\id JOS - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h యెహోషువ \toc1 యెహోషువ గ్రంథం \toc2 యెహోషువ \toc3 యెహో \mt1 యెహోషువ \mt2 గ్రంథం \c 1 \s1 యెహోషువను నాయకునిగా నియమించుట \p \v 1 యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోవా నూను కుమారుడు, మోషే సహాయకుడైన యెహోషువతో ఇలా అన్నారు: \v 2 “నా సేవకుడైన మోషే చనిపోయాడు. కాబట్టి నీవు, నీతో పాటు ఈ ప్రజలందరూ బయలుదేరి యొర్దాను నదిని దాటి, నేను ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్న దేశానికి వెళ్లడానికి సిద్ధపడండి. \v 3 నేను మోషేకు వాగ్దానం చేసినట్లు, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకిస్తాను. \v 4 మీ భూభాగం ఎడారి నుండి లెబానోను వరకు యూఫ్రటీసు అనే గొప్ప నది నుండి హిత్తీయుల దేశం అంతా, పశ్చిమాన మధ్యధరా సముద్రం వరకు విస్తరిస్తుంది. \v 5 నీ జీవితకాలమంతా ఎవ్వరూ నీకు వ్యతిరేకంగా నీ ముందు నిలబడలేరు, నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉంటాను; నేను నిన్ను విడువను ఎడబాయను. \v 6 దృఢంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను వారసత్వంగా ఇస్తానని వారి పూర్వికులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వారిని నడిపిస్తావు. \p \v 7 “నీవు నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని జాగ్రత్తగా పాటించాలి, నీవు వెళ్లే ప్రతి మార్గంలో నీవు విజయం పొందేలా దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగవద్దు. \v 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు నీ పెదాల మీద ఉండాలి; పగలు రాత్రి దానిని ధ్యానించాలి, తద్వార నీవు దానిలో వ్రాయబడి ఉన్న ప్రతిదీ శ్రద్ధగా చేయగలవు. అప్పుడు నీవు విజయవంతంగా వర్ధిల్లుతావు. \v 9 బలంగా ధైర్యంగా ఉండమని నేను నీకు ఆజ్ఞాపించలేదా? భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు; ఎందుకంటే నీవు ఎక్కడికి వెళ్లినా నీ దేవుడైన యెహోవా నీతో ఉంటారు.” \p \v 10 కాబట్టి యెహోషువ ప్రజల అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు: \v 11 “మీరు శిబిరం గుండా వెళ్తూ ప్రజలతో, ‘మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మీరు మూడు రోజుల్లో యొర్దాను నదిని దాటాలి కాబట్టి భోజన ఏర్పాట్లు చేసుకోండి’ అని చెప్పండి.” \p \v 12 అయితే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి, యెహోషువ ఇలా చెప్పాడు, \v 13 “యెహోవా సేవకుడైన మోషే, ‘మీ దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చి మీకు విశ్రాంతిని ఇస్తాడు’ అని మీకిచ్చిన ఆజ్ఞను జ్ఞాపకముంచుకోండి. \v 14 మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు యొర్దానుకు తూర్పున మోషే మీకిచ్చిన ప్రదేశంలో ఉండవచ్చు, అయితే యుద్ధానికి సిద్ధంగా ఉన్న మీ పోరాట పురుషులంతా, మీ తోటి ఇశ్రాయేలీయులకంటె ముందుగా దాటాలి. \v 15 యెహోవా మీకు సహాయం చేసినట్టు, ఆయన వారికి విశ్రాంతినిచ్చే వరకు, వారు కూడా మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకునే వరకు, మీరు కూడా వారికి సహాయం చేయాలి. ఆ తర్వాత, మీరు తిరిగివెళ్లి, యెహోవా సేవకుడైన మోషే యొర్దానుకు తూర్పున సూర్యోదయం వైపున మీకిచ్చిన మీ స్వాస్థ్యాన్ని మీరు ఆక్రమించుకోవచ్చు.” \p \v 16 అప్పుడు వారు యెహోషువకు ఇలా జవాబిచ్చారు, “నీవు మాకాజ్ఞాపించినదంతా మేము చేస్తాము. మమ్మల్ని ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాము. \v 17 అన్ని విషయాల్లో మోషే మాటకు ఎలా పూర్తిగా లోబడినామో మీ మాటకు అలాగే లోబడతాము. నీ దేవుడైన యెహోవా మోషేతో ఉన్నట్లే నీతో కూడా ఉండును గాక. \v 18 నీ మాటకు తిరుగుబాటు చేసేవారు, నీ ఆజ్ఞలను లోబడనివారు చంపబడతారు. నీవు మాత్రం దృఢంగా ధైర్యంగా ఉండాలి!” \c 2 \s1 రాహాబు, వేగులవారు \p \v 1 అప్పుడు నూను కుమారుడైన యెహోషువ షిత్తీము నుండి ఇద్దరు వేగులవారు రహస్యంగా పంపుతూ, “వెళ్లి ఆ దేశాన్ని, ముఖ్యంగా యెరికోను వేగుచూసి రండి” అని వారితో చెప్పాడు. వారు రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. \p \v 2 ఎవరో యెరికో రాజుతో, “చూడండి, కొంతమంది ఇశ్రాయేలీయులు రాత్రి ఈ దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు” అని చెప్పారు. \v 3 కాబట్టి యెరికో రాజు: “నీ దగ్గరకు వచ్చి నీ ఇంట్లో ఉన్న మనుష్యులను ఇక్కడకు తీసుకురా, ఎందుకంటే వారు ఈ దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు” అని ఆజ్ఞ జారీచేస్తూ రాహాబుకు సందేశం పంపాడు. \p \v 4 అయితే ఆమె ఆ ఇద్దరిని తీసుకెళ్లి దాచిపెట్టి, వారి కోసం వచ్చిన వారితో, “అవును, నా దగ్గరకు మనుష్యులు వచ్చారు, కానీ వారెక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. \v 5 చీకటి పడుతుండగా పట్టణ ద్వారం మూసివేసే సమయంలో వారు వెళ్లిపోయారు. వారు ఏ మార్గాన వెళ్లారో నాకు తెలియదు. మీరు త్వరగా వెళ్తే వారిని పట్టుకోవచ్చు” అని చెప్పింది. \v 6 (కాని నిజానికి ఆమె వారిని మిద్దె మీదికి తీసుకెళ్లి అక్కడ వరుసగా పేర్చి ఉన్న జనపకట్టెల్లో దాచిపెట్టింది.) \v 7 కాబట్టి రాజు మనుషులు ఆ గూఢచారులను పట్టుకోడానికి యొర్దాను రేవులకు వెళ్లే మార్గంలో వెళ్లారు. వారు బయటకు వెళ్లిన వెంటనే ద్వారం మూసివేశారు. \p \v 8 ఆ వేగులవారు రాత్రి పడుకునే ముందు రాహాబు వారున్న మిద్దె మీదికి వెళ్లి, \v 9 వారితో, “యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు చాలా భయం, ఈ దేశంలో నివసించే వారందరూ మీరంటే భయంతో క్రుంగిపోతున్నారు. \v 10 మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము. \v 11 ఈ విషయాలు విన్నప్పుడు, మా గుండెలు భయంతో క్రుంగి, మిమ్మల్ని బట్టి ఎవరికి ఏమాత్రం ధైర్యం లేదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలోను క్రింద భూమి మీద కూడా దేవుడే. \p \v 12-13 “ఇప్పుడు, దయచేసి మీరు నా కుటుంబం మీద దయ చూపిస్తారని యెహోవా మీద ప్రమాణం చేయండి. ఎందుకంటే నేను మీ పట్ల దయ చూపించాను కాబట్టి మీరు నా తల్లిదండ్రుల, నా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల, అలాగే వారికి సంబంధించిన వారినందరిని ప్రాణాలతో కాపాడతారని నాకొక నిజమైన సూచన ఇవ్వండి” అని అడిగింది. \p \v 14 అందుకు వారు, “మేము ఏమి చేస్తున్నామో, నీవు చెప్పకుండా ఉంటే మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెడతాం! యెహోవా ఈ దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము మీ పట్ల దయతో నమ్మకంగా ఉంటాము” అని చెప్పారు. \p \v 15 రాహాబు ఇల్లు పట్టణ గోడమీద ఉంది కాబట్టి, ఆమె వారిని కిటికీ నుండి త్రాడుతో క్రిందకు దింపింది. \v 16 ఆమె వారితో, “మీరు కొండ సీమకు వెళ్లండి, మిమ్మల్ని తరుముతున్నవారు మిమ్మల్ని పట్టుకోలేరు. వారు తిరిగి వచ్చేవరకు అక్కడే మూడు రోజులు దాక్కోండి, తర్వాత మీ దారిన మీరు వెళ్లవచ్చు” అని చెప్పింది. \p \v 17 అందుకు వారు ఆమెతో, “మేము నీతో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండేలా లేకపోతే మేము నిర్దోషులం: \v 18 మేము ఈ దేశానికి వచ్చినప్పుడు, నీవు మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి ఈ ఎర్రని త్రాడును కట్టి మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి కట్టాలి, మీ అమ్మ నాన్నలను, మీ అన్నదమ్ములను, మీ కుటుంబమంతటిని నీ ఇంట్లోనే ఉంచాలి. \v 19 ఒకవేళ నీ ఇంటి నుండి ఎవరైనా బయటి వీధిలోకి వెళ్తే వారి చావుకు వారే బాధ్యులు మేము బాధ్యులం కాము. అయితే నీ ఇంట్లో నీ దగ్గరున్న వారి మీద చేయి పడినా అది మా బాధ్యత. \v 20 అయితే ఒకవేళ మా గురించి నీవు ఎవరికైనా చెప్తే, నీవు మాతో చేయించిన ప్రమాణం నుండి మేము విముక్తులం” అని అన్నారు. \p \v 21 అందుకామె, “సరే, మీరు చెప్పినట్టే కానివ్వండి” అని చెప్పి వారిని పంపివేసింది. \p వారు వెళ్లిన తర్వాత ఆమె ఆ ఎర్రని త్రాడును కిటికీకి కట్టింది. \p \v 22 వారు అక్కడినుండి కొండల్లోకి వెళ్లి, తమను తరిమినవారు దారి పొడవునా తమను వెదికి వారిని పట్టుకోలేక తిరిగి వెళ్లిపోయేవరకు మూడు రోజులు అక్కడ ఉన్నారు. \v 23 తర్వాత ఆ ఇద్దరు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. వారు ఆ కొండలు దిగి నదిని దాటి నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వెళ్లి, జరిగినదంతా అతనికి చెప్పారు. \v 24 వారు యెహోషువతో, “ఖచ్చితంగా యెహోవా ఆ దేశాన్నంతటిని మన చేతులకు అప్పగించారు. ఆ దేశ ప్రజలందరూ మనమంటే భయంతో క్రుంగిపోతున్నారు” అని చెప్పారు. \c 3 \s1 యొర్దాను నదిని దాటుట \p \v 1 ఉదయాన్నే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వెళ్లి, దానిని దాటే ముందు అక్కడ బస చేశారు. \v 2 మూడు రోజుల తర్వాత అధికారులు శిబిరమంతా తిరుగుతూ, \v 3 ప్రజలకిలా ఆజ్ఞలు జారీ చేశారు: “మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులు మోయటం మీరు చూసినప్పుడు, మీ స్థలాల నుండి బయలుదేరి దానిని వెంబడించాలి. \v 4 మీరు వెళ్లే మార్గంలో ఇంతకు ముందు వెళ్లలేదు మీరు దానిని తెలుసుకోవాలి. కాబట్టి మీకు, మందసానికి మధ్య దాదాపు రెండువేల మూరల\f + \fr 3:4 \fr*\ft అంటే సుమారు 900 మీటర్లు\ft*\f* దూరం ఉండాలి; దాని దగ్గరగా నడవకూడదు.” \p \v 5 యెహోషువ ప్రజలతో, “రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి” అని చెప్పాడు. \p \v 6 యెహోషువ యాజకులతో, “నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా వెళ్లండి” అన్నాడు. కాబట్టి వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా నడిచారు. \p \v 7 యెహోవా యెహోషువతో, “నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉన్నానని ఇశ్రాయేలీయులందరు తెలుసుకునేలా ఈ రోజు వారి కళ్ళెదుట నిన్ను గొప్పవానిగా చేయడం ప్రారంభిస్తాను. \v 8 నిబంధన మందసాన్ని మోసే యాజకులతో: ‘మీరు యొర్దాను నది నీటి అంచులకు చేరినప్పుడు, వెళ్లి నదిలో నిలబడాలి’ అని నిబంధన మందసాన్ని మోసే యాజకులతో చెప్పు.” \p \v 9 యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, “ఇక్కడకు వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి. \v 10 ఈ విధంగా సజీవుడైన దేవుడు మీ మధ్య ఉన్నారని, ఆయన కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ముందు నుండి వెళ్లగొడతారని మీరు తెలుసుకుంటారు. \v 11 చూడండి, సర్వలోక ప్రభువు యొక్క నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానులోకి వెళ్తుంది. \v 12 ఇప్పుడు, ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రతి గోత్రం నుండి ఒక పురుషుని చొప్పున పన్నెండుమందిని ఎన్నుకోండి. \v 13 లోకమంతటికి ప్రభువైన యెహోవా మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యొర్దానులో అడుగు పెట్టగానే, దిగువకు ప్రవహిస్తున్న ప్రవాహం తెగిపోయి ఒకవైపు రాశిగా నిలబడతాయి.” \p \v 14 కాబట్టి యాజకులు ప్రజలకు ముందుగా నిబంధన మందసం మోస్తూ నడుస్తుండగా ప్రజలు వారి శిబిరాల నుండి యొర్దాను దాటడానికి బయలుదేరతారు. \v 15 కోతకాలమంతా యొర్దాను నది పొంగుతూ ఉంటుంది. మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది దగ్గరకు వచ్చి వారి పాదాలు ఆ నీటికి తగలగానే పైనుండి వచ్చే నీళ్లు ఆగిపోయాయి. \v 16 ఆ నీళ్లు ఆగిపోయి చాలా దూరంలో సారెతాను ప్రక్కన ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఎత్తైన రాశిలా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రమనే అరాబా సముద్రం అంటే మృత సముద్రంలోకి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. కాబట్టి ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు. \v 17 ఇశ్రాయేలీయులంతా పొడినేల మీద యొర్దాను నది దాటే వరకు యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో పొడినేల మీద నిలబడి ఉన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగమంతా పొడినేల మీద యొర్దాను నదిని దాటారు. \c 4 \p \v 1 ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు, \v 2 “ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున ప్రజల్లో నుండి పన్నెండుమందిని ఎన్నుకుని, \v 3 యొర్దాను మధ్య నుండి, అంటే యాజకులు నిలబడి ఉన్న చోటుకు కుడివైపు నుండి పన్నెండు రాళ్లను తీసుకుని, వాటిని మీతో పాటు మోసుకువెళ్లి, ఈ రాత్రి మీరు బసచేసే స్థలంలో వాటిని ఉంచమని వారికి చెప్పు” అని ఆజ్ఞాపించారు. \p \v 4 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల నుండి తాను నియమించిన పన్నెండుమందిని ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున పిలిచి, \v 5 వారితో, “మీ దేవుడైన యెహోవా మందసానికి ముందుగా యొర్దాను మధ్యలోనికి వెళ్లండి. ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున మీలో ప్రతి ఒక్కరూ తన భుజంపై ఒక రాయిని మోయాలి, \v 6 అది మీ మధ్య ఒక సూచనగా ఉంటుంది. భవిష్యత్తులో, ‘ఈ రాళ్లకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, \v 7 యెహోవా నిబంధన మందసం యొర్దాను దాటుతున్నప్పుడు యొర్దాను నీళ్లు ఆగిపోయాయి. కాబట్టి ఈ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు నిత్యం జ్ఞాపకార్థంగా ఉంటాయి అని వారికి చెప్పండి.” \p \v 8 కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోషువ ఆజ్ఞాపించినట్లు చేశారు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం వారు యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసుకొని తమతో పాటు తమ శిబిరానికి తెచ్చి వారు ఉన్నచోట పెట్టారు. \v 9 యెహోషువ ఆ పన్నెండు రాళ్లను యొర్దాను మధ్యలో, నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు నిలబడిన స్థలంలో నిలబెట్టించాడు. నేటి వరకు అవి అక్కడే ఉన్నాయి. \p \v 10 మోషే యెహోషువకు నిర్దేశించినట్లుగా యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన ప్రతిదీ ప్రజలు చేసే వరకు మందసాన్ని మోసిన యాజకులు యొర్దాను మధ్యలో నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరత్వరగా దాటి వెళ్లారు, \v 11 వారంతా దాటిన వెంటనే ప్రజలు చూస్తుండగానే యెహోవా మందసాన్ని మోస్తూ యాజకులు అవతలి వైపుకు దాటి వచ్చారు. \v 12 ఇశ్రాయేలీయులకు ముందుగా రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు మోషే వారికి నిర్దేశించినట్టుగా యుద్ధానికి సిద్ధపడి దాటారు. \v 13 యుద్ధానికి సిద్ధపడిన దాదాపు నలభై వేలమంది ఆయుధాలు ధరించి యెహోవా ఎదుట దాటి యుద్ధానికి యెరికో మైదానాలకు చేరుకున్నారు. \p \v 14 ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేశారు; వారు మోషేను గౌరవించినట్టు యెహోషువ జీవించినంత కాలం అతన్ని గౌరవించారు. \p \v 15 తర్వాత యెహోవా యెహోషువతో, \v 16 “నిబంధన\f + \fr 4:16 \fr*\ft హెబ్రీలో \ft*\fqa సాక్ష్యపు మందసం\fqa*\f* మందసాన్ని మోసే యాజకులను యొర్దానులో నుండి ఇవతలికి రమ్మని ఆజ్ఞాపించు” అని చెప్పారు. \p \v 17 కాబట్టి యెహోషువ, “యొర్దానులో నుండి పైకి వచ్చేయండి” అని యాజకులను ఆజ్ఞాపించాడు. \p \v 18 యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి పైకి వచ్చారు. వారి అరికాళ్ల ఆరిన నేలను తాకగానే యొర్దాను నీరు ఎప్పటిలాగే పొంగుతూ ప్రవహించాయి. \p \v 19 మొదటి నెల పదవ రోజున ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు సరిహద్దులోని గిల్గాలులో బస చేశారు. \v 20 వారు యొర్దాను నుండి తీసిన పన్నెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించాడు. \v 21 అతడు ఇశ్రాయేలీయులతో, “భవిష్యత్తులో మీ సంతతివారు తమ తల్లిదండ్రులను, ‘ఈ రాళ్లకు అర్థం ఏంటి?’ అని అడిగినప్పుడు, \v 22 మీరు వారితో, ‘ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దాను నదిని దాటారు’ అని చెప్పాలి. \v 23 ఎందుకంటే మీరు యొర్దానును దాటే వరకు మీ దేవుడైన యెహోవా మీ ఎదుట యొర్దానును ఆరిపోయేలా చేశారు. మేము ఎర్ర సముద్రాన్ని దాటే వరకు మా ఎదుట దాన్ని ఆరేలా చేసినట్టు మీ దేవుడైన యెహోవా ఇప్పుడు యొర్దానును చేశారు. \v 24 యెహోవా హస్తం శక్తివంతమైనదని భూమిపై ఉన్న ప్రజలందరూ తెలుసుకునేలా, మీరు మీ దేవుడైన యెహోవాకు ఎల్లప్పుడూ భయపడేలా ఆయన ఇలా చేశారు.” \c 5 \p \v 1 ఇశ్రాయేలీయులు దాటే వరకు యెహోవా యొర్దానును వారి ముందు ఆరిపోయేలా చేశారని యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులందరూ, మధ్యధరా తీరం వెంబడి నివసించిన కనానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు కరిగి నీరై ఇశ్రాయేలు ప్రజలను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది. \s1 గిల్గాలు దగ్గర సున్నతి, పస్కా \p \v 2 ఆ సమయంలో యెహోవా యెహోషువతో, “చెకుముకిరాతి కత్తులు చేయించి ఇశ్రాయేలీయులకు మళ్ళీ సున్నతి చేయించు” అని చెప్పారు. \v 3 కాబట్టి యెహోషువ చెకుముకిరాతి కత్తులు చేయించి గిబియత్ హారలోతు\f + \fr 5:3 \fr*\ft అంటే \ft*\fqa సున్నతి చర్మాల కొండ\fqa*\f* దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు. \p \v 4 యెహోషువ వారికి సున్నతి చేయించడానికి కారణం ఏంటంటే ఈజిప్టు నుండి బయటకు వచ్చిన వారిలో సైనిక వయస్సుగల పురుషులంతా ఈజిప్టును విడిచిన అరణ్య మార్గంలోనే చనిపోయారు. \v 5 బయటకు వచ్చిన వారందరూ సున్నతి పొందిన వారే, కానీ ఈజిప్టు నుండి ప్రయాణం చేస్తుండగా అరణ్యమార్గంలో పుట్టిన వారందరూ సున్నతి పొందనివారే. \v 6 యెహోవా మాట వినలేదు కాబట్టి, ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పుడు సైనిక వయస్సులో ఉన్న పురుషులందరు చనిపోయే వరకు వారు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. ఎందుకంటే మనకు ఇస్తానని వారి పూర్వికులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు చూడరని యెహోవా వారితో ప్రమాణం చేశారు. \v 7 కాబట్టి ఆయన వారి స్థానంలో వారి కుమారులను లేవనెత్తారు, యెహోషువ సున్నతి చేయించింది వీరికే. దారిలో వారికి సున్నతి జరుగలేదు కాబట్టి వారు సున్నతిలేనివారిగానే ఉన్నారు. \v 8 దేశంలోని మగవారంతా సున్నతి పొందిన తర్వాత, వారు స్వస్థత పొందేవరకు శిబిరంలోనే ఉన్నారు. \p \v 9 తర్వాత యెహోవా యెహోషువతో, “ఈ రోజు నేను మీ నుండి ఈజిప్టు అవమానాన్ని తొలగించాను” అని చెప్పారు. అందుకని ఈనాటి వరకు ఆ స్థలాన్ని గిల్గాలు\f + \fr 5:9 \fr*\fq గిల్గాలు \fq*\ft హెబ్రీలో \ft*\fqa తొలగించుట అని అర్థం\fqa*\f* అని పిలువబడుతుంది. \p \v 10 యెరికో మైదానాల్లోని గిల్గాలులో బస చేసినప్పుడు ఆ నెల పద్నాలుగవ రోజు సాయంత్రం అక్కడ ఇశ్రాయేలీయులు పస్కాను జరుపుకున్నారు. \v 11 పస్కా జరిగిన మరుసటి రోజే, వారు భూమిలో పండించిన వాటిలో నుండి పులియని రొట్టె, కాల్చిన ధాన్యం తినడం మొదలుపెట్టారు. \v 12 వారు భూమి నుండి ఈ ఆహారాన్ని తిన్న మరుసటిరోజు\f + \fr 5:12 \fr*\ft లేదా \ft*\fqa అదే రోజు\fqa*\f* మన్నా ఆగిపోయింది; ఇశ్రాయేలీయులకు ఇకపై మన్నా లేదు, కానీ ఆ సంవత్సరం వారు కనాను పంటను తిన్నారు. \s1 యెరికో పతనం \p \v 13 యెహోషువ యెరికోకు సమీపంలో ఉన్నప్పుడు, అతడు పైకి చూసినప్పుడు ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని తన ముందు నిలబడి కనిపించాడు. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా పక్షమా లేదా మా శత్రువుల పక్షమా?” అని అడిగాడు. \p \v 14 “ఎవరి పక్షం కాను, అయితే నేనిప్పుడు యెహోవా సేనాధిపతిగా వచ్చాను” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ భక్తితో నేలమీద బోర్లపడి, “నా ప్రభువు తన సేవకునికి ఏమి సందేశం ఇస్తారు?” అని అడిగాడు. \p \v 15 అందుకు యెహోవా సేనాధిపతి యెహోషువతో, “నీవు నిలబడిన స్ధలం పవిత్రమైనది, కాబట్టి నీ చెప్పులు తీసివేయి” అని చెప్పగానే యెహోషువ అలాగే చేశాడు. \c 6 \p \v 1 ఇశ్రాయేలీయుల భయంతో యెరికో ద్వారాలు గట్టిగా మూసివేయబడ్డాయి. ఎవరూ బయటకు రావడానికి గాని లోపలికి వెళ్లడానికి గాని లేదు. \p \v 2 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు, “చూడు, యెరికోను, దాని రాజును, దానిలో ఉన్న యుద్ధవీరులతో పాటు మీ చేతికి అప్పగిస్తున్నాను. \v 3 నీవు యుద్ధవీరులందరితో పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. ఇలా ఆరు రోజులు చేయాలి. \v 4 మందసం ముందు ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి. ఏడవ రోజున యాజకులు బూరలు ఊదుతూ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరగాలి. \v 5 వారు మానకుండా చేస్తున్న బూరధ్వని మీరు విన్నప్పుడు, సైన్యమంతా పెద్దగా కేకలు వేయాలి; అప్పుడు ఆ పట్టణపు గోడ కూలిపోతుంది, సైన్యంలో ప్రతి ఒక్కరు పైకి ఎక్కి నేరుగా లోపలికి వెళ్తారు.” \p \v 6 కాబట్టి నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి వారితో, “మీరు యెహోవా నిబంధన మందసాన్ని ఎత్తుకుని దాని ముందు ఏడుగురు యాజకులు బూరలు పట్టుకుని నడవాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. \v 7 తర్వాత అతడు, “పదండి ముందుకు! యెహోవా మందసం ముందు ఆయుధాలు ధరించిన వీరులు నడుస్తుండగా పట్టణం చుట్టూ తిరగాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. \p \v 8 యెహోషువ ప్రజలతో మాట్లాడినప్పుడు, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని ఏడు బూరలను మోస్తూ, బూరలు పట్టుకుని వాటిని ఊదుతూ ముందుకు సాగుతూ ఉండగా, యెహోవా నిబంధన మందసం వారి వెంట వెళ్లింది. \v 9 ఆయుధాలు ధరించిన వీరులు బూరలు ఊదుతున్న యాజకుల ముందు నడుస్తుండగా, వెనుక ఉన్న వీరులు మందసం వెనుక నడిచారు. ఆ సమయమంతా యాజకులు బూరలు ఊదుతూనే ఉన్నారు. \v 10 కానీ యెహోషువ, “యుద్ధపు కేక వేయవద్దు, మీ స్వరాలు ఎత్తవద్దు, నేను మీకు అరవమని చెప్పే రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నేను చెప్పినప్పుడు అరవండి!” అని సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. \v 11 అలా అతడు యెహోవా మందసాన్ని మోసుకొని పట్టణం చుట్టూ ఒకసారి తిరిగేలా చూశాడు. తర్వాత సైన్యం శిబిరానికి తిరిగివచ్చి రాత్రి అక్కడ గడిపింది. \p \v 12 యెహోషువ మరుసటిరోజు ఉదయాన్నే లేవగా, యాజకులు, యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తుకున్నారు. \v 13 ఆ ఏడుగురు యాజకులు ఏడు బూరలను పట్టుకుని యెహోవా మందసం ముందు నడుస్తూ బూరలు ఊదుతూ ఉన్నారు. బూరధ్వని వినబడుతూ ఉండగా, ఆయుధాలు ధరించిన వీరులు వారికి ముందు వెళ్తుండగా, వెనుక ఉన్న వీరులు యెహోవా మందసం వెనుక వెళ్లారు. \v 14 రెండవ రోజున కూడా వారు పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి, శిబిరానికి తిరిగి వచ్చారు. అలా వారు ఆరు రోజులపాటు చేశారు. \p \v 15 ఏడవ రోజున వారు తెల్లవారుజామున లేచి, రోజూలాగే పట్టణం చుట్టూ తిరిగారు. అయితే ఆ రోజు ఆ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. \v 16 ఏడవసారి తిరుగుతూ ఉండగా, యాజకులు బూరధ్వని చేయగానే యెహోషువ, “అరవండి! యెహోవా మీకు ఈ పట్టణాన్ని ఇచ్చారు! \v 17 పట్టణం, దానిలో ఉన్నవన్నీ యెహోవా వలన శపించబడ్డాయి.\f + \fr 6:17 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే; \ft*\ft అలాగే \+xt 18|link-href="JOS 6:18"\+xt*, \+xt 21|link-href="JOS 6:21"\+xt*.\ft*\f* అయితే మనం పంపిన దూతలను దాచిపెట్టిన వేశ్యయైన రాహాబును, ఆమెతో పాటు ఆమె ఇంట్లో ఉన్నవారిని మాత్రం మనం విడిచిపెట్టాలి. \v 18 శపించబడిన వాటికి దూరంగా ఉండండి, లేకపోతే వాటిలో ఏదైనా తీసుకుని మీ సొంత నాశనాన్ని మీరు తెచ్చుకుంటారు! ఇశ్రాయేలీయుల శిబిరాన్ని నాశనానికి గురిచేసి దాని మీదికి కష్టాలు తెచ్చిన వారవుతారు. \v 19 వెండి, బంగారం, ఇత్తడి, ఇనుప వస్తువులు అన్నీ యెహోవాకు పవిత్రమైనవి, వాటిని ఆయన ఖజానాలోనికి చేర్చాలి.” \p \v 20 బూరలు ఊదగానే సైన్యం కేకలు వేసింది. బూర శబ్దానికి పురుషులు పెద్దగా అరవడంతో గోడ కూలిపోయింది; కాబట్టి అందరు నేరుగా లోపలికి ప్రవేశించి వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. \v 21 వారు పట్టణాన్ని యెహోవా కోసం ప్రత్యేకపరచి, పురుషులను, స్త్రీలను, చిన్నవారిని, పెద్దవారిని, పశువులను, గొర్రెలను, గాడిదలను దానిలోని ప్రతి జీవిని ఖడ్గంతో నాశనం చేశారు. \p \v 22 ఆ దేశాన్ని వేగు చూసిన ఇద్దరు వ్యక్తులతో యెహోషువ ఇలా అన్నాడు: “మీరు వేశ్య ఇంటికి వెళ్లి మీరు ఆమెతో చేసిన ప్రమాణం ప్రకారం ఆమెను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకురండి.” \v 23 కాబట్టి వేగు చూసిన యువకులు లోపలికి వెళ్లి రాహాబును, ఆమె తండ్రిని, తల్లిని, ఆమె సోదరులు, సోదరీమణులను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకువచ్చారు. వారు ఆమె కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి ఇశ్రాయేలు శిబిరం బయట ఒకచోట ఉంచారు. \p \v 24 ఆ తర్వాత వారు ఆ పట్టణాన్ని, దానిలోని సమస్తాన్ని కాల్చివేసి, వెండి బంగారాన్ని, ఇత్తడి ఇనుప వస్తువులను యెహోవా మందిరంలోని ఖజానాలో పెట్టారు. \v 25 అయితే యెరికోకు వేగులవారిగా యెహోషువ పంపిన వారిని దాచిపెట్టింది కాబట్టి, వేశ్యయైన రాహాబును ఆమె కుటుంబంతో పాటు ఆమెకు సంబంధించిన వారందరినీ విడిచిపెట్టాడు; ఆమె ఈనాటికీ ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తుంది. \p \v 26 ఆ సమయంలో యెహోషువ ఈ గంభీరమైన ప్రమాణం చేశాడు: “యెరికో పట్టణాన్ని మరలా కట్టాలనుకునేవాడు యెహోవా ఎదుట శాపగ్రస్తుడు: \q1 “దాని పునాది వేసే వాడి \q2 పెద్దకుమారుడు చనిపోతాడు \q1 దాని తలుపులను నిలబెట్టేవాడి \q2 చిన్నకుమారుడు చనిపోతాడు.” \p \v 27 యెహోవా యెహోషువతో ఉన్నారు కాబట్టి అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. \c 7 \s1 ఆకాను పాపం \p \v 1 శపించబడిన వాటి\f + \fr 7:1 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడానికే. \ft*\ft అలాగే \+xt 11|link-href="JOS 7:11"\+xt*, \+xt 12|link-href="JOS 7:12"\+xt*, \+xt 13|link-href="JOS 7:13"\+xt*, \+xt 15|link-href="JOS 7:15"\+xt*.\ft*\f* విషయంలో ఇశ్రాయేలీయులు నమ్మకద్రోహులుగా ఉన్నారు. యూదా గోత్రపు వాడైన జెరహు కుమారుడు జబ్ది,\f + \fr 7:1 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa జిమ్రీ అని వాడబడింది\fqa*\f* జబ్ది కుమారుడు కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను వాటిలో కొన్నిటిని తీసుకున్నాడు. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలీయులపై రగులుకుంది. \p \v 2 తర్వాత యెహోషువ యెరికో నుండి బేతేలుకు తూర్పున బేత్-ఆవెను సమీపంలో ఉన్న హాయికి మనుష్యులను పంపుతూ, “మీరు వెళ్లి ఆ ప్రదేశాన్ని వేగుచూసి రండి” అని చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి హాయిని వేగు చూశారు. \p \v 3 వారు యెహోషువ దగ్గరకు తిరిగివచ్చి, “హాయి మీదికి సైన్యమంతా వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనపరచుకోడానికి రెండు లేదా మూడువేలమందిని పంపండి చాలు, సైన్యమంతా అలసిపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడ కొంతమంది మాత్రమే నివసిస్తున్నారు.” \v 4 కాబట్టి ప్రజల్లో సుమారు మూడువేలమంది యోధులు వెళ్లారు; కానీ వారు హాయి ప్రజల ఎదుట నిలబడలేక పారిపోయారు, \v 5 హాయి ప్రజలు వారిలో ముప్పై ఆరుగురిని చంపారు. వారు ఇశ్రాయేలీయులను పట్టణ ద్వారం నుండి రాతి గనుల వరకు కొండ దిగువన వారిని చంపారు. దీంతో ప్రజల గుండెలు భయంతో నీరుగారిపోయాయి. \p \v 6 అప్పుడు యెహోషువ, తన బట్టలు చింపుకొని యెహోవా మందసం ముందు నేలమీద పడి, సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలు పెద్దలు కూడా అలాగే చేసి తమ తలలపై దుమ్ము చల్లుకున్నారు. \v 7 యెహోషువ, “అయ్యో! ప్రభువైన యెహోవా! ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మమ్మల్ని నాశనం చేయమని అమోరీయుల చేతికి అప్పగించడానికా? మేము యొర్దాను అవతలి ఒడ్డున ఆగిపోవడానికి నిర్ణయించుకొని ఉంటే ఎంత బాగుండేది! \v 8 ప్రభువా, మీ సేవకుని క్షమించు. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువును ఎదుర్కోలేక పారిపోయారు, నేను ఏమి చెప్పగలను? \v 9 కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు. \p \v 10 అయితే యెహోవా యెహోషువతో ఇలా అన్నారు, “నీవు లే! నీ ముఖం నేలకేసి నీవేమి చేస్తున్నావు? \v 11 ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు; నేను వారికి ఆజ్ఞాపించిన నా ఒడంబడికను వారు ఉల్లంఘించారు. శపించబడిన వాటిలో కొన్నిటిని తీసి దొంగిలించి అబద్ధమాడారు, వారు వాటిని తమ సొంత ఆస్తులతో పాటు పెట్టుకున్నారు. \v 12 అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల ఎదుట నిలువలేక పోతున్నారు; వారు శాపానికి గురికావడం వల్లనే శత్రువులకు వెన్ను చూపి పారిపోయారు. మీ మధ్య వేరుగా ఉంచబడిన వాటన్నిటిని మీరు నాశనం చేస్తేనే తప్ప నేను ఇప్పటినుండి మీతో ఉండను. \p \v 13 “నీవు వెళ్లి, ప్రజలను పవిత్రపరచు. వారితో ఇలా చెప్పు, ‘రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి; ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలూ, మీ మధ్య శాపగ్రస్తమైనవి ఉన్నాయి. వాటిని తీసివేసే వరకు మీరు మీ శత్రువుల ఎదుట నిలబడలేరు. \p \v 14 “ ‘ఉదయాన్నే గోత్రం వెంబడి గోత్రం మీరు హాజరు కావాలి. అప్పుడు యెహోవా ఎంచుకున్న గోత్రం వంశాలవారిగా ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న వంశం కుటుంబాల ప్రకారం ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న కుటుంబం యొక్క పురుషులు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తారు. \v 15 శపించబడినవి ఎవరి దగ్గర దొరుకుతుందో వారిని, వారికి చెందిన వారందరిని అగ్నితో నాశనం చేయాలి. వారు యెహోవా ఒడంబడికను మీరి ఇశ్రాయేలులో అవమానకరమైన పని చేశారు!’ ” \p \v 16 మరుసటిరోజు తెల్లవారుజామున యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను గోత్రాల ప్రకారం ముందుకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టుబడింది. \v 17 యూదా వంశాలు ముందుకు వచ్చినప్పుడు జెరహీయులు పట్టుబడ్డారు. అతడు జెరహీయుల వంశాన్ని కుటుంబాల ప్రకారం ముందుకు వచ్చినప్పుడు జబ్ది ఎంపిక చేయబడ్డాడు. \v 18 యెహోషువ అతని కుటుంబాన్ని ఒక్కొక్కరిగా ముందుకు రప్పించగా, యూదా గోత్రానికి చెందిన జెరహు కుమారుడైన జిమ్రీ, జిమ్రీ కుమారుడైన కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు. \p \v 19 అప్పుడు యెహోషువ ఆకానుతో, “నా కుమారుడా, నిజం చెప్పి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమ కలిగేలా ఆయనను ఘనపరచు. నువ్వేం చేశావో నాతో చెప్పు; దాన్ని నా దగ్గర దాచవద్దు అన్నాడు” అన్నాడు. \p \v 20 అందుకు ఆకాను యెహోషువతో, “అది నిజమే! ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరుద్ధంగా నేను పాపం చేశాను. నేను ఏం చేశానంటే, \v 21 దోపుడు సొమ్ములో ఒక అందమైన బబులోను\f + \fr 7:21 \fr*\ft హెబ్రీలో \ft*\fqa షీనారు\fqa*\f* వస్త్రం, రెండువందల షెకెళ్ళ\f + \fr 7:21 \fr*\ft అంటే సుమారు 2.3 కి. గ్రా. లు\ft*\f* వెండి, యాభై షెకెళ్ళ\f + \fr 7:21 \fr*\ft అంటే సుమారు 575 గ్రాములు\ft*\f* బరువుగల బంగారుకడ్డీని నేను చూసి, నాకు చాలా ఇష్టమై నేను వాటిని తెచ్చుకున్నాను. అవి నా డేరాలో నేలలో వెండిని క్రింద ఉంచి వాటిని దాచిపెట్టాను” అని చెప్పాడు. \p \v 22 కాబట్టి యెహోషువ దూతలను పంపినప్పుడు వారు గుడారానికి పరుగెత్తి, అతని గుడారంలో నేలలో క్రింద వెండి, దానిపై మిగతావి దాచిపెట్టబడి ఉండడం చూశారు. \v 23 ఆ డేరా మధ్య నుండి వారు వాటిని తీసి యెహోషువ, ఇశ్రాయేలీయుల దగ్గరకు తెచ్చి యెహోవా ఎదుట వాటిని ఉంచారు. \p \v 24 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులతో పాటు జెరహు వంశస్థుడైన ఆకానును వెండిని వస్త్రాన్ని బంగారుకడ్డీని ఆకాను కుమారులను కుమార్తెలను అతని ఎద్దులను గాడిదలను గొర్రెలను అతని డేరాను అతనికి ఉన్నదంతటిని పట్టుకుని ఆకోరు లోయకు తెచ్చారు. \v 25 యెహోషువ, “నీవు మాకు ఈ ఇబ్బంది ఎందుకు తెచ్చావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తారు” అని అన్నాడు. \p అప్పుడు ఇశ్రాయేలీయులంతా ఆకానును, అతని కుటుంబీకులను రాళ్లతో కొట్టి కాల్చివేశారు. \v 26 ఆకాను మీద వారు ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు, అది ఇప్పటికీ ఉంది. అప్పుడు యెహోవా తీవ్రమైన కోపం చల్లారింది. కాబట్టి అప్పటినుండి ఆ స్థలాన్ని ఆకోరు\f + \fr 7:26 \fr*\fq ఆకోరు \fq*\ft అంటే \ft*\fqa ఇబ్బంది\fqa*\f* లోయ అని పిలుస్తారు. \c 8 \s1 హాయి పతనం \p \v 1 అప్పుడు యెహోవా యెహోషువతో, “భయపడకు; నిరుత్సాహపడకు. సైన్యమంతటిని నీతో తీసుకుని హాయి మీద దండెత్తు. నేను హాయి రాజును, అతని జనులను, పట్టణాన్ని, అతని దేశాన్ని నీ చేతులకు అప్పగించాను. \v 2 యెరికోకు దాని రాజుకు నీవు చేసిన విధంగా హాయికి దాని రాజుకు చేస్తావు, అయితే ఈసారి దానిలోని సొమ్మును, పశువులను మీ కోసం దోచుకోవచ్చు. పట్టణం వెనుక మాటు ఏర్పాటు చేయి” అని చెప్పారు. \p \v 3 కాబట్టి యెహోషువ, సైనికులందరూ హాయిని ముట్టడించడానికి బయలుదేరారు. ముప్పైవేలమంది గొప్ప పరాక్రమవంతులను యెహోషువ ఎన్నుకుని రాత్రివేళ వారిని పంపిస్తూ, \v 4 వారికి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు: “శ్రద్ధగా వినండి. మీరు పట్టణం వెనుక మాటువేసి ఉండాలి. పట్టణానికి బాగా దూరంగా వెళ్లిపోకుండా మీరంతా సిద్ధంగా ఉండాలి. \v 5 నేను, నాతో ఉన్నవారంతా పట్టణం దగ్గరకు వస్తాం, వారు ఇంతకు ముందులా మా మీదికి వచ్చినప్పుడు మేము వారి నుండి పారిపోతాము. \v 6 ‘వారు ఇంతకుముందులాగే మన నుండి పారిపోతున్నారు’ అని వారనుకుంటారు కాబట్టి మేము వారిని పట్టణం నుండి బయటకు తీసుకువచ్చే వరకు వారు మమ్మల్ని వెంటాడుతారు. మేము వారి నుండి పారిపోయినప్పుడు, \v 7 మీరు మాటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని పట్టుకోండి. మీ దేవుడైన యెహోవా ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తారు. \v 8 మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దానికి నిప్పు పెట్టండి. యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేసి దానికి నిప్పు పెట్టండి. నేను మీకు ఇచ్చే ఆదేశాలు ఇవే.” \p \v 9 యెహోషువ వారిని పంపించగా వారు వెళ్లి బేతేలుకు హాయికి మధ్య హాయి పడపటి వైపున మాటు వేశారు ఆ రాత్రి యెహోషువ ప్రజలమధ్య గడిపాడు. \p \v 10 యెహోషువ మరుసటి ఉదయాన్నే తన సైన్యాన్ని సిద్ధపరచి, అతడు ఇశ్రాయేలీయుల పెద్దలు కలిసి వారి ముందు హాయి మీదికి వెళ్లారు. \v 11 అతనితో ఉన్న బలగమంతా పట్టణానికి సమీపించి దాని ముందుకు చేరుకుంది. వారు హాయికి ఉత్తరాన, వారికి ఆ పట్టణానికి మధ్య లోయ ఉన్నచోట శిబిరం ఏర్పరచుకున్నారు. \v 12 యెహోషువ దాదాపు అయిదువేల మందిని తీసుకుని పట్టణానికి పడమటి వైపున బేతేలుకు, హాయికి మధ్య మాటు వేశాడు. \v 13 కాబట్టి సైనికులు పట్టణానికి ఉత్తరాన ప్రధాన శిబిరాన్ని, పట్టణానికి పడమర మాటు వేయడానికి తమ స్థానాలను ఏర్పరచుకున్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోకి వెళ్లాడు. \p \v 14 హాయి రాజు ఇది చూసినప్పుడు, అతడు, పట్టణపు ప్రజలందరూ ఉదయాన్నే త్వరగా లేచి అరాబాకు ఎదురుగా ఉన్న ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఇశ్రాయేలును యుద్ధంలో ఎదుర్కోడానికి బయలుదేరారు. అయితే పట్టణం వెనుక తనను పట్టుకోడానికి మాటువేసి ఉంటారని అతనికి తెలియలేదు. \v 15 యెహోషువ, ఇశ్రాయేలీయులందరు వారి ముందు నిలబడలేక అరణ్యానికి పారిపోయారు. \v 16 వారిని తరమడానికి హాయిలోని ప్రజలందరూ కలిసి యెహోషువను వెంటాడుతున్నామనే భ్రమలో పట్టణం నుండి దూరంగా వచ్చేశారు. \v 17 ఇశ్రాయేలును తరమడానికి వెళ్లకుండా ఉన్నవారు హాయిలో గాని బేతేలులో గాని ఒక్కరు కూడా లేదు. వారు పట్టణాన్ని మూయకుండా తెరిచే ఉంచి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లారు. \p \v 18 అప్పుడు యెహోవా యెహోషువతో, “నీ చేతిలో ఉన్న ఈటెను హాయి వైపు పట్టుకో, నీ చేతికి నేను పట్టణాన్ని అప్పగిస్తాను” అని చెప్పారు. కాబట్టి యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను పట్టణం వైపు చాపాడు. \v 19 యెహోషువ తన చేయి చాపిన వెంటనే మాటున ఉన్నవారు త్వరత్వరగా తమ స్థలాల నుండి బయటకు పరిగెత్తి వచ్చి పట్టణంలో జొరబడి దానిని స్వాధీనం చేసుకుని, వెంటనే దానికి నిప్పంటించారు. \p \v 20 హాయి మనుష్యులు వెనక్కి తిరిగి చూచేటప్పటికి ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంలోకి లేవడం చూశారు, అయితే వారు తప్పించుకోవడానికి ఏ వైపు నుండి కూడా అవకాశం లేదు; అరణ్యం వైపు పారిపోతున్న ఇశ్రాయేలీయులు ఇప్పుడు తమను వెంటాడుతున్న వారిమీదికి దాడికి దిగారు. \v 21 మాటున పొంచిన వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం పట్టణం నుండి పొగ పైకి లేవడం యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలంతా చూసి, వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద దాడి చేశారు. \v 22 ఈ లోపు పట్టణం బయట మాటు వేసినవారు కూడా వారితో పోరాడటానికి బయలుదేరి వచ్చారు. కొంతమంది ఇటువైపు, మరికొంతమంది అటువైపు ఉండడంతో ఇశ్రాయేలీయుల మధ్యలో హాయి వారు చిక్కుకున్నారు. కాబట్టి వారిలో ఎవ్వరూ బ్రతికి బయటపడకుండ అందరిని హతమార్చారు. \v 23 కాని హాయి రాజును మాత్రం వారు ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరకు తీసుకువచ్చారు. \p \v 24 పొలాల్లో, అరణ్యంలో హాయి మనుష్యులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపటం పూర్తి చేసిన తర్వాత, వారిలో ఎవరూ మిగలకుండా ప్రతి ఒక్కరు ఖడ్గం పాలయ్యాక, ఇశ్రాయేలీయులంతా హాయికి తిరిగివచ్చి దానిలో ఉన్నవారందరిని చంపివేశారు. \v 25 ఆ రోజున హాయి పట్టణానికి చెందిన స్త్రీ పురుషులు మొత్తం పన్నెండువేలమంది చనిపోయారు. \v 26 ఎందుకంటే హాయిలో నివసించే వారందరినీ నాశనం చేసే వరకు యెహోషువ తన ఈటెను పట్టుకున్న చేతిని వెనుకకు తీసుకోలేదు. \v 27 అయితే యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు ఈ పట్టణంలోని పశువులను, దోపుడుసొమ్మును తమ కోసం తీసుకెళ్లారు. \p \v 28 కాబట్టి యెహోషువ హాయిని కాల్చివేసి, దానిని శాశ్వత శిధిలాల కుప్పగా చేశాడు, ఇప్పటికీ అది నిర్జన ప్రదేశంగానే ఉంది. \v 29 అతడు హాయి రాజును సాయంకాలం వరకు స్తంభానికి వ్రేలాడదీశాడు. సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆ మృతదేహాన్ని స్తంభం నుండి క్రిందికి దించి పట్టణ ద్వారం దగ్గర పడవేయమని ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేసి దానిపై ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. \s1 ఏబాలు పర్వతం దగ్గర ఒడంబడిక పునరుద్ధరణ \p \v 30-31 యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు, యెహోషువ ఏబాలు పర్వతం మీద ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన దాని ప్రకారం అతడు చెక్కని రాళ్లతో ఎటువంటి ఇనుప సాధనం వాడకుండ దాన్ని కట్టాడు. దానిపై వారు యెహోవాకు దహనబలులు సమాధానబలులు అర్పించారు. \v 32 ఇశ్రాయేలీయుల సమక్షంలో, యెహోషువ మోషే ధర్మశాస్త్ర ప్రతిని రాళ్లపై వ్రాశాడు. \v 33 ఇశ్రాయేలీయులందరు, వారి పెద్దలు, అధికారులు, న్యాయాధిపతులతో పాటు యెహోవా నిబంధన మందసానికి ఇరువైపులా, దానిని మోస్తున్న లేవీయ యాజకులకు ఎదురుగా నిలబడ్డారు. వారి మధ్య నివసిస్తున్న విదేశీయులు, స్థానికంగా పుట్టినవారు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి యెహోవా సేవకుడైన మోషే గతంలో సూచనలు ఇచ్చినప్పుడు ఆజ్ఞాపించినట్లుగా వారిలో సగం మంది ప్రజలు గెరిజీము పర్వతం ముందు, సగం మంది ఏబాలు పర్వతం ముందు నిలబడ్డారు. \p \v 34 ఆ తర్వాత, యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని అనగా దీవెనలను శాపాలను ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే చదివాడు. \v 35 స్త్రీలు, పిల్లలు, వారి మధ్య నివసించే విదేశీయులతో సహా ఇశ్రాయేలీయుల సమాజమంతటి సమక్షంలో మోషే ఆజ్ఞాపించిన వాటిలో యెహోషువ చదవకుండా ఒక్క మాట కూడా విడిచిపెట్టలేదు. \c 9 \s1 గిబియోనీయుల మోసం \p \v 1 యొర్దానుకు పశ్చిమాన ఉన్న రాజులందరూ అంటే కొండ సీమలోని రాజులు, పడమటి పర్వత ప్రాంతాల్లో, మధ్యధరా సముద్ర తీరప్రాంతంలో లెబానోను వరకు ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయుల, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల రాజులు ఈ విషయాలను గురించి విన్నప్పుడు, \v 2 వారు యెహోషువతో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి కలిసి వచ్చారు. \p \v 3 అయితే, యెరికోకు, హాయికి యెహోషువ ఏమి చేశాడో గిబియోను ప్రజలు విన్నప్పుడు, \v 4 వారు ఒక కుయుక్తిని ఆలోచించి, రాయబారులుగా నటిస్తూ తమ గాడిదల మీద చినిగిపోయిన గోనెసంచులు, పాతగిల్లి అతుకు వేసిన ద్రాక్షతిత్తులను పెట్టుకుని వెళ్లారు. \v 5 తమ కాళ్లకు అరిగిపోయి అతుకులు వేసిన పాత చెప్పులు, పాతబడిన బట్టలు వేసుకున్నారు. వారు తెచ్చుకున్న రొట్టెలన్నీ ఎండిపోయి బూజు పట్టి ఉన్నాయి. \v 6 వారు గిల్గాలులో శిబిరం దగ్గర ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి అతనితో, ఇశ్రాయేలీయులతో, “మేము దూరదేశం నుండి వచ్చాం; మాతో ఒక సమాధాన ఒడంబడిక” అని అన్నారు. \p \v 7 ఇశ్రాయేలీయులు హివ్వీయులతో, “కాని మీరు మా మధ్య నివసిస్తున్న వారిలా ఉన్నారు, మేము మీతో ఎలా సమాధాన ఒడంబడిక చేసుకోగలం?” అని అడిగారు. \p \v 8 అందుకు వారు, “మేము మీ దాసులం” అని యెహోషువతో అన్నారు. \p కాని యెహోషువ, “మీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు?” అని వారిని అడిగాడు. \p \v 9 అందుకు వారు: “మీ దేవుడైన యెహోవా కీర్తిని గురించి విని, మీ దాసులమైన మేము చాలా దూరదేశం నుండి వచ్చాము. ఆయన ఈజిప్టులో చేసినదంతటిని గురించి, \v 10 యొర్దాను తూర్పున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులకు అనగా హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో పాలించిన బాషాను రాజైన ఓగులకు చేసిన దాన్ని గురించి విన్నాము. \v 11 కాబట్టి మా పెద్దలు, మా దేశవాసులంతా మాతో, ‘ప్రయాణానికి అవసరమైన ఆహారం తీసుకుని వెళ్లి వారిని కలిసి వారితో, “మేము మీ దాసులం; మాతో సమాధాన ఒడంబడిక చేయండి” అని చెప్పండి’ అన్నారు. \v 12 మేము మీ దగ్గరకు రావడానికి బయలుదేరిన రోజు ఇంట్లో చేసినప్పుడు మా ఈ రొట్టెలు వేడిగా ఉన్నాయి. కానీ ఇప్పుడవి ఎండిపోయి బూజు పట్టి ఉన్నాయి చూడండి. \v 13 ఈ ద్రాక్షరసం తిత్తులు మేము నింపినప్పుడు క్రొత్తవే, కాని ఇప్పుడు చినిగిపోయాయి. చాలా దూరం ప్రయాణం చేయడంతో మా బట్టలు, చెప్పులు అరిగిపోయాయి.” \p \v 14 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాను అడగకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు. \v 15 తర్వాత యెహోషువ వారిని బ్రతకనివ్వడానికి వారితో సమాధాన ఒడంబడిక చేశాడు, దానిని సమాజ నాయకులు ప్రమాణం చేసి ఆమోదించారు. \p \v 16 గిబియోనీయులతో సమాధాన ఒడంబడిక చేసుకున్న మూడు రోజుల తర్వాత, వారు తమ పొరుగువారని, తమ దగ్గర నివసిస్తున్నారని ఇశ్రాయేలీయులు విన్నారు. \v 17 కాబట్టి ఇశ్రాయేలీయులు బయలుదేరి మూడవ రోజున వారి పట్టణాలైన గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్-యారీము చేరుకున్నారు. \v 18 అయితే ఇశ్రాయేలీయులు వారిపై దాడి చేయలేదు, ఎందుకంటే సమాజ నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరున వారితో ప్రమాణం చేశారు. \p సమాజమంతా నాయకుల మీద సణుగుకొన్నారు. \v 19 అయితే సమాజ నాయకులంతా, “మనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున వారికి ప్రమాణం చేశాం కాబట్టి ఇప్పుడు మనం వారిని తాకకూడదు. \v 20 మనం వారికి చేసిన ప్రమాణం వల్ల మన మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండేలా వారిని బ్రతుకనిద్దాం” అన్నారు. \v 21 వారు ఇంకా మాట్లాడుతూ, “వారిని బ్రతుకనివ్వండి, వారు సమాజమంతటికి కట్టెలు కొట్టేవారిగా నీళ్లు తెచ్చేవారిగా ఉంటారు” అని జవాబిచ్చారు. అలా నాయకులు ఇచ్చిన మాట నెరవేరింది. \p \v 22 యెహోషువ గిబియోనీయులను పిలిపించి వారితో, “మీరు మా దగ్గరే నివసించే వారైనప్పటికి మేము చాలా దూరంలో ఉంటామని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? \v 23 అందుకే మీరు శాపానికి గురైయ్యారు. మీరు ఎప్పటికీ నా దేవుని మందిరానికి కట్టెలు కొట్టేవారిగా, నీరు తెచ్చే వారిగానే ఉంటారు” అని చెప్పాడు. \p \v 24 అందుకు వారు యెహోషువకు, “మీ దేవుడైన యెహోవా ఈ దేశమంతటిని మీకు ఇవ్వమని, దాని నివాసులందరిని మీ ముందు నుండి తుడిచిపెట్టమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించారని మీ దాసులమైన మాకు స్పష్టంగా తెలిసింది. మీ వల్ల మాకు ప్రాణభయం ఉంది, అందుకే ఇలా చేశాము. \v 25 మేమిప్పుడు మీ చేతుల్లో ఉన్నాము. మా విషయంలో మీకు ఏది మంచిది, ఏది సరియైనది అనిపిస్తే అదే చేయండి” అని జవాబిచ్చారు. \p \v 26 కాబట్టి యెహోషువ గిబియోనీయులను ఇశ్రాయేలీయుల నుండి కాపాడి, వారిని చంపకుండా చేశాడు. \v 27 ఆ రోజు యెహోషువ యెహోవా ఎంచుకున్న స్థలంలో ఉండే బలిపీఠం యొక్క అవసరాలను తీర్చడానికి, గిబియోనీయులను సమాజం కోసం కట్టెలు కొట్టేవారిగా, నీరు తెచ్చేవారిగా చేశాడు. నేటికీ వారు అదే చేస్తున్నారు. \c 10 \s1 సూర్యుడు నిలిచిపోవుట \p \v 1 యెహోషువ హాయిని పట్టుకుని పూర్తిగా నాశనం\f + \fr 10:1 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది\ft*\f* చేసి, యెరికోకు దాని రాజుకు చేసినట్లు హాయికి దాని రాజుకు చేశాడని, గిబియోను ప్రజలు ఇశ్రాయేలుతో సమాధాన ఒప్పందం చేసుకుని వారితో కలిసిపోయారని యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు విన్నాడు. \v 2 అతడు, అతని ప్రజలు దీని గురించి చాలా భయపడ్డారు, ఎందుకంటే గిబియోను పట్టణం రాజధానుల్లో ఒక ముఖ్యమైన పట్టణం; అది హాయి కంటే పెద్దది, దాని మనుష్యులందరు మంచి పోరాట యోధులు. \v 3 కాబట్టి యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు హెబ్రోను రాజైన హోహాము, యర్మూతు రాజైన పిరాము, లాకీషు రాజైన యాఫీయా, ఎగ్లోను రాజైన దెబీరులకు, \v 4 “రండి గిబియోనుపై దాడి చేయడానికి నాకు సహాయం చేయండి, ఎందుకంటే గిబియోను యెహోషువతో ఇశ్రాయేలీయులతో సమాధాన ఒప్పందం చేసుకుంది” అని విన్నవించుకున్నారు. \p \v 5 అమోరీయుల అయిదుగురు రాజులు అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఒకటిగా చేరి, తమ సైనికులందరితో కలిసి వెళ్లి గిబియోనీయులతో యుద్ధం చేశారు. \p \v 6 గిబియోనీయులు గిల్గాలులోని శిబిరంలో ఉన్న యెహోషువకు: “నీ దాసులను విడిచిపెట్టక త్వరగా మా దగ్గరకు వచ్చి సహాయం చేసి మమ్మల్ని రక్షించండి! కొండ సీమలోని అమోరీయుల రాజులందరూ ఒక్కటిగా మా మీదికి దండెత్తి వచ్చారు” అని అంటూ సమాచారం పంపారు. \p \v 7 కాబట్టి యెహోషువ తన సైన్యమంతటితో, అత్యుత్తమ పోరాట యోధులందరితో సహా గిల్గాలు నుండి బయలుదేరాడు. \v 8 యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు; నేను వారిని నీ చేతికి అప్పగించాను. వారిలో ఒక్కరు మీ ముందు నిలబడలేరు” అని చెప్పారు. \p \v 9 గిల్గాలు నుండి రాత్రంతా నడిచి వచ్చిన తర్వాత, యెహోషువ హఠాత్తుగా వారి మీద దాడి చేశాడు. \v 10 యెహోవా వారిని ఇశ్రాయేలీయుల ముందు గందరగోళంలో పడేశారు, కాబట్టి ఇశ్రాయేలీయులు గిబియోనులో వారిని పూర్తిగా ఓడించారు. ఇశ్రాయేలీయులు బేత్-హోరోనుకు పైకి వెళ్లే దారిలో అజేకా, మక్కేదా వరకు వారిని వెంటాడి నరికివేశారు. \v 11 వారు బేత్-హోరోను నుండి అజేకాకు వెళ్లే దారిలో ఇశ్రాయేలీయుల నుండి పారిపోతుండగా, యెహోవా వారిపై పెద్ద వడగళ్ళు కురిపించారు, ఇశ్రాయేలీయుల ఖడ్గాల చేత చంపబడినవారి కంటే వడగళ్ళతో చచ్చినవారే ఎక్కువ. \p \v 12 యెహోవా అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించిన రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల సమక్షంలో యెహోవాతో ఇలా అన్నాడు: \q1 “సూర్యుడా, గిబియోనుపై నిలిచిపో, \q2 చంద్రుడా, అయ్యాలోను లోయ పైగా ఆగిపో.” \q1 \v 13 ప్రజలు తమ శత్రువులపై పూర్తి విజయం సాధించే వరకు, \q2 సూర్యుడు నిలిచిపోయాడు, \q2 చంద్రుడు ఆగిపోయాడు, \m అని యాషారు\f + \fr 10:13 \fr*\fq యాషారు \fq*\ft అంటే \ft*\fqa వీరులు \fqa*\ft లేదా \ft*\fqa శూరులు\fqa*\f* వ్రాసిన వీరుల గ్రంథంలో వ్రాయబడినట్లుగా జరిగింది. \p సూర్యుడు ఆకాశం మధ్యలో ఆగి, దాదాపు ఒక రోజు ఆలస్యమయ్యాడు. \v 14 యెహోవా ఒక మానవుడి మాట విన్న ఆ రోజులాంటిది ఇంకొకటి అంతకుముందుగానీ ఆ తర్వాత గాని లేదు. నిజంగా యెహోవా ఇశ్రాయేలీయుల కోసం యుద్ధం చేశారు! \p \v 15 ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు గిల్గాలులో ఉన్న శిబిరానికి తిరిగి వచ్చాడు. \s1 అయిదుగురు అమోరీయుల రాజులు చంపబడుట \p \v 16 అప్పుడు అయిదుగురు రాజులు పారిపోయి మక్కేదాలోని గుహలో దాక్కున్నారు. \v 17 అయిదుగురు రాజులు మక్కేదాలోని గుహలో దాక్కున్నట్టు యెహోషువకు తెలిసినప్పుడు, \v 18 యెహోషువ ఇలా అన్నాడు, “గుహ ద్వారానికి పెద్ద పెద్ద రాళ్లు దొర్లింది మూసివేసి దానికి మనుష్యులను కాపలా పెట్టండి. \v 19 ఆగవద్దు; మీ శత్రువులను వెంటాడండి! వెనుక నుండి వారిపై దాడి చేయండి, వారిని వారి పట్టణాలకు చేరనివ్వవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని మీ చేతికి అప్పగించారు.” \p \v 20 కాబట్టి యెహోషువ, ఇశ్రాయేలీయులు వారిని పూర్తిగా ఓడించారు, అయితే ప్రాణాలతో బయటపడిన కొంతమంది కోటగోడలు గల తమ పట్టణాలకు చేరుకున్నారు. \v 21 అప్పుడు సైన్యమంతా మక్కేదాలోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు క్షేమంగా తిరిగి వచ్చింది. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. \p \v 22 యెహోషువ, “గుహ ద్వారం తెరిచి ఆ అయిదుగురు రాజులను నా దగ్గరకు తీసుకురండి” అని అన్నాడు. \v 23 కాబట్టి వారు ఆ అయిదుగురు రాజులను అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను యొక్క రాజులను గుహ నుండి బయటకు తెచ్చారు. \v 24 ఆ రాజులను వారు యెహోషువ దగ్గరకు తీసుకువచ్చాక, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి తనతో వెళ్లి వచ్చిన సేనాధిపతులతో, “నా దగ్గరకు రండి, మీ పాదాలు ఈ రాజుల మెడల మీద పెట్టండి” అని చెప్పాడు. కాబట్టి వారు ముందుకు వచ్చి తమ పాదాలను వారి మెడల మీద పెట్టారు. \p \v 25 అప్పుడు యెహోషువ వారితో, “భయపడకండి; నిరుత్సాహపడకండి. నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. మీరు పోరాడబోయే శత్రువులందరికీ యెహోవా ఇలాగే చేస్తారు” అన్నాడు. \v 26 అప్పుడు యెహోషువ రాజులను చంపి వారి శవాలను అయిదు స్తంభాలకు వ్రేలాడదీశాడు, సాయంత్రం వరకు వారి శవాలు స్తంభాలకు వ్రేలాడి ఉన్నాయి. \p \v 27 సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆజ్ఞ ఇవ్వగా వారు వాటిని స్తంభాల నుండి దించి, వారు దాక్కున్న గుహలోకి విసిరి ఆ గుహ ముఖద్వారం దగ్గర వారు పెద్ద రాళ్లను ఉంచారు, అవి నేటికీ ఉన్నాయి. \s1 దక్షిణ పట్టణాలను జయించుట \p \v 28 ఆ రోజు యెహోషువ మక్కేదాను స్వాధీనపరచుకున్నాడు. అతడు ఆ పట్టణాన్ని దాని రాజును కత్తితో చంపి, దానిలోని వారందరినీ పూర్తిగా నాశనం చేశాడు. ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లుగా మక్కేదా రాజుకు చేశాడు. \p \v 29 అప్పుడు యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మక్కేదా నుండి లిబ్నాకు వెళ్లి దానిపై దాడి చేశారు. \v 30 యెహోవా ఆ పట్టణాన్ని దాని రాజును ఇశ్రాయేలు చేతికి అప్పగించారు. యెహోషువ ఆ పట్టణాన్ని, దానిలోని వారందరినీ కత్తితో చంపాడు. అక్కడ అతడు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లు దాని రాజుకు చేశాడు. \p \v 31 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లిబ్నా నుండి లాకీషుకు వెళ్లి అక్కడ తన దళాలను మోహరించి దాని మీద దాడి చేశాడు. \v 32 యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు. రెండవ రోజు యెహోషువ దానిని పట్టుకుని లిబ్నాకు చేసినట్లే ఆ పట్టణాన్ని, అందులోని వారందరినీ ఖడ్గంతో చంపాడు. \v 33 ఇంతలో గెజెరు రాజైన హోరాము లాకీషుకు సహాయం చేయడానికి రాగా అయితే యెహోషువ ఎవరూ ప్రాణాలతో మిగులకుండా అతన్ని అతని సైన్యాన్ని హతం చేశాడు. \p \v 34 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లాకీషు నుండి ఎగ్లోనుకు వెళ్లారు; దానికి వ్యతిరేకంగా వారు తమ సైన్యాన్ని మోహరింపజేసి దాని మీద దాడి చేశాడు. \v 35 వారు లాకీషుకు చేసినట్లుగా అదే రోజు దానిని పట్టుకుని ఖడ్గంతో అక్కడ ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు. \p \v 36 ఎగ్లోను నుండి యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు హెబ్రోనుకు వెళ్లి దాని మీద దాడి చేశారు. \v 37 వారు దానిని పట్టుకుని దానిని దాని రాజును దానికి చెందిన అన్ని గ్రామాలను దానిలో ఉన్నవారినందరిని ఖడ్గంతో చంపారు. ఎగ్లోనుకు చేసినట్టే దానిని దానిలో ఉన్నవారినందరిని పూర్తిగా నాశనం చేశారు. \p \v 38 తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు వెనుకకు వచ్చి దెబీరు మీద దాడి చేశాడు. \v 39 వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దాని గ్రామాలను పట్టుకుని కత్తితో చంపారు. అందులో ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు. వారు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. లిబ్నాకు, దాని రాజుకు, హెబ్రోనుకు చేసినట్లే వారు దెబీరుకు, దాని రాజుకు చేశారు. \p \v 40 కాబట్టి యెహోషువ కొండ ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన్ని, పడమటి పర్వతాలను, కొండ వాలులతో సహా మొత్తం ప్రాంతాన్ని వాటి రాజులందరితో పాటు స్వాధీనం చేసుకున్నాడు. ఎవ్వరినీ మిగల్చలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే, ఊపిరితో ఉన్నవారందరిని అతడు పూర్తిగా నాశనం చేశాడు. \v 41 యెహోషువ వారిని కాదేషు బర్నియా నుండి గాజా వరకు, గోషేను ప్రాంతం నుండి గిబియోను వరకు జయించాడు. \v 42 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలు కోసం పోరాడారు కాబట్టి యెహోషువ ఈ రాజులందరినీ, వారి దేశాలను ఒకే దండయాత్రలో జయించాడు. \p \v 43 తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో కలిసి గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చాడు. \c 11 \s1 ఉత్తర రాజుల ఓటమి \p \v 1 హాసోరు రాజు యాబీను ఈ విషయం విని, మాదోను రాజైన యోబాబుకు, షిమ్రోను, అక్షఫు రాజులకు, \v 2 ఉత్తరాన కొండ సీమలో ఉన్న రాజులకు, కిన్నెరెతు సరస్సుకు దక్షిణంగా ఉన్న అరాబా లోయ ప్రాంతంలో ఉన్న రాజులకు, పడమటి దిగువ కొండ ప్రదేశాల రాజులకు, పడమర ఉన్న నఫోత్ దోరు రాజుకు, \v 3 తూర్పు పడమర లోని కనానీయుల రాజులకు, అమోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, కొండ సీమలో ఉన్న యెబూసీయుల, మిస్పా ప్రదేశంలో హెర్మోను పర్వతం క్రింద ఉన్న హివ్వీయుల రాజులకు కబురు పంపాడు. \v 4 వారు సముద్రతీరంలో ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన తమ భారీ సైన్యంతో, లెక్కలేనన్ని గుర్రాలతో రథాలతో బయలుదేరి వచ్చారు. \v 5 ఈ రాజులందరూ తమ బలగాలను కలుపుకొని ఇశ్రాయేలీయులతో పోరాడడానికి మేరోము జలాల దగ్గర కలిసి మకాం వేశారు. \p \v 6 యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు, ఎందుకంటే రేపు ఈ సమయానికి నేను వారందరినీ చంపి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగిస్తాను. మీరు వారి గుర్రాల తొడనరాలు తెగకోసి, వారి రథాలను కాల్చివేయాలి” అని చెప్పారు. \p \v 7 కాబట్టి యెహోషువ అతనితో పాటు సైనికులంతా బయలుదేరి మేరోము జలాల దగ్గర ఒక్కసారిగా వారి మీద పడ్డారు. \v 8 యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు. వీరు వారిని ఓడించి, మహా పట్టణమైన సీదోను వరకు, మిస్రెఫోత్-మయీము వరకు, తూర్పున మిస్పే లోయవరకు ఏ ఒక్కరు మిగులకుండా వారిని వెంటాడి చంపారు. \v 9 యెహోవా చెప్పినట్లే యెహోషువ వారికి చేశాడు: అతడు వారి గుర్రాల తొడనరాలు తెగకోసి, వారి రథాలను కాల్చివేశాడు. \p \v 10 యెహోషువ ఆ సమయంలో వెనుకకు తిరిగి హాసోరును వశపరచుకున్నాడు. దాని రాజును కత్తితో చంపాడు. (అంతకుముందు హాసోరు ఆ రాజ్యాలన్నిటికీ ముఖ్యపట్టణంగా ఉండేది.) \v 11 దానిలో ఉన్నవారందరిని కత్తితో చంపారు. ఊపిరి ఉన్న ఎవరినీ విడిచిపెట్టకుండా వారిని పూర్తిగా నాశనం చేశారు.\f + \fr 11:11 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే; \ft*\ft అలాగే \+xt 12|link-href="JOS 11:12"\+xt*, \+xt 20|link-href="JOS 11:20"\+xt*, \+xt 21|link-href="JOS 11:21"\+xt*.\ft*\f* అతడు హాసోరును కాల్చివేశాడు. \p \v 12 యెహోషువ ఈ రాజ పట్టణాలన్నిటిని, వాటి రాజులందరినీ పట్టుకుని ఖడ్గంతో చంపాడు. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని పూర్తిగా నాశనం చేశాడు. \v 13 అయితే యెహోషువ కాల్చివేసిన హాసోరు తప్ప మట్టి కొండలమీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. \v 14 ఇశ్రాయేలీయులు ఈ పట్టణాలలోని దోపుడుసొమ్మును, పశువులన్నిటిని తమ కోసం తీసుకెళ్లారు, కాని మనుష్యుల్లో ఎవరినీ విడిచిపెట్టకుండా, వాటిని పూర్తిగా నాశనం చేసేంతవరకు ప్రజలందరినీ ఖడ్గంతో చంపారు. \v 15 యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, యెహోషువ దానినే చేశాడు; మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిలో అతడు ఏదీ వదల్లేదు. \p \v 16 కాబట్టి యెహోషువ ఈ మొత్తం భూమిని స్వాధీనం అనగా కొండసీమ, దక్షిణ ప్రాంతం, గోషేను ప్రాంతమంతా, పశ్చిమ పర్వత ప్రాంతాలు, అరాబా, ఇశ్రాయేలు పర్వతాలు వాటి దిగువ ప్రాంతాలు, \v 17 హలాకు పర్వతం నుండి శేయీరు వైపు, హెర్మోను పర్వతం క్రింద లెబానోను లోయలోని బయల్-గాదు వరకు అతడు స్వాధీనం చేసుకుని వాటి రాజులందరినీ పట్టుకుని చంపాడు. \v 18 యెహోషువ ఈ రాజులందరితో చాలా కాలం యుద్ధం చేశాడు. \v 19 గిబియోనులో నివసిస్తున్న హివ్వీయులు తప్ప, ఏ ఒక్క పట్టణం కూడా ఇశ్రాయేలీయులతో సమాధాన ఒప్పందం చేసుకోలేదు, వారు యుద్ధంలో వారందరినీ పట్టుకున్నారు. \v 20 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు కనికరం లేకుండా వారిని పూర్తిగా నాశనం చేయాలని, ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచారు. \p \v 21 ఆ సమయంలో యెహోషువ వెళ్లి కొండ ప్రాంతంలో అనగా హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా, ఇశ్రాయేలు కొండ ప్రాంతమంతా నివసించిన అనాకీయులందరినీ, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడు. \v 22 ఇశ్రాయేలీయుల భూభాగంలో అనాకీయులు ఎవరూ మిగల్లేదు; గాజా, గాతు, అష్డోదులలో మాత్రమే కొంతమంది మిగిలారు. \p \v 23 యెహోవా మోషేకు చెప్పినట్లుగానే యెహోషువ ఆ దేశమంతటిని స్వాధీనం చేసుకుని, ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారసత్వంగా దానిని ఇచ్చాడు. తర్వాత దేశం యుద్ధాలు లేకుండ విశ్రాంతిగా ఉంది. \c 12 \s1 ఓడిపోయిన రాజుల జాబితా \lh \v 1 ఇశ్రాయేలీయులు ఓడించిన దేశపు రాజులు వీరే: అర్నోను కొండగట్టు నుండి హెర్మోను పర్వతం వరకు, అరాబాకు తూర్పున ఉన్న ప్రాంతంతో సహా యొర్దానుకు తూర్పున ఉన్న వారి దేశాలను స్వాధీనం చేసుకున్నారు. \b \li1 \v 2 అమోరీయుల రాజైన సీహోను హెష్బోను నుండి పరిపాలించాడు. \li2 అతడు అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి అనగా కొండ మధ్య నుండి అమ్మోనీయుల సరిహద్దు యైన యబ్బోకు నది వరకు పరిపాలించాడు. ఇందులో సగం గిలాదు ఉంది. \li2 \v 3 అతడు తూర్పు అరాబాను కిన్నెరెతు\f + \fr 12:3 \fr*\ft అంటే \ft*\fqa గలలీ\fqa*\f* సముద్రం నుండి అరాబా సముద్రం (అంటే మృత సముద్రం) వరకు, బేత్-యెషిమోతు వరకు, ఆపై పిస్గా కొండ క్రింద దక్షిణం వైపు వరకు పరిపాలించాడు. \li1 \v 4 అష్తారోతు, ఎద్రెయీలలో పాలించిన రెఫాయీయులలో చివరివాడైన బాషాను రాజైన ఓగు యొక్క భూభాగము. \li2 \v 5 అతడు హెర్మోను పర్వతం, సలేకా, గెషూరు, మయకా ప్రజల సరిహద్దు వరకు బాషాను మొత్తాన్ని, గిలాదులో సగం హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు పరిపాలించాడు. \b \lf \v 6 యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలీయులు వారిని జయించారు. యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి వారి భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. \b \p \v 7 యెహోషువ, ఇశ్రాయేలీయులు యొర్దానుకు పశ్చిమాన, లెబానోను లోయలోని బయల్-గాదు నుండి శేయీరు వైపుగా ఉన్న హలాకు పర్వతం వరకు జయించిన దేశాల రాజుల జాబితా ఇది. యెహోషువ ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారి భూములను వారసత్వంగా ఇచ్చాడు. \v 8 ఈ భూములలో కొండసీమ, పశ్చిమ పర్వతాలు, అరాబా, పర్వత వాలులు, అరణ్యం, దక్షిణ ప్రాంతం ఉన్నాయి. ఇవి హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల దేశాలు. \b \lh వారు జయించిన రాజు లెవరనగా: \b \li1 \v 9 యెరికో రాజు \litl ఒక్కడు\litl* \li1 హాయి రాజు (బేతేలు సమీపంలోని) \litl ఒక్కడు\litl* \li1 \v 10 యెరూషలేము రాజు \litl ఒక్కడు\litl* \li1 హెబ్రోను రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 11 యర్మూతు రాజు \litl ఒక్కడు\litl* \li1 లాకీషు రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 12 ఎగ్లోను రాజు \litl ఒక్కడు\litl* \li1 గెజెరు రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 13 దెబీరు రాజు \litl ఒక్కడు\litl* \li1 గెదెరు రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 14 హోర్మా రాజు \litl ఒక్కడు\litl* \li1 అరాదు రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 15 లిబ్నా రాజు \litl ఒక్కడు\litl* \li1 అదుల్లాము రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 16 మక్కేదా రాజు \litl ఒక్కడు\litl* \li1 బేతేలు రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 17 తప్పూయ రాజు \litl ఒక్కడు\litl* \li1 హెఫెరు రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 18 ఆఫెకు రాజు \litl ఒక్కడు\litl* \li1 లషారోను రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 19 మాదోను రాజు \litl ఒక్కడు\litl* \li1 హాసోరు రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 20 షిమ్రోను మెరోను రాజు \litl ఒక్కడు\litl* \li1 అక్షఫు రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 21 తానాకు రాజు \litl ఒక్కడు\litl* \li1 మెగిద్దో రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 22 కెదెషు రాజు \litl ఒక్కడు\litl* \li1 కర్మెలులోని యొక్నీము రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 23 దోరు రాజు (నఫోత్ దోరు లోని) \litl ఒక్కడు\litl* \li1 గిల్గాలులో గోయీం రాజు \litl ఒక్కడు\litl* \li1 \v 24 తిర్సా రాజు \litl ఒక్కడు\litl* \b \lf \litl మొత్తం ముప్పై ఒక్క మంది రాజులు.