\id JER - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h యిర్మీయా \toc1 యిర్మీయా ప్రవచనం \toc2 యిర్మీయా \toc3 యిర్మీయా \mt1 యిర్మీయా \mt2 ప్రవచనం \c 1 \p \v 1 బెన్యామీను దేశంలో అనాతోతు అనే పట్టణంలో ఉన్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా మాటలు. \v 2 ఆమోను కుమారుడు యూదా రాజైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరంలో యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చి, \v 3 యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము పాలన నుండి, యోషీయా కుమారుడును యూదా రాజునైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం పూర్తయ్యే వరకు అంటే ఆ సంవత్సరం అయిదవ నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్లేవరకు యిర్మీయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది. \b \s1 యిర్మీయాకు దేవుని పిలుపు \p \v 4 యెహోవా వాక్కు నాకు వచ్చి, \q1 \v 5 “గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, \q2 నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; \q2 దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” \m అని చెప్పింది. \p \v 6 అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను. \p \v 7 అయితే యెహోవా నాతో, “ ‘నేను చిన్నవాన్ని’ అని నీవు అనవద్దు. నేను నిన్ను ఎవరి దగ్గిరికి పంపితే నీవు వారి దగ్గరికి వెళ్లి నేను ఏది ఆజ్ఞాపించానో అది వారికి చెప్పాలి. \v 8 నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.” \p \v 9 తర్వాత యెహోవా తన చేయి చాపి, నా నోటిని ముట్టి, “నీ నోటిలో నా మాటలు పెట్టాను. \v 10 పెళ్లగించడానికి, కూల్చివేయడానికి, నాశనం చేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి నాటడానికి నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమిస్తున్నాను” అని నాతో చెప్పారు. \p \v 11 తర్వాత యెహోవా నాతో మాట్లాడుతూ, “యిర్మీయా, నీకేం కనబడుతోంది?” అని అడిగారు. \p అందుకు నేను, “బాదం చెట్టు కొమ్మ కనబడుతోంది” అని జవాబిచ్చాను. \p \v 12 యెహోవా నాతో, “నీవు సరిగ్గా చూశావు, ఎందుకంటే నా మాట నెరవేరడం చూడాలని నేను కనిపెట్టుకుని\f + \fr 1:12 \fr*\ft హెబ్రీలో ఈ పదం \ft*\fqa బాదం చెట్టు \fqa*\ft పదంలా ఉంది\ft*\f* ఉన్నాను” అన్నారు. \p \v 13 మరోసారి యెహోవా నాతో మాట్లాడుతూ, “నీవు ఏం చూస్తున్నావు?” అని అడిగారు. \p అందుకు నేను, “మసలుతున్న బాన, అది ఉత్తర దిక్కునుండి మన వైపు వంగి ఉంది” అని చెప్పాను. \p \v 14 అప్పుడు యెహోవా నాతో, “ఉత్తరం నుండి దేశంలో నివసించే వారందరి మీద విపత్తు కుమ్మరించబడుతుంది. \v 15 నేను ఉత్తర రాజ్యాల జనాంగాలన్నిటిని పిలిపించబోతున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “వారి రాజులు వచ్చి తమ సింహాసనాలను \q2 యెరూషలేము గుమ్మాల్లో ఏర్పరచుకుంటారు; \q1 వారు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాకారాలన్నింటి మీద \q2 అలాగే యూదా పట్టణాలన్నింటి మీద దాడి చేస్తారు. \q1 \v 16 నా ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, \q2 వారి చేతులు చేసిన విగ్రహాలను వారు పూజించి, \q1 వారు చేసిన దుర్మార్గాన్ని బట్టి \q2 నేను నా ప్రజల మీద నా తీర్పులను ప్రకటిస్తాను. \p \v 17 “నిన్ను నీవు సిద్ధం చేసుకో! లేచి నిలబడి నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తే అది వారితో చెప్పు. వారికి భయపడవద్దు, లేకపోతే వారి ముందు నేను నిన్ను భయపెడతాను. \v 18 ఈ రోజు నేను మిమ్మల్ని దేశమంతటికి వ్యతిరేకంగా యూదా రాజులకు, దాని అధికారులకు, యాజకులకు, కోటగోడలు గల పట్టణంగా, ఇనుప స్తంభంగా ఇత్తడి గోడగా చేశాను. \v 19 వారు నీతో యుద్ధం చేస్తారు గాని, నీ మీద విజయం పొందలేరు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \c 2 \s1 ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టుట \p \v 1 యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది: \v 2 “నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు: \b \p “యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది, \q2 మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది; \q1 నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు, \q2 విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు. \q1 \v 3 ఇశ్రాయేలు యెహోవాకు పరిశుద్ధమైనది, \q2 వారు ఆయన పంటలోని ప్రథమ ఫలాలు; \q1 ఇశ్రాయేలీయులను మ్రింగివేసినవారు శిక్షకు పాత్రులు, \q2 విపత్తు వారి మీదికి వస్తుంది’ ” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 4 యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా, \q2 యెహోవా మాట వినండి. \p \v 5 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “మీ పూర్వికులు అంతలా దూరమవడానికి, \q2 వారికి నాలో ఏం తప్పు కనిపించింది? \q1 వారు విలువలేని విగ్రహాలను పూజించి, \q2 వారు విలువలేని వారయ్యారు. \q1 \v 6 వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, \q2 నిర్జన అరణ్యం గుండా, \q1 ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, \q2 కరువు, చీకటి నిండిన భూమి గుండా, \q1 ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా \q2 మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు. \q1 \v 7 నేను మిమ్మల్ని సారవంతమైన దేశంలోకి, \q2 దాని ఫలాలను, శ్రేష్ఠమైన వాటిని తినడానికి తీసుకువచ్చాను. \q1 అయితే మీరు వచ్చి నా దేశాన్ని ఆచారరీత్య అపవిత్రం చేసి \q2 నా స్వాస్థ్యాన్ని అసహ్యమైనదిగా చేశారు. \q1 \v 8 యాజకులు ‘యెహోవా ఎక్కడ ఉన్నారు?’ \q2 అని అడగలేదు. \q1 ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి నేను తెలియదు; \q2 నాయకులు నా మీదికి తిరుగబడ్డారు. \q1 ప్రవక్తలు పనికిరాని విగ్రహాలను పూజిస్తూ, \q2 బయలు పేరిట ప్రవచించారు. \b \q1 \v 9 “కాబట్టి నేను మీమీద మళ్ళీ నేరారోపణ చేస్తాను” \q2 మీ పిల్లల పిల్లల మీద కూడా నేరారోపణ చేస్తాను, \q2 “అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 10 కుప్ర\f + \fr 2:10 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కిత్తీము\fqa*\f* తీరాల అవతలి వైపుకు వెళ్లి చూడండి, \q2 కేదారుకు\f + \fr 2:10 \fr*\ft సిరియా-అరేబియా ఎడారి\ft*\f* దూతల్ని పంపి దగ్గరి నుండి గమనించండి; \q2 ఇలాంటిది ఎప్పుడైనా జరిగి ఉంటుందేమో చూడండి: \q1 \v 11 ఏ దేశమైనా తన దేవుళ్ళను ఎప్పుడైనా మార్చుకుందా? \q2 అయినా అవి దేవుళ్ళే కావు. \q1 కాని నా ప్రజలు పనికిమాలిన విగ్రహాల కోసం \q2 తమ మహిమగల దేవున్ని మార్చుకున్నారు. \q1 \v 12 ఆకాశమా, దీని గురించి ఆందోళన చెంది, \q2 భయంతో వణుకు,” \q2 అని యెహోవా చెప్తున్నారు. \q1 \v 13 “నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: \q1 జీవజలపు ఊటనైన నన్ను \q2 వారు విసర్జించి, \q1 తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, \q2 అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు. \q1 \v 14 ఇశ్రాయేలు దాసుడా? పుట్టుకతోనే బానిసా? \q2 అలాంటప్పుడు అతడు దోపుడుసొమ్ము ఎందుకు అయ్యాడు? \q1 \v 15 సింహాలు గర్జించాయి; \q2 అవి అతని మీదికి గుర్రుమన్నాయి. \q1 వారు అతని దేశాన్ని పాడుచేశారు; \q2 అతని పట్టణాలు కాలిపోయి నిర్జనమయ్యాయి. \q1 \v 16 అలాగే, మెంఫిసు,\f + \fr 2:16 \fr*\ft హెబ్రీలో \ft*\fqa నోఫు\fqa*\f* తహ్పన్హేసు పట్టణస్థులు, \q2 నీ పుర్రె పగులగొట్టారు. \q1 \v 17 కానీ నీ దేవుడైన యెహోవా మార్గంలో నిన్ను నడిపిస్తున్నప్పుడు, \q2 నీవు ఆయనను విడిచిపెట్టి, \q2 నీకు నీవే ఇదంతా నీ మీదికి తెచ్చుకోలేదా? \q1 \v 18 నైలు నది\f + \fr 2:18 \fr*\ft హెబ్రీలో \ft*\fqa షీహోరు; \fqa*\ft అంటే, నైలు నది ప్రవహించే ఒక శాఖ\ft*\f* నీళ్లు త్రాగడానికి \q2 ఈజిప్టుకు ఎందుకు వెళ్లాలి? \q1 యూఫ్రటీసు నుండి నీళ్లు త్రాగడానికి \q2 అష్షూరుకు ఎందుకు వెళ్లాలి? \q1 \v 19 నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; \q2 నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. \q1 నీ దేవుడైన యెహోవాను, \q2 నీవు విడిచిపెట్టడం, \q1 నేనంటే భయం లేకపోవడం, \q2 నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” \q2 అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 20 “చాలా కాలం క్రితమే నేను నీ కాడిని విరగ్గొట్టాను, \q2 నీ బంధకాలను తెంపివేశాను; \q2 అయినా నీవు, ‘నేను నీ సేవ చేయను!’ అన్నావు \q1 కాని నిజానికి, ప్రతీ ఎత్తైన కొండమీద, \q2 ప్రతీ పచ్చని చెట్టు క్రింద \q2 నీవు వేశ్యలా పడుకుంటున్నావు. \q1 \v 21 నేను నిన్ను శ్రేష్ఠమైన ద్రాక్షవల్లిగా \q2 మంచి, నమ్మదగిన మొక్కగా నాటాను. \q1 అలాంటప్పుడు నీవు నాకు వ్యతిరేకంగా \q2 చెడిపోయిన అడవి ద్రాక్షవల్లిగా ఎలా మారావు? \q1 \v 22 నీవు సబ్బుతో నిన్ను నీవు కడుక్కున్నా \q2 శుభ్రం చేయడానికి వాడే చూర్ణం వాడినా, \q2 నీ అపరాధపు మరక ఇంకా కనిపిస్తుంది,” \q2 అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 23 “నీవు, ‘నేను అపవిత్రం కాలేదు; \q2 నేను బయలు విగ్రహాల వెంట పరుగెత్తలేదు’ అని ఎలా అనగలవు? \q1 లోయలో నీవు ఎలా ప్రవర్తించావో చూడు; \q2 నీవు ఏమి చేశావో కాస్త గమనించు. \q1 నీవు ఇటు అటు వేగంగా \q2 పరుగెత్తే ఆడ ఒంటెవు, \q1 \v 24 ఎడారికి అలవాటు పడిన అడవి గాడిదవు, \q2 అది కామంతో గాలిని పసిగడుతుంది, \q2 అది తాపంలో ఉన్నప్పుడు దానిని ఎవరు అడ్డుకోగలరు? \q1 దాన్ని వెంటాడే మగ గాడిదలకు అలసట రాదు; \q2 అది కలుసుకునే సమయంలో అది వారికి కనబడుతుంది. \q1 \v 25 నీ పాదాల చెప్పులు అరిగిపోయే వరకు, \q2 నీ గొంతు ఆరిపోయే వరకు నీవు పరదేశి దేవుళ్ళ వెంట పరుగెత్తకు. \q1 అయితే మీరు ఇలా అన్నారు, ‘మాకు నీవు చెప్పి ప్రయోజనం లేదు! \q2 మేము పరదేశి దేవుళ్ళను ప్రేమిస్తున్నాము, \q2 మేము వారి వెంట వెళ్లాలి.’ \b \q1 \v 26 “దొంగ పట్టుబడినప్పుడు అవమానించబడినట్లు, \q2 ఇశ్రాయేలు ప్రజలు అవమానించబడ్డారు; \q1 వారు వారి రాజులు వారి అధికారులు, \q2 వారి యాజకులు వారి ప్రవక్తలు అవమానించబడ్డారు. \q1 \v 27 వారు చెక్కతో, ‘నీవు మా తండ్రివి’ అని, \q2 రాయితో, ‘నీవు మాకు జన్మనిచ్చావు’ అంటున్నారు \q1 వారు నావైపు వారి ముఖాలు త్రిప్పకుండ, \q2 నాకు వెన్ను చూపారు; \q1 అయినప్పటికీ వారు కష్టంలో ఉన్నప్పుడు, \q2 ‘వచ్చి మమ్మల్ని రక్షించండి!’ అని అంటారు. \q1 \v 28 అయితే మీరు మీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడున్నారు? \q2 మీరు కష్టాల్లో ఉన్నప్పుడు \q2 మిమ్మల్ని కాపాడగలిగితే రానివ్వండి! \q1 యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో, \q2 అంతమంది దేవుళ్ళు ఉన్నారు. \b \q1 \v 29 “నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు? \q2 మీరందరూ నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 30 “నేను వ్యర్థంగా నీ పిల్లలను శిక్షించాను; \q2 వారు దిద్దుబాటుకు స్పందించలేదు. \q1 నీ ఖడ్గం నీ ప్రవక్తలను, \q2 బాగా ఆకలిగా ఉన్న సింహంలా చంపింది. \p \v 31 “ఈ తరం వారలారా! యెహోవా మాటలు శ్రద్ధగా వినండి: \q1 “నేను ఇశ్రాయేలుకు ఎడారిగా \q2 మహా చీకటి దేశంగా ఉన్నానా? \q1 ఎందుకు నా ప్రజలు, ‘మేము స్వేచ్ఛగా తిరుగుతాము; \q2 ఇకపై మేము మీ దగ్గరకు రాము’ అని ఎందుకు అంటున్నారు? \q1 \v 32 ఒక యువతి తన నగలు, \q2 ఒక వధువు తన పెళ్ళి ఆభరణాలు మరచిపోతుందా? \q1 అయినా నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు, \q2 నన్ను మరచిపోయారు. \q1 \v 33 ప్రేమను వెదకడంలో నీవు ఎంత నేర్పరివో! \q2 నీచమైన స్త్రీలు నీ నుండి నేర్చుకుంటారు. \q1 \v 34 నిర్దోషుల ప్రాణాధారమైన రక్తపు మరక \q2 నీ బట్టలపైన ఉంది. \q2 వారు లోపలికి చొచ్చుకొని వస్తూ ఉంటే నీవు వారిని పట్టుకోలేదు. \q1 ఇంత జరిగినా, \q2 \v 35 నీవు, ‘నేను నిర్దోషిని; \q2 ఆయనకు నా మీద కోపం రాదు’ అంటున్నావు. \q1 ‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు, \q2 కాబట్టి నేను నీ మీద తీర్పు ప్రకటిస్తాను. \q1 \v 36 నీ మార్గాలను మార్చుకుంటూ, \q2 ఎందుకు అంతలా తిరుగుతున్నావు? \q1 నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా \q2 ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు. \q1 \v 37 నీ తలపై చేతులు పెట్టుకుని \q2 ఆ స్థలం నుండి వెళ్లిపోతావు, \q1 ఎందుకంటే నీవు నమ్మేవారిని యెహోవా తిరస్కరించారు; \q2 నీవు వారి ద్వారా సహాయం పొందలేవు. \b \b \c 3 \q1 \v 1 “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, \q2 ఆమె అతన్ని విడిచిపెట్టి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే, \q1 అతడు మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాలా? \q2 దేశమంతా పూర్తిగా అపవిత్రమవదా? \q1 అయితే నీవు చాలామంది ప్రేమికులతో వేశ్యగా జీవించావు, \q2 ఇప్పుడు నా దగ్గరకు తిరిగి వస్తావా?” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 2 “కళ్లు పైకెత్తి ఆ బంజరు కొండలను చూడు. \q2 నీవు అత్యాచారానికి గురి కాని ప్రదేశం ఏదైనా ఉందా? \q1 ప్రేమికుల కోసం రోడ్డు ప్రక్కన ఎదురుచూస్తూ కూర్చున్నావు, \q2 ఎడారిలో అరబీయునిగా\f + \fr 3:2 \fr*\ft అంటే \ft*\fqa సంచారిగా\fqa*\f* కూర్చున్నావు. \q1 నీ వ్యభిచారంతో, దుర్మార్గంతో \q2 దేశాన్ని అపవిత్రం చేశావు. \q1 \v 3 కాబట్టి వాన జల్లులు ఆగిపోయాయి, \q2 వసంత వర్షాలు కురవలేదు. \q1 అయినా నీవు వేశ్యలా సిగ్గుపడడానికి తిరస్కరిస్తున్నావు; \q2 నీవు సిగ్గుపడడానికి నిరాకరిస్తున్నావు. \q1 \v 4 నీవు ఇప్పుడే నన్ను పిలిచి: \q2 ‘నా తండ్రీ, నా చిన్నప్పటి నుండి నా స్నేహితుడవు, \q1 \v 5 నీవు ఎప్పటికీ కోపంగా ఉంటావా? \q2 నీ ఉగ్రత ఎప్పటికీ ఉంటుందా?’ \q1 నీవు ఇలా మాట్లాడతావు, \q2 కానీ నీవు చేయగలిగిన కీడంతా చేస్తావు.” \s1 నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు \p \v 6 యోషీయా రాజు పాలనలో యెహోవా నాతో ఇలా అన్నారు, “నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు ఏమి చేసిందో చూశావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి వెళ్లి, వ్యభిచారం చేసింది. \v 7 ఇదంతా చేసిన తర్వాత ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుందని నేను అనుకున్నాను, కానీ ఆమె అలా చేయలేదు, ఆమె నమ్మకద్రోహియైన సోదరి యూదా దానిని చూసింది. \v 8 నేను విశ్వాసంలేని ఇశ్రాయేలుకు తన విడాకుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, ఆమె చేసిన వ్యభిచారాలన్నిటిని బట్టి ఆమెను పంపివేసాను. అయినప్పటికీ నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదాకు భయం లేదని నేను చూశాను; ఆమె కూడా బయటకు వెళ్లి వ్యభిచారం చేసింది. \v 9 ఇశ్రాయేలు అనైతికత ఆమె దృష్టికి చాలా తక్కువ కాబట్టి, ఆమె దేశాన్ని అపవిత్రం చేసింది, రాయితో, కలపతో వ్యభిచారం చేసింది. \v 10 ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన తన సహోదరి యూదా తన పూర్ణహృదయంతో నా వైపు తిరగలేదు, కేవలం నటించింది” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 11 యెహోవా నాతో ఇలా అన్నారు: “ద్రోహియైన యూదా కంటే విశ్వాసంలేని ఇశ్రాయేలు నీతిమంతురాలు. \v 12 నీవు వెళ్లి, ఉత్తరాన\f + \fr 3:12 \fr*\ft అంటే \ft*\fqa ఇశ్రాయేలు\fqa*\f* ఈ సందేశం ప్రకటించాలి: \q1 “ ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, \q2 ‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను, \q1 ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, \q2 ‘నేను నిత్యం కోపంగా ఉండను. \q1 \v 13 నీ అపరాధాన్ని ఒప్పుకో \q2 నీ దేవుడైన యెహోవా మీద నీవు తిరుగుబాటు చేశావు, \q1 నీవు ప్రతి మహా వృక్షం క్రింద \q2 పరదేశి దేవుళ్ళకు నీ ఇష్టాన్ని పంచుకున్నావు, \q2 నాకు విధేయత చూపలేదు’ ” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 14 “విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను నీ భర్తను కాబట్టి నేను నిన్ను ఎంచుకుంటాను ఒక పట్టణం నుండి ఒకనిగా, ఒక వంశం నుండి ఇద్దరినిగా నిన్ను సీయోనుకు తీసుకువస్తాను. \v 15 అప్పుడు నేను నీకు నా హృదయానికి చాలా దగ్గరి వారైన కాపరులను ఇస్తాను, వారు జ్ఞానంతో, అవగాహనతో మిమ్మల్ని నడిపిస్తారు. \v 16 ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు. \v 17 ఆ సమయంలో వారు యెరూషలేమును యెహోవా యొక్క సింహాసనం అని పిలుస్తారు, యెహోవా నామాన్ని గౌరవించడానికి అన్ని దేశాలు యెరూషలేములో సమకూడుతాయి. ఇకపై వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించరు. \v 18 ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు. \p \v 19 “నేను నేనే ఇలా అన్నాను, \q1 “ ‘మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను \q2 మీకు ఆహ్లాదకరమైన భూమిని, \q2 ఏ జాతికి చెందనంత అందమైన వారసత్వాన్ని ఇస్తాను.’ \q1 ‘తండ్రీ’ అని నీవు నన్ను పిలుస్తావని అనుకున్నాను \q2 నన్ను అనుసరించకుండ దూరంగా వెళ్లవని అనుకున్నాను. \q1 \v 20 కానీ తన భర్తకు ద్రోహం చేసిన స్త్రీలా \q2 ఇశ్రాయేలూ, నీవు నాకు నమ్మకద్రోహం చేశావు,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 21 ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గాలను తప్పుదారి పట్టించి \q2 తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు కాబట్టి, \q1 బంజరు కొండలమీద \q2 ఇశ్రాయేలు ప్రజల ఏడ్పులు, విన్నపాలు, వినబడుతున్నాయి. \b \q1 \v 22 “విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి. \q2 మీ విశ్వాసభ్రష్టత్వాన్ని నేను నయం చేస్తాను.” \b \q1 “అవును, మేము మీ దగ్గరకు వస్తాము, \q2 ఎందుకంటే మీరే మా దేవుడైన యెహోవా. \q1 \v 23 నిశ్చయంగా కొండలు, పర్వతాలమీద జరుగుతున్న \q2 విగ్రహారాధన అల్లకల్లోలం మోసమే; \q1 ఖచ్చితంగా మన దేవుడైన యెహోవాలో \q2 ఇశ్రాయేలు రక్షణ. \q1 \v 24 మన పూర్వికుల శ్రమ ఫలాలను \q2 వారి గొర్రెలను, మందలను, \q1 వారి కుమారులు, కుమార్తెలను \q2 మా యవ్వనం నుండి సిగ్గుమాలిన దేవతలు తినివేశాయి. \q1 \v 25 మనం అవమానంలో పడి ఉందాం, \q2 మన అవమానాన్ని మనల్ని కప్పివేయనిద్దాము. \q1 మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మనం పాపం చేశాము, \q2 మనమూ, మన పూర్వికులు; \q1 మా యవ్వనం నుండి నేటి వరకు \q2 మనం మన దేవుడైన యెహోవా మాటకు లోబడలేదు.” \b \c 4 \q1 \v 1 “ఇశ్రాయేలూ, నీవు తిరిగి వస్తే, \q2 నా దగ్గరకు తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “నీ అసహ్యమైన విగ్రహాలను నా దృష్టికి దూరంగా ఉంచితే \q2 ఇక దారి తొలగకుండా ఉంటే, \q1 \v 2 మీరు నిజాయితీ, న్యాయం నీతిగల మార్గంలో ఉండి, \q2 ‘సజీవుడైన యెహోవా మీద’ అని ప్రమాణం చేస్తే, \q1 అప్పుడు నిన్ను బట్టి దేశాలు ఆశీర్వాదాలు పొందుతాయి, \q2 వారు యెహోవా పట్ల వారి అభిమానాన్ని చాటుకుంటారు.” \p \v 3 యూదా వారికి, యెరూషలేముకు యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “దున్నబడని నీ నేలను పగులగొట్టు \q2 ముళ్ళ మధ్య విత్తవద్దు. \q1 \v 4 మిమ్మల్ని మీరు యెహోవాకు సున్నతి చేసుకోండి, \q2 మీ హృదయాలను సున్నతి చేసుకోండి, \q2 యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, \q1 లేకపోతే మీరు చేసిన చెడును బట్టి \q2 నా కోపం అగ్నిలా మండుతుంది, \q2 ఆర్పడానికి ఎవరూ ఉండరు. \s1 ఉత్తర దిక్కునుండి విపత్తు \q1 \v 5 “యూదాలో ప్రకటించి, యెరూషలేములో ప్రకటించి ఇలా చెప్పు: \q2 ‘దేశమంతటా బూరధ్వని చేయండి!’ \q1 బిగ్గరగా కేకలువేస్తూ అనండి: \q2 ‘ఒక్క దగ్గరికి రండి! \q2 కోటలున్న పట్టణాలకు పారిపోదాం!’ \q1 \v 6 సీయోనుకు కనబడేలా జెండాను ఎత్తండి! \q2 ఆలస్యం చేయకుండా క్షేమం కోసం పారిపోండి! \q1 నేను ఉత్తరం నుండి విపత్తును, \q2 భయంకరమైన నాశనాన్ని కూడా తెస్తున్నాను.” \b \q1 \v 7 ఒక సింహం తన పొద చాటు నుండి బయటకు వచ్చింది; \q2 దేశాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు. \q1 మీ దేశాన్ని పాడుచేయడానికి \q2 ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టాడు. \q1 నీ పట్టణాలు \q2 నివాసులు లేకుండా శిథిలావస్థలో ఉంటాయి. \q1 \v 8 కాబట్టి గోనెపట్ట ధరించుకుని, \q2 విలపించండి, ఏడవండి, \q1 యెహోవా యొక్క భయంకరమైన కోపం \q2 మనల్ని విడిచిపెట్టలేదు. \b \q1 \v 9 యెహోవా ఇలా అంటున్నాడు, \q2 “ఆ రోజు రాజు, అధికారులు ధైర్యం కోల్పోతారు, \q1 యాజకులు భయపడతారు, \q2 ప్రవక్తలు ఆశ్చర్యపోతారు.” \p \v 10 అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా! ఖడ్గం మా గొంతు మీద ఉన్నప్పుడు, ‘మీకు సమాధానం కలుగుతుంది’ అని చెప్పి మీరు ఈ ప్రజలను, యెరూషలేమును ఎంత ఘోరంగా మోసం చేశారు!” \p \v 11 ఆ సమయంలో ఈ ప్రజలకు, యెరూషలేముకు ఇలా ప్రకటించబడుతుంది: “ఎడారిలో బంజరు కొండల నుండి మండే గాలి నా ప్రజల వైపు వీస్తుంది, కానీ పొట్టు చెరగడానికో లేదా శుభ్రం చేయడానికో కాదు. \v 12 అంతకంటే బలమైన గాలి నా మీద వీచింది, యెహోవా చెప్పినట్లు వారి మీదికి నా తీర్పులు ప్రకటిస్తున్నాను.” \q1 \v 13 చూడు! అతడు మేఘాల్లా ముందుకు సాగిపోతాడు, \q2 అతని రథాలు సుడిగాలిలా వస్తాయి, \q1 అతని గుర్రాలు గ్రద్దల కంటే వేగవంతమైనవి. \q2 అయ్యో మాకు శ్రమ! మేము నాశనం అయ్యాము! \q1 \v 14 యెరూషలేమా, నీ హృదయంలోని చెడును కడిగి రక్షించబడు. \q2 మీరు ఎంతకాలం చెడ్డ ఆలోచనలను కలిగి ఉంటారు? \q1 \v 15 దాను నుండి ఒక స్వరం, \q2 ఎఫ్రాయిం కొండల నుండి కీడు వస్తుందని ప్రకటిస్తుంది. \q1 \v 16 “దేశాలకు ఈ విషయం చెప్పండి, \q2 యెరూషలేము గురించి ఇలా ప్రకటించండి: \q1 ‘దూరదేశం నుండి ముట్టడి చేస్తున్న సైన్యం, \q2 యూదా పట్టణాలకు వ్యతిరేకంగా యుద్ధ కేకలు వేస్తుంది. \q1 \v 17 పొలంలో కాపలా కాస్తున్న మనుష్యుల్లా వారు ఆమెను చుట్టుముట్టారు, \q2 ఎందుకంటే ఆమె నా మీదికి తిరుగుబాటు చేసింది’ ” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 18 “మీ ప్రవర్తన మీ క్రియలు \q2 దీన్ని మీపైకి తెచ్చాయి. \q1 ఇది నీకు శిక్ష. \q2 ఎంత చేదుగా ఉంది! \q2 అది హృదయాన్ని ఎలా గ్రుచ్చుతుంది!” \b \q1 \v 19 అయ్యో, నా వేదన, నా వేదన! \q2 నేను నొప్పితో విలపిస్తున్నాను. \q1 అయ్యో, నా హృదయ వేదన! \q2 నా గుండె నాలో కొట్టుకుంటుంది, \q2 నేను మౌనంగా ఉండలేను. \q1 నేను బూరధ్వని విన్నాను; \q2 నేను యుద్ధ కేకలు విన్నాను. \q1 \v 20 విపత్తు తర్వాత విపత్తు వస్తున్నాయి; \q2 దేశం మొత్తం శిథిలావస్థలో ఉంది. \q1 వెంటనే నా గుడారాలు ధ్వంసమయ్యాయి, \q2 నా ఆశ్రయం క్షణంలో ధ్వంసమయ్యాయి. \q1 \v 21 నేను ఎంతకాలం యుద్ధ పతాక సంకేతాన్ని చూడాలి \q2 బూరధ్వని వినాలి? \b \q1 \v 22 “నా ప్రజలు మూర్ఖులు; \q2 వారికి నేను తెలియదు. \q1 వారు బుద్ధిలేని పిల్లలు; \q2 వారికి వివేచన లేదు. \q1 వారు కీడు చేయడంలో నేర్పరులు; \q2 మంచి చేయడం ఎలాగో వారికి తెలియదు.” \b \q1 \v 23 నేను భూమిని చూశాను, \q2 అది నిరాకారంగా, శూన్యంగా ఉంది; \q1 ఆకాశాల వైపు చూశాను, \q2 వాటి కాంతి పోయింది. \q1 \v 24 నేను పర్వతాలను చూశాను, \q2 అవి వణుకుతున్నాయి. \q2 కొండలన్నీ ఊగుతున్నాయి. \q1 \v 25 నేను చూశాను, అక్కడ మనుష్యులే లేరు; \q2 ఆకాశంలోని ప్రతి పక్షి ఎగిరిపోయింది. \q1 \v 26 నేను చూశాను, ఫలవంతమైన భూమి ఎడారి; \q2 దాని పట్టణాలన్ని \q2 యెహోవా ఎదుట, ఆయన ఉగ్రమైన కోపం ముందు శిథిలమైపోయాయి. \p \v 27 యెహోవా ఇలా అంటున్నాడు: \q1 “నేను దానిని పూర్తిగా నాశనం చేయనప్పటికీ, \q2 దేశమంతా పాడైపోతుంది. \q1 \v 28 కాబట్టి భూమి దుఃఖిస్తుంది \q2 పైనున్న ఆకాశం అంధకారం అవుతుంది, \q1 నేను మాట్లాడాను కాబట్టి పశ్చాత్తాపపడను, \q2 నేను నిర్ణయించుకున్నాను, కాబట్టి వెనుకకు తిరగను.” \b \q1 \v 29 గుర్రాలు, విలుకాడుల శబ్దానికి \q2 ప్రతి ఊరు ఎగిరిపోతుంది. \q1 కొందరు పొదల్లోకి వెళ్తారు; \q2 కొందరు రాళ్ల మధ్య ఎక్కుతారు. \q1 పట్టణాలన్ని నిర్జనమైపోయాయి; \q2 వాటిలో ఎవరూ నివసించరు. \b \q1 \v 30 అన్నీ నాశనమవుతుంటే, నీవు ఏం చేస్తున్నావు? \q2 ఎర్రని రంగును \q2 ధరించి బంగారు ఆభరణాలు ఎందుకు ధరించాలి? \q1 మీ కళ్లను అలంకరించుకుని ఎందుకు ఆకర్షణీయంగా చేస్తారు? \q2 నిన్ను నీవు వృధాగా అలంకరించుకున్నావు. \q1 నీ ప్రేమికులు నిన్ను తృణీకరిస్తారు; \q2 వారు నిన్ను చంపాలనుకుంటున్నారు. \b \q1 \v 31 ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఏడ్పు, \q2 తన మొదటి బిడ్డను కంటూ వేదనపడుతున్న స్త్రీ కేకలు, \q1 ఊపిరి కోసం అల్లాడుతూ, \q2 సీయోను కుమారి తన చేతులు చాచి, \q1 “అయ్యో! నేను మూర్ఛపోతున్నాను; \q2 నా ప్రాణం హంతకులకు అప్పగించబడింది,” \q2 అంటూ కేకలు వేయడం నాకు వినబడుతుంది. \c 5 \s1 నీతిమంతులు ఒక్కరు లేరు \q1 \v 1 “యెరూషలేము వీధుల్లోకి వెళ్లి, \q2 చుట్టూ చూసి పరిశీలించండి, \q2 దాని కూడళ్లలో వెదకండి. \q1 నమ్మకంగా వ్యవహరించే సత్యాన్ని వెదికే \q2 ఒక్క వ్యక్తినైనా మీరు కనుగొనగలిగితే, \q2 నేను ఈ పట్టణాన్ని క్షమిస్తాను. \q1 \v 2 వారు, ‘సజీవుడైన యెహోవా మీద ప్రమాణం’ అని అన్నప్పటికీ, \q2 వారు అబద్ధపు ప్రమాణమే చేస్తున్నారు.” \b \q1 \v 3 యెహోవా, మీ కళ్లు నమ్మకత్వాన్ని వెదకడం లేదా? \q2 మీరు వారిని మొత్తారు కాని వారికి నొప్పి కలగలేదు; \q2 మీరు వారిని చితకబాదారు, కానీ వారు దిద్దుబాటును నిరాకరించారు. \q1 వారు తమ ముఖాలను రాయి కంటే కఠినంగా చేసుకున్నారు \q2 పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు. \q1 \v 4 నేను ఇలా అనుకున్నాను, “వీరు పేదవారు; \q2 వారు బుద్ధిహీనులు, \q1 ఎందుకంటే వారికి యెహోవా మార్గం తెలియదు, \q2 వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలియదు. \q1 \v 5 కాబట్టి నేను నాయకుల దగ్గరకు వెళ్లి \q2 వారితో మాట్లాడతాను; \q1 ఖచ్చితంగా యెహోవా మార్గం వారికి తెలుసు, \q2 వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలుసు.” \q1 అయితే వారు కూడా ఏకమనస్సుతో కాడిని విరగ్గొట్టారు, \q2 బంధకాలను తెంపుకున్నారు. \q1 \v 6 కాబట్టి అడవి నుండి సింహం వారిపై దాడి చేస్తుంది, \q2 ఎడారి నుండి ఒక తోడేలు వారిని నాశనం చేస్తుంది, \q1 ఒక చిరుతపులి వారి పట్టణాల దగ్గర పొంచి ఉంది \q2 బయటకు వెళ్లేవారిని ముక్కలు చేయడానికి, \q1 ఎందుకంటే వారి తిరుగుబాటు గొప్పది \q2 వారి విశ్వాసభ్రష్టత్వం చాలా ఎక్కువ. \b \q1 \v 7 “నేను నిన్ను ఎందుకు క్షమించాలి? \q2 మీ పిల్లలు నన్ను విడిచి, \q2 దేవుళ్ళు కాని దేవుళ్ళపై ప్రమాణం చేశారు. \q1 వారి అవసరాలన్నీ నేను తీర్చాను, \q2 అయినప్పటికీ వారు వ్యభిచారం చేశారు \q2 వేశ్యల ఇళ్ళకు గుమికూడారు. \q1 \v 8 వారు బాగా మేపబడిన, కామంతో నిండిన మగ గుర్రాలు, \q2 ప్రతి ఒక్కరు పొరుగువాని భార్యను చూసి సకిలిస్తారు, \q1 \v 9 అందుకు నేను వారిని శిక్షించవద్దా?” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “ఇలాంటి దేశం మీద నేను \q2 ప్రతీకారం తీర్చుకోవద్దా? \b \q1 \v 10 “ఆమె ద్రాక్షతోట వరుసల గుండా వెళ్లి వాటిని నాశనం చేయండి, \q2 అయితే వాటిని పూర్తిగా నాశనం చేయవద్దు. \q1 వాటి కొమ్మలను తీసివేయండి, \q2 ఎందుకంటే ఈ ప్రజలు యెహోవాకు చెందినవారు కారు. \q1 \v 11 ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు \q2 నా పట్ల పూర్తిగా నమ్మకద్రోహులుగా ఉన్నారు” \q2 అని యెహోవా అంటున్నారు. \b \q1 \v 12 వారు యెహోవా గురించి అబద్ధం చెప్పారు; \q2 వారు, “ఆయన ఏమీ చేయడు! \q1 మాకు ఎలాంటి హాని జరగదు; \q2 మేము ఖడ్గం గాని కరువు గాని ఎన్నడూ చూడము. \q1 \v 13 ప్రవక్తలు గాలి తప్ప మరొకటి కాదు \q2 వారిలో వాక్యం లేదు; \q2 కాబట్టి వారు చెప్పేది వారికే జరుగనివ్వండి” \m అని అన్నారు. \p \v 14 కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: \q1 “ప్రజలు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి, \q2 నేను నీ నోటిలో నా మాటలను అగ్నిగాను \q2 ఈ ప్రజలను అది కాల్చివేసే కలపగాను చేస్తాను. \q1 \v 15 ఇశ్రాయేలు ప్రజలారా,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q2 “నేను మీ మీదికి దూర దేశాన్ని రప్పిస్తున్నాను, \q1 చాలా కాలంనాటి, శాశ్వతమైన దేశం, \q2 ఎవరి భాష మీకు తెలియదో, \q2 ఎవరి మాట మీకు అర్థం కాదో, అలాంటి ప్రజలను. \q1 \v 16 వారి అంబులపొది తెరిచిన సమాధిలా ఉంది; \q2 వారందరూ పరాక్రమవంతులు. \q1 \v 17 వారు మీ పంటలను, ఆహారాన్ని మ్రింగివేస్తారు, \q2 మీ కుమారులను, కుమార్తెలను మ్రింగివేస్తారు; \q1 వారు మీ గొర్రెలను, మందలను మ్రింగివేస్తారు, \q2 మీ ద్రాక్ష చెట్లను, అంజూర చెట్లను మ్రింగివేస్తారు. \q1 మీరు నమ్ముకునే కోటగోడలు గల పట్టణాలను \q2 వారు ఖడ్గంతో నాశనం చేస్తారు. \p \v 18 “అయినప్పటికీ ఆ రోజుల్లో” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయను. \v 19 ఒకవేళ ప్రజలు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇదంతా చేశారు?’ అని అడిగితే మీరు వారితో ఇలా చెప్తారు, ‘మీరు నన్ను విడిచి మీ స్వదేశంలో పరదేశి దేవుళ్ళను సేవించారు, కాబట్టి ఇప్పుడు మీరు మీది కాని దేశంలో విదేశీయులకు సేవ చేయాలి.’ \q1 \v 20 “యాకోబు సంతతికి ఈ విషయాన్ని చాటించండి \q2 యూదాలో ప్రకటించండి: \q1 \v 21 తెలివిలేని బుద్ధిహీనులారా, \q2 కళ్లుండి చూడ లేనివారలారా, \q2 చెవులుండి వినలేనివారలారా, ఇది వినండి: \q1 \v 22 మీరు నాకు భయపడరా?” \q2 అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. \q2 “నా సన్నిధిలో మీరు వణకరా? \q1 నేను సముద్రానికి ఇసుకను ఒక సరిహద్దుగా చేశాను, \q2 అది దాటకూడని ఒక నిత్యమైన హద్దు, \q1 అలలు ఎగసిపడవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు; \q2 అవి గర్జించవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు. \q1 \v 23 అయితే ఈ ప్రజలు మొండితనం, తిరుగుబాటుతనం గల హృదయాలు కలిగి ఉన్నారు; \q2 వారు ప్రక్కకు తిరిగి వెళ్లిపోయారు. \q1 \v 24 ‘మనం మన దేవుడైన యెహోవాకు భయపడదాం, \q2 ఆయన తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తారు, \q1 నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను గురించి మనకు నిశ్చయత కలిగించేవాడు ఆయనే’ \q2 అని వారు తమ హృదయాల్లో అనుకోరు. \q1 \v 25 మీ తప్పులు వీటిని దూరం చేశాయి; \q2 మీ పాపాలు మీకు మేలు లేకుండా చేశాయి. \b \q1 \v 26 “నా ప్రజలమధ్య దుర్మార్గులు ఉన్నారు \q2 వారు పక్షులకు వలలు వేసే మనుష్యుల్లా \q2 మనుష్యులను పట్టుకోవడానికి వేటగానిలా పొంచి ఉన్నారు. \q1 \v 27 పక్షులతో నిండిన బోనుల్లా, \q2 వారి ఇల్లు మోసంతో నిండి ఉన్నాయి; \q1 వారు ధనవంతులు శక్తివంతులు \q2 \v 28 వారు లావుగా నిగనిగలాడుతూ ఉన్నారు. \q1 వారి దుర్మార్గాలకు హద్దు లేదు; \q2 వారు న్యాయం కోరరు. \q1 వారు తండ్రిలేనివారి వాదనను వాదించరు; \q2 వారు పేదల న్యాయమైన కారణాన్ని సమర్థించరు. \q1 \v 29 దీని కోసం నేను వారిని శిక్షించకూడదా?” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “ఇలాంటి దేశం మీద నేను \q2 ప్రతీకారం తీర్చుకోకూడదా? \b \q1 \v 30 “భయంకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి \q2 దేశంలో జరిగింది: \q1 \v 31 ప్రవక్తలు అబద్ధాలను ప్రవచిస్తున్నారు, \q2 యాజకులు తమ సొంత అధికారంతో పరిపాలిస్తున్నారు, \q1 నా ప్రజలు ఇలాగే ఇష్టపడుతున్నారు. \q2 అయితే చివరికి మీరేం చేస్తారు? \c 6 \s1 యెరూషలేమును ముట్టడించుట \q1 \v 1 “బెన్యామీను ప్రజలారా, క్షేమం కోసం పారిపోండి! \q2 యెరూషలేము నుండి పారిపోండి! \q1 తెకోవాలో బూరధ్వని చేయండి! \q2 బేత్-హక్కెరెము మీద సంకేతం కోసం ధ్వజం నిలబెట్టండి! \q1 ఎందుకంటే ఉత్తర దిక్కునుండి విపత్తు వస్తుంది, \q2 భయంకరమైన విధ్వంసం కూడా వస్తుంది. \q1 \v 2 నేను చాలా అందమైన, సున్నితమైన, \q2 సీయోను కుమార్తెను నాశనం చేస్తాను. \q1 \v 3 రాజులు తమ సైన్యాలతో ఆమెకు వ్యతిరేకంగా వస్తారు; \q2 వారు ఆమె చుట్టూ తమ గుడారాలు వేసుకుంటారు, \q2 ప్రతి ఒక్కరూ తమ సైన్యం నిర్మూలం చేయడానికి ఒక భాగాన్ని ఎంచుకుంటారు.” \b \q1 \v 4 “ఆమెతో పవిత్ర యుద్ధానికి సిద్ధపడండి! \q2 లేచి, మధ్యాహ్న సమయంలో దాడి చేద్దాం! \q1 కానీ, అయ్యో, పగటి వెలుతురు తగ్గిపోతుంది, \q2 సాయంత్రపు నీడలు పొడవు అవుతున్నాయి. \q1 \v 5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి \q2 దాని కోటలను నాశనం చేద్దాం!” \p \v 6 సైన్యాల యెహోవా చెప్పేదేమిటంటే: \q1 “చెట్లను నరికి \q2 యెరూషలేముపై ముట్టడి దిబ్బలను కట్టండి. \q1 ఈ పట్టణం శిక్షించబడాలి; \q2 ఇందులో అణచివేయడం తప్ప ఏమీ లేదు. \q1 \v 7 బావి తన నీళ్లను ఎలా బయటకు ఉబికేలా చేస్తుందో, \q2 అలాగే ఆమె తన దుష్టత్వాన్ని కుమ్మరిస్తుంది. \q1 హింస, విధ్వంసం ఆమెలో ప్రతిధ్వనిస్తుంది; \q2 ఆమె జబ్బులు, గాయాలు నిత్యం నా ముందు ఉన్నాయి. \q1 \v 8 యెరూషలేమా, ఈ హెచ్చరికను తీవ్రమైనదిగా తీసుకో, \q2 లేకపోతే నేను నిన్ను వదిలేసి \q1 నీ దేశాన్ని నిర్జనంగా చేస్తాను \q2 అందులో ఎవరూ నివసించలేరు.” \p \v 9 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “మిగిలిన ఇశ్రాయేలీయులను \q2 ద్రాక్షపళ్లలా వారిని ఏరుకోనివ్వండి; \q1 ఒకడు ద్రాక్ష పళ్లను ఏరుకున్నట్లుగా, \q2 మళ్ళీ కొమ్మల మీద నీ చేయి వేయి.” \b \q1 \v 10 నేను ఎవరితో మాట్లాడి హెచ్చరిక ఇవ్వగలను? \q2 నా మాట ఎవరు వింటారు? \q1 వారి చెవులు మూయబడి ఉన్నాయి\f + \fr 6:10 \fr*\ft హెబ్రీలో \ft*\fqa సున్నతి చేయబడలేదు\fqa*\f* \q2 కాబట్టి వారు వినలేరు. \q1 యెహోవా మాట వారికి అభ్యంతరకరమైనది; \q2 వారు దానిలో ఆనందాన్ని పొందలేరు. \q1 \v 11 కానీ నేను యెహోవా యొక్క ఉగ్రతతో నిండి ఉన్నాను, \q2 నేను దానిని పట్టుకోలేను. \b \q1 “వీధిలో ఉన్న పిల్లల మీద \q2 ఒక్కచోట పోగైన యువకుల మీద దానిని కుమ్మరించండి; \q1 భార్య భర్తలు, \q2 వృద్ధులు, వయస్సు మీరిన వారు అందులో చిక్కుకుంటారు. \q1 \v 12 నేను దేశంలో నివసించే వారిపై \q2 నా చేయి చాచినప్పుడు \q1 వారి ఇల్లు, వారి పొలాలతో పాటు, \q2 వారి భార్యలు ఇతరులకు అప్పగించబడతారు,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 13 “అల్పుల నుండి గొప్పవారి వరకు, \q2 అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు; \q1 ప్రవక్తలు యాజకులు అంతా ఒకటే, \q2 అందరు మోసం చేసేవారే. \q1 \v 14 నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు \q2 వారు దానికి కట్టు కడతారు. \q1 సమాధానం లేనప్పుడు, \q2 ‘సమాధానం, సమాధానం’ అని వారంటారు. \q1 \v 15 వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? \q2 లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; \q2 ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. \q1 కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; \q2 నేను వారిని శిక్షించినప్పుడు వారు పడద్రోయబడతారు” \q2 అని యెహోవా చెప్తున్నారు. \p \v 16 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “కూడలిలో నిలబడి చూడండి; \q2 పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి, \q1 మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి, \q2 మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. \q2 కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’ \q1 \v 17 నేను మీపై కావలివారిని నియమించాను వారు మీతో ఇలా చెప్పారు, \q2 ‘బూరధ్వని వినండి!’ \q2 కాని మీరన్నారు, ‘మేము వినము.’ \q1 \v 18 కాబట్టి జనులారా, వినండి; \q2 సాక్షులైన మీరు, \q2 వారికి ఏమి జరుగుతుందో గమనించండి. \q1 \v 19 భూమీ, విను: \q2 నేను ఈ ప్రజలమీదికి విపత్తు తెస్తున్నాను, \q2 అది వారి కుట్రల ఫలం, \q1 ఎందుకంటే వారు నా మాటలను వినలేదు, \q2 నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు. \q1 \v 20 షేబ నుండి వచ్చే ధూపం గురించి గాని \q2 దూరదేశం నుండి వచ్చే మధురమైన సువాసనగల వస గురించి నేను ఏమి పట్టించుకోను? \q1 మీ దహనబలులు అంగీకరించదగినవి కావు; \q2 మీ బలులు నన్ను ప్రసన్నం చేయవు.” \p \v 21 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ఈ ప్రజల ముందు నేను అడ్డురాళ్లు వేస్తాను. \q2 తల్లిదండ్రులు పిల్లలు ఒకే విధంగా వారిపై పొరపాట్లు చేస్తారు; \q2 పొరుగువారు స్నేహితులు నశిస్తారు.” \p \v 22 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “చూడు, ఉత్తర దేశం నుండి \q2 ఒక సైన్యం వస్తుంది; \q1 ఒక గొప్ప దేశం \q2 భూదిగంతాల నుండి పురికొల్పబడతారు. \q1 \v 23 వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; \q2 వారు కౄరమైనవారు, దయ చూపరు. \q1 వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు \q2 గర్జించే సముద్రంలా వినిపిస్తారు; \q1 సీయోను కుమారీ, నీ మీద దాడి చేయడానికి \q2 వారు యుద్ధ వరుసలో ఉన్న సైనికుల్లా వస్తారు.” \b \q1 \v 24 మేము వారి గురించిన వార్తలను విన్నాము, \q2 మా చేతులు వణికిపోయాయి. \q1 స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి \q2 వేదన మమ్మల్ని పట్టుకుంది. \q1 \v 25 పొలాల్లోకి వెళ్లకండి \q2 రహదారులపై నడవకండి, \q1 శత్రువుకు కత్తి ఉంది, \q2 ప్రతి వైపు భయం ఉంది. \q1 \v 26 నా ప్రజలారా, \q2 గోనెపట్ట కట్టుకుని బూడిదలో దొర్లండి. \q1 ఒక్కగానొక్క కుమారుని కోసం \q2 తీవ్ర రోదనతో దుఃఖించండి, \q1 ఎందుకంటే హఠాత్తుగా నాశనం చేసేవాడు \q2 మన మీదికి వస్తాడు. \b \q1 \v 27 “నేను నిన్ను లోహాలు పరీక్షించేవానిగా \q2 నా ప్రజలను మిశ్రమ లోహంగా చేశాను, \q1 మీరు వారి మార్గాలను గమనిస్తారని \q2 వాటిని పరీక్షిస్తారని. \q1 \v 28 వారంతా మొండి తిరుగుబాటుదారులు, \q2 వారు అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు. \q1 వారు ఇత్తడి, ఇనుము లాంటివారు; \q2 వారంతా అవినీతికి పాల్పడుతున్నారు. \q1 \v 29 సీసాన్ని నిప్పుతో కాల్చివేయడానికి \q2 కొలిమి తిత్తులు తీవ్రంగా ఊదుతున్నారు, \q1 కానీ శుద్ధి చేయడం వృధా అవుతుంది; \q2 దుష్టులు ప్రక్షాళన చేయబడరు. \q1 \v 30 వారు తిరస్కరించబడిన వెండి అని పిలువబడతారు, \q2 ఎందుకంటే యెహోవా వారిని తిరస్కరించారు.” \c 7 \s1 యిర్మీయా ప్రసంగం \p \v 1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది: \v 2 “యెహోవా ఆలయ ద్వారం దగ్గర నిలబడి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించండి: \p “ ‘యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే సర్వ యూదా ప్రజలారా, యెహోవా చెప్తుంది వినండి. \v 3 సైన్యాల యెహోవాయైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నారు: నీ మార్గాలను, నీ క్రియలను సరిచేసుకో, అప్పుడు నేను నిన్ను ఈ స్థలంలో నివాసం చేయిస్తాను. \v 4 మోసపూరిత మాటలను నమ్మకండి, “ఇది యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం!” \v 5 మీరు నిజంగా మీ మార్గాలను, మీ క్రియలను మార్చుకుని ఒకరితో ఒకరు న్యాయంగా వ్యవహరిస్తే, \v 6 మీరు విదేశీయులను, తండ్రిలేనివారిని లేదా విధవరాండ్రను అణచివేయకుండ, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండ, మీకు హాని కలిగించే విధంగా ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే, \v 7 నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను. \v 8 కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు. \p \v 9 “ ‘నీవు దొంగిలిస్తూ, హత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధ ప్రమాణం,\f + \fr 7:9 \fr*\ft లేదా \ft*\fqa అబద్ధ దేవుళ్ళ మీద ప్రమాణం\fqa*\f* దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ, నీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, \v 10 తర్వాత వచ్చి నా పేరుతో పిలువబడే ఈ మందిరంలో నా ముందు నిలబడి, “మేము క్షేమంగా ఉన్నాము” ఈ అసహ్యకరమైన వాటన్నిటిని చేయడానికి క్షేమంగా ఉన్నాము అని అంటారా? \v 11 నా పేరు కలిగిన ఈ ఇల్లు మీకు దొంగల గుహ అయ్యిందా? నేను చూస్తూనే ఉన్నాను! అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 12 “ ‘షిలోహులో నా పేరు కోసం నేను మొదట నివాసం ఏర్పరచుకున్న ప్రదేశానికి వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల దుష్టత్వాన్ని బట్టి నేను దానికి చేసినది ఏంటో చూడండి. \v 13 మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, నేను మీతో పదే పదే మాట్లాడాను, కానీ మీరు వినలేదు; నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు జవాబివ్వలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 14 కాబట్టి, నేను షిలోహుకు చేసినట్టే, నా పేరు కలిగి ఉన్న ఆలయానికి, మీరు నమ్మిన ఆలయానికి, మీకు మీ పూర్వికులకు నేను ఇచ్చిన స్థలానికి ఇప్పుడు చేస్తాను. \v 15 మీ తోటి ఇశ్రాయేలీయులందరిని, ఎఫ్రాయిం ప్రజలందరినీ నేను నా దగ్గర నుండి తరిమివేసినట్టు మిమ్మల్ని తరిమివేస్తాను.’ \p \v 16 “కాబట్టి ఈ ప్రజల కోసం ప్రార్థించవద్దు, వేడుకోవద్దు, ఏ మనవి చేయవద్దు; నా దగ్గర ప్రాధేయపడవద్దు, ఎందుకంటే నేను నీ మాట వినను. \v 17 యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు ఏమి చేస్తున్నారో మీరు చూడడం లేదా? \v 18 పిల్లలు కట్టెలు సేకరిస్తారు, తండ్రులు మంట వెలిగిస్తారు, స్త్రీలు పిండిని పిసికి ఆకాశ రాణికి సమర్పించడానికి రొట్టెలు తయారుచేస్తారు. నా కోపాన్ని రెచ్చగొట్టడానికి వారు ఇతర దేవుళ్ళకు పానార్పణలు పోస్తారు. \v 19 కానీ వారు కోపం రెచ్చగొడుతుంది నన్నా? వారు తమకు అవమానం కలిగేలా, తమకు తాము హాని చేసుకోవడం లేదా? అని యెహోవా అడుగుతున్నారు. \p \v 20 “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నా కోపం నా ఉగ్రత ఈ స్థలంపై మనుష్యులపై మృగాలపై పొలాల్లో ఉన్న చెట్లపై మీ భూమి పంటలపై కుమ్మరించబడతాయి; అది కాలిపోతుంది, దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు. \p \v 21 “ ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ ఇతర బలులతో పాటు మీ దహనబలులను కలిపి, మాంసాన్ని మీరే తినండి! \v 22 నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి వారితో మాట్లాడినప్పుడు, నేను వారికి దహనబలులు బలుల గురించి మాత్రమే ఆజ్ఞలు ఇవ్వలేదు, \v 23 నేను వారికి ఈ ఆజ్ఞ ఇచ్చాను: నాకు లోబడండి, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మీకు మేలు జరిగేలా నా మార్గాలన్నిటిని అనుసరించండి. \v 24 కానీ వారు వినలేదు, అసలు పట్టించుకోలేదు; పైగా, వారు తమ చెడ్డ హృదయాల్లో ఉన్న మొండి కోరికలను అనుసరించి, వారు ముందుకు వెళ్లకుండా వెనుకకు వెళ్లారు. \v 25 మీ పూర్వికులు ఈజిప్టును విడిచినప్పటి నుండి నేటి వరకు, నేను పదే పదే నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరకు పంపాను. \v 26 కానీ వారు నా మాట వినలేదు, అసలు పట్టించుకోలేదు. వారు మెడ వంగనివారై, వారి పూర్వికులకంటే ఇంకా ఎక్కువ చెడు చేశారు.’ \p \v 27 “నీవు ఇవన్నీ వారికి చెప్పినప్పుడు, వారు నీ మాట వినరు; నీవు వారిని పిలిచినప్పుడు, వారు జవాబివ్వరు. \v 28 కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ఇది దాని దేవుడైన యెహోవాకు లోబడని దిద్దుబాటుకు స్పందించని దేశము. నమ్మకత్వం లేకుండా పోయింది; అది వారి పెదవుల నుండి మాయమై పోయింది. \p \v 29 “ ‘ప్రతిష్ఠించబడిన మీ వెంట్రుకలు కత్తిరించి పారవేయండి; బంజరు కొండలమీద విలపించండి, ఎందుకంటే యెహోవా తన ఉగ్రత క్రింద ఉన్న ఈ తరాన్ని తిరస్కరించారు, వదిలేశారు. \s1 సంహార లోయ \p \v 30 “ ‘యూదా ప్రజలు నా దృష్టికి చెడు చేశారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు నా పేరు కలిగి ఉన్న నా మందిరంలో వారి అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అపవిత్రం చేశారు. \v 31 వారు వారి కుమారులను, కుమార్తెలను అగ్నిలో కాల్చడానికి బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతులో క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు నా మనస్సులోకి కూడా రాలేదు. \v 32 కాబట్టి జాగ్రత్త, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ప్రజలు ఇకపై తోఫెతు అని గాని బెన్ హిన్నోము లోయ అని గాని పిలువక, సంహార లోయ అని పిలిచే రోజులు రాబోతున్నాయి, ఎందుకంటే వారు తోఫెతులో స్థలం లేకుండ పోయే వరకు చనిపోయినవారిని పాతిపెడతారు. \v 33 అప్పుడు ఈ ప్రజల కళేబరాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి వాటిని భయపెట్టడానికి ఎవరూ ఉండరు. \v 34 యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ వధూవరుల స్వరాలను, ఆనంద సంతోష ధ్వనులను నేను అంతం చేస్తాను, ఎందుకంటే దేశం నిర్జనమైపోతుంది. \c 8 \p \v 1 “ ‘ఆ సమయంలో, యూదా రాజుల, అధికారుల ఎముకలు, యాజకుల, ప్రవక్తల ఎముకలు, అలాగే యెరూషలేము ప్రజల ఎముకలు వారి సమాధుల నుండి తీసివేయబడతాయి అని యెహోవా ప్రకటన చేస్తున్నారు. \v 2 వారు ప్రేమించి సేవించిన వారు అనుసరించిన, సంప్రదించిన పూజించిన సూర్యునికి చంద్రునికి ఆకాశమండలం లోని అన్ని నక్షత్రాలకు బహిర్గతమవుతారు. వారు పోగుచేయబడక, పాతిపెట్టబడక, నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటారు. \v 3 నేను వారిని ఎక్కడికి బహిష్కరించినా, ఈ దుష్ట జనాంగంలో మిగిలినవారంతా బ్రతకడం కంటే చావునే కోరుకుంటారు, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’ \s1 పాపం శిక్ష \p \v 4 “వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘మనుష్యులు పడిపోయినప్పుడు, వారు లేవరా? \q2 ఎవరైనా ప్రక్కకు తొలగిపోతే, వారు వెనుకకు తిరిగి రారా? \q1 \v 5 అలాంటప్పుడు ఈ ప్రజలు ఎందుకు దారి తప్పారు? \q2 యెరూషలేము ఎప్పుడూ ఎందుకు వెనుదిరుగుతుంది? \q1 వారు మోసానికి అంటిపెట్టుకుని ఉంటారు; \q2 వారు తిరిగి రావడానికి నిరాకరిస్తారు. \q1 \v 6 నేను జాగ్రత్తగా విన్నాను, \q2 కానీ వారు సరియైనది చెప్పరు. \q1 “నేనేం చేశాను?” అని అంటూ, \q2 వారిలో ఎవ్వరూ తమ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపపడరు. \q1 యుద్ధంలోకి గుర్రం దూసుకెళ్లినట్లుగా, \q2 ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గాన్ని వెంటే వెళ్తారు. \q1 \v 7 ఆకాశంలోని కొంగకు కూడా \q2 తన నిర్ణీత కాలాలు తెలుసు, \q1 అలాగే పావురం, వేగంగా ఎగిరే పక్షి, ఓదె అనే పక్షులు \q2 తమ వలస సమయాన్ని గమనిస్తాయి. \q1 అయితే నా ప్రజలకు \q2 యెహోవా న్యాయవిధులు తెలియవు. \b \q1 \v 8 “ ‘శాస్త్రుల అబద్ధాల కలం, \q2 దాన్ని అబద్ధాలతో మార్చినప్పుడు, \q1 “మేము జ్ఞానులం, ఎందుకంటే \q2 మాకు యెహోవా ధర్మశాస్త్రం ఉంది” అని మీరు ఎలా అనగలరు? \q1 \v 9 జ్ఞానులు సిగ్గుపడతారు; \q2 వారు భయపడి చిక్కుల్లో పడతారు. \q1 వారు యెహోవా వాక్యాన్ని తిరస్కరించినప్పుడు, \q2 వారికి ఇక జ్ఞానం ఎక్కడుంది? \q1 \v 10 కాబట్టి నేను వారి భార్యలను ఇతర పురుషులకు \q2 వారి పొలాలను క్రొత్త యజమానులకు ఇస్తాను. \q1 అల్పుల నుండి గొప్పవారి వరకు, \q2 అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు; \q1 ప్రవక్తలు, యాజకులు అంతా ఒకటే, \q2 అందరు మోసం చేసేవారే. \q1 \v 11 నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు \q2 వారు కట్టు కడతారు. \q1 సమాధానం లేనప్పుడు, \q2 “సమాధానం, సమాధానం” అని వారంటారు. \q1 \v 12 వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? \q2 లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; \q2 ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. \q1 కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; \q2 వారు శిక్షించబడినప్పుడు వారు పడద్రోయబడతారు, \q2 అని యెహోవా చెప్తున్నారు. \b \q1 \v 13 “ ‘నేను వారి పంటకోతను తీసివేస్తాను, \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q2 ద్రాక్షతీగెకు ద్రాక్షపండ్లు ఉండవు. \q1 అంజూర చెట్టు మీద అంజూర పండ్లు ఉండవు, \q2 వాటి ఆకులు వాడిపోతాయి. \q1 నేను వారికి ఇచ్చింది \q2 వారి దగ్గరి నుండి తీసివేయబడుతుంది.’ ” \b \q1 \v 14 మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? \q2 మనం ఒక్కచోట చేరి, \q1 కోటగోడలు గల పట్టణాలకు పారిపోయి \q2 అక్కడ నశించుదాం! \q1 మన దేవుడైన యెహోవా మనకు నాశనాన్ని విధించి, \q2 మనకు త్రాగడానికి విషం కలిపిన నీళ్లు ఇచ్చారు, \q2 ఎందుకంటే మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశాము. \q1 \v 15 మేము సమాధానం కోసం నిరీక్షించాం, \q2 కానీ ఏ మంచి జరగలేదు, \q1 స్వస్థత కోసం ఎదురుచూశాము \q2 కానీ భయమే కలిగింది. \q1 \v 16 శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం \q2 దాను నుండి వినబడుతుంది; \q1 వారి మగ గుర్రాల సకిలింపుకు \q2 దేశమంతా వణికిపోతుంది. \q1 వారు మ్రింగివేయడానికి \q2 భూమిని, అందులోని సమస్తాన్ని, \q2 పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు. \b \q1 \v 17 “చూడండి, నేను మీ మధ్యకు విషసర్పాలను, \q2 అదుపు చేయలేని మిడునాగులను పంపుతాను, \q2 అవి మిమ్మల్ని కాటేస్తాయి” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 18 దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, \q2 నా హృదయం నాలో నీరసించి ఉంది. \q1 \v 19 సుదూరదేశం నుండి \q2 నా ప్రజల మొరను ఆలకించు: \q1 “యెహోవా సీయోనులో లేడా? \q2 ఆమె రాజు ఇక ఇప్పుడు అక్కడ లేరా?” \b \q1 “వారు తమ చిత్రాలతో, తమ పనికిమాలిన పరదేశి విగ్రహాలతో \q2 ఎందుకు నాకు కోపం రప్పించారు?” \b \q1 \v 20 “కోత సమయం దాటిపోయింది, \q2 వేసవికాలం ముగిసింది, \q2 అయినా మనం రక్షించబడలేదు.” \b \q1 \v 21 నా ప్రజలు నలిగిపోయారు కాబట్టి, నేనూ నలిగిపోయాను; \q2 నేను దుఃఖిస్తున్నాను, భయం నన్ను పట్టుకుంటుంది. \q1 \v 22 గిలాదులో ఔషధతైలం లేదా? \q2 అక్కడ వైద్యుడు లేడా? \q1 ఉంటే నా ప్రజల గాయానికి \q2 స్వస్థత ఎందుకు లేదు? \c 9 \q1 \v 1 అయ్యో, నా తల నీటి బావి \q2 నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! \q1 చంపబడిన నా ప్రజల కోసం \q2 నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని. \q1 \v 2 అయ్యో, అరణ్యంలో నాకు \q2 యాత్రికులు బసచేసే స్థలం ఒకటి ఉంటే బాగుండేది! \q1 నా ప్రజలను వదిలి \q2 వారికి దూరంగా వెళ్లి అక్కడ ఉండేవాన్ని; \q1 ఎందుకంటే వారంతా వ్యభిచారులు, \q2 వారిది ఒక నమ్మకద్రోహుల సమూహము. \b \q1 \v 3 “ఒక విలుకాడు బాణాలు వేయడానికి విల్లును సిద్ధం చేసుకున్నట్లు \q2 వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకను సిద్ధం చేసుకుంటారు; \q1 వారి అబద్ధం వల్లనే వారు దేశంలో బలవంతులయ్యారు \q2 కాని నాకు నమ్మకస్థులుగా ఉండి కాదు. \q1 వారు ఒక పాపం తర్వాత మరొక పాపం చేస్తారు; \q2 వారు నన్ను గుర్తించరు,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 4 “ప్రతి ఒక్కరూ తన పొరుగువారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి; \q2 బంధువుల్లో ఎవరినీ కూడా నమ్మవద్దు, \q1 ఎందుకంటే వారిలో ప్రతివాడు ఒక మోసగాడు,\f + \fr 9:4 \fr*\ft లేదా \ft*\fqa మోసగించే యాకోబు\fqa*\f* \q2 స్నేహితుడు స్నేహితుని మీద అపనిందలు వేస్తాడు. \q1 \v 5 స్నేహితుడు స్నేహితుడిని మోసం చేస్తాడు, \q2 ఎవరూ సత్యం మాట్లాడరు. \q1 వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకలకు శిక్షణ ఇచ్చారు; \q2 వారు పాపం చేసి తమను తాము అలసటకు గురిచేసుకుంటారు. \q1 \v 6 నీవు\f + \fr 9:6 \fr*\ft అంటే \ft*\fqa యిర్మీయా\fqa*\f* మోసం మధ్య జీవిస్తున్నావు; \q2 వారి మోసాన్ని బట్టి వారు నన్ను తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 7 కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “చూడండి, నేను వారిని శుద్ధి చేసి పరీక్షిస్తాను, \q2 నా ప్రజల పాపాన్ని బట్టి \q2 అంతకన్నా నేనేం చేయగలను? \q1 \v 8 వారి నాలుక మరణకరమైన బాణం; \q2 అది మోసపూరితంగా మాట్లాడుతుంది. \q1 వారంతా తమ పొరుగువారితో సమాధానంగానే మాట్లాడతారు, \q2 కాని తమ హృదయాల్లో వారి కోసం ఉచ్చులు బిగిస్తారు. \q1 \v 9 అందుకు నేను వారిని శిక్షించకూడదా? \q2 ఇలాంటి దేశంపై \q1 నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 10 నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను, \q2 అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను. \q1 అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి, \q2 పశువుల అరుపులు వినబడవు. \q1 పక్షులన్నీ పారిపోయాయి \q2 జంతువులు వెళ్లిపోయాయి. \b \q1 \v 11 “నేను యెరూషలేమును శిథిలాల కుప్పగా, \q2 నక్కల విహారంగా చేస్తాను. \q1 నేను యూదా పట్టణాలను \q2 నాశనం చేస్తాను, అక్కడ ఎవరూ నివసించలేరు.” \p \v 12 దీనిని గ్రహించగల జ్ఞాని ఎవరు? యెహోవా నుండి ఉపదేశం పొందుకొని దాన్ని వివరించగల వారెవరు? దేశం ఎందుకు శిథిలమై ఎవరు దాటలేని ఎడారిలా పాడైంది? \p \v 13 యెహోవా ఇలా అన్నాడు, “నేను వారి ముందుంచిన నా ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టారు; వారు నాకు విధేయత చూపలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. \v 14 దానికి బదులు, వారు తమ హృదయాల మొండితనాన్ని అనుసరించారు; వారి పూర్వికులు వారికి బోధించినట్లుగా వారు బయలును అనుసరించారు.” \v 15 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “చూడండి, నేను ఈ ప్రజలను చేదు ఆహారం తినేలా, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను. \v 16 వారికి గాని వారి పూర్వికులకు గాని తెలియని దేశాల మధ్య వారిని చెదరగొట్టి, వారిని అంతం చేసే వరకు ఖడ్గంతో వారిని వెంటాడుతాను.” \b \p \v 17 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ఇప్పుడు ఆలోచించండి! విలపించే స్త్రీలను పిలిపించండి; \q2 వారిలో అత్యంత నైపుణ్యం ఉన్న వారి కోసం పంపండి. \q1 \v 18 వారు త్వరగా వచ్చి \q2 మన కళ్ల నుండి కన్నీరు పొర్లిపారే వరకు \q1 మా కనురెప్పల నుండి నీటి ధారలు వచ్చేవరకు \q2 మనల్ని చూసి ఏడుస్తారు. \q1 \v 19 సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: \q2 ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! \q2 మన ఘోరంగా అవమానపరచబడ్డాము! \q1 మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి \q2 మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ” \b \q1 \v 20 స్త్రీలారా, యెహోవా మాట వినండి; \q2 ఆయన నోటి మాటలకు మీ చెవులు తెరవండి. \q1 ఏడ్వడం ఎలాగో మీ కుమార్తెలకు నేర్పండి; \q2 ఒకరికొకరు ఎలా విలపించాలో బోధించండి. \q1 \v 21 మరణం మన కిటికీల గుండా ఎక్కి \q2 మన కోటల్లోకి ప్రవేశించింది; \q1 అది వీధుల్లో పిల్లలు లేకుండ \q2 బహిరంగ కూడళ్లలో యువకులు లేకుండ నాశనం చేస్తుంది. \p \v 22 ఇలా చెప్పు, “యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: \q1 “ ‘మృతదేహాలు \q2 బహిర్భూమిలో పెంటలా, \q1 కోత కోసేవాని వెనుక పడి ఉన్న పనల్లా, \q2 వాటిని సేకరించడానికి ఎవరూ ఉండరు.’ ” \p \v 23 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: \q1 “జ్ఞానులు తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు \q2 బలవంతులు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోకూడదు \q2 ధనవంతులు తమ ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పుకోకూడదు, \q1 \v 24 అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి: \q2 నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని, \q1 నేనే యెహోవానని, భూమిపై దయను, \q2 న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని, \q2 ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 25 “కేవలం శరీర సంబంధంగా మాత్రమే సున్నతి పొందిన వారందరినీ నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 26 “ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు అరణ్యంలో, సుదూర ప్రాంతాల్లో నివసించే వారందరినీ నేను శిక్షించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ నిజంగా సున్నతి పొందలేదు, ఇశ్రాయేలు ఇంటివారందరు కూడా హృదయంలో సున్నతి పొందలేదు.” \c 10 \s1 సజీవుడైన దేవుడు విగ్రహాలు \p \v 1 ఇశ్రాయేలు ప్రజలారా! యెహోవా మీతో మాట్లాడుతున్నారు, వినండి. \v 2 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దు \q2 ఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా, \q2 మీరు భయపడవద్దు. \q1 \v 3 ఎందుకంటే జనాంగాల ఆచారాలు విలువలేనివి; \q2 వారు అడవిలో చెట్టు నరికి తెస్తారు, \q2 హస్తకళాకారుడు ఉలితో చెక్కుతాడు. \q1 \v 4 వారు వెండి బంగారాలతో వాటిని అలంకరిస్తారు; \q2 కదలకుండా ఉండేలా, \q2 సుత్తితో మేకులు కొట్టి దానిని బిగిస్తారు. \q1 \v 5 దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, \q2 వారి విగ్రహాలు మాట్లాడలేవు; \q1 అవి నడవలేవు కాబట్టి \q2 వాటిని మోయాలి. \q1 వాటికి భయపడవద్దు; \q2 అవి ఏ హాని చేయలేవు \q2 అలాగే ఏ మేలు కూడా చేయలేవు.” \b \q1 \v 6 యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు; \q2 మీరు గొప్పవారు, \q2 మీ నామం ఘనమైనది. \q1 \v 7 దేశాలకు మీరు రాజు, \q2 మిమ్మల్ని గౌరవించని వాడెవడు? \q2 గౌరవం మీకు చెందినదే. \q1 దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో \q2 వారి రాజ్యాలన్నిటిలో, \q2 మీలాంటి వారెవ్వరూ లేరు. \b \q1 \v 8 వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు; \q2 వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు. \q1 \v 9 తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండి \q2 ఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి. \q1 హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసిన \q2 వాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు, \q2 అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి. \q1 \v 10 అయితే యెహోవాయే నిజమైన దేవుడు; \q2 ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు. \q1 ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది; \q2 ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు. \p \v 11 “వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ”\f + \fr 10:11 \fr*\ft ఈ వచనం లోని విషయం అరామిక్ భాషలో ఉంది\ft*\f* \q1 \v 12 అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; \q2 ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, \q2 తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు. \q1 \v 13 ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; \q2 ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. \q1 ఆయన వర్షంతో మెరుపులు పంపి \q2 తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు. \b \q1 \v 14 మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; \q2 ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. \q1 అతడు చేసే చిత్రాలు మోసం; \q2 వాటిలో ఊపిరి లేదు. \q1 \v 15 అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; \q2 వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి. \q1 \v 16 యాకోబులో భాగమైన వాడు\f + \fr 10:16 \fr*\ft యాకోబు యొక్క భాగం అనేది, యెహోవా అని చెప్పడానికి ఉపయోగించబడింది\ft*\f* వీటిలాంటివాడు కాదు, \q2 ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, \q1 అన్నిటిని సృజించారు. \q2 ఆయన పేరు సైన్యాల యెహోవా. \s1 రాబోతున్న నాశనం \q1 \v 17 ఆక్రమణలో ఉంటున్నవారలారా, \q2 దేశాన్ని విడిచి వెళ్లడానికి మీ వస్తువులను సర్దుకోండి. \q1 \v 18 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: \q2 “ఈ సమయంలో నేను \q2 ఈ దేశంలో నివసించేవారిని తరిమివేస్తాను. \q1 వారు పట్టబడేలా \q2 నేను వారి మీదికి కష్టం రప్పిస్తాను.” \b \q1 \v 19 నా గాయం వల్ల నాకు శ్రమ! \q2 నా గాయం మానిపోయేది కాదు! \q1 అయినా, “ఇది నా జబ్బు, నేను భరించాలి” \q2 అని నాలో నేను చెప్పుకున్నాను. \q1 \v 20 నా గుడారం నాశనమైంది; \q2 దాని త్రాళ్లన్నీ తెగిపోయాయి. \q1 నా పిల్లలు నా నుండి వెళ్లిపోయారు, వారిక లేరు; \q2 నా గుడారం వేయడానికి \q2 నాకు బసను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు. \q1 \v 21 కాపరులు తెలివిలేనివారు \q2 వారు యెహోవా దగ్గర విచారణ చేయరు; \q1 కాబట్టి వారు వర్ధిల్లరు \q2 వారి మంద అంతా చెదరిపోయింది. \q1 \v 22 వినండి! నివేదిక వస్తుంది \q2 ఉత్తర దేశం నుండి ఒక గొప్ప కలకలం! \q1 అది యూదా పట్టణాలను నిర్జనంగా, \q2 నక్కల విహారంగా చేస్తుంది. \s1 యిర్మీయా ప్రార్థన \q1 \v 23 యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు; \q2 తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు. \q1 \v 24 యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమే \q2 మీ కోపంలో కాదు, \q2 లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు. \q1 \v 25 మిమ్మల్ని గుర్తించని \q2 దేశాల మీద, \q2 మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. \q1 వారు యాకోబును మ్రింగివేశారు; \q2 వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు \q2 అతని మాతృభూమిని నాశనం చేశారు. \c 11 \s1 నిబంధన ఉల్లంఘన \p \v 1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది: \v 2 “ఈ నిబంధనలోని షరతులను విని, యూదా ప్రజలకు, యెరూషలేములో నివసించేవారికి చెప్పండి. \v 3 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ నిబంధన నియమాలను పాటించనివాడు శాపగ్రస్తుడు. \v 4 నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి ఇనుమును కరిగించే కొలిమి నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధనలు.’ నేను ఇలా అన్నాను, ‘నాకు విధేయత చూపి, నేను మీకు ఆజ్ఞాపించినదంతా చేయండి, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను దేవునిగా ఉంటాను. \v 5 అప్పుడు నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను’ అని వారితో చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తాను.” \p నేను, “ఆమేన్, యెహోవా” అని జవాబిచ్చాను. \p \v 6 యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒడంబడికలోని నియమాలను విని వాటిని అనుసరించండి. \v 7 నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చినప్పటి నుండి నేటి వరకు, “నాకు లోబడండి” అని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాను. \v 8 అయితే వారు వినలేదు లేదా పట్టించుకోలేదు. బదులుగా, వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించారు. కాబట్టి నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధన శాపాలన్నిటిని వారిపైకి తెచ్చాను, కానీ వారు పాటించలేదు.’ ” \p \v 9 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా ప్రజల్లోనూ, యెరూషలేములో నివసించేవారిలోనూ కుట్ర ఉంది. \v 10 నా మాటలు వినడానికి నిరాకరించిన తమ పూర్వికుల పాపాలకు వారు తిరిగి వచ్చారు. వారికి సేవ చేసేందుకు ఇతర దేవుళ్ళను అనుసరించారు. ఇశ్రాయేలు యూదా వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను ఉల్లంఘించారు. \v 11 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘వారు తప్పించుకోలేని విపత్తును వాళ్ల మీదికి తెస్తాను. వారు నాకు మొరపెట్టుకున్నా, నేను వినను. \v 12 యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు వెళ్లి తాము ధూపం వేసే దేవుళ్ళకు మొరపెట్టుకుంటారు, అయితే విపత్తు వచ్చినప్పుడు వారు ఏమాత్రం సహాయం చేయరు. \v 13 యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అవమానకరమైన దేవుడైన బయలుకు ధూపం వేయడానికి మీరు ఏర్పాటుచేసిన బలిపీఠాలు యెరూషలేము వీధులంత విస్తారంగా ఉన్నాయి.’ \p \v 14 “ఈ ప్రజల కోసం ప్రార్థించవద్దు లేదా వారి కోసం ప్రార్థన లేదా విన్నపం చేయవద్దు, ఎందుకంటే నేను చేయను. వారు కష్టకాలంలో నన్ను పిలిచినప్పుడు వినండి. \q1 \v 15 “నా ప్రియురాలు నా మందిరంలో ఏమి చేస్తుంది? \q2 వారు ఇతరులతో కలిసి తమ దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉన్నారు \q2 పవిత్రపరచబడిన మాంసం మీ శిక్షను తప్పించగలదా? \q1 మీరు మీ దుర్మార్గంలో పాలుపంచుకున్నప్పుడు, \q2 మీరు సంతోషిస్తారు.” \b \q1 \v 16 అందమైన పండ్లతో \q2 అభివృద్ధి చెందుతున్న ఒలీవచెట్టు అని యెహోవా నిన్ను పిలిచాడు. \q1 అయితే పెను తుఫాను గర్జనతో \q2 దానికి నిప్పు పెడతాడు, \q2 దాని కొమ్మలు విరిగిపోతాయి. \m \v 17 ఇశ్రాయేలు, యూదా ప్రజలు చెడ్డపనులు చేసి బయలుకు ధూపం వేసి నా కోపాన్ని రేకెత్తించారు కాబట్టి నిన్ను నాటిన సైన్యాల యెహోవా నీకు విపత్తు విధించాడు. \s1 యిర్మీయాకు వ్యతిరేకంగా కుట్ర \p \v 18 యెహోవా వారి కుట్రను నాకు తెలియజేశాడు, అది నాకు తెలుసు, ఎందుకంటే ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నారో ఆయన నాకు చూపించాడు. \v 19 నేను వధకు దారితీసిన మృదువైన గొర్రెపిల్లలా ఉన్నాను; \q1 “చెట్టును, దాని పండ్లను నాశనం చేద్దాం; \q2 అతని పేరు ఇకపై జ్ఞాపకం రాకుండా ఉండేలా \q2 సజీవుల దేశం నుండి అతన్ని నరికివేద్దాము.” \q1 \v 20 అయితే సైన్యాల యెహోవా, \q2 నీతిగా తీర్పు తీర్చి, హృదయాన్ని, మనస్సును పరీక్షించే నీవు, \q1 నీ ప్రతీకారాన్ని నేను చూసుకోనివ్వు, \q2 నీకు నేను నా కర్తవ్యాన్ని అప్పగించాను. \p \v 21 అందుకే నిన్ను చంపుతానని బెదిరిస్తున్న అనాతోతు ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు, “యెహోవా పేరిట ప్రవచించకండి, అలా చేస్తే మా చేతిలోనే చస్తారు.” \v 22 కాబట్టి ఇది సైన్యాల యెహోవా ఇలా అంటున్నాడు: “నేను వారిని శిక్షిస్తాను. వారి యువకులు కత్తిచేత, వారి కుమారులు కుమార్తెలు కరువుచేత మరణిస్తారు. \v 23 అనాతోతు ప్రజలకు శిక్ష విధించే సంవత్సరంలో నేను వారికి విపత్తు తెస్తాను కాబట్టి వారికి మిగిలేది కూడా ఉండదు.” \c 12 \s1 యిర్మీయా ఫిర్యాదు \q1 \v 1 యెహోవా, నేను మీ ముందు ఎప్పుడు వాదన వినిపించినా \q2 మీరెప్పుడూ నీతిమంతునిగానే ఉంటారు. \q1 అయినా మీ న్యాయం గురించి నేను మీతో మాట్లాడతాను: \q2 దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? \q2 నమ్మకద్రోహులంతా ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు? \q1 \v 2 మీరు వారిని నాటారు, వారు వేర్లు పాదుకున్నారు; \q2 వారు పెరిగి ఫలిస్తున్నారు. \q1 వారెల్లప్పుడూ మీ గురించి మాట్లాడతారు \q2 కానీ వారి హృదయాలు మీకు దూరంగా ఉంటాయి. \q1 \v 3 అయినా యెహోవా, నేను మీకు తెలుసు; \q2 మీరు నన్ను చూస్తున్నారు, \q2 మిమ్మల్ని గురించిన నా ఆలోచనలను మీరు పరీక్షిస్తున్నారు. \q1 వధకు గొర్రెలు లాగివేయబడునట్లు వారిని లాగివేయండి! \q2 వధ దినం కోసం వారిని వేరు చేయండి! \q1 \v 4 ఎంతకాలం భూమి ఎండిపోయి ఉండాలి? \q2 ఎంతకాలం పొలంలో గడ్డి ఎండిపోతూ ఉండాలి? \q1 అందులో నివసించేవారు దుర్మార్గులు కాబట్టి \q2 జంతువులు, పక్షులు నశించాయి. \q1 “మనకు ఏమి జరుగుతుందో యెహోవా చూడడు” \q2 అని ప్రజలు అంటున్నారు. \s1 దేవుని జవాబు \q1 \v 5 “మీరు కాలినడకన వెళ్తున్న వారితో పరుగెడితేనే \q2 వారు నిన్ను అలసిపోయేలా చేశారు, \q2 అలాంటప్పుడు గుర్రాలతో ఎలా పోటీపడతావు? \q1 భద్రతగల దేశం అని మీరనుకునే దేశంలోనే మీరు క్షేమంగా ఉండనప్పుడు, \q2 యొర్దాను ఒడ్డున ఉన్న దట్టమైన పొదల్లో ఎలా? \q1 \v 6 నీ బంధువులు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా, \q2 నీకు నమ్మకద్రోహం చేశారు; \q2 వారు నీ మీద పెద్దగా అరుస్తూ మాట్లాడారు. \q1 కాబట్టి వారు నీ గురించి మంచిగా మాట్లాడినా \q2 వారిని నమ్మవద్దు. \b \q1 \v 7 “నా ఇంటిని విడిచిపెడతాను, \q2 నా వారసత్వాన్ని వదిలివేస్తాను; \q1 నేను ప్రేమించిన దానిని \q2 తన శత్రువుల చేతికి అప్పగిస్తాను. \q1 \v 8 నా వారసత్వం నాకు \q2 అడవిలోని సింహంలా మారింది. \q1 అది నా మీదికి గర్జిస్తుంది; \q2 కాబట్టి నేను దానిని ద్వేషిస్తున్నాను. \q1 \v 9 నా వారసత్వం నాకు \q2 మచ్చలున్న క్రూరపక్షిలా కాలేదా? \q2 దాన్ని ఇతర పక్షులు చుట్టుముట్టి దాడి చేస్తాయి \q1 వెళ్లి క్రూర మృగాలన్నిటిని పోగు చేయండి; \q2 మ్రింగివేయడానికి వాటిని తీసుకురండి. \q1 \v 10 చాలామంది కాపరులు నా ద్రాక్షతోటను నాశనం చేశారు \q2 నా పొలాన్ని త్రొక్కివేశారు; \q1 వారు నాకు ఇష్టమైన పొలాన్ని \q2 నిర్జనమైన బంజరు భూమిలా మార్చారు. \q1 \v 11 అది నా ఎదుట బంజరు భూమిలా, \q2 ఎండిపోయి పాడైపోయింది; \q1 పట్టించుకునే వారు లేక \q2 దేశమంతా వృధా అవుతుంది. \q1 \v 12 ఎడారిలో ఉన్న బంజరు కొండలపైకి \q2 నాశనం చేసేవారు గుంపుగా వస్తున్నారు, \q1 యెహోవా ఖడ్గం \q2 భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు హతం చేస్తుంది; \q2 ఎవరూ క్షేమంగా ఉండరు. \q1 \v 13 వారు గోధుమలు విత్తుతారు కాని ముళ్ళ పంట కోస్తారు; \q2 వారు పనితో అలసిపోతారు కాని లాభం ఉండదు. \q1 యెహోవా కోపం కారణంగా \q2 కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు.” \p \v 14 యెహోవా ఇలా అంటున్నారు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నేను ఇచ్చిన స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకున్న నా చెడ్డ పొరుగువారిని వారి దేశాల నుండి పెళ్లగిస్తాను, యూదా ప్రజలను వారి మధ్య నుండి పెళ్లగిస్తాను. \v 15 కానీ నేను వారిని పెళ్లగించిన తర్వాత, మళ్ళీ వారి మీద కనికరపడి, వారి వారసత్వాలకు వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను. \v 16 వారు ఒకప్పుడు బయలుపై ప్రమాణం చేయడం నా ప్రజలకు బోధించినట్లే, ఇప్పుడు ‘సజీవుడైన యెహోవా పేరిట’ అని నా పేరు మీద ప్రమాణం చేయడానికి నా ప్రజల మార్గాలను బాగా నేర్చుకుంటే వారు నా ప్రజలమధ్య స్థిరపడతారు. \v 17 అయితే ఒకవేళ ఏ దేశమైనా నా మాట వినకపోతే, నేను ఆ జనాన్ని వేళ్లతో సహా పెళ్లగించి నిర్మూలం చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \c 13 \s1 నారబట్టతో చేసిన నడికట్టు \p \v 1 యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి నార పట్టీ కొని నీ నడుముకు పెట్టుకో, అయితే అది నీళ్లతో తడపవద్దు.” \v 2 కాబట్టి నేను యెహోవా ఆజ్ఞాపించినట్లే నడుముకు నార పట్టీ పెట్టుకున్నాను. \p \v 3 రెండవసారి యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది: \v 4 “నీవు కొనుక్కుని నడుముకు పెట్టుకున్న పట్టీని తీసుకుని నీవిప్పుడు పేరతు\f + \fr 13:4 \fr*\ft లేదా బహుశ \ft*\fqa యూఫ్రటీసు నది \fqa*\ft \+xt 5-7|link-href="JER 13:5-7"\+xt* వచనాల్లో కూడా ఉంది\ft*\f* నది ఒడ్డుకు వెళ్లి, అక్కడ బండ సందులో దాన్ని దాచి పెట్టు.” \v 5 కాబట్టి యెహోవా నాకు చెప్పినట్లే నేను వెళ్లి పేరతు దగ్గర దాన్ని దాచి పెట్టాను. \p \v 6 చాలా రోజుల తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఇప్పుడే నీవు పేరతు నది ఒడ్డుకు వెళ్లి అక్కడ దాచిపెట్టుమని నేను చెప్పిన పట్టీని తెచ్చుకో.” \v 7 కాబట్టి నేను పేరతు నది ఒడ్డుకు వెళ్లి త్రవ్వి దాచిపెట్టిన స్థలంలో నుండి ఆ పట్టీని తీసుకున్నాను, కానీ ఇప్పుడు అది పాడై, పూర్తిగా పనికిరాకుండా పోయింది. \p \v 8 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 9 “యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా గర్వాన్ని, యెరూషలేము గొప్ప అహంకారాన్ని కూడా అదే విధంగా నాశనం చేస్తాను. \v 10 నా మాటలు వినకుండ, తమ హృదయాల మొండితనాన్ని అనుసరించి, ఇతర దేవుళ్ళను సేవించే, ఆరాధించే ఈ దుష్ట ప్రజలు ఈ పట్టీలా ఎందుకు పనికిరానివారిగా ఉంటారు! \v 11 నడుముకు పట్టీ కట్టినట్లు నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదా ప్రజలందరినీ, నా కీర్తి, స్తుతి ఘనత కోసం నా ప్రజలుగా ఉండడానికి నాకు కట్టుకున్నాను. కానీ వారు వినలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. \s1 ద్రాక్ష తిత్తులు \p \v 12 “వారితో ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలి.’ ఒకవేళ వారు నీతో, ‘ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలని మాకు తెలీదా?’ అని అంటే, \v 13 వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: దావీదు సింహాసనం మీద ఆసీనులైన రాజులు, యాజకులు, ప్రవక్తలు, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో సహా ఈ దేశంలో నివసించే వారందరినీ నేను మత్తులో మునిగేలా చేయబోతున్నాను. \v 14 అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అలాగే అందరిని ఒకరిపై ఒకరు పడేలా చేస్తాను, వారిపై దయ కరుణ కనికరం లేకుండా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \s1 చెరను గురించిన బెదిరింపు \q1 \v 15 వినండి శ్రద్ధ వహించండి, \q2 గర్వపడకండి, అని యెహోవా చెప్తున్నారు. \q1 \v 16 చీకటి కమ్ముతున్న కొండలమీద \q2 మీ పాదాలు తడబడక ముందే, \q1 మీ దేవుడైన యెహోవా చీకటి తేక ముందే \q2 మీ దేవుడైన యెహోవాను మహిమపరచండి. \q1 మీరు వెలుగు కోసం ఎదురుచూస్తారు, \q2 కానీ ఆయన దానిని పూర్తిగా చీకటిగా \q2 గాఢమైన చీకటిగా మారుస్తారు. \q1 \v 17 మీరు వినకపోతే \q2 మీ గర్వాన్ని బట్టి \q2 నేను రహస్యంగా ఏడుస్తాను; \q1 యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది \q2 కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి, \q2 కన్నీరు కారుస్తాయి. \b \q1 \v 18 రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు, \q2 “మీర మీ సింహాసనాలు దిగిరండి, \q1 ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు \q2 మీ తలల నుండి పడిపోతాయి.” \q1 \v 19 దక్షిణ వైపు ఉన్న పట్టణాలు మూసివేయబడతాయి, \q2 వాటిని తెరవడానికి పట్టించుకునేవారే ఉండరు. \q1 యూదా వారంతా బందీగా కొనిపోబడతారు, \q2 ఏమి మిగులకుండ పూర్తిగా కొనిపోబడతారు. \b \q1 \v 20 కళ్లు పైకెత్తి \q2 ఉత్తరం నుండి వస్తున్న వారిని చూడండి. \q1 నీకు అప్పగించబడిన మంద, \q2 నీవు గొప్పలు చెప్పుకున్న గొర్రెలు ఎక్కడ? \q1 \v 21 నీ ప్రత్యేక మిత్రులుగా నీవు చేసుకొన్న వారిని \q2 యెహోవా నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేమంటావు? \q1 ప్రసవిస్తున్న స్త్రీ పడే బాధలాంటి \q2 బాధ నీకు కలుగదా? \q1 \v 22 “నాకే ఎందుకు ఇలా జరిగింది?” \q2 అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే \q1 నీ అనేక పాపాల కారణంగానే \q2 నీ వస్త్రాలు చింపబడ్డాయి \q2 నీ శరీరం అసభ్యంగా తాకబడింది. \q1 \v 23 కూషీయుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? \q2 చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? \q1 అలాగే చెడు చేయడం అలవాటైన \q2 మీరు మంచి చేయలేరు. \b \q1 \v 24 “ఎడారి గాలికి కొట్టుకుపోయే పొట్టులా \q2 నేను నిన్ను చెదరగొడతాను. \q1 \v 25 ఇదే నీ భాగం, \q2 నేను నీకు నియమించిన భాగం, \q1 ఎందుకంటే నీవు నన్ను మరచిపోయి \q2 అబద్ధ దేవుళ్ళపై నమ్మకం ఉంచావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 26 “నీ అవమానం కనబడేలా \q2 నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను. \q1 \v 27 నీ వ్యభిచారాలు, కామపు సకిలింపులు, \q2 నీ సిగ్గులేని వ్యభిచారం! \q1 కొండలమీద, పొలాల్లో \q2 నీ హేయమైన పనులు నేను చూశాను. \q1 యెరూషలేమా, నీకు శ్రమ! \q2 నీవు ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు?” \c 14 \s1 అనావృష్టి, కరువు, ఖడ్గం \p \v 1 అనావృష్టి గురించి యిర్మీయాకు వచ్చిన యెహోవా వాక్కు ఇది: \q1 \v 2 “యూదా దుఃఖిస్తుంది, \q2 ఆమె పట్టణాలు వాడిపోతున్నాయి. \q1 వారు భూమి కోసం విలపిస్తున్నారు, \q2 యెరూషలేము నుండి కేకలు వినిపిస్తున్నాయి. \q1 \v 3 అధిపతులు నీళ్ల కోసం తమ సేవకులను పంపుతారు; \q2 వారు నీళ్ల తొట్టెల దగ్గరకు వెళ్తారు \q2 కానీ నీళ్లు దొరకవు. \q1 వారు ఖాళీ పాత్రలతో తిరిగి వస్తారు; \q2 నిరాశ నిస్పృహలతో, \q2 వారు తమ తలలను కప్పుకుంటారు. \q1 \v 4 దేశంలో వర్షం కురవకపోవడం వల్ల \q2 నేల చీలిపోయింది; \q1 రైతులు సిగ్గుతో \q2 తలలు కప్పుకున్నారు. \q1 \v 5 పొలంలో ఉన్న జింక కూడా \q2 గడ్డి లేనందున \q2 అప్పుడే పుట్టిన తన పిల్లలను విడిచిపెడుతుంది. \q1 \v 6 అడవి గాడిదలు బంజరు కొండలమీద నిలబడి \q2 నక్కల్లా రొప్పుతాయి. \q1 మేత లేకపోవడంతో \q2 వాటి కళ్లు క్షీణిస్తున్నాయి.” \b \q1 \v 7 మా పాపాలు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నా, \q2 యెహోవా, మీ నామం కోసం ఏదైనా చేయండి. \q1 ఎందుకంటే మేము చాలాసార్లు దారితప్పాం; \q2 మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాము. \q1 \v 8 మీరు ఇశ్రాయేలీయులకు నిరీక్షణ, \q2 ఆపద సమయంలో వారికి రక్షకుడవు, \q1 దేశంలో నీవు అపరిచితునిలా ఎందుకు ఉన్నావు? \q2 ఒక రాత్రి మాత్రమే బసచేసే ప్రయాణికునిలా ఎందుకు ఉన్నావు? \q1 \v 9 నీవు ఆందోళనకు గురియైన వ్యక్తిలా ఎందుకు ఉన్నావు? \q2 రక్షించడానికి శక్తిలేని యోధునిలా ఎందుకు ఉన్నావు? \q1 యెహోవా, మీరు మా మధ్య ఉన్నారు, \q2 మేము మీ పేరును కలిగి ఉన్నాము; \q2 మమ్మల్ని విడిచిపెట్టకండి! \p \v 10 ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు: \q1 “వారికి తిరగడం అంటే చాలా ఇష్టం; \q2 వారు తమ పాదాలను అదుపు చేసుకోరు. \q1 కాబట్టి యెహోవా వారిని అంగీకరించరు; \q2 ఆయన ఇక వారి దుర్మార్గాన్ని జ్ఞాపకం ఉంచుకుని \q2 వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తారు.” \p \v 11 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఈ ప్రజల క్షేమం కోసం ప్రార్థించవద్దు. \v 12 వారు ఉపవాసం ఉన్నప్పటికీ నేను వారి మొర వినను; వారు దహనబలులను భోజనార్పణలను అర్పించినప్పటికీ నేను వాటిని అంగీకరించను. నేను వారిని ఖడ్గంతో కరువుతో తెగులుతో నాశనం చేస్తాను.” \p \v 13 అయితే నేను, “అయ్యో, ప్రభువా యెహోవా! ప్రవక్తలు వారితో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, మీకు కరువు రాదు. నిజానికి, ఈ స్థలంలో నేను మీకు శాశ్వతమైన సమాధానం ఇస్తాను’ అని చెబుతున్నారు.” \p \v 14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “ప్రవక్తలు నా పేరుతో అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారిని నియమించలేదు, అసలు వారితో మాట్లాడలేదు. వారు మీకు తప్పుడు దర్శనాలు, భవిష్యవాణి, బూటకపు మాటలు\f + \fr 14:14 \fr*\ft లేదా \ft*\fqa విగ్రహారాధనలు\fqa*\f* వారి సొంత మనస్సు యొక్క భ్రమలు ప్రవచిస్తున్నారు. \v 15 కాబట్టి నా పేరుతో ప్రవచిస్తున్న ప్రవక్తల గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను వారిని పంపలేదు, అయినా వారు, ‘ఖడ్గం గాని కరువు గాని ఈ దేశాన్ని తాకవు’ అని చెప్తున్నారు. అలా ప్రవచిస్తున్న ప్రవక్తలే ఖడ్గం కరువుతో నశిస్తారు. \v 16 వారు ఎవరికి ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు కరువు, ఖడ్గం కారణంగా యెరూషలేము వీధుల్లోకి విసిరివేయబడతారు. వారిని, వారి భార్యలను, వారి కుమారులను వారి కుమార్తెలను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు. నేను వారికి తగిన విపత్తును వారిపై కురిపిస్తాను. \b \p \v 17 “వారితో ఈ మాట చెప్పు: \q1 “ ‘నా కళ్లలో కన్నీరు \q2 రాత్రింబగళ్ళు ఆగకుండా పొంగిపారును గాక; \q1 ఎందుకంటే, కన్యయైన నా ప్రజల కుమార్తెకు, \q2 తీవ్రమైన గాయం తగిలింది, \q2 అది ఆమెను నలిపివేస్తుంది. \q1 \v 18 నేను పొలాల్లోకి వెళ్తే, \q2 ఖడ్గంతో చంపబడినవారు కనబడతారు; \q1 నేను పట్టణంలోకి వెళ్తే, \q2 కరువు బీభత్సాన్ని చూస్తాను. \q1 ప్రవక్త యాజకుడు ఇద్దరూ \q2 తమకు తెలియని దేశానికి వెళ్లారు.’ ” \b \q1 \v 19 యెహోవా, మీరు యూదాను పూర్తిగా తిరస్కరించారా? \q2 మీరు సీయోనును తృణీకరిస్తున్నారా? \q1 మేము స్వస్థత పొందలేనంతగా \q2 మమ్మల్ని ఎందుకు బాధించారు? \q1 మేము సమాధానం కోసం నిరీక్షించాం \q2 కానీ ఏ మంచి జరగలేదు, \q1 స్వస్థత జరిగే సమయం కోసం నిరీక్షించాం \q2 కానీ కేవలం భయమే ఉండింది. \q1 \v 20 యెహోవా, మా దుర్మార్గాన్ని, \q2 మా పూర్వికుల అపరాధాన్ని మేము ఒప్పుకుంటున్నాం; \q2 మేము మీకు విరోధంగా పాపం చేశాము. \q1 \v 21 మీ పేరు కోసం మమ్మల్ని తృణీకరించకండి; \q2 మహిమతో నిండిన మీ సింహాసనాన్ని అగౌరపరచకండి. \q1 మాతో మీ ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకోండి \q2 దానిని భంగం చేయకండి. \q1 \v 22 జనాంగాల పనికిమాలిన విగ్రహాలేవైనా వర్షాన్ని కురిపిస్తాయా? \q2 ఆకాశాలు వాటంతట అవి జల్లులు కురిపిస్తాయా? \q1 లేదు, యెహోవా, మా దేవా మీరే కదా. \q2 కాబట్టి మీ మీదనే మా నిరీక్షణ ఉంది, \q2 ఎందుకంటే ఇదంతా చేసింది మీరే. \c 15 \p \v 1 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు! \v 2 వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి; \q1 ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి; \q1 ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి; \q1 చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’ \p \v 3 “నేను నాలుగు రకాల బాధలను వారి మీదికి పంపుతాను. చంపడానికి ఖడ్గాన్ని, చీల్చడానికి కుక్కలను, తిని నాశనం చేయడానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 4 యూదా రాజైన హిజ్కియా కుమారుడైన మనష్షే యెరూషలేములో చేసిన దానిని బట్టి భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా చేస్తాను. \q1 \v 5 “యెరూషలేమా, నీ మీద ఎవరు జాలి చూపిస్తారు? \q2 నీకోసం ఎవరు దుఃఖిస్తారు? \q2 నీ క్షేమసమాచారం ఎవరు అడుగుతారు? \q1 \v 6 నీవు నన్ను తిరస్కరించావు” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q2 “నీవు విశ్వాసభ్రష్టత్వం కొనసాగిస్తూనే ఉన్నావు. \q1 కాబట్టి నేను నా చేయి చాపి నిన్ను నాశనం చేస్తాను; \q2 నీ మీద జాలి చూపడానికి నేను అలసిపోయాను. \q1 \v 7 దేశపు పట్టణ ద్వారం దగ్గర \q2 నేను వారిని చేటతో చెరుగుతాను. \q1 నా ప్రజలు తమ మార్గాలను మార్చుకోలేదు \q2 వారికి బంధువియోగం కలిగించి నాశనం చేస్తాను. \q1 \v 8 నేను వారి విధవరాండ్ర సంఖ్యను \q2 సముద్రపు ఇసుక కంటే ఎక్కువ చేస్తాను. \q1 మధ్యాహ్న సమయంలో నేను వారి యువకులు తల్లుల మీదికి \q2 నాశనం చేసేవాన్ని రప్పిస్తాను; \q1 అకస్మాత్తుగా నేను వారి మీదికి \q2 వేదనను, భయాందోళనను రప్పిస్తాను. \q1 \v 9 ఏడుగురు పిల్లల తల్లి మూర్ఛపోయి \q2 తుది శ్వాస విడుస్తుంది. \q1 పగలు ఉండగానే ఆమెకు ప్రొద్దు గ్రుంకుతుంది; \q2 ఆమె అవమానం పాలవుతుంది, కించపరచబడుతుంది. \q1 ప్రాణాలతో బయటపడిన వారిని \q2 వారి శత్రువుల ముందు ఖడ్గానికి అప్పగిస్తాను” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 10 అయ్యో, నా తల్లీ, దేశమంతటితో పోరాటాలు, \q2 కలహాలు పెట్టుకునేవానిగా, \q2 నీవు నాకు జన్మనిచ్చావు! \q1 నేను అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదు, \q2 అయినా ప్రతిఒక్కరు నన్ను శపిస్తున్నారు. \p \v 11 యెహోవా ఇలా అన్నారు, \q1 “ఖచ్చితంగా నేను నిన్ను మంచి ఉద్దేశంతో విడిపిస్తాను; \q2 ఆపద సమయాల్లోనూ, కష్ట సమయాల్లోనూ \q2 నీ శత్రువులు నిన్ను సాయం కోరేలా నేను చేస్తాను. \b \q1 \v 12 “ఉత్తరానికి చెందిన ఇనుమును గాని \q2 ఇత్తడిని గాని ఎవరైనా విరగ్గొట్టగలరా? \b \q1 \v 13 “మీ దేశమంతటా \q2 మీరు చేసిన పాపాలన్నిటి కారణంగా \q1 మీ సంపదను, మీ ఖజానాను నేను \q2 ఎలాంటి రుసుము లేకుండా దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. \q1 \v 14 నీకు తెలియని దేశంలో \q2 నీ శత్రువులకు నిన్ను బానిసగా చేస్తాను, \q1 నా కోపం మంటలు రేపుతుంది \q2 అది నీకు వ్యతిరేకంగా మండుతుంది.” \b \q1 \v 15 యెహోవా, మీరు అర్థం చేసుకోండి; \q2 నన్ను జ్ఞాపకముంచుకొని నా పట్ల శ్రద్ధ చూపండి. \q2 నన్ను హింసించేవారి మీద నా కోసం ప్రతీకారం తీర్చుకోండి. \q1 మీ ఓర్పును బట్టి నన్ను తీసుకెళ్లనివ్వకండి; \q2 మీ కోసం నేనెలా నిందలు అనుభవిస్తున్నానో ఆలోచించండి. \q1 \v 16 మీ మాటలు దొరికినప్పుడు ఒకడు ఆహారం తిన్నట్లుగా నేను వాటిని తిన్నాను; \q2 అవే నాకు ఆనందం నా హృదయానికి సంతోషం, \q1 ఎందుకంటే సైన్యాల యెహోవా దేవుడు అనే, \q2 మీ పేరును నేను కలిగి ఉన్నాను. \q1 \v 17 నేనిప్పుడు ఆనందించే వారితో కలిసి కూర్చోలేదు, \q2 వారితో ఎప్పుడూ సంతోషించలేదు. \q1 మీ చేయి నా మీద ఉంది \q2 మీరు నాలో కోపాన్ని నింపారు కాబట్టి నేను ఒంటరిగా కూర్చున్నాను. \q1 \v 18 అలాంటప్పుడు నా బాధ ఎందుకు అంతం కావడం లేదు? \q2 నా గాయం ఎందుకు నయం చేయలేనిది? \q1 మీ సహాయం నమ్మలేని వాగులా, \q2 ఎండిపోయే ఊటలా వంటిది. \p \v 19 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: \q1 “నీవు పశ్చాత్తాపపడితే \q2 మీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. \q1 నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే, \q2 నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు. \q1 ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి, \q2 కాని నీవు వారివైపు తిరగకూడదు. \q1 \v 20 నిన్ను ఈ ప్రజలకు గోడగా, \q2 ఇత్తడి కోటగోడగా చేస్తాను; \q1 వారు నీతో పోరాడతారు, \q2 కాని నిన్ను జయించలేరు, \q1 ఎందుకంటే నిన్ను విడిపించి రక్షించడానికి \q2 నేను నీతో ఉన్నాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 21 “దుష్టుల చేతుల నుండి నేను నిన్ను రక్షించి \q2 క్రూరమైన వారి పట్టు నుండి నిన్ను విడిపిస్తాను.” \c 16 \s1 విపత్తు దినం \p \v 1 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “ఈ స్థలంలో నీవు పెళ్ళి చేసుకుని కుమారులు, కూతుళ్లు కనకూడదు.” \v 3 ఈ దేశంలో పుట్టిన కుమారులు కుమార్తెల గురించి వారి తల్లుల గురించి వారి తండ్రుల గురించి యెహోవా ఇలా అంటున్నారు: \v 4 “వారు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు. వారి కోసం ఎవరు దుఃఖించరు, వారిని పాతిపెట్టరు, వారి శవాలు నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటాయి. వారు ఖడ్గంతో, కరువుతో నశిస్తారు, వారి శవాలు పక్షులకు అడవి జంతువులకు ఆహారంగా ఉంటాయి.” \p \v 5 యెహోవా ఇలా అంటున్నారు: “చనిపోయిన దుఃఖంతో ఉన్న ఇంటికి వెళ్లవద్దు; దుఃఖించడానికీ, సానుభూతి చూపడానికి వెళ్లవద్దు, ఎందుకంటే నేను ఈ ప్రజల నుండి నా సమాధానాన్ని, నా ప్రేమను, నా జాలి వదిలేశాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 6 “ఈ దేశంలో గొప్పవారు చిన్నవారు అందరు చనిపోతారు. వారు పాతిపెట్టబడరు, వారి కోసం ఎవరు దుఃఖించరు, చనిపోయినవారి కోసం ఎవరూ తమను తాము కోసుకోరు, తల క్షౌరం చేయించుకోరు. \v 7 చనిపోయినవారి కోసం దుఃఖించేవారిని ఓదార్చడానికి ఎవరూ ఆహారం ఇవ్వరు కనీసం తండ్రి తల్లి చనిపోయినా సరే వారిని ఓదార్చేలా త్రాగడానికి ఏమీ ఇవ్వరు. \p \v 8 “విందు జరుగుతున్న ఇంట్లోకి వెళ్లి తినడానికి, త్రాగడానికి కూర్చోవద్దు. \v 9 ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ కళ్లముందు, మీ రోజుల్లో నేను ఈ స్థలంలో ఆనంద, సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను అంతం చేస్తాను. \p \v 10 “నీవు ఈ సంగతులను ఈ ప్రజలకు చెప్పినప్పుడు, ‘యెహోవా మనపై ఇంత పెద్ద విపత్తును ఎందుకు విధించారు? మేము చేసిన తప్పేంటి? మన దేవుడైన యెహోవాకు విరోధంగా మనం ఏమి పాపం చేశాం?’ \v 11 అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘మీ పూర్వికులు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని సేవిస్తూ, ఆరాధించారు. వారు నన్ను విడిచిపెట్టారు నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 12 అయితే మీరు మీ పూర్వికులకంటే దుర్మార్గంగా ప్రవర్తించారు. మీరందరూ నాకు విధేయత చూపకుండ మీ దుష్ట హృదయాల మొండితనాన్ని ఎలా అనుసరిస్తున్నారో చూసుకోండి. \v 13 కాబట్టి నేను మిమ్మల్ని ఈ దేశం నుండి మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని దేశంలోకి విసిరివేస్తాను, అక్కడ మీరు పగలు రాత్రి ఇతర దేవుళ్ళను సేవిస్తారు, ఎందుకంటే నేను మీకు ఎలాంటి దయ చూపను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 14 “అయినా, ఆ రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తూ ఇలా చెప్తున్నారు, “అప్పుడు ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన యెహోవా జీవం తోడు’ అని ఇకపై చెప్పరు, \v 15 అయితే, ‘యెహోవా జీవం తోడు, ఇశ్రాయేలీయులను ఉత్తర దేశం నుండి ఆయన వారిని తరిమేసిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన యెహోవా జీవం తోడు.’ ఎందుకంటే నేను వారిని వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి మళ్ళీ రప్పిస్తాను. \p \v 16 “అయితే వారిని పట్టుకోడానికి నేను చాలామంది చేపలు పట్టేవారిని పిలిపిస్తాను. ఆ తర్వాత వారిని ప్రతి పర్వతం మీద కొండమీద రాళ్ల పగుళ్లలో నుండి వేటాడడానికి చాలామంది వేటగాళ్లను పిలుస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 17 వారి మార్గాలన్నిటిపై నా దృష్టి ఉంది; నాకు కనబడకుండ లేదు, వారి పాపం నా కళ్ళకు దాచబడలేదు. \v 18 వారి దుష్టత్వానికి, పాపానికి రెట్టింపు ప్రతిఫలమిస్తాను, ఎందుకంటే వారు నా దేశాన్ని నిర్జీవమైన తమ నీచమైన విగ్రహాలతో అపవిత్రం చేశారు వారి అసహ్యమైన విగ్రహాలతో నా వారసత్వాన్ని నింపారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 19 యెహోవా, మీరే నా బలం, నా కోట, \q2 ఆపద సమయంలో నాకు ఆశ్రయం, \q1 దేశాలు నీ దగ్గరకు \q2 భూమి అంచుల నుండి వచ్చి, \q1 “మా పూర్వికులు అబద్ధపు దేవుళ్ళు తప్ప మరేమీ కలిగి లేరు. \q2 పనికిరాని విగ్రహాలు వారికి ఏ మేలు చేయలేదు. \q1 \v 20 మనుష్యులు తమ దేవుళ్ళను చేసుకుంటారా? \q2 అవును, కానీ వారు దేవుళ్ళు కాదు!” \b \q1 \v 21 “అందుకే నేను వారికి బోధిస్తాను, \q2 ఈసారి వారికి \q2 నా శక్తిని, మహాత్మ్యాన్ని బోధిస్తాను. \q1 అప్పుడు వారు నా పేరు యెహోవా \q2 అని తెలుసుకుంటారు. \b \c 17 \q1 \v 1 “యూదా పాపం వారి హృదయ పలకలపై, \q2 వారి బలిపీఠాల కొమ్ములపై, \q1 ఇనుప పనిముట్టుతో చెక్కబడింది. \q2 వజ్రపు మొనతో లిఖించబడింది. \q1 \v 2 వారి పిల్లలు కూడా \q2 మహా వృక్షాల ప్రక్కన ఎత్తైన కొండలమీద ఉన్న \q1 తమ బలిపీఠాలను, అషేరా స్తంభాలను\f + \fr 17:2 \fr*\ft అంటే, అషేరా దేవత యొక్క చెక్క చిహ్నాలు\ft*\f* \q2 జ్ఞాపకం చేసుకుంటారు. \q1 \v 3 నీవు పాపం నీ దేశమంతటా ఉంది కాబట్టి \q2 దేశంలోని నా కొండలను, \q1 నీ\f + \fr 17:3 \fr*\ft లేదా \ft*\fqa దేశంలోని పర్వతాలు\fqa*\f* ధనాన్ని, నీ సంపదను, \q2 నీ క్షేత్రాలతో పాటు \q2 దోపుడు సొమ్ముగా ఇస్తాను. \q1 \v 4 నీవు చేసిన తప్పు వల్ల \q2 నేను నీకు ఇచ్చిన వారసత్వాన్ని నీవు కోల్పోతావు. \q1 నీకు తెలియని దేశంలో నిన్ను \q2 నీ శత్రువులకు బానిసగా చేస్తాను, \q1 నీవు నా కోపాన్ని రెచ్చగొట్టావు, \q2 అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది.” \p \v 5 యెహోవా ఇలా అంటున్నారు: \q1 “మనుష్యుల మీద నమ్మకం పెట్టుకునేవారు, \q2 కేవలం శరీర బలం మీద ఆధారపడేవారు, \q2 యెహోవా నుండి తమ హృదయాన్ని త్రిప్పివేసుకునేవారు శాపగ్రస్తులు. \q1 \v 6 వారు బంజరు భూములలో పొదలా ఉంటారు; \q2 వృద్ధి కలిగినప్పుడు వారు దానిని చూడరు. \q1 వారు ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో, \q2 ఎవరూ నివసించని ఉప్పు భూమిలో నివసిస్తారు. \b \q1 \v 7 “కాని యెహోవా మీద నమ్మకముంచేవారు ధన్యులు, \q2 ఆయనయందు నమ్మకం ఉంచేవారు ధన్యులు. \q1 \v 8 వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు \q2 వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి. \q1 కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు; \q2 వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. \q1 కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు, \q2 ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.” \b \q1 \v 9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది \q2 నయం చేయలేని వ్యాధి కలది. \q2 దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? \b \q1 \v 10 “యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి \q2 మనస్సును పరీక్షించి, \q1 ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి, \q2 వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను.” \b \q1 \v 11 అన్యాయంగా ధనాన్ని సంపాదించేవారు \q2 పెట్టని గుడ్ల మీద పొదిగిన కౌజుపిట్టలాంటి వారు. \q1 వారి జీవితం సగం ముగిసినప్పటికే సంపద వారిని వదిలివేస్తుంది, \q2 చివరికి వారు మూర్ఖులు అని నిరూపించబడతారు. \b \q1 \v 12 మన పరిశుద్ధాలయం, \q2 ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము. \q1 \v 13 యెహోవా, మీరే ఇశ్రాయేలీయుల నిరీక్షణ; \q2 మిమ్మల్ని విడిచిపెట్టేవారందరూ అవమానానికి గురవుతారు. \q1 మిమ్మల్ని విడిచిపెట్టినవారి గమ్యం నాశనమే, \q2 ఎందుకంటే వారు జీవజలపు ఊటయైన \q2 యెహోవాను విడిచిపెట్టారు. \b \q1 \v 14 యెహోవా, నన్ను స్వస్థపరచండి, నేను స్వస్థపడతాను; \q2 నన్ను రక్షించండి, నేను రక్షింపబడతాను, \q2 నేను స్తుతించేది మిమ్మల్నే. \q1 \v 15 వారు నాతో ఇలా అంటారు: \q2 “యెహోవా మాట ఏమైంది? \q2 అది ఇప్పుడు నెరవేరాలి!” \q1 \v 16 నేను మీకు కాపరిగా ఉండకుండ పారిపోలేదు; \q2 వారికి నిరాశ దినం రావాలని నేను కోరుకోలేదని మీకు తెలుసు. \q2 నా పెదవుల నుండి బయటకు వచ్చే ప్రతీ మాట మీకు తెలుసు. \q1 \v 17 నాకు భయాన్ని కలిగించకండి; \q2 ఆపద దినాన మీరే నాకు ఆశ్రయము. \q1 \v 18 నన్ను హింసించేవారు అవమానించబడాలి, \q2 కాని అవమానపాలుకాకుండ నన్ను కాపాడండి. \q1 వారికి భయభ్రాంతులు కలగాలి, \q2 కాని నాకు భయభ్రాంతులు కలుగకుండా కాపాడండి. \q1 వారి మీదికి నాశన దినాన్ని రప్పించండి; \q2 రెట్టింపు విధ్వంసంతో వారిని నాశనం చేయండి. \s1 సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడం \p \v 19 యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి యూదా రాజులు వెళ్లే ప్రజల\f + \fr 17:19 \fr*\ft లేదా \ft*\fqa సైన్యం\fqa*\f* ద్వారం దగ్గర నిలబడు. యెరూషలేము యొక్క అన్ని ఇతర ద్వారాల దగ్గర కూడా నిలబడు. \v 20 నీవు వారితో, ‘ఈ ద్వారాల గుండా వచ్చే యూదా రాజులారా, సర్వ యూదా ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ యెహోవా మాట వినండి. \v 21 యెహోవా ఇలా అంటున్నారు: సబ్బాతు దినాన ఏ బరువులు మోయకుండా, వాటిని యెరూషలేము ద్వారాల గుండా తీసుకురాకుండా జాగ్రత్తపడండి. \v 22 సబ్బాతు దినాన మీ ఇళ్ళ నుండి బరువులు తేకండి, ఏ పని చేయకండి, అయితే నేను మీ పూర్వికులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలి. \v 23 కాని వారు వినలేదు, పట్టించుకోలేదు; వారు మొండి వారై నా మాటలు వినలేదు, క్రమశిక్షణకు ప్రతిస్పందించలేదు. \v 24 అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, మీరు నా మాటకు విధేయత చూపుతూ, సబ్బాతు దినాన ఈ పట్టణపు ద్వారాల గుండా ఎలాంటి బరువులు తీసుకురాకుండా, ఏ పని చేయకుండా సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే, \v 25 దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులు తమ అధికారులతో కలిసి ఈ నగర ద్వారాల గుండా వస్తారు. వారు, వారి అధికారులు రథాల మీద, గుర్రాల మీద స్వారీ చేస్తూ, యూదా వారితో, యెరూషలేము నివాసులతో కలిసి వస్తారు, ఈ పట్టణం శాశ్వతంగా ఉంటుంది. \v 26 యూదా పట్టణాల నుండి, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల నుండి, బెన్యామీను ప్రాంతం నుండి, పడమటి కొండ దిగువ ప్రదేశాల నుండి, కొండ ప్రదేశాల నుండి, దక్షిణ వైపు నుండి ప్రజలు దహనబలులను, బలులను, భోజనార్పణలను, ధూపద్రవ్యాలను, కృతజ్ఞతార్పణలను యెహోవా ఆలయానికి తీసుకువస్తారు. \v 27 అయితే మీరు సబ్బాతు దినాన యెరూషలేము గుమ్మాల గుండా వస్తున్నప్పుడు ఎలాంటి బరువును మోస్తూ రాకుండ సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడంలో మీరు నాకు విధేయత చూపితే సరి, లేకపోతే నేను యెరూషలేము గుమ్మాల్లో ఆర్పలేని అగ్నిని రప్పిస్తాను, అది దాని భవనాలను దహించివేస్తుంది.’ ” \c 18 \s1 కుమ్మరి ఇల్లు \p \v 1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు: \v 2 “నీవు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు, అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని ఆదేశించింది. \v 3 కాబట్టి నేను కుమ్మరి ఇంటికి వెళ్లాను, అక్కడ కుమ్మరి చక్రంపై పని చేయడం చూశాను. \v 4 అయితే బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది; అతడు దాన్ని మళ్ళీ ముద్ద చేసి తనకు ఇష్టమైన ఆకారంలో మరో కుండను చేశాడు. \p \v 5 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది. \v 6 ఆయన, “ఇశ్రాయేలూ, ఈ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “కుమ్మరి చేతిలోని మట్టిలా, ఇశ్రాయేలూ, నీవు నా చేతిలో ఉన్నావు. \v 7 ఏదైనా ఒక దేశాన్ని లేదా రాజ్యాన్ని పెళ్లగిస్తానని, కూల్చివేస్తానని, నాశనం చేస్తానని నేను ఎప్పుడైనా ప్రకటిస్తే, \v 8 దానికి ఆ దేశం దాని చెడు గురించి పశ్చాత్తాపపడితే నేను జాలిపడి, పంపాలనుకున్న విపత్తును పంపకుండ నిలిపివేస్తాను. \v 9 ఏదైనా ఒక దేశాన్ని గాని రాజ్యాన్ని గాని కడతానని, స్థిరపరుస్తానని నేను ప్రకటిస్తే, \v 10 ఒకవేళ అది నా దృష్టిలో చెడు చేసి, నాకు లోబడకపోతే, నేను దానికి చేయాలని ఉద్దేశించిన మంచి చేయకుండా ఆపివేస్తాను. \p \v 11 “కాబట్టి ఇప్పుడు యూదా ప్రజలతోను, యెరూషలేము నివాసులతోను ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: చూడండి! నేను మీ కోసం ఒక విపత్తును రప్పిస్తున్నాను, మీకు వ్యతిరేకంగా ఒక ఆలోచన చేస్తున్నాను. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తనను సరిచేసుకోండి.’ \v 12 అయితే వారంటారు, ‘మీరు చెప్పినా ప్రయోజనం లేదు. మేము మా ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాం; మేమందరం మా దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరిస్తాము.’ ” \b \p \v 13 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “కన్యయైన ఇశ్రాయేలు \q2 అత్యంత ఘోరమైన పని చేసింది. \q1 ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? \q2 అన్ని దేశాలను అడిగి తెలుసుకోండి. \q1 \v 14 లెబానోను మంచు \q2 దాని రాతి బండల నుండి ఎప్పుడైనా మాయమవుతుందా? \q1 సుదూర ప్రాంతాల నుండి వచ్చే దాని చల్లని జలాలు \q2 ప్రవహించడం ఆగిపోతాయా? \q1 \v 15 అయినా నా ప్రజలు నన్ను మరచిపోయారు; \q2 పనికిమాలిన విగ్రహాలకు ధూపం వేస్తున్నారు, \q1 వాటివలన వారు తమ జీవితాల్లో తడబడ్డారు \q2 పురాతనమైన మార్గాలను వదిలిపెట్టి, \q1 సరిగా లేని అడ్డదారుల్లో \q2 నడవాలి అనుకున్నారు. \q1 \v 16 వారి దేశం పాడైపోయి \q2 నిత్యం హేళన చేయబడేదిగా ఉంటుంది; \q1 దారిన వెళ్లేవారంతా \q2 నివ్వెరపోయి వారి తలలాడిస్తారు. \q1 \v 17 తూర్పు గాలి చెదరగొట్టినట్లు, \q2 నేను వారి శత్రువుల ముందు వారిని చెదరగొడతాను; \q1 వారి మీదకు విపత్తు వచ్చిన రోజున \q2 నేను వారిపై దయ చూపను.” \p \v 18 వారు, “రండి, యిర్మీయా మీద కుట్ర చేద్దాం; యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధించక మానడు, జ్ఞానులు సలహాలు ఇవ్వడం మానరు, ప్రవక్తలు వాక్కును ప్రకటింపక మానరు. కాబట్టి రండి, అతడు చెప్పేదేదీ పట్టించుకోకుండా మన మాటలతో అతనిపై దాడి చేద్దాం” అంటారు. \q1 \v 19 యెహోవా, నా మాట వినండి; \q2 నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి! \q1 \v 20 మేలుకు ప్రతిగా కీడు చేయాలా? \q2 అయినా వారు నా కోసం గొయ్యి త్రవ్వారు. \q1 నేను నీ ఎదుట నిలబడి \q2 వారి మీది నుండి మీ కోపం తొలగించమని \q2 వారి పక్షాన నేను మిమ్మల్ని వేడుకున్నానని జ్ఞాపకం తెచ్చుకోండి. \q1 \v 21 కాబట్టి వారి పిల్లలను కరువుకు అప్పగించండి; \q2 ఖడ్గానికి వారిని అప్పగించండి. \q1 వారి భార్యలు సంతానం లేనివారుగా, విధవరాండ్రుగా ఉండాలి; \q2 వారి మనుష్యులు చంపబడాలి, \q2 వారి యువకులు యుద్ధంలో కత్తివేటుతో చంపబడాలి. \q1 \v 22 మీరు అకస్మాత్తుగా వారిపైకి దండెత్తే వారిని రప్పించినప్పుడు, \q2 వారి ఇళ్ళలో నుండి కేకలు వినబడాలి, \q1 ఎందుకంటే వారు నన్ను పట్టుకోవడానికి గొయ్యి త్రవ్వారు, \q2 నా పాదాలకు రహస్య ఉచ్చులు బిగించారు. \q1 \v 23 అయితే యెహోవా, \q2 నన్ను చంపడానికి వారు పన్నిన కుట్రలన్నీ మీకు తెలుసు. \q1 వారి నేరాలను క్షమించకండి \q2 మీ దృష్టి నుండి వారి పాపాలను తుడిచివేయకండి. \q1 వారిని మీ ఎదుట కూలనివ్వండి; \q2 మీరు కోపంలో ఉన్నప్పుడే వారికి తగిన శాస్తి చేయండి. \c 19 \p \v 1 యెహోవా ఇలా అంటున్నారు: “వెళ్లి కుమ్మరి దగ్గర ఒక మట్టి పాత్ర కొను. నీతో పాటు ప్రజల పెద్దలను, యాజకులలో కొందరిని తీసుకుని, \v 2 హర్సీతు\f + \fr 19:2 \fr*\ft లేదా \ft*\fqa కుండపెంకు\fqa*\f* ద్వారం దగ్గర ఉన్న బెన్ హిన్నోము లోయకు వెళ్లి అక్కడ నేను మీకు చెప్పే మాటలు ప్రకటిస్తూ, \v 3 ఇలా చెప్పు, ‘యూదా రాజులారా, యెరూషలేము ప్రజలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: వినండి! నేను ఈ స్థలం మీదికి ఒక విపత్తును తెచ్చి, దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేలా చేస్తాను. \v 4 ఎందుకంటే వారు నన్ను విడిచిపెట్టి, ఈ స్థలాన్ని ఇతర దేవతల స్థలంగా చేశారు. వారికి గాని, వారి పూర్వికులకు గాని, యూదా రాజులకు గాని తెలియని దేవతలకు ధూపం వేసి, ఈ స్థలాన్ని నిర్దోషుల రక్తంతో నింపారు. \v 5 వారు తమ పిల్లలను బయలుకు దహనబలులుగా అగ్నిలో కాల్చడానికి బయలుకు క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను వారికి ఆజ్ఞాపించలేదు, కనీసం ప్రస్తావించలేదు, అసలు అది నా మనస్సులోకి కూడా రాలేదు. \v 6 ప్రజలు ఇకపై ఈ ప్రదేశాన్ని తోఫెతు లేదా బెన్ హిన్నోము లోయ అని పిలువకుండా, వధ లోయ అని పిలిచే రోజులు రాబోతున్నాయి, కాబట్టి జాగ్రత్త వహించండి, అని యెహోవా హెచ్చరించారు. \p \v 7 “ ‘ఈ స్థలంలో నేను యూదా, యెరూషలేము ప్రణాళికలను నాశనం చేస్తాను. వారిని చంపాలనుకునే శత్రువుల చేతిలో వారు కత్తివేటుకు గురయ్యేలా చేస్తాను, వారి శవాలను పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. \v 8 నేను ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను; దానిని భయానకంగా, ఎగతాళిగా చేస్తాను; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు, దాని గాయాలన్నిటిని చూసి అపహాస్యం చేస్తారు. \v 9 వారు తమ కుమారుల, కుమార్తెల మాంసాన్ని తినేలా చేస్తాను, వారు ఒకరి మాంసాన్ని మరొకరు తింటారు, ఎందుకంటే వారి శత్రువులు వారిని నాశనం చేయడానికి వారిని పూర్తిగా ముట్టడిస్తారు.’ \p \v 10 “నీతో పాటు వచ్చినవారు చూస్తుండగానే ఆ కుండను పగలగొట్టి, \v 11 వారితో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మరలా బాగుచేయడానికి వీలు లేకుండ ఈ కుమ్మరి కుండను పగలగొట్టినట్లు నేను ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని ధ్వంసం చేస్తాను. తోఫెతులో స్థలం లేకపోయేంతగా అక్కడే చనిపోయినవారిని పాతిపెడతారు. \v 12 నేను ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసించేవారికి ఇదే చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు. నేను ఈ పట్టణాన్ని తోఫెతులా చేస్తాను. \v 13 యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ” \p \v 14 ప్రవచించడానికి యెహోవా అతన్ని పంపిన తోఫెతు నుండి యిర్మీయా తిరిగివచ్చి యెహోవా ఆలయ ఆవరణంలో నిలబడ్డాడు. \v 15 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘వినండి! వారు మెడవంచని వారై నా మాటలు వినలేదు కాబట్టి నేను ఈ పట్టణం మీద దాని చుట్టుప్రక్కల గ్రామాలన్నిటి మీదికి నేను చెప్పిన ప్రతి విపత్తును తీసుకురాబోతున్నాను.’ ” \c 20 \s1 యిర్మీయా, పషూరు \p \v 1 యిర్మీయా ఈ విషయాలు ప్రవచించడం ఇమ్మేరు కుమారుడు, యాజకుడు, యెహోవా ఆలయానికి అధికారియైన పషూరు విని, \v 2 అతడు యిర్మీయా ప్రవక్తను కొట్టించి, యెహోవా మందిరం దగ్గర బెన్యామీను ఎగువ ద్వారం దగ్గర ఉన్న కొయ్యకు బంధించాడు. \v 3 మరుసటిరోజు, పషూరు అతన్ని కొయ్య నుండి విడిపించినప్పుడు, యిర్మీయా అతనితో, “నీకు యెహోవా ఇచ్చిన పేరు పషూరు కాదు, నీ పేరు మాగోర్-మిస్సాబీబు.\f + \fr 20:3 \fr*\ft అంటే \ft*\fqa ప్రతీ వైపు భయం\fqa*\f* \v 4 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను నిన్ను నీకు, నీ స్నేహితులందరికీ భయంగా చేస్తాను; వారు తమ శత్రువుల ఖడ్గం చేత పడిపోవుట నీ కళ్లతో చూస్తావు. నేను యూదా ప్రజలందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు వారిని బబులోనుకు తీసుకెళ్తాడు, ఖడ్గంతో హతమారుస్తాడు. \v 5 నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు. \v 6 పషూరు, నీవు, నీ ఇంట్లో నివసించే వారందరూ బబులోనుకు బందీలుగా వెళ్తారు. అక్కడ మీరు, మీ అబద్ధాల ప్రవచనాలతో మీరు మోసగించిన మీ స్నేహితులందరూ చనిపోయి పాతిపెట్టబడతారు.’ ” \s1 యిర్మీయా ఫిర్యాదు \q1 \v 7 యెహోవా! మీరే నన్ను మోసగించావు, \q2 నేను లోబడ్డాను, మీరు నాకంటే బలవంతులు, \q1 మీరే గెలిచారు, రోజంతా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, \q2 ఎగతాళి చేస్తున్నారు. \q1 \v 8 నేను మాట్లాడినప్పుడెల్లా ఒకే ప్రవచనం వస్తుంది, \q2 హింస, నాశనం అంటూ ఎలుగెత్తి ప్రకటించవలసి వస్తుంది. \q1 యెహోవా మాట పలికినందుకు \q2 నాకు అవమానం, అపహాస్యం ఎదురయ్యాయి. \q1 \v 9 “దేవుని పేరు నేనెత్తను, \q2 ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, \q1 అప్పుడది నా హృదయంలో \q2 అగ్నిలా మండుతుంది. \q1 నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? \q2 విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను. \q1 \v 10 చాలామంది గుసగుసలాడడం విన్నాను, \q2 “అన్ని వైపుల భయం! \q2 అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” \q1 నా స్నేహితులందరూ \q2 నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, \q1 “బహుశా అతడు మోసపోవచ్చు; \q2 అప్పుడు మనం అతనిపై విజయం సాధించి \q2 అతని మీద పగ తీర్చుకుందాము.” \b \q1 \v 11 అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; \q2 కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, \q1 వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; \q2 వారి అవమానం ఎన్నటికీ మరవబడదు. \q1 \v 12 సైన్యాల యెహోవా! మీరు నీతిమంతులను పరీక్షిస్తారు, \q2 అంతరింద్రియాలను, హృదయాలను పరిశీలిస్తారు. \q1 నా వాదన మీకే అప్పగిస్తున్నాను, \q2 మీరు వారికి ఎలా ప్రతీకారం చేస్తారో నేను చూస్తాను. \b \q1 \v 13 యెహోవాను కీర్తించండి! \q2 యెహోవాను స్తుతించండి! \q1 దుష్టుని బారి నుండి \q2 దరిద్రుని ప్రాణాన్ని ఆయనే విడిపిస్తారు. \b \q1 \v 14 నేను పుట్టిన దినం శపితమవును గాక, \q2 నా తల్లి నన్ను కనిన దినం దీవించబడకపోవును గాక. \q1 \v 15 “నీకు ఒక కుమారుడు పుట్టాడు!” \q2 అని నా తండ్రికి వార్త తెలియజేసి, \q2 అతనికి చాలా సంతోషం కలిగించిన వ్యక్తి శాపగ్రస్తుడగును గాక. \q1 \v 16 యెహోవా దయ లేకుండా పడగొట్టిన పట్టణాల్లా \q2 ఆ వ్యక్తి ఉండును గాక. \q1 అతడు ఉదయాన్నే రోదనను, \q2 మధ్యాహ్నం యుద్ధఘోష వినును గాక. \q1 \v 17 ఎందుకంటే అతడు నన్ను గర్భంలో చంపి, \q2 నా తల్లినే నాకు సమాధిగా ఉండేలా చేయలేదు, \q2 ఆమె గర్భం శాశ్వతంగా ఉండిపోయేలా చేయలేదు. \q1 \v 18 కష్టాన్ని, దుఃఖాన్ని చూసి \q2 సిగ్గుతో నా దినాలు ముగించుకోవాలనా \q2 నేను గర్భం నుండి బయటకు వచ్చింది? \c 21 \s1 సిద్కియా మనవిని దేవుడు తిరస్కరించుట \p \v 1 సిద్కియా రాజు మల్కీయా కుమారుడైన పషూరు, మయశేయా కుమారుడు యాజకుడైన జెఫన్యా అనే ఇద్దరిని అతని దగ్గరకు పంపినప్పుడు, యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది. వారు వచ్చి, యిర్మీయాతో: \v 2 “బబులోను రాజైన నెబుకద్నెజరు\f + \fr 21:2 \fr*\ft హెబ్రీలో \ft*\fqa నెబుకద్రెజరు \fqa*\ft నెబుకద్నెజరు యొక్క మరో రూపం; ఇక్కడ, అలాగే తరచుగా యిర్మీయా, యెహెజ్కేలు గ్రంథాల్లో కూడా\ft*\f* మనమీద దాడి చేస్తున్నాడు. అయితే అతడు మనల్ని విడిచివెళ్లేలా, యెహోవా గతంలో చేసినట్లుగా ఇప్పుడు కూడా ఏమైన అద్భుతాలు చేస్తారేమో, యెహోవా దగ్గర విచారణ చేయి” అని అడిగారు. \p \v 3 అయితే యిర్మీయా వారితో, “సిద్కియాతో ఇలా చెప్పండి, \v 4 ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు అని చెప్పండి: బబులోను రాజుతో ప్రాకారం బయట ఉన్న బబులోను\f + \fr 21:4 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయ \fqa*\ft \+xt 9|link-href="JER 21:9"\+xt* వచనంలో కూడా ఉంది\ft*\f* వారితో పోరాడేందుకు మీరు ఉపయోగించే యుద్ధ ఆయుధాలను నేను మీ మీదికే త్రిప్పబోతున్నాను. నేను వాటిని ఈ పట్టణం లోపల పోగుచేయిస్తాను. \v 5 స్వయంగా నేనే భయంకరమైన కోపంతో, మహా ఉగ్రతతో, నా చాపబడిన చేతితో, బలమైన బాహువుతో నీకు వ్యతిరేకంగా పోరాడతాను. \v 6 ఈ పట్టణంలో నివసించే మనుష్యులను, మృగాలను నేను చంపుతాను. భయంకరమైన తెగులుతో వారు చస్తారు. \v 7 ఆ తర్వాత, ఈ పట్టణంలో తెగులు, ఖడ్గం కరువు నుండి బయటపడిన యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను, ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతులకు, వారిని చంపాలనుకునే శత్రువుల చేతులకు అప్పగిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. ఆ రాజు వారి మీద దయ, జాలి, కనికరం చూపించకుండ వారిని ఖడ్గంతో చంపుతాడు.’ \p \v 8 “ఇంకా, ప్రజలతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: చూడండి, నేను మీ ముందు జీవమార్గాన్ని, మరణమార్గాన్ని పెడుతున్నాను. \v 9 ఈ పట్టణంలో ఉండబోయే వారు ఖడ్గం వల్ల గాని కరువు వల్ల గాని తెగులు వల్ల గాని చస్తారు. అయితే ఎవరైనా పట్టణం బయటకు వెళ్లి మీమీద దాడి చేస్తున్న బబులోనీయులకు లొంగిపోతే, వారు బ్రతుకుతారు; వారు తమ ప్రాణాలతో తప్పించుకుంటారు. \v 10 నేను ఈ పట్టణానికి మేలు కాదు హాని చేయాలని నిశ్చయించుకున్నాను, కాని మేలు చేయాలని కాదు. ఈ పట్టణం బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది, అతడు దానిని అగ్నితో నాశనం చేస్తాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 11 “అంతేకాక, యూదా రాజకుటుంబంతో ఇలా చెప్పు, ‘యెహోవా మాట వినండి. \v 12 దావీదు ఇంటివారలారా, యెహోవా మీతో ఇలా చెప్తున్నారు: \q1 “ ‘ప్రతి ఉదయం న్యాయం చేయండి; \q2 అణచివేసే వారి చేతి నుండి \q2 దోచుకోబడిన వానిని విడిపించండి, \q1 లేకపోతే మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి \q2 నా ఉగ్రత అగ్నిలా మండుతూ \q2 ఎవరూ ఆర్పలేనంతగా మిమ్మల్ని కాల్చివేస్తుంది. \q1 \v 13 యెరూషలేమా, లోయకు ఎగువన \q2 రాతి పీఠభూమి మీద నివసించేదానా, \q2 “మా మీదికి ఎవరు రాగలరు? \q1 మా నివాసంలోకి ఎవరు ప్రవేశించగలరు?” \q2 అని నీవు అనుకుంటున్నావు, \q2 అని యెహోవా అంటున్నారు. \q1 \v 14 నీ క్రియలకు తగినట్లు నేను నిన్ను శిక్షిస్తాను, \q2 నీ అడవుల్లో అగ్ని రాజబెడతాను \q1 అది నీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని కాల్చివేస్తుంది, \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \c 22 \s1 చెడ్డ రాజులకు వ్యతిరేకంగా తీర్పు \p \v 1 యెహోవా ఇలా అంటున్నారు: “నీవు యూదారాజు యొక్క రాజభవనానికి వెళ్లి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించు: \v 2 ‘దావీదు సింహాసనం మీద ఆసీనుడైయున్న యూదా రాజైన మీకు, మీ అధికారులకు, ఈ ద్వారాల గుండా వచ్చే మీ ప్రజలకు, యెహోవా ప్రకటిస్తున్న మాట వినండి. \v 3 యెహోవా ఇలా చెప్తున్నారు: నీతిన్యాయాల ప్రకారం చేయండి. అణచివేసే వారి చేతిలో నుండి దోపిడికి గురైన వారిని విడిపించండి. విదేశీయులకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు ఎలాంటి అన్యాయం చేయవద్దు, హింసించవద్దు, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించవద్దు. \v 4 ఎందుకంటే ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించడంలో జాగ్రత్త వహిస్తే, అప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులు రథాలు, గుర్రాలపై స్వారీ చేస్తూ, వారి అధికారులు, వారి ప్రజలతో కలిసి ఈ రాజభవనం ద్వారాల గుండా వస్తారు. \v 5 ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించకపోతే, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రాజభవనం శిథిలమవుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.” \p \v 6 ఎందుకంటే యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా అంటున్నారు: \q1 “నీవు నాకు గిలాదులా ఉన్నా, \q2 లెబానోను శిఖరంలా ఉన్నా, \q1 నిన్ను బంజరు భూమిలా, \q2 నివసించేవారు లేని పట్టణాల్లా చేస్తాను. \q1 \v 7 నేను నీ మీదికి నాశనం చేసేవారిని పంపుతాను, \q2 వారు తమ ఆయుధాలతో \q1 నీ శ్రేష్ఠమైన దేవదారు దూలాలను నరికి \q2 వాటిని అగ్నిలో పడవేస్తారు. \p \v 8 “అనేక దేశాల ప్రజలు ఈ పట్టణం గుండా వెళ్తూ, ‘యెహోవా ఈ గొప్ప పట్టణానికి ఎందుకు ఇలా చేశాడు?’ అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. యెహోవా ఈ గొప్ప పట్టణానికి ఎందుకు ఇలా చేశాడు? \v 9 దానికి జవాబు: ‘ఎందుకంటే వారు తమ దేవుడైన యెహోవా నిబంధనను విడిచిపెట్టి, ఇతర దేవతలను ఆరాధించి సేవించారు.’ ” \q1 \v 10 చనిపోయిన రాజు కోసం ఏడవవద్దు అతన్ని కోల్పోయినందుకు దుఃఖించవద్దు; \q2 దానికి బదులు, బందీలుగా కొనిపోబడినవారి కోసం తీవ్రంగా ఏడవండి, \q1 ఎందుకంటే వారు ఎప్పటికీ తిరిగి రారు, \q2 తన స్వదేశాన్ని మళ్ళీ చూడరు. \m \v 11 తన తండ్రి తర్వాత యూదా రాజుగా ఆసీనుడైన యోషీయా కుమారుడైన షల్లూము\f + \fr 22:11 \fr*\fqa యెహోయాజు \fqa*\ft అని కూడా పిలుస్తారు\ft*\f* గురించి యెహోవా ఇలా అంటున్నారు: “అతడు ఎప్పటికీ తిరిగి రాడు. \v 12 వారు అతన్ని బందీగా తీసుకెళ్లిన చోటే అతడు చనిపోతాడు; అతడు మళ్ళీ ఈ దేశాన్ని చూడడు.” \q1 \v 13 “అక్రమంతో తన రాజభవనాన్ని, \q2 అన్యాయంతో తన మేడగదులను కట్టించుకునే వారికి శ్రమ, \q1 ఏమి చెల్లించకుండ తన సొంత ప్రజలతో పని చేయించుకుని, \q2 వారి ప్రయాసానికి తగిన వేతనం ఇవ్వని వారికి శ్రమ. \q1 \v 14 ‘నేను విశాలమైన పై గదులున్న \q2 గొప్ప రాజభవనాన్ని నిర్మించుకుంటాను’ అని అతడు అనుకుంటాడు. \q1 కాబట్టి దానికి పెద్ద కిటికీలు చేయించుకుని, \q2 దేవదారుతో పలకలు అతికి \q2 వాటికి ఎరుపురంగు పూసి అలంకరిస్తాడు. \b \q1 \v 15 “ఎక్కువగా దేవదారు కలిగి ఉండడం \q2 అతడు నీతిని న్యాయాన్ని చేసినప్పుడు, \q1 నీ తండ్రికి అన్నపానాలు లేవా? \q2 అతడు సరియైనది, న్యాయమైనది చేశాడు, \q2 అతనికి అంతా బాగానే జరిగింది కదా. \q1 \v 16 అతడు పేదలు, అవసరతలో ఉన్న వారి పక్షంగా వాదించాడు, \q2 కాబట్టి అంతా బాగానే జరిగింది. \q1 నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 17 “అయితే నీ కళ్లు, నీ హృదయం \q2 అన్యాయమైన సంపాదనపై, \q1 నిర్దోషుల రక్తాన్ని చిందించడంపై, \q2 అణచివేయడంపై, దోపిడీపై మాత్రమే దృష్టి పెట్టాయి.” \m \v 18 కాబట్టి యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ ‘అయ్యో, నా సోదరా! అయ్యో, నా సోదరీ!’ \q2 అంటూ అతని గురించి వారు దుఃఖించరు, \q1 ‘అయ్యో, నా యజమానీ! అయ్యో, అతని వైభవమా!’ \q2 అంటూ వారు అతని గురించి దుఃఖించరు. \q1 \v 19 అతడు యెరూషలేము గుమ్మాల బయటకు ఈడ్వబడి, \q2 అక్కడ విసిరివేయబడి \q2 ఒక గాడిదలా పాతిపెట్టబడతాడు.” \b \q1 \v 20 “లెబానోనుకు వెళ్లి కేకవేయి, \q2 నీ స్వరం బాషానులో వినబడాలి, \q1 అబారీము నుండి కేకవేయి, \q2 ఎందుకంటే నీ స్నేహితులంతా నలగ్గొట్టబడ్డారు. \q1 \v 21 నీవు క్షేమంగా ఉన్నావని భావించినప్పుడు నేను నిన్ను హెచ్చరించాను, \q2 కానీ ‘నేను వినను!’ అని నీవన్నావు, \q1 నీ చిన్నప్పటి నుండి ఇదే నీకు అలవాటు; \q2 నీవు నా మాటకు లోబడలేదు. \q1 \v 22 గాలికి నీ కాపరులందరు కొట్టుకుపోతారు, \q2 నీ స్నేహితులను బందీలుగా తీసుకెళ్తారు. \q1 అప్పుడు నీ దుష్టత్వమంతటిని బట్టి \q2 నీవు సిగ్గుపడి అవమానానికి గురవుతావు. \q1 \v 23 ‘లెబానోనులో\f + \fr 22:23 \fr*\ft అంటే, యెరూషలేములో ఉన్న రాజభవనం; \+xt 1 రాజులు 7:2\+xt* \ft*\ft లో చూడండి.\ft*\f*’ నివసించే నీవు \q2 దేవదారు భవనాలలో గూడు కట్టుకుని ఉన్న నీవు, \q1 ప్రసవ వేదనలో ఉన్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి \q2 నొప్పులు నీకు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావో! \p \v 24 “నా జీవం తోడు” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “యూదా రాజైన యెహోయాకీము కుమారుడవైన యెహోయాకీనూ\f + \fr 22:24 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కొనయా \fqa*\ft అనేది \ft*\fq యెహోయాకీనూ \fq*\ft యొక్క మరో రూపం\ft*\f*, నీవు నా కుడిచేతి ముద్ర ఉంగరంగా ఉన్నా, నేను నిన్ను పీకేస్తాను. \v 25 నిన్ను చంపాలనుకునే వారి చేతులకు, నీవు భయపడే బబులోను రాజైన నెబుకద్నెజరుకు, బబులోనీయుల చేతులకు నిన్ను అప్పగిస్తాను. \v 26 నిన్ను, నీ కన్నతల్లినీ మరో దేశంలోకి విసిరివేస్తాను. అది నీ జన్మస్థలం కాదు, అక్కడే మీరు చస్తారు. \v 27 తిరిగి రావాలని మీరెంతో ఆశిస్తారు, కాని ఇక్కడకు మీరు తిరిగి రారు.” \q1 \v 28 ఈ యెహోయాకీను హేయమైన పగిలిన కుండ వంటివాడా, \q2 ఎవరూ కోరుకోని వస్తువా? \q1 అతడు అతని పిల్లలు విసిరివేయబడి, \q2 వారికి తెలియని దేశంలోకి త్రోసివేయబడతారు? \q1 \v 29 ఓ దేశమా, దేశమా, దేశమా, \q2 యెహోవా మాట వినండి! \q1 \v 30 యెహోవా చెప్పేదేమిటంటే, \q1 “అతడు సంతానం లేనివాడని, \q2 తన జీవితకాలంలో వృద్ధిచెందలేడని అతని గురించి వ్రాయండి, \q1 అతని సంతానంలో ఎవరూ వర్ధిల్లరు, \q2 దావీదు సింహాసనం మీద ఎవరూ కూర్చోరు, \q2 యూదాలో ఇకపై పరిపాలన చేయరు.” \c 23 \s1 నీతి కొమ్మ \p \v 1 “నా పచ్చిక బయళ్లలోని గొర్రెలను నాశనం చేసి చెదరగొట్టే కాపరులకు శ్రమ!” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 2 కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలను మేపుతున్న గొర్రెల కాపరులతో ఇలా అంటున్నారు: “మీరు నా మందను చెదరగొట్టి వాటిని తరిమివేసి వాటిని పట్టించుకోనందున, మీరు చేసిన దుర్మార్గానికి నేను మీకు శిక్ష విధిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 3 “నేను వాటిని తరిమికొట్టిన దేశాలన్నిటిలో నుండి నా మందలో మిగిలిన వాటిని నేనే పోగుచేసి, వాటి పచ్చిక బయళ్లకు తిరిగి వాటిని తీసుకువస్తాను, అక్కడ అవి ఫలించి వృద్ధిచెందుతాయి. \v 4 వాటిని మేపడానికి నేను గొర్రెల కాపరులను నియమిస్తాను, అవి ఇకపై భయపడవు, బెదిరిపోవు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 5 “రాబోయే రోజుల్లో, \q2 నేను దావీదుకు నీతి అనే చిగురును పుట్టిస్తాను, \q1 జ్ఞానయుక్తంగా పరిపాలించే రాజు, \q2 దేశంలో నీతి న్యాయాలు జరిగించేవాన్ని” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 6 అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది \q2 ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది. \q1 యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు \q2 అని పిలువబడతాడు. \b \m \v 7 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో, ఇకపై ప్రజలు, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట అని చెప్పరు’ \v 8 అయితే, ‘ఇశ్రాయేలీయుల సంతానాన్ని ఉత్తర దేశంలో నుండి, ఆయన వారిని బహిష్కరించిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట’ అని వారు చెప్తారు. అప్పుడు వారు వారి స్వదేశంలో నివసిస్తారు.” \s1 అబద్ధ ప్రవక్తలు \p \v 9 ప్రవక్తల గురించి: \q1 యెహోవాను బట్టి \q2 ఆయన మాట్లాడిన మాటలనుబట్టి \q1 నా హృదయం నాలో పగిలిపోయింది; \q2 నా ఎముకలన్నీ వణుకుతున్నాయి. \q1 త్రాగిన మత్తులో ఉన్నవాడిలా, \q2 ద్రాక్షరసానికి లొంగిపోయిన బలవంతునిలా ఉన్నాను, \q1 \v 10 దేశమంతా వ్యభిచారులతో నిండిపోయింది; \q2 శాపం కారణంగా భూమి ఎండిపోయింది \q2 అరణ్యంలో పచ్చికబయళ్లు ఎండిపోయాయి. \q1 ప్రవక్తలు చెడు మార్గం అనుసరిస్తారు \q2 తమ అధికారాన్ని అన్యాయంగా ఉపయోగిస్తారు. \b \q1 \v 11 “ప్రవక్త యాజకుడు ఇద్దరూ భక్తిహీనులే; \q2 నా మందిరంలో కూడా వారి దుర్మార్గాన్ని నేను చూస్తున్నాను” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 12 “కాబట్టి వారి దారి జారే నేలలా అవుతుంది; \q2 వారు చీకటిలోకి వెళ్లగొట్టబడతారు \q2 అక్కడ వారు పడిపోతారు. \q1 వారు శిక్షించబడే సంవత్సరంలో \q2 నేను వారి మీదికి విపత్తు రప్పిస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 13 “సమరయ ప్రవక్తల్లో \q2 నేను ఇలాంటి అసహ్యకరమైన దాన్ని చూశాను: \q1 వారు బయలు పేరిట ప్రవచించి \q2 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను తప్పుదారి పట్టించారు. \q1 \v 14 యెరూషలేము ప్రవక్తల్లో \q2 భయంకరమైనది నేను చూశాను: \q2 వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు. \q1 వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు, \q2 వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. \q1 వారందరూ నాకు సొదొమలాంటివారు; \q2 యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.” \p \v 15 కాబట్టి సైన్యాల యెహోవా ప్రవక్తలను గురించి ఇలా అంటున్నారు: \q1 “నేను వారిని చేదు ఆహారం తినేలా చేస్తాను, \q2 విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను, \q1 ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల \q2 భక్తిహీనత దేశమంతటా వ్యాపించింది.” \p \v 16 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ప్రవక్తలు మీకు చెప్పే ప్రవచనాలను వినవద్దు; \q2 అవి మిమ్మల్ని భ్రమ పెడతాయి. \q1 వారి సొంత మనస్సులోని దర్శనాలు చెప్తారు, \q2 కాని యెహోవా నోటి నుండి వచ్చినవి కాదు. \q1 \v 17 ‘మీకు సమాధానం కలుగుతుంది యెహోవా చెప్తున్నారు’ \q2 అని నన్ను తృణీకరించే వారితో అంటారు. \q1 ‘మీకు హాని జరగదు’ \q2 అని వారు హృదయ కాఠిన్యం గలవారితో అంటారు. \q1 \v 18 అయితే ఆయనను చూడడానికి, ఆయన మాట వినడానికి \q2 వారిలో ఎవరు యెహోవా సభలో నిలబడి ఉన్నారు? \q2 ఆయన మాటను ఎవరు విన్నారు ఎవరు ఆలకించారు? \q1 \v 19 చూడండి, యెహోవా ఉగ్రత \q2 తుఫానులా విరుచుకుపడుతుంది, \q1 అది సుడిగాలిలా \q2 దుష్టుల తలలపైకి దూసుకెళ్తుంది. \q1 \v 20 యెహోవా తన హృదయ ఉద్దేశాలను \q2 పూర్తిగా నెరవేర్చే వరకు \q2 ఆయన కోపం తగ్గదు. \q1 ఈ విషయాన్ని రాబోయే రోజుల్లో \q2 మీరు స్పష్టంగా గ్రహిస్తారు. \q1 \v 21 నేను ఈ ప్రవక్తలను పంపలేదు, \q2 అయినాసరే వారు తమ సొంత సందేశంతో పరుగెత్తుకు వచ్చారు; \q1 నేను వారితో మాట్లాడలేదు, \q2 అయినాసరే వారు ప్రవచించారు. \q1 \v 22 కానీ ఒకవేళ వారు నా సభలో నిలబడి ఉంటే, \q2 వారు నా ప్రజలకు నా మాటలు ప్రకటించి \q1 వారి చెడు మార్గాల నుండి \q2 వారి చెడు పనుల నుండి వారిని తప్పించి ఉండేవారు. \b \q1 \v 23 “నేను దగ్గరగా ఉంటేనే దేవుణ్ణా, \q2 దూరంగా ఉంటే నేను దేవున్ని కానా? \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 24 నాకు కనబడకుండ ఎవరైనా \q2 రహస్య ప్రదేశాల్లో దాచుకోగలరా?” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “నేను ఆకాశంలో భూమి మీద అంతటా లేనా?” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 25 “నా పేరిట అబద్ధాలు చెప్పే ప్రవక్తలు చెప్పేది నేను విన్నాను. వారు, ‘నాకొక కల వచ్చింది! నాకొక కల వచ్చింది!’ అని అంటారు. \v 26 తమ మనస్సులోని భ్రమలను ప్రవచించే ఈ అబద్ధాల ప్రవక్తల హృదయాల్లో ఇలా ఎంతకాలం కొనసాగుతుంది? \v 27 తమ పూర్వికులు బయలును ఆరాధించి నా పేరును మరచిపోయినట్లే, వీరు ఒకరికొకరు చెప్పుకునే కలలు నా ప్రజలు నా పేరును మరచిపోయేలా చేస్తాయని వీరు అనుకుంటున్నారు. \v 28 కలలు కనే ప్రవక్తలు వారి కలలను చెప్పవచ్చు, నా సందేశాన్ని పొందుకున్న వారు ఆ సందేశాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. పొట్టుకు ధాన్యంతో ఏమి సంబంధం?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 29 “నా మాట అగ్నిలాంటిది కాదా, బండను ముక్కలు చేసే సుత్తిలాంటిది కాదా? అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 30 “కాబట్టి,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఒకరి నుండి నా మాటలను దొంగిలించే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని. \v 31 అవును” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “తమ నాలుకలతో తమ స్వంత మాటలు మాట్లాడుతూ ‘యెహోవా ప్రకటిస్తున్నారు’ అనే చెప్పే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని. \v 32 నిజానికి, తప్పుడు కలలను ప్రవచించే వారికి నేను వ్యతిరేకిని” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారు తమ మోసపూరితమైన అబద్ధాలతో నా ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తారు, నేను వారిని పంపలేదు వారిని నియమించలేదు. వారి వల్ల ఈ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \s1 అబద్ధ ప్రవచనం \p \v 33 “ఈ ప్రజలు గాని ఒక ప్రవక్త గాని యాజకుడు గాని, ‘యెహోవా నుండి ఏం సందేశం వచ్చింది?’ అని నిన్ను అడిగినప్పుడు, ‘ఏ సందేశం? నేను మిమ్మల్ని విడిచిపెడతాను అని యెహోవా చెప్తున్నారు’ అని చెప్పు. \v 34 ఒకవేళ ప్రవక్త గాని యాజకుడు గాని లేదా ఇంకెవరైనా, ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని చెప్పినట్లయితే, నేను వారిని వారి ఇంటివారిని శిక్షిస్తాను. \v 35 మీరు మీ స్నేహితులతో ఇతర ఇశ్రాయేలీయులతో, ‘యెహోవా జవాబేంటి? యెహోవా ఏమి చెప్పారు?’ అని అనాలి. \v 36 కానీ మీరు ‘యెహోవా సందేశం’ అని చెప్పకూడదు, ఎందుకంటే ఎవరి మాట వారికి సందేశం అవుతుంది. మీరు సజీవుడైన దేవుని మాటలను, మన దేవుడైన సైన్యాల యెహోవా మాటలను తారుమారు చేశారు. \v 37 మీరు ప్రవక్తతో ఇలా చెప్పాలి: ‘యెహోవా నీకు ఇచ్చిన జవాబేంటి? యెహోవా ఏమి చెప్పారు?’ \v 38 ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెబితే, యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెప్పకూడదని నేను మీతో చెప్పినా సరే, ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెప్పారు. \v 39 కాబట్టి, నేను మిమ్మల్ని పూర్తిగా మరచిపోతాను, నేను మీకు మీ పూర్వికులకు ఇచ్చిన పట్టణంతో పాటు మిమ్మల్ని నా సన్నిధిలో నుండి వెళ్లగొడతాను. \v 40 నేను నీ మీదికి ఎన్నటికీ మరచిపోలేని శాశ్వతమైన అవమానాన్ని రప్పిస్తాను.” \c 24 \s1 రెండు గంపల అంజూర పండ్లు \p \v 1 యూదారాజు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును,\f + \fr 24:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యెకొన్యా \fqa*\ft యెహోయాకీనుకు మరొక రూపం\ft*\f* అధికారులను, నైపుణ్యం కలిగిన పనివారిని, యూదా కళాకారులను బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లిన తర్వాత, యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు. \v 2 యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు. \p \v 3 అప్పుడు యెహోవా నన్ను, “యిర్మీయా, నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు. \p “అంజూర పండ్లు, వాటిలో మంచివి చాలా బాగున్నాయి, కానీ చెడిపోయిన బాగా కుళ్లిపోయిన వాటిని మాత్రం తినలేము” అని నేను జవాబిచ్చాను. \p \v 4 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 5 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా నుండి దూరంగా బబులోనీయుల దేశానికి బందీలుగా పంపిన వారిని నేను ఈ మంచి అంజూర పండ్లలా భావిస్తున్నాను. \v 6 వారికి మేలు కలిగేలా వారిపై నా దృష్టి పెడతాను. వారిని మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను. నేను వారిని కడతాను, కూల్చివేయను; నాటుతాను, పెరికివేయను. \v 7 నేనే యెహోవానని నన్ను తెలుసుకునే హృదయాన్ని వారికి ఇస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారి దేవుడనై ఉంటాను, ఎందుకంటే వారు తమ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగి వస్తారు. \p \v 8 “ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 9 నేను వారిని చెదరగొట్టిన అన్ని భూరాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా, అభ్యంతరకరమైన వారిగా నిందగా, ఒక సామెతగా, ఒక శాపంగా,\f + \fr 24:9 \fr*\ft అంటే, శపించడానికి వారి పేర్లు వాడబడతాయి \+xt 29:22\+xt* \ft*\ft లేదా, ఇతరులు వారు శపించబడాలని చూస్తారు.\ft*\f* హేళనకు కారణంగా చేస్తాను. \v 10 నేను వారికి, వారి పూర్వికులకు ఇచ్చిన దేశంలో నుండి వారు పూర్తిగా నాశనమయ్యే వరకు నేను వారి మీదికి ఖడ్గాన్ని కరువును తెగులును పంపుతాను.’ ” \c 25 \s1 డెబ్బై సంవత్సరాల చెర \p \v 1 యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి నాల్గవ సంవత్సరంలో అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది. \v 2 కాబట్టి యిర్మీయా ప్రవక్త యూదా ప్రజలందరితో, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో ఇలా అన్నాడు: \v 3 యూదా రాజైన ఆమోను కుమారుడైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఇరవై మూడు సంవత్సరాలు యెహోవా వాక్కు నాకు వస్తూ ఉండింది. నేను మీతో పదే పదే మాట్లాడాను కానీ మీరు వినలేదు. \p \v 4 యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరినీ మీ దగ్గరకు మళ్ళీ మళ్ళీ పంపినా మీరు వినలేదు లేదా పట్టించుకోలేదు. \v 5 వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను, మీ చెడు ఆచారాలను ఇప్పటికైనా విడిచిపెట్టండి, యెహోవా మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు శాశ్వతంగా ఉండగలరు. \v 6 ఇతర దేవుళ్ళ విగ్రహాలను మీరు సేవించవద్దు, పూజించవద్దు, వాటిని అనుసరించవద్దు; మీ చేతిపనుల వలన మీరు నాకు కోపం రేపవద్దు; అప్పుడు నేను మీకు హాని చేయను” అని చెప్పారు. \p \v 7 “కాని మీరు నా మాట వినలేదు, మీ చేతులు చేసిన వాటితో మీరు నా కోపాన్ని రేపి, మీకే హాని తెచ్చుకున్నారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 8 కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు నా మాటలు వినలేదు కాబట్టి, \v 9 నేను ఉత్తరాది జనాంగాలను, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును పిలిపిస్తాను” అని యెహోవా అంటున్నారు. నేను వారిని ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టుప్రక్కల ఉన్న అన్ని దేశాల మీదికి తీసుకువస్తాను. నేను ఈ ప్రజలను పూర్తిగా నాశనం\f + \fr 25:9 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే.\ft*\f* చేస్తాను. వారిని భయానకంగా, హేళనగా శాశ్వతమైన నాశనంగా చేస్తాను. \v 10 నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను. \v 11 ఈ దేశమంతా నిర్జనమైన బంజరుగా మారుతుంది, ఈ దేశాలు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తాయి. \p \v 12 “అయితే డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను బబులోను రాజును, అతని ప్రజలను, బబులోనీయుల దేశాన్ని వారి దోషాన్ని బట్టి శిక్షిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “దానిని శాశ్వతంగా నిర్జనం చేస్తాను. \v 13 నేను ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాటన్నిటిని, ఈ పుస్తకంలో వ్రాసి ఉన్నవాటన్నిటిని, యిర్మీయా ప్రవచించిన ప్రకారం ఆ దేశం మీదికి రప్పిస్తాను. \v 14 వారే అనేక దేశాలకు, గొప్ప రాజులకు బానిసలుగా ఉంటారు; వారి క్రియలనుబట్టి వారి చేతి పనులను బట్టి నేను వారికి ప్రతిఫలమిస్తాను.” \s1 దేవుని ఉగ్రత పాత్ర \p \v 15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ఉగ్రత అనే ద్రాక్షరసంతో నిండిన ఈ గిన్నెను నా చేతిలో నుండి తీసివేసి, నేను నిన్ను పంపే దేశాలన్నిటిని త్రాగనివ్వు. \v 16 వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.” \v 17 కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి గిన్నె తీసుకుని, ఆయన నన్ను పంపిన దేశాలన్నిటిని త్రాగేలా చేశాను: \b \li1 \v 18 అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను; \li1 \v 19 ఈజిప్టు రాజు ఫరో, అతని పరిచారకులు, అధికారులు, అతని ప్రజలందరూ, \v 20 అక్కడున్న విదేశీయులందరు అనగా \li1 ఊజు రాజులందరూ; \li1 ఫిలిష్తీయ పట్టణాలైన అష్కెలోను, గాజా, ఎక్రోను రాజులందరూ అష్డోదులో మిగిలిన ప్రజలు; \li1 \v 21 ఎదోము, మోయాబు, అమ్మోను; \li1 \v 22 తూరు సీదోను రాజులందరూ; \li1 సముద్ర తీర ప్రాంతాల రాజులు; \li1 \v 23 దేదాను, తేమా, బూజీయులు దూర ప్రాంతాల్లో ఉన్నవారందరు; \li1 \v 24 అరేబియా రాజులందరూ అరణ్యంలో నివసించే పరదేశి ప్రజల రాజులందరూ; \li1 \v 25 జిమ్రీ, ఏలాము, మాదీయుల రాజులందరూ; \li1 \v 26 ఉత్తరాన ఉన్న రాజులందరూ, సమీపంలో దూరంగా, ఒకదాని తర్వాత ఒకటి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలు త్రాగుతారు. \li1 వారందరి తర్వాత షేషకు రాజు కూడా దానిని త్రాగుతాడు. \b \p \v 27 “అప్పుడు వారితో, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మధ్యకు పంపే ఖడ్గాన్ని బట్టి ఇకపై లేవకుండా పడిపోండి, త్రాగండి, త్రాగి వాంతులు చేసుకోండి.’ \v 28 అయితే వారు మీ చేతిలో నుండి పాత్ర తీసుకుని త్రాగడానికి నిరాకరిస్తే, నీవు వారితో ఇలా చెప్పు, ‘మీరు దీన్ని త్రాగాలి అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. \v 29 ఇదిగో, నా పేరు ఉన్న పట్టణం మీదికి నేను విపత్తు రప్పించబోతున్నాను, మీరు నిజంగా శిక్షించబడరా? మీరు శిక్షించబడకుండా ఉండరు, ఎందుకంటే నేను భూమిపై నివసించే వారందరిపై ఖడ్గాన్ని రప్పిస్తున్నాను, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’ \p \v 30 “ఇప్పుడు నీవు వారికి ఈ మాటలన్నీ ప్రవచించి వారితో ఇలా చెప్పు: \q1 “ ‘యెహోవా పైనుండి గర్జిస్తారు; \q2 ఆయన తన పవిత్ర నివాసం నుండి ఉరుముతారు; \q2 ఈ దేశానికి వ్యతిరేకంగా బలంగా గర్జిస్తారు. \q1 ద్రాక్షపండ్లను త్రొక్కేవారి మీద ఆయన గట్టిగా అరుస్తారు, \q2 భూమిపై నివసించే వారందరికి వ్యతిరేకంగా కేకలు వేస్తారు. \q1 \v 31 భూదిగంతముల వరకు ఆ సందడి ప్రతిధ్వనిస్తుంది, \q2 ఎందుకంటే యెహోవా దేశాల మీద ఆరోపణలు చేస్తాడు; \q1 అతడు సమస్త మానవాళికి \q2 తీర్పు తెచ్చి, దుర్మార్గులను ఖడ్గానికి గురి చేస్తాడు’ ” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 32 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ఇదిగో! దేశం నుండి దేశానికి \q2 విపత్తు విస్తరిస్తుంది; \q1 పెను తుఫాను \q2 భూమి అంచుల నుండి ఎగసిపడుతుంది.” \m \v 33 ఆ సమయంలో యెహోవాచేత చంపబడినవారు భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు ప్రతిచోటా ఉంటారు. వారి కోసం ఎవరూ దుఃఖించరు, వారి మృతదేహాలను సేకరించి పాతిపెట్టరు, అవి నేలమీద పెంటలా పడి ఉంటాయి. \q1 \v 34 కాపరులారా, ఏడవండి రోదించండి; \q2 మంద నాయకులారా, దుమ్ములో దొర్లండి. \q1 ఎందుకంటే మీరు వధించబడే సమయం ఆసన్నమైంది; \q2 మీరు శ్రేష్ఠమైన పొట్టేళ్లలా పడిపోతారు.\f + \fr 25:34 \fr*\ft కొ.ప్ర. లలో \ft*\fqa పడి, చక్కటి కుండల్లా పగిలిపోతారు\fqa*\f* \q1 \v 35 గొర్రెల కాపరులకు పారిపోవడానికి చోటు ఉండదు, \q2 మందలోని నాయకులు తప్పించుకోవడానికి స్థలం ఉండదు. \q1 \v 36 గొర్రెల కాపరుల మొర, \q2 మంద నాయకుల ఏడ్పులు వినబడుతున్నాయి, \q2 యెహోవా వారి పచ్చికను నాశనం చేస్తున్నారు. \q1 \v 37 నెమ్మదిగల పచ్చికభూములు \q2 యెహోవా కోపాగ్నికి పాడవుతాయి. \q1 \v 38 సింహం తన గుహలో నుంచి వచ్చినట్లు ఆయన వస్తారు, \q2 అణచివేసే వారి ఖడ్గం\f + \fr 25:38 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa కోపం \+xt యిర్మీయా 46:16; 50:16\+xt*కూడా చూడండి\fqa*\f* కారణంగా \q1 యెహోవా తీవ్రమైన కోపం కారణంగా \q2 వారి భూమి నిర్జనమైపోతుంది. \c 26 \s1 యిర్మీయాకు మరణ బెదిరింపు \p \v 1 యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము పరిపాలన ప్రారంభంలో, యెహోవా నుండి ఈ మాట వచ్చింది: \v 2 “యెహోవా ఇలా అంటున్నారు: యెహోవా ఆలయ ఆవరణలో నిలబడి, యూదా పట్టణాల నుండి యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే ప్రజలందరితో మాట్లాడు. ఒక్క మాట కూడా వదలకుండ నేను నీకు ఆజ్ఞాపిస్తున్నదంతా వారికి చెప్పు. \v 3 బహుశా వారు విని తమ చెడు మార్గాలను విడిచిపెట్టవచ్చు. అప్పుడు నేను నా మనస్సు మార్చుకుని వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారి మీదికి రప్పించాలనుకున్న విపత్తును రప్పించను. \v 4 వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు నా మాట వినకపోయినా, నేను మీ ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినా, \v 5 పదే పదే నేను మీ దగ్గరకు పంపిన నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోయినా, \v 6 నేను ఈ మందిరానికి షిలోహుకు చేసినట్లు చేస్తాను, ఈ పట్టణాన్ని భూమ్మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక శాపంగా చేస్తాను.’ ” \p \v 7 యిర్మీయా యెహోవా మందిరంలో ఈ మాటలు మాట్లాడడం యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ విన్నారు. \v 8 అయితే చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించినవన్నీ యిర్మీయా ప్రజలందరికి చెప్పడం ముగించిన వెంటనే యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ అతన్ని పట్టుకుని, “నీవు తప్పక చావాల్సిందే! \v 9 ఈ మందిరం షిలోహులా అవుతుందని, ఈ పట్టణం నిర్జనమై ఎడారిగా అవుతుందని నీవు యెహోవా నామంలో ఎందుకు ప్రవచిస్తున్నావు?” అని అంటూ ప్రజలంతా యిర్మీయా యెహోవా మందిరంలో ఉండగానే అతని చుట్టూ గుమిగూడారు. \p \v 10 ఈ సంగతుల గురించి యూదా అధికారులు విన్నప్పుడు, వారు రాజభవనం నుండి యెహోవా ఆలయానికి వెళ్లి యెహోవా ఆలయ క్రొత్త గుమ్మం దగ్గర కూర్చున్నారు. \v 11 అప్పుడు యాజకులు, ప్రవక్తలు అధికారులతో, ప్రజలందరితో, “ఈ వ్యక్తి ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రవచించాడు, అది మీ చెవులతో మీరే విన్నారు. కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించాలి” అని అన్నారు. \p \v 12 అప్పుడు యిర్మీయా అధికారులందరితోను, అలాగే ప్రజలందరితోను ఇలా చెప్పారు: “మీరు విన్నదంతా ఈ ఆలయానికి, ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రవచించడానికి యెహోవాయే నన్ను పంపించారు. \v 13 మీ మార్గాలను, క్రియలను, సరిచేసికొని, మీ దేవుడైన యెహోవాకు లోబడండి. అప్పుడు యెహోవా తన మనస్సు మార్చుకుని, మీ మీదికి రప్పిస్తానని ఆయన ప్రకటించిన విపత్తును ఆయన రప్పించరు. \v 14 ఇక నా విషయానికొస్తే, నేను మీ చేతుల్లో ఉన్నాను; మీకు ఏది మంచిది, సరియైనది అనిపిస్తే అదే చేయండి. \v 15 కాని ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మీరు నన్ను చంపితే, నిర్దోషిని చంపిన అపరాధం మీ మీదికి, ఈ పట్టణం మీదికి, అందులో నివసించేవారి మీదికి తెచ్చిన వారవుతారు. ఎందుకంటే ఈ మాటలన్నీ మీకు వినబడేలా చెప్పడానికి నిజంగా యెహోవాయే నన్ను మీ దగ్గరికి పంపారు.” \p \v 16 అప్పుడు అధికారులు, ప్రజలందరూ యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు, “ఇదంతా ఇతడు మన దేవుడైన యెహోవా నామంలో మనతో చెప్పాడు కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించకూడదు!” అన్నారు. \p \v 17 అప్పుడు ఆ దేశంలోని పెద్దలలో కొందరు ముందుకు వచ్చి, ప్రజల సమాజమంతటితో ఇలా అన్నారు, \v 18 “మోరెషెతు వాడైన మీకా ప్రవక్త యూదా రాజైన హిజ్కియా దినాల్లో ప్రవచించాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు, ‘సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, \q2 యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది, \q2 ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో నిండిపోతుంది.’\f + \fr 26:18 \fr*\ft \+xt మీకా 3:12\+xt*\ft*\f* \m \v 19 “మరి యూదా రాజైన హిజ్కియా గాని, యూదా దేశస్థుడు ఎవడైనా గాని, ఆ ప్రవక్తను చంపారా? ఆ రాజైన హిజ్కియా భయభక్తులతో యెహోవా దయ కోసం ప్రార్ధన చేశాడు గదా! యెహోవా మనస్సు మార్చుకుని, వారి మీదికి రప్పించవలసిన కీడును ఆపివేయలేదా? మనకు మనమే మన మీదికి భయంకరమైన విపత్తు తెచ్చుకోబోతున్నాం!” \p \v 20 (అదే సమయంలో కిర్యత్-యారీము వాడైన షెమయా కుమారుడైన ఊరియా అనే మరొక వ్యక్తి యెహోవా నామమున ప్రవచించాడు; అతడు కూడా యిర్మీయా ప్రవచించినట్లే ఈ పట్టణానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవచించాడు. \v 21 రాజైన యెహోయాకీము, అతని అధికారులు, ముఖ్యులందరూ అతని మాటలు విన్నప్పుడు, రాజు అతన్ని చంపాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఊరియా అది విని భయపడి ఈజిప్టుకు పారిపోయాడు. \v 22 అయితే రాజైన యెహోయాకీము, అక్బోరు కుమారుడైన ఎల్నాతానును మరికొందరు వ్యక్తులతో పాటు ఈజిప్టుకు పంపాడు. \v 23 వారు ఊరియాను ఈజిప్టు నుండి రాజైన యెహోయాకీము దగ్గరకు తీసుకురాగా, రాజు అతడిని ఖడ్గంతో చంపి అతని దేహాన్ని సామాన్య ప్రజల సమాధి స్థలంలోకి విసిరివేశాడు.) \p \v 24 ఇంకా, షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు అండగా నిలబడ్డాడు, కాబట్టి యిర్మీయాను చంపడానికి ప్రజలకు అప్పగించలేదు. \c 27 \s1 యూదా నెబుకద్నెజరుకు సేవ చేయాలి \p \v 1 యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము\f + \fr 27:1 \fr*\ft కొ. ప్రా. ప్ర. లలో \ft*\fqa సిద్కియా\fqa*\f* ఏలుబడిలో, యెహోవా నుండి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: \v 2 యెహోవా నాతో ఇలా అన్నారు: “సంకెళ్లు ఒక కాడిని తయారుచేసి నీ మెడ మీద పెట్టుకో. \v 3 యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు. \v 4 తమ యజమానుల తెలియజేయమని వారికి ఈ సందేశం ఇవ్వు, ‘ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు మీ యజమానులకు ఇలా చెప్పండి: \v 5 నా గొప్ప శక్తితో చాచిన బాహువుతో నేను భూమిని, దాని ప్రజలను దానిపై ఉన్న జంతువులను సృష్టించాను. నేను ఎవరు సరైన వారనుకుంటే వారికి దానిని ఇస్తాను. \v 6 ఇప్పుడు నేను నీ దేశాలన్నిటిని నా సేవకుడు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను; అడవి జంతువులను కూడా అతనికి లోబడి చేస్తాను. \v 7 అతని దేశానికి అంతం వచ్చేవరకు అన్ని దేశాలు అతనికి, అతని కుమారునికి, మనుమడికి సేవ చేస్తారు; అప్పుడు అనేక దేశాలు, గొప్ప రాజులు అతన్ని లొంగదీసుకుంటారు. \p \v 8 “ ‘ “అయితే, ఏదైనా దేశం గాని రాజ్యం గాని బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేయకపోయినా అతని కాడి క్రింద మెడ వంచకపోయినా, నేను ఆ దేశాన్ని కత్తితో, కరువుతో, తెగులుతో శిక్షిస్తాను, అతని చేతితో దానిని పూర్తిగా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 9 కాబట్టి, ‘మీరు బబులోను రాజుకు సేవ చేయరు’ అని మీతో చెప్పే మీ ప్రవక్తలు, భవిష్యవాణి చెప్పేవారు, కలల భావం చెప్పేవారు, మృతుల ఆత్మతో మాట్లాడేవారు, మంత్రగాళ్ల మాటలు మీరు వినవద్దు. \v 10 మిమ్మల్ని మీ దేశం నుండి దూరం చేయడానికే వారు మీతో అబద్ధాలు ప్రవచిస్తారు; నేను నిన్ను వెళ్లగొడతాను మీరు నశిస్తారు. \v 11 అయితే ఏ దేశమైనా బబులోను రాజు కాడి క్రింద మెడ వంచి అతనికి సేవ చేస్తే, నేను ఆ దేశాన్ని దాని సొంత దేశంలోనే ఉండి, దానిలో వ్యవసాయం చేయడానికి అక్కడ నివసించడానికి అనుమతిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.” ’ ” \p \v 12 నేను యూదా రాజైన సిద్కియాకు కూడా అదే సందేశం ఇచ్చాను. నేను, “బబులోను రాజు కాడి క్రింద నీ మెడను వంచు; అతనికి అతని ప్రజలకు సేవ చేయండి, మీరు జీవిస్తారు. \v 13 బబులోను రాజుకు సేవ చేయని ఏ దేశానికైనా యెహోవా హెచ్చరించినట్లు కత్తితో కరువుతో తెగులుతో నీవు, నీ ప్రజలు ఎందుకు చావాలి? \v 14 ప్రవక్తల మాటలను వినవద్దు, వారు మీతో, ‘నీవు బబులోను రాజుకు సేవ చేయవు’ అని అబద్ధాలు ప్రవచిస్తున్నారు. \v 15 యెహోవా ఇలా చెప్తున్నారు, ‘నేను వారిని పంపలేదు, నా పేరుతో వారు అబద్ధాలు ప్రవచిస్తున్నారు. కాబట్టి, నేను నిన్ను వెళ్లగొడతాను, మీరూ మీతో పాటు ప్రవచించే ప్రవక్తలు కూడా నశిస్తారు.’ ” \p \v 16 అప్పుడు నేను యాజకులతో, ఈ ప్రజలందరితో ఇలా అన్నాను: “యెహోవా ఇలా చెప్తున్నారు: ‘అతిత్వరలో యెహోవా ఆలయ పాత్రలు బబులోను నుండి మళ్ళీ తేబడతాయి’ అని చెప్పే ప్రవక్తల మాటలను మీరు వినవద్దు, వారు మీకు అబద్ధాలు ప్రవచిస్తున్నారు. \v 17 వారి మాట వినవద్దు. బబులోను రాజును సేవించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఈ పట్టణం ఎందుకు నాశనమవ్వాలి? \v 18 ఒకవేళ వారు ప్రవక్తలైతే వారు యెహోవా మాటలు కలిగి ఉన్నట్లయితే, యెహోవా మందిరంలో, యూదారాజు రాజభవనంలో యెరూషలేములో మిగిలి ఉన్న వస్తువులను బబులోనుకు తీసుకెళ్లవద్దని వారు సైన్యాల యెహోవాను వేడుకోవడం మంచిది. \v 19 ఎందుకంటే స్తంభాలు, ఇత్తడి నీళ్ల తొట్టె, కదిలే పీటలు ఈ పట్టణంలో మిగిలి ఉన్న ఇతర వస్తువుల గురించి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు, \v 20 వేటినైతే యూదా రాజైన యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును,\f + \fr 27:20 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యెకొన్యా \fqa*\ft యెహోయాకీను యొక్క మరో రూపం\ft*\f* యూదా యెరూషలేము పెద్దలందరిని యెరూషలేము నుండి బబులోనుకు బందీగా తీసుకెళ్లినప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తీసుకెళ్లలేదో, \v 21 యెహోవా మందిరంలో, అలాగే యూదారాజు యొక్క రాజభవనంలో యెరూషలేములోను మిగిలిపోయిన వాటి గురించి ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా చెప్పారు: \v 22 ‘వాటిని బబులోనుకు తీసుకెళ్తారు; నేను వాటిని దర్శించి ఇక్కడికి తీసుకువచ్చి ఈ స్థలంలో పెట్టే వరకు అవి అక్కడే ఉంటాయి’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \c 28 \s1 అబద్ధ ప్రవక్త హనన్యా \p \v 1 అదే సంవత్సరం అంటే, యూదారాజు సిద్కియా ఏలుబడిలో నాల్గవ సంవత్సరం అయిదవ నెలలో, గిబియోనుకు చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకులు ప్రజలందరి సమక్షంలో నాతో ఇలా అన్నాడు, \v 2 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను. \v 3 బబులోను రాజైన నెబుకద్నెజరు ఇక్కడినుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటిని రెండు సంవత్సరాల లోపు తిరిగి తెప్పిస్తాను. \v 4 నేను బబులోను రాజు కాడిని విరగ్గొట్టి, యూదా రాజును యెహోయాకీము కుమారుడునైన యెహోయాకీనును,\f + \cat dup\cat*\fr 28:4 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యెకొన్యా \fqa*\ft యెహోయాకీను యొక్క మరో రూపం\ft*\f* బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన యూదావారందరిని తిరిగి ఇక్కడకు రప్పిస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.” \p \v 5 అప్పుడు యిర్మీయా ప్రవక్త యెహోవా మందిరంలో నిలబడి ఉన్న యాజకుల ముందు, ప్రజలందరి ముందు ప్రవక్తయైన హనన్యాకు జవాబిచ్చాడు. \v 6 యిర్మీయా ఇలా అన్నాడు, “ఆమేన్! యెహోవా అలా చేయును గాక! బబులోను నుండి యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులను బందీలుగా తీసుకెళ్లిన వారందరిని తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి నీవు ప్రవచించిన మాటలను యెహోవా నెరవేరుస్తారు. \v 7 అయితే, నీవు వింటుండగా, ఈ ప్రజలందరు వింటుండగా నేను చెప్పేది విను: \v 8 నీకు నాకు ముందు ఉన్న ప్రవక్తలు చాలా దేశాలకు గొప్ప రాజ్యాలకు వ్యతిరేకంగా యుద్ధాలు, విపత్తు, తెగులు గురించి చాలా కాలం నుండి ప్రవచించారు. \v 9 అయితే క్షేమం కలుగుతుందని ప్రవచించే ప్రవక్త తన అంచనా నిజమైతేనే యెహోవా పంపిన వ్యక్తిగా గుర్తించబడతాడు.” \p \v 10 అప్పుడు ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని తీసి, దాన్ని విరిచి, \v 11 ప్రజలందరి ముందు, “యెహోవా ఇలా అంటున్నారు: ‘రెండు సంవత్సరాల్లో అన్ని దేశాల మెడ మీద నుండి బబులోను రాజై నెబుకద్నెజరు కాడిని నేను అలాగే విరగ్గొడతాను.’ ” అది వినగానే యిర్మీయా ప్రవక్త అక్కడినుండి వెళ్లిపోయాడు. \p \v 12 ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని విరగ్గొట్టిన తర్వాత, యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా వచ్చింది: \v 13 “నీవు, వెళ్లి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేదేమిటంటే, నీవు చెక్క కాడి విరగ్గొట్టావు. కానీ దాని స్థానంలో నీవు ఇనుప కాడిని పొందుతావు. \v 14 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేసేలా ఈ దేశాలందరి మెడపై నేను ఇనుప కాడిని ఉంచుతాను. అడవి జంతువులపై కూడా నేను అతనికి అధికారం ఇస్తాను.’ ” \p \v 15 అప్పుడు యిర్మీయా ప్రవక్త హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు: “విను హనన్యా! యెహోవా నిన్ను పంపలేదు, అయినప్పటికీ నీ అబద్ధాలను ఈ ప్రజలు నమ్మేలా చేశావు. \v 16 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను భూమి మీద నుండి తొలగించబోతున్నాను. మీరు ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు బోధించారు కాబట్టి ఈ సంవత్సరమే మీరు చనిపోతారు.’ ” \p \v 17 అదే సంవత్సరం ఏడవ నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు. \c 29 \s1 బందీలుగా ఉన్నవారికి లేఖ \p \v 1 నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారిలో మిగిలి ఉన్న పెద్దలకు, యాజకులకు, ప్రవక్తలకు, ఇతర ప్రజలందరికి యెరూషలేము నుండి యిర్మీయా ప్రవక్త పంపిన ఉత్తరంలోని మాటలు ఇవి. \v 2 (యెహోయాకీను\f + \cat dup\cat*\fr 29:2 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యెకొన్యా \fqa*\ft యెహోయాకీను యొక్క మరో రూపం\ft*\f* రాజు, రాజమాత, ఆస్థాన అధికారులు, యూదా, యెరూషలేము నాయకులు, నిపుణులైన పనివారు కళాకారులు యెరూషలేము నుండి బందీలుగా తీసుకువెళ్లిన తర్వాత ఈ ఉత్తరం పంపబడినది.) \v 3 యూదా రాజైన సిద్కియా బబులోను రాజు నెబుకద్నెజరు దగ్గరకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా, హిల్కీయా కుమారుడైన గెమర్యాలతో అతడు ఈ ఉత్తరాన్ని పంపించాడు. అందులో ఇలా ఉంది: \pm \v 4 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా తన ఇష్టప్రకారం యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారందరితో ఇలా అంటున్నారు: \v 5 “ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి. \v 6 పెళ్ళి చేసుకుని కుమారులు, కుమార్తెలను కనండి; మీ కుమారులకు భార్యలను తెచ్చుకోండి, మీ కుమార్తెలకు పెళ్ళి చేయండి, వారు కూడా కుమారులు కుమార్తెలను కంటారు. అప్పుడు మీ సంఖ్య తగ్గకుండ అధికమవుతుంది. \v 7 అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.” \v 8 అవును, ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీ మధ్య ఉన్న ప్రవక్తలు భవిష్యవాణి చెప్పేవారు మిమ్మల్ని మోసగించకుండ చూసుకోండి. మీలో కలలు కనేవారి మాటలు మీరు వినకండి. \v 9 వారు నా పేరిట అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \pm \v 10 యెహోవా ఇలా అంటున్నారు: “బబులోనుకు డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను మిమ్మల్ని దర్శించి నేను చేసిన మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను. \v 11 ఎందుకంటే మీ కోసం నేను ఏర్పరచుకున్న ప్రణాళికలు నాకు తెలుసు” అని యెహోవా అంటున్నారు. “అవి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగించే సమాధానకరమైన ఉద్దేశాలే గాని మీకు హాని కలిగించడానికి కాదు. \v 12 అప్పుడు మీరు నాకు మొరపెట్టి నాకు ప్రార్థిస్తారు, అప్పుడు నేను మీ మాట వింటాను. \v 13 మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు. \v 14 మీరు నన్ను కనుగొంటారు, మిమ్మల్ని చెర నుండి తిరిగి రప్పిస్తాను.\f + \fr 29:14 \fr*\ft లేదా \ft*\fqa నీ భాగ్యాలను తిరిగి రప్పిస్తాను\fqa*\f* నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన అన్ని దేశాల నుండి అన్ని ప్రాంతాల నుండి మిమ్మల్ని సమకూరుస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన దేశానికి తిరిగి తీసుకువస్తాను. \pm \v 15 “బబులోనులో యెహోవా మన కోసం ప్రవక్తలను లేవనెత్తారు” అని మీరు అనవచ్చు, \v 16 అయితే దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు గురించి, మీతో పాటు బందీలుగా వెళ్లకుండా ఈ పట్టణంలో మిగిలిన మీ తోటి సోదరులు ప్రజలందరి గురించి యెహోవా ఇలా అంటున్నారు. \v 17 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను ఖడ్గాన్ని, కరువును, తెగులును వారిపైకి పంపుతాను, వారిని తినడానికి పనికిరాని చెడ్డ అంజూర పండ్లలా చేస్తాను. \v 18 నేను వారిని ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో వెంటాడి, వారిని ఏ దేశాల్లోకి తరుముతానో ఆ భూరాజ్యాలన్నిటికి వారిని అసహ్యమైన వారిగా, శాపంగా,\f + \fr 29:18 \fr*\ft అంటే, ఎవరినైనా శపించడానికి వారి పేర్లు వాడబడతాయి \+xt 22|link-href="JER 29:22"\+xt* వచనంలో కూడా ఉంది; లేదా ఇతరులు వారు శపించబడడం చూస్తారు.\ft*\f* భయానకంగా, హేళనగా నిందగా చేస్తాను. \v 19 ఎందుకంటే వారు నా మాటలు వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నా సేవకులైన ప్రవక్తల ద్వారా నేను వారికి మళ్ళీ మళ్ళీ పంపిన మాటలు వారు వినలేదు. వారే కాదు బందీలుగా ఉన్న మీరు కూడా వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \pm \v 20 కాబట్టి నేను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా పంపినవారలారా, యెహోవా మాట వినండి. \v 21 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా, నా పేరిట మీకు అబద్ధాలు ప్రవచిస్తున్న కోలాయా కుమారుడైన అహాబు, మయశేయా కుమారుడైన సిద్కియా గురించి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను, అతడు మీ కళ్లముందే వారిని చంపేస్తాడు. \v 22 వారి కారణంగా, బబులోనులో ఉన్న యూదా నుండి బందీలుగా వెళ్లిన వారందరూ, ‘సిద్కియా, అహాబులను బబులోను రాజు అగ్నిలో కాల్చివేసినట్టుగా, యెహోవా మీకు చేయును గాక’ అని శపిస్తారు. \v 23 ఎందుకంటే వారు ఇశ్రాయేలులో అవమానకరమైన పనులు చేశారు; వారు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచారం చేశారు, నేను ప్రకటించని విషయాలలో వారు నా పేరిట అబద్ధాలు చెప్పారు. అది నాకు తెలుసు, నేనే దానికి సాక్షిని” అని యెహోవా తెలియజేస్తున్నారు. \s1 షెమయాకు సందేశం \p \v 24 నెహెలామీయుడైన షెమయాతో ఇలా చెప్పు, \v 25 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేములో ఉన్న ప్రజలందరికి, మయశేయా కుమారుడు యాజకుడునైన జెఫన్యాకు, ఇతర యాజకులందరికీ నీ పేరిట ఉత్తరాలు పంపి జెఫన్యాతో ఇలా అన్నావు, \v 26 ‘యెహోవా ఆలయానికి అధిపతిగా ఉండడానికి యెహోయాదా స్థానంలో యెహోవా నిన్ను యాజకునిగా నియమించారు; ప్రవక్తలా ప్రవర్తించే ఉన్మాదిని నీవు ఇనుప సంకెళ్లతో బంధించి కొయ్యకు బిగించాలి. \v 27 కాబట్టి మీలో ప్రవక్తగా నటిస్తున్న అనాతోతీయుడైన యిర్మీయాను నీవెందుకు గద్దించలేదు? \v 28 అతడు బబులోనులో ఉన్న మాకు, మీరు చాలా కాలం పాటు ఉంటారు. కాబట్టి ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు వేసి వాటి పండ్లు తినండని సందేశాన్ని పంపాడు.’ ” \p \v 29 అయితే యాజకుడైన జెఫన్యా యిర్మీయా ప్రవక్తకు ఆ ఉత్తరాన్ని చదివి వినిపించాడు. \v 30 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి: \v 31 “బందీలుగా ఉన్నవారందరికి ఈ సందేశం పంపు, ‘నెహెలామీయుడైన షెమయా గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను అతన్ని పంపలేదు, అయినాసరే షెమయా మీకు ప్రవచించి మీరు ఆ అబద్ధాలను నమ్మేలా చేశాడు. \v 32 యెహోవా ఇలా అంటున్నారు: నెహెలామీయుడైన షెమయాను, అతని సంతానాన్ని నేను తప్పకుండా శిక్షిస్తాను. నా ప్రజలకు నేను చేయబోయే మేలు అతని సంతతిలో ఎవరూ చూడరు, ఎందుకంటే అతడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రకటించాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.” \c 30 \s1 ఇశ్రాయేలును తిరిగి రప్పిస్తాను \p \v 1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది: \v 2 “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు, ‘నేను మాట్లాడిన మాటలన్నీ ఒక గ్రంథంలో వ్రాయి. \v 3 అవి జరుగబోయే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నా ప్రజలైన ఇశ్రాయేలును, యూదాను చెరనుండి\f + \fr 30:3 \fr*\ft లేదా \ft*\fqa నా ఇశ్రాయేలు యూదా ప్రజల భాగ్యాలను తిరిగి రప్పిస్తాను\fqa*\f* విడిపించి, వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి వారిని రప్పిస్తాను, వారు దాన్ని స్వాధీనం చేసుకునే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా చెప్తున్నారు.” \p \v 4 ఇశ్రాయేలు, యూదా గురించి యెహోవా చెప్పిన మాటలు: \v 5 “యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ ‘భయంతో కూడిన కేకలు వినబడుతున్నాయి, \q2 భయమే ఉంది తప్ప, సమాధానం లేదు. \q1 \v 6 ఓ విషయం వారిని అడిగి చూడండి: \q2 పురుషుడు పిల్లలు కనగలడా? \q1 అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా \q2 పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? \q2 వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి? \q1 \v 7 ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో! \q2 అలాంటిది మరొకటి ఉండదు. \q1 అది యాకోబుకు కష్టకాలం, \q2 అయితే వారు దాని నుండి రక్షించబడతారు. \b \q1 \v 8 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ ‘ఆ రోజు, \q2 నేను వారి మెడల మీద ఉన్న కాడిని విరగ్గొడతాను \q1 వారి బంధకాలను తెంపివేస్తాను; \q2 ఇకపై విదేశీయులు వారిని బానిసలుగా చేయరు. \q1 \v 9 కాని, వారు తమ దేవుడైన యెహోవాకు సేవ చేస్తారు \q2 నేను వారికి రాజుగా నియమించే \q2 దావీదు రాజును వారు సేవిస్తారు. \b \q1 \v 10 “ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; \q2 ఇశ్రాయేలు, కలవరపడకు’ \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, \q2 నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. \q1 యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, \q2 ఎవరూ అతన్ని భయపెట్టరు. \q1 \v 11 నేను నీతో ఉన్నాను, నిన్ను రక్షిస్తాను’ \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 ‘నేను నిన్ను చెదరగొట్టిన \q2 దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా, \q2 నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చేయను. \q1 కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను; \q2 శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.’ \p \v 12 “యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ ‘నీ గాయం నయం కానిది, \q2 నీ గాయం తీవ్రమైనది. \q1 \v 13 నీ పక్షంగా వాదించడానికి ఎవరు లేరు, \q2 నీ పుండుకు నివారణ లేదు, \q2 నీకు స్వస్థత లేదు. \q1 \v 14 నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; \q2 వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. \q1 శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, \q2 క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, \q1 ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, \q2 నీ పాపాలు చాలా ఎక్కువ. \q1 \v 15 నీ గాయం గురించి, \q2 తీరని నీ బాధ గురించి ఎందుకు ఏడుస్తున్నావు? \q1 నీ గొప్ప అపరాధం అనేక పాపాల కారణంగా \q2 నేను నీకు ఇవన్నీ చేశాను. \b \q1 \v 16 “ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; \q2 నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. \q1 నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; \q2 నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను. \q1 \v 17 అయితే నేను నీకు స్వస్థత కలుగజేసి \q2 నీ గాయాలను బాగుచేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, \q1 ఎందుకంటే ‘నీవు వెలివేయబడినవాడవని, \q2 సీయోనును ఎవ్వరూ పట్టించుకోరు’ అని నీ గురించి అన్నారు. \p \v 18 “యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, \q2 అతని నివాసాలపై కనికరం చూపుతాను. \q1 పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, \q2 రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది. \q1 \v 19 వాటినుండి కృతజ్ఞతాగీతాలు \q2 ఆనంద ధ్వనులు వస్తాయి. \q1 నేను వారి సంఖ్యను తగ్గించకుండ, \q2 అధికం చేస్తాను; \q1 నేను వారికి ఘనతను తెస్తాను, \q2 వారు అసహ్యానికి గురికారు. \q1 \v 20 వారి పిల్లలు పూర్వకాలంలో ఉన్నట్లే ఉంటారు, \q2 వారి సంఘం నా ముందు స్థిరపడుతుంది; \q2 వారిని హింసించే వారందరినీ నేను శిక్షిస్తాను. \q1 \v 21 వారి నాయకుడు వారిలో ఒకడు; \q2 వారి పాలకుడు వారి మధ్య నుండి లేస్తాడు. \q1 నేను అతన్ని దగ్గరికి తీసుకువస్తాను, అతడు నా దగ్గరికి వస్తాడు \q2 నన్ను సమీపించే \q2 సాహసం చేయగల వ్యక్తి ఎవరు?’ \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 22 ‘కాబట్టి మీరు నా ప్రజలు, \q2 నేను మీకు దేవుడను.’ ” \b \q1 \v 23 చూడండి, యెహోవా ఉగ్రత \q2 తుఫానులా విరుచుకుపడుతుంది, \q1 అది సుడిగాలిలా వీస్తూ \q2 దుష్టుల తలలపైకి తిరుగుతుంది. \q1 \v 24 ఆయన తన హృదయ ఉద్దేశాలను \q2 పూర్తిగా నెరవేర్చే వరకు \q2 యెహోవా తీవ్రమైన కోపం చల్లారదు. \q1 రాబోయే రోజుల్లో \q2 మీరు దీన్ని గ్రహిస్తారు. \c 31 \p \v 1 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఆ సమయంలో నేను ఇశ్రాయేలు కుటుంబాలన్నిటికీ దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు.” \p \v 2 యెహోవా చెప్పేదేమిటంటే: \q1 “ఖడ్గం నుండి తప్పించుకున్న ప్రజలు \q2 అరణ్యంలో దయ పొందుతారు; \q2 ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇవ్వడానికి నేను వస్తాను.” \p \v 3 గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: \q1 “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; \q2 నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను. \q1 \v 4 నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను, \q2 ఇశ్రాయేలు కన్యా, నీవు తిరిగి కట్టబడతావు. \q1 మళ్ళీ నీవు నీ తంబురలు తీసుకుని \q2 ఆనందించే వారితో కలిసి నాట్యం చేస్తావు. \q1 \v 5 మళ్ళీ సమరయ కొండలపై \q2 నీవు ద్రాక్షతోటలు నాటుతావు. \q1 రైతులు వాటిని నాటుతారు \q2 నీవు వాటి ఫలాలను తింటూ ఆనందిస్తావు. \q1 \v 6 ఎఫ్రాయిం కొండలమీద \q2 కావలివారు, \q1 ‘రండి, మనం సీయోనుకు, \q2 మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం’ అని కేకలు వేసే రోజు వస్తుంది.” \p \v 7 యెహోవా ఇలా అంటున్నారు: \q1 “యాకోబు కోసం ఆనందంగా పాడండి; \q2 దేశాల్లో గొప్పదాని కోసం కేకవేయండి. \q1 స్తుతులు చెల్లిస్తూ, \q2 ‘యెహోవా, ఇశ్రాయేలీయులలో మిగిలిన, \q2 నీ ప్రజలను రక్షించండి’ అని అనండి. \q1 \v 8 చూడు, నేను వారిని ఉత్తర దేశం నుండి రప్పించి, \q2 భూమి మూలల నుండి వారిని పోగుచేస్తాను. \q1 వారిలో గ్రుడ్డివారు, కుంటివారు, \q2 తల్లి కాబోతున్నవారు పురిటినొప్పులు పడుతున్న స్త్రీలు ఉంటారు; \q2 గొప్ప గుంపు తరలివస్తుంది. \q1 \v 9 వారు ఏడుస్తూ వస్తారు; \q2 నేను వారిని వెనుకకు తీసుకువస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు. \q1 నేను వారిని నీటి ప్రవాహాల ప్రక్కన \q2 వారు తడబడని తిన్నని దారిలో నడిపిస్తాను \q1 ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల తండ్రిగా ఉంటాను, \q2 ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారునిగా ఉంటాడు. \b \q1 \v 10 “జనులారా, యెహోవా మాట వినండి; \q2 సుదూర తీరప్రాంతాలలో ఇలా ప్రకటించండి: \q1 ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవారే వారిని సమకూర్చి, \q2 కాపరిలా తన మందను కాపాడతాడు.’ \q1 \v 11 ఎందుకంటే యెహోవా యాకోబును, \q2 వారికంటే బలవంతుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు. \q1 \v 12 వారు వచ్చి సీయోను కొండలమీద ఆనందంతో కేకలు వేస్తారు. \q2 వారు యెహోవా ఇచ్చిన సమృద్ధిని బట్టి \q1 ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ఒలీవ నూనెలను బట్టి, \q2 గొర్రెలకు పశువులకు పుట్టే పిల్లలను బట్టి సంతోషిస్తారు \q1 వారు బాగా నీరు పెట్టిన తోటలా ఉంటారు, \q2 వారు ఇకపై విచారించరు. \q1 \v 13 అప్పుడు యువతులు యువకులు, \q2 వృద్ధులు సంతోషంతో నాట్యం చేస్తారు. \q1 నేను వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను; \q2 నేను వారికి విచారానికి బదులుగా ఆదరణను, ఆనందాన్ని ఇస్తాను. \q1 \v 14 నేను యాజకులను సమృద్ధితో తృప్తిపరుస్తాను, \q2 నా ప్రజలు నా సమృద్ధితో నింపబడతారు,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 15 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “రామాలో రోదన, \q2 గొప్ప ఏడ్పు వినబడుతుంది, \q1 రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ \q2 ఇక వారు లేరని, \q2 ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.” \p \v 16 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ఏడవకుండా నీ స్వరాన్ని, \q2 కన్నీరు పెట్టుకోకుండా నీ కళ్లను అడ్డుకో, \q1 ఎందుకంటే నీ పనికి ప్రతిఫలం లభిస్తుంది, \q2 వారు శత్రువుల దేశం నుండి తిరిగి వస్తారు, \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 17 కాబట్టి నీ సంతానానికి నిరీక్షణ ఉంది,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q2 “మీ పిల్లలు తమ సొంత దేశానికి తిరిగి వస్తారు. \b \q1 \v 18 “ఎఫ్రాయిం మూలుగులు నేను ఖచ్చితంగా విన్నాను: \q2 ‘శిక్షణ పొందని దూడలా ఉన్న నన్ను మీరు క్రమశిక్షణలో పెట్టారు, \q2 నేను క్రమశిక్షణ పొందాను. \q1 నన్ను బాగుచేయండి, నేను తిరిగి వస్తాను, \q2 ఎందుకంటే మీరే నా దేవుడైన యెహోవావు. \q1 \v 19 నేను దారితప్పిన తర్వాత, \q2 పశ్చాత్తాపపడ్డాను; \q1 నేను అర్థం చేసుకున్న తర్వాత, \q2 నా రొమ్ము కొట్టుకున్నాను. \q1 నా యవ్వనంలో కలిగిన అవమానాన్ని భరిస్తూ, \q2 నేను సిగ్గుపడ్డాను అవమానపాలయ్యాను.’ \q1 \v 20 ఎఫ్రాయిం నా ప్రియ కుమారుడు, \q2 నేను ఇష్టపడే బిడ్డ కాదా? \q1 నేను తరచుగా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, \q2 నేను ఇప్పటికీ అతన్ని జ్ఞాపకముంచుకుంటాను. \q1 కాబట్టి నా హృదయం అతని కోసం ఆశపడుతుంది; \q2 అతని మీద నాకు చాలా కనికరం ఉంది,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 21 “రహదారి గుర్తులను ఏర్పాటు చేయి; \q2 దారి చూపే స్తంభాలు పెట్టించు. \q1 నీవు వెళ్లే మార్గాన్ని, \q2 ఆ రహదారిని గమనించు. \q1 ఇశ్రాయేలు కన్యా, \q2 నీ పట్టణాలకు తిరిగి రా. \q1 \v 22 విశ్వాసఘాతకురాలవైన కుమార్తె, ఇశ్రాయేలూ, \q2 నీవు ఎంతకాలం తిరుగుతావు? \q1 యెహోవా భూమిపై ఒక క్రొత్తదాన్ని సృష్టిస్తారు, \q2 స్త్రీ పురుషుని దగ్గరకు\f + \fr 31:22 \fr*\ft లేదా \ft*\fqa కాపాడుతుంది\fqa*\f* తిరిగి వస్తుంది.” \p \v 23 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని చెర నుండి తిరిగి రప్పించినప్పుడు,\f + \fr 31:23 \fr*\ft లేదా \ft*\fqa నేను భాగ్యాలను తిరిగి రప్పించినప్పుడు\fqa*\f* యూదా దేశంలోనూ దాని పట్టణాల్లోనూ ఉన్న ప్రజలు ఇలా చెప్తారు: ‘నీతి కలిగిన నగరమా, పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక.’ \v 24 రైతులు, తమ మందలతో తిరిగే కాపరులతో సహా యూదాలో, దాని పట్టణాలన్నిటిలో ప్రజలందరూ కలిసి జీవిస్తారు. \v 25 అలసినవారికి అలసట తీరుస్తాను, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను.” \p \v 26 అంతలో నాకు మెలకువ వచ్చి చుట్టూ చూశాను. నా నిద్ర నాకు హాయిగా ఉంది. \p \v 27 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను మనుష్యుల సంతానంతో అలాగే జంతువుల సంతానంతో నాటే రోజులు రాబోతున్నాయి. \v 28 నేను వారిని పెరికివేయడానికి, కూల్చివేయడానికి, పడద్రోయడానికి, నాశనం చేయడానికి, విపత్తును రప్పించడానికి ఎలా ఎదురుచూశానో, అలాగే వారిని కట్టడానికి నాటడానికి నేను ఎదురుచూస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 29 “ఆ రోజుల్లో ప్రజలు, \q1 “ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తిన్నప్పుడు, \q2 పిల్లల పళ్లు పులిసాయి’ అనే సామెత చెప్పరు. \m \v 30 ఎవరి పాపానికి వారే చస్తారు; ఎవరు పుల్లని ద్రాక్షలు తింటారో వారి పళ్లే పులుస్తాయి. \q1 \v 31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q2 “నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ \q1 యూదా ప్రజలతోనూ \q2 క్రొత్త నిబంధన చేసే రోజులు వస్తున్నాయి. \q1 \v 32 ఆ నిబంధన, ఈజిప్టు నుండి నేను వారి పూర్వికుల \q2 చేయి పట్టుకుని బయటకు నడిపించినపుడు \q1 నేను వారితో చేసిన \q2 నిబంధనలా ఉండదు, \q1 ఎందుకంటే నేను వారికి ఒక భర్తగా ఉన్నా, \q2 వారితో చేసిన నా నిబంధనను వారు ఉల్లంఘించారు,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 33 “ఆ కాలం తర్వాత, \q2 ఇశ్రాయేలు ప్రజలతో నేను చేసే నిబంధన ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచి, \q2 దాన్ని వారి హృదయాల మీద వ్రాస్తాను. \q1 నేను వారి దేవుడనై ఉంటాను, \q2 వారు నా ప్రజలై ఉంటారు. \q1 \v 34 ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, \q2 ‘యెహోవాను తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, \q1 ఎందుకంటే వారిలో, \q2 సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “ఎందుకంటే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి \q2 వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.” \p \v 35 యెహోవా ఇలా చెప్తున్నారు, \q1 పగలు ప్రకాశించడానికి \q2 సూర్యుని నియమించినవాడు, \q1 రాత్రి ప్రకాశించడానికి, \q2 చంద్రుని, నక్షత్రాలను శాసించేవాడు, \q1 కెరటాలు గర్జించేలా, \q2 సముద్రాన్ని కదిలించేవాడు ఆయనే, \q2 ఆయన పేరు సైన్యాల యెహోవా: \q1 \v 36 “ఈ శాసనాలు నా దృష్టి నుండి మాయమైతేనే,” \q2 అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q1 “ఇశ్రాయేలు ఇక ఎన్నటికీ నా ఎదుట \q2 ఒక జనంగా ఉండదు.” \p \v 37 యెహోవా ఇలా అంటున్నారు: \q1 “పైన ఉన్న ఆకాశాలు కొలవబడగలిగితే, \q2 అలాగే క్రింద ఉన్న భూమి పునాదులు పరిశోధించబడగలిగితే తప్ప, \q1 వారు చేసినదంతటిని బట్టి \q2 నేను ఇశ్రాయేలు సంతతివారందరిని తిరస్కరిస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 38 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “హనానేలు గోపురం నుండి మూల ద్వారం వరకు ఈ పట్టణం నా కోసం తిరిగి కట్టబడే రోజులు వస్తున్నాయి. \v 39 కొలనూలు అక్కడినుండి నేరుగా గారేబు కొండ వరకు వెళ్లి, ఆపై గోయా వైపు తిరుగుతుంది. \v 40 శవాలను, బూడిదను విసిరే లోయ మొత్తం, తూర్పున కిద్రోను లోయవరకు గుర్రపు ద్వారం మూల వరకు ఉన్న డాబాలన్నీ యెహోవాకు పవిత్రంగా ఉంటాయి. పట్టణం ఇంకెప్పుడు పెరికివేయబడదు, కూల్చివేయబడదు.” \c 32 \s1 యిర్మీయా పొలం కొనుట \p \v 1 యూదా రాజైన సిద్కియా ఏలుబడిలో పదవ సంవత్సరంలో అంటే నెబుకద్నెజరు ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరంలో యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన మాట ఇది. \v 2 బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్త యూదా రాజభవనంలోని కావలివారి ప్రాంగణంలో బంధించబడ్డాడు. \p \v 3 యూదా రాజైన సిద్కియా అతన్ని అక్కడ బంధించి, “నీవు అలా ఎందుకు ప్రవచిస్తున్నావు? పైగా నీవంటున్నావు, ‘యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు. \v 4 యూదా రాజైన సిద్కియా బబులోనీయుల\f + \fr 32:4 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల \fqa*\ft \+xt 5|link-href="JER 32:5"\+xt*, \+xt 24|link-href="JER 32:24"\+xt*, \+xt 25|link-href="JER 32:25"\+xt*, \+xt 28|link-href="JER 32:28"\+xt*, \+xt 29|link-href="JER 32:29"\+xt*, \+xt 43|link-href="JER 32:43"\+xt* వచనాల్లో కూడ\ft*\f* నుండి తప్పించుకోడు, అతడు బబులోను రాజు చేతికి ఖచ్చితంగా అప్పగించబడతాడు, సిద్కియా అతనితో ముఖాముఖి మాట్లాడతాడు తన కళ్లారా అతన్ని చూస్తాడు. \v 5 అతడు సిద్కియాను బబులోనుకు తీసుకెళ్తాడు, నేను అతని సంగతి చూసే వరకు అతడు అక్కడే ఉంటాడని యెహోవా ప్రకటిస్తున్నారు. ఒకవేళ మీరు బబులోనీయులతో పోరాడితే విజయం సాధించలేరు’ అని చెప్పావు” అన్నాడు. \p \v 6 యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా వాక్కు నాకు వచ్చింది: \v 7 నీ మేనమామ షల్లూము కుమారుడైన హనామేలు నీ దగ్గరకు వచ్చి, ‘అనాతోతులో నా పొలాన్ని కొను, ఎందుకంటే ఒక సమీప బంధువుగా దాన్ని కొనడం నీ హక్కు నీ బాధ్యత’ అని చెప్తాడు. \p \v 8 “అప్పుడు, యెహోవా చెప్పినట్లే, నా బంధువైన హనామేలు కావలివారి ప్రాంగణంలో నా దగ్గరకు వచ్చి, ‘బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను. దానిని విడిపించి, స్వాధీనపరచుకునే హక్కు నీకుంది కాబట్టి, నీ కోసం దాన్ని కొనుక్కో’ అని అన్నాడు. \p “ఇది యెహోవా వాక్కు అని నాకు తెలుసు; \v 9 కాబట్టి నేను అనాతోతులో ఉన్న పొలాన్ని నా బంధువైన హనామేలు దగ్గర కొని, అతనికి పదిహేడు షెకెళ్ళ\f + \fr 32:9 \fr*\ft అంటే, సుమారు 200 గ్రాములు\ft*\f* వెండి తూకం వేసి ఇచ్చాను. \v 10 నేను క్రయపత్రం వ్రాసి ముద్రవేసి, సాక్షి సంతకం కూడా చేయించి వెండిని తూకం వేయించి ఇచ్చాను. \v 11 అప్పుడు కొనుగోలు నియమ నిబంధనలు వ్రాసి ముద్ర వేసిన, ముద్ర వేయని పత్రాలను నేను తీసుకున్నాను. \v 12 నేను ఈ పత్రాన్ని నా బంధువు హనామేలు సమక్షంలో, అలాగే పత్రంపై సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కావలివారి ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి సమక్షంలో మహశేయా కుమారుడైన నేరియా, అతని కుమారుడైన బారూకుకు ఇచ్చాను. \p \v 13 “వారి సమక్షంలో నేను బారూకుకు ఈ సూచనలను ఇచ్చాను: \v 14 ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ పత్రాలను, అనగా ముద్ర వేసిన కొనుగోలు పత్రాన్ని, ముద్ర వేయని కొనుగోలు పత్రాన్ని తీసుకుని, అవి చాలా కాలం పాటు ఉండేలా వాటిని మట్టికుండలో దాచిపెట్టు. \v 15 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ దేశంలో మళ్ళీ ఇల్లు, పొలాలు, ద్రాక్షతోటలు కొంటారు.’ \p \v 16 “నేరియా కుమారుడైన బారూకుకు కొనుగోలు పత్రాన్ని ఇచ్చిన తర్వాత, నేను యెహోవాను ఇలా ప్రార్థించాను: \pm \v 17 “అయ్యో, ప్రభువా యెహోవా, మీ గొప్ప శక్తితో, మీ చాచిన బాహువుతో ఆకాశాలను భూమిని సృష్టించారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. \v 18 మీరు వేలమందిపై ప్రేమ చూపిస్తారు కానీ తల్లిదండ్రుల పాపాల శిక్షను వారి తర్వాత వారి పిల్లల ఒడిలోకి తీసుకువస్తారు. ఆయన గొప్ప బలవంతుడైన దేవుడు, ఆయన పేరు సైన్యాల యెహోవా. \v 19 మీ ఉద్దేశాలు గొప్పవి, మీ క్రియలు బలమైనవి. మీ కనుదృష్టి సర్వ మానవాళిపై ఉన్నది; మీరు ప్రతిఒక్కరికి వారి ప్రవర్తనకు, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తారు. \v 20 మీరు ఈజిప్టులో సూచకక్రియలు, అద్భుతాలు చేశారు, నేటికీ ఇశ్రాయేలు మధ్య, ఇతర మనుష్యలందరి మధ్య వాటిని కొనసాగిస్తూ మీరు ఇంకా పేరు కీర్తి కలిగించుకుంటున్నారు. \v 21 మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను సూచకక్రియలతో, అద్భుతాలతో, బలమైన చేతితో, చాచిన బాహువుతో, గొప్ప భయాన్ని కలిగించి ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చారు. \v 22 మీరు వారి పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన ఈ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చారు. \v 23 వారు దాని లోపలికి వచ్చి దానిని స్వాధీనం చేసుకున్నారు, కానీ వారు మీకు లోబడలేదు, మీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు; మీరు వారికి ఆజ్ఞాపించినట్లు వారు చేయలేదు. కాబట్టి మీరు వారిపై ఈ విపత్తు అంతా తెచ్చారు. \pm \v 24 “పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముట్టడి దిబ్బలు ఎలా నిర్మించబడ్డాయో చూడండి. ఖడ్గం, కరువు తెగులు కారణంగా పట్టణం దాని మీద దాడి చేస్తున్న బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది. నీవు చెప్పింది జరగడం ఇప్పుడు నీవే చూస్తున్నావు. \v 25 పట్టణం బబులోనీయుల చేతికి అప్పగించబడినప్పటికీ, యెహోవా, మీరు నాతో, ‘వెండి ఇచ్చి పొలాన్ని కొని, లావాదేవీకి సాక్షులను ఏర్పాటు చేసుకో’ అని చెప్పారు.” \p \v 26 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై: \v 27 “నేను యెహోవాను; నేను సర్వ మానవాళికి దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? \v 28 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోనీయుల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరుకు అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు. \v 29 ఈ పట్టణంపై దాడి చేస్తున్న బబులోనీయులు లోపలికి వచ్చి దానికి నిప్పు పెడతారు; బయలుకు ఏ ఇంటి పైకప్పుల మీద ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించి ప్రజలు నాకు కోపాన్ని రేపారో ఆ ఇళ్ళతో పాటు వారు దానిని కాల్చివేస్తారు. \p \v 30 “ఇశ్రాయేలు, యూదా ప్రజలు తమ చిన్ననాటి నుండి నా దృష్టికి చెడు తప్ప మరి ఏమీ చేయలేదు. నిజానికి, ఇశ్రాయేలు ప్రజలు తమ చేతులు చేసిన వాటితో నాకు కోపం తెప్పించడం తప్ప మరేమీ చేయలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 31 ఈ పట్టణం కట్టబడిన రోజు నుండి ఇప్పటివరకు నాకు కోపాన్ని, ఉగ్రతను రప్పిస్తూనే ఉన్నది. \v 32 ఇశ్రాయేలు, యూదా ప్రజలు, వారి రాజులు, అధికారులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదా ప్రజలు యెరూషలేములో నివసించేవారు తాము చేసిన వాటన్నిటితో నాకు కోపం రేపారు. \v 33 వారు నావైపు తమ ముఖాలు త్రిప్పక నాకు వెన్ను చూపారు. నేను వారికి పదే పదే బోధించినప్పటికీ, వారు క్రమశిక్షణను అంగీకరించలేదు, స్పందించలేదు. \v 34 నా పేరు కలిగిన మందిరంలో తమ నీచమైన విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని అపవిత్రం చేశారు. \v 35 వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు. \p \v 36 “మీరు ఈ పట్టణం గురించి, ‘ఖడ్గం, కరువు తెగులు కారణంగా అది బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది’ అని అంటున్నారు; అయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: \v 37 నా ఉగ్రతతో, గొప్ప కోపంతో నేను వారిని వెళ్లగొట్టే అన్ని దేశాల నుండి తప్పకుండా వారిని సమకూర్చి తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి క్షేమంగా జీవించేలా చేస్తాను. \v 38 వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. \v 39 నేను వారికి ఏక హృదయాన్ని ఒకే మార్గాన్ని ఇస్తాను, తద్వార వారు ఎల్లప్పుడూ నాకు భయపడతారు, వారికి, వారి తర్వాత వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు అంతా మేలు జరుగుతుంది. \v 40 నేను వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను: నేను వారికి మేలు చేయడం ఎప్పటికీ మానను, వారు నా నుండి ఎన్నటికీ దూరంగా ఉండకుండ నా పట్ల వారికి భయభక్తులు కలిగిస్తాను. \v 41 నేను వారికి మేలు చేయడంలో నాకు ఆనందం ఉంది కాబట్టి నిజంగా నా పూర్ణహృదయంతో నా పూర్ణాత్మతో వారిని ఈ దేశంలో నాటుతాను. \p \v 42 “యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ ప్రజలమీదికి ఇంత గొప్ప విపత్తు తెచ్చినట్లే, నేను వారికి వాగ్దానం చేసిన వృద్ధి అంతటిని వారికి ఇస్తాను. \v 43 ‘ఇది బబులోనీయుల చేతికి అప్పగించబడి మనుష్యులు జంతువులు లేక పాడైపోయిందని’ మీరు చెప్పే ఈ దేశంలో మరలా పొలాలు కొంటారు. \v 44 బెన్యామీను ప్రాంతాల్లోనూ, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ, యూదా పట్టణాల్లోనూ, కొండ సీమల్లోనూ, పడమటి దిగువ కొండ ప్రదేశాల్లోనూ, దక్షిణ ప్రాంతాల్లోనూ పొలాలు వెండి ఇచ్చి కొంటారు, ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, కొనుగోలు పత్రాలపై ముద్రలు వేస్తారు, ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.” \c 33 \s1 పునరుద్ధరణ వాగ్దానం \p \v 1 యిర్మీయా ఇంకా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉండగా, యెహోవా వాక్కు అతనికి రెండవసారి వచ్చింది: \v 2 “యెహోవా ఇలా అంటున్నారు, ఆయన భూమిని సృష్టించారు, యెహోవా దానిని రూపించి, స్థాపించారు; యెహోవా అని పేరు కలిగినవారే ఇలా చెప్తున్నారు, \v 3 ‘నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను, నీకు తెలియని, నీవు పరిశోధించలేని గొప్ప విషయాలను నీకు చెప్తాను.’ \v 4-5 బబులోనీయులతో జరిగిన యుద్ధంలో ముట్టడి దిబ్బల వల్ల ఖడ్గం వల్ల నాశనమైన ఈ పట్టణంలోని ఇళ్ళ గురించి, యూదా రాజభవనాల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘అవి నా కోపం ఉగ్రత వల్ల నేను చంపిన మనుష్యుల శవాలతో నిండిపోతాయి. ఈ పట్టణపు దుష్టత్వాన్ని బట్టి దానికి నేను నా ముఖాన్ని దాచుకుంటాను. \p \v 6 “ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను. \v 7 నేను యూదాను, ఇశ్రాయేలీయులను చెర నుండి తిరిగి రప్పించి\f + \fr 33:7 \fr*\ft లేదా \ft*\fqa యూదా ఇశ్రాయేలు భాగ్యాలను తిరిగి రప్పిస్తాను\fqa*\f* వారు ఎలా పూర్వం ఉన్నారో వారిని తిరిగి అలాగే నిర్మిస్తాను. \v 8 వారు నాకు వ్యతిరేకంగా చేసిన పాపాలన్నిటి నుండి నేను వారిని శుద్ధి చేస్తాను, నాపై తిరుగుబాటు చేసిన వారి పాపాలన్నిటిని క్షమిస్తాను. \v 9 అప్పుడు నేను వారి కోసం చేయబోతున్న మంచి పనులన్నిటి గురించి విన్న భూప్రజలందరి ముందు ఈ పట్టణం నాకు కీర్తిని ఆనందాన్ని గౌరవాన్ని తెస్తుంది. నేను వారికి ఇచ్చే విస్తారమైన వృద్ధిని సమాధానాన్ని చూసి వారు భయంతో వణికిపోతారు.’ \p \v 10 “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ స్థలం గురించి మీరు ఇలా అంటున్నారు, “ఇది మనుష్యులు జంతువులు లేక పాడైపోయింది” అని మీరు చెప్పే ఈ స్థలంలోనే, మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండా పాడైపోయిన యూదా పట్టణాల్లో యెరూషలేము వీధుల్లో \v 11 సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, \q1 “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, \q2 యెహోవా మంచివాడు; \q2 ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” \m అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు. \p \v 12 “సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మనుష్యులు, జంతువులు లేక నిర్జనమైన ఈ స్థలంలో, దాని పట్టణాలన్నింటిలో గొర్రెల కాపరులు తమ మందలకు విశ్రాంతి ఇచ్చేందుకు మళ్ళీ పచ్చికబయళ్లు ఉంటాయి. \v 13 కొండ ప్రాంత పట్టణాల్లో, పడమటి పర్వత ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతంలో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల్లో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించే వారిచేత లెక్కించబడతాయి’ అని యెహోవా చెప్తున్నారు. \p \v 14 “యెహోవా అంటూ ఇలా ప్రకటిస్తున్నారు, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చే రోజులు వస్తున్నాయి.’ \q1 \v 15 “ ‘ఆ రోజుల్లో, ఆ సమయంలో \q2 నేను దావీదు వంశం నుండి నీతి కొమ్మను మొలకెత్తిస్తాను. \q2 అతడు దేశంలో నీతి న్యాయాలు జరిగిస్తాడు. \q1 \v 16 ఆ రోజుల్లో యూదాకు కాపుదల ఉంటుంది \q2 యెరూషలేము క్షేమంగా జీవిస్తుంది. \q1 యెహోవాయే మన నీతిమంతుడైన రక్షకుడు \q2 అనే పేరుతో యెరూషలేము పిలువబడుతుంది.’ \m \v 17 యెహోవా ఇలా అంటున్నారు: ‘ఇశ్రాయేలు సింహాసనంపై కూర్చోడానికి దావీదుకు ఒకడు లేకుండా ఉండడు. \v 18 నా ఎదుట నిలబడి దహనబలులు అర్పించడానికి, భోజనార్పణలు అర్పించడానికి, బలులు అర్పించడానికి లేవీయులైన యాజకులకు ఒకడు లేకుండా పోడు.’ ” \p \v 19 యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి: \v 20 “యెహోవా ఇలా అంటున్నారు: ‘పగలు రాత్రులు వాటి నిర్ణీత సమయంలో రాకుండా నేను పగటికి, రాత్రికి చేసిన నా ఒడంబడికను మీరు భంగం చేస్తే, \v 21 అప్పుడు నా సేవకుడైన దావీదుతో తన సింహాసనంపై రాజ్యం చేయడానికి అతనికి ఒకడు లేకుండా పోడని నేను చేసిన నిబంధన, నా ఎదుట పరిచర్య చేస్తున్న యాజకులుగా ఉన్న లేవీయులతో నేను చేసిన నిబంధన వ్యర్ధం అవుతుంది. \v 22 నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నా ఎదుట పరిచర్య చేసే లేవీయులను ఆకాశంలోని నక్షత్రాలవలె లెక్కపెట్టలేనంతగా, సముద్రతీరంలోని ఇసుకలా కొలువలేనంతగా చేస్తాను.’ ” \p \v 23 యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి: \v 24 “ఈ ప్రజలు, ‘యెహోవా తాను ఎంచుకున్న రెండు రాజ్యాలను\f + \fr 33:24 \fr*\ft లేదా \ft*\fqa కుటుంబాలను\fqa*\f* ఆయన తృణీకరించారు’ అని అనడం నీవు గమనించలేదా? కాబట్టి వారు నా ప్రజలను తృణీకరిస్తారు ఇకపై వారిని ఒక జనంగా పరిగణించరు. \v 25 యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను పగలు రాత్రితో నా ఒడంబడిక చేసి, భూమ్యాకాశాల నియమాలను స్థాపించి ఉండకపోతే, \v 26 అప్పుడు నేను యాకోబు నా సేవకుడైన దావీదుల సంతతిని తిరస్కరించి ఉండేవాన్ని, అబ్రాహాము, ఇస్సాకు యాకోబుల సంతతివారిని పరిపాలించడానికి అతని కుమారులలో ఒక్కరిని కూడా ఎన్నుకోను. ఎందుకంటే నేను చెర నుండి వారిని తిరిగి రప్పించి, వారిపై కనికరం చూపుతాను.’ ” \c 34 \s1 సిద్కియాకు హెచ్చరిక \p \v 1 బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని సైన్యమంతా, అతడు పరిపాలించిన సామ్రాజ్యంలోని అన్ని రాజ్యాలు, జనాంగాలు యెరూషలేముతో పాటు దాని చుట్టుప్రక్కల పట్టణాలన్నిటితో యుద్ధం చేస్తున్నప్పుడు, యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది: \v 2 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: యూదా రాజైన సిద్కియా దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను, అతడు దానిని కాల్చివేస్తాడు. \v 3 నీవు అతని పట్టు నుండి తప్పించుకోలేవు, ఖచ్చితంగా బంధించబడి అతని చేతులకు అప్పగించబడతావు. నీవు బబులోను రాజును నీ కళ్లతో చూస్తావు, అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీవు బబులోనుకు వెళ్లిపోతావు. \p \v 4 “ ‘అయినప్పటికీ యూదా రాజైన సిద్కియా, యెహోవా నీకు చేసిన వాగ్దానాన్ని విను. నీ గురించి యెహోవా ఇలా అంటున్నారు: నీవు ఖడ్గంతో చంపబడవు; \v 5 నీవు సమాధానంగా చనిపోతావు. నీకు ముందుగా పాలించిన రాజులైన నీ పూర్వికుల గౌరవార్థం ప్రజలు సుగంధ ద్రవ్యాలను దహించినట్లే, వారు నీ కోసం కూడా సుగంధద్రవ్యాలు దహిస్తూ, “అయ్యో, యజమానుడా!” అని విలపిస్తారు. నాకు నేనే ఈ వాగ్దానం చేస్తున్నాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \p \v 6 అప్పుడు యిర్మీయా ప్రవక్త యెరూషలేములో ఉన్న యూదా రాజైన సిద్కియాకు ఇదంతా చెప్పాడు. \v 7 ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద యూదాలోని ఇతర పట్టణాల మీద, లాకీషు, అజేకా మీదా యుద్ధం చేస్తూ ఉంది. యూదాలో మిగిలి ఉన్న కోట పట్టణాలు ఇవి మాత్రమే. \s1 బానిసలకు విడుదల \p \v 8 సిద్కియా రాజు యెరూషలేములోని ప్రజలందరితో బానిసలకు విడుదల ప్రకటించాలని ఒడంబడిక చేసుకున్న తర్వాత యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది. \v 9 ప్రతి ఒక్కరూ తమకు బానిసలుగా ఉన్న హెబ్రీయులైన మగవారిని, ఆడవారిని అందరిని విడిపించాలి; తోటి యూదులను ఎవరూ బానిసత్వంలో ఉంచకూడదు. \v 10 కాబట్టి ఈ ఒడంబడిక ప్రకారం వచ్చిన అధికారులందరు, అలాగే ప్రజలందరూ తమ దగ్గర ఉన్న ఆడ, మగ బానిసలను విడుదల చేస్తామని, ఇక ఎప్పటికీ వారిని బానిసలుగా ఉంచమని అంగీకరించి, ఆ ఆజ్ఞకు లోబడి వారిని విడుదల చేశారు. \v 11 అయితే ఆ తర్వాత వారు మనస్సు మార్చుకుని విడిపించిన బానిసలను వెనుకకు తీసుకుని మళ్ళీ బానిసలుగా చేసుకున్నారు. \p \v 12 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది: \v 13 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి, బానిస దేశం నుండి బయటకు రప్పించినప్పుడు వారితో నిబంధన చేసి నేను ఇలా అన్నాను, \v 14 ‘మీకు అమ్మబడిన తోటి హెబ్రీయులను ఏడవ సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరు వారిని విడుదల చేయాలి. వారు ఆరు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత, మీరు వారిని స్వతంత్రులుగా\f + \fr 34:14 \fr*\ft \+xt ద్వితీ 15:12\+xt*\ft*\f* వెళ్లిపోనివ్వాలి.’ అయితే, మీ పూర్వికులు నా మాట వినలేదు, కనీసం నా గురించి పట్టించుకోలేదు. \v 15 ఇటీవలే మీరు పశ్చాత్తాపపడి మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత ప్రజలకు విడుదల ప్రకటించి నా దృష్టికి సరియైనది చేశారు. నా పేరు కలిగిన మందిరంలో మీరు నా ముందు ఒక ఒడంబడిక కూడా చేశారు. \v 16 కాని ఇప్పుడు మీరు తిరగబడి నా పేరును అపవిత్రం చేశారు. మీలో ప్రతి ఒక్కరు మీ ఆడ, మగ బానిసలను వారు కోరుకున్న చోటికి వెళ్లగలిగేలా వారిని విడుదల చేశారు. కాని మీరు వారిని మళ్ళీ మీ బానిసలుగా ఉండాలని బలవంతం చేశారు. \p \v 17 “కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: మీరు నా మాట వినలేదు. మీరు మీ సొంత ప్రజలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించలేదు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ‘స్వాతంత్ర్యాన్ని’ చాటిస్తున్నాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ఖడ్గం, తెగులు కరువుతో చావడానికే మీకు ‘విడుదల.’ నేను మిమ్మల్ని భూలోక రాజ్యాలన్నిటికీ అసహ్యమైన వారిగా చేస్తాను. \v 18 నా ఒడంబడికను ఉల్లంఘించి, నా ముందే తాము చేసిన ఒడంబడికలోని నిబంధనలను నెరవేర్చని వారిని, దూడను రెండు ముక్కలు చేసి దాని మధ్య నడిచినవారిగా నేను చూస్తాను. \v 19 యూదా, యెరూషలేము నాయకులు, ఆస్థాన అధికారులు, యాజకులు, దేశ ప్రజలందరు దూడ ముక్కల మధ్య నడిచినవారు, \v 20 వారిని చంపాలనుకున్న వారి శత్రువుల చేతికి నేను వారిని అప్పగిస్తాను. వారి మృతదేహాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి. \p \v 21 “నేను యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను వారిని చంపాలనుకున్న శత్రువుల చేతికి, అంటే నీ దగ్గర నుండి వెనుకకు వెళ్లిపోయిన బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను. \v 22 నేను ఆదేశాన్ని జారీ చేయబోతున్నాను. వారిని ఈ పట్టణానికి తిరిగి తీసుకువస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు దానికి వ్యతిరేకంగా పోరాడి, దానిని స్వాధీనం చేసుకుని దానిని కాల్చివేస్తారు. నేను యూదా పట్టణాలను ఎవరూ నివసించని విధంగా నాశనం చేస్తాను.” \c 35 \s1 రేకాబీయులు \p \v 1 యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము పరిపాలనలో యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన మాట ఇది: \v 2 “రేకాబీయుల కుటుంబం దగ్గరకు వెళ్లి, వారిని యెహోవా మందిరంలోని ప్రక్క గదుల్లో ఒక దానిలోకి రమ్మని ఆహ్వానించి, త్రాగడానికి వారికి ద్రాక్షరసం ఇవ్వు.” \p \v 3 కాబట్టి నేను హబజ్జిన్యా మనుమడును యిర్మీయా కుమారుడునైన యాజన్యాను అతని సోదరులను అతని కుమారులందరిని అంటే రేకాబీయుల కుటుంబమంతటిని తీసుకురావడానికి వెళ్లాను. \v 4 నేను వారిని యెహోవా మందిరంలోకి, అంటే దైవజనుడైన ఇగ్దలియా కుమారుడైన హానాను కుమారుల గదిలోకి తీసుకువచ్చాను. అది అధికారుల గది ప్రక్కనే ఉన్న ద్వారపాలకుడైన షల్లూము కుమారుడైన మయశేయా గదికి పైన ఉంది. \v 5 అప్పుడు నేను ద్రాక్షరసంతో నిండిన పాత్రలను, కొన్ని గిన్నెలను రేకాబీయుల ముందు ఉంచి, “కొంచెం ద్రాక్షరసం త్రాగండి” అని వారితో చెప్పాను. \p \v 6 అయితే వారు, “మేము ద్రాక్షరసం త్రాగము, ఎందుకంటే మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు,\f + \fr 35:6 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యోనాదాబు \fqa*\ft యెహోనాదాబు యొక్క మరో రూపం; ఇక్కడ, ఈ అధ్యాయంలో తరచుగా కనబడుతుంది\ft*\f* ‘మీరు గాని మీ సంతానం గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగకూడదు. \v 7 అలాగే మీరు ఎప్పటికీ ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తవద్దు, ద్రాక్షతోటలు నాటవద్దు; వీటిలో మీకు ఏదీ ఉండకూడదు; ఎల్లప్పుడూ గుడారాల్లో నివసించాలి. అప్పుడు మీరు పరవాసులుగా ఉన్న దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు’ అని మాకు ఆజ్ఞాపించాడు. \v 8 మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన ప్రతిదానికీ మేము లోబడి ఉన్నాము. మేము గాని మా భార్యలు గాని మా కుమారులు, కుమార్తెలు గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగలేదు. \v 9 నివసించడానికి ఇల్లు కట్టుకోలేదు, ద్రాక్షతోటలు గాని, పొలాలు గాని పంటలు గాని మాకు లేవు. \v 10 మేము గుడారాల్లో నివసించాము, మా పూర్వికుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని పూర్తిగా పాటించాము. \v 11 అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు, మేము, ‘రండి, మనం బబులోను, సిరియనుల సైన్యాల నుండి తప్పించుకోవడానికి యెరూషలేముకు వెళ్దాం’ అని చెప్పుకున్నాము. కాబట్టి మేము యెరూషలేములో ఉండిపోయాం” అని చెప్పారు. \p \v 12 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా ప్రకటించింది: \v 13 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీరు వెళ్లి యూదా ప్రజలకు, యెరూషలేములో నివసిస్తున్న వారికి ఇలా చెప్పండి, ‘మీరు గుణపాఠం నేర్చుకుని నా మాటలకు లోబడరా?’ అని యెహోవా అడుగుతున్నారు. \v 14 ‘రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షరసం త్రాగకూడదని తన వారసులకు ఆదేశించగా అది స్థిరంగా ఉంది. వారు తమ పూర్వికుల ఆజ్ఞను పాటిస్తున్నారు కాబట్టి నేటికీ వారు ద్రాక్షరసం త్రాగరు. అయితే నేను మీతో పదే పదే మాట్లాడుతున్నా, మీరు నా మాట వినట్లేదు. \v 15 నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు. \v 16 రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతివారు తమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు, కానీ ఈ ప్రజలు నా మాటకు లోబడలేదు.’ \p \v 17 “కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇలా అంటున్నారు: ‘వినండి! నేను వారితో మాట్లాడాను కాని వారు వినలేదు; నేను వారిని పిలిచాను కాని వారు జవాబివ్వలేదు. కాబట్టి నేను యూదా వారిమీదికి యెరూషలేము నివాసులందరి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’ ” \p \v 18 అప్పుడు యిర్మీయా రేకాబీయులతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మీరు మీ పూర్వికుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞకు లోబడ్డారు, అలాగే అతని ఆదేశాలన్నిటిని అనుసరించి అతడు ఆదేశించిన ప్రతిదీ మీరు చేశారు.’ \v 19 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నన్ను సేవించడానికి రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతానంలో ఒకడు ఎప్పటికీ ఉంటాడు.’ ” \c 36 \s1 యిర్మీయా గ్రంథపుచుట్టను యెహోయాకీము కాల్చివేయుట \p \v 1 యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో నాలుగో సంవత్సరంలో, యిర్మీయాకు యెహోవా నుండి ఈ మాట వచ్చింది: \v 2 “ఒక గ్రంథపుచుట్ట తీసుకుని యూదా, ఇశ్రాయేలు, ఇతర జనాంగాల గురించి యోషీయా పాలనలో నీతో మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు నేను నీతో చెప్పిన మాటలన్నీ దానిలో వ్రాయి. \v 3 బహుశా యూదా ప్రజలు నేను వారికి రప్పించాలని అనుకున్న ప్రతి విపత్తు గురించి విన్నప్పుడు వారు తమ చెడు మార్గాలను విడిచిపెడతారేమో; అప్పుడు నేను వారి దుర్మార్గాన్ని, వారి పాపాన్ని క్షమిస్తాను.” \p \v 4 కాబట్టి యిర్మీయా నేరియా కుమారుడైన బారూకును పిలిచి, యెహోవా తనతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా చెప్తుండగా, బారూకు వాటిని గ్రంథపుచుట్ట మీద వ్రాశాడు. \v 5 అప్పుడు యిర్మీయా బారూకుతో, “నేను నిర్బంధించబడ్డాను; కాబట్టి యెహోవా ఆలయానికి వెళ్లడానికి నాకు అనుమతి లేదు. \v 6 కాబట్టి ఉపవాస దినాన నీవు యెహోవా ఆలయానికి వెళ్లి, నేను చెప్పినట్లుగా నీవు గ్రంథపుచుట్టలో వ్రాసిన యెహోవా వాక్కులను ప్రజలకు చదివి వినిపించు. తమ పట్టణాల నుండి వచ్చే యూదా ప్రజలందరికి వాటిని చదివి వినిపించు. \v 7 బహుశా వారి విన్నపం యెహోవా సన్నిధిలో ఆమోదించబడి, వారు తమ చెడు మార్గాలను విడిచిపెడతారేమో, ఎందుకంటే యెహోవా ఈ ప్రజల మీదకు తీవ్రమైన కోపం ఉగ్రత వస్తాయని ప్రకటించారు.” \p \v 8 నేరియా కుమారుడైన బారూకు యిర్మీయా ప్రవక్త చెప్పినదంతా చేశాడు; యెహోవా మందిరంలో అతడు గ్రంథపుచుట్టలోని యెహోవా మాటలను చదివి వినిపించాడు. \v 9 యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో అయిదవ సంవత్సరం తొమ్మిదవ నెలలో, యెరూషలేములోని ప్రజలందరికి, యూదా పట్టణాల నుండి వచ్చిన ప్రజలందరికి యెహోవా సన్నిధిలో ఉపవాసం ఉండాలని ప్రకటించబడింది. \v 10 యెహోవా మందిరంలో కార్యదర్శియైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగా ఉన్న ప్రాంగణంలో యెహోవా మందిర క్రొత్త ద్వార ప్రవేశం దగ్గర ప్రజలందరికి వినిపించేలా బారూకు గ్రంథపుచుట్టలో నుండి యిర్మీయా చెప్పిన మాటలను చదివాడు. \p \v 11 షాఫాను మనుమడును గెమర్యా కుమారుడునైన మీకాయా ఆ గ్రంథపుచుట్టలో నుండి చదవబడిన యెహోవా చెప్పిన మాటలన్నీ విని, \v 12 అతడు రాజభవనంలోని లేఖికుని గదిలోకి వెళ్లాడు, అక్కడ అధికారులందరు అనగా లేఖికుడైన ఎలీషామా, షెమయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇంకా ఇతర అధికారులందరూ కూర్చుని ఉన్నారు. \v 13 బారూకు ఆ గ్రంథపుచుట్ట నుండి ప్రజలకు చదివి వినిపించిన ప్రతిదీ మీకాయా వారికి చెప్పిన తర్వాత, \v 14 “నీవు ఏ గ్రంథపుచుట్ట నుండి ప్రజలకు చదివి వినిపించావో దాన్ని తీసుకుని రా” అని బారూకుకు చెప్పడానికి అధికారులందరు కలిసి కూషీ కుమారుడైన షెలెమ్యా, అతని కుమారుడైన నెతన్యా, అతని కుమారుడైన యెహూదిని పంపారు. కాబట్టి నేరియా కుమారుడైన బారూకు ఆ గ్రంథపుచుట్టను తీసుకుని వారి దగ్గరకు వెళ్లాడు. \v 15 వారు అతనితో, “దయచేసి కూర్చుని, మాకు దాన్ని చదివి వినిపించండి” అని అడిగారు. \p కాబట్టి బారూకు దానిని వారికి చదివి వినిపించాడు. \v 16 వారు ఈ మాటలు విని భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుని బారూకుతో, “ఈ మాటలన్నీ మనం తప్పక రాజుకు తెలియజేయాలి” అని అన్నారు. \v 17 అప్పుడు వారు బారూకును, “నీవు ఇవన్నీ ఎలా వ్రాశావు? యిర్మీయా చెప్పాడా? మాకు చెప్పు” అని అడిగారు. \p \v 18 అందుకు బారూకు, “అవును, ఇవన్నీ అతడు చెప్తుండగా, నేను ఈ గ్రంథపుచుట్టలో వ్రాశాను” అని జవాబిచ్చాడు. \p \v 19 అప్పుడు అధికారులు బారూకుతో, “నీవు, అలాగే యిర్మీయా కూడా వెళ్లి దాక్కోండి. మీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియకూడదు” అని చెప్పారు. \p \v 20 తర్వాత వారు ఆ గ్రంథపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో పెట్టి, తన భవన ప్రాంగణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి, జరిగినదంతా ఆయనతో చెప్పారు. \v 21 అప్పుడు రాజు ఆ గ్రంథపుచుట్టను తెమ్మని యెహూదిని పంపినప్పుడు, అతడు వెళ్లి లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తెచ్చి రాజుకు, ఆయన ప్రక్కన నిలబడి ఉండిన అధికారులందరికి చదివి వినిపించాడు. \v 22 అది తొమ్మిదవ నెల కాబట్టి రాజు శీతాకాలపు భవనంలో మంటలు మండుతున్న కుంపటి ముందు కూర్చుని ఉన్నాడు. \v 23 యెహూది గ్రంథపుచుట్టలోని మూడు నాలుగు వరుసలను చదివినప్పుడల్లా, రాజు వాటిని లేఖికుని కత్తితో కోసి మండుతున్న కుంపటిలో విసురుతూ ఉన్నాడు, ఆ గ్రంథపుచుట్టను పూర్తిగా కాల్చివేసే వరకు రాజు అలాగే చేశాడు. \v 24 ఈ మాటలన్నీ విన్న రాజు గాని అతని సహాయకులెవ్వరు గాని భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు. \v 25 ఆ గ్రంథపుచుట్టను కాల్చవద్దు అంటూ ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును అభ్యర్థించారు, కాని రాజు వారి అభ్యర్థనను వినిపించుకోలేదు. \v 26 పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు. \p \v 27 యిర్మీయా చెప్తూ ఉండగా బారూకు వ్రాసిన ఆ గ్రంథపుచుట్టను రాజు కాల్చివేసినప్పుడు, యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది: \v 28 “మరో గ్రంథపుచుట్టను తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చివేసిన మొదటి గ్రంథపుచుట్టలో ఉండిన మాటలన్నీ దానిపై వ్రాయి. \v 29 అలాగే యూదా రాజైన యెహోయాకీముతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు ఆ గ్రంథపుచుట్టను కాల్చివేసి, “బబులోను రాజు ఖచ్చితంగా వచ్చి ఈ దేశాన్ని నాశనం చేస్తాడని దాని నుండి మనుష్యులను, జంతువులను తుడిచివేస్తాడని నీవు దానిపై ఎందుకు వ్రాశావు?” అని అన్నావు. \v 30 కాబట్టి యూదా రాజైన యెహోయాకీమును గురించిన యెహోవా వాక్కు ఇదే: దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీకు ఎవరూ ఉండరు, అతని శవం పగలు ఎండలో రాత్రి మంచులో పడి ఉంటుంది. \v 31 నేను అతన్ని, అతని పిల్లలను అతని సేవకులను వారి దుర్మార్గాన్ని బట్టి శిక్షిస్తాను; నేను వారి మీదికి, యెరూషలేములో నివసించేవారి మీదికి, యూదా ప్రజలమీదికి నేను వారికి వ్యతిరేకంగా ప్రకటించిన ప్రతీ విపత్తును రప్పిస్తాను, ఎందుకంటే వారు నా మాట వినలేదు.’ ” \p \v 32 కాబట్టి యిర్మీయా మరో గ్రంథపుచుట్టను తీసుకుని నేరియా కుమారుడైన బారూకు అనే లేఖికునికి ఇచ్చి, యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపుచుట్టలోని మాటలన్నిటిని యిర్మీయా చెప్తూ ఉండగా, బారూకు దానిపై వ్రాశాడు. ఆ మాటలతో పాటు అలాంటి అనేక మాటలను వ్రాశాడు. \c 37 \s1 చెరసాలలో యిర్మీయా \p \v 1 యోషీయా కుమారుడైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాకు రాజుగా నియమించాడు. అతడు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను\f + \fr 37:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కొనయా \fqa*\ft యెహోయాకీను యొక్క మరో రూపము.\ft*\f* స్థానంలో రాజయ్యాడు. \v 2 ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాటలను అతడు గాని, అతని సేవకులు గాని, దేశ ప్రజలు గాని పట్టించుకోలేదు. \p \v 3 అయితే రాజైన సిద్కియా, షెలెమ్యా కుమారుడైన యెహుకలును మయశేయా కుమారుడును యాజకుడునైన జెఫన్యాతో పాటు యిర్మీయా ప్రవక్తకు ఈ సందేశాన్ని పంపాడు: “దయచేసి మాకోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించండి.” \p \v 4 అప్పటికి యిర్మీయాను ఇంకా జైలులో పెట్టలేదు కాబట్టి ప్రజలమధ్య స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. \v 5 ఫరో సైన్యం ఈజిప్టు నుండి బయలుదేరగా, యెరూషలేమును ముట్టడించిన బబులోనీయులు ఆ వార్త విని యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిపోయారు. \p \v 6 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయా ప్రవక్తకు వచ్చింది: \v 7 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘ఫరో గురించి నన్ను విచారించడానికి నిన్ను పంపిన యూదా రాజుతో చెప్పు. మీకు మద్ధతు ఇవ్వడానికి బయలుదేరిన సైన్యం తిరిగి తన దేశమైన ఈజిప్టుకు వెళ్తుంది. \v 8 అప్పుడు బబులోనీయులు తిరిగివచ్చి ఈ పట్టణంపై దాడి చేస్తారు; వారు దానిని పట్టుకుని కాల్చివేస్తారు.’ \p \v 9 “యెహోవా ఇలా అంటున్నారు: ‘బబులోనీయులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు’ అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వారు వెళ్లరు! \v 10 మీపై దాడి చేస్తున్న బబులోనీయుల\f + \fr 37:10 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల \fqa*\ft \+xt 11|link-href="JER 37:11"\+xt* వచనంలో కూడా ఉంది\ft*\f* సైన్యం మొత్తాన్ని మీరు ఓడించినా, గాయపడిన మనుష్యులు మాత్రమే తమ గుడారాల్లో మిగిలిపోయినా, వారే బయటకు వచ్చి ఈ పట్టణాన్ని కాల్చివేస్తారు.” \p \v 11 ఫరో సైన్యాన్ని బట్టి బబులోనీయుల సైన్యం యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిన తర్వాత, \v 12 యిర్మీయా బెన్యామీను ప్రాంతంలో తన ప్రజల ఆస్తిలో తన వాటాను పొందేందుకు యెరూషలేమును విడిచి అక్కడి వెళ్లడానికి బయలుదేరాడు. \v 13 అయితే అతడు బెన్యామీను ద్వారం దగ్గరకు చేరుకున్నప్పుడు, హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు ఇరియా అనే కావలివారి దళాధిపతి ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకుని, “నీవు బబులోనీయులతో చేరిపోవడానికి వెళ్తున్నావు!” అన్నాడు. \p \v 14 “అది నిజం కాదు! నేను బబులోనీయులలో చేరడానికి వెళ్లడం లేదు” అని యిర్మీయా జవాబిచ్చాడు. కాని ఇరియా అతని మాట వినలేదు; పైగా, అతడు యిర్మీయాను బంధించి అధికారుల దగ్గరకు తీసుకువచ్చాడు. \v 15 వారు యిర్మీయా మీద కోపం తెచ్చుకుని, అతన్ని కొట్టి, కార్యదర్శియైన యోనాతాను ఇంట్లో బంధించి, ఆ ఇంటిని వారు జైలుగా చేశారు. \p \v 16 యిర్మీయా సొరంగంలో ఉన్న ఒక చెరసాలలో చాలా రోజులు ఉండిపోయాడు. \v 17 అప్పుడు రాజైన సిద్కియా అతన్ని పిలిపించి, రాజభవనానికి తీసుకువచ్చి, “యెహోవా నుండి ఏదైనా వాక్కు వచ్చిందా?” అని అడిగాడు. \p “అవును, నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు” అని యిర్మీయా జవాబిచ్చాడు. \p \v 18 అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “నన్ను జైలులో వేయడానికి నేను నీకు గాని నీ సేవకులకు గాని ఈ ప్రజలకు గాని వ్యతిరేకంగా ఏ నేరం చేశాను? \v 19 ‘బబులోను రాజు మీ మీదా, ఈ దేశం మీదా దాడి చేయడు’ అని మీకు ప్రవచించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? \v 20 అయితే నా ప్రభువా, రాజా, దయచేసి వినండి. నా విన్నపాన్ని మీ ముందుకు తేనివ్వండి: నన్ను కార్యదర్శియైన యోనాతాను ఇంటికి తిరిగి పంపవద్దు, నేను అక్కడే చనిపోతాను.” \p \v 21 రాజైన సిద్కియా యిర్మీయాను కావలివారి ప్రాంగణంలో ఉంచి, పట్టణంలోని రొట్టెలన్నీ పూర్తిగా అయిపోయే వరకు ప్రతిరోజు రొట్టెలు చేసేవారి వీధి నుండి ఒక రొట్టె ఇవ్వమని ఆజ్ఞాపించాడు. కాబట్టి యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు. \c 38 \s1 నీటి గోతిలో యిర్మీయా విసిరివేయబడుట \p \v 1 మత్తాను కుమారుడైన షెఫట్యా, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకాలు,\f + \fr 38:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యెహుకలు \fqa*\ft యూకాలు యొక్క మరో రూపం\ft*\f* మల్కీయా కుమారుడైన పషూరు యిర్మీయా ప్రజలందరితో చెప్పేది విని, \v 2 “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణంలో నివసించేవారు ఖడ్గంతో కరువుతో తెగులుతో చనిపోతారు, కానీ బబులోనీయుల\f + \fr 38:2 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల\fqa*\ft ; \+xt 18|link-href="JER 38:18"\+xt*, \+xt 19|link-href="JER 38:19"\+xt*, \+xt 23|link-href="JER 38:23"\+xt* వచనాల్లో కూడా\ft*\f* దగ్గరకు వెళ్లేవారు బ్రతుకుతారు. వారు తమ ప్రాణాలతో తప్పించుకుని బ్రతుకుతారు; వారు జీవిస్తారు.’ \v 3 యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణం ఖచ్చితంగా బబులోను రాజు సైన్యానికి అప్పగించబడుతుంది, అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు’ ” అని చెప్పడం విన్నారు. \p \v 4 అప్పుడు ఆ అధికారులు రాజుతో, “ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఇతడు ఈ పట్టణంలో మిగిలి ఉన్న సైనికులను, అలాగే ప్రజలందరినీ తాను వారితో చెప్పే మాటల ద్వార నిరుత్సాహపరుస్తున్నాడు. ఈ వ్యక్తి ఈ ప్రజల క్షేమం కోరడంలేదు, వారి పతనాన్ని కోరుతున్నాడు.” \p \v 5 అందుకు రాజైన సిద్కియా, “అతడు మీ ఆధీనంలో ఉన్నాడు, రాజు మీకు వ్యతిరేకంగా ఏమి చేయడు” అన్నాడు. \p \v 6 కాబట్టి వారు యిర్మీయాను తీసుకెళ్లి, చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజు కుమారుడైన మల్కీయా నీటి గోతిలోకి దింపినప్పుడు దాంట్లో వారు యిర్మీయాను త్రాళ్లతో నీటి గోతిలోకి దించారు; దాంట్లో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది, యిర్మీయా ఆ బురదలో మునిగిపోయాడు. \p \v 7 అయితే రాజభవనంలో అధికారిగా\f + \fr 38:7 \fr*\ft లేదా \ft*\fqa నపుంసకుడు\fqa*\f* ఉన్న ఎబెద్-మెలెకు అనే ఒక కూషీయుడు\f + \fr 38:7 \fr*\ft బహుశ ఎగువ నైలు ప్రాంతానికి చెందిన వాడు కావచ్చు\ft*\f* యిర్మీయాను నీటి గోతిలో వేశారు అని విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. \v 8 ఎబెద్-మెలెకు రాజభవనంలో నుండి రాజు దగ్గరకు వెళ్లి రాజుతో, \v 9 “రాజా! నా ప్రభువా! ఈ మనుష్యులు యిర్మీయా ప్రవక్త విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. వీరు అతన్ని గోతిలో వేశారు, పట్టణంలో ఇక ఆహారం లేకుండా పోతే అక్కడ అతడు ఆకలితో చనిపోతాడు” అని మనవి చేశాడు. \p \v 10 అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్-మెలెకుకు, “నీవు ఇక్కడినుండి ముప్పది మందిని తీసుకెళ్లి, యిర్మీయా ప్రవక్తను చావకముందే ఆ గోతిలో నుండి బయటకు తీయించు” అని ఆజ్ఞాపించాడు. \p \v 11 కాబట్టి ఎబెద్-మెలెకు ఆ మనుష్యులను తనతో పాటు తీసుకుని రాజభవనంలోని ఖజానా క్రింద ఉన్న గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడినుండి కొన్ని పాత గుడ్డలు చిరిగిన బట్టలు తీసుకుని, నీటి గోతిలో ఉన్న యిర్మీయాకు వాటిని త్రాళ్లతో దించాడు. \v 12 కూషీయుడైన ఎబెద్-మెలెకు యిర్మీయాతో, “ఈ పాత గుడ్డలు, చిరిగిన బట్టలు త్రాళ్లగా చేయడానికి నీ చేతుల క్రింద పెట్టుకో” అన్నాడు. యిర్మీయా అలాగే చేశాడు, \v 13 వారు అతన్ని త్రాళ్లతో పైకి లాగి బందీకానా నుండి పైకి లేపారు. యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు. \s1 సిద్కియా యిర్మీయాను మళ్ళీ ప్రశ్నించాడు \p \v 14 అప్పుడు రాజైన సిద్కియా యిర్మీయా ప్రవక్తను పిలిపించి, యెహోవా మందిరంలోని మూడవ ద్వారం దగ్గరకు అతన్ని రప్పించాడు. రాజు యిర్మీయాతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతున్నాను; నా దగ్గర ఏమీ దాచకుండ జవాబివ్వాలి” అని అన్నాడు. \p \v 15 అందుకు యిర్మీయా సిద్కియాతో, “ఒకవేళ నేను మీరు నిజం చెబితే, మీరు నన్ను చంపరా? నేను ఒకవేళ మీకు సలహా ఇచ్చినా మీరు నా మాట వినరు.” \p \v 16 అయితే సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఈ ప్రమాణం చేశాడు: “మనకు ఊపిరినిచ్చే, సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, నిన్ను నేను చంపను, నిన్ను చంపాలనుకున్న వారికి అప్పగించను.” \p \v 17 అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: ‘నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోతే, నీ ప్రాణం దక్కుతుంది, ఈ పట్టణం కూడా అగ్నితో కాల్చివేయబడదు; నీవు, నీ కుటుంబం బ్రతుకుతారు. \v 18 అయితే ఒకవేళ నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోకపోతే, ఈ పట్టణం బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది, వారు దానిని కాల్చివేస్తారు; అప్పుడు కనీసం నీవు కూడా వారి నుండి తప్పించుకోలేవు.’ ” \p \v 19 సిద్కియా రాజు యిర్మీయాతో, “బబులోనీయుల దగ్గరకు వెళ్లిపోయిన యూదుల గురించి నేను భయపడుతున్నాను, ఎందుకంటే బబులోనీయులు నన్ను వారి చేతికి అప్పగిస్తే, వారు నన్ను ఘోరంగా అవమానిస్తారు” అని అన్నాడు. \p \v 20 “వారు మిమ్మల్ని అప్పగించరు; నేను చెప్పేది చేస్తూ యెహోవాకు లోబడండి. అప్పుడు అది మీకు అంతా మంచే జరుగుతుంది, మీరు ప్రాణాలతో ఉంటారు” అని యిర్మీయా జవాబిచ్చాడు. \v 21 కానీ మీరు లొంగిపోవడానికి నిరాకరిస్తే, యెహోవా నాకు ఇలా తెలియజేశారు: \v 22 యూదారాజు యొక్క రాజభవనంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను రాజు యొక్క అధికారుల దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు ఆ స్త్రీలు నిన్ను చూసి వెటకారంగా ఇలా అంటారు: \q1 “ ‘మీ నమ్మకమైన స్నేహితులు \q2 మిమ్మల్ని తప్పుదారి పట్టించారు, వారు మిమ్మల్ని అప్పగించారు. \q1 మీ పాదాలు బురదలో దిగబడినప్పుడు; \q2 మీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారు.’ \p \v 23 “మీ భార్యాపిల్లలందరూ బబులోనీయుల దగ్గరికి రప్పించబడతారు. స్వయంగా మీరే వారి చేతుల నుండి తప్పించుకోలేరు; మీరు బబులోను రాజు చేత బంధించబడతారు; ఈ పట్టణం కాల్చివేయబడుతుంది.” \p \v 24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో, “ఈ సంభాషణ గురించి ఎవరికీ తెలియకూడదు, తెలిస్తే నీవు చస్తావు. \v 25 నేను నీతో మాట్లాడానని అధికారులు విని, నీ దగ్గరికి వచ్చి, ‘మీరు రాజుతో ఏం మాట్లాడారో, రాజు మీతో ఏం మాట్లాడారో మాకు చెప్పండి. మా దగ్గర దాచవద్దు, లేకుంటే మేము మిమ్మల్ని చంపుతాము’ \v 26 అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘నన్ను యోనాతాను ఇంటికి తిరిగి పంపించవద్దని రాజు దగ్గర విన్నవించుకున్నాను.’ ” \p \v 27 అధికారులందరూ యిర్మీయా దగ్గరకు వచ్చి అతన్ని ప్రశ్నించగా, అతడు రాజు వారితో చెప్పమని తనకు ఆదేశించినదంతా చెప్పాడు. కాబట్టి వారు అతనితో ఇంకేమి అనలేదు, ఎందుకంటే రాజుతో అతనికి ఏమి సంభాషణ జరిగిందో ఎవరూ వినలేదు. \p \v 28 యెరూషలేము స్వాధీనమైపోయిన రోజు వరకు యిర్మీయా, కావలివారి ప్రాంగణంలోనే ఉన్నాడు. \s1 యెరూషలేము పతనం \p యెరూషలేము ఈ విధంగా ఆక్రమించబడింది: \c 39 \nb \v 1 యూదా రాజైన సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం పదవ నెలలో, బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో వచ్చి యెరూషలేమును ముట్టడించాడు. \v 2 సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం నాలుగవ నెల తొమ్మిదవ రోజు పట్టణ ప్రాకారం విరగ్గొట్టబడింది. \v 3 అప్పుడు బబులోను రాజు అధికారులు శమ్గరుకు చెందిన నెర్గల్-షారెజెరు, ముఖ్య అధికారియైన నెబో-శర్సెకీము,\f + \fr 39:3 \fr*\ft లేదా \ft*\fqa శమ్గర్-నెబో\fqa*\f* వచ్చి మధ్య ద్వారంలో కూర్చున్నారు. నెర్గల్-షారెజెరు ఒక ఉన్నతాధికారి, మిగిలినవారు బబులోను రాజు ఇతర అధికారులు. \v 4 యూదా రాజైన సిద్కియా, అతని సైనికులందరు వారిని చూసి పారిపోయారు; రాత్రివేళ వారు రాజు తోటలోని మార్గం నుండి రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పట్టణాన్ని విడిచిపెట్టి, అరాబా\f + \fr 39:4 \fr*\ft లేదా \ft*\fqa యొర్దాను లోయ\fqa*\f* వైపు బయలుదేరి వెళ్లారు. \p \v 5 అయితే బబులోను\f + \fr 39:5 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల\fqa*\f* సైన్యం వారిని వెంటాడి యెరికో సమతల మైదానంలో ఉన్న సిద్కియాను పట్టుకుంది. వారు అతన్ని పట్టుకుని హమాతు దేశంలోని రిబ్లాలో ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు. \v 6 అక్కడ బబులోను రాజు రిబ్లాలో సిద్కియా కుమారులను, అలాగే యూదా పెద్దలందరినీ అతని కళ్లముందే చంపేశాడు. \v 7 అప్పుడు అతడు సిద్కియా కళ్లు ఊడదీసి, అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు. \p \v 8 బబులోనీయులు\f + \fr 39:8 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయులు\fqa*\f* రాజభవనాలన్నిటిని ప్రజల ఇళ్ళను తగలబెట్టి యెరూషలేము గోడలను పడగొట్టారు. \v 9 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలి ఉన్నవారిని, ద్రోహులై తమ రాజును విడిచి అతనితో చేరిన వారిని, మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు. \v 10 అయితే రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను నిరుపేదలను యూదా దేశంలో విడిచిపెట్టి వారికి ద్రాక్షతోటలు పొలాలు ఇచ్చాడు. \p \v 11 ఇప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు యిర్మీయా గురించి రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు: \v 12 “అతన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోవాలి; అతనికి హాని చేయవద్దు, అతడు ఏమి అడిగినా అతని కోసం చేయాలి.” \v 13 కాబట్టి రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను, ముఖ్య అధికారి నెబూషజ్బాను, ఉన్నతాధికారియైన నెర్గల్-షారెజెరు, బబులోను రాజు ఇతర అధికారులందరూ, \v 14 మనుష్యులను పంపి యిర్మీయాను కావలివారి ప్రాంగణం నుండి బయటకు తీసుకువచ్చారు. అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లమని షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యాకు అప్పగించారు. కాబట్టి యిర్మీయా తన సొంత ప్రజల మధ్యనే ఉండిపోయాడు. \p \v 15 యిర్మీయా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉన్నప్పుడు, అతనికి యెహోవా వాక్కు వచ్చి: \v 16 “వెళ్లి కూషీయుడైన ఎబెద్-మెలెకుతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణానికి వ్యతిరేకంగా చెప్పిన నా మాటలను అనగా మేలు గురించి కాదు కాని కీడు గురించి చెప్పిన మాటలను నేను నెరవేర్చబోతున్నాను. ఆ సమయంలో అవి మీ కళ్లముందు నెరవేరుతాయి. \v 17 అయితే ఆ రోజు నేను నిన్ను రక్షిస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు; నీవు భయపడేవారి చేతికి నీవు అప్పగించబడవు. \v 18 నేను నిన్ను రక్షిస్తాను; నీవు నన్ను నమ్మావు కాబట్టి నీవు ఖడ్గానికి బలి కాకుండ, నీవు ప్రాణంతో తప్పించుకుంటావు అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \c 40 \s1 యిర్మీయా విడుదల \p \v 1 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను రామాలో విడిచిపెట్టిన తర్వాత యిర్మీయాకు యెహోవా నుండి వాక్కు వచ్చింది. నెబూజరదాను యెరూషలేము, యూదా నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్తున్న వారిలో గొలుసులతో బంధించబడి ఉన్న యిర్మీయాను చూశాడు. \v 2 రాజ రక్షక దళాధిపతి యిర్మీయాతో, “నీ దేవుడైన యెహోవా ఈ స్థలానికి విపత్తు రప్పిస్తానని ప్రకటించారు కదా. \v 3 ఇప్పుడు యెహోవా దాన్ని రప్పించి తాను చెప్పినట్లే ఆయన చేశారు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయనకు లోబడలేదు కాబట్టి ఇదంతా జరిగింది. \v 4 అయితే ఈ రోజు నేను నీ మణికట్టుకు ఉన్న సంకెళ్ళ నుండి నిన్ను విడిపిస్తున్నాను. నీకు ఇష్టమైతే నాతో పాటు బబులోనుకు రా, నేను నిన్ను చూసుకుంటాను; ఒకవేళ నాతో రావడం సరియైనది కాదని నీకు అనిపిస్తే రావద్దు. చూడు, దేశం మొత్తం నీ ముందు ఉంది; నీకిష్టమైన చోటికి వెళ్లు” అన్నాడు. \v 5 అయితే, యిర్మీయా బయలుదేరక ముందు,\f + \fr 40:5 \fr*\ft లేదా \ft*\fq యిర్మీయా \fq*\fqa జవాబివ్వక ముందు\fqa*\f* నెబూజరదాను, “బబులోను రాజు యూదా పట్టణాలపై నియమించిన షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు తిరిగివెళ్లి, అతనితో పాటు ప్రజలమధ్య నివసించు, లేదా ఎక్కడికి వెళ్లడం సరియైనది అని నీకు అనిపిస్తే అక్కడికి వెళ్లు” అని చెప్పాడు. \p తర్వాత దళాధిపతి అతనికి ఆహారపదార్థాలు బహుమానం ఇచ్చి అతన్ని పంపించాడు. \v 6 కాబట్టి యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి వెళ్లి, దేశంలో మిగిలిపోయిన ప్రజలమధ్య నివసించాడు. \s1 గెదల్యా హత్య \p \v 7 బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడని, అలాగే బబులోనుకు బందీలుగా వెళ్లకుండా మిగిలిన నిరుపేదలైన పురుషులు, స్త్రీలు, పిల్లల మీద అధికారిగా నియమించాడని చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న సైన్య అధిపతులందరు, వారి మనుష్యులు విన్నప్పుడు, \v 8 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహానాను యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏఫా కుమారులు, మయకాతీయుని కుమారుడైన యెజన్యా\f + \fr 40:8 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యజన్యా \fqa*\ft యెజన్యా యొక్క మరో రూపం\ft*\f* వారి మనుష్యులు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చారు. \v 9 అప్పుడు షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యా ప్రమాణం చేసి, వారికి వారి భద్రత గురించి నమ్మకం కలిగించడానికి, “బబులోనీయులకు\f + \fr 40:9 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయులకు \fqa*\ft \+xt 10|link-href="JER 40:10"\+xt* వచనంలో కూడా ఉంది\ft*\f* సేవ చేయడానికి మీరు భయపడకండి; దేశంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది. \v 10 మన దగ్గరకు వచ్చే బబులోనీయుల ముందు మీకు ప్రాతినిధ్యం వహించడానికి స్వయంగా నేనే మిస్పాలో ఉంటాను, అయితే మీరు ద్రాక్షరసాన్ని, వేసవికాలపు పండ్లను, ఒలీవ నూనెను సేకరించి, వాటిని మీ పాత్రల్లో నిల్వజేయండి, మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివసించండి” అని అన్నాడు. \p \v 11 బబులోను రాజు యూదాలో కొందరిని విడిచిపెట్టి షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడునైన గెదల్యాను వారి మీద అధిపతిగా నియమించాడని మోయాబు, అమ్మోను, ఎదోము ఇతర దేశాల్లో ఉన్న యూదులందరు విన్నప్పుడు, \v 12 వారందరూ వారు చెదరగొట్టబడిన అన్ని దేశాల నుండి యూదా దేశానికి, మిస్పాలోని గెదల్యా దగ్గరకు తిరిగి వచ్చారు. వారు సమృద్ధిగా ద్రాక్షరసాన్ని వేసవికాలపు పండ్లను సేకరించారు. \p \v 13 కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చి, \v 14 అతనితో, “అమ్మోనీయుల రాజైన బాలిస్ నిన్ను చంపడానికి నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపాడని నీకు తెలియదా?” అని అన్నారు. కాని అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాటలు నమ్మలేదు. \p \v 15 అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడుతూ, “నేను వెళ్లి ఎవరికీ తెలియకుండా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపుతాను. అతడు ఎందుకు నీ ప్రాణాన్ని తీయాలి, అలా చేసి, నీ చుట్టూ ఉన్న యూదులందరు చెదిరిపోయేలా, యూదా వారిలో మిగిలినవారు నాశనమయ్యేలా ఎందుకు చేయాలి?” \p \v 16 అయితే అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడు యోహానానుతో, “అలాంటి పని చేయకు! ఇష్మాయేలు గురించి మీరు చెప్పేది నిజం కాదు” అన్నాడు. \c 41 \p \v 1 ఏడవ నెలలో, రాజవంశానికి చెందిన వాడు, రాజు అధికారులలో ఒకడైన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొని మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు వచ్చాడు. అక్కడ వారు కలిసి భోజనం చేస్తుండగా, \v 2 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న పదిమంది మనుష్యులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధిపతిగా నియమించిన షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గంతో కొట్టి చంపారు. \v 3 అంతటితో ఆగక, మిస్పాలో గెదల్యా దగ్గర ఉన్న యూదులందరిని, బబులోనీయుల\f + \fr 41:3 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల\fqa*\f* సైనికులను ఇష్మాయేలు చంపివేశాడు. \p \v 4 గెదల్యా హత్య జరిగిన మరుసటిరోజు, ఆ విషయం ఎవరికీ తెలియకముందే, \v 5 తమ గడ్డాలు గీసుకుని, బట్టలు చింపుకుని, తమను తాము గాయపరచుకున్న ఎనభైమంది షెకెము, షిలోహు, సమరయ నుండి భోజనార్పణలు, ధూపం తీసుకుని యెహోవా ఆలయానికి వచ్చారు. \v 6 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని కలుసుకోడానికి మిస్పా నుండి ఏడుస్తూనే వెళ్లాడు. అతడు వారిని కలుసుకున్నప్పుడు, అతడు వారితో, “అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి రండి” అని అన్నాడు. \v 7 వారు పట్టణంలోకి వెళ్లినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న మనుష్యులు వారిని చంపి గోతిలో పడేశారు. \v 8 అయితే వారిలో పదిమంది ఇష్మాయేలుతో, “మమ్మల్ని చంపకు! మా దగ్గర గోధుమలు, యవలు, ఒలీవనూనె తేనె ఉన్నాయి, వాటిని పొలంలో దాచిపెట్టాము” అని అన్నారు. కాబట్టి అతడు వారిని మిగతా వారితోపాటు చంపలేదు. \v 9 అతడు గెదల్యాతో పాటు చంపిన మనుష్యులందరి మృతదేహాలను పడవేసిన గోతిని గతంలో రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయెషా నుండి కాపాడుకోడానికి త్రవ్వించాడు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దానిని మృతదేహాలతో నింపాడు. \p \v 10 ఇష్మాయేలు మిస్పాలో ఉన్న మిగిలిన ప్రజలందరినీ రాజకుమార్తెలతో పాటు అక్కడ మిగిలిపోయిన వారందరినీ బందీలుగా చేశాడు. రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారి మీద అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని బందీలుగా తీసుకుని అమ్మోనీయుల దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు. \p \v 11 కారేహ కుమారుడైన యోహానాను, అతనితో ఉన్న సైన్య అధికారులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన నేరాల గురించి విని, \v 12 తమ సైనికులందరిని తీసుకుని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్లారు. వారు గిబియోనులోని పెద్ద కొలను దగ్గర అతన్ని పట్టుకున్నారు. \v 13 ఇష్మాయేలు అతనితో ఉన్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులను చూసినప్పుడు, వారు సంతోషించారు. \v 14 మిస్పాలో ఇష్మాయేలు బందీలుగా పట్టుకున్న ప్రజలంతా తిరిగి కారేహ కుమారుడైన యోహానాను దగ్గరికి వెళ్లారు. \v 15 అయితే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతని ఎనిమిది మంది మనుష్యులు యోహానాను నుండి తప్పించుకుని అమ్మోనీయుల దగ్గరకు పారిపోయారు. \s1 ఈజిప్టుకు పారిపోవుట \p \v 16 అప్పుడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను హత్యచేసిన తర్వాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఇష్మాయేలు దగ్గర ప్రాణాలతో మిగిలి ఉన్న ప్రజలందరినీ అనగా గిబియోను నుండి ఇష్మాయేలు తీసుకెళ్లిన సైనికులను, స్త్రీలను, పిల్లలను ఆస్థాన అధికారులను తిరిగి తీసుకువచ్చారు. \v 17 వారు బబులోనీయుల నుండి తప్పించుకోవడానికి వారు ఈజిప్టుకు వెళ్లే మార్గంలో బేత్లెహేము సమీపంలోని గెరూత్-కిమ్హాము దగ్గర ఆగారు. \v 18 వారు బబులోను రాజు దేశానికి అధిపతిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపాడు కాబట్టి వారు బబులోనీయులకు భయపడ్డారు. \c 42 \p \v 1 అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను, హోషయా కుమారుడైన యెజన్యాతో\f + \fr 42:1 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa అజర్యా; \fqa*\ft అలాగే \+xt 43:2\+xt* \ft*\ft లో కూడా ఉంది\ft*\f* సహా సైన్య అధికారులందరూ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరూ, \v 2 యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, “దయచేసి మా విన్నపం విని, ఈ మిగిలిన వారందరి కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే నీవిప్పుడు చూస్తున్నట్లుగా, మేము ఒకప్పుడు చాలా మందిమే అయినప్పటికీ, ఇప్పుడు కొద్ది మందిమి మాత్రమే మిగిలి ఉన్నాము. \v 3 మేము ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో మాకు తెలియజేయమని నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు” అని అన్నారు. \p \v 4 “నేను నీ మాట విన్నాను, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన యెహోవాకు తప్పక ప్రార్థిస్తాను; యెహోవా చెప్పినదంతా నేను మీకు చెప్తాను మీ నుండి ఏమీ దాచను” అని యిర్మీయా ప్రవక్త జవాబిచ్చాడు. \p \v 5 అప్పుడు వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీ దేవుడైన యెహోవా నీ ద్వారా మాకు తెలియజేసిన మాటల ప్రకారం మేము చేయకపోతే, యెహోవాయే మాకు వ్యతిరేకంగా నిజమైన, నమ్మకమైన సాక్షిగా ఉండును గాక. \v 6 అది మాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మేము నిన్ను పంపుతున్న మా దేవుడైన యెహోవాకు లోబడతాము. మా దేవుడైన యెహోవాకు లోబడితే మాకు మంచే జరుగుతుంది.” \p \v 7 పది రోజుల తర్వాత యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది. \v 8 కాబట్టి అతడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్య అధికారులందరినీ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరినీ పిలిచాడు. \v 9 అతడు వారితో, “మీ విన్నపాన్ని తెలియజేయడానికి మీరు ఎవరి దగ్గరకు నన్ను పంపించారో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: \v 10 ‘మీరు ఈ దేశంలోనే ఉంటే, నేను మిమ్మల్ని కడతాను, కూల్చివేయను; నేను మిమ్మల్ని నాటుతాను, పెరికివేయను, ఎందుకంటే నేను మీకు కలిగించిన విపత్తు గురించి బాధపడ్డాను. \v 11 ఇప్పుడు మీరు ఎవరికైతే భయపడుతున్నారో ఆ బబులోను రాజుకు మీరు భయపడవద్దు. అతనికి భయపడవద్దు, అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను అతని చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. \v 12 నేను మీమీద కనికరం చూపిస్తాను, అప్పుడు అతడు మీమీద కనికరం చూపి, మిమ్మల్ని మీ దేశానికి తిరిగి పంపుతాడు.’ \p \v 13 “అయితే, ‘మేము ఈ దేశంలో ఉండము’ అని చెప్పి, మీ దేవుడైన యెహోవాకు అవిధేయత చూపితే, \v 14 ఒకవేళ మీరు, ‘వద్దు, మేము ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసిస్తాము. మేము యుద్ధం చూడం, బూరధ్వని వినం, రొట్టెల కోసం ఆకలితో ఉండం’ అని అంటే, \v 15 యూదాలో మిగిలి ఉన్నవారలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఒకవేళ మీరు ఈజిప్టుకు వెళ్లి, అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొని ఉంటే, \v 16 మీరు ఏ ఖడ్గానికి భయపడతారో అది అక్కడ మిమ్మల్ని పట్టుకుంటుంది, మీరు భయపడే కరువు ఈజిప్టులోకి కూడా మిమ్మల్ని వెంటపడుతుంది, అక్కడే మీరు చనిపోతారు. \v 17 నిజానికి, ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొనిన వారందరూ ఖడ్గం, కరువు, తెగులు వల్ల చస్తారు; నేను వారి మీదికి తెచ్చే విపత్తు నుండి వారిలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడలేరు.’ \v 18 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘యెరూషలేములో నివసించేవారి మీద నా కోపం, ఉగ్రత ఎలా కుమ్మరించానో, మీరు ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా నా కోపం మీమీద అలాగే కుమ్మరిస్తాను. మీరు శాపగ్రస్తులుగా,\f + \fr 42:18 \fr*\ft అంటే, మీ పేరు ఇతరులను శపించడానికి వాడబడుతుంది; (\+xt యిర్మీయా 29:22\+xt* చూడండి); లేదా ఇతరులు మీరు శపించబడాలని చూస్తారు.\ft*\f* భయానకంగా, శాపంగా, నిందగా అవుతారు; మీరు ఈ స్థలాన్ని మళ్ళీ చూడలేరు.’ \p \v 19 “యూదాలో మిగిలి ఉన్నవారలారా, ‘ఈజిప్టుకు వెళ్లవద్దు’ అని యెహోవా మీతో చెప్పారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి: \v 20 మీరు నన్ను మీ దేవుడైన యెహావా దగ్గరకు పంపి, ‘మాకోసం మా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి, ఆయన చెప్పే ప్రతిదీ మాతో చెప్పు, మేము అలాగే చేస్తాము’ అని చెప్పి మీరు ఘోరమైన తప్పు చేశారని గుర్తుంచుకోండి. \v 21 ఈ రోజు నేను మీతో చెప్పాను, కానీ మీకు చెప్పమని నన్ను పంపిన వాటన్నిటిలో దేనికి మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు. \v 22 కాబట్టి ఇప్పుడు ఈ విషయం తప్పక గుర్తుంచుకోండి: మీరు ఎక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా మీరు ఖడ్గం, కరువు, తెగులు వల్ల చనిపోతారు.” \c 43 \p \v 1 వారి దేవుడైన యెహోవా వారికి చెప్పమని తెలియజేసిన వాక్కులన్నిటిని యిర్మీయా ప్రజలకు చెప్పడం ముగించిన తర్వాత ఏ వాక్కులు చెప్పమని యెహోవా అతన్ని వారి దగ్గరకు పంపాడో ఆ వాక్కులన్నిటిని చెప్పిన తర్వాత, \v 2 హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా గర్విష్ఠులైన కొందరు యిర్మీయాతో, “నీవు అబద్ధం చెప్తున్నావు! ‘మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడకూడదు’ అని చెప్పమని మా దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. \v 3 అయితే నేరియా కుమారుడైన బారూకు మమ్మల్ని బబులోనీయులకు\f + \fr 43:3 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయులకు\fqa*\f* అప్పగించమని నిన్ను మా మీదికి రెచ్చగొడుతున్నాడు, అలా చేస్తే వారు మమ్మల్ని చంపుతారు లేదా బబులోనుకు బందీలుగా తీసుకెళ్తారు” అని అన్నారు. \p \v 4 కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్య అధికారులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండాలి అనే యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించారు. \v 5 అందుకు బదులుగా, కారేహ కుమారుడైన యోహానాను సైన్య అధికారులందరూ ఆయా దేశాలకు పారిపోయి యూదా దేశానికి తిరిగివచ్చిన మిగిలి ఉన్న యూదా ప్రజలందరిని తీసుకెళ్లారు. \v 6 షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యా దగ్గర రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను విడిచిపెట్టిన వారందరినీ అనగా పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను కూడా వారు తీసుకెళ్లారు. అలాగే వారు ప్రవక్తయైన యిర్మీయాను, నేరియా కుమారుడైన బారూకును తమ వెంట తీసుకెళ్లారు. \v 7 వారు యెహోవాకు లోబడక ఈజిప్టులో ప్రవేశించి, తహ్పన్హేసు వరకు వెళ్లారు. \p \v 8 తహ్పన్హేసులో యిర్మీయాకు యెహోవా వాక్కు ఇలా వచ్చింది: \v 9 “యూదులు చూస్తుండగానే, నీతో పాటు కొన్ని పెద్ద రాళ్లను తీసుకెళ్లి, తహ్పన్హేసులోని ఫరో రాజభవనం ద్వారం దగ్గర ఉన్న ఇటుక కాలిబాటలో మట్టిలో పాతిపెట్టు. \v 10 అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను నా సేవకుడును బబులోను రాజైన నెబుకద్నెజరును పిలిపించి, నేను ఇక్కడ పాతిపెట్టిన ఈ రాళ్లపై అతని సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాను; అతడు వాటి మీద తన రాజ మండపాన్ని వేస్తాడు. \v 11 అతడు వచ్చి ఈజిప్టుపై దాడి చేసి, చావవలసినవారు చనిపోయేలా, బందీలుగా వెళ్లవలసినవారు బందీలుగా వెళ్లేలా, ఖడ్గానికి బలి కావలసినవారిని ఖడ్గం పాలు అయ్యేలా చేస్తాడు. \v 12 అతడు ఈజిప్టు దేవతల ఆలయాలకు నిప్పంటిస్తాడు; అతడు వారి దేవాలయాలను కాల్చివేస్తాడు వారి దేవుళ్ళను బందీగా తీసుకుంటాడు. ఒక గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పేళ్లను దులిపివేసినట్లు అతడు ఈజిప్టును శుభ్రంగా దులిపివేసి అక్కడినుండి సమాధానంగా వెళ్లిపోతాడు. \v 13 అక్కడ ఈజిప్టులోని బేత్-షెమెషులో ఉన్న సూర్య\f + \fr 43:13 \fr*\ft లేదా \ft*\fqa హెలియోపొలిస్\fqa*\f* దేవాలయంలో పవిత్ర స్తంభాలను పడగొట్టి, ఈజిప్టు దేవతల ఆలయాలను కాల్చివేస్తాడు.’ ” \c 44 \s1 విగ్రహారాధన వలన విపత్తు \p \v 1 ఈజిప్టులోని మిగ్దోలు, తహ్పన్హేసు, మెంఫిసులో, పత్రూసులో నివసిస్తున్న యూదులందరి గురించి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: \v 2 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: యెరూషలేము మీదా యూదా పట్టణాలన్నింటి మీదా నేను తెచ్చిన మహా విపత్తును మీరు చూశారు. వారు చేసిన దుర్మార్గం కారణంగా నేడు అవి నిర్జనమై శిథిలావస్థలో ఉన్నాయి. \v 3 వారికి గాని, మీకు గాని, మీ పూర్వికులకు గాని ఎన్నడూ తెలియని ఇతర దేవతలకు వారు ధూపం వేసి, పూజించి వారు నా కోపాన్ని రెచ్చగొట్టారు. \v 4 ‘నేను అసహ్యించుకునే ఈ అసహ్యకరమైన పనిని చేయవద్దు!’ అని చెప్పమని మళ్ళీ మళ్ళీ నేను నా సేవకులైన ప్రవక్తలను పంపాను, వారు వెళ్లి చెప్పారు. \v 5 కానీ వారు వినలేదు, అసలు పట్టించుకోలేదు. వారు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు, ఇతర దేవతలకు ధూపం వేయడం ఆపలేదు. \v 6 కాబట్టి, నా తీవ్రమైన కోపం యూదా పట్టణాల మీదా, యెరూషలేము వీధుల మీదా కుమ్మరించబడి వాటిని నేటి వరకు పాడైపోయిన శిథిలాలుగా మిగిల్చింది. \p \v 7 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: యూదాలో స్త్రీలూ, పురుషులు, పిల్లలు, పసిపిల్లలు ఎవరూ ఉండకుండా నిర్మూలం అయ్యేలా, మీలో ఎవరూ మిగలకుండా మీ మీదికి మీరే విపత్తు ఎందుకు తెచ్చుకుంటున్నారు? \v 8 మీరు నివసించడానికి వచ్చిన ఈజిప్టులో ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ, మీ చేతులు చేసిన వాటితో ఎందుకు నా కోపాన్ని రెచ్చగొడుతున్నారు? మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు, భూమిపై ఉన్న అన్ని దేశాల మధ్య మిమ్మల్ని మీరు ఒక శాపంగా చేసుకుంటారు, అవమానం పాలవుతారు. \v 9 మీ పూర్వికులు, యూదా రాజులు, రాణులు చేసిన దుర్మార్గాన్ని, యూదా దేశంలో, యెరూషలేము వీధుల్లో మీరు, మీ భార్యలు చేసిన దుర్మార్గాన్ని మీరు మరచిపోయారా? \v 10 ఈ రోజు వరకు వారు తమను తాము తగ్గించుకోలేదు, గౌరవం చూపించలేదు, నేను మీ ముందు, మీ పూర్వికుల ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను మీరు అనుసరించలేదు. \p \v 11 “కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మీదికి విపత్తు తెచ్చి యూదా అంతటిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. \v 12 ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకున్న యూదా వారిలో మిగిలి ఉన్నవారిని నేనే అక్కడికి తీసుకువెళ్తాను. వారంతా ఈజిప్టులో నశిస్తారు; వారు ఖడ్గం వల్ల చనిపోతారు లేదా కరువుతో చనిపోతారు. సామాన్యుల నుండి గొప్పవారి వరకు, వారు ఖడ్గం చేత గాని కరువుచేత గాని చనిపోతారు. వారు శాపంగాను, భయం పుట్టించే వారుగాను; ఒక శాపంగాను నిందకు కారణమైనవారిగాను అవుతారు. \v 13 నేను యెరూషలేమును ఎలా శిక్షించానో ఈజిప్టులో నివసించేవారిని కూడా ఖడ్గంతో, కరువుతో, తెగులుతో అలాగే శిక్షిస్తాను. \v 14 ఈజిప్టులో నివసించడానికి వెళ్లిన యూదా వారిలో మిగిలి ఉన్న వారెవరూ తప్పించుకోలేరు, ఎక్కడికైతే తిరిగివెళ్లి జీవించాలని అనుకుంటున్నారో, ఆ యూదా దేశానికి ప్రాణాలతో తిరిగి వెళ్లరు; పారిపోయిన కొంతమంది తప్ప ఎవరూ తిరిగి వెళ్లరు.” \p \v 15 అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తున్నారని తెలిసిన పురుషులు, అక్కడ ఉన్న స్త్రీలందరు పెద్ద సమాజంగా చేరి దిగువ ఎగువ ఈజిప్టులో అనగా పత్రూసులో నివసిస్తున్న ప్రజలందరూ యిర్మీయాతో ఇలా అన్నారు, \v 16 “యెహోవా పేరిట నీవు మాతో చెప్పిన సందేశాన్ని మేము వినము. \v 17 ఖచ్చితంగా మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాము: మేము, మా పూర్వికులు, మా రాజులు మా అధికారులు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్లుగా మేము కూడా ఆకాశ రాణికి ధూపం వేస్తాము ఆమెకు పానార్పణలు అర్పిస్తాము. ఆ సమయంలో మాకు పుష్కలంగా ఆహారం ఉండింది, మేము బాగున్నాం, ఎలాంటి హాని జరగలేదు. \v 18 ఆకాశ రాణికి ధూపం వేయడం ఆమెకు పానార్పణలు అర్పించడం మానివేసినప్పటి నుండి మా దగ్గర ఏమి లేకుండా పోయింది, మేము ఖడ్గం చేత కరువుచేత నాశనమవుతున్నాము.” \p \v 19 ఆ స్త్రీలు ఇంకా ఇలా అన్నారు: “మేము ఆకాశ రాణికి ధూపం వేసి, ఆమెకు పానార్పణలు అర్పించినప్పుడు, మేము ఆమె ప్రతిమకు నచ్చిన రొట్టెలు చేసి, ఆమెకు పానార్పణలు అర్పిస్తున్నామని మా భర్తలకు తెలియదా?” అని అన్నారు. \p \v 20 అప్పుడు యిర్మీయా తనకు జవాబిస్తున్న స్త్రీ పురుషులందరితో ఇలా అన్నాడు: \v 21 “మీరు, మీ పూర్వికులు, మీ రాజులు, మీ అధికారులు దేశ ప్రజలు, యూదా పట్టణాల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ధూపం వేసిన విషయం యెహోవా గుర్తుంచుకుని జ్ఞాపకం తెచ్చుకోలేదా? \v 22 మీ దుష్ట కార్యాలను, మీరు చేసిన అసహ్యకరమైన పనులను యెహోవా ఇక భరించలేనప్పుడు, మీ దేశం నేడు ఉన్నట్లుగా శాపంగా, నివాసులు లేని నిర్జనమైనదిగా మారింది. \v 23 ఎందుకంటే మీరు ధూపం వేసి, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి, ఆయనకు విధేయత చూపలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను, ఆయన నిబంధనలను అనుసరించలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.” \p \v 24 అప్పుడు యిర్మీయా స్త్రీలతో సహా ప్రజలందరితో, “ఈజిప్టులోని యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి. \v 25 ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం, మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను నిశ్చయంగా నెరవేరుస్తాం’ అని మీరు మీ భార్యలు ప్రమాణం చేసినట్టే మీరు చేశారు. \p “అయితే సరే అలాగే కానివ్వండి, మీరు వాగ్దానం చేసినట్లు చేయండి! మీ మ్రొక్కుబడులను చెల్లించుకోండి! \v 26 అయితే ఈజిప్టులో నివసిస్తున్న యూదులారా, యెహోవా మాట వినండి: ‘నా గొప్ప నామం తోడు’ అంటూ యెహోవా ఇలా చెప్తున్నారు, ‘ఈజిప్టులో నివసించే యూదా వారెవరూ ఇకపై, “ప్రభువైన యెహోవా జీవం తోడు.” \v 27 ఎందుకంటే నేను వారికి మేలు చేయాలని కాదు వారికి కీడు చేయడం కోసమే ఎదురు చూస్తున్నాను. ఈజిప్టులోని యూదులు పూర్తిగా నాశనమయ్యే వరకు ఖడ్గంతోను కరువుతోను చస్తారు. \v 28 ఖడ్గం నుండి తప్పించుకుని ఈజిప్టు నుండి యూదా దేశానికి తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. అప్పుడు ఈజిప్టులో నివసించడానికి వచ్చిన యూదా శేషులంతా ఎవరి మాట నెరవేరుతుందో! నాదో వారిదో అనేది తెలుసుకుంటారు. \p \v 29 “ ‘నేను ఈ స్థలంలో నిన్ను శిక్షిస్తాను అనడానికి ఇది నీకు సూచనగా ఉంటుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘తద్వార నీకు హాని చేస్తాననే నా బెదిరింపులు తప్పక నిజమవుతాయని మీరు తెలుసుకుంటారు.’ \v 30 యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను ఎలాగైతే యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించానో, అలాగే ఈజిప్టు రాజైన ఫరో హోఫ్రాను అతన్ని చంపాలనుకుంటున్న అతని శత్రువుల చేతులకు అప్పగించబోతున్నాను.’ ” \c 45 \s1 బారూకుకు సందేశం \p \v 1 యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలన నాల్గవ సంవత్సరంలో యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలను నేరియా కుమారుడైన బారూకు గ్రంథపుచుట్టలో వ్రాసినప్పుడు, యిర్మీయా బారూకుతో ఇలా అన్నాడు: \v 2 “బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీతో ఇలా అంటున్నారు: \v 3 ‘అయ్యో నాకు శ్రమ! యెహోవా నా బాధకు దుఃఖాన్ని జోడించారు; నేను మూలుగులతో సొమ్మసిల్లిపోయాను, నాకు నెమ్మది లేదు’ అని నీవు అనుకుంటున్నావు. \v 4 అయితే యెహోవా నీతో, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తాను, నేను నాటిన వాటిని నేనే పెరికివేస్తాను; ఇది భూమి అంతటా జరుగుతుంది’ అని చెప్పమని నాకు చెప్పారు. \v 5 ‘అలాంటప్పుడు నీకోసం నీవు గొప్ప వాటిని వెదుక్కోవాలా? వాటిని వెదకవద్దు. నేను ప్రజలందరికి విపత్తు తెస్తాను, కానీ నీవు ఎక్కడికి వెళ్లినా నీవు ప్రాణాలతో తప్పించుకునేలా చేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \c 46 \s1 ఈజిప్టును గురించిన సందేశం \p \v 1 ఇతర దేశాల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు: \b \p \v 2 ఈజిప్టును గురించి: \b \p యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషులో ఓడిపోయిన ఈజిప్టు రాజైన ఫరో నెకో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన సందేశం ఇది: \q1 \v 3 “చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని \q2 యుద్ధానికి బయలుదేరండి. \q1 \v 4 గుర్రాలను సిద్ధం చేసుకోండి, \q2 గుర్రాలను ఎక్కండి! \q1 శిరస్త్రాణం ధరించి \q2 బయలుదేరడానికి సిద్ధపడండి! \q1 నీ ఈటెలను పదును చేయండి, \q2 మీ కవచాన్ని ధరించండి! \q1 \v 5 నేను చూస్తున్నదేంటి? \q2 వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, \q1 వారు వెన్ను చూపుతున్నారు, \q2 వారి యోధులు ఓడిపోయారు. \q1 వారు వెనుకకు చూడకుండ \q2 వేగంగా పారిపోతున్నారు, \q2 అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 6 “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, \q2 బలాఢ్యులు తప్పించుకోలేరు. \q1 ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన \q2 వారు తడబడి పడిపోతున్నారు. \b \q1 \v 7 “నైలు నది ప్రవాహంలా \q2 ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు? \q1 \v 8 ఈజిప్టు నైలు నదిలా, \q2 ఉప్పెనలా ప్రవహిస్తుంది. \q1 ఆమె ఇలా అన్నది, ‘నేను లేచి భూమిని కప్పివేస్తాను, \q2 పట్టణాలను వాటిలోని ప్రజలను నాశనం చేస్తాను’ అంటుంది. \q1 \v 9 గుర్రాల్లారా ఎగరండి, \q2 రథాల్లారా రెచ్చిపోండి! \q1 యోధులారా, డాళ్లు మోసే కూషు\f + \fr 46:9 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం\ft*\f* వారలారా, పూతు వారలారా, బయలుదేరండి, \q2 విల్లు విసిరే లిడియా పురుషులారా ముందుకు నడవండి. \q1 \v 10 అయితే ఈ దినం సైన్యాల అధిపతియైన యెహోవాది; \q2 తన శత్రువుల మీద పగతీర్చుకునే దినం. \q1 ఖడ్గం తనకు తృప్తి కలిగే వరకు హతమారుస్తుంది, \q2 తన రక్త దాహం తీరే వరకు హతమారుస్తుంది. \q1 ఎందుకంటే యూఫ్రటీసు నది ప్రక్కన ఉత్తర దేశంలో \q2 సైన్యాల అధిపతియైన యెహోవా బలి అర్పించబోతున్నారు. \b \q1 \v 11 “కన్యయైన ఈజిప్టు కుమారీ, \q2 గిలాదుకు వెళ్లి ఔషధతైలం తెచ్చుకో. \q1 కానీ నీవు అనేక మందులు వాడడం వ్యర్థమే; \q2 నీకు స్వస్థత కలుగదు. \q1 \v 12 దేశాలు నీ అవమానం గురించి వింటాయి; \q2 నీ కేకలు భూమంతటా వినబడతాయి. \q1 యోధులు ఒకరికొకరు తగిలి తడబడి; \q2 ఇద్దరూ కలిసి క్రిందకు పడిపోతారు.” \p \v 13 ఈజిప్టుపై దాడి చేయడానికి బబులోను రాజైన నెబుకద్నెజరు రావడం గురించి యెహోవా యిర్మీయా ప్రవక్తతో చెప్పిన సందేశం ఇది: \q1 \v 14 “ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి; \q2 మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి: \q1 ‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది, \q2 కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’ \q1 \v 15 నీ బలవంతులు ఎందుకు దిగజారిపోతారు? \q2 వారు నిలబడలేరు, ఎందుకంటే యెహోవా వారిని క్రిందికి నెట్టివేస్తారు. \q1 \v 16 వారు పదే పదే తడబడతారు; \q2 వారు ఒకరి మీద ఒకరు పడతారు. \q1 వారు, ‘లేవండి, మనం \q2 అణచివేసే వారి ఖడ్గానికి దూరంగా, \q2 మన స్వదేశాలకు, మన సొంత ప్రజల దగ్గరికి తిరిగి వెళ్దాం’ అని చెప్తారు. \q1 \v 17 అక్కడ వారు, \q2 ‘ఈజిప్టు రాజు ఫరో పెద్ద శబ్దం మాత్రమే; \q2 అతడు తన అవకాశాన్ని కోల్పోయాడు’ అని గట్టిగా కేకలు వేస్తారు. \b \q1 \v 18 “నా జీవం తోడు” అని రాజు ప్రకటిస్తున్నారు, \q2 ఆయన పేరు సైన్యాల యెహోవా, \q1 “పర్వతాల మధ్య తాబోరు లాంటివాడు, \q2 సముద్రం ఒడ్డున ఉన్న కర్మెలు లాంటివాడు వస్తాడు. \q1 \v 19 ఈజిప్టులో నివసించేవారలారా, \q2 బందీలుగా వెళ్లడానికి మీ సామాన్లు సర్దుకోండి, \q1 ఎందుకంటే మెంఫిసు పాడుచేయబడి, \q2 నివాసులు లేక శిథిలమవుతుంది. \b \q1 \v 20 “ఈజిప్టు అందమైన పాడి ఆవు, \q2 అయితే దాని మీదికి ఉత్తరం నుండి \q2 జోరీగ వస్తున్నది. \q1 \v 21 దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు \q2 బలిసిన దూడల వంటివారు. \q1 వారు కూడా నిలబడలేక, \q2 వెనక్కి పారిపోతారు. \q1 విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, \q2 అది వారు శిక్షించబడే సమయము. \q1 \v 22 శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు \q2 పారిపోతున్న సర్పంలా ఈజిప్టు బుసలు కొడుతుంది. \q1 చెట్లు నరికేవారు గొడ్డళ్లతో వచ్చినట్లు \q2 వారు ఆమె మీదికి వస్తారు. \q1 \v 23 ఆమె దట్టమైన అడవులను, \q2 వారు నరికివేస్తారు” అని యెహోవా చెప్తున్నారు. \q1 “వారి సంఖ్య మిడతల కంటే ఎక్కువ, \q2 వారిని లెక్కించలేము. \q1 \v 24 ఈజిప్టు కుమార్తె అవమానించబడుతుంది, \q2 ఉత్తరాది ప్రజల చేతికి అప్పగించబడుతుంది.” \p \v 25 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేబేసులోని ఆమోను దేవున్ని, ఫరోను, ఈజిప్టును దాని దేవుళ్ళను, రాజులను, ఫరోను నమ్ముకున్న వారిని శిక్షించబోతున్నాను. \v 26 వారిని చంపాలనుకున్న వారి చేతులకు అనగా బబులోను రాజైన నెబుకద్నెజరుకు అతని అధికారులకు నేను వారిని అప్పగిస్తాను. ఆ తర్వాత ఈజిప్టు గతంలో ఉన్నట్లే నివాసయోగ్యంగా ఉంటుంది” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 27 “నా సేవకుడైన యాకోబూ, భయపడకు; \q2 ఇశ్రాయేలూ, కలవరపడకు. \q1 నేను నిన్ను సుదూర ప్రాంతం నుండి తప్పకుండా రక్షిస్తాను, \q2 నీ సంతతివారిని బందీలుగా ఉన్న దేశం నుండి రక్షిస్తాను. \q1 యాకోబుకు మళ్ళీ శాంతి భద్రతలు కలుగుతాయి, \q2 ఎవరూ అతన్ని భయపెట్టరు. \q1 \v 28 నా సేవకుడైన యాకోబూ, భయపడకు, \q2 నేను నీకు తోడుగా ఉన్నాను” \q2 అని యెహోవా చెప్తున్నారు. \q1 “నేను నిన్ను చెదరగొట్టే \q2 దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా, \q2 నిన్ను పూర్తిగా నాశనం చేయను. \q1 కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను; \q2 శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.” \c 47 \s1 ఫిలిష్తీయుల గురించిన సందేశం \p \v 1 ఫరో ఇంకా గాజా మీద దాడిచేయక ముందు ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు: \b \p \v 2 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి; \q2 అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి. \q1 అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద, \q2 పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి. \q1 కాబట్టి ప్రజలంతా మొరపెడతారు; \q2 దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు. \q1 \v 3 పరుగెత్తే గుర్రాల డెక్కల శబ్దానికి, \q2 శత్రు రథాల శబ్దానికి \q2 వాటి చక్రాల శబ్దానికి వారు రోదిస్తారు. \q1 తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయరు; \q2 వారి చేతులు బలహీనంగా ఉంటాయి. \q1 \v 4 ఎందుకంటే ఆ రోజు వచ్చింది, \q2 ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు \q1 తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని \q2 తొలగించే రోజు తప్పకుండా వస్తుంది. \q1 యెహోవా ఫిలిష్తీయులను, \q2 కఫ్తోరు\f + \fr 47:4 \fr*\ft అంటే, క్రేతు\ft*\f* తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు. \q1 \v 5 గాజా దుఃఖంలో తల క్షౌరం చేసుకుంటుంది; \q2 అష్కెలోను నిశ్శబ్దం చేయబడుతుంది. \q1 సమతల మైదానంలో మిగిలి ఉన్నవారలారా, \q2 ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపరచుకుంటారు? \b \q1 \v 6 “ ‘అయ్యో, యెహోవా ఖడ్గమా, \q2 నీవు ఎంత కాలానికి విశ్రాంతి తీసుకుంటావు? \q1 నీ ఒర లోనికి తిరిగివెళ్లి \q2 ప్రశాంతంగా విశ్రమించు.’ \q1 \v 7 అయితే అష్కెలోను మీదా, \q2 సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని, \q1 యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు, \q2 అది ఎలా విశ్రమిస్తుంది?” \c 48 \s1 మోయాబు గురించిన సందేశం \p \v 1 మోయాబు గురించి: \b \p ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “నెబోకు శ్రమ, అది శిథిలమైపోతుంది. \q2 కిర్యతాయిము ఆక్రమించబడి అవమానించబడుతుంది; \q2 దాని కోట\f + \fr 48:1 \fr*\ft లేదా \ft*\fqa స్వాధీనమైంది \fqa*\fqa మిస్గబు\fqa*\f* పడగొట్టబడి అవమానించబడుతుంది. \q1 \v 2 మోయాబును ఇకపై పొగడరు; \q2 హెష్బోను ప్రజలు ఆమె పతనానికి కుట్ర చేస్తారు: \q2 ‘రండి, ఆ దేశాన్ని అంతం చేద్దాము.’ \q1 మద్మేను\f + \fr 48:2 \fr*\ft ఇది మోయాబీయుల పట్టణం పేరు; హెబ్రీలో \ft*\fqa మౌనం చేయబడుట\fqa*\f* ప్రజలారా, మీరు కూడా మౌనంగా ఉంటారు; \q2 ఖడ్గం నిన్ను వెంటాడుతుంది. \q1 \v 3 హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి, \q2 అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి. \q1 \v 4 మోయాబు ధ్వంసమవుతుంది; \q2 దాని చిన్న బిడ్డలు బిగ్గరగా ఏడుస్తారు.\f + \fr 48:4 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa ఆ విషయాన్ని సోయరుకు ప్రకటించండి\fqa*\f* \q1 \v 5 వారు కొండపై నుండి లూహీతుకు, \q2 ఏడుస్తూ వెళ్తున్నారు; \q1 హొరొనయీముకు వెళ్లే దారిలో జరిగిన \q2 విధ్వంసం వల్ల ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. \q1 \v 6 పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి; \q2 ఎడారిలో పొదలా\f + \fr 48:6 \fr*\ft లేదా \ft*\fqa అరోయేరు లా\fqa*\f* ఉండండి. \q1 \v 7 మీరు మీ క్రియలను, ఐశ్వర్యాన్ని నమ్ముతారు కాబట్టి, \q2 మీరు కూడా బందీలుగా కొనిపోబడతారు, \q1 అలాగే కెమోషు దేవుడు తన యాజకులతో, అధికారులతో పాటు \q2 బందీగా వెళ్తాడు. \q1 \v 8 యెహోవా చెప్పారు కాబట్టి \q2 నాశనం చేసేవాడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు, \q1 ఒక్క పట్టణం తప్పించుకోదు. \q2 లోయ పాడైపోతుంది, \q2 పీఠభూమి నాశనమవుతుంది. \q1 \v 9 మోయాబుకు రెక్కలు ఇవ్వబడితే, \q2 అది ఎగిరిపోయి, దేశం వ్యర్థంగా పడి ఉండేది; \q1 నివసించేవారు లేక, \q2 దాని పట్టణాలు నిర్జనమైపోయేవి. \b \q1 \v 10 “యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు! \q2 రక్తం చిందించకుండ తమ ఖడ్గాన్ని ఒరలో పెట్టేవారు శాపగ్రస్తులు! \b \q1 \v 11 “మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది, \q2 ఒక బాన నుండి మరొక బానలో పోయబడని, \q1 అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది, \q2 అది చెరలోకి వెళ్లలేదు. \q1 కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది, \q2 దాని సువాసన మారలేదు.” \q1 \v 12 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q1 “రాబోయే రోజుల్లో నేను, \q2 కుండను కుమ్మరించే వారిని పంపినప్పుడు, \q1 వారు దాన్ని బయటకు కుమ్మరించి, \q2 కుండలను ఖాళీచేసి వాటిని పగలగొడతారు. \q1 \v 13 ఇశ్రాయేలీయులు బేతేలును నమ్మినప్పుడు \q2 ఎలా సిగ్గుపడ్డారో \q2 మోయాబీయులు కెమోషును బట్టి సిగ్గుపడతారు. \b \q1 \v 14 “ ‘మేము యోధులం, \q2 యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు? \q1 \v 15 మోయాబు నాశనమై దాని పట్టణాలు ఆక్రమించబడతాయి; \q2 దాని శ్రేష్ఠమైన యువకులు వధకు గురవుతారు,” \q2 అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా. \q1 \v 16 “మోయాబు పతనం సమీపించింది; \q2 దాని విపత్తు త్వరగా వస్తుంది. \q1 \v 17 దాని చుట్టూ నివసించేవారలారా, \q2 దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి; \q1 ‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది, \q2 కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి. \b \q1 \v 18 “దీబోను కుమార్తెలారా, \q2 మీ కీర్తి నుండి క్రిందికి దిగి, \q2 ఎండిపోయిన నేల మీద కూర్చుండి, \q1 ఎందుకంటే మోయాబును నాశనం చేసేవాడు \q2 మీ మీదికి వస్తాడు \q2 మీ కోట పట్టణాలను పతనం చేస్తాడు. \q1 \v 19 అరోయేరులో నివసించేవారలారా, \q2 రోడ్డు ప్రక్కన నిలబడి చూడండి. \q1 పారిపోతున్న పురుషుడిని, తప్పించుకుంటున్న స్త్రీని, \q2 ‘ఏమైంది?’ అని అడగండి. \q1 \v 20 మోయాబు కుప్పకూలిపోయి, అపకీర్తి పాలయింది. \q2 రోదించండి, బిగ్గరగా ఏడవండి! \q1 మోయాబు నాశనమైపోయిందని \q2 అర్నోనులో ప్రకటించండి. \q1 \v 21 పీఠభూమికి తీర్పు తీర్చబడింది \q2 హోలోనుకు, యహజుకు, మెఫాతుకు, \q2 \v 22 దీబోనుకు, నెబోకు, బేత్-దిబ్లాతయీము, \q2 \v 23 కిర్యతాయిముకు, బేత్-గమూలుకు, బేత్-మెయోనుకు, \q2 \v 24 కెరీయోతుకు, బొస్రాకు \q2 దూరంగా దగ్గరగా ఉన్న మోయాబులోని అన్ని పట్టణాలకు శిక్ష విధించబడుతుంది. \q1 \v 25 మోయాబు కొమ్ము\f + \fr 48:25 \fr*\fq కొమ్ము \fq*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తుంది\ft*\f* నరికివేయబడింది; \q2 దాని బాహువు విరిగింది,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 26 “ఆమెకు మత్తు ఎక్కేలా త్రాగించండి, \q2 ఎందుకంటే ఆమె యెహోవాను ధిక్కరించింది. \q1 మోయాబు తన వాంతిలో పడిదొర్లుతుంది; \q2 ఆమె హేళన చేయబడుతుంది. \q1 \v 27 ఇశ్రాయేలును మీరు హేళన చేయలేదా? \q2 ఆమె దొంగల మధ్య పట్టుబడిన దానిలా, \q1 నీవు ఆమె గురించి ఎప్పుడు మాట్లాడినా \q2 ఛీ అన్నట్లుగా తల ఊపుతావు? \q1 \v 28 మోయాబులో నివసించేవారలారా, \q2 మీ పట్టణాలను విడిచిపెట్టి రాళ్ల మధ్య నివసించండి. \q1 గుహ ముఖద్వారం దగ్గర \q2 గూడు కట్టుకునే పావురంలా ఉండండి. \b \q1 \v 29 “మోయాబు గర్వం గురించి \q2 దానికి అహంకారం గురించి \q1 దాని తలపొగరు, దాని గర్వం, దాని దురహంకారం, \q2 దాని హృదయ అతిశయం గురించి విన్నాము. \q1 \v 30 దాని తలపొగరు నాకు తెలుసు, దానికి ఏ విలువలేదు, \q2 దాని ప్రగల్భాలు ఏమీ సాధించవు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 31 కాబట్టి నేను మోయాబు గురించి రోదిస్తున్నాను, \q2 మోయాబు అంతటి కోసం నేను బిగ్గరగా ఏడుస్తున్నాను, \q2 కీర్ హరెశెతు ప్రజల కోసం నేను మూలుగుతున్నాను. \q1 \v 32 షిబ్మా ద్రాక్షలారా, \q2 యాజెరు ఏడ్చినట్లు, నేను మీ కోసం ఏడుస్తున్నాను. \q1 మీ కొమ్మలు సముద్రం\f + \fr 48:32 \fr*\ft బహుశ మృత సముద్రం కావచ్చు\ft*\f* వరకు వ్యాపించాయి; \q2 అవి యాజెరు వరకు వ్యాపించాయి. \q1 నాశనం చేసేవాడు, \q2 పండిన మీ పండ్ల మీద, ద్రాక్షపండ్ల మీద పడ్డాడు. \q1 \v 33 మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి \q2 ఆనందం, సంతోషం పోయాయి. \q1 నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను; \q2 ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు. \q1 కేకలు వినిపించినప్పటికీ, \q2 అవి ఆనందంతో వేసిన కేకలు కావు. \b \q1 \v 34 “నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి \q2 కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, \q1 సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, \q2 వారి కేకలు వినిపిస్తున్నాయి. \q1 \v 35 క్షేత్రాల దగ్గర అర్పణలు అర్పించేవారిని మోయాబులో \q2 తమ దేవుళ్ళకు ధూపం వేసేవారిని \q2 నేను మోయాబులో లేకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 36 “కాబట్టి నా హృదయం మోయాబు గురించి పిల్లనగ్రోవిలా విలపిస్తుంది; \q2 అది కీర్ హరెశెతు ప్రజలకు పిల్లనగ్రోవిలా విలపిస్తుంది. \q2 వారు సంపాదించిన సంపద పోయింది. \q1 \v 37 ప్రతి తల గుండు చేయబడింది \q2 ప్రతి గడ్డం కత్తిరించబడింది; \q1 ప్రతి చేయి నరకబడింది \q2 ప్రతి నడుము గోనెపట్టతో కప్పబడింది. \q1 \v 38 మోయాబులో ఇళ్ల పైకప్పులన్నిటి మీద \q2 బహిరంగ కూడళ్లలో \q1 దుఃఖం తప్ప మరేమీ లేదు, \q2 పనికిరాని కుండను పగలగొట్టినట్లు \q2 నేను మోయాబును పగులగొట్టాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 39 “అది ఎలా శిథిలమైపోయిందో! వారు ఎలా విలపిస్తున్నారో! \q2 మోయాబు సిగ్గుతో ఎలా వెన్నుచూపిస్తుందో! \q1 మోయాబు దాని చుట్టూ ఉన్నవారందరికి, \q2 హేళనగా భయం పుట్టించేదిగా మారింది.” \p \v 40 యెహోవా ఇలా అంటున్నారు: \q1 “చూడండి! ఒక గ్రద్ద మోయాబు మీద \q2 రెక్కలు విప్పుకుని దూసుకుపోతుంది. \q1 \v 41 కెరీయోతు\f + \fr 48:41 \fr*\ft లేదా \ft*\fqa పట్టణాలు\fqa*\f* స్వాధీనం చేసుకోబడుతుంది, \q2 బలమైన కోటలు వారి స్వాధీనం అవుతాయి. \q1 ఆ రోజు మోయాబు యోధుల హృదయాలు \q2 ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ హృదయంలా ఉంటాయి. \q1 \v 42 మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి \q2 ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది. \q1 \v 43 మోయాబు ప్రజలారా, \q2 భయాందోళనలు, గొయ్యి, ఉచ్చు మీ కోసం ఎదురుచూస్తున్నాయి” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 44 “భయాందోళన నుండి పారిపోయేవాడు \q2 గొయ్యిలో పడిపోతాడు, \q1 గొయ్యిలో నుండి తప్పించుకుని పైకి వచ్చినవాడు \q2 ఉచ్చులో చిక్కుకుంటాడు; \q1 నేను మోయాబు మీదికి \q2 దాన్ని శిక్షించే సంవత్సరాన్ని రప్పిస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 45 “పారిపోయినవారు హెష్బోను నీడలో \q2 బలహీనులై నిలబడి ఉన్నారు, \q1 హెష్బోను నుండి అగ్ని, \q2 సీహోను మధ్య నుండి మంటలు బయలుదేరాయి. \q1 అది మోయాబు నొసళ్లను, \q2 అహంకారుల పుర్రెలను కాల్చివేస్తుంది. \q1 \v 46 మోయాబూ, నీకు శ్రమ! \q2 కెమోషు ప్రజలు నాశనమైపోయారు; \q1 నీ కుమారులు బందీలుగా వెళ్లారు \q2 నీ కుమార్తెలు బందీలుగా కొనిపోబడ్డారు. \b \q1 \v 47 “అయితే నేను రాబోయే రోజుల్లో \q2 మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది. \b \c 49 \s1 అమ్మోనీయుల గురించిన సందేశం \p \v 1 అమ్మోనీయుల గురించి: \b \p యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ఇశ్రాయేలుకు కుమారులు లేరా? \q2 ఇశ్రాయేలుకు వారసుడు లేడా? \q1 మోలెకు\f + \fr 49:1 \fr*\ft లేదా \ft*\fqa వారి రాజు\fqa*\ft ; \+xt 3|link-href="JER 49:3"\+xt* వచనంలో కూడా\ft*\f* గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? \q2 అతని ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తున్నారు? \q1 \v 2 అయితే ఆ రోజులు రాబోతున్నాయి” \q2 అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q1 “అమ్మోనీయుల రబ్బాకు వ్యతిరేకంగా \q2 నేను యుద్ధధ్వని చేసినప్పుడు; \q1 అది శిథిలాల దిబ్బ అవుతుంది, \q2 దాని చుట్టుప్రక్కల గ్రామాలు అగ్నికి ఆహుతి అవుతాయి. \q1 అప్పుడు ఇశ్రాయేలు \q2 దాన్ని వెళ్లగొట్టిన వారిని వెళ్లగొడుతుంది,” \q2 అని యెహోవా అంటున్నారు. \q1 \v 3 “హెష్బోనూ, ఏడువు. ఎందుకంటే హాయి నాశనం చేయబడింది! \q2 రబ్బా నివాసులారా, బిగ్గరగా ఏడవండి! \q1 గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి; \q2 గోడల లోపల ఇటు అటు పరుగెత్తండి, \q1 ఎందుకంటే మోలెకు దేవుడు తన యాజకులు, అధికారులతో పాటు \q2 బందీగా వెళ్తాడు. \q1 \v 4 మీ లోయలు చాలా ఫలవంతమైనవి, \q2 అని మీరు మీ లోయల గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు? \q1 అమ్మోనూ, నమ్మకద్రోహియైన కుమార్తె, \q2 నీవు నీ సంపదపై నమ్మకం ఉంచి, \q2 ‘నాపై ఎవరు దాడి చేస్తారు?’ అని అంటున్నావు. \q1 \v 5 నీ చుట్టూ ఉన్న వారందరి నుండి \q2 నీకు భయం పుట్టిస్తాను” \q2 అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “మీలో ప్రతి ఒక్కరు తరిమివేయబడతారు, \q2 పారిపోయినవారిని ఎవరూ సమకూర్చరు. \b \q1 \v 6 “అయితే, నేను అమ్మోనీయులను చెర నుండి తిరిగి రప్పిస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \s1 ఎదోము గురించిన సందేశం \p \v 7 ఎదోము గురించి: \b \p సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “తేమానులో ఇక జ్ఞానం లేదా? \q2 వివేకవంతులు సలహా ఇవ్వడం మానివేశారా? \q2 వారి జ్ఞానం తగ్గిపోయిందా? \q1 \v 8 దేదానులో నివసించేవారలారా, \q2 వెనక్కి తిరిగి పారిపోయి లోతైన గుహల్లో దాక్కోండి, \q1 నేను ఏశావు మీదికి విపత్తు రప్పించి \q2 వారిని శిక్షిస్తాను. \q1 \v 9 ద్రాక్షలు పోగుచేసుకునేవారు మీ దగ్గరకు వస్తే, \q2 వారు కొన్ని ద్రాక్షలు వదిలేయరా? \q1 రాత్రివేళ దొంగలు వస్తే, \q2 వారికి కావలసినంత వారు దొంగిలించరా? \q1 \v 10 అయితే నేను ఏశావును నగ్నంగా చేస్తాను; \q2 అతడు దాక్కునే స్థలాలను బయటపెడతాను, \q2 అప్పుడతడు ఎక్కడా దాక్కోలేడు. \q1 అతని సాయుధ పురుషులు నాశనానికి గురవుతారు, \q2 అతని సోదరులు పొరుగువారు కూడా నాశనమవుతారు. కాబట్టి, \q1 \v 11 ‘తండ్రిలేని నీ పిల్లలను వదిలేయండి; నేను వారిని చూసుకుంటాను. \q2 నీ విధవరాండ్రు కూడా నన్ను నమ్ముకోవచ్చు’ \q2 అని చెప్పడానికి ఎవ్వరూ ఉండరు.” \p \v 12 యెహోవా ఇలా అంటున్నారు: “పాత్రలోనిది త్రాగడానికి అర్హత లేనివారు కూడా దానిని త్రాగినప్పుడు మీరు శిక్షించబడకుండ ఎందుకు ఉండాలి? మీరు శిక్షించబడేలా దానిని మీరు త్రాగాలి.” \v 13 యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు. \q1 \v 14 నేను యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది; \q1 “దానిపై దాడి చేయడానికి మీరంతా కలిసి రండి! \q2 లెండి! యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి, \q2 దేశాలకు ఒక దూత పంపబడ్డాడు. \b \q1 \v 15 “ఇప్పుడు నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా, \q2 మనుష్యులు నిన్ను తృణీకరించేలా చేస్తాను. \q1 \v 16 నీవు రేపిన భయాందోళనలు, \q2 నీ హృదయ గర్వం నిన్ను మోసం చేశాయి, \q1 బండ సందుల్లో నివసించేదానా, \q2 కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, \q1 నీవు గ్రద్దలా ఎత్తైన చోట నీ గూడు కట్టుకున్నా \q2 అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” \q2 అని యెహోవా చెప్తున్నారు. \q1 \v 17 “ఎదోము నాశనం అవుతుంది; \q2 దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు, \q2 దాని గాయాలన్నిటిని చూసి ఎగతాళి చేస్తారు. \q1 \v 18 సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో \q2 పాటు పడగొట్టినట్లు వీటిని కూడా పడగొట్టిన తర్వాత \q1 అక్కడ ఎవరూ నివసించనట్లే; \q2 ఇక్కడ కూడా ప్రజలు నివసించరు” అని యెహోవా అంటున్నారు. \b \q1 \v 19 “యొర్దాను పొదల్లో నుండి సింహం \q2 సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, \q1 నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. \q2 దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? \q1 నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? \q2 ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?” \b \q1 \v 20 కాబట్టి ఎదోమును వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో వినండి, \q2 తేమానులో నివసించేవారికి ఆయన ఏమి ఉద్దేశించారో వినండి: \q1 మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; \q2 వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి. \q1 \v 21 వారు పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది; \q2 వారి మొర ఎర్ర సముద్రం వరకు వినిపిస్తుంది. \q1 \v 22 చూడండి! శత్రువు తన రెక్కలు బొస్రా మీదుగా విప్పి \q2 గ్రద్దలా దూసుకుపోతాడు. \q1 ఆ రోజున ఎదోము యోధులు \q2 ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా వేదనలో ఉంటారు. \s1 దమస్కు గురించిన సందేశం \p \v 23 దమస్కు గురించి: \q1 “హమాతు, అర్పదు చెడువార్త విని \q2 భయంతో క్రుంగిపోయారు. \q1 వారు హృదయంలో కలవరపడ్డారు, \q2 నెమ్మది లేని సముద్రంలా ఆందోళన పడుతున్నారు. \q1 \v 24 దమస్కు బలహీనమైపోయింది, \q2 పారిపోవడానికి అది వెనుకకు తిరిగింది, \q2 భయం దాన్ని పట్టుకుంది; \q1 ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా \q2 దానికి వేదన, బాధ కలిగాయి. \q1 \v 25 పేరు పొందిన పట్టణం, \q2 నేను ఆనందించే పట్టణం ఎందుకు వదల్లేదు? \q1 \v 26 నిశ్చయంగా, దాని యువకులు వీధుల్లో కూలిపోతారు; \q2 ఆ రోజున దాని సైనికులందరూ మూగబోతారు,” \q2 అని సైన్యాల యెహోవా ప్రకటించారు. \q1 \v 27 “నేను దమస్కు గోడలకు నిప్పు పెడతాను; \q2 అది బెన్-హదదు కోటలను దహించివేస్తుంది.” \s1 కేదారు, హాసోరును గురించిన సందేశం \p \v 28 బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేసిన కేదారు, హాసోరు రాజ్యాల గురించి: \b \p యెహోవా ఇలా అంటున్నారు: \q1 “లేవండి, లేచి కేదారు మీద దాడి చేసి \q2 తూర్పు ప్రజలను నాశనం చేయండి. \q1 \v 29 వారి గుడారాలు, వారి మందలు స్వాధీనం చేసుకోబడ్తాయి; \q2 వారి ఒంటెలు, వారి మొత్తం సామాగ్రితో పాటు, \q2 వారి గుడారాలను తీసుకెళ్తారు. \q1 ‘అన్నివైపులా భయమే!’ \q2 అని ప్రజలు వారితో అంటారు. \b \q1 \v 30 “త్వరగా పారిపోండి! \q2 హాసోరులో నివసించేవారలారా, లోతైన గుహల్లో దాక్కోండి” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “బబులోను రాజైన నెబుకద్నెజరు నీకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. \q2 అతడు నీకు వ్యతిరేకంగా ఒక పథకం వేశాడు. \b \q1 \v 31 “మీరు లేచి, నిర్భయంగా జీవిస్తూ, \q2 ద్వారాలు గాని అడ్డు గడియలు గాని లేకుండ \q2 ప్రజలు క్షేమంగా ఉంటున్న, \q1 దేశం మీద దాడి చేయండి,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 32 “వారి ఒంటెలు దోచుకోబడతాయి, \q2 వారి విస్తారమైన మందలు యుద్ధంలో కొల్లగొట్టబడతాయి. \q1 సుదూర ప్రాంతాలకు నలువైపులా వారిని చెదరగొట్టి \q2 వారి మీదికి అన్నివైపులా విపత్తు తెస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 33 “హాసోరు నక్కలకు నిలయంగా, \q2 ఎప్పటికీ నిర్జన ప్రదేశంగా మారుతుంది. \q1 అక్కడ ఎవరూ నివసించరు; \q2 దానిలో ఏ ప్రజలు నివసించరు.” \s1 ఏలాము గురించిన సందేశం \p \v 34 యూదా రాజైన సిద్కియా పాలనలో ఏలామును గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు ఇది: \b \p \v 35 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “చూడండి, నేను ఏలాము బలానికి మూలమైన \q2 విల్లును విరగ్గొడతాను. \q1 \v 36 నేను ఏలాముకు వ్యతిరేకంగా \q2 ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు గాలులను రప్పిస్తాను; \q1 నేను వారిని నాలుగు గాలులకు చెదరగొడతాను, \q2 చెదిరిపోయిన ఏలాము వారు వెళ్లని \q2 దేశమే ఉండదు. \q1 \v 37 నేను ఏలామును వారి శత్రువుల ఎదుట, \q2 వారిని చంపాలనుకున్న వారి ఎదుట వారిని చెదరగొడతాను. \q1 నేను వారి మీదికి విపత్తును, \q2 నా కోపాగ్నిని కూడా రప్పిస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “నేను వారిని అంతం చేసే వరకు \q2 ఖడ్గంతో వారిని వెంటాడుతాను. \q1 \v 38 ఏలాములో నా సింహాసనాన్ని స్థాపించి, \q2 దాని రాజును, అధికారులను నాశనం చేస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 39 “అయినప్పటికీ నేను రాబోయే రోజుల్లో \q2 ఏలాముకు చెందిన వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \c 50 \s1 బబులోను గురించిన సందేశం \p \v 1 బబులోను గురించి, బబులోనీయుల దేశం గురించి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన వాక్కు ఇది: \q1 \v 2 “దేశాల మధ్య ప్రకటన చేసి, చాటించండి, \q2 ఒక జెండాను ఎత్తి దాన్ని చాటించండి; \q2 ఏదీ దాచకుండా ఇలా చెప్పండి, \q1 ‘బబులోను స్వాధీనం చేసుకోబడుతుంది; \q2 బేలు దేవుడు సిగ్గుపరచబడతాడు, \q2 మర్దూకు దేవత పడవేయబడుతుంది. \q1 బబులోను ప్రతిమలు సిగ్గుపరచబడతాయి, \q2 దాని విగ్రహాలు పడద్రోయబడతాయి.’ \q1 \v 3 ఉత్తర దిక్కునుండి ఒక దేశం దానిపై దాడి చేసి \q2 దాని దేశాన్ని పాడుచేస్తుంది. \q1 దానిలో ఎవరూ నివసించరు; \q2 మనుష్యులు పారిపోతారు జంతువులు పారిపోతాయి. \b \q1 \v 4 “ఆ రోజుల్లో, ఆ సమయంలో, \q1 ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి \q2 తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కన్నీటితో వెళ్తారు” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 5 వారు సీయోనుకు వెళ్లే దారి ఎటు అని అడిగి \q2 ఆ దారిలో ప్రయాణిస్తారు. \q1 వారు వచ్చి మరచిపోలేని \q2 శాశ్వతమైన ఒడంబడికలో \q2 యెహోవాకు కట్టుబడి ఉంటారు. \b \q1 \v 6 “నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలు; \q2 వారి కాపరులు వారిని తప్పుత్రోవ పట్టించి \q2 వారిని పర్వతాలమీద తిరిగేలా చేశారు. \q1 వారు పర్వతాలు, కొండలమీద తిరుగుతూ, \q2 తమ సొంత విశ్రాంతి స్థలాన్ని మరచిపోయారు. \q1 \v 7 వారిని చూసినవారు వారిని మ్రింగివేశారు; \q2 వారి శత్రువులు, ‘మేము దోషులం కాదు, \q1 ఎందుకంటే వారు తమ నీతి సింహాసనమైన యెహోవాకు, \q2 తమ పూర్వికుల నిరీక్షణయైన యెహోవాకు విరోధంగా పాపం చేశారు’ అని అన్నారు. \b \q1 \v 8 “బబులోను నుండి పారిపోండి; \q2 బబులోనీయుల దేశాన్ని విడిచిపెట్టండి, \q2 మందను నడిపించే మేకపోతుల్లా ప్రజల ముందు నడవండి. \q1 \v 9 నేను బబులోనుకు వ్యతిరేకంగా \q2 ఉత్తర దేశం నుండి గొప్ప దేశాల కూటమిని రప్పిస్తాను. \q1 వారు దానికి వ్యతిరేకంగా యుద్ధపంక్తులు తీర్చుతారు, \q2 ఉత్తరం నుండి దాన్ని పట్టుకుంటారు. \q1 వారి బాణాలు వట్టి చేతులతో తిరిగి రాని \q2 నైపుణ్యం కలిగిన యోధుల వలె ఉంటాయి. \q1 \v 10 కాబట్టి బబులోను దోచుకోబడుతుంది; \q2 దాన్ని దోచుకునే వారందరూ సంతృప్తి చెందుతారు” \q2 అని యెహోవా ప్రకటించాడు. \b \q1 \v 11 “నా స్వాస్థ్యాన్ని దోచుకునేవారలారా, \q2 అది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది \q1 ధాన్యం నూర్పిడి చేస్తున్న దూడలా \q2 బలమైన గుర్రాల్లా మీరు సకిలిస్తున్నారు. \q1 \v 12 నీ తల్లి చాలా సిగ్గుపడుతుంది; \q2 నీకు జన్మనిచ్చిన ఆమె పరువు పోతుంది. \q1 అది దేశాలన్నిటిలో నీచమైనదిగా \q2 అరణ్యంగా, ఎండిన భూమిగా, ఎడారిగా ఉంటుంది. \q1 \v 13 యెహోవా కోపం వలన అది నివాసయోగ్యంగా ఉండదు. \q2 పూర్తిగా నిర్జనమైపోతుంది. \q1 బబులోను దాటి వెళ్లే వారందరూ నివ్వెరపోతారు; \q2 దాని గాయాలన్నిటిని బట్టి వారు ఎగతాళి చేస్తారు. \b \q1 \v 14 “బబులోను చుట్టూ యుద్ధపంక్తులు తీరండి, \q2 విల్లును వంచగలిగిన ప్రతి ఒక్కరు విల్లు లాగండి. \q1 అది యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది, \q2 దానిపై బాణాలు వేయండి! మీ బాణాలు దాచుకోవద్దు. \q1 \v 15 అన్ని వైపుల నుండి దానిమీద కేకలు వేయండి! \q2 అది లొంగిపోతుంది, దాని బురుజులు పడిపోయాయి, \q2 దాని గోడలు కూలిపోయాయి. \q1 ఇది యెహోవా ప్రతీకారం కాబట్టి, \q2 దాని మీద ప్రతీకారం తీర్చుకోండి; \q2 అది ఇతరులకు చేసినట్లు దానికి చేయండి. \q1 \v 16 బబులోను నుండి విత్తేవారిని, \q2 కొడవలితో కోత కోసేవారిని నిర్మూలం చేయండి. \q1 అణచివేసే వారి ఖడ్గం కారణంగా \q2 ప్రతి ఒక్కరూ తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నారు, \q2 ప్రతి ఒక్కరూ తమ సొంత దేశానికి పారిపోతున్నారు. \b \q1 \v 17 “ఇశ్రాయేలు చెదరిపోయిన గొర్రెలు \q2 సింహాలు వాటిని తరిమికొట్టాయి. \q1 మొదట అష్షూరు రాజు \q2 వాటిని మ్రింగివేశాడు; \q1 చివరిగా బబులోను రాజైన నెబుకద్నెజరు \q2 వాటి ఎముకలను విరగ్గొట్టాడు.” \p \v 18 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “నేను అష్షూరు రాజును శిక్షించినట్లే \q2 బబులోను రాజును అతని దేశాన్ని శిక్షిస్తాను. \q1 \v 19 అయితే నేను ఇశ్రాయేలీయులను వారి పచ్చిక బయళ్లకు తిరిగి రప్పిస్తాను, \q2 వారు కర్మెలు బాషాను మీద మేస్తారు. \q1 ఎఫ్రాయిం గిలాదు కొండలమీద \q2 వారు తృప్తి చెందుతారు.” \q1 \v 20 యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “ఆ రోజుల్లో, ఆ సమయంలో, \q1 ఇశ్రాయేలీయుల అపరాధాల కోసం వెదకుతారు, \q2 కానీ అవి కనబడవు, \q1 అలాగే యూదా కోసం వెదకుతారు, \q2 కానీ అవి దొరకవు, \q2 మిగిలి ఉన్నవారిని నేను క్షమిస్తాను. \b \q1 \v 21 “మెరతాయీము మీద దాడి చేయండి. \q2 పేకోదులో నివసించేవారి మీద దాడి చేయండి,” \q1 వెంటాడి, వారిని చంపి పూర్తిగా నాశనం\f + \fr 50:21 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే.\ft*\f* చేయండి, \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q2 “నేను నీకు ఆజ్ఞాపించినదంతా చేయండి. \q1 \v 22 దేశంలో యుద్ధధ్వని, \q2 మహా విధ్వంసపు ధ్వని వినబడుతుంది! \q1 \v 23 మొత్తం భూమిని కొడుతున్న సుత్తి \q2 ఎలా విరిగి పగిలిపోయిందో! \q1 దేశాల మధ్య బబులోను \q2 ఎలా నిర్జనమైపోయిందో చూడండి! \q1 \v 24 బబులోనూ, నీ కోసం ఉచ్చు బిగించాను \q2 అది నీకు తెలియకముందే దానిలో చిక్కుకున్నావు. \q1 నీవు యెహోవాను వ్యతిరేకించావు కాబట్టి \q2 నిన్ను కనుగొని బంధించాను. \q1 \v 25 బబులోనీయుల దేశంలో \q2 ప్రభువైన సైన్యాల యెహోవా చేయవలసిన పని ఉంది. \q1 కాబట్టి యెహోవా తన ఆయుధశాలను తెరిచి \q2 తన ఉగ్రతను తీర్చే ఆయుధాలను బయటకు తెచ్చారు. \q1 \v 26 దూరం నుండి ఆమెపై దాడి చేయడానికి రండి. \q2 ఆమె ధాన్యాగారాలు తెరవండి; \q2 ధాన్యం కుప్పలా ఆమెను పోగు చేయండి. \q1 దాన్ని పూర్తిగా నాశనం చేయండి \q2 ఆమెలో దేన్ని వదలవద్దు. \q1 \v 27 దాని కోడెలన్నిటినీ చంపండి; \q2 వాటిని వధకు పంపండి! \q1 వారికి శ్రమ దినం వచ్చింది, \q2 వారు శిక్షించబడే సమయం వచ్చింది. \q1 \v 28 బబులోను నుండి తప్పించుకొని పారిపోయినవారి శబ్దం వినిపిస్తుంది \q2 మన దేవుడైన యెహోవా తన మందిరం కోసం \q1 ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో, \q2 సీయోనులో ప్రకటించండి. \b \q1 \v 29 “బబులోను మీదికి రమ్మని, \q2 విలుకాండ్రను బాణాలు విసిరే వారిని పిలువండి. \q1 ఆమె చుట్టూ చేరండి; \q2 ఎవరూ తప్పించుకోకూడదు. \q1 ఆమె చేసిన వాటికి ప్రతిఫలం ఇవ్వండి; \q2 ఆమె చేసినట్లే ఆమెకు చేయండి. \q1 ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను \q2 ఆమె ధిక్కరించింది. \q1 \v 30 కాబట్టి, ఆమె యువకులు వీధుల్లో కూలిపోతారు; \q2 ఆ రోజున ఆమె సైనికులందరూ మూగబోతారు” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 31 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q2 “అహంకారి, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, \q1 నీ శ్రమ దినం వచ్చింది, \q2 నీవు శిక్షించబడే సమయం వచ్చింది. \q1 \v 32 గర్విష్ఠులు తడబడి పడిపోతారు \q2 ఆమెను లేపడానికి ఎవరూ సహాయం చేయరు. \q1 నేను ఆమె పట్టణాల్లో అగ్ని రాజేస్తాను \q2 అది ఆమె చుట్టూ ఉన్నవారందరిని కాల్చివేస్తుంది.” \p \v 33 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ఇశ్రాయేలు ప్రజలు, \q2 యూదా ప్రజలు కూడా అణచివేయబడ్డారు. \q1 వారిని బంధించినవారు వారిని పట్టుకొని ఉన్నారు \q2 వారిని విడిచిపెట్టడానికి నిరాకరించారు. \q1 \v 34 అయినా వారి విమోచకుడు బలవంతుడు; \q2 ఆయన పేరు సైన్యాల యెహోవా. \q1 ఆయన వారి దేశానికి విశ్రాంతిని తెచ్చేలా \q2 వారి పక్షాన వాదిస్తారు, \q2 బబులోనులో నివసించేవారికి అశాంతి కలుగుతుంది.” \b \q1 \v 35 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q2 “బబులోనీయుల మీదికి \q1 బబులోనులో నివసించేవారి మీదికి \q2 దాని అధికారులు జ్ఞానుల మీదికి ఖడ్గం వస్తుంది. \q1 \v 36 దాని అబద్ధ ప్రవక్తల మీదికి ఖడ్గం వస్తుంది! \q2 వారు మూర్ఖులు అవుతారు. \q1 దాని యోధుల మీదికి ఖడ్గం వస్తుంది! \q2 వారు భయంతో నిండిపోతారు. \q1 \v 37 దాని గుర్రాలు రథాల మీదికి \q2 దానిలో ఉన్న విదేశీయులందరి మీదికి ఖడ్గం వస్తుంది! \q2 వారు స్త్రీలలా బలహీనులవుతారు. \q1 ఆమె సంపద మీదికి ఖడ్గం వస్తుంది! \q2 దాన్ని దోచుకుంటారు. \q1 \v 38 దానికి నీళ్ల కరువు వస్తుంది! \q2 నీళ్లు ఎండిపోతాయి. \q1 అది విగ్రహాల దేశం, \q2 భయంకరమైన విగ్రహాల వల్ల ప్రజలు పిచ్చివారవుతారు. \b \q1 \v 39 “కాబట్టి ఎడారి జీవులు, హైనాలు అక్కడ నివసిస్తాయి, \q2 గుడ్లగూబ అక్కడ నివసిస్తుంది. \q1 అది ఇంకెప్పుడు నివాసస్థలంగా ఉండదు \q2 తరతరాల వరకు దానిలో ఎవరూ నివసించరు. \q1 \v 40 సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు \q2 పడగొట్టినట్లు వీటిని కూడా చేసిన తర్వాత, \q2 అక్కడ ఎవరూ నివసించనట్లే, \q1 ఇక్కడ కూడా ఎవరూ నివసించరు” \q2 అని యెహోవా అంటున్నారు. \b \q1 \v 41 “చూడండి! ఉత్తర దిక్కునుండి ఒక సైన్యం వస్తుంది; \q2 ఒక గొప్ప దేశం అనేకమంది రాజులు \q2 భూదిగంతాల నుండి పురికొల్పబడతారు. \q1 \v 42 వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; \q2 వారు క్రూరులు, కనికరం లేనివారు. \q1 వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు \q2 వారి స్వరం సముద్ర ఘోషలా ఉంటుంది; \q1 బబులోను కుమార్తె, నీ మీద దాడి చేయడానికి \q2 వారు యుద్ధ వ్యూహంలోని సైనికుల్లాగా వస్తారు. \q1 \v 43 బబులోను రాజు వారి గురించిన వార్తలను విన్నాడు, \q2 అతని చేతులు వణికిపోయాయి. \q1 స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి \q2 వేదన అతన్ని పట్టుకుంది. \q1 \v 44 యొర్దాను పొదల్లో నుండి సింహం \q2 సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, \q1 నేను బబులోనును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. \q2 దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? \q1 నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? \q2 ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?” \b \q1 \v 45 కాబట్టి, బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో, \q2 బబులోనీయుల దేశానికి వ్యతిరేకంగా ఏమి ఉద్దేశించారో వినండి: \q1 మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; \q2 వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి. \q1 \v 46 బబులోను పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది; \q2 వారి మొర దేశాల్లో ప్రతిధ్వనిస్తుంది. \c 51 \p \v 1 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “చూడండి, నేను బబులోనుకు, లేబ్-కమాయి\f + \fr 51:1 \fr*\ft ఇది, బబులోను యొక్క రహస్య సంకేతంతో కూడిన పేరు\ft*\f* ప్రజలకు వ్యతిరేకంగా \q2 నాశనకరమైన ఆత్మను రేపుతాను. \q1 \v 2 బబులోనును చెదరగొట్టడానికి దాని దేశాన్ని నాశనం చేయడానికి \q2 విదేశీయులను పంపుతాను; \q1 దాని విపత్తు దినాన \q2 ప్రతి వైపున వారు దానిని వ్యతిరేకిస్తారు. \q1 \v 3 విలుకాండ్రు తమ విల్లును తీయకుందురు గాక, \q2 తమ కవచాలను ధరించకుందురు గాక. \q1 దాని యువకులను విడిచిపెట్టవద్దు; \q2 దాని సైన్యాన్ని పూర్తిగా నాశనం\f + \fr 51:3 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే.\ft*\f* చేయాలి. \q1 \v 4 వారు బబులోనులో హతమవుతారు, \q2 దాని వీధుల్లో ఘోరంగా గాయపరచబడతారు. \q1 \v 5 ఎందుకంటే ఇశ్రాయేలు, యూదా దేశాలు \q2 ఇశ్రాయేలు పరిశుద్ధునికి వ్యతిరేకంగా \q1 చేసిన దోషాలతో నిండి ఉన్నప్పటికీ \q2 వారి దేవుడైన సైన్యాల యెహోవా వారిని విడిచిపెట్టలేదు. \b \q1 \v 6 “బబులోను నుండి పారిపోండి! \q2 మీ ప్రాణాలు కాపాడుకోండి! \q2 దాని పాపాలను బట్టి నాశనం కాకండి. \q1 ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం; \q2 దానికి తగిన ప్రతిఫలం ఆయన చెల్లిస్తారు. \q1 \v 7 బబులోను యెహోవా చేతిలో బంగారు గిన్నె; \q2 అది భూమినంతటిని మత్తెక్కించింది. \q1 అన్ని దేశాలు దాని ద్రాక్షారసాన్ని త్రాగాయి; \q2 కాబట్టి వారు ఇప్పుడు పిచ్చివారైపోయారు. \q1 \v 8 బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. \q2 దాని గురించి విలపించండి! \q1 దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; \q2 బహుశా దానికి నయం కావచ్చు. \b \q1 \v 9 “ ‘మనం బబులోనును స్వస్థపరచి ఉండేవారం, \q2 కానీ దానికి స్వస్థత కలగదు; \q1 మనం దాన్ని విడిచి మన సొంత దేశానికి వెళ్దాం, \q2 ఎందుకంటే దాని తీర్పు ఆకాశాన్ని తాకుతుంది, \q2 అది మేఘాలంత ఎత్తుగా లేస్తుంది.’ \b \q1 \v 10 “ ‘యెహోవా మన నీతిని బయటపెట్టారు; \q2 రండి, మన దేవుడైన యెహోవా \q2 ఏమి చేశారో సీయోనులో చెప్పుదాము.’ \b \q1 \v 11 “బాణాలకు పదును పెట్టండి, \q2 కవచాలను తీసుకోండి! \q1 యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, \q2 ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. \q1 యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, \q2 తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు. \q1 \v 12 బబులోను గోడలకు వ్యతిరేకంగా జెండా ఎత్తండి! \q2 రక్షకభటులను బలపరచండి, \q1 కావలివారిని నిలబెట్టండి, \q2 మాటుగాండ్రను సిద్ధం చేయండి! \q1 యెహోవా తన ఉద్దేశాన్ని, \q2 బబులోను ప్రజలకు వ్యతిరేకంగా తన శాసనాన్ని నెరవేర్చబోతున్నారు. \q1 \v 13 అనేక జలాల ప్రక్కన నివసించేదానా, \q2 సమృద్ధి సంపదలు కలిగి ఉన్నదానా, \q1 నీ అంతం వచ్చింది, \q2 నీవు నాశనమయ్యే సమయం వచ్చింది. \q1 \v 14 సైన్యాల యెహోవా తన జీవం తోడని ప్రమాణం చేశారు: \q2 మిడతల దండులా నేను నిన్ను నిశ్చయంగా మనుష్యులతో నింపుతాను, \q2 వారు నీపై విజయ కేకలు వేస్తారు. \b \q1 \v 15 “ఆయన తన శక్తితో భూమిని చేశారు; \q2 ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, \q2 తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు. \q1 \v 16 ఆయన ఉరిమినప్పుడు, ఆకాశ జలాలు గర్జిస్తాయి; \q2 ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. \q1 ఆయన వర్షంతో మెరుపులు పంపి \q2 తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు. \b \q1 \v 17 “మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; \q2 ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. \q1 అతడు చేసే చిత్రాలు మోసం; \q2 వాటిలో ఊపిరి లేదు. \q1 \v 18 అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; \q2 వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి. \q1 \v 19 యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, \q2 ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, \q1 అన్నిటిని సృజించారు, \q2 ఆయన పేరు సైన్యాల యెహోవా. \b \q1 \v 20 “నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు, \q2 యుద్ధ ఆయుధంవంటివాడవు \q1 నీతో నేను దేశాలను చిన్నాభిన్నం చేస్తాను, \q2 నీతో రాజ్యాలను నాశనం చేస్తాను, \q1 \v 21 నీతో నేను గుర్రాన్ని రౌతును చిన్నాభిన్నం చేస్తాను, \q2 నీతో నేను రథాన్ని సారథిని చిన్నాభిన్నం చేస్తాను, \q1 \v 22 నీతో పురుషున్ని స్త్రీని చిన్నాభిన్నం చేస్తాను, \q2 నీతో వృద్ధులను చిన్నవారిని చిన్నాభిన్నం చేస్తాను, \q2 నీతో యువకులను యువతులను చిన్నాభిన్నం చేస్తాను, \q1 \v 23 నీతో గొర్రెల కాపరిని మందను చిన్నాభిన్నం చేస్తాను, \q2 నీతో రైతును ఎద్దులను చిన్నాభిన్నం చేస్తాను, \q2 నీతో అధిపతులను అధికారులను చిన్నాభిన్నం చేస్తాను. \p \v 24 “బబులోనుకు, బబులోనులో నివసించే వారందరికి సీయోనులో చేసిన అన్యాయానికి బదులుగా మీ కళ్లముందే నేను ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 25 “నాశనం చేసే పర్వతమా, \q2 భూమి అంతటిని నాశనం చేసేదానా, నేను నీకు వ్యతిరేకిని,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 “నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి, \q2 నిన్ను కొండలమీద నుండి దొర్లించి, \q2 నిన్ను కాలిపోయిన పర్వతంలా చేస్తాను. \q1 \v 26 ప్రజలు నీ నుండి మూలరాయిని గాని, \q2 పునాది రాయిని గాని తీసుకోరు, \q1 ఎందుకంటే నీవు శాశ్వతంగా నిర్జనమై ఉంటావు” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 27 “దేశంలో ఒక జెండా ఎత్తండి! \q2 దేశాల మధ్య బాకా ఊదండి! \q1 దానితో యుద్ధానికి జనాలను సిద్ధపరచండి; \q2 దాని మీద దాడి చేయడానికి: \q2 అరారతు, మిన్ని అష్కెనజు. \q1 దానికి వ్యతిరేకంగా సేనాధిపతిని నియమించండి; \q2 మిడతల దండులా గుర్రాలను పంపండి. \q1 \v 28 మాదీయుల రాజులను, \q2 వారి అధిపతులను, వారి అధికారులందరిని, \q1 వారు పాలించే అన్ని దేశాలను \q2 దాని మీదికి యుద్ధానికి సిద్ధపరచండి. \q1 \v 29 భూమి వణుకుతుంది, ప్రసవ వేదన పడుతుంది, \q2 బబులోను దేశాన్ని పాడు చేయాలని \q1 అక్కడ ఎవరూ నివసించకుండ చేయాలని \q2 యెహోవా ఉద్దేశాలలో మార్పు లేదు. \q1 \v 30 బబులోను యోధులు యుద్ధం ఆపివేశారు; \q2 వారు తమ కోటల్లోనే ఉంటారు. \q1 వారి బలం సమసిపోయింది; \q2 వారు బలహీనులయ్యారు. \q1 దాని నివాసాలకు నిప్పు పెట్టారు; \q2 దాని ద్వారబంధాలు విరిగిపోయాయి. \q1 \v 31 అతని పట్టణమంతా స్వాధీనం చేసుకోబడిందని \q2 బబులోను రాజుకు తెలియజేయడానికి, \q1 ఒక వార్తాహరుని వెంట మరో వార్తాహరుడు, \q2 ఒక దూత వెంట మరో దూత పరుగు పెడుతున్నారు. \q1 \v 32 నదుల రేవులను ఆక్రమించబడ్డాయి. \q2 చిత్తడి నేలలకు నిప్పంటించబడింది, \q2 సైనికులు భయభ్రాంతులకు గురయ్యారు.” \p \v 33 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “బబులోను కుమార్తె నూర్పిడి కళ్ళంలా ఉంది \q2 దాన్ని నూర్పిడి సమయం ఇదే; \q2 త్వరలో దాని కోతకాలం వస్తుంది.” \b \q1 \v 34 “బబులోను రాజైన నెబుకద్నెజరు మనల్ని మ్రింగివేశాడు, \q2 మనల్ని గందరగోళంలో పడేశాడు, \q2 మనల్ని ఖాళీ కుండలా చేశాడు. \q1 ఘటసర్పంలా మనల్ని మ్రింగివేసి \q2 మన రుచికరమైన పదార్ధాలతో తన కడుపు నింపుకొని \q2 తర్వాత మనల్ని ఉమ్మివేశాడు. \q1 \v 35 మన శరీరానికి\f + \fr 51:35 \fr*\ft లేదా \ft*\fqa మనకు, మన పిల్లలకు\fqa*\f* చేసిన హింస బబులోనుకు జరుగును గాక,” \q2 అని సీయోను నివాసులు అంటున్నారు. \q1 “మా రక్తదోషం బబులోనులో నివసించేవారి మీద ఉండును గాక,” \q2 అని యెరూషలేము అంటుంది. \p \v 36 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: \q1 “చూడండి, నేను మీ పక్షంగా వాదిస్తాను, \q2 మీ కోసం ప్రతీకారం తీర్చుకుంటాను. \q1 నేను దాని సముద్రం ఆరిపోయేలా చేస్తాను, \q2 దాని నీటి ఊటలు ఎండిపోయేలా చేస్తాను. \q1 \v 37 బబులోను శిథిలాల కుప్పగా, \q2 నక్కల నివాసంగా, \q1 భయానకంగా, హేళనగా, \q2 ఎవరూ నివసించని స్థలంగా అవుతుంది. \q1 \v 38 దాని ప్రజలంతా కొదమ సింహాల్లా గర్జిస్తారు, \q2 సింహం పిల్లల్లా కేకలు వేస్తారు. \q1 \v 39 అయితే వారు ఉత్సాహంగా ఉన్నప్పుడు, \q2 నేను వారికి విందు ఏర్పాటుచేసి, \q2 వారు సంతోషించేలా, \q1 మద్యంతో వారికి మత్తు ఎక్కేలా చేస్తాను \q2 అప్పుడు వారు శాశ్వతంగా నిద్రపోతారు, తిరిగి మేలుకోరు,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 40 “వధకు గొర్రెపిల్లలను \q2 పొట్టేళ్లను, మేకలను తెచ్చినట్టు, \q2 నేను వారిని తీసుకువస్తాను. \b \q1 \v 41 “భూమి అంతా మెచ్చుకునే, \q2 షేషకు\f + \fr 51:41 \fr*\fq షేషకు \fq*\ft అంటే బబులోను యొక్క సంకేత లిపి\ft*\f* ఎలా పట్టబడింది! \q1 దేశాల మధ్యలో బబులోను \q2 ఎంత నిర్జనంగా మారిందో! \q1 \v 42 సముద్రం బబులోను మీదికి పొంగి వచ్చింది; \q2 ఎగసిపడే అలలు దాన్ని కప్పివేస్తాయి. \q1 \v 43 దాని పట్టణాలు నిర్జనమై, \q2 ఎండిపోయి ఎడారిగా, \q1 ఎవరూ నివసించని దేశంగా ఉంది, \q2 ఎవరూ ప్రయాణించని దేశంగా ఉంటుంది. \q1 \v 44 నేను బబులోనులో బేలును శిక్షిస్తాను \q2 అతడు మ్రింగివేసిన దాన్ని బయటకు కక్కేలా చేస్తాను. \q1 దేశాలు అతని దగ్గరకు ఇక గుంపులుగా రావు. \q2 బబులోను గోడ కూలిపోతుంది. \b \q1 \v 45 “నా ప్రజలారా, దాని నుండి బయటకు రండి! \q2 మీ ప్రాణాలు కాపాడుకోండి! \q2 యెహోవా కోపాగ్ని నుండి పారిపోండి. \q1 \v 46 దేశంలో పుకార్లు వినబడినప్పుడు, \q2 ధైర్యం కోల్పోవద్దు, భయపడవద్దు; \q1 ప్రతి సంవత్సరం ఒకదాని తర్వాత ఇంకొక పుకారు వస్తూనే ఉంటుంది, \q2 దేశంలో హింస జరుగుతుందని, \q2 పాలకునికి వ్యతిరేకంగా మరో పాలకుడు ఉన్నాడని పుకార్లు వినబడతాయి. \q1 \v 47 ఎందుకంటే నేను బబులోను విగ్రహాలను \q2 శిక్షించే సమయం తప్పకుండా వస్తుంది; \q1 దాని దేశమంతా అవమానించబడుతుంది \q2 చనిపోయిన దాని ప్రజలు దానిలోనే పడిపోయి ఉంటారు. \q1 \v 48 అప్పుడు భూమి ఆకాశాలు వాటిలో ఉన్నవన్నీ \q2 బబులోను గురించి ఆనందంతో కేకలు వేస్తాయి, \q1 ఎందుకంటే ఉత్తర దిక్కునుండి \q2 నాశనం చేసేవారు దాని మీద దాడి చేస్తారు,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 49 “బబులోను ఇశ్రాయేలు వారిని చంపినట్లే, \q2 బబులోను పతనం కావాలి \q2 బబులోనువారు భూమి అంతటా చంపబడతారు. \q1 \v 50 ఖడ్గం నుండి తప్పించుకున్న వారలారా, \q2 వెళ్లిపొండి, ఆలస్యం చేయకండి! \q1 సుదూరదేశంలో ఉన్నాసరే, యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, \q2 యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి.” \b \q1 \v 51 “మేము అపకీర్తి పాలయ్యాము, \q2 ఎందుకంటే మేము అవమానించబడ్డాము \q2 సిగ్గు మా ముఖాలను కప్పివేస్తుంది, \q1 ఎందుకంటే యెహోవా మందిరంలోని పవిత్ర స్థలాల్లోకి \q2 విదేశీయులు ప్రవేశించారు.” \b \q1 \v 52 యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “రాబోయే రోజుల్లో, \q2 నేను దాని విగ్రహాలను శిక్షిస్తాను, \q1 దాని దేశమంతటా \q2 గాయపడినవారు మూల్గుతారు. \q1 \v 53 బబులోను ఆకాశానికి ఎక్కి \q2 తన ఎత్తైన కోటను పటిష్టం చేసుకున్నా, \q2 నేను దాని మీదికి నాశనం చేసేవారిని పంపుతాను” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 54 “బబులోను నుండి ఏడ్పు వస్తుంది, \q2 బబులోనీయుల దేశం నుండి \q2 మహా విధ్వంస శబ్దం వస్తుంది. \q1 \v 55 యెహోవా బబులోనును నాశనం చేస్తారు; \q2 ఆయన దాని సందడిని అణచివేస్తారు. \q1 శత్రువుల కెరటాలు మహా జలాల్లా ఎగసిపడతాయి; \q2 వారి స్వరాల గర్జన ప్రతిధ్వనిస్తుంది. \q1 \v 56 బబులోను మీదికి నాశనం చేసేవాడు వస్తాడు; \q2 దాని యోధులు బందీలవుతారు, \q2 ఎందుకంటే వారి విల్లులు విరిగిపోతాయి. \q1 యెహోవా ప్రతీకారం చేసే దేవుడు; \q2 ఆయన పూర్తిగా తిరిగి చెల్లిస్తారు. \q1 \v 57 నేను దాని ఉన్నతాధికారులు, జ్ఞానులు, \q2 దాని అధిపతులు, అధికారులు, యోధులు \q2 కూడా మద్యం త్రాగి మత్తెక్కేలా చేస్తాను. \q1 వారు శాశ్వతంగా నిద్రపోతారు ఇక మేలుకోరు,” \q2 అని సైన్యాల యెహోవా అనే పేరుగల రాజు ప్రకటిస్తున్నారు. \p \v 58 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: \q1 “బబులోను దృఢమైన గోడ నేలమట్టం అవుతుంది, \q2 దాని ఎత్తైన ద్వారాలకు నిప్పు పెట్టబడుతుంది. \q1 ప్రజలు వృధాగా కష్టపడుతున్నారు, \q2 దేశాల శ్రమ అగ్ని పాలవుతుంది.” \p \v 59 యూదా రాజైన సిద్కియా పాలనలోని నాల్గవ సంవత్సరంలో మహశేయా మనుమడును నేరియా కుమారుడును రాజు వసతిగృహ అధికారియునైన శెరాయా, రాజైన సిద్కియాతో కలిసి బబులోనుకు వెళ్లినప్పుడు, ప్రవక్తయైన యిర్మీయా ఈ సందేశాన్ని అతనికి ఇచ్చాడు. \v 60 యిర్మీయా ఒక గ్రంథపుచుట్టలో బబులోను మీదికి రాబోతున్న విపత్తులన్నిటిని గురించి వ్రాశాడు. బబులోను గురించి వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాశాడు. \v 61 అప్పుడు యిర్మీయా శెరాయాతో, “మీరు బబులోనుకు చేరుకున్నప్పుడు, ఈ మాటలన్నీ బిగ్గరగా చదివి వినిపించు. \v 62 తర్వాత ఇలా చెప్పండి, ‘యెహోవా, ఈ స్థలంలో మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండ దాన్ని నాశనం చేస్తాను; అది శాశ్వతంగా పాడైపోయి ఉంటుందని యెహోవా చెప్పారు’ అని నీవు చెప్పాలి. \v 63 నీవు ఈ గ్రంథపుచుట్ట చదవడం ముగించాక, దానికి ఒక రాయి కట్టి యూఫ్రటీసు నదిలో పడేయండి. \v 64 తర్వాత, ‘నేను దాని మీదికి తెచ్చే విపత్తు వల్ల బబులోను ఇక లేవకుండ అలాగే మునిగిపోతుంది. దాని ప్రజలు పతనమవుతారు.’ అని నీవు చెప్పాలి.” \b \b \p యిర్మీయా మాటలు ఇంతటితో ముగిశాయి. \b \c 52 \s1 యెరూషలేము పతనం \p \v 1 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు; ఆమె యిర్మీయా కుమార్తె; ఆమె లిబ్నా పట్టణస్థురాలు. \v 2 యెహోయాకీము చేసినట్టే అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. \v 3 యెహోవా తీవ్రమైన కోపంతో వారిని తన సన్నిధి నుండి త్రోసివేసేంతగా ఈ చెడుతనం యెరూషలేము, యూదాల్లో జరిగింది. \p తర్వాత సిద్కియా బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు. \p \v 4 కాబట్టి సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ రోజున, బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి బయలుదేరాడు. వారు పట్టణం బయట శిబిరం వేసుకుని దాని చుట్టూ ముట్టడి దిబ్బలు నిర్మించారు. \v 5 సిద్కియా రాజు ఏలుబడిలో పదకొండవ సంవత్సరం వరకు పట్టణం ముట్టడిలో ఉంది. \p \v 6 నాలుగవ నెల తొమ్మిదవ రోజున కరువు పట్టణంలో మరీ తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఆహారం లేకుండా పోయింది. \v 7 పట్టణ గోడలు పడగొట్టి బబులోనీయులు పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు, సైన్యమంతా రాత్రివేళ రాజు తోట సమీపంలోని రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా వారు పట్టణాన్ని విడిచిపోయారు. వారు అరాబా వైపు పారిపోయారు.\f + \fr 52:7 \fr*\ft లేదా \ft*\fqa యొర్దాను లోయ\fqa*\f* \v 8 అయితే బబులోను సైన్యం సిద్కియా రాజును వెంటాడి, యెరికో సమతల మైదానంలో అతన్ని పట్టుకుంది. అతని సైనికులందరూ అతని నుండి చెదిరిపోయారు. \v 9 అతడు పట్టుబడ్డాడు. \p అతన్ని హమాతు దేశంలోని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు. \v 10 అక్కడ బబులోను రాజు రిబ్లాలో సిద్కియా కుమారులను, అలాగే యూదా పెద్దలందరినీ అతని కళ్లముందే చంపేశాడు. \v 11 అప్పుడు అతడు సిద్కియా రాజు కళ్లు ఊడదీసి, ఇత్తడి సంకెళ్ళతో బంధించి, అతన్ని బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు చనిపోయే వరకు అక్కడే చెరసాలలో ఉంచాడు. \p \v 12 బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలనలోని పందొమ్మిదవ సంవత్సరం, అయిదవ నెల, పదవ రోజున బబులోను రాజు సేవకుడును రాజ రక్షక దళాధిపతియునైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. \v 13 అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు. \v 14 రాజ రక్షక దళాధిపతి క్రింద ఉన్న బబులోను సైన్యమంతా యెరూషలేము చుట్టూ ఉన్న గోడలన్నిటిని పడగొట్టారు. \v 15 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను నిరుపేదలైన కొందరిని పట్టణంలో మిగిలినవారిని, బబులోను రాజు పక్షం చేరిన వారిని, మిగిలిన నిపుణులైన చేతిపని వారిని బందీలుగా తీసుకెళ్లాడు. \v 16 అయితే నెబూజరదాను ద్రాక్షతోటల్లో, పొలాల్లో పని చేయడానికి దేశంలోని కొంతమంది నిరుపేద ప్రజలను విడిచిపెట్టాడు. \p \v 17 బబులోనీయులు యెహోవా మందిరం దగ్గర ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, ఇత్తడి గంగాళాన్ని పగలగొట్టి, ఆ ఇత్తడినంతటిని బబులోనుకు తీసుకెళ్లారు. \v 18 వారు కుండలు, గడ్డపారలు, వత్తులు కత్తిరించే కత్తెరలను, చిలకరించే గిన్నెలు, గిన్నెలు ఆలయ సేవలో ఉపయోగించే అన్ని ఇత్తడి వస్తువులను కూడా తీసుకెళ్లారు. \v 19 రాజ రక్షక దళాధిపతి పళ్లెములు, ధూపార్తులను, చిలకరింపు పాత్రలను, కుండలను, దీపస్తంభాలను, పానీయ అర్పణలకు ఉపయోగించే గిన్నెలను పాత్రలను మేలిమి బంగారంతో వెండితో చేసిన వాటన్నిటిని తీసుకెళ్లాడు. \p \v 20 యెహోవా మందిరం కోసం సొలొమోను రాజు చేయించిన రెండు స్తంభాలు, గంగాళం, దాని క్రింద ఉన్న పన్నెండు ఇత్తడి ఎద్దులు, పీటలకున్న ఇత్తడిని తూకం వేయలేనంత ఎక్కువ బరువు కలవి. \v 21 ఒక్కో స్తంభం ఎత్తు పద్దెనిమిది మూరలు, చుట్టుకొలత\f + \fr 52:21 \fr*\ft అంటే, దాదాపు 27 అడుగుల ఎత్తు, 18 అడుగుల చుట్టుకొలత లేదా దాదాపు 8.1 మీటర్ల ఎత్తు, 5.4 మీటర్ల చుట్టుకొలత\ft*\f* పన్నెండు మూరలు; ఒక్కొక్కటి నాలుగు వ్రేళ్ల మందంతో గుల్లగా ఉన్నాయి. \v 22 ఒక స్తంభం మీద ఉన్న ఇత్తడి పీట ఎత్తు అయిదు మూరలు,\f + \fr 52:22 \fr*\ft అంటే, సుమారు 7.5 అడుగులు లేదా 2.3 మీటర్లు\ft*\f* దాని చుట్టూ అల్లికపనితో, ఇత్తడితో చేసిన దానిమ్మ పండ్లతో అలంకరించబడింది. ఇంకొక స్తంభం కూడా దానిమ్మ పండ్లతో అలాగే ఉంది. \v 23 ప్రక్కలలో తొంభై ఆరు దానిమ్మపండ్లు ఉన్నాయి; చుట్టూరా అల్లికపని పైన ఉన్న మొత్తం దానిమ్మపండ్ల సంఖ్య వంద. \p \v 24 రాజ రక్షక దళాధిపతి ముఖ్య యాజకుడైన శెరాయాను, ఆ తర్వాతి స్థానంలో ఉన్న యాజకుడైన జెఫన్యాను, ముగ్గురు ద్వారపాలకులను ఖైదీలుగా తీసుకెళ్లాడు. \v 25 పట్టణంలో ఇంకా ఉన్నవారిలో నుండి అతడు సైనికుల అధికారిని, ఏడుగురు రాజ సలహాదారులను తీసుకెళ్లాడు. అంతేకాక, దేశప్రజలను సైన్యంలో చేర్చే ప్రధాన అధికారిగా ఉన్న కార్యదర్శిని, పట్టణంలో దొరికిన అరవైమంది ప్రముఖులను పట్టుకుని తీసుకెళ్లాడు. \v 26 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారందరినీ పట్టుకుని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లాడు. \v 27 హమాతు దేశంలోని రిబ్లాలో బబులోను రాజు వారిని చంపించాడు. \p కాబట్టి యూదా తన దేశానికి దూరంగా బందీగా వెళ్లిపోయింది. \b \lh \v 28 నెబుకద్నెజరు బందీలుగా తీసుకెళ్లిన ప్రజల సంఖ్య ఇది: \b \li1 ఏడవ సంవత్సరంలో, \li2 3,023 మంది యూదులు; \li1 \v 29 నెబుకద్నెజరు పద్దెనిమిదవ సంవత్సరంలో, \li2 యెరూషలేము నుండి 832 మంది; \li1 \v 30 నెబుకద్నెజరు తన పరిపాలన ఇరవై మూడవ సంవత్సరంలో, \li2 745 మంది యూదులను రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను బందీలుగా తీసుకెళ్లాడు. \b \lf బందీలుగా వెళ్లిన ప్రజలు మొత్తం 4,600 మంది. \s1 యెహోయాకీను విడుదల \p \v 31 యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, పన్నెండవ నెల ఇరవై అయిదవ రోజున, అతడు యూదా రాజైన యెహోయాకీనును జైలు నుండి విడుదల చేశాడు. \v 32 అతడు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న ఇతర రాజుల స్థాయి కంటే ఉన్నత స్థాయిని అతనికిచ్చాడు. \v 33 కాబట్టి యెహోయాకీను తన జైలు దుస్తులు తీసివేసి, ఇక తన జీవితాంతం రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు. \v 34 అతడు బ్రతికి ఉన్నంత కాలం, అతడు చనిపోయే వరకు, బబులోను రాజు ప్రతిరోజు క్రమంగా యెహోయాకీనుకు బత్తెం ఇచ్చాడు.