\id DAN - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h దానియేలు \toc1 దానియేలు ప్రవచనం \toc2 దానియేలు \toc3 దాని \mt1 దానియేలు \mt2 ప్రవచనం \c 1 \s1 బబులోనులో దానియేలు శిక్షణ \p \v 1 యూదా రాజైన యెహోయాకీము పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి దానిని ముట్టడించాడు. \v 2 ప్రభువు నెబుకద్నెజరు చేతికి యూదా రాజైన యెహోయాకీమును, దేవుని ఆలయపు పరికరాలతో పాటు అప్పగించారు. బబులోను రాజు వాటిని తన బబులోనియా\f + \fr 1:2 \fr*\ft హెబ్రీలో \ft*\fqa షీనారు\fqa*\f* దేవుని గుడికి తీసుకెళ్లి వాటిని తన దేవుని ధనాగారంలో ఉంచాడు. \p \v 3 రాజు, రాజ్య పరిచర్య చేయడానికి ఇశ్రాయేలీయులలో రాజకుటుంబానికి, రాజవంశాలకు చెందిన కొంతమందిని తీసుకురమ్మని తన ముఖ్య అధికారియైన అష్పెనజును ఆదేశించాడు. \v 4 ఆ యువకులు ఏ శారీరక లోపం లేనివారై, అందంగా ఉండి, విద్యా ప్రావీణ్యత కలిగి తెలివి కలవారై, త్వరగా గ్రహించే వారై రాజభవనంలో సేవ చేయటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. వారికి బబులోనీయుల\f + \fr 1:4 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల\fqa*\f* భాష చదవడం వ్రాయడం నేర్పాలి. \v 5 రాజు తన బల్ల నుండి వారి కోసం ఆహారం, ద్రాక్షరసం కొంత భాగాన్ని ప్రతిరోజు వారికి కేటాయించాడు. వారు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది ఆ తర్వాత వారు రాజుకు సేవ చేయాలి. \p \v 6 యూదా నుండి ఎంపిక చేసిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా ఉన్నారు. \v 7 ప్రధాన అధికారి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రకు అని మిషాయేలుకు మేషాకు అని అజర్యాకు అబేద్నెగో అని క్రొత్త పేర్లు పెట్టాడు. \p \v 8 అయితే దానియేలు, రాజు ఇచ్చే ఆహారం, ద్రాక్షరసం పుచ్చుకుని తనను తాను అపవిత్రపరచుకోవద్దని నిర్ణయించుకొని, తాను అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తినకుండా ఉండడానికి ప్రధాన అధికారి అనుమతి కోరాడు. \v 9 ఆ అధిపతి దానియేలు పట్ల దయ కరుణ చూపించేలా దేవుడు చేశారు. \v 10 కాబట్టి ఆ అధికారి దానియేలుతో, “మీకు ఆహారం పానీయం కేటాయించిన నా ప్రభువైన నా రాజుకు నేను భయపడుతున్నాను. మీ వయస్సు యువకుల కంటే మీరు అతనికి ఎందుకు పీక్కుపోయినట్టుగా కనిపించాలి? అప్పుడు రాజు మిమ్మల్ని బట్టి నా తల నరికేస్తాడు” అన్నాడు. \p \v 11 అప్పుడు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా మీద ప్రధాన అధికారి నియమించిన నాయకునితో దానియేలు, \v 12 “దయచేసి పది రోజులపాటు మీ దాసులను పరీక్షించి చూడండి: మాకు కూరగాయలు, త్రాగడానికి నీళ్లు తప్ప ఏమి ఇవ్వకండి. \v 13 ఆ తర్వాత రాజాహారం తిన్న యువకులతో మా ముఖాలను పోల్చి చూసిన తర్వాత మీకు నచ్చినట్లు మాకు చేయండి” అని అన్నాడు. \v 14 అందుకతడు ఒప్పుకుని పది రోజులు వారిని పరీక్షించాడు. \p \v 15 పది రోజుల తర్వాత చూస్తే రాజు ఆహారం తిన్న యువకులందరికంటే వీరు ఆరోగ్యంగా, పుష్టిగా కనిపించారు. \v 16 కాబట్టి ఆ నాయకుడు రాజు ఆహారాన్ని, వారు త్రాగవలసిన ద్రాక్షరసాన్ని తీసివేసి వారికి కూరగాయలు పెట్టాడు. \p \v 17 ఈ నలుగురు యువకులకు దేవుడు అన్ని రకాల సాహిత్యంలో, విద్యలో, తెలివిని, వివేకాన్ని ఇచ్చారు. అంతేకాక, దానియేలు దర్శనాలు, రకరకాల కలల భావాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. \p \v 18 వారిని రాజు సేవకై తీసుకువచ్చే సమయం సమీపించినప్పుడు, ప్రముఖ అధికారి వారిని నెబుకద్నెజరు సమక్షంలో నిలబెట్టాడు. \v 19 రాజు వారితో మాట్లాడారు, వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకు సమానం ఎవరూ లేరని కనుగొన్నాడు; కాబట్టి వారిని రాజు సేవకు నియమించాడు. \v 20 రాజు వారిని ప్రశ్నించినప్పుడు జ్ఞానం, వివేకం విషయంలో తన రాజ్యమంతటిలో ఉన్న మాంత్రికులు, శకునగాళ్లు, అందరికంటే పది రెట్లు గొప్పగా వారునట్లు అతడు కనుగొన్నాడు. \p \v 21 దానియేలు రాజ్య సేవలో రాజైన కోరెషు పరిపాలనలోని మొదటి సంవత్సరం వరకు ఉన్నాడు. \c 2 \s1 నెబుకద్నెజరు కల \p \v 1 నెబుకద్నెజరు పరిపాలన యొక్క రెండవ సంవత్సరంలో అతడు కలలు కన్నాడు; వాటివలన అతని మనస్సు కలతచెందింది, అతడు పడుకోలేకపోయాడు. \v 2 కాబట్టి అతడు తనకు వచ్చిన కలను చెప్పడానికి మాంత్రికులను, శకునగాళ్లను, గారడీవారిని, జ్యోతిష్యులను\f + \fr 2:2 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయులు\fqa*\ft ; \+xt 4|link-href="DAN 2:4"\+xt*, \+xt 5|link-href="DAN 2:5"\+xt*, \+xt 10|link-href="DAN 2:10"\+xt* వచనాల్లో కూడా\ft*\f* పిలిపించాడు. వారు వచ్చి రాజు సమక్షంలో నిలబడ్డారు. \v 3 రాజు వారితో, “నాకు కల వచ్చింది, అది నన్ను కలవరపెడుతుంది, దాని భావం ఏంటో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అని అన్నాడు. \p \v 4 అప్పుడు జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! మీ దాసులకు కల ఏంటో చెప్పండి, మేము దాని భావం చెప్తాం” అన్నారు. \p \v 5 రాజు కల్దీయ జ్యోతిష్యులతో, “నేను ఆ కలను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలుగా చేసి, మీ ఇళ్ళను కూల్చివేస్తాను. \v 6 కాని ఒకవేళ మీరు నా కలను, దాని భావాన్ని చెప్తే మీకు కానుకలు, బహుమానాలు, గొప్ప ఘనతను ఇస్తాను. కాబట్టి నాకు వచ్చిన కలను చెప్పి, దాని భావాన్ని వివరించండి” అన్నాడు. \p \v 7 అందుకు వారు, “రాజు తన దాసులకు కలను చెబితే మేము దాని భావం వివరిస్తాం” అన్నారు. \p \v 8 అప్పుడు రాజు వారితో ఇలా అన్నాడు, “నాకు వచ్చిన కలను నేను మరచిపోయాను కాబట్టి మీరు కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. \v 9 నాకు వచ్చిన కలను మీరు చెప్పకపోతే, మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు. పరిస్థితి మారాలని నన్ను తప్పుదారి పట్టించే మోసపు మాటలు చెప్పాలని అనుకుంటున్నారు. కాబట్టి నాకు కలను చెప్పండి, అప్పుడు మీరు కల భావం చెప్పగలరని నేను తెలుసుకుంటాను.” \p \v 10 కల్దీయ జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ ఇలా అన్నారు, “రాజు అడిగింది చెప్పేవారు భూమిపై ఎవరూ లేరు! ఏ రాజు ఏ అధిపతి ఏ అధికారి ఇలాంటి విషయాన్ని ఏ శకునగాడిని గాని మాంత్రికున్ని గాని జ్యోతిష్యున్ని గాని ఇప్పటివరకు అడగలేదు. \v 11 రాజు అడిగేది కష్టతరమైనది. దేవుళ్ళు తప్ప ఎవరూ దానిని రాజుకు తెలియజేయలేరు, అయితే వారేమో మానవుల మధ్య నివసించరు.” \p \v 12 ఇది రాజుకు తీవ్రమైన కోపాన్ని పుట్టించగా అతడు బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపమని ఆదేశించాడు. \v 13 జ్ఞానులను చంపమని శాసనం జారీ అయ్యింది, కాబట్టి దానియేలును అతని స్నేహితులను చంపాలని మనుష్యులు వారిని వెదకడానికి వెళ్లారు. \p \v 14 రాజుకు ప్రధాన రక్షక భటుడైన అర్యోకు బబులోనులోని జ్ఞానులను చంపడానికి వెళ్లినప్పుడు, దానియేలు జ్ఞానంతో, యుక్తితో అతనితో మాట్లాడాడు. \v 15 “రాజు దగ్గర నుండి ఇలాంటి కఠినమైన ఆజ్ఞ ఇంత త్వరగా రావడమేంటి?” అని రాజాధికారిని అతడు అడిగాడు. అప్పుడు అర్యోకు దానియేలుకు విషయాన్ని వివరించాడు. \v 16 వెంటనే దానియేలు రాజు దగ్గరకు వెళ్లి, ఆ కల భావాన్ని వివరించడానికి కొంత సమయం ఇవ్వమని కోరాడు. \p \v 17 తర్వాత దానియేలు ఇంటికి వెళ్లి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు ఆ సంగతి వివరించాడు. \v 18 దానియేలు, అతని స్నేహితులు, బబులోనులో ఉన్న ఇతర జ్ఞానులతో పాటు చంపబడకుండునట్లు, పరలోక దేవుడు ఆ మర్మాన్ని తెలియజేసేలా ఆయన కరుణ కోసం ప్రాధేయపడమని వారిని బలవంతం చేశాడు. \v 19 ఆ రాత్రివేళ దానియేలుకు దర్శనం ద్వారా ఆ మర్మం తెలియజేయబడింది. అప్పుడు దానియేలు పరలోక దేవున్ని స్తుతిస్తూ, \v 20 ఇలా అన్నాడు: \q1 “దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి కలుగును గాక; \q2 జ్ఞానం, శక్తి ఆయనకే చెందుతాయి. \q1 \v 21 ఆయన కాలాలను, రుతువులను మారుస్తారు; \q2 ఆయన రాజులను కూలగొట్టి ఇతరులను నియమిస్తారు. \q1 ఆయన జ్ఞానులకు జ్ఞానాన్ని, \q2 వివేకులకు వివేకాన్ని ఇస్తారు. \q1 \v 22 ఆయన లోతైన విషయాలను, రహస్యాలను బయలుపరుస్తారు; \q2 చీకటిలో ఉన్నది ఆయనకు తెలుసు, \q2 వెలుగు ఆయనతో నివసిస్తుంది. \q1 \v 23 నా పూర్వికుల దేవా, నేను మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను: \q2 మీరు నాకు జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చారు, \q1 మేము మిమ్మల్ని అడిగింది మీరు నాకు తెలియజేశారు, \q2 రాజు కలను మీరు మాకు తెలియజేశారు.” \s1 దానియేలు కలను వివరించుట \p \v 24 అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులను చంపమని రాజు నియమించిన అర్యోకు దగ్గరకు వెళ్లి అతనితో, “బబులోను జ్ఞానులను చంపకండి. నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్లండి, నేను అతని కల భావం అతనికి తెలియజేస్తాను” అన్నాడు. \p \v 25 వెంటనే అర్యోకు దానియేలును రాజు దగ్గరకు తీసుకెళ్లి, “యూదా నుండి బందీలుగా వచ్చిన వారిలో రాజు కల భావం చెప్పగలవాడు నాకు దొరికాడు” అని చెప్పాడు. \p \v 26 రాజు దానియేలును (మరో పేరు బెల్తెషాజరు), “నేను కలలో ఏమి చూశానో, దాని భావం ఏంటో చెప్పగలవా?” అని అడిగాడు. \p \v 27 దానియేలు జవాబిస్తూ ఇలా అన్నాడు, “రాజు అడిగిన మర్మం ఏ జ్ఞాని గాని, శకునాలు చెప్పేవాడు గాని, మాంత్రికుడు