\id EZK - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h యెహెజ్కేలు \toc1 యెహెజ్కేలు ప్రవచనం \toc2 యెహెజ్కేలు \toc3 యెహె \mt1 యెహెజ్కేలు \mt2 ప్రవచనం \c 1 \s1 యెహెజ్కేలు మొదటి దర్శనం \p \v 1 నా ముప్పయవ సంవత్సరం, నాల్గవ నెల, అయిదవ రోజున నేను కెబారు నది దగ్గర బందీల మధ్య ఉన్నప్పుడు ఆకాశం తెరువబడింది, నేను దేవుని దర్శనాలను చూశాను. \p \v 2 రాజైన యెహోయాకీను బందీగా ఉన్న అయిదవ సంవత్సరం నాల్గవ నెల అయిదవ రోజున ఇది జరిగింది. \v 3 బబులోనీయుల\f + \fr 1:3 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల\fqa*\f* దేశంలో కెబారు నది దగ్గర బూజీ కుమారుడు యాజకుడైన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యింది. అక్కడ యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది. \p \v 4 నేను చూసినప్పుడు ఉత్తరం నుండి గాలి తుఫాను రావడం కనిపించింది; అది జ్వలించే అగ్నితో ప్రకాశవంతమైన కాంతితో నిండిన గొప్ప మేఘము. ఆ అగ్ని మధ్య భాగం కరిగిన ఇత్తడిలా కనిపించింది. \v 5 దానిలో కరిగిన ఇత్తడిలా నాలుగు జీవుల్లాంటి ఒక రూపం కనిపించింది. వాటి రూపం మానవరూపంలా ఉంది. \v 6 కాని ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. \v 7 వాటి కాళ్లు తిన్నగా ఉండి అరికాళ్లు దూడ కాళ్లలా ఉన్నాయి. అవి ఇత్తడిలా తళతళ మెరుస్తున్నాయి. \v 8 వాటి రెక్కల క్రింద నాలుగు వైపులా మనుష్యుల చేతులు ఉన్నాయి. ఆ నాలుగింటికి ముఖాలు, రెక్కలు ఉన్నాయి. \v 9 ఒకదాని రెక్కలు మరొకదాని రెక్కలకు తాకుతున్నాయి. అవి అటూ ఇటూ తిరగకుండా అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి. \p \v 10 ఆ నాలుగింటికి మానవ ముఖంలాంటి ముఖాలు ఉన్నాయి, కుడి వైపున సింహపు ముఖం, ఎడమవైపున ఎద్దు ముఖం ఉన్నాయి. ప్రతి దానికి గ్రద్ద ముఖం ఉంది. \v 11 వాటి ముఖాలు అలా ఉన్నాయి. ప్రతి దానికి పైకి చాచి ఉన్న రెండు రెక్కలు వాటి ప్రక్కన ఉన్నవాటి రెక్కలను తాకుతూ ఉన్నాయి. మరో రెండు రెక్కలు వాటి శరీరాలను కప్పాయి. \v 12 ప్రతిదీ తిన్నగా ముందు వెళ్తూ ఉంది. అవి అటూ ఇటూ తిరగకుండా ఆత్మ ఏ వైపుకు వెళ్తే అవి ఆ వైపుకే వెళ్తున్నాయి. \v 13 ఆ జీవుల రూపం మండుతున్న నిప్పులా దివిటీలా ఉంది. అగ్ని ఆ జీవుల మధ్య ముందుకి వెనుకకు కదులుతూ ఉంది. ఆ అగ్ని చాలా ప్రకాశవంతంగా ఉండి దానిలో నుండి మెరుపులు వస్తున్నాయి. \v 14 మెరుపు తీగెల్లా ఆ జీవులు అటూ ఇటూ తిరుగుతున్నాయి. \p \v 15 నేను ఆ జీవులను చూసినప్పుడు, ప్రతి జీవి నాలుగు ముఖాల్లో ప్రతీదాని ప్రక్కన నేలమీద ఒక్కొక్క చక్రం కనిపించింది. \v 16 చక్రాల రూపం, నిర్మాణం ఇలా ఉంది: అవి గోమేధికంలా మెరుస్తూ, నాలుగు ఒకేలా ఉన్నాయి. ప్రతిదీ ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉండేలా తయారుచేయబడినట్లు కనిపించింది. \v 17 అవి కదిలినప్పుడు ఆ జీవుల ముఖాలు ఉన్న నాలుగు దిశలలో కదులుతున్నాయి; ఆ జీవులు వెళ్లినప్పుడు ఆ చక్రాలు దిశను మార్చలేదు. \v 18 వాటి అంచులు ఎత్తుగా భయంకరంగా ఉన్నాయి. నాలుగు అంచుల చుట్టూ కళ్లతో నిండి ఉన్నాయి. \p \v 19 జీవులు కదిలినప్పుడు, వాటి ప్రక్కన ఉన్న చక్రాలు కదిలాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు కూడా లేచాయి. \v 20 ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, అక్కడికి అవి వెళ్తున్నాయి, వాటితో పాటు చక్రాలు కూడా లేస్తున్నాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది. \v 21 జీవులు కదిలినప్పుడు, అవి కూడా కదిలాయి; జీవులు నిశ్చలంగా ఉన్నప్పుడు, అవి కూడా నిలిచి ఉన్నాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు వాటితో పాటు లేచాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది. \p \v 22 జీవుల తలల పైన విశాలమైనది ఒకటి కనిపించింది. అది స్ఫటికంలా మెరుస్తూ, అద్భుతంగా ఉంది. \v 23 ఆ విశాలం క్రింద వాటి రెక్కలు ఒకదాని వైపు ఒకటి తిన్నగా చాపి ఉన్నాయి, ప్రతి దాని శరీరాన్ని రెండు రెక్కలు కప్పి ఉంచాయి. \v 24 ఆ జీవులు కదిలినప్పుడు నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది జలప్రవాహాల ఘోషలా, సర్వశక్తిమంతుని స్వరంలా, సైన్యం నుండి వచ్చే కోలాహలంలా ఉంది. అవి నిలబడినప్పుడు వాటి రెక్కలు క్రిందికి వాల్చాయి. \p \v 25 అవి రెక్కలు వాల్చి నిలబడినప్పుడు వాటి తలపైన ఉన్న విశాలం పైనుండి ఒక స్వరం వచ్చింది. \v 26 వాటి తలపైన ఉన్న విశాలంపైన నీలమణి వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసిన ఒక సింహాసనం వంటిది కనిపించింది. దాని మీద మానవరూపంలో ఉన్న ఒకడు కూర్చున్నాడు. \v 27 అతని నడుము నుండి పైభాగం చుట్టూరా అగ్నిలో కరుగుతున్న ఇత్తడిలా, క్రింది భాగం అగ్నిలా నాకు కనిపించింది. అతని చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఉంది. \v 28 వర్షం కురుస్తున్న రోజు మేఘాలలో వానవిల్లు కనిపించినట్లు, అతని చుట్టూ ఉన్న తేజస్సు కూడా అలాగే ఉంది. \p ఇది యెహోవా మహిమ రూపము. నేను దానిని చూసినప్పుడు, నేను నేల మీద పడిపోయాను, ఒక స్వరం నాకు వినిపించింది. \c 2 \s1 యెహెజ్కేలుకు ప్రవక్తగా పిలుపు \p \v 1 ఆయన నాతో, “మనుష్యకుమారుడా,\f + \fr 2:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa బెన్ ఆదాము \fqa*\ft అంటే \ft*\fqa మానవుడు. \fqa*\ft క్రొత్త నిబంధనలో “మనుష్యకుమారుడు” తో సహ అనుబంధం కారణంగా \ft*\fq మనుష్యకుమారుడా \fq*\ft అనే పద బంధం ఇక్కడ యెహెజ్కేలు అంతటా సంబోధించబడింది\ft*\f* లేచి నీ కాళ్లమీద నిలబడు. నీతో నేను మాట్లాడతాను” అన్నారు. \v 2 ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆత్మ నా మీదికి వచ్చి నా పాదాల మీద నన్ను నిలబెట్టినప్పుడు ఆయన నాతో మాట్లాడడం నేను విన్నాను. \p \v 3 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; వారు వారి పూర్వికులు ఈ రోజు వరకు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. \v 4 మొండివారును కఠిన హృదయులునైన ప్రజల దగ్గరకు నేను నిన్ను పంపుతున్నాను. ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదేనని వారితో చెప్పు.’ \v 5 వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకునేలా వారికి చెప్పు. \v 6 మనుష్యకుమారుడా, వారికి, వారి మాటలకు భయపడకు. నీ చుట్టూ ముండ్లపొదలు ముళ్ళు ఉన్నా, తేళ్ల మధ్య నివసిస్తున్నా నీవు భయపడకు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వారు అన్న వాటికి వారి చూపులకు నీవేమి భయపడకు. \v 7 వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాట వారికి తెలియజేయి. \v 8 మనుష్యకుమారుడా, వారు తిరుగుబాటు చేసినట్లే నీవు చేయకు. నా మాట విను. నోరు తెరిచి నేను ఇచ్చేది తిను.” \p \v 9 నేను చూస్తుండగా గ్రంథపుచుట్టను పట్టుకుని ఒక చేయి నాకు దగ్గరగా రావడం కనపడింది, \v 10 ఆయన దానిని నా ముందు తెరిచారు. దానికి రెండు వైపులా విలాపం, దుఃఖం శ్రమ అనే మాటలు వ్రాసి ఉన్నాయి. \c 3 \p \v 1 ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, నీకు కనిపించిన దానిని తిని, ఈ గ్రంథపుచుట్టను తిను; తర్వాత ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారికి ప్రకటించు.” \v 2 నేను నోరు తెరవగా ఆయన నాకు ఆ గ్రంథపుచుట్టను తినిపించారు. \p \v 3 అప్పుడు ఆయన, “మనుష్యకుమారుడా, నేనిచ్చే ఈ గ్రంథపుచుట్టను తిని నీ కడుపు నింపుకో” అన్నారు. ఆయన చెప్పినట్లే ఆ గ్రంథాన్ని తిన్నాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది. \p \v 4 ఆయన ఇంకా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి నా మాటలు వారికి తెలియజేయి. \v 5 నీవు అర్థం చేసుకోలేని మాటలు మాట్లాడేవారి దగ్గరకు తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరకు కాదు ఇశ్రాయేలీయుల దగ్గరికే నిన్ను పంపుతున్నాను. \v 6 నీకు అర్థం చేసుకోలేని మాటలు తెలియని భాష మాట్లాడే ఇతర ప్రజల దగ్గరకు పంపలేదు. వారి మధ్యకు నిన్ను పంపితే నీవు చెప్పేది వారు వింటారు. \v 7 కాని ఇశ్రాయేలీయులు మొండివారు కఠిన హృదయులు. నా మాటలు వినడానికి ఇష్టపడరు కాబట్టి నీ మాటలు కూడా వినరు. \v 8 వారి ముఖంలాగానే నీ ముఖం కఠినంగా పోతుంది. వారి నుదురులా నీ నుదిటిని కఠినంగా చేస్తాను. \v 9 నేను నీ నుదుటిని వజ్రం కంటే గట్టి రాయిలా చేస్తాను. వారు తిరుగుబాటుదారులు అయినప్పటికీ వారికి బెదరకు వారిని చూసి భయపడకు.” \p \v 10 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా విని మనస్సులో ఉంచుకో. \v 11 బందీలుగా ఉన్న నీ ప్రజలు దగ్గరకు వెళ్లి వారు విన్నా వినకపోయినా, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే’ అని ప్రకటించు” అన్నారు. \p \v 12 ఆత్మ నన్ను పైకెత్తగా నా వెనుక ఆయన ఉన్న స్థలం నుండి యెహోవా మహిమకు స్తోత్రం కలుగుతుంది అనే గొప్ప గర్జన లాంటి శబ్దం వినిపించింది. \v 13 అది జీవుల రెక్కలు ఒకదానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దము. వాటి ప్రక్కన ఉన్న చక్రాల శబ్దం గొప్ప గర్జన వంటి శబ్దంలా ఉంది. \v 14 అప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్లాడు. నేనలాగే కొట్టుకొని పోయాను. నా మనస్సులో పుట్టిన కోపానికి ఎంతో కలత చెందినప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చింది. \v 15 కెబారు నది దగ్గర ఉన్న తేలాబీబు అనే స్థలంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు వచ్చాను. వారు కూర్చున్న చోటే దిగులుగా ఏడు రోజులు కూర్చుండిపోయాను. \s1 కావలివానిగా యెహెజ్కేలు \p \v 16 ఏడు రోజులు గడిచిన తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి: \v 17 “మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు. \v 18 నేను దుర్మార్గునితో, ‘నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, నీవు వాన్ని హెచ్చరించకపోయినా, లేదా వాని ప్రాణం కాపాడబడేలా చెడు మార్గాలను విడిచిపెట్టమని వాన్ని హెచ్చరించకపోయినా, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే, వాని చావుకు నిన్ను జవాబుదారీని చేస్తాను. \v 19 అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా వారు తమ దుర్మార్గాన్ని, దుష్ట మార్గాలను వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు; కాని నీవు తప్పించుకుంటావు. \p \v 20 “నీతిమంతుడు తన నీతి నుండి తొలగిపోయి చెడు చేస్తే నేను అతని ముందు అభ్యంతరం పెడతాను అప్పుడతడు చస్తాడు. అయితే నీవు అతన్ని హెచ్చరించలేదు కాబట్టి అతడు తన పాపాన్ని బట్టి చస్తాడు. అతడు చేసిన నీతిక్రియలను నేను జ్ఞాపకం చేసుకోను, కాని అతని రక్తానికి నిన్నే జవాబుదారీని చేస్తాను. \v 21 ఒకవేళ పాపం చేయకూడదని నీవు నీతిమంతుని హెచ్చరించినప్పుడు అతడు పాపం చేయకపోతే అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు, ఎందుకంటే అతడు ఆ హెచ్చిరికకు లోబడ్డాడు. అలాగే నిన్ను నీవు కాపాడుకుంటావు.” \p \v 22 అప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చి, ఆయన నాతో, “నీవు లేచి, సమతల మైదాన ప్రాంతానికి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని అన్నారు. \v 23 కాబట్టి నేను లేచి సమతల మైదానానికి వెళ్లాను. కెబారు నది దగ్గర నేను చూసిన యెహోవా మహిమ అక్కడ నిలబడి ఉంది. నేను ముఖం నేలకు ఆనించి మోకాళ్లమీద ఉన్నాను. \p \v 24 అప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నా కాళ్లమీద నన్ను నిలబెట్టాడు. తర్వాత యెహోవా నాతో ఇలా చెప్పారు: “నీ ఇంటి లోపలికి వెళ్లి, తలుపులు మూసివేసుకో. \v 25 మనుష్యకుమారుడా, వారు నిన్ను త్రాళ్లతో కట్టి బంధించబోతున్నారు కాబట్టి నీవు వారి మధ్యకు వెళ్లవద్దు. \v 26 వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి నీవు వారిని గద్దించకుండా మౌనంగా ఉండేలా నీ నాలుక నీ అంగిటికి అంటుకుపోయేలా చేస్తాను. \v 27 కాని నేను నీతో మాట్లాడినప్పుడు నీవు వారితో, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు’ చెప్పడానికి నేను నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వినేవారు వింటారు విననివారు వినరు. \c 4 \s1 యెరూషలేము ముట్టడికి సూచన \p \v 1 “మనుష్యకుమారుడా, ఒక మట్టి ఇటుకను తీసుకుని, నీ ముందు పెట్టుకుని, దాని మీద యెరూషలేము పట్టణ నమూనాను గీయి. \v 2 తర్వాత అది ముట్టడి వేయబడినట్లుగా దాని ఎదురుగా ముట్టడి దిబ్బలు, బురుజు కట్టినట్లు, దానికి ఎదురుగా సైనిక శిబిరాలు, గోడలను పడగొట్టే యంత్రాలు ఉన్నట్లు గీయి. \v 3 తర్వాత ఒక ఇనుప రేకును తీసుకుని, దాన్ని నీకు, పట్టణానికి మధ్య ఇనుప గోడలా ఉంచి, నీ ముఖాన్ని దాని వైపుకు త్రిప్పి నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడి చేస్తున్నట్లుగా ఉంటావు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచనగా ఉంటుంది. \p \v 4 “అప్పుడు నీవు నీ ఎడమవైపుకు పడుకుని ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని నీ మీద వేసుకో. నీవు నీవైపు పడుకుని ఉన్న అన్ని రోజులు వారి పాపాన్ని నీవు భరించాలి. \v 5 ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు పాపం చేశారో అన్ని రోజులు నేను నీకు నిర్ణయిస్తాను. దాని ప్రకారం 390 రోజులు నీవు వారి పాపాన్ని భరించాలి. \p \v 6 “నీవు ఇది పూర్తి చేసిన తర్వాత, ఈసారి నీ కుడి వైపుకు తిరిగి పడుకుని యూదా ప్రజల పాపాన్ని భరించు. నేను నీకు 40 రోజులు, ప్రతి సంవత్సరానికి ఒక రోజు నియమించాను. \v 7 ముట్టడిలో ఉన్న యెరూషలేము వైపు నీ ముఖాన్ని త్రిప్పి చొక్కా తీసివేసి చేయి ఎత్తి, దానికి వ్యతిరేకంగా ప్రవచించు. \v 8 నీ ముట్టడి రోజులు పూర్తయ్యే వరకు నీవు ఒకవైపు నుండి మరోవైపుకు తిరగకుండా నిన్ను త్రాళ్లతో బంధిస్తాను. \p \v 9 “గోధుమలు, యవలు, చిక్కుడు కాయలు, అలచందలు, జొన్నలు తీసుకోండి; వాటిని ఒక పాత్రలో నిల్వ ఉంచి వాటితో రొట్టెలు చేసుకుని నీవు ఒకవైపు పడుకున్న 390 రోజులు వాటిని తినాలి. \v 10 ప్రతిరోజు తినడానికి ఇరవై షెకెళ్ళ\f + \fr 4:10 \fr*\ft అంటే, సుమారు 230 గ్రాములు\ft*\f* ఆహారాన్ని తూకం వేసి, నిర్ణీత సమయాల్లో తినాలి. \v 11 అలాగే ఒక హిన్\f + \fr 4:11 \fr*\ft అంటే, సుమారు 0.6 లీటర్\ft*\f* లో ఆరవ వంతు నీరు కొలిచి నిర్ణీత సమయాల్లో త్రాగాలి. \v 12 యవలతో రొట్టెలు చేసుకుని ప్రజలంతా చూస్తుండగా మానవ మలంతో వాటిని కాల్చుకుని తినాలి. \v 13 నేను వారిని ఏ జాతుల మధ్యకు వెళ్లగొడతానో వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అపవిత్రమైన ఆహారం తింటారు” అని యెహోవా నాకు చెప్పారు. \p \v 14 అప్పుడు నేను, “అలా కాదు, ప్రభువా, యెహోవా! నన్ను నేను ఎప్పుడూ అపవిత్రం చేసుకోలేదు. నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు చనిపోయింది గాని అడవి జంతువులు చంపిన దానిని గాని నేను తినలేదు. ఏ అపవిత్రమైన మాంసం నా నోటిలోకి వెళ్లలేదు” అని అన్నాను. \p \v 15 అందుకు ఆయన, “మంచిది, అలా అయితే మానవ మలం బదులు ఆవు పేడ మీద కాల్చడానికి నేను నిన్ను అనుమతిస్తాను” అని అన్నారు. \p \v 16 ఇంకా ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, నేను యెరూషలేములో ఆహార సరఫరాను నిలిపివేయబోతున్నాను. ప్రజలు ఆందోళనకు గురియై కొలత ప్రకారం ఆహారం తింటారు, అలాగే కొలత ప్రకారం నీరు త్రాగుతారు. \v 17 ఆహారానికి నీటికి కొరత ఏర్పడుతుంది. వారు ఒకరినొకరు చూసి దిగులుపడతారు, వారి పాపం కారణంగా వారు నశించిపోతారు. \c 5 \s1 తీర్పు అనే దేవుని మంగలి కత్తి \p \v 1 “మనుష్యకుమారుడా, పదునైన కత్తిని తీసుకుని దానిని మంగలి కత్తిలా ఉపయోగించి నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఒక త్రాసు తెచ్చి ఆ వెంట్రుకలను తూచి భాగాలుగా చేయి. \v 2 నీ ముట్టడి రోజులు పూర్తి కాగానే ఈ వెంట్రుకలలో మూడవ భాగాన్ని పట్టణం లోపల కాల్చివేయాలి. మూడవ భాగాన్ని తీసుకుని ఖడ్గంతో పట్టణం చుట్టూ చెదరగొట్టాలి. మిగిలిన మూడవ భాగాన్ని గాలికి ఎగిరిపోనివ్వాలి. ఎందుకంటే నేను ఖడ్గంతో వారిని వెంటాడతాను. \v 3 అయితే కొన్ని వెంట్రుకలు తీసుకుని నీ బట్టల అంచుకు కట్టుకో. \v 4 మరికొన్నిటిని తీసుకుని అగ్నిలో వేసి కాల్చు, అందులో నుండి అగ్ని వచ్చి ఇశ్రాయేలంతా వ్యాపిస్తుంది. \p \v 5 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము ఇదే! దాని చుట్టూరా దేశాలున్నాయి. \v 6 అయితే అది దాని చుట్టూ ఉన్న జాతుల కన్నా, రాజ్యాల కన్నా ఎక్కువగా నా ధర్మశాస్త్రాన్ని, శాసనాలను నిర్లక్ష్యం చేసింది. అది నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించి నా శాసనాలను పాటించలేదు. \p \v 7 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరే దుష్టులు, నా శాసనాలను అనుసరించలేదు, నా చట్టాలను పాటించలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న జాతుల ప్రమాణాలకు కూడా మీరు అనుగుణంగా ఉండరు. \p \v 8 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేమా, నేనే నీకు వ్యతిరేకంగా ఉన్నాను, జాతులు చూస్తుండగానే నేను నీకు శిక్ష విధిస్తాను. \v 9 మీ అసహ్యమైన విగ్రహాలన్నిటిని బట్టి నేను ఇంతకు ముందెన్నడూ చేయనిది, ఇకపై ఎన్నడూ చేయనిది మీకు చేస్తాను. \v 10 కాబట్టి మీ మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను తింటారు, పిల్లలు తమ తల్లిదండ్రులను తింటారు. నేను మీకు శిక్ష విధించి మీలో మిగిలిన వారినందరిని గాలికి చెదరగొడతాను. \v 11 నా జీవం తోడు, నిశ్చయంగా, నీవు నీ నీచమైన ప్రతిమలతోను అసహ్యమైన ఆచారాలతోను నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచావు కాబట్టి, నేనే నీకు క్షౌరం చేస్తాను; నేను నీపై జాలిపడను, నిన్ను కనికరించను” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 12 మీ ప్రజల్లో మూడవ భాగం మీలోనే తెగులుతో చస్తారు, కరువుతో నశిస్తారు; మరో మూడవ భాగం మీ గోడల బయట ఖడ్గానికి కూలిపోతారు. మిగిలిన భాగాన్ని నేను గాలికి చెదరగొట్టి ఖడ్గంతో వారిని వెంటాడతాను. \p \v 13 “అప్పుడు నా కోపం తీరుతుంది, వారి మీద నా ఉగ్రత తగ్గుతుంది, నా ప్రతీకారం తీరుతుంది. నేను వారి మీద నా ఉగ్రతను పూర్తిగా కుమ్మరించినప్పుడు, యెహోవానైన నేను రోషంతో మాట్లాడానని వారు తెలుసుకుంటారు. \p \v 14 “నీ చుట్టూ ఉన్న జాతుల మధ్యలో నిన్ను చూసే వారందరి ఎదుట నిన్ను నిర్జనంగాను నిందగాను చేస్తాను. \v 15 నేను కోపంలో, ఉగ్రతలో, కఠోరమైన మందలింపుతో నిన్ను శిక్షించినప్పుడు, నీ చుట్టూ ఉన్న జాతులకు నీవు ఒక నిందగా హేళనగా ఒక హెచ్చరికగా ఒక భయానకమైనదానిగా ఉంటావు. యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను. \v 16 నేను నిన్ను నాశనం చేయడానికి ఘోరమైన, నాశనకరమైన కరువు బాణాలను నీ మీదికి విసురుతాను. నేను నీ మీదికి ఇంకా ఇంకా ఎక్కువ కరువు రప్పించి, నీ ఆహార సరఫరాను నిలిపివేస్తాను. \v 17 నేను నీ మీదికి కరువును, అడవి మృగాలను పంపుతాను, అవి మీకు సంతానం లేకుండా చేస్తాయి. తెగులు, రక్తపాతం నిన్ను తుడిచివేస్తాయి, నేను నీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని యెహోవానైన నేనే చెప్పాను.” \c 6 \s1 ఇశ్రాయేలు పర్వతాలకు వినాశనం \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల పర్వతాల వైపు తిరిగి, వాటికి వ్యతిరేకంగా ప్రవచిస్తూ, \v 3 ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, పర్వతాలకు, కొండలకు, కనుమలకు, లోయలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను మీ మీదికి ఖడ్గాన్ని రప్పించి, మీ క్షేత్రాలను నాశనం చేస్తాను. \v 4 మీ బలిపీఠాలు కూల్చివేయబడతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి; మీ విగ్రహాల ముందు నేను నీ ప్రజలను చంపుతాను. \v 5 ఇశ్రాయేలీయుల శవాలను వారి విగ్రహాల ముందు పడవేస్తాను, మీ బలిపీఠాలు చుట్టూ మీ ఎముకలు వెదజల్లుతాను. \v 6 మీరు ఎక్కడ నివసించినా, ఆ పట్టణాలు నిర్జనమవుతాయి, క్షేత్రాలు పడగొట్టబడతాయి, తద్వారా మీ బలిపీఠాలు అపవిత్రమవుతాయి, మీ విగ్రహాలు పగిలి శిథిలమవుతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి, మీరు తయారుచేసినవి తుడిచివేయబడతాయి. \v 7 మీ ప్రజలు మీ మధ్య చంపబడతారు, అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. \p \v 8 “ ‘అయినా నేను కొందరిని విడిచిపెడతాను, ఎందుకంటే మీరు వివిధ దేశాలకు జాతుల మధ్యకు చెదరగొట్టబడినపుడు మీలో కొంతమంది ఖడ్గం నుండి తప్పించుకుంటారు. \v 9 అప్పుడు తప్పించుకుని ఇతర దేశాల్లో బందీలుగా ఉన్నవారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నాకు దూరంగా ఉన్న వారి వ్యభిచార హృదయాలను బట్టి నేను ఎలా దుఃఖించానో, వారి విగ్రహాల పట్ల వారి కళ్లల్లో కనిపించిన మోహాన్ని బట్టి నేను ఎలా బాధపడ్డానో జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన చెడును బట్టి వారి అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి తమను తాము అసహ్యించుకుంటారు. \v 10 అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు; వారిపైకి కీడు రప్పిస్తానని నేను ఊరకనే బెదిరించలేదు. \p \v 11 “ ‘ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చేతులను చరిచి మీ పాదాలతో నేలను తన్ని ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గమైన అసహ్యమైన క్రియలనుబట్టి “అయ్యో!” అని ఏడువు ఎందుకంటే వారు ఖడ్గం కరువు తెగులు ద్వారా చస్తారు. \v 12 దూరాన ఉన్నవారు తెగులు వచ్చి చస్తారు. దగ్గరగా ఉన్నవారు ఖడ్గంతో చస్తారు, ఎవరైనా మిగిలినా, విడిచిపెట్టబడినా, వారు కరువుతో చస్తారు. నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. \v 13 తమ విగ్రహాల మధ్య, తమ బలిపీఠాల చుట్టూరా, ఎత్తైన కొండలన్నిటి మీద, పర్వత శిఖరాలన్నిటి మీద, మహా వృక్షాల క్రింద, ఏపుగా పెరిగిన సింధూర వృక్షాలన్నిటి క్రింద ఎక్కడైతే తమ విగ్రహాలన్నిటికి పరిమళ ధూపం వేశారో అక్కడ వారి ప్రజలందరూ చచ్చి పడి ఉండడం చూసి, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. \v 14 నేను వారికి వ్యతిరేకంగా నా చేయి చాపి వారెక్కడ నివసించినా ఆ దేశాన్ని ఎడారి నుండి రిబ్లా\f + \fr 6:14 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa దిబ్లా\fqa*\f* వరకు నిర్జనమైన వ్యర్థంగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” \c 7 \s1 అంతం వచ్చింది \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీయుల దేశానికి చెప్తున్న మాట ఇదే: \q1 “ ‘అంతం! అంతం వచ్చేసింది \q2 దేశం నలువైపులా వచ్చేసింది! \q1 \v 3 ఇప్పుడు నీ మీద అంతం వచ్చేసింది! \q2 నా కోపాన్ని నీపై కుమ్మరిస్తాను. \q1 నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి \q2 నీ అసహ్యకరమైన ఆచారాలన్నిటిని బట్టి నీకు తిరిగి చెల్లిస్తాను. \q1 \v 4 నీ మీద ఏమాత్రం దయ చూపించను \q2 నిన్ను వదిలిపెట్టను. \q1 నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్న \q2 అసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను. \m “ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’ \b \p \v 5 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: \q1 “ ‘విపత్తు! విపత్తు వెనకే విపత్తు \q2 చూడండి, అది వచ్చేస్తుంది! \q1 \v 6 అంతం వచ్చేసింది! \q2 అంతం వచ్చేసింది! \q1 అది నీ కోసమే చూస్తుంది; \q2 ఇదిగో, వచ్చింది. \q1 \v 7 దేశ నివాసులారా! \q2 మీ మీదికి వినాశనం వస్తుంది. \q1 సమయం దగ్గరకి వచ్చింది! ఆ రోజు సమీపంగా ఉంది! \q2 ఆనందం కాదు భయమే పర్వతాలమీద వినపడుతుంది. \q1 \v 8 నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను. \q2 నా కోపాన్ని మీమీద చూపిస్తాను. \q1 మీ ప్రవర్తనకు మీరు చేసిన \q2 అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. \q1 \v 9 మీమీద ఏమాత్రం దయ చూపించను; \q2 మిమ్మల్ని వదిలిపెట్టను. \q1 మీ ప్రవర్తనకు, మీ మధ్య ఉన్న \q2 అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. \b \m “ ‘అప్పుడు యెహోవానైన నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.’ \q1 \v 10 “ ‘ఇదిగో ఆ రోజు! \q2 అది వచ్చేస్తుంది! \q1 నాశనం బయలుదేరి వచ్చేసింది \q2 దండం వికసించింది. \q2 గర్వం చిగురించింది. \q1 \v 11 బలాత్కారం మొదలై \q2 దుష్టులను శిక్షించే దండం అయింది. \q1 ప్రజల్లో గాని \q2 వారి గుంపులో గాని, \q1 ఆస్తిలో గాని, \q2 వారి ప్రఖ్యాతిలో గాని ఏదీ మిగల్లేదు. \q1 \v 12 ఆ సమయం వచ్చింది! \q2 ఆ రోజు వచ్చింది! \q1 ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది. \q2 కాబట్టి కొనేవాడు సంతోష పడనక్కరలేదు \q2 అమ్మే వానికి దుఃఖ పడనక్కరలేదు. \q1 \v 13 అమ్మినవాడు కొన్న వాడు జీవించి ఉన్నంత కాలం \q2 అమ్మినవాడు తాను అమ్మిన దానిని తిరిగిపొందడు. \q1 ఈ దర్శనం ఆ గుంపు అంతటికి సంబంధించినది \q2 అది తప్పక నెరవేరుతుంది. \q1 వారి పాపాల కారణంగా వారిలో ఎవరూ \q2 తమ ప్రాణాలను రక్షించుకోలేడు. \b \q1 \v 14 “ ‘వారంతా సిద్ధపడి \q2 యుద్ధానికి బూరలను ఊదుతారు. \q1 ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది \q2 కాబట్టి వారిలో ఏ ఒక్కరూ యుద్ధానికి వెళ్లరు. \q1 \v 15 బయట కత్తి ఉంది; \q2 లోపల తెగులు కరువు ఉన్నాయి. \q1 బయట ఉన్నవారు \q2 కత్తి వలన చచ్చారు; \q1 పట్టణంలో ఉన్నవారు \q2 తెగులు కరువు వలన నాశనమవుతారు. \q1 \v 16 వాటినుండి తప్పించుకున్నవారు \q2 పర్వతాల మీదకు పారిపోయి \q1 తమ పాపాలను బట్టి \q2 వారిలో ప్రతి ఒక్కరు \q2 లోయ పావురాల్లా మూల్గుతారు. \q1 \v 17 ప్రతీ చేయి బలహీనం అవుతుంది; \q2 ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది. \q1 \v 18 వారు గోనెపట్ట కట్టుకుంటారు \q2 భయం వారిని ఆవరిస్తుంది. \q1 ప్రతి ఒక్కరు సిగ్గుతో తలవంచుకుంటారు, \q2 ప్రతి తల క్షౌరం చేయబడుతుంది. \b \q1 \v 19 “ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు, \q2 వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది. \q1 యెహోవా ఉగ్రత దినాన \q2 వారి వెండి బంగారాలు \q2 వారిని రక్షించలేవు. \q1 వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకు \q2 వాటివలన వారి ఆకలి తీరదు \q2 వారి కడుపు నిండదు. \q1 \v 20 అందమైన ఆభరణాల బట్టి గర్వించి \q2 హేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు. \q1 వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు; \q2 కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను. \q1 \v 21 నేను వారి సంపదను విదేశీయులకు ఎరగా \q2 భూమిమీది దుర్మార్గులకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను \q2 వారే దానిని అపవిత్రపరుస్తారు. \q1 \v 22 వారిని చూడకుండ నా ముఖాన్ని త్రిప్పుకుంటాను, \q2 కాబట్టి దొంగలు నా నిధి ఉన్న స్థలాన్ని అపవిత్రపరుస్తారు. \q1 వారు దానిలోనికి వెళ్లి \q2 దానిని మలినం చేస్తారు. \b \q1 \v 23 “ ‘దేశమంతా రక్తంతో \q2 పట్టణమంతా హింసతో నిండిపోయింది \q2 కాబట్టి సంకెళ్ళు సిద్ధం చేయండి. \q1 \v 24 వారి ఇళ్ళను స్వాధీనం చేసుకోవడానికి \q2 ప్రజల్లో అత్యంత దుష్ట జాతులను రప్పిస్తాను. \q1 నేను వారి బలవంతుల గర్వాన్ని అణచివేస్తాను \q2 వారి పరిశుద్ధాలయాలు అపవిత్రం చేయబడతాయి. \q1 \v 25 భయం కలిగినప్పుడు \q2 వారు సమాధానాన్ని వెదుకుతారు కాని అది దొరకదు. \q1 \v 26 నాశనం వెంబడి నాశనం వస్తుంది, \q2 పుకార్ల మీద పుకార్లు పుట్టుకొస్తాయి. \q1 వారు ప్రవక్త దగ్గరకి దర్శనం కోసం వెళ్తారు \q2 ధర్మశాస్త్ర జ్ఞానం యాజకులకు ఉండదు. \q2 పెద్దలు ఆలోచన చేయరు. \q1 \v 27 రాజు దుఃఖిస్తారు, \q2 యువరాజు నిరాశకు గురవుతాడు, \q2 దేశ ప్రజల చేతులు వణకుతాయి. \q1 వారి ప్రవర్తనను బట్టి వారికి చేస్తాను, \q2 వారి సొంత ప్రమాణాల ప్రకారమే నేను వారికి తీర్పు తీరుస్తాను. \b \m “ ‘అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” \c 8 \s1 మందిరంలో విగ్రహారాధన \p \v 1 ఆరవ సంవత్సరం ఆరవ నెల అయిదవ రోజున నా ఇంట్లో నేను, యూదా పెద్దలు కూర్చుని ఉన్నప్పుడు, ప్రభువైన యెహోవా చేయి నా మీదికి వచ్చింది. \v 2 నేను చూస్తుండగా ఒక మానవ ఆకారం\f + \fr 8:2 \fr*\ft లేదా \ft*\fqa అగ్ని లాంటి ఆకారం\fqa*\f* కనిపించింది. అతని నడుము నుండి క్రిందికి నిప్పులా ఉన్నాడు, అక్కడినుండి అతని రూపం మెరుస్తున్న లోహంలా ప్రకాశవంతంగా ఉంది. \v 3 ఆయన చేయిలాంటి దానిని చాపి నా జుట్టు పట్టుకున్నారు. ఆత్మ నన్ను భూమికి ఆకాశానికి మధ్యకు ఎత్తి దేవుని దర్శనాలలో ఆయన నన్ను యెరూషలేముకు లోపలి ఆవరణ ఉత్తర ద్వారం దగ్గర ఉన్న రోషం పుట్టించే విగ్రహం దగ్గరకు తీసుకువచ్చాడు. \v 4 అప్పుడు సమతల మైదానంలో నేను చూసిన దర్శనంలో కనిపించినట్లే ఇశ్రాయేలీయుల దేవుని మహిమ మళ్ళీ కనిపించింది. \p \v 5 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఉత్తరదిక్కు చూడు” అని చెప్పినప్పుడు, నేను ఉత్తరదిక్కు చూడగా అక్కడ బలిపీఠపు ఉత్తర ద్వారం దగ్గర రోషం పుట్టించే విగ్రహం కనిపించింది. \p \v 6 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, వారు చేస్తున్నది నీవు చూశావు కదా! నా పరిశుద్ధాలయం నుండి నన్ను దూరం చేసేలా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేస్తున్న చాలా అసహ్యకరమైన పనులు చూశావా? కాని వీటి కంటే మరింత అసహ్యకరమైన వాటిని నీవు చూస్తావు” అన్నారు. \p \v 7 అప్పుడు ఆయన నన్ను ఆవరణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ నేను చూడగా, నాకు గోడకు ఒక రంధ్రం కనిపించింది. \v 8 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఆ గోడ లోపలికి త్రవ్వు” అని చెప్పారు. నేను ఆ గోడ లోపలికి త్రవ్వగా ద్వారం ఒకటి కనిపించింది. \p \v 9 ఆయన నాతో, “లోపలికి వెళ్లి వారు ఇక్కడ చేస్తున్న దుర్మార్గమైన అసహ్యకరమైన పనులు చూడు” అని చెప్పారు. \v 10 నేను లోపలికి వెళ్లి చూస్తే, అన్ని రకాల ప్రాకే జీవులు, అపవిత్రమైన జంతువులు, ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహాలు గోడ మీద అంతటా గీయబడి కనిపించాయి. \v 11 డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది. \p \v 12 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ తమ విగ్రహాల గుడి దగ్గర ప్రతి ఒక్కరూ తమ తమ విగ్రహాల గుడి దగ్గర ఏమి చేస్తున్నారో నీవు చూశావు గదా? యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు” అన్నారు. \v 13 ఆయన ఇంకా నాతో, “నీవు ఈ వైపుకు తిరిగి చూస్తున్నావా? వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు. \p \v 14 ఇలా చెప్పి ఆయన నన్ను యెహోవా ఆలయానికి ఉత్తర ద్వారం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, అక్కడ కొందరు స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవతను గురించి ఏడుస్తూ నాకు కనిపించారు. \v 15 అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నీవు ఇది చూస్తున్నావా? అని యెహోవా అన్నాడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు. \p \v 16 ఆయన నన్ను యెహోవా ఆలయ లోపలి ఆవరణంలోనికి తీసుకువచ్చినప్పుడు, ఆలయ ప్రవేశం దగ్గర ఉన్న మంటపానికి బలిపీఠానికి మధ్యలో ఇంచుమించు ఇరవై అయిదుగురు మనుష్యులు నాకు కనిపించారు. వారి వీపులు యెహోవా మందిరం వైపు వారి ముఖాలు తూర్పు వైపు తిరిగి ఉన్నాయి. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. \p \v 17 అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, చూశావా? యూదా ప్రజలు ఇక్కడ చేస్తున్న ఈ అసహ్యమైన పనులు చేయడం చిన్న విషయమా? అంతే కాకుండా వారు దేశాన్ని హింసతో నింపివేస్తూ నా కోపాన్ని అంతకంతకు పెంచుతున్నారు. వారి ముక్కుకు తీగె పెట్టుకుంటున్నారు చూడు! \v 18 కాబట్టి నేను వారితో కోపంగా వ్యవహరిస్తాను; వారి మీద జాలి చూపించను వారిని వదిలిపెట్టను. వారు నా చెవుల్లో అరిచినా నేను వారి మొర వినను” అన్నారు. \c 9 \s1 విగ్రహారాధికులకు తీర్పు \p \v 1 ఆయన గట్టిగా ఇలా మాట్లాడడం నేను విన్నాను, “మీలో ప్రతి ఒక్కరు తమ చేతిలో ఆయుధం పట్టుకుని పట్టణం మీద తీర్పును అమలుచేయడానికి నియమించబడిన వారిని దగ్గరకు తీసుకురండి.” \v 2 ఉత్తరాన ఉన్న పై ద్వారం వైపు నుండి ఆరుగురు వ్యక్తులు తమ చేతుల్లో మారణాయుధాలు పట్టుకుని రావడం నేను చూశాను. వారితో పాటు నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. వారు లోపలికి వచ్చి ఇత్తడి బలిపీఠం ప్రక్కన నిలబడ్డారు. \p \v 3 ఇశ్రాయేలీయుల దేవుని మహిమ అది ఉన్న కెరూబు మీది నుండి పైకి వెళ్లి ఆలయ గడప దగ్గరకు వచ్చి నిలిచింది. అప్పుడు యెహోవా నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకుని ఉన్న వానిని పిలిచి, \v 4 యెహోవా అతనితో, “నీవు వెళ్లి యెరూషలేము పట్టణమంతా తిరిగి అక్కడ జరుగుతున్న అసహ్యకరమైన పనులన్నిటిని బట్టి దుఃఖించి విలపించే వారి నుదిటిపై ఒక గుర్తు పెట్టు” అన్నారు. \p \v 5 నేను వింటుండగా ఆయన మిగిలిన వారితో, “మీరు అతని వెంట పట్టణంలోనికి వెళ్లి దయా కనికరం లేకుండా అందరిని చంపండి. \v 6 ఎవరినీ విడిచిపెట్టకండి. వృద్ధులను, యువకులను, స్త్రీలను, తల్లులను పిల్లలను అందరిని చంపండి కాని ఆ గుర్తు ఉన్నవారిని మాత్రం ముట్టుకోవద్దు. నా పరిశుద్ధాలయం నుండి మొదలుపెట్టండి” అన్నారు. వెంటనే వారు మందిరం ముందున్న వృద్ధులతో మొదలుపెట్టారు. \p \v 7 ఆయన వారితో, “మందిరాన్ని అపవిత్రం చేయండి. ఆవరణాలను శవాలతో నింపండి. మొదలుపెట్టండి” అన్నారు. వారు బయలుదేరి వెళ్లి పట్టణంలో అందరిని చంపడం మొదలుపెట్టారు. \v 8 వారు చంపుతూ ఉన్నప్పుడు నేను ఒక్కడినే మిగిలి పోయాను, అప్పుడు నేను నేలపై పడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో! ప్రభువైన యెహోవా! యెరూషలేముపై నీ ఉగ్రతను కుమ్మరించి ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారందరిని నాశనం చేస్తావా?” అని మొరపెట్టాను. \p \v 9 అందుకు ఆయన నాతో, “ఇశ్రాయేలు ప్రజల పాపాలు, యూదా ప్రజల పాపాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ దేశమంతా రక్తపాతంతో పట్టణమంతా అన్యాయంతో నిండిపోయింది. యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు. \v 10 కాబట్టి వారి మీద ఏమాత్రం దయ చూపించను వారిని కనికరించను కాని వారు చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని నేను వారికి ఇస్తాను” అన్నారు. \p \v 11 నారబట్టలు వేసుకుని తన నడుముకు వ్రాత సామాన్లు కట్టుకుని ఉన్నవాడు తిరిగివచ్చి, “నీవు ఆజ్ఞాపించినట్లే నేను చేశాను” అని చెప్పాడు. \c 10 \s1 మందిరంలో నుండి వెళ్లిపోయిన దేవుని మహిమ \p \v 1 నేను చూడగా, కెరూబుల తలల పైన ఉన్న విశాలంపైన నీలమణి వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసిన ఒక సింహాసనం వంటిది కనిపించింది. \v 2 నారబట్టలు వేసుకున్న వానితో యెహోవా, “కెరూబు క్రింద ఉన్న చక్రాల మధ్యకు వెళ్లు. కెరూబుల మధ్య ఉన్న నిప్పులు నీ చేతి నిండా గుప్పిలిలో తీసుకుని పట్టణమంతా చల్లు” అని చెప్పారు. నేను చూస్తుండగానే ఆయన లోపలికి వెళ్లిపోయారు. \p \v 3 ఆయన లోపలికి వెళ్లినప్పుడు కెరూబులు ఆలయానికి దక్షిణం వైపున నిలబడి ఉన్నాయి; ఒక మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మివేసింది. \v 4 అప్పుడు యెహోవా మహిమ కెరూబు మీద నుండి పైకి వెళ్లి ఆలయ గుమ్మం వరకు వెళ్లింది. మేఘం మందిరాన్ని నింపివేసింది, ఆవరణం యెహోవా మహిమతో నిండిపోయింది. \v 5 కెరూబుల రెక్కల ధ్వని బయటి ఆవరణం వరకు, సర్వశక్తిమంతుడైన దేవుడు\f + \fr 10:5 \fr*\ft హెబ్రీలో \ft*\fqa ఎల్-షద్దాయ్\fqa*\f* మాట్లాడుతున్నప్పుడు వినిపించే స్వరంలా వినబడింది. \p \v 6 నారబట్టలు వేసుకున్న వానితో యెహోవా, “కెరూబుల మధ్య ఉన్న చక్రాల మధ్య నుండి అగ్నిని తీసివేయి” అని ఆజ్ఞాపించినప్పుడు, అతడు లోపలికి వెళ్లి ఒక చక్రం ప్రక్కన నిలబడ్డాడు. \v 7 అప్పుడు కెరూబులలో ఒకడు తన చేతిని వారి మధ్య ఉన్న అగ్ని వైపుకు చాచి కొన్ని నిప్పులు తీసుకుని నారబట్టలు వేసుకున్న వాని చేతికి ఇవ్వగా అతడు వాటిని తీసుకుని బయటకు వెళ్లాడు. \v 8 (కెరూబుల రెక్కల క్రింద మానవ చేతుల్లాంటివి కనిపించాయి.) \p \v 9 ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రం చొప్పున మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవి పుష్యరాగం వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసినట్లుగా ఉన్నాయి. \v 10 ఆ నాలుగు చక్రాలు ఒకేలా ఉన్నాయి. ఆ చక్రాలు ఒకదానిలో ఒకటి అమర్చినట్లుగా ఉన్నాయి. \v 11 అవి కదిలినప్పుడు కెరూబులు తిరిగి ఉన్న నాలుగు వైపులకు అవి వెళ్తాయి అయితే కెరూబులు వెళ్తూ ఉన్నప్పుడు అవి వెనుకకు తిరగలేదు. కెరూబులు ఎటూ తిరగకుండా వాటి తలలు తిరగి ఉన్న వైపు వెళ్లాయి. \v 12 వాటి వీపు, చేతులు రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్లు ఉన్నాయి; వాటికున్న నాలుగు చక్రాలు కూడా పూర్తిగా కళ్లతో నిండి ఉన్నాయి. \v 13 తిరగండని చక్రాలతో చెప్పడం నేను విన్నాను. \v 14 ప్రతి కెరూబుకు నాలుగు ముఖాలు ఉన్నాయి: మొదటిది కెరూబు ముఖం, రెండవది మానవ ముఖం, మూడవది సింహ ముఖం, నాల్గవది గ్రద్ద ముఖము. \p \v 15 అప్పుడు కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నేను చూసిన జీవులు ఇవే. \v 16 కెరూబులు కదిలినప్పుడు వాటి ప్రక్కనున్న చక్రాలు కూడా కదిలాయి; కెరూబులు నేల నుండి పైకి లేవడానికి రెక్కలు విప్పినప్పుడు కూడా చక్రాలు వాటి దగ్గర నుండి తొలగిపోలేదు. \v 17 జీవుల ఆత్మ చక్రాలలో ఉంది కాబట్టి కెరూబులు నిలబడినప్పుడు అవి కూడ నిలబడ్డాయి; లేచినప్పుడు అవి కూడా లేచాయి. \p \v 18 అప్పుడు యెహోవా మహిమ ఆలయ గుమ్మం మీద నుండి వెళ్లిపోయి కెరూబుల పైన ఆగింది. \v 19 నేను చూస్తుండగానే కెరూబులు రెక్కలు విప్పి నేల నుండి పైకి లేచాయి, అవి వెళ్తుండగా చక్రాలు వాటితో పాటు వెళ్లాయి. అవి యెహోవా ఆలయ తూర్పు ద్వారం దగ్గరకు వచ్చి ఆగాయి; ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపైన ఉంది. \p \v 20 ఇవి కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నేను చూసిన జీవులు ఇవే. అవి కెరూబులను నేను గ్రహించాను. \v 21 ప్రతి దానికి నాలుగు ముఖాలు నాలుగు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల క్రింద మానవ చేతుల్లాంటివి ఉన్నాయి. \v 22 వాటి ముఖాలు నేను కెబారు నది దగ్గర నేను చూసిన ముఖాల్లాగానే ఉన్నాయి. అవన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి. \c 11 \s1 యెరూషలేముపై దేవుని ఖచ్చితమైన తీర్పు \p \v 1 అప్పుడు ఆత్మ నన్ను పైకి లేపి తూర్పు వైపున ఉన్న యెహోవా మందిరపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చాడు. ద్వారం దగ్గర ఇరవై అయిదుగురు మనుష్యులు ఉన్నారు, వారిలో ప్రజల నాయకులైన అజ్జూరు కుమారుడైన యాజన్యా, బెనాయా కుమారుడైన పెలట్యా నాకు కనిపించారు. \v 2 యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, వీరు చెడు కుట్రలు పన్నుతూ ఈ పట్టణంలో దుష్ట సలహాలు ఇస్తున్నారు. \v 3 వారు, ‘మన ఇల్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు; ఈ పట్టణం ఒక కుండ అయితే మనం దానిలో మాంసం’ అని అంటున్నారు. \v 4 కాబట్టి వారికి వ్యతిరేకంగా ప్రవచించు; మనుష్యకుమారుడా, ప్రవచించు.” \p \v 5 అప్పుడు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఇలా చెప్పమని నాతో చెప్పారు: “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు నాయకులారా, మీరు చెప్పేది అదే కాని మీ మనస్సులో వచ్చే ఆలోచనలు నాకు తెలుసు. \v 6 మీరు ఈ పట్టణంలో ఎంతోమందిని చంపారు; మీరు చంపిన శవాలతో పట్టణ వీధులు నిండిపోయాయి. \p \v 7 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు చంపి పట్టణంలో పడవేసిన వారి శవాలే మాంసం, ఈ పట్టణం ఒక కుండ అయితే నేను మిమ్మల్ని పట్టణంలో ఉండకుండా వెళ్లగొడతాను. \v 8 మీరు ఖడ్గానికి భయపడుతున్నారు, కాబట్టి నేనే మీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 9 నేను మిమ్మల్ని పట్టణంలో నుండి వెళ్లగొట్టి విదేశీయుల చేతికి మిమ్మల్ని అప్పగించి మీకు శిక్ష విధిస్తాను. \v 10 ఇశ్రాయేలు సరిహద్దుల లోపలే మీరు ఖడ్గంతో చంపబడేలా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. \v 11 ఈ పట్టణం మీకు కుండగా ఉండదు, మీరు దానిలో మాంసం కారు. ఇశ్రాయేలు సరిహద్దులలో నేను మిమ్మల్ని శిక్షిస్తాను. \v 12 మీ చుట్టూ ఉన్న జాతుల విధులను పాటించడానికి మీరు ఎవరి శాసనాలను అనుసరించకుండా ఎవరి విధులను పాటించలేదో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.” \p \v 13 నేను ఈ విధంగా ప్రవచిస్తుండగానే బెనాయా కుమారుడైన పెలట్యా చనిపోయాడు. అప్పుడు నేను సాష్టాంగపడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో ప్రభువైన యెహోవా! ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారిని కూడా పూర్తిగా నిర్మూలిస్తావా?” అని మొరపెట్టాను. \s1 ఇశ్రాయేలీయులు తిరిగి వస్తారని వాగ్దానం \p \v 14 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 15 “మనుష్యకుమారుడా, మీ తోటి బందీల గురించి ఇతర ఇశ్రాయేలీయులందరి గురించి యెరూషలేము ప్రజలు, ‘వారు యెహోవాకు చాలా దూరంగా ఉన్నారు; ఈ దేశం మా స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు. \p \v 16 “కాబట్టి వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దూరంగా ఉన్న జాతుల మధ్యకు నేను వారిని పంపినా, దేశాల మధ్య వారిని చెదరగొట్టినా వారు వెళ్లిన దేశాల్లో కొంతకాలం వారికి నేను పరిశుద్ధాలయంగా ఉన్నాను.’ \p \v 17 “వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ జాతులలో నుండి మిమ్మల్ని సమకూర్చి, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని తిరిగి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మీకు తిరిగి ఇస్తాను.’ \p \v 18 “వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచిన అసహ్యమైన విగ్రహాలను హేయమైన వాటిని తొలగిస్తారు. \v 19 నేను వారికి ఏక హృదయం ఇచ్చి వారిలో నూతన ఆత్మను ఉంచుతాను; నేను వారిలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి వారికి మాంసపు హృదయాన్ని ఇస్తాను. \v 20 అప్పుడు వారు నా శాసనాలను అనుసరించి నా కట్టడలను పాటించడంలో జాగ్రత్తగా ఉంటారు. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. \v 21 అయితే తమ విగ్రహాలను అనుసరిస్తూ ఎప్పటిలాగే అసహ్యమైన పనులు చేసేవారికి వాటి ప్రతిఫలాన్ని వారి తల మీదికి రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” \p \v 22 అప్పుడు కెరూబులు రెక్కలు విప్పాయి, చక్రాలు వాటి ప్రక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపై ఉంది. \v 23 యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకి వెళ్లి తూర్పున ఉన్న కొండ పైన ఆగింది. \v 24 దేవుని ఆత్మ వలన వచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి బబులోనీయుల\f + \fr 11:24 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల \fqa*\ft ఈ గ్రంథంలో అన్ని చోట్ల ఇది వర్తిస్తుంది\ft*\f* దేశంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు తీసుకువచ్చింది. \p అంతలో నాకు కనబడిన దర్శనం నన్ను విడిచి వెళ్లిపోయింది. \v 25 అప్పుడు యెహోవా నాకు చూపించిన వాటన్నిటిని బందీలుగా ఉన్నవారికి చెప్పాను. \c 12 \s1 బందీలకు సూచన \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య జీవిస్తున్నావు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి చూసే కళ్లు ఉన్నా చూడరు, వినే చెవులు ఉన్నా వినరు. \p \v 3 “కాబట్టి మనుష్యకుమారుడా, దేశాంతరం వెళ్లడానికి నీ వస్తువులను సర్దుకుని, పగటివేళ వారు చూస్తుండగానే బయలుదేరి నీవు ఉన్న చోటు నుండి వేరొక ప్రదేశానికి వెళ్లు. వారు తిరుగుబాటుదారులే అయినా బహుశా వారు అర్థం చేసుకోవచ్చు. \v 4 పగలు వారు చూస్తుండగా దేశం నుండి వెళ్లిపోడానికి సర్దుకున్న నీ సామాన్లు బయటకు తీసుకురా. సాయంత్రం వారు చూస్తుండగా దేశం విడిచి వెళ్తున్నట్లుగా బయలుదేరి వెళ్లు. \v 5 వారు చూస్తుండగా, గోడను త్రవ్వి దానిలో నుండి నీ వస్తువులను బయటకు తీయి. \v 6 వారు చూస్తుండగానే వాటిని నీ భుజంపై వేసుకుని సంధ్యా సమయంలో వాటిని తీసుకుని వెళ్లు. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు సూచనగా చేశాను కాబట్టి నీకు నేల కనిపించకుండా నీ ముఖాన్ని కప్పుకో.” \p \v 7 నాకు ఆజ్ఞాపించిన ప్రకారమే నేను చేశాను. దేశం విడిచి వెళ్తున్నట్లుగా పగలు నా సామాన్లు బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేతితో గోడను త్రవ్వాను. రాత్రి వారు చూస్తుండగా నా సామాన్లు భుజంపై ఎత్తుకున్నాను. \p \v 8 ఉదయాన యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: \v 9 మనుష్యకుమారుడా, నీవేం చేస్తున్నావని తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులు నిన్ను అడగలేదా? \p \v 10 “వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ప్రవచనం యెరూషలేములోని యువరాజుకు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరికి సంబంధించినది.’ \v 11 వారికి ఈ మాట చెప్పు: ‘నేను మీకు సూచనగా ఉన్నాను.’ \p “నేను చేసినట్లే వారికి కూడా జరుగుతుంది. వారు బందీలుగా దేశం నుండి కొనిపోబడతారు. \p \v 12 “వారిలో యువరాజు రాత్రివేళ తన సామాన్లు భుజంపై వేసుకుని తాను వెళ్లడానికి గోడను త్రవ్వుతాడు. అతడు నేల కనిపించకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు. \v 13 అతన్ని పట్టుకోడానికి వల వేయగా అతడు దానిలో చిక్కుకుంటాడు. నేను అతన్ని బబులోనీయుల దేశమైన బబులోనుకు తీసుకువస్తాను కానీ అతడు దానిని చూడకుండానే అక్కడే అతడు చనిపోతాడు. \v 14 అతనితో ఉన్నవారందరిని అనగా అతని సహాయకులను అతని సైన్యాన్ని గాలికి చెదరగొడతాను. కత్తి దూసి వారినందరిని తరుముతాను. \p \v 15 “నేను వారిని జాతుల మధ్యకు చెదరగొట్టి వివిధ దేశాలకు వెళ్లగొట్టినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. \v 16 వారు వెళ్లే దేశాల్లోని ప్రజలకు వారు చేసే అసహ్యమైన ఆచారాల గురించి వివరించడానికి వారిలో కొంతమందిని ఖడ్గం నుండి కరువు తెగులు నుండి కాపాడి తప్పిస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.” \p \v 17 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 18 “మనుష్యకుమారుడా, వణుకుతూ నీ ఆహారం తిను, భయంతో తడబడుతూ నీ నీళ్లు త్రాగు. \v 19 దేశంలోని ప్రజలకు ఇలా చెప్పు: ‘యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్నవారి గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అక్కడ నివసించే వారందరు చేసే హింస కారణంగా వారి దేశంలోని ప్రతిదీ తీసివేయబడుతుంది. కాబట్టి వారు ఆందోళనలో తమ ఆహారాన్ని తింటారు నిరాశతో నీరు త్రాగుతారు. \v 20 నివాసులు ఉండిన పట్టణాలు వ్యర్థమైన శిథిలాలుగా, దేశం నిర్జనంగా మారుతాయి. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ” \s1 ఏమాత్రం ఆలస్యం ఉండదు \p \v 21 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 22 “మనుష్యకుమారుడా, ‘రోజులు గడిచిపోతున్నాయి, ప్రతీ దర్శనం విఫలమవుతుంది’ అని ఇశ్రాయేలు దేశంలో చెప్పే సామెతకు అర్థం ఏమిటి? \v 23 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఇకపై ఇశ్రాయేలు దేశంలో వినబడకుండ నేను ఆ సామెతకు ముగింపు ఇవ్వబోతున్నాను. ప్రతీ దర్శనం నెరవేరబోయే రోజులు ఎదురుగా ఉన్నాయని వారితో చెప్పు. \v 24 ఇశ్రాయేలీయుల మధ్య తప్పుడు దర్శనాలు గాని పొగడ్తలతో కూడిన భవిష్యవాణి గాని ఉండవు. \v 25 అయితే యెహోవానైన నేను, నేను ఏమి చేస్తానో అదే మాట్లాడతాను, అది ఆలస్యం లేకుండా నెరవేరుతుంది. ఎందుకంటే, తిరుగుబాటుదారులారా, మీ రోజుల్లో నేను చెప్పేది నెరవేరుస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \p \v 26 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 27 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు, ‘అతడు చూసే దర్శనం నెరవేరడానికి చాలా సంవత్సరాల పడుతుంది, అతడు చాలా కాలం తర్వాత భవిష్యత్తులో జరిగే వాటి గురించి ప్రవచిస్తున్నాడు’ అని అంటున్నారు. \p \v 28 “కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇకపై నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు; నేను చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయి, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \c 13 \s1 అబద్ధ ప్రవక్తలపై తీర్పు \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, ఇప్పుడు ప్రవచిస్తున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచించు. తమ సొంత ఊహ ఆధారంగా ప్రవచించే వారితో ఇలా చెప్పు: ‘యెహోవా మాట వినండి! \v 3 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: దర్శనమేమి చూడకపోయినా సొంత ఆత్మను అనుసరించే మూర్ఖ\f + \fr 13:3 \fr*\ft లేదా \ft*\fqa దుష్ట\fqa*\f* ప్రవక్తలకు శ్రమ. \v 4 ఇశ్రాయేలీయులారా! మీ ప్రవక్తలు శిథిలాల మధ్య తిరిగే నక్కల్లాంటి వారు. \v 5 ఇశ్రాయేలు ప్రజలు యెహోవా రోజున జరిగే యుద్ధంలో స్థిరంగా నిలబడేలా మీరు గోడ పగుళ్ల దగ్గరకు వెళ్లి వాటిని బాగుచేయలేదు. \v 6 వారి దర్శనాలు తప్పు, వారి భవిష్యవాణి అబద్ధము. యెహోవా తమను పంపకపోయినా, “ఇదే యెహోవా వాక్కు” అని చెబుతూ తమ మాటలు నెరవేరుతాయని నమ్మిస్తారు. \v 7 నేను మాట్లాడక పోయినా ఇదే యెహోవా మాట అని మీరు చెప్పినప్పుడు మీ చూసిన దర్శనాలు వట్టి భ్రమలు భవిష్యవాణి అబద్ధమే కదా? \p \v 8 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు చెప్పే వట్టిమాటలు అబద్ధపు దర్శనాల కారణంగా నేను మీకు వ్యతిరేకంగా ఉన్నానని ప్రభువైన యెహోవా తెలియజేస్తున్నారు. \v 9 వ్యర్థమైన దర్శనాలు చూస్తూ అబద్ధపు సోదె చెప్పే ప్రవక్తలకు నా చేయి వ్యతిరేకంగా ఉంటుంది. వారిని నా ప్రజల సభలోనికి రానివ్వను, వారు ఇశ్రాయేలీయుల జాబితాలో నమోదు చేయబడరు, ఇశ్రాయేలీయుల దేశానికి తిరిగి రారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు. \p \v 10 “ ‘సమాధానం లేనప్పుడు సమాధానం అంటూ నా ప్రజలను మోసగిస్తున్నారు. ఒకరు కట్టిన బలహీనమైన గోడకు వారు సున్నం వేస్తారు. \v 11 సున్నం వేస్తున్నవారితో అది కూలిపోతుందని చెప్పు. నేను వర్షం, వడగండ్లు కురిపించినప్పుడు బలమైన గాలులు వీచి అది పడిపోతుంది. \v 12 గోడ కూలిపోవడం చూసిన ప్రజలు, “మీరు వేసిన సున్నం ఏది అని అడగరా?” \p \v 13 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఉగ్రతతో బలమైన గాలిని, కోపంతో వడగండ్లు కుండపోత వర్షాన్ని పంపి దానిని పడగొడతాను. \v 14 మీరు సున్నం వేసిన గోడను దాని పునాది కనబడేలా నేలమట్టం చేస్తాను. ఆ గోడ\f + \fr 13:14 \fr*\ft లేదా \ft*\fqa పట్టణం\fqa*\f* పడినప్పుడు దాని క్రింద మీరంతా నాశనమవుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. \v 15 ఆ గోడ మీద దానికి సున్నం వేసిన వారి మీద నా కోపం కురిపిస్తాను. అప్పుడు నేను మీతో, “గోడ లేదు దానికి సున్నం వేసినవారు కూడా లేరు, \v 16 యెరూషలేముకు సమాధానం లేకపోయినా సమాధానం కలిగే దర్శనాలు చూసి ప్రవచించే ఇశ్రాయేలు ప్రవక్తలు కూడా ఉండరు అని చెప్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” ’ \p \v 17 “మనుష్యకుమారుడా, ప్రవచిస్తున్న నీ ప్రజల కుమార్తెలకు విరోధంగా ప్రవచించి, \v 18 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ప్రజలను వలలో వేసుకోవడానికి తమ మణికట్టు మీద తాయెత్తులు కట్టుకుని తమ తలలపై వేసుకోడానికి వివిధ రకాల ముసుగులు తయారుచేసే స్త్రీలకు శ్రమ. మీరు నా ప్రజల జీవితాలను ఉచ్చులో ఇరికించి, మీ సొంత ప్రాణాలను కాపాడుకుంటారా? \v 19 మీరు గుప్పెడు యవల కోసం రొట్టె ముక్కల కోసం నా ప్రజలమధ్య నన్ను అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్పి, చావకూడని వారిని చంపారు; బ్రతకకూడని వారిని విడిచిపెట్టారు. \p \v 20 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు పక్షులకు వల వేసినట్లు ప్రజల ప్రాణాలకు వల వేయడానికి ఉపయోగించే మీ మంత్రాలకు నేను వ్యతిరేకిని. నేను వాటిని మీ చేతుల నుండి తెంపివేస్తాను; పక్షులను పట్టినట్లు వలవేసి మీరు పట్టిన ప్రజలను విడిపిస్తాను. \v 21 నేను మీ ముసుగులను చింపివేసి, నా ప్రజలను మీ చేతుల నుండి రక్షిస్తాను, వారు ఇకపై మీ శక్తికి బలి అవరు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. \v 22 ఇదంతా ఎందుకంటే, నేను దుఃఖపరచని నీతిమంతుల హృదయాన్ని అబద్ధాలతో మీరు దుఃఖపెట్టారు. దుర్మార్గులు తమ చెడు మార్గాలు వదిలిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోకుండ మీరు వారిని ప్రోత్సహించారు. \v 23 కాబట్టి ఇకపై మీరు అబద్ధపు దర్శనాలు చూడరు భవిష్యవాణి చెప్పరు. మీ చేతుల్లో నుండి నా ప్రజలను రక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ” \c 14 \s1 విగ్రహారాధికులకు తీర్పు \p \v 1 ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు ఎదురుగా కూర్చున్నారు. \v 2 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 3 “మనుష్యకుమారుడా, ఈ మనుష్యులు తమ హృదయాల్లో విగ్రహాలను ఉంచుకొని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకున్నారు. నా దగ్గర విచారణ చేయడానికి నేను వారిని అనుమతించాలా? \v 4 కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ఇశ్రాయేలు సర్వసమాజం తమ హృదయాల్లో విగ్రహాలను పెట్టుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని ప్రవక్త దగ్గరకు వెళ్తే వారు చేసే విగ్రహారాధనను బట్టి వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను. \v 5 తమ విగ్రహాలన్నిటి కోసం నన్ను విడిచిపెట్టిన ఇశ్రాయేలీయుల హృదయాలను తిరిగి నా వైపు త్రిప్పుకోడానికి నేను ఇలా చేస్తాను.’ \p \v 6 “కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీ విగ్రహాలను విడిచిపెట్టి అసహ్యకరమైన ఆచారాలు మానివేసి మనస్సు మార్చుకోండి. \p \v 7 “ ‘ఇశ్రాయేలీయులు గాని వారి దేశంలో ఉంటున్న విదేశీయులు గాని నన్ను విడిచిపెట్టి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని నా దగ్గర విచారణచేయమని వారు ప్రవక్త దగ్గరకు వెళ్తే వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను. \v 8 వారికి నేను విరోధిగా ఉండి వారిని ఒక సూచనగా సామెతగా చేస్తాను. నేను వారిని నా ప్రజల నుండి తొలగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. \p \v 9 “ ‘ఎవరైనా ప్రవక్త మోసపోయి ఏదైన ప్రవచనం చెబితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి వ్యతిరేకంగా నా చేయి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలులో నుండి అతన్ని నాశనం చేస్తాను. \v 10 వారు తమ శిక్షను భరిస్తారు; ప్రవచనం కోసం వచ్చిన వాని దోషమెంతో ప్రవచించిన ప్రవక్త దోషం కూడా అంతే. \v 11 అప్పుడిక ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టరు, వారు తమ పాపాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వారు నా ప్రజలై ఉంటారు. నేను వారి దేవుడినై ఉంటానని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \s1 యెరూషలేము తీర్పును తప్పించుకోలేదు \p \v 12 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 13 “మనుష్యకుమారుడా, ఒక దేశం నమ్మకద్రోహంతో నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే దానికి వ్యతిరేకంగా నా చేతిని చాపి ఆహారం లేకుండా చేసి కరువు పంపించి దాని మనుష్యులను పశువులను చంపుతాను. \v 14 ఆ దేశంలో నోవహు దానియేలు\f + \fr 14:14 \fr*\ft లేదా \ft*\fqa దానేలు \fqa*\ft ప్రాచీన సాహిత్యంలో ప్రఖ్యాతి చెందిన వ్యక్తి\ft*\ft ; \+xt 20|link-href="EZK 14:20"\+xt* వచనంలో కూడా\ft*\f* యోబు ఈ ముగ్గురు ఉన్నప్పటికీ వారు తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \p \v 15 “ఆ దేశం పిల్లలు లేనిదై నిర్మానుష్యంగా మారేలా దాని మీదికి అడవి మృగాలను పంపుతాను. వాటి కారణంగా దానిగుండా ఎవరూ ప్రయాణించరు. \v 16 నా జీవం తోడు ఆ ముగ్గురు నీతిమంతులు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. వారు తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు కాని దేశం పాడైపోతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \p \v 17 “నేను ఆ దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించి, ఆ దేశమంతా తిరిగి దానిలోని మనుష్యులను పశువులను చంపమని చెప్పినప్పుడు, \v 18 నా జీవం తోడు ఆ ముగ్గురు నీతిమంతులు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. వారు తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \p \v 19 “నేను ఆ దేశంలోకి తెగులు పంపి రక్తపాతం జరిగేంతగా నా ఉగ్రత కుమ్మరించి మనుష్యులను పశువులను చంపినప్పుడు, \v 20 నా జీవం తోడు నోవహు దానియేలు యోబు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలరని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 21 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దాని మనుష్యులను వారి జంతువులను చంపడానికి యెరూషలేము మీదికి ఖడ్గం కరువు అడవి మృగాలు తెగులు అనే నాలుగు భయంకరమైన తీర్పులను పంపినప్పుడు అది ఎంతో ఘోరంగా ఉంటుంది! \v 22 అయినప్పటికీ దానిలో నుండి బయటకు రప్పించబడిన కుమారులు కుమార్తెలలో కొంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారు. వారు మీ దగ్గరకు వస్తారు, మీరు వారి ప్రవర్తనలో పనులలో తేడాను చూసినప్పుడు నేను యెరూషలేము మీదికి రప్పించిన కీడు గురించి నేను దానికి చేసిన వాటన్నిటి గురించి మీరు ఓదార్పు పొందుతారు. \v 23 వారి ప్రవర్తన వారి పనులు చూసినప్పుడు నేను కారణం లేకుండా ఏదీ చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు పొందుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.” \c 15 \s1 యెరూషలేము పనికిరాని ద్రాక్షతీగె \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కొమ్మల కంటే ఏమైనా గొప్పదా? \v 3 దాని కర్ర ఏ పనికైనా ఉపయోగపడుతుందా? ఏ పనికైనా దాని కర్రను వాడతారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో మేకులు తయారుచేస్తారా? \v 4 లేదు కదా, అది మంటలో వేయడానికే ఉపయోగపడుతుంది. అగ్నిలో రెండు చివరలు మధ్య భాగం కాలిపోయిన తర్వాత అది దేనికైనా ఉపయోగపడుతుందా? \v 5 అది కాలక ముందే దేనికి ఉపయోగపడనప్పుడు అగ్నిలో పూర్తిగా కాలిన తర్వాత మరి దేనికి ఉపయోగపడుతుంది? \p \v 6 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అడవి చెట్లలో ద్రాక్షచెట్టు కర్రను నేను ఎలా అగ్నికి అప్పగించానో అలానే యెరూషలేములో నివసించే ప్రజలను అప్పగిస్తాను. \v 7 నేను వారిపట్ల కఠినంగా ఉంటాను. వారు అగ్ని నుండి తప్పించుకున్నా సరే అగ్ని వారిని కాల్చివేస్తుంది. నేను వారిపట్ల కఠినంగా ఉన్నప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. \v 8 వారు నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి నేను దేశాన్ని పాడుచేస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.” \c 16 \s1 వ్యభిచరించిన భార్యగా యెరూషలేము \p \v 1 యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చి: \v 2 “మనుష్యకుమారుడా, యెరూషలేము చేసిన అసహ్యమైన ఆచారాలు దానికి తెలియజేసి, \v 3 ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఇలా చెప్తున్నారు: మీ మూలలు, మీ పుట్టుక కనానీయుల దేశంలోనే; మీ తండ్రి అమోరీయుడు, మీ తల్లి హిత్తీయురాలు. \v 4 నీ జన్మ విధానం చూస్తే, నీవు పుట్టిన రోజున నీ నాభి సూత్రం కత్తిరించబడలేదు, నిన్ను నీళ్లతో శుభ్రం చేయలేదు, ఉప్పుతో రుద్దలేదు, గుడ్డలో చుట్టలేదు. \v 5 నీ మీద ఎవరూ జాలిపడలేదు. ఈ పనులలో ఒక్కటైనా చేయాలని ఎవరూ నీ మీద కనికరం చూపించలేదు. పైగా, పుట్టిననాడే నిన్ను అసహ్యించుకుని, బయట పొలంలో విసిరివేశారు. \p \v 6 “ ‘అప్పుడు నేను అటు నుండి వెళ్తూ నీ రక్తంలో కొట్టుకుంటున్న నిన్ను చూసి, నీవు నీ రక్తంలో పడి ఉన్నప్పుడు నేను నీతో, “బ్రతుకు!” అని అన్నాను. \v 7 నిన్ను పొలం లోని మొక్కలా పెంచాను. నీవు పెరిగి అభివృద్ధిచెంది యుక్తవయస్సులోకి ప్రవేశించావు. నీకు రొమ్ములు ఏర్పడ్డాయి, నీ జుట్టు పెరిగింది, అయినప్పటికీ నీవు పూర్తిగా నగ్నంగా ఉన్నావు. \p \v 8 “ ‘తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి, నీవు ప్రేమకు తగిన వయస్సులో ఉన్నావు కాబట్టి నా వస్త్రాన్ని నీపై వేసి నీ నగ్న శరీరాన్ని కప్పాను. నేను నీతో ప్రమాణం చేసి నిబంధన చేసుకున్నప్పుడు నీవు నా దానివి అయ్యావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 9 “ ‘నీకు నీళ్లతో స్నానం చేయించి నీ రక్తాన్ని కడిగి సువాసనగల నూనెతో నిన్ను అభిషేకించాను. \v 10 నీకు అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు వేసి, మంచి చర్మంతో చేసిన చెప్పులు నీ పాదాలకు తొడిగించాను. నీకు సన్నని అవిసె నారబట్టలు వేసి ఖరీదైన పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను. \v 11 నేను నిన్ను నగలతో అలంకరించాను: నీ చేతులకు కంకణాలు, మెడలో హారం వేసి, \v 12 ముక్కుకు ముక్కుపుడక, చెవులకు పోగులు తలపై కిరీటం పెట్టాను. \v 13 ఇలా నిన్ను బంగారం, వెండితో అలంకరించి, సన్నని నార కుట్టుపని ఉన్న ఖరీదైన పట్టు వస్త్రాలు నీకు ధరింపజేశాను. నీకు ఆహారంగా తేనె, ఒలీవనూనె నాణ్యమైన పిండి ఇవ్వగా నీవు చాలా అందంగా తయారయ్యావు, ఒక రాణిగా ఎదిగావు. \v 14 నీ అందం కారణంగా నీ కీర్తి దేశాల్లో వ్యాపించింది, ఎందుకంటే నేను నీకు ఇచ్చిన వైభవం నీ అందాన్ని పరిపూర్ణం చేసిందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 15 “ ‘అయితే నీ అందాన్ని నమ్ముకుని, నీ కీర్తిని ఉపయోగించుకుని నీవు వేశ్యగా మారావు. దారిన వెళ్లే వారందరితో వ్యభిచరించావు; నీ అందం వారి సొంతం అయింది. \v 16 నీవు అందమైన క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి నీ వస్త్రాల్లో కొన్నిటిని తీసుకున్నావు, అక్కడ నీవు నీ వ్యభిచారం కొనసాగించావు. నీవు అతని దగ్గరకు వెళ్లావు, అతడు నీ అందాన్ని తనది చేసుకున్నాడు. \v 17 నేను నీకు ఇచ్చిన నాణ్యమైన నగలు, నా బంగారు వెండితో చేసిన నగలు కూడా తీసుకుని, నీకోసం మగ విగ్రహాలను తయారుచేసి, వాటితో వ్యభిచారం చేశావు. \v 18 నీవు వాటికి నీ కుట్టుపని చేసిన వస్త్రాలు ధరింపజేసి, నీవు వాటికి నా నూనె, ధూపం సమర్పించావు. \v 19 నేను నీకు ఆహారంగా ఇచ్చిన నాణ్యమైన పిండి, తేనె, నూనెలను తీసుకుని సువాసన వచ్చేలా వాటికి అర్పించావు. జరిగింది ఇదే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 20 “ ‘నీవు నాకు కనిన కుమారులను, కుమార్తెలను ఆ విగ్రహాలకు ఆహారంగా బలి అర్పించావు. నీవు చేసిన వ్యభిచారం సరిపోలేదా? \v 21 నా పిల్లలను నీవు వధించి ఆ విగ్రహాలకు బలి ఇచ్చావు. \v 22 నీవు అసహ్యకరమైన ఆచారాలు పాటిస్తూ వ్యభిచారం చేస్తున్నప్పుడు నీ యవ్వనంలో నీవు నగ్నంగా ఒంటి మీద ఏమి లేకుండ, నీ రక్తంలో పడి తన్నుకుంటున్న రోజులను జ్ఞాపకం చేసుకోలేదు. \p \v 23 “ ‘నీవు చేసిన చెడుతనాన్ని బట్టి శ్రమ! నీకు శ్రమ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 24 నీవు నీకోసం ఒక మట్టిదిబ్బను నిర్మించుకున్నావు, ప్రతి బహిరంగ కూడలిలో ఒక ఎత్తైన క్షేత్రాన్ని నిర్మించావు. \v 25 ప్రతి వీధి మూలలో నీవు నీ ఎత్తైన క్షేత్రాలను నిర్మించి, నీ అందాన్ని దిగజార్చుకున్నావు, కామం ఎక్కువై దారిన ఎవరు వెళ్తే వారికి నీ కాళ్లను తెరిచి వ్యభిచరించావు. \v 26 నీవు కామవాంఛలతో నిండిన నీ పొరుగువారైన ఈజిప్టు వారితో మరి ఎక్కువగా వ్యభిచారం చేసి నాకు కోపాన్ని రేపావు. \v 27 కాబట్టి నేను నీ మీదికి చేయి చాచి నీ సరిహద్దులను కుదించాను; నీ అశ్లీల ప్రవర్తనకు దిగ్భ్రాంతి చెందిన ఫిలిష్తీయుల కుమార్తెలైన నీ శత్రువుల దురాశకు నిన్ను అప్పగించాను. \v 28 నీకు తృప్తి కలుగలేదు కాబట్టి నీవు అష్షూరీయులతో కూడా వ్యభిచరించావు; ఆ తర్వాత కూడా నీకు తృప్తి కలుగలేదు. \v 29 బబులోను వర్తక దేశంతో కూడా వ్యభిచరించావు, అయినా నీకు తృప్తి కలుగలేదు. \p \v 30 “ ‘నీవు ఇవన్నీ చేస్తూ సిగ్గులేని వేశ్యలా ప్రవర్తిస్తూ ఉంటే, నాకు నీ మీద కోపం వచ్చింది,\f + \fr 16:30 \fr*\ft లేదా \ft*\fqa నీ హృదయం ఎంత తాపంతో ఉండింది\fqa*\f* అని ప్రభువైన యెహోవా అంటున్నారు. \v 31 నీవు ప్రతి వీధి మూలలో నీ మట్టిదిబ్బలను నిర్మించినప్పుడు, ప్రతి బహిరంగ కూడలిలో నీ క్షేత్రాలను నిర్మించినప్పుడు నీవు ఒక వేశ్య చేసినట్లు చేయలేదు, ఎందుకంటే నీవు డబ్బును తిరస్కరించావు. \p \v 32 “ ‘వ్యభిచారియైన భార్యా! నీవు నీ సొంత భర్త కంటే అపరిచితులే కావాలనుకుంటావు! \v 33 వేశ్యలందరూ బహుమతులు తీసుకుంటారు, కానీ నీ ప్రేమికులందరికీ నీవు ఎదురు బహుమతులు ఇస్తావు, నీతో వ్యభిచారం చేయడం కోసం ఎక్కడి నుండైనా నీ దగ్గరకు రావాలని వారికి లంచం ఇస్తావు. \v 34 కాబట్టి నీ వ్యభిచారంలో నీకు ఇతరులకు తేడా ఉంది; నీతో వ్యభిచరించడానికి ఎవరూ నీ వెంట పడరు. నీవు డబ్బులు తీసుకోవు కాని తిరిగి నీవే వారికి ఇస్తావు కాబట్టి నీవు చాలా భిన్నమైనదానివి. \p \v 35 “ ‘కాబట్టి, వేశ్యా, నీవు యెహోవా మాట విను! \v 36 ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నీవు నీ ప్రేమికులతో నీ వ్యభిచారంలో నీ కామాన్ని కుమ్మరించి, నీ నగ్న శరీరాన్ని చూపించినందుకు, నీ అసహ్యకరమైన విగ్రహాల కారణంగా, నీవు వాటికోసం నీ పిల్లల రక్తాన్ని చిందించినందున, \v 37 నీకు ఇష్టమైన నీ ప్రేమికులందరిని నీవు ప్రేమించినవారిని అలాగే నీవు ద్వేషించిన వారందరిని పోగుచేస్తాను. నీ చుట్టూ వారిని పోగు చేసి వారు నీ నగ్న శరీరాన్ని చూసేలా వారి ఎదుట నిన్ను వివస్త్రను చేస్తాను. \v 38 వ్యభిచారులై హత్యలు చేసే స్త్రీలకు విధించే శిక్షను నేను నీకు విధిస్తాను; నా కోపం, రోషంతో కూడిన రక్త ప్రతీకారాన్ని నేను నీ మీదికి తెస్తాను. \v 39 తర్వాత నేను నిన్ను నీ ప్రేమికుల చేతికి అప్పగిస్తాను, వారు నీ మట్టిదిబ్బలను కూల్చివేసి, నీ ఎత్తైన క్షేత్రాలను నాశనం చేస్తారు. వారు నీ బట్టలు విప్పి, నీ సొగసైన నగలును తీసుకుని నిన్ను నగ్నంగా వదిలివేస్తారు. \v 40 వారు నీ మీదికి గుంపును రెచ్చగొట్టి పంపుతారు, ఆ గుంపు నిన్ను రాళ్లతో కొట్టి, తమ ఖడ్గాలతో నిన్ను ముక్కలు చేస్తారు. \v 41 వారు నీ ఇళ్ళను తగలబెట్టి, అనేకమంది స్త్రీల చూస్తుండగా నీకు శిక్ష విధిస్తారు. నేను నీ వ్యభిచారాన్ని మాన్పిస్తాను, నీవు ఇకపై నీ ప్రేమికులకు డబ్బు చెల్లించవు. \v 42 అప్పుడు నీ మీద నా ఉగ్రత తగ్గిపోతుంది, రోషంతో కూడిన నా కోపం నీ మీద నుండి తొలగిపోతుంది; నేను ప్రశాంతంగా ఉంటాను, ఇకపై కోపంగా ఉండను. \p \v 43 “ ‘నీవు నీ యవ్వన దినాలను జ్ఞాపకం చేసుకోక వీటన్నిటితో నాకు కోపం రేపావు కాబట్టి, నీవు చేసిన పనిని నేను నిశ్చయంగా నీ తల మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. మీరు మీ ఇతర అసహ్యకరమైన ఆచారాలకు అసభ్యతను జోడించలేదా? \p \v 44 “ ‘సామెతలు చెప్పే ప్రతి ఒక్కరూ నీ గురించి ఈ సామెత చెప్తారు: “తల్లి ఎలాంటిదో కూతురు అలాంటిదే” అని. \v 45 నీవు భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ తల్లికి తగిన కుమార్తెవు; అలాగే నీవు తన భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ అక్కకు తగ్గ చెల్లెలివి. నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు. \v 46 నీ ఎడమ ప్రక్కన తన కుమార్తెలతో నివసించే సమరయ నీకు అక్క, నీ కుడి ప్రక్కన తన కుమార్తెలతో నివసించే సొదొమ నీకు చెల్లెలు. \v 47 నీవు వారిలా ప్రవర్తించడమే కాకుండా వారి అసహ్యకరమైన ఆచారాలను పాటించావు, ప్రవర్తన అంతటిలో వారికన్నా మరింతగా దిగజారిపోయావు. \v 48 నీవు, నీ కుమార్తెలు చేసినట్లు నీ సోదరియైన సొదొమ గాని దాని కుమార్తెలు గాని చేయలేదని నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 49 “ ‘నీ సోదరి సొదొమ చేసిన పాపమేమిటంటే, తాను, తన కుమార్తెలు అహంకారులు, ఆహార సమృద్ధి కలిగి ఉండి ఇతరులను పట్టించుకోరు; వారు పేదలకు గాని అవసరంలో ఉన్నవారికి గాని సహాయం చేయలేదు. \v 50 వారంతా గర్వించి నా ఎదుట అసహ్యమైన వాటిని చేశారు కాబట్టి అదంతా చూసి నేను వారిని వెళ్లగొట్టాను. \v 51 సమరయ సైతం నీవు చేసిన పాపంలో సగమైనా చేయలేదు. నీవు వారికంటే అసహ్యమైన పనులు చేశావు. నీవు చేసిన వాటితో పోల్చితే నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడతారు. \v 52 నీ అక్కచెల్లెళ్లకు నీవు విధించిన అవమాన శిక్ష నీవే భరించాలి. వారి పాపాల నీ పాపాలు కంటే చాలా నీచంగా ఉన్నాయి కాబట్టి వారు నీ కంటే ఎక్కువ నీతిమంతులుగా కనిపిస్తారు. నీ పనుల వలన నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడుతున్నారు కాబట్టి సిగ్గుపడి అవమానాన్ని భరించు. \p \v 53 “ ‘నేను సొదొమకు దాని కుమార్తెలకు, సమరయకు దాని కుమార్తెలకు వారి సంపదతో పాటు మీ సంపదను తిరిగి ఇస్తాను. \v 54 తద్వార వారి ఆదరణ కోసం నీవు చేసిన దానంతటిని బట్టి నీవు అవమానాన్ని భరించి సిగ్గుపడతావు. \v 55 నీ సోదరీలైన సొదొమ దాని కుమార్తెలు, సమరయ దాని కుమార్తెలు తమ పూర్వస్థితికి వస్తారు. అలాగే నీవు నీ కుమార్తెలు కూడా మీ పూర్వస్థితికి వస్తారు. \v 56 నీవు గర్వించే రోజుల్లో, నీ దుర్మార్గం బయటపడక ముందు నీ సోదరి సొదొమ గురించి కూడా ప్రస్తావించవు, \v 57 అయినప్పటికీ, ఇప్పుడు ఎదోము కుమార్తెలు, ఆమె పొరుగువారైన ఫిలిష్తీయుల కుమార్తెలు, మీ చుట్టూ ఉన్న మిమ్మల్ని తృణీకరించే వారందరూ మిమ్మల్ని దూషిస్తున్నారు. \v 58 నీ అసభ్య ప్రవర్తనకు నీ అసహ్యమైన ఆచారాల పర్యవసానాన్ని నీవే భరించాలి అని యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 59 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు చేసిన నిబంధన ఉల్లంఘించడం ద్వారా నీవు నా ప్రమాణాన్ని తృణీకరించావు కాబట్టి దానికి తగినట్లుగా నీకు చేస్తాను. \v 60 అయినా నీ యవ్వనంలో నేను నీతో చేసిన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటాను, నీతో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను. \v 61 నీవు నీ అక్కచెల్లెళ్లను కలుసుకున్నప్పుడు నీ మార్గాలను జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు. నీతో నా ఒడంబడికలో భాగం కాకపోయినా నేను వారిని నీకు కుమార్తెలుగా ఇస్తాను. \v 62 నేను నీతో నా ఒడంబడికను స్థిరపరుస్తాను, అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. \v 63 నీవు చేసిన వాటన్నిటికి నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు నీవు వాటిని జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు, నీ అవమానాన్ని బట్టి ఇక ఎన్నటికీ నోరు విప్పవు, ఇదే యెహోవా వాక్కు.’ ” \c 17 \s1 రెండు గ్రద్దలు, ఒక ద్రాక్షవల్లి \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, నీవు ఒక పొడుపు కథ వేసి, దానిని ఇశ్రాయేలీయులకు ఒక ఉపమానంలా చెప్పాలి. \v 3 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: బలమైన రెక్కలు, పొడవైన ఈకలు కలిగి రకరకాల రంగులతో ఉన్న ఒక పెద్ద గ్రద్ద లెబానోను పర్వతానికి వచ్చి, దేవదారు చెట్టు కొమ్మపై వాలి, \v 4 దాని అంచున ఉన్న లేత కొమ్మల చిగురు తెంపి వర్తకుల దేశానికి తీసుకెళ్లి వ్యాపారుల పట్టణంలో దానిని నాటింది. \p \v 5 “ ‘అది ఆ దేశపు విత్తనాలను తీసుకెళ్లి సారవంతమైన నేలలో నాటింది. విస్తారమైన నీటి ప్రక్కన పెరిగే నిరవంజి చెట్లలా ఆ మొక్కను నాటింది, \v 6 అది చిగురు వేసి పైకి పెరగకుండ నేలమీద విస్తరించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు గ్రద్ద వరకు వెళ్లాయి, కాని దాని వేర్లు గ్రద్ద క్రింద ఉన్నాయి. అలా అది ద్రాక్షవల్లిలా మారి అనేక కొమ్మలతో రెమ్మలు వేసింది. \p \v 7 “ ‘అయితే బలమైన రెక్కలు దట్టమైన ఈకలతో మరొక పెద్ద గ్రద్ద ఉంది. ఆ ద్రాక్షావల్లి అది నాటబడిన చోటు నుండి ఆ గ్రద్ద వైపు తన వేర్లు విస్తరింపజేసుకుని, దాని కొమ్మలను నీటి కోసం దానివైపు విస్తరింపచేసుకుంది. \v 8 ఆ ద్రాక్షావల్లికి తీగెలు వచ్చి, పండ్లు ఇచ్చేలా, అద్భుతమైన ద్రాక్షవల్లిలా అయ్యేలా, అది మంచి నేలలో విస్తారమైన నీటి ప్రక్కన నాటబడింది.’ \p \v 9 “కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అలాంటి ద్రాక్షావల్లి వృద్ధి చెందుతుందా? అది ఎండిపోయేలా ప్రజలు దాని వేరు పెకిలించి, దాని పండ్లు కోయరా? దాని చిగురులన్నీ ఎండిపోతాయి. దానిని వేర్లతో సహా పెకిలించడానికి బలమైన చేయి గాని, చాలామంది వ్యక్తులు గాని అవసరం లేదు. \v 10 అది ఒకచోట నుండి మరొక చోట నాటబడింది, అది వృద్ధి చెందుతుందా? తూర్పు గాలి దాని మీద వీచినపుడు అది నాటబడిన చోటనే ఎండిపోదా?’ ” \p \v 11 మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 12 “తిరుగుబాటు చేసే ఈ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఈ మాటల అర్థం మీకు తెలియదా?’ ఇదిగో, ‘బబులోను రాజు యెరూషలేముకు వెళ్లి దాని రాజును, అధిపతులను పట్టుకుని తనతో పాటు బబులోనుకు తీసుకువచ్చాడు. \v 13-14 తర్వాత అతడు రాజ కుటుంబీకుల్లో ఒకన్ని ఎంచుకుని, అతనితో ప్రమాణం చేయించి, అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాక ఆ రాజ్యం బలహీనపడి, మరలా అది బలపడకుండా తన ఒప్పందాన్ని పాటించడం ద్వారా మాత్రమే మనుగడ సాగించేలా, దేశంలోని నాయకులను తీసుకెళ్లిపోయాడు. \v 15 అయితే రాజకుటుంబం నుండి ఎంచుకోబడిన వ్యక్తి, తనకు గుర్రాలను పెద్ద సైన్యాన్ని పంపి సహాయం చేయమని అడగడానికి ఈజిప్టు దేశానికి రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. అతడు విజయం సాధిస్తాడా? అటువంటి పనులు చేసినవాడు తప్పించుకుంటాడా? అతడు ఒప్పందాన్ని ఉల్లంఘించి తప్పించుకుంటాడా? \p \v 16 “ ‘ఏ రాజైతే అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడో, ఎవరి ప్రమాణాన్ని అతడు తృణీకరించాడో, ఎవరి ఒప్పందాన్ని అతడు ఉల్లంఘించాడో ఆ రాజు దేశమైన బబులోనులోనే, నా జీవం తోడు అతడు చనిపోతాడు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 17 యుద్ధం జరిగేటప్పుడు అనేకుల జీవితాలను నాశనం చేయాలని బబులోనీయులు ముట్టడి దిబ్బలు వేసి కోటలు కట్టినప్పుడు ఫరో తనకున్న మహా బలమైన గొప్ప సైన్యంతో వచ్చినా ఆ రాజుకు ఏమాత్రం సహాయం చేయలేడు. \v 18 నిబంధనను భంగం చేసి తన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రమాణం చేసి కూడా అలాంటి పనులు చేశాడు కాబట్టి అతడు ఏమాత్రం తప్పించుకోలేడు. \p \v 19 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అతడు నేను పెట్టుకున్న ఒట్టును తృణీకరించి నా నిబంధనను భంగం చేసినందుకు నా జీవం తోడు నేను అతనికి ప్రతిఫలమిస్తాను. \v 20 నేను అతనికి వలవేసి నా ఉచ్చులో బిగించి బబులోనుకు తీసుకెళ్లి అతడు నా పట్ల నమ్మకద్రోహిగా ఉన్నాడు కాబట్టి అక్కడ అతనికి శిక్ష విధిస్తాను. \v 21 అతని సైన్యంలో ఎంపిక చేయబడిన వారందరు కత్తివేటుకు చనిపోతారు, తప్పించుకున్నవారు గాలికి చెదిరిపోతారు. అప్పుడు యెహోవానైన నేనే ఈ మాట చెప్తున్నానని మీరు తెలుసుకుంటారు. \p \v 22 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఎత్తైన దేవదారు చెట్టులో చిటారు కొమ్మ ఒకటి తీసి దానిని నాటుతాను; దాని పైనున్న కొమ్మల్లో ఒక లేత కొమ్మను త్రుంచి అత్యున్నత పర్వతం మీద నాటుతాను. \v 23 ఇశ్రాయేలు దేశంలో ఎత్తైన పర్వతం మీద నేనే దానిని నాటుతాను. అది కొమ్మలు వేసి ఫలించి ఘనమైన దేవదారు చెట్టు అవుతుంది. అన్ని రకాల పక్షులు దానిపై గూళ్ళు కట్టుకుంటాయి; దాని కొమ్మల నీడలో అవి ఆశ్రయాన్ని పొందుతాయి. \v 24 యెహోవానైన నేనే పొడవైన చెట్లను చిన్నవిగా, నీచమైన చెట్లను గొప్ప చెట్లుగా మార్చగలనని, పచ్చని చెట్టుని ఎండిపోయేలా, ఎండిన చెట్టుని పచ్చని చెట్టులా చేస్తానని అడవిలో ఉన్న అన్ని చెట్లు తెలుసుకుంటాయి. \p “ ‘యెహోవానైన నేనే ఈ మాట అంటున్నాను. నేనే దానిని నెరవేరుస్తాను.’ ” \c 18 \s1 పాపం చేసేవాడు చనిపోతాడు \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “ఇశ్రాయేలు దేశం గురించి మీరు చెప్పే ఈ సామెతకు అర్థం ఏంటి? \q1 “ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తింటే \q2 పిల్లల పళ్లు పులిసాయి.’ \p \v 3 “నా జీవం తోడు, ఇశ్రాయేలీయుల మధ్య ఈ సామెత మళ్ళీ వినపడదు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 4 ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా వారే, తండ్రులైనా పిల్లలైనా ఇద్దరూ నా వారే. పాపం చేసేవాడు చనిపోతాడు. \q1 \v 5 “ఒక నీతిమంతుడు ఉంటే \q2 అతడు నీతిని న్యాయాన్ని జరిగిస్తాడు. \q1 \v 6 అతడు పర్వత క్షేత్రాల మీద భోజనం చేయడు, \q2 ఇశ్రాయేలీయుల విగ్రహాలవైపు చూడడు, \q1 తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు, \q2 బహిష్టులో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవడు, \q1 \v 7 ఎవరిని బాధించడు, \q2 అప్పుకు తాకట్టుగా పెట్టిన దానిని తిరిగి ఇచ్చేస్తాడు, \q1 ఎవరినీ దోచుకోడు \q2 కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇచ్చి \q2 దిగంబరికి బట్టలు ఇస్తాడు. \q1 \v 8 వడ్డీకి అప్పు ఇవ్వడు \q2 వారి నుండి లాభం తీసుకోడు. \q1 తప్పు చేయకుండా జాగ్రత్తపడతాడు \q2 సత్యంగా న్యాయం తీరుస్తాడు. \q1 \v 9 అతడు నా శాసనాలను అనుసరించి \q2 నా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. \q1 ఇలాంటి వాడే నీతిమంతుడు; \q2 అతడు నిజంగా బ్రతుకుతాడు, \q2 అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 10 “ఒకవేళ అతనికి ఈ మంచి పనులేవి చేయకుండా రక్తం చిందించే ఒక హింసాత్మకుడైన కుమారుడు ఉంటే, \v 11 అతడు తన తండ్రి చేయని వీటన్నిటిని చేసేవాడైతే: \q1 “అతడు పర్వత క్షేత్రాల దగ్గర తింటాడు. \q1 తన పొరుగువాని భార్యను అపవిత్రం చేస్తాడు. \q1 \v 12 పేదవారిని దరిద్రులను అణచివేస్తాడు. \q1 దోపిడీలు చేస్తాడు. \q1 అప్పుకు తాకట్టుగా తీసుకున్న దానిని తిరిగి ఇవ్వడు. \q1 అతడు విగ్రహాలవైపు చూస్తాడు. \q1 అసహ్యమైన పనులు చేస్తాడు. \q1 \v 13 అతడు వడ్డీలకు అప్పు ఇచ్చి లాభం తీసుకుంటాడు. \m అలాంటివాడు బ్రతుకుతాడా? అతడు బ్రతకడు! ఎందుకంటే అతడు ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు కాబట్టి, అతనికి మరణశిక్ష విధించబడుతుంది; తన మరణానికి అతడే బాధ్యుడు. \p \v 14 “అయితే అలాంటి వానికి పుట్టిన కుమారుడు తన తండ్రి చేసిన పాపాలన్నిటిని చూసి ఆలోచించి అలాంటి పనులు చేయకపోతే అంటే: \q1 \v 15 “అతడు పర్వత క్షేత్రాల దగ్గర తినడు \q2 ఇశ్రాయేలీయుల విగ్రహాలను చూడడు. \q1 తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు. \q1 \v 16 అతడు ఎవరినీ అణచివేయడు, \q2 ఎవరి వస్తువులు తాకట్టు ఉంచుకోడు. \q1 అతడు ఎవరినీ దోచుకోడు \q2 కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇస్తాడు, \q2 దిగంబరికి బట్టలు ఇస్తాడు. \q1 \v 17 అతడు పేదల పట్ల తప్పుగా ప్రవర్తించడు, \q2 వారి నుండి వడ్డీని గాని లాభాన్ని గాని తీసుకోడు. \q1 అతడు నా చట్టాలను అనుసరించి నా శాసనాలను పాటిస్తాడు. \m అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా మరణించడు కాని ఖచ్చితంగా బ్రతుకుతాడు. \v 18 కాని అతని తండ్రి క్రూరుడై ఇతరులను బాధపెట్టి తన సోదరులను దోచుకుని తన ప్రజలమధ్య చేయకూడని తప్పు చేశాడు కాబట్టి అతడు తన పాపం కారణంగా చనిపోతాడు. \p \v 19 “అయితే మీరు, ‘తన తండ్రి దోషశిక్షను కుమారుడు ఎందుకు భరించడు?’ అని అడుగుతున్నారు. కుమారుడు నీతిన్యాయాలను జరిగిస్తూ నా శాసనాలను అనుసరించి నా నిబంధనలను పాటించాడు. కాబట్టి అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. \v 20 పాపం చేసేవాడు చనిపోతాడు. తల్లిదండ్రుల పాపాన్ని పిల్లలు భరించరు. పిల్లల పాపాన్ని తల్లిదండ్రులు భరించరు. నీతిమంతుని నీతి వానికే చెందుతుంది. అలాగే దుర్మార్గుని దుర్మార్గం వానికే చెందుతుంది. \p \v 21 “అయితే దుర్మార్గులు తాము చేసిన పాపాలను విడిచిపెట్టి నా శాసనాలను అనుసరించి న్యాయమైనవి, సరియైనవి చేస్తే వారు చనిపోరు; ఖచ్చితంగా బ్రతుకుతారు. \v 22 వారు చేసిన నేరాల్లో ఏది జ్ఞాపకం చేసుకోబడదు. వారి నీతి క్రియలను బట్టే వారు బ్రతుకుతారు. \v 23 దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తన సరిదిద్దుకొని బ్రతికితేనే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \p \v 24 “అయితే నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి పాపం చేస్తూ దుర్మార్గునిలా అసహ్యమైన పనులు చేస్తే వారు బ్రతుకుతారా? వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు. వారు నమ్మకద్రోహంతో చేసిన దోషాలను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి వారు చస్తారు. \p \v 25 “అయినా మీరు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. ఇశ్రాయేలీయులారా! నా మాట వినండి. నా మార్గం అన్యాయమైనదా? మీ మార్గాలు అన్యాయమైనవి కావా? \v 26 నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే వారు దానిని బట్టి చస్తారు. వారు చేసిన పాపాన్ని బట్టి వారు చస్తారు. \v 27 అయితే దుర్మార్గులు తాము చేసిన దుర్మార్గాన్ని విడిచిపెట్టి న్యాయమైనవి, సరియైనవి చేస్తే, వారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు. \v 28 అతడు తాను చేసిన నేరాలన్నిటిని గమనించుకుని వాటిని చేయడం మానేశాడు కాబట్టి అతడు చనిపోడు కాని ఖచ్చితంగా బ్రతుకుతాడు. \v 29 అయినా ఇశ్రాయేలీయులు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. ఇశ్రాయేలీయులారా! నా మార్గాలు అన్యాయమైనవా? కాని మీ మార్గాలే కదా అన్యాయమైనవి? \p \v 30 “ఇశ్రాయేలు ప్రజలారా! ఎవరి ప్రవర్తనను బట్టి వారిని నేను శిక్షిస్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. పశ్చాత్తాపపడి మీ అక్రమాల కారణంగా మీరు శిక్షించబడకుండా వాటిని విడిచిపెట్టండి. \v 31 గతంలో మీరు చేసిన నేరాలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన ఆత్మను పొందండి. ఇశ్రాయేలీయులారా! మీరెందుకు మరణాన్ని పొందాలి? \v 32 మరణించిన వానిని బట్టి నేను సంతోషించను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పశ్చాత్తాపపడి జీవించండి! \c 19 \s1 ఇశ్రాయేలు అధిపతుల గురించి విలాప గీతం \p \v 1 “నీవు ఇశ్రాయేలీయుల అధిపతుల గురించి విలాప గీతం పాడి ఇలా చెప్పు: \q1 \v 2 “ ‘నీ తల్లి ఎలాంటిది అంటే \q2 సింహాల మధ్యలో ఆడసింహం లాంటిది. \q1 కొదమ సింహాల మధ్య పడుకుని \q2 తన పిల్లలను పెంచింది. \q1 \v 3 ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడు \q2 అది బలమైన సింహం అయ్యింది. \q1 అది వేటాడడం నేర్చుకొని \q2 మనుష్యులను తినే జంతువుగా మారింది. \q1 \v 4 దాని గురించి ఇతర జనాంగాలు విని \q2 తమ గోతిలో దానిని పట్టుకున్నారు. \q1 దానికి గాలం తగిలించి \q2 ఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు. \b \q1 \v 5 “ ‘అది చూసిన దాని తల్లి \q2 తన ఆశ నిరాశ అయ్యిందని \q1 తన పిల్లల్లో మరో దానిని తీసుకుని \q2 బలమైన సింహంగా తయారుచేసింది. \q1 \v 6 ఇది కూడా కొదమ సింహమై, \q2 మిగిలిన కొదమ సింహాలతో పాటు తిరుగుతూ \q1 వేటాడడం నేర్చుకొని \q2 మనుష్యులను తినే జంతువుగా మారింది. \q1 \v 7 అది వారి బలమైన కోటలను పడగొట్టి \q2 వారి పట్టణాలను పాడుచేసింది. \q1 దాని గర్జన విని \q2 దేశంతో పాటు దేశంలో ఉన్నదంతా పాడైపోయింది. \q1 \v 8 నాలుగు వైపుల ఉన్న దేశాల ప్రజలందరూ \q2 దానిని పట్టుకోవడానికి వచ్చి \q1 దాని కోసం తమ వలలు పన్ని \q2 తమ గోతిలో దానిని చిక్కించుకున్నారు. \q1 \v 9 దానికి గాలం తగిలించి బోనులో పెట్టి \q2 బబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు. \q1 ఇశ్రాయేలీయుల పర్వతాలమీద \q2 దాని గర్జన ఎన్నటికీ వినబడకుండా \q2 వారు దానిని చెరసాలలో ఉంచారు. \b \q1 \v 10 “ ‘నీ తల్లి నీ ద్రాక్షతోటలో నీటి ప్రక్కన \q2 నాటబడిన ద్రాక్షవల్లిలాంటిది; \q1 నీరు సమృద్ధిగా ఉన్నందున \q2 అది ఫలించి అనేక కొమ్మలతో నిండి ఉంది. \q1 \v 11 పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన \q2 బలమైన కొమ్మలు దానికున్నాయి. \q1 అది మేఘాలను తాకే అంతగా \q2 పైకి పెరిగింది \q1 దానికున్న అనేక కొమ్మలతో \q2 ఏపుగా పెరిగింది. \q1 \v 12 అయితే మహా కోపంతో అది పెరికి వేయబడి \q2 నేల మీద పారవేయబడింది. \q1 తూర్పు గాలి వీచగా \q2 దాని పండ్లు వాడిపోయాయి; \q1 బలమైన దాని కొమ్మలు \q2 అగ్నిలో పడి కాలిపోయాయి. \q1 \v 13 ఇప్పుడది అరణ్యంలో పూర్తిగా ఎండిపోయిన \q2 నీళ్లు లేని ఎడారిలో నాటబడింది. \q1 \v 14 దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించి \q2 దాని పండ్లను కాల్చివేసింది. \q1 పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన \q2 బలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’ \m ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.” \c 20 \s1 తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రక్షాళన \p \v 1 ఏడవ సంవత్సరం అయిదవ నెల పదవ రోజున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవాను సంప్రదించడానికి నా దగ్గరకు వచ్చి నా ఎదుట కూర్చున్నారు. \p \v 2 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 3 “మనుష్యకుమారుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నన్ను సంప్రదించడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నేను మీకే ఆలోచన చెప్పను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ \p \v 4 “వారికి న్యాయం తీరుస్తావా? మనుష్యకుమారుడా, వారికి న్యాయం తీరుస్తావా? వారి పూర్వికులు చేసిన అసహ్యమైన ఆచారాలు వారికి తెలియజేసి, \v 5 వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న రోజున, నేను యాకోబు వారసులకు ప్రమాణం చేసిన రోజున ఈజిప్టులో వారికి నన్ను ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసి, “మీ దేవుడనైన యెహోవాను నేనే” అని వారికి ప్రకటించాను. \v 6 వారిని ఈజిప్టు దేశంలో నుండి బయటకు తీసుకువచ్చి నేను వారికి ఏర్పాటుచేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అన్ని దేశాల్లో సుందరమైన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను. \v 7 అప్పుడు నేను, “నేనే మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన అసహ్యమైన పనులను విడిచిపెట్టాలి. ఈజిప్టువారి విగ్రహాలను పూజించి అపవిత్రులు కావద్దని వారికి ఆజ్ఞాపించాను.” \p \v 8 “ ‘అయితే వారు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేశారు; తమకిష్టమైన అసహ్యమైన పనులు చేయడం మానలేదు, ఈజిప్టువారి విగ్రహాలను పూజించడం మానలేదు. కాబట్టి వారు ఈజిప్టు దేశంలో ఉండగానే నేను నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకున్నాను. \v 9 అయితే నా నామం కోసం వారిని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. వారు నివసించిన జనాంగాల దృష్టిలో, ఎవరి ఎదుట నన్ను నేను ఇశ్రాయేలీయులకు బయలుపరచుకున్నానో వారి ఎదుట నా పేరు అపవిత్రం కాకూడదని అలా చేశాను. \v 10 వారిని ఈజిప్టు దేశం నుండి బయటకు రప్పించి అరణ్యంలోకి తీసుకువచ్చి, \v 11 వారికి నా శాసనాలను ఇచ్చి, నా ధర్మశాస్త్రాన్ని వారికి తెలియజేశాను. వాటిని అనుసరించిన మనుష్యులే బ్రతుకుతారు. \v 12 యెహోవానైన నేనే వారిని పవిత్రపరచానని వారు తెలుసుకునేలా, నాకు వారికి మధ్య సూచనగా సబ్బాతులను నియమించాను. \p \v 13 “ ‘అరణ్యంలో ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి, నా శాసనాలను తృణీకరించి, వాటికి లోబడేవారు బ్రతుకుతారని నేనిచ్చిన నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నేను నియమించిన సబ్బాతులను పూర్తిగా అపవిత్రం చేశారు. కాబట్టి వారిపై నా ఉగ్రత కుమ్మరించి వారిని అరణ్యంలో నాశనం చేయాలనుకున్నాను. \v 14 అయితే కోసం నేను ఎవరి దృష్టిలో వారిని బయటకు తీసుకువచ్చానో ఆ జాతుల దృష్టిలో నా నామం అపవిత్రం కాకుండా ఉండేందుకు నేను అనుకున్న ప్రకారం చేయలేదు. \v 15-16 తమకిష్టమైన విగ్రహాలను పూజించాలని నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండ నా శాసనాలను అనుసరించకుండ నా సబ్బాతులను అపవిత్రం చేసినందుకు, నేను వారికి ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, అన్ని దేశాల్లో అతి సుందరమైన దేశంలోనికి నేను వారిని తీసుకురానని వారు అరణ్యంలో ఉండగానే నా చేయి పైకెత్తి వారితో ప్రమాణం చేశాను. \v 17 అయినా వారి మీద జాలిపడి వారిని నాశనం చేయలేదు, అరణ్యంలోనే వారిని అంతం చేయలేదు. \v 18 వారు అరణ్యంలో ఉన్నప్పుడు నేను వారి పిల్లలతో, “మీ తండ్రుల కట్టడలను పాటించవద్దు; వారి పద్ధతులను అనుసరిస్తూ వారి విగ్రహాలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. \v 19 మీ దేవుడైన యెహోవాను నేనే; నా శాసనాలను అనుసరిస్తూ నా ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించండి. \v 20 సబ్బాతును పరిశుద్ధంగా పాటించండి; నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి మీకూ నాకు మధ్య సూచనగా ఉంటాయి” అని చెప్పాను. \p \v 21 “ ‘అయినా వారి పిల్లలు నాపై తిరగబడ్డారు: వారు అనుసరించి బ్రతకాలని చెప్పి నేను ఇచ్చిన నా శాసనాలను వారు పాటించకుండా నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా నా సబ్బాతును అపవిత్రం చేశారు. కాబట్టి వారు అరణ్యంలో ఉండగానే నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి కోపాన్ని తీర్చుకోవాలని అనుకున్నాను. \v 22 అయితే నేను ఏ ఇతర ప్రజలమధ్య ప్రత్యక్షమయ్యానో ఏ ఇతర ప్రజల నుండి వారిని బయటకు రప్పించానో ఆ ప్రజలమధ్య నా నామం అపవిత్రపరచబడకుండా నా చేయి వెనుకకు తీసి నా వాగ్దానం నెరవేర్చాను. \v 23-24 వారు నా ధర్మశాస్త్రానికి లోబడకుండా నా శాసనాలను తృణీకరించి నా సబ్బాతును అపవిత్రపరచి తమ తండ్రులు పెట్టిన విగ్రహాలను పూజించారు, కాబట్టి నేను వారిని ఇతర ప్రజలమధ్య చెదరగొట్టి అన్ని దేశాలకు వారిని చెదరగొడతానని అరణ్యంలో వారికి ప్రమాణం చేశాను. \v 25 కాబట్టి నేనే యెహోవానని వారు తెలుసుకునేలా నేను వారికి మంచివి కాని శాసనాలు, వారు బ్రతకడానికి ఉపయోగపడని విధులు ఇచ్చాను; \v 26 వారు తమ మొదటి సంతానాన్ని బలి ఇచ్చి తమను తాము అపవిత్రం చేసుకోనిచ్చాను. నేనే యెహోవానని వారు తెలుసుకునేలా వారిని భయాందోళనలకు గురిచేస్తాను.’ \p \v 27 “కాబట్టి మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ విషయంలో కూడా మీ పూర్వికులు నాకు నమ్మకద్రోహం చేసి నన్ను దూషించారు: \v 28 నేను వారిని ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి నేను వారిని తీసుకువచ్చిన తర్వాత కూడా ఎత్తైన కొండను గాని గుబురుగా ఉన్న చెట్టును గాని వారు చూడగానే వాటికి బలులు అర్పణలు అర్పిస్తూ, పరిమళ ధూపాలను వేస్తూ పానార్పణలు చేస్తూ నాకు కోపం పుట్టించారు. \v 29 అప్పుడు నేను వారితో ఇలా అన్నాను: మీరు వెళ్లే ఈ ఉన్నత స్థలం ఏమిటి?’ ” అని అడిగాను. (ఇప్పటికి అది బామా\f + \fr 20:29 \fr*\fq బామా \fq*\ft అంటే \ft*\fqa ఉన్నత స్థలం\fqa*\f* అనే పిలువబడుతుంది.) \s1 తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు పునరుద్ధరించబడింది \p \v 30 “కాబట్టి ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీ పూర్వికులు చేసిన విధంగా మీరు కూడా అసహ్యమైన విగ్రహాలతో వ్యభిచారం చేస్తారా? \v 31 నేటి వరకు మీరు అర్పణలు అర్పించి, మీ పిల్లలను అగ్నిగుండాలు దాటించి మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రులవుతున్నారు. ఇశ్రాయేలీయులారా, నన్ను విచారించడానికి నేను మిమ్మల్ని అనుమతించాలా? నా జీవం తోడు నా నుండి మీకు ఏ ఆలోచనా దొరకదు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \p \v 32 “ ‘ “మేము కట్టెను, రాయిని సేవించే దేశాల్లా, ప్రపంచంలోని జనాంగాల్లా ఉండాలని కోరుకుంటున్నాము” అని మీరంటున్నారు. కాని మీ మనస్సులో ఉన్నట్లు ఎప్పటికీ జరగదు. \v 33 నా జీవం తోడు, నేను బలిష్టమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న కోపంతో నిన్ను పరిపాలిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 34 నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి రప్పిస్తాను మీరు చెదిరిపోయి ఉన్న దేశాల నుండి బలమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న ఉగ్రతతో మిమ్మల్ని సమకూరుస్తాను. \v 35 నేను మిమ్మల్ని జనాలు ఉన్న అరణ్యంలోకి తీసుకువస్తాను, అక్కడ ముఖాముఖిగా నేను మీకు తీర్పు తీరుస్తాను. \v 36 ఈజిప్టు దేశపు అరణ్యంలో నేను మీ పూర్వికులకు తీర్పు ఇచ్చినట్టే మీకు కూడా తీరుస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 37 మీరు నా చేతికర్ర క్రింద దాటి వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని గమనించి మిమ్మల్ని ఒడంబడిక బంధంలోనికి తీసుకువస్తాను. \v 38 నా మీద తిరుగుబాటు చేసేవారిని దోషులను మీలో ఉండకుండా చేస్తాను. వారు ఉంటున్న దేశంలో నుండి వారిని బయటకు రప్పిస్తాను కాని వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు. అప్పుడు మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు. \p \v 39 “ ‘ఇశ్రాయేలు ఇంటివారలారా! ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు నా మాట వినకపోతే మీరు వెళ్లి మీ విగ్రహాలను పూజించండి. కాని మీ అర్పణల వలన విగ్రహాల వలన నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయకండి. \v 40 ఇశ్రాయేలీయులకు ఉన్నత పర్వతమైన నా పరిశుద్ధ పర్వతం మీద దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరు నాకు సేవ చేస్తారు, అక్కడే నేను వారిని అంగీకరిస్తాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అక్కడ మీ పరిశుద్ధ బలులతో పాటు మీ అర్పణలు, మీ ప్రత్యేక కానుకలన్నిటిని\f + \fr 20:40 \fr*\ft లేదా \ft*\fqa ప్రథమ ఫలాల కానుకలు\fqa*\f* నేను అంగీకరిస్తాను. \v 41 ఇతర ప్రజల నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మీరు చెదరిపోయిన ఆయా దేశాల్లో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపంలా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఇతర ప్రజల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధ పరుచుకుంటాను. \v 42 మీ పూర్వికులకు ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశమైన ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. \v 43 అక్కడ మీరు మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకున్న పనులన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన చెడు అంతటిని బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు. \v 44 ఇశ్రాయేలీయులారా! మీ దుర్మార్గాన్ని బట్టి మీ చెడు పనులను బట్టి కాకుండా నా నామాన్ని బట్టే మీకు ఇలా చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \s1 దక్షిణ దేశానికి వ్యతిరేకంగా ప్రవచనం \p \v 45 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 46 “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని దక్షిణం వైపు త్రిప్పుకుని దక్షిణ దేశానికి ప్రకటించు; దక్షిణ అరణ్యాన్ని గురించి ప్రవచించు. \v 47 దక్షిణ అరణ్యంలో ఇలా చెప్పు: ‘యెహోవా మాట విను. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను నీలో అగ్ని రాజేస్తాను. అది నీలో ఉన్న పచ్చని చెట్లను ఎండిన చెట్లను అన్నిటిని కాల్చివేస్తుంది. ఆ అగ్ని ఆరిపోదు. దక్షిణ దిక్కునుండి ఉత్తరదిక్కు వరకు భూతలమంతా కాలిపోతుంది. \v 48 ఆ అగ్నిని రగిలించింది యెహోవానైన నేనేనని అందరు తెలుసుకుంటారు; దాన్ని ఎవరూ ఆర్పలేరు.’ ” \p \v 49 అప్పుడు నేను ఇలా అన్నాను, “ప్రభువైన యెహోవా, వారు నా గురించి, ‘ఇతడు కేవలం ఉపమానాలు చెప్పేవాడే కదా?’ అని అంటున్నారు.” \c 21 \s1 దేవుని తీర్పు అనే ఖడ్గంగా బబులోను \p \v 1 అప్పుడు యెహోవా వాక్కు నాకు వచ్చి: \v 2 “మనుష్యకుమారుడా, యెరూషలేము వైపు నీ ముఖం త్రిప్పుకుని పరిశుద్ధాలయం గురించి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రవచించి ఇలా చెప్పు: \v 3 యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఓ ఇశ్రాయేలూ, నేను నీకు విరోధంగా ఉన్నాను. ఒర నుండి నా ఖడ్గాన్ని దూసి నీలో ఉన్న నీతిమంతులను, దుర్మార్గులను హతమారుస్తాను. \v 4 నీతిమంతులను, దుర్మార్గులను చంపబోతున్నాను కాబట్టి, దక్షిణం నుండి ఉత్తరం వరకు వారందరినీ చంపే వరకు నా ఖడ్గం ఒరలో పెట్టబడదు. \v 5 అప్పుడు యెహోవానైన నేనే నా ఖడ్గాన్ని మళ్ళీ ఒరలో పెట్టకుండా దూసానని ప్రజలందరూ తెలుసుకుంటారు.’ \p \v 6 “కాబట్టి మనుష్యకుమారుడా, మూల్గు! నీ విరిగిన మనస్సుతో తీవ్రమైన దుఃఖంతో వారి ముందు మూలుగు. \v 7 ‘నీవెందుకు మూల్గుతున్నావు?’ అని వారు అడిగినప్పుడు, నీవు వారితో, ‘శ్రమ దినం వస్తుందనే భయంకరమైన వార్త నాకు వినబడింది! ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది, ప్రతి చేయి బలహీనం అవుతుంది. ప్రతి ఆత్మ సొమ్మసిల్లుతుంది, ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది’ అని చెప్తావు. అది వస్తోంది! అది తప్పక జరుగుతుందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” \p \v 8 మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 9 “మనుష్యకుమారుడా, నీవు ప్రవచించి ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం \q2 పదును పెట్టబడి మెరుగు పెట్టబడింది. \q1 \v 10 వధించడానికి పదును పెట్టబడింది, \q2 మెరుపులా మెరిసేలా మెరుగు పెట్టబడింది! \p “ ‘నా కుమారుని రాజదండాన్ని బట్టి మనం సంతోషిద్దామా? అలాంటి ప్రతి దండాన్ని ఆ ఖడ్గం తృణీకరిస్తుంది. \q1 \v 11 “ ‘ఆ ఖడ్గం మెరుగుపరచడానికి, \q2 చేతితో పట్టుకోడానికి నియమించబడింది; \q1 హతం చేసేవాడు పట్టుకోడానికి, \q2 అది పదును పెట్టబడి, మెరుగు పెట్టబడి సిద్ధంగా ఉంది. \q1 \v 12 మనుష్యకుమారుడా, మొరపెట్టు, రోదించు \q2 ఆ ఖడ్గం నా ప్రజలమీదికి \q2 ఇశ్రాయేలు అధిపతులందరి మీదికి వస్తున్నది. \q1 నా ప్రజలతో పాటు \q2 వారు కూడా ఖడ్గంతో చంపబడతారు. \q1 కాబట్టి నీ రొమ్ము కొట్టుకో. \p \v 13 “ ‘పరీక్ష తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఖడ్గం తృణీకరించిన రాజదండం కూడా కొనసాగకపోతే ఎలా? అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ \q1 \v 14 “కాబట్టి మనుష్యకుమారుడా, ప్రవచించు, \q2 నీ రెండు చేతులతో చప్పట్లు కొట్టు. \q1 ఖడ్గం రెండు సార్లు దాడి చేయును గాక \q2 మూడుసార్లు అయినా దాడి చేయును గాక. \q1 అది వధ కొరకైన ఖడ్గం, \q2 మహా వధ కొరకైన ఖడ్గం, \q2 అన్ని వైపుల నుండి వారి మీద దాడి చేస్తుంది. \q1 \v 15 తద్వార వారి హృదయాలు భయంతో కరిగిపోవును గాక, \q2 చాలామంది హతమవుదురు గాక, \q1 వారి గుమ్మాలన్నిటి దగ్గర \q2 నేను ఖడ్గాన్ని నిలబెట్టాను. \q1 చూడండి! అది తళతళ మెరుస్తూ ఉంది, \q2 అది వధ కోసం దూయబడింది. \q1 \v 16 ఖడ్గమా! కుడివైపు వేటు వేయి, \q2 తర్వాత ఎడమవైపు వేటు వేయి. \q2 ఎటువైపు త్రిప్పబడితే అటు వేటు వేయి. \q1 \v 17 నేను కూడా నా చేతులతో చప్పట్లు కొట్టి, \q2 నా ఉగ్రత తీర్చుకుంటాను. \q1 యెహోవానైన నేనే ఈ మాట అన్నాను.” \p \v 18 యెహోవా వాక్కు నాకు వచ్చి: \v 19 “మనుష్యకుమారుడా, బబులోను రాజు ఖడ్గం పట్టడానికి రెండు దారులను ఏర్పరచు, రెండూ ఒకే దేశం నుండి మొదలవుతాయి. ఒక సూచికను తయారుచేసి, పట్టణానికి వెళ్లే రహదారి ఆరంభంలో ఉంచు. \v 20 అమ్మోనీయుల పట్టణమైన రబ్బా మీదికి ఒక మార్గాన్ని, అలాగే యూదా దేశంలో ఉన్న ప్రాకార పట్టణమైన యెరూషలేము మీదికి ఒక ఖడ్గం వచ్చేలా మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలి. \v 21 దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు. \v 22 యెరూషలేము గురించి తన కుడి వైపున శకునం కనిపించింది ఏర్పాటు చేయమని, చంపమని, యుద్ధధ్వని చేయమని, గుమ్మాలకు ఎదురుగా పడగొట్టే యంత్రాలు ఏర్పాటు చేయమని, ముట్టడి దిబ్బలు వేయమని చెప్పాడు. \v 23 అతనితో ఒప్పందం చేసుకున్న వారికి ఇది తప్పుడు శకునంగా కనిపిస్తుంది, కాని అతడు వారి అపరాధాన్ని వారికి గుర్తు చేసి వారిని బందీగా తీసుకెళ్తాడు. \p \v 24 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరు బహిరంగంగా తిరుగుబాటు చేసి మీ అపరాధాన్ని గుర్తుకు తెచ్చారు, మీరు చేసేవాటన్నిటిలో మీ పాపాలను బయట పెట్టుకున్నారు. మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు బందీలుగా కొనిపోబడతారు. \p \v 25 “ ‘అపవిత్రుడా ఇశ్రాయేలీయుల దుష్ట అధిపతీ, నిన్ను శిక్షించే రోజు సమీపించింది; నీ శిక్షాకాలం ముగింపుకు చేరుకుంది, \v 26 ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు. \v 27 శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’ \p \v 28 “మనుష్యకుమారుడా! నీవు ప్రవచించి ఇలా చెప్పు, ‘అమ్మోనీయుల గురించి వారి అవమానాల గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం, \q2 వధ కోసం దూయబడింది, \q1 నాశనం చేయడానికి మెరుగు పెట్టబడి, \q2 మెరుపులా తళతళలాడుతూ ఉంది! \q1 \v 29 నీ గురించి శకునగాండ్రు తప్పుడు దర్శనాలు చూస్తుండగా, \q2 నీ గురించి అబద్ధపు శకునాలు చెప్తున్నప్పుడు, \q1 ఎవరి దినమైతే వచ్చేసిందో, \q2 ఎవరి శిక్షా సమయం ముగింపుకు చేరుకుందో, \q1 ఆ దుర్మార్గుల మెడ మీద ఆ ఖడ్గం పెట్టబడుతుంది. \q2 వారి మెడ ప్రక్కనే అది నిన్ను పడవేస్తుంది. \b \q1 \v 30 “ ‘ఖడ్గాన్ని తిరిగి ఒరలో పెట్టు. \q2 నీవు సృజించబడిన స్థలంలోనే, \q1 నీ పూర్వికుల దేశంలోనే \q2 నేను నీకు తీర్పు తీరుస్తాను. \q1 \v 31 నేను నా ఉగ్రతను నీపై కుమ్మరించి \q2 నా కోపాగ్నిని నీ మీదికి ఊదుతాను; \q1 నాశనం చేయడంలో నేర్పరులైన \q2 క్రూరుల చేతికి నిన్ను అప్పగిస్తాను. \q1 \v 32 నీవు అగ్నికి ఆహుతి అవుతావు, \q2 నీ రక్తం నీ దేశంలో చిందించబడుతుంది, \q2 నీవు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోబడవు; \q1 ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను.’ ” \c 22 \s1 యెరూషలేము పాపాలకు తీర్పు \p \v 1 యెహోవా వాక్కు నాకు వచ్చి: \b \p \v 2 “మనుష్యకుమారుడా, నీవు దానికి తీర్పు తీరుస్తావా? రక్తం చిందించిన ఈ పట్టణానికి నీవు తీర్పు తీరుస్తావా? అలా అయితే నీవు దాని అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి దానిని నిలదీస్తూ \v 3 ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తన మధ్య రక్తాన్ని చిందిస్తూ, విగ్రహాలను తయారుచేస్తూ తనను తాను అపవిత్రం చేసుకునే నగరమా, \v 4 నీవు చిందించిన రక్తాన్ని బట్టి నీవు అపరాధివి అయ్యావు, నీవు తయారుచేసిన విగ్రహాల వలన నీవు అపవిత్రం అయ్యావు. నీవే నీ దినాలు దగ్గర పడేలా చేసుకున్నావు, నీ సంవత్సరాలు ముగింపుకు వచ్చాయి. కాబట్టి నేను నిన్ను ఇతర జనాంగాల మధ్య హాస్యాస్పదంగా చేసి, అన్ని దేశాల ఎదుట నవ్వులపాలు చేస్తాను. \v 5 అపకీర్తి పొందిన పట్టణమా, కలత చెందినదానా, నీకు దగ్గరగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తారు. \p \v 6 “ ‘చూడండి, నీలో ఉన్న ఇశ్రాయేలు నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్యలు చేయాలని నిర్ణయించుకున్నారు. \v 7 నీలో వారు తండ్రిని తల్లిని అవమానించారు; నీలో వారు పరదేశులను అణచివేశారు, తండ్రిలేనివారిని, విధవరాండ్రను చులకనగా చూశారు. \v 8 నీవు నా పరిశుద్ధ వస్తువులను తృణీకరించి నా సబ్బాతులను అపవిత్రం చేశావు. \v 9 అపవాదులు వేసేవారు, రక్తం చిందించేవారు నీలో ఉన్నారు; పర్వత క్షేత్రాల దగ్గర తిని, అసభ్యకరమైన పనులు చేసేవారు నీలో ఉన్నారు. \v 10 తమ తండ్రి పడకను అవమానపరిచేవారు నీలో ఉన్నారు; బహిష్టు సమయంలో అపవిత్రంగా ఉన్న స్త్రీలను చెరిపినవారు నీలో ఉన్నారు. \v 11 నీలో ఒకడు తన పొరుగువాని భార్యతో అసహ్యకరమైన నేరం చేస్తాడు, మరొకడు అవమానకరంగా తన కోడలిని అపవిత్రం చేస్తాడు, మరొకడు తన సోదరిని, తన తండ్రి కుమార్తెను చెరుపుతాడు. \v 12 నీలో రక్తం చిందించడానికి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు; నీవు వడ్డీ తీసుకుని పేదల నుండి లాభం పొందుతావు. నీవు నీ పొరుగువారి నుండి అన్యాయమైన లాభం పొందుతావు. నీవు నన్ను మరచిపోయావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 13 “ ‘నీవు సంపాదించిన అన్యాయ లాభాన్ని, నీవు చేసిన హత్యలు చూసి నా చేతులు చరుచుకుంటాను. \v 14 నేను నిన్ను శిక్షించే రోజును తట్టుకునే ధైర్యం నీకు ఉంటుందా? నీ చేతులు బలంగా ఉంటాయా? యెహోవానైన నేను చెప్పాను, దానిని నేను నెరవేరుస్తాను. \v 15 ఇతర జనాంగాల్లోకి నిన్ను చెదరగొట్టి, ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను; నీ అపవిత్రతకు ముగింపు తెస్తాను. \v 16 నీవు జనాంగాల దృష్టిలో అపవిత్రం అయినప్పుడు, నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’ ” \p \v 17 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 18 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి లోహపు మడ్డిలాంటి వారు; వారంతా కొలిమి లోపల మిగిలిపోయిన రాగి, తగరం, ఇనుము, తగరం వంటివారు. వారు వెండి లోహపు మడ్డి వంటివారు. \v 19 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరంతా లోహపు మడ్డిలా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యకు పోగుచేస్తాను. \v 20 వెండి, ఇత్తడి, ఇనుము, తగరాన్ని పోగుచేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది, కరిగించినట్లు నేను నా కోపంతో నా ఉగ్రతతో మిమ్మల్ని పోగుచేసి ఆ పట్టణం లోపల ఉంచి మిమ్మల్ని కరిగిస్తాను. \v 21 మిమ్మల్ని పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా మీరు దానిలో కరిగిపోతారు. \v 22 కొలిమిలో వెండి కరిగినట్లు మీరు దానిలో కరిగిపోతారు. యెహోవానైన నేను నా ఉగ్రతను మీమీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.’ ” \p \v 23 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 24 “మనుష్యకుమారుడా, యెరూషలేముతో ఇలా చెప్పు, ‘నీవు శుద్ధి చేయబడని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం కురవదు.’ \v 25 సింహం గర్జిస్తూ వేటను చీల్చేటట్లు దానిలో దాని ప్రవక్తలు కుట్ర చేస్తారు. వారు మనుష్యులను మ్రింగివేస్తారు. ప్రజల సంపదను విలువైన వస్తువులను దోచుకుంటారు. చాలామందిని విధవరాండ్రుగా చేస్తారు. \v 26 దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని మీరి నా పరిశుద్ధ వస్తువులను అపవిత్రం చేస్తారు; పరిశుద్ధమైన వాటికి సాధారణమైన వాటికి మధ్య భేదం వారికి తెలియదు. పవిత్రతకు అపవిత్రతకు మధ్య ఉన్న భేదాన్ని ప్రజలకు నేర్పించరు. నా విశ్రాంతి దినాలను నిర్లక్ష్యం చేస్తారు. వారి మధ్య నేను అపవిత్రం అయ్యాను. \v 27 దానిలో అధికారులు వేటాడినదాన్ని చీల్చే తోడేళ్లలా ఉన్నారు; అక్రమ సంపాదన కోసం వారు రక్తాన్ని చిందించి ప్రజలను చంపుతారు. \v 28 దాని ప్రవక్తలు తప్పుడు దర్శనాలు అబద్ధపు శకునాలు చూస్తూ యెహోవా ఏమి చెప్పనప్పటికి ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే అని తమ పనులను కప్పిపుచ్చుకుంటారు. \v 29 దేశ ప్రజలు బలాత్కారాలు చేస్తూ దొంగతనాలు చేస్తారు; పేదవారిని దరిద్రులను హింసిస్తారు, విదేశీయులను అన్యాయంగా బాధిస్తారు. \p \v 30 “నేను దేశాన్ని నాశనం చేయకుండా దాని గోడలను బాగుచేయడానికి పగుళ్లలో నా ఎదుట నిలబడడానికి నేను తగిన వాన్ని వెదికాను కాని అలాంటివాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు. \v 31 కాబట్టి నేను నా ఉగ్రతను వారి మీద క్రుమ్మరించి, నా కోపాగ్నితో వారిని కాల్చివేసి వారు చేసిన వాటన్నిటి ఫలితాన్ని వారి మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” \c 23 \s1 వ్యభిచారులైన అక్కాచెల్లెలు \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, ఒకే తల్లి కుమార్తెలైన ఇద్దరు స్త్రీలు ఉన్నారు. \v 3 వారు తమ యవ్వనం నుండి వ్యభిచారం చేస్తూ ఈజిప్టులో వేశ్యలుగా మారారు. ఆ దేశంలో వారి రొమ్ములు పిండబడ్డాయి, వారి కన్య చనుమొనలు నలిపివేయబడ్డాయి. \v 4 వారిలో పెద్దదాని పేరు ఒహోలా, దాని చెల్లి పేరు ఒహోలీబా. నేను వారిని పెళ్ళి చేసుకోగా వారు నాకు కుమారులను, కుమార్తెలను కన్నారు. ఒహోలా అంటే సమరయ, ఒహోలీబా అంటే యెరూషలేము. \p \v 5 “ఒహోలా నాదానిగా ఉన్నప్పుడే వ్యభిచారం చేసింది; అది తన ప్రేమికులైన అష్షూరు వారిని మోహించింది. \v 6 వారు నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, అధికారులు సైన్యాధిపతులు, వారందరూ అందమైన యువకులు, గుర్రాలు స్వారీ చేసేవారు. \v 7 అది ఒక వేశ్యలా అష్షూరీయులలో ముఖ్యులైన వారి ఎదుట తిరుగుతూ వారందరితో వ్యభిచరిస్తూ వారు నిలబెట్టిన విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రురాలైంది. \v 8 అది ఈజిప్టులో ప్రారంభించిన వ్యభిచారాన్ని ఇంకా వదల్లేదు, దాని యవ్వనంలోనే పురుషులు దానితో పడుకున్నప్పుడు, దాని కన్య చనుమొనలను నలిపి, దానితో తమ కామాన్ని తీర్చుకున్నారు. \p \v 9 “కాబట్టి అది మోహించిన దాని ప్రేమికులైన అష్షూరువారి చేతికే దానిని అప్పగించాను. \v 10 వారు దానిని నగ్నంగా నిలబెట్టారు, దాని కుమారులను కుమార్తెలను బంధించి దాన్ని ఖడ్గంతో చంపారు. స్త్రీలందరిలో అది ఒక సామెతగా అయ్యింది, దానికి శిక్ష విధించబడింది. \p \v 11 “దాని చెల్లి ఒహోలీబా ఇదంతా చూసింది, అయినాసరే కామంలో వ్యభిచారంలో దాని అక్కను మించి దిగజారిపోయింది. \v 12 అది కూడా అష్షూరు వారిలో సైన్యాధిపతులు, అధికారులను, నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, గుర్రాలు స్వారీ చేసేవారిని, అందమైన యువకులను మోహించింది. \v 13 అది కూడా తనను తాను అపవిత్రపరచుకోవడం నేను చూశాను; వారిద్దరు ఒకే దారిలో వెళ్లారు. \p \v 14 “అయితే అది వ్యభిచారాన్ని మరింత ఎక్కువగా చేసింది. అది గోడపై ఎరుపు రంగులో చిత్రీకరించబడిన కల్దీయుల\f + \fr 23:14 \fr*\ft లేదా \ft*\fqa బబులోనీయుల\fqa*\f* పురుషుల చిత్రాలను చూసింది. \v 15 వారు నడుములకు దట్టీలు, తలలపై తలపాగాలు ధరించిన బబులోను రథ అధికారుల్లా, కల్దీయ సంతానంలా కనిపించారు. \v 16 అది వారిని చూడగానే వారిని మోహించి, కల్దీయలో ఉన్న వారి దగ్గరకు దూతలను పంపింది. \v 17 అప్పుడు బబులోనువారు దాని పడక సుఖాన్ని కోరి వచ్చి వ్యభిచరించి దానిని అపవిత్రం చేశారు. అది వారిచే అపవిత్రపరచబడిన తర్వాత, దాని మనస్సుకు వారంటే అసహ్యం వేసింది. \v 18 అదలా తన వ్యభిచారాన్ని బహిరంగంగా నిర్వహిస్తూ, తన నగ్న శరీరాన్ని బహిర్గతం చేసినప్పుడు, నేను దాని సోదరిని వదిలేసినట్టే, దీని మీద అసహ్యం కలిగి దీన్ని కూడా వదిలేశాను. \v 19 అయినప్పటికీ అది ఈజిప్టులో వేశ్యగా ఉన్న తన యవ్వన రోజులను గుర్తుచేసుకుని మరింత వ్యభిచారం చేసింది. \v 20 గాడిదల్లాంటి పురుషాంగం గుర్రాల్లాంటి వీర్య స్ఖలనం ఉన్న తన ప్రేమికులను అది మోహించింది. \v 21 కాబట్టి ఈజిప్టులో నీ రొమ్ములను చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని నీ యవ్వనపు అశ్లీల ప్రవర్తన కొనసాగించాలని ఎంతో ఆశించావు. \p \v 22 “కాబట్టి ఒహోలీబా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీ ప్రేమికులనే నీకు వ్యతిరేకంగా రేపుతాను, నీవు అసహ్యం కలిగి వదిలేసిన వారినే అన్ని వైపుల నుండి నీ మీదికి రప్పిస్తాను. \v 23 బబులోనీయులు, కల్దీయులందరూ, పేకోదు, షోవ, కోవ యొక్క పురుషులు, వారితో ఉన్న అష్షూరీయులందరు, అందమైన యువకులు, అధికారులు, అధిపతులు, రథ అధికారులు ఉన్నత స్థాయి పురుషులు, గుర్రపు స్వారీ చేసే వీరందరిని రప్పిస్తాను. \v 24 వారు ఆయుధాలతో రథాలతో బండ్లతో జనసమూహంతో నీ మీదికి వస్తారు. పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి అన్ని వైపుల నుండి నిన్ను చుట్టుముడతారు. శిక్షించడానికి నేను నిన్ను వారికి అప్పగిస్తాను, వారు తమ పద్ధతిలో నిన్ను శిక్షిస్తారు. \v 25 నేను రోషంతో నా కోపాన్ని చూపించగా కోపాగ్రతతో వారు నిన్ను శిక్షిస్తారు. వారు నీ ముక్కు నీ చెవులు నరికివేస్తారు, నీలో మిగిలి ఉన్నవారు కత్తివేటుకు కూలిపోతారు. నీ కుమారులను కుమార్తెలను వారు తీసుకెళ్తారు, నీలో మిగిలిన వారు అగ్నిచేత కాల్చబడతారు. \v 26 వారు నీ బట్టలు లాగివేసి నీ విలువైన ఆభరణాలు తీసుకెళ్తారు. \v 27 కాబట్టి ఈజిప్టులో నీవు మొదలుపెట్టిన అశ్లీల ప్రవర్తన, వ్యభిచారం నీలో ఉండకుండా చేస్తాను. ఇకపై నీవు ఈజిప్టును జ్ఞాపకం చేసుకోవు, నీవు వీటిపై నీ దృష్టిని పెట్టవు. \p \v 28 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు ద్వేషించిన వారికి నీవు అసహ్యించుకునే వారికి నిన్ను అప్పగిస్తున్నాను. \v 29 వారు ద్వేషంతో నిన్ను బాధిస్తారు. నీవు వేటి కోసం కష్టపడ్డావో వాటన్నిటిని తీసుకుంటారు. వారు నిన్ను నగ్నంగా వదిలివేయగా నీ వేశ్యాత్వం వలన కలిగిన అవమానం బహిర్గతమవుతుంది. \v 30 నీవు దేశాలను మోహించి, వారి విగ్రహాలతో నిన్ను నీవు అపవిత్రం చేసుకున్నావు, నీ అశ్లీలత, వ్యభిచారం వల్లనే ఇది నీ మీదికి వచ్చింది. \v 31 నీ సోదరి వెళ్లిన దారిలోనే నీవు వెళ్లావు; కాబట్టి నేను దాని గిన్నెనే నీ చేతిలో పెడతాను. \p \v 32 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “నీ అక్క త్రాగిన గిన్నె లోనిదే నీవు త్రాగుతావు, \q2 అది లోతైన పెద్ద గిన్నె; \q1 అది అపహాస్యం ఎగతాళిని తెస్తుంది, \q2 అందులో త్రాగాల్సింది చాలా ఉంటుంది. \q1 \v 33 నీవు మత్తుతో, విచారంతో నిండిపోతావు, \q2 నీ సోదరియైన సమరయ గిన్నె, \q2 శిథిలం నిర్మానుష్యంతో నిండిన గిన్నె. \q1 \v 34 అడుగు వరకు దానిలోనిది త్రాగి \q2 ఆ పాత్రను ముక్కలు చేసి, \q2 వాటితో నీ రొమ్ములు చీల్చుకుంటావు. \m ఇది నేనే చెప్పాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \b \p \v 35 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు నన్ను మరచిపోయి నాకు వెన్ను చూపావు, నీ అశ్లీల ప్రవర్తనకు వ్యభిచారానికి తగిన శిక్షను నీవు భరించాలి.” \p \v 36 యెహోవా నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఒహోలాకు, ఒహోలీబాకు నీవు తీర్పు తీరుస్తావా? వారు చేసిన అసహ్యమైన పనులను వారికి తెలియజేయి. \v 37 వారు వ్యభిచారులు, వారి చేతికి రక్తం అంటింది. వారు విగ్రహాలతో వ్యభిచరించారు; నాకు కన్న బిడ్డలను వారు విగ్రహాలకు ఆహారంగా అర్పించారు. \v 38 వారు నాకు కూడా ఇలా చేశారు: అదే సమయంలో వారు నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు; నా సబ్బాతులను కూడా అపవిత్రం చేశారు. \v 39 వారు తాము పెట్టుకున్న విగ్రహాలకు తమ పిల్లలను అర్పించిన రోజే వారు నా పరిశుద్ధాలయంలో ప్రవేశించి దానిని అపవిత్రం చేశారు. నా నివాసంలో వారు ఈ విధంగానే చేశారు. \p \v 40 “వారు దూర ప్రాంతాల నుండి వచ్చిన పురుషుల కోసం దూతలను కూడా పంపారు. వారు వచ్చినప్పుడు వారి కోసం నీవు స్నానం చేసి కళ్లకు కాటుక పెట్టుకుని నగలు ధరించావు. \v 41 అందమైన మంచం మీద కూర్చుని దాని ఎదురుగా ఉన్న బల్లమీద నా పరిమళద్రవ్యాన్ని ఒలీవల నూనెను పెట్టావు. \p \v 42 “అప్పుడే కోలాహలం చేసే గుంపు ఆమె చుట్టూ వినిపించింది; అల్లరిమూకలోని వారితో పాటు ఎడారి మార్గాన త్రాగుబోతులు వచ్చారు. వారు ఈ అక్కచెల్లెళ్ల చేతులకు కడియాలను తొడిగి వారి తలకు అందమైన కిరీటాలు పెట్టారు. \v 43 వ్యభిచారం చేసి అలసిపోయిన దాని గురించి ఇలా అన్నాను, ‘అది వారితో చేసినట్లే వారు దానితో వ్యభిచారం చేశారు.’ \v 44 వేశ్యతో గడిపినట్లుగా వారు ఆమెతో గడిపారు. అలాగే వేశ్యలైన ఒహోలాతో, ఒహోలీబాతో గడిపారు. \v 45 వీరిద్దరు వ్యభిచారం చేసి హత్యలు చేశారు కాబట్టి నీతిమంతులైన న్యాయాధిపతులు వీరికి తగిన శిక్ష విధిస్తారు. \p \v 46 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: వారి మీదికి నేను అల్లరిమూకను రప్పిస్తాను. శత్రువులు వారిని భయపెట్టి దోచుకుంటారు. \v 47 అల్లరిమూక వారిని రాళ్లు రువ్వి చంపుతుంది. ఖడ్గంతో చంపుతారు. వారి కుమారులు కుమార్తెలను చంపి వారి ఇళ్ళను కాల్చివేస్తారు. \p \v 48 “కాబట్టి స్త్రీలందరూ మిమ్మల్ని అనుకరించకుండా హెచ్చరికగా ఉండేలా నేను దేశంలోని అసభ్య అంతం చేస్తాను. \v 49 మీరు మీ అసభ్య ప్రవర్తనకు శిక్ష అనుభవిస్తారు, విగ్రహారాధన పాపానికి పర్యవసానాలను భరిస్తారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.” \c 24 \s1 వంట కుండగా యెరూషలేము \p \v 1 తొమ్మిదో సంవత్సరం పదవనెల పదవ రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి: \v 2 “మనుష్యకుమారుడా, ఈ తేదీని నమోదు చేయి ఎందుకంటే బబులోను రాజు ఈ రోజే యెరూషలేమును ముట్టడించాడు. \v 3 తిరుగుబాటు చేసే ఈ ప్రజల గురించి ఉపమానరీతిగా ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘ఒక కుండ తెచ్చి దానిలో నీళ్లు పోసి, \q2 దానిని పొయ్యిమీద పెట్టు. \q1 \v 4 తొడ ముక్కలు, జబ్బ ముక్కల వంటి \q2 మంచి ముక్కలు దానిలో వేసి \q1 మంచి ఎముకలతో దానిని నింపు; \q2 \v 5 మందలో శ్రేష్ఠమైన వాటిని తీసుకో! \q1 దానిలోని ఎముకలు బాగా ఉడికేలా \q2 దాని క్రింద కట్టెలతో మంట ఎక్కువగా పెట్టి \q2 వాటిని మరిగించి బాగా ఉడకబెట్టు. \b \m \v 6 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ, \q2 మడ్డి ఉన్న కుండకు శ్రమ, \q2 దాని తుప్పు పోదు. \q1 ఏ వరుసలో వచ్చినా సరే \q2 దానిలో నుండి మాంసాన్ని ముక్క తర్వాత ముక్కగా తీయండి. \b \q1 \v 7 “ ‘అది చిందించిన రక్తం దాని మధ్యనే ఉంది: \q2 మట్టితో కప్పివేయడానికి వీలుగా \q1 అది రక్తాన్ని నేలమీద క్రుమ్మరించకుండ, \q2 వట్టి బండ మీద క్రుమ్మరించింది; \q1 \v 8 ఉగ్రతను రేపి ప్రతీకారం తీసుకోవడానికి \q2 దాని రక్తం కప్పివేయబడకుండ \q2 వట్టి బండ మీద క్రుమ్మరించాను. \b \m \v 9 “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ! \q2 నేను మరి ఎక్కువగా కట్టెలు పేర్చుతాను. \q1 \v 10 కట్టెలు పేర్చి \q2 అగ్ని రాజేయండి. \q1 మసాలాలు కలిపి \q2 మాంసం బాగా ఉడకబెట్టండి; \q2 ఎముకలు పూర్తిగా ఉడకనివ్వండి; \q1 \v 11 తర్వాత దానికున్న మలినం కరిగిపోయి, \q2 మడ్డి పూర్తిగా పోయేలా \q1 ఆ కుండ వేడెక్కి దాని రాగి మెరిసే వరకు \q2 దానిని బొగ్గుల మీద ఉంచండి. \q1 \v 12 అలసిపోయేంత వరకు ప్రయత్నించినా \q2 అగ్నితో కాల్చినా సరే \q2 దాని మడ్డి తొలగిపోలేదు. \p \v 13 “ ‘నీ అతి కామాతురతయే నీకున్న అపవిత్రత. నిన్ను పవిత్రపరచడానికి నేను ప్రయత్నించాను కాని నీవు శుద్ధి కాలేదు కాబట్టి నా ఉగ్రత నీమీద తీర్చుకునే వరకు నీవు పవిత్రం కావు. \b \p \v 14 “ ‘యెహోవానైన నేను మాట ఇచ్చాను. అది నెరవేర్చే సమయం వచ్చింది. నేను వెనక్కి తీసుకోను; నేను జాలిపడను పశ్చాత్తాపపడను. నీ ప్రవర్తనను బట్టి, నీ పనులను బట్టి నీకు శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \s1 యెహెజ్కేలు భార్య మరణం \p \v 15 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 16 “మనుష్యకుమారుడా, ఒక్క దెబ్బతో నీ కళ్లల్లో ఆనందాన్ని నీ నుండి తీసివేయబోతున్నాను. విలపించవద్దు ఏడవవద్దు కన్నీరు కార్చవద్దు. \v 17 చనిపోయినవారి కోసం దుఃఖించకుండ నిశ్శబ్దంగా నిట్టూర్చు. నీ తలపాగాను కట్టుకుని నీ కాళ్లకు చెప్పులు వేసుకో; నీ మీసం గెడ్డం కప్పుకోవద్దు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినవద్దు.” \p \v 18 కాబట్టి నేను ఉదయం ప్రజలతో మాట్లాడాను, సాయంత్రం నా భార్య చనిపోయింది. మరుసటిరోజు ఉదయం నాకు ఆజ్ఞాపించినట్లే నేను చేశాను. \p \v 19 అప్పుడు ప్రజలు నన్ను ఇలా అడిగారు, “నీవు చేస్తున్న వాటినుండి మేము తెలుసుకోవలసిన వాటిని మాకు చెప్పవా?” \p \v 20 అప్పుడు నేను వారితో ఇలా అన్నాను, “యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: \v 21 ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీకు గర్వకారణంగా, మీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేదిగా, మీరు అభిమానించే నా పరిశుద్ధాలయాన్ని నేను అపవిత్రం చేయబోతున్నాను. మీరు వెనుక విడిచిపెట్టిన మీ కుమారులు, కుమార్తెలు కత్తివేటుకు కూలిపోతారు. \v 22 అప్పుడు నేను చేసినట్లే మీరు కూడా చేస్తారు. మీ మీసం గడ్డం కప్పుకోరు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినరు. \v 23 మీ తలపాగాలు మీ తలల మీద నుండి తీయరు మీ చెప్పులు మీ కాళ్లకే ఉంటాయి. మీరు దుఃఖించరు ఏడవరు కానీ మీలో మీరే మూల్గుతూ మీ పాపాల కారణంగా క్రుంగిపోతారు. \v 24 యెహెజ్కేలు నీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిందంతా మీరూ చేస్తారు. ఇది జరిగినప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ” \p \v 25 “మనుష్యకుమారుడా, నేను వారి ఆశ్రయాన్ని, వారి ఆనందాన్ని కీర్తిని, వారి కళ్లకు ఇష్టమైన దానిని, వారి హృదయ ఆశలను అలాగే వారి కుమారులను కుమార్తెలను తీసివేసే రోజు వస్తుంది. \v 26 ఆ రోజున నీకు వార్త చెప్పడానికి ఒకడు తప్పించుకుని నీ దగ్గరకు వస్తాడు. \v 27 అప్పుడు నీవు మౌనంగా ఉండకుండా తప్పించుకుని వచ్చిన వానితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు. నేనే యెహోవానని వారు తెలుసుకోవడానికి ఇలా నీవు వారికి ఒక సూచనగా ఉంటావు.” \c 25 \s1 అమ్మోను గురించి ప్రవచనం \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, అమ్మోనీయుల వైపు నీ ముఖాన్ని త్రిప్పి వారి గురించి ప్రవచించు. \v 3 వారితో ఇలా చెప్పు, ‘అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా పరిశుద్ధాలయం అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలు దేశం పాడైపోతున్నప్పుడు, యూదా వారు బందీలుగా వెళ్తున్నప్పుడు మీరు “ఆహా!” అన్నారు. \v 4 కాబట్టి నేను మిమ్మల్ని తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను. వారు గుడారాలు వేసుకుని మీ మధ్య నివసిస్తారు; వారు మీ పండ్లు తిని మీ పాలు త్రాగుతారు. \v 5 రబ్బా పట్టణాన్ని ఒంటెల శాలగా మారుస్తాను. అమ్మోనీయుల దేశాన్ని గొర్రె దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. \v 6 ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీరు చప్పట్లు కొట్టి కాళ్లతో నేలను తన్ని ఇశ్రాయేలు దేశానికి జరిగిన దానిని గురించి మీ మనస్సులోని దురుద్దేశంతో సంతోషించారు. \v 7 అందుకే నేను మీకు విరోధినై మిమ్మల్ని ప్రజలకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. ఇతర ప్రజల్లో ఉండకుండా నేను మిమ్మల్ని తుడిచివేస్తాను, దేశాల నుండి నిర్మూలిస్తాను. నేను మిమ్మల్ని నాశనం చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ” \s1 మోయాబు గురించి ప్రవచనం \p \v 8 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మోయాబీయులు శేయీరు పట్టణస్థులు, “యూదా వారు కూడా ఇతర జనాల్లాగానే తయారయ్యారు” అన్నారు కాబట్టి, \v 9 మోయాబుకు ఘనతను తెచ్చే పొలిమేర పట్టణాలైన బేత్-యెషిమోతు బయల్-మెయోను కిర్యతాయిములతో మొదలుపెట్టి సరిహద్దు పట్టణాలన్నిటిని \v 10 అమ్మోనీయులతో పాటు తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను, అప్పుడు జనాల్లో అమ్మోనీయులు జ్ఞాపకానికి రారు. \v 11 మోయాబుకు నేను శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” \s1 ఎదోము గురించి ప్రవచనం \p \v 12 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఎదోమీయులు యూదా వారి మీద పగతీర్చుకున్నారు. అలా చేసి వారు దోషులయ్యారు, \v 13 కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఎదోము మీద నా చేయి చాపి మనుష్యులను పశువులను చంపి సమస్తాన్ని నిర్మూలం చేస్తాను. తేమాను పట్టణం నుండి దేదాను వరకు ప్రజలంతా కత్తివేటుకు కూలిపోతారు. \v 14 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము మీద నా పగ తీర్చుకుంటాను. నా కోపం నా ఉగ్రతకు అనుగుణంగా వారు ఎదోముకు చేస్తారు. అప్పుడు నా ఉగ్రత ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.’ ” \s1 ఫిలిష్తీయ గురించి ప్రవచనం \p \v 15 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఫిలిష్తీయులు పగతీర్చుకున్నారు తమ హృదయాల్లో ఉన్న ద్వేషంతో పాత పగలతో యూదాను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. \v 16 కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఫిలిష్తీయుల మీద నేను చేయి చాపి కెరేతీయులను తుడిచివేస్తాను. సముద్రతీరాన నివసించే మిగిలిన వారికి కూడా నాశనం చేస్తాను. \v 17 నా ఉగ్రతతో వారిని శిక్షించి వారి మీద పూర్తిగా పగ తీర్చుకుంటాను. వారి మీద నేను పగ తీర్చుకున్నప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” \c 26 \s1 తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 పదకొండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది: \v 2 “మనుష్యకుమారుడా, యెరూషలేము గురించి తూరు, ‘ఆహా! జనాంగాలకు గుమ్మం విరిగిపోయింది, దాని తలుపులు నా కోసం తెరచుకొని ఉన్నాయి; ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది కాబట్టి నేను వృద్ధి చెందుతాను’ అని చెప్పింది. \v 3 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రంలో అలలు పొంగినట్లు అనేక జనాంగాలను నీ మీదికి రప్పిస్తాను. \v 4 వారు తూరు గోడలు కూల్చివేసి దాని గోపురాలను పడగొడతారు; దాని మీద ఉన్న మట్టిని నేను తుడిచివేసి, వట్టి బండలా మిగిలేలా చేస్తాను. \v 5 సముద్రం దానిని చుట్టుముట్టినప్పుడు అది చేపల వలలు ఆరబెట్టే స్థలంగా మారుతుంది. నేనే మాట ఇచ్చాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అది జనాంగాలకు దోపుడు సొమ్ముగా మారుతుంది, \v 6 పొలంలో ఉన్న దాని కుమార్తెలు ఖడ్గం పాలవుతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. \p \v 7 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఉత్తరం నుండి నేను రాజుల రాజు, బబులోను రాజైన నెబుకద్నెజరును\f + \fr 26:7 \fr*\ft హెబ్రీలో \ft*\fqa నెబుకద్రెజరు \fqa*\ft ఇది \ft*\fqa నెబుకద్నెజరు \fqa*\ft యొక్క మరో రూపం; ఇక్కడ, అలాగే యెహెజ్కేలు యిర్మియాలో తరచుగా వాడబడింది\ft*\f* గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు గొప్ప సైన్యంతో తూరు మీదికి రప్పించబోతున్నాను. \v 8 అతడు ఖడ్గంతో ప్రధాన భూభాగంలో మీ నివాసాలను నాశనం చేస్తాడు; అతడు మీకు వ్యతిరేకంగా ముట్టడి పనులను ఏర్పాటు చేస్తాడు, మీ గోడలకు ముట్టడి దిబ్బలను ఏర్పాటు చేస్తాడు. \v 9 అతడు మీ గోడల మీదికి తన పడగొట్టే యంత్రాలను పంపుతాడు, తన ఆయుధాలతో మీ గోపురాలను కూల్చివేస్తాడు. \v 10 అతనికి ఉన్న గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కమ్ముతుంది. ఒకడు పగిలిన గోడలున్న పట్టణంలోకి ప్రవేశించినట్లు అతడు నీ గుమ్మాల్లోకి వచ్చినప్పుడు గుర్రపురౌతుల నుండి రథచక్రాల నుండి వచ్చే శబ్దానికి నీ గోడలు అదురుతాయి. \v 11 అతడు తన గుర్రాల డెక్కలతో నీ వీధులన్నిటిని అణగద్రొక్కిస్తాడు. కత్తితో నీ ప్రజలను చంపుతాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలిపోతాయి. \v 12 వారు నీ సంపదను దోచుకుంటారు నీ వస్తువులను దొంగిలిస్తారు. వారు నీ గోడలను కూల్చివేసి, నీ విలాసవంతమైన భవనాలను పడగొట్టి, నీ రాళ్లను కలపను సముద్రంలోకి విసిరివేస్తారు. \v 13 నేను నీ సంగీతాన్ని ఆపివేస్తాను. నీ సితార శబ్దం ఇకపై వినపడదు. \v 14 నేను నిన్ను వట్టి బండగా చేస్తాను, నీవు చేపల వలలు పరిచే స్థలం అవుతావు. నీవు ఎప్పటికీ కట్టబడవు, ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 15 “తూరు గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు కూలిపోయినప్పుడు నీలో నుండి వచ్చే గాయపడినవారి కేకలు, నీ మధ్య జరుగుతున్న ఊచకోతను విని తీరప్రాంతాలు వణకవా? \v 16 తీరప్రాంతపు అధికారులందరూ తమ సింహాసనాల మీది నుండి దిగి, వారి వస్త్రాలను, చేతికుట్టుతో చేసిన వస్త్రాలను తీసివేసి, భయంతో నేలపై కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి ఆందోళన చెందుతారు. \v 17 నీ గురించి విలాప గీతం ఎత్తి ఇలా పాడతారు: \q1 “ ‘సముద్ర ప్రజలతో నిండిన గొప్ప పట్టణమా! \q2 నీవెలా నాశనమైపోయావు! \q1 నీవు నీ నివాసులు \q2 సముద్రాల మీద బలవంతులుగా ఉన్నారు, \q1 అక్కడ నివసించిన వారందరిపై \q2 నీవు నీ భయాన్ని ఉంచావు. \q1 \v 18 ఇప్పుడు నీవు కూలిపోయిన రోజున \q2 తీరప్రాంతాలు కంపిస్తున్నాయి. \q1 నీవు పతనాన్ని చూసి \q2 సముద్ర ద్వీపాలు భయపడుతున్నాయి.’ \p \v 19 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నివాసులు లేని పట్టణాల్లా నిన్ను నేను నిర్మానుష్యంగా మార్చినప్పుడు, నిన్ను మహా సముద్రం ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాలను రప్పిస్తాను. నిన్ను మహా సముద్రం నిన్ను ముంచివేస్తున్నప్పుడు, \v 20 చాలా కాలం క్రితం పాతాళంలోకి దిగి వెళ్లిన వారి దగ్గరకు నేను నిన్ను పడవేస్తాను. నేను నిన్ను భూమి క్రింద ఉన్న స్థలంలో ప్రాచీన శిథిలాల మధ్య పాతాళంలోకి దిగి వెళ్లిన వారితో నివసించేలా చేస్తాను, అప్పుడు నీవు సజీవులు నివసించే చోటికి తిరిగి రావు. \v 21 నేను నీకు భయంకరమైన ముగింపు ఇస్తాను, నీవు ఇకపై ఉండవు. నీ గురించి ఎంత వెదికినా నీవు ఎప్పటికీ కనిపించవు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” \c 27 \s1 తూరు గురించి విలాపం \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు: \v 3 సముద్ర ద్వారం దగ్గర ఉన్న తూరుతో చెప్పు, అనేక తీర ప్రాంతాల ప్రజలకు వ్యాపారిగా ఉన్న తూరుతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘తూరూ, నీవంటావు, \q2 “అందంలో నేను పరిపూర్ణమైన దానిని.” \q1 \v 4 నీ సరిహద్దులు సముద్రం మధ్యలో ఉన్నాయి; \q2 నీ భవన నిర్మాణకులు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు. \q1 \v 5 శెనీరు\f + \fr 27:5 \fr*\ft అంటే, హెర్మోను పర్వతం\ft*\f* దేశపు సరళ పలకలతో \q2 వారు నీ ఓడలు తయారుచేస్తారు; \q1 లెబానోను దేవదారు చెక్కతో \q2 వారు ఓడ స్తంభాలు తయారుచేస్తారు. \q1 \v 6 బాషాను సింధూర చెక్కతో \q2 వారు నీ తెడ్లు తయారుచేస్తారు. \q1 కుప్ర తీరం నుండి తెచ్చిన తమాల కలపతో \q2 వారు నీకు పీటలు తయారుచేసి ఏనుగు దంతంతో అలంకరించారు. \q1 \v 7 ఈజిప్టు నుండి వచ్చిన కుట్టుపని చేసిన సన్నని నార నీ తెరచాపగా \q2 జెండాగా పని చేశాయి; \q1 ఎలీషా తీరాల నుండి తెచ్చిన \q2 నీలం ఊదా రంగుల బట్ట నీ అంతస్తుల పైకప్పులు. \q1 \v 8 తూరూ, సీదోను వారు అర్వాదు వారు నీ తెడ్లు వేసేవారు; \q2 నీ మనుష్యుల్లో నిపుణులైనవారు నీ నావికులు. \q1 \v 9 నీ ఓడను బాగుచేయడానికి \q2 గెబాలుకు\f + \fr 27:9 \fr*\ft లేదా \ft*\fqa బిబ్లోసు\fqa*\f* చెందిన పెద్దలు, అనుభవజ్ఞులైన చేతి పనివారు ఉన్నారు. \q1 సముద్రంలో నీ వస్తువులు కొనడానికి, \q2 సముద్రపు నావికుల ఓడలన్నీ నీ రేవులో ఉన్నాయి. \b \q1 \v 10 “ ‘పర్షియా మనుష్యులారా, లిడియా, పూతుకు చెందినవారు \q2 నీ సైన్యంలో సైనికులుగా పని చేశారు. \q1 వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీసి, \q2 నీకు వైభవాన్ని తెస్తున్నారు. \q1 \v 11 అర్వాదు వారు, హెలెకు వారు \q2 అన్నివైపులా నీ గోడలకు కాపలా కాసారు; \q2 గమ్మాదీయులు నీ గోపురాలలో ఉన్నారు. \q1 వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీశారు; \q2 వారు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు. \p \v 12 “ ‘నీ గొప్ప సంపదను బట్టి తర్షీషు వారు నీతో వ్యాపారం చేశారు; వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి మీ సరుకు తీసుకున్నారు. \p \v 13 “ ‘గ్రీసు, తుబాలు, మెషెకు వారు నీతో వ్యాపారం చేశారు; మనుష్యులను, ఇత్తడి వస్తువులను ఇచ్చి మీ వస్తువులను కొన్నారు. \p \v 14 “ ‘బేత్ తోగర్మా వారు మీ సరుకు కోసం రథ గుర్రాలు, అశ్వికదళ గుర్రాలు కంచరగాడిదలను ఇచ్చారు. \p \v 15 “ ‘దేదాను\f + \fr 27:15 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa రోదెశు\fqa*\f* వారు నీతో వ్యాపారం చేశారు, చాలా తీర ప్రాంతాల ప్రజలు నీ సరుకు కొన్నారు; వారు మీకు దంతపు దంతాలు, తునికి కలప ఇచ్చారు. \p \v 16 “ ‘నీ దగ్గర ఉన్న అనేక వస్తువుల కారణంగా అరామీయులు\f + \fr 27:16 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa ఎదోమీయులు\fqa*\f* నీతో వ్యాపారం చేశారు. వారు పచ్చరాళ్లను, ఊదా రంగు నూలుతో కుట్టుపని చేసిన వస్త్రాలు, సన్నని నారబట్టలు, కెంపులు రత్నాలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు. \p \v 17 “ ‘యూదా వారు, ఇశ్రాయేలీయులు నీతో వ్యాపారం చేశారు. వారు మిన్నీతు గోధుమలు, మిఠాయిలు, తేనె, ఒలీవనూనె ఇచ్చి నీ సరుకు కొన్నారు. \p \v 18 “ ‘దమస్కు నీ దగ్గర అనేక వస్తువులు విలువైన సరుకు ఉన్న కారణంగా నీతో వ్యాపారం చేసింది. వారు హెల్బోను నుండి ద్రాక్షరసం, జహరు నుండి ఉన్ని, \v 19 వారు ఇజాలు\f + \fr 27:19 \fr*\ft హెబ్రీలో \ft*\fq ఇజాలు \fq*\ft నుండి \ft*\fqa వేదాను \fqa*\ft యవాను \ft*\ft అని ప్రస్తావించబడింది.\ft*\f* నుండి ద్రాక్షరసం పీపాలు ఇచ్చి, అచ్చుపోసిన ఇనుము, లవంగపట్ట, వోమ ఇచ్చి మీ సరుకులు కొన్నారు. \p \v 20 “ ‘దేదాను వారు నీతో జీను దుప్పట్ల వ్యాపారం చేశారు. \p \v 21 “ ‘అరేబియా వారు కేదారు యువరాజులందరూ నీతో వ్యాపారం చేశారు. గొర్రెపిల్లలు పొట్టేళ్లు మేకలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు. \p \v 22 “ ‘షేబ రాయమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. అన్ని రకాల సుగంధద్రవ్యాలు విలువైన రాళ్లు బంగారం ఇచ్చి నీ వస్తువులు కొన్నారు. \p \v 23 “ ‘హారాను వారు కన్నెహు వారు ఏదెను వారు షేబ వర్తకులు అష్షూరు కిల్మదు వర్తకులు నీతో వ్యాపారం చేశారు. \v 24 వారు వ్యాపారం చేసి అందమైన వస్త్రాలు, నీలం బట్టలు, కుట్టుపని చేసిన బట్టలు, తివాచీలు బాగా పేనిన గట్టి త్రాళ్లు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు. \q1 \v 25 “ ‘తర్షీషు ఓడలు \q2 నీ సరుకులు మోసుకెళ్లేవి. \q1 నీవు విస్తారమైన సరుకులతో \q2 సముద్రం మీద కూర్చున్నావు. \q1 \v 26 నీ తెడ్లు నడిపేవారు \q2 మహా సముద్రంలోకి నిన్ను తీసుకెళ్లారు. \q1 కాని తూర్పు గాలి వీచి సముద్రం మధ్యలో \q2 నిన్ను నాశనం చేస్తుంది. \q1 \v 27 అప్పుడు నీ సంపద, సరుకులు వస్తువులు, \q2 నీ నావికులు, ఓడ నాయకులు నీ ఓడలు బాగుచేసేవారు, \q1 నీ వ్యాపారులు నీ సైనికులందరూ, \q2 నీతో ఉన్న ప్రతి ఒక్కరూ \q1 నీ ఓడ ధ్వంసమైన రోజున \q2 సముద్రం మధ్యలో మునిగిపోతారు. \q1 \v 28 నీ నావికులు వేసే కేకలకు \q2 తీరప్రాంతాలు కంపిస్తాయి. \q1 \v 29 తెడ్డు నడిపే వారందరూ \q2 నావికులు, ఓడ నాయకులు \q1 తమ ఓడల మీద నుండి దిగివచ్చి \q2 తీరాన నిలబడతారు. \q1 \v 30 వారంతా గొంతెత్తి \q2 నీ గురించి ఏడుస్తారు; \q1 తమ తలలపై బూడిద చల్లుకుని \q2 బూడిదలో దొర్లుతారు. \q1 \v 31 నీ గురించి వారు తమ తలలు గొరిగించుకుని \q2 గోనెపట్టలు కట్టుకుని \q1 తీవ్రమైన దుఃఖంతో \q2 నీ గురించి ఏడుస్తారు; \q1 \v 32 వారు నీ గురించి ఏడుస్తూ \q2 విలాప గీతం పాడతారు: \q1 “సముద్రం మధ్యలో మునిగిపోయిన తూరు పట్టణమా! \q2 నీకు సాటియైన పట్టణమేదీ?” \q1 \v 33 సముద్రం మీద నీ వస్తువులు తీసుకెళ్తూ, \q2 అనేకమందిని తృప్తిపరిచావు; \q1 నీ విస్తారమైన సంపదతో నీ వ్యాపార వస్తువులతో \q2 భూరాజులను ఐశ్వర్యవంతులను చేశావు. \q1 \v 34 ఇప్పుడు లోతైన జలాల్లో మునిగి \q2 సముద్రంలో నాశనమయ్యావు; \q1 నీ వస్తువులు నీ సహచరులు \q2 నీతో పాటే మునిగిపోయారు. \q1 \v 35 తీరప్రాంతాలలో ఉన్నవారంతా \q2 నీ గురించి దిగులుపడతారు; \q1 వారి రాజులు వణకుతారు. \q2 వారి ముఖాలు చిన్నబోయాయి. \q1 \v 36 వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు. \q2 నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు, \q2 పూర్తిగా నాశనం అవుతావు.’ ” \c 28 \s1 తూరు రాజుకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘గర్వించిన హృదయంతో నీవు, \q2 “నేనొక దేవుడిని; \q1 సముద్రం మధ్యలో \q2 ఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు. \q1 దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు, \q2 కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు. \q1 \v 3 నీవు దానియేలు\f + \fr 28:3 \fr*\ft లేదా \ft*\fqa దానియేలు, \fqa*\ft ప్రాచీన సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి\ft*\f* కన్నా జ్ఞానివా? \q2 నీకు తెలియని రహస్యం ఏదీ లేదా? \q1 \v 4 నీకున్న జ్ఞానంతో వివేకంతో \q2 నీకోసం సంపద సంపాదించుకుని \q1 నీ ఖజానాలో \q2 వెండి బంగారాలను పోగు చేసుకున్నావు. \q1 \v 5 వ్యాపారంలో నీకున్న గొప్ప నైపుణ్యంతో \q2 నీ సంపదను వృద్ధి చేసుకున్నావు, \q1 నీ సంపదను బట్టి \q2 నీవు హృదయంలో గర్వించావు. \p \v 6 “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: \q1 “ ‘దేవునిలా నీవు జ్ఞానివి \q2 అనుకుంటున్నావు కాబట్టి, \q1 \v 7 నేను నీమీదికి విదేశీయులను, \q2 అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను; \q1 నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి, \q2 నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు. \q1 \v 8 వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు. \q2 సముద్రం మధ్యలో \q2 భయంకరంగా చనిపోతావు. \q1 \v 9 నిన్ను చంపేవారి ఎదుట \q2 “నేను దేవుడిని” అని చెప్తావా? \q1 నిన్ను చంపేవారి చేతుల్లో \q2 నీవు మనిషివే కాని దేవుడవు కావు. \q1 \v 10 సున్నతిలేనివారు చనిపోయినట్లు \q2 నీవు విదేశీయుల చేతిలో చస్తావు \m అని చెప్పింది నేనే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \b \p \v 11 యెహోవా వాక్కు నాకు వచ్చి: \v 12 “మనుష్యకుమారుడా, తూరు రాజు గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘నీవు పరిపూర్ణతకు ముద్రగా, \q2 జ్ఞానంతో నిండి ఎంతో అందంగా ఉండేవాడివి. \q1 \v 13 దేవుని తోటయైన, \q2 ఏదెనులో నీవు ఉండేవాడివి; \q1 ప్రతి ప్రశస్తమైన రాయితో నీవు అలంకరించబడ్డావు. \q2 మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, \q2 కెంపు, సులిమాని, మరకతం, \q2 నీలమణి, పద్మరాగం, \q1 అన్ని బంగారంతో నీకోసం తయారుచేయబడ్డాయి; \q2 నీవు సృజించబడిన రోజున అవి నీకోసం సిద్ధపరచబడ్డాయి. \q1 \v 14 అభిషేకం పొందిన కావలి కెరూబులా \q2 నేను నిన్ను నియమించాను \q1 దేవుని పరిశుద్ధ పర్వతం మీద నీవున్నావు. \q2 నీవు కాలుతున్న రాళ్ల మధ్య నడిచావు. \q1 \v 15 నీవు సృష్టించబడిన రోజు నుండి \q2 నీలో దుష్టత్వం కనిపించిన రోజు వరకు \q2 నీ ప్రవర్తన నిందారహితంగా ఉంది. \q1 \v 16 అయితే నీ వ్యాపారం విస్తరించి \q2 నీవు హింసతో నిండిపోయి \q2 పాపం చేశావు. \q1 కాబట్టి నేను నిన్ను అపవిత్రపరచి దేవుని పర్వతం మీద ఉండకుండా వెళ్లగొట్టాను, \q2 కావలి కెరూబుల కాలుతున్న రాళ్ల మధ్య \q2 నీవిక ఉండకుండా నిన్ను నాశనం చేస్తాను. \q1 \v 17 నీ సౌందర్యం చూసుకుని \q2 నీ హృదయం గర్వించింది \q1 నీ వైభవం కారణంగా \q2 నీ జ్ఞానం కలుషితమయ్యింది, \q1 కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను. \q2 రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను. \q1 \v 18 నీ అన్యాయమైన వ్యాపారంతో నీవు చేసిన అనేక పాపాల వలన, \q2 నీ పరిశుద్ధాలయాలను అపవిత్రం చేశావు. \q1 కాబట్టి నీలో అగ్ని పుట్టిస్తాను. \q2 అది నిన్ను కాల్చివేస్తుంది, \q1 చూస్తున్న వారందరి ఎదుట \q2 నేను నిన్ను నేల మీద బూడిదగా చేస్తాను. \q1 \v 19 నిన్ను ఎరిగిన జనులంతా నిన్ను బట్టి వణికిపోతారు; \q2 నీవు భయానక ముగింపుకు వచ్చావు \q2 నీవు పూర్తిగా నాశనమైపోతావు.’ ” \s1 సీదోనుకు వ్యతిరేకం ప్రవచనం \p \v 20 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 21 “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు త్రిప్పుకుని దాని గురించి ప్రవచించి ఇలా చెప్పు: \v 22 ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: \q1 “ ‘సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, \q2 నీ మధ్య నేను ఘనత పొందుతాను. \q1 నేను నీకు శిక్ష విధించి \q2 నీలో నా పరిశుద్ధతను కనుపరిచినప్పుడు \q2 నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. \q1 \v 23 పట్టణం మీదికి తెగులు పంపించి \q2 నీ వీధుల్లో రక్తం పారేలా చేస్తాను. \q1 అన్ని వైపుల నుండి నీ మీదికి వచ్చే \q2 కత్తివేటుకు వారు చనిపోతారు. \q1 అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. \p \v 24 “ ‘ఇశ్రాయేలీయుల పొరుగువారు ఇకపై గుచ్చుకుని బాధించే కంపలుగా పదునైన ముళ్ళుగా ఉండరు. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు. \p \v 25 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ప్రజల్లో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చినప్పుడు వారి ద్వారా నేను ఆ ప్రజల ఎదుట పరిశుద్ధుడనని రుజువవుతాను. నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన వారి దేశంలో వారు నివసిస్తారు. \v 26 అందులో వారు నిశ్చింతగా నివసించి ఇల్లు కట్టుకుని ద్రాక్షతోటలు నాటతారు. వారిని హింసించిన వారి పొరుగువారందరిని నేను శిక్షించిన తర్వాత వారు నిర్భయంగా నివసిస్తారు. అప్పుడు నేనే తమ దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” \c 29 \s1 ఈజిప్టుపై దేవుని తీర్పు \s2 ఫరో మీద తీర్పు \p \v 1 పదవ సంవత్సరం పదవనెల పన్నెండవ రోజు యెహోవా వాక్కు నాకు వచ్చి: \v 2 “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని ఈజిప్టు రాజైన ఫరోవైపు త్రిప్పి అతని గురించి ఈజిప్టు దేశమంతటి గురించి ప్రవచించి ఇలా చెప్పు: \v 3 ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘ఈజిప్టు రాజైన ఫరో, నైలు నదిలో పడుకుని ఉన్న ఘటసర్పమా, \q2 నేను నీకు విరోధిని. \q1 “నైలు నది నాదే, \q2 నేనే దాన్ని చేశానని నీవు అంటావు.” \q1 \v 4 కాని నేను నీ దవడలకు గాలాలు తగిలించి, \q2 నీ నదులలో ఉన్న చేపలు నీ పొలుసులకు అంటుకుపోయేలా చేస్తాను. \q1 నీ పొలుసులకు అంటుకున్న చేపలతో పాటు \q2 నైలు నదిలో నుండి నిన్ను బయటకు లాగుతాను. \q1 \v 5 నిన్ను నీ నదులలోని చేపలన్నిటిని \q2 నేను అరణ్యంలో విడిచిపెడతాను. \q1 నీవు నేల మీద పడతావు \q2 నిన్ను ఎత్తేవారు గాని, తీసేవారు గాని ఉండరు. \q1 అడవి మృగాలకు ఆకాశపక్షులకు \q2 నిన్ను ఆహారంగా ఇస్తాను. \m \v 6 అప్పుడు నేనే యెహోవానని ఈజిప్టు నివాసులందరూ తెలుసుకుంటారు. \b \p “ ‘ఈజిప్టు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లల్లాంటి చేతికర్ర అయ్యింది. \v 7 వారు నిన్ను చేతితో పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి భుజాలలో గుచ్చుకున్నావు; వారు నీ మీద ఆనుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవడానికి కారణమయ్యావు. \p \v 8 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నీ మీదికి కత్తిని రప్పిస్తాను. అది మనుష్యులను పశువులను చంపుతుంది. \v 9 ఈజిప్టు దేశం నిర్మానుష్యమై పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. \p “ ‘నైలు నది నాది నేనే దానిని చేశానని నీవు అన్నావు కాబట్టి, \v 10 నేను నీకు నీ నదికి విరోధిని అయ్యాను. ఈజిప్టు దేశాన్ని మిగ్దోలు నుండి సైనే వరకు కూషు\f + \fr 29:10 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం\ft*\f* సరిహద్దు వరకు పూర్తిగా పాడుచేసి ఎడారిగా చేస్తాను. \v 11 దానిలో మనుష్యులు నడవరు పశువులు తిరగరు. నలభై సంవత్సరాలు దానిలో ఎవరూ నివసించరు. \v 12 నిర్మానుష్యమైన దేశాల మధ్య ఈజిప్టు దేశం పాడైపోతుంది. శిథిలమై పోయిన పట్టణాల మధ్య దాని పట్టణాలు నలభై సంవత్సరాలు పాడైపోయి ఉంటాయి. ఈజిప్టువారిని ఇతర ప్రజలమధ్య చెదరగొడతాను. వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. \p \v 13 “ ‘అయినా ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఇతర ప్రజలమధ్య చెదరిపోయిన ఈజిప్టువారిని నేను సమకూరుస్తాను. \v 14 బందీ నుండి వారిని తీసుకువచ్చి దక్షిణ ఈజిప్టులోని పత్రూసు అనేవారి పూర్వికుల దేశానికి వారిని రప్పిస్తాను. అక్కడ వారు ఒక అల్పమైన రాజ్యంగా ఏర్పడతారు. \v 15 రాజ్యాలన్నిటిలో అది అల్పమైన రాజ్యంగా ఉంటుంది. వారు ఇకపై ఇతర రాజ్యాల మీద ఆధిపత్యం చెలాయించకుండ నేను వారిని అణచివేస్తాను. \v 16 ఇశ్రాయేలీయులకు ధైర్యం కలిగించేదిగా ఈజిప్టు ఉండదు కాని సహాయం కోసం ఈజిప్టు వైపు తిరిగి తాము చేసిన పాపాన్ని ఇశ్రాయేలీయులు గుర్తుచేసుకుంటారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” \s2 నెబుకద్నెజరు ప్రతిఫలం \p \v 17 ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: \v 18 “మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు. \v 19 కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని తీసుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లగొడతాడు. అదే అతని సైన్యానికి జీతం అవుతుంది. \v 20 అతడు అతని సైన్యం నా కోసమే శ్రమించారు కాబట్టి అతడు చేసిన దానికి ప్రతిఫలంగా బహుమానంగా ఈజిప్టు దేశాన్ని అతనికి అప్పగించాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \p \v 21 “ఆ రోజున నేను ఇశ్రాయేలీయుల కొమ్ము\f + \fr 29:21 \fr*\fq కొమ్ము \fq*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తుంది\ft*\f* చిగిర్చేలా చేస్తాను. వారి మధ్య మాట్లాడటానికి నీకు ధైర్యాన్ని ఇస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.” \c 30 \s2 ఈజిప్టు గురించి విలాప గీతం \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘రోదిస్తూ అనండి: \q2 “అయ్యో, శ్రమ దినం వచ్చిందే!” \q1 \v 3 ఎందుకంటే ఆ రోజు వచ్చేసింది, \q2 యెహోవా దినం సమీపించింది, \q1 మబ్బులు కమ్ముకునే రోజు, \q2 జనాంగాలు శిక్షించబడే రోజు. \q1 \v 4 ఈజిప్టు దేశం మీదికి ఖడ్గం దూసుకువస్తుంది, \q2 కూషు\f + \fr 30:4 \fr*\ft అంటే, నైలు ఉపరితల ప్రాంతం; \+xt 5|link-href="EZK 30:5"\+xt*, \+xt 9|link-href="EZK 30:9"\+xt* వచనాల్లో కూడా.\ft*\f* మీదికి వేదన వస్తుంది. \q1 ఈజిప్టులో హతులైనవారు పడిపోతుంటే, \q2 దాని సంపదను తీసుకెళ్లిపోతారు, \q2 దాని పునాదులు కూల్చివేయబడతాయి. \m \v 5 కూషు వారు, లిబియా వారు (పూతు వారు), లిడియా వారు, అరేబియా అంతా, కూబు వారు, ఇంకా నిబంధన దేశపు ప్రజలు ఈజిప్టుతో పాటు ఖడ్గానికి కూలిపోతారు. \p \v 6 “ ‘యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘ఈజిప్టు సహాయకులు కూలిపోతారు, \q2 దాని బల గర్వం అణిగిపోతుంది. \q1 మిగ్దోలు నుండి సైనే వరకు ప్రజలు \q2 దాని లోపలే ఉన్న ఖడ్గానికి కూలిపోతారు. \q2 అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 7 పాడైపోయిన దేశాల మధ్య \q2 ఈజిప్టువారు దిక్కులేని వారవుతారు. \q1 శిథిలమైన పట్టణాల మధ్య \q2 వారి పట్టణాలు పడి ఉంటాయి. \q1 \v 8 ఈజిప్టు దేశంలో అగ్ని రగిలించబడి \q2 దాని సహాయకులంతా నలిపివేయబడినప్పుడు \q2 నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. \p \v 9 “ ‘ఆ రోజున దూతలు నా దగ్గర నుండి ఓడలలో బయలుదేరి నిర్భయంగా ఉన్న కూషును భయపెడతారు. ఈజిప్టుకు తీర్పు తీర్చబడిన రోజున వారికెంతో భయాందోళనలు కలుగుతాయి. అది తప్పనిసరిగా వస్తుంది. \b \p \v 10 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: \q1 “ ‘బబులోను రాజైన నెబుకద్నెజరుచేత నేను \q2 ఈజిప్టువారి అల్లరిమూకలను అంతం చేస్తాను. \q1 \v 11 ప్రజల్లో అతి క్రూరులైన తన సైన్యాన్ని తీసుకుని \q2 ఆ దేశాన్ని నాశనం చెయ్యడానికి అతడు వస్తాడు. \q1 వారు ఈజిప్టు వారిపై తమ ఖడ్గాలు దూసి \q2 దేశమంతా శవాలతో నింపుతారు. \q1 \v 12 నైలు నదిని ఎండిపోయేలా చేసి \q2 ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మేస్తాను. \q1 విదేశీయులచేత నేను \q2 ఆ దేశాన్ని అందులోని సమస్తాన్ని పాడుచేస్తాను. \m యెహోవానైన నేనే మాట ఇచ్చాను. \b \p \v 13 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: \q1 “ ‘విగ్రహాలను నాశనం చేసి \q2 మెంఫిసులో ఒక్క విగ్రహం కూడా మిగలకుండా చేస్తాను. \q1 ఈజిప్టు దేశంలో ఒక్క యువరాజు కూడా ఉండడు, \q2 ఆ దేశమంతా భయం పుట్టిస్తాను. \q1 \v 14 పత్రూసు\f + \fr 30:14 \fr*\ft అంటే \ft*\fqa ఎగువ ఈజిప్టు\fqa*\f* పాడుచేస్తాను, \q2 సోయనులో అగ్ని పుట్టిస్తాను \q2 తేబేసుకు శిక్ష విధిస్తాను. \q1 \v 15 ఈజిప్టుకు కోటయైన \q2 సీను మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. \q2 తేబేసు అల్లరిమూకలను నిర్మూలం చేస్తాను. \q1 \v 16 ఈజిప్టు దేశంలో మంట పుట్టిస్తాను. \q2 సీను వేదనతో మెలికలు తిరుగుతుంది. \q1 తేబేసు తుఫాను తాకిడికి చిన్నాభిన్నం అవుతుంది; \q2 మెంఫిసు నిరంతరం బాధలో ఉంటుంది. \q1 \v 17 హెలియోపొలిస్,\f + \fr 30:17 \fr*\ft అంటే, \ft*\fqa ఓను\fqa*\f* పీ-బెసెతు\f + \fr 30:17 \fr*\ft అంటే, \ft*\fqa బుబాస్టిస్\fqa*\f* యువకులు \q2 కత్తివేటుకు కూలిపోతారు, \q2 ఆ పట్టణస్థులు బందీలవుతారు. \q1 \v 18 ఈజిప్టు కాడిని నేను విరిచినప్పుడు \q2 తహ్పన్హేసులో పగలే చీకటి కమ్ముతుంది; \q2 దాని బల గర్వం అణచివేయబడుతుంది. \q1 దానిని మబ్బులు క్రమ్ముతాయి \q2 దాని కుమార్తెలు బందీగా వెళ్తారు. \q1 \v 19 కాబట్టి నేను ఈజిప్టువారికి శిక్ష విధిస్తాను. \q2 అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” \s2 విరిగిన ఫరో చేతులు \p \v 20 పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: \v 21 “మనుష్యకుమారుడా, నేను ఈజిప్టు రాజైన ఫరో చేతిని విరగ కొట్టాను. అది బాగవ్వడానికి ఎవరూ దానికి కట్టు కట్టరు, అది కత్తి పట్టుకోడానికి కావలసినంత బలంగా మారడానికి బద్దపెట్టి కట్టరు. \v 22 కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని అయ్యాను. బాగా ఉన్న చేతిని విరిగిపోయిన చేతిని రెండింటిని నేను విరగ్గొట్టి అతని చేతిలో నుండి కత్తి పడిపోయేలా చేస్తాను. \v 23 ఈజిప్టువారిని ఇతర జనాంగాల్లోకి చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. \v 24 నేను బబులోను రాజు చేతులను బలపరచి నా ఖడ్గాన్ని అతని చేతికి అందిస్తాను. నేను ఫరో చేతులను విరగ్గొట్టినప్పుడు బబులోను రాజు ఎదుట చావు దెబ్బ తిన్నవానిలా అతడు మూల్గుతాడు. \v 25 నేను బబులోను రాజు చేతులను బలపరుస్తాను, కాని ఫరో చేతులు చచ్చుబడిపోతాయి. ఈజిప్టు దేశం మీద ఆడించడానికి నేను నా ఖడ్గాన్ని బబులోను రాజు చేతికి ఇచ్చినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. \v 26 ఈజిప్టువారిని ఇతర ప్రజల్లో చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.” \c 31 \s2 నరికివేయబడిన లెబానోను దేవదారులా ఫరో \p \v 1 పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి తేది యెహోవా వాక్కు నాకు వచ్చి: \v 2 “మనుష్యకుమారుడా, నీవు ఈజిప్టు రాజైన ఫరోతో అతని పరివారంతో ఇలా చెప్పు: \q1 “ ‘ఘనతలో నీకు సాటి ఎవరు? \q1 \v 3 అష్షూరును చూడు, ఒకప్పుడు లెబానోను దేవదారులా, \q2 అందమైన కొమ్మలతో అడవిలా ఉండేది; \q1 దాని చిటారు కొమ్మ \q2 మిగతా చెట్ల కన్నా ఎత్తుగా ఉండేది. \q1 \v 4 సమృద్ధియైన జలాలు దానిని పోషించాయి, \q2 లోతైన నీటి ఊటలు దానిని ఎత్తుగా పెరిగేలా చేశాయి; \q1 వాటి ప్రవాహాలు \q2 దాని మొదలు చుట్టూ ప్రవహించాయి, \q1 పొలంలో ఉన్న చెట్లన్నిటికి \q2 దాని కాలువలు నీరు అందించాయి. \q1 \v 5 కాబట్టి పొలం లోని చెట్లన్నిటి కన్నా \q2 ఆ చెట్టు ఎత్తుగా ఎదిగింది; \q1 నీరు సమృద్ధిగా ఉన్నందున, \q2 దాని కొమ్మలు విస్తరించి, \q2 పెద్ద శాఖలుగా ఎదిగాయి. \q1 \v 6 ఆకాశ పక్షులన్నీ \q2 దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి, \q1 అడవి జంతువులన్నీ \q2 దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టాయి; \q1 గొప్ప జనాంగాలన్నీ \q2 దాని నీడలో నివసించాయి. \q1 \v 7 నీరు సమృద్ధిగా ఉన్న చోటికి \q2 దాని వేర్లు వ్యాపించాయి, \q1 కాబట్టి అది విస్తరించిన కొమ్మలతో \q2 ఎంతో అందంగా ఉంది. \q1 \v 8 దేవుని తోటలో దేవదారు వృక్షాలు కూడా \q2 దానితో పోటీపడలేకపోయాయి, \q1 సరళ వృక్షాలు \q2 దాని కొమ్మలతో సమానం కాలేవు, \q1 అక్షోట వృక్షాల కొమ్మలు \q2 దాని కొమ్మలతో పోల్చబడలేవు, \q1 దానికి ఉన్నంత అందం \q2 దేవుని తోటలో ఉన్న ఏ చెట్టుకు లేదు. \q1 \v 9 విస్తారమైన కొమ్మలతో \q2 నేను దానిని అందంగా తయారుచేశాను, \q1 దేవుని తోటయైన ఏదెను లోని \q2 చెట్లన్నీ దానిని చూసి అసూయపడేలా చేశాను. \p \v 10 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మహా దేవదారు చెట్టు మిగిలిన చెట్ల కన్నా ఎత్తుగా ఉంది కాబట్టి అది గర్వపడింది. \v 11 కాబట్టి దాని దుర్మార్గానికి తగినట్టుగా నేను దానిని దేశాల అధినేత చేతులకు అప్పగించాను. నేను దానిని విసిరివేశాను, \v 12 విదేశీ జాతులలో క్రూరులు దాన్ని నరికి నేల మీద వదిలేశారు. కొండల్లో, లోయల్లో దాని కొమ్మలు పడి ఉన్నాయి; భూమిమీది వాగులన్నిటిలో దాని కొమ్మలు విరిగిపడ్డాయి. భూమి మీద ఉన్న జాతులన్ని దాని నీడ నుండి బయటకు వచ్చి దానిని వదిలేశాయి. \v 13 కూలిపోయిన చెట్టు మీద ఆకాశ పక్షులన్నీ వాలాయి, కొమ్మల మధ్య అడవి జంతువులన్నీ నివసించాయి. \v 14 కాబట్టి నీటి ప్రక్కన ఉన్న ఏ చెట్టు వాటి చిటారు కొమ్మలను గుబురుగా పెంచుకుని గర్వించకూడదు. నీరు సమృద్ధిగా ఉన్న ఏ ఇతర చెట్లు అంత ఎత్తుకు ఎప్పటికీ ఎదగకూడదు; వాటన్నిటి గమ్యం మరణమే, భూమి దిగువన పాతాళంలోనికి దిగిపోయే సాధారణ మనుష్యుల్లా అవి చనిపోతాయి. \p \v 15 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అది పాతాళానికి రప్పించబడిన రోజున నేను దాని గురించి దుఃఖిస్తూ లోతైన ఊటలతో దానిని కప్పివేసాను; దాని ప్రవాహాలను ఆపి, విస్తారమైన జలాలను అరికట్టాను. దాని కోసం నేను లెబానోను పర్వతాన్ని గాఢాంధకారం కమ్మేలా చేశాను, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి. \v 16 పాతాళంలోకి దిగే వారితో ఉండడానికి నేను దానిని పాతాళంలోకి దించినప్పుడు, దాని పతనం వల్ల వచ్చే శబ్దానికి నేను దేశాలు వణికిపోయేలా చేశాను. అప్పుడు ఏదెను చెట్లన్నీ, లెబానోనులో ఉత్తమమైనవి, మంచివి, సమృద్ధిగా నీరున్న చెట్లు, భూమి దిగువన ఓదార్పు పొందాయి. \v 17 వారు కూడా గొప్ప దేవదారులా, ఖడ్గంతో చంపబడినవారి దగ్గరకు, జాతుల మధ్య దాని నీడలో నివసించిన సాయుధ పురుషులతో పాటు పాతాళానికి దిగారు. \p \v 18 “ ‘వైభవంలో ఘనతలో ఏదెను తోటలో ఉన్న ఏ చెట్లు నీతో పోల్చబడగలవు? అయినప్పటికీ, నీవు కూడా ఏదెను చెట్లతో పాటు భూమి దిగువకు రప్పించబడతావు; సున్నతిలేనివారి మధ్య, ఖడ్గం వలన చచ్చినవారితో నీవు కూడ పడి ఉంటావు. \p “ ‘ఫరోకు, అతని పరివారానికి ఇలా జరుగుతుంది, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \c 32 \s2 ఫరో గురించి విలాప గీతం \p \v 1 పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల మొదటి రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: \q1 “ ‘దేశాల మధ్య సింహంవంటివాడవు; \q2 నీవు నీ ప్రవాహంలో కొట్టుకుపోతూ, \q1 నీ పాదాలతో నీటిని చిమ్ముతూ, \q2 ప్రవాహాలను బురదమయం చేస్తూ, \q2 సముద్రాల్లో ఉండే భీకరమైన సముద్ర జీవిలాంటి వాడవు. \p \v 3 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘గుంపులు గుంపులుగా ప్రజలు చేరినప్పుడు \q2 నేను నీ మీద వల వేస్తాను; \q2 నా వలలో చిక్కిన నిన్ను వారంతా నీటిలో నుండి బయటకు లాగుతారు. \q1 \v 4 నేను నిన్ను నేల మీద పడవేసి \q2 బయట పొలంలో విసిరివేస్తాను. \q1 ఆకాశ పక్షులను నీ మీద వ్రాలనిస్తాను, \q2 అడవి జంతువులను వాటి కడుపునిండా నిన్ను తినేలా చేస్తాను. \q1 \v 5 నీ మాంసాన్ని పర్వతాలమీద వెదజల్లుతాను, \q2 నీ శవాలతో లోయలన్నిటిని నింపుతాను. \q1 \v 6 నేను నీ రక్తధారలతో భూమిని \q2 పర్వతాల వరకు తడుపుతాను, \q2 లోయలు నీ మాంసంతో నిండిపోతాయి. \q1 \v 7 నేను నిన్ను ఆర్పివేసి ఆకాశాన్ని మూసివేస్తాను. \q2 నక్షత్రాలను చీకటిగా చేస్తాను; \q1 సూర్యుని మబ్బుతో కప్పుతాను \q2 చంద్రుడు ప్రకాశించడు. \q1 \v 8 నీ వలన ఆకాశంలోని జ్యోతులను చీకటిగా చేస్తాను \q2 నీ దేశం మీద గాఢాంధకారం కమ్మేలా చేస్తాను; \q2 ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \q1 \v 9 నీకు తెలియని దేశాల మధ్య \q2 అనేక జనాంగాల మధ్య నేను నీ మీదికి నాశనం తెచ్చినప్పుడు \q2 అనేక జనాంగాల హృదయాలకు కలవరం కలిగిస్తాను. \q1 \v 10 నేను వారి ముందు నా ఖడ్గాన్ని ఆడించినప్పుడు, \q2 నీ కారణంగా అనేకమందికి కలవరాన్ని కలిగిస్తాను, \q2 వారి రాజులు నిన్ను చూసి భయపడతారు. \q1 నీవు కూలిపోయిన రోజున \q2 వారంతా ప్రాణభయంతో \q2 నిత్యం వణికిపోతారు. \p \v 11 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “ ‘బబులోను రాజు ఖడ్గం \q2 నీ మీదికి వస్తుంది. \q1 \v 12 అన్ని జాతులలో అతి క్రూరులైన \q2 బల శూరుల ఖడ్గంతో \q2 నీ సైన్యం పతనమయ్యేలా చేస్తాను. \q1 వారు ఈజిప్టువారి గర్వాన్ని అణచివేస్తారు, \q2 దాని అల్లరిమూకలు నాశనమైపోతాయి. \q1 \v 13 సమృద్ధి జలాల ప్రక్కన ఉన్న \q2 దాని పశువులన్నిటిని నేను నాశనం చేస్తాను, \q1 ఇకపై నరుని పాదాలు వాటిని కదల్చవు, \q2 పశువుల కాళ్లు వాటిని బురదమయం చేయవు. \q1 \v 14 అప్పుడు నేను జలాలను నిమ్మళింపజేసి, \q2 దాని ప్రవాహాలను నూనెలా ప్రవహించేలా చేస్తాను, \q2 అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 15 నేను ఈజిప్టును పాడు చేసినప్పుడు, \q2 అందులో ఉన్నవాటన్నిటిని నాశనం చేసినప్పుడు, \q1 దానిలో నివసించే వారినందరిని నిర్మూలం చేసినప్పుడు, \q2 నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ \p \v 16 “వారు ఆమె కోసం ఈ విలాప గీతం పాడతారు. ఆయా దేశాల కుమార్తెలు దానిని పాడతారు; ఈజిప్టు కోసం, దాని అల్లరిమూకలన్నిటి కోసం వారు దానిని పాడతారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” \s2 ఈజిప్టు పాతాళంలోకి దిగి వెళ్లుట \p \v 17 పన్నెండవ సంవత్సరం మొదటి నెల పదిహేనవ రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి: \v 18 “మనుష్యకుమారుడా! ఈజిప్టు అల్లరిమూకల కోసం విలపించు పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు ఆమెను, బలమైన దేశాల కుమార్తెలను భూమికి అప్పగించు. \v 19 వారితో ఇలా చెప్పు, ‘నీవు ఇతరులకంటే ఎక్కువ అందంగా ఉన్నావా? నీవు క్రిందికి దిగివెళ్లి, సున్నతిలేనివారి మధ్య పడుకో.’ \v 20 ఖడ్గం వలన చనిపోయినవారితో వారు కూలుతారు. ఖడ్గం దూయబడింది; ఆమెను తన అల్లరిమూకలన్నిటితో పాటు ఈడ్చుకుపోతారు. \v 21 పాతాళంలోని బలమైన నాయకులు ఈజిప్టు, దాని మిత్రుల గురించి ఇలా చెప్తారు, ‘వారు దిగి వచ్చారు, వారు సున్నతిలేని వారితో, ఖడ్గంతో చంపబడినవారితో పడుకున్నారు.’ \p \v 22 “అష్షూరు దాని మొత్తం సైన్యంతో అక్కడే ఉంది; దాని చుట్టూ హతుల సమాధులు, ఖడ్గం వలన చంపబడినవారి సమాధులు ఉన్నాయి. \v 23 వారి సమాధులు పాతాళ అగాధాల్లో ఉన్నాయి, దాని సమాధుల చుట్టూ దాని సైన్యం పడి ఉంది. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా ఖడ్గంతో చచ్చి పడి ఉన్నారు. \p \v 24 “సమాధి చుట్టూ ఏలాము దాని అల్లరిమూకలు ఉన్నాయి. వారందరూ చంపబడ్డారు, ఖడ్గంతో కూలారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా సున్నతి పొందని వారిగా పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు తమ అవమానాన్ని భరిస్తున్నారు. \v 25 చనిపోయినవారి మధ్య, దాని సమాధి చుట్టూ ఉన్న దాని అల్లరిమూకలకు దానికి పడక ఏర్పాటు చేయబడింది. వారందరూ సున్నతి లేకుండా ఖడ్గంతో చచ్చారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేశారు కాబట్టి పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు; చనిపోయినవారి మధ్య వారు పడి ఉన్నారు. \p \v 26 “మెషెకు, తుబాలు తమ సమాధుల చుట్టూ తమ అల్లరిమూకలతో పాటు అక్కడ ఉన్నారు. వారంతా సున్నతిలేనివారు, ఖడ్గంతో చంపబడ్డారు ఎందుకంటే సజీవుల దేశంలో వారు భయాన్ని వ్యాపింపజేశారు. \v 27 అయితే వారు సున్నతిలేని వారిలో పతనమైన యోధులతో పడుకోరు,\f + \fr 32:27 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa సున్నతిలేని \fqa*\fqa యోధులు\fqa*\f* వారు యుద్ధ ఆయుధాలతో పాటు పాతాళానికి దిగివెళ్లి, తమ ఖడ్గాలను వారి తలల క్రింద, వారి డాళ్లు\f + \fr 32:27 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa శిక్ష\fqa*\f* వారి ఎముకల మీద పెట్టుకుని పడుకుంటారు; వీరు సజీవుల దేశంలో భయాన్ని పుట్టించారు కాబట్టి వీరి దోషం వీరి ఎముకలకు తగిలింది. \p \v 28 “ఫరో, నీవు కూడా సున్నతిలేనివారి మధ్య కత్తితో చంపబడినవారితో పాటు పడుకుంటావు. \p \v 29 “అక్కడ ఎదోము, దాని రాజులు యువరాజులు ఉన్నారు; వారికి శక్తి ఉన్నప్పటికీ, వారు ఖడ్గం చేత చంపబడినవారితో పాటు పడి ఉన్నారు. వారు సున్నతి పొందని వారితో, గొయ్యిలో దిగే వారితో పడుకుంటారు. \p \v 30 “ఉత్తర ప్రాంత అధిపతులందరు, అలాగే సీదోనీయులందరు అక్కడ ఉన్నారు; వారు తమ శక్తి వల్ల భీభత్సం సృష్టించినప్పటికీ చంపబడినవారితో దిగివెళ్లి అవమానానికి గురయ్యారు. వారు ఖడ్గం చేత చంపబడినవారితో సున్నతి పొందని వారిగా పడి ఉన్నారు, పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు. \p \v 31 “ఖడ్గంతో చంపబడిన ఫరో అతని సైన్యమంతా వారిని చూసి తమ అల్లరిమూకలన్నిటిని బట్టి ఓదార్పు పొందుతారు అని ప్రభువైన యెహోవా ప్రకటించారు. \v 32 సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసేలా చేశాను కాబట్టి ఫరో అతనితో పాటు అతని సైన్యం సున్నతిలేని వారితోనూ ఖడ్గం చేత హతులైనవారితోనూ పడి ఉంటారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” \c 33 \s1 కావలివానిగా యెహెజ్కేలు పిలుపు పునరుద్ధరణ \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, నీ ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను ఒక దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించగా ఆ ప్రజలు తమలో ఒకరిని ఎంచుకుని అతన్ని తమ కావలివానిగా పెట్టుకుంటారు. \v 3 అతడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదుతాడు, \v 4 అప్పుడు ఒకవేళ ఎవరైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్త పడకపోతే ఆ ఖడ్గం వచ్చి వారి ప్రాణాన్ని తీస్తుంది, వారి చావుకు వారే బాధ్యులు. \v 5 వారు బూర శబ్దం విని కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, కాబట్టి వారి చావుకు వారే బాధ్యులు. ఒకవేళ వారు ఆ హెచ్చరికకు జాగ్రత్తపడి ఉంటే, వారు తమ ప్రాణాలను కాపాడుకునేవారు. \v 6 అయితే ఒకవేళ కావలివాడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి కూడా ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదకపోతే, ఖడ్గం వచ్చి ఎవరినైనా చంపితే, చనిపోయినవారు తమ పాపాల కారణంగా చనిపోయినప్పటికి, నేను ఆ కావలివాన్ని బాధ్యున్ని చేస్తాను.’ \p \v 7 “మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు. \v 8 నేను దుర్మార్గునితో, ‘దుర్మార్గుడా, నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, వారి మార్గాలను విడిచిపెట్టమని నీవు వాన్ని హెచ్చరించకపోతే, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే వాని చావుకు నిన్ను బాధ్యున్ని చేస్తాను. \v 9 అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా ఆ దుర్మార్గులు తమ దుష్టత్వాన్ని వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు, అయితే నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. \p \v 10 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు, “మా పాపాలు దోషాలు మాకు భారంగా ఉన్నాయి, వాటివలన మేము క్షీణించి పోతున్నాము; మేమెలా బ్రతకాలి?” అని అంటున్నారు.’ \v 11 నీవు వారితో ఇలా చెప్పు, ‘నా జీవం తోడు, దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం ఉండదు గాని వారు తమ చెడు మార్గాలు విడిచి బ్రతికితే నాకు సంతోషము. తిరగండి! మీ చెడు మార్గాల నుండి తిరగండి! ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చస్తారు?’ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 12 “కాబట్టి మనుష్యకుమారుడా, నీ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఒకవేళ నీతిమంతులు పాపం చేస్తే, వారి గతంలోని నీతికి విలువ ఉండదు. అలాగే దుష్టులు పశ్చాత్తాపపడితే, వారి యొక్క గతంలోని దుష్టత్వం శిక్షను తీసుకురాదు. పాపం చేసే నీతిమంతులు గతంలో నీతిమంతులుగా ఉన్నప్పటికీ, వారు జీవించడానికి అనుమతించబడరు.’ \v 13 నీతిమంతులు తప్పక జీవిస్తారని నేను చెప్పినా సరే, వారు తమ నీతిని నమ్ముకొని పాపం చేస్తే, వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు; వారు చేసిన పాపానికి వారు చస్తారు. \v 14 అలాగే ఒకవేళ నేను దుర్మార్గులతో, ‘మీరు తప్పక చస్తారు’ అని చెప్తే, వారు తమ పాపాన్ని విడిచిపెట్టి, న్యాయమైనవి, సరియైనవి చేస్తూ, \v 15 వారు అప్పు ఇచ్చినప్పుడు తాకట్టుగా పెట్టుకున్న వాటిని తిరిగి ఇస్తే, వారు దొంగిలించింది తిరిగి ఇస్తే, జీవితాన్ని ఇచ్చే శాసనాలను అనుసరిస్తూ కీడు చేయనట్లైతే; ఆ వారు ఖచ్చితంగా బ్రతుకుతారు; వారు చనిపోరు. \v 16 వారు చేసిన పాపాల్లో ఏదీ జ్ఞాపకం చేసుకోబడదు. వారు న్యాయమైనవి, సరియైనవి చేశారు; కాబట్టి వారు ఖచ్చితంగా బ్రతుకుతారు. \p \v 17 “అయినా నీ ప్రజలు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. కాని నిజానికి వారి విధానమే న్యాయమైనది కాదు. \v 18 నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి చెడు చేస్తే, ఆ పాపాన్ని బట్టి వారు చస్తారు. \v 19 దుర్మార్గులు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి న్యాయమైనవి, సరియైనవి చేస్తే, వాటిని బట్టి వారు బ్రతుకుతారు. \v 20 అయితే ఇశ్రాయేలీయులారా, మీరు ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటున్నారు. అయితే నేను మీ ప్రవర్తన బట్టి మీ అందరికి తీర్పు తీరుస్తాను.” \s1 యెరూషలేము పతనం \p \v 21 మనం బందీలుగా వచ్చిన పన్నెండవ సంవత్సరం పదవనెల అయిదవ రోజున యెరూషలేములో నుండి తప్పించుకున్న ఒక మనుష్యుడు నా దగ్గరికి వచ్చి, “పట్టణం కూలిపోయింది!” అని చెప్పాడు. \v 22 అతడు ఇక్కడకు రావడానికి ముందు సాయంత్రం యెహోవా హస్తం నా మీద ఉంచి, ఉదయం ఆ వ్యక్తి నా దగ్గరికి రాకముందు ఆయన నా నోరు తెరిచారు. కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నేను ఇక మౌనంగా ఉండను. \p \v 23 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 24 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు దేశంలో శిథిలాల మధ్య నివసిస్తున్నవారు, ‘అబ్రాహాము ఒంటరిగానే ఈ దేశమంతటిని స్వాధీనపరచుకున్నాడు. కాని మనమైతే చాలామందిమి; ఖచ్చితంగా ఈ దేశం మనకు మన స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు. \v 25 కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మాంసంలో ఇంకా రక్తం ఉండగానే తింటూ, మీ విగ్రహాలవైపు చూస్తూ రక్తాన్ని చిందిస్తున్నారు, అలాంటి మీరు భూమిని స్వాధీనం చేసుకోగలరని అనుకుంటున్నారా? \v 26 మీరు మీ ఖడ్గం మీద ఆధారపడుతున్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు, మీలో ప్రతి ఒక్కరూ మీ పొరుగువాని భార్యను అపవిత్రం చేస్తారు; అలాంటి మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోగలరా?’ \p \v 27 “వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నా జీవం తోడు, శిథిలాల్లో మిగిలి ఉన్నవారు ఖడ్గం చేత కూలిపోతారు, బయట పొలంలో ఉన్నవారు అడవి మృగాలకు ఆహారమవుతారు, కోటలలో గుహల్లో ఉన్నవారు తెగులుతో చస్తారు. \v 28 నేను ఆ దేశాన్ని నిర్మానుష్యంగా చేస్తాను. దాని బల గర్వం ముగిసిపోతుంది, వాటి గుండా ఎవరూ వెళ్లకుండా ఇశ్రాయేలీయుల పర్వతాలు నిర్జనమవుతాయి. \v 29 వారు చేసిన అసహ్యమైన పనులను బట్టి నేను వారి దేశాన్ని పాడు చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ \p \v 30 “మనుష్యకుమారుడా, నీ ప్రజలు గోడల దగ్గర, ఇళ్ళ గుమ్మాల దగ్గర నిలబడి నీ గురించి మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు, ‘రండి యెహోవా దగ్గర నుండి వచ్చిన సందేశం ఏంటో విందాం’ అని చెప్పుకుంటున్నారు. \v 31 నా ప్రజలు ఎప్పుడూ వచ్చినట్లే నీ దగ్గరకు వచ్చి మీ మాటలు వినడానికి నీ ఎదుట కూర్చుంటారు, కాని వారు వాటిని పాటించరు. వారి నోళ్ళు ప్రేమ గురించి మాట్లాడతాయి, కాని వారి హృదయాలు అన్యాయపు లాభాన్ని ఆశిస్తాయి. \v 32 నిజానికి, వారికి నీవు అందమైన స్వరంతో ప్రేమ పాటలు పాడే వాడివి, వాయిద్యాన్ని చక్కగా వాయించే వాడివి తప్ప మరేమీ కాదు, ఎందుకంటే వారు మీ మాటలు వింటారు కానీ వాటిని పాటించరు. \p \v 33 “ఇవన్నీ నిజమైతే! ఖచ్చితంగా నిజమవుతాయి. అప్పుడు తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకుంటారు.” \c 34 \s1 యెహోవా ఇశ్రాయేలీయుల కాపరి \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించు; ప్రవచించి వారితో ఇలా చెప్పు: ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకునే ఇశ్రాయేలు కాపరులారా మీకు శ్రమ! కాపరులు తమ గొర్రెల మందను జాగ్రత్తగా చూసుకోవాలి కదా? \v 3 మీరు క్రొవ్విన వాటిని తింటారు, ఉన్నితో బట్టలు వేసుకుంటారు, ఎంపిక చేసిన జంతువులను వధిస్తారు, కానీ మందను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోరు. \v 4 మీరు బలహీనమైన వాటిని బలపరచలేదు, రోగంతో ఉన్నవాటిని స్వస్థపరచలేదు, గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. మీరు దారితప్పిన వాటిని తిరిగి తీసుకురాలేదు, తప్పిపోయిన వాటికోసం వెదకలేదు. మీరు వాటిని కఠినంగా, క్రూరంగా పాలించారు. \v 5 కాపరి లేనందున అవి చెదిరిపోయాయి, అవి చెదిరిపోయి అడవి జంతువులన్నిటికి ఆహారమయ్యాయి. \v 6 నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా, ఎత్తైన ప్రతి కొండ మీదా సంచరించాయి. వారు భూమి అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు, ఎవరూ వాటిని వెదకలేదు, వాటికోసం చూడలేదు. \p \v 7 “ ‘కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి: \v 8 నా జీవం తోడు కాపరులు లేని నా గొర్రెలు దోచుకోబడ్డాయి, అడవి మృగాలన్నిటికి ఆహారమయ్యాయి, నా కాపరులు నా గొర్రెలను వెదకలేదు, నా గొర్రెలను జాగ్రత్తగా చూసుకోకుండా వారు తమ గురించి మాత్రమే చూసుకున్నారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 9 కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి: \v 10 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఆ కాపరులకు వ్యతిరేకిని, నా మంద గురించి నేను వారిని లెక్క అడుగుతాను. గొర్రెల కాపరులు ఇకపై మందను మేపకుండ నేను వారిని తొలగిస్తాను, తద్వార వారు తమను తాము పోషించుకోలేరు. వారి నోటి నుండి నేను నా మందను విడిపిస్తాను, ఇకపై అది వారికి ఆహారంగా ఉండదు. \p \v 11 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేనే స్వయంగా నా గొర్రెలను వెదికి వాటిని చూసుకుంటాను. \v 12 గొర్రెల కాపరి చెదిరిపోయిన తన మందను వెదకినట్లు నేను నా గొర్రెలను వెదకుతాను. మేఘాలు కమ్మి చీకటిగా ఉన్న రోజున, అవి ఎక్కడెక్కడ చెదిరిపోయాయో అక్కడ నుండి నేను వాటిని రక్షిస్తాను. \v 13 నేను వాటిని ఇతర జాతుల నుండి బయటకు రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, నేను వాటిని వారి స్వదేశానికి తీసుకువస్తాను. నేను వాటిని ఇశ్రాయేలు పర్వతాలమీద, కనుమలలో, దేశంలోని అన్ని నివాస స్థలాల్లో మేపుతాను. \v 14 మంచి పచ్చిక ఉన్నచోట వాటిని మేపుతాను, ఇశ్రాయేలీయుల ఎత్తైన పర్వతాలు వాటికి పచ్చికబయళ్లుగా ఉంటాయి. అందులో అవి హాయిగా పడుకుంటాయి. ఇశ్రాయేలు పర్వతాలమీద శ్రేష్ఠమైన మేత ఉన్న స్థలాల్లో అవి మేస్తాయి. \v 15 నేనే స్వయంగా నా గొర్రెలను మేపి వాటిని పడుకోబెడతాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 16 నేను తప్పిపోయిన వాటిని వెదికి, తోలివేసిన వాటిని తిరిగి తోలుకు వస్తాను. నేను గాయపడిన వాటికి కట్టుకడతాను. బలహీనమైన వాటిని బలపరుస్తాను. క్రొవ్విన వాటిని బలిసిన వాటిని నాశనం చేస్తాను. మందను న్యాయంగా మేపుతాను. \p \v 17 “ ‘నా మందా, నీ గురించి ప్రభువైన యెహోవా చెప్తున్నారు: నేను గొర్రెకు మధ్య, పొట్టేళ్లకు మేకపోతులకూ మధ్య తీర్పు తీరుస్తాను. \v 18 మంచి పచ్చికబయళ్లను తింటే సరిపోదా? మిగిలిన పచ్చికబయళ్లను కాళ్లతో త్రొక్కాలా? మీరూ స్వచ్ఛమైన నీరు త్రాగితే సరిపోదా? మీ పాదాలతో మిగిలిన నీటిని బురదమయం చేయాలా? \v 19 మీ కాళ్లతో త్రొక్కింది నా మంద మేయాలా? కాళ్లతో బురద చేసిన నీళ్లను నా గొర్రెలు త్రాగాలా? \p \v 20 “ ‘ప్రభువైన యెహోవా వారికి చెబుతున్న మాట ఇదే: క్రొవ్విన గొర్రెలకు బక్కచిక్కిన గొర్రెలకు మధ్య నేనే తీర్పు తీరుస్తాను. \v 21 మీరు కొమ్ములతో పొడుస్తూ, భుజంతో ప్రక్కలతో తోస్తూ బలహీనమైన గొర్రెలన్నిటిని తరిమికొడుతున్నారు కాబట్టి, \v 22 నేను నా గొర్రెలను కాపాడతాను, ఇకపై అవి దోచుకోబడవు. గొర్రెకు మధ్య నేను తీర్పు తీరుస్తాను. \v 23 వాటిని మేపడానికి నేను నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని కాస్తాడు; అతడు వాటిని మేపుతాడు, వాటికి కాపరిగా ఉంటాడు. \v 24 యెహోవానైన నేను వారికి దేవునిగా ఉంటాను, నా సేవకుడైన దావీదు వాటికి అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట చెప్పాను. \p \v 25 “ ‘అవి అరణ్యంలో క్షేమంగా నివసించి అడవుల్లో పడుకునేలా నేను వాటితో సమాధాన ఒడంబడిక చేసుకుంటాను, అలాగే అడవి మృగాలను దేశంలో లేకుండా చేస్తాను. \v 26 నేను వాటిని నా పర్వతం చుట్టుప్రక్కల ఉన్న స్థలాలను ఆశీర్వాదకరంగా చేస్తాను.\f + \fr 34:26 \fr*\ft లేదా \ft*\fqa వాటిని నా పర్వతం చుట్టూ ఉన్న ప్రదేశాలను ఆశీర్వాదాల పేరుతో పిలువబడతాయి \fqa*\ft (\+xt ఆది 48:20\+xt*) లేదా \ft*\fqa నేను వాటిని నా కొండ చుట్టూ ఉన్న ప్రదేశాలను దీవించబడినవిగా చూస్తాను\fqa*\f* రుతువుల ప్రకారం జల్లులు కురిపిస్తాను; ఆశీర్వాదకరమైన జల్లులు కురుస్తాయి. \v 27 చెట్లు తమ పండ్లను ఇస్తాయి, భూమి తన పంటను ఇస్తుంది; ప్రజలు తమ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను వారి కాడిని విరగ్గొట్టి, వారిని బానిసలుగా చేసుకున్న వారి చేతుల్లో నుండి వారిని విడిపించినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. \v 28 వారు ఇకపై దేశాలచేత దోచుకోబడరు, అడవి మృగాలకు వారు ఆహారం కారు. వారు క్షేమంగా జీవిస్తారు, వారిని ఎవరూ భయపెట్టరు. \v 29 పంటలకు ప్రసిద్ధి చెందిన దేశాన్ని నేను వారికి ఇస్తాను, వారు ఇకపై దేశంలో కరువు బారిన పడరు, ఇతర దేశాల మధ్య అవమానాన్ని భరించే అవసరం ఉండదు. \v 30 అప్పుడు నేను వారి దేవుడనైన యెహోవాను వారికి తోడుగా ఉన్నానని, ఇశ్రాయేలీయులైన వారు నా ప్రజలని వారు తెలుసుకుంటారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 31 మీరు నా గొర్రెలు, నా పచ్చిక బయళ్లలోని గొర్రెలు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \c 35 \s1 ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పి దానికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: \v 3 ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఓ శేయీరు పర్వతమా, నేను నీకు వ్యతిరేకిని, నేను నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి నిన్ను నిర్జనమై వ్యర్థంగా మిగిలిపోయేలా చేస్తాను. \v 4 నీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను; నీవు నిర్జనమవుతావు. అప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటావు. \p \v 5 “ ‘నీవు ఇశ్రాయేలీయుల పట్ల ఎప్పుడూ పగతో ఉండి, వారి విపత్తు సమయంలో, వారి శిక్ష ముగింపుకు చేరుకున్న సమయంలో నీవు వారిని ఖడ్గానికి అప్పగించావు, \v 6 కాబట్టి నా జీవం తోడు, నేను నిన్ను రక్తపాతానికి అప్పగిస్తాను, అది నీ వెంటపడుతుంది. నీవు రక్తపాతాన్ని ద్వేషించలేదు కాబట్టి, రక్తపాతం నిన్ను వెంటాడుతుందని యెహోవా ప్రకటిస్తున్నారు. \v 7 నేను శేయీరు పర్వతాన్ని నిర్జనంగా వ్యర్థంగా చేస్తాను, వస్తూ వెళ్తూ ఉండేవారు అక్కడ లేకుండా చేస్తాను. \v 8 నీ పర్వతాలను శవాలతో నింపుతాను; ఖడ్గం చేత చచ్చినవారు నీ కొండలమీద, నీ లోయల్లో, నీ వాగుల్లో పడి ఉంటారు. \v 9 నేను నిన్ను శాశ్వతంగా పాడైపోయేలా చేస్తాను; నీ పట్టణాల్లో ఎవరూ నివసించరు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. \p \v 10 “ ‘యెహోవానైన నేను అక్కడ ఉన్నప్పటికీ, “ఈ రెండు జాతులు, దేశాలు మనవే; మనం వాటిని స్వాధీనం చేసుకుందాం” అని మీరు చెప్పారు. \v 11 కాబట్టి నా జీవం తోడు నీవు వారిమీద ద్వేషంతో నీవు వారికి చూపించిన కోపం అసూయను బట్టి నేను నీ పట్ల తగిన రీతిగా వ్యవహరిస్తాను. నేను నిన్ను శిక్షించినప్పుడు నన్ను నేను వారికి పరిచయం చేసుకుంటాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 12 “అవి పాడుచేయబడ్డాయి, మనకు ఆహారంగా ఇవ్వబడ్డాయి” అని నీవు ఇశ్రాయేలు పర్వతాలను దూషించిన మాటలన్నీ యెహోవానైన నేను విన్నానని నీవు తెలుసుకుంటావు. \v 13 మీరు ప్రగల్భాలు పలుకుతూ, ఏమాత్రం అదుపు లేకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, అదంతా నేను విన్నాను. \v 14 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఒకవైపు లోకమంతా సంతోషిస్తూ ఉంటే, నేను నిన్ను నాశనం చేస్తాను. \v 15 ఇశ్రాయేలీయుల వారసత్వం పాడైపోయినప్పుడు నీవు సంతోషించావు, కాబట్టి నేను నీతో అలాగే వ్యవహరిస్తాను. శేయీరు పర్వతమా, నీవూ నీతో పాటు ఎదోము అంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ” \c 36 \s1 ఇశ్రాయేలు పర్వతాలకు నిరీక్షణ \p \v 1 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచించి ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి. \v 2 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ఆహా! ప్రాచీనమైన ఉన్నత స్థలాలు మా స్వాధీనమయ్యాయి” అని శత్రువులు నీ గురించి అన్నారు.’ \v 3 కాబట్టి ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మిగిలిన ఇతర దేశాల వారికి స్వాధీనమయ్యేలా, ప్రజల మధ్యలో మీరు ఎగతాళిచేయబడి హేళన చెందేలా, వారు అన్ని వైపుల నుండి మిమ్మల్ని ధ్వంసం చేసి అణచివేశారు. \v 4 కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి: ప్రభువైన యెహోవా పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో, నిర్జనమైన శిథిలాలతో, మీ చుట్టూ ఉన్న మిగిలిన ఇతర జాతులచేత దోచుకోబడి అపహాస్యం చేయబడిన పాడైన పట్టణాలతో మాట్లాడుతూ, \v 5 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: చుట్టూ ఉన్న దేశాలు, ఎదోము వారంతా ద్వేషంతో, ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నారు, కాబట్టి నేను తీవ్రమైన రోషంలో నేను వారికి వ్యతిరేకంగా మాట్లాడాను.’ \v 6 కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచించి పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు దేశాల మధ్య అవమానించబడ్డారు, కాబట్టి నేను నా రోషంలో ఉగ్రతలో మాట్లాడుతున్నాను. \v 7 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీ చుట్టూ ఉన్న దేశాలు కూడా అవమానం పాలవుతాయని నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. \p \v 8 “ ‘కాని ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తమ ఇంటికి తిరిగి వస్తారు, కాబట్టి మీరు కొమ్మలుగా ఎదిగి వారి కోసం పండ్లు ఇవ్వాలి. \v 9 నేను మీ పక్షంగా ఉండి మీమీద దయ చూపిస్తాను; మీరు దున్నబడి, విత్తబడతారు. \v 10 మీమీద మనుష్యజాతిని అంటే ఇశ్రాయేలీయులందరు నివసించేలా చేస్తాను. నా పట్టణాల్లో మళ్ళీ నివాసులు ఉంటారు, శిథిలాలు మళ్ళీ కట్టబడతాయి. \v 11 మీమీద నివసించే మనుష్యులను పశువులను నేను విస్తరింపజేస్తాను, వారు ఫలించి విస్తరిస్తారు. గతంలో ఉన్నట్లే మీమీద ప్రజలను స్థిరపరచి, అంతకుముందు కన్నా అధికంగా అభివృద్ధి కలిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. \v 12 నేను మనుష్యజాతిని అనగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మీమీద నివసించేలా చేస్తాను. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు, మీరు వారికి స్వాస్థ్యంగా ఉంటారు; ఇక ఎప్పటికీ మీరు వారిని పిల్లలు లేనివారిగా చేయరు. \p \v 13 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నీవు మనుష్యులను చంపుతూ, నీ దేశంలో పిల్లలు లేకుండా చేస్తున్నావు” అని కొందరు నీ గురించి చెప్పుకుంటున్నారు. \v 14 కాబట్టి నీవు ఇకపై మనుష్యులను చంపవు, నీ దేశాన్ని పిల్లలు లేనిదిగా చేయవు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 15 ఇకపై మిమ్మల్ని దేశాలు దూషించడం మీరు వినరు, ఇకపై మిమ్మల్ని జనాంగాల అవమానించవు, మీ జాతిని పతనమయ్యేలా చేయరు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \s1 ఇశ్రాయేలును పునరుద్ధరిస్తానని హామీ \p \v 16 మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 17 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు తమ స్వదేశంలో నివసిస్తున్నప్పుడు, వారు తమ ప్రవర్తనతో తమ చేష్టలతో దానిని అపవిత్రం చేశారు. నా దృష్టికి వారి ప్రవర్తన నెలసరిలో ఉన్న స్త్రీ అపవిత్రతలా ఉంది. \v 18 కాబట్టి వారు దేశంలో రక్తం చిందించినందుకు, తమ విగ్రహాలతో దానిని అపవిత్రం చేసినందుకు నేను వారిపై నా ఉగ్రత క్రుమ్మరించాను. \v 19 నేను వారిని జాతుల మధ్యకు చెదరగొట్టాను, వారు వివిధ దేశాలకు చెదిరిపోయారు; వారి ప్రవర్తన, వారి చేష్టలకు తగినట్టుగా నేను వారికి తీర్పు తీర్చాను. \v 20 వారు ఏ దేశాల మధ్యకు వెళ్లినా నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, ఎలా అంటే, ‘వారు యెహోవా ప్రజలే అయినప్పటికీ వారు ఆయన దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది’ అని వారి గురించి చెప్తారు. \v 21 నా పరిశుద్ధ నామం గురించి నాకు చింత ఉంది, దానిని ఇశ్రాయేలీయులు తాము వెళ్లిన దేశాల్లో అపవిత్రం చేశారు. \p \v 22 “కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు ప్రజలారా, నేను చేయబోయేది మీ కోసం కాదు, ఇతర ప్రజల్లో మీ వలన అవమానానికి గురియైన నా పరిశుద్ధ నామం కోసమే చేస్తాను. \v 23 మీ మూలంగా ఇతర ప్రజల్లో అవమానపరచబడుతున్న నా గొప్ప పేరు ఎంత పరిశుద్ధమైనదో మీకు చూపిస్తాను. వారి కళ్ళెదుట మీ ద్వారా నా పరిశుద్ధతను వెల్లడి చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 24 “ ‘నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి బయటకు తీసుకువస్తాను; దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశానికి తిరిగి తీసుకువస్తాను. \v 25 నేను మీమీద శుద్ధ జలాన్ని చిలకరిస్తాను, మీరు శుద్ధులవుతారు; మీ విగ్రహాల నుండి, అపవిత్రతలన్నిటి నుండి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను. \v 26 నేను మీకు నూతన హృదయాన్ని ఇచ్చి, మీలో నూతనమైన ఆత్మను ఉంచుతాను. మీలోని రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాను. \v 27 నా ఆత్మను మీలో ఉంచి, నా శాసనాలను అనుసరించి నా ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా మిమ్మల్ని చేస్తాను. \v 28 అప్పుడు మీ పూర్వికులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను. \v 29 మీ అపవిత్రతలన్నిటి నుండి మిమ్మల్ని కాపాడతాను. మీ మీదికి కరువు తీసుకురాకుండా మీకు సమృద్ధిగా ధాన్యం పండేలా చేస్తాను. \v 30 చెట్ల ఫలాలను, పొలాల పంటను వృద్ధి చేస్తాను, అప్పుడు కరువు కారణంగా ఇతర ప్రజల ముందు మీకు అవమానం కలుగదు. \v 31 అప్పుడు మీరు మీ చెడు ప్రవర్తనను, చేసిన చెడ్డపనులను జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన పాపాలు అసహ్యమైన పనులను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు. \v 32 ఇదంతా నేను మీ కోసం చేయడం లేదని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. ఇశ్రాయేలీయులారా! మీ ప్రవర్తనకు సిగ్గుపడండి, అవమానంగా భావించండి. \p \v 33 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను మిమ్మల్ని మీ పాపాలన్నిటి నుండి శుద్ధి చేసే రోజున మీరు తిరిగి మీ పట్టణాల్లో నివసించేలా చేస్తాను; శిథిలమైన పట్టణాలు తిరిగి కట్టబడతాయి. \v 34 ఆ దారిలో వెళ్లే వారందరి దృష్టికి ఈ పాడుబడి నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ భూమి సేద్యం చేయబడుతుంది. \v 35 వ్యర్థంగా ఉండిన ఈ భూమి ఏదెను తోటలా మారింది; శిథిలమై పాడుబడి నిర్మానుష్యంగా ఉన్న పట్టణాలు ఇప్పుడు కోటలతో జనసంచారంతో సందడిగా ఉన్నాయని వారంటారు. \v 36 అప్పుడు యెహోవానైన నేను శిథిలమైన వాటిని మళ్ళీ కడతానని, పాడైన స్థలాల్లో చెట్లు నాటుతానని మీ చుట్టూ మిగిలి ఉన్న దేశాలు తెలుసుకుంటాయి. యెహోవానైన నేను చెప్పాను, దానిని నేను చేస్తాను.’ \p \v 37 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలు ప్రజలు నన్ను వేడుకునేలా చేస్తాను. గొర్రెలు విస్తరించినట్లు నేను వారు విస్తరించేలా చేస్తాను. \v 38 నియమించబడిన పండుగల్లో యెరూషలేములో అర్పించబడే గొర్రె మందల్లా వారి సంఖ్యను అభివృద్ధి చేస్తాను. అప్పుడు శిథిలమైన పట్టణాలు మనుష్యుల గుంపులతో నిండిపోతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.” \c 37 \s1 ఎండిన ఎముకల లోయ \p \v 1 యెహోవా చేయి నా మీదికి వచ్చింది. యెహోవా ఆత్మ నన్ను తీసుకెళ్లి ఎముకలతో నిండిన ఒక లోయలో దించారు. \v 2 ఆయన వాటి మధ్య నన్ను అటూ ఇటూ నడిపించారు. ఆ లోయలో బాగా ఎండిపోయిన చాలా ఎముకలు నాకు కనబడ్డాయి. \v 3 “మనుష్యకుమారుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా?” అని ఆయన నన్ను అడిగారు. \p అందుకు నేను, “ప్రభువైన యెహోవా, అది మీకు మాత్రమే తెలుసు” అని చెప్పాను. \p \v 4 ఆయన నాతో ఇలా అన్నారు, “ఈ ఎముకలకు ప్రవచించి వాటితో ఇలా చెప్పు: ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి. \v 5 ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు బ్రతికేలా మీలోనికి ఊపిరి\f + \fr 37:5 \fr*\ft హెబ్రీలో ఈ పదానికి అర్థం \ft*\fqa గాలి \fqa*\ft లేదా \ft*\fqa ఆత్మ \fqa*\ft \+xt 6-14|link-href="EZK 37:6-14"\+xt* వచనాలు కూడా చూడండి\ft*\f* పంపిస్తాను. \v 6 మీకు కండరాలను అతికించి మాంసాన్ని పొదిగి మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పెడతాను, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ” \p \v 7 కాబట్టి నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నేను ప్రవచిస్తూ ఉండగా, గలగలమనే శబ్దం వినిపించి చూస్తే, ఆ ఎముకలన్నీ దగ్గరకు వచ్చి ఒక దానికి ఒకటి అంటుకున్నాయి. \v 8 నేను చూస్తుండగా వాటి మీదికి కండరాలు మాంసం పొదగడం, వాటి మీద చర్మం కప్పుకోవడం కనిపించింది, అయితే వాటిలో ఊపిరి లేదు. \p \v 9 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఊపిరి వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఊపిరీ! నీవు నాలుగు వైపుల నుండి వచ్చి, ఈ హతులైన వీరి బ్రతికేలా వీరిలో ఊపిరి నింపు.’ ” \v 10 కాబట్టి ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే నేను ప్రవచించినప్పుడు ఊపిరి వారిలోనికి ప్రవేశించి వారు సజీవులై లేచి మహా సైన్యంగా నిలబడ్డారు. \p \v 11 ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలు. వారు, ‘మా ఎముకలు ఎండిపోయాయి, మాకు ఏ ఆశ లేదు మేము నాశనమయ్యాం’ అని అనుకుంటున్నారు. \v 12 కాబట్టి నీవు ప్రవచించి వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నా ప్రజలారా, నేను మీరున్న సమాధులు తెరచి వాటిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పిస్తాను; ఇశ్రాయేలు దేశంలోకి మిమ్మల్ని తిరిగి తీసుకువస్తాను. \v 13 నేను మీరున్న సమాధులు తెరచి వాటిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు నా ప్రజలైన మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు. \v 14 మీరు బ్రతికేలా మీలో నా ఆత్మను ఉంచి మీ స్వదేశంలో మీరు నివసించేలా చేస్తాను. అప్పుడు యెహోవానైన నేను మాట ఇచ్చాను, దానిని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ” \s1 ఒకే రాజు ఒకే దేశం \p \v 15 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 16 “మనుష్యకుమారుడా, ఒక కర్ర తీసుకుని, దానిపై ‘ఇది యూదాకు, అతని సహచరులైన ఇశ్రాయేలీయులకు చెందినది’ అని వ్రాయి, తర్వాత మరొక కర్ర తీసుకుని, దానిపై, ‘యోసేపు (అంటే, ఎఫ్రాయిం) అతని సహచరులైన ఇశ్రాయేలీయులందరికి చెందినది’ అని వ్రాయి. \v 17 ఆ రెండింటిని నీ చేతిలో ఒకే కర్రలా ఉండేలా జతచేయి. \p \v 18 “ ‘దీని భావమేమిటో మాకు చెప్పవా?’ అని నీ ప్రజలు నిన్ను అడిగినప్పుడు, \v 19 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఎఫ్రాయిం చేతిలో ఉన్న యోసేపు కర్రను, అతనితో సంబంధం ఉన్న ఇశ్రాయేలీయుల గోత్రాలను తీసుకుని యూదా కర్రకు జతచేయబోతున్నాను. నేను వాటిని ఒకే కర్రలా చేస్తాను, అవి నా చేతిలో ఒకటిగా అవుతాయి.’ \v 20 నీవు ఏ కర్రల మీదైతే వ్రాసావో వాటిని వారి కళ్లముందు పట్టుకుని, \v 21 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలీయులు చెదరిపోయిన దేశాల నుండి నేను వారిని బయటకి తీసుకువస్తాను. వారిని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సమకూర్చి వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను. \v 22 వారు ఇక ఎన్నటికీ రెండు జాతులుగా గాని రెండు రాజ్యాలుగా విడిపోకుండ నేను వారిని ఇశ్రాయేలు పర్వతాలమీద, ఒకే దేశంగా చేస్తాను. వారందరికి ఒకే రాజు ఉంటాడు. \v 23 వారు ఇకపై తమ విగ్రహాలతో, నీచమైన చిత్రాలతో గాని వారి నేరాలతో గాని తమను తాము అపవిత్రం చేసుకోరు, ఎందుకంటే వారు పాపాలు చేస్తూ నివసించిన ప్రతి స్థలం నుండి నేను వారిని రక్షించి, వారిని శుద్ధి చేస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. \p \v 24 “ ‘నా సేవకుడైన దావీదు వారికి రాజు. వారందరికి ఒకే కాపరి ఉంటాడు. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను పాటించే విషయంలో వారు జాగ్రత్త వహిస్తారు. \v 25 నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన దేశంలో అనగా మీ పూర్వికులు నివసించిన దేశంలో వారు నివసిస్తారు. వారు వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యం నివసిస్తారు. నా సేవకుడైన దావీదు వారికి శాశ్వతమైన అధిపతిగా ఉంటాడు. \v 26 నేను వారితో సమాధాన ఒప్పందాన్ని చేస్తాను; అది నాకు వారికి మధ్య శాశ్వత నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరచి వారిని విస్తరింపచేస్తాను, వారి మధ్య నా పరిశుద్ధాలయాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను. \v 27 నా నివాసస్థలం వారితో ఉంటుంది; నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు. \v 28 వారి మధ్య నా పరిశుద్ధాలయం నిత్యం ఉండడం చూసి ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచే యెహోవాను నేనే అని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.’ ” \c 38 \s1 దేశాల మీద యెహోవా గొప్ప విజయం \p \v 1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: \v 2 “మనుష్యకుమారుడా, మాగోగు దేశానికి చెందిన గోగు వైపు అనగా మెషెకుకు తుబాలుకు రోషుకు అధిపతియైన వానివైపు నీ ముఖాన్ని త్రిప్పి, అతనికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పుమని ఆజ్ఞాపించింది: \v 3 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు ముఖ్య అధిపతియైన\f + \fr 38:3 \fr*\ft లేదా \ft*\fqa రోషుకు అధిపతియైన\fqa*\f* గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. \v 4 నేను నిన్ను వెనక్కు త్రిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి, నిన్ను సైన్యమంతటితో పాటు, నీ గుర్రాలను, సంపూర్ణ సాయుధులైన నీ రౌతులను, పెద్ద చిన్న డాళ్లను ధరించి, వారంతా ఖడ్గాలు ఆడిస్తూ పట్టుకున్న యోధులను బయటకు తీసుకువస్తాను. \v 5 పర్షియా, కూషు, పూతు వారందరు డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి వారితో పాటు వస్తారు. \v 6 అలాగే గోమెరు అతని సైన్యం, ఉత్తరాన దూరంగా ఉన్న తోగర్మా అతని సైన్యం, ఇంకా అనేక జాతులవారు నీతో వస్తారు. \p \v 7 “ ‘సిద్ధంగా ఉండు; నీవు నీతో పాటు చేరిన సమూహమంతటితో కలిసి సిద్ధంగా ఉండు, నీవే వారికి నాయకునిగా ఉండు. \v 8 చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు. \v 9 అయితే నీవు గాలి తుఫాను వచ్చినట్లుగా వస్తావు; నీవు, నీ సైన్యం, నీ పక్షాన ఉన్న అనేకమంది ప్రజలు కలిసి దేశం మీద మేఘంలా కమ్ముకుంటారు. \p \v 10 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ రోజు నీ మనస్సులో చెడు ఆలోచనలు పుడతాయి. నీవు చెడు పన్నాగం పన్ని, \v 11 దురాలోచనతో నీవు ఇలా అంటావు, “నేను గోడలులేని గ్రామాలున్న దేశంపై దాడి చేస్తాను; గోడలు ద్వారాలు అడ్డగడియలు లేని దేశంలో ప్రశాంతంగా క్షేమంగా నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తాను. \v 12 వారిని దోచుకుని సొమ్ము కొల్లగొట్టడానికి, గతంలో పాడుబడి ఉన్నా మళ్ళీ నివాసం ఉంటున్న స్థలాల మీద దాడి చేయడానికి, ఇతర జనాల్లో నుండి సమకూర్చబడి సమృద్ధిగా పశువులు సరుకులు కలిగి భూమి మధ్యభాగంలో నివసించే ప్రజలమీదికి వెళ్తాను.” \v 13 షేబ వారు, దేదాను వారు, తర్షీషు వర్తకులు, దాని కొదమ సింహాల్లాంటి\f + \fr 38:13 \fr*\ft లేదా \ft*\fqa కొదమసింహాలు\fqa*\f* వారందరు నిన్ను చూసి, “దోచుకోవడానికి వచ్చావా? వెండి బంగారాలను, పశువులను సరుకులను కొల్లగొట్టుకొని తీసుకెళ్లడానికి, దోచుకోవడానికి నీ సైన్యాన్ని సమకూర్చుకున్నావా?” అని అంటారు.’ \p \v 14 “మనుష్యకుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే రోజున నీవు ఇది గమనించలేదా? \v 15 ఉత్తరాన దూరంగా ఉన్న నీ స్థలంలో నుండి నీవూ, నీతో పాటు అనేక జనాలు గుర్రాలపై స్వారీ చేస్తూ చాలా గొప్ప సైన్యంగా వస్తారు. \v 16 దేశాన్ని మేఘం క్రమ్మినట్లు మీరంతా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది; నీ ద్వారా ఇతర ప్రజల ఎదుట నేను పరిశుద్ధుడను అని కనుపరిచినప్పుడు వారు నన్ను తెలుసుకునేలా గోగూ, నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను. \p \v 17 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: పూర్వకాలంలో నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా నేను మాట్లాడింది నీ గురించే. నేను నిన్ను వారికి వ్యతిరేకంగా తీసుకువస్తానని అనేక సంవత్సరాలుగా వారు ప్రవచించారు. \v 18 ఆ రోజున గోగు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చేటప్పుడు నా కోపం తీవ్రంగా ఉంటుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \v 19 నేను రోషంతో, కోపోద్రేకంతో ఏమని ప్రకటించానంటే, ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన భూకంపం వస్తుంది. \v 20 అప్పుడు సముద్రంలోని చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమి మీద ప్రాకే పురుగులు, భూమి మీద ఉన్న మనుష్యులందరు నా ఎదుట వణుకుతారు. పర్వతాలు కూలిపోతాయి, కొండచరియలు విరిగిపోతాయి, ప్రతి గోడ నేలమట్టం అవుతుంది. \v 21 నేను నా పర్వతాలన్నిటిపైన గోగుకు వ్యతిరేకంగా ఖడ్గాన్ని రప్పిస్తాను. ప్రతి ఒక్కని ఖడ్గం తన సోదరుని మీద పడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 22 తెగులుతో రక్తపాతంతో అతని మీద తీర్పు తీరుస్తాను; అతనిపై అతని సైన్యం మీద అతనితో పాటు ఉన్న అనేక దేశాలపై నేను కుండపోత వర్షాన్ని, వడగండ్లను అగ్నిగంధకాలను కురిపిస్తాను. \v 23 నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ \c 39 \p \v 1 “మనుష్యకుమారుడా, గోగు గురించి ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు అధిపతియైన\f + \fr 39:1 \fr*\ft లేదా \ft*\fqa రోషుకు అధిపతియైన\fqa*\f* గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. \v 2 నేను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, దూరంగా ఉన్న ఉత్తర దిక్కునుండి రప్పించి ఇశ్రాయేలు పర్వతాల మీదికి పంపుతాను. \v 3 అప్పుడు నేను నీ ఎడమచేతి నుండి నీ విల్లు, నీ కుడిచేతి నుండి నీ బాణాలు క్రింద పడేలా చేస్తాను. \v 4 నీవు నీ సైన్యం నీతో పాటు ఉన్న అనేక జనులు ఇశ్రాయేలు పర్వతాలమీద కూలిపోతారు. వేటాడే రకరకాల క్రూర పక్షులకు, అడవి మృగాలకు నిన్ను ఆహారంగా చేస్తాను. \v 5 నీవు పొలంలో పడిపోతావు; నేను మాట ఇచ్చాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 6 నేను మాగోగు మీదికి, సముద్ర తీర ప్రాంతాల్లో క్షేమంగా నివసించేవారి మీదికి అగ్ని పంపిస్తాను, అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. \p \v 7 “ ‘నా పరిశుద్ధ నామాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య వెల్లడి చేస్తాను. ఇకపై నా పరిశుద్ధ నామం అవమానానికి గురి కానివ్వను, అప్పుడు నేనే యెహోవానని ఇశ్రాయేలులో పరిశుద్ధుడనని ఇతర దేశాల ప్రజలు తెలుసుకుంటారు. \v 8 ఆ సమయం వస్తుంది! అది ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \p \v 9 “ ‘అప్పుడు ఇశ్రాయేలు పట్టణాల్లో నివసించేవారు బయటకు వెళ్లి, ఆ ఆయుధాలను చిన్న పెద్ద డాళ్లు, విల్లులు బాణాలు, యుద్ధ దండాలు ఈటెలను తీసుకుని పొయ్యిలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఏడేళ్లపాటు వాటిని ఇంధనంగా వినియోగించనున్నారు. \v 10 వారు పొలంలో కట్టెలు ఏరుకోకుండా అడవిలో చెట్లు నరకకుండా ఆయుధాలను పొయ్యిలో కాలుస్తారు. వారు తమను దోచుకున్న వారిని తిరిగి దోచుకుంటారు. తమను కొల్లగొట్టిన వారిని తిరిగి కొల్లగొడతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \p \v 11 “ ‘ఆ రోజున నేను సముద్రానికి తూర్పుగా ప్రయాణికులు వెళ్లే లోయలో ఇశ్రాయేలు దేశంలో గోగును, అల్లరిమూకలను పాతిపెట్టడానికి స్థలం ఇస్తాను. అక్కడ గోగును, అతని అల్లరిమూకలన్ని పాతిపెట్టిన తర్వాత ప్రయాణికులు వెళ్లడానికి వీలుపడదు. ఆ లోయకు హమోన్ గోగు\f + \fr 39:11 \fr*\fq హమోన్ గోగు \fq*\ft అంటే \ft*\fqa గోగు యొక్క అల్లరిమూకలు\fqa*\f* అనే పేరు వస్తుంది. \p \v 12 “ ‘దేశాన్ని పవిత్రపరచడానికి ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెడతారు. \v 13 దేశంలోని ప్రజలందరూ వారిని పాతిపెడతారు, నేను ఘనత పొందిన ఆ రోజు వారికి ఘనత కలుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \v 14 దేశాన్ని పవిత్రపరచడానికి కొంతమంది మనుష్యులను నియమిస్తారు. వారు ఇతరులతో కలిసి దేశమంతా తిరుగుతూ నేల మీద పడివున్న శవాలను పాతిపెడతారు. \p “ ‘ఏడు నెల తర్వాత వారు దేశాన్ని పూర్తిగా తనిఖీ చేస్తారు. \v 15 దేశమంతా తిరుగుతున్నప్పుడు వారిలో ఎవరికైనా మనిషి ఎముక కనబడితే పాతి పెట్టేవారు దానిని తీసుకెళ్లి హమోన్ గోగు లోయలో పాతిపెట్టే వరకు దాని దగ్గర ఒక గుర్తు ఉంచుతారు. \v 16 ఆ లోయ దగ్గర హమోనా\f + \fr 39:16 \fr*\fq హమోనా \fq*\ft అంటే \ft*\fqa అల్లరిమూక\fqa*\f* అనే పేరున్న పట్టణం ఉంది. ఈ విధంగా వారు దేశాన్ని పవిత్ర పరుస్తారు.’ \p \v 17 “మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు అన్ని రకాల పక్షులకు అడవి మృగాలకు ఇలా చెప్పు: ‘నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలికి అనగా ఇశ్రాయేలు పర్వతాలమీద జరుగబోయే గొప్ప బలి దగ్గరకు నలువైపుల నుండి తరలి రండి, అక్కడ మీరు మాంసాన్ని తిని రక్తాన్ని త్రాగుతారు. \v 18 కోడెల రక్తం త్రాగుతారు. మీరు అక్కడ బలవంతుల మాంసాన్ని తింటారు; భూ రాజుల రక్తాన్ని బాషానులో బలిసిన పొట్టేళ్ల, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తంలా త్రాగుతారు. అవన్నీ బాషానుకు చెందిన క్రొవ్విన జంతువులే. \v 19 నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలి దగ్గర కడుపునిండా ఆ క్రొవ్వును తింటారు. మత్తు ఎక్కేవరకు రక్తం త్రాగుతారు. \v 20 నేను ఏర్పరచిన బల్ల దగ్గర గుర్రాలను, రౌతులను బలవంతులను, సైనికులందరిని కడుపారా తింటారు.’ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \p \v 21 “నా మహిమను ఇతర ప్రజలమధ్య చూపుతాను. ఇతర ప్రజలందరు నేను విధించిన శిక్షను నేను వారిపై ఉంచిన చేతిని చూస్తారు. \v 22 ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు నేనే వారి దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు. \v 23 ఇశ్రాయేలీయులు పాపం చేసిన కారణంగా బందీలుగా వెళ్లవలసి వచ్చిందని, నా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు నేను వారికి నా ముఖం దాచి వేసి వారంతా కత్తివేటుకు కూలిపోయేలా వారి శత్రువులకు అప్పగించానని ఇతర ప్రజలు తెలుసుకుంటారు. \v 24 వారి అపవిత్రత తిరుగుబాటుతనం బట్టి నేను వారికి విరోధినై వారికి తగిన ప్రతీకారం చేశాను. \p \v 25 “కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నా పరిశుద్ధ నామాన్ని బట్టి రోషం కలిగి యాకోబు సంతతిని చెరలో నుండి రప్పిస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కనికరిస్తాను. \v 26 ఎవరినుండి భయం లేకుండా వారు తమ స్వదేశంలో క్షేమంగా నివసిస్తున్నప్పుడు వారు నాకు చేసిన నమ్మకద్రోహాన్ని, దానివల్ల వారు పొందిన అవమానాన్ని మర్చిపోతారు. \v 27 నేను వారిని ఇతర జనాల్లో నుండి బయటకు తీసుకువచ్చి శత్రు దేశాల నుండి వారిని సమకూర్చినప్పుడు వారి ద్వారా అనేక జనుల మధ్యలో నన్ను నేను పరిశుద్ధునిగా కనుపరచుకుంటాను. \v 28 నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి బందీలుగా పంపి, ఎవరినీ విడిచిపెట్టకుండా వారందరిని వారి స్వదేశానికి సమకూరుస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని వారి దేవుడనని తెలుసుకుంటారు. \v 29 అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, కాబట్టి వారికిక నా ముఖాన్ని దాచను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.” \c 40 \s1 ఆలయ ప్రాంతం పునరుద్ధరణ \p \v 1 అప్పటికి మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదవ సంవత్సరంలోని మొదటి నెల పదవ రోజున, అనగా పట్టణం నాశనమైన పద్నాలుగవ సంవత్సరంలో ఆ రోజునే యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఆయన నన్ను పట్టణానికి తీసుకెళ్లారు. \v 2 దేవుని దర్శనంలో ఆయన నన్ను ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చాలా ఎత్తైన పర్వతం మీద నన్ను ఉంచారు. దాని మీద దక్షిణం వైపున ఒక పట్టణం లాంటిది నాకు కనిపించింది. \v 3 ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లగా మెరుస్తున్న ఇత్తడిలా ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను. అతడు తన చేతిలో నార దారం, కొలిచే కర్ర పట్టుకుని పట్టణ ద్వారంలో నిలబడి ఉన్నాడు. \v 4 ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, నేను నీకు చూపించబోయే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపించడానికే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నీవు చూసిన ప్రతిదాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేయి.” \s2 తూర్పు ద్వారం నుండి బయటి ఆవరణం వరకు \p \v 5 ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన గోడను నేను చూశాను. ఆ వ్యక్తి చేతిలోని ఉన్న కొలిచే కడ్డీ పొడవు ఆరు మూరలు, ఒక్కొక్కటి ఒక మూర ఒక బెత్తెడు వెడల్పు ఉంది. అతడు గోడను కొలిచాడు; అది ఆ కొలిచే కడ్డీ అంత వెడల్పు, ఆ కడ్డీ అంత ఎత్తు ఉంది. \p \v 6 అప్పుడతడు తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్లి దాని మెట్లెక్కి దాని గుమ్మపు గడపను కొలిచినప్పుడు అది ఒక కొలిచే కర్ర పొడవు ఉంది. \v 7 కావలివారి గది పొడవు వెడల్పులు కొలిచే కర్రంత ఉన్నాయి. ఆ గదులకు మధ్య ఉన్న గోడలు అయిదు మూరల\f + \fr 40:7 \fr*\ft అంటే సుమారు 2.7 మీటర్లు\ft*\ft ; \+xt 48|link-href="EZK 40:48"\+xt* వచనంలో కూడా\ft*\f* మందంగా ఉన్నాయి. ద్వారం ప్రక్క నుండి ఆలయానికి ఎదురుగా ఉన్న మంటపానికి ఒక కొలిచే కర్ర లోతు ఉంది. \p \v 8 అతడు ద్వారపు మంటపం మధ్య కొలిచాడు; \v 9 ద్వారం వాకిలి ఎనిమిది మూరలు,\f + \fr 40:9 \fr*\ft అంటే, సుమారు 4.2 మీటర్లు\ft*\f* దాని ద్వారబంధాలు రెండు మూరలు\f + \fr 40:9 \fr*\ft అంటే, సుమారు 1 మీటరు\ft*\f* ఉన్నాయి; ద్వారపు మంటపం మందిరం లోపలి వైపుకు ఉంది. \p \v 10 తూర్పు ద్వారం లోపల ప్రతి వైపు మూడు కాపలా గదులు ఉన్నాయి; మూడింటికి ఒకే కొలతలు ఉన్నాయి; వాటి రెండు ప్రక్కల ఉన్న ద్వారబంధాలు కూడా ఒకే కొలతలు ఉన్నాయి. \v 11 అప్పుడు అతడు ద్వారాల వాకిళ్లను కొలిచినప్పుడు దాని వెడల్పు పది మూరలు, పొడవు పదమూడు మూరలు\f + \fr 40:11 \fr*\ft అంటే సుమారు 5.3 మీటర్ల వెడల్పు 6.9 మీటర్ల పొడవు\ft*\f* ఉన్నాయి. \v 12 ప్రతి కాపలా గదికి ఎదురుగా ఉన్న గోడ ఎత్తు ఒక మూర ఉంది. గదులైతే రెండు ప్రక్కలా ఆరు మూరల ఎత్తు ఉన్నాయి. \v 13 అప్పుడతడు ఒక గది పైకప్పు నుండి మరో గది పైకప్పు వరకు ద్వారాన్ని కొలిచినప్పుడు ఇరవై అయిదు మూరల\f + \fr 40:13 \fr*\ft అంటే సుమారు 13 మీటర్లు\ft*\ft ; \+xt 21|link-href="EZK 40:21"\+xt*, \+xt 25|link-href="EZK 40:25"\+xt*, \+xt 29|link-href="EZK 40:29"\+xt*, \+xt 30|link-href="EZK 40:30"\+xt*, \+xt 33|link-href="EZK 40:33"\+xt*, \+xt 36|link-href="EZK 40:36"\+xt* వచనాల్లో కూడా\ft*\f* దూరం ఉంది, రెండు వాకిళ్ల మధ్య కూడా అదే కొలత ఉంది. \v 14 అతడు ద్వారం లోపల భాగం చుట్టూ ఉన్న గోడల వెంబడి అరవై మూరలు\f + \fr 40:14 \fr*\ft అంటే, సుమారు 32 మీటర్లు\ft*\f* కొలిచాడు. ఆ కొలత ఆవరణానికి ఎదురుగా ఉన్న ప్రాంగణం వరకు. \v 15 బయటి గుమ్మం నుండి లోపలి గుమ్మం ద్వారం యొక్క ఆవరణం వరకు యాభై మూరలు.\f + \fr 40:15 \fr*\ft అంటే సుమారు 27 మీటర్లు; \+xt 21|link-href="EZK 40:21"\+xt*, \+xt 25|link-href="EZK 40:25"\+xt*, \+xt 29|link-href="EZK 40:29"\+xt*, \+xt 33|link-href="EZK 40:33"\+xt*, \+xt 36|link-href="EZK 40:36"\+xt* వచనాల్లో కూడా\ft*\f* \v 16 కాపలా గదులకు ద్వారం లోపల చుట్టూ ఉన్న గోడలకు ప్రక్క గదులకు మూసి ఉన్న కిటికీలు ఉన్నాయి. గోడలోని ద్వారబంధాలు కిటికీలు ఉన్నాయి. ప్రతి ద్వారబంధాన్ని ఖర్జూరం చెట్లతో అలంకరించారు. \s2 బయటి ఆవరణం \p \v 17 తర్వాత నన్ను బయటి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. అక్కడ నేను కొన్ని గదులు, ఆవరణం చుట్టూ నిర్మించబడిన ఒక కాలిబాటను చూశాను; కాలిబాట ప్రక్కగా ముప్పై గదులు ఉన్నాయి. \v 18 ఈ చప్టా ద్వారం వరకు ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది క్రింది చప్టా. \v 19 అప్పుడు అతడు దిగువ ద్వారం లోపలి నుండి లోపలి ఆవరణం బయట వరకు కొలిచినప్పుడు అది తూర్పు వైపుకు వంద మూరలు ఉత్తరం వైపుకు వంద మూరలు ఉంది. \s2 ఉత్తర ద్వారము \p \v 20 అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు. \v 21 దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కాపలా గదులను వాటి ద్వారబంధాలను వాటి మధ్య గోడలను కొలిచినప్పుడు వాటి కొలత, మొదటి ద్వారం కొలత ఒక్కటే. పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. \v 22 వాటి కిటికీలు మధ్య గోడలు, ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాల కొలతలన్నీ తూర్పు గుమ్మం కొలతతో సమానంగా ఉన్నాయి. పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి. \v 23 తూర్పు ద్వారంలా ఉత్తర ద్వారానికి ఎదురుగా లోపలి ఆవరణానికి దారితీసే ఒక గుమ్మం ఉంది. ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు దూరం కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది. \s2 దక్షిణ ద్వారం \p \v 24 అప్పుడతడు నన్ను దక్షిణం వైపుకు తీసుకెళ్లగా అక్కడ దక్షిణ ద్వారం కనిపించింది. దాని ద్వారబంధాలను మధ్య గోడలను కొలిచినప్పుడు దీని కొలత ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే. \v 25 వాటికి ఉన్నట్లుగానే దీనికి కూడా దీని మధ్యగోడలకు చుట్టూ కిటికీలు ఉన్నాయి. ద్వారం పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. \v 26 పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి. రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాలు ఉన్నాయి. \v 27 అతడు ఈ ద్వారం నుండి దక్షిణం వైపున ఉన్న బయటి ద్వారం వరకు కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది. \s2 లోపలి ఆవరణానికి ద్వారాలు \p \v 28 అప్పుడతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి దక్షిణ ద్వారాన్ని కొలిచాడు; దీని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే. \v 29 దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. \v 30 లోపలి ఆవరణం చుట్టూ ఉన్న మధ్య గోడల పొడవు ఇరవై అయిదు మూరలు వెడల్పు అయిదు మూరలు. \v 31 దాని మధ్య గోడలు బయటి ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి. \p \v 32 అప్పుడతడు నన్ను తూర్పు వైపున ఉన్న లోపలి ఆవరణం దగ్గరికి తీసుకువచ్చి దాని ద్వారాన్ని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే. \v 33 దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. \v 34 దాని ద్వారబంధాలు బయట ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి. \p \v 35 అప్పుడతడు నన్ను ఉత్తర ద్వారం దగ్గరికి తీసుకువచ్చి దానిని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే. \v 36 అలాగే కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది. \v 37 దాని ద్వారబంధాలు బయట ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి. \s2 బలులు సిద్ధపరచడానికి గదులు \p \v 38 ప్రతి లోపలి ద్వారంలో మంటపం దగ్గర ద్వారం ఉన్న గది ఉంది, ఇక్కడ దహనబలుల మాంసం కడుగుతారు. \v 39 ద్వారపు మంటపానికి రెండు వైపులా రెండు బల్లలు ఉన్నాయి; వాటిపై దహనబలులు, పాపపరిహార బలులు,\f + \fr 40:39 \fr*\ft లేదా \ft*\fqa శుద్ధీకరణ అర్పణ\fqa*\f* అపరాధబలులను వధిస్తారు. \v 40 ద్వారం యొక్క బయటి మంటపం దగ్గర ఉత్తర ద్వారం మెట్లు ఎక్కే చోట రెండు బల్లలు, మెట్లకు అవతలి వైపు రెండు బల్లలు ఉన్నాయి. \v 41 ద్వారానికి ఒక్కో వైపు నాలుగు చొప్పున రెండు వైపులా ఎనిమిది బల్లలు ఉన్నాయి; వాటిపై బలులు వధిస్తారు. \v 42 అంతే కాకుండా దహనబలుల కోసం చెక్కిన రాతితో చేసిన నాలుగు బల్లలు ఉన్నాయి; వాటి పొడవు మూరన్నర వెడల్పు మూరన్నర ఎత్తు ఒక మూర.\f + \fr 40:42 \fr*\ft అంటే, సుమారు 80 సెం.మీ. పొడవు 53 సెం.మీ. ఎత్తు\ft*\f* దహనబలులు ఇతర బలులు వధించడానికి ఉపయోగించే పాత్రలు వాటిపై ఉంచారు. \v 43 చుట్టూ ఉన్న గోడకు ఒక బెత్తెడు పొడవు ఉన్న మేకులు తగిలించి ఉన్నాయి. అర్పణల మాంసాన్ని ఆ బల్లల మీద ఉంచుతారు. \s2 యాజకులకు గదులు \p \v 44 లోపలి ఆవరణంలో లోపలి ద్వారం బయట రెండు గదులు ఉన్నాయి. ఒకటి ఉత్తర ద్వారం దగ్గర దక్షిణం వైపుగా ఒకటి, తూర్పు ద్వారం దగ్గర ఉత్తరం వైపుగా ఒకటి ఉన్నాయి. \v 45 అతడు నాతో ఇలా అన్నాడు, “దక్షిణం వైపుగా ఉన్న గది మందిరాన్ని కాపలా కాసే యాజకుల కోసము. \v 46 ఉత్తరం వైపుగా ఉన్న గది బలిపీఠాన్ని కాపలా కాసే యాజకుల కోసము. లేవీయులలో సాదోకు వారసులైన వీరు యెహోవా సన్నిధిలో సేవ చేయటానికి వస్తారు.” \p \v 47 అప్పుడతడు ఆవరణాన్ని కొలిచినప్పుడు అది చతురస్రాకారంలో ఉండి పొడవు వెడల్పులు వంద మూరలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా బలిపీఠం ఉంది. \s1 నూతన మందిరం \p \v 48 అప్పుడతడు ఆలయ మంటపంలోకి నన్ను తీసుకెళ్లి దాని స్తంభాలను కొలిచాడు; రెండు వైపులా వాటి వెడల్పు అయిదు మూరలు. దాని ద్వారం వెడల్పు పద్నాలుగు మూరలు\f + \fr 40:48 \fr*\ft అంటే, సుమారు 7.4 మీటర్లు\ft*\f* ఉంది, దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం మూడు మూరలు.\f + \fr 40:48 \fr*\ft అంటే, సుమారు 1.6 మీటర్లు\ft*\f* \v 49 మంటపం పొడవు ఇరవై మూరలు.\f + \fr 40:49 \fr*\ft అంటే, సుమారు 11 మీటర్లు\ft*\f* వెడల్పు పన్నెండు\f + \fr 40:49 \fr*\ft కొ. ప్రా. ప్ర. లలో \ft*\fqa పదకొండు\fqa*\f* మూరలు.\f + \fr 40:49 \fr*\ft అంటే, సుమారు 6.4 మీటర్లు\ft*\f* దానిపైకి ఎక్కడానికి మెట్లున్నాయి,\f + \fr 40:49 \fr*\ft కొ. ప్రా. ప్ర. లలో \ft*\fqa 10 మెట్లు\fqa*\f* దాని ద్వారబంధాలకు రెండు వైపులా స్తంభాలు ఉన్నాయి. \c 41 \p \v 1 అప్పుడతడు నన్ను ప్రధాన ప్రాంగణంలోనికి తీసుకువచ్చి ద్వారబంధాలను కొలిచాడు, వాటి వెడల్పు రెండు వైపులా ఆరు మూరలు\f + \fr 41:1 \fr*\ft అంటే సుమారు 3.2 మీటర్లు\ft*\ft ; \+xt 3|link-href="EZK 41:3"\+xt*, \+xt 5|link-href="EZK 41:5"\+xt*, \+xt 8|link-href="EZK 41:8"\+xt* వచనాల్లో కూడా\ft*\f* ఉంది. \v 2 వాకిలి వెడల్పు పది మూరలు. దానికి రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు అయిదు మూరలు ఉంది. దానిని కొలిచినప్పుడు పొడవు నలభై మూరలు వెడల్పు ఇరవై మూరలు\f + \fr 41:2 \fr*\ft అంటే సుమారు 2.7 మీటర్లు\ft*\ft ; \+xt 9|link-href="EZK 41:9"\+xt*, \+xt 11|link-href="EZK 41:11"\+xt*, \+xt 12|link-href="EZK 41:12"\+xt* వచనాల్లో కూడా\ft*\f* ఉంది. \p \v 3 అప్పుడతడు గర్భాలయం లోపలికి వెళ్లి వాకిలి ద్వారబంధాలను కొలిచినప్పుడు వాటి వెడల్పు రెండు మూరలు\f + \fr 41:3 \fr*\ft అంటే సుమారు 1.1 మీటర్లు\ft*\ft ; \+xt 22|link-href="EZK 41:22"\+xt* వచనంలో కూడా\ft*\f*, వాకిలి ఆరు మూరలు దానికి రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు ఏడు మూరలు ఉంది. \v 4 అతడు గర్భాలయాన్ని కొలిచినప్పుడు దాని పొడవు ఇరవై మూరలు, ప్రధాన మందిరానికి దానికి మధ్య ఉన్న వెడల్పు ఇరవై మూరలు ఉంది. “అది అతి పరిశుద్ధ స్థలం” అని అతడు నాతో చెప్పాడు. \p \v 5 తర్వాత అతడు ఆలయ గోడలను కొలిచినప్పుడు వాటి మందం ఆరు మూరలు, ఆలయానికి రెండు వైపులా ఉన్న గదుల వెడల్పు నాలుగేసి మూరల ఉంది. \v 6 ప్రక్కన ఉన్న ఆ గదులకు మూడంతస్థులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో ముప్పై గదులున్నాయి. అవి ఆలయ గోడకు ఆనుకుని ఉండకుండా ప్రక్క గదులకు ఆనుకుని ఉండేలా ఆలయ గోడ చుట్టూ వరసగా ఉన్నాయి. \v 7 మందిరం చుట్టూ ఉన్న ఈ ప్రక్క గదులు పైకి వెళ్లే కొలది వాటి వెడల్పు ఎక్కువవుతుంది. మందిరం చుట్టూ ఉన్న గదులు క్రింది నుండి పైకి వెళ్లే కొలది ఎక్కువ వెడల్పుగా ఉండేలా అవి నిర్మించబడ్డాయి. క్రింది అంతస్తు నుండి మధ్య అంతస్తు ద్వారా పై అంతస్తు వరకు మెట్లు ఉన్నాయి. \p \v 8 నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. దాని పొడవు కొలిచే కర్రంత అనగా ఆరు మూరలు. \v 9 ఆ ప్రక్క గదుల బయటి గోడల మందం అయిదు మూరలు. ఆలయపు ప్రక్క గదుల మధ్యలో ఖాళీ స్థలం ఉంది. \v 10 ఆలయానికి అన్ని వైపుల నుండి ఇరవై మూరల దూరంలో యాజకుల గదులు ఉన్నాయి. \v 11 ఆ ప్రక్క గదుల గుమ్మాలు ఖాళీ స్థలం వైపుకు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరం వైపుకు మరొకటి దక్షిణం వైపుకు ఉంది. ఖాళీ స్థలం అన్ని వైపుల నుండి అయిదు మూరలు ఉంది. \p \v 12 పడమటి వైపున ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనం డెబ్బై మూరల వెడల్పుతో ఉంది. దాని గోడ మందం అయిదు మూరలు పొడవు తొంభై మూరలు. \p \v 13 తర్వాత అతడు మందిరాన్ని కొలిచినప్పుడు అది వంద మూరల పొడవు ఉంది. ఆలయ ఆవరణాన్ని దానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దాని గోడలను కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది. \v 14 తూర్పు వైపు ఆలయ ప్రాంగణాన్ని ఆలయ ముందు భాగాన్ని కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది. \p \v 15 మందిరం వెనుక భాగంలో ఉన్న ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దానికి రెండు వైపులా ఉన్న వసారాలను అతడు కొలిచినప్పుడు వంద మూరలు ఉంది. \p ప్రధాన ప్రాంగణం, గర్భాలయం, ఆవరణానికి ఎదురుగా ఉన్న మంటపం, \v 16 గడపలు, కమ్ములు ఉన్న కిటికీలు మూడు అంతస్తుల చుట్టూ ఉన్న వసారాలను చెక్కతో కప్పి ఉన్న గడపలతో సహా ప్రతిదాన్ని అతడు కొలిచాడు. నేల, కిటికీల వరకు ఉన్న గోడ, కిటికీలు చెక్కతో కప్పబడి ఉన్నాయి. \v 17 వాకిలికి పై భాగంలో గర్భాలయం బయట, లోపల ఉన్న గోడలు, మందిరం చుట్టూ ఉన్న బయటి గోడలు లోపలి గోడలు కొలత ప్రకారం కట్టి ఉన్నాయి. \v 18 వాటిపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. రెండు కెరూబుల మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. ప్రతి కెరూబుకు రెండు ముఖాలు ఉన్నాయి. \v 19 ఒక ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు నరుని ముఖం, రెండవ ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు సింహ ముఖం ఉన్నాయి. ఆలయమంతా అవి చెక్కి ఉన్నాయి. \v 20 నేల నుండి వాకిలి పైభాగం వరకు ప్రధాన మందిరపు గోడలపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. \p \v 21 ప్రధాన మందిరానికి ద్వారబంధం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అతి పరిశుద్ధ స్థలం ద్వారబంధం కూడా అలాంటిదే. \v 22 అక్కడ చెక్కతో చేయబడి ఉన్న బలిపీఠం ఎత్తు మూడు మూరలు పొడవు రెండు మూరలు. దాని మూలలు అడుగుభాగం ప్రక్క భాగం కర్రతో చేయబడ్డాయి. “ఇది యెహోవా ఎదుట ఉండే బల్ల” అని అతడు నాతో చెప్పాడు. \v 23 ప్రధాన మందిరానికి అతి పరిశుద్ధ స్థలానికి రెండు తలుపులు ఉన్నాయి. \v 24 ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి. \v 25 గోడ మీద ఉన్నట్లే ప్రధాన ప్రాంగణం తలుపులపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి మంటపానికి కర్రతో చేసిన పందిరి ఉంది. \v 26 ఆవరణ ప్రక్క గోడలలో ఇరుకైన కిటికీలు ఉన్నాయి, ప్రతి వైపున ఖర్జూర చెట్లతో చెక్కబడ్డాయి. ఆలయ ప్రక్క గదులకు కూడా కప్పులు ఉండేవి. \c 42 \s1 యాజకుల కోసం గదులు \p \v 1 అతడు ఉత్తరం వైపుగా బయటి ఆవరణంలోకి నన్ను నడిపించి ఆలయ ప్రాంగణానికి ఉత్తరాన ఉన్న బయటి గోడకు ఎదురుగా ఉన్న గదుల దగ్గరికి తీసుకువచ్చాడు. \v 2 ఉత్తరం వైపు తలుపు ఉన్న ఆ భవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు.\f + \fr 42:2 \fr*\ft అంటే, సుమారు 53 మీటర్ల పొడవు, 27 మీటర్ల వెడల్పు\ft*\f* \v 3 లోపలి ఆవరణం నుండి ఇరవై మూరల\f + \fr 42:3 \fr*\ft అంటే, సుమారు 11 మీటర్లు\ft*\f* భాగంలో బయటి ఆవరణం కాలిబాట ఎదురుగా ఉన్న భాగంలో, వసారా మూడు అంతస్తుల వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. \v 4 ఆ గదుల ముందు పది మూరల వెడల్పు, వంద మూరల పొడవు ఉన్న లోపలి మార్గం ఉంది. వాటి తలుపులు ఉత్తరం వైపు ఉన్నాయి. \v 5 ఆ భవనంలోని క్రింది అలాగే మధ్య అంతస్తులలో ఉన్న గదుల కన్నా పై అంతస్తులో వసారాలు ఎక్కువ స్థలం ఆక్రమించడం వలన పై గదులు ఇరుకుగా ఉన్నాయి. \v 6 పై అంతస్తులో ఉన్న గదులకు ఆవరణంలో ఉన్నట్లుగా స్తంభాలు లేవు; కాబట్టి అవి క్రింది, మధ్య అంతస్తుల కంటే చిన్నవిగా ఉన్నాయి. \v 7 గదులకు, బయటి ఆవరణానికి సమాంతరంగా బయటి గోడ ఉంది; అది యాభై మూరల వరకు గదుల ముందు విస్తరించి ఉంది. \v 8 బయటి ఆవరణ ప్రక్కన ఉన్న గదుల వరుస యాభై మూరల పొడవు ఉండగా, గర్భాలయానికి సమీపంలో ఉన్న వరుస వంద మూరల పొడవు ఉంది. \v 9 బయటి ఆవరణంలో నుండి దిగువ గదుల్లోకి ప్రవేశించేలా దిగువ గదులకు తూర్పు వైపున ద్వారం ఉంది. \p \v 10 బయటి ఆవరణ గోడ పొడవున దక్షిణం వైపున,\f + \fr 42:10 \fr*\ft కొ.ప్రా.ప్ర.లలో \ft*\fqa తూర్పు వైపున\fqa*\f* ఆలయ ప్రాంగణానికి ఆనుకుని, బయటి గోడకు ఎదురుగా గదులు ఉన్నాయి, \v 11 వాటికి ముందు ఒక మార్గం ఉంది. అవి ఉత్తరాన ఉన్న గదుల్లా ఉన్నాయి; అవి ఒకే విధమైన బయటకు వెళ్లే ద్వారాలు, కొలతలతో ఒకే పొడవు, వెడల్పు కలిగి ఉన్నాయి. ఉత్తరాన ఉన్న ద్వారాల మాదిరిగానే, \v 12 దక్షిణాన ఉన్న గదుల ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న గోడకు ఎదురుగా ఉన్న ఆవరణంలోకి వెళ్లే దారి మొదట్లో ఆ గదుల్లోకి వెళ్లడానికి ఒక ద్వారం ఉంది. \p \v 13 అప్పుడతడు నాతో ఇలా అన్నాడు, “ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉత్తర గదులు, దక్షిణ గదులు యాజకులకు చెందినవి; అక్కడ యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ అర్పణలను తింటారు. అక్కడే వారు అతి పరిశుద్ధ అర్పణలను అనగా భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులను ఉంచుతారు. ఆ స్థలం అతిపరిశుద్ధమైనది. \v 14 యాజకులు పరిశుద్ధ ఆవరణంలోకి ప్రవేశించిన తర్వాత, వారు పరిచర్య చేసే వస్త్రాలను విప్పివేసే వరకు వారు బయటి ఆవరణంలోనికి వెళ్లకూడదు, ఎందుకంటే ఇవి పరిశుద్ధమైనవి. ప్రజలు ఉండే స్థలానికి వెళ్లేటప్పుడు యాజకులు వేరే బట్టలు ధరించాలి.” \p \v 15 అతడు లోపలి మందిరాన్ని కొలవడం పూర్తి చేసిన తర్వాత అతడు నన్ను తూర్పు ద్వారం గుండా తీసుకెళ్లి చుట్టూ ఉన్న స్థలాన్ని కొలిచాడు. \v 16 తూర్పు వైపున కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు\f + \fr 42:16 \fr*\ft అంటే సుమారు 265 మీటర్లు\ft*\ft ; \+xt 17|link-href="EZK 42:17"\+xt*, \+xt 18|link-href="EZK 42:18"\+xt*, \+xt 19|link-href="EZK 42:19"\+xt* వచనాల్లో కూడా\ft*\f* ఉంది. \v 17 అలాగే ఉత్తరం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. \v 18 దక్షిణం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. \v 19 అతడు పడమటి వైపుకు తిరిగి కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. \v 20 అతడు ఆ స్థలాన్ని నాలుగు వైపులా కొలిచాడు. పరిశుద్ధ స్థలాన్ని సాధారణ స్థలాన్ని వేరు చేయడానికి దాని చుట్టూ అయిదువందల మూరల పొడవు అయిదువందల మూరల వెడల్పు గల ఒక గోడ ఉంది. \c 43 \s1 దేవుని మహిమ ఆలయానికి తిరిగి వచ్చుట \p \v 1 అతడు నన్ను తూర్పు వైపున ఉన్న గుమ్మం దగ్గరకు తీసుకువచ్చాడు. \v 2 ఇశ్రాయేలు దేవుని మహిమ తూర్పు నుండి రావడం నేను చూశాను. ఆయన స్వరం, ప్రవహించే జలాల గర్జనలా ఉంది, భూమి ఆయన మహిమతో ప్రకాశిస్తూ ఉంది. \v 3 నేను చూసిన దర్శనం ఆయన\f + \fr 43:3 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa నేను\fqa*\f* పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు కెబారు నది దగ్గర నేను చూసిన దర్శనాల్లా ఉంది, నేను నేలపై సాష్టాంగపడ్డాను. \v 4 తూర్పు వైపున ఉన్న గుమ్మం గుండా యెహోవా మహిమ మందిరంలోనికి ప్రవేశించింది. \v 5 అప్పుడు ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణంలోకి తీసుకువచ్చినప్పుడు, ఆలయమంతా యెహోవా మహిమ నిండిపోయి ఉంది. \p \v 6 ఆ వ్యక్తి నా ప్రక్కన నిలబడి ఉండగా, మందిరం లోపలి నుండి ఎవరో నాతో మాట్లాడడం విన్నాను. \v 7 ఆయన ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఇది నా సింహాసనం, నా పాదాలు పెట్టుకునే స్థలము. ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు తమ వ్యభిచారం ద్వారా, వారి రాజుల మరణ సమయంలో\f + \fr 43:7 \fr*\ft లేదా \ft*\fq వారి \fq*\fqa ఉన్నత స్థలాల్లో\fqa*\f* వారి అంత్యక్రియల అర్పణల\f + \fr 43:7 \fr*\ft లేదా \ft*\fqa స్మారక చిహ్నాలు\fqa*\ft ; \+xt 9|link-href="EZK 43:9"\+xt* వచనంలో కూడా\ft*\f* ద్వారా నామాన్ని వారు గాని వారి రాజులు గాని అపవిత్రం చేయరు. \v 8 నాకు వారికి మధ్య గోడ మాత్రమే ఉంచి, వారు నా గుమ్మం ప్రక్కన తమ గుమ్మాలను, నా గడపల ప్రక్కన తమ గడపలను కట్టి, తమ అసహ్యమైన ఆచారాలతో వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, కాబట్టి నేను కోపంతో వారిని నాశనం చేశాను. \v 9 ఇప్పటికైనా వారు తమ వ్యభిచారాన్ని తమ రాజుల అంత్యక్రియల అర్పణలను నా దగ్గరి నుండి దూరంగా తీసివేసినప్పుడు, నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను. \p \v 10 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలకు సిగ్గుపడేలా మందిరాన్ని గురించి వారికి వివరించండి. వారు దాని పరిపూర్ణతను పరిగణలోనికి తీసుకుని, \v 11 వారు చేసిన పనులన్నిటికి వారు సిగ్గుపడితే, వారికి ఆలయ రూపకల్పనను గురించి అనగా దాని అమర్చిన విధానం, దానిలోనికి వచ్చే బయటకు వెళ్లే ద్వారాల గురించి, దాని మొత్తం రూపకల్పన గురించి, దాని అన్ని నియమాలు, చట్టాలను తెలియజేయాలి. వారు దాని రూపకల్పన పట్ల నమ్మకంగా ఉండగలిగేలా, వారు దాని నియమానలన్నింటినీ అనుసరించేలా చేయడానికి వాటిని వారి ముందు వ్రాసిపెట్టాలి. \p \v 12 “ఇది ఆలయ నియమం: పర్వతం పైన ఉన్న పరిసర ప్రాంతాలన్నీ అత్యంత పవిత్రంగా ఉంటాయి. ఆలయ ధర్మం అలాంటిది. \s1 గొప్ప బలిపీఠం పునరుద్ధరణ \p \v 13 “మూరలలో\f + \fr 43:13 \fr*\ft అంటే, సుమారు 5.3 సెం.మీ\ft*\ft ; \+xt 14|link-href="EZK 43:14"\+xt*, \+xt 17|link-href="EZK 43:17"\+xt* వచనాల్లో కూడ\ft*\f* బలిపీఠం కొలతలు: మూరెడు అంటే ఒక మూర ఒక బెత్తెడు; దాని అడుగుభాగం ఎత్తు ఒక మూర, వెడల్పు ఒక మూర. దాని అంచుకు ఒక జానెడు\f + \fr 43:13 \fr*\ft అంటే, సుమారు 27 సెం.మీ.\ft*\f* చట్రం ఉంది. ఇది బలిపీఠం యొక్క ఎత్తు: \v 14 నేల మీద ఉన్న అడుగుభాగం నుండి క్రింది గట్టు వరకు బలిపీఠం ఎత్తు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. చిన్న గట్టు నుండి పెద్ద గట్టు వరకు దాని ఎత్తు నాలుగు మూరలు, వెడల్పు ఒక మూర. \v 15 బలిపీఠం పొయ్యి ఎత్తు నాలుగు మూరలు. ఆ పొయ్యి నుండి పైకి నాలుగు కొమ్మలు ఉన్నాయి. \v 16 ఆ పొయ్యి చతురస్రంగా ఉండి పొడవు పన్నెండు మూరలు వెడల్పు పన్నెండు మూరలు ఉంది. \v 17 దాని పైచూరు కూడా చతురస్రంగా ఉండి పొడవు పద్నాలుగు మూరలు వెడల్పు పద్నాలుగు మూరలు ఉంది. దాని చుట్టూ ఉన్న అంచు వెడల్పు ఒక జానెడు దాని అంచుకు అర మూరెడు\f + \cat dup\cat*\fr 43:17 \fr*\ft అంటే, సుమారు 27 సెం.