\id ISA - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h యెషయా \toc1 యెషయా ప్రవచనం \toc2 యెషయా \toc3 యెషయా \mt1 యెషయా \mt2 ప్రవచనం \c 1 \p \v 1 ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజులుగా ఉన్న కాలంలో యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనము. \b \s1 తిరుగుబాటు చేసిన దేశం \q1 \v 2 ఆకాశాల్లారా, నా మాట వినండి! భూమీ శ్రద్ధగా విను! \q2 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, \q2 కాని వారు నా మీద తిరుగబడ్డారు. \q1 \v 3 ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది, \q2 గాడిదకు తన యజమానుని పశువుల దొడ్డి తెలుసు, \q1 కాని ఇశ్రాయేలుకు వారి యజమాని ఎవరో తెలియదు, \q2 నా ప్రజలు గ్రహించరు.” \b \q1 \v 4 పాపిష్ఠి దేశానికి శ్రమ, \q2 ఆ ప్రజల దోషం గొప్పది, \q1 వారిది దుష్ట సంతానం, \q2 అవినీతికి అప్పగించబడిన పిల్లలు! \q1 వారు యెహోవాను విడిచిపెట్టారు; \q2 ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని తృణీకరించారు. \q2 వారు ఆయనను విడిచి తొలగిపోయారు. \b \q1 \v 5 ఎందుకు మీరు ఇంకా దెబ్బలు తింటున్నారు? \q2 ఎందుకు మీరు ఇంకా తిరుగుబాటు కొనసాగిస్తున్నారు? \q1 మీ తలంతా గాయపరచబడింది, \q2 మీ గుండె మొత్తం బాధించబడింది. \q1 \v 6 అరికాలు నుండి నడినెత్తి వరకు \q2 పుండు లేనిచోటు లేదు. \q1 ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, \q2 పచ్చి పుండ్లు, \q1 వాటిని శుభ్రం చేయలేదు, కట్టు కట్టలేదు, \q2 ఒలీవనూనెతో చికిత్స చేయలేదు. \b \q1 \v 7 మీ దేశం నాశనమైపోయింది. \q2 మీ పట్టణాలు అగ్నిచేత కాలిపోయాయి; \q1 మీ కళ్లెదుటే మీ పొలాలు \q2 విదేశీయులచేత దోచుకోబడ్డాయి, \q2 కంటికి కనబడినవాటిని పరాయివారిగా నాశనం చేశారు. \q1 \v 8 ద్రాక్షతోటలోని గుడిసెలా, \q2 దోసకాయ పొలంలోని పాకలా, \q1 ముట్టడించబడిన పట్టణంలా, \q2 సీయోను కుమార్తె విడిచిపెట్టబడింది. \q1 \v 9 సైన్యాల యెహోవా \q2 కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, \q1 మనం సొదొమలా మారేవారం, \q2 గొమొర్రాను పోలి ఉండేవారము. \b \q1 \v 10 సొదొమ పాలకులారా, \q2 యెహోవా మాట వినండి; \q1 గొమొర్రా ప్రజలారా! \q2 మన దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినండి. \q1 \v 11 యెహోవా ఇలా అంటున్నారు, \q2 “విస్తారమైన మీ బలులు నాకెందుకు? \q1 దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు, \q2 బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి; \q1 ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో \q2 నాకు ఆనందం లేదు. \q1 \v 12 మీరు నా సన్నిధికి వస్తున్నప్పుడు, \q2 నా ఆవరణాలను త్రొక్కడానికి \q2 మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? \q1 \v 13 విలువలేని అర్పణలు తీసుకురావడం ఆపండి! \q2 మీ ధూపం నాకు అసహ్యం కలిగిస్తుంది. \q1 అమావాస్యలు, సబ్బాతులు, ప్రత్యేక సమావేశాలు \q2 మీ దుష్ట సమావేశాలు నేను భరించలేను. \q1 \v 14 మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు \q2 నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను. \q1 అవి నాకు భారంగా ఉన్నాయి; \q2 వాటిని భరించలేక అలిసిపోయాను. \q1 \v 15 ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు, \q2 మిమ్మల్ని చూడకుండ కళ్లు కప్పుకుంటాను; \q1 మీరు చాలా ప్రార్థనలు చేసినా \q2 నేను వినను. \b \q1 “మీ చేతులు రక్తంతో నిండిపోయాయి! \b \q1 \v 16 “మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. \q2 మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; \q2 తప్పు చేయడం మానండి. \q1 \v 17 సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. \q2 అణచివేయబడుతున్న వారి\f + \fr 1:17 \fr*\ft లేదా \ft*\fq న్యాయం \fq*\fqa హింసిస్తున్న వారిని సరిచేయండి\fqa*\f* పక్షాన ఉండండి. \q1 తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. \q2 విధవరాలి పక్షాన వాదించండి. \b \q1 \v 18 “రండి, మనం విషయాన్ని పరిష్కరించుకుందాం” \q2 అని యెహోవా అంటున్నారు. \q1 “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, \q2 అవి మంచులా తెల్లగా అవుతాయి; \q1 కెంపులా ఎర్రగా ఉన్నా, \q2 అది ఉన్నిలా తెల్లగా అవుతాయి. \q1 \v 19 మీరు ఇష్టపడి నా మాట వింటే, \q2 మీరు భూమి ఇచ్చే మంచి పంటను తింటారు; \q1 \v 20 ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, \q2 మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” \q1 యెహోవా ఈ మాట చెప్తున్నారు. \b \q1 \v 21 చూడండి, నమ్మకమైన పట్టణం \q2 వేశ్యగా ఎలా అయ్యిందో! \q1 ఒక్కప్పుడు అది న్యాయంతో నిండి ఉండేది; \q2 నీతి దానిలో నివసించేది, \q2 కాని ఇప్పుడు హంతకులు ఉంటున్నారు! \q1 \v 22 నీ వెండి మలినం అయిపోయింది, \q2 నీ శ్రేష్ఠమైన ద్రాక్షరసం నీళ్లతో కలిసి పలచబడి పోయింది. \q1 \v 23 నీ పాలకులు తిరుగుబాటుదారులు, \q2 దొంగలతో సహవాసం చేస్తారు. \q1 వారందరికి లంచాలు ఇష్టం \q2 కానుకల వెంటపడతారు. \q1 తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. \q2 విధవరాలి సమస్యను పరిష్కరించరు. \b \q1 \v 24 కాబట్టి ప్రభువైన, సైన్యాల యెహోవా, \q2 ఇశ్రాయేలు బలవంతుడు ఇలా చెప్తున్నారు: \q1 ఆహా! నా శత్రువులపై నా ఉగ్రతను బయటపెట్టి, \q2 నా విరోధుల మీద పగ తీర్చుకుంటాను. \q1 \v 25 నీకు\f + \fr 1:25 \fr*\ft అంటే, యెరూషలేముకు వ్యతిరేకంగా\ft*\f* వ్యతిరేకంగా నా చేయి ఉంచుతాను; \q2 నీ లోహపు మలినాన్ని శుద్ధి చేసి \q2 నీ మలినాలను తొలగిస్తాను. \q1 \v 26 పూర్వం ఉన్నట్లు నీకు న్యాయాధిపతులను, \q2 తొలి రోజుల్లో ఉన్నట్లు నీకు పాలకులను నియమిస్తాను. \q1 అప్పుడు నీవు \q2 నీతిగల పట్టణమని, \q2 నమ్మకమైన పట్టణమని పిలువబడతావు. \b \q1 \v 27 సీయోనుకు న్యాయంతో, \q2 పశ్చాత్తాపపడే వారికి నీతితో విడుదల కలుగుతుంది. \q1 \v 28 అయితే తిరుగుబాటుదారులు, పాపులు నలుగగొట్టబడతారు, \q2 యెహోవాను విడిచిపెట్టిన వారు నశిస్తారు. \b \q1 \v 29 “మీరు వేటిని బట్టి ఆనందించారో \q2 ఆ పవిత్ర సింధూర వృక్షాల గురించి మీరు సిగ్గుపడతారు; \q1 మీరు ఎంచుకున్న సింధూర తోటల గురించి \q2 మీరు అవమానించబడతారు. \q1 \v 30 మీరు ఆకులు వాడిపోతున్న సింధూర వృక్షంలా, \q2 నీరు లేని తోటలా అవుతారు. \q1 \v 31 బలవంతుడు పీచులా అవుతాడు \q2 అతని పని నిప్పురవ్వలా అవుతుంది; \q1 అవి రెండూ కలిసి కాలిపోతాయి, \q2 మంటను ఆర్పేవారు ఎవరూ ఉండరు.” \c 2 \s1 యెహోవా పర్వతం \p \v 1 యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనం: \b \p \v 2 చివరి రోజుల్లో \q1 యెహోవా మందిరం \q2 పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; \q1 అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, \q2 జనాంగాలన్నీ దాని దగ్గరకు ప్రవాహంలా వెళ్తారు. \p \v 3 చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు, \q1 “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, \q2 యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. \q1 మనం ఆయన మార్గంలో నడిచేలా, \q2 ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” \q1 సీయోనులో నుండి ధర్మశాస్త్రం, \q2 యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి. \q1 \v 4 ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు, \q2 అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు. \q1 వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, \q2 తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. \q1 ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు, \q2 వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు. \b \q1 \v 5 యాకోబు వారసులారా రండి, \q2 మనం యెహోవా వెలుగులో నడుద్దాము. \s1 యెహోవా దినం \q1 \v 6 యెహోవా, యాకోబు వారసులైన \q2 మీ ప్రజలను మీరు విడిచిపెట్టారు. \q1 వారు తూర్పు దేశాలకున్న మూఢనమ్మకాలతో నిండి ఉన్నారు; \q2 వారు ఫిలిష్తీయుల్లా భవిష్యవాణి చూస్తారు, \q2 ఇతరుల ఆచారాలను పాటిస్తారు. \q1 \v 7 వారి దేశం వెండి బంగారాలతో నిండి ఉంది; \q2 వారి ధనానికి అంతులేదు. \q1 వారి దేశం గుర్రాలతో నిండి ఉంది; \q2 వారి రథాలకు అంతులేదు. \q1 \v 8 వారి దేశం విగ్రహాలతో నిండి ఉంది. \q2 వారు తమ చేతులతో చేసిన వాటికి, \q2 తమ వ్రేళ్లతో చేసిన వాటికి తలవంచి నమస్కరిస్తారు. \q1 \v 9 కాబట్టి ప్రజలు అణచివేయబడతారు \q2 ప్రతి ఒక్కరు తగ్గించబడతారు \q2 వారిని క్షమించకండి.\f + \fr 2:9 \fr*\ft లేదా \ft*\fqa వారిని లేవనెత్తకండి\fqa*\f* \b \q1 \v 10 యెహోవా భీకర సన్నిధి నుండి, \q2 ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి \q2 బండ సందులకు వెళ్లి నేలలో దాక్కోండి. \q1 \v 11 మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, \q2 మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; \q1 ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు. \b \q1 \v 12 సైన్యాల యెహోవా \q2 అహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసం \q1 హెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు. \q2 (అవి అణచివేయబడతాయి), \q1 \v 13 ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి, \q2 బాషాను సింధూర వృక్షాలన్నిటికి, \q1 \v 14 పెద్ద పర్వతాలన్నిటికి, \q2 ఎత్తైన కొండలన్నిటికి \q1 \v 15 ఉన్నతమైన ప్రతి గోపురానికి \q2 ప్రతి కోటగోడకు, \q1 \v 16 ప్రతీ వాణిజ్య నౌకకు\f + \fr 2:16 \fr*\ft హెబ్రీలో \ft*\fqa తర్షీషు ఓడలన్నిటికి\fqa*\f* \q2 మనోహరమైన నౌకలకు ఒక రోజును నియమించారు. \q1 \v 17 మనుష్యుల అహంకారం అణచివేయబడుతుంది \q2 మానవుల గర్వం తగ్గించబడుతుంది; \q1 ఆ రోజు యెహోవా మాత్రమే ఘనపరచబడతారు. \q2 \v 18 విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి. \b \q1 \v 19 యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, \q2 ఆయన భీకర సన్నిధి నుండి \q1 ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయి \q2 వారు కొండల గుహల్లో \q2 నేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు. \q1 \v 20 ఆ రోజున మనుష్యులు \q2 తాము పూజించడానికి తయారుచేసుకున్న \q1 వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను \q2 ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు. \q1 \v 21 యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, \q2 ఆయన భీకర సన్నిధి నుండి పారిపోయి \q1 ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి \q2 వారు కొండల గుహల్లో \q2 బండ బీటల్లో దాక్కుంటారు. \b \q1 \v 22 తమ నాసికారంధ్రాలలో ఊపిరి తప్ప ఏమీ లేని \q2 నరులను నమ్మడం మానండి. \q2 వారిని ఎందుకు లక్ష్యపెట్టాలి? \c 3 \s1 యెరూషలేముకు యూదాకు తీర్పు \q1 \v 1 చూడండి, ప్రభువును, \q2 సైన్యాలకు అధిపతియైన యెహోవా \q1 యెరూషలేములో నుండి యూదాలో నుండి \q2 జీవనాధారాన్ని, మద్దతును తీసివేయబోతున్నారు: \q1 అన్ని ఆహార సరఫరాలు, అన్ని నీటి సరఫరాలు, \q2 \v 2 వీరులు, యోధులు, \q1 న్యాయాధిపతులు, ప్రవక్తలు, \q2 సోదె చెప్పేవారు, పెద్దలు, \q1 \v 3 పంచదశాధిపతులను, ఘనత వహించినవారు, \q2 సలహాదారులు, నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు, \q2 తెలివిగల మాంత్రికులు, వీరందరిని తీసివేస్తారు. \b \q1 \v 4 “నేను యవ్వనులను వారికి అధిపతులుగా నియమిస్తాను. \q2 పిల్లలు వారిని పరిపాలిస్తారు.” \b \q1 \v 5 ప్రజలు ఒకరిని ఒకరు \q2 ఒకరి మీదికి ఒకరు, పొరుగువారి మీదికి పొరుగువారు. \q1 యువకులు పెద్దవారి మీదికి, \q2 అనామకులు ఘనుల మీదికి లేస్తారు. \b \q1 \v 6 ఒకడు తన తండ్రి ఇంట్లో \q2 తన సోదరుని పట్టుకుని, \q1 “నీకు బట్టలు ఉన్నాయి, నీవు మాకు నాయకునిగా ఉండు; \q2 ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలోనికి తీసుకో!” అంటాడు. \q1 \v 7 కాని ఆ రోజు అతడు కేక వేసి, \q2 “నా దగ్గర పరిష్కారం లేదు. \q1 నా ఇంట్లో ఆహారం గాని బట్టలు గాని లేవు; \q2 నన్ను ప్రజలకు నాయకునిగా చేయవద్దు” అంటాడు. \b \q1 \v 8 యెరూషలేము పాడైపోయింది, \q2 యూదా పతనమవుతుంది, \q1 వారి మాటలు పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి, \q2 ఆయన మహిమగల సన్నిధిని వారు ధిక్కరించారు. \q1 \v 9 వారి ముఖమే వారి మీద సాక్ష్యమిస్తుంది; \q2 వారు తమ పాపాన్ని సొదొమలా ప్రకటిస్తారు; \q2 వారు దానిని దాచిపెట్టరు. \q1 వారికి శ్రమ! \q2 వారు తమ మీద తామే విపత్తు తెచ్చుకున్నారు. \b \q1 \v 10 మీకు మేలు కలుగుతుందని నీతిమంతులకు చెప్పండి \q2 ఎందుకంటే వారు తాము చేసిన క్రియల ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. \q1 \v 11 దుష్టులకు శ్రమ! \q2 వారికి చెడు జరుగుతుంది! \q1 వారి చేతులు చేసిన దాని ప్రతిఫలం \q2 వారికి ఇవ్వబడుతుంది. \b \q1 \v 12 నా ప్రజలను యువకులు అణచివేస్తారు \q2 స్త్రీలు వారిని పాలిస్తారు. \q1 నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు \q2 మార్గం నుండి వారు మిమ్మల్ని తప్పిస్తారు. \b \q1 \v 13 యెహోవా న్యాయస్థానంలో తన స్థానం తీసుకుంటారు; \q2 ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన లేస్తారు. \q1 \v 14 యెహోవా తన ప్రజల పెద్దలకు నాయకులకు \q2 తీర్పు ప్రకటించడానికి వస్తున్నారు: \q1 “మీరే నా ద్రాక్షతోటను నాశనం చేశారు; \q2 పేదల నుండి దోచుకున్న సొమ్ము మీ ఇళ్ళలో ఉంది. \q1 \v 15 మీరు నా ప్రజలను ఎందుకు నలుగగొడుతున్నారు? \q2 పేదల ముఖాలను ఎందుకు నూరుతున్నారు?” \q2 అని సైన్యాల అధిపతియైన యెహోవా అంటున్నారు. \b \q1 \v 16 యెహోవా ఇలా అంటున్నారు, \q2 “సీయోను స్త్రీలు గర్విష్ఠులు \q1 వారు మెడలు చాచి నడుస్తూ \q2 ఓర చూపులు చూస్తూ \q1 ఠీవిగా పిరుదులు త్రిప్పుతూ నడుస్తూ \q2 తమ కాళ్ల గజ్జలు మ్రోగిస్తున్నారు. \q1 \v 17 కాబట్టి ప్రభువు సీయోను స్త్రీల తలలపై పుండ్లు పుట్టిస్తారు; \q2 యెహోవా వారి తలల్ని బోడి చేస్తారు.” \p \v 18 ఆ రోజు ప్రభువు వారి సొగసును లాక్కుంటారు: గాజులు, శిరోభూషణాలు, నెలవంక హారాలు, \v 19 చెవిపోగులు, కడియాలు, మేలి ముసుగులు, \v 20 తలపాగాలు, కాళ్లపట్టీలు, ఒడ్డాణాలు, సుగంధద్రవ్య బుడ్డీలు, తాయెత్తులు, \v 21 ఉంగరాలు, ముక్కుపుడకలు, \v 22 పండుగ వస్త్రాలు, పైవస్త్రాలు, అంగీలు, సంచులు, \v 23 అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు. \q1 \v 24 సువాసనకు బదులు దుర్వాసన ఉంటుంది; \q2 నడికట్టుకు బదులు తాడు; \q1 అల్లిన జడకు బదులు బోడితల; \q2 ప్రశస్తమైన పైవస్త్రానికి బదులు గోనెపట్ట; \q2 అందానికి బదులు ఖైదీ వాత ఉంటుంది. \q1 \v 25 మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, \q2 మీ వీరులు యుద్ధంలో చనిపోతారు. \q1 \v 26 సీయోను గుమ్మాలు విలపిస్తూ దుఃఖిస్తాయి; \q2 ఆమె ఒంటరిదై, నేల మీద కూర్చుంటుంది. \c 4 \q1 \v 1 ఆ రోజున ఏడుగురు స్త్రీలు \q2 ఒక్క పురుషుని పట్టుకుని \q1 “మేము మా అన్నమే తింటాము, \q2 మా బట్టలే మేము కట్టుకుంటాము; \q1 నీ పేరు మాత్రం మాకు పెట్టి \q2 మా అవమానాన్ని తీసివేయి చాలు!” \m అని చెప్తారు. \s1 యెహోవా కొమ్మ \p \v 2 ఆ రోజు యెహోవా కొమ్మ అందంగా, మహిమగలదిగా ఉంటుంది; ఇశ్రాయేలులో తప్పించుకున్నవారికి భూమి పంట అతిశయంగా, ఘనతగా ఉంటుంది. \v 3 సీయోనులో మిగిలిన వారికి, యెరూషలేములో ఉన్నవారికి అనగా యెరూషలేములో నివసించే వారిలో నమోదు చేయబడ్డ ప్రతివారు పరిశుద్ధులని పిలువబడతారు. \v 4 ప్రభువు సీయోను స్త్రీల మురికిని కడిగివేస్తారు; ఆయన తీర్పు తీర్చు ఆత్మతో, దహించే ఆత్మతో, యెరూషలేము నుండి రక్తం మరకల్ని శుభ్రం చేస్తారు. \v 5 అప్పుడు యెహోవా సీయోను పర్వతం అంతట, అక్కడ కూడుకునేవారి మీద పగలు పొగతో ఉన్న మేఘాన్ని, రాత్రి మండుతున్న అగ్నిని సృష్టిస్తారు; ప్రతి దాని మీద మహిమ\f + \fr 4:5 \fr*\ft లేదా \ft*\fqa అక్కడ ఉన్న మహిమ అంతటి మీద\fqa*\f* పందిరిగా ఉంటుంది. \v 6 అది పగలు ఎండ వేడి నుండి ఆశ్రయంగా, నీడగా, తుఫాను, వానల నుండి కాపాడే దాగుచోటుగా ఉంటుంది. \c 5 \s1 ద్రాక్షతోట గీతం \q1 \v 1 నా ప్రియుని గురించి పాడతాను. \q2 తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను: \q1 సారవంతమైన కొండమీద \q2 నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది. \q1 \v 2 ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి \q2 అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు. \q1 దానిలో కాపలా గోపురం కట్టాడు \q2 ద్రాక్షతొట్టిని తొలిపించాడు. \q1 మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు, \q2 కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి. \b \q1 \v 3 “కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, \q2 నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం చేయండి. \q1 \v 4 నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే \q2 దానికి ఇంకేమి చేయాలి? \q1 మంచి ద్రాక్షపండ్ల కోసం నేను చూస్తే \q2 ఎందుకు అది చెడ్డ ద్రాక్షలను కాసింది? \q1 \v 5 నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో \q2 ఇప్పుడు మీకు చెప్తాను. \q1 దాని కంచె నేను తీసివేస్తాను \q2 అప్పుడు అది నాశనం అవుతుంది; \q1 దాని గోడను పడగొడతాను \q2 అప్పుడు అది త్రొక్కబడుతుంది. \q1 \v 6 నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, \q2 అది త్రవ్వరు, సాగు చేయరు, \q2 అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. \q1 దానిపై వర్షం కురిపించవద్దని \q2 మేఘాలను ఆజ్ఞాపిస్తాను.” \b \q1 \v 7 ఇశ్రాయేలు వంశం \q2 సైన్యాల యెహోవా ద్రాక్షతోట, \q1 యూదా ప్రజలు \q2 ఆయన ఆనందించే ద్రాక్షలు. \q1 ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; \q2 నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి. \s1 శ్రమలు, తీర్పులు \q1 \v 8 చోటు మిగులకుండ \q2 మీరు మాత్రమే దేశంలో నివసించేలా \q1 ఇంటికి ఇల్లు, \q2 పొలానికి పొలం కలుపుకునేవారికి శ్రమ. \p \v 9 నేను వినేలా సైన్యాల యెహోవా చెప్పిన మాట: \q1 “నిజంగా గొప్ప ఇల్లు ఖాళీగా అయిపోతాయి, \q2 చక్కటి భవనాలు నివాసులు లేక పాడైపోతాయి. \q1 \v 10 పది ఎకరాల ద్రాక్షతోట ఒక బాతు\f + \fr 5:10 \fr*\ft అంటే, సుమారు 22 లీటర్లు\ft*\f* ద్రాక్షరసాన్నే ఇస్తుంది. \q2 హోమెరు\f + \fr 5:10 \fr*\ft అంటే, సుమారు 160 కి. గ్రా. లు\ft*\f* గింజలు ఒక ఏఫా\f + \fr 5:10 \fr*\ft అంటే, సుమారు 16 కి. గ్రా. లు\ft*\f* పంట మాత్రమే ఇస్తాయి.” \b \q1 \v 11 మద్యం త్రాగడానికి \q2 ఉదయాన్నే లేచి మత్తెక్కే వరకు \q1 చాలా రాత్రివరకు \q2 త్రాగే వారికి శ్రమ. \q1 \v 12 వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ \q2 ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, \q1 కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు \q2 ఆయన చేతిపనిని గౌరవించరు. \q1 \v 13 కాబట్టి నా ప్రజలు తెలివిలేక \q2 బందీలుగా వెళ్తున్నారు. \q1 వారిలో ఘనులు ఆకలితో చనిపోతారు. \q2 సామాన్య ప్రజలు దప్పికతో ఎండిపోతారు. \q1 \v 14 కాబట్టి మరణం తన దవడలను పెద్దగా \q2 తన నోరు వెడల్పుగా తెరుస్తుంది. \q1 అందులోకి యెరూషలేము సంస్థానాధిపతులు, సామాన్య ప్రజలు, \q2 ఆకతాయిలు, ఆనందించేవారు దిగిపోతారు. \q1 \v 15 మనుష్యులు అణగద్రొక్కబడతారు. \q2 అందరు తగ్గించబడతారు, \q2 గర్విష్ఠుల చూపు తగ్గించబడుతుంది. \q1 \v 16 కాని సైన్యాల యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడతారు, \q2 తన నీతి క్రియలనుబట్టి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధునిగా నిరూపించబడతారు. \q1 \v 17 అప్పుడు గొర్రెపిల్లలు తమ పచ్చికబయళ్లలో ఉన్నట్లుగా అక్కడ మేస్తాయి; \q2 ధనవంతుల బీడు భూములలో గొర్రెపిల్లలు మేస్తాయి. \b \q1 \v 18 మోసమనే త్రాళ్లతో పాపాన్ని లాక్కొనే వారికి, \q2 బండి త్రాళ్లతో దుర్మార్గాన్ని లాక్కొనే వారికి శ్రమ. \q1 \v 19 “దేవుడు త్వరపడాలి; \q2 ఆయన పనిని త్వరగా చేయాలి \q2 అప్పుడు ఆయన కార్యాలు మేము చూస్తాము. \q1 ఇశ్రాయేలు పరిశుద్ధుని ఆలోచన \q2 ఆచరణలోకి రావాలి, అప్పుడు మేము తెలుసుకుంటాము” \q2 అనే వారికి శ్రమ. \b \q1 \v 20 కీడును మేలని, \q2 మేలును కీడని చెప్పేవారికి, \q1 చీకటిని వెలుగుగా \q2 వెలుగును చీకటిగా \q1 చేదును తీపిగా \q2 తీపిని చేదుగా మార్చేవారికి శ్రమ. \b \q1 \v 21 తమకు తామే జ్ఞానులమని \q2 తమ దృష్టిలో తామే తెలివైనవారమని అనుకునేవారికి శ్రమ. \b \q1 \v 22 ద్రాక్షరసం త్రాగడంలో పేరు పొందినవారికి \q2 మద్యం కలపడంలో నేర్పు గలవారికి శ్రమ. \q1 \v 23 వారు లంచం తీసుకుని దోషులను వదిలేస్తారు, \q2 నిర్దోషులకు న్యాయం చేయడానికి నిరాకరిస్తారు. \q1 \v 24 వారు సైన్యాల యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, \q2 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తృణీకరించారు, \q1 కాబట్టి మంటలు గడ్డిని కాల్చినట్లుగా \q2 ఎండుగడ్డి మంటలో కాలిపోయినట్లుగా \q1 వారి వేరులు కుళ్లిపోతాయి, \q2 వారి పూలు ధూళిలా ఎగిరిపోతాయి. \q1 \v 25 కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతుంది; \q2 ఆయన వారి మీదికి తన చేయి చాచి వారిని కొడతారు. \q1 పర్వతాలు వణుకుతాయి, \q2 వీధుల్లో వారి శవాలు పెంటలా పడి ఉన్నాయి. \b \q1 ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, \q2 ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది. \b \q1 \v 26 ఆయన దూరంగా ఉన్న దేశాలను పిలువడానికి జెండా ఎత్తుతారు, \q2 భూమి అంచుల్లో ఉన్నవారిని రప్పించడానికి ఈల వేస్తారు. \q1 చూడండి వారందరు \q2 తొందరగా, వేగంగా వస్తున్నారు. \q1 \v 27 వారిలో ఒక్కరు కూడా అలిసిపోరు, తూలిపోరు. \q2 వారిలో ఒక్కరు కూడా కునుకరు నిద్రపోరు. \q1 వారి నడికట్టు విడిపోదు. \q2 వారి చెప్పుల వారు తెగిపోదు. \q1 \v 28 వారి బాణాలు పదునుగా ఉన్నాయి. \q2 వారి విల్లులన్ని ఎక్కుపెట్టి ఉన్నాయి; \q1 వారి గుర్రాల డెక్కలు చెకుముకి రాళ్లవలె ఉన్నాయి, \q2 వారి రథచక్రాలు సుడిగాలి తిరిగినట్టు తిరుగుతాయి. \q1 \v 29 వారి గర్జన సింహగర్జనలా ఉంది. \q2 కొదమసింహం గర్జించినట్లు గర్జిస్తారు; \q1 వారు తమ వేటను పట్టుకుని ఎత్తుకుపోతారు \q2 కాపాడే వారెవరు ఉండరు. \q1 \v 30 వారు ఆ రోజు సముద్ర ఘోషలా \q2 తమ శత్రువు మీద గర్జిస్తారు. \q1 ఒకవేళ ఎవరైనా భూమివైపు చూస్తే, \q2 అక్కడ చీకటి, బాధ మాత్రమే కనబడుతుంది; \q2 మేఘాలు కమ్మి వెలుగు కూడా చీకటిగా అవుతుంది. \c 6 \s1 యెషయా నియామకం \p \v 1 రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు కూర్చుని ఉండడం నేను చూశాను; ఆయన వస్త్రపు అంచు దేవాలయాన్ని నింపింది. \v 2 ఆయన పైన సెరాపులు ఒక్కొక్కరు ఆరు రెక్కలతో నిలబడి ఉన్నారు; రెండు రెక్కలతో తమ ముఖాలను, రెండింటితో తమ కాళ్లను కప్పుకుని, రెండింటితో ఎగురుతున్నారు. \v 3 వారు ఒకరితో ఒకరు, \q1 “సైన్యాల యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు; \q2 సమస్త భూమి ఆయన మహిమతో నిండి ఉంది” \m అని పాడుతున్నారు. \p \v 4 వారి స్వరాల ధ్వనికి ద్వారబంధాలు, పునాదులు కదిలాయి. మందిరం పొగతో నిండిపోయింది. \p \v 5 నేను, “నాకు శ్రమ! నేను నశించిపోయాను! ఎందుకంటే నేను అపవిత్ర పెదవులు గలవాడను. అపవిత్ర పెదవులు ఉన్న ప్రజలమధ్య నేను నివసిస్తున్నాను, నా కళ్లు రాజు, సైన్యాల యెహోవాను చూశాయి” అని మొరపెట్టాను. \p \v 6 అప్పుడు ఆ సెరాపులలో ఒకడు బలిపీఠం మీద నుండి పటకారుతో తీసిన నిప్పును తన చేతితో పట్టుకుని ఎగురుతూ నా దగ్గరకు వచ్చాడు. \v 7 దానితో నా నోటిని ముట్టి, “చూడు, ఇది నీ పెదవులను తాకింది; నీ దోషం తీసివేయబడింది, నీ పాపం క్షమించబడింది” అన్నాడు. \p \v 8 అప్పుడు ప్రభువు స్వరం, “నేను ఎవరిని పంపాలి? మాకోసం ఎవరు వెళ్తారు?” అని అనడం నేను విన్నాను. \p నేను, “నేనున్నాను. నన్ను పంపండి!” అన్నాను. \p \v 9 అందుకు ఆయన, “నీవు వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు: \q1 “ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, కాని అర్థం చేసుకోరు; \q2 ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కాని గ్రహించరు.’ \q1 \v 10 వారి హృదయాలను కఠినపరచు; \q2 వారి చెవులకు చెవుడు \q2 వారి కళ్లకు గుడ్డితనం కలిగించు \q1 లేదంటే వారు తమ కళ్లతో చూసి, \q2 చెవులతో విని, \q2 హృదయాలతో గ్రహించి, \q1 మనస్సు మార్చుకొని స్వస్థత పొందుతారు.” \p \v 11 అందుకు నేను, “ప్రభువా! ఇలా ఎంతకాలం వరకు?” అని అడిగాను. \p అందుకు ఆయన ఇలా జవాబిచ్చారు: \q1 “నివాసులు లేక \q2 పట్టణాలు నాశనం అయ్యేవరకు, \q1 మనుష్యులు లేక ఇల్లు పాడై విడిచిపెట్టబడే వరకు, \q2 భూమి పూర్తిగా నాశనమై బీడుగా అయ్యేవరకు, \q1 \v 12 యెహోవా మనుష్యులను దూరం పంపించే వరకు \q2 భూమి పూర్తిగా విడిచిపెట్టబడే వరకు. \q1 \v 13 దానిలో పదవ భాగం మాత్రమే విడిచిపెట్టబడినా \q2 అది కూడా నాశనమవుతుంది. \q1 అయితే మస్తకి సింధూర చెట్లు నరకబడిన తర్వాత \q2 మొద్దులు ఎలా మిగులుతాయో \q2 అలాగే పరిశుద్ధ విత్తనం మొద్దులా నేలపై ఉంటుంది.” \c 7 \s1 ఇమ్మానుయేలు గురించి సూచన \p \v 1 యూదా రాజైన ఉజ్జియాకు పుట్టిన యోతాము కుమారుడైన ఆహాజు కాలంలో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు కాని అది వారు జయించలేకపోయారు. \p \v 2 అప్పుడు దావీదు ఇంటివారికి, “అరాము ఎఫ్రాయిముతో పొత్తు పెట్టుకుంది” అని తెలియజేయబడింది; కాబట్టి గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆహాజు, అతని ప్రజల హృదయాలు వణికాయి. \p \v 3 అప్పుడు యెహోవా యెషయాతో ఇలా అన్నారు, “ఆహాజును కలుసుకోడానికి నీవు, నీ కుమారుడైన షెయార్యాషూబు\f + \fr 7:3 \fr*\fq షెయార్యాషూబు \fq*\ft అంటే \ft*\fqa మిగిలినవారు తిరిగి వస్తారు\fqa*\f* చాకలి రేవుకు వెళ్లే దారిలో ఉన్న పై కోనేటి కాలువ చివరికి వెళ్లండి. \v 4 అతనితో, ‘జాగ్రత్త, నెమ్మదిగా ఉండు, భయపడకు. పొగరాజుకుంటున్న ఈ రెండు కాగడాలకు అనగా రెజీను, అరాము, రెమల్యా కుమారుడైన పెకహు యొక్క తీవ్రమైన కోపానికి అధైర్యపడకు. \v 5 అరాము, ఎఫ్రాయిం, రెమల్యా కుమారుడు నీకు కీడు చేయాలని కుట్రపన్ని, \v 6 “మనం యూదాపై దాడి చేద్దాము; మనం దానిని చీల్చివేసి, మన మధ్యలో పంచుకుందాం, టాబెయేలు కుమారున్ని దానికి రాజుగా చేద్దాం” అని చెప్పుకున్నారు.’ ” \v 7 అయితే ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “అది నిలబడదు, \q2 అలా జరుగదు. \q1 \v 8 ఎందుకంటే అరాము రాజధాని దమస్కు. \q2 దమస్కు రాజు రెజీను మాత్రమే. \q1 అరవై అయిదు సంవత్సరాలు కాకముందే \q2 ఎఫ్రాయిం ఒక జాతిగా ఉండకుండా నాశనం అయిపోతుంది. \q1 \v 9 ఎఫ్రాయిముకు సమరయ రాజధాని, \q2 సమరయకు రెమల్యా కుమారుడు రాజు. \q1 మీరు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే \q2 మీరు క్షేమంగా ఉండలేరు.” \p \v 10 యెహోవా ఆహాజుతో మరలా మాట్లాడుతూ, \v 11 “నీ దేవుడైన యెహోవాను ఒక సూచన అడుగు. అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే” అన్నారు. \p \v 12 అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు. \p \v 13 అప్పుడు యెషయా, “దావీదు కుటుంబమా! వినండి. మనుష్యుల ఓపికను పరీక్షించడం సరిపోదని, నా దేవుని ఓపికను కూడా పరీక్షిస్తున్నారా? \v 14 కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు\f + \fr 7:14 \fr*\fq ఇమ్మానుయేలు \fq*\ft అంటే \ft*\fqa దేవుడు మనకు తోడు\fqa*\f* అని పేరు పెడతారు. \v 15 తప్పును తిరస్కరించి, సరియైనది ఎంచుకోవడం తెలిసినప్పుడు అతడు పెరుగు, తేనె తింటాడు. \v 16 ఎందుకంటే తప్పును తిరస్కరించి సరియైనది ఎంచుకునే తెలివి ఆ బాలునికి రాకముందు నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజుల దేశాలు పాడుచేయబడతాయి. \v 17 యెహోవా నీ మీదికి, నీ ప్రజలమీదికి, నీ తండ్రి ఇంటి మీదికి, ఎఫ్రాయిం యూదా నుండి విడిపోయిన రోజు నుండి ఇప్పటివరకు రాని రోజులను రప్పిస్తారు. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పిస్తారు” అని అన్నాడు. \s1 అష్షూరు యెహోవా పనిముట్టు \p \v 18 ఆ రోజున ఈజిప్టులో నైలు నది పాయల నుండి ఈగలను, అష్షూరు దేశం నుండి కందిరీగలను యెహోవా ఈలవేసి పిలుస్తారు. \v 19 అవన్నీ వచ్చి మెట్ట కనుమలలో, రాళ్ల పగుళ్లలో, ముళ్ళపొదల్లో, పచ్చికబయళ్లలో నివసిస్తాయి. \v 20 ఆ రోజున యెహోవా యూఫ్రటీసు నది అవతలి నుండి కూలికి తెచ్చిన మంగలకత్తితో అనగా, అష్షూరు రాజుతో మీ తలవెంట్రుకలు కాళ్లవెంట్రుకలు క్షౌరం చేయిస్తారు. అది మీ గడ్డాలను కూడా గీసివేస్తారు. \v 21 ఆ రోజున ఒకనికి ఒక చిన్న ఆవు రెండు గొర్రెలు ఉంటాయి. \v 22 అవి సమృద్ధిగా ఇచ్చిన పాలవలన అతడు తినడానికి పెరుగు ఉంటుంది. ఆ దేశంలో మిగిలిన వారందరు పెరుగు, తేనె తింటారు. \v 23 ఆ రోజున వెయ్యి వెండి షెకెళ్ళు\f + \fr 7:23 \fr*\ft అంటే, సుమారు 12 కి. గ్రా. లు\ft*\f* విలువ కలిగిన వెయ్యి ద్రాక్షతీగెలు ఉన్న ప్రతిచోట గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటాయి. \v 24 ఆ దేశమంతా గచ్చపొదలు ముళ్ళతో నిండి ఉంటుంది కాబట్టి బాణాలు విల్లులు పట్టుకుని వేటగాళ్లు అక్కడికి వెళ్తారు. \v 25 గచ్చపొదలకు, ముళ్ళకు భయపడి పారతో సాగుచేసిన కొండలన్నిటికి మీరు దూరంగా ఉంటారు; ఆ స్థలాలు పశువులు తిరగడానికి, గొర్రెలు త్రొక్కడానికి ఉపయోగపడతాయి. \c 8 \s1 సూచనలుగా యెషయా, అతని పిల్లలు \p \v 1 యెహోవా నాతో ఇలా అన్నారు, “నీవు పెద్ద పలక తీసుకుని దానిపై మహేర్-షాలాల్-హాష్-బజ్\f + \fr 8:1 \fr*\fq మహేర్-షాలాల్-హాష్-బజ్ \fq*\ft అంటే \ft*\fqa దోచుకోవడానికి త్వరపడడం లేదా కొల్లగొట్టడానికి తొందరపడడం\fqa*\ft ; \+xt 3|link-href="ISA 8:3"\+xt* వచనంలో కూడా\ft*\f* అని సామాన్యమైన అక్షరాలతో వ్రాయి. \v 2 నా కోసం నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి యాజకుడైన ఊరియాను, యేబెరెక్యా కుమారుడైన జెకర్యాను పిలిచాను. \v 3 తర్వాత నేను ప్రవక్త్రితో శయనించగా ఆమె గర్భవతియై కుమారునికి జన్మనిచ్చింది. అప్పుడు యెహోవా, ‘అతనికి మహేర్-షాలాల్-హాష్-బజ్ అని పేరు పెట్టు’ అని నాతో చెప్పారు. \v 4 ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.” \p \v 5 యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు: \q1 \v 6 “ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని \q2 వద్దు అని, \q1 రెజీను గురించి, \q2 రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు, \q1 \v 7 కాబట్టి ప్రభువు భయంకరమైన యూఫ్రటీసు నది వరద నీటిని \q2 అనగా అష్షూరు రాజును, అతని బలగమంతటిని \q2 వారి మీదికి రప్పించబోతున్నారు. \q1 అవి దాని కాలువలన్నిటి నుండి ఉప్పొంగి \q2 దాని ఒడ్డులన్నిటి మీది నుండి ప్రవహిస్తాయి. \q1 \v 8 అవి యూదాలోకి వచ్చి పొంగిపొర్లి ప్రవహిస్తూ, \q2 గొంతు లోతు వరకు చేరుతాయి. \q1 ఇమ్మానుయేలూ, దాని చాచిన రెక్కలు \q2 నీ దేశమంతట వ్యాపిస్తాయి.” \b \q1 \v 9 దేశాల్లారా, మీరు ముక్కలై నాశనమైపోతారు! \q2 దూర దేశాల్లారా! మీరందరూ వినండి. \q1 యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి! \q2 అవును, యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి! \q1 \v 10 మీరు వ్యూహం రచించండి, అది విఫలమవుతుంది; \q2 మీ ప్రణాళికను ప్రతిపాదించండి, అది నిలబడదు, \q2 ఎందుకంటే దేవుడు మాతో ఉన్నారు.