\id MIC - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h మీకా \toc1 మీకా ప్రవచనం \toc2 మీకా \toc3 మీకా \mt1 మీకా \mt2 ప్రవచనం \c 1 \p \v 1 యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పరిపాలన కాలాల్లో మోరెషెతు వాడైన మీకా దగ్గరకు వచ్చిన యెహోవా వాక్కు. సమరయ, యెరూషలేముల గురించి అతడు చూసిన దర్శనం. \b \b \q1 \v 2 ప్రజలారా, మీరంతా వినండి, \q2 భూమీ, నీవు నీలోని నివాసులందరూ ఆలకించండి, \q1 ప్రభువైన యెహోవా మీమీద నేరారోపణ చేయబోతున్నారు, \q2 ప్రభువు తన పరిశుద్ధ ఆలయం నుండి మాట్లాడుతున్నారు. \s1 సమరయ యెరూషలేముల మీద తీర్పు \q1 \v 3 చూడండి! యెహోవా తన నివాసస్థలం నుండి వస్తున్నారు; \q2 ఆయన దిగి భూమిమీది ఉన్నతస్థలాల మీద నడవబోతున్నారు. \q1 \v 4 అగ్నికి మైనం కరిగినట్లు, \q2 వాలు మీద నీరు ప్రవహించినట్లు, \q1 ఆయన పాదాల క్రింద పర్వతాలు కరుగుతాయి, \q2 లోయలు చీలిపోతాయి. \q1 \v 5 దీనంతటికీ యాకోబు అతిక్రమం, \q2 ఇశ్రాయేలు ప్రజల పాపాలే కారణం. \q1 యాకోబు అతిక్రమం ఏంటి? \q2 అది సమరయ కాదా? \q1 యూదా యొక్క క్షేత్రం ఏంటి? \q2 అది యెరూషలేము కాదా? \b \q1 \v 6 “కాబట్టి నేను సమరయను రాళ్ల కుప్పగా చేస్తాను, \q2 అది ద్రాక్షతోటలు నాటే స్థలం అవుతుంది. \q1 దాని రాళ్లను లోయలో పారవేస్తాను, \q2 దాని పునాదులు బయట పడతాయి. \q1 \v 7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరగ్గొట్టబడతాయి; \q2 దాని గుడి కానుకలన్ని అగ్నితో కాల్చబడతాయి; \q2 నేను దాని ప్రతిమలన్నిటినీ నాశనం చేస్తాను. \q1 అది వేశ్య సంపాదనతో తన బహుమానాలను పోగుచేసింది కాబట్టి \q2 అవి మళ్ళీ వేశ్య జీతంగా ఇవ్వబడతాయి.” \s1 ఏడ్వడం, దుఃఖించడం \q1 \v 8 దీనిని బట్టి నేను ఏడుస్తూ విలపిస్తాను; \q2 నేను చెప్పులు లేకుండా, దిగంబరిగా బయట తిరుగుతాను. \q1 నేను నక్కలా అరుస్తాను, \q2 గుడ్లగూబలాగా మూలుగుతాను. \q1 \v 9 ఎందుకంటే సమరయ తెగులు బాగు చేయలేనిది; \q2 అది యూదాకు వ్యాపించింది. \q1 అది నా ప్రజల ద్వారాల వరకు, \q2 యెరూషలేము వరకు కూడా వ్యాపించింది. \q1 \v 10 ఈ సంగతి గాతు\f + \fr 1:10 \fr*\fq గాతు \fq*\ft హెబ్రీలో \ft*\fqa మాట్లాడు\fqa*\f* పట్టణంలో చెప్పకండి; \q2 ఏమాత్రం ఏడవకండి. \q1 బేత్-లీఫ్రాలో\f + \fr 1:10 \fr*\fq బేత్-లీఫ్రాలో \fq*\ft అంటే \ft*\fqa దుమ్ము గల ఇల్లు\fqa*\f* \q2 నేను ధూళిలో పొర్లాడాను. \q1 \v 11 షాఫీరు\f + \fr 1:11 \fr*\fq షాఫీరు \fq*\ft అంటే \ft*\fqa ఆహ్లాదకరం\fqa*\f* వాసులారా, \q2 దిగంబరులై సిగ్గు పడుతూ దాటి వెళ్లండి. \q1 జయనాను\f + \fr 1:11 \fr*\fq జయనాను \fq*\ft హెబ్రీలో \ft*\fqa బయటకు రావడం\fqa*\f* నివాసులు \q2 బయటకు రారు. \q1 బేత్-ఏజెల్ శోకంలో ఉంది; \q2 అది ఇక ఎన్నడు మిమ్మల్ని కాపాడదు. \q1 \v 12 మారోతు\f + \fr 1:12 \fr*\fq మారోతు \fq*\ft హెబ్రీలో \ft*\fqa చేదు\fqa*\f* వాసులు బాధలో ఉన్నారు, \q2 ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు, \q1 ఎందుకంటే, ఎందుకంటే, యెహోవా దగ్గర నుండి కీడు వచ్చింది, \q2 అది యెరూషలేము ద్వారం వరకు వచ్చింది. \q1 \v 13 లాకీషులో నివాసులారా, \q2 రథాలకు గుర్రాలను కట్టండి. \q1 ఇశ్రాయేలు అతిక్రమాలు మీలో కనిపించాయి, \q2 సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం మీరు. \q1 \v 14 కాబట్టి మీరు మోరెషెత్-గాతుకు \q2 వీడుకోలు కానుకలిస్తారు. \q1 అక్సీబు పట్టణం ఇశ్రాయేలు రాజులను \q2 మోసగిస్తుందని రుజువు అవుతుంది. \q1 \v 15 మరేషా\f + \fr 1:15 \fr*\fq మరేషా \fq*\ft హెబ్రీలో \ft*\fqa జయించేవాడు\fqa*\f* వాసులారా! \q2 మీ పట్టణాన్ని స్వాధీనపరచుకునేవారిని పంపుతాను. \q1 ఇశ్రాయేలు ఘనులు \q2 అదుల్లాముకు పారిపోతారు. \q1 \v 16 మీకు ఇష్టమైన పిల్లల కోసం \q2 శోకంలో మీ తలలు గొరిగించుకోండి; \q1 రాబందులా బోడితల చేసుకోండి \q2 ఎందుకంటే మీ పిల్లలు మీ నుండి బందీలుగా వెళ్తారు. \c 2 \s1 మానవ ప్రణాళికలు, దేవుని ప్రణాళికలు \q1 \v 1 తమ పడకల మీద పాపపు ఆలోచనలు చేసేవారికి, \q2 కీడును తలంచే వారికి శ్రమ! \q1 వారికి అధికారం ఉంది కాబట్టి, \q2 ఉదయకాల వెలుగులో వారు చెడు చేస్తారు. \q1 \v 2 వారు భూములను ఆశించి ఆక్రమించుకుంటారు, \q2 ఇళ్ళను ఆశించి తీసుకుంటారు. \q1 వారు ప్రజలను మోసం చేసి వారి ఇళ్ళను లాక్కుంటారు, \q2 ప్రజల నుండి వారి స్వాస్థ్యాన్ని దోచుకుంటారు. \p \v 3 కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను, \q2 దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. \q1 అది విపత్తు కాలం కాబట్టి \q2 మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు. \q1 \v 4 ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు; \q2 మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు: \q1 ‘మేము పూర్తిగా పాడైపోయాం; \q2 నా ప్రజల ఆస్తి విభజింపబడింది \q1 ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు! \q2 ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ” \b \q1 \v 5 అందువల్ల చీట్లువేసి భూమిని కొలమానం ప్రకారం పంచడానికి \q2 యెహోవా సమాజంలో ఎవరూ ఉండరు. \s1 అబద్ధ ప్రవక్తలు \q1 \v 6 “ప్రవచించకండి” అని వారి ప్రవక్తలు అంటారు, \q2 “వీటి గురించి ప్రవచించకండి; \q2 మనకు అవమానం కలుగకూడదు.” \q1 \v 7 యాకోబు వారసులారా, \q2 “యెహోవా సహనం కోల్పోయారా? \q2 ఆయన ఇలాంటి పనులు చేస్తారా?” అని అనవచ్చా? \b \q1 “యథార్థంగా ప్రవర్తించే వారికి \q2 నా మాటలు క్షేమం కలిగించవా? \q1 \v 8 ఇటీవల నా ప్రజలే \q2 శత్రువుగా లేచారు. \q1 యుద్ధం నుండి తిరిగి వచ్చే మనుష్యుల్లా, \q2 నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి నుండి \q2 సంపన్న వస్త్రాన్ని మీరు లాగివేస్తారు. \q1 \v 9 నా ప్రజల స్త్రీలను \q2 వారికిష్టమైన గృహాలలో నుండి వెళ్లగొడతారు. \q1 వారి పిల్లల మీద ఎప్పటికీ \q2 నా ఆశీర్వాదం ఉండకుండా