మీ.\ft*\f* చట్రం ఉంది. బలిపీఠానికి మెట్లు తూర్పు వైపుగా ఉన్నాయి.” \p \v 18 అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద రక్తం చిలకరించి దహనబలులు అర్పించడానికి నియమాలు ఇవి: \v 19 నా సన్నిధిలో సేవ చేయడానికి వచ్చే సాదోకు కుటుంబీకులు లేవీయులైన యాజకులకు పాపపరిహారబలి అర్పించడానికి కోడెదూడను ఇవ్వాలని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \v 20 వారు దానిని పాపపరిహారబలిగా అర్పించి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేసి దాన్ని శుద్ధీకరించడానికి ఆ దూడ రక్తంలో కొంత తీసుకుని బలిపీఠపు నాలుగు కొమ్ము మీద, పై గట్టు నాలుగు మూలల మీద, చుట్టూ ఉన్న అంచు మీద ఉంచాలి. \v 21 మీరు పాపపరిహారబలి కోసం ఎద్దును తీసుకెళ్లి, పరిశుద్ధాలయం బయట ఆలయ ప్రాంతంలోని నిర్ణయించబడిన భాగంలో కాల్చాలి. \p \v 22 “రెండవ రోజున పాపపరిహారబలిగా ఏ లోపం లేని మేకపోతును అర్పించాలి. కోడెతో బలిపీఠానికి పాపపరిహారం చేసినట్లే మేకపోతుతో కూడా బలిపీఠానికి పాపపరిహారం చేయాలి. \v 23 దానిని శుద్ధి చేయడం పూర్తి చేసిన తర్వాత ఏ దోషంలేని కోడెను, పొట్టేలును అర్పించాలి. \v 24 మీరు వాటిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి అప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పిస్తారు. \p \v 25 “రోజుకు ఒకటి చొప్పున వరుసగా ఏడు రోజులు పాపపరిహారబలిగా మేకపోతులను సిద్ధం చేయాలి. అలాగే మందలో నుండి ఏ లోపం లేని కోడెను పొట్టేలును సిద్ధం చేయాలి. \v 26 ఏడు రోజులు యాజకులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. అలా వారు దానిని ప్రతిష్ఠించాలి. \v 27 ఈ రోజులన్నీ ముగిసిన తర్వాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు మీ సమాధానబలులు అర్పిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” \c 44 \s1 యాజకత్వ పునరుద్ధరణ \p \v 1 అతడు నన్ను తూర్పు వైపున ఉన్న పరిశుద్ధస్థలం బయటి ద్వారం దగ్గరికి తీసుకువచ్చాడు. అది మూసి ఉంది. \v 2 యెహోవా నాతో ఇలా అన్నారు, “అది మూసే ఉంటుంది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ద్వారం గుండా ప్రవేశించారు కాబట్టి అది మూసే ఉంటుంది. ఏ ఒక్కరూ దానిలో ప్రవేశించకుండా ఇక ఎన్నటికీ తెరవకుండా మూసే ఉంటుంది. \v 3 యువరాజైన ఒక్కడే యెహోవా సన్నిధిలో భోజనం చేయడానికి ద్వారం లోపల కూర్చోవచ్చును. అతడు మంటపం మార్గంలో లోపలికి వెళ్లి అదే దారిలో బయటకు వెళ్లాలి.” \p \v 4 అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా మందిరం ముందుకు తీసుకువచ్చాడు. అప్పుడు నేను యెహోవా మహిమ ప్రకాశంతో యెహోవా మందిరం నిండిపోవడం చూసి నేను నేలపై పడ్డాను. \p \v 5 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, యెహోవా ఆలయానికి సంబంధించిన అన్ని నియమాలు విధుల గురించి నేను నీకు చెప్పే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని గ్రహించు. మందిరం లోపలికి వచ్చే మార్గాన్ని పరిశుద్ధస్థలం నుండి బయటకు వెళ్లే అన్ని మార్గాలను శ్రద్ధగా గమనించు. \v 6 తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు ప్రజలారా, ఇంతవరకు మీరు చేసిన అసహ్యమైన ఆచారాలు చాలు. \v 7 మీరు చేసిన అసహ్యమైన ఆచారాలతో పాటు హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులను నా పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువచ్చి మీరు నాకు ఆహారాన్ని క్రొవ్వును రక్తాన్ని అర్పించి నా మందిరాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగం చేశారు. \v 8 మీకు అప్పగించిన నా పవిత్ర వస్తువుల బాధ్యతను మీరు నెరవేర్చకుండా నా పరిశుద్ధస్థలం యొక్క బాధ్యతను ఇతరులకు అప్పగించారు. \v 9 ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులుగా ఇశ్రాయేలీయుల మధ్య నివసించే వారిలో ఎవరూ నా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించకూడదు. \p \v 10 “ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టి తమ విగ్రహాలను అనుసరించినప్పుడు వారితో పాటు నాకు దూరమైన లేవీయులు తమ దోషాన్ని భరించాలి. \v 11 వారు నా పరిశుద్ధ స్థలంలో సేవ చేశారు, ఆలయ ద్వారపాలకులుగా బాధ్యత వహించి సేవ చేశారు; వారు ప్రజల కోసం దహనబలులను బలులను వధించి ప్రజల ముందు నిలబడి వారికి సేవ చేశారు. \v 12 కానీ వారు తమ విగ్రహాల సమక్షంలో వారికి సేవ చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యారు కాబట్టి వారు తమ పాప దోషాన్ని భరించేలా నేను వారికి వ్యతిరేకంగా నా చేయెత్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \v 13 వారు నాకు యాజకులుగా సేవ చేయడానికి నా సన్నిధికి రాకూడదు, నా పరిశుద్ధ వస్తువుల దగ్గరకు గాని అతి పరిశుద్ధ అర్పణల దగ్గరకు గాని రాకూడదు. వారు చేసిన అసహ్యమైన పనులకు వారు అవమానాన్ని భరించాలి. \v 14 అయితే మందిరంలో చేయవలసిన పనులన్నిటికి నేను వారిని కాపలాగా నియమిస్తాను. \p \v 15 “ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టినప్పుడు నా పరిశుద్ధ స్థలానికి కాపలాగా ఉన్న సాదోకు వంశస్థులై లేవీయులైన యాజకులు సేవ చేయడానికి నా సన్నిధికి వస్తారు. వారు నా ఎదుట నిలబడి క్రొవ్వును రక్తాన్ని నాకు అర్పిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \v 16 వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు; వారే నా బల్ల దగ్గరికి వచ్చి సేవ చేస్తారు. వారే నేను అప్పగించిన దాన్ని కాపాడతారు. \p \v 17 “ ‘వారు లోపలి ఆవరణపు గుమ్మాల్లోకి ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరించాలి; లోపలి ఆవరణపు గుమ్మాల్లో గాని మందిరం లోపల గాని సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు వేసుకోకూడదు. \v 18 తలకు నార తలపాగా ధరించి నడుముకు నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేదీ ఏదీ వారు ధరించకూడదు. \v 19 ప్రజలు ఉండే బయటి ఆవరణంలోకి వారు వెళ్లేటప్పుడు వారి వస్త్రాలతో తాకి ప్రజలు ప్రతిష్ఠించకుండా ఉండడానికి తమ సేవ వస్త్రాలను తీసివేసి వాటిని పవిత్రమైన గదుల్లో ఉంచి వేరే బట్టలు వేసుకుని వెళ్లాలి. \p \v 20 “ ‘వారు తమ తలలు క్షౌరం చేయించుకోకూడదు, తలవెంట్రుకలు పొడవుగా పెరగకుండ వాటిని కత్తిరించాలి. \v 21 లోపలి ఆవరణంలో ప్రవేశించేటప్పుడు ఏ యాజకుడు ద్రాక్షరసం త్రాగకూడదు. \v 22 యాజకులు విధవరాండ్రను గాని, విడాకులు తీసుకున్న స్త్రీని గాని పెళ్ళి చేసుకోకూడదు. వారు కేవలం ఇశ్రాయేలు కన్యలను గాని యాజకులకు భార్యలై విధవరాండ్రుగా ఉన్నవారిని గాని పెళ్ళి చేసుకోవచ్చు. \v 23 అంతేగాక వారు నా ప్రజలకు పవిత్రమైన వాటికి సాధారణమైన వాటి మధ్య భేదాన్ని బోధిస్తారు; పవిత్రమైన దానికి, అపవిత్రమైన దానికి మధ్య తేడా ఏమిటో వారికి చూపిస్తారు. \p \v 24 “ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి. \p \v 25 “ ‘యాజకుడు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి తనను తాను అపవిత్రం చేసుకోకూడదు; చనిపోయిన వ్యక్తి తన తండ్రి తల్లి కుమారుడు కుమార్తె సోదరుడు లేదా పెళ్ళికాని సోదరి అయితే శవాన్ని ముట్టుకొని అతడు అపవిత్రం కావచ్చు. \v 26 అయితే అతడు శుద్ధి చేయబడిన తర్వాత, అతడు ఏడు రోజులు వేచి ఉండాలి. \v 27 పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి పరిశుద్ధాలయం లోపలి ఆవరణంలోనికి వెళ్లినప్పుడు అతడు పాపపరిహారబలి\f + \fr 44:27 \fr*\ft లేదా \ft*\fqa శుద్ధీకరణ అర్పణ\fqa*\ft ; \+xt 29|link-href="EZK 44:29"\+xt* వచనంలో కూడా\ft*\f* అర్పించాలి, అని ప్రభువైన యెహోవా ప్రకటించారు. \p \v 28 “ ‘యాజకులకు ఉన్న ఏకైన వారసత్వం నేనే. నీవు వారికి ఇశ్రాయేలులో స్వాస్థ్యం ఇవ్వకూడదు; నేనే వారికి స్వాస్థ్యంగా ఉంటాను. \v 29 వారు భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులు తింటారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించినవన్నీ వారివే అవుతాయి. \v 30 మీ ప్రథమ ఫలాల్లో మీ ప్రత్యేక కానుకలన్నిటిలో శ్రేష్ఠమైనవి యాజకులకు చెందుతాయి. మీ కుటుంబం మీద ఆశీర్వాదం ఉండేలా మీరు మొదట పిసికిన పిండిముద్దను యాజకులకు ఇవ్వాలి. \v 31 పక్షుల్లో పశువుల్లో సహజంగా చచ్చిన వాటిని గాని మృగాలు చీల్చిన వాటిని గాని యాజకులు తినకూడదు. \c 45 \s1 ఇశ్రాయేలు పూర్తి పునరుద్ధరణ \p \v 1 “ ‘మీరు భూమిని వారసత్వంగా కేటాయిస్తున్నప్పుడు, మీరు భూమి నుండి ఒక భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఆ భాగం పొడవు 25,000 మూరలు,\f + \fr 45:1 \fr*\ft అంటే సుమారు 13 కి. మీ\ft*\ft ; \+xt 3|link-href="EZK 45:3"\+xt*, \+xt 5|link-href="EZK 45:5"\+xt*, \+xt 6|link-href="EZK 45:6"\+xt* వచనాల్లో కూడా\ft*\f* వెడల్పు 20,000\f + \fr 45:1 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa 10,000 \fqa*\ft \+xt 3|link-href="EZK 45:3"\+xt*, \+xt 5|link-href="EZK 45:5"\+xt*, \+xt 48:9\+xt* వచనాలు కూడా చూడండి\ft*\f* మూరలు\f + \fr 45:1 \fr*\ft అంటే, సుమారు 11 కి. మీ\ft*\f* ఉండాలి; ఆ స్థలమంతా ప్రతిష్ఠితమవుతుంది. \v 2 దానిలో పరిశుద్ధస్థలం కోసం 500 మూరల\f + \fr 45:2 \fr*\ft అంటే, సుమారు 265 మీటర్లు\ft*\f* చతురస్రాకార స్థలాన్ని కేటాయించాలి దాని చుట్టూ అన్నివైపులా 50 మూరల మైదానం ఉండాలి. \v 3 ఈ స్థలం నుండి 25,000 మూరల పొడవు 10,000 మూరల\f + \fr 45:3 \fr*\ft అంటే; సుమారు 5.3 కి. మీ\ft*\ft ; \+xt 5|link-href="EZK 45:5"\+xt* వచనంలో కూడా\ft*\f* వెడల్పు గల భూమి కొలవాలి. దానిలో అతి పరిశుద్ధ స్థలమైన పరిశుద్ధస్థలం ఉంటుంది. \v 4 యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలమవుతుంది. అది వారి ఇళ్ళకు స్థలంగా పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలంగా ఉంటుంది. \v 5 25,000 మూరల పొడవు 10,000 మూర వెడల్పు గల స్థలం మందిరంలో సేవచేసే లేవీయులకు స్వాస్థ్యంగా ఇరవై గదులు ఉన్న వారి నివాస స్థలంగా ఉంటుంది. \p \v 6 “ ‘పరిశుద్ధ స్థలానికి ఆనుకుని 5,000 మూరల వెడల్పు 25,000 మూరల పొడవు ఉన్న పవిత్ర భాగాన్ని మీరు పట్టణానికి ఆస్తిగా ఇవ్వాలి; అది ఇశ్రాయేలీయులందరికి చెందుతుంది. \p \v 7 “ ‘ప్రతిష్ఠిత భాగానికి పట్టణ భాగానికి ఎదురుగా, వాటికి పడమర వైపుగా తూర్పు వైపుగా, ప్రతిష్ఠిత భాగానికి పట్టణ భాగానికి రెండు వైపులా ఉన్న భూభాగాన్ని యువరాజుకు కేటాయించాలి. పడమర నుండి తూర్పుకు కొలిచినప్పుడు అది ఒక గోత్ర భాగానికి సరిపడిన పొడవు ఉండాలి. \v 8 ఈ భూమి ఇశ్రాయేలులో అతనికి స్వాస్థ్యంగా ఉంటుంది. నా అధిపతులు ఇకపై నా ప్రజలను హింసించరు కానీ ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల ప్రకారం భూమిని కేటాయించుకోడానికి అనుమతిస్తారు. \p \v 9 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు అధిపతులారా! ఇక చాలు. ఇంతవరకు మీరు పెట్టిన హింసను బాధను విడిచిపెట్టి, న్యాయమైనది సరియైనది చేయండి. నా ప్రజలను దోచుకోవడం మానండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \v 10 మీరు సరైన త్రాసు సరైన ఏఫాను\f + \fr 45:10 \fr*\ft అంటే, సుమారు 22 లీటర్లు\ft*\f* సరైన బాతును\f + \cat dup\cat*\fr 45:10 \fr*\ft అంటే, సుమారు 22 లీటర్లు\ft*\f* వాడండి. \v 11 ఏఫా బాతు ఒకే పరిమాణంలో ఉండాలి; హోమెరులో పదవ వంతు ఏఫా, హోమెరులో పదవ వంతు బాతు; హోమెరు రెండింటికీ ప్రామాణిక కొలతగా ఉండాలి. \v 12 ఒక షెకెలుకు\f + \fr 45:12 \fr*\ft అంటే, సుమారు 12 గ్రాములు\ft*\f* ఇరవై గెరాలు. ఇరవై షెకెళ్లు, ఇరవై అయిదు షెకెళ్లు, పదిహేను షెకెళ్లు కలిపి ఒక మినాకు\f + \fr 45:12 \fr*\ft అంటే, సుమారు 690 గ్రాములు\ft*\f* సమానము. \p \v 13 “ ‘మీరు అర్పించవలసిన ప్రత్యేక కానుక ఏంటంటే ప్రతి హోమెరు గోధుమలలో ఒక ఏఫాలో\f + \fr 45:13 \fr*\ft అంటే, 2.7 కి. గ్రా. లు\ft*\f* ఆరవ భాగం ప్రతి హోమెరు యవలలో ఒక ఏఫాలో ఆరవ భాగం అర్పించాలి. \v 14 సూచించిన భాగం బాతులలో\f + \fr 45:14 \fr*\ft అంటే, సుమారు 2.2 లీటర్లు\ft*\f* కొలత ప్రకారం మీ నూనెలో ప్రతి కోరుకు బాతులో పదోవంతు అర్పించాలి. ఒక కోరు అనగా పది బాతులు లేదా ఒక హోమెరు; అంటే పది బాతులు ఒక హోమెరుకు సమానము. \v 15 అలాగే ఇశ్రాయేలులో మంచి నీరున్న పచ్చికబయళ్లలో మేపిన మందలోని ప్రతి రెండు వందలకు ఒక గొర్రెను తీసుకోవాలి. ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వీటిని భోజనార్పణలు, దహనబలులు, సమాధాన బలులకు ఉపయోగిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. \v 16 దేశంలోని ప్రజలందరూ ఇశ్రాయేలులోని యువరాజుకు ఈ ప్రత్యేక కానుక ఇవ్వాలి. \v 17 పండుగల్లోను, అమావాస్య దినాల్లోను, సబ్బాతు దినాల్లోను, ఇశ్రాయేలీయులు కూడుకునే నియామక కాలాల్లోను వాడబడే దహనబలులను నైవేద్యాలను పానార్పణలను అందించడం అధిపతి యొక్క బాధ్యత. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలులు, భోజనార్పణలు, దహనబలులు, సమాధానబలులను సమకూరుస్తాడు. \p \v 18 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మొదటి నెల మొదటి రోజున లోపం లేని కోడెను తీసుకుని పరిశుద్ధాలయాన్ని శుద్ధి చేయాలి. \v 19 యాజకుడు పాపపరిహారబలి రక్తంలో కొంత తీసి దానిని ఆలయ ద్వారబంధాల పైన, బలిపీఠపు పైగట్టు నాలుగు మూలల మీద, లోపలి ఆవరణ ద్వారబంధాల పైన చల్లాలి. \v 20 అనుకోకుండ గాని అవివేకంతో గాని ఎవరైనా పాపం చేస్తే, అలాంటి వారికి మీరు నెలలో ఏడవ రోజున అదే విధంగా చేయాలి; ఇలా మీరు ఆలయానికి ప్రాయశ్చిత్తం చేయాలి. \p \v 21 “ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు పస్కా పండుగ ఆచరించాలి, ఆ పండుగ జరిగే ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి. \v 22 ఆ రోజు అధిపతి తన కోసం, దేశంలోని ప్రజలందరి కోసం పాపపరిహారబలిగా ఒక ఎద్దును అందించాలి. \v 23 పండుగ జరిగే ఏడు రోజుల్లో ప్రతిరోజు అతడు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఏడు ఎద్దులు ఏడు పొట్టేళ్లను, పాపపరిహారబలిగా ఒక మేకపోతును ఇవ్వాలి. \v 24 అతడు భోజనార్పణగా ప్రతి కోడెతో పాటు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క కోడెకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క పొట్టేలుకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఏఫా పిండికి ఒక హిన్\f + \fr 45:24 \fr*\ft అంటే, సుమారు 3.8 లీటర్లు\ft*\f* ఒలీవ నూనెను కూడా ఇవ్వాలి. \p \v 25 “ ‘ఏడవ నెలలో పదిహేనవ రోజున ప్రారంభమయ్యే పండుగ యొక్క ఏడు రోజుల్లో కూడా అతడు పాపపరిహార బలులు, దహనబలులు, భోజనార్పణలు, నూనెను అదే విధంగా ఏర్పాటు చేయాలి. \c 46 \p \v 1 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఆరు పని దినాల్లో తూర్పు ముఖంగా ఉన్న లోపలి ఆవరణ ద్వారం మూసివేయబడాలి, అయితే సబ్బాతు దినాన అమావాస్య రోజున దానిని తెరవాలి. \v 2 యువరాజు బయటి మంటప గుమ్మం ద్వారా ప్రవేశించి గుమ్మం ద్వారబంధాల దగ్గర నిలబడాలి. యాజకులు అతని దహనబలిని, సమాధానబలులను అర్పించాలి. అతడు గుమ్మం దగ్గర ఆరాధన చేసి నమస్కరించి బయటకు వెళ్లాలి, కాని సాయంత్రం వరకు ద్వారాన్ని మూసివేయకూడదు. \v 3 సబ్బాతులలో, అమావాస్యల్లో దేశ ప్రజలు ఆ ద్వారం దగ్గర నిలబడి యెహోవాను ఆరాధించాలి. \v 4 సబ్బాతు దినాన యువరాజు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఆరు మగ గొర్రెపిల్లలను ఒక పొట్టేలును అర్పించాలి. \v 5 పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని భోజనార్పణగా అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి. \v 6 అమావాస్య నాడు అతడు ఒక కోడెను, ఆరు గొర్రెపిల్లలను, ఒక పొట్టేలును లోపం లేనివాటిని అర్పించాలి. \v 7 అతడు భోజనార్పణగా ఎద్దుతో పాటు ఒక ఏఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి. \v 8 యువరాజు ప్రవేశించినప్పుడు, అతడు మంటప గుమ్మం ద్వారా లోపలికి వెళ్లాలి అదే దారిలో బయటకు రావాలి. \p \v 9 “ ‘దేశ ప్రజలు నియమించబడిన పండుగల్లో యెహోవా సన్నిధికి ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఉత్తర ద్వారం నుండి వచ్చేవారు దక్షిణ ద్వారం నుండి బయటకు వెళ్లాలి; దక్షిణ ద్వారం నుండి వచ్చేవారు ఉత్తర ద్వారం నుండి బయటకు వెళ్లాలి. ఎవరూ తాము వచ్చిన ద్వారం గుండా తిరిగి వెళ్లకుండా ప్రతిఒక్కరు తిన్నగా బయటకు వెళ్లాలి. \v 10 యువరాజు వారి మధ్య ఉండి, లోపలికి వెళ్లి వారితో పాటు బయటకు వెళ్లాలి. \v 11 పండుగల్లో, నియమించబడిన సమయాల్లో, భోజనార్పణగా ఎద్దుతో పాటు ఒక ఏఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి. \p \v 12 “ ‘యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని యువరాజు అర్పించేటప్పుడు అతని కోసం తూర్పు వైపు ద్వారం తలుపులు తెరవాలి. సబ్బాతు దినాన అర్పించునట్లుగానే దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తర్వాత ద్వారం తలుపులు మూసివేయాలి. \p \v 13 “ ‘ప్రతిరోజు మీరు యెహోవాకు దహనబలిగా ఏ లోపం లేని ఒక సంవత్సరం వయస్సున్న గొర్రెపిల్లను అందించాలి. ప్రతి ఉదయం మీరు దానిని ఏర్పాటు చేయాలి. \v 14 మీరు దానితో ప్రతి ఉదయం భోజనార్పణను ఏర్పాటు చేయాలి, పిండిని తేమగా ఉంచడానికి ఒక ఏఫాలో\f + \fr 46:14 \fr*\ft అంటే, సుమారు 2.7 కి. గ్రా. లు.\ft*\f* ఆరవ వంతు నూనెతో పాటు, ఒక హిన్‌లో\f + \fr 46:14 \fr*\ft అంటే, సుమారు 1.3 లీటర్లు\ft*\f* మూడింట ఒక వంతు నూనె ఉంటుంది. ఈ భోజనార్పణను యెహోవాకు సమర్పించడమనేది నిత్య కట్టుబాటుగా ఉంటుంది. \v 15 కాబట్టి ప్రతిరోజు ఉదయం క్రమమైన దహనబలి కోసం గొర్రెపిల్లను, భోజనార్పణను, నూనెను అందించాలి. \p \v 16 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అధిపతి వారసత్వంగా పొందిన భూమిలో ఒక భాగం తన కొడుక్కు ఇస్తే అది అతనికే సంక్రమిస్తుంది. ఇది వారసత్వ నియమము. \v 17 ఒకవేళ సేవకునికి ఇస్తే అది విడుద సంవత్సరం వరకే సేవకుని ఆధీనంలో ఉంటుంది. అప్పుడది తిరిగి అధిపతికే వస్తుంది. అది పతి వారసత్వం భూమి అతని సంతతి వారిదే! \v 18 ప్రజలను వారి స్వాస్థ్యంలో నుండి బయటకు వెళ్లగొట్టి, వారి వారసత్వంలో నుండి అధిపతి ఏదీ తీసుకోకూడదు. అధిపతి తన భూమిలో నుండి తన కుమారునికి భాగాలివ్వాలి. దేవుని ప్రజల్లో ఎవరూ తమ భూములను విడిచి చెదరిపోకూడదు.’ ” \p \v 19 ఉత్తర వైపుగా ఉన్న యాజకుల పవిత్ర గదుల్లోకి ఆయన నన్ను తీసుకెళ్లి అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు చూపించారు. \v 20 అతడు నాతో ఇలా అన్నారు: “అపరాధ పరిహారార్థబలి, పాపపరిహారబలి వండి, భోజనార్పణ కాల్చడానికి, బయటి ఆవరణంలోనికి వాటిని తీసుకురాకుండా, ప్రజలను పవిత్రం చేయడానికి యాజకులు ఉండే స్థలం ఇది.” \p \v 21 అప్పుడు అతడు నన్ను బయటి ఆవరణానికి తీసుకువచ్చి దాని నాలుగు మూలలకు నన్ను నడిపించాడు, నేను ప్రతి మూలలో మరొక ఆవరణాన్ని చూశాను. \v 22 బయటి ఆవరణం యొక్క నాలుగు మూలల్లో నలభై మూరల పొడవు, ముప్పై మూరల వెడల్పు\f + \fr 46:22 \fr*\ft అంటే, సుమారు 21 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు\ft*\f* ఉన్న ఆవరణాలు ఉన్నాయి; నాలుగు మూలల్లో ఒక్కో ఆవరణం ఒకే పరిమాణంలో ఉంది. \v 23 నాలుగు ఆవరణాల ప్రతి లోపలి భాగంలో ఒక రాతి గట్టు ఉంది, దాని చుట్టూ గట్టు క్రింద పొయ్యిలున్నాయి. \v 24 ఆయన నాతో ఇలా అన్నాడు: “దేవాలయంలో పరిచర్య చేసేవారు ప్రజల బలి అర్పణలు వండడానికి ఇవి వంటశాలలు.” \c 47 \s1 మందిరంలో నుండి ప్రవహించే నది \p \v 1 ఆ మనుష్యుడు నన్ను ఆలయ ద్వారం దగ్గరకు తిరిగి తీసుకువచ్చాడు, అక్కడ ఆలయ గుమ్మం క్రిందనుండి తూర్పు వైపుకు నీరు రావడం నేను చూశాను (మందిరం తూర్పు ముఖంగా ఉంది). ఆ నీరు ఆలయానికి దక్షిణం వైపున క్రింది నుండి, బలిపీఠానికి దక్షిణం నుండి వస్తుంది. \v 2 తర్వాత అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి, తూర్పు వైపున ఉన్న బయటి ద్వారం దగ్గరకు నన్ను నడిపించాడు, అక్కడ ఆ నీరు దక్షిణం వైపు నుండి పారుతుంది. \p \v 3 ఆ వ్యక్తి తన చేతిలో కొలమానం పట్టుకుని తూర్పు వైపు వెళ్తుండగా, అతడు వెయ్యి మూరలు\f + \fr 47:3 \fr*\ft అంటే, సుమారు 530 మీటర్లు\ft*\f* కొలిచాడు, ఆపై చీలమండల లోతు ఉన్న నీటి గుండా నన్ను నడిపించాడు. \v 4 అతడు మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించాడు. నీళ్లు మోకాళ్ల వరకు వచ్చాయి. మరో వెయ్యి మూరలు కొలిచి నీటి గుండా నన్ను నడిపించాడు. అక్కడ నీళ్లు నడుము వరకు వచ్చాయి. \v 5 అతడు మరో వెయ్యి కొలిచాడు, కానీ ఇప్పుడు అది నేను దాటలేని నదిగా ఉంది, ఎందుకంటే నీళ్లు ఎక్కువై ఈదగలిగినంత లోతుగా ఉంది. \v 6 “మనుష్యకుమారుడా! ఇది చూస్తున్నావా?” \p ఆయన నన్ను మరల నది ఒడ్డుకు చేర్చాడు. \v 7 నేను అక్కడికి చేరుకున్నప్పుడు, నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో చెట్లు కనిపించాయి. \v 8 అతడు నాతో ఇలా అన్నాడు, “ఈ నీరు తూర్పు ప్రాంతం వైపు ప్రవహిస్తూ అరాబా\f + \fr 47:8 \fr*\ft లేదా \ft*\fqa యొర్దాను లోయ\fqa*\f* లోకి వెళ్తుంది, అక్కడ అది మృత సముద్రంలోకి ప్రవేశిస్తుంది. అది సముద్రంలోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ఉప్పునీరు మంచి నీటిగా మారుతుంది. \v 9 ఈ నది నీరు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ జీవరాశుల గుంపులు ఉంటాయి. మృత సముద్రంలో చేపలు పుష్కలంగా ఉంటాయి, ఎందుకంటే దాని నీళ్లు మంచి నీటిగా ఉంటాయి. ఈ నీరు ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జీవం వర్ధిల్లుతుంది. \v 10 ఎన్-గేదీ నుండి ఎన్-ఎగ్లయీము వరకు చేపలు పట్టేవారు ఒడ్డున నిలబడి వలలు వేస్తారు. మధ్యధరా సముద్రంలో ఉన్నట్లు అన్ని రకాల చేపలు మృత సముద్రంలో ఉంటాయి. \v 11 కానీ బురద మడుగులు, చిత్తడి నేలలు శుద్ధి చేయబడవు; అవి ఇంకా ఉప్పుగానే ఉంటాయి. \v 12 నదికి ఇరువైపులా అన్ని రకాల పండ్లచెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు గోధుమ రంగులోకి మారవు, వాడిపోతాయి వాటి కొమ్మలపై ఎల్లప్పుడూ పండ్లు ఉంటాయి. దేవాలయం నుండి ప్రవహించే నది ద్వారా వాటికి నీరు అందుతుంది కాబట్టి ప్రతి నెల క్రొత్త పంట ఉంటుంది. పండ్లు ఆహారంగా ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి.” \s1 దేశ సరిహద్దులు \p \v 13 ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ఇవి ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి స్వాస్థ్యంగా మీరు పంచుకునే దేశ సరిహద్దులు, యోసేపుకు రెండు వంతులు. \v 14 నీవు దానిని వారి మధ్య సమానంగా పంచాలి. మీ పూర్వికులకు ఇస్తానని చేయెత్తి ప్రమాణం చేశాను కాబట్టి, ఈ భూమి మీకు వారసత్వంగా మారుతుంది. \b \lh \v 15 “ఇది దేశానికి సరిహద్దుగా ఉంటుంది: \b \li1 “ఉత్తరం వైపున ఇది మధ్యధరా సముద్రం నుండి హెత్లోను రహదారి ద్వారా లెబో హమాతు దాటి సెదాదు వరకు ఉంటుంది, \v 16 తర్వాత అది దమస్కు హమాతు మధ్య సరిహద్దులో ఉన్న బెరోతా సిబ్రాయిము వరకు, చివరకు హౌరాను సరిహద్దులో ఉన్న హజెర్-హత్తికోను వరకు వెళ్తుంది. \v 17 సముద్రం నుండి వచ్చిన ఈ సరిహద్దు దమస్కు సరిహద్దు వున్న హజర్-ఎనానుకు\f + \fr 47:17 \fr*\fq ఎనానుకు \fq*\ft మరో రూపం \ft*\fqa ఎనోను\fqa*\f* వెళ్తుంది. దానికి ఉత్తరంగా హమాతు సరిహద్దు ఉంటుంది. ఇది ఉత్తర సరిహద్దు. \li1 \v 18 తూర్పు వైపున సరిహద్దు హౌరాను దమస్కు మధ్య, గిలాదు ఇశ్రాయేలు దేశాల మధ్య యొర్దాను వెంట, మృత సముద్రం, తామారు వరకు ఉంటుంది. ఇది తూర్పు సరిహద్దు అవుతుంది. \li1 \v 19 దక్షిణం వైపున అది తామారు నుండి మెరీబా కాదేషు నీళ్ల వరకు, తర్వాత ఈజిప్టు వాగు వెంట మధ్యధరా సముద్రం వరకు వెళుతుంది. ఇది దక్షిణ సరిహద్దు అవుతుంది. \li1 \v 20 పడమటి వైపున, మధ్యధరా సముద్రం లెబో హమాతుకు ఎదురుగా ఉన్న చోటుకు సరిహద్దుగా ఉంటుంది. ఇది పశ్చిమ సరిహద్దు అవుతుంది. \b \p \v 21 “ఇశ్రాయేలు ప్రజ గోత్రాల ప్రకారం దేశాన్ని నీవు పంచాలి. \v 22 మీరు దానిని మీకు మీ మధ్య నివసిస్తూ పిల్లలను కన్న విదేశీయులకు వారసత్వంగా పంచుకోవాలి. మీరు వారిని స్థానిక ఇశ్రాయేలీయులుగా పరిగణించాలి; మీతో పాటు వారికి ఇశ్రాయేలు గోత్రాల మధ్య వారసత్వం ఇవ్వబడుతుంది. \v 23 ఏ గోత్రికుల మధ్య పరదేశులు నివసిస్తున్నారో ఆ గోత్రాల భూభాగంలో వారికి వారసత్వం ఇవ్వాలి” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \c 48 \s1 గోత్రాల ప్రకారం భూమి పంపకం \lh \v 1 “పేర్ల ప్రకారం జాబితా తయారుచేయబడిన గోత్రాలు ఇవే: \b \li1 “ఉత్తర సరిహద్దులో దానుకు ఒక భాగం ఉంటుంది; అది హెత్లోను నుండి లెబో హమాతుకు వెళ్లే రహదారి వెంట ఉంటుంది; హజర్-ఎనాను హమాతుకు ప్రక్కన దమస్కు ఉత్తర సరిహద్దు తూర్పు వైపు నుండి పడమటి వైపు వరకు దాని సరిహద్దులో భాగంగా ఉంటుంది. \li1 \v 2 ఆషేరు వారికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమటి వరకు దానుకు సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 3 నఫ్తాలికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఆషేరు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 4 మనష్షేకు ఒక భాగం ఉంటుంది; అది తూర్పు నుండి పడమర వరకు నఫ్తాలి భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 5 ఎఫ్రాయిముకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు మనష్షే భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 6 రూబేనుకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఎఫ్రాయిముకు సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 7 యూదాకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు రూబేను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది. \b \p \v 8 “తూర్పు నుండి పడమర వరకు యూదా భూభాగానికి సరిహద్దుగా ఉండే భాగాన్ని మీరు ప్రత్యేక బహుమతిగా సమర్పించాలి. అది 25,000 మూరల\f + \fr 48:8 \fr*\ft అంటే, సుమారు కి.మీ\ft*\ft ; \+xt 9|link-href="EZK 48:9"\+xt*, \+xt 10|link-href="EZK 48:10"\+xt*, \+xt 13|link-href="EZK 48:13"\+xt*, \+xt 15|link-href="EZK 48:15"\+xt*, \+xt 20|link-href="EZK 48:20"\+xt*, \+xt 21|link-href="EZK 48:21"\+xt* వచనాల్లో కూడా\ft*\f* వెడల్పు, దాని పొడవు తూర్పు నుండి పడమర వరకు ఉన్న గోత్రాల భాగాలలో ఒక దానితో సమానము. \p \v 9 “యెహోవాకు ప్రతిష్ఠించే ప్రత్యేక భాగం పొడవు 25,000 మూరలు. వెడల్పు 10,000 మూరలు\f + \fr 48:9 \fr*\ft అంటే, సుమారు 5.3 కి.మీ\ft*\ft ; \+xt 10|link-href="EZK 48:10"\+xt*, \+xt 13|link-href="EZK 48:13"\+xt*, \+xt 18|link-href="EZK 48:18"\+xt* వచనాల్లో కూడా\ft*\f* ఉంటుంది. \v 10 ఇది యాజకులకు కేటాయించబడిన పవిత్రమైన భాగము. అది ఉత్తరం వైపు 25,000 మూరల పొడవు, పడమర వైపు 10,000 మూరల వెడల్పు, తూర్పు వైపున 10,000 మూరల వెడల్పు దక్షిణం వైపున 25,000 మూరల పొడవు ఉంటుంది. దాని మధ్యలో యెహోవా మందిరం ఉంటుంది. \v 11 ఇది ప్రతిష్ఠించబడిన యాజకులైన సాదోకు సంతతివారి కోసము. ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టినప్పుడు లేవీయుల్లా తప్పుదారి పట్టకుండా, వారు నాకు సేవచేయడంలో నమ్మకంగా ఉన్నారు. \v 12 పవిత్రమైన భూమిలో లేవీయుల భూభాగానికి సరిహద్దుగా ఉన్న ఆ భాగం వారికి ప్రత్యేక బహుమతిగా ఉంటుంది, అది అతిపరిశుద్ధమైన భాగము. \p \v 13 “యాజకుల ప్రాంతంతో పాటు, లేవీయులకు 25,000 మూరల పొడవు 10,000 మూరల వెడల్పు ఉంటుంది. దాని మొత్తం పొడవు 25,000 మూరలు వెడల్పు 10,000 మూరలు. \v 14 వారు దేనినీ అమ్మకూడదు లేదా మార్చుకోకూడదు. ఇది భూమిలో శ్రేష్ఠమైనది ఇతర చేతుల్లోకి వెళ్లకూడదు, ఎందుకంటే ఇది యెహోవాకు పవిత్రమైనది. \p \v 15 “మిగిలిన స్థలం, 5,000 మూరల\f + \fr 48:15 \fr*\ft అంటే, సుమారు 2.7 కి.మీ\ft*\f* వెడల్పు 25,000 మూరల పొడవున మిగిలిన భూమిని ఉమ్మడి ప్రాంతంగా భావించి పట్టణంలోని ఇళ్ళ కోసం పచ్చిక బయళ్ల కోసం ఉపయోగించాలి. పట్టణం దాని మధ్యలో ఉంటుంది. \v 16 పట్టణానికి ఈ కొలతలు ఉంటాయి: ఉత్తరం వైపు 4,500 మూరలు,\f + \fr 48:16 \fr*\ft అంటే, సుమారు 2.4 కి.మీ\ft*\ft ; ఇది \+xt 30|link-href="EZK 48:30"\+xt*, \+xt 32|link-href="EZK 48:32"\+xt*, \+xt 33|link-href="EZK 48:33"\+xt*, \+xt 34|link-href="EZK 48:34"\+xt* వచనాల్లో కూడా\ft*\f* దక్షిణం వైపు 4,500 మూరలు, తూర్పు వైపు 4,500 మూరలు పడమర వైపు 4,500 మూరలు. \v 17 పట్టణం కోసం పచ్చిక బయలు ఉత్తరాన 250 మూరలు,\f + \fr 48:17 \fr*\ft అంటే, సుమారు 135 మీటర్లు\ft*\f* దక్షిణాన 250 మూరలు, తూర్పున 250 మూరలు పశ్చిమాన 250 మూరలు ఉండాలి. \v 18 కేటాయించబడిన పవిత్ర స్థలంతో పాటు మిగిలిన భూమి పొడవు తూర్పు వైపున 10,000 మూరలు పడమర వైపు 10,000 మూరలు ఉంటుంది. ఇది పట్టణంలో పనిచేసి బ్రతికేవారికి ఆహారాన్ని అందించే ఆధారంగా ఉంటుంది. \v 19 ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల నుండి పట్టణంలో కష్టపడి పని చేసేవారు దానిని సాగు చేస్తారు. \v 20 భాగమంతా చతురస్రాకారంలో ఉంటుంది, ప్రతి వైపు 25,000 మూరలు ఉండాలి. ప్రత్యేక బహుమతిగా మీరు పట్టణం యొక్క ఆస్తితో పాటు పవిత్ర భాగాన్ని ప్రక్కన పెడతారు. \p \v 21 “పవిత్ర కేటాయింపు, పట్టణం యొక్క ఆస్తికి రెండు వైపులా మిగిలి ఉన్నవి యువరాజుకు చెందుతాయి. ఇది పవిత్ర భాగపు 25,000 మూరల నుండి తూర్పు సరిహద్దు వరకు పశ్చిమాన 25,000 మూరల నుండి పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంటుంది. గిరిజన ప్రాంతాల పొడవునా ఈ రెండు ప్రాంతాలు యువరాజుకు చెందుతాయి ఆలయ పరిశుద్ధ స్థలంతో కూడిన పవిత్ర భాగం వాటి మధ్యలో ఉంటుంది. \v 22 కాబట్టి లేవీయుల స్వాస్థ్యం, పట్టణం యొక్క స్వాస్థ్యం యువరాజుకు చెందిన ప్రాంతం మధ్యలో ఉంటుంది. యువరాజుకు చెందిన ప్రాంతం యూదా సరిహద్దుకు బెన్యామీను సరిహద్దుకు మధ్య ఉంటుంది. \b \lh \v 23 “తక్కిన గోత్రాల వివరాలు: \b \li1 “బెన్యామీను వారికి ఒక భాగము. అది తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. \li1 \v 24 షిమ్యోను వారికి ఒక భాగము. తూర్పు నుండి పడమటి వరకు అది బెన్యామీను వారి భూమిని ఆనుకుని ఉంటుంది. \li1 \v 25 ఇశ్శాఖారు వారికి ఒక వాటా! అది తూర్పు నుండి పడమర వరకు షిమ్యోను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 26 జెబూలూను తూర్పు నుండి పడమర వరకు ఇశ్శాఖారు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 27 గాదు వారికి ఒక వాటా. అది తూర్పు నుండి పడమర వరకు జెబూలూను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది. \li1 \v 28 గాదు దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు నీళ్ల వరకు, తర్వాత ఈజిప్టు వాగు వెంట మధ్యధరా సముద్రం వరకు వెళ్తుంది. \b \lf \v 29 “ఇశ్రాయేలు గోత్రాలకు వారసత్వంగా కేటాయించవలసిన దేశం ఇదే, ఇవి వారి భాగాలు” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. \s1 క్రొత్త పట్టణం యొక్క ద్వారాలు \lh \v 30 “పట్టణం నుండి బయటకు వెళ్లే గుమ్మాల వివరాలు: \b \li1 “ఉత్తర దిక్కున 4,500 మూరల పొడవుగా ద్వారాలు మూడు ఉంటాయి, \v 31 పట్టణ ద్వారాలకు ఇశ్రాయేలు గోత్రాల పేర్లు పెట్టాలి. ఉత్తర దిక్కున రూబేను ద్వారం, యూదా ద్వారం, లేవీ ద్వారం ఉండాలి. \li1 \v 32 తూర్పు దిక్కున 4,500 మూరల పొడవుతో మూడు ద్వారాలు: యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం, దాను ద్వారము. \li1 \v 33 దక్షిణ దిక్కున 4,500 మూరల కొలతలతో మూడు ద్వారాలు: షిమ్యోను ద్వారం, ఇశ్శాఖారు ద్వారం, జెబూలూను ద్వారం ఉండాలి. \li1 \v 34 పశ్చిమదిక్కున 4,500 మూరల కొలతలతో మూడు ద్వారాలు: గాదు ద్వారం, ఆషేరు ద్వారం, నఫ్తాలి ద్వారం ఉండాలి. \b \lf \v 35 “దాని చుట్టూ విస్తీర్ణం 18,000 మూరలు.\f + \fr 48:35 \fr*\ft అంటే, సుమారు 9.5 కి.మీ.\ft*\f* \b \p “అప్పటినుండి ఆ పట్టణానికి, ‘యెహోవా షమ్మా\f + \fr 48:35 \fr*\ft అంటే \ft*\fqa యెహోవా ఉన్నాడు\fqa*\f* అని పేరు.’ ”