\id AMO - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h ఆమోసు \toc1 ఆమోసు ప్రవచనం \toc2 ఆమోసు \toc3 ఆమోసు \mt1 ఆమోసు \mt2 ప్రవచనం \c 1 \p \v 1 యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు\f + \fr 1:1 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యోవాషు\fqa*\f* కుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము. \b \b \p \v 2 ఆమోసు ఇలా చెప్పాడు: \q1 “యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారు \q2 యెరూషలేము నుండి ఉరుముతున్నారు; \q1 కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి, \q2 కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.” \s1 ఇశ్రాయేలు పొరుగువారికి తీర్పు \p \v 3 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “దమస్కు చేసిన మూడు పాపాల గురించి, \q2 దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. \q1 ఎందుకంటే అది గిలాదును \q2 ఇనుప పనిముట్లతో నూర్చింది. \q1 \v 4 నేను హజాయేలు ఇంటి మీదికి అగ్నిని పంపుతాను, \q2 అది బెన్-హదదు కోటలను దగ్ధం చేస్తుంది. \q1 \v 5 దమస్కు ద్వారాన్ని విరగ్గొడతాను; \q2 ఆవెను\f + \fr 1:5 \fr*\fq ఆవెను \fq*\ft అంటే \ft*\fqa దుష్టత్వం\fqa*\f* లోయలో ఉన్న రాజును\f + \fr 1:5 \fr*\ft లేదా \ft*\fqa నివాసులను\fqa*\f* నాశనం చేస్తాను \q1 అతడు బేత్-ఏదెనులో రాజదండం పట్టుకున్నవాడు. \q2 అరాము ప్రజలు కీరుకు బందీలుగా వెళ్తారు” \q2 అని యెహోవా చెప్తున్నారు. \p \v 6 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “గాజా చేసిన మూడు పాపాల గురించి, \q2 నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. \q1 ఎందుకంటే అది సమాజమంతటిని బందీలుగా తీసుకెళ్లి \q2 ఎదోముకు అమ్మివేసింది. \q1 \v 7 నేను గాజా ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, \q2 అది దాని కోటలను దగ్ధం చేస్తుంది. \q1 \v 8 నేను అష్డోదు రాజును నాశనం చేస్తాను, \q2 అతడు అష్కెలోనులో రాజదండం పట్టుకున్నవాడు. \q1 నేను ఫిలిష్తీయులలో చివరి వారు మరణించే వరకు, \q2 నేను ఎక్రోనుకు విరుద్ధంగా నా చేతిని ఉంచుతాను” \q2 అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు. \p \v 9 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “తూరు చేసిన మూడు పాపాల గురించి, \q2 దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. \q1 ఎందుకంటే సహోదర ఒప్పందాన్ని పరిగణించకుండా, \q2 అది సమాజమంతటిని బందీలుగా ఎదోముకు అమ్మివేసింది. \q1 \v 10 నేను తూరు ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, \q2 అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.” \p \v 11 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “ఎదోము చేసిన మూడు పాపాల గురించి, \q2 అతని నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను. \q1 ఎందుకంటే అతడు తన సోదరున్ని ఖడ్గంతో వెంటాడాడు, \q2 ఆ దేశ స్త్రీలను చంపేశాడు, \q1 అతని కోపం అధికమవుతూ ఉంది, \q2 ఎప్పుడూ రగులుతూ ఉంది. \q1 \v 12 నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను, \q2 అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.” \p \v 13 యెహోవా ఇలా చెప్తున్నారు: \q1 “అమ్మోను చేసిన మూడు పాపాల గురించి, \q2 అతని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. \q1 ఎందుకంటే అతడు తన సరిహద్దులను విశాల పరచడానికి, \q2 గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులను చీల్చాడు. \q1 \v 14 నేను రబ్బా ప్రాకారాలను తగలబెడతాను, \q2 యుద్ధం రోజున యుద్ధ నినాదాల మధ్యలో, \q1 తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు, \q2 అగ్ని దాని కోటలను దగ్ధం చేస్తుంది. \q1 \v 15 దాని రాజు, తన రాజ పరివారంతో పాటు \q2 బందీగా వెళ్తాడు” \q2 అని యెహోవా చెప్తున్నారు. \c 2 \p \v 1 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “మోయాబు చేసిన మూడు పాపాల గురించి, \q2 అతని నాలుగు పాపాల గురించి నేను అతన్ని తప్పకుండా శిక్షిస్తాను. \q1 ఎందుకంటే అతడు ఎదోము రాజు ఎముకలను \q2 కాల్చి బూడిద చేశాడు. \q1 \v 2 నేను మోయాబు మీదికి అగ్నిని పంపుతాను, \q2 అది కెరీయోతు కోటలను\f + \fr 2:2 \fr*\ft లేదా \ft*\fqa దాని పట్టణాలు\fqa*\f* దగ్ధం చేస్తుంది. \q1 యుద్ధ నినాదాల మధ్యలో, బూర శబ్దం వినబడినప్పుడు, \q2 మోయాబు గొప్ప కలవరంతో అంతరిస్తుంది. \q1 \v 3 నేను దాని పరిపాలకున్ని నిర్మూలిస్తాను, \q2 అతనితో పాటు దాని అధిపతులందరినీ హతం చేస్తాను,” \q2 అని యెహోవా చెప్తున్నారు. \p \v 4 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “యూదా వారు చేసిన మూడు పాపాల గురించి, \q2 వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, \q1 ఎందుకంటే వారు యెహోవా ఉపదేశాలను విసర్జించారు, \q2 ఆయన శాసనాలను పాటించలేదు, \q1 వారి పూర్వికులు అనుసరించిన అబద్ధ దేవుళ్ళను\f + \fr 2:4 \fr*\ft లేదా \ft*\fqa అబద్ధాలను\fqa*\f* నమ్ముకొని, \q2 వారి వల్ల దారి తప్పారు. \q1 \v 5 నేను యూదా మీదికి అగ్నిని పంపుతాను, \q2 అది యెరూషలేము కోటలను దగ్ధం చేస్తుంది.” \s1 ఇశ్రాయేలు మీద తీర్పు \p \v 6 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “ఇశ్రాయేలు చేసిన మూడు పాపాల గురించి, \q2 వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, \q1 వారు నిర్దోషులను వెండి కోసం అమ్మారు, \q2 బీదలను చెప్పుల కోసం అమ్మారు. \q1 \v 7 వారు నేల మట్టిని త్రొక్కినట్టు \q2 బీదల తలలను త్రొక్కుతున్నారు \q2 హింసించబడే వారికి న్యాయం జరగనివ్వలేదు. \q1 తండ్రీ, కుమారులు ఒకే స్త్రీ దగ్గరకు వెళ్లారు \q2 అలా నా పరిశుద్ధ నామాన్ని అవమానపరిచారు. \q1 \v 8 తాకట్టు పెట్టిన బట్టలు అప్పగించకుండా, \q2 ప్రతి బలిపీఠం దగ్గర వాటిని పరుచుకొని పడుకుంటారు. \q1 వారు జరిమానాలతో కొనుక్కున్న ద్రాక్షరసాన్ని, \q2 తమ దేవుని మందిరంలోనే త్రాగుతారు. \b \q1 \v 9 “దేవదారు వృక్షమంత ఎత్తుగా, అయినా నేను వారి \q2 సింధూర వృక్షమంత బలంగా ఉన్న, \q2 అమోరీయులను వారి ఎదుట ఉండకుండా నేను నాశనం చేశాను. \q1 నేను పైనున్న వారి ఫలాన్ని, \q2 క్రిందున్న వారి వేరును నాశనం చేశాను. \q1 \v 10 అమోరీయుల దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలని, \q2 నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి, \q2 నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాను. \b \q1 \v 11 “అంతేకాక నేను మీ సంతానం నుండి ప్రవక్తలను, \q2 మీ యవకులలో నుండి నాజీరులను లేవనెత్తాను. \q1 ఇశ్రాయేలీయులారా! ఇది నిజం కాదా?” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \q1 \v 12 “అయితే మీరు నాజీరులతో ద్రాక్షరసం త్రాగించారు, \q2 ప్రవచించ వద్దని ప్రవక్తలను ఆదేశించారు. \b \q1 \v 13 “కాబట్టి ధాన్యపు మోపులతో నిండిన బండి నేలను అణగద్రొక్కినట్టు, \q2 ఇప్పుడు నేను మిమ్మల్ని అణగద్రొక్కుతాను. \q1 \v 14 వేగంగా పరుగెత్తేవారు తప్పించుకోలేరు, \q2 బలాఢ్యులు ధైర్యం తెచ్చుకోలేరు, \q2 వీరుడు తన ప్రాణాన్ని రక్షించుకోలేడు. \q1 \v 15 విలుకాడు నిలబడలేడు, \q2 బాగా పరుగెత్తగల సైనికుడు తప్పించుకోలేడు, \q2 గుర్రపురౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. \q1 \v 16 ఆ రోజున ధైర్యవంతులైన వీరులు కూడా \q2 దిగంబరులై పారిపోతారు,” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \c 3 \s1 ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పిలువబడిన సాక్షులు \p \v 1 ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి: \q1 \v 2 “భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండి \q2 మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను. \q1 కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టి \q2 నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” \b \q1 \v 3 పరస్పర సమ్మతి లేకుండా \q2 ఇద్దరూ కలిసి