\id LAM - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h విలాప \toc1 విలాప గ్రంథం \toc2 విలాప \toc3 విలాప \mt1 విలాప \mt2 గ్రంథం \c 1 \q1 \f + \fr 1 \fr*\ft ఈ అధ్యాయం ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి\ft*\f* \v 1 పట్టణం ఎలా నిర్జనమై ఉంది, \q2 ఒకప్పుడు జనంతో నిండి ఉండేది! \q1 ఆమె ఒక విధవరాలిలా ఎలా ఉంది, \q2 ఒకప్పుడు దేశాల మధ్య గొప్పదిగా ఉండేది! \q1 ఆమె రాజ్యాల మధ్య రాణిగా ఉండేది, \q2 కాని ఇప్పుడు బానిసగా మారింది. \b \q1 \v 2 రాత్రంతా ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది, \q2 ఆమె చెంపల మీద కన్నీరు ఉంటుంది. \q1 ఆమె ప్రేమికులందరి మధ్య ఉన్నా \q2 ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. \q1 ఆమె స్నేహితులందరూ ఆమెను అప్పగించారు; \q2 వారు ఆమెకు శత్రువులయ్యారు. \b \q1 \v 3 బాధ, కఠిన శ్రమ తర్వాత, \q2 యూదా చెరకు వెళ్లిపోయింది. \q1 ఆమె జనాంగాల మధ్య నివసిస్తుంది; \q2 ఆమెకు విశ్రాంతి స్థలం దొరకడం లేదు. \q1 ఆమెను వెంటాడే వారంతా ఆమె కష్టాల మధ్య \q2 ఆమెను దాటి వెళ్లిపోయారు. \b \q1 \v 4 సీయోనుకు వెళ్లే దారులు దుఃఖిస్తున్నాయి, \q2 ఎందుకంటే దాని నియమించబడిన పండుగలకు ఎవరూ రావట్లేదు. \q1 దాని ద్వారాలన్నీ నిర్జనమయ్యాయి, \q2 ఆమె యాజకులు మూలుగుతున్నారు, \q1 ఆమె యువతులు దుఃఖపడుతున్నారు, \q2 ఆమె తీవ్ర వేదనలో ఉంది. \b \q1 \v 5 ఆమె విరోధులు ఆమెకు యజమానులయ్యారు; \q2 ఆమె శత్రువులు సుఖంగా జీవిస్తున్నారు; \q1 ఆమె యొక్క అనేక పాపాలను బట్టి \q2 యెహోవా ఆమెకు దుఃఖం కలిగించారు. \q1 ఆమె పిల్లలు చెరకు వెళ్లారు, \q2 వారు శత్రువు ముందు బందీలుగా ఉన్నారు. \b \q1 \v 6 సీయోను కుమారి నుండి \q2 వైభవమంతా అంతరించింది. \q1 ఆమె అధిపతులు, \q2 పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు; \q1 బలహీనులై తమను వెంటాడుతున్న వారి \q2 ఎదుటి నుండి పారిపోయారు. \b \q1 \v 7 తన బాధలో, ఆమె నిరాశ్రయురాలిగా ఉన్న రోజుల్లో, \q2 యెరూషలేము పూర్వకాలంలో తనకు చెందిన సంపదలన్నింటినీ \q2 జ్ఞాపకం చేసుకుంటుంది. \q1 ఆమె ప్రజలు శత్రువు చేతిలో పడినప్పుడు, \q2 వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు. \q1 ఆమె శత్రువులు ఆమె వైపు చూసి \q2 ఆమెకు కలిగిన నాశనాన్ని బట్టి నవ్వారు. \b \q1 \v 8 యెరూషలేము చాలా పాపం చేసింది \q2 కాబట్టి అపవిత్రమైనది. \q1 ఆమెను గౌరవించిన వారందరూ ఆమెను తృణీకరిస్తారు, \q2 అందరు ఆమెను నగ్నంగా చూశారు. \q1 ఆమె మూలుగుతూ వెనుదిరిగింది. \b \q1 \v 9 ఆమె అపవిత్రత ఆమె దుస్తులకు అంటుకుంది; \q2 ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. \q1 ఆమె పతనం ఆశ్చర్యకరంగా ఉంది; \q2 ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. \q1 “యెహోవా, నా బాధను చూడు, \q2 ఎందుకంటే శత్రువు నా మీద విజయం సాధించాడు.” \b \q1 \v 10 ఆమె సంపదలన్నిటినీ \q2 ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు; \q1 యూదేతరుల దేశాలు \q2 ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది, \q1 మీరు మీ సమాజంలోకి \q2 ప్రవేశించకుండ నిషేధించబడినవారు. \b \q1 \v 11 ఆమె ప్రజలందరూ \q2 ఆహారం కోసం వెదుకుతూ మూల్గుతారు; \q1 తాము బ్రతికి ఉండడానికి \q2 వారు తమ సంపదలను ఇచ్చి ఆహారం తెచ్చుకుంటున్నారు. \q1 “యెహోవా, మమ్మల్ని చూసి, ఏదైనా ఆలోచించు, \q2 ఎందుకంటే మేము