\f + \fr 8:10 \fr*\ft హెబ్రీలో \ft*\fqa ఇమ్మానుయేలు\fqa*\f* \p \v 11 ఈ ప్రజల మార్గాన్ని అనుసరించకూడదని యెహోవా నన్ను హెచ్చరించి నాతో ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే: \q1 \v 12 “ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్ని \q2 కుట్ర అనకండి. \q1 వారు భయపడే దానికి భయపడకండి. \q2 దానికి బెదిరిపోకండి. \q1 \v 13 సైన్యాల యెహోవాయే పరిశుద్ధుడని మీరు గుర్తించాలి, \q2 ఆయనకే మీరు భయపడాలి, \q2 ఆయనకే మీరు భయపడాలి. \q1 \v 14 ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు; \q2 అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు \q1 ప్రజలను తడబడేలా చేసే రాయిలా \q2 వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు. \q1 ఆయన యెరూషలేము ప్రజలకు \q2 బోనుగా, ఉచ్చుగా ఉంటారు. \q1 \v 15 వారిలో అనేకమంది తడబడతారు; \q2 వారు పడిపోతారు, గాయపరచబడతారు \q2 వారు ఉచ్చులో చిక్కుకుని పట్టబడతారు.” \b \q1 \v 16 ఈ హెచ్చరిక సాక్ష్యాన్ని కట్టండి \q2 దేవుని బోధను నా శిష్యుల మధ్యలో ముద్రించండి. \q1 \v 17 యాకోబు వారసుల నుండి తన ముఖాన్ని దాస్తున్న \q2 యెహోవా కోసం నేను ఎదురుచూస్తాను. \q1 ఆయనపై నా నమ్మకాన్ని ఉంచుతాను. \p \v 18 ఇదిగో నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండమీద నివసించే సైన్యాల యెహోవా వలన సూచనలుగా, గుర్తులుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. \s1 చీకటి వెలుగుగా మారుట \p \v 19 మీతో ఎవరైనా, గుసగుసలాడే గొణిగే మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించమని చెప్పినప్పుడు, ప్రజలు తమ దేవుని దగ్గరే విచారించాలి కదా? సజీవుల గురించి చచ్చిన వారిని ఎందుకు సంప్రదించాలి? \v 20 దేవుని బోధను, హెచ్చరిక సాక్ష్యాన్ని దృష్టి నిలపండి. ఈ వాక్యం ప్రకారం మాట్లాడని వారికి ఉదయపు వెలుగు ఉండదు. \v 21 వారు బాధపడుతూ ఆకలితో దేశమంతా తిరుగుతారు; వారు ఆకలితో ఉన్నప్పుడు వారు కోపంతో పైకి చూస్తూ తమ రాజును, తమ దేవుని శపిస్తారు. \v 22 వారు భూమివైపు చూడగా వారికి బాధ, చీకటి, భయంకరమైన దుఃఖం మాత్రమే కనబడతాయి. వారు దట్టమైన చీకటిలోకి త్రోయబడతారు. \c 9 \p \v 1 అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు. \q1 \v 2 చీకటిలో జీవిస్తున్న ప్రజలు \q2 గొప్ప వెలుగును చూశారు; \q1 చిమ్మచీకటిగల దేశంలో నివసించేవారి మీద \q2 ఒక వెలుగు ప్రకాశించింది. \q1 \v 3 మీరు దేశాన్ని విస్తరింపజేశారు \q2 వారి సంతోషాన్ని అధికం చేశారు; \q1 కోతకాలంలో ప్రజలు సంతోషించినట్లు \q2 దోపుడుసొమ్ము పంచుకుంటున్నప్పుడు \q1 యుద్ధవీరులు సంతోషించినట్లు \q2 వారు మీ ఎదుట సంతోషిస్తున్నారు. \q1 \v 4 మిద్యాను ఓడిపోయిన రోజు జరిగినట్లు, \q2 వారికి భారం కలిగించే కాడిని \q1 వారి భుజాలమీద ఉన్న కర్రను, \q2 వారిని హింసించేవాని కర్రను \q2 మీరు విరిచివేశారు. \q1 \v 5 యుద్ధంలో వాడిన వీరుల చెప్పులు \q2 రక్తంలో చుట్టబడిన బట్టలు \q1 మంటలో వేయబడతాయి \q2 అగ్నికి ఇంధనంగా అవుతాయి. \q1 \v 6 ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు, \q2 మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. \q2 ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. \q1 ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు \q2 నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి \q2 అని పిలువబడతాడు. \q1 \v 7 ఆయన ప్రభుత్వానికి, సమాధానానికి గొప్పతనానికి \q2 ముగింపు ఉండదు. \q1 ఆయన అప్పటినుండి ఎల్లకాలం వరకు \q2 దావీదు సింహాసనం మీద, \q1 అతని రాజ్యాన్ని ఏలుతూ, \q2 న్యాయంతోను నీతితోను \q2 రాజ్యాన్ని స్థాపించి స్థిరంగా ఉంచుతారు. \q1 సైన్యాలకు అధిపతియైన యెహోవా \q2 ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది. \s1 ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపం \q1 \v 8 ప్రభువు యాకోబుకు వ్యతిరేకంగా ఒక సందేశం పంపారు; \q2 అది ఇశ్రాయేలు మీద పడుతుంది. \q1 \v 9 గర్వం, అహంకారంతో నిండిన \q2 హృదయం కలిగిన ప్రజలందరు \q1 అనగా ఎఫ్రాయిం, సమరయ వాసులు \q2 దానిని తెలుసుకుంటారు. \q1 \v 10 “ఇటుకలు పడిపోయాయి, \q2 కాని మనం చెక్కిన రాళ్లతో మళ్ళీ కడదాము; \q1 రావి చెట్లు నరకబడ్డాయి, \q2 వాటికి బదులుగా దేవదారులను వేద్దాం” అని అంటారు. \q1 \v 11 అయితే యెహోవా వారి మీదికి రెజీను విరోధులను లేపారు \q2 వారి శత్రువులను పురికొల్పారు. \q1 \v 12 తూర్పు నుండి అరామీయులు, పడమర నుండి ఫిలిష్తీయులు \q2 నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగివేశారు. \b \q1 ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, \q2 ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది. \b \q1 \v 13 అయితే ప్రజలు తమను కొట్టినవాడి వైపు తిరుగలేదు, \q2 సైన్యాల యెహోవాను వారు వెదకలేదు. \q1 \v 14 కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, \q2 తాటికొమ్మను, జమ్ము రెల్లును ఒకేరోజున తొలగిస్తారు. \q1 \v 15 పెద్దలు ప్రముఖులు తల అయితే, \q2 అబద్ధాలు చెప్పే ప్రవక్తలు తోక. \q1 \v 16 ఈ ప్రజలను నడిపించేవారు వారిని తప్పుదారి పట్టిస్తారు; \q2 వారిని వెంబడించేవారు చెదిరిపోతారు. \q1 \v 17 కాబట్టి ప్రభువు యువకులను చూసి సంతోషించరు \q2 తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల జాలి చూపరు. \q1 ఎందుకంటే, ప్రతి ఒక్కరు భక్తిహీనులుగా దుర్మార్గులుగా ఉన్నారు, \q2 ప్రతి నోరు మూర్ఖంగా మాట్లాడుతుంది. \b \q1 ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, \q2 ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది. \b \q1 \v 18 ఖచ్చితంగా దుష్టత్వం అగ్నిలా మండుతుంది \q2 అది గచ్చపొదలను, ముళ్ళచెట్లను కాల్చివేస్తుంది; \q1 అడవి పొదలను దహనం చేసి \q2 దట్టమైన పొగలా పైకి లేస్తుంది. \q1 \v 19 సైన్యాల యెహోవా ఉగ్రత వలన \q2 భూమి కాలిపోతుంది \q1 ప్రజలు అగ్నికి ఇంధనం అవుతారు; \q2 వారిలో ఒకరిపై మరొకరికి కనికరం ఉండదు. \q1 \v 20 కుడి ప్రక్కన దానిని వారు మ్రింగుతారు \q2 కాని ఇంకా ఆకలితోనే ఉంటారు. \q1 ఎడమ ప్రక్కన దానిని తింటారు \q2 కాని తృప్తి పొందరు. \q1 వారిలో ప్రతిఒక్కరు తన సంతానం\f + \fr 9:20 \fr*\ft లేదా \ft*\fqa చేతి\fqa*\f* యొక్క మాంసాన్ని తింటారు. \q2 \v 21 మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిం మనష్షేను తింటారు. \q2 వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. \b \q1 ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, \q2 ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది. \b \b \c 10 \q1 \v 1 అన్యాయపు చట్టాలు చేసేవారికి, \q2 చెడు శాసనాలు చేసేవారికి శ్రమ. \q1 \v 2 వారు పేదల హక్కులను హరిస్తారు, \q2 నా ప్రజల్లో అణచివేయబడిన వారికి న్యాయం చేరనివ్వరు \q1 వారు విధవరాండ్రను తమ దోపుడు సొమ్ముగా చేసుకుంటూ \q2 తండ్రిలేనివారిని దోచుకుంటారు. \q1 \v 3 తీర్పు తీర్చే రోజున, \q2 దూరం నుండి విపత్తు వచ్చినప్పుడు మీరేమి చేస్తారు? \q1 సహాయం కోసం ఎవరి దగ్గరకు పరుగెత్తుతారు? \q2 మీ సంపదను ఎక్కడ వదిలివేస్తారు? \q1 \v 4 బంధించబడిన వారి మధ్య మోకరిల్లడం \q2 చనిపోయినవారి మధ్య పడిపోవడం తప్ప మరేమీ మిగలదు. \b \q1 ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు \q2 ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది. \s1 అష్షూరుపై దేవుని తీర్పు \q1 \v 5 అష్షూరుకు శ్రమ, అతడు నా కోపం అనే దండం \q2 నా ఉగ్రత అనే దుడ్డుకర్ర అతని చేతిలో ఉంది. \q1 \v 6 దేవుడు లేని దేశం మీదికి నేను అతన్ని పంపుతాను, \q2 దోచుకోడానికి కొల్లగొట్టడానికి, \q1 వీధుల్లో మట్టిలా వారిని త్రొక్కడానికి \q2 నాకు కోపం కలిగించిన ప్రజల గురించి అతన్ని ఆజ్ఞాపిస్తాను. \q1 \v 7 అయితే ఇది అతడు ఉద్దేశించింది కాదు, \q2 ఇది అతని మనస్సులో ఉన్నది అది కాదు. \q1 నాశనం చేయాలని, \q2 చాలా దేశాలను నిర్మూలించాలన్నది అతని ఉద్దేశము. \q1 \v 8 అతడు, “నా అధిపతులందరు రాజులు కారా? \q2 \v 9 కల్నో, కర్కెమీషులా ఉండలేదా? \q1 హమాతు అర్పదులా ఉండలేదా \q2 సమరయ దమస్కులా ఉండలేదా? \q1 \v 10 విగ్రహాలను పూజించే రాజ్యాలను నా చేయి పట్టుకున్నట్లు, \q2 వాటి విగ్రహాలు యెరూషలేము సమరయుల విగ్రహాల కన్న ఎక్కువగా ఉన్నాయి. \q1 \v 11 నేను సమరయకు దాని విగ్రహాలకు చేసినట్లు \q2 యెరూషలేముకు దాని విగ్రహాలకు చేయవద్దా?” \p \v 12 ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను. \v 13 ఎందుకంటే అతడు ఇలా అన్నాడు: \q1 “ ‘నేను వివేకిని, నా బాహుబలం చేత, \q2 నా జ్ఞానంతో దీన్ని చేశాను. \q1 నేను ప్రజల సరిహద్దులు తీసివేశాను, \q2 వారి సంపదలు దోచుకున్నాను; \q2 బలవంతునిలా వారి రాజులను అణచివేశాను.\f + \fr 10:13 \fr*\ft లేదా \ft*\fqa బలవంతులను అణచివేశాను\fqa*\f* \q1 \v 14 పక్షి గూటిలోనికి చేరునట్లు \q2 నా చేయి దేశాల సంపదను చేరుకుంది; \q1 ప్రజలు విడిచిపెట్టిన గుడ్లు ఏరుకున్నట్లుగా, \q2 నేను అన్ని దేశాలను సమకూర్చుకున్నాను; \q1 ఏ ఒక్కటి రెక్కలు ఆడించలేదు లేదా \q2 కిచకిచమనడానికి నోరు తెరవలేదు.’ ” \b \q1 \v 15 గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా, \q2 రంపం దానిని ఉపయోగించే వ్యక్తి మీద ప్రగల్భాలు పలుకుతుందా? \q1 కర్ర తనను ఎత్తేవానిని ఆడించినట్లు \q2 దుడ్డుకర్ర కర్రకానివాన్ని ఆడిస్తుంది! \q1 \v 16 కాబట్టి, సైన్యాల అధిపతియైన యెహోవా, \q2 అష్షూరీయుల బలమైన వీరుల మీదికి పాడుచేసే రోగాన్ని పంపుతారు; \q1 వారి మహిమను కాల్చడానికి \q2 వారి క్రింద మండుతున్న జ్వాలల వంటి అగ్ని మండుతుంది. \q1 \v 17 ఇశ్రాయేలు వెలుగు అగ్నిగా మారుతుంది, \q2 వారి పరిశుద్ధ దేవుడు అగ్నిజ్వాలగా మారుతారు; \q1 అతని ముళ్ళచెట్లను, గచ్చపొదలను \q2 ఒక రోజులోనే వాటిని కాల్చి, దహించివేస్తుంది. \q1 \v 18 ఒక రోగి ఆరోగ్యం క్షీణించిపోవునట్లు \q2 అతని అడవికి, సారవంతమైన పొలాలకు ఉన్న వైభవాన్ని \q2 అది పూర్తిగా నాశనం చేస్తుంది. \q1 \v 19 అతని అడవిలో మిగిలిన చెట్లు కొన్నే మిగులుతాయి \q2 పిల్లవాడు కూడా వాటిని లెక్కపెట్టవచ్చు. \s1 ఇశ్రాయేలులో మిగిలినవారు \q1 \v 20 ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవారు \q2 యాకోబు కుటుంబంలో తప్పించుకున్నవారు \q1 తమను మొత్తిన వానిని \q2 ఇక ఆశ్రయించరు \q1 కాని ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను \q2 వారు నిజంగా ఆశ్రయిస్తారు. \q1 \v 21 మిగిలినవారు తిరిగి వస్తారు, యాకోబులో మిగిలినవారు \q2 బలవంతుడైన దేవుని వైపు తిరుగుతారు. \q1 \v 22 నీ ప్రజలైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, \q2 వారిలో మిగిలినవారే తిరుగుతారు. \q1 నాశనం శాసించబడింది \q2 నీతియుక్తమైన శిక్ష ఉప్పొంగి ప్రవహిస్తుంది. \q1 \v 23 ప్రభువు, సైన్యాల యెహోవా \q2 భూమి అంతటా నిర్ణయించబడిన నాశనాన్ని కలుగజేస్తారు. \p \v 24 కాబట్టి సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పే మాట ఇది: \q1 “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, \q2 ఈజిప్టులో చేసినట్టు కర్రతో మిమ్మల్ని కొట్టి \q1 మీమీద తన దుడ్డుకర్ర ఎత్తిన \q2 అష్షూరీయులకు భయపడకండి. \q1 \v 25 అతిత్వరలో మీమీద నా కోపం చల్లారుతుంది \q2 నా ఉగ్రత వారి నాశనానికి దారి తీస్తుంది.” \b \q1 \v 26 ఓరేబు బండ దగ్గర మిద్యానును చంపినట్లు \q2 సైన్యాల యెహోవా తన కొరడాతో వారిని కొడతారు; \q1 ఆయన ఈజిప్టులో చేసినట్టు \q2 తన దండాన్ని సముద్రం మీద ఎత్తుతారు. \q1 \v 27 ఆ రోజు వారి భుజాలపై నుండి వారి బరువు తీసివేయబడుతుంది, \q2 మీ మెడపై నుండి వారి కాడి కొట్టివేయబడుతుంది. \q1 మీరు బలంగా ఉన్నందుకు \q2 ఆ కాడి విరిగిపోతుంది. \b \q1 \v 28 అష్షూరీయులు ఆయాతులో ప్రవేశించారు; \q2 మిగ్రోను గుండా వెళ్లారు; \q2 మిక్మషులో తమ సామాను ఉంచారు. \q1 \v 29 వారు మార్గం దాటి వెళ్తూ, \q2 “మేము గెబాలో రాత్రి బస చేస్తాం” అంటున్నారు. \q1 రామా వణకుతుంది; \q2 సౌలు గిబియా పారిపోతుంది. \q1 \v 30 గల్లీము కుమార్తె! కేకలు వేయి \q2 లాయిషా, విను! \q2 అయ్యయ్యో, అనాతోతు! \q1 \v 31 మద్మేనా ప్రజలు పారిపోతారు. \q2 గెబీము నివాసులు దాక్కుంటారు. \q1 \v 32 ఈ రోజే వారు నోబులో దిగుతారు; \q2 ఈ రోజే సీయోను కుమారి పర్వతం, \q1 యెరూషలేము కొండ వైపు \q2 వారు తమ పిడికిలి ఆడిస్తారు. \b \q1 \v 33 చూడండి, ప్రభువు, సైన్యాల అధిపతియైన యెహోవా \q2 మహాబలంతో కొమ్మలు నరుకుతారు. \q1 ఉన్నతమైన చెట్లు నరకబడతాయి, \q2 ఎత్తైనవి పడగొట్టబడతాయి. \q1 \v 34 ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతారు; \q2 బలవంతుని ఎదుట లెబానోను పడిపోతుంది. \c 11 \s1 యెష్షయి కొమ్మ \q1 \v 1 యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది; \q2 అతని వేరుల నుండి కొమ్మ ఫలిస్తుంది. \q1 \v 2 యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం కలిగించే ఆత్మ, \q2 ఆలోచనను బలాన్ని ఇచ్చే ఆత్మ, \q2 తెలివిని, యెహోవా పట్ల భయం కలిగించే ఆత్మ, \q2 అతని మీద ఉంటుంది. \q1 \v 3 యెహోవాయందలి భయంతో అతడు సంతోషిస్తాడు. \b \q1 అతడు తన కళ్లతో చూసిన దానిని బట్టి తీర్పు తీర్చడు, \q2 తన చెవులతో విన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోడు; \q1 \v 4 కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు, \q2 భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. \q1 అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు; \q2 తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు. \q1 \v 5 నీతి అతని నడికట్టుగా ఉంటుంది \q2 నమ్మకత్వం అతని తుంటికి నడికట్టుగా ఉంటుంది. \b \q1 \v 6 తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తుంది, \q2 చిరుతపులి మేకతో పడుకుంటుంది, \q1 దూడ, కొదమసింహం, బలిపశువు కలిసి ఉంటాయి; \q2 చిన్న పిల్లవాడు వాటిని నడిపిస్తాడు. \q1 \v 7 ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, \q2 వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి. \q2 ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది. \q1 \v 8 పసిపిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుంది. \q2 విషసర్పం పుట్టలో చిన్న బిడ్డ తన చేయి పెడుతుంది. \q1 \v 9 నా పరిశుద్ధ పర్వతమంతటా \q2 అవి హాని చేయవు, నాశనం చేయవు. \q1 నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు \q2 యెహోవా జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది. \p \v 10 ఆ రోజున యెష్షయి వేరు జనాంగాలకు ధ్వజంగా నిలుస్తుంది; దేశాలు అతనివైపు వస్తాయి, అతని విశ్రాంతి స్థలం మహిమగలదిగా ఉంటుంది. \v 11 ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు,\f + \fr 11:11 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం\ft*\f* ఏలాము, బబులోను\f + \fr 11:11 \fr*\ft అంటే, \ft*\fqa షీనారు\fqa*\f*, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు. \q1 \v 12 దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు \q2 చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; \q1 భూమి నలుదిక్కుల నుండి \q2 ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు. \q1 \v 13 ఎఫ్రాయిముకున్న అసూయ పోతుంది, \q2 యూదా శత్రువులు నశిస్తారు. \q1 ఎఫ్రాయిం యూదాపై అసూయపడదు, \q2 యూదా ఎఫ్రాయింతో విరోధంగా ఉండదు. \q1 \v 14 వారు పడమటి వైపు ఫిలిష్తీయ వాలుల మీద దూకుతారు; \q2 వారు కలిసి తూర్పు ప్రజలను దోచుకుంటారు. \q1 వారు ఎదోమును, మోయాబును లోబరచుకుంటారు, \q2 అమ్మోనీయులు వారికి లోబడతారు. \q1 \v 15 యెహోవా ఈజిప్టు సముద్రపు \q2 అగాధాన్ని నాశనం చేస్తారు; \q1 తన వేడి గాలితో \q2 యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడిస్తారు. \q1 ఆయన ఏడు కాలువలుగా దానిని చీల్చుతారు \q2 చెప్పులు తడువకుండ మనుష్యులు దానిని దాటేలా చేస్తారు. \q1 \v 16 ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన రోజున \q2 వారికి దారి ఏర్పడినట్లు \q1 అష్షూరు నుండి వచ్చే \q2 ఆయన ప్రజల్లో మిగిలిన వారికి రాజమార్గం ఉంటుంది. \c 12 \s1 స్తుతి పాటలు \p \v 1 ఆ రోజున మీరు ఇలా అంటారు: \q1 “యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను. \q2 మీరు నాపై కోప్పడినా కూడా \q1 మీ కోపం చల్లారింది \q2 మీరు నన్ను ఆదరించారు. \q1 \v 2 నిజంగా దేవుడే నా రక్షణ; \q2 నేను భయపడను ఆయనను నమ్ముతాను. \q1 యెహోవా యెహోవాయే నా బలం, నా ఆత్మరక్షణ; \q2 ఆయనే నా రక్షణ అయ్యారు.” \q1 \v 3 మీరు రక్షణ బావులలో నుండి \q2 ఆనందంతో నీళ్లు చేదుతారు. \p \v 4 ఆ రోజున మీరు ఇలా అంటారు: \q1 “యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; \q2 దేశాల్లో ఆయన చేసిన కార్యాలను తెలియజేయండి, \q2 ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి. \q1 \v 5 యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన మహిమగల కార్యాలు చేశారు; \q2 లోకమంతటికి ఇది తెలియాలి. \q1 \v 6 సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, \q2 ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.” \c 13 \s1 బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 బబులోను గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన ప్రవచనం: \q1 \v 2 చెట్లులేని కొండ శిఖరం మీద జెండా నిలబెట్టండి, \q2 కేకలు వేసి వారిని పిలువండి; \q1 ప్రజల ప్రధానులను గుమ్మాల్లో \q2 చేతులతో సైగ చేయండి. \q1 \v 3 నేను యుద్ధానికి ప్రతిష్ఠించిన వారికి ఆజ్ఞ ఇచ్చాను; \q2 నా కోపం తీర్చుకోవాలని నా వీరులను పిలిపించాను, \q2 నా విజయాన్ని బట్టి సంతోషించేవారిని పిలిపించాను. \b \q1 \v 4 పెద్ద జనసమూహం ఉన్నట్లుగా \q2 కొండల్లో వస్తున్న శబ్దం వినండి! \q1 దేశాలు ఒక్కటిగా చేరుతునట్లు \q2 రాజ్యాల మధ్య అల్లరి శబ్దం వినండి! \q1 సైన్యాల యెహోవా \q2 యుద్ధానికి సైన్యాన్ని సమకూరుస్తున్నారు. \q1 \v 5 దేశాన్ని మొత్తం పాడుచేయడానికి, \q2 యెహోవా కోపాన్ని తీర్చే ఆయుధాలుగా, \q1 వారు దూరదేశం నుండి, \q2 ఆకాశపు అంచుల నుండి వస్తున్నారు. \b \q1 \v 6 యెహోవా దినం దగ్గరలో ఉందని రోదించండి; \q2 అది సర్వశక్తుడు దేవుని దగ్గర నుండి వచ్చే నాశనంలా వస్తుంది. \q1 \v 7 దీనిని బట్టి, చేతులన్నీ బలహీనపడతాయి, \q2 ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది. \q1 \v 8 భయం వారిని పట్టుకుంటుంది, \q2 వేదన బాధలు వారిని గట్టిగా పట్టుకుంటాయి; \q2 స్త్రీ ప్రసవ వేదన పడినట్లు వారు వేదన పడతారు. \q1 వారు ఒకరిపట్ల ఒకరు విసుగుతో చూసుకుంటారు, \q2 వారి ముఖాలు అగ్నిజ్వాలల్లా ఉంటాయి. \b \q1 \v 9 చూడండి, యెహోవా దినం వస్తుంది. \q2 దేశాన్ని పాడుచేయడానికి \q1 దానిలో ఉన్న పాపులను పూర్తిగా నాశనం చేయడానికి \q2 క్రూరమైన ఉగ్రతతో తీవ్రమైన కోపంతో ఆ రోజు వస్తుంది. \q1 \v 10 ఆకాశ నక్షత్రాలు వాటి నక్షత్రరాసులు \q2 తమ వెలుగు ఇవ్వవు. \q1 ఉదయించే సూర్యుడు చీకటిగా మారుతాడు \q2 చంద్రుడు తన వెలుగునివ్వడు. \q1 \v 11 దాని చెడుతనం బట్టి లోకాన్ని \q2 వారి పాపాన్ని బట్టి దుర్మార్గులను నేను శిక్షిస్తాను. \q1 గర్విష్ఠుల అహంకారాన్ని అంతం చేస్తాను. \q2 క్రూరుల గర్వాన్ని అణచివేస్తాను. \q1 \v 12 నేను మనుష్యులను స్వచ్ఛమైన బంగారం కంటే కొరతగా, \q2 ఓఫీరు దేశ బంగారం కంటే అరుదుగా ఉండేలా చేస్తాను. \q1 \v 13 సైన్యాల యెహోవా ఉగ్రత కారణంగా \q2 ఆయన కోపం రగులుకున్న రోజున \q1 ఆకాశం వణికేలా చేస్తాను; \q2 భూమి తన స్థానం నుండి తప్పుకునేలా చేస్తాను. \b \q1 \v 14 తరుమబడుతున్న జింకలా, \q2 కాపరి లేని గొర్రెలా, \q1 వారు తమ సొంత ప్రజల వైపు తిరుగుతారు, \q2 వారు తమ స్వదేశాలకు పారిపోతారు. \q1 \v 15 పట్టబడిన ప్రతిఒక్కరు కత్తిపోటుకు గురవుతారు; \q2 బందీగా పట్టబడిన వారందరు ఖడ్గానికి చస్తారు. \q1 \v 16 వారి కళ్లముందే వారి పసిపిల్లలు ముక్కలుగా నలుగ కొట్టబడతారు; \q2 వారి ఇల్లు దోచుకోబడతాయి వారి భార్యలు అత్యాచారం చేయబడతారు. \b \q1 \v 17 చూడండి, వారి మీద దాడి చేయడానికి నేను మెదీయ వారిని రేపుతాను. \q2 వారు వెండిని లెక్కచేయరు. \q2 బంగారం మీద వారికి ఆసక్తి లేదు. \q1 \v 18 వారి విల్లులు యవ్వనస్థులను నలగ్గొడతాయి; \q2 పసిపిల్లలపై వారు జాలిపడరు. \q2 పిల్లలపై వారు దయ చూపరు. \q1 \v 19 అప్పుడు రాజ్యాలకు వైభవంగా, \q2 బబులోనీయుల\f + \fr 13:19 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల\fqa*\f* గర్వానికి ఘనతకు కారణంగా ఉన్న బబులోనును \q1 సొదొమ గొమొర్రాల వలె \q2 దేవుడు పడగొడతారు. \q1 \v 20 ఇకపై దానిలో ఎవరూ నివసించరు \q2 తరతరాలకు దానిలో ఎవరూ కాపురముండరు; \q1 అరబీయులు\f + \fr 13:20 \fr*\ft అంటే \ft*\fqa సంచార జాతులు\fqa*\f* అక్కడ తమ డేరాలు వేసుకోరు, \q2 గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు. \q1 \v 21 ఎడారి జీవులు అక్కడ పడుకుంటాయి, \q2 వారి ఇళ్ళ నిండ నక్కలు ఉంటాయి; \q1 గుడ్లగూబలు అక్కడ నివసిస్తాయి \q2 కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి. \q1 \v 22 దాని కోటలలో హైనాలు, \q2 దాని విలాసవంతమైన భవనాలలో నక్కలు నివసిస్తాయి. \q1 దాని కాలం ముగిసిపోతుంది \q2 దాని రోజులు పొడిగించబడవు. \b \b \c 14 \q1 \v 1 యెహోవా యాకోబుపై జాలి చూపుతారు; \q2 ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని \q2 వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు. \q1 విదేశీయులు వారిని కలుసుకుంటారు \q2 యాకోబు వారసులతో ఏకమై ఉంటారు. \q1 \v 2 ప్రజలు వారిని తీసుకువచ్చి \q2 వారి సొంత దేశంలో వారిని చేర్చుతారు. \q1 ఇశ్రాయేలు దేశాలను స్వాధీనపరచుకుని \q2 యెహోవా దేశంలో వారిని తమ దాసదాసీలుగా చేసుకుంటారు. \q1 వారు తమను బందీలుగా పట్టుకెళ్లిన వారిని బందీలుగా పట్టుకుని \q2 తమను బాధించిన వారిని పాలిస్తారు. \p \v 3 నీ బాధ నుండి వేదన నుండి నీతో బలవంతంగా చేయించిన కఠినమైన పని నుండి యెహోవా నీకు ఉపశమనం ఇచ్చిన రోజున, \v 4 నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు: \q1 బాధ పెట్టినవాడు ఎలా నశించాడు! \q2 రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది! \q1 \v 5 దుర్మార్గుల దుడ్డుకర్రను \q2 పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టారు. \q1 \v 6 వారు కోపంతో ఎడతెగని దెబ్బలతో \q2 ప్రజలను క్రూరంగా కొట్టారు, \q1 కోపంతో ప్రజలను పరిపాలించి \q2 కనికరం లేకుండా వారిని అణచివేశారు. \q1 \v 7 భూమి అంతా విశ్రాంతిలో సమాధానంతో ఉంది; \q2 వారు పాడడం మొదలుపెట్టారు. \q1 \v 8 సరళ వృక్షాలు లెబానోను దేవదారు చెట్లు \q2 నీ గురించి సంతోషిస్తూ ఇలా అంటాయి, \q1 “నీవు పడుకుంటున్నప్పటి నుండి \q2 మమ్మల్ని నరకడానికి ఎవరూ రారు.” \b \q1 \v 9 నీవు వస్తుండగా నిన్ను కలుసుకోడానికి \q2 క్రింద పాతాళం నీ గురించి ఆవేశపడుతుంది; \q1 అది నిన్ను చూసి చచ్చిన వారి ఆత్మలను అనగా \q2 భూమి మీద నాయకులుగా ఉన్నవారందరిని రేపుతుంది; \q1 దేశాలకు రాజులుగా ఉన్నవారందరిని \q2 తమ సింహాసనాలు నుండి లేపుతుంది. \q1 \v 10 వారందరు నిన్ను చూసి \q2 నీతో ఇలా అంటారు, \q1 “నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు; \q2 నీవు కూడా మాలా అయ్యావు.” \q1 \v 11 నీ వీణల సందడితో పాటు నీ ఆడంబరం అంతా \q2 క్రింద సమాధిలో పడవేయబడింది; \q1 నీ క్రింద పురుగులు వ్యాపిస్తాయి \q2 క్రిములు నిన్ను కప్పివేస్తాయి. \b \q1 \v 12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, \q2 నీవెలా ఆకాశం నుండి పడ్డావు? \q1 దేశాలను పడగొట్టిన నీవు \q2 భూమి మీద ఎలా పడవేయబడ్డావు? \q1 \v 13 నీవు నీ హృదయంలో, \q2 “నేను ఆకాశాలను ఎక్కుతాను; \q1 దేవుని నక్షత్రాల కన్నా ఎత్తుగా \q2 నా సింహాసనాన్ని హెచ్చిస్తాను; \q1 ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద, \q2 సాఫోన్\f + \fr 14:13 \fr*\fq సాఫోన్ \fq*\ft కనానీయుల చేత \ft*\fqa అతి పవిత్ర \fqa*\ft పర్వతముగా పరిగణించబడింది.\ft*\f* పర్వతం యొక్క ఎత్తైన స్థలాల మీద కూర్చుంటాను. \q1 \v 14 మేఘ మండలం మీదికి ఎక్కుతాను. \q2 నన్ను నేను మహోన్నతునిగా చేసుకుంటాను” అనుకున్నావు. \q1 \v 15 కాని నీవు పాతాళంలో చచ్చిన వారి స్థలంలో \q2 లోతైన గోతిలో త్రోయబడ్డావు. \b \q1 \v 16 నిన్ను చూసేవారు నిన్ను గమనించి చూస్తూ \q2 నీ విధి గురించి ఇలా అనుకుంటారు: \q1 “భూమిని కంపింపజేసి \q2 రాజ్యాలను వణికించింది ఇతడేనా? \q1 \v 17 లోకాన్ని అడవిగా చేసి \q2 దాని పట్టణాలను పాడుచేసినవాడు ఇతడేనా? \q2 తాను బంధించిన వారిని తమ ఇళ్ళకు పోనివ్వనివాడు ఇతడేనా?” \b \q1 \v 18 దేశాల రాజులందరూ ఘనత వహించినవారై \q2 తమ తమ సమాధుల్లో నిద్రిస్తున్నారు. \q1 \v 19 అయితే నీవు తిరస్కరించబడిన కొమ్మలా \q2 నీ సమాధి నుండి పారవేయబడ్డావు. \q1 నీవు చంపబడినవారితో \q2 కత్తితో పొడవబడిన వారితో \q2 పాతాళంలో ఉన్న రాళ్ల దగ్గరకు దిగిపోయిన వారితో కప్పబడి ఉన్నావు. \q1 కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు. \q2 \v 20 నీవు నీ దేశాన్ని పాడుచేసి \q1 నీ ప్రజలను చంపేశావు \q2 కాబట్టి నీవు సమాధిలో వారితో పాటు కలిసి ఉండవు. \b \b \q1 దుర్మార్గుని సంతానం \q2 ఎప్పుడూ జ్ఞాపకానికి రాదు. \q1 \v 21 వారు పెరిగి భూమిని స్వాధీనం చేసుకుని \q2 తమ పట్టణాలతో భూమిని నింపకుండా \q1 తమ పూర్వికుల పాపాన్ని బట్టి \q2 అతని పిల్లలను వధించడానికి చోటు సిద్ధం చేయండి. \b \q1 \v 22 “నేను వారి మీదికి లేస్తాను” అని \q2 సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు, \q1 “బబులోను పేరును దానిలో మిగిలినవారిని, \q2 సంతానాన్ని, వారసులను కొట్టివేస్తాను” \q2 అని యెహోవా తెలియజేస్తున్నారు. \q1 \v 23 “నేను దానిని గుడ్లగూబలు ఉండే స్థలంగా చేస్తాను \q2 నీటిమడుగులుగా చేస్తాను; \q1 నాశనమనే చీపురుకట్టతో దానిని తుడిచివేస్తాను” అని \q2 సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు. \p \v 24 సైన్యాల యెహోవా చేసిన ప్రమాణం ఇదే: \q1 “నేను ఉద్దేశించినట్లే అది తప్పక ఉంటుంది, \q2 నేను ఆలోచించినట్లే అది జరుగుతుంది. \q1 \v 25 నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను; \q2 నా పర్వతాలమీద అతన్ని నలగదొక్కుతాను. \q1 అతని కాడి నా ప్రజల మీద నుండి తీసివేయబడుతుంది, \q2 అతని భారం వారి భుజాలపై నుండి తొలగించబడుతుంది.” \b \q1 \v 26 లోకమంతటి గురించి నిర్ణయించిన ఆలోచన ఇదే; \q2 ప్రజలందరిపై చాపబడిన చేయి ఇదే. \q1 \v 27 సైన్యాల యెహోవా దానిని ఉద్దేశిస్తే ఆయనను అడ్డుకునేవారు ఎవరు? \q2 ఆయన చేయి చాచి ఉన్నది, దాన్ని త్రిప్పగలవారెవరు? \s1 ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 28 రాజైన ఆహాజు చనిపోయిన సంవత్సరం వచ్చిన ప్రవచనం: \q1 \v 29 ఫిలిష్తియా, మిమ్మల్ని కొట్టిన కర్ర \q2 విరిగిపోయిందని మీరందరు సంతోషించకండి; \q1 సర్పమూలం నుండి విషపూరిత పాము పుడుతుంది, \q2 దాని సంతానం ఎగిరే విషసర్పము. \q1 \v 30 అప్పుడు అతి బీదవారు భోజనం చేస్తారు, \q2 అవసరతలో ఉన్నవారు క్షేమంగా పడుకుంటారు. \q1 కాని కరువుతో మీ మూలాన్ని నాశనం చేస్తాను; \q2 అది మీలో మిగిలి ఉన్నవారిని చంపేస్తుంది. \b \q1 \v 31 గుమ్మమా, దుఃఖించు! పట్టణమా, కేకలు వేయి! \q2 ఫిలిష్తియా, మీరంతా కరిగిపోవాలి! \q1 ఉత్తర దిక్కునుండి పొగలేస్తుంది. \q2 పంక్తులు తీరిన సైన్యంలో వెనుదిరిగేవారు ఎవరూ లేరు. \q1 \v 32 ఆ దేశ దూతలకు \q2 ఇవ్వవలసిన జవాబు ఏది? \q1 “యెహోవా సీయోనును స్థాపించారు, \q2 ఆయన ప్రజల్లో శ్రమ పొందినవారు దానిని ఆశ్రయిస్తారు.” \c 15 \s1 మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం: \q1 ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం \q2 పాడై నశిస్తుంది! \q1 ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం \q2 పాడై నశిస్తుంది! \q1 \v 2 దీబోను ఏడ్వడానికి గుడికి \q2 తన క్షేత్రాలకు వెళ్తుంది; \q2 నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. \q1 ప్రతి తల క్షౌరం చేయబడింది \q2 ప్రతివాని గడ్డం గొరిగించబడింది. \q1 \v 3 వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు; \q2 తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో \q1 వారందరు రోదిస్తారు, \q2 ఏడుస్తూ కన్నీరు కారుస్తారు. \q1 \v 4 హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు, \q2 యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది. \q1 కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు, \q2 వారి హృదయాలు క్రుంగిపోతాయి. \b \q1 \v 5 మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది; \q2 వారిలో పారిపోయినవారు సోయరు వరకు, \q2 ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు. \q1 వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు \q2 ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు; \q1 హొరొనయీము వెళ్లే దారిలో \q2 తమ నాశనం గురించి విలపిస్తారు. \q1 \v 6 నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి \q2 గడ్డి ఎండిపోయింది; \q1 వృక్ష సంపద ఉండదు \q2 పచ్చదనం ఎక్కడా మిగల్లేదు. \q1 \v 7 కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తిని \q2 నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు. \q1 \v 8 వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి; \q2 వారి రోదన ఎగ్లయీము వరకు \q2 వారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది. \q1 \v 9 దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి \q2 కాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను. \q1 మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికి \q2 ఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను. \b \b \c 16 \q1 \v 1 ఎడారి వైపు ఉన్న సెల నుండి \q2 దేశాన్ని పాలించేవానికి \q1 కప్పంగా గొర్రెపిల్లలను \q2 సీయోను కుమార్తె పర్వతానికి పంపండి. \q1 \v 2 గూటినుండి చెదరగొట్టబడి \q2 ఇటు అటు ఎగిరే పక్షుల్లా \q1 అర్నోను రేవుల దగ్గర \q2 మోయాబు స్త్రీలు ఉంటారు. \b \q1 \v 3 మోయాబు అంటుంది, “మనస్సు సిద్ధం చేసుకో, \q2 నిర్ణయం తీసుకో. \q1 చీకటి కమ్మినట్టుగా మిట్టమధ్యాహ్నం \q2 నీ నీడ మామీద ఉండనివ్వు. \q1 పారిపోయినవారిని దాచి పెట్టు, \q2 శరణార్థులకు ద్రోహం చేయకు. \q1 \v 4 పారిపోయిన మోయాబీయులను నీతో ఉండనివ్వు; \q2 నాశనం చేసేవాని నుండి కాపాడే ఆశ్రయంగా ఉండు.” \b \q1 హాని చేసేవారు అంతం అవుతారు, \q2 విధ్వంసం ఆగిపోతుంది; \q2 అణచివేసేవారు భూమి మీద లేకుండా మాయమవుతారు. \q1 \v 5 మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది; \q2 దావీదు కుటుంబం నుండి \q2 సత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చుని \q1 న్యాయంగా తీర్పు తీర్చుతూ \q2 నీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు. \b \q1 \v 6 మోయాబు గర్వం గురించి మేము విన్నాము \q2 దాని అహంకారం చాలా ఎక్కువ \q1 దాని ప్రగల్భాలు, గర్వం, దౌర్జన్యం గురించి విన్నాం; \q2 అయితే దాని ప్రగల్భాలు వట్టివే. \q1 \v 7 కాబట్టి మోయాబీయులు రోదిస్తారు, \q2 వారందరూ కలిసి మోయాబు గురించి ఏడుస్తారు. \q1 కీర్ హరెశెతుకు ఎండు ద్రాక్షపండ్ల \q2 విలపించి దుఃఖిస్తారు. \q1 \v 8 హెష్బోను పొలాలు, \q2 షిబ్మా ద్రాక్షతీగెలు కూడా వాడిపోయాయి. \q1 యాజెరు వరకు వ్యాపించిన \q2 అరణ్యం వరకు ప్రాకిన \q1 శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను \q2 దేశాల పాలకులు త్రొక్కివేశారు. \q1 వాటి తీగెలు విశాలంగా వ్యాపించి \q2 సముద్రాన్ని\f + \fr 16:8 \fr*\ft బహుశ మృత సముద్రం\ft*\f* దాటాయి. \q1 \v 9 అందువల్ల యాజెరు ఏడ్చినట్లు \q2 నేను షిబ్మా ద్రాక్షతీగెల కోసం ఏడుస్తాను. \q1 హెష్బోనూ ఎల్యాలెహు, \q2 నా కన్నీటి చేత మిమ్మల్ని తడుపుతాను. \q1 నీ పండిన ఫలాల కోసం \q2 నీ పంటల కోసం వేసే సంతోషపు కేకలు ఆగిపోయాయి. \q1 \v 10 ఫలభరితమైన పొలాల నుండి ఆనంద సంతోషాలు తీసివేయబడతాయి; \q2 ద్రాక్షతోటలో ఎవరూ పాడరు, కేకలు వేయరు; \q1 గానుగులలో ద్రాక్షగెలలను ఎవరూ త్రొక్కరు. \q2 ఎందుకంటే, నేను వారి సంతోషపు అరుపులు ఆపివేశాను. \q1 \v 11 నా హృదయం వీణలా మోయాబు గురించి, \q2 నా అంతరంగం కీర్ హరెశెతు గురించి విలపిస్తుంది. \q1 \v 12 మోయాబు తన క్షేత్రాల దగ్గరకు వెళ్లినప్పుడు \q2 అది కేవలం ఆయాసపడుతుంది; \q1 ప్రార్ధన చేయడానికి తన క్షేత్రానికి వెళ్లినప్పుడు \q2 దానికి ఏమి దొరకదు. \p \v 13 యెహోవా మోయాబు గురించి ముందే పలికిన వాక్కు ఇది. \v 14 అయితే యెహోవా ఇప్పుడు ఇలా చెప్తున్నారు: “మూడు సంవత్సరాల్లో, కూలివాని లెక్క ప్రకారం ఖచ్చితంగా మోయాబు ఘనతతో పాటు దానిలోని అనేకమంది తృణీకరించబడతారు; దానిలో మిగిలినవారు అతితక్కువగా, బలహీనంగా ఉంటారు.” \c 17 \s1 దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం: \q1 “చూడండి, దమస్కు ఒక పట్టణంగా ఇక ఉండదు, \q2 కాని అది శిథిలాల కుప్పగా మారుతుంది. \q1 \v 2 అరోయేరు పట్టణాలు నిర్జనమవుతాయి \q2 అవి గొర్రెల మందలకు వదిలేయబడతాయి, \q2 ఎవరి భయం లేకుండా అవి అక్కడ పడుకుంటాయి. \q1 \v 3 ఎఫ్రాయిములో నుండి కోటగల పట్టణం మాయమవుతుంది, \q2 దమస్కు రాజ్యాధికారాన్ని కోల్పోతుంది; \q1 ఇశ్రాయేలీయుల ప్రభావానికి జరిగినట్లు \q2 అరాములో మిగిలినవారికి జరుగుతుంది” \q2 అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు. \b \q1 \v 4 “ఆ రోజున యాకోబు ప్రభావం తగ్గిపోతుంది; \q2 అతని శరీరం యొక్క క్రొవ్వు తరిగిపోతుంది. \q1 \v 5 అది కోత కోసేవారు ధాన్యం కోసినప్పుడు \q2 వారి చేతుల్లో వెన్నులు కోసినట్లుగా ఉంటుంది. \q1 రెఫాయీము లోయలో \q2 ఒకడు పరిగె ఏరుకున్నట్లుగా ఉంటుంది. \q1 \v 6 అయినా ఒలీవచెట్టు కొమ్మలు దులపగా \q2 పై కొమ్మ చివర రెండు మూడు పండ్లు మిగిలినట్లు, \q1 ఫలించు చెట్టు కొమ్మల్లో మూడు, నాలుగు పండ్లు మిగిలినట్లు, \q2 కొంత పరిగె మిగిలి ఉంటుంది” అని \q2 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు. \b \q1 \v 7 ఆ రోజున మనుష్యులు తమ సృష్టికర్త వైపు చూస్తారు \q2 వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు తమ దృష్టిని మరల్చుకుంటారు. \q1 \v 8 వారు తమ చేతుల పనియైన \q2 బలిపీఠాల వైపు చూడరు, \q1 తమ చేతివ్రేళ్లు చేసిన అషేరా స్తంభాలను \q2 ధూపవేదికలను పట్టించుకోరు. \p \v 9 ఆ రోజున ఇశ్రాయేలీయుల కారణంగా వారు విడిచిపెట్టిన బలమైన నిర్మానుష్యంగా పట్టణాలు పొదలు తుప్పలు పెరిగే స్థలాల్లా ఉంటాయి. అవి పాడైపోతాయి. \q1 \v 10 నీ రక్షకుడైన దేవుని నీవు మరచిపోయావు; \q2 నీ బలానికి ఆధారమైన బండను గుర్తు చేసుకోలేదు. \q1 కాబట్టి నీవు అందమైన తోటలు పెంచినా \q2 వాటిలో విదేశీ ద్రాక్షతీగెలు నాటినా, \q1 \v 11 నీవు వాటిని నాటిన రోజున అవి పెరిగేలా నీవు చేసినా, \q2 ఉదయాన నీవు వేసిన విత్తనాలు పూలు పూచేలా నీవు చేసినా, \q1 రోగం, తీరని దుఃఖం కలిగే రోజున \q2 పంట ఏమి లేనట్లుగా ఉంటుంది. \b \q1 \v 12 ఘోషిస్తున్న అనేక దేశాలకు శ్రమ \q2 వారు హోరెత్తిన సముద్రంలా ఘోషిస్తున్నారు! \q1 గర్జిస్తున్న ప్రజలకు శ్రమ \q2 వారు గొప్ప నీటి ప్రవాహాల్లా గర్జిస్తున్నారు! \q1 \v 13 ఉప్పొంగుతున్న నీటిలా ప్రజలు గర్జించినా \q2 ఆయన వారిని బెదిరించగా, వారు దూరంగా పారిపోతారు. \q1 కొండల మీది పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు, \q2 సుడిగాలికి గిరగిరా తిరుగుతూ ఎగిరిపోయే పిచ్చిమొక్కలా తరమబడతారు. \q1 \v 14 సాయంకాలంలో ఆకస్మిక భయం! \q2 ఉదయం కాక ముందే వారు కనుమరుగవుతారు! \q1 మమ్మల్ని దోచుకునేవారి భాగం ఇదే, \q2 మా సొమ్ము దొంగతనం చేసేవారికి దొరికేది ఇదే. \c 18 \s1 కూషుకు వ్యతిరేకంగా ప్రవచనం \q1 \v 1 కూషు\f + \fr 18:1 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం\ft*\f* నదుల అవతల \q2 సందడి చేసే రెక్కల దేశమా\f + \fr 18:1 \fr*\fq రెక్కల దేశమా \fq*\ft లేదా \ft*\fqa మిడతల దేశమా\fqa*\f*, నీకు శ్రమ! \q1 \v 2 అది సముద్ర మార్గంలో నీటి మీద \q2 జమ్ము పడవలలో దూతలను పంపుతుంది. \b \q1 తొందరపడే దూతలారా! \q1 వారు నునుపైన చర్మం గల ఎత్తైన ప్రజల దగ్గరకు, \q2 దూరంలోనున్న భయపెట్టే ప్రజల దగ్గరకు, \q1 నదులు పారుచున్న దేశం కలిగి \q2 దౌర్జన్యం వింత భాష కలిగిన దేశం దగ్గరకు వెళ్లండి. \b \q1 \v 3 సమస్త లోకవాసులారా, \q2 భూలోక నివాసులారా, \q1 పర్వతాలమీద ఒక జెండాను ఎత్తినప్పుడు \q2 మీరు చూస్తారు, \q1 బూర ఊదినప్పుడు \q2 మీరు వింటారు. \q1 \v 4 యెహోవా నాతో చెప్పే మాట ఇది: \q2 “సూర్యకాంతిలోని తీవ్రమైన వేడిలా, \q1 వేసవి కోతకాలంలోని పొగమంచు మేఘంలా, \q2 నేను నిశ్శబ్దంగా నా నివాసస్థలం నుండి చూస్తాను.” \q1 \v 5 కోతకాలం రాకముందే, పువ్వు వాడిపోయినప్పుడు \q2 పువ్వు ద్రాక్షగా మారుతున్నప్పుడు \q1 ఆయన మడ్డికత్తులతో ద్రాక్షతీగెలను కత్తిరించి \q2 విస్తరించే తీగెలను తీసివేస్తారు. \q1 \v 6 అవి పర్వత పక్షులకు, \q2 భూమిమీది మృగాలకు విడిచిపెట్టబడతాయి; \q1 వాటిని వేసవి కాలమంతా పక్షులు, \q2 శీతాకాలమంతా భూమిమీది మృగాలు తింటాయి. \p \v 7 ఆ కాలంలో \q1 ఎత్తైన వారు నునుపైన చర్మం గల ప్రజలు \q2 దూరంలోనున్న భయపెట్టే ప్రజలు \q1 నదులు పారుచున్న దేశం కలిగి \q2 దౌర్జన్యం చేసి వింత భాష కలిగిన దేశం \m సైన్యాల యెహోవాకు కానుకలు తెస్తారు. సైన్యాల యెహోవా నామానికి నివాసస్థలమైన సీయోను పర్వతానికి ఆ కానుకలు తీసుకువస్తారు. \c 19 \s1 ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం: \q1 చూడండి, యెహోవా వేగంగల మేఘం ఎక్కి \q2 ఈజిప్టుకు వస్తున్నారు. \q1 ఈజిప్టు విగ్రహాలు ఆయన ఎదుట వణకుతాయి, \q2 ఈజిప్టు ప్రజల గుండెలు భయంతో కరిగిపోతాయి. \b \q1 \v 2 “నేను ఈజిప్టువారి మీదికి ఈజిప్టువారిని రేపుతాను, \q2 సోదరుని మీదికి సోదరుడు, \q2 పొరుగువారి మీదికి పొరుగువారు, \q2 పట్టణం మీదికి పట్టణం, \q2 రాజ్యం మీదికి రాజ్యం రేపుతాను. \q1 \v 3 ఈజిప్టువారు ఆత్మస్థైర్యం కోల్పోతారు, \q2 వారి ఆలోచనలను నాశనం చేస్తాను; \q1 వారు విగ్రహాలను, మరణించిన వారి ఆత్మలను, \q2 భవిష్యవాణి చెప్పేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదిస్తారు. \q1 \v 4 నేను ఈజిప్టువారిని \q2 క్రూరమైన అధికారి చేతికి అప్పగిస్తాను, \q1 భయంకరమైన రాజు వారిని పాలిస్తాడు” అని \q2 సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 5 సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి, \q2 నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి. \q1 \v 6 కాలువలు కంపుకొడతాయి; \q2 ఈజిప్టు కాలువలు ఇంకి ఎండిపోతాయి. \q1 రెల్లు, గడ్డి వాడిపోతాయి, \q2 \v 7 నైలు నది ప్రాంతంలో \q2 దాని ఒడ్డున ఉన్న మొక్కలు కూడా వాడిపోతాయి, \q1 నైలు తీరం వెంట ఉన్న ప్రతి పొలం \q2 వాడిపోయి దుమ్ములా కొట్టుకు పోయి ఇక కనబడవు. \q1 \v 8 జాలరులు మూల్గుతారు, దుఃఖిస్తారు, \q2 నైలు నదిలో గాలాలు వేసే వారందరు ఏడుస్తారు; \q2 నీటి మీద వలలు వేసేవారు విలపిస్తారు. \q1 \v 9 దువ్వెనతో చిక్కుతీసి జనపనారతో పని చేసేవారు నిరాశపడతారు, \q2 సన్నని నారతో అల్లేవారు నిరీక్షణ కోల్పోతారు. \q1 \v 10 బట్టలు తయారుచేసేవారు నిరుత్సాహపడతారు, \q2 కూలిపని చేసే వారందరు మనోవేదన పొందుతారు. \b \q1 \v 11 సోయను అధిపతులు మూర్ఖులు తప్ప మరేమీ కాదు; \q2 ఫరో సలహాదారులు అర్థంలేని సలహాలు ఇస్తారు. \q1 “నేను జ్ఞానులలో ఒకడిని, \q2 పూర్వపురాజుల శిష్యుడను” \q2 అని ఫరోతో మీరెలా చెప్తారు? \b \q1 \v 12 నీ జ్ఞానులు ఏమయ్యారు? \q2 సైన్యాల యెహోవా \q1 ఈజిప్టు గురించి నిర్ణయించిన దానిని \q2 వారు నీకు చూపించి, తెలియజేయనివ్వు. \q1 \v 13 సోయను అధిపతులు మూర్ఖులయ్యారు, \q2 మెంఫిసు నాయకులు మోసపోయారు. \q1 ఈజిప్టు గోత్రానికి మూలరాళ్లుగా ఉన్నవారు \q2 దానిని దారి తప్పేలా చేశారు. \q1 \v 14 యెహోవా వారి మీద \q2 భ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు; \q1 ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు, \q2 తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు. \q1 \v 15 తల గాని తోక గాని తాటి మట్ట గాని జమ్ము రెల్లు గాని \q2 ఈజిప్టు కోసం ఎవరు ఏమి చేయలేరు. \p \v 16 ఆ రోజున ఈజిప్టువారు స్త్రీలలా బలహీనంగా అవుతారు. సైన్యాల యెహోవా వారిపై తన చేయి ఆడించడం చూసి వారు భయంతో వణికిపోతారు. \v 17 యూదా దేశం ఈజిప్టువారికి భయం కలిగిస్తుంది; తమకు వ్యతిరేకంగా సైన్యాల యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి యూదా గురించి విన్న ప్రతి ఒక్కరు భయపడతారు. \p \v 18 ఆ రోజున ఈజిప్టులో ఉండే అయిదు పట్టణాలు కనాను భాష మాట్లాడి, సైన్యాల యెహోవా వారమని ప్రమాణం చేస్తాయి. వాటిలో ఒకదాని పేరు సూర్యుని పట్టణము.\f + \fr 19:18 \fr*\ft కొ.ప్రా.ప్ర.లలో \ft*\fqa నాశన పట్టణం\fqa*\f* \p \v 19 ఆ రోజున ఈజిప్టు దేశంలో మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠం, దాని సరిహద్దులో యెహోవాకు ఒక స్మారక చిహ్నం ఉంటాయి. \v 20 అది ఈజిప్టు దేశంలో సైన్యాల యెహోవాకు సూచనగా, సాక్ష్యంగా ఉంటుంది. తమను బాధించేవారిని గురించి వారు దేవునికి మొరపెట్టగా, ఆయన వారిని కాపాడడానికి రక్షకుడిని విమోచకుడిని పంపుతారు, అతడు వారిని రక్షిస్తాడు. \v 21 ఈజిప్టువారికి యెహోవా తనను తాను బయలుపరచుకుంటారు; ఆ రోజున వారు యెహోవాను తెలుసుకుంటారు. వారు బలులు, భోజనార్పణలు సమర్పించి ఆయనను ఆరాధిస్తారు. వారు యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లిస్తారు. \v 22 యెహోవా ఈజిప్టును తెగులుతో బాధిస్తారు; వారిని బాధించి వారిని స్వస్థపరుస్తారు. వారు యెహోవా వైపు తిరుగుతారు, ఆయన వారి విన్నపాలు విని వారిని స్వస్థపరుస్తారు. \p \v 23 ఆ రోజున ఈజిప్టు నుండి అష్షూరుకు రహదారి ఉంటుంది. అష్షూరీయులు ఈజిప్టుకు, ఈజిప్టువారు అష్షూరుకు వస్తూ పోతుంటారు. ఈజిప్టువారు అష్షూరీయులు కలిసి ఆరాధిస్తారు. \v 24 ఆ రోజున, ఈజిప్టు అష్షూరుతో పాటు ఇశ్రాయేలు మూడవదిగా ఉండి, భూమిపై ఆశీర్వాదంగా\f + \fr 19:24 \fr*\ft లేదా \ft*\fqa వారి పేర్లు ఆశీర్వదించడానికి వాడబడతాయి\fqa*\f* ఉంటుంది. \v 25 సైన్యాల యెహోవా, “నా ప్రజలైన ఈజిప్టు వారలారా, నా చేతి పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా! మీరు ఆశీర్వదింపబడతారు” అని చెప్పి వారిని ఆశీర్వదిస్తారు. \c 20 \s1 ఈజిప్టుకు కూషుకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 అష్షూరు రాజైన సర్గోను తన సైన్యాధిపతిని పంపిన సంవత్సరంలో అతడు అష్డోదుకు వచ్చి, దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు. \v 2 ఆ సమయంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా మాట్లాడారు. ఆయన, “నీ నడుముకున్న గోనె పట్టాను, నీ పాదాలకున్న చెప్పులు తీసివేయి” అన్నారు. అతడు అలాగే చేసి, బట్టలు తీసివేసి చెప్పులు లేకుండా నడిచాడు. \p \v 3 అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యెషయా ఈజిప్టు గురించి, కూషు\f + \fr 20:3 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం; \+xt 5|link-href="ISA 20:5"\+xt* వచనంలో కూడా\ft*\f* గురించి సూచనగా సంకేతంగా మూడు సంవత్సరాలు బట్టలు, చెప్పులు లేకుండా తిరిగిన విధంగానే \v 4 అష్షూరు రాజు చెరపట్టబడిన ఈజిప్టువారిని, కూషు బందీలను, పిల్లలను పెద్దలను బట్టలు లేకుండా చెప్పులు లేకుండా తీసుకు పోతాడు. ఈజిప్టువారిని అవమానం కలిగేలా వారి పిరుదుల కనిపించేలా వారిని తీసుకెళ్తాడు. \v 5 కూషును నమ్ముకుని ఈజిప్టును బట్టి గర్వపడినవారు దిగులుపడి, సిగ్గుపడతారు. \v 6 ఆ రోజున ఆ తీరప్రాంతంలో నివసించేవారు, ‘అష్షూరు రాజు చేతిలో నుండి విడుదల, సహయం కోసం మనం పారిపోయి ఆశ్రయించిన వారికి ఏమి జరిగిందో చూడండి! ఇప్పుడు మనమెలా తప్పించుకోగలం?’ అని అంటారు.” \c 21 \s1 బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం: \q1 దక్షిణ దిక్కున సుడిగాలి వీచినట్లుగా \q2 ఎడారిలో నుండి \q2 భయంకరమైన దేశం నుండి దోచుకునేవాడు వస్తాడు. \b \q1 \v 2 భయంకరమైన దర్శనం నాకు వచ్చింది: \q2 మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు. \q1 ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు! \q2 దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను. \b \q1 \v 3 కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది, \q2 ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది; \q1 నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను, \q2 నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను. \q1 \v 4 నా గుండె దడదడలాడుతుంది \q2 భయంతో వణుకు పుడుతుంది; \q1 నేను ఇష్టమైన సంధ్యవేళ \q2 నాకు భయం పుట్టించింది. \b \q1 \v 5 వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు, \q2 వారు తివాసీలు పరిచారు, \q2 వారు తిని త్రాగుతారు! \q1 అధిపతులారా! లేవండి \q2 డాళ్లకు నూనె రాయండి. \p \v 6 ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: \q1 “వెళ్లి కాపలా పెట్టండి \q2 అతడు చూసింది తెలియజేయాలి. \q1 \v 7 అతడు రథాలను \q2 గుర్రాల జట్లను \q1 గాడిదల మీద వచ్చేవారిని \q2 ఒంటెల మీద వచ్చేవారిని చూడగానే \q1 అతడు జాగ్రత్తగా \q2 చాలా జాగ్రత్తగా ఉండాలి.” \p \v 8 కావలివాడు సింహంలా కేకలు వేసి \q1 “నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను; \q2 రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను. \q1 \v 9 చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి \q2 రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా \q1 అతడు ఇలా సమాధానం చెప్పాడు: \q2 ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! \q1 దాని దేవతల విగ్రహాలన్నీ \q2 నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ” \b \q1 \v 10 నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా! \q2 సైన్యాల యెహోవా నుండి \q1 ఇశ్రాయేలు దేవుని నుండి \q2 నేను విన్నది నీకు చెప్తాను. \s1 ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 11 దూమాకు\f + \fr 21:11 \fr*\fq దూమా \fq*\ft ఎదోముకు పదప్రయోగం \ft*\ft అంటే, \ft*\fqa నిశబ్దం\fqa*\f* వ్యతిరేకంగా ప్రవచనం: \q1 ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు, \q2 “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది? \q2 కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?” \q1 \v 12 కావలివాడు, “ఉదయం అవుతుంది, \q2 రాత్రి కూడా అవుతుంది. \q1 మీరు అడగాలనుకుంటే అడగండి; \q2 మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు. \s1 అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 13 అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం: \q1 అరేబియా ఎడారిలో బసచేసే \q2 దెదానీయులైన యాత్రికులారా, \q2 \v 14 మీరు దాహంతో ఉన్నవారికి నీళ్లు తీసుకురండి; \q1 తేమా దేశ నివాసులారా, \q2 పారిపోతున్నవారి కోసం ఆహారం తీసుకురండి. \q1 \v 15 ఖడ్గం నుండి, \q2 దూసిన ఖడ్గం నుండి, \q1 ఎక్కుపెట్టిన బాణాల నుండి, \q2 తీవ్రమైన యుద్ధం నుండి వారు పారిపోతారు. \p \v 16 ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “కూలివాని లెక్క ప్రకారం ఒక సంవత్సరంలోనే కేదారు వైభవమంతా ముగిసిపోతుంది. \v 17 కేదారు వీరులైన విలుకాండ్రలో కొంతమందే మిగిలి ఉంటారు.” ఇలా జరుగుతుందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పారు. \c 22 \s1 యెరూషలేము గురించి ప్రవచనం \p \v 1 దర్శనపు లోయకు వ్యతిరేకంగా ప్రవచనం: \q1 ఏ కారణంగా మీరందరు \q2 మేడల మీదికి ఎక్కారు? \q1 \v 2 కల్లోలంతో నిండిన పట్టణమా! \q2 కోలాహలం, ఉల్లాసంతో ఉన్న పట్టణమా! \q1 నీలో చనిపోయినవారు ఖడ్గం వలన చనిపోలేదు. \q2 యుద్ధంలో మరణించలేదు. \q1 \v 3 నీ నాయకులందరు కలిసి పారిపోయారు; \q2 విల్లు వాడకుండానే వారు పట్టుబడ్డారు. \q1 శత్రువు దూరంగా ఉండగానే పారిపోయిన వారందరిని, \q2 మీలో పట్టుబడిన వారందరిని కలిపి బందీలుగా తీసుకెళ్లారు. \q1 \v 4 అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి; \q2 నన్ను గట్టిగా ఏడవనివ్వండి. \q1 నా ప్రజలకు కలిగిన నాశనం గురించి \q2 నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను. \b \q1 \v 5 దర్శనపు లోయలో \q2 సైన్యాల అధిపతియైన యెహోవా \q2 నియమించిన రోజున కల్లోలం, తొక్కిసలాట, గందరగోళం ఉంటాయి, \q1 గోడలు కూలిపోతాయి \q2 పర్వతాల వైపు కేకలతో ఏడ్వడం ఉంటుంది. \q1 \v 6 ఏలాము రథసారధులతో గుర్రాలతో \q2 తన అంబులపొదిని నింపుకుంది. \q2 కీరు మనుష్యులు డాలును బయటకు తీశారు. \q1 \v 7 కాబట్టి మీకు ఇష్టమైన లోయల నిండా రథాలు ఉన్నాయి, \q2 గుర్రపురౌతులు పట్టణపు గుమ్మాల దగ్గర తమ స్థానాల్లో ఉన్నారు. \b \q1 \v 8 ప్రభువు యూదా నుండి రక్షణ కవచాన్ని తీసివేశారు, \q2 ఆ రోజున మీరు అరణ్య రాజభవనంలో ఉన్న \q2 ఆయుధాల వైపు చూశారు. \q1 \v 9 దావీదు పట్టణపు గోడలు \q2 చాలా స్థలాల్లో పాడైనట్లు చూశారు \q1 దిగువన ఉన్న కొలనులో \q2 మీరు నీటిని సమకూర్చారు. \q1 \v 10 మీరు యెరూషలేములోని భవనాలను లెక్కపెట్టి \q2 గోడను పటిష్టం చేయడానికి ఇళ్ళను పడగొట్టారు. \q1 \v 11 పాత కొలనులో నీటి కోసం \q2 మీరు రెండు గోడల మధ్య జలాశయం కట్టారు. \q1 కాని దానిని నిర్మించిన వ్యక్తి వైపు మీరు చూడలేదు. \q2 పూర్వకాలంలో దానిని ఆలోచించిన వ్యక్తిని మీరు లెక్కచేయలేదు. \b \q1 \v 12 ఆ రోజున ఏడ్వడానికి కన్నీరు కార్చడానికి \q2 తలలు గొరిగించుకోడానికి \q1 గోనెపట్ట కట్టుకోడానికి \q2 సైన్యాల అధిపతియైన యెహోవా మిమ్మల్ని పిలుస్తారు. \q1 \v 13 కాని మీరు, “రేపు చనిపోతాం కాబట్టి \q2 మనం తిని త్రాగుదాం” అని చెప్పి, \q2 పశువులను నరుకుతూ గొర్రెలను చంపుతూ, \q1 మాంసం తింటూ, ద్రాక్షరసం త్రాగుతూ, \q2 మీరు సంతోషించి ఉల్లసిస్తారు. \p \v 14 ప్రభువు, సైన్యాల యెహోవా బయలుపరిచింది ఇది: “నీ మరణించే రోజు వరకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” అని సర్వశక్తిమంతుడైన సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు. \b \p \v 15 సైన్యాల అధిపతియైన యెహోవా ఇలా అంటున్నారు: \q1 “నిర్వాహకుడు, అనగా రాజభవన నిర్వాహకుడైన \q2 షెబ్నా దగ్గరకు వెళ్లి అతనితో ఇలా చెప్పు: \q1 \v 16 నీవిక్కడేం చేస్తున్నావు \q2 నీకోసం ఇక్కడ సమాధిని ఎందుకు తొలిపించుకున్నావు? \q1 నీ సమాధిని ఎత్తైన స్థలంలో తొలిపించుకున్నావు? \q2 నీ విశ్రాంతి స్థలాన్ని బండపై ఎందుకు చెక్కించుకున్నావు? \q2 నీకు ఎవరు అనుమతి ఇచ్చారు? \b \q1 \v 17 “ఓ బలవంతుడా, యెహోవా నిన్ను గట్టిగా పట్టుకుని, \q2 వేగంగా విసిరివేస్తారు, జాగ్రత్త! \q1 \v 18 ఆయన నిన్ను ఒక బంతిలా దొర్లించి \q2 విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేస్తారు. \q1 అక్కడ నీవు చనిపోతావు, \q2 నీ గొప్ప రథాలు అక్కడే పడి ఉంటాయి; \q2 నీ యజమాని ఇంటికి అవమానాన్ని తెస్తావు. \q1 \v 19 నీ పని నుండి నేను నిన్ను తొలగిస్తాను, \q2 నీ హోదా నుండి త్రోసివేయబడతావు. \p \v 20 “ఆ రోజున నేను, నా సేవకుడైన హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును పిలిపించి, \v 21 నీ చొక్కా అతనికి తొడిగించి, నీ నడికట్టు అతనికి కట్టి, నీ అధికారాన్ని అతనికి ఇస్తాను. అతడు యెరూషలేములో నివసించేవారికి, యూదా ప్రజలకు తండ్రిగా ఉంటాడు. \v 22 నేను దావీదు ఇంటి తాళపు చెవిని అతని భుజం మీద ఉంచుతాను; అతడు తెరచిన దానిని ఎవరూ మూయలేరు. అతడు మూసివేసిన దానిని ఎవరూ తెరవలేరు. \v 23 బలమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరుస్తాను; అతడు తన తండ్రి ఇంటికి గౌరవాన్ని ఘనతను తెచ్చే సింహాసనంగా ఉంటాడు. \v 24 చిన్న గిన్నెలను పాత్రలను మేకుకు వ్రేలాడదీసినట్టు అతని కుటుంబ ఘనతను అతనిపై వ్రేలాడి ఉంటుంది. \p \v 25 “సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజున బలమైన చోట స్థిరంగా కొట్టబడిన మేకు ఊడిపోయి క్రిందపడిపోతుంది. దానిపై ఉన్న బరువు తెగి క్రిందపడుతుంది.” ఇదే యెహోవా చెప్పిన మాట. \c 23 \s1 తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం: \q1 తర్షీషు ఓడలారా! రోదించండి: \q2 తూరు నాశనమయ్యింది, \q2 అది ఇల్లు గాని ఓడరేవు గాని లేకుండ మిగిలింది. \q1 కుప్ర దేశం నుండి \q2 ఈ విషయం వారికి తెలియజేయబడింది. \b \q1 \v 2 సముద్ర తీర వాసులారా, \q2 సీదోను వ్యాపారులారా, మౌనంగా ఉండండి, \q2 సముద్ర నావికులు మిమ్మల్ని సంపన్నులుగా చేశారు. \q1 \v 3 గొప్ప జలాల మీద \q2 షీహోరు ధాన్యం వచ్చింది; \q1 నైలు ప్రాంతంలో పండిన పంట తూరుకు ఆదాయం ఇచ్చింది, \q2 అది దేశాలకు వాణిజ్య కేంద్రంగా మారింది. \b \q1 \v 4 సీదోనూ, సముద్రపు కోట సిగ్గుపడండి, \q2 సముద్రం ఇలా మాట్లాడింది: \q1 “నేను ప్రసవ వేదన పడలేదు, పిల్లలు కనలేదు, \q2 కుమారులను పోషించలేదు కుమార్తెలను పెంచలేదు.” \q1 \v 5 వార్త ఈజిప్టుకు చేరినప్పుడు \q2 తూరు గురించి వారు వేదన పడతారు. \b \q1 \v 6 తర్షీషుకు వెళ్లండి; \q2 సముద్ర తీర వాసులారా దుఃఖపడండి. \q1 \v 7 మీకు ఉల్లాసం కలిగించిన పట్టణం ఇదేనా? \q2 పాతది, ప్రాచీన పట్టణం, \q1 దూరదేశంలో నివసించడానికి \q2 సుదూర ప్రయాణం చేసింది ఇదేనా? \q1 \v 8 తూరు కిరీటాలు పంచిపెట్టే పట్టణం, \q2 దాని వ్యాపారులు రాకుమారులు, \q1 దాని వర్తకులు భూమి మీద ప్రసిద్ధులు, \q2 అలాంటి తూరుకు వ్యతిరేకంగా ఎవరు ఆలోచన చేశారు? \q1 \v 9 తనకున్న అందాన్ని బట్టి కలిగిన గర్వాన్ని అణచడానికి \q2 భూమి మీద ప్రసిద్ధులందరిని అవమానపరచడానికి \q2 సైన్యాల యెహోవా ఇలా చేశారు. \b \q1 \v 10 తర్షీషు కుమారీ, \q2 నీ దేశానికి ఇక ఓడరేవు లేదు కాబట్టి \q2 నైలు నది దాటునట్లు మీ దేశానికి తిరిగి వెళ్లు. \q1 \v 11 యెహోవా సముద్రం మీద తన చేయి చాపి \q2 దాని రాజ్యాలు వణికేలా చేశారు. \q1 కనాను కోటలను నాశనం చేయడానికి \q2 ఆయన దాని గురించి ఆజ్ఞ ఇచ్చారు. \q1 \v 12 ఆయన ఇలా అన్నారు, “అణచివేతకు గురైన సీదోను కుమార్తె, \q2 ఇకపై నీకు సంతోషం ఉండదు. \b \q1 “నీవు లేచి కుప్రకు వెళ్లు, \q2 అక్కడ కూడా నీకు విశ్రాంతి దొరకదు.” \q1 \v 13 బబులోనీయుల\f + \fr 23:13 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల\fqa*\f* దేశాన్ని చూడు, \q2 వారు తమ గుర్తింపును కోల్పోయారు! \q1 అష్షూరీయులు దానిని \q2 ఎడారి జీవులకు నివాసంగా చేశారు. \q1 వారు దానిలో ముట్టడి గోపురాలు కట్టించి, \q2 దాని కోటలు పడగొట్టి \q2 శిథిలాలుగా మార్చారు. \b \q1 \v 14 తర్షీషు ఓడలారా, రోదించండి; \q2 మీ కోట నాశనమయ్యింది. \p \v 15 ఒక రాజు జీవితకాలంలా డెబ్బై సంవత్సరాలు తూరు గురించి మరచిపోతారు. అయితే డెబ్బై సంవత్సరాలు ముగింపులో వేశ్యల పాటలో ఉన్నట్లుగా తూరుకు జరుగుతుంది: \q1 \v 16 “మరవబడిన వేశ్యా, \q2 సితారా తీసుకుని పట్టణంలో తిరుగు; \q1 నీవు జ్ఞాపకం వచ్చేలా \q2 సితారా మంచిగా వాయిస్తూ చాలా పాటలు పాడు.” \p \v 17 డెబ్బై సంవత్సరాల తర్వాత యెహోవా తూరు మీద దయ చూపిస్తారు. కాని అది తన లాభదాయకమైన వ్యభిచారానికి తిరిగివెళ్లి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలతో వ్యాపారం చేస్తుంది. \v 18 అయినా దాని లాభం, దాని సంపాదన యెహోవాకు చెందుతుంది; వాటిని నిల్వ ఉంచరు, కూడబెట్టరు. దాని లాభాలు యెహోవా సన్నిధిలో నివసించేవారికి సమృద్ధి ఆహారం, విలువైన వస్త్రాలు అందించడానికి ఉపయోగించబడతాయి. \c 24 \s1 యెహోవా భూమిని నాశనం చేయుట \q1 \v 1 చూడండి, యెహోవా భూమిని పాడుచేసి \q2 నాశనం చేయబోతున్నారు; \q1 ఆయన దాని ఉపరితలాన్ని పాడుచేసి \q2 దానిలో నివసించేవారిని చెదరగొడతారు. \q1 \v 2 అందరికి ఒకేలా ఉంటుంది; \q2 ప్రజలకు కలిగినట్లే యాజకునికి, \q2 సేవకునికి కలిగినట్లే యజమానికి, \q2 సేవకురాలికి కలిగినట్లే యజమానురాలికి, \q2 కొనేవారికి కలిగినట్లే అమ్మేవారికి, \q2 అప్పు ఇచ్చేవారికి కలిగినట్లే అప్పు తీసుకునేవారికి, \q2 వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్లే వడ్డీకి తీసుకునేవారికి కలుగుతుంది. \q1 \v 3 భూమి పూర్తిగా పాడుచేయబడి \q2 పూర్తిగా దోచుకోబడుతుంది. \q1 యెహోవా ఈ మాట చెప్పారు. \b \q1 \v 4 భూమి ఎండిపోయి వాడిపోతుంది, \q2 లోకం క్షీణించి వాడిపోతుంది, \q2 ఆకాశాలు భూమితో పాటు క్షీణించిపోతాయి. \q1 \v 5 భూప్రజలును బట్టి భూమి అపవిత్రమైంది; \q2 వారు చట్టాలకు లోబడలేదు, \q1 వారు కట్టడలను ఉల్లంఘించారు \q2 వారు నిత్యనిబంధనను భంగం చేశారు. \q1 \v 6 కాబట్టి ఒక శాపం భూమిని మ్రింగివేస్తుంది; \q2 దాని ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి. \q1 కాబట్టి భూనివాసులు కాలిపోయారు \q2 కేవలం కొద్దిమంది మిగిలారు. \q1 \v 7 క్రొత్త ద్రాక్షరసం ఎండిపోతుంది, ద్రాక్షతీగె వాడిపోతుంది; \q2 సంతోషంగా ఉన్నవారు మూల్గుతారు. \q1 \v 8 ఆనందంతో చేసే తంబురల ధ్వనులు నిలిచిపోయాయి, \q2 కేకలు వేసే వారి ధ్వని ఆగిపోయింది \q2 ఆనందంగా ఉన్న సితార నిశ్శబ్దంగా ఉంది. \q1 \v 9 ఇక వారు పాటలు పాడుతూ ద్రాక్షరసం త్రాగరు; \q2 మద్యం త్రాగే వారికి అది చేదుగా మారింది. \q1 \v 10 శిథిలమైన పట్టణం నిర్జనంగా ఉంది; \q2 ప్రతి ఇంటి గుమ్మం మూయబడింది. \q1 \v 11 ద్రాక్షరసం కోసం వారు వీధుల్లో కేకలు వేస్తున్నారు; \q2 ఆనందమంతా దిగులుగా మారుతుంది, \q2 దేశం ఆనంద ధ్వనులన్నీ నిషేధించబడ్డాయి. \q1 \v 12 పట్టణం శిథిలాల్లో ఉన్నది, \q2 దాని గుమ్మం ముక్కలుగా విరిగిపోయింది. \q1 \v 13 ఒలీవ చెట్టుని దులిపినప్పుడు, \q2 ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా \q1 భూమి మీద \q2 భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది. \b \q1 \v 14 వారు తమ స్వరాలెత్తి ఆనందంతో కేకలు వేస్తారు; \q2 పశ్చిమ నుండి వారు యెహోవా గొప్పతనాన్ని కొనియాడుతారు. \q1 \v 15 కాబట్టి తూర్పున ఉన్నవారలారా, యెహోవాను ఘనపరచండి. \q2 సముద్ర ద్వీపవాసులారా, \q2 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి. \q1 \v 16 భూమి అంచుల నుండి మేము ఇలా పాడడం వింటున్నాము: \q2 “నీతిమంతునికి\f + \fr 24:16 \fr*\ft అంటే, \ft*\fqa దేవునికి\fqa*\f* ఘనత.” \b \q1 అయితే నేను అన్నాను, “నేను చెడిపోయాను, చెడిపోయాను! \q2 నాకు శ్రమ! \q1 మోసగాళ్ళు ద్రోహం చేస్తారు, \q2 మోసగాళ్ళు మోసంతో ద్రోహం చేస్తారు!” \q1 \v 17 భూలోక ప్రజలారా! \q2 మీ కోసం భయం, గుంట, ఉరి వేచి ఉన్నాయి. \q1 \v 18 భయంకరమైన శబ్దం విని ఎవరైతే పారిపోతారో \q2 వారు గుంటలో పడతారు; \q1 ఎవరైతే గుంటలో నుండి పైకి వస్తారో, \q2 వారు ఉరిలో చిక్కుకుంటారు. \b \q1 ఆకాశపు తూములు తెరవబడ్డాయి \q2 భూమి పునాదులు కదిలాయి. \q1 \v 19 భూమి బద్దలై పోయింది, \q2 భూమి ముక్కలుగా చీలిపోయింది, \q2 భూమి భయంకరంగా అదురుతుంది. \q1 \v 20 భూమి త్రాగుబోతులా తూలుతుంది, \q2 గాలికి ఊగే పాకలా ఇటు అటు ఊగుతుంది. \q1 దాని తిరుగుబాటు అపరాధం దానిపై బరువుగా ఉంది \q2 అది ఇక లేవనంతగా పడిపోతుంది. \b \q1 \v 21 ఆ రోజున యెహోవా \q2 పైన ఆకాశాల్లో ఉన్న శక్తులను, \q2 భూమి మీద ఉన్న రాజులను శిక్షిస్తారు. \q1 \v 22 చెరసాలలో బంధించబడిన ఖైదీలవలె \q2 వారు చెరసాలలో వేయబడతారు. \q1 చాలా రోజులు అక్కడ ఉన్న తర్వాత \q2 వారు శిక్షించబడతారు.\f + \fr 24:22 \fr*\ft లేదా \ft*\fqa విడుదల చేయబడతారు\fqa*\f* \q1 \v 23 చంద్రుడు దిగులు చెందుతాడు \q2 సూర్యుడు సిగ్గుపడతాడు; \q1 సైన్యాల యెహోవా \q2 సీయోను కొండమీద యెరూషలేములో, \q2 దాని పెద్దల ఎదుట గొప్ప మహిమతో రాజ్యమేలుతారు. \c 25 \s1 యెహోవాకు స్తుతి \q1 \v 1 యెహోవా, మీరే నా దేవుడు; \q2 నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను, \q1 పరిపూర్ణ నమ్మకత్వంతో \q2 మీరు ఎంతో కాలం క్రితం ఆలోచించిన \q2 అద్భుతాలను మీరు చేశారు. \q1 \v 2 మీరు పట్టణాన్ని శిథిలాల కుప్పగా \q2 కోట ఉన్న పట్టణాన్ని పాడైన దానిగా, \q1 విదేశీయుల దుర్గాన్ని పట్టణంగా ఉండకుండా చేశారు; \q2 అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు. \q1 \v 3 కాబట్టి బలమైన జనాంగాలు మిమ్మల్ని గౌరవిస్తారు; \q2 క్రూరమైన దేశాల పట్టణాలు మీకు భయపడతాయి. \q1 \v 4 మీరు పేదవారికి ఆశ్రయంగా ఉన్నారు, \q2 అవసరతలో ఉన్నవారికి తమ బాధలో మీరు ఆశ్రయంగా ఉన్నారు, \q1 తుఫానులో ఉన్నవారికి ఆశ్రయంగా, \q2 వేడి నుండి తప్పించే నీడగా ఉన్నారు. \q1 ఎందుకంటే, క్రూరుల శ్వాస \q2 గోడకు తాకే తుఫానులా, \q2 \v 5 ఎడారి వేడిలా ఉంటుంది. \q1 మీరు విదేశీయుల ప్రగల్భాలను అణచివేశారు; \q2 మేఘాల నీడ ద్వారా వేడి తగ్గునట్లు \q2 క్రూరుల పాట నిలిపివేయబడుతుంది. \b \q1 \v 6 ఈ పర్వతం మీద సైన్యాల యెహోవా \q2 ప్రజలందరి కోసం క్రొవ్విన వాటిలో విందు సిద్ధం చేస్తారు \q1 ఈ విందులో పాత ద్రాక్షరసం ఉంటుంది \q2 లేత మాంసం, ఎంపిక చేసిన ద్రాక్షరసం ఉంటాయి. \q1 \v 7 ఈ పర్వతంపై ఆయన \q2 ప్రజలందరి ముఖాల మీద ఉన్న ముసుగును \q1 సమస్త దేశాల మీద ఉన్న తెరను తీసివేస్తారు; \q2 \v 8 శాశ్వతంగా ఆయన మరణాన్ని మ్రింగివేస్తారు. \q1 ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది \q2 కన్నీటిని తుడిచివేస్తారు; \q1 సమస్త భూమి మీద నుండి \q2 తన ప్రజల అవమానాన్ని తొలగిస్తారు. \q1 యెహోవా ఇది తెలియజేశారు. \p \v 9 ఆ రోజున వారు ఇలా అంటారు, \q1 “నిజంగా ఈయనే మన దేవుడు \q2 ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. \q1 మనం నమ్మిన యెహోవా ఈయనే; \q2 ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.” \b \q1 \v 10 యెహోవా చేయి ఈ పర్వతంపై నిలిచి ఉంటుంది; \q2 అయితే పెంటకుప్పలో గడ్డిని త్రొక్కినట్లు, \q2 మోయాబీయులు తమ దేశంలోనే త్రొక్కబడతారు. \q1 \v 11 ఈతగాళ్లు ఈదడానికి తమ చేతులు చాపినట్లు \q2 వారు దాని మధ్య తమ చేతులు చాపుతారు. \q1 వారి చేతులు యుక్తితో ఉన్నా \q2 దేవుడు వారి గర్వాన్ని అణచివేస్తారు. \q1 \v 12 మోయాబూ, నీ ఎత్తైన కోటలను \q2 ఆయన పడగొడతారు. \q1 వాటిని నేలకు అణగద్రొక్కి \q2 ధూళిలో పడవేస్తారు. \c 26 \s1 స్తుతి గీతం \p \v 1 ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు: \q1 మనకు ఒక బలమైన పట్టణం ఉంది; \q2 దేవుడు రక్షణను \q2 దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు. \q1 \v 2 నీతిగల దేశం \q2 నమ్మదగిన దేశం ప్రవేశించేలా \q2 గుమ్మాలు తీయండి. \q1 \v 3 మీరు స్థిరమైన మనస్సుగల వారిని \q2 సంపూర్ణ సమాధానంతో కాపాడతారు, \q2 ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు. \q1 \v 4 యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ \q2 కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి. \q1 \v 5 ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు \q2 ఎత్తైన కోటలను పడగొడతారు; \q1 ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి \q2 దానిని ధూళిలో కలుపుతారు. \q1 \v 6 అణచివేయబడినవారి కాళ్లతో \q2 పేదవారి అడుగులతో \q2 అది త్రొక్కబడుతుంది. \b \q1 \v 7 నీతిమంతుల దారి సమంగా ఉంటుంది; \q2 యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు. \q1 \v 8 అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ \q2 మేము మీ కోసం వేచి ఉన్నాము; \q1 మీ నామం మీ కీర్తి \q2 మా హృదయాల కోరిక. \q1 \v 9 రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; \q2 ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. \q1 మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, \q2 ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు. \q1 \v 10 కాని చెడ్డవారికి దయ చూపిస్తే, \q2 వారు నీతిని నేర్చుకోరు. \q1 యథార్థమైన దేశంలో ఉన్నా కూడా వారు చెడు చేస్తూనే ఉంటారు \q2 యెహోవా ఘనతను వారు పట్టించుకోరు. \q1 \v 11 యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది, \q2 కాని వారు దానిని చూడరు. \q1 మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు; \q2 మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి. \b \q1 \v 12 యెహోవా! మీరు మాకు సమాధానాన్ని స్థాపిస్తారు; \q2 మేము సాధించిందంతా మీరు మాకోసం చేసిందే. \q1 \v 13 యెహోవా! మా దేవా! మీరు కాకుండా వేరే ప్రభువులు మమ్మల్ని పాలించారు, \q2 కాని మేము మీ నామాన్ని మాత్రమే ఘనపరుస్తాము. \q1 \v 14 వారు చనిపోయారు, మరల బ్రతకరు; \q2 వారి ఆత్మలు లేవవు. \q1 మీరు వారిని శిక్షించి నాశనం చేశారు; \q2 మీరు వారి జ్ఞాపకాలన్నిటిని తుడిచివేశారు. \q1 \v 15 యెహోవా, మీరు దేశాన్ని వృద్ధిచేశారు; \q2 మీరు దేశాన్ని వృద్ధిచేశారు. \q1 మీరు మీకే మహిమ సంపాదించుకున్నారు; \q2 మీరు దేశపు సరిహద్దులన్నిటిని విస్తరింపజేశారు. \b \q1 \v 16 యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు; \q2 మీరు వారిని శిక్షించినప్పుడు \q2 వారు దీన ప్రార్థనలు చేశారు. \q1 \v 17 గర్భిణి స్త్రీ ప్రసవానికి సిద్ధమైనప్పుడు \q2 ఆ నొప్పికి బాధతో కేకలు వేసినట్లు \q2 యెహోవా మీ సన్నిధిలో మేము ఉన్నాము. \q1 \v 18 మేము గర్భం ధరించి ప్రసవవేదన పడ్డాము. \q2 కాని గాలికి జన్మనిచ్చాము. \q1 మేము భూమికి రక్షణను తీసుకురాలేదు, \q2 ఈ లోక ప్రజలు పుట్టలేదు. \b \q1 \v 19 కాని యెహోవా, చనిపోయిన మీ వారు బ్రతుకుతారు; \q2 వారి శరీరాలు పైకి లేస్తాయి \q1 మట్టిలో నివసిస్తున్నవారు, \q2 మేల్కొని సంతోషించాలి. \q1 మీ మంచు ఉదయపు మంచు వంటిది; \q2 భూమి తన మృతులకు జన్మనిస్తుంది. \b \q1 \v 20 నా ప్రజలారా! మీ గదిలోకి వెళ్లి \q2 మీ వెనక తలుపులు వేసుకోండి; \q1 ఆయన ఉగ్రత పోయే వరకు \q2 కొంతకాలం మీరు దాక్కోండి. \q1 \v 21 ఇదిగో వారి పాపాలను బట్టి భూప్రజలను శిక్షించడానికి \q2 యెహోవా తన నివాసంలో నుండి వస్తున్నారు. \q1 భూమి తనపై చిందిన రక్తాన్ని వెల్లడిస్తుంది; \q2 భూమి చంపబడిన వారిని ఇకపై దాచదు. \c 27 \s1 ఇశ్రాయేలు విడుదల \p \v 1 ఆ రోజున \q1 యెహోవా భయంకరమైన, గొప్పదైన \q2 శక్తిగల తన ఖడ్గంతో \q1 లెవియాథన్ అనే ఎగిరే పాము, \q2 లెవియాథన్ అనే చుట్టుకునే పామును ఆయన శిక్షిస్తారు. \q1 ఆయన సముద్రపు మృగాన్ని చంపుతారు. \p \v 2 ఆ రోజున \q1 “ఫలభరితమైన ద్రాక్షతోట గురించి పాడండి: \q2 \v 3 యెహోవానైన నేను దానిని కాపాడతాను; \q2 నేను దానికి క్రమంగా నీరు పెడతాను. \q1 ఎవరూ దానిని పాడు చేయకుండ \q2 రాత్రి పగలు కాపలా కాస్తాను. \q2 \v 4 నాకు కోపం లేదు. \q1 ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే \q2 యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను \q2 వాటన్నిటిని కాల్చివేస్తాను. \q1 \v 5 ఆశ్రయం కోసం వారు నా దగ్గరకు రానివ్వండి; \q2 వారు నాతో సమాధానపడాలి, \q2 అవును, వారు నాతో సమాధానపడాలి.” \b \q1 \v 6 రాబోయే రోజుల్లో యాకోబు వేరు పారుతుంది, \q2 ఇశ్రాయేలు చిగురించి వికసించి \q2 లోకమంతటిని ఫలంతో నింపుతుంది. \b \q1 \v 7 ఇశ్రాయేలును కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు, \q2 యెహోవా ఇశ్రాయేలును కొట్టారా? \q1 ఇశ్రాయేలును చంపినవారిని ఆయన చంపినట్లు \q2 ఇశ్రాయేలును చంపరా? \q1 \v 8 మీరు యుద్ధంతో వెళ్లగొట్టి దానిని శిక్షించారు \q2 తూర్పు నుండి బలమైన గాలి వీచినట్లు \q2 ఆయన తన బలమైన గాలితో దానిని తరిమికొట్టారు. \q1 \v 9 ఈ విధంగా యాకోబు అపరాధం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, \q2 ఇదంతా అతని పాప పరిహారానికి కలిగే సంపూర్ణ ఫలం ఇదే: \q1 సున్నపురాయిని ముక్కలుగా నలగ్గొట్టినట్లు, \q2 అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని చేసినప్పుడు \q1 అషేరా స్తంభాలు కాని ధూప బలిపీఠాలు కాని \q2 మిగిలి ఉండవు. \q1 \v 10 బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది, \q2 పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది. \q1 అక్కడ దూడలు మేస్తాయి \q2 అక్కడే అవి పడుకుంటాయి; \q2 అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి. \q1 \v 11 దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయి \q2 స్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు. \q1 ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు; \q2 కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు. \q2 వారి సృష్టికర్త వారికి దయ చూపించరు. \p \v 12 ఆ రోజున యెహోవా పారుతున్న యూఫ్రటీసు నది నుండి ఈజిప్టు వాగువరకు నూర్చుతారు. ఓ ఇశ్రాయేలూ! నీవు ఒక్కొక్కరిగా సమకూర్చబడతావు. \v 13 ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు. \c 28 \s1 ఎఫ్రాయిం, యూదా నాయకులకు శ్రమ \q1 \v 1 ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటానికి శ్రమ, \q2 వాడిపోతున్న పువ్వు వంటి అతని మహిమగల సౌందర్యానికి శ్రమ, \q1 ద్రాక్షరసం మత్తులో పడిపోయిన వారి \q2 సంపన్న లోయ తలమీద ఉన్న కిరీటానికి శ్రమ. \q1 \v 2 చూడండి, బలం, పరాక్రమం కలిగిన ఒకడు ప్రభువుకు ఉన్నాడు. \q2 వడగండ్లు, తీవ్రమైన గాలులు \q1 కుండపోత వర్షం, తీవ్రమైన వరద కొట్టివేసినట్లు \q2 ఆయన తన బలంతో దానిని నేలమీద పడవేస్తారు. \q1 \v 3 ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటం \q2 కాళ్లతో త్రొక్కబడుతుంది. \q1 \v 4 ఫలవంతమైన లోయ తలపై ఉన్న \q2 వాడిపోయిన పువ్వు లాంటి అతని వైభవం \q1 కోతకాలం రాకముందే పండిన అంజూర పండులా ఉంటుంది. \q2 ప్రజలు వాటిని చూడగానే తమ చేతిలోనికి తీసుకుని \q2 వెంటనే వాటిని మ్రింగివేస్తారు. \b \q1 \v 5 ఆ రోజున సైన్యాల యెహోవా \q2 మిగిలిన తన ప్రజలకు \q1 తానే మహిమగల కిరీటంగా \q2 సుందరమైన పూల కిరీటంగా ఉంటారు. \q1 \v 6 ఆయన న్యాయస్థానంపై కూర్చునే వారికి \q2 వివేచన ఆత్మగా \q1 గుమ్మం దగ్గరే యుద్ధాన్ని త్రిప్పికొట్టేవారికి \q2 బలానికి మూలంగా ఉంటారు. \b \q1 \v 7 అయితే వీరు కూడ ద్రాక్షరసం త్రాగి తూలుతారు \q2 తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు తడబడతారు \q1 యాజకులు ప్రవక్తలు మద్యం మత్తులో తూలుతారు \q2 ద్రాక్షరసం వలన అయోమయంగా ఉంటారు; \q1 మద్యం మత్తులో తడబడతారు \q2 దర్శనం వచ్చినప్పుడు తూలుతారు \q2 తీర్పు చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు తడబడతారు. \q1 \v 8 వారి బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నాయి \q2 మురికి లేనిచోటు ఉండదు. \b \q1 \v 9 “ఆయన ఎవరికి బోధించే ప్రయత్నం చేస్తున్నారు? \q2 ఆయన తన సందేశాన్ని ఎవరికి వివరిస్తున్నారు? \q1 తల్లి రొమ్ము విడిచిన వారికా, \q2 స్తన్యమును విడిచిన వారికా? \q1 \v 10 ఇది చేయండి, అది చేయండి \q2 దీనికి ఈ నియమం, దానికి ఆ నియమం; \q2 కొంత ఇక్కడ, కొంత అక్కడ” అని వారు అనుకుంటారు. \b \q1 \v 11 అప్పుడు పరదేశీయుల పెదాలతో వింత భాషలో \q2 దేవుడు ఈ ప్రజలతో మాట్లాడతారు. \q1 \v 12 గతంలో ఆయన వారితో, \q2 “ఇది విశ్రాంతి స్థలం, అలసిపోయినవారిని విశ్రాంతి తీసుకోనివ్వండి; \q1 ఇది నెమ్మది దొరికే స్థలం” \q2 అని చెప్పారు కాని వారు వినలేదు. \q1 \v 13 కాబట్టి వారికి యెహోవా వాక్కు ఇలా అవుతుంది: \q2 ఇది చేయాలి, అది చేయాలి \q2 దీనికి ఆజ్ఞ, దానికి ఆజ్ఞ \q2 కొంత ఇక్కడ కొంత అక్కడ \q1 అప్పుడు వారు వెళ్తుండగా వెనుకకు పడతారు; \q2 వారు గాయపరచబడతారు, ఉచ్చులో పడతారు, పట్టబడతారు. \b \q1 \v 14 కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ ప్రజలను పాలిస్తున్న \q2 ఎగతాళి చేసేవారలారా, యెహోవా వాక్కు వినండి. \q1 \v 15 “మేము చావుతో నిబంధన చేసుకున్నాం, \q2 పాతాళంతో ఒప్పందం చేసుకున్నాము. \q1 ప్రమాదం ప్రవాహంలా వేగంగా వచ్చినప్పుడు \q2 అది మమ్మల్ని తాకదు, \q1 ఎందుకంటే అబద్ధాన్ని మాకు అండగా చేసుకున్నాం, \q2 అసత్యాన్ని\f + \fr 28:15 \fr*\ft లేదా \ft*\fqa అబద్ధ దేవుళ్ళు\fqa*\f* మా దాగు స్థలంగా చేసుకున్నాం” \m అని మీరు అతిశయిస్తున్నారు. \p \v 16 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని, \q2 పరీక్షించబడిన రాయిని వేశాను, \q2 అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి; \q1 దానిపై నమ్మకముంచేవారు \q2 ఎప్పుడూ భయాందోళనలకు గురికారు. \q1 \v 17 నేను న్యాయాన్ని కొలమానంగా, \q2 నీతిని మట్టపు గుండుగా చేస్తాను: \q1 వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి. \q2 మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది. \q1 \v 18 చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది; \q2 పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు. \q1 ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు \q2 మీరు దానిచే కొట్టబడతారు. \q1 \v 19 అది వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఈడ్చుకెళ్తుంది; \q2 ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి \q2 అది ఈడ్చుకెళ్తుంది.” \b \q1 ఈ సందేశాన్ని గ్రహించినప్పుడు \q2 చాలా భయం పుడుతుంది. \q1 \v 20 పడుకోడానికి మంచం పొడవు సరిపోదు. \q2 కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు. \q1 \v 21 నిజంగా తన పనిని తన ఆశ్చర్యకరమైన పనిని \q2 అపూర్వమైన తన పని చేయడానికి \q1 ఆయన పెరాజీము అనే కొండమీద లేచినట్లుగా యెహోవా లేస్తారు. \q2 గిబియోను లోయలో ఆయన రెచ్చిపోయినట్లు రెచ్చిపోతారు. \q1 \v 22 ఇప్పుడు మీ ఎగతాళి మానండి \q2 లేదంటే మీ సంకెళ్ళు మరింత భారమవుతాయి; \q1 భూమంతా ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని \q2 సైన్యాల అధిపతియైన యెహోవా నాకు చెప్పారు. \b \q1 \v 23 జాగ్రత్తగా నా మాట వినండి; \q2 నేను చెప్పేది శ్రద్ధగా వినండి. \q1 \v 24 రైతు నాటడానికి ఎప్పుడూ తన పొలాన్ని దున్నుతూనే ఉంటాడా? \q2 అతడు మట్టి పెల్లలు ఎప్పుడూ పగులగొడుతూనే ఉంటాడా? \q1 \v 25 అతడు నేల చదును చేసిన తర్వాత \q2 సోంపు, జీలకర్ర విత్తనాలు చల్లడా? \q1 గోధుమలను వాటి స్థలంలో నాటడా? \q2 యవలను వాటి చోట వేయడా? \q2 పొలం అంచుల్లో ధాన్యం నాటడా? \q1 \v 26 అతని దేవుడు అతనికి నేర్పిస్తారు \q2 సరిగా ఎలా చేయాలో ఆయనే అతనికి బోధిస్తారు. \b \q1 \v 27 సోంపును యంత్రంతో నూర్చరు, \q2 జీలకర్ర మీద బండి చక్రం నడిపించరు; \q1 కర్రతో సోంపును \q2 దుడ్డుకర్రతో జీలకర్రను కొట్టి దులుపుతారు. \q1 \v 28 రొట్టె చేయడానికి ధాన్యాన్ని దంచాలి; \q2 కాబట్టి ఎప్పుడూ దానిని నూర్చుతూనే ఉండరు. \q1 నూర్చే బండి చక్రాలు దానిపై నడిపిస్తారు, \q2 కాని వాటిని పిండి చేయడానికి గుర్రాలను ఉపయోగించరు. \q1 \v 29 ఇదంతా సైన్యాల యెహోవా నుండి నేర్చుకుంటారు, \q2 ఆయన ఆలోచన అద్భుతం, \q2 ఆయన జ్ఞానం గొప్పది. \c 29 \s1 దావీదు పట్టణానికి శ్రమ \q1 \v 1 అరీయేలుకు శ్రమ \q2 దావీదు శిబిరం వేసుకున్న అరీయేలు పట్టణానికి శ్రమ! \q1 సంవత్సరం తర్వాత సంవత్సరం గడవనివ్వండి \q2 పండుగలు క్రమంగా జరుగనివ్వండి. \q1 \v 2 అయినా నేను అరీయేలును ముట్టడిస్తాను; \q2 అది దుఃఖించి రోదిస్తుంది. \q2 అది నాకు అగ్నిగుండంలా అవుతుంది. \q1 \v 3 నీకు వ్యతిరేకంగా అన్నివైపులా నేను శిబిరం ఏర్పాటు చేస్తాను; \q2 గోపురాలతో నిన్ను చుట్టుముట్టి \q2 నీకు వ్యతిరేకంగా ముట్టడి దిబ్బలు ఏర్పాటు చేస్తాను. \q1 \v 4 అప్పుడు నీవు క్రిందపడి నేలపై నుండి మాట్లాడతావు; \q2 నీ మాట ధూళినుండి గొణుగుతున్నట్లు ఉంటుంది. \q1 దయ్యం స్వరంలా నీ స్వరం నేల నుండి వస్తుంది; \q2 ధూళినుండి నీ మాట గుసగుసలాడుతుంది. \b \q1 \v 5 కాని నీ శత్రువులు సన్నటి ధూళిలా మారతారు; \q2 క్రూరుల గుంపు ఎగిరిపోయే పొట్టులా ఉంటుంది. \q1 హఠాత్తుగా ఒక క్షణంలోనే ఇది జరుగుతుంది. \q2 \v 6 ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో \q1 సుడిగాలి తుఫానుతో దహించే అగ్నిజ్వాలలతో \q2 సైన్యాల యెహోవా వస్తారు. \q1 \v 7 అప్పుడు అరీయేలుతో యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులు \q2 దాని మీద దాడి చేసి దాని కోటను ముట్టడించేవారు \q1 ఒక కలలా ఉంటారు \q2 రాత్రివేళలో వచ్చే దర్శనంలా ఉంటారు. \q1 \v 8 ఆకలితో ఉన్నవారు తింటున్నట్లు కల కని \q2 కాని ఇంకా ఆకలితోనే మేల్కొన్నట్లు, \q1 దాహంతో ఉన్నవారు త్రాగినట్లు కల కని \q2 ఇంకా అలసిపోయి దాహంతోనే మేల్కొన్నట్లు ఉంటారు. \q1 సీయోను కొండకు వ్యతిరేకంగా యుద్ధం చేసే \q2 అన్ని దేశాల గుంపులకు ఇలా ఉంటుంది. \b \q1 \v 9 నివ్వెరపోండి, ఆశ్చర్యపడండి. \q2 మిమ్మల్ని మీరు చూపులేని గ్రుడ్డివారిగా చేసుకోండి; \q1 ద్రాక్షరసం త్రాగకుండానే మత్తులో ఉండండి, \q2 మద్యపానం చేయకుండానే తూలుతూ ఉండండి. \q1 \v 10 యెహోవా మీకు గాఢనిద్ర కలిగించారు: \q2 మీకు కళ్లుగా ఉన్న ప్రవక్తలను ఆయన మూసివేశారు; \q2 మీ తలలుగా ఉన్న దీర్ఘదర్శులకు ఆయన ముసుగు వేశారు. \p \v 11 మీకు ఈ దర్శనమంతా ముద్ర వేసిన గ్రంథంలోని మాటల్లా ఉంది. మీరు దానిని చదవగలిగిన వారికి ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నేను చదవలేను; అది ముద్రించబడింది” అని జవాబిస్తారు. \v 12 చదవడం రాని వానికి గ్రంథపుచుట్ట ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నాకు చదవడం రాదు” అని జవాబిస్తారు. \b \p \v 13 ప్రభువు ఇలా అంటున్నారు: \q1 “ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. \q2 పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, \q2 కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి. \q1 వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే \q2 నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.\f + \fr 29:13 \fr*\ft మూ.భా.లో \ft*\fqa వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు మానవ నియమాలు మాత్రమే\fqa*\f* \q1 \v 14 కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను \q2 ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను; \q1 జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది \q2 వివేకుల వివేకం మాయమైపోతుంది.” \q1 \v 15 తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా \q2 దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. \q1 “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, \q2 చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ. \q1 \v 16 మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు \q2 కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! \q1 చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, \q2 “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? \q1 కుండ కుమ్మరితో, \q2 “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా? \b \q1 \v 17 ఇంకా కొంతకాలం తర్వాత లెబానోను సారవంతమైన పొలంగా, \q2 సారవంతమైన పొలం అడవిగా మారదా? \q1 \v 18 ఆ రోజున చెవిటివారు గ్రంథంలోని మాటలు వింటారు, \q2 చీకటిలో చిమ్మ చీకటిలో \q2 గ్రుడ్డివారి కళ్లు చూస్తాయి. \q1 \v 19 మరోసారి దీనులు యెహోవాలో సంతోషిస్తారు; \q2 మనుష్యుల్లో పేదవారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు. \q1 \v 20 దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, \q2 హేళన చేసేవారు మాయమవుతారు \q2 చెడు చేయడానికి ఇష్టపడేవారందరు, \q1 \v 21 ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు, \q2 న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం చేసేవారిని వలలో వేసుకునేవారు \q2 అబద్ధసాక్ష్యంతో అమాయకులకు న్యాయం జరుగకుండా చేసేవారు తొలగించబడతారు. \p \v 22 కాబట్టి అబ్రాహామును విడిపించిన యెహోవా యాకోబు వారసుల గురించి చెప్పే మాట ఇదే: \q1 “ఇకపై యాకోబు సిగ్గుపడడు; \q2 ఇకపై వారి ముఖాలు చిన్నబోవు. \q1 \v 23 వారు వారి పిల్లల మధ్య \q2 నేను చేసే కార్యాలను చూసినప్పుడు, \q1 వారు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు: \q2 యాకోబు పరిశుద్ధ దేవుని ఘనపరుస్తారు, \q2 ఇశ్రాయేలు దేవునికి భయపడతారు. \q1 \v 24 ఆత్మలో దారి తప్పినవారు వివేకులవుతారు; \q2 సణిగేవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు.” \c 30 \s1 మూర్ఖపు పట్టుగల దేశానికి శ్రమ \q1 \v 1 యెహోవా ఇలా అంటున్నారు, \q2 “మూర్ఖులైన పిల్లలకు శ్రమ, \q1 వారు నావి కాని ఆలోచనలు చేస్తారు, \q2 నా ఆత్మ నియమించని పొత్తు చేసుకుంటూ \q2 పాపానికి పాపం జత చేస్తున్నారు; \q1 \v 2 వారు నన్ను సంప్రదించకుండా \q2 ఈజిప్టుకు వెళ్తారు; \q1 వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు, \q2 ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు. \q1 \v 3 కాని ఫరో ఇచ్చే రక్షణ మీకు సిగ్గు కలిగిస్తుంది, \q2 ఈజిప్టు నీడ మీకు అవమానంగా ఉంటుంది. \q1 \v 4 వారి అధిపతులు సోయనులో ఉన్నా, \q2 వారి రాయబారులు హనేసు చేరుకున్నా \q1 \v 5 వారికి సహాయకరంగా ఉపయోగకరంగా \q2 ఉండకుండా అవమానాన్ని సిగ్గును కలిగించే \q1 ప్రజల కారణంగా \q2 వారందరు సిగ్గుపరచబడతారు.” \p \v 6 దక్షిణ దేశంలోని జంతువుల గురించి ప్రవచనం: \q1 సింహాలు ఆడ సింహాలు, \q2 నాగుపాములు ఎగిరే సర్పాలు, \q2 కష్టాలు బాధలున్న దేశం గుండా రాయబారులు, \q1 గాడిదల వీపుల మీద తమ ఆస్తిని \q2 ఒంటెల మూపుల మీద తమ సంపదలను ఎక్కించుకొని \q1 తమకు లాభం కలిగించని ఆ దేశానికి, \q2 \v 7 సహాయం వలన ప్రయోజనం లేని ఆ ఈజిప్టుకు వెళ్తారు. \q1 కాబట్టి నేను దానిని \q2 ఏమి చేయని రాహాబు\f + \fr 30:7 \fr*\ft పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక \ft*\fqa సముద్ర రాక్షసుడి \fqa*\ft పేరు.\ft*\f* అని పిలుస్తాను. \b \q1 \v 8 ఇప్పుడు వెళ్లు, రాబోయే రోజుల్లో శాశ్వతమైన \q2 సాక్షంగా ఉండేలా \q1 వారి కోసం పలక మీద దీనిని వ్రాయి \q2 వీటిని గ్రంథస్తం చేయి. \q1 \v 9 ఎందుకంటే వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, మోసపూరిత పిల్లలు, \q2 యెహోవా హెచ్చరికకు లోబడడానికి ఇష్టపడని పిల్లలు. \q1 \v 10 వారు దీర్ఘదర్శులతో, \q2 “ఇకపై దర్శనాలు చూడవద్దు!” అంటారు. \q1 అలాగే ప్రవక్తలతో, \q2 “సరియైనదాని గురించి ఇకపై దర్శనాలు ఇవ్వవద్దు! అంటారు. \q1 మాకు అనుకూలమైన విషయాలు \q2 భ్రాంతి కలిగించే ప్రవచనాలు తెలియజేయండి. \q1 \v 11 మా దారిని వదలండి, \q2 ఈ మార్గం నుండి తొలగిపోండి. \q1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి చెప్తూ \q2 మమ్మల్ని ఎదుర్కోవడం ఆపండి!” \p \v 12 కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట ఇదే: \q1 “మీరు ఈ వర్తమానాన్ని తిరస్కరించారు, \q2 బాధించడాన్ని నమ్ముకుని, \q2 మోసాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి, \q1 \v 13 ఈ పాపం మీకు బీటలు తీసి \q2 ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది, \q2 అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు. \q1 \v 14 అది మట్టికుండలా పగిలిపోతుంది, \q2 కరుణ లేకుండా పగులగొట్టబడుతుంది, \q1 పొయ్యిలో నుండి నిప్పు తీయడానికి గాని \q2 కుండలో నుండి నీళ్లు తీయడానికి గాని \q2 దానిలో ఒక్క పెంకు కూడా దొరకదు.” \p \v 15 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది, \q2 ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది \q2 కానీ మీకు ఇవేవి లభించవు. \q1 \v 16 మీరు, ‘లేదు, మేము గుర్రాల మీద పారిపోతాం’ అన్నారు. \q2 కాబట్టి మీరు పారిపోతారు! \q1 మీరు, ‘మేము వేగంగా పరుగెత్తే గుర్రాల మీద స్వారీ చేస్తాం’ అన్నారు. \q2 కాబట్టి మిమ్మల్ని వెంటాడేవారు వేగంగా తరమబడతారు! \q1 \v 17 పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా \q2 కొండమీద ఉన్న జెండాలా \q1 మీరు మిగిలేవరకు \q2 ఒకరు గద్దించగా \q1 మీలో వెయ్యిమంది పారిపోతారు; \q2 అయిదుగురు గద్దించగా \q2 మీరందరు పారిపోతారు.” \b \q1 \v 18 అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు; \q2 కాబట్టి మీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. \q1 యెహోవా న్యాయం తీర్చే దేవుడు \q2 ఆయన కోసం ఎదురు చూసే వారందరు ధన్యులు! \p \v 19 యెరూషలేములో నివసించే సీయోను ప్రజలారా! ఇకపై మీరు ఏడవరు. సహాయం కోసం మీరు చేసే మొరను విని ఆయన దయ చూపిస్తారు. ఆయన విన్న వెంటనే మీకు జవాబు ఇస్తారు. \v 20 ప్రభువు మీకు శత్రువులనే రొట్టెను బాధలనే నీటిని ఇచ్చినప్పటికీ, మీ బోధకులు దాగి ఉండరు; మీ సొంత కళ్లతో వారిని చూస్తారు. \v 21 మీరు కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని తిరిగినా, “ఇదే సరియైన దారి; దీనిలో నడవండి” అని మీ చెవుల వెనుక నుండి ఒక శబ్దం వింటారు. \v 22 అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు. \b \p \v 23 మీరు భూమిలో నాటే విత్తనాలకు కావలసిన వాన ఆయన కురిపిస్తారు. ఆ భూమి నుండి వచ్చే ఆహారం గొప్పగా, సమృద్ధిగా ఉంటుంది. ఆ రోజున మీ పశువులు విశాలమైన మైదానాల్లో మేస్తాయి. \v 24 భూమిని దున్నే ఎడ్లు గాడిదలు చేటతో జల్లెడతో చెరిగిన మేత, కుడితి తింటాయి. \v 25 గోపురాలు కూలిపోయే గొప్ప వధ జరిగే రోజున, ఎత్తైన ప్రతి పర్వతం మీద, ఎత్తైన ప్రతి కొండమీద నీటి వాగులు ప్రవహిస్తాయి. \v 26 యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారి దెబ్బలను బాగుచేసిన రోజున, చంద్రుడు సూర్యునిలా ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు ఏడు రెట్లు, అంటే ఏడు రోజుల పూర్తి వెలుగులా ఉంటుంది. \q1 \v 27 చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో \q2 యెహోవా నామం దూరం నుండి వస్తుంది; \q1 ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. \q2 ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది. \q1 \v 28 ఆయన ఊపిరి మెడ లోతు వరకు \q2 ప్రవహించే ధారలా ఉంది. \q1 ఆయన నాశనమనే జల్లెడలో దేశాలను గాలిస్తారు; \q2 దారి తప్పించే కళ్లెమును \q2 ప్రజల దవడలలో ఆయన అమర్చుతారు. \q1 \v 29 రాత్రివేళ పరిశుద్ధ పండుగను జరుపుకుంటున్నట్లుగా \q2 మీరు పాడతారు \q1 ఇశ్రాయేలుకు ఆశ్రయ కోటయైన \q2 యెహోవా పర్వతానికి \q1 పిల్లనగ్రోవి వాయిస్తూ వెళ్లే వారిలా \q2 మీ హృదయాలు సంతోషిస్తాయి. \q1 \v 30 యెహోవా తన ప్రభావం గల స్వరాన్ని ప్రజలకు వినిపిస్తారు, \q2 భయంకరమైన కోపంతో దహించే అగ్నితో \q1 మేఘ విస్పోటంతో, ఉరుముల తుఫానుతో, వడగండ్లతో \q2 తన చేయి క్రిందికి రావడాన్ని ప్రజలు చూసేలా చేస్తారు. \q1 \v 31 యెహోవా స్వరం అష్షూరును పడగొడుతుంది; \q2 తన దండంతో ఆయన వారిని మొత్తుతారు. \q1 \v 32 యెహోవా తన శిక్షించే దండంతో \q2 అష్షూరు మీద వేసే ప్రతి దెబ్బ \q1 తంబుర సితారాల సంగీతంతో కలిసి ఉంటుంది. \q2 ఆయన తన చేయి ఆడించి యుద్ధం చేస్తారు. \q1 \v 33 చాలా కాలం క్రితమే మండుతున్న స్థలం\f + \fr 30:33 \fr*\ft అంటే, \ft*\fqa తోఫెతు\fqa*\f* సిద్ధపరచబడింది; \q2 అది రాజు కోసం సిద్ధపరచబడింది. \q1 విస్తారమైన అగ్ని, చెక్కతో \q2 దాని అగ్ని గుంట లోతుగా విశాలంగా చేయబడింది; \q1 యెహోవా ఊపిరి \q2 మండుతున్న గంధక ప్రవాహంలా \q2 దానిని రగిలిస్తుంది. \c 31 \s1 ఈజిప్టుపై ఆధారపడేవారికి శ్రమ \q1 \v 1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండా \q2 యెహోవా నుండి సహాయం కోసం చూడకుండ \q1 సహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికి \q2 గుర్రాలపై ఆధారపడేవారికి, \q1 తమ రథాల సంఖ్యపై \q2 గుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ. \q1 \v 2 అయినా ఆయన చాలా తెలివైనవారు, వినాశనం తీసుకురాగలరు; \q2 ఆయన తన మాట వెనుకకు తీసుకోరు. \q1 ఆయన దుష్టప్రజల మీద, \q2 కీడు చేసేవారికి సహయపడేవారి మీద లేస్తారు. \q1 \v 3 ఈజిప్టువారు కేవలం మనుష్యులే, దేవుడు కాదు; \q2 వారి గుర్రాలు మాంసమే కాని ఆత్మ కాదు. \q1 యెహోవా తన చేయి చాపగా \q2 సహయం చేసేవారు తడబడతారు, \q2 సహయం పొందేవారు పడతారు; \q2 వారందరు కలిసి నాశనమవుతారు. \p \v 4 యెహోవా నాతో చెప్పే మాట ఇదే: \q1 తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చి \q2 ఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండా \q1 వారి కేకలకు కలవరపడకుండా \q2 సింహం ఒక కొదమసింహం \q1 తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు \q2 సైన్యాల యెహోవా \q1 యుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికి \q2 దాని కొండ మీదికి దిగి వస్తారు. \q1 \v 5 అటూ ఇటూ ఎగిరే పక్షుల్లా \q2 సైన్యాల యెహోవా యెరూషలేమును కాపాడతారు; \q1 ఆయన దానిని కాపాడుతూ విడిపిస్తారు. \q2 దాని మీద దాటి వెళ్తూ దానిని రక్షిస్తారు. \p \v 6 ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిపై తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి. \v 7 మీ పాపిష్ఠి చేతులు తయారుచేసిన వెండి బంగారు విగ్రహాలను ఆ రోజున మీలో ప్రతి ఒక్కరు పారవేస్తారు. \q1 \v 8 “మనుష్యులు చేయని ఖడ్గానికి అష్షూరు పడిపోతుంది. \q2 మానవులు చేయని ఖడ్గం వారిని మ్రింగివేస్తుంది. \q1 వారు ఖడ్గం ఎదుట నుండి పారిపోతారు \q2 వారి యవ్వనస్థులు వెట్టిచాకిరి చేస్తారు. \q1 \v 9 వారి ఆశ్రయ కోట భయంతో పడిపోతుంది; \q2 వారి అధిపతులు యుద్ధ జెండా చూసి భయపడిపోతారు” \q1 అని యెహోవా ప్రకటించారు. \q2 సీయోనులో ఆయన అగ్ని \q2 యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నాయి. \c 32 \s1 నీతి రాజ్యం \q1 \v 1 చూడండి, ఒక రాజు నీతిగా రాజ్యపాలన చేస్తాడు \q2 అధికారులు న్యాయంగా పాలిస్తారు. \q1 \v 2 వారిలో ప్రతి ఒక్కరు గాలి వీచినప్పుడు దాక్కునే స్థలంలా \q2 తుఫానులో ఆశ్రయంగా \q1 ఎడారిలో నీటి ప్రవాహాల్లా \q2 ఎండిన భూమిలో ఒక గొప్ప కొండ నీడలా ఉంటారు. \b \q1 \v 3 అప్పుడు చూసేవారి కళ్లు ఎప్పుడూ మూసుకుపోవు, \q2 వినేవారి చెవులు వింటాయి. \q1 \v 4 భయంతో ఉండే హృదయం తెలుసుకొని, గ్రహిస్తుంది, \q2 నత్తిగల నాలుక చక్కగా, స్పష్టంగా మాట్లాడుతుంది. \q1 \v 5 ఇకపై మూర్ఖులు ఘనులని పిలువబడరు. \q2 దుష్టులు ఉన్నతంగా గౌరవించబడరు. \q1 \v 6 మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారు, \q2 వారి హృదయాలు చెడు ఆలోచిస్తాయి; \q1 వారు భక్తిహీనతను పాటిస్తూ \q2 యెహోవా గురించి తప్పుడు వార్త ప్రకటిస్తారు; \q1 ఆకలితో ఉన్నవారికి ఏమి లేకుండా చేస్తారు \q2 దప్పికతో ఉన్నవారికి నీళ్లు లేకుండా చేస్తారు. \q1 \v 7 దుష్టులు చెడ్డ పద్ధతులను ఉపయోగిస్తారు, \q2 నిరుపేదలు న్యాయమైన అభ్యర్థన చేసినా, \q1 అబద్ధాలతో పేదవారిని నాశనం చేయడానికి \q2 వారు చెడ్డ ఆలోచనలు చేస్తారు. \q1 \v 8 అయితే గొప్పవారు గొప్ప ఆలోచనలు చేస్తారు, \q2 వారు చేసే గొప్ప పనులను బట్టి నిలబడతారు. \s1 యెరూషలేము స్త్రీలు \q1 \v 9 ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా, \q2 లేచి నా మాట వినండి; \q1 భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, \q2 నేను చెప్పే మాట వినండి! \q1 \v 10 ఇక ఒక సంవత్సరంలో, \q2 భద్రంగా ఉన్న మీరు భయంతో వణుకుతారు; \q1 ద్రాక్ష పంట పడిపోతుంది. \q2 పండ్లు పంటకు రావు. \q1 \v 11 ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా వణకండి; \q2 భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, వణకండి \q1 మీ మంచి బట్టలు తీసివేసి \q2 మీ నడుముకు గోనెపట్ట కట్టుకోండి. \q1 \v 12 ఆహ్లాదకరమైన పొలాల గురించి ఫలించే ద్రాక్షతీగెల గురించి \q2 మీ రొమ్ము కొట్టుకోండి. \q1 \v 13 నా ప్రజల భూమిలో \q2 గచ్చపొదలు, ముళ్ళచెట్లు పెరుగుతాయి. \q1 ఆనందోత్సాహాలతో ఉన్న ఇళ్ళన్నిటి కోసం \q2 ఉల్లాసంతో ఉన్న ఈ పట్టణం కోసం దుఃఖించండి. \q1 \v 14 కోట విడిచిపెట్టబడుతుంది \q2 కోలాహలంగా ఉన్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది; \q1 కోట, కావలికోట శాశ్వతంగా బంజరు భూమిలా మారుతాయి, \q2 అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా, \q2 మందలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి, \q1 \v 15 పైనుండి మామీద ఆత్మ కుమ్మరించబడేవరకు ఇలా ఉంటాయి. \q2 తర్వాత అరణ్యం ఫలభరితమైన భూమిలా, \q2 ఫలభరితమైన భూమి అడవిగా మారుతాయి. \q1 \v 16 అప్పుడు యెహోవా న్యాయం అరణ్యంలో నివసిస్తుంది, \q2 ఆయన నీతి ఫలభరితమైన భూమిలో ఉంటుంది. \q1 \v 17 సమాధానం ఆ నీతి యొక్క ఫలంగా ఉంటుంది; \q2 దాని ఫలితంగా నెమ్మది భద్రత నిత్యం కలుగుతాయి. \q1 \v 18 అప్పుడు నా ప్రజలు సమాధానకరమైన నివాసాల్లో \q2 సురక్షితమైన ఇళ్ళలో \q2 ఎలాంటి ఆటంకాలు లేని విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు. \q1 \v 19 వడగండ్లు అడవిని నాశనం చేసినా \q2 పట్టణం పూర్తిగా నేలమట్టమైనా, \q1 \v 20 మీరు ఎంతో ధన్యులై ఉంటారు, \q2 మీరు నీటి ప్రవాహాల ఒడ్డులన్నిటి దగ్గర మీ విత్తనాలు చల్లుతూ, \q2 మీ పశువులను గాడిదలను స్వేచ్ఛగా తిరగనిస్తారు. \c 33 \s1 శ్రమ, సహాయం \q1 \v 1 నాశనం చేసేవాడా, \q2 ఇంకా నాశనం చేయబడని నీకు శ్రమ! \q1 మోసం చేసేవాడా, \q2 ఇంకా మోసం చేయబడని నీకు శ్రమ! \q1 నీవు నాశనం చేయడం ముగించిన తర్వాతే \q2 నీవు నాశనం చేయబడతావు; \q1 నీవు మోసగించడం ముగించిన తర్వాతే \q2 నీవు మోసగించబడతావు. \b \q1 \v 2 యెహోవా! మమ్మల్ని కరుణించండి; \q2 మీ కోసం ఎదురుచూస్తున్నాము. \q1 ప్రతి ఉదయం మాకు బలంగా, \q2 శ్రమకాలంలో మాకు రక్షణగా ఉండండి. \q1 \v 3 మీ సైన్యం యొక్క గొప్ప శబ్దాన్ని విని జనాంగాలు పారిపోతాయి. \q2 మీరు లేచినప్పుడు దేశాలు చెదిరిపోతాయి. \q1 \v 4 దేశాల్లారా, మిడతలు పంటను తిన్నట్లుగా మీ సొమ్ము దోచుకోబడుతుంది; \q2 మిడతల దండులా ప్రజలు దాని మీద పడతారు. \b \q1 \v 5 యెహోవా ఘనత పొందుతారు, ఆయన ఎత్తైన చోట నివసిస్తారు; \q2 ఆయన తన న్యాయంతో, నీతితో సీయోనును నింపుతారు. \q1 \v 6 ఆయన నీ కాలాల్లో స్థిరమైన పునాది, \q2 విస్తారమైన రక్షణ బుద్ధి జ్ఞానాలు ఇస్తారు. \q2 యెహోవా భయం ఈ సంపదకు మూలము. \b \q1 \v 7 చూడండి, వారి యోధులు వీధుల్లో ఘోరంగా ఏడుస్తున్నారు; \q2 సమాధాన రాయబారులు ఎక్కువగా ఏడుస్తున్నారు. \q1 \v 8 రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి \q2 దారుల్లో ప్రయాణికులు లేరు. \q1 ఒప్పందాన్ని మీరారు, \q2 పట్టణాలను అవమానపరిచారు, \q2 ఏ ఒక్కరూ గౌరవించబడరు. \q1 \v 9 దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, \q2 లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; \q1 షారోను ఎడారిలా మారింది \q2 బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి. \b \q1 \v 10 యెహోవా ఇలా అంటున్నారు, “ఇప్పుడు నేను లేస్తాను, \q2 ఇప్పుడు నేను ఘనపరచబడతాను; \q2 ఇప్పుడు నేను హెచ్చింపబడతాను \q1 \v 11 మీరు పొట్టును గర్భం ధరించి \q2 గడ్డికి జన్మనిస్తారు; \q2 మీ ఊపిరి అగ్నిలా మిమ్మల్ని కాల్చివేస్తుంది. \q1 \v 12 ప్రజలు కాలి బూడిద అవుతారు; \q2 వారు నరకబడిన ముళ్ళపొదల్లా కాల్చబడతారు.” \b \q1 \v 13 దూరంగా ఉన్నవారలారా, నేను ఏమి చేశానో వినండి; \q2 దగ్గరగా ఉన్నవారలారా, నా బలాన్ని గుర్తించండి! \q1 \v 14 సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు; \q2 భక్తిహీనులకు వణుకు పుడుతుంది. \q1 “మనలో ఎవరు దహించే అగ్నితో నివసించగలరు? \q2 మనలో ఎవరు నిత్యం మండే అగ్నితో నివసించగలరు?” \q1 \v 15 నీతిగా నడుచుకుంటూ \q2 నిజాయితీగా మాట్లాడేవారు, \q1 అవినీతి వలన వచ్చే లాభాన్ని విడిచిపెట్టి \q2 తమ చేతులతో లంచం తీసుకోకుండ, \q1 హత్య చేయాలనే కుట్రలు వినబడకుండ చెవులు మూసుకుని \q2 చెడుతనం చూడకుండ కళ్లు మూసుకునేవారు, \q1 \v 16 వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, \q2 పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. \q1 వారికి ఆహారం దొరుకుతుంది, \q2 వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి. \b \q1 \v 17 మీ కళ్లు రాజును అతని వైభవంలో చూస్తాయి, \q2 విశాలంగా విస్తరించిన దేశాన్ని చూస్తాయి. \q1 \v 18 మీ తలంపులలో మీ గత భయాన్ని గుర్తుచేసుకుంటారు: \q2 “ఆ ప్రధానాధికారి ఎక్కడ ఉన్నాడు? \q1 ఆదాయాన్ని తీసుకున్నవారు ఎక్కడ? \q2 గోపురాల అధికారి ఎక్కడ?” \q1 \v 19 ఆ గర్వించే ప్రజలను మీరు ఇక చూడరు, \q2 వారు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ప్రజలు, \q2 వారి భాష వింతగా గ్రహించలేనిదిగా ఉంటుంది. \b \q1 \v 20 మనం పండుగలు చేసుకునే సీయోను పట్టణాన్ని చూడండి; \q2 మీ కళ్లు యెరూషలేమును చూస్తాయి, \q2 అది ప్రశాంత నివాసంగా, కదలని గుడారంగా ఉంటుంది; \q1 దాని మేకులు ఎప్పటికీ ఊడదీయబడవు, \q2 దాని త్రాళ్లలో ఏ ఒక్కటి తెగిపోదు. \q1 \v 21 అక్కడ యెహోవా మన బలాఢ్యుడైన రాజుగా ఉంటారు. \q2 అది విశాలమైన నదులు, వాగులు ఉన్న స్థలంగా ఉంటుంది. \q1 వాటిలో తెడ్ల ఓడ నడువదు \q2 వాటిలో ఏ పెద్ద నౌక ప్రయాణించదు. \q1 \v 22 యెహోవా మనకు న్యాయాధిపతి, \q2 యెహోవా మన శాసనకర్త, \q1 యెహోవా మన రాజు; \q2 మనల్ని రక్షించేది ఆయనే. \b \q1 \v 23 నీ ఓడ త్రాళ్లు వదులయ్యాయి: \q2 ఓడ స్తంభం క్షేమంగా లేదు, \q2 తెరచాప విప్పబడలేదు. \q1 అప్పుడు విస్తారమైన దోపుడుసొమ్ము విభజించబడుతుంది, \q2 కుంటివారు కూడా దోపుడుసొమ్మును తీసుకెళ్తారు. \q1 \v 24 సీయోనులో నివసించేవారెవరూ, “నాకు ఆరోగ్యం బాగోలేదు” అని చెప్పరు; \q2 దానిలో నివసించే ప్రజల పాపాలు క్షమించబడతాయి. \c 34 \s1 దేశాలపై తీర్పు \q1 \v 1 దేశాల్లారా, నా దగ్గరకు వచ్చి వినండి; \q2 ప్రజలారా, మీరు శ్రద్ధగా వినండి! \q1 భూమి దానిలోని సమస్తం, \q2 లోకం, దాని నుండి వచ్చేవన్ని వినును గాక. \q1 \v 2 సమస్త దేశాల మీద యెహోవా కోపంగా ఉన్నారు; \q2 వారి సైన్యాలన్నిటి మీద ఆయన ఉగ్రత ఉంది. \q1 ఆయన వారిని\f + \fr 34:2 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు ఇవ్వడాన్ని సూచిస్తుంది; \+xt 5|link-href="ISA 34:5"\+xt* వచనంలో కూడా\ft*\f* పూర్తిగా నాశనం చేస్తారు, \q2 వారిని వధకు అప్పగిస్తారు. \q1 \v 3 వారిలో చంపబడినవారు పూడ్చిపెట్టబడరు, \q2 వారి శవాలు కంపుకొడతాయి. \q2 పర్వతాలు వారి రక్తంతో తడిసిపోతాయి. \q1 \v 4 ఆకాశ నక్షత్రాలన్నీ కరిగిపోతాయి \q2 గ్రంథపుచుట్టలా ఆకాశాలు చుట్టబడతాయి; \q1 ద్రాక్షతీగె నుండి వాడిన ఆకు రాలినట్లుగా \q2 అంజూర చెట్టు నుండి వాడిన కాయ రాలినట్లుగా \q2 నక్షత్ర సైన్యమంతా రాలిపోతుంది. \b \q1 \v 5 ఆకాశంలో నా ఖడ్గం దానికి కావల్సింది త్రాగింది; \q2 చూడండి, ఎదోము మీద తీర్పు తీర్చడానికి, \q2 నేను పూర్తిగా నాశనం చేసిన ప్రజలు మీదికి అది దిగుతుంది. \q1 \v 6 యెహోవా ఖడ్గం రక్తసిక్తం అవుతుంది, \q2 అది క్రొవ్వుతో కప్పబడి ఉంది. \q1 గొర్రెపిల్లల, మేకల రక్తంతో, \q2 పొట్టేళ్ల మూత్రపిండాల మీది క్రొవ్వుతో కప్పబడి ఉంది. \q1 ఎందుకంటే బొస్రాలో యెహోవా బలి జరిగిస్తారు. \q2 ఎదోము దేశంలో ఆయన గొప్ప వధ జరిగిస్తారు. \q1 \v 7 వాటితో పాటు అడవి ఎద్దులు, \q2 కోడెలు, బలమైన ఎద్దులు చస్తాయి. \q1 వారి భూమి రక్తంతో తడుస్తుంది. \q2 వారి మట్టి క్రొవ్వులో నానుతుంది. \b \q1 \v 8 యెహోవా ప్రతీకారం చేయడానికి ఒక రోజును, \q2 సీయోను పక్షంగా ప్రాయశ్చిత్తం చేసే ఒక సంవత్సరాన్ని నియమించారు. \q1 \v 9 ఎదోము నీటిప్రవాహాలు కీలుగా \q2 దాని మట్టి మండుతున్న గంధకంగా మారుతుంది. \q2 దాని భూమి మండుతున్న కీలుగా ఉంటుంది. \q1 \v 10 అది రాత్రింబగళ్ళు ఆరిపోదు; \q2 దాని పొగ నిత్యం లేస్తూనే ఉంటుంది. \q1 అది తరతరాల వరకు నిర్మానుష్యంగానే ఉంటుంది; \q2 దానిగుండా ఎవ్వరూ ఎప్పటికీ ప్రయాణించరు. \q1 \v 11 గూడబాతులు, జీరగపిట్ట దానిని స్వాధీనం చేసుకుంటాయి; \q2 గుడ్లగూబ, కాకి దానిలో నివసిస్తాయి. \q1 దేవుడు తారుమారనే కొలమానాన్ని \q2 శూన్యమనే మట్టపు గుండును \q2 ఏదోముపై చాపుతారు. \q1 \v 12 రాజ్యమని ప్రకటించడానికి వారి ఘనులకు అక్కడ ఏమీ మిగలదు, \q2 వారి అధిపతులందరు మాయమవుతారు. \q1 \v 13 దాని కోటలలో ముళ్ళచెట్లు, \q2 దాని దుర్గాలలో దురదగొండ్లు గచ్చపొదలు పెరుగుతాయి. \q1 అది తోడేళ్లకు నివాసంగా \q2 గుడ్లగూబలకు ఇల్లుగా ఉంటుంది. \q1 \v 14 ఎడారి జీవులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి \q2 అడవి మేకలు ఒకదానిపై ఒకటి విరుచుకుపడతాయి; \q1 అక్కడ రాత్రివేళ తిరిగే ప్రాణులు కూడా పడుకుంటాయి \q2 అక్కడ అవి వాటికి విశ్రాంతి స్థలాలను కనుగొంటారు. \q1 \v 15 అక్కడ గుడ్లగూబ గూడు కట్టి గుడ్లు పెట్టి, \q2 వాటిని పొదిగి, తన రెక్కల నీడలో వాటిని ఉంచి, \q2 దాని పిల్లలను పోషిస్తుంది. \q1 అక్కడ తెల్ల గద్దలు \q2 ప్రతి ఒక్కటి తమ జాతి పక్షులతో జతకడతాయి. \p \v 16 యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి: \q1 వీటిలో ఏవి తప్పిపోవు, \q2 ఏ ఒక్కటి కూడా తన జత లేకుండా ఉండదు. \q1 ఎందుకంటే, ఆయన నోరే ఈ ఆదేశాన్ని ఇచ్చింది, \q2 ఆయన ఆత్మ వాటిని పోగుచేస్తారు. \q1 \v 17 ఆయన వాటికి వాటి భాగాలు కేటాయిస్తారు; \q2 ఆయన చేతి కొలత ప్రకారం వాటికి పంచిపెడుతుంది. \q1 అవి శాశ్వతంగా దానిని స్వాధీనం చేసుకుంటాయి \q2 తరతరాలు అందులో నివసిస్తాయి. \c 35 \s1 విమోచన పొందినవారి ఆనందం \q1 \v 1 ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి; \q2 అరణ్యం సంతోషించి పూస్తుంది. \q1 అది కుంకుమ పువ్వులా, \v 2 ఒక్కసారిగా విచ్చుకుంటుంది; \q2 అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది. \q1 లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది, \q2 కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది; \q1 వారు యెహోవా మహిమను \q2 మన దేవుని వైభవాన్ని చూస్తారు. \b \q1 \v 3 బలహీనమైన చేతులను బలపరచండి, \q2 వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి; \q1 \v 4 భయపడేవారితో ఇలా అనండి: \q2 “ధైర్యంగా ఉండండి, భయపడకండి; \q1 మీ దేవుడు వస్తారు \q2 ఆయన ప్రతీకారంతో వస్తారు. \q1 దైవిక ప్రతీకారంతో \q2 ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.” \b \q1 \v 5 అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి \q2 చెవిటి వారి చెవులు వినబడతాయి. \q1 \v 6 అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు, \q2 మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది. \q1 అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి \q2 ఎడారిలో కాలువలు పారతాయి. \q1 \v 7 మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది \q2 ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి. \q1 ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో \q2 గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి. \b \q1 \v 8 అక్కడ రహదారి ఉంటుంది; \q2 అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది; \q2 అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే. \q1 అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు; \q2 దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు. \q1 \v 9 అక్కడ ఏ సింహం ఉండదు, \q2 ఏ క్రూర జంతువు ఉండదు; \q2 అవి అక్కడ కనబడవు. \q1 విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు. \q2 \v 10 యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. \q1 వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; \q2 నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. \q1 వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. \q2 దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి. \c 36 \s1 సన్హెరీబు యెరూషలేమును భయపెట్టుట \p \v 1 రాజైన హిజ్కియా పాలన పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. \v 2 అప్పుడు అష్షూరు రాజు లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా మీదికి గొప్ప సైన్యంతో తన యుద్ధభూమిలో ఉన్న సైన్యాధిపతిని పంపించాడు. ఆ సైన్యాధిపతి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగినప్పుడు, \v 3 హిల్కీయా కుమారుడు రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు అతని దగ్గరకు వెళ్లారు. \p \v 4 అప్పుడు సైన్యాధిపతి వారితో ఇలా అన్నాడు, “హిజ్కియాకు చెప్పండి: \pm “ ‘మహారాజు, అష్షూరు రాజు చెప్పే మాట ఇది: దేన్ని చూసుకుని నీకు ఈ ధైర్యం? \v 5 యుద్ధం విషయంలో నీకు ఆలోచన, బలం ఉంది అంటావు, కాని నీవు మాట్లాడేవి వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేస్తున్నావు? \v 6 చూడు, నీవు నలిగిన రెల్లులాంటి ఈజిప్టును నమ్ముకుంటున్నావు, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. ఈజిప్టు రాజైన ఫరోను నమ్ముకునే వారందరికి అతడు చేసేది అదే. \v 7 అయితే, “మా దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడుతున్నాం” అని మీరు నాతో అంటే, “ఈ బలిపీఠం దగ్గర మీరు ఆరాధించాలి” అని యూదా వారితో యెరూషలేము వారితో చెప్పిన ఆయన ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టింది? \pm \v 8 “ ‘ఇప్పుడు రండి, నా యజమానియైన అష్షూరు రాజుతో బేరం కుదుర్చుకోండి: మీ దగ్గర రెండువేల గుర్రాలకు సరిపడే రౌతులు ఉంటే, నేను వాటిని మీకు ఇస్తాను! \v 9 రథాలు రౌతుల కోసం ఈజిప్టు రాజును నమ్ముకున్నా, మీరు నా యజమాని అధికారులలో అతి అల్పుడైన ఒక్క అధికారినైనా ఎలా ఎదిరించగలరు? \v 10 యెహోవా నుండి అనుమతి లేకుండానే ఈ స్థలంపై దాడి చేసి నాశనం చేయడానికి వచ్చానా? ఈ దేశంపై దాడి చేసి నాశనం చేయమని స్వయాన యెహోవాయే చెప్పారు.’ ” \p \v 11 అప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు సైన్యాధిపతితో, “నీ దాసులమైన మాకు అరామిక్ భాష అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. గోడ మీద ఉన్న ప్రజలకు వినిపించేలా హెబ్రీ భాషలో మాట్లాడకండి” అన్నారు. \p \v 12 అయితే సైన్యాధిపతి జవాబిస్తూ, “ఈ విషయాలు కేవలం మీకు, మీ యజమానికి మాత్రమే చెప్పటానికి నా యజమాని నన్ను పంపాడని, గోడ మీద కూర్చున్న ప్రజలకు కాదనుకున్నారా? వారు కూడా మీలాగే తమ మలం తింటూ తమ మూత్రం త్రాగాల్సిందే” అని అన్నాడు. \p \v 13 అప్పుడు సైన్యాధిపతి నిలబడి బిగ్గరగా హెబ్రీ భాషలో ఇలా అన్నాడు, “మహారాజైన అష్షూరు రాజు మాటలు వినండి! \v 14 రాజు చెప్పే మాట ఇదే: హిజ్కియా మిమ్మల్ని మోసం చేయకుండ చూసుకోండి. అతడు మిమ్మల్ని విడిపించలేడు. \v 15 హిజ్కియా, ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తారు; ఈ పట్టణం అష్షూరు రాజు చేతికి చిక్కదు’ అని చెప్తూ యెహోవా మీద నమ్మకం ఉంచేలా ప్రేరేపించనివ్వకండి. \p \v 16 “హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు. \v 17 తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం. \p \v 18 “హిజ్కియా, ‘యెహోవా మనల్ని విడిపిస్తారు’ అని చెప్తూ మిమ్మల్ని తప్పుత్రోవ పట్టనివ్వకండి. ఇతర దేశాల దేవుళ్ళు ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించారా? \v 19 హమాతు, అర్పదు దేవుళ్ళు ఎక్కడ? సెఫర్వయీము దేవుళ్ళు ఎక్కడ? వారు నా చేతిలో నుండి సమరయను రక్షించగలిగారా? \v 20 ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తమ దేశాలను నా చేతిలో నుండి రక్షించగలిగారా? అలాగైతే, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును ఎలా విడిపిస్తారు?” \p \v 21 అయితే, “అతనికి జవాబివ్వకండి” అని రాజు వారికి ఆజ్ఞాపించడంతో ప్రజలు ఏమి జవాబివ్వకుండా మౌనంగా ఉన్నారు. \p \v 22 అప్పుడు హిల్కీయా, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు, తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వెళ్లి అష్షూరు సైన్యాధిపతి చెప్పింది అతనికి తెలియజేశారు. \c 37 \s1 యెరూషలేము విడుదల ముందే తెలియజేయుట \p \v 1 ఇది విని రాజైన హిజ్కియా తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరంలోకి వెళ్లాడు. \v 2 అతడు రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీమును, కార్యదర్శియైన షెబ్నాను, యాజకులలో పెద్దవారిని ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా దగ్గరకు పంపాడు, వారంత గోనెపట్ట కట్టుకున్నారు. \v 3 వారు అతనితో ఇలా అన్నారు, “హిజ్కియా చెప్పిన మాట ఇదే: ఈ రోజు బాధ, చీవాట్లు, అవమానం ఉన్న రోజు, బిడ్డ పుట్టడానికి సమయం దగ్గరకు వచ్చినా కనే శక్తిలేని స్త్రీలా ఉంది. \v 4 జీవంగల దేవున్ని దూషించడానికి అష్షూరు రాజు తన సేవకుడైన సైన్యాధిపతి పంపించాడు. అతడు పలికిన మాటలన్నీ మీ దేవుడైన యెహోవా విని అతని మాటలనుబట్టి మీ దేవుడైన యెహోవా అష్షూరు రాజును గద్దిస్తారేమో, కాబట్టి ఇక్కడ మిగిలే వారి కోసం ప్రార్థించండి.” \p \v 5 రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వచ్చినప్పుడు, \v 6 యెషయా వారితో ఇలా అన్నాడు, “మీ యజమానికి చెప్పండి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు విన్న వాటికి అనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ మాట్లాడిన మాటలకు భయపడకండి. \v 7 వినండి! అతడు ఒక వదంతి విని తన దేశానికి వెళ్ళిపోయేలా నేను చేస్తాను, అక్కడ అతడు ఖడ్గం చేత చనిపోయేలా చేస్తాను.’ ” \p \v 8 అంతలో అష్షూరు రాజు లాకీషును విడిచి వెళ్లాడని అతని సైన్యాధిపతి విని, అతడు తిరిగివెళ్లి రాజు లిబ్నాతో పోరాడుతున్నాడని తెలుసుకున్నాడు. \p \v 9 అప్పుడు, కూషు\f + \fr 37:9 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం\ft*\f* రాజైన తిర్హాకా తన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడనే వార్త సన్హెరీబు విన్నప్పుడు, అతడు దూతలతో హిజ్కియా దగ్గరకు ఇలా సందేశం పంపాడు: \v 10 “యూదా రాజైన హిజ్కియాకు ఇలా చెప్పండి: నీవు నమ్ముకున్న నీ దేవుడు నీతో, ‘యెరూషలేము అష్షూరు రాజు చేతికి ఇవ్వబడదు’ అని చెప్పే మోసపు మాటలకు మోసపోవద్దు. \v 11 అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీవు ఖచ్చితంగా వినే ఉంటావు. మీరు మాత్రం తప్పించుకోగలరా? \v 12 గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారు పట్టణంలో ఉండే ఏదెను ప్రజలను నా పూర్వికులు నాశనం చేసినప్పుడు, ఆ జనాల దేవుళ్ళు వారిని విడిపించారా? \v 13 హమాతు రాజు, అర్పదు రాజు ఎక్కడ? లాయిరు, సెఫర్వయీము, హేన, ఇవ్వా పట్టణాల రాజులు ఏమయ్యారు?” \s1 హిజ్కియా ప్రార్థన \p \v 14 హిజ్కియా దూతల నుండి లేఖ తీసుకుని దానిని చదివాడు. తర్వాత యెహోవా ఆలయానికి వెళ్లి, యెహోవా సముఖంలో ఆ ఉత్తరాన్ని తెరిచాడు. \v 15 హిజ్కియా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: \v 16 “సైన్యాల యెహోవా! ఇశ్రాయేలు దేవా! కెరూబుల మధ్యలో సింహాసనాసీనుడా! ఈ లోక రాజ్యాలకు మీరు మాత్రమే దేవుడు. మీరు భూమ్యాకాశాలను సృష్టించారు. \v 17 యెహోవా, శ్రద్ధగా వినండి; యెహోవా, కళ్లు తెరచి చూడండి. జీవంగల దేవున్ని దూషించడానికి సన్హెరీబు చెప్పి పంపిన మాటలన్నిటిని వినండి. \p \v 18 “యెహోవా! అష్షూరు రాజులు ఈ ప్రజలందరినీ, వారి దేశాలను నాశనం చేశారన్నది వాస్తవం. \v 19 వారు వారి దేవుళ్ళను అగ్నిలో వేసి నాశనం చేశారు, ఎందుకంటే అవి దేవుళ్ళు కాదు, కేవలం మనుషుల చేతులతో చేసిన కర్ర, రాళ్లు మాత్రమే. \v 20 ఇప్పుడు యెహోవా, మా దేవా, మమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించండి, అప్పుడు ఈ లోక రాజ్యాలన్ని యెహోవాయైన మీరే దేవుడని తెలుసుకుంటారు.” \s1 సన్హెరీబు పతనం \p \v 21 అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఇలా సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: అష్షూరు రాజైన సన్హెరీబు గురించి నీవు నాకు ప్రార్థన చేసినందుకు, \v 22 అతని గురించి యెహోవా చెప్పిన మాట ఇదే: \q1 “కన్యయైన సీయోను కుమార్తె \q2 నిన్ను తృణీకరించి ఎగతాళి చేస్తుంది. \q1 యెరూషలేము కుమార్తె \q2 నీవు పారిపోతుంటే తల ఊపుతుంది. \q1 \v 23 నీవు ఎవరిని నిందించి దూషించావు? \q2 ఎవరి మీద నీవు అరిచి \q1 గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? \q2 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా! \q1 \v 24 నీవు పంపిన దూతల ద్వారా \q2 ప్రభువును దూషించావు. \q1 నీవు అన్నావు, \q2 ‘నాకున్న అనేక రథాల చేత, \q1 పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, \q2 లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. \q1 దాని పొడువైన దేవదారులను నరికివేశాను, \q2 శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. \q1 దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, \q2 దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను. \q1 \v 25 నేను పరదేశి నేలలో బావులు త్రవ్వి \q2 అక్కడి నీళ్లు త్రాగాను. \q1 నా అరికాలితో \q2 ఈజిప్టు నది ప్రవాహాలన్నీ ఎండిపోయేలా చేశాను.’ \b \q1 \v 26 “చాలా కాలం క్రితం నేనే నిర్ణయించానని, \q2 నీవు వినలేదా? \q1 పూర్వకాలంలో నేను సంకల్పించాను. \q2 ఇప్పుడు నేను అలా జరిగేలా చేశాను, \q1 నీవు కోటగోడలు గల పట్టణాలను \q2 రాళ్ల కుప్పలుగా చేసేలా చేశాను. \q1 \v 27 వారి ప్రజలు బలహీనులై, \q2 భయాక్రాంతులై అవమానం పాలయ్యారు. \q1 వారు పొలంలో మొక్కల్లా, \q2 పచ్చని మొక్కల్లా, \q1 ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా \q2 పెరగక ముందే వాడిపోయినట్టు ఉన్నారు. \b \q1 \v 28 “అయితే నీవు ఎక్కడ ఉన్నావో \q2 ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో \q2 నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు. \q1 \v 29 నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, \q2 నీ అహంకారం నా చెవిని చేరినందుకు, \q1 నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, \q2 నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. \q1 నీవు వచ్చిన దారిలోనే \q2 నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను. \p \v 30 “హిజ్కియా, దానికి నీకిదే సూచన: \q1 “ఈ సంవత్సరం దాని అంతట అదే పండే పంటను మీరు తింటారు, \q2 రెండవ ఏట దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు తింటారు. \q1 అయితే మూడవ ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, \q2 ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలు మీరు తింటారు. \q1 \v 31 యూదా రాజ్యంలో శేషం మరోసారి \q2 క్రిందికి వేర్లు తన్ని చిగురించి ఫలిస్తుంది. \q1 \v 32 యెరూషలేము నుండి శేషం వస్తుంది, \q2 సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. \q1 సైన్యాల యెహోవా రోషం \q2 దీన్ని సాధిస్తుంది. \p \v 33 “కాబట్టి, అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు \q2 ఒక్క బాణమైనా వేయడు. \q1 ఒక్క డాలును దానికి చూపించడు \q2 దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు. \q1 \v 34 అతడు వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోతాడు. \q2 అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 35 “నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం \q2 నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను!” \p \v 36 అప్పుడు యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరంలో 1,85,000 మంది సైనికులను హతం చేశాడు. ప్రొద్దున ప్రజలు లేచి చూస్తే వారంతా శవాలుగా పడి ఉన్నారు. \v 37 అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు. \p \v 38 ఒక రోజు, అతడు నిస్రోకు అనే తన దేవుని గుడిలో పూజ చేస్తుండగా అతని కుమారులు ఆద్రమ్మెలెకు, షెరెజరు ఖడ్గంతో అతన్ని చంపి, అరారతు ప్రాంతానికి పారిపోయారు. అతని తర్వాత అతని కుమారుడైన ఏసర్హద్దోను రాజయ్యాడు. \c 38 \s1 హిజ్కియాకు అస్వస్థత \p \v 1 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు. \p \v 2 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు, \v 3 “యెహోవా, నేను నమ్మకంగా యథార్థ హృదయంతో, మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు. \p \v 4 అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ఇలా వచ్చింది: \v 5 “నీవు వెళ్లి హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను. నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. \v 6 అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నేను ఈ పట్టణాన్ని కాపాడతాను. \p \v 7 “ ‘యెహోవా తాను చెప్పిన మాట నెరవేరుస్తారని తెలియజేయడానికి యెహోవా నీకు ఇచ్చే సూచన ఇదే: \v 8 ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి వలన ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు వెనుకకు వెళ్లేలా నేను చేస్తాను.’ ” కాబట్టి సూర్యకాంతి ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మరలా వెనుకకు జరిగింది. \b \p \v 9 యూదా రాజైన హిజ్కియా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత అతని రచన: \q1 \v 10 నేను, “నా జీవిత సగభాగంలో \q2 నేను మరణ ద్వారం గుండా వెళ్లాలా, \q2 నా మిగిలిన జీవితకాలమంతా పొగొట్టుకున్నానా?” \q1 \v 11 నేను, “సజీవుల దేశంలో \q2 నేనిక యెహోవాను చూడలేను; \q1 నా తోటి మనుష్యులను చూడలేను \q2 ఈ లోకంలో ఇప్పుడు నివసించే వారితో ఉండలేను. \q1 \v 12 గొర్రెల కాపరి గుడారంలా నా ఇల్లు \q2 పడవేయబడి నా నుండి తీసివేయబడింది. \q1 నేతపనివాడు వస్త్రం చుట్టినట్లు నా జీవితాన్ని ముగిస్తున్నాను, \q2 ఆయన నన్ను మగ్గం నుండి వేరుచేశారు. \q2 ఒక్క రోజులోనే మీరు నాకు ముగింపు తెచ్చారు. \q1 \v 13 ఉదయం వరకు ఓపికగా ఉన్నాను, \q2 కాని సింహం విరిచినట్లు ఆయన నా ఎముకలన్నీ విరిచారు; \q2 పగలు రాత్రి మీరు నా ముగింపు తెచ్చారు. \q1 \v 14 కొంగలా చిన్న పిట్టలా నేను కిచకిచ అరిచాను, \q2 దుఃఖపడే పావురంలా మూలిగాను \q1 ఆకాశాల వైపు చూసి నా కళ్లు అలసిపోయాయి. \q2 నేను బెదిరిపోయాను; ప్రభువా, నాకు సహాయం చేయండి.” \b \q1 \v 15 కాని నేనేమి అనగలను? \q2 ఆయనే నాకు మాట ఇచ్చారు, ఆయనే ఇది నెరవేర్చారు. \q1 నాకు కలిగిన వేదన బట్టి \q2 నా సంవత్సరాలన్నీ దీనుడిగా జీవిస్తాను. \q1 \v 16 ప్రభువా! వీటి వలన మనుష్యులు జీవిస్తారు. \q2 వాటిలో కూడా నా ఆత్మకు జీవం దొరుకుతుంది. \q1 మీరు నాకు ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చారు \q2 నన్ను జీవింపచేశారు. \q1 \v 17 నేను అనుభవించిన ఈ వేదన \q2 ఖచ్చితంగా నాకు నెమ్మది కలగడానికే. \q1 మీ ప్రేమతో నా ప్రాణాన్ని \q2 నాశనం అనే గోతినుండి విడిపించారు; \q1 నా పాపాలన్నిటిని \q2 మీ వెనుక పారవేశారు. \q1 \v 18 ఎందుకంటే, సమాధి మిమ్మల్ని స్తుతించలేదు, \q2 మరణం మీకు స్తుతులు పాడలేదు. \q1 సమాధిలోనికి వెళ్లేవారు \q2 మీ నమ్మకత్వం కోసం నిరీక్షించలేరు. \q1 \v 19 నేను ఈ రోజు స్తుతిస్తున్నట్లు, \q2 సజీవులు, సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు; \q1 తల్లిదండ్రులు తమ పిల్లలకు \q2 మీ నమ్మకత్వాన్ని తెలియజేస్తారు. \b \q1 \v 20 యెహోవా నన్ను రక్షిస్తారు. \q2 మనం బ్రతికినన్ని రోజులు \q1 యెహోవా మందిరంలో \q2 తంతి వాద్యాలు వాయిస్తూ పాడదాము. \p \v 21 యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేసి ఆ పుండుకు రాస్తే అతడు బాగుపడతాడు” అన్నాడు. \p \v 22 హిజ్కియా, “నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు. \c 39 \s1 బబులోను నుండి రాయబారులు \p \v 1 ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోను రాజైన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసి, తిరిగి కోలుకున్నాడని విని అతనికి ఉత్తరాలు, కానుక పంపాడు. \v 2 హిజ్కియా సంతోషంగా ఆ రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు. \p \v 3 తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు. \p అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు. \p \v 4 “నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. \p హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ దాచకుండా అన్నీ వారికి చూపించాను” అన్నాడు. \p \v 5 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు, “సైన్యాల యెహోవా వాక్కు విను: \v 6 ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ, ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు. \v 7 నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.” \p \v 8 హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే. నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి” అని అన్నాడు. \c 40 \s1 దేవుని ప్రజలకు ఆదరణ \q1 \v 1 నా ప్రజలను ఓదార్చండి, ఓదార్చండి, \q2 అని మీ దేవుడు చెప్తున్నారు. \q1 \v 2 యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి \q2 ఆమె యుద్ధకాలం ముగిసిందని \q1 ఆమె పాపదోషం తీరిపోయిందని \q2 యెహోవా చేతిలో ఆమె పాపాలన్నిటి కోసం \q1 రెండింతల ఫలం పొందిందని \q2 ఆమెకు తెలియజేయండి. \b \q1 \v 3 బిగ్గరగా కేక వేస్తున్న ఒక స్వరం: \q1 “అరణ్యంలో యెహోవా కోసం \q2 మార్గాన్ని సిద్ధపరచండి\f + \fr 40:3 \fr*\ft లేదా \ft*\fqa అరణ్యంలో కేక వేస్తున్న ఒక స్వరం: “యెహోవా మార్గం సిద్ధపరచండి”\fqa*\f* \q1 ఎడారిలో మన దేవునికి \q2 రహదారిని సరాళం చేయండి. \q1 \v 4 ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది, \q2 ప్రతి పర్వతం ప్రతి కొండ సమం చేయబడుతుంది; \q1 వంకర త్రోవ తిన్నగా, \q2 గరుకు మార్గాలు నున్నగా చేయబడతాయి. \q1 \v 5 యెహోవా మహిమ వెల్లడవుతుంది. \q2 దాన్ని ప్రజలందరు చూస్తారు. \q1 యెహోవాయే ఇది తెలియజేశారు.” \b \q1 \v 6 “మొరపెట్టు” అని ఒక స్వరం అంటుంది, \q2 నేను, “నేనేమని మొరపెట్టాలి?” అన్నాను. \b \q1 “ప్రజలందరు గడ్డి వంటివారు, \q2 వారి నమ్మకత్వమంతా పొలంలోని పువ్వు వంటిది. \q1 \v 7 గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి \q2 ఎందుకంటే యెహోవా తన ఊపిరి వాటి మీద ఊదుతారు. \q2 నిజంగా ప్రజలు గడ్డిలా ఉన్నారు. \q1 \v 8 గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి, \q2 కాని మన దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.” \b \q1 \v 9 సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, \q2 ఎత్తైన పర్వతం ఎక్కు. \q1 సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా, \q2 నీ గొంత్తెత్తి బలంగా \q1 భయపడకుండా ప్రకటించు; \q2 యూదా పట్టణాలకు, \q2 “ఇదిగో మీ దేవుడు” అని చెప్పు. \q1 \v 10 చూడండి, ప్రభువైన యెహోవా శక్తితో వస్తున్నారు, \q2 తన బలమైన చేతితో పరిపాలిస్తారు. \q1 చూడండి, ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది, \q2 ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనను అనుసరిస్తుంది. \q1 \v 11 గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు; \q2 తన చేతితో గొర్రెపిల్లలను చేర్చుకుని \q1 తన హృదయానికి ఆనించి వాటిని మోస్తారు; \q2 పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తారు. \b \q1 \v 12 తన చేతితో నీటిని కొలిచిన వారెవరు? \q2 జేనతో ఆకాశాన్ని కొలిచిన వారెవరు? \q1 భూమిలోని మట్టి అంతటిని బుట్టలో ఉంచిన వాడెవడు? \q2 త్రాసుతో పర్వతాలను తూచిన వాడెవడు? \q2 తూనికతో కొండలను తూచిన వాడెవడు? \q1 \v 13 యెహోవా ఆత్మను తెలుసుకున్న వారెవరు? \q2 యెహోవాకు సలహాదారునిగా ఆలోచన చెప్పగలవారెవరు? \q1 \v 14 ఎవరి దగ్గర యెహోవా ఆలోచన అడిగారు? \q2 న్యాయ మార్గాన్ని ఆయనకు నేర్పిన వారెవరు? \q1 ఆయనకు తెలివిని నేర్పించిన వారెవరు? \q2 ఆయనకు బుద్ధి మార్గాన్ని చూపించిన వారెవరు? \b \q1 \v 15 నిజంగా దేశాలు చేద నుండి జారే నీటి బిందువుల వంటివి. \q2 వారు కొలబద్దల మీది ధూళివంటి వారు; \q2 ఆయన ద్వీపాలను సన్నటి ధూళిలా కొలుస్తారు. \q1 \v 16 బలిపీఠపు అగ్నికి లెబానోను చెట్లు సరిపోవు, \q2 దహనబలికి దాని జంతువులు చాలవు. \q1 \v 17 అన్ని దేశాలు ఆయన ముందు వట్టివే; \q2 ఆయన దృష్టికి అవి విలువలేనివిగా \q2 శూన్యం కంటే తక్కువగా ఉంటాయి. \b \q1 \v 18 కాబట్టి మీరు ఎవరితో దేవుని పోలుస్తారు? \q2 ఏ రూపంతో ఆయనను పోలుస్తారు? \q1 \v 19 విగ్రహాన్ని ఒక శిల్పి పోతపోస్తాడు, \q2 కంసాలి దానికి బంగారు రేకులు పొదిగి \q2 దానికి వెండి గొలుసులు చేస్తాడు. \q1 \v 20 అలాంటి విలువైన దానిని అర్పణగా ఇవ్వలేని పేదవారు \q2 పుచ్చిపోని చెక్కను ఎంచుకుంటారు; \q1 విగ్రహం కదలకుండా నిలబెట్టడానికి \q2 వారు నిపుణుడైన పనివానిని వెదుకుతారు. \b \q1 \v 21 మీకు తెలియదా? \q2 మీరు వినలేదా? \q1 మొదటి నుండి ఎవరు మీకు చెప్పలేదా? \q2 భూమి స్థాపించబడడాన్ని బట్టి మీరు గ్రహించలేదా? \q1 \v 22 ఆయన భూమండలంపై ఆసీనుడై కూర్చున్నారు. \q2 ఆయన ముందు ప్రజలు మిడతల్లా ఉన్నారు. \q1 తెరను విప్పినట్లు ఆయన ఆకాశాన్ని పరిచి \q2 గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలంగా ఏర్పరిచారు. \q1 \v 23 ఆయన రాజులను నిష్ఫలం చేస్తారు \q2 ఈ లోక పాలకులను ఏమీ లేకుండా చేస్తారు. \q1 \v 24 వారు నాటబడిన వెంటనే, \q2 వారు విత్తబడిన వెంటనే, \q2 వారి భూమిలో వేరు పారకముందే \q1 ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోతారు. \q2 సుడిగాలికి పొట్టు ఎగురునట్లు ఆయన వారిని ఎగరగొడతారు. \b \q1 \v 25 “నన్ను ఎవరితో పోలుస్తారు? \q2 నాకు సమానులెవరు?” అని పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నారు. \q1 \v 26 మీ కళ్లు ఎత్తి ఆకాశం వైపు చూడండి: \q2 వీటన్నటిని సృజించింది ఎవరు? \q1 నక్షత్ర సమూహాన్ని ఒక్కొక్క దానిని తీసుకువస్తూ, \q2 వాటి వాటి పేర్ల ప్రకారం పిలిచేవాడే గదా. \q1 తన గొప్ప శక్తినిబట్టి, తనకున్న శక్తివంతమైన బలాన్నిబట్టి \q2 వాటిలో ఏ ఒక్క దానిని విడిచిపెట్టలేదు. \b \q1 \v 27 యాకోబూ, “నా త్రోవ యెహోవాకు మరుగై ఉంది; \q2 నా న్యాయాన్ని నా దేవుడు పట్టించుకోలేదు” అని \q1 నీవెందుకు అంటున్నావు? \q2 ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెప్తున్నావు? \q1 \v 28 నీకు తెలియదా? \q2 నీవు వినలేదా? \q1 భూమి అంచులను సృష్టించిన \q2 యెహోవా నిత్యుడైన దేవుడు. \q1 ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు, \q2 ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు. \q1 \v 29 ఆయన అలిసిపోయిన వారికి బలమిస్తారు \q2 శక్తిలేనివారికి శక్తిని ఇస్తారు. \q1 \v 30 యువత సొమ్మసిల్లి అలసిపోతారు, \q2 యువకులు తడబడి పడిపోతారు. \q1 \v 31 కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు, \q2 నూతన బలాన్ని పొందుతారు. \q1 వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు; \q2 అలసిపోకుండా పరుగెత్తుతారు. \q2 సొమ్మసిల్లకుండా నడుస్తారు. \c 41 \s1 ఇశ్రాయేలు సహాయకుడు \q1 \v 1 ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండండి! \q2 దేశాలు తమ బలాన్ని నూతన పరచుకోవాలి! \q1 వారు ముందుకు వచ్చి మాట్లాడాలి; \q2 తీర్పు తీర్చే స్థలం దగ్గర మనం కలుసుకుందాము. \b \q1 \v 2 “తన సేవ కోసం తూర్పు నుండి ఒకరిని పురికొల్పి \q2 నీతిలో పిలిచింది ఎవరు? \q1 ఆయన అతనికి దేశాలు అప్పగిస్తారు \q2 రాజులను అతని ఎదుట అణచివేస్తారు. \q1 అతడు తన ఖడ్గంతో వాటిని ధూళిగా చేస్తాడు, \q2 తన విల్లుతో గాలికి ఎగిరే పొట్టులా మారుస్తాడు. \q1 \v 3 అతడు వారిని వెంటాడుతాడు, \q2 ఇంతకుముందు తాను వెళ్లని దారైనా క్షేమంగా వెళ్తాడు. \q1 \v 4 ఎవరు దీనిని ఆలోచించి జరిగించారు? \q2 మొదటి నుండి తరాలను పిలిచింది ఎవరు? \q1 యెహోవానైన నేనే; వారిలో మొదటి వారితో ఉంది నేనే, \q2 చివరి వరకు వారితో ఉండేది నేనే.” \b \q1 \v 5 ద్వీపాలు దానిని చూసి భయపడుతున్నాయి; \q2 భూమి అంచులు వణుకుతున్నాయి. \q1 వారు వచ్చి చేరుతున్నారు; \q2 \v 6 వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, \q2 “ధైర్యంగా ఉండండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. \q1 \v 7 శిల్పి కంసాలివాన్ని ప్రోత్సహిస్తాడు, \q2 సుత్తితో నునుపు చేసేవాడు, \q2 “అది బాగుంది” అని అతుకు గురించి చెప్తూ \q1 దాగిలి మీద కొట్టే వానిని ప్రోత్సహిస్తాడు. \q2 ఇంకొకడు విగ్రహం కదలకుండా మేకులతో దానిని బిగిస్తాడు. \b \q1 \v 8 “అయితే, నా సేవకుడవైన ఇశ్రాయేలూ, \q2 నేను ఏర్పరచుకున్న యాకోబూ, \q2 నా స్నేహితుడైన అబ్రాహాము వారసులారా, \q1 \v 9 భూమి అంచుల నుండి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను, \q2 మారుమూల ప్రాంతాల నుండి పిలుచుకున్నాను. \q1 నేను అన్నాను, ‘నీవు నా సేవకుడవు’; \q2 నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను త్రోసివేయలేదు. \q1 \v 10 కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను; \q2 దిగులుపడకు, నేను నీ దేవుడను. \q1 నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను; \q2 నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను. \b \q1 \v 11 “నీ మీద కోప్పడిన వారందరు \q2 ఖచ్చితంగా సిగ్గుపడి అవమానం పొందుతారు; \q1 నిన్ను వ్యతిరేకించేవారు \q2 కనబడకుండా నశించిపోతారు. \q1 \v 12 నీ శత్రువుల కోసం నీవు వెదకినా, \q2 వారు నీకు కనపడరు. \q1 నీతో యుద్ధం చేసేవారు \q2 ఏమి లేనివారిగా అవుతారు. \q1 \v 13 నీ దేవుడనైన యెహోవాను, \q2 నేను నీ కుడిచేతిని పట్టుకుని, \q1 భయపడకు అని \q2 నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను. \q1 \v 14 భయపడకు, పురుగులాంటి యాకోబూ! \q2 కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు. \q1 నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడు \q2 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు. \q1 \v 15 “చూడు, నేను నిన్ను పదునుగా ఉండి, అనేకమైన పళ్ళు కలిగిన \q2 క్రొత్త నూర్చే పలకగా చేస్తాను. \q1 నీవు పర్వతాలను నూర్చి నలగ్గొడతావు, \q2 కొండలను పొట్టులా చేస్తావు. \q1 \v 16 నీవు వాటిని చెరగగా, గాలికి కొట్టుకుపోతాయి, \q2 సుడిగాలి వాటిని చెదరగొడుతుంది. \q1 అయితే నీవు యెహోవాలో సంతోషిస్తావు, \q2 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు. \b \q1 \v 17 “పేదవారు, దరిద్రులు నీళ్లు వెదకుతారు \q2 కాని వారికి నీరు దొరకక \q2 వారి నాలుకలు దాహంతో ఎండిపోతాయి. \q1 అయితే, యెహోవానైన నేను వారికి జవాబిస్తాను; \q2 ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడిచిపెట్టను. \q1 \v 18 నేను చెట్లులేని ఎత్తు స్థలాల మీద నదులను ప్రవహింపచేస్తాను, \q2 లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను. \q1 ఎడారిని నీటి మడుగుగా, \q2 ఎండిపోయిన నేలను ఊటలుగా చేస్తాను. \q1 \v 19 నేను ఎడారిలో దేవదారు వృక్షాలు, \q2 తుమ్మచెట్లు, గొంజిచెట్లు, ఓలీవ చెట్లు నాటుతాను. \q1 అరణ్యంలో సరళ వృక్షాలను, ఈత చెట్లను, \q2 నేరేడు చెట్లను కలిపి నాటుతాను. \q1 \v 20 అప్పుడు ప్రజలు అది చూసి \q2 యెహోవా చేయి దీనిని చేసిందని, \q1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీనిని కలుగజేశారని \q2 తెలుసుకుని స్పష్టంగా గ్రహిస్తారు. \b \q1 \v 21 “మీ వాదన చెప్పండి” \q2 అని యెహోవా అంటున్నారు. \q1 “మీ రుజువులు చూపించండి” \q2 అని యాకోబు రాజు అంటున్నారు. \q1 \v 22 “విగ్రహాల్లారా, ఏమి జరుగబోతుందో \q2 మాకు చెప్పండి. \q1 గతంలో జరిగిన వాటి గురించి చెప్పండి, \q2 తద్వారా మేము వాటిని పరిశీలించి \q2 అవి ఎలా నెరవేరాయో తెలుసుకుంటాము. \q1 జరుగబోయే సంగతులను మాకు తెలియజేయండి, \q2 \v 23 భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో చెప్పండి, \q2 అప్పుడు మీరు దేవుళ్ళని మేము గ్రహిస్తాము. \q1 మేము దిగులుపడి భయపడేలా \q2 మేలైనా కీడైనా, ఏదో ఒకటి చేయండి. \q1 \v 24 కాని మీరు వట్టివారి కంటే తక్కువవారు \q2 మీ పనులు ఏమాత్రం విలువలేనివి; \q2 మిమ్మల్ని కోరుకునేవారు అసహ్యులు. \b \q1 \v 25 “ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను. \q2 నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు. \q1 కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు \q2 ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు. \q1 \v 26 మేము అంగీకరించేలా మొదటి నుండి జరిగిన వాటిని మాకు ఎవరు చెప్పారు? \q2 ‘అతడు చేసింది న్యాయమే’ అని మేము చెప్పేలా గతాన్ని ఎవరు చెప్పారు? \q1 దాని గురించి చెప్పిన వారెవరూ లేరు, \q2 దాని గురించి ముందే ఎవరు చెప్పలేదు. \q2 మీ మాటలు విన్న వారెవరూ లేరు. \q1 \v 27 ‘చూడండి, వారిక్కడ ఉన్నారు!’ \q2 అని మొదట సీయోనుతో చెప్పింది నేనే. \q2 యెరూషలేముకు శుభవార్త చెప్పడానికి నేను ఒక దూతను పంపాను. \q1 \v 28 నేను చూడగా అక్కడ ఎవరూ లేరు, \q2 దేవుళ్ళలో సలహా చెప్పడానికి ఎవరూ లేరు, \q2 నేను వారిని ప్రశ్నిస్తే జవాబు ఇవ్వడానికి ఎవరూ లేరు. \q1 \v 29 చూడండి, వారందరు మాయాస్వరూపులే \q2 వారి క్రియలు మోసమే; \q2 వారి పోత విగ్రహాలు వట్టి గాలి అవి శూన్యములే. \c 42 \s1 యెహోవా సేవకుడు \q1 \v 1 “ఇదిగో, నేను నిలబెట్టుకునే నా సేవకుడు, \q2 నేను ఏర్పరచుకున్నవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; \q1 ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. \q2 ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు. \q1 \v 2 అతడు కేకలు వేయడు, అరవడు, \q2 వీధుల్లో ఆయన స్వరం వినబడనీయడు. \q1 \v 3 నలిగిన రెల్లును అతడు విరువడు, \q2 మసకగా వెలుగుతున్న వత్తిని ఆర్పడు. \q1 అతడు నమ్మకంగా న్యాయాన్ని చేస్తాడు; \q2 \v 4 భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకు \q1 అతడు అలసిపోడు నిరుత్సాహపడడు. \q2 అతని బోధలో ద్వీపాలు నిరీక్షణ కలిగి ఉంటాయి.” \b \q1 \v 5 ఆకాశాలను సృష్టించి వాటిని విశాలపరచి, \q1 భూమిని దానిలో పుట్టిన సమస్తాన్ని విస్తరింపజేసి, \q2 దానిపై ఉన్న ప్రజలకు ఊపిరిని, \q2 దానిపై నడిచే వారికి జీవాన్ని ఇస్తున్న \q2 దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 \v 6-7 “యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను; \q2 నేను నీ చేయి పట్టుకుంటాను. \q1 గుడ్డివారి కళ్లు తెరవడానికి, \q2 చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి, \q2 చీకటి గుహల్లో నివసించేవారిని \q1 బయటకు తీసుకురావడానికి, \q2 నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, \q2 యూదేతరులకు వెలుగుగా చేస్తాను. \b \q1 \v 8 “నేనే యెహోవాను. అదే నా పేరు! \q2 నా మహిమను నేను మరొకరికి ఇవ్వను \q2 నాకు రావలసిన స్తుతులను విగ్రహాలకు చెందనివ్వను. \q1 \v 9 చూడండి, గతంలో చెప్పిన సంగతులు జరిగాయి. \q2 క్రొత్త సంగతులు నేను తెలియజేస్తున్నాను. \q1 అవి జరగకముందే \q2 వాటిని మీకు తెలియజేస్తాను.” \s1 యెహోవాకు స్తుతి గీతం \q1 \v 10 సముద్రయానం చేసేవారలారా, సముద్రంలోని సమస్తమా, \q2 ద్వీపాల్లారా, వాటిలో నివసించేవారలారా! \q1 యెహోవాకు క్రొత్త గీతం పాడండి. \q2 భూమి అంచుల నుండి ఆయనను స్తుతించండి. \q1 \v 11 అరణ్యం, దాని పట్టణాలు, తమ స్వరాలు ఎత్తాలి; \q2 కేదారు నివాస గ్రామాలు సంతోషించాలి. \q1 సెల ప్రజలు ఆనందంతో పాడాలి; \q2 పర్వత శిఖరాల నుండి వారు కేకలు వేయాలి. \q1 \v 12 వారు యెహోవాకు మహిమ చెల్లించి \q2 ద్వీపాల్లో ఆయన స్తుతిని ప్రకటించాలి. \q1 \v 13 యెహోవా శూరునిలా బయలుదేరతారు \q2 యోధునిలా ఆయన తన రోషాన్ని రేకెత్తిస్తారు; \q1 ఆయన హుంకరిస్తూ యుద్ధ నినాదం చేస్తూ, \q2 తన శత్రువుల మీద గెలుస్తారు. \b \q1 \v 14 “చాలా కాలం నేను మౌనంగా ఉన్నాను, \q2 నేను నిశ్శబ్దంగా ఉంటూ నన్ను నేను అణచుకున్నాను. \q1 కాని ఇప్పుడు ప్రసవవేదన పడే స్త్రీలా \q2 నేను కేకలువేస్తూ, రొప్పుతూ, ఊపిరి పీల్చుకుంటున్నాను. \q1 \v 15 పర్వతాలను, కొండలను పాడుచేస్తాను. \q2 వాటి వృక్ష సంపద అంతటిని ఎండిపోయేలా చేస్తాను; \q1 నదులను ద్వీపాలుగా చేస్తాను \q2 మడుగులను ఆరిపోయేలా చేస్తాను. \q1 \v 16 గ్రుడ్డివారిని వారికి తెలియని దారుల్లో తీసుకెళ్తాను, \q2 తెలియని మార్గాల్లో నేను వారిని నడిపిస్తాను. \q1 వారి ఎదుట చీకటిని వెలుగుగా, \q2 వంకర దారులను చక్కగా చేస్తాను. \q1 నేను ఈ కార్యాలు చేస్తాను; \q2 నేను వారిని విడిచిపెట్టను. \q1 \v 17 అయితే చెక్కిన విగ్రహాలను నమ్మినవారు \q2 ప్రతిమలతో, ‘మీరు మాకు దేవుళ్ళు’ అని చెప్పేవారు, \q2 చాలా సిగ్గుతో వెనుకకు తిరుగుతారు. \s1 గ్రుడ్డి చెవిటి ఇశ్రాయేలు \q1 \v 18 “చెవిటి వారలారా! వినండి. \q2 చూడండి, గ్రుడ్డి వారలారా! చూడండి. \q1 \v 19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? \q2 నేను పంపిన దూత కాకుండా మరి ఎవడు చెవిటివాడు? \q1 నాతో నిబంధన ఉన్నవాని కన్నా ఎవడు గ్రుడ్డివాడు, \q2 యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? \q1 \v 20 నీవు చాలా సంగతులను చూశావు, \q2 కాని నీవు వాటిపై శ్రద్ధ పెట్టవు; \q2 నీ చెవులు తెరచి ఉన్నాయి, కాని నీవు వినవు.” \q1 \v 21 యెహోవా తన నీతిని బట్టి \q2 తన ధర్మశాస్త్రాన్ని గొప్పగా, మహిమగలదిగా \q2 చేయడానికి ఇష్టపడ్డారు. \q1 \v 22 కాని ఈ ప్రజలు దోచుకోబడి కొల్లగొట్టబడ్డారు, \q2 వారందరూ గుహల్లో చిక్కుకున్నారు, \q2 చెరసాలలో దాచబడ్డారు. \q1 వారు దోచుకోబడ్డారు \q2 వారిని విడిపించే వారెవరూ లేరు. \q1 వారు దోపుడు సొమ్ముగా చేయబడ్డారు, \q2 “వారిని వెనుకకు పంపండి” అని చెప్పేవారు ఎవరూ లేరు. \b \q1 \v 23 మీలో ఎవరు దీనిని వింటారు \q2 రాబోయే కాలంలో ఎవరు శ్రద్ధ చూపిస్తారు? \q1 \v 24 యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించింది, \q2 ఇశ్రాయేలును దోపిడి చేసేవారికి అప్పగించింది ఎవరు? \q1 యెహోవా కాదా, \q2 మేము ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు కాదా? \q1 వారు ఆయన మార్గాలను అనుసరించలేదు \q2 ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు. \q1 \v 25 కాబట్టి ఆయన వారిమీద తన కోపాగ్నిని \q2 యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించారు. \q1 అది వారి చుట్టూ మంటలతో చుట్టుకుంది, \q2 అయినా వారు గ్రహించలేదు; \q2 అది వారిని కాల్చింది, కాని వారు దాన్ని పట్టించుకోలేదు. \c 43 \s1 ఇశ్రాయేలు యొక్క ఏకైక రక్షకుడు \q1 \v 1 అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా \q2 ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు \q2 ఇలా చెప్తున్నారు: \q1 “భయపడకు నేను నిన్ను విడిపించాను. \q2 పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు. \q1 \v 2 నీవు నీళ్లను దాటుతున్నప్పుడు \q2 నేను నీతో ఉంటాను; \q1 నీవు నదులను దాటుతున్నప్పుడు \q2 అవి నిన్ను ముంచవు. \q1 నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు \q2 నీవు కాలిపోవు. \q2 మంటలు నిన్ను కాల్చవు. \q1 \v 3 యెహోవానైన నేను నీకు దేవుడను. \q2 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడిని. \q1 నీ క్రయధనంగా ఈజిప్టును ఇచ్చాను, \q2 నీకు బదులుగా కూషు సెబాలను ఇచ్చాను. \q1 \v 4 నీవు నా దృష్టిలో విలువైనవాడవు, ఘనుడవు కాబట్టి, \q2 నేను నిన్ను ప్రేమిస్తున్నాను, \q1 నీకు బదులుగా మనుష్యులను అప్పగిస్తాను \q2 నీ ప్రాణానికి బదులుగా దేశాలను అప్పగిస్తాను. \q1 \v 5 భయపడకు, నేను నీతో ఉన్నాను; \q2 తూర్పు నుండి నీ సంతానాన్ని తీసుకువస్తాను, \q2 పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను. \q1 \v 6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, \q2 ‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను. \q1 దూరం నుండి నా కుమారులను \q2 భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి. \q1 \v 7 నా పేరుపెట్టబడిన వారందరిని, \q2 నా మహిమ కోసం నేను సృష్టించిన వారిని, \q2 నేను రూపించి కలుగజేసిన వారిని తీసుకురండి.” \b \q1 \v 8 కళ్లుండి గ్రుడ్డివారైన వారిని, \q2 చెవులుండి చెవిటివారైన వారిని తీసుకురండి. \q1 \v 9 సర్వ దేశాలు గుమికూడాలి \q2 జనములు సమావేశమవ్వాలి. \q1 వారిలో ఎవరి దేవుళ్ళు ఇలాంటి సంగతులు మాకు తెలియజేశారు? \q2 గతంలో జరిగిన వాటిని ఎవరు మాకు చెప్పారు? \q1 తాము నిర్దోషులని నిరూపించడానికి తమ సాక్షులను తీసుకురావాలి, \q2 అప్పుడు ఇతరులు విని, “ఇది నిజమే” అని చెప్తారు. \q1 \v 10 “మీరు నా సాక్షులు” అని యెహోవా చెప్తున్నారు, \q2 “నేను ఏర్పరచుకున్న నా సేవకుడవు, \q1 తద్వారా నీవు నన్ను తెలుసుకొని, నన్ను నమ్మి, \q2 నేనే ఆయననని నీవు గ్రహిస్తావు. \q1 నాకు ముందుగా ఏ దేవుడు లేడు. \q2 నా తర్వాత ఏ దేవుడు ఉండడు. \q1 \v 11 నేను నేనే యెహోవాను, \q2 నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. \q1 \v 12 బయలుపరిచింది రక్షించింది ప్రకటించింది నేనే \q2 మీ మధ్య ఉన్నది నేనే, ఏ ఇతర దేవుడో కాదు. \q1 నేనే దేవుడను మీరు నా సాక్షులు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q2 \v 13 “అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే. \q1 నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు. \q2 నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?” \q2 అని యెహోవా చెప్తున్నారు. \s1 దేవుని కరుణ, ఇశ్రాయేలు నమ్మకద్రోహం \q1 \v 14 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు \q2 మీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “మీ కోసం నేను బబులోనుకు సైన్యాన్ని పంపి \q2 బబులోనీయులందరూ వేటిని బట్టి గర్వించేవారో \q2 వారిని ఆ ఓడలలో పారిపోయేలా చేస్తాను. \q1 \v 15 యెహోవానైన నేనే మీకు పరిశుద్ధ దేవుడను. \q2 ఇశ్రాయేలును సృజించిన నేనే మీకు రాజును.” \b \q1 \v 16 యెహోవా ఇలా అంటున్నారు: \q2 సముద్రంలో మార్గాన్ని ఏర్పరచినవాడు, \q2 గొప్ప జలాల్లో దారిని కలుగజేసినవాడు, \q1 \v 17 రథాలను గుర్రాలను, \q2 సైన్యాన్ని వీరులను రప్పించిన యెహోవా చెప్పే మాట ఇదే \q1 వారందరు కలిసి పడిపోయారు మరలా ఎప్పటికీ లేవరు, \q2 ఆరిపోయిన వత్తిలా వారు నిర్మూలించబడతారు: \q1 \v 18 “పూర్వ విషయాల్ని మరచిపోండి; \q2 గత సంగతులను ఆలోచించకండి. \q1 \v 19 చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను! \q2 ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా? \q1 నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను, \q2 ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను. \q1 \v 20 నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగడానికి \q2 అరణ్యంలో నీళ్లు ఇస్తున్నాను \q1 ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను కాబట్టి \q2 అడవి జంతువులు, నక్కలు \q1 నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి. \q2 \v 21 వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, \q2 వారు నా సుత్తిని ప్రకటిస్తారు. \b \q1 \v 22 “అయినా యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. \q2 ఇశ్రాయేలూ, నా గురించి నీవు విసిగిపోయావు. \q1 \v 23 దహనబలులకు గొర్రెలను నా దగ్గరకు తీసుకురాలేదు, \q2 నీ బలులతో నన్ను ఘనపరచలేదు. \q1 భోజనార్పణల కోసం నేను నీ మీద భారం మోపలేదు \q2 ధూపం వేయమని నిన్ను విసిగించలేదు. \q1 \v 24 నీవు నా కోసం సువాసనగల లవంగపు చెక్కను డబ్బుతో కొనలేదు, \q2 నీ బలి పశువుల క్రొవ్వుతో నన్ను తృప్తిపరచలేదు. \q1 కాని నీ పాపాలతో నన్ను విసిగించావు \q2 నీ దోషాలతో నేను అలసిపోయేలా చేశావు. \b \q1 \v 25 “నేను నేనే నా ఇష్టానుసారంగా \q2 నీ పాపాలను తుడిచివేస్తున్నాను, \q2 నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను. \q1 \v 26 నాకు గతంలో జరిగింది గుర్తు చేయి \q2 మనం కలిసి వాదించుకుందాం; \q2 నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో. \q1 \v 27 నీ మూలపురుషుడు పాపం చేశాడు; \q2 నీకు బోధించమని నేను పంపినవారు నా మీద తిరుగుబాటు చేశారు. \q1 \v 28 కాబట్టి నేను నీ మందిరంలోని ప్రధానులను అవమానించాను; \q2 నేను యాకోబును నాశనానికి\f + \fr 43:28 \fr*\ft ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే.\ft*\f* \q2 ఇశ్రాయేలును దూషణకు అప్పగించాను. \c 44 \s1 ఏర్పరచుకోబడ్డ ఇశ్రాయేలు \q1 \v 1 “అయితే నా సేవకుడవైన యాకోబూ, \q2 నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలూ, విను. \q1 \v 2 నిన్ను పుట్టించి, గర్భంలో నిన్ను నిర్మించి \q2 నీకు సహాయం చేసేవాడైన \q2 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 నా సేవకుడవైన యాకోబూ, \q2 నేను ఏర్పరచుకున్న యెషూరూను\f + \fr 44:2 \fr*\fq యెషూరూను \fq*\ft అంటే \ft*\fqa యథార్థవంతుడు, \fqa*\ft అంటే, ఇశ్రాయేలు\ft*\f* భయపడకు. \q1 \v 3 నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు, \q2 ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను. \q1 నీ సంతానంపై నా ఆత్మను, \q2 నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను. \q1 \v 4 వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు, \q2 నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు. \q1 \v 5 కొంతమంది, ‘నేను యెహోవా వాడను’ అని అంటారు; \q2 ఇతరులు యాకోబు పేరుతో తమను తాము పిలుచుకుంటారు; \q1 ఇంకా కొందరు తమ చేతిపై ‘యెహోవా వారము’ అని రాసుకుని \q2 ఇశ్రాయేలు పేరును పెట్టుకుంటారు. \s1 విగ్రహాలు కాదు, యెహోవాయే \q1 \v 6 “ఇశ్రాయేలీయుల రాజు, విమోచకుడు, \q2 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: \q1 నేను మొదటివాడను చివరివాడను; \q2 నేను తప్ప ఏ దేవుడు లేడు. \q1 \v 7 నాలా ఎవరు ఉన్నారు? అతడు ప్రకటించాలి. \q2 నేను నా మొదటి ప్రజలను నియమించినప్పటి నుండి ఏమి జరిగిందో, \q1 ఇంకా ఏమి జరగబోతుందో \q2 అతడు తెలియజేయాలి, నా ముందు ఉంచాలి. \q2 అవును ఏమి జరగబోతుందో వారు తెలియజేయాలి. \q1 \v 8 మీరు బెదరకండి, భయపడకండి. \q2 చాలా కాలం క్రితం నేను ఈ విషయం చెప్పి మీకు ప్రకటించలేదా? \q1 మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? \q2 నేను తప్ప, ఆశ్రయ దుర్గమేదీ లేదు. ఉన్నట్లు నేనెరుగను.” \b \q1 \v 9 విగ్రహాలను చేసే వారందరు వట్టివారు. \q2 వారు నిధిగా ఉంచిన వస్తువులు పనికిరానివి. \q1 వారి కోసం మాట్లాడేవారు గ్రుడ్డివారు; \q2 వారు తెలివిలేనివారు, వారు సిగ్గుపరచబడతారు. \q1 \v 10 ఎందుకు పనికిరాని విగ్రహాన్ని పోతపోసిన \q2 దానినొక దేవునిగా రూపించేవాడు ఎవడు? \q1 \v 11 అలా చేసే ప్రజలందరూ సిగ్గుపరచబడతారు. \q2 ఆ శిల్పకారులు కేవలం మనుష్యులే. \q1 వారందరు కలిసివచ్చి నిలబడాలి; \q2 వారు భయానికి గురై సిగ్గుపడతారు. \b \q1 \v 12 కమ్మరి తన పనిముట్టు తీసుకుని \q2 దానితో నిప్పుల మీద పని చేస్తాడు; \q1 సుత్తితో విగ్రహానికి రూపిస్తాడు \q2 తన చేతి బలంతో దానిని తయారుచేస్తాడు. \q1 అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. \q2 అతడు నీళ్లు త్రాగడు, సొమ్మసిల్లిపోతాడు. \q1 \v 13 వడ్రంగి నూలు త్రాడుతో కొలతలు వేసి \q2 రూపం యొక్క రూపురేఖలను గుర్తిస్తాడు; \q1 అతడు ఉలితో దానిని చెక్కి \q2 దిక్సూచితో గుర్తులు పెడతాడు. \q1 క్షేత్రంలో అది ఉండడానికి \q2 దానికి నర రూపాన్ని ఇచ్చి \q2 నర సౌందర్యం కలదానిగా తయారుచేస్తాడు. \q1 \v 14 అతడు దేవదారు చెట్లను నరుకుతాడు \q2 సరళ వృక్షాన్ని గాని సింధూర వృక్షాన్ని గాని తీసుకుంటాడు. \q1 అతడు అడవి చెట్ల మధ్యలో దానిని ఎదిగేటట్లు చేస్తాడు, \q2 దేవదారు చెట్టు నాటుతాడు, వర్షం దానిని పెంచుతుంది. \q1 \v 15 ఒక మనుష్యుడు దాని కట్టెలను మంట పెట్టడానికి ఉపయోగిస్తాడు; \q2 అతడు ఆ కట్టెలలో కొన్ని తీసుకుని చలి కాచుకుంటాడు, \q2 అవే కట్టెలతో అతడు నిప్పు రాజేసి రొట్టె కాల్చుకుంటాడు. \q1 మిగిలిన కర్రతో ఒక దేవున్ని చేసికొని దానిని పూజిస్తాడు; \q2 దానితో ఒక విగ్రహాన్ని చేసి దానికి నమస్కారం చేస్తాడు. \q1 \v 16 సగం కట్టెలను నిప్పుతో కాల్చి \q2 ఆ కట్టెల మీద తన ఆహారం వండుకుంటాడు. \q2 దానిపై అతడు మాంసం వండుకుని తృప్తిగా తింటాడు. \q1 అంతేకాదు, అతడు చలి కాచుకుంటూ, \q2 “ఆహా! నాకు వెచ్చగా ఉంది; నాకు మంట కనబడుతుంది” అని అనుకుంటాడు. \q1 \v 17 మిగిలిన దానితో అతడు తనకు దేవునిగా ఒక విగ్రహాన్ని చేసుకుంటాడు. \q2 అతడు దానికి నమస్కారం చేసి పూజిస్తాడు. \q1 “నీవే నా దేవుడవు! నన్ను రక్షించు!” \q2 అని దానికి ప్రార్థిస్తాడు. \q1 \v 18 ఈ మనుష్యులకు ఏమీ తెలియదు, దేన్ని గ్రహించరు; \q2 చూడకుండ వారి కళ్లు కప్పబడ్డాయి, \q2 గ్రహించకుండా వారి మనస్సులు మూయబడ్డాయి. \q1 \v 19 ఎవరూ ఆలోచించడం లేదు, \q2 “దీనిలో సగం ఇంధనంగా వాడాను; \q1 దాని నిప్పుల మీద రొట్టె కూడా కాల్చాను, \q2 నేను మాంసం వండుకుని తిన్నాను. \q2 నేను మిగిలిన దానితో అసహ్యమైన దానిని చేయాలా? \q1 నేను చెట్టు మొద్దుకు నమస్కారం చేయాలా?” అని \q2 ఆలోచించడానికి ఎవరికీ తెలివి గాని వివేచన గాని లేదు. \q1 \v 20 అలాంటివాడు బూడిద తింటాడు; మోసపూరితమైన హృదయం అతన్ని దారి తప్పిస్తుంది; \q2 తనను తాను రక్షించుకోలేడు, \q2 “నా కుడి చేతిలో ఉన్నది అబద్ధం కాదా?” అని అనలేడు. \b \q1 \v 21 “యాకోబూ, వీటిని గుర్తు చేసుకో, \q2 ఎందుకంటే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. \q1 నేను నిన్ను నిర్మించాను, నీవు నా సేవకుడవు; \q2 ఇశ్రాయేలూ, నేను నిన్ను మరచిపోను. \q1 \v 22 మేఘం విడిపోవునట్లు నీ దోషాలను \q2 ఉదయకాలపు మంచు మబ్బు తొలగిపోయేలా నీ పాపాలను, తుడిచివేశాను. \q1 నేను నిన్ను విడిపించాను. \q2 నా దగ్గరకు తిరిగి రా.” \b \q1 \v 23 యెహోవా దీనిని చేశారు కాబట్టి ఆకాశాల్లారా, ఆనందంతో పాడండి; \q2 భూమి లోతుల్లారా, బిగ్గరగా అరవండి. \q1 పర్వతాల్లారా, అరణ్యమా, \q2 నీలో ఉన్న ప్రతి చెట్టు సంగీత నాదం చేయండి. \q1 యెహోవా యాకోబును విడిపించారు \q2 ఆయన ఇశ్రాయేలులో తన మహిమను చూపిస్తారు. \s1 యెరూషలేము నివాస స్థలంగా మారుట \q1 \v 24 “నిన్ను గర్భంలో రూపించిన నీ విమోచకుడైన \q2 యెహోవా చెప్పే మాట ఇదే: \b \q1 “యెహోవాను నేనే \q2 అన్నిటిని సృష్టించాను, \q2 నేనే ఆకాశాలను విశాలపరిచాను \q2 నేను నేనే భూమికి ఆకారమిచ్చాను. \q1 \v 25 నేనే అబద్ధ ప్రవక్తల సూచనలను భంగం చేస్తాను, \q2 సోదె చెప్పేవారిని వెర్రివారిగా చేస్తాను. \q1 జ్ఞానులను వెనుకకు త్రిప్పి \q2 వారి చదువును వ్యర్థం చేసేది నేనే. \q1 \v 26 నా సేవకుని మాటలను స్థిరపరచి \q2 నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. \b \q1 “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని \q2 యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని \q2 వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను. \q1 \v 27 నేను నీటి లోతులతో, ‘ఎండిపో, \q2 నీ ప్రవాహాలను ఎండిపోయేటట్లు చేస్తాను’ అని చెప్పాను. \q1 \v 28 నేను కోరెషు గురించి, ‘అతడు నా కాపరి, \q2 నా ఇష్టాన్నంతటిని నెరవేరుస్తాడు’ అని చెప్పాను. \q1 అతడు, ‘యెరూషలేము తిరిగి కట్టబడాలి’ అని \q2 ‘మందిరం పునాదులు వేయబడాలి’ అని చెప్తాడు.” \b \b \c 45 \q1 \v 1 కోరెషు పక్షంగా దేశాలను జయించడానికి \q2 రాజులను నిరాయుధులుగా చేయడానికి \q1 అతని ఎదుట ద్వారాలు మూయబడకుండా \q2 తలుపులు తీయడానికి \q1 నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. \q2 తన అభిషిక్తుడైన ఈ కోరెషుతో యెహోవా చెప్పే మాట ఇదే: \q1 \v 2 నేను నీకు ముందుగా వెళ్లి \q2 పర్వతాలను చదును చేస్తాను; \q1 ఇత్తడి తలుపుల్ని పగలగొట్టి, \q2 ఇనుప గడియలను విరగ్గొడతాను. \q1 \v 3 పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను \q2 నేనేనని నీవు తెలుసుకునేలా \q1 రహస్య స్థలాల్లో ఉంచిన నిధులను \q2 దాచబడిన ధనాన్ని నీకిస్తాను. \q1 \v 4 నా సేవకుడైన యాకోబు కోసం \q2 నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు కోసం \q1 నేను పేరు పెట్టి నిన్ను పిలిచాను. \q2 నీవు నన్ను గుర్తించకపోయినా \q2 నీకు గౌరవ బిరుదు ఇచ్చాను. \q1 \v 5 నేను యెహోవాను, వేరే ఏ దేవుడు లేడు; \q2 నేను తప్ప ఏ దేవుడు లేడు. \q1 నీవు నన్ను గుర్తించకపోయినా \q2 నేను నిన్ను బలపరుస్తాను. \q1 \v 6 అప్పుడు సూర్యోదయ దిక్కునుండి సూర్యాస్తమయ స్థలం వరకు \q2 నేను తప్ప ఏ దేవుడు లేడని \q1 ప్రజలు తెలుసుకుంటారు. \q2 యెహోవాను నేనే; నేను తప్ప వేరే ఎవరూ లేడు. \q1 \v 7 నేను వెలుగును రూపిస్తాను, చీకటిని కలుగజేస్తాను, \q2 నేను వృద్ధిని తెస్తాను, విపత్తును కలుగజేస్తాను. \q2 యెహోవానైన నేను వీటన్నిటిని చేస్తాను. \b \q1 \v 8 “పైనున్న ఆకాశాల్లారా, నా నీతిని వర్షింపనివ్వండి; \q2 మేఘాలు వాటిని క్రిందికి కురిపించాలి. \q1 భూమి విశాలంగా తెరవాలి, \q2 రక్షణ మొలవాలి, \q1 నీతి దానితో కలిసి వర్ధిల్లాలి; \q2 యెహోవానైన నేను దానిని సృష్టించాను. \b \q1 \v 9 “మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉండి \q2 తనను చేసినవానితో \q2 వాదించే వారికి శ్రమ. \q1 జిగటమన్ను కుమ్మరితో, \q2 ‘నీవు ఏం తయారుచేస్తున్నావు?’ అని అంటుందా? \q1 అతని పని అతనితో, \q2 ‘కుమ్మరికి నైపుణ్యం లేదు’ అని అంటుందా? \q1 \v 10 ‘నీవు కన్నది ఏంటి?’ \q2 అని తండ్రితో అనే వానికి, \q1 ‘నీ గర్భంలో పుట్టింది ఏంటి?’ \q2 అని తల్లితో అనే వానికి శ్రమ. \b \q1 \v 11 “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు \q2 దానిని సృష్టించిన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 జరుగబోయే వాటి గురించి, \q2 నా కుమారుల గురించి నన్ను అడుగుతారా? \q2 నా చేతిపనుల గురించి నన్నే ఆజ్ఞాపిస్తారా? \q1 \v 12 భూమిని కలుగచేసింది \q2 దాని మీద ఉన్న నరులను సృష్టించింది నేనే. \q1 నా సొంత చేతులు ఆకాశాలను విశాలపరిచాయి; \q2 నేను వాటి నక్షత్ర సమూహాలను నడిపిస్తాను. \q1 \v 13 నేను నీతిని బట్టి కోరెషును పురికొల్పుతాను: \q2 అతని మార్గాలన్నీ తిన్నగా చేస్తాను. \q1 అతడు నా పట్టణాన్ని మరలా కడతాడు \q2 ఏ వెల ఏ బహుమానం తీసుకోకుండ \q1 బందీలుగా ఉన్నవారిని అతడు విడిపిస్తాడు \q2 అని సైన్యాల యెహోవా అన్నారు.” \p \v 14 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “ఈజిప్టు సంపాదన, కూషు వ్యాపార లాభాలు, \q2 పొడవైన సెబాయీయులు; \q1 నీ దగ్గరకు వచ్చి నీవారవుతారు; \q1 సంకెళ్ళతో నీ దగ్గరకు వచ్చి \q2 నీ ఎదుట మోకరిస్తారు. \q1 ‘నిజంగా దేవుడు నీతో ఉన్నారు, \q2 వేరే ఎవరూ లేరు; \q1 వేరే ఏ దేవుడు లేడు’ అని \q2 నీ ఎదుట నమస్కారం చేసి మనవి చేస్తారు.” \b \q1 \v 15 ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయంగా మీరు \q2 కనబడకుండా చేసుకున్న దేవుడవు. \q1 \v 16 విగ్రహాలను చేసే వారందరు సిగ్గుపడి అవమానపడతారు. \q2 వారందరు కలిసి అవమానానికి గురవుతారు. \q1 \v 17 అయితే యెహోవా వలన ఇశ్రాయేలు \q2 నిత్యమైన రక్షణ పొందుతుంది; \q1 మీరు మరలా ఎప్పటికీ \q2 సిగ్గుపరచబడరు, అవమానం పొందరు. \b \q1 \v 18 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 ఆకాశాలను సృష్టించిన \q2 యెహోవాయే దేవుడు. \q1 ఆయన భూమికి ఆకారమిచ్చి \q2 దానిని స్థిరపరిచారు: \q1 దానిని శూన్యంగా సృష్టించలేదు కాని, \q2 నివాస స్థలంగా దానిని చేశారు. \q1 ఆయన అంటున్నారు: \q1 “యెహోవాను నేనే \q2 మరి వేరే ఎవరూ లేరు. \q1 \v 19 నేను ఎక్కడో చీకటి దేశంలో నుండి \q2 రహస్యంగా మాట్లాడలేదు; \q1 ‘వ్యర్థంగా నన్ను వెదకండి’ అని \q2 యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. \q1 యెహోవానైన నేను సత్యం మాట్లాడతాను; \q2 నేను యథార్థమైనవే తెలియజేస్తాను. \b \q1 \v 20 “అంతా కలిసి రండి; \q2 దేశాల నుండి తప్పించుకు పారిపోయినవారలారా రండి. \q1 చెక్క విగ్రహాలను మోస్తూ, \q2 రక్షించలేని దేవుళ్ళకు మొరపెట్టే వారికి తెలివిలేదు. \q1 \v 21 నా సన్నిధిలోకి వచ్చి సంగతులు తెలియజేయండి, \q2 వారు కలిసి ఆలోచన చేయాలి. \q1 పూర్వకాలం నుండి దీనిని తెలియజేసింది ఎవరు? \q2 చాలా కాలం క్రితం దానిని ప్రకటించింది ఎవరు? \q1 యెహోవానైన నేను కాదా? \q2 నేను తప్ప వేరొక దేవుడు లేడు. \q1 నేను నీతిగల దేవుడను, రక్షకుడను; \q2 నేను తప్ప వేరే ఎవరూ లేరు. \b \q1 \v 22 “భూమి అంచుల్లో నివసించే మీరందరు \q2 నా వైపు తిరిగి రక్షణ పొందండి; \q2 నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు. \q1 \v 23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని \q2 ప్రతి నాలుక నాతోడని ప్రమాణం చేస్తుందని \q2 నేను నా పేరిట ప్రమాణం చేశాను. \q1 నీతిగల నా నోటి నుండి వచ్చిన మాట \q2 ఏదీ వ్యర్థం కాదు. \q1 \v 24 ‘యెహోవాలోనే నీతి, బలము’ అని \q2 ప్రజలు నా గురించి చెప్తారు.” \q1 ఆయన మీద కోప్పడిన వారందరు \q2 ఆయన దగ్గరకు వస్తారు, వారు సిగ్గుపరచబడతారు. \q1 \v 25 అయితే ఇశ్రాయేలు సంతతివారందరు \q2 యెహోవాలోనే నీతిమంతులుగా తీర్చబడతారు, \q2 వారు ఆయనలోనే అతిశయిస్తారు. \c 46 \s1 బబులోను దేవుళ్ళు \q1 \v 1 బేలు మోకరిస్తుంది, నెబో క్రిందికి వంగుతుంది. \q2 వాటి విగ్రహాలను బరువులు మోసే జంతువులు\f + \fr 46:1 \fr*\ft లేదా \ft*\fqa జంతువులు, పశువులు\fqa*\f* మోస్తాయి. \q1 ఆ బరువైన ప్రతిమలను మోయడం కష్టం, \q2 అలసిపోయిన పశువులకు భారము. \q1 \v 2 అవన్నీ కలిసి వంగి మోకరిస్తాయి; \q2 ఆ బరువును తప్పించుకోలేక \q2 అవి కూడా బందీలుగా పట్టుబడతాయి. \b \q1 \v 3 “యాకోబు వారసులారా, నా మాట వినండి, \q2 ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారలారా, నా మాట వినండి, \q1 మీ పుట్టుక నుండి నేను మిమ్మల్ని నిలబెట్టాను, \q2 మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని మోసాను. \q1 \v 4 మీ వృద్ధాప్యం వరకు, వెంట్రుకలు తెల్లగా అయ్యేవరకు \q2 నేను, నేనే మిమ్మల్ని నిలబెడతాను. \q1 నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని మోస్తాను. \q2 నేనే మిమ్మల్ని నిలబెడతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. \b \q1 \v 5 “మీరు నన్ను ఎవరితో పోలుస్తారు, ఎవరితో సమానంగా ఎంచుతారు? \q2 నాతో సమానమని ఎవరిని మీరు నాకు పోటీగా ఉంచుతారు? \q1 \v 6 కొంతమంది తమ సంచుల నుండి బంగారం కుమ్మరించి \q2 వెండిని తీసుకువచ్చి బరువు తూచి, \q1 తమకు దేవున్ని తయారుచేయడానికి కంసాలిని నియమిస్తారు, \q2 తర్వాత దానికి నమస్కరించి పూజిస్తారు. \q1 \v 7 వారు దానిని తమ భుజాలపై ఎత్తుకుని మోస్తారు; \q2 దాని చోటులో దానిని నిలబెడతారు, \q2 ఆ చోటు నుండి అది కదల్లేదు. \q1 ఎవరైనా దానికి మొరపెట్టినా, అది జవాబివ్వలేదు; \q2 వారి కష్టాల నుండి వారిని రక్షించలేదు. \b \q1 \v 8 “దీనిని జ్ఞాపకం ఉంచుకోండి, మనస్సులో పెట్టుకోండి, \q2 తిరుగుబాటు చేసే మీరు మీ హృదయంలో పెట్టుకోండి, \q1 \v 9 చాలా కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి; \q2 నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు; \q2 నేను దేవుడును, నాలా ఎవరూ లేరు. \q1 \v 10 నేనే మొదటి నుండి చివర కలుగబోయే వాటిని ప్రకటిస్తాను. \q2 పూర్వకాలం నుండి రాబోయే వాటిని తెలియజేస్తాను. \q1 ‘నా ఉద్దేశం నిలబడుతుంది \q2 నాకు ఏది ఇష్టమో, అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను. \q1 \v 11 తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తాను; \q2 దూరదేశం నుండి నా ఉద్దేశాన్ని నెరవేర్చే వానిని పిలుస్తాను. \q1 నేను చెప్పిన దానిని నెరవేరుస్తాను; \q2 నా ప్రణాళిక ప్రకారం నేను చేస్తాను. \q1 \v 12 మొండి హృదయంతో నా నీతికి దూరంగా ఉన్నవారలారా, \q2 నా మాట వినండి. \q1 \v 13 నా నీతిని దగ్గరకు తెస్తున్నాను. \q2 అది దూరంగా లేదు; \q2 నా రక్షణ ఆలస్యం కాదు. \q1 నేను సీయోనుకు రక్షణను \q2 ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను. \c 47 \s1 బబులోను పతనము \q1 \v 1 “కన్యయైన బబులోను కుమార్తె, \q2 క్రిందికి దిగి ధూళిలో కూర్చో; \q1 బబులోనీయుల\f + \fr 47:1 \fr*\ft లేదా \ft*\ft కల్దీయుల\ft*\ft ; \+xt 5|link-href="ISA 47:5"\+xt* వచనంలో కూడా\ft*\f* రాణి పట్టణమా, సింహాసనం లేకుండా \q2 నేల మీద కూర్చో. \q1 నీవు సున్నితమైన దానవని సుకుమారివని \q2 ఇకపై పిలువబడవు. \q1 \v 2 తిరగలి తీసుకుని పిండి విసురు; \q2 నీ ముసుగు తీసివేయి. \q1 లంగాలు పైకెత్తి \q2 కాలిమీద బట్ట తీసి నదులు దాటు. \q1 \v 3 నీ నగ్నత్వం బయటపడుతుంది \q2 నీ సిగ్గు కనబడుతుంది. \q1 నేను ప్రతీకారం తీసుకుంటాను; \q2 నేను ఎవరిని క్షమించను.” \b \q1 \v 4 మన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు \q2 ఆయన పేరు సైన్యాల యెహోవా. \b \q1 \v 5 “బబులోనీయుల రాణి పట్టణమా, \q2 మౌనంగా కూర్చో, చీకటిలోనికి వెళ్లిపో; \q1 రాజ్యాలకు రాణివని \q2 ఇకపై నీవు పిలువబడవు. \q1 \v 6 నా ప్రజల మీద నేను కోప్పడి \q2 నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచాను; \q1 నేను వారిని నీ చేతికి అప్పగించాను, \q2 నీవు వారిమీద జాలి చూపలేదు. \q1 వృద్ధుల మీద కూడా నీవు \q2 చాలా బరువైన కాడిని ఉంచావు. \q1 \v 7 నీవు ‘నేను ఎప్పటికీ \q2 నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. \q1 కాని వీటి గురించి ఆలోచించలేదు \q2 ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు. \b \q1 \v 8 “నీవు సుఖాన్ని ప్రేమిస్తూ \q2 క్షేమంగా జీవిస్తూ, \q1 ‘నేనే ఉన్నాను, నేను తప్ప వేరే ఎవరూ లేరు. \q2 నేను ఎప్పటికీ విధవరాలిని కాను \q1 బిడ్డల్ని పోగొట్టుకొని బాధపడను’ అని నీలో నీవు అనుకుంటున్నావు, \q2 కాని ఇప్పుడు ఈ మాట విను. \q1 \v 9 ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే \q2 ఈ రెండు నీకు సంభవిస్తాయి: \q2 బిడ్డల్ని పోగొట్టుకుంటావు విధవరాలిగా మారతావు. \q1 నీవు చాలా శకునాలు చూసినా, \q2 అనేక కర్ణపిశాచ తంత్రాల మీద ఆధారపడినా \q2 ఈ విషాదాలు నీ మీదికి పూర్తిగా వస్తాయి. \q1 \v 10 నీ చెడుతనాన్ని నీవు నమ్ముకుని \q2 ‘ఎవరూ నన్ను చూడరు’ అని అనుకున్నావు. \q1 ‘నేనే, నేను తప్ప వేరే ఎవరూ లేరు’ \q2 అని నీకు నీవు అనుకున్నప్పుడు \q2 నీ జ్ఞానం నీ తెలివి నిన్ను తప్పుదారి పట్టించాయి. \q1 \v 11 విపత్తు నీ మీదికి వస్తుంది, \q2 దానిని మాయాజాలంతో ఎలా పోగొట్టాలో నీవు తెలుసుకోలేవు. \q1 ఒక కీడు నీ మీద పడుతుంది \q2 దానిని నీవు డబ్బుతో నివారించలేవు; \q1 నీకు తెలియని నాశనం \q2 నీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది. \b \q1 \v 12 “నీ చిన్నప్పటి నుండి నీవు కష్టపడి నేర్చుకున్న \q2 నీ కర్ణపిశాచ తంత్రాలను \q2 నీ విస్తారమైన శకునాలను ప్రయోగించుకో \q1 బహుశ నీవు విజయం సాధిస్తావేమో, \q2 బహుశ నీవు భయం కలిగించగలవేమో. \q1 \v 13 నీవు తీసుకున్న సలహాలన్నీ విని నీవు అలసిపోయావు. \q2 నీ జ్యోతిష్యులు, నెలలవారీగా \q1 రాశి ఫలాలను చెప్పేవారిని రమ్మను, \q2 నీ మీదికి వచ్చే వాటినుండి నిన్ను వారు రక్షించాలి. \q1 \v 14 నిజంగా వారు గడ్డిపరకలా అవుతారు; \q2 అగ్ని వారిని కాల్చివేస్తుంది. \q1 అగ్ని జ్వాలల నుండి వారు \q2 తమను తాము కాపాడుకోలేరు. \q1 అవి చలికాచుకోవడానికి వాడే నిప్పులు కాదు; \q2 ఎదురుగా కూర్చుని కాచుకునే అగ్ని కూడా కాదు. \q1 \v 15 నీ చిన్నప్పటి నుండి \q2 నీవు ఎవరి కోసం శ్రమపడ్డావో \q2 వారంతా నిన్ను నిరాశపరుస్తారు. \q1 వారంతా తమ తప్పుదారిలో వెళ్లిపోతారు. \q2 నిన్ను రక్షించగలిగే వారొక్కరూ ఉండడు. \c 48 \s1 మొండిగా ఉన్న ఇశ్రాయేలు \q1 \v 1 “యాకోబు వారసులారా, \q2 ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి \q2 యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి, \q1 యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ \q2 ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ \q2 సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి. \q1 \v 2 మీ గురించి మీరు పరిశుద్ధ పట్టణస్థులమని చెప్పుకుంటూ \q2 ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్న మీరు వినండి, \q2 ఆయన పేరు సైన్యాల యెహోవా: \q1 \v 3 గతంలో జరిగిన వాటి గురించి నేను చాలా కాలం క్రితమే చెప్పాను. \q2 నా నోరు వాటిని ప్రకటించింది నేను వాటిని తెలియజేశాను; \q2 తర్వాత నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి జరిగాయి. \q1 \v 4 ఎందుకంటే మీరు ఎంత మొండివారో నాకు తెలుసు; \q2 నీ మెడ నరాలు ఇనుపవని, \q2 నీ నుదురు ఇత్తడిదని నాకు తెలుసు. \q1 \v 5 కాబట్టి వీటి గురించి నేను చాలా కాలం క్రితం చెప్పాను; \q2 ‘నా విగ్రహం ఈ పనులను జరిగించింది \q1 నేను చెక్కిన ప్రతిమ, నేను పోతపోసిన విగ్రహం వాటిని నియమించాయి’ అని \q2 నీవు ఎప్పుడూ చెప్పకుండా ఉండేలా \q2 అవి జరగకముందే నీకు వాటిని ప్రకటించాను. \q1 \v 6 నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు. \q2 అవి నిజమని నీవు ఒప్పుకోవా? \b \q1 “నీకు తెలియకుండా దాచబడిన \q2 క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను. \q1 \v 7 అవి ఇప్పుడే సృజించినవి, ఎప్పుడో చేసినవి కావు; \q2 ఈ రోజుకు ముందు నీవు వాటి గురించి వినలేదు. \q1 అప్పుడు, ‘అవును, వాటి గురించి నాకు తెలుసు’ \q2 అని నీవు చెప్పలేవు. \q1 \v 8 నీవు వాటి గురించి వినలేదు, అవి నీకు తెలియదు; \q2 పూర్వం నుండి నీ చెవులు తెరవబడలేదు. \q1 నీవు ఎంత ద్రోహివో నాకు తెలుసు; \q2 నీ పుట్టుక నుండి తిరుగుబాటుదారుడవు. \q1 \v 9 నేను నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా \q2 నా నామాన్ని బట్టి నా కోపాన్ని ఆపుకున్నాను; \q2 నా కీర్తి కోసం నీ నుండి దానిని నేను నిగ్రహించుకున్నాను. \q1 \v 10 చూడు, నేను నిన్ను శుద్ధి చేశాను, కాని వెండిని చేసినట్లు కాదు; \q2 బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను. \q1 \v 11 నా కోసం, నా కొరకే, నేను ఇలా చేస్తాను. \q2 నా పేరును ఎలా అపవిత్రం చేయనిస్తాను? \q2 నేను నా మహిమను మరొకరికి ఇవ్వను. \s1 ఇశ్రాయేలు విడిపించబడుట \q1 \v 12 “యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, \q2 నా మాట విను. \q1 నేనే ఆయనను; \q2 నేనే మొదటివాడను నేను చివరివాడను. \q1 \v 13 నా సొంత చేయి భూమికి పునాదులను వేసింది, \q2 నా కుడిచేయి ఆకాశాలను విశాలపరిచింది; \q1 నేను వాటిని పిలిచినప్పుడు \q2 అవన్నీ కలసి నిలబడతాయి. \b \q1 \v 14 “మీరందరూ కలసి వచ్చి వినండి: \q2 విగ్రహాలలో ఏది ఈ విషయాలను ముందే చెప్పింది? \q1 యెహోవా స్నేహితునిగా ఎంచుకున్నవాడు \q2 ఆయన ఉద్దేశాన్ని బబులోనుకు చేస్తాడు \q2 ఆయన చేయి బబులోనీయులకు\f + \fr 48:14 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయులకు \fqa*\ft \+xt 20|link-href="ISA 48:20"\+xt* వచనంలో కూడా ఉంది\ft*\f* వ్యతిరేకంగా ఉంటుంది. \q1 \v 15 నేను, నేనే చెప్పాను; \q2 అవును, నేనే అతన్ని పిలిచాను. \q1 నేను అతన్ని రప్పిస్తాను \q2 అతడు తన పనిలో విజయం సాధిస్తాడు. \p \v 16 “నా దగ్గరకు వచ్చి ఈ మాట విను: \q1 “మొదటి ప్రకటన నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు; \q2 అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను.” \b \q1 ఇప్పుడు ప్రభువైన యెహోవా \q2 తన ఆత్మతో నన్ను పంపారు. \b \q1 \v 17 నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన \q2 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 నీ దేవుడనైన యెహోవాను నేనే, \q2 నీకు ఏది మంచిదో అది నీకు బోధిస్తాను \q2 నీవు వెళ్లవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాను. \q1 \v 18 నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే \q2 నీ సమాధానం నదిలా \q2 నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి. \q1 \v 19 నీ వారసులు ఇసుకలా, \q2 నీ పిల్లలు లెక్కించలేని రేణువుల్లా ఉండేవారు. \q1 వారి పేరు ఎప్పటికీ కొట్టివేయబడదు \q2 ఎప్పుడూ నా ఎదుట నుండి నిర్మూలం కావు. \b \q1 \v 20 బబులోనును విడిచిపెట్టండి. \q2 బబులోనీయుల నుండి పారిపోండి! \q1 “యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని \q2 ఆనంద కేకలతో తెలియజేయండి. \q1 దానిని ప్రకటించండి. \q2 భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి. \q1 \v 21 ఎడారుల గుండా ఆయన వారిని నడిపించినా వారికి దాహం వేయలేదు; \q2 ఆయన వారి కోసం బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేశారు. \q1 ఆయన బండను చీల్చారు, \q2 నీళ్లు ఉప్పొంగుతూ బయటకు వచ్చాయి. \b \q1 \v 22 “దుర్మార్గులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెప్తున్నారు. \c 49 \s1 యెహోవా సేవకుడు \q1 \v 1 ద్వీపాల్లారా, నా మాట వినండి; \q2 దూరంగా ఉన్న దేశాల్లారా, ఇది వినండి: \q1 నేను పుట్టక ముందే యెహోవా నన్ను పిలిచారు. \q2 నా తల్లి గర్భంలో ఉండగానే ఆయన నా పేరు పలికారు. \q1 \v 2 ఆయన నా నోటిని పదునైన ఖడ్గంగా చేశారు, \q2 తన చేతి నీడలో నన్ను దాచారు; \q1 నన్ను మెరుగుపెట్టిన బాణంలా చేసి \q2 తన అంబులపొదిలో నన్ను దాచారు. \q1 \v 3 “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు. \q2 నీ ద్వారా నా మహిమను కనుపరుస్తాను” అని ఆయన నాతో చెప్పారు. \q1 \v 4 అయితే నేను, “నేను వృధాగా కష్టపడ్డాను; \q2 ఫలితం లేకుండా నా బలాన్ని ఖర్చు చేశాను \q1 కాని ఖచ్చితంగా నా తీర్పు యెహోవా దగ్గరే ఉంది, \q2 నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది” అని అన్నాను. \b \q1 \v 5 యెహోవా దృష్టిలో నేను ఘనపరచబడ్డను \q2 నా దేవుడే నాకు బలంగా ఉన్నారు \q2 తన దగ్గరకు యాకోబును తిరిగి రప్పించడానికి \q1 ఇశ్రాయేలును తన కోసం సమకూర్చడానికి \q2 తన సేవకునిగా ఉండడానికి నన్ను గర్భంలో నిర్మించిన, \q1 యెహోవా ఇలా అంటున్నారు: \q1 \v 6 ఆయన అంటున్నారు: \q1 “నీవు యాకోబు గోత్రాలను పునరుద్ధరించడానికి, \q2 ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి \q2 నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము. \q1 నేనిచ్చే రక్షణ భూమి అంచుల వరకు చేరడానికి \q2 యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తాను.” \b \q1 \v 7 రాజ్యాలచేత త్రోసివేయబడి ద్వేషానికి గురైన \q2 పాలకుల సేవకునితో \q1 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునైన \q2 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “యెహోవా నమ్మకమైనవాడు కాబట్టి \q2 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి \q1 రాజులు నిన్ను చూసి లేచి నిలబడతారు, \q2 యువరాజులు చూసి నమస్కారం చేస్తారు.” \s1 ఇశ్రాయేలు పునరుద్ధరణ \p \v 8 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “అనుకూల సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను, \q2 రక్షణ దినాన నేను నీ మీద దయ చూపిస్తాను; \q1 దేశాన్ని పునరుద్ధరించి \q2 పాడైన స్వాస్థ్యాలను పంచడానికి \q1 బంధించబడిన వారితో, ‘బయలుదేరండి’ అని, \q2 చీకటిలో ఉన్నవారితో ‘బయటికి రండి’ అని చెప్పడానికి, \q1 \v 9 నిన్ను కాపాడి \q2 ప్రజలకు నిబంధనగా నియమిస్తాను. \b \q1 “వారు దారి ప్రక్కన తింటారు \q2 చెట్లులేని కొండలమీద పచ్చిక దొరుకుతుంది. \q1 \v 10 వారికి ఆకలి గాని దాహం గాని వేయదు. \q2 ఎడారి వేడిగాలి గాని, ఎండ గాని వారికి తగలదు. \q1 వారిపట్ల దయగలవాడు వారిని తీసుకెళ్లి \q2 నీటి ఊటల ప్రక్క వారిని నడిపిస్తాడు. \q1 \v 11 నా పర్వతాలన్నిటిని దారులుగా చేస్తాను \q2 నా రహదారులు ఎత్తు చేయబడతాయి. \q1 \v 12 చూడండి, వారు దూరం నుండి వస్తారు \q2 కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి, \q2 కొందరు సీనీయుల\f + \fr 49:12 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa అశ్వాను\fqa*\f* దేశం నుండి వస్తారు.” \b \q1 \v 13 ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి; \q2 భూమీ, సంతోషించు; \q2 పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి! \q1 ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు, \q2 బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు. \b \q1 \v 14 అయితే సీయోను, “యెహోవా నన్ను విడిచిపెట్టారు. \q2 ప్రభువు నన్ను మరచిపోయారు” అని అన్నది. \b \q1 \v 15 “తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా? \q2 తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా? \q1 తల్లియైన మరచిపోవచ్చు కాని \q2 నేను నిన్ను మరవను! \q1 \v 16 చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను; \q2 నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి. \q1 \v 17 నీ కుమారులు తొందరగా తిరిగి వస్తారు. \q2 నిన్ను నాశనం చేసినవారు నీ నుండి వెళ్లిపోతారు. \q1 \v 18 నీ కళ్ళెత్తి చుట్టూ చూడు; \q2 నీ పిల్లలందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు. \q1 ‘వారందరిని నీవు ఆభరణంగా ధరించుకుంటావు; \q2 పెళ్ళికుమార్తెలా నీవు వారిని ధరించుకుంటావు. \q2 నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \b \q1 \v 19 “నీవు నాశనమై నిర్మానుష్యంగా చేయబడినా \q2 నీ దేశం పాడుబడినా \q1 నీ భూమి నీ ప్రజలకు ఇరుకుగా ఉంటుంది, \q2 నిన్ను మ్రింగివేసినవారు దూరంగా ఉంటారు. \q1 \v 20 నీవు కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు, \q2 ‘ఈ స్ధలం మాకు ఇరుకుగా ఉంది. \q1 ఇంకా విశాలమైన స్ధలం మాకు ఇవ్వు’ అని \q2 నీవు వింటుండగా అంటారు. \q1 \v 21 అప్పుడు నీవు నీ హృదయంలో, \q2 ‘వీరిని నా కోసం ఎవరు కన్నారు? \q1 నేను నా పిల్లల్ని కోల్పోయిన గొడ్రాలిని; \q2 నేను బందీ అయ్యాను, తిరస్కరించబడ్డాను. \q2 ఈ పిల్లల్ని ఎవరు పెంచారు? \q1 నేను ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను. \q2 కానీ వీరు ఎక్కడ నుండి వచ్చారు?’ ” \m అని అనుకుంటావు. \p \v 22 ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “చూడు, నేను దేశాలకు సైగ చేస్తాను, \q2 జనాంగాల వైపు నా జెండాను ఎత్తుతాను; \q1 వారు నీ కుమారులను తమ చేతుల్లో తీసుకువస్తారు \q2 నీ కుమార్తెలను తమ భుజాల మీద మోసుకువస్తారు. \q1 \v 23 రాజులు నిన్ను పోషించే తండ్రులుగా \q2 వారి రాణులు నీకు పాలిచ్చే తల్లులుగా ఉంటారు. \q1 వారు నీ ఎదుట తమ ముఖాన్ని నేలకు ఆనించి నమస్కారం చేస్తారు; \q2 నీ పాదాల దగ్గర ఉన్న దుమ్మును నాకుతారు. \q1 అప్పుడు నీవు, నేను యెహోవాను అని, \q2 నా కోసం నిరీక్షణతో ఉన్నవారు నిరాశ చెందరని తెలుసుకుంటావు.” \b \q1 \v 24 యోధుల నుండి దోపుడుసొమ్ము తీసుకోబడుతుందా? \q2 నీతిమంతుని నుండి బందీలు విడిపించబడతారా? \p \v 25 అయితే యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “అవును, వీరుల నుండి బందీలు విడిపించబడతారు, \q2 క్రూరుల నుండి దోపుడుసొమ్ము తిరిగి వస్తుంది; \q1 నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను. \q2 నీ పిల్లలను నేను రక్షిస్తాను. \q1 \v 26 నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; \q2 ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. \q1 అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని \q2 యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని \q2 మానవులందరూ తెలుసుకుంటారు.” \c 50 \s1 ఇశ్రాయేలు పాపం, దాసుని విధేయత \p \v 1 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన \q2 విడాకుల పత్రం ఎక్కడ? \q1 నా అప్పుల వారిలో \q2 ఎవరికి మిమ్మల్ని అమ్మివేశాను? \q1 మీ పాపాలను బట్టి మీరు అమ్మబడ్డారు; \q2 మీ అతిక్రమాలను బట్టి మీ తల్లి పంపివేయబడింది. \q1 \v 2 నేను వచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఎవరూ లేరు? \q2 నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవరూ జవాబివ్వలేదు? \q1 నా చేయి నిన్ను విడిపించలేనంత చిన్నగా ఉందా? \q2 నిన్ను రక్షించడానికి నాకు బలం లేదా? \q1 కేవలం ఒక గద్దింపుతో నేను సముద్రం ఎండిపోయేలా చేస్తాను, \q2 నదులను ఎడారిగా చేస్తాను; \q1 నీళ్లు లేక వాటి చేపలు కుళ్ళిపోయి \q2 దాహంతో చస్తాయి. \q1 \v 3 ఆకాశాలకు చీకటి కమ్మేలా చేస్తాను \q2 దానిని గోనెపట్టతో కప్పుతాను.” \b \q1 \v 4 అలసినవారిని బలపరిచే మాటలు మాట్లాడడానికి \q2 చక్కగా ఉపదేశించే నాలుకను ప్రభువైన యెహోవా నాకు ఇచ్చారు. \q1 ఆయన ప్రతి ఉదయం నన్ను మేల్కొలుపుతారు, \q2 శిష్యునిలా నేను శ్రద్ధగా వినేలా చేస్తారు. \q1 \v 5 ప్రభువైన యెహోవా నా చెవులు తెరిచారు; \q2 నేను తిరుగుబాటు చేయలేదు. \q2 వినకుండా నేను వెనుతిరగలేదు. \q1 \v 6 నన్ను కొట్టినవారికి నా వీపు అప్పగించాను, \q2 నా గడ్డం పెరికినవారికి నా చెంపలు అప్పగించాను; \q1 హేళన చేసిన వారి నుండి, ఉమ్మివేసిన వారి నుండి \q2 నా ముఖం దాచుకోలేదు. \q1 \v 7 ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు కాబట్టి \q2 నేను సిగ్గుపరచబడను. \q1 నేను సిగ్గుపరచబడనని నాకు తెలుసు \q2 కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలా చేసుకున్నాను. \q1 \v 8 నన్ను నీతిమంతునిగా ఎంచే వాడు సమీపంలోనే ఉన్నాడు. \q2 నాపై ఎవరు అభియోగాలు మోగపలరు? \q2 మనం కలిసి వాదించుకుందాం! \q1 నా ప్రతివాది ఎవడు? \q2 అతడు నన్ను ఎదిరించాలి! \q1 \v 9 ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు. \q2 నన్ను ఎవరు ఖండిస్తారు? \q1 వారందరూ వస్త్రంలా పాతబడిపోతారు. \q2 చిమ్మెటలు వారిని తినివేస్తాయి. \b \q1 \v 10 మీలో యెహోవాకు భయపడి \q2 ఆయన సేవకుని మాట వినే వారెవరు? \q1 వెలుగు లేకుండా ఉంటూ \q2 చీకటిలో నడిచేవాడు \q1 యెహోవా నామాన్ని నమ్మి \q2 తన దేవునిపై ఆధారపడాలి. \q1 \v 11 అయితే ఇప్పుడు అగ్నిని ముట్టించి \q2 మీ చుట్టూ మండుతున్న దివిటీలను పెట్టుకునే మీరందరు, \q1 వెళ్లండి, మీ మంటల వెలుగులో నడవండి \q2 మీరు వెలిగించిన దివిటీల మంటల్లో నడవండి. \q1 నా చేతి నుండి మీరు పొందుకునేది ఇదే: \q2 మీరు వేదనలో పడుకుంటారు. \c 51 \s1 సీయోనుకు శాశ్వతమైన రక్షణ \q1 \v 1 “నీతిని అనుసరిస్తూ యెహోవాను వెదికే వారలారా, \q2 నా మాట వినండి: \q1 మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో దానివైపు చూడండి, \q2 మీరు ఏ గని నుండి తీయబడ్డారో దానివైపు చూడండి; \q1 \v 2 మీ తండ్రియైన అబ్రాహామును, \q2 మీకు జన్మనిచ్చిన శారాను చూడండి, \q1 అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను, \q2 అతన్ని ఆశీర్వదించి అతన్ని అనేకమందిగా చేశాను. \q1 \v 3 యెహోవా తప్పకుండా సీయోనును ఓదారుస్తారు \q2 దాని శిథిలాలన్నిటిని దయతో చూస్తారు; \q1 దాని ఎడారులను ఏదెనులా చేస్తారు. \q2 దాని బీడుభూములను యెహోవా తోటలా చేస్తారు. \q1 ఆనంద సంతోషాలు, \q2 కృతజ్ఞతాస్తుతులు, సంగీత ధ్వనులు దానిలో కనబడతాయి. \b \q1 \v 4 “నా ప్రజలారా, మా మాట వినండి; \q2 నా దేశమా, నా మాట విను: \q1 నా దగ్గర నుండి ఒక హెచ్చరిక వెళ్తుంది; \q2 నా న్యాయం దేశాలకు వెలుగుగా మారుతుంది. \q1 \v 5 నా నీతి వేగంగా సమీపిస్తుంది, \q2 నా రక్షణ మార్గంలో ఉంది. \q2 నా చేయి దేశాలకు తీర్పు తీరుస్తుంది. \q1 ద్వీపాలు నా వైపు చూస్తాయి, \q2 నిరీక్షణతో నా చేయి కోసం వేచి ఉంటాయి. \q1 \v 6 ఆకాశాల వైపు మీ కళ్ళెత్తి చూడండి, \q2 క్రిందున్న భూమిని చూడండి; \q1 ఆకాశాలు పొగలా మాయమైపోతాయి, \q2 భూమి వస్త్రంలా పాతబడిపోతుంది \q2 దాని నివాసులు జోరీగల్లా చనిపోతారు. \q1 అయితే నా రక్షణ నిత్యం ఉంటుంది, \q2 నా నీతి ఎన్నటికీ విఫలం కాదు. \b \q1 \v 7 “సరియైనది తెలిసినవారలారా, నా మాట వినండి. \q2 నా బోధను హృదయంలో ఉంచుకున్న ప్రజలారా, వినండి: \q1 కేవలం మనుష్యులు వేసే నిందలకు భయపడకండి \q2 వారి దూషణకు దిగులుపడకండి. \q1 \v 8 వస్త్రాన్ని కొరికినట్లు చిమ్మెట వారిని తినివేస్తుంది; \q2 పురుగు బొచ్చును కొరికినట్లు వారిని మ్రింగివేస్తుంది. \q1 అయితే నా నీతి నిత్యం ఉంటుంది, \q2 నా రక్షణ తరతరాలు ఉంటుంది.” \b \q1 \v 9 యెహోవా హస్తమా, మేలుకో మేలుకో, \q2 బలాన్ని ధరించుకో! \q1 పాత తరంలో ఉన్నట్లు \q2 గడచిన కాలంలో ఉన్నట్లు లేచిరా. \q1 రాహాబును ముక్కలుగా నరికింది నీవే కదా? \q2 సముద్రపు మృగాన్ని పొడిచింది నీవే కదా? \q1 \v 10 సముద్రాన్ని లోతైన జలాలను \q2 ఎండిపోయేలా చేసింది నీవే కదా, \q1 విడిపించబడిన వారు దాటి వెళ్లేలా \q2 సముద్ర లోతుల్లో దారి చేసింది నీవే కదా? \q1 \v 11 యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. \q2 వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; \q2 నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. \q1 వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. \q2 దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి. \b \q1 \v 12 “నేను నేనే మిమ్మల్ని ఓదార్చుతాను. \q2 చనిపోయే మనుష్యులకు గడ్డివంటి మనుష్యులకు \q2 మీరు ఎందుకు భయపడతారు? \q1 \v 13 ఆకాశాలను విస్తరింపజేసి \q2 భూమి పునాదులను వేసిన \q2 మీ సృష్టికర్తయైన యెహోవాను ఎందుకు మరచిపోయారు? \q1 బాధించేవాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు \q2 వాని కోపాన్ని చూసి \q2 ప్రతిరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నారు? \q1 బాధించేవాని కోపం ఏమయ్యింది? \q2 \v 14 క్రుంగిపోయిన ఖైదీలు త్వరలో విడుదల పొందుతారు; \q1 వారు తమ చెరసాల గోతిలో చనిపోరు. \q2 వారికి ఆహారం తక్కువకాదు. \q1 \v 15 నేను మీ దేవుడనైన యెహోవాను, \q2 సముద్రపు అలలు ఘోషించేలా నేను దానిని రేపుతాను. \q2 సైన్యాల యెహోవా అని ఆయనకు పేరు. \q1 \v 16 నీ నోటిలో నా మాటలు ఉంచి \q2 నా చేతి నీడలో నిన్ను కప్పాను, \q1 నేను ఆకాశాలను స్థాపించాను, \q2 భూమి పునాదులు వేసినవాడను \q2 ‘మీరే నా ప్రజలు’ అని సీయోనుతో చెప్పాను.” \s1 యెహోవా ఉగ్రత పాత్ర \q1 \v 17 యెరూషలేమా లే, \q2 మేలుకో, మేలుకో! \q1 యెహోవా ఉగ్రత పాత్రను \q2 ఆయన చేతి నుండి తీసుకుని నీవు త్రాగావు. \q1 ప్రజలను తడబడేలా చేసే పాత్రలోనిది అంతా \q2 మడ్డితో సహా పూర్తిగా నీవు త్రాగావు. \q1 \v 18 ఆమెకు పుట్టిన పిల్లలందరిలో \q2 తనకు దారి చూపడానికి ఎవరూ లేరు; \q1 ఆమె పెంచిన పిల్లలందరిలో \q2 తన చేతిని పట్టుకునే వారెవరూ లేరు. \q1 \v 19 ఈ రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. \q2 నిన్ను ఎవరు ఓదార్చగలరు? \q1 విధ్వంసం, వినాశనం, కరువు, ఖడ్గం నీ మీదికి వచ్చాయి, \q2 నిన్ను ఎవరు ఆదరించగలరు? \q1 \v 20 నీ పిల్లలు మూర్ఛపోయారు. \q2 దుప్పి వలలో చిక్కుకున్నట్లు \q2 ప్రతి వీధి మూలల్లో వారు పడిపోయారు. \q1 యెహోవా ఉగ్రతతో \q2 నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు. \b \q1 \v 21 ద్రాక్షరసం లేకుండానే మత్తులో మునిగి \q2 శ్రమపడినదానా, ఈ మాట విను. \q1 \v 22 తన ప్రజల కోసం వాదించే నీ దేవుడు \q2 నీ ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “చూడు, నిన్ను తడబడేలా చేసే పాత్రను, \q2 నా ఉగ్రత పాత్రను \q1 నీ చేతిలో నుండి తీసివేశాను. \q2 నీవు మరలా దానిని త్రాగవు. \q1 \v 23 ‘మేము మీమీద నడిచేటట్లు క్రింద పడుకో’ \q2 అని నీతో చెప్పి \q2 నిన్ను బాధపెట్టేవాని చేతుల్లో దానిని పెడతాను, \q1 నీవు నీ వీపును నేలకు వంచి \q2 నడిచి వెళ్లడానికి ఒక వీధిగా చేశావు.” \b \b \c 52 \q1 \v 1 సీయోనూ, మేలుకో మేలుకో, \q2 నీ బలాన్ని ధరించుకో! \q1 పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! \q2 నీ సుందరమైన వస్త్రాలను ధరించుకో. \q1 సున్నతి పొందనివారు గాని అపవిత్రులు గాని \q2 నీ లోనికి మరలా ప్రవేశించరు. \q1 \v 2 నీ దుమ్ము దులుపుకో; \q2 యెరూషలేమా, లేచి కూర్చో. \q1 బందీగా ఉన్న సీయోను కుమారీ, \q2 నీ మెడకున్న సంకెళ్ళు తీసివెయ్యి. \p \v 3 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “మీరు ఉచితంగా అమ్మబడ్డారు, \q2 డబ్బులు ఇవ్వకుండానే మీరు విడిపించబడతారు.” \p \v 4 ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “నా ప్రజలు మొదట నివసించడానికి ఈజిప్టుకు వెళ్లారు; \q2 తర్వాత అష్షూరు వారిని బాధించింది. \p \v 5 “ఇప్పుడు ఇక్కడ నాకున్నది ఏంటి?” అని యెహోవా అంటున్నారు. \q1 “నా ప్రజలు ఏ కారణం లేకుండా కొనిపోబడ్డారు. \q2 వారిని పాలించేవారు వారిని ఎగతాళి చేస్తున్నారు \q1 రోజంతా నా నామం దూషించబడుతుంది” \q2 అని యెహోవా అంటున్నారు. \q1 \v 6 “కాబట్టి నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు; \q2 కాబట్టి దీని గురించి ముందుగా చెప్పింది నేనని \q1 వారు తెలుసుకుంటారు. \q2 అవును, అది నేనే.” \b \q1 \v 7 సువార్త ప్రకటిస్తూ, \q2 సమాధానాన్ని చాటిస్తూ, \q1 శుభవార్తను తీసుకువస్తూ, \q2 రక్షణ గురించి ప్రకటిస్తూ, \q2 సీయోనుతో, “నీ దేవుడు పాలిస్తున్నారు” \q1 అనే సువార్తను తెచ్చేవారి పాదాలు \q2 పర్వతాలమీద ఎంతో అందమైనవి. \q1 \v 8 వినండి! మీ కావలివారు కేకలు వేస్తున్నారు; \q2 వారంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. \q1 యెహోవా సీయోనుకు తిరిగి వచ్చినప్పుడు \q2 వారు తమ కళ్లారా చూస్తారు. \q1 \v 9 యెహోవా తన ప్రజలను ఆదరించారు, \q2 ఆయన యెరూషలేమును విడిపించారు. \q1 కాబట్టి యెరూషలేము శిథిలాల్లారా, \q2 కలిసి సంతోషంతో పాటలు పాడండి. \q1 \v 10 అన్ని దేశాలు చూస్తుండగా \q2 యెహోవా తన పరిశుద్ధ చేతిని విప్పుతారు. \q1 భూమి అంచుల వరకు ఉండేవారంతా \q2 మన దేవుని రక్షణను చూస్తారు. \b \q1 \v 11 వెళ్లండి, వెళ్లండి, అక్కడినుండి వెళ్లండి! \q2 అపవిత్రమైన దానిని తాకకండి! \q1 యెహోవా మందిరపు ఉపకరణాలను మోసేవారలారా, \q2 అక్కడినుండి వెళ్లి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. \q1 \v 12 యెహోవా మీకు ముందుగా వెళ్తారు, \q2 ఇశ్రాయేలు దేవుడు మీ వెనుక కాపలా ఉంటారు. \q1 కాని మీరు తొందరగా బయలుదేరి వెళ్లరు. \q2 పారిపోతున్నట్లు వెళ్లరు. \s1 సేవకుని బాధలు, మహిమ \q1 \v 13 చూడండి, నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు;\f + \fr 52:13 \fr*\ft లేదా \ft*\fqa వృద్ధి చెందుతాడు\fqa*\f* \q2 అతడు హెచ్చింపబడి ప్రసిద్ధిచెంది ఉన్నతంగా ఘనపరచబడతాడు. \q1 \v 14 మనుష్యులందరి కంటే అతని ముఖం చాలా వికారమని \q2 అతని రూపం మనిషిలా లేదని \q2 అతన్ని చూసి అనేకమంది దిగ్భ్రాంతి చెందినట్లు, \q1 \v 15 అతడు అనేక దేశాలను ఆశ్చర్యపడేలా చేస్తారు, \q2 అతన్ని బట్టి రాజులు నోళ్ళు మూసుకుంటారు. \q1 ఎందుకంటే తమకు తెలియజేయబడని సంగతులను వారు చూస్తారు. \q2 తాము వినని వాటిని వారు గ్రహిస్తారు. \b \c 53 \q1 \v 1 మా సందేశాన్ని ఎవరు నమ్మారు? \q2 యెహోవా హస్తం ఎవరికి వెల్లడయింది? \q1 \v 2 లేత మొక్కలా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా \q2 అతడు ఆయన ఎదుట పెరిగాడు. \q1 మనల్ని అతనివైపు ఆకర్షించేంత అందం గాని ఘనత గాని అతనికి లేదు, \q2 మనం అతన్ని కోరుకునేంతగా మంచి రూపమేమీ అతనికి లేదు. \q1 \v 3 అతడు మనుష్యులచే తృణీకరించబడి తిరస్కరించబడినవానిగా, \q2 శ్రమలు అనుభవించినవానిగా, బాధను ఎరిగినవానిగా ఉన్నాడు. \q1 ప్రజలు అతన్ని చూడకుండ ముఖం దాచుకుంటారు; \q2 అతడు నిర్లక్ష్యం చేయబడ్డాడు, మనం అతన్ని చిన్న చూపు చూశాము. \b \q1 \v 4 ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు. \q2 మన రోగాలను భరించారు; \q1 అయినా అతడు దేవునిచే శిక్షించబడ్డాడని \q2 దెబ్బలు బాధలు అనుభవించాడని మనం అనుకున్నాము. \q1 \v 5 అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు \q2 మన దోషాల కారణంగా నలగ్గొట్టబడ్డాడు. \q1 మనకు సమాధానం ఇచ్చే శిక్ష అతని మీద పడింది. \q2 అతని గాయాల కారణంగా మనం స్వస్థత పొందాము. \q1 \v 6 మనమందరం గొర్రెల్లా దారి తప్పిపోయాము. \q2 మనలో ప్రతి ఒక్కరూ తనకిష్టమైన దారిలో తిరిగిపోయారు. \q1 యెహోవా మనందరి దోషాన్ని \q2 అతని మీద మోపారు. \b \q1 \v 7 అతడు పీడించబడి బాధించబడినా \q2 అతడు తన నోరు తెరవలేదు; \q1 వధించబడడానికి తేబడిన గొర్రెపిల్లలా, \q2 బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు, \q2 ఆయన తన నోరు తెరవలేదు. \q1 \v 8 అన్యాయమైన తీర్పుతో అతన్ని తీసుకెళ్లారు. \q2 అయినా అతని తరంలో నిరసన తెలిపింది ఎవరు? \q1 సజీవుల భూమి మీద నుండి అతడు తీసివేయబడ్డాడు; \q2 అతడు నా ప్రజల పాపాల కోసం శిక్షించబడ్డాడు. \q1 \v 9 అతడు అన్యాయమేమీ చేయలేదు, \q2 అతని నోటిలో ఏ మోసం లేదు కాని \q1 అతడు చనిపోయినప్పుడు దుర్మార్గులతో సమాధి చేశారు, \q2 ధనవంతుల సమాధిలో అతన్ని ఉంచారు. \b \q1 \v 10 అయినా అతన్ని నలగ్గొట్టడం యెహోవాకు ఇష్టమైంది, \q2 యెహోవా అతని జీవితాన్ని పాపపరిహారబలిగా అర్పించినా, \q1 అతడు తన సంతానాన్ని చూస్తాడు, దీర్ఘకాలం జీవిస్తాడు, \q2 యెహోవా చిత్తం అతని హస్తంలో వృద్ధిచెందుతుంది. \q1 \v 11 అతడు శ్రమ పొందిన తర్వాత \q2 జీవిత వెలుగును\f + \fr 53:11 \fr*\ft కొ.ప్రా.ప్ర.లలో జీవిత వెలుగు అని లేదు\ft*\f* చూసి తృప్తి చెందుతాడు\f + \fr 53:11 \fr*\ft లేదా \ft*\fqa తన శ్రమ యొక్క ఫలితం చూస్తాడు, తృప్తి చెందుతాడు\fqa*\f*; \q1 నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానంతో అనేకమందిని సమర్థిస్తాడు, \q2 వారి దోషాలను అతడు భరిస్తాడు. \q1 \v 12 కాబట్టి గొప్పవారితో నేనతనికి భాగం ఇస్తాను. \q2 బలవంతులతో కలిసి అతడు దోపుడుసొమ్ము పంచుకుంటాడు. \q1 ఎందుకంటే తన ప్రాణాన్ని మరణం పొందడానికి ధారపోసాడు, \q2 అతడు అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు. \q1 అతడు అనేకుల పాపభారాన్ని భరిస్తూ, \q2 అపరాధుల గురించి విజ్ఞాపన చేశాడు. \c 54 \s1 సీయోనుకు కలుగబోయే మహిమ \q1 \v 1 “గొడ్రాలా, పిల్లలు కననిదానా, \q2 పాటలు పాడు. \q1 ప్రసవవేదన పడనిదానా, \q2 ఆనందంతో కేకలు వేయి. \q1 ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే \q2 విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువగా ఉంటారు” \q2 అని యెహోవా తెలియజేస్తున్నారు. \q1 \v 2 “నీ గుడారపు స్థలాన్ని పెద్దగా చేయి. \q2 నీ గుడారపు తెరలను ఆటంకం లేకుండా \q2 ముందుకు పొడిగించు \q1 నీ త్రాళ్లను పొడవుగా చేయి. \q2 నీ మేకుల్ని లోతుగా దిగగొట్టు. \q1 \v 3 నీవు కుడి వైపుకు ఎడమవైపుకు వ్యాపిస్తావు; \q2 నీ వారసులు దేశాలను స్వాధీనం చేసుకుని \q2 నిర్జనమైన వారి పట్టణాల్లో స్థిరపడతారు. \b \q1 \v 4 “భయపడకు; నీవు సిగ్గుపరచబడవు \q2 అవమానానికి భయపడకు; నీవు అవమానపరచబడవు. \q1 నీ యవ్వనపు సిగ్గును నీవు మరచిపోతావు \q2 నీ వైధవ్యపు నిందను ఇకపై జ్ఞాపకం చేసుకోవు. \q1 \v 5 నిన్ను సృష్టించినవాడే నీ భర్త \q2 ఆయన పేరు సైన్యాల యెహోవా, \q1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు; \q2 ఆయన భూమి అంతటికి దేవుడు. \q1 \v 6 విడిచిపెట్టబడి మనోవేదనకు గురైన భార్యను భర్త పిలిచినట్లు \q2 తిరస్కరించబడిన యవ్వనంలో ఉన్న భార్యను భర్త పిలిచినట్లు, \q1 యెహోవా నిన్ను తిరిగి పిలుస్తారు” \q2 అని నీ దేవుడు చెప్తున్నారు. \q1 \v 7 “కొద్ది కాలం నేను నిన్ను విడిచిపెట్టాను, \q2 కానీ గొప్ప జాలితో నేను నిన్ను తిరిగి చేర్చుకుంటాను. \q1 \v 8 తీవ్రమైన కోపంలో \q2 కొంతకాలం నీవైపు నేను చూడలేదు \q1 కాని నిత్యమైన కృపతో \q2 నీపై జాలి చూపిస్తాను” \q2 అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు. \b \q1 \v 9 “ఇది నాకు నోవహు కాలంలోని జలప్రళయంలా ఉంది, \q2 జలప్రళయం భూమి మీదికి ఇకపై రాదని నోవహు కాలంలో నేను ప్రమాణం చేశాను. \q1 అలాగే ఇప్పుడు నీ మీద కోప్పడనని, ఎన్నడు నిన్ను గద్దించనని \q2 నేను ప్రమాణం చేశాను. \q1 \v 10 పర్వతాలు కదిలినా \q2 కొండలు తొలగిపోయినా \q1 నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. \q2 నా సమాధాన నిబంధన తొలిగిపోదు” \q2 అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు. \b \q1 \v 11 “తుఫానులతో కొట్టుకుపోతూ ఓదార్పు లేక బాధపడుతున్న పట్టణమా, \q2 వైడూర్యాలతో నేను నిన్ను తిరిగి కడతాను, \q2 నీలమణులతో నీ పునాదులను వేస్తాను. \q1 \v 12 రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు, \q2 మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు \q2 ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను. \q1 \v 13 యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు \q2 వారికి గొప్ప సమాధానం కలుగుతుంది. \q1 \v 14 నీవు నీతిలో స్థాపించబడతావు: \q1 బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. \q2 నీవు దేనికి భయపడే అవసరం లేదు. \q1 భయం నీకు దూరంగా ఉంటుంది. \q2 అది నీ దగ్గరకు రాదు. \q1 \v 15 ఎవరైనా నీ మీద దాడి చేస్తే, అది చేసింది నేను కాదు; \q2 నీ మీద దాడి చేసినవారు నీకు లొంగిపోతారు. \b \q1 \v 16 “చూడు, నిప్పులు ఊది మండించి \q2 తన పనికి తగిన ఆయుధాన్ని తయారుచేసే \q2 కమ్మరిని సృజించింది నేనే. \q1 నాశనం చేయడానికి నాశనం చేసేవాన్ని సృష్టించింది నేనే. \q2 \v 17 నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు, \q2 నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. \q1 యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే, \q2 నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \c 55 \s1 దాహంతో ఉన్నవారికి ఆహ్వానం \q1 \v 1 దాహంతో ఉన్నవారలారా, \q2 నీళ్ల దగ్గరకు రండి. \q1 డబ్బులేని వారలారా, \q2 మీరు వచ్చి కొని తినండి! \q1 డబ్బు లేకపోయినా ఏమీ చెల్లించకపోయినా, \q2 ద్రాక్షరసం, పాలు కొనండి. \q1 \v 2 ఆహారం కాని దాని కోసం మీరెందుకు డబ్బు ఖర్చుపెడతారు? \q2 తృప్తి కలిగించని వాటికోసం ఎందుకు కష్టార్జితాన్ని వెచ్చిస్తారు? \q1 వినండి, నా మాట వినండి, ఏది మంచిదో దానిని తినండి, \q2 అప్పుడు మీరు గొప్ప వాటిని ఆనందిస్తారు. \q1 \v 3 శ్రద్ధగా విని నా దగ్గరకు రండి; \q2 మీరు వింటే బ్రతుకుతారు. \q1 నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, \q2 దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను. \q1 \v 4 చూడండి, నేను అతన్ని జనాంగాలకు సాక్షిగా చేశాను, \q2 జనాంగాలకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించాను. \q1 \v 5 ఖచ్చితంగా నీకు తెలియని దేశాలను నీవు పిలుస్తావు. \q2 యెహోవా నిన్ను మహిమపరచడం చూసి \q1 నీ దేవుడైన యెహోవాను బట్టి \q2 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి \q2 నీవెవరో తెలియని దేశాలు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి. \b \q1 \v 6 యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; \q2 ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి. \q1 \v 7 దుష్టులు తమ మార్గాలను \q2 అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. \q1 వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. \q2 మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు. \b \q1 \v 8 “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, \q2 మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు” \q2 అని యెహోవా చెప్తున్నారు. \q1 \v 9 “ఆకాశాలు భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నాయో, \q2 మీ మార్గాల కన్నా నా మార్గాలు \q2 మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి. \q1 \v 10 వర్షం మంచు ఆకాశం నుండి క్రిందికి వచ్చి \q2 ఎలా తిరిగి వెళ్లకుండా భూమిని తడిపి \q1 విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి \q2 భూమిని తడిపి \q1 విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి \q2 అది చిగురించి ఫలించేలా చేస్తాయో, \q1 \v 11 అలాగే నా నోటి నుండి వచ్చిన నా మాట ఉంటుంది: \q2 అది వట్టిగా నా దగ్గరకు తిరిగి రాకుండా \q1 నేను కోరుకున్న ప్రకారం చేసి \q2 నేను దానిని పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. \q1 \v 12 మీరు సంతోషంగా బయటకు వెళ్తారు, \q2 మీరు సమాధానంగా తీసుకెళ్తారు. \q1 మీ ఎదుట పర్వతాలు కొండలు \q2 పాటలు పాడడం ప్రారంభిస్తాయి, \q1 పొలం లోని చెట్లన్నీ \q2 తమ చేతులతో చప్పట్లు కొడతాయి. \q1 \v 13 ముండ్ల చెట్లకు బదులు సరళ వృక్షాలు పెరుగుతాయి, \q2 దురదగొండి చెట్లకు బదులు గొంజిచెట్లు ఎదుగుతాయి. \q1 ఇది యెహోవా కీర్తిగా నిత్యమైన గుర్తుగా \q2 ఎప్పటికీ నిలిచి ఉంటుంది.” \c 56 \s1 ఇతరులకు రక్షణ \p \v 1 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది, \q2 నా నీతి త్వరలో వెల్లడవుతుంది, \q1 కాబట్టి న్యాయంగా ఉండండి \q2 సరియైనది చేయండి. \q1 \v 2 ఎవరైతే సబ్బాతును అపవిత్రం చేయకుండ \q2 దానిని పట్టుదలతో ఆచరించేవారు, \q1 ఏ కీడు చేయకుండ, \q2 తమ చేతిని బిగబట్టుకునేవారు ధన్యులు.” \b \q1 \v 3 యెహోవాను వెంబడించే ఏ విదేశీయుడైనా, \q2 “యెహోవా తన ప్రజల్లో నుండి నన్ను వెలివేస్తారు” అని అనకూడదు. \q1 ఏ నపుంసకుడైనా, \q2 “నేను కేవలం ఎండిన చెట్టును” అని అనకూడదు. \p \v 4 ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “నేను నియమించిన సబ్బాతును పాటిస్తూ \q2 నాకిష్టమైన వాటిని కోరుకుంటూ \q2 నా నిబంధనకు నమ్మకంగా ఉండే నపుంసకులకు, \q1 \v 5 నా మందిరంలో, నా గోడలలో, \q2 కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న \q2 శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను. \q1 ఎప్పటికీ నిలిచివుండే \q2 నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను. \q1 \v 6 యెహోవాకు కట్టుబడి ఉంటూ \q2 ఆయనకు సేవ చేస్తూ, \q1 యెహోవా నామాన్ని ప్రేమిస్తూ, \q2 ఆయన సేవకులుగా ఉంటూ \q1 సబ్బాతును అపవిత్రపరచకుండా పాటిస్తూ, \q2 నా నిబంధన నమ్మకంగా పాటిస్తున్న విదేశీయులందరిని \q1 \v 7 నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను, \q2 నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను. \q1 నా బలిపీఠం మీద వారు అర్పించే \q2 దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి; \q1 నా మందిరం అన్ని దేశాలకు \q2 ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది.” \q1 \v 8 ఇశ్రాయేలీయులలో బందీగా కొనిపోబడినవారిని సమకూర్చే \q2 ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నారు: \q1 “నేను సమకూర్చిన వారే కాకుండా \q2 వారితో పాటు ఇతరులను సమకూర్చుతాను.” \s1 దుష్టులపై దేవుని ఆరోపణ \q1 \v 9 పొలం లోని సమస్త జంతువులారా, రండి, \q2 అడవిలోని సమస్త మృగాల్లారా, వచ్చి తినండి! \q1 \v 10 ఇశ్రాయేలు కావలివారు గ్రుడ్డివారు. \q2 వారందరికి తెలివిలేదు; \q1 వారందరు మూగ కుక్కలు, \q2 వారు మొరగలేరు; \q1 వారు పడుకుని కలలు కంటారు, \q2 నిద్రంటే వారికి ఇష్టము. \q1 \v 11 వారు తిండి కోసం ఆరాటపడే కుక్కల వంటి వారు. \q2 ఎంత తిన్నా వారికి తృప్తి ఉండదు. \q1 వారు వివేచనలేని కాపరులుగా ఉన్నారు; \q2 వారందరు తమకిష్టమైన దారుల్లో పోతారు, \q2 తమ సొంత ప్రయోజనం చూసుకుంటారు. \q1 \v 12 వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను \q2 మనం తృప్తిగా మద్యం త్రాగుదాం! \q1 ఈ రోజులానే రేపు ఉంటుంది, \q2 ఇంకా మంచిగా ఉంటుంది” అంటారు. \b \b \c 57 \q1 \v 1 నీతిమంతులు నశిస్తారు, \q2 ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు; \q1 భక్తులు మాయమైపోతారు, \q2 కీడు చూడకుండ \q1 నీతిమంతులు కొనిపోబడడం \q2 ఎవరూ గ్రహించరు. \q1 \v 2 యథార్థంగా జీవించేవారు \q2 సమాధానంలో ప్రవేశిస్తారు; \q2 వారు చనిపోయినప్పుడు వారికి విశ్రాంతి కలుగుతుంది. \b \q1 \v 3 “అయితే మంత్రగత్తె పిల్లలారా! వ్యభిచారసంతానమా! \q2 వేశ్యసంతానమా! ఇక్కడకు రండి. \q1 \v 4 మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? \q2 ఎవరిని చూసి వెక్కిరిస్తూ \q2 మీ నాలుక చాపుతున్నారు \q1 మీరు తిరుగుబాటుదారులు, \q2 అబద్ధికుల సంతానం కాదా? \q1 \v 5 మీరు సింధూర వృక్షాల క్రింద పచ్చని ప్రతి చెట్టు క్రింద \q2 కామంతో రగిలిపోతున్నారు; \q1 మీరు కనుమలలో, రాతిసందుల క్రింద \q2 మీ పిల్లలను బలి ఇస్తారు. \q1 \v 6 కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము; \q2 నిజంగా అవే మీకు భాగము. \q1 అవును వాటికి మీ పానార్పణలు పోశారు, \q2 భోజనార్పణలు చెల్లించారు. \q2 ఇదంతా చూసి నేను క్షమించాలా? \q1 \v 7 చాలా ఎత్తైన పర్వతం మీద మీరు మీ పరుపు వేసుకున్నారు; \q2 బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కి వెళ్లారు. \q1 \v 8 తలుపుల వెనుక ద్వారబంధాల వెనుక \q2 మీ యూదేతర గుర్తులు పెట్టారు. \q1 నన్ను విడిచిపెట్టి మీ పరుపును పరిచారు \q2 దాని మీదకు ఎక్కి దానిని వెడల్పు చేశారు; \q1 మీరు వారి మంచాలను ప్రేమించి వారితో నిబంధన చేసుకున్నారు. \q2 వారి నగ్న శరీరాలను కామంతో చూశారు. \q1 \v 9 మీరు ఒలీవనూనె తీసుకుని మోలెకు\f + \fr 57:9 \fr*\ft లేదా \ft*\fqa రాజు\fqa*\f* దగ్గరకు వెళ్లారు \q2 ఎన్నో సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లారు. \q1 మీరు మీ రాయబారులను\f + \fr 57:9 \fr*\ft లేదా \ft*\fqa విగ్రహాలను\fqa*\f* దూరప్రాంతానికి పంపించారు; \q2 మీరు పాతాళమంత లోతుగా దిగబడిపోయారు! \q1 \v 10 మీరు దూర ప్రయాణాలు చేసి అలసిపోయారు, \q2 అయినా ‘అది సాధ్యం కాదు’ అని మీరు అనుకోలేదు. \q1 మీరు మీ తిరిగి బలం పొందుకున్నారు \q2 కాబట్టి మీరు సొమ్మసిల్లలేదు. \b \q1 \v 11 “మీరు ఎవరికి జడిసి భయపడి \q2 నా పట్ల నిజాయితీగా లేకుండా, \q1 నన్ను జ్ఞాపకం చేసుకోకుండా \q2 దీనిని పట్టించుకోకుండా ఉన్నారు? \q1 చాలా కాలం నేను మౌనంగా ఉన్నానని \q2 మీరు నాకు భయపడడం లేదు కదా? \q1 \v 12 నీ నీతిని పనులను నేను బయటపెడతాను \q2 అవి మీకు ప్రయోజనకరంగా ఉండవు. \q1 \v 13 మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు \q2 మీరు సేకరించిన మీ విగ్రహాలే మిమ్మల్ని రక్షించాలి! \q1 గాలి వాటన్నిటిని తీసుకెళ్తుంది, \q2 కేవలం ఒకని ఊపిరి వాటిని చెదరగొడుతుంది. \q1 అయితే నన్ను ఆశ్రయించినవారు \q2 దేశాన్ని స్వతంత్రించుకుంటారు \q2 నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.” \s1 పశ్చాత్తాపం చెందిన వారికి ఆదరణ \p \v 14 ఇలా చెప్పబడుతుంది: \q1 “కట్టండి, కట్టండి, దారిని సిద్ధపరచండి! \q2 నా ప్రజల మార్గంలో నుండి అడ్డుగా ఉన్నవాటిని తీసివేయండి.” \q1 \v 15 ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు, \q2 పరిశుద్ధుడు, నిత్యనివాసియైన దేవుడు ఇలా చెప్తున్నారు: \q1 “నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను, \q2 అంతేకాక వినయం గలవారి ఆత్మకు చైతన్యం కలిగించడానికి \q1 నలిగినవారి ప్రాణానికి చైతన్యం కలిగించడానికి \q2 ఆత్మలో వినయం, దీనమనస్సు గలవారి దగ్గర నివసిస్తాను. \q1 \v 16 నేను వారిని నిత్యం నిందించను, \q2 నేను ఎప్పుడు కోపంగా ఉండను \q1 ఎందుకంటే నా వలన వారు నీరసించిపోతారు. \q2 నేను పుట్టించిన ప్రజలు నీరసించిపోతారు. \q1 \v 17 వారి పాపిష్ఠి దురాశను బట్టి కోప్పడ్డాను \q2 నేను వారిని శిక్షించి కోపంతో నా ముఖం త్రిప్పుకున్నాను, \q2 అయినా వారు తమకిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. \q1 \v 18 నేను వారి మార్గాలను చూశాను, కాని వారిని బాగుచేస్తాను; \q2 నేను వారిని నడిపించి ఇశ్రాయేలులో దుఃఖించేవారిని ఓదారుస్తూ, \q2 \v 19 వారి పెదవులపై స్తుతి కలుగజేస్తాను. \q1 దూరంగా ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారికి \q2 సమాధానం, సమాధానం” అని యెహోవా అంటున్నారు. \q1 “నేను వారిని బాగుచేస్తాను.” \q1 \v 20 దుర్మార్గులు ఎగసిపడే సముద్రం వంటివారు. \q2 అది నెమ్మదిగా ఉండలేదు, \q2 దాని అలలు బురదను మురికిని పైకి తెస్తాయి. \q1 \v 21 “దుర్మార్గులకు సమాధానం ఉండదు” అని నా దేవుడు చెప్తున్నారు. \c 58 \s1 నిజమైన ఉపవాసం \q1 \v 1 “గట్టిగా కేకలు వేయండి, ఆపకండి. \q2 బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి. \q1 నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి, \q2 యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి. \q1 \v 2 ప్రతిరోజు వారు నన్ను వెదకుతారు; \q2 తమ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టని వారిగా \q1 నీతిని అనుసరించే దేశంగా \q2 నా మార్గాలు తెలుసుకోవడానికి అత్యాసక్తి చూపిస్తారు. \q1 తమకు న్యాయమైన తీర్పులు ఇవ్వాలని నన్ను అడుగుతారు, \q2 దేవుడు తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు. \q1 \v 3 వారంటారు, ‘మేము ఉపవాసం ఉండగా \q2 మీరెందుకు చూడరు? \q1 మమ్మల్ని మేము తగ్గించుకుంటే \q2 మీరెందుకు గమనించరు?’ \b \q1 “అయినా మీరు ఉపవాసం ఉన్న రోజున మీకు నచ్చినట్లుగా చేశారు \q2 మీ పనివారినందరిని దోచుకున్నారు. \q1 \v 4 మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో, \q2 ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది. \q1 మీ స్వరం పరలోకంలో వినపడాలని \q2 మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు. \q1 \v 5 ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది? \q2 మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా? \q1 ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని \q2 గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా? \q1 యెహోవాకు ఇష్టమైన ఉపవాసం \q2 ఇదేనని మీరనుకుంటున్నారా? \b \q1 \v 6 “నేను కోరుకునే ఉపవాసం \q1 అన్యాయపు సంకెళ్ళను విప్పడం, \q2 బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం, \q1 బాధించబడిన వారిని విడిపించడం, \q2 ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా? \q1 \v 7 మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం, \q2 ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం, \q1 మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం, \q2 మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం? \q1 \v 8 అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. \q2 మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది; \q1 అప్పుడు మీ నీతి\f + \fr 58:8 \fr*\ft లేదా \ft*\fq మీ \fq*\fqa నీతిమంతుడు\fqa*\f* మీ ముందుగా నడుస్తుంది \q2 యెహోవా మహిమ మీ వెనుక కాపలాగా ఉంటుంది. \q1 \v 9 అప్పుడు మీరు పిలిస్తే యెహోవా జవాబిస్తారు; \q2 మీరు మొరపెడితే ఆయన నేనున్నాను అంటారు. \b \q1 “మీరు ఇతరులను బాధించడం, \q2 వ్రేలుపెట్టి చూపిస్తూ చెడు మాట్లాడడం మానేస్తే, \q1 \v 10 ఆకలితో ఉన్నవారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి, \q2 బాధించబడినవారి అవసరాలను తీరిస్తే, \q1 చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది, \q2 మీ చీకటి మధ్యాహ్నపు వెలుగుగా మారుతుంది. \q1 \v 11 యెహోవా మిమ్మల్ని నిత్యం నడిపిస్తారు; \q2 కరువు కాలంలో ఆయన మిమ్మల్ని తృప్తిపరచి \q2 మీ ఎముకలను బలపరుస్తారు. \q1 మీరు నీరు పెట్టిన తోటలా \q2 ఎప్పుడూ నీరు వచ్చే నీటి ఊటలా ఉంటారు. \q1 \v 12 పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు. \q2 అనేక తరాల నాటి పునాదులను మీరు మరల వేస్తారు; \q1 మీరు కూలిన గోడలను మరమత్తు చేసే మేస్త్రీగా, \q2 నివాసయోగ్యంగా వీధుల్ని బాగు చేసేవారిగా పిలువబడతారు. \b \q1 \v 13 “నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా \q2 నా సబ్బాతును పాటిస్తే, \q1 సబ్బాతు ఆనందాన్ని కలిగిస్తుందని \q2 యెహోవా పరిశుద్ధ దినం ఘనమైనదని అనుకుంటే, \q1 దానిని గౌరవించి మీ సొంత మార్గంలో మీరు వెళ్లకుండా, \q2 మీకిష్టమైన పనులు చేయకుండా వట్టిమాటలు మాట్లాడకుండా ఉంటే, \q1 \v 14 అప్పుడు మీరు యెహోవాలో ఆనందిస్తారు, \q2 దేశంలో ఉన్నతస్థలాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను, \q2 మీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యాన్ని మీరు అనుభవించేలా చేస్తాను.” \q1 యెహోవా తెలియజేసిన మాట ఇదే. \c 59 \s1 పాపం, ఒప్పుకోలు, విమోచన \q1 \v 1 నిజంగా రక్షించలేనంతగా యెహోవా చేయి కురుచకాలేదు, \q2 వినలేనంతగా ఆయన చెవులు మందం కాలేదు. \q1 \v 2 కాని మీ పాపాలు మిమ్మల్ని \q2 మీ దేవుని నుండి వేరు చేశాయి; \q1 మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు కనబడకుండా చేశాయి, \q2 కాబట్టి ఆయన వినడం లేదు. \q1 \v 3 మీ చేతులు రక్తంతో \q2 మీ వ్రేళ్లు దోషంతో మలినమయ్యాయి. \q1 మీ పెదవులు అబద్ధాలు పలికాయి, \q2 మీ నాలుక చెడ్డ మాటలు మాట్లాడింది. \q1 \v 4 న్యాయం గురించి ఎవరూ పట్టించుకోరు; \q2 ఎవరూ నిజాయితితో వాదించరు. \q1 వారు వట్టి వాదనలను నమ్ముకుని అబద్ధాలు చెప్తారు; \q2 వారు హింసను గర్భం దాల్చి చెడును కంటారు. \q1 \v 5 వారు మిడునాగుల గుడ్లను పొదుగుతారు \q2 సాలెగూడు నేస్తారు. \q1 వారి గుడ్లు తిన్నవారు చనిపోతారు, \q2 ఒక గుడ్డు పగిలితే విషపాము పుడుతుంది. \q1 \v 6 వారి సాలెగూళ్లు దుస్తులకు పనికిరావు \q2 వారు తయారుచేసిన వాటితో తమను తాము కప్పుకోలేరు. \q1 వారి పనులు చెడుపనులు. \q2 వారి చేతులతో హింసాత్మక క్రియలు ఉన్నాయి. \q1 \v 7 వారి కాళ్లు పాపంలోకి పరుగెత్తుతాయి; \q2 నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి వారు త్వరపడతారు. \q1 వారు దుష్ట పథకాలు అనుసరిస్తారు. \q2 హింస క్రియలు వారి మార్గాల్లో ఉన్నాయి. \q1 \v 8 సమాధాన మార్గం వారికి తెలియదు; \q2 వారి మార్గాల్లో న్యాయం ఉండదు. \q1 వాటిని వారు వంకర దారులుగా చేశారు; \q2 వాటిలో నడిచే వారెవరికి సమాధానం ఉండదు. \b \q1 \v 9 కాబట్టి న్యాయం మనకు దూరంగా ఉంది, \q2 నీతి మనకు అందడం లేదు. \q1 మేము వెలుగు కోసం చూస్తున్నాం కాని అంతా చీకటే ఉంది; \q2 ప్రకాశం కోసం చూస్తున్నాం కాని కటిక చీకటిలోనే నడుస్తున్నాము. \q1 \v 10 గ్రుడ్డివారిలా గోడ కోసం తడుముకుంటున్నాము, \q2 కళ్లులేని వారిలా తడుముకుంటున్నాము. \q1 సంధ్య చీకటి అన్నట్టు మధ్యాహ్నం కాలుజారి పడుతున్నాము. \q2 బలవంతుల మధ్యలో చచ్చిన వారిలా ఉన్నాము. \q1 \v 11 మేమంతా ఎలుగుబంట్లలా కేకలు వేస్తున్నాము; \q2 పావురాల్లా దుఃఖంతో మూలుగుతున్నాము. \q1 మేము న్యాయం కోసం చూస్తున్నాం కాని అది దొరకడం లేదు. \q2 రక్షణ కోసం చూస్తున్నాం కాని అది మాకు దూరంగా ఉంది. \b \q1 \v 12 మా అపరాధాలన్నీ మా ఎదుట ఉన్నాయి \q2 మా పాపాలు మామీద సాక్ష్యం ఇస్తున్నాయి. \q1 మా అపరాధాలన్నీ ఎల్లప్పుడు మాతో ఉన్నాయి, \q2 మా దోషాలు మాకు తెలుసు. \q1 \v 13 తిరుగుబాటు చేసి యెహోవాకు ద్రోహం చేశాం, \q2 మా దేవునికి విరుద్ధంగా ఉంటూ, \q1 తిరుగుబాటును ప్రేరేపించడం బాధపెట్టడం, \q2 మా హృదయంలో ఆలోచించుకుని, అబద్ధాలు చెప్పడము. \q1 \v 14 కాబట్టి న్యాయం వెనుకకు నెట్టబడింది, \q2 నీతి దూరంగా నిలబడింది. \q1 సత్యం వీధుల్లో పడి ఉంది. \q2 నిజాయితీ లోపలికి రాలేకపోతుంది. \q1 \v 15 సత్యం ఎక్కడా కనిపించడం లేదు, \q2 చెడును విడిచిపెట్టేవాడు దోచుకోబడుతున్నాడు. \b \q1 న్యాయం జరగకపోవడం చూసి \q2 యెహోవా అసంతృప్తి చెందారు. \q1 \v 16 ఎవరూ లేరని ఆయన చూశారు, \q2 మధ్యవర్తి ఎవరూ లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు; \q1 కాబట్టి ఆయన చేయి ఆయనకు సహాయం చేసింది, \q2 ఆయన నీతి ఆయనను నిలబెట్టింది. \q1 \v 17 ఆయన నీతిని తన కవచంగా ధరించారు, \q2 రక్షణను తన తలమీద శిరస్త్రాణంగా ధరించారు; \q1 ఆయన ప్రతీకార వస్త్రాలను ధరించారు \q2 పై వస్త్రం ధరించినట్లు ఆయన తనను తాను ఆసక్తితో చుట్టుకున్నారు. \q1 \v 18 వారు చేసిన దానిని బట్టి \q2 ఆయన ప్రతిఫలం ఇస్తారు \q1 తన శత్రువులకు కోపం చూపిస్తారు \q2 తన విరోధులకు ప్రతీకారం చేస్తారు; \q2 ఆయన ద్వీపాలకు తగిన ప్రతిఫలాన్ని చెల్లిస్తారు. \q1 \v 19 పశ్చిమలో ఉన్నవారు యెహోవా నామానికి భయపడతారు. \q2 సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమను గౌరవిస్తారు. \q1 యెహోవా ఊపిరి తీసుకువచ్చే ఉధృతమైన \q2 వరదలా ఆయన వస్తారు. \b \q1 \v 20 “సీయోను దగ్గరకు, యాకోబులో తమ పాపాలకు పశ్చాత్తాపం చెందినవారి దగ్గరకు \q2 విమోచకుడు వస్తాడు,” \q2 అని యెహోవా తెలియజేస్తున్నారు. \p \v 21 “నేను వారితో చేసే నా నిబంధన ఇదే” అని యెహోవా చెప్తున్నారు. “మీమీద ఉన్న నా ఆత్మ మీ నుండి తొలిగిపోదు, నేను మీ నోటిలో ఉంచిన నా మాటలు, మీ పెదవుల నుండి, మీ పిల్లల పెదవుల నుండి, వారి వారసుల పెదవుల నుండి, ఇప్పటినుండి ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా తెలియజేస్తున్నారు. \c 60 \s1 సీయోను యొక్క మహిమ \q1 \v 1 “లేచి ప్రకాశించు, నీ వెలుగు వచ్చింది, \q2 యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. \q1 \v 2 చూడు, భూమిని చీకటి కమ్ముతుంది \q2 కటిక చీకటి జనాంగాలను కమ్ముకుంటుంది. \q1 కాని యెహోవా నీ మీద ఉదయిస్తున్నారు. \q2 ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. \q1 \v 3 దేశాలు నీ వెలుగు దగ్గరకు వస్తాయి, \q2 రాజులు నీ ఉదయకాంతి దగ్గరకు వస్తారు. \b \q1 \v 4 “నీ కళ్లు పైకెత్తి చూడు: \q2 అందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు; \q1 నీ కుమారులు దూరం నుండి వస్తున్నారు, \q2 నీ కుమార్తెలు చంకనెక్కి వస్తున్నారు. \q1 \v 5 అప్పుడు నీవు చూసి ప్రకాశిస్తావు. \q2 నీ గుండె కొట్టుకొంటూ ఆనందంతో పొంగుతుంది; \q1 సముద్ర సంపద నీ దగ్గరకు త్రిప్పబడుతుంది, \q2 దేశాల సంపద నీ దగ్గరకు వస్తుంది. \q1 \v 6 ఒంటెల మందలు, మిద్యాను ఏఫాల ఒంటె పిల్లలతో \q2 నీ దేశం నిండిపోతుంది. \q1 వారందరు షేబ నుండి వస్తారు, \q2 బంగారం ధూపద్రవ్యాలను తీసుకువస్తారు, \q2 యెహోవా స్తుతిని ప్రకటిస్తారు. \q1 \v 7 నీ దగ్గర కేదారు గొర్రె మందలన్నీ సమకూడతాయి. \q2 నెబాయోతు పొట్టేళ్లు నీకు సేవ చేస్తాయి; \q1 అవి నా బలిపీఠం మీద అర్పణలుగా అంగీకరించబడతాయి. \q2 నేను నా మహిమగల మందిరాన్ని అలంకరిస్తాను. \b \q1 \v 8 “మేఘాల్లా, తమ గూళ్లకు ఎగిరిపోయే పావురాల్లా \q2 ఎగిరే వీరెవరు? \q1 \v 9 నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి; \q2 నీ దేవుడైన యెహోవాను \q1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి, \q2 తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి, \q1 దూరము నుండి నీ పిల్లలను \q2 తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి, \q2 ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు. \b \b \q1 \v 10 “విదేశీయులు నీ గోడల్ని మరల కడతారు, \q2 వారి రాజులు నీకు సేవ చేస్తారు. \q1 నేను కోపంలో నిన్ను కొట్టాను కాని, \q2 నేను కరుణించి నీ మీద దయ చూపిస్తాను. \q1 \v 11 నీ దగ్గరకు దేశాల సంపద తీసుకురావడానికి, \q2 జయోత్సవంతో వారి రాజులను నడిపించడానికి, \q1 నీ ద్వారాలు రాత్రింబగళ్ళు మూసివేయకుండా \q2 నిత్యం తెరిచే ఉంటాయి. \q1 \v 12 నిన్ను సేవించని దేశమైనా రాజ్యమైనా నాశనమవుతుంది; \q2 అది పూర్తిగా నాశనమవుతుంది. \b \q1 \v 13 “నా పరిశుద్ధాలయాన్ని అలంకరించడానికి \q2 లెబానోను యొక్క వైభవమైన దేవదారు వృక్షాలు, \q1 సరళ వృక్షాలు, గొంజిచెట్లు నీ దగ్గరకు తీసుకువస్తారు. \q2 నేను నా పాదాలు పెట్టే స్థలాన్ని మహిమపరుస్తాను. \q1 \v 14 నిన్ను బాధించినవారి పిల్లలు నీ ఎదుటకు వచ్చి నమస్కరిస్తారు. \q2 నిన్ను తృణీకరించిన వారందరు వచ్చి నీ పాదాల దగ్గర మోకరిస్తారు, \q1 యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క \q2 సీయోనని వారు నిన్ను పిలుస్తారు. \b \q1 \v 15 “నీవు విడిచిపెట్టబడి, ద్వేషించబడి \q2 నీ మార్గంలో ఎవరూ ప్రయాణించకపోయినా, \q1 నేను నిన్ను శాశ్వత ఘనతగా \q2 అన్ని తరాలకు ఆనందంగా చేస్తాను. \q1 \v 16 నీవు దేశాల పాలు త్రాగుతావు \q2 రాజుల చనుపాలు త్రాగుతావు. \q1 అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని \q2 యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు. \q1 \v 17 నేను ఇత్తడికి బదులు బంగారాన్ని \q2 ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను. \q1 నేను కర్రకు బదులు ఇత్తడిని \q2 రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను. \q1 నేను సమాధానాన్ని నీకు అధిపతిగా \q2 నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను. \q1 \v 18 ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు, \q2 నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు. \q1 అయితే నీవు నీ గోడలను రక్షణ అని \q2 నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు. \q1 \v 19 ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు, \q2 చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు, \q1 యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. \q2 నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు. \q1 \v 20 నీ సూర్యుడికపై అస్తమించడు. \q2 నీ చంద్రుడు క్షీణించడు. \q1 యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు, \q2 నీ దుఃఖ దినాలు అంతమవుతాయి. \q1 \v 21 అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు; \q2 వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. \q1 నా వైభవం కనుపరచడానికి \q2 వారు నేను నాటిన కొమ్మగా \q2 నా చేతుల పనిగా ఉంటారు. \q1 \v 22 నీలో చిన్నవాడు వేయిమంది అవుతాడు, \q2 కొద్దిగా ఉన్నది బలమైన దేశమవుతుంది. \q1 నేను యెహోవాను; \q2 సరియైన సమయంలో ఈ పనిని త్వరగా చేస్తాను.” \c 61 \s1 యెహోవా యొక్క దయా సంవత్సరము \q1 \v 1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. \q2 బీదలకు సువార్త ప్రకటించడానికి \q2 యెహోవా నన్ను అభిషేకించారు. \q1 విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి \q2 బందీలకు విడుదలను \q2 ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి, \q1 \v 2 యెహోవా హితవత్సరాన్ని, \q2 మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి \q1 దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి, \q2 \v 3 సీయోనులో దుఃఖిస్తున్న వారికి \q1 బూడిదకు బదులుగా \q2 అందమైన కిరీటాన్ని \q1 దుఃఖానికి బదులు \q2 ఆనంద తైలాన్ని \q1 భారమైన ఆత్మకు బదులు \q2 స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు. \q1 యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి, \q2 నీతి అనే సింధూర చెట్లని \q2 యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు. \b \q1 \v 4 పురాతన శిథిలాలను వారు మరలా కడతారు \q2 గతంలో నాశనమైన స్థలాలను వారు పునరుద్ధరిస్తారు; \q1 పాడైపోయిన పట్టణాలను \q2 తరతరాల నుండి నాశనమైన ఉన్న స్థలాలను వారు నూతనపరుస్తారు. \q1 \v 5 అపరిచితులు మీ మందల్ని మేపుతారు; \q2 విదేశీయులు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పని చేస్తారు. \q1 \v 6 మీరు యెహోవా యాజకులని పిలువబడతారు, \q2 మా దేవుని సేవకులు అని మీకు పేరు పెట్టబడుతుంది. \q1 దేశాల సంపదను మీరు అనుభవిస్తారు \q2 వారి ఐశ్వర్యాన్ని పొంది అతిశయిస్తారు. \b \q1 \v 7 మీ అవమానానికి బదులుగా \q2 రెట్టింపు ఘనత పొందుతారు. \q1 నిందకు బదులుగా \q2 మీ స్వాస్థ్యంలో మీరు సంతోషిస్తారు. \q1 మీరు మీ దేశంలో రెట్టింపు స్వాస్థ్యాన్ని పొందుతారు, \q2 శాశ్వతమైన ఆనందం మీకు కలుగుతుంది. \b \q1 \v 8 “ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము; \q2 దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము. \q1 నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను \q2 వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను. \q1 \v 9 వారి వారసులు దేశాల మధ్య \q2 వారి సంతానం జనాంగాల మధ్య ప్రసిద్ధి పొందుతారు. \q1 వారు యెహోవా ఆశీర్వదించిన ప్రజలని \q2 వారిని చూసినవారందరు గుర్తిస్తారు.” \b \q1 \v 10 యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా \q2 నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా \q1 ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు \q2 ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు \q1 కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. \q2 నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది. \q1 \v 11 భూమి మొలకను మొలిపించినట్లు, \q2 విత్తనాలు ఎదిగేలా చేసే తోటలా, \q1 అన్ని దేశాల ఎదుట ప్రభువైన యెహోవా \q2 నీతిని, స్తుతిని మొలకెత్తేలా చేస్తారు. \c 62 \s1 సీయోను యొక్క క్రొత్త పేరు \q1 \v 1 సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు, \q2 దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు, \q1 సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. \q2 యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను. \q1 \v 2 దేశాలు నీ నీతిని చూస్తాయి. \q2 రాజులందరూ నీ మహిమను చూస్తారు. \q1 యెహోవా నీకు ఇవ్వబోయే \q2 క్రొత్త పేరుతో నీవు పిలువబడతావు. \q1 \v 3 నీవు యెహోవా చేతిలో వైభవ కిరీటంగా, \q2 నీ దేవుని చేతిలో రాజకిరీటంగా ఉంటావు. \q1 \v 4 ఇకపై నీవు విడిచిపెట్టబడిన దానివని పిలువబడవు, \q2 నీ దేశం పాడైపోయిందని పిలువబడదు. \q1 అయితే నీవు హెఫ్సీబా\f + \fr 62:4 \fr*\fq హెఫ్సీబా \fq*\ft అంటే \ft*\fqa నా ఆనందం ఆమెలో ఉంది\fqa*\f* అని \q2 నీ దేశం బ్యూలా\f + \fr 62:4 \fr*\fq బ్యూలా \fq*\ft అంటే \ft*\fqa పెళ్ళి అయ్యింది\fqa*\f* అని పిలువబడుతుంది; \q1 యెహోవా నీలో ఆనందిస్తారు \q2 నీ దేశానికి పెళ్ళి అవుతుంది. \q1 \v 5 యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లు \q2 నిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు; \q1 పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు, \q2 నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు. \b \q1 \v 6 యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను; \q2 పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు. \q1 యెహోవాకు మొరపెట్టే వారలారా \q2 విశ్రాంతి తీసుకోకండి, \q1 \v 7 యెరూషలేమును స్థాపించే వరకు \q2 భూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి. \b \q1 \v 8 యెహోవా తన కుడిచేతితో \q2 తన బలమైన హస్తంతో ఇలా ప్రమాణం చేశారు: \q1 “ఇకనుండి ఎప్పుడూ నీ ధాన్యాన్ని \q2 నీ శత్రువులకు ఆహారంగా నేనివ్వను. \q1 నీవు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని \q2 విదేశీయులు ఇక ఎన్నడు త్రాగరు; \q1 \v 9 అయితే పంట పండించిన వారే దానిని తిని \q2 యెహోవాను స్తుతిస్తారు. \q1 ద్రాక్షలను సమకూర్చిన వారే \q2 నా పరిశుద్ధాలయ ఆవరణాల్లో దాని త్రాగుతారు.” \b \q1 \v 10 రండి, గుమ్మాల ద్వారా రండి! \q2 ప్రజలకు మార్గం సిద్ధపరచండి. \q1 నిర్మించండి, రహదారిని నిర్మించండి! \q2 రాళ్లను తొలగించండి. \q1 దేశాలు చూసేలా జెండాను ఎత్తండి. \b \q1 \v 11 భూమి అంచుల వరకు \q2 యెహోవా చేస్తున్న ప్రకటన: \q1 “ ‘ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు! \q2 ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది \q1 ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గరే ఉంది’ అని \q2 సీయోను కుమార్తెతో చెప్పండి.” \q1 \v 12 వారు పరిశుద్ధ ప్రజలని, \q2 యెహోవా విడిపించినవారని పిలువబడతారు; \q1 నీవు అందరికి కావలసిన దానివని \q2 పాడుబడని పట్టణమని పిలువబడతావు. \c 63 \s1 దేవుని తీర్పు, విమోచన దినం \q1 \v 1 రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండి \q2 బొస్రానుండి వస్తున్న ఇతడెవరు? \q1 రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూ \q2 గొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు? \b \q1 “విజయాన్ని ప్రకటిస్తూ \q2 రక్షించగల సమర్థుడనైన నేనే.” \b \q1 \v 2 నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కేవాని బట్టల్లా \q2 ఎర్రగా ఎందుకు ఉన్నాయి? \b \q1 \v 3 “నేను ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కాను; \q2 దేశాల్లో ఏ ఒక్కరూ నాతో లేరు. \q1 నా కోపంలో వారిని త్రొక్కివేశాను \q2 నా ఉగ్రతలో వారిని అణగద్రొక్కాను; \q1 వారి రక్తం నా బట్టలమీద చిందింది, \q2 నా బట్టలన్నిటికి మరకలయ్యాయి. \q1 \v 4 అది నేను పగతీర్చుకునే రోజు; \q2 నేను విమోచించే సంవత్సరం వచ్చింది. \q1 \v 5 నేను చూశాను కాని సహాయం చేయడానికి ఎవరూ లేరు; \q2 ఎవరూ సహకారం అందించకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను; \q1 కాబట్టి నా సొంత చేయి నాకు రక్షణ ఇచ్చింది \q2 నా కోపమే నన్ను ఆదుకుంది. \q1 \v 6 నేను నా కోపంతో దేశాలను త్రొక్కివేశాను \q2 నా ఉగ్రతలో వారు మత్తెక్కేలా చేశాను \q2 వారి రక్తాన్ని నేలమీద పారబోశాను.” \s1 స్తుతి, ప్రార్థన \q1 \v 7 యెహోవా మనకు చేసినదంతటిని బట్టి, \q2 యెహోవా కృపలను, \q2 యెహోవా స్తుతులను నేను ప్రకటిస్తాను. \q1 అవును, ఆయన తన కనికరాన్ని బట్టి, గొప్ప దయను బట్టి \q2 ఇశ్రాయేలుకు ఆయన చేసిన అనేక మేలుల గురించి \q2 నేను చెప్తాను. \q1 \v 8 ఆయన అన్నారు, “నిజంగా వారు నా ప్రజలు, \q2 నాకు నమ్మకంగా ఉండే పిల్లలు”; \q2 కాబట్టి ఆయన వారికి రక్షకుడయ్యారు. \q1 \v 9 వారి బాధంతటిలో ఆయన కూడా బాధ అనుభవించారు, \q2 ఆయన సన్నిధి యొక్క దూత వారిని రక్షించాడు.\f + \fr 63:9 \fr*\ft లేదా \ft*\fqa రక్షకుడు \fqa*\ft అక్కడ రాయబారి లేదా దూత కాదు కాని ఆయన సన్నిధే వారిని రక్షించింది\ft*\f* \q1 ఆయన ప్రేమతో, జాలితో వారిని విడిపించారు; \q2 పూర్వ రోజులన్నిటిలో \q2 ఆయన వారిని ఎత్తుకుంటూ, మోస్తూ వచ్చారు. \q1 \v 10 అయినా వారు తిరుగుబాటు చేసి \q2 ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. \q1 కాబట్టి ఆయన వారికి శత్రువయ్యారు \q2 తానే వారితో యుద్ధం చేశారు. \b \q1 \v 11 అప్పుడు ఆయన ప్రజలు పూర్వ రోజులను, \q2 మోషేను తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారు \q1 తన మందకాపరులతో పాటు \q2 తమను సముద్రంలో నుండి తీసుకువచ్చిన ఆయనేరి? \q1 తమలో తన పరిశుద్ధాత్మను \q2 ఉంచిన ఆయనేరి? \q1 \v 12 మోషే కుడిచేతి వైపు \q2 మహిమగల తన చేతిని పంపిన ఆయనేరి? \q1 తనకు శాశ్వతమైన కీర్తి రాడానికి \q2 వారి ఎదుట నీళ్లను విభజించిన ఆయనేరి? \q1 \v 13 మైదానంలో గుర్రం నడిచినట్లు \q1 వారు పడిపోకుండా \q2 లోతైన జలాల్లో నడిపించిన ఆయనేరి? \q1 \v 14 లోయలోనికి దిగివెళ్లే పశువుల్లా \q2 యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసింది. \q1 మీకు ఘనమైన పేరు రావాలని \q2 మీరు మీ ప్రజలను ఇలా నడిపించారు. \b \q1 \v 15 పరలోకం నుండి, \q2 గంభీరమైన, పరిశుద్ధమైన మహిమగల సింహాసనం నుండి క్రిందికి చూడండి. \q1 మీ ఆసక్తి మీ బలము ఏవి? \q2 మా పట్ల మీకున్న జాలి కనికరం మా నుండి నిలిపివేయబడ్డాయి. \q1 \v 16 అయితే అబ్రాహాముకు మేము తెలియకపోయినా \q2 ఇశ్రాయేలు మమ్మల్ని గుర్తించకపోయినా \q2 మాకు తండ్రి మీరే; \q1 యెహోవా! మాకు తండ్రి మీరే, \q2 పూర్వకాలం నుండి మా విమోచకుడవని మీకు పేరు. \q1 \v 17 యెహోవా! మేము మీ మార్గాల నుండి తొలగిపోయి తిరిగేలా ఎందుకు చేశారు? \q2 మిమ్మల్ని భయపడకుండా మా హృదయాల్ని ఎందుకు కఠినపరిచారు? \q1 మీ సేవకుల కోసం, \q2 మీ స్వాస్థ్యమైన గోత్రాల కోసం తిరిగి రండి. \q1 \v 18 మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు \q2 కాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు. \q1 \v 19 పూర్వం నుండి మేము మీ వారము; \q2 కాని మీరెన్నడు వారిని పాలించలేదు, \q2 వారు మీ పేరుతో పిలువబడలేదు. \b \b \c 64 \q1 \v 1 మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే, \q2 పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి! \q1 \v 2 మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు, \q2 ఆ మంటకు నీళ్లు మరిగినట్లు, \q1 మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి, \q2 మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి! \q1 \v 3 మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడు \q2 మీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి. \q1 \v 4 తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప \q2 అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు \q1 అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు \q2 ఎవరూ గ్రహించలేదు. \q1 \v 5 మీ మార్గాలను గుర్తుచేసుకుంటూ \q2 సంతోషంగా సరియైనది చేసేవారికి సహాయం చేయడానికి మీరు వస్తారు. \q1 అయితే మేము వాటికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు \q2 మీరు కోప్పడ్డారు. \q2 అలా అయితే మేము ఎలా రక్షింపబడగలం? \q1 \v 6 మేమందరం అపవిత్రులమయ్యాము, \q2 మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి; \q1 మేమందరం ఆకులా వాడిపోయాము, \q2 గాలిలా మా పాపాలు మమ్మల్ని తుడిచివేస్తున్నాయి. \q1 \v 7 ఎవరూ మీ పేరిట మొరపెట్టడం లేదు \q2 మిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి ఆరాటపడడం లేదు. \q1 మీరు మా నుండి మీ ముఖం దాచుకున్నారు. \q2 మమ్మల్ని మా పాపాలకు అప్పగించారు. \b \q1 \v 8 అయినా యెహోవా! మీరే మాకు తండ్రి. \q2 మేము మట్టి, మీరు కుమ్మరి. \q2 మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము. \q1 \v 9 యెహోవా! ఎక్కువగా కోప్పడకండి; \q2 నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. \q1 మేమంతా మీ ప్రజలమే కాబట్టి \q2 మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము. \q1 \v 10 మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి; \q2 చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి. \q1 \v 11 మా పూర్వికులు మిమ్మల్ని స్తుతించిన సుందరమైన మా కీర్తిగల మందిరం \q2 అగ్నితో కాల్చబడింది, \q2 మా ఆహ్లాదకరమైనవన్నీ నాశనమైపోయాయి. \q1 \v 12 యెహోవా! ఇదంతా జరిగిన తర్వాత, మీరు చూసి ఊరుకుంటారా? \q2 మీరు మౌనంగా ఉండి మమ్మల్ని ఇంకా శిక్షిస్తూనే ఉంటారా? \c 65 \s1 తీర్పు, రక్షణ \q1 \v 1 “నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను; \q2 నన్ను వెదకనివారికి నేను దొరికాను. \q1 ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అని \q2 నా పేరిట మొరపెట్టని దేశంతో చెప్పాను. \q1 \v 2 తమ ఊహల ప్రకారం చేస్తూ \q2 చెడు మార్గంలో నడుస్తూ ఉన్న \q1 మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా \q2 నా చేతులు చాపాను. \q1 \v 3 వారు తోటల్లో బలులు అర్పిస్తూ \q2 ఇటుకల బలిపీఠం మీద ధూపం వేస్తూ \q1 నా ముఖం మీద \q2 నాకు కోపం తెప్పించిన ప్రజలు; \q1 \v 4 వారు సమాధుల మధ్యలో కూర్చుని \q2 రహస్య జాగారం చేస్తూ వారి రాత్రులు గడుపుతారు; \q1 వారు పందిమాంసం తింటారు. \q2 అపవిత్రమైన మాంసం కూర వారి పాత్రల్లో ఉంది; \q1 \v 5 వారు, ‘నా దగ్గరకు రావద్దు. దూరంగా ఉండండి, \q2 మీకంటే నేను ఎంతో పరిశుద్ధున్ని’ అని అంటారు. \q1 అలాంటివారు నా నాసిక రంధ్రాలకు పొగలా, \q2 రోజంతా మండే నిప్పులా ఉన్నారు. \b \q1 \v 6-7 “చూడండి, ఇది నా ఎదుట గ్రంథంలో వ్రాయబడింది: \q2 నేను మౌనంగా ఉండను, వారికి పూర్తి ప్రతిఫలం చెల్లిస్తాను; \q2 మీ పాపాలకు మీ పూర్వికుల పాపాలకు, \q1 నేను వారికి వారి ఒడిలో ప్రతిఫలం చెల్లిస్తాను” \q2 అని యెహోవా అంటున్నారు. \q1 “ఎందుకంటే, వారు పర్వతాలమీద ధూపం వేశారు, \q2 కొండలమీద నన్ను అవమానించారు, \q1 గతంలో వారు చేసిన వాటన్నిటికి వారి ఒడిలోనే \q2 పూర్ణ ప్రతీకారాన్ని కొలిచి పోస్తాను.” \p \v 8 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “ద్రాక్షగుత్తిలో ఇంకా రసం కనబడినప్పుడు \q2 ప్రజలు, ‘దానిలో ఆశీర్వాదం ఉంది, \q2 దానిని నాశనం చేయకండి’ అని చెప్తారు కదా. \q1 అలాగే నా సేవకులందరి కోసం చేస్తాను; \q2 నేను వారందరిని నాశనం చేయను. \q1 \v 9 యాకోబు నుండి యూదా నుండి వారసుల్ని తీసుకువస్తాను, \q2 వారు నా పర్వతాల్ని స్వాధీనపరచుకుంటారు. \q1 నేను ఏర్పరచుకున్న ప్రజలు వాటిని స్వతంత్రించుకుంటారు. \q2 నా సేవకులు అక్కడ నివసిస్తారు. \q1 \v 10 నన్ను వెదకే నా ప్రజల కోసం \q2 షారోను గొర్రెలకు పచ్చికబయళ్లుగా, \q2 ఆకోరు లోయ పశువులకు విశ్రాంతి తీసుకునే చోటుగా ఉంటాయి. \b \q1 \v 11 “అయితే యెహోవాను విడిచి, \q2 నా పరిశుద్ధ పర్వతాన్ని మరచి, \q1 గాదు\f + \fr 65:11 \fr*\ft అంటే \ft*\fqa అదృష్టం\fqa*\f* దేవునికి బల్లను సిద్ధపరచి, \q2 మెనీ\f + \fr 65:11 \fr*\ft అంటే \ft*\fqa విధి, తలరాత\fqa*\f* దేవునికి ద్రాక్షరస పాత్రలు నింపేవారలారా, \q1 \v 12 నేను ఖడ్గానికి మిమ్మల్ని అప్పగిస్తాను, \q2 మీరందరు వధకు గురై కూలిపోతారు; \q1 ఎందుకంటే, నేను పిలిస్తే మీరు సమాధానం ఇవ్వలేదు, \q2 నేను మాట్లాడితే మీరు వినలేదు. \q1 నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి \q2 నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.” \p \v 13 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “నా సేవకులు భోజనం చేస్తారు, \q2 కాని మీరు ఆకలితో ఉంటారు; \q1 నా సేవకులు త్రాగుతారు \q2 కాని మీరు దాహంతో ఉంటారు; \q1 నా సేవకులు సంతోషిస్తారు \q2 కాని మీరు సిగ్గుపరచబడతారు. \q1 \v 14 నా సేవకులు తమ ఆనంద హృదయాలతో \q2 పాటలు పాడతారు, \q1 మీరు హృదయ వేదనతో ఏడుస్తారు \q2 నలిగిన ఆత్మలతో రోదిస్తారు. \q1 \v 15 నేను ఏర్పరచుకున్నవారు వారి శాపవచనాల్లో \q2 మీ పేరును ఉపయోగిస్తారు; \q1 ప్రభువైన యెహోవా మిమ్మల్ని చంపుతారు. \q2 ఆయన తన సేవకులకు మరొక పేరు పెడతారు. \q1 \v 16 దేశంలో ఆశీర్వాదం ఉండాలని కోరుకునేవారు \q2 ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ఆశీర్వదించబడాలని కోరుకుంటారు; \q1 దేశంలో ప్రమాణం చేసేవారు, \q2 ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ప్రమాణం చేస్తారు. \q1 గతకాలపు సమస్యలన్నీ మరచిపోయాను. \q2 అవి నా కళ్ల నుండి దాచబడ్డాయి. \s1 క్రొత్త ఆకాశం క్రొత్త భూమి \q1 \v 17 “చూడండి, నేను క్రొత్త ఆకాశాన్ని \q2 క్రొత్త భూమిని సృష్టిస్తాను. \q1 గత విషయాలు గుర్తు చేసుకోబడవు. \q2 వాటి గురించి ఎవరూ ఆలోచించరు. \q1 \v 18 అయితే నేను సృష్టించబోయే వాటి గురించి \q2 మీరు ఎప్పుడూ సంతోషించి ఆనందించండి. \q1 నేను యెరూషలేమును సంతోషకరమైన స్థలంగా \q2 ప్రజలను ఆనందంగా చేస్తాను. \q1 \v 19 నేను యెరూషలేము గురించి సంతోషిస్తాను \q2 నా ప్రజల్లో ఆనందిస్తాను; \q1 ఏడ్పు రోదన శబ్దం \q2 ఇకపై దానిలో వినపడవు. \b \q1 \v 20 “ఇకపై అక్కడ కొన్ని రోజులు మాత్రమే \q2 బ్రతికి ఉండే శిశువులు ఉండరు. \q2 తన కాలం పూర్తి కాకుండా చనిపోయే వృద్ధుడు ఉండడు; \q1 వంద సంవత్సరాల వయస్సులో \q2 చనిపోయేవారిని పిల్లలుగా పరిగణించబడతారు; \q1 వంద సంవత్సరాలకన్నా ముందే చనిపోయే \q2 పాపిని శాపగ్రస్తుడు అంటారు. \q1 \v 21 వారు ఇల్లు కట్టుకుని వాటిలో నివసిస్తారు; \q2 వారు ద్రాక్షతోటలు నాటి వాటి పండ్లు తింటారు. \q1 \v 22 ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు. \q2 వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు. \q1 నా ప్రజల ఆయుష్షు \q2 చెట్ల ఆయుష్షంత ఉంటుంది; \q1 నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని \q2 పూర్తిగా అనుభవిస్తారు. \q1 \v 23 వారు వృధాగా కష్టపడరు, \q2 దురదృష్టాన్ని అనుభవించడానికి పిల్లల్ని కనరు; \q1 వారు యెహోవాచేత ఆశీర్వదించబడిన ప్రజలుగా, \q2 వారు, వారి వారసులు ఉంటారు. \q1 \v 24 వారు మొరపెట్టక ముందే నేను జవాబిస్తాను; \q2 వారు ఇంకా మాట్లాడుతుండగానే నేను వింటాను. \q1 \v 25 తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, \q2 సింహం ఎద్దులా గడ్డి తింటుంది, \q2 దుమ్ము సర్పానికి ఆహారమవుతుంది. \q1 నా పరిశుద్ధ పర్వతం మీద \q2 అవి హానిని గాని నాశనాన్ని గాని చేయవు” \q2 అని యెహోవా చెప్తున్నారు. \c 66 \s1 తీర్పు, నిరీక్షణ \p \v 1 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “ఆకాశం నా సింహాసనం \q2 భూమి నా పాదపీఠం. \q1 మీరు నా కోసం కట్టాలనుకున్న ఇల్లు ఎక్కడ? \q2 నా విశ్రాంతి స్థలం ఏది? \q1 \v 2 వీటన్నిటిని చేసింది నా చేయి కాదా, \q2 ఈ విధంగా అవి కలిగాయి కదా?” \q2 అని యెహోవా తెలియజేస్తున్నారు. \b \q1 “ఎవరైతే వినయంతో పశ్చాత్తాప హృదయం కలిగి \q2 నా మాట విని వణుకుతారో, \q2 వారికే నేను దయ చూపిస్తాను. \q1 \v 3 అయితే కోడెను బలిచ్చేవారు \q2 నరబలి ఇచ్చేవారి వంటివారే, \q1 గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, \q2 కుక్క మెడను విరిచేవారి వంటివారే; \q1 భోజనార్పణ చేసేవారు \q2 పందిరక్తం అర్పించేవారి వంటివారే, \q1 జ్ఞాపకార్థ ధూపం వేసేవారు \q2 విగ్రహాలను పూజించేవారి వంటివారే. \q1 వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు \q2 వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు; \q1 \v 4 కాబట్టి నేను వారి కోసం కఠినమైన శిక్షను ఎంచుకుంటాను \q2 వారు భయపడేవాటిని వారి మీదికి రప్పిస్తాను. \q1 ఎందుకంటే, నేను పిలిస్తే ఎవరూ జవాబు ఇవ్వలేదు \q2 నేను మాట్లాడితే ఎవరూ వినలేదు. \q1 నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి \q2 నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.” \b \q1 \v 5 యెహోవా మాటకు భయపడేవారలారా, \q2 ఆయన మాట వినండి. \q1 “మిమ్మల్ని ద్వేషిస్తూ నా నామాన్ని బట్టి \q2 మిమ్మల్ని త్రోసివేసే మీ సొంతవారు, \q1 ‘మీ సంతోషం మాకు కనిపించేలా \q2 యెహోవాకు మహిమ కలుగును గాక!’ అని అన్నారు. \q2 అయినా వారు సిగ్గుపరచబడతారు. \q1 \v 6 పట్టణం నుండి వచ్చే కోలాహలం వినండి \q2 మందిరం నుండి వస్తున్న ఆ శబ్దం వినండి! \q1 తన శత్రువులకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్న \q2 యెహోవా యొక్క శబ్దం అది. \b \q1 \v 7 “ఆమె ప్రసవవేదన పడక ముందే \q2 ఆమె బిడ్డకు జన్మనిస్తుంది; \q1 ఆమెకు నొప్పులు రాకముందే \q2 కుమారున్ని కంటుంది. \q1 \v 8 అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? \q2 అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా చూశారా? \q1 ఒక్క రోజులో దేశం పుడుతుందా \q2 ఒక్క నిమిషంలోనే ఒక జనం జన్మిస్తుందా? \q1 అయితే సీయోనుకు ప్రసవవేదన కలగగానే \q2 ఆమె తన బిడ్డలకు జన్మనిస్తుంది. \q1 \v 9 నేను ప్రసవవేదన కలిగించి \q2 జన్మనివ్వకుండా ఉంటానా?” \q2 అని యెహోవా అడుగుతున్నారు. \q1 “పుట్టుక వరకు తీసుకువచ్చి \q2 గర్భాన్ని మూస్తానా?” \q2 అని నీ దేవుడు అడుగుతున్నారు. \q1 \v 10 “యెరూషలేమును ప్రేమించే మీరందరూ \q2 ఆమెతో సంతోషించి ఆనందించండి. \q1 ఆమె గురించి ఏడ్చే మీరందరూ \q2 ఆమెతో గొప్పగా సంతోషించండి. \q1 \v 11 ఆదరణకరమైన ఆమె రొమ్ము పాలు త్రాగి \q2 మీరు తృప్తిపొందుతారు. \q1 మీరు తృప్తిగా త్రాగి \q2 ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.” \p \v 12 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “వినండి. ఆమె దగ్గరకు సమాధానం నదిలా ప్రవహించేలా చేస్తాను, \q2 దేశాల సంపదలు పొంగిపొర్లే ప్రవాహంలా వస్తాయి; \q1 మీరు పోషించబడి ఆమె చంకనెక్కుతారు \q2 ఆమె మోకాళ్లమీద ఆడుకుంటారు. \q1 \v 13 తల్లి తన బిడ్డను ఆదరించినట్లు \q2 నేను మిమ్మల్ని ఆదరిస్తాను. \q2 యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు.” \b \q1 \v 14 మీరు ఇది చూసినప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది \q2 మీరు గడ్డిలా వర్ధిల్లుతారు; \q1 యెహోవా యొక్క చేతి బలం తన సేవకులకు తెలియజేయబడుతుంది, \q2 కాని ఆయన కోపం తన శత్రువులకు చూపించబడుతుంది. \q1 \v 15 చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నారు, \q2 ఆయన రథాలు సుడిగాలిలా వస్తున్నాయి. \q1 ఆయన తన కోపాన్ని తీవ్రతతో క్రిందికి తెస్తున్నారు, \q2 ఆయన గద్దింపు అగ్ని మంటలతో వస్తుంది. \q1 \v 16 అగ్నితో తన ఖడ్గంతో \q2 యెహోవా ప్రజలందరికి తీర్పు అమలుచేస్తారు, \q2 యెహోవా ద్వారా అనేకమంది చంపబడతారు. \p \v 17 “ఎవరైతే పందిమాంసం, ఎలుకలు, ఇతర అపవిత్రమైన వాటిని తినేవాన్ని అనుసరిస్తూ, పవిత్ర తోటలోకి వెళ్లి పూజించడానికి తమను తాము ప్రతిష్ఠించుకుని శుద్ధి చేసుకుంటారో, వారు తాము అనుసరించే వానితో పాటు నశిస్తారు” అని యెహోవా తెలియజేస్తున్నారు. \p \v 18 “వారి యొక్క పనులు వారి ఆలోచనలను బట్టి నేను అన్ని దేశాల ప్రజలను, రకరకాల భాషలు మాట్లాడేవారిని ఒక్కచోట చేర్చడానికి వస్తున్నాను. వారు వచ్చి నా మహిమను చూస్తారు. \p \v 19 “నేను వారి ఎదుట ఒక సూచనను పెడతాను. వారిలో తప్పించుకున్న వారిని వేరే దేశాలకు అనగా, తర్షీషు, పూలు, లూదు (ప్రసిద్ధ విల్లుకాండ్రు) అనే దేశాల దగ్గరకు, తుబాలు గ్రీసులకు, నా గురించి నా మహిమ గురించి వినని దూరంగా ఉన్న ద్వీపవాసుల దగ్గరకు పంపిస్తాను. వారు దేశాల మధ్య నా మహిమ గురించి ప్రకటిస్తారు. \v 20 ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రల్లో భోజనార్పణల్ని యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లు, గుర్రాల మీద, రథాల మీద, బండ్ల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి అన్ని దేశాల నుండి నా పరిశుద్ధ పర్వతమైన యెరూషలేముకు మీ ప్రజలందరినీ యెహోవాకు అర్పణగా వారు తీసుకువస్తారు” అని యెహోవా చెప్తున్నారు. \v 21 “యాజకులుగా లేవీయులుగా ఉండడానికి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను” అని యెహోవా చెప్తున్నారు. \b \p \v 22 “నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు. \v 23 “ప్రతి అమావాస్య రోజున, ప్రతి సబ్బాతు దినాన నా ఎదుట ఆరాధించడానికి ప్రజలందరూ వస్తారు” అని యెహోవా చెప్తున్నారు. \v 24 “వారు వెళ్లి నా మీద తిరుగుబాటు చేసిన వారి శవాలను చూస్తారు; వాటిని తినే పురుగులు చావవు, వాటిని కాల్చే అగ్ని ఆరిపోదు, మనుష్యులందరికి అది అసహ్యంగా ఉంటుంది.”