\id EZR - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h ఎజ్రా \toc1 ఎజ్రా గ్రంథం \toc2 ఎజ్రా \toc3 ఎజ్రా \mt1 ఎజ్రా \mt2 గ్రంథం \c 1 \s1 బందీలు తిరిగి వెళ్లడానికి కోరెషు సహాయం చేయుట \p \v 1 పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు: \pmo \v 2 “పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: \pm “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు. \v 3 మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా యూదాలోని యెరూషలేముకు వెళ్లి మందిరాన్ని నిర్మించవచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, యెరూషలేములో ఉన్న దేవుడైన వారి దేవుడు వారికి తోడుగా ఉండును గాక. \v 4 మిగిలి ఉన్నవారు ఇప్పుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం ప్రజలు వారికి వెండి, బంగారాలను, సామాగ్రిని, పశువులను యెరూషలేములోని దేవుని ఆలయానికి స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి.’ ” \p \v 5 అప్పుడు యూదా, బెన్యామీనీయుల కుటుంబ పెద్దలు, యాజకులు, లేవీయులు, దేవునిచే ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టేందుకు వెళ్లడానికి సిద్ధపడ్డారు. \v 6 వారి పొరుగువారందరు తమ స్వేచ్ఛార్పణలతో పాటు వెండి, బంగారం, సామాగ్రి, పశువులు, విలువైన కానుకలు ఇచ్చి వారికి సహాయం చేశారు. \p \v 7 అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకెళ్లి తన దేవుని\f + \fr 1:7 \fr*\ft లేదా \ft*\fqa దేవుళ్ళు\fqa*\f* గుడిలో ఉంచిన యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులను రాజైన కోరెషు బయటకు తెప్పించాడు. \v 8 పర్షియా రాజైన కోరెషు తన కోశాధికారియైన మిత్రిదాతుతో వాటిని తెప్పించి, అతడు వాటిని లెక్కించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు అప్పగించాడు. \b \lh \v 9 ఆ జాబితాలో ఉన్న వస్తువులు: \b \li1 బంగారు పాత్రలు 30; \li1 వెండి పాత్రలు 1,000; \li1 వెండి కడాయిలు 29; \li1 \v 10 బంగారు గిన్నెలు 30; \li1 వెండి గిన్నెలు 410; \li1 ఇతర వస్తువులు 1,000. \b \lf \v 11 వెండి బంగారు వస్తువులు అన్ని కలిపి మొత్తం 5,400. \b \p షేష్బజ్జరు వీటన్నిటితో పాటు బబులోనులో బందీలుగా ఉండి విడిపించబడిన వారందరిని తీసుకుని యెరూషలేముకు వెళ్లాడు. \c 2 \s1 చెర నుండి తిరిగి వచ్చినవారి జాబితా \lh \v 1 బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి, \v 2 జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరే, బిగ్వయి, రెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు: \b \lh ఇశ్రాయేలు ప్రజల పురుషుల జాబితా: \v 3 పరోషు వారసులు 2,172; \li1 \v 4 షెఫట్యా వారసులు 372; \li1 \v 5 ఆరహు వారసులు 775; \li1 \v 6 పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,812; \li1 \v 7 ఏలాము వారసులు 1,254; \li1 \v 8 జత్తూ వారసులు 945; \li1 \v 9 జక్కయి వారసులు 760; \li1 \v 10 బానీ వారసులు 642; \li1 \v 11 బేబై వారసులు 623; \li1 \v 12 అజ్గాదు వారసులు 1,222; \li1 \v 13 అదోనీకాము వారసులు 666; \li1 \v 14 బిగ్వయి వారసులు 2,056; \li1 \v 15 ఆదీను వారసులు 454; \li1 \v 16 అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98; \li1 \v 17 బేజయి వారసులు 323; \li1 \v 18 యోరా వారసులు 112; \li1 \v 19 హాషుము వారసులు 223; \li1 \v 20 గిబ్బారు వారసులు 95; \li1 \v 21 బేత్లెహేము వారసులు 123; \li1 \v 22 నెటోపా వారసులు 56; \li1 \v 23 అనాతోతు వారసులు 128; \li1 \v 24 అజ్మావెతు వారసులు 42; \li1 \v 25 కిర్యత్-యారీము, కెఫీరా, బెయేరోతు వారసులు 743; \li1 \v 26 రామా, గెబా వారసులు 621; \li1 \v 27 మిక్మషు వారసులు 122; \li1 \v 28 బేతేలు, హాయి వారసులు 223; \li1 \v 29 నెబో వారసులు 52; \li1 \v 30 మగ్బీషు వారసులు 156; \li1 \v 31 మరొక ఏలాము వారసులు 1,254; \li1 \v 32 హారీము వారసులు 320; \li1 \v 33 లోదు, హదీదు, ఓనో వారసులు 725; \li1 \v 34 యెరికో వారసులు 345; \li1 \v 35 సెనాయా వారసులు 3,630. \b \lh \v 36 యాజకులు: \li1 యెషూవ కుటుంబీకుడైన యెదాయా వారసులు 973; \li1 \v 37 ఇమ్మేరు వారసులు 1,052; \li1 \v 38 పషూరు వారసులు 1,247; \li1 \v 39 హారీము వారసులు 1,017. \b \lh \v 40 లేవీయులు: \li1 యెషూవ కద్మీయేలు వారసులు (హోదవ్యా కుటుంబం నుండి) 74. \b \lh \v 41 సంగీతకారులు: \li1 ఆసాపు వారసులు 128. \b \lh \v 42 ఆలయ ద్వారపాలకులు: \li1 షల్లూము, అటేరు, టల్మోను, \li1 అక్కూబు, హటీటా, షోబయి \li1 అనేవారి వారసులు 139. \b \lh \v 43 ఆలయ సేవకులు: \li1 జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు, \li1 \v 44 కేరోసు, సీయహా, పాదోను వారసులు, \li1 \v 45 లెబానా, హగాబా, అక్కూబు వారసులు, \li1 \v 46 హాగాబు, షల్మయి, హానాను వారసులు, \li1 \v 47 గిద్దేలు, గహరు, రెవాయా వారసులు, \li1 \v 48 రెజీను, నెకోదా, గజ్జాము వారసులు, \li1 \v 49 ఉజ్జా, పాసెయ, బేసాయి వారసులు, \li1 \v 50 అస్నా, మెహూనీము, నెఫూసీము వారసులు, \li1 \v 51 బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు, \li1 \v 52 బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు, \li1 \v 53 బర్కోసు, సీసెరా, తెమహు వారసులు, \li1 \v 54 నెజీయహు, హటీపా వారసులు. \lh \v 55 సొలొమోను సేవకుల వారసులు: \li1 సొటయి, హస్సోఫెరెతు, పెరూదా వారసులు, \li1 \v 56 యహలా, దర్కోను, గిద్దేలు వారసులు, \li1 \v 57 షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, అమీ వారసులు. \lf \v 58 ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392. \b \lh \v 59 తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు. అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు: \li1 \v 60 దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు, మొత్తం 652. \b \lh \v 61 యాజకుల వారసులు: \li1 హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వారసులు (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు). \lf \v 62 వీరు వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు. \v 63 ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు. \b \lf \v 64 సమూహం మొత్తం సంఖ్య 42,360, \v 65 వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 200 మంది. \v 66 వారికి 736 గుర్రాలు, 245 కంచరగాడిదలు, \v 67 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి. \b \p \v 68 వారు యెరూషలేములో యెహోవా ఆలయానికి చేరుకున్నప్పుడు, కుటుంబ పెద్దలలో కొందరు ఆ స్థలంలో దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి స్వేచ్ఛార్పణలు ఇచ్చారు. \v 69 వారు ఈ పని కోసం తమ శక్తి కొద్ది 61,000 డారిక్కుల\f + \fr 2:69 \fr*\ft అంటే, సుమారు 500 కి. గ్రా. లు\ft*\f* బంగారం, 5,000\f + \fr 2:69 \fr*\ft అంటే, సుమారు 3 టన్నులు\ft*\f* మీనాల వెండిని, యాజకులకు 100 వస్త్రాలను ఇచ్చారు. \p \v 70 యాజకులు, లేవీయులు, సంగీతకారులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు, తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇతర ప్రజల్లో కొంతమంది మిగిలిన ఇశ్రాయేలీయులతో పాటు తమ పట్టణాల్లో స్థిరపడ్డారు. \c 3 \s1 బలిపీఠాన్ని తిరిగి కట్టుట \p \v 1 ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణాల్లో స్థిరపడినప్పుడు, ప్రజలు ఒక్కటిగా యెరూషలేములో సమావేశమయ్యారు. \v 2 అప్పుడు యోజాదాకు కుమారుడైన యెషూవ, అతని తోటి యాజకులు, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, అతని తోటి పనివారు దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారంగా దహనబలులు అర్పించడానికి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టారు. \v 3 వీరికి అక్కడి ప్రజల భయం ఉన్నా, బలిపీఠాన్ని దాని పునాదుల మీదనే కట్టి, ఉదయ సాయంత్రాల్లో యెహోవాకు దహనబలులు క్రమంగా అర్పిస్తూ వచ్చారు. \v 4 తర్వాత ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధంగా గుడారాల పండుగ చేసుకుని నియమించబడిన సంఖ్య ప్రకారం ప్రతిరోజు దహనబలులు అర్పించారు. \v 5 దాని తర్వాత క్రమంగా దహనబలులు, అమావాస్య బలులు, యెహోవా యొక్క పరిశుద్ధ పండుగలకు అర్పించవలసిన బలులు, అదే విధంగా ఒక్కొక్కరు తీసుకువచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించారు. \v 6 యెహోవా ఆలయానికి ఇంకా పునాది వేయనప్పటికి, ఏడవ నెల మొదటి రోజు నుండి వారు యెహోవాకు దహనబలులు అర్పించడం మొదలుపెట్టారు. \s1 మందిరాన్ని తిరిగి నిర్మించుట \p \v 7 అప్పుడు వారు తాపీ మేస్త్రీలకు, వడ్రంగులకు డబ్బులు ఇచ్చారు. పర్షియా రాజైన కోరెషు ఆదేశం ప్రకారం దేవదారు మ్రానులను సముద్రం ద్వారా లెబానోను నుండి యొప్ప పట్టణానికి చేర్చడానికి సీదోనీయులకు, తూరువారికి భోజనపదార్థాలు, ఒలీవనూనె ఇచ్చారు. \p \v 8 యెరూషలేములోని దేవుని ఆలయానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ యాజకులు, ఇతర ప్రజలు (యాజకులు, లేవీయులు, బందీ నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చిన వారందరు) పని ప్రారంభించారు. లేవీయులలో ఇరవై సంవత్సరాలకన్నా ఎక్కువ వయస్సున్న వారిని యెహోవా మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించారు. \v 9 వీరితో పాటు యెషూవ అతని కుమారులు, అతని సోదరులు, కద్మీయేలు అతని కుమారులు (యూదా\f + \fr 3:9 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యెహూదా \fqa*\ft హోదవ్యాకు మరొక రూపం\ft*\f* వారసులు), హేనాదాదు కుమారులు, వారి సోదరులైన లేవీయులందరు దేవుని మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించబడ్డారు. \p \v 10 నిర్మించేవారు యెహోవా ఆలయానికి పునాది వేసినప్పుడు ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన ప్రకారం యాజకులు ప్రత్యేక వస్త్రాలను ధరించి బూరలు పట్టుకుని, ఆసాపు కుమారులైన లేవీయులు తాళాలు పట్టుకుని యెహోవాను కీర్తించడానికి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. \v 11 కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు: \q1 “ఆయన మంచివారు. \q2 ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.” \m యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు. \v 12 అయితే గతంలో ఉన్న మందిరాన్ని తమ కళ్లతో చూసిన వృద్ధులైన యాజకులు, లేవీయులు, నాయకులు చాలామంది, ఇప్పుడు వేస్తున్న మందిర పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. మరికొందరు సంతోషంతో కేకలు వేశారు. \v 13 అక్కడ ఉన్న ప్రజలు చాలా పెద్దగా శబ్దం చేయడంతో సంతోషంతో వేసిన కేకలకు, దుఃఖంతో వేసిన కేకలకు తేడా తెలుసుకోలేకపోయారు. ఆ శబ్దం చాలా దూరం వరకు వినబడింది. \c 4 \s1 తిరిగి కట్టకూడదని వ్యతిరేకత \p \v 1 చెర నుండి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కడుతున్నారని యూదా, బెన్యామీనీయుల శత్రువులు విని, \v 2 జెరుబ్బాబెలు దగ్గరకు, కుటుంబ పెద్దల దగ్గరకు వచ్చి, “అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చినప్పటి నుండి మీలాగే మేము కూడా మీ దేవుని వెదకుతున్నాం, ఆయనకు బలులు అర్పిస్తూ ఉన్నాం కాబట్టి నిర్మాణంలో మేము మీకు సహాయం చేస్తాం” అన్నారు. \p \v 3 అయితే జెరుబ్బాబెలు, యెషూవ, మిగిలిన కుటుంబ పెద్దలు, “మా దేవుని ఆలయ నిర్మాణంలో మీకు పాలు లేదు. పర్షియా రాజైన కోరెషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరాన్ని మేమే కడతాం” అన్నారు. \p \v 4 అప్పుడు ఆ దేశ ప్రజలు యూదా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ కడుతున్నవారిని భయపెట్టారు. \v 5 పర్షియా రాజైన కోరెషు పరిపాలించిన కాలం నుండి పర్షియా రాజైన దర్యావేషు పరిపాలించిన కాలం వరకు యూదా వారి ప్రణాళికలను చెడగొట్టడానికి వారు అధికారులకు లంచాలు ఇచ్చారు. \s1 అహష్వేరోషు, అర్తహషస్తల పాలనలో వ్యతిరేకత \p \v 6 అహష్వేరోషు పరిపాలన ఆరంభంలో యూదా వారి మీద, యెరూషలేము వారిమీద ఫిర్యాదు చేస్తూ ఉత్తరం వ్రాసి పంపారు. \p \v 7 పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న సమయంలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు వారి సహచరులు అర్తహషస్తకు ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరం అరామిక్ లిపిలో, అరామిక్ భాషలో వ్రాయబడింది.