తృణీకరించబడ్డాము.” \b \q1 \v 12 “దారిన పోయే మీకందరికి, ఏమీ అనిపించడం లేదా? \q2 చుట్టూ తిరిగి చూడండి. \q1 యెహోవా నా మీదికి \q2 తన కోపాగ్ని దినాన \q1 తెచ్చిన బాధలాంటి \q2 బాధ ఏదైనా ఉందా? \b \q1 \v 13 “ఆయన పైనుండి అగ్ని పంపారు, \q2 దాన్ని నా ఎముకల్లోకి పంపారు. \q1 నా పాదాలకు వలవేసి \q2 నన్ను వెనుకకు తిరిగేలా చేశారు. \q1 ఆయన నన్ను నిర్జనంగా చేశారు, \q2 నేను బాధతో మూర్ఛపోయాను. \b \q1 \v 14 “నా పాపాలు కాడికి కట్టబడ్డాయి\f + \fr 1:14 \fr*\ft కొ. ప్ర. లలో \ft*\fqa ఆయన నా పాపాలను కనిపెడుతున్నారు\fqa*\f*; \q2 ఆయన చేతులతో అవి ఒక్కటిగా నేయబడ్డాయి. \q1 అవి నా మెడకు వ్రేలాడదీయబడ్డాయి, \q2 యెహోవా నా బలాన్ని విఫలం చేశారు. \q1 నేను తట్టుకోలేని వారి చేతుల్లోకి \q2 ఆయన నన్ను అప్పగించారు. \b \q1 \v 15 “నా మధ్య ఉన్న బలవంతులందరినీ \q2 యెహోవా తిరస్కరించారు; \q1 నా యువకులను అణచివేయడానికి \q2 ఆయన నా మీదికి సైన్యాన్ని పిలిపించారు. \q1 కన్యయైన యూదా కుమారిని \q2 ప్రభువు తన ద్రాక్షగానుగలో త్రొక్కారు. \b \q1 \v 16 “అందుకే నేను ఏడుస్తున్నాను \q2 నా కళ్ల నుండి కన్నీరు పొర్లి పారుతున్నాయి. \q1 నన్ను ఓదార్చడానికి నాకు దగ్గరగా ఎవరూ లేరు, \q2 నా ఆత్మను ఉత్తేజపరచడానికి ఎవరూ లేరు. \q1 శత్రువు నన్ను జయించాడు కాబట్టి \q2 నా పిల్లలు నిరుపేదలయ్యారు.” \b \q1 \v 17 సీయోను చేతులు చాచింది, \q2 ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. \q1 యాకోబుకు తన పొరుగువారే \q2 శత్రువులుగా మారాలని యెహోవా శాసించారు; \q2 యెరూషలేము వారి మధ్య అపవిత్రం అయ్యింది. \b \q1 \v 18 “యెహోవా నీతిమంతుడు, \q2 అయినా నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. \q1 జనాంగములారా, వినండి; \q2 నా శ్రమను చూడండి. \q1 నా యువకులు, యువతులు \q2 చెరకు వెళ్లారు. \b \q1 \v 19 “సహాయం కోసం నేను నా స్నేహితులను పిలిచాను \q2 కానీ వారు నన్ను మోసం చేశారు. \q1 నా యాజకులు, నా పెద్దలు \q2 తాము బ్రతికి ఉండాలని \q1 ఆహారం కోసం వెదుకుతూ, \q2 వారు పట్టణంలో చనిపోయారు. \b \q1 \v 20 “యెహోవా, చూడండి, నేను ఎంత బాధలో ఉన్నానో! \q2 నా లోలోపల చిత్రహింసను అనుభవిస్తున్నాను, \q1 నా హృదయంలో నేను కలత చెందాను, \q2 ఎందుకంటే నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను. \q1 బయట, ఖడ్గం హతమారుస్తూ ఉంది; \q2 లోపల, కేవలం మరణమే. \b \q1 \v 21 “ప్రజలు నా మూలుగు విన్నారు, \q2 కాని నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు. \q1 నా శత్రువులందరూ నా బాధను గురించి విన్నారు; \q2 మీరు నాకు చేసిన దానిని బట్టి వారు సంతోషిస్తున్నారు. \q1 మీరు ప్రకటించిన రోజును మీరు రప్పించాలి \q2 అప్పుడు వారు నాలా అవుతారు. \b \q1 \v 22 “వారి దుష్టత్వమంతా మీ ముందుకు రావాలి; \q2 నా పాపాలన్నిటిని బట్టి \q1 మీరు నాతో ఎలా వ్యవహరించారో \q2 వారితో కూడా అలాగే వ్యవహరించాలి. \q1 నా మూలుగులు అనేకం \q2 నా హృదయం సొమ్మసిల్లింది.” \b \b \c 2 \q1 \f + \fr 2 \fr*\ft ఈ అధ్యాయం ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి\ft*\f* \v 1 ప్రభువు తన కోపంతో \q2 సీయోను కుమార్తెను మేఘంతో కప్పివేశారు! \q1 ఆయన ఇశ్రాయేలు వైభవాన్ని \q2 ఆకాశం నుండి భూమి మీదికి పడగొట్టారు; \q1 ఆయన తన కోప్పడిన దినాన \q2 తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. \b \q1 \v 2 దయ లేకుండా ప్రభువు \q2 యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు. \q1 తన కోపంలో ఆయన తన కుమార్తెయైన \q2 యూదా కోటలను పడగొట్టారు. \q1 ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులను \q2 అగౌరపరచి నేలకూల్చారు. \b \q1 \v 3 ఆయన తన కోపాగ్నిలో \q2 ఇశ్రాయేలీయుల ప్రతి కొమ్మును\f + \fr 2:3 \fr*\fq కొమ్ము \fq*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తుంది\ft*\f* నరికివేశారు. \q1 శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు \q2 ఆయన తన కుడిచేతిని వెనుకకు తీసుకున్నారు. \q1 ఆయన యాకోబులో మండుతున్న అగ్నిలా, \q2 దాని చుట్టూ ఉన్న సమస్తాన్ని దహించే మంటలా ఉన్నారు. \b \q1 \v 4 ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టారు; \q2 ఆయన కుడిచేయి సిద్ధంగా ఉంది. \q1 ఆయన ఒక శత్రువులా \q2 కంటికి నచ్చిన వారందరినీ చంపేశారు; \q1 ఆయన తన కోపాన్ని అగ్నిలా \q2 సీయోను కుమార్తె గుడారం మీద కుమ్మరించారు. \b \q1 \v 5 ప్రభువు ఒక శత్రువులా; \q2 ఇశ్రాయేలును నాశనం చేశారు. \q1 ఆమె రాజభవనాలన్నింటిని ఆయన కూల్చివేశారు, \q2 అలాగే ఆమె కోటలను నాశనం చేశారు. \q1 ఆయన యూదా కుమార్తె కోసం \q2 దుఃఖాన్ని, విలాపాన్ని అధికం చేశారు. \b \q1 \v 6 ఆయన తన నివాసాన్ని తోటలో ఉండే ఒక పాకలా కూల్చివేశారు; \q2 ఆయన తన సమావేశ స్థలాన్ని నాశనం చేశారు. \q1 యెహోవా సీయోనును తన \q2 నియమించబడిన పండుగలను, సబ్బాతులను మరచిపోయేలా చేశారు; \q1 ఆయన తన కోపాగ్నిలో \q2 రాజును, యాజకులను తిరస్కరించారు. \b \q1 \v 7 ప్రభువు తన బలిపీఠాన్ని తిరస్కరించి, \q2 తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టారు. \q1 ఆయన ఆమె రాజభవనాల గోడలను \q2 శత్రువుల చేతికి అప్పగించారు; \q1 నియామక పండుగ రోజున చేసినట్టుగా వారు \q2 యెహోవా నివాసంలో బిగ్గరగా కేకలు వేశారు. \b \q1 \v 8 సీయోను కుమారి చుట్టూ ఉన్న గోడను \q2 పడగొట్టాలని యెహోవా నిశ్చయించుకున్నారు. \q1 ఆయన కొలమానాన్ని గీసాడు \q2 నాశనం చేయకూడదని తన చేతిని వెనుకకు తీసుకోలేదు. \q1 ఆయన రక్షణ వ్యవస్థ అంతటిని, గోడలను విలపించేలా చేశారు; \q2 అవి శిథిలావస్థలో ఉండిపోయాయి. \b \q1 \v 9 ఆమె ద్వారాలు భూమిలోకి కృంగిపోయాయి; \q2 ఆయన వాటి బంధాలను పగలగొట్టి నాశనం చేశారు. \q1 ఆమె రాజు, ఆమె అధిపతులు దేశాల్లోకి చెరకు కొనిపోబడ్డారు, \q2 ఇక ఉపదేశం లేకుండా పోయింది, \q1 ఆమె ప్రవక్తలు ఇక \q2 యెహోవా నుండి దర్శనాలను పొందుకోలేదు. \b \q1 \v 10 సీయోను కుమార్తె పెద్దలు \q2 మౌనంగా నేలమీద కూర్చున్నారు; \q1 తమ తలలపై ధూళి చల్లుకొని \q2 గోనెపట్ట కట్టుకున్నారు. \q1 యెరూషలేము యువతులు \q2 తమ తలలు నేలకు వంచుకున్నారు. \b \q1 \v 11 ఏడ్వడం వల్ల నా కళ్లు క్షీణిస్తున్నాయి, \q2 నా లోపలి భాగాలు వేదనను అనుభవిస్తున్నాను. \q1 నా హృదయం నేలమీద కుమ్మరించబడింది, \q2 ఎందుకంటే నా ప్రజలు నాశనమయ్యారు, \q1 పిల్లలు, పసిపిల్లలు \q2 నగర వీధుల్లో మూర్ఛపోయారు. \b \q1 \v 12 వారు తమ తల్లులతో, \q2 “తినడానికి, త్రాగడానికి ఏమి లేవా?” అని అడుగుతున్నారు, \q1 వారు గాయపడిన వారిలా \q2 నగర వీధుల్లో మూర్ఛపోతున్నారు, \q1 వారి తల్లుల చేతుల్లో \q2 వారి ప్రాణాలు పోతున్నాయి. \b \q1 \v 13 యెరూషలేము కుమారీ! \q2 నీ గురించి ఏమి చెప్పగలను? \q2 నిన్ను దేనితో పోల్చగలను? \q1 సీయోను కుమారీ, \q2 కన్యకా! నిన్నెలా ఓదార్చడానికి \q2 నిన్ను దేనితో పోల్చగలను \q1 నీకు