\id ECC - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h ప్రసంగి \toc1 ప్రసంగి గ్రంథం \toc2 ప్రసంగి \toc3 ప్రసంగి \mt1 ప్రసంగి \mt2 గ్రంథం \c 1 \s1 ప్రతిదీ అర్థరహితమే \p \v 1 దావీదు కుమారుడును యెరూషలేము రాజును అయిన ప్రసంగి మాటలు: \q1 \v 2 ఈ ప్రసంగి ఇలా అంటున్నాడు, \q2 “అర్థరహితం! అర్థరహితం! \q2 అంతా అర్థరహితమే.” \b \q1 \v 3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన \q2 వారికి కలిగే లాభం ఏమిటి? \q1 \v 4 తరాలు వస్తాయి తరాలు పోతాయి, \q2 కాని ఈ భూమి ఎప్పటికీ ఉంటుంది. \q1 \v 5 సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, \q2 తాను ఉదయించే చోటుకు మరలా చేరాలని త్వరపడుతున్నాడు. \q1 \v 6 గాలి దక్షిణం వైపు వీస్తూ \q2 అంతలోనే ఉత్తరానికి తిరుగుతుంది; \q1 అది సుడులు సుడులుగా తిరుగుతూ, \q2 తన దారిలోనే తిరిగి వస్తుంది. \q1 \v 7 నదులన్నీ సముద్రంలోనికే చేరుతాయి, \q2 అయినా సముద్రం ఎప్పటికీ నిండదు. \q1 నదులు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయో \q2 అక్కడికే తిరిగి వెళ్తాయి. \q1 \v 8 అన్నీ శ్రమపడి అలసిపోతున్నాయి, \q2 మనుష్యులు దానిని వివరించలేరు. \q1 ఎంత చూసినా కంటికి తృప్తి కలుగదు. \q2 ఎంత విన్నా చెవికి సంతృప్తి కలుగదు. \q1 \v 9 ఇంతవరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది, \q2 ఇంతవరకు జరిగిందే ఇకముందు జరుగబోతుంది; \q2 సూర్యుని క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు. \q1 \v 10 “చూడండి! ఇది క్రొత్తది” \q2 అని ఎవరైనా ఒకదాని గురించి చెప్పడానికి ఏదైనా ఉందా? \q1 చాలా కాలం క్రితమే, అది ఉంది; \q2 మన కాలానికి ముందే అది ఉంది. \q1 \v 11 పూర్వతరాలు ఎవరికి జ్ఞాపకముండవు, \q2 రాబోయే తరాలు కూడా \q1 వాళ్ళ తర్వాతి తరం వాళ్ళకు \q2 అసలే జ్ఞాపకముండవు. \s1 జ్ఞానం అర్థరహితం \p \v 12 ప్రసంగినైన నేను, యెరూషలేములో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను. \v 13 ఆకాశం క్రింద జరుగుతున్నదంతా అధ్యయనం చేయడానికి జ్ఞానంతో పరిశోధించడానికి దానిపై మనస్సు పెట్టాను. దేవుడు మనుష్యులపై ఎంతో అధికమైన భారం పెట్టారు! \v 14 సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిని నేను చూశాను; అవన్నీ అర్థరహితమే, అది గాలి కోసం ప్రయాసపడడమే. \q1 \v 15 వంకరగా ఉన్నవాటిని సరి చేయలేము; \q2 లేనివాటిని లెక్కపెట్టలేము. \p \v 16 “చూడు, యెరూషలేములో నాకన్నా ముందు పాలించిన రాజులందరికంటే నేను గొప్పజ్ఞానిని; ఎంతో జ్ఞానాన్ని తెలివిని సంపాదించాను” అని నాలో నేను అనుకున్నాను. \v 17 ఏది జ్ఞానమో, ఏది వెర్రితనమో ఏది అవివేకమో గ్రహించాలని ప్రయత్నించాను. కాని అది కూడా, గాలి కోసం ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను. \q1 \v 18 జ్ఞానం ఎక్కువవుతూ ఉంటే విచారం కూడా ఎక్కువవుతుంది; \q2 ఎంత ఎక్కువ తెలివి ఉంటే అంత ఎక్కువ దుఃఖం కలుగుతుంది. \c 2 \s1 సంతోషాలు అర్థరహితం \p \v 1 “ఇప్పుడు, మంచి ఏమిటో తెలుసుకోవడానికి సంతోషం చేత నిన్ను పరీక్షిస్తాను” అని నాలో నేను అనుకున్నాను. కాని ఇది కూడా అర్థరహితమేనని తెలిసింది. \v 2 నవ్వుతో, “నీది వెర్రితనమని”, ఆనందంతో, “నీవు ఏమి సాధిస్తావు?” అని నేను అన్నాను. \v 3 నా మనస్సు ఇంకా నన్ను జ్ఞానంతో నడిపిస్తూ ఉండగానే, ద్రాక్షరసంతో నన్ను నేను తృప్తిపరుచుకోవాలని, బుద్ధిహీనత వలన ఉపయోగం తెలుసుకోవాలని అనుకున్నాను. ఆకాశం క్రింద తాము జీవించే కొన్ని రోజుల్లో మనుష్యులు ఏమి చేస్తే మంచిదో చూడాలనుకున్నాను. \p \v 4 నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను. \v 5 తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను. \v 6 పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను. \v 7 దాసదాసీలను నేను వెల చెల్లించి కొన్నాను, నా ఇంట్లోనే పుట్టిపెరిగిన దాసులు కూడా నాకున్నారు. యెరూషలేములో నాకన్నా ముందు నుండి ఉన్న వారందరికంటే ఎక్కువ పశుసంపద గొర్రెల మందలు నాకున్నాయి. \v 8 నా కోసం వెండి బంగారం సమకూర్చుకున్నాను. విదేశాల నుండి రాజ సంపదను సేకరించాను. గాయనీ గాయకులను, మనుష్యుల హృదయాన్ని సంతోషపరిచే వాటిని సంపాదించాను; స్త్రీలు కూడా నా దగ్గర ఉన్నారు. \v 9 నాకన్నా ముందు యెరూషలేములోని వారందరికంటే నేనెంతో గొప్పవాడినై ఎంతో వృద్ధి చెందాను. వీటన్నిటిలో నా జ్ఞానం నాతోనే ఉంది. \q1 \v 10 నా కళ్లు కోరినవాటిలో దేన్ని చూడకుండ నేను నిరాకరించలేదు; \q2 సంతోషాలను అనుభవించకుండా నా హృదయాన్ని ఆటంకపరచలేదు. \q1 నా పనులన్నిటిని బట్టి నా హృదయం సంతోషించింది. \q2 నా శ్రమంతటికి కలిగిన ఫలితం ఇదే. \q1 \v 11 అయితే, నా చేతులు చేసిన పనులన్నిటిని \q2 వాటికోసం నేను పడిన శ్రమనంతటి పరిశీలిస్తే, \q1 అవన్నీ అర్థరహితమే అని, గాలికి ప్రయాసపడినట్లే అని తెలుసుకున్నాను. \q2 సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేదని నేను గ్రహించాను. \s1 జ్ఞానం బుద్ధిహీనత రెండూ అర్థరహితమే \q1 \v 12 నేను జ్ఞానం, పిచ్చితనం, బుద్ధిహీనతల గురించి \q2 ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. \q1 రాజు ఇంతకుముందే చేసిన దానికంటే, \q2 రాజు తర్వాత వచ్చేవాడు అధికంగా ఇంకేమి చేయగలడు? అనుకున్నాను. \q1 \v 13 చీకటి కంటే వెలుగు మేలు అని, \q2 బుద్ధిహీనత కంటే జ్ఞానం మేలు అని నేను చూశాను. \q1 \v 14 జ్ఞానికి తలలో కళ్లు ఉంటాయి. \q2 మూర్ఖుడు చీకటిలో నడుస్తాడు. \q1 అయినా అందరి విధి ఒకటే \q2 అని నేను గ్రహించాను. \p \v 15 నాలో నేను అనుకున్నాను \q1 మూర్ఖుడికి సంభవించేదే నాకూ సంభవిస్తుంది. \q2 నేను ఇంత జ్ఞానం సంపాదించి నాకేం లాభం? \q1 “ఇది కూడా అర్థరహితం” అని \q2 నాలో నేననుకున్నాను. \q1 \v 16 ఎందుకంటే మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడా ఎక్కువకాలం జ్ఞాపకం ఉండరు; \q2 ఇరువురిని మరచిపోయే రోజులు ఇప్పటికే వచ్చాయి. \q1 మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడ చస్తారు. \s1 శ్రమ అర్థరహితం \p \v 17 ఇదంతా చూస్తూ ఉంటే సూర్యుని క్రింద జరుగుతున్న దాన్ని బట్టి నాకెంతో విచారం కలిగింది, కాబట్టి నేను నా జీవితాన్ని అసహ్యించుకున్నాను. అంతా అర్థరహితమే గాలికి ప్రయాసపడడమే. \v 18 సూర్యుని క్రింద నేను కష్టపడి సాధించినవన్నీ నా తర్వాత వచ్చే వారికి చెందుతాయని తెలుసుకొని నేను వాటన్నిటిని అసహ్యించుకున్నాను. \v 19 నా తర్వాత వచ్చేవాడు ఎలాంటివాడో ఎవరికి తెలుసు? అతడు జ్ఞాని కావచ్చు, మూర్ఖుడు కావచ్చు. ఎలాంటి వాడైనా సూర్యుని క్రింద నా శ్రమతో నైపుణ్యతతో సంపాదించినదంతా అతని స్వాధీనమౌతుంది. ఇది కూడా అర్థరహితమే. \v 20 కాబట్టి సూర్యుని క్రింద నేను పడిన కష్టమంతటి గురించి నేను నిరాశ చెందాను. \v 21 ఒకరు జ్ఞానంతో తెలివితో నైపుణ్యంతో శ్రమించి పని చేస్తారు, కాని తర్వాత వారు దానిని శ్రమించని మరొకరికి వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా అర్థరహితమే, గొప్ప దురదృష్టకరమే. \v 22 సూర్యుని క్రింద మనుష్యులు కష్టపడి చేస్తున్న పనులకు వారి శ్రమకు పొందుతున్నది ఏంటి? \v 23 వారి రోజులన్నిటిలో వారు చేసే పనులన్నీ దుఃఖంతో బాధతో నిండి ఉన్నాయి; రాత్రి కూడా వారి మనస్సులు విశ్రాంతి తీసుకోవు. ఇది కూడా అర్థరహితమే. \p \v 24 మనుష్యులు అన్నపానాలు పుచ్చుకుని తమ కష్టార్జితంతో మేలుపొందడం కంటే క్షేమం ఇంకేముంది? అయినా ఇది కూడా దేవుని వలనే కలుగుతుందని నేను తెలుసుకున్నాను. \v 25 ఆయన అనుమతి లేకుండా, ఎవరు తినగలరు ఆనందాన్ని పొందగలరు? \v 26 తనను సంతోషపెట్టే వారికి దేవుడు జ్ఞానం, తెలివి, సంతోషాన్ని ఇస్తారు, కాని దేవున్ని సంతోషపెట్టే వారికి కోసం సంపదను పోగుచేసే పని ఆయన పాపికి ఇస్తారు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే. \c 3 \s1 ప్రతి దానికి సమయముంది \q1 \v 1 ప్రతిదానికీ ఒక సమయం ఉంది, \q2 ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది: \b \q2 \v 2 పుట్టడానికి సమయం చావడానికి సమయం, \q2 నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం, \q2 \v 3 చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, \q2 పడగొట్టడానికి, కట్టడానికి. \q2 \v 4 ఏడ్వడానికి, నవ్వడానికి \q2 దుఃఖపడడానికి, నాట్యమాడడానికి, \q2 \v 5 రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి, \q2 కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి. \q2 \v 6 వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం, \q2 దాచిపెట్టడానికి, పారవేయడానికి, \q2 \v 7 చింపివేయడానికి, కుట్టడానికి, \q2 మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, \q2 \v 8 ప్రేమించడానికి, ద్వేషించడానికి, \q2 యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది. \p \v 9 కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి? \v 10 మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను. \v 11 ఆయన ప్రతిదాన్ని దాని సమయానికి తగినట్లుగా ఉండేలా చేశారు. ఆయన మానవ హృదయంలో నిత్యమైన జ్ఞానాన్ని ఉంచారు; దేవుడు చేసిన వాటిని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఎవరూ గ్రహించలేరు. \v 12 మనుష్యులు జీవించినంత కాలం సంతోషంగా ఉంటూ, మంచి చేయడం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను. \v 13 ప్రతి ఒక్కరు తిని త్రాగుతూ తన కష్టార్జితాన్ని ఆస్వాదించడమే దేవుని వరమని నేను తెలుసుకున్నాను. \v 14 దేవుడు చేసే ప్రతిదీ శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు; దానికి ఏమీ జోడించలేము దాని