చేస్తున్నారు. \q1 \v 10 మీరు లేచి వెళ్లిపోండి! \q2 ఇది మీ విశ్రాంతి స్థలం కాదు, \q1 ఎందుకంటే అది అపవిత్రమైంది, \q2 అది పూర్తిగా నిర్మూలమైంది. \q1 \v 11 ఒకవేళ అబద్ధికుడు మోసగాడు వచ్చి, \q2 ‘ద్రాక్షరసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచిస్తాను’ \q2 అంటే, వాడే ఈ ప్రజలకు తగిన ప్రవక్త! \s1 విమోచన వాగ్దానం \q1 \v 12 “యాకోబూ, నేను ఖచ్చితంగా మీ అందరిని సమకూరుస్తాను; \q2 నేను ఖచ్చితంగా మిగిలిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాను. \q1 నేను వారిని గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా, \q2 పచ్చిక బయళ్లలోని మందలా సమకూరుస్తాను, \q2 ఈ స్థలం మనుష్యులతో కిటకిటలాడుతుంది. \q1 \v 13 అడ్డును పడగొట్టేవాడు వారికి ముందుగా వెళ్తాడు; \q2 వారు గుమ్మాన్ని పడగొట్టి, దానిగుండా బయటకు వెళ్తారు. \q1 వారి రాజు వారికి ముందుగా వెళ్తాడు, \q2 యెహోవా వారికి నాయకునిగా ఉంటారు.” \c 3 \s1 నాయకులు, ప్రవక్తలు గద్దించబడుట \p \v 1 అప్పుడు నేను ఇలా అన్నాను, \q1 “యాకోబు నాయకులారా, \q2 ఇశ్రాయేలు పాలకులారా, వినండి. \q1 న్యాయాన్ని మీరు తెలుసుకోవద్దా? \q2 \v 2 మీరు మంచిని అసహ్యించుకుని చెడును ప్రేమిస్తారు; \q1 నా ప్రజల చర్మం ఒలిచి, \q2 వారి ఎముకల మీద మాంసాన్ని చీలుస్తారు; \q1 \v 3 నా ప్రజల మాంసాన్ని తింటారు, \q2 వారి చర్మం ఒలిచి, \q2 వారి ఎముకలను ముక్కలుగా విరగ్గొడతారు; \q1 పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు, \q2 కుండలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు చేస్తారు.” \b \q1 \v 4 తర్వాత వారు యెహోవాకు మొరపెడతారు, \q2 కాని ఆయన వారికి జవాబివ్వరు. \q1 వారు చేసిన చెడు కారణంగా \q2 ఆయన ఆ కాలంలో తన ముఖం దాచుకుంటారు. \p \v 5 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “నా ప్రజలను తప్పుదారి పట్టించిన \q2 ప్రవక్తల విషయానికి వస్తే, \q1 వారికి తినడానికి ఏదైన ఉంటే, \q2 వారు ‘సమాధానం’ ప్రకటిస్తారు, \q1 కాని ఎవరైనా వారికి భోజనం పెట్టకపోతే, \q2 వారి మీద యుద్ధానికి సిద్ధపడతారు. \q1 \v 6 కాబట్టి మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముతుంది, \q2 సోదె చెప్పకుండా మిమ్మల్ని చీకటి ఆవరిస్తుంది. \q1 ప్రవక్తలకు సూర్యాస్తమయం అవుతుంది, \q2 పగలు వారికి చీకటిగా మారుతుంది. \q1 \v 7 అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గుపడతారు \q2 సోదె చెప్పేవారు అవమానపడతారు. \q1 దేవుని దగ్గర నుండి జవాబేమీ రాక \q2 వారంతా తమ ముఖాలను కప్పుకుంటారు.” \q1 \v 8 నేనైతే, యాకోబుకు అతని అతిక్రమాన్ని \q2 ఇశ్రాయేలుకు అతని పాపాన్ని తెలియజేయడానికి, \q2 యెహోవా ఆత్మను పొంది \q1 శక్తితో నింపబడి ఉన్నాను, \q2 న్యాయబుద్ధితో, బలంతో ఉన్నాను. \b \q1 \v 9 యాకోబు నాయకులారా, \q2 ఇశ్రాయేలు పాలకులారా, మీరు ఇది వినండి. \q1 మీరు న్యాయాన్ని తృణీకరించి, \q2 