం చంపుతాము. వారికి కాపుదల లేదు, కానీ యెహోవా మనతో ఉన్నారు. వారికి భయపడకండి” అని చెప్పారు. \p \v 10 అయితే సమాజమంతా వారిని రాళ్లతో కొట్టాలని మాట్లాడుకున్నారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం సమావేశ గుడారం దగ్గర ఇశ్రాయేలీయులందరికి కనిపించింది. \v 11 యెహోవా మోషేతో, “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను ధిక్కరిస్తారు? నేను వారి మధ్య అన్ని సూచనలు చేసినప్పటికీ, వారు నన్ను నమ్మడానికి ఎంతకాలం నిరాకరిస్తారు? \v 12 తెగులుతో వారిని మొత్తి నాశనం చేస్తాను, అయితే వీరిని మించిన బలమైన గొప్ప ప్రజలుగా నిన్ను చేస్తాను” అని అన్నారు. \p \v 13 మోషే యెహోవాతో, “ఈజిప్టువారు దాని గురించి విన్నప్పుడు వారు ఏమనుకుంటారు? మీ ప్రభావం చేత వారి మధ్య నుండి వీరిని తెచ్చారు. \v 14 ఈ దేశ నివాసులకు దానిని గురించి వారు చెప్తారు. ఇప్పటికే మీరు యెహోవా, ఈ ప్రజలతో ఉన్నారని, మీరు ముఖాముఖిగా వీరికి కనిపిస్తారని, మీ మేఘము వీరితో ఉంటుందని, మీరు పగలు మేఘస్తంభంలో, రాతి అగ్నిస్తంభంలో ఉంటూ వారిని నడిపిస్తారని వారు విన్నారు. \v 15 ఒకవేళ ఎవరిని విడిచిపెట్టకుండా ఈ ప్రజలందరినీ చంపేస్తే, మీ గురించి ఈ విషయాలు విన్న దేశాలు, \v 16 ‘యెహోవా ఈ ప్రజలకు మ్రొక్కుబడిగా వాగ్దానం చేసిన స్థలానికి తీసుకెళ్లలేక, వీరిని అరణ్యంలో చంపేశారు’ అని అంటారు. \p \v 17 “కాబట్టి మీరు ప్రకటించినట్లే, ఇప్పుడు ప్రభువు యొక్క బలం కనుపరచబడును గాక: \v 18 ‘యెహోవా త్వరగా కోప్పడరు, ప్రేమ క్షమాగుణాలతో నిండియున్నవారు, ఆయన తిరుగుబాటును పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి వారి పిల్లలను శిక్షిస్తారు.’ \v 19 మీ గొప్ప ప్రేమను బట్టి, ఈ ప్రజల పాపాన్ని, ఈజిప్టు వదిలినప్పటి నుండి ఇప్పటివరకు వీరిని క్షమించిన ప్రకారం క్షమించండి” అని అన్నాడు. \p \v 20 యెహోవా జవాబిస్తూ, “నీవడిగినట్టే, నేను వారిని క్షమించాను. \v 21 అయినా, నా జీవం తోడు, యెహోవా మహిమ భూమంతటిని నింపునట్లు, \v 22 నా మహిమను, ఈజిప్టులోను, అరణ్యంలోను నేను చూపిన సూచనలను చూసి నాకు లోబడక, నన్ను పదిసార్లు పరీక్షించిన ఏ ఒకరు, \v 23 వారి పూర్వికులకు నేను వాగ్దానంగా ప్రమాణం చేసిన దేశాన్ని వారిలో ఏ ఒక్కరు ఎప్పటికిని చూడరు. నా పట్ల ధిక్కారంగా ప్రవర్తించిన వారెవ్వరూ ఎప్పటికీ చూడరు. \v 24 అయితే నా సేవకుడు కాలేబు భిన్నమైన ఆత్మ కలిగి ఉండి నన్ను హృదయమంతటితో వెంబడిస్తున్నందుకు, అతడు వెళ్లిన దేశంలోకి నేను అతన్ని తీసుకువస్తాను, అతని వారసులు దానిని స్వతంత్రించుకుంటారు. \v 25 అమాలేకీయులు, కనానీయులు ఆ లోయల్లో నివసిస్తున్నారు కాబట్టి, రేపు వెనుకకు తిరగండి, ఎడారి వైపు ఎర్ర సముద్రం మార్గం గుండా రండి” అని చెప్పారు. \p \v 26 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు: \v 27 “ఎంతకాలం ఈ చెడు సమాజం నా మీద సణుగుతారు? ఈ సణిగే ఇశ్రాయేలీయుల ఫిర్యాదులు నేను విన్నాను. \v 28 కాబట్టి వారికి చెప్పండి, ‘నా జీవం తోడు, మీరు సణుగులను నేను విన్న ప్రకారం నేను మీకు చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు: \v 29 ఈ అరణ్యంలో మీ శవాలు రాలిపోతాయి అనగా ఇరవై సంవత్సరాలకు పైబడి జనాభా లెక్కలో నమోదై యుండి, నాకు వ్యతిరేకంగా సణిగిన ప్రతి ఒక్కరు రాలిపోతారు. \v 30 నేను చేయెత్తి వాగ్దానం చేసిన భూమిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మీలో ఏ ఒక్కరు ప్రవేశించరు. \v 31 దోచుకోబడతారని నీవు చెప్పిన నీ పిల్లల విషయానికొస్తే, నీవు తిరస్కరించిన భూమిని అనుభవించడానికి నేను వారిని తీసుకువస్తాను. \v 32 మీ విషయానికొస్తే, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి. \v 33 మీ పిల్లలు ఇక్కడ నలభై సంవత్సరాలు కాపరులుగా ఉంటారు, మీలో చివరి శవం ఈ అరణ్యంలో రాలిపోయే వరకు, మీ నమ్మకద్రోహాన్ని బట్టి మీ వ్యభిచారశిక్షను భరిస్తారు. \v 34 నలభై సంవత్సరాల వరకు మీరు దేశాన్ని వేగు చూసిన ప్రతి నలభై రోజులకు ఒక సంవత్సరం, మీ దోషశిక్షను మీరు భరించి నేను మీకు వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు.’ \v 35 యెహోవానగు నేనే స్వయంగా చెప్తున్నాను, నాకు వ్యతిరేకంగా పోగయిన ఈ దుష్ట సమాజం మొత్తానికి, నేను ఖచ్చితంగా ఇవి చేస్తాను. ఈ అరణ్యంలో వారు అంతరిస్తారు; ఇక్కడ వారు చస్తారు.” \p \v 36 మోషే, ఆ దేశాన్ని పరిశీలించండి, అని పంపిన మనుష్యులు, వెళ్లి తిరిగివచ్చి దాని గురించి తప్పుడు నివేదిక తెచ్చి సమర్పించి, సర్వసమాజం సణుగునట్లు చేశారు \v 37 తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి బాధ్యులైన వీరు మొత్తబడి, యెహోవా ఎదుట తెగులు ద్వార చనిపోయారు. \v 38 ఆ దేశాన్ని పరిశీలించిన వారిలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే బ్రతికారు. \p \v 39 మోషే ఇశ్రాయేలీయులందరికి ఈ విషయం చెప్పినప్పుడు, వారు చాలా ఏడ్చారు. \v 40 మరుసటిరోజు ఉదయాన్నే వారు, “నిజంగా మేము పాపం చేశాము. ఇప్పుడు మేము యెహోవా వాగ్దానం చేసిన దేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం!” అని అంటూ, కొండసీమ మీదున్న ఎత్తైన ప్రదేశానికి బయలుదేరారు. \p \v 41 కానీ మోషే, “ఎందుకు మీరు యెహోవా ఆజ్ఞను మీరుతున్నారు? ఇదిలా కొనసాగదు! \v 42 యెహోవా మీతో లేడు కాబట్టి మీరు వెళ్లకండి. మీరు శత్రువుల చేతిలో ఓడిపోతారు, \v 43 ఎందుకంటే అమాలేకీయులు, కనానీయులు అక్కడ మీ మీదికి వస్తారు, మీరు వారి ఖడ్గం చేత చస్తారు. ఎందుకంటే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయన మీతో ఉండరు” అని చెప్పాడు. \p \v 44 అయినాసరే, వారు అహంకారంతో మోషే గాని, యెహోవా నిబంధన మందసం గాని శిబిరం నుండి కదలక పోయినా, కొండసీమ ప్రాంతానికి ఎక్కి వెళ్లారు. \v 45 అప్పుడు కొండ సీమలో నివసిస్తున్న అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చి, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, హోర్మా వరకు తరిమికొట్టారు. \c 15 \s1 అనుబంధ అర్పణలు \p \v 1 యెహోవా మోషేతో అన్నారు, \v 2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: మీకు నివాస స్థలంగా ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు \v 3 యెహోవాకు ఇష్టమైన సువాసన కలుగునట్లు మీ మందల నుండి లేదా పశువుల నుండి అర్పణలు అంటే దహనబలులు గాని బలులు గాని, ప్రత్యేకమైన మ్రొక్కుబడులు గాని స్వేచ్ఛార్పణలు గాని, లేదా పండుగ అర్పణలు గాని అర్పించవచ్చు. \v 4 అప్పుడు అర్పణ తెచ్చే వ్యక్తి ఒక పావు హిన్\f + \fr 15:4 \fr*\ft అంటే సుమారు ఒక లీటర్; 5 వచనంలో కూడా\ft*\f* నూనెలో ఒక ఓమెరు\f + \fr 15:4 \fr*\ft అంటే సుమారు 1.6 కి. గ్రా. లు\ft*\f* నాణ్యమైన పిండి కలిపి యెహోవాకు భోజనార్పణ సమర్పించాలి. \v 5 దహనబలి లేదా బలి కోసం తెచ్చే ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి. \p \v 6 “ ‘భోజనార్పణ కోసం పొట్టేళ్ళతో పాటు రెండు ఓమెర్ల\f + \fr 15:6 \fr*\ft అంటే సుమారు 3.2 కి. గ్రా. లు\ft*\f* నాణ్యమైన పిండి ఒక హిన్‌లో మూడవ వంతు\f + \fr 15:6 \fr*\ft అంటే సుమారు 1.3 లీటర్లు; 7 వచనంలో కూడా\ft*\f* నూనెతో కలిపి తేవాలి, \v 7 దానితో పాటు ఒక హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా అర్పించాలి. \p \v 8 “ ‘యెహోవాకు ప్రత్యేకమైన మ్రొక్కుబడి లేదా సమాధానబలి కోసం దహనబలిగా లేదా బలిగా అర్పించడానికి కోడెను సిద్ధపరిచేటప్పుడు, \v 9 కోడెతో పాటు అయితే భోజనార్పణగా మూడు ఓమెర్ల\f + \fr 15:9 \fr*\ft అంటే సుమారు 5 కి. గ్రా. లు\ft*\f* నూనె కలిపిన అర హిన్\f + \fr 15:9 \fr*\ft అంటే సుమారు 1.9 లీటర్లు; 10 వచనంలో కూడా\ft*\f* లో నాణ్యమైన పిండి, \v 10 దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది. \v 11 ప్రతి కోడె లేదా పొట్టేలు, ప్రతి గొర్రెపిల్ల లేదా మగ మేకపిల్ల ఈ విధంగా సిద్ధపరచబడాలి. \v 12 ఇలా ప్రతి దానిలోకి, మీరు ఎన్ని సిద్ధం చేస్తారో, అన్నిటికి చేయాలి. \p \v 13 “ ‘స్వదేశీయులుగా ఉన్న ప్రతి ఒక్కరు యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించినప్పుడు ఇలాగే చేయాలి. వారు ఇలాగే విధులను పాటించాలి. \v 14 వచ్చే తరాలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. విదేశీయులు లేదా మీ మధ్య నివసించే ఎవరైనా సరే, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించాలనుకుంటే, మీలాగే వారు కూడా చేయాలి. \v 15 సమాజంలో ఉండే మీరైనా, విదేశీయులైనా ఒకే చట్టం పాటించాలి; ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. యెహోవా దృష్టిలో మీరూ విదేశీయులు ఒక్కటే: \v 16 మీకూ, మీ మధ్య ఉన్న విదేశీయులకు అవే నియమాలు, అవే నిబంధనలు వర్తిస్తాయి.’ ” \p \v 17 యెహోవా మోషేతో అన్నారు, \v 18 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో ప్రవేశించినప్పుడు, \v 19 ఆ దేశం ఆహారాన్ని మీరు తినేటప్పుడు, ఒక భాగం యెహోవాకు అర్పణగా సమర్పించాలి. \v 20 మీరు రుబ్బిన పిండితో చేసిన మొదటి రొట్టెను నూర్పిడి కళ్ళపు అర్పణగా అర్పించాలి. \v 21 రాబోయే తరాలకు ఇలా మీ మొదటి పిండి ముద్ద నుండి యెహోవాకు అర్పణను అర్పించాలి. \s1 ఉద్దేశం లేకుండ చేసిన పాపాల కోసం అర్పణ \p \v 22 “ ‘సమాజంగా మీరు అనుకోకుండ యెహోవా మోషేకు ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనినైనా పాటించడంలో ఒకవేళ విఫలమైతే, \v 23 యెహోవా మోషే ద్వార మీకు ఇచ్చిన ఆజ్ఞలు, యెహోవా వాటిని ఇచ్చిన రోజు నుండి రాబోయే తరాల వరకు కొనసాగిస్తూ, \v 24 ఒకవేళ తెలియక పొరపాటున మీరితే, అప్పుడు సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా కోడెను, దానితో పాటు నిర్దేశించిన భోజనార్పణ, పానార్పణలతో, పాపపరిహారబలి కోసం మేకపోతుతో కలిపి అర్పించాలి. \v 25 యాజకుడు ఇశ్రాయేలు సమాజమంతటి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి అప్పుడు వారు క్షమించబడతారు ఎందుకంటే ఆ పాపం ఉద్దేశపూర్వకమైనది కాదు, పైగా వారు పొరపాటున చేసిన తప్పును బట్టి యెహోవాకు వారు హోమబలి పాపపరిహారబలిని అర్పించారు. \v 26 ప్రజలు అనుకోకుండ తప్పు చేశారు కాబట్టి ఇశ్రాయేలు సర్వసమాజం, వారితో నివసిస్తున్న విదేశీయులు క్షమించబడతారు. \p \v 27 “ ‘అయితే ఒక్క వ్యక్తి అనుకోకుండ చేసిన పాపాలకు, ఆ వ్యక్తి పాపపరిహారబలిగా ఏడాది ఆడ మేకను అర్పించాలి. \v 28 పొరపాటున పాపం చేసిన వారి కోసం యాజకుడు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు, అది జరిగినప్పుడు ఆ వ్యక్తి క్షమించబడతాడు. \v 29 స్వదేశీయులైన ఇశ్రాయేలీయులైనా వారి మధ్యలో నివసించే విదేశీయులైనా పొరపాటున పాపం చేసినవారందరికి ఒకే చట్టం వర్తిస్తుంది. \p \v 30 “ ‘అయితే ఎవరైనా కావాలని పాపం చేస్తే, స్వదేశీయులైనా విదేశీయులైనా వారు యెహోవాను దూషించిన వారు కాబట్టి ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల నుండి వారిని తొలగించాలి. \v 31 వారు యెహోవా మాటను తృణీకరించి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించారు, కాబట్టి వారు తప్పక తొలగించబడాలి; వారి అపరాధం వారి మీదే ఉంటుంది.’ ” \s1 సబ్బాతును ఆచరించని వారు చంపబడాలి \p \v 32 ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు, ఒక మనుష్యుడు సబ్బాతు దినాన్న కట్టెలు ఏరుకుంటున్నాడు. \v 33 అది చూసినవారు అతన్ని పట్టుకుని, మోషే అహరోనుల ఎదుట సమాజమందరి ఎదుట నిలబెట్టారు. \v 34 అతనికి ఏం చేయాలో స్పష్టత లేనందున అతన్ని కావలిలో ఉంచారు. \v 35 అప్పుడు యెహోవా మోషేతో, “ఆ మనుష్యుడు చావాలి. సమాజమంతా అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టాలి.” \v 36 కాబట్టి యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. \s1 వస్త్రాల మీద కుచ్చులు \p \v 37 యెహోవా మోషేతో ఇలా అన్నారు, \v 38 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘రాబోయే తరాలన్నిటిలో మీరు మీ వస్త్రాల మూలల్లో నీలం రంగు దారంతో కుచ్చులు తయారుచేయాలి. \v 39 ఆ కుచ్చులను చూసినప్పుడు యెహోవా ఆజ్ఞలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు, వాటికి లోబడాలని మీ హృదయాభిలాషలు మీ నేత్రాశల వెంటపడుతూ వ్యభిచరించకూడదని జ్ఞాపకం చేసుకుంటారు. \v 40 అప్పుడు నా ఆజ్ఞలన్నిటికి లోబడాలని జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి మీరు ప్రతిష్ఠించుకుంటారు. \v 41 నేను మీ దేవుడైన యెహోవానై ఉన్నాను, మీకు దేవునిగా ఉండడానికి నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను.’ ” \c 16 \s1 కోరహు, దాతాను, అబీరాముల తిరుగుబాటు \p \v 1 లేవీ మునిమనమడు, కహాతు మనుమడు, ఇస్హారు కుమారుడగు కోరహు, కొంతమంది రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓనులు కొంతమందిని పోగు చేసి, \v 2 మోషేకు ఎదురు తిరిగారు. వారితో 250 మంది ఇశ్రాయేలు నాయకులు, సమాజ నాయకులుగా ఏర్పరచబడిన ప్రముఖులు చేరారు. \v 3 వారంతా మోషే, అహరోనులకు విరోధంగా పోగై, “మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు! సర్వసమాజంలో ప్రతిఒక్కరు పరిశుద్ధంగానే ఉన్నారు, యెహోవా వారితో ఉన్నారు. అలాంటప్పుడు యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు?” అని అడిగారు. \p \v 4 మోషే ఇది విని సాగిలపడ్డాడు. \v 5 తర్వాత కోరహుతో, అతని సహచరులందరితో ఇలా అన్నాడు: “రేపు ప్రొద్దున యెహోవా తన వారు ఎవరో పవిత్రులెవరో బయలుపరచి తన దగ్గరకు రానిస్తారు. తాను ఎన్నుకున్న మనిషిని ఆయన తన దగ్గరకు రానిస్తారు. \v 6 కోరహూ! నీవూ, నీ వెంట ఉన్న సమస్త సమూహం ఇలా చేయండి: ధూపార్తులు తీసుకోండి \v 7 రేపు యెహోవా ఎదుట వాటిలో నిప్పు తెచ్చి ధూపం వేయండి. యెహోవా ఎవరిని ఎన్నుకుంటారో అతడు పవిత్రుడు. లేవీయులారా! మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు!” \p \v 8 మోషే కోరహుతో మాట్లాడుతూ, “ఇప్పుడు వినండి లేవీయులారా! \v 9 ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని మిగిలిన ఇశ్రాయేలీయుల సమాజం నుండి వేరుచేసి, యెహోవా గుడారంలో పని చేయడానికి, సమాజం ముందు నిలబడి వారికి సేవ చేయడానికి మిమ్మల్ని దగ్గరకు తీసుకువచ్చినందుకు ఇది మీకు సరిపోదా? \v 10 నిన్ను, నీ తోటి లేవీయులను ఆయన చేర్చుకున్నారు, కానీ ఇప్పుడు యాజకత్వం కూడా కావాలని మీరు ప్రయత్నిస్తున్నారు. \v 11 యెహోవాకు విరోధంగా నీవు నీ పక్షంవారు గుమికూడారు. మీరు అహరోను మీద సణగడానికి అతనెవరు?” \p \v 12 అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలిపించాడు. కానీ వారు, “మేము రాము! \v 13 మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే భూమి నుండి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకువచ్చారు, అది చాలదా? ఇప్పుడు నీవు మాపై ప్రభువుగా కూడా ఉండాలనుకుంటున్నావు! \v 14 అంతేకాక, మీరు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురాలేదు లేదా పొలాలు ద్రాక్షతోటల వారసత్వాన్ని మాకు ఇవ్వలేదు. మీరు ఈ మనుష్యులను బానిసలుగా\f + \fr 16:14 \fr*\ft లేదా \ft*\fqa పురుషులను మోసం చేయాలని; హెబ్రీలో \fqa*\fqa ఈ మనుష్యుల కళ్లు ఊడదీస్తావా?\fqa*\f* చూడాలనుకుంటున్నారా? మేము రాము!” అని అన్నారు. \p \v 15 మోషేకు చాలా కోపం వచ్చి యెహోవాతో, “వారి అర్పణలు స్వీకరించకండి. వారి దగ్గర నుండి కనీసం ఒక గాడిదను కూడా నేను తీసుకోలేదు, వారిలో ఎవరి పట్ల ఏ తప్పు చేయలేదు” అని అన్నాడు. \p \v 16 మోషే కోరహుతో అన్నాడు, “రేపు నీవూ నీ అనుచరులు అనగా నీవు, వారు, అహరోను యెహోవా ఎదుట నిలబడాలి. \v 17 మీలో ప్రతి ఒక్కరు తమ ధూపార్తి చేతపట్టుకుని ధూపం వేయాలి. అన్నీ కలిపి 250 ధూపార్తులు యెహోవా ఎదుట దానిని సమర్పించాలి. నీవు అహరోను కూడా మీ ధూపార్తులు సమర్పించాలి.” \v 18 కాబట్టి ప్రతి ఒక్కరు తమ ధూపార్తిలో నిప్పువేసి దాని మీద ధూపం వేసి సమావేశ గుడార ద్వారం దగ్గర, మోషే అహరోనులతో నిలిచారు. \v 19 కోరహు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా తన పక్షం వారినందరిని సమావేశ గుడార ప్రవేశం దగ్గర పోగు చేశాడు. అప్పుడు యెహోవా మహిమ సమాజమంతటికి కనిపించింది. \v 20 యెహోవా మోషే అహరోనులతో అన్నారు, \v 21 “ఒక్కసారిగా నేను వారిని నాశనం చేయడానికి అనుకూలంగా ఉండేలా మీరు ఈ సమాజం నుండి వేరుగా నిలబడండి.” \p \v 22 కానీ మోషే అహరోనులు సాగిలపడి, “ఓ దేవా! సర్వ ప్రాణులకు ఊపిరి ఇచ్చే దేవా, ఒక్క మనిషి పాపం చేస్తే సమాజమంతటి మీద కోప్పడతారా?” అని వేడుకున్నారు. \p \v 23 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పారు. \v 24 “సమాజంతో చెప్పు, ‘కోరహు, దాతాను, అబీరాముల డేరాల నుండి దూరంగా వెళ్లండి.’ ” \p \v 25 మోషే లేచి దాతాను, అబీరాముల దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్లారు. \v 26 అతడు సమాజాన్ని హెచ్చరించాడు, “ఈ దుష్టుల డేరాల నుండి దూరంగా వెళ్లండి! వారికి చెందిన దేన్ని తాకకండి, లేదా వారి పాపాలన్నిటిని బట్టి మీరు తుడిచివేయబడతారు.” \v 27 కాబట్టి కోరహు, దాతాను, అబీరాములు డేరాల దగ్గర నుండి వారు కదిలి దూరంగా వెళ్లారు. దాతాను, అబీరాములు వారి భార్యాపిల్లలు చిన్న పిల్లలు తమ డేరాల ద్వారాలలో నిలబడి ఉన్నారు. \p \v 28 అప్పుడు మోషే అన్నాడు, “యెహోవా ఇవన్నీ చేయడానికి నన్ను పంపించారని, నా అంతట నేనే ఏమీ చేయలేదని ఇలా మీరు తెలుసుకుంటారు: \v 29 ఈ మనుష్యులు, సహజ మరణం పొందితే, మనుష్యులు అనుభవించు విధిని వీరు అనుభవిస్తే, అప్పుడు యెహోవా నన్ను పంపలేదు. \v 30 కానీ ఒకవేళ యెహోవా పూర్తిగా క్రొత్తదాన్ని తెస్తే, భూమి తన నోరు తెరిచి, వారికి సంబంధించిన ప్రతి దానితో పాటు వారిని మ్రింగివేసి, వారు సజీవంగా పాతాళంలోకి వెళ్తే, వీరు యెహోవాతో ధిక్కారంతో వ్యవహరించారని మీకు తెలుస్తుంది.” \p \v 31 మోషే ఈ మాటలు చెప్పి ముగించిన వెంటనే వారి పాదాల క్రింద నేల చీలిపోయింది, \v 32 భూమి నోరు తెరిచి, ఆ మనుష్యులను వారి ఇంటివారిని, కోరహు పక్షంగా ఉన్నవారందరిని, వారి ఆస్తితో సహా మ్రింగివేసింది. \v 33 వారంతా వారికి చెందిన సమస్తంతో పాటు ప్రాణంతోనే పాతాళంలోకి వెళ్లారు; భూమి వారిని కప్పేసింది. వారంతా సమాజంలో లేకుండా నాశనమయ్యారు. \v 34 వారి కేకలు విని చుట్టూరా ఉన్న ఇశ్రాయేలీయులు, “మనలను కూడా భూమి మ్రింగివేస్తుంది!” అని అంటూ అరుస్తూ పారిపోయారు. \p \v 35 యెహోవా దగ్గర నుండి మంటలు లేచి ధూపారాధన చేసే 250 మందిని కాల్చివేసింది. \p \v 36 యెహోవా మోషేతో అన్నారు, \v 37 “యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరుకు, బూడిదలో నుండి ఆ ధూపార్తులను తీసివేసి నిప్పు కణాలను దూరంగా చెదరగొట్టమని చెప్పు, ఎందుకంటే అవి పవిత్రమైన ధూపార్తులు. \v 38 పాపం చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వారి ధూపార్తులు. వాటిని చెడగొట్టి, రేకులుగా చేసి, వాటిని బలిపీఠం కప్పుగా వాడాలి, అవి యెహోవా ఎదుట సమర్పించబడినవి కాబట్టి పవిత్రమైనవి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తులుగా ఉండును గాక.” \p \v 39 కాబట్టి యాజకుడైన ఎలియాజరు కాల్చి చంపబడినవారు తీసుకువచ్చిన ఇత్తడి ధూపార్తులను సేకరించి, బలిపీఠం మీద కప్పి ఉండేలా వాటిని సుత్తెతో కొట్టించాడు, \v 40 యెహోవా మోషే ద్వారా అతనికి సూచించిన ప్రకారం చేశాడు. అలా ఎందుకు చేయించారంటే, అహరోను వంశస్థుడు తప్ప ఇతరులెవ్వరు యెహోవా ఎదుట ధూపం వేయడానికి రాకూడదని, వస్తే కోరహు అతని అనుచరుల్లా అవుతారని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేయడానికి. \p \v 41 మరుసటిరోజు ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగారు. “మీరు యెహోవా యొక్క ప్రజలను చంపేశారు” అని వారన్నారు. \p \v 42 మోషే అహరోనులకు వ్యతిరేకంగా సమాజం గుమికూడి, సమావేశ గుడారం వైపు చూశారు, అకస్మాత్తుగా మేఘం దానిని కప్పింది, యెహోవా మహిమ కనిపించింది. \v 43 అప్పుడు మోషే, అహరోనులు సమావేశ గుడారం ముందుకు వెళ్లారు. \v 44 యెహోవా మోషేతో, \v 45 “మీరు సమాజం మధ్య నుండి తొలగిపోండి, వెంటనే వారిని చంపేస్తాను” అన్నారు. అప్పుడు వారు సాష్టాంగపడ్డారు. \p \v 46 అప్పుడు మోషే అహరోనుతో, “నీ ధూపార్తిని తీసుకుని దానిలో ధూపం వేసి, బలిపీఠం నుండి మండుతున్న బొగ్గును తీసుకుని వారికి ప్రాయశ్చిత్తం చేయడానికి సమాజం దగ్గరకు త్వరగా వెళ్లు. యెహోవా నుండి కోపం రగులుతూ వస్తుంది; తెగులు ప్రారంభమైంది” అన్నాడు. \v 47 మోషే చెప్పినట్లే అహరోను చేశాడు. ధూపార్తులతో సమాజం మధ్యకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అప్పటికే ప్రజల్లో తెగులు మొదలయ్యింది కానీ అహరోను ధూపం వేసి వారి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. \v 48 మృతులకు, జీవులకు మధ్య అతడు నిలిచాడు, తెగులు ఆగిపోయింది. \v 49 అయితే, కోరహు తిరుగుబాటు వల్ల చనిపోయినవారు కాక తెగులు ద్వారా 14,700 మంది చనిపోయారు. \v 50 తర్వాత తెగులు ఆగిపోయినందుకు అహరోను, సమావేశ గుడార ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరకు తిరిగి వచ్చాడు. \c 17 \s1 చిగురించిన అహరోను చేతికర్ర \p \v 1 యెహోవా మోషేతో అన్నారు, \v 2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి పూర్వికుల గోత్రాల ఒక్కొక్క నాయకుడి నుండి ఒకటి చొప్పున కర్రలను తెప్పించు. ప్రతి వ్యక్తి పేరు అతని కర్రపై వ్రాయాలి. \v 3 లేవీ కర్రపై అహరోను పేరు వ్రాయాలి, ఎందుకంటే ప్రతి పూర్వికుల గోత్ర నాయకునికి ఒక కర్ర ఉండాలి. \v 4 సమావేశ గుడారంలో నేను మీతో కలిసే నిబంధన మందసం ఎదుట ఈ కర్రలను పెట్టు. \v 5 నేను ఎన్నుకున్న నాయకుడి కర్ర చిగురిస్తుంది, నీకు విరోధంగా ఇశ్రాయేలీయుల నుండి ఎప్పుడు వచ్చే సణుగుళ్లను ముగిస్తాను.” \p \v 6 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు, పూర్వికుల వంశాల క్రమం ప్రకారం ఒక్కొక్క నాయకుడు వారి వారి కర్రను, మొత్తం పన్నెండు కర్రలు ఇచ్చారు. వాటిలో అహరోను కర్ర ఉంది. \v 7 మోషే ఆ కర్రలను నిబంధన గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు. \p \v 8 మర్నాడు మోషే నిబంధన గుడారంలోకి వెళ్లి చూడగా, వాటిలో లేవీ వంశ ప్రతినిధి యైన అహరోను కర్ర చిగురించి మొగ్గలు తొడిగి, పూలు పూసి, బాదం పండ్లు వచ్చాయి. \v 9 మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి దగ్గరకు తెచ్చాడు. వారు వాటిని చూశారు, ప్రతీ నాయకుడు తన కర్రలను తీసుకున్నారు. \p \v 10 యెహోవా మోషేతో, “అహరోను కర్రను తెచ్చి మళ్ళీ నిబంధన మందసం ఎదుట పెట్టు. తిరుగుబాటు చేసినవారికి అది ఒక గుర్తుగా ఉండాలి. నాకు విరోధంగా వారు చేసే సణుగుడుకు ఇది ముగింపు కలిగిస్తుంది, తద్వార వారు చావరు” అని చెప్పారు. \v 11 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేశాడు. \p \v 12 ఇశ్రాయేలీయులు మోషేతో, “మేము చస్తాము! మేము నశించాము, మేమంతా నశించాము! \v 13 ఎవరైనా కనీసం యెహోవా యొక్క సమావేశ గుడారం దగ్గరకు వచ్చినా చస్తారు. మేమంతా చస్తామా?” అని అన్నారు. \c 18 \s1 యాజకులు, లేవీయుల బాధ్యతలు \p \v 1 యెహోవా అహరోనుతో, “పరిశుద్ధాలయానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు నీ కుటుంబం బాధ్యులు, యాజక ధర్మానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు బాధ్యులు. \v 2 మీతో చేరి నీవు, మీ కుమారులు నిబంధన గుడారం ముందు పరిచర్య చేస్తున్నప్పుడు మీకు సహాయపడడానికి మీ పూర్వికుల గోత్రానికి చెందిన మీ తోటి లేవీయులను తీసుకురండి. \v 3 వారు నీకు బాధ్యత వహించాలి, గుడారం యొక్క అన్ని విధులను నిర్వర్తించాలి, అయితే వారు పరిశుద్ధాలయం యొక్క సామాగ్రి దగ్గరకు గాని బలిపీఠం దగ్గరకు గాని వెళ్లకూడదు. లేదంటే వారు మీరు చస్తారు. \v 4 వారు మీతో కలిసి సమావేశ గుడారంలోని అన్ని పనులు జరిగేలా బాధ్యత వహించాలి; మీకు సహాయం చేయడానికి ఇతరులెవ్వరు రాకూడదు. \p \v 5 “పరిశుద్ధాలయం, బలిపీఠం పట్ల శ్రద్ధ వహించే విషయంలో మీరు బాధ్యత వహించాలి. తద్వారా ఇశ్రాయేలీయుల మీదికి యెహోవా కోపం రాదు. \v 6 నేను నేనే ఇశ్రాయేలీయుల నుండి మీ తోటి లేవీయులను మీకు బహుమానంగా, సమావేశ గుడారంలో సేవ చేయడానికి యెహోవాకు ప్రతిష్ఠించాను. \v 7 అయితే నీవు, నీ కుమారులు మాత్రమే బలిపీఠం దగ్గర, తెర వెనుక ఉన్న ప్రతిదానికీ సంబంధించి యాజకులుగా పని చేయవచ్చు. యాజక ధర్మాన్ని మీకు ప్రత్యేకమైన వరంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే, వారికి మరణశిక్ష విధించబడుతుంది.” \s1 యాజకులు, లేవీయుల కోసం అర్పణలు \p \v 8 అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “నాకు అర్పించిన అర్పణలకు నేనే నీకు బాధ్యత అప్పగించాను; ఇశ్రాయేలీయులు నాకు ఇచ్చే పరిశుద్ధ అర్పణలన్నీ నేను నీకు, నీ కుమారులకు మీ భాగంగా, మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. \v 9 బలిపీఠం మీది నిప్పులో కాల్చివేయబడని అతి పవిత్ర అర్పణలలో కొంత భాగం మీరు తీసుకోవాలి. నాకు వారు తెచ్చే అతి పవిత్రమైన భోజనార్పణలు పాపపరిహారబలులు అపరాధబలులు నీకు, నీ కుమారులకు చెందినవి. \v 10 అవి అతి పవిత్రంగా ఎంచి తినాలి. ప్రతి మగవాడు అది తినాలి. వాటిని పవిత్రమైనవిగా పరిగణించాలి. \p \v 11 “ఇది కూడా మీదే: ఇశ్రాయేలీయులు అర్పించే అర్పణలన్నిటిలో నుండి ప్రక్కన పెట్టబడినది. నేను నీకు, నీ కుమారులు కుమార్తెలకు మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. మీ ఇంట్లో ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తినవచ్చు. \p \v 12 “యెహోవాకు ఇశ్రాయేలీయులు వారి కోతలో నుండి ప్రథమ ఫలంగా అర్పించే ధాన్యము, ద్రాక్షరసము, నూనె అంతటిని మీకు ఇస్తున్నాను. \v 13 దేశం పంటలన్నిటిలో యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాలు మీకు చెందుతాయి. నీ కుటుంబంలో ఆచార ప్రకారం పవిత్రులందరు వాటిని తినవచ్చు. \p \v 14 “ఇశ్రాయేలీయులు యెహోవా కోసం ప్రతిష్ఠించిన ప్రతిదీ నీకు చెందుతుంది. \v 15 ప్రతి గర్భం నుండి వచ్చిన యెహోవాకు అర్పించబడ్డ జ్యేష్ఠ సంతానం, మనుష్యులైన, జంతువులైన, మీకు చెందుతాయి. కానీ మీరు ప్రతి పెద్ద కుమారున్ని, అపవిత్ర జంతువుల తొలిచూలును విడిపించాలి. \v 16 ఒక నెల వయస్సున్నప్పుడు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం అయిదు షెకెళ్ళ\f + \fr 18:16 \fr*\ft అంటే సుమారు 58 గ్రాములు\ft*\f* వెండితో విడిపించాలి, అంటే ఇరవై గెరాలు. \p \v 17 “ఆవులలో, గొర్రెలలో, మేకలలో తొలిచూలును విడిపించకూడదు. అవి పవిత్రమైనవి. వాటి రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించి యెహోవాకు సువాసనగా ఉండే హోమంగా వాటి క్రొవ్వును కాల్చివేయాలి. \v 18 ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది. \v 19 ఇశ్రాయేలీయులు యెహోవాకు తెచ్చే పవిత్రార్పణలను ప్రక్కకు పెట్టినవి నీకు, నీ కుమారులకు, కుమార్తెలకు శాశ్వత వాటాగా ఇస్తున్నాను. ఇది యెహోవా ఎదుట నీతో పాటు నీ సంతానానికి నిత్య ఉప్పు ఒడంబడికగా ఉంటుంది.” \p \v 20 యెహోవా అహరోనుతో ఇలా చెప్పారు, “వారి దేశంలో నీకు స్వాస్థ్యం కానీ వాటా కానీ ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్య నేనే నీ వాటాను నేనే నీ స్వాస్థ్యాన్ని. \p \v 21 “సమావేశ గుడారం దగ్గర సేవ చేస్తున్న లేవీయులకు పారితోషికంగా ఇశ్రాయేలీయులు ఇచ్చే దశమ భాగాలను స్వాస్థ్యంగా ఇస్తున్నాను. \v 22 ఇప్పటినుండి యాజకులు, లేవీయులు తప్ప ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం దగ్గరకు రాకూడదు లేదా వారి పాపానికి ప్రతిఫలం భరించి చస్తారు. \v 23 లేవీయులు మాత్రమే సమావేశ గుడారంలో సేవ చేస్తారు వారు చేసే అపరాధాలకు వారే బాధ్యులు. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు. \v 24 దానికి బదులు, ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించే దశమ భాగాలను నేను లేవీ వంశస్థులకు వారసత్వంగా ఇస్తున్నాను. అందుకే, వారిని ఉద్దేశించి ఇలా చెప్పాను: ‘ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు.’ ” \p \v 25 యెహోవా మోషేతో ఇలా అన్నారు: \v 26 “లేవీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు ఇశ్రాయేలీయుల నుండి వారసత్వంగా దశమభాగం తీసుకున్నప్పుడు, ఆ దశమభాగంలో పదవ వంతు మీరు యెహోవాకు అర్పణగా సమర్పించాలి. \v 27 అలా ప్రత్యేకించిన అర్పణలు నూర్పిడి కళ్ళంలోని ధాన్యంలా, గానుగ నుండి వచ్చిన ద్రాక్షరసంలా లెక్కకు వస్తాయి. \v 28 ఇశ్రాయేలీయుల నుండి పుచ్చుకొనే దశమ భాగాలన్నిటి నుండి యెహోవాకు మీరు కూడా అర్పణలు ఇస్తారు. ఈ దశమ భాగాల నుండి యెహోవా భాగమును యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. \v 29 మీకు ఇవ్వబడిన ప్రతి దానిలో ఉత్తమమైన పవిత్రమైన భాగాన్ని మీరు యెహోవా యొక్క భాగంగా సమర్పించాలి.’ \p \v 30 “లేవీయులకు చెప్పు: ‘శ్రేష్ఠమైనవి అర్పించినప్పుడు, అవి మీ నూర్పిడి కళ్ళంలా, ద్రాక్ష గానుగలా లెక్కకు వస్తాయి. \v 31 మిగితా వాటిని మీరు, మీ ఇంటివారు ఎక్కడైనా తినవచ్చు అది సమావేశ గుడారంలో మీరు చేస్తున్న సేవకు మీ జీతము. \v 32 మీరు దానిలో ఉత్తమమైన వాటిని అర్పించినప్పుడు మీరు దాని గురించి ఎటువంటి పాపశిక్షను భరించరు; అయితే ఇశ్రాయేలీయుల పరిశుద్ధ అర్పణలను అపవిత్రపరచవద్దు. అప్పుడు మీరు చావరు.’ ” \c 19 \s1 శుద్ధి జలం \p \v 1 యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు: \v 2 యెహోవా ఆజ్ఞాపించిన నియమానికి ఇది అవసరం: ఇశ్రాయేలీయులు లోపం లేని లేదా మచ్చలేని కాడి మోయని ఎర్రని పెయ్యను మీ దగ్గరకు తేవాలని చెప్పండి. \v 3 దానిని యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి; అతని ఎదుట శిబిరం బయట దానిని వధించాలి. \v 4 అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత వ్రేలితో తీసుకుని సమావేశ గుడారం ముందు భాగం వైపు ఆ రక్తాన్ని ఏడుసార్లు చిలకరించాలి. \v 5 అతడు చూస్తుండగా ఆ పెయ్య కాల్చివేయబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడ అంతా కాల్చివేయబడాలి. \v 6 అప్పుడు యాజకుడు కొంత దేవదారు కర్రను, హిస్సోపు చెట్టురెమ్మను ఎర్ర దారాన్ని తీసుకుని పెయ్యను కాల్చి నిప్పులో వెయ్యాలి. \v 7 తర్వాత యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి. తర్వాత అతడు శిబిరంలో ప్రవేశించవచ్చు గాని సాయంత్రం వరకు ఆచారరీత్య అపవిత్రుడే. \v 8 ఆ పెయ్యను దహించు వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు అతడు అపవిత్రుడే. \p \v 9 పవిత్రుడైనవాడు ఆవు పెయ్య బూడిదను పోగు చేసి శిబిరం బయట ఆచార ప్రకారం శుభ్రమైన చోట ఉంచాలి. అది శుద్ధి జలంలో వాడబడడానికి ఇశ్రాయేలు సమాజం ద్వారా పెట్టబడాలి; అది పాపపరిహారబలి. \v 10 పెయ్య బూడిదను పోగుచేసిన వ్యక్తి కూడా తన బట్టలు ఉతుక్కోవాలి, అతడు సాయంత్రం వరకు అపవిత్రునిగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకు, వారి మధ్య నివసిస్తున్న విదేశీయులకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. \p \v 11 “మానవ శవాన్ని ఎవరైనా తాకితే వారు ఏడు రోజులు అపవిత్రులై ఉంటారు. \v 12 వారు మూడవ రోజు, ఏడవ రోజు తమను తాము శుద్ధి చేసుకోవాలి; అప్పుడు వారు శుద్ధులవుతారు. అయితే వారు మూడవ రోజు, ఏడవ రోజు శుద్ధి చేసుకోకపోతే అపవిత్రంగానే ఉంటారు. \v 13 ఒక మనుష్యుని మృతదేహాన్ని తాకిన తర్వాత తమను తాము శుద్ధి చేసుకోకపోతే, యెహోవా సమావేశ గుడారాన్ని అపవిత్రం చేసినవారవుతారు. అలాంటి వారిని ఇశ్రాయేలు నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు, వారు అపవిత్రులుగా ఉన్నారు. వారి అపవిత్రత వారి మీద ఉంటుంది. \p \v 14 “ఇదీ గుడారంలో మనుష్యులెవరైనా చనిపోతే దానికి సంబంధించిన నియమం: ఎవరైనా డేరాలో ప్రవేశిస్తే, దానిలో ఉంటే, వారు ఏడు రోజులపాటు అపవిత్రులుగా ఉంటారు. \v 15 మూత పెట్టి ఉంచని ప్రతి పాత్ర అపవిత్రమే. \p \v 16 “ఎవరైనా బయట ఉన్నప్పుడు ఖడ్గం చేత చంపబడిన వారిని లేదా సహజ మరణం పొందినవారిని, లేదా మానవుల ఎముకలు కానీ, సమాధి కానీ ముట్టుకుంటే, వారు ఏడు రోజులు అపవిత్రులుగా ఉంటారు. \p \v 17 “ఎందుకంటే అపవిత్రమైన వ్యక్తి కోసం, కాల్చబడిన పాపపరిహారబలి యొక్క బూడిద కొంత పాత్రలో వేసి, వాటి మీద పారే తాజా నీరు పొయ్యాలి. \v 18 అప్పుడు ఆచార ప్రకారం పవిత్రంగా ఉన్న వ్యక్తి కొంత హిస్సోపు తీసుకుని, నీటిలో ముంచి గుడారం అన్ని అలంకరణలు అక్కడ ఉన్న ప్రజలను చిలకరించాలి. అతడు మానవ ఎముక లేదా సమాధిని తాకిన వారి మీద లేదా చంపబడిన ఎవరైనా లేదా సహజ మరణం పొందినవారి మీద కూడా చిలకరించాలి. \v 19 పవిత్రుడైన పురుషుడు అపవిత్రుల మీద మూడవ రోజు, ఏడవ రోజు చిలకరించాలి, ఏడవ రోజు వారిని పవిత్రపరచాలి. పవిత్రపరచబడే వారు వారి బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, ఆ సాయంత్రం వారు శుద్ధులవుతారు. \v 20 కానీ అపవిత్రులైనవారు తమను తాము శుద్ధి చేసుకోకపోతే, వారు సమాజం నుండి బహిష్కరించబడాలి, వారు యెహోవా పరిశుద్ధాలయాన్ని అపవిత్ర పరిచిన వారు. శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు కాబట్టి వారు అపవిత్రులు. \v 21 ఇది వారికి నిత్య కట్టుబాటుగా ఉంటుంది. \p “శుద్ధి జలం చిలకరించు పురుషుడు కూడా తన బట్టలు ఉతుక్కోవాలి. ఎవరైనా శుద్ధి జలం తాకితే సాయంత్రం వరకు వారు అపవిత్రులు. \v 22 అపవిత్రమైనవారు ఏది ముట్టిన అది అపవిత్రమే, ఎవరైనా దానిని ముట్టుకుంటే సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.” \c 20 \s1 బండ నుండి నీళ్లు \p \v 1 సంవత్సరం మొదటి నెలలో ఇశ్రాయేలు సమాజమంతా సీను ఎడారికి చేరి కాదేషులో దిగారు. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడింది. \p \v 2 అయితే సమాజానికి నీళ్లు లేవు కాబట్టి ప్రజలు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా గుమికూడారు. \v 3 వారు మోషేతో గొడవపడుతూ, “మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చనిపోయి ఉంటే బాగుండేది! \v 4 యెహోవా సమాజాన్ని ఈ అరణ్యంలోనికి ఎందుకు తెచ్చావు? మేము, మా పశువులు చావాలనా? \v 5 మీరు మమ్మల్ని ఈజిప్టు నుండి ఈ భయంకరమైన చోటికి ఎందుకు తీసుకువచ్చారు? దీనిలో ధాన్యాలు లేదా అంజూరాలు, ద్రాక్షలు లేదా దానిమ్మలు లేవు. త్రాగడానికి నీరు దొరకలేదు!” \p \v 6 మోషే అహరోనులు సమాజం నుండి సమావేశ గుడారం దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం వారికి కనిపించింది. \v 7 యెహోవా మోషేతో, \v 8 “చేతికర్రను పట్టుకుని, నీవు నీ అన్న అహరోను కలిసి సమాజాన్ని సమకూర్చి, వారు చూస్తుండగా ఆ బండను ఆజ్ఞాపించు, ఆ బండ నుండి నీళ్లు వస్తాయి. వారు వారి పశువులు త్రాగడానికి సమాజం కోసం నీవు ఆ బండ నుండి నీళ్లను రప్పిస్తావు.” \p \v 9 కాబట్టి మోషే ఆయన ఆజ్ఞ ప్రకారం యెహోవా సన్నిధి నుండి తన చేతికర్రను తీసుకున్నాడు. \v 10 అతడు, అహరోను సమాజాన్ని బండ ఎదుట సమకూర్చారు మోషే, “ద్రోహులారా! వినండి. ఈ బండలో నుండి మీ కోసం నీళ్లు రప్పించాలా?” \v 11 అప్పుడు మోషే చేయి ఎత్తి రెండు సార్లు కర్రతో బండను కొట్టాడు. వెంటనే నీళ్లు ఉబుకుతూ వచ్చాయి, సమాజ ప్రజలు, వారి పశువులతో సహా త్రాగారు. \p \v 12 అయితే యెహోవా మోషే అహరోనులతో, “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నా పరిశుద్ధతను ఘనపరచడానికి నన్ను నమ్మలేదు కాబట్టి మీరు ఈ సమాజాన్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్లరు” అని అన్నారు. \p \v 13 ఇవి మెరీబా జలాలు. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోవాతో గొడవపడ్డారు, యెహోవా తన పరిశుద్ధతను నిరూపించుకున్నారు. \s1 ఇశ్రాయేలు ఎదోము వారి మధ్య నుండి వెళ్లడానికి వారు తిరస్కరించారు \p \v 14 మోషే కాదేషు నుండి ఎదోము రాజు దగ్గరకు ఈ వర్తమానంతో దూతలను పంపాడు: \pm “నీ సహోదరుడైన ఇశ్రాయేలు ఇలా చెప్తున్నాడు: మా మీదికి వచ్చిన కష్టాలన్నిటి గురించి నీకు తెలుసు. \v 15 మా పూర్వికులు ఈజిప్టుకు వెళ్లారు. చాలా కాలం మేమక్కడ ఉన్నాము. ఈజిప్టువారు మా పట్ల, మా పూర్వికుల పట్ల దారుణంగా ప్రవర్తించారు, \v 16 అయితే మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన మా మొర ఆలకించాడు దేవదూతను పంపి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చాడు. \pm “ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాము, ఈ పట్టణం మీ సరిహద్దుల చివర ఉంది. \v 17 దయచేసి మమ్మల్ని మీ దేశం మార్గం ద్వారా వెళ్లనివ్వండి. మేము మీ పొలాలు, ద్రాక్షతోటల్లో నుండి వెళ్లము, మీ బావులలోని నీళ్లు త్రాగము. రాజమార్గంలోనే సాగిపోతాము. ఈ దేశం పొలిమేర దాటే వరకు కుడికి గాని, ఎడమకు గాని తిరగకుండా వెళ్తాము.” \p \v 18 కానీ ఎదోము రాజు ఇలా ఆజ్ఞాపించారు: \pm “మీరు ఇక్కడినుండి వెళ్లకూడదు. వెళ్లడానికి ప్రయత్నిస్తే ఖడ్గంతో మీపై దాడి చేస్తాము.” \p \v 19 ఇశ్రాయేలు ప్రజలు తిరిగి కబురు పంపారు: \pm “మేము రాజమార్గంలోనే సాగిపోతాము. మేము మా పశువులు నీళ్లు త్రాగితే దానికి వెల చెల్లిస్తాము. మేము కేవలం కాలినడకతో దాటి వెళ్తాం అంతే ఇంకేమి లేదు.” \p \v 20 వారు తిరిగి జవాబిచ్చారు: \pm “మీరు దాటి వెళ్లకూడదు.” \p ఎదోము వారు వారిని ఎదుర్కోడానికి, శక్తిగల పెద్దబలగంతో వచ్చారు. \v 21 ఎదోము వారు ఇశ్రాయేలీయులను తమ సరిహద్దులు దాటనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు అక్కడినుండి తిరిగిపోయారు. \s1 అహరోను మరణం \p \v 22 ఇశ్రాయేలు సమాజమంత కాదేషు నుండి ప్రయాణమై హోరు పర్వతానికి చేరారు. \v 23 ఎదోము సరిహద్దు దగ్గర ఉన్న హోరు పర్వతం దగ్గర, యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు, \v 24 “అహరోను తన పూర్వికుల దగ్గర చేర్చబడతాడు. మీరిద్దరు మెరీబా నీళ్ల దగ్గర నా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించడు. \v 25 నీవు అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు పర్వతం పైకి తీసుకెళ్లు. \v 26 అహరోను వస్త్రాలు తీసి, అతని కుమారుడైనా ఎలియాజరుకు తొడిగించు. అక్కడే అహరోను చనిపోయి తన పూర్వికుల దగ్గర చేర్చబడతాడు.” \p \v 27 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉండగా వారు హోరు పర్వతం ఎక్కారు. \v 28 మోషే అహరోను వస్త్రాలు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను ఆ పర్వత శిఖరం మీదనే చనిపోయాడు. మోషే ఎలియాజరు పర్వతం దిగి వచ్చారు, \v 29 సమాజమంతా అహరోను చనిపోయాడని ఎప్పుడైతే తెలుసుకుందో, ఇశ్రాయేలీయులంతా ముప్పై రోజులు అహరోను కోసం సంతాపం పాటించారు. \c 21 \s1 అరాదు నాశనం చేయబడింది \p \v 1 ఇశ్రాయేలీయులు అతారీముకు వెళ్లే మార్గాన వస్తున్నారని దక్షిణ ప్రాంతంలో ఉన్న అరాదులో ఉన్న కనానీయ రాజు విని, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, కొంతమందిని చెరగా తీసుకెళ్లాడు. \v 2 అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ మ్రొక్కుబడి చేసుకున్నారు: “మీరు ఈ ప్రజలను మా చేతులకు అప్పగిస్తే, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేస్తాము.”\f + \fr 21:2 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే; \+xt సంఖ్యా 21:3\+xt* కూడా ఉంది.\ft*\f* \v 3 యెహోవా ఇశ్రాయేలు మనవి విని కనానీయులను వారికి అప్పగించారు. వారు వారిని, వారి పట్టణాలను సర్వనాశనం చేశారు; కాబట్టి ఆ స్థలానికి హోర్మా\f + \fr 21:3 \fr*\ft అంటే \ft*\fqa నాశనం\fqa*\f* అనే పేరు వచ్చింది. \s1 ఇత్తడి సర్పం \p \v 4 ఎదోము చుట్టూ తిరిగి రావాలని వారు హోరు పర్వతం నుండి ఎర్ర సముద్రం మార్గాన ప్రయాణం చేశారు. అయితే ప్రజలు ఈ ప్రయాణంలో ఓపిక కోల్పోయారు; \v 5 దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడుతూ, “ఈ అరణ్యంలో మేము చావాలని ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తెచ్చారు? ఇక్కడ తినడానికి తిండి లేదు! త్రాగడానికి నీళ్లు లేవు! ఈ పిచ్చి ఆహారమంటే మాకు అసహ్యం!” అని అన్నారు. \p \v 6 అప్పుడు యెహోవా వారి మధ్యకు విషసర్పాలను పంపారు; అవి ప్రజలను కాటు వేశాయి, చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. \v 7 ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము. యెహోవా మా మధ్య నుండి సర్పాలను తీసివేసేలా ప్రార్థన చేయండి” అన్నారు. కాబట్టి మోషే ప్రజల కోసం ప్రార్థన చేశాడు. \p \v 8 యెహోవా మోషేతో, “ఒక సర్పం చేసి స్తంభం మీద పెట్టు; పాము కాటేసినప్పుడు ఎవరైనా దానిని చూస్తే, వారు బ్రతుకుతారు” అని చెప్పారు. \v 9 కాబట్టి మోషే ఇత్తడి సర్పాన్ని చేసి, దాన్ని ఒక స్తంభం మీద పెట్టాడు. అప్పుడు ఎవరైనా పాము కాటేసినప్పుడు, ఇత్తడి సర్పాన్ని చూస్తే, వారు చావలేదు. \s1 మోయాబుకు ప్రయాణం \p \v 10 ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి, ఓబోతులో దిగారు. \v 11 తర్వాత ఓబోతు నుండి ప్రయాణం చేసి, ఈయ్యె-అబారీములో దిగారు. అది మోయాబుకు ఎదురుగా, సూర్యోదయ దిక్కున ఉన్న అరణ్యము. \v 12 అక్కడినుండి ప్రయాణం చేసి జెరెదు లోయలో దిగారు. \v 13 వారు అక్కడినుండి బయలుదేరి, అమోరీయుల భూభాగంలో విస్తరించి ఉన్న అరణ్యంలో ఉన్న అర్నోను ప్రక్కన విడిది చేశారు. అర్నోను మోయాబు అమోరీయుల మధ్య మోయాబు సరిహద్దు. \v 14-15 అందుకే యెహోవా యుద్ధాల గ్రంథంలో: \q1 “సుఫాలోని వాహేబు,\f + \fr 21:14-15 \fr*\ft గ్రీకు అనువాదంలో ఈ పదం \ft*\fqa జాహబ్\fqa*\f* \q2 అర్నోను లోయలు \q1 ఆరు పట్టణం వరకు ఉన్న పల్లపు లోయలు \q2 మోయాబు సరిహద్దులో ఉన్నాయి” \m అని వ్రాయబడి ఉంది. \p \v 16 అక్కడినుండి వారు బెయేర్‌కు వెళ్లారు, ఈ బావి గురించి యెహోవా మోషేతో, “ప్రజలను సమకూర్చు, నేను వారికి నీళ్లిస్తాను” అని అన్నారు. \p \v 17 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు: \q1 “ఓ బావి ఉప్పొంగు! \q2 దాని గురించి పాడండి. \q1 \v 18 రాకుమారులు ఆ బావిని త్రవ్వించారు, \q2 ప్రజల సంస్థానాధిపతులు \q2 తమ రాజదండాలతో కర్రలతో త్రవ్వారు.” \m తర్వాత వారు అరణ్యం నుండి మత్తానకు వెళ్లారు, \v 19 మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు, \v 20 బామోతు నుండి మోయాబు లోయకు వెళ్లారు. అక్కడే పిస్గా పర్వతం ఉంది. \s1 సీహోను, ఓగుల ఓటమి \p \v 21 ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపారు: \pm \v 22 “మీ దేశం మీదుగా మమ్మల్ని వెళ్లనివ్వండి. మీ పొలాల వైపు, ద్రాక్షతోటల పొలాల వైపు తిరగము, మీ బావులలోని నీళ్లు త్రాగము. మీ దేశం పొలిమేర దాటే వరకు రాజమార్గంలోనే వెళ్తాము.” \p \v 23 అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన దేశం గుండా వెళ్లడానికి అనుమతించలేదు. అతడు తన సైన్యమంతటిని పోగు చేసి, ఇశ్రాయేలుపై దాడి చేయడానికి అరణ్యంలోకి వెళ్లాడు. అతడు యాహాజుకు చేరినప్పుడు, ఇశ్రాయేలుతో పోరాడాడు. \v 24 అయితే ఇశ్రాయేలు అతన్ని ఖడ్గంతో చంపి అతని దేశాన్ని అర్నోను నది నుండి యబ్బోకు వరకు ఆక్రమించారు, కానీ అమ్మోనీయుల సరిహద్దు వరకు మాత్రమే ఎందుకంటే వారి సరిహద్దు పటిష్టమైనది. \v 25 ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణాలన్నిటిని, హెష్బోను దాని చుట్టూరా ఉన్న గ్రామాలతో సహా స్వాధీనం చేసుకుని ఆక్రమించారు. \v 26 హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. సీహోను అంతకుముందు మోయాబు రాజుతో యుద్ధం చేసి, అర్నోను నది వరకు ఉన్న ప్రదేశమంతా వశం చేసుకున్నాడు. \p \v 27 అందుకే సామెతలు చెప్పేవారు ఇలా అంటారు: \q1 హెష్బోనుకు రండి అది తిరిగి కట్టబడనివ్వండి; \q2 సీహోను పట్టణం పూర్వస్థితికి వచ్చును గాక. \b \q1 \v 28 హెష్బోను నుండి అగ్ని బయలుదేరింది, \q2 సీహోను పట్టణం నుండి మంటలు వచ్చాయి. \q1 అది మోయాబులోని ఆరు పట్టణాన్ని కాల్చివేసింది. \q2 అర్నోను యొక్క ఎత్తైన స్థలాల యజమానులను దహించివేసింది. \q1 \v 29 మోయాబూ, నీకు శ్రమ! \q2 కెమోషు ప్రజలారా! మీరు నాశనమయ్యారు. \q1 అతడు తన కుమారులను పారిపోయేవారిగా, \q2 అతని కుమార్తెలను అమోరీయుల రాజైన సీహోను దగ్గర \q2 చెరగా అప్పగించాడు. \b \q1 \v 30 “అయితే మేము వారిని కూల్చివేసాము; \q2 హెష్బోను అధికారం దీబోను వరకు నాశనమైంది. \q1 నోఫహు వరకు వారిని పడగొట్టాము, \q2 మెదెబా వరకు అది వ్యాపించింది.” \p \v 31 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు. \p \v 32 యాజెరు ప్రాంతాన్ని చూసి రమ్మని మోషే వేగులవారిని పంపిన తర్వాత, ఇశ్రాయేలీయులు ఆ పట్టణాన్ని, దాని చుట్టూరా ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకుని అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు. \v 33 తర్వాత వారు తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము, అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో వారిని ఎదుర్కోడానికి బయలుదేరాడు. \p \v 34 యెహోవా మోషేతో, “అతనికి భయపడకండి, ఎందుకంటే అతన్ని, అతని సైన్యమంతటిని, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి చేయండి” అని ఆజ్ఞాపించారు. \p \v 35 కాబట్టి వారు ఓగును, అతని కుమారులను, అతని సైన్యమంతటిని, ఏ ఒక్కరు మిగలకుండా హతం చేశారు. అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. \c 22 \s1 బాలాకు బిలామును ఆహ్వానించుట \p \v 1 తర్వాత ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల వైపు ప్రయాణం చేసి యొర్దాను నది తూర్పుగా, యెరికో వైపు దిగారు. \p \v 2 ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతా సిప్పోరు కుమారుడైన బాలాకు చూశాడు, \v 3 చాలామంది ఉన్నందున మోయాబు భయపడింది. నిజానికి, ఇశ్రాయేలీయుల వల్ల మోయాబు భయంతో నిండిపోయింది. \p \v 4 మోయాబీయులు మిద్యాను పెద్దలతో, “ఈ దండు, ఒక ఎద్దు పొలం లోని గడ్డిని లాక్కున్నట్లు, మన చుట్టూ ఉన్న సమస్తాన్ని లాక్కుంటుంది” అని అన్నారు. \p కాబట్టి ఆ సమయంలో మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు, \v 5 యూఫ్రటీసు నదికి సమీపంలో ఉన్న పెతోరు దగ్గర ఉన్న బెయోరు కుమారుడైన బిలామును తన స్వదేశంలో పిలువడానికి దూతలను పంపాడు. బాలాకు అన్నాడు: \pm “ఈజిప్టు నుండి ప్రజలు వచ్చారు; వారు భూ ముఖాన్ని కప్పి, నా ప్రక్కన స్థిరపడ్డారు. \v 6 నీవు వచ్చి వీరిని శపించాలి, ఎందుకంటే వారు నా శక్తికి మించి ఉన్నారు. బహుశా అప్పుడు నేను వీరిని ఓడించి ఈ స్థలం నుండి తరిమివేయగలుగుతాను. నీవు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారని, నీవు ఎవరిని శపిస్తే వారు శపించబడతారని నాకు తెలుసు.” \p \v 7 మోయాబు మిద్యాను పెద్దలు, భవిష్యవాణికి రుసుము తీసుకెళ్లారు. వారు బిలాము దగ్గరకు వచ్చి, బాలాకు చెప్పింది అతనికి చెప్పారు. \p \v 8 బిలాము వారితో, “ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, యెహోవా నాకు చెప్పేది నేను మీకు తెలియజేస్తాను” అని అన్నాడు. కాబట్టి మోయాబు అధికారులు ఆ రాత్రి అతనితో ఉన్నారు. \p \v 9 ఆ రాత్రి దేవుడు వచ్చి బిలామును, “నీతో ఉన్న వీళ్ళు ఎవరు?” అని ప్రశ్నించారు. \p \v 10 బిలాము దేవునితో, “సిప్పోరు కుమారుడు, మోయాబు రాజైన బాలాకు, నాకు ఈ సందేశం పంపాడు: \v 11 ‘ఈజిప్టు నుండి వచ్చిన ఒక ప్రజల గుంపు భూమినంతా కప్పుతుంది. నా కోసం వారిని శపించు. బహుశ అప్పుడు నేను వారితో యుద్ధం చేసి తరిమివేస్తాను.’ ” \p \v 12 అయితే దేవుడు బిలాముతో, “నీవు వారితో వెళ్లొద్దు. వారు దీవించబడినవారు కాబట్టి నీవు వారిని శపించకూడదు” అని అన్నారు. \p \v 13 మర్నాడు ఉదయం బిలాము బాలాకు అధికారులతో, “మీ సొంత దేశానికి వెళ్లిపొండి, నేను మీతో వెళ్లడానికి యెహోవా నిరాకరించారు” అని చెప్పాడు. \p \v 14 కాబట్టి మోయాబు అధికారులు బాలాకు దగ్గరకు తిరిగివెళ్లి, “బిలాము మాతో రావడానికి ఒప్పుకోలేదు” అని చెప్పారు. \p \v 15 అప్పుడు బాలాకు ఇతర అధికారులను, మొదటిసారి కన్నా ఇంకా ఎక్కువ మంది ప్రముఖులను, పంపాడు. \v 16 వారు బిలాము దగ్గరకు వచ్చి అన్నారు: \pm “సిప్పోరు కుమారుడైన బాలాకు ఇలా చెప్తున్నాడు: నా దగ్గరకు రాకుండ ఏది కూడా మిమ్మల్ని ఆపనివ్వకండి, \v 17 ఎందుకంటే నేను నిన్ను గొప్పగా గౌరవిస్తాను, నీవు నాకు ఏది చెబితే అది చేస్తాను. వచ్చి నా కోసం ఈ ప్రజలపై శాపం పెట్టండి.” \p \v 18 అయితే బిలాము వారితో, “బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారమంతా ఇచ్చినా సరే, నా దేవుడైన యెహోవా ఆజ్ఞకు మించి ఎక్కువ గాని తక్కువ గాని చేయలేను. \v 19 మీరు రాత్రి ఇక్కడ గడపండి, యెహోవా నాకేమి చెప్తారు తెలుసుకుంటాను” అని చెప్పాడు. \p \v 20 ఆ రాత్రి దేవుడు బిలాముతో, “ఈ మనుష్యులు నిన్ను పిలువడానికి వచ్చారు కాబట్టి నీవు వారితో వెళ్లు కానీ నేను చెప్పేది మాత్రమే చేయు” అని అన్నారు. \s1 బిలాము యొక్క గాడిద \p \v 21 మర్నాడు ఉదయం బిలాము తన గాడిదకు సీను కట్టుకుని మోయాబు అధికారులతో వెళ్లాడు. \v 22 కాని బిలాము వెళ్తునప్పుడు దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత మార్గంలో బిలామును అడ్డుకోడానికి నిలబడ్డాడు. బిలాము గాడిద మీద వెళ్తున్నాడు, అతనితో తన ఇద్దరు సేవకులు ఉన్నారు. \v 23 యెహోవా దూత కత్తి దూసి చేతపట్టుకుని త్రోవలో నిలిచి ఉండడం చూసి గాడిద దారి విడిచి పొలంలోకి వెళ్లింది. అది మార్గంలోకి రావాలని బిలాము దాన్ని కొట్టాడు. \p \v 24 అప్పుడు యెహోవా దూత రెండు ద్రాక్షతోటల మధ్య రెండు వైపుల గోడలు ఉన్నచోట నిలబడ్డాడు. \v 25 యెహోవా దూతను చూసి ఆ గాడిద గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది కాబట్టి అతడు గాడిదను మళ్ళీ కొట్టాడు. \p \v 26 తర్వాత యెహోవా దూత కొంచెం ముందుకు వెళ్లి, గాడిద కుడివైపు కానీ, ఎడమవైపు కానీ తిరుగకుండునట్లు ఇరుకు స్థలంలో నిలబడ్డాడు. \v 27 యెహోవా దూతను చూసి గాడిద బిలాము క్రింద నేల మీద పడి ఉన్నది. బిలాము కోపంతో తన చేతికర్రతో గాడిదను కొట్టాడు. \v 28 అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచారు, అది బిలాముతో మాట్లాడుతూ, “నేను నీకు ఏమి చేశానని నన్ను మూడుసార్లు కొట్టావు?” అని అన్నది. \p \v 29 బిలాము గాడిదకు, “నీవు నన్ను మూర్ఖునిగా ఎంచావు. నా చేతిలో ఖడ్గం ఉండి ఉంటే నిన్ను ఇప్పుడే చంపేసే వాన్ని” అని జవాబిచ్చాడు. \p \v 30 గాడిద బిలాముతో, “ఈ రోజు వరకు ప్రతిసారి స్వారీ చేసిన మీ సొంత గాడిదను నేను కాదా? ఇలా ఎప్పుడైనా చేశానా?” అని అడిగింది. \p “లేదు” అని అతడు అన్నాడు. \p \v 31 అప్పుడు యెహోవా బిలాము కళ్లు తెరిచారు, దూసిన ఖడ్గం చేతితో పట్టుకుని దారికి అడ్డుగా ఉన్న యెహోవా దూతను అతడు చూశాడు. బిలాము తలవంచి సాష్టాంగపడ్డాడు. \p \v 32 యెహోవా దూత, “నీవెందుకు నీ గాడిదను ఈ మూడుసార్లు కొట్టావు? నీ మార్గం నాశనకరమైనది కాబట్టి నిన్ను అడ్డుకోడానికి వచ్చాను. \v 33 మూడుసార్లు గాడిద నన్ను చూసి తొలగిపోయింది. ఒకవేళ అది తిరగకపోయి ఉంటే, ఈపాటికి నేను తప్పకుండా నిన్ను చంపేసి గాడిదను వదిలేసేవాన్ని” అని అతనితో అన్నాడు. \p \v 34 బిలాము యెహోవా దూతతో, “నేను పాపం చేశాను. నన్ను ఎదుర్కోడానికి నీవు దారికి అడ్డుగా నిలబడ్డావని నేను గ్రహించలేదు. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని అన్నాడు. \p \v 35 యెహోవా దూత బిలాముతో, “వారితో వెళ్లు కానీ నేను చెప్పేదే నీవు పలకాలి” అని అన్నాడు. కాబట్టి బిలాము బాలాకు అధికారులతో వెళ్లాడు. \p \v 36 బిలాము వస్తున్నాడని విని బాలాకు అర్నోను నది సరిహద్దులో ఉన్న మోయాబు పట్టణం పొలిమేరలో అతన్ని కలసుకోడానికి వెళ్లాడు. \v 37 బాలాకు బిలాముతో, “నిన్ను త్వరగా రమ్మని చెప్పలేదా? నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఘనత ఇవ్వలేనా?” అని అన్నాడు. \p \v 38 “ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కదా” అని బిలాము జవాబిచ్చాడు. “కానీ నాకిష్టమైనది నేను చెప్పలేను. దేవుడు నా నోట్లో పెట్టిందే నేను చెప్పాలి” అని బాలాకుతో అన్నాడు. \p \v 39 తర్వాత బిలాము బాలాకు వెంట కిర్యత్-హుచ్చోతుకు వెళ్లాడు. \v 40 అక్కడ బాలాకు ఎద్దులను గొర్రెలను బలి ఇచ్చాడు, బిలాముకు, అతనితో ఉన్న అధికారులకు కొంత ఇచ్చాడు. \v 41 మర్నాడు ఉదయం బాలాకు బిలామును బామోత్ బయలుకు తీసుకెళ్లాడు, అక్కడినుండి ఇశ్రాయేలు శిబిరం యొక్క చివరలను చూడగలిగాడు. \c 23 \s1 బిలాము యొక్క మొదటి సందేశము \p \v 1 బిలాము బాలాకుతో అన్నాడు, “నాకు ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టాలి, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్లను నా కోసం సిద్ధం చేయాలి.” \v 2 బాలాకు బిలాము చెప్పినట్లు చేశాడు, వారిద్దరు ఒక కోడెను, ఇద్దరు ఒక్కో బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించారు. \p \v 3 అప్పుడు బిలాము బాలాకుతో, “నీవు నీ దహనబలి దగ్గర ఉండు. బహుశ యెహోవా నన్ను కలుసుకోడానికి రావొచ్చు. ఆయన నాకు ఏమి బయలుపరుస్తారో అది నీకు చెప్తాను” అని అన్నాడు. తర్వాత అతడు ఖాళీ కొండపైకి వెళ్లాడు. \p \v 4 దేవుడు అతన్ని కలుసుకున్నారు, బిలాము, “నేను ఏడు బలిపీఠాలు సిద్ధపరచి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాను” అని అన్నాడు. \p \v 5 యెహోవా బిలాము నోటిలో ఒక సందేశం పెట్టి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పు” అని అన్నారు. \p \v 6 కాబట్టి బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు. \v 7 అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: \q1 “బాలాకు నన్ను అరాము నుండి తీసుకువచ్చాడు, \q2 మోయాబు రాజు తూర్పు పర్వతాల నుండి తెచ్చాడు. \q1 ‘రా, నా కోసం యాకోబును శపించు’ అని అన్నాడు; \q2 ‘రా, ఇశ్రాయేలును శపించు.’ \q1 \v 8 దేవుడు శపించని వారిని \q2 నేనెలా శపించగలను? \q1 యెహోవా శపించని వారిని \q2 నేనెలా శపించగలను? \q1 \v 9 ఎత్తైన కొండ శిఖరాల నుండి నేను వారిని చూడగలను, \q2 ఎత్తైన స్థలాల నుండి నేను వారిని వీక్షించగలను. \q1 విడివిడిగా నివసించే ప్రజలను నేను చూస్తున్నాను \q2 తమను తాము దేశాల్లో ఒకటిగా పరిగణించని వారు. \q1 \v 10 యాకోబు ధూళిని ఎవరు లెక్కించగలరు? \q2 ఇశ్రాయేలు ప్రజల్లో కనీసం నాలుగవ వంతు ఎవరు లెక్కించగలరు? \q1 నేను యథార్థవంతుల మరణం పొందుదును గాక, \q2 నా అంతం వారి అంతంలా ఉండును గాక!” \p \v 11 బాలాకు బిలాముతో, “నీవు నాకు ఏమి చేశావు? నా శత్రువులను శపిస్తావని నిన్ను తీసుకువచ్చాను, కానీ నీవు వారిని ఆశీర్వదించడం తప్ప ఏమి చేయలేదు!” \p \v 12 బిలాము, “యెహోవా నా నోట పెట్టిన మాటను నేను మాట్లాడకూడదా?” అని అన్నాడు. \s1 బిలాము యొక్క రెండవ సందేశం \p \v 13 అప్పుడు బాలాకు అతనితో, “వారు కనిపించే మరో చోటికి నాతో రా; వారందరిని చూడవు కానీ, వారి శిబిరం సరిహద్దులు చూస్తావు. అక్కడినుండి నా కోసం వారిని శపించు” అని అన్నాడు. \v 14 బాలాకు బిలామును సోఫీము పొలములో ఉన్న పిస్గా శిఖరం మీదికి తీసుకెళ్లాడు. అక్కడ ఏడు బలిపీఠాలు కట్టి, ఒక్కో దాని మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాడు. \p \v 15 బిలాము బాలాకుతో, “నీవు ఇక్కడ నీ బలిపీఠం దగ్గర ఉండు, నేను అక్కడ దేవున్ని కలుస్తాను” అని అన్నాడు. \p \v 16 యెహోవా బిలామును కలుసుకొని, అతని నోటిలో మాట ఉంచి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటను చెప్పు” అని అన్నారు. \p \v 17 బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు. బాలాకు అతన్ని, “యెహోవా ఏమి చెప్పారు?” అని అడిగాడు. \p \v 18 అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: \q1 “బాలాకు! లేచి, విను; \q2 సిప్పోరు కుమారుడా! నా మాట విను. \q1 \v 19 అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు, \q2 మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. \q1 ఆయన మాట్లాడి క్రియ చేయరా? \q2 ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా? \q1 \v 20 ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను; \q2 ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను. \b \q1 \v 21 “యాకోబులో ఎటువంటి దోషం కనిపించలేదు, \q2 ఇశ్రాయేలులో ఏ చెడు కనిపించలేదు. \q1 వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు; \q2 రాజు యొక్క కేక వారి మధ్య ఉన్నది. \q1 \v 22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చారు; \q2 వారికి అడవి ఎద్దుకు ఉన్న బలం ఉంది. \q1 \v 23 యాకోబుకు వ్యతిరేకంగా ఏ భవిష్యవాణి లేదు, \q2 ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునాలు లేవు. \q1 ఇప్పుడు యాకోబు గురించి, \q2 ఇశ్రాయేలు గురించి, ‘దేవుడు ఏమి చేశారో చూడండి!’ \q1 \v 24 ప్రజలు ఆడ సింహంలా లేస్తారు; \q2 వారు తమకు తాము సింహంలా లేస్తారు \q1 అది తన వేట మాంసాన్ని మ్రింగివేసే వరకు \q2 దాని బాధితుల రక్తం త్రాగే వరకు విశ్రాంతి తీసుకోదు” \m అని చెప్పబడుతుంది. \p \v 25 బాలాకు బిలాముతో, “వారిని అసలు శపించకు వారిని దీవించకు!” అని అన్నాడు. \p \v 26 బిలాము బాలాకుతో, “యెహోవా ఏది చెప్తే నేను అదే చేయాలని నేను చెప్పలేదా?” అని జవాబిచ్చాడు. \s1 బిలాము యొక్క మూడవ సందేశం \p \v 27 అప్పుడు బాలాకు బిలాముతో, “అయితే నిన్ను మరో స్థలానికి తీసుకెళ్తాను. బహుశ అక్కడినుండి నీవు నా కోసం వారిని శపించడం దేవునికి ఇష్టం కావచ్చు” అని అన్నాడు. \v 28 బాలాకు, బిలామును నిర్మానుష్య స్థలానికి ఎదురుగా ఉన్న పెయోరు కొండ శిఖరం పైకి తీసుకెళ్లాడు. \p \v 29 బిలాము బాలాకుతో, “నా కోసం ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టించు, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్ళను సిద్ధం చేయించు” అని అన్నాడు. \v 30 బాలాకు బిలాము చెప్పినట్టు చేశాడు, ప్రతి బలిపీఠం మీద కోడెను, పొట్టేలును అర్పించాడు. \c 24 \p \v 1 ఇశ్రాయేలును ఆశీర్వదించడం యెహోవాకు ఇష్టమని బిలాము గ్రహించినప్పుడు, అతడు ఇతర సమయాల్లో చేసినట్టు భవిష్యవాణి ఆశ్రయించలేదు, కానీ తన ముఖాన్ని అరణ్యం వైపు త్రిప్పాడు. \v 2 ఇశ్రాయేలు వారు గోత్రాల ప్రకారం గుడారాలు వేసుకుని ఉండడం బిలాము చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది, \v 3 అతడు ఈ సందేశం ఇచ్చాడు: \q1 “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, \q2 స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం, \q1 \v 4 దేవుని మాటలు వినే వాని ప్రవచనం, \q2 సర్వశక్తిగల\f + \fr 24:4 \fr*\ft హెబ్రీలో \ft*\fqa ఎల్-షద్దాయ్ \fqa*\ft \+xt 16|link-href="NUM 24:16"\+xt* వచనంలో కూడా\ft*\f* దేవుని నుండి దర్శనం చూసేవాడు, \q2 సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు: \b \q1 \v 5 “ఓ యాకోబు, నీ గుడారాలు ఎంత అందంగా ఉన్నాయి, \q2 ఓ ఇశ్రాయేలు, నీ నివాస భవనాలు ఎంత రమ్యంగా ఉన్నాయి! \b \q1 \v 6 “అవి లోయల్లా వ్యాపించాయి, \q2 నది ప్రక్కన తోటల్లా ఉన్నాయి, \q1 యెహోవా నాటిన అగరు వంటివి, \q2 జలాల ప్రక్కన దేవదారు చెట్లలా ఉన్నాయి. \q1 \v 7 వాటి బొక్కెనల నుండి నీళ్లు పారుతున్నాయి; \q2 వాటి విత్తనాలకు సమృద్ధిగా నీళ్లుంటాయి. \b \q1 “వారి రాజు అగగు కంటే గొప్పవాడు; \q2 వారి రాజ్యం హెచ్చింపబడుతుంది. \b \q1 \v 8 “దేవుడు ఈజిప్టు నుండి వారిని బయటకు తెచ్చారు; \q2 వారు అడవి ఎద్దు బలం కలిగి ఉన్నారు. \q1 వారు శత్రు దేశాలను మ్రింగివేస్తారు \q2 వారి ఎముకలను తునాతునకలు చేస్తారు; \q2 వారి బాణాలతో వారు వారిని గుచ్చుతారు. \q1 \v 9 సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు, \q2 వారిని ధైర్యంగా ఎవరు లేపగలరు? \b \q1 “ఓ ఇశ్రాయేలు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక \q2 నిన్ను శపించేవారు శపించబడుదురు గాక!” \p \v 10 బిలాము మీద బాలాకుకు కోపం రగులుకుంది. చేతులు చరుస్తూ అతనితో, “నా శత్రువులను శపించమని నిన్ను పిలిపిస్తే, వారిని మూడుసార్లు దీవించావు. \v 11 ఇప్పుడు ఇక్కడినుండి మీ ఇంటికి పో! నిన్ను ఘనంగా సన్మానిస్తానని నేను అన్నాను కానీ యెహోవా నీకు ఆ సన్మానం లేకుండా చేశారు” అని అన్నాడు. \p \v 12 బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా, \v 13 ‘బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారం అంతా నాకు ఇచ్చినా సరే, నా సొంతగా నేనేమి చెప్పలేను, మంచిదైనా, చెడ్డదైనా యెహోవా ఆజ్ఞ దాటి ఏమి చెప్పలేను యెహోవా చెప్పిందే నేను చెప్పాలి.’ \v 14 నేనిప్పుడు నా ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను. కానీ ముందు ఈ ప్రజలు రాబోయే రోజుల్లో మీ ప్రజలకు ఏమి చేస్తారో చెప్తాను.” \s1 బిలాము నాలుగవ సందేశం \p \v 15 అప్పుడు బిలాము ఈ సందేశాన్ని ఇచ్చాడు: \q1 “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, \q2 స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం, \q1 \v 16 దేవుని మాటలు వినే వాని ప్రవచనం, \q2 మహోన్నతుని దగ్గర నుండి తెలివి సంపాదించుకున్నవాడు, \q1 సర్వశక్తిగల వాడి నుండి దర్శనం చూసేవాడు, \q2 సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు: \b \q1 \v 17 “అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు; \q2 అతన్ని కనిపెడతాను, కానీ సమీపంగా కాదు. \q1 యాకోబు నుండి నక్షత్రం వస్తుంది; \q2 ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. \q1 అతడు మోయాబు కణతలను నలగ్గొడతాడు, \q2 షేతు ప్రజల కపాలాలను చితకగొడతాడు. \q1 \v 18 ఎదోము జయించబడుతుంది; \q2 అతని శత్రువైన శేయీరు జయించబడుతుంది. \q2 కానీ ఇశ్రాయేలు బలంగా ఎదుగుతుంది. \q1 \v 19 యాకోబు నుండి రాజ్యమేలేవాడు వస్తాడు. \q2 అతడు పట్టణంలో మిగిలిన వారిని నాశనం చేస్తాడు.” \s1 బిలాము యొక్క అయిదవ సందేశం \p \v 20 అప్పుడు బిలాము, అమాలేకును చూసి ఈ సందేశాన్ని ఇచ్చాడు: \q1 “అమాలేకు దేశాల్లో మొదటిది, \q2 కానీ దాని అంతం పూర్తి నాశనమే!” \s1 బిలాము యొక్క ఆరవ సందేశం \p \v 21 అతడు కెనీయులను చూసి తన సందేశాన్ని ఇచ్చాడు: \q1 “మీ నివాసస్థలం భద్రంగా ఉంది, \q2 నీ గూడు బండలో ఉంది; \q1 \v 22 అయినా కెనీయులైన మీరు నాశనమవుతారు \q2 అష్షూరు మిమ్మల్ని బందీగా పట్టుకెళ్తుంది.” \s1 బిలాము యొక్క ఏడవ సందేశం \p \v 23 తర్వాత అతడు తన సందేశాన్ని ఇచ్చాడు: \q1 “అయ్యో, దేవుడు ఇలా చేస్తే, ఎవరు జీవించగలరు? \q2 \v 24 కుప్ర\f + \fr 24:24 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కిత్తీము\fqa*\f* తీరం నుండి ఓడలు వస్తాయి; \q1 అవి అష్షూరును, ఏబెరును అణచివేస్తాయి, \q2 అయితే మీరు కూడా పతనమవుతారు.” \p \v 25 తర్వాత బిలాము లేచి తన ఇంటికి వెళ్లాడు, బాలాకు తన దారిన వెళ్లాడు. \c 25 \s1 మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలీయుల వ్యభిచారం \p \v 1 ఇశ్రాయేలు ప్రజలు షిత్తీములో ఉన్నప్పుడు వారు మోయాబు స్త్రీలతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు, \v 2 వారు తమ దేవుళ్ళకు బలి ఇవ్వడానికి వారిని ఆహ్వానించారు. ప్రజలు వాటికి అర్పించినవి తినడమే కాక, వారి దేవుళ్ళకు మొక్కారు. \v 3 కాబట్టి ఇశ్రాయేలు బయల్-పెయోరును పూజించడంలో వారితో కలిసిపోయారు యెహోవా కోపం వారిపై రగులుకుంది. \p \v 4 యెహోవా మోషేతో అన్నారు, “ఈ ప్రజల నాయకులందరిని తీసుకువచ్చి, యెహోవా ఎదుట వారిని చంపి, పట్టపగలే వారిని ప్రదర్శించు, తద్వారా యెహోవా కోపం ఇశ్రాయేలు మీద నుండి వెళ్లిపోతుంది.” \p \v 5 కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులతో, “మీలో ప్రతి ఒక్కరు బయల్-పెయోరును పూజించిన వారితో కలిసిన ప్రతి పురుషుని చంపేయండి” అని అన్నాడు. \p \v 6 అప్పుడే ఇశ్రాయేలీయులలో ఒకడు మిద్యాను స్త్రీని మోషే సమాజమందరి ఎదుట, ఆ శిక్షను బట్టి వారు సమావేశ గుడార ద్వారం దగ్గర ఏడుస్తున్న సమయంలో తీసుకువచ్చాడు. \v 7 యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇది చూసినప్పుడు, సమాజాన్ని వదిలి, ఒక ఈటెను పట్టుకుని, \v 8 ఆ ఇశ్రాయేలీయుని వెంట అతని గుడారంలోకి వెళ్లాడు. అతన్ని ఆ స్త్రీని కలిపి ఈటెతో పొడిచాడు, ఆ ఈటె అతని శరీరంలో నుండి ఆమె కడుపులోనికి దూసుకుపోయింది. అప్పుడు ఇశ్రాయేలు మీదికి వచ్చిన తెగులు అంతరించింది; \v 9 అయితే తెగులు ద్వారా 24,000 మంది చనిపోయారు. \p \v 10 యెహోవా మోషేతో అన్నారు, \v 11 “యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇశ్రాయేలీయుల మీద ఉన్న నా కోపాన్ని తిప్పాడు. నాలాగే అతడు నా ఘనత కోసం వారి మధ్యలో రోషం కలిగి ఉన్నాడు కాబట్టి, నా రోషాన్ని బట్టి వారిని శిక్షించకుండ ఆపివేశాను. \v 12 కాబట్టి నేను అతనితో సమాధాన ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పు. \v 13 అతడు అతని సంతానం నిత్య యాజకత్వ నిబంధన కలిగి ఉంటారు ఎందుకంటే తన దేవుని ఘనత కోసం రోషం కలిగి, ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు.” \p \v 14 మిద్యాను స్త్రీతో పాటు చంపబడిన ఇశ్రాయేలీయుని పేరు సలూ కుమారుడైన జిమ్రీ. ఇతడు షిమ్యోను కుటుంబంలో నాయకుడు. \v 15 చంపబడిన ఆ మిద్యానీయ స్త్రీ పేరు కొజ్బీ, ఈమె మిద్యానీయ కుటుంబాలలో ఒక గోత్ర నాయకుడైన సూరు కుమార్తె. \p \v 16 యెహోవా మోషేతో అన్నారు. \v 17 “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారిని చంపండి. \v 18 వారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగించిన వారి సహోదరి, కొజ్బీ, మిద్యానీయుల నాయకుని కుమార్తె, పెయోరులో జరిగిన సంఘటన ఫలితంగా తెగులు వచ్చినప్పుడు చంపబడింది.” \c 26 \s1 రెండవ జనాభా లెక్క \p \v 1 తెగులు అంతరించిన తర్వాత, యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో అన్నారు, \v 2 “ఇశ్రాయేలు సమాజమంతటిని ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు ఉండి ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలవారిని కుటుంబాల ప్రకారం లెక్కించాలి.” \v 3 కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు, యెరికో నుండి యొర్దాను వైపు ఉన్న మోయాబు సమతల మైదానాల్లో ఇశ్రాయేలీయుల నాయకులతో మాట్లాడుతూ, \v 4 “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉన్న పురుషులను లెక్కించండి” అని చెప్పారు. \b \lh వీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు: \b \li1 \v 5 ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: \li2 హనోకు ద్వార, హనోకీయుల వంశం; \li2 పల్లు ద్వార, పల్లువీయుల వంశం; \li2 \v 6 హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; \li2 కర్మీ ద్వార, కర్మీయుల వంశము. \lf \v 7 ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730. \li2 \v 8 పల్లు కుమారుడు ఏలీయాబు, \v 9 ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు. \v 10 భూమి నోరు తెరచుకొని కోరహుతో పాటు వారిని మ్రింగివేసింది, అతని అనుచరులు 250 మంది మంటలో హతమయ్యారు. వారు హెచ్చరిక గుర్తుగా ఉన్నారు. \v 11 అయితే, ఆ రోజున కోరహు కుమారులు చనిపోలేదు. \b \li1 \v 12 షిమ్యోను వారసులు వారి వంశాల ప్రకారం: \li2 నెమూయేలు ద్వార, నెమూయేలీయుల వంశం; \li2 యామీను ద్వార, యామీనీయుల వంశం; \li2 యాకీను ద్వార, యాకీనీయుల వంశం; \li2 \v 13 జెరహు ద్వార, జెరహీయుల వంశం; \li2 షావూలు ద్వార, షావూలీయుల వంశము. \lf \v 14 ఇవి షిమ్యోను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 22,200. \b \li1 \v 15 గాదు యొక్క వారసులు వారి వంశాల ప్రకారం: \li2 సెఫోను ద్వార, సెఫోనీయుల వంశం; \li2 హగ్గీ ద్వార, హగ్గీయుల వంశం; \li2 షూనీ ద్వార, షూనీయుల వంశం; \li2 \v 16 ఓజ్ని ద్వార, ఓజ్నీయుల వంశం; \li2 ఏరీ ద్వార, ఏరీయుల వంశం; \li2 \v 17 అరోదు\f + \fr 26:17 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa అరోది \+xt ఆది 46:16\+xt*\fqa*\f* ద్వార, అరోదీయుల వంశం; \li2 అరేలీ ద్వార, అరేలీయుల వంశము. \lf \v 18 ఇవి గాదు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 40,500. \b \lh \v 19 యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు. \li1 \v 20 యూదా వారసులు వారి వంశాల ప్రకారం: \li2 షేలా ద్వార, షేలాహీయుల వంశం; \li2 పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; \li2 జెరహు ద్వార, జెరహీయుల వంశము. \li2 \v 21 పెరెసు యొక్క వారసులు: \li3 హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; \li3 హామూలు ద్వార, హామూలీయుల వంశము. \lf \v 22 ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500. \b \li1 \v 23 ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: \li2 తోలా ద్వార, తోలాహీయుల వంశం; \li2 పువా ద్వార, పువీయుల\f + \fr 26:23 \fr*\ft కొ.ప్ర.లలో పునీయులు అని వ్రాయబడింది\ft*\f* వంశం; \li2 \v 24 యాషూబు ద్వార, యాషూబీయుల వంశం; \li2 షిమ్రోను ద్వార, షిమ్రోనీయుల వంశము. \lf \v 25 ఇవి ఇశ్శాఖారు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,300. \b \li1 \v 26 జెబూలూను వారసులు వారి వంశాల ప్రకారం: \li2 సెరెదు ద్వార, సెరెదీయుల వంశం; \li2 ఏలోను ద్వార, ఏలోనీయుల వంశం; \li2 యహలేలు ద్వార, యహలేలీయుల వంశము. \lf \v 27 ఇవి జెబూలూను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 60,500. \b \lh \v 28 మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు: \lh \v 29 మనష్షే వారసులు: \li2 మాకీరు ద్వార, మాకీరీయుల వంశం (మాకీరు గిలాదు యొక్క తండ్రి); \li2 గిలాదు ద్వార, గిలాదీయుల వంశము. \li2 \v 30 గిలాదు వారుసులు: \li3 ఈజరు ద్వార, ఈజరీయుల వంశం; \li3 హెలెకు ద్వార, హెలెకీయుల వంశం; \li3 \v 31 అశ్రీయేలు ద్వార, అశ్రీయేలీయుల వంశం; \li3 షెకెము ద్వార, షెకెమీయుల వంశం; \li3 \v 32 షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; \li3 హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము. \li3 \v 33 (హెఫెరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమారులు లేరు; అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారి పేర్లు, మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.) \lf \v 34 ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700. \li1 \v 35 ఎఫ్రాయిం వారసులు వారి వంశాల ప్రకారం: \li2 షూతలహు ద్వార, షూతలహీయుల వంశం; \li2 బేకరు ద్వార, బేకరీయల వంశం; \li2 తహను ద్వార, తహనీయుల వంశము. \li2 \v 36 వీరు షూతలహు వారసులు: \li3 ఏరాను ద్వార, ఏరానీయుల వంశము. \lf \v 37 ఇవి ఎఫ్రాయిం వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 32,500. \lf వీరు వంశాల ప్రకారం యోసేపు వారసులు. \b \li1 \v 38 బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: \li2 బేల ద్వార, బేలీయుల వంశం; \li2 అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; \li2 అహీరాము ద్వార, అహీరామీయుల వంశం; \li2 \v 39 షూఫాము\f + \fr 26:39 \fr*\ft కొ. ప్రా. ప్ర. లలో \ft*\fqa షూఫూఫాము\fqa*\f* ద్వార, షూఫామీయుల వంశం; \li2 హుఫాము ద్వార, హుఫామీయుల వంశము. \li2 \v 40 అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు: \li3 అర్దు ద్వార, అర్దీయుల వంశం; \li3 నయమాను ద్వార, నయమానీయుల వంశము. \lf \v 41 ఇవి బెన్యామీను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,600. \b \li1 \v 42 దాను వారుసులు వారి వంశాల ప్రకారం: \li2 షూహాము ద్వార, షూహామీయుల వంశము. \lf ఇవి దాను వంశాలు: \v 43 వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400. \b \li1 \v 44 ఆషేరు వారసులు వారి వంశాల ప్రకారం: \li2 ఇమ్నా ద్వార, ఇమ్నీయుల వంశం; \li2 ఇష్వీ ద్వార, ఇష్వీయుల వంశం; \li2 బెరీయా ద్వార, బెరీయుల వంశం; \li2 \v 45 బెరీయా వారసుల ద్వార వచ్చినవారు: \li3 హెబెరు ద్వార, హెబెరీయుల వంశం; \li3 మల్కీయేలు ద్వార, మల్కీయేలీయుల వంశము. \lf \v 46 ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు. \lf \v 47 ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400. \b \li1 \v 48 నఫ్తాలి వారసులు వారి వంశాల ప్రకారం: \li2 యహజీయేలు ద్వార, యహజీయేలీయుల వంశం; \li2 గూనీ ద్వార, గూనీయుల వంశం; \li2 \v 49 యేజెరు ద్వార, యెజెరీయుల వంశం; \li2 షిల్లేము ద్వార, షిల్లేమీయుల వంశము. \lf \v 50 ఇవి నఫ్తాలి వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,400. \b \lf \v 51 లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730. \b \p \v 52 యెహోవా మోషేతో అన్నారు, \v 53 “పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి. \v 54 పెద్ద గుంపుకు పెద్ద భూభాగం, చిన్న గుంపుకు చిన్న భూభాగం వారసత్వంగా ఇవ్వాలి; ప్రతి గుంపు దానిలో లెక్కించబడినవారి సంఖ్య ప్రకారం పొందుకోవాలి. \v 55 చీట్లు వేసి భూమిని పంచడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి గుంపు వారి పూర్వికుల గోత్రాల పేర్ల ప్రకారం పొందుకుంటుంది. \v 56 ప్రతి వారసత్వం చీట్లు వేయడం ద్వార పెద్ద, చిన్న గుంపుల మధ్య పంచాలి.” \b \li1 \v 57 వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు: \li2 గెర్షోను ద్వార, గెర్షోనీయుల వంశం; \li2 కహాతు ద్వార, కహాతీయుల వంశం; \li2 మెరారి ద్వార మెరారీయుల వంశము. \li1 \v 58 ఇవి కూడా లేవీ వంశాలు: \li2 లిబ్నీయుల వంశం, \li2 హెబ్రోనీయుల వంశం, \li2 మహలీయుల వంశం, \li2 మూషీయుల వంశం, \li2 కోరహీయుల వంశము. \li2 (కహాతు కుమారుడు అమ్రాము; \v 59 అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది. \v 60 అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి. \v 61 అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.) \b \lf \v 62 లేవీయులలో పురుషులు ఒక నెల ఆపైన వయస్సు ఉన్న వారి సంఖ్య 23,000. ఇశ్రాయేలీయులతో వారు లెక్కించబడలేదు ఎందుకంటే వారి మధ్యలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు. \b \p \v 63 యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు మైదానంలో మోషే, యాజకుడైన ఎలియాజరు ద్వార లెక్కించబడిన ఇశ్రాయేలీయులు వీరు. \v 64 వీరిలో ఏ ఒక్కరైన మోషే, యాజకుడైన అహరోను సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నవారు కారు. \v 65 ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు. \c 27 \s1 సెలోఫెహాదు కుమార్తెలు \p \v 1 యోసేపు కుమారుడైన మనష్షే వంశానికి చెందిన మనష్షే కుమారుడైన మాకీరు, అతని కుమారుడు గిలాదు, అతని కుమారుడు హెఫెరు, అతని కుమారుడైన సెలోఫెహాదు కుమార్తెలు. ఆ కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు ముందుకు వచ్చి \v 2 సమావేశ గుడార ద్వారం దగ్గర మోషే, యాజకుడైన ఎలియాజరు, నాయకులు సమాజమంతటి ఎదుట నిలబడి, \v 3 “మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. అతడు యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన కోరహు సమూహంలో లేడు, కానీ తన సొంత పాపాన్ని బట్టి చనిపోయాడు, అతనికి కుమారులు లేరు. \v 4 కుమారులు లేనందుకు మా తండ్రి పేరు అతని వంశం నుండి తీసివేయబడాలి? మా తండ్రి బంధువుల్లో మాకు స్వాస్థ్యం ఇవ్వండి” అని అన్నారు. \p \v 5 మోషే ఈ విషయాన్ని యెహోవా దగ్గరకు తెచ్చాడు, \v 6 యెహోవా మోషేతో అన్నారు, \v 7 సెలోఫెహాదు కుమార్తెలు చెప్పేది న్యాయమైనదే. నీవు వారికి తమ తండ్రి బంధువుల్లో వారసత్వంగా స్వాస్థ్యం ఖచ్చితంగా ఇచ్చి వారి తండ్రి వారసత్వాన్ని వారికి ఇవ్వాలి. \p \v 8 “ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘ఒక మనిషి చనిపోతే, అతనికి కుమారులు లేకపోతే, అతని వారసత్వం అతని కుమార్తెకు ఇవ్వాలి. \v 9 ఒకవేళ అతనికి కుమార్తెలు లేకపోతే, అతని వారసత్వం అతని సహోదరులకు ఇవ్వాలి. \v 10 ఒకవేళ సహోదరులు లేకపోతే, వారసత్వం అతని తండ్రి సహోదరులకు ఇవ్వాలి. \v 11 అతని తండ్రికి సహోదరులు లేకపోతే, తన వారసత్వం సమీప బంధువుకు ఇవ్వాలి, అతడు స్వాస్థ్యంగా పొందుకుంటాడు. ఇది ఇశ్రాయేలీయుల కోసం యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన న్యాయ నియమము.’ ” \s1 మోషే తర్వాత నాయకుడు యెహోషువ \p \v 12 యెహోవా మోషేతో అన్నారు, “నీవు అబారీము పర్వతం ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు. \v 13 చూసిన తర్వాత, నీవును నీ అన్న అహరోను లాగే చనిపోయి స్వజనుల దగ్గరకు చేరతావు. \v 14 ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం నీళ్ల దగ్గర తిరుగుబాటు చేసినప్పుడు, మీరిద్దరు వారి దృష్టిలో నన్ను పరిశుద్ధునిగా గౌరవించకుండా అవిధేయత చూపారు.” (ఈ నీళ్లు సీను అరణ్యంలో మెరీబా కాదేషు నీళ్లు.) \p \v 15 మోషే యెహోవాతో అన్నాడు, \v 16 “సమస్త జీవులకు శ్వాసనిచ్చే దేవుడైన యెహోవా, ఈ సమాజం మీద ఒక నాయకుని నియమించాలి, \v 17 అతడు ఈ సమాజం ముందు వెళ్తూ, వస్తూ, వారిని బయటకు లోనికి నడిపిస్తూ ఉండాలి, అప్పుడు యెహోవా ప్రజలైన వీరు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.” \p \v 18 కాబట్టి యెహోవా మోషేతో అన్నారు, “నూను కుమారుడైన యెహోషువను తీసుకో, అతనిలో నాయకత్వపు ఆత్మ ఉంది, అతని మీద నీ చేయి పెట్టు. \v 19 యాజకుడైన ఎలియాజరు సమాజమందరి సముఖంలో అతన్ని నిలబెట్టి, అధికార పూర్వకంగా నియమించు. \v 20 నీ ప్రభావంలో కొంత అతనికి ఇవ్వు, అప్పుడు ఇశ్రాయేలు సమాజమంతా అతనికి లోబడుతుంది. \v 21 అతన్ని యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలబెట్టు, ఎలియాజరు యెహోవా సన్నిధిలో ఊరీముతో సంప్రదించి అతని కోసం చట్టాలు పొందుకోవాలి. అతని ఆజ్ఞమేరకు అతడు, ఇశ్రాయేలు సమాజమంతా బయటకు వెళ్తుంది, అతని ఆజ్ఞమేరకు వారు లోనికి వస్తారు.” \p \v 22 యెహోవా ఆజ్ఞమేరకు మోషే చేశాడు. యెహోషువను యాజకుడైన ఎలియాజరు ముందు, సర్వసమాజం ముందు నిలబెట్టాడు. \v 23 తర్వాత యెహోవా మోషేకు సూచించిన ప్రకారం అతనిపై చేతులుంచి అధికార పూర్వకంగా అతన్ని నియమించాడు. \c 28 \s1 అనుదిన అర్పణలు \p \v 1 యెహోవా మోషేతో ఇలా అన్నారు, \v 2 “నీవు ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞలిస్తూ వారితో ఇలా చెప్పు: ‘నియమింపబడిన సమయంలో నాకు ఇష్టమైన సువాసనగా ఉండే హోమబలులు అర్పించేలా చూసుకోండి.’ \v 3 నీవు వారికి ఇలా చెప్పు: ‘ఇది మీరు యెహోవాకు సమర్పించాల్సిన హోమబలి: ప్రతిరోజు లోపం లేని ఏడాది గొర్రెపిల్లలు రెండు దహనబలిగా అర్పించాలి. \v 4 ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి, \v 5 దానితో పాటు ఒక ఓమెరు\f + \fr 28:5 \fr*\ft అంటే సుమారు 1.6 కి. గ్రా. లు; \+xt 13|link-href="NUM 28:13"\+xt*, \+xt 21|link-href="NUM 28:21"\+xt*, \+xt 29|link-href="NUM 28:29"\+xt*వచనాల్లో కూడా\ft*\f* నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్\f + \fr 28:5 \fr*\ft అంటే సుమారు 1 లీటర్; \+xt 7|link-href="NUM 28:7"\+xt*, \+xt 14|link-href="NUM 28:14"\+xt*వచనాల్లో కూడా\ft*\f* ఒలీవనూనెతో కలిపి భోజనార్పణగా అర్పించాలి. \v 6 ఇది సీనాయి కొండపై నియమించబడిన క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి. \v 7 దానితో పాటు ఒక పావు హిన్ పులియబెట్టిన పానీయాన్ని పానార్పణగా ప్రతి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి. పరిశుద్ధాలయం దగ్గర యెహోవాకు పానార్పణ పోయాలి. \v 8 సాయంకాలం రెండవ గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణను పానార్పణను అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి. \s1 సబ్బాతు అర్పణలు \p \v 9 “ ‘సబ్బాతు దినాన, లోపం లేని ఒక ఏడాది వయస్సు ఉన్న రెండు గొర్రెపిల్లలను, వాటితో పాటు పానార్పణం, భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన రెండు ఓమెర్ల\f + \fr 28:9 \fr*\ft అంటే సుమారు 3.2 కి. గ్రా. లు; \+xt 12|link-href="NUM 28:12"\+xt*, \+xt 20|link-href="NUM 28:20"\+xt*, \+xt 28|link-href="NUM 28:28"\+xt*వచనాల్లో కూడా\ft*\f* నాణ్యమైన పిండి అర్పించాలి. \v 10 ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి. \s1 నెలసరి అర్పణలు \p \v 11 “ ‘ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, యేడు ఏడాది మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి. \v 12 ప్రతి కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల\f + \fr 28:12 \fr*\ft అంటే సుమారు 5 కి. గ్రా. లు; \+xt 20|link-href="NUM 28:20"\+xt*, \+xt 28|link-href="NUM 28:28"\+xt*వచనాల్లో కూడా\ft*\f* నాణ్యమైన పిండితో భోజనార్పణ ఉండాలి; పొట్టేలుతో పాటు, నూనె కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి భోజనార్పణగా ఉండాలి; \v 13 అలాగే ప్రతి గొర్రెపిల్లతో పాటు, నూనె కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని భోజనార్పణగా సమర్పించాలి. ఇది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలి. \v 14 ప్రతి కోడెతో పాటు పానార్పణగా అర హిన్\f + \fr 28:14 \fr*\ft అంటే సుమారు 1.9 లీటర్లు\ft*\f* ద్రాక్షరసం ఉండాలి; పొట్టేలుతో పాటు, హిన్‌లో మూడవ వంతు\f + \fr 28:14 \fr*\ft అంటే సుమారు 1.3 లీటర్లు\ft*\f* ద్రాక్షరసం; ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం అర్పించాలి. సంవత్సరంలో ప్రతి అమావాస్యకు అర్పించాల్సిన దహనబలి ఇది. \v 15 క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, దాని పానార్పణంతో పాటు, యెహోవాకు పాపపరిహారబలిగా ఒక మేకపోతును అర్పించాలి. \s1 పస్కా \p \v 16 “ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు యెహోవా యొక్క పస్కా పండుగ ఆచరించాలి. \v 17 ఆ నెల పదిహేనవ రోజు ఒక పండుగ జరగాలి; ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి. \v 18 మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు. \v 19 యెహోవాకు హోమబలిగా లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి. \v 20 ప్రతి కోడెతో పాటు ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండిని భోజనార్పణగా అర్పించాలి; పొట్టేలుతో, రెండు ఓమెర్లు; \v 21 ఏడు గొర్రెపిల్లలలో ఒక్కో దానితో ఒక్కో ఓమెరు అర్పించాలి. \v 22 మీ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును పాపపరిహారబలిగా అర్పించాలి. \v 23 ఇవన్నీ ప్రతి ఉదయం దహన బలులతో పాటు అర్పించాలి. \v 24 ఈ విధంగా ఏడు రోజులపాటు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండే ఆహార అర్పణను అర్పించాలి; ప్రతిరోజు అర్పించే దహనబలి దాని పానార్పణంతో పాటు దీనిని అర్పించాలి. \v 25 ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. \s1 వారాల పండుగ \p \v 26 “ ‘ప్రథమ ఫలాల రోజున, వారాల పండుగలో\f + \fr 28:26 \fr*\ft లేదా \ft*\fqa వార పండుగ \fqa*\ft \+xt నిర్గమ 34:22\+xt*; \+xt లేవీ 23:15-22\+xt*; \ft*\fqa తదనంతరం పెంతెకొస్తు పండుగగా పిలువబడింది. \fqa*\ft \+xt అపొ. కా. 2:1\+xt* \ft*\ft ఈనాడు ఇది \ft*\fqa షావౌట్ లేదా షాబౌట్ \fqa*\ft అని పిలువబడుతుంది\ft*\f* యెహోవాకు క్రొత్త ధాన్యంతో భోజనార్పణ అర్పించినప్పుడు పరిశుద్ధ సభ ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. \v 27 రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా అర్పించాలి. \v 28 ప్రతి కోడెతో పాటు భోజనార్పణగా ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి; పొట్టేలుతో రెండు ఓమెర్లు; \v 29 ఏడు గొర్రెపిల్లలలో ఒక్కో దానితో ఒక్కో ఓమెరు అర్పించాలి. \v 30 దానితో పాటు ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును అర్పించాలి. \v 31 దహనబలులు, ఆహార అర్పణలతో పాటు, వీటిని వీటి పానార్పణాలతో కలిపి అర్పించాలి. అర్పణ కోసం తెచ్చే ప్రతి జంతువు లోపం లేనిదై ఉండాలి. \c 29 \s1 బూరల పండుగ \p \v 1 “ ‘ఏడవ నెల మొదటి రోజు పరిశుద్ధ సభను ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. ఆ రోజు మీరు బూరల ధ్వని చేసే రోజు. \v 2 యెహోవాకు ఇష్టమైన సువాసనగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలను దహనబలిగా అర్పించాలి. \v 3 కోడెతో పాటు భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల\f + \fr 29:3 \fr*\ft అంటే సుమారు 5 కి. గ్రా. లు; \+xt 9|link-href="NUM 29:9"\+xt*, \+xt 14|link-href="NUM 29:14"\+xt*వచనాల్లో కూడా\ft*\f* నాణ్యమైన పిండి తేవాలి; పొట్టేలుతో రెండు ఓమెర్లు\f + \fr 29:3 \fr*\ft అంటే సుమారు 3.2 కి. గ్రా. లు\ft*\f*; \v 4 ఏడు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు\f + \fr 29:4 \fr*\ft అంటే సుమారు 1.6 కి. గ్రా. లు; \+xt 10|link-href="NUM 29:10"\+xt*, \+xt 15|link-href="NUM 29:15"\+xt* వచనాల్లో కూడా\ft*\f* నాణ్యమైన పిండి అర్పించాలి. \v 5 అంతేకాక మీకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహారబలిగా మేకపోతును కూడా అర్పించాలి. \v 6 ఇవి నిర్దేశించబడిన ప్రతి నెలనెలా అనుదినం దహనబలులకు అధనంగా వాటి భోజనార్పణలు, పానార్పణలు. ఇవి యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలులుగా తేవాలి. \s1 ప్రాయశ్చిత్త దినం \p \v 7 “ ‘ఏడవ నెల పదవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి. మీరు ఉపవాసముండాలి ఏ పని చేయకూడదు. \v 8 యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. \v 9 కోడెతో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి తేవాలి; పొట్టేలుతో రెండు ఓమెర్లు; \v 10 ఏడు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి. \v 11 అంతేకాక ప్రాయశ్చిత్తం కొరకైన పాపపరిహారబలి, క్రమంగా అర్పించే దహనబలి, భోజనార్పణ, వారి పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. \s1 గుడారాల పండుగ \p \v 12 “ ‘ఏడవ నెల పదిహేనవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. యెహోవా కోసం ఏడు రోజులు పండుగ ఆచరించాలి. \v 13 యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని పదమూడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి. \v 14 పదమూడు కోడెల్లో ప్రతి దానితో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల పిండి తేవాలి; రెండు పొట్టేళ్లలో ఒక్కో దానితో రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి; \v 15 పద్నాలుగు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి. \v 16 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. \p \v 17 “ ‘రెండవ రోజున లోపం లేని పన్నెండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. \v 18 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. \v 19 అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. \p \v 20 “ ‘మూడవ రోజు లోపం లేని పదకొండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. \v 21 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. \v 22 అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. \p \v 23 “ ‘నాలుగవ రోజున లోపం లేని పది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. \v 24 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. \v 25 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. \p \v 26 “ ‘అయిదవ రోజు లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. \v 27 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. \v 28 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. \p \v 29 “ ‘ఆరవరోజు లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. \v 30 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. \v 31 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. \p \v 32 “ ‘ఏడవ రోజున లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి. \v 33 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. \v 34 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. \p \v 35 “ ‘ఎనిమిదవ రోజున ప్రత్యేక సభగా కూడుకోవాలి, పని ఏదీ చేయకూడదు. \v 36 యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి. \v 37 కోడె, పొట్టేలు గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. \v 38 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. \p \v 39 “ ‘మీ మ్రొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలతో పాటు వీటిని నియమించబడిన పండుగల్లో యెహోవాకు అర్పించాలి: మీ దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు, సమాధానబలులు.’ ” \p \v 40 యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. \c 30 \s1 మ్రొక్కుబడులు \p \v 1 మోషే ఇశ్రాయేలు గోత్ర పెద్దలతో ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించింది ఇదే: \v 2 ఒక వ్యక్తి యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ ద్వారా ప్రమాణం చేస్తే, ఆ వ్యక్తి మాట తప్పకుండా, తాను చెప్పినదంతా చేయాలి. \p \v 3 “ఒక యువతి తండ్రి ఇంట ఉన్నప్పుడు యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ చేస్తే, \v 4 తన తండ్రి దాన్ని గురించి వినిన తర్వాత తనను ఏమి అనకపోతే అప్పుడు ఆ యువతి మ్రొక్కుబళ్ళు లేదా తాను చేసిన ప్రతి ప్రతిజ్ఞ నిలుస్తుంది. \v 5 అయితే, తన తండ్రి దాని గురించి విని ఒప్పుకోకపోతే, అప్పుడు ఆ యువతి చేసిన మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు ఏవి కూడా నిలువవు; తన తండ్రి ఒప్పుకోలేదు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తారు. \p \v 6 “ఆమె మ్రొక్కుబడి చేసుకున్న తర్వాత లేదా అవివేకంగా ప్రమాణం చేసిన తర్వాత ఆమె పెళ్ళి చేసుకుంటే, \v 7 ఆమె భర్తకు ఈ సంగతి తెలుసుకుని అతడు మౌనంగా ఉంటే ఆమె మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు నిలుస్తాయి. \v 8 కానీ ఆమె భర్త ఈ సంగతి తెలుసుకుని, అతడు ఆ మ్రొక్కుబడిని లేదా ఆమె అవివేకంగా చేసిన ప్రమాణాన్ని కానీ ఒప్పుకోక రద్దు చేస్తే యెహోవా ఆమెను క్షమిస్తారు. \p \v 9 “విధవరాలు లేదా విడాకులు తీసుకున్న స్త్రీ చేసే మ్రొక్కుబడి కానీ ప్రమాణం తప్పనిసరిగా చెల్లించాలి. \p \v 10 “ఒక స్త్రీ తన భర్తతో నివసిస్తూ మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ చేస్తే, \v 11 తన భర్త దాన్ని గురించి వినిన తర్వాత తనను ఏమి అనకపోతే అప్పుడు ఆ యువతి మ్రొక్కుబళ్ళు లేదా తాను చేసిన ప్రతి ప్రతిజ్ఞ నిలుస్తుంది. \v 12 కానీ ఆమె భర్త వాటి గురించి విన్నప్పుడు వాటిని రద్దు చేస్తే, అప్పుడు ఆమె చేసిన మ్రొక్కుబళ్ళు లేదా తన పెదవులతో చేసిన ప్రమాణాలు ఏవి కూడా నిలువవు, యెహోవా ఆమెను క్షమిస్తారు. \v 13 స్త్రీ తాను ఉపవాసం ఉంటానని చేసుకున్న మ్రొక్కుబడి లేదా ప్రతిజ్ఞను ఆమె భర్త ఒప్పుకోవచ్చు లేదా రద్దు చేయవచ్చు. \v 14 కానీ ఆమె భర్త కొన్ని రోజుల వరకు కూడా ఏమి అనకుండా ఉంటే, అప్పుడు ఆమె చేసిన మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు ఒప్పుకుంటున్నాడు. వాటి గురించి విన్నప్పుడు మౌనంగా ఉండడం ద్వారా అతడు వాటిని అంగీకరించాడు. \v 15 అయితే అతడు వినిన కొద్ది కాలం తర్వాత వాటిని రద్దు చేస్తే అతడు చేసిన తప్పుకు ప్రతిఫలం భరించాలి.” \p \v 16 ఇవి భార్యా భర్తల సంబంధం, యవ్వన కుమార్తె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రికి తనకు మధ్య ఉండవలసిన సంబంధం గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమాలు. \c 31 \s1 మిద్యానీయుల మీద పగ \p \v 1 యెహోవా మోషేతో మాట్లాడుతూ, \v 2 “ఇశ్రాయేలీయుల కోసం మిద్యానీయుల మీద నీవు ప్రతీకారం తీర్చుకో. ఆ తర్వాత నీవు నీ స్వజనుల దగ్గరకు చేరతావు.” \p \v 3 కాబట్టి మోషే ప్రజలతో, “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి వెళ్లి యెహోవా వారి మీద తీర్చుకోవాలనుకున్న ప్రతీకారాన్ని తీర్చుకోండి. \v 4 ఇశ్రాయేలు యొక్క