\id GEN - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h ఆది \toc1 ఆదికాండం \toc2 ఆది \toc3 ఆది \mt1 ఆదికాండం \c 1 \s1 ఆరంభం \p \v 1 ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. \v 2 భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు. \b \p \v 3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. \v 4 దేవుడు ఆ వెలుగు బాగుందని చూసి, వెలుగును చీకటిని వేరుచేశారు. \v 5 దేవుడు వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది మొదటి రోజు. \b \p \v 6 దేవుడు, “ఆకాశ జలాలను భూ జలాలను వేరు చేయడానికి జలాల మధ్య విశాలం కలుగును గాక” అన్నారు. \v 7 అలాగే జరిగింది. దేవుడు విశాలాన్ని చేసి ఆ విశాలం క్రింది జలాలను విశాలం మీది జలాలను వేరుచేశారు. \v 8 దేవుడు ఆ విశాలానికి “ఆకాశం” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది రెండవ రోజు. \b \p \v 9 దేవుడు, “ఆకాశం క్రింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడును గాక” అని అనగా అలాగే జరిగింది. \v 10 దేవుడు ఆరిన నేలకు “భూమి” అని, ఒకే చోట సమకూడిన జలాలకు “సముద్రం” అని పేరు పెట్టారు. అది మంచిదని దేవుడు చూశారు. \p \v 11 అప్పుడు దేవుడు, “భూమి వృక్ష సంపదను అనగా విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లను భూమి మొలిపించును గాక” అని అన్నారు. అలాగే జరిగింది. \v 12 భూమి వృక్ష సంపదను ఉత్పత్తి చేసింది అంటే, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలు గల మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లు మొలిపించింది. అది మంచిదని దేవుడు చూశారు. \v 13 సాయంకాలం గడిచి ఉదయం రాగా అది మూడవ రోజు. \b \p \v 14 దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి. \v 15 ఆకాశ విశాలంలో భూమికి వెలుగునిచ్చే జ్యోతులుండును గాక” అని అన్నారు, అలాగే జరిగింది. \v 16 దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అలా రెండు గొప్ప జ్యోతులను అలాగే నక్షత్రాలను కూడా చేశారు. \v 17-18 భూమికి వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని పాలించడానికి, చీకటిని వెలుగును వేరు చేయడానికి, దేవుడు వాటిని ఆకాశ విశాలంలో అమర్చారు. అది మంచిదని దేవుడు చూశారు. \v 19 సాయంకాలం గడిచి ఉదయం రాగా అది నాలుగవ రోజు. \b \p \v 20 దేవుడు, “నీటిలో జలజీవులు విస్తరించాలి, భూమిపై నుండి పక్షులు ఆకాశ విశాలంలో ఎగురును గాక” అని అన్నారు. \v 21 కాబట్టి దేవుడు సముద్రపు గొప్ప జీవులను, వాటి వాటి జాతుల ప్రకారం నీటిలో ఉండి నీటిలో తిరిగే ప్రతి జీవిని, వాటి వాటి జాతి ప్రకారం రెక్కలు గల పక్షులను సృష్టించారు. అది మంచిదని దేవుడు చూశారు. \v 22 దేవుడు, “ఫలించి, వృద్ధి చెంది, సముద్ర జలాల్లో నిండిపోవాలి, అలాగే భూమి మీద పక్షులు విస్తరించును గాక” అని వాటిని ఆశీర్వదించారు. \v 23 అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు. \b \p \v 24 దేవుడు, “భూమి వాటి వాటి జాతి ప్రకారం జీవులను పుట్టించాలి అంటే, పశువులను, నేల మీద ప్రాకే జీవులను, అడవి మృగాలను, వాటి వాటి జాతుల ప్రకారం పుట్టించును గాక” అని అన్నారు, అలాగే జరిగింది. \v 25 దేవుడు వాటి వాటి జాతుల ప్రకారం అడవి మృగాలను, వాటి వాటి జాతుల ప్రకారం పశువులను, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద ప్రాకే జీవులను చేశారు. అది మంచిదని దేవుడు చూశారు. \p \v 26 అప్పుడు దేవుడు, “మనం మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాము. వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, పశువులను, అడవి మృగాలను భూమిపై ప్రాకే జీవులన్నిటిని ఏలుతారు” అని అన్నారు. \q1 \v 27 కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు, \q2 దేవుని స్వరూపంలో వారిని సృజించారు; \q2 వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. \p \v 28 దేవుడు వారితో, “మీరు ఫలించి, వృద్ధి చెంది, భూలోకమంతా విస్తరించి, దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేలపై ప్రాకే ప్రతి జీవిని ఏలండి” అని చెప్పి ఆశీర్వదించారు. \p \v 29 అప్పుడు దేవుడు, “భూమిపై విత్తనాలు ఇచ్చే ప్రతి మొక్కను, విత్తనాలు గల ఫలమిచ్చే ప్రతి చెట్టును మీకు ఆహారంగా ఇస్తున్నాను. \v 30 భూమిపై ఉన్న మృగాలన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేలపై ప్రాకే జీవులన్నిటికి, జీవం ఉన్న ప్రతీ దానికి ప్రతి పచ్చని మొక్కను ఆహారంగా ఇస్తున్నాను” అని అన్నారు. అలాగే జరిగింది. \p \v 31 దేవుడు తాను చేసిందంతా చూశారు. అది చాలా బాగుంది. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది ఆరవరోజు. \b \c 2 \p \v 1 ఆ విధంగా ఆకాశం భూమి వాటిలో సమస్తం సంపూర్తి చేయబడ్డాయి. \b \p \v 2 ఏడవ రోజు నాటికి దేవుడు తాను చేస్తున్న పనంతా ముగించారు; కాబట్టి ఏడవ రోజున తన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నారు. \v 3 ఆ రోజున సృష్టి క్రియ అంతటి నుండి దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆయన ఆ రోజును దీవించి పరిశుద్ధపరిచారు. \s1 ఆదాము హవ్వ \p \v 4 యెహోవా దేవుడు భూమిని సృజించినప్పుడు, భూమ్యాకాశాల సృష్టి జరిగిన విధానం ఇదే. \b \p \v 5 భూమి\f + \fr 2:5 \fr*\ft లేదా \ft*\fqa నేల \fqa*\ft \+xt 6|link-href="GEN 2:6"\+xt*\ft*\f* మీద ఏ పొద కనిపించలేదు, మొక్క మొలవలేదు, ఎందుకంటే యెహోవా దేవుడు భూమి మీద వాన కురిపించలేదు, భూమిని సేద్యం చేయడానికి నరులు లేరు, \v 6 అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు\f + \fr 2:6 \fr*\ft లేదా \ft*\fqa మంచు\fqa*\f* వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి. \v 7 యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని\f + \fr 2:7 \fr*\ft హెబ్రీలో \ft*\fq మనుష్యుని \fq*\fqa ఆదాము \fqa*\ft లేదా \ft*\fqa ఆదామా \fqa*\ft ఈ పదాలు ఒకేలా ఉంటాయి; (\+xt 20|link-href="GEN 2:20"\+xt* చూడండి).\ft*\f* చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు. \p \v 8 యెహోవా దేవుడు తూర్పు దిక్కున ఏదెనులో తోట నాటి, అందులో తాను రూపించిన నరుని ఉంచారు. \v 9 యెహోవా దేవుడు నేల నుండి కంటికి అందంగా కనిపించే ఆహారానికి సరియైన అన్ని రకాల చెట్లను మొలిపించారు. అలాగే ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞాన వృక్షం ఉన్నాయి. \p \v 10 ఏదెను నుండి ఒక నది పారుతూ తోటను తడిపేది; అది అక్కడినుండి నాలుగు పాయలుగా చీలిపోయింది. \v 11 ఈ నదులలో మొదటి దాని పేరు పీషోను; ఇది బంగారం ఉన్న హవీలా దేశం చుట్టూ పారుతుంది. \v 12 ఆ దేశ బంగారం ఉండేది; సువాసనగల గుగ్గిలం\f + \fr 2:12 \fr*\ft లేదా \ft*\fqa ముత్యాలు\fqa*\f* లేతపచ్చ రాళ్లు కూడా అక్కడ ఉండేవి. \v 13 రెండవ నది పేరు గిహోను, అది కూషు\f + \fr 2:13 \fr*\ft బహుశ ఆగ్నేయ మెసపొటేమియా అయి ఉండవచ్చు\ft*\f* దేశమంతటా పారుతుంది. \v 14 మూడవ నది పేరు టైగ్రీసు, అది అష్షూరు ప్రాంతానికి తూర్పున ప్రవహిస్తుంది. నాలుగవ నది యూఫ్రటీసు. \p \v 15 ఏదెను తోటను సాగుచేయడానికి దానిని, జాగ్రత్తగా చూసుకోడానికి యెహోవా దేవుడు నరుని దానిలో ఉంచారు. \v 16 యెహోవా దేవుడు ఆ నరునితో, “ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ నీవు తినవచ్చు; \v 17 కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తిన్న రోజున నీవు తప్పక చస్తావు” అని ఆజ్ఞాపించారు. \p \v 18 యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు. \p \v 19 యెహోవా దేవుడు నేల మట్టితో ప్రతి విధమైన అడవి జంతువులను, ఆకాశ పక్షులను చేసి, ఆ మనుష్యుని దగ్గరకు తెచ్చి వాటికి అతడు ఏ పేర్లు పెడతాడో అని చూశారు; అతడు ఒక్కొక్క జీవికి ఏ పేరైతే పెట్టాడో అదే ఆ జీవికి పేరు అయ్యింది. \v 20 ఆ మనుష్యుడు పశువులన్నిటికి, ఆకాశపక్షులకు, అడవి జంతువులన్నిటికి పేర్లు పెట్టాడు. \p అయితే మనుష్యునికి\f + \fr 2:20 \fr*\fq మనుష్యునికి \fq*\ft లేదా \ft*\fqa ఆదాముకు\fqa*\f* తగిన తోడు దొరకలేదు. \v 21 కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలిగించి, అతని ప్రక్కటెముకల్లో ఒకటి తీసి, ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చి వేశారు. \v 22 అప్పుడు యెహోవా దేవుడు మనుష్యుని నుండి తీసిన ప్రక్కటెముకతో స్త్రీని చేసి అతని దగ్గరకు తెచ్చారు. \p \v 23 అప్పుడు ఆ మనుష్యుడు ఇలా అన్నాడు: \q1 “ఈమె నా ఎముకల్లో ఎముక, \q2 నా మాంసంలో మాంసం; \q1 ఈమె నరుని నుండి వచ్చింది కాబట్టి \q2 ఈమె ‘నారీ’ అని పిలువబడుతుంది.” \m \v 24 అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏకశరీరం అవుతారు. \p \v 25 ఆదాము, అతని భార్య, ఇద్దరు నగ్నంగా ఉన్నారు, కానీ వారికి సిగ్గు అనిపించలేదు. \c 3 \s1 పతనం \p \v 1 యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా యుక్తి కలది. సర్పం స్త్రీతో, “దేవుడు, ‘తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు’ అని నిజంగా చెప్పారా?” అని అడిగింది. \p \v 2 అందుకు స్త్రీ, “తోటలోని చెట్ల పండ్లు మేము తినవచ్చు \v 3 కాని, ‘తోట మధ్యలో చెట్టు పండు మాత్రం తినకూడదు, దానిని ముట్టుకోవద్దు, లేదంటే మీరు చస్తారు’ అని దేవుడు చెప్పారు” అని జవాబిచ్చింది. \p \v 4 అప్పుడు సర్పం, “మీరు ఖచ్చితంగా చావరు. \v 5 మీరు అది తింటే మీ కళ్లు తెరవబడతాయని, మీరు దేవునిలా అవుతారని, మంచిచెడులు తెలుసుకుంటారని దేవునికి తెలుసు” అని చెప్పింది. \p \v 6 స్త్రీ ఆ చెట్టు పండు తినడానికి మంచిది, చూడటానికి బాగుంది, తింటే జ్ఞానం వస్తుందని తలంచి, దానిలో కొంచెం తిని, తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. \v 7 అప్పుడు వారి ఇద్దరి కళ్లు తెరవబడి తాము నగ్నంగా ఉన్నారని గ్రహించి, తమ శరీరాలను కప్పుకోడానికి అంజూర ఆకులు అల్లుకొన్నారు. \p \v 8 అప్పుడు ఆ రోజు చల్లని సమయంలో యెహోవా దేవుడు తోటలో నడుస్తున్న శబ్దం విని, ఆదాము అతని భార్య యెహోవా దేవునికి కనబడకూడదని తోట చెట్ల మధ్య దాక్కున్నారు. \v 9 అప్పుడు యెహోవా దేవుడు ఆదామును పిలిచి, “నీవెక్కడున్నావు?” అని అడిగారు. \p \v 10 అతడు, “తోటలో మీ శబ్దం విని, నేను దిగంబరిగా ఉన్నానని భయపడ్డాను; అందుకే నేను దాక్కున్నాను” అని జవాబిచ్చాడు. \p \v 11 అప్పుడు దేవుడు, “నీవు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినకూడదని నేను మీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు నుండి పండు తిన్నావా?” అని అడిగారు. \p \v 12 అందుకు ఆదాము, “మీరు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండును కొంచెం నాకిచ్చింది, నేను తిన్నాను” అని చెప్పాడు. \p \v 13 అప్పుడు యెహోవా దేవుడు స్త్రీని, “నీవు చేసిన ఈ పనేంటి?” అని అడిగారు. \p అందుకు ఆ స్త్రీ జవాబిస్తూ, “సర్పం మాటలకు మోసపోయి నేను తిన్నాను” అని చెప్పింది. \p \v 14 అందుకు యెహోవా దేవుడు సర్పంతో, “నీవు ఇలా చేశావు కాబట్టి, \q1 “అన్ని రకాల పశువుల్లోను, \q2 అడవి జంతువులన్నిటిలోనూ నీవు శపించబడ్డావు! \q1 నీవు బ్రతుకు దినాలన్ని \q2 నీ పొట్టతో ప్రాకుతావు, \q2 మన్ను తింటావు. \q1 \v 15 నేను నీకు స్త్రీకి మధ్య, \q2 నీ సంతానానికి\f + \fr 3:15 \fr*\ft లేదా \ft*\fqa విత్తనం\fqa*\f* స్త్రీ సంతానానికి మధ్య \q2 శత్రుత్వం కలుగజేస్తాను; \q1 అతడు నీ తలను చితకగొడతాడు,\f + \fr 3:15 \fr*\ft లేదా \ft*\fqa నలిపివేస్తాడు\fqa*\f* \q2 నీవు అతని మడిమె మీద కాటేస్తావు” \m అని అన్నారు. \p \v 16 తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు, \q1 “నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను; \q2 తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. \q1 నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది, \q2 అతడు నిన్ను ఏలుతాడు.” \p \v 17 ఆదాముతో ఆయన ఇలా అన్నారు, “నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి, \q1 “నిన్ను బట్టి ఈ నేల శపించబడింది; \q2 నీ జీవితకాలమంతా దాని పంట నుండి, \q2 కష్టపడి పని చేసి తింటావు. \q1 \v 18 భూమి నీకోసం ముళ్ళ కంపలను గచ్చపొదలను మొలిపిస్తుంది, \q2 నీవు పొలం లోని పంటను తింటావు. \q1 \v 19 నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి \q2 నీవు మట్టికి చేరేవరకు, \q1 నీ నుదిటి మీద చెమట కార్చి \q2 నీ ఆహారాన్ని తింటావు \q1 నీవు మట్టివి కాబట్టి \q2 తిరిగి మన్నై పోతావు.” \p \v 20 ఆదాము\f + \fr 3:20 \fr*\ft లేదా \ft*\fqa మనుష్యుడు\fqa*\f* తన భార్యకు హవ్వ\f + \fr 3:20 \fr*\fq హవ్వ \fq*\ft అంటే బహుశ \ft*\fqa జీవం\fqa*\f* అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె జీవంగల వారందరికి తల్లి. \p \v 21 యెహోవా దేవుడు ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో చేసిన వస్త్రాలను తొడిగించారు. \v 22 అప్పుడు యెహోవా దేవుడు, “మనుష్యుడు ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకోగలిగి మనలాంటి వాడయ్యాడు, కాబట్టి అతడు తన చేయి చాపి జీవవృక్ష ఫలం కూడా తెంపుకొని తిని ఎప్పటికీ బ్రతికే ఉంటాడేమో, అలా జరగనివ్వకూడదు” అని అనుకున్నారు. \v 23 కాబట్టి యెహోవా దేవుడు అతన్ని ఏదెను తోట నుండి బయటకు వెళ్లగొట్టి అతడు ఏ మట్టి నుండి తీయబడ్డాడో, ఆ మట్టినే సాగు చేసుకునేలా చేశారు. \v 24 దేవుడు ఆదామును బయటకు పంపివేసి జీవవృక్షం దగ్గరకు వెళ్లే మార్గాన్ని కాపాడడానికి ఏదెను తోటకు తూర్పున\f + \fr 3:24 \fr*\ft లేదా \ft*\fqa ముందున\fqa*\f* కెరూబును\f + \fr 3:24 \fr*\fq కెరూబును \fq*\ft సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం \ft*\fqa నర రూపం లేదా జంతు రూపంలో \fqa*\ft ఉంటుందని భావిస్తారు.\ft*\f* ఇటు అటు తిరుగుతున్న మండుతున్న ఖడ్గాన్ని కాపలా ఉంచారు. \c 4 \s1 కయీను హేబెలు \p \v 1 అటు తర్వాత ఆదాము హవ్వను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై కయీనుకు\f + \fr 4:1 \fr*\fq కయీను \fq*\ft హెబ్రీ పదంలా ఉంది \ft*\fqa సంపాదించాను.\fqa*\f* జన్మనిచ్చింది. “యెహోవా సహాయంతో నేను కుమారున్ని సంపాదించుకున్నాను” అని ఆమె అన్నది. \v 2 తర్వాత అతని సహోదరుడైన హేబెలుకు జన్మనిచ్చింది. \p హేబెలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయకుడు. \v 3 కోత సమయం వచ్చినప్పుడు కయీను పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. \v 4 హేబెలు కూడా తన గొర్రెలలో మొదటి సంతానంగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను అంగీకరించారు. \v 5 కానీ కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. అందుకు కయీనుకు చాలా కోపం వచ్చి ముఖం మాడ్చుకున్నాడు. \p \v 6 అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నారు, “నీవెందుకు కోపంతో ఉన్నావు? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొన్నావు? \v 7 నీవు చేసేది మంచిదైతే నీవు అంగీకరించబడవా? నీవు సరియైనది చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచుకొని ఉంది; అది నిన్ను పొందుకోవాలని వాంఛతో ఉంది, కానీ నీవు దానిని జయించాలి.” \p \v 8 ఒక రోజు కయీను తన తమ్మున్ని పిలిచి, “మనం పొలానికి వెళ్దాం” అని అన్నాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను హేబెలు మీద దాడి చేసి అతన్ని చంపేశాడు. \p \v 9 అప్పుడు యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగారు. \p అందుకు అతడు, “ఏమో నాకు తెలియదు, నేనేమైన నా తమ్మునికి కావలివాడినా?” అని అన్నాడు. \p \v 10 అందుకు యెహోవా, “నీవేం చేశావు? విను, నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది. \v 11 ఇప్పుడు నీవు శపించబడ్డావు, నీ చేతి నుండి వచ్చిన నీ తమ్ముని రక్తాన్ని పీల్చుకున్న నేల నుండి నీవు తరిమివేయబడ్డావు. \v 12 నీవు భూమిలో ఎంత కృషి చేసినా, అది ఇకమీదట నీకు మంచి పంటను ఇవ్వదు. నీవు భూమిపై విశ్రాంతి లేని దేశదిమ్మరిగా ఉంటావు” అని చెప్పారు. \p \v 13 కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది. \v 14 ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు. \p \v 15 అయితే యెహోవా అతనితో, “అలా జరగదు; ఎవరైనా కయీనును చంపితే, వారు ఏడు రెట్లు ఎక్కువ శిక్ష అనుభవిస్తారు” అని అన్నారు. అప్పుడు యెహోవా కయీనును ఎవరూ చంపకుండ ఉండేలా కయీను మీద ఒక గుర్తు వేశారు. \v 16 కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లి ఏదెనుకు తూర్పున ఉన్న నోదు\f + \fr 4:16 \fr*\fq నోదు \fq*\ft అంటే \ft*\fqa తిరుగుతూ ఉండడం \fqa*\ft (\+xt 12|link-href="GEN 4:12"\+xt*; \+xt 14|link-href="GEN 4:14"\+xt* వచనాలు చూడండి).\ft*\f* దేశంలో నివసించాడు. \p \v 17 కయీను తన భార్యను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై హనోకుకు జన్మనిచ్చింది. అప్పుడు కయీను ఒక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడు, దానికి హనోకు అని తన కుమారుని పేరు పెట్టాడు. \v 18 హనోకుకు ఈరాదు పుట్టాడు, ఈరాదు మెహూయాయేలు తండ్రి, మెహూయాయేలు మెతూషాయేలుకు తండ్రి, మెతూషాయేలు లెమెకుకు తండ్రి. \p \v 19 లెమెకు ఇద్దరిని భార్యలుగా చేసుకున్నాడు, ఒకరు ఆదా ఇంకొకరు సిల్లా. \v 20 ఆదా యాబాలుకు జన్మనిచ్చింది; అతడు గుడారాల్లో నివసిస్తూ పశువులను పెంచేవారికి మూలపురుషుడు. \v 21 అతని తమ్ముని పేరు యూబాలు, అతడు తంతి వాయిద్యాలు వాయించే వారికి మూలపురుషుడు. \v 22 సిల్లా కూడా ఒక కుమారునికి జన్మనిచ్చింది, అతని పేరు తూబల్-కయీను, అతడు అన్ని రకాల ఇత్తడి ఇనుప పనిముట్లు తయారుచేయడంలో నిపుణుడు. తూబల్-కయీను యొక్క సోదరి నయమా. \p \v 23 ఒక రోజు లెమెకు తన భార్యలతో, \q1 “ఆదా, సిల్లా నా మాట ఆలకించండి; \q2 లెమెకు భార్యలారా, నా పలుకులు వినండి. \q1 నాకు గాయం చేసినందుకు ఒక మనుష్యుని, \q2 నన్ను గాయపరిచినందుకు ఒక యువకుడిని చంపాను. \q1 \v 24 కయీనును చంపితే ఏడు రెట్లు శిక్ష పడితే, \q2 లెమెకును చంపితే డెబ్బై ఏడు రెట్లు” \m అని అన్నాడు. \p \v 25 ఆదాము తన భార్యను మరోసారి లైంగికంగా కలుసుకున్నప్పుడు, ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చి, “దేవుడు, కయీను చంపిన నా కుమారుడు హేబెలుకు బదులుగా మరొక శిశువునిచ్చారు” అని అతనికి షేతు\f + \fr 4:25 \fr*\fq షేతు \fq*\ft బహుశ దీని అర్థం \ft*\fqa అనుగ్రహించబడినవాడు\fqa*\f* అని పేరు పెట్టింది. \v 26 షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషు అని పేరు పెట్టాడు. \p అప్పటినుండి ప్రజలు యెహోవా నామంలో ప్రార్థించడం మొదలుపెట్టారు. \c 5 \s1 ఆదాము నుండి నోవహు వరకు \p \v 1 ఆదాము వంశావళి యొక్క జాబితా ఇదే. \b \p దేవుడు మనుష్యజాతిని సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో చేశారు. \v 2 ఆయన వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. ఆయన వారిని ఆశీర్వదించి వారికి “మనుష్యజాతి”\f + \fr 5:2 \fr*\ft హెబ్రీలో \ft*\fqa ఆదాము\fqa*\f* అని పేరు పెట్టారు. \b \li1 \v 3 ఆదాము 130 సంవత్సరాలు జీవించి తన పోలికలో తన స్వరూపంలో ఒక కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు. \v 4 షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \v 5 ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. \li1 \v 6 షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు. \v 7 ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. \v 8 షేతు మొత్తం 912 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. \li1 \v 9 ఎనోషు 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి కేయినాను పుట్టాడు. \v 10 కేయినాను పుట్టిన తర్వాత ఎనోషు 815 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. \v 11 ఎనోషు మొత్తం 905 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. \li1 \v 12 కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు. \v 13 మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \v 14 కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. \li1 \v 15 మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి యెరెదు పుట్టాడు. \v 16 యెరెదు పుట్టిన తర్వాత మహలలేలు 830 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \v 17 మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. \li1 \v 18 యెరెదు 162 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి హనోకు పుట్టాడు. \v 19 హనోకు పుట్టిన తర్వాత యెరెదు 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \v 20 యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. \li1 \v 21 హనోకు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మెతూషెల పుట్టాడు. \v 22 మెతూషెల పుట్టిన తర్వాత హనోకు 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నమ్మకంగా నడిచాడు; ఈ సమయంలో ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \v 23 హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు. \v 24 హనోకు దేవునితో నమ్మకంగా నడిచాడు; తర్వాత ఒక రోజు దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు. \li1 \v 25 మెతూషెల 187 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి లెమెకు పుట్టాడు. \v 26 లెమెకు పుట్టిన తర్వాత మెతూషెల 782 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \v 27 మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. \li1 \v 28 లెమెకు 182 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. \v 29 అతనికి నోవహు\f + \fr 5:29 \fr*\fq నోవహు \fq*\ft హెబ్రీలో దీని అర్థం \ft*\fqa ఆదరణ\fqa*\f* అని పేరు పెట్టి, “యెహోవా శపించిన ఈ భూమిని సాగుచేయడానికి మనం పడే ప్రయాసలో, మన చేతుల బాధాకరమైన శ్రమలలో ఆయన మనలను ఆదరిస్తారు” అని అన్నాడు. \v 30 నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \v 31 లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. \li1 \v 32 నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు. \c 6 \s1 లోకంలో దుష్టత్వం \p \v 1 నరులు భూమిపై వృద్ధి చెంది విస్తరిస్తూ ఉన్న సమయంలో వారికి కుమార్తెలు పుట్టినప్పుడు, \v 2 దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందంగా ఉండడం చూసి, వారిలో నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నారు. \v 3 అప్పుడు యెహోవా, “నా ఆత్మ నరులతో నిరంతరం వాదించదు,\f + \fr 6:3 \fr*\ft లేదా \ft*\fq నా \fq*\fqa ఆత్మ వారిలో ఉండదు\fqa*\f* ఎందుకంటే వారు శరీరులు;\f + \fr 6:3 \fr*\ft లేదా \ft*\fqa అవినీతిపరులు\fqa*\f* వారి బ్రతుకు దినాలు 120 సంవత్సరాలు అవుతాయి” అని అన్నారు. \p \v 4 ఆ దినాల్లో భూమిపై నెఫిలీములు\f + \fr 6:4 \fr*\fq నెఫిలీములు \fq*\ft అంటే \ft*\fqa ఆజానుబాహులు\fqa*\f* ఉండేవారు, వీరు తర్వాత కూడా ఉన్నారు. వీరు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు పుట్టిన పిల్లలు. వీరు ప్రాచీన కాలంలో పేరు పొందిన యోధులు. \p \v 5 యెహోవా భూమిపై నరుల దుష్టత్వం చాలా విస్తరించిందని, నరుల హృదయంలోని ప్రతీ ఊహ కేవలం చెడు అని చూశారు. \v 6 యెహోవా భూమిపై నరులను చేసినందుకు చింతించి, హృదయంలో చాలా బాధపడ్డారు. \v 7 అప్పుడు యెహోవా, “నేను సృజించిన నరులను, వారితో పాటు జంతువులను, పక్షులను, నేలపై ప్రాకే జీవులను భూమి మీద నుండి తుడిచివేస్తాను, వాటిని చేసినందుకు నేను బాధపడుతున్నాను” అని అనుకున్నారు. \v 8 అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు. \s1 నోవహు, జలప్రళయం \p \v 9 నోవహు అతని కుటుంబం యొక్క వివరాలు: \b \p నోవహు నీతిమంతుడు, అతని సమకాలికులలో అతడు నిందారహితుడు, దేవునితో నమ్మకంగా జీవించాడు. \v 10 నోవహుకు ముగ్గురు కుమారులు: షేము, హాము, యాపెతు. \p \v 11 దేవుని దృష్టిలో భూమి అవినీతితో హింసతో నిండిపోయింది. \v 12 దేవుడు ఈ భూమి ఎంతో అవినీతితో ఉందని చూశారు, ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజలంతా తమ జీవిత విధానాలను పాడుచేసుకున్నారు. \v 13 కాబట్టి దేవుడు నోవహుతో ఇలా అన్నారు, “నేను ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే వారిని బట్టి భూమి హింసతో నిండిపోయింది. నేను ఖచ్చితంగా వారిని, భూమిని నాశనం చేయబోతున్నాను. \v 14 కాబట్టి నీకోసం తమాల వృక్ష చెక్కతో ఒక ఓడను నిర్మించుకో; దానిలో గదులు చేసి, దానికి లోపల బయట కీలు పూయాలి. \v 15 దానిని నిర్మించవలసిన విధానం: ఆ ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు ఉండాలి.\f + \fr 6:15 \fr*\ft దాదాపు 135 మీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పు 14 మీటర్ల ఎత్తు\ft*\f* \v 16 దానికి పైకప్పు వేసి, మూర\f + \fr 6:16 \fr*\ft దాదాపు 18 అంగుళాలు లేదా 45 సెం. మీ.\ft*\f* కొలత క్రింద అన్ని మూలలు గల ఒక కిటికీ పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి, క్రింద, మధ్య, పై అంతస్తులు నిర్మించాలి. \v 17 ఆకాశం క్రింద ఉన్న సమస్త జీవులను, జీవవాయువు గల ప్రతి ప్రాణిని నాశనం చేయడానికి నేను భూమి మీదికి జలప్రళయం తీసుకురాబోతున్నాను. భూమిపై ఉన్న ప్రతిదీ నశిస్తుంది. \v 18 అయితే నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను, ఓడలో నీతో పాటు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు ప్రవేశించాలి. \v 19 మీతో పాటు బ్రతికి ఉండేలా జీవులన్నిటిలో మగ, ఆడవాటిని మీరు ఓడలోకి తీసుకురావాలి. \v 20 ప్రతి జాతిలో రెండేసి పక్షులు, ప్రతి జాతిలో రెండేసి జంతువులు, ప్రతి జాతిలో నేలపై ప్రాకే ప్రాణులు బ్రతికి ఉండడానికి నీ దగ్గరకు వస్తాయి. \v 21 నీకు, వాటికి తినడానికి ఆహారాన్ని అన్ని రకాల భోజనపదార్థాలు సమకూర్చుకోవాలి.” \p \v 22 దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు. \c 7 \p \v 1 అప్పుడు యెహోవా నోవహుతో, “నీవు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి, ఎందుకంటే ఈ తరంలో నీవు మాత్రమే నాకు నీతిమంతునిగా కనిపించావు. \v 2 నీతో పాటు పవిత్రమైన జంతువుల్లో జంటల చొప్పున ఏడు మగవాటిని, ఏడు ఆడవాటిని, అపవిత్రమైన వాటిలో ఒక మగదానిని, \v 3 అలాగే పక్షిజాతులన్నిటిలో నుండి ఏడు మగవాటిని ఏడు ఆడవాటిని భూమిపై వాటి జాతులు సజీవంగా ఉంచడానికి ఓడలోకి తీసుకెళ్లు. \v 4 ఇంకా ఏడు రోజుల్లో భూమి మీద నలభై రాత్రింబగళ్ళు నేను వర్షం కురిపిస్తాను, నేను చేసిన ప్రతి ప్రాణిని భూమి మీద నుండి తుడిచివేస్తాను” అని అన్నారు. \p \v 5 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే నోవహు అంతా చేశాడు. \p \v 6 భూమి మీదికి జలప్రళయం వచ్చినప్పుడు నోవహుకు 600 సంవత్సరాలు. \v 7 జలప్రళయం నుండి తప్పించుకోడానికి నోవహు, అతని భార్య, కుమారులు, వారి భార్యలు ఓడలోనికి ప్రవేశించారు. \v 8 పవిత్రమైన, అపవిత్రమైన జంతువుల్లో, పక్షుల్లో, నేలపై ప్రాకే జీవులన్నిటిలో, \v 9 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే మగవి ఆడవి, జతలుగా నోవహు దగ్గరకు వచ్చి ఓడలో ప్రవేశించాయి. \v 10 ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. \p \v 11 నోవహుకు 600 సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున గొప్ప అగాధంలోని ఊటలన్నీ ఉప్పొంగాయి, ఆకాశ తూములు ద్వారాలు తెరుచుకున్నాయి. \v 12 నలభై రాత్రింబగళ్ళు భూమిపై వర్షం కురిసింది. \p \v 13 ఆ రోజే నోవహు, అతని కుమారులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, అతని ముగ్గురు కుమారుల భార్యలు ఓడలోనికి వెళ్లారు. \v 14 ప్రతి జాతి ప్రకారం అడవి జంతువులు, వాటి వాటి జాతుల ప్రకారం అన్ని రకాల పశువులు, ఆయా జాతుల ప్రకారం నేలపై ప్రాకే జీవులు, వాటి వాటి జాతుల ప్రకారం పక్షులు, రెక్కలు గల ప్రతిదీ వారితో ఉన్నాయి. \v 15 జీవపు ఊపిరి ఉన్న అన్ని జీవుల జతలు నోవహు దగ్గరకు వచ్చి ఓడలోకి ప్రవేశించాయి. \v 16 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే అన్ని జీవులలో ఆడవి మగవి జతలుగా ఓడలోకి వెళ్లాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశారు. \p \v 17 నలభై రోజులు భూమిపై జలప్రళయం ముంచెత్తింది, నీళ్లు నిండిన కొలది ఓడ నీటిపై తేలుతూ ఉంది. \v 18 భూమిపై జలాలు అధికంగా విస్తరించాయి, ఆ ఓడ నీటిపై తేలింది. \v 19 నీరు ఎక్కువై భూమిని కప్పివేశాయి, ఆకాశాల క్రింద ఉన్న అన్ని ఎత్తైన పర్వతాలు నీటిలో మునిగిపోయాయి. \v 20 నీరు పర్వతాల కన్నా పదిహేను మూరల\f + \fr 7:20 \fr*\ft అంటే సుమారు 23 అడుగులు లేదా 6.8 మీటర్లు\ft*\f* ఎత్తు లేచి వాటిని కప్పివేశాయి. \v 21 భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంటే పక్షులు, పశువులు, అడవి జంతువులు, భూమి మీద సంచరించే సమస్త ప్రాణులు చనిపోయాయి, మనుష్యులు కూడా అందరు చనిపోయారు. \v 22 పొడి నేలపై నాసికారంధ్రాలలో జీవం కలిగి ఉన్న ప్రతి ప్రాణి చనిపోయింది. \v 23 నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి; మనుష్యులు, పశువులు, నేల మీద తిరిగే జీవులు, పక్షులు తుడిచివేయబడ్డాయి. కేవలం నోవహు, అతనితో ఓడలో ఉన్నవారు మిగిలారు. \p \v 24 వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి. \c 8 \p \v 1 అయితే దేవుడు నోవహును, అతనితో ఓడలో ఉన్న సమస్త అడవి జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకుని, భూమి మీదికి గాలిని పంపినప్పుడు నీరు వెనుకకు తగ్గింది. \v 2 అగాధజలాల ఊటలు ఆకాశపు తూములు మూయబడ్డాయి, ఆకాశం నుండి కురుస్తున్న వర్షం ఆగిపోయింది. \v 3 భూమి నుండి క్రమంగా నీరు తగ్గింది, నూట యాభై రోజుల తర్వాత నీరు తగ్గి, \v 4 ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారతు పర్వతాలమీద ఆగింది. \v 5 పదవనెల వరకు నీరు తగ్గుతూ ఉంది, పదవనెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి. \p \v 6 నలభైౖ రోజుల తర్వాత నోవహు తాను తయారుచేసిన ఓడ కిటికీ తెరిచి, \v 7 ఒక కాకిని బయటకు పంపాడు, అది భూమిపై నీళ్లు ఆరిపోయే వరకు ఇటు అటు ఎగురుతూ ఉంది. \v 8 అప్పుడు భూమి మీద నీరు తగ్గిందో లేదో చూడటానికి నోవహు ఒక పావురాన్ని బయటకు పంపాడు. \v 9 అయితే భూమి మీద అంతటా నీరు ఉన్నందుకు ఆ పావురానికి వాలడానికి చోటు దొరకలేదు; కాబట్టి అది ఓడలో ఉన్న నోవహు దగ్గరకు తిరిగి వచ్చింది. అతడు చేయి చాపి, పావురాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు. \v 10 మరో ఏడు రోజులు వేచియున్న తర్వాత అతడు ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు. \v 11 సాయంకాలం ఆ పావురం అతని దగ్గరకు వచ్చినప్పుడు, దాని ముక్కుకు పచ్చని ఒలీవ ఆకు ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందని నోవహు గ్రహించాడు. \v 12 మరో ఏడు రోజులు ఆగి, ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు, అయితే ఈసారి అది అతని దగ్గరకు తిరిగి రాలేదు. \p \v 13 నోవహు యొక్క 601 వ సంవత్సరం మొదటి నెల మొదటి దినాన భూమి మీద నీళ్లు ఎండిపోయాయి. అప్పుడు నోవహు ఓడ కప్పు తెరిచి చూస్తే నేల ఆరిపోయి కనిపించింది. \v 14 రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది. \p \v 15 అప్పుడు దేవుడు నోవహుతో, \v 16 “నీవూ, నీ భార్య, నీ కుమారులు, వారి భార్యలు, ఓడలో నుండి బయటకు రండి. \v 17 నీతో ఉన్న ప్రతి జీవిని అంటే పక్షులు, జంతువులు, నేల మీద ప్రాకే ప్రాణులన్నిటిని బయటకు తీసుకురా, అప్పుడు అవి భూమి మీద ఫలించి, వృద్ధి చెంది, విస్తరిస్తాయి” అని అన్నారు. \p \v 18 నోవహు, తన భార్య, కుమారులు, కుమారుల భార్యలతో పాటు బయటకు వచ్చాడు. \v 19 జంతువులు, నేల మీద ప్రాకే జీవులు, పక్షులు, భూమి మీద తిరిగే జీవులన్నీ ఒక జాతి వెంబడి మరో జాతి, వాటి వాటి జంటల ప్రకారం ఓడలో నుండి బయటకు వచ్చాయి. \p \v 20 అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి, జంతువుల్లో పక్షుల్లో పవిత్రమైనవాటిలో కొన్ని తీసి ఆ బలిపీఠంపై దహనబలి అర్పించాడు. \v 21 యెహోవా ఆ బలి అర్పణ యొక్క ఇష్టమైన సువాసన పీల్చుకుని తన హృదయంలో ఇలా అనుకున్నారు: “మనుష్యుల హృదయాలోచన బాల్యం నుండే చెడ్డది అయినప్పటికీ, ఇక ఎన్నడు మనుష్యుల కారణంగా భూమిని శపించను. నేను ఇప్పుడు చేసినట్టు ఇంకెప్పుడు సమస్త జీవులను నాశనం చేయను. \q1 \v 22 “ఈ భూమి ఉన్నంత కాలం, \q1 నాటే కాలం కోతకాలం, \q1 చలి వేడి, \q1 ఎండకాలం చలికాలం, \q1 పగలు రాత్రి, \q1 ఎప్పుడూ నిలిచిపోవు.” \c 9 \s1 నోవహుతో