\id NAM - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h నహూము \toc1 నహూము ప్రవచనం \toc2 నహూము \toc3 నహూము \mt1 నహూము \mt2 ప్రవచనం \c 1 \p \v 1 నీనెవెను గురించిన ప్రవచనం; ఎల్కోషీయుడైన నహూముకు ఇవ్వబడిన దర్శనాన్ని వివరించే గ్రంథమిది. \b \s1 నీనెవెకు వ్యతిరేకంగా యెహోవా కోపం \q1 \v 2 యెహోవా రోషం గలవారు ప్రతీకారం తీర్చుకునే దేవుడు; \q2 యెహోవా పగ తీర్చుకునేవారు ఉగ్రత గలవారు. \q1 యెహోవా తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు, \q2 తన శత్రువులపై తన ఉగ్రతను వెళ్లగ్రక్కుతారు. \q1 \v 3 యెహోవా త్వరగా కోప్పడరు, ఆయన గొప్ప శక్తిగలవారు; \q2 యెహోవా దోషులను శిక్షించకుండ విడిచిపెట్టరు. \q1 ఆయన మార్గం సుడిగాలిలోనూ తుఫానులోనూ ఉంది, \q2 మేఘాలు ఆయన పాద ధూళి. \q1 \v 4 ఆయన సముద్రాన్ని గద్దించి దానిని ఆరిపోయేలా చేస్తారు; \q2 నదులన్నిటినీ ఆయన ఎండిపోయేలా చేస్తారు. \q1 బాషాను కర్మెలు ఎండిపోతాయి, \q2 లెబానోను పువ్వులు వాడిపోతాయి. \q1 \v 5 ఆయన ముందు పర్వతాలు కంపిస్తాయి, \q2 కొండలు కరిగిపోతాయి. \q1 ఆయన సన్నిధిలో భూమి వణుకుతుంది, \q2 లోకం, దానిలో నివసించే వారందరూ వణుకుతారు. \q1 \v 6 ఆయన ఆగ్రహాన్ని ఎవరు తట్టుకోగలరు? \q2 ఆయన కోపాగ్నిని ఎవరు సహించగలరు? \q1 ఆయన ఉగ్రత అగ్నిలా బయటకు కుమ్మరించబడింది; \q2 ఆయన ముందు బండలు బద్దలయ్యాయి. \b \q1 \v 7 యెహోవా మంచివారు, \q2 ఆపద సమయాల్లో ఆశ్రయం ఇస్తారు. \q1 ఆయన మీద నమ్మకముంచే వారిపట్ల ఆయన శ్రద్ధ చూపుతారు. \q2 \v 8 అయితే పొంగిపొరలే వరదతో \q1 నీనెవెను అంతం చేస్తారు; \q2 ఆయన తన శత్రువులను చీకటిలోకి తరుముతారు. \b \q1 \v 9 వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పన్నాగం పన్నినా, \q2 ఆపద రెండవసారి రాకుండ, \q2 ఆయన దానిని అంతం చేస్తారు. \q1 \v 10 వారు ముళ్ళపొదల్లో చిక్కుకొని \q2 తమ ద్రాక్షరసంతో మత్తులై \q2 ఎండిన చెత్తలా కాలిపోతారు. \q1 \v 11 నీనెవే, నీ నుండి \q2 యెహోవాకు వ్యతిరేకంగా చెడు పన్నాగాలు పన్నేవాడు, \q2 దుష్ట ప్రణాళికలు వేసే ఒకడు వచ్చాడు. \p \v 12 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “వారికి ఎంతోమంది మిత్రులు ఉన్నప్పటికీ, \q2 వారు నాశనమై గతించిపోతారు. \q1 యూదా, నేను నిన్ను బాధించాను, \q2 ఇక నేను నిన్ను బాధించను. \q1 \v 13 నీ మెడ మీద ఉన్న వారి కాడిని నేను విరగ్గొట్టి, \q2 నీ సంకెళ్ళను తెంపివేస్తాను.” \b \q1 \v 14 నీనెవే, నీ గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: \q2 “నీ పేరు పెట్టుకునే సంతతివారు ఎవరూ ఉండరు. \q1 నీ దేవతల గుడిలో ఉన్న \q2 ప్రతిమలను, విగ్రహాలను నాశనం చేస్తాను. \q1 నీవు నీచుడవు, \q2 కాబట్టి, నీ సమాధిని సిద్ధం చేస్తాను.” \b \q1 \v 15 చూడు, అక్కడ పర్వతాలమీద, \q2 సువార్తను ప్రకటించేవారి పాదాలు, \q2 వారు సమాధానాన్ని ప్రకటించేవారు! \q1 యూదా, నీ పండుగలు జరుపుకో, \q2 నీ మ్రొక్కుబడులను నెరవేర్చుకో. \q1 ఇకపై దుష్టులు నీపై దండెత్తరు; \q2 వారు పూర్తిగా నాశనం చేయబడతారు. \c 2 \s1 నీనెవె పతనం \q1 \v 1 నీనెవే! దాడి చేసేవాడు నీ మీదికి వస్తున్నాడు. \q2 కోటకు కాపలా ఉండు, \q2 రహదారి మీద నిఘా వేయి, \q2 నడుము బిగించుకో, \q2 నీ బలమంతటిని కూడగట్టుకో! \b \q1 \v 2 దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ, \q2 వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ, \q1 యెహోవా ఇశ్రాయేలు వైభవంలా, \q2 యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు. \b \q1 \v 3 సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి; \q2 యోధులు ఎరుపు దుస్తులు ధరించారు. \q1 వారు సిద్ధపడిన రోజున \q2 రథాలపై ఉన్న లోహం మెరుస్తుంది; \q2 సరళవృక్షంతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.\f + \fr 2:3 \fr*\ft కొ.ప్ర.లలో, \ft*\fqa సిద్ధంగా ఉన్నాయి; గుర్రపురౌతులు ముందుకు వెనుకకు పరుగెడుతున్నాయి.\fqa*\f* \q1 \v 4 రథాలు వీధుల్లో దూసుకెళ్తాయి, \q2 రాజమార్గాల గుండా ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతున్నాయి. \q1 అవి మండుతున్న జ్యోతుల్లా కనిపిస్తున్నాయి; \q2 అవి మెరుపులా వేగంగా వెళ్తున్నాయి. \b \q1 \v 5 నీనెవె తన అధికారులను పిలుస్తుంది, \q2 అయినా వారు తమ దారిలో తడబడతారు. \q1 వారు నగర గోడకు గుద్దుకుంటారు; \q2 రక్షణ కవచం సిద్ధం చేస్తారు. \q1 \v 6 నది ద్వారాలు తెరుస్తారు, \q2 రాజభవనాలు కూలిపోతాయి. \q1 \v 7 నీనెవెను బందీగా, \q2 తీసుకుపోవాలని శాసించబడింది. \q1 ఆమె దాసీలు పావురాల్లా మూలుగుతూ, \q2 తమ రొమ్ముల మీద కొట్టుకుంటారు. \q1 \v 8 నీనెవె నీరు పారుతున్న \q2 నీరు కొలనులా ఉంది. \q1 “ఆగు! ఆగు!” అని వారు ఏడుస్తారు, \q2 కానీ ఎవరూ వెనుకకు తిరుగరు. \q1 \v 9 వెండిని దోచుకో! \q2 బంగారాన్ని దోచుకో! \q1 ఆమె ఖజానాల్లో \q2 అంతులేని సంపదలు ఉన్నాయి! \q1 \v 10 ఆమె కొల్లగొట్టబడి దోచుకోబడి పాడుచేయబడుతుంది! \q2 హృదయాలు కరిగిపోతున్నాయి, మోకాళ్లు వణుకుతున్నాయి, \q2 శరీరాలు వణుకుతున్నాయి, ప్రతీ ముఖం పాలిపోతుంది. \b \q1 \v 11 సింహాల గుహ ఇప్పుడు ఎక్కడ? \q2 వాటి పిల్లల మేత స్థలం ఎక్కడ? \q1 సింహం, ఆడసింహం, సింహం కూనలు \q2 ఏ భయం లేకుండా తిరిగే చోటు ఏది? \q1 \v 12 సింహం తన కూనల కోసం కావలసినంత వేటాడుతూ, \q2 ఆడ సింహానికి ఆహారంగా జంతువుల మెడ కొరికి చంపుతూ, \q1 చంపిన వాటితో తన నివాస స్థలాలను, \q2 వేట మాంసంతో తన గుహలను నింపింది. \b \q1 \v 13 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు \q2 “నేను నీకు వ్యతిరేకిని, \q1 నీ రథాల నుండి పొగ వచ్చేలా కాల్చివేస్తాను, \q2 ఖడ్గం నీ కొదమ సింహాలను చంపివేస్తుంది. \q2 నేను భూమ్మీద నీకు ఏ ఎర దొరక్కుండా చేస్తాను. \q1 నీ దూతల స్వరాలు \q2 ఇక వినబడవు.” \c 3 \s1 నీనెవెకు శ్రమ \q1 \v 1 అబద్ధాలతో దోపిడీతో నిండి ఉన్న, \q2 హంతకుల పట్టణానికి శ్రమ! \q1 నిత్యం బాధితులు ఉండే, \q2 రక్తపు పట్టణానికి శ్రమ! \q1 \v 2 కొరడాల ధ్వని, చక్రాల మోత, \q2 పరుగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం \q1 వేగంగా పరుగెడుతున్న \q2 రథాల ధ్వని వినబడుతుంది! \q1 \v 3 రౌతులు ముందుకు దూసుకువెళ్తుండగా, \q2 వారి ఖడ్గాలు మెరుస్తున్నాయి, \q2 వారి ఈటెలు తళతళ మెరుస్తున్నాయి! \q1 ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది, \q2 మృతులు కుప్పలుగా పడి ఉన్నారు, \q1 మృతదేహాలకు లెక్క లేదు, \q2 మృతదేహాలు తగిలి ప్రజలు తడబడుతున్నారు. \q1 \v 4 తన మంత్రవిద్య ద్వారా