కలిగిన గాయం సముద్రమంత లోతుగా ఉంది \q2 నిన్నెవరు స్వస్థపరచగలరు? \b \q1 \v 14 నీ ప్రవక్తల దర్శనాలు \q2 అబద్ధం, పనికిరానివి; \q1 చెర నుండి నిన్ను తప్పించడానికి \q2 వారు నీ పాపాన్ని బయటపెట్టలేదు. \q1 వారు నీకు చెప్పిన ప్రవచనాలు \q2 అబద్ధం, తప్పుదారి పట్టించేవి. \b \q1 \v 15 నీ దారిన వెళ్లేవారంతా నిన్ను చూసి, \q2 చప్పట్లు కొడతారు; \q1 వారు యెరూషలేము దిక్కు చూసి \q2 ఎగతాళిగా తలలాడిస్తూ ఇలా అంటారు: \q1 “పరిపూర్ణ సౌందర్య పట్టణమని, \q2 సమస్త భూనివాసులకు ఆనంద కారణమని \q2 ఈ పట్టణాన్ని గురించేనా చెప్పుకున్నారు?” \b \q1 \v 16 నీ శత్రువులందరూ \q2 నీకు వ్యతిరేకంగా నోరు విప్పారు. \q1 వారు ఎగతాళి చేసి పళ్లు కొరుకుతూ, \q2 “మేము ఆమెను నాశనం చేశాము. \q1 ఈ రోజు కోసమే మేము ఎదురు చూసింది; \q2 దీన్ని చూడడానికే మేము బ్రతికి ఉండింది” అని అంటారు. \b \q1 \v 17 యెహోవా తాను సంకల్పించింది చేశారు, \q2 చాలా కాలం క్రితం ఆయన శాసించిన, \q2 తన మాట ఆయన నెరవేర్చారు. \q1 ఆయన దయ లేకుండా నిన్ను పడగొట్టారు, \q2 శత్రువు నీ మీద సంతోషించేలా చేశారు, \q2 ఆయన నీ శత్రువుల కొమ్మును\f + \cat dup\cat*\fr 2:17 \fr*\fq కొమ్ము \fq*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తుంది\ft*\f* హెచ్చించారు. \b \q1 \v 18 ప్రజల హృదయాలు \q2 యెహోవాకు మొరపెడుతున్నాయి. \q1 సీయోను కుమారి గోడలారా, \q2 మీ కన్నీటిని నదిలా \q2 పగలు రాత్రి ప్రవహించనివ్వండి; \q1 మీకు మీరే ఉపశమనం కలిగించుకోవద్దు, \q2 మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వవద్దు. \b \q1 \v 19 లేచి, రాత్రివేళ కేకలు వేయండి, \q2 రేయి మొదటి జామున కేకలు వేయండి. \q1 నీ హృదయాన్ని నీళ్లలా \q2 ప్రభువు సన్నిధిలో కుమ్మరించండి. \q1 ప్రతి వీధి చివరిలో \q2 ఆకలితో మూర్ఛపోయిన \q1 మీ పిల్లల ప్రాణాల కోసం \q2 ఆయన వైపు మీ చేతులు ఎత్తండి. \b \q1 \v 20 “చూడండి, యెహోవా, ఆలోచించండి: \q2 మీరు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలా వ్యవహరించారా? \q1 స్త్రీలు తమ సంతానాన్ని తినాలా, \q2 తాము పెంచిన పిల్లలను తినాలా? \q1 యాజకుడు, ప్రవక్త \q2 ప్రభువు యొక్క పరిశుద్ధాలయంలో చంపబడాలా? \b \q1 \v 21 “చిన్నవారు, పెద్దవారు కలిసి \q2 వీధుల్లోని దుమ్ములో పడుకుంటారు; \q1 నా యువకులు, యువతులు \q2 ఖడ్గం చేత చంపబడ్డారు. \q1 మీరు కోప్పడిన దినాన మీరు వారిని చంపారు; \q2 మీరు జాలి లేకుండా వారిని వధించారు. \b \q1 \v 22 “మీరు ఒక పండుగ దినానికి పిలిచినట్లు, \q2 నాకు వ్యతిరేకంగా ప్రతి వైపు నుండి భయాందోళనలు పిలిచారు. \q1 యెహోవా ఉగ్రత దినాన \q2 ఎవరూ తప్పించుకోలేదు, బ్రతకలేదు; \q1 నేను అపురూపంగా పెంచుకొన్న వారిని \q2 నా శత్రువు నాశనం చేశాడు.” \b \b \c 3 \q1 \f + \fr 3 \fr*\ft ఈ అధ్యాయం ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి\ft*\f* \v 1 యెహోవా ఉగ్రత కర్ర చేత \q2 నేను బాధను అనుభవించిన వాన్ని. \q1 \v 2 ఆయన నన్ను వెళ్లగొట్టి, \q2 వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు. \q1 \v 3 నిజానికి, ఆయన రోజంతా \q2 మాటిమాటికి నా మీద తన చేయి ఆడిస్తానే ఉన్నారు. \b \q1 \v 4 ఆయన నా చర్మాన్ని, నా మాంసాన్ని క్షీణించిపోయేలా చేసి \q2 నా ఎముకలను విరగ్గొట్టారు. \q1 \v 5 ఆయన నన్ను ముట్టడించి, \q2 విషంతో కఠినత్వంతో నన్ను చుట్టుముట్టారు. \q1 \v 6 ఎప్పుడో చనిపోయినవారు పడి ఉన్నట్లుగా \q2 ఆయన నన్ను చీకటిలో పడి ఉండేలా చేశారు. \b \q1 \v 7 నేను తప్పించుకోకుండా ఆయన నా చుట్టూ గోడ కట్టించారు; \q2 బరువైన గొలుసులతో ఆయన నన్ను బంధించారు. \q1 \v 8 నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా \q2 ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు. \q1 \v 9 ఆయన రాళ్లను నా దారికి అడ్డుపెట్టారు; \q2 ఆయన నా మార్గాలను వంకర చేశారు. \b \q1 \v 10 పొంచి ఉన్న ఎలుగుబంటిలా, \q2 దాక్కున్న సింహంలా, \q1 \v 11 ఆయన నన్ను దారిలో నుండి ఈడ్చుకెళ్లి, నన్ను ముక్కలు చేసి, \q2 నిస్సహాయ స్థితిలో వదిలేశారు. \q1 \v 12 ఆయన తన విల్లు తీసి, \q2 తన బాణాలకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. \b \q1 \v 13 ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, \q2 నా గుండెను గుచ్చారు. \q1 \v 14 నేను నా ప్రజలందరికి నవ్వులాటగా మారాను; \q2 రోజంతా వారు పాటలో నన్ను హేళన చేస్తున్నారు. \q1 \v 15 ఆయన నాతో చేదు మూలికలు తినిపించారు, \q2 త్రాగడానికి చేదు పానీయాన్ని ఇచ్చారు. \b \q1 \v 16 ఆయన రాళ్లతో నా పళ్లను విరగ్గొట్టారు; \q2 నన్ను దుమ్ములో త్రొక్కారు. \q1 \v 17 సమాధానం నాకు దూరమైంది, \q2 అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను. \q1 \v 18 కాబట్టి, “నా వైభవం పోయింది, \q2 యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను. \b \q1 \v 19 నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి, \q2 నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి. \q1 \v 20 నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, \q2 నా ప్రాణం నాలో కృంగి ఉంది. \q1 \v 21 అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను, \q2 కాబట్టి నాకు నిరీక్షణ ఉంది: \b \q1 \v 22 యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, \q2 ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు. \q1 \v 23 ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; \q2 మీ నమ్మకత్వం గొప్పది. \q1 \v 24 నాలో నేను, “యెహోవా నా స్వాస్థ్యం; \q2 కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను” \q2 అని అనుకుంటున్నాను. \b \q1 \v 25 తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి, \q2 తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు; \q1 \v 26 యెహోవా రక్షణ కోసం \q2 ఓపికతో వేచి ఉండడం మంచిది. \q1 \v 27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, \q2 కాడి మోయడం అతనికి మేలు. \b \q1 \v 28 యెహోవాయే దాన్ని అతని మీద ఉంచారు, \q2 కాబట్టి అతడు ఒంటరిగా మౌనంగా కూర్చోవాలి. \q1 \v 29 అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు \q2 ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు. \q1 \v 30 తనను కొట్టేవానికి తన చెంపను చూపించి, \q2 నిండా అవమానం పాలుకానివ్వు. \b \q1 \v 31 ఎవ్వరూ ప్రభువుచేత \q2 శాశ్వతంగా త్రోసివేయబడరు. \q1 \v 32 ఆయన దుఃఖం కలిగించినప్పటికీ, ఆయన కనికరం చూపుతారు, \q2 ఆయన మారని ప్రేమ చాలా గొప్పది. \q1 \v 33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని \q2 దుఃఖం గాని కలుగజేయరు. \b \q1 \v 34 దేశంలో ఖైదీలందరిని, \q2 కాళ్లక్రింద పడేసి త్రొక్కాలని, \q1 \v 35 మహోన్నతుని ఎదుట, \q2 ప్రజలు తమ హక్కులను త్రోసిపుచ్చాలని, \q1 \v 