\id JOB - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h యోబు \toc1 యోబు గ్రంథం \toc2 యోబు \toc3 యోబు \mt1 యోబు \mt2 గ్రంథం \c 1 \s1 ముందుమాట \p \v 1 ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు; దేవుడంటే భయం కలిగి చెడుకు దూరంగా ఉండేవాడు. \v 2 అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, \v 3 అతనికి ఏడువేల గొర్రెలు, మూడువేల ఒంటెలు, అయిదువందల జతల ఎద్దులు, అయిదువందల ఆడగాడిదలు ఉన్నాయి, అతనికి ఎందరో సేవకులు ఉన్నారు. తూర్పున ఉన్నవారందరిలో యోబు చాలా గొప్పవాడు. \p \v 4 అతని కుమారులు తమ ఇళ్ళలో ప్రత్యేక సందర్భాలలో విందులు చేసుకునేవారు తమతో కలిసి తిని త్రాగడానికి తమ ముగ్గురు అక్కచెల్లెళ్లను కూడా పిలిచేవారు. \v 5 విందులు ముగిసిన వెంటనే యోబు, “నా పిల్లలు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని శపించారేమో” అని అనుకుని వారందరిని పిలిపించి పవిత్రపరచడానికి ఏర్పాట్లు చేసేవాడు. తెల్లవారుజామునే తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం దహనబలి అర్పించేవాడు. యోబు నిత్యం అలా చేస్తూ ఉండేవాడు. \p \v 6 ఒక రోజు దేవదూతలు\f + \fr 1:6 \fr*\ft హెబ్రీలో \ft*\fqa దేవుని కుమారులు\fqa*\f* యెహోవా సన్నిధిలో సమకూడారు, సాతాను\f + \fr 1:6 \fr*\ft హెబ్రీలో \ft*\fq సాతాను \fq*\ft అంటే \ft*\fqa విరోధి.\fqa*\f* కూడా వారితో కలిసి వచ్చాడు. \v 7 యెహోవా, “నీవెక్కడ నుండి వస్తున్నావు?” అని సాతానును అడిగారు. \p సాతాను, “భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా తిరిగి వస్తున్నాను” అని జవాబిచ్చాడు. \p \v 8 అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమిమీద లేడు; అతడు నిందలేనివాడు, యథార్థవంతుడు, దేవుని భయం కలిగి చెడుకు దూరంగా ఉంటాడు” అన్నారు. \p \v 9 సాతాను, “యోబు ఏమి లేకుండానే దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడా? \v 10 అతని చుట్టూ అతని కుటుంబం చుట్టూ, అతడు కలిగి ఉన్న దానంతటి చుట్టూ మీరు కంచె వేయలేదా? అతని చేతి పనులను మీరు దీవించడం వలన అతని పశువులు, మందలు దేశమంతా విస్తరించాయి. \v 11 అయితే ఇప్పుడు చేయి చాపి అతని సర్వస్వాన్ని మొత్తి చూడండి, తప్పకుండా మిమ్మల్ని మీ ముఖంపై శపిస్తాడు” అని జవాబిచ్చాడు. \p \v 12 అందుకు యెహోవా, “మంచిది, అతనికున్నదంతటి మీద నీకు అనుమతి ఉంది. అతనికి మాత్రం హాని చేయకు” అని అన్నారు. \p అప్పుడు సాతాను యెహోవా సన్నిధిలో నుండి వెళ్లిపోయాడు. \p \v 13 ఒక రోజు యోబు పెద్ద కుమారుడి ఇంట్లో అతని కుమారులు కుమార్తెలు కలిసి భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతూ ఉండగా, \v 14 ఒక దూత యోబు దగ్గరకు వచ్చి, “ఎద్దులు పొలం దున్నుతుండగా గాడిదలు వాటికి దగ్గరలోనే మేస్తుండగా, \v 15 షెబాయీయులు దాడిచేసి పశువులన్నిటిని పట్టుకుపోయారు. ఖడ్గంతో సేవకులను చంపేశారు; ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు. \p \v 16 అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను సేవకులను కాల్చివేసింది. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు. \p \v 17 అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “కల్దీయులు మూడు గుంపులుగా వచ్చి మీ ఒంటెలను దోచుకుపోయారు. ఖడ్గంతో సేవకులను చంపేశారు. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు. \p \v 18 అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “మీ కుమారులు కుమార్తెలు కలిసి మీ పెద్ద కుమారుని ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతుండగా, \v 19 అరణ్యమార్గం నుండి పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగానే అది వారి మీద కూలి వారంతా చనిపోయారు. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు. \p \v 20 అప్పుడు యోబు పైకి లేచి తన పైవస్త్రాన్ని చింపుకొని గుండు చేసుకుని అప్పుడు నేలమీద సాష్టాంగపడి ఆరాధిస్తూ, \v 21 ఇలా అన్నాడు: \q1 “నేను తల్లి గర్భంలోనుండి దిగంబరిగానే వచ్చాను, \q2 దిగంబరిగానే వెళ్తాను. \q1 యెహోవాయే ఇచ్చారు యెహోవాయే తీసుకున్నారు; \q2 యెహోవా నామం స్తుతింపబడును గాక.” \p \v 22 జరిగిన ఈ సంఘటనలలో ఏ విషయంలోను యోబు పాపం చేయలేదు, దేవున్ని నిందించలేదు. \b \c 2 \p \v 1 దేవదూతలు\f + \fr 2:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa దేవుని కుమారులు\fqa*\f* యెహోవా సమక్షంలో నిలబడవలసిన రోజున, యెహోవా ఎదుట నిలబడడానికి వారితో పాటు సాతాను కూడా వచ్చాడు. \v 2 యెహోవా, “ఎక్కడ నుండి వస్తున్నావు?” అని సాతానును అడిగాడు. \p “భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా తిరిగి వస్తున్నాను” అని సాతాను చెప్పాడు. \p \v 3 అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమి మీద లేడు; అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు, దేవుడంటే భయం కలిగి, చెడుకు దూరంగా ఉండేవాడు. ఏ కారణం లేకుండా నీవు అతన్ని నాశనం చేయడానికి నన్ను ఒప్పించినా అతడు తన యథార్థతను విడువక స్థిరంగా ఉన్నాడు” అని అన్నారు. \p \v 4 అప్పుడు సాతాను, “తన చర్మం కాపాడుకోడానికి చర్మాన్ని ఇస్తాడు! మనిషి తన ప్రాణం కోసం తనకున్నదంతా ఇచ్చేస్తాడు. \v 5 అయితే ఇప్పుడు మీ చేయి చాపి అతని శరీరాన్ని ఎముకలను కొట్టి చూడండి, అతడు ఖచ్చితంగా మీ ముఖం మీద మిమ్మల్ని శపిస్తాడు” అని జవాబిచ్చాడు. \p \v 6 యెహోవా, “మంచిది, ఇదిగో యోబు నీ చేతిలో ఉన్నాడు కాని అతని ప్రాణం మాత్రం తీయకూడదు” అని సాతానుతో అన్నారు. \p \v 7 కాబట్టి సాతాను యెహోవా సమక్షంలో నుండి వెళ్లి, అరికాలు నుండి నడినెత్తి వరకు బాధకరమైన కురుపులతో యోబును బాధించాడు. \v 8 అప్పుడు అతడు ఒళ్ళంతా చిల్లపెంకుతో గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు. \p \v 9 అతని భార్య వచ్చి, “నీవు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుని శపించి చనిపోవచ్చు కదా!” అని అన్నది. \p \v 10 అందుకతడు, “నీవు ఒక మూర్ఖురాలిగా మాట్లాడుతున్నావు. దేవుని దగ్గర నుండి మేలును మాత్రమే అంగీకరించాలా, కీడును అంగీకరించకూడదా?” అని సమాధానం ఇచ్చాడు. \p ఈ సంగతుల్లో ఏ విషయంలోను మాటల ద్వారా యోబు పాపం చేయలేదు. \b \p \v 11 తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి వచ్చిన కష్టాలన్నిటి గురించి విని తమ స్నేహితుడిని కలిసి సానుభూతి చూపించి ఆదరించడానికి వెళ్లాలని వారు నిర్ణయించుకొని, తమ ఇళ్ళ నుండి బయలుదేరి వచ్చారు. \v 12 వారు దూరం నుండి చూసినప్పుడు యోబును సరిగా గుర్తుపట్టలేకపోయారు; దానితో వారు బట్టలు చింపుకొని తమ తలలపై దుమ్ము వేసుకుంటూ గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు. \v 13 వారు ఏడు రోజులు రాత్రింబగళ్ళు అతనితో పాటు నేలమీద కూర్చుండిపోయారు. అతడు పడుతున్న తీవ్రమైన బాధను చూసి అతనితో ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. \c 3 \s1 యోబు మాటలు \p \v 1 ఆ తర్వాత, యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన రోజును శపించాడు. \v 2 యోబు ఇలా అన్నాడు: \q1 \v 3 “నేను పుట్టిన రోజు, \q2 ‘మగ శిశువు పుట్టాడని!’ చెప్పిన ఆ రాత్రి లేకపోవును గాక. \q1 \v 4 ఆ రోజు చీకటి అగును గాక; \q2 పైనున్న దేవుడు దాన్ని లెక్కచేయకుండును గాక; \q2 దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. \q1 \v 5 చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరకు తీసుకొనును గాక; \q2 మేఘం దాన్ని కమ్మును గాక; \q2 పగటిని కమ్మే అంధకారం దాన్ని భయపెట్టును గాక. \q1 \v 6 కటిక చీకటి ఆ రాత్రిని పట్టుకొనును గాక; \q2 సంవత్సరపు రోజుల్లో ఒకరోజుగా అది లెక్కించబడకపోవును గాక, \q2 ఏ నెలలోను అది చేర్చబడకపోవును గాక. \q1 \v 7 ఆ రాత్రి గొడ్రాలిగా ఉండును గాక; \q2 దానిలో సంతోష ధ్వని వినిపించకపోవును గాక. \q1 \v 8 రోజులను శపించేవారు, లెవియాథన్\f + \fr 3:8 \fr*\fq లెవియాథన్ \fq*\ft ఎలాంటి జంతువో అనేది చర్చించబడే విషయము. ఇది భూమిలో ఉన్న జీవియై ఉండవచ్చు ప్రాచీన సాహిత్యంలో ఒక భయంకరమైన ఊహాత్మక \ft*\fqa సముద్రపు రాక్షసి \fqa*\ft అని చెప్పబడింది.\ft*\f* రెచ్చగొట్టే అనుభవం గలవారు \q2 ఆ రోజును శపించుదురు గాక. \q1 \v 9 దాని అరుణోదయ నక్షత్రాలు చీకటిమయం అగును గాక; \q2 వెలుగు కోసం అది ఎదురుచూడడం వృధా అవ్వాలి, \q2 ఉదయ కిరణాలు దానికి కనపడకూడదు. \q1 \v 10 ఎందుకంటే అది నా కళ్ళ నుండి బాధను దాచిపెట్టడానికి \q2 నా తల్లి గర్భద్వారాలను మూయలేదు. \b \q1 \v 11 “పుట్టగానే నేనెందుకు చావలేదు? \q2 గర్భం నుండి రాగానే నేనెందుకు మరణించలేదు? \q1 \v 12 నన్నెందుకు మోకాళ్లమీద పడుకోబెట్టుకున్నారు \q2 నేనెందుకు తల్లిపాలు త్రాగాను? \q1 \v 13 నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే; \q2 నేను ఈపాటికి నిద్రించి నాకు విశ్రాంతి కలిగియుండేవాన్ని, \q1 \v 14 తమ కోసం భవనాలు కట్టుకున్న \q2 భూరాజులతో పాలకులతో, \q1 \v 15 బంగారం సంపాదించుకుని వెండితో తమ ఇళ్ళు నింపుకొన్న \q2 అధిపతులతో నేనూ ప్రశాంతంగా నిద్రించి ఉండేవాన్ని. \q1 \v 16 లేదా చనిపోయి పుట్టిన పిండంవలె \q2 ఎప్పుడు వెలుగు చూడని శిశువు వలె నేను ఎందుకు నేలలో దాచబడలేదు? \q1 \v 17 అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపెట్టరు, \q2 బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు. \q1 \v 18 చెరలో ఉన్నవారు కూడా అక్కడ నెమ్మది అనుభవిస్తారు, \q2 యాజమానుల స్వరాలు వారికిక వినబడవు. \q1 \v 19 పేదవారు గొప్పవారు అక్కడ ఉన్నారు, \q2 దాసులు తమ యాజమానుల నుండి విముక్తి పొందుతారు. \b \q1 \v 20 “దురవస్థలో ఉన్నవారికి వెలుగెందుకు? \q2 ఆత్మలో చేదుననుభవిస్తున్న వారికి జీవమెందుకు? \q1 \v 21 వారు రాని మరణం కోసం ఆశతో ఎదురుచూస్తారు, \q2 దాచబడిన ధననిధి కంటే ఎక్కువగా దాని కోసం వెదకుతారు, కాని అది రాదు. \q1 \v 22 వారు సమాధిని చేరినప్పుడు \q2 ఆనందంతో నింపబడి సంతోషిస్తారు. \q1 \v 23 మరుగుచేయబడిన మార్గంగలవానికి \q2 దేవుడు చుట్టూ కంచెవేసినవానికి \q2 జీవం ఎందుకు ఇవ్వబడింది? \q1 \v 24 నిట్టూర్పే నా అనుదిన భోజనంగా మారింది. \q2 నా మూలుగులు నీళ్లలా పారుతున్నాయి. \q1 \v 25 దేనికి భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది; \q2 దేని గురించి దిగులుపడ్డానో అదే నాకు కలిగింది. \q1 \v 26 నాకు నెమ్మది లేదు సుఖం లేదు; \q2 విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.” \c 4 \s1 ఎలీఫజు \p \v 1 అందుకు తేమానీయుడైన ఎలీఫజు ఇలా అన్నాడు: \q1 \v 2 ఎవరైనా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నీవు సహించలేవా? \q2 కాని మాట్లాడకుండా ఎవరు ఉండగలరు? \q1 \v 3 ఎలా నీవు చాలామందికి బుద్ధి నేర్పావో, \q2 ఎలా బలహీనమైన చేతులు బలపరిచావో ఆలోచించు. \q1 \v 4 తొట్రిల్లినవారిని నీ మాటలు ఆదుకున్నాయి; \q2 క్రుంగిన మోకాళ్లను నీవు బలపరిచావు. \q1 \v 5 అలాంటి నీకు ఇప్పుడు కష్టం కలిగితే నీవు నిరుత్సాహపడుతున్నావు; \q2 అది నిన్ను తాకగానే నీవు భయపడుతున్నావు. \q1 \v 6 నీ దైవభక్తి నీకు ధైర్యం కాదా? \q2 నీ నిర్దోష ప్రవర్తన నీ నిరీక్షణ కాదా? \b \q1 \v 7 “ఇప్పుడు ఆలోచించు: నిర్దోషిగా ఉన్నవాడు ఎప్పుడైనా నశించాడా? \q2 యథార్థవంతులు ఎప్పుడైనా నాశనమయ్యారా? \q1 \v 8 నేను చూసినంత వరకు చెడును దున్ని \q2 కీడును నాటేవారు దానినే కోస్తారు. \q1 \v 9 దేవుని శ్వాసకు వారు నశిస్తారు; \q2 ఆయన ధ్వంసం చేయు కోపం ద్వారా వారు ఇక ఉండరు. \q1 \v 10 సింహాలు గర్జిస్తాయేమో కొదమసింహాలు కేకలు వేస్తాయేమో, \q2 అయినా అలాంటి బలమైన సింహాల కోరలు విరిగిపోతాయి. \q1 \v 11 సింహం తిండి దొరకక నశిస్తుంది, \q2 సింహం యొక్క కూనలు చెదిరిపోతాయి. \b \q1 \v 12 “నాకొక విషయం రహస్యంగా తెలిసింది, \q2 నా చెవులు దాని గుసగుసను విన్నాయి. \q1 \v 13 ప్రజలు గాఢనిద్రలో ఉన్నప్పుడు, \q2 రాత్రి వచ్చి కలవరపెట్టే కలలలో అది తెలిసింది, \q1 \v 14 భయం వణకు నన్ను చుట్టుకొని \q2 నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి. \q1 \v 15 ఒక ఆత్మ నా ముఖాన్ని తాకుతూ వెళ్లింది, \q2 నా శరీర రోమాలు నిక్కబొడుచుకున్నాయి. \q1 \v 16 అది నా దగ్గర నిలిచింది, \q2 కాని అది ఏమిటో నేను చెప్పలేను. \q1 ఒక రూపం నా కళ్ళ ముందు నిలబడింది, \q2 మెల్లగా ఒక స్వరం నాకు వినిపించింది. \q1 \v 17 ‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా? \q2 మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా? \q1 \v 18 దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు, \q2 తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు, \q1 \v 19 మట్టి ఇళ్ళలో నివసిస్తూ, \q2 దుమ్ములో పునాదులు గలవారిని, \q2 చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో! \q1 \v 20 ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవారు ముక్కలుగా చేయబడి, \q2 గుర్తింపు పొందకుండానే శాశ్వతంగా నాశనమవుతారు. \q1 \v 21 వారి డేరా తాడు తెంపివేయబడుతుంది, \q2 జ్ఞానం లేకుండానే వారు చనిపోతారు.’ \b \c 5 \q1 \v 1 “నీవు మొరపెట్టు, కాని నీకు సమాధానం ఎవరిస్తారు? \q2 పరిశుద్ధులలో ఎవరు నీకు సహాయం చేస్తారు? \q1 \v 2 ఆగ్రహం మూర్ఖులను చంపుతుంది. \q2 అసూయ బుద్ధిహీనులను చంపుతుంది. \q1 \v 3 మూర్ఖులు వేరుపాదుకోవడం నేను చూశాను, \q2 కాని హఠాత్తుగా వారి ఇల్లు శపించబడింది. \q1 \v 4 వారి పిల్లలకు క్షేమం దూరమవుతుంది, \q2 వారి పక్షంగా వాదించేవారు లేక న్యాయస్థానంలో వారు నలిగిపోతారు. \q1 \v 5 ఆకలితో ఉన్నవారు వారి పంటను తినివేస్తారు, \q2 ముండ్ల మధ్యలో ఉన్నవాటిని కూడా వారు తీసుకుంటారు, \q2 దాహంతో ఉన్నవారు వారి ఆస్తి కోసం కాచుకుని ఉంటారు. \q1 \v 6 కష్టం దుమ్ములో నుండి పుట్టదు. \q2 బాధ భూమిలో నుండి మొలకెత్తదు. \q1 \v 7 నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు \q2 నరులు బాధల కోసమే పుడుతున్నారు. \b \q1 \v 8 “ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; \q2 ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను. \q1 \v 9 పరిశోధించలేని మహాకార్యాలను \q2 లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు. \q1 \v 10 ఆయన భూమిపై వాన కురిపిస్తారు; \q2 పొలాలకు నీటిని పంపిస్తారు. \q1 \v 11 ఆయన దీనావస్థలోనున్న వారిని పైకి లేపుతారు, \q2 దుఃఖపడేవారిని క్షేమానికి లేవనెత్తుతారు. \q1 \v 12 వంచకుల చేతులు విజయం సాధించకుండ, \q2 ఆయన వారి ఆలోచనలను తలక్రిందులు చేస్తారు. \q1 \v 13 జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు, \q2 వంచకుల ఆలోచనలు తుడిచివేయబడతాయి. \q1 \v 14 పగటివేళ వారి మీదికి చీకటి వస్తుంది; \q2 రాత్రిలో తడుముకున్నట్లు వారు మధ్యాహ్న వేళలో తడుముకుంటారు. \q1 \v 15 వారి నోటి నుండి వచ్చే పదునైన మాటల నుండి ఆయన బీదలను రక్షిస్తారు; \q2 బలవంతుల చేతిలో నుండి ఆయన వారిని రక్షిస్తారు. \q1 \v 16 కాబట్టి బీదలకు నిరీక్షణ ఉంది, \q2 అన్యాయం తన నోరు మూసుకుంటుంది. \b \q1 \v 17 “దేవుడు సరిదిద్దేవారు ధన్యులు; \q2 కాబట్టి సర్వశక్తిమంతుని\f + \fr 5:17 \fr*\ft హెబ్రీలో \ft*\fqa షద్దాయ్\fqa*\ft ; ఇక్కడ, యోబు అంతట\ft*\f* క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు. \q1 \v 18 గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే; \q2 ఆయన గాయపరుస్తారు, కాని ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. \q1 \v 19 ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు; \q2 ఏడు బాధల్లో ఏ హాని నిన్ను తాకదు. \q1 \v 20 కరువు కాలంలో చావు నుండి, \q2 యుద్ధంలో ఖడ్గం అంచు నుండి ఆయన నిన్ను తప్పిస్తారు. \q1 \v 21 కొరడాలవంటి నోటిమాటల నుండి నిన్ను కాపాడతారు, \q2 నాశనం వచ్చినా నీవు భయపడవు. \q1 \v 22 కరువు నాశనం వచ్చినప్పుడు నీవు నవ్వుతావు, \q2 అడవి మృగాలకు నీవు భయపడే అవసరం లేదు. \q1 \v 23 ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు, \q2 అడవి జంతువులు నీతో సమాధానంగా ఉంటాయి. \q1 \v 24 నీ గుడారం క్షేమనివాసమని నీవు తెలుసుకుంటావు; \q2 నీ ఆస్తులను లెక్క చూడగా వాటిలో ఒకటి కూడా పోదు. \q1 \v 25 నీకు చాలామంది పిల్లలు ఉంటారని, \q2 నీ సంతానం భూమిమీది గడ్డిని పోలి ఉంటుందని నీవు తెలుసుకుంటావు. \q1 \v 26 పంట కాలంలో ధాన్యం సేకరించబడినట్లు \q2 పూర్తి వయస్సు నిండిన తర్వాత నీవు సమాధికి చేరతావు. \b \q1 \v 27 “మేము ఇది పరిశీలించాము, ఇది నిజము. \q2 కాబట్టి ఈ మాటలు విని నీ మంచి కోసం తెలుసుకో.” \c 6 \s1 యోబు \p \v 1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: \q1 \v 2 “కేవలం నా వేదనను తూకం వేసి, \q2 నా కష్టాలన్నీ త్రాసులో ఉంచి లెక్కిస్తే, \q1 \v 3 సముద్రాల ఇసుక కంటే అవి బరువుగా ఉంటాయి, \q2 కాబట్టి నా మాటలు ఉద్వేగభరితంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. \q1 \v 4 సర్వశక్తిమంతుడైన దేవుని బాణాలు నాకు గుచ్చుకున్నాయి, \q2 నా ఆత్మ వాటికున్న విషం త్రాగింది; \q2 దేవుని భయంకరకార్యాలు నాకు వ్యతిరేకంగా మోహరించి ఉన్నాయి. \q1 \v 5 గడ్డి దొరికితే అడవి గాడిద అరుస్తుందా, \q2 మేత దొరికితే ఎద్దు రంకెవేస్తుందా? \q1 \v 6 ఉప్పు లేకుండ రుచిలేని ఆహారం ఎవరైనా తింటారా? \q2 గుడ్డులోని తెలుపుకు రుచి ఉంటుందా? \q1 \v 7 నేను దాన్ని తాకను, \q2 అలాంటి ఆహారం తింటే నా ఆరోగ్యం పాడవుతుంది. \b \q1 \v 8 “నా అభ్యర్థన నెరవేరి, \q2 దేవుడే నా కోరికను అనుగ్రహించియుంటే బాగుండేది, \q1 \v 9 దేవుడు ఇష్టపూర్వకంగా నన్ను నలిపివేసి, \q2 తన చేయి జాడించి నా ప్రాణాన్ని తీసివేస్తే బాగుండేది! \q1 \v 10 అప్పుడు నేను ఈ ఆదరణ కలిగి ఉంటాను, \q2 భరించలేని బాధలో ఉన్నప్పటికీ, \q2 పరిశుద్ధుని మాటలు నేను తిరస్కరించలేదని ఆనందిస్తాను. \b \q1 \v 11 “నేను ఇంకా నిరీక్షణ కలిగి ఉండడానికి నాకున్న బలమెంత? \q2 నేను ఓపికగా ఉండడానికి నా అంతం ఏపాటిది? \q1 \v 12 రాయికున్నంత బలం నాకుందా? \q2 నాదేమైనా ఇత్తడి శరీరమా? \q1 \v 13 నాకు నేను సహాయం చేసుకోగల శక్తి నాలో ఏమైన ఉన్నదా? \q2 నా శక్తి నన్ను పూర్తిగా విడిచిపెట్టింది. \b \q1 \v 14 “స్నేహితునికి దయ చూపనివాడు \q2 సర్వశక్తిమంతుడైన దేవుని భయం విడిచిపెట్టినవాడు. \q1 \v 15 కాని నా సహోదరులు నమ్మదగని జలప్రవాహాల్లా ఉన్నారు, \q2 ఉప్పొంగే వాగుల్లా ఆధారపడదగనివారుగా ఉన్నారు, \q1 \v 16 అవి కరిగిపోతున్న మంచుగడ్డలతో, \q2 వాటి మీద కురిసిన మంచుతో అవి నల్లబారాయి. \q1 \v 17 కాని వేసవికాలంలో వాటి ప్రవాహం ఆగిపోతుంది, \q2 వేడికి వాటి స్థలాల్లోనే అవి ఆవిరైపోతాయి. \q1 \v 18 అవి ప్రవహించే మార్గాల నుండి ప్రక్కకు తిరుగుతాయి; \q2 అవి బంజరు భూమిలో వెళ్లి నశించిపోతాయి. \q1 \v 19 తేమా వర్తకుల గుంపు నీటి కోసం వెదకుతారు, \q2 షేబ వ్యాపారులు వాటికోసం ఆశతో చూస్తారు. \q1 \v 20 వారు నమ్మకంగా ఉన్నందుకు వారు దుఃఖపడుతున్నారు, \q2 అక్కడికి వచ్చి వారు నిరాశ చెందారు. \q1 \v 21 ఇప్పుడు మీరు కూడా ఏ సహాయం ఇవ్వలేరని నిరూపించారు; \q2 మీరు ఆపదను చూసి భయపడుతున్నారు. \q1 \v 22 నేను ఎప్పుడైనా, ‘నాకేమైనా ఇవ్వండి అని అడిగానా? \q2 మీ ఆస్తిలో నుండి నాకేమైనా బహుమానం తెమ్మని అడిగానా? \q1 \v 23 శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించమని, \q2 క్రూరుల బారి నుండి నన్ను తప్పించండి’ అని అడిగానా? \b \q1 \v 24 “నాకు బోధించండి, నేను మౌనంగా ఉంటాను; \q2 నా తప్పేంటో నేను గ్రహించేలా నాకు చూపించండి. \q1 \v 25 యథార్థమైన మాటలు ఎంతో బాధాకరమైనవి, \q2 కాని మీ వాదనలు ఏమి నిరూపిస్తున్నాయి? \q1 \v 26 నేను చెప్పే మాటలను సరిచేయాలని చూస్తున్నారా, \q2 నిరాశతో కూడిన నా మాటలు గాలివంటివే అని అనుకుంటున్నారా? \q1 \v 27 మీరు తండ్రిలేనివారిని కొనడానికి చీట్లు వేస్తారు, \q2 మీ స్నేహితుని మీద బేరమాడతారు. \b \q1 \v 28 “అయితే ఇప్పుడు నన్ను దయతో చూడండి, \q2 మీ ముఖాలు చూస్తూ అబద్ధం చెప్పగలనా? \q1 \v 29 పశ్చాత్తాపపడండి, అన్యాయం చేయకండి; \q2 మరలా విచారించండి ఎందుకంటే నాలో ఇంకా యథార్థత ఉంది. \q1 \v 30 నా పెదవుల మీద దుష్టత్వం ఉందా? \q2 నా నోరు దుర్మార్గాన్ని గ్రహించలేదా? \b \c 7 \q1 \v 1 “భూమి మీద మానవులకు ఉండేది కఠినమైన సేవ కాదా? \q2 వారి రోజులన్నీ కూలివారి రోజులవంటివి కావా? \q1 \v 2 చల్లనినీడ కోసం ఎంతో ఆశపడే దాసునిలా, \q2 కూలిడబ్బుల కోసం ఎదురు చూసే కూలివానిలా, \q1 \v 3 నిరర్థకమైన నెలలు నాకు కేటాయించబడ్డాయి, \q2 దుఃఖంతో నిండిన రాత్రులు నాకు నియమించబడ్డాయి. \q1 \v 4 నేను పడుకున్నప్పుడు ‘నేను ఎప్పుడు లేస్తాను రాత్రి ఎప్పుడు ముగుస్తుంది?’ \q2 అని ఆలోచిస్తాను తెల్లవారే వరకు నేను అటూ ఇటూ దొర్లుతూ ఉంటాను. \q1 \v 5 నా శరీరం పురుగులతో కురుపులతో కప్పబడింది, \q2 నా చర్మం పగిలి చీము పట్టింది. \b \q1 \v 6 “నేతగాని మగ్గం కంటే వేగంగా నా రోజులు గడుస్తున్నాయి, \q2 నిరీక్షణ లేకుండానే అవి ముగిసిపోతున్నాయి. \q1 \v 7 దేవా! నా జీవం వట్టి ఊపిరి వంటిదేనని జ్ఞాపకం చేసుకోండి; \q2 నా కళ్లు మంచిని మరలా చూడలేవు. \q1 \v 8 ఇప్పుడు నన్ను చూస్తున్నవారి కన్ను ఇకమీదట నన్ను చూడదు; \q2 మీరు నా కోసం చూసినా నేను ఇక ఉండను. \q1 \v 9 మేఘం విడిపోయి మాయమైపోయిట్లు, \q2 సమాధిలోనికి దిగిపోయినవాడు మరలా తిరిగి రాడు. \q1 \v 10 అతడు తన ఇంటికి మరలా తిరిగి రాడు; \q2 అతని స్వస్థలం అతన్ని మరచిపోతుంది. \b \q1 \v 11 “కాబట్టి నేను మౌనంగా ఉండను; \q2 నా ఆత్మలోని వేదన బట్టి మాట్లాడతాను. \q2 నా మనస్సులోని బాధను బట్టి నేను ఫిర్యాదు చేస్తాను. \q1 \v 12 మీరు నాకు కాపలా పెట్టడానికి \q2 నేనేమైనా సముద్రాన్నా లేదా సముద్రపు క్రూరజంతువునా? \q1 \v 13 నా పడక నాకు ఆదరణ ఇస్తుందని \q2 నా మంచం నా బాధను తగ్గిస్తుందని నేను అనుకుంటే, \q1 \v 14 అప్పుడు కూడా కలలతో మీరు నన్ను బెదిరిస్తున్నారు. \q2 దర్శనాలతో నన్ను భయపెడుతున్నారు. \q1 \v 15 ఈ శరీరంతో ఇలా జీవించడం కంటే \q2 ఊపిరాడకుండా చనిపోవడాన్నే నేను కోరుకుంటాను. \q1 \v 16 నా జీవితాన్ని తృణీకరిస్తున్నాను; నేను ఎల్లకాలం బ్రతకను. \q2 నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి; నా దినాలు అర్థం లేకుండా ఉన్నాయి. \b \q1 \v 17 “మీరు మానవులను ఘనపరచడానికి, \q2 వారిపై మీరు అంతగా శ్రద్ధ చూపించడానికి, \q1 \v 18 ప్రతి ఉదయం వారిని దర్శించడానికి, \q2 అనుక్షణం వారిని పరీక్షించడానికి వారెంతటివారు? \q1 \v 19 ఎంతకాలం మీరు నన్ను చూడడం మానకుండ ఉంటారు? \q2 నా ఉమ్మిని మ్రింగేంత వరకు కూడ నన్ను విడిచిపెట్టరా? \q1 \v 20 మనుష్యులను గమనించేవాడా, నేను పాపం చేస్తే, \q2 మీకు నేను ఏమి చేశాను? \q1 మీరెందుకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు? \q2 మీకు నేనే భారమైపోయానా? \q1 \v 21 ఎందుకు మీరు నా అపరాధాలను క్షమించరు? \q2 ఎందుకు నా పాపాలను తీసివేయరు? \q1 త్వరలోనే నేను మట్టిలో కలిసిపోతాను, \q2 మీరు నా కోసం వెదికినా నేనిక ఉండను.” \c 8 \s1 బిల్దదు \p \v 1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా అన్నాడు: \q1 \v 2 “ఎంతకాలం నీవు ఇలాంటి మాటలు మాట్లాడతావు? \q2 నీ మాటలు సుడిగాలిలా ఉన్నాయి. \q1 \v 3 దేవుడు న్యాయాన్ని తలక్రిందులు చేస్తారా? \q2 సర్వశక్తిమంతుడు ధర్మాన్ని వక్రీకరిస్తారా? \q1 \v 4 నీ పిల్లలు ఆయనకు విరోధంగా పాపం చేసి ఉండవచ్చు, \q2 అందుకే ఆయన వారి పాపానికి తగ్గ శిక్షకు వారిని అప్పగించారు. \q1 \v 5 కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, \q2 సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే, \q1 \v 6 నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే, \q2 ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు, \q2 నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు. \q1 \v 7 నీ స్థితి మొదట మామూలుగా ఉన్నా, \q2 చివరకు అది ఎంతో అభివృద్ధి చెందుతుంది. \b \q1 \v 8 “గత తరం వారిని అడుగు, \q2 వారి పూర్వికులు చేసిన శోధనను గమనించు, \q1 \v 9 ఎందుకంటే మనం నిన్న పుట్టినవారం, మనకు ఏమి తెలియదు, \q2 భూమిపై మన రోజులు నీడ వంటివి. \q1 \v 10 వారు నీకు బోధించి చెప్పరా? \q2 వారు తమ అనుభవంతో మాట్లాడరా? \q1 \v 11 బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? \q2 నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా? \q1 \v 12 అవి కోయకముందు పచ్చగా ఉంటాయి \q2 గడ్డి కంటే త్వరగా వాడిపోతాయి. \q1 \v 13 దేవుడిని మరచిపోయే వారందరి గతి ఇలాగే ఉంటుంది; \q2 భక్తిహీనుల ఆశ అడుగంటిపోతుంది. \q1 \v 14 వారు నమ్మేది పెళుసుగా ఉంటుంది. \q2 వారి ఆశ్రయం సాలెగూడు వంటిది. \q1 \v 15 వారు సాలెగూడును ఆశ్రయిస్తారు కాని అది నిలబడదు, \q2 వారు దానిని అంటిపెట్టుకుంటారు కాని అది విడిపోతుంది. \q1 \v 16 వారు సూర్యరశ్మిలో సమృద్ధి నీరు కలిగిన వాటిలా పచ్చగా ఉంటూ, \q2 వాటి తీగలు వారి తోటమీద అల్లుకుంటూ విస్తరిస్తారు. \q1 \v 17 దాని వేర్లు రాళ్ల చుట్టూ చుట్టుకొని, \q2 రాళ్ల మధ్యకు చొచ్చుకుపోవాలని చూస్తుంది. \q1 \v 18 ఆ చోటు నుండి అది తెంచివేయబడినప్పుడు, \q2 ఆ చోటు ‘నేను నిన్నెప్పుడు చూడలేదు’ అంటూ దానిని నిరాకరిస్తుంది. \q1 \v 19 ఖచ్చితంగా అది వాడిపోతుంది, \q2 భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి. \b \q1 \v 20 “దేవుడు నిర్దోషిని త్రోసివేయరు \q2 దుర్మార్గుల చేతులను బలపరచరు. \q1 \v 21 ఆయన నీ నోటిని నవ్వుతో, \q2 నీ పెదవులను ఆనంద ధ్వనులతో నింపుతారు. \q1 \v 22 నీ శత్రువులు అవమానాన్ని ధరిస్తారు, \q2 దుర్మార్గుల గుడారాలు ఇక ఉండవు.” \c 9 \s1 యోబు \p \v 1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: \q1 \v 2 “అవును, ఇదంతా నిజమని నాకు తెలుసు. \q2 అయితే నశించే మానవులు దేవుని ఎదుట తమ నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలరు? \q1 \v 3 వారు ఆయనతో వాదించాలనుకుంటే, \q2 వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనా వారు ఆయనకు జవాబు చెప్పలేరు. \q1 \v 4 ఆయన అత్యంత జ్ఞానవంతుడు మహాబలవంతుడు. \q2 ఆయనతో పోరాడి సురక్షితంగా వచ్చినవారు ఎవరు? \q1 \v 5 ఆయన పర్వతాలను వాటికి తెలియకుండానే కదిలిస్తారు, \q2 కోపంతో వాటిని తలక్రిందులు చేస్తారు. \q1 \v 6 ఆయన భూమిని దాని స్థలంలో నుండి కదిలించి \q2 దాని స్తంభాలు అదిరేలా చేస్తారు. \q1 \v 7 ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. \q2 ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు. \q1 \v 8 ఆయనే ఆకాశాన్ని విశాలపరుస్తారు \q2 సముద్రపు అలలను అణచివేస్తారు. \q1 \v 9 స్వాతి, మృగశీర్ష, కృతిక అనే నక్షత్రాలను \q2 దక్షిణ నక్షత్రరాసులను ఆయన సృజించారు. \q1 \v 10 ఆయన ఎవరు గ్రహించలేని మహాకార్యాలను \q2 లెక్కలేనన్ని అద్భుతాలను చేస్తారు. \q1 \v 11 ఆయన నా ప్రక్కన నుండే వెళ్తారు కాని నేను ఆయనను చూడలేను, \q2 ఆయన వెళ్తున్నప్పుడు ఆయనను గమనించలేను. \q1 \v 12 ఆయన లాక్కుంటే ఎవరు ఆయనను ఆపగలరు? \q2 ‘మీరు ఏమి చేస్తున్నారు?’ అని ఆయనను ఎవరు అడగగలరు? \q1 \v 13 దేవుడు తన కోపాన్ని అణచుకోరు; \q2 రాహాబు\f + \fr 9:13 \fr*\fq రాహాబు \fq*\ft పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక \ft*\fqa సముద్ర రాక్షసుడి \fqa*\ft పేరు.\ft*\f* సహాయకులు ఆయన పాదాల దగ్గర లొంగిపోయారు. \b \q1 \v 14 “కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను? \q2 ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను? \q1 \v 15 నేను నిర్దోషినైనప్పటికి ఆయనకు బదులు చెప్పలేను. \q2 కరుణించమని మాత్రమే నా న్యాయమూర్తిని వేడుకుంటాను. \q1 \v 16 నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా, \q2 ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను. \q1 \v 17 తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు, \q2 ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు. \q1 \v 18 ఆయన నన్ను ఊపిరి తీసుకోనివ్వరు \q2 కాని చేదైన వాటిని నాకు తినిపిస్తారు. \q1 \v 19 బలం విషయానికొస్తే, ఆయన మహాబలవంతుడు! \q2 న్యాయం విషయానికొస్తే, ఆయనకు ప్రతివాదిగా ఎవరు ఉండగలరు? \q1 \v 20 నేను నిర్దోషినైనా కూడా నా నోరే నన్ను నిందిస్తుంది; \q2 నేను నిర్దోషినైనా అదే నన్ను దోషిగా ప్రకటిస్తుంది. \b \q1 \v 21 “నేను నిర్దోషినినైనా \q2 నా గురించి నాకు శ్రద్ధ లేదు. \q2 నా ప్రాణాన్ని నేను తృణీకరిస్తున్నాను. \q1 \v 22 ఏమి చేసినా ఒక్కటే; అందుకే నేను, \q2 దేవుడు నిర్దోషులని దుర్మార్గులని ఏ తేడా లేకుండ నాశనం చేస్తారు అని అంటున్నాను. \q1 \v 23 ఉపద్రవం అకస్మాత్తుగా వచ్చి నాశనం చేస్తే, \q2 నిర్దోషుల దురవస్థను చూసి దేవుడు వెక్కిరిస్తారు. \q1 \v 24 భూమి దుష్టుల చేతికి ఇవ్వబడినప్పుడు, \q2 ఆయన దాని న్యాయాధిపతుల కళ్లను మూసివేస్తారు. \q2 ఆయన కాక ఈ పని ఇంకెవరు చేస్తారు? \b \q1 \v 25 “పరుగెత్తేవాని కంటే నా రోజులు వేగంగా పరుగెడుతున్నాయి; \q2 ఏ సంతోషం లేకుండానే అవి ఎగిరిపోతున్నాయి. \q1 \v 26 రెల్లు పడవలు దాటిపోతున్నట్లు, \q2 గ్రద్ద తన ఎరను తన్నుకుపోయినట్లు అవి గడిచిపోతున్నాయి. \q1 \v 27 నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి \q2 సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే, \q1 \v 28 నా బాధలన్నిటికి భయపడతాను \q2 ఎందుకంటే మీరు నన్ను నిర్దోషిగా ప్రకటించరని నాకు తెలుసు. \q1 \v 29 నేను దోషినని తేలినప్పుడు, \q2 నాకెందుకు ఈ వృధా ప్రయాస? \q1 \v 30 సబ్బుతో నన్ను నేను కడుక్కున్నా, \q2 శుభ్రం చేసే పొడితో నా చేతులు కడుక్కున్నా, \q1 \v 31 మీరు నన్ను బురద గుంటలో ముంచుతారు, \q2 అప్పుడు నా బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి. \b \q1 \v 32 “నేను జవాబివ్వడానికి, ఒకరిపై ఒకరం న్యాయస్థానంలో పోరాడడానికి \q2 దేవుడు నాలాంటి మనిషి కాదు. \q1 \v 33 మా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు, \q2 మమ్మల్ని కలపగల వారు మాకు లేరు, \q1 \v 34 దేవుని దండాన్ని నా మీద నుండి తీసివేయగలిగిన వారు ఉంటే బాగుండేది, \q2 అప్పుడు ఆయన భయం నన్ను ఇక బెదిరించదు. \q1 \v 35 అప్పుడు నిర్భయంగా నేను ఆయనతో మాట్లాడగలను, \q2 కాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అలా చేయలేను. \b \c 10 \q1 \v 1 “నా బ్రతుకును నేను అసహ్యించుకొంటున్నాను; \q2 కాబట్టి నేను స్వేచ్ఛగా ఫిర్యాదు చేస్తాను \q2 నా మనస్సులోని బాధను బట్టి మాట్లాడతాను. \q1 \v 2 నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, \q2 కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి. \q1 \v 3 నన్ను హింసించడం, \q2 మీ చేతిపనిని త్రోసివేయడం, \q2 దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా? \q1 \v 4 మీ కళ్లు మనుష్యుల కళ్లలాంటివా? \q2 మనుష్యులు చూసేటట్లు మీరు చూస్తారా? \q1 \v 5 మీ రోజులు మానవుల రోజుల వంటివా \q2 మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా? \q1 \v 6-7 నేను దోషిని కానని \q2 మీ చేతిలో నుండి నన్ను ఎవరూ విడిపించలేరని మీకు తెలిసినప్పటికీ \q1 నా అపరాధాలను మీరు వెదకుతున్నారు? \q2 నా పాపాలను మీరు పరిశోధిస్తున్నారు? \b \q1 \v 8 “మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి. \q2 ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా? \q1 \v 9 బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి, \q2 ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా? \q1 \v 10 పాలు పోసినట్లు మీరు నన్ను పోయలేదా, \q2 జున్నుగడ్డ పేరబెట్టినట్లు నన్ను చేయలేదా, \q1 \v 11 చర్మంతో మాంసంతో నన్ను కప్పి \q2 ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా? \q1 \v 12 మీరు నాకు జీవాన్ని ఇచ్చి దయ చూపించారు, \q2 మీ సంరక్షణతో నా ఆత్మను కాపాడారు. \b \q1 \v 13 “అయితే ఇది మీ హృదయంలో దాచుకున్నారు, \q2 ఇది మీ మనస్సులో ఉన్నదని నాకు తెలుసు: \q1 \v 14 నేను పాపం చేస్తే, మీరు నన్ను చూస్తుంటారు, \q2 నా నేరానికి శిక్ష వేయకుండ వదలరు. \q1 \v 15 నేను దోషినైతే నాకు శ్రమ! \q2 నేను నిర్దోషినైనప్పటికి నా తల పైకెత్తలేను, \q1 ఎందుకంటే నేను అవమానంతో నిండుకొని \q2 నా బాధలో మునిగి ఉన్నాను. \q1 \v 16 నా తలను పైకెత్తితే సింహం వలె మీరు నన్ను వేటాడతారు, \q2 నాకు వ్యతిరేకంగా మీ మహాబలాన్ని మరలా ప్రదర్శిస్తారు. \q1 \v 17 మీరు నాకు వ్యతిరేకంగా మరలా సాక్షులను తీసుకువస్తారు \q2 నా మీద మీకు కోపం పెరిగిపోతుంది; \q2 ఒకదాని తర్వాత ఒకటిగా మీ సైన్యాలు నామీదికి వస్తాయి. \b \q1 \v 18 “అసలు గర్భం నుండి నన్నెందుకు బయటకు తీసుకువచ్చారు? \q2 ఎవరు నన్ను చూడకముందే నేను చనిపోయి ఉంటే బాగుండేది. \q1 \v 19 అప్పుడు నేను ఉండేవాడిని కాదు, \q2 గర్భం నుండి నేరుగా సమాధికి వెళ్లేవాన్ని. \q1 \v 20 నాకున్న కొన్ని రోజులు దాదాపు ముగియలేదా? \q2 నేను సంతోష గడియలు కలిగి ఉండేలా, \q1 \v 21 తిరిగి రాలేని స్థలానికి నేను వెళ్లక ముందు, \q2 చీకటి, అంధకారం గల దేశానికి వెళ్లక ముందు నన్ను వదిలేయండి. \q1 \v 22 అంధకారం గల చిమ్మచీకటి \q2 గందరగోళంగా ఉండే స్థలానికి నన్ను వెళ్లనివ్వండి, \q2 అక్కడ వెలుగు కూడా చీకటిలా ఉంటుంది.” \c 11 \s1 జోఫరు \p \v 1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు: \q1 \v 2 “ఈ మాటలన్నిటికి జవాబు చెప్పాలి కదా? \q2 ఈ వదరుబోతు నిర్దోషిగా గుర్తించబడాలా? \q1 \v 3 నీ వ్యర్థమైన మాటలు విని ఇతరులు మౌనంగా ఉండాలా? \q2 నీవు ఎగతాళి చేసినప్పుడు నిన్నెవరు మందలించరా? \q1 \v 4 నీవు దేవునితో, ‘నా నమ్మకాలు నిర్దోషమైనవి, \q2 మీ దృష్టికి నేను పవిత్రుడను’ అని చెప్తున్నావు. \q1 \v 5 అయితే దేవుడు నీతో మాట్లాడాలని, \q2 ఆయన నీతో వాదించాలని, \q1 \v 6 జ్ఞాన రహస్యాలు ఆయనే నీకు తెలియజేయాలని నేను ఎంతో కోరుతున్నాను, \q2 ఎందుకంటే, నిజమైన జ్ఞానం నీ ఆలోచనకు మించింది. \q2 నీ పాపాల్లో కొన్నిటిని దేవుడు మరచిపోయారని తెలుసుకో. \b \q1 \v 7 “దేవుని రహస్యాలను నీవు గ్రహించగలవా? \q2 సర్వశక్తిమంతుడైన దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలవా? \q1 \v 8 అవి పైనున్న ఆకాశాలకన్నా ఉన్నతమైనవి, నీవు ఏమి చేయగలవు? \q2 అవి పాతాళం కంటే లోతైనవి, నీవు ఏమి తెలుసుకోగలవు? \q1 \v 9 అవి భూమి కంటే పొడవైనవి, \q2 సముద్రం కంటే విశాలమైనవి. \b \q1 \v 10 “ఆయన వచ్చి, నిన్ను చెరసాలలో బంధిస్తే \q2 న్యాయసభను ఏర్పాటుచేస్తే, ఆయనను ఎవరు అడ్డగించగలరు? \q1 \v 11 మోసగాళ్లు ఎవరో