సరియైన దానినంతటిని వంకర చేస్తారు; \q1 \v 10 మీరు రక్తపాతంతో సీయోనును కడతారు, \q2 దుష్టత్వంతో యెరూషలేమును నిర్మిస్తారు. \q1 \v 11 దాని నాయకులు లంచం తీసుకుని తీర్పు చెప్తారు, \q2 దాని యాజకులు జీతానికి ఉపదేశిస్తారు. \q2 దాని ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెప్తారు. \q1 అయినా వారు యెహోవా సహాయం కోసం చూస్తూ, \q2 “యెహోవా మన మధ్య ఉన్నారు గదా! \q2 ఏ కీడు మన మీదికి రాదు” అంటారు. \q1 \v 12 కాబట్టి మీ కారణంగా, \q2 సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, \q1 యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది \q2 ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది. \c 4 \s1 యెహోవా పర్వతం \p \v 1 చివరి రోజుల్లో \q1 యెహోవా ఆలయ పర్వతం \q2 పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; \q1 అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, \q2 ప్రజలు ప్రవాహంలా దాని దగ్గరకు వెళ్తారు. \p \v 2 అన్య దేశాల వారనేకులు వచ్చి ఇలా అంటారు, \q1 “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, \q2 యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. \q1 మనం ఆయన మార్గంలో నడిచేలా, \q2 ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” \q1 సీయోనులో నుండి ధర్మశాస్త్రం, \q2 యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి. \q1 \v 3 ఆయన అనేక ప్రజలకు తీర్పు తీరుస్తారు, \q2 దూరంగా ఉన్న బలమైన దేశాల వివాదాలను పరిష్కరిస్తారు. \q1 వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, \q2 తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. \q1 దేశం మరొక దేశం మీది ఖడ్గం తీయదు, \q2 వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు. \q1 \v 4 ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్షచెట్టు క్రింద, \q2 తమ అంజూర చెట్టు క్రింద కూర్చుంటారు, \q1 ఎవరూ వారిని భయపెట్టరు, \q2 ఎందుకంటే సైన్యాల యెహోవా మాట ఇచ్చారు. \q1 \v 5 అన్ని దేశాల ప్రజలు తమ దేవుళ్ళ పేరిట నడుచుకుంటారు, \q2 అయితే మేము మా దేవుడైన \q2 యెహోవా పేరును బట్టి ఎల్లకాలం నడుచుకుంటాము. \s1 యెహోవా ప్రణాళిక \q1 \v 6 యెహోవా ఇలా అంటున్నారు, “ఆ రోజు, \q2 నేను కుంటివారిని పోగుచేస్తాను; \q1 బందీలుగా వెళ్లిన వారిని, \q2 నేను బాధకు గురిచేసిన వారిని సమకూరుస్తాను. \q1 \v 7 కుంటివారిని నా శేషంగా, \q2 వెళ్లగొట్టబడిన వారిని బలమైన దేశంగా చేస్తాను. \q1 యెహోవా సీయోను కొండమీద \q2 ఆ రోజు నుండి ఎల్లప్పుడూ వారిని పరిపాలిస్తారు. \q1 \v 8 మందకు కావలికోటగా, \q2 సీయోను కుమార్తె దుర్గంగా\f + \fr 4:8 \fr*\ft లేదా \ft*\fqa కొండ\fqa*\f* ఉన్న నీకైతే, \q1 మునుపటి అధికారం తిరిగి ఇవ్వబడుతుంది; \q2 యెరూషలేము కుమార్తెకు రాజ్యాధికారం వస్తుంది.” \b \q1 \v 9 ఇప్పుడు మీరెందుకు కేకలు