\id HOS - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h హోషేయ \toc1 హోషేయ ప్రవచనం \toc2 హోషేయ \toc3 హోషేయ \mt1 హోషేయ \mt2 ప్రవచనం \c 1 \p \v 1 ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పాలన కాలంలో, యెహోయాషు కుమారుడైన యరొబాము అనే ఇశ్రాయేలు రాజు కాలంలో, బెయేరి కుమారుడైన హోషేయకు యెహోవా వాక్కు వచ్చింది: \b \s1 హోషేయ భార్య, పిల్లలు \p \v 2 యెహోవా హోషేయ ద్వారా మాట్లాడడం ఆరంభించినప్పుడు, యెహోవా ఇలా అన్నారు, “వెళ్లు, ఒక వ్యభిచారిణిని పెళ్ళి చేసుకో, ఆమెతో పిల్లలు కను, ఎందుకంటే ఈ దేశం కూడా ఒక వ్యభిచారిణిలా యెహోవాకు నమ్మకద్రోహం చేస్తూ ఉంది.” \v 3 కాబట్టి అతడు దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెళ్ళి చేసుకున్నాడు, ఆమె గర్భవతియై అతనికి కుమారున్ని కన్నది. \p \v 4 అప్పుడు యెహోవా హోషేయతో అన్నారు, “అతనికి యెజ్రెయేలు అనే పేరు పెట్టు, ఎందుకంటే యెజ్రెయేలులో జరిగిన రక్తపాతాన్ని బట్టి త్వరలో నేను యెహు వంశాన్ని శిక్షిస్తాను, ఇశ్రాయేలు రాజ్యాన్ని తుదముట్టిస్తాను. \v 5 ఆ రోజు యెజ్రెయేలు లోయలో నేను ఇశ్రాయేలు విల్లు విరగ్గొడతాను.” \p \v 6 గోమెరు మళ్ళీ గర్భవతియై ఆడపిల్లను కన్నది. అప్పుడు యెహోవా హోషేయతో ఇలా అన్నారు, “ఆమెకు లో-రుహామా\f + \fr 1:6 \fr*\fq లో-రుహామా \fq*\ft అంటే \ft*\fqa ప్రేమించబడకపోవడం\fqa*\f* అని పేరు పెట్టు, ఎందుకంటే నేను ఇక ఇశ్రాయేలును ప్రేమించను వారిని ఏమాత్రం క్షమించను. \v 7 అయితే యూదా వారికి నా ప్రేమను చూపించి వారిని రక్షిస్తాను; విల్లు, ఖడ్గం, యుద్ధం, గుర్రాలు, రౌతుల వల్ల కాదు, కాని వారి దేవుడనైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను.” \p \v 8 ఆమె లో-రుహామాను పాలు మాన్పించిన తర్వాత, గోమెరుకు మరో కుమారుడు పుట్టాడు. \v 9 అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “అతనికి లో-అమ్మీ\f + \fr 1:9 \fr*\fq లో-అమ్మీ \fq*\ft అంటే \ft*\fqa నా ప్రజలు కాదు\fqa*\f* అని పేరు పెట్టు, ఎందుకంటే మీరు నా జనం కాదు, నేను మీ దేవుడను కాదు. \p \v 10 “అయినా ఇశ్రాయేలీయులు సముద్రతీరాన ఉన్న ఇసుకంత విస్తారంగా కొలువలేనంతగా లెక్కపెట్టలేనంతగా ఉంటారు. ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అక్కడే వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు. \v 11 యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏకమవుతారు; వారు ఒక నాయకున్ని నియమించుకుంటారు, వారు ఈ దేశంలో ఎదుగుతారు, ఎందుకంటే యెజ్రెయేలు దినం గొప్పగా ఉండబోతుంది. \c 2 \p \v 1 “మీరు మీ సోదరులతో, ‘మీరు నా ప్రజలు’ అని, మీ సహోదరీలతో, ‘నా ప్రియమైన వారలారా’ అని అనండి. \s1 ఇశ్రాయేలు శిక్షంచబడుట, పునరుద్ధరించబడుట \q1 \v 2 “మీ తల్లిని గద్దించండి, గద్దించండి, \q2 ఆమె నా భార్య కాదు, \q2 నేను ఆమె భర్తను కాను. \q1 ఆమె తన వ్యభిచార చూపును మానుకోవాలి, \q2 తన రొమ్ముల మధ్య నుండి పరపురుషులను తొలగించాలి. \q1 \v 3 లేకపోతే ఆమెను దిగంబరిని చేస్తాను, \q2 ఆమె బట్టలు తీసివేసి ఆమె పుట్టిన రోజున ఉన్నట్లు ఆమెను నగ్నంగా చేస్తాను. \q1 ఆమెను ఎడారిలా చేస్తాను, \q2 ఎండిపోయిన భూమిలా చేస్తాను \q2 దప్పికతో ఆమె చచ్చునట్లు చేస్తాను. \q1 \v 4 ఆమె పిల్లల మీద నా ప్రేమను చూపించను, \q2 ఎందుకంటే, వారు వ్యభిచారం వలన పుట్టిన పిల్లలు. \q1 \v 5 వారి తల్లి వ్యభిచారం చేసింది, \q2 అవమానంలో వారిని కన్నది. \q1 ఆమె, ‘నేను నా ప్రేమికుల వెంట వెళ్తాను, \q2 వారు నాకు నా ఆహారం, నీళ్లు, \q2 ఉన్ని, జనపనార, ఒలీవనూనె, పానీయం ఇస్తారు’ అన్నది. \q1 \v 6 కాబట్టి ముళ్ళపొదలను ఆమె దారిని అడ్డుగా వేస్తాను; \q2 ఆమె తన దారి కనబడకుండ నేను గోడ కడతాను. \q1 \v 7 ఆమె తన ప్రేమికుల వెంటపడుతుంది కాని వారిని కలుసుకోలేదు; \q2 ఆమె వారిని వెదుకుతుంది కాని వారు కనబడరు. \q1 అప్పుడు ఆమె ఇలా అంటుంది, \q2 ‘నేను నా మొదటి భర్త దగ్గరకు తిరిగి వెళ్తాను, \q2 ఇప్పటి కంటే అప్పుడే నా స్థితి బాగుండేది.’ \q1 \v 8 ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె, \q2 విస్తారమైన వెండి, బంగారాలు, \q1 ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు, \q2 వాటిని బయలు కోసం వాడింది. \b \q1 \v 9 “కాబట్టి కోతకాలంలో నా ధాన్యం నేను తీసివేస్తాను, \q2 ద్రాక్షరసం సిద్ధంగా ఉన్నప్పుడు దానిని తీసివేస్తాను. \q1 ఆమె దిగంబరత్వాన్ని కప్పుకోడానికి నేను ఇచ్చిన \q2 నా ఉన్నిని, నా జనపనారను తిరిగి తీసుకుంటాను. \q1 \v 10 కాబట్టి ఇప్పుడు ఆమె ప్రేమికుల కళ్లెదుట, \q2 ఆమె కామాతురతను బయటపెడతాను, \q2 ఆమెను నా చేతిలో నుండి ఎవ్వరూ విడిపించలేరు. \q1 \v 11 ఆమె ఉత్సవ వేడుకలన్నిటిని: \q2 ఆమె వార్షిక పండుగలు, అమావాస్యలు, \q2 ఆమె సబ్బాతు దినాలు అన్ని ఆగిపోయేలా చేస్తాను. \q1 \v 12 తన ప్రేమికులు తనకు ఇచ్చిన జీతం అని ఆమె చెప్పుకునే, \q2 ఆమె ద్రాక్షలను అంజూర చెట్లను నేను పాడుచేస్తాను; \q1 వాటిని దట్టమైన అడవిగా మారుస్తాను, \q2 అడవి జంతువులు వాటిని తినివేస్తాయి. \q1 \v 13 ఆమె బయలులకు ధూపం వేసిన రోజుల గురించి, \q2 నేను ఆమెను శిక్షిస్తాను; \q2 ఆమె నగలు ఆభరణాలతో అలంకరించుకుని, \q1 తన ప్రేమికుల వెంట వెళ్లిపోయింది, \q2 కాని నన్ను మరచిపోయింది” \q2 అని యెహోవా చెప్తున్నారు. \b \q1 \v 14 కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను; \q2 నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి, \q2 ఆమెతో మృదువుగా మాట్లాడతాను. \q1 \v 15 అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను, \q2 ఆకోరు\f + \fr 2:15 \fr*\fq ఆకోరు \fq*\ft అంటే \ft*\fqa శ్రమ\fqa*\f* లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. \q1 అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు, \q2 ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది.\f + \fr 2:15 \fr*\ft లేదా \ft*\fqa పాడుతుంది\fqa*\f* \b \q1 \v 16 యెహోవా ఇలా అంటున్నారు, \q2 “ఆ రోజున నీవు నన్ను, ‘నా భర్తవు’ అని అంటావు; \q2 నీవు నన్ను ఇక ఎన్నడు ‘నా బయలు\f + \fr 2:16 \fr*\ft హెబ్రీలో \ft*\fqa నా యజమాని\fqa*\f*’ అని పిలువవు. \q1 \v 17 నేను ఆమె పెదవుల నుండి బయలుల పేర్లు తీసివేస్తాను; \q2 ఇక ఎన్నడు వారి పేర్లు ప్రస్తావించబడవు. \q1 \v 18 ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో, \q2 ఆకాశ పక్షులతో, \q2 నేలను ప్రాకే జంతువులతో నిబంధన చేస్తాను. \q1 విల్లు, ఖడ్గం, యుద్ధం \q2 దేశంలో లేకుండా చేస్తాను, \q2 అప్పుడు వారు క్షేమంగా పడుకుంటారు. \q1 \v 19 నీవు శాశ్వతంగా నాతో ఉండేలా, \q2 నేను నిన్ను నీతి, న్యాయంతో, \q2 మారని ప్రేమతో, దయతో ప్రధానం చేసుకుంటాను. \q1 \v 20 నీవు యెహోవాను తెలుసుకునేలా, \q2 నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను. \b \q1 \v 21 “ఆ రోజున నేను జవాబిస్తాను,” \q2 అని యెహోవా అంటున్నారు. \q1 “నేను ఆకాశాలకు జవాబిస్తాను, \q2 అవి భూమికి జవాబిస్తాయి; \q1 \v 22 భూమి ధాన్యంతో, నూతన ద్రాక్షరసంతో, \q2 ఒలీవనూనెతో మాట్లాడుతుంది. \q2 అవి యెజ్రెయేలుతో\f + \fr 2:22 \fr*\fq యెజ్రెయేలు \fq*\ft అంటే, దేవుని మొక్కలు\ft*\f* మాట్లాడతాయి. \q1 \v 23 నేను ఆమెను నా కోసం దేశంలో నాటుతాను; \q2 ‘నా ప్రియురాలు కాదు,\f + \fr 2:23 \fr*\ft హెబ్రీలో \ft*\fqa లో-రుహామా\fqa*\ft ; \+xt 1:6\+xt* వచనం చూడండి\ft*\f*’ అని ఎవరి గురించి అన్నానో ఆ వ్యక్తికే నా ప్రేమను చూపిస్తాను. \q1 ‘నా ప్రజలు కారు,\f + \fr 2:23 \fr*\ft హెబ్రీలో \ft*\fqa లో-అమ్మీ\fqa*\ft ; \+xt 1:9\+xt* వచనం చూడండి\ft*\f*’ అని ఎవరి గురించి అన్నానో వారితో, ‘మీరు నా ప్రజలు’ అని చెప్తాను; \q2 అప్పుడు వారు, ‘మీరే మా దేవుడు’ అంటారు.” \c 3 \s1 హోషేయ తన భార్యతో సమాధానపడుట \p \v 1 యెహోవా నాతో, “వెళ్లు, నీ భార్యను వేరే వ్యక్తి ప్రేమించినా, వ్యభిచారిగా ఉన్నా ఆమెకు నీ ప్రేమను చూపించు. ఇశ్రాయేలీయులు ఇతర దేవుళ్ళను పూజించి పవిత్ర ద్రాక్షపండ్ల ముద్దలను ఆశించనప్పటికి, యెహోవా వారిని ప్రేమించినట్లు ఆమెను ప్రేమించు” అని చెప్పారు. \p \v 2 కాబట్టి నేను పదిహేను వెండి నాణేలు,\f + \fr 3:2 \fr*\ft అంటే, 170 గ్రాములు\ft*\f* ఒక హోమెరు, ఒక లెతెకు\f + \fr 3:2 \fr*\ft ఒక హోమెరు, ఒక లెతెకు అంటే సుమారు 195 కి. గ్రా. లు\ft*\f* యవలు ఇచ్చి ఆమెను కొనుక్కున్నాను. \v 3 అప్పుడు ఆమెతో, “నీవు నాతో చాలా కాలం జీవించాలి; నీవు వేశ్యగా ఉండకూడదు, వేరే ఏ పురుషునితో సన్నిహితంగా ఉండకూడదు, అలాగే నేను నీ పట్ల నమ్మకంగా ఉంటాను” అన్నాను. \p \v 4 ఎందుకంటే ఇశ్రాయేలీయులు చాలా కాలం రాజు గాని పాలకుడు గాని లేకుండా, బలులు గాని పవిత్ర రాళ్లు గాని లేకుండా, ఏఫోదు గాని గృహ దేవుళ్ళు గాని లేకుండా ఉంటారు. \v 5 తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి, తమ దేవుడైన యెహోవాను, తమ రాజైన దావీదును వెదుకుతారు. చివరి రోజుల్లో యెహోవా దగ్గరకు, ఆయన దీవెనలు దగ్గరకు వారు వణకుతూ వస్తారు. \c 4 \s1 ఇశ్రాయేలుపై అభియోగం \q1 \v 1 ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు వినండి, \q2 యెహోవా ఈ దేశ వాసులైన మీమీద \q2 నేరం మోపుతున్నారు: \q1 “ఈ దేశంలో నమ్మకత్వం, ప్రేమ \q2 దేవుని గురించిన జ్ఞానం అనేవి లేవు. \q1 \v 2 శపించడం,\f + \fr 4:2 \fr*\ft అంటే, శాపం పలకడం\ft*\f* అబద్ధాలు చెప్పడం, హత్య చేయడం, \q2 దొంగిలించడం, వ్యభిచారం చేయడం మాత్రమే ఉన్నాయి; \q1 వారు దౌర్జన్యాలు మానలేదు, \q2 నిత్యం రక్తపాతం జరుగుతూ ఉంది. \q1 \v 3 ఈ కారణంచేత దేశం ఎండిపోతుంది, \q2 అందులో నివసించేవారు నీరసించి పోతున్నారు; \q1 అడవి జంతువులు, ఆకాశపక్షులు, \q2 సముద్రపు చేపలు నశించిపోతున్నాయి. \b \q1 \v 4 “అయితే ఏ ఒకరిపై నేరం మోపకండి, \q2 ఏ ఒక్కరు ఇంకొకరిని నిందించకండి, \q1 ఎందుకంటే మీ ప్రజలు \q2 యాజకుని మీద నేరం మోపుతారు. \q1 \v 5 మీరు పగలు రాత్రులు తడబడతారు, \q2 ప్రవక్తలు మీతో కలిసి తడబడతారు, \q1 కాబట్టి నేను నీ తల్లిని నాశనం చేస్తాను. \q2 \v 6 జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు. \b \q1 “మీరు జ్ఞానాన్ని త్రోసివేశారు కాబట్టి, \q2 నేను కూడా మిమ్మల్ని నా యాజకులుగా ఉండకుండా త్రోసివేస్తున్నాను; \q1 మీరు మీ దేవుని ఉపదేశాన్ని పట్టించుకోలేదు కాబట్టి, \q2 నేను కూడా మీ పిల్లలను పట్టించుకోను. \q1 \v 7 యాజకుల సంఖ్య పెరిగిన కొద్దీ, \q2 వారు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు; \q2 వారి ఘనతను అవమానంగా మారుస్తాను. \q1 \v 8 నా ప్రజల పాపాన్ని ఆహారంగా చేసుకుంటారు \q2 వారి దుష్టత్వం ఎక్కువ కావాలని కోరుకుంటారు. \q1 \v 9 కాబట్టి ప్రజలు జరిగినట్లే యాజకులకు జరుగుతుంది. \q2 వారి విధానాలను బట్టి వారిద్దరిని నేను శిక్షిస్తాను \q2 వారి క్రియలకు తగిన ప్రతిఫలం వారికిస్తాను. \b \q1 \v 10 “వారు తింటారు, కాని తృప్తి పొందరు; \q2 వారు వ్యభిచారం చేస్తారు, కాని అభివృద్ధి చెందరు, \q1 ఎందుకంటే వారు యెహోవాను వదిలేశారు, \q2 తమను తాము \v 11 వ్యభిచారానికి అప్పగించుకున్నారు; \q1 పాత ద్రాక్షరసం, క్రొత్త ద్రాక్షరసం \q2 వారి మతిని పోగొట్టాయి. \q1 \v 12 నా ప్రజలు చెక్క విగ్రహాన్ని సంప్రదిస్తారు, \q2 సోదె చెప్పే వాని కర్ర వారితో మాట్లాడుతుంది. \q1 వ్యభిచార ఆత్మ వారిని చెదరగొడుతుంది; \q2 వారు తమ దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు. \q1 \v 13 వారు పర్వత శిఖరాల మీద బలులు అర్పిస్తారు \q2 కొండలమీద ధూపం వేస్తారు, \q1 సింధూర, చినారు, మస్తకి వృక్షాల క్రింద \q2 నీడ మంచిగా ఉన్నచోట బలులు అర్పిస్తారు. \q1 కాబట్టి మీ కుమార్తెలు వేశ్యలయ్యారు \q2 మీ కోడళ్ళు వ్యభిచారిణులయ్యారు. \b \q1 \v 14 “మీ కుమార్తెలు వేశ్యలు అయినందుకు, \q2 నేను వారిని శిక్షించను, \q1 మీ కోడళ్ళు వ్యభిచారం చేసినందుకు, \q2 నేను వారిని శిక్షించను \q1 ఎందుకంటే, మనుష్యులు వ్యభిచారిణులుతో పోతారు, \q2 క్షేత్ర వ్యభిచారులతో పాటు బలులు అర్పిస్తారు, \q2 గ్రహింపు లేని ప్రజలు నాశనమవుతారు. \b \q1 \v 15 “ఇశ్రాయేలూ, నీవు వ్యభిచారం చేసినా సరే, \q2 యూదా అపరాధం చేయకూడదు. \b \q1 “గిల్గాలుకు వెళ్లవద్దు; \q2 బేత్-ఆవెనుకు\f + \fr 4:15 \fr*\fq బేత్-ఆవెను \fq*\ft అంటే \ft*\fqa దుష్టత్వం గల ఇల్లు\fqa*\f* వెళ్లవద్దు. \q2 ‘యెహోవా జీవం తోడు’ అని ఒట్టు పెట్టుకోవద్దు. \q1 \v 16 పొగరుబోతు పెయ్యలా \q2 ఇశ్రాయేలీయులు మొండిగా ఉన్నారు. \q1 అలాగైతే యెహోవా వారిని విశాల మైదానంలో \q2 గొర్రెపిల్లలను మేపినట్టు ఎలా పోషిస్తారు? \q1 \v 17 ఎఫ్రాయిం విగ్రహాలతో కలుసుకున్నాడు; \q2 అతన్ని అలాగే వదిలేయండి! \q1 \v 18 వారి పానీయాలు అయిపోయినా, \q2 వారి వ్యభిచారం కొనసాగిస్తున్నారు; \q2 వారి పాలకులు సిగ్గుమాలిన విధానాలను ఎంతో ఇష్టపడతారు. \q1 \v 19 సుడిగాలి వారిని చెదరగొడుతుంది, \q2 వారి బలుల వలన వారికి అవమానం కలుగుతుంది. \c 5 \s1 ఇశ్రాయేలుపై తీర్పు \q1 \v 1 “యాజకులారా! ఇది వినండి, \q2 ఇశ్రాయేలీయులారా! శ్రద్ధగా వినండి, \q1 రాజ వంశస్థులారా! వినండి, \q2 ఈ తీర్పు మీ కొరకే ఇవ్వబడింది: \q1 మీరు మిస్పాలో ఉరిగా, \q2 తాబోరు మీద వలలా ఉన్నారు. \q1 \v 2 తిరుగుబాటుదారులు ఘోరమైన హత్యలు చేశారు. \q2 వారందరిని నేను శిక్షిస్తాను. \q1 \v 3 ఎఫ్రాయిం గురించి నాకు అంతా తెలుసు; \q2 ఇశ్రాయేలు నా నుండి దాచబడలేదు. \q1 ఎఫ్రాయిమూ! ఇప్పుడు నీవు వ్యభిచారం వైపు తిరిగావు; \q2 ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది. \b \q1 \v 4 “వారి పనుల వలన \q2 వారు తమ దేవుని దగ్గరకు తిరిగి రారు. \q1 వారి హృదయాల్లో వ్యభిచార ఆత్మ ఉంది; \q2 వారు యెహోవాను గుర్తించరు. \q1 \v 5 ఇశ్రాయేలీయుల అహంకారం వారికి విరోధంగా సాక్ష్యమిస్తుంది; \q2 ఇశ్రాయేలీయులు, ఎఫ్రాయిమువారు కూడా తమ పాపంలో తడబడతారు; \q2 యూదా కూడా వారితో తడబడుతుంది. \q1 \v 6 వారు యెహోవాను వెదకడానికి \q2 తమ గొర్రెలను, పశువులను వెంటబెట్టుకొని వెళ్లినప్పుడు, \q1 ఆయనను కనుగొనరు; \q2 ఎందుకంటే ఆయన వారికి దూరంగా ఉన్నారు. \q1 \v 7 వారు యెహోవా పట్ల అపనమ్మకంగా ఉన్నారు; \q2 వారు అక్రమ సంతానాన్ని కన్నారు. \q1 వారు అమావాస్య ఉత్సవాలు జరుపుకున్నప్పుడు, \q2 ఆయన వారి భూములను నాశనం చేస్తారు. \b \q1 \v 8 “గిబియాలో బాకానాదం చేయండి, \q2 రామాలో బూర ఊదండి. \q1 బెన్యామీనూ, నీ వెనుకే వస్తున్నాము; \q2 బేత్-ఆవెనులో\f + \cat dup\cat*\fr 5:8 \fr*\fq బేత్-ఆవెను \fq*\ft అంటే \ft*\fqa దుష్టత్వం గల ఇల్లు\fqa*\f* యుద్ధ నినాదాలు చేయండి. \q1 \v 9 దండన రోజున \q2 ఎఫ్రాయిం పాడైపోతుంది. \q1 తప్పనిసరిగా జరగబోయే దానిని \q2 నేను ఇశ్రాయేలు గోత్రాలకు ప్రకటిస్తున్నాను. \q1 \v 10 యూదా నాయకులు \q2 సరిహద్దు రాళ్లను జరిపే వారిలా ఉన్నారు. \q1 వారి మీద నా కోపాన్ని \q2 నీటి ప్రవాహంలా కుమ్మరిస్తాను. \q1 \v 11 ఎఫ్రాయిమీయులు విగ్రహాల వెంట వెళ్తున్నారు కాబట్టి \q2 వారు హింసించబడతారు, \q2 తీర్పులో త్రొక్కబడతారు. \q1 \v 12 నేను ఎఫ్రాయిం వారికి చిమ్మెట పురుగులా ఉన్నాను, \q2 యూదా ప్రజలకు కుళ్లు పట్టించే తెగులుగా ఉంటాను. \b \q1 \v 13 “ఎఫ్రాయిం తన రోగాన్ని, \q2 యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు, \q1 ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగి \q2 గొప్ప రాజును సహాయం కోరాడు. \q1 అయితే అతడు నిన్ను బాగుచేయలేదు, \q2 నీ పుండ్లను స్వస్థపరచలేదు. \q1 \v 14 ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా \q2 యూదాకు కొదమసింహంలా ఉంటాను. \q1 నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను; \q2 వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు. \q1 \v 15 వారు తమ అపరాధం ఒప్పుకుని \q2 నన్ను వెదికే వరకు \q2 నేను నా స్థలానికి తిరిగి వెళ్తాను, \q1 వారు తమ దురవస్థలో \q2 నన్ను తీవ్రంగా వెదకుతారు.” \c 6 \s1 పశ్చాత్తాపపడని ఇశ్రాయేలు \q1 \v 1 “రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. \q1 ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు \q2 కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు; \q1 ఆయన మనల్ని గాయపరచారు \q2 కాని ఆయన మన గాయాలను కడతారు. \q1 \v 2 రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు, \q2 ఆయన సన్నిధిలో మనం బ్రతికేటట్టు, \q2 మూడవ రోజున ఆయన మనల్ని పునరుద్ధరిస్తారు. \q1 \v 3 మనం యెహోవా గురించి తెలుసుకుందాం; \q2 ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. \q1 సూర్యోదయం ఎంత నిశ్చయమో, \q2 ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం; \q1 ఆయన శీతాకాలం వర్షాల్లా, \q2 భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.” \b \q1 \v 4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? \q2 యూదా, నిన్ను నేనేం చేయాలి? \q1 మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, \q2 ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది. \q1 \v 5 కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను, \q2 నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను, \q2 అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి. \q1 \v 6 ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు, \q2 దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము. \q1 \v 7 ఆదాములా\f + \fr 6:7 \fr*\ft లేదా \ft*\fqa మానవుల్లా\fqa*\f* వారు నా నిబంధనను మీరారు; \q2 వారు నాకు నమ్మకద్రోహం చేశారు. \q1 \v 8 గిలాదు దుర్మార్గుల పట్టణం, \q2 దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి. \q1 \v 9 బందిపోటు దొంగల్లా మాటున పొంచి ఉన్నట్లు, \q2 యాజకుల గుంపు పొంచి ఉంది; \q1 షెకెము మార్గంలో వారు హత్య చేస్తారు, \q2 దుర్మార్గపు కుట్రలు చేస్తూ ఉంటారు. \q1 \v 10 నేను ఇశ్రాయేలులో ఘోరమైన విషయాన్ని చూశాను: \q2 అక్కడ ఎఫ్రాయిం వ్యభిచారానికి అప్పగించుకుంది, \q2 ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది. \b \q1 \v 11 “నేను నా ప్రజలను \q2 మునుపటి స్థితికి తీసుకువచ్చినప్పుడు, \b \q1 “యూదా వారలారా, మీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది. \c 7 \q2 \v 1 నేను ఇశ్రాయేలును స్వస్థపరిచేటప్పుడు, \q1 ఎఫ్రాయిం పాపాలు బహిర్గతం అవుతున్నాయి, \q2 సమరయ నేరాలు బయటపడుతున్నాయి. \q1 వారు మోసం చేస్తూనే ఉంటారు, \q2 దొంగలు ఇళ్ళలో చొరబడతారు, \q2 బందిపోటు దొంగలు వీధుల్లో దోచుకుంటారు; \q1 \v 2 అయితే వారి చెడు పనులన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటానని \q2 వారు గ్రహించరు. \q1 వారి పాపాలు వారిని చుట్టుముట్టాయి; \q2 అవి ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి. \b \q1 \v 3 “వారు తమ దుష్టత్వంతో రాజును, \q2 వారి అబద్ధాలతో అధిపతులను సంతోషపరుస్తారు. \q1 \v 4 వారంతా వ్యభిచారులు, \q2 పొయ్యిలా మండుతూ ఉంటారు, \q1 వంటమనిషి ముద్ద పిసికిన తర్వాత అది పొంగే వరకు \q2 వేడి చేసిన పొయ్యివంటి వారు. \q1 \v 5 మన రాజు పండుగ దినాన, \q2 అధిపతులు ద్రాక్ష మద్యం మత్తులో ఉంటారు. \q2 అతడు అపహాసకులతో చేతులు కలుపుతాడు. \q1 \v 6 వారి హృదయాలు పొయ్యివంటివి; \q2 కుట్రతో వారు అతన్ని సమీపిస్తారు. \q1 రాత్రంతా వారి కోపాగ్ని రగులుతూ ఉంటుంది; \q2 ఉదయాన అది మండే అగ్నిలా ప్రజ్వలిస్తుంది. \q1 \v 7 వారంతా పొయ్యిలా వేడిగా ఉన్నారు; \q2 వారు తమ పాలకులను మ్రింగివేస్తారు \q1 వారి రాజులందరూ కూలిపోతారు, \q2 వారిలో ఏ ఒక్కడు నన్ను ప్రార్థించడు. \b \q1 \v 8 “ఎఫ్రాయిం దేశాలతో కలిసిపోతుంది; \q2 ఎఫ్రాయిం తిరిగేయని అప్పం లాంటిది. \q1 \v 9 విదేశీయులు అతని బలాన్ని లాగేస్తారు, \q2 కాని అతడు గ్రహించడు. \q1 అతని తలమీద నెరసిన వెంట్రుకలు ఉంటాయి, \q2 కాని అతడు గమనించడు. \q1 \v 10 ఇశ్రాయేలు అహంకారం అతనికి విరుద్ధంగా సాక్ష్యం ఇస్తుంది, \q2 కాని ఇదంతా జరిగినా కూడా \q1 అతడు తన దేవుడైన యెహోవా వైపు తిరగడం లేదు, \q2 ఆయనను వెదకడం లేదు. \b \q1 \v 11 “ఎఫ్రాయిం గువ్వ లాంటిది, \q2 బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, \q1 అది ఈజిప్టును పిలుస్తుంది, \q2 అది అష్షూరు వైపు తిరుగుతుంది. \q1 \v 12 వారు వెళ్లేటప్పుడు, నేను వారి మీద నా వల వేస్తాను; \q2 నేను వారిని ఆకాశంలో పక్షుల్లా క్రిందికి లాగుతాను. \q1 వారు సమాజంగా కూడుకుంటున్నారని నేను విన్నప్పుడు, \q2 నేను వారిని శిక్షిస్తాను. \q1 \v 13 వారికి శ్రమ కలుగుతుంది, \q2 ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేశారు! \q1 వారికి నాశనం కలుగుతుంది, \q2 ఎందుకంటే నాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. \q1 నేను వారిని విమోచించాలని ఆశిస్తాను, \q2 కాని వారు నా గురించి అబద్ధాలు చెప్పారు. \q1 \v 14 వారు తమ హృదయపూర్వకంగా నాకు మొరపెట్టరు, \q2 కాని తమ పడకల మీద విలపిస్తారు. \q1 ధాన్యం కోసం, నూతన ద్రాక్షరసం కోసం, \q2 వారు తమ దేవుళ్ళను వేడుకుంటూ తమను తాము కొట్టుకుంటారు \q2 కాని వారు నా నుండి తొలగిపోయారు. \q1 \v 15 నేను వారికి శిక్షణ ఇచ్చి బలపరిచాను, \q2 కాని నాకు విరుద్ధంగా దురాలోచన చేస్తున్నారు. \q1 \v 16 వారు సర్వోన్నతుని వైపు తిరుగరు, \q2 వారు పనికిరాని విల్లులా ఉన్నారు. \q1 వారి నాయకులు తమ గర్వపు మాటల వలన \q2 కత్తివేటుకు పడిపోతారు. \q1 ఇందుచేత ఈజిప్టు దేశంలో \q2 వారు ఎగతాళి చేయబడతారు. \c 8 \s1 ఇశ్రాయేలు సుడిగాలిని కోస్తారు \q1 \v 1 “బూర నీ పెదవులపై పెట్టుకో! \q2 ఒక గ్రద్ద యెహోవా ఇంటి మీద వ్రాలింది. \q1 ఎందుకంటే ప్రజలు నా నిబంధనను మీరి, \q2 నా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. \q1 \v 2 ఇశ్రాయేలు, ‘మా దేవా! \q2 మిమ్మల్ని మేము తెలుసుకున్నాం’ అని మొరపెడుతుంది. \q1 \v 3 కాని ఇశ్రాయేలు మంచి దానిని విసర్జించారు; \q2 కాబట్టి శత్రువులు వారిని తరుముతారు. \q1 \v 4 వారు నా సమ్మతి లేకుండా రాజులను నియమించుకున్నారు, \q2 వారు నా ఆమోదం లేకుండా అధిపతులను ఎన్నుకున్నారు. \q1 వారి వెండి బంగారాలతో \q2 తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. \q2 అవి వారి సొంత నాశనానికే. \q1 \v 5 సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి! \q2 నా కోపం వాటి మీద రగులుకుంది \q1 ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు? \q2 \v 6 ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి! \q1 ఈ దూడను కంసాలి తయారుచేశాడు. \q2 అది దేవుడు కాదు, \q1 ఆ సమరయ దూడ \q2 ముక్కలుగా విరగ్గొట్టబడుతుంది. \b \q1 \v 7 “వారు గాలిని విత్తుతారు, \q2 సుడిగాలిని కోస్తారు. \q1 పైరుకు కంకులు లేవు, \q2 దాని నుండి పిండి రాదు. \q1 అది ఒకవేళ పంటకు వస్తే, \q2 విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు. \q1 \v 8 ఇశ్రాయేలు మ్రింగివేయబడింది; \q2 ఇప్పుడు అది ఎవరికీ ఇష్టం లేనిదానిగా, \q2 ఇతర దేశాల మధ్య ఉంది. \q1 \v 9 వారు ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా, \q2 అష్షూరుకు వెళ్లారు, \q2 ఎఫ్రాయిం తనను తాను విటులకు అమ్ముకుంది. \q1 \v 10 వారు తమను ఇతర దేశాల్లో అమ్ముకున్నప్పటికీ, \q2 నేను వారిని ఇప్పుడు సమకూరుస్తాను. \q1 బలవంతుడైన రాజు పెట్టే భారం క్రింద, \q2 వారు నీరసించిపోతారు. \b \q1 \v 11 “పాపపరిహార బలులు అర్పించడానికి ఎఫ్రాయిం అనేక బలిపీఠాలు నిర్మించింది, \q2 కాని అవే పాపం చేయడానికి కారణమయ్యాయి. \q1 \v 12 నేను వారి కోసం నా ధర్మశాస్త్ర విషయాలు ఎన్నో వ్రాశాను, \q2 కాని అవి తమకు సంబంధించినవి కావన్నట్లు పరిగణించారు. \q1 \v 13 వారు తమ బలులు నాకు బహుమానంగా ఇచ్చినా, \q2 వాటి మాంసం తిన్నా సరే, \q2 యెహోవా వారిని బట్టి సంతోషించడం లేదు. \q1 ఇప్పుడు ఆయన వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, \q2 వారి పాపాలను శిక్షిస్తారు: \q2 వారు ఈజిప్టుకు తిరిగి వెళ్తారు. \q1 \v 14 ఇశ్రాయేలు తమ సృష్టికర్తను మరచిపోయి \q2 రాజభవనాలను కట్టుకున్నారు; \q2 యూదావారు చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. \q1 అయితే నేను వారి పట్టణాల మీద అగ్ని కురిపిస్తాను, \q2 అది వాటి కోటలను దహించి వేస్తుంది.” \c 9 \s1 ఇశ్రాయేలుకు శిక్ష \q1 \v 1 ఇశ్రాయేలూ, ఆనందించకు; \q2 ఇతర దేశాల్లా ఉత్సాహపడకు. \q1 నీవు నీ దేవుని పట్ల నమ్మకంగా లేవు; \q2 ధాన్యం దుల్లగొట్టే నీ నూర్పిడి కళ్ళాలన్నిటిలో \q2 నీవు వేశ్యల జీతాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డావు. \q1 \v 2 నూర్పిడి కళ్ళాలు, ద్రాక్ష గానుక తొట్లు ప్రజలను పోషించవు, \q2 క్రొత్త ద్రాక్షరసం వారికి మిగలదు. \q1 \v 3 వారు యెహోవా దేశంలో నిలిచి ఉండరు, \q2 ఎఫ్రాయిం ఈజిప్టుకు తిరిగి వెళ్తుంది, \q2 అష్షూరులో అపవిత్ర ఆహారాన్ని తింటుంది. \q1 \v 4 వారు యెహోవాకు ద్రాక్షరస పానార్పణలు అర్పించరు, \q2 వారి బలులు ఆయనను సంతోషపరచవు. \q1 అట్టి బలులు ఏడ్చేవారి రొట్టెలా ఉంటాయి. \q2 వాటిని తినేవారందరు అపవిత్రులవుతారు. \q1 ఈ ఆహారం వారికే సరిపడుతుంది; \q2 అది యెహోవా మందిరంలోకి రాదు. \b \q1 \v 5 మీ నియమించబడిన పండుగల దినాన, \q2 యెహోవా విందు దినాల్లో మీరేం చేస్తారు? \q1 \v 6 వారు నాశనాన్ని తప్పించుకున్నా సరే, \q2 ఈజిప్టువారిని సమకూరుస్తుంది, \q2 మెంఫిసు వారిని పాతిపెడుతుంది. \q1 వారికి ప్రియమైన వెండి వస్తువులను దురదగొండ్లు ఆక్రమిస్తాయి, \q2 వారి గుడారాలు ముళ్ళతో నిండుతాయి. \q1 \v 7 శిక్షా దినాలు వస్తున్నాయి, \q2 వెల చెల్లించే దినాలు సమీపంగా ఉన్నాయి. \q2 ఇశ్రాయేలు దీనిని తెలుసుకోవాలి. \q1 ఎందుకంటే మీ అపరాధాలు అనేకం, \q2 మీరు చూపిన శత్రుత్వం తీవ్రమైంది కాబట్టి \q1 ప్రవక్త మూర్ఖునిగా, \q2 ప్రభావం గల వ్యక్తి పిచ్చివానిగా పరిగణించబడుతున్నారు. \q1 \v 8 నా దేవునితో పాటు ఉండే ప్రవక్త \q2 ఎఫ్రాయిం ప్రజలకు కావలివాడు, \q1 అయినప్పటికీ అతని త్రోవలన్నిట్లో ఉచ్చులు పొంచి ఉన్నాయి. \q2 తన దేవుని ఆలయంలో కూడా శత్రువులు ఉన్నారు. \q1 \v 9 గిబియా రోజుల్లో ఉన్నట్లు, \q2 వారు అవినీతిలో లోతుగా మునిగిపోయారు. \q1 దేవుడు వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, \q2 వారి పాపాల కోసం వారిని శిక్షిస్తారు. \b \q1 \v 10 “నాకు ఇశ్రాయేలు దొరికినప్పుడు, \q2 ఎడారిలో ద్రాక్షపండ్లు చూసినట్లు అనిపించింది; \q1 నేను మీ పూర్వికులను చూసినప్పుడు, \q2 అంజూర చెట్టు మీద తొలి పండ్లను చూసినట్లు అనిపించింది. \q1 అయితే వారు బయల్-పెయోరు వచ్చినప్పుడు, \q2 వారు ఆ సిగ్గుమాలిన విగ్రహానికి తమను తాము ప్రతిష్ఠించుకొన్నారు, \q2 తాము ఇష్టపడింది ఎంత నీచమో, వారు అంత నీచులయ్యారు. \q1 \v 11 ఎఫ్రాయిం యొక్క ఘనత పక్షిలా ఎగిరిపోతుంది, \q2 పుట్టుక, గర్భధారణ, పిల్లలను కనడం వారిలో ఉండవు. \q1 \v 12 వారు పిల్లలను పెంచినా సరే, \q2 నేను వారికి మనుష్యులందరిని దూరం చేస్తాను. \q1 నేను వారిని విడిచిపెట్టినప్పుడు, \q2 వారికి శ్రమ! \q1 \v 13 నేను ఎఫ్రాయిమును, \q2 అందమైన స్థలంలో నాటబడిన తూరులా చూశాను. \q1 కాని ఎఫ్రాయిం తన పిల్లలను, \q2 వధించే వాని దగ్గరకు తెస్తుంది.” \b \q1 \v 14 యెహోవా, వారికి ఇవ్వండి, \q2 వారికి మీరేమి ఇస్తారు, \q1 జన్మనివ్వలేని గర్భాలను, \q2 ఎండిపోయిన రొమ్ములను వారికి ఇవ్వండి. \b \q1 \v 15 “గిల్గాలులో వారి చెడుతనం అంతటిని బట్టి, \q2 అక్కడ వారిని ద్వేషిస్తున్నాను. \q1 వారు పాప క్రియలనుబట్టి, \q2 నేను వారిని నా మందిరంలో నుండి వెళ్లగొడతాను. \q1 నేను ఇక ఎన్నడూ వారిని ప్రేమించను; \q2 వారి నాయకులంతా తిరుగుబాటుదారులు. \q1 \v 16 ఎఫ్రాయిమువారు మొత్తబడ్డారు, \q2 వారి వేరు ఎండిపోయింది, \q2 వారు ఇక ఫలించరు. \q1 ఒకవేళ వారు పిల్లలు కన్నా, \q2 వారి ప్రియమైన సంతతిని నేను నాశనం చేస్తాను.” \b \q1 \v 17 వారు నా దేవునికి లోబడలేదు కాబట్టి, \q2 ఆయన వారిని తిరస్కరించారు; \q2 వారు ఇతర దేశాల్లో తిరుగుతూ ఉంటారు. \b \c 10 \q1 \v 1 ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; \q2 అతడు బాగా ఫలించాడు. \q1 అతడు ఫలించినకొద్దీ, \q2 అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. \q1 అతని భూమి సారవంతమైన కొద్ది, \q2 అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు. \q1 \v 2 వారి హృదయం కపటమైనది, \q2 ఇప్పుడు వారు తమ అపరాధానికి శిక్షను భరించాలి. \q1 యెహోవా వారి బలిపీఠాలను పడగొట్టి, \q2 వారి పవిత్ర రాళ్లను నాశనం చేస్తారు. \b \q1 \v 3 అప్పుడు వారు, “మనకు రాజు లేడు \q2 ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు. \q1 ఒకవేళ మనకు రాజు ఉన్నా కూడా, \q2 అతడు మనకు ఏమి చేయగలడు?” అంటారు. \q1 \v 4 వారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, \q2 అబద్ధ ప్రమాణాలు చేస్తారు \q2 ఒప్పందాలు చేసుకుంటారు; \q1 కాబట్టి వాదనలు దున్నబడిన పొలంలో \q2 విషపు మొక్కల్లా మొలుస్తాయి. \q1 \v 5 సమరయలో నివసించే ప్రజలు, \q2 బేత్-ఆవెనులో\f + \fr 10:5 \fr*\fq బేత్-ఆవెనులో \fq*\ft అంటే \ft*\fqa దుష్టత్వం గల ఇల్లు\fqa*\f* ఉన్న దూడ విగ్రహం గురించి భయపడతారు. \q1 దాని ఘనత పోయిందని \q2 దాని ప్రజలు దుఃఖపడతారు, \q1 దాని వైభవం గురించి ఆనందించిన \q2 దాని యాజకులు ఏడుస్తారు. \q1 \v 6 అది అష్షూరుకు కొనిపోబడి, \q2 మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. \q1 ఎఫ్రాయిం అవమానించబడుతుంది; \q2 ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది. \q1 \v 7 సమరయ రాజు నాశనమవుతాడు, \q2 అతడు నీటిలో విరిగిపోయిన రెమ్మలా కొట్టుకు పోతాడు. \q1 \v 8 ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైన \q2 దుష్టత్వం\f + \fr 10:8 \fr*\ft హెబ్రీలో \ft*\fqa ఆవెను \fqa*\ft బేత్-ఆవెన్ ను సూచిస్తుంది; 5 వచనం చూడండి\ft*\f* కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి. \q1 ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి \q2 వారి బలిపీఠాలను కప్పుతాయి. \q1 అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని \q2 కొండలతో, “మామీద పడండి!” అని అంటారు. \b \q1 \v 9 “ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం చేస్తూ ఉన్నావు. \q2 నీవు అదే స్థితిలో ఉండిపోయావు. \q1 గిబియాలోని దుర్మార్గుల మీదికి \q2 మరలా యుద్ధం రాలేదా? \q1 \v 10 నాకు ఇష్టమైనప్పుడు, నేను వారిని శిక్షిస్తాను; \q2 వారి రెండంతల పాపం కోసం వారిని బంధకాలలో పెట్టడానికి \q2 దేశాలు వారికి విరుద్ధంగా కూడుకుంటాయి. \q1 \v 11 ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది, \q2 నూర్పిడి అంటే దానికి ఇష్టం; \q1 కాబట్టి దాని నున్నటి మెడ మీద \q2 నేను కాడి పెడతాను, \q1 నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను, \q2 యూదా భూమిని దున్నాలి, \q2 యాకోబు భూమిని చదును చేయాలి. \q1 \v 12 మీ కోసం నీతిని విత్తండి, \q2 మారని ప్రేమ అనే పంట కోయండి. \q1 దున్నబడని భూమిని చదును చేయండి; \q2 ఎందుకంటే, యెహోవా మీ దగ్గరకు వచ్చి, \q1 నీతి వర్షం మీపై కురిపించే వరకు, \q2 యెహోవాను వెదికే సమయం ఇదే. \q1 \v 13 కాని మీరు దున్ని దుష్టత్వాన్ని నాటారు, \q2 మీరు చెడును కోశారు, \q2 మీరు వంచన ఫలాలు తిన్నారు. \q1 మీరు మీ సొంత బలాన్ని, \q2 మీకున్న అనేకమంది యోధులను నమ్ముకున్నారు. \q1 \v 14 కాబట్టి మీ ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది, \q2 షల్మాను యుద్ధంలో బేత్-అర్బేలును పాడుచేసినట్లు, \q1 మీ కోటలన్నీ నాశనమవుతాయి, \q2 ఆ రోజు తల్లులు తమ పిల్లలతో పాటు నేలకు కొట్టబడతారు. \q1 \v 15 బేతేలు, నీకు ఇలా జరుగుతుంది, \q2 ఎందుకంటే, నీ దుష్టత్వం ఘోరంగా ఉంది. \q1 ఆ రోజు ఉదయించినప్పుడు, \q2 ఇశ్రాయేలు రాజు సంపూర్ణంగా నాశనమవుతాడు. \c 11 \s1 ఇశ్రాయేలుపై దేవుని ప్రేమ \q1 \v 1 “ఇశ్రాయేలు శిశువుగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను, \q2 ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను. \q1 \v 2 అయితే ఎంత ఎక్కువగా వారిని పిలిస్తే, \q2 అంతగా వారు నా నుండి దూరమయ్యారు. \q1 వారు బయలుకు బలులు అర్పించారు, \q2 విగ్రహాలకు ధూపం వేశారు. \q1 \v 3 ఎఫ్రాయిం ప్రజలను చేయి పట్టుకుని, \q2 నడవడం నేర్పింది నేనే; \q1 అయితే వారిని స్వస్థపరచింది నేనని \q2 వారు గ్రహించలేదు. \q1 \v 4 నేను మనుష్యుల మంచితనం అనే త్రాళ్లతో, \q2 ప్రేమ బంధాలతో వారిని నడిపించాను. \q1 ఒకడు చిన్నబిడ్డను ముఖం దగ్గరకు ఎలా తీసుకుంటారో, \q2 అలా నేను వారికి ఉంటూ వారి మీద నుండి కాడిని తీసివేశాను, \q2 నేను క్రిందికి వంగి వారిని పోషించాను. \b \q1 \v 5 “వారు ఈజిప్టుకు తిరిగి వెళ్లరా? \q2 అష్షూరు రాజు వారిమీద అధికారం చేయడా? \q2 ఎందుకంటే వారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు. \q1 \v 6 వారి పట్టణాల్లో ఖడ్గం తళుక్కుమంటుంది; \q2 అది వారి అబద్ధ ప్రవక్తలను మ్రింగివేస్తుంది, \q2 వారి ఉపాయాలను తుదముట్టిస్తుంది. \q1 \v 7 నా ప్రజలు నా నుండి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నారు. \q2 వారు మహోన్నత దేవుడనైన నాకు మొరపెట్టినా, \q2 నేను ఏ విధంగాను వారిని హెచ్చించను. \b \q1 \v 8 “ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను? \q2 ఇశ్రాయేలూ, నిన్ను ఎలా అప్పగించగలను? \q1 నిన్ను ఎలా అద్మాలా పరిగణించగలను? \q2 సెబోయిములా నిన్ను ఎలా చేయగలను? \q1 నా హృదయం నాలో మారింది; \q2 నా జాలి అంతా ఉప్పొంగుతుంది. \q1 \v 9 నేను నా కోపాగ్నిని చూపించను, \q2 ఎఫ్రాయిమును మరలా నాశనం చేయను. \q1 నేను దేవుడను, మనిషిని కాను, \q2 మీ మధ్య ఉన్న పరిశుద్ధ దేవుడను. \q2 నేను వారి పట్టణాలకు విరుద్ధంగా రాను. \q1 \v 10 వారు యెహోవాను అనుసరిస్తారు; \q2 ఆయన సింహంలా గర్జిస్తారు, \q1 ఆయన గర్జించినప్పుడు, \q2 ఆయన పిల్లలు పడమటి నుండి వణకుతూ వస్తారు. \q1 \v 11 వారు వణకుతూ ఈజిప్టు నుండి \q2 పక్షుల్లా ఎగిరి వస్తారు, \q2 అష్షూరు నుండి గువ్వల్లా అల్లాడుతూ వస్తారు. \q1 వారిని తమ ఇళ్ళలో నివసించేలా చేస్తాను,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \s1 ఇశ్రాయేలీయుల పాపం \q1 \v 12 ఎఫ్రాయిం అబద్ధాలతో నన్ను చుట్టుముట్టింది, \q2 ఇశ్రాయేలు మోసంతో నన్ను ఆవరించింది. \q1 యూదా దేవునికి విరుద్ధంగా ఉంది, \q2 నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. \c 12 \q1 \v 1 ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; \q2 అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, \q2 విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. \q1 అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు \q2 ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు. \q1 \v 2 యెహోవా యూదా మీద నేరారోపణ చేస్తున్నారు; \q2 ఆయన యాకోబును తన మార్గాలను బట్టి శిక్షిస్తారు \q2 ఆయన అతని క్రియలనుబట్టి అతనికి ప్రతిఫలం ఇస్తారు. \q1 \v 3 తల్లి గర్భంలో అతడు తన సోదరుని కాలి మడమను పట్టుకున్నాడు; \q2 అతడు పెద్దవాడయ్యాక దేవునితో పోరాడాడు. \q1 \v 4 అతడు దేవదూతతో పోరాడి గెలిచాడు; \q2 అతడు ఏడ్చి, దయచూపమని వేడుకున్నాడు. \q1 బేతేలులో అతడు దేవున్ని కనుగొన్నాడు \q2 అక్కడ అతడు ఆయనతో మాట్లాడాడు. \q1 \v 5 ఆయన సైన్యాల అధిపతియైన యెహోవా, \q2 ఆయన పేరు యెహోవా! \q1 \v 6 అయితే నీవు నీ దేవుని దగ్గరకు తిరిగి రావాలి; \q2 ప్రేమ, న్యాయం కలిగి ఉండాలి, \q2 నీ దేవుని కోసం ఎల్లప్పుడు వేచి ఉండాలి. \b \q1 \v 7 వ్యాపారి తప్పుడు తూకం వాడుతూ \q2 మోసం చేయడానికి ఇష్టపడతాడు. \q1 \v 8 “నేను చాలా ధనవంతుడను; \q2 నాకున్న ధనాన్ని బట్టి వారు నాలో \q1 ఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అని \q2 ఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు. \b \q1 \v 9 “మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి \q2 యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; \q1 మీ నియమించబడిన పండుగ రోజుల్లో ఉన్నట్లు \q2 నేను మిమ్మల్ని మరలా గుడారాల్లో నివసింపజేస్తాను. \q1 \v 10 నేను ప్రవక్తలతో మాట్లాడాను. \q2 వారికి అనేక దర్శనాలను ఇచ్చి \q2 ఉపమానరీతిగా వారికి చెప్పాను.” \b \q1 \v 11 గిలాదు చెడ్డదా? \q2 దాని ప్రజలు వ్యర్థమైన వారు! \q1 వారు గిల్గాలులో కోడెలను బలి అర్పిస్తున్నారా? \q2 వారి బలిపీఠాలు దున్నబడిన పొలంలోని \q2 రాళ్ల కుప్పల్లా ఉన్నాయి. \q1 \v 12 యాకోబు అరాము దేశానికి పారిపోయాడు; \q2 ఇశ్రాయేలు భార్యను పొందడానికి సేవ చేశాడు, \q2 భార్యను సంపాదించడానికి గొర్రెలు కాచాడు. \q1 \v 13 యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకురావడానికి ఒక ప్రవక్తను వాడుకున్నారు, \q2 ప్రవక్త ద్వారా ఆయన వారిని సంరక్షించారు. \q1 \v 14 కాని ఎఫ్రాయిం ఆయన మహా కోపాన్ని రేపాడు \q2 అతడు చేసిన రక్తపాతం బట్టి దేవుడు అతని మీద నేరం మోపుతారు \q2 అతని ధిక్కారం బట్టి ఆయన అతనికి ప్రతీకారం చేస్తారు. \c 13 \s1 ఇశ్రాయేలుపై యెహోవా కోపం \q1 \v 1 ఎఫ్రాయిం మాట్లాడినప్పుడు ప్రజలు వణికారు; \q2 అతడు ఇశ్రాయేలులో ఘనపరచబడ్డాడు. \q2 కాని అతడు బయలును పూజించి అపరాధిగా చనిపోయాడు. \q1 \v 2 ఇప్పుడు వారు మరి ఎక్కువ పాపం చేస్తున్నారు; \q2 వారు వెండితో తమ కోసం విగ్రహాలను చేసుకుంటున్నారు, \q1 అవి నైపుణ్యంతో చేయబడిన ప్రతిమలు, \q2 అవన్నీ కళాకారుని చేతిపనులు. \q1 ఈ ప్రజల గురించి ఇలా చెప్తారు, \q2 “వారు నరబలులు అర్పిస్తారు! \q2 దూడ విగ్రహాలను ముద్దు పెట్టుకుంటారు!” \q1 \v 3 కాబట్టి వారు ఉదయకాలపు పొగలా ఉంటారు, \q2 ఉదయకాలపు మంచులా అదృశ్యం అవుతారు, \q2 నూర్పిడి కళ్ళంలో నుండి గాలికి ఎగిరే పొట్టులా ఉంటారు, \q2 కిటికీలో గుండా పోయే పొగలా అయిపోతారు. \b \q1 \v 4 “మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి \q2 యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; \q1 మీరు నన్ను తప్ప మరే దేవున్ని అంగీకరించకూడదు, \q2 నేను తప్ప రక్షకుడు ఎవరూ లేరు. \q1 \v 5 మీరు తీవ్రమైన వేడిగల అరణ్యంలో ఉన్నప్పుడు, \q2 నేను మిమ్మల్ని సంరక్షించాను. \q1 \v 6 నేను వారిని పోషించగా వారు తృప్తి చెందారు. \q2 వారు తృప్తి చెందిన తర్వాత గర్వించి; \q2 నన్ను మరచిపోయారు. \q1 \v 7 కాబట్టి నేను వారికి సింహంలా ఉంటాను, \q2 చిరుతపులిలా దారిలో పొంచి ఉంటాను. \q1 \v 8 పిల్లలు పోయిన ఎలుగుబంటిలా, \q2 నేను వారిపై పడి వారిని చీల్చివేస్తాను; \q1 సింహంలా వారిని మ్రింగివేస్తాను, \q2 అడవి మృగంలా వారిని చీల్చివేస్తాను. \b \q1 \v 9 “ఇశ్రాయేలూ! నీవు నాశనమవుతావు \q2 ఎందుకంటే నీవు నీ సహాయకుడనైన నాకు విరుద్ధంగా ఉన్నావు. \q1 \v 10 నిన్ను కాపాడగలిగే నీ రాజు ఎక్కడా? \q2 మీ పట్టణాలన్నిటిలో ఉండే మీ అధిపతులు ఎక్కడా? \q1 వారి గురించి నీవు, ‘నాకు రాజును అధిపతులను ఇవ్వండి’ \q2 అని నీవు అడిగావు కదా? \q1 \v 11 కాబట్టి నేను కోపంలో నీకు రాజును ఇచ్చాను. \q2 నా ఆగ్రహంతో అతన్ని తొలగించాను. \q1 \v 12 ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది, \q2 అతని పాపాలు వ్రాయబడ్డాయి. \q1 \v 13 ప్రసవ వేదనలాంటి శ్రమ అతనికి కలుగుతుంది, \q2 కాన్పు సమయం వచ్చినప్పుడు కాని అతడు జ్ఞానంలేని శిశువుగా ఉన్నాడు; \q1 గర్భం నుండి బయటకు రాని శిశువులా \q2 అతడు జ్ఞానంలేనివానిగా ఉన్నాడు. \b \q1 \v 14 “నేను ఈ ప్రజలను పాతాళం శక్తి నుండి విడిపిస్తాను; \q2 మరణం నుండి వారిని విమోచిస్తాను. \q1 ఓ మరణమా, నీవు కలిగించే తెగుళ్ళు ఎక్కడ? \q2 ఓ పాతాళమా, నీవు కలిగించే నాశనం ఎక్కడ? \b \q1 “అతడు తన సోదరుల మధ్య ఎదుగుతున్నా సరే, \q2 \v 15 నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను. \q1 యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది, \q2 ఎడారి నుండి అది వీస్తుంది. \q1 అతని నీటిబుగ్గ ఎండిపోతుంది \q2 అతని బావి ఇంకిపోతుంది. \q2 అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి. \q1 \v 16 సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి, \q2 ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు. \q1 వారు ఖడ్గానికి కూలుతారు; \q2 వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు, \q2 వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.” \c 14 \s1 దీవెన రావాలంటే పశ్చాత్తాపపడాలి \q1 \v 1 ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా! \q2 నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు! \q1 \v 2 మాటలు సిద్ధపరచుకొని \q2 యెహోవా దగ్గరకు రా. \q1 ఆయనతో ఇలా చెప్పు: \q2 “మా పాపాలన్నీ క్షమించండి \q1 మమ్మల్ని దయతో స్వీకరించండి, \q2 కోడెలకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తాము. \q1 \v 3 అష్షూరు మమ్మల్ని రక్షించలేదు; \q2 మేము యుద్ధ గుర్రాలను ఎక్కము. \q1 మా చేతులు చేసిన వాటితో మేము, \q2 ‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము, \q2 ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.” \b \q1 \v 4 “నేను వారి నమ్మకద్రోహాన్ని సరిచేస్తాను, \q2 మనస్పూర్తిగా వారిని ప్రేమిస్తాను, \q2 ఎందుకంటే వారి మీదున్న నా కోపం చల్లారింది. \q1 \v 5 నేను ఇశ్రాయేలుకు మంచులా ఉంటాను; \q2 అతడు తామరలా వికసిస్తాడు. \q1 లెబానోను దేవదారు చెట్టులా \q2 అతని వేర్లు భూమి లోతుకు వెళ్తాయి; \q2 \v 6 అతని చిగురు పెరుగుతుంది. \q1 అతని వైభవం ఒలీవ చెట్టులా, \q2 అతని సువాసన లెబానోను దేవదారులా ఉంటుంది. \q1 \v 7 అతని నీడలో ప్రజలు నివసిస్తారు; \q2 వారు ధాన్యంలా అభివృద్ధి చెందుతారు, \q1 వారు ద్రాక్షలా వికసిస్తారు, \q2 ఇశ్రాయేలు కీర్తి లెబానోను ద్రాక్షరసంలా ఉంటుంది. \q1 \v 8 ఎఫ్రాయిమూ, ఇకనుండి విగ్రహాలతో నాకేం పని? \q2 నేనే అతనికి జవాబిస్తాను, అతన్ని సంరక్షిస్తాను. \q1 నేను పచ్చని సరళ వృక్షం వంటి వాన్ని; \q2 నా వలనే నీకు ఫలం కలుగుతుంది.” \b \q1 \v 9 జ్ఞానులెవరు? వారు ఈ విషయాలు గ్రహించాలి. \q2 వివేచన గలవారెవరు? వారు కూడ గ్రహించాలి. \q1 యెహోవా మార్గాలు సరియైనవి; \q2 నీతిమంతులు వాటిలో నడుస్తారు, \q2 కాని తిరుగుబాటుదారులు వాటిలో తొట్రిల్లుతారు.