ఆయనకు తెలుసు; \q2 చెడుతనాన్ని చూసిప్పుడు, ఆయన దానిని గమనించడా? \q1 \v 12 అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, \q2 తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము. \b \q1 \v 13 “నీవు నీ హృదయాన్ని సమర్పించుకొని, \q2 నీ చేతులు ఆయన వైపు చాపితే, \q1 \v 14 నీ చేతిలో ఉన్న పాపాన్ని నీవు విడిచిపెడితే \q2 నీ గుడారంలో చెడుకు చోటివ్వకపోతే, \q1 \v 15 అప్పుడు నిర్దోషిగా నీ ముఖాన్ని పైకెత్తుతావు; \q2 భయం లేకుండా స్థిరంగా నిలబడతావు. \q1 \v 16 నీ కష్టాన్ని తప్పకుండా నీవు మరచిపోతావు. \q2 పారుతూ దాటిపోయిన నీటిలా మాత్రమే నీవు దాన్ని గుర్తుచేసుకుంటావు. \q1 \v 17 అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల ప్రకాశం కన్నా ఎక్కువ ప్రకాశిస్తుంది. \q2 చీకటి ఉన్నా అది ఉదయపు వెలుగులా ఉంటుంది. \q1 \v 18 అప్పుడు నిరీక్షణ ఉంటుంది కాబట్టి నీవు భద్రత కలిగి ఉంటావు. \q2 నీ ఇంటిని పరిశోధించి సురక్షితంగా పడుకుంటావు. \q1 \v 19 ఎవరి భయం లేకుండా నీవు విశ్రమిస్తావు. \q2 చాలామంది నీ సహాయాన్ని కోరుకుంటారు. \q1 \v 20 కాని దుర్మార్గుల చూపు మందగిస్తుంది. \q2 తప్పించుకొనే చోటు వారికి దొరకదు; \q2 ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తారు.” \c 12 \s1 యోబు \p \v 1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు: \q1 \v 2 నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు, \q2 మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది! \q1 \v 3 అయినా మీకున్నట్లే నాకు కూడా గ్రహించే మనస్సు ఉంది, \q2 నేను మీకేమి తీసిపోను. \q2 ఈ విషయాలు తెలియనివారు ఎవరు? \b \q1 \v 4 నేను దేవునికి ప్రార్థించగా ఆయన సమాధానం ఇచ్చినప్పటికీ, \q2 నా స్నేహితుల ముందు నేను నవ్వులపాలయ్యాను, \q2 నీతిగా నిందారహితంగా ఉన్న నేను నవ్వులపాలయ్యాను. \q1 \v 5 నిశ్చింతగా ఉన్నవారు అభాగ్యులను తిరస్కరిస్తారు, \q2 పాదాలు జారిపోతున్న వారి విధిని చూసి ఎగతాళి చేస్తారు. \q1 \v 6 బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి, \q2 దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు, \q2 వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు. \b \q1 \v 7 కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి, \q2 ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి. \q1 \v 8 భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది, \q2 సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి. \q1 \v 9 వీటన్నిటిని యెహోవా హస్తం చేసిందని \q2 తెలుసుకోలేనివారు ఎవరు? \q1 \v 10 ఆయన చేతిలో జీవులన్నిటి ప్రాణం \q2 మానవులందరి ఊపిరి ఉంది. \q1 \v 11 నాలుక ఆహారం రుచిని చూసినట్లు \q2 చెవి మాటలను పరిశీలించదా? \q1 \v 12 వృద్ధుల దగ్గర జ్ఞానం దొరకదా? \q2 దీర్ఘాయువు గ్రహింపును తీసుకురాదా? \b \q1 \v 13 జ్ఞానం శక్తి దేవునికి చెందినవి; \q2 ఆలోచన గ్రహింపు ఆయనవే. \q1 \v 14 దేవుడు పడగొట్టిన దానిని తిరిగి కట్టలేరు; \q2 ఆయన బంధించిన వారిని ఎవరూ విడిపించలేరు. \q1 \v 15 ఆయన జలాలను ఆపేస్తే అవి ఎండిపోతాయి; \q2 ఆయన వాటిని వదిలేస్తే అవి భూమిని వరదలతో నాశనం చేస్తాయి. \q1 \v 16 బలం వివేకం ఆయనకు చెందినవే; \q2 మోసపోయేవారు మోసగించేవారు ఆయన వారే. \q1 \v 17 ఆయన ఆలోచనకర్తలను దిగంబరులుగా నడిపిస్తారు, \q2 న్యాయాధిపతులను బుద్ధిహీనులుగా చేస్తారు. \q1 \v 18 ఆయన రాజులు వేసిన సంకెళ్ళు తీసివేస్తారు \q2 వారి నడుము చుట్టూ తాడు కడతాడు. \q1 \v 19 యాజకులను దిగంబరులుగా చేసి నడిపిస్తారు, \q2 స్థిరంగా పాతుకుపోయిన అధికారులను పడగొడతారు. \q1 \v 20 నమ్మకమైన సలహాదారుల మాటలను నిరర్థకం చేస్తారు, \q2 పెద్దల వివేచనను తీసివేస్తారు. \q1 \v 21 ఆయన అధిపతుల మీద అవమానాన్ని కురిపిస్తారు, \q2 బలవంతులను నిరాయుధులనుగా చేస్తారు. \q1 \v 22 ఆయన చీకటిలోని లోతైన విషయాలను వెల్లడిస్తారు \q2 చిమ్మ చీకటిని వెలుగులోకి తెస్తారు. \q1 \v 23 ఆయన దేశాలను గొప్ప చేస్తారు వాటిని నాశనం చేస్తారు; \q2 దేశాలను విశాలపరుస్తారు వాటిని చెదరగొడతారు. \q1 \v 24 ఆయన భూలోక నాయకుల గ్రహింపును తీసివేస్తారు; \q2 వారు దారిలేని ఎడారిలో తిరుగులాడేలా చేస్తారు. \q1 \v 25 వారు వెలుగు లేదా చీకటిలో తడబడతారు; \q2 ఆయన వారిని త్రాగుబోతు తూలినట్లు తూలేలా చేస్తారు. \b \c 13 \q1 \v 1 నా కళ్లు ఇదంతా చూశాయి, \q2 నా చెవులు విని గ్రహించాయి. \q1 \v 2 మీకు తెలిసింది నాకు కూడా తెలుసు. \q2 మీకు నేనేమి తీసిపోను. \q1 \v 3 అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని \q2 దేవునితోనే వాదించాలని కోరుతున్నాను. \q1 \v 4 అయితే మీరు అబద్ధాలను పుట్టిస్తారు. \q2 మీరంతా ఎందుకు పనికిరాని వైద్యులు! \q1 \v 5 మీరందరు మౌనంగా ఉంటే మంచిది, \q2 మీకు అదే జ్ఞానము. \q1 \v 6 ఇప్పుడు నా వాదన వినండి; \q2 నా వాదనలు ఆలకించండి. \q1 \v 7 దేవుని పక్షంగా మీరు దుర్మార్గంగా మాట్లాడగలరా? \q2 ఆయన కోసం వంచనగా మాట్లాడగలరా? \q1 \v 8 ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా? \q2 దేవుని పక్షంగా మీరు వాదిస్తారా? \q1 \v 9 ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తే బాగుంటుందా? \q2 ఒక మనిషిని మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేయగలరా? \q1 \v 10 మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే \q2 ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గద్దిస్తారు. \q1 \v 11 దేవుని వైభవం మిమ్మల్ని భయపెట్టదా? \q2 ఆయన భయం మీ మీదికి రాదా? \q1 \v 12 మీ నీతిమాటలు బూడిదలాంటి సామెతలు, \q2 మీ వాదనలు మట్టి వాదనలు. \b \q1 \v 13 మౌనంగా ఉండండి నన్ను మాట్లాడనివ్వండి; \q2 అప్పుడు నా మీదికి ఏది రావాలో అది వస్తుంది. \q1 \v 14 నేనెందుకు ప్రమాదంలో పడాలి? \q2 నా ప్రాణాన్ని ఎందుకు నా చేతుల్లో పెట్టుకోవాలి? \q1 \v 15 ఆయన నన్ను చంపినా సరే ఆయనలోనే నిరీక్షిస్తాను; \q2 నా మార్గం గురించి నేరుగా ఆయనతో వాదిస్తాను. \q1 \v 16 ఇది నాకు విడుదలలా మారుతుంది, \q2 ఎందుకంటే భక్తిహీనులు దేవుని ముందుకు రావడానికి తెగించలేరు! \q1 \v 17 నా మాటలను శ్రద్ధగా వినండి. \q2 మీ చెవుల్లో నా మాటలు మారుమ్రోగాలి. \q1 \v 18 ఇప్పుడు నా వ్యాజ్యెం సిద్ధంగా ఉంది కాబట్టి, \q2 నేను నిర్దోషినని రుజువవుతానని నాకు తెలుసు. \q1 \v 19 ఎవరైనా నాపై ఆరోపణలు చేయగలరా? \q2 ఒకవేళ చేయగలిగితే, నేను మౌనంగా ఉండి చనిపోతాను. \b \q1 \v 20 దేవా! కేవలం రెండింటిని నాకు అనుగ్రహించండి, \q2 అప్పుడు మీ నుండి నేను దాగను. \q1 \v 21 మీ చేతిని నా మీద నుండి తీసివేయండి, \q2 మీ భయంతో నన్ను భయపెట్టకండి. \q1 \v 22 అప్పుడు నన్ను పిలిస్తే నేను జవాబిస్తాను. \q2 నన్ను మాట్లాడనిచ్చి మీరు జవాబివ్వండి. \q1 \v 23 నేను ఎన్ని దోషాలను పాపాలను చేశాను? \q2 నా అతిక్రమాన్ని నా పాపాన్ని నాకు చూపించండి. \q1 \v 24 ఎందుకు మీ ముఖాన్ని దాచుకుంటున్నారు? \q2 ఎందుకు నన్ను శత్రువుగా భావిస్తున్నారు? \q1 \v 25 గాలికి ఎగిరే ఆకును మీరు వేధిస్తారా? \q2 ఎండిన చెత్తను మీరు తరుముతారా? \q1 \v 26 మీరు నాకు కఠిన శిక్ష విధించారు \q2 యవ్వనకాలంలో చేసిన పాపాల ప్రతిఫలం అనుభవించేలా చేశారు. \q1 \v 27 సంకెళ్ళతో నా కాళ్లు బిగించారు. \q2 నా అరికాళ్ల చుట్టూ గీత గీసి, \q2 నా ప్రవర్తనంతటిని జాగ్రత్తగా కనిపెడుతున్నారు. \b \q1 \v 28 మురిగి కుళ్ళిపోతున్న దానిలా, చిమ్మెటలు కొట్టిన వస్త్రంలా \q2 మనిషి నాశనమవుతాడు. \b \c 14 \q1 \v 1 “స్త్రీకి పుట్టిన మనుష్యులు, \q2 ఉండేది కొంతకాలమే అయినా ఎన్నో శ్రమలు పొందుతారు. \q1 \v 2 వారు పువ్వులా వికసించి వాడిపోతారు; \q2 నిలకడలేని నీడలా వారు స్థిరంగా ఉండరు. \q1 \v 3 అలాంటివారి మీద మీ దృష్టిని నిలిపారా? \q2 తీర్పు తీర్చడానికి వారిని మీ ఎదుటికి తీసుకువస్తారా? \q1 \v 4 అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు? \q2 ఎవరు తీసుకురాలేరు! \q1 \v 5 మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి; \q2 వారు ఎన్ని నెలలు బ్రతుకుతారో మీరు శాసించారు \q2 వారు దాటలేని పరిధిని మీరు నియమించారు. \q1 \v 6 కూలివారిలా వారు తమ పని ముగించే వరకు \q2 మీరు వారివైపు చూడకండి, వారిని అలా వదిలేయండి. \b \q1 \v 7 “కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది: \q2 దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది, \q2 దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి. \q1 \v 8 దాని వేర్లు భూమిలో ఎండిపోయినా \q2 దాని మోడు మట్టిలో చనిపోయినా, \q1 \v 9 నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది. \q2 లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది. \q1 \v 10 కాని నరులు చనిపోయి కదలకుండ పడి ఉంటారు; \q2 చివరి శ్వాస విడిచిన తర్వాత వారు ఇక ఉండరు. \q1 \v 11 సముద్రంలోని నీరు ఆవిరైపోయినట్లుగా, \q2 నదీ తీరం హరించి ఎండిపోయినట్లుగా, \q1 \v 12 మానవులు నిద్రిస్తారు, తిరిగి లేవరు; \q2 ఆకాశం గతించేవరకు వారు మేలుకోరు \q2 వారి నిద్ర నుండి తిరిగి లేవరు. \b \q1 \v 13 “మీరు నన్ను సమాధిలో దాచిపెడితే, \q2 మీ కోపాగ్ని చల్లారే వరకు నన్ను దాచి ఉంచితే ఎంత బాగుండేది! \q1 మీరు నాకు కొంతకాలం నియమించి \q2 ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండేది! \q1 \v 14 ఎవరైనా చనిపోతే వారు మరలా బ్రతుకుతారా? \q2 అలా అయితే నేను కష్టపడి పనిచేసే రోజులన్నీ \q2 నా విడుదల కోసం నేను ఎదురుచూస్తాను. \q1 \v 15 అప్పుడు మీరు పిలుస్తారు నేను జవాబిస్తాను; \q2 మీ చేతులు చేసిన వాటిని మీరు ఇష్టపడతారు. \q1 \v 16 అప్పుడు ఖచ్చితంగా మీరు నా అడుగులను లెక్కిస్తారు \q2 కాని నా పాపాలను గుర్తించరు. \q1 \v 17 నా అతిక్రమాలు సంచిలో మూసివేయబడతాయి; \q2 మీరు నా పాపాన్ని కప్పివేస్తారు. \b \q1 \v 18 “పర్వతాలు క్షీణించి ముక్కలైనట్లుగా \q2 కొండలు వాటి స్థానం తప్పునట్లుగా, \q1 \v 19 నీళ్లు రాళ్లను అరగదీసినట్లుగా \q2 ప్రవాహాలు మట్టిని కడిగివేసినట్లు, \q2 మీరు మనిషి యొక్క నిరీక్షణను నాశనం చేస్తారు. \q1 \v 20 మీరు వారిని ఒకేసారి జయిస్తారు, వారు గతించిపోతారు; \q2 మీరు వారి ముఖం తీరు మార్చివేసి వారిని వెళ్లగొడతారు. \q1 \v 21 ఒకవేళ వారి పిల్లలు గౌరవించబడినా అది వారికి తెలియదు; \q2 వారి సంతానం అణచివేయబడినా వారు గ్రహించలేరు. \q1 \v 22 వారు తమ శరీరంలోని బాధను మాత్రమే అనుభవిస్తారు \q2 తమ కోసం మాత్రమే దుఃఖపడతారు.” \c 15 \s1 ఎలీఫజు \p \v 1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు: \q1 \v 2 “జ్ఞానం కలవారు వ్యర్థమైన తెలివితో సమాధానం ఇస్తారా? \q2 తూర్పు గాలితో తమ కడుపు నింపుకొంటారా? \q1 \v 3 పనికిరాని పదాలతో విలువలేని మాటలతో \q2 వారు వాదిస్తారా? \q1 \v 4 నీవు భక్తిని విడిచిపెట్టి \q2 దేవుని గురించిన ధ్యానాన్ని అడ్డగిస్తున్నావు. \q1 \v 5 నీ నోరు నీ పాపాలను తెలియజేస్తుంది; \q2 కపటంగా మాట్లాడేవారిలా నీవు మాట్లాడుతున్నావు. \q1 \v 6 నేను కాదు, నీ నోరే నిన్ను ఖండిస్తుంది; \q2 నీ పెదవులే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాయి. \b \q1 \v 7 “నీవేమైన మొదట పుట్టిన పురుషునివా? \q2 కొండలు ఏర్పడక ముందే నీవు ఉన్నావా? \q1 \v 8 దేవుని ఆలోచనసభలో నీవు ఉన్నావా? \q2 జ్ఞానం నీకొక్కడికే సొంతమా? \q1 \v 9 నీకు తెలిసినది మాకు తెలియనిది ఏమిటి? \q2 నీవు గ్రహించగలిగింది మేము గ్రహించలేనిది ఏమిటి? \q1 \v 10 తల నెరసినవారు వృద్ధులైనవారు మా వైపు ఉన్నారు, \q2 వారు వయస్సులో నీ తండ్రి కంటే పెద్దవారు. \q1 \v 11 దేవుని ఓదార్పులు నీకు సరిపోవడం లేదా? \q2 ఆయన మృదువైన మాటలు సరిపోవడం లేదా? \q1 \v 12-13 దేవుని మీద కోప్పడి, \q2 ఇలాంటి మాటలు నీ నోటి నుండి వచ్చేలా, \q1 నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది \q2 నీ కళ్లు ఎందుకు ఎర్రబడ్డాయి? \b \q1 \v 14 “పవిత్రులుగా ఉండడానికి మనుష్యులు ఏపాటివారు? \q2 నీతిమంతులుగా ఉండడానికి స్త్రీకి పుట్టిన వారు ఏపాటివారు? \q1 \v 15 దేవుడు తన పవిత్రులను కూడా నమ్మకపోతే, \q2 ఆయన దృష్టిలో ఆకాశాలు కూడా పవిత్రం కాకపోతే, \q1 \v 16 ఇక చెడును నీటిలా త్రాగే నీచులు, అవినీతిపరులు, \q2 ఆయన దృష్టికి ఇంకెంత అల్పులు! \b \q1 \v 17 “నా మాట విను, నేను నీకు వివరిస్తాను; \q2 నేను చూసిన దానిని నీకు చెప్తాను. \q1 \v 18 జ్ఞానులు తమ పూర్వికుల దగ్గర నుండి సంపాదించి \q2 దానిలో ఏమీ దాచకుండా చెప్పిన బోధ నీకు చెప్తాను. \q1 \v 19 ఇతర ప్రజలు వారి మధ్య లేనప్పుడు \q2 ఆ దేశం స్వాస్థ్యంగా ఇవ్వబడిన జ్ఞానులు చెప్పిన బోధ నీకు చెప్తాను. \q1 \v 20 దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధ అనుభవిస్తాడు. \q2 క్రూరమైనవాడు తనకు నియమించిన సంవత్సరాలన్నీ బాధ అనుభవిస్తాడు. \q1 \v 21 భయంకరమైన శబ్దాలు వాని చెవుల్లో మ్రోగుతాయి. \q2 అంతా క్షేమంగా ఉన్నప్పుడు నాశనం చేసేవారు అతనిపై దాడి చేస్తారు. \q1 \v 22 చీకటిని తప్పించుకుంటాడనే నమ్మకం అతనికి లేదు; \q2 అతడు ఖడ్గం పాలవుతాడు. \q1 \v 23 అతడు ఆహారం కోసం రాబందులా చుట్టూ తిరుగుతాడు; \q2 చీకటి రోజులు సమీపించాయని అతనికి తెలుసు. \q1 \v 24 శ్రమ వేదన అతన్ని భయపెడతాయి; \q2 యుద్ధానికి సిద్ధమైన రాజులా అవి అతన్ని ముంచెత్తుతాయి, \q1 \v 25 ఎందుకంటే, అతడు దేవునికి విరోధంగా చేయి చాపాడు \q2 సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల గర్వంగా ప్రవర్తించాడు. \q1 \v 26 అతడు మందంగా ఉన్న బలమైన డాలుతో \q2 ధిక్కారంగా దేవుని మీదికి దండెత్తుతాడు. \b \q1 \v 27 “వాని ముఖం క్రొవ్వుపట్టి ఉన్నప్పటికీ \q2 అతని నడుము క్రొవ్వుతో ఉబ్బినప్పటికి, \q1 \v 28 అతడు పాడైపోయిన పట్టణాల్లో \q2 ఎవరు నివసించని ఇళ్ళలో, \q2 శిధిలమైపోతున్న ఇళ్ళలో నివసిస్తాడు. \q1 \v 29 ఇక ఎప్పటికీ అతడు ధనవంతునిగా ఉండడు అతని సంపద నిలబడదు. \q2 అతని ఆస్తులు భూమిలో విస్తరించవు. \q1 \v 30 అతడు చీకటిని తప్పించుకోలేడు \q2 అతని లేత మొక్కలను అగ్ని కాల్చివేస్తుంది, \q2 దేవుని నోటి ఊపిరిచేత అతడు చనిపోతాడు. \q1 \v 31 అతడు వ్యర్థమైన దానిని నమ్మి తనను తాను మోసగించుకోవద్దు \q2 ఎందుకంటే అతనికి ప్రతిఫలం ఏమి ఉండదు. \q1 \v 32 అతని కాలం పూర్తి కాక ముందే వాడిపోతాడు, \q2 అతని కొమ్మలు వృద్ధిచెందవు. \q1 \v 33 పిందెలు రాలిపోయే ద్రాక్ష చెట్టులా, \q2 పువ్వులు రాలిపోయే ఒలీవ చెట్టులా అతడు ఉంటాడు. \q1 \v 34 భక్తిలేనివారి సహచరులు నిస్సారంగా ఉంటారు, \q2 లంచాలు ప్రేమించేవారి గుడారాలను అగ్ని కాల్చివేస్తుంది. \q1 \v 35 వారు దుష్టత్వాన్ని గర్భం ధరించి చెడును కంటారు. \q2 వారి కడుపున మోసం పుడుతుంది.” \c 16 \s1 యోబు \p \v 1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు: \q1 \v 2 నేను ఇలాంటి విషయాలెన్నో విన్నాను; \q2 మీరందరు నీచంగా ఓదార్చేవారు. \q1 \v 3 మీ గాలిమాటలకు అంతం లేదా? \q2 మీరు ఇలాంటి సమాధానం ఇచ్చేలా ఏది మిమ్మల్ని బలవంతం చేస్తుంది? \q1 \v 4 నేనున్న స్థానంలో మీరు ఉంటే, \q2 నేనూ మీలాగే మాట్లాడగలను; \q1 మీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడి \q2 మిమ్మల్ని చూసి తల ఊపుతూ ఎగతాళి చేయగలను. \q1 \v 5 కాని నా నోటి మాట మిమ్మల్ని బలపరుస్తుంది; \q2 నా పెదవుల నుండి వచ్చే ఆదరణ మీకు ఉపశమనం కలిగిస్తుంది. \b \q1 \v 6 అయితే నేను మాట్లాడినప్పటికి నా బాధకు ఉపశమనం లేదు; \q2 మౌనంగా ఉన్నా నా బాధ తీరదు. \q1 \v 7 దేవా, నాకు అలసట కలిగించారు; \q2 నా కుటుంబమంతటిని వినాశనం చేశారు. \q1 \v 8 మీరు నన్ను అస్థిపంజరంలా చేశారు అది నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది; \q2 బక్కచిక్కిన నా దేహం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది. \q1 \v 9 దేవుడు తన కోపంలో నా మీద దాడి చేసి నన్ను చీల్చివేశారు; \q2 ఆయన నా వైపు చూస్తూ పళ్ళు కొరుకుతున్నారు; \q2 నాకు శత్రువై నాపై కన్నెర్ర చేసి నావైపు కోపంగా చూస్తున్నారు. \q1 \v 10 ప్రజలు నన్ను ఎత్తిపొడవడానికి వారి నోళ్ళు తెరిచారు; \q2 నన్ను తిట్టి చెంపదెబ్బలు కొడుతున్నారు. \q2 నాకు వ్యతిరేకంగా వారంతా ఒక్కటైయ్యారు. \q1 \v 11 దేవుడు నన్ను భక్తిహీనులకు అప్పగించారు. \q2 దుర్మార్గుల చేతుల్లో నన్ను పడవేశారు. \q1 \v 12 నేను నెమ్మది కలిగి ఉండేవాన్ని, కాని ఆయన నన్ను ముక్కలుగా చేశారు; \q2 నా మెడ పట్టుకుని విదిలించి నన్ను నలిపేశారు. \q1 ఆయన నన్ను తన గురిగా పెట్టుకున్నారు; \q2 \v 13 ఆయన బాణాలు నన్ను చుట్టుకున్నాయి \q1 జాలి లేకుండ ఆయన నా మూత్రపిండాల గుండా గుచ్చారు \q2 నా పైత్యరసాన్ని నేలపై పారబోశారు. \q1 \v 14 పదే పదే ఆయన నన్ను విరుచుకుపడ్డారు; \q2 శూరునిలా పరుగున నా మీద పడ్డారు. \b \q1 \v 15 నా చర్మం మీద గోనెపట్ట కుట్టుకున్నాను \q2 నా నుదిటిని\f + \fr 16:15 \fr*\ft మూ.భా.