నుండి ఏమీ తీసివేయలేము. ప్రజలు ఆయనకు భయపడేలా దేవుడు అలా నియమించారు. \q1 \v 15 ఇప్పుడు జరుగుతున్నది ఇంతకుముందు జరిగిందే. \q2 ఇకముందు జరగబోయేది, పూర్వం జరిగి ఉన్నదే. \q2 మునుపున్నదాన్నే మళ్ళీ దేవుడు రప్పిస్తారు, జరిగిస్తారు. \p \v 16 సూర్యుని క్రింద ఈ భూమి మీద మరో విషయం నేను చూశాను. \q1 న్యాయస్థానంలో దుర్మార్గం జరుగుతూ ఉంది. \q2 న్యాయానికి బదులు దుర్మార్గమే ప్రబలుతోంది. \p \v 17 నేనిలా అనుకున్నాను, \q1 “నీతిమంతులకు దుర్మార్గులకు \q2 దేవుడు తీర్పు తీరుస్తారు, \q1 ఎందుకంటే ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది \q2 ప్రతి పనికి తీర్పు తీర్చడానికి సమయం ఉంది.” \p \v 18 నేను ఇంకా ఇలా అనుకున్నాను, “మనుష్యుల తాము జంతువుల్లాంటివారని గ్రహించేలా దేవుడు వారిని పరీక్షిస్తారు. \v 19 ఖచ్చితంగా జంతువులకు జరిగినట్లే మనుష్యులకు జరుగుతుంది. వారిద్దరి విధి ఒక్కటే; జంతువులు చనిపోతాయి మనుష్యులు చనిపోతారు. అంతా అర్థరహితమే. \v 20 అంతా వెళ్లేది ఒక చోటికే; సమస్తం మట్టిలో నుండి వచ్చింది, తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. \v 21 ఒకవేళ మానవ ఆత్మ పైకి లేస్తుందో లేదో, జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?” \p \v 22 కాబట్టి మనుష్యులు తమ పనిని ఆస్వాదించడం కంటే మెరుగైనది ఏదీ లేదని నేను గ్రహించాను, ఎందుకంటే అదే వారు చేయవలసింది. వారి తర్వాత ఏమి జరుగుతుందో చూడటానికి వారిని ఎవరు వెనక్కి తీసుకురాగలరు? \c 4 \s1 అణచివేత, శ్రమ, స్నేహరాహిత్యం \p \v 1 సూర్యుని క్రింద జరుగుతున్న అణచివేతనంతటిని నేను చూశాను: \q1 సూర్యుని క్రింద అణగారిన వారి కన్నీటిని నేను చూశాను, \q2 కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు; \q1 బాధపెట్టేవారు బలవంతులు, \q2 వారిని ఆదరించేవారెవరూ లేరు. \q1 \v 2 ఇంకా జీవించి ఉన్నవారి కంటే \q2 మునుపే చనిపోయినవారు, \q1 సంతోషంగా ఉన్నారని \q2 నేను అనుకున్నాను. \q1 \v 3 ఇంకా పుట్టనివారు, \q2 సూర్యుని క్రింద జరిగే \q1 చెడును చూడనివారు, \q2 ఈ ఇరువురి కన్నా ధన్యులు. \p \v 4 కష్టమంతటితో సాధించినవన్నీ ఒకరిపట్ల ఒకరికి అసూయ కలిగిస్తున్నాయని నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే, గాలికి శ్రమ పడినట్లే. \q1 \v 5 మూర్ఖులు చేతులు ముడుచుకుని \q2 తమను తాము పతనం చేసుకుంటారు.\f + \fr 4:5 \fr*\ft హెబ్రీలో \ft*\fqa తమ మాంసాన్నే తింటారు\fqa*\f* \q1 \v 6 రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే \q2 ఒక చేతినిండ నెమ్మది ఉంటే \q2 అది ఎంతో మేలు. \p \v 7 నేను సూర్యుని క్రింద మళ్ళీ అర్థరహితమైన దానిని చూశాను: \q1 \v 8 ఒక ఒంటరివాడు ఉండేవాడు; \q2 అతనికి కుమారుడు కాని సోదరుడు కాని లేరు. \q1 కాని అతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు, \q2 అయినప్పటికీ అతని సంపద అతని కళ్లను తృప్తిపరచలేకపోయింది. \q1 “నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? \q2 నేను ఎందుకు ఆనందంగా లేను?” అని ప్రశ్నించుకున్నాడు, \q1 ఇది కూడా అర్థరహితమే \q2 విచారకరమైన క్రియ! \b \q1 \v 9 ఒకరికంటే ఇద్దరు మేలు, \q2 ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది: \q1 \v 10 ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే \q2 రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు. \q1 ఒంటరివాడు పడితే \q2 లేవనెత్తేవాడెవడూ ఉండడు. \q1 \v 11 అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు. \q2 అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు? \q1 \v 12 ఒంటరి వారిని పడద్రోయడం తేలిక, \q2 ఇద్దరు కలిసి తమను తాము రక్షించుకోగలరు. \q1 మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు. \s1 అభివృద్ధి అర్థరహితమే \p \v 13 మూర్ఖుడై హెచ్చరికలు వినడానికి ఇష్టపడని ముసలి రాజుకంటే బీదవాడైన జ్ఞానంగల యువకుడే నయము. \v 14 అలాంటి యువకుడు చెరసాలలో నుండి బయటపడి పట్టాభిషేకం పొందవచ్చు. తన దేశంలో దరిద్రుడిగా పుట్టినా రాజు కాగలడు. \v 15 సూర్యుని క్రింద జీవిస్తూ తిరిగే వారందరూ రాజు బదులు రాజైన ఆ యువకుని అనుసరిస్తారని నేను తెలుసుకున్నాను. \v 16 అతని అధికారం క్రింద ఉన్న ప్రజలు అసంఖ్యాకులు. కానీ తర్వాత వచ్చినవారు అతని పట్ల సంతోషించరు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే. \c 5 \s1 దేవునికి నీ మ్రొక్కుబడిని చెల్లించు \p \v 1 నీవు దేవుని ఆలయానికి వెళ్లినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము దుర్మార్గపు పనులు చేస్తున్నామని తెలుసుకోకుండా మూర్ఖుల్లా బలి అర్పించడం కన్నా దగ్గరకు వెళ్లి వినడం మంచిది. \q1 \v 2 దేవుని ముందు అనాలోచితంగా మాట్లాడటానికి, \q2 నీ హృదయం తొందరపడకుండ \q2 నీ నోటిని కాచుకో. \q1 దేవుడు ఆకాశంలో ఉన్నారు \q2 నీవు భూమిపై ఉన్నావు, \q2 కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి. \q1 \v 3 విస్తారమైన పనుల వల్ల కలలు వస్తాయి. \q2 ఎక్కువ మాటలు మాట్లాడేవారు మూర్ఖునిలా మాట్లాడతారు. \p \v 4 నీ దేవునికి చేసుకున్న మ్రొక్కుబడిని చెల్లించడంలో ఆలస్యం చేయవద్దు. మూర్ఖుల గురించి దేవుడు సంతోషించరు, నీ మ్రొక్కుబడిని చెల్లించు. \v 5 మ్రొక్కుబడి చేసి చెల్లించక పోవడం కంటే మ్రొక్కుబడి చేయకపోవడమే మంచిది. \v 6 నీ మాటలు నిన్ను పాపంలోకి పడవేయకుండా చూసుకో. ఆలయ దూతకు, “పొరపాటున మొక్కుబడి చేశాను” అని చెప్పవద్దు. నీ మాటలకు దేవుడు కోప్పడి నీ చేతిపనిని నాశనం చేయడం అవసరమా? \v 7 ఎక్కువ కలలు ఎక్కువ మాటలు అర్థరహితమే. కాబట్టి దేవునికి భయపడు. \s1 ధనం అర్థరహితం \p \v 8 ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు. \v 9 దేశం అభివృద్ధి చెందినప్పుడు అందరు పంచుకుంటారు; స్వయాన రాజు పొలాల నుండి లబ్ది పొందుతారు. \q1 \v 10 డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు; \q2 సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు. \q2 ఇది కూడా అర్థరహితము. \b \q1 \v 11 ఆస్తి ఎక్కువవుతూ ఉంటే, \q2 దాన్ని దోచుకునేవారు కూడా ఎక్కువవుతారు. \q1 యజమానులకు తమ ఆస్తిని కళ్లతో చూడడం తప్ప, \q2 దానివల్ల వారికేమి ప్రయోజనం? \b \q1 \v 12 శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా, \q2 సుఖంగా నిద్రపోతారు, \q1 కానీ ధనికులకున్న సమృద్ధి \q2 వారికి నిద్రపట్ట నివ్వదు. \p \v 13 సూర్యుని క్రింద బాధాకరమైన ఒక చెడ్డ విషయాన్ని నేను చూశాను: \q1 దాచి ఉంచిన సంపద యజమానునికి హాని తెస్తుంది, \q2 \v 14 లేదా దురదృష్టవశాత్తూ వారి సంపద పోతుంది, \q1 వారికి పిల్లలు కలిగినప్పుడు \q2 వారికి వారసత్వంగా ఏమీ మిగలదు. \q1 \v 15 ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినట్లే \q2 దిగంబరిగానే వెళ్లిపోతారు. \q1 తాము కష్టపడిన దానిలో నుండి వారు \q2 తమ చేతుల్లో ఏమి మోసుకు వెళ్లరు. \p \v 16 మరొక చెడ్డ విషయం: \q1 ప్రతి ఒక్కరూ ఎలా వస్తారో, వారు అలాగే వెళ్లిపోతారు, \q2 వారు గాలికి ప్రయాసపడుతున్నారు \q2 కాబట్టి వారు ఏమి పొందుతారు? \q1 \v 17 వారు చాలా నిరాశతో, బాధలతో, కోపంతో, \q2 తమ దినాలన్ని చీకటిలో భోజనం చేస్తారు. \p \v 18 నేను గమనించిన వాటిలో మంచిది ఏదనగా: దేవుడు తనకిచ్చిన రోజులన్నిటిలో ఒక వ్యక్తి తిని, త్రాగుతూ సూర్యుని క్రింద తాను చేసిన శ్రమతో సంతృప్తి చెందాలి. ఎందుకంటే ఇదే వారు చేయవలసింది. \v 19 అంతేకాక, దేవుడు ఒక వ్యక్తికి సంపదను ఆస్తులను వాటిని అనుభవించగల సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు, వారు తమ భాగాన్ని తీసుకుని వారి కష్టార్జితంలో వారు ఆనందంగా ఉండాలి; ఇది దేవుని వరము. \v 20 దేవుడతనికి హృదయంలో ఆనందం కలిగిస్తారు కాబట్టి అతడు తన గతాన్ని సులభంగా మరిచిపోగలుగుతాడు. వారు వారి జీవితపు రోజులను చాలా అరుదుగా ప్రతిబింబిస్తారు. \c 6 \p \v 1 నేను సూర్యుని క్రింద మరొక చెడు చూశాను, అది మనుష్యజాతి మీద ఎంతో భారంగా ఉంది. \v 2 దేవుడు కొందరికి ధనం, ఆస్తి, గౌరవం ఇస్తారు, తద్వార వారి హృదయాలు కోరుకున్నవేవి వారికి కొదువగా ఉండవు. కాని వాటిని అనుభవించే సామర్థ్యాన్ని వారికి దేవుడు ఇవ్వరు, అపరిచితులు వాటిని అనుభవిస్తారు. ఇదంతా అర్థరహితమే, చెడ్డ విషయమే. \p \v 3 ఒకడు వందమంది పిల్లలను కని అనేక సంవత్సరాలు జీవించినప్పటికీ, అతడు బ్రతికినంత కాలం తన అభివృద్ధిని అనుభవించకపోతే, సరియైన రీతిలో సమాధి చేయబడకపోతే, అతనికంటే గర్భస్రావమైపోయిన పిండమే నయము. \v 4 గర్భస్రావమైన పిండం నిరుపయోగంగా వచ్చి చీకటిలోకి వెళ్లిపోతుంది, చీకటిలో దాని పేరు కప్పబడుతుంది. \v 5 అది ఎన్నడు సూర్యుని చూడకపోయినా దానికి ఏమి తెలియకపోయినా, ఆ మనిషి కన్నా దానికే ఎక్కువ విశ్రాంతి ఉంది. \v 6 అతడు రెండువేల సంవత్సరాలు బ్రతికినా తన అభివృద్ధిని అనుభవించలేడు. అందరు వెళ్లేది ఒకే చోటికే కదా? \q1 \v 7 మనుష్యులు పడే శ్రమ అంతా కడుపు కోసమే, \q2 అయినా వారి ఆశకు తృప్తి కలగదు. \q1 \v 8 మూర్ఖుల కంటే జ్ఞానులకున్న ప్రయోజనం ఏముంది? \q1 ఇతరుల ఎదుట ఎలా జీవించాలో \q2 తెలుసుకున్న బీదవారికి లాభం ఏంటి? \q1 \v 9 కోరిక వెంట పడడం కంటే \q2 కళ్లకు కనిపించేది మేలు. \q1 అయినా ఇది కూడా అర్థరహితమే. \q2 గాలికి ప్రయాసపడడమే. \b \q1 \v 10 ఉనికిలో ఉన్నవన్నీ ఇంతకు ముందు తెలిసినవే. \q2 మనుష్యులు ఎలా ఉంటారో పూర్వం నుండి తెలిసిందే; \q2 తనకంటే బలవంతుడితో ఎవరు పోరాడలేరు. \q1 \v 11 మాటలు ఎక్కువ \q2 అర్థం తక్కువ, \q2 దానివల్ల ఎవరికి ప్రయోజనం? \p \v 12 నీడలా తమ జీవితకాలాన్ని అర్థరహితంగా గడిపే మనుష్యుల బ్రతుకులో వారికి ఏది క్షేమమో ఎవరికి తెలుసు? వారు గతించాక సూర్యుని క్రింద భూమి మీద ఏం జరుగుతుందో వారికి ఎవరు చెప్తారు? \c 7 \s1 జ్ఞానం \q1 \v 1 చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, \q2 జన్మదినం కంటే మరణ దినం మంచిది. \q1 \v 2 విందు జరిగే వారి ఇళ్ళకు వెళ్లే కంటే \q2 ఏడ్చేవారి ఇళ్ళకు వెళ్లడం మంచిది. \q1 ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరికీ వస్తుంది; \q2 జీవించి ఉన్నవారు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించాలి. \q1 \v 3 నవ్వడం కంటే దుఃఖపడడం మేలు, \q2 ఎందుకంటే విచారంగా ఉన్న ముఖం గుండెకు మంచిది. \q1 \v 4 జ్ఞానుల హృదయం దుఃఖపడే వారి గృహంలో ఉంటుంది \q2 కాని బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంట్లో ఉంటుంది. \q1 \v 5 మూర్ఖుల పాటలు వినడంకంటే, \q2 జ్ఞానుల గద్దింపు వినడం మేలు. \q1 \v 6 కుండ క్రింద చిటపటమనే ముండ్ల కంప మంట ఎలాంటిదో, \q2 మూర్ఖుల నవ్వు అలాంటిదే. \q2 అది కూడా అర్థరహితమే. \b \q1 \v 7 అన్యాయం జ్ఞానంగల వానిని మూర్ఖునిగా మారుస్తుంది, \q2 లంచం హృదయాన్ని పాడుచేస్తుంది. \b \q1 \v 8 ఆరంభం కంటే అంతం మేలు, \q2 అహంకారం కంటే సహనం మేలు. \q1 \v 9 తొందరపడి కోపపడవద్దు \q2 ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది. \b \q1 \v 10 “ఇప్పుడు ఉన్న రోజుల కన్నా గడిచిపోయిన రోజులే ఎందుకు మంచివి?” అని అనవద్దు \q2 అలాంటి ప్రశ్నలు అడగడం తెలివైనది కాదు. \b \q1 \v 11 జ్ఞానం ఒక వారసత్వంలా ఒక మంచి విషయమే \q2 అది సూర్యుని క్రింద బ్రతికి ఉన్నవారికి ప్రయోజనం కలిగిస్తుంది. \q1 \v 12 డబ్బుతో భద్రత లభించినట్లే, \q2 జ్ఞానంతో కూడా భద్రత లభిస్తుంది, \q1 ప్రయోజనం ఏంటంటే: \q2 జ్ఞానం తనను కలిగినవారిని కాపాడుతుంది. \p \v 13 దేవుడు చేసిన వాటిని పరిశీలించండి: \q1 ఆయన వంకరగా చేసిన దానిని \q2 ఎవరు సరిచేయగలరు? \q1 \v 14 సమయం మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి; \q2 కానీ సమయం చెడుగా ఉన్నప్పుడు ఇలా ఆలోచించండి: \q1 దేవుడు దీన్ని చేశారు \q2 అలాగే దాన్ని చేశారు. \q1 అందువల్ల, తమ భవిష్యత్తు గురించి \q2 ఎవరూ ఏమీ తెలుసుకోలేరు. \p \v 15 నా ఈ అర్థరహిత జీవితంలో నేను ఈ రెండు చూశాను; \q1 నీతిమంతులు తమ నీతిలో నశించారు, \q2 దుష్టులు తమ దుష్టత్వంలో దీర్ఘకాలం జీవించారు. \q1 \v 16 మరీ ఎక్కువ నీతిమంతునిగా ఉండకు, \q2 మరీ ఎక్కువ జ్ఞానిగా ఉండకు, \q2 నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకొంటావు? \q1 \v 17 మరీ ఎక్కువ దుర్మార్గంగా ఉండకు, \q2 మూర్ఖునిగా ఉండకు. \q2 సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి? \q1 \v 18 ఒకదాన్ని పట్టుకోవడం \q2 మరొకదాన్ని విడిచిపెట్టకపోవడం మంచిది. \q2 దేవునికి భయపడేవారు అన్ని విపరీతాలను అధిగమిస్తారు. \b \q1 \v 19 పట్టణంలోని పదిమంది అధికారుల కంటే \q2 తెలివైన వ్యక్తికి ఉన్న జ్ఞానం శక్తివంతమైనది. \b \q1 \v 20 ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే, \q2 నీతిమంతులు భూమిపై ఒక్కరు లేరు. \b \q1 \v 21 ప్రజలు చెప్పే ప్రతి మాటను వినవద్దు, \q2 లేకపోతే మీ సేవకుడు మిమ్మల్ని శపించడం మీరు వింటారు. \q1 \v 22 ఎందుకంటే మీరే చాలాసార్లు \q2 ఇతరులను శపించారని మీకు తెలుసు. \p \v 23 నా జ్ఞానంతో ఇదంతా నేను పరిశోధించాను, \q1 “నేను జ్ఞానిని కావాలని నిశ్చయించుకున్నాను” \q2 కాని అది నావల్ల కాలేదు. \q1 \v 24 జ్ఞానం దూరంగా లోతుగా ఉంది \q2 దానిని ఎవరు కనుగొనగలరు? \q1 \v 25 జ్ఞానాన్ని, సంగతుల మూలకారణాన్ని వెదకి తెలుసుకోడానికి, \q2 దుష్టత్వంలోని బుద్ధిహీనతను, \q1 మూర్ఖత్వంలోని వెర్రితనాన్ని గ్రహించడానికి, \q2 నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను. \b \q1 \v 26 నేను మరణం కన్నా దుఃఖకరమైనది తెలుసుకున్నాను, \q2 అది వల వంటిది, \q1 ఉచ్చులాంటి మనస్సు కలిగి \q2 సంకెళ్ల వంటి చేతులు కలిగిన స్త్రీ. \q1 దేవుని సంతోషపరిచేవారు ఆమె నుండి తప్పించుకుంటారు. \q2 కాని ఆమె పాపులను పట్టుకుంటుంది. \p \v 27 ప్రసంగి ఇలా అంటున్నాడు, “నేను తెలుసుకున్నది ఇదే: \q1 “సంగతుల మూలకారణాలను తెలుసుకోడానికి ఒక దానికి మరొకదాన్ని జోడించాను. \q2 \v 28 నేను ఇంకా వెదకుతున్నాను \q2 కాని దొరకడం లేదు, \q1 వేయిమంది పురుషులలో ఒక్క యథార్థవంతుడు దొరికాడు, \q2 కానీ స్త్రీలందరిలో ఒక్క యథార్థవంతురాలు కూడా దొరకలేదు. \q1 \v 29 నేను తెలుసుకున్నది ఇది ఒక్కటే; \q2 దేవుడు మనుష్యజాతిని యథార్థవంతులుగానే సృజించారు, \q2 కానీ వారు అనేక చెడు పథకాల వెంటపడుతున్నారు.” \b \c 8 \q1 \v 1 జ్ఞానులకు ఎవరు సాటి? \q2 విషయాలను ఎవరు వివరించగలరు? \q1 ఒకని జ్ఞానం వాని ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది \q2 దాని కఠిన రూపాన్ని మారుస్తుంది. \s1 రాజుకు లోబడాలి \p \v 2 నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కాబట్టి రాజాజ్ఞకు లోబడమని నేను చెప్తున్నాను. \v 3 రాజు సముఖం నుండి తొందరపడి వెళ్లి పోవద్దు. అతడు తనకు ఏది ఇష్టమైతే అది చేస్తాడు కాబట్టి చెడ్డపనులు చేయవద్దు. \v 4 రాజు మాట మహోన్నతమైనది, “మీరు నీవు ఏం చేస్తున్నావు?” అని రాజును ఎవరు అడగగలరు? \q1 \v 5 అతని ఆజ్ఞను పాటించే వారెవరికి ఏ హాని జరగదు, \q2 ఏది సరియైన సమయమో న్యాయమో జ్ఞానుల హృదయానికి తెలుసు. \q1 \v 6 ఒక వ్యక్తి కష్టం అతని మీద అధిక భారంగా ఉన్నప్పటికీ, \q2 ప్రతి దానికి సరియైన సమయం విధానం ఉంది. \b \q1 \v 7 భవిష్యత్తు గురించి ఎవరికి తెలియదు కాబట్టి, \q2 ఏది రాబోతుందో ఒకరికి ఎవరు చెప్పగలరు? \q1 \v 8 గాలిని అదుపుచేసే శక్తి ఎవరికీ లేదు, \q2 కాబట్టి\f + \fr 8:8 \fr*\ft లేదా \ft*\fqa దానిని నిలుపుకోవల్సింది మానవ ఆత్మ \fqa*\fq మీద \fq*\fqa కాబట్టి\fqa*\f* తమ మరణ సమయం మీద ఎవరికీ అధికారం లేదు. \q1 ఎలాగైతే యుద్ధ సమయంలో ఎవరూ విడుదల చేయబడరో, \q2 అలాగే దుర్మార్గం దానిని ఆచరించేవారిని విడుదల చేయదు. \p \v 9 ఇవన్నీ నేను చూశాను, సూర్యుని క్రింద చేసిన ప్రతిదానికీ నేను నా మనస్సులో ఆలోచించాను. ఒకరు ఇతరులపై ఉన్న అధికారంతో తనకే హాని తెచ్చుకుంటున్నారు. \v 10 పవిత్ర స్థలానికి తరచూ వెళ్లేవారు ఇప్పుడు ఎక్కడ నేరాలు చేశారో అదే పట్టణంలో పొగడబడతారు. అలాంటి దుర్మార్గులు సక్రమంగా పాతిపెట్టబడడం నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే. \p \v 11 చేసిన నేరానికి శిక్ష త్వరగా పడకపోతే ప్రజలు భయం లేకుండా చెడుపనులు చేస్తారు. \v 12 వంద నేరాలకు పాల్పడిన దుర్మార్గుడు ఎక్కువకాలం జీవించినప్పటికీ, దేవునికి భయపడుతూ ఆయన పట్ల భక్తిగలవారి స్థితి మేలు అని నాకు తెలుసు. \v 13 దుర్మార్గులు దేవునికి భయపడరు కాబట్టి, వారు అభివృద్ధి చెందరు, వారి రోజులు నీడలా ధీర్ఘకాలం ఉండవు. \p \v 14 భూమిపై అర్థరహితమైనది మరొకటి ఉంది: దుర్మార్గులు పొందవలసిన దాన్ని నీతిమంతులు, నీతిమంతులు పొందవలసిన దాన్ని దుర్మార్గులు పొందుతున్నారు. ఇది కూడా అర్థరహితమే అని నేను చెప్తున్నాను. \v 15 కాబట్టి జీవితాన్ని ఆనందించడాన్ని నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే సూర్యుని క్రింద ఉన్నవారు తిని త్రాగి సంతోషించడం కన్నా గొప్పది లేదు. అప్పుడు దేవుడు సూర్యుని క్రింద వారికి ఇచ్చిన జీవితకాలంలో వారి కష్టంలో వారికి తోడుగా ఉండేది ఆ సంతోషమే. \p \v 16 జ్ఞానాన్ని పొందడానికి, భూమిపై ప్రజలు పగలు రాత్రి నిద్రలేకుండ చేసే శ్రమను గమనించడానికి నేను నా మనస్సును నిలిపినప్పుడు \v 17 దేవుడు చేస్తున్నదంతా నేను చూశాను. సూర్యుని క్రింద ఏమి జరుగుతుందో ఎవరూ అర్థం చేసుకోలేరు. దీన్ని వెదకడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దాని పూర్తిగా గ్రహించలేరు. జ్ఞానులు తమకు తెలుసు అని వాదించినప్పటికీ, వారు దానిని నిజంగా గ్రహించలేరని నేను తెలుసుకున్నాను. \c 9 \s1 అందరికి ఒకే గమ్యం \p \v 1 దీని అంతటిని పరిశీలించి నేనో నిర్ణయానికి వచ్చాను ఏంటంటే నీతిమంతులు జ్ఞానులు వారు చేసే పనులు దేవుని చేతుల్లో ఉన్నాయని, అయితే వారి కోసం ప్రేమ ఎదురుచూస్తుందా లేదా ద్వేషమా అనేది ఎవరికీ తెలియదు. \v 2 జరిగేవన్నీ అందరికి ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు దుర్మార్గులకు, మంచివారికి చెడ్డవారికి, అపవిత్రులకు పవిత్రులకు, బలులు అర్పించేవారికి అర్పించని వారికి అందరికి ఒకే విధంగా జరుగుతాయి. \q1 మంచివారికి ఎలాగో, \q2 పాపాత్ములకు అలాగే జరుగుతుంది; \q1 ఒట్టుపెట్టుకునే వారికి, \q2 ఒట్టు పెట్టుకోడానికి భయపడేవారికి అలాగే జరుగుతుంది. \p \v 3 అందరికి ఒకే విధంగా జరగడం సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిలో చాలా చెడ్డ విషయం. అంతేకాక, మనుష్యుల హృదయాలు చెడుతో నిండి ఉన్నాయి, వారు బ్రతికి ఉన్నప్పుడు వారి హృదయాల్లో పిచ్చి ఉంటుంది, తర్వాత వారు చచ్చినవారితో కలిసిపోతారు. \v 4 బ్రతికి ఉన్నవారి మధ్యలో ఉండే వారికే నిరీక్షణ ఉంటుంది; చనిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క నయం కదా! \q1 \v 5 బ్రతికి ఉన్నవారికి తాము చనిపోతామని తెలుసు, \q2 కాని చనిపోయినవారికి ఏమి తెలియదు; \q1 వారికి ఏ బహుమతి లేదు, \q2 వారి పేరు కూడా మర్చిపోతారు. \q1 \v 6 వారి ప్రేమ, వారి ద్వేషం \q2 వారి అసూయ చాలా కాలం క్రితమే అంతరించిపోయాయి; \q1 సూర్యుని క్రింద జరిగే ఏ విషయంలో \q2 వారికిక ఏ భాగం ఉండదు. \p \v 7 వెళ్లండి, సంతోషంగా మీ ఆహారాన్ని తినండి ఆనందకరమైన హృదయంతో మీ ద్రాక్షరసం త్రాగండి, ఎందుకంటే మీరు చేసే దాన్ని దేవుడు ముందుగానే ఆమోదించారు. \v 