\id NEH - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h నెహెమ్యా \toc1 నెహెమ్యా గ్రంథం \toc2 నెహెమ్యా \toc3 నెహె \mt1 నెహెమ్యా \mt2 గ్రంథం \c 1 \s1 నెహెమ్యా ప్రార్థన \p \v 1 హకల్యా కుమారుడైన నెహెమ్యా మాటలు: \b \b \p ఇరవయ్యవ సంవత్సరం కిస్లేవు నెలలో నేను షూషను కోటలో ఉన్నప్పుడు, \v 2 నా సోదరులలో ఒకడైన హనానీ మరి కొంతమందితో కలిసి యూదా నుండి వచ్చారు. అప్పుడు చెరలోకి రాకుండా బయటపడి మిగిలి ఉన్న యూదుల గురించి, యెరూషలేము గురించి నేను వారిని అడిగాను. \p \v 3 వారు నాతో, “చెరలో పడకుండ బయటపడ్డవారు మన దేశంలోనే ఉన్న ఎంతో శ్రమను అవమానాన్ని అనుభవిస్తున్నారు. యెరూషలేము గోడ కూలిపోయింది. దాని గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయి” అని చెప్పారు. \p \v 4 ఈ మాటలు విన్నప్పుడు నేను క్రింద కూర్చుని ఏడ్చాను. కొన్ని రోజుల వరకు దుఃఖంతో ఉపవాసముండి పరలోకంలో ఉన్న దేవునికి ప్రార్థించాను. \v 5 నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: \pm “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు, \v 6 మీ సేవకులైన ఇశ్రాయేలు ప్రజల కోసం మీ సేవకుడు పగలు రాత్రి మీ ఎదుట చేస్తున్న ప్రార్థనను వినడానికి మీ చెవిని మీ కళ్లను తెరవండి. నేను, నా తండ్రి కుటుంబంతో సహా ఇశ్రాయేలీయులమైన మేము మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను నేను ఒప్పుకుంటున్నాను. \v 7 మేము మీ పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాము. మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన ఆజ్ఞలకు, శాసనాలకు చట్టాలకు మేము లోబడలేదు. \pm \v 8 “మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, మీరేమన్నారంటే, ‘మీరు నా పట్ల నమ్మకద్రోహులుగా ప్రవర్తిస్తే, దేశాల మధ్యలోకి మిమ్మల్ని చెదరగొడతాను, \v 9 కానీ ఒకవేళ మీరు నా వైపు తిరిగి, నా ఆజ్ఞలను అనుసరిస్తే చెరగొనిపోబడిన మీ ప్రజలు ఎంత దూరంలో ఉన్నా నేను వారిని అక్కడినుండి సమకూర్చి నా పేరు కోసం నేను నివాసంగా ఎంచుకున్న ప్రదేశానికి వారిని తీసుకువస్తాను.’ \pm \v 10 “వారు మీ సేవకులైన మీ ప్రజలు, మీ గొప్ప బలంతో, శక్తిగల మీ హస్తంతో మీరు విమోచించిన ప్రజలు. \v 11 ప్రభువా, మీ సేవకుడనైన నా ప్రార్థనను మీ నామం పట్ల భయభక్తులు కలిగి ఉండడంలో ఆనందించే నీ సేవకుల ప్రార్థనను మీ చెవులతో శ్రద్ధగా వినండి. ఈ రోజు ఈ వ్యక్తికి నాపై దయ పుట్టించి మీ సేవకుడనైన నాకు విజయం ఇవ్వండి.” \p ఆ సమయంలో నేను రాజుకు గిన్నె అందించే వానిగా ఉన్నాను. \c 2 \s1 అర్తహషస్త నెహెమ్యాను యెరూషలేముకు పంపుట \p \v 1 అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నీసాను నెలలో, రాజు కోసం ద్రాక్షరసం తీసుకువచ్చినప్పుడు నేను ద్రాక్షారసాన్ని తీసుకుని రాజుకు ఇచ్చాను. అంతకుముందు నేను వారి ముందు ఎప్పుడు బాధపడలేదు. \v 2 కాబట్టి రాజు, “నీవు అనారోగ్యంగా లేవు కదా, మరి నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది? ఇది హృదయంలో ఉన్న విచారమే తప్ప మరొకటి కాదు” అని అన్నారు. \p అప్పుడు నేను చాలా భయపడ్డాను, కాని \v 3 నేను రాజుతో, “రాజు చిరకాలం జీవించును గాక! నా పూర్వికులను పాతిపెట్టిన పట్టణం శిథిలావస్థలో ఉండి, దాని ద్వారాలు అగ్నికి ఆహుతి అయినప్పుడు నా ముఖం ఎందుకు విచారంగా కనిపించకూడదు?” అన్నాను. \p \v 4 అప్పుడు రాజు, “నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. \p నేను పరలోకపు దేవునికి ప్రార్థనచేసి, \v 5 రాజుతో, “రాజా, మీకు ఇష్టమైతే మీ సేవకుడనైన నాపై దయ చూపించండి. మా పూర్వికుల సమాధులున్న పట్టణాన్ని తిరిగి కట్టడానికి నన్ను యూదా దేశానికి పంపండి” అని అడిగాను. \p \v 6 అప్పుడు రాణి తన ప్రక్కన కూర్చుని ఉండగా రాజు, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు?” అని అడిగాడు. నేను ఎన్ని రోజులో చెప్పినప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు. \p \v 7 అప్పుడు నేను రాజును, “రాజుకు ఇష్టమైతే నేను యూదా దేశం చేరుకునేవరకు నేను క్షేమంగా ప్రయాణించడానికి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు ఉత్తరాలు ఇవ్వండి. \v 8 పట్టణ గోడకు, ఆలయానికి సంబంధించిన కోట గుమ్మాలకు, నేను ఉండబోయే ఇంటికి దూలాలు, మ్రానులు ఇచ్చేలా రాజు అడవులపై అధికారియైన ఆసాపుకు ఉత్తరం ఇవ్వండి” అని అడిగాను. నా దేవుని కృప హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి రాజు నా అభ్యర్థన విన్నాడు. \v 9 కాబట్టే నేను బయలుదేరి వెళ్లి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు రాజు ఉత్తరాలు ఇచ్చాను. రాజు నాతో పాటు సేనాధిపతులను గుర్రపు సేనను పంపించాడు. \p \v 10 హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన టోబీయా అనేవాడు ఇది విని ఇశ్రాయేలు ప్రజలకు ప్రయోజనం కలిగించడానికి ఎవరో వచ్చారని తెలిసి వారు చాలా కలవరపడ్డారు. \s1 యెరూషలేము గోడలను పరిశీలించిన నెహెమ్యా \p \v 11 నేను యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే ఉండి, \v 12 రాత్రివేళ నేను నాతో ఉన్న కొంతమంది పురుషులతో కలిసి బయలుదేరాను. యెరూషలేము గురించి దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన ఎవరికి చెప్పలేదు. నేను ఎక్కిన జంతువు తప్ప నా దగ్గర మరో జంతువు లేదు. \p \v 13 రాత్రివేళలో నేను లోయ ద్వారం\f + \fr 2:13 \fr*\ft అంటే \ft*\fqa పశ్చిమాన ఉన్న ద్వారం యొక్క పేరు\fqa*\f* గుండా ఘటసర్పం బావి వైపు పెంట ద్వారం దగ్గరకు వెళ్లి కూల్చబడిన యెరూషలేము గోడలు, అగ్నితో కాల్చబడిన దాని గుమ్మాలను పరిశీలించాను. \v 14 అక్కడినుండి నీటి ఊట గుమ్మానికి రాజు కొలను దగ్గరకు వెళ్లాను కాని నేను ఎక్కిన జంతువు వెళ్లడానికి ఆ దారి చాలా ఇరుకుగా ఉంది. \v 15 రాత్రివేళలో నేను లోయ గుండా వెళ్లి గోడను పరిశీలించి తిరిగి లోయ గుమ్మం గుండా వెనుకకు వచ్చాను. \v 16 నేను ఎక్కడ వెళ్లానో ఏమి చేస్తున్నానో అధికారులకు తెలియదు. యూదులకు గాని యాజకులకు గాని సంస్థానాధిపతులకు గాని ఇతర అధికారులకు గాని నేను ఆ విషయం చెప్పలేదు. \p \v 17 నేను వారితో, “మనకున్న సమస్యను మీరు చూశారు. యెరూషలేము పాడైపోయింది దాని గుమ్మాలు కాలిపోయాయి. రండి, ఇకపై ఈ నింద మనమీద ఉండకుండా యెరూషలేమును తిరిగి కడదాం” అన్నాను. \v 18 అంతే కాకుండా దేవుని కృపాహస్తమే నాకు తోడుగా ఉండడం గురించి రాజు నాతో చెప్పినవన్నీ వారితో చెప్పాను. \p అందుకు వారు, “మనం పునర్నిర్మాణం మొదలుపెడదాం” అని చెప్పి ఈ మంచి పనిని ప్రారంభించారు. \p \v 19 హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన సేవకుడు టోబీయా, అరబీయుడైన గెషెము ఈ సంగతి విని మమ్మల్ని వేళాకోళం చేశారు. “మీరేం చేస్తున్నారు? రాజు మీద తిరుగుబాటు చేస్తారా?” అని మమ్మల్ని అడిగారు. \p \v 20 అందుకు నేను, “పరలోకపు దేవుడే మాకు విజయాన్ని ఇస్తారు కాబట్టి ఆయన సేవకులమైన మేము పునర్నిర్మాణం మొదలుపెడతాము. మీకు యెరూషలేములో భాగం గాని, చారిత్రాత్మకమైన హక్కు గాని లేదు” అని వారితో చెప్పాను. \c 3 \s1 గోడ కట్టినవారు \p \v 1 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సోదరులైన యాజకులును వెళ్లి గొర్రెల గుమ్మాన్ని కట్టి ప్రతిష్ఠించి దాని తలుపులు నిలబెట్టారు. వందవ గోపురం వరకు, హనానేలు గోపురం వరకు వారు నిర్మించి ప్రతిష్ఠించారు. \v 2 ఆ ప్రక్కనే యెరికో పట్టణస్థులు కట్టారు. వారి ప్రక్కన ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టాడు. \b \p \v 3 చేప గుమ్మాన్ని హస్సెనాయా కుమారులు తిరిగి కట్టారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు అమర్చారు. \v 4 వారి ప్రక్క భాగంలో హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు మరమ్మత్తు చేశాడు. అతని తర్వాత మెషేజబేలుకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లాము, ఆ ప్రక్కన బయనా కుమారుడైన సాదోకు వరుసగా బాగుచేశారు. \v 5 ఆ ప్రక్క భాగాన్ని తెకోవాకు చెందినవారు బాగుచేశారు. అయితే తమ అధిపతుల క్రింద పనిని చేయడానికి వారి అధికారులు ఒప్పుకోలేదు. \b \p \v 6 యెషానా\f + \fr 3:6 \fr*\ft అంటే \ft*\fqa పాతది\fqa*\f* గుమ్మాన్ని పాసెయ కుమారుడైన యెహోయాదా బెసోద్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు. \v 7 ఆ ప్రక్క నుండి గిబియోను, మిస్పా పట్టణస్థులైన గిబియోనీయుడైన మెలట్యా, మేరోనోతీయుడైన యాదోను బాగుచేశారు. యూఫ్రటీసు నది అవతలి అధిపతుల ఆధీనంలో ఉన్న స్థలాల వరకు వారు బాగుచేశారు. \v 8 ఆ ప్రక్క భాగాన్ని కంసాలివాడైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేశాడు. అతని ప్రక్కనే పరిమళద్రవ్యాలు తయారుచేసేవారిలో ఒకడైన హనన్యా బాగుచేశాడు. వారు విశాల గోడ వరకు యెరూషలేమును తిరిగి కట్టారు. \v 