\id 2CH - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h 2 దినవృత్తాంతములు \toc1 దినవృత్తాంతములు రెండవ గ్రంథం \toc2 2 దినవృత్తాంతములు \toc3 2 దిన \mt1 దినవృత్తాంతములు \mt2 రెండవ గ్రంథం \c 1 \s1 సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించుట \p \v 1 దావీదు కుమారుడు సొలొమోను తన రాజ్యంలో రాజుగా స్థిరపడ్డాడు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి అతన్ని గొప్పగా హెచ్చించాడు. \p \v 2 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలీయులందరితో అంటే సహస్రాధిపతులతో,\f + \fr 1:2 \fr*\fq సహస్రాధిపతులతో \fq*\ft అంటే వేయిమంది సైనికులపై అధిపతి\ft*\f* శతాధిపతులతో\f + \fr 1:2 \fr*\fq శతాధిపతులతో \fq*\ft అంటే, \ft*\fqa వందమంది సైనికులపై అధిపతులతో\fqa*\f*, న్యాయాధిపతులతో, ఇశ్రాయేలులోని నాయకులందరితో, కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు. \v 3 సొలొమోను సమాజమంతా గిబియోనులోని ఉన్నత స్థలానికి వెళ్లారు, ఎందుకంటే యెహోవా సేవకుడైన మోషే అరణ్యంలో ఏర్పాటుచేసిన దేవుని యొక్క సమావేశ గుడారం అక్కడ ఉంది. \v 4 దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి దాని కోసం సిద్ధపరచిన స్థలానికి తీసుకువచ్చాడు, ఎందుకంటే అతడు యెరూషలేములో దాని కోసం ఒక గుడారాన్ని వేశాడు. \v 5 అయితే హూరు మనుమడు ఊరి కుమారుడైన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం గిబియోనులో యెహోవా సమావేశ గుడారం ముందు ఉంది; కాబట్టి సొలొమోను సమాజం అక్కడ అతని గురించి విచారణ చేశారు. \v 6 సొలొమోను సమావేశ గుడారంలో ఉన్న యెహోవా సన్నిధి ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వెళ్లి దానిమీద వెయ్యి దహనబలులు అర్పించాడు. \p \v 7 ఆ రాత్రివేళ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు. \p \v 8 అందుకు సొలొమోను దేవునితో, “మీరు నా తండ్రియైన దావీదు మీద ఎంతో దయను చూపించారు, అంతేకాక ఆయన స్థానంలో నన్ను రాజుగా చేశారు. \v 9 యెహోవా దేవా, నా తండ్రియైన దావీదుకు మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. భూమిమీది ధూళియంత విస్తారమైన ప్రజలకు నన్ను రాజుగా చేశారు. \v 10 నేను ఈ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానాన్ని, వివేచనను ఇవ్వండి. లేకపోతే మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?” \p \v 11 దేవుడు సొలొమోనుతో, “ఇది నీ హృదయ కోరిక, నీవు సంపదలు, ఆస్తులు గాని గౌరవాన్ని గాని నీ శత్రువుల మరణాన్ని గాని నీవు కోరలేదు, నీవు సుదీర్ఘ జీవితాన్ని కోరలేదు, కానీ ఏ ప్రజల మీద నిన్ను రాజుగా చేశానో, ఆ నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం కోరావు, \v 12 కాబట్టి నీకు జ్ఞాన వివేకాలు ఇస్తాను. అంతే కాకుండా నీకు ముందున్న ఏ రాజుకు నీ తర్వాత వచ్చే రాజులకు ఉండనంత సంపదలు, ఆస్తులు, గౌరవాన్ని నేను నీకు ఇస్తాను” అని చెప్పారు. \p \v 13 తర్వాత సొలొమోను గిబియోనులో ఉన్న సమావేశ గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుండి యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. \p \v 14 సొలొమోను రథాలను, గుర్రాలను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు, 12,000 గుర్రాలు\f + \fr 1:14 \fr*\ft లేదా \ft*\fqa రథసారధులు\fqa*\f* ఉన్నాయి, వీటిని రథాల పట్టణాల్లో యెరూషలేములో తన దగ్గర ఉంచాడు. \v 15 రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు. \v 16 సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, క్యూ\f + \fr 1:16 \fr*\ft బహుశ \ft*\fqa కిలికియ\fqa*\f* నుండి దిగుమతి చేసుకున్నారు. రాజ వర్తకులు తగిన ధర చెల్లించి వాటిని క్యూ దగ్గర కొనుగోలు చేశారు. \v 17 వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ\f + \fr 1:17 \fr*\ft అంటే, సుమారు 6.9 కి. గ్రా. లు\ft*\f* వెండిని ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ\f + \fr 1:17 \fr*\ft అంటే, సుమారు 1.7 కి. గ్రా. లు\ft*\f* వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి సిరియా రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు. \c 2 \s1 దేవాలయ నిర్మాణానికి సిద్ధపాటు \p \v 1 సొలొమోను యెహోవా పేరిట ఒక మందిరం, తమ కోసం ఒక రాజభవనం కట్టాలని ఆజ్ఞాపించాడు. \v 2 సొలొమోను 70,000 మందిని బరువులు మోయడానికి, 80,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఆ పని తనిఖీ చేయడానికి వారిమీద 3,600 మంది అధికారులను కూడా నియమించాడు. \p \v 3 తూరు రాజైన హీరాముకు\f + \fr 2:3 \fr*\ft హెబ్రీలో \ft*\fq హీరాము \fq*\ft మరో రూపం \ft*\fqa హూరాము\fqa*\f* సొలొమోను ఇలా కబురు పంపాడు. \pm “నా తండ్రియైన దావీదుకు నివాసంగా ఒక భవనం కట్టడానికి మీరు దేవదారు మ్రానులను పంపినట్లే నాకు కూడ పంపించండి. \v 4 ఎందుకంటే, నా దేవుడైన యెహోవా పేరిట మందిరం కట్టిస్తాను. ఆయన సన్నిధిలో పరిమళ ధూపం వేయడం కోసం, ఎల్లప్పుడూ సన్నిధి రొట్టెలు పెట్టడంకోసం, ప్రతి ఉదయం సాయంకాలం, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, మా దేవుడైన యెహోవాకు నియమించబడిన పండుగ సమయాల్లో దహనబలులు అర్పించడం కోసం మందిరాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తాను. ఇవన్నీ ఇశ్రాయేలుకు నిత్య కట్టుబాట్లుగా ఉంటాయి. \pm \v 5 “మా దేవుడు ఇతర దేవుళ్ళందరికంటే గొప్పవాడు. కాబట్టి నేను కట్టించే మందిరం గొప్పగా ఉంటుంది. \v 6 అయితే ఆకాశ మహాకాశాలు కూడా ఆయనకు సరిపోవు. ఆయనకు మందిరం ఎవరు నిర్మించగలరు? ఆయనకు మందిరం కట్టించడానికి నా సామర్థ్యం ఏపాటిది? ఆయన సన్నిధానంలో ధూపం వేయడం కోసం ఒక స్థలాన్ని నిర్మిస్తాను. \pm \v 7 “యెరూషలేములోను యూదాదేశంలోను నా దగ్గర నేర్పరులైన పనివారున్నారు. వారిని నా తండ్రి దావీదు నియమించాడు. వారితో కలిసి, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, ఎరుపు ఊదా నూలుతోను, నీలి నూలుతోను చేసేపని, అన్ని రకాల చెక్కడం పనులు నిర్వహించడానికి నేర్పుగల ఒక మనిషిని పంపండి. \pm \v 8 “లెబానోను అడవుల్లో మ్రానులు నరకడంలో మీ పనివారు నేర్పరులని నాకు తెలుసు. కాబట్టి లెబానోను నుండి నాకు సరళ వృక్షం దూలాలు, దేవదారు దూలాలు, చందనం దూలాలు పంపించండి. నా పనివారు మీ పనివారితో కలిసి పని చేస్తారు. \v 9 నేను కట్టే దేవాలయం విశాలంగా, అద్భుతంగా ఉండాలి కాబట్టి చాలా దూలాలు కావాలి. \v 10 దూలాలు నరికే మీ పనివాళ్ళకు ఆహారంగా 20,000 కోరుల\f + \fr 2:10 \fr*\ft అంటే, సుమారు 3,600 టన్నులు\ft*\f* గోధుమ పిండిని, 20,000 కోరుల\f + \fr 2:10 \fr*\ft అంటే, సుమారు 3,000 టన్నులు\ft*\f* యవలు, 20,000 బాతుల\f + \fr 2:10 \fr*\ft అంటే, సుమారు 4,40,000 లీటర్లు\ft*\f* ద్రాక్షరసం, 20,000 బాతుల ఒలీవనూనె ఇస్తాను.” \p \v 11 దానికి జవాబుగా తూరు రాజైన హీరాము సొలొమోనుకు ఒక లేఖ వ్రాశాడు. \pm “యెహోవా తన ప్రజలను ప్రేమగా చూస్తున్నాడు. అందుకే నిన్ను వారిమీద రాజుగా నియమించాడు.” \p \v 12 అందుకు హీరాము, \pm “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను సృజించిన దేవుడు. ఆయన స్తుతిపాత్రుడు! ఆయన రాజైన దావీదుకు బుద్ధిగల కుమారున్ని ఇచ్చారు. ఆ కుమారుడు జ్ఞానం, వివేకం గలవాడై, యెహోవా పేరిట మందిరం, తనకు రాజభవనం కట్టిస్తాడు. \pm \v 13 “మీ దగ్గరకు హూరాము-అబి అనే జ్ఞానంగల వ్యక్తిని పంపిస్తున్నాను. అతడు గొప్ప నేర్పుగలవాడు. \v 14 అతని తల్లి దాను వంశీయురాలు. తండ్రి తూరుకు చెందిన వాడు. బంగారం వెండి ఇత్తడి ఇనుము రాళ్లు దూలాలతో పని చేయడం అతనికి బాగా తెలుసు. ఊదా నీలి సన్నని నూలుతో ఎరుపు నూలుతో పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల చెక్కడపు పనిలో నైపుణ్యం ఉన్నవాడు, నాకు యజమాని నీకు తండ్రియైన దావీదు, మీరు ఏర్పాటుచేసిన పనివారితో అతడు పని చేస్తాడు. \pm \v 15 “నా యజమానులైన మీరు చెప్పినట్టే ఇప్పుడు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షరసం మీ సేవకులకిచ్చి పంపించండి. \v 16 మీరు కావాలన్న దూలాలను మేము లెబానోను అడవుల నుండి నరికి సముద్రం మీద తెప్పలుగా కట్టి, యొప్ప పట్టణం దాకా తెస్తాము. అక్కడినుండి మీరు వాటిని యెరూషలేముకు తీసుకెళ్లవచ్చు.” \p \v 17 సొలొమోను ఇశ్రాయేలులో ఉంటున్న పరాయి దేశస్థుల జనాభా లెక్కలు తీయించాడు. తన తండ్రియైన దావీదు చేయించిన లెక్కల ప్రకారం అలాంటి వారికి లెక్కించినప్పుడు మొత్తం 1,53,600 మంది ఉన్నారు. \v 18 వారిలో బరువులు మోయడానికి 70,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి 80,000 మందిని నియమించాడు. పని సక్రమంగా జరిగేటట్టు చూడడానికి 3,600 మందిని పనివారి మీద అధికారులుగా నియమించాడు. \c 3 \s1 సొలొమోను దేవాలయాన్ని నిర్మించుట \p \v 1 ఆ తర్వాత సొలొమోను యెరూషలేములో ఉన్న మోరీయా కొండమీద యెహోవా మందిరాన్ని కట్టడం ఆరంభించాడు. అక్కడే యెహోవా సొలొమోను తండ్రియైన దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను మందిరం కట్టించిన స్థలం అంతకుముందు యెబూసీయుడైన ఒర్నాను\f + \fr 3:1 \fr*\fq ఒర్నాను \fq*\fqa అరౌనా \fqa*\ft ఒర్నానుకు మరొక రూపం\ft*\f* నూర్పిడి కళ్ళం ఉంది. దావీదు దానిని సిద్ధం చేశాడు. \v 2 అతడు తన పాలనలోని నాలుగవ సంవత్సరం రెండవ నెల రెండవ రోజున కట్టడం ప్రారంభించాడు. \p \v 3 సొలొమోను దేవుని ఆలయానికి పునాది వేయించాడు. పూర్వంలో ఉపయోగించిన మూర కొలత ప్రకారం, దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు.\f + \fr 3:3 \fr*\ft అంటే, సుమారు 27 మీటర్ల పొడవు 9 మీటర్ల వెడల్పు\ft*\f* \v 4 మందిరం విశాల గదికి ముందు మంటపం ఉంది. దాని పొడవు ఇరవై మూరలు,\f + \fr 3:4 \fr*\ft అంటే, సుమారు 9 మీటర్లు\ft*\f* ఎత్తు నూట ఇరవై మూరలు. \p లోపలిభాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు. \v 5 అతడు ప్రధాన గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారం పొదిగించి, పైభాగాన ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటివి చెక్కించాడు. \v 6 మందిరాన్ని ప్రశస్తమైన రాళ్లతో అలంకరించాడు. అతడు ఉపయోగించిన బంగారం పర్వయీము నుండి తెచ్చింది. \v 7 మందిర దూలాలను, స్తంభాలను, గోడలను, తలుపులను బంగారంతో పొదిగించాడు. గోడ మీద కెరూబు\f + \fr 3:7 \fr*\ft సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.\ft*\f* చెక్కించాడు. \p \v 8 అతడు మందిరంలో అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. మందిరం వెడల్పు బట్టి దాని పొడవు ఇరవై మూరలు. వెడల్పు కూడా ఇరవై మూరలు. దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. అందుకు సుమారు 20,000 కిలోగ్రాముల బంగారం పట్టింది. \v 9 బంగారు మేకు బరువు యాభై షెకెళ్ళు,\f + \fr 3:9 \fr*\ft అంటే, సుమారు 575 గ్రాములు\ft*\f* మందిర పైభాగాలను కూడా బంగారంతో పొదిగించాడు. \p \v 10 అతి పరిశుద్ధ స్థలంలో రెండు కెరూబులను చెక్కించాడు. వాటిని బంగారంతో పొదిగించాడు. \v 11 ఆ కెరూబులకు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల పొడవు మొత్తం ఇరవై మూరలు. ఒక్కొక్క రెక్క అయిదు మూరల\f + \fr 3:11 \fr*\ft అంటే, సుమారు 2.3 మీటర్లు; ఇంకా \+xt 15|link-href="2CH 3:15"\+xt* వచనంలో\ft*\f* పొడవు మొదటి రెక్క గోడకు తాకుతూ ఉంది. రెండవ రెక్క దానికి జతగా ఉన్న కెరూబు తాకుతూ ఉంది. \v 12 అదే విధంగా రెండవ కెరూబు ఒక రెక్క అయిదు మూరల పొడవు. అది ఆలయ గోడకు తాకుతూ ఉంది. దాని మరొక రెక్క అయిదు మూరల పొడవు, మొదటి కెరూబు రెక్కను తాకుతూ ఉంది. \v 13 ఆ విధంగా ఆ కెరూబుల రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. కెరూబుల ముఖాలు ప్రధాన మందిరం వైపుకు తిరిగి ఉన్నాయి. కెరూబులు కాళ్లమీద నిలబడి ఉన్నాయి. \p \v 14 సొలొమోను నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో సన్నని నారతో ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను అల్లించాడు. \p \v 15 మందిరం ముందు స్థలానికి రెండు స్తంభాలు చేయించాడు. వాటి ఎత్తు ముప్పై అయిదు మూరలు. వాటి మీద అయిదు మూరల ఎత్తుగల పీటలు కూడా చేయించాడు. \v 16 అతడు అల్లిన గొలుసులు\f + \fr 3:16 \fr*\ft లేదా \ft*\fqa గర్భాలయంలో గొలుసులు తయారుచేసి; \fqa*\ft హెబ్రీ భాషలో ఈ పదం యొక్క ఖచ్చితమైన అర్థం తెలియదు\ft*\f* చేయించి స్తంభాల పైభాగంలో పెట్టాడు. వంద దానిమ్మపండ్లు కూడా చేసి గొలుసులకు తగిలించాడు. \v 17 మందిరం ముందు భాగంలో స్తంభాలను ఒకటి దక్షిణం వైపు ఒకటి ఉత్తరం వైపు నిలబెట్టాడు. దక్షిణాన ఉన్న దానికి యాకీను\f + \fr 3:17 \fr*\fq యాకీను \fq*\ft బహుశ దీని అర్థం \ft*\fqa ఆయన స్థాపిస్తారు\fqa*\f* అని, ఉత్తరాన ఉన్న దానికి బోయజు\f + \fr 3:17 \fr*\fq బోయజు \fq*\ft బహుశ దీని అర్థం \ft*\fqa ఆయనలో బలముంది\fqa*\f* అని పేరు పెట్టాడు. \c 4 \s1 ఆలయ సామాగ్రి \p \v 1 హూరాము-అబి ఇత్తడి బలిపీఠం చేశాడు. దాని పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు పది మూరలు.\f + \fr 4:1 \fr*\ft అంటే, సుమారు లేదా 9 మీటర్ల పొడవు 4.5 మీటర్ల ఎత్తు\ft*\f* \v 2 అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు.\f + \fr 4:2 \fr*\ft అంటే, సుమారు 2.3 మీటర్లు\ft*\f* దాని చుట్టుకొలత ముప్పై మూరలు.\f + \fr 4:2 \fr*\ft అంటే, సుమారు 14 మీటర్లు\ft*\f* \v 3 దాని అంచు క్రింద మూరకు పది చొప్పున చుట్టూ ఎడ్ల రూపాలు ఉన్నాయి. నీళ్ల తొట్టెను పోత పోసినప్పుడు ఆ ఎడ్లు రెండు వరుసలుగా పోత పోశారు. \p \v 4 ఆ నీళ్ల తొట్టె పన్నెండు ఎడ్ల మీద అమర్చబడింది, వాటిలో మూడు ఉత్తరం వైపు, మూడు పశ్చిమ వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపు ఉన్నాయి. నీళ్ల తొట్టె వాటిపై ఉంచబడింది, వాటి వెనుకటి భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి. \v 5 అది బెత్తెడు\f + \fr 4:5 \fr*\ft అంటే, సుమారు 7.5 సెం.మీ.\ft*\f* మందం కలిగి ఉండి, దాని అంచు పాత్ర అంచులా, తామర పువ్వులా ఉంది. దానిలో మూడు వేల బాతుల\f + \fr 4:5 \fr*\ft అంటే, సుమారు 66,000 లీటర్లు\ft*\f* నీళ్లు పడతాయి. \p \v 6 దహనబలుల కోసం వాడే వాటిని కడగడానికి అతడు పది చిన్న గంగాళాలు చేయించి, దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదింటిని పెట్టాడు. వాటిలో దహనబలుల కోసం వాడే వాటిని కడుగబడతాయి, అయితే పెద్ద గంగాళం యాజకులు కడుక్కోడానికి మాత్రమే ఉపయోగిస్తారు. \p \v 7 అతడు వాటి వివరాల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను తయారుచేసి వాటిని మందిరంలో అయిదు దక్షిణం వైపు అయిదు ఉత్తరం వైపు ఉంచాడు. \p \v 8 పది బల్లలను చేయించి మందిరంలో దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదు ఉంచాడు. బంగారంతో నూరు గిన్నెలను చేయించాడు. \p \v 9 యాజకుల ఆవరణాన్ని, పెద్ద ఆవరణాన్ని చేయించాడు, ఆ ఆవరణాలకు తలుపులు చేయించి వాటిని ఇత్తడితో పొదిగించాడు. \v 10 గంగాళాన్ని మందిరానికి దక్షిణ వైపున ముఖాన్ని ఆగ్నేయ దిక్కుకు త్రిప్పి ఉంచాడు. \p \v 11 హూరాము కుండలను, చేటలను, చిలకరించడానికి వాడే గిన్నెలను కూడా చేయించాడు. \p కాబట్టి హూరాము యెహోవా ఆలయానికి రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం పనంతా చేసి ముగించాడు: \b \li1 \v 12 రెండు స్తంభాలు, \li1 ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి రెండు పీటలు, \li1 గిన్నెలాంటి ఆ రెండు పీటలను కప్పడానికి రెండు అల్లికలు, \li1 \v 13 స్తంభాలపై ఉన్న గిన్నెలాంటి పీటలను అలంకరిస్తూ ఒక్కొక్క అల్లికకు రెండేసి వరుసల చొప్పున ఆ రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మపండ్లు, \li1 \v 14 ఆ పీటలు వాటిపై ఉన్న తొట్లు, \li1 \v 15 నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు, \li1 \v 16 కుండలు, చేటలు, ముండ్ల కొంకులు మొదలైన పాత్రలు. \b \p హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు. \v 17 రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు\f + \fr 4:17 \fr*\fq సారెతానుకు \fq*\ft అంటే \ft*\fqa జెరేదాతను\fqa*\f* మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు. \v 18 సొలొమోను చేయించిన ఇత్తడి వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ ఇత్తడి బరువు ఎంతో ఎవరూ నిర్ణయించలేదు. \p \v 19 దేవుని మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు: \b \li1 బంగారు బల్ల, \li1 సన్నిధి రొట్టెలు పెట్టే బల్లలు, \li1 \v 20 గర్భాలయం ఎదుట వెలుతురు ఉండడానికి మేలిమి బంగారు దీపస్తంభాలు, వాటి దీపాలు, \li1 \v 21 వాటి బంగారు పుష్పాలు దీపాలు కత్తెరలు పట్టుకారులు, \li1 \v 22 మేలిమి బంగారు చేసిన వత్తులు కత్తిరించే కత్తెరలు, చిలకరించే గిన్నెలు, పాత్రలు, ధూపకలశాలు; మందిర బంగారు తలుపులు: అతి పరిశుద్ధ స్థలానికి లోపలి తలుపులు, ప్రధాన గది తలుపులు. \b \c 5 \p \v 1 రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేసిన పని అంతా ముగిసిన తర్వాత, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారు, వస్తువులను తెప్పించి, యెహోవా మందిర ఖజానాలో పెట్టాడు. \s1 మందసాన్ని మందిరానికి తీసుకురావడం \p \v 2 అప్పుడు సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేముకు పిలిపించాడు. \v 3 ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజు ఎదుట సమావేశమయ్యారు. \p \v 4 ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, లేవీయులు నిబంధన మందసాన్ని తీసుకుని, \v 5 మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. లేవీయులైన యాజకులు వాటిని పైకి మోసుకెళ్లారు; \v 6 రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు. \p \v 7 తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు. \v 8 కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపి మందసాన్ని దానిని మోసే కర్రలను కప్పివేశాయి. \v 9 ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు మందసం నుండి విస్తరించి, గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి. \v 10 మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు. \p \v 11 తర్వాత యాజకులు పరిశుద్ధాలయం నుండి బయటకు వచ్చారు. అంతకుముందు అక్కడ ఉన్న యాజకులందరు తమ విభాగాలతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. \v 12 సంగీతకారులైన లేవీయులంతా, అంటే ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, బంధువులు సన్నని నారబట్టలను ధరించి తాళాలు, తంతి వాయిద్యాలు, స్వరమండలాలు చేతపట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపున నిలబడి ఉన్నారు. వారితో కలిసి బూరల ధ్వని చేయడానికి నూట ఇరవైమంది యాజకులు ఉన్నారు. \v 13 బూరలు ఊదేవారు, సంగీతకారులు ఏకకంఠంతో యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి జత కలిశారు. వారికి జతగా బూరలు, తాళాలు, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, పాటలు పాడేవారు యెహోవాను స్తుతించడానికి తమ స్వరాలెత్తి: \q1 “యెహోవా మంచివాడు. \q2 ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” \m అని పాడారు. \p అప్పుడు యెహోవా మందిరం మేఘంతో నిండిపోయింది. \v 14 యెహోవా మహిమ దేవుని మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు. \c 6 \p \v 1 అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు; \v 2 నేను మీ కోసం ఘనమైన మందిరాన్ని కట్టించాను. అది మీరు ఎల్లకాలం నివసించగలిగే స్థలం” అని అన్నాడు. \p \v 3 ఇశ్రాయేలు సమాజమంతా అక్కడ నిలబడి ఉండగా రాజు వారివైపు తిరిగి, వారిని దీవించాడు. \v 4 అప్పుడతడు ఇలా అన్నాడు: \pm “నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన హస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు: \v 5 ‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, నా ప్రజలను పరిపాలించడానికి ఏ రాజును నేను ఎన్నుకోలేదు. \v 6 అయితే ఇప్పుడు నా పేరు ఉండేలా యెరూషలేమును ఎన్నుకున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’ \pm \v 7 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరం కట్టించాలనే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉండింది. \v 8 కాని యెహోవా నా తండ్రియైన దావీదుతో, ‘నా పేరున మందిరాన్ని కట్టించాలనే ఆశ నీ హృదయంలో ఉండడం మంచిదే. \v 9 అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు. \pm \v 10 “యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను. \v 11 యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనను తెలిపే మందసాన్ని మందిరంలో అక్కడ పెట్టాను.” \s1 సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ చేసిన ప్రార్థన \p \v 12 అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో నిలబడి చేతులు చాపి ప్రార్థన చేశాడు. \v 13 తర్వాత సొలొమోను అయిదు మూరల పొడవు, అయిదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తుతో\f + \fr 6:13 \fr*\ft అంటే, సుమారు 2.3 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల ఎత్తు\ft*\f* ఒక ఇత్తడి వేదికను తయారుచేసి, బయటి ఆవరణ మధ్యలో ఉంచాడు. అతడు వేదికపై నిలబడి, ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో మోకరిల్లి, ఆకాశం వైపు చేతులు చాపాడు. \v 14 అతడు ఇలా ప్రార్థించాడు: \pm “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు. \v 15 మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు. \pm \v 16 “ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి. \v 17 ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీ సేవకుడైన దావీదుతో మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. \pm \v 18 “అయితే దేవుడు భూమి మీద మనుష్యులతో నిజంగా నివాసం చేస్తారా? ఆకాశ మహాకాశాలు మీకు సరిపోవు. నేను కట్టించిన ఈ మందిరం ఏం సరిపోతుంది? \v 19 అయినా యెహోవా నా దేవా, మీ దాసుడైన నేను చేసే ప్రార్థన, కనికరం కోసం చేసే విన్నపం ఆలకించండి. మీ దాసుడు మీ సన్నిధిలో చేసే మొరను, ప్రార్థనను వినండి. \v 20 మీ పేరు అక్కడ ఉంటుందని మీరు చెప్పిన స్థలం వైపు తిరిగి మీ దాసుడు చేసే ప్రార్థన మీరు వినేలా రాత్రింబగళ్ళు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉండును గాక. \v 21 మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపాలు ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి; మీరు విన్నప్పుడు క్షమించండి. \pm \v 22 “ఎవరైనా తన పొరుగువారి పట్ల తప్పు చేశారని ఆరోపించబడి వారు ప్రమాణం చేయాల్సివస్తే ఈ మందిరంలో మీ బలిపీఠం ముందు ఆ ప్రమాణం చేసినప్పుడు, \v 23 మీరు ఆకాశం నుండి విని మీ దాసులకు న్యాయం తీర్చండి. దోషులను వారి దోషం బట్టి శిక్షిస్తూ, నిర్దోషుల నిర్దోషత్వాన్ని బట్టి వారి నిర్దోషత్వాన్ని నిర్ధారించండి. \pm \v 24 “మీ ఇశ్రాయేలు ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు మీ వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఈ మందిరం ఎదుట మిమ్మల్ని వేడుకున్నప్పుడు, \v 25 మీరు పరలోకం నుండి విని, మీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారికి వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ తీసుకురండి. \pm \v 26 “మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తే, \v 27 మీరు పరలోకం నుండి విని, మీ దాసులు, మీ ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని క్షమించండి. సరైన మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని వారికి బోధించండి, మీ ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో వర్షం కురిపించండి. \pm \v 28 “దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా, \v 29 మీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా తమ వేదన బాధలు తెలుసుకొని ఈ మందిరం వైపు తమ చేతులను చాచి ప్రార్థన విన్నపం చేస్తే, \v 30 ప్రతి మనిషి హృదయం మీకు తెలుసు కాబట్టి మీ నివాసస్థలమైన పరలోకం నుండి విని క్షమించి, ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమివ్వండి (ఎందుకంటే ప్రతి మానవ హృదయం మీకు తెలుసు), \v 31 అప్పుడు మీరు మా పూర్వికులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత కాలం మీకు భయపడి, మీకు విధేయులై మీ మార్గంలో వారు నడుస్తారు. \pm \v 32 “మీ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించని విదేశీయులు, మీ గొప్ప పేరును బట్టి, మీ బలమైన బాహువును చాచిన మీ చేతులను బట్టి దూరదేశం నుండి వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, \v 33 మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి. విదేశీయులు మిమ్మల్ని ఏమి అడిగినా అది వారికి చేయండి. అప్పుడు భూలోక ప్రజలు మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా మీ పేరు తెలుసుకొని మీకు భయపడతారు. నేను కట్టిన ఈ మందిరం మీ పేరు కలిగి ఉందని తెలుసుకుంటారు. \pm \v 34 “మీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు, మీరు వారిని ఎక్కడికి పంపినా, మీరు ఎన్నుకున్న ఈ పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి, వారు మీకు ప్రార్థన చేస్తే, \v 35 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి. \pm \v 36 “పాపం చేయని మనుష్యులు లేరు కాబట్టి వారు మీకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు, మీరు వారిపై కోప్పడి శత్రువులకు అప్పగిస్తే, వారు వీరిని దూరంగా లేదా దగ్గరగా ఉన్న దేశానికి బందీలుగా తీసుకెళ్తారు; \v 37 అప్పుడు వారు బందీగా ఉన్న దేశంలో వారి హృదయాలు మారి పశ్చాత్తాపపడి, ‘మేము తప్పు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాం’ అని వారు వేడుకుంటే, \v 38 తాము బందీగా ఉన్న దేశంలో వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో మరలా మీ వైపు తిరిగి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశం వైపు, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, \v 39 అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపాలను విని వారి పక్షాన ఉండండి. మీకు విరుద్ధంగా పాపం చేసిన మీ ప్రజలను క్షమించండి; \pm \v 40 “నా దేవా! ఈ స్థలంలో చేసిన ప్రార్థనపై మీ కనుదృష్టి ఉంచండి. చెవులారా ఆలకించండి. \qm1 \v 41 “యెహోవా దేవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, \qm2 మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి. \qm1 యెహోవా దేవా! మీ యాజకులు రక్షణను ధరించుకొందురు గాక! \qm2 మీ మంచితనాన్నిబట్టి నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషించుదురు గాక! \qm1 \v 42 యెహోవా దేవా! మీ అభిషిక్తుని తిరస్కరించకండి. \qm2 మీ సేవకుడైన దావీదు మీద మీ మారని ప్రేమను చూపుతానని మీరు చేసిన వాగ్దానాలు జ్ఞాపకముంచుకోండి.” \c 7 \s1 మందిరాన్ని ప్రతిష్ఠించుట \p \v 1 సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహనబలిని, బలులను దహించివేసింది. యెహోవా మహిమ మందిరాన్ని నింపింది. \v 2 ఆలయమంతా యెహోవా మహిమతో నిండడంతో యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు. \v 3 అగ్ని దిగి రావడం, యెహోవా మహిమ మందిరం మీద ఉండడం ఇశ్రాయేలీయులు చూసినప్పుడు, వారు కాలిబాట మీద సాష్టాంగపడి, \q1 “యెహోవా మంచివాడు; \q2 ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” \m అంటూ ఆయనను ఆరాధించి కృతజ్ఞత చెల్లించారు. \p \v 4 తర్వాత రాజు, ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు. \v 5 సొలొమోను రాజు 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, మేకలు బలిగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ప్రజలందరు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు. \v 6 యాజకులు తమ స్థలాల్లో నిలబడి ఉండగా, రాజైన దావీదు యెహోవాను స్తుతించడానికి, “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉండును గాక!” అంటూ ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లించడానికి దావీదు యెహోవా కోసం తయారుచేసిన వాయిద్యాలు వాయిస్తూ గీతాలను పాడుతూ లేవీయులు కూడా తమ స్థలాలలో నిలబడ్డారు. లేవీయులకు ఎదురుగా యాజకులు నిలబడి బూరలు ఊదుతుండగా ఇశ్రాయేలీయులంతా నిలబడి ఉన్నారు. \p \v 7 సొలొమోను చేసిన ఇత్తడి బలిపీఠం మీద అర్పించలేనంత ఎక్కువగా ఆ దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వు ఉంది కాబట్టి అతడు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్య భాగాన్ని అతడు పవిత్రపరచి, దహనబలులు, భోజనార్పణలు, క్రొవ్వు పదార్థాలు అర్పించాడు. \p \v 8 ఆ సమయంలో ఏడు రోజులు సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చారు. \v 9 ఎనిమిదవ రోజున వారు సమావేశాన్ని నిర్వహించారు, ఎందుకంటే ఏడు రోజులు బలిపీఠాన్ని ప్రతిష్ఠించి మరో ఏడు రోజులు పండుగ జరుపుకున్నారు. \v 10 ఏడవ నెల ఇరవై మూడవ రోజున, అతడు ప్రజలను తమ ఇళ్ళకు పంపివేశాడు. యెహోవా దావీదుకు, సొలొమోనుకు, తన ప్రజలైన ఇశ్రాయేలుకు చేసిన మంచి వాటిని బట్టి హృదయంలో ఆనందంతో, సంతోషంతో వెళ్లారు. \s1 యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమగుట \p \v 11 సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని పూర్తి చేసి, యెహోవా మందిరంలో, తన సొంత భవనంలో తాను కోరుకున్నదంతా పూర్తి చేసినప్పుడు, \v 12 ఒక రాత్రి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: \pm “నేను నీ ప్రార్థన విన్నాను, ఈ స్థలాన్ని నా కోసం బలులు అర్పించే మందిరంగా ఎన్నుకున్నాను. \pm \v 13 “వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని, \v 14 ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను. \v 15 ఇప్పటినుండి ఈ స్థలంలో చేసే ప్రార్థనలపై నా దృష్టి ఉంటుంది నా చెవులతో వింటాను. \v 16 ఇక్కడ నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను ఈ మందిరాన్ని ఎన్నుకుని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి. \pm \v 17 “నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే, \v 18 నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని నిబంధన చేసినట్లు నీ రాజ సింహాసనం ఎల్లకాలం స్థాపిస్తాను. \pm \v 19 “అయితే ఒకవేళ మీరు నన్ను అనుసరించుట మాని, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు విడిచి ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే, \v 20 అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన నా దేశం నుండి వారిని పెళ్లగించి నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. నేను దాన్ని ప్రజలందరిలో సామెతగా, హేళనకు కారణంగా చేస్తాను. \v 21 ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు. \v 22 అప్పుడు ప్రజలు, ‘వారు తమను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని, పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.” \c 8 \s1 సొలొమోను ఇతర కార్యకలాపాలు \p \v 1 సొలొమోను యెహోవా మందిరాన్ని, తన సొంత భవనాన్ని కట్టించడానికి తీసుకున్న ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత, \v 2 హీరాము\f + \fr 8:2 \fr*\ft హెబ్రీలో \ft*\fq హీరాము \fq*\ft మరో రూపం \ft*\fqa హూరాము\fqa*\ft ; \+xt 18|link-href="2CH 8:18"\+xt* వచనంలో కూడా\ft*\f* అతనికి ఇచ్చిన గ్రామాలను సొలొమోను మరలా కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను స్థిరపరిచాడు. \v 3 తర్వాత సొలొమోను హమాత్-సోబా పట్టణం మీదికి వెళ్లి, దానిని స్వాధీనపరచుకున్నాడు. \v 4 అతడు ఎడారిలో తద్మోరును, హమాతులో తాను కట్టించిన దుకాణ పట్టణాలన్నిటిని కూడా నిర్మించాడు. \v 5 ఎగువ బేత్-హోరోనును, దిగువ బేత్-హోరోనును కోటగోడలతో, ద్వారాలతో, అడ్డగడియలతో కోటగోడలు గల పట్టణాలుగా కట్టించాడు. \v 6 అలాగే బయలతు, తన ధాన్యాగారాలను, తన రథాలకు, గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో, లెబానోనులో, తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు. \p \v 7 హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు (ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు) ఇంకా అక్కడ మిగిలి ఉన్నారు. \v 8 ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండ వదిలిన ఈ ప్రజలందరి వారసులను సొలొమోను ఈనాటికీ బానిసలుగా పని చేయడానికి నిర్బంధించాడు. \v 9 అయితే సొలొమోను ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని తన పని కోసం బానిసలుగా చేయలేదు; వారు అతని సైనికులు, అతని సేనాధిపతుల అధిపతులు, రథాలకు, రథసారధులకు అధిపతులుగా ఉన్నారు. \v 10 అంతేకాక, వారిలో రెండువందల యాభైమంది సొలొమోను రాజు ప్రజల మీద నియమించిన ముఖ్య అధికారులు కూడా ఉన్నారు. \p \v 11 సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి ఆమె కోసం కట్టించిన భవనానికి తీసుకువచ్చాడు. ఎందుకంటే, ఆయన, “ఇశ్రాయేలీయుల రాజైన దావీదు భవనంలో నా భార్య నివసించకూడదు. ఎందుకంటే యెహోవా మందసం ప్రవేశించిన స్థలాలు పరిశుద్ధమైనవి” అనుకున్నాడు. \p \v 12 తర్వాత సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించాడు. \v 13 మోషే ఇచ్చిన ఆజ్ఞ ననుసరించి ప్రతిరోజు పాటించవలసిన విధి ప్రకారం సబ్బాతు దినాల్లో, అమావాస్యలప్పుడు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ,\f + \fr 8:13 \fr*\ft లేదా \ft*\fqa వార పండుగ \fqa*\ft \+xt నిర్గమ 34:22\+xt*; \+xt లేవీ 23:15-22\+xt*; \ft*\fqa తదనంతరం పెంతెకొస్తు పండుగ అని పిలువబడింది. \fqa*\ft \+xt అపొ. కా. 2:1\+xt* \ft*\ft ఈనాడు ఇది \ft*\fqa షావౌట్ లేదా షాబౌట్ \fqa*\ft అని పిలువబడుతుంది\ft*\f* గుడారాల పండుగ అనే మూడు వార్షిక పండుగలప్పుడు యెహోవాకు దహనబలులు అర్పించేవాడు. \v 14 తన తండ్రి దావీదు శాసనానికి అనుగుణంగా, అతడు వారి సేవలను జరిగించడానికి యాజకుల విభాగాలను, ప్రతిరోజు అవసరాన్ని బట్టి యాజకులకు సహాయం చేయడానికి, స్తుతి చేయడానికి లేవీయులను నియమించాడు. ప్రతి ద్వారానికి వంతు ప్రకారం ద్వారపాలకులుగా ఉండడానికి మనుష్యులను నియమించాడు. అతడు వివిధ ద్వారాలకు విభాగాల ప్రకారం ద్వారపాలకులను నియమించాడు. ఎందుకంటే ఇలా చేయాలని దైవజనుడైన దావీదు ఆదేశించాడు. \v 15 వారు యాజకులకు లేవీయులకు సంబంధించిన విషయాల్లో, ఖజానాల విషయంతో సహా ఏ విషయంలోనూ రాజు ఆజ్ఞలను మీరలేదు. \p \v 16 యెహోవా మందిరం పునాది వేయబడ్డప్పటి నుండి మందిరం పని మొత్తం ముగిసేవరకు సొలొమోను పనినంతా చేయించాడు. యెహోవా మందిరం పూర్తి అయింది. \p \v 17 అప్పుడు సొలొమోను ఎదోము యొక్క సముద్రతీరాన ఉన్న ఏలతు దగ్గర ఉన్న ఎసోన్-గెబెరు ప్రాంతానికి వెళ్లాడు. \v 18 హీరాము తన సేవకుల ద్వారా ఓడలను, సముద్రం గురించి తెలిసిన తన నావికులను పంపించాడు. వారు సొలొమోను మనుష్యులతో పాటు బయలుదేరి ఓఫీరుకు చేరి అక్కడినుండి సుమారు 450 తలాంతుల\f + \fr 8:18 \fr*\ft అంటే, సుమారు 17 టన్నులు\ft*\f* బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు. \c 9 \s1 షేబ రాణి సొలొమోనును దర్శించుట \p \v 1 షేబ దేశపు రాణి సొలొమోను ఖ్యాతి గురించి విన్నప్పుడు, చిక్కు ప్రశ్నలతో అతన్ని పరీక్షిద్దామని ఆమె యెరూషలేముకు వచ్చింది. ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది. \v 2 సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు. వివరించలేనంత కష్టమైనది అతనికి ఏది లేదు. \v 3 షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానాన్ని, అతడు కట్టించిన రాజభవనాన్ని, \v 4 అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, తమ ప్రత్యేక వస్త్రాల్లో ఉన్న పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది. \p \v 5 ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే. \v 6 అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, మీ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి సగం కూడా నాకు చెప్పలేదు; నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు. \v 7 మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో! \v 8 మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి, వారిని శాశ్వతంగా సుస్థిరం చేయాలని ఆయనకున్న కోరికను బట్టి, నీతిన్యాయాల ప్రకారం కార్యాలు చేయడానికి యెహోవా మిమ్మల్ని వారిమీద రాజుగా చేశారు” అని అభినందించింది. \p \v 9 తర్వాత ఆమె రాజుకు 120 తలాంతుల\f + \fr 9:9 \fr*\ft అంటే, సుమారు 4.5 టన్నులు\ft*\f* బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి సొలొమోను రాజుకు ఇచ్చిన సుగంధద్రవ్యాలు వంటివి మరెప్పుడూ రాలేదు. \p \v 10 (హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు నుండి బంగారం తెచ్చారు; వారు చందనం, దూలాలు, వెలగల రాళ్లు కూడా తెచ్చారు. \v 11 ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి మెట్లను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. అంతకుముందు అలాంటివి యూదా ప్రదేశంలో ఎన్నడూ కనిపించలేదు.) \p \v 12 రాజైన సొలొమోను షేబ రాణి కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు; ఆమె అతనికి తెచ్చిన వాటికంటే ఎక్కువగా ఆమెకు ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది. \s1 సొలొమోను వైభవము \p \v 13 సొలొమోనుకు సంవత్సరానికి వచ్చే బంగారం బరువు 666 తలాంతులు.\f + \fr 9:13 \fr*\ft అంటే, సుమారు 25 టన్నులు\ft*\f* \v 14 అది వర్తకులు వ్యాపారులు తెచ్చిన ఆదాయం కాక, అరేబియా రాజులందరూ, దేశ అధికారుల నుండి సొలొమోనుకు బంగారం, వెండి తెచ్చారు. \p \v 15 రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో రెండువందల పెద్ద డాళ్లను చేయించాడు; ప్రతి డాలుకు ఆరువందల షెకెళ్ళ\f + \fr 9:15 \fr*\ft అంటే, సుమారు 6.9 కి. గ్రా. లు\ft*\f* బంగారం వినియోగించారు. \v 16 సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు. ప్రతి డాలుకు మూడువందల షెకెళ్ళ\f + \fr 9:16 \fr*\ft అంటే, సుమారు 3.5 కి. గ్రా. లు\ft*\f* బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు. \p \v 17 తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు. \v 18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. దానికి ఒక బంగారు పాదపీఠం కట్టి ఉంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి. \v 19 ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు. \v 20 రాజైన సొలొమోను పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి, లెబానోను వనపు రాజభవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండితో ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే సొలొమోను కాలంలో వెండికి విలువలేదు. \v 21 హీరాము\f + \fr 9:21 \fr*\ft హెబ్రీలో \ft*\fq హీరాము \fq*\ft మరో రూపం \ft*\fqa హూరాము\fqa*\f* మనుష్యులతో పాటు రాజు ఓడలు సముద్రంలో తర్షీషు వెళ్లి, మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి. \p \v 22 రాజైన సొలొమోను సంపదలో, జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే గొప్పవాడు. \v 23 దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వినడానికి భూలోక రాజులందరూ సొలొమోనును చూడాలని కోరారు. \v 24 ప్రతీ సంవత్సరం అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు తెచ్చేవారు. \p \v 25 గుర్రాల కోసం, రథాల కోసం రాజైన సొలొమోనుకు నాలుగువేల శాలలు ఉన్నాయి. పన్నెండువేలమంది గుర్రపు రౌతులున్నారు. రథాలలో కొన్నిటిని రౌతులలో కొందరిని వాటికోసం కట్టిన పట్టణాల్లో ఉంచాడు. కొన్ని యెరూషలేములో తన దగ్గర ఉంచాడు. \v 26 యూఫ్రటీసు నది ఒడ్డునుండి ఫిలిష్తీయుల దేశం వరకు, ఈజిప్టు సరిహద్దు వరకు ఉండే రాజులందరిపై అతడు పరిపాలన చేసేవాడు. \v 27 రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు. \v 28 సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, ఇతర అన్ని దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. \s1 సొలొమోను మరణం \p \v 29 సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, మొదటి నుండి చివరి వరకు నాతాను ప్రవక్త వ్రాసిన గ్రంథంలో, షిలోనీయుడైన అహీయా ప్రవచన గ్రంథంలో, దీర్ఘదర్శియైన ఇద్దో నెబాతు కుమారుడైన యరొబాము గురించి వ్రాసిన గ్రంథంలో వ్రాయబడలేదా? \v 30 సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలందరి మీదా నలభై సంవత్సరాలు పరిపాలించాడు. \v 31 తర్వాత సొలొమోను చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని అతని తండ్రి దావీదు పట్టణంలో సమాధి చేశారు, సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు. \c 10 \s1 రెహబామునకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు తిరుగుబాటు \p \v 1 రెహబామును రాజుగా చేయడానికి ఇశ్రాయేలు ప్రజలంతా షెకెముకు వెళ్లగా రెహబాము అక్కడికి వెళ్లాడు. \v 2 రాజైన సొలొమోను దగ్గరి నుండి ఈజిప్టుకు పారిపోయి అక్కడే నివాసం చేస్తున్న నెబాతు కుమారుడైన యరొబాము ఇది విని, ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు. \v 3 కాబట్టి ప్రజలు యరొబామును పిలిపించారు. అతడు, ఇశ్రాయేలీయులు అంతా కలిసి రెహబాము దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అన్నారు: \v 4 “మీ తండ్రి మామీద బరువైన కాడిని మోపాడు, అయితే మీ తండ్రి పెట్టిన కఠినమైన దాసత్వాన్ని, మామీద ఉంచిన బరువైన కాడిని తేలిక చేయండి, అప్పుడు మేము మీకు సేవ చేస్తాము.” \p \v 5 అందుకు రెహబాము జవాబిస్తూ, “మీరు మూడు రోజులయ్యాక మళ్ళీ రండి” అన్నాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు. \p \v 6 అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతనికి సేవలందించిన పెద్దలను సంప్రదించి, “ఈ ప్రజలకు ఎలా జవాబివ్వాలో చెప్పండి” అని అడిగాడు. \p \v 7 అందుకు వారు, “ఈ రోజు నీవు ఈ ప్రజల మీద దయచూపి వారిని సంతోషపరచి వారికి అనుకూలంగా జవాబు చెప్తే, వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని చెప్పారు. \p \v 8 కాని రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించి, తనతో పెరిగి పెద్దవారై తనకు సేవలందిస్తున్న యువకులను సంప్రదించాడు. \v 9 అతడు వారిని, “మీ సలహా ఏంటి? ‘మీ తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండి’ అని నాతో అంటున్న ఈ ప్రజలకు నేనేమి జవాబివ్వాలి?” అని అడిగాడు. \p \v 10 అతనితో పాటు పెరిగి పెద్దవారైన ఆ యువకులు జవాబిస్తూ, “ఈ ప్రజలు నీతో, ‘మీ తండ్రి మామీద బరువైన కాడి ఉంచాడు, కాని మీరు దాన్ని తేలిక చేయండి’ అని అన్నారు. కాని నీవు వారితో, ‘నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దది. \v 11 నా తండ్రి మీమీద బరువైన కాడి ఉంచాడు; నేను దానిని ఇంకా బరువు చేస్తాను. నా తండ్రి కొరడాలతో కొట్టాడు; నేను తేళ్లతో కొడతాను’ అని చెప్పాలి” అన్నారు. \p \v 12 రాజు, “మూడు రోజుల తర్వాత నా దగ్గరకు రండి” అని చెప్పిన ప్రకారం మూడు రోజుల తర్వాత యరొబాము ప్రజలంతా రెహబాము దగ్గరకు వచ్చారు. \v 13 రెహబాము రాజు పెద్దలు చెప్పిన సలహాను తిరస్కరించి, వారికి కఠినంగా జవాబిచ్చాడు. \v 14 అతడు యువకులు ఇచ్చిన సలహా ప్రకారం, “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు; నేను మరి ఎక్కువ బరువుగా చేస్తాను. నా తండ్రి కొరడాలతో శిక్షించాడు; నేను తేళ్లతో శిక్షిస్తాను” అని అన్నాడు. \v 15 రాజు ప్రజల మాట వినిపించుకోలేదు, ఎందుకంటే యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో చెప్పిన మాట నెరవేర్చడానికి ఈ సంఘటనలు దేవుడు ఇలా జరిగించారు. \p \v 16 రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: \q1 “దావీదులో మాకేం భాగం ఉంది, \q2 యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? \q1 ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! \q2 దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” \m కాబట్టి ఇశ్రాయేలీయులంతా గుడారాలకు వెళ్లిపోయారు. \v 17 కాని యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలీయుల మీద మాత్రం రెహబాము పరిపాలన చేశాడు. \p \v 18 రాజైన రెహబాము వెట్టి పనివారి మీద అధికారిగా ఉన్న అదోనిరామును\f + \fr 10:18 \fr*\ft హెబ్రీలో \ft*\fq అదోనిరామును \fq*\ft మరో రూపం \ft*\fqa హదోరాము\fqa*\f* పంపాడు, కాని ఇశ్రాయేలీయులు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయితే రాజైన రెహబాము తప్పించుకుని తన రథమెక్కి యెరూషలేముకు పారిపోయాడు. \v 19 కాబట్టి నేటికీ ఇశ్రాయేలీయులు దావీదు వంశం మీద తిరుగబడుతూనే ఉన్నారు. \c 11 \p \v 1 రెహబాము యెరూషలేము చేరుకొని యూదా బెన్యామీను గోత్రాల వారినందరిని, అనగా 1,80,000 మంది ఉత్తములైన సైనికులను పోగుచేసుకుని, ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి, రెహబాముకు రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు. \p \v 2 అయితే దైవజనుడైన షెమయాకు యెహోవా నుండి ఈ వాక్కు వచ్చింది: \v 3 “సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో, యూదా బెన్యామీనులో ఉన్న ఇశ్రాయేలీయులందరితో చెప్పు, \v 4 ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు మీ తోటి ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వెళ్లకండి. ఇది నేను చేస్తున్నది కాబట్టి మీరంతా ఇళ్ళకు వెళ్లండి.’ ” కాబట్టి వారు యెహోవా మాటలు విని, యరొబాముతో యుద్ధానికి వెళ్లడం మాని తిరిగి వెళ్లారు. \s1 యూదాను బలపరచిన రెహబాము \p \v 5 రెహబాము యెరూషలేములో నివాసముండి యూదాలో రక్షణ కోసం ఈ పట్టణాలను కట్టించాడు: \v 6 బేత్లెహేము, ఏతాము, తెకోవా, \v 7 బేత్-సూరు, శోకో, అదుల్లాము, \v 8 గాతు, మరేషా, జీఫు, \v 9 అదోరయాము, లాకీషు, అజేకా, \v 10 జోరహు, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులో కోటగోడలు గల పట్టణాలు ఉన్నాయి. \v 11 అతడు వాటి కోటగోడలను బలంగా చేసి, వాటిలో అధిపతులను ఉంచాడు. వారికి ఆహారపదార్థాలు, నూనె, ద్రాక్షరసం సరఫరాచేశాడు. \v 12 ఆ పట్టణాల్లో డాళ్లను, ఈటెలను ఉంచి వాటిని చాలా బలమైన పట్టణాలుగా చేశాడు. ఈ విధంగా యూదా, బెన్యామీను వారంతా అతని వశంలో ఉండిపోయాయి. \p \v 13 ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న యాజకులు లేవీయులు తమ ప్రాంతాలన్నిటి నుండి వచ్చి రెహబాము దగ్గరకు చేరారు. \v 14-15 యరొబాము, అతని కుమారులు లేవీయులను యెహోవా యాజకులుగా ఉండకుండా తిరస్కరించి, అతడు క్షేత్రాలకు మేక దూడ విగ్రహాలకు తన సొంత పూజారులను నియమించినప్పుడు, లేవీయులు తమ పచ్చికబయళ్లను, ఆస్తిని కూడా విడిచిపెట్టి యూదాకు యెరూషలేముకు వచ్చారు. \v 16 ఇలా ఉండగా, ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల్లో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాల్లో నిర్ణయించుకున్న వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి యెరూషలేముకు వెళ్తున్న లేవీయులను వెంబడించారు. \v 17 వారు యూదా రాజ్యాన్ని బలపరిచారు; ఈ సమయంలో వారు దావీదు సొలొమోనుల మార్గాలను అనుసరించి మూడు సంవత్సరాలు సొలొమోను కుమారుడైన రెహబాముకు మద్ధతు ఇచ్చారు. \s1 రెహబాము కుటుంబం \p \v 18 రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయైన మహలతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కుమారుడు ఏలీయాబు కుమార్తెయైన అబీహయిలు. \v 19 రెహబాముకు యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు. \v 20 ఆ తర్వాత అతడు అబ్షాలోము కుమార్తె మయకాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు పుట్టారు. \v 21 రెహబాముకు పద్దెనిమిది మంది భార్యలు, అరవైమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. ఇరవై ఎనిమిది మంది కుమారులు, అరవైమంది కుమార్తెలు పుట్టారు. తన భార్యలందరిలో, ఉంపుడుగత్తెలందరిలో అబ్షాలోము కుమార్తె మయకా అంటే రెహబాముకు ఎక్కువ ప్రేమ. \p \v 22 మయకా కుమారుడైన అబీయాను రాజుగా చేయాలనుకొని, రెహబాము అతన్ని తన సోదరులపైన ప్రముఖునిగా నాయకునిగా నియమించాడు. \v 23 రెహబాము వివేకంతో ప్రవర్తిస్తూ, తక్కిన తన కుమారులను యూదాలో, బెన్యామీనులో వేరు ప్రాంతాలకు, కోటగోడలు గల పట్టణాలకు పంపాడు. వారికి విస్తారమైన ధనం ఇచ్చి వారికి అనేక పెళ్ళిళ్ళు చేశాడు. \c 12 \s1 షీషకు యెరూషలేముపై దాడి చేయుట \p \v 1 రెహబాము రాజ్యం స్థిరపడి బలపడిన తర్వాత అతడు, ఇశ్రాయేలీయులంతా\f + \fr 12:1 \fr*\ft అంటే, 2 దినవృత్తాంతములో తరచుగా యూదా అని వాడబడింది\ft*\f* యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. \v 2 వారు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి, రాజైన రెహబాము పాలనలోని అయిదవ సంవత్సరం ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు. \v 3 అతనితో పాటు 1,200 రథాలు, 60,000 మంది రౌతులు, లెక్కలేనంత మంది లిబియానీయులు సుక్కీయులు కూషీయులు\f + \fr 12:3 \fr*\ft అంటే, ఇతియొపియా వారు\ft*\f* ఈజిప్టు నుండి వచ్చారు. \v 4 షీషకు యూదా దేశంలో కోటగోడలు గల పట్టణాలను పట్టుకుని, తర్వాత యెరూషలేము వరకు వచ్చాడు. \p \v 5 అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరకు, షీషకుకు భయపడి యెరూషలేముకు వచ్చి చేరిన యూదా అధిపతుల దగ్గరకు వచ్చి వారితో, “యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నన్ను విడిచిపెట్టారు. కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను” అని చెప్పాడు. \p \v 6 రాజు ఇశ్రాయేలు అధికారులు తమను తాము తగ్గించుకొని, “యెహోవా న్యాయం గలవాడు” అని ఒప్పుకున్నారు. \p \v 7 వారు అలా తగ్గించుకోవడం యెహోవా చూశారు. కాబట్టి యెహోవా నుండి ఈ వాక్కు షెమయాకు వచ్చింది, “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చెయ్యను. త్వరలో వారిని శిక్షిస్తాను. షీషకు ద్వారా నా కోపాగ్ని యెరూషలేము మీద కుమ్మరించను. \v 8 కాని, నాకు సేవచేయడంలో ఇతర దేశాల రాజులకు సేవచేయడంలో ఉన్న తేడా వారు గ్రహించాలి కాబట్టి వారు షీషకుకు దాసులవుతారు.” \p \v 9 ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చినప్పుడు, అతడు యెహోవా మందిరంలోని నిధిని, రాజభవనంలో నిధిని దోచుకున్నాడు. అతడు సమస్తాన్ని, సొలొమోను చేయించిన బంగారు డాళ్లతో పాటు తీసుకెళ్లాడు. \v 10 కాబట్టి రాజైన రెహబాము ఆ డాళ్లకు బదులు ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల అధిపతులకు అప్పగించాడు. \v 11 రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్లు మోసుకెళ్లేవారు. తర్వాత వాటిని కాపలా గదిలో ఉంచేవారు. \p \v 12 రెహబాము తనను తగ్గించుకున్నందుకు, యూదాలో కొన్ని మంచి విషయాలు కనిపించినందుకు యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేయక, అతని మీద నుండి తన కోపం మళ్ళించుకున్నాడు. \p \v 13 రాజైన రెహబాము యెరూషలేములో సుస్థిరంగా ఉండి రాజుగా పరిపాలిస్తూ వచ్చాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు, రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు. \v 14 రెహబాము యెహోవాను వెదకడం మీద మనస్సు నిలుపుకోలేదు, కాబట్టి చెడుగా ప్రవర్తించేవాడు. \p \v 15 రెహబాము పరిపాలనకు సంబంధించిన విషయాలు, మొదటి నుండి చివరి వరకు షెమయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో దీర్ఘదర్శియైన ఇద్దో వ్రాసిన వంశవృక్షాల విషయమైన గ్రంథంలో వ్రాయబడలేదా? రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది. \v 16 రెహబాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని తన పూర్వికుల దగ్గర సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అబీయా రాజయ్యాడు. \c 13 \s1 యూదా రాజైన అబీయా \p \v 1 యరొబాము పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అబీయా యూదా దేశానికి రాజయ్యాడు. \v 2 అతడు యెరూషలేములో మూడేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి పేరు మయకా;\f + \fr 13:2 \fr*\ft కొ. ప్ర. లలో \ft*\fqa మీకాయా \fqa*\ft అని వాడబడింది; \+xt 11:20\+xt*; \+xt 1 రాజులు 15:2\+xt*\ft*\f* ఈమె గిబియా పట్టణం వాడైన ఊరియేలు కుమార్తె.\f + \fr 13:2 \fr*\ft లేదా \ft*\fqa మనుమరాలు\fqa*\f* \p అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. \v 3 అబీయా నాలుగు లక్షలమంది సమర్థులైన సైనికులతో యుద్ధానికి వెళ్తే, యరొబాము ఎనిమిది లక్షలమంది సమర్థులైన సైనికులతో అతనికి వ్యతిరేకంగా యుద్ధ వ్యూహం రచించాడు. \p \v 4 అబీయా ఎఫ్రాయిం కొండ సీమలో ఉన్న సెమరాయిము కొండమీద నిలబడి ఇలా అన్నాడు, “యరొబామా, సర్వ ఇశ్రాయేలు ప్రజలారా, నేను చెప్పేది వినండి! \v 5 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉప్పు ఒడంబడిక\f + \fr 13:5 \fr*\ft అంటే, ఆహారంలో ఉప్పు అనివార్యమైనది; అలాగే ఒడంబడిక ఉప్పును మార్చలేము.\ft*\f* చేసి, ఇశ్రాయేలు రాజ్యపరిపాలనను శాశ్వతంగా దావీదు వారసులకు ఇచ్చాడు. ఈ సంగతి మీకు తెలియదా? \v 6 అయినాసరే దావీదు కుమారుడైన సొలొమోను సేవకుడును నెబాతు కుమారుడునైన యరొబాము తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. \v 7 సొలొమోను కుమారుడైన రెహబాము యువకుడై నిర్ణయాలు తీసుకోలేనివాడై, వారిని ఎదిరించే శక్తి లేనివానిగా ఉన్నప్పుడు, కొందరు పనికిమాలిన పోకిరీలు అతని చుట్టూ చేరి, అతని మీదికి యుద్ధానికి వెళ్లారు. \p \v 8 “ఇక ఇప్పుడేమో దావీదు వారసుల చేతుల్లో ఉన్న యెహోవా రాజ్యాన్ని ఎదిరించాలని మీరు ఆలోచిస్తున్నారు. నిజానికి మీరు మహా సైన్యంగా ఉన్నారు. మీతో యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు ఉన్నాయి. \v 9 అయితే మీరు అహరోను కుమారులైన యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టి, ఇతర దేశాల ప్రజల్లా మీ సొంత యాజకులను నియమించుకోలేదా? ఒక కోడెతో ఏడు పొట్టేళ్లతో తనను తాను పవిత్రం చేసుకోవడానికి వచ్చిన ప్రతివాడు దేవుళ్ళు కాని వాటికి యాజకులవుతున్నారు. \p \v 10 “మా విషయానికొస్తే యెహోవాయే మా దేవుడు, మేము ఆయనను విడిచిపెట్టలేదు. యెహోవాకు సేవచేసే యాజకులు అహరోను కుమారులు; లేవీయులు వారికి సహాయం చేస్తారు. \v 11 ప్రతి ఉదయం సాయంత్రం వారు యెహోవాకు దహనబలులు అర్పిస్తారు, పరిమళ ధూపం వేస్తారు. వారు ఆచారం ప్రకారం వారు పవిత్రమైన బల్లపై రొట్టెలు పెట్టి, ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభంపై దీపాలను వెలిగిస్తారు. మేము మా దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటిస్తున్నాము. కాని మీరు ఆయనను విడిచిపెట్టారు. \v 12 దేవుడు మాతో ఉన్నారు; ఆయన మా నాయకుడు. ఆయన యాజకులు తమ బూరలతో మీమీద యుద్ధనాదం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వికుల దేవుడైన యెహోవాతో పోరాడకండి, ఎందుకంటే మీరు గెలువలేరు.” \p \v 13 కాని యరొబాము కొంత సైన్యాన్ని వెనుకకు పంపాడు. అతడు యూదా వారికి ముందు ఉన్నప్పుడు మాటుగాండ్రు వారి వెనుక ఉండేలా చేశాడు. \v 14 యూదా వారు, తాము ముందు వెనుక ముట్టడి చేయబడ్డామని తెలుసుకుని యెహోవాకు మొరపెట్టారు. యాజకులు తమ బూరలు ఊదగా, \v 15 యూదా వారు యుద్ధనాదం చేశారు. వారు చేసిన యుద్ధనాదం వినబడడంతోనే దేవుడు అబీయా ఎదుట యూదా వారి ఎదుట యరొబామును ఇశ్రాయేలు సైన్యమంతటిని తరిమివేశారు. \v 16 ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు ఇశ్రాయేలు వారిని యూదా వారి చేతులకు అప్పగించారు. \v 17 అబీయా అతని సేనలు వారికి భారీ ప్రాణనష్టం కలిగించగా ఇశ్రాయేలీయుల సమర్థులలో అయిదు లక్షలమంది సైనికులు మరణించారు. \v 18 ఈ విధంగా ఇశ్రాయేలీయులు అణచివేయబడ్డారు. యూదా ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవాపై ఆధారపడ్డారు కాబట్టి వారు విజయం సాధించారు. \p \v 19 అబీయా యరొబామును వెంటాడి, అతని వశంలో నుండి బేతేలును దాని పట్టణాలను, యెషానాను ఎఫ్రోనునూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకున్నాడు. \v 20 అబీయా రోజుల్లో యరొబాము మళ్ళీ బలపడలేదు. యెహోవా అతన్ని మొత్తాడు కాబట్టి అతడు చనిపోయాడు. \p \v 21 కానీ అబీయా బలాభివృద్ధి చెందాడు. అతడు పద్నాలుగు మంది స్త్రీలను పెళ్ళి చేసుకున్నాడు; అతనికి ఇరవై రెండు మంది కుమారులు, పదహారు మంది కుమార్తెలు. \p \v 22 అబీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు ఏమి చేశాడో ఏమి చెప్పాడో, అవన్నీ ప్రవక్తయైన ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. \c 14 \p \v 1 అబీయా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఆసా రాజయ్యాడు. అతని రోజుల్లో దేశం పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉండింది. \s1 యూదా రాజైన ఆసా \p \v 2 ఆసా యెహోవా దృష్టిలో మంచిది, సరియైనది చేశాడు. \v 3 అతడు ఇతర దేవుళ్ళ బలిపీఠాలను, క్షేత్రాలను తొలగించాడు. అషేరా దేవి స్తంభాలను\f + \fr 14:3 \fr*\ft అంటే, \ft*\fqa అషేరా దేవత యొక్క చెక్క బొమ్మలు; ఇక్కడ 2 దినవృత్తాంతములో వేరే చోట్ల కూడా\fqa*\f* పడగొట్టించాడు. \v 4 అతడు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వారు తెలుసుకొని, ఆయన నియమాలను ఆజ్ఞలను అనుసరించాలని యూదా ప్రజలకు ఆజ్ఞాపించాడు. \v 5 అతడు యూదాలోని ప్రతి పట్టణంలోని ఉన్నత క్షేత్రాలను, ధూపవేదికలను తొలగించాడు. అతని పరిపాలనలో దేశం ప్రశాంతంగా ఉంది. \v 6 దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కట్టించాడు. యెహోవా అతనికి విశ్రాంతి ఇవ్వగా ఆ సంవత్సరాల్లో అతనితో ఎవరూ యుద్ధం చేయలేదు. \p \v 7 ఆసా యూదా వారితో, “మనం యెహోవాను వెదికి అనుసరించాం కాబట్టి ఈ దేశం ఇంకా మన స్వాధీనంలోనే ఉంది. ఆయనను వెదకి అనుసరించాం కాబట్టి మనం ఈ పట్టణాలను కట్టి, వాటికి చుట్టూ గోడలు, గోపురాలు, ద్వారాలు, అడ్డగడియలు అమర్చుదాం” అన్నాడు. అలాగే వారు పట్టణాలను కట్టి వర్థిల్లారు. \p \v 8 ఆసాకు యూదా వారిలో 3,00,000 మంది సైనికులు ఉన్నారు. వారికి పెద్ద డాళ్లు ఈటెలు ఉన్నాయి. అతనికి బెన్యామీనీయులలో 2,80,000 మంది సైనికులున్నారు. వారికి చిన్న డాళ్లు, విల్లులు ఉన్నాయి. వీరంతా పోరాట యోధులు. \p \v 9 తర్వాత కూషు వాడైన జెరహు వేవేల సైన్యంతో, మూడువందల రథాలతో వారిపైకి దండెత్తి మరేషా పట్టణం వరకు వచ్చాడు. \v 10 ఆసా అతన్ని ఎదుర్కోడానికి వెళ్లాడు. వారు మరేషాకు దగ్గరలో ఉన్న జెపాతా లోయలో బారులు తీరారు. \p \v 11 అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు. \p \v 12 ఆసా ఎదుట యూదా వారి ఎదుట యెహోవా కూషువారిని మొత్తగా వారు పారిపోయారు. \v 13 ఆసా, అతనితో ఉన్నవారు వారిని గెరారు వరకు వెంటాడారు. కూషు వారిలో చాలామంది కూలారు, కాబట్టి వారు మళ్ళీ బలాన్ని కూడగట్టుకోలేక యెహోవా ఎదుట ఆయన సైన్యం ఎదుట నుండి పారిపోయారు. యూదా వారు అధిక మొత్తంలో దోపుడుసొమ్ము దోచుకున్నారు. \v 14 గెరారు చుట్టూరా ఉన్న గ్రామాలను యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా వారు వాటన్నిటిని ఓడించి దోచుకొని, చాలా దోపుడుసొమ్ము తీసుకున్నారు. \v 15 వారు పశువుల కాపరుల గుడారాలపై కూడా దాడి చేశారు. అంతేకాదు గొర్రెలు, మేకలు ఒంటెల మందలను కూడా తీసుకెళ్లారు. తర్వాత వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. \c 15 \s1 ఆసా సంస్కరణలు \p \v 1 దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దిగిరాగా, \v 2 అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు. \v 3 ఎందుకంటే చాలా కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుడు గాని, బోధించడానికి యాజకులు గాని, ధర్మశాస్త్రం గాని లేకుండానే గడిపారు. \v 4 అయితే తమ బాధలో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనను వెదికారు. ఆయన వారికి దొరికారు. \v 5 ఆ రోజుల్లో ప్రయాణం చేయడం క్షేమం కాదు, ఎందుకంటే దేశాల వాసులంతా గొప్ప కలవరంలో ఉన్నారు. \v 6 ఒక దేశం మరొక దేశాన్ని, ఒక పట్టణం మరొక నగరాన్ని నాశనం చేసుకుంటున్నాయి, ఎందుకంటే దేవుడు వారిని అన్ని రకాల బాధలతో ఇబ్బంది పెడుతున్నారు. \v 7 అయితే మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఆశ వదులుకోవద్దు, ఎందుకంటే మీ పనికి ప్రతిఫలం లభిస్తుంది.” \p \v 8 ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా విని ధైర్యం తెచ్చుకున్నాడు. యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిం కొండ సీమలో తాను వశం చేసుకున్న పట్టణాల్లో ఉన్న విగ్రహాలను, అసహ్యమైన వాటన్నిటిని తీసివేశాడు. యెహోవా ఆలయ ఆవరణంలో ఉన్న బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించాడు. \p \v 9 అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూసి పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు రాజ్యాన్ని విడచి అతని పక్షం చేరారు. ఆసా తన దగ్గరకు యూదా వారందరినీ బెన్యామీను వారందరినీ వారి మధ్య నివసిస్తున్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారిని సమకూర్చాడు. \p \v 10 ఆసా పరిపాలిస్తున్న పదిహేనో సంవత్సరం మూడవ నెల వారు యెరూషలేములో సమకూడారు. \v 11 ఆ రోజు వారు యెహోవాకు 700 ఎద్దులు, 7,000 గొర్రెలు బలిగా అర్పించారు. ఇవన్నీ వారు దోపిడిగా తీసుకువచ్చిన వాటిలోనివి. \v 12 వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు మనస్పూర్తిగా హృదయపూర్వకంగా వెదికి అనుసరిస్తామని ఒడంబడిక చేశారు. \v 13 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకనివారు స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా చిన్నలైనా, వారికి మరణశిక్ష విధించాలని నిర్ణయించారు. \v 14 వారు కంఠమెత్తి పెద్దగా కేకలువేస్తూ బూరలు, కొమ్ములు ఊదుతూ, యెహోవా సమక్షంలో ప్రమాణం చేశారు. \v 15 ఆ విధంగా యూదా వారంతా హృదయమంతటితో ప్రమాణం చేశారు కాబట్టి ఆ ప్రమాణం విషయం అందరు సంతోషించారు. వారు మనస్పూర్తిగా యెహోవాను వెదికారు. ఆయన వీరికి దొరికాడు. అన్ని దిశలా వారికి నెమ్మదిని ఇచ్చారు. \p \v 16 రాజైన ఆసా అతని అవ్వ మయకా అషేరాను పూజించడానికి ఒక అసహ్యమైన ప్రతిమను చేయించింది కాబట్టి ఆమెను రాజమాత స్థానం నుండి తొలగించాడు. ఆసా ఆ ప్రతిమను కూలగొట్టి విరగ్గొట్టి, కిద్రోను లోయలో దానిని తగలబెట్టాడు. \v 17 అతడు ఇశ్రాయేలు నుండి క్షేత్రాలను మాత్రం తొలగించనప్పటికీ, ఆసా బ్రతికిన కాలమంతా యెహోవాకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. \v 18 అతడు, తాను తన తండ్రి ప్రతిష్ఠించిన బంగారం వెండి పాత్రలను దేవుని ఆలయానికి తెచ్చాడు. \p \v 19 ఆసా పరిపాలనలో ముప్పై అయిదవ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు. \c 16 \s1 ఆసా చివరి సంవత్సరాలు \p \v 1 ఆసా పరిపాలిస్తున్న ముప్పై ఆరవ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు. \p \v 2 అప్పుడు ఆసా యెహోవా మందిరంలో, తన భవనంలో ఉన్న ఖజానాల్లో నుండి వెండి బంగారాలు తీసి దమస్కులో పరిపాలిస్తున్న సిరియా రాజైన బెన్-హదదుకు పంపాడు. \v 3 అతడు, “నా తండ్రికి నీ తండ్రికి మధ్య ఒప్పందం ఉన్నట్లు, నీకు నాకు మధ్య ఒప్పందం ఉండాలి. చూడు, నేను వెండి బంగారాలను పంపిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీ ఒప్పందం తెంచుకో” అని అన్నాడు. \p \v 4 రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్-మయీము, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాలలోని కొట్లను జయించారు. \v 5 బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తన పనిని నిలిపి వేశాడు. \v 6 అప్పుడు రాజైన ఆసా యూదా మనుష్యులందరిని సమకూర్చాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో ఆసా గెబాను, మిస్పాను కట్టించాడు. \p \v 7 ఆ సమయంలో హనానీ అనే దీర్ఘదర్శి యూదా రాజైన ఆసా దగ్గరకు వచ్చి అతనితో ఇలా అన్నాడు, “నీవు నీ దేవుడు యెహోవాపై ఆధారపడక సిరియా రాజు ఆరాముపై ఆధారపడ్డావు. అందుచేతే అరాము రాజు సైన్యం నీ చేతిలో పడకుండా తప్పించుకుంది. \v 8 కూషీయులు లిబియానీయులు మహా సైన్యంగా చాలా రథాలలో రౌతులతో వచ్చారు గదా! అయినా, నీవు యెహోవాపై ఆధారపడినందున ఆయన వారిని నీ వశం చేశాడు. \v 9 తన పట్ల యథార్థంగా హృదయం ఉన్నవారికి సాయం చేయడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఆ విషయంలో నీవు తెలివితక్కువగా ప్రవర్తించావు. ఇకనుండి నీకు ఎప్పుడూ యుద్ధాలే.” \p \v 10 ఆసాకు ఆ దీర్ఘదర్శిమీద కోపం వచ్చి అతని మీద మండిపడి ఖైదులో వేశాడు. ఆ సమయంలో ప్రజల్లో కొందరిని ఆసా అణచివేశాడు. \p \v 11 ఆసా పరిపాలన గురించిన విషయాలు మొదటి నుండి చివరి వరకు యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. \v 12 ఆసా పరిపాలిస్తున్న ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానివలన అతడు చాలా బాధ పడినా దాని గురించి కూడా యెహోవాను వెదకలేదు గాని వైద్యులను సహాయం కోరాడు. \v 13 తాను పరిపాలిస్తున్న నలభై ఒకటో సంవత్సరంలో ఆసా నిద్రపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. \v 14 తన కోసం అతడు దావీదు పట్టణంలో తొలిపించుకొన్న సమాధిలో ప్రజలు అతన్ని పాతిపెట్టారు. సుగంధ ద్రవ్యాలతో, రకరకాల పరిమళాలతో నిండిన పాడెమీద అతన్ని ఉంచి, అతని అంత్యక్రియలు ఘనంగా జరిగించారు. \c 17 \s1 యూదా రాజైన యెహోషాపాతు \p \v 1 ఆసా స్థానంలో అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తనను తాను బలపరచుకున్నాడు. \v 2 కోటగోడలు గల యూదా పట్టణాలన్నిటిలో అతడు సైన్యాలను ఉంచాడు. యూదాలోనూ, తన తండ్రి ఆసా పట్టుకున్న ఎఫ్రాయిం ప్రాంత పట్టణాల్లోనూ రక్షక దళాలను ఏర్పాటు చేశాడు. \p \v 3 యెహోషాపాతు తన పితరుడైన దావీదు ఆరంభ దినాల్లో అనుసరించిన విధానాలను అనుసరించాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయలును అనుసరించలేదు. \v 4 అతడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు చేయక తన తండ్రి యొక్క దేవున్ని వెదికి, ఆయన ఆజ్ఞలు అనుసరించాడు. \v 5 కాబట్టి యెహోవా అతని ఆధీనంలో రాజ్యాన్ని సుస్థిరం చేశారు. యూదా ప్రజలంతా యెహోషాపాతుకు పన్ను చెల్లిస్తూ ఉండేవారు కాబట్టి అతనికి ఎంతో గౌరవం, ఐశ్వర్యం చేకూరాయి. \v 6 యెహోవా మార్గాల్లో నడవాలని అతడు తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. అతడు క్షేత్రాలను అషేరా స్తంభాలను యూదా దేశంలో లేకుండా తొలగించాడు. \p \v 7 తాను పరిపాలిస్తున్న మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్-హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే నాయకులను పంపాడు. \v 8 వారితో పాటు షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబీయా, టోబ్-అదోనియా అనే లేవీయులను యాజకులైన ఎలీషామా, యెహోరాము అనే వారిని పంపాడు. \v 9 వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేతపట్టుకుని యూదా అంతటా బోధించారు. వారు యూదాపట్టణాలన్నిటికి సంచారం చేస్తూ ప్రజలకు బోధించారు. \p \v 10 యూదా చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి అవి యెహోషాపాతుపై యుద్ధం చేయలేదు. \v 11 ఫిలిష్తీయులలో కొంతమంది యెహోషాపాతుకు కానుకలు, పన్నుగా వెండిని తెచ్చేవారు. అరబీయులు అతనికి 7,700 పొట్టేళ్లు, 7,700 మేకపోతులు తెచ్చేవారు. \p \v 12 యెహోషాపాతు అధికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అతడు యూదాలో కోటలు, సామాగ్రి నిల్వజేసే గిడ్డంగుల పట్టణాలు కట్టించాడు. \v 13 యూదా పట్టణాల్లో అతనికి చాలా సంపద చేకూరింది. అతని దగ్గర యెరూషలేములో అనుభవం కలిగిన పోరాట వీరులున్నారు. \v 14 వారి పూర్వికుల వంశాల ప్రకారం వారి సంఖ్య ఇలా ఉంది: \b \li1 యూదా గోత్రాల్లో వేయిమందికి అధిపతులుగా ఉన్నవారికి అద్నా అనేవాడు సేనాధిపతి: \li2 అతనితో 3,00,000 మంది యుద్ధవీరులున్నారు, \li2 \v 15 తర్వాత సేనాధిపతియైన యెహోహనాను, అతనితో 2,80,000 మంది ఉన్నారు, \li2 \v 16 తర్వాత, జిఖ్రీ కుమారుడు అమస్యా. అతడు యెహోవాకు హృదయపూర్వకంగా సమర్పించుకున్నవాడు. అతనితో 2,00,000 మంది యుద్ధవీరులున్నారు. \li1 \v 17 బెన్యామీను గోత్రంలో: \li2 ఎల్యాదా అనే యుద్ధవీరుడు ఉండేవాడు. అతనితో విల్లు, డాలు పట్టుకునేవారు 2,00,000 మంది ఉన్నారు, \li2 \v 18 తర్వాత, యెహోజాబాదు, అతనితో 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు. \b \m \v 19 వీరంతా రాజుకు కొలువు చేసినవారు. వీరు కాక రాజు యూదా అంతటా కోటగోడలు గల పట్టణాల్లో కొంతమందిని ఉంచాడు. \c 18 \s1 మీకాయా అహాబుకు వ్యతిరేకంగా ప్రవచించుట \p \v 1 యెహోషాపాతుకు ఎంతో ఐశ్వర్యం, ఘనత ఉన్నాయి. అతడు అహాబుతో వియ్యమందాడు. \v 2 కొన్ని సంవత్సరాల తర్వాత అతడు సమరయలో అహాబును సందర్శించడానికి వెళ్లాడు. అహాబు అతని కోసం, అతని వెంట వచ్చిన వారి కోసం చాలా గొర్రెలు, పశువులు వధించి, ఆపైన రామోత్ గిలాదుపై దాడి చేయమని అతన్ని ప్రేరేపించాడు. \v 3 ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును, “నాతో కూడా రామోత్ గిలాదు మీదికి వస్తావా?” అని అడిగాడు. \p అందుకు యెహోషాపాతు, “నేను మీవాన్ని, నా ప్రజలు మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు; మేము మీతో యుద్ధంలో పాల్గొంటాం” అని జవాబిచ్చాడు. \v 4 అయితే యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “మొదట యెహోవా సలహాను తీసుకుందాం” అని కూడా అన్నాడు. \p \v 5 కాబట్టి ఇశ్రాయేలు రాజు సుమారు నాలుగువందలమంది ప్రవక్తలను పిలిపించి, “నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? వద్దా?” అని వారిని అడిగాడు. \p “వెళ్లండి! దానిని యెహోవా రాజు వశం చేస్తారు” అని వారు జవాబిచ్చారు. \p \v 6 అయితే యెహోషాపాతు, “మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఒక్కడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు. \p \v 7 అందుకు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు. కాని, నాకు అతడంటే అయిష్టం, ఎందుకంటే అతడు నా గురించి ఎప్పుడూ మంచిని ప్రవచించడు, ఎప్పుడూ చెడ్డగానే ప్రవచిస్తాడు. అతడు ఇమ్లా కుమారుడైన మీకాయా” అని చెప్పాడు. \p అందుకు యెహోషాపాతు, “రాజా మీరు అలా అనవద్దు” అన్నాడు. \p \v 8 అప్పుడు ఇశ్రాయేలు రాజు తన అధికారులలో ఒకరిని పిలిచి, “వెంటనే వెళ్లి, ఇమ్లా కుమారుడైన మీకాయాను తీసుకురా” అని చెప్పాడు. \p \v 9 ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని సమరయ నగర ద్వారం దగ్గర ఉన్న నూర్పిడి కళ్ళం దగ్గరలో ప్రవక్తలంతా ప్రవచిస్తూ ఉండగా, తమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. \v 10 అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేసుకుని వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘అరామీయులు నాశనమయ్యే వరకు మీరు వీటితో వారిని పొడుస్తారు’ ” అని చెప్పాడు. \p \v 11 ఇతర ప్రవక్తలంతా కూడా అదే విషయాన్ని ప్రవచించారు. “రామోత్ గిలాదు మీద దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తారు” అని వారన్నారు. \p \v 12 మీకాయాను పిలువడానికి వెళ్లిన దూత మీకాయాతో, “చూడు, ఇతర ప్రవక్తలందరు రాజుకు విజయం కలుగుతుందని చెప్తున్నారు. వారి మాటతో నీ మాట ఏకమై, అనుకూలంగా పలుకాలి” అన్నాడు. \p \v 13 అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు. \p \v 14 అతడు వచ్చినప్పుడు, రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా, వెళ్లొద్దా?” అని అడిగాడు. \p అందుకతడు, “దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే వారు మీ చేతికి అప్పగించబడతారు” అని జవాబిచ్చాడు. \p \v 15 రాజు అతనితో, “యెహోవా పేరిట నాకు సత్యమే చెప్పమని నేనెన్నిసార్లు నీ చేత ప్రమాణం చేయించాలి?” అని అన్నాడు. \p \v 16 అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు. \p \v 17 ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “నా గురించి ఇతడు ఎన్నడు మంచిని ప్రవచించడు, చెడు మాత్రమే ప్రవచిస్తాడు అని మీతో చెప్పలేదా?” అని అన్నాడు. \p \v 18 మీకాయా ఇంకా ఇలా అన్నాడు, “కాబట్టి యెహోవా మాట వినండి: యెహోవా తన సింహాసనంపై కూర్చుని ఉండగా తన కుడి ఎడమలు పరలోక సమూహాలన్ని నిలబడి ఉండడం నేను చూశాను. \v 19 అప్పుడు యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు. \p “ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు. \v 20 చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి, యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు. \p “ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు. \p \v 21 “ ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరి నోట మోసగించే ఆత్మగా ఉంటాను’ అని అతడు చెప్పాడు. \p “అందుