\id JAS - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h యాకోబు పత్రిక \toc1 యాకోబు వ్రాసిన పత్రిక \toc2 యాకోబు పత్రిక \toc3 యాకోబు \mt1 యాకోబు \mt2 వ్రాసిన పత్రిక \c 1 \po \v 1 దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు సేవకుడనైన యాకోబు, \po వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాస్తున్నాను: \po మీకు శుభాలు. \s1 శ్రమలు, శోధనలు \p \v 2 నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కాబట్టి, \v 3 మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి. \v 4 మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేనివారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి. \v 5 మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు. \v 6 మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలికి రేగి ఎగసిపడే సముద్రపు అలల్లాంటివారు; \v 7 కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. \v 8 అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగి ఉంటారు, తాము చేసేవాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు. \p \v 9 దీనస్థితిలో ఉన్న విశ్వాసులు తమకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతిశయించాలి. \v 10 అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు. \v 11 కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు. \p \v 12 శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు. \p \v 13 దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే, “నేను దేవుని చేత శోధించబడుతున్నాను” అని అనకూడదు. \v 14 ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురై శోధించబడతారు. \v 15 చెడు కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పండి మరణానికి జన్మనిస్తుంది. \p \v 16 నా ప్రియ సహోదరీ సహోదరులారా, మోసపోకండి. \v 17 పైనుండి వచ్చే ప్రతీ శ్రేష్ఠమైన సంపూర్ణమైన బహుమానం వెలుగును కలిగించిన తండ్రి దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఆయన ఒకచోట నిలబడని నీడల్లా ఎన్నడు మారరు. \v 18 ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు. \s1 వినుట ఆచరించుట \p \v 19 నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు; \v 20 ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు. \v 21 కాబట్టి మీ జీవితాల్లోని సమస్త మలినాన్ని చెడును వదిలిపెట్టి, దేవుడు మీ హృదయాల్లో నాటిన వాక్యాన్ని వినయంతో అంగీకరించండి, ఎందుకంటే మీ ఆత్మలను రక్షించే శక్తి దానికే ఉంది. \p \v 22 మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి. \v 23 ఎవరైతే వాక్యాన్ని విని అది చెప్పిన ప్రకారం చేయరో, వారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకునే వారిలా ఉంటారు; \v 24 వారు తమను చూసుకొని ప్రక్కకు వెళ్లిన వెంటనే తాము ఎలా ఉన్నారో మరచిపోతారు. \v 25 అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి పరిశీలనగా చూసి దానిలో కొనసాగేవారు, విని మరచేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు. \p \v 26 తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది. \v 27 తండ్రియైన దేవుని దృష్టిలో పవిత్రమైన నిష్కళంకమైన ధర్మం ఏంటంటే: అనాధలను, ఇబ్బందుల్లో ఉన్న విధవరాండ్రను సంరక్షించడం, లోక మాలిన్యం అంటకుండా తమను కాపాడుకోవడము. \c 2 \s1 పక్షపాతం చూపకూడదు \p \v 1 నా సహోదరీ సహోదరులారా, మహిమగల మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసం గలవారిగా పక్షపాతం చూపకండి. \v 2 బంగారు ఉంగరాలు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడు, అలాగే మురికిబట్టలు వేసుకున్న పేదవాడు మీ సంఘానికి వచ్చినప్పుడు, \v 3 విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడిని ప్రత్యేకంగా గమనించి, “దయచేసి ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, పేదవానితో “అక్కడ నిలబడు” అని “నా కాళ్ల దగ్గర కూర్చో” అని చెబితే, \v 4 మీరు వ్యత్యాసాలు చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా? \p \v 5 నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా? \v 6 అయితే మీరు పేదవారిని అవమానించారు. మీకు అన్యాయం చేసింది ధనవంతులు కాదా? మిమ్మల్ని న్యాయస్థానానికి లాగింది వారు కాదా? \v 7 మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా? \p \v 8 “మీలా మీ పొరుగువారిని ప్రేమించాలి”\f + \fr 2:8 \fr*\ft \+xt లేవీ 19:18\+xt*\ft*\f* అని లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీ ప్రవర్తన సరిగా ఉన్నట్లే. \v 9 అయితే మీరు పక్షపాతం చూపిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు అపరాధులుగా నిర్ధారించబడి పాపం చేసినవారవుతారు. \v 10 ఎవరైనా ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించి ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పటికి వారు అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధులు అవుతారు. \v 11 “వ్యభిచారం చేయకూడదు,”\f + \fr 2:11 \fr*\ft \+xt నిర్గమ 20:14; ద్వితీ 5:18\+xt*\ft*\f* అని చెప్పిన దేవుడు, “మీరు హత్య చేయకూడదు”\f + \fr 2:11 \fr*\ft \+xt నిర్గమ 20:13; ద్వితీ 5:17\+xt*\ft*\f* అని కూడా చెప్పారు. నీవు వ్యభిచారం చేయకపోయినా నరహత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. \p \v 12 కాబట్టి మీరు స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు పొందబోయే వానిలా మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలి. \v 13 ఎందుకంటే దయచూపించనివారి మీద దయ చూపక తీర్పు తీర్చబడుతుంది; దయ తీర్పుపై జయం పొందుతుంది. \s1 విశ్వాసం, క్రియలు \p \v 14 నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా ఎవరైనా మాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా? \v 15-16 ఒక సహోదరునికి గాని సహోదరికి గాని వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనప్పుడు మీరు వారి శరీరాలకు అవసరమైనవి ఇవ్వకుండ వారితో, “సమాధానంతో వెళ్లి చలి కాచుకుని, తృప్తిగా తిను” అని చెప్తే ఏం ప్రయోజనం? \v 17 అలాగే క్రియలు లేకపోతే ఆ విశ్వాసం దానికదే మరణిస్తుంది. \p \v 18 అయితే ఎవరైనా, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి.” \p క్రియలు లేకుండా మీ విశ్వాసాన్ని నాకు చూపించు, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు చూపిస్తానని చెప్పవచ్చు. \v 19 దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అది మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి. \p \v 20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని\f + \fr 2:20 \fr*\ft కొ.ప్రా.ప్ర.లలో \ft*\fqa మృతము\fqa*\f* నీకు రుజువులు కావాలా? \v 21 మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించినప్పుడు తాను చేసిన దాన్ని బట్టి నీతిమంతుడని చెప్పబడలేదా? \v 22 అతని క్రియలు అతని విశ్వాసం కలిసి పని చేశాయి. అతడు చేసిన దాన్ని బట్టి అతని విశ్వాసం సంపూర్ణం అయ్యింది. \v 23 నెరవేరబడిన లేఖనాలు ఏమి చెప్తున్నాయంటే, “అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది”\f + \fr 2:23 \fr*\ft \+xt ఆది 15:6\+xt*\ft*\f* అనే లేఖనం నెరవేరింది. అలాగే అబ్రాహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. \v 24 ఒక వ్యక్తి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా అతని క్రియలనుబట్టి నీతిమంతునిగా పరిగణించడం మీరు చూశారు. \p \v 25 అలాగే వేశ్యయైన రాహాబు\f + \fr 2:25 \fr*\ft \+xt యెహో 2:1-21\+xt*\ft*\f* దూతలను ఆదరించి, వేరొక మార్గం గుండా వారిని పంపివేసినప్పుడు తాను చేసిన క్రియలనుబట్టి ఆమె నీతిమంతురాలిగా చెప్పబడలేదా? \v 26 ప్రాణం లేని శరీరం మరణించినట్లే క్రియలు లేని విశ్వాసం కూడా మరణిస్తుంది. \c 3 \s1 నాలుకను అదుపుచేయడం \p \v 1 నా సహోదరీ సహోదరులారా, బోధకులమైన మనం అత్యంత కఠినంగా తీర్పు తీర్చబడతామని మీకు తెలుసు కాబట్టి మీలో అనేకమంది బోధకులుగా మారకండి. \v 2 మనమందరం అనేక విషయాల్లో తడబడతాము. మాట్లాడంలో తప్పులు చేయనివారు పరిపూర్ణులై శరీరమంతటిని ఒక కళ్లెంతో అదుపులో ఉంచుకోగల శక్తిని కలిగి ఉంటారు. \p \v 3 మనం గుర్రాలను లోబరచుకోవడానికి వాటి నోటికి కళ్లెం వేసి దాని ఆధారంగా వాటి శరీరమంతటిని త్రిప్పుతాము. \v 4 