36 ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం, \q2 ఇలాంటివి ప్రభువు చూడరా? \b \q1 \v 37 ప్రభువు శాసించనప్పుడు \q2 అది జరిగేలా ఎవరు ఆజ్ఞాపించగలరు? \q1 \v 38 మహోన్నతుని నోటి నుండి \q2 వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా? \q1 \v 39 తమ పాపాలను బట్టి శిక్షించబడినప్పుడు \q2 సజీవులైన మనుష్యులు ఎందుకు ఫిర్యాదు చేయాలి? \b \q1 \v 40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, \q2 యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. \q1 \v 41 మన హృదయాలను, చేతులను \q2 పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి: \q1 \v 42 “మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము \q2 మీరు క్షమించలేదు. \b \q1 \v 43 “మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; \q2 మీరు జాలి లేకుండా చంపారు. \q1 \v 44 ఏ ప్రార్థన ఫలించకుండా, \q2 మీరు ఒక మేఘంతో మిమ్మల్ని మీరు కప్పుకున్నారు. \q1 \v 45 దేశాల మధ్య \q2 మీరు మమ్మల్ని చెత్తగా చేశారు. \b \q1 \v 46 “మా శత్రువులందరూ మాకు వ్యతిరేకంగా \q2 నోరు తెరిచారు. \q1 \v 47 మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, \q2 పతనము నాశనము.” \q1 \v 48 నా ప్రజలు నాశనమయ్యారు కాబట్టి \q2 నా కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తాయి. \b \q1 \v 49-50 యెహోవా పరలోకం నుండి \q2 క్రిందికి వంగి చూసే వరకు, \q1 ఉపశమనం లేకుండా, \q2 నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది. \q1 \v 51 నా నగర స్త్రీలందరి వల్ల \q2 నేను చూసేది నా ప్రాణానికి దుఃఖం కలిగిస్తుంది. \b \q1 \v 52 కారణం లేకుండా నాకు శత్రువులుగా ఉన్నవారు \q2 పక్షిలా నన్ను వేటాడారు. \q1 \v 53 వారు గొయ్యిలో వేసి నా ప్రాణం తీయాలని చూశారు, \q2 నాపై రాళ్లు విసిరారు; \q1 \v 54 నీరు నా తలపై మూసుకుపోయాయి, \q2 నేను నశిస్తానని అనుకున్నాను. \b \q1 \v 55 యెహోవా, నీ నామమున మొరపెట్టాను, \q2 గొయ్యి లోతుల్లో నుండి నీ నామాన్ని పిలిచాను. \q1 \v 56 “మీరు నా మొరను ఆలకించారు, \q2 నీ చెవులు మూసుకోకు” \q2 అనే నా విన్నపాన్ని మీరు విన్నారు. \q1 \v 57 నేను నిన్ను పిలిచినప్పుడు మీరు దగ్గరికి వచ్చి \q2 “భయపడకు” అన్నారు. \b \q1 \v 58 ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. \q2 నీవు నా ప్రాణాన్ని విమోచించావు. \q1 \v 59 యెహోవా చూశావు. \q2 నా కారణాన్ని సమర్థించండి! \q1 \v 60 వారి ప్రతీకార తీవ్రతను, \q2 నాకు వ్యతిరేకంగా వారు పన్నిన కుట్రలన్నీ మీరు చూశారు. \b \q1 \v 61 యెహోవా, వారి అవమానాలను, \q2 నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు. \q1 \v 62 నా శత్రువులు రోజంతా నాకు వ్యతిరేకంగా \q2 గుసగుసలాడే గొణుగుతున్నారు. \q1 \v 63 వాటిని చూడు! కూర్చున్నా, నిలబడినా \q2 తమ పాటల్లో నన్ను వెక్కిరిస్తారు. \b \q1 \v 64 యెహోవా వారి క్రియా కలపలను బట్టి, \q2 ప్రతీకారం చేస్తావు. \q1 \v 65 వారికి కాఠిన్యమైన హృదయాలు ఇవ్వండి, \q2 మీ శాపం వారి మీదికి వచ్చును గాక. \q1 \v 66 కోపంతో వారిని వెంటాడి, \q2 యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి. \b \b \c 4 \q1 \f + \cat dup\cat*\fr 4 \fr*\ft ఈ అధ్యాయం ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి\ft*\f* \v 1 బంగారం తన మెరుపును ఎలా కోల్పోయింది, \q2 మంచి