దేవుని నిబంధన \p \v 1 అప్పుడు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదిస్తూ, “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకాన్ని నింపండి. \v 2 భూలోకంలో ఉన్న అన్ని రకాల జంతువులు, ఆకాశంలోని అన్ని రకాల పక్షులు, నేల మీద తిరిగే ప్రతీ జీవి, సముద్రంలో ఉన్న అన్ని చేపలు మీకు భయపడతాయి భీతి చెందుతాయి; అవి మీ చేతికి అప్పగించబడ్డాయి. \v 3 జీవిస్తూ తిరిగే ప్రతిదీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను నేను మీకు ఇచ్చినట్టుగా ఇప్పుడు అన్నిటిని మీకు ఇస్తున్నాను. \p \v 4 “అయితే మాంసంలో ప్రాణాధారమైన రక్తం ఉంటే మీరు తినకూడదు. \v 5 ఎవరైనా ఇంకొకరి ప్రాణం తీస్తే నేను వారి రక్తం గురించి లెక్క అడుగుతాను. అడవి జంతువు ఒక మనుష్యుని చంపితే, అది చంపబడాలి. ఎవరైనా తోటి మనుష్యుల ప్రాణం తీస్తే దాని గురించి నేను లెక్క అడుగుతాను. \q1 \v 6 “ఎవరైనా మనుష్యుని రక్తం చిందిస్తే, \q2 మనుష్యులచే వారి రక్తం చిందించబడాలి; \q1 ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో \q2 మనుష్యుని సృజించారు. \m \v 7 మీరైతే, ఫలించి, అభివృద్ధిచెంది; భూమిపై విస్తరించండి” అని చెప్పారు. \p \v 8 దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇలా అన్నారు: \v 9 “నేను మీతో మీ రాబోయే తరం వారితో నా నిబంధన స్థిరపరస్తున్నాను, \v 10 మీతో పాటు ఉన్న ప్రతి జీవితో అనగా పక్షులతో, పశువులతో, సమస్త అడవి జంతువులతో, ఓడలో నుండి మీతో పాటు బయటకు వచ్చిన జీవులన్నిటితో, భూమిపై ఉన్న ప్రతి జీవితోను నా నిబంధన స్థిరపరస్తున్నాను. \v 11 నేను నీతో చేసిన నిబంధనను ధృవీకరిస్తున్నాను: ఇక ఎన్నడు వరద నీటితో సమస్త ప్రాణులు నాశనం కావు; భూమిని నాశనం చేసే జలప్రళయం ఇక ఎన్నడు రాదు.” \p \v 12 దేవుడు ఇలా అన్నారు, “నాకును మీకును, మీతో ఉన్న ప్రతి ప్రాణికిని మధ్య తరాలన్నిటి కోసం నేను చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే: \v 13 నేను మేఘాలలో నా ధనుస్సును పెట్టాను, అది నాకూ భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉంటుంది. \v 14 నేను భూమిపై మేఘాలను తీసుకువచ్చినప్పుడు ఈ ధనుస్సు మేఘాలలో కనిపిస్తుంది, \v 15 అప్పుడు నేను నాకును మీకును, ప్రతి రకమైన ప్రాణులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఇక ఎన్నడు కూడా సమస్త జీవులన్నిటిని నాశనం చేయడానికి నీరు వరదలా మారదు. \v 16 మేఘాలలో ధనస్సు కనిపించినప్పుడు, నేను దానిని చూసి దేవునికి, భూమిపై ఉన్న సమస్త ప్రాణులకు మధ్య నేను చేసిన నిత్యనిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను.” \p \v 17 ఇంకా దేవుడు నోవహుతో, “ఇది నాకూ భూమిపై ఉన్న సమస్త జీవులకు మధ్య ఉన్న నిబంధనకు గుర్తు” అని చెప్పారు. \s1 నోవహు కుమారులు \p \v 18 ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. (హాము కనానీయులకు తండ్రి.) \v 19 ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి నుంచే భూలోకమంతా ప్రజలు విస్తరించారు. \p \v 20 వ్యవసాయకుడైన నోవహు ద్రాక్షతోట నాటడం ఆరంభించాడు. \v 21 అతడు కొంత మద్యం త్రాగి మత్తులో తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. \v 22 కనాను తండ్రియైన హాము తన తండ్రి దిగంబరిగా ఉండడం చూసి బయట ఉన్న తన ఇద్దరు అన్నలకు చెప్పాడు. \v 23 అయితే షేము, యాపెతు ఒక వస్త్రం తీసుకుని తమ భుజాల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరాన్ని కప్పారు. తండ్రి నగ్న శరీరం వైపు చూడకుండ వారు తమ ముఖాలను మరోవైపుకు తిప్పుకున్నారు. \p \v 24 నోవహుకు మత్తు వదిలిన తర్వాత చిన్నకుమారుడు తనకు చేసింది తెలుసుకుని, \v 25 ఇలా అన్నాడు, \q1 “కనాను శపించబడాలి! \q2 అతడు తన సహోదరులకు \q2 దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.” \p \v 26 ఇంకా అతడు, \q1 “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! \q2 కనాను అతనికి దాసుడవాలి. \q1 \v 27 దేవుడు యాపెతు\f + \fr 9:27 \fr*\fq యాపెతు \fq*\ft హెబ్రీలో \ft*\fqa విస్తరణ \fqa*\ft అని అర్థం ఇచ్చే పదంలా ఉంది\ft*\f* సరిహద్దును విస్తరింపజేయాలి; \q2 యాపెతు షేము గుడారాల్లో నివసించాలి, \q2 కనాను యాపెతుకు దాసుడవాలి” \m అని అన్నాడు. \p \v 28 జలప్రళయం తర్వాత నోవహు ఇంకా 350 సంవత్సరాలు జీవించాడు. \v 29 నోవహు మొత్తం 950 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. \c 10 \s1 ప్రజల వంశ వృక్షం \lh \v 1 నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు అనబడే వారి వంశావళి వివరణ: జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టారు. \s2 యాపెతీయులు \li1 \v 2 యాపెతు కుమారులు:\f + \fr 10:2 \fr*\fq కుమారులు \fq*\ft బహుశ అర్థం \ft*\fqa సంతతి \fqa*\ft లేదా \ft*\fqa వారసులు \fqa*\ft లేదా \ft*\fqa జనాంగాలు\fqa*\ft ; \+xt 3|link-href="GEN 10:3"\+xt*, \+xt 4|link-href="GEN 10:4"\+xt*, \+xt 6|link-href="GEN 10:6"\+xt*, \+xt 7|link-href="GEN 10:7"\+xt*, \+xt 20-23|link-href="GEN 10:20-23"\+xt*, \+xt 29|link-href="GEN 10:29"\+xt*, \+xt 31|link-href="GEN 10:31"\+xt* వచనాల్లో కూడా\ft*\f* \li2 గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు. \li1 \v 3 గోమెరు కుమారులు: \li2 అష్కెనజు, రీఫతు, తోగర్మా. \li1 \v 4 యవాను కుమారులు: \li2 ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. \v 5 (వీరినుండి సముద్ర తీర ప్రజలు, వారి వారి వంశం ప్రకారం, తమ తమ భాషలతో సరిహద్దులలో విస్తరించారు.) \s2 హామీయులు \li1 \v 6 హాము కుమారులు: \li2 కూషు, ఈజిప్టు, పూతు, కనాను. \li1 \v 7 కూషు కుమారులు: \li2 సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. \li1 రాయమా కుమారులు: \li2 షేబ, దేదాను. \lf \v 8 కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు. \v 9 అతడు యెహోవా దృష్టిలో బలమైన వేటగాడు. అందుకే, “యెహోవా ఎదుట గొప్ప వేటగాడైన నిమ్రోదు వలె” అని సామెత ఉంది. \v 10 షీనారులో\f + \fr 10:10 \fr*\ft అంటే బబులోను\ft*\f* అతని రాజ్యంలో మొదటి ప్రాంతాలు బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనేవి ప్రధాన పట్టణాలు. \v 11 అక్కడినుండి అతడు అష్షూరుకు వెళ్లి అక్కడ నీనెవె, రెహోబోత్-ఇర్,\f + \fr 10:11 \fr*\ft లేదా \ft*\fq నీనెవె \fq*\fqa నగర కూడళ్లు\fqa*\f* కలహు, \v 12 నీనెవెకు కలహుకు మధ్యలో ఉన్న రెసెను అనే గొప్ప పట్టణం కట్టి తన సరిహద్దును విస్తరింపజేశాడు. \li1 \v 13 ఈజిప్టు కుమారులు: \li2 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు, \v 14 పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు. \li1 \v 15 కనాను కుమారులు: \li2 మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు, \v 16 యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, \v 17 హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, \v 18 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు. \li2 (తర్వాత కనాను వంశస్థులు చెదిరిపోయారు \v 19 కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.) \lf \v 20 వీరు వంశాల ప్రకారం, వివిధ భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన హాము కుమారులు. \s2 షేమీయులు \lh \v 21 షేముకు కూడా కుమారులు పుట్టారు, ఇతని పెద్ద సహోదరుడు యాపెతు; షేము ఏబెరు కుమారులందరికి పూర్వికుడు. \li1 \v 22 షేము కుమారులు: \li2 ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. \li1 \v 23 అరాము కుమారులు: \li2 ఊజు, హూలు, గెతెరు, మెషెకు.\f + \fr 10:23 \fr*\ft హెబ్రీలో \ft*\fqa మాషు\fqa*\ft ; \+xt 1 దిన 1:17\+xt*\ft*\f* \li1 \v 24 అర్పక్షదు షేలహుకు తండ్రి\f + \fr 10:24 \fr*\ft కొ. ప్ర. లలో \ft*\fqa కేయినానుకు \fqa*\fq తండ్రి\fq*\f*: \li2 షేలహు ఏబెరుకు తండ్రి. \li1 \v 25 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: \li2 ఒకనికి పెలెగు\f + \fr 10:25 \fr*\fq పెలెగు \fq*\ft అంటే \ft*\fqa విభజన\fqa*\f* అని పేరు పెట్టారు ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు. \li1 \v 26 యొక్తాను కుమారులు: \li2 అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, \v 27 హదోరము, ఊజాలు, దిక్లా, \v 28 ఓబాలు, అబీమాయేలు, షేబ, \v 29 ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు. \li2 \v 30 (వీరు నివసించే ప్రాంతం మేషా నుండి తూర్పు కొండసీమ ఉన్న సెఫారా వరకు ఉంది.) \lf \v 31 వీరు తమ వంశాల ప్రకారం వారి భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన షేము కుమారులు. \b \lf \v 32 తమ వంశాల ప్రకారం తమ దేశాల్లో ఉంటున్న నోవహు కుమారుల వంశావళి ఇదే. జలప్రళయం తర్వాత వీరి ద్వారా ప్రజలు విస్తరించారు. \c 11 \s1 బాబెలు గోపురం \p \v 1 భూలోకమంతా ఒకే భాష ఒకే యాస ఉంది. \v 2 ప్రజలు తూర్పు\f + \fr 11:2 \fr*\ft లేదా \ft*\fqa తూర్పు నుండి\fqa*\ft ; లేదా \ft*\fqa తూర్పులో\fqa*\f* వైపునకు ప్రయాణమై వెళ్తుండగా, షీనారు దేశంలో ఒక మైదానాన్ని కనుగొని అక్కడే స్థిరపడ్డారు. \p \v 3 వారు ఒకరితో ఒకరు, “రండి ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాం” అని చెప్పుకున్నారు. వారు రాళ్లకు బదులు ఇటుకలు, అడుసుకు బదులుగా కీలుమట్టి వాడారు. \v 4 అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు. \p \v 5 అయితే యెహోవా మనుష్యులు కట్టుకుంటున్న పట్టణాన్ని, గోపురాన్ని చూడటానికి క్రిందికి దిగి వచ్చారు. \v 6 యెహోవా, “ఒకవేళ ప్రజలు ఒకే భాష మాట్లాడుతూ ఇది చేయడం ప్రారంభిస్తే, అప్పుడు వారు చేద్దామనుకుంది ఏదైనా వారికి అసాధ్యం కాదు. \v 7 రండి, మనం క్రిందికి వెళ్లి వారి భాషను తారుమారు చేద్దాం, అప్పుడు ఒకరి సంభాషణ ఒకరు అర్థం చేసుకోలేరు” అని అన్నారు. \p \v 8 కాబట్టి యెహోవా వారిని భూమి అంతట చెదరగొట్టారు, వారు పట్టణ నిర్మాణం ఆపివేశారు. \v 9 యెహోవా భూప్రజలందరి భాషను తారుమారు చేశారు కాబట్టి అది బాబెలు\f + \fr 11:9 \fr*\fq బాబెలు \fq*\ft హెబ్రీ భాషలో \ft*\fq తారుమారు\fq*\f* అని పిలువబడింది. యెహోవా వారిని అక్కడినుండి భూలోకమంతా చెదరగొట్టారు. \s1 షేము నుండి అబ్రాము వరకు \p \v 10 ఇది షేము కుటుంబ వంశావళి. \b \li1 జలప్రళయం గతించిన రెండు సంవత్సరాల తర్వాత, షేముకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతనికి అర్పక్షదు పుట్టాడు. \v 11 అర్పక్షదు పుట్టిన తర్వాత షేము 500 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \li1 \v 12 అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు. \v 13 షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా అతనికి కుమారులు కుమార్తెలు పుట్టారు. \li1 \v 14 షేలహు 30 సంవత్సరాల వయసువాడై ఏబెరుకు తండ్రి అయ్యాడు. \v 15 ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు బ్రతికాడు, అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. \li1 \v 16 ఏబెరు 34 సంవత్సరాల వయసువాడై పెలెగును కన్నాడు. \v 17 పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \li1 \v 18 పెలెగు 30 సంవత్సరాల వయసువాడై రయూను కన్నాడు. \v 19 రయూ పుట్టిన తర్వాత పెలెగు 209 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \li1 \v 20 రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు. \v 21 సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \li1 \v 22 సెరూగు 30 సంవత్సరాల వయసువాడై నాహోరును కన్నాడు. \v 23 నాహోరు పుట్టిన తర్వాత సెరూగు 200 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు కుమార్తెలు అతనికి పుట్టారు. \li1 \v 24 నాహోరు 29 సంవత్సరాల వయసువాడై తెరహును కన్నాడు. \v 25 తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. \li1 \v 26 తెరహు 70 సంవత్సరాల వయసులో ఉండగా అతనికి అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. \s1 అబ్రాము కుటుంబం \p \v 27 ఇది తెరహు కుటుంబ వంశావళి. \b \p తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు. \v 28 హారాను, తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే, కల్దీయుల ఊరు అనే పట్టణంలో, తన జన్మస్థలంలో చనిపోయాడు. \v 29 అబ్రాము, నాహోరు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్యపేరు శారాయి, నాహోరు భార్యపేరు మిల్కా; ఈమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె. \v 30 శారాయి గొడ్రాలు, ఆమెకు పిల్లలు కలుగలేదు. \p \v 31 తెరహు తన కుమారుడైన అబ్రామును, తన మనవడు, హారాను కుమారుడైన లోతును, తన కోడలైన అబ్రాము భార్య శారాయిని తీసుకుని కల్దీయుల ఊరు నుండి కనానుకు ప్రయాణమయ్యాడు. కాని దారిలో వారు హారానుకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. \p \v 32 తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు. \c 12 \s1 అబ్రాముకు పిలుపు \p \v 1 యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, “నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు. \q1 \v 2 “నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, \q2 నిన్ను ఆశీర్వదిస్తాను; \q1 నీ పేరును గొప్పగా చేస్తాను, \q2 నీవు దీవెనగా ఉంటావు. \q1 \v 3 నిన్ను దీవించే వారిని దీవిస్తాను, \q2 శపించే వారిని శపిస్తాను; \q1 నిన్ను బట్టి భూమి మీద ఉన్న \q2 సర్వ జనాంగాలు దీవించబడతారు.”\f + \fr 12:3 \fr*\ft లేదా \ft*\fq భూమి \fq*\fqa దీవించడానికి నీ పేరును వాడుకుంటారు \fqa*\ft (\+xt 48:20\+xt* చూడండి)\ft*\f* \p \v 4 యెహోవా చెప్పినట్టే అబ్రాము బయలుదేరాడు; లోతు అతనితో వెళ్లాడు. హారాను నుండి ప్రయాణమైనప్పుడు అబ్రాము వయస్సు డెబ్బై అయిదు సంవత్సరాలు. \v 5 అబ్రాము తన భార్య శారాయిని, తమ్ముని కుమారుడైన లోతును, హారానులో వారు కూడబెట్టుకున్న మొత్తం ఆస్తిని, సంపాదించుకున్న ప్రజలను తీసుకుని కనాను దేశం చేరుకున్నాడు. \p \v 6 అబ్రాము ఆ దేశం గుండా ప్రయాణమై షెకెములో మోరె యొక్క సింధూర వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఆ దేశంలో కనానీయులు నివసిస్తున్నారు. \v 7 యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి\f + \fr 12:7 \fr*\ft లేదా \ft*\fqa విత్తనం\fqa*\f* నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు. \p \v 8 అక్కడినుండి బేతేలుకు తూర్పున ఉన్న కొండల వైపు వెళ్లి అక్కడ గుడారం వేసుకున్నాడు. దానికి పడమర బేతేలు, తూర్పున హాయి ఉన్నాయి. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం నిర్మించి యెహోవాను ఆరాధించాడు. \p \v 9 తర్వాత అబ్రాము ప్రయాణిస్తూ దక్షిణంగా వెళ్లాడు. \s1 ఈజిప్టులో అబ్రాము \p \v 10 అప్పుడు దేశంలో కరువు వచ్చింది, అది తీవ్రంగా ఉన్నందుకు అబ్రాము కొంతకాలం ఉందామని ఈజిప్టుకు వెళ్లాడు. \v 11 అతడు ఈజిప్టు ప్రవేశిస్తుండగా తన భార్య శారాయితో, “నీవు చాలా అందంగా ఉంటావని నాకు తెలుసు. \v 12 ఈజిప్టువారు నిన్ను చూసినప్పుడు, ‘ఈమె అతని భార్య’ అని అంటారు. తర్వాత వారు నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. \v 13 నీవు నా చెల్లివని చెప్పు, అప్పుడు నీకోసం నన్ను మంచిగా చూసుకుంటారు, అప్పుడు నిన్ను బట్టి నా ప్రాణం సురక్షితంగా ఉంటుంది” అని చెప్పాడు. \p \v 14 అబ్రాము ఈజిప్టుకు వచ్చినప్పుడు ఈజిప్టువారు శారాయి అందంగా ఉందని చూశారు. \v 15 ఫరో అధికారులు ఆమెను చూసి, ఆమె అందాన్ని ఫరో ఎదుట పొగిడారు, ఆమెను రాజభవనం లోనికి తీసుకెళ్లారు. \v 16 ఆమెను బట్టి అతడు అబ్రామును మంచిగా చూసుకున్నాడు, అబ్రాము గొర్రెలు, మందలు, ఆడ మగ గాడిదలు, ఆడ మగ దాసులు, ఒంటెలను ఇచ్చాడు. \p \v 17 కాని యెహోవా అబ్రాము భార్య శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని ఘోరమైన వ్యాధులతో శిక్షించారు. \v 18 కాబట్టి ఫరో అబ్రామును పిలిపించి, “నాకెందుకిలా చేశావు?” అని అన్నాడు. “ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? \v 19 నేను ఆమెను నా భార్యగా చేసుకునేలా, ‘ఈమె నా చెల్లెలు’ అని నీవెందుకు నాతో చెప్పావు? ఇదిగో నీ భార్య, నీవు ఆమెను తీసుకుని వెళ్లిపో!” అని అన్నాడు. \v 20 అప్పుడు ఫరో తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, వారు అతన్ని, అతని భార్యను, అతనితో ఉన్న ప్రతి దానితో పాటు పంపివేశారు. \c 13 \s1 అబ్రాము లోతు విడిపోవుట \p \v 1 అబ్రాము తన భార్యను తనకున్న అంతటిని తీసుకుని ఈజిప్టు నుండి దక్షిణ దేశానికి వెళ్లాడు, లోతు అతనితో పాటు వెళ్లాడు. \v 2 అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు. \p \v 3 దక్షిణం నుండి బయలుదేరి బేతేలుకు వచ్చేవరకు, అంటే బేతేలుకు హాయికి మధ్యలో తాను మొదట గుడారం వేసుకున్న చోటికి వెళ్లి, \v 4 తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకు చేరుకున్నాడు. అక్కడ అబ్రాము యెహోవాకు ప్రార్థన చేశాడు. \p \v 5 అబ్రాముతో కలిసి ప్రయాణిస్తున్న లోతుకు కూడా గొర్రెలు, మందలు, గుడారాలు ఉన్నాయి. \v 6 వీరిద్దరి ఆస్తులు ఎంతో అధికంగా ఉండడం వల్ల వీరు కలిసి ఉండడానికి ఆ స్థలం సహకరించలేదు. \v 7 అబ్రాము కాపరులకు లోతు కాపరులకు మధ్య వివాదం మొదలైంది. ఆ సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఆ దేశంలో నివసిస్తున్నారు. \p \v 8 కాబట్టి అబ్రాము లోతుతో, “మనం సమీప బంధువులం కాబట్టి నీ కాపరులకు నా కాపరులకు మధ్య వైరం కలిగి ఉండడం మంచిది కాదు. \v 9 ఈ దేశమంతా నీ ముందు లేదా? మనం విడిపోదాము. నీవు ఈ భూభాగంలో ఎడమ వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తాను; నీవు కుడి వైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను” అని అన్నాడు. \p \v 10 లోతు కళ్ళెత్తి సోయరు వైపు యొర్దాను మైదాన ప్రాంతమంతా యెహోవా తోటలా, ఈజిప్టులా, సస్యశ్యామలమై ఉన్నట్లు చూశాడు. (ఇది యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయక ముందు అలా ఉంది.) \v 11 కాబట్టి లోతు యొర్దాను మైదాన ప్రాంతమంతా తన కోసం ఎంచుకుని తూర్పు వైపు వెళ్లిపోయాడు. వారు ఒకరి నుండి ఒకరు విడిపోయారు: \v 12 అబ్రాము కనాను దేశంలో నివసించాడు, లోతు మైదాన పట్టణాల మధ్య నివసిస్తూ, సొదొమ దగ్గర గుడారాలు వేసుకున్నాడు. \v 13 అయితే, సొదొమ ప్రజలు దుర్మార్గులు, యెహోవాకు విరోధంగా ఘోరంగా పాపం చేస్తూ ఉండేవారు. \p \v 14 లోతు అబ్రాము నుండి విడిపోయిన తర్వాత యెహోవా అబ్రాముతో, “నీవున్న చోట నుండి ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలు చూడు. \v 15 నీవు చూస్తున్న భూమంతా నీకు, నీ సంతానానికి\f + \fr 13:15 \fr*\ft లేదా \ft*\fqa విత్తనం\fqa*\ft ; \+xt 16|link-href="GEN 13:16"\+xt* వచనంలో కూడా\ft*\f* శాశ్వతంగా ఇస్తాను. \v 16 నీ సంతానాన్ని భూమి మీద ఉన్న ఇసుక రేణువుల్లా అంటే ఒకవేళ ఎవరైనా లెక్కించాలనుకున్నా లెక్కించలేనంత విస్తారంగా చేస్తాను. \v 17 నీవు లేచి దేశం యొక్క అన్ని దిక్కులకు వెళ్లు, అదంతా నేను నీకు ఇస్తున్నాను” అని అన్నారు. \p \v 18 కాబట్టి అబ్రాము హెబ్రోనులో మమ్రే అనే చోట సింధూర వృక్షాల దగ్గర నివసించడానికి వెళ్లాడు. అక్కడ తన గుడారాలు వేసుకున్నాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. \c 14 \s1 అబ్రాము లోతును రక్షిస్తాడు \p \v 1 అమ్రాపేలు షీనారు\f + \fr 14:1 \fr*\ft అంటే బాబెలు; \+xt 9|link-href="GEN 14:9"\+xt* వచనంలో కూడా\ft*\f* యొక్క రాజుగా ఉన్న కాలంలో, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు, \v 2 ఈ రాజులు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిము రాజైన షెమేబెరుతోను బేల (సోయరు) రాజుతోను యుద్ధం చేశారు. \v 3 ఈ రెండవ గుంపు రాజులందరూ సిద్దీము లోయలో (మృత సముద్ర\f + \fr 14:3 \fr*\fq మృత సముద్ర \fq*\ft అంటే \ft*\fqa ఉప్పు సముద్రం\fqa*\f* లోయలో) కూడుకున్నారు. \v 4 వారంతా పన్నెండు సంవత్సరాలు కదొర్లాయోమెరుకు సేవ చేశారు, కానీ పదమూడవ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. \p \v 5 పద్నాలుగవ సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితో పొత్తు పెట్టుకున్న రాజులు కలిసి అష్తారోతు కర్నాయింలో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిములో ఎమీయులను \v 6 హోరీయులను, శేయీరు కొండ సీమలో ఎడారి దగ్గర ఉన్న ఎల్ పారాను వరకు తరిమి ఓడించారు. \v 7 తర్వాత అక్కడినుండి వెనుకకు తిరిగి ఎన్ మిష్పాతు అనబడిన కాదేషుకు వెళ్లి, అమాలేకీయుల భూభాగమంతా, హససోన్ తామారులో నివసిస్తున్న అమోరీయుల భూభాగమంతా జయించారు. \p \v 8 అప్పుడు సిద్దీం లోయలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బేల (సోయరు) రాజు తమ సైన్యాలతో, \v 9 ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, అంటే నలుగురు రాజులు అయిదుగురు రాజులతో యుద్ధం చేశారు. \v 10 సిద్దీము లోయ అంతా కీలుమట్టి గుంటలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోతూ ఉన్నప్పుడు, కొంతమంది వాటిలో పడిపోయారు మిగిలినవారు కొండల్లోకి పారిపోయారు. \v 11 ఆ నలుగురు రాజులు సొదొమ గొమొర్రాల ఆస్తిపాస్తులను, భోజన పదార్థాలను అన్నిటిని దోచుకున్నారు; తర్వాత వారు వెళ్లిపోయారు. \v 12 అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో నివసిస్తున్నాడు కాబట్టి, అతన్ని కూడా అతని ఆస్తితో పాటు తీసుకెళ్లారు. \p \v 13 అయితే ఒక వ్యక్తి తప్పించుకు వచ్చి, హెబ్రీయుడైన అబ్రాముకు ఈ సంగతి తెలిపాడు. అబ్రాము ఎష్కోలు ఆనేరుల సోదరుడైన మమ్రే అనే అమోరీయుని సింధూర వృక్షాలు దగ్గర నివసిస్తున్నాడు. వీరు అబ్రాముతో ఒప్పందం చేసుకున్న వారు. \v 14 అబ్రాము తన బంధువు బందీగా కొనిపోబడ్డాడు అని విన్నప్పుడు, తన ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన 318 మందిని తీసుకుని వారిని దాను వరకు తరిమాడు. \v 15 రాత్రివేళ అబ్రాము తన మనుష్యులను గుంపులుగా విభజించి దాడి చేస్తూ, శత్రువులను ముట్టడించి, దమస్కుకు ఉత్తరాన ఉన్న హోబా వరకు వారిని తరిమాడు. \v 16 అబ్రాము తన బంధువైన లోతును, అతని ఆస్తిని, అతని స్త్రీలను, ఇతర ప్రజలను విడిపించాడు. \p \v 17 కదొర్లాయోమెరు, అతనితో పొత్తు ఉన్న రాజులను ఓడించిన తర్వాత, రాజు లోయ అనబడే షావే లోయలో సొదొమ రాజు అబ్రామును కలిశాడు. \p \v 18 అప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తెచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. \v 19 అతడు అబ్రామును, \q1 “భూమ్యాకాశాల సృష్టికర్త, \q2 సర్వోన్నతుడైన దేవుడు అబ్రామును దీవించును గాక, \q1 \v 20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన \q2 సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగును గాక” \m అంటూ ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు. \p \v 21 సొదొమ రాజు, “చెరగా తెచ్చిన ప్రజలను నాకు ఇవ్వండి, వస్తువులను మీ కోసం పెట్టుకోండి” అని అబ్రాముతో అన్నాడు. \p \v 22 అయితే అబ్రాము సొదొమ రాజుతో, “చేతులెత్తి సర్వోన్నతుడైన దేవుడు, భూమ్యాకాశాల సృష్టికర్తయైన యెహోవాకు ఇలా ప్రమాణం చేశాను, \v 23 ఒక దారం పోగైననూ, చెప్పులవారైననూ నేను ఆశించను, తద్వార నీవు, ‘నేనే అబ్రామును ధనికుడయ్యేలా చేశాను’ అని చెప్పకుండ ఉంటావు. \v 24 నేను దేన్ని అంగీకరించను కాని నా మనుష్యులు తిన్నది, నాతోపాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే వారికి వారి వాటాను తీసుకోనివ్వు” అని చెప్పాడు. \c 15 \s1 యెహోవా అబ్రాముతో చేసిన నిబంధన \p \v 1 ఈ సంఘటనల తర్వాత దర్శనంలో యెహోవా వాక్కు అబ్రాము వద్దకు వచ్చి: \q1 “అబ్రామూ, భయపడకు, \q2 నేను నీకు డాలును,\f + \fr 15:1 \fr*\ft లేదా \ft*\fqa ప్రభువును\fqa*\f* \q2 నీ గొప్ప బహుమానాన్ని.\f + \fr 15:1 \fr*\ft లేదా \ft*\fqa నీకు గొప్ప బహుమానం కలుగుతుంది\fqa*\f*” \p \v 2 అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, నాకు సంతానం లేదు కదా మీరు నాకేమిచ్చినా ఏం లాభం? నా ఆస్తికి వారసుడు దమస్కువాడైన ఎలీయెజెరే కదా” అని అన్నాడు. \v 3 ఇంకా అబ్రాము దేవునితో, “మీరు నాకు సంతానం ఇవ్వలేదు, కాబట్టి నా ఇంటి పనివారిలో ఒకడు నా వారసుడవుతాడు” అని అన్నాడు. \p \v 4 అప్పుడు యెహోవా వాక్కు అతని వద్దకు వచ్చింది: “ఈ మనుష్యుడు నీకు వారసుడు కాడు, కాని నీ రక్తమాంసాలను పంచుకుని పుట్టేవాడే నీకు వారసుడు.” \v 5 దేవుడు అబ్రామును బయటకు తీసుకువచ్చి, “పైన ఆకాశాన్ని చూసి నీకు చేతనైతే నక్షత్రాలను లెక్కబెట్టు. నీ సంతానం అలా ఉంటుంది” అని చెప్పారు. \p \v 6 అబ్రాము యెహోవాను నమ్మాడు, ఆయన దాన్ని అతనికి నీతిగా ఎంచారు. \p \v 7 అంతేకాక దేవుడు అతనితో, “ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి నిన్ను కల్దీయుల ఊరు నుండి బయటకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పారు. \p \v 8 అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, దీనిని నేను స్వాస్థ్యంగా పొందుతానని నాకెలా తెలుస్తుంది?” అని అడిగాడు. \p \v 9 అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు. \p \v 10 అబ్రాము వాటన్నిటిని తెచ్చి, వాటిని సగానికి రెండు ముక్కలుగా కోసి, దేనికది ఎదురెదురుగా పేర్చాడు; అయితే అతడు పక్షులను మాత్రం సగం చేయలేదు. \v 11 ఆ కళేబరాలపై వాలడానికి రాబందులు వచ్చాయి అయితే అబ్రాము వాటిని వెళ్లగొట్టాడు. \p \v 12 సూర్యాస్తమయం అవుతుండగా అబ్రాముకు గాఢనిద్ర పట్టింది, భయంకరమైన కారుచీకటి అతని మీదుగా కమ్ముకుంది. \v 13 అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు. \v 14 అయితే వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత గొప్ప ఆస్తులతో వారు బయటకు వస్తారు. \v 15 నీవైతే సమాధానంగా నీ పూర్వికుల దగ్గరకు చేరతావు, మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు. \v 16 నీ సంతానంలో నాలుగవ తరం వారు ఇక్కడకు తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా అమోరీయుల పాపం పండలేదు.” \p \v 17 సూర్యుడు అస్తమించి చీకటి కమ్మినప్పుడు పొగలేస్తున్న కుంపటి, మండుతున్న దివిటీ కనిపించి, ఆ ముక్కల మధ్యలో నుండి దాటి వెళ్లాయి. \v 18 ఆ రోజు యెహోవా అబ్రాముతో నిబంధన చేసి, “నేను నీ సంతానానికి ఈజిప్టు వాగు\f + \fr 15:18 \fr*\ft లేదా \ft*\fqa నది\fqa*\f* నుండి యూఫ్రటీసు మహా నది వరకు అంటే, \v 19 కెనీయులు, కెనిజ్జీయులు, కద్మోనీయులు, \v 20 హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీయులు, \v 21 అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు ఉన్న దేశమంతటిని ఇస్తున్నాను” అని అన్నారు. \c 16 \s1 హాగరు ఇష్మాయేలు \p \v 1 అబ్రాము భార్యయైన శారాయి వలన అతనికి పిల్లలు పుట్టలేదు. అయితే ఆమెకు ఈజిప్టు నుండి వచ్చిన దాసి ఉంది, ఆమె పేరు హాగరు; \v 2 కాబట్టి శారాయి అబ్రాముతో, “యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశారు. నీవు వెళ్లి నా దాసితో లైంగికంగా కలువు; బహుశ ఆమె ద్వార నాకు సంతానం కలుగుతుందేమో” అని అన్నది. \p శారాయి చెప్పిన దానికి అబ్రాము అంగీకరించాడు. \v 3 అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది. \v 4 అతడు హాగరును లైంగికంగా కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది. \p తాను గర్భవతినని ఆమె తెలుసుకున్నప్పుడు తన యజమానురాలైన శారాయిని చిన్న చూపు చూసింది. \v 5 అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది. \p \v 6 అబ్రాము శారాయితో, “నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఏది మంచిదనిపిస్తే అది తనకు చేయి” అన్నాడు. శారాయి హాగరును వేధించింది కాబట్టి ఆమె శారాయి దగ్గర నుండి పారిపోయింది. \p \v 7 యెహోవా దూత హాగరు ఎడారిలో నీటిబుగ్గ దగ్గర ఉండడం చూశాడు; అది షూరు మార్గం ప్రక్కన ఉండే నీటిబుగ్గ. \v 8 ఆ దూత, “శారాయి దాసియైన హాగరూ, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు. \p ఆమె, “నా యజమానురాలైన శారాయి దగ్గర నుండి వెళ్లిపోతున్నాను” అని జవాబిచ్చింది. \p \v 9 అప్పుడు యెహోవా దూత ఆమెతో, “నీ యజమానురాలి దగ్గరకు తిరిగివెళ్లి ఆమెకు లోబడి ఉండు” అని చెప్పాడు. \v 10 యెహోవా దూత ఇంకా మాట్లాడుతూ, “నీ సంతానాన్ని లెక్కించలేనంత అధికం చేస్తాను” అని చెప్పాడు. \p \v 11 యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు: \q1 “ఇప్పుడు నీవు గర్భవతివి \q2 నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, \q1 యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి \q2 అతనికి ఇష్మాయేలు\f + \fr 16:11 \fr*\fq ఇష్మాయేలు \fq*\ft అంటే \ft*\fqa దేవుడు వింటాడు.\fqa*\f* అని నీవు పేరు పెడతావు. \q1 \v 12 అతడు ఒక అడవి గాడిదలాంటి మనుష్యుడు; \q2 అందరితో అతడు విరోధం పెట్టుకుంటాడు, \q2 అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి, \q1 అతడు తన సోదరులందరితో \q2 శత్రుత్వం కలిగి జీవిస్తాడు.” \p \v 13 ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు ఈ పేరు పెట్టింది: “నన్ను చూస్తున్న దేవుడు మీరే.” ఆమె, “నన్ను చూస్తున్న దేవుని నేను వెనుక నుండి చూశాను” అని అన్నది. \v 14 అందుకే ఆ బావికి బెయేర్-లహాయి-రోయి\f + \fr 16:14 \fr*\fq బెయేర్-లహాయి-రోయి \fq*\ft అంటే \ft*\fqa నన్ను చూసే జీవంగల దేవుని బావి\fqa*\f* అని పేరు వచ్చింది; అది కాదేషు బెరెదు మధ్యలో ఇప్పటికి ఉంది. \p \v 15 హాగరు అబ్రాముకు కుమారుని కన్నది, అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. \v 16 హాగరు ఇష్మాయేలుకు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు. \c 17 \s1 సున్నతి నిబంధన \p \v 1 అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల\f + \fr 17:1 \fr*\ft హెబ్రీ \ft*\fqa ఎల్-షద్దాయ్\fqa*\f* దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి. \v 2 అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను, నీ సంతతిని అత్యధికంగా వర్ధిల్లజేస్తాను” అన్నారు. \p \v 3 అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు, \v 4 “నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు. \v 5 ఇకమీదట నీ పేరు అబ్రాము\f + \fr 17:5 \fr*\fq అబ్రాము \fq*\ft అంటే \ft*\fqa హెచ్చింపబడ్డ తండ్రి\fqa*\f* కాదు; నీకు అబ్రాహాము\f + \fr 17:5 \fr*\fq అబ్రాహాము \fq*\ft బహుశ \ft*\fqa అనేకులకు తండ్రి\fqa*\f* అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నేను నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను. \v 6 నిన్ను ఎంతో ఫలభరితంగా చేస్తాను; నిన్ను అనేక జనాంగాలుగా చేస్తాను, రాజులు నీ నుండి వస్తారు. \v 7 నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను. \v 8 నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.” \p \v 9 అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవైతే, నీవు, నీ తర్వాత నీ సంతానం తరతరాల వరకు నా నిబంధనను నిలుపుకోవాలి. \v 10 నీకు నీ తర్వాత నీ సంతతివారికి నేను చేసే నా నిబంధన, మీరు నిలుపుకోవలసిన నిబంధన ఇదే: మీలో ప్రతి మగవాడు సున్నతి చేసుకోవాలి. \v 11 మీకు నాకు మధ్య నిబంధన గుర్తుగా మీ గోప్య చర్మాన్ని సున్నతి చేసుకోవాలి. \v 12 రాబోయే తరాలలో ఎనిమిది రోజుల వయస్సున్న ప్రతి మగబిడ్డకు అంటే మీ ఇంట్లో పుట్టినవారైనా మీ సంతతి కాక విదేశీయుల నుండి కొనబడినవారైనా సున్నతి చేయబడాలి. \v 13 మీ డబ్బుతో కొనబడినవారైనా, వారికి సున్నతి చేయబడాలి. మీ శరీరంలో నా నిబంధన నిత్య నిబంధనగా ఉండాలి. \v 14 సున్నతి చేయబడని మగవారు అంటే తన గోప్య చర్మానికి సున్నతి చేయబడనివారు తమ జనులలో నుండి బహిష్కరించబడాలి; ఎందుకంటే వారు నా నిబంధనను మీరారు.” \p \v 15 దేవుడు అబ్రాహాముతో ఇలా కూడా చెప్పారు, “నీ భార్యయైన శారాయిని ఇకపై శారాయి అని పిలువకూడదు; ఇప్పటినుండి తన పేరు శారా. \v 16 నేను ఖచ్చితంగా ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె ద్వార నీకు కుమారున్ని ఇస్తాను. ఆమె జనాంగాలకు తల్లిగా ఉండేలా తనను ఆశీర్వదిస్తాను; అనేక జనాంగాల రాజులు ఆమె నుండి వస్తారు.” \p \v 17 అప్పుడు అబ్రాహాము సాష్టాంగపడ్డాడు; అతడు తన హృదయంలో నవ్వుకుంటూ, “నూరు సంవత్సరాలు నిండిన మనుష్యునికి కుమారుడు పుడతాడా? తొంభై సంవత్సరాలు నిండిన శారా బిడ్డను కంటుందా?” అని అనుకున్నాడు. \v 18 అబ్రాహాము దేవునితో, “మీ ఆశీర్వాదం క్రింద ఇష్మాయేలు జీవిస్తే చాలు!” అని అన్నాడు. \p \v 19 అప్పుడు దేవుడు, “అవును, అయితే నీ భార్య శారా ఒక కుమారునికి జన్మనిస్తుంది, అతనికి ఇస్సాకు\f + \fr 17:19 \fr*\fq ఇస్సాకు \fq*\ft అంటే \ft*\fqa అతడు నవ్వుతాడు\fqa*\f* అని పేరు పెడతావు. అతనితో నా నిబంధనను చేస్తాను, తన తర్వాత తన సంతానంతో ఉండేలా నిత్య నిబంధనగా దానిని స్థిరపరుస్తాను. \v 20 ఇష్మాయేలు గురించి, నీవు అడిగింది విన్నాను: నేను అతన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను; అతడు ఫలించి విస్తరించేలా చేస్తాను, సంఖ్యాపరంగా గొప్పగా విస్తరింపజేస్తాను. అతడు పన్నెండుమంది పాలకులకు తండ్రిగా ఉంటాడు; అతన్ని గొప్ప జనంగా చేస్తాను. \v 21 అయితే వచ్చే యేడాది ఈ సమయానికి శారా నీకోసం కనే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను” అని చెప్పారు. \v 22 దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత, పైకి వెళ్లిపోయారు. \p \v 23 ఆ రోజే అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, ఇంట్లో పుట్టిన లేదా డబ్బుతో కొనబడిన మగవారికందరికి దేవుడు చెప్పినట్టు సున్నతి చేయించాడు. \v 24 అబ్రాహాము సున్నతి పొందినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు, \v 25 తన కుమారుడైన ఇష్మాయేలు వయస్సు పదమూడు సంవత్సరాలు; \v 26 అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలు, ఇద్దరు అదే రోజు సున్నతి పొందారు. \v 27 అబ్రాహాము ఇంటివారిలో మగవారందరు, అతని ఇంట్లో పుట్టిన వారు లేదా విదేశీయుల నుండి కొనబడిన అతనితో పాటు సున్నతి చేయించుకున్నారు. \c 18 \s1 ముగ్గురు సందర్శకులు \p \v 1 అబ్రాహాము మమ్రేలో ఉన్న సింధూర వృక్షాల దగ్గర తన గుడార ద్వారం దగ్గర ఎండలో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యారు. \v 2 అబ్రాహాము కళ్ళెత్తి చూసినప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుష్యులు నిలిచి ఉన్నారు. వారిని చూసిన వెంటనే తన గుడార ద్వారం నుండి వారిని కలవడానికి త్వరపడి వెళ్లి సాష్టాంగపడ్డాడు. \p \v 3 అబ్రాహాము వారితో, “నా ప్రభువా, మీ దృష్టిలో నేను దయ పొందినట్లైతే, మీ దాసున్ని విడిచి వెళ్లకండి. \v 4 నీళ్లు తెప్పిస్తాను, కాళ్లు కడుక్కుని ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి. \v 5 మీరు మీ సేవకుని దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు తినడానికి ఆహారం తీసుకువస్తాను, మీ ఆకలి తీరిన తర్వాత వెళ్లవచ్చు” అని అన్నాడు. \p “మంచిది, అలాగే చేయి” అని వారు జవాబిచ్చారు. \p \v 6 కాబట్టి అబ్రాహాము శారా గుడారంలోకి త్వరపడి వెళ్లి, “త్వరగా మూడు మానికెలు\f + \fr 18:6 \fr*\ft సుమారు 16 కి. గ్రా. లు\ft*\f* నాణ్యమైన పిండి తెచ్చి, బాగా పిసికి రొట్టెలు చేయి” అని చెప్పాడు. \p \v 7 తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరకు పరుగెత్తి వెళ్లి, లేగదూడను తెచ్చి తన పనివానికి ఇచ్చాడు, ఆ పనివాడు త్వరగా దానిని వండి పెట్టాడు. \v 8 తర్వాత అతడు కొంచెం వెన్న, పాలు, వండిన దూడ మాంసాన్ని వారి ముందు ఉంచాడు. వారు భోజనం చేస్తుండగా, వారి దగ్గర చెట్టు క్రింద అతడు నిలబడ్డాడు. \p \v 9 “నీ భార్య శారా ఎక్కడ?” అని వారు అడిగారు. \p “అదిగో ఆ గుడారంలో ఉంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు. \p \v 10 అప్పుడు వారిలో ఒకరు, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి తప్పకుండా నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి నీ భార్య శారా ఒక కుమారున్ని కలిగి ఉంటుంది” అని అన్నారు. \p శారా అతని వెనుక ఉన్న గుడార ద్వారం దగ్గర నిలబడి వింటుంది. \v 11 అబ్రాహాము శారా అప్పటికే చాలా వృద్ధులు, శారా పిల్లలు కనే వయస్సు దాటిపోయింది. \v 12 శారా తనలో తాను నవ్వుకుని, “నేను బలం ఉడిగిన దానిని, నా భర్త కూడా వృద్ధుడు కదా ఇప్పుడు నాకు ఈ భాగ్యం ఉంటుందా?” అని అనుకుంది. \p \v 13 అప్పుడు యెహోవా అబ్రాహాముతో, “శారా ఎందుకలా నవ్వుకుంది, ‘ముసలిదాన్ని నేను కనగలనా అని ఎందుకు అనుకుంది?’ \v 14 యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వచ్చే సంవత్సరం నియమించబడిన సమయానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి శారా ఒక కుమారున్ని కంటుంది” అని అన్నారు. \p \v 15 శారా భయపడి, “నేను నవ్వలేదు” అని అబద్ధమాడింది. \p “లేదు, నీవు నవ్వావు” అని ఆయన అన్నారు. \s1 అబ్రాహాము సొదొమ కోసం విజ్ఞప్తి చేస్తాడు \p \v 16 ఆ మనుష్యులు వెళ్లడానికి లేచి సొదొమ, గొమొర్రాల వైపు చూశారు, అబ్రాహాము వారిని పంపించడానికి వారితో పాటు వెళ్లాడు. \v 17 అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “నేను చేయబోతున్న దానిని అబ్రాహాముకు చెప్పకుండ ఎలా దాచగలను? \v 18 అబ్రాహాము ఖచ్చితంగా గొప్ప శక్తిగల దేశం అవుతాడు, అతని ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు\f + \fr 18:18 \fr*\ft లేదా \ft*\fqa దీవించేటప్పుడు అతని పేరు వాడబడుతుంది \fqa*\ft (\+xt 48:20\+xt* చూడండి)\ft*\f* దీవించబడతాయి. \v 19 ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.” \p \v 20 అప్పుడు యెహోవా, “సొదొమ, గొమొర్రాల గురించిన మొర చాలా గొప్పది, వారి పాపం ఘోరమైనది. \v 21 నేను అక్కడికి వెళ్లి నాకు చేరిన ఫిర్యాదు వలె వారి క్రియలు ఎంత చెడ్డగా ఉన్నాయో చూసి తెలుసుకుంటాను” అని అన్నారు. \p \v 22 ఆ మనుష్యులు అక్కడినుండి సొదొమ వైపు వెళ్లారు, అయితే అబ్రాహాము యెహోవా సన్నిధిలో నిలిచి\f + \fr 18:22 \fr*\ft కొ.ప్రా.ప్ర. లలో; ప్రాచీన హెబ్రీ శాస్త్రుల ఆచారం\ft*\f* ఉన్నాడు. \v 23 అప్పుడు అబ్రాహాము ఆయనను సమీపించి, “దుష్టులతో పాటు నీతిమంతులను నిర్మూలం చేస్తారా? \v 24 ఒకవేళ ఆ పట్టణంలో యాభైమంది నీతిమంతులుంటే ఎలా? ఆ యాభైమంది కోసమన్నా ఆ పట్టణాన్ని కాపాడకుండా\f + \fr 18:24 \fr*\ft లేదా \ft*\fqa క్షమించుట\fqa*\ft ; \+xt 26|link-href="GEN 18:26"\+xt* వచనంలో కూడా\ft*\f* నిజంగా దానిని నాశనం చేస్తారా? \v 25 అలా నాశనం చేయడం మీకు దూరమవును గాక! దుష్టులతో పాటు నీతిమంతులను చంపడం, దుష్టులను నీతిమంతులను ఒకేలా చూడడము. మీ నుండి ఆ తలంపు దూరమవును గాక! సర్వలోక న్యాయాధిపతి న్యాయం చేయరా?” అని అన్నాడు. \p \v 26 యెహోవా జవాబిస్తూ, “సొదొమలో యాభైమంది నీతిమంతులను నేను కనుగొంటే, వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాపాడతాను” అని అన్నారు. \p \v 27 అబ్రాహాము మరలా మాట్లాడాడు: “నేను ధూళిని బూడిదను, అయినాసరే నేను ప్రారంభించాను కాబట్టి నేను ప్రభువుతో ఇంకా మాట్లాడతాను. \v 28 ఒకవేళ యాభైమందిలో నీతిమంతులు అయిదుగురు తక్కువైతే అప్పుడు పట్టణం అంతటిని అయిదుగురు తక్కువ ఉన్నందుకు నాశనం చేస్తారా?” \p ఆయన, “నేను అక్కడ నలభై అయిదుగురు చూస్తే అప్పుడు దానిని నాశనం చేయను” అన్నారు. \p \v 29 అబ్రాహాము, “ఒకవేళ నలభైమంది నీతిమంతులు ఉంటే?” అని మరలా అడిగాడు. \p “ఆ నలభైమంది కోసం దానిని నాశనం చేయను” అని దేవుడు అన్నారు. \p \v 30 అప్పుడు అతడు, “ప్రభువు కోప్పడకండి, నన్ను మాట్లాడనివ్వండి. ఒకవేళ అక్కడ ముప్పైమంది నీతిమంతులు మాత్రమే ఉంటే?” అని అడిగాడు. \p ఆయన, “ముప్పైమందిని నేను కనుగొంటే నేను నాశనం చేయను” అని జవాబిచ్చారు. \p \v 31 అబ్రాహాము, “నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగించాను; ఒకవేళ అక్కడ ఇరవైమందే మాత్రమే ఉంటే?” అని అన్నాడు. \p ఆయన, “ఆ ఇరవైమంది కోసం దానిని నాశనం చేయను” అన్నారు. \p \v 32 అప్పుడతడు, “ప్రభువా, కోప్పడకండి, నేను ఇంకొక్కసారి మాట్లాడతాను. ఒకవేళ అక్కడ పదిమందే ఉంటే?” అని అడిగాడు. \p ఆయన, “ఆ పదిమంది కోసం దానిని నాశనం చేయను” అని జవాబిచ్చారు. \p \v 33 యెహోవా అబ్రాహాముతో సంభాషణ ముగించిన తర్వాత, ఆయన వెళ్లిపోయారు, అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్లాడు. \c 19 \s1 సొదొమ గొమొర్రాల నాశనం \p \v 1 ఆ సాయంత్రం ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు, లోతు సొదొమ పట్టణ ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. అతడు వారిని చూడగానే, వారిని కలవడానికి లేచి వారి ఎదుట సాష్టాంగపడ్డాడు. \v 2 “నా ప్రభువులారా! దయచేసి మీ దాసుని ఇంటికి రండి, మీ కాళ్లు కడుక్కుని ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి, వేకువజామున లేచి వెళ్లవచ్చు” అని వారితో అన్నాడు. \p అప్పుడు వారు, “లేదు, ఈ రాత్రి నడి వీధిలోనే ఉంటాం” అని చెప్పారు. \p \v 3 అయితే అతడు వారిని బలవంతం చేశాడు, కాబట్టి వారు అతని ఇంటికి వెళ్లారు. అతడు వారికి పులియని పిండితో రొట్టెలు చేశాడు, వారు తిన్నారు. \v 4 వారు పడుకోకముందు, సొదొమ పట్టణపు వారంతా నలుదిక్కుల నుండి పురుషులు యువకులు, ముసలివారు లోతు ఇంటిని చుట్టుముట్టారు. \v 5 వారు లోతును పిలిచి, “రాత్రి నీ దగ్గరకు వచ్చిన ఆ మనుష్యులు ఎక్కడ? వారితో మేము లైంగికంగా కలుసుకునేలా బయటకు తీసుకురా” అని అన్నారు. \p \v 6 లోతు వారిని కలవడానికి బయటకు వెళ్లి తన వెనుక తలుపు మూసివేసి \v 7 వారితో, “సోదరులారా వద్దు, ఈ దుర్మార్గపు పని చేయవద్దు. \v 8 ఇదిగో! నాకు పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకొనని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిని మీ దగ్గరకు తెస్తాను వారితో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. కానీ ఈ మనుష్యులు అతిథులుగా నా ఇంటికి వచ్చారు, వీరిని మీరేమి చేయవద్దు” అని బ్రతిమాలుకున్నాడు. \p \v 9 వారు, “మాకు అడ్డు పడకుండా వెళ్లిపో” అని బదులిచ్చారు. “వీడు పరదేశిగా ఇక్కడకు వచ్చి మనకే తీర్పు చెప్తున్నాడు! మేము నిన్ను వారిపైన కంటే నీమీద ఎక్కువ దౌర్జన్యం చేస్తాం” అని అంటూ లోతు మీద పడి తలుపు బద్దలు కొట్టడానికి ముందుకు వెళ్లారు. \p \v 10 అయితే లోపల ఉన్న మనుష్యులు లోతును ఇంట్లోకి లాగి తలుపు వేశారు. \v 11 తర్వాత వారు ఇంటి తలుపు దగ్గర ఉన్న యువకులను వృద్ధులను గ్రుడ్డితనంతో మొత్తగా వారు ద్వారం కనుగొనలేకపోయారు. \p \v 12 ఆ ఇద్దరు మనుష్యులు లోతుతో, “నీకు నీ అల్లుళ్ళు, కుమారులు, కుమార్తెలు, లేదా నీకు సంబంధించిన వారెవరైనా ఈ పట్టణంలో ఉన్నారా? వారిని బయటకు తీసుకురా, \v 13 ఎందుకంటే మేము ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాము. ఈ స్థలం యొక్క ప్రజల గురించి యెహోవాకు చేరిన మొర ఎంతో గొప్పది కాబట్టి దీనిని నాశనం చేయడానికి ఆయన మమ్మల్ని పంపారు” అని అన్నారు. \p \v 14 లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెళ్ళి చేసుకోబోయే తన అల్లుళ్ళతో మాట్లాడి, “త్వరపడండి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి రండి, యెహోవా దీనిని నాశనం చేయబోతున్నారు” అని అన్నాడు. అయితే వారికి తన మాటలు హేళనగా అనిపించాయి. \p \v 15 తెల్లవారుజామున ఆ దూతలు లోతుతో, “త్వరగా, ఇక్కడున్న నీ భార్యను, నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని బయలుదేరు లేదా ఈ పట్టణం శిక్షించబడినప్పుడు మీరు కూడా నాశనమవుతారు” అని చెప్పారు. \p \v 16 లోతు సంశయిస్తుండగా ఆ మనుష్యులు లోతును, అతని భార్యను, ఇద్దరు కుమార్తెలను చేయి పట్టుకుని పట్టణం బయటకు తీసుకువచ్చారు, ఎందుకంటే యెహోవా వారిపై కనికరం చూపారు. \v 17 వారిని బయటకు తీసుకువచ్చిన వెంటనే, వారిలో ఒకరు, “మీ ప్రాణాల కోసం పారిపోండి! వెనుకకు చూడకండి, మైదానంలో ఎక్కడ ఆగకండి! పర్వతాల వైపు పారిపోండి లేదా మీరు తుడిచివేయబడతారు!” అని చెప్పారు. \p \v 18 కానీ లోతు వారితో, “నా ప్రభువులారా! దయచేసి అలా కాదు, \v 19 మీ సేవకుడు మీ దృష్టిలో దయ పొందాడు, మీ దయ వలన మీరు నా ప్రాణం కాపాడారు. అయితే నేను పర్వతాలకు వెళ్లను; ఈ విపత్తు నా మీదికి వచ్చి నేను చస్తాను. \v 20 చూడండి, నేను తప్పించుకోడానికి ఇక్కడ ఒక చిన్న పట్టణం ఉంది. దానిలోకి వెళ్లనివ్వండి అది చిన్నగా ఉంది కదా, అప్పుడు నా ప్రాణం రక్షింపబడుతుంది” అని అన్నాడు. \p \v 21 ఆ దూత, “మంచిది, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను; నీవు చెప్పే ఈ పట్టణాన్ని నాశనం చేయను. \v 22 కాని అక్కడికి త్వరగా పారిపోండి, ఎందుకంటే మీరు అక్కడికి చేరేవరకు నేను ఏమి చేయలేను” అని అన్నాడు. అందుకే ఆ పట్టణానికి సోయరు\f + \fr 19:22 \fr*\fq సోయరు \fq*\ft అంటే \ft*\fqa చిన్నది\fqa*\f* అని పేరు పెట్టబడింది. \p \v 23 లోతు సోయరు చేరే లోపు ఆ ప్రాంతంలో సూర్యుడు ఉదయించాడు. \v 24 అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురిపించారు; యెహోవా దగ్గర నుండి ఆకాశం నుండి అవి కురిపించబడ్డాయి. \v 25 అలా ఆయన ఆ పట్టణాలను, ఆ మైదానమంతటిని ఆ పట్టణాల్లో నివసించే వారినందరిని ఆ ప్రాంతంలో ఉన్న నేల మొలకలతో సహా నాశనం చేశారు. \v 26 అయితే లోతు భార్య వెనుకకు తిరిగింది, ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. \p \v 27 మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి అంతకుముందు యెహోవా ఎదుట తాను నిలిచిన స్థలానికి వెళ్లాడు. \v 28 సొదొమ గొమొర్రాల వైపు, ఆ మైదానమంతటిని చూశాడు, ఆ స్థలం నుండి కొలిమిలో నుండి వచ్చే పొగలా పొగ రావడం చూశాడు. \p \v 29 దేవుడు మైదానంలోని పట్టణాలను నాశనం చేసినప్పుడు, ఆయన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నారు, లోతును, తాను నివసించిన ఆ పట్టణాలను పడగొట్టిన విపత్తు నుండి అతన్ని తప్పించారు. \s1 లోతు, అతని కుమార్తెలు \p \v 30 లోతు, అతని ఇద్దరు కుమార్తెలు సోయరును విడిచి పర్వతాల్లో స్థిరపడ్డారు ఎందుకంటే సోయరులో ఉండడానికి అతడు భయపడ్డాడు. అతడు, అతని కుమార్తెలిద్దరు ఒక గుహలో నివసించారు. \v 31 ఒక రోజు అతని పెద్దకుమార్తె తన చెల్లెలితో, “మన తండ్రి వృద్ధుడు, ఈ లోకమర్యాద ప్రకారం మనకు పిల్లలను ఇవ్వడానికి ఈ చుట్టుప్రక్కల పురుషులెవ్వరు లేరు. \v 32 మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి, అతనితో పడుకుని మన తండ్రి ద్వార కుటుంబ వంశావళిని కాపాడదాం” అని అన్నది. \p \v 33 ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించారు, పెద్దకుమార్తె అతనితో పడుకుంది. ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు. \p \v 34 మర్నాడు పెద్దకుమార్తె తన చెల్లెలితో, “నిన్న రాత్రి తండ్రితో పడుకున్నాను. ఈ రోజు మరలా అతడు ద్రాక్షరసం త్రాగేలా చేద్దాం, నీవు వెళ్లి అతనితో పడుకో, అలా మన తండ్రి ద్వారా మన కుటుంబ వంశావళిని కాపాడదాం” అని అన్నది. \v 35 ఆ రాత్రి కూడా తమ తండ్రి ద్రాక్షరసం త్రాగేలా చేశారు, చిన్న కుమార్తె అతనితో పడుకుంది. ఈసారి కూడా ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు. \p \v 36 అలా లోతు ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు. \v 37 పెద్దకుమార్తెకు కుమారుడు పుట్టాడు, ఆమె అతనికి మోయాబు\f + \fr 19:37 \fr*\fq మోయాబు \fq*\ft హెబ్రీ పదంలా ఉంది \ft*\fqa తండ్రి నుండి.\fqa*\f* అని పేరు పెట్టింది; నేడు ఇతడు మోయాబీయులకు మూలపురుషుడు. \v 38 చిన్నకుమార్తెకు కూడా కుమారుడు పుట్టాడు, ఆమె అతనికి బెన్-అమ్మి\f + \fr 19:38 \fr*\fq బెన్-అమ్మి \fq*\ft అంటే \ft*\fqa నా తండ్రి ప్రజల కుమారుడు.\fqa*\f* అని పేరు పెట్టింది; నేడు ఇతడు అమ్మోనీయులకు\f + \fr 19:38 \fr*\ft హెబ్రీలో \ft*\fqa బెనె-అమ్మోను\fqa*\f* మూలపురుషుడు. \c 20 \s1 అబ్రాహాము అబీమెలెకు \p \v 1 అబ్రాహాము అక్కడినుండి దక్షిణాదికి ప్రయాణం చేసి కాదేషుకు, షూరుకు మధ్య నివాసం ఉన్నాడు. కొంతకాలం గెరారులో ఉన్నాడు. \v 2 అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గురించి, “ఈమె నా చెల్లెలు” అని చెప్పాడు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు శారాను తన రాజభవనం లోనికి రప్పించుకున్నాడు. \p \v 3 అయితే ఆ రాత్రి కలలో దేవుడు అబీమెలెకుకు కనిపించి, “నీవు తీసుకున్న స్త్రీ కారణంగా నీవు చచ్చినట్టే ఎందుకంటే ఆమె ఇంకొకని భార్య” అని చెప్పారు. \p \v 4 అబీమెలెకు ఆమెను సమీపించలేదు. కాబట్టి అతడు, “ప్రభువా, మీరు ఒక నిర్దోషులైన జనాన్ని నాశనం చేస్తారా? \v 5 ‘ఆమె నా సోదరి’ అని అతడు చెప్పలేదా? ‘ఇతడు నా అన్న’ అని ఆమె కూడా చెప్పలేదా? నేను నిర్మలమైన మనస్సాక్షితో నిర్దోషిగా ఉండి దీన్ని చేశాను” అని అన్నాడు. \p \v 6 అప్పుడు దేవుడు అతనితో కలలో ఇలా అన్నారు, “అవును, నీవు నిర్మలమైన మనస్సాక్షితో చేశావని నాకు తెలుసు, అందుకే నీవు పాపం చేయకుండా ఆపాను. అందుకే నీవామెను ముట్టుకోకుండా చేశాను. \v 7 ఇప్పుడు ఆ మనుష్యుని భార్యను తనకు ఇవ్వు, అతడు ప్రవక్త కాబట్టి నీకోసం ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. ఒకవేళ ఆమెను తిరిగి ఇవ్వకపోతే, నీవు, నీకు సంబంధించిన వారందరు చస్తారు.” \p \v 8 మర్నాడు వేకువజామున అబీమెలెకు తన అధికారులను పిలిపించి, వారితో ఏమి జరిగిందో చెప్పాడు, వారు ఎంతో భయపడ్డారు. \v 9 అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, “నీవు మాకు చేసింది ఏంటి? నీ పట్ల నేను ఏ తప్పు చేశానని ఇంత గొప్ప అపరాధం నాపైన, నా రాజ్యం పైన తెచ్చావు? నీవు నా పట్ల చేసినవి ఎవరు చేయకూడనివి” అని అన్నాడు. \v 10 అబీమెలెకు, “నీవు ఇలా చేయడానికి కారణమేంటి?” అని అబ్రాహామును అడిగాడు. \p \v 11 అందుకు అబ్రాహాము అన్నాడు, “ఈ స్థలంలో దేవుని భయం లేదు, ‘నా భార్యను బట్టి వారు నన్ను చంపేస్తారు’ అని నాలో నేను అనుకున్నాను. \v 12 అంతేకాదు, ఆమె నిజంగా నా సోదరి, నా తండ్రికి కుమార్తె కాని నా తల్లికి కాదు; ఆమె నా భార్య అయ్యింది. \v 13 దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి తిరిగేలా చేసినప్పుడు, నేను ఆమెతో ఇలా చెప్పాను, ‘మనం వెళ్లే ప్రతిచోటా నా గురించి, “ఈయన నా సోదరుడు” అని చెప్పు, ఇది నా పట్ల నీ ప్రేమ.’ ” \p \v 14 అప్పుడు అబీమెలెకు గొర్రెలను, పశువులను, దాసదాసీలను అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాము భార్యయైన శారాను కూడా తిరిగి అప్పగించాడు. \v 15 అబీమెలెకు, “నా దేశం నీ ఎదుట ఉన్నది; నీకు ఇష్టమైన చోట నీవు నివసించవచ్చు” అన్నాడు. \p \v 16 అతడు శారాతో, “నీ అన్నకు వెయ్యి షెకెళ్ళ\f + \fr 20:16 \fr*\ft అంటే, సుమారు 12 కి. గ్రా. లు\ft*\f* వెండి ఇస్తున్నాను, ఇది నీతో ఉన్న వారందరి ఎదుట నీకు విరోధంగా చేసిన దానికి నష్టపరిహారం; నీవు పూర్తిగా నిర్దోషివి” అన్నాడు. \p \v 17 అప్పుడు అబ్రాహాము దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు అబీమెలెకును, అతని భార్య, అతని ఆడ దాసీలను స్వస్థపరచగా వారు తిరిగి పిల్లలు కన్నారు. \v 18 ఎందుకంటే యెహోవా అబ్రాహాము భార్య శారాను బట్టి అబీమెలెకు ఇంట్లోని స్త్రీలందరిని పిల్లలు కనలేకుండా చేశారు. \c 21 \s1 ఇస్సాకు పుట్టుక \p \v 1 యెహోవా తాను చెప్పినట్టే శారా పట్ల కృప చూపించారు, శారాకు వాగ్దానం చేసినట్టే యెహోవా చేశారు. \v 2 సరిగ్గా దేవుడు వాగ్దానం చేసిన నిర్ణీత కాలంలో శారా గర్భవతియై, వృద్ధాప్యంలో ఉన్న అబ్రాహాముకు కుమారున్ని కన్నది. \v 3 అబ్రాహాము, శారా తన కోసం కన్న కుమారునికి ఇస్సాకు\f + \fr 21:3 \fr*\fq ఇస్సాకు \fq*\ft అంటే \ft*\fqa అతడు నవ్వుతాడు.\fqa*\f* అని పేరు పెట్టాడు. \v 4 దేవుని ఆజ్ఞమేరకు తన కుమారుడైన ఇస్సాకుకు ఎనిమిదో రోజున అబ్రాహాము సున్నతి చేశాడు. \v 5 ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నూరు సంవత్సరాల వృద్ధుడు. \p \v 6 శారా, “నాకు దేవుడు నవ్వు తెప్పించారు, ఇది వినే ప్రతివారు నాతో నవ్వుతారు, \v 7 శారా పిల్లలకు పాలిస్తుందని అబ్రాహాముతో ఎవరు అంటారు? అయినా నా భర్తకు వృద్ధాప్యంలో కుమారున్ని కన్నాను” అని అన్నది. \s1 హాగరు, ఇష్మాయేలు పంపివేయబడుట \p \v 8 ఇస్సాకు పాలు విడిచిన రోజు అబ్రాహాము పెద్ద విందు చేశాడు. \v 9 అయితే ఈజిప్టు దాసి హాగరు ద్వార అబ్రాహాముకు పుట్టిన కుమారుడు శారాను హేళన చేయడం చూసి, \v 10 ఆమె అబ్రాహాముతో, “ఆ దాసిని దాని కుమారున్ని పంపివేయండి, దాని కుమారుడు ఎప్పటికీ నా కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని శారా చెప్పింది. \p \v 11 తన కుమారునికి సంబంధించిన విషయం కాబట్టి అబ్రాహాము చాలా బాధపడ్డాడు. \v 12 అయితే దేవుడు అబ్రాహాముతో, “ఈ బాలుని గురించి, నీ దాసి గురించి నీవు బాధపడకు. శారా చెప్పినట్టు నీవు చేయి, ఎందుకంటే ఇస్సాకు మూలంగానే నీ సంతానం\f + \fr 21:12 \fr*\ft లేదా \ft*\fqa విత్తనం\fqa*\f* లెక్కించబడుతుంది. \v 13 అయితే దాసి కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా గొప్ప జనంగా చేస్తాను.” \p \v 14 మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి కొంత ఆహారం, నీళ్ల తిత్తి హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి, ఆమెను తన కుమారునితో పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షేబ ఎడారిలో తిరుగుతూ ఉంది. \p \v 15 తిత్తిలో నీళ్లు అయిపోయినప్పుడు ఆమె ఆ పిల్లవాన్ని ఒక పొద క్రింద ఉంచింది. \v 16 తర్వాత ఆమె కొంత దూరం వెళ్లి కూర్చుంది, ఎందుకంటే, “బాలుడు చావడం నేను చూడలేను” అని అనుకుంది. అక్కడ కూర్చుని అదుపు లేకుండ ఏడవసాగింది. \p \v 17 దేవుడు చిన్నవాని మొర విన్నారు, దేవదూత పరలోకం నుండి హాగరును పిలిచి, “హాగరూ! ఏమైంది? భయపడకు; బాలుడు అక్కడ పడి ఏడ్వడం దేవుడు విన్నారు. \v 18 ఆ పిల్లవాన్ని లేపి నీ చేతితో పట్టుకో, నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను” అని అన్నాడు. \p \v 19 అప్పుడు దేవుడు ఆమె కళ్లు తెరిచారు, ఆమె నీళ్ల ఊటను చూసింది. ఆమె వెళ్లి తిత్తిని నీళ్లతో నింపి బాలునికి త్రాగడానికి ఇచ్చింది. \p \v 20 ఆ పిల్లవాడు ఎదుగుతుండగా దేవుడు అతనితో ఉన్నారు. అతడు ఎడారిలో నివసిస్తూ విలుకాడయ్యాడు. \v 21 అతడు పారాను ఎడారిలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి ఈజిప్టు నుండి అతనికి భార్యను తీసుకువచ్చింది. \s1 బెయేర్షేబా దగ్గర ఒప్పందం \p \v 22 ఆ సమయంలో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీతో ఉన్నారు. \v 23 కాబట్టి నీవు నాతో గాని నా పిల్లలతో గాని నా వారసులతో గాని మోసపూరితంగా వ్యవహరించవని దేవుని ఎదుట నాతో ప్రమాణం చేయి. నీవు పరదేశిగా ఉంటున్న ఈ దేశంలో నేను చూపించిన దయ నాకు, ఈ దేశానికి చూపించు.” \p \v 24 అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నా” అన్నాడు. \p \v 25 అప్పుడు అబీమెలెకు దాసులు అంతకుముందు ఒక బావిని ఆక్రమించుకున్న విషయాన్ని అబ్రాహాము అబీమెలెకుకు చెప్పాడు. \v 26 అయితే అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. నీవు నాకు చెప్పలేదు, ఈ రోజే ఈ సంగతి వింటున్నాను” అని అన్నాడు. \p \v 27 అబ్రాహాము గొర్రెలు పశువులు తీసుకువచ్చి అబీమెలెకుకు ఇచ్చాడు, ఆ ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు. \v 28 అబ్రాహాము తన మంద నుండి ఏడు ఆడ గొర్రెపిల్లలను వేరు చేశాడు. \v 29 అబీమెలెకు, “నీవు స్వయంగా వేరు చేసిన ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలకు అర్థం ఏంటి?” అని అబ్రాహామును అడిగాడు. \p \v 30 అందుకు అతడు, “నేను ఈ బావిని త్రవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలను నా చేతి నుండి అంగీకరించు” అని చెప్పాడు. \p \v 31 అక్కడ వారిద్దరు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఆ స్థలానికి బెయేర్షేబ\f + \fr 21:31 \fr*\fq బెయేర్షేబ \fq*\ft అంటే \ft*\fqa ఏడింటి బావి \fqa*\ft అలాగే \ft*\fqa ఒప్పంద బావి.\fqa*\f* అని పేరు పెట్టారు. \p \v 32 బెయేర్షేబ దగ్గర ఒప్పందం చేసుకున్న తర్వాత అబీమెలెకు, సేనాధిపతియైన ఫీకోలు ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు. \v 33 అబ్రాహాము బెయేర్షేబలో ఒక పిచుల వృక్షం నాటాడు, అక్కడ నిత్య దేవుడైన యెహోవా నామాన్ని ఆరాధించాడు. \v 34 అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా కాలం పరదేశిగా ఉన్నాడు. \c 22 \s1 అబ్రాహాము పరీక్షించబడ్డాడు \p \v 1 కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించారు. ఆయన, “అబ్రాహామూ!” అని పిలిచారు. \p “చిత్తం! ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు. \p \v 2 అప్పుడు దేవుడు ఇలా అన్నారు, “నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు.” \p \v 3 మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి గాడిదకు గంతలు కట్టి ఇద్దరు పనివారిని, తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. దహనబలి కోసం కట్టెలు కొట్టుకుని దేవుడు చూపిన స్థలం వైపు వెళ్లాడు. \v 4 మూడవ రోజు అబ్రాహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ స్థలాన్ని చూశాడు. \v 5 అబ్రాహాము తన పనివారితో, “మీరు గాడిదతో ఇక్కడ ఉండండి, నేను, ఈ చిన్నవాడు అక్కడికి వెళ్లి, ఆరాధించి తిరిగి వస్తాం” అని అన్నాడు. \p \v 6 అబ్రాహాము దహనబలి కోసం కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు, అతడు నిప్పును కత్తిని పట్టుకుని వెళ్లాడు. వారిద్దరు కలసి నడిచి వెళ్తున్నప్పుడు, \v 7 ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో, “తండ్రీ” అని పిలిచాడు. \p “నా కుమారుడా, ఏంటి?” అని అబ్రాహాము జవాబిచ్చాడు. \p ఇస్సాకు, “నిప్పు కట్టెలు ఉన్నాయి. కాని దహనబలి కోసం కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు. \p \v 8 “నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. వారిద్దరు కలిసి వెళ్లారు. \p \v 9 దేవుడు నిర్దేశించిన స్థలం వారు చేరుకున్నాక, అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, దాని మీద కట్టెలు పేర్చాడు. తన కుమారుడైన ఇస్సాకును బంధించి, కట్టెల మీద పడుకోబెట్టాడు. \v 10 తర్వాత అబ్రాహాము తన కుమారున్ని బలి ఇవ్వడానికి చేయి చాపి కత్తి పట్టుకున్నాడు. \v 11 అయితే యెహోవా దూత ఆకాశం నుండి, “అబ్రాహామూ! అబ్రాహామూ!” అని పిలిచాడు. \p “చిత్తం ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు. \p \v 12 “ఆ బాలుని మీద చేయివేయకు అతన్ని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడతావని ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ఏకైక కుమారున్ని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు!” అని దేవుని దూత మాట్లాడాడు. \p \v 13 అబ్రాహాము కళ్ళెత్తి చూశాడు, ఆ పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న పొట్టేలు కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దహనబలి అర్పించాడు. \v 14 అబ్రాహాము ఆ స్థలానికి, యెహోవా యీరే\f + \fr 22:14 \fr*\ft అంటే \ft*\fqa యెహోవా సమకూరుస్తారు\fqa*\f* అని పేరు పెట్టాడు. ఇప్పటికీ, “యెహోవా పర్వతం మీద సమకూర్చబడుతుంది” అని చెప్పబడుతుంది. \p \v 15 యెహోవా దూత రెండవసారి అబ్రాహాముతో ఇలా అన్నాడు, \v 16 “యెహోవా ప్రకటిస్తున్నారు, నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీవిలా నీ ఏకైక కుమారున్ని ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి, \v 17 నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని లెక్కించలేని ఆకాశ నక్షత్రాల్లా సముద్ర ఒడ్డు మీద ఇసుక రేణువుల్లా విస్తరింపజేస్తాను. నీ సంతతివారు వారి శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు, \v 18 నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి,\f + \fr 22:18 \fr*\ft లేదా \ft*\fqa జనాంగాలన్నీ తమ ఆశీర్వాదాలలో నీ సంతానం పేరు వాడుకుంటారు \fqa*\ft \+xt 48:20\+xt*చూడండి\ft*\f* ఎందుకంటే నీవు నాకు లోబడ్డావు.” \p \v 19 తర్వాత అబ్రాహాము తన పనివారి దగ్గరకు తిరిగి వెళ్లాడు, వారు కలిసి బెయేర్షేబకు వెళ్లారు. అబ్రాహాము బెయేర్షేబలో నివసించాడు. \s1 నాహోరు కుమారులు \li1 \v 20 కొంతకాలం తర్వాత, అబ్రాహాముకు ఇలా చెప్పబడింది, “మిల్కా కూడా తల్లి అయ్యింది; నీ సోదరుడు నాహోరుకు ఆమె జన్మనిచ్చిన కుమారులు: \li2 \v 21 మొదటి కుమారుడు ఊజు, అతని తమ్ముడు బూజు, \li2 కెమూయేలు (అరాము ఇతని కుమారుడు), \li2 \v 22 కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు.” \li3 \v 23 బెతూయేలు రిబ్కాకు తండ్రి అయ్యాడు. \lf మిల్కా ఈ ఎనిమిది మంది కుమారులను అబ్రాహాము సోదరుడైన నాహోరుకు కన్నది. \b \li1 \v 24 రయూమా అనే అతని ఉంపుడుగత్తె కూడా కుమారులు కన్నది: \li2 తెబహు, గహము, తహషు, మయకా. \c 23 \s1 శారా మృతి \p \v 1 శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది. \v 2 ఆమె కనాను దేశంలోని కిర్యత్-అర్బా అనగా హెబ్రోనులో చనిపోయింది, అబ్రాహాము శారా కోసం దుఃఖపడడానికి, ఏడ్వడానికి వెళ్లాడు. \p \v 3 తర్వాత అబ్రాహాము చనిపోయిన తన భార్య మృతదేహం దగ్గర నుండి లేచి హిత్తీయులతో\f + \fr 23:3 \fr*\ft లేదా \ft*\fqa హేతు సంతతివారు\fqa*\ft ; \+xt 5|link-href="GEN 23:5"\+xt*, \+xt 7|link-href="GEN 23:7"\+xt*, \+xt 10|link-href="GEN 23:10"\+xt*, \+xt 16|link-href="GEN 23:16"\+xt*, \+xt 18|link-href="GEN 23:18"\+xt*, \+xt 20|link-href="GEN 23:20"\+xt* వచనాల్లో కూడా\ft*\f* మాట్లాడుతూ, \v 4 “నేను మీ మధ్య విదేశీయునిగా, అపరిచితునిగా ఉన్నాను. చనిపోయిన నా భార్యను పాతిపెట్టడానికి నాకు కొంత భూమి అమ్మండి” అని అన్నాడు. \p \v 5 హిత్తీయులు అబ్రాహాముకు జవాబిస్తూ, \v 6 “అయ్యా, మేము చెప్పేది వినండి, మీరు మా మధ్య దేవుని రాజకుమారునిలా ఉన్నారు. సమాధి స్థలాల్లో మీకు నచ్చిన దానిలో మీరు పాతిపెట్టండి. మాలో ఎవ్వరూ మిమ్మల్ని ఆపరు” అన్నారు. \p \v 7 అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హిత్తీయుల ఎదుట తలవంచాడు. \v 8-9 వారితో ఇలా అన్నాడు, “మీరు నా భార్య మృతదేహాన్ని పాతిపెట్టడానికి సమ్మతిస్తే, సోహరు కుమారుడైన ఎఫ్రోనుకు చెందిన పొలం చివర మక్పేలా గుహ ఉంది, నా తరపున అతనితో మాట్లాడి, ఆ స్థలం నాకు మీ మధ్యలో ఉండే సమాధి స్థలంగా పూర్తి వెలకు అమ్ముమని అడగండి.” \p \v 10 హిత్తీయుడైన ఎఫ్రోను అక్కడే తన ప్రజలమధ్య కూర్చుని, పట్టణ గవినికి వచ్చిన హిత్తీయులందరి సమక్షంలో అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు. \v 11 “నా ప్రభువా, అలా కాదు, నా మాట వినండి; ప్రజలందరి సమక్షంలో నేను పొలాన్ని ఇస్తాను, అందులోని గుహను ఇస్తాను. మీరు పాతి పెట్టుకోండి.” \p \v 12 మళ్ళీ అబ్రాహాము ఆ దేశ ప్రజలందరి ఎదుట తలవంచాడు, \v 13 అతడు ఆ దేశ ప్రజలందరూ వినేలా ఎఫ్రోనుతో, “నా మాట విను, పొలం యొక్క వెల నేను చెల్లిస్తాను. నా భార్య మృతదేహాన్ని అక్కడ నేను పాతిపెట్టేలా నా నుండి అది అంగీకరించు” అన్నాడు. \p \v 14-15 ఎఫ్రోను అబ్రాహాముకు జవాబిస్తూ, “నా ప్రభువా, మా మాట వినండి; దాని ఖరీదు నాలుగు వందల షెకెళ్ళ\f + \fr 23:14,15 \fr*\ft అంటే సుమారు 4.6 కి. గ్రా. లు\ft*\f* వెండి, అయితే నాకు మీకు మధ్య అదెంత? మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి” అన్నాడు. \p \v 16 అబ్రాహాము ఎఫ్రోను చెప్పినట్టే ఒప్పుకుని, హిత్తీయుల వినికిడిలో వ్యాపారుల కొలత ప్రకారం నాలుగు వందల షెకెళ్ళ వెండి తూచి అతనికి ఇచ్చాడు. \p \v 17 మమ్రే దగ్గర మక్పేలాలో ఉన్న ఎఫ్రోను పొలం అందులో ఉన్న గుహ ఆ పొలం సరిహద్దులో ఉన్న అన్ని చెట్లు \v 18 పట్టణ గవిని దగ్గర ఉన్న హిత్తీయుల సమక్షంలో అబ్రాహాము పేర దస్తావేజు చేయబడింది. \v 19 అప్పుడు అబ్రాహాము కనాను దేశంలో, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారా మృతదేహాన్ని పాతిపెట్టాడు. \v 20 కాబట్టి ఆ పొలం, అందులోని గుహ, హిత్తీయుల వలన స్మశాన వాటికగా అబ్రాహాము పేరు మీద వ్రాయబడింది. \c 24 \s1 ఇస్సాకు రిబ్కా \p \v 1 అబ్రాహాము చాలా వృద్ధుడయ్యాడు, యెహోవా అతన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించారు. \v 2 అబ్రాహాము తన ఇంట్లో గృహనిర్వాహకుడైన ముఖ్య సేవకునితో, “నీ చేయి నా తొడ క్రింద పెట్టు. \v 3-4 నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు. \p \v 5 అందుకు ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ ఈ దేశానికి రావడానికి ఇష్టపడకపోతే ఏం చేయాలి? నీవు వచ్చిన ఆ దేశానికి నీ కుమారున్ని తీసుకెళ్లాలా?” అని అతన్ని అడిగాడు. \p \v 6 అబ్రాహాము, “ఖచ్చితంగా నా కుమారున్ని అక్కడికి తీసుకెళ్లకూడదు. \v 7 నా తండ్రి ఇంటి నుండి, నా స్వదేశం నుండి బయటకు తీసుకువచ్చి, ‘నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను’ అని వాగ్దానం చేసిన పరలోక దేవుడైన యెహోవాయే నా కుమారునికి భార్యను అక్కడినుండి తీసుకువచ్చేలా తన దూతను నీకు ముందుగా పంపుతారు. \v 8 ఒకవేళ ఆ స్త్రీ నీ వెంట రావడానికి ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నీవు