లో \ft*\fqa కొమ్ము\fqa*\f* దుమ్ములో ఉంచాను. \q1 \v 16 ఏడ్పుచేత నా ముఖం ఎరుపెక్కింది \q2 నా కనురెప్పల మీద చీకటి నీడలు ఉన్నాయి; \q1 \v 17 అయినా నా చేతులు దౌర్జన్యానికి దూరంగా ఉన్నాయి, \q2 నా ప్రార్థనలు యథార్థంగా ఉన్నాయి. \b \q1 \v 18 భూమీ, నా రక్తాన్ని కప్పివేయకు; \q2 నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి. \q1 \v 19 ఇప్పుడు కూడా నా సాక్షి పరలోకంలో ఉన్నాడు; \q2 నా న్యాయవాది పైన ఉన్నాడు. \q1 \v 20 నా కళ్లు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా \q2 నా మధ్యవర్తి నా స్నేహితుడు\f + \fr 16:20 \fr*\ft లేదా \ft*\fq నా \fq*\fqa స్నేహితులు అపహాస్యం చేస్తారు\fqa*\f* \q1 \v 21 ఒకడు స్నేహితుని కోసం వేడుకున్నట్లు \q2 అతడు నరుని పక్షాన దేవున్ని వేడుకుంటాడు. \b \q1 \v 22 ముందున్నవి ఇంకా కొన్ని సంవత్సరాలే \q2 తర్వాత నేను తిరిగి రాలేని మార్గంలో వెళ్తాను. \c 17 \q1 \v 1 “నా ప్రాణం క్రుంగిపోయింది, \q2 నా రోజులు కుదించబడ్డాయి. \q2 సమాధి నా కోసం ఎదురుచూస్తుంది. \q1 \v 2 ఎగతాళి చేసేవారు నన్ను చుట్టుముట్టారు; \q2 నేను చూస్తూ ఉండగానే వారు వివాదం రేపుతున్నారు. \b \q1 \v 3 “దేవా, మీరే నా కోసం జామీనుగా నిలవండి. \q2 ఇంకెవరు నాకు భద్రత ఇవ్వగలరు? \q1 \v 4 గ్రహించకుండా మీరు వారి హృదయాలను మూసివేశారు. \q2 కాబట్టి మీరు వారిని విజయం పొందనివ్వరు. \q1 \v 5 స్వలాభం కోసం తమ స్నేహితులను ఎవరైనా మోసం చేస్తే \q2 వారి పిల్లల కళ్లు మసకబారతాయి. \b \q1 \v 6 “దేవుడు నన్ను ప్రజలందరికి ఒక సామెతగా చేశారు, \q2 నా ముఖం మీద ప్రజలు ఉమ్మివేస్తారు. \q1 \v 7 దుఃఖంతో నా చూపు మందగించింది. \q2 నా అవయవాలు నీడలా మారాయి. \q1 \v 8 యథార్థవంతులు దీనినిచూసి ఆశ్చర్యపడతారు; \q2 నిర్దోషులు భక్తిహీనులను చూసి ఆందోళన చెందుతారు. \q1 \v 9 అయితే నీతిమంతులు తమ మార్గాలను విడిచిపెట్టరు, \q2 నిరపరాధులు బలాన్ని పొందుకుంటారు. \b \q1 \v 10 “మీరందరు మరోసారి రండి, మరలా ప్రయత్నించండి! \q2 నాకు మీలో జ్ఞానవంతుడు ఒక్కడు కూడా కనిపించలేదు. \q1 \v 11 నా రోజులు గతించిపోయాయి, నా ఆలోచనలు వ్యర్థమయ్యాయి. \q2 నా హృదయ వాంఛలు భంగమయ్యాయి. \q1 \v 12 ఈ మనుష్యులు రాత్రిని పగలని, \q2 చీకటి కమ్ముకున్నప్పుడు వెలుగు వచ్చిందని వాదిస్తారు. \q1 \v 13 నాకున్న ఆశ ఏంటంటే సమాధి నాకు ఇల్లు అవ్వాలి, \q2 చీకటిలో నా పరుపు పరచుకోవాలి. \q1 \v 14 నేను అవినీతితో, ‘నీవే నా తండ్రివి’ అని, \q2 పురుగుతో, ‘నా తల్లివి’ లేదా ‘నా సోదరివి’ అని అంటే, \q1 \v 15 అప్పుడు నా నిరీక్షణ ఎక్కడున్నట్టు! \q2 నా గురించి ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా? \q1 \v 16 అది మరణపు తలుపుల దగ్గరకు దిగిపోతుందా? \q2 నాతో పాటు మట్టిలో కలిసిపోదా?” \c 18 \s1 బిల్దదు \p \v 1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు: \q1 \v 2 “నీవు ఈ మాటలు మాట్లాడడం ఎప్పుడు మానేస్తావు? \q2 కొంచెం ఆలోచించు, అప్పుడు మేము మాట్లాడతాము. \q1 \v 3 నీ దృష్టికి మేము ఎందుకు పశువులుగా \q2 తెలివితక్కువ వారిగా కనబడుతున్నాము? \q1 \v 4 కోపంలో నిన్ను నీవే ముక్కలు చేసుకున్నవాడవు, \q2 నీకోసం భూమంతా విడిచిపెట్టబడాలా? \q2 నీకోసం కొండలు వాటి స్థానం తప్పాలా? \b \q1 \v 5 “దుర్మార్గుల దీపం ఆర్పివేయబడుతుంది; \q2 వారి అగ్నిజ్వాలలు మండవు. \q1 \v 6 వారి గుడారంలో వెలుగు చీకటిగా అవుతుంది; \q2 వారి దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది. \q1 \v 7 వారి బలమైన అడుగులు బలహీనపడతాయి; \q2 వారి సొంత ఆలోచనలే వారిని పడగొడతాయి. \q1 \v 8 వారి కాళ్లు వారిని వలలోనికి నడిపిస్తాయి; \q2 వారు వలలో పడతారు. \q1 \v 9 బోను వారి మడమను పట్టుకుంటుంది; \q2 ఉచ్చు వారిని గట్టిగా పట్టుకుంటుంది. \q1 \v 10 వారి కోసం నేల మీద ఉరి అమర్చబడింది; \q2 వారి దారిలో ఉచ్చు ఉంది. \q1 \v 11 భయాలు ప్రతి దిక్కునుండి వారిని ఆవరిస్తాయి, \q2 అడుగడుగునా వారిని వెంటాడతాయి. \q1 \v 12 విపత్తు వారి కోసం ఆకలితో ఉంది; \q2 వారు పడిపోతే ఆపద వారి కోసం సిద్ధంగా ఉంది. \q1 \v 13 అది వారి చర్మ భాగాలను తినివేస్తుంది; \q2 మరణం యొక్క మొదటి సంతానం వారి అవయవాలను మ్రింగివేస్తుంది. \q1 \v 14 వారి గుడారంలో ఉన్న భద్రత నుండి వారు పెరికివేయబడ్డారు. \q2 భయం కలిగించే రాజు దగ్గరకు కొనిపోబడతారు. \q1 \v 15 అగ్ని వారి గుడారంలో నివసిస్తుంది.\f + \fr 18:15 \fr*\ft లేదా \ft*\fqa అతని దగ్గర ఉన్నది ఏది మిగలదు\fqa*\f* \q2 వారి నివాసం మీద మండే గంధకం చెదిరిపోతుంది. \q1 \v 16 క్రింద వారి వేర్లు ఎండిపోతాయి \q2 పైన వారి కొమ్మలు వాడిపోతాయి. \q1 \v 17 భూమి మీద వారి జ్ఞాపకం నశించిపోతుంది; \q2 నేలమీద వారి పేరే ఉండదు. \q1 \v 18 వెలుగులో నుండి చీకటిలోకి వారు నడిపించబడతారు \q2 లోకం నుండి వారు తరిమివేయబడతారు. \q1 \v 19 తమ ప్రజల్లో వారికి సంతానం గాని వారసులు గాని ఉండరు, \q2 ఒకప్పుడు వారు నివాసమున్న స్థలాల్లో బ్రతికి ఉన్నవారు ఎవరు లేరు. \q1 \v 20 వారి దుస్థితిని చూసిన పశ్చిమ ప్రజలు ఆందోళన చెందుతారు; \q2 తూర్పున ఉన్నవారు భయంతో నిండి ఉంటారు. \q1 \v 21 ఖచ్చితంగా దుర్మార్గుల నివాసం ఇలాగే ఉంటుంది; \q2 దేవుని ఎరుగనివారి స్థలం కూడా ఇలానే ఉంటుంది.” \c 19 \s1 యోబు \p \v 1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు: \q1 \v 2 “ఎంతకాలం మీరు నన్ను వేధించి \q2 మాటలతో నలుగగొడతారు? \q1 \v 3 ఇప్పటికి పదిసార్లు మీరు నన్ను నిందించారు; \q2 సిగ్గులేకుండా మీరు నాపై దాడి చేశారు. \q1 \v 4 ఒకవేళ నేను తప్పు చేసినట్లైతే \q2 నా తప్పు నా మీదికే వస్తుంది. \q1 \v 5 మిమ్మల్ని మీరు నా కంటే హెచ్చించుకొని \q2 నా మీద నా అవమానాన్ని మోపితే, \q1 \v 6 దేవుడు నాకు అన్యాయం చేశారని \q2 నా చుట్టూ ఆయన తన వల వేశారని తెలుసుకోండి. \b \q1 \v 7 “నాపై ‘దౌర్జన్యం జరుగుతుంది’ అని నేను మొరపెట్టినా నాకు జవాబు రాదు; \q2 సహాయం చేయమని అడిగినా నాకు న్యాయం జరుగదు. \q1 \v 8 నేను దాటకుండా ఆయన నా దారిని మూసివేశారు; \q2 నా త్రోవలను చీకటితో కప్పివేశారు. \q1 \v 9 ఆయన నా గౌరవాన్ని తొలగించారు. \q2 నా తలపై నుండి కిరీటాన్ని తీసివేశారు. \q1 \v 10 నేను నశించే వరకు అన్నివైపులా ఆయన నన్ను విరగ్గొట్టారు; \q2 చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణను పెల్లగించారు. \q1 \v 11 నా మీద ఆయన కోపం రగులుకుంది; \q2 ఆయన నన్ను తన శత్రువుగా భావించారు. \q1 \v 12 ఆయన సైన్యాలన్నీ ఒక్కటిగా వచ్చి, \q2 నాకు విరోధంగా ముట్టడి దిబ్బలు వేసి \q2 నా గుడారం చుట్టూ మకాం వేశారు. \b \q1 \v 13 “ఆయన నా సహోదరులను నాకు దూరం చేశారు; \q2 నా పరిచయస్థులందరూ నాకు పూర్తిగా పరాయివారయ్యారు. \q1 \v 14 నా బంధువులు నా నుండి దూరంగా వెళ్లిపోయారు; \q2 నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు. \q1 \v 15 నా అతిథులకు నా ఇంటి పనికత్తెలకు నేను విదేశీయునిగా ఉన్నాను; \q2 పరాయివానిగా చూసినట్లు వారు నన్ను చూస్తున్నారు. \q1 \v 16 నేను పనివాన్ని పిలిచినా, నేను వాన్ని బ్రతిమాలినా, \q2 వాడు పలకడం లేదు. \q1 \v 17 నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది; \q2 నా కుటుంబం నన్ను అసహ్యించుకుంటుంది. \q1 \v 18 చిన్నపిల్లలు కూడా నన్ను దూషిస్తున్నారు; \q2 నేను కనిపిస్తే నన్ను ఎగతాళి చేస్తున్నారు. \q1 \v 19 నా ప్రాణస్నేహితులంతా నన్ను అసహ్యించుకుంటున్నారు; \q2 నేను ప్రేమించినవారు నా మీద తిరగబడుతున్నారు. \q1 \v 20 నేను అస్థిపంజరంలా తయారయ్యాను. \q2 నా పళ్ల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది. \b \q1 \v 21 “జాలి పడండి, నా స్నేహితులారా, నాపై జాలి చూపండి \q2 ఎందుకంటే దేవుని హస్తం నన్ను మొత్తింది. \q1 \v 22 దేవుడు వెంటాడినట్లు మీరు కూడా నన్నెందుకు వెంటాడుతున్నారు? \q2 నా శరీరం నాశనమైపోయింది, ఇది చాలదా? \b \q1 \v 23 “నా మాటలు ఒక గ్రంథపుచుట్టలో, \q2 వ్రాయబడి ఉంటే బాగుండేది! \q1 \v 24 అవి నిత్యం ఉండేలా ఇనుపగంటతో రాతి మీద చెక్కి \q2 సీసంతో నింపితే బాగుండేది! \q1 \v 25 నా విమోచకుడు సజీవుడని, \q2 తుదకు ఆయన భూమి\f + \fr 19:25 \fr*\ft లేదా \ft*\fqa నా సమాధి\fqa*\f* మీద నిలబడతారని నాకు తెలుసు. \q1 \v 26 నా చర్మం నాశనమైపోయిన తర్వాత \q2 నా శరీరంతో నేను దేవుని చూస్తాను. \q1 \v 27 మరొకరు కాదు, నేనే \q2 నా కళ్ళతో స్వయంగా దేవుని చూస్తాను. \q2 నా హృదయం నాలో ఎంత ఆరాటపడుతుంది! \b \q1 \v 28 “ఒకవేళ మీరు, ‘దీనికంతటికి మూలకారణం అతనిలోనే ఉంది, \q2 అతన్ని మనమెలా వేటాడాలి’ అని అనుకుంటే, \q1 \v 29 మీరు ఖడ్గానికి భయపడాలి; \q2 ఎందుకంటే కోపమనే ఖడ్గం శిక్షను విధిస్తుంది, \q2 అప్పుడు మీరు తీర్పు ఉందని తెలుసుకుంటారు.” \c 20 \s1 జోఫరు \p \v 1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు: \q1 \v 2 “నేను చాలా ఆందోళన చెందగా, \q2 జవాబివ్వాలని నా ఆలోచనలు నన్ను తొందర చేస్తున్నాయి. \q1 \v 3 నాకు అవమానం కలిగించే నిందను నేను విన్నాను, \q2 కాబట్టి నా వివేకం జవాబు చెప్పేలా నన్ను ప్రేరేపిస్తుంది. \b \q1 \v 4 “అనాది కాలం నుండి ఎలా ఉందో నీకు తెలుసు, \q2 భూమి మీద నరుడు\f + \fr 20:4 \fr*\ft లేదా \ft*\fqa ఆదాము\fqa*\f* ఉంచబడినప్పటి నుండి ఏమి జరుగుతున్నది నీకు తెలుసు. \q1 \v 5 దుర్మార్గుల ఉల్లాసం కొద్దిసేపే అని, \q2 భక్తిహీనుల సంతోషం ఒక క్షణమే ఉంటుందని నీకు తెలుసు. \q1 \v 6 భక్తిహీనుల గర్వం ఆకాశాలను అంటినా \q2 వారి తల మేఘాలను తాకినా, \q1 \v 7 వారి మలంలా వారు కూడా ఎప్పటికి కనబడకుండా నశిస్తారు; \q2 వారిని చూసినవారు, ‘వారెక్కడ ఉన్నారు?’ అని అడుగుతారు. \q1 \v 8 కలలా వారు చెదిరిపోయి కనుమరుగవుతారు, \q2 రాత్రి స్వప్నంలా వారు చెదిరిపోతారు. \q1 \v 9 వారిని చూసిన కన్ను మరలా వారిని చూడదు; \q2 వారి స్థలం వారిని మరలా చూడదు. \q1 \v 10 వారి పిల్లలు పేదవారి సహాయం అడుగుతారు; \q2 వారి చేతులు తమ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాయి. \q1 \v 11 వారి ఎముకల్లో నిండి ఉన్న యవ్వన బలం \q2 వారితో పాటు మట్టిపాలవుతుంది. \b \q1 \v 12 “చెడుతనం వారి నోటికి తీయగా ఉన్నా, \q2 నాలుక క్రింద వారు దాన్ని దాచినా, \q1 \v 13 భరించలేకపోయినా దాన్ని విడిచిపెట్టలేదు \q2 తమ నోటిలో భద్రం చేసుకున్నారు, \q1 \v 14 వారి ఆహారం వారి కడుపులో పులిసిపోతుంది; \q2 అది వారిలో నాగుపాముల విషంలా మారుతుంది. \q1 \v 15 వారు మ్రింగిన ఐశ్వర్యాన్ని కక్కివేస్తారు; \q2 దేవుడు వారి కడుపు లోనిది కక్కిస్తారు. \q1 \v 16 వారు నాగుపాముల విషాన్ని పీల్చుకుంటారు; \q2 పాము కోరలు వారిని చంపుతాయి. \q1 \v 17 నదిలా ప్రవహించే తేనె మీగడలు చూసి, \q2 వారు ఆనందించలేరు. \q1 \v 18 వారు కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించకుండానే తిరిగి ఇచ్చేస్తారు; \q2 తమ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని వారు ఆస్వాదించరు. \q1 \v 19 ఎందుకంటే వారు పేదలను వేధించి వారిని దిక్కులేనివారిగా చేశారు; \q2 తాను కట్టని ఇళ్ళను వారు ఆక్రమించారు. \b \q1 \v 20 “వారి అత్యాశకు అంతం ఉండదు; \q2 వారికున్న సంపదలతో తమను తాము రక్షించుకోలేడు. \q1 \v 21 వారు మ్రింగివేయడానికి వారికి ఏమి మిగల్లేదు; \q2 వారి అభివృద్ధి నిలబడదు. \q1 \v 22 వారికి సమృద్ధి కలిగినప్పుడు ఇబ్బందిపడతారు; \q2 కష్టాల భారం వారి మీద పడుతుంది. \q1 \v 23 వారు తమ కడుపు నింపుకునేప్పుడు, \q2 దేవుడు తన కోపాగ్నిని వారి మీద కురిపిస్తారు, \q2 వారి మీద కష్టాలను కురిపిస్తారు. \q1 \v 24 ఇనుప ఆయుధం నుండి వారు తప్పించుకున్నా \q2 ఇత్తడి విల్లు నుండి బాణం వారి గుండా దూసుకుపోతుంది. \q1 \v 25 దానిని వెనుక నుండి బయటకు తీయగా \q2 మెరుస్తున్న ఆ బాణం అంచు వారి కాలేయాన్ని ముక్కలు చేస్తుంది. \q1 మరణభయం వారిని కమ్ముకుంటుంది; \q2 \v 26 వారి సంపదలు చీకటిమయం అవుతాయి, \q1 ఎవరూ ఊదకుండానే మంటలు రాజుకొని వారిని దహించి వేసి, \q2 వారి గుడారాల్లో మిగిలినదంతా నాశనం చేస్తుంది. \q1 \v 27 ఆకాశాలు వారి అపరాధాన్ని బయటపెడతాయి; \q2 భూమి వారి మీదికి లేస్తుంది. \q1 \v 28 దేవుని కోపదినాన ప్రవహించే నీటిలో, \q2 వారి ఇళ్ళు కొట్టుకుపోతాయి. \q1 \v 29 దుష్టులకు దేవుడు నియమించిన, \q2 వారసత్వం ఇదే.” \c 21 \s1 యోబు \p \v 1 అప్పుడు యోబు ఇలా అన్నాడు: \q1 \v 2 “నేను శ్రద్ధగా వినండి; \q2 ఇదే మీరు నాకిచ్చే ఓదార్పు అవనివ్వండి. \q1 \v 3 నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఓర్చుకోండి, \q2 నేను మాట్లాడిన తర్వాత, మీరు ఎగతాళి చేయవచ్చు. \b \q1 \v 4 “నేను మనుష్యులకు ఫిర్యాదు చేశానా? \q2 అలాంటప్పుడు నేను ఎందుకు ఆతురపడకూడదు? \q1 \v 5 నా వైపు చూసి నివ్వెరపోండి; \q2 మీ నోటిమీద చేయి వేసుకోండి. \q1 \v 6 దీని గురించి ఆలోచించినప్పుడు, నేను హడలిపోతున్నాను; \q2 నా శరీరంలో వణుకు పుడుతుంది. \q1 \v 7 దుష్టులు ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు, \q2 పెద్దవారిగా ఎదుగుతూ వారు బలాభివృద్ధి చెందుతున్నారు? \q1 \v 8 తమ పిల్లలు స్థిరపడడం వారు చూస్తారు, \q2 వారు మనవళ్ళుమనవరాళ్లతో ఆనందిస్తారు. \q1 \v 9 వారి ఇళ్ళు భయం లేకుండ క్షేమంగా ఉన్నాయి; \q2 దేవుని శిక్షాదండం వారి మీదికి రాలేదు. \q1 \v 10 వారి ఎద్దులు సంతానోత్పత్తిలో ఎప్పుడూ విఫలం కావు; \q2 వారి ఆవులు దూడలను ఈనుతాయి గర్భస్రావం చేయవు. \q1 \v 11 వారు తమ పిల్లలను మందగా పంపిస్తారు; \q2 వారి చిన్నారులు నాట్యమాడతారు. \q1 \v 12 కంజర తంతి వాయిద్యాలు మోగిస్తూ పాడతారు; \q2 పిల్లనగ్రోవి ఊదుతూ ఆనందిస్తారు. \q1 \v 13 వారు తమ సంవత్సరాలు శ్రేయస్సులో గడుపుతారు \q2 సమాధానంతో\f + \fr 21:13 \fr*\ft లేదా \ft*\fqa ఒక్క క్షణంలో\fqa*\f* సమాధికి వెళ్తారు. \q1 \v 14 అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! \q2 మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు. \q1 \v 15 మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? \q2 మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు. \q1 \v 16 అయితే వారి వృద్ధి వారి స్వహస్తాలలో లేదు, \q2 కాబట్టి నేను దుష్టుల ప్రణాళికలకు దూరంగా ఉంటాను. \b \q1 \v 17 “అయినా ఎంత తరచుగా దుర్మార్గుల దీపం ఆరిపోతుంది? \q2 దేవుడు తన కోపంలో కేటాయించిన, \q2 విపత్తు ఎంత తరచుగా వారి మీదికి వస్తుంది? \q1 \v 18 వారు ఎంత తరచుగా గాలి ముందు ఉనకలా, \q2 తుఫానుకు కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు? \q1 \v 19 ‘దేవుడు దుష్టుల శిక్షను వారి పిల్లల కోసం దాచి ఉంచుతాడు’ అని చెప్పబడింది. \q2 వారు చేసిన దానిని వారే అనుభవించేలా, \q2 దుష్టులకు ఆయనను తిరిగి చెల్లించనివ్వండి. \q1 \v 20 వారి కళ్లు వారి నాశనాన్ని చూడాలి; \q2 సర్వశక్తిమంతుని ఉగ్రత పాత్రను వారు త్రాగాలి. \q1 \v 21 వారికి నియమించబడిన నెలలు ముగిసిపోయినప్పుడు \q2 వారు విడిచి వెళ్లే తమ కుటుంబాల గురించి వారేమి శ్రద్ధ తీసుకోగలరు? \b \q1 \v 22 “అత్యంత ఉన్నతమైన వారికి ఆయన తీర్పు తీరుస్తారు, \q2 అలాంటి దేవునికి తెలివిని ఎవరైనా బోధించగలరా? \q1 \v 23 ఒక వ్యక్తి పూర్ణ శక్తి, \q2 సంపూర్ణ భద్రత, అభివృద్ధి, \q1 \v 24 బాగా పోషించబడిన శరీరం, \q2 ఎముకల్లో సమృద్ధి మూలిగ కలిగి ఉండి చస్తాడు. \q1 \v 25 మరొకరు ఎన్నడు ఏ మంచిని అనుభవించకుండానే, \q2 మనోవేదనతో చనిపోతారు. \q1 \v 26 మట్టిలో వారు ఒకరి ప్రక్కన ఒకరు పడుకుంటారు, \q2 వారిద్దరిని పురుగులు కప్పివేస్తాయి. \b \q1 \v 27 “మీరేమి ఆలోచిస్తున్నారో, \q2 నామీద ఏ కుట్రలు చేస్తున్నారో నాకు తెలుసు. \q1 \v 28 ‘ఇప్పుడు గొప్పవారి గృహం ఎక్కడ, \q2 దుష్టులు నివసించిన గుడారాలు ఎక్కడ?’ అని మీరంటారు. \q1 \v 29 ప్రయాణం చేసేవారిని మీరు ఎప్పుడు అడగలేదా? \q2 వారు చెప్పినవాటిని మీరు గుర్తుపట్టలేదా? \q1 \v 30 అవేమంటే, విపత్తు దినం నుండి దుష్టులు వదిలి వేయబడతారు, \q2 ఉగ్రత దినం నుండి ఎలా తప్పించుకుంటారు? \q1 \v 31 వారి ముఖం మీదనే వారి ప్రవర్తన గురించి ఎవరు ఖండిస్తారు? \q2 వారు చేసిన వాటికి ఎవరు వారికి తిరిగి చెల్లిస్తారు? \q1 \v 32 వారు సమాధికి మోయబడతారు, \q2 వారి సమాధులపై నిఘా పెట్టబడుతుంది. \q1 \v 33 లోయలోని మట్టి వారికి తీపి; \q2 మనుష్యులంతా వారిని వెంబడిస్తారు, \q2 అలాగే లెక్కలేనంత జనసమూహం వారికి ముందుగా వెళ్తారు. \b \q1 \v 34 “కాబట్టి మీ అర్థంలేని మాటలతో నన్నెలా ఓదార్చగలరు? \q2 మీ సమాధానాలలో అబద్ధం తప్ప మరేమీ లేదు!” \c 22 \s1 ఎలీఫజు \p \v 1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు: \q1 \v 2 “ఒక మనిషి దేవునికేమైనా ప్రయోజనం చేయగలడా? \q2 ఒక జ్ఞానియైన వ్యక్తైనా సరే ఆయనకు ప్రయోజనం చేయగలడా? \q1 \v 3 నీవు నీతిమంతుడవైతే సర్వశక్తిమంతునికి కలిగే ఆనందమేమిటి? \q2 నీ మార్గాలు నిందలేనివైతే ఆయనకు వచ్చే లాభం ఏమిటి? \b \q1 \v 4 “నీకున్న భయభక్తులను బట్టి ఆయన నిన్ను గద్దిస్తారా? \q2 దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తారా? \q1 \v 5 నీ దుష్టత్వం గొప్పది కాదా? \q2 నీ పాపాలు అంతులేనివి కావా? \q1 \v 6 ఏ కారణం లేకుండానే నీ సోదరుల దగ్గర తాకట్టు తీసుకున్నావు; \q2 నీవు ప్రజల బట్టలు లాక్కుని, వారిని నగ్నంగా వదిలివేసావు. \q1 \v 7-8 సొంత భూమి కలిగి ఉండి, నీవు అధికారంలో ఉండి, \q2 ఒక గౌరవం కలిగినవాడవై, స్థాయికి తగినట్టుగా జీవిస్తూ కూడా, \q1 నీవు అలసిపోయినవారికి నీళ్లు ఇవ్వలేదు \q2 ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టకుండ వెనుకకు తీసుకున్నావు. \q1 \v 9 విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసావు \q2 తండ్రిలేనివారి బలాన్ని అణగద్రొక్కావు. \q1 \v 10 అందుకే ఉరులు నిన్ను చుట్టుకున్నాయి, \q2 ఆకస్మిక ప్రమాదం నిన్ను భయపెడుతుంది. \q1 \v 11 అందుకే ఏమీ చూడలేనంతగా చీకట్లు నిన్ను కమ్ముకున్నాయి, \q2 వరదనీరు పొంగి నిన్ను ముంచేస్తున్నాయి. \b \q1 \v 12 “దేవుడు ఎత్తైన ఆకాశాల్లో లేరా? \q2 పైనున్న నక్షత్రాలను చూడు అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయి! \q1 \v 13 అయినా నీవు, ‘దేవునికేమి తెలుసు? \q2 గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం చెప్పగలడా? \q1 \v 14 ఆకాశమండలం పైన ఆయన తిరుగుచున్నాడు కాబట్టి \q2 మేఘాలు ఆయనను కప్పివేశాయి ఆయన చూడలేడు’ అని అంటున్నావు. \q1 \v 15 దుష్టులు నడిచిన పాత మార్గంలోనే \q2 నీవు కూడా నడుస్తావా? \q1 \v 16 తమ గడువు తీరకముందే వారు కొనిపోబడ్డారు, \q2 వారి పునాదులు వరదల్లో కొట్టుకుపోయాయి. \q1 \v 17 దేవుడు వారి గృహాలను మంచివాటితో నింపినప్పటికి \q2 వారు దేవునితో, ‘మమ్మల్ని విడిచిపో! \q1 \v 18 సర్వశక్తిమంతుడైన దేవుడు మాకేమి చేయగలడు?’ అంటారు \q2 కాబట్టి దుర్మార్గుల ప్రణాళికలకు నేను దూరంగా ఉంటాను. \q1 \v 19-20 ‘మన పగవారు నాశనమైపోయారు, \q2 వారి సంపదను అగ్ని కాల్చివేసిందని’ చెప్పుకుంటూ, \q1 ఖచ్చితంగా నీతిమంతులు వారి నాశనాన్ని చూసి సంతోషిస్తారు; \q2 నిర్దోషులు వారిని ఎగతాళి చేస్తారు. \b \q1 \v 21 “దేవునికి లొంగి ఆయనతో నీవు సమాధానంగా ఉండు; \q2 దీనివలన నీకు వృద్ధి కలుగుతుంది. \q1 \v 22 ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అంగీకరించు \q2 ఆయన మాటలను నీ హృదయంలో నిలుపుకో. \q1 \v 23 ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, \q2 నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: \q2 నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి \q1 \v 24 నీ బంగారాన్ని మట్టిలో \q2 ఓఫీరు బంగారాన్ని కనుమల రాళ్లలో పారవేస్తే, \q1 \v 25 అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు బంగారం, \q2 నీకు ప్రశస్తమైన వెండి అవుతాడు. \q1 \v 26 అప్పుడు నీవు ఖచ్చితంగా సర్వశక్తిమంతునిలో ఆనందిస్తావు \q2 దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తుతావు. \q1 \v 27 నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన నీ మనవి వింటారు, \q2 నీవు నీ మ్రొక్కుబడులను చెల్లిస్తావు. \q1 \v 28 నీవు ఏది నిర్ణయించుకొంటే అది నీకు జరుగుతుంది, \q2 నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. \q1 \v 29 ప్రజలు తగ్గించబడినప్పుడు, ‘వారిని పైకి లేవనెత్తు!’ అని నీవు అంటావు \q2 అప్పుడు ఆయన దీనులను రక్షిస్తారు. \q1 \v 30 నిర్దోషి కాని వానిని కూడా ఆయన విడిపిస్తారు, \q2 నీ చేతుల శుద్ధి కారణంగా వారికి విడుదల కలుగుతుంది.” \c 23 \s1 యోబు \p \v 1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు: \q1 \v 2 ఈ రోజు కూడా నా ఫిర్యాదు తీవ్రంగానే ఉంది; \q2 నా మూల్గుల కంటే ఆయన హస్తం నా మీద భారంగా ఉంది. \q1 \v 3 నేను ఆయన నివాసస్థలానికి వెళ్లగలిగేలా; \q2 ఆయన ఎక్కడ కనిపిస్తాడో నాకు తెలిస్తే బాగుండేది కదా! \q1 \v 4 ఆయన ఎదుటే నా ఫిర్యాదేమిటో చెప్పుకుంటాను \q2 వాదోపవాదాలతో నా నోటిని నింపుకుంటాను. \q1 \v 5 ఆయన నాకు ఏమి జవాబు ఇస్తారో తెలుసుకుంటాను, \q2 ఆయన నాకు చెప్పేవాటిని గ్రహిస్తాను. \q1 \v 6 ఆయన తన మహాబలంతో నాతో వాదిస్తారా? \q2 లేదు, ఆయన నా మనవి వింటారు. \q1 \v 7 అక్కడ యథార్థవంతులు ఆయన ముందు వాదించగలరు, \q2 నేను నా న్యాయాధిపతి నుండి శాశ్వతంగా విడుదల పొందుతాను. \b \q1 \v 8 కాని నేను తూర్పుకు వెళ్లినా ఆయన అక్కడ లేరు; \q2 పడమరకు వెళ్లినా నేను ఆయన ఉన్నట్లు గ్రహించలేదు. \q1 \v 9 ఆయన ఉత్తరాన పని చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్లినా నేను ఆయనను చూడలేదు; \q2 ఆయన దక్షిణ వైపుకు తిరిగినప్పుడు, నేనాయనను చూడలేదు. \q1 \v 10 కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు; \q2 ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను. \q1 \v 11 ఆయన అడుగుజాడల్లోనే నా పాదాలు నడిచాయి; \q2 ప్రక్కకు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాను. \q1 \v 12 ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలను నేను విడిచిపెట్టలేదు; \q2 నేను నా అనుదిన ఆహారం కంటే ఆయన నోటి మాటలకే ఎక్కువ విలువనిచ్చాను. \b \q1 \v 13 కాని ఆయన మారనివాడు, ఆయనను ఎవరు మార్చగలరు? \q2 తనకిష్టమైనదే ఆయన చేస్తారు. \q1 \v 14 నాకు వ్యతిరేకంగా తన శాసనాన్ని ఆయన కొనసాగిస్తారు, \q2 ఇలాంటి ఎన్నో ప్రణాళికలు ఆయన దగ్గర ఉన్నాయి. \q1 \v 15 కాబట్టి నేను ఆయన ఎదుట భయపడుతున్నాను, \q2 వీటన్నిటిని ఆలోచించినప్పుడు నేను ఆయనకు భయపడుతున్నాను. \q1 \v 16 దేవుడే నా హృదయం క్రుంగిపోయేలా చేశారు; \q2 సర్వశక్తిమంతుడు నన్ను భయపెట్టారు. \q1 \v 17 చీకటి నన్ను చుట్టుముట్టినా, \q2 దట్టమైన చీకటి నా ముఖాన్ని కమ్మినా నేను నాశనమవ్వలేదు. \b \c 24 \q1 \v 1 “సర్వశక్తిమంతుడు తీర్పుకాలాలను ఎందుకు నియమించరు? \q2 ఆయనను ఎరిగినవారు ఆ కాలాలను ఎందుకు చూడడం లేదు? \q1 \v 2 సరిహద్దు రాళ్లను తీసివేసేవారున్నారు; \q2 వారు దొంగిలించిన మందలను వారు మేపుతారు. \q1 \v 3 తండ్రిలేనివారి గాడిదను తోలుకుపోతారు \q2 విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకెళ్తారు. \q1 \v 4 వారు నిరుపేదలను దారి నుండి గెంటివేస్తారు. \q2 దేశంలో ఉన్న పేదలందరిని దాక్కునేలా చేస్తారు. \q1 \v 5 అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్లు \q2 పేదవారు ఆహారాన్ని వెదుకుతూ తిరుగుతారు; \q2 బంజరు భూమి వారి పిల్లలకు ఆహారాన్ని ఇస్తుంది. \q1 \v 6 వారు పొలాల్లో పశుగ్రాసం సేకరిస్తారు \q2 దుష్టుల ద్రాక్షతోటల్లో రాలిపోయిన వాటిని ఏరుకుంటారు. \q1 \v 7 బట్టలు లేదా, రాత్రంతా దిగంబరంగా గడుపుతారు; \q2 చలికి కప్పుకోడానికి వారికి ఏమి లేదు. \q1 \v 8 పర్వతాలపై జడివానలో వారు తడిసిపోతారు. \q2 నిలువనీడ కోసం బండలను కౌగిలించుకుంటారు. \q1 \v 9 దుష్టుడు తండ్రిలేని పిల్లలను రొమ్ము నుండి లాగివేస్తాడు; \q2 వారు పేదవారి శిశువును తాకట్టుగా తీసుకుంటారు. \q1 \v 10 బట్టలు లేకుండ దిగంబరంగా తిరుగుతారు; \q2 పనలు మోస్తారు కాని ఆకలితోనే ఉంటారు. \q1 \v 11 వారు ఒలీవ చెట్ల వరుసల మధ్య ఒలీవనూనె గానుగను ఆడిస్తారు; \q2 ద్రాక్షగానుగను త్రొక్కుతారు కాని వారు దప్పికతోనే ఉంటారు. \q1 \v 12 పట్టణంలో మరణమూలుగులు వినబడతాయి, \q2 గాయపడినవారి ప్రాణాలు సహాయం కోసం మొరపెడతారు. \q2 అయితే దేవుడు వారి మీద నేరారోపణ చేయడు. \b \q1 \v 13 “వెలుగుమీద తిరుగుబాటు చేసేవారున్నారు, \q2 వారికి దాని మార్గాలు తెలియవు \q2 దాని బాటలో వారు నిలువరు. \q1 \v 14 హంతకుడు చీకటి పడగానే లేస్తాడు \q2 బీదలను నిరుపేదలను చంపుతాడు, \q2 రాత్రివేళ దొంగలా దోచుకొంటాడు. \q1 \v 15 వ్యభిచారి కన్ను సందెచీకటి కోసం ఎదురుచూస్తుంది; \q2 ముఖానికి ముసుగు వేసుకుని, \q2 ‘నన్ను ఎవరు చూడరు’ అని అనుకుంటాడు. \q1 \v 16 దొంగలు రాత్రివేళ ఇళ్ళకు కన్నం వేస్తారు, \q2 పగటివేళ లోపల దాక్కుంటారు; \q2 వారికి వెలుగుతో సంబంధం లేదు. \q1 \v 17 వారందరికి, మధ్యరాత్రే వారి ఉదయం; \q2 వారు చీకటి భయాలతో స్నేహం చేస్తారు. \b \q1 \v 18 “అయినాసరే వారు నీటి మీద నురుగులా ఉన్నారు; \q2 వారి భూభాగం శపించబడింది, \q2 కాబట్టి ఎవరు వారి ద్రాక్షతోట వైపు వెళ్లరు. \q1 \v 19 వేడి కరువు కరిగిన మంచును లాగివేసినట్టు, \q2 పాతాళం పాపం చేసిన వారిని లాగివేస్తుంది. \q1 \v 20 గర్భం వారిని మరచిపోతుంది, \q2 పురుగు వారిపై విందు చేసుకుంటుంది; \q1 దుష్టులు ఇక జ్ఞాపకంలో ఉండరు, \q2 కాని చెట్టు విరిగినట్లు వారు విరిగిపోతారు. \q1 \v 21 వారు గొడ్రాళ్లను పిల్లలు కనని స్త్రీలను బాధితురాళ్లుగా చేస్తారు, \q2 విధవరాలి మీద దయ చూపరు. \q1 \v 22 కానీ దేవుడు తన శక్తితో బలవంతులను లాగుతాడు; \q2 వారు స్థిరపడినప్పటికీ, వారికి జీవితం మీద నమ్మకం లేదు. \q1 \v 23 భద్రతా భావనతో ఆయన వారిని విశ్రాంతి తీసుకోనిస్తారు, \q2 కాని వారి మార్గాలపై ఆయన దృష్టి ఉంచుతారు. \q1 \v 24 వారు కొద్దిసేపు కోసం హెచ్చింపబడతారు, తర్వాత కనుమరుగవుతారు; \q2 వారు పతనం చేయబడి అందరిలాగే పోగుచేయబడతారు; \q2 పండిన వెన్నులా వారు కోయబడతారు. \b \q1 \v 25 “ఒకవేళ ఇదిలా కానట్లైతే, నేను అబద్ధికుడనని \q2 నా మాటలు వట్టివని ఎవరు రుజువు చేయగలరు?” \c 25 \s1 బిల్దదు \p \v 1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు: \q1 \v 2 “అధికారం భీకరత్వం దేవునివే; \q2 ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు. \q1 \v 3 ఆయన సైన్యాలు లెక్కించబడగలవా? \q2 ఎవరి మీద ఆయన వెలుగు ఉదయించదు? \q1 \v 4 అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు? \q2 అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు? \q1 \v 5 ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు; \q2 నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు. \q1 \v 6 పురుగువంటి మనుష్యుడు \q2 క్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!” \c 26 \s1 యోబు \p \v 1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు: \q1 \v 2 “శక్తిలేనివారికి నీవు ఎంత సహాయం చేశావు! \q2 బలహీనమైన చేతిని నీవు రక్షించావా? \q1 \v 3 జ్ఞానం లేనివారికి నీవు ఎలాంటి ఆలోచన చెప్పావు? \q2 ఎంత చక్కగా వివరించావు? \q1 \v 4 ఈ మాటలు చెప్పడానికి నీకు ఎవరు సహాయం చేశారు? \q2 ఎవరి మనస్సులోని మాటలు నీ నోటి నుండి వచ్చాయి? \b \q1 \v 5 “జలాల క్రింద, వాటిలో జీవించే జీవుల క్రింద ఉన్న మృతులు, \q2 మృతులు వణుకుతున్నారు. \q1 \v 6 పాతాళలోకం దేవుని ఎదుట తెరిచి ఉంది; \q2 నరకం\f + \fr 26:6 \fr*\ft హెబ్రీలో \ft*\fqa అబద్దోను\fqa*\f* ఆయనకు తేటగా కనిపిస్తుంది. \q1 \v 7 శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు; \q2 శూన్యంలో భూమిని వేలాడదీసారు. \q1 \v 8 ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు \q2 అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు. \q1 \v 9 దాని మీద మేఘాలను వ్యాపింపజేసి \q2 ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు. \q1 \v 10 వెలుగు చీకట్ల సరిహద్దు వరకు \q2 జలాలకు ఆయన హద్దును నియమించారు. \q1 \v 11 ఆయన గద్దింపుకు \q2 ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి. \q1 \v 12 ఆయన బలం చేత సముద్రం ఉప్పొంగుతుంది; \q2 తన జ్ఞానం చేత రాహాబును ముక్కలుగా చేస్తారు. \q1 \v 13 ఆయన ఊపిరిచే ఆకాశాలు అలంకరించబడతాయి; \q2 ఆయన చేయి పారిపోతున్న సర్పాన్ని పొడిచింది. \q1 \v 14 ఇవన్నీ ఆయన చేసినపనులలో కొంతవరకు మాత్రమే; \q2 మనం ఆయన గురించి విన్నది కేవలం గుసగుస ధ్వని వంటిది మాత్రమే! \q2 అలాంటప్పుడు ఆయన శక్తి యొక్క ఉరుమును గ్రహించగలిగిన వారెవరు?” \c 27 \s1 యోబు తన స్నేహితులకు చెప్పిన చివరి మాటలు \p \v 1 యోబు ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు: \q1 \v 2 “నాకు న్యాయం నిరాకరించిన సజీవుడైన దేవుని మీద, \q2 నా జీవితాన్ని చేదుగా మార్చిన సర్వశక్తిమంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, \q1 \v 3 నాలో ప్రాణం ఉన్నంత వరకు, \q2 నా నాసికా రంధ్రాల్లో దేవుని ఊపిరి ఉన్నంత వరకు, \q1 \v 4 నా పెదవులు చెడుదేది మాట్లాడవు, \q2 నా నాలుక అబద్ధాలు పలకదు. \q1 \v 5 మీరు చెప్పేది సరియైనదంటే నేనొప్పుకోను; \q2 నేను చనిపోయే వరకు, నా నిజాయితీని విడిచిపెట్టను. \q1 \v 6 నేను నా నిర్దోషత్వాన్ని కొనసాగిస్తాను దానిని ఎప్పటికీ వదలను; \q2 నేను బ్రతికిన కాలమంతా నా మనస్సాక్షి నన్ను నిందించదు. \b \q1 \v 7 “నా శత్రువు దుష్టునిలా, \q2 నా విరోధి అన్యాయస్థునిలా ఉండును గాక! \q1 \v 8 భక్తిహీనులు కొట్టివేయబడిన తర్వాత, \q2 దేవుడు వారి ప్రాణాలను తీసివేసిన తర్వాత వారికి ఇంకేమి ఆశ ఉంది? \q1 \v 9 వారి మీదికి ఆపద వచ్చినప్పుడు \q2 దేవుడు వారి మొర ఆలకిస్తారా? \q1 \v 10 సర్వశక్తిమంతునిలో వారు ఆనందం పొందుతారా? \q2 అన్నివేళల్లో వారు దేవునికి మొరపెడతారా? \b \q1 \v 11 “దేవుని శక్తిని గురించి నేను మీకు ఉపదేశిస్తాను; \q2 సర్వశక్తిమంతుని మార్గాలను నేను దాచిపెట్టను. \q1 \v 12 మీరే దానిని చూశారు. \q2 అలాంటప్పుడు ఈ అర్థంలేని సంభాషణ ఎందుకు? \b \q1 \v 13 “దుష్టులైన మనుష్యులకు దేవుడు ఇచ్చే భాగం; \q2 సర్వశక్తుని నుండి వారు పొందే వారసత్వం: \q1 \v 14 వారికి ఎంతమంది పిల్లలున్నా, ఖడ్గం వారి గతి; \q2 వారి సంతతికి కడుపునిండా తిండి దొరకదు. \q1 \v 15 వారికి మిగిలిన వారు తెగులుచేత పాతిపెట్టబడతారు, \q2 వారి విధవరాండ్రు వారి కోసం రోదించరు. \q1 \v 16 దుమ్ము పోగుచేసినట్లు వెండిని పోగుచేసినా \q2 మట్టివలె బట్టలను కుప్పగా వేసినా \q1 \v 17 వారు పోగుచేసిన వాటిని నీతిమంతులు ధరిస్తారు, \q2 నిర్దోషులు వారి వెండిని పంచుకుంటారు. \q1 \v 18 వారు కట్టుకునే ఇల్లు పురుగుల గూడులా, \q2 కావలివారు వేసుకునే గుడిసెలా ఉంటాయి. \q1 \v 19 వారు ధనవంతులుగా పడుకుంటారు, \q2 కాని వారు మేల్కొన్నప్పుడు వారి సంపద అంతా పోయిందని వారు కనుగొంటారు. \q1 \v 20 భీభత్సం వారిని వరదలా ముంచెత్తుతుంది; \q2 తుఫాను రాత్రివేళ వారిని లాక్కుని పోతుంది. \q1 \v 21 తూర్పు గాలి వారిని తీసుకెళ్తే, వారిక ఉండరు; \q2 అది వారి స్థలం నుండి వారిని తుడిచివేస్తుంది. \q1 \v 22 వారు దాని శక్తి నుండి తలక్రిందులుగా పారిపోతున్నప్పుడు \q2 అది దయ లేకుండా వారికి వ్యతిరేకంగా తిరుగుతుంది. \q1 \v 23 అది ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతుంది \q2 వారి స్థలం నుండి వారిని ఊదివేస్తుంది.” \c 28 \s1 విరామం: జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది \q1 \v 1 వెండికి గని ఉన్నది \q2 బంగారాన్ని పుటం వేయడానికి ఒక స్థలం ఉన్నది. \q1 \v 2 ఇనుము మట్టిలో నుండి తీయబడుతుంది, \q2 ధాతువు కరిగించి రాగి తీస్తారు. \q1 \v 3 చీకటిలో కాంతిని ఎలా ప్రకాశింప చేయాలో మానవులకు తెలుసు; \q2 ధాతువు కోసం చీకటిలో శోధిస్తున్నప్పుడు \q2 భూమి యొక్క సుదూర ప్రాంతాలను అన్వేషిస్తారు. \q1 \v 4 మనుష్యుల నివాస స్థలాలకు దూరంగా, \q2 మానవ అడుగులు పడని చోట్లలో; \q2 వ్రేలాడుతూ ఊగుతూ సొరంగాలు త్రవ్వుతారు. \q1 \v 5 భూమిపై ఆహారం పెంచబడుతుంది, \q2 కాని దాని లోపలి భాగం అగ్నికి కరిగిపోయి ఉంటుంది. \q1 \v 6 దాని రాళ్లల్లో నీలమణులుంటాయి. \q2 దాని మట్టిలో బంగారం ఉంటుంది. \q1 \v 7 దాని త్రోవ ఏ గ్రద్దకు తెలియదు, \q2 డేగ కన్ను కూడా దానిని చూడలేదు. \q1 \v 8 గర్వంగల క్రూరమృగాలు ఆ దారిలో అడుగుపెట్టలేదు, \q2 ఏ సింహం అక్కడ నడవలేదు. \q1 \v 9 మనుష్యులు తమ చేతులతో చెకుముకిరాయి మీద దాడి చేస్తారు. \q2 కొండలను వాటి పునాదులతో సహా పెకిలించి వేస్తారు. \q1 \v 10 బండలో వారు సొరంగం త్రవ్వుతారు. \q2 దాని నిధులను వారి కళ్లు పసిగడుతుంది. \q1 \v 11 వారు నదుల మూలాలను శోధిస్తారు, \q2 మరుగున పడి ఉన్నవాటిని వెలుగులోనికి తెస్తారు. \b \q1 \v 12 అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? \q2 అవగాహన ఎక్కడ నివసిస్తుంది? \q1 \v 13 ఏ మానవుడు దాని విలువను అర్థం చేసుకోడు; \q2 అది సజీవుల దేశంలో దొరకదు. \q1 \v 14 “అది నాలో లేదు” అని అగాధం అంటుంది; \q2 “అది నాలో లేదు” అని సముద్రం అంటుంది. \q1 \v 15 మేలిమి బంగారంతో దానిని కొనలేము, \q2 దాని వెలకు సరిపడా వెండిని తూచలేము. \q1 \v 16 ఓఫీరు బంగారంతోనైనా విలువైన గోమేధికంతోనైనా \q2 నీలమణితోనైనా దానిని కొనలేము. \q1 \v 17 బంగారాన్ని కాని స్ఫటికాన్ని కాని దానితో పోల్చలేము; \q2 బంగారు ఆభరణాలతో కూడా దాన్ని పొందలేము. \q1 \v 18 పగడము చంద్రకాంత శిల ప్రస్తావించదగినవి కావు; \q2 జ్ఞానం యొక్క ధర మాణిక్యాలకు మించినది.