వేస్తున్నారు? \q2 మీకు రాజు లేడా? \q1 మీ పరిపాలకుడు నాశనమయ్యాడా? \q2 స్త్రీ ప్రసవవేదన పడినట్లు మీరెందుకు వేదన చెందుతున్నారు? \q1 \v 10 సీయోను కుమార్తె, నీవు \q2 ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా వేదనతో మెలికలు తిరుగు, \q1 ఎందుకంటే ఇప్పుడు నీవు పట్టణం వదిలిపెట్టి, \q2 బయట నివసించాలి. \q1 మీరు బబులోనుకు వెళ్తారు, \q2 అక్కడే మీరు విడిపించబడతారు. \q1 అక్కడే యెహోవా మీ శత్రువు చేతిలో నుండి \q2 మిమ్మల్ని విడిపిస్తారు. \b \q1 \v 11 ఇప్పుడు అనేక దేశాలు \q2 మీకు విరుద్ధంగా కూడుకుని, \q1 “సీయోను అపవిత్రం కావాలి, \q2 దాని నాశనం మేము కళ్లారా చూడాలి!” అంటున్నారు. \q1 \v 12 కాని వారికి \q2 యెహోవా తలంపులు తెలియవు; \q1 ఆయన ప్రణాళిక వారు గ్రహించరు. \q2 నూర్పిడి కళ్ళంలో పనలు సమకూర్చినట్లు ఆయన వారిని సమకూరుస్తారు. \q1 \v 13 “సీయోను కుమార్తె, లేచి, కళ్ళం త్రొక్కు, \q2 నేను నీకు ఇనుప కొమ్ములు ఇస్తాను; \q1 ఇత్తడి డెక్కలు ఇస్తాను. \q2 నీవు అనేక దేశాలను ముక్కలుగా విరగ్గొడతావు.” \q1 నీవు వారి అన్యాయపు సంపదను యెహోవాకు సమర్పిస్తావు. \q2 వారి ఆస్తులను సర్వలోక ప్రభువుకు సమర్పిస్తావు. \c 5 \s1 బేత్లెహేము నుండి వాగ్దాన పాలకుడు \q1 \v 1 సైన్య సమూహాలు గల నగరమా, సమూహాలను సమకూర్చు, \q2 శత్రువులు మనల్ని ముట్టడించారు. \q1 వారు ఇశ్రాయేలు ప్రజల పాలకున్ని \q2 బెత్తంతో చెంపమీద కొడతారు. \b \q1 \v 2 “అయితే బేత్లెహేము ఎఫ్రాతా, \q2 యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, \q1 నా కోసం \q2 ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, \q1 ఆయన పూర్వకాలం నుండి \q2 శాశ్వతకాలం ఉన్నవాడు.” \b \q1 \v 3 కాబట్టి ప్రసవ వేదన పడే స్త్రీ బిడ్డను కనేవరకు \q2 ఇశ్రాయేలు విడిచిపెట్టబడుతుంది. \q1 అతని సోదరులలో మిగిలిన వారు, \q2 ఇశ్రాయేలీయులతో చేరడానికి తిరిగి వస్తారు. \b \q1 \v 4 ఆయన యెహోవా బలం పొంది \q2 తన దేవుడైన యెహోవా నామ మహిమతో \q2 లేచి తన మందను మేపుతాడు. \q1 ఆయన మహాత్యం భూదిగంతాల వరకు వ్యాపిస్తుంది, \q2 కాబట్టి వారు సురక్షితంగా నివసిస్తారు. \b \q1 \v 5 అష్షూరు వారు దండెత్తి మన దేశంలోకి వచ్చి \q2 మన కోటలలో ప్రవేశించేటప్పుడు, \q2 ఆయన మన సమాధానం అవుతారు \q1 మనం వారికి విరుద్ధంగా ఏడుగురు కాపరులను, \q2 ఎనిమిది మంది నాయకులుగా నియమిస్తాము. \q1 \v 6 వీరు ఖడ్గంతో అష్షూరు దేశాన్ని, \q2 దూసిన ఖడ్గంతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. \q1 అష్షూరు వారు దండెత్తి మన సరిహద్దులను దాటి, \q2 మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు \q2 ఆయన మనల్ని రక్షిస్తారు. \b \q1 \v 7 యాకోబు సంతానంలో మిగిలినవారు, \q2 అనేక జనాల మధ్యలో, \q1 యెహోవా కురిపించే మంచులా, \q2 ఎవరి కోసం ఎదురుచూడకుండ \q1 ఏ మనిషి మీద ఆధారపడకుండా \q2 గడ్డి మీద కురిసే వానజల్లులా ఉంటారు. \q1 \v 8 యాకోబు సంతానంలో మిగిలినవారు దేశాల మధ్య, \q2 అనేక జనాల మధ్య, \q1 అడవి మృగాలలో సింహంలా, \q2 గొర్రెల మందలలో దూరి, \q1 ఎవ్వరూ విడిపించలేనంతగా \q2 వాటిని త్రొక్కి చీల్చే కొదమసింహంలా ఉంటారు. \q1 \v 9 మీ హస్తం మీ విరోధుల మీద విజయం సాధిస్తుంది, \q2 మీ శత్రువులందరూ నాశనమవుతారు. \p \v 10 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఆ దినాన” \q1 “నేను మీ మధ్య నుండి మీ గుర్రాలను నాశనం చేస్తాను, \q2 మీ రథాలను ధ్వంసం చేస్తాను. \q1 \v 11 మీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను \q2 మీ కోటలను పడగొడతాను, \q1 \v 12 మీ మధ్య మంత్రవిద్య లేకుండా నాశనం చేస్తాను \q2 ఇక ఎన్నడూ మీరు సోదె చెప్పరు. \q1 \v 13 నేను మీ విగ్రహాలను, \q2 మీ పవిత్ర రాళ్లను మీ మధ్య నుండి నిర్మూలిస్తాను; \q1 ఇకపై మీరు ఎన్నడు \q2 మీ చేతి పనులకు మ్రొక్కరు. \q1 \v 14 నేను మీ పట్టణాలను పడగొట్టినప్పుడు, \q2 మీ మధ్య నుండి అషేరా స్తంభాలను పెళ్లగిస్తాను. \q1 \v 15 నా మాట వినని దేశాల మీద \q2 కోపంతో, క్రోధంతో ప్రతీకారం తీసుకుంటాను.” \c 6 \s1 ఇశ్రాయేలుపై యెహోవా అభియోగం \p \v 1 యెహోవా చెప్పేది వినండి: \q1 “మీరు నిలబడి, పర్వతాల ఎదుట నా వాదన వినిపించండి; \q2 కొండలు మీరు చెప్పేది వినాలి. \b \q1 \v 2 “పర్వతాల్లారా, యెహోవా చేసిన నేరారోపణ వినండి; \q2 భూమికి నిత్యమైన పునాదుల్లారా, ఆలకించండి. \q1 యెహోవా తన ప్రజలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు; \q2 ఆయన ఇశ్రాయేలుపై అభియోగం మోపుతున్నారు. \b \q1 \v 3 “నా ప్రజలారా! నేను మీకేం చేశాను? \q2 నేను మిమ్మల్ని ఎలా కష్టపెట్టాను? నాకు జవాబివ్వండి. \q1 \v 4 నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చాను \q2 మిమ్మల్ని దాస్యంలో ఉంచిన ఆ దేశం నుండి విడిపించాను. \q1 మీకు దారి చూపడానికి \q2 మోషే అహరోను మిర్యాములను పంపించాను. \q1 \v 5 నా ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు ఎలా కుట్ర చేశాడో, \q2 బెయోరు కుమారుడైన బిలాము అతనికి ఎలా జవాబిచ్చాడో \q2 జ్ఞాపకం చేసుకోండి. \q1 యెహోవా నీతి క్రియలు మీరు గ్రహించేలా \q2 షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన మీ ప్రయాణం జ్ఞాపకం చేసుకోండి.” \b \q1 \v 6 ఏమి తీసుకుని నేను యెహోవా సన్నిధిలోకి రావాలి, \q2 మహోన్నతుడైన దేవుని ఎదుట నమస్కరించాలి? \q1 నేను దహనబలులను, ఏడాది దూడలను \q2 ఆయన సన్నిధికి తీసుకురావాలా? \q1 \v 7 వేల కొలది పొట్టేళ్ళూ, \q2 పదివేల నదులంత నూనెను అర్పిస్తే యెహోవా సంతోషిస్తారా? \q1 నా అతిక్రమం కోసం నా జ్యేష్ఠ కుమారున్ని, \q2 నా పాపం కోసం నా గర్భఫలాన్ని అర్పించాలా? \q1 \v 8 ఓ మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు చూపించారు. \q2 యెహోవా నీ నుండి కోరేదేంటి? \q1 న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం, \q2 వినయం\f + \fr 6:8 \fr*\ft లేదా \ft*\fqa