\litl* \c 13 \s1 ఇంకా స్వాధీనం చేసుకోవలసిన భూమి \p \v 1 యెహోషువ ముసలివాడయ్యాక, యెహోవా అతనితో, “నీవు ముసలివాడవయ్యావు, ఇంకా చాలా ప్రాంతాలు స్వాధీనం చేసుకోవలసి ఉంది. \b \lh \v 2 “ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలు: \b \li1 “ఫిలిష్తీయుల, గెషూరీయుల అన్ని ప్రాంతాలు, \v 3 కనానీయులవని పిలువబడిన ఈజిప్టు తూర్పున ఉన్న షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను భూభాగం వరకు, అయిదుగురు ఫిలిష్తీయ పాలకులకు సంబంధించిన గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను; \li1 ఆవీయుల భూభాగం, \v 4 దక్షిణాన; \li1 సీదోనీయుల ఆరా\f + \fr 13:4 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa మియరా\fqa*\f* నుండి ఆఫెకు, అమోరీయుల సరిహద్దుల వరకు ఉన్న కనానీయుల దేశమంతా; \li1 \v 5 గెబాలీయుల ప్రాంతం; \li1 హెర్మోను పర్వతం క్రింద బయల్-గాదు నుండి లెబో హమాతు వరకు తూర్పున ఉన్న లెబానోను ప్రాంతమంతా. \b \p \v 6 “లెబానోను నుండి మిస్రెఫోత్-మయీము వరకు ఉన్న పర్వత ప్రాంతాల నివాసులందరిని అంటే, సీదోనీయులందరినీ ఇశ్రాయేలీయుల ముందు నుండి నేనే వారిని వెళ్లగొడతాను. నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా ఈ భూమిని ఇశ్రాయేలుకు వారసత్వంగా ఇవ్వాలి, \v 7 దానిని తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థగోత్రానికి వారసత్వంగా పంచి ఇవ్వాలి” అని చెప్పారు. \s1 యొర్దానుకు తూర్పున ఉన్న భూభాగం విభజన \lh \v 8 మనష్షే గోత్రంలో మిగిలిన సగభాగం, రూబేనీయులు, గాదీయులు యొర్దాను తూర్పున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన విధంగా యొర్దాను తూర్పున వారసత్వంగా పొందారు. \li1 \v 9 ఇది అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి, కొండగట్టు మధ్యలో ఉన్న పట్టణం నుండి, మెదెబా మొత్తం పీఠభూమితో సహా దీబోను వరకు విస్తరించి ఉంది, \v 10 హెష్బోనులో అమ్మోనీయుల సరిహద్దు వరకు పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను పట్టణాలన్ని ఉన్నాయి. \li1 \v 11 అందులో గిలాదు, గెషూరు, మయకా ప్రజల భూభాగం, హెర్మోను పర్వతం మొత్తం, సలేకా వరకు ఉన్న బాషాను కూడా ఉన్నాయి, \v 12 అంటే, అష్తారోతు ఎద్రెయీలో పాలించిన బాషానులోని ఓగు రాజ్యం మొత్తము. (అతడు రెఫాయీయులలో చివరివాడు.) మోషే వారిని ఓడించి వారి భూమిని స్వాధీనం చేసుకున్నాడు. \v 13 కానీ ఇశ్రాయేలీయులు గెషూరు, మయకా ప్రజలను బయటకు వెళ్లగొట్టలేదు, కాబట్టి వారు ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యనే నివసిస్తున్నారు. \b \li1 \v 14 కానీ లేవీ గోత్రానికి అతడు ఎలాంటి వారసత్వాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన వారికి వాగ్దానం చేసినట్లు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు అర్పించబడిన హోమబలులే వారి వారసత్వము. \b \lh \v 15 రూబేను గోత్రం వారికి వారి వంశాల ప్రకారం మోషే వారికిచ్చింది: \li1 \v 16 అర్నోను నది లోయ ప్రక్కన ఉన్న అరోయేరు లోయ మొదలుకొని ఆ లోయలో ఉన్న పట్టణం నుండి మెదెబా దగ్గరి పూర్తి మైదానం, \v 17 ఇదీగాక హెష్బోను దాని మైదానంలోని పట్టణాలన్ని, దీబోను, బామోత్ బయలు బేత్-బయల్-మెయోను, \v 18 యహజు, కెదేమోతు, మెఫాతు, \v 19 కిర్యతాయిము, షిబ్మా లోయలో ఉన్న కొండ మీది శెరెత్ షహరు, \v 20 బేత్-పెయోరు, పిస్గా కొండచరియలు, బేత్-యెషిమోతు, \v 21 మైదానంలోని పట్టణాలన్ని, హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను రాజ్యం మొత్తం వారసత్వంగా ఇచ్చాడు. మోషే అతన్ని, ఆ దేశంలో నివసించిన సీహోనుతో జతకట్టిన మిద్యానీయుల ప్రధానులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే వారిని ఓడించాడు. \v 22 ఇశ్రాయేలీయులు యుద్ధంలో చంపినవారితో పాటు, బెయోరు కుమారుడైన భవిష్యవాణి చెప్పే బిలామును కత్తితో చంపారు. \lf \v 23 రూబేనీయుల సరిహద్దు యొర్దాను నది తీరము. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు రూబేనీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి. \b \lh \v 24 గాదు గోత్రానికి దాని వంశాల ప్రకారం మోషే ఇచ్చింది ఇదే: \li1 \v 25 యాజెరు ప్రాంతం, గిలాదు పట్టణాలన్ని, అమ్మోనీయుల దేశంలో సగం అంటే రబ్బాకు సమీపంలో ఉన్న అరోయేరు వరకు; \v 26 హెష్బోను నుండి రామాత్ మిస్పే, బెతోనీము వరకు, మహనయీము నుండి దెబీరు ప్రాంతం వరకు; \v 27 లోయలో, బేత్-హారాము, బేత్-నిమ్రా, సుక్కోతు, సాఫోను, హెష్బోను రాజైన సీహోను యొక్క ప్రాంతం (యొర్దాను తూర్పు వైపు, కిన్నెరెతు సముద్రం\f + \fr 13:27 \fr*\ft అంటే \ft*\fqa గలిలీ\fqa*\f* చివరి వరకు ఉన్న ప్రాంతం). \lf \v 28 ఈ పట్టణాలు, వాటి గ్రామాలు గాదీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి. \b \lh \v 29 మోషే మనష్షే యొక్క అర్థగోత్రానికి, అంటే మనష్షే వంశస్థుల సగం కుటుంబానికి, దాని వంశాల ప్రకారం ఇచ్చింది ఇదే: \li1 \v 30 వారి సరిహద్దు మహనయీము నుండి బాషాను రాజైన ఓగు రాజ్యం మొత్తం, అంటే బాషానులోని యాయీరు స్థిరనివాసాలైన అరవై పట్టణాలు, \v 31 గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయీ (బాషానులోని ఓగు యొక్క రాజ పట్టణాలు). \lf ఇవి మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు వారి వంశాల ప్రకారం మాకీరు కుమారులలో సగం మందికి ఇవ్వబడ్డాయి. \b \lf \v 32 యెరికోకు తూర్పున యొర్దాను అవతల మోయాబు సమతల మైదానంలో ఉన్నప్పుడు మోషే ఇచ్చిన వారసత్వం ఇదే. \v 33 కానీ లేవీ గోత్రానికి, మోషే వారసత్వం ఇవ్వలేదు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసినట్లు ఆయనే వారి స్వాస్థ్యము. \c 14 \s1 యొర్దానుకు పడమర ఉన్న భూభాగం విభజన \p \v 1 ఇవి ఇశ్రాయేలీయులు కనాను దేశంలో వారసత్వంగా పొందిన ప్రాంతాలు, వీటిని యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు గోత్ర వంశ పెద్దలు వారికి కేటాయించారు. \v 2 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా, తొమ్మిదిన్నర గోత్రాలకు చీటి ద్వారా వారి వారసత్వాలు కేటాయించబడ్డాయి. \v 3 మోషే యొర్దాను తూర్పున ఉన్న రెండున్నర గోత్రాలకు వారి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కానీ మిగిలిన వాటిలో లేవీయులకు వారసత్వం ఇవ్వలేదు, \v 4 ఎందుకంటే యోసేపు సంతతివారైన మనష్షే, ఎఫ్రాయిములు రెండు గోత్రాలుగా అయ్యారు. లేవీయులకు భూమిలో వాటా లేదు, కానీ వారి మందలు, గొర్రెల మందల కోసం పచ్చికబయళ్లు, నివసించడానికి పట్టణాలు మాత్రమే పొందుకున్నారు. \v 5 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు దేశాన్ని విభజించారు. \s1 కాలేబుకు ఇవ్వబడిన భాగం \p \v 6 యూదా ప్రజలు గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి, కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో, “నీ గురించి, నా గురించి కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా ఏమి చెప్పారో నీకు తెలుసు. \v 7 యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియా నుండి దేశాన్ని పరిశోధించడానికి నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాలు. నా నమ్మకం ప్రకారం నేను అతనికి ఒక నివేదికను తీసుకువచ్చాను, \v 8 కానీ నాతో వచ్చిన నా తోటి ఇశ్రాయేలీయులు ప్రజల గుండెలు భయంతో కరిగిపోయేలా చేశారు. అయితే, నేను నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించాను. \v 9 కాబట్టి ఆ రోజున మోషే నాతో ప్రమాణం చేసి, ‘నీవు నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన దేశం నీకు, నీ పిల్లలకు శాశ్వత వారసత్వంగా ఉంటుంది’\f + \fr 14:9 \fr*\ft \+xt ద్వితీ 1:36\+xt*\ft*\f* అని చెప్పాడు. \p \v 10 “యెహోవా వాగ్దానం చేసినట్లుగా, ఆయన మోషేతో ఈ మాట చెప్పినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగిన ఈ నలభై అయిదు సంవత్సరాలు నన్ను బ్రతికించారు. ఇప్పుడు నాకు ఎనభై అయిదు సంవత్సరాలు! \v 11 మోషే నన్ను బయటకు పంపిన రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను; నేను అప్పటిలాగే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లడానికి చాలా శక్తివంతంగా ఉన్నాను. \v 12 ఆ రోజు యెహోవా నాకు వాగ్దానం చేసిన ఈ కొండ సీమను ఇప్పుడు నాకు ఇవ్వండి. అనాకీయులు అక్కడ ఉన్నారని, వారి పట్టణాలు కోటగోడలతో విశాలంగా ఉన్నాయని అప్పుడు నీవే స్వయంగా విన్నావు. అయితే, యెహోవా నాకు సహాయం చేస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నేను వారిని వెళ్లగొడతాను” అని చెప్పాడు. \p \v 13 అప్పుడు యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు. \v 14 అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హృదయమంతటితో అనుసరించాడు కాబట్టి అప్పటినుండి హెబ్రోను కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబుకు వారసత్వంగా ఉంది. \v 15 (హెబ్రోనును అనాకీయులలో గొప్ప వ్యక్తియైన అర్బా పేరున కిర్యత్-అర్బా అని పిలిచేవారు.) \p అప్పుడు దేశం యుద్ధాలు లేకుండా విశ్రాంతిగా ఉంది. \c 15 \s1 యూదాకు ఇవ్వబడిన భాగం \lh \v 1 యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన భాగం, ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన సీను ఎడారి వరకు విస్తరించి ఉంది. \b \li1 \v 2 వారి దక్షిణ సరిహద్దు మృత సముద్రం యొక్క దక్షిణ చివరన ఉన్న అఖాతం నుండి ప్రారంభమైంది, \v 3 అక్రబ్బీం\f + \fr 15:3 \fr*\ft హెబ్రీలో అర్థం \ft*\fqa స్కార్పియన్\fqa*\f* కనుమకు దక్షిణంగా దాటి, సీను వరకు కొనసాగి, కాదేషు బర్నియాకు దక్షిణ వైపు వరకు వ్యాపించి ఉంది. తర్వాత అది హెస్రోను దాటి అద్దారు వరకు వెళ్లి కర్కా వైపు తిరిగింది. \v 4 అది అజ్మోను గుండా ఈజిప్టు వాగులో చేరి, మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. ఇది వారి\f + \fr 15:4 \fr*\ft హెబ్రీలో \ft*\fqa మీ\fqa*\f* దక్షిణ సరిహద్దు. \li1 \v 5-6 దాని తూర్పు సరిహద్దు మృత సముద్రం వెంట యొర్దాను నది యొక్క ముఖద్వారం వరకు విస్తరించింది. \li1 ఉత్తర సరిహద్దు యొర్దాను ముఖద్వారం దగ్గర సముద్రం యొక్క అఖాతం నుండి ప్రారంభమై, బేత్-హొగ్లా వరకు వెళ్లి, బేత్-అరాబాకు ఉత్తరాన రూబేను కుమారుడైన బోహాను రాయి వరకు కొనసాగింది. \v 7 ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకు వెళ్లి కొండగట్టుకు దక్షిణాన అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. అది ఎన్-షెమెషు నీళ్ల నుండి ఎన్-రోగేలు వరకు వ్యాపించింది. \v 8 ఆ తర్వాత అది యెబూసీయుల పట్టణం (అంటే, యెరూషలేము) దక్షిణ వాలు వెంబడి బెన్ హిన్నోము లోయవరకు వెళ్లింది. అక్కడినుండి అది రెఫాయీము లోయకు ఉత్తరాన ఉన్న హిన్నోము లోయకు పశ్చిమాన ఉన్న కొండపై వరకు వ్యాపించింది. \v 9 కొండపై నుండి సరిహద్దు నెఫ్తోవ నీటి ఊటవైపు వెళ్లి, ఎఫ్రోను పర్వత పట్టణాల నుండి బాలా (అనగా కిర్యత్-యారీము) వైపుకు వెళ్లింది. \v 10 తర్వాత ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు పర్వతానికి వంపుగా తిరిగి, యారీము పర్వతం (అంటే కెసాలోను) ఉత్తర వాలు గుండా వెళ్లింది, బేత్-షెమెషు వరకు కొనసాగి తిమ్నాకు వ్యాపించింది. \v 11 అది ఎక్రోను ఉత్తర వాలుకు వెళ్లి, షిక్కెరోను వైపు తిరిగి, బాలా పర్వతాన్ని దాటి జబ్నీలుకు చేరుకుంది. సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. \li1 \v 12 పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్ర తీరప్రాంతము. \b \lf ఇవి యూదా ప్రజల వంశాల ప్రకారం వారి సరిహద్దులు. \b \p \v 13 యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబుకు యూదాలో ఒక భాగాన్ని అనగా కిర్యత్-అర్బాను, అంటే హెబ్రోనును ఇచ్చాడు. (అర్బా అనాకు యొక్క పూర్వికుడు.) \v 14 కాలేబు హెబ్రోను నుండి అనాకు కుమారులైన షేషయి, అహీమాను, తల్మయి అనే ముగ్గురు అనాకీయులను వెళ్లగొట్టాడు. \v 15 అక్కడినుండి గతంలో కిర్యత్-సెఫెరు అని పిలువబడిన దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేశాడు. \v 16 కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు. \v 17 కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు. \p \v 18 ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని\f + \fr 15:18 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa ఒత్నీయేలు, అతడు ఆమెను కోరాడు\fqa*\f* కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు. \p \v 19 అందుకామె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువన, దిగువన ఉన్న నీటి మడుగులను ఇచ్చాడు. \b \lh \v 20 ఇది యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన వారసత్వం: \b \li1 \v 21 ఎదోము సరిహద్దు వైపున దక్షిణ ప్రాంతంలోని యూదా గోత్రానికి చెందిన దక్షిణాన ఉన్న పట్టణాలు: \li2 కబ్సెయేలు, ఏదెరు, యాగూరు, \v 22 కీనా, దిమోనా, అదాదా, \v 23 కెదెషు, హాసోరు, ఇత్నాను, \v 24 జీఫు, తెలెము, బెయాలోతు, \v 25 హాసోర్-హదత్తా, కెరీయోతు హెస్రోను (అంటే, హాసోరు), \v 26 అమాం, షేమ, మొలాదా, \v 27 హజర్-గద్దా, హెష్మోను, బేత్-పెలెతు, \v 28 