8 ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో, ఎప్పుడూ తలకు నూనె రాసుకో. \v 9 సూర్యుని క్రింద దేవుడు మీకు ఇచ్చిన ఈ అర్థరహితమైన జీవితకాలమంతా మీరు ప్రేమించే మీ భార్యతో జీవితాన్ని ఆస్వాదించండి; ఎందుకంటే ఇది మీ జీవితంలో సూర్యుని క్రింద మీరు పడిన కష్టంలో మీకు లభించే భాగము. \v 10 మీ చేతికి వచ్చిన ఏ పనియైనా శక్తివంచన లేకుండా చేయండి. ఎందుకంటే మీరు వెళ్తున్న పాతాళంలో పని చేయడం గాని ప్రణాళిక వేయడం గాని లేదా తెలివి గాని జ్ఞానం గాని ఉండవు. \p \v 11 సూర్యుని క్రింద మరొకటి కూడ నేను గమనించాను: \q1 వేగంగా ఉన్నవారే పందెం గెలవలేరు \q2 బలంగా ఉన్నవారే యుద్ధాన్ని జయించలేరు, \q1 జ్ఞానులకు ఆహారం లభించదు \q2 తెలివైన వారికే సంపద ఉండదు \q2 చదువుకున్న వారికి దయ లభించదు; \q1 కాని సమయాన్ని బట్టే అందరికి అవకాశాలు వస్తాయి. \p \v 12 అంతేకాక, వాటి సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు: \q1 చేపలు వలలో పట్టబడినట్లు, \q2 పక్షులు వలలో చిక్కుకున్నట్లు \q1 హఠాత్తుగా వారి మీద పడే \q2 చెడు కాలంలో ప్రజలు చిక్కుపడతారు. \s1 బుద్ధిహీనత కన్నా జ్ఞానం మిన్న \p \v 13 నేను సూర్యుని క్రింద నన్ను బాగా ఆకట్టుకొన్న జ్ఞానం యొక్క ఈ ఉదాహరణను నేను చూశాను: \v 14 ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్న ఒక చిన్న పట్టణం ఉండేది. ఒక శక్తివంతమైన రాజు వచ్చి దానిని చుట్టుముట్టి, దానికి ఎదురుగా భారీ ముట్టడి దిబ్బలు కట్టాడు. \v 15 ఇప్పుడు ఆ పట్టణంలో ఉండే ఒక పేదవాడు తన జ్ఞానంతో ఆ పట్టణాన్ని కాపాడాడు. కానీ ఆ పేదవాన్ని ఎవరూ జ్ఞాపకం ఉంచుకోలేదు. \v 16 కాబట్టి నేను ఇలా అనుకున్నాను, “బలం కన్నా జ్ఞానం మేలు” కానీ ఆ పేదవాడి జ్ఞానం తృణీకరించబడింది, అతని మాటలు ఇకపై పట్టించుకోరు. \q1 \v 17 మూర్ఖుల పాలకుడి కేకల కంటే \q2 జ్ఞానులు మెల్లగా చెప్పే మాటలు వినడం మంచిది. \q1 \v 18 యుద్ధాయుధాలకంటె జ్ఞానం మేలు, \q2 కాని ఒక్క పాపి అనేకమైన మంచి వాటిని నాశనం చేస్తాడు. \b \c 10 \q1 \v 1 పరిమళతైలంలో పడిన చచ్చిన ఈగలు దానికి చెడు వాసన తెచ్చినట్లు, \q2 కొంచెం మూర్ఖత్వం జ్ఞానాన్ని ఘనతను పాడుచేస్తుంది. \q1 \v 2 జ్ఞాని హృదయం కుడి చేతిలో ఉంటుంది, \q2 కాని మూర్ఖుడి హృదయం ఎడమ చేతిలో ఉంటుంది. \q1 \v 3 తెలివిలేనివారు దారిలో సరిగా నడవలేక \q2 వారు ఎంత తెలివితక్కువ వారు అనేది \q2 అందరికి చూపిస్తారు. \q1 \v 4 వారు ఎంత తెలివితక్కువ వారు అనేది, \q2 మీ ఉద్యోగాన్ని వదిలేయవద్దు; \q2 ప్రశాంతత గొప్ప నేరాలు జరుగకుండ ఆపుతుంది. \b \q1 \v 5 నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, \q2 ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం: \q1 \v 6 అదేమిటంటే మూర్ఖులను ఉన్నత పదవులలో, \q2 సమర్థులను దిగువ స్థాయిలో ఉంచడమే. \q1 \v 7 నేను బానిసలు గుర్రాలపై, \q2 యువరాజులు బానిసల్లా కాలినడకన వెళ్లడం చూశాను. \b \q1 \v 8 గొయ్యి త్రవ్వినవారే అందులో పడతారు; \q2 గోడను పడగొట్టిన వారే పాము కాటుకు గురవుతారు. \q1 \v 9 రాళ్లు దొర్లించేవారు దానివల్ల గాయపడతారు; \q2 మొద్దులను చీల్చేవారు వాటి వల్ల ప్రమాదానికి గురి అవుతారు. \b \q1 \v 10 ఒకవేళ గొడ్డలి మొద్దుబారి \q2 దాని అంచుకు పదును పెట్టకపోతే, \q1 ఎక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుంది, \q2 అయితే జ్ఞానం విజయాన్ని తెస్తుంది. \b \q1 \v 11 ఒకవేళ లొంగదీయక ముందే పాము కాటేస్తే, \q2 పాములు ఆడించేవానికి లాభం ఉండదు. \b \q1 \v 12 జ్ఞానుల నోటి నుండి వచ్చే మాటలు దయగలవి, \q2 కాని మూర్ఖుని పెదవులు వానినే మ్రింగివేస్తాయి. \q1 \v 13 అవివేకంతో మొదలైన వారి మాటలు; \q2 దుర్మార్గపు వెర్రితనంతో ముగుస్తాయి; \q2 \v 14 అయినా మూర్ఖులు వాగుతూనే ఉంటారు. \b \q1 ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు \q2 వారు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు? \b \q1 \v 15 మూర్ఖులకు పట్టణానికి వెళ్లడానికి దారి తెలియదు; \q2 కాబట్టి తమ శ్రమతో వారు అలసిపోతారు. \b \q1 \v 16 దాసుడు\f + \fr 10:16 \fr*\ft లేదా \ft*\fq రాజు \fq*\fqa బాలుడు\fqa*\f* రాజుగా ఉన్న దేశానికి \q2 ఉదయాన్నే విందు చేసుకొనే యువరాజులు ఉన్న దేశానికి శ్రమ. \q1 \v 17 గొప్ప జన్మ కలిగినవాడు రాజుగా ఉన్న దేశం \q2 మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో \q2 భోజనానికి కూర్చునే అధిపతులు ఉన్న దేశం ధన్యమైనది. \b \q1 \v 18 ఒకని సోమరితనం వల్ల ఇంటికప్పు కూలిపోతుంది, \q2 ఒకని బద్దకం వల్ల ఇల్లు కారిపోతుంది. \b \q1 \v 19 నవ్వడం కోసం విందు చేస్తారు, \q2 ద్రాక్షరసం జీవితానికి సంతోషం కలిగిస్తుంది, \q2 డబ్బు ప్రతిదానికీ సమాధానం. \b \q1 \v 20 మీ ఆలోచనలో కూడా రాజును తిట్టవద్దు, \q2 మీ పడకగదిలో కూడా ధనికులను శపించవద్దు, \q1 ఎందుకంటే ఆకాశపక్షులు, \q2 రెక్కలున్న పక్షులు మీరు చెప్పేవాటిని బయట పెట్టవచ్చు. \c 11 \s1 అనేక చోట్ల పెట్టుబడి \q1 \v 1 మీ ధాన్యాన్ని సముద్రం గుండా రవాణ చేయండి; \q2 చాలా రోజుల తర్వాత దాని నుండి మీరు లాభం పొందవచ్చు. \q1 \v 2 ఏడు ఎనిమిదింటిలో పెట్టుబడి పెట్టండి; \q2 దేశంలో ఎలాంటి విపత్తు వస్తుందో మీకు తెలియదు. \b \q1 \v 3 ఒకవేళ మేఘాల నిండా నీళ్లు ఉంటే, \q2 అవి భూమిపై వర్షిస్తాయి. \q1 ఒక చెట్టు దక్షిణంగా కూలినా ఉత్తరంగా కూలినా, \q2 అది పడిన చోటనే ఉంటుంది. \q1 \v 4 గాలిని పరిశీలించేవాడు విత్తనాలు చల్లడు; \q2 మబ్బులు చూస్తూ ఉండేవాడు పంట కోయడు. \b \q1 \v 5 మీకు గాలి వీచే దిశ తెలియనట్లుగానే, \q2 తల్లి గర్భంలో పిండం ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియనట్లుగా, \q1 అన్నిటిని చేసినవాడైన \q2 దేవుని క్రియలు మీకు అర్థం కావు. \b \q1 \v 6 ఉదయాన్నే మీ విత్తనాన్ని విత్తండి, \q2 సాయంత్రం వరకు మీ చేతులను వెనుకకు తీయకండి, \q1 ఎందుకంటే ఇది ఫలిస్తుందో అది ఫలిస్తుందో, \q2 లేదా రెండు సమానంగా ఫలిస్తాయో, \q2 మీకు తెలియదు. \s1 బాల్యంలోనే మీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి \q1 \v 7 వెలుగు ఆహ్లాదకరమైనది, \q2 సూర్యుని చూడడం కళ్లకు సంతోషాన్ని ఇస్తుంది. \q1 \v 8 ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే, \q2 అన్ని సంవత్సరాలు వారు ఆనందంగా ఉండాలి. \q1 అయితే చీకటి రోజులు చాలా \q2 రాబోతున్నాయని వారు జ్ఞాపకముంచుకోవాలి. \q2 రాబోయేదంతా అర్థరహితమే. \b \q1 \v 9 యవ్వనులారా మీరు, మీ యవ్వన దశలో మీరు సంతోషించండి, \q2 మీ యవ్వన దినాల్లో మీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వండి \q1 మీ హృదయ కోరుకున్న వాటిని \q2 మీ కళ్లు చూసే వాటిని అనుభవించండి, \q1 కాని వీటన్నిటిని బట్టి దేవుడు మిమ్మల్ని \q2 తీర్పులోకి తెస్తారని తెలుసుకోండి. \q1 \v 10 కాబట్టి, మీ హృదయంలోనుండి ఆందోళన తీసివేయండి, \q2 మీ శరీర బాధలను వెళ్లగొట్టండి, \q2 ఎందుకంటే యవ్వనం, దాని బలం అర్థరహితమే. \b \c 12 \q1 \v 1-2 కష్ట దినాలు రాకముందే \q2 “వాటిలో నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పే \q2 సంవత్సరాలు రాకముందే, \q1 సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే, \q2 వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే, \q1 నీ యవ్వన ప్రాయంలో \q2 నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. \q1 \v 3 ఆ రోజు ఇంటి కావలివారు వణుకుతారు, \q2 బలిష్ఠులు వంగిపోతారు, \q1 తిరగలి విసిరేవారు కొంతమందే ఉండడంతో పని ఆపివేస్తారు, \q2 కిటికీలో నుండి చూచేవారి దృష్టి మందగిస్తుంది. \q1 \v 4 వీధి తలుపులు మూసేస్తారు; \q2 తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోతుంది \q1 పక్షుల కూతకు ప్రజలు మేల్కొంటారు, \q2 పాటలు పాడే స్త్రీల గొంతులు తగ్గిపోతాయి. \q1 \v 5 మనుష్యులు ఎత్తైన స్థలాలకు \q2 వీధుల్లో అపాయాలకు భయపడతారు; \q1 బాదం చెట్టు పూలు పూస్తుంది \q2 మిడత తనను తాను ఈడ్చుకు వెళ్తున్నప్పుడు \q2 ఇక కోరికలు రేపబడవు. \q1 మనుష్యులు శాశ్వత నివాసం చేరుకుంటారు \q2 వారి కోసం ఏడ్చేవారు వీధుల్లో తిరుగుతారు. \b \q1 \v 6 వెండితాడు తెగిపోక ముందే, \q2 బంగారు గిన్నె పగిలిపోక ముందే, \q1 నీటి ఊట దగ్గర కుండ బద్దలైపోక ముందే, \q2 బావి దగ్గర చక్రం విరిగిపోక ముందే, \q2 నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. \q1 \v 7 మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది, \q2 ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది. \b \q1 \v 8 “అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి. \q2 “ప్రతిదీ అర్థరహితమే!” \s1 ముగింపు \p \v 9 ప్రసంగి జ్ఞాని మాత్రమే కాదు అతడు ప్రజలకు కూడా జ్ఞానాన్ని అందించాడు. అతడు లోతుగా ఆలోచించి ఎన్నో సామెతలను క్రమపరిచాడు. \v 10 ఈ ప్రసంగి సరియైన మాటలనే చెప్పాడు; అతడు సత్యమైన యథార్థ వాక్కులు వ్రాశాడు. \p \v 11 జ్ఞానుల మాటలు ములికోలు లాంటివి, సేకరించిన సూక్తులు గట్టిగా దిగగొట్టిన మేకుల వంటివి; అవి ఒక కాపరి చేత ఇవ్వబడ్డాయి. \v 12 నా కుమారుడా, వీటితో పాటు ఇతర వాటి గురించి జాగ్రత్తగా ఉండు. \p పుస్తకాల రచనకు అంతం లేదు, అధిక చదువు శరీరానికి అలసట కలిగిస్తుంది. \q1 \v 13 ఇవన్నీ విన్న తర్వాత, \q2 అన్నిటి ముగింపు ఇదే: \q1 దేవునికి భయపడాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి, \q2 ఇదే మనుష్యులందరి కర్తవ్యము. \q1 \v 14 దేవుడు ప్రతి పనిని తీర్పులోనికి తెస్తారు, \q2 దాచబడిన ప్రతి దానిని, \q2 అది మంచిదైనా చెడ్డదైనా సరే తీర్పులోనికి తెస్తారు.