నిర్దోషివి, కాని నా కుమారున్ని మాత్రం అక్కడికి తీసుకెళ్లకూడదు” అని చెప్పాడు. \v 9 ఆ సేవకుడు ఈ విషయమై తన యజమానియైన అబ్రాహాము తొడ క్రింద చేయి పెట్టి ప్రమాణం చేశాడు. \p \v 10 అప్పుడు ఆ సేవకుడు యజమాని ఒంటెల్లో పది ఒంటెలను, యజమాని యొక్క అన్ని రకాల శ్రేష్ఠమైన వస్తు సముదాయాన్ని తీసుకుని బయలుదేరాడు. అతడు అరాము నహరయీముకు\f + \fr 24:10 \fr*\ft అంటే, వాయువ్య మెసొపొటేమియా\ft*\f* బయలుదేరి, నాహోరు పట్టణం చేరాడు. \v 11 పట్టణం బయట ఉన్న బావి దగ్గర ఒంటెలను మోకరింపజేశాడు; అది సాయంకాలం, స్త్రీలు నీళ్లు చేదుకోడానికి వచ్చే సమయము. \p \v 12 అప్పుడు అతడు ఇలా ప్రార్థన చేశాడు, “యెహోవా! నా యజమానియైన అబ్రాహాము దేవా, నేను వచ్చిన పని ఈ రోజు సఫలం చేయండి, నా యజమాని అబ్రాహాముపై దయ చూపండి. \v 13 నేను ఈ నీటి ఊట దగ్గర నిలబడి ఉన్నాను, ఈ పట్టణవాసుల కుమార్తెలు నీళ్లు తోడుకోడానికి వస్తున్నారు. \v 14 నేను వారిలో ఒక యవ్వన స్త్రీతో, ‘నీ కడవ క్రిందికి వంచు, నేను నీళ్లు త్రాగుతాను’ అని అడిగినప్పుడు, ఏ స్త్రీ అయితే, ‘ఇదిగో త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను’ అని అంటుందో, ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు మీరు ఎంచుకున్న స్త్రీ అయి ఉండాలి. దీనిని బట్టి నా యజమాని పట్ల మీరు దయ చూపారు అని గ్రహిస్తాను.” \p \v 15 అతడు ప్రార్థన ముగించకముందే రిబ్కా కడవ భుజంపై పెట్టుకుని వచ్చింది. ఆమె అబ్రాహాము సోదరుడు నాహోరు యొక్క భార్యయైన మిల్కా దంపతులకు పుట్టిన బెతూయేలు కుమార్తె. \v 16 రిబ్కా చాలా అందమైన కన్యక; ఏ మనుష్యుడు ఆమెతో శయనించలేదు. ఆమె బావిలోనికి దిగివెళ్లి తన కుండలో నీళ్లు నింపుకుని పైకి వచ్చింది. \p \v 17 ఆ సేవకుడు పరుగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లి, “నీ కుండలోని నీళ్లు కొన్ని నాకు త్రాగడానికి ఇవ్వు” అని అన్నాడు. \p \v 18 “అయ్యా త్రాగండి” అని అంటూ రిబ్కా వెంటనే కుండను చేతి మీదికి దించుకుని, అతనికి నీళ్లు ఇచ్చింది. \p \v 19 అతనికి నీళ్లు ఇచ్చిన తర్వాత, “మీ ఒంటెలకు కూడా, వాటికి సరిపడే నీళ్లు చేది పోస్తాను” అని చెప్పింది. \v 20 కాబట్టి ఆమె త్వరపడి తన కుండలో నీళ్లు తొట్టిలో పోసి, పరుగెత్తుకుంటూ మళ్ళీ బావి దగ్గరకు వెళ్లి, ఒంటెలన్నిటికి సరిపడే నీళ్లు చేది పోసింది. \v 21 ఆ సేవకుడు ఒక్క మాట మాట్లాడకుండా, యెహోవా తన ప్రయాణం సఫలం చేశారా లేదా అని ఆమెను గమనిస్తూ ఉన్నాడు. \p \v 22 ఒంటెలు నీళ్లు త్రాగిన తర్వాత, అతడు ఒక బెకా\f + \fr 24:22 \fr*\ft అంటే 5.7 గ్రాములు\ft*\f* బరువుగల బంగారం ముక్కుపుడక, పది షెకెళ్ళ\f + \fr 24:22 \fr*\ft అంటే 115 గ్రాములు\ft*\f* బరువుగల రెండు బంగారు కడియాలు చేతిలో పట్టుకున్నాడు. \v 23 అప్పుడతడు, “నీవెవరి కుమార్తెవు? దయచేసి చెప్పు, ఈ రాత్రి నీ తండ్రి ఇంట్లో మేము గడపడానికి స్థలం ఉందా?” అని అడిగాడు. \p \v 24 అందుకు ఆమె, “నేను మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను” అని జవాబిచ్చింది. \v 25 “మీరు బసచేయడానికి కావలసిన స్థలం, మీ ఒంటెలకు మేత కూడా మా ఇంట్లో ఉంది” అని కూడా చెప్పింది. \p \v 26 అప్పుడు ఆ మనుష్యుడు తలవంచి యెహోవాను ఆరాధిస్తూ, \v 27 “నా యజమానియైన అబ్రాహాము దేవుడైన యెహోవాకు స్తుతి, ఆయన నా యజమానికి తన దయను, తన నమ్మకత్వాన్ని చూపడం మానలేదు. నా మట్టుకైతే, యెహోవా నా ప్రయాణాన్ని సఫలపరచి నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించారు” అని అన్నాడు. \p \v 28 ఆ యవ్వన స్త్రీ పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లి ఇంటివారికి ఈ సంగతులన్ని చెప్పింది. \v 29 రిబ్కాకు లాబాను అనే సోదరుడు ఉన్నాడు, అతడు వెంటనే నీటిబుగ్గ దగ్గర ఉన్న ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లాడు. \v 30 లాబాను రిబ్కా ధరించిన ముక్కుపుడక, చేతి కడియాలు చూసి, ఆ వ్యక్తి రిబ్కాతో మాట్లాడినదంతా ఆమె తన వారితో చెప్పినప్పుడు, వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లి, ఆ బావి దగ్గర తన ఒంటెలతో నిలబడి ఉండడం చూశాడు. \v 31 “యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా, నీవు బయటే ఎందుకు నిలబడ్డావు? నీవు బసచేయడానికి ఇల్లును, ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను” అని అతడు అన్నాడు. \p \v 32 కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్లి, ఒంటెల మీది నుండి బరువును దించారు. వాటికి మేత వేశారు, అతనికి, అతనితో ఉన్న మనుష్యులందరికి కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఇచ్చారు. \v 33 అతనికి భోజనం వడ్డించారు కాని అతడు, “నేను వచ్చిన పని ఏంటో మీకు చెప్పకుండా నేను తినను” అని అన్నాడు. \p అందుకు లాబాను, “అయితే చెప్పు” అన్నాడు. \p \v 34 అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను. \v 35 యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు. \v 36 నా యజమాని భార్య శారా తన వృద్ధాప్యంలో కుమారున్ని కన్నది, తన ఆస్తినంతటిని అతనికి ఇచ్చాడు. \v 37 నా యజమాని నాతో ప్రమాణం చేయించి, ‘నీవు నా కుమారునికి నేను నివసించే కనానీయుల కుమార్తెలలో నుండి భార్యను తీసుకురాకూడదు, \v 38 అయితే నా తండ్రి ఇంటికి, నా బంధువుల దగ్గరకు వెళ్లి, నా కుమారునికి భార్యను తీసుకురా’ అని చెప్పాడు. \p \v 39 “అందుకు నేను, ‘ఒకవేళ ఆమె నాతో రాకపోతే ఎలా?’ అని నా యజమానిని అడిగాను. \p \v 40 “అందుకతడు జవాబిస్తూ, ‘నేను ఇంతవరకు ఎవరి ఎదుట నమ్మకంగా జీవించానో, ఆ యెహోవా తన దూతను నీకు ముందుగా పంపి నీ ప్రయాణం విజయవంతం చేస్తారు, కాబట్టి నీవు నా సొంత వంశస్థులలో నుండి నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని కోసం భార్యను తీసుకువస్తావు. \v 41 నీవు మా వంశస్థుల దగ్గరకు వెళ్లినప్పుడు ఒకవేళ వారు ఆమెను ఇవ్వడానికి ఒప్పుకోకపోతే, నీకు ఈ ప్రమాణం నుండి విముక్తి’ అని అన్నాడు. \p \v 42 “ఈ రోజు నేను నీటిబుగ్గ దగ్గరకు వచ్చినప్పుడు, ‘యెహోవా, నా యజమానియైన అబ్రాహాము దేవా! మీకు ఇష్టమైతే, నా ప్రయాణం సఫలం చేయండి. \v 43 ఇదిగో, నేను ఈ నీటిబుగ్గ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒకవేళ ఒక యువతి నీళ్ల చేదుకోడానికి వస్తే, నేను, “దయచేసి త్రాగడానికి నీ కుండ నుండి కొన్ని నీళ్లు ఇవ్వు” అని నేను అడిగితే, \v 44 ఏ యువతైతే, “త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను” అని అంటుందో, ఆ యువతే యెహోవా నా యజమాని కుమారునికి భార్య కావాలి’ అని నేను ప్రార్థన చేశాను. \p \v 45 “నేను నా హృదయంలో ఇంకా ప్రార్థన ముగించకముందే, రిబ్కా తన కుండను భుజంపై పెట్టుకుని రావడం నేను చూశాను. ఆమె బావిలోనికి దిగివెళ్లి నీళ్లు తోడుకున్న తర్వాత, ఆమెతో, ‘దయచేసి త్రాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అని అడిగాను. \p \v 46 “త్వరగా ఆమె కడవ భుజం మీది నుండి దింపుకుని, ‘త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తాను’ అని అన్నది. కాబట్టి నేను త్రాగాను ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పోసింది. \p \v 47 “అప్పుడు నేను, ‘నీవు ఎవరి కుమార్తెవు?’ అని అడిగాను. \p “అందుకు ఆమె, ‘మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను’ అని చెప్పింది. \p “అప్పుడు నేను ఆమెకు ముక్కు పుడకను, చేతులకు కడియాలు ఇచ్చి, \v 48 తలవంచి నేను యెహోవాను ఆరాధించాను; నా యజమాని సోదరుని మనవరాలిని తన కుమారునికి భార్యగా తీసుకురావడానికి నన్ను సరియైన మార్గంలో నడిపించిన నా యజమాని అబ్రాహాముకు దేవుడైన యెహోవాను స్తుతించాను. \v 49 ఇప్పుడు మీరు నా యజమాని పట్ల దయను, నమ్మకత్వాన్ని చూపాలనుకున్నా, ఒకవేళ లేదు అనుకున్నా చెప్పండి. అప్పుడు నేను ఏ మార్గంలో వెళ్లాలో తెలుసుకుంటాను” అని అన్నాడు. \p \v 50 అప్పుడు లాబాను, బెతూయేలు ఇలా జవాబిచ్చారు, “ఇది యెహోవా చేసిన కార్యం; ఈ విషయంలో మేము చెప్పేది ఏమి లేదు. \v 51 ఇదిగో రిబ్కా, ఆమెను తీసుకెళ్లండి. యెహోవా సూచించినట్లే ఆమె నీ యజమాని కుమారునికి భార్య అవును గాక.” \p \v 52 అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా ఎదుట నేల మీద సాష్టాంగపడ్డాడు. \v 53 తర్వాత ఆ వ్యక్తి వెండి, బంగారు నగలు, వస్త్రాలు రిబ్కాకు ఇచ్చాడు; అతడు ఆమె సోదరునికి, ఆమె తల్లికి కూడా విలువైన కానుకలిచ్చాడు. \v 54 అప్పుడు అతడు, అతని మనుష్యులు భోజనం చేసి ఆ రాత్రి అక్కడే గడిపారు. \p మర్నాడు ఉదయం వారు లేచినప్పుడు, అతడు, “నా దారిన నన్ను నా యజమాని దగ్గరకు పంపివేయండి” అని అన్నాడు. \p \v 55 అయితే ఆమె తల్లి సోదరుడు, “యువతిని కనీసం పదిరోజులైనా మా దగ్గర ఉండనివ్వండి, ఆ తర్వాత ఆమె వెళ్లిపోవచ్చు” అని అన్నారు. \p \v 56 కాని అతడు, “యెహోవా నా ప్రయాణం సఫలం చేశారు, కాబట్టి ఆలస్యం చేయకుండా నన్ను పంపివేయండి, నా యజమాని దగ్గరకు నేను వెళ్తాను” అన్నాడు. \p \v 57 అప్పుడు వారు, “యువతిని పిలిచి ఆమె ఏమంటుందో అడుగుదాం” అని అన్నారు. \v 58 కాబట్టి వారు రిబ్కాను పిలిచి, “ఇతనితో నీవు వెళ్తావా?” అని అడిగారు. \p అందుకు ఆమె, “నేను వెళ్తాను” అని జవాబిచ్చింది. \p \v 59 కాబట్టి వారు తమ సోదరి రిబ్కాను, ఆమెకు తోడుగా దాదిని, అబ్రాహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను పంపివేశారు. \v 60 వారు రిబ్కాను దీవించి ఆమెతో ఇలా అన్నారు, \q1 “మా సోదరీ, నీవు వర్ధిల్లాలి, \q2 వేవేల మందికి తల్లివి కావాలి; \q1 నీ సంతానపు వారు \q2 తమ శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకోవాలి.” \p \v 61 అప్పుడు రిబ్కా, ఆమె పరిచారకులు సిద్ధపడి, ఒంటెలు ఎక్కి ఆ మనుష్యునితో పాటు వెళ్లారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకుని వెళ్లాడు. \p \v 62 ఇప్పుడు ఇస్సాకు బెయేర్-లహాయి-రోయి నుండి వచ్చాడు, ఎందుకంటే అతడు దక్షిణాదిలో నివాసముంటున్నాడు. \v 63 ఒక రోజు సాయంకాలం అతడు ధ్యానం చేసుకోవడానికి పొలానికి వెళ్లాడు; ఆ సమయంలో ఇస్సాకు తేరిచూడగా, అతనికి ఒంటెలు వస్తున్నట్లు కనిపించాయి. \v 64 రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసి, ఒంటె మీది నుండి క్రిందికి దిగి, \v 65 “మనలను కలవడానికి పొలంలో నుండి వస్తున్న అతడు ఎవరు?” అని ఆ సేవకుని అడిగింది. \p అందుకతడు, “అతడే నా యజమాని” అని అన్నాడు. ఆమె తన తలమీద ముసుగు వేసుకుంది. \p \v 66 ఆ సేవకుడు జరిగినదంతా ఇస్సాకుకు చెప్పాడు. \v 67 ఇస్సాకు తన తల్లియైన శారా గుడారం లోనికి ఆమెను తీసుకెళ్లి, ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఇలా రిబ్కా అతని భార్య అయ్యింది. అతడు ఆమెను ప్రేమించాడు; ఇలా తల్లి మరణం చేత బాధతో ఉన్న ఇస్సాకుకు రిబ్కా ద్వార ఓదార్పు కలిగింది. \c 25 \s1 అబ్రాహాము మృతి \p \v 1 అబ్రాహాము కెతూరా అనే మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు, \v 2 ఆమె అతనికి కన్న కుమారులు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. \v 3 యొక్షాను కుమారులు షేబ, దేదాను; అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు దేదాను వారసులు. \v 4 ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతానము. \p \v 5 అబ్రాహాము తనకున్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు. \v 6 అయితే అబ్రాహాము ఇంకా బ్రతికి ఉండగానే తన ఉపపత్నులకు పుట్టిన కుమారులకు బహుమానాలిచ్చి, వారినందరిని తన కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి తూర్పు ప్రాంతాలకు పంపివేశాడు. \p \v 7 అబ్రాహాము నూట డెబ్బై సంవత్సరాలు జీవించాడు. \v 8 అబ్రాహాము తన వృద్ధాప్యంలో, సంవత్సరాలు నిండిన వృద్ధునిగా తుది శ్వాస విడిచి చనిపోయాడు; తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. \v 9 అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలులు కలిసి తమ తండ్రిని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో సమాధి చేశారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలము. \v 10 అబ్రాహాము ఆ పొలాన్ని హిత్తీయుల దగ్గర కొన్నాడు. అందులో అబ్రాహాము తన భార్యయైన శారాతో పాటు పాతిపెట్టబడ్డాడు. \v 11 అబ్రాహాము మృతి చెందిన తర్వాత, దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించారు, అప్పుడు అతడు బెయేర్-లహాయి-రోయి దగ్గర నివసించాడు. \s1 ఇష్మాయేలు కుమారులు \p \v 12 శారా దాసి, ఈజిప్టుకు చెందిన హాగరు, అబ్రాహాముకు కన్న ఇష్మాయేలు కుటుంబ వంశావళి: \b \lh \v 13 ఇష్మాయేలు కుమారులు, వారు పుట్టిన క్రమం ప్రకారం వారి పేర్లు: \b \li1 ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, \li1 కేదారు, అద్బీయేలు, మిబ్శాము, \li1 \v 14 మిష్మా, దూమా, మశ్శా, \li1 \v 15 హదదు, తేమా, యెతూరు, \li1 నాపీషు, కెదెమా. \b \lf \v 16 వీరు ఇష్మాయేలు కుమారులు, వారి వారి స్థావరాలలో, శిబిరాలలో, తమ తమ జనాంగాలకు పన్నెండుగురు గోత్ర పాలకుల పేర్లు. \b \p \v 17 ఇష్మాయేలు నూట ముప్పై ఏడు సంవత్సరాలు జీవించాడు. తన తుది శ్వాస విడిచి చనిపోయాడు, తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. \v 18 అతని వారసులు అష్షూరు వైపు వెళ్లే మార్గంలో హవీలా నుండి ఈజిప్టు సరిహద్దు దగ్గర ఉన్న షూరు వరకు ఉన్న ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు తమ సోదరులందరికి విరోధంగా\f + \fr 25:18 \fr*\ft లేదా \ft*\fqa తూర్పు వైపున\fqa*\f* నివసించారు. \s1 యాకోబు ఏశావు \p \v 19 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి. \b \p అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, \v 20 ఇస్సాకు పద్దనరాములోని సిరియావాడైన బెతూయేలు కుమార్తె, లాబాను సోదరియైన రిబ్కాను పెళ్ళి చేసుకున్నప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు. \p \v 21 రిబ్కాకు సంతానం కలుగలేదు కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చారు, అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది. \v 22 ఆమె గర్భంలో పిల్లలు ఒకరితో ఒకరు పెనుగులాడారు, అందుకు ఆమె, “నాకెందుకు ఇలా జరుగుతుంది?” అని అంటూ యెహోవాను అడగడానికి వెళ్లింది. \p \v 23 యెహోవా ఆమెతో ఇలా చెప్పారు, \q1 “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, \q2 ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; \q1 ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. \q2 పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.” \p \v 24 ఆమె ప్రసవ కాలం సమీపించినప్పుడు, ఆమె గర్భంలో కవలపిల్లలు ఉన్నారు. \v 25 మొదట పుట్టినవాడు ఎర్రగా ఉన్నాడు, అతని శరీరమంతా రోమాల వస్త్రంలా ఉంది; కాబట్టి అతనికి ఏశావు\f + \fr 25:25 \fr*\fq ఏశావు \fq*\ft బహుశ అర్థం \ft*\fqa రోమాలు గలవాడు\fqa*\f* అని పేరు పెట్టారు. \v 26 తర్వాత అతని సోదరుడు, అతని మడిమెను పట్టుకుని బయటకు వచ్చాడు, అతనికి యాకోబు\f + \fr 25:26 \fr*\fq యాకోబు \fq*\ft అంటే \ft*\fqa అతడు మడిమెను పట్టుకుంటాడు \fqa*\ft హెబ్రీ భాషషైలిలో \ft*\fqa అతడు మోసం చేస్తాడు.\fqa*\f* అని పేరు పెట్టారు. రిబ్కా వారికి జన్మనిచ్చినప్పుడు ఇస్సాకు వయస్సు అరవై సంవత్సరాలు. \p \v 27 అబ్బాయిలు పెరిగారు, ఏశావు అరణ్యంలో తిరుగుతూ నేర్పుగల వేటగాడయ్యాడు. యాకోబు నెమ్మదస్థుడై గుడారాల్లో నివసించేవాడు. \v 28 ఇస్సాకు వేటాడిన మాంసం కోరుకునేవాడు, అతడు ఏశావును ప్రేమించేవాడు, కానీ రిబ్కా యాకోబును ప్రేమించేది. \p \v 29 ఒక రోజు యాకోబు వంటకం చేస్తున్నపుడు, ఏశావు పొలం నుండి బాగా ఆకలితో వచ్చి, \v 30 “నేను చాలా ఆకలితో ఉన్నాను, నీవు వండుచున్న ఆ ఎర్రని కూర కొంచెం నాకు పెట్టు!” అని అడిగాడు, (అందుకే అతనికి ఎదోము\f + \fr 25:30 \fr*\fq ఎదోము \fq*\ft అంటే \ft*\fq ఎర్రని.\fq*\f* అని పేరు వచ్చింది.) \p \v 31 యాకోబు, “అలా అయితే మొదట నీ జ్యేష్ఠత్వపు హక్కు\f + \fr 25:31 \fr*\fq జ్యేష్ఠత్వపు హక్కు \fq*\ft జ్యేష్ఠులు తమ తండ్రి దగ్గర పొందుకునే \ft*\fqa స్వాస్థ్యము. \fqa*\ft జ్యేష్ఠులు ఇతర పిల్లలకంటే రెండింతలు ఎక్కువ పొందుకుంటారు.\ft*\f* నాకు అమ్ము” అని అన్నాడు. \p \v 32 అప్పుడు ఏశావు, “నేను ఆకలితో చస్తూ ఉంటే నాకు జ్యేష్ఠత్వం దేనికి ఉపయోగం?” అని అన్నాడు. \p \v 33 అయితే యాకోబు, “ముందు నాకు ప్రమాణం చేయి” అన్నాడు. కాబట్టి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మివేస్తున్నట్టుగా ప్రమాణం చేశాడు. \p \v 34 అప్పుడు యాకోబు కొంత రొట్టె, కొంత కాయధాన్యం వంటకం ఏశావుకు ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచి వెళ్లిపోయాడు. \p ఈ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. \c 26 \s1 ఇస్సాకు అబీమెలెకు \p \v 1 ఆ దేశంలో అబ్రాహాము కాలంలో వచ్చిన కరువు కాక మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోని ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరకు వెళ్లాడు. \v 2 యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు, “నీవు ఈజిప్టుకు వెళ్లకు; నేను చెప్పిన దేశంలోనే నివసించు. \v 3 కొంతకాలం ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నీ వారసులకు ఈ దేశాలన్నీ ఇస్తాను, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను. \v 4 నీ వారసులను ఆకాశంలోని అనేక నక్షత్రాల్లా విస్తరింపజేసి ఈ దేశాలన్నీ వారికిస్తాను, నీ సంతానం ద్వారా సమస్త భూప్రజలు ఆశీర్వదించబడతారు, \v 5 ఎందుకంటే అబ్రాహాము నా మాట విని, నేను చెప్పింది చేశాడు, నా ఆజ్ఞలను, కట్టడలను, సూచనలను పాటించాడు.” \v 6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. \p \v 7 అక్కడి మనుష్యులు అతని భార్యను చూసి ఆమె ఎవరు అని అతన్ని అడిగితే, “ఆమె నా సోదరి” అని చెప్పాడు, ఎందుకంటే, “ఆమె నా భార్య” అని చెప్పడానికి భయపడ్డాడు. “రిబ్కా అందంగా ఉంది కాబట్టి తనను బట్టి ఈ స్థలం యొక్క మనుష్యులు నన్ను చంపేస్తారు” అని అతడు అనుకున్నాడు. \p \v 8 ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్నాడు, ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం చూశాడు. \v 9 కాబట్టి అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, “నిజంగా ఈమె నీ భార్య కదా! ‘ఆమె నా సోదరి’ అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. \p ఇస్సాకు, “ఆమె కారణంగా నా ప్రాణం పోతుందేమో అని అనుకున్నాను” అని జవాబిచ్చాడు. \p \v 10 అప్పుడు అబీమెలెకు, “నీవు మా పట్ల చేసినదేంటి? ఈ మనుష్యుల్లో ఎవరైనా ఆమెతో శయనించి ఉండేవారు. అప్పుడు నీవు మాపైన అపరాధం తెచ్చిపెట్టేవాడివి” అని అన్నాడు. \p \v 11 అప్పుడు అబీమెలెకు ప్రజలందరికి ఆదేశించాడు: “ఎవరైనా ఈ మనుష్యునికి లేదా అతని భార్యకు హాని చేస్తే, వారికి మరణశిక్ష విధించబడును.” \p \v 12 ఇస్సాకు ఆ దేశంలో విత్తనాలు విత్తాడు, యెహోవా అతన్ని దీవించారు కాబట్టి, అదే సంవత్సరం అతనికి నూరంతల పంట వచ్చింది. \v 13 అతడు ధనికుడయ్యాడు, అతడు ఎంతో గొప్పవాడయ్యే వరకు అతని ఆస్తి వృద్ధిచెందుతూ ఉంది. \v 14 అతనికి మందలు, పశువులు, దాసులు ఎక్కువగా ఉన్నందుకు ఫిలిష్తీయులు అసూయపడ్డారు. \v 15 అతని తండ్రియైన అబ్రాహాము కాలంలో అతని దాసులు త్రవ్విన బావులన్ని ఫిలిష్తీయులు మట్టితో నింపి పూడ్చేశారు. \p \v 16 అబీమెలెకు ఇస్సాకుతో, “నీవు ఇక్కడినుండి వెళ్లిపో; మాకంటే చాలా బలవంతుడవు అయ్యావు” అన్నాడు. \p \v 17 కాబట్టి ఇస్సాకు అక్కడినుండి గెరారు లోయకు వెళ్లి, గుడారం వేసుకుని అక్కడ స్థిరపడ్డాడు. \v 18 తన తండ్రి అబ్రాహాము కాలంలో త్రవ్వించిన బావులను అతడు చనిపోయాక ఫిలిష్తీయులు పూడ్చేసిన వాటిని ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు, వాటికి తన తండ్రి పెట్టిన అవే పేర్లు పెట్టాడు. \p \v 19 ఇస్సాకు సేవకులు గెరారు లోయలో కూడా త్రవ్వినప్పుడు మంచి నీళ్ల బావి కనుగొన్నారు. \v 20 అయితే గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో గొడవపడి, “ఈ నీళ్లు మావి!” అని అన్నారు. వారు జగడమాడారు కాబట్టి ఇస్సాకు ఆ బావికి ఏశెకు\f + \fr 26:20 \fr*\fq ఏశెకు \fq*\ft అంటే \ft*\fqa జగడం\fqa*\f* అని పేరు పెట్టాడు. \v 21 తర్వాత వారు మరో బావి త్రవ్వారు, కానీ దాని కోసం కూడా గొడవపడ్డారు; కాబట్టి ఆ బావికి శిత్నా\f + \fr 26:21 \fr*\fq శిత్నా \fq*\ft అంటే \ft*\fqa వ్యతిరేకత.\fqa*\f* అని పేరు పెట్టాడు. \v 22 అతడు అక్కడినుండి వెళ్లి మరో బావి త్రవ్వించాడు, దాని కోసం ఎలాంటి గొడవ జరగలేదు. అతడు, “ఇప్పుడు యెహోవా మాకు స్థలం ఇచ్చారు, మేము ఈ దేశంలో వర్ధిల్లుతాము” అని ఆ బావికి రహెబోతు\f + \fr 26:22 \fr*\fq రహెబోతు \fq*\ft అంటే \ft*\fqa గది\fqa*\f* అని పేరు పెట్టాడు. \p \v 23 అక్కడినుండి అతడు బెయేర్షేబకు వెళ్లాడు. \v 24 ఆ రాత్రి యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై, “నేను నీ తండ్రి అబ్రాహాము దేవుడను. భయపడకు, నేను నీతో ఉన్నాను; నా సేవకుడైన అబ్రాహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, సంఖ్యాపరంగా నీ వారసులను విస్తరింపజేస్తాను” అని అన్నారు. \p \v 25 ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి యెహోవాను ఆరాధించాడు. అక్కడ తన గుడారం వేసుకున్నాడు, అక్కడే తన సేవకులు బావి త్రవ్వారు. \p \v 26 ఇంతలో అబీమెలెకు, అతని స్నేహితుడు అహుజతు, సేనాధిపతి ఫీకోలు, గెరారు నుండి ఇస్సాకు దగ్గరకు వచ్చారు. \v 27 ఇస్సాకు వారిని, “మీరెందుకు నా దగ్గరకు వచ్చారు, నాకు వ్యతిరేకంగా ఉంటూ నన్ను పంపివేశారు కదా?” అని అడిగాడు. \p \v 28 వారు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా నీతో ఉండడం మేము స్పష్టంగా చూశాం; కాబట్టి, ‘మాకు నీకు మధ్య ప్రామాణిక ఒప్పందం ఉండాలి’ అని మేము అనుకున్నాము. కాబట్టి మనం ఒప్పందం చేసుకుందాము. \v 29 మేము నీకు ఏ హాని చేయలేదు కాని మిమ్మల్ని మంచిగా చూసుకుని సమాధానంతో పంపించాం, కాబట్టి నీవు మాకు ఏ హాని చేయకూడదు. ఇప్పుడు నీవు యెహోవాచేత ఆశీర్వదించబడ్డావు.” \p \v 30 అప్పుడు ఇస్సాకు వారికి విందు చేశాడు, వారు తిని త్రాగారు. \v 31 మర్నాడు వేకువజామున వారు లేచి, ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపాడు, వారు అక్కడినుండి సమాధానంతో వెళ్లారు. \p \v 32 ఆ రోజు ఇస్సాకు సేవకులు వచ్చి అతనితో వారు త్రవ్విన మరో బావి గురించి ఇలా చెప్పారు. వారు, “మాకు నీళ్లు కనిపించాయి!” అని చెప్పారు. \v 33 అతడు ఆ బావికి షేబ\f + \fr 26:33 \fr*\fq షేబ \fq*\ft అంటే \ft*\fqa ఒప్పందం \fqa*\ft లేదా \ft*\fqa ఏడు.\fqa*\f* అని పేరు పెట్టాడు, అందుకే ఇప్పటివరకు ఆ పట్టణం పేరు బెయేర్షేబ.\f + \fr 26:33 \fr*\fq బెయేర్షేబ \fq*\ft అంటే \ft*\fqa ఒప్పంద బావి \fqa*\ft అలాగే \ft*\fqa ఏడింటి బావి.\fqa*\f* \s1 యాకోబు ఏశావు ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు \p \v 34 ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో, హిత్తీయుడైన బెయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు. \v 35 ఈ ఇద్దరు ఇస్సాకు రిబ్కాల దుఃఖానికి కారకులయ్యారు. \c 27 \p \v 1 ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, అతడు ఇక చూడలేనంతగా తన కళ్ళు మసకబారినప్పుడు, తన పెద్దకుమారుడైన ఏశావును, “నా కుమారుడా” అని పిలిచాడు. \p అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు. \p \v 2 ఇస్సాకు ఇలా అన్నాడు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. \v 3 కాబట్టి నీవు నీ ఆయుధాలను అంటే నీ అంబులపొదిని విల్లును తీసుకుని అడవికి వెళ్లి జంతువును వేటాడి నాకు మాంసం తెచ్చిపెట్టు. \v 4 నాకు ఇష్టమైన భోజనం రుచిగా సిద్ధం చేసి తీసుకురా, నేను చనిపోకముందు తిని నిన్ను దీవిస్తాను” అని చెప్పాడు. \p \v 5 అయితే ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు రిబ్కా విన్నది. ఏశావు వేటాడేందుకు బహిరంగ పొలానికి వెళ్లిపోయాక, \v 6 రిబ్కా తన కుమారుడైన యాకోబుతో, “ఇదిగో, నీ తండ్రి నీ అన్న ఏశావుతో చెప్పడం నేను విన్నాను, \v 7 ‘నేను చనిపోకముందు దానిని తిని యెహోవా సన్నిధిలో నిన్ను దీవిస్తాను’ అందుకు నీవు నా కోసం వేటాడి మాంసం తెచ్చి రుచికరమైన భోజనం సిద్ధం చేసి తీసుకురా అని చెప్పాడు. \v 8 కాబట్టి నా కుమారుడా! నా మాట జాగ్రతగా విని, నేను చెప్పినట్టు చేయి: \v 9 మన మందలో నుండి రెండు మంచి మేక పిల్లలను తీసుకురా, నేను నీ తండ్రికి ఇష్టమైన భోజనం వండి పెడతాను. \v 10 అప్పుడు నీ తండ్రి తినడానికి దానిని తీసుకెళ్లు, అప్పుడు అతడు చనిపోకముందు నిన్ను దీవిస్తాడు” అని చెప్పింది. \p \v 11 యాకోబు తన తల్లి రిబ్కాతో, “నా అన్న ఏశావు వెంట్రుకలు గలవాడు, నాకు నునుపైన చర్మం ఉంది. \v 12 ఒకవేళ నా తండ్రి నన్ను తాకిచూస్తే ఎలా? అతన్ని మోసం చేసినవాడనై, నా మీదికి ఆశీర్వాదానికి బదులు శాపం తెచ్చుకున్నవాన్ని అవుతాను” అని అన్నాడు. \p \v 13 అతని తల్లి అతనితో, “నా కుమారుడా, ఆ శాపం నా మీదికే రానివ్వు. కేవలం నేను చెప్పింది చేయి; వెళ్లి వాటిని నా కోసం తీసుకురా” అని చెప్పింది. \p \v 14 కాబట్టి అతడు వెళ్లి వాటిని తన తల్లి దగ్గరకు తెచ్చాడు, ఆమె అతని తండ్రికి ఇష్టమైన భోజనం వండింది. \v 15 తర్వాత రిబ్కా ఇంట్లో ఉన్న తన పెద్దకుమారుడైన ఏశావు యొక్క శ్రేష్ఠమైన బట్టలు తీసుకుని తన చిన్న కుమారుడైన యాకోబుకు తొడిగించింది. \v 16 ఆమె అతని చేతులను, మెడ దగ్గర ఉండే నునుపైన భాగాలను మేక చర్మంతో కప్పింది. \v 17 తర్వాత తాను చేసిన రుచిగల భోజనాన్ని, రొట్టెలను యాకోబు చేతికి ఇచ్చింది. \p \v 18 యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “నా తండ్రి” అని పిలిచాడు. \p “నా కుమారుడా, నీవెవరివి?” అని అతడు అడిగాడు. \p \v 19 యాకోబు తన తండ్రితో, “నేను నీ మొదటి కుమారుడనైన ఏశావును, నీవు చెప్పిన ప్రకారం నేను చేశాను. నన్ను ఆశీర్వదించడానికి లేచి, నేను చేసింది తిను” అని అన్నాడు. \p \v 20 ఇస్సాకు తన కుమారున్ని, “నా కుమారుడా, ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అని అడిగాడు. \p యాకోబు, “నీ దేవుడైన యెహోవా నా దగ్గరకు దానిని తీసుకువచ్చారు” అని జవాబిచ్చాడు. \p \v 21 అప్పుడు ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, నా దగ్గరకు రా, నేను నిన్ను ముట్టుకొని, నీవు నిజంగా ఏశావువో కాదో తెలుసుకుంటాను” అని అన్నాడు. \p \v 22 యాకోబు తండ్రి దగ్గరకు వెళ్లగా, ఇస్సాకు అతన్ని తాకిచూసి, “స్వరం యాకోబు స్వరంలా ఉంది, కాని చేతులు ఏశావులా ఉన్నాయి” అని అన్నాడు. \v 23 యాకోబు చేతులు తన అన్న ఏశావులా రోమాలు కలిగి ఉన్నాయి కాబట్టి అతడు గుర్తు పట్టలేదు; కాబట్టి అతన్ని దీవించడం ప్రారంభించాడు. \v 24 “నీవు నిజంగా నా కుమారుడైన ఏశావువేనా?” అని అతడు అడిగాడు. \p “అవును నేనే” అని అతడు జవాబిచ్చాడు. \p \v 25 అప్పుడు అతడు, “నా కుమారుడా, నీవు వండింది కొంత తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను” అని అన్నాడు. \p యాకోబు తెచ్చాడు, అతడు తిన్నాడు; ద్రాక్షరసం తెచ్చాడు, అతడు త్రాగాడు. \v 26 అప్పుడు అతని తండ్రి ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, దగ్గరకు వచ్చి నాకు ముద్దుపెట్టు” అన్నాడు. \p \v 27 కాబట్టి అతడు దగ్గరకు వెళ్లి అతనికి ముద్దుపెట్టాడు. ఇస్సాకు కుమారుని వస్త్రాల వాసనను పసిగట్టి, అతన్ని ఇలా దీవించాడు, \q1 “ఆహా, నా కుమారుని వాసన \q2 యెహోవా దీవించిన \q2 పొలం యొక్క సువాసన \q1 \v 28 దేవుడు నీకు ఆకాశపు మంచును, \q2 భూమి యొక్క సారాన్ని, \q2 సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక. \q1 \v 29 జనాంగాలు నీకు సేవ చేయాలి, \q2 జనాలు నీకు తలవంచాలి. \q1 నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, \q2 నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. \q1 నిన్ను శపించేవారు శపించబడతారు \q2 నిన్ను దీవించే వారు దీవించబడతారు.” \p \v 30 ఇస్సాకు అతన్ని దీవించడం ముగించిన తర్వాత, యాకోబు తండ్రి దగ్గర నుండి వెళ్లీ వెళ్లకముందే, తన సోదరుడు ఏశావు వేటనుండి వచ్చాడు. \v 31 అతడు కూడా రుచిగల భోజనం వండుకొని తన తండ్రి దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడతడు, “నా తండ్రి, నన్ను దీవించడానికి నేను వేటాడి తెచ్చిన మాంసంతో సిద్ధం చేసిన భోజనం తిను” అని అతనితో అన్నాడు. \p \v 32 అప్పుడు తన తండ్రి ఇస్సాకు, “నీవెవరివి?” అని అడిగాడు. \p అందుకతడు, “నేను నీ కుమారున్ని, నీ మొదటి సంతానమైన ఏశావును” అని జవాబిచ్చాడు. \p \v 33 ఇస్సాకు గజగజ వణకుతూ ఇలా అన్నాడు, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!” \p \v 34 తన తండ్రి మాట విన్న వెంటనే ఏశావు దుఃఖంతో బిగ్గరగా ఏడ్చి, “నన్ను కూడా దీవించు, నా తండ్రి!” అని అన్నాడు. \p \v 35 అయితే అతడు, “నీ తమ్ముడు మోసపూరితంగా వచ్చి నీ దీవెనను తీసుకున్నాడు” అన్నాడు. \p \v 36 ఏశావు, “అతనికి యాకోబు\f + \fr 27:36 \fr*\fq యాకోబు \fq*\ft అంటే \ft*\fqa అతడు మడిమెను పట్టుకుంటాడు \fqa*\ft హెబ్రీ భాషషైలిలో \ft*\fqa అతడు మోసం చేస్తాడు.\fqa*\f* అని సరిగ్గానే పేరు పెట్టారు కదా? నన్ను అతడు మోసగించడం ఇది రెండవసారి: నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు నా దీవెనను దొంగిలించాడు! నా కోసం ఒక్క దీవెన కూడా మిగలలేదా?” అని అడిగాడు. \p \v 37 ఇస్సాకు జవాబిస్తూ, “నేను అతన్ని నీపై ప్రభువుగా నియమించాను, అతని బంధువులందరినీ అతనికి దాసులుగా చేశాను, సమృద్ధిగా ధాన్యం, ద్రాక్షరసం అతనికి సమకూర్చాను. కాబట్టి నా కుమారుడా! ఇప్పుడు నీకోసం నేను ఏమి చేయగలను?” అని అడిగాడు. \p \v 38 అందుకు ఏశావు తన తండ్రితో, “నా తండ్రి, ఒక్క దీవెననే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు!” అని అంటూ గట్టిగా ఏడ్చాడు. \p \v 39 అప్పుడు ఇస్సాకు అతనికి జవాబిస్తూ ఇలా అన్నాడు, \q1 “నీ నివాసం \q2 సారవంతమైన భూమికి దూరంగా, \q2 పైనున్న ఆకాశం యొక్క మంచుకు దూరంగా ఉంటుంది. \q1 \v 40 నీవు నీ ఖడ్గం చేత జీవిస్తావు \q2 నీ సోదరునికి సేవ చేస్తావు, \q1 అయితే నీవు విశ్రాంతి లేక ఉన్నప్పుడు, \q2 నీ మెడ మీద నుండి అతని కాడి \q2 విరిచి పడవేస్తావు.” \p \v 41 తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెనను బట్టి ఏశావు తన సోదరుని మీద పగబెట్టుకున్నాడు, “నా తండ్రిని గురించి దుఃఖించే రోజులు సమీపంగా ఉన్నాయి; తర్వాత నా సోదరుడైన యాకోబును చంపేస్తా” అని తనకు తాను అనుకున్నాడు. \p \v 42 రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు ఏమన్నాడో తెలుసుకుని, తన చిన్న కుమారుడైన యాకోబును పిలిపించి అతనితో ఇలా అన్నది, “నీ అన్న ఏశావు నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు. \v 43 కాబట్టి నా కుమారుడా! నేను చెప్పేది విను: హారానులో ఉన్న నా సోదరుడైన లాబాను దగ్గరకు పారిపో. \v 44 మీ అన్న కోపం తగ్గే వరకు అక్కడ కొంతకాలం అతని దగ్గరే ఉండు. \v 45 అతని కోపం చల్లారి, నీవు అతనికి చేసింది అతడు మరచిపోయిన తర్వాత, నేను నీకు కబురు పెడతాను. ఒక్క రోజే మీ ఇద్దరిని ఎందుకు పోగొట్టుకోవాలి?” \p \v 46 తర్వాత రిబ్కా ఇస్సాకుతో, “ఈ హిత్తీయుల స్త్రీల వలన నేను విసిగిపోయాను. యాకోబు కూడా ఇలాంటి హిత్తీయుల స్త్రీలలా ఈ దేశ స్త్రీని భార్యగా చేసుకుంటే, ఇక నేను బ్రతికి లాభం లేదు” అని అన్నది. \c 28 \p \v 1 ఇస్సాకు యాకోబును పిలిపించి అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు తనకు ఇలా ఆజ్ఞాపించాడు: “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు. \v 2 వెంటనే పద్దనరాములో నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. అక్కడ నీ తల్లి సోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకో. \v 3 సర్వశక్తిగల దేవుడు నిన్ను దీవించి, నిన్ను ఫలభరితంగా చేసి, జనాంగాల సమాజంగా విస్తరించేలా సంఖ్యాపరంగా వృద్ధి చేయును గాక. \v 4 ఆయన నీకును, నీ వారసులకు అబ్రాహాముకు ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చును గాక, తద్వార నీవు పరదేశిగా ఉన్న ఈ దేశాన్ని, దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నీవు స్వాధీనం చేసుకుంటావు.” \v 5 తర్వాత ఇస్సాకు యాకోబును పంపివేశాడు. అతడు పద్దనరాముకు, యాకోబు ఏశావుల తల్లియైన రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు వెళ్లాడు. లాబాను సిరియావాడైన బెతూయేలు కుమారుడు. \p \v 6-7 ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాముకు పంపి అక్కడే అతడు భార్యను చూసుకోవాలని, “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు” అని చెప్పాడని, యాకోబు తన తల్లిదండ్రులకు లోబడి పద్దనరాముకు వెళ్లాడని ఏశావు తెలుసుకున్నాడు. \v 8 అప్పుడు ఏశావు కనాను స్త్రీలంటే తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదని గ్రహించాడు; \v 9 కాబట్టి అతడు తనకున్న భార్యలు కాక ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సోదరియైన మహలతును భార్యగా చేసుకున్నాడు. \s1 బేతేలు దగ్గర యాకోబుకు వచ్చిన కల \p \v 10 యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు. \v 11 ఒక స్థలం చేరిన తర్వాత సూర్యాస్తమయం అయినందున రాత్రికి అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉన్న రాళ్లలో ఒకటి తీసుకుని, తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. \v 12 అతడు ఒక కల కన్నాడు, అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశాన్ని అంటి ఉంది. ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. \v 13 దాని మీద యెహోవా నిలబడి ఇలా అన్నారు: “యెహోవాను నేనే, నీ తాత అబ్రాహాముకు దేవుడను, నీ తండ్రి ఇస్సాకుకు దేవుడను. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకు, నీ వారసులకు ఇస్తాను. \v 14 నీ సంతానం భూమిపై ఇసుక రేణువుల్లా అవుతారు, నీవు పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణాలకు వ్యాపిస్తావు. భూమిపై ఉన్న సర్వ జనాంగాలు నీ ద్వార, నీ సంతానం ద్వార దీవించబడతారు. \v 15 నేను నీతో ఉంటాను, నీవు వెళ్లే ప్రతీ చోట నిన్ను సంరక్షిస్తాను, ఈ దేశానికి మళ్ళీ రప్పిస్తాను. నేను నీకు వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నిన్ను విడువను.” \p \v 16 యాకోబు నిద్రలేచి, “ఖచ్చితంగా ఈ స్థలంలో యెహోవా ఉన్నారు, నేను అది గ్రహించలేకపోయాను” అని అనుకున్నాడు. \v 17 అతడు భయపడి ఇలా అన్నాడు, “ఈ స్థలం ఎంత అద్భుతమైనది! ఇది దేవుని మందిరమే కాని ఇంకొకటి కాదు; ఇది పరలోక ద్వారము.” \p \v 18 మర్నాడు తెల్లవారినప్పుడు యాకోబు తన తలగడగా పెట్టుకున్న రాయిని తీసుకుని, దానిని స్తంభంగా నిలిపి, దాని మీదుగా నూనె పోశాడు. \v 19 ఆ స్థలానికి బేతేలు\f + \fr 28:19 \fr*\fq బేతేలు \fq*\ft అంటే \ft*\fqa దేవుని మందిరం\fqa*\f* అని పేరు పెట్టాడు, ముందు ఆ పట్టణం లూజు అని పిలువబడేది. \p \v 20-22 తర్వాత యాకోబు మ్రొక్కుబడి చేస్తూ ఇలా అన్నాడు, “దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఈ ప్రయాణంలో కాపాడి నాకు తినడానికి ఆహారం ఇచ్చి వేసుకోడానికి వస్త్రాలు ఇచ్చి నన్ను నా తండ్రి ఇంటికి క్షేమంగా చేరిస్తే, యెహోవాయే నా దేవుడుగా ఉంటారు, స్తంభంగా నేను నిలబెట్టిన ఈ రాయి దేవుని మందిరంగా ఉంటుంది. అంతేకాక, నీవు నాకు ఇచ్చే అంతటిలో నుండి నేను నీకు పదవ భాగం ఇస్తాను” అని ఆయనకు మ్రొక్కుబడి చేసుకున్నాడు. \c 29 \s1 యాకోబు పద్దనరాముకు చేరతాడు \p \v 1 యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు. \v 2 అక్కడ ఒక బహిరంగ పొలంలో అతనికి ఒక బావి కనిపించింది. అక్కడ మూడు గొర్రె మందలు దాని దగ్గర పడుకుని ఉన్నాయి, కాపరులు ఆ బావి నీళ్లు వాటికి పెడతారు. ఆ బావి మీద పెద్ద రాయి మూత పెట్టి ఉంది. \v 3 మందలన్నీ కూడి రాగానే కాపరులు ఆ బావి మీద నుండి రాయిని దొర్లించి, గొర్రెలకు నీళ్లుపెట్టి, రాయి మూతను తిరిగి బావి మీద పెడతారు. \p \v 4 యాకోబు కాపరులను చూసి, “సోదరులారా, మీరు ఎక్కడి వారు?” అని అడిగాడు. \p వారు, “మేము హారాను వారం” అని జవాబిచ్చారు. \p \v 5 అతడు, “నాహోరు మనవడు, లాబాను మీకు తెలుసా?” అని వారిని అడిగాడు. \p వారు, “అవును, తెలుసు” అని చెప్పారు. \p \v 6 అప్పుడు యాకోబు, “లాబాను క్షేమమేనా?” అని అడిగాడు. \p “అవును, అతడు క్షేమమే, అదిగో, అతని కుమార్తె రాహేలు గొర్రెల మందతో వస్తుంది” అని వారు చెప్పారు. \p \v 7 యాకోబు, “ఇంకా ప్రొద్దుగుంకలేదు; మందలను తీసుకెళ్లే సమయం కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టుకోండి, వాటిని మేపుకోండి” అన్నాడు. \p \v 8 “మందలన్నీ పోగయ్యేవరకు వాటికి నీళ్లు పెట్టలేము. బావి మీది నుండి రాయి దొర్లిస్తారు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెడతాం” అని వారు జవాబిచ్చారు. \p \v 9 యాకోబు వారితో ఇంకా మాట్లాడుతుండగా, రాహేలు తన తండ్రి గొర్రెలతో వచ్చింది, ఆమె కూడా కాపరి. \v 10 యాకోబు తన మామ లాబాను కుమార్తెయైన రాహేలును, తన మామ మందను చూడగానే, అతడు వెళ్లి బావి మీద ఉన్న రాయిని దొర్లించి తన మామ మందకు నీళ్లు పెట్టాడు. \v 11 తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు. \v 12 అతడు తన తండ్రి బంధువని, రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పాడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రికి చెప్పింది. \p \v 13 తన సోదరి కుమారుడైన యాకోబును గురించిన సమాచారం విన్న వెంటనే, లాబాను అతన్ని కలవడానికి త్వరపడ్డాడు. అతన్ని హత్తుకుని, ముద్దుపెట్టి, తన ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడ యాకోబు అన్ని విషయాలు అతనికి చెప్పాడు. \v 14 లాబాను అతనితో, “నీవు నా సొంత శరీరం, రక్తం” అన్నాడు. \s1 యాకోబు లేయాను రాహేలును పెళ్ళి చేసుకోవడం \p ఒక పూర్తి నెల యాకోబు అతనితో ఉన్న తర్వాత, \v 15 లాబాను అతనితో, “నీవు నా బంధువైనంత మాత్రాన ఏమి తీసుకోకుండ నా కోసం పని చేస్తావా? నీకు జీతంగా ఏమి కావాలో చెప్పు” అని అన్నాడు. \p \v 16 లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు; పెద్దకుమార్తె పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు. \v 17 లేయాకు బలహీనమైన\f + \fr 29:17 \fr*\ft లేదా \ft*\fqa సున్నితమైన \fqa*\ft హెబ్రీలో ఈ పదానికి అర్థం స్పష్టంగా లేదు\ft*\f* కళ్లు ఉన్నాయి, కాని రాహేలు రూపవతి, అందగత్తె. \v 18 యాకోబు రాహేలుతో ప్రేమలో ఉండి, “నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు. \p \v 19 లాబాను, “ఆమెను పరాయి మనుష్యునికి ఇవ్వడం కంటే నీకివ్వడం మంచిది. నా దగ్గరే పని చేస్తూ ఉండు” అన్నాడు. \v 20 యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు, అయితే తనకు రాహేలు పట్ల ఉన్న ప్రేమను బట్టి అతనికి ఆ ఏడు సంవత్సరాలు కొద్దిరోజులే అనిపించింది. \p \v 21 తర్వాత యాకోబు లాబానుతో, “నా భార్యను నాకు ఇవ్వు, నా గడువు తీరింది. నేను ఆమెతో పడుకుంటాను” అని అన్నాడు. \p \v 22 కాబట్టి లాబాను ఆ ప్రాంత ప్రజలందరినీ సమావేశపరిచి విందు చేశాడు. \v 23 అయితే అతడు రాత్రివేళలో తన కుమార్తె లేయాను యాకోబుకు ఇచ్చాడు, యాకోబు తనతో పడుకున్నాడు. \v 24 లాబాను తన దాసి జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చాడు. \p \v 25 తెల్లవారినప్పుడు యాకోబు లేచి చూస్తే, అతనితో ఉన్నది లేయా! కాబట్టి యాకోబు లాబానును, “నీవు చేసింది ఏంటి? నేను రాహేలు కోసం నీకు పని చేశాను కదా; నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని అడిగాడు. \p \v 26 లాబాను జవాబిస్తూ, “పెద్దకుమార్తెకు ముందు చిన్న కుమార్తెను ఇవ్వడం మా ఆచారం కాదు. \v 27 లేయాతో వైవాహిక వారం గడువు ముగించు. తర్వాత మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేస్తే రాహేలును కూడా నీకిస్తాను” అని అన్నాడు. \p \v 28 యాకోబు అలాగే చేశాడు. లేయాతో తన వారం ముగించుకున్న తర్వాత లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. \v 29 లాబాను తన దాసి బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చాడు. \v 30 యాకోబు రాహేలుతో కూడా పడుకున్నాడు, అతడు లేయాకంటే రాహేలును ఎక్కువ ప్రేమించాడు కాబట్టి అతడు లాబాను కోసం ఇంకా ఏడు సంవత్సరాలు పని చేశాడు. \s1 యాకోబు పిల్లలు \p \v 31 లేయా ప్రేమించబడడం లేదని యెహోవా చూసి, ఆమె గర్భవతి అయ్యేలా ఆయన కరుణించారు, కాని రాహేలు గొడ్రాలిగా ఉంది. \v 32 లేయా గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “యెహోవా నా బాధను చూశారు. ఇప్పుడు తప్పకుండ నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అని చెప్పి, అతనికి రూబేను\f + \fr 29:32 \fr*\fq రూబేను \fq*\ft హెబ్రీలో \ft*\fqa ఆయన \fqa*\fq నా బాధను చూశారు\fq*\ft ; పేరు అర్థం \ft*\fqa చూడు, కుమారుడు\fqa*\f* అని పేరు పెట్టింది. \p \v 33 ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నేను ప్రేమించబడడం లేదని యెహోవా విన్నారు కాబట్టి, ఇతన్ని కూడా నాకు ఇచ్చారు” అని చెప్పి, అతనికి షిమ్యోను\f + \fr 29:33 \fr*\fq షిమ్యోను \fq*\ft దీని అర్థం \ft*\fqa వినేవాడు\fqa*\f* అని పేరు పెట్టింది. \p \v 34 లేయా మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నా భర్తకు నేను ముగ్గురు కుమారులను కన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉంటాడు” అని ఆమె అతనికి లేవీ\f + \fr 29:34 \fr*\fq లేవీ \fq*\ft హెబ్రీ నుండి వచ్చిన పదం; దీని అర్థం \ft*\fq అంటిపెట్టుకుని\fq*\f* అని పేరు పెట్టింది. \p \v 35 ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను” అని ఆమె అతనికి యూదా\f + \fr 29:35 \fr*\fq యూదా \fq*\ft హెబ్రీ నుండి వచ్చిన పదం; దీని అర్థం \ft*\fqa స్తుతి\fqa*\f* అని పెట్టింది. తర్వాత ఆమె పిల్లలు కనడం ఆగిపోయింది. \c 30 \p \v 1 రాహేలు తనకు పిల్లలు కలగడం లేదు అని గ్రహించి, తన అక్క మీద అసూయ పడింది. కాబట్టి యాకోబుతో, “నాకు పిల్లలను ఇవ్వు లేదా నేను చస్తాను!” అని అన్నది. \p \v 2 యాకోబు ఆమెపై కోప్పడి, “నేనేమైన నీకు పిల్లలు పుట్టకుండా ఆపిన దేవుని స్థానంలో ఉన్నానా?” అని అన్నాడు. \p \v 3 అప్పుడు ఆమె, “ఇదిగో, నా దాసి బిల్హా. ఈమెతో వెళ్లు, తద్వార ఆమె నా కోసం పిల్లలను కంటుంది, ఆమె ద్వార నేను కూడా కుటుంబం కట్టుకుంటాను” అని చెప్పింది. \p \v 4 కాబట్టి తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో పడుకున్నాడు. \v 5 బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది. \v 6 అప్పుడు రాహేలు, “దేవుడు నాకు శిక్షావిముక్తి చేశారు; నా మొర విని నాకు కుమారుని ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి దాను\f + \fr 30:6 \fr*\fq దాను \fq*\ft ఇక్కడ అర్థం \ft*\fqa ఆయన తీర్పు తీర్చారు\fqa*\f* అని పేరు పెట్టింది. \p \v 7 రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతియై యాకోబుకు మరో కుమారున్ని కన్నది. \v 8 అప్పుడు రాహేలు, “నేను అక్కతో గొప్ప పోరాటం చేశాను, నేను గెలిచాను” అని అన్నది. కాబట్టి అతనికి నఫ్తాలి\f + \fr 30:8 \fr*\fq నఫ్తాలి \fq*\ft అంటే \ft*\fqa నా \fqa*\fq పోరాటం\fq*\f* అని పేరు పెట్టింది. \p \v 9 లేయా పిల్లలు కనడం ఆగిపోయింది అని గ్రహించినప్పుడు, తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. \v 10 లేయా దాసి జిల్పా యాకోబుకు కుమారున్ని కన్నది. \v 11 అప్పుడు లేయా, “ఎంత భాగ్యం!”\f + \fr 30:11 \fr*\ft లేదా \ft*\fqa “ఒక దళం వస్తుంది!”\fqa*\f* అని అన్నది. కాబట్టి అతనికి గాదు\f + \fr 30:11 \fr*\fq గాదు \fq*\ft బహుశ అర్థం \ft*\fqa మంచి భాగ్యం \fqa*\ft లేదా \ft*\fqa దళము.\fqa*\f* అని పేరు పెట్టింది. \p \v 12 లేయా దాసి జిల్పా యాకోబుకు మరో కుమారున్ని కన్నది. \v 13 అప్పుడు లేయా అన్నది, “నాకు ఎంత సంతోషం! స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు.” కాబట్టి అతనికి ఆషేరు\f + \fr 30:13 \fr*\fq ఆషేరు \fq*\ft అంటే \ft*\fqa సంతోషం\fqa*\f* అని పేరు పెట్టింది. \p \v 14 గోధుమ కోతకాలంలో రూబేను పొలాలకు వెళ్లాడు, అక్కడ ఉన్న పుత్రదాత వృక్షం పండ్లు కొన్ని తెచ్చి, తల్లి లేయాకు ఇచ్చాడు. రాహేలు లేయాతో, “నీ కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్ని నాకు దయచేసి ఇవ్వు” అని అడిగింది. \p \v 15 అయితే లేయా ఆమెతో, “నా భర్తను నీవు తీసుకున్నావు, అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన పండ్లు కూడా కావాలా?” అని అన్నది. \p రాహేలు, “సరే, నీ కుమారుడు తెచ్చిన పండ్ల కోసం ఈ రోజు నీతో అతడు పడుకోవచ్చు” అని అన్నది. \p \v 16 సాయంత్రం యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు, లేయా అతన్ని కలవడానికి వెళ్లింది. “నీవు నాతో పడుకోవాలి, నీకోసం నా కుమారుని పండ్లను ఇచ్చాను” అని అతనితో అన్నది. కాబట్టి ఆ రాత్రి అతడు ఆమెతో పడుకున్నాడు. \p \v 17 దేవుడు లేయా మనవి విన్నారు, ఆమె గర్భవతియై అయిదవ కుమారున్ని కన్నది. \v 18 అప్పుడు లేయా, “నా భర్తకు నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి ఇశ్శాఖారు\f + \fr 30:18 \fr*\fq ఇశ్శాఖారు \fq*\ft హెబ్రీ పదంలా ఉంది \ft*\fq ప్రతిఫలం\fq*\f* అని పేరు పెట్టింది. \p \v 19 ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది. \v 20 అప్పుడు లేయా, “దేవుడు నాకు ప్రశస్తమైన బహుమానం ఇచ్చారు. ఆరుగురు కుమారులను కన్నాను కాబట్టి నా భర్త నన్ను ఘనపరుస్తాడు” అని అన్నది. కాబట్టి అతనికి జెబూలూను\f + \fr 30:20 \fr*\ft జెబూలూను \ft*\ft బహుశ అర్థం \ft*\fqa ఘనత\fqa*\f* అని పేరు పెట్టింది. \p \v 21 కొంతకాలం తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు దీనా అని పేరు పెట్టింది. \p \v 22 తర్వాత దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నారు; ఆయన ఆమె మనవి విన్నారు, ఆమెకు పిల్లలు పుట్టేలా చేశారు. \v 23 ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “దేవుడు నా నిందను తొలగించారు” అని అన్నది. \v 24 ఆమె అతనికి యోసేపు\f + \fr 30:24 \fr*\fq యోసేపు \fq*\ft అంటే \ft*\fqa ఆయన మరలా ఇచ్చును గాక\fqa*\f* అని పేరు పెట్టి, “యెహోవా నాకు ఇంకొక కుమారుని కూడా ఇచ్చును గాక” అని అన్నది. \s1 యాకోబు మందలు అధికమగుట \p \v 25 రాహేలు యోసేపుకు జన్మనిచ్చిన తర్వాత, యాకోబు లాబానుతో, “నేను నా స్వదేశానికి వెళ్తాను, నన్ను పంపించు. \v 26 నా భార్యలను, పిల్లలను నాతో పంపించు. వారి కోసమే నేను నీకు సేవ చేశాను, ఇక నేను వెళ్తాను. నేను ఎంతగా నీకోసం పని చేశానో నీకు తెలుసు” అని అన్నాడు. \p \v 27 అయితే లాబాను, “నీకు నాపై దయ ఉంటే, దయచేసి ఉండు. నిన్ను బట్టి యెహోవా నన్ను దీవించారని నేను భవిష్యవాణి ద్వార తెలుసుకున్నాను. \v 28 నీకెంత జీతం కావాలో అడుగు, ఇస్తాను” అని అన్నాడు. \p \v 29 యాకోబు అతనితో, “నీకోసం ఎంత పని చేశానో, నా ఆధీనంలో నీ మంద ఎంత ఎదిగిందో నీకు తెలుసు. \v 30 నేను రాకముందు నీకున్న కొంచెం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినది, నేను ఏ చోట ఉన్నా యెహోవా నిన్ను దీవించారు. అయితే, నా సొంత ఇంటివారి కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి?” అని అన్నాడు. \p \v 31 లాబాను, “నీకు ఏమివ్వాలి?” అని అడిగాడు. \p అందుకు యాకోబు, “నాకు ఈ ఒక్కటి చేస్తే చాలు వేరే ఏమి అక్కర్లేదు. నేను నీ మందను కాపాడుతూ మేపుతాను: \v 32 ఈ రోజు నేను నీ మందలన్నిటి మధ్య గుండా వెళ్లి పొడలు, మచ్చలు ఉన్న ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలలో నల్లవాటిని, మేకలలో మచ్చలు, పొడలు గలవాటిని వేరు చేస్తాను. వాటిని నాకు జీతంగా ఇవ్వు. \v 33 నీవు నాకు జీతంగా ఇచ్చిన వాటిని పరిశీలించడానికి వచ్చినప్పుడు నేను యథార్థంగా ఉన్నట్లు నీవు చూస్తావు. మచ్చలు, పొడలు లేని మేకలు లేదా నల్ల గొర్రెపిల్లలు నా దగ్గర ఉంటే, అవి నేను దొంగిలించాను అని గ్రహించ వచ్చు” అని అన్నాడు. \p \v 34 లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు. \v 35 ఆ రోజే లాబాను చారలు, మచ్చలు ఉన్న మేకపోతులన్నిటిని పొడలు, మచ్చలు ఉన్న ఆడ మేకలను (తెల్ల మచ్చలు ఉన్నవాటిని), గొర్రెపిల్లలలో నల్లవాటిని వేరుచేసి వాటిని తన కుమారులకు అప్పగించాడు. \v 36 అప్పుడు అతడు, తనకు యాకోబుకు మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపడం కొనసాగించాడు. \p \v 37 అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు. \v 38 తర్వాత అతడు మందలు నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టాలని ఒలిచిన కొమ్మలను వాటి ఎదురుగా ఉండేలా నీళ్లగాళ్లలో పెట్టాడు. మందలు వేడి మీద ఉన్నప్పుడు నీళ్లు త్రాగడానికి వచ్చాయి. \v 39 అక్కడ అవి ఆ కొమ్మల ముందు చూలు కట్టి చారలు, మచ్చలు, పొడలు ఉన్న పిల్లలను ఈనాయి. \v 40 యాకోబు మందలో చిన్నవాటిని వేరు చేశాడు, కానీ మిగితా వాటిని లాబాను మందలోని చారలు ఉన్నవాటి వైపు, నల్లనివాటివైపు వాటి ముఖాలు త్రిప్పి ఉంచాడు. ఇలా తన కోసం వేరే మందను చేసుకున్నాడు, వాటిని లాబాను మందలతో కలపలేదు. \v 41 మందలలో బలమైన ఆడవి వేడి మీద ఉన్నప్పుడు, అవి కొమ్మల దగ్గర చూలు కట్టేలా యాకోబు ఆ కొమ్మలను వాటికి ఎదురుగా నీటి తొట్టిలో పెట్టేవాడు. \v 42 ఒకవేళ పశువులు బలహీనంగా ఉంటే, వాటిని అక్కడ పెట్టేవాడు కాదు. కాబట్టి బలహీనమైనవి లాబానుకు వెళ్లాయి, బలమైనవి యాకోబుకు వచ్చాయి. \v 43 ఈ విధంగా యాకోబు ఎంతో అభివృద్ధి చెందాడు, గొప్ప మందలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను సొంతం చేసుకున్నాడు. \c 31 \s1 యాకోబు లాబాను దగ్గర నుండి పారిపోతాడు \p \v 1 లాబాను కుమారులు, “యాకోబు మన తండ్రికి ఉన్న ఆస్తి అంతా తీసుకున్నాడు; అతడు సంపాదించుకున్న ఆస్తి అంతా మన తండ్రికి సంబంధించినదే” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు. \v 2 లాబాను వైఖరి తన పట్ల ముందు ఉన్నట్లు లేదు అని యాకోబు గ్రహించాడు. \p \v 3 అప్పుడు యెహోవా యాకోబుతో, “నీ పూర్వికుల దేశానికి నీ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లు, నేను నీతో ఉంటాను” అని చెప్పారు. \p \v 4 యాకోబు తన మందలు ఉన్న పొలం దగ్గరకు రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు. \v 5 వారితో అన్నాడు, “మీ తండ్రి వైఖరి నా పట్ల ముందులా లేదని నేను గమనించాను, కానీ నా తండ్రి యొక్క దేవుడు నాతో ఉన్నారు. \v 6 నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు, \v 7 అయినాసరే మీ తండ్రి నా జీతం పదిసార్లు మార్చి నన్ను మోసగించాడు. కానీ అతడు నాకు హాని చేయడాన్ని దేవుడు అనుమతించలేదు. \v 8 ఒకవేళ అతడు, ‘పొడలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, మందలన్నీ పొడలు గల పిల్లలనే ఈనాయి; ‘చారలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలనే ఈనాయి. \v 9 ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు. \p \v 10 “మందలు చూలు కట్టే కాలంలో నాకొక కల వచ్చింది, అందులో మందతో వెళ్లిన మేకపోతులు చారలు, పొడలు లేదా మచ్చలతో ఉండడం నేను చూశాను. \v 11 కలలో దేవదూత నాతో, ‘యాకోబు’ అని పిలిచాడు. ‘చిత్తం, నేను ఉన్నాను’ అని జవాబిచ్చాను. \v 12 అతడు నాతో, ‘కళ్ళెత్తి చూడు, మందతో కూడుకుంటున్న మేకపోతులు పొడలు, మచ్చలు లేదా చారలతో ఉన్నాయి, ఎందుకంటే లాబాను నీకు చేసిందంతా నేను చూశాను. \v 13 నీవు ఎక్కడైతే ఒక స్తంభాన్ని అభిషేకించి నాకు మ్రొక్కుబడి చేసుకున్నావో ఆ బేతేలు యొక్క దేవున్ని నేనే. ఇప్పుడు లేచి ఈ దేశాన్ని విడిచి నీ స్వదేశానికి వెళ్లు’ అని అన్నారు.” \p \v 14 అప్పుడు రాహేలు, లేయా జవాబిస్తూ, “మా తండ్రి స్వాస్థ్యంలో మాకు ఇంకా ఏమైనా పాలుపంపులు ఉన్నాయా? \v 15 అతడు మమ్మల్ని విదేశీయులుగా చూడట్లేదా? మమ్మల్ని అమ్మివేయడమే కాక, మాకు రావలసింది అతనే వాడుకున్నాడు. \v 16 దేవుడు మా తండ్రి దగ్గర తీసివేసిన ఆస్తి ఖచ్చితంగా మనకు మన పిల్లలకు చెందినది. కాబట్టి దేవుడు నీకేమి చెప్తే అది చేయి” అని అన్నారు. \p \v 17 కాబట్టి యాకోబు తన పిల్లలను భార్యలను ఒంటెలపై ఎక్కించి, \v 18 తన ముందు పశువులను పంపుతూ, తాను పద్దనరాములో\f + \fr 31:18 \fr*\ft అంటే, వాయువ్య మెసొపొటేమియా\ft*\f* సంపాదించుకున్న అన్నిటితో కలిసి, కనాను దేశంలో ఉన్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు బయలుదేరాడు. \p \v 19 లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించే పనిమీద వెళ్లినప్పుడు, రాహేలు తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించింది. \v 20 అంతేకాక తాను పారిపోతున్నాడని సిరియావాడైన లాబానుకు చెప్పకుండా యాకోబు మోసం చేశాడు. \v 21 తన యావదాస్తితో పారిపోయాడు, యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండసీమ వైపు వెళ్లాడు. \s1 లాబాను యాకోబును వెంటాడుట \p \v 22 మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది. \v 23 లాబాను తన బంధువులను తీసుకుని, యాకోబును ఏడు రోజులు వెంటాడి గిలాదు కొండ సీమలో అతన్ని ఎదుర్కొన్నాడు. \v 24 రాత్రి దేవుడు కలలో సిరియావాడైన లాబానుకు ప్రత్యక్షమై, “నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త” అని హెచ్చరించారు. \p \v 25 లాబాను యాకోబును ఎదుర్కొన్నప్పుడు యాకోబు గిలాదు కొండ సీమలో తన గుడారం వేసుకున్నాడు, లాబాను అతని బంధువులు కూడా అక్కడే మకాం వేశారు. \v 26 అప్పుడు లాబాను యాకోబుతో అన్నాడు, “నీవు చేసింది ఏంటి? నన్ను మోసం చేసి, నా కుమార్తెలను యుద్ధంలో చెరగా తీసుకెళ్లావు. \v 27 నీవెందుకు రహస్యంగా పారిపోయి, నన్ను మోసం చేశావు? మృదంగ సితారాల సంగీతంతో నిన్ను ఆనందంగా పంపేవాన్ని కదా, నాకెందుకు చెప్పలేదు? \v 28 నేను నా మనవళ్లకు ముద్దుపెట్టనివ్వలేదు, నా కుమార్తెలను సాగనంపనివ్వలేదు. నీవు బుద్ధిలేని పని చేశావు. \v 29 నీకు హాని చేసే సత్తా నాకు ఉంది; కానీ గత రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు, ‘నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త’ అని నన్ను హెచ్చరించారు. \v 30 సరే, నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాలన్న ఆశతో నీవు బయలుదేరావు. కానీ నా దేవతలను ఎందుకు దొంగిలించావు?” \p \v 31 యాకోబు లాబానుకు జవాబిస్తూ, “నేను భయపడ్డాను, ఎందుకంటే నీవు నీ కుమార్తెలను బలవంతంగా నా నుండి తీసుకెళ్తావని అనుకున్నాను. \v 32 అయితే ఒకవేళ ఎవరి దగ్గర నీ దేవతల విగ్రహాలు దొరికితే, వారు బ్రతకరు. నీదేదైనా నా దగ్గర ఉన్నదేమో నీ బంధువుల సమక్షంలో వెదుక్కో; ఒకవేళ ఉంటే, తీసుకెళ్లు” అని అన్నాడు. అయితే రాహేలు ఆ దేవతల విగ్రహాలను దొంగిలించిందని యాకోబుకు తెలియదు. \p \v 33 లాబాను వెదకడానికి యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీల గుడారాల్లోకి వెళ్లి చూశాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు. లేయా గుడారం నుండి బయటకు వచ్చి రాహేలు గుడారంలోకి వెళ్లాడు. \v 34 రాహేలు ఆ గృహదేవతల విగ్రహాలను ఒంటె సామాగ్రిలో దాచిపెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికాడు కానీ అతనికి ఏమి దొరకలేదు. \p \v 35 రాహేలు తన తండ్రితో, “నా ప్రభువా! నాపై కోప్పడకండి, నేను మీ ఎదుట లేవలేను, నేను నెలసరిలో ఉన్నాను” అని చెప్పింది. కాబట్టి లాబాను వెదకినా అతనికి తన గృహదేవతల విగ్రహాలు దొరకలేదు. \p \v 36 యాకోబు కోపంతో లాబానుతో వాదన పెట్టుకున్నాడు. “నా నేరమేంటి? నేను ఏం పాపం చేశానని నన్నిలా తరుముతున్నావు? \v 37 నా సామానంతా వెదికావు కదా, నీ ఇంటికి సంబంధించింది నీకు ఏమి దొరికింది? నీ బంధువుల ఎదుట, మా వారి ఎదుట ఉంచు, వారు మన మధ్యలో తీర్పు తీర్చనివ్వు. \p \v 38 “ఇరవై సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలకు, మేకలకు గర్భస్రావం కలుగలేదు లేదా నీ మందలోని పొట్టేళ్లను నేనేమి తినలేదు. \v 39 అడవి మృగాలు ద్వార చీల్చబడిన జంతువులను నీ దగ్గరకు తేలేదు; ఆ నష్టం నేనే భరించాను. పగలైనా, రాత్రైనా దొంగిలించబడిన దానికి నీవు నన్ను నష్టపరిహారం అడిగావు. \v 40 నా పరిస్థితి ఇది: పగలు ఎండ రాత్రి చలి నన్ను క్షీణింపజేశాయి, నిద్ర నా కళ్ళకు దూరమైంది. \v 41 నీ ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నీ ఇద్దరు కుమార్తెల కోసం పద్నాలుగు సంవత్సరాలు, నీ మంద కోసం ఆరు సంవత్సరాలు పని చేశాను, అయితే నీవు పదిసార్లు నా జీతం మార్చావు. \v 42 ఒకవేళ నా తండ్రి యొక్క దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడుగా లేకపోతే, నీవు నన్ను ఖచ్చితంగా ఖాళీ చేతులతో పంపియుండేవాడివి. కానీ దేవుడు నా ప్రయాసను, నా చేతి కష్టాన్ని చూశారు, గత రాత్రి నిన్ను గద్దించారు.” \p \v 43 లాబాను యాకోబుతో, “ఈ స్త్రీలు నా కుమార్తెలు, పిల్లలు నా పిల్లలు, మందలు నా మందలు. అయినా ఇప్పుడు ఈ నా కుమార్తెల గురించి, లేదా వారు కన్న పిల్లల గురించి నేనేమి చేయగలను? \v 44 ఇప్పుడు రా, మనం నిబంధన చేసుకుందాము. అది మనిద్దరి మధ్య సాక్ష్యంగా ఉంటుంది” అని అన్నాడు. \p \v 45 కాబట్టి యాకోబు ఒక రాయిని తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టాడు. \v 46 అతడు తన బంధువులతో, “కొన్ని రాళ్లు పోగు చేయండి” అని అన్నాడు. వారు రాళ్లు తెచ్చి కుప్పగా పోశారు, ఆ రాళ్లకుప్ప దగ్గర వారు భోజనం చేశారు. \v 47 లాబాను దానికి యెగర్ శాహదూతా అని పేరు పెట్టాడు, యాకోబు దానికి గలీదు\f + \fr 31:47 \fr*\ft అరామిక్ భాషలో \ft*\fq యెగర్ శాహదూతా \fq*\ft హెబ్రీ భాషలో \ft*\fq గలీదు \fq*\ft రెండింటి అర్థం \ft*\fqa సాక్షి కుప్ప\fqa*\ft ; \+xt 31:48\+xt* \ft*\ft లో కూడా ఉంది\ft*\f* అని పేరు పెట్టాడు. \p \v 48 లాబాను, “ఈ రోజున ఈ రాళ్ల గుట్ట నీకు, నాకు మధ్య సాక్షి” అన్నాడు. అందుకే అది గలీదు అని పిలువబడింది. \v 49 ఈ స్థలం మిస్పా\f + \fr 31:49 \fr*\ft అంటే \ft*\fqa కావలికోట\fqa*\f* అని కూడా పిలువబడేది, ఎందుకంటే అతడు అన్నాడు, “మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నప్పుడు యెహోవా నాకు నీకు మధ్య జరిగేది గమనించును గాక. \v 50 నీవు నా కుమార్తెలను బాధ పెడితే లేదా నా కుమార్తెలు ఉన్నా వేరే స్త్రీలను భార్యలుగా చేసుకుంటే, మనతో ఎవరు లేకపోయినా, మన మధ్యలో సాక్షిగా దేవుడు ఉన్నారని గుర్తుంచుకో.” \p \v 51 లాబాను ఇంకా యాకోబుతో, “ఇదిగో రాళ్లకుప్ప, ఇదిగో నీకు నాకు మధ్య నిలబెట్టబడి ఉన్న ఈ రాతి స్తంభము. \v 52 ఈ రాళ్లకుప్ప సాక్షి, ఈ స్తంభం సాక్షి, నీకు హాని చేయడానికి ఈ రాళ్లకుప్ప, స్తంభం దాటి నేను రాను, నాకు హాని చేయడానికి ఈ రాళ్లకుప్ప, స్తంభం దాటి నీవు రావద్దు. \v 53 అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చును గాక” అని అన్నాడు. \p కాబట్టి యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడే దేవుని నామంలో ప్రమాణం చేశాడు. \v 54 అతడు ఆ కొండమీద బలి అర్పించి, బంధువులను భోజనానికి పిలిచాడు. వారు భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి అక్కడే గడిపారు. \p \v 55 మర్నాడు వేకువజామున లాబాను మనవళ్లను, అతని కుమార్తెలను ముద్దు పెట్టుకుని దీవించాడు. తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. \c 32 \s1 యాకోబు ఏశావును కలవడానికి సిద్ధపడుట \p \v 1 యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు. \v 2 యాకోబు వారిని చూసి, “ఇది దేవుని సేన!” అని ఆ స్థలానికి మహనయీము\f + \fr 32:2 \fr*\fq మహనయీము \fq*\ft అంటే \ft*\fqa రెండు సేనలు\fqa*\f* అని పెట్టారు. \p \v 3 యాకోబు ఎదోము దేశంలోని శేయీరు ప్రాంతంలో ఉన్న తన సోదరుడైన ఏశావు దగ్గరకు తనకంటే ముందు దూతలను పంపాడు. \v 4 ఆయన వారికి ఇలా సూచించాడు: “నా ప్రభువైన ఏశావుతో మీరు ఇలా చెప్పాలి: ‘మీ సేవకుడైన యాకోబు చెప్తున్నాడు, ఇంతవరకు నేను లాబాను దగ్గరే ఉన్నాను. \v 5 నాకు మందలు గాడిదలు గొర్రెలు మేకలు, దాసదాసీలు ఉన్నారు. నీ దృష్టిలో దయ పొందడానికి ఇప్పుడు నా ప్రభువుకు ఈ వర్తమానం పంపుతున్నాను.’ ” \p \v 6 ఆ దూతలు యాకోబు దగ్గరకు తిరిగివచ్చి, “నీ సోదరుడు ఏశావు దగ్గరకు వెళ్లాం, ఇప్పుడు అతడు నిన్ను కలవడానికి వస్తున్నాడు, అతనితో నాలుగువందలమంది మనుష్యులు ఉన్నారు” అని అన్నారు. \p \v 7 ఎంతో భయంతో, బాధతో యాకోబు తనతో ఉన్న ప్రజలను, తన మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. \v 8 “ఒకవేళ ఏశావు ఒక గుంపు మీద దాడి చేస్తే, ఇంకొక గుంపు తప్పించుకోవచ్చు” అని అతడు అనుకున్నాడు. \p \v 9 తర్వాత యాకోబు ప్రార్థిస్తూ, “నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, ‘నీ దేశానికి, నీ బంధువుల దగ్గరకు వెళ్లు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా, \v 10 మీరు మీ సేవకునికి చూపిన దయ నమ్మకత్వానికి నేను యోగ్యుడను కాను. నేను యొర్దాను దాటినప్పుడు, నా దగ్గర చేతికర్ర మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు నేను రెండు గుంపులుగా అయ్యాను. \v 11 దేవా, నా సోదరుడు ఏశావు చేతిలో పడకుండ నన్ను తప్పించు, ఎందుకంటే అతడు వచ్చి నన్ను, నా పిల్లలను వారి తల్లులతో పాటు చంపేస్తాడని నాకు భయమేస్తుంది. \v 12 కానీ మీరు, ‘నేను ఖచ్చితంగా నిన్ను వృద్ధి చేసి నీ సంతానాన్ని లెక్కించబడలేని సముద్రపు ఇసుక రేణువుల్లా చేస్తాను’ అని అన్నారు” అని ప్రార్థన చేశాడు. \p \v 13 ఆ రాత్రి యాకోబు అక్కడే గడిపి తన దగ్గర ఉన్న దాంట్లో నుండి తన అన్నయైన ఏశావుకు కానుక ఇవ్వడానికి పెట్టినవి: \v 14 రెండువందల మేకలు, ఇరవై మేకపోతులు, రెండువందల గొర్రెలు, ఇరవై పొట్టేళ్లు, \v 15 ముప్పై పాడి ఒంటెలు వాటి పిల్లలు, నలభై ఆవులు, పది ఎద్దులు, ఇరవై ఆడగాడిదలు, పది మగ గాడిదలు. \v 16 వాటిని మందలు మందలుగా విభజించి, తన సేవకులకు అప్పగించి, తన సేవకులతో, “మంద మందకు నడుమ ఖాళీ ఉంచి, నాకంటే ముందుగా వెళ్లండి” అని అన్నాడు. \p \v 17 వారిలో మొదట నిలబడి ఉన్నవాన్ని ఇలా హెచ్చరించాడు: “నా సోదరుడు ఏశావు మీకు ఎదురై, ‘నీవు ఎవరి సంబంధివి, నీవు ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందు ఉన్న ఈ జంతువులన్నీ ఎవరివి?’ అని అడిగితే, \v 18 అప్పుడు నీవు ఇలా చెప్పాలి, ‘ఇవి నీ సేవకుడైన యాకోబువి, నా ప్రభువైన ఏశావుకు కానుకగా పంపబడ్డాయి, అతడు వెనుక వస్తున్నాడు.’ ” \p \v 19 అతడు మందల వెంట వెళ్తున్న రెండవ వానికి, మూడవ వానికి, మిగతా అందరికి అలాగే సూచించాడు: “మీరు ఏశావును కలిసినప్పుడు అతనితో ఇలాగే చెప్పాలి. \v 20 నీవు తప్పకుండ ఈ మాట చెప్పాలి, ‘నీ సేవకుడైన యాకోబు మా వెనుక వస్తున్నాడు.’ ” ఎందుకంటే అతడు, “నేను ముందుగా పంపుతున్న ఈ బహుమతులతో నేను అతన్ని శాంతింపజేస్తాను; తర్వాత, నేను అతన్ని చూసినప్పుడు, బహుశ అతడు నన్ను చేర్చుకుంటాడు” అని అనుకున్నాడు. \v 21 కాబట్టి యాకోబు బహుమతులు తనకు ముందుగా వెళ్లాయి, అయితే తాను మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే ఉన్నాడు. \s1 యాకోబు దేవునితో పెనుగులాడతాడు \p \v 22 ఆ రాత్రి యాకోబు లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను పదకొండుగురు పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటి వెళ్లాడు. \v 23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. \v 24 యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లవారే వరకు ఒక మనుష్యుడు అతనితో పెనుగులాడాడు. \v 25 అతన్ని గెలవలేనని ఆ మనుష్యుడు గ్రహించి, యాకోబు తొడగూటి మీద కొట్టాడు. ఆ మనుష్యునితో పోరాడినందున యాకోబు తొడగూడు సడలింది. \v 26 అప్పుడు అతడు, “నన్ను వెళ్లనివ్వు, తెల్లవారింది” అన్నాడు. \p కానీ యాకోబు, “నన్ను దీవిస్తేనే గాని, నిన్ను వెళ్లనివ్వను” అన్నాడు. \p \v 27 అప్పుడు ఆ మనుష్యుడు, “నీ పేరేంటి?” అని అడిగాడు. \p అందుకతడు, “యాకోబు” అని జవాబిచ్చాడు. \p \v 28 అప్పుడు ఆ మనుష్యుడు, “ఇకమీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు,\f + \fr 32:28 \fr*\fq ఇశ్రాయేలు \fq*\ft బహుశ అర్థం \ft*\fqa అతడు దేవునితో పోరాడతాడు\fqa*\f* ఎందుకంటే నీవు దేవునితో, మనుష్యులతో పోరాడి గెలిచావు” అని అన్నాడు. \p \v 29 యాకోబు అన్నాడు, “దయచేసి నీ పేరు నాకు చెప్పు.” \p కానీ అతడు అన్నాడు, “నా పేరు ఎందుకు అడుగుతున్నావు?” తర్వాత అతడు అక్కడ యాకోబును ఆశీర్వదించాడు. \p \v 30 యాకోబు ఆ స్థలానికి పెనీయేలు\f + \fr 32:30 \fr*\fq పెనీయేలు \fq*\ft అంటే \ft*\fqa దేవుని ముఖం\fqa*\f* అని పేరు పెట్టి, “నేను దేవున్ని ముఖాముఖిగా చూశాను, అయినా నా ప్రాణం దక్కింది” అని అన్నాడు. \p \v 31 యాకోబు పెనీయేలు\f + \fr 32:31 \fr*\ft హెబ్రీలో \ft*\fqa పెనూయేలు \fqa*\ft అంటే \ft*\fq పెనీయేలు\fq*\f* నుండి వెళ్లే సమయంలో సూర్యోదయం అయ్యింది, అతడు తొడకుంటుతూ నడిచాడు. \v 32 కాబట్టి యాకోబు తొడగూటి మీది తుంటినరం మీద దెబ్బ తిన్నాడు కాబట్టి, ఇశ్రాయేలీయులు నేటి వరకు తొడగూటి మీద ఉన్న తుంటినరం తినరు. \c 33 \s1 యాకోబు ఏశావును కలుస్తాడు \p \v 1 యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు, ఏశావు తన నాలుగువందలమంది మనుష్యులతో వస్తూ కనిపించాడు; కాబట్టి అతడు పిల్లలను లేయాకు రాహేలుకు ఇద్దరు దాసీలకు పంచి అప్పగించాడు. \v 2 అతడు దాసీలు, వారి పిల్లలను ముందు ఉంచి, తర్వాత లేయా తన పిల్లలను, చివరిగా రాహేలును, యోసేపును ఉంచాడు. \v 3 అతడు అందరికంటే ముందు వెళ్తూ, తన సోదరున్ని సమీపించే వరకు ఏడుసార్లు సాష్టాంగపడ్డాడు. \p \v 4 అయితే ఏశావు యాకోబును కలవడానికి పరుగెత్తి వెళ్లి అతన్ని హత్తుకున్నాడు; తన చేతులు అతని మెడ మీద వేసి ముద్దు పెట్టుకున్నాడు. వారు ఏడ్చారు. \v 5 ఏశావు కళ్ళెత్తి స్త్రీలను, పిల్లలను చూశాడు. “నీతో ఉన్న వీరెవరు?” అని అడిగాడు. \p యాకోబు, “వీరు నీ సేవకునికి దేవుడు దయతో ఇచ్చిన పిల్లలు” అని జవాబిచ్చాడు. \p \v 6 అప్పుడు ఆ దాసీలు, వారి పిల్లలు వచ్చి అతనికి నమస్కారం చేశారు. \v 7 తర్వాత లేయా, ఆమె పిల్లలు వచ్చి నమస్కరించారు. చివరికి యోసేపు, రాహేలు కూడా వచ్చి నమస్కరించారు. \p \v 8 ఏశావు, “ఈ మందలు, పశువులన్నీ నాకు ఎందుకు?” అని అడిగాడు. \p “నా ప్రభువా, నీ దృష్టిలో దయ పొందడానికి” అని యాకోబు అన్నాడు. \p \v 9 అయితే ఏశావు, “నా తమ్ముడా, నాకిప్పటికే సమృద్ధిగా ఉంది. నీది నీవే ఉంచుకో” అని అన్నాడు. \p \v 10 యాకోబు ఇలా అన్నాడు, “దయచేసి, వద్దు! నీ దృష్టిలో నేను దయ పొందితే, ఈ బహుమానం అంగీకరించాలి. నిన్ను చూస్తే దేవుని ముఖం చూసినట్టే ఉంది, దయతో నీవు నన్ను చేర్చుకున్నావు. \v 11 దయచేసి నేను తెచ్చిన ఈ కానుకను స్వీకరించు, ఎందుకంటే దేవుడు నన్ను కనికరించారు, నాకు అవసరమైనది నా దగ్గర ఉన్నది.” యాకోబు పట్టుబట్టడంతో ఏశావు దానిని స్వీకరించాడు. \p \v 12 అప్పుడు ఏశావు, “మనం వెళ్తూ ఉందాము; నేను మీతో వస్తాను” అని అన్నాడు. \p \v 13 కానీ యాకోబు అతనితో, “నా దగ్గర ఉన్నవి పసిపిల్లలు, గొర్రెలు, మేకలు వాటికి పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వీటిని త్వరపెట్టి తోలితే, పశువులన్నీ చస్తాయి. \v 14 కాబట్టి నా ప్రభువు తన సేవకునికి ముందుగా వెళ్లాలి. నేను శేయీరులో ఉన్న నా ప్రభువు దగ్గరకు వచ్చేవరకు, నా ముందున్న గొర్రెల మందలు పశువుల మందలు, అలాగే ఈ పసిపిల్లలు నడువగలిగిన దానిని బట్టి వాటిని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకువస్తాను” అని అన్నాడు. \p \v 15 అందుకు ఏశావు, “అలాగైతే నా మనుష్యుల్లో కొందరిని మీతో ఉంచుతాను” అని అన్నాడు. \p “అలా ఎందుకు? నా ప్రభువు దృష్టిలో దయ ఉంటే చాలు” అని యాకోబు అన్నాడు. \p \v 16 కాబట్టి ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం చేశాడు. \v 17 అయితే యాకోబు మాత్రం సుక్కోతుకు వెళ్లాడు, అక్కడ తన కోసం ఒక ఇల్లు కట్టించుకుని, పశువులకు పాకలు వేశాడు. అందుకే ఆ స్థలం సుక్కోతు\f + \fr 33:17 \fr*\fq సుక్కోతు \fq*\ft అంటే \ft*\fqa ఆశ్రయాలు\fqa*\f* అని పిలువబడింది. \p \v 18 యాకోబు పద్దనరాము నుండి వచ్చి, క్షేమంగా కనానులో ఉన్న షెకెము పట్టణానికి చేరాడు, ఆ పట్టణం ఎదురుగా గుడారం వేసుకున్నాడు. \v 19 తాను గుడారం వేసుకున్న స్థలాన్ని షెకెము తండ్రియైన హమోరు కుమారుల దగ్గర వంద వెండి నాణేలకు\f + \fr 33:19 \fr*\ft హెబ్రీలో \ft*\fqa కెశితా\fqa*\ft ; దీని ప్రస్తుత విలువ తెలియదు\ft*\f* కొన్నాడు. \v 20 అక్కడ అతడు బలిపీఠం కట్టాడు, ఆ స్థలానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేలు\f + \fr 33:20 \fr*\fq ఎల్ ఎలోహి ఇశ్రాయేలు \fq*\ft అంటే అర్థం \ft*\fqa ఎల్ ఇశ్రాయేలు దేవుడు \fqa*\ft లేదా \ft*\fqa ఇశ్రాయేలు దేవుడు శక్తిమంతుడు.\fqa*\f* అని పేరు పెట్టాడు. \c 34 \s1 దీనా, షెకెమీయులు \p \v 1 యాకోబు లేయాలకు పుట్టిన కుమార్తెయైన దీనా ఆ దేశంలోని యువతులను దర్శించడానికి వెళ్లింది. \v 2 ఆ ప్రాంత పాలకుడు, హివ్వీయుడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూశాడు, ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. \v 3 అతడు యాకోబు కుమార్తె దీనాపై మనస్సు పడ్డాడు; ఆ యువతిని అతడు ప్రేమించాడు, ఆమెతో ప్రేమగా మాట్లాడాడు. \v 4 షెకెము తన తండ్రి హమోరుతో, “ఈ అమ్మాయిని నాకు భార్యగా చేయండి” అని అన్నాడు. \p \v 5 యాకోబు తన కుమార్తెయైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది అని విన్నప్పుడు, అతని కుమారులు తన మందతో పొలంలో ఉన్నారు; కాబట్టి వారు ఇంటికి వచ్చేవరకు అతడు ఏమి చేయలేదు. \p \v 6 అప్పుడు షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు. \v 7 ఇంతలో యాకోబు కుమారులు జరిగిన సంగతి విన్న వెంటనే పొలాల నుండి వచ్చేశారు. ఇశ్రాయేలులో జరగకూడని దారుణమైన సంఘటన, యాకోబు కుమార్తెను షెకెము బలత్కారం చేశాడని వారు ఆశ్చర్యానికి గురై ఆగ్రహంతో ఉన్నారు. \p \v 8 కానీ హమోరు వారితో, “నా కుమారుడు షెకెము మీ కుమార్తె మీద మనస్సు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికి భార్యగా ఇవ్వండి. \v 9 మనం వియ్యమందుకుందాం; మీ కుమార్తెలను మాకు, మా కుమార్తెలను మీకు ఇచ్చి పుచ్చుకుందాము. \v 10 మీరు మాతో నివసించవచ్చు, ఈ దేశం మీ ఎదుట ఉంది. ఇక్కడ ఉండండి, వ్యాపారం\f + \fr 34:10 \fr*\ft లేదా \ft*\fqa స్వేచ్ఛగా తిరగవచ్చు\fqa*\ft ; \+xt ఆది 34:21\+xt*\ft*\f* చేయండి, ఆస్తి సంపాదించండి” అని అన్నాడు. \p \v 11 తర్వాత షెకెము దీనా తండ్రితో, సోదరులతో, “మీ దృష్టిలో నేను దయ పొందితే మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. \v 12 వధువు కట్నం, నేను తెచ్చే బహుమానం ఎంతైనా సరే, మీరు అడిగింది నేను ఇస్తాను. యువతిని మాత్రం నాకు భార్యగా ఇవ్వండి” అని అడిగాడు. \p \v 13 వారి సోదరియైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది కాబట్టి యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రి హమోరుతో మోసపూరితంగా జవాబిచ్చారు. \v 14 వారు అన్నారు, “అలా మేము చేయలేము; సున్నతిలేని మనుష్యునికి మా సోదరిని ఇవ్వలేము. మాకది అవమానము. \v 15 ఒక షరతుతో మాత్రమే మీతో ఒప్పందం లోనికి వస్తాం; మీ మగవారందరు సున్నతి చేసుకుని మాలాగా మారాలి. \v 16 అప్పుడు మా కుమార్తెలను మీకు ఇస్తాము, మీ కుమార్తెలను మేము తీసుకుని మీతో నివసిస్తాం, మీతో ఒకే ప్రజలుగా అవుతాము. \v 17 మీరు సున్నతి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే, మా సోదరిని తీసుకుని వెళ్లిపోతాము.” \p \v 18 వారి ప్రతిపాదన హమోరుకు అతని కుమారుడైన షెకెముకు నచ్చింది. \v 19 ఆ యువకుడు, తన తండ్రి ఇంటి అంతటిలో ఘనత పొందినవాడు, యాకోబు కుమార్తె దీనాను ఎంతో కోరుకున్నాడు కాబట్టి వారు చెప్పింది చేయడానికి ఆలస్యం చేయలేదు. \v 20 కాబట్టి హమోరు అతని కుమారుడు షెకెము వారి పట్టణ నాయకులతో మాట్లాడడానికి పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లారు. \v 21 “ఈ మనుష్యులు మనతో స్నేహంగా ఉంటున్నారు” అని వారు అన్నారు. “వారిని మన దేశంలో నివసిస్తూ, వ్యాపారం చేయనిద్దాం; దేశంలో వారి కోసం చాల స్థలం ఉంది. మనం వారి కుమార్తెలను పెళ్ళి చేసుకుందాం, వారు మన వారిని చేసుకుంటారు. \v 22 అయితే వారు మనతో నివసిస్తూ, మనతో ఒకే ప్రజలుగా ఉండాలంటే మన మగవారందరు వారిలా సున్నతి చేసుకోవాలని ఒక షరతు పెట్టారు. \v 23 వారి పశువులు, వారి ఆస్తులు, వారి జంతువులన్నీ మనవి అవుతాయి కదా! కాబట్టి వారి షరతులు ఒప్పుకుందాము, వారు మన మధ్య స్థిరపడతారు.” \p \v 24 పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లిన మనుష్యులందరు హమోరు, అతని కుమారుడైన షెకెముతో ఏకీభవించారు, పట్టణంలో ప్రతి మగవాడు సున్నతి పొందాడు. \p \v 25 మూడు రోజుల తర్వాత, వారు ఇంకా నొప్పితో ఉండగా, యాకోబు కుమారులలో ఇద్దరు, దీనా సోదరులు షిమ్యోను, లేవీ వారి ఖడ్గాలు తీసుకుని, క్షేమంగా ఉన్నాం అని దాడిని కూడా ఊహించని పట్టణం మీద దాడి చేసి, ప్రతి పురుషుని చంపేశారు. \v 26 వారు హమోరును, అతని కుమారుడైన షెకెమును ఖడ్గంతో చంపి, షెకెము ఇంటి నుండి దీనాను తీసుకెళ్లారు. \v 27 యాకోబు కుమారులు వారిని చంపి, తమ సోదరి అపవిత్రం చేయబడిన పట్టణాన్ని దోచుకున్నారు. \v 28 వారి మందలను, పశువులను, గాడిదలను, వారి పట్టణంలో, పొలాల్లో ఉన్న సమస్తాన్ని దోచుకున్నారు. \v 29 వారి ధనమంతటిని, వారి స్త్రీలనందరిని, పిల్లలందరిని తీసుకెళ్లి, వారి ఇండ్లలో ఉన్నదంతటిని దోచుకున్నారు. \p \v 30 అప్పుడు యాకోబు షిమ్యోను, లేవీతో అన్నాడు, “ఈ దేశంలో నివసించే కనానీయులు, పెరిజ్జీయులు నన్ను చెడ్డవానిగా చూసేలా ఈ కష్టం నా మీదికి తెచ్చారు. మేము కొద్ది మందిమి, ఒకవేళ వారు ఏకమై నా మీద దాడి చేస్తే, నేను నా ఇంటివారు నాశనమవుతాము.” \p \v 31 అయితే వారు, “మా సోదరి వేశ్యగా పరిగణించబడాలా?” అని జవాబిచ్చారు. \c 35 \s1 యాకోబు బేతేలుకు తిరిగి వెళ్లుట \p \v 1 దేవుడు యాకోబుతో, “నీవు లేచి, బేతేలుకు వెళ్లి, అక్కడ స్థిరపడు, నీవు నీ సోదరుడైన ఏశావు నుండి పారిపోతున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు” అని అన్నారు. \p \v 2 కాబట్టి యాకోబు తన ఇంటివారితో, తనతో ఉన్నవారందరితో అన్నాడు, “మీ దగ్గర ఉన్న ఇతర దేవతలను తీసివేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకోండి. \v 3 తర్వాత నాతో బేతేలుకు రండి, అక్కడ నా శ్రమ దినాన నాకు జవాబిచ్చిన దేవునికి బలిపీఠం కడతాను.” \v 4 కాబట్టి వారు తమ దగ్గర ఉన్న ఇతర దేవతలను, చెవి పోగులను యాకోబుకు ఇచ్చారు, యాకోబు వాటిని షెకెము ప్రాంతంలో ఒక సింధూర వృక్షం క్రింద పాతిపెట్టాడు. \v 5 తర్వాత వారు బయలుదేరారు. వారి చుట్టూ ఉన్న పట్టణాలకు దేవుని భయం పట్టుకుంది, కాబట్టి వారిని ఎవ్వరూ వెంటాడలేదు. \p \v 6 యాకోబు, అతనితో ఉన్న ప్రజలందరు కనాను దేశంలో ఉన్న లూజుకు (అంటే బేతేలుకు) వచ్చారు. \v 7 అక్కడా అతడు బలిపీఠం కట్టి ఆ స్థలానికి ఎల్ బేతేలు\f + \fr 35:7 \fr*\fq ఎల్ బేతేలు \fq*\ft అంటే \ft*\fqa బేతేలు దేవుడు.\fqa*\f* అని పేరు పెట్టాడు. యాకోబు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు ఇక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు. \p \v 8 ఆ తర్వాత రిబ్కా దాది, దెబోరా చనిపోయింది, బేతేలుకు దిగవ ఉన్న సింధూర వృక్షం క్రింద పాతిపెట్టబడింది. కాబట్టి ఆ వృక్షానికి అల్లోన్ బాకూత్\f + \fr 35:8 \fr*\fq బాకూత్ \fq*\ft అంటే \ft*\fqa ఏడ్చే సింధూరము.\fqa*\f* అని పేరు పెట్టారు. \p \v 9 యాకోబు పద్దనరాము నుండి తిరిగి వచ్చాక, దేవుడు అతనికి మరలా ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించారు. \v 10 దేవుడు అతనితో, “నీ పేరు యాకోబు, కానీ ఇక ఎన్నడు యాకోబుగా పిలువబడవు; నీ పేరు ఇశ్రాయేలు” అని అన్నారు. కాబట్టి ఆయన అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టారు. \p \v 11 దేవుడు అతనితో అన్నారు, “నేను సర్వశక్తుడగు దేవుడను; నీవు ఫలించి, సంఖ్యాపరంగా అభివృద్ధి పొందు. ఒక జనం, జనాంగాల సమాజం నీ నుండి వస్తాయి, నీ వారసులలో నుండి రాజులు వస్తారు. \v 12 అబ్రాహాముకు, ఇస్సాకుకు నేనిచ్చిన దేశాన్ని, నీకు కూడా ఇస్తాను. నీ తర్వాత నీ వారసులకు కూడా ఈ దేశాన్ని ఇస్తాను.” \v 13 తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి ఆరోహణమయ్యారు. \p \v 14 దేవుడు అతనితో మాట్లాడిన స్థలంలో, యాకోబు ఒక రాతి స్తంభాన్ని నిలబెట్టి, దాని మీద పానార్పణం కుమ్మరించాడు; నూనె కూడా దాని మీద పోశాడు. \v 15 యాకోబు, దేవుడు తనతో మాట్లాడిన ఆ స్థలాన్ని బేతేలు\f + \fr 35:15 \fr*\fq బేతేలు \fq*\ft అంటే \ft*\fqa దేవుని మందిరం\fqa*\f* అని పేరు పెట్టాడు. \s1 రాహేలు ఇస్సాకుల మరణాలు \p \v 16 తర్వాత బేతేలు నుండి వారు బయలుదేరి వెళ్లారు. ఎఫ్రాతాకు కొద్ది దూరంలో ఉన్నప్పుడు రాహేలుకు కాన్పు నొప్పులు మొదలయ్యాయి. \v 17 బిడ్డకు జన్మనివ్వడంలో చాల శ్రమపడింది. మంత్రసాని, “భయపడకమ్మా, నీవు ఇంకొక మగపిల్లవాన్ని కన్నావు” అని చెప్పింది. \v 18 రాహేలు చనిపోతూ తన కుమారునికి బెన్-ఓని\f + \fr 35:18 \fr*\fq బెన్-ఓని \fq*\ft అంటే \ft*\fqa ఇబ్బంది పుత్రుడు\fqa*\f* అని పేరు పెట్టింది. కానీ అతని తండ్రి అతనికి బెన్యామీను\f + \fr 35:18 \fr*\fq బెన్యామీను \fq*\ft అంటే \ft*\fqa కుడిచేతి పుత్రుడు\fqa*\f* అని పేరు పెట్టాడు. \p \v 19 కాబట్టి రాహేలు చనిపోయి, ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) మార్గంలో పాతిపెట్టబడింది. \v 20 యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలబెట్టాడు, అది ఈ రోజు వరకు రాహేలు సమాధిని సూచిస్తుంది. \p \v 21 ఇశ్రాయేలు మరలా ప్రయాణించి మిగ్దల్ ఏదెరు అవతల తన గుడారం వేసుకున్నాడు. \v 22 ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, రూబేను తన తండ్రి ఉంపుడుగత్తెయైన బిల్హాతో శయనించాడు, ఈ సంగతి ఇశ్రాయేలు విన్నాడు. \b \lh యాకోబు యొక్క పన్నెండుగురు కుమారులు: \b \li1 \v 23 లేయా కుమారులు: \li2 యాకోబు మొదటి కుమారుడు రూబేను, \li2 షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. \li1 \v 24 రాహేలు కుమారులు: \li2 యోసేపు, బెన్యామీను. \li1 \v 25 రాహేలు దాసి బిల్హా కుమారులు: \li2 దాను, నఫ్తాలి. \li1 \v 26 లేయా దాసి జిల్పా కుమారులు: \li2 గాదు, ఆషేరు. \b \lf వీరు పద్దనరాములో జన్మించిన యాకోబు కుమారులు. \b \p \v 27 యాకోబు కిర్యత్-అర్బా (అంటే, హెబ్రోను) దగ్గర ఉన్న మమ్రేలో తన తండ్రి దగ్గరకు వచ్చాడు, అబ్రాహాము, ఇస్సాకు అక్కడే నివసించారు. \v 28 ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు. \v 29 అతడు తన తుది శ్వాస విడిచి, చనిపోయి మంచి వృద్ధాప్యంలో తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. అతని కుమారులు, ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు. \c 36 \s1 ఏశావు వారసులు \p \v 1 ఇది ఏశావు అనగా ఎదోము కుటుంబ వంశావళి: \b \p \v 2 కనాను స్త్రీలలో నుండి ఏశావు తన భార్యలుగా చేసుకున్న వారు: హిత్తీయుడైన ఎలోను కుమార్తెయైన ఆదా, హివ్వీయుడైన సిబ్యోను మనవరాలు, అనా కుమార్తెయైన ఒహోలీబామా, \v 3 అలాగే నెబాయోతు సోదరి, ఇష్మాయేలు కుమార్తెయైన బాశెమతు. \p \v 4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. \v 5 ఒహోలీబామా యూషు, యాలాము, కోరహులను కన్నది. వీరంత కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు. \p \v 6 ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరిని, పశువులను, అన్ని జంతువులను, కనానులో సంపాదించుకున్న వస్తువులన్నిటిని తీసుకుని తన తమ్ముడికి దూరంగా ఉన్న దేశానికి వెళ్లాడు. \v 7 వారి ఆస్తులు వారు కలిసి ఉండలేనంత గొప్పగా ఉన్నాయి; వారికున్న పశువులను బట్టి వారున్న స్థలం వారికి సరిపోలేదు. \v 8 కాబట్టి ఏశావు అనగా ఎదోము శేయీరు కొండ సీమలో స్థిరపడ్డాడు. \b \lh \v 9 శేయీరు కొండ సీమలో స్థిరపడిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి: \b \li1 \v 10 ఏశావు కుమారులు: \li2 ఏశావు భార్య ఆదా కుమారుడైన ఎలీఫజు, ఏశావు భార్య బాశెమతు కుమారుడైన రెయూయేలు. \li1 \v 11 ఎలీఫజు కుమారులు: \li2 తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు. \v 12 ఏశావు కుమారుడైన ఎలీఫజుకు తిమ్నా అనే ఉంపుడుగత్తె కూడా ఉంది. ఆమె అమాలేకును కన్నది. వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు. \li1 \v 13 రెయూయేలు కుమారులు: \li2 నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు. \li1 \v 14 ఏశావు భార్య అనా కుమార్తెయైన సిబ్యోను మనవరాలైన ఒహోలీబామా ద్వారా కలిగిన ఏశావు కుమారులు: \li2 యూషు, యాలాము, కోరహు. \b \lh \v 15 ఏశావు వారసులలో నాయకులైన వారు వీరు: \li1 ఏశావు మొదటి కుమారుడైన ఎలీఫజు కుమారులు: \li2 నాయకులైన తేమాను, సెఫో, కనజు, ఓమారు, \v 16 కోరహు,\f + \fr 36:16 \fr*\fq కోరహు \fq*\ft కొ.ప్ర.లలో ఈ పేరు లేదు\ft*\f* గాతాము, అమాలేకు. వీరు ఎదోములో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు. \li1 \v 17 ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు: \li2 నాయకులైన నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఎదోములో రెయూయేలు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు. \li1 \v 18 ఏశావు భార్య ఒహోలీబామా యొక్క కుమారులు: \li2 నాయకులైన యూషు, యాలాము, కోరహు. వీరు అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామా నుండి వచ్చిన నాయకులు. \lf \v 19 వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు. \b \li1 \v 20 ఆ ప్రాంతంలో నివసిస్తున్న హోరీయుడైన శేయీరు కుమారులు: \li2 లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, \v 21 దిషోను, ఏసెరు, దిషాను. ఎదోములో ఉన్న శేయీరు కుమారులైన వీరు హోరీయుల నాయకులు. \li1 \v 22 లోతాను కుమారులు: \li2 హోరీ, హోమాము.\f + \fr 36:22 \fr*\ft హెబ్రీ \ft*\fqa హేమాము, \fqa*\ft మరో రూపం \ft*\fq హోమాము \fq*\ft (చూడండి \+xt 1 దిన 1:39\+xt*)\ft*\f* లోతాను సోదరి తిమ్నా. \li1 \v 23 శోబాలు కుమారులు: \li2 అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము. \li1 \v 24 సిబ్యోను కుమారులు: \li2 అయ్యా, అనా. ఈ అనా తన తండ్రి గాడిదలను మేపుతూ ఉన్నప్పుడు అరణ్యంలో నీటి ఊటలను కనుగొన్నాడు. \li1 \v 25 అనా సంతానం: \li2 కుమారుడైన దిషోను, కుమార్తెయైన ఒహోలీబామా. \li1 \v 26 దిషోను\f + \fr 36:26 \fr*\ft హెబ్రీ \ft*\fqa దిషాను, \fqa*\fq దిషోను \fq*\ft యొక్క మరో రూపం\ft*\f* కుమారులు: \li2 హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. \li1 \v 27 ఏసెరు కుమారులు: \li2 బిల్హాను, జవాను, ఆకాను. \li1 \v 28 దిషాను కుమారులు: \li2 ఊజు, అరాను. \li1 \v 29 వీరు హోరీయుల నాయకులు: \li2 లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, \v 30 దిషోను ఏసెరు దిషాను. \lf శేయీరులో వంశావళి ప్రకారం, వీరు హోరీయుల నాయకులు. \s1 ఎదోము పాలకులు \lh \v 31 ఇశ్రాయేలు రాజులెవరు పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు: \li1 \v 32 బెయోరు కుమారుడైన బేల ఎదోముకు రాజయ్యాడు. అతని పట్టణానికి దిన్హాబా అని పేరు పెట్టబడింది. \li1 \v 33 బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు, బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు. \li1 \v 34 యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. \li1 \v 35 హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది. \li1 \v 36 హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు. \li1 \v 37 శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. \li1 \v 38 షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు. \li1 \v 39 అక్బోరు కుమారుడైన బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు\f + \fr 36:39 \fr*\ft చాలా ప్రతులలో \ft*\fqa హదరు \fqa*\ft అలాగే \+xt 1 దిన 1:50\+xt* \ft*\ft లో కూడా చూడాలి.\ft*\f* అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు, అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె. \b \lh \v 40 వారి వారి వంశాల ప్రకారం వారి వారి ప్రాంతాల ప్రకారం ఇవి ఏశావు వారసుల నాయకులు పేర్లు: \li1 తిమ్నా, అల్వా, యతేతు, \li1 \v 41 ఒహోలీబామా, ఏలహు, పీనోను, \li1 \v 42 కనజు, తేమాను, మిబ్సారు, \li1 \v 43 మగ్దీయేలు, ఈరాము. \lf వారు ఆక్రమించిన దేశంలో వారి వారి స్థావరాల ప్రకారం, వీరు ఎదోము నాయకులు. \b \lf ఇది ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి. \c 37 \s1 యోసేపు కలలు \p \v 1 యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశంలో నివసించాడు. \b \p \v 2 యాకోబు వంశావళి వివరాలు ఇవి. \b \p యోసేపు పదిహేడు సంవత్సరాల యువకుడు, తన అన్నలతో, తన తండ్రి భార్యలైన బిల్హా జిల్పాల కుమారులతో కలిసి మందలను మేపుతూ ఉండేవాడు. వారు చేసే చెడు పనుల గురించి తండ్రికి చెప్పేవాడు. \p \v 3 ఇశ్రాయేలు తన ఇతర కుమారుల కంటే యోసేపును ఎక్కువ ప్రేమించాడు, ఎందుకంటే అతడు తన వృద్ధాప్యంలో పుట్టినవాడు; అతని కోసం ఒక ప్రత్యేకమైన బాగా అలంకరించబడిన\f + \fr 37:3 \fr*\ft హెబ్రీ భాషలో ఈ పదానికి ఖచ్చితమైన అర్థం తెలియదు; \+xt 23|link-href="GEN 37:23"\+xt*, \+xt 32|link-href="GEN 37:32"\+xt* వచనాల్లో కూడ\ft*\f* అంగీని కుట్టించాడు. \v 4 తమ తండ్రి అతన్ని తమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూసి వారు యోసేపును ద్వేషించారు, అతని క్షేమసమాచారం కూడా అడగలేదు. \p \v 5 ఒక రోజు యోసేపుకు ఒక కల వచ్చింది, అది తన అన్నలకు చెప్పినప్పుడు వారతన్ని మరీ ఎక్కువగా ద్వేషించారు. \v 6 అతడు వారితో, “నాకు వచ్చిన కలను వినండి: \v 7 మనం పొలంలో వరి పనలు కడుతున్నాము, అప్పుడు అకస్మాత్తుగా నా పన లేచి నిలబడింది, నా పన చుట్టూ మీ పనలు చేరి సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు. \p \v 8 అతని అన్నలు అతనితో, “నీవు మమ్మల్ని ఏలాలి అనుకుంటున్నావా? నిజంగా మమ్మల్ని ఏలుతావా?” అని అన్నారు. అతని కలను బట్టి వారు అతన్ని ఇంకా ద్వేషించారు. \p \v 9 అతనికి మరో కల వచ్చింది, “వినండి. నాకు ఇంకొక కల వచ్చింది, ఈసారి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి” అని తన అన్నలకు చెప్పాడు. \p \v 10 తన తండ్రికి తన అన్నలకు ఈ కలను గురించి చెప్పినప్పుడు, తన తండ్రి అతని గద్దిస్తూ, “నీకు వచ్చిన ఈ కల ఏంటి? నీ తల్లి, నేను, నీ అన్నలు నీ ఎదుట నిజంగా సాష్టాంగపడాలా?” అని అన్నాడు. \v 11 యోసేపు అన్నలు అతనిపై అసూయపడ్డారు కానీ అతని తండ్రి ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు. \s1 యోసేపు తన సోదరుల ద్వారా అమ్మివేయబడుట \p \v 12 యోసేపు అన్నలు తమ తండ్రి మందలను మేపడానికి షెకెముకు వెళ్లారు. \v 13 ఒక రోజు ఇశ్రాయేలు యోసేపుతో, “నీ అన్నలు షెకెము దగ్గర మందలను మేపుతున్నారని నీకు తెలుసు కదా. రా, నేను నిన్ను వారి దగ్గరకు పంపుతాను” అని అన్నాడు. \p “సరే, మంచిది” అని అతడు జవాబిచ్చాడు. \p \v 14 కాబట్టి యాకోబు, “వెళ్లు, నీ అన్నలు, అలాగే మందల యోగక్షేమాలు తెలుసుకుని, వచ్చి నాకు చెప్పు” అని యోసేపుతో అన్నాడు. తర్వాత అతడు హెబ్రోను లోయ నుండి అతన్ని పంపించాడు. \p యోసేపు షెకెముకు చేరుకున్నప్పుడు, \v 15 అతడు పొలాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండడం ఒక మనుష్యుడు చూసి, “నీవు ఏం వెదకుతున్నావు?” అని అడిగాడు. \p \v 16 యోసేపు జవాబిస్తూ, “నేను మా అన్నల కోసం వెదకుతున్నాను. వారు తమ మందలను ఎక్కడ మేపుతున్నారో మీరు చెప్పగలరా?” అని అడిగాడు. \p \v 17 “వారు ఇక్కడినుండి వెళ్లిపోయారు. ‘మనం దోతానుకు వెళ్దాం’ అని వారు అనుకోవడం నేను విన్నాను” అని ఆ వ్యక్తి అన్నాడు. \p కాబట్టి యోసేపు తన అన్నలను వెదుకుతూ వెళ్లి దోతానులో వారిని కనుగొన్నాడు. \v 18 అయితే వారు అతన్ని దూరం నుండి చూడగానే, అతడు వారిని చేరకముందే, వారు అతన్ని చంపడానికి కుట్రపన్నారు. \p \v 19 “కలలు కనేవాడు వస్తున్నాడు!” అని వారు ఒకరితో ఒకరు అనుకున్నారు. \v 20 “రండి, వాన్ని చంపి ఈ బావులలో ఒక దాంట్లో పడవేద్దాం, క్రూరమృగం చంపేసిందని చెప్పుదాము. అప్పుడు వీని కలలు ఏమైపోతాయో చూద్దాం” అని అనుకున్నారు. \p \v 21 రూబేను ఇది విని, అతన్ని వారి నుండి రక్షించాలని ప్రయత్నించాడు. “మనం అతన్ని చంపొద్దు. \v 22 రక్తం చిందించవద్దు. అరణ్యంలో ఈ బావిలో వాన్ని పడద్రోయండి కానీ వానికి హానిచెయ్యవద్దు” అని అన్నాడు. యోసేపును వారి నుండి కాపాడి తన తండ్రి దగ్గరకు తిరిగి తీసుకెళ్లడానికి రూబేను ఇలా అన్నాడు. \p \v 23 కాబట్టి యోసేపు తన అన్నల దగ్గరకు రాగానే, అతడు వేసుకున్న రంగుల అంగీని చింపేశారు. \v 24 అతన్ని తీసుకెళ్లి బావిలో పడద్రోసారు. ఆ బావి ఖాళీగా ఉంది; అందులో నీళ్లు లేవు. \p \v 25 వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, కళ్ళెత్తి చూశారు, గిలాదు నుండి ఇష్మాయేలీయుల వర్తక బాటసారుల గుంపు ఒకటి రావడం కనిపించింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం మోస్తూ ఉన్నాయి, వారు వాటిని ఈజిప్టుకు తీసుకెళ్తున్నారు. \p \v 26 యూదా తన అన్నలతో, “మన తమ్మున్ని చంపి, అతని రక్తం దాచిపెట్టడం ద్వారా మనకు ఉపయోగం ఏంటి? \v 27 రండి, వీడిని మనం ఏమి హాని చేయకుండా, ఇష్మాయేలీయులకు అమ్మివేద్దాం; ఎంతైనా మన తమ్ముడు మన సొంత శరీరం కదా” అని అన్నాడు. అతని అన్నలు అందుకు ఒప్పుకున్నారు. \p \v 28 కాబట్టి మిద్యాను వర్తకులు అటు వచ్చినప్పుడు, యోసేపును తన అన్నలు బావిలో నుండి బయటకు లాగి ఇరవై షెకెళ్ళ\f + \fr 37:28 \fr*\ft అంటే 230 గ్రాములు\ft*\f* వెండికి ఆ ఇష్మాయేలీయులకు అమ్మివేశారు, వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లారు. \p \v 29 రూబేను ఆ బావి దగ్గరకు తిరిగివచ్చి, అక్కడ యోసేపు లేడని చూసి, తన బట్టలు చింపుకున్నాడు. \v 30 అతడు తన తమ్ముళ్ల దగ్గరకు తిరిగివెళ్లి, “ఆ బాలుడు అక్కడ లేడు! నేనిప్పుడు ఎక్కడికి వెళ్లాలి?” అని అన్నాడు. \p \v 31 అప్పుడు వారు యోసేపు అంగీని తీసుకుని, ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచారు. \v 32 వారు ఆ రంగుల అంగీని తమ తండ్రి దగ్గరకు తీసుకెళ్లి, “మాకు ఇది దొరికింది. ఇది నీ కుమారుని చొక్కాయో కాదో చూడండి” అని అన్నారు. \p \v 33 అతడు దానిని గుర్తుపట్టి, “ఈ చొక్కా నా కుమారునిదే! ఒక క్రూరమృగం అతన్ని మ్రింగివేసింది. ఖచ్చితంగా యోసేపును ముక్కలు చేసి ఉంటుంది” అని అన్నాడు. \p \v 34 అప్పుడు యాకోబు తన బట్టలు చింపుకుని, గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కుమారుని కోసం ఏడ్చాడు. \v 35 అతని కుమారులు, కుమార్తెలు అందరు అతని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ అతడు ఓదార్పు పొందలేదు. అతడు వారితో, “లేదు, నేను సమాధిలో నా కుమారుని కలిసే వరకు నేను దుఃఖిస్తాను” అని అన్నాడు. అలా అతడు తన కుమారుని కోసం ఏడ్చాడు. \p \v 36 ఇంతలో మిద్యానీయులు యోసేపును, ఈజిప్టులో ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరుకు అమ్మివేశారు. \c 38 \s1 యూదా, తామారు \p \v 1 ఆ సమయంలో, యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒక అదుల్లామీయుని దగ్గర ఉన్నాడు. \v 2 అక్కడ ఒక కనానీయుడైన షూయ కుమార్తెను కలిశాడు. ఆమెను పెళ్ళి చేసుకుని ఆమెతో లైంగికంగా కలుసుకున్నాడు; \v 3 ఆమె గర్భవతియై కుమారున్ని కన్నది. అతనికి ఏరు అని పేరు పెట్టారు. \v 4 ఆమె మరలా గర్భవతియై కుమారుని కన్నది, అతనికి ఓనాను అని పేరు పెట్టింది. \v 5 ఆమె మరొక కుమారుని కన్నది, అతనికి షేలా అని పేరు పెట్టింది. ఆమె కజీబులో ఇతనికి జన్మనిచ్చింది. \p \v 6 యూదా అతని మొదటి కుమారుడైన ఏరుకు తామారుతో పెళ్ళి చేశాడు. \v 7 కానీ యూదా మొదటి కుమారుడైన ఏరు, యెహోవా దృష్టికి చెడ్డవాడు కాబట్టి యెహోవా అతన్ని మరణానికి గురి చేశారు. \p \v 8 అప్పుడు యూదా ఓనానుతో, “నీ అన్న భార్యతో పడుకోని మరిది ధర్మం నిర్వర్తించి నీ అన్నకు సంతానం కలిగేలా చేయి” అని అన్నాడు. \v 9 అయితే పుట్టే బిడ్డ అతని బిడ్డగా ఉండదని ఓనానుకు తెలుసు; కాబట్టి తన అన్న భార్యతో పడుకున్న ప్రతిసారి, తన అన్నకు సంతానం కలుగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు. \v 10 అతడు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డదైనందుకు యెహోవా అతన్ని కూడా మరణానికి గురి చేశారు. \p \v 11 అప్పుడు యూదా తన కోడలు తామారుతో, “నా కుమారుడు షేలా ఎదిగే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “తన అన్నల్లా ఇతడు కూడా చనిపోతాడేమో” అని అనుకున్నాడు. కాబట్టి తామారు తన తండ్రి ఇంట్లో ఉండడానికి వెళ్లింది. \p \v 12 చాలా కాలం తర్వాత యూదా భార్య, షూయ కుమార్తె చనిపోయింది. యూదా దుఃఖ కాలం తీరిపోయాక, తన గొర్రెబొచ్చు కత్తిరించే వారున్న తిమ్నాకు వెళ్లాడు, అతని స్నేహితుడైన హీరా అనే అదుల్లామీయుడు అతనితో వెళ్లాడు. \p \v 13 “నీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్తున్నాడు” అని తామారుకు తెలిసినప్పుడు, \v 14 తన విధవరాలి బట్టలు తీసివేసి తలమీద ముసుగు వేసుకుని, తిమ్నా మార్గంలో ఉన్న ఎనయీము అనే గ్రామ ప్రవేశం దగ్గర కూర్చుంది. షేలా పెద్దవాడైనా కూడా ఆమె అతనికి భార్యగా ఇవ్వబడలేదు కాబట్టి ఆమె అలా చేసింది. \p \v 15 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకున్నందుకు వేశ్య అనుకున్నాడు. \v 16 ఆమె తన కోడలని తెలియక, దారిలో ఉన్న ఆమె వైపు వెళ్లి, “రా, నేను నీతో పడుకుంటాను” అని అన్నాడు. \p “నాతో పడుకోడానికి నాకు ఏమి ఇస్తావు?” అని ఆమె అడిగింది. \p \v 17 అతడు, “నా మంద నుండి మేకపిల్లను ఇస్తాను” అని చెప్పాడు. \p అప్పుడు ఆమె, “అది పంపే వరకు నా దగ్గర ఏదైనా తాకట్టు పెడతావా?” అని అడిగింది. \p \v 18 అతడు, “ఏం తాకట్టు పెట్టాలి?” అని అడిగాడు. \p ఆమె, “నీ ముద్ర, దాని దారం, నీ చేతిలో ఉన్న కర్ర” అని అన్నది. కాబట్టి అతడు అవి ఆమెకు ఇచ్చి ఆమెతో పడుకున్నాడు, అతని ద్వారా ఆమె గర్భవతి అయ్యింది. \v 19 ఆమె వెళ్లి తన ముసుగు తీసివేసి తిరిగి తన విధవరాలి బట్టలు వేసుకుంది. \p \v 20 అంతలో యూదా ఆ స్త్రీ దగ్గర తాకట్టు పెట్టినవి విడిపించుకోడానికి తన స్నేహితుడైన అదుల్లామీయుని ద్వారా మేకపిల్లను పంపాడు కానీ ఆమె అతనికి కనబడలేదు. \v 21 అక్కడున్న మనుష్యులను, “ఎనయీము దారి ప్రక్కన ఉండే పుణ్యక్షేత్ర వేశ్య ఎక్కడుంది?” అని అడిగాడు. \p “ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య ఎవరు లేరు” అని వారన్నారు. \p \v 22 కాబట్టి అతడు యూదా దగ్గరకు తిరిగివెళ్లి, “నేను ఆమెను కనుగొనలేదు. అంతేకాక, అక్కడ ఉండే మనుష్యులు, ‘ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య లేదు’ అని అన్నారు” అని చెప్పాడు. \p \v 23 అప్పుడు యూదా, “ఆమె తన దగ్గర ఉన్నవాటిని ఉంచుకోనివ్వండి, లేకపోతే మనం నవ్వుల పాలవుతాము. ఎంతైనా నేను ఆమెకు ఈ మేకపిల్లను పంపాను, కానీ నీకు ఆమె కనబడలేదు” అని అన్నాడు. \p \v 24 దాదాపు మూడు నెలలు తర్వాత, “నీ కోడలు తామారు వ్యభిచారిగా అపరాధం చేసింది, ఫలితంగా ఇప్పుడు ఆమె గర్భవతి” అని యూదాకు తెలియజేయబడింది. \p యూదా అన్నాడు, “ఆమెను బయటకు తీసుకువచ్చి ఆమెను కాల్చి చంపండి!” అని అన్నాడు. \p \v 25 ఆమెను బయటకు తీసుకువచ్చినప్పుడు, ఆమె తన మామకు వార్త పంపి, “ఇవి ఎవరికి చెందినవో ఆ యజమాని ద్వార నేను గర్భవతినయ్యాను” అని అన్నది. ఇంకా ఆమె, “ఈ ముద్ర, దారం, కర్ర ఎవరివో గుర్తుపడ్తారేమో చూడండి” అని అన్నది. \p \v 26 యూదా అవి తనవేనని గుర్తుపట్టి ఇలా అన్నాడు, “ఆమె నాకంటే నీతిమంతురాలు, ఎందుకంటే నేను ఆమెను నా కుమారుడైన షేలాకు ఇచ్చి పెళ్ళి చేయలేదు.” ఆ తర్వాత అతడు ఆమెతో మరలా ఎప్పుడూ పడుకోలేదు. \p \v 27 ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. \v 28 కాన్పు సమయంలో ఒక శిశువు బయటకు వస్తూ చేయి చాచాడు; మంత్రసాని ఎర్రటి నూలుదారం ఆ శిశువు చేతికి కట్టి, “ఇతడు మొదట బయటకు వచ్చినవాడు” అని అన్నది. \v 29 అయితే ఆ శిశువు చేయి వెనుకకు తీసుకున్నప్పుడు, అతని సోదరుడు బయటకు వచ్చాడు, అప్పుడు ఆమె, “ఇలా నీవు దూసుకుని వచ్చావు!” అన్నది. అతనికి పెరెసు\f + \fr 38:29 \fr*\ft పెరెసు \ft*\ft అంటే \ft*\fqa దూసుకుని రావడం\fqa*\f* అని పేరు పెట్టారు. \v 30 తర్వాత చేతికి ఎర్రటి దారం ఉన్నవాడు బయటకు వచ్చాడు. అతనికి జెరహు\f + \fr 38:30 \fr*\fq జెరహు \fq*\ft బహుశ అర్థం \ft*\fqa నూలుదారం \fqa*\ft లేదా \ft*\fqa ప్రకాశం\fqa*\f* అని పేరు పెట్టారు. \c 39 \s1 యోసేపు, పోతీఫరు భార్య \p \v 1 యోసేపు ఈజిప్టుకు కొనిపోబడ్డాడు. ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరు అనే ఈజిప్టువాడు యోసేపును తీసుకెళ్లిన ఇష్మాయేలీయుల దగ్గర అతన్ని కొన్నాడు. \p \v 2 యెహోవా యోసేపుతో ఉన్నారు కాబట్టి అతడు వర్ధిల్లాడు, తన ఈజిప్టు యజమాని ఇంట్లో ఉన్నాడు. \v 3 యెహోవా అతనితో ఉన్నారని, అతడు చేసే ప్రతి పనిలో యెహోవా విజయం ఇచ్చారని అతని యజమాని చూసినప్పుడు \v 4 యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు, అతనికి వ్యక్తిగత పరిచారకుడయ్యాడు. పోతీఫరు యోసేపును అతని ఇంటికి అధికారిగా నియమించి తనకున్న సమస్తాన్ని అతని పర్యవేక్షణలో పెట్టాడు. \v 5 తన ఇంటికి, తన సమస్తానికి యోసేపును అధికారిగా నియమించినప్పటి నుండి, యెహోవా ఈజిప్టు యజమాని ఇంటిని ఆశీర్వదించారు. ఇంట్లోనూ, పొలంలోనూ పోతీఫరుకు ఉన్న సమస్తం మీద యెహోవా ఆశీర్వాదం ఉంది. \v 6 కాబట్టి పోతీఫరు సమస్తాన్ని యోసేపు పర్యవేక్షణలో పెట్టాడు; యోసేపు అధికారిగా ఉన్నందుకు తన భోజనం తప్ప మరి దేని గురించి అతడు పట్టించుకోలేదు. \p యోసేపు మంచి రూపం కలిగినవాడు, అందగాడు. \v 7 కొంతకాలం తర్వాత తన యజమాని భార్య అతని మీద కన్నేసి, “నాతో పడుకో!” అని అన్నది. \p \v 8 కానీ అతడు తిరస్కరించాడు. “నా యజమాని నన్ను అధికారిగా నియమించి ఇంట్లో నేనున్నాననే నమ్మకంతో తాను నిశ్చింతగా ఉన్నారు. తన సమస్తాన్ని నా పర్యవేక్షణలో ఉంచాడు. \v 9 ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు. మీరు తన భార్య కాబట్టి నా యజమాని మిమ్మల్ని తప్ప మిగతాదంతా నాకు అప్పగించాడు. కాబట్టి దేవునికి విరుద్ధంగా అలాంటి చెడ్డపని నేను ఎలా చేయగలను?” అని అన్నాడు. \v 10 ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఆమెతో పడుకోడానికి లేదా ఆమెతో ఉండడానికి కూడా అతడు తిరస్కరించారు. \p \v 11 ఒక రోజు అతడు ఇంట్లో తన పనులు చేసుకోవడానికి వెళ్లాడు, అప్పుడు ఇంట్లో పనివారు ఎవరు లేరు. \v 12 ఆమె అతని అంగీ పట్టుకుని లాగి, “నాతో పడుకో!” అని అన్నది. అయితే అతడు తన అంగీ ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడు. \p \v 13 అతడు తన అంగీని ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడని చూసి, \v 14 తన ఇంటి పనివారిని పిలిచి, “చూడండి, నా భర్త మనలను అవమానించాలని ఈ హెబ్రీయున్ని తెచ్చాడు. అతడు నాతో శయనించాలని లోనికి వచ్చాడు కానీ నేను కేకలు పెట్టాను. \v 15 సహాయం కోసం నేను పెట్టిన కేకలు విని, తన అంగీని నా ప్రక్కన వదిలేసి పారిపోయాడు” అని చెప్పింది. \p \v 16 తన యజమాని ఇంటికి వచ్చేవరకు అతని అంగీని ఆమె ప్రక్కనే పెట్టుకుంది. \v 17 తర్వాత అతనికి ఈ కథ చెప్పింది: “నీవు తీసుకువచ్చిన ఆ హెబ్రీ బానిస నా దగ్గరకు వచ్చి నన్ను లోబరచుకోవాలని చూశాడు. \v 18 నేను సహాయం కోసం కేకలు పెట్టిన వెంటనే, తన అంగీని నా ప్రక్కన వదిలేసి ఇంట్లోనుండి పారిపోయాడు.” \p \v 19 అతని యజమాని, “నీ దాసుడు ఇలా ప్రవర్తించాడు” అని తన భార్య చెప్పిన కథ విని కోపంతో రగిలిపోయాడు. \v 20 యోసేపు యజమాని అతన్ని రాజద్రోహులనుంచే చెరసాలలో పడవేశాడు. \p అయితే యోసేపు అక్కడే చెరసాలలో ఉన్నప్పుడు, \v 21 యెహోవా అతనితో ఉన్నారు; ఆయన అతనిపై దయ చూపించారు, చెరసాల అధికారి దృష్టిలో అతనిపై దయ కలిగించారు. \v 22 కాబట్టి చెరసాల అధికారి చెరసాలలో ఉన్నవారందరిపై యోసేపుకు అధికారం ఇచ్చాడు, అక్కడ జరిగే అంతటి మీద అతనికి బాధ్యత అప్పగించాడు. \v 23 చెరసాల అధికారి యోసేపు ఆధీనంలో ఉన్నవాటి గురించి చింతించలేదు, ఎందుకంటే యెహోవా యోసేపుతో ఉన్నారు, అతడు చేసే అన్నిటిలో విజయాన్ని ఇచ్చారు. \c 40 \s1 పాత్ర అందించేవాడు, రొట్టెలు చేసేవాడు \p \v 1 కొంతకాలం తర్వాత ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు రొట్టెలు చేసేవాడు తమ యజమాని పట్ల తప్పు చేశారు. \v 2 కాబట్టి ఫరో తన ఇద్దరి అధికారులపై అనగా గిన్నె అందించేవారి నాయకునిపై, రొట్టెలు కాల్చేవారి నాయకునిపై కోప్పడి, \v 3 వారిని అంగరక్షకుల అధికారి ఆధీనంలో, అతని ఇంట్లో ఉంచాడు, అదే చెరసాలలో యోసేపు బంధించబడి ఉన్నాడు. \v 4 అంగరక్షకుల అధికారి వీరిద్దరిని యోసేపుకు అప్పగించాడు, అతడు వారిని చూసుకున్నాడు. \p వారు కొంతకాలం వరకు చెరసాలలో ఉన్నప్పుడు, \v 5 ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు చెరలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే రాత్రి కలగన్నారు. ఇద్దరి కలలకు దేని భావం దానికే ఉంది. \p \v 6 మరుసటిరోజు ప్రొద్దున్నే యోసేపు వారి దగ్గరకు వచ్చినప్పుడు, వారు దిగులుగా ఉన్నట్లు గమనించాడు. \v 7 కాబట్టి అతడు తన యజమాని ఇంట్లో నిర్బంధంలో ఉన్న అధికారులను, “మీరు ఎందుకు ఈ రోజు విచారంగా ఉన్నారు?” అని అడిగాడు. \p \v 8 “మా ఇద్దరికి కలలు వచ్చాయి కానీ వాటి భావం చెప్పడానికి ఎవరు లేరు” అని వారు జవాబిచ్చారు. \p అప్పుడు యోసేపు వారితో, “భావాలు చెప్పడం దేవుని వశం కాదా? మీ కలలు నాకు చెప్పండి” అని అన్నాడు. \p \v 9 కాబట్టి గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు తన కలను చెప్పాడు. అతడు, “నా కలలో నా ఎదుట ఒక ద్రాక్షచెట్టు ఉంది, \v 10 ఆ ద్రాక్షచెట్టుకు మూడు తీగెలున్నాయి. అది చిగురించి, పూలు పూసింది, దాని గెలలు ద్రాక్షపండ్లతో ఉన్నాయి. \v 11 ఫరో గిన్నె నా చేతిలో ఉంది, నేను ద్రాక్షపండ్లు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి అతని చేతికి ఆ గిన్నెను ఇచ్చాను” అని చెప్పాడు. \p \v 12 యోసేపు అతనితో, “దాని అర్థం ఇది. మూడు తీగెలు మూడు రోజులు. \v 13 మూడు రోజుల్లో ఫరో నీ తల పైకెత్తి నీ స్థానం నీకు మరలా ఇస్తాడు, గతంలో నీవు గిన్నె అందించే వానిగా ఉన్నప్పుడు చేసినట్టు, ఫరో గిన్నెను అతనికి చేతికి అందిస్తావు. \v 14 నీకు అంతా మంచి జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు దయ చూపించు; ఫరోతో నా గురించి మాట్లాడి నన్ను ఈ చెరసాల నుండి బయటకు రప్పించు. \v 15 హెబ్రీ దేశం నుండి బలవంతంగా నన్ను దొంగిలించి తీసుకువచ్చారు, నేను చెరసాలలో ఉండడానికి చేసిన నేరం ఏమి లేదు” అని చెప్పాడు. \p \v 16 యోసేపు అనుకూలంగా భావం చెప్పాడు అని గమనించిన రొట్టెలు కాల్చేవాడు యోసేపుతో, “నాకు కూడా కల వచ్చింది: నా తలమీద రొట్టెలు ఉన్న మూడు గంపలు ఉన్నాయి. \v 17 పై గంపలో ఫరో కోసం అన్ని రకాల మంచి వంటకాలున్నాయి, కానీ పక్షులు వచ్చి, నా తలమీద ఉన్న గంపలో నుండి తింటున్నాయి” అని చెప్పాడు. \p \v 18 యోసేపు అన్నాడు, “దాని అర్థం ఇది. మూడు గంపలు మూడు రోజులు. \v 19 మూడు రోజుల్లో ఫరో నీ తలను తీసివేసి, నీ శరీరాన్ని స్తంభానికి వ్రేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తినివేస్తాయి.” \p \v 20 మూడవ రోజు ఫరో పుట్టిన రోజు, అతడు తన అధికారులందరికి విందు ఏర్పాటు చేశాడు. అధికారులందరి ఎదుట గిన్నె అందించేవారి నాయకుడి, రొట్టెలు కాల్చేవాని నాయకుడి తలలను పైకెత్తాడు: \v 21 గిన్నె అందించేవారి నాయకున్ని అతని స్థానం తిరిగి ఇచ్చాడు కాబట్టి మరలా అతడు ఫరో చేతికి గిన్నె అందించాడు. \v 22 కానీ యోసేపు కల భావం చెప్పినట్టే, అతడు రొట్టెలు కాల్చేవారి నాయకున్ని వ్రేలాడదీశాడు. \p \v 23 అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపును జ్ఞాపకం చేసుకోలేదు; అతన్ని మరచిపోయాడు. \c 41 \s1 ఫరో కలలు \p \v 1 రెండు సంవత్సరాల ముగిసిన తర్వాత ఫరో కలగన్నాడు: అతడు నైలు నది దగ్గర నిలబడి ఉన్నాడు, \v 2 నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. \v 3 వాటి తర్వాత, చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు వాటి ప్రక్కన నైలు నది ఒడ్డున నిలబడ్డాయి. \v 4 చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు అందంగా పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు. \p \v 5 మళ్ళీ అతడు పడుకున్నాడు, రెండవ కలగన్నాడు: పుష్టిగా, మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కొమ్మకు పెరుగుతున్నాయి. \v 6 వాటి తర్వాత పీలగా, తూర్పుగాలికి ఎండిపోయిన మరో ఏడు వెన్నులు పెరిగాయి. \v 7 పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు; అది కల అని గ్రహించాడు. \p \v 8 ఉదయం అతని మనస్సు కలవరపడింది, కాబట్టి ఈజిప్టులోని మాంత్రికులను, జ్ఞానులను అందరిని పిలిపించాడు. ఫరో తన కలలు వారికి చెప్పాడు, కానీ వాటి భావం ఎవరు చెప్పలేకపోయారు. \p \v 9 అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు ఫరోతో అన్నాడు, “ఈ రోజు నా తప్పులు నాకు జ్ఞాపకం చేయబడ్డాయి. \v 10 ఫరో ఒకసారి తన సేవకులపై కోప్పడి, నన్ను రొట్టెలు కాల్చేవారి నాయకున్ని అంగరక్షకుల అధిపతి ఇంట్లో నిర్బంధంలో ఉంచారు. \v 11 మా ఇద్దరికి ఒకే రాత్రి కలలు వచ్చాయి, ఒక్కొక్క కలకు ఒక్కొక్క అర్థం ఉంది. \v 12 అక్కడ మాతో పాటు ఒక హెబ్రీ యువకుడు ఉన్నాడు. అతడు అంగరక్షకుల అధికారికి దాసుడు. మా కలలు అతనికి చెప్పాం, అతడు ఎవరి కల భావాన్ని వారికి చెప్పాడు. \v 13 అతడు వాటిని వివరించినట్టే మాకు జరిగింది: నా స్థానం నాకు తిరిగి వచ్చింది, మరో వ్యక్తి వ్రేలాడదీయబడ్డాడు.” \p \v 14 అప్పుడు ఫరో యోసేపును పిలిపించాడు, వారు అతన్ని చెరసాల నుండి త్వరగా తీసుకువచ్చారు. యోసేపు శుభ్రంగా క్షౌరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో సమక్షంలో నిలబడ్డాడు. \p \v 15 ఫరో యోసేపుతో, “నేనొక కలగన్నాను, దాని భావం ఎవరూ చెప్పలేకపోయారు. కానీ నీవు ఒక కల వింటే దాని భావం చెప్తావని నీ గురించి విన్నాను” అని అన్నాడు. \p \v 16 అందుకు యోసేపు, “నేను చేయలేను, అయితే ఫరోకు క్షేమకరమైన జవాబు దేవుడు ఇస్తారు” అని ఫరోతో అన్నాడు. \p \v 17 అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను, \v 18 నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. \v 19 వాటి తర్వాత చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అంత వికారమైన ఆవులను ఈజిప్టులో నేనెప్పుడు చూడలేదు. \v 20 బక్కగా వికారంగా ఉన్న ఆవులు ముందు వచ్చిన పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. \v 21 కానీ అవి తిన్నా కూడా అవి తిన్నాయని ఎవరు చెప్పలేరు; అవి ముందు ఉన్నట్లే వికారంగా ఉన్నాయి. అప్పుడు నేను నిద్రలేచాను. \p \v 22 “నా కలలో పుష్టిగా మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కాడకు పెరుగుతున్నాయి. \v 23 వాటి తర్వాత పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన మరో పీలవెన్నులు వాటి తర్వాత మొలిచాయి. \v 24 పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. ఇది మాంత్రికులకు చెప్పాను, కానీ దాని అర్థాన్ని చెప్పేవారు ఎవరూ లేరు.” \p \v 25 అప్పుడు యోసేపు ఫరోకు చెప్పాడు, “ఫరో కలల భావం ఒక్కటే. దేవుడు ఏమి చేయబోతున్నారో ఫరోకు తెలియజేశారు. \v 26 ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు, అలాగే ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరాలు; రెండు కలల భావం ఒకటే. \v 27 వాటి తర్వాత వచ్చిన చిక్కిపోయి వికారంగా ఉన్న ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు, పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు వెన్నులు కూడా అవే ఏడు సంవత్సరాలు; అవి ఏడు సంవత్సరాలు కరువు కాలము. \p \v 28 “నేను ఫరోకు చెప్పినట్టే జరుగుతుంది. దేవుడు తాను ఏమి చేయబోతున్నారో ఫరోకు చూపించారు. \v 29 ఈజిప్టు దేశమంతటా గొప్ప సమృద్ధిగల ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి. \v 30 కానీ వాటి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ సమయంలో ఈజిప్టులో ఉండే సమృద్ధి అందరు మరిచిపోతారు, కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. \v 31 తర్వాత వచ్చే కరువు ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దేశంలో ఉండిన సమృద్ధి ఎవరికీ జ్ఞాపకం ఉండదు. \v 32 కల రెండు విధాలుగా ఫరోకు ఇవ్వబడిన కారణం ఏంటంటే ఇది దేవునిచే దృఢంగా నిర్ణయించబడింది, దేవుడు త్వరలో దానిని చేస్తారు. \p \v 33 “ఇప్పుడు ఫరో జ్ఞాన వివేచనలు కలిగిన ఒక వ్యక్తిని ఈజిప్టు అంతటి మీద అధికారిగా నియమించాలి. \v 34 సమృద్ధిగా పండే ఏడు సంవత్సరాల్లో పంటలో అయిదవ భాగాన్ని సేకరించడానికి ఫరో దేశమంతా పర్యవేక్షకులను నియమించాలి. \v 35 వారు ఈ మంచి సంవత్సరాల్లో పండే ధాన్యం సేకరించి ఫరో ఆధీనంలో పట్టణాల్లో ఆహారం ఉండేలా నిలువచేయాలి. \v 36 ఈ ఆహారం దేశం కోసం నిలువచేయబడి ఈజిప్టు మీదికి వచ్చే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఉపయోగించబడుతుంది, అప్పుడు కరువు ద్వారా దేశం నాశనం కాదు.” \p \v 37 ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. \v 38 కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు. \p \v 39 అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు. \v 40 నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు. \s1 యోసేపు ఈజిప్టుకు అధికారి అయ్యాడు \p \v 41 కాబట్టి ఫరో యోసేపుతో, “నేను నిన్ను ఈజిప్టు దేశమంతటికి అధికారిగా ప్రకటిస్తున్నాను” అని అన్నాడు. \v 42 ఫరో తన రాజముద్ర ఉంగరం తీసి యోసేపు వ్రేలికి పెట్టాడు. సన్నని నారబట్టలు అతనికి తొడిగించాడు, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. \v 43 తన రెండవ రథంలో అతన్ని కూర్చోబెట్టాడు, అప్పుడు ప్రజలు, “నమస్కారం చేయండి!”\f + \fr 41:43 \fr*\ft లేదా \ft*\fqa దారి ఇవ్వండి\fqa*\f* అని అంటూ అతని ముందు కేకలు వేశారు. ఈ విధంగా అతడు యోసేపును దేశమంతటిమీద అధికారిగా చేశాడు. \p \v 44 అప్పుడు ఫరో యోసేపుతో, “నేను ఫరోను, కానీ నీ అనుమతి లేకుండా ఈజిప్టు అంతటిలో ఎవరు కూడా తన చేయి కానీ కాలు కానీ ఎత్తరు” అని అన్నాడు. \v 45 ఫరో యోసేపుకు జఫెనత్-ఫనేహు అనే పేరు పెట్టాడు, ఓనులో\f + \fr 41:45 \fr*\ft అంటే, హెలియోపొలిస్; \+xt 50|link-href="GEN 41:50"\+xt* వచనంలో కూడా\ft*\f* యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతును అతనికి భార్యగా ఇచ్చాడు. యోసేపు ఈజిప్టు దేశమంతటా పర్యటించాడు. \p \v 46 యోసేపు ఈజిప్టు రాజైన ఫరో సేవ మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు. యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి, ఈజిప్టు దేశమంతా సంచరించాడు. \v 47 ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది. \v 48 యోసేపు ఈజిప్టులో ఆ ఏడు సంవత్సరాల పంటనంతా సేకరించి పట్టణాల్లో నిల్వచేశాడు. ప్రతి పట్టణం చుట్టూ ఉన్న పొలాల్లో సేకరించిన ధాన్యాన్ని ఆ పట్టణాల్లోనే నిల్వచేశాడు. \v 49 యోసేపు సముద్రతీరాన ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలువచేశాడు; అది విస్తారంగా ఉంది కాబట్టి దాన్ని కొలవడం ఆపేశాడు. \p \v 50 కరువు సంవత్సరాలకు ముందు యోసేపుకు ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతు ద్వారా ఇద్దరు కుమారులు పుట్టారు. \v 51 తన మొదటి కుమారునికి యోసేపు మనష్షే అని పేరు పెట్టి, “దేవుడు నా కష్టాలన్నీ, నా తండ్రి ఇంటివారందరినీ మరచిపోయేలా చేశారు” అని అన్నాడు. \v 52 రెండవ కుమారునికి ఎఫ్రాయిం\f + \fr 41:52 \fr*\fq ఎఫ్రాయిం \fq*\ft హెబ్రీ పదంలా ఉంది \ft*\fqa ఫలవంతం\fqa*\f* అని పేరు పెట్టి, “నాకు శ్రమలు కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశారు” అని అన్నాడు. \p \v 53 ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి, \v 54 యోసేపు చెప్పినట్టే ఏడు సంవత్సరాల కరువు ప్రారంభమయ్యింది. ఇతర దేశాల్లో కరువు ఉన్నది కానీ ఈజిప్టు దేశమంతా ఆహారం ఉంది. \v 55 ఈజిప్టు అంతా కరువు అనుభవించడం ప్రారంభమైనప్పుడు, ఆహారం కోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. అప్పుడు ఫరో ఈజిప్టు వారందరితో, “యోసేపు దగ్గరకు వెళ్లి అతడు చెప్పినట్టు చేయండి” అని చెప్పాడు. \p \v 56 దేశమంతటా కరువు వ్యాపించినప్పుడు, యోసేపు ధాన్య కొట్లన్నీ తెరిచి, ఈజిప్టువారికి ధాన్యం అమ్మాడు, ఎందుకంటే ఈజిప్టు దేశంలో కరువు చాలా తీవ్రంగా ఉంది. \v 57 లోకమంతా ఈజిప్టుకు వచ్చి యోసేపు దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు, ఎందుకంటే కరువు అంతటా తీవ్రంగా ఉంది. \c 42 \s1 యోసేపు సోదరులు ఈజిప్టుకు వెళ్తారు \p \v 1 యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని తెలుసుకుని, తన కుమారులతో, “ఎందుకు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు? \v 2 ఈజిప్టులో ధాన్యం ఉందని నేను విన్నాను. అక్కడికి వెళ్లి మన కోసం కొంత ధాన్యం కొనుక్కురండి, అప్పుడు మనం చావకుండ బ్రతుకుతాం” అని అన్నాడు. \p \v 3 అప్పుడు యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనడానికి ఈజిప్టుకు వెళ్లారు. \v 4 అయితే యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనును పంపలేదు ఎందుకంటే అతనికి ఏదైన హాని కలుగుతుందని భయపడ్డాడు. \v 5 కాబట్టి ఇశ్రాయేలు కుమారులు కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి వచ్చారు ఎందుకంటే, కనాను దేశంలో కూడా కరువు వచ్చింది. \p \v 6 అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారిగా ఉంటూ, ఆ దేశ ప్రజలందరికి ధాన్యం అమ్మేవాడు. యోసేపు అన్నలు వచ్చి అతనికి సాష్టాంగపడి నమస్కారం చేశారు. \v 7 యోసేపు వారిని చూసిన వెంటనే, వారిని గుర్తుపట్టాడు కాని తెలియనట్లుగా నటిస్తూ వారితో కఠినంగా మాట్లాడాడు. “మీరెక్కడ నుండి వచ్చారు?” అని అతడు అడిగాడు. \p వారు, “కనాను దేశం నుండి ఆహారం కొనడానికి వచ్చాం” అని జవాబిచ్చారు. \p \v 8 యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు కాని వారతన్ని గుర్తు పట్టలేదు. \v 9 వారి గురించి తాను కన్న కలలు యోసేపు జ్ఞాపకం చేసుకుని, “మీరు వేగులవారు. మా దేశానికి చెందిన భద్రత రహస్యాలు తెలుసుకోడానికి వచ్చారు” అని వారితో అన్నాడు. \p \v 10 వారు, “లేదు ప్రభువా, మీ దాసులమైన మేము ఆహారం కొనడానికి వచ్చాము. \v 11 మేమంతా ఒక్క మనుష్యుని కుమారులము. నీ దాసులమైన మేము యథార్థవంతులం, వేగులవారం కాము” అని అన్నారు. \p \v 12 “లేదు! మా దేశ భద్రత రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చారు” అని యోసేపు వారితో అన్నాడు. \p \v 13 అందుకు వారు, “నీ దాసులమైన మేము పన్నెండుమంది అన్నదమ్ములం, ఒక్క మనుష్యుని కుమారులం, కనాను దేశంలో నివసిస్తాము. మాలో చిన్నవాడు మా తండ్రి దగ్గరే ఉన్నాడు, ఇంకొకడు చనిపోయాడు” అన్నారు. \p \v 14 అప్పుడు యోసేపు వారితో, “నేను మీతో చెప్పిందే నిజం: మీరు వేగులవారే! \v 15 ఫరో జీవం తోడు, మీ తమ్ముడు ఇక్కడకు వస్తేనే తప్ప మీరు ఈ స్థలం విడిచి వెళ్లడానికి వీల్లేదు. \v 16 మీ తమ్మున్ని తీసుకురావడానికి మీలో ఒకర్ని పంపి మిగిలినవారు జైల్లో ఉండాలి, అప్పుడు మీ మాటల్లో సత్యం ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే ఫరో జీవం తోడు, మీరు వేగులవారే!” అని అన్నాడు. \v 17 అతడు వారిని మూడు రోజుల వరకు జైల్లో ఉంచాడు. \p \v 18 మూడవ రోజున యోసేపు వారితో, “మీరు ఒక పని చేస్తే బ్రతికి ఉంటారు, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాన్ని: \v 19 మీరు నిజంగా యథార్థవంతులైతే, మీ సోదరులలో ఒకరిని ఇక్కడ చెరసాలలో ఉండనివ్వండి, మిగితా వారు ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ధాన్యం తీసుకెళ్లండి. \v 20 అయితే మీ చిన్న తమ్మున్ని నా దగ్గరకు తీసుకురావాలి, అప్పుడు మీ మాటలు స్థిరపరచబడతాయి, మీరు చావరు” అని అన్నాడు. వారు అలానే చేశారు. \p \v 21 అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మన తమ్మున్ని బట్టి మనం ఇలా శిక్షించబడుతున్నాము. తనను చంపవద్దని అతడు మనలను ఎంత వేడుకున్నా మనం వినలేదు అప్పుడు అతడు ఎంత బాధపడ్డాడో చూశాం; మనం చేసిన ఆ దోషం వల్లే ఇప్పుడు మనకు ఈ దుస్థితి వచ్చింది” అని మాట్లాడుకున్నారు. \p \v 22 రూబేను జవాబిస్తూ, “ఈ చిన్నవాని పట్ల పాపం చేయవద్దని నేను చెప్పలేదా? అయినా మీరు వినిపించుకోలేదు! ఇప్పుడు తన రక్తం కోసం మనం లెక్క అప్పగించాలి” అన్నాడు. \v 23 యోసేపు దగ్గర భాషను తర్జుమా చేసేవాడు ఉన్నాడని అతడు వారి మాటలు అర్థం చేసుకోగలడని వారు గ్రహించలేదు. \p \v 24 యోసేపు వారి దగ్గర నుండి వెళ్లి ఏడ్చి తిరిగివచ్చి వారితో మళ్ళీ మాట్లాడాడు. వారిలో నుండి షిమ్యోనును పట్టుకుని వారి కళ్లముందే బంధించాడు. \p \v 25 యోసేపు వారి సంచుల్లో ధాన్యం నింపి, ఎవరి బస్తాలో వారి వెండిని తిరిగి పెట్టి, ప్రయాణంలో వారికి అవసరమైన భోజనపదార్థాలు ఇవ్వుమని ఆదేశించాడు. \v 26 వారు తమ ధాన్యాన్ని తమ గాడిదల మీద పెట్టుకుని వెళ్లిపోయారు. \p \v 27 రాత్రి గడపడానికి ఒక స్థలంలో ఆగినప్పుడు, వారిలో ఒకడు గాడిదకు మేతపెడదామని సంచి విప్పాడు, గోనెసంచి విప్పగానే అందులో తన వెండి ఉండడం చూశాడు. \v 28 “నా వెండి నాకు తిరిగి ఇవ్వబడింది, నా గోనెసంచిలోనే అది ఉంది” అని సోదరులకు చెప్పాడు. \p వారి హృదయాలు కలవరపడ్డాయి. వారు వణకుతూ, ఒకరి వైపు ఒకరు తిరిగి, “దేవుడు మనకిలా చేశారేంటి?” అని చెప్పుకున్నారు. \p \v 29 వారు కనాను దేశంలో తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు, తమకు జరిగిందంతా అతనికి చెప్పారు. వారు అన్నారు, \v 30 “ఆ దేశాధిపతి మాతో కఠినంగా మాట్లాడాడు, మేము ఆ దేశానికి వేగుచూడటానికి వచ్చామని అనుకున్నాడు. \v 31 అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము. \v 32 మేము పన్నెండుమంది సోదరులం, ఒక తండ్రి కుమారులము. ఒకడు చనిపోయాడు, కనిష్ఠుడు కనానులో తండ్రి దగ్గర ఉన్నాడు’ అని చెప్పాము. \p \v 33 “ఆ దేశాధిపతి మాతో, ‘ఇలా మీరు యథార్థవంతులని నాకు తెలుస్తుంది: మీ సోదరులలో ఒకరిని ఇక్కడ నా దగ్గర వదిలేసి, ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ఆహారం తీసుకెళ్లండి. \v 34 కాని మీ తమ్మున్ని నా దగ్గరకు తీసుకురండి, తద్వారా మీరు యథార్థవంతులని తెలుసుకుంటాను. అప్పుడు మీ సోదరుని తిరిగి ఇచ్చేస్తాను, ఈ దేశంలో మీరు వ్యాపారం\f + \fr 42:34 \fr*\ft లేదా \ft*\fqa స్వేచ్ఛగా తిరగవచ్చు\fqa*\f* చేసుకోవచ్చు’ అన్నాడు.” \p \v 35 వారు తమ గోనెసంచులను ఖాళీ చేస్తుండగా, ఎవరి గోనెసంచిలో వారి వెండి మూట ఉంది. వారు, వారి తండ్రి, వారి డబ్బు మూటలు చూసి భయపడిపోయారు. \v 36 వారి తండ్రి యాకోబు వారితో, “మీరు నన్ను పిల్లలు కోల్పోయేలా చేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉంది!” అని అన్నాడు. \p \v 37 అప్పుడు రూబేను తన తండ్రితో, “నేను బెన్యామీనును తిరిగి నీ దగ్గరకు తీసుకురాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చు. అతన్ని నాకు అప్పగించు, నేను తిరిగి అతన్ని నీ దగ్గరకు తీసుకువస్తాను” అన్నాడు. \p \v 38 అయితే యాకోబు, “నా కుమారుడు నీతో అక్కడికి రాడు; అతని అన్న చనిపోయాడు, మిగిలింది ఒక్కడే. మీరు వెళ్లే ప్రయాణంలో ఏదైన హాని జరిగితే, మీరు నెరిసిన వెంట్రుకలతో ఉన్న నన్ను దుఃఖంలో సమాధికి తీసుకెళ్తారు” అని అన్నాడు. \c 43 \s1 రెండవసారి ఈజిప్టుకు ప్రయాణం \p \v 1 దేశంలో కరువు ఇంకా తీవ్రంగా ఉంది. \v 2 ఈజిప్టు నుండి తెచ్చుకున్న ధాన్యమంతా వారు తిన్న తర్వాత, వారి తండ్రి వారితో, “మీరు తిరిగివెళ్లి మన కోసం ఇంకా కొంచెం ఆహారం కొనండి” అని అన్నాడు. \p \v 3 కానీ యూదా అతనితో, “ఆ మనుష్యుడు, ‘మీ తమ్ముడు మీతో ఉండే వరకు నన్ను మీరు మళ్ళీ చూడరు’ అని గట్టిగా హెచ్చరించాడు. \v 4 ఒకవేళ మా తమ్మున్ని మాతో పంపితే, మేము వెళ్లి నీకు ఆహారం కొంటాము. \v 5 కానీ ఒకవేళ అతన్ని పంపకపోతే, మేము వెళ్లం ఎందుకంటే, ‘మీ తమ్ముడు మీతో ఉండకపోతే మీరు నన్ను మళ్ళీ చూడరు’ అని ఆ మనుష్యుడు అన్నాడు” అని చెప్పాడు. \p \v 6 “మీకు ఇంకొక సోదరుడున్నాడని చెప్పి ఎందుకు ఈ శ్రమ నాకు తెచ్చి పెట్టారు?” అని ఇశ్రాయేలు అడిగాడు. \p \v 7 వారు, “ఆయన మమ్మల్ని ఖండితంగా ప్రశ్నించాడు. ‘మీ తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? మీకు ఇంకొక సోదరుడు ఉన్నాడా?’ అని అడిగాడు. మేము అతని ప్రశ్నలకు జవాబిచ్చాం అంతే. ‘మీ తమ్మున్ని ఇక్కడకు తీసుకురండి’ అని అంటాడని మాకు ఎలా తెలుస్తుంది?” అని అన్నారు. \p \v 8 అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో, “బాలున్ని నాతో పంపించు, మేము వెంటనే వెళ్తాము. అప్పుడు మేము నీవు మా పిల్లలు చావకుండ బ్రతుకుతాము. \v 9 నేను అతని భద్రతకు హామీ ఇస్తున్నాను; అతని కోసం నన్ను బాధ్యున్ని చేయవచ్చు. నేను అతన్ని నీ దగ్గరకు తిరిగి తీసుకువచ్చి నీ ఎదుట ఉంచకపోతే, నా జీవితం అంతా ఆ నిందను భరిస్తాను. \v 10 ఇలా ఆలస్యం కాకపోయి ఉంటే, రెండవసారి కూడా వెళ్లి వచ్చియుండేవారం” అని అన్నాడు. \p \v 11 అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు, “ఒకవేళ అలాగైతే, ఇలా చేయండి: దేశంలో ఉన్న శ్రేష్ఠమైన వాటిని అంటే ఔషధతైలం, కొంచెం తేనె, కొన్ని సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తా గింజలు, బాదం పప్పులు మీ సంచుల్లో పెట్టుకుని ఆ వ్యక్తికి కానుకగా తీసుకెళ్లండి. \v 12 మీ దగ్గర ఉన్న వెండికి రెట్టింపు తీసుకెళ్లండి, ఎందుకంటే మీ గోనెసంచులలో పెట్టబడిన వెండిని మీరు తిరిగి ఇచ్చేయాలి. బహుశ అది పొరపాటు కావచ్చు. \v 13 మీ సోదరున్ని కూడా తీసుకుని వెంటనే ఆ మనుష్యుని దగ్గరకు తిరిగి వెళ్లండి. \v 14 సర్వశక్తిగల దేవుడు\f + \fr 43:14 \fr*\ft హెబ్రీలో \ft*\fqa ఎల్-షద్దాయ్\fqa*\f* ఆ మనుష్యుని ఎదుట కరుణ చూపును గాక తద్వారా మీ ఇంకొక సోదరుడు బెన్యామీను మీతో తిరిగి వచ్చేలా అనుమతిస్తాడు. నా మట్టుకైతే, ఒకవేళ నేను కోల్పోవలసి వస్తే కోల్పోతాను.” \p \v 15 కాబట్టి ఆ మనుష్యులు కానుకలను, రెట్టింపు డబ్బును, బెన్యామీనును కూడా తీసుకుని త్వరగా ఈజిప్టుకు వెళ్లి యోసేపు ఎదుట హాజరయ్యారు. \v 16 యోసేపు వారితో బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో, “ఈ మనుష్యులను నా ఇంటికి తీసుకెళ్లి, ఒక జంతువును వధించి, భోజనం సిద్ధం చేయి; వారు మధ్యాహ్నం నాతో భోజనం చేస్తారు” అని చెప్పాడు. \p \v 17 ఆ మనుష్యుడు యోసేపు చెప్పినట్టు చేశాడు, వారిని యోసేపు ఇంటికి తీసుకెళ్లాడు. \v 18 యోసేపు వారిని తన ఇంటికి తీసుకెళ్లినందుకు ఆ మనుష్యులు భయపడ్డారు. “మొదటిసారి మన గోనెసంచులలో పెట్టబడిన వెండి గురించి మనం ఇక్కడకు రావలసివచ్చింది. అతడు మనపై దాడి చేసి, మనలను బానిసలుగా బంధించి మన గాడిదలను తీసుకుంటాడు” అని అనుకున్నారు. \p \v 19 కాబట్టి వారు యోసేపు యొక్క గృహనిర్వాహకుని దగ్గరకు వెళ్లి ద్వారం దగ్గర అతనితో మాట్లాడారు. \v 20 “అయ్యా, మా మనవి వినండి. మేము మొదటిసారి ఆహారం కొనడానికే వచ్చాము. \v 21 కానీ మేము రాత్రి గడిపిన స్థలంలో మా గోనెసంచులను విప్పి చూస్తే, ఎవరు ఎంత వెండి తెచ్చారో సరిగ్గా అంతే వెండి వారి గోనెసంచిలో ఉంది. కాబట్టి మేము తిరిగి దానిని తెచ్చాము. \v 22 ఆహారం కొనడానికి మరికొంత వెండిని కూడా తీసుకుని వచ్చాము. మా గోనెసంచులలో వెండిని ఎవరు పెట్టారో మాకు తెలియదు” అన్నారు. \p \v 23 అప్పుడు అతడు, “మీకు క్షేమం కలుగును గాక మీరు భయపడకండి, మీ దేవుడు, మీ తండ్రి యొక్క దేవుడు, ఈ ధనాన్ని మీ గోనెసంచులలో పెట్టారు; మీ వెండి నాకు ముట్టింది” అని అన్నాడు. తర్వాత షిమ్యోనును వారి దగ్గరకు తీసుకువచ్చాడు. \p \v 24 గృహనిర్వాహకుడు ఆ మనుష్యులను యోసేపు ఇంట్లోకి తీసుకెళ్లాడు, కాళ్లు కడుక్కోడానికి వారికి నీళ్లిచ్చాడు, వారి గాడిదలకు మేత పెట్టాడు. \v 25 తాము భోజనం చేయాల్సింది అక్కడే అని విన్నందుకు మధ్యాహ్నం యోసేపు రాక కోసం తమ కానుకలను సిద్ధపరచుకున్నారు. \p \v 26 యోసేపు ఇంటికి రాగానే, వారు ఇంట్లోకి తెచ్చిన కానుకలను అతనికి ఇచ్చి, అతని ఎదుట సాష్టాంగపడ్డారు. \v 27 వారు ఎలా ఉన్నారని వారిని అడిగి, “వృద్ధుడైన మీ తండ్రి గురించి మీరు నాకు చెప్పారు కదా, ఆయన ఎలా ఉన్నారు? ఇంకా బ్రతికే ఉన్నారా?” అని అన్నాడు. \p \v 28 వారు జవాబిస్తూ, “తమ దాసుడు, మా తండ్రి బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అన్నారు, అప్పుడు వారు తలవంచి, సాష్టాంగపడ్డారు. \p \v 29 యోసేపు కళ్ళెత్తి తన తమ్ముడు అనగా తన సొంత తల్లి కుమారుడైన బెన్యామీనును చూసి, “మీరు నాకు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?” అని అడిగి, “నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక!” అని అన్నాడు. \v 30 తమ్మున్ని చూడగానే యోసేపుకు అతని మీద ప్రేమ పొర్లుకు వచ్చింది, అందుకు అతడు వెంటనే లోపలి గదిలోకి వెళ్లి ఏడ్చాడు. \p \v 31 తన ముఖం కడుక్కున్న తర్వాత, తనను తాను అదుపుచేసుకుని, “భోజనం వడ్డించండి” అని చెప్పాడు. \p \v 32 సేవకులు యోసేపుకు తన బల్ల దగ్గర, అతని సోదరులకు వేరే బల్ల దగ్గర, అతనితో భోజనంచేస్తున్న ఈజిప్టువారికి వరుసగా భోజనం వడ్డించారు, ఎందుకంటే హెబ్రీయులతో కలసి భోజనం చేయడం ఈజిప్టువారికి అసహ్యము. \v 33 వారి వయస్సు ప్రకారం మొదటివాడు మొదలుకొని చివరివాని వరకు అతని ఎదుట కూర్చున్నారు; వారు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. \v 34 యోసేపు బల్ల నుండి వారికి భోజనం వడ్డించబడినప్పుడు, ఇతరులకంటే అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. కాబట్టి వారు అతనితో స్వేచ్ఛగా విందు చేసుకున్నారు, త్రాగారు. \c 44 \s1 సంచిలో వెండి గిన్నె \p \v 1 యోసేపు తన ఇంటి గృహనిర్వాహకుని పిలిచి, “ఈ మనుష్యులు మోసికొని వెళ్లగలిగినంత ఆహారంతో వారి సంచులు నింపి ఎవరి గోనెసంచిలో వారు రూకలుగా తెచ్చిన వెండిని కూడా పెట్టు. \v 2 తర్వాత కనిష్ఠుని గోనెసంచిలో మాత్రం ధాన్యం, రూకలుగా తెచ్చిన వెండితో పాటు నా వెండి గిన్నెను పెట్టు” అని సూచించాడు. అతడు యోసేపు చెప్పినట్టు చేశాడు. \p \v 3 తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు వారి గాడిదలతో పాటు పంపబడ్డారు. \v 4 పట్టణం నుండి వారింకా దూరం వెళ్లకముందే, యోసేపు గృహనిర్వాహకునితో, “వెంటనే ఆ మనుష్యుల వెంట వెళ్లు, వారిని పట్టుకున్నప్పుడు, ‘మేలుకు ప్రతిగా కీడును ఎందుకు చేశారు? \v 5 ఇది మా యజమాని త్రాగడానికి, భవిష్యవాణి కోసం ఉపయోగించే గిన్నె కాదా? మీరు చేసింది చెడ్డ పని’ అని వారితో చెప్పు” అన్నాడు. \p \v 6 గృహనిర్వాహకుడు వారిని కలిసినప్పుడు, అవే మాటలు చెప్పాడు. \v 7 అయితే వారు, “మా ప్రభువు ఎందుకు అలా అంటున్నాడు? మీ దాసులకు అలాంటి పని దూరమవును గాక! \v 8 మా గోనెసంచులలో దొరికిన వెండి తిరిగి కనాను దేశం నుండి తెచ్చాము. కాబట్టి వెండి లేదా బంగారం ఎందుకు నీ యజమాని ఇంటి నుండి దొంగిలిస్తాము? \v 9 ఒకవేళ మీ దాసులలో ఎవరి దగ్గరైనా దొరికితే, వాడు చస్తాడు; మిగిలినవారం మా ప్రభువా బానిసలమవుతాం” అని అన్నారు. \p \v 10 అప్పుడు అతడు, “సరే మీరన్నట్టే కానివ్వండి; ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడు నాకు బానిస అవుతాడు, మిగితా వారు నిర్దోషులవుతారు” అని అన్నాడు. \p \v 11 వారంతా త్వరత్వరగా గోనెసంచులను క్రిందికి దించి వాటిని తెరిచారు. \v 12 అప్పుడు గృహనిర్వాహకుడు పెద్దవాడి నుండి ప్రారంభించి చిన్నవాడి వరకు సోదా చేశాడు. ఆ గిన్నె బెన్యామీను గోనెసంచిలో దొరికింది. \v 13 ఇది చూసి వారు తమ బట్టలు చింపుకున్నారు. వారందరు తమ గాడిదల మీద తన గోనెసంచులు ఎత్తుకుని, తిరిగి పట్టణానికి వెళ్లారు. \p \v 14 యూదా అతని సోదరులు వచ్చినప్పుడు యోసేపు ఇంట్లోనే ఉన్నాడు, వారు అతని ఎదుట సాష్టాంగపడ్డారు. \v 15 యోసేపు వారితో, “మీరు చేసిన ఈ పని ఏంటి? నా లాంటి మనుష్యుని భవిష్యవాణి ద్వారా విషయాలు తెలుసుకుంటాడని మీకు తెలియదా?” అని అన్నాడు. \p \v 16 యూదా జవాబిస్తూ, “మా ప్రభువా, మేమేమి చెప్పగలం? మా నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలం? మీ దాసుల అపరాధాన్ని దేవుడు బయటపెట్టారు. మేమిప్పుడు మా ప్రభువు బానిసలం; మాలో ఎవరి సంచిలో గిన్నె దొరుకుతుందో వాడు కూడా మా ప్రభువుకు దాసుడవుతాడు” అన్నాడు. \p \v 17 అయితే యోసేపు, “అలా చేయడం నాకు దూరం అవును గాక! ఎవరి దగ్గర గిన్నె దొరికిందో అతడు మాత్రమే నా బానిస. మిగిలిన మీరు మీ తండ్రి దగ్గరకు సమాధానంగా వెళ్లండి” అన్నాడు. \p \v 18 అప్పుడు యూదా అతని దగ్గరకు వెళ్లి అన్నాడు: “నా ప్రభువా, మీ దాసుని క్షమించి నా ప్రభువుతో ఒక్క మాట మాట్లాడనివ్వండి. మీరు ఫరోతో సమానులైనను మీ దాసునిపై కోప్పడకండి. \v 19 నా ప్రభువు తమ దాసులను, ‘మీకు తండ్రి గాని సోదరుడు గాని ఉన్నాడా?’ అని అడిగారు. \v 20 దానికి మేము, ‘నా ప్రభువా, మాకు వృద్ధుడైన తండ్రి, వృద్ధాప్యంలో తనకు పుట్టిన చిన్నకుమారుడు ఉన్నాడు. అతని అన్న చనిపోయాడు, అతని తల్లి కుమారులలో ఆ ఒక్కడే మిగిలాడు, అతని తండ్రికి ఆ చిన్నవాడంటే చాలా ప్రేమ’ అని చెప్పాము. \p \v 21 “అప్పుడు మీరు మీ దాసులతో, ‘అతన్ని నేను చూడాలి, నా దగ్గరకు తీసుకురండి’ అని అన్నారు. \v 22 అందుకు మేము నా ప్రభువుతో, ‘అతడు తండ్రిని విడిచి ఉండలేడు; ఒకవేళ అతడు విడిచిపెట్టి వస్తే, అతని తండ్రి చనిపోతాడు’ అని చెప్పాము. \v 23 కాని మీరు మీ దాసులతో, ‘మీ చిన్న తమ్ముడు మీతో వస్తేనే తప్ప మీరు నాకు కనబడవద్దు’ అని అన్నారు. \v 24 మేము మా తండ్రి దగ్గరకు వెళ్లి మా ప్రభువు చెప్పిందంతా చెప్పాము. \p \v 25 “మా తండ్రి, ‘ఇంకొంచెం ఆహారం కొనడానికి మళ్ళీ వెళ్లండి’ అన్నాడు. \v 26 అందుకు మేము అతనితో, ‘మేము వెళ్లలేము. మా చిన్న తమ్ముడు మాతో వెళ్తేనే మేము వెళ్తాము. మా చిన్న తమ్ముడు మాతో ఉంటేనే తప్ప మేము వెళ్లి ఆయన ముఖం చూడలేం’ అని చెప్పాము. \p \v 27 “మీ దాసుడైన మా తండ్రి మాతో, ‘నా భార్య నాకు ఇద్దరు కుమారులను కన్నదని మీకు తెలుసు. \v 28 వారిలో ఒకడు వెళ్లి తిరిగి రాలేదు. నిస్సందేహంగా అతన్ని ఏదో అడవి జంతువు చంపి ముక్కలు చేసి ఉంటుంది. అప్పటినుండి అతన్ని నేను చూడలేదు. \v 29 మీరు నా దగ్గర నుండి వీన్ని కూడా తీసుకెళ్తే, వీనికి ఏదైన హాని సంభవిస్తే, దుఃఖిస్తూ ఉన్న, తల నెరసిన ఈ వ్యక్తిని సమాధికి పంపిన వారవుతారు’ అన్నాడు. \p \v 30 “కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు మాతో లేకుండ, మీ దాసుడైన మా తండ్రి దగ్గరకు మేము తిరిగి వెళ్తే, ఈ చిన్నవానితో ముడిపడి ఉన్న మా తండ్రి, \v 31 మాతో చిన్నవాడు లేకపోవడం చూసి, అతడు చనిపోతాడు. మీ దాసులమైన మేము తల నెరిసిన మా తండ్రిని దుఃఖంలోనే సమాధికి తీసుకెళ్లిన వారమవుతాము. \v 32 మీ దాసుడనైన నేను బాలుని భద్రతకు నా తండ్రికి హామీ ఇచ్చాను. ‘నేను అతన్ని తీసుకురాకపోతే, నా జీవితాంతం ఆ నిందను నేను భరిస్తాను’ అని చెప్పాను. \p \v 33 “కాబట్టి ఇప్పుడు, ఈ చిన్నవానికి బదులు నా ప్రభువు యొక్క దాసుని మీ దగ్గర బానిసగా ఉండనివ్వండి, ఈ చిన్నవాన్ని మాత్రం తన సోదరులతో తిరిగి వెళ్లనివ్వండి. \v 34 చిన్నవాడు నాతో లేకుండ నా తండ్రి దగ్గరకు ఎలా తిరిగి వెళ్లగలను? లేదు! నా తండ్రికి కలిగే బాధను నేను చూడలేను.” \c 45 \s1 యోసేపు తనను తాను తెలియజేసుకోవడం \p \v 1 అప్పుడు యోసేపు తన సేవకులందరి ఎదుట తనను తాను అదుపు చేసుకోలేక, “అందరిని నా ఎదుట నుండి పంపివేయండి!” అని బిగ్గరగా చెప్పాడు. తన సోదరులకు తనను తాను తెలియపరచుకున్నప్పుడు యోసేపుతో ఎవరు లేరు. \v 2 అతడు ఈజిప్టువారు వినేటంతగా బిగ్గరగా ఏడ్చాడు, ఫరో ఇంటివారు దాని గురించి విన్నారు. \p \v 3 యోసేపు తన సోదరులతో, “నేను యోసేపును! నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా?” అని అన్నాడు. అతన్ని చూసి అతని సోదరులు కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు. \p \v 4 యోసేపు తన సోదరులతో, “నా దగ్గరకు రండి” అన్నాడు. వారు అతని దగ్గరకు వచ్చాక, “నేను మీ సోదరుడైన యోసేపును, మీరు ఈజిప్టుకు అమ్మివేసినవాన్ని! \v 5 ఇప్పుడు నన్ను ఇక్కడకు అమ్మివేసినందుకు బాధపడకండి, మీపై మీరు కోప్పడకండి, ఎందుకంటే జీవితాలను రక్షించడానికి మీకంటే ముందే దేవుడు నన్ను పంపించారు. \v 6 ఇప్పటికి దేశంలో కరువు వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది, ఇంకా వచ్చే అయిదు సంవత్సరాలు దున్నడం, కోత కోయడం ఉండదు. \v 7 అయితే దేవుడు భూమిపై మిమ్మల్ని సంరక్షించి, మీ జీవితాలను కాపాడడానికి మీకంటే ముందు నన్ను ఇక్కడకు పంపించారు. \p \v 8 “కాబట్టి ఇప్పుడు, నన్ను ఇక్కడకు పంపింది మీరు కాదు, దేవుడే. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటికి ప్రభువుగా, ఈజిప్టు అంతటికి పాలకునిగా చేశారు. \v 9 ఇప్పుడు నా తండ్రి దగ్గరకు వెంటనే వెళ్లి అతనితో, ‘నీ కుమారుడైన యోసేపు ఇలా అన్నాడు: దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద ప్రభువుగా చేశారు. నా దగ్గరకు వచ్చేయండి; ఆలస్యం చేయకండి! \v 10 మీరు, మీ పిల్లలు, మీ మనవళ్లు, మీ మందలు, మీ పశువులు, మీతో ఉన్న సమస్తం గోషేను ప్రాంతంలో నాకు సమీపంగా ఉండవచ్చు. \v 11 ఇంకా రాబోయే అయిదు సంవత్సరాలు కరువు ఉంటుంది అయితే అక్కడ మిమ్మల్ని నేను పోషిస్తాను. లేకపోతే మీకు మీ ఇంటివారికి పేదరికం ఏర్పడుతుంది.’ \p \v 12 “మాట్లాడుతుంది నిజంగా నేనే అని స్వయంగా మీరు, నా తమ్ముడైన బెన్యామీను చూడవచ్చు. \v 13 ఈజిప్టులో నాకు ఇవ్వబడిన ఘనత గురించి, మీరు చూసిన ప్రతి దాని గురించి నా తండ్రికి చెప్పండి. నా తండ్రిని ఇక్కడకు త్వరగా తీసుకురండి” అని చెప్పాడు. \p \v 14 తర్వాత తన సోదరుడైన బెన్యామీనుపై మెడ మీద చేతులు వేసి, ఏడ్చాడు, బెన్యామీను అతన్ని హత్తుకుని ఏడ్చాడు. \v 15 తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. తర్వాత అతని సోదరులు అతనితో మాట్లాడారు. \p \v 16 ఫరో ఇంటివారికి యోసేపు సోదరులు వచ్చారని సమాచారం చేరినప్పుడు, ఫరో, అతని అధికారులందరు సంతోషించారు. \v 17 ఫరో యోసేపుతో, “మీ సోదరులతో, ‘మీరు ఇలా చేయండి: మీ జంతువులను ఎక్కించి, కనాను దేశానికి తిరిగివెళ్లి, \v 18 మీ తండ్రిని మీ కుటుంబాలను తీసుకురండి. ఈజిప్టు దేశంలో శ్రేష్ఠమైన నేలను మీకిస్తాను. మీరు శ్రేష్ఠమైన ఆహారం తినవచ్చు’ అని చెప్పు. \p \v 19 “ఇలా కూడ చెప్పమని ఆదేశిస్తున్నాను, ‘మీరు ఇలా చేయండి: మీ పిల్లలు, మీ భార్యల కోసం ఈజిప్టు నుండి కొన్ని బండ్లను తీసుకెళ్లండి, మీ తండ్రిని తీసుకురండి. \v 20 అక్కడ మీ సామాన్ల గురించి చింతించకండి ఎందుకంటే ఈజిప్టులో శ్రేష్ఠమైనవన్నీ మీవి.’ ” \p \v 21 కాబట్టి ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో ఆజ్ఞమేరకు వారికి బండ్లను ఇచ్చాడు, ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. \v 22 అతడు వారందరికి క్రొత్త బట్టలు ఇచ్చాడు, కాని బెన్యామీనుకు మూడువందల షెకెళ్ళ\f + \fr 45:22 \fr*\ft అంటే సుమారు 3.5 కి. గ్రా. లు\ft*\f* వెండి, అయిదు జతల బట్టలు ఇచ్చాడు. \v 23 తన తండ్రికి పంపించింది ఇది: పది గాడిదల మీద ఈజిప్టులో నుండి శ్రేష్ఠమైన వస్తువులు, పది ఆడగాడిదలు మీద ధాన్యం, ఆహారం, తన ప్రయాణానికి కావలసిన ఇతర సామాగ్రి. \v 24 తర్వాత తన సోదరులను పంపిస్తూ, వారు వెళ్లేటప్పుడు, “మీలో మీరు గొడవపడకండి!” అని చెప్పాడు. \p \v 25 కాబట్టి వారు ఈజిప్టు నుండి వెళ్లారు, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చారు. \v 26 వారు అతనితో, “యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు! నిజానికి, అతడు ఈజిప్టు అంతటికి పాలకుడు” అని చెప్పారు. అది విని యాకోబు ఆశ్చర్యపోయాడు; అతడు వారి మాటను నమ్మలేదు. \v 27 అయితే యోసేపు తమతో చెప్పిందంతా వారు అతనికి చెప్పి, యోసేపు తనను తీసుకెళ్లడానికి పంపిన బండ్లను చూసినప్పుడు, తమ తండ్రియైన యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. \v 28 అప్పుడు ఇశ్రాయేలు, “నాకిది చాలు, నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. నేను చనిపోకముందు వెళ్లి అతన్ని చూస్తాను” అని అన్నాడు. \c 46 \s1 యాకోబు ఈజిప్టుకు వెళ్లుట \p \v 1 కాబట్టి ఇశ్రాయేలు తనకున్నదంతటితో బయలుదేరాడు, బెయేర్షేబకు వచ్చాక, తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులు అర్పించారు. \p \v 2 రాత్రి దర్శనం ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడారు. ఆయన, “యాకోబూ! యాకోబూ!” అని పిలిచారు. \p అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు. \p \v 3 ఆయన, “నేను దేవున్ని, నీ తండ్రి యొక్క దేవున్ని. ఈజిప్టుకు వెళ్లడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. \v 4 నేను నీతో ఈజిప్టుకు వస్తాను, ఖచ్చితంగా నిన్ను తిరిగి తీసుకువస్తాను. యోసేపు స్వహస్తాలే నీ కళ్లు మూస్తాయి” అని అన్నారు. \p \v 5 అప్పుడు యాకోబు బెయేర్షేబ నుండి బయలుదేరాడు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును, వారి పిల్లలను, వారి భార్యలను ఫరో పంపిన బండ్లలో తీసుకెళ్లారు. \v 6 కాబట్టి యాకోబు, అతని సంతానమంతా వారి పశువులతో, కనానులో వారు సంపాదించిన సమస్త సంపదతో ఈజిప్టుకు వెళ్లారు. \v 7 యాకోబు తనతో తన కుమారులను, మనవళ్లను, కుమార్తెలను, మనవరాళ్లను, తన సంతానమంతటిని ఈజిప్టుకు తీసుకువచ్చాడు. \b \lh \v 8 ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల (యాకోబు అతని సంతానం) పేర్లు: \b \li1 రూబేను, యాకోబు యొక్క మొదటి కుమారుడు. \li1 \v 9 రూబేను కుమారులు: \li2 హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. \li1 \v 10 షిమ్యోను కుమారులు: \li2 యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీ యొక్క కుమారుడైన షావూలు. \li1 \v 11 లేవీ కుమారులు: \li2 గెర్షోను, కహాతు, మెరారి. \li1 \v 12 యూదా కుమారులు: \li2 ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (కాని ఏరు, ఓనాను కనాను దేశంలో చనిపోయారు). \li2 పెరెసు కుమారులు: \li3 హెస్రోను, హామూలు. \li1 \v 13 ఇశ్శాఖారు కుమారులు: \li2 తోలా, పువా, యోబు, షిమ్రోను. \li1 \v 14 జెబూలూను కుమారులు: \li2 సెరెదు, ఏలోను, యహలేలు. \lf \v 15 వీరు పద్దనరాములో లేయాకు యాకోబుకు పుట్టిన కుమారులు, దీనా వారి కుమార్తె. కుమారులు, కుమార్తెలు కలిసి వీరంతా ముప్పై ముగ్గురు. \b \li1 \v 16 గాదు కుమారులు: \li2 సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోది, అరేలీ. \li1 \v 17 ఆషేరు కుమారులు: \li2 ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. శెరహు వారి సోదరి. \li2 బెరీయా కుమారులు: \li3 హెబెరు, మల్కీయేలు. \lf \v 18 వీరు లాబాను తన కుమార్తె లేయాకు ఇచ్చిన జిల్పా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం పదహారు మంది. \b \li1 \v 19 యాకోబు భార్య రాహేలు యొక్క కుమారులు: \li2 యోసేపు, బెన్యామీను. \li3 \v 20 ఈజిప్టులో యోసేపుకు ఓను\f + \fr 46:20 \fr*\ft అంటే, హెలియోపొలిస్\ft*\f* పట్టణానికి యాజకుడైన పోతీఫెర కుమార్తె ఆసెనతు ద్వారా మనష్షే, ఎఫ్రాయిం పుట్టారు. \li1 \v 21 బెన్యామీను కుమారులు: \li2 బేల, బెకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు. \lf \v 22 వీరు యాకోబుకు కలిగిన రాహేలు సంతానం మొత్తం పద్నాలుగు మంది. \b \li1 \v 23 దాను కుమారుడు: \li2 హూషీము. \li1 \v 24 నఫ్తాలి కుమారులు: \li2 యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము. \lf \v 25 వీరు లాబాను తన కుమార్తె రాహేలుకు ఇచ్చిన బిల్హా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం ఏడుగురు. \b \lf \v 26 యాకోబుతో ఈజిప్టుకు అతని కుమారుల భార్యలు కాక, యాకోబు సంతతివారు మొత్తం అరవై ఆరు మంది వ్యక్తులు. \v 27 ఈజిప్టులో యోసేపుకు పుట్టిన కుమారులు ఇద్దరితో కలిపి, ఈజిప్టుకు వెళ్లిన యాకోబు కుటుంబీకులంతా డెబ్బైమంది.\f + \fr 46:27 \fr*\ft పాత నిబంధన గ్రీకులో \ft*\fqa డెబ్బై అయిదు\fqa*\f* \b \p \v 28 గోషేనుకు త్రోవ చూపడానికి యాకోబు యూదాను తనకన్నా ముందు యోసేపు దగ్గరకు పంపాడు. వారు గోషేను ప్రాంతం చేరుకున్నప్పుడు, \v 29 యోసేపు తన రథం సిద్ధం చేయించుకుని తన తండ్రి ఇశ్రాయేలును కలవడానికి గోషేనుకు వెళ్లాడు. యోసేపు కనుపరచుకున్న వెంటనే, తన తండ్రిని కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాడు. \p \v 30 ఇశ్రాయేలు యోసేపుతో, “నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను కళ్లారా చూశాను కాబట్టి, ఇప్పుడు హాయిగా చనిపోగలను” అని అన్నాడు. \p \v 31 అప్పుడు యోసేపు తన సోదరులతో తన తండ్రి ఇంటివారితో, “నేను వెళ్లి ఫరోతో మాట్లాడి అతనికి, ‘కనాను దేశంలో నివసించే నా సోదరులు, నా తండ్రి ఇంటివారు నా దగ్గరకు వచ్చారు. \v 32 ఈ మనుష్యులు కాపరులు; వారు పశువులను మేపుతారు, వారు తమ మందలను, పశువులను, వారికి ఉన్నదంతా తెచ్చారు’ అని చెప్తాను. \v 33 ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే, \v 34 ‘మీ సేవకులు మా పితరులు చేసినట్టే బాల్యం నుండి పశువులను మేపేవారము’ అని జవాబివ్వాలి. అప్పుడు గోషేనులో స్థిరపడడానికి మీకు అనుమతి వస్తుంది, ఎందుకంటే గొర్రెల కాపరులంటే ఈజిప్టువారికి అసహ్యం” అని చెప్పాడు. \c 47 \p \v 1 యోసేపు వెళ్లి ఫరోతో, “నా తండ్రి, నా సోదరులు కనాను దేశం నుండి వారి గొర్రెల మందలు, పశువులు, వారి సమస్తంతో వచ్చారు, ఇప్పుడు గోషేనులో ఉన్నారు” అన్నాడు. \v 2 అతడు తన సోదరులలో అయిదుగురిని ఫరోకు ఎదుట కనుపరిచాడు. \p \v 3 ఫరో ఆ సోదరులతో, “మీ వృత్తి ఏంటి?” అని అడిగాడు. \p “మీ దాసులు మా పూర్వికుల్లా గొర్రెల కాపరులు” అని వారు ఫరోకు జవాబిచ్చారు. \v 4 వారు అతనితో, “మేము కొంతకాలం ఇక్కడ నివసించడానికి వచ్చాం ఎందుకంటే కనానులో కరువు తీవ్రంగా ఉంది, మీ దాసుల గొర్రెల మందలకు మేత లేదు. కాబట్టి ఇప్పుడు మీ దాసులను గోషేనులో నివసించనివ్వండి” అని కూడా అన్నారు. \p \v 5 ఫరో యోసేపుతో, “నీ తండ్రి, సోదరులు నీ దగ్గరకు వచ్చారు, \v 6 ఈజిప్టు దేశమంతా నీ ముందుంది; శ్రేష్ఠమైన ప్రాంతంలో నీ తండ్రిని, నీ సోదరులను ఉంచు. గోషేనులో వారు నివసించవచ్చు. వీరిలో ప్రత్యేక సామర్థ్యం కలిగినవారు ఎవరైనా ఉంటే, నా సొంత పశువులకు ముఖ్య కాపరులుగా నియమించు” అన్నాడు. \p \v 7 తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును తీసుకువచ్చి ఫరో ఎదుట కనుపరిచాడు. యాకోబు ఫరోను దీవించిన తర్వాత, \v 8 ఫరో, “నీ వయసెంత?” అని అడిగాడు. \p \v 9 యాకోబు ఫరోతో, “నేను యాత్రచేసిన సంవత్సరాలు నూట ముప్పై. నేను బ్రతికిన సంవత్సరాలు తక్కువ, అవి కూడా శ్రమతో నిండి ఉన్నాయి, అవి నా పూర్వికుల యాత్ర సంవత్సరాలతో సమానం కాదు” అని అన్నాడు. \v 10 తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ఎదుట నుండి వెళ్లిపోయాడు. \p \v 11 కాబట్టి యోసేపు తన తండ్రిని, తన సోదరులను ఈజిప్టులో స్థిరపరచి, దేశంలో శ్రేష్ఠమైన భాగంలో, ఫరో చెప్పినట్టు రామెసేసు జిల్లాను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. \v 12 యోసేపు తన తండ్రికి, తన సోదరులకు, తన తండ్రి ఇంటివారికందరికి వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారాన్ని కూడా అందించాడు. \s1 యోసేపు, కరువు \p \v 13 అయితే దేశమంతటిలో ఆహారం లేదు ఎందుకంటే కరువు తీవ్రంగా ఉంది; ఈజిప్టు కనాను దేశాలు కరువును బట్టి ఆకలితో అలమటించాయి. \v 14 యోసేపు ఈజిప్టు కనాను దేశాలకు, ధాన్యం కొనుగోలుకు వచ్చిన డబ్బు మొత్తం సేకరించి ఫరో రాజభవనానికి తెచ్చాడు. \v 15 ఈజిప్టు కనాను ప్రజల డబ్బు అయిపోయినప్పుడు, ఈజిప్టు వారంతా యోసేపు దగ్గరకు వచ్చి, “మాకు ఆహారం ఇవ్వండి. మీ కళ్లముందే మేము ఎందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అని అన్నారు. \p \v 16 అందుకు యోసేపు, “అలాగైతే మీ పశువులను తీసుకురండి, మీ డబ్బు అయిపోయింది కాబట్టి మీ పశువులకు బదులుగా నేను ఆహారం సరఫరా చేస్తాను” అని అన్నాడు. \v 17 కాబట్టి వారు యోసేపు దగ్గరకు తమ పశువులను తెచ్చారు. వారి గుర్రాలు, గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలకు బదులుగా వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరమంతా వారి పశువులకు బదులుగా ఆహారం అందించాడు. \p \v 18 సంవత్సరం ముగిసిన తర్వాత, మరుసటి సంవత్సరం వారు అతని దగ్గరకు వచ్చి, “మేము మా ప్రభువు నుండి నిజాన్ని దాచలేము, మా డబ్బు అయిపోయింది, మా పశువులు మీకే ఇచ్చాం, ఇక మా శరీరాలు, మా భూమి తప్ప మా ప్రభువుకు ఇవ్వడానికి ఏమీ మిగల్లేదు. \v 19 మేము, మా భూమి మీ కళ్లముందే నశించడం బాగుంటుందా? ఆహారం కోసం మమ్మల్ని, మా భూములను కొనండి. మేము మా భూములతో సహా ఫరోకు బానిసలమవుతాము. మేము చావకుండ బ్రతికేలా పొలాలు పాడైపోకుండ మాకు విత్తనాలు ఇవ్వండి” అని మనవి చేసుకున్నారు. \p \v 20 కాబట్టి యోసేపు ఫరో కోసం ఈజిప్టు భూమి అంతా కొన్నాడు. ఈజిప్టు వారంతా కరువు చాలా తీవ్రంగా ఉండడం వల్ల తమ భూములన్నీ అమ్మివేశారు. భూమి ఫరో ఆధీనంలోనికి వచ్చింది, \v 21 యోసేపు ఈజిప్టు యొక్క సరిహద్దు నుండి ఇంకొక సరిహద్దు వరకు ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చేశాడు. \v 22 అయితే, యాజకులకు చెందిన భూమిని మాత్రం అతడు కొనలేదు. ఎందుకంటే వారు క్రమంగా ఫరో నుండి బత్తెం పొందుకునే వారు, ఆ బత్తెంతో వారికి సరిపడే ఆహారం ఉంది. కాబట్టి వారు తమ భూమిని అమ్మలేదు. \p \v 23 యోసేపు ప్రజలతో, “నేను మీ భూములను మిమ్మల్ని ఈ రోజు ఫరో కోసం కొన్నాను. ఇదిగో మీరు భూమిలో నాటడానికి విత్తనాలు తీసుకోండి. \v 24 అయితే పంట వచ్చినప్పుడు అయిదవ వంతు ఫరోకు ఇవ్వండి. మిగితా నాలుగు వంతులు మీ పొలాల్లో విత్తనం కోసం, మీకూ మీ ఇంటివారికి మీ పిల్లలకు ఆహారం కోసం ఉంచుకోండి” అన్నాడు. \p \v 25 అప్పుడు వారు, “మీరు మా జీవితాలను కాపాడారు. ప్రభువా, మామీద మీ దయ ఉంచండి; మేము ఫరోకు బానిసలుగా ఉంటాం” అని అన్నారు. \p \v 26 కాబట్టి యోసేపు ఈజిప్టు దేశాన్ని ఉద్దేశించి శాసనం నియమించాడు. అది నేటి వరకు ఉంది. పంటంతటిలో అయిదవ వంతు ఫరోకు చెందుతుంది. అయితే యాజకుల స్థలం మాత్రం ఫరోకు చెందలేదు. \p \v 27 ఇశ్రాయేలీయులు ఈజిప్టులో గోషేను ప్రదేశంలో స్థిరపడ్డారు. అక్కడ స్వాస్థ్యం సంపాదించుకుని ఫలించి, సంతానాభివృద్ధి చెందుతూ వేగంగా విస్తరించారు. \p \v 28 యాకోబు ఈజిప్టులో పదిహేడు సంవత్సరాలు జీవించాడు, అతడు జీవించిన సంవత్సరాలు నూట నలభై ఏడు. \v 29 ఇశ్రాయేలు చనిపోయే సమయం సమీపించినప్పుడు, తన కుమారుడైన యోసేపును పిలిపించి, “నీ దృష్టిలో నేను దయ పొందినవాడనైతే, నా తొడ క్రింద చేయి పెట్టి, నా పట్ల మంచితనాన్ని, నమ్మకత్వాన్ని చూపుతావని ప్రమాణం చేయి. ఈజిప్టులో నన్ను పాతిపెట్టకు, \v 30 నా పితరులతో నేను నిద్రించినప్పుడు, ఈజిప్టు నుండి నన్ను తీసుకెళ్లి వారు పాతిపెట్టబడిన దగ్గరే నన్ను పాతిపెట్టు” అని చెప్పాడు. \p “నీవు చెప్పినట్టే చేస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు. \p \v 31 అయితే యాకోబు, “నాతో ప్రమాణం చేయి” అని అన్నాడు. అప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాడు, ఇశ్రాయేలు తన చేతికర్ర మీద ఆనుకుని ఆరాధించాడు.\f + \fr 47:31 \fr*\ft గ్రీకులో ఈ పదం యొక్క అర్థం \ft*\fqa ఆరాధించడం, తల వంచడం, వంగడం \fqa*\ft అలాగే \+xt హెబ్రీ 11:21\+xt* \ft*\ft చూడండి\ft*\f* \c 48 \s1 మనష్షే ఎఫ్రాయిం \p \v 1 కొంతకాలం తర్వాత, “నీ తండ్రి అస్వస్థతతో ఉన్నాడు” అని యోసేపుకు చెప్పబడింది. కాబట్టి తన ఇద్దరు కుమారులు, మనష్షేను ఎఫ్రాయిమును తీసుకెళ్లాడు. \v 2 “నీ కుమారుడు, యోసేపు నీ దగ్గరకు వచ్చాడు” అని యాకోబుకు చెప్పబడినప్పుడు, ఇశ్రాయేలు బలం తెచ్చుకుని పడక మీద కూర్చున్నాడు. \p \v 3 యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు, “సర్వశక్తిగల\f + \fr 48:3 \fr*\ft హెబ్రీలో \ft*\fqa ఎల్-షద్దాయ్\fqa*\f* దేవుడు కనాను దేశంలో లూజు దగ్గర నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి, \v 4 ‘నేను నిన్ను ఫలవంతం చేస్తాను, నీ సంఖ్యను పెంచుతాను. నేను నిన్ను ప్రజల సమాజంగా చేస్తాను, నీ తర్వాత నీ వారసులకు ఈ భూమిని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అని అన్నారు. \p \v 5 “కాబట్టి ఇప్పుడు, నేను నీ దగ్గరకు రాకముందు ఈజిప్టులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా వారిగా లెక్కించబడతారు; రూబేను షిమ్యోనుల్లా, ఎఫ్రాయిం మనష్షే కూడా నా వారిగా ఉంటారు. \v 6 వారి తర్వాత నీకు పిల్లలు పుడితే వారు నీ సంతానమవుతారు; వారు వారసత్వంగా పొందిన భూభాగంలో వారు తమ సోదరుల పేర్లతో లెక్కించబడతారు. \v 7 నేను పద్దన\f + \fr 48:7 \fr*\ft అంటే, వాయువ్య మెసపొటేమియా\ft*\f* నుండి తిరిగి వస్తున్నప్పుడు, మేము ఇంకా దారిలో ఉండగానే, కనాను దేశంలో, ఎఫ్రాతాకు కొద్ది దూరంలో రాహేలు చనిపోయింది. కాబట్టి నేను ఆమెను ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) దారి ప్రక్కన సమాధి చేశాను.” \p \v 8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు. \p \v 9 “వారు దేవుడు నాకు ఇక్కడ అనుగ్రహించిన కుమారులు” అని యోసేపు తన తండ్రికి చెప్పాడు. \p అప్పుడు ఇశ్రాయేలు, “నేను వారిని దీవించేలా వారిని నా దగ్గరకు తీసుకురా” అని అన్నాడు. \p \v 10 ఇశ్రాయేలు వృద్ధాప్యంలో ఉన్నందుకు దృష్టి మందగించింది కాబట్టి అతడు చూడలేకపోయాడు. కాబట్టి యోసేపు తన కుమారులను అతనికి సమీపంగా తెచ్చాడు, తన తండ్రి వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. \p \v 11 ఇశ్రాయేలు యోసేపుతో, “నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, కాని ఇప్పుడు నాకు దేవుడు నీ పిల్లలను కూడా చూసే భాగ్యం ఇచ్చారు” అన్నాడు. \p \v 12 అప్పుడు యోసేపు వారిని ఇశ్రాయేలు మోకాళ్లమీద నుండి తీసివేసి అతనికి తలవంచి నమస్కరించాడు. \v 13 యోసేపు వారిద్దరిని తీసుకుని, ఎఫ్రాయిమును తన కుడివైపు ఇశ్రాయేలుకు ఎడమవైపు మనష్షేను తన ఎడమవైపు ఇశ్రాయేలుకు కుడివైపు ఉంచి అతని దగ్గరకు తీసుకువచ్చాడు. \v 14 అయితే ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా త్రిప్పి చిన్నవాడైన ఎఫ్రాయిం తలపై తన కుడిచేతిని మొదటి కుమారుడైన మనష్షే తలపై తన ఎడమ చేతిని పెట్టాడు. \p \v 15 అప్పుడు అతడు యోసేపును దీవిస్తూ అన్నాడు, \q1 “నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు \q2 ఎవరి ఎదుట నమ్మకంగా నడిచారో ఆ దేవుడు, \q1 నేటి వరకు నా జీవితమంతా \q2 నాకు కాపరిగా ఉన్న దేవుడు, \q1 \v 16 నన్ను ప్రతి హాని నుండి విడిపించిన దూత \q2 ఈ బాలురను దీవించును గాక. \q1 వారు నా నామాన నా పితరులైన \q2 అబ్రాహాము ఇస్సాకుల నామాన పిలువబడుదురు గాక, \q2 భూమిపై వారు గొప్పగా విస్తరించుదురు గాక.” \p \v 17 తన తండ్రి ఎఫ్రాయిం తలపై కుడిచేయి పెట్టడం చూసి యోసేపు అసంతృప్తి చెందాడు; ఎఫ్రాయిం తలపై నుండి మనష్షే తలపైకి చేయి మార్చడానికి తన తండ్రి చేతిని పట్టుకున్నాడు. \v 18 యోసేపు అతనితో, “లేదు, నా తండ్రి, ఇతడు మొదటి కుమారుడు; ఇతని తలపై నీ కుడిచేయిని పెట్టు” అన్నాడు. \p \v 19 కాని అతని తండ్రి ఒప్పుకోకుండా, “నాకు తెలుసు, నా కుమారుడా, నాకు తెలుసు, అతడు కూడా జనాల సమూహమై గొప్పవాడవుతాడు. అయినా, అతని తమ్ముడు అతనికంటే గొప్పవాడవుతాడు, అతని వారసులు జనాల సమూహం అవుతారు” అని చెప్పాడు. \v 20 అతడు వారిని ఆ రోజు దీవిస్తూ అన్నాడు, \q1 “నీ నామంలో ఇశ్రాయేలు ఈ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు: \q2 ‘దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిములా మనష్షేలా చేయును గాక.’ ” \m కాబట్టి ఎఫ్రాయిమును మనష్షేకు ముందుగా పెట్టాడు. \p \v 21 తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, “నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు మీతో ఉంటారు. మిమ్మల్ని తిరిగి మీ పూర్వికుల స్థలమైన కనానుకు తిరిగి తీసుకెళ్తారు. \v 22 నీ సోదరులకంటే ఎక్కువగా ఒక కొండ ప్రాంతం, నా ఖడ్గం, నా విల్లుతో అమోరీయుల దగ్గర నుండి తీసుకున్న కొండ ప్రాంతాన్ని నీకు ఇస్తున్నాను” అని చెప్పాడు. \c 49 \s1 యాకోబు తన కుమారులను దీవించుట \p \v 1 యాకోబు తన కుమారులను పిలిపించి ఇలా అన్నాడు: “చుట్టూ కూడి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏమి జరగబోతుందో నేను మీకు చెప్తాను. \q1 \v 2 “యాకోబు కుమారులారా, సమావేశమై వినండి \q2 మీ తండ్రియైన ఇశ్రాయేలు చెప్పేది వినండి. \b \q1 \v 3 “రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, \q2 నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు, \q2 ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు \q1 \v 4 కానీ నీళ్లలా అస్థిరంగా ఉండే నీవు ఇకపై రాణించవు, \q2 ఎందుకంటే నీవు నీ తండ్రి మంచం ఎక్కావు, \q2 నా పడకను అపవిత్రం చేశావు. \b \q1 \v 5 “షిమ్యోను లేవీ సోదరులు \q2 వారి ఖడ్గాలు హింసాయుధాలు. \q1 \v 6 వారి సమావేశాల్లో నేను ప్రవేశించకుందును గాక, \q2 నా ఘనతను వారి కూడికలో చేర్చకుందును గాక, \q1 ఎందుకంటే వారి కోపంలో వారు మనుష్యులను చంపేశారు \q2 సరదా కోసం ఎడ్ల కాలి నరాలు తెగగొట్టారు. \q1 \v 7 వారి కోపం శపించబడాలి, అది భయంకరమైనది, \q2 వారి ఆగ్రహం ఎంతో క్రూరమైనది! \q1 వారిని యాకోబులో చెల్లాచెదురు చేస్తాను, \q2 ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను. \b \q1 \v 8 “యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసిస్తారు; \q2 నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది; \q2 నీ తండ్రి కుమారులు నీకు తలవంచుతారు \q1 \v 9 యూదా, నీవు ఒక కొదమసింహం; \q2 నా కుమారుడా, నీవు వేటాడి తిరిగి వచ్చావు. \q1 అతడు సింహంలా కాళ్లు ముడుచుకుని, \q2 ఆడ సింహంలా పడుకుంటాడు, అతన్ని లేపడానికి ఎవరు తెగిస్తారు? \q1 \v 10 రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, \q2 అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, \q1 అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, \q2 దేశాలు అతనికి విధేయులై ఉంటాయి. \q1 \v 11 అతడు ద్రాక్షచెట్టుకు తన గాడిదను, \q2 మంచి ద్రాక్షచెట్టుకు గాడిద పిల్లను కడతాడు; \q1 అతడు ద్రాక్షరసంలో తన బట్టలను, \q2 ద్రాక్షరసంలో తన వస్త్రాలను ఉతుకుతాడు. \q1 \v 12 అతని కళ్లు ద్రాక్షరసం కంటే ఎర్రగా, \q2 అతని పళ్లు పాలకంటే తెల్లగా ఉంటాయి. \b \q1 \v 13 “జెబూలూను సముద్రతీరాన నివసిస్తాడు \q2 ఓడలకు రేవు అవుతాడు; \q2 అతని సరిహద్దు సీదోను వరకు వ్యాపిస్తుంది. \b \q1 \v 14 “ఇశ్శాఖారు రెండు గొర్రెల దొడ్ల మధ్య \q2 పడుకుని ఉన్న బలమైన గాడిద వంటివాడు. \q1 \v 15 అతడు తన విశ్రాంతి స్థలం ఎంత మంచిదో, \q2 అతని నేల ఎంత ఆహ్లాదకరమో చూసినప్పుడు, \q1 అతడు భుజం వంచి శ్రమించి, \q2 వెట్టిచాకిరికి సమర్పించుకుంటాడు. \b \q1 \v 16 “దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంలా \q2 తన ప్రజలకు న్యాయం చేస్తాడు. \q1 \v 17 దాను దారిన ఉండే పాములా, \q2 మార్గంలో ఉండే విషసర్పంలా, \q1 గుర్రాల మడిమెలు కాటు వేస్తాడు. \q2 అప్పుడు స్వారీ చేస్తున్నవాడు వెనుకకు పడతాడు. \b \q1 \v 18 “యెహోవా! మీ రక్షణ కోసం వేచియున్నాను. \b \q1 \v 19 “గాదు దోపిడి మూక ద్వారా దాడి చేయబడతాడు, \q2 కానీ అతడు వారి మడిమెలను కొడతాడు. \b \q1 \v 20 “ఆషేరుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది; \q2 రాజులకు తగిన భోజనం అతడు సమకూరుస్తాడు. \b \q1 \v 21 “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి \q2 అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు.\f + \fr 49:21 \fr*\ft లేదా \ft*\fq స్వేచ్ఛ \fq*\fqa అతడు మధురమైన మాటలు పలుకుతాడు\fqa*\f* \b \q1 \v 22 “యోసేపు ఫలించే కొమ్మ, \q2 నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ \q2 దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి. \q1 \v 23 అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; \q2 అతనిపై బాణాలు విసిరారు. \q1 \v 24 కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, \q2 అతని చేతులు బలంగా ఉన్నాయి, \q1 ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, \q2 కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి, \q1 \v 25 నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవున్ని బట్టి, \q2 పైనున్న ఆకాశాల దీవెనలతో, \q1 క్రింది అగాధజలాల దీవెనలతో, \q2 స్తనాల దీవెనలతో గర్భం యొక్క దీవెనలతో, \q2 నిన్ను ఆశీర్వదించే సర్వశక్తిమంతున్ని బట్టి బలపరచబడ్డాయి. \q1 \v 26 నీ తండ్రి ఆశీర్వాదాలు \q2 పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే, \q2 ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి. \q1 ఇవన్నీ యోసేపు తలమీద, \q2 తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి. \b \q1 \v 27 “బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు; \q2 ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు, \q2 సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.” \p \v 28 ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలు. వారి తండ్రి ఎవరి దీవెన ప్రకారం వారిని దీవిస్తూ వారికి చెప్పింది అదే. \s1 యాకోబు మరణం \p \v 29-30 తర్వాత అతడు వారికి ఈ సూచనలు ఇచ్చాడు: “నేను నా జనుల దగ్గరకు చేరబోతున్నాను. మీరు నన్ను నా పూర్వికుల దగ్గర, హిత్తీయుడైన ఎఫ్రోను గుహలో, కనానులో మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో, అంటే అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న గుహలో పాతిపెట్టండి. \v 31 అక్కడే అబ్రాహాము అతని భార్య శారా సమాధి చేయబడ్డారు, అక్కడే ఇస్సాకు అతని భార్య రిబ్కా సమాధి చేయబడ్డారు, అక్కడే నేను లేయాను సమాధి చేశాను. \v 32 ఆ పొలం, అందులోని గుహ హిత్తీయుల దగ్గర కొనబడ్డాయి.” \p \v 33 యాకోబు తన కుమారులకు సూచనలు ఇచ్చిన తర్వాత, మంచంపై తన కాళ్లు ముడుచుకుని తుది శ్వాస విడిచాడు, తన ప్రజల దగ్గరకు చేర్చబడ్డాడు. \c 50 \p \v 1 యోసేపు తన తండ్రి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు. \v 2 తర్వాత తన తండ్రి ఇశ్రాయేలు శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచమని వైద్యులకు ఆదేశించాడు. \v 3 కాబట్టి వైద్యులు పూర్తి నలభై రోజులు తీసుకుని భద్రపరిచారు, ఎందుకంటే భద్రపరచడానికి అవసరమయ్యే సమయం అది. ఈజిప్టువారు అతని కోసం డెబ్బై రోజులు దుఃఖించారు. \p \v 4 సంతాప దినాలు గడిచాక, యోసేపు ఫరో ఇంటివారితో, “నేను మీ దృష్టిలో దయ పొందితే, నా పక్షాన ఫరోతో మాట్లాడండి. అతనితో, \v 5 ‘నా తండ్రి నా చేత ప్రమాణం చేయించుకుని, “నేను చనిపోబోతున్నాను; కనాను దేశంలో నా కోసం నేను త్రవ్వించుకున్న సమాధిలో నన్ను పాతిపెట్టండి” అని చెప్పాడు. కాబట్టి నాకు సెలవిస్తే నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి తిరిగి వస్తాను’ అని చెప్పండి” అని అన్నాడు. \p \v 6 అప్పుడు ఫరో, “నీవు వెళ్లి, అతడు నీతో ప్రమాణం చేయించినట్టు నీ తండ్రిని పాతిపెట్టు” అన్నాడు. \p \v 7 కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు అతనితో ఫరో అధికారులందరు, అతని ఇంటి పెద్దలు, ఈజిప్టు ఉన్నతాధికారులందరు, \v 8 యోసేపు ఇంటివారందరు, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారితో వెళ్లారు. కేవలం వారి పిల్లలను, వారి మందలను, పశువులను గోషేనులో విడిచిపెట్టారు. \v 9 రథాలు, రథసారధులు కూడా అతనితో వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు. \p \v 10 వారు యొర్దాను దగ్గర ఉన్న ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర చేరినప్పుడు, వారు బిగ్గరగా, ఘోరంగా ఏడ్చారు; అక్కడ తన తండ్రి కోసం యోసేపు ఏడు రోజుల సంతాప కాలం పాటించాడు. \v 11 అక్కడ నివసించే కనానీయులు ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర ఏడ్వడం చూసి, “ఈజిప్టువారు శోకంతో సంతాప వేడుకను జరుపుకుంటున్నారు” అని అన్నారు. అందుకే యొర్దాను దగ్గర ఉన్న ఆ స్థలం ఆబేల్-మిస్రాయిము అని పిలువబడింది. \p \v 12 కాబట్టి యాకోబు ఆజ్ఞాపించినట్టు అతని కుమారులు చేశారు: \v 13 అతన్ని కనాను దేశానికి మోసుకెళ్లి, అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలంలో ఉన్న గుహలో సమాధి చేశారు. \v 14 తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత యోసేపు తన సోదరులతో, సమాధి కార్యక్రమానికి వచ్చిన వారందరితో ఈజిప్టుకు తిరిగి వెళ్లాడు. \s1 యోసేపు సోదరులకు మళ్ళీ అభయమిస్తాడు \p \v 15 తమ తండ్రి చనిపోయాడని యోసేపు సోదరులు చూసి, “ఒకవేళ యోసేపు మనపై కక్ష పెట్టుకుని మనం చేసిన తప్పులకు ప్రతి కీడు చేస్తే ఎలా?” అని అనుకున్నారు. \v 16 కాబట్టి వారు యోసేపుకు ఇలా కబురు పంపారు, “నీ తండ్రి చనిపోకముందు ఇలా ఈ సూచనలు ఇచ్చాడు: \v 17 ‘యోసేపుతో ఇలా మీరు చెప్పాలి: నీ సోదరులు నిన్ను హీనంగా చూస్తూ నీ పట్ల చేసిన పాపాలను తప్పులను క్షమించమని చెప్తున్నాను.’ కాబట్టి దయచేసి నీ తండ్రి యొక్క దేవుని సేవకుల పాపాలను క్షమించు.” వారి కబురు అందిన తర్వాత యోసేపు ఏడ్చాడు. \p \v 18 అప్పుడు తన సోదరులు అతని దగ్గరకు వచ్చి సాష్టాంగపడి, “మేము నీ బానిసలం” అన్నారు. \p \v 19 అయితే యోసేపు వారితో, “భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా? \v 20 మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ ఎంతోమంది జీవితాలను కాపాడడానికి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని సాధించడానికి దేవుడు దానిని మేలుకే మార్చారు. \v 21 కాబట్టి ఇప్పుడు భయపడకండి. నేను మీకు, మీ పిల్లలకు సమకూరుస్తాను” అని అన్నాడు. అతడు వారికి మళ్ళీ అభయమిచ్చి దయతో మాట్లాడాడు. \s1 యోసేపు మరణం \p \v 22 యోసేపు తన తండ్రి కుటుంబంతో కలిసి ఈజిప్టులో నివసించాడు. అతడు నూటపది సంవత్సరాలు జీవించాడు, \v 23 ఎఫ్రాయిం పిల్లల మూడవ తరాన్ని చూశాడు. మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన పిల్లలు కూడా యోసేపు సొంతవారిగా పెరిగారు.\f + \fr 50:23 \fr*\ft హెబ్రీలో \ft*\fqa పుట్టినప్పుడు అతని మోకాళ్లమీద పెట్టారు\fqa*\f* \p \v 24 యోసేపు తన సోదరులతో, “నేను చనిపోబోతున్నాను. అయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించి, ఈ దేశం నుండి ఆయన అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని చెప్పాడు. \v 25 యోసేపు ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకుని, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తారు, అప్పుడు మీరు ఈ స్థలం నుండి నా ఎముకలను తీసుకెళ్లండి” అని చెప్పాడు. \p \v 26 యోసేపు నూటపది సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. అతని శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచాక, ఈజిప్టులో అతని శరీరాన్ని ఒక శవపేటికలో ఉంచారు.