హజర్-షువలు, బెయేర్షేబ, బిసియోత్యా, \v 29 బాలా, ఐయీము, ఎజెము, \v 30 ఎల్తోలదు, కెసీలు, హోర్మా, \v 31 సిక్లగు, మద్మన్నా, సన్సన్నా, \v 32 లెబయోతు, షిల్హిం, ఆయిను, రిమ్మోను అనేవి మొత్తం ఇరవై తొమ్మిది పట్టణాలు వాటి గ్రామాలు. \li1 \v 33 పశ్చిమాన కొండ దిగువ ప్రాంతంలో: \li2 ఎష్తాయోలు, జోరహు, అష్నా, \v 34 జానోహ, ఎన్-గన్నీము, తప్పూయ, ఏనము, \v 35 యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా, \v 36 షరాయిము, అదీతాయిం, గెదేరా (గెదెరోతాయిం), మొత్తం పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు. \li2 \v 37 సెనాను, హదాషా, మిగ్దల్-గాదు, \v 38 దిలాను, మిస్పే, యొక్తియేలు, \v 39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను, \v 40 కబ్బోను, లహ్మాస్, కిత్లిషు \v 41 గెదెరోతు, బేత్-దాగోను, నయమా, మక్కేదా మొత్తం పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు. \li2 \v 42 లిబ్నా, ఎతెరు, ఆషాను, \v 43 ఇఫ్తా, అష్నా, నెసీబు, \v 44 కెయీలా, అక్సీబు, మరేషా మొత్తం పదహారు పట్టణాలు వాటి గ్రామాలు. \li2 \v 45 ఎక్రోను, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు; \v 46 ఎక్రోనుకు పశ్చిమాన, అష్డోదు పరిసరాల్లో ఉన్నవాటన్నిటితో పాటు వాటి గ్రామాలన్నీ ఉన్నాయి; \v 47 అష్డోదు, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, వాటి గ్రామాలు; దాని ఈజిప్టు వాగువరకు, మహా మధ్యధరా సముద్ర తీరం వరకు గాజా, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు. \li1 \v 48 కొండ సీమలో: \li2 షామీరు, యత్తీరు, శోకో, \v 49 దన్నా, కిర్యత్-సన్నా (అంటే, దెబీరు), \v 50 అనాబు, ఎష్టెమో, అనీము, \v 51 గోషేను, హోలోను గిలోహు, మొత్తం పదకొండు పట్టణాలు వాటి గ్రామాలు. \li2 \v 52 అరబు, దూమా, ఎషాను, \v 53 యానీము, బేత్-తప్పూయ, ఆఫెకా, \v 54 హుమ్తా, కిర్యత్-అర్బా (అదే హెబ్రోను) సీయోరు మొత్తం తొమ్మిది పట్టణాలు వాటి గ్రామాలు. \li2 \v 55 మాయోను, కర్మెలు, జీఫు, యుత్తా, \v 56 యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ \v 57 కయీను, గిబియా, తిమ్నా అనేవి మొత్తం పది పట్టణాలు, వారి గ్రామాలు. \li2 \v 58 హల్హూలు, బేత్-సూరు, గెదోరు, \v 59 మారాతు, బేత్-అనోతు, ఎల్తెకోను అనేవి మొత్తం ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు. \li2 \v 60 కిర్యత్-బయలు (అంటే కిర్యత్-యారీము), రబ్బా అనేవి మొత్తం రెండు పట్టణాలు, వాటి గ్రామాలు. \li1 \v 61 అరణ్యంలో: \li2 బేత్-అరాబా, మిద్దీను, సెకాకా, \v 62 నిబ్షాను, ఉప్పు పట్టణం, ఎన్-గేదీ అనేవి మొత్తం ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు. \b \p \v 63 యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను యూదా వారు వెళ్లగొట్టలేకపోయారు; నేటి వరకు యెబూసీయులు యూదా ప్రజలతో కలిసి అక్కడ నివసిస్తున్నారు. \c 16 \s1 ఎఫ్రాయిం, మనష్షేకు ఇవ్వబడిన భాగం \li1 \v 1 యోసేపు సంతతివారికి చీట్ల వల్ల వచ్చిన భూభాగం తూర్పున ఉన్న యెరికో నీటి ఊటల దగ్గర యొర్దాను నుండి మొదలై ఎడారి గుండా బేతేలు కొండసీమ లోపలి వరకు ఉంది. \v 2 అది లూజు అనబడే బేతేలు\f + \fr 16:2 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa బేతేలు నుండి లూజు వరకు\fqa*\f* వరకు వెళ్లి అతారోతులో ఉన్న అర్కీయుల భూభాగం దాటి, \v 3 దిగువ బేత్-హోరోను ప్రాంతం వరకు పడమటివైపుగా యఫ్లెతీయుల భూభాగం వరకు, మధ్యధరా సముద్రం దగ్గర ముగిసే గెజెరు వరకు దిగారు. \b \lf \v 4 అక్కడ యోసేపు వంశస్థులైన మనష్షే, ఎఫ్రాయిం వారి వారసత్వాన్ని పొందారు. \b \b \lh \v 5 ఎఫ్రాయిమీయుల వంశాల ప్రకారం వారి సరిహద్దు ఈ విధంగా: \b \li1 వారి వారసత్వపు సరిహద్దు తూర్పున అతారోత్-అద్దారు నుండి ఎగువ బేత్-హోరోను వరకు వెళ్లి, \v 6 మధ్యధరా సముద్రం వరకు కొనసాగింది. దానికి ఉత్తరాన ఉన్న మిక్మెతాతు నుండి అది తూర్పున తానత్ షిలోహు వరకు తిరిగి, తూర్పున ఉన్న యానోహ వరకు వెళ్లింది. \v 7 అది యానోహ నుండి అతారోతు, నయరా వైపుకు దిగి, యెరికోను తాకి, యొర్దాను దగ్గర అంతమయ్యింది. \v 8 తప్పూయ నుండి ఆ సరిహద్దు కానా కనుమ వరకు పడమటి వైపుగా వెళ్లి సముద్రం దగ్గర అంతమయ్యింది. ఇది ఎఫ్రాయిం గోత్రం వారికి వారి వంశాల ప్రకారం లభించిన వారసత్వము. \li1 \v 9 మనష్షే వారి వారసత్వంలో ఎఫ్రాయిమీయుల కోసం కేటాయించబడిన అన్ని పట్టణాలు, వాటి గ్రామాలు కూడా ఉన్నాయి. \b \p \v 10 గెజెరులో నివసిస్తున్న కనానీయులను వారు వెళ్లగొట్టలేదు; ఈ రోజు వరకు కనానీయులు ఎఫ్రాయిం ప్రజలమధ్య నివసిస్తూ దాసులుగా కష్టపడి పని చేస్తున్నారు. \c 17 \p \v 1 యోసేపు మొదటి సంతానంగా మనష్షే గోత్రానికి కేటాయించబడిన భాగం ఇదే. మనష్షే మొదటి కుమారుడు, గిలాదీయుల పూర్వికుడైన మాకీరుకు గిలాదు, బాషానులు ఇవ్వబడ్డాయి ఎందుకంటే మాకీరీయులు గొప్ప సైనికులు. \v 2 కాబట్టి ఈ కేటాయింపు మనష్షే వారిలో మిగిలిన ప్రజలైన అబీయెజెరు, హెలెకు, అశ్రీయేలు, షెకెము, హెఫెరు, షెమీదా వారికి ఇవ్వబడింది. వీరు తమ వంశాల ప్రకారం యోసేపు కుమారుడైన మనష్షే మగ సంతానము. \p \v 3 మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన గిలాదు కుమారుడైన హెఫెరుకు పుట్టిన సెలోఫెహాదుకు కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారి పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. \v 4 వారు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, నాయకుల దగ్గరకు వెళ్లి, “మా బంధువుల మధ్య మాకు వారసత్వం ఇవ్వాలని మోషేకు యెహోవా ఆజ్ఞాపించారు” అని చెప్పారు. కాబట్టి యెహోషువ యెహోవా ఆజ్ఞ ప్రకారం వారి తండ్రి సోదరుల మధ్య వారికి వారసత్వమిచ్చాడు. \v 5 యొర్దాను నదికి అవతల ఉన్న గిలాదు, బాషానుతో పాటు మనష్షేకు అధనంగా పది వాటాల భూమి వచ్చింది. \v 6 ఎందుకంటే మనష్షే గోత్రపు కుమారులతో పాటు వారి కుమార్తెలు కూడా వారసత్వాన్ని పొందారు. గిలాదు దేశం మిగతా మనష్షే సంతతివారికి ఇవ్వబడింది. \b \li1 \v 7 మనష్షే భూభాగం ఆషేరు నుండి షెకెముకు తూర్పున ఉన్న మిక్మెతాతు వరకు దక్షిణాన ఎన్-తప్పూయ నివాసుల వైపుకు వ్యాపించింది. \v 8 (తప్పూయ భూభాగం మనష్షేకు చెందుతుంది, కానీ మనష్షే సరిహద్దులో ఉన్న తప్పూయ ఎఫ్రాయిమీయులకు చెందినదే.) \v 9 ఆ సరిహద్దు దక్షిణాన కానా కనుమ వరకు కొనసాగింది. మనష్షే పట్టణాల మధ్య ఎఫ్రాయిముకు చెందిన పట్టణాలు ఉన్నాయి, కానీ మనష్షే సరిహద్దు కనుమకు ఉత్తరం వైపుగా మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. \v 10 దక్షిణాన ఉన్న భూమి ఎఫ్రాయిముకు, ఉత్తరాన మనష్షేకు చెందినది. మనష్షే భూభాగం మధ్యధరా సముద్రం వరకు ఉంది. ఉత్తరాన ఆషేరు, తూర్పున ఇశ్శాఖారు సరిహద్దులుగా ఉంది. \li1 \v 11 ఇశ్శాఖారు, ఆషేరులలో మనష్షేకు బేత్-షాను, ఇబ్లెయాము, దోరు, ఎన్-దోరు, తానాకు, మెగిద్దో ప్రజలు, వారి చుట్టూ ఉన్న స్థావరాలు కూడా ఉన్నాయి (జాబితాలో మూడవది నఫోతా\f + \fr 17:11 \fr*\ft అంటే \ft*\fqa దోరు\fqa*\f*). \b \p \v 12 కనానీయులు ఆ ప్రాంతంలో నివసించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు కాబట్టి మనష్షే సంతతివారు ఈ పట్టణాలను ఆక్రమించలేకపోయారు. \v 13 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బాగా బలం పుంజుకున్నప్పుడు కనాను వారితో వెట్టిచాకిరి చేయించుకున్నారు గాని, వారిని పూర్తిగా వెళ్లగొట్టలేదు. \p \v 14 యోసేపు వంశపు వారు యెహోషువతో, “మీరు మాకు ఒక్క వాటా ఒక్క భాగం మాత్రమే వారసత్వంగా ఇచ్చారేంటి? మేము చాలామందిమి, యెహోవా మమ్మల్ని విస్తారంగా దీవించారు” అన్నారు. \p \v 15 యెహోషువ, “ఒకవేళ మీరు చాలామంది ఉండి ఎఫ్రాయిం కొండ ప్రాంతం మీకు ఇరుకుగా అనిపిస్తే అడవిలోకి వెళ్లి, పెరిజ్జీయులు రెఫాయీయుల దేశంలో మీ కోసం భూమిని ఖాళీ చేసుకోండి” అని వారికి చెప్పాడు. \p \v 16 అందుకు యోసేపు సంతతివారు, “ఈ కొండసీమ మాకు సరిపోదు. మైదాన ప్రాంతంలో అంటే బేత్-షానులో దాని చుట్టూ ఉన్న స్థావరాలలో యెజ్రెయేలు లోయలో ఉంటున్న కనానీయులందరికీ ఇనుప రథాలున్నాయి” అన్నారు. \p \v 17 యెహోషువ యోసేపు గోత్రాలతో అనగా ఎఫ్రాయిం మనష్షేలతో, “మీరు చాలామంది ఉన్నారు, మీరు చాలా బలవంతులు. మీకు ఒక్క భాగమే కాదు, \v 18 అడవులతో ఉన్న ఆ కొండ మీదే. కాబట్టి దానిని నరకండి; అప్పుడు ఆ ప్రదేశం మీది అవుతుంది. కనానీయులకు ఇనుప రథాలు ఉన్నా వారు బలవంతులైనా మీరు వారిని వెళ్లగొట్టగలరు” అన్నాడు. \c 18 \s1 మిగిలిన భూభాగం విభజన \p \v 1 ఇశ్రాయేలీయుల సమాజమంతా షిలోహులో సమావేశమై అక్కడ సమావేశ గుడారాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది, \v 2 కాని ఇంకా ఏడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు వారి వారసత్వం కేటాయించబడలేదు. \p \v 3 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోడానికి వెళ్లకుండా మీరు ఎంతకాలం వేచి ఉంటారు? \v 4 ప్రతి గోత్రం నుండి ముగ్గురు వ్యక్తులను నియమించండి. ఒక్కొక్కరి వారసత్వం ప్రకారం భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తీసుకురావడానికి నేను వారిని పంపుతాను. అప్పుడు వారు నా దగ్గరకు తిరిగి వస్తారు. \v 5 మీరు భూమిని ఏడు భాగాలుగా విభజించాలి. యూదా వారు దక్షిణాన ఉన్న తన ప్రాంతంలోనూ, యోసేపు గోత్రాలు ఉత్తరాన ఉన్న తమ ప్రాంతాల్లోనూ ఉండాలి. \v 6 మీరు భూమి యొక్క ఏడు భాగాల వివరాలు వ్రాసి వాటిని నా దగ్గరకు తీసుకురండి, నేను మన దేవుడైన యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను. \v 7 అయితే లేవీయులు మీ మధ్య భాగాన్ని పొందరు, ఎందుకంటే యెహోవాకు యాజక సేవ చేయడమే వారి వారసత్వము. గాదు, రూబేను, మనష్షే అర్థగోత్రం ఇప్పటికే యొర్దాను తూర్పు వైపున వారి వారసత్వాన్ని పొందారు. యెహోవా సేవకుడైన మోషే దానిని వారికి ఇచ్చాడు.” \p \v 8 మనుష్యులు భూమిని పరిశీలించడానికి బయలుదేరేటప్పుడు యెహోషువ వారికి, “మీరు వెళ్లి భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను” అని చెప్పాడు. \v 9 ఆ మనుష్యులు అక్కడినుండి బయలుదేరి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా పట్టణాలవారీగా దాని వివరాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి, షిలోహులోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. \b \lh \v 10 యెహోవా ఎదుట షిలోహులో యెహోషువ వారి కోసం చీట్లు వేసి, ఇశ్రాయేలు ప్రజలకు వారి గోత్రాల విభజనల ప్రకారం ఆ దేశాన్ని పంచిపెట్టాడు. \s1 బెన్యామీనుకు ఇవ్వబడిన భాగం \lh \v 11 బెన్యామీను గోత్రానికి వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. వారికి కేటాయించబడిన భూభాగం యూదా, యోసేపు గోత్రాల మధ్య ఉంది. \li1 \v 12 ఉత్తరాన వారి సరిహద్దు యొర్దాను నది దగ్గర మొదలై యెరికోకు ఉత్తరంగా వెళ్లి పడమర వైపుకు కొండ సీమగుండా వెళ్లి, బేత్-ఆవెను అడవి వరకు ఉంది. \v 13 అక్కడినుండి అది లూజు అనే బేతేలుకు దక్షిణంగా సాగి క్రింది బేత్-హోరోనుకు దక్షిణంగా ఉన్న కొండ దగ్గర అతారోత్-అద్దారు వరకు వెళ్లింది. \li1 \v 14 అక్కడినుండి దక్షిణాన బేత్-హోరోనుకు ఎదురుగా ఉన్న కొండ నుండి పడమటి దిక్కున దక్షిణంగా సాగి యూదా వారి పట్టణమైన కిర్యత్-బయలు అనే కిర్యత్-యారీము దగ్గర అంతమయ్యింది. ఇది పడమటి సరిహద్దు. \li1 \v 15 దక్షిణ సరిహద్దు కిర్యత్-యారీము పొలిమేర నుండి మొదలై పడమటి వైపున నెఫ్తోవ నీళ్ల ఊట వరకు వెళ్లింది. \v 16 ఆ సరిహద్దు రెఫాయీము లోయకు ఉత్తరాన బెన్ హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ దిగువకు వెళ్లింది. ఇది హిన్నోము లోయ నుండి యెబూసీయుల పట్టణపు దక్షిణ వాలు వెంబడి ఎన్-రోగేలు వరకు కొనసాగింది. \v 17 అది ఉత్తరం వైపుకు తిరిగి, ఎన్-షెమెషుకు వెళ్లి, అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గెలీలోతు వరకు కొనసాగింది. రూబేను కుమారుడైన బోహాను రాయి దగ్గరకు వెళ్లింది. \v 18 ఇది బేత్-అరాబా యొక్క ఉత్తర వాలు వరకు అరాబా క్రింది వరకు కొనసాగింది. \v 19 అది బేత్-హొగ్లా ఉత్తర వాలుకు వెళ్లి దక్షిణాన యొర్దాను ముఖద్వారం దగ్గర మృత సముద్రపు ఉత్తర అఖాతం దగ్గరకు వచ్చింది. ఇది దక్షిణ సరిహద్దు. \li1 \v 20 తూర్పు వైపున యొర్దాను సరిహద్దుగా ఉంది. \lh ఇవి బెన్యామీను వంశాల వారసత్వానికి అన్నివైపులా ఉన్న సరిహద్దులు. \b \lh \v 21 వారి వారి వంశాల ప్రకారం బెన్యామీను గోత్రం వారి పట్టణాలివి: \li1 యెరికో, బేత్-హొగ్లా, యెమెక్-కెసీసు, \v 22 బేత్-అరాబా, సెమరాయిము, బేతేలు \v 23 ఆవీము, పారా, ఒఫ్రా \v 24 కెఫార్-అమ్మోని, ఓఫ్ని, గెబా అనేవి పన్నెండు పట్టణాలు వాటి గ్రామాలు. \li1 \v 25 గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే, \v 26 మిస్పే, కెఫీరా, మోసా, \v 27 రేకెము, ఇర్పెయేలు, తరలా, \v 28 సేలా ఎలెపు, యెబూసి పట్టణం (యెరూషలేము) గిబియా, కిర్యత్ అనేవి పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు, \lf వారి వారి వంశాల ప్రకారం ఇది బెన్యామీను గోత్రం వారికి వచ్చిన వారసత్వము. \c 19 \s1 షిమ్యోనుకు ఇవ్వబడిన భాగం \lh \v 1 రెండవ చీటి షిమ్యోను గోత్రానికి దాని వంశాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం యూదా భూభాగంలో ఉంది. \v 2 వారి వారసత్వంలో ఇవి కూడా ఉన్నాయి: \li1 బెయేర్షేబ (లేదా షేబ),\f + \fr 19:2 \fr*\ft లేదా \ft*\fq బెయేర్షేబ \fq*\fqa షేబ; \+xt 1 దిన 4:28\+xt* లో \fqa*\fq షేబ \fq*\fqa లేదు\fqa*\f* మొలాదా, \v 3 హజర్-షువలు, బాలా, ఎజెము, \v 4 ఎల్తోలదు, బేతూలు, హోర్మా, \v 5 సిక్లగు, బేత్-మర్కాబోతు, హజర్-సూసా, \v 6 బేత్-లెబయోతు, షారుహెను అనేవి మొత్తం పదమూడు పట్టణాలు, వాటి గ్రామాలు, \li1 \v 7 ఆయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, మొత్తం నాలుగు పట్టణాలు, వాటి గ్రామాలు. \v 8 ఈ పట్టణాల చుట్టూరా బాలత్-బెయేరు (దక్షిణాన ఉన్న రామా) వరకు ఉన్న గ్రామాలన్నీ. \lf ఇది షిమ్యోనీయుల గోత్రం వారి వంశాల ప్రకారం వచ్చిన వారసత్వము. \v 9 యూదా వాటా వారికి ఎక్కువగా ఉన్నందున షిమ్యోనీయుల వారసత్వం యూదా వాటా నుండి తీసుకోబడింది. కాబట్టి షిమ్యోనీయులు యూదా భూభాగంలో తమ వారసత్వాన్ని పొందారు. \s1 జెబూలూనుకు ఇవ్వబడిన భాగం \lh \v 10 మూడవ చీటి జెబూలూనుకు దాని వంశాల ప్రకారం వచ్చింది: \li1 వారి వారసత్వపు సరిహద్దు శారీదు వరకు వెళ్లింది. \v 11 అది పడమటి వైపుగా మరాలా వరకు వెళ్లి దబ్బేషేతును తాకి, యొక్నీము సమీపంలోని లోయవరకు విస్తరించింది. \v 12 ఇది శారీదు నుండి సూర్యోదయం వైపు కిస్లోత్-తాబోరు భూభాగానికి తూర్పుగా తిరిగి దాబెరతు, యాఫీయా వరకు వెళ్లింది. \v 13 తర్వాత తూర్పు వైపు గాత్-హెఫెరు, ఎత్ కాజీను వరకు కొనసాగింది; అది రిమ్మోను దగ్గరకు వచ్చి నేయా వైపు తిరిగింది. \v 14 అక్కడ సరిహద్దు ఉత్తరాన హన్నాతోను వరకు వెళ్లి ఇఫ్తా ఎల్ లోయ దగ్గర ముగిసింది. \li1 \v 15 కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదాలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి. \lf \v 16 ఈ పట్టణాలు, వాటి గ్రామాలు జెబూలూనుకు దాని వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి. \s1 ఇశ్శాఖారుకు ఇవ్వబడిన భాగం \lh \v 17 నాల్గవ చీటి వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారుకు వచ్చింది. \v 18 వారి భూభాగంలో ఇవి ఉన్నాయి: \li1 యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము \v 19 హపరాయిము, షీయోను, అనహరాతు, \v 20 రబ్బీతు, కిష్యోను, ఎబెస్ \v 21 రెమెతు, ఎన్-గన్నీము, ఎన్-హద్దా, బేత్-పస్సెసు ఉన్నాయి. \li1 \v 22 దాని సరిహద్దు తాబోరు, షహజుమా, బేత్-షెమెషులను తాకి యొర్దాను నది దగ్గర ముగిసింది. \li1 పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి. \lf \v 23 ఈ పట్టణాలు, వాటి గ్రామాలు ఇశ్శాఖారు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి. \s1 ఆషేరుకు ఇవ్వబడిన భాగం \lh \v 24 అయిదవ చీటి వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రానికి వచ్చింది. \v 25 వారి సరిహద్దులో హెల్కతు, \li1 హలి, బెతెను, అక్షఫు, \v 26 అలమ్మేలెకు, అమాదు, మిషాలు ఉన్నాయి. పడమరగా ఆ సరిహద్దు కర్మెలు షీహోర్ లిబ్నాతు వరకు ఉంది. \v 27 అది తూర్పున బేత్-దాగోను వైపు తిరిగి, జెబూలూను, ఇఫ్తా ఎల్ లోయను తాకి, ఉత్తరాన బేత్-ఎమెకు, నెయీయేలులకు వెళ్లి ఎడమవైపున కాబూల్ దాటింది. \v 28 అది మహా సీదోను వరకు అబ్దోను,\f + \fr 19:28 \fr*\ft కొ.ప్రా.ప్ర.లలో \ft*\fqa ఎబ్రోను; \+xt 21:30\+xt* లో కూడా\fqa*\f* రెహోబు, హమ్మోను, కానా వరకు వెళ్లింది. \v 29 ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, కోటగోడలు గల పట్టణమైన తూరుకు వెళ్లి, హోసా వైపు తిరిగి, అక్సీబు ప్రాంతంలోని మధ్యధరా సముద్రం దగ్గరకు వచ్చింది. \v 30 ఉమ్మా, ఆఫెకు, రెహోబు కూడా వారి ప్రాంతంలో ఉన్నాయి. \li1 మొత్తం ఇరవై రెండు పట్టణాలు, వాటి గ్రామాలు. \lf \v 31 ఈ పట్టణాలు వాటి గ్రామాలు ఆషేరు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి. \s1 నఫ్తాలికి ఇవ్వబడిన భాగం \lh \v 32 ఆరో చీటి వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి వచ్చింది. \li1 \v 33 వారి సరిహద్దు హెలెఫు జయనన్నీములోని సింధూర వృక్షం నుండి అదామి నెకెబు, జబ్నీలులను దాటి లక్కూముకు వెళ్లి యొర్దాను\f + \fr 19:33 \fr*\ft హెబ్రీలో యూదా, అంటే \ft*\fqa యొర్దాను\fqa*\f* దగ్గర ముగిసింది. \v 34 దాని సరిహద్దు పశ్చిమాన అస్నోత్-తాబోరు గుండా వెళ్లి హుక్కోకు దగ్గరకు వచ్చింది. అది దక్షిణాన జెబూలూను, పశ్చిమాన ఆషేరు, యూదా, తూర్పున యొర్దాను తాకింది. \li1 \v 35 కోటగోడలు గలవారి పట్టణాలు: జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు, \v 36 అదామా, రామా, హాసోరు, \v 37 కెదెషు, ఎద్రెయీ, ఎన్-హాసోరు, \v 38 ఇరోను, మిగ్దల్-ఏలు, హొరేము, బేత్-అనాతు, బేత్-షెమెషు, \li1 పందొమ్మిది పట్టణాలు, వారి గ్రామాలు. \lf \v 39 వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు వాటి గ్రామాలు ఇవి. \s1 దానుకు ఇవ్వబడిన భాగం \lh \v 40 ఏడవ చీటి వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి వచ్చింది. \v 41 వారి వారసత్వం సరిహద్దు \li1 జోరహు, ఎష్తాయోలు ఈర్-షెమెషు, \v 42 షయల్బీను, అయ్యాలోను, ఇత్లా, \v 43 ఎలోను, తిమ్నా, ఎక్రోను, \v 44 ఎల్తెకే, గిబ్బెతోను, బాలతు, \v 45 యెహూదు, బెనె-బెరకు, గాత్-రిమ్మోను, \v 46 మే-యర్కోను, రక్కోను, యొప్ప ముందున్న ప్రాంతం. \lf \v 47 కానీ దాను గోత్రం వారి భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బంది పడింది, కాబట్టి వారు లెషెము పట్టణంపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని, దాని ప్రజలను చంపి అక్కడ స్థిరపడ్డారు. వారు తమ పూర్వికుల పేరు మీదుగా పట్టణానికి దాను అని పేరు పెట్టారు. \lf \v 48 వారి వంశాల ప్రకారం దాను గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు, వాటి గ్రామాలు ఇవి. \s1 యెహోషువకు ఇవ్వబడిన భాగం \li1 \v 49 వారు సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని పంచి ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు వారసత్వాన్ని ఇచ్చారు. \v 50 వారు యెహోవా ఆజ్ఞను అనుసరించి యెహోషువ అడిగిన ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని తిమ్నాత్ సెరహు\f + \fr 19:50 \fr*\ft ఇంకా \ft*\fqa తిమ్నాత్ హెరెసు అని కూడా పిలువబడింది. \+xt న్యాయా 2:9\+xt*\fqa*\f* అనే ఊరు అతనికిచ్చారు. అతడా ఊరిని కట్టించి అక్కడ నివసించాడు. \b \lf \v 51 యాజకుడైన ఎలియాజరు, నూను కమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు ప్రజల గోత్రాల వంశాల నాయకులు షిలోహులో యెహోవా ఎదుట సమావేశ గుడారం ద్వారం దగ్గర చీట్లు వేసి పంచి ఇచ్చిన వారసత్వ భూములివి. ఈ విధంగా వారు భూమిని పంచిపెట్టడం ముగించారు. \c 20 \s1 ఆశ్రయ పట్టణాలు \p \v 1 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు: \v 2 “నేను మోషే ద్వారా మీకు సూచించినట్లు ఆశ్రయ పట్టణాలను నియమించమని ఇశ్రాయేలీయులకు చెప్పు, \v 3 తద్వార, ఎవరైనా ఒక వ్యక్తిని తెలియక పొరపాటున చంపితే అక్కడికి పారిపోయి ఆ హత్యకు చేసే ప్రతీకారం నుండి ఆశ్రయం పొందవచ్చు. \v 4 వారు ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోయినప్పుడు, వారు నగర ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దల ముందు తమ వాదనను తెలియజేయాలి. అప్పుడు పెద్దలు పారిపోయినవారిని తమ పట్టణంలోకి చేర్చి, వారి మధ్య నివసించడానికి ఒక స్థలాన్ని ఇవ్వాలి. \v 5 హత్యకు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి వెంబడిస్తూ వస్తే ఆ పెద్దలు వానికి పారిపోయి వచ్చిన వ్యక్తిని అప్పగించకూడదు. ఎందుకంటే పారిపోయిన వ్యక్తి తన పొరుగువారిని అనుకోకుండ చంపాడు కాని పగతో కాదు. \v 6 వారు సమాజం ముందు విచారణ జరిగే వరకు, ఆ సమయంలో సేవ చేస్తున్న ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఆ పట్టణంలోనే ఉండాలి. తర్వాత వారు తాము పారిపోయి వచ్చిన పట్టణంలోని తమ సొంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చు.” \p \v 7 కాబట్టి వారు నఫ్తాలి కొండ సీమలోని గలిలయలో ఉన్న కెదెషును, ఎఫ్రాయిం కొండ సీమలోని షెకెమును, యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) ప్రత్యేకపరిచారు. \v 8 యొర్దానుకు తూర్పున (యెరికో నుండి అవతలి వైపు) వారు రూబేను గోత్రంలో పీఠభూమిలోని అరణ్యంలో బేసెరును, గాదు గోత్రంలో గిలాదులోని రామోతును, మనష్షే గోత్రంలో బాషానులోని గోలానును నిర్ణయించారు. \v 9 ఇశ్రాయేలీయులలో ఎవరైనా లేదా వారిలో నివసించే విదేశీయులెవరైనా అనుకోకుండ ఎవరినైనా చంపితే వారు ఈ నిర్ణయించబడిన పట్టణాలకు పారిపోవచ్చు, సమాజం ముందు విచారణ జరిగే వరకు రక్తపు పగతో చంపబడరు. \c 21 \s1 లేవీయులకు ఇవ్వబడిన పట్టణాలు \p \v 1 తర్వాత లేవీయుల కుటుంబ పెద్దలు కనానులోని షిలోహులో ఉన్న యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువను ఇశ్రాయేలులోని ఇతర గోత్రాల కుటుంబాల పెద్దలను కలిసి, \v 2 వారితో కనానులోని షిలోహులో వారితో, “మీరు మా పశువులకు పచ్చికబయళ్లతో పాటు మాకు నివసించడానికి పట్టణాలు ఇవ్వమని మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించారు” అన్నారు. \b \lh \v 3 కాబట్టి, యెహోవా ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు తమ సొంత వారసత్వంలో నుండి ఈ క్రింది పట్టణాలను, పచ్చికబయళ్లను లేవీయులకు ఇచ్చారు: \b \li1 \v 4 కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు. \li1 \v 5 మిగిలిన కహాతు సంతతివారికి ఎఫ్రాయిం, దాను, మనష్షే అర్థ గోత్రాల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు ఇచ్చారు. \li1 \v 6 గెర్షోను సంతతివారికి ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్థ గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు. \li1 \v 7 మెరారి సంతతివారికి వారి వంశాల ప్రకారం, రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించారు. \b \lf \v 8 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు లేవీయులకు చీట్ల ద్వారా ఈ పట్టణాలను, వాటి పచ్చికబయళ్లను కేటాయించారు. \b \li1 \v 9 వారు యూదా, షిమ్యోను గోత్రాల నుండి క్రింద చెప్పిన పట్టణాలను కేటాయించారు. \v 10 లేవీయులైన కహాతీయుల వంశాల్లోని అహరోను సంతతివారికి ఈ క్రింది పట్టణాలు కేటాయించారు, ఎందుకంటే మొదటి చీటి వారికి పడింది: \li2 \v 11 వారు యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) దాని చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో పాటు వారికి ఇచ్చారు. (అర్బా అనాకు పితరుడు.) \v 12 అయితే వారు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలను, గ్రామాలను స్వాస్థ్యంగా ఇచ్చారు. \v 13 కాబట్టి యాజకుడైన అహరోను సంతతివారికి హెబ్రోను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), లిబ్నా, \v 14 యత్తీరు, ఎష్తెమోవా, \v 15 హోలోను, దెబీరు, \v 16 ఆయిను, యుత్తా, బేత్-షెమెషు వాటి పచ్చికబయళ్లతో పాటు, ఈ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలిచ్చారు. \li1 \v 17 బెన్యామీను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: \li2 గిబియోను, గెబా, \v 18 అనాతోతు, అల్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు. \lf \v 19 అహరోను సంతతివారైన యాజకులకు పచ్చికబయళ్లతో పాటు ఇచ్చిన పట్టణాలు మొత్తం పదమూడు. \b \lh \v 20 లేవీయులైన కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఎఫ్రాయిం గోత్రం నుండి కేటాయించిన పట్టణాలు: \li1 \v 21 ఎఫ్రాయిం కొండ సీమలో వారికి ఇచ్చినవి: \li2 షెకెము (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), గెజెరు, \v 22 కిబ్సాయిము, బేత్-హోరోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు. \li1 \v 23 దాను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: \li2 ఎల్తెకే, గిబ్బెతోను, \v 24 అయ్యాలోను, గాత్-రిమ్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు. \li1 \v 25 మనష్షే అర్థగోత్రం నుండి వారికి ఇచ్చినవి: \li2 తానాకు, గాత్-రిమ్మోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం రెండు పట్టణాలు. \lf \v 26 ఈ పది పట్టణాలు, వాటి పచ్చికబయళ్లు మిగిలిన కహాతీయుల వంశాలకు ఇచ్చారు. \b \lh \v 27 గెర్షోనీయుల లేవీ గోత్ర వంశాలకు ఇచ్చినవి: \li1 మనష్షే అర్థగోత్రం నుండి: \li2 బాషానులోని గోలాను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), బే యెష్తెరా, వాటి పచ్చికబయళ్లతో పాటు రెండు పట్టణాలు; \li1 \v 28 ఇశ్శాఖారు గోత్రం నుండి: \li2 కిష్యోను, దాబెరతు, \v 29 యర్మూతు, ఎన్-గన్నీము దాని పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు; \li1 \v 30 ఆషేరు గోత్రం నుండి: \li2 మిషాలు, అబ్దోను, \v 31 హెల్కతు రెహోబు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు; \li1 \v 32 నఫ్తాలి గోత్రం నుండి: \li2 గలిలయలోని కెదెషు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), హమ్మోత్-దోరు, కర్తాను, వారి పచ్చికబయళ్లతో పాటు మూడు పట్టణాలు. \lf \v 33 గెర్షోనీయుల వంశాల పట్టణాల సంఖ్య, వాటి పచ్చికబయళ్లతో కలిపి మొత్తం పదమూడు. \b \lh \v 34 మెరారీయ వంశాలకు (లేవీయులలో మిగిలిన వారు) ఇచ్చారు: \li1 జెబూలూను గోత్రం నుండి: \li2 యొక్నీము, కర్తా, \v 35 దిమ్న, నహలాలు వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు; \li1 \v 36 రూబేను గోత్రం నుండి: \li2 బేసెరు, యహజు, \v 37 కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు; \li1 \v 38 గాదు గోత్రం నుండి: \li2 గిలాదులో ఉన్న రామోతు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), మహనయీము, \v 39 హెష్బోను, యాజెరు, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు. \lf \v 40 లేవీయులలో మిగిలిన వారైన మెరారి వంశాలకు కేటాయించిన పట్టణాల సంఖ్య మొత్తం పన్నెండు. \b \lf \v 41 ఇశ్రాయేలీయుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని లేవీయుల పట్టణాలు వాటి పచ్చికబయళ్లతో కలిపి మొత్తం నలభై ఎనిమిది. \v 42 ఈ పట్టణాలన్నిటి చుట్టూ పచ్చికబయళ్లు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికి అలాగే ఉన్నాయి. \b \p \v 43 కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయులకు వారి పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశమంతా ఇచ్చారు, వారు దానిని స్వాధీనం చేసుకుని అక్కడ స్థిరపడ్డారు. \v 44 యెహోవా వారి పూర్వికులతో ప్రమాణం చేసినట్లే వారికి అన్నివైపులా విశ్రాంతిని ఇచ్చారు. వారి శత్రువులలో ఒక్కరు కూడా ఇశ్రాయేలీయులకు ఎదురు నిలబడలేకపోయారు; యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించారు. \v 45 ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మంచి వాగ్దానాలలో నెరవేరకుండా ఒక్కటి కూడా లేదు; ప్రతి ఒక్కటి నెరవేరింది. \c 22 \s1 ఇంటికి తిరిగివచ్చిన తూర్పు గోత్రాలు \p \v 1 అప్పుడు యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రం వారిని పిలిపించి, \v 2 వారితో, “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు, నేనిచ్చిన ప్రతి ఆజ్ఞకు లోబడ్డారు. \v 3 చాలా కాలం క్రితం నుండి నేటి వరకు మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. \v 4 ఇప్పుడు మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లు వారికి విశ్రాంతిని ఇచ్చారు కాబట్టి, యొర్దాను అవతలి వైపున యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన దేశంలోని మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి. \v 5 అయితే మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనను గట్టిగా అంటిపెట్టుకుని ఆయనను సేవించమని యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని పాటించేలా జాగ్రత్త వహించాలి” అని చెప్పాడు. \p \v 6 అప్పుడు యెహోషువ వారిని ఆశీర్వదించి పంపివేశాడు. వారు తమ ఇళ్ళకు వెళ్లిపోయారు. \v 7 (మోషే మనష్షే అర్థగోత్రానికి బాషానులో భూమిని ఇచ్చాడు, యెహోషువ మిగిలిన అర్థగోత్రానికి వారి తోటి ఇశ్రాయేలీయులతో పాటు యొర్దానుకు పశ్చిమాన భూమిని ఇచ్చాడు.) యెహోషువ వారిని ఇంటికి పంపినప్పుడు, అతడు వారిని ఆశీర్వదిస్తూ, \v 8 వారితో, “మీ గొప్ప సంపదతో, పెద్ద పశువుల మందలతో, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, విస్తారమైన దుస్తులతో మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి. మీ శత్రువుల నుండి దోచుకున్న సొమ్మును మీ తోటి ఇశ్రాయేలీయులతో పంచుకోండి” అని చెప్పాడు. \p \v 9 కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలీయులను కనానులోని షిలోహులో విడిచిపెట్టి, మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తమ సొంత దేశమైన గిలాదుకు తిరిగి వచ్చారు. \p \v 10 వారు కనాను దేశంలోని యొర్దానుకు సమీపంలో ఉన్న గెలీలోతుకు వచ్చినప్పుడు, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు యొర్దాను ప్రక్కన ఒక పెద్ద బలిపీఠాన్ని కట్టారు. \v 11 రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రపు వారు కనాను సరిహద్దులో యొర్దాను దగ్గర గెలీలోతు దగ్గర బలిపీఠాన్ని కట్టారని ఇశ్రాయేలీయులు విన్నప్పుడు, \v 12 ఇశ్రాయేలీయులందరు వారితో యుద్ధం చేయడానికి షిలోహులో సమావేశమయ్యారు. \p \v 13 కాబట్టి ఇశ్రాయేలీయులు యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును గిలాదు దేశంలో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రాల వారి దగ్గరకు పంపారు. \v 14 ఇశ్రాయేలీయుల గోత్రాల్లో ప్రతీదాని నుండి ఒకరు చొప్పున, ఇశ్రాయేలీయుల వంశాలలో తమ పితరుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న పదిమందిని అతనితో పాటు పంపారు. \p \v 15 గిలాదులో ఉన్న రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారి దగ్గరకు వెళ్లి వారితో ఇలా అన్నారు: \v 16 “యెహోవా సమాజమంతా ఇలా అన్నారు: ‘మీరు ఇశ్రాయేలు దేవుని పట్ల నమ్మకద్రోహం ఎలా చేస్తారు? మీరు యెహోవాను విడిచిపెట్టి ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఇప్పుడు బలిపీఠాన్ని ఎలా కట్టుకోగలరు? \v 17 పెయోరులో చేసిన పాపం మనకు సరిపోదా? యెహోవా సమాజం మీదికి తెగులు వచ్చినా, ఈ రోజు వరకు ఆ పాపం నుండి మనం శుద్ధి చేసుకోలేదు! \v 18 ఇప్పుడు మీరు యెహోవా నుండి దూరంగా వెళ్తున్నారా? \p “ ‘మీరు ఈ రోజు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, రేపు ఆయన ఇశ్రాయేలు సమాజమంతటి మీద కోప్పడతారు. \v 19 మీరు స్వాధీనం చేసుకున్న భూమి అపవిత్రంగా ఉంటే, యెహోవా సమావేశ గుడారం ఉన్న యెహోవా దేశానికి వచ్చి, ఆ దేశాన్ని మాతో పంచుకోండి. కాని మన దేవుడైన యెహోవా బలిపీఠం కాకుండా మీ కోసం ఒక బలిపీఠాన్ని కట్టుకుని యెహోవా మీద గాని మామీద గాని తిరుగుబాటు చేయవద్దు. \v 20 ప్రతిష్ఠించబడిన వాటి విషయంలో జెరహు కుమారుడైన ఆకాను నమ్మకద్రోహం చేసినప్పుడు, ఇశ్రాయేలు సమాజమంతటిపై ఉగ్రత రాలేదా? అతని పాపానికి అతడు ఒక్కడే చనిపోలేదు.’ ” \p \v 21 అప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలు వంశ పెద్దలకు ఇలా జవాబిచ్చారు: \v 22 “శక్తిమంతుడైన యెహోవా దేవుడు! శక్తిమంతుడైన దేవుడు యెహోవా! అది ఆయనకు తెలుసు! ఇశ్రాయేలుకు తెలియనివ్వండి! ఇది యెహోవా పట్ల ద్రోహంతో గాని తిరుగుబాటుతో గాని చేసివుంటే ఈ రోజు మమ్మల్ని రక్షించవద్దు. \v 23 యెహోవాను విడిచిపెట్టి దహనబలులు భోజనార్పణలు సమాధానబలులు అర్పించడానికి మేము సొంత బలిపీఠాన్ని కట్టుకున్నట్లయితే, యెహోవాయే స్వయంగా మమ్మల్ని లెక్క అడుగుతారు. \p \v 24 “నిజమేమిటంటే, భవిష్యత్తులో మీ సంతతివారు మా సంతతివారితో, ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించడానికి మీకు ఏం హక్కు ఉంది? \v 25 రూబేనీయులారా, గాదీయులారా, యెహోవా మాకు మీకు మధ్య యొర్దానును సరిహద్దుగా చేశారు! యెహోవాలో మీకు వాటా లేదు’ అని అంటారేమో! మీ సంతతివారు మా సంతతివారిని యెహోవాకు భయపడకుండా చేస్తారేమో! \p \v 26 “అందుకే మేము, ‘మనం బలిపీఠం కట్టడానికి సిద్ధపడదాం రండి, అయితే అది దహనబలులు బలులు అర్పించడం కోసం కాదు’ అని అనుకున్నాము. \v 27 మనం దహనబలులు బలులు సమాధాన బలులతో యెహోవాను ఆయన పరిశుద్ధాలయంలో ఆరాధించాలని చెప్పడానికి అది మాకు మీకు తర్వాతి తరాల వారికి మధ్య సాక్షిగా ఉండాలి. అప్పుడు భవిష్యత్తులో మీ సంతతివారు మా సంతతివారితో, ‘మీకు యెహోవాలో వాటా లేదు’ అని అనలేరు. \p \v 28 “మేము, ‘వారు ఎప్పుడైనా మాతో గాని మా వారసులతో గాని ఒకవేళ అంటే, మా పూర్వికులు కట్టిన యెహోవా బలిపీఠం ప్రతిరూపాన్ని చూడండి; దహనబలులు బలులు అర్పించడం కోసం కాదు; అది మీకు మాకు మధ్య సాక్షిగా ఉండాలని కట్టారు’ అని చెప్పాలని అనుకున్నాము. \p \v 29 “మన దేవుడైన యెహోవా సమావేశ గుడారం ఎదుట దహనబలులు, భోజనార్పణలు, అర్పణల కొరకైన బలిపీఠం కాక మరొక బలిపీఠం కట్టి, నేడు యెహోవాను విడిచిపెట్టి ఆయన మీద తిరుగుబాటు చేయడం మాకు దూరమవును గాక.” \p \v 30 యాజకుడైన ఫీనెహాసు, సమాజ నాయకులు అనగా ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు రూబేను, గాదు, మనష్షే చెప్పింది విని సంతోషించారు. \v 31 యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు రూబేను, గాదు, మనష్షేలతో ఇలా అన్నాడు, “ఈ విషయంలో మీరు యెహోవాకు నమ్మకద్రోహం చేయలేదు కాబట్టి యెహోవా మనతో ఉన్నాడని ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మీరు ఇశ్రాయేలీయులను యెహోవా చేతిలో నుండి రక్షించారు.” \p \v 32 అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, నాయకులు గిలాదులోని రూబేనీయులు, గాదీయులను కలిసి కనానుకు తిరిగివచ్చి ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని చెప్పారు. \v 33 ఇశ్రాయేలీయులు ఆ వార్త విని సంతోషించి దేవున్ని స్తుతించారు. రూబేనీయులు, గాదీయులు నివసించిన దేశాన్ని నాశనం చేయడానికి వారిపై యుద్ధానికి వెళ్లడం గురించి వారు ఇక మాట్లాడలేదు. \p \v 34 రూబేనీయులు, గాదీయులు యెహోవాయే దేవుడు అనడానికి ఈ బలిపీఠమే సాక్ష్యం అని చెప్పి దానికి ఏద్ అని పేరు పెట్టారు. \c 23 \s1 నాయకులకు యెహోషువ వీడ్కోలు \p \v 1 యెహోవా ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి వారికి విశ్రాంతిని ఇచ్చారు. అప్పటికి యెహోషువ చాలా వృద్ధుడయ్యాడు. \v 2 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని అనగా వారి పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, అధికారులను పిలిచి వారితో ఇలా అన్నాడు: “నేను చాలా వృద్ధుడనయ్యాను. \v 3 మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ దేశాలన్నిటికి చేసినదంతా మీరే చూశారు. మీ కోసం పోరాడినది మీ దేవుడైన యెహోవాయే. \v 4 నేను జయించిన దేశాలతో పాటు పశ్చిమాన యొర్దాను మధ్యధరా సముద్రం మధ్య మిగిలి ఉన్న దేశాల భూమిని మీ గోత్రాలకు వారసత్వంగా ఎలా కేటాయించానో గుర్తుచేసుకోండి. \v 5 మీ కోసం మీ దేవుడైన యెహోవా వారిని బయటకు వెళ్లగొడతారు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్టు ఆయన మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టినప్పుడు మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకుంటారు. \p \v 6 “దృఢంగా ఉండండి; మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా జాగ్రత్తగా పాటించండి. \v 7 మీ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దు; వారి దేవతల పేర్లు ఎత్తవద్దు; వాటిపై ప్రమాణం చేయవద్దు. మీరు వాటిని సేవించవద్దు లేదా వాటికి నమస్కరించవద్దు. \v 8 అయితే మీరు ఇప్పటివరకు ఉన్నట్లే మీ దేవుడైన యెహోవాను గట్టిగా పట్టుకుని ఉండాలి. \p \v 9 “యెహోవా మీ ఎదుట నుండి శక్తివంతమైన దేశాలను వెళ్లగొట్టారు; ఈ రోజు వరకు ఎవరూ మీ ముందు నిలబడలేకపోతున్నారు. \v 10 మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లుగా మీ కోసం పోరాడుతున్నారు కాబట్టి మీలో ఒకడు వెయ్యిమందిని ఓడించాడు. \v 11 కాబట్టి మీ దేవుడైన యెహోవాను ప్రేమించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి. \p \v 12 “అయితే మీరు వెనక్కి తిరిగి, మీ మధ్య మిగిలి ఉన్న ఈ దేశాల్లో జీవించి ఉన్నవారితో పొత్తు పెట్టుకుని, మీరు వారిని పెళ్ళి చేసుకుని, వారితో సహవాసం చేస్తే, \v 13 మీ దేవుడైన యెహోవా ఇకపై ఈ దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టడని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికి బదులుగా, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగా, ఉచ్చులుగా, మీ వీపుపై కొరడాలుగా, మీ కళ్లల్లో ముళ్ళుగా మారుతారు. \p \v 14 “ఇప్పుడు మనుష్యులందరు వెళ్లే మార్గంలోనే నేను వెళ్లబోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి వాగ్దానాలలో ఒక్కటి కూడా విఫలం కాలేదని మీ హృదయాలకు మనస్సులకు తెలుసు. ప్రతి వాగ్దానం నెరవేరింది; ఒక్కటి కూడా విఫలం కాలేదు. \v 15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్ని మీకు నెరవేరినట్లే, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన చెప్పిన కీడునంతా మీ మీదికి రప్పిస్తారు. \v 16 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన నిబంధనను పాటించకుండా, ఇతర దేవుళ్ళను సేవించి వాటికి నమస్కరిస్తే, యెహోవా కోపం మీపై రగులుకుంటుంది. ఆయన మీకు ఇచ్చిన మంచి దేశంలో నుండి మీరు త్వరగా నశించిపోతారు.” \c 24 \s1 షెకెములో ఒడంబడిక పునరుద్ధరణ \p \v 1 తర్వాత యెహోషువ ఇశ్రాయేలు గోత్రాలన్నిటిని షెకెములో సమావేశపరిచాడు. అతడు ఇశ్రాయేలు పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, అధికారులను పిలిపించాడు, వారు వచ్చి దేవుని ముందు నిలబడ్డారు. \p \v 2 యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘చాలా కాలం క్రితం అబ్రాహాము, నాహోరుల తండ్రియైన తెరహుతో సహా మీ పూర్వికులు యూఫ్రటీసు నది అవతల నివసించి ఇతర దేవుళ్ళను ఆరాధించారు. \v 3 అయితే నేను మీ తండ్రి అబ్రాహామును యూఫ్రటీసు అవతల ఉన్న దేశం నుండి తీసుకువచ్చి కనానుకు నడిపించి, అతనికి చాలామంది సంతానాన్ని ఇచ్చాను. అయితే నేను అతనికి ఇస్సాకును ఇచ్చాను, \v 4 ఇస్సాకుకు యాకోబును, ఏశావును ఇచ్చాను. నేను శేయీరు కొండ ప్రాంతాన్ని ఏశావుకు స్వాధీనపరచుకోడానికి ఇచ్చాను, అయితే యాకోబు, అతని కుటుంబం ఈజిప్టుకు వెళ్లిపోయారు. \p \v 5 “ ‘నేను మోషే అహరోనులను పంపి, అక్కడ నేను చేసిన కార్యాలతో ఈజిప్టువారిని బాధపెట్టి, మిమ్మల్ని బయటకు రప్పించాను. \v 6 నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి రప్పించినప్పుడు మీరు సముద్రం దగ్గరకు వచ్చారు. ఈజిప్టువారు రథాలతో, గుర్రాలతో\f + \fr 24:6 \fr*\ft లేదా \ft*\fqa రథసారధులతో\fqa*\f* ఎర్ర సముద్రం వరకు వారిని వెంటాడారు. \v 7 అయితే వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టగా ఆయన మీకు, ఈజిప్టువారికి మధ్య చీకటిని కలిగించి, సముద్రాన్ని వారి మీదికి తెచ్చి వారిని కప్పివేశారు. నేను ఈజిప్టువారికి ఏమి చేశానో మీరు మీ కళ్లతో చూశారు. అప్పుడు మీరు చాలా కాలం అరణ్యంలో నివసించారు. \p \v 8 “ ‘యొర్దానుకు తూర్పు వైపున ఉండే అమోరీయుల దేశానికి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడు వారు మీతో యుద్ధం చేశారు గాని, నేను వారిని మీ చేతికప్పగించాను. నేను వారిని మీ ముందు ఉండకుండా నాశనం చేయగా మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. \v 9 మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలుతో యుద్ధానికి సిద్ధపడి మిమ్మల్ని శపించమని బెయోరు కుమారుడైన బిలామును పిలిపించాడు. \v 10 అయితే నేను బిలాము మాట వినలేదు కాబట్టి అతడు మిమ్మల్ని పదే పదే ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించాను. \p \v 11 “ ‘తర్వాత మీరు యొర్దాను దాటి యెరికోకు వచ్చారు. యెరికోకు యజమానులైన అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులతో కలిసి యెరికో ప్రజలు కూడా మీతో పోరాడారు, కాని నేను వారిని మీ చేతికి అప్పగించాను. \v 12 నేను కందిరీగలను మీకు ముందుగా పంపాను. అవే ఇద్దరు అమోరీయుల రాజులను మీ ముందు నుండి తరిమివేశాయి. అంతేకాని మీ ఖడ్గం కాదు మీ విల్లు కాదు. \v 13 కాబట్టి మీరు కష్టపడని దేశాన్ని, మీరు కట్టని పట్టణాలను నేను మీకు ఇచ్చాను. మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్షతోటలు, ఒలీవతోటల నుండి పండ్లు తింటున్నారు.’ \p \v 14 “ఇప్పుడు యెహోవాకు భయపడి పూర్తి నమ్మకత్వంతో ఆయనను సేవించండి. యూఫ్రటీసు నది అవతల, ఈజిప్టులో మీ పూర్వికులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను సేవించండి. \v 15 అయితే యెహోవాను సేవించడం మీకు అయిష్టంగా అనిపిస్తే మీరు ఎవరిని సేవించాలో, యూఫ్రటీసు నది అవతల మీ పూర్వికులు సేవించిన దేవుళ్ళను సేవించాలో లేదా మీరు నివసిస్తున్న అమోరీయుల దేశంలోని దేవుళ్ళను సేవించాలో ఈ రోజు ఎంచుకోండి. అయితే నేనూ, నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము.” \p \v 16 అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించడం మాకు దూరమవును గాక! \v 17 మమ్మల్ని, మా తల్లిదండ్రులను దాస్య దేశమైన ఈజిప్టు నుండి రప్పించి, మన కళ్లముందు ఆ గొప్ప సూచకక్రియలను చేసింది మన దేవుడైన యెహోవాయే. మా మొత్తం ప్రయాణంలో, మేము ప్రయాణించిన అన్ని దేశాల మధ్య ఆయన మమ్మల్ని రక్షించాడు. \v 18 ఆ దేశంలో నివసించే అమోరీయులతో సహా ప్రజలందరినీ యెహోవా మన ముందు వెళ్లగొట్టారు. కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఎందుకంటే ఆయనే మన దేవుడు.” \p \v 19 యెహోషువ ప్రజలతో, “మీరు యెహోవాను సేవించలేరు. ఆయన పరిశుద్ధ దేవుడు; ఆయన రోషం గల దేవుడు. మీ తిరుగుబాటును, మీ పాపాలను ఆయన క్షమించడు. \v 20 ఒకవేళ మీరు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను సేవిస్తే, ఆయన మీకు మేలు చేసినట్టే మీ మీదికి కీడు తెచ్చి మిమ్మల్ని నాశనం చేస్తారు.” \p \v 21 అయితే ప్రజలు యెహోషువతో, “లేదు! మేము యెహోవానే సేవిస్తాం” అన్నారు. \p \v 22 అప్పుడు యెహోషువ, “మీరు యెహోవాను సేవించడానికి ఎంచుకున్నందుకు మీకు మీరే సాక్షులు” అని అన్నాడు. \p అందుకు వారు, “అవును, మేము సాక్షులం” అని చెప్పారు. \p \v 23 “అలా అయితే, ఇప్పుడు మీ మధ్యనున్న ఇతర దేవుళ్ళను పారవేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మీ హృదయాలను అప్పగించుకోండి” అని యెహోషువ చెప్పాడు. \p \v 24 ప్రజలు యెహోషువతో, “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయనకే లోబడతాం” అన్నారు. \p \v 25 ఆ రోజున యెహోషువ ప్రజల కోసం ఒక ఒడంబడిక చేసి షెకెములో వారి కోసం శాసనాలను, చట్టాలను నియమించాడు. \v 26 యెహోషువ ఈ విషయాలను దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో నమోదు చేసి ఒక పెద్ద రాయిని తీసుకుని దానిని యెహోవా పవిత్ర స్థలం దగ్గర సింధూర వృక్షం క్రింద ప్రతిష్ఠించాడు. \p \v 27 యెహోషువ ప్రజలందరితో, “చూడండి! ఈ రాయి మనమీద సాక్షిగా ఉంటుంది. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ అది విన్నది. మీరు మీ దేవుని విడిచిపెడితే అది మీమీద సాక్ష్యంగా ఉంటుంది” అన్నాడు. \p \v 28 ఆ తర్వాత యెహోషువ ప్రజలను ఎవరి వారసత్వానికి వారిని పంపివేశాడు. \s1 వాగ్దాన భూమిలో పాతిపెట్టబడుట \p \v 29 ఈ సంఘటనలు జరిగిన తర్వాత, నూను కుమారుడు, యెహోవా సేవకుడునైన యెహోషువ నూట పదేళ్ల వయస్సులో చనిపోయాడు. \v 30 ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోని గాయషు పర్వతానికి ఉత్తరాన ఉన్న తిమ్నాత్ సెరహులో అతనికి వారసత్వంగా వచ్చిన దేశంలో వారు అతన్ని పాతిపెట్టారు. \p \v 31 యెహోషువ జీవించినంత కాలం, అతనికంటే ఎక్కువకాలం జీవించి యెహోవా ఇశ్రాయేలులో చేసిన ప్రతి కార్యాన్ని అనుభవించిన పెద్దలు ఉన్నంతకాలం ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు. \p \v 32 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. యాకోబు దానిని షెకెము తండ్రియైన హమోరు కుమారుల నుండి వంద వెండి నాణేలకు\f + \fr 24:32 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కెసిటా; అనేది తెలియని బరువు, విలువ కలిగిన డబ్బు యొక్క తూకం\fqa*\f* కొన్నాడు. ఇది యోసేపు వారసుల వారసత్వంగా మారింది. \p \v 33 అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయిం కొండసీమల్లో అతని కుమారుడైన ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.