జ్ఞానం\fqa*\f* కలిగి నీ దేవునితో కలిసి నడవడమే కదా. \s1 ఇశ్రాయేలు అపరాధం శిక్ష \q1 \v 9 వినండి! యెహోవా పట్టణానికి ఇలా ప్రకటన చేస్తున్నారు: \q2 మీ నామానికి భయపడడమే జ్ఞానం, \q2 “శిక్షను, దానిని విధించేవాని మాటలు వినండి. \q1 \v 10 దుర్మార్గపు ఇల్లా, మీ అక్రమ సంపాదనలు, \q2 అసహ్యకరమైన మీ తప్పుడు కొలతలు ఇంకా ఉన్నాయి కదా? \q1 \v 11 తప్పుడు త్రాసు, మోసపు తూనిక రాళ్లున్న సంచి కలిగిన \q2 వారిని నిర్దోషి అని నేను తీర్పు ఇవ్వాలా? \q1 \v 12 మీ ధనవంతులు దౌర్జన్యం చేస్తున్నారు; \q2 మీ నివాసులు అబద్ధికులు \q2 వారి నాలుకలు కపటంగా మాట్లాడతాయి. \q1 \v 13 కాబట్టి మీ పాపాల కారణంగా నేను మిమ్మల్ని \q2 నాశనం చేసి నిర్మూలిస్తాను. \q1 \v 14 మీరు తింటారు కాని తృప్తి చెందరు; \q2 మీ కడుపులు ఇంకా ఖాళీగా ఉంటాయి. \q1 మీరు కూడబెట్టుకుంటారు కాని ఏమి కాపాడుకోలేరు, \q2 ఎందుకంటే మీరు భద్రపరచుకుంది నేను ఖడ్గానికి అప్పగిస్తాను. \q1 \v 15 మీరు నాటుతారు కాని పంట కోయరు; \q2 మీరు ఒలీవపండ్లను త్రొక్కుతారు కాని ఆ నూనెను వాడరు; \q2 ద్రాక్షలను త్రొక్కుతారు కాని ద్రాక్షరసం త్రాగరు. \q1 \v 16 మీరు ఒమ్రీ కట్టడాలను పాటించారు \q2 అహాబు ఇంటివారి విధానాలన్నీ పాటించారు; \q2 వారి సంప్రదాయాలను అనుసరించారు; \q1 కాబట్టి నేను మిమ్మల్ని నాశనం చేస్తాను \q2 ప్రజలు మిమ్మల్ని అపహాస్యం చేస్తారు; \q2 మీరు నా ప్రజల నిందను భరిస్తారు.” \c 7 \s1 ఇశ్రాయేలు దుస్థితి \q1 \v 1 ఏంటి నా దుస్థితి! \q1 నా పరిస్థితి వేసవికాలపు పండ్లు ఏరుకునే వానిలా \q2 ద్రాక్షతోట పరిగె సేకరించేవానిలా ఉంది; \q1 తినడానికి ద్రాక్షపండ్ల గెల లేదు, \q2 నేను ఆశించే క్రొత్త అంజూరపు పండ్లు లేవు. \q1 \v 2 నమ్మకమైనవారు దేశంలో లేకుండా పోయారు; \q2 యథార్థవంతుడు ఒక్కడూ లేడు. \q1 అందరు రక్తం చిందించడానికి పొంచి ఉన్నారు; \q2 వారు ఒకరిని ఒకరు వలలతో వేటాడతారు. \q1 \v 3 వారి రెండు చేతులు కీడు చేస్తాయి; \q2 పాలకులు బహుమతులు కోరతారు, \q1 న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటారు, \q2 గొప్పవారు తమ కోరికను తెలియజేస్తారు. \q2 వారంతా కలిసి కుట్ర చేస్తారు. \q1 \v 4 వారిలో మంచి వారు ముళ్ళపొద వంటివారు, \q2 వారిలో అత్యంత యథార్థవంతులు ముండ్లకంచె కంటే ఘోరము. \q1 దేవుడు మిమ్మల్ని దర్శించే రోజు, \q2 మీ కాపరులు\f + \fr 7:4 \fr*\ft ఇది ప్రవక్తలను సూచిస్తుంది\ft*\f* హెచ్చరించే రోజు వచ్చింది. \q2 ఇప్పుడే మీరు కలవరపడే సమయము. \q1 \v 5 పొరుగువారిని నమ్మకండి; \q2 స్నేహితుని మీద నమ్మకం పెట్టుకోకండి. \q1 మీ కౌగిటిలో ఉండే స్త్రీ దగ్గర కూడా \q2 మీ పెదవుల నుండి వచ్చే మాటలను కాచుకోండి. \q1 \v 6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేస్తాడు, \q2 తల్లి మీదికి కుమార్తె, \q1 అత్త మీదికి తన కోడలు తిరగబడతారు, \q2 సొంత ఇంటివారే వారికి శత్రువులవుతారు. \b \q1 \v 7 నేనైతే యెహోవా వైపు