ప్రతి గోత్రం నుండి వేయిమంది పురుషులను యుద్ధానికి పంపండి” అని చెప్పాడు. \v 5 కాబట్టి ఇశ్రాయేలు వంశాల నుండి పన్నెండువేలమంది పురుషులు ఆయుధాలతో యుద్ధం కోసం సిద్ధపడ్డారు. \v 6 మోషే వారిని యుద్ధానికి పంపాడు, ప్రతి గోత్రం నుండి వేయిమందిని పంపాడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, తనతో పాటు పరిశుద్ధాలయం నుండి పరికరాలు సంకేతం ఇవ్వడానికి బూరలు తీసుకున్నాడు. \p \v 7 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మిద్యానుతో వారు పోరాడారు, ప్రతి మగవాన్ని హతం చేశారు. \v 8 చచ్చినవారిలో అయిదుగురు మిద్యాను రాజులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ. వారు బెయోరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు. \v 9 ఇశ్రాయేలీయులు మిద్యానీయుల స్త్రీలను, పిల్లలను బందీగా తీసుకుని వారి పశువులను, మందలను, వారి ఆస్తిని దోచుకున్నారు. \v 10 వారు మిద్యానీయులు నివసించే పట్టణాలన్ని, వారి శిబిరాలతో, తగలబెట్టారు. \v 11 వారు తీసుకున్న దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన వాటిని, మనుష్యులు, పశువులతో సహా, \v 12 బందీలను, కొల్లగొట్టిన వాటిని, దోపుడుసొమ్మును తీసుకువచ్చారు యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో ఉన్న మోషే, యాజకుడైన ఎలియాజరు ఇశ్రాయేలు సమాజం దగ్గరకు తీసుకువచ్చారు. \p \v 13 మోషే, యాజకుడైన ఎలియాజరు సమాజ నాయకులు వారిని కలుసుకోడానికి శిబిరం బయటకు వచ్చారు. \v 14 మోషే సైన్య అధికారులు అనగా, యుద్ధం నుండి తిరిగివచ్చిన సహస్రాధిపతులు శతాధిపతులపై కోప్పడ్డాడు. \p \v 15 “స్త్రీలందరిని మీరు బ్రతకనిచ్చారా?” అని మోషే వారిని అడిగాడు. \v 16 “వీరు బిలాము సలహా ప్రకారం పెయోరు సంఘటనలో ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉండడానికి పురికొల్పినవారు, వీరి మూలంగా యెహోవా ప్రజలు తెగులు ద్వారా మొత్తబడ్డారు. \v 17 ఇప్పుడు అబ్బాయిలందరిని చంపండి. స్త్రీలలో పురుషులతో లైంగిక సంబంధం కలిగినవారిని చంపండి, \v 18 కానీ కన్యగా ఉన్న ప్రతి అమ్మాయిని మీ కోసం బ్రతకనివ్వండి. \p \v 19 “ఎవరైనా ఎవరినైన చంపినా, లేదా చంపబడిన వారిని తాకినా, తాకినవారు ఏడు రోజులు శిబిరం బయట ఉండాలి. మూడవ రోజున ఏడవ రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీ బందీలను కూడా శుద్ధి చేయాలి. \v 20 మీ బట్టలను తోలుతో, మేక వెంట్రుకలతో, చెక్కతో చేయబడిన ప్రతీ వస్తువును శుద్ధి చేసుకోవాలి.” \p \v 21 అప్పుడు యాజకుడైన ఎలియాజరు యుద్ధానికి వెళ్లిన సైనికులతో, “యెహోవా మోషేకు ఇచ్చిన నియమం ఇది: \v 22 బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, \v 23 అగ్నిని తట్టుకోగలిగిన దేనినైనా అగ్నిలో వేయాలి, ఆపై అది శుద్ధి అవుతుంది. కానీ అది కూడా శుద్ధి జలంతో శుద్ధి చేయబడాలి. అలాగే అగ్నిని తట్టుకోలేని దానిని ఆ నీటిలో వేయాలి. \v 24 ఏడవ రోజు మీరు బట్టలు ఉతుక్కోండి, మీరు శుద్ధులవుతారు. ఆ తర్వాత శిబిరంలోకి రావచ్చు.” \s1 కొల్లగొట్టిన వాటిని పంచుకోవడం \p \v 25 యెహోవా మోషేతో ఇలా చెప్పారు, \v 26 “నీవూ, యాజకుడైన ఎలియాజరు, సమాజం యొక్క కుటంబ యజమానులు, చెరపట్టబడిన మనుష్యులందరిని, జంతువులన్నిటిని లెక్కబెట్టాలి. \v 27 ఆ కొల్లగొట్టిన వాటిని యుద్ధంలో పాల్గొన్న సైనికులకు మిగితా సమాజానికి సమానంగా పంచాలి. \v 28 యుద్ధంలో పోరాడిన సైనికుల భాగం నుండి, ప్రతి అయిదువందల నుండి అనగా మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా లేదా గొర్రెలైనా సరే ఒకరిని, ఒకదాన్ని యెహోవాకు పన్నుగా వేరు చేయాలి. \v 29 ఈ పన్ను వారి భాగం నుండి తీసుకుని యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇవ్వాలి. \v 30 ఇశ్రాయేలీయుల మిగతా సగం వాటా నుండి, మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా, గొర్రెలైనా, వీటిలో ఏవైనా సరే, ప్రతి 50 నుండి ఒకటి తీసుకుని, యెహోవా సమావేశ గుడారాన్ని చూసుకునే బాధ్యత కలిగిన లేవీయులకు ఇవ్వాలి.” \v 31 కాబట్టి మోషే యాజకుడైన ఎలియాజరు యెహోవాకు మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. \p \v 32-35 సైనికులు తీసుకున్న కొల్లగొట్టిన వాటిలో మిగిలి ఉన్న దోపుడుసొమ్ము 6,75,000 గొర్రెలు, 72,000 పశువులు, 61,000 గాడిదలు, 32,000 మంది పురుషులతో పడుకొనని కన్యలు. \b \lh \v 36 ఇది యుద్ధంలో పోరాడిన వారి సగం వాటా: \b \li1 3,37,500 గొర్రెలు \v 37 వీటిలో యెహోవాకు ఇచ్చినవి 675; \li1 \v 38 36,000 పశువులు, వీటిలో యెహోవాకు ఇచ్చినవి 72; \li1 \v 39 30,500 గాడిదలు, వీటిలో యెహోవాకు ఇచ్చినవి 61; \li1 \v 40 16,000 మంది మనుష్యులు, వీరిలో యెహోవాకు ప్రత్యేకింపబడినవారు 32. \b \p \v 41 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇచ్చాడు. \p \v 42-46 సైనికుల భాగం నుండి ఇశ్రాయేలు సమాజం కోసం మోషే వేరుగా ఉంచిన సగభాగం ఇది: 3,37,500 గొర్రెలు, 36,000 పశువులు, 30,500 గాడిదలు, 16,000 మంది మనుష్యులు. \v 47 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే, ఇశ్రాయేలీయుల సగభాగంలో నుండి, ప్రతి యాభైమంది మనుష్యుల్లో నుండి ఒకరిని, జంతువుల్లో నుండి ఒకదాన్ని ఎంచుకుని, యెహోవా సమావేశ గుడారాన్ని చూసుకునే బాధ్యత కలిగిన లేవీయులకు ఇచ్చాడు. \p \v 48 తర్వాత సైన్యానికి అధికారులుగా ఉన్న సహస్రాధిపతులు, శతాధిపతులు మోషే దగ్గరకు వచ్చి, \v 49 మోషేతో, “మేము సైనికుల లెక్క చూశాము. మాలో ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు. \v 50 కాబట్టి యెహోవా సన్నిధిలో మాకు ప్రాయశ్చిత్తం కలగాలని మేము భుజ కడియాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, మెడ హారాలు యెహోవాకు అర్పణగా తెచ్చాము” అని చెప్పారు. \p \v 51 మోషే, యాజకుడైన ఎలియాజరు వారి నుండి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. \v 52 సహస్రాధిపతుల నుండి, శతాధిపతుల నుండి వారు తీసుకుని, యెహోవాకు అర్పణగా అర్పించిన బంగారం మొత్తం 16,750 షెకెళ్ళు.\f + \fr 31:52 \fr*\ft అంటే సుమారు 190 కి. గ్రా. లు\ft*\f* \v 53 ప్రతి సైనికుడు తన కోసం తాను దోపుడుసొమ్మును తీసుకున్నాడు. \v 54 సహస్రాధిపతుల శతాధిపతుల దగ్గర నుండి మోషే, యాజకుడైన ఎలియాజరు ఆ బంగారం తీసుకుని ఇశ్రాయేలీయులకు యెహోవా ఎదుట జ్ఞాపకార్థంగా సమావేశ గుడారంలో ఉంచారు. \c 32 \s1 యొర్దానుకు తూర్పున ఉన్న గోత్రాలు \p \v 1 చాలా ఎక్కువ పశువుల మందలు కలిగిన రూబేనీయులు, గాదీయులు తమ పశువులకు యాజెరు, గిలాదు ప్రాంతాలు తగిన స్థలాలని చూశారు. \v 2 కాబట్టి వారు మోషే, యాజకుడైన ఎలియాజరు, సమాజ నాయకుల దగ్గరకు వచ్చి, \v 3 “అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎల్యాలెహు, షెబాము, నెబో, బెయోను ప్రాంతాలు, \v 4 ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన స్థలం పశువులకు తగిన స్థలాలు, మీ సేవకులమైన మాకు పశువులు ఉన్నాయి. \v 5 మీరు మా పట్ల దయ చూపిస్తే ఈ స్థలం మీ సేవకులమైన మాకు స్వాస్థ్యంగా ఇవ్వండి. మమ్మల్ని యొర్దాను అవతలికి దాటించకండి” అని అన్నారు. \p \v 6 మోషే రూబేనీయులతో, గాదీయులతో, “మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ తోటి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగాడు. \v 7 “యెహోవా ఇచ్చిన దేశానికి ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను ఎందుకు నిరాశపరుస్తారు? \v 8 మీ తండ్రులను కాదేషు బర్నియాకు స్థలాన్ని చూసి రమ్మని పంపితే వారు ఇలాగే చేశారు. \v 9 వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి తిరిగివచ్చి, యెహోవా వారికిచ్చిన వాగ్దాన భూమికి ప్రవేశించకుండా ఇశ్రాయేలీయులను నిరాశ పరిచారు. \v 10 ఆ రోజు యెహోవా కోపం వారిపై రగులుకొని, ఆయన ఇలా ప్రమాణం చేశారు: \v 11 ‘వారు హృదయమంతటితో నన్ను వెంబడించలేదు కాబట్టి, ఈజిప్టు నుండి వచ్చిన వారిలో ఇరవై సంవత్సరాలు ఆ పైబడి వయస్సు ఉన్నవారు ఎవ్వరూ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఈ దేశాన్ని చూడరు. \v 12 కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ మాత్రమే వెళ్తారు, ఎందుకంటే వీరు యెహోవాను హృదయమంతటితో వెంబడించారు.’ \v 13 యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకుంది. ఆయన వారు అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరిగేలా చేశారు, ఆయన దృష్టి నుండి చెడు చేసిన వారందరు చనిపోయే వరకు అలా చేశారు. \p \v 14 “ఇక్కడ మీరు, పాపుల సంతానం, మీ తండ్రుల స్థానంలో నిలబడి, యెహోవాకు ఇశ్రాయేలుపై మరింత కోపం తెప్పిస్తున్నారు. \v 15 మీరు ఆయనను వెంబడించకుండా తప్పుకుంటే, ఆయన మరలా ప్రజలందరినీ అరణ్యంలో వదిలేస్తారు వారి నాశనానికి మీరే కారణం అవుతారు.” \p \v 16 వారు అతని దగ్గరకు వచ్చి, “మేము ఇక్కడ మందలకు కావలసిన దొడ్లు మా స్త్రీలు, పిల్లలకు పట్టణాలు కట్టుకుంటాము. \v 17 కానీ మేము యుద్ధానికి మమ్మల్ని మేము సిద్ధంగా ఉంచుకుని ఇశ్రాయేలీయులకు ముందుగా వెళ్తూ వారు వారి స్థలాలకు చేరేవరకు ఉంటాము. ఆ సమయంలో మా స్త్రీలు, పిల్లలు కోటగోడలు గల పట్టణాల్లో ఉంటూ, ప్రాంత నివాసులకు కాపుదలగా ఉంటారు. \v 18 ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు తమ వారసత్వం స్వాధీనం చేసుకునేవరకు మా గృహాలకు వెళ్లము. \v 19 యొర్దానుకు అవతల వారసత్వం పొందుకోము ఎందుకంటే మా వారసత్వం యొర్దాను తూర్పు ప్రదేశంలో ఉంది.” \p \v 20 అప్పుడు మోషే వారితో, “మీరు ఇలా చేస్తే అంటే మీరు యుద్ధం కోసం యెహోవా ఎదుట సిద్ధంగా ఉంటే, \v 21 ఆయుధాలు ధరించిన మీరందరూ యొర్దాను దాటి యెహోవా తన శత్రువులను తన ఎదుట నుండి తరిమికొట్టే వరకు యొర్దానును దాటితే, \v 22 దేశం యెహోవా ఎదుట వశపరచబడినప్పుడు, మీరు తిరిగివచ్చి యెహోవాకు, ఇశ్రాయేలుకు మీ బాధ్యత నుండి విముక్తి పొందవచ్చు. ఈ దేశం యెహోవా ఎదుట మీకు స్వాస్థ్యంగా ఉంటుంది. \p \v 23 “కానీ మీరు ఇలా చేయకపోతే, యెహోవాకు విరోధంగా పాపం చేసినవారవుతారు; మీ పాపం మిమ్మల్ని వెంటాడుతుందని ఖచ్చితంగా నమ్మవచ్చు. \v 24 ఇప్పుడు మీ స్త్రీల కోసం, పిల్లల కోసం పట్టణాలు, మీ మందల దొడ్లు నిర్మించుకోండి, కానీ మీరు చెప్పినదంతా చేయండి.” \p \v 25 గాదీయులు, రూబేనీయులు మోషేతో ఇలా అన్నారు, “మీ సేవకులైన మేము మా ప్రభువా ఆజ్ఞాపించినట్లే చేస్తాము. \v 26 మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, పశువులు ఇక్కడే గిలాదు పట్టణాల్లో ఉంటారు. \v 27 అయితే, యుద్ధానికి సిద్ధపడిన మీ సేవకుల మందరం మా ప్రభువా చెప్పినట్లు, యెహోవా ఎదుట యుద్ధానికి యొర్దానును దాటుతాము.” \p \v 28 అప్పుడు మోషే వారి గురించి యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలీయుల గోత్రాల కుటుంబ పెద్దలకు ఆదేశించాడు. \v 29 మోషే వారితో అన్నాడు, “గాదీయులు, రూబేనీయులు, వీరిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు యెహోవా ఎదుట మీతో యొర్దానును దాటుతారు, అప్పుడు ఆ స్థలాన్ని జయించినప్పుడు, మీరు గిలాదు భూమిని వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి. \v 30 కానీ వారు ఒకవేళ ఆయుధాలు ధరించి మీతో దాటకపోతే, వారు కనానులో మీ దగ్గర తమ స్వాస్థ్యాన్ని అంగీకరించాలి.” \p \v 31 గాదీయులు, రూబేనీయులు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా చెప్పినది మీ సేవకులమైన మేము చేస్తాము. \v 32 ఆయుధాలు ధరించి యెహోవా ఎదుట కనాను లోనికి వెళ్తాము, కానీ మేము వారసత్వంగా సంపాదించుకునే స్వాస్థ్యం యొర్దానుకు ఇటువైపు ఉంటుంది.” \p \v 33 అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రానికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని దాని పట్టణాలు, వాటి సరిహద్దులతో సహా ఆ స్థలాన్నంతటిని ఇచ్చాడు. \p \v 34 గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, \v 35 అత్రోత్-షోఫాను, యాజెరు, యొగ్బెహ, \v 36 బేత్-నిమ్రా, బేత్-హారాను, అనే పట్టణాలను కోటగోడలతో నిర్మించారు, మందలకు దొడ్లు కూడా కట్టుకున్నారు. \v 37 రూబేనీయులు నిర్మించిన పట్టణాలు హెష్బోను, ఎల్యాలెహు, కిర్యతాయిము, \v 38 అలాగే నెబో, బయల్-మెయోను (ఈ పేర్లు మార్చబడ్డాయి) షిబ్మా అనే పట్టణాలను నిర్మించుకున్నారు. వారు తిరిగి కట్టుకున్న పట్టణాలకు వారు పేర్లు పెట్టుకున్నారు. \p \v 39 మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులు గిలాదుకు వెళ్లి, దాన్ని జయించి, అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు. \v 40 కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు. \v 41 మనష్షే వంశస్థుడైన యాయీరు వారి స్థావరాలను స్వాధీనం చేసుకుని వాటికి హవ్వోత్ యాయీరు\f + \fr 32:41 \fr*\ft లేదా \ft*\fqa యాయీరు స్థావరాలు\fqa*\f* అని పేరు పెట్టాడు. \v 42 నోబహు అనేవాడు వెళ్లి కెనాతు దాని స్థావరాలను జయించి ఆ ప్రాంతానికి నోబహు అని తన పేరు పెట్టుకున్నాడు. \c 33 \s1 ఇశ్రాయేలు ప్రయాణ దశలు \p \v 1 ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల నాయకత్వంలో సేనలుగా ఏర్పడి ఈజిప్టు నుండి బయలుదేరి చేసిన ప్రయాణాలు. \v 2 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారి ప్రయాణాల దశలను నమోదు చేశాడు. ఇవి వారి ప్రయాణాల దశలు: \b \pi1 \v 3-4 ఇశ్రాయేలీయులు మొదటి నెల పదిహేనవ రోజు అంటే పస్కా తర్వాత రోజున, రామెసేసు నుండి ప్రయాణమయ్యారు. యెహోవా హతం చేసిన తమ జ్యేష్ఠులందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూ ఉన్నప్పుడు, వారు చూస్తూ ఉండగా జయోత్సాహంతో బయలుదేరారు; ఎందుకంటే యెహోవా వారి దేవుళ్ళ మీద తీర్పు తీర్చారు. \pi1 \v 5 ఇశ్రాయేలీయులు రామెసేసును వదిలి సుక్కోతు దగ్గర దిగారు. \pi1 \v 6 వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు. \pi1 \v 7 వారు ఏతాము నుండి వెనుకకు తిరిగి బయల్-సెఫోను ఎదురుగా పీ హహీరోతు వైపుకు వెళ్లి మిగ్దోలు ఎదుట దిగారు. \pi1 \v 8 పీ హహీరోతు నుండి బయలుదేరి సముద్రం గుండా దాటుతూ ఎడారిలోకి చేరారు, వారు మూడు రోజులు ఏతాము ఎడారిలో ప్రయాణం చేసి మారాలో దిగారు. \pi1 \v 9 మారా నుండి బయలుదేరి ఎలీముకు వెళ్లారు, ఎలీములో పన్నెండు నీటి ఊటలు, డెబ్బయి ఈతచెట్లు ఉన్నాయి, వారక్కడ ఉన్నారు. \pi1 \v 10 ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు. \pi1 \v 11 ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారికి వచ్చారు. \pi1 \v 12 సీను ఎడారి నుండి బయలుదేరి దోపకాకు వచ్చారు. \pi1 \v 13 దోపకా నుండి బయలుదేరి ఆలూషుకు వచ్చారు. \pi1 \v 14 ఆలూషు నుండి బయలుదేరి రెఫీదీముకు వచ్చారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు. \pi1 \v 15 రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చారు. \pi1 \v 16 సీనాయి ఎడారి నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాకు వచ్చారు. \pi1 \v 17 కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతుకు వచ్చారు. \pi1 \v 18 హజేరోతు నుండి బయలుదేరి రిత్మాకు వచ్చారు. \pi1 \v 19 రిత్మా నుండి బయలుదేరి రిమ్మోను పెరెజుకు వచ్చారు. \pi1 \v 20 రిమ్మోను పెరెజు నుండి బయలుదేరి లిబ్నాకు వచ్చారు. \pi1 \v 21 లిబ్నా నుండి బయలుదేరి రీసాకు వచ్చారు. \pi1 \v 22 రీసా నుండి బయలుదేరి కేహేలాతాకు వచ్చారు. \pi1 \v 23 కేహేలాతా నుండి బయలుదేరి షాపెరు పర్వతముకు వచ్చారు. \pi1 \v 24 షాపెరు పర్వతము నుండి బయలుదేరి హరాదాకు వచ్చారు. \pi1 \v 25 హరాదా నుండి బయలుదేరి మకెలోతుకు వచ్చారు. \pi1 \v 26 మకెలోతు నుండి బయలుదేరి తాహతుకు వచ్చారు. \pi1 \v 27 తాహతు నుండి బయలుదేరి తారహుకు వచ్చారు. \pi1 \v 28 తారహు నుండి బయలుదేరి మిత్కాకు వచ్చారు. \pi1 \v 29 మిత్కా నుండి బయలుదేరి హష్మోనాకు వచ్చారు. \pi1 \v 30 హష్మోనా నుండి బయలుదేరి మొసేరోతుకు వచ్చారు. \pi1 \v 31 మొసేరోతు నుండి బయలుదేరి బెనె యహకానుకు వచ్చారు. \pi1 \v 32 బెనె యహకాను నుండి బయలుదేరి హోర్-హగ్గిద్గాదుకు వచ్చారు. \pi1 \v 33 హోర్-హగ్గిద్గాదు నుండి బయలుదేరి యొత్బాతాకు వచ్చారు. \pi1 \v 34 యొత్బాతా నుండి బయలుదేరి ఎబ్రోనాకు వచ్చారు. \pi1 \v 35 ఎబ్రోనా నుండి బయలుదేరి ఎసోన్-గెబెరుకు వచ్చారు. \pi1 \v 36 ఎసోన్-గెబెరు నుండి బయలుదేరి సీను ఎడారిలో ఉన్న కాదేషుకు వచ్చారు. \pi1 \v 37 కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు. \v 38 యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడైన అహరోను హోరు పర్వతం మీద చనిపోయాడు, ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన నలభైయవ సంవత్సరం, అయిదవ నెల, మొదటి రోజున అతడు చనిపోయాడు. \v 39 హోరు పర్వతం మీద అహరోను చనిపోయినప్పుడు అతని వయస్సు నూట యిరవై మూడు సంవత్సరాలు. \pi1 \v 40 కనాను దక్షిణ దిక్కున కనానీయుడైన అరాదు పట్టణ రాజు ఇశ్రాయేలీయులు వస్తున్నారని విన్నాడు. \pi1 \v 41 వారు హోరు పర్వతం నుండి బయలుదేరి సల్మానాకు వచ్చారు. \pi1 \v 42 సల్మానా నుండి బయలుదేరి పూనొనుకు వచ్చారు. \pi1 \v 43 పూనొను నుండి బయలుదేరి ఓబోతుకు వచ్చారు. \pi1 \v 44 ఓబోతు నుండి బయలుదేరి మోయాబు సరిహద్దులో ఉన్న ఈయ్యె-అబారీముకు వచ్చారు. \pi1 \v 45 ఈయ్యె-అబారీము నుండి బయలుదేరి దీబోనుగాదుకు వచ్చారు. \pi1 \v 46 దీబోనుగాదు నుండి బయలుదేరి అల్మోన్-దిబ్లాతయీముకు వచ్చారు. \pi1 \v 47 అల్మోన్-దిబ్లాతయీము నుండి బయలుదేరి నెబో ఎదుట ఉన్న అబారీము పర్వతాల దగ్గర దిగారు. \pi1 \v 48 అబారీము పర్వతాల నుండి బయలుదేరి యెరికోకు దగ్గర యొర్దాను అవతలి వైపున మోయాబు సమతల మైదానాల్లో దిగారు. \v 49 మోయాబు సమతల మైదానంలో బేత్-యెషిమోతు మొదలుకొని ఆబేల్-షిత్తీము వరకు యొర్దాను దగ్గర దిగారు. \b \p \v 50 యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు, \v 51 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు, \v 52 ఆ దేశవాసులందర్నీ తరిమేయాలి. వారి రాతి విగ్రహాలను, కోట విగ్రహాలను నాశనం చేయాలి వారి క్షేత్రాలను పడగొట్టాలి. \v 53 ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించండి ఎందుకంటే మీరు స్వాధీనపరచుకోడానికి ఆ దేశాన్ని మీకు ఇచ్చాను. \v 54 చీట్లు వేసి మీ వంశాల ప్రకారం ఆ దేశాన్ని పంచుకోండి. పెద్ద గోత్రాలకు ఎక్కువ వారసత్వం చిన్న గోత్రాలకు తక్కువ వారసత్వంగా పంచుకోండి. చీట్లలో ఏది వస్తే, అది వారికి చెందుతుంది. మీ పూర్వికుల గోత్రాల ప్రకారం దానిని పంచుకోండి. \p \v 55 “ ‘అయితే ఆ దేశవాసులను మీరు తరిమివేయకపోతే, అక్కడ ఉండడానికి అనుమతించిన వారు మీ కళ్లలో ముళ్ళుగా, మీ ప్రక్కలలో శూలాలుగా చేసినవారవుతారు. మీరు నివసించే భూమిలో వారు మిమ్మల్ని కష్ట పెడతారు. \v 56 అప్పుడు నేను వారికేమి చేయాలని అనుకున్నానో, అది మీకు చేస్తాను.’ ” \c 34 \s1 కానాను సరిహద్దులు \lh \v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు, \v 2 “నీవు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తూ వారికి ఇలా చెప్పు: ‘మీరు కనానులో ప్రవేశించిన తర్వాత, మీకు వారసత్వంగా కేటాయించబడే భూములకు చెందిన సరిహద్దులు: \b \li1 \v 3 “ ‘మీ దక్షిణం వైపు ఎదోము సరిహద్దు ప్రక్కన సీను ఎడారిలో కొద్ది భాగం ఉంటుంది. మీ దక్షిణ సరిహద్దు మృత సముద్రం\f + \fr 34:3 \fr*\ft అంటే \ft*\fqa ఉప్పు సముద్రం\fqa*\f* యొక్క దక్షిణ చివర తూర్పు దిక్కున ప్రారంభమై, \v 4 దక్షిణం వైపు అక్రబ్బీం కనుమ నుండి తిరిగి సీను వరకు వ్యాపించి కాదేషు బర్నియాకు దక్షిణంగా ఉంటుంది. అక్కడినుండి హజర్ అద్దారుకు, అక్కడినుండి అజ్మోను వరకు, \v 5 అజ్మోను నుండి తిరిగి ఈజిప్టు వాగు వైపు తిరిగి మధ్యధరా సముద్రం దగ్గర ముగుస్తుంది. \li1 \v 6 మీ పడమటి సరిహద్దు మధ్యధరా సముద్ర తీరము. ఇదే మీ పడమటి వైపు సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 7 మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం నుండి హోరు పర్వతం వరకు \v 8 హోరు పర్వతం నుండి లెబో హమాతు వరకు అక్కడినుండి సరిహద్దు సెదాదు వరకు వెళ్తూ, \v 9 అక్కడినుండి జిఫ్రోను వరకు కొనసాగుతూ హజర్-ఎనాను వరకు వ్యాపిస్తుంది. ఇది మీకు ఉత్తర సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 10 మీ తూర్పు సరిహద్దు హజర్-ఎనాను నుండి షెఫాము వరకు ఉంటుంది. \v 11 సరిహద్దు షెఫాము నుండి ఆయినుకు తూర్పు వైపు రిబ్లా వరకు వెళ్లి కిన్నెరెతు సరస్సు\f + \fr 34:11 \fr*\ft అంటే \ft*\fqa గలలీ సరస్సు\fqa*\f* తూర్పున ఉన్న వాలుల వెంట కొనసాగుతుంది. \v 12 తర్వాత ఆ సరిహద్దు యొర్దాను గుండా వెళ్తూ మృత సముద్రం వరకు వ్యాపిస్తుంది. \b \lf “ ‘ఇది మీ దేశం, దీనికి అన్ని వైపుల సరిహద్దులు ఉంటాయి.’ ” \b \p \v 13 మోషే ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు చీట్లు వేసి ఈ దేశాన్ని ఒక వారసత్వంగా కేటాయించాలి. తొమ్మిదిన్నర గోత్రాలకు ఇవ్వమని యెహోవా ఆదేశించారు, \v 14 ఎందుకంటే రూబేను గోత్రికులు, గాదు గోత్రికులు, మనష్షే అర్థగోత్రం, తమ తమ కుటుంబాలు వారసత్వం పొందారు. \v 15 ఈ రెండున్నర గోత్రాల వారు యెరికోకు తూర్పున యొర్దానుకు అవతలి వైపు, సూర్యోదయం వైపున ఉన్న భూభాగాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నారు.” \p \v 16 యెహోవా మోషేతో అన్నారు, \v 17 “మీకు భూమిని స్వాస్థ్యంగా కేటాయించే పురుషుల పేర్లు ఇవి: యాజకుడైన ఎలియాజరు నూను కుమారుడైన యెహోషువ. \v 18 భూకేటాయింపు కోసం సహాయపడడానికి ప్రతి గోత్రం నుండి ఒక నాయకున్ని నియమించు. \b \lh \v 19 “వారి పేర్లు ఇవి: \b \li1 “యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు; \li1 \v 20 షిమ్యోను గోత్రం నుండి అమీహూదు కుమారుడైన షెమూయేలు; \li1 \v 21 బెన్యామీను గోత్రం నుండి కిస్లోను కుమారుడైన ఎలీదాదు; \li1 \v 22 దాను గోత్రం నుండి యొగ్లీ కుమారుడైన బుక్కీ నాయకుడు; \li1 \v 23 యోసేపు కుమారుడైన మనష్షే గోత్రం నుండి ఏఫోదు కుమారుడైన హన్నీయేలు నాయకుడు; \li1 \v 24 ఎఫ్రాయిం గోత్రం నుండి షిఫ్తాను కుమారుడైన కెమూయేలు నాయకుడు; \li1 \v 25 జెబూలూను గోత్రం నుండి పర్నాకు కుమారుడైన ఎలీషాపాను నాయకుడు; \li1 \v 26 ఇశ్శాఖారు గోత్రం నుండి అజ్జాను కుమారుడైన పల్తీయేలు నాయకుడు; \li1 \v 27 ఆషేరు గోత్రం నుండి షెలోమి కుమారుడైన అహీహూదు నాయకుడు; \li1 \v 28 నఫ్తాలి గోత్రం నుండి అమీహూదు కుమారుడైన పెదహేలు నాయకుడు.” \b \lf \v 29 కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారసత్వ భూమిని కేటాయించడానికి యెహోవా ఈ పురుషులను నియమించారు. \c 35 \s1 లేవీయులకు పట్టణాలు \p \v 1 మోయాబు సమతల మైదానాల్లో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతంలో యెహోవా మోషేతో అన్నారు, \v 2 “ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే స్వాస్థ్యం నుండి పట్టణాలను లేవీయులు నివసించడానికి ఇమ్మని ఆజ్ఞాపించు. పట్టణాల చుట్టూ ఉన్న పచ్చికబయళ్లు వారికి ఇవ్వాలి. \v 3 అప్పుడు వారు నివసించడానికి పట్టణాలు కలిగి ఉంటారు వారి సొంత పశువుల కోసం, ఇతర జంతువుల కోసం పచ్చికబయళ్లు ఉంటాయి. \p \v 4 “లేవీయులకు ఇచ్చే పట్టణాల చుట్టూ ఉండే పచ్చికబయళ్లు పట్టణ ప్రాకారానికి 1,000 క్యూబిట్‌ల\f + \fr 35:4 \fr*\ft అంటే, సుమారు 450 మీటర్లు\ft*\f* దూరంలో ఉంటుంది. \v 5 పట్టణం బయట తూర్పు దిక్కున 2,000 క్యూబిట్‌ల దక్షిణ దిక్కున 2,000 క్యూబిట్‌ల, పడమటి దిక్కున 2,000 క్యూబిట్‌ల, ఉత్తర దిక్కున 2,000 క్యూబిట్‌లు కొలవాలి, దాని కేంద్రంగా పట్టణం ఉంటుంది. వారు ఈ భూభాగాన్ని పట్టణాలకు పచ్చికబయళ్లుగా కలిగి ఉంటారు. \s1 ఆశ్రయపురాలు \p \v 6 “లేవీయులకు ఇచ్చే వాటిలో ఆరు పట్టణాలు ఆశ్రయపురాలుగా ఉండాలి. ప్రమాదవశాత్తు ఎవరినైనా చంపితే ఆ వ్యక్తి ఇక్కడకు పారిపోవచ్చు. వీటితో సహా 42 పట్టణాలు వారికి ఇవ్వాలి. \v 7 మొత్తం 48 పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో సహా లేవీయులకు ఇవ్వాలి. \v 8 ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే వాటిలో లేవీయులకు ఇచ్చే పట్టణాలు ప్రతి గోత్రం వారి వారసత్వం నుండి ఇవ్వాలి. ఎక్కువ పట్టణాలు గల గోత్రం నుండి ఎక్కువ పట్టణాలు, తక్కువ ఉన్న వారి నుండి తక్కువ తీసుకోవాలి.” \p \v 9 తర్వాత యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు: \v 10 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు, \v 11 కొన్ని పట్టణాలను ఆశ్రయపురాలుగా ఎన్నుకోండి. ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు. \v 12 ఆ పట్టణాలు ప్రతీకారం తీర్చుకునే వారి నుండి కాపాడుకోడానికి ఆశ్రయంగా ఉంటాయి, తద్వారా హత్యకు పాల్పడిన ఎవరైనా సమాజం ముందు విచారణకు రాకముందు చంపబడరు. \v 13 ఈ ఆరు పట్టణాలు మీ ఆశ్రయ పట్టణాలుగా ఉంటాయి. \v 14 మూడు యొర్దానుకు ఇటువైపు, మూడు కనాను దేశంలో ఆశ్రయపురాలుగా ఇవ్వాలి. \v 15 ఈ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులు వారి మధ్య నివసించే విదేశీయులకు ఆశ్రయపురాలుగా ఉంటాయి, తద్వార, ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు. \p \v 16 “ ‘ఎవరైనా ఇనుప వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి. \v 17 లేదా ఒకవేళ ఎవరైనా ఒక రాయితో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి. \v 18 లేదా ఒకవేళ ఎవరైనా ఒక చెక్క వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి. \v 19 పగ తీర్చుకునేవాడు ఆ హంతకునికి మరణశిక్ష వేయాలి; పగ తీర్చుకునేవాడు హంతకున్ని పట్టుకున్నప్పుడు అతన్ని చంపుతాడు. \v 20 ఎవరైనా పగతో నెట్టినా లేదా వారివైపు ఉద్దేశపూర్వకంగా చేతిలో ఉన్నదానిని వారి మీదికి విసిరివేసినా, వారు చనిపోతే \v 21 లేదా శత్రుత్వం బట్టి ఒకరిని పిడికిలితో కొడితే ఆ వ్యక్తి చస్తే, వాడు మరణశిక్ష పొందాలి; ఆ వ్యక్తి హంతకుడు. పగ తీర్చుకునేవాడు అతన్ని కలిసినప్పుడు అతన్ని చంపుతాడు. \p \v 22 “ ‘అయితే ఎవరైనా శత్రుత్వం లేకుండ ఎవరినైన అకస్మాత్తుగా నెట్టినా, లేదా వారివైపు అనుకోకుండ ఏదైనా విసిరినా, \v 23 లేదా చూడకుండ బరువైన రాయి వేసినా, వారు చనిపోతే, వేసినవానికి వారు శత్రువు కాదు హాని చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి, \v 24 సమాజం నిందితునికి, పగతీర్చుకునే వానికి మధ్య ఉండి ఈ చట్టాల ప్రకారం తీర్పు తీర్చాలి. \v 25 సమాజం ఆ నిందితుడిని పగతీర్చుకునే వాని నుండి కాపాడి తిరిగి అతడు పారిపోయిన ఆశ్రయపురానికి పంపించాలి. నిందితుడు పరిశుద్ధ నూనెతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడే ఉండాలి. \p \v 26 “ ‘ఒకవేళ నిందితుడు తాను వెళ్లిన ఆశ్రయపురం నుండి బయటకు వెళ్తే, \v 27 పగ తీర్చుకునేవాడు అతన్ని ఆశ్రయపురం బయట చూస్తే, అతన్ని చంపవచ్చు, అది హత్యగా లెక్కించబడదు. \v 28 ప్రధాన యాజకుడు చనిపోయే వరకు నిందితుడు ఆశ్రయపురం లోనే ఉండాలి. ఆ తర్వాత అతడు తన స్వస్థలానికి వెళ్లిపోవచ్చు. \p \v 29 “ ‘ఇది మీరు ఎక్కడ నివసించినా, రాబోయే తరాలలో మీ కోసం చట్టబద్ధమైన నియమంగా ఉంటుంది. \p \v 30 “ ‘సాక్షుల నోటి మాటను బట్టి హంతకులు మరణశిక్ష పొందుతారు. అయితే ఒక్క సాక్షి సాక్ష్యాన్ని బట్టి ఏ ఒక్కరికీ మరణశిక్ష విధించబడకూడదు. \p \v 31 “ ‘శిక్ష పొందాల్సిన హంతకుల జీవితం కోసం విమోచన క్రయధనం స్వీకరించకూడదు. వారు మరణశిక్ష పొందాలి. \p \v 32 “ ‘ఆశ్రయపురానికి పారిపోయినవారి నుండి విమోచన క్రయధనం స్వీకరించకూడదు, ప్రధాన యాజకుడు చనిపోకముందు వారిని తమ స్వస్థలానికి పంపించవద్దు. \p \v 33 “ ‘మీరున్న భూమిని కలుషితం చేయకండి. రక్తపాతం దేశాన్ని కలుషితం చేస్తుంది రక్తపాతం చేసిన ఆ వ్యక్తి రక్తం ద్వారానే తప్ప ఆ భూమికి ప్రాయశ్చిత్తం చేయలేము. \v 34 మీరు నివసించే, నేను నివసించే భూమిని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే, యెహోవానైన నేను, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను.’ ” \c 36 \s1 సెలోఫెహాదు కుమార్తెల వారసత్వం \p \v 1 యోసేపు వంశం నుండి వచ్చిన మనష్షే కుమారుడు మాకీరు, గిలాదు వంశ పెద్దలు వచ్చి నాయకులు, ఇశ్రాయేలీయుల కుటుంబాల పెద్దలు ఎదుట మోషేతో మాట్లాడారు. \v 2 “చీట్లు వేసి ఇశ్రాయేలీయులకు భూమిని వారసత్వంగా ఇవ్వమని యెహోవా మా ప్రభువుకు ఆజ్ఞాపించినప్పుడు మా సహోదరుడు సెలోఫెహాదు భూ వారసత్వాన్ని అతని కుమార్తెలకు ఇమ్మని ఆజ్ఞాపించారు. \v 3 ఒకవేళ వారు ఇతర ఇశ్రాయేలు గోత్రం వారిని పెళ్ళి చేసుకుంటే, అప్పుడు వారి వారసత్వం పూర్వికుల గోత్రం నుండి మారి వేరే వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది. కాబట్టి వారి వారసత్వం లోని భాగం తీసివేయబడుతుంది. \v 4 ఇశ్రాయేలు యొక్క మహోత్సవ సంవత్సరం\f + \fr 36:4 \fr*\ft హె.భా.లో \ft*\fqa రుణవిమోచన సంవత్సరం\fqa*\f* వచ్చినప్పుడు, వారి వారసత్వం వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది, మా పూర్వికుల వంశ వారసత్వం నుండి స్వాస్థ్యం పోతుంది” అని అంటూ చెప్పారు. \p \v 5 అప్పుడు యెహోవా ఆజ్ఞమేరకు మోషే ఇశ్రాయేలీయులను ఆదేశించాడు: “యోసేపు సంతతివారి గోత్రం వారు తెచ్చిన ఫిర్యాదు సరియైనదే. \v 6 సెలోఫెహాదు కుమార్తెల గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: వారు తమకు ఇష్టం వచ్చిన వారిని పెళ్ళి చేసుకోవచ్చు, కానీ అది వారి తండ్రి గోత్ర వంశం వారై ఉండాలి. \v 7 ఇశ్రాయేలు ప్రజల వారసత్వం ఒక గోత్రం నుండి ఇంకొక గోత్రం లోకి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరూ తమ పూర్వికుల గోత్ర వారసత్వాన్ని తమ వంశం లోనే ఉంచుకోవాలి. \v 8 ఇశ్రాయేలు ప్రజల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి కుమార్తె తన తండ్రి గోత్రం వారినే పెళ్ళి చేసుకోవాలి. ఈ విధంగా వారి వారి పూర్వికులు వారసత్వం వారి స్వాధీనంలోనే ఉంటుంది. \v 9 వారసత్వం ఒక వంశం నుండి ఇంకొక వంశానికి వెళ్లకూడదు. ప్రతి ఇశ్రాయేలు గోత్రం వారు వారసత్వ భూమిని కాపాడుకోవాలి.” \p \v 10 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం సెలోఫెహాదు కుమార్తెలు చేశారు. \v 11 సెలోఫెహాదు కుమార్తెలైన మహ్లా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోవా తమ తండ్రి సహోదరుల కుమారులను పెళ్ళి చేసుకున్నారు. \v 12 వీరు యోసేపు కుమారుడైన మనష్షే సంతతివారిని పెళ్ళి చేసుకున్నారు వారి వారసత్వం వారి తండ్రి గోత్రం లోనే, వంశం లోనే నిలిచింది. \b \p \v 13 ఇవి మోయాబు సమతల మైదానంలో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ప్రాంతంలో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు ఇచ్చారు.