గాని, జ్యోతిష్యుడు గాని చెప్పలేడు. \v 28 అయితే మర్మాలు బయలుపరిచే ఒక దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే నెబుకద్నెజరు రాజుకు రాబోయే రోజుల్లో జరిగేది తెలియజేశారు. మీ మంచం మీద మీరు పడుకున్నప్పుడు మీ మనస్సులోనికి వచ్చిన మీ కల, మీ దర్శనాలు ఇవి: \p \v 29 “రాజా! మీరు పడుకున్నప్పుడు, రాబోయే సంగతుల గురించి మీరు ఆలోచిస్తుండగా, మర్మాలను తెలిపేవాడు జరగబోయే దానిని చూపించారు. \v 30 నా మట్టుకైతే, ఈ మర్మం నాకు బయలుపరచబడింది, నేను ఇతరులకంటే గొప్ప జ్ఞానం కలిగినవాడినని కాదు గాని, రాజుకు భావం తెలియజేయడానికి, మీ మనస్సులోని ఆలోచనలు మీరు గ్రహించాలని అది బయలుపరచబడింది. \p \v 31 “రాజా! మీరు మీ కలలో చూసినప్పుడు మీ ఎదుట ఒక బ్రహ్మాండమైన విగ్రహం ఉంది. అది గొప్పది, ప్రకాశమానమైన, భయంకరమైన ప్రతిమ. \v 32 ఆ ప్రతిమ తల మేలిమి బంగారంతో, దాని రొమ్ము, చేతులు వెండితో, దాని కడుపు, తొడలు ఇత్తడితో, \v 33 దాని కాళ్లు ఇనుముతో, దాని పాదాలు కొంత ఇనుము కొంత బంకమట్టితో చేయబడింది. \v 34 మీరు చూస్తుండగా, మనిషి చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఇనుము బంకమట్టితో ఉన్న ఆ విగ్రహం పాదాల మీద పడి వాటిని విరగ్గొట్టింది. \v 35 అప్పుడు ఇనుము, బంకమట్టి, ఇత్తడి, వెండి, బంగారం ముక్కలుగా విరిగిపోయి, వేసవికాలంలో నూర్పిడి కళ్ళం మీద పడే పొట్టులా అయ్యింది. జాడ తెలియలేనంతగా గాలి వాటిని ఈడ్చుకెళ్తుంది. అయితే ఆ విగ్రహాన్ని కొట్టిన ఆ రాయి మహా పర్వతంగా మారి భూమంతా నిండింది. \p \v 36 “ఇదే కల, ఇప్పుడు దాని భావం రాజుకు మేము వివరిస్తాము. \v 37 రాజా! మీరు రాజులకు రాజు. పరలోక దేవుడు మీకు అధికారాన్ని, శక్తిని, బలాన్ని, వైభవాన్ని అనుగ్రహించారు; \v 38 ఆయన మానవులందరిని, భూజంతువులను, ఆకాశ పక్షులను మీ చేతుల్లో ఉంచారు. వారున్న ప్రతిచోట ఆయన మిమ్మల్ని పాలకునిగా చేశారు. ఆ విగ్రహానికి ఉన్న బంగారు తల మీరు. \p \v 39 “మీ తర్వాత, మీకంటే తక్కువగా ఉన్న మరో సామ్రాజ్యం లేస్తుంది. దాని తర్వాత ఇత్తడి సూచనగా ఉన్న మూడవ సామ్రాజ్యం, లోకమంతటిని పరిపాలిస్తుంది. \v 40 చివరికి, ఇనుము వంటి బలమైన నాలుగవ సామ్రాజ్యం వస్తుంది. ఇనుము అన్నిటిని విరగ్గొట్టి ముక్కలుగా చేసినట్లు, ఆ రాజ్యం ఇతరులందరిని చితుకగొట్టి, విరగ్గొడుతుంది. \v 41 ఆ విగ్రహ పాదాలు, కాళ్ల వేర్లు కొంత ఇనుము, కొంత బంకమట్టితో ఉన్నట్టు మీరు చూసిన విధంగా అది విభజించబడిన రాజ్యంగా ఉంటుంది; అయినా ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్లు, దానిలో కొంత ఇనుములా బలంగా ఉంటుంది. \v 42 కాళ్ల వ్రేళ్లు కొంత ఇనుము, కొంత బంకమట్టితో ఉన్నట్లు, ఆ రాజ్యం కొంత బలంగా, కొంత బలహీనంగా ఉంటుంది. \v 43 ఇనుము, బంకమట్టితో కలిసినట్లు మీరు చూసినట్లే, ఆ రాజ్య ప్రజలు మిశ్రితమై ఉంటారు. అయినా ఇనుము బంకమట్టితో కలవనట్లు, వారు కూడా ఐక్యంగా ఉండలేరు. \p \v 44 “ఆ రాజుల కాలంలో పరలోక దేవుడు ఒక రాజ్యం నెలకొల్పుతారు, అది ఎన్నటికి నశించదు, అది ఇతర ప్రజల చేతిలో పడదు. అది ఆ రాజ్యాలన్నిటినీ చితగ్గొట్టి, వాటిని తుదముట్టిస్తుంది, కాని అది మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది. \v 45 మనుష్యుల చేతితో ముట్టని రాయి, పర్వతం నుండి చీలిపోయి ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారాన్ని ముక్కలు చేసినట్లు వచ్చిన ఆ దర్శనానికి అర్థం ఇది. \p “గొప్ప దేవుడు భవిష్యత్తులో జరిగేది రాజుకు వెల్లడి చేశారు. ఈ కల నిజం, దాని వివరణ నమ్మదగినది.” \p \v 46 అప్పుడు నెబుకద్నెజరు రాజు దానియేలు ఎదుట సాష్టాంగపడి, అతన్ని పూజించి, అతనికి నైవేద్యం ధూపం అర్పించమని ఆదేశించాడు. \v 47 రాజు దానియేలుతో, “నిజంగా నీ దేవుడే దేవుళ్ళకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మాలను బయలుపరిచేవాడు, ఎందుకంటే ఈ మర్మాన్ని నీవు బయలుపరిచావు” అన్నాడు. \p \v 48 అప్పుడు రాజు దానియేలుకు ఉన్నత పదవిని ఇచ్చి, ఎన్నో గొప్ప బహుమానాలు ఇచ్చాడు. అతన్ని బబులోను సామ్రాజ్యమంతటి మీద అధికారిగా చేశాడు, ఆ దేశ జ్ఞానులందరి మీద ప్రధానిగా నియమించాడు. \v 49 అంతేకాక, రాజు దానియేలు చేసిన మనవి ప్రకారం షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో నిర్వాహకులుగా నియమించాడు, అయితే దానియేలు రాజభవనంలోనే ఉండిపోయాడు. \c 3 \s1 బంగారు విగ్రహం, మండుతున్న అగ్నిగుండం \p \v 1 నెబుకద్నెజరు రాజు ఒక బంగారు విగ్రహం చేయించి, దానిని బబులోను దేశంలో దూరా అనే మైదానంలో నిలబెట్టాడు. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు ఆరు మూరలు.\f + \fr 3:1 \fr*\ft అంటే, 27 మీటర్ల ఎత్తు, 2.7 మీటర్ల వెడల్పు\ft*\f* \v 2 తర్వాత రాజైన నెబుకద్నెజరు ఆ విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ రావాలని ప్రకటించాడు. \v 3 కాబట్టి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ వచ్చి దాని ఎదుట నిలబడ్డారు. \p \v 4 అప్పుడు దూత బిగ్గరగా ఇలా ప్రకటించాడు, “దేశాల్లారా, వివిధ భాషల ప్రజలారా, మీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఇదే: \v 5 బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు మీరు విన్నప్పుడు, మీరు సాగిలపడి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించాలి. \v 6 దానికి సాగిలపడి పూజించని వారు వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు.” \p \v 7 కాబట్టి వారు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్న వెంటనే సమస్త దేశాలవారు, వివిధ భాషల ప్రజలు నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు విగ్రహం ఎదుట సాగిలపడి దానిని పూజించారు. \p \v 8 ఆ సమయంలో కొందరు కల్దీయ జ్యోతిష్యులు\f + \fr 3:8 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయులు\fqa*\f* ముందుకు వచ్చి యూదుల మీద అభియోగం మోపారు. \v 9 వారు నెబుకద్నెజరు రాజు దగ్గరకు వచ్చి అన్నారు, “రాజు చిరకాలం జీవించు గాక! \v 10 రాజా! మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు వినబడిన వెంటనే ప్రజలందరు సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని, \v 11 ఎవరైతే సాగిలపడి పూజించరో, వారిని మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారని శాసనం జారీ చేశారు. \v 12 అయితే రాజా, మీరు బబులోను సామ్రాజ్య అధికారులుగా నియమించిన షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే యూదులు మిమ్మల్ని లెక్క చేయట్లేదు. వారు మీ దేవుళ్ళకు సేవ చేయడం లేదు, పూజించడం లేదు.” \p \v 13 నెబుకద్నెజరు అతి కోపంతో మండిపోయి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. కాబట్టి వారిని రాజు సముఖానికి తీసుకువచ్చారు. \v 14 అప్పుడు నెబుకద్నెజరు వారితో, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయలేదని, నేను నిలిపిన బంగారు విగ్రహాన్ని పూజించట్లేదనేది నిజమా? \v 15 ఇప్పటికైనా మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్నప్పుడు నేను నిలబెట్టిన విగ్రహం ఎదుట సాగిలపడి పూజిస్తే మంచిది. ఒకవేళ మీరు దానిని పూజించకపోతే, మీరు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుండి రక్షిస్తాడు?” అన్నాడు. \p \v 16 షద్రకు, మేషాకు, అబేద్నెగో అతనికి జవాబిస్తూ, “నెబుకద్నెజరు రాజు, ఈ విషయంలో మేము మీ ఎదుట వివరం ఇవ్వాల్సిన అవసరం లేదు. \v 17 ఒకవేళ మమ్మల్ని మండుతున్న అగ్నిగుండంలో పడవేసినా మేము సేవించే దేవుడు దాని నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రాజా, మీ చేతిలో నుండి ఆయన మమ్మల్ని రక్షిస్తారు. \v 18 రాజా, ఆయన రక్షించకపోయినా సరే మీ దేవుళ్ళకు మేము సేవ చేయం, మీరు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించమని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాము” అన్నారు. \p \v 19 అప్పుడు నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోల మీద కోపంతో మండిపడి వారి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు. ఆ అగ్నిగుండంలో వేడి ఏడంతలు ఎక్కువ చేయమని ఆదేశించి, \v 20 తన సైన్యంలో బలిష్ఠులైన సైనికులను కొందరిని పిలిచి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞాపించాడు. \v 21 కాబట్టి వారు వేసుకున్న అంగీలు, ప్యాంట్లు, తలపాగాలు, ఇతర బట్టలు ఏమి తీయకుండానే వారిని మండుతున్న అగ్నిగుండం మధ్యలో పడేలా విసిరివేశారు. \v 22 రాజాజ్ఞ తీవ్రంగా ఉంది కాబట్టి అగ్నిగుండం చాలా వేడిగా ఉండింది కాబట్టి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తీసుకెళ్లిన సైనికులు ఆ అగ్ని మంటల్లో కాలిపోయి చనిపోయారు. \v 23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను ఆ ముగ్గురిని గట్టిగా బంధించి అగ్నిగుండంలో పడవేశారు. \p \v 24 అప్పుడు నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యంతో ఒక్కసారి లేచి నిలబడి అతని సలహాదారులను, “మనం బంధించి అగ్నిలో వేసింది ముగ్గురిని కాదా?” అని అడిగాడు. \p “అవును రాజా!” అని వారు జవాబిచ్చారు. \p \v 25 అతడు, “చూడండి! అగ్నిలో అటూ ఇటూ తిరుగుతూ నలుగురు కనబడుతున్నారు, వారు బంధించబడినట్లుగాని, ఏ హాని కలిగినట్లు గాని లేరు, ఆ నాలుగవ వ్యక్తి దేవుళ్ళ కుమారునిగా కనిపిస్తున్నాడు” అన్నాడు. \p \v 26 అప్పుడు నెబుకద్నెజరు మండుతున్న అగ్నిగుండం యొక్క ద్వారం దగ్గరకు వెళ్లి, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా! బయటకు రండి! ఇక్కడకు రండి!” అని అంటూ బిగ్గరగా పిలిచారు. \p కాబట్టి మంటల్లో నుండి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు బయటకు వచ్చారు. \v 27 పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, రాజ సలహాదారులు వారి చుట్టూ గుమికూడారు. వారి శరీరాలను అగ్ని హాని చేయలేదని, వారి తలవెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదు, వారి దగ్గర కాలిన వాసన కూడా లేదని వారు గమనించారు. \p \v 28 అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు, “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి స్తుతి! ఆయన తన దేవదూతను పంపి తన సేవకులను రక్షించారు! వారాయనను నమ్ముకొని రాజాజ్ఞను ధిక్కరించారు, తమ దేవున్ని తప్ప మరే దేవున్ని సేవించి పూజించమని, తమ జీవితాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. \v 29 కాబట్టి ఏ దేశ ప్రజలైనా గాని, ఏ భాష ప్రజలైనా గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుని దూషిస్తే వారు ముక్కలు చేయబడతారని, వారి ఇల్లు కూల్చివేయబడుతుందని ఆదేశిస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా మరి ఏ దేవుడు రక్షించలేడు.” \p \v 30 అప్పుడు రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో ఉన్నత స్థానాల్లో నియమించాడు. \c 4 \s1 నెబుకద్నెజరుకు చెట్టు గురించి వచ్చిన కల \pmo \v 1 రాజైన నెబుకద్నెజరు, \pmo లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు: \pmo మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక! \pm \v 2 సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు మీకు చెప్పడం నాకు ఎంతో ఆనందము. \qm1 \v 3 ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి, \qm2 ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి! \qm1 ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం; \qm2 ఆయన అధికారం తరతరాలకు నిలిచి ఉంటుంది. \pm \v 4 నెబుకద్నెజరు అనే నేను, నా రాజభవనంలో హాయిగా, క్షేమంగా ఉన్నాను. \v 5 నాకు ఒక కల వచ్చింది, అది నన్ను భయపెట్టింది. నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు, నా మనస్సులోనికి వచ్చిన దృశ్యాలు, దర్శనాలు నన్ను భయపెట్టాయి. \v 6 కాబట్టి ఆ కల భావం చెప్పడానికి బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ నా ఎదుటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. \v 7 మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారు వచ్చినప్పుడు నా కల వారికి చెప్పాను. కాని వారు దాని భావం చెప్పలేకపోయారు. \v 8 చివరికి, దానియేలు నా దగ్గరకు వచ్చాడు (నా దేవుని పేరైన బెల్తెషాజరు అని అతనికి పేరు పెట్టాను, ఎందుకంటే అతనిలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉంది) అతనికి నా కల చెప్పాను. \pm \v 9 నేను అతనితో, “శకునగాండ్రకు అధిపతివైన బెల్తెషాజరూ, పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉందని, మర్మం ఏదైనా నీకు కష్టం కాదని నాకు తెలుసు. ఇదిగో నా కల; దాని భావం నాకు చెప్పు. \v 10 నా పడకలో నేను పడుకుని ఉన్నప్పుడు నేను చూసిన దర్శనాలు ఇవి: నేను చూడగా, భూమి మధ్యలో ఒక చెట్టు కనిపించింది, దాని ఎత్తు చాలా ఎక్కువ. \v 11 ఆ చెట్టు ఎత్తుగా, బలంగా పెరిగింది. దాని కొమ్మ ఆకాశాన్ని అంటుకుంది; భూమి అంచుల వరకు అది కనిపించింది. \v 12 దానికి అందమైన ఆకులు సమృద్ధిగా ఫలాలు ఉన్నాయి. అందరికి సరిపడా ఆహారం దాని మీద ఉంది. అడవి జంతువులు దాని నీడలో ఉన్నాయి, పక్షులు దాని కొమ్మల్లో నివసించాయి; ప్రతి జీవి దాని నుండి పోషించబడింది. \pm \v 13 “నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు నా దర్శనాలలో పరలోకం నుండి ఒక పరిశుద్ధుడు, ఒక దూత\f + \fr 4:13 \fr*\ft లేదా \ft*\fqa కావలివాడు\fqa*\ft ; \+xt 17|link-href="DAN 4:17"\+xt*, \+xt 23|link-href="DAN 4:23"\+xt* వచనాల్లో కూడా\ft*\f* రావడం చూశాను. \v 14 అతడు ఇలా బిగ్గరగా అన్నాడు: ‘ఈ చెట్టును నరికివేయండి, కొమ్మలను కత్తిరించండి; దాని ఆకులను తీసివేసి దాని పండ్లను చెదరగొట్టండి. దాని క్రిందనుండి జంతువులు, దాని కొమ్మల నుండి పక్షులు పారిపోవాలి. \v 15 అయితే దాని మొద్దును దాని వేర్లను ఇనుముతో ఇత్తడితో కట్టి పొలంలోని గడ్డిలో నేలపై విడిచిపెట్టండి. \pm “ ‘అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి, అతడు జంతువులతో, భూమిమీది మొక్కలతో నివసించాలి. \v 16 అతనికి ఏడు కాలాలు\f + \fr 4:16 \fr*\ft లేదా \ft*\fqa సంవత్సరాలు\fqa*\ft ; \+xt 23|link-href="DAN 4:23"\+xt*, \+xt 25|link-href="DAN 4:25"\+xt*, \+xt 32|link-href="DAN 4:32"\+xt* వచనంలో కూడా\ft*\f* గడిచేవరకు, అతనికి మానవ మనస్సుకు బదులు జంతువు మనస్సు ఉండాలి. \pm \v 17 “ ‘ఈ నిర్ణయం దేవదూతలు ప్రకటించారు, పరిశుద్ధులు ఈ తీర్పును ప్రకటించారు, తద్వారా సర్వోన్నతుడు, సమస్త మానవ రాజ్యాల మీద ప్రభువని, ఆయన కోరుకున్న వారెవరికైన ఇస్తారని, ఆయన మనుష్యుల్లో అల్పులైనవారికి వాటి మీద అధికారమిస్తారని మనుషులంతా తెలుసుకుంటారు.’ \pm \v 18 “బెల్తెషాజరూ, నెబుకద్నెజరు రాజునైన నాకు వచ్చిన కల ఇది. బెల్తెషాజరూ, దాని అర్థమేంటో నాకు చెప్పు, నా రాజ్యంలో ఏ జ్ఞాని దీని భావం చెప్పలేదు. అయితే పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉంది కాబట్టి నీవు చెప్పగలవు” అని అన్నాడు. \s1 దానియేలు కలను వివరించుట \pm \v 19 అప్పుడు దానియేలు (బెల్తెషాజరు అని కూడా పిలువబడ్డాడు) కొంత సమయం కలవరపడ్డాడు, అతని తలంపులు అతనికి భయం కలిగించాయి. అప్పుడు రాజు అన్నాడు, “బెల్తెషాజరూ, ఈ కలకు గాని దాని భావానికి కలవరపడవద్దు.” \pm బెల్తెషాజరు జవాబిస్తూ అన్నాడు, “నా ప్రభువా, ఆ కల మీ శత్రువులకు, దాని అర్థం మీ విరోధులకు చెందితే ఎంత బాగుండేది! \v 20 మీరు చూసిన చెట్టు పెద్దగా, బలంగా పెరుగుతూ, ఆకాశాన్ని తాకుతూ, లోకమంతట కనిపిస్తుంది, \v 21 దాని ఆకులు అందంగా, ఫలాలు సమృద్ధిగా ఉంటూ, అందరికి ఆహారాన్ని ఇస్తూ, అడవి జంతువులకు ఆశ్రయాన్ని ఇస్తూ, పక్షులు గూళ్ళు కట్టుకునే స్థలం కలిగి ఉంది \v 22 రాజా! ఆ చెట్టు మీరే! మీరు గొప్పగా, బలవంతునిగా అయ్యారు; మీ గొప్పతనం ఆకాశాన్ని తాకే అంతగా, మీ అధికారం భూదిగంతాల వరకు విస్తరించింది. \pm \v 23 “రాజా! పరలోకం నుండి పరిశుద్ధుడు, ఒక దేవదూత వచ్చి, ‘చెట్టును నరికి దానిని నాశనం చేయాలి, కాని మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డి మధ్యలో విడిచిపెట్టాలి, దాని వేర్లు భూమిలో ఉండాలి. అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి; అతడు ఏడు కాలాలు దాటే వరకు అడవి జంతువుల మధ్యలో నివసించాలి’ అని ప్రకటించడం మీరు చూశారు. \pm \v 24 “రాజా! ఆ కల భావం ఇదే, సర్వోన్నతుడైన దేవుడు నా ప్రభువైన రాజుకు జారీ చేసిన ఆదేశం ఇది: \v 25 మీరు ప్రజల నుండి తరిమివేయబడి, అడవి జంతువుల మధ్య నివసిస్తారు; ఎద్దులా గడ్డి మేస్తూ ఆకాశపు మంచుకు తడిసిపోతారు. సర్వోన్నతుడు భూమిపై ఉన్న రాజ్యాలకు ప్రభువని, ఆయన వాటిని ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తారని మీరు గుర్తించేవరకు మీకు ఏడు కాలాల వరకు ఇలా జరుగుతుంది. \v 26 చెట్టు మొద్దు, వేర్లు అలానే విడిచిపెట్టమని ఇచ్చిన ఆజ్ఞకు అర్థం ఏంటంటే, మీరు పరలోకం పరిపాలిస్తుందని గ్రహించినప్పుడు, మీ రాజ్యం తిరిగి మీకు ఇవ్వబడుతుంది. \v 27 కాబట్టి రాజా! నా సలహాను ఇష్టంతో అంగీకరించండి: సరియైనది చేస్తూ మీ పాపాలను విడిచిపెట్టండి, బాధల్లో ఉన్నవారికి దయ చూపిస్తూ మీ చెడుతనాన్ని మానేయండి. అప్పుడు మీ అభివృద్ధి కొనసాగుతుంది.” \s1 కల నెరవేర్చబడుట \pm \v 28 ఇదంతా నెబుకద్నెజరుకు రాజుకు జరిగింది. \v 29 పన్నెండు నెలల తర్వాత, రాజు బబులోను రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, \v 30 “నా రాజ నివాసంగా నేను కట్టుకున్న ఈ మహా బబులోను పట్టణం నా బలప్రభావంతో నా వైభవాన్ని కనుపరచడానికి కట్టుకుంది కాదా?” అని తనలో తాను అనుకున్నాడు. \pm \v 31 ఆ మాటలు తన పెదవుల మీద ఉండగానే, ఆకాశం నుండి ఓ స్వరం వినిపించింది, “రాజైన నెబుకద్నెజరూ, నీకోసం ఇలా ప్రకటించబడింది: నీ రాజ్యాధికారం నీ నుండి తీసివేయబడింది. \v 32 నీవు ప్రజల నుండి తొలగించబడతావు, నీవు ప్రజల్లో నుండి తరమబడి అడవి జంతువులతో నివసిస్తావు; ఎద్దులా నీవు గడ్డి మేస్తావు. సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని నీవు గ్రహించే వరకు నీవు ఏడు కాలాలు గడుపుతావు.” \pm \v 33 వెంటనే నెబుకద్నెజరు గురించి చెప్పబడింది నెరవేరింది. అతడు ప్రజల నుండి తరమబడి, ఎద్దులా గడ్డి మేశాడు. అతని తలవెంట్రుకలు గ్రద్ద ఈకల్లా, అతని గోళ్ళు పక్షి గోళ్ళలా పెరిగే వరకు, అతని శరీరం ఆకాశం నుండి పడే మంచుకు తడిసిపోయింది. \b \pm \v 34 ఆ కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు అనే నేను ఆకాశం వైపు నా తలెత్తి చూశాను, అప్పుడు నా మానవ బుద్ధి తిరిగి వచ్చింది. అప్పుడు నేను సర్వోన్నతున్ని స్తుతించాను; నిత్యం జీవించే ఆయనను ఘనపరిచాను, మహిమపరిచాను. \qm1 ఆయన అధికారం శాశ్వత అధికారం; \qm2 ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది. \qm1 \v 35 