ఓడలను చూడండి; చాలా పెద్దగా ఉంటాయి, అవి బలమైన గాలికి కొట్టుకొనిపోతున్నా దానిని నడిపేవాని ఇష్ట ప్రకారం చాలా చిన్నగా ఉండే చుక్కాని సహాయంతో త్రిప్పబడుతుంది. \v 5 అలాగే నాలుక చిన్న అవయవమే కానీ అది అధికంగా ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ వల్ల ఎంతో పెద్ద అడవి కాల్చివేయబడుతుంది. \v 6 కాబట్టి నాలుక అగ్నిలాంటిది. నాలుక ఒక పాపాల పుట్టగా మన అవయవాల మధ్య ఉంచబడింది; అది శరీరమంతటిని పాడుచేస్తుంది, ప్రకృతి చక్రంలో చిచ్చు పెడుతుంది; నరకాగ్ని చేత దానికదే కాలిపోతుంది. \p \v 7 మృగాలను, పక్షులను, ప్రాకే ప్రాణులను, సముద్రపు జీవులను మానవజాతి అదుపుచేస్తుంది, అదుపుచేసింది. \v 8 కాని నిరంతరం చెడుచేస్తూ, మరణకరమైన విషంతో నిండిన నాలుకను ఎవరూ అదుపుచేయలేరు. \p \v 9 ఆ నాలుకతోనే తండ్రియైన దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని పోలికతో చేయబడిన వారిని శపిస్తాము. \v 10 ఒకే నోటి నుండి స్తుతి శాపాలు వస్తున్నాయి. నా సహోదరీ సహోదరులారా, మనం అలా ఉండకూడదు. \v 11 ఒక నీటి ఊటలో ఒకే చోట నుండి మంచినీరు ఉప్పునీరు వస్తాయా? \v 12 నా సహోదరీ సహోదరులారా, అంజూర చెట్టుకు ఒలీవల పండ్లు, ద్రాక్షతీగెలకు అంజూర పండ్లు కాస్తాయా? అదే విధంగా ఉప్పునీటి ఊట నుండి మంచినీరు రావు. \s1 రెండు రకాల జ్ఞానం \p \v 13 మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ క్రియలను మీ మంచి ప్రవర్తన ద్వారా చూపించాలి. \v 14 అయితే మీ హృదయాల్లో తీవ్రమైన అసూయ, స్వార్థపూరితమైన దురాశలు ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవద్దు, సత్యాన్ని తృణీకరించవద్దు. \v 15 అలాంటి జ్ఞానం పరలోక నుండి దిగివచ్చింది కాదు ఈ లోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది కాదు దయ్యాలకు సంబంధించిన జ్ఞానము. \v 16 ఎక్కడైతే అసూయ స్వార్థపూరితమైన దురాశలు ఉంటాయో అక్కడ ప్రతి విధమైన అక్రమాలు దుర్మార్గాలు ఉంటాయి. \p \v 17 పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది. \v 18 శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు. \c 4 \s1 మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి \p \v 1 మీ మధ్యలో ఉన్న తగాదాలు, గొడవలు ఎక్కడ నుండి వచ్చాయి? మీలో పోరాడుతున్న దురాశల నుండి వచ్చినవే కదా? \v 2 మీరు కోరుకున్నదానిని పొందలేదు కాబట్టి మీరు హత్య చేస్తారు. మీరు ఆశపడిన దానిని సంపాదించుకోలేదు కాబట్టి మీరు పోరాటాలు, గొడవలు చేస్తారు. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు పొందలేదు. \v 3 మీరు అడిగినప్పుడు మీ సంతోషాల కోసం ఉపయోగించుకోవాలనే దురుద్ధేశ్యంతో అడుగుతారు కాబట్టి మీకు ఏమి దొరకదు. \p \v 4 వ్యభిచారులారా!\f + \fr 4:4 \fr*\ft అవిశ్వాస ఒడంబడికకు సూచన, \+xt హోషేయ 3:1\+xt*\ft*\f* ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడమేనని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు. \v 5 లేదా, “దేవుడు మనలో నివసింపచేసిన ఆత్మ కోసం ఆయన ఆరాటపడుతున్నారని” లేఖనం చెప్పడం అనవసరం అని అనుకుంటున్నారా?\f + \fr 4:5 \fr*\ft లేదా \ft*\fqa ఆయన మనలో నివసింపచేసిన ఆత్మ తీవ్రంగా అసూయపడుచున్నాడు.\fqa*\f* \v 6 అయితే ఆయన అందరికి ఎక్కువ కృపను ఇస్తారు కాబట్టి, \q1 “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని, \q2 దీనులకు దయ చూపిస్తారు”\f + \fr 4:6 \fr*\ft \+xt సామెత 3:34\+xt*\ft*\f* \m అని లేఖనం చెప్తుంది. \p \v 7 కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు. \v 8 దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. \v 9 విచారపడుతూ దుఃఖిస్తూ కన్నీరు కార్చండి. మీ నవ్వును దుఃఖంగా, మీ సంతోషాన్ని విచారంగా మార్చుకోండి. \v 10 ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. \p \v 11 నా సహోదరీ సహోదరులారా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు లేదా ఇతరులకు తీర్పు తీర్చేవారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తారు. మీరు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చితే అప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా కాకుండా న్యాయాధికారిగా ఉన్నారని అర్థము. \v 12 ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవారు న్యాయాధికారి ఒక్కరే, ఆయన రక్షించగలరు నాశనం చేయగలరు. కాబట్టి మీ పొరుగువారికి తీర్పు తీర్చడానికి మీరు ఎవరు? \s1 రేపటి గురించి గొప్పలు చెప్పుకోవడం \p \v 13 “ఈ రోజైనా లేక రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అని చెప్పేవారలారా రండి. \v 14 రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనిపించి అంతలోనే మాయమైపోయే ఆవిరివంటిది. \v 15 కాబట్టి, “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాం అది చేద్దాం” అని మీరు చెప్పాలి. \v 16 కాని మీరు అహంకారంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా గొప్పలు చెప్పుకోవడం చాలా చెడ్డది. \v 17 కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు. \c 5 \s1 హింసించే ధనవంతులకు హెచ్చరిక \p \v 1 ధనవంతులారా రండి, మీపైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడవండి. \v 2 మీ ధనం పాడైపోతుంది, మీ వస్త్రాలను చిమ్మటలు తినివేస్తాయి. \v 3 మీ బంగారము వెండి తుప్పుపడతాయి; వాటి తుప్పు మీకు వ్యతిరేక సాక్ష్యంగా ఉండి అగ్నిలా మీ శరీరాన్ని తింటుంది. మీరు చివరిరోజుల కోసం ధనాన్ని కూడబెట్టారు. \v 4 చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి. \v 5 మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహార దినాన\f + \fr 5:5 \fr*\ft లేదా \ft*\fqa విందు దినాన\fqa*\f* మీ హృదయాలను మిమ్మల్ని మీరు పోషించుకున్నారు. \v 6 మిమ్మల్ని ఎదిరించలేని నీతిమంతులను మీరు శిక్షించి వారిని హత్య చేశారు. \s1 శ్రమలలో ఓర్పు \p \v 7 కాబట్టి సహోదరీ సహోదరులారా, ప్రభువు వచ్చేవరకు ఓపికతో ఉండండి. రైతు భూమి నుండి విలువైన పంటను పొందడానికి తొలకరి వాన చివరి వానలు పడేవరకు ఓపికతో ఎదురుచూస్తాడు. \v 8 మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది కాబట్టి మీ హృదయాలను బలపరచుకోండి. \v 9 సహోదరీ సహోదరులారా, మీరు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి ఒకరిపై ఒకరు సణుగుకోవద్దు. చూడండి, న్యాయాధిపతి తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు! \p \v 10 సహోదరీ సహోదరులారా, మన ప్రభువు నామంలో మాట్లాడిన ప్రవక్తలను శ్రమలకు ఓపికకు మాదిరిగా తీసుకోండి. \v 11 సహనాన్ని చూపినవారిని ధన్యులు అని పిలుస్తాము. యోబుకు గల సహనం గురించి మీకు తెలుసు. చివరకు ప్రభువు అతనికి చేసిన దాన్ని చూసి ప్రభువు ఎంతో జాలి దయ గలవారని మీరు తెలుసుకున్నారు. \p \v 12 అన్నిటికి మించి, నా సహోదరీ సహోదరులారా, ఆకాశంతోడని గాని భూమితోడని గాని లేదా ఇంకా దేనిపైనైనా గాని ప్రమాణం చేయవద్దు. మీరు, అవునంటే “అవును” కాదంటే “కాదు” అని లేకపోతే మీరు శిక్షించబడతారు. \s1 విశ్వాసంతో ప్రార్థన \p \v 13 మీలో ఎవరైనా శ్రమలు అనుభవిస్తున్నారా? అయితే వారు ప్రార్థించాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అయితే వారు స్తుతి గీతాలను పాడాలి. \v 14 మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అయితే వారు సంఘ పెద్దలను పిలిపించాలి. ఆ పెద్దలు ప్రభువు పేరిట వారికి నూనె రాసి వారి కోసం ప్రార్థన చేయాలి. \v 15 విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగులను బాగుచేస్తుంది. ప్రభువు వారిని లేపుతారు; ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలు క్షమించబడతాయి. \v 16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకుని మీరు స్వస్థత పొందేలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది, ఫలవంతమైనది. \p \v 17 ఏలీయా మనవంటి మనుష్యుడే; కాని అతడు వర్షం పడకూడదని మనఃపూర్వకంగా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు భూమిపై వర్షం పడలేదు. \v 18 అతడు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వర్షం కురిసింది, భూమి తన పంటను ఇచ్చింది. \p \v 19 నా సహోదరీ సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తొలగిపోతే ఎవరో ఒకరు వారిని తిరిగి వెనుకకు తీసుకువస్తే, \v 20 తప్పిపోయిన ఆ ఒక్క పాపిని తిరిగి వెనుకకు తీసుకువచ్చినవారు ఆ పాపి ఆత్మను మరణం నుండి రక్షించారని, అనేక పాపాలు కప్పివేయబడ్డాయని మీరు తెలుసుకోండి.