\f + \fr 4:7 \fr*\ft లేదా \ft*\fqa అరామిక్ లిపిలో వ్రాయబడి అరామిక్ భాషలో అనువదించబడింది\fqa*\f*\f + \fr 4:7 \fr*\ft \+xt 4:8–6:18\+xt* ఉన్న భాగం అరామిక్ భాషలో ఉంది\ft*\f* \p \v 8 ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, యెరూషలేము వారి మీద ఫిర్యాదు చేస్తూ రాజైన అర్తహషస్తకు ఇలా ఉత్తరం వ్రాశారు: \pmo \v 9 ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, వారి తోటి ఉద్యోగులు అనగా పర్షియా, ఎరెకు, బబులోను, షూషనుకు చెందిన ఏలామీయుల న్యాయాధిపతులు, అధికారులు, \v 10 గొప్పవాడు గౌరవనీయుడైన ఆస్నప్పరు\f + \fr 4:10 \fr*\fqa ఆషుర్బనిపలు \fqa*\fq ఆస్నప్పరు \fq*\ft యొక్క మరొక రూపం\ft*\f* విడుదల చేయగా, సమరయ పట్టణంలో యూఫ్రటీసు నదిని అవతల నివసించే ఇతర ప్రజలు వ్రాస్తున్న ఉత్తరము. \p \v 11 (ఇది వారు రాజుకు వ్రాసిన ఉత్తరానికి నకలు.) \pmo రాజైన అర్తహషస్తకు, \pmo యూఫ్రటీసు నది అవతల ఉంటున్న మీ సేవకులు వ్రాస్తున్న ఉత్తరము. \pm \v 12 రాజైన మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీ దగ్గర నుండి మా దగ్గరకు వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు గోడలను మరలా కడుతూ పునాదులను మరమ్మత్తు చేస్తున్నారు. \pm \v 13 అంతేకాక, మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, ఒకవేళ వీరే ఈ పట్టణాన్ని కట్టి దాని ప్రాకారాలు తిరిగి నిర్మిస్తే వారు పన్నులు గాని కప్పం గాని లేదా సుంకం గాని చెల్లించరు. తద్వారా రాజ్య ఆదాయానికి నష్టం కలుగుతుంది. \v 14 మేము రాజుకు కట్టుబడి ఉన్నాం కాబట్టి రాజుకు అవమానం జరిగితే చూడలేము. అందుకే రాజుకు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాము. \v 15 మీ పూర్వికులు వ్రాసిన చరిత్రను పరిశీలన చేయండి. వాటిలో ఈ పట్టణస్థులు తిరుగుబాటుదారులని, రాజులకు దేశాలకు హాని చేశారని, దేశద్రోహులని తెలుస్తుంది. ఆ కారణంగానే ఆ పట్టణం నాశనం అయ్యింది. \v 16 వీరు ఈ పట్టణాన్ని కట్టి దాని గోడలను మరలా కడితే, యూఫ్రటీసు నది అవతలి ప్రాంతంలో ఏది కూడా మీ ఆధీనంలో ఉండదని రాజుకు తెలియజేస్తున్నాము. \p \v 17 దానికి రాజు ఇచ్చిన సమాధానం ఇది: \pmo ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, సమరయలో యూఫ్రటీసు నది అవతలి ప్రాంతంలో నివసించేవారి సహోద్యోగులకు: \pmo శుభాలు. \pm \v 18 మీరు మాకు పంపిన ఉత్తరాన్ని నా ఎదుట చదివి అనువదించారు. \v 19 నా ఆజ్ఞ ప్రకారం పరిశోధించగా ఈ పట్టణానికి రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సుదీర్ఘ చరిత్ర ఉందని, అది తిరుగుబాటుకు దేశద్రోహానికి స్థానమని తెలిసింది. \v 20 గతంలో యెరూషలేమును పరిపాలించిన బలమైన రాజుల ఆధీనంలోనే యూఫ్రటీసు నది అవతలి ప్రాంతమంతా ఉండేది. వారికి పన్నులు, కప్పం, సుంకం చెల్లించేవారు. \v 21 ఇప్పుడు అక్కడ ఉన్నవారు తమ పనిని వెంటనే ఆపి మరలా నేను ఆజ్ఞ ఇచ్చేవరకు ఆ పట్టణాన్ని తిరిగి కట్టకూడదని ఆదేశం జారీ చేయండి. \v 22 ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రాజ్య ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం జరగడానికి ఎందుకు అనుమతించాలి? \p \v 23 రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరం నకలు రెహూము, షింషయి వారి తోటి ఉద్యోగులకు చదివి వినిపించిన వెంటనే వారు యెరూషలేములోని యూదుల దగ్గరకు వెళ్లి పని చేయడం ఆపమని బలవంతం చేశారు. \b \p \v 24 కాబట్టి యెరూషలేములో జరుగుతున్న దేవుని మందిరం పని ఆగిపోయింది. పర్షియా రాజైన దర్యావేషు హయాములో రెండవ సంవత్సరం వరకు పని ఆగిపోయింది. \c 5 \s1 దర్యావేషుకు ఉత్తరం వ్రాసిన తత్తెనై \p \v 1 ప్రవక్తయైన హగ్గయి ఇద్దోకు వారసుడు, ప్రవక్తయైన జెకర్యా యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రవచించారు. \v 2 అప్పుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ, యెరూషలేములో దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టించడం మొదలుపెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి మద్ధతు ఇచ్చారు. \p \v 3 ఆ సమయంలో యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు వారి దగ్గరకు వెళ్లి, “ఈ మందిరాన్ని మరలా కట్టి దానిని పూర్తి చేయడానికి మీకు ఎవరు అనుమతిచ్చారు?” అని వారిని ప్రశ్నించారు. \v 4 అంతే కాకుండా, “ఈ భవనాన్ని కడుతున్న వారి పేర్లు ఏమిటి?” అని కూడా అడిగారు. \v 5 అయితే వారి దేవుని దృష్టి యూదుల పెద్దలను కాపాడుతూ ఉంది కాబట్టి ఈ సమాచారం దర్యావేషుకు చేరి అతని దగ్గర నుండి వ్రాతపూర్వక జవాబు వచ్చేవరకు వారు పని చేయడం ఆపలేదు. \p \v 6 యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు రాజైన దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ఇది. \v 7 వారు పంపిన సమాచారం ఇలా ఉంది: \pmo రాజైన దర్యావేషుకు: \pmo హృదయపూర్వక శుభాలు. \pm \v 8 రాజు తెలుసుకోవలసింది ఏంటంటే, మేము యూదా జిల్లాకు అక్కడ ఉన్న గొప్ప దేవుని ఆలయానికి వెళ్లాము. ప్రజలు దానిని పెద్ద రాళ్లతో కడుతున్నారు, గోడలకు దూలాలు అమరుస్తున్నారు. వారి ఆధ్వర్యంలో పనులు శ్రద్ధతో, శరవేగంగా జరుగుతున్నాయి. \pm \v 9 మేము అక్కడి పెద్దలను, “ఈ మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానిని పూర్తి చేయడానికి మీకు అనుమతి ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించాము. \v 10 అంతే కాకుండా వారి నాయకుల పేర్లు వివరాలు మీకు అందించడానికి వారి పేర్లను కూడా అడిగి తెలుసుకున్నాము. \pm \v 11 వారు మాకిచ్చిన జవాబు ఇది: \b \pm “మేము భూమ్యాకాశాల దేవుని సేవకులము. చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాము. \v 12 మా పూర్వికులు పరలోక దేవునికి కోపం తెప్పించారు కాబట్టి ఆయన వారిని బబులోను రాజు, కల్దీయుడైన నెబుకద్నెజరు చేతికి అప్పగించారు, అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బందీలుగా బబులోను తీసుకెళ్లాడు. \pm \v 13 “అయినా, బబులోను రాజైన కోరెషు హయాములో మొదటి సంవత్సరంలో రాజైన కోరెషు ఈ దేవుని మందిరాన్ని మరలా కట్టడానికి శాసనం జారీ చేశాడు. \v 14 అంతేకాదు గతంలో నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోను క్షేత్రానికి\f + \fr 5:14 \fr*\ft లేదా \ft*\fqa రాజభవనం\fqa*\f* తీసుకెళ్లిన దేవుని మందిరపు వెండి బంగారు వస్తువులను రాజైన కోరెషు బబులోను క్షేత్రంలో నుండి తెప్పించి, తాను అధిపతిగా నియమించిన షేష్బజ్జరుకు వాటిని ఇచ్చి, \v 15 అతనితో అన్నాడు, ‘నీవు ఈ వస్తువులను తీసుకెళ్లి యెరూషలేములోని మందిరంలో ఉంచాలి. ఆ స్థలంలో దేవుని మందిరాన్ని తిరిగి కట్టించాలి.’ \pm \v 16 “కాబట్టి ఈ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో దేవుని ఆలయానికి పునాది వేశాడు. అప్పటినుండి నేటివరకు దాన్ని కడుతున్నాము కాని అది ఇంకా పూర్తి కాలేదు.” \b \pm \v 17 ఇది రాజుకు ఇష్టమైతే, యెరూషలేములో దేవుని మందిరాన్ని నిర్మించడానికి రాజైన కోరెషు ఆదేశం ఇచ్చాడో లేదో తెలుసుకోవడానికి బబులోను రాజ్య దస్తావేజులను పరిశోధించండి. అప్పుడు ఈ విషయంలో రాజు నిర్ణయాన్ని మాకు తెలియచేయాలని కోరుతున్నాము. \c 6 \s1 దర్యావేషు ఆదేశం \p \v 1 అప్పుడు రాజైన దర్యావేషు ఆదేశించగా వారు బబులోను ఖజానాలోని రాజ్య దస్తావేజులన్ని పరిశోధించారు. \v 2 మాదీయ ప్రాంతంలో ఉన్న ఎక్బతానా కోటలో ఒక గ్రంథపుచుట్ట దొరికింది. దాని మీద ఇలా వ్రాసి ఉంది: \pmo వ్రాతపూర్వక సందేశము: \pm \v 3 రాజైన కోరెషు పాలనలో మొదటి సంవత్సరంలో యెరూషలేములోని దేవుని దేవాలయం గురించి రాజు జారీ చేసిన శాసనం: \b \pm బలులు అర్పించే స్థలంగా మందిరాన్ని తిరిగి కట్టాలి, దాని పునాదులు వేయాలి. దాని ఎత్తు అరవై మూరలు,\f + \fr 6:3 \fr*\ft అంటే, సుమారు 27 మీటర్లు\ft*\f* వెడల్పు అరవై మూరలు ఉండాలి. \v 4 పెద్ద రాళ్లతో మూడు వరుసలు, క్రొత్త కలపతో ఒక వరుస పెట్టి కట్టాలి. దానికయ్యే ఖర్చు రాజ్య ఖజానా నుండి చెల్లించాలి. \v 5 అంతేకాక, నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోనుకు తీసుకువచ్చిన దేవుని ఆలయానికి సంబంధించిన వెండి బంగారు వస్తువులను తిరిగి యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లి వాటి స్థానాల్లో పెట్టాలి; వాటిని దేవుని మందిరంలోనే ఉంచాలి. \b \pm \v 6 అందుకు ఇప్పుడు, యూఫ్రటీసు నది అవతల అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు దీనికి దూరంగా ఉండాలి. \v 7 దేవుని ఆలయ పనికి ఆటంకం కలిగించకూడదు. యూదుల అధిపతిని, యూదుల పెద్దలను దేవుని మందిరాన్ని దాని స్థానంలో కట్టనివ్వండి. \pm \v 8 అంతేకాక, దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఈ యూదుల పెద్దలకు మీరు అందించవలసిన సహాయం గురించి కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నాను: \pm యూఫ్రటీసు నది అవతల నుండి రాజ ఖజానాకు వచ్చిన పన్నుల నుండి వారి ఖర్చులన్నిటిని చెల్లించాలి, తద్వారా వారి పని ఆగదు. \v 9 వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి. \v 10 తద్వారా వారు బలులు అర్పించి పరలోక దేవుని సంతోషపరచి రాజు, అతని కుమారుల క్షేమం గురించి ప్రార్థిస్తారు. \pm \v 11 అంతేకాక, నా ఆదేశం ఏంటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞ పాటించకపోతే వారి ఇంటి నుండి దూలాన్ని తీసి దానికి వారిని ఉరితీయాలి. ఈ నేరం బట్టి వారి ఇంటిని చెత్తకుప్పగా చేయాలి. \v 12 ఏ రాజైన ఏ ప్రజలైనా ఈ ఆజ్ఞను మీరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తన నామాన్ని అక్కడ ఉంచిన దేవుడు వారిని పడగొట్టును గాక. \pm దర్యావేషు అనే నేను ఆదేశిస్తున్నాను. దీనిని ఖచ్చితంగా శ్రద్ధతో పాటించాలి. \s1 ఆలయ నిర్మాణం పూర్తి ప్రతిష్ఠించుట \p \v 13 తర్వాత, రాజైన దర్యావేషు పంపించిన శాసనం ప్రకారం, యూఫ్రటీసు నది అవతలి అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు పని చేయించారు. \v 14 ప్రవక్తయైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జెకర్యాల ప్రవచనాలను బట్టి యూదుల పెద్దలు పనిని సక్రమంగా కొనసాగించారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ప్రకారం పర్షియా రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆదేశాలను అనుసరించి వారు మందిరాన్ని కట్టడం ముగించారు. \v 15 రాజైన దర్యావేషు పాలనలోని ఆరవ సంవత్సరంలో అదారు నెల మూడవ రోజున మందిరం పూర్తి అయ్యింది. \p \v 16 అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు చెర నుండి విడుదలై వచ్చిన వారందరు కలిసి ఆనందంతో మందిరాన్ని ప్రతిష్ఠించారు. \v 17 దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి వారు ఆ రోజున వంద ఎడ్లు, రెండువందల పొట్టేళ్లు, నాలుగువందల గొర్రెపిల్లలు, ఇశ్రాయేలీయులందరి కోసం పాపపరిహారబలిగా\f + \fr 6:17 \fr*\ft లేదా \ft*\fqa శుద్ధీకరణ అర్పణ\fqa*\f* ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున పన్నెండు మేకపోతులను బలి అర్పించారు. \v 18 యెరూషలేములో దేవుని సేవ చేయడానికి మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం వారి వారి తరగతుల ప్రకారం యాజకులను వారివారి వరుసల ప్రకారం లేవీయులను నియమించారు. \s1 పస్కాపండుగ \p \v 19 చెర నుండి విడుదలై వచ్చినవారు మొదటి నెల పద్నాలుగవ రోజు పస్కాపండుగ చేసుకున్నారు. \v 20 యాజకులు, లేవీయులు తమను తాము శుద్ధి చేసుకుని పవిత్రులయ్యారు. లేవీయులు చెర నుండి విడుదలైన వారందరి కోసం, తమ బంధువులైన యాజకుల కోసం, తమ కోసం పస్కా గొర్రెపిల్లను వధించారు. \v 21 చెర నుండి విడుదలై వచ్చిన ఇశ్రాయేలీయులు, దేశంలో పొరుగు ప్రజల అపవిత్ర ప్రవర్తను నుండి తమను తాము ప్రత్యేకించుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కొలిచే వారంతా కలిసి పస్కాను తిన్నారు. \v 22 ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనిలో సహకరించేలా యెహోవా అష్షూరు రాజు హృదయాన్ని మార్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు వారు ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను ఆనందంతో జరుపుకున్నారు. \c 7 \s1 ఎజ్రా యెరూషలేముకు వచ్చుట \p \v 1 ఈ విషయాలన్ని జరిగిన తర్వాత, పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న కాలంలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు వచ్చాడు. ఎజ్రా శెరాయా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు, \v 2 అతడు షల్లూము కుమారుడు, అతడు సాదోకు కుమారుడు, అతడు అహీటూబు కుమారుడు, \v 3 అతడు అమర్యా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు మెరాయోతు కుమారుడు, \v 4 అతడు జెరహ్యా కుమారుడు, అతడు ఉజ్జీ కుమారుడు, అతడు బుక్కీ కుమారుడు, \v 5 అతడు అబీషూవ కుమారుడు, అతడు ఫీనెహాసు కుమారుడు, అతడు ఎలియాజరు కుమారుడు, అతడు ముఖ్య యాజకుడైన అహరోను కుమారుడు. \v 6 ఈ ఎజ్రా బబులోను నుండి తిరిగి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇచ్చిన మోషే ధర్మశాస్త్రంలో ఆరితేరిన శాస్త్రి. తన దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు అడిగిన వాటన్నిటిని రాజు అతనికి ఇచ్చాడు. \v 7 రాజైన అర్తహషస్త పరిపాలనలో ఏడవ సంవత్సరంలో కొందరు ఇశ్రాయేలీయులు, వారితో పాటు యాజకులు, లేవీయులు, సంగీతకారులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు యెరూషలేముకు వచ్చారు. \p \v 8 రాజు పరిపాలనలోని ఏడవ సంవత్సరం అయిదవ నెలలో, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేము చేరుకున్నాడు. \v 9 తన దేవుని కరుణాహస్తం అతనికి తోడుగా ఉన్నందుకు అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను నుండి బయలుదేరి, అయిదవ నెల మొదటి రోజున యెరూషలేము చేరుకున్నాడు. \v 10 యెహోవా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారం చేయాలని, ఇశ్రాయేలీయులకు దాని శాసనాలను, న్యాయవిధులను నేర్పించాలని ఎజ్రా నిశ్చయించుకున్నాడు. \s1 ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఉత్తరం \p \v 11 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలు ఆజ్ఞల విషయంలో ధర్మశాస్త్ర శాస్త్రి, యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరం నకలు ఇది: \pmo \v 12 రాజులకు రాజైన అర్తహషస్త, \pmo యాజకుడును ఆకాశమందున్న దేవుని ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాకు వ్రాయునది, \pmo శుభములు. \pm \v 13 నా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులలో, యాజకులలో, లేవీయులలో, యెరూషలేము వెళ్లడానికి ఇష్టపడినవారు నీతో పాటు వెళ్లవచ్చని నేను ఆదేశిస్తున్నాను. \v 14 నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం యూదా గురించి యెరూషలేము గురించి పరిశీలించడానికి రాజు అతని ఏడుగురు సలహాదారులు నిన్ను పంపించారు. \v 15 అంతేకాక, యెరూషలేములో నివాసం ఉన్న ఇశ్రాయేలు దేవునికి రాజు అతని సలహాదారులు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వెండి బంగారాలను నీతో తీసుకెళ్లాలి. \v 16 వాటితో పాటు బబులోను ప్రాంతమంతటిలో నీకు లభించిన వెండి బంగారాలను, యెరూషలేములో ఉన్న తమ దేవుని ఆలయానికి ప్రజలు, యాజకులు ఇచ్చిన కానుకలను నీవు తీసుకెళ్లాలి. \v 17 ఆ డబ్బుతో నీవు బలి అర్పించడానికి కావలసిన ఎడ్లు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు, వాటి భోజనార్పణలు, పానార్పణలతో పాటు కొని, యెరూషలేములోని నీ దేవుని ఆలయ బలిపీఠం మీద వాటిని అర్పించాలి. \pm \v 18 మిగిలిన వెండి బంగారాలను నీ దేవుని చిత్తప్రకారం నీకు, నీ తోటి ఇశ్రాయేలీయులకు సమ్మతమైన విధంగా వాడండి. \v 19 నీ దేవుని మందిరంలో ఆరాధన కోసం నీకు అప్పగించిన అన్ని వస్తువులను యెరూషలేములోని దేవుని సన్నిధిలో అందించాలి. \v 20 నీ దేవుని ఆలయానికి ఇంకా అవసరమైనవి ఏమైనా నీవు కావాలంటే, రాజ ఖజానా నుండి అవి నీకు అందించబడతాయి. \pm \v 21 రాజునైన అర్తహషస్త అనే నేను, యూఫ్రటీసు నది అవతలి కోశాధికారులకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, పరలోక దేవుని ధర్మశాస్త్ర బోధకుడు, యాజకుడైన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగితే, దానిని శ్రద్ధతో మీరు అందించాలి. \v 22 వంద తలాంతుల\f + \fr 7:22 \fr*\ft అంటే, సుమారు 3 3/4 టన్నులు\ft*\f* వెండి, వెయ్యి తూముల\f + \fr 7:22 \fr*\ft అంటే, సుమారు 18 మెట్రిక్ టన్నులు\ft*\f* వరకు గోధుమలు, వంద బాతుల\f + \fr 7:22 \fr*\ft అంటే, సుమారు 2,200 లీటర్లు\ft*\f* ద్రాక్షరసం, వంద బాతుల ఒలీవ\f + \cat dup\cat*\fr 7:22 \fr*\ft అంటే, సుమారు 2,200 లీటర్లు\ft*\f* నూనె, లెక్కలేనంత ఉప్పు సరఫరా చెయ్యండి. \v 23 పరలోక దేవుడు నిర్దేశించిన ప్రకారం పరలోక దేవుని మందిరం కోసం శ్రద్ధగా చేయాలి. రాజు అతని కుమారుల సామ్రాజ్యం మీదికి దేవుని కోపం ఎందుకు రావాలి? \v 24 అంతేకాక, యాజకులలో, లేవీయులలో, సంగీతకారులలో, ద్వారపాలకుల్లో, దేవాలయ సేవకులలో లేదా ఇతర పనివారిలో ఎవరి మీద హోదా పన్ను గాని, కప్పం గాని, సుంకం గాని, విధించే అధికారం మీకు లేదని గ్రహించండి. \pm \v 25 ఎజ్రా! నీవు నీకున్న నీ దేవుని జ్ఞానంతో, యూఫ్రటీసు నది అవతలి ప్రజలకు న్యాయం తీర్చడానికి, నీ దేవుని న్యాయవిధులు తెలిసినవారిని నీవే అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించు. అవి తెలియని వారికి నీవు వాటిని బోధించాలి. \v 26 నీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు చట్టాన్ని అతిక్రమించిన వారికి తప్పనిసరిగా మరణశిక్ష, దేశ బహిష్కరణ, ఆస్తుల జప్తు లేదా జైలు శిక్ష విధించాలి. \p \v 27 యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయానికి ఈ విధంగా ఘనత చేకూర్చేందుకు రాజు హృదయాన్ని కదిలించిన మన పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతి! \v 28 రాజుకు, అతని సహాయకులకు రాజు యొక్క శక్తివంతులైన నాయకులకు నా మీద దయ కలిగేలా ఆయన తన దయ నాపై చూపించారు. నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి, నేను ధైర్యం చేసి నాతో రావడానికి ఇశ్రాయేలీయుల నాయకులను సమకూర్చాను. \c 8 \s1 ఎజ్రాతో