ప్రజలను, \q2 తన వ్యభిచారం ద్వారా దేశాలను \q1 బానిసలుగా మార్చిన వేశ్య; \q2 మంత్రగత్తెల యజమానురాలు ఇదంతా చేసింది. \b \q1 \v 5 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q2 “నేను నీకు వ్యతిరేకిని, \q2 నేను నీ వస్త్రాలను నీ ముఖం మీదుగా ఎత్తి, \q1 దేశాలకు నీ నగ్నత్వాన్ని \q2 రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను. \q1 \v 6 నీ మీదికి హేయమైనది విసిరి, \q2 అందరి ముందు, \q2 నిన్ను అవమానిస్తాను. \q1 \v 7 నిన్ను చూసేవారందరూ నీ నుండి పారిపోయి, \q2 ‘నీనెవె శిథిలావస్థలో ఉంది, ఆమె కోసం ఎవరు దుఃఖిస్తారు?’ \q2 నిన్ను ఓదార్చేవారిని నేను ఎక్కడి నుండి తీసుకురాగలం?” అని అంటారు. \b \q1 \v 8 నైలు నది దగ్గర ఉండి, \q2 చుట్టూ నీళ్లు ఉన్న, \q2 తేబేసు కంటే మేలైనదానివా? \q1 ఆ నది ఆమెకు రక్షణ, \q2 ఆ నీళ్లు ఆమెకు గోడ. \q1 \v 9 కూషు,\f + \fr 3:9 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం\ft*\f* ఈజిప్టు ఆమెకు అపరిమితమైన బలం; \q2 పూతు, లిబియా ఆమెకు మిత్రరాజ్యాలు. \q1 \v 10 అయినప్పటికీ ఆమెను \q2 బందీగా తీసుకెళ్లారు. \q1 ప్రతి వీధి మూలలో దాని పసిపిల్లల్ని \q2 ముక్కలు చేశారు. \q1 దాని అధిపతుల కోసం చీట్లు వేశారు, \q2 దాని ఘనులందరిని సంకెళ్ళతో బంధించారు. \q1 \v 11 నీకు కూడా మత్తు ఎక్కుతుంది; \q2 నీవు వెళ్లి దాక్కుని \q2 శత్రువు నుండి కాపాడుకోడానికి ఆశ్రయాన్ని వెదకుతావు. \b \q1 \v 12 నీ కోటలన్నీ మొదట పండిన పండ్లతో ఉన్న \q2 అంజూరపు చెట్లలా ఉన్నాయి; \q1 అవి కదిలించబడినప్పుడు, \q2 తినే వారి నోటిలో అంజూరపు పండ్లు పడతాయి. \q1 \v 13 నీ సైన్యాన్ని చూడు, \q2 వారంతా బలహీనులు. \q1 నీ దేశపు ద్వారాలు \q2 నీ శత్రువులకు విశాలంగా తెరిచి ఉన్నాయి; \q2 అగ్ని నీ ద్వారబంధాలను కాల్చివేసింది. \b \q1 \v 14 ముట్టడివేసే సమయానికి నీళ్లు తోడుకో, \q2 నీ కోటలను బలపరచుకో! \q1 బురదలోకి దిగు, \q2 ఇటుకలు తయారుచేయడానికి బురదను త్రొక్కు, \q2 ఇటుక బట్టీలను సిద్ధపరచు. \q1 \v 15 అక్కడ అగ్ని నిన్ను కాల్చివేస్తుంది; \q2 ఖడ్గం నిన్ను నరికివేస్తుంది, \q2 మిడతల గుంపులా అవి నిన్ను మ్రింగివేస్తాయి. \q1 గొంగళిపురుగుల్లా విస్తరించు, \q2 మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో! \q1 \v 16 ఆకాశంలోని నక్షత్రాల కంటే \q2 మీ వ్యాపారుల సంఖ్యను ఎక్కువగా ఉన్నప్పటికీ, \q1 మిడతల్లా వారు దేశాన్ని \q2 దోచుకుని ఎగిరిపోతారు. \q1 \v 17 మీ కావలివారు మిడతల్లా ఉన్నారు, \q2 మీ అధికారులు మిడతల గుంపులా ఉన్నారు. \q2 అవి చలికాలంలో గోడల మీద ఉండి \q1 ఎండ రాగానే ఎగిరిపోతాయి. \q2 అవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. \b \q1 \v 18 అష్షూరు రాజా, మీ కాపరులు\f + \fr 3:18 \fr*\ft అంటే, పాలకులు\ft*\f* నిద్రపోతున్నారు; \q2 మీ అధిపతులు విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నారు. \q1 మీ ప్రజలు \q2 పర్వతాలమీద చెదరిపోయారు. \q1 \v 19 ఏదీ నిన్ను స్వస్థపరచలేదు; \q2 మీ గాయం ప్రాణాంతకమైనది. \q1 మీ గురించిన వార్త విన్నవారందరు \q2 మీ పతనాన్ని చూసి చప్పట్లు కొడతారు, \q1 ఎందుకంటే ప్రజలందరూ మీ అంతులేని క్రూరత్వాన్ని \q2 నీ క్రూరమైన హింసను అనుభవించిన వారే.