ఆయన దృష్టిలో భూప్రజలు శూన్యులు. \qm2 పరలోక శక్తుల పట్ల \qm1 భూప్రజల పట్ల \qm2 ఆయనకు నచ్చింది చేస్తారు. \qm2 ఆయనను ఎవరూ ఆపలేరు. \qm1 “మీరు చేసింది ఏంటి?” \qm2 అని ఆయనను అడగలేరు. \pm \v 36 నా మానవ బుద్ధి తిరిగి ఇవ్వబడిన ఆ సమయంలోనే, నా రాజ్య మహిమ కోసం నా ఘనత, నా వైభవం నాకు తిరిగి ఇవ్వబడ్డాయి. నా సలహాదారులు, నా ఘనులు నా దగ్గరకు వచ్చారు, నేను నా సింహాసనం మీద మరలా కూర్చున్నాను, మునుపటి కంటే ఇంకా గొప్పవాడిగా అయ్యాను. \v 37 ఇప్పుడు నెబుకద్నెజరు అనే నేను పరలోక రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్నాను, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ సత్యమైనది, ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. గర్వంతో జీవించేవారిని ఆయన అణచివేయగలడు. \c 5 \s1 గోడ మీద వ్రాత \p \v 1 బెల్షస్సరు రాజు తన వేయిమంది ప్రముఖులకు గొప్ప విందు ఏర్పాటు చేసి వారితో కలిసి ద్రాక్షరసం త్రాగాడు. \v 2 బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు, తన తండ్రియైన\f + \fr 5:2 \fr*\ft లేదా \ft*\fqa పూర్వికుడు\fqa*\ft ; \+xt 11|link-href="DAN 5:11"\+xt*, \+xt 13|link-href="DAN 5:13"\+xt*, \+xt 18|link-href="DAN 5:18"\+xt* వచనాల్లో కూడా\ft*\f* నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజు, తన ప్రముఖులు, తన భార్యలు, తన ఉంపుడుగత్తెలు వాటిలో ద్రాక్షరసం త్రాగాలని అనుకున్నాడు. \v 3 కాబట్టి వారు యెరూషలేములోని దేవుని మందిరంలో నుండి తెచ్చిన బంగారు గిన్నెలు తీసుకురాగా రాజు, అతని ప్రముఖులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు వాటిలో త్రాగారు. \v 4 వారు ద్రాక్షరసం త్రాగుతూ, తమ బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేసిన దేవుళ్ళను స్తుతించారు. \p \v 5 అకస్మాత్తుగా మనిషి చేతివ్రేళ్లు కనిపించాయి, అవి దీపస్తంభానికి ఎదురుగా రాజభవనం గోడ మీద ఆ చేయి వ్రాస్తుండగా రాజు చూశాడు. \v 6 అప్పుడు రాజు ముఖం తెల్లబోయింది, భయంతో అతని మోకాళ్లు వణుకుతూ కొట్టుకున్నాయి. \p \v 7 రాజు శకునగాళ్లను, కల్దీయ జ్యోతిష్యులను, సోదె చెప్పేవారిని పిలిపించగా వచ్చిన బబులోను జ్ఞానులతో అతడు ఇలా అన్నాడు, “ఎవరైనా ఈ గోడ మీద రాత చదివి, దాని భావం నాకు చెప్తే, అతనికి ఊదా రంగు వస్త్రాలు తొడిగించి, తన మెడలో బంగారు గొలుసు వేసి, రాజ్యంలో మూడవ అధికారిగా చేస్తాము.” \p \v 8 అప్పుడు రాజు యొక్క జ్ఞానులందరు వచ్చారు, కాని గోడ మీద ఆ రాతను చదవలేకపోయారు, దాని అర్థం చెప్పలేకపోయారు. \v 9 కాబట్టి బెల్షస్సరు రాజు ఇంకా భయపడ్డాడు, అతని ముఖం ఇంకా పాలిపోయింది. అతని అధికారులు కలవరపడ్డారు. \p \v 10 రాజు, అతని అధికారుల స్వరాలు విని, రాణి\f + \fr 5:10 \fr*\ft లేదా \ft*\fqa రాణి తల్లి\fqa*\f* విందుశాలకు వచ్చింది, “రాజు చిరకాలం జీవించు గాక! కలవరపడకండి! నిబ్బరంగా ఉండండి! అని ఆమె అన్నది. \v 11 మీ రాజ్యంలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. మీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం, వివేకం, తెలివితేటలు కలిగినవానిగా గుర్తించబడ్డాడు. మీ తండ్రియైన నెబుకద్నెజరు రాజు అతన్ని మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారి మీద అధిపతిగా నియమించాడు. \v 12 ఎందుకంటే బెల్తెషాజరు అని రాజుచేత పిలువబడే దానియేలుకు చురుకైన మనస్సు, వివేకం, జ్ఞానం కలిగి, కలల భావాలు చెప్పడానికి, మర్మాలు వివరించడానికి, కఠినమైన ప్రశ్నలను పరిష్కరించడానికి సామర్థ్యం గలవాడు. ఆ దానియేలును పిలిపించండి, అతడు ఈ వ్రాతకు అర్థం మీకు చెప్తాడు.” \p \v 13 కాబట్టి దానియేలును రాజు సముఖానికి తీసుకువచ్చారు. రాజు దానియేలుతో ఇలా అన్నాడు, “నా తండ్రి యూదా నుండి తెచ్చిన బందీలలో ఒకడివైన దానియేలు నీవేనా? \v 14 నీలో దేవుళ్ళ ఆత్మ ఉందని, దైవ జ్ఞానం, వివేకం, విశేష జ్ఞానం ఉన్నాయని నేను విన్నాను. \v 15 గోడ మీద ఈ వ్రాత చదివి, దాని అర్థం నాకు చెప్పడానికి జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాను, కాని వారెవరు అర్థం చెప్పలేకపోయారు. \v 16 ఇప్పుడు నీవు భావాలు చెప్పగలవని, కఠిన ప్రశ్నలను పరిష్కరించగలవని నేను విన్నాను. ఈ వ్రాత చదివి దాని అర్థం నాకు చెప్తే, నీకు ఊదా రంగు వస్ర్తం తొడిగించి, నీ మెడకు బంగారు గొలుసు వేసి, నిన్ను రాజ్యంలో మూడవ అధికారిగా చేస్తాను.” \p \v 17 అప్పుడు దానియేలు రాజుకు జవాబిస్తూ, “మీ కానుకలు మీరే ఉంచుకోండి, మీ బహుమానాలు ఎవరికైనా ఇవ్వండి. అయితే రాజు కోసం నేను ఈ రాత చదివి, దాని భావం ఏంటో చెప్తాను” అన్నాడు. \p \v 18 “రాజా! సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరుకు ఆధిపత్యం, మహాత్యం, ఘనత, వైభవం ప్రసాదించారు. \v 19 అతనికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని బట్టి అన్ని దేశాలు, వివిధ భాషల ప్రజలందరు అతనికి వణుకుతూ, భయపడేవారు. రాజు చంపాలనుకున్న వారిని చంపేవాడు; వదిలేయాలనుకున్నవారిని వదిలేశాడు; ఉన్నత పదవి ఇవ్వాలనుకున్నవారికి ఉన్నత పదవి ఇచ్చాడు; అవమానించాలని అనుకున్నవారిని అవమానించాడు. \v 20 అయితే, అతని హృదయం అహంకారంతో నిండింది, గర్వంతో బండబారి పోయింది, అప్పుడు అతడు తన సింహాసనం నుండి త్రోసివేయబడి, తన మహిమను కోల్పోయాడు. \v 21 అతడు ప్రజల్లో నుండి తరమబడి అతనికి జంతువుల మనస్సు ఇవ్వబడింది; అతడు అడవి గాడిదలతో నివసిస్తూ, ఎద్దులా గడ్డి మేశాడు; సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని అతడు గుర్తించేవరకు అతని శరీరం ఆకాశం నుండి కురిసే మంచుకు తడిసింది. \p \v 22 “అయితే అతని కుమారుడవైన బెల్షస్సరు, ఇదంతా తెలిసినా కూడా నిన్ను నీవు తగ్గించుకోలేదు. \v 23 పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా నిన్ను నీవు గొప్ప చేసుకున్నావు. దేవాలయ పాత్రలను తెప్పించి వాటిలో ద్రాక్షరసం పోసుకొని నీవు, నీ అధికారులు, నీ భార్యలు, నీ ఉంపుడుగత్తెలు త్రాగారు. చూడలేని, వినలేని, గ్రహించలేని వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, రాతి దేవుళ్ళను నీవు స్తుతించావు. కాని నీ జీవితాన్ని, నీ మార్గాలన్నిటిని తన చేతిలో పట్టుకున్న దేవున్ని నీవు గౌరవించలేదు. \v 24 కాబట్టి ఆయన వ్రాత వ్రాయడానికి ఆ చేతిని పంపారు. \p \v 25 “వ్రాయబడిన రాత ఇది: \pc \sc మెనే, మెనే, టెకేల్, ఉఫార్సీన్.\sc* \p \v 26 “ఈ పదాల అర్థం ఇది: \p “మెనే: దేవుడు నీ పరిపాలన రోజులను లెక్కించి, నీ పాలనను ముగింపుకు తీసుకువచ్చారు. \p \v 27 “టెకేల్: నీవు త్రాసులో తూచబడ్డావు, తక్కువగా ఉన్నట్లు తేలింది. \p \v 28 “ఫెరేస్: నీ రాజ్యం విభజింపబడి మాదీయులకు పర్షియా వారికి ఇవ్వబడుతుంది.” \p \v 29 అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞమేరకు, దానియేలుకు ఊదా రంగు వస్ర్తం తొడిగించారు, అతని మెడలో బంగారు గొలుసు వేశారు, అతన్ని రాజ్యంలో మూడవ అధికారిగా ప్రకటించారు. \p \v 30 అదే రాత్రి కల్దీయుల రాజైన బెల్షస్సరు చంపబడ్డాడు, \v 31 మాదీయుడైన దర్యావేషు అరవై రెండేళ్ళ వయస్సులో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. \c 6 \s1 సింహాల గుహలో దానియేలు \p \v 1 దర్యావేషు తన రాజ్యమంతటిని పాలించడానికి 120 మంది అధిపతులను నియమించాడు. \v 2 వీరి మీద ముగ్గురు నిర్హాహకులను నియమించాడు, ఆ ముగ్గురిలో దానియేలు ఒకడు. రాజుకు నష్టం వాటిల్లకుండ ఆ అధిపతులు ఈ ముగ్గురికి లెక్క అప్పచెప్పాలి. \v 3 అయితే దానియేలు తనకున్న గొప్ప లక్షణాలను బట్టి అధిపతులకంటే, నిర్వాహకులకంటే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి రాజు తన రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని అనుకున్నాడు. \v 4 అందువల్ల నిర్వాహకులు, అధిపతులు దానియేలు మీద నేరం మోపడానికి అతని ప్రభుత్వ నిర్వహణలో లోట్ల కోసం వెదికారు కాని, అతడు నమ్మకస్థుడు, నేరం లేనివాడు. వారు అతనిలో ఎలాంటి నేరం కనుగొనలేకపోయారు. \v 5 చివరికి ఈ మనుష్యులు, “ఈ దానియేలు మీద నేరం మోపడానికి ఎలాంటి కారణం ఎన్నడు మనకు దొరకదు, దొరికితే తన దేవుని ధర్మశాస్త్రం విషయంలో దొరకవచ్చు” అని అనుకున్నారు. \p \v 6 కాబట్టి ఈ నిర్వాహకులు, అధిపతులు గుంపుగా రాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, “రాజైన దర్యావేషు చిరకాలం జీవించు గాక! \v 7 రానున్న ముప్పై రోజుల్లో ఎవరైనా మీకు తప్ప ఏ దేవునికైనా, మనిషికైనా ప్రార్థిస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని రాజు ఒక ఆదేశం జారీ చేసి, దానిని అమల్లోకి తీసుకురావాలని రాజ్య నిర్వాహకులు, ప్రముఖులు, అధిపతులు, సలహాదారులు, రాష్ట్ర అధికారులు అందరం ఏకీభవించి కోరుతున్నాము. \v 8 రాజా! ఈ శాసనాన్ని ఇచ్చి, అది మాదీయుల పర్షియా చట్టం ప్రకారం అది రద్దు కాకుండా, మార్చబడకుండా ఉండేందుకు దానిని వ్రాతపూర్వకంగా ఇవ్వండి.” \v 9 కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు. \p \v 10 అయితే ఈ శాసనం ఇవ్వబడిందని దానియేలు తెలిసినప్పటికీ అతడు ఇంటికి వెళ్లి యెరూషలేము వైపు తెరచిన కిటికీలు ఉన్న తన పైగదికి వెళ్లాడు. అతడు గతంలో చేసినట్టు, రోజుకు మూడుసార్లు మోకరించి ప్రార్థన చేస్తూ, తన దేవునికి స్తుతులు చెల్లించాడు. \v 11 అప్పుడు ఈ మనుష్యులు గుంపుగా వెళ్లి, దానియేలు ప్రార్థన చేస్తూ, దేవుని సహాయం కోసం వేడుకోవడం చూశారు. \v 12 