బంగారం ఎలా మొద్దుబారిపోయింది! \q1 ప్రతి వీధి మూలలో \q2 ప్రశస్తమైన రాళ్ల వంటి రత్నాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. \b \q1 \v 2 ప్రశస్తమైన సీయోను పిల్లలు ఎలా అయిపోయారు, \q2 ఒకప్పుడు వారి విలువ బంగారంతో తూగేది, \q1 ఇప్పుడు మట్టి కుండలుగా, \q2 కుమ్మరి చేతి పనిగా పరిగణించబడుతున్నారు! \b \q1 \v 3 నక్కలు కూడా \q2 తమ పిల్లలకు పాలివ్వడానికి తమ రొమ్ములిస్తాయి, \q1 కానీ నా ప్రజలు ఎడారిలో నిప్పుకోడిలా \q2 హృదయం లేనివారయ్యారు. \b \q1 \v 4 దాహం వల్ల పసివారి నాలుక \q2 నోటి అంగిటికి అంటుకుపోతుంది; \q1 పిల్లలు ఆహారం కోసం వేడుకుంటారు, \q2 కానీ ఎవరూ వారికి ఇవ్వరు. \b \q1 \v 5 ఒకప్పుడు రుచికరమైన పదార్ధాలు తిన్నవారు \q2 వీధుల్లో నిరుపేదలు. \q1 రాజ ఊదా రంగులో పెరిగిన \q2 ఇప్పుడు బూడిద కుప్పల మీద పడుకున్నారు. \b \q1 \v 6 సొదొమ శిక్ష కంటే \q2 నా ప్రజల శిక్ష గొప్పది, \q1 ఆమెకు సహాయం చేయడానికి చేయి లేకుండానే \q2 క్షణాల్లో పడగొట్టబడింది. \b \q1 \v 7 అందలి అధిపతులు మంచుకంటే స్వచ్ఛమైన వారు, \q2 పాలకంటే తెల్లని వారు. \q1 శరీరాలు పగడాలకంటే ఎర్రగా ఉన్నాయి, \q2 వారి దేహకాంతి నీలమణి లాంటిది. \b \q1 \v 8 అలాంటివారి ఆకారం బొగ్గు కంటే నలుపుగా అయింది, \q2 వీధుల్లో వారిని చూసి వారిని గుర్తు పట్టలేదు. \q1 వారి చర్మం వారి ఎముకలకు అంటుకుపోయి \q2 ఎండిన కర్రలా అయింది. \b \q1 \v 9 కరువు వారిని దెబ్బతీసింది, \q2 పంటలు పండవు. \q1 ఈ బాధకు క్షీణించిపోయారు, \q2 ఇంతకంటే ఖడ్గం చేత చావడం మహా భాగ్యం అనిపిస్తుంది. \b \q1 \v 10 కనికరంగల స్త్రీలు \q2 తమ సొంత చేతులతో తమ పిల్లలను వండుకున్నారు, \q1 నా ప్రజలు నాశనమైనప్పుడు, \q2 వారికి ఆహారం అయ్యారు. \b \q1 \v 11 యెహోవా తన కోపాన్ని పూర్తిగా చల్లార్చారు. \q2 ఆయన తన తీవ్రమైన కోపాన్ని కుమ్మరించాడు. \q1 ఆయన సీయోనులో అగ్నిని రప్పించారు, \q2 అది దాని పునాదులను దహించివేసింది. \b \q1 \v 12 శత్రువులు, శత్రువులు \q2 యెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించవచ్చని \q1 భూరాజులు నమ్మలేదు, \q2 ప్రపంచంలోని జనాంగలెవరూ నమ్మలేదు. \b \q1 \v 13 అయితే అది ఎందువల్ల జరిగిందంటే, \q2 నీతిమంతుల రక్తాన్ని చిందించిన \q1 దాని ప్రవక్తల పాపాల వల్ల, \q2 దాని యాజకుల దోషాల వల్ల జరిగింది. \b \q1 \v 14 ఇప్పుడు వారు గ్రుడ్డివారిలా \q2 వీధుల్లో తడుముతూ తిరుగుతున్నారు. \q1 వారు రక్తంతో ఎంతగా అపవిత్రం అయ్యారంటే, \q2 వారి వస్త్రాలను తాకడానికి ఎవరూ సాహసించరు. \b \q1 \v 15 “వెళ్లిపొండి! మీరు అపవిత్రులు!” \q2 అని ప్రజలు గట్టిగా వారిమీద అరుస్తారు. \q2 “దూరం! దూరం! మమ్మల్ని తాకవద్దు!” \q1 అని వారు పారిపోయి, తిరుగులాడుతున్నప్పుడు, \q2 దేశాల్లో ఉన్న ప్రజలు, \q2 “వారు ఇకపై ఇక్కడ ఉండడానికి వీల్లేదు” అని అంటారు. \b \q1 \v 16 యెహోవా తానే వారిని చెదరగొట్టారు; \q2 ఆయన ఇకపై వారిని పట్టించుకోరు. \q1 యాజకుల పట్ల ఇక గౌరవం చూపించరు, \q2 పెద్దల పట్ల దయ చూపించరు. \b \q1 \v 17 పైగా, సహాయం కోసం వ్యర్థంగా, \q2 మేము మా గోపురాల నుండి; \q1 మమ్మల్ని రక్షించలేని దేశం కోసం ఎదురుచూస్తూ \q2 మా కళ్లు క్షీణించిపోయాయి. \b \q1 \v 18 ప్రజలు అడుగడుగునా మమ్మల్ని పొంచి ఉన్నారు, \q2 మేము మా వీధుల్లో నడవలేకపోయాము. \q1 మా అంతం దగ్గరపడింది, మా రోజులు లెక్కించబడ్డాయి, \q2 మా అంతం వచ్చింది. \b \q1 \v 19 మమ్మల్ని