9 వీరి ప్రక్క భాగాన్ని యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేశాడు. \v 10 వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేశాడు. అతని ప్రక్కనే హషబ్నెయా కుమారుడైన హట్టూషు బాగుచేశాడు. \v 11 రెండవ భాగాన్ని, బట్టీల గోపురాన్ని హారీము కుమారుడైన మల్కీయా, పహత్-మోయాబు కుమారుడైన హష్షూబు బాగుచేశారు. \v 12 వారి ప్రక్క భాగంలో యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హల్లోహేషు కుమారుడైన షల్లూము అతని కుమార్తెల సహాయంతో బాగుచేశారు. \b \p \v 13 లోయ గుమ్మాన్ని హానూను, జానోహలో నివసిస్తున్నవారు బాగుచేశారు. వారు దానిని బాగుచేసి తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు. అంతే కాకుండా పెంట గుమ్మం వరకు వెయ్యి మూరల\f + \fr 3:13 \fr*\ft అంటే, సుమారు 450 మీటర్లు\ft*\f* గోడ కట్టారు. \b \p \v 14 పెంట గుమ్మాన్ని బేత్-హక్కెరెము ప్రదేశానికి అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా బాగుచేశాడు. అతడు దానికి మరమ్మత్తులు చేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు బిగించాడు. \b \p \v 15 నీటి ఊట గుమ్మాన్ని మిస్పా ప్రదేశానికి అధిపతియైన కొల్-హోజె కుమారుడైన షల్లూము బాగుచేశాడు. అతడు దానిని బాగుచేసి పైకప్పు వేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు అమర్చాడు. అంతే కాకుండా దావీదు పట్టణం నుండి క్రిందకు వెళ్లే మెట్ల వరకు రాజుగారి తోట దగ్గర సిలోయము కొలను గోడను అతడే నిర్మించాడు. \v 16 అతని ప్రక్క భాగం నుండి దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకు కట్టి ఉన్న కోనేరు వరకు, యుద్ధవీరుల ఇళ్ళ వరకు బేత్-సూరులో సగభాగానికి అధిపతియైన అజ్బూకు కుమారుడైన నెహెమ్యా బాగుచేశాడు. \p \v 17 అతని ప్రక్కనే లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేశాడు. అతని తర్వాతి భాగాన్ని కెయీలాలో సగభాగానికి అధిపతియైన హషబ్యా బాగుచేశాడు. \v 18 అతని ప్రక్క భాగాన్ని వారి బంధువులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేశాడు. అతడు కెయీలాలో సగభాగానికి అధిపతిగా ఉన్నాడు. \v 19 అతని తర్వాతి భాగాన్ని ఆయుధశాల మార్గానికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన మరొక భాగాన్ని మిస్పాకు అధిపతి యెషూవ కుమారుడైన ఏజెరు బాగుచేశాడు. \v 20 అతని ప్రక్కనే ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి గుమ్మం వరకు జక్కయి కుమారుడైన జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తిగా పని చేశాడు \v 21 ఆ ప్రక్కనే మరొక భాగాన్ని ఎల్యాషీబు ఇంటి గుమ్మం నుండి ఆ ఇంటి చివరి వరకు హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేశాడు. \p \v 22 అతని ప్రక్కనే చుట్టుప్రక్కల ఉన్న యాజకులు బాగుచేశారు. \v 23 వారి ప్రక్కనే బెన్యామీను హష్షూబు అనేవారు తమ ఇంటి ఎదుట ఉన్న భాగాన్ని మరమ్మత్తు చేశారు. వారి ప్రక్కనే అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా తన ఇంటి ప్రక్కన ఉన్న భాగాన్ని బాగుచేశాడు. \v 24 అతని ప్రక్కనే అజర్యా ఇంటి నుండి గోడ మలుపు మూల వరకు ఉన్న భాగాన్ని హేనాదాదు కుమారుడైన బిన్నూయి బాగుచేశాడు. \v 25 ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు. \v 26 ఓఫెలులో నివసిస్తున్న ఆలయ సేవకులు తూర్పున ఉన్న నీటిగుమ్మం ప్రక్కన, గోపురం దగ్గర బాగుచేశారు. \v 27 వారి తర్వాతి భాగాన్ని, గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న భాగం నుండి ఓఫెలు గోడ వరకు తెకోవాకు చెందినవారు బాగుచేశారు. \b \p \v 28 గుర్రపు గుమ్మానికి పైన తమ ఇళ్ళకు ఎదురుగా ఉన్న భాగాలను యాజకులందరు బాగుచేశారు. \v 29 వారి తర్వాత తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేశాడు. ఆ ప్రక్క భాగాన్ని తూర్పు గుమ్మాన్ని కాపలా కాసే షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేశాడు. \v 30 ఆ తర్వాత షెలెమ్యా కుమారుడైన హనన్యా, జాలాపు ఆరవ కుమారుడైన హానూను మరొక భాగాన్ని బాగుచేశారు. వారి తర్వాత తన గదికి ఎదురుగా ఉన్న భాగాన్ని బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశాడు. \v 31 అతని ప్రక్కనే ఆలయ సేవకుల ఇంటి నుండి, పరిశీలన గుమ్మానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకు కంసాలివాడైన మల్కీయా బాగుచేశాడు. \v 32 మూలన ఉన్న పై గది నుండి గొర్రెల గుమ్మం మధ్య వరకు కంసాలివారు, వ్యాపారులు బాగుచేశారు. \c 4 \s1 పునర్నిర్మాణానికి వ్యతిరేకత \p \v 1 మేము గోడ తిరిగి కడుతున్నామని విన్న సన్బల్లటు తీవ్రమైన కోపంతో ఊగిపోతూ యూదులను అవహేళన చేస్తూ, \v 2 తన స్నేహితుల ఎదుట సమరయ సైనికుల ఎదుట మాట్లాడుతూ, “ఈ బలహీనమైన యూదులు ఏం చేయగలరు? తమంతట తామే ఈ పని చేయగలరా? వారే బలి అర్పిస్తారా? ఒక రోజులోనే పనంతా చేసేస్తారా? కాలిపోయి చెత్తకుప్పగా పడి ఉన్న రాళ్లతో మళ్ళీ కడతారా?” అన్నాడు. \p \v 3 అతని ప్రక్కన నిలబడి ఉన్న అమ్మోనీయుడైన టోబీయా, “వారు కట్టిన గోడ మీదికి నక్క ఎక్కితే అది కూలిపోతుంది” అన్నాడు. \b \p \v 4 మా దేవా! ప్రార్థన వినండి, మేము తిరస్కరించబడిన వారము. వారి నిందలు వారి తలల మీదికే త్రిప్పండి. వారే పరాయి దేశానికి బందీలుగా పోవాలి! \v 5 వారు కడుతున్నవారిని అడ్డుకుని నీకు కోపం పుట్టించారు కాబట్టి వారి దోషాలను కప్పివేయకండి వారి పాపాలను తుడిచివేయకండి. \b \p \v 6 ప్రజలు హృదయపూర్వకంగా పనిచేశారు కాబట్టి సగం ఎత్తు వరకు గోడలు కట్టగలిగాము. \p \v 7 సన్బల్లటు, టోబీయా, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు యెరూషలేము గోడలు బాగుచేసే పని కొనసాగుతుందని, బీటలన్నిటిని మూసివేస్తున్నారని విన్నప్పుడు వారు చాలా కోప్పడ్డారు. \v 8 యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి పనిని అడ్డుకోవాలని వారంతా కలిసి కుట్రపన్నారు. \v 9 అయితే మేము మా దేవునికి ప్రార్థించి వారి నుండి కాపాడుకోడానికి రాత్రింబగళ్ళు కాపలా ఉంచాము. \p \v 10 అప్పుడు యూదా వారు, “పనివారి బలం తగ్గిపోతుంది. చెత్త చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక మేము గోడ కట్టలేం” అన్నారు. \p \v 11 మా శత్రువులు, “వారికి తెలిసేలోపు మనలను చూడకముందే, మనం వారి మధ్యకు వెళ్లి వారిని చంపి పని ఆపివేద్దాం” అని ఆలోచన చేశారు. \p \v 12 మా శత్రువులకు దగ్గరలో నివసించే యూదులు వచ్చి, “మీరు ఎటు తిరిగినా వారు మాపై దాడి చేస్తారు” అని పది కన్న ఎక్కువసార్లు చెప్పారు. \p \v 13 అందువల్ల గోడ వెనుక దిగువ ప్రాంతాల్లో పైనున్న స్థలాల్లో కుటుంబాల ప్రకారం వారికి కత్తులు ఈటెలు విల్లులు ఇచ్చి కాపలా కాయడానికి నియమించాను. \v 14 అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత నేను లేచి సంస్థానాధిపతులతో, అధికారులతో మిగిలిన ప్రజలందరితో, “మీరు భయపడకండి. గొప్పవాడు, అద్భుతమైన వాడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాల కోసం మీ కుమారులు కుమార్తెల కోసం, మీ భార్యల కోసం మీ ఇళ్ళ కోసం పోరాడండి” అని చెప్పాను. \p \v 15 తమ కుట్ర గురించి మాకు తెలిసిందని దేవుడు వారి కుట్ర భంగం చేశారని మా శత్రువులు వినగానే, మాలో ప్రతి ఒక్కరు తమ పని చేయడానికి గోడ దగ్గరకు వచ్చారు. \p \v 16 ఆ రోజు నుండి నా పనివారిలో సగం మంది పని చేస్తుండగా మిగతా సగం మంది ఈటెలు డాళ్లు విండ్లు కవచాలు ధరించి వచ్చారు. గోడ కట్టే యూదా కుటుంబాలన్నిటి వెనుక అధికారులు నిలబడి ఉన్నారు. \v 17 బరువులు మోసేవారు ఒక చేతితో తమ పని చేస్తూ మరో చేతితో ఆయుధం పట్టుకున్నారు. \v 18 కట్టే ప్రతి ఒక్కరు కడుతున్నప్పుడు తన కత్తి నడుముకు బిగించుకుని ఉన్నారు. బూర ఊదేవాడు నా దగ్గరే నిలబడ్డాడు. \p \v 19 అప్పుడు నేను సంస్థానాధిపతులతో, అధికారులతో, మిగిలిన వారితో, “మనం చేస్తున్న పని చాలా విస్తారమైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం చాలా దూరంగా ఉన్నాము. \v 20 కాబట్టి మీకు ఎక్కడ నుండి బూరధ్వని వినబడుతుందో అక్కడికి మీరందరు వచ్చి మాతో కలవాలి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తారు” అన్నాను. \p \v 21 ఆ విధంగా మేము పని చేశాము; మాలో సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకు ఈటెలు పట్టుకుని నిలబడ్డారు. \v 22 ఆ సమయంలో నేను ప్రజలతో, “ప్రతి వ్యక్తి తన పనివారితో కలసి రాత్రివేళ యెరూషలేములోనే ఉండాలి. అప్పుడు వారు రాత్రి మాకు కాపలాగా ఉంటారు, పగలు పని చేస్తారు” అని చెప్పాను. \v 23 ఈ విధంగా నేను గాని నా బంధువులు గాని నా సేవకులు గాని, నా వెంట ఉన్న కావలివారు గాని బట్టలు విప్పలేదు. నీరు త్రాగడానికి వెళ్లినప్పుడు కూడా ఎవరూ ఆయుధాన్ని వదిలిపెట్టలేదు. \c 5 \s1 పేదవారికి సహాయం చేసిన నెహెమ్యా \p \v 1 తర్వాత ప్రజలు వారి భార్యలు తమ తోటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. \v 2 కొందరు, “మేమూ, మా కుమారులు కుమార్తెలు కలిపి చాలామంది ఉన్నాము కాబట్టి మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇవ్వండి” అన్నారు. \p \v 3 మరికొందరు, “కరువు సమయంలో ధాన్యం పొందడానికి మేము మా పొలాలను ద్రాక్షతోటలను మా ఇళ్ళను తాకట్టు పెడుతున్నాం” అన్నారు. \p \v 4 ఇంకా కొందరు, “రాజుకు పన్ను చెల్లించడానికి మా పొలాలు ద్రాక్షతోటల మీద డబ్బు అప్పుగా తీసుకున్నాము. \v 5 మా శరీరం రక్తం మా తోటి యూదుల శరీరం రక్తం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల్లాంటివారు కారా? అయినా మా కుమారులను మా కుమార్తెలను బానిసలుగా ఉంచాల్సి వచ్చింది. ఇప్పటికే మా కుమార్తెలలో కొందరు బానిసలుగా ఉన్నారు కాని మా పొలాలు ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వారిని విడిపించడానికి మాకు శక్తి లేదు” అన్నారు. \p \v 6 వారి నిరసనలు ఫిర్యాదులు విని నేనెంతో కోప్పడ్డాను. \v 7 అయితే నేను వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించి సంస్థానాధిపతులను, అధికారులను పిలిచి, “మీరు సోదరుల నుండి వడ్డీ తీసుకుంటున్నారు” అని చెప్పి వారిని గద్దించి, వారి గురించి వెంటనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి, \v 8 “యూదేతరులకు అమ్మివేయబడిన మన తోటి యూదులను మా శక్తికొలది మేము విడిపించాము. మీరు మీ సొంత ప్రజలను అమ్ముతున్నారు; వారు మరలా మనకు అమ్మబడవచ్చా?” అని అడిగినప్పుడు వారేమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. \p \v 9 నేను ఇంకా మాట్లాడుతూ, “మీరు చేస్తున్న పని సరియైనది కాదు. యూదేతరులైన శత్రువుల నిందలు తప్పించుకోడానికి మన దేవునికి భయపడకుండా నడుచుకుంటారా? \v 10 నేను, నా సోదరులు నా పనివారు కూడా ప్రజలకు డబ్బు ధాన్యం అప్పుగా ఇచ్చాము. కాని ఆ అప్పులన్నీ రద్దు చేస్తున్నాము. \v 11 ఈ రోజే మీరు వారి దగ్గర నుండి తీసుకున్న పొలాలు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, ఇల్లు వారికి తిరిగి ఇచ్చేయండి. అలాగే వారి నుండి వసూలు చేసిన వడ్డీ డబ్బులు ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో నూనెలో ఒక శాతం వారికి అప్పగించండి” చెప్పాను. \p \v 12 అందుకు వారు, “మేము అన్ని తిరిగి ఇచ్చేస్తాము. వారి నుండి ఇక ఏమి ఆశించము. నీవు చెప్పినట్లే చేస్తాం” అన్నారు. \p అప్పుడు నేను యాజకులను పిలిపించి వారు చేసిన వాగ్దానం ప్రకారం చేస్తామని చెప్పి సంస్థానాధిపతులతో, అధికారులతో ప్రమాణం చేయించాను. \v 13 నేను కూడా నా బట్టలు దులిపి వారితో, “ఈ విధంగా దేవుడు తమ వాగ్దానాన్ని నెరవేర్చి వారందరిని వారి ఇళ్ళ నుండి ఆస్తినుండి దులిపి వేస్తారు. అప్పుడు వాడు ఏమి లేనివానిగా అవుతాడు” అని చెప్పాను. \p అప్పుడు అక్కడ సమావేశమైన వారంతా ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా తమ వాగ్దానం ప్రకారం చేశారు. \p \v 14 నేను యూదా దేశంలో వారికి అధిపతిగా నియమించబడినప్పటి నుండి అనగా అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నుండి ముప్పై రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాలు నేను గాని నా సోదరులు గాని అధిపతికి ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేదు. \v 15 నాకన్నా ముందు అధిపతులుగా ఉన్నవారు ప్రజలపై భారాన్ని మోపి వారి నుండి నలభై షెకెళ్ళ\f + \fr 5:15 \fr*\ft అంటే, సుమారు 460 గ్రాములు\ft*\f* వెండిని, ఆహారాన్ని ద్రాక్షరసాన్ని తీసుకునేవారు. వారి సహాయకులు కూడా ప్రజల మీద భారం మోపారు. అయితే దేవుని భయం ఉన్న నేను అలా చేయలేదు. \v 16 నేను శ్రద్ధగా గోడ పని చేశాను. నా పనివారు అంతా కలిసి అదే పని చేశారు. మేము\f + \fr 5:16 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa నేను\fqa*\f* భూమి సంపాదించుకోలేదు. \p \v 17 అంతేకాక, నా భోజనపు బల్ల దగ్గర చుట్టుప్రక్కల దేశాలవారు కాకుండా నూటయాభైమంది యూదులు భోజనం చేసేవారు. \v 18 ప్రతిరోజు ఒక ఎద్దు, ఆరు ఎంపిక చేసిన గొర్రెలు, కొన్ని కోళ్లు నా కోసం సిద్ధం చేసేవారు, పదిరోజులకు ఒకసారి అనేక రకాల ద్రాక్షరసాలను సమృద్ధిగా అందించేవారు. ఈ ప్రకారం చేసినా ప్రజల పని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి కాకుండా అధిపతికి ఇచ్చే ఆహారాన్ని నేను ఆశించలేదు. \p \v 19 నా దేవా, ఈ ప్రజల కోసం నేను చేసినదంతా నన్ను దయతో గుర్తుంచుకోండి. \c 6 \s1 పునర్నిర్మాణానికి కలిగిన మరింత వ్యతిరేకత \p \v 1 అప్పటికి నేను గుమ్మాలకు తలుపులు నిలబెట్టక పోయినప్పటికి, ఏ బీటలు లేకుండా గోడను పునర్నిర్మించానని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము, మరికొందరు మా మిగతా శత్రువులు విన్నారు. \v 2 సన్బల్లటు గెషెము, “రండి, మనం ఓనో సమతల మైదానంలో ఉన్న ఒక గ్రామంలో\f + \fr 6:2 \fr*\ft లేదా \ft*\fqa కెఫీరీము\fqa*\f* కలుసుకుందాం” అని నాకు సందేశం పంపారు. \p అయితే వారు నాకు హాని చేయాలని కుట్రపన్నారు; \v 3 కాబట్టి నేను వారికి, “నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, దానిని విడిచిపెట్టి మీ దగ్గరకు ఎందుకు రావాలి? లేను రాలేను” అని చెప్పి దూతతో కబురు పంపాను. \v 4 వారదే పనిగా నాలుగు సార్లు కబురు పంపారు. నేను ప్రతిసారి అదే జవాబు ఇచ్చాను. \p \v 5 అప్పుడు అయిదవసారి సన్బల్లటు తన పనివాని చేతికి తెరిచి ఉన్న ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడు. \v 6 దానిలో ఈ విధంగా వ్రాసి ఉంది: \pm “నీవు యూదులతో కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో గోడ కడుతున్నావని ప్రజల మధ్యలో వదంతి ఉంది. దానిని గెషెము నిరూపించాడు. అంతే కాకుండా దాని ప్రకారం నీవు వారికి రాజు కావాలని చూస్తున్నావు. \v 7 యూదాలో రాజు ఉన్నాడని యెరూషలేములో నీ గురించి ప్రకటించడానికి నీవు ప్రవక్తలను కూడా నియమించావు. ఈ విషయాలు రాజుకు తెలుస్తాయి కాబట్టి నీవు వస్తే ఈ విషయం గురించి మనం కలిసి మాట్లాడుకోవచ్చు.” \p \v 8 అప్పుడు నేను ఈ విధంగా జవాబు పంపించాను: “నీవు చెప్పినట్లుగా ఇక్కడ ఏమి జరుగలేదు; అవన్నీ మీరు ఊహించి కల్పించినవే” అని వారికి జవాబు పంపాను. \p \v 9 “వారి చేతులు పని చేసి బలహీనమైపోయి ఇక వారు ఆ పని చేయలేరు” అని భావించి వారు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు. \p అయితే నేను, “ఇప్పుడు నా చేతులను బలపరచు” అని ప్రార్థించాను. \p \v 10 ఒక రోజు నేను మెహేతబేలుకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా ఇంటికి వెళ్లాను. అతడు ఇంట్లోనే ఉన్నాడు. అతడు, “రాత్రివేళ నిన్ను చంపడానికి వారు వస్తున్నారు కాబట్టి మనం దేవుని మందిరం దగ్గర కలుసుకొని గర్భాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకుందాం” అని చెప్పాడు. \p \v 11 కాని నేను, “నాలాంటివాడు పారిపోవాలా? లేదా నా లాంటివాడు ప్రాణాలు కాపాడుకోడానికి గర్భాలయంలోకి వెళ్లి దాక్కోవాలా? నేను వెళ్లను” అన్నాను. \v 12 దేవుడు అతన్ని పంపించలేదని నేను గ్రహించాను. నాకు వ్యతిరేకంగా ప్రవచించడానికి టోబీయా సన్బల్లటు అతనికి లంచం ఇచ్చారు. \v 13 నేను భయపడి అతడు చెప్పినట్లు చేసి పాపం చేస్తే వారు నన్ను నిందించి నాకు చెడ్డ పేరు తీసుకురావాలని లంచమిచ్చి అతన్ని నియమించుకున్నారు. \b \p \v 14 నా దేవా, టోబీయా సన్బల్లటు చేసిన దానిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి; నన్ను బెదిరించడానికి ప్రయత్నించిన ఈ ప్రవక్తలను, నోవద్యా అనే ప్రవక్తిని కూడా జ్ఞాపకం చేసుకోండి. \v 15 ఈ విధంగా ఏలూలు నెల ఇరవై అయిదవ తేదీన అనగా యాభై రెండు రోజులకు గోడ కట్టడం పూర్తయ్యింది. \s1 పూర్తయైన గోడ మీద వ్యతిరేకత \p \v 16 ఈ సంగతి విన్న మా శత్రువులు చుట్టుప్రక్కల దేశాలు మా దేవుని సహాయంతో పని పూర్తయ్యిందని గ్రహించి చాలా భయపడి ధైర్యం కోల్పోయారు. \p \v 17 ఆ రోజుల్లో యూదా సంస్థానాధిపతులు టోబీయాకు పదే పదే ఉత్తరాలు పంపుతూ ఉండేవారు. టోబీయా కూడా వారికి జవాబులు పంపేవాడు. \v 18 అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. అంతే కాకుండా అతని కుమారుడైన యెహోహనాను బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. కాబట్టి యూదా వారిలో చాలామంది అతనికి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేశారు. \v 19 అంతేకాక వారు నా దగ్గరకు వచ్చి అతని గురించి పొగుడుతూ నేను చెప్పేవాటన్నిటిని అతనికి చేరవేసేవారు. నన్ను బెదిరించడానికే టోబీయా ఉత్తరాలు పంపేవాడు. \c 7 \p \v 1 నేను గోడ కట్టిన తర్వాత తలుపులు నిలబెట్టి, ద్వారపాలకులను సంగీతకారులను, లేవీయులను నియమించాను. \v 2 నా సోదరుడైన హనానీతో పాటు కోటకు అధిపతియైన హనన్యాను యెరూషలేముపై అధికారులుగా నియమించాను. హనన్యా