కాబట్టి వారు రాజు దగ్గరకు వెళ్లి, తన రాజ శాసనం గురించి చెప్తూ, “రాజా! వచ్చే ముప్పై రోజుల వరకు మీకు తప్పా ఏ దేవునికి గాని మనిషికి గాని ప్రార్థన గాని చేయకూడదని, అలా చేస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని శాసనం ఇచ్చారు కదా?” అన్నారు. \p రాజు జవాబిస్తూ, “ఆ శాసనం అమలు చేయబడుతుంది. మాదీయుల పర్షియా వారి చట్టం ప్రకారం అది రద్దు చేయబడదు” అన్నాడు. \p \v 13 అప్పుడు వారు రాజుతో అన్నారు, “రాజా! యూదా నుండి వచ్చిన బందీలలో ఒకడైన దానియేలు మిమ్మల్ని కాని మీరు సంతకం చేసిన శాసనాన్ని గాని లెక్క చేయట్లేదు. అతడు ఇంకా మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు.” \v 14 ఇది విని రాజు చాల బాధపడ్డాడు; ఎలాగైనా దానియేలును కాపాడాలని, సూర్యాస్తమయం వరకు అతన్ని విడిపించాలని ఎంతో ప్రయత్నించాడు. \p \v 15 అప్పుడు ఆ మనుష్యులు రాజైన దర్యావేషు దగ్గరకు గుంపుగా వెళ్లి, “రాజా! మాదీయ పర్షియా వారి చట్టం ప్రకారం రాజు చేసిన శాసనాన్ని గాని తీర్మానాన్ని గాని ఎవరు మార్చకూడదనే విషయాన్ని మీరు గుర్తుచేసుకోవాలి” అన్నారు. \p \v 16 అప్పుడు రాజు ఆదేశం ఇవ్వగా, వారు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడవేశారు. రాజు దానియేలుతో, “నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని అన్నాడు. \p \v 17 ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు. \v 18 తర్వాత రాజు భవనానికి వెళ్లి రాత్రంతా ఉపవాసం ఉండి వినోదాలను జరగనియ్యలేదు. అతనికి నిద్రపట్టలేదు. \p \v 19 తెల్లవారే సమయంలో రాజు లేచి, సింహాల గుహ దగ్గరకు త్వరగా వెళ్లాడు. \v 20 రాజు సింహాల గుహ దగ్గరకు చేరుకుని దుఃఖ స్వరంతో, “దానియేలూ! సజీవ దేవుని సేవకుడా! నిత్యం నీవు సేవించే నీ దేవుడు సింహాల బారి నుండి నిన్ను రక్షించగలిగారా?” అని అన్నాడు. \p \v 21 దానియేలు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! \v 22 నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించారు. అవి నాకు హాని చేయలేదు, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను నిర్దోషిని. రాజా! మీ ఎదుట కూడా నేను ఏ తప్పు చేయలేదు” అన్నాడు. \p \v 23 రాజు ఎంతో సంతోషించి దానియేలును గుహలో నుండి బయటకు తీసుకురమ్మని ఆదేశించాడు. దానియేలు తన దేవున్ని నమ్మాడు కాబట్టి అతడు బయటకు వచ్చినప్పుడు, అతని మీద ఏ గాయం లేదు. \p \v 24 రాజు ఆజ్ఞమేరకు, దానియేలు మీద తప్పుడు నేరం మోపిన వ్యక్తులను వారి భార్య పిల్లలతో పాటు సింహాల గుహలో పడవేశారు. వారు ఇంకా గుహ నేలను తాకకముందే సింహాలు వారిని చీల్చి, వారి ఎముకలన్నిటిని నలుగగొట్టాయి. \p \v 25 అప్పుడు రాజైన దర్యావేషు భూమిపై ఉన్న దేశాలన్నిటికి, వివిధ భాషల ప్రజలందరికి: \pmo “మీరు గొప్పగా వృద్ధి పొందుదురు గాక! \pm \v 26 “నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను. \qm1 “ఆయన జీవంగల దేవుడు. \qm2 ఆయన ఎల్లకాలం జీవిస్తారు; \qm1 ఆయన రాజ్యం నాశనం కాదు, \qm2 ఆయన అధికారం ఎప్పటికీ అంతం కాదు. \qm1 \v 27 ఆయన రక్షిస్తారు, కాపాడతారు; \qm2 ఆకాశంలో, భూమి మీద \qm2 ఆయన సూచకక్రియలు అద్భుతాలు చేస్తారు. \qm1 ఆయనే దానియేలును \qm2 సింహాల నుండి కాపాడారు” అని వ్రాయించాడు. \p \v 28 కాబట్టి దానియేలు దర్యావేషు రాజు పరిపాలనలోను పర్షియా వాడైన కోరెషు రాజు పరిపాలనలోను వృద్ధి చెందాడు. \c 7 \s1 దానియేలుకు వచ్చిన నాలుగు మృగాల కల \p \v 1 బబులోను రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మొదటి సంవత్సరంలో, దానియేలు తన పడక మీద పడుకుని ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది, దర్శనాలు తన మనస్సులో కలిగాయి. అతడు తన కలను ఇలా సంక్షిప్తంగా వ్రాశాడు. \p \v 2 దానియేలు, “రాత్రివేళ నా దర్శనంలో నేను తేరిచూడగా నా ఎదుట ఆకాశం నాలుగు వైపుల నుండి గాలులు వీచి మహా సముద్రాన్ని కదిలించాయి. \v 3 అప్పుడు సముద్రంలో నుండి నాలుగు గొప్ప మృగాలు పైకి లేచాయి, ఇవి ఒక దానికి ఒకటి భిన్నంగా ఉన్నాయి. \p \v 4 “మొదటి మృగం సింహంలా ఉంది, దానికి గ్రద్ద రెక్కలవంటి రెక్కలున్నాయి. దాని రెక్కలు తీసివేయగా అది మనిషిలా రెండు కాళ్లమీద నిలబడడం చూశాను, దానికి మనిషి మనస్సు ఇవ్వబడింది. \p \v 5 “తర్వాత నా ఎదుట రెండవ మృగం ఎలుగుబంటిలా ఉంది. అది ఒకవైపు ఎత్తుగా ఉండి దాని నోటి పళ్ల మధ్యలో మూడు ప్రక్కటెముకలు ఉన్నాయి. ‘లేచి నీవు తినగలిగినంత మాంసం తిను!’ అని దానికి చెప్పబడింది. \p \v 6 “ఆ తర్వాత నాకు చిరుతపులిలా ఉన్న ఇంకొక మృగం కనిపించింది. దాని వీపుకు పక్షి రెక్కలవంటి నాలుగు రెక్కలున్నాయి. ఈ మృగానికి నాలుగు తలలు ఉన్నాయి, పరిపాలించడానికి దీనికి అధికారం ఇవ్వబడింది. \p \v 7 “దాని తర్వాత రాత్రివేళ నా దర్శనంలో నేను చూస్తుండగా నాలుగవ మృగం కనిపించింది. అది భయానకంగా, భయం కలిగించేదిగా, మహా శక్తి కలిగి ఉంది. దానికి పెద్ద ఇనుప పళ్లున్నాయి; అది దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది. అంతకుముందు కనిపించిన మృగాల కంటే అది భిన్నమైనది, దానికి పది కొమ్ములున్నాయి. \p \v 8 “నేను కొమ్ముల గురించి ఆలోచిస్తుండగా వాటి మధ్య నుండి మరొక చిన్న కొమ్ము పైకి వచ్చింది. మొదటి మూడు కొమ్ములు దాని ఎదుట నుండి పెరికివేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనిషిలాంటి కళ్లు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నాయి. \p \v 9 “నేను చూస్తుండగా, \q1 “సింహాసనాలు వాటి స్థానాల్లో వేయబడ్డాయి, \q2 వాటిపై మహా వృద్ధుడు కూర్చున్నారు. \q1 ఆయన వస్త్రం మంచులా తెల్లగా, \q2 ఆయన తలవెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రె ఉన్నిలా ఉన్నాయి. \q1 ఆయన సింహాసనం అగ్నిలా మండుతూ ఉంది, \q2 దాని చక్రాలు మండుతూ ఉన్నాయి. \q1 \v 10 ఆయన ఎదుట నుండి \q2 అగ్ని నది ప్రవహిస్తూ వస్తుంది, \q1 వేవేలకొలది ఆయనకు సేవ చేస్తున్నారు; \q2 పదివేలకొలది ఆయన ఎదుట నిలబడ్డారు, \q1 న్యాయసభ మొదలైంది, \q2 గ్రంధాలు విప్పారు. \p \v 11 “అప్పుడు నేను చూస్తుండగా ఆ చిన్న కొమ్ము గర్వంగా మాట్లాడినందుకు ఆ జంతువు చంపబడింది. దాని శవం నాశనం చేయబడి మండుతున్న అగ్నిలో పడవేయబడింది. \v 12 (ఇతర మృగాల తమ అధికారం కోల్పోయాయి, కాని కొంతకాలం వరకు బ్రతకడానికి అనుమతించబడ్డాయి.) \p \v 13 “రాత్రి దర్శనంలో నేను చూస్తుండగా మనుష్యకుమారునిలా ఉన్న ఒక వ్యక్తి మేఘాల మీద నా ముందుకు వచ్చాడు. అతడు మహా వృద్ధుని సముఖంలోకి వచ్చాడు. \v 14 ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు. \s1 కల భావం \p \v 15 “దానియేలు అనే నేను ఆత్మలో ఆందోళన చెందాను, నాకు వచ్చిన దర్శనాల నన్ను కలవరపరిచాయి. \v 16 అక్కడ నిలబడివున్న వారిలో ఒకని దగ్గరకు వెళ్లి, దీనంతటి అర్థం చెప్పమని అడిగాను. \p “కాబట్టి అతడు నాతో మాట్లాడి ఈ సంగతుల భావం ఇలా తెలియజేశాడు: \v 17 ‘ఆ నాలుగు మహా మృగాలు భూలోకాన్ని పాలించే నలుగురు రాజులు. \v 18 కాని, సర్వోన్నతుని పరిశుద్ధులే రాజ్యాన్ని పొందుకుంటారు, వారి రాజ్యమే యుగయుగాలకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.’ \p \v 19 “అప్పుడు నేను ఆ నాలుగవ మృగం గురించిన భావం తెలుసుకోవాలని కోరాను. అది మిగతా మృగాలన్నిటికంటే భిన్నంగా, అతి భయంకరంగా ఉంది, దాని పళ్లు ఇనుపవి, దాని పంజా ఇత్తడిది. ఆ మృగం దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది. \v 20 దాని తలమీద ఉన్న పది కొమ్ముల గురించి, వాటి మధ్య నుండి లేచిన మొదట ఉన్న మూడు కొమ్ములను పడగొట్టిన చిన్న కొమ్ము గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాను. అది ఇతర కొమ్ముల కంటే గంభీరంగా కనిపిస్తూ, కళ్లు, గర్వంగా మాట్లాడు నోరు గలది. \v 21 నేను చూస్తుండగా, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని ఓడిస్తూ ఉంది, \v 22 మహా వృద్ధుడు వచ్చి సర్వోన్నతుని పరిశుద్ధుల పక్షంగా తీర్పు చెప్పే వరకు అది అలా చేసింది. కాని సమయం వచ్చినప్పుడు వారు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. \p \v 23 “అతడు ఇలా వివరించాడు: ‘నాలుగవ మృగం భూలోకంలోని నాలుగవ రాజ్యము. అది ఇతర రాజ్యాలకు భిన్నంగా ఉంటూ, సర్వ లోకాన్ని త్రొక్కుతూ, నాశనం చేస్తూ మ్రింగివేస్తుంది. \v 24 పది కొమ్ములు ఈ రాజ్యంలో నుండి వచ్చే పదిమంది రాజులు. వారి తర్వాత మరో రాజు వస్తాడు, అతడు ముందున్న వారికంటే భిన్నమైనవాడు; అతడు ముగ్గురు రాజులను లోబరచుకుంటాడు. \v 25 అతడు సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన పరిశుద్ధులను హింసిస్తూ, పండుగ కాలాలను, శాసనాలను మార్చే ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధులు ఒక కాలం, కాలాలు, సగం కాలం\f + \fr 7:25 \fr*\ft లేదా \ft*\fqa ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, సగం సంవత్సరం\fqa*\f* అతని చేతికి అప్పగించబడతారు. \p \v 26 “ ‘అయితే తీర్పు తీర్చబడి అతని అధికారం తీసివేయబడుతుంది, ఎప్పటికీ పూర్తిగా నిర్మూలం చేయబడుతుంది. \v 27 అప్పుడు ఆకాశం క్రిందున్న అన్ని రాజ్యాల అధికారం, శక్తి, మహాత్యం, సర్వోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది. ఆయన రాజ్యం శాశ్వతం రాజ్యం, అధికారులందరు ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు లోబడతారు.’ \p \v 28 “ఇది ఆ విషయానికి ముగింపు. దానియేలు అనే నేను నా తలంపులలో ఆందోళన చెందాను, నా ముఖం పాలిపోయింది, కాని నేను ఈ విషయాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను.” \c 8 \s1 దానియేలుకు వచ్చిన పొట్టేలు, మేక దర్శనం \p \v 1 రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, దానియేలు అనే నాకు ముందు వచ్చిన దర్శనం కాకుండా మరో దర్శనం వచ్చింది. \v 2 నేను దర్శనం చూస్తూ ఉన్నప్పుడు ఏలాము సామ్రాజ్యంలోని షూషను కోటలో ఉన్న నేను, దర్శనంలో ఊలయి కాలువ దగ్గర ఉన్నట్లు చూశాను. \v 3 నేను కళ్ళెత్తి చూడగా ఆ కాలువ ప్రక్కన రెండు కొమ్ములున్న ఒక పొట్టేలు ఉంది, ఆ కొమ్ములు పొడువుగా ఉన్నాయి. ఆ కొమ్ములలో ఒకటి రెండవ దానికంటే పొడువుగా ఉంది కాని అది తర్వాత మొలిచింది. \v 4 నేను చూస్తుండగా ఆ పొట్టేలు పడమర, ఉత్తర, దక్షిణాల వైపు కొమ్ములతో పొడుస్తూ ఉంది. దాని ఎదుట ఏ జంతువు నిలబడలేక పోయింది, దాని శక్తి నుండి ఏది తప్పించుకోలేదు. అది తన ఇష్టానుసారంగా చేస్తూ గొప్పగా అయ్యింది. \p \v 5 నేను దాని గురించి ఆలోచిస్తుండగా, అకస్మాత్తుగా పడమటి నుండి కళ్ల మధ్యలో పెద్ద కొమ్ము ఉన్న ఒక మేకపోతు వచ్చి, కాళ్లు నేలను తాకించకుండా భూమంతా పరుగు పెట్టింది. \v 6 ఆ మేకపోతు కాలువ ఒడ్డున నేను చూసిన రెండు కొమ్ముల పొట్టేలు వైపు వచ్చి తీవ్రమైన కోపంతో బలంగా దానివైపు పరుగెత్తింది. \v 7 అది పొట్టేలుపై ఆవేశంగా దాడి చేసి, దాని రెండు కొమ్ములను విరగ్గొట్టింది. దాని ఎదుట పొట్టేలు నిలువలేకపోయింది; మేకపోతు దాన్ని క్రింద పడేసి త్రొక్కేసింది, దాని శక్తి నుండి పొట్టేలును ఎవరూ రక్షించలేకపోయారు. \v 8 మేకపోతు ఎంతో గొప్పగా అయ్యింది, కాని దాని అధికారం ఉన్నత స్థితిలో ఉండగా, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది, దాని స్థానంలో నాలుగు పెద్ద కొమ్ములు పైకి వచ్చి ఆకాశం నాలుగు వైపులకు పెరిగాయి. \p \v 9 వాటిలో ఒకదాని నుండి మరో కొమ్ము వచ్చింది, అది చిన్నగా ప్రారంభమై దక్షిణం, తూర్పుకు, సుందరమైన దేశం వైపు బలంతో వ్యాపించింది. \v 10 అది ఆకాశ సమూహాన్ని చేరేవరకు పెరిగి కొన్ని నక్షత్ర సమూహాలను భూమిపై పడేసి, వాటిని త్రొక్కింది. \v 11 యెహోవా సైన్యం యొక్క అధిపతికి సమానంగా తనను తాను హెచ్చించుకుంది; యెహోవా నుండి అనుదిన అర్పణలను నిలిపివేసింది, ఆయన పరిశుద్ధాలయాన్ని పడద్రోసింది. \v 12 దాని తిరుగుబాటును బట్టి, యెహోవా ప్రజలు\f + \fr 8:12 \fr*\ft లేదా \ft*\fq తిరుగుబాటు \fq*\fqa సైన్యాలు\fqa*\f*, అనుదిన అర్పణలు దానికి ఇవ్వబడ్డాయి. అది సత్యాన్ని నేలపాలు చేసి ఇష్టం వచ్చినట్లు చేస్తూ వర్థిల్లింది. \p \v 13 అప్పుడు ఒక పరిశుద్ధుడు మాట్లాడడం నేను చూశాను, మరో పరిశుద్ధుడు అతనితో, “అనుదిన అర్పణలు, నాశనానికి కారణమైన తిరుగుబాటు, పరిశుద్ధాలయాన్ని లోబరచుకోవడం, యెహోవా ప్రజలు పాదాల క్రింద త్రొక్కబడుతున్న ఈ దర్శనం నెరవేరడానికి ఎంతకాలం పడుతుంది?” అన్నాడు. \p \v 14 అతడు నాతో, “దానికి 2,300 ఉదయ సాయంత్రాలు పడుతుంది; తర్వాత పరిశుద్ధాలయం తిరిగి పవిత్రపరచబడుతుంది.” \s1 దర్శనం యొక్క భావం \p \v 15 దానియేలు అనే నేను ఆ దర్శనం చూసి దానిని గ్రహించుకునే ప్రయత్నం చేస్తుండగా, నా ఎదుట మనిషిలా ఉన్న ఒకడు నిలబడ్డాడు. \v 16 అప్పుడు ఊలయి కాలువ నుండి, “గబ్రియేలూ, ఆ దర్శనాన్ని గ్రహించేలా ఈ మనుష్యునికి చెప్పు” అని అంటూ ఒక స్వరం అనడం విన్నాను. \p \v 17 అతడు నేను నిలుచున్న చోటికి రాగానే, నేను భయపడి సాగిలపడ్డాను. “మనుష్యకుమారుడా, అంత్యకాలం గురించిన దర్శనాన్ని గ్రహించు” అని అతడు నాతో అన్నాడు. \p \v 18 అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు, నేను గాఢనిద్రలో నేల మీద సాష్టాంగపడ్డాను. అప్పుడు అతడు నన్ను ముట్టి నన్ను నిలబెట్టాడు. \p \v 19 అతడు అన్నాడు: “ఉగ్రత కాలంలో ఏం జరగబోతుందో నీకు చెప్పబోతున్నాను, ఎందుకంటే, దర్శనం నిర్ణీతమైన అంత్య కాలానికి సంబంధించింది. \v 20 నీవు చూసిన రెండు కొమ్ముల పొట్టేలు మెదీయ, పర్షియా రాజులను సూచిస్తుంది. \v 21 బొచ్చుగల మేకపోతు గ్రీసు దేశపు రాజును, దాని కళ్ల మధ్య ఉన్న పెద్ద కొమ్ము దాని మొదటి రాజును సూచిస్తుంది. \v 22 ఆ కొమ్ము స్థానంలో వచ్చిన నాలుగు కొమ్ములు అతని దేశం నుండి లేచే నాలుగు రాజ్యాలను సూచిస్తుంది, కాని వాటికి మొదటి రాజుకు ఉన్నంత బలం ఉండదు. \p \v 23 “వారి పరిపాలనలోని చివరి భాగంలో, తిరుగుబాటుదారులు పూర్తిగా దుష్టులైనప్పుడు, భయంకరంగా కనిపించే రాజు, కుట్రలో ఆరితేరినవాడు లేస్తాడు. \v 24 అతడు ఎంతో బలవంతుడవుతాడు, కాని తన సొంత శక్తి ద్వారా కాదు. అతడు స్తంభింపజేసే విధ్వంసాలు చేస్తాడు, అతడు చేసే ప్రతీ దాంట్లో జయం పొందుతాడు.అతడు బలాఢ్యులను, పరిశుద్ధులను నాశనం చేస్తాడు. \v 25 అతడు యుక్తి గలవాడై మోసం చేసి తనకు లాభం కలిగేలా చూసుకుంటాడు. క్షేమంగా ఉన్నామని వారు అనుకున్నప్పుడు, అతడు ఎంతోమందిని నాశనం చేస్తాడు, రాజాధిరాజుతో యుద్ధం చేస్తాడు. కాని చివరకు అతడు నాశనమవుతాడు, అయితే మానవ శక్తి ద్వారా కాదు. \p \v 26 “ఉదయ సాయంత్రాల గురించి నీకు ఇవ్వబడిన దర్శనం నిజమైనది, కాని దానిని రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే అది చాలా కాలం తర్వాత జరిగేది.” \p \v 27 దానియేలు అనే నేను నీరసించిపోయాను, కొన్ని రోజులు అనారోగ్యంతో ఉన్నాను. తర్వాత నేను లేచి రాజు పనులలో ఉన్నాను. దర్శనాన్ని బట్టి నేను ఆందోళన చెందాను; అది గ్రహింపుకు మించింది. \c 9 \s1 దానియేలు ప్రార్థన \p \v 1 మాదీయుడును అహష్వేరోషు కుమారుడునైన దర్యావేషు బబులోను\f + \fr 9:1 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల\fqa*\f* రాజ్యం మీద రాజుగా నియమించబడిన మొదటి సంవత్సరంలో \v 2 అతని పరిపాలన మొదటి సంవత్సరంలో, దానియేలు అనే నేను పవిత్ర గ్రంథంలోని లేఖనాల ద్వారా గ్రహించింది, యిర్మీయా ప్రవక్తకు యెహోవా పంపిన వాక్కు ప్రకారం, యెరూషలేము యొక్క నిర్జన స్థితి డెబ్బై సంవత్సరాల వరకు కొనసాగుతుంది. \v 3 కాబట్టి నేను ప్రభువైన దేవుని వైపు తిరిగి ప్రార్థన, విన్నపం ద్వారా ఆయనను ప్రాధేయపడ్డాను, ఉపవాసముండి, గోనెపట్ట చుట్టుకొని, బూడిద మీద పోసుకున్నాను. \p \v 4 నా దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నాను: \pm “ప్రభువా! మిమ్మల్ని ప్రేమించి, మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల ప్రేమ నిబంధనను నిలిపే మహా భీకరుడవైన దేవా, \v 5 మేము పాపం చేశాము, తప్పు చేశాము. మేము దుష్టులమై తిరుగుబాటు చేశాం; మీ ఆజ్ఞలు, న్యాయవిధుల నుండి తప్పిపోయాము. \v 6 మీ నామంలో, మా రాజులతో, అధిపతులతో, పూర్వికులతో, దేశ ప్రజలందరితో మాట్లాడిన మీ దాసులైన ప్రవక్తల మాటలు మేము వినలేదు. \pm \v 7 “ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము. \v 8 యెహోవా, మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మేము, మా రాజులు, అధిపతులు, పూర్వికులు అవమానంతో కప్పబడ్డాము. \v 9 మా ప్రభువైన దేవుడు, మేము తిరుగుబాటు చేసిన కూడా, కరుణ, క్షమాపణ గలవారు; \v 10 దేవుడైన యెహోవాకు మేము లోబడలేదు, ఆయన తన దాసులైన ప్రవక్తల ద్వారా మాకిచ్చిన న్యాయవిధులను మేము పాటించలేదు. \v 11 ఇశ్రాయేలంతా మీకు విధేయత చూపడం విడిచిపెట్టి, మీ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, వదిలేశారు. \pm “కాబట్టి దేవుని దాసుడైన మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న శాపాలు, ప్రమాణం చేయబడిన తీర్పులు మామీద కుమ్మరించబడ్డాయి, ఎందుకంటే మీకు విరోధంగా మేము పాపం చేశాము. \v 12 మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు, మా మీదికి, మా పాలకుల మీదికి గొప్ప విపత్తు తీసుకురావడం ద్వారా మీరు నెరవేర్చారు. యెరూషలేముకు జరిగినట్లు ఆకాశమంతటి క్రింద మరే స్థలంలో ఎప్పుడూ జరగలేదు. \v 13 మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే, ఈ విపత్తు అంతా మా మీదికి వచ్చింది, అయినా మేము పాపాలను వదిలి, మీ సత్యం వైపు దృష్టి పెట్టక, మా దేవుడైన యెహోవా చూపించు దయను కోరలేదు. \v 14 మా దేవుడైన యెహోవా తాను క్రియలన్నిటిలో న్యాయవంతులు కాబట్టి యెహోవా ఈ విపత్తు మా మీదికి రప్పించడానికి మొహమాట పడలేదు; అయినా మేము ఆయనకు లోబడలేదు. \pm \v 15 “ప్రభువైన మా దేవా, బలమైన హస్తం ద్వారా మీ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు రప్పించి నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు. మేము పాపం చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాము. \v 16 ప్రభువా, మీ నీతిక్రియల ప్రకారం మీ పట్టణం, మీ పరిశుద్ధ కొండయైన యెరూషలేము పట్ల మీ కోపాన్ని వదిలేయండి. మా పాపాలు, మా పూర్వికుల అతిక్రమాలు, మా చుట్టూ ఉన్న ప్రజలకు, యెరూషలేమును, మీ ప్రజలను హేళన చేసే విషయంగా మార్చాయి. \pm \v 17 “ఇప్పుడు, మా దేవా, మీ దాసుని ప్రార్థనలు, విన్నపాలు ఆలకించండి. ప్రభువా, మీ కోసం, పాడైపోయిన మీ పరిశుద్ధాలయం మీద దయతో చూడండి. \v 18 మా దేవా, చెవియొగ్గి ఆలకించండి; మీ కళ్లు తెరిచి, మీ పేరుపెట్టబడిన పట్టణం యొక్క శిథిలావస్తను చూడండి. మేము నీతిమంతులమని కాదు కాని, మీ గొప్ప కరుణను బట్టి మేము మీకు మా విన్నపాలు చేస్తున్నాము. \v 19 ప్రభువా ఆలకించండి! ప్రభువా క్షమించండి! నా దేవా మీ కోసం, ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ పట్టణం మీ ప్రజలు మీ పేరు కలిగి ఉన్నారు.” \s1 