వెంటాడుతున్నవారు \q2 ఆకాశంలో ఎగిరే గ్రద్ద కంటే వేగంగా ఉన్నారు; \q1 పర్వతాల మీదుగా మమల్ని వెంబడించి \q2 ఎడారిలో మాకోసం వేచి ఉన్నారు. \b \q1 \v 20 యెహోవా అభిషిక్తుడు, మన ప్రాణానికి ఊపిరి. \q2 వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. \q1 ఆయన నీడలో \q2 మనం ప్రజలమధ్య జీవిస్తాం అని అనుకున్నాము. \b \q1 \v 21 ఎదోము కుమారీ, \q2 ఊజు దేశంలో నివసిస్తున్నదానా, ఆనందించి సంతోషించు. \q1 అయితే గిన్నె మీకు కూడా పంపబడుతుంది; \q2 నీవు త్రాగి మత్తెక్కి వస్త్రాలు ఊడిపోయి నగ్నంగా ఉంటావు. \b \q1 \v 22 సీయోను కుమారీ, నీ శిక్ష పూర్తి కాబోతుంది; \q2 ఆయన మీ చెరను పొడిగించరు. \q1 కానీ ఎదోము కుమారీ, ఆయన నీ పాపాన్ని శిక్షిస్తారు, \q2 నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తారు. \b \b \c 5 \q1 \v 1 యెహోవా, మాకు ఏమి జరిగిందో జ్ఞాపకముంచుకోండి; \q2 మా వైపు తిరిగి, మాకు కలిగిన అవమానాన్ని చూడండి. \q1 \v 2 మా వారసత్వం అపరిచితులకు, \q2 మా ఇళ్ళను విదేశీయులకు అప్పగించారు. \q1 \v 3 మేము తండ్రిలేని వారమయ్యాము, \q2 మా తల్లులు విధవరాండ్రు. \q1 \v 4 మేము త్రాగే నీటిని మేము కొనుక్కోవలసి వస్తుంది; \q2 మేము కట్టెలు ఎక్కువ వెలపెట్టి కొనుక్కోవలసి వస్తుంది. \q1 \v 5 మమ్మల్ని వెంటాడేవారు మా వెనుకే ఉన్నారు; \q2 మేము అలసిపోయాము, కాని విశ్రాంతి దొరకడం లేదు. \q1 \v 6 తగినంత ఆహారం పొందేందుకు మేము ఈజిప్టు, అష్షూరు వారివైపు \q2 మేము మా చేతులు చాపాము. \q1 \v 7 మా పూర్వికులు పాపం చేశారు, వారు చనిపోయారు, \q2 వారి శిక్షను మేము భరిస్తున్నాము. \q1 \v 8 బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, \q2 వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు. \q1 \v 9 ఎడారిలో ఖడ్గం కారణంగా, \q2 ప్రాణాలను పణంగా పెట్టి ఆహారం తెచ్చుకుంటున్నాము. \q1 \v 10 ఆకలికి జ్వరంగా ఉండి, \q2 మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది. \q1 \v 11 సీయోనులో స్త్రీలు, \q2 యూదా పట్టణాల్లో కన్యలు హింసించబడ్డారు. \q1 \v 12 అధిపతుల చేతులు కట్టబడి, వ్రేలాడదీయబడ్డారు; \q2 పెద్దలకు గౌరవం లేదు. \q1 \v 13 యువకులు తిరుగటిరాళ్ల దగ్గర కష్టపడుతున్నారు; \q2 బాలురు కట్టెల బరువు మోయలేక తూలుతున్నారు. \q1 \v 14 పెద్దలు నగర ద్వారం నుండి వెళ్లిపోయారు, \q2 యువకులు తమ సంగీతాన్ని ఆపివేశారు. \q1 \v 15 మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది, \q2 మా నాట్యం దుఃఖంగా మారింది. \q1 \v 16 మా తల మీది నుండి కిరీటం పడిపోయింది, \q2 పాపం చేశాము, మాకు శ్రమ. \q1 \v 17 మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి, \q2 వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి \q1 \v 18 సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది, \q2 నక్కలు దాని మీద విహరిస్తున్నాయి. \b \q1 \v 19 యెహోవా, ఎప్పటికీ పాలించండి; \q2 మీ సింహాసనం తరతరాలుగా ఉంటుంది. \q1 \v 20 మీరు మమ్మల్ని ఎందుకు మరచిపోతారు? \q2 ఇంతకాలం వరకు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారు? \q1 \v 21 యెహోవా, మేము తిరిగి వచ్చేలా, మమ్మల్ని మీ దగ్గరకు రప్పించుకోండి; \q2 మీరు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించి, \q1 \v 22 మామీద చెప్పలేనంత కోపాన్ని పెంచుకుంటే తప్ప, \q2 మా రోజులను పాత రోజుల్లా నూతనపర్చండి.