\f + \fr 28:18 \fr*\ft ఈ ప్రశస్తమైన రాళ్ల పేర్లను క్లుప్తీకరించడం కష్టం\ft*\f* \q1 \v 19 కూషుదేశపు విలువైన రాయిని దానితో పోల్చలేము; \q2 శుద్ధమైన బంగారంతో కూడా దానిని కొనలేము. \b \q1 \v 20 అలాగైతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? \q2 అవగాహన ఎక్కడ నివసిస్తుంది? \q1 \v 21 అది జీవులన్నిటి కళ్ళ నుండి దాచబడింది, \q2 ఆకాశపక్షుల నుండి కూడా అది దాచిపెట్టబడింది. \q1 \v 22 “కేవలం దాని గురించిన వదంతిని విన్నాము” \q2 నరకము\f + \fr 28:22 \fr*\ft హెబ్రీలో \ft*\fqa అబద్దోను\fqa*\f* మృత్యువు అంటాయి. \q1 \v 23 దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తారు \q2 అది ఎక్కడుండేది ఆయనకే తెలుసు. \q1 \v 24 ఎందుకంటే ఆయన భూమి అంచుల వరకు చూస్తున్నారు \q2 ఆకాశాల క్రింద ఉన్న ప్రతిదీ ఆయన చూస్తున్నారు. \q1 \v 25 ఆయన గాలి ప్రభావాన్ని స్థాపించినప్పుడు \q2 జలములను కొలిచినప్పుడు, \q1 \v 26 వర్షపాతానికి శాసనాన్ని విధించినప్పుడు \q2 ఉరుములతో కూడిన మెరుపులకు దారిని ఏర్పరచినప్పుడు, \q1 \v 27 అప్పుడు ఆయన జ్ఞానం వైపు చూశాడు దానిని అంచనా వేశాడు; \q2 ఆయన దానిని ధృవీకరించారు పరీక్షించారు. \q1 \v 28 అంతేకాక మనుష్యజాతితో, \q2 “యెహోవాకు భయపడడమే జ్ఞానం \q2 దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం” అని అన్నాడు. \c 29 \s1 యోబు చివరి వాదన \p \v 1 యోబు ఇంకా ఈ విధంగా మాట్లాడాడు: \q1 \v 2 “గడచిన నెలల్లో ఉన్నట్లు, \q2 దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్లు నేను ఉంటే ఎంత బాగుండేది, \q1 \v 3 ఆయన దీపం నా తలపై వెలిగినప్పుడు \q2 ఆయన వెలుగును బట్టి చీకటిలో నేను నడిచాను! \q1 \v 4 నేను నా అత్యంత ఉత్పాదక సమయంలో ఉన్నాను, \q2 దేవుని సన్నిహిత స్నేహం నా ఇంటిని దీవించినప్పుడు, \q1 \v 5 సర్వశక్తిమంతుడు ఇంకా నాతో ఉన్నప్పుడు \q2 నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. \q1 \v 6 నా అడుగులు మీగడలో మునిగాయి, \q2 బండ నుండి నా కోసం ఒలీవనూనె ప్రవహించేది. \b \q1 \v 7 “నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు, \q2 రాజవీధిలో నా స్థానంలో కూర్చున్నప్పుడు, \q1 \v 8 యువకులు నన్ను చూసి తప్పుకునేవారు \q2 వృద్ధులు లేచి నిలబడేవారు; \q1 \v 9 అధికారులు మాట్లాడడం ఆపివేసి, \q2 తమ చేతులతో నోటిని కప్పుకునేవారు; \q1 \v 10 ప్రధానులు మౌనంగా ఉండేవారు. \q2 వారి నాలుకలు వారి అంగిటికి అంటుకుపోయాయి. \q1 \v 11 నా గురించి విన్న వారు నన్ను ప్రశంసించారు, \q2 నన్ను చూసినవారు నా గురించి చెప్పారు, \q1 \v 12 ఎందుకంటే సహాయం కోసం మొరపెట్టిన బీదలను, \q2 తమను చూసుకోవడానికి ఎవరూ లేని తండ్రిలేనివారిని నేను రక్షించాను. \q1 \v 13 చనిపోబోతున్నవారు నన్ను దీవించారు; \q2 విధవరాండ్ర హృదయాలు సంతోషించేలా చేశాను. \q1 \v 14 నేను నీతిని నా దుస్తులుగా ధరించాను; \q2 న్యాయం నాకు వస్త్రం నా తలపాగా అయ్యింది. \q1 \v 15 గ్రుడ్డివారికి నేను కళ్లలా \q2 కుంటివారికి పాదాల్లా ఉన్నాను. \q1 \v 16 నిరుపేదలకు నేను తండ్రిగా ఉన్నాను; \q2 అపరిచితుల పక్షంగా వాదించడానికి ఒప్పుకున్నాను. \q1 \v 17 దుష్టుల కోరలు విరగ్గొట్టాను \q2 వారి పళ్ళ నుండి బాధితులను విడిపించాను. \b \q1 \v 18 “అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ‘నా ఇంట్లోనే నేను చనిపోతాను, \q2 నా రోజులు ఇసుక రేణువుల్లా ఉంటాయి. \q1 \v 19 నా వేర్లు నీటిని తాకుతాయి, \q2 నా కొమ్మల మీద రాత్రంతా మంచు కురుస్తుంది. \q1 \v 20 నా ఘనత ఎప్పటికీ తగ్గదు; \q2 నా చేతిలో నా విల్లు ఎప్పుడూ క్రొత్తదిగానే ఉంటుంది.’ \b \q1 \v 21 “ప్రజలు నేను చెప్పేది ఆశగా వినేవారు, \q2 నా సలహా కోసం మౌనంగా ఎదురు చూసేవారు. \q1 \v 22 నేను మాట్లాడిన తర్వాత, వారికిక ఏమి మాట్లాడలేదు; \q2 నా మాటలు మృదువుగా వారి చెవులకు చేరాయి. \q1 \v 23 వర్షం కోసం చూసినట్లు వారు నా కోసం ఎదురు చూశారు, \q2 కడవరి వర్షంలా వారు నా మాటలు త్రాగారు. \q1 \v 24 నేను వారిని చూసి నవ్వినప్పుడు; \q2 వారు కష్టంగా దాన్ని నమ్మారు; \q2 నా ముఖకాంతి వారికి ప్రశస్తమైనది. \q1 \v 25 వారికి నేనే పెద్దగా కూర్చుని వారి కోసం మార్గం ఏర్పరిచాను; \q2 సైన్యం మధ్యలో ఉండే రాజులా, \q2 దుఃఖంలో ఉన్నవారిని ఆదరించేవానిగా నేనున్నాను. \b \c 30 \q1 \v 1 “అయితే ఇప్పుడు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, \q2 నాకన్నా చిన్నవారు, \q1 ఎవరి తండ్రులను నేను \q2 నా గొర్రెలు కాసే కుక్కలతో పెట్టడానికి అసహ్యించుకునేవాన్ని. \q1 \v 2 వారి చేతుల బలం వల్ల నాకేమి ఉపయోగం? \q2 వారు బలం నశించిపోయిన పురుషులు. \q1 \v 3 లేమితో ఆకలితో బక్కచిక్కినవారై, \q2 పొడిగా ఉన్న భూమిపై తిరుగులాడారు \q2 రాత్రివేళ నిర్జనమైన బంజరు భూములలో. \q1 \v 4 ఆకుల పొదల్లో ఉప్పు మూలికలు సేకరించారు, \q2 బదరీ వేర్లు వారికి ఆహారము. \q1 \v 5 వారు మానవ సమాజం మధ్య నుండి వెళ్లగొట్టబడ్డారు, \q2 వారు దొంగలైనట్టు వారిపై కేకలు వేశారు. \q1 \v 6 కాబట్టి ఇప్పుడు వారు భయపెట్టే లోయల్లో, \q2 బండల మధ్య గుహల్లో నివసిస్తున్నారు. \q1 \v 7 వారు పొదల మధ్య విరుచుకుపడ్డారు \q2 ముండ్లకంపల క్రింద ఒక్కటిగా పోగయ్యారు. \q1 \v 8 పేరు లేని బుద్ధిహీనుల కుమారులు \q2 వారు దేశం నుండి తరిమివేయబడ్డారు. \b \q1 \v 9 “అలాంటి వారికి నేను హేళన పాట అయ్యాను; \q2 వారికి నేను ఓ సామెతను అయ్యాను. \q1 \v 10 వారు నన్ను చూసి అసహ్యించుకుని దూరంగా జరుగుతున్నారు; \q2 నా ముఖం మీద ఉమ్మివేయడానికి కూడా వెనుకాడరు. \q1 \v 11 దేవుడు నా విల్లును విప్పి నన్ను బాధపెట్టారు, \q2 వారు నా సమక్షంలో సంయమనాన్ని వదిలేశారు. \q1 \v 12 నా కుడి వైపున తెగ దాడులు; \q2 వారు నా పాదాలకు వలలు వేస్తారు, \q2 నాకు వ్యతిరేకంగా తమ నాశన ప్రయత్నాలను చేస్తున్నారు. \q1 \v 13 నా మార్గాన్ని పాడుచేస్తున్నారు; \q2 నన్ను నాశనం చేయడంలో వారు విజయం సాధించారు. \q2 వారిని అడ్డుకునేవారు లేరు. \q1 \v 14 గండిపడిన పెద్ద ప్రవాహంవలె వారు వస్తారు; \q2 పతనంలా వారు దొర్లుతూ వస్తారు. \q1 \v 15 భయాలు నన్ను ముంచెత్తుతాయి; \q2 నా గౌరవం గాలిలా తరిమివేయబడింది, \q2 నా భద్రత మేఘంలా అదృశ్యమవుతుంది. \b \q1 \v 16 “ఇప్పుడు నా జీవితం దూరమవుతుంది; \q2 శ్రమ దినాలు నన్ను పట్టుకున్నాయి. \q1 \v 17 రాత్రి నా ఎముకలను పొడుస్తూ ఉంది; \q2 నన్ను కొరికివేస్తున్న నొప్పి ఆగడమే లేదు. \q1 \v 18 తన గొప్ప శక్తితో దేవుడు నాకు దుస్తుల్లా\f + \fr 30:18 \fr*\ft కొ.ప్రా.లలో \ft*\fqa నా దుస్తులతో నన్ను పట్టుకుంటారు\fqa*\f* అవుతాడు; \q2 నా చొక్కా మెడవలె ఆయన నన్ను బంధిస్తారు. \q1 \v 19 ఆయన నన్ను బురదలో పడవేశారు, \q2 నేను దుమ్ము బూడిదగా అయ్యాను. \b \q1 \v 20 “దేవా, నేను మీకు మొరపెడతాను, కాని మీరు జవాబు ఇవ్వరు; \q2 నేను నిలబడతాను అయినా మీరు నన్ను ఊర్కెనే చూస్తారు. \q1 \v 21 నా పట్ల మీరు కఠినంగా మారారు; \q2 మీ బాహువు బలం చేత నా మీద దాడి చేస్తావు. \q1 \v 22 నీవు నన్ను లాక్కుని గాలి ముందు నడిపిస్తావు; \q2 నీవు తుఫానులో నన్ను విసిరివేస్తావు. \q1 \v 23 సజీవులందరి కోసం నియమించబడిన స్థలమైన, \q2 మరణానికి నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలుసు. \b \q1 \v 24 “విరిగిన వ్యక్తి తన బాధలో సహాయం కోసం \q2 కేకలు వేసినప్పుడు ఖచ్చితంగా ఎవరూ చేయి వేయరు. \q1 \v 25 ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం నేను ఏడవలేదా? \q2 పేదవారిని చూసి నా ప్రాణం దుఃఖపడలేదా? \q1 \v 26 అయినాసరే నేను మేలు జరుగుతుందని ఆశిస్తే, కీడు జరిగింది; \q2 నేను వెలుగు కోసం చూస్తే, చీకటి వచ్చింది. \q1 \v 27 నా లోపల చిందరవందర ఎప్పుడూ ఆగదు; \q2 శ్రమ దినాలు నాకెదురయ్యాయి. \q1 \v 28 నేను నల్లబడతాను, కాని సూర్యుని ద్వారా కాదు; \q2 నేను సమాజంలో నిలబడి సహాయం కోసం మొరపెడతాను. \q1 \v 29 నేను నక్కలకు సోదరుడనయ్యాను, \q2 గుడ్లగూబలకు సహచరుడనయ్యాను. \q1 \v 30 నా చర్మం నల్లబడి రాలిపోతుంది; \q2 నా శరీరం జ్వరంతో కాలిపోతుంది. \q1 \v 31 నా వీణ దుఃఖానికి, \q2 నా పిల్లనగ్రోవి రోదన ధ్వనికి శ్రుతి చేయబడింది. \b \c 31 \q1 \v 1 “యవ్వనస్త్రీని కామదృష్టితో చూడనని \q2 నేను నా కళ్లతో ఒడంబడిక చేసుకున్నాను. \q1 \v 2 పైనున్న దేవుని నుండి మనకు ఉన్న భాగం, \q2 ఉన్నతస్థలంలోని సర్వశక్తిమంతుని నుండి మన వారసత్వమేమి? \q1 \v 3 అది దుష్టులకు పతనం, \q2 తప్పు చేసేవారికి విపత్తు కాదా? \q1 \v 4 ఆయన నా మార్గాలను చూడరా \q2 నా ప్రతి అడుగును లెక్కించరా? \b \q1 \v 5 “ఒకవేళ నేను అబద్ధంతో నడచి ఉంటే \q2 మోసం వైపు నా పాదం తొందరపడి ఉంటే \q1 \v 6 దేవుడు నన్ను న్యాయ త్రాసులో తూచును గాక, \q2 అప్పుడు నేను నిందారహితుడనని ఆయన తెలుసుకుంటారు. \q1 \v 7 ఒకవేళ నా అడుగులు త్రోవ నుండి తొలగి ఉంటే, \q2 ఒకవేళ నా హృదయం నా కళ్ల చేత నడిపించబడి ఉంటే, \q2 నా చేతులు అపవిత్రం అయి ఉంటే, \q1 \v 8 అప్పుడు నేను విత్తిన దానిని ఇతరులు తిందురు గాక, \q2 నా పంటలు పెరికివేయబడును గాక. \b \q1 \v 9 “ఒకవేళ నా హృదయంలో నేను పరస్త్రీని చేత మోహించినా, \q2 నేను నా పొరుగువాని తలుపు దగ్గర వాని భార్య కోసం పొంచి ఉంటే, \q1 \v 10 నా భార్య వేరొకని ధాన్యాన్ని రుబ్బును గాక, \q2 ఇతర పురుషులు ఆమెతో పడుకొందురు గాక. \q1 \v 11 ఎందుకంటే అది దుష్టత్వం అవుతుంది, \q2 ఒక శిక్షించవలసిన పాపము. \q1 \v 12 అది నాశనమయ్యే వరకు దహించివేసే అగ్ని; \q2 అది నా ఆదాయాన్ని సమూలంగా నాశనం చేసి ఉండేది. \b \q1 \v 13 “ఒకవేళ నా పనివారిలో ఎవరికైనా, \q2 ఆడవారికైనా లేదా మగవారికైనా నా మీద ఆయాసం ఉన్నప్పుడు, \q2 నేను వారికి న్యాయం నిరాకరించి ఉంటే, \q1 \v 14 దేవుడు నన్ను నిలదీసినప్పుడు నేను ఏమి చేస్తాను? \q2 లెక్క అప్పగించడానికి నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబు చెప్తాను? \q1 \v 15 గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించలేదా? \q2 మా తల్లుల గర్భాల్లో మమ్మల్ని రూపించినవాడు ఒకడు కాదా? \b \q1 \v 16 “ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినా \q2 విధవరాండ్ర కళ్లు అలసిపోయేలా చేసినా, \q1 \v 17 ఒకవేళ అనాధలకు పెట్టకుండా \q2 నేనే ఒంటరిగా భోజనం చేసినా \q1 \v 18 కాని నా యవ్వనకాలం నుండి నేను వారిని తండ్రిలా పోషించాను, \q2 నేను పుట్టినప్పటి నుండి విధవరాండ్రకు దారి చూపించాను; \q1 \v 19 ఎవరైనా వేసుకోవడానికి బట్టలు లేక, \q2 కప్పుకోడానికి వస్త్రాలు లేక చావడం నేను చూసినప్పుడు, \q1 \v 20 నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను, \q2 అయినా వారి హృదయాలు నన్ను దీవించలేదు, \q1 \v 21 నాకు న్యాయస్థానంలో పలుకుబడి ఉందని తెలిసి, \q2 ఒకవేళ అనాధలకు వ్యతిరేకంగా నేను నా చేయి ఎత్తితే, \q1 \v 22 అప్పుడు నా చేతులు భుజాల నుండి పడిపోవును గాక, \q2 దాని కీళ్ల దగ్గర విడిపోవును గాక. \q1 \v 23 దేవుని నుండి వచ్చే నాశనానికి భయపడి, \q2 ఆయన మహాత్మ్యం పట్ల ఉన్న భయాన్ని బట్టి నేను అలాంటి వాటిని చేయలేదు. \b \q1 \v 24 “నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా, \q2 ‘నీవే నా భద్రత’ అని మేలిమి బంగారంతో చెప్పినా, \q1 \v 25 ఒకవేళ నా గొప్ప ఆస్తిని బట్టి, \q2 నా చేతులు సంపాదించిన ఐశ్వర్యాన్ని బట్టి నేను సంతోషిస్తే, \q1 \v 26 నేను సూర్యుడిని దాని ప్రకాశంలో \q2 చంద్రుడు వైభవంలో కదులుతున్నట్లు భావించి, \q1 \v 27 నా హృదయం రహస్యంగా ఆకర్షించబడి \q2 నా చేతితో గౌరవ సూచకమైన ముద్దు ఇచ్చి ఉంటే, \q1 \v 28 అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి, \q2 ఎందుకంటే పైనున్న దేవునికి నేను నమ్మకద్రోహిని అవుతాను. \b \q1 \v 29 “ఒకవేళ నా శత్రువు నాశనాన్ని బట్టి నేను సంతోషిస్తే \q2 వారికి ఏర్పడిన ఇబ్బందిని బట్టి నేను ఆనందిస్తే, \q1 \v 30 వారి జీవితానికి వ్యతిరేకంగా శాపం పెట్టడం ద్వారా \q2 నా నోటిని పాపానికి అనుమతించలేదు \q1 \v 31 ‘యోబు పెట్టిన ఆహారం తిని తృప్తి పొందనివారే ఉన్నారు?’ \q2 అని నా ఇంటివారు ఎన్నడు అనలేదా \q1 \v 32 ఏ అపరిచితున్ని రాత్రివేళ వీధుల్లో గడపనివ్వలేదు, \q2 ఎందుకంటే బాటసారులకు నా ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది \q1 \v 33 మనుష్యులు చేసినట్లు,\f + \fr 31:33 \fr*\ft లేదా \ft*\fqa ఆదాము చేసినట్లు\fqa*\f* నేను నా దోషాన్ని నా హృదయంలో కప్పిపుస్తూ, \q2 నేను నా పాపాన్ని దాచే ప్రయత్నం చేశానా? \q1 \v 34 నేను గుంపులకు భయపడి గాని \q2 వంశాల ధిక్కారానికి బెదిరిపోయి గాని \q2 నేను బయటకు వెళ్లకుండా మౌనంగా ఉండిపోయానా? \b \q1 \v 35 “ఓహో, నేను చెప్తుంది వినడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండేది! \q2 నా ప్రతిపాదన మీద సంతకం పెట్టాను, సర్వశక్తిమంతుడు నాకు జవాబు చెప్పును గాక; \q2 నన్ను నిందించేవాడు తన అభియోగాన్ని వ్రాసి ఇచ్చును గాక. \q1 \v 36 ఖచ్చితంగా నేను దానిని నా భుజం మీద ధరిస్తాను, \q2 నేను దానిని కిరీటంగా పెట్టుకుంటాను. \q1 \v 37 ఆయనకు నా ప్రతి అడుగును గురించిన లెక్క అప్పగిస్తాను, \q2 పాలకునికి అయినట్టుగా నేను దానిని ఆయనకు సమర్పిస్తాను. \b \q1 \v 38 “నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేసి ఉంటే \q2 దున్నిన నేలంతా దాని కన్నీటితో తడిసిపోయి ఉంటే, \q1 \v 39 వెల చెల్లించకుండా దాని పంటను మ్రింగివేసినా \q2 దాని యజమానులకు ప్రాణాపాయం తల పెట్టినా, \q1 \v 40 అప్పుడు గోధుమలకు బదులుగా ముళ్ళపొదలు \q2 యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక.” \p యోబు తన మాటలు ముగించాడు. \c 32 \s1 ఎలీహు \p \v 1 యోబు తన దృష్టిలో తాను నీతిమంతునిగా ఉన్నాడని గ్రహించిన ఆ ముగ్గురూ అతనికి సమాధానం ఇవ్వడం మానేశారు. \v 2 దేవుని కంటే తాను ఎక్కువ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడని, రాము వంశస్థుడును, బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు యోబు మీద చాలా కోప్పడ్డాడు. \v 3 అతడు ముగ్గురు మిత్రులపై కూడా కోపంగా ఉన్నాడు, ఎందుకంటే వారు యోబు తప్పు అని నిరూపించడం చేతకాకపోయినా, వారు అతన్ని ఖండించారు.\f + \fr 32:3 \fr*\ft ప్రా.ప్ర.లలో \ft*\fqa యోబును, తద్వార దేవున్ని ఖండించారు\fqa*\f* \v 4 వారందరు తనకన్నా పెద్దవారు కాబట్టి యోబుతో మాట్లాడాలని ఎలీహు ఎదురుచూశాడు. \v 5 కాని ఆ ముగ్గురు స్నేహితులు ఇంకేమి మాట్లాడకపోవడంతో అతనికి చాలా కోపం వచ్చింది. \p \v 6 బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు ఇలా అన్నాడు: \q1 నేను వయస్సులో చిన్నవాన్ని, \q2 మీరు పెద్దవారు; \q1 అందుకే నేను భయపడ్డాను, \q2 నేను అనుకున్నది మీతో చెప్పడానికి ధైర్యం చేయలేదు. \q1 \v 7 ముందుగా వయస్సు మాట్లాడాలి; \q2 గడచిన సంవత్సరాలు జ్ఞానం బోధించాలని నేననుకున్నాను. \q1 \v 8 అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ, \q2 సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది. \q1 \v 9 కేవలం వృద్ధులే జ్ఞానులు కారు, \q2 పెద్ద వయస్సు వారే వివేచన గలవారని కాదు. \b \q1 \v 10 కాబట్టి నేను చెప్తున్న: నేను చెప్పేది వినండి; \q2 నాకు తెలిసింది మీకు చెప్తాను. \q1 \v 11 మాట్లాడడానికి మీరు మాటల కోసం వెదకుతున్నప్పుడు, \q2 మీ మాటల కోసం నేను వేచి ఉన్నాను; \q1 నేను మీ అభిప్రాయాలను విన్నాను, \q2 \v 12 మీరు చెప్పేవాటిని నేను జాగ్రత్తగా విన్నాను; \q1 అయితే మీలో ఒక్కరు కూడా యోబు తప్పు అని నిరూపించలేదు; \q2 అతని వాదనలకు ఎవరూ జవాబు చెప్పలేదు. \q1 \v 13 మాకు జ్ఞానం లభించింది; \q2 మనుష్యులు కాదు, దేవుడే అతన్ని తప్పు అని నిరూపించాలని మీరు అనకండి. \q1 \v 14 కాని యోబు నాతో వాదించలేదు, \q2 మీ వాదనలతో నేను అతనికి జవాబు ఇవ్వను. \b \q1 \v 15 వారు ఆశ్చర్యపడి ఇక ఏమి చెప్పలేదు; \q2 వారికి మాటలు దొరకలేదు. \q1 \v 16 వారు జవాబేమి చెప్పలేదా అలా ఉండిపోయారు, \q2 వారు మౌనంగా ఉండగా నేను ఇంకా వేచి ఉండాలా? \q1 \v 17 నేను కూడా చెప్పాల్సింది చెప్తాను; \q2 నేను కూడా నాకు తెలిసింది చెప్తాను. \q1 \v 18 ఎందుకంటే నా మనస్సునిండ మాటలున్నాయి, \q2 నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తోంది. \q1 \v 19 నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలా ఉంది, \q2 క్రొత్త తిత్తివలె అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. \q1 \v 20 నేను మాట్లాడి ఉపశమనం పొందాలి; \q2 నా నోరు తెరచి సమాధానం ఇస్తాను. \q1 \v 21 నేను పక్షపాతం చూపించను, \q2 ఏ మనుష్యుని పొగడను; \q1 \v 22 ఎలా పొగడాలో నాకు చేతకాదు. ఒకవేళ నేను అలా పొగిడితే \q2 వెంటనే నా సృష్టికర్త నన్ను చంపుతారు. \b \c 33 \q1 \v 1 “యోబూ, ఇప్పుడు నా మాటలు విను; \q2 నేను చెప్పే ప్రతిదాన్ని ఆలకించు. \q1 \v 2 నేను నోరు తెరిచి మాట్లాడబోతున్నాను; \q2 నా మాటలు నా నాలుక చివర ఉన్నాయి. \q1 \v 3 యథార్థమైన హృదయం నుండి నా మాటలు వస్తున్నాయి; \q2 నాకు తెలిసిన దానిని నా పెదవులు నిష్కపటంగా పలుకుతాయి. \q1 \v 4 దేవుని ఆత్మ నన్ను సృష్టించింది; \q2 సర్వశక్తిమంతుని ఊపిరి నాకు జీవమిచ్చింది. \q1 \v 5 నీకు చేతనైతే నాకు జవాబు చెప్పు; \q2 నా ముందు నిలబడి నీ వాదన వినిపించు. \q1 \v 6 దేవుని దృష్టిలో నీవెంతో నేను అంతే; \q2 నేను కూడా మట్టితో చేయబడ్డాను. \q1 \v 7 నా భయం నిన్ను భయపెట్టకూడదు, \q2 నా చేయి నీ మీద భారంగా ఉండకూడదు. \b \q1 \v 8 “నేను వింటుండగా నీవు మాట్లాడావు \q2 నీ మాటలు నేను విన్నాను. \q1 \v 9 అవేమిటంటే, ‘నేను పవిత్రుడను, ఏ తప్పు చేయలేదు; \q2 నేను శుద్ధుడను పాపం లేనివాడను. \q1 \v 10 అయినా దేవుడు నాలో తప్పును కనుగొన్నారు; \q2 నన్ను తన శత్రువుగా భావిస్తున్నారు. \q1 \v 11 నా కాళ్లకు సంకెళ్ళు బిగించాడు. \q2 నా మార్గాలన్నిటిని దగ్గర నుండి గమనిస్తున్నాడు.’ \b \q1 \v 12 “కాని ఈ విషయంలో నీవు తప్పు, \q2 ఎందుకంటే దేవుడు మానవుల కంటే గొప్పవాడు. \q1 \v 13 ఒకని మాటలకు ఆయన స్పందించరని \q2 ఎందుకు నీవు ఆయనకు ఫిర్యాదు చేస్తావు? \q1 \v 14 ఎందుకంటే దేవుడు ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడతారు, \q2 అయితే ఎవరు దానిని గ్రహించలేరు. \q1 \v 15 ప్రజలు పడకపై పడుకుని, \q2 గాఢనిద్రలో ఉన్నప్పుడు, \q2 రాత్రి వచ్చే కలలో, \q1 \v 16-18 నరులను గర్విష్ఠులు కాకుండచేయాలని \q2 వారు చేయదలచిన తప్పులను చేయకుండా వారిని ఆపడానికి, \q1 గోతిలో పడకుండ వారిని కాపాడడానికి, \q2 ఖడ్గం ద్వార వారి ప్రాణాలు పోకుండ వారిని తప్పించాలని\f + \fr 33:16-18 \fr*\ft లేదా \ft*\fqa నది దాటుట నుండి\fqa*\f* \q1 ఆయన వారి చెవుల్లో మాట్లాడవచ్చు \q2 హెచ్చరికలతో వారిని భయపెట్టవచ్చు. \b \q1 \v 19 “లేదా ఒకరు ఎముకల్లో నిరంతరం బాధ కలిగి \q2 నొప్పితో మంచం పట్టడం ద్వారా శిక్షించబడతారు. \q1 \v 20 అప్పుడు వారికి అన్నం సహించదు \q2 వారికి ఇష్టమైన భోజనమైనా సరే అసహ్యంగా ఉంటుంది. \q1 \v 21 వారి మాంసం కృషించిపోయి, \q2 ఇంతకుముందు కనిపించని ఎముకలు ఇప్పుడు బయటకు కనబడతాయి. \q1 \v 22 వారు సమాధికి దగ్గరవుతారు, \q2 వారి ప్రాణాలు మరణ దూతలకు\f + \fr 33:22 \fr*\ft లేదా \ft*\fqa మృతుల స్థలానికి\fqa*\f* దగ్గరవుతాయి. \q1 \v 23 అయినాసరే వారికి ఒక దేవదూత ఉంటే, \q2 వేలాది దేవదూతల్లో ఒక దూతను, \q2 మనుష్యులు యథార్థంగా ఎలా ఉండాలో చెప్పడానికి పంపితే, \q1 \v 24 ఆ దూతకు వారిపై దయ కలిగి దేవునితో, \q2 ‘వారిని సమాధిలోనికి దిగిపోకుండా కాపాడండి; \q2 వారి కోసం క్రయధనం నాకు దొరికిందని చెప్తాడు. \q1 \v 25 అప్పుడు వారి దేహం చిన్నపిల్లల దేహంలా ఉంటుంది; \q2 వారికి తమ యవ్వనకాలం తిరిగి వస్తుంది.’ \q1 \v 26 అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు, \q2 వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు; \q2 ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు. \q1 \v 27 వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు, \q2 ‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను, \q2 అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు. \q1 \v 28 సమాధికి వెళ్లకుండ దేవుడు నా ప్రాణాన్ని విమోచించారు. \q2 జీవిత వెలుగును ఆస్వాదించడానికి నేను బ్రతుకుతాను.’ \b \q1 \v 29-30 “జీవిత వెలుగు వారి మీద ప్రకాశించేలా \q2 వారిని సమాధి నుండి తప్పించడానికి, \q1 దేవుడు మానవుల కోసం వీటన్నిటిని \q2 రెండు, మూడు సార్లైనా చేస్తారు. \b \q1 \v 31 “యోబూ, నా మాటలు విను; శ్రద్ధగా ఆలకించు, \q2 మౌనంగా ఉండు, నేను మాట్లాడతాను. \q1 \v 32 నీవు చెప్పవలసినది ఏదైనా ఉంటే నాతో చెప్పు; \q2 మాట్లాడు, నీ దోషమేమీ లేదని నేను నిరూపించదలిచాను. \q1 \v 33 కాని ఒకవేళ ఏమిలేకపోతే, నేను చెప్పేది విను; \q2 మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను.” \c 34 \p \v 1 అప్పుడు ఎలీహు అన్నాడు: \q1 \v 2 “జ్ఞానులారా, మీరు నా మాటలు వినండి; \q2 అనుభవజ్ఞులారా, నేను చెప్పేది వినండి. \q1 \v 3 నాలుక ఆహారాన్ని రుచి చూసినట్లు. \q2 చెవి మాటలను పరిశీలిస్తుంది. \q1 \v 4 మనకు న్యాయమైన దానిని వివేచిద్దాం; \q2 మనకు మేలైన దానిని తెలుసుకుందాము. \b \q1 \v 5 “యోబు, ‘నేను నిర్దోషిని, \q2 కాని దేవుడు నాకు న్యాయం చేయలేదు. \q1 \v 6 నేను న్యాయంగా ఉన్నప్పటికీ \q2 నన్ను అబద్ధికునిగా చూస్తున్నారు; \q1 నా దోషం ఏమి లేనప్పటికి \q2 ఆయన బాణాలు నయంకాని గాయం నాకు కలిగింది’ అన్నాడు. \q1 \v 7 యోబువంటి వారు ఎవరైనా ఉన్నారా? \q2 తిరస్కారాన్ని మంచి నీళ్లలా అతడు త్రాగుతున్నాడు. \q1 \v 8 కీడు చేసేవారితో అతడు స్నేహంగా ఉంటాడు; \q2 దుర్మార్గులతో నడచుకుంటున్నాడు. \q1 \v 9 అతడు అన్నాడు, ‘దేవుని సంతోషపెట్టడం వలన \q2 మనుష్యునికి ఏ లాభం లేదని’ అని. \b \q1 \v 10 “వివేకంగల మనుష్యులారా, నా మాటలు వినండి. \q2 దేవుడు ఎన్నడూ చెడు చేయడు. \q2 సర్వశక్తిమంతుడు ఎన్నడూ తప్పు చేయడు. \q1 \v 11 వారందరికి చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్ని ఆయన వారికిస్తారు; \q2 ఎవరి నడతకు తగ్గఫలాన్ని ఆయన వారికి ముట్టచెప్తారు. \q1 \v 12 దేవుడు ఎన్నడూ దుష్కార్యం చేయడు, \q2 సర్వశక్తుడు న్యాయం తప్పడు. \q1 \v 13 భూమి మీద ఆయనను నియమించింది ఎవరు? \q2 సర్వలోకానికి ఆయనను అధిపతిగా చేసింది ఎవరు? \q1 \v 14 దేవుడే కాబట్టి స్వార్థపరుడై ఉండి \q2 తన ఆత్మను ఊపిరిని తొలగించి వేస్తే, \q1 \v 15 మనుష్యులంతా ఒకేసారి నశించిపోతారు, \q2 మానవులు తిరిగి దుమ్ములో కలిసిపోతారు. \b \q1 \v 16 “నీవు జ్ఞానం కలిగి ఉంటే, ఇది విను; \q2 నేను చెప్పేది ఆలకించు. \q1 \v 17 న్యాయాన్ని ద్వేషించేవాడు పరిపాలించగలడా? \q2 బలాఢ్యుడైన న్యాయవంతుడైన దేవుని మీద నీవు నేరం మోపుతావా? \q1 \v 18 ‘మీరు పనికిమాలినవారు’ అని రాజులతో, \q2 ‘మీరు దుష్టులు’ అని సంస్థానాధిపతులతో చెప్పేవాడు ఈయన కాడా, \q1 \v 19 ఆయన అధికారులంటే పక్షపాతం లేదు \q2 ఆయన బీదలను కాదని ధనవంతులకు దయచూపించడు, \q2 అందరు ఆయన చేతుల్లో సృష్టించబడినవారే కదా. \q1 \v 20 వారు నిమిషంలోనే మధ్యరాత్రిలోనే చనిపోతారు; \q2 వారు కదిలించబడి మరణిస్తారు; \q2 మానవ ప్రమేయం లేకుండానే బలవంతులు తీసుకెళ్తారు. \b \q1 \v 21 “మానవుల మార్గాలన్నిటిని ఆయన చూస్తున్నారు. \q2 వారి ప్రతి అడుగును ఆయన గమనిస్తున్నారు. \q1 \v 22 చెడు చేసేవారు దాక్కోవడానికి \q2 చీకటియైనా మరణాంధకారమైనా లేదు. \q1 \v 23 ఒకరు దేవుని ఎదుట న్యాయవిచారణలోకి రాకముందే, \q2 వానిని ఎక్కువగా విచారణ చేయనవసరం ఆయనకు లేదు. \q1 \v 24 విచారణలేకుండానే ఆయన బలవంతులను ముక్కలుగా చేస్తారు \q2 వారి స్థానంలో ఇతరులను నియమిస్తారు. \q1 \v 25 ఎందుకంటే వారి పనులెలాంటివో ఆయనకు తెలుసు, \q2 రాత్రివేళలో ఆయన వారిని పడద్రోయగా వారు నలుగగొట్టబడతారు. \q1 \v 26 అందరు చూస్తూ ఉండగానే \q2 వారి దుర్మార్గాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తారు. \q1 \v 27 ఎందుకంటే, వారు ఆయనను అనుసరించుట మానుకున్నారు, \q2 ఆయన మార్గాల్లో దేన్ని వారు గ్రహించలేదు. \q1 \v 28 బీదలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేలా వారు చేశారు; \q2 అవసరతలో ఉన్న వారి మొరను ఆయన ఆలకిస్తారు. \q1 \v 29 ఆయన మౌనంగా ఉంటే ఆయనకు శిక్ష విధించగలవారెవరు? \q2 ఆయన తన ముఖం దాచుకొంటే ఆయనను చూడగలవారెవరు? \q1 ఒక్క వ్యక్తికైనా దేశమంతటికైనా ఆయన విధానం ఒక్కటే, \q2 \v 30 భక్తిహీనులు పరిపాలించకుండ చేయడం, \q2 మనుష్యులకు ఉచ్చులు బిగించకుండా వారిని అడ్డుకోవడము. \b \q1 \v 31 “ఒకవేళ ఎవరైనా దేవునితో, \q2 ‘నేను శిక్షను భరించాను ఇకమీదట నేరం చేయను. \q1 \v 32 నేను చూడలేనిది నాకు చూపించు; \q2 నేనేదైనా తప్పు చేసివుంటే ఇకమీదట అలాంటిది చేయను’ అనవచ్చు. \q1 \v 33 నీవు పశ్చాత్తాపపడేందుకు నిరాకరించినప్పుడు \q2 దేవుడు నీ షరతుల ప్రకారం నీకు ప్రతిఫలమిస్తాడా? \q1 నేను కాదు, నీవే నిర్ణయించుకోవాలి; \q2 నీకు తెలిసింది నాకు చెప్పు. \b \q1 \v 34 “వివేకంగలవారు, జ్ఞానంగలవారు నా మాటలు విని \q2 నాతో ఇలా చెప్తారు, \q1 \v 35 ‘యోబు తెలివిలేని లేకుండ మాట్లాడుతున్నాడు; \q2 అతని మాటల్లో వివేకం లోపించింది.’ \q1 \v 36 యోబు దుష్టునిలా జవాబిచ్చినందుకు \q2 చివరి వరకు అతడు పరీక్షించబడుతూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. \q1 \v 37 అతడు తన పాపానికి తిరుగుబాటును జతచేశాడు; \q2 అతడు మన మధ్య తిరస్కారంతో చప్పట్లు కొట్టి \q2 దేవునికి విరుద్ధంగా ఎన్నో మాటలు మాట్లాడాడు.” \c 35 \p \v 1 ఇంకా ఎలీహు అన్నాడు: \q1 \v 2 “ఇది న్యాయమని నీవనుకుంటున్నావా? \q2 ‘నా నీతి దేవుని నీతి కన్నా గొప్పది.’ \q1 \v 3 అయితే, నా పాపం వలన నాకు\f + \fr 35:3 \fr*\ft లేదా \ft*\fqa మీకు\fqa*\f* లాభమేంటి? \q2 ‘పాపం చేయకపోవడం వలన నేను పొందేదేంటి?’ \q2 అని నీవు అడుగుతున్నావు. \b \q1 \v 4 “నేను నీ స్నేహితులకు \q2 నీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను. \q1 \v 5 ఆకాశం వైపు తేరి చూడండి; \q2 మీకన్నా ఎంతో ఎత్తుగా ఉన్న మేఘాల వైపు చూడండి. \q1 \v 6 నీవు పాపం చేస్తే, అది ఆయన మీద ఎలా ప్రభావం చూపుతుంది? \q2 నీ పాపాలు ఎక్కువగా ఉంటే, అది ఆయనకేమి చేస్తుంది? \q1 \v 7 నీవు నీతిమంతుడవైతే, నీవు ఆయనకేమి ఇస్తావు, \q2 నీ చేతి నుండి ఆయన ఏం పొందుకుంటారు? \q1 \v 8 నీ దుష్టత్వం నీలాంటి మనుష్యుల మీద, \q2 నీ నీతి ఇతరుల మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. \b \q1 \v 9 “ఒత్తిళ్ళ భారాన్ని బట్టి ప్రజలు ఆక్రందన చేస్తారు; \q2 బలవంతుల చేతి నుండి విడుదల కోసం విన్నవించుకొంటారు. \q1 \v 10-11 అయితే, ‘రాత్రివేళ పాటలు ఇచ్చే, \q2 భూజంతువుల కంటే మనకు ఎక్కువ బోధించే, \q1 ఆకాశపక్షుల కన్నా మనలను జ్ఞానవంతులుగా చేసే, \q2 నా సృష్టికర్తయైన దేవుడు ఎక్కడున్నాడు?’ అని ఎవరు అనరు. \q1 \v 12 దుర్మార్గుల గర్వం కారణంగా \q2 ప్రజలు మొరపెట్టినా ఆయన జవాబివ్వరు. \q1 \v 13 నిజానికి, వారి ఖాళీ మనవిని దేవుడు వినరు; \q2 సర్వశక్తిమంతుడు వాటిని లెక్క చేయడు. \q1 \v 14 అయితే, మీరు అతన్ని చూడలేదని, \q2 మీ వాదన అతని ముందు ఉందని, \q2 మీరు అతని కోసం వేచి ఉండాలని, \q1 \v 15 ఇంకా ఎంత తక్కువ చెప్పినా అతడు వింటాడా? అతని కోపం ఎప్పుడూ \q2 శిక్షించదు అతడు దుర్మార్గాన్ని కనీసం పట్టించుకోడు. \q1 \v 16 కాబట్టి యోబు వ్యర్థంగా మాట్లాడుతున్నాడు; \q2 తెలివి లేకుండా ఎన్నో మాటలు పలికాడు.” \c 36 \p \v 1 ఎలీహు ఇంకా మాట్లాడుతూ: \q1 \v 2 “ఇంకొంచెం సేపు నన్ను భరించండి \q2 దేవుని పక్షాన చెప్పాల్సింది చాలా ఉందని మీకు తెలియజేస్తాను. \q1 \v 3 నేను నా తెలివిని దూరం నుండి పొందాను; \q2 నేను నా సృష్టికర్తకు న్యాయం ఆపాదిస్తాను. \q1 \v 4 నా మాటలు అబద్ధం కాదని నమ్మండి; \q2 పరిపూర్ణ జ్ఞాని మీతో ఉన్నాడు. \b \q1 \v 5 “దేవుడు మహాబలవంతుడు, కాని ఎవరిని త్రోసివేయరు; \q2 ఆయన శక్తిమంతుడు, తన ఉద్దేశ్యంలో దృఢంగా ఉంటారు. \q1 \v 6 ఆయన దుష్టులను బ్రతకనివ్వరు \q2 కాని బాధితులకు న్యాయం చేస్తారు. \q1 \v 7 నీతిమంతులను ఆయన చూడకపోరు; \q2 వారిని రాజులతో పాటు సింహాసనంపై కూర్చోబెట్టి \q2 నిత్యం వారిని ఘనపరుస్తారు. \q1 \v 8 ప్రజలు గొలుసులతో బంధించబడి, \q2 బాధ అనే త్రాళ్లతో కట్టబడి ఉంటే, \q1 \v 9 వారు అహంకారంతో పాపం చేశారని \q2 ఆయన వారు చేసిన దానిని వారికి చెప్తారు. \q1 \v 10 దిద్దుబాటును వినేలా చేస్తారు \q2 తమ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపపడాలని వారిని ఆజ్ఞాపిస్తారు. \q1 \v 11 ఒకవేళ వారు లోబడి ఆయనను సేవిస్తే, \q2 వారు తమ మిగిలిన రోజులు క్షేమంగా \q2 తమ సంవత్సరాలు సంతృప్తిగా గడుపుతారు. \q1 \v 12 అయితే వారు వినకపోతే, \q2 వారు ఖడ్గం చేత నశిస్తారు \q2 జ్ఞానం లేకుండానే చనిపోతారు. \b \q1 \v 13 “హృదయంలో భక్తిలేనివారు కోపాన్ని ఉంచుకుంటారు; \q2 ఆయన వారిని బంధించినప్పుడు వారు సహాయం కోసం మొరపెట్టరు. \q1 \v 14 వారు తమ యవ్వనకాలంలో చనిపోతారు, \q2 పుణ్యక్షేత్రాల మగ వ్యభిచారుల మధ్య వారి జీవితం ముగుస్తుంది. \q1 \v 15 బాధపడుతున్నవారిని ఆయన వారి బాధలనుండి విడిపిస్తారు; \q2 బాధల్లో ఆయన వారితో మాట్లాడతారు. \b \q1 \v 16 “ఆయన నిన్ను బాధల్లో నుండి తప్పించి \q2 పరిమితి లేని విశాలమైన ప్రదేశానికి, \q2 మంచి ఆహారంతో నిండిన బల్ల దగ్గరకు నిన్ను తీసుకువస్తారు. \q1 \v 17 కానీ ఇప్పుడు నీవు దుష్టుల తీర్పుతో నిండి ఉన్నావు; \q2 తీర్పు న్యాయం నిన్ను పట్టుకున్నాయి. \q1 \v 18 ధనంతో ఎవరు నిన్ను మభ్యపెట్టకుండ జాగ్రత్తపడు; \q2 అధిక లంచం నిన్ను దారి తప్పించకుండ చూసుకో. \q1 \v 19 మీ సంపదలు మీ శక్తివంతమైన ప్రయత్నాలు \q2 బాధలో ఉండకుండా మిమ్మల్ని తప్పిస్తాయా? \q1 \v 20 ప్రజలను వారి ఇళ్ళలో నుండి దూరంగా లాగివేయాలని, \q2 రాత్రి కోసం ఎదురుచూడవద్దు. \q1 \v 21 చెడు వైపు తిరుగకుండ జాగ్రత్త వహించండి, \q2 ఎందుకంటే మీరు బాధల్లో పరీక్షించబడతారు. \b \q1 \v 22 “దేవుడు శక్తిమంతుడైన గొప్పవాడు. \q2 ఆయనలాంటి బోధకుడెవరు? \q1 \v 23 ఆయనకు మార్గాలను ఎవరు నిర్దేశించారు, \q2 ‘నీవు తప్పు చేశావు’ అని ఆయనతో ఎవరు చెప్పారు? \q1 \v 24 ప్రజలు పాటలతో కీర్తించిన ఆయన కార్యాలను \q2 ఘనపరచాలని నీవు జ్ఞాపకముంచుకో. \q1 \v 25 మనుష్యులందరు వాటిని చూశారు; \q2 మనుష్యులు దూరంగా ఉండి వాటిని చూశారు. \q1 \v 26 దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించలేము! \q2 ఆయన సంవత్సరాలను లెక్కించలేనివి. \b \q1 \v 27 “అతడు నీటి బిందువులను పైకి తీసుకుంటారు, \q2 అవే ప్రవాహాలకు వర్షంలాగా కురుస్తుంది; \q1 \v 28 మేఘాలు వాటి తేమను కురిపిస్తాయి \q2 మనుష్యులపై అవి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. \q1 \v 29 ఆయన మేఘాలను ఎలా వ్యాపింప చేస్తారో \q2 ఆయన ఆవరణం నుండి ఎలా ఉరుము వస్తుందో ఎవరు గ్రహించగలరు? \q1 \v 30 ఆయన మెరుపులను తన చుట్టూ ఎలా వ్యాపింప చేస్తారో \q2 అవి సముద్ర అడుగుభాగాన్ని ఎలా కప్పివేసారో చూడండి. \q1 \v 31 వీటిని బట్టి ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తారు \q2 సమృద్ధిగా ఆహారం ఇస్తారు. \q1 \v 32 ఆయన తన చేతులతో మెరుపులను పట్టుకుని \q2 గురికి తగలాలని వాటికి ఆజ్ఞాపిస్తారు. \q1 \v 33 ఉరుము రాబోయే తుఫానును ప్రకటిస్తుంది; \q2 పశువులకు కూడ దాని రాకడ తెలుస్తుంది. \b \c 37 \q1 \v 1 “వీటన్నిబట్టి నా హృదయం వణికిపోతుంది, \q2 దాని స్థలం నుండి దూకుతుంది. \q1 \v 2 ఆయన స్వరం గర్జించడం వినండి, \q2 ఆయన నోటి నుండి వచ్చే ఉరుమును వినండి. \q1 \v 3 ఆయన తన మెరుపును ఆకాశమంతటి క్రింద విప్పుతారు \q2 దానిని భూమి చివర్లకు పంపుతారు. \q1 \v 4 దాని తర్వాత ఆయన గర్జన శబ్దం వినిపిస్తుంది; \q2 ఆయన తన గంభీరమైన స్వరంతో ఉరుముతారు. \q1 ఆయన స్వరం ప్రతిధ్వనిస్తున్నప్పుడు, \q2 ఆయన ఏది వెనుకకు తీసుకోరు. \q1 \v 5 దేవుని స్వరం అద్భుతమైన విధానాల్లో ఉరుముతుంది; \q2 మనం గ్రహించలేని గొప్ప వాటిని ఆయన చేస్తారు. \q1 \v 6 ఆయన మంచుతో, ‘భూమిపై పడు’ \q2 వాన జల్లుతో, ‘కుండపోత వర్షంగా కురువు’ అని ఆజ్ఞాపిస్తారు. \q1 \v 7 తద్వార మనుష్యులందరు ఆయన కార్యాన్ని తెలుసుకుంటారు, \q2 ఆయన ప్రజలందరినీ తమ ప్రయాసం నుండి విరమింపజేస్తారు.\f + \fr 37:7 \fr*\ft లేదా \ft*\fq కార్యాన్ని \fq*\fqa ఆయన తన శక్తిచేత ప్రజలందరినీ ఆయన భయంతో నింపుతారు\fqa*\f* \q1 \v 8 జంతువులు వాటి గుహల్లోకి వెళ్లి \q2 వాటిలో దాక్కుని అక్కడే నివసిస్తాయి. \q1 \v 9 తుఫాను దాని స్థానం నుండి బయటకు వస్తుంది, \q2 వీచే గాలుల నుండి చలి వస్తుంది. \q1 \v 10 దేవుని ఊపిరి మంచును పుట్టిస్తుంది, \q2 మహా సముద్ర ఉపరితలాలు గడ్డకడతాయి. \q1 \v 11 ఆయన దట్టమైన మేఘాలను తేమతో నింపుతారు; \q2 మేఘాలలో తన మెరుపులను వ్యాపింపజేస్తారు. \q1 \v 12 భూమి అంతటి ఉపరితలం మీద \q2 ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి, \q2 ఆయన నిర్దేశించిన మార్గంలో అవి చుట్టూ తిరుగుతాయి. \q1 \v 13 ప్రజలను శిక్షించడానికి లేదా తన భూమికి నీళ్లు పోయడానికి, \q2 తన ప్రేమను చూపించడానికి ఆయన మేఘాలను రప్పిస్తారు. \b \q1 \v 14 “యోబూ, ఇది విను; \q2 ఆగి దేవుని అద్భుతాలను గురించి ఆలోచించు. \q1 \v 15 దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తారో \q2 తన మెరుపులను ఎలా ప్రకాశింపజేస్తారో నీకు తెలుసా? \q1 \v 16 మేఘాలు ఎలా సమతుల్యంగా వ్రేలాడుతున్నాయో, \q2 పరిపూర్ణ జ్ఞానం గలవాని అద్భుతకార్యాలు నీకు తెలుసా? \q1 \v 17 దక్షిణపుగాలికి భూమి ప్రశాంతంగా ఉన్నప్పుడు \q2 మీ బట్టలలో మీకు చెమట పడుతుంది, \q1 \v 18 ఇత్తడితో పోతపోసిన అద్దంలా, \q2 ఆకాశాలను విస్తరింపజేయడంలో ఆయనతో నీవు జత కలుస్తావా? \b \q1 \v 19 “మేము ఆయనతో ఏమి మాట్లాడాలో మాకు చెప్పు; \q2 మా చీకటిని బట్టి మా వాదనను సరిగా వినిపించలేము. \q1 \v 20 నేను మాట్లాడతాను అని ఆయనకు చెప్పబడాలా? \q2 మ్రింగివేయబడటానికి ఎవరైనా అడుగుతారా? \q1 \v 21 గాలి వీచి మేఘాలు తొలగిపోయి తేటగా ఉన్నప్పుడు \q2 ఆకాశాల్లో ప్రకాశిస్తున్న సూర్యుడిని \q2 ఏ ఒక్కరు చూడలేరు. \q1 \v 22 అలాగే ఉత్తర దిక్కునుండి బంగారు తేజస్సుతో ఆయన వస్తున్నారు; \q2 భీకరమైన మహిమతో దేవుడు వస్తున్నారు. \q1 \v 23 సర్వశక్తిమంతుడు మనకు మించినవాడు శక్తిలో ఉన్నతమైనవాడు; \q2 తన న్యాయం గొప్ప నీతిని బట్టి, ఆయన అణచివేయడు. \q1 \v 24 కాబట్టి ప్రజలు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు, \q2 తమకు జ్ఞానముందని అనుకునేవారిని ఆయన లెక్కచేయరు.” \c 38 \s1 యెహోవా మాట్లాడడం \p \v 1 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు: \q1 \v 2 “తెలివిలేని మాటలతో \q2 నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు? \q1 \v 3 పురుషునిగా నీ నడుము కట్టుకో; \q2 నేను నిన్ను ప్రశ్నిస్తాను, \q2 నీవు నాకు జవాబు చెప్పాలి. \b \q1 \v 4 “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? \q2 నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు. \q1 \v 5 దాని కొలమానాన్ని ఎవరు నిర్ణయించారు? నీకు ఖచ్చితంగా తెలుసు! \q2 దాని చుట్టూ కొలత రేఖను వేసిందెవరు? \q1 \v 6-7 వేకువ చుక్కలన్ని కలిసి గానం చేస్తుంటే \q2 దేవదూతలంతా ఆనంద కేకలు వేస్తుంటే \q1 దాని పాదాలు దేనిపై మోపబడ్డాయి? \q2 దానికి మూలరాయి వేసింది ఎవరు? \b \q1 \v 8 “భూగర్భం నుండి సముద్రం పొంగి వచ్చినప్పుడు \q2 తలుపుల వెనుక దానిని మూసి ఉంచింది ఎవరు? \q1 \v 9 నేను మేఘాలను దానికి వస్త్రంగా చేసి \q2 కటిక చీకటిలో దానిని చుట్టిపెట్టినప్పుడు, \q1 \v 10 నేను దానికి హద్దులను నిర్ణయించి \q2 తలుపులు గడియలు అమర్చినప్పుడు, \q1 \v 11 ఇక్కడి వరకు నీవు రావచ్చు ఇంతకు మించి కాదు; \q2 నీ అహంకార అలలు ఇక్కడే ఆగిపోవాలి, \b \q1 \v 12-13 “భూమి అంచుల వరకు వ్యాపించి \q2 దానిలో నుండి దుష్టులను దులిపివేసేలా \q1 నీవెపుడైనా ఉదయాన్ని ఆజ్ఞాపించావా? \q2 తెల్లవారుజాముకు దాని స్థలమేదో ఎప్పుడైనా తెలియచేశావా? \q1 \v 14 ముద్ర వేయబడిన బంకమట్టిలా భూమి రూపం మారుతుంది; \q2 దాని లక్షణాలు వస్త్రం యొక్క లక్షణాల్లా ఉంటాయి. \q1 \v 15 దుర్మార్గుల దగ్గర నుండి వారి వెలుగు తొలగించబడింది, \q2 పైకెత్తబడిన వారి చేయి విరగ్గొట్టబడింది. \b \q1 \v 16 “నీవెప్పుడైనా సముద్రపు ఊటలలోనికి ప్రవేశించావా? \q2 సముద్రపు అడుగుభాగంలో నడిచావా? \q1 \v 17 మృత్యుద్వారాలు నీకు చూపించబడ్డాయా? \q2 లోతైన చీకటి ద్వారాలను నీవు చూశావా? \q1 \v 18 భూమి వైశాల్యం ఎంతో నీకు గ్రహించగలవా? \q2 ఒకవేళ ఇవన్నీ నీకు తెలిస్తే, నాకు చెప్పు. \b \q1 \v 19 “వెలుగు నివసించే చోటికి వెళ్లే మార్గం ఏది? \q2 చీకటి ఎక్కడ నివసిస్తుంది? \q1 \v 20 దానిని దాని చోటికి నీవు తీసుకెళ్లగలవా? \q2 దాని నివాస స్థలాలకు మార్గం నీవు వివేచించగలవా? \q1 \v 21 నీకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే అప్పటికే నీవు పుట్టావు! \q2 నీవు అనేక సంవత్సరాలు జీవించావు! \b \q1 \v 22 “మంచు నిల్వ ఉండే స్థలాలకు నీవు వెళ్లవా? \q2 వడగండ్లు నిల్వ ఉండే స్థలాలను నీవు చూశావా? \q1 \v 23 వాటిని నేను కష్టకాలం కోసం, \q2 యుద్ధం కోసం యుద్ధ దినాల కోసం దాచిపెట్టాను. \q1 \v 24 వెలుగు విభజించబడే చోటుకు మార్గం ఏది? \q2 తూర్పుగాలులు ఎక్కడ నుండి వచ్చి భూమంతటా వ్యాపిస్తాయి? \q1 \v 25-27 ఎవరూ నివసించని భూమికి, \q2 మనుష్యులే నివసించని ఎడారికి నీరు పెట్టడానికి, \q1 పాడైపోయిన బీడుభూమిని తృప్తిపరచి \q2 అందులో లేతగడ్డి మొక్కలను ఎవరు మొలిపిస్తున్నారు? \q1 కుండపోతగా కురిసే వర్షానికి ఎవరు కాలువలు ఏర్పాటు చేశారు? \q2 ఉరుములు మెరుపులకు ఎవరు మార్గమేర్పరిచారు? \q1 \v 28 వర్షానికి తండ్రి ఉన్నాడా? \q2 మంచు బిందువులను ఎవరు పుట్టిస్తారు? \q1 \v 29 ఎవరి గర్భం నుండి మంచుగడ్డ వచ్చింది? \q2 పైనుండి దిగివచ్చే మంచును ఎవరు పుట్టించారు? \q1 \v 30 నీళ్లు రాయిలా ఎప్పుడు గడ్డకట్టుకుపోతాయి, \q2 లోతైన నీళ్ల ఉపరితలం ఎప్పుడు గట్టిపడుతుంది? \b \q1 \v 31 “కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో\f + \fr 38:31 \fr*\ft మూ. భా.లో \ft*\fqa అందంతో\fqa*\f* బంధించగలవా? \q2 మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా? \q1 \v 32 నక్షత్ర రాశులను వాటి వాటి కాలాల్లో వచ్చేలా నీవు చేయగలవా? \q2 సప్తరుషి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రాలను నీవు నడిపించగలవా? \q1 \v 33 ఆకాశం యొక్క చట్టాలు నీకు తెలుసా? \q2 నీవు భూమిపై దేవుని\f + \fr 38:33 \fr*\ft లేదా \ft*\fqa వారి\fqa*\f* ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయగలవా? \b \q1 \v 34 “నిన్ను నీటి వరదతో కప్పి వేయమని \q2 నీ స్వరాన్ని ఎత్తి నీవు మేఘాలకు చెప్పగలవా? \q1 \v 35 నీవు మెరుపులను వాటి మార్గాల్లో పంపుతావా? \q2 మేము ఇక్కడ ఉన్నాము అని అవి నీతో చెప్తాయా? \q1 \v 36 హృదయానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? \q2 మనస్సుకు వివేచన కలిగించింది ఎవరు? \q1 \v 37-38 దుమ్ము గట్టిగా మారినప్పుడు \q2 మట్టిగడ్డలు ఒకదాన్ని ఒకటి అతుక్కున్నప్పుడు \q1 మేఘాలను లెక్కించు జ్ఞానం ఎవరికుంది? \q2 ఆకాశపు నీటి పాత్రలను బోర్లించగలరు? \b \q1 \v 39-40 “సింహపుపిల్లలు గుహలో పడుకుని ఉన్నప్పుడు, \q2 అవి పొదలో పొంచి ఉన్నప్పుడు, \q1 ఆడసింహం కోసం నీవు ఎరను వేటాడి \q2 వాటి ఆకలిని తీర్చగలవా? \q1 \v 41 కాకిపిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు \q2 ఆహారం లేక తిరుగుతున్నప్పుడు \q2 కాకికి ఆహారం ఇచ్చేది ఎవరు? \b \c 39 \q1 \v 1 “కొండమీద తిరిగే అడవి మేకలు ఎప్పుడు ఈనుతాయో నీకు తెలుసా? \q2 లేళ్లు పిల్లలను కంటున్నప్పుడు నీవు చూశావా? \q1 \v 2 అవి ఎన్ని నెలల వరకు మోస్తాయో నీవు లెక్కపెడతావా? \q2 అవి పిల్లలను కనే సమయం నీకు తెలుసా? \q1 \v 3 అవి వంగి తమ పిల్లలకు జన్మనిస్తాయి; \q2 వాటి పురుటినొప్పులు అంతలోనే ఆగిపోతాయి. \q1 \v 4 వాటి పిల్లలు అడవిలో పెరిగి బలపడతాయి. \q2 అవి తల్లిని విడిచిపోయి మరలా తిరిగి రావు. \b \q1 \v 5 “అడవి గాడిదను స్వేచ్ఛగా వెళ్లనిచ్చేది ఎవరు? \q2 దాని కట్లను విప్పింది ఎవరు? \q1 \v 6 బంజరు భూమిని దానికి ఇల్లుగా \q2 ఉప్పు పర్రలను నివాస స్థలంగా ఇచ్చాను. \q1 \v 7 అది పట్టణంలోని సందడిని చూసి నవ్వుతుంది; \q2 తోలేవాని కేకలు అది వినదు. \q1 \v 8 దాని పచ్చిక కోసం అది పర్వతాల్లో తిరుగుతుంది, \q2 ఏదైన పచ్చని దాని కోసం వెదకుతుంది. \b \q1 \v 9 “నీకు సేవ చేయడానికి అడవి ఎద్దు అంగీకరిస్తుందా? \q2 రాత్రివేళ అది నీ పశువుల దొడ్డిలో ఉంటుందా? \q1 \v 10 నీవు అడవి ఎద్దుకు పగ్గం వేసి నాగటికి కట్టి నడిపించగలవా? \q2 నీ వెనుక నడుస్తూ అది లోయ భూములను దున్ని చదును చేస్తుందా? \q1 \v 11 దాని బలం గొప్పదని దాన్ని నమ్ముతావా? \q2 నీ పెద్ద పనిని దానికి అప్పగిస్తావా? \q1 \v 12 అది నీ ధాన్యాన్ని ఇంటికి మోసుకొనివచ్చి, \q2 అది నీ నూర్పిడి కళ్ళంలో కూర్చుతుందని నీవు నమ్మగలవా? \b \q1 \v 13 “నిప్పుకోడి రెక్కలు సంతోషంతో ఆడిస్తుంది, \q2 అయినా కొంగకున్న రెక్కలు ఈకలతో \q2 అవి పోల్చబడకపోయినా. \q1 \v 14 అది నేలమీద గుడ్లు పెడుతుంది \q2 ఇసుకలో వాటిని పొదుగుతుంది. \q1 \v 15 ఏ పాదమో వాటిని నలిపివేస్తుందని, \q2 ఏ అడవి జంతువో వాటిని త్రొక్కివేస్తుందని అది ఆలోచించదు. \q1 \v 16 తన పిల్లలు తనవి కానట్టు, వాటిని కఠినంగా చూస్తుంది; \q2 తన ప్రసవ వేదనంతా వృధా అయినా అది పట్టించుకోదు. \q1 \v 17 ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు \q2 దానికి గ్రహింపు ఇవ్వలేదు. \q1 \v 18 అయినా పరుగెత్తడానికి అది తన రెక్కలను చాపినప్పుడు, \q2 అది గుర్రాన్ని దాని రౌతును చూసి నవ్వుతుంది. \b \q1 \v 19 “గుర్రానికి దాని బలాన్ని నీవిస్తావా? \q2 దాని మెడ మీద జూలు పెట్టింది నీవా? \q1 \v 20 దాని భీకరమైన గురకతో భయాన్ని సృష్టించే మిడతలా, \q2 మీరు దానిని దూకేలా చేస్తారా? \q1 \v 21 అది తన బలాన్నిబట్టి సంతోషిస్తూ, ఆగ్రహంతో నేలను దువ్వి, \q2 పోరాడటానికి పరుగెడుతుంది. \q1 \v 22 అది భయాన్ని చూసి నవ్వుతుంది, దేనికి భయపడదు; \q2 ఖడ్గాన్ని చూసినా వెనుతిరుగదు. \q1 \v 23 మెరుస్తున్న ఈటెలు బరిసెలతో పాటు \q2 దాని అంబులపొది గలగలలాడుతుంది, \q1 \v 24 పిచ్చి కోపంలో అది నేల మీద కాలు దువ్వుతుంది; \q2 బూరధ్వని విన్నప్పుడు అది ప్రశాంతంగా నిలబడలేదు. \q1 \v 25 బూర మ్రోగగానే అది, ‘ఆహా!’ అని అంటుంది \q2 దూరం నుండే యుద్ధవాసన, \q2 సేనాధిపతుల కేకలు యుద్ధఘోష పసిగడుతుంది. \b \q1 \v 26 “దక్షిణదిక్కు వైపుకు తన రెక్కలు చాపి ఎలా ఎగరాలో \q2 డేగకు నీ జ్ఞానంతో నేర్పించావా? \q1 \v 27 నీ ఆజ్ఞను బట్టే గ్రద్ద పైకెగిరిపోయి, \q2 తన గూడు ఎత్తైన చోటులో కట్టుకుంటుందా? \q1 \v 28 ఎవరు ఎక్కలేని కొండచరియలో నివసిస్తుంది రాత్రివేళ అక్కడే గడుపుతుంది; \q2 ఏటవాలుగా ఉన్న బండ దానికి బలమైన కోట. \q1 \v 29 అక్కడి నుండే ఆహారం కోసం చూస్తుంది; \q2 దాని కళ్లు దూరం నుండే దానిని కనిపెడతాయి. \q1 \v 30 దాని పిల్లలు రక్తాన్ని త్రాగుతాయి, \q2 మృతదేహాలు ఎక్కడ ఉంటాయో అక్కడే అది ఉంటుంది.” \c 40 \p \v 1 యెహోవా యోబుతో ఈ విధంగా అన్నారు: \q1 \v 2 “సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా? \q2 దేవునితో నిందించేవారు ఆయనకు జవాబు చెప్పాలి!” \p \v 3 అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు: \q1 \v 4 “నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? \q2 నా చేతితో నా నోరు మూసుకుంటాను. \q1 \v 5 ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; \q2 రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.” \p \v 6 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు: \q1 \v 7 “పురుషునిగా నీ నడుము కట్టుకో; \q2 నేను నిన్ను ప్రశ్నిస్తాను, \q2 నీవు నాకు జవాబు చెప్పాలి. \b \q1 \v 8 “నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? \q2 నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా? \q1 \v 9 దేవుని బాహువులాంటిది నీకుందా? \q2 ఆయన స్వరంలా నీ స్వరం ఉరుమగలదా? \q1 \v 10 అలాగైతే మహిమ వైభవంతో నిన్ను నీవే అలంకరించుకో! \q2 ఘనత ప్రభావాలను ధరించుకో! \q1 \v 11 నీ మహా కోపాన్ని ప్రవాహంలా కుమ్మరించు, \q2 గర్విష్ఠులందరిని చూసి వారిని పడగొట్టు, \q1 \v 12 గర్విష్ఠులందరిని చూసి వారిని అణచివేయి, \q2 వారున్న చోటులోనే దుష్టులను నలగ్గొట్టు. \q1 \v 13 వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు; \q2 వారిని సమాధిలో బంధించు. \q1 \v 14 అప్పుడు నీ సొంత కుడి చేయి నిన్ను రక్షించగలదని \q2 నేనే నీ ముందు ఒప్పుకుంటాను. \b \q1 \v 15 “నీటిగుర్రాన్ని చూడు, \q2 నిన్ను చేసినట్లే దానిని కూడా సృజించాను \q2 అది ఎద్దులా గడ్డిమేస్తుంది. \q1 \v 16 దాని బలం దాని నడుములో ఉంది, \q2 దాని శక్తి దాని కడుపు కండరాల్లో ఉంది! \q1 \v 17 దాని తోక దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు వంగుతుంది; \q2 దాని తొడనరాలు గట్టిగా అతికి ఉన్నాయి. \q1 \v 18 దాని ఎముకలు ఇత్తడి గొట్టాలు, \q2 దాని ప్రక్కటెముకలు ఇనుప కడ్డీల్లాంటివి. \q1 \v 19 దేవుని కార్యాల్లో అది మొదటి స్థానంలో ఉంటుంది, \q2 అయినా దాని సృష్టికర్తే దానిని తన ఖడ్గంతో సమీపించగలడు. \q1 \v 20 కొండలు దానికి ఆహారం అందిస్తాయి, \q2 అడవి జంతువులన్నీ దగ్గరలోనే ఆడుకుంటాయి. \q1 \v 21 తామర మొక్కల క్రింద అది పడుకుంటుంది, \q2 బురదనేలలోని రెల్లు మధ్యలో అది దాక్కుంటుంది. \q1 \v 22 తామరచెట్లు వాటి నీడలో దానిని కప్పుతాయి; \q2 కాలువలోని నిరవంజి చెట్లు దానిని చుట్టుకొని ఉంటాయి. \q1 \v 23 నది పొంగిపొర్లినా అది భయపడదు. \q2 యొర్దాను నది పొంగి దాని నోటి వరకు నీరు వచ్చినా అది ధైర్యంగా ఉంటుంది. \q1 \v 24 అది మెలకువగా ఉన్నప్పుడు ఎవరైనా దానిని బంధించగలరా, \q2 దానికి వలవేసి ముక్కుకు తాడువేయగలరా? \b \c 41 \q1 \v 1 “లెవియాథన్ ను చేపగాలంతో లాగగలవా? \q2 త్రాడుతో దాని నాలుకను కట్టగలవా? \q1 \v 2 దాని జమ్ము తాడును ముక్కుకు వేయగలవా? \q2 దవడకు గాలం ఎక్కించగలవా? \q1 \v 3 దయచూపమని అది నిన్ను వేడుకుంటుందా? \q2 మృదువైన మాటలు నీతో మాట్లాడుతుందా? \q1 \v 4 జీవితాంతం నీవు దానిని బానిసగా ఉంచుకునేలా \q2 అది నీతో ఒప్పందం చేసుకుంటుందా? \q1 \v 5 ఒక పక్షితో ఆడుకున్నట్లు నీవు దానితో ఆడుకుంటావా? \q2 నీ ఇంట్లోని అమ్మాయిలు ఆడుకోడానికి దానిని కట్టి ఉంచగలవా? \q1 \v 6 వ్యాపారులు దానితో పరివర్తకం చేస్తారా? \q2 వారు దానిని ముక్కలుగా కోసి వ్యాపారులకు అమ్ముతారా? \q1 \v 7 దాని చర్మం నిండా బల్లెములను గుచ్చగలవా? \q2 చేపలను పట్టే ఈటెలతో దాని తల నిండా పొడవగలవా? \q1 \v 8 నీవు దాని మీద చేయి వేసి చూడు, \q2 దానితో చేసే పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలా చేయవు. \q1 \v 9 దానిని వశపరుచుకోవాలనే ఆశ అబద్ధం; \q2 కేవలం దానిని చూస్తే చాలు ఎవరైనా భయపడిపోతారు. \q1 \v 10 దానిని లేపే సాహసం ఎవరు చేయలేరు. \q2 అలాంటప్పుడు నా ఎదుట ఎవరు నిలబడగలరు? \q1 \v 11 నేను తిరిగి చెల్లించవలసి ఉందని ఎవరు నన్ను అడగగలరు? \q2 ఆకాశం క్రింద ఉన్నదంతా నాదే. \b \q1 \v 12 “లెవియాథన్ అవయవాల గురించి, దానికున్న అధిక బలాన్ని గురించి, \q2 దాని మనోహరమైన రూపాన్ని గురించి చెప్పకుండా ఉండలేను. \q1 \v 13 దానిపై కవచాన్ని ఎవరు లాగివేయగలరు? \q2 దాని రెండంతల కవచంలోకి\f + \fr 41:13 \fr*\ft హెబ్రీలో \ft*\fq రెండంతల \fq*\fqa కళ్ళం\fqa*\f* ఎవరు చొచ్చుకోగలరు? \q1 \v 14 భయంకరమైన పళ్ళ వరుస గల, \q2 దాని నోటిద్వారాన్ని తెరవడానికి ఎవరు సాహసం చేస్తారు? \q1 \v 15 దాని వీపుమీది పొలుసులు చాలా గట్టివి; \q2 అవి దగ్గరగా బిగుసుగా కూర్చబడ్డాయి. \q1 \v 16 గాలికూడా వాటి మధ్యలోనికి చొరబడలేనంత \q2 ప్రతిదీ దాని తర్వాత దానికి చాలా దగ్గరగా ఉంటుంది. \q1 \v 17 ఒక దానితో ఒకటి అతుక్కుని ఉన్నాయి, \q2 అవి అంటిపెట్టుకుని ఉంటాయి వాటిని ఎవరు వేరు చేయలేరు. \q1 \v 18 దాని గురక కాంతి వెలుగులను విసురుతుంది; \q2 దాని కళ్లు ఉదయపు కిరణాల్లా ఉన్నాయి. \q1 \v 19 దాని నోటి నుండి అగ్నిజ్వాలలు ప్రవహిస్తాయి; \q2 నిప్పు కణాలు ఎగిరివస్తాయి. \q1 \v 20 జమ్ము మంట పై ఉడికే కుండలో నుండి పొగ వచ్చినట్లు \q2 దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ వస్తుంది. \q1 \v 21 దాని ఊపిరి నిప్పు కణాలను రాజేస్తుంది, \q2 దాని నోటి నుండి మంటలు బయలుదేరతాయి. \q1 \v 22 బలం దాని మెడలో ఉంటుంది; \q2 నిరాశ దాని ముందర నడుస్తుంది. \q1 \v 23 దాని మాంసం యొక్క మడతలు దగ్గరగా కలుపబడ్డాయి; \q2 అవి దృఢంగా అంటుకుని ఉంటాయి. \q1 \v 24 దాని రొమ్ము బండలా గట్టిగా, \q2 తిరుగటిరాయి క్రింది దిమ్మలా ఉంటుంది. \q1 \v 25 అది లేచినప్పుడు, బలవంతులు భయపడతారు; \q2 అది కొట్టకుండానే పారిపోతారు. \q1 \v 26 ఖడ్గంతో దాడి చేసినా ప్రభావం ఉండదు, \q2 ఈటెలు బాణాలు బరిసెలు దాని మీద పని చేయవు. \q1 \v 27 దానికి ఇనుము అంటే తుక్కుతో \q2 ఇత్తడి అంటే పుచ్చిపోయిన చెక్కతో సమానము. \q1 \v 28 బాణాలు దానిని పారిపోయేలా చేయలేవు; \q2 వడిసెల రాళ్లు దానికి పొట్టుతో సమానము. \q1 \v 29 దుడ్డుకర్ర దానికి తుక్కు ముక్కలా ఉంటుంది; \q2 వడిగా వెళ్తున్న ఈటెను చూసి నవ్వుతుంది. \q1 \v 30 దాని దిగువ భాగం పగిలిన కుండపెంకుల వలె గరుకుగా ఉంటాయి, \q2 బురద మీద నూర్పిడి కర్రను పోలిన గుర్తులను ఏర్పరుస్తుంది. \q1 \v 31 అది దాని గందరగోళంతో నీటిని మరిగేలా చేస్తుంది. \q2 అది సముద్రాన్ని కదిలించి నూనె మరుగుతున్న కుండలా చేస్తుంది. \q1 \v 32 అది వెళ్లిన దారంతా మెరుస్తున్న నురుగును వదలుతుంది; \q2 అది చూసేవారికి సముద్రానికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయేమో అనిపిస్తుంది. \q1 \v 33 భూమి మీద దానికి సమానమైనదేదీ లేదు; \q2 ఒక భయంలేని సృష్టి. \q1 \v 34 అహంకారం కలిగిన వాటన్నిటిని చిన్న చూపు చూస్తుంది; \q2 గర్వపడే వాటన్నిటికి అది రాజు.” \c 42 \s1 యోబు \p \v 1 అప్పుడు యోబు యెహోవాకు ఇలా సమాధానం ఇచ్చాడు: \q1 \v 2 “నీవు సమస్తం చేయగలవని నాకు తెలుసు; \q2 నీ ఉద్దేశాలలో ఏది నిష్ఫలం కాదు. \q1 \v 3 ‘తెలివిలేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు? అని నీవడిగావు.’ \q2 అవును, అర్థం చేసుకోలేని విషయాల గురించి నేను మాట్లాడాను. \q2 అవి నా బుద్ధికి మించినవి నేను గ్రహించలేనివి. \b \q1 \v 4 “మీరు అన్నారు, ‘నేను మాట్లాడతాను, నీవు విను; \q2 నేను ప్రశ్నిస్తాను, \q2 నీవు నాకు జవాబివ్వాలి.’ \q1 \v 5 గతంలో నా చెవులు మీ గురించి విన్నాయి \q2 కాని ఇప్పుడైతే నా కళ్లు మిమ్మల్ని చూశాయి. \q1 \v 6 కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని \q2 దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను.” \s1 ముగింపు \p \v 7 యెహోవా యోబుతో ఈ విషయాలు చెప్పిన తర్వాత, ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో, “నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు. కాబట్టి నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను. \v 8 కాబట్టి మీరంతా ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసుకుని, నా సేవకుడైన యోబు దగ్గరకు వెళ్లి మీ కోసం దహనబలిని అర్పించాలి. నా సేవకుడైన యోబు మీ కోసం ప్రార్థన చేస్తాడు, నేను అతని ప్రార్థన అంగీకరించి మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించను” అన్నారు. నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు. \v 9 కాబట్టి తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు; అప్పుడు యెహోవా యోబు ప్రార్థన అంగీకరించారు. \p \v 10 యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి ఇచ్చారు. అతనికి గతంలో ఉన్నదానికన్నా రెండింతలు అధికంగా ఇచ్చారు. \v 11 అప్పుడు అతని సోదరీ సోదరులందరు, గతంలో అతనికి పరిచయం ఉన్న ప్రతిఒక్కరు వచ్చి అతని ఇంట్లో అతనితో కలిసి భోజనం చేశారు. యెహోవా అతని మీదికి రప్పించిన బాధ గురించి వారు దుఃఖపడి అతన్ని ఓదార్చారు. అంతేకాక ఒక్కొక్కరు ఒక వెండి నాణాన్ని,\f + \fr 42:11 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కెసిటా\fqa*\ft ; కెసిటా అనేది తెలియని బరువు విలువ యొక్క డబ్బు ప్రమాణము.\ft*\f* ఒక బంగారు ఉంగరాన్ని అతనికి ఇచ్చారు. \p \v 12 యెహోవా యోబు జీవితాన్ని గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఆశీర్వదించారు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు ఉన్నాయి. \v 13 అలాగే అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పుట్టారు. \v 14 యోబు పెద్దకుమార్తెకు యెమీమా అని రెండవ కుమార్తెకు కెజీయా అని మూడవ కుమార్తెకు కెరెంహప్పుకు అని పేర్లు పెట్టాడు. \v 15 దేశమంతటిలో యోబు కుమార్తెలంత అందమైనవారు ఎవరూ లేరు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి కూడా వారసత్వాన్ని పంచి ఇచ్చాడు. \p \v 16 దీని తర్వాత, యోబు నూట నలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన కుమారులను వారి కుమారులను నాలుగు తరాల వరకు చూశాడు. \v 17 చివరికి యోబు సంవత్సరాలు నిండి పండు ముసలివాడై చనిపోయాడు.