తిరిగివచ్చిన కుటుంబ పెద్దల జాబితా \lh \v 1 రాజైన అర్తహషస్త పాలనలో నాతో కూడా బబులోను నుండి వచ్చిన కుటుంబ పెద్దలు వారితో పాటు నమోదైన వారి వివరాలు: \b \li1 \v 2 ఫీనెహాసు వారసుల నుండి: \li2 గెర్షోము; \li1 ఈతామారు వారసుల నుండి: \li2 దానియేలు; \li1 దావీదు వారసుల నుండి: \li2 హట్టూషు \v 3 షెకన్యా వారసుల నుండి వచ్చినవాడు; \li1 పరోషు వారసుల నుండి: \li2 జెకర్యా, అతనితో పాటు నమోదైన 150 మంది పురుషులు; \li1 \v 4 పహత్-మోయాబు వారసుల నుండి: \li2 జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనై, అతనితో పాటు నమోదైన 200 మంది పురుషులు; \li1 \v 5 జట్టు\f + \fr 8:5 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fq జట్టు \fq*\ft ఈ పేరు లేదు\ft*\f* వారసుల నుండి: \li2 షెకన్యా కుమారుడైన యహజీయేలు, అతనితో పాటు నమోదైన 300 మంది పురుషులు; \li1 \v 6 ఆదీను వారసుల నుండి: \li2 యోనాతాను కుమారుడైన ఎబెదు, అతనితో పాటు నమోదైన 50 మంది పురుషులు; \li1 \v 7 ఏలాము వారసుల నుండి: \li2 అతల్యా కుమారుడైన యెషయా, అతనితో పాటు నమోదైన 70 మంది పురుషులు; \li1 \v 8 షెఫట్యా వారసుల నుండి: \li2 మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితో పాటు నమోదైన 80 మంది పురుషులు; \li1 \v 9 యోవాబు వారసుల నుండి: \li2 యెహీయేలు కుమారుడైన ఓబద్యా, అతనితో పాటు నమోదైన 218 మంది పురుషులు; \li1 \v 10 బానీ\f + \fr 8:10 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fq బానీ \fq*\ft ఈ పేరు లేదు\ft*\f* వారసుల నుండి: \li2 షెలోమీతు కుమారుడైన యోసిప్యా, అతనితో పాటు నమోదైన 160 మంది పురుషులు; \li1 \v 11 బేబై వారసుల నుండి: \li2 బేబై కుమారుడైన జెకర్యా, అతనితో పాటు నమోదైన 28 మంది పురుషులు; \li1 \v 12 అజ్గాదు వారసుల నుండి: \li2 హక్కాటాను కుమారుడైన యోహానాను, అతనితో పాటు నమోదైన 110 మంది పురుషులు; \li1 \v 13 అదోనీకాము వారసుల నుండి: \li2 చివరి వారైన ఎలీఫెలెతు, యెహీయేలు, షెమయా, వారితో పాటు నమోదైన 60 మంది పురుషులు; \li1 \v 14 బిగ్వయి వారసుల నుండి: \li2 ఊతై, జక్కూరు, వారితో పాటు నమోదైన 70 మంది పురుషులు. \s1 యెరూషలేముకు తిరిగి వచ్చుట \p \v 15 అహవా వైపు ప్రవహించే ఓ కాలువ దగ్గర నేను వీరందరిని సమావేశపరిచాను. అక్కడ మేము మూడు రోజులు బస చేశాము. అక్కడ ఉన్న ప్రజలను యాజకులను పరిశీలించి నేను గ్రహించింది ఏంటంటే వారిలో లేవీయులెవ్వరూ లేరు. \v 16 కాబట్టి నేను నాయకులైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనే వారిని, అలాగే వివేచన కలిగిన యోయారీబు ఎల్నాతానులను పిలిపించి, \v 17 కాసిప్యా ప్రాంతంలో నాయకుడైన ఇద్దో దగ్గరకు వెళ్లమని ఆదేశించాను. వారు మా దేవుని మందిర సేవకులను మా దగ్గరకు తీసుకువచ్చేలా ఇద్దో అతని తోటి లేవీయులైన ఆలయ సేవకులకు ఏమి చెప్పాలో వారికి చెప్పాను. \v 18 మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందుకు, వారు ఇశ్రాయేలు కుమారుడైన లేవీకి పుట్టిన మహలి వారసుడు, సమర్థుడైన షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని తీసుకువచ్చారు; \v 19 హషబ్యాను, అతనితో మెరారి వారసుడైన యెషయాను, అతని సోదరులను, వారి కుమారులను మొత్తం 20 మందిని తీసుకువచ్చారు. \v 20 వారితో పాటు లేవీయులకు సహాయంగా దావీదు అతని అధికారులు నిర్ణయించిన ఆలయ సేవకులలో నుండి 220 మందిని తీసుకువచ్చారు. వారందరి పేర్లు నమోదు చేయబడి ఉన్నాయి. \p \v 21 అప్పుడు అక్కడ అహవా కాలువ దగ్గర, మనమందరం ఉపవాసం ఉండి, మన దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుని మనకు మన పిల్లలకు మన ఆస్తి అంతటికి క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వమని వేడుకుందామని నేను ప్రకటించాను. \v 22 మేము రాజుతో, “మా దేవున్ని వెదికే ప్రతి ఒక్కరిపై ఆయన కరుణాహస్తం ఉంటుంది. ఆయనను విడిచిపెట్టినవారి మీద ఆయన తీవ్రమైన కోపం కుమ్మరించబడుతుంది” అని చెప్పాము కాబట్టి, దారిలో ఎదురయ్యే శత్రువులు నుండి కాపాడడానికి సైనికులు, గుర్రపురౌతులను మాకు సహాయంగా పంపమని రాజును అడగడానికి నేను సిగ్గుపడ్డాను. \v 23 కాబట్టి మేము ఉపవాసముండి, దీని గురించి మా దేవునికి మొరపెట్టగా, ఆయన మా ప్రార్థనకు జవాబిచ్చారు. \p \v 24 నేను యాజకులలో నుండి ముఖ్యమైన పన్నెండుమందిని అనగా, షేరేబ్యా, హషబ్యా, వారి సోదరులలో పదిమందిని ఎంపిక చేశాను. \v 25 రాజు అతని సలహాదారులు అధికారులు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరు మన దేవుని మందిరానికి విరాళంగా ఇచ్చిన వెండి బంగారాన్ని వస్తువులను తూచి నేను వారికి ఇచ్చాను. \v 26 నేను 650 తలాంతుల\f + \fr 8:26 \fr*\ft అంటే, సుమారు 24 టన్నులు\ft*\f* వెండి, 100 తలాంతుల\f + \fr 8:26 \fr*\ft అంటే, సుమారు 3 3/4 టన్నులు\ft*\f* వెండి పాత్రలు, 100 తలాంతుల\f + \cat dup\cat*\fr 8:26 \fr*\ft అంటే, సుమారు 3 3/4 టన్నులు\ft*\f* బంగారం \v 27 1,000 డారిక్కుల\f + \fr 8:27 \fr*\ft అంటే, సుమారు 8.4 కి. గ్రా. లు\ft*\f* బరువుగల 20 బంగారు గిన్నెలు, మేలిమి బంగారమంతా విలువైన రెండు మెరిసే ఇత్తడి పాత్రలు తూచి ఇచ్చాను. \p \v 28 నేను వారితో, “మీరు, ఈ వస్తువులతో పాటు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు, ఈ వెండి బంగారాలు మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు ఇష్టపూర్వకంగా ఇచ్చిన అర్పణ. \v 29 యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదుల్లో ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దల సమక్షంలో వీటిని తూచి అప్పగించే వరకు వీటిని జాగ్రత్తగా కాపాడండి” అని చెప్పాను. \v 30 అప్పుడు యాజకులు, లేవీయులు, యెరూషలేములోని దేవుని ఆలయానికి తీసుకుని వెళ్లడానికి తూచిన వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తీసుకున్నారు. \p \v 31 అహవా కాలువ దగ్గర నుండి మొదటి నెల పన్నెండవ రోజున మేము యెరూషలేముకు రావాలని బయలుదేరాము. మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి, శత్రువుల నుండి, దారిలో పొంచి ఉండే బందిపోట్లు నుండి ఆయన మమ్మల్ని