నమ్మకమైనవాడు, అందరికంటే ఎక్కువగా దేవుని భయం ఉన్నవాడు. \v 3 నేను వారితో, “బాగా ప్రొద్దెక్కే వరకు యెరూషలేము గుమ్మాల తలుపులు తీయకూడదు. ప్రజలు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి అడ్డగడియలు పెట్టాలి. అలాగే యెరూషలేములో నివసించేవారు వారంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా కాపలా కాసేలా నియమించాలి” అని చెప్పాను. \s1 చెరనుండి తిరిగి వచ్చినవారి జాబితా \p \v 4 అప్పుడు ఆ పట్టణమెంతో విశాలంగా పెద్దగా ఉండేది కాని అక్కడ కొంతమందే ఉండేవారు. ఇంకా ఎవరూ ఇల్లు కట్టుకోలేదు. \v 5 కుటుంబాల ప్రకారం నమోదు చేయాలనే ఆలోచన దేవుడు నాకు పుట్టించగా నేను సంస్థానాధిపతులను అధికారులను ప్రజలను సమకూర్చాను. అంతలో ముందు వచ్చినవారి కుటుంబ వివరాలు ఉన్న ఒక గ్రంథం నాకు దొరికింది. దానిలో ఉన్న వివరాలు: \b \lh \v 6 బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి, \v 7 జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు: \b \lh ఇశ్రాయేలు ప్రజల పురుషుల జాబితా: \li1 \v 8 పరోషు వారసులు 2,172; \li1 \v 9 షెఫట్యా వారసులు 372; \li1 \v 10 ఆరహు వారసులు 652; \li1 \v 11 పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,818; \li1 \v 12 ఏలాము వారసులు 1,254; \li1 \v 13 జత్తూ వారసులు 845; \li1 \v 14 జక్కయి వారసులు 760; \li1 \v 15 బిన్నూయి వారసులు 648; \li1 \v 16 బేబై వారసులు 628; \li1 \v 17 అజ్గాదు వారసులు 2,322; \li1 \v 18 అదోనీకాము వారసులు 667; \li1 \v 19 బిగ్వయి వారసులు 2,067; \li1 \v 20 ఆదీను వారసులు 655; \li1 \v 21 అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98; \li1 \v 22 హాషుము వారసులు 328; \li1 \v 23 బేజయి వారసులు 324; \li1 \v 24 హారీపు వారసులు 112; \li1 \v 25 గిబియోను వారసులు 95. \li1 \v 26 బేత్లెహేము వారసులు: \li1 నెటోపా వారసులు 188; \li1 \v 27 అనాతోతు వారసులు 128; \li1 \v 28 బేత్-అజ్మావెతు వారసులు 42; \li1 \v 29 కిర్యత్-యారీము, కెఫీరా బెయేరోతు వారసులు 743; \li1 \v 30 రామా, గెబా వారసులు 621; \li1 \v 31 మిక్మషు వారసులు 122; \li1 \v 32 బేతేలు, హాయి వారసులు 123; \li1 \v 33 రెండవ నెబో వారసులు 52; \li1 \v 34 మరొక ఏలాము వారసులు 1,254; \li1 \v 35 హారీము వారసులు 320; \li1 \v 36 యెరికో వారసులు 345; \li1 \v 37 లోదు, హదీదు, ఓనో వారసులు 721; \li1 \v 38 సెనాయా వారసులు 3,930. \b \lh \v 39 యాజకులు: \li1 యెషూవ కుటుంబీకుడైన యెదాయా వారసులు 973; \li1 \v 40 ఇమ్మేరు వారసులు 1,052; \li1 \v 41 పషూరు వారసులు 1,247; \li1 \v 42 హారీము వారసులు 1,017. \b \lh \v 43 లేవీయులు: \li1 యెషూవ వారసులు (హోదవ్యా కుటుంబం, కద్మీయేలు కుటుంబం నుండి) 74. \b \lh \v 44 సంగీతకారులు: \li1 ఆసాపు వారసులు 148. \b \lh \v 45 ఆలయ ద్వారపాలకులు: \li1 షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 138. \b \lh \v 46 ఆలయ సేవకులు: \li1 జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు, \li1 \v 47 కేరోసు, సీయహా, పాదోను వారసులు, \li1 \v 48 లెబానా, హగాబా, షల్మయి వారసులు, \li1 \v 49 హానాను, గిద్దేలు, గహరు వారసులు, \li1 \v 50 రెవాయా, రెజీను, నెకోదా వారసులు, \li1 \v 51 గజ్జాము, ఉజ్జా, పాసెయ వారసులు, \li1 \v 52 బేసాయి, మెహూనీము, నెఫూసీము వారసులు, \li1 \v 53 బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు, \li1 \v 54 బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు, \li1 \v 55 బర్కోసు, సీసెరా, తెమహు వారసులు, \li1 \v 56 నెజీయహు, హటీపా వారసులు. \lh \v 57 సొలొమోను సేవకుల వారసులు: \li1 సొటయి, సోఫెరెతు, పెరీదా వారసులు \li1 \v 58 యహలా, దర్కోను, గిద్దేలు వారసులు, \li1 \v 59 షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, ఆమోను వారసులు. \lf \v 60 ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392. \b \lh \v 61 తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు, అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు: \li1 \v 62 దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు మొత్తం 642. \b \lh \v 63 యాజకుల వారసులు: \li1 హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు) వారసులు. \lf \v 64 వీరు తమ వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు. \v 65 కాబట్టి ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు. \b \lf \v 66 సమూహం మొత్తం సంఖ్య 42,360, \v 67 వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 245 మంది. \v 68 వారి గుర్రాలు 736, కంచరగాడిదలు\f + \fr 7:68 \fr*\ft \+xt ఎజ్రా 2:66\+xt* కూడా చూడండి\ft*\f* 245, \v 69 ఒంటెలు 435, గాడిదలు 6,720. \b \pm \v 70 కుటుంబ పెద్దలలో కొందరు పనికి సహాయపడ్డారు. అధిపతి ఖజానాకు 1,000 డారిక్కుల\f + \fr 7:70 \fr*\ft అంటే, సుమారు 8.4 కి. గ్రా. లు\ft*\f* బంగారం, 50 పళ్లాలు, 530 యాజక వస్త్రాలు ఇచ్చాడు. \v 71 కుటుంబ పెద్దలలో కొంతమంది పని కోసం ఖజానాకు 20,000 డారిక్కుల\f + \fr 7:71 \fr*\ft అంటే, సుమారు 170 కి. గ్రా. లు\ft*\f* బంగారం, 2,200 మీనాల\f + \fr 7:71 \fr*\ft అంటే, సుమారు 1 1/3 టన్నులు\ft*\f* వెండి ఇచ్చారు. \v 72 మిగిలినవారంతా కలిసి 20,000 డారిక్కుల బంగారం 2,000 మీనాల\f + \fr 7:72 \fr*\ft అంటే, సుమారు 1 1/4 టన్నులు\ft*\f* వెండి, 67 యాజక వస్త్రాలు ఇచ్చారు. \pm \v 73 యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు, కొంతమంది ప్రజలతో పాటు మిగిలిన ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. \s1 ధర్మశాస్త్రాన్ని చదివిన ఎజ్రా \p ఇశ్రాయేలీయులంతా ఏడవ నెల రాగానే తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు, \c 8 \nb \v 1 ప్రజలంతా ఏకమనస్సుతో నీటిగుమ్మం ఎదుట ఉన్న చావడికి వచ్చారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురమ్మని వారు ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాతో చెప్పారు. \p \v 2 యాజకుడైన ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరు ఉన్న సమాజం ఎదుటకు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకువచ్చాడు. \v 3 అతడు నీటిగుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అక్కడ ఉన్న విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు. వారందరు ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా విన్నారు. \p \v 4 అప్పుడు ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా చెక్కతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవారు ఉన్నారు; ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవారు ఉన్నారు. \p \v 5 ప్రజలందరికి కనిపించేలా వారందరి కన్నా ఎత్తులో ఎజ్రా నిలబడి గ్రంథాన్ని తెరిచాడు. అతడు గ్రంథాన్ని విప్పగానే ప్రజలంతా లేచి నిలబడ్డారు. \p \v 6 ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించగా ప్రజలందరు చేతులెత్తి, “ఆమేన్! ఆమేన్!” అని అంటూ తమ తలలు నేలకు వంచి యెహోవాను ఆరాధించారు. \p \v 7 ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు. \v 8 వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి ప్రజలు దానిని గ్రహించేలా దాని అర్థాన్ని వివరించారు. \p \v 9 ప్రజలందరు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే ఏడ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అధిపతియైన నెహెమ్యా, యాజకుడూ ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా, ప్రజలు గ్రహించేలా బోధించి లేవీయులు వారందరితో, “ఈ రోజు మన దేవుడైన యెహోవాకు పరిశుద్ధ దినం కాబట్టి మీరు దుఃఖపడకండి ఏడవకండి” అని చెప్పారు. \p \v 10 నెహెమ్యా వారితో, “వెళ్లి, రుచికరమైన ఆహారాన్ని తిని మధురమైన వాటిని త్రాగి ఆనందించండి. తమ కోసం ఏమి సిద్ధం చేసుకోని వారికి కొంత భాగాన్ని పంపించండి. ఈ రోజు యెహోవాకు పరిశుద్ధ దినము. యెహోవాలో ఆనందించడమే మీ బలం కాబట్టి మీరు దుఃఖపడకండి” అన్నాడు. \p \v 11 లేవీయులు ప్రజలందరినీ ఓదార్చుతూ, “మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఇది పరిశుద్ధమైన రోజు కాబట్టి దుఃఖపడకండి” అన్నారు. \p \v 12 ఆ తర్వాత ప్రజలందరు తమకు తెలియజేసిన మాటలన్నీ గ్రహించారు కాబట్టి తినడానికి త్రాగడానికి లేనివారికి పంపించడానికి, గొప్ప సంతోషాన్ని అనుభవించడానికి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. \p \v 13 నెలలో రెండవ రోజున కుటుంబ పెద్దలు యాజకులు లేవీయులతో కలిసి ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా దగ్గరకు ధర్మశాస్త్రంలోని మాటల నుండి జ్ఞానం పొందాలని వచ్చారు. \v 14 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో ఏడవ నెల పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు తాత్కాలిక నివాసాల్లో నివసించాలని వ్రాయబడి ఉండడం చూసి, \v 15 వెంటనే వారు తమ పట్టణాల్లో యెరూషలేములో ఈ విధంగా ప్రకటించారు: “మీరు పర్వత ప్రాంతానికి వెళ్లి ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్టు కొమ్మలు, ఈత చెట్టు కొమ్మలు, గుబురుగా ఉండే చెట్టు కొమ్మలు తీసుకువచ్చి వ్రాయబడిన విధంగా తాత్కాలిక నివాసాలు\f + \fr 8:15 \fr*\ft \+xt లేవీ 23:37-40\+xt* చూడండి\ft*\f* నిర్మించాలి.” \p \v 16 అలాగే ప్రజలందరు వెళ్లి కొమ్మలు తెచ్చి తమ ఇళ్ళ కప్పుల మీద, తమ వాకిటిలో, దేవుని ఆలయ ఆవరణంలో, నీటి గుమ్మపు వీధిలో, ఎఫ్రాయిం గుమ్మపు వీధిలో తాత్కాలిక నివాసాలు కట్టుకున్నారు. \v 17 చెర నుండి తిరిగి వచ్చినవారి సమూహం తాత్కాలిక నివాసాలు కట్టుకుని వాటిలో నివసించారు. నూను కుమారుడైన యెహోషువ కాలం నుండి ఆ రోజు వరకు ఇశ్రాయేలీయులు ఎప్పుడు అలా చేయలేదు. వారు గొప్ప సంతోషాన్ని అనుభవించారు. \p \v 18 మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతిరోజు ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు. వారు ఏడు రోజులు పండుగ చేసుకుని నియమించిన ప్రకారం ఎనిమిదవ రోజున పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు. \c 9 \s1 తమ పాపాలు ఒప్పుకున్న ఇశ్రాయేలీయులు \p \v 1 అదే నెల ఇరవై నాలుగవ రోజున ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలమీద బూడిద వేసుకుని వచ్చారు. \v 2 ఇశ్రాయేలీయులు విదేశీయులకు వేరుగా నిలబడి తమ పాపాలను తమ పూర్వికుల పాపాలను ఒప్పుకున్నారు. \v 3 వారు ఉన్న చోటే నిలబడి ఒక పూటంతా తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకుంటూ తమ దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ గడిపారు. \v 4 లేవీయులలో యెషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ అనేవారు మెట్ల మీద నిలబడి తమ దేవుడైన యెహోవాకు బిగ్గరగా మొరపెట్టారు. \v 5 అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా అనేవారు మెట్ల మీద నిలబడి, “లేచి నిలబడండి, మీకు నిత్యం దేవునిగా ఉన్న యెహోవాను స్తుతించండి” అని చెప్పి ఇలా స్తుతించారు: \pm “మీ దివ్యమైన నామం స్తుతించబడుతుంది. సమస్త ఆశీర్వాదాలకు స్తుతులకు మించి హెచ్చింపబడుతుంది. \v 6 మీరు మాత్రమే యెహోవా. మీరే మహాకాశాలను, ఆకాశాలను, వాటి నక్షత్ర సమూహాలన్నిటిని, భూమిని, దానిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. వాటన్నిటికి జీవాన్ని ఇచ్చారు. పరలోక సమూహాలన్ని మిమ్మల్ని ఆరాధిస్తున్నాయి. \pm \v 7 “యెహోవా దేవా, అబ్రామును ఏర్పరచుకుని, అతన్ని కల్దీయుల ఊరు అనే చోటు నుండి బయటకు తీసుకువచ్చి అతనికి అబ్రాహాము అని పేరు పెట్టింది మీరే. \v 8 అతని హృదయం మీ పట్ల నమ్మకంగా ఉందని గుర్తించి కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయుల దేశాన్ని అతని వారసులకు ఇస్తానని అతనితో నిబంధన చేశారు. మీరు నీతిమంతులు కాబట్టి మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. \pm \v 9 “మా పూర్వికులు ఈజిప్టులో శ్రమపడడం మీరు చూశారు; ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విన్నారు. \v 10 ఫరో, అతని సేవకులు, అతని దేశ ప్రజలందరు ఇశ్రాయేలీయుల పట్ల ఎంత అహంకారంతో ప్రవర్తించారో మీకు తెలుసు కాబట్టి మీరు వారి ఎదుట అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకక్రియలు చేశారు. ఈ రోజు వరకు మీ నామాన్ని ఘనపరిచేలా చేశారు. \v 11 మీ ప్రజల ఎదుట సముద్రాన్ని రెండుగా చీల్చగా వారు పొడినేల మీద నడిచివెళ్లారు. లోతైన నీళ్లలో రాయి వేసినట్లుగా మీ ప్రజలను వెంటాడుతూ వచ్చిన వారిని అగాధ జలాల్లో పడేశారు. \v 12 మీరు పగలు మేఘస్తంభంలా రాత్రి వారు వెళ్లే మార్గంలో వెలుగు ఇవ్వడానికి అగ్ని స్తంభంలా వారిని నడిపించారు. \pm \v 13 “మీరు సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి పరలోకం నుండి వారితో మాట్లాడారు. వారికి న్యాయమైన సరియైన నియమాలు, చట్టాలు మేలైన శాసనాలు, ఆజ్ఞలు ఇచ్చారు. \v 14 పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని మీరు వారికి తెలియజేశారు. మీ సేవకుడైన మోషే ద్వారా ఆజ్ఞలు, శాసనాలు, ధర్మశాస్త్రాన్ని నియమించారు. \v 15 మీరు వారి ఆకలి తీర్చడానికి పరలోకం నుండి ఆహారాన్ని ఇచ్చి దాహం తీర్చడానికి బండలో నుండి నీళ్లు రప్పించారు; మీరు వారికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి స్వాధీనం చేసుకోమని చెప్పారు. \pm \v 16 “అయితే మా పూర్వికులు అహంకారంతో ప్రవర్తించి మీ ఆజ్ఞలకు లోబడకుండా తిరుగుబాటు చేశారు. \v 17 మీకు అవిధేయులుగా ఉండి, మీరు వారి మధ్య చేసిన అద్భుతాలను మరచిపోయారు. ఈజిప్టులో తమ బానిసత్వానికి తిరిగి వెళ్లడానికి ఒక నాయకుని ఏర్పరచుకుని తిరుగుబాటు చేశారు. అయితే మీరు క్షమించే దేవుడవు దయా కనికరం ఉన్నవారు, త్వరగా కోప్పడరు, అపరిమితమైన ప్రేమ ఉన్నవారు కాబట్టి వారిని విడిచిపెట్టలేదు. \v 18 వారు పోతపోసిన దూడను తయారుచేసి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన దేవుడు ఇదే అని చెప్పినా తీవ్రమైన దేవదూషణ చేసినా మీరు వారిని విడిచిపెట్టలేదు. \pm \v 19 “మీ గొప్ప కనికరాన్ని బట్టి ఎడారిలో మీరు వారిని విడిచిపెట్టలేదు. పగలు మేఘస్తంభం దారి చూపడం ఆపలేదు; రాత్రి అగ్నిస్తంభం వారి మార్గాలకు వెలుగివ్వడం మానలేదు. \v 20 వారికి బోధించడానికి మీరు మీ దయగల ఆత్మను ఇచ్చారు. మీరు వారికి ఇచ్చిన మన్నాను ఇవ్వడం మానలేదు. వారికి నీళ్లు ఇచ్చి వారి దాహం తీర్చారు. \v 21 మీరు నలభై సంవత్సరాల పాటు వారిని పోషించారు. ఎడారిలో కూడా వారికి ఏమీ తక్కువ కాలేదు. వారి బట్టలు చిరిగిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. \pm \v 22 “మీరు వారికి రాజ్యాలను దేశాలను ఇచ్చారు. మారుమూల సరిహద్దులను కూడా వారికి కేటాయించారు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్ని బాషాను రాజు ఓగు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. \v 23 మీరు వారి పిల్లలను నక్షత్రాలంత విస్తారంగా చేసి, వారి పితరులకు మీరు వెళ్లి స్వాధీనం చేసుకుంటారని వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకువచ్చారు. \v 24 వారి పిల్లలు ఆ దేశంలోనికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకున్నారు. మీరు ఆ దేశంలో నివసిస్తున్న కనానీయులను వారి ఎదుట అణచివేశారు. తమకు నచ్చిన విధంగా చేయడానికి కనానీయులను వారి రాజులతో ఆ దేశ ప్రజలతో కలిపి వారి చేతికి అప్పగించారు. \v 25 వారు కోటగోడలు ఉన్న పట్టణాలను సారవంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇల్లు, త్రవ్విన బావులు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, విస్తారమైన పండ్లచెట్లు స్వాధీనపరచుకున్నారు. వారు తిని తృప్తి చెందారు. మీ గొప్ప మంచితనాన్ని చూసి ఆనందించారు. \pm \v 26 “అయినా వారు మీ పట్ల అవిధేయత చూపించి మీపై తిరుగుబాటు చేశారు; మీ ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. మీ వైపు తిరగాలని వారిని హెచ్చరించిన ప్రవక్తలను చంపారు; ఘోరమైన దేవదూషణ చేశారు. \v 27 కాబట్టి మీరు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించారు. వారు బాధించబడిన సమయంలో మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. మీ గొప్ప కృపను బట్టి వారిని శత్రువు చేతిలో నుండి విడిపించడానికి వారికి విమోచకులను ఇచ్చారు. \pm \v 28 “వారికి విశ్రాంతి లభించిన వెంటనే మీ ఎదుట చెడు చేశారు కాబట్టి శత్రువులు వారి మీద ప్రభుత్వం చేసేలా వారిని తిరిగి శత్రువు చేతికే అప్పగించారు. వారు తిరిగి మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. కరుణ చూపించి అనేకసార్లు వారిని విడిపించారు. \pm \v 29 “వారిని మీ ధర్మశాస్త్రం వైపు మరలించడానికి మీరు వారిని హెచ్చరించారు, అయితే వారు గర్వించి మీ ఆజ్ఞలకు లోబడక ‘వాటిని పాటించే మనుష్యులు వాటి ద్వారా జీవిస్తాడు’ అని మీరు చెప్పిన మీ శాసనాలకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు. \v 30 మీరు వారిని ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో సహించారు. మీ ఆత్మ చేత ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. అయినా వారు మీ మాట వినలేదు, కాబట్టి మీరు వారిని వారి పొరుగు దేశాలకు అప్పగించారు. \v 31 అయితే మీ గొప్ప కనికరాన్ని బట్టి మీరు వారిని పూర్తిగా నాశనం చేయలేదు, విడిచిపెట్టలేదు. మీరు దయా కనికరంగల దేవుడవు. \pm \v 32 “మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు. \v 33 మాకు జరిగినదాని అంతటిలో మీరు నీతిమంతులుగానే ఉన్నారు; మేము దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు మీరు నమ్మకంగా ప్రవర్తించారు. \v 34 మా రాజులు, మా నాయకులు, మా యాజకులు, మా పూర్వికులు మీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు; మీరు పాటించమని హెచ్చరించిన మీ ఆజ్ఞలు శాసనాలను లక్ష్యపెట్టలేదు. \v 35 వారు తమ రాజ్య పరిపాలనలోను మీరు వారికిచ్చిన విశాలమైన సారవంతమైన దేశంలో మీరు వారిపట్ల చేసిన గొప్ప మేలులు అనుభవిస్తూ కూడా వారు మిమ్మల్ని సేవించలేదు, తమ దుష్టత్వాన్ని విడిచి మీ వైపు తిరగలేదు. \pm \v 36 “ఇదిగో ఈ రోజు మేము బానిసలుగా ఉన్నాము, దాని ఫలాలను తిని దానిలో ఉన్న మంచి వాటన్నిటిని అనుభవించమని మా పూర్వికులకు మీరిచ్చిన దేశంలో మేము బానిసలుగా ఉన్నాము. \v 37 మా పాపాల కారణంగా దాని అపారమైన పంటంతా మీరు మామీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరాల మీద మా పశువులమీద అధికారం చెలాయిస్తున్నారు. మేము చాలా శ్రమ అనుభవిస్తున్నాము. \s1 ప్రజల ఒప్పందము \p \v 38 “వీటన్నిటిని బట్టి మేము వ్రాతపూర్వకంగా ఒక్క ఖచ్చితమైన ఒప్పందాన్ని చేసుకున్నాము; మా నాయకులు మా లేవీయులు మా యాజకులు దానిపై తమ ముద్రలు వేసి ఆమోదించారు.” \b \c 10 \p \v 1 ముద్ర వేసినవారు వీరే: \b \li1 అధిపతి: \li2 హకల్యా కుమారుడైన నెహెమ్యా. \b \li2 సిద్కియా, \v 2 శెరాయా, అజర్యా, యిర్మీయా, \li2 \v 3 పషూరు, అమర్యా, మల్కీయా, \li2 \v 4 హట్టూషు, షెబన్యా, మల్లూకు, \li2 \v 5 హారీము, మెరేమోతు, ఓబద్యా, \li2 \v 6 దానియేలు, గిన్నెతోను, బారూకు, \li2 \v 7 మెషుల్లాము, అబీయా, మీయామిను, \li2 \v 8 మయజ్యా, బిల్గయి, షెమయా. \li1 వీరంతా యాజకులు. \b \li1 \v 9 లేవీయులు: \li2 అజన్యా కుమారుడైన యెషూవ, హేనాదాదు కుమారులు బిన్నూయి, కద్మీయేలు, \li2 \v 10 వారి బంధువులు షెబన్యా, \li2 హోదీయా, కెలిథా, పెలాయా, హానాను, \li2 \v 11 మీకా, రెహోబు, హషబ్యా, \li2 \v 12 జక్కూరు, షేరేబ్యా, షెబన్యా, \li2 \v 13 హోదీయా, బానీ, బెనీను. \b \li1 \v 14 ప్రజల నాయకుల నుండి: \li2 పరోషు, పహత్-మోయాబు, ఏలాము, జత్తూ, బానీ, \li2 \v 15 బున్నీ, అజ్గాదు, బేబై, \li2 \v 16 అదోనియా, బిగ్వయి, ఆదీను, \li2 \v 17 అటేరు, హిజ్కియా, అజ్జూరు, \li2 \v 18 హోదీయా, హాషుము, బేజయి, \li2 \v 19 హారీపు, అనాతోతు, నేబై, \li2 \v 20 మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు, \li2 \v 21 మెషేజబేలు, సాదోకు, యద్దూవ, \li2 \v 22 పెలట్యా, హానాను, అనాయా, \li2 \v 23 హోషేయ, హనన్యా, హష్షూబు, \li2 \v 24 హల్లోహేషు, పిల్హా, షోబేకు, \li2 \v 25 రెహూము, హషబ్నా, మయశేయా, \li2 \v 26 అహీయా, హానాను, ఆనాను, \li2 \v 27 మల్లూకు, హారీము, బయనా. \b \pm \v 28 మిగిలిన ప్రజలు అనగా, యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు దేవుని ధర్మశాస్త్రం బట్టి తమను ఆ దేశ ప్రజల నుండి వేరు చేసుకున్న వారందరు గ్రహించగలిగిన తమ భార్యలు కుమారులు కుమార్తెలతో పాటు, \v 29 తమ బంధువులైన అధిపతులతో కలిసివచ్చి దేవుని సేవకుడైన మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని, మా ప్రభువైన యెహోవా ఆజ్ఞలకు నిబంధనలకు శాసనాలకు లోబడతామని శపథం చేసి ప్రమాణం చేశారు. \pm \v 30 “పొరుగు దేశ ప్రజలతో మా కుమార్తెలకు పెళ్ళి చేయము, వారి కుమార్తెలతో మా కుమారులకు పెళ్ళి చేయము. \pm \v 31 “పొరుగు దేశ ప్రజలు విశ్రాంతి దినాన వారి వస్తువులు గాని ధాన్యం గాని అమ్మడానికి తెస్తే విశ్రాంతి దినాన కాని పరిశుద్ధ దినాన గాని మేము వాటిని కొనము. ప్రతి ఏడవ సంవత్సరం భూమిని దున్నకుండా వదిలివేస్తాము, అన్ని అప్పులు రద్దు చేస్తాము. \pm \v 32 “మన దేవుని ఆలయ సేవ కోసం ప్రతి సంవత్సరం ఒక షెకెలు\f + \fr 10:32 \fr*\ft అంటే, సుమారు 4 గ్రాములు\ft*\f* వెండిలో మూడవ వంతు ఇస్తామని నిబంధన చేసుకున్నాము. \v 33 ఈ డబ్బును బల్ల మీద పెట్టే రొట్టెలకు; నిత్యం అర్పించే ధాన్యార్పణలకు దహనబలులకు; విశ్రాంతి దినాల్లో, అమావాస్య పండుగ నియమించబడిన పండుగల్లో అర్పణలకు; పరిశుద్ధ అర్పణలకు; ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహార బలులకు;\f + \fr 10:33 \fr*\ft లేదా \ft*\fqa శుద్ధీకరణ అర్పణ\fqa*\f* మన దేవుని ఆలయ పనులకు ఖర్చు చేస్తాము. \pm \v 34 “మా కుటుంబాలలో వంతు ప్రకారం ప్రతి సంవత్సరం నిర్ణయించబడిన సమయంలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మన దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహించడానికి కావలసిన కట్టెలు ఎవరెవరు తీసుకురావాలో నిర్ణయించడానికి మేము అనగా యాజకులు లేవీయులు ప్రజలు చీట్లు వేసుకున్నాము. \pm \v 35 “ప్రతి సంవత్సరం పంటలో ప్రథమ ఫలాన్ని అన్ని పండ్లచెట్ల ప్రథమ ఫలాలను యెహోవా ఆలయానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. \pm \v 36 “అలాగే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మా కుమారులలో మొదట పుట్టినవాన్ని, మా పశువుల్లో, మందలలో గొర్రెలలో మొదట పుట్టిన వాటిని యెహోవా ఆలయానికి అక్కడ పరిచర్య చేస్తున్న యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. \pm \v 37 “అంతే కాకుండా, మా పిండిలో, భోజన అర్పణలలో, అన్ని రకాల మా పండ్లచెట్ల ఫలాల్లో, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో అన్నిటిలో ప్రథమ ఫలాన్ని మన దేవుని మందిరపు గిడ్డంగులకు యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. పదవ భాగాన్ని లేవీయుల దగ్గరకి తీసుకురావాలని, మేము పని చేసే అన్ని పట్టణాల్లో పదవ భాగాన్ని సేకరించి లేవీయులకు ఇవ్వాలని నిర్ణయించాము. \v 38 లేవీయులు పదవ భాగాన్ని తీసుకునేటప్పుడు వారితో పాటు అహరోను వారసుడైన ఒక యాజకుడు ఉండాలని, లేవీయులు ఆ పదవ భాగాలన్నిటిలో పదవ భాగాన్ని మన దేవుని ఆలయ గిడ్డంగులకు ఖజానాకు తీసుకురావాలి. \v 39 ఇశ్రాయేలీయులు, లేవీయులతో సహా ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షరసాన్ని, నూనెను విరాళంగా తీసుకువచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వారపాలకులు సంగీతకారులు వాటిని తీసుకుని పరిశుద్ధాలయపు ఉపకరణాలు ఉండే గిడ్డంగులలో ఉంచాలి. \pm “మేము మా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాము.” \c 11 \s1 యెరూషలేములో క్రొత్తగా నివసించేవారు \p \v 1 ప్రజల నాయకులు యెరూషలేములో స్థిరపడ్డారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకరు మాత్రమే పరిశుద్ధ యెరూషలేములో నివసించేలా మిగతా తొమ్మిదిమంది తమ సొంత పట్టణాల్లోనే నివసించేలా చీట్లు వేశారు. \v 2 యెరూషలేములో నివసించడానికి ఇష్టపూర్వకంగా వచ్చిన వారిని ప్రజలు దీవించారు. \b \lh \v 3 యెరూషలేములో స్థిరపడిన ప్రాంతీయ నాయకులు వీరే, (ఇశ్రాయేలీయులలో కొంతమంది, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు యూదా పట్టణాల్లో వివిధ పట్టణాల్లో ఉన్న తమ సొంత స్థలాల్లో నివసించారు, \v 4 యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు): \b \li1 యూదా వారసుల నుండి: \li2 అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు; \li2 \v 5 మయశేయా, ఇతడు షేలా వారసుడైన జెకర్యా కుమారుడైన యోయారీబుకు పుట్టిన అదాయా కుమారుడైన హజాయాకు పుట్టిన కొల్-హోజె కుమారుడైన బారూకు కుమారుడు. \li2 \v 6 యెరూషలేములో నివసించిన పెరెసు వారసులు 468 మంది, వీరంతా అసాధారణమైన పోరాట యోధులు. \li1 \v 7 బెన్యామీను వారసుల నుండి: \li2 సల్లు, ఇతడు యెషయా కుమారుడైన ఇతీయేలుకు పుట్టిన మయశేయా కుమారుడైన కోలాయాకు పుట్టిన పెదాయా కుమారుడైన యోవేదుకు పుట్టిన మెషుల్లాము కుమారుడు, \v 8 అతని అనుచరులైన గబ్బయి సల్లయి అనేవారితో కలిపి 928 మంది. \li2 \v 9 జిఖ్రీ కుమారుడైన యోవేలు వీరి అధికారి; హస్సెనూయా కుమారుడైన యూదా ఆ పట్టణపు నూతన భాగానికి ముఖ్య అధికారి. \li1 \v 10 యాజకుల నుండి: \li2 యోయారీబు కుమారుడైన యెదాయా, యాకీను; \li2 \v 11 శెరాయా దేవుని ఆలయానికి అధికారిగా ఉన్నాడు. ఇతడు అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడైన మెషుల్లాముకు పుట్టిన హిల్కీయా కుమారుడు; \v 12 ఆలయ పని చేసే వీరి బంధువులు 822 మంది; \li2 అదాయా, ఇతడు మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన జెకర్యా కుమారుడైన అమ్జీకు పుట్టిన పెలల్యా కుమారుడైన యెరోహాము కుమారుడు. \v 13 కుటుంబ పెద్దలుగా ఉన్న వీరి బంధువులు 242 మంది. \li2 అమష్షయి, ఇతడు ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమోతుకు పుట్టిన అహజై కుమారుడైన అజరేలు కుమారుడు. \v 14 అతని బంధువులు 128 మంది, వీరు అసాధారణ పోరాట యోధులు. \li2 హగ్గేదోలిము కుమారుడైన జబ్దీయేలు వీరి ముఖ్య