నడుస్తారా? \q1 \v 4 ఆహారం దొరకక పోతే, \q2 సింహం అడవిలో గర్జిస్తుందా? \q1 దేనినీ పట్టుకోకుండానే \q2 అది దాని గుహలో గుర్రుమంటుందా? \q1 \v 5 నేల మీద ఎరపెట్టనిదే, \q2 పక్షి ఉరిలో చిక్కుకుంటుందా? \q1 ఉరిలో ఏదీ చిక్కకపోతే, \q2 ఆ ఉరి నేల నుండి పైకి లేస్తుందా? \q1 \v 6 పట్టణంలో బూరధ్వని వినబడితే, \q2 ప్రజలు వణకరా? \q1 పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు \q2 అది యెహోవా పంపింది కాదా? \b \q1 \v 7 తన సేవకులైన ప్రవక్తలకు \q2 తన ప్రణాళికను తెలియజేయకుండా \q2 ప్రభువైన యెహోవా ఏదీ చేయరు. \b \q1 \v 8 సింహం గర్జించింది, \q2 భయపడని వారెవరు? \q1 ప్రభువైన యెహోవా చెప్పారు \q2 దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు? \b \q1 \v 9 అష్డోదు కోటలకు ఇలా చాటించండి, \q2 ఈజిప్టు కోటలకు ఇలా చాటించండి: \q1 “సమరయ పర్వతాలమీద కూడుకోండి; \q2 దానిలో జరుగుతున్న గొప్ప అల్లరిని, \q2 దాని ప్రజలమధ్య ఉన్న దౌర్జన్యాన్ని చూడండి.” \b \q1 \v 10 “సరియైనది ఎలా చేయాలో వారికి తెలియదు,” \q2 అని యెహోవా చెప్తున్నారు, \q1 “వారు తమ కోటలలో \q2 తాము కొల్లగొట్టిన దోపుడుసొమ్మును దాచుకుంటారు.” \p \v 11 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “శత్రువు నీ ప్రాంతంలో చొరబడతాడు, \q2 మీ దుర్గాలను పడగొడతాడు, \q2 మీ కోటలను దోచుకుంటాడు.” \p \v 12 యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు, \q2 దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా, \q1 సమరయలో మంచాల మీద \q2 పట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న, \q2 ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.” \p \v 13 “దీనిని విని, యాకోబు వారసులకు వ్యతిరేకంగా తెలియజేయండి” అని ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్తున్నారు. \q1 \v 14 “ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజున \q2 బేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను; \q2 ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి. \q1 \v 15 చలికాలపు విడిది భవనాన్ని, \q2 ఎండకాలపు విడిది భవనాన్ని పడగొడతాను; \q1 ఏనుగు దంతంతో అలంకరించబడ్డ భవనాలు నాశనమవుతాయి \q2 గొప్ప భవనాలు నిర్మూలించబడతాయి,” \q2 అని యెహోవా చెప్తున్నారు. \c 4 \s1 ఇశ్రాయేలు దేవుని దగ్గరకు తిరిగి రాలేదు \q1 \v 1 సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! \q2 దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ \q2 “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” \q2 అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి. \q1 \v 2 ప్రభువైన యెహోవా తన పవిత్రత తోడని ప్రమాణం చేశారు: \q2 “మిమ్మల్ని కొంకులతో పట్టుకుని, \q1 మీలో మిగిలిన వారిని గాలంతో పట్టుకుని \q2 తీసుకెళ్లే కాలం ఖచ్చితంగా రాబోతుంది. \q1 \v 3 మీరంతా ప్రాకారాలలో పగుళ్ళ గుండా \q2 తిన్నగా పోతారు. \q1 మీరు హర్మోను వైపుకు పారవేయబడతారు,” \q2 అని యెహోవా చెప్తున్నారు. \q1 \v 4 “బేతేలుకు వెళ్లి పాపం చేయండి; \q2 గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువ పాపం చేయండి. \q1 ప్రతి ఉదయం మీ బలులు తీసుకరండి, \q2 మూడు సంవత్సరాలకు\f + \fr 4:4 \fr*\ft లేదా \ft*\fqa రోజులు\fqa*\f* ఒకసారి మీ దశమ భాగాల్ని తీసుకురండి. \q1 \v 5 పులిసిన రొట్టెను కృతజ్ఞతార్పణగా కాల్చండి \q2 మీ స్వేచ్ఛార్పణల గురించి ప్రకటించండి. \q1 ఇశ్రాయేలీయులారా, వాటి గురించి ప్రకటన చేయండి, \q2 ఇలా చేయడం మీకు చాలా ఇష్టం కదా” \q2 అని ప్రభువైన యెహోవా అంటున్నారు. \b \q1 \v 6 “మీ ప్రతి పట్టణానికి తినడానికి ఏమీ దొరక్కుండా చేశాను, \q2 ప్రతి పట్టణంలో ఆహారం లేకుండ చేశాను, \q1 అయినా మీరు నా వైపు తిరగలేదు” \q2 అని యెహోవా ప్రకటిస్తున్నారు. \b \q1 \v 7 “కోతకాలానికి మూడు నెలలు ముందు \q2 వర్షం కురవకుండా చేశాను, \q1 నేను ఒక పట్టణం మీద వర్షం కురిపించి, \q2 మరో పట్టణం మీద కురిపించలేదు. \q1 ఒక పొలం మీద వర్షం కురిసింది; \q2 వర్షం లేనిచోటు ఎండిపోయింది. \q1 \v 8 ప్రజలు నీళ్ల కోసం పట్టణం నుండి పట్టణానికి తడబడుతూ వెళ్లారు \q2 కాని వారికి త్రాగడానికి సరిపడా నీళ్లు దొరకలేదు. \q1 అయినా మీరు నా వైపు తిరగలేదు” \q2 అని యెహోవా అంటున్నారు. \b \q1 \v 9 “ఎన్నోసార్లు నేను మీ తోటలను, ద్రాక్షతోటలను \q2 వడగాలి వల్ల కాటుక తెగుళ్ళ వల్ల పాడు చేశాను. \q1 మిడతలు మీ అంజూర చెట్లను ఒలీవ చెట్లను మ్రింగివేశాయి. \q2 అయినా మీరు నా వైపు తిరగలేదు” \q2 అని యెహోవా అంటున్నారు. \b \q1 \v 10 “నేను ఈజిప్టు మీదికి రప్పించినట్లు \q2 మీ మీదికి తెగుళ్ళు రప్పించాను. \q1 మీరు కొల్లగొట్టిన గుర్రాలతో పాటు \q2 మీ యువకులను కత్తితో చంపాను. \q1 మీ శిబిరాల పుట్టిన దుర్వాసన మీ ముక్కు పుటలను చేరింది. \q2 అయినా మీరు నా వైపుకు తిరగలేదు” \q2 అని యెహోవా అంటున్నారు. \b \q1 \v 11 “నేను సొదొమ గొమొర్రా పట్టణాలను పడగొట్టినట్టు \q2 మీలో కొంతమందిని పడగొట్టాను. \q1 మీరు మంటలో నుండి లాగివేసిన కట్టెలా ఉన్నారు, \q2 అయినా మీరు నా వైపుకు తిరగలేదు, \q2 అని యెహోవా అంటున్నారు. \b \q1 \v 12 “కాబట్టి ఇశ్రాయేలూ, నేను నీకు చేసేది ఇదే, \q2 ఇశ్రాయేలూ, నేను ఇలా చేస్తాను కాబట్టి \q2 నీ దేవుని కలుసుకోడానికి సిద్ధపడు.” \b \q1 \v 13 పర్వతాలను ఏర్పరచింది \q2 గాలిని సృష్టించింది ఆయనే, \q2 తన ఆలోచనలను మనుష్యులకు వెల్లడి చేసేది, \q1 ఉదయాన్ని చీకటిగా మార్చేది ఆయనే, \q2 భూమి ఎత్తైన స్థలాల్లో ఆయన నడుస్తారు \q2 ఆయన పేరు దేవుడైన సైన్యాల యెహోవా. \c 5 \s1 విలాపం పశ్చాత్తాపానికి పిలుపు \p \v 1 ఇశ్రాయేలూ! ఈ మాట విను, ఇది మిమ్మల్ని గురించి విలాప వాక్కు: \q1 \v 2 “ఇశ్రాయేలు కన్య పడిపోయింది, \q2 ఆమె మరి ఎన్నడు లేవదు, \q1 ఆమెను లేపడానికి ఎవరూ లేక \q2 తన సొంత నేలపై పడి ఉంది.” \p \v 3 ప్రభువైన యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: \q1 “నీ పట్టణం నుండి వేయిమంది బలమైన వారు బయలుదేరితే, \q2 వందమంది మాత్రమే మిగులుతారు. \q1 నీ పట్టణం నుండి వందమంది బలమైన వారు బయలుదేరితే \q2 పదిమంది మాత్రమే మిగులుతారు.” \p \v 4 యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: \q1 “నన్ను వెదికితే బ్రతుకుతారు. \q2 \v 5 బేతేలును ఆశ్రయించకండి; \q1 గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, \q2 బెయేర్షేబకు ప్రయాణించకండి. \q1 గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, \q2 విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.” \q1 \v 6 యెహోవాను వెదకండి మీరు బ్రతుకుతారు, \q2 లేదంటే యోసేపు గోత్రాల మీద ఆయన అగ్నిలా పడతారు; \q1 అది వారిని కాల్చివేస్తుంది \q2 బేతేలులో దాన్ని ఆర్పివేయగల వారెవరూ ఉండరు. \b \q1 \v 7 వారు న్యాయాన్ని చేదుగా మార్చి \q2 నీతిని నేల మీద పడవేస్తారు. \b \q1 \v 8 ఆయన సప్తర్షి నక్షత్రాలను మృగశీర్ష నక్షత్రాలను సృష్టించారు, \q2 ఆయన మధ్యరాత్రిని ఉదయంగా మారుస్తారు, \q2 పగటిని చీకటి చేస్తారు. \q1 ఆయన సముద్రంలోని నీటిని రప్పించి. \q2 భూమి మీద కుమ్మరిస్తారు \q2 ఆయన పేరు యెహోవా. \q1 \v 9 ఆయన మెరుపు వేగంతో దుర్గాన్ని నాశనం చేస్తారు, \q2 వారి కోటగల పట్టణాన్ని నాశనం చేస్తారు. \b \q1 \v 10 న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని \q2 యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు. \b \q1 \v 11 మీరు బీదలను అణగద్రొక్కుతూ, \q2 వారి ధాన్యం మీద పన్ను వేస్తారు. \q1 కాబట్టి మీరు రాళ్లతో భవనాలను కట్టుకున్నా, \q2 వాటిలో కాపురముండరు; \q1 అందమైన ద్రాక్షతోటలు నాటినా \q2 మీరు ఆ పండ్ల రసం త్రాగరు. \q1 \v 12 ఎందుకంటే మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో \q2 మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు. \b \q1 మీరు లంచాలు తీసుకుని అమాయకులను బాధిస్తారు, \q2 న్యాయస్థానంలో వచ్చే బీదలకు న్యాయం జరగనివ్వరు. \q1 \v 13 ఇది చెడుకాలం కాబట్టి, \q2 అలాంటి సమయాల్లో వివేకవంతులు మౌనంగా ఉంటారు. \b \q1 \v 14 చెడును విడిచిపెట్టి మంచిని వెదకండి, \q2 అప్పుడు మీరు బ్రతుకుతారు. \q1 అప్పుడు ఆయన గురించి మీరనుకున్న విధంగా \q2 సైన్యాల యెహోవా దేవుడు మీతో ఉంటారు. \q1 \v 15 చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి; \q2 న్యాయస్థానాల్లో న్యాయం జరిగించండి. \q1 బహుశ సైన్యాల యెహోవా దేవుడు, \q2 యోసేపు వంశంలో మిగిలి ఉన్నవారిపై దయ చూపిస్తారేమో. \p \v 16 కాబట్టి ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్పే మాట ఇదే: \q1 “వీధులన్నిటిలో విలాపం ఉండబోతుంది \q2 ప్రతి రాజ మార్గంలో వేదనతో కూడిన ఏడ్పులు. \q1 ఏడ్వడానికి రైతులను \q2 దుఃఖపడడానికి విలపించేవారిని పిలుస్తారు. \q1 \v 17 ద్రాక్షతోటలన్నిటిలో శోకం ఉంటుంది, \q2 ఎందుకంటే నేను మీ మధ్యలో సంచరిస్తాను,” \q2 అని యెహోవా అంటున్నారు. \s1 యెహోవా దినం \q1 \v 18 యెహోవా దినం రావాలని ఆశించే \q2 మీకు శ్రమ! \q1 యెహోవా దినం కోసం ఎందుకు మీరు ఆశిస్తున్నారు? \q2 ఆ దినం వెలుగుగా కాదు, చీకటిగా ఉంటుంది. \q1 \v 19 అది ఒక మనిషి సింహం నుండి తప్పించుకుని \q2 ఎలుగుబంటి ఎదురు పడినట్లు, \q1 అతడు ఇంట్లోకి ప్రవేశించి \q2 గోడ మీద చేయి పెడితే \q2 పాము కరిచినట్టుగా ఉంటుంది. \q1 \v 20 యెహోవా దినం వెలుగుగా కాకుండా అంధకారంగా ఉంటుంది కదా, \q2 ఒక్క కాంతి కిరణం కూడా లేకుండ కారుచీకటిగా ఉంటుంది కదా? \b \q1 \v 21 “మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను; \q2 మీ సమావేశాల్లో నేను సంతోషించను. \q1 \v 22 మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, \q2 నేను వాటిని స్వీకరించను. \q1 మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, \q2 నేను వాటిని లెక్కచేయను. \q1 \v 23 మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి! \q2 మీ సితారాల సంగీతం నేను వినను. \q1 \v 24 అయితే న్యాయం నదీ ప్రవాహంలా, \q2 నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి. \b \q1 \v 25 “ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు, \q2 మీరు నాకు బలులు, అర్పణలు తెచ్చారా? \q1 \v 26 మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, \q2 మీ కైవాన్ విగ్రహాలను, \q2 మీ కోసం మోసుకొచ్చారు. \q2 అది మీరు మీ కోసం చేసుకుంది. \q1 \v 27 కాబట్టి నేను మిమ్మల్ని దమస్కు అవతలికి బందీలుగా పంపిస్తాను,” \q2 అని సైన్యాల దేవుడు అని పేరు కలిగిన యెహోవా అంటున్నారు. \c 6 \s1 సంతృప్తి గలవారికి శ్రమ \q1 \v 1 సీయోనులో సంతృప్తిగా ఉన్నవారికి శ్రమ, \q2 సమరయ పర్వతం మీద ఆధారపడి ఉన్న మీకు శ్రమ, \q1 ఇశ్రాయేలు ప్రజలకు సలహాదారులుగా ఉన్న, \q2 గొప్ప దేశాల్లో ప్రముఖులైన మీకు శ్రమ! \q1 \v 2 మీరు కల్నేకు వెళ్లి చూడండి; \q2 అక్కడినుండి హమాతుకు\f + \fr 6:2 \fr*\ft అంటే \ft*\fqa మహా హమాతు\fqa*\f* వెళ్లండి, \q2 తర్వాత ఫిలిష్తీయలోని గాతుకు వెళ్లండి. \q1 మీ రెండు రాజ్యాల కంటే అవి గొప్పవా? \q2 వాటి నేల మీకంటే పెద్దది కాదా? \q1 \v 3 ఆపద్దినం దూరంగా ఉందనుకుని, \q2 దౌర్జన్య పరిపాలనను త్వరగా రప్పిస్తున్నారు. \q1 \v 4 మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు, \q2 పరుపులపై ఆనుకుంటారు. \q1 శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, \q2 శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు. \q1 \v 5 మీరు దావీదులా సితారా వాయిస్తూ \q2 వాయిద్యాలు మెరుగుపరుస్తారు. \q1 \v 6 మీరు ద్రాక్షరసం పాత్ర నిండా నింపుకొని త్రాగుతారు, \q2 పరిమళ తైలాలు పూసుకుంటారు, \q2 కాని మీరు యోసేపు నాశనం గురించి విచారపడరు. \q1 \v 7 కాబట్టి బందీలుగా మొదట దేశాంతరం పోయే వారిలో మీరు ఉంటారు; \q2 మీ ఉత్సవాలు, మీ విలాసాలు గతించిపోతాయి. \s1 యెహోవా ఇశ్రాయేలు గర్వాన్ని అణచివేయుట \p \v 8 ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: \q1 “నేను యాకోబు గర్వాన్ని అసహ్యించుకుంటున్నాను \q2 అతని కోటలను ద్వేషిస్తున్నాను; \q1 నేను పట్టణాన్ని దానిలో ఉన్న అంతటితో \q2 శత్రువు వశం చేస్తాను.” \p \v 9 ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా, \v 10 ఆ శవాలను ఇంట్లోనుండి తీసుకుపోయి వాటిని దహనం చేయడానికి వచ్చిన బంధువు ఇంట్లో దాక్కొని ఉన్నవానితో, “నీతో ఇంకెవరైన ఉన్నారా?” అని అడిగితే, “లేదు” అని అతడు చెప్తే, “మాట్లాడకు, మనం యెహోవా పేరును ప్రస్తావించకూడదు” అని అంటాడు. \q1 \v 11 ఎందుకంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, \q2 పెద్ద కుటుంబాలు ముక్కలుగా విడిపోతాయి \q2 చిన్నా కుటుంబాలు చీలిపోతాయి. \b \q1 \v 12 గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా? \q2 బండ మీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? \q1 కాని న్యాయాన్ని విషంగా మార్చారు, \q2 నీతి ఫలాన్ని చేదుగా మార్చారు. \q1 \v 13 లో దెబారును\f + \fr 6:13 \fr*\fq లో దెబారును \fq*\ft అంటే \ft*\fqa ఏమి లేదు\fqa*\f* జయించి ఆనందిస్తున్న మీరు, \q2 “మా సొంత బలంతోనే కర్నాయీమును\f + \fr 6:13 \fr*\fq కర్నాయీమును \fq*\ft అంటే \ft*\fqa కొమ్ములు\fqa*\ft ; \ft*\fqa కొమ్ము \fqa*\ft ఇక్కడ బలాన్ని సూచిస్తుంది\ft*\f* పట్టుకోలేదా?” అంటారు. \b \q1 \v 14 అయితే సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు, \q2 “ఇశ్రాయేలూ, నేను నీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను, \q1 అది నిన్ను హమాతు మొదలుకొని అరాబా లోయవరకు \q2 ఆ అరణ్య మార్గమంతా నిన్ను హింసిస్తుంది.” \c 7 \s1 మిడతలు, అగ్ని, కొలనూలు \p \v 1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇది: రాజుకు రావలసిన పంట వచ్చిన తర్వాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు, యెహోవా మిడత గుంపులను సిద్ధపరిచారు. \v 2 అవి మొత్తం పంటను తినివేసినప్పుడు, “ప్రభువైన యెహోవా, క్షమించండి! యాకోబు వంశం చిన్నది అది ఎలా మనుగడ సాగించగలదు?” అని నేను మొరపెట్టాను. \p \v 3 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. \p “ఇది జరగదు” అని యెహోవా అన్నారు. \p \v 4 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇది: ప్రభువైన యెహోవా అగ్ని ద్వారా తీర్పును ప్రకటిస్తున్నారు; అది మహా అగాధాన్ని ఎండగొట్టి, నేలను మ్రింగివేసింది. \v 5 అప్పుడు నేను, “ప్రభువైన యెహోవా, దయచేసి ఆపండి! యాకోబు వంశం చిన్నది అది ఎలా మనుగడ సాగించగలదు?” అని మొరపెట్టాను. \p \v 6 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. \p “ఇది కూడా జరగదు” అని ప్రభువైన యెహోవా అన్నారు. \b \p \v 7 ఆయన నాకు చూపించింది ఇదే: ప్రభువు తన చేతిలో కొలనూలు పట్టుకుని, మట్టపు గుండు ప్రకారం కట్టబడిన గోడ దగ్గర నిలబడి ఉన్నారు. \v 8 యెహోవా నన్ను, “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని అడిగారు. \p “కొలనూలు” అని నేను జవాబిచ్చాను. \p అప్పుడు ప్రభువు అన్నారు, “చూడు, నా ఇశ్రాయేలు ప్రజలమధ్య కొలనూలు వేయబోతున్నాను, ఇకమీదట వారిని శిక్షించకుండ వదలను. \q1 \v 9 “ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి \q2 ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; \q2 యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.” \s1 ఆమోసు అమజ్యా \p \v 10 తర్వాత బేతేలు యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఇలా వర్తమానం పంపాడు: “ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే ఆమోసు నీ మీద కుట్ర పన్నుతున్నాడు. దేశం అతని మాటలన్నిటిని భరించలేకపోతుంది. \v 11 ఎందుకంటే ఆమోసు చెప్పేది ఇదే: \q1 “ ‘యరొబాము ఖడ్గం చేత చస్తాడు, \q2 ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశం నుండి \q2 బందీలుగా దేశాంతరం పోతారు.’ ” \p \v 12 అప్పుడు అమజ్యా ఆమోసుతో, “దీర్ఘదర్శీ నీవు వెళ్లిపో! యూదా దేశానికి తిరిగి వెళ్లు! అక్కడ నీకు ఆహారం సంపాదించుకో, అక్కడే నీవు ప్రవచించుకో. \v 13 బేతేలులో ప్రవచించడం ఆపు, ఎందుకంటే రాజు గుడి, రాజభవనం ఇక్కడే ఉన్నాయి” అని చెప్పాడు. \p \v 14 ఆమోసు అమజ్యాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కుమారున్ని కాదు. నేను గొర్రెల కాపరిగా ఉంటూ మేడిచెట్లను చూసుకునే వాన్ని. \v 15 అయితే యెహోవా, మందను కాసుకుంటున్న నన్ను పిలిచి, ‘వెళ్లు, నా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచించు’ అన్నారు. \v 16 కాబట్టి ఇప్పుడు యెహోవా చెప్పేది వినండి. నీవు ఇలా అంటున్నావు, \q1 “ ‘ఇశ్రాయేలుకు విరుద్ధంగా ప్రవచించకు, \q2 ఇస్సాకు సంతానానికి విరుద్ధంగా ప్రసంగించడం ఆపు.’ \p \v 17 “కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: \q1 “ ‘నీ భార్య పట్టణంలో వేశ్యగా మారుతుంది, \q2 నీ కుమారులు, కుమార్తెలు ఖడ్గానికి కూలుతారు. \q1 నీ భూమి కొలవబడి విభజించబడుతుంది, \q2 నీవు యూదేతర\f + \fr 7:17 \fr*\ft హెబ్రీలో \ft*\fqa అపవిత్రమైన\fqa*\f* దేశంలో చస్తావు. \q1 ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశానికి దూరంగా, \q2 బందీలుగా వెళ్తారు.’ ” \c 8 \s1 పండిన పండ్ల గంప \p \v 1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప. \v 2 “ఆమోసూ! నీవేం చూస్తున్నావు?” అని ఆయన అడిగారు. \p “పండిన పండ్ల గంప” అని నేను జవాబిచ్చాను. \p అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “నా ప్రజలైన ఇశ్రాయేలుకు సమయం దగ్గరపడింది; ఇక నేను వారిని శిక్షించకుండా ఉండను. \p \v 3 “ఆ రోజు గుడిలో వారు పాడే పాటలు విలాపంగా\f + \fr 8:3 \fr*\ft లేదా \ft*\fqa మందిరంలో గాయకులు విలపిస్తారు\fqa*\f* మారుతాయి. ఎన్నో శవాలు ఉంటాయి; ఎక్కడ చూసినా అవే! ఊరుకోండి!” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు. \q1 \v 4 అవసరతలో ఉన్నవారిని అణగద్రొక్కే వారలారా, \q2 దేశంలో ఉన్న పేదలను అంతం చేసేవారలారా, \p \v 5 అలా చేస్తూ, \q1 “మనం ధాన్యం అమ్ముకోడానికి, \q2 అమావాస్య ఎప్పుడు దాటి పోతుందో, \q1 గోధుమ వ్యాపారం సాగటానికి విశ్రాంతి దినం \q2 ఎప్పుడు గతించి పోతుందో?” అనుకునేవారలారా వినండి. \q1 మీరు కొల గంపలు చిన్నగా చేస్తూ, \q2 ధర ఎక్కువ చేస్తూ, \q2 దొంగ త్రాసుతో మోసగిస్తారు, \q1 \v 6 బీదలను వెండికి కొంటారు, \q2 చెప్పులిచ్చి అవసరతలో ఉన్నవారిని కొంటారు, \q2 పాడైపోయి గింజలు కూడా అమ్మివేస్తారు. \p \v 7 యాకోబు ఆత్మగౌరవమైన తన నామం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశారు: “నేను వారు చేసిన వాటిలో ఒక్కటి కూడా ఎన్నటికీ మరువను. \q1 \v 8 “ఈ కారణంచేత భూమి కంపించదా? \q2 దేశవాసులందరూ దుఃఖపడరా? \q1 నైలు నది పొంగినట్లు దేశమంతా పొంగుతుంది, \q2 అది పైకి లేచి తర్వాత \q2 ఈజిప్టు నదిలా అణగిపోతుంది. \p \v 9 “ఆ రోజున,” అంటూ ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q1 మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించేలా, \q2 పట్ట పగటివేళ భూమికి చీకటి కమ్మేలా చేస్తాను. \q1 \v 10 నేను మీరు ఆచరించే పండుగలను విలాపంగా, \q2 మీ పాటలన్నీ విషాద గీతాలుగా మారుస్తాను. \q1 నేను మీరంతా గోనెపట్ట కట్టుకునేలా, \q2 తల గొరిగించుకునేలా చేస్తాను. \q1 ఏకైక కుమారుని కోసం ఏడ్చినట్లుగా ఆ సమయాన్ని చేస్తాను, \q2 దాని అంతం ఘోరమైన రోజుగా ఉంటుంది. \b \q1 \v 11 ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q2 “రాబోయే రోజుల్లో నేను ఈ దేశంలో కరువు పుట్టిస్తాను, \q1 ఆహారం నీళ్లు లేకపోవడం వల్ల కలిగే కరువు కాదు, \q2 యెహోవా వాక్కుల కరువు పుట్టిస్తాను. \q1 \v 12 ప్రజలు యెహోవా వాక్కు కోసం వెతుకుతూ, \q2 ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు, \q1 ఉత్తర దిక్కునుండి తూర్పుదిక్కు వరకు తిరుగుతారు \q2 కాని అది వారికి దొరకదు. \p \v 13 “ఆ రోజున \q1 “అందమైన కన్యలు బలమైన యువకులు \q2 దప్పికతో మూర్ఛపోతారు. \q1 \v 14 సమరయ దోషానికి కారణమైనదాని తోడని, \q2 ‘దాను దేవుని తోడు’ అని, \q2 ‘బెయేర్షేబ దేవుని తోడు’ అని ప్రమాణం చేసేవారు \q2 మళ్ళీ లేవకుండా కూలిపోతారు.” \c 9 \s1 ఇశ్రాయేలు నాశనం \p \v 1 బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను, ఆయన ఇలా అన్నారు: \q1 “గడపలు కదిలి పోయేలా, \q2 స్తంభాల పైభాగాలను కొట్టు. \q1 వాటిని ప్రజలందరి తలల మీద పడవేయు; \q2 మిగిలిన వారిని నేను ఖడ్గంతో హతం చేస్తాను. \q1 ఒక్కడు కూడా పారిపోలేడు, \q2 ఎవ్వడూ తప్పించుకోలేడు. \q1 \v 2 వారు పాతాళం లోతుల్లోనికి త్రవ్వుకొని వెళ్లినా, \q2 అక్కడినుండి నా చేయి వారిని తీసుకుంటుంది. \q1 వారు పైనున్న ఆకాశాల పైకి ఎక్కినా, \q2 అక్కడినుండి వారిని క్రిందికి తీసుకువస్తాను. \q1 \v 3 వారు కర్మెలు పర్వత శిఖరాన దాక్కున్నా, \q2 అక్కడ నేను వారిని వెంటబడి పట్టుకుంటాను. \q1 నా కళ్లకు కనిపించకుండా వారు సముద్రపు అడుగుభాగంలో దాక్కున్నా, \q2 అక్కడ వారిని కరవమని సర్పానికి ఆజ్ఞ ఇస్తాను. \q1 \v 4 శత్రువులు వారిని బందీలుగా దేశాంతరం తీసుకెళ్లినా, \q2 అక్కడ వారిని చంపమని ఖడ్గానికి ఆజ్ఞ ఇస్తాను. \b \q1 “నా చూపు వారి మీద నిలుపుతాను, \q2 అది కీడుకోసమే కాని మేలుకోసం కాదు.” \b \q1 \v 5 సైన్యాల అధిపతియైన యెహోవా \q1 ఆయన భూమిని ముట్టగా అది కరిగిపోతుంది, \q2 భూనివాసులు అందరు విలపిస్తారు; \q1 దేశమంతా నైలు నదిలా పొంగుతుంది, \q2 ఈజిప్టు నదిలా అణగిపోతుంది. \q1 \v 6 ఆయన ఆకాశాల్లో తన ఉన్నత రాజభవనాన్ని కట్టుకుంటారు, \q2 దాని పునాదిని భూమి మీద నిర్మిస్తారు. \q1 ఆయన సముద్రం నీటిని పిలిపించి \q2 భూమి మీద కుమ్మరిస్తారు, \q2 ఆయన పేరు యెహోవా. \b \q1 \v 7 “ఇశ్రాయేలీయులైన మీరు \q2 నా దృష్టికి కూషు దేశస్థులతో\f + \fr 9:7 \fr*\ft అంటే, ఇతియొపియా వారు\ft*\f* సమానం కారా?” \q2 అని యెహోవా అంటున్నారు. \q1 “నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి, \q2 ఫిలిష్తీయులను కఫ్తోరు\f + \fr 9:7 \fr*\ft అంటే \ft*\fqa క్రేతు\fqa*\f* నుండి, \q2 అరామీయులను కీరు నుండి తీసుకురాలేదా? \b \q1 \v 8 “నిజంగా ప్రభువైన యెహోవా కళ్లు \q2 పాపిష్ఠి రాజ్యం మీద ఉన్నాయి. \q1 నేను దాన్ని భూమి మీద ఉండకుండ \q2 నాశనం చేస్తాను. \q1 అయినా యాకోబు సంతానాన్ని \q2 సంపూర్ణంగా నాశనం చేయను,” \q2 అని యెహోవా అంటున్నారు. \q1 \v 9 “నేను ఆజ్ఞ ఇస్తాను, \q2 మనిషి ధాన్యం జల్లెడలో వేసి, \q2 ఒక్క గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా, \q1 ఇశ్రాయేలు ప్రజలను \q2 అన్ని దేశాల వారి మధ్య జల్లిస్తాను. \q1 \v 10 నా ప్రజల్లోని పాపులందరు \q2 ‘విపత్తు మనల్ని తరమదు, మన మీదికి రాదు’ \q1 అని అనుకునే వారందరు, \q2 ఖడ్గానికి గురై చస్తారు. \s1 ఇశ్రాయేలు పునరుద్ధరణ \p \v 11 “ఆ రోజున, \q1 “పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, \q2 నేను దాని విరిగిన గోడలను మరమ్మత్తు చేసి, \q2 దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, \q2 మునుపు ఉండినట్లుగా దాన్ని తిరిగి కడతాను. \q1 \v 12 అలా వారు ఎదోము జనంలో మిగిలిన వారిని, \q2 నా నామం కలిగిన యూదేతరులనందరినీ స్వాధీనం చేసుకుంటారు,” \q2 అని ఈ కార్యాలన్ని చేసే యెహోవా అంటున్నారు. \p \v 13 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, \q1 “రాబోయే రోజుల్లో పంట కోసేవారిని దున్నేవాడు దాటిపోతాడు, \q2 నాటే వారిని ద్రాక్ష పండ్లు త్రొక్కేవాడు దాటిపోతాడు, \q1 నూతన ద్రాక్షరసం పర్వతాలమీద నుండి, \q2 అన్ని కొండల నుండి ప్రవహిస్తుంది. \q2 \v 14 నేను నా ఇశ్రాయేలు ప్రజలను బందీల నుండి తిరిగి తీసుకువస్తాను.\f + \fr 9:14 \fr*\ft లేదా \ft*\fqa నా ఇశ్రాయేలు ప్రజల భాగ్యాలను తిరిగి రప్పిస్తాను\fqa*\f* \b \q1 “వారు శిథిలమైన పట్టణాలను పునర్నిర్మించుకుని వాటిలో నివసిస్తారు. \q2 వారు ద్రాక్షతోటలు వేసి వాటి ద్రాక్షరసం త్రాగుతారు; \q2 వారు వనాలు నాటి వాటి పండ్లు తింటారు. \q1 \v 15 నేను ఇశ్రాయేలును తమ స్వదేశంలో నాటుతాను, \q2 నేను వారికిచ్చిన దేశంలో నుండి \q2 వారు ఇక ఎన్నడు పెళ్లగించబడరు,” \m అని మీ దేవుడైన యెహోవా చెప్తున్నారు.