కాపాడారు. \v 32 కాబట్టి మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే బస చేశాము. \p \v 33 నాలుగవ రోజున మా దేవుని మందిరంలో, వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తూకం వేసి, యాజకుడును ఊరియా కుమారుడునైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో పాటు ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు, లేవీయులైన యెషూవ కుమారుడైన యోజాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యా ఉన్నారు. \v 34 ఆ సమయంలో ప్రతిదాన్ని సంఖ్య ప్రకారం, బరువు ప్రకారం లెక్కించారు, వాటి మొత్తం బరువును నమోదు చేశారు. \p \v 35 తర్వాత చెర నుండి విడుదలై తిరిగివచ్చిన ప్రవాసులు ఇశ్రాయేలీయుల దేవునికి దహనబలిగా ఇశ్రాయేలీయులందరి కోసం పన్నెండు ఎడ్లు, తొంభై ఆరు పొట్టేళ్లు, డెబ్బై ఏడు గొర్రెపిల్లలను పాపపరిహారబలిగా పన్నెండు మేకపోతులను అర్పించారు. ఇదంతా యెహోవాకు అర్పించిన దహనబలి. \v 36 వారు రాజు ఆదేశాలను రాజు అధికారులకు, యూఫ్రటీసు నది అవతలనున్న అధిపతులకు అప్పగించిన తర్వాత, వారందరు ప్రజలకు, దేవుని మందిర పనికి సహాయపడ్డారు. \c 9 \s1 వియ్యము గురించి ఎజ్రా ప్రార్థన \p \v 1 ఈ విషయాలన్ని జరిగిన తర్వాత నాయకులు నా దగ్గరకు వచ్చి, “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, అందరు తమ పొరుగువారైన కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఈజిప్టువారు, అమోరీయుల నుండి వేరుగా ఉండకుండా వారితో కలిసిపోయి, వారు చేసే అసహ్యకరమైన ఆచారాలను పాటించారు. \v 2 వారి కుమార్తెలను తమకు, తమ కుమారులకు భార్యలుగా చేసుకుంటూ, పరిశుద్ధజాతిగా ఉండకుండా తమ చుట్టూ ఉన్నవారితో కలిసిపోయారు. నాయకులు అధికారులు ఈ విషయంలో అపనమ్మకంగా ఉన్నారు” అని చెప్పారు. \p \v 3 ఇది విని నేను నా చొక్కా, పై వస్త్రం చింపుకుని, తలవెంట్రుకలు, గడ్డం పీక్కుని దిగ్భ్రాంతితో కూర్చుండిపోయాను. \v 4 అప్పుడు చెర నుండి వచ్చినవారు చేసిన ఈ నమ్మకద్రోహాన్ని బట్టి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన ప్రతిఒక్కరు నా చుట్టూ చేరారు. సాయంత్రపు బలి అర్పించే సమయం వరకు నేను దిగ్భ్రాంతితో అక్కడ కూర్చున్నాను. \p \v 5 తర్వాత, సాయంత్రపు బలి అర్పించే సమయానికి నేను నా అవమానం నుండి లేచి, చినిగిన చొక్కా పై వస్ర్తంతోనే మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవా వైపు చేతులెత్తి \v 6 ఇలా ప్రార్థించాను: \pm “నా దేవా, నా ముఖాన్ని మీ వైపు ఎత్తడానికి నాకు చాలా సిగ్గుగా, అవమానంగా ఉంది. మా పాపాలు మా తల కన్న ఎత్తుగా ఉన్నాయి, మా అపరాధం ఆకాశాన్ని అంటింది. \v 7 మా పూర్వికుల రోజులనుండి నేటివరకు మేము చాలా ఘోరమైన అపరాధాలు చేశాము. మా పాపం కారణంగా ఈ రోజు ఉన్నట్లు మేము, మా రాజులు, యాజకులు పరాయి రాజుల చేతి అప్పగించబడి ఖడ్గానికి, బానిసత్వానికి, దోపిడికి, అవమానానికి గురైయ్యాము. \pm \v 8 “అయితే ఇప్పుడు, మా దేవుడైన యెహోవా ప్రార్థనకు జవాబుగా మా కళ్ళకు వెలుగిచ్చి మా బానిసత్వం నుండి కొంత ఉపశమనం కలిగేలా మాలో కొందరిని తప్పించి, తన పరిశుద్ధాలయంలో స్థిరమైన స్థలాన్ని ఇచ్చి, మా దేవుడు కొంతమట్టుకు మా పట్ల దయ చూపించారు. \v 9 మేము బానిసలుగా ఉన్నప్పటికీ, మా దేవుడు మా దాస్యంలో మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన పర్షియా రాజుల ఎదుట మామీద దయ చూపించారు. దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానికి మరమ్మత్తు చేయడానికి, ఆయన మాకు నూతన జీవాన్ని ఇచ్చారు. యూదాలో, యెరూషలేములో ఆయన మాకు రక్షణ గోడగా ఉన్నారు. \pm \v 10-11 “అయితే ఇప్పుడు, మా దేవా, ఇంత జరిగిన తర్వాత మేము ఏమి చెప్పగలము? మీ సేవకులైన ప్రవక్తల ద్వారా మీరు ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టాము. వారు, ‘మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం అక్కడి ప్రజల అపవిత్రత వలన కలుషితమైపోయింది. తమ అసహ్యకరమైన ఆచారాలతో వారు దేశాన్ని ఆ చివర నుండి ఈ చివర వరకు నింపేశారు. \v 12 కాబట్టి మీ కుమార్తెలకు వారి కుమారులతో గాని, మీ కుమారులకు వారి కుమార్తెలతో గాని పెళ్ళి చేయవద్దు. ఎప్పటికీ వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు, అప్పుడు మీరు బలవంతులుగా ఉండి, ఆ దేశంలోని మంచి వాటిని తిని, మీ పిల్లలకు శాశ్వతమైన వారసత్వంగా దానిని అప్పగిస్తారు’ అని చెప్పారు. \pm \v 13 “మేము చేసిన చెడు పనులకు, మా గొప్ప అపరాధానికి ఫలితంగా ఇలా మాకు జరిగింది. అయినప్పటికీ, మా దేవుడవైన మీరు మా దోషాలకు తగిన పూర్తి శిక్షను మాకు విధించకుండా ఈ విధంగా కొంతమందిని దాస్యం నుండి తప్పించారు. \v 14 ఇంత జరిగాక, మేము మరలా మీ ఆజ్ఞలు పాటించకుండా ఇలాంటి అసహ్యకరమైన ఆచారాలు పాటించే ప్రజలతో వియ్యమందుతామా? మాలో ఒక్కరు తప్పించుకుని మిగిలిపోకుండ మీరు మమ్మల్ని నాశనం చేసేంతగా కోప్పడతారు గదా? \v 15 యెహోవా, ఇశ్రాయేలు దేవా, మీరు నీతిమంతులు! ఈ రోజున మేము కొద్ది మందిమి మిగిలాము. మేము మీ ముందు నిలబడడానికి మేమెవరం అర్హులం కాకపోయిన, మీ ఎదుట మా అపరాధంలో నిలబడ్డాము.” \c 10 \s1 ప్రజలు తమ పాపం ఒప్పుకొనుట \p \v 1 ఎజ్రా దేవుని మందిరం ఎదుట నేలమీద పడి ఏడుస్తూ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులలో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు పెద్ద సమూహంగా అతని చుట్టూ చేరి వారు కూడా బిగ్గరగా ఏడ్చారు. \v 2 అప్పుడు ఏలాము వారసులలో ఒకడైన యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో, “మా చుట్టూ ఉన్న ప్రజల నుండి పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని మన దేవుని పట్ల నమ్మకద్రోహం చేశాము. అయినా ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకుంటారనే నిరీక్షణ ఉంది. \v 3 నా ప్రభువు సలహా ప్రకారం మన దేవుని ఆజ్ఞలకు భయపడేవారి సలహా ప్రకారం, ఈ స్త్రీలను వారి పిల్లలందరిని పంపించి వేయడానికి మన దేవుని ఎదుట ఒక నిబంధన చేద్దాము. ధర్మశాస్త్రం ప్రకారం ఇది జరగాలి. \v 4 లెండి; ఈ పని మీ చేతిలోనే ఉంది. మేము మీకు మద్ధతు ఇస్తాం కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి” అన్నాడు. \p \v 5 అప్పుడు ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులందరు ఆ మాట ప్రకారం చేసేలా వారితో ప్రమాణం చేయించాడు. వారు ప్రమాణం చేశారు. \v 6 అప్పుడు ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి బయలుదేరి ఎల్యాషీబు కుమారుడైన యెహోహనాను గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు, ఎజ్రా అన్నపానాలు పుచ్చుకోలేదు ఎందుకంటే, చెరగొనిపోబడిన వారి నమ్మకద్రోహాన్ని బట్టి దుఃఖించాడు. \p \v 7 చెర నుండి విడుదలై వచ్చిన వారంతా యెరూషలేములో సమావేశం కావాలని యూదాలో, యెరూషలేములో ప్రకటన చేశారు. \v 8 ఎవరైనా మూడు రోజుల లోపు అధికారులు, పెద్దల నిర్ణయం ప్రకారం రాకపోతే, వారి ఆస్తి జప్తు చేయబడుతుంది. వారు చెర నుండి విడుదలై వచ్చిన వారి సమాజంలో నుండి వెలివేయబడతారు. \b \p \v 9 మూడు రోజుల్లో, యూదా, బెన్యామీను పురుషులందరు యెరూషలేములో సమకూడారు. తొమ్మిదవ నెల ఇరవయ్యవ రోజున ప్రజలందరు దేవుని మందిరం ఎదురుగా ఉన్న కూడలిలో కూర్చుని భారీ వర్షంలో తడుస్తూ ఈ విషయాన్ని బట్టి ఎంతో దిగులుతో ఉన్నారు. \v 10 అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి నిలబడి వారితో, “మీరు నమ్మకద్రోహులుగా ఉన్నారు; పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని ఇశ్రాయేలీయుల దోషాన్ని ఇంకా ఎక్కువ చేశారు. \v 11 ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించండి, ఆయన చిత్తం చేయండి. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల నుండి, మీ పరాయి దేశపు భార్యల నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి” అని చెప్పాడు. \p \v 12 అప్పుడు అక్కడ చేరి ఉన్నవారందరు స్పందిస్తూ బిగ్గరగా ఇలా అన్నారు: “నీవు చెప్పింది సరియైనది! నీవు చెప్పినట్లు మేము చేయాలి. \v 13 అయితే ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్ద వర్షం కురుస్తుండడం వలన మేము బయట నిలబడలేము. అంతేకాక, ఇది ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే విషయం కాదు ఎందుకంటే, ఈ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాము. \v 14 కాబట్టి ఈ సమాజమంతటి పక్షంగా మా అధికారులు నిలబడాలి. అప్పుడు ఈ విషయంలో మన దేవుని తీవ్రమైన కోపం మన నుండి తొలగిపోయే వరకు మన పట్టణాల్లో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న ప్రతివారు నిర్ణయించిన సమయంలో ప్రతి పట్టణపు పెద్దలతో, న్యాయాధిపతులతో రావాలి.” \v 15 దీనిని కేవలం అశాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహజ్యాలు మెషుల్లాము, లేవీయుడైన షబ్బెతై అనేవారి మద్దతుతో దీన్ని వ్యతిరేకించారు. \p \v 16 కాబట్టి నిర్ణయించిన ప్రకారం చెర నుండి విడుదలైన వారు చేశారు. అప్పుడు యాజకుడైన ఎజ్రా, కుటుంబ పెద్దలైన వారిని ప్రతి కుటుంబం నుండి ఒకరు చొప్పున, వారి వారి పేర్లను బట్టి ఎన్నుకున్నాడు. ఈ విషయం పరిశీలించటానికి పదవనెల మొదటి రోజున వారంతా కూర్చున్నారు. \v 17 మొదటి నెల మొదటి రోజుకి పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారందరి విషయాన్ని పరిష్కరించడం జరిగింది. \s1 వియ్యమందుకుని అపరాధులుగా ఉన్నవారు \lh \v 18 యాజకుల వారసులలో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారు వీరు: \li1 యోజాదాకు కుమారుడైన యెషూవ వారసులు, అతని సహోదరుల నుండి: \li2 మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా. \v 19 (వీరంతా తమ భార్యలను పంపివేస్తామని మాట ఇచ్చారు. తమ దోషాన్ని బట్టి అపరాధపరిహారబలిగా ఒక్కొక్కరు మందలో ఒక్కొక్క పొట్టేలు అర్పించారు.) \li1 \v 20 ఇమ్మేరు వారసుల నుండి: \li2 హనానీ, జెబద్యా. \li1 \v 21 హారీము వారసుల నుండి: \li2 మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా. \li1 \v 22 పషూరు వారసుల నుండి: \li2 ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా. \b \lh \v 23 లేవీయుల నుండి: \li2 యోజాబాదు, షిమీ, కెలిథా అనే కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు. \li1 \v 24 సంగీతకారుల నుండి: \li2 ఎల్యాషీబు. \li1 ద్వారపాలకుల నుండి: \li2 షల్లూము, తెలెము, ఊరి. \b \lh \v 25 ఇతర ఇశ్రాయేలీయుల నుండి: \li1 పరోషు వారసుల నుండి: \li2 రమ్యా, ఇజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియాజరు, మల్కీయా, బెనాయా. \li1 \v 26 ఏలాము వారసుల నుండి: \li2 మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా. \li1 \v 27 జత్తూ వారసుల నుండి: \li2 ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా. \li1 \v 28 బేబై వారసుల నుండి: \li2 యెహోహనాను, హనన్యా, జబ్బయి, అత్లాయి. \li1 \v 29 బానీ వారసుల నుండి: \li2 మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు షెయాలు, యెరేమోతు. \li1 \v 30 పహత్-మోయాబు వారసుల నుండి: \li2 అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే. \li1 \v 31 హారీము వారసుల నుండి: \li2 ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షిమ్యోను, \v 32 బెన్యామీను, మల్లూకు, షెమర్యా. \li1 \v 33 హాషుము వారసుల నుండి: \li2 మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీఫెలెతు, యెరేమై, మనష్షే, షిమీ. \li1 \v 34 బానీ వారసుల నుండి: \li2 మయదై, అమ్రాము, ఊయేలు, \v 35 బెనాయా, బేద్యా, కెలూహు, \v 36 వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు \v 37 మత్తన్యా, మత్తెనై, యయశావు. \li1 \v 38 బానీ బిన్నూయి వారసుల నుండి: \li2 షిమీ, \v 39 షెలెమ్యా, నాతాను, అదాయా, \v 40 మక్నద్బయి, షాషై, షారాయి, \v 41 అజరేలు, షెలెమ్యా, షెమర్యా, \v 42 షల్లూము, అమర్యా, యోసేపు. \li1 \v 43 నెబో వారసుల నుండి: \li2 యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా. \b \lf \v 44 వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. వారిలో కొందరికి ఈ భార్యల\f + \fr 10:44 \fr*\ft లేదా \ft*\fqa వారి పిల్లలతో పాటు వారిని పంపించేశారు\fqa*\f* వలన పిల్లలు కూడా పుట్టారు.