అధికారి. \li1 \v 15 లేవీయుల నుండి: \li2 షెమయా, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడు. \li2 \v 16 దేవుని మందిరంలో బయటి పనులకు పర్యవేక్షకులుగా ఉన్న లేవీయుల పెద్దలు షబ్బెతై, యోజాబాదు; \li2 \v 17 కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన నడిపించే నాయకుడు ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా; \li2 అతని సహకారులలో రెండవవాడైన బక్బుక్యా; \li2 యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దా. \li2 \v 18 పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయుల సంఖ్య 284 మంది. \li1 \v 19 ద్వారపాలకుల్లో: \li2 అక్కూబు, టల్మోను గుమ్మాలను కాపలా కాసేవారి సహాయకులు 172 మంది. \b \p \v 20 మిగిలిన ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు యూదా పట్టణాల్లో తమకు కేటాయించిన స్వాస్థ్యంలో నివసించారు. \p \v 21 ఆలయ సేవకులు ఓఫెలు కొండమీద నివసించారు. వీరికి జీహా, గిష్పా అధికారులు. \p \v 22 యెరూషలేములోని లేవీయులకు ఉజ్జీ అధికారి; ఇతడు మీకా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన హషబ్యా కుమారుడైన బానీ కుమారుడు. దేవుని ఆలయ సేవల బాధ్యత వహించిన సంగీతకారులైన ఆసాపు వారసులలో ఒకడు ఉజ్జీ. \v 23 సంగీతకారులు రాజు ఆదేశాల ప్రకారం పని చేయాలి, కాబట్టి వారి దినచర్య క్రమబద్ధం చేయబడింది. \p \v 24 యూదా కుమారుడైన జెరహు వారసులలో ఒక్కడైన మెషేజబేలు కుమారుడైన పెతహయా ప్రజలకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో రాజుకు సలహాదారునిగా ఉన్నాడు. \p \v 25 ఇక గ్రామాలు వాటి పొలాలకు సంబంధించి యూదా ప్రజల్లో కొంతమంది కిర్యత్-అర్బాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, దీబోనులో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, యెకబ్సెయేలులో దాని గ్రామాల్లో, \v 26 యెషూవలో, మొలాదాలో, బేత్-పెలెతులో, \v 27 హజర్-షువలులో, బెయేర్షేబలో వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో, \v 28 సిక్లగులో, మెకోనాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, \v 29 ఎన్-రిమ్మోనులో, జోరహులో, యర్మూతులో, \v 30 జానోహలో, అదుల్లాములో వాటి గ్రామాల్లో, లాకీషులో దానికి పొలాల్లో అజేకాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసించారు. వారు బెయేర్షేబ నుండి హిన్నోము లోయవరకు నివసించారు. \p \v 31 గెబాలో స్థిరపడిన బెన్యామీనీయులు మిక్మషులో, అయ్యాలో, బేతేలు వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో, \v 32 అనాతోతులో, నోబులో, అనన్యాలో, \v 33 హాసోరులో, రామాలో, గిత్తయీములో, \v 34 హదీదులో, సెబోయిములో, నెబల్లాటులో, \v 35 లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు. \p \v 36 యూదాలోని లేవీయులలో కొన్ని గుంపులు బెన్యామీనులో నివసించారు. \c 12 \s1 యాజకులు లేవీయులు \lh \v 1 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో యెషూవతో పాటు వచ్చిన యాజకులు లేవీయులు వీరే: \b \li1 శెరాయా, యిర్మీయా, ఎజ్రా, \li1 \v 2 అమర్యా, మల్లూకు, హట్టూషు, \li1 \v 3 షెకన్యా, రెహూము, మెరేమోతు, \li1 \v 4 ఇద్దో, గిన్నెతోయి,\f + \fr 12:4 \fr*\ft చాలా హెబ్రీ ప్రతులలో \ft*\fqa గిన్నెతోను\fqa*\f* అబీయా, \li1 \v 5 మీయామిను,\f + \fr 12:5 \fr*\fqa మిన్యామీను \fqa*\fq మీయామిను \fq*\ft యొక్క మరో రూపం\ft*\f* మయద్యా, బిల్గా, \li1 \v 6 షెమయా, యోయారీబు, యెదాయా, \li1 \v 7 సల్లు ఆమోకు హిల్కీయా యెదాయా. \b \lf వీరందరు యెషూవ సమయంలో యాజకులకు వారి బంధువులకు సహాయకులు. \b \p \v 8 లేవీయులలో యెషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా కృతజ్ఞత పాటలకు నాయకత్వం వహించే మత్తన్యా అతని సహాయకులు. \v 9 పరిచర్యలలో బక్బుక్యా, ఉన్నీ, వారి సహాయకులు వారికి ఎదురు వరుసలో నిలబడేవారు. \b \li1 \v 10 యోయాకీము తండ్రి యెషూవ, \li1 ఎల్యాషీబు తండ్రి యోయాకీము, \li1 యోయాదాను తండ్రి ఎల్యాషీబు, \li1 \v 11 యోనాతాను తండ్రి యోయాదా, \li1 యద్దూవ తండ్రి యోనాతాను. \b \b \lh \v 12 యోయాకీము సమయంలో యాజకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నవారు: \b \li1 శెరాయా కుటుంబానికి మెరాయా; \li1 యిర్మీయా కుటుంబానికి హనన్యా; \li1 \v 13 ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము; \li1 అమర్యా కుటుంబానికి యెహోహనాను; \li1 \v 14 మెలీకూ కుటుంబానికి యోనాతాను, \li1 షెకన్యా\f + \fr 12:14 \fr*\ft హెబ్రీ ప్రతులలో \ft*\fqa షెబన్యా\fqa*\f* కుటుంబానికి యోసేపు; \li1 \v 15 హారీము కుటుంబానికి అద్నా; \li1 మెరాయోతు కుటుంబానికి హెల్కయి; \li1 \v 16 ఇద్దో కుటుంబానికి జెకర్యా; \li1 గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము; \li1 \v 17 అబీయా కుటుంబానికి జిఖ్రీ; \li1 మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి; \li1 \v 18 బిల్గా కుటుంబానికి షమ్మూయ; \li1 షెమయా కుటుంబానికి యెహోనాతాను; \li1 \v 19 యోయారీబు కుటుంబానికి మత్తెనై; \li1 యెదాయా కుటుంబానికి ఉజ్జీ; \li1 \v 20 సల్లు కుటుంబానికి కల్లయి; \li1 ఆమోకు కుటుంబానికి ఏబెరు; \li1 \v 21 హిల్కీయా కుటుంబానికి హషబ్యా; \li1 యెదాయా కుటుంబానికి నెతనేలు. \b \p \v 22 ఎల్యాషీబు సమయంలో లేవీయులలో కుటుంబ పెద్దలుగా ఉన్నవారు యోయాదా, యోహానాను, యద్దూవ. పర్షియా రాజైన దర్యావేషు పాలనలో వీరే యాజక కుటుంబాలలో పెద్దలుగా నమోదయ్యారు. \v 23 ఎల్యాషీబు కుమారుడైన యోహానాను సమయం వరకు కుటుంబ పెద్దలుగా లేవీ వారసుల పేర్లు దినచర్య గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. \v 24 లేవీయుల నాయకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కుమారుడైన యెషూవ, వారి బంధువులు దైవజనుడైన దావీదు నిర్దేశించిన ప్రకారం వంతులవారీగా ఎదురెదురుగా నిలబడి కృతజ్ఞతా స్తుతి గీతాలు పాడడానికి నియమించబడ్డారు. \p \v 25 మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనేవారు గుమ్మాల దగ్గర ఉన్న గిడ్డంగులను కాపలా కాసే ద్వారపాలకులు. \v 26 వీరంతా యోజాదాకు పుట్టిన యెషూవ కుమారుడైన యోయాకీము సమయంలో, అధిపతియైన నెహెమ్యా సమయంలో, ధర్మశాస్త్ర బోధకుడు యాజకుడైన ఎజ్రా సమయంలో సేవ చేశారు. \s1 యెరూషలేము గోడ ప్రతిష్ఠించబడుట \p \v 27 యెరూషలేము గోడ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు కృతజ్ఞతా స్తుతి గీతాలతో తాళాలు, వీణలు సితారలు వాయిస్తూ సంతోషంగా చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి లేవీయులను యెరూషలేముకు తీసుకువచ్చే పని మొదలుపెట్టారు. \v 28 సంగీతకారులను యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల నుండి తీసుకువచ్చారు. \v 29 యెరూషలేము చుట్టూ సంగీతకారులు తమ కోసం గ్రామాలు నిర్మించుకున్నారు కాబట్టి బేత్-గిల్గాలు నుండి, గెబా అజ్మావెతు ప్రాంతాల నుండి వచ్చారు. \v 30 యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపరచుకున్న తర్వాత ప్రజలను, గుమ్మాలను, గోడను పవిత్రపరిచారు. \p \v 31 నేను యూదా నాయకులను గోడ మీదికి తీసుకువచ్చాను. కృతజ్ఞతలు చెల్లించడానికి రెండు పెద్ద గాయక బృందాలను నియమించాను. వాటిలో ఒక బృందం గోడ మీద కుడి వైపుగా పెంట ద్వారం వైపు నడిచారు. \v 32 హోషయా, యూదా నాయకుల్లో సగం మంది వారితో పాటు వెళ్లారు. \v 33 వారితో అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, \v 34 యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనేవారు వెళ్లారు. \v 35 అలాగే బూరలు ఊదుతూ కొంతమంది యాజకులు వెళ్లారు. ఆసాపు కుమారుడైన జక్కూరుకు పుట్టిన మీకాయా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జెకర్యా, \v 36 అతని సహాయకులైన షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవారు దేవుని సేవకుడైన దావీదు నిర్దేశించిన సంగీత వాయిద్యాలు వాయిస్తూ వెళ్లారు. ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా వారిని నడిపించాడు. \v 37 ఊట గుమ్మం దగ్గర వారు నేరుగా దావీదు పట్టణం గోడ మెట్ల మీదుగా దావీదు ఇంటిని దాటి తూర్పున ఉన్న నీటిగుమ్మం దగ్గరకు వెళ్లారు. \p \v 38 కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండవ బృందం వారికి ఎదురుగా వెళ్లారు. మిగిలిన సగం మంది ప్రజలతో పాటు కలిసి నేను అగ్ని గుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ వరకు వెళ్లాము. \v 39 వారు ఎఫ్రాయిం ద్వారం మీదగా వెళ్లి, యెషానా\f + \fr 12:39 \fr*\ft లేదా \ft*\fqa పాతది\fqa*\f* గుమ్మాన్ని, చేప గుమ్మాన్ని, హనానేలు గోపురాన్ని, వందవ గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మం వరకు వెళ్లి కాపలా గుమ్మం దగ్గర ఆగారు. \p \v 40 అప్పుడు కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండు బృందాలు, నేను, నాతో పాటు ఉన్న అధికారులలో సగం మంది దేవుని మందిరంలో నిలబడ్డాము. \v 41 అలాగే యాజకులైన ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యాలు తమ బూరలు పట్టుకుని ఉన్నారు. \v 42 మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహనాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు అక్కడే ఉన్నారు. ఇజ్రహయా సారథ్యంలో గాయకులు గట్టిగా పాటలు పాడారు. \v 43 ఆ రోజు దేవుడు తమకు గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు వారు గొప్ప బలులు అర్పించి సంతోషించారు. స్త్రీలు పిల్లలు కూడా సంతోషించారు. యెరూషలేములోని ఈ సంతోష ధ్వనులు చాలా దూరం వరకు వినిపించాయి. \p \v 44 ఆ సమయంలో ప్రజలిచ్చే ప్రథమ ఫలాలు, పదవ భాగాలు కానుకలకు సంబంధించిన గిడ్డంగులకు అధికారులుగా కొంతమంది నియమించబడ్డారు. పరిచర్య చేస్తున్న యాజకులు లేవీయులను బట్టి యూదా ప్రజలు సంతోషించారు కాబట్టి యాజకులు లేవీయుల కోసం ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన వంతులను పట్టణాల చుట్టూ ఉన్న పొలాల నుండి గిడ్డంగులకు చేరవేయడానికి వారు నియమించబడ్డారు. \v 45 దావీదు అతని కుమారుడైన సొలొమోను ఆజ్ఞల ప్రకారం వారంతా సంగీతకారులు ద్వారపాలకులతో కలిసి తమ దేవుని సేవ, శుద్ధీకరణ సేవ చేశారు. \v 46 చాలా కాలం క్రితం దావీదు, ఆసాపు కాలంలో సంగీతకారులను దేవునికి కృతజ్ఞతా స్తుతి గీతాలను నడిపించేవారు ఉండేవారు. \v 47 అయితే జెరుబ్బాబెలు, నెహెమ్యా సమయంలో ఇశ్రాయేలీయులందరు సంగీతకారులకు, ద్వారపాలకులకు ప్రతిరోజు ఆహారం ఇచ్చేవారు. అలాగే ఇతర లేవీయులకు కూడా ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు. లేవీయులు అహరోను వారసులకు ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు. \c 13 \s1 నెహెమ్యా యొక్క చివరి సంస్కరణలు \p \v 1 ఆ రోజున ప్రజల వినికిడిలో మోషే గ్రంథం బిగ్గరగా చదువుతూ ఉండగా; అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని సమాజంలోకి ప్రవేశించకూడదని వ్రాయబడిన భాగం కనబడింది, \v 2 ఎందుకంటే వారు అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఆహారం గాని నీరు గాని తీసుకెళ్లి ఇవ్వలేదు పైగా వారిని శపించడానికి బిలామును నియమించుకున్నారు. అయితే దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చారు. \v 3 ప్రజలు ఈ ధర్మశాస్త్రం విన్నప్పుడు, వారు ఇశ్రాయేలు నుండి పరదేశి సంతతికి చెందిన వారందరినీ వెలివేశారు. \p \v 4 దీనికి ముందు, యాజకుడైన ఎల్యాషీబు మా దేవుని మందిరానికి సంబంధించిన గిడ్డంగులకు అధికారిగా ఉన్నాడు. ఇతడు టోబీయాకు దగ్గరి బంధువు, \v 5 అంతేకాదు, అతడు గతంలో భోజనార్పణలు, ధూపద్రవ్యాలు, ఆలయ వస్తువులను, లేవీయులు, సంగీతకారులు ద్వారపాలకుల కోసం కేటాయించిన ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో పదవ వంతును, అలాగే యాజకులకు ఇవ్వవలసిన విరాళాలను నిల్వ ఉంచే స్థలం దగ్గర ఒక పెద్ద గదిని టోబీయాకు ఏర్పాటు చేశాడు. \p \v 6 అయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో నేను యెరూషలేములో లేను. ఎందుకంటే బబులోను దేశపు రాజైన అర్తహషస్త పాలన ముప్పై రెండవ సంవత్సరంలో నేను రాజు దగ్గరకు తిరిగి వెళ్లాను. కొంతకాలం తర్వాత నేను రాజు అనుమతి తీసుకుని, \v 7 యెరూషలేముకు తిరిగి వచ్చాను. దేవుని ఆలయ ఆవరణంలో టోబీయాకు గది ఏర్పాటు చేసి ఎల్యాషీబు కీడు చేశాడని నేను గ్రహించాను. \v 8 నాకు చాలా కోపం వచ్చి, నేను ఆ గదిలో నుండి టోబీయా వస్తువులన్నిటిని తీసి బయట పడవేశాను. \v 9 గదులన్నీ శుద్ధి చేయమని ఆజ్ఞ ఇచ్చి, తర్వాత దేవుని ఆలయానికి సంబంధించిన వస్తువులు, భోజనార్పణలు, ధూపద్రవ్యాలను మరలా ఆ గదిలో పెట్టాను. \p \v 10 లేవీయులకు ఇవ్వవలసిన భాగాలు వారికి ఇవ్వలేదని, సేవ చేయవలసిన లేవీయులు, సంగీతకారులు తమ పొలాల్లో పని చేసుకోవడానికి తిరిగి వెళ్లిపోయారని నేను తెలుసుకున్నాను. \v 11 కాబట్టి నేను అధికారులను గద్దించి, “దేవుని మందిరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు?” అని అడిగాను. తర్వాత నేను వారందరిని ఒక్క దగ్గరికి పిలిచి వారిని వారి స్థానాల్లో మరలా నియమించాను. \p \v 12 యూదా ప్రజలందరు ధాన్యంలో, ద్రాక్షరసంలో, నూనెలో పదవ వంతులను గిడ్డంగులకు తెచ్చారు. \v 13 యాజకుడైన షెలెమ్యా, శాస్త్రియైన సాదోకు, లేవీయుడైన పెదాయాలను గిడ్డంగుల మీద అధికారులుగా నియమించాను. అలాగే వారికి సహాయంగా జక్కూరు కుమారుడును, మత్తన్యా మనుమడునైన హానానును నియమించాను ఎందుకంటే వీరంతా నమ్మకస్థులుగా పేరు పొందారు. తమ తోటి లేవీయులకు ఆహారం పంచి ఇవ్వాల్సిన బాధ్యత అప్పగించబడింది. \b \p \v 14 నా దేవా, వీటిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా దేవుని మందిరం కోసం దాని సేవల కోసం నేను నమ్మకంగా చేసిన వాటిని తుడిచివేయకండి. \b \p \v 15 ఆ రోజుల్లో యూదాలో కొంతమంది విశ్రాంతి దినాన ద్రాక్షలను ద్రాక్షగానుగలో తొక్కడం, ధాన్యం, ద్రాక్షరసం, ద్రాక్షలు, అంజూర పండ్లు అన్ని రకాల మూటలు తీసుకువచ్చి గాడిదల మీద పెట్టి విశ్రాంతి దినాన యెరూషలేముకు తీసుకురావడం నేను చూశాను. కాబట్టి ఆ రోజు ఆహారం అమ్మకూడదని నేను వారిని హెచ్చరించాను. \v 16 యెరూషలేములో నివసిస్తున్న తూరుకు చెందిన ప్రజలు చేపలు, అన్ని రకాల సరుకులు తీసుకువచ్చి విశ్రాంతి దినాన యూదాలోని ప్రజలకు అమ్ముతున్నారు. \v 17 అందుకు నేను యూదా సంస్థానాధిపతులను మందలించి, “సబ్బాతు దినాన్ని అపవిత్రం చేస్తూ మీరు చేస్తున్న ఈ చెడ్డ పని ఏమిటి? \v 18 మీ పూర్వికులు ఇలా చేసినందుకే మన దేవుడు మన మీదికి, ఈ పట్టణం మీదికి ఈ విపత్తు రప్పించలేదా? మీరు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి ఇశ్రాయేలీయుల మీదికి కోపాన్ని మరింతగా రప్పిస్తున్నారు.” \p \v 19 సబ్బాతుకు ముందు రోజు యెరూషలేము గుమ్మాలపై సాయంకాలపు నీడలు పడగానే యెరూషలేము తలుపులు మూసివేసి విశ్రాంతి దినం గడిచేవరకు తలుపులు తెరవకూడదని నేను ఆజ్ఞాపించాను. సబ్బాతు దినాన ఏ బరువులు లోపలికి రాకుండా నా మనుష్యుల్లో కొందరిని కాపలా ఉంచాను. \v 20 వ్యాపారులు, రకరకాల వస్తువులు అమ్మేవారు ఒకటి రెండు సార్లు యెరూషలేము బయట రాత్రంతా గడిపారు. \v 21 అయితే నేను వెళ్లి వారిని గద్దించి, “మీరు రాత్రంతా గోడ దగ్గర ఎందుకు ఉన్నారు? మరోసారి ఇలా చేస్తే మిమ్మల్ని పట్టుకుంటాను” అని చెప్పాను. అప్పటినుండి వారు మళ్ళీ విశ్రాంతి దినాన రాలేదు. \v 22 అప్పుడు తమను తాము పవిత్రపరచుకుని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి వెళ్లి గుమ్మాలను కనిపెట్టుకుని ఉండాలని లేవీయులను ఆజ్ఞాపించాను. \b \p నా దేవా, వీటిని బట్టి కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి! మీ మహా ప్రేమను బట్టి నా మీద దయ చూపించండి. \b \p \v 23 అంతే కాకుండా, ఆ రోజుల్లో అష్డోదు, అమ్మోను, మోయాబులకు చెందిన స్త్రీలను పెళ్ళి చేసుకున్న యూదా పురుషులను నేను చూశాను. \v 24 వారి పిల్లల్లో సగం మంది అష్డోదు భాషను గాని పరాయి ప్రజల భాషను గాని మాట్లాడేవారు కాని యూదా భాషలో ఎలా మాట్లాడాలో వారికి తెలియదు. \v 25 నేను వారిని గద్దించి శపించాను. ఆ పురుషులలో కొంతమందిని కొట్టి వారి జుట్టు పెరికించాను. నేను వారితో దేవుని పేరిట ప్రమాణం చేయించి, “మీరు మీ కుమార్తెలకు వారి కుమారులతో పెళ్ళి చేయకూడదు, వారి కుమార్తెలతో మీరు మీ కుమారులు పెళ్ళి చేసుకోకూడదు. \v 26 ఇలాంటి పెళ్ళిళ్ళను బట్టి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక దేశాల్లో అతని వంటి రాజు మరొకడు లేడు. అతడు తన దేవునిచే ప్రేమించబడి దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా చేశాడు కాని యూదేతరుల స్త్రీలు అతనిచేత పాపం చేయించారు. \v 27 ఈ ఘోరమైన చెడునంతా చేస్తూ యూదేతరుల స్త్రీలను పెళ్ళి చేసుకుని మన దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉండి పాపం చేస్తున్న మీలాంటి వారి మాటలు మేము వినాలా?” అన్నాను. \p \v 28 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కుమారుడైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటుకు అల్లుడు. అతన్ని నా దగ్గర నుండి దూరంగా వెళ్లగొట్టాను. \b \p \v 29 నా దేవా! వారు యాజకత్వ వృత్తిని, యాజక నిబంధనలను, లేవీయుల నిబంధనను అపవిత్రం చేశారు కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. \b \p \v 30 కాబట్టి యాజకులు లేవీయులు ఏ విదేశీయులతో కలిసిపోకుండ వారిని శుద్ధి చేసి వారిలో ప్రతి ఒక్కరికి వారి సొంత పనిని అప్పగించాను. \v 31 నేను నిర్ణీత సమయాల్లో కట్టెలు, ప్రథమ ఫలాలు తెచ్చేలా ఏర్పాటు చేశాను. \b \p నా దేవా! దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి.