\id HAG - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h హగ్గయి \toc1 హగ్గయి ప్రవచనం \toc2 హగ్గయి \toc3 హగ్గయి \mt1 హగ్గయి \mt2 ప్రవచనం \c 1 \s1 యెహోవా మందిరం కట్టడానికి పిలుపు \p \v 1 రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరో నెల మొదటి రోజున ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదాదేశపు అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు\f + \fr 1:1 \fr*\ft అంటే \ft*\fq యెహోజాదాకు \fq*\ft యోజాదాకు యొక్క మరో రూపం\ft*\ft ; \+xt 12|link-href="HAG 1:12"\+xt*, \+xt 14|link-href="HAG 1:14"\+xt*వచనంలో కూడా\ft*\f* కుమారుడైన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పింది: \p \v 2 సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: “యెహోవాకు మందిరాన్ని మరలా కట్టడానికి సమయమింకా రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.” \p \v 3 అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా చెప్పింది ఏంటంటే: \v 4 “ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు చెక్క పలకలతో కప్పిన మీ ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?” \p \v 5 కాబట్టి సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: “మీ ప్రవర్తన గురించి బాగా ఆలోచించుకోండి. \v 6 మీరు విస్తారంగా విత్తినా కానీ పండింది కొంచెమే. మీరు భోజనం చేస్తున్నా ఆకలి తీరడం లేదు. మీరు త్రాగుతున్నారు కానీ మత్తు ఎక్కడం లేదు. బట్టలు కప్పుకున్నా వెచ్చగా లేదు. మీరు జీతం సంపాదిస్తున్నా అది చిల్లు సంచిలో వేసినట్లే ఉంటుంది.” \p \v 7 సైన్యాలకు యెహోవా చెబుతున్న మాట ఇదే: “మీ ప్రవర్తన గురించి బాగా ఆలోచించుకోండి. \v 8 పర్వతాల పైకి వెళ్లి కలపను తీసుకువచ్చి నా మందిరాన్ని కట్టండి, అప్పుడు నేను దానిలో ఆనందించి ఘనత పొందుతానని” యెహోవా తెలియజేస్తున్నారు. \v 9 “మీరు ఎక్కువ ఆశించారు కాని కొంచెమే వచ్చింది. మీరు ఇంటికి తెచ్చిన దానిని నేను చెదరగొట్టాను. ఎందుకు? అని సైన్యాలకు యెహోవా అంటున్నారు. ఎందుకంటే నా మందిరం పాడైపోయి ఉండగా మీరంతా మీ ఇళ్ళు కట్టుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. \v 10 కాబట్టి మీ కారణంగా ఆకాశం నుండి మంచు కురవలేదు భూమి పంటలు పండలేదు. \v 11 పొలాలు పర్వతాల విషయంలో ధాన్యం క్రొత్త ద్రాక్షరసం విషయంలో నూనె విషయంలో భూమి పండించే చేసే ప్రతి దాని విషయంలో మనుష్యులు పశువుల విషయంలో చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.” \b \p \v 12 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునైన యెహోషువ, మిగిలి ఉన్న ప్రజలందరూ తమ దేవుడైన యెహోవా మాట విని, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపి తెలియజేసిన సందేశానికి లోబడి యెహోవా పట్ల భయభక్తులు చూపించారు. \p \v 13 అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన సందేశాన్ని ప్రజలకు ఇలా వినిపించాడు: “నేను మీకు తోడుగా ఉన్నాను” ఇదే యెహోవా వాక్కు. \v 14 యెహోవా యూదాదేశపు అధికారిగా ఉన్న షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు మనస్సును, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును, మిగిలి ఉన్న ప్రజలందరి మనస్సులను ప్రేరేపించగా వారందరూ వచ్చి, వారి దేవుడైన సైన్యాల యెహోవా మందిరపు పనిని, \v 15 ఆరో నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు. \s1 నూతన మందిరానికి వాగ్దానం చేయబడిన మహిమ \p రాజైన దర్యావేషు పరిపాలించిన రెండవ సంవత్సరంలో, \c 2 \nb \v 1 ఏడవ నెల ఇరవై ఒకటవ రోజున ప్రవక్తయైన హగ్గయి ద్వార వచ్చిన యెహోవా వాక్కు: \v 2 “నీవు యూదాదేశపు అధికారిగా ఉన్న షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు\f + \fr 2:2 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యోజాదాకు\fqa*\f* కుమారుడైన యెహోషువతో, మిగిలి ఉన్న ప్రజలందరితో మాట్లాడి ఇలా అడుగు, \v 3 పూర్వం ఈ మందిర వైభవాన్ని చూసినవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడది మీకు ఎలా కనబడుతోంది? దానితో పోల్చడానికి ఎందుకూ సరిపోదు కదా? \v 4 అయితే యెహోవా చెప్పేదేమంటే, ‘జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో! ప్రధాన యాజకుడవును యెహోజాదాకు కుమారుడవునైన యెహోషువా, ధైర్యం తెచ్చుకో! దేశ ప్రజలారా, మీరందరూ ధైర్యం తెచ్చుకోండి! నేను మీకు తోడుగా ఉన్నాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. \v 5 ‘మీరు ఈజిప్టు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన ఇదే. నా ఆత్మ మీ మధ్య ఉంటుంది కాబట్టి భయపడకండి.’ \p \v 6 “సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మరికొంత సమయంలో మరోసారి నేను ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని ఎండిన భూమిని కంపింపజేస్తాను. \v 7 నేను ఇతర జనాలను కదిలించగా వారు తమకిష్టమైన వాటిని తీసుకువస్తారు; నేను ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతాను’ ఇదే సైన్యాల యెహోవా మాట. \v 8 వెండి నాది, బంగారం నాది; ఇదే సైన్యాల యెహోవా మాట. \v 9 ‘ఇప్పుడున్న మందిర వైభవం గత మందిర వైభవం కన్నా అధికంగా ఉంటుంది’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘ఈ స్థలంలో నేను సమాధానాన్ని అనుగ్రహిస్తాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.” \s1 అపవిత్రమైన ప్రజలకు ఆశీర్వాదాలు \p \v 10 రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు వచ్చి తెలియజేసింది ఏంటంటే: \v 11 “సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: ధర్మశాస్త్రం గురించి యాజకులను అడుగు: \v 12 ఎవరైనా తమ వస్త్రపు చెంగులో ప్రతిష్ఠితమైన మాంసాన్ని తీసుకెళ్లి, ఆ చెంగుతో రొట్టెను గాని వంటకాన్ని గాని, ద్రాక్షరసాన్ని గాని, నూనెను గాని ఇతర ఏ ఆహారాన్ని గాని తాకితే అది పవిత్రం అవుతుందా?” అని అడిగితే, \p యాజకులు, “కాదు” అన్నారు. \p \v 13 అప్పుడు హగ్గయి, “ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడై ఆ వస్తువులలో ఒకదాన్ని తాకితే అతడు తాకింది అపవిత్రం అవుతుందా?” అని అడిగితే, \p యాజకులు, “అవును, అది అపవిత్రం అవుతుంది” అని జవాబిచ్చారు. \p \v 14 అందుకు హగ్గయి వారితో ఇలా అన్నాడు, “ఈ ప్రజలు, ఈ జనాలు నా దృష్టికి అలాగే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ అక్కడ వారు అర్పించేదంతా నా దృష్టికి అపవిత్రమే! ఇదే యెహోవా వాక్కు. \p \v 15 “ ‘ఆ రోజు నుండి మీరు దీని గురించి బాగా ఆలోచించండి. యెహోవా మందిరంలో రాయి మీద రాయి ఉంచే ముందు మీ పరిస్థితులను గురించి ఆలోచించండి. \v 16 ఒకడు ఇరవై కుప్పల ధాన్యం నాటగా పది కుప్పల ధాన్యమే వస్తుంది. ద్రాక్షగానుగ తొట్టిలో నుండి యాభై కొలతల ద్రాక్షరసం తీయడానికి వెళ్తే ఇరవై కొలతలు మాత్రమే ఉంటుంది. \v 17 నేను నీ చేతి పనంతటిని తెగులుతో బూజుతో వడగండ్లతో నాశనం చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 18 ‘మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు నుండి, తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజు నుండి, అంటే యెహోవా ఆలయ పునాది వేయబడిన రోజు నుండి జరిగిన వాటిని గురించి జాగ్రత్తగా ఆలోచించండి: \v 19 గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా! \p “ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ” \s1 యెహోవా ముద్ర ఉంగరంగా జెరుబ్బాబెలు \p \v 20 అదే నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు రెండవసారి వచ్చి తెలియజేసింది ఏంటంటే: \v 21 యూదాదేశపు అధికారియైన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు, నేను ఆకాశాన్ని భూమిని కదిలించబోతున్నాను. \v 22 నేను రాజ సింహాసనాలను కూలదోసి ఇతర రాజ్యాల అధికారాన్ని నాశనం చేస్తాను. నేను రథాలను రథసారథులను కూలదోస్తాను; గుర్రాలు గుర్రపురౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలిపోతారు. \p \v 23 “ ‘అయితే షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలూ, నీవు నా సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను తీసుకుని నా ముద్ర ఉంగరంలా చేస్తాను, ఎందుకంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను’ ఇదే సైన్యాల యెహోవా వాక్కు.”