డెబ్బై “ఏడులు” \p \v 20 నేను మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, నా పాపాలు, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపాలు ఒప్పుకుంటూ, నా దేవుడైన యెహోవాకు ఆయన పరిశుద్ధ కొండ గురించి వేడుకుంటూ ప్రార్థించాను. \v 21 నేను ఇంకా ప్రార్థనలో ఉన్నప్పుడు, ముందు చూసిన దర్శనంలో కనిపించిన వ్యక్తియైన గబ్రియేలు సాయంకాల నైవేద్య సమయంలో వేగంగా ఎగురుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. \v 22 అతడు నాకు ఉపదేశిస్తూ నాతో అన్నాడు, “దానియేలూ, నేను నీకు వివేకమును, గ్రహింపును ఇవ్వడానికి వచ్చాను. \v 23 నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే, ఒక మాట బయటకు వెళ్లింది, అది నేను నీతో చెప్పాలని వచ్చాను, ఎందుకంటే నీవు ఎంతో విలువగలవాడివి. కాబట్టి, వాక్కును పరిగణించి, దర్శనాన్ని గ్రహించు: \p \v 24 “దోషం ముగించడానికి, పాపం తుదముట్టించడానికి, దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, శాశ్వత నీతిని చేకూర్చడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని\f + \fr 9:24 \fr*\ft లేదా \ft*\fqa అది పరిశుద్ధున్ని\fqa*\f* అభిషేకించడానికి, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి డెబ్బై ‘ఏడులు’\f + \fr 9:24 \fr*\ft లేదా \ft*\fqa వారాలు \fqa*\ft \+xt 25|link-href="DAN 9:25"\+xt*, \+xt 26|link-href="DAN 9:26"\+xt* వచనాల్లో కూడ\ft*\f* నిర్ణయించబడ్డాయి. \p \v 25 “దీనిని తెలుసుకొని, గ్రహించు: యెరూషలేము పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం ఆజ్ఞ ఇయ్యబడింది మొదలుకొని, అభిషిక్తుడైన అధిపతి వచ్చేవరకు ఏడు ‘వారాలు,’ అరవై రెండు ‘వారాలు’ పడుతుంది. అయితే కష్టకాలంలో యెరూషలేము నడి వీధులతో, కాలువతో పునర్నిర్మించబడుతుంది. \v 26 అరవై రెండు ‘సంవత్సరాల’ తర్వాత అభిషిక్తుడు హతం చేయబడతాడు, ఆయన స్వాధీనంలో ఏమీ ఉండదు. ఆ తర్వాత వచ్చే పరిపాలకుని ప్రజలు పట్టణాన్ని, పరిశుద్ధాలయాన్ని నాశనం చేస్తారు. అంతం వరదలా వస్తుంది: యుద్ధం అంతం వరకు కొనసాగుతుంది, వినాశనం జరగాలని నిర్ణయంచబడింది. \v 27 ఆ పరిపాలకుడు ఒక ‘ఏడు’ కోసం చాలా మందితో నిబంధన నెలకొల్పుతాడు. అయితే ఆ ‘ఏడు’ సగం గడిచాక, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అతని మీద శాసించబడిన అంతం కుమ్మరించబడేవరకు, మందిరం దగ్గర వినాశనం కలిగించే హేయమైన దానిని నిలుపుతాడు.” \c 10 \s1 దానియేలుకు వచ్చిన మనిషి యొక్క దర్శనం \p \v 1 పర్షియా రాజైన కోరెషు పరిపాలన యొక్క మూడవ సంవత్సరంలో, దానియేలుకు (బెల్తెషాజరు అని పిలువబడేవాడు) ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత యొక్క సందేశం నిజం, అది మహా యుద్ధం\f + \fr 10:1 \fr*\ft లేదా \ft*\fq నిజం, \fq*\fqa భారమైనది\fqa*\f* గురించిన విషయము. అతనికి ఆ వార్త యొక్క గ్రహింపు దర్శనంలో వచ్చింది. \p \v 2 ఆ సమయంలో దానియేలు అనే నేను మూడు వారాలు విలపిస్తూ ఉన్నాను. \v 3 నేను శ్రేష్ఠమైన ఆహారం తినలేదు; మాంసం కాని, ద్రాక్షరసం కాని నా పెదవులను తాకలేదు; మూడు వారాలు గడిచేవరకు సువాసనగల నూనె రాసుకోలేదు. \p \v 4 మొదటి నెల ఇరవై నాలుగవ రోజున నేను మహా నది టైగ్రీసు ఒడ్డున నిలబడి ఉన్నాను, \v 5 నేను తేరిచూడగా, నా ఎదుట సన్నని నారబట్టలు ధరించి నడుముకు ఊఫజు నుండి తెప్పించబడిన మేలిమి బంగారు నడికట్టు నడుముకు కట్టుకున్న మనిషి కనిపించాడు. \v 6 అతని శరీరం గోమేధికంలా, అతని ముఖం మెరుపులా, అతని కళ్లు మండే దివిటీలలా, అతని కాళ్లు చేతులు మెరుగుపెట్టిన ఇత్తడిలా తళతళలాడుతూ ఉన్నాయి. అతని కంఠస్వరం గుంపు చేసే ధ్వనిలా ఉంది. \p \v 7 దానియేలు అనే మాత్రమే ఆ దర్శనాన్ని చూసింది; నాతో ఉన్నవారు దానిని చూడలేదు, కాని వారు ఎంతో భయాబ్రాంతులై పారిపోయి దాక్కున్నారు. \v 8 కాబట్టి నేనొక్కడినే ఈ గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉండిపోయాను, ఈ గొప్ప దర్శనం చూశాను; నాలో బలం ఏమి లేదు, నా ముఖం ఎంతో పాలిపోయింది, నేను పూర్తిగా నీరసించిపోయాను. \v 9 అప్పుడు అతడు మాట్లాడడం నేను విన్నాను, నేను వింటూ ఉండగా, సాష్టాంగపడి గాఢ నిద్రలోకి వెళ్లాను. \p \v 10 ఒక చేయి నన్ను తాకి వణుకుతున్న నా మోకాళ్లు, అరచేతుల మీద నిలబెట్టింది. \v 11 అతడు, “దానియేలూ! నీవు ఎంతో విలువైనవాడవు, నేను నీతో మాట్లాడే మాటలు శ్రద్ధగా ఆలోచించి, లేచి నిలబడు, ఎందుకంటే నేను నీ దగ్గరకు పంపబడ్డాను” అన్నాడు. అతడు ఇది చెప్పిన తర్వాత, నేను వణకుతూ లేచి నిలబడ్డాను. \p \v 12 అప్పుడతడు అన్నాడు, “దానియేలూ, భయపడకు. నీవు గ్రహింపు కోసం నీ మనస్సును సిద్ధపరచుకుని, నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకున్న మొదటి రోజు నుండే నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి, వాటికి జవాబుగా నేను వచ్చాను. \v 13 అయితే, పర్షియా రాజ్యాధిపతి ఇరవై ఒక రోజులు నన్ను ఎదిరించాడు. నేను పర్షియా రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చింది కాబట్టి ప్రముఖ దేవదూతల్లో ఒకడైన మిఖాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. \v 14 ఇప్పుడు నీ ప్రజలకు భవిష్యత్తులో జరుగబోయే వాటిని నీకు వివరించడానికి వచ్చాను, ఎందుకంటే దర్శనం రాబోయే కాలం గురించి వచ్చింది.” \p \v 15 అతడు ఇది నాకు చెప్తుండగా, నేను నా ముఖాన్ని నేల వైపుకు వంచుకొని ఏమి మాట్లాడలేకపోయాను. \v 16 అప్పుడు మనిషిని పోలిన ఒక వ్యక్తి నా పెదవులు ముట్టాడు, నేను నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాను. నా ఎదుట నిలుచున్న వ్యక్తితో అన్నాను, “నా ప్రభువా! ఈ దర్శనాన్ని బట్టి నేను వేదన చెందాను, నేను ఎంతో బలహీనంగా అయ్యాను. \v 17 నా ప్రభువా, మీ దాసుడనైన నేను మీతో ఎలా మాట్లాడగలను? నా బలం పోయింది, కష్టంగా ఊపిరి తీసుకుంటున్నాను.” \p \v 18 మనిషిని పోలిన ఆ వ్యక్తి మరలా నన్ను తాకి, నన్ను బలపరిచాడు. \v 19 “నీవు ఎంతో విలువైనవాడవు, భయపడకు, సమాధానం! ఇప్పుడు ధైర్యం తెచ్చుకో! ధైర్యం తెచ్చుకో!” అని అతడు అన్నాడు. \p అతడు నాతో మాట్లాడినప్పుడు నేను బలపరచబడ్డాను, “నా ప్రభువా, మీరు నాకు బలం కలిగించారు, కాబట్టి మాట్లాడండి” అని అన్నాను. \p \v 20 కాబట్టి అతడు అన్నాడు, “నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? త్వరలో నేను పర్షియా రాజ్యాధిపతితో పోరాడడానికి తిరిగి వస్తాను, నేను వెళ్లిన తర్వాత, గ్రీసు అధిపతి వస్తాడు; \v 21 అయితే ముందు సత్య గ్రంథంలో వ్రాయబడింది ఏంటో నీకు చెప్తాను. (వాళ్ళను ఎదిరించడానికి మీ అధిపతియైన మిఖాయేలు తప్ప ఎవరూ నా పక్షంగా నిలువరు. \c 11 \nb \v 1 మాదీయుడైన దర్యావేషు పరిపాలన యొక్క మొదటి సంవత్సరం, నేను అతనికి సహాయం చేయడానికి, బలపరచడానికి నిలబడ్డాను.) \s1 ఉత్తర దక్షిణ రాజులు \p \v 2 “కాబట్టి ఇప్పుడు, నేను నీకు సత్యం చెప్తాను: ఇంకా ముగ్గురు పర్షియా రాజులు వస్తారు, తర్వాత నాలుగవ రాజు వస్తాడు, అతడు ఇతరులందరికంటే ఎంతో ధనవంతుడు. తన ధనం వల్ల బలం పొందుకున్న తర్వాత, అతడు గ్రీసు రాజ్యనికి వ్యతిరేకంగా అందరిని పురికొల్పుతాడు. \v 3 తర్వాత బలమైన రాజు లేచి, గొప్ప శక్తితో పాలిస్తూ, తన ఇష్టానుసారంగా చేస్తాడు. \v 4 అతడు పైకి వచ్చిన తర్వాత, అతని సామ్రాజ్యం చీల్చబడి ఆకాశ నలుదిక్కులకు పంచి పెట్టబడుతుంది. అది అతని వారసులకు సంక్రమించదు, లేదా అతడు ఉపయోగించిన అధికారం దానికి ఉండదు ఎందుకంటే, అతని సామ్రాజ్యం పెరికి వేయబడి ఇతరులకు ఇవ్వబడుతుంది. \p \v 5 “తర్వాత దక్షిణాది రాజు బలవంతుడవుతాడు, అయితే అతనికంటే అతని అధిపతులలో ఒకడు ఇంకా ఎక్కువ బలం కలిగి, అతని సొంత రాజ్యంలో గొప్ప అధికారంతో ఏలుతాడు. \v 6 కొన్ని సంవత్సరాలకు వారిద్దరు మిత్రులవుతారు. అంతేగాక దక్షిణ రాజు కుమార్తె ఉత్తర రాజుతో సంబంధాలు సరిచేయడానికి అతని దగ్గరకు వెళ్తుంది, కాని ఆమె అతని మీద తన ప్రభావాన్ని నిలుపుకోదు, అతడు, అతని అధికారం\f + \fr 11:6 \fr*\ft లేదా \ft*\fqa సంతానం\fqa*\f* నిలువదు. ఆ రోజుల్లో ఆమె, ఆమె రాజ అంగరక్షకులు, ఆమె తండ్రి, ఆమెకు సహాయపడినవాడు తృణీకరించబడతారు. \p \v 7 “ఆమె కుటుంబ వంశం నుండి ఆమెకు బదులు ఒకడు లేస్తాడు. అతడు ఉత్తరాది రాజు యొక్క బలగాలపై దాడి చేసి అతని కోటలో చొరబడతాడు; అతడు వారి మీద యుద్ధం చేసి గెలుస్తాడు. \v 8 అతడు వారి దేవుళ్ళను, వారి పోతవిగ్రహాలను, వారి విలువైన వెండి బంగారు వస్తువులను పట్టుకుని ఈజిప్టుకు తీసుకెళ్తాడు. కొన్ని సంవత్సరాలు అతడు ఉత్తరాది రాజును ఒంటరిగా వదిలేస్తాడు. \v 9 తర్వాత ఉత్తరాది రాజు దక్షిణాది రాజు దేశంలోకి దండెత్తి వస్తాడు కాని, తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాడు. \v 10 అతని కుమారులు యుద్ధానికి సిద్ధపడి, గొప్ప సైన్యాన్ని సమకూరుస్తారు, అది ఆగలేని వరదలా ముందుకు వస్తూ, అతని కోట వరకు యుద్ధాన్ని తీసుకెళ్తుంది. \p \v 11 “అప్పుడు దక్షిణాది రాజు కోపంతో గొప్ప సైన్యాన్ని పురికొల్పిన ఉత్తరాది రాజు మీదికి దండెత్తి వస్తాడు, వారిని ఓడిస్తాడు. \v 12 ఆ సైన్యాన్ని పట్టుకెళ్లిన తర్వాత, దక్షిణాది రాజు గర్వంతో నిండి, వేలమందిని చంపేస్తాడు, అయినా అతని విజయం నిలువదు. \v 13 ఎందుకంటే ఉత్తరాది రాజు మరో సైన్యాన్ని సిద్ధం చేస్తాడు, అది ముందున్న దానికంటే గొప్పది; కొన్ని సంవత్సరాల తర్వాత, పూర్తిగా సిద్ధం చేయబడిన మహా సైన్యంతో అతడు తిరిగి వస్తాడు. \p \v 14 “ఆ రోజుల్లో చాలామంది దక్షిణాది రాజు మీదికి లేస్తారు. నీ సొంత ప్రజల్లో హింసాత్మకమైన వారు దర్శనం నెరవేర్పులో భాగంగా తిరగబడతారు, కాని విఫలమవుతారు. \v 15 తర్వాత ఉత్తరాది రాజు వచ్చి ముట్టడి దిబ్బలను వేసి, కోటగల పట్టణాన్ని చెరగా పట్టుకుంటాడు. దక్షిణాది బలగాలకు ఎదుర్కొనే శక్తి ఉండదు; వారి యొక్క బలమైన సైన్యానికి కూడా ఎదుర్కొనే బలం ఉండదు. \v 16 ఉత్తరాది రాజు తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు; అతన్ని ఎదిరించే సామర్థ్యం ఎవరికీ లేదు. అతడు సుందరమైన దేశంలో తనను తాను స్థిరపరచుకుంటాడు, దానిని నాశనం చేసే శక్తి అతనికి ఉంది. \v 17 అతడు తన రాజ్యమంతటి బలంతో వచ్చి దక్షిణాది రాజుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతని రాజ్యాన్ని పడగొట్టడానికి ఒక కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తాడు, కాని అతని ప్రణాళికలు విజయవంతం కావు, అవేవి అతనికి సహాయపడవు. \v 18 తర్వాత అతడు తన దృష్టి సముద్ర తీరాల మీద పెట్టి చాలా పట్టణాలను జయిస్తాడు, కాని అతడు కలిగించిన అవమానాన్ని ఒక సైన్యాధిపతి తుదముట్టించి ఆ అవమానం అతనికే కలిగిస్తాడు. \v 19 దీని తర్వాత, అతడు తన దేశ కోటల వైపు తిరుగుతాడు, కాని మరెన్నడు కనిపించకుండా, తడబడి పడిపోతాడు. \p \v 20 “అతని వారసుడు రాజ వైభవాన్ని నిర్వహించడానికి పన్ను వసూలు చేసేవాన్ని పంపిస్తాడు, అయితే అతడు నాశనమవుతాడు, అయినా ఎవరి కోపం వల్ల లేదా యుద్ధం వల్ల కాదు. \p \v 21 “అతని తర్వాత రాజ్య గౌరవం దక్కని నీచమైన వ్యక్తి అధికారంలోకి వస్తాడు. ప్రజలు సురక్షితంగా ఉన్నామని అనుకున్నప్పుడు, అతడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, కాని కుట్రతో ఆక్రమించుకుంటాడు. \v 22 అప్పుడు అతని ఎదుట ఉప్పొంగే సైన్యం కొట్టుకుపోతుంది; అది, దాని నిబంధన అధికారి నాశనమవుతారు. \v 23 అతనితో సంధి చేసుకున్న తర్వాత అతడు కపటంగా వ్యవహరిస్తాడు, తనతో ఉన్న కొంతమంది ప్రజలతో మాత్రమే అధికారంలోకి వస్తాడు. \v 24 ధనికమైన ప్రాంతాలు సురక్షితంగా ఉన్నామని భావించినప్పుడు, అతడు వాటిని ఆక్రమించి, తన పితరులు, తన పూర్వికులు సంపాదించలేనిది సంపాదిస్తాడు. అతడు దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన సొమ్మును, ధనాన్ని తన అనుచరులకు పంచిపెడతాడు. కోటలు పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, కాని కొంతకాలం మట్టుకే. \p \v 25 “గొప్ప సైన్యంతో అతడు దక్షిణాది రాజు మీద తన బలాన్ని, ధైర్యాన్ని సమకూరుస్తాడు. దక్షిణాది రాజు చాల శక్తివంతమైన పెద్ద సైన్యం సమకూర్చుకొని యుద్ధం చేస్తాడు, కాని అతనికి విరుద్ధంగా వేసిన కుట్రలను బట్టి అతడు నిలువలేకపోతాడు. \v 26 రాజు భోజనం తినేవారు, అతన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు; అతని సైన్యం తుడిచివేయబడుతుంది, ఎంతోమంది యుద్ధంలో కూలిపోతారు. \v 27 ఆ ఇద్దరు రాజులు కీడును ఉద్దేశిస్తూ, ఒకే బల్ల దగ్గర కూర్చుని ఒకనితో ఒకడు అబద్ధాలు చెప్పుకుంటారు, కాని అది నిష్ప్రయోజనం, ఎందుకంటే అంతం దాని నిర్ణీత కాలంలో వస్తుంది. \v 28 ఉత్తరాది రాజు గొప్ప ఐశ్వర్యంతో తన స్వదేశానికి తిరిగి వస్తాడు, అయితే అతని హృదయం పరిశుద్ధ నిబంధనకు విరుద్ధంగా ఉంటుంది. దానికి విరుద్ధంగా కార్యం చేసి, తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోతాడు. \p \v 29 “నిర్ణీత కాలంలో అతడు దక్షిణాది ప్రాంతం మీద మళ్ళీ దాడి చేస్తాడు, అయితే ఈసారి మునుపటి ఫలితానికి భిన్నంగా ఉంటుంది. \v 30 కిత్తీము అనగా పశ్చిమ తీర ప్రాంతాల ఓడలు అతన్ని వ్యతిరేకిస్తాయి, అతడు ధైర్యం కోల్పోతాడు. అప్పుడు అతడు తన దేశానికి తిరిగివెళ్లి, పరిశుద్ధ నిబంధనకు వ్యతిరేకంగా తన కోపాన్ని చూపిస్తాడు. అతడు తిరిగివెళ్లి పరిశుద్ధ నిబంధనను విడిచిపెట్టినవారి పట్ల దయ చూపిస్తాడు. \p \v 31 “అతని సాయుధ దళాలు దేవాలయ కోటను అపవిత్రపరచి అనుదిన బలిని నిలిపివేయడానికి లేచి నాశనానికి కారణమైన హేయమైన దానిని నిలబెడతారు. \v 32 అతడు దుర్మార్గమైన పనులు చేస్తూ పొగడ్తలతో నిబంధనను అతిక్రమించేవారిని తన వశం చేసుకుంటాడు, అయితే తమ దేవున్ని తెలుసుకున్నవారు కదలక అతన్ని ఎదిరిస్తారు. \p \v 33 “ప్రజల్లో జ్ఞానులు చాలామందికి ఉపదేశిస్తారు, కాని వారు ఖడ్గం చేత గాని దహించబడడం వల్ల గాని చెరపట్టబడడం వల్ల గాని దోపిడికి గురికావడం వల్ల గాని హతమవుతారు. \v 34 వారు పడిపోయినప్పుడు, వారు కొద్ది సహాయం పొందుకుంటారు, అయితే చాలామంది నిజాయితీ లేనివారు వారితో చేరుతారు. \v 35 అంత్యకాలం కోసం శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, మచ్చలేని వారిగా చేయబడడానికి జ్ఞానులలో కొంతమంది పడిపోతారు, ఎందుకంటే, నిర్ణీత సమయంలో అంతం వస్తుంది. \s1 తనను తాను హెచ్చించుకునే రాజు \p \v 36 “రాజు తన ఇష్టానుసారంగా చేస్తాడు. తనను తాను ప్రతి దేవునిపైన హెచ్చించుకొని, ఘనపరచుకొని, దేవాది దేవునికి వ్యతిరేకంగా ఎన్నడు వినని విషయాలు మాట్లాడతాడు. ఉగ్రత కాలం పూర్తయ్యే వరకు అతడు వర్ధిల్లుతూ ఉంటాడు, ఎందుకంటే నిర్ణయించబడింది జరగాలి. \v 37 అతడు తన పూర్వికుల దేవుళ్ళను గాని, స్త్రీలు కోరే దేవున్ని కాని, ఏ ఇతర దేవతను గాని ఆలోచింపక, వారందరి మీద తనను తాను హెచ్చించుకుంటాడు. \v 38 వారికి బదులు, కోటల దేవున్ని ఘనపరుస్తాడు; తన పూర్వికులకు తెలియని దేవున్ని వెండి, బంగారం, ప్రశస్తమైన రాళ్లు, ఖరీదైన బహుమానాలు ఇచ్చి ఘనపరుస్తాడు. \v 39 అతడు పరదేశి దేవుని సహాయంతో బలమైన కోటల మీద దాడి చేసి, తనను గుర్తించిన వారిని గొప్పగా ఘనపరుస్తాడు. వారిని అనేకుల మీద పాలకులుగా నియమిస్తాడు, వెలకు దేశాన్ని పంచిపెడతాడు. \p \v 40 “అంత్యకాలంలో దక్షిణాది రాజు యుద్ధంలో పాల్గొంటాడు, ఉత్తరాది రాజు రథాలు, గుర్రాల దళం, ఎన్నో యుద్ధ నౌకలతో అతని మీద దాడి చేస్తాడు. అతడు ఎన్నో దేశాలను ఆక్రమించి వరదలా వాటిని లాగేస్తాడు. \v 41 అతడు సుందరమైన దేశాన్ని కూడ ఆక్రమిస్తాడు, ఎన్నో దేశాలు పడిపోతాయి, కాని ఎదోము, మోయాబు, అమ్మోను నాయకులు అతని చేతి నుండి విడిపించబడతారు. \v 42 అతడు ఎన్నో దేశాల మీద తన అధికారం కలిగి ఉంటాడు; ఈజిప్టు తప్పించుకోలేదు. \v 43 ఈజిప్టులో కూడబెట్టిన వెండి, బంగారు నిధులు, విలువైన వస్తువులన్నీ అతని ఆధీనంలోనికి తీసుకుంటాడు. లిబియానీయులు, కూషీయులు\f + \fr 11:43 \fr*\ft అంటే, ఇతియొపియా వారు\ft*\f* అతనికి లొంగిపోతారు. \v 44 అయితే తూర్పు, ఉత్తరం నుండి వచ్చే సమాచారాలు అతన్ని కలవరపరుస్తాయి. అప్పుడతడు అనేకులను నాశనం చేయడానికి నిర్మూలించడానికి మహా కోపోద్రేకంతో బయలుదేరుతాడు. \v 45 అతడు తన రాజ గుడారాలను సముద్రాల మధ్య సుందరమైన పవిత్ర పర్వతం దగ్గర వేసుకుంటాడు. అయినా అతడు అంతరించిపోతాడు, ఎవరూ అతనికి సహాయం చేయరు. \c 12 \s1 కడవరి కాలాలు \p \v 1 “ఆ సమయంలో నీ ప్రజలను కాపాడే గొప్ప అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు దేశాల పుట్టుక నుండి ఎప్పుడు సంభవించని ఆపద కాలం వస్తుంది. అయితే ఆ సమయంలో, నీ ప్రజల్లో ఎవరి పేర్లు గ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వారు రక్షింపబడతారు. \v 2 భూలోక మట్టికి చేరి నిద్రించిన వారిలో చాలామంది లేస్తారు: కొందరు నిత్యజీవం, మరికొందరు అవమానం, శాశ్వత నిందను అనుభవించడానికి. \v 3 జ్ఞానులైనవారు ఆకాశ ప్రకాశంతో ప్రకాశిస్తారు, అనేకులను నీతిమార్గం లోనికి నడిపించేవారు నక్షత్రాల్లా నిత్యం ప్రకాశిస్తారు. \v 4 అయితే దానియేలూ, నీవు ఈ గ్రంథం యొక్క మాటలను అంత్యకాలం వరకు భద్రపరచి ముద్రించు. చాలామంది జ్ఞానం అధికం చేసుకోవడానికి అటూ ఇటూ వెళ్తూ ఉంటారు.” \b \p \v 5 అప్పుడు దానియేలు అనే నేను చూస్తుండగా, నా ఎదుట ఇద్దరు వ్యక్తులు, ఒకడు నది అవతలి ఒడ్డున మరొకడు ఇవతలి ఒడ్డున నిలబడి ఉన్నారు. \v 6 వారిలో ఒకడు, నారబట్టలు వేసుకుని నది జలాల మీద ఉన్న వ్యక్తిని, “ఈ భయానకమైన సంఘటనలు జరగడానికి ఎంతకాలం పడుతుంది?” అని అడిగాడు. \p \v 7 నారబట్టలు వేసుకుని నది జలాల మీద ఉన్న వ్యక్తి, తన కుడిచేతిని, తన ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి, నిత్యం జీవించే ఆయన మీద ప్రమాణం చేస్తూ, “అది ఒక కాలం, కాలాలు, సగం కాలం\f + \fr 12:7 \fr*\ft లేదా \ft*\fqa ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, సగం సంవత్సరం\fqa*\f* వరకు జరుగుతుంది. చివరికి పరిశుద్ధుల అధికారం విరగ్గొట్టబడిన తర్వాత, ఇవన్నీ సమాప్తమైతాయి” అని అనడం నేను విన్నాను. \p \v 8 నేను విన్నాను కాని గ్రహించలేదు. కాబట్టి నేను, “నా ప్రభువా! వీటికి పర్యవసానమేంటి?” అని అడిగాను. \p \v 9 అతడు జవాబిస్తూ అన్నాడు, “దానియేలూ, నీ మార్గాన్న నీవు వెళ్లు, ఎందుకంటే ఈ సంగతులు అంత్యకాలం వరకు భద్రంగా ముద్రించబడ్డాయి. \v 10 చాలామంది శుద్ధి చేయబడి, మచ్చలేనివారుగా, పవిత్రులుగా అవుతారు, అయితే దుష్టులు దుష్టులుగానే ఉంటారు. దుష్టులెవరు వీటిని గ్రహించరు కానీ జ్ఞానులు గ్రహిస్తారు. \p \v 11 “అనుదిన నైవేద్యం నిలిపివేయడం, వినాశనం కలిగించే హేయమైనది స్థిరపరచబడడం జరిగే కాలం నుండి 1,290 రోజులు గడచిపోతాయి. \v 12 ఎదురుచూస్తూ 1,335 రోజుల ముగింపు వరకు వేచి ఉండే మనిషి ధన్యుడు. \p \v 13 “నీవైతే, నీ మార్గాన్న అంతం వరకు వెళ్లు. నీవు విశ్రమిస్తావు, కాలాంతంలో నీవు లేచి నీకు కేటాయించబడిన స్వాస్థ్యాన్ని పొందుకుంటావు.”