నిరీక్షణతో చూస్తాను, \q2 నా రక్షకుడైన దేవుని కోసం వేచి ఉంటాను; \q2 నా దేవుడు నా ప్రార్ధన వింటారు. \s1 ఇశ్రాయేలు తిరిగి లేస్తుంది \q1 \v 8 నా విరోధీ, నా మీద అతిశయించకు, \q2 నేను పడిపోయినా తిరిగి లేస్తాను. \q1 నేను చీకటిలో కూర్చున్నా, \q2 యెహోవా నాకు వెలుగై ఉంటారు. \q1 \v 9 నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను కాబట్టి, \q2 ఆయన నాకు న్యాయం తీర్చేవరకు \q1 ఆయన నా పక్షాన ఉండే వరకు \q2 నేను ఆయన కోపాగ్నిని భరిస్తాను. \q1 ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తారు, \q2 నేను ఆయన నీతిని చూస్తాను. \q1 \v 10 అప్పుడు నా శత్రువు దాన్ని చూసి, \q2 ఇలా జరగడం చూసి సిగ్గుపడుతుంది. \q1 “నీ దేవుడైన యెహోవా ఎక్కడ?” \q2 అని నాతో అన్న ఆమె \q1 నా కళ్లు ఆమె పతనం చూస్తాయి; \q2 ఇప్పుడు కూడా ఆమె వీధిలోని బురదలా \q2 కాళ్లక్రింద త్రొక్కబడుతుంది. \b \q1 \v 11 మీ గోడలు కట్టే రోజు వస్తుంది \q2 మీ సరిహద్దులు విశాలపరిచే రోజు వస్తుంది. \q1 \v 12 ఆ రోజు ప్రజలు అష్షూరు నుండి \q2 ఈజిప్టు పట్టణాల నుండి మీ దగ్గరకు వస్తారు, \q1 ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీసు వరకు, \q2 సముద్రం నుండి సముద్రం వరకు \q2 పర్వతం నుండి పర్వతం వరకు ఉన్న ప్రజలు వస్తారు. \q1 \v 13 భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా \q2 దేశం పాడవుతుంది. \s1 ప్రార్ధన స్తుతి \q1 \v 14 మీ చేతికర్రతో మీ ప్రజలను కాయండి, \q2 వారు మీ వారసత్వపు మంద, \q1 వారు అడవిలో ఒంటరిగా, \q2 సారవంతమైన పచ్చికబయళ్లలో\f + \fr 7:14 \fr*\ft లేదా \ft*\fqa కర్మెలు మధ్య ప్రాంతం\fqa*\f* నివసిస్తున్నారు. \q1 పూర్వకాలంలో మేసినట్లు \q2 వారిని బాషాను, గిలాదులో మేస్తారు. \b \q1 \v 15 “మీరు ఈజిప్టు నుండి వచ్చిన రోజుల్లో చేసినట్లు, \q2 నేను నా అద్భుతాలు వారికి చూపిస్తాను.” \b \q1 \v 16 దేశాల ప్రజలు అది చూసి \q2 తమ శక్తి కోల్పోయి సిగ్గుపడతారు. \q1 వారు తమ చేతులతో నోరు మూసుకుంటారు, \q2 వారి చెవులకు చెవుడు వస్తుంది. \q1 \v 17 పాములా, నేల మీద ప్రాకే పురుగులా, \q2 వారు ధూళిని నాకుతారు. \q1 వారు తమ గుహల్లో నుండి వణకుతూ బయటకు వస్తారు; \q2 వారు భయంతో మన దేవుడైన యెహోవా వైపు తిరుగుతారు, \q2 నిన్ను బట్టి భయపడతారు. \q1 \v 18 మీలాంటి దేవుడెవరు? \q2 మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి \q2 పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు, \q1 మీరు నిత్యం కోపంతో ఉండరు \q2 కాని దయ చూపడంలో ఆనందిస్తారు. \q1 \v 19 మీరు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తారు; \q2 మీరు మా పాపాలను అణగద్రొక్కుతారు, \q2 మా అతిక్రమాలన్నిటిని సముద్రంలో లోతుల్లో పడవేస్తారు. \q1 \v 20 మీరు పూర్వకాలంలో మా పూర్వికులకు \q2 ప్రమాణం చేసిన విధంగా \q1 యాకోబు పట్ల నమ్మకత్వాన్ని, \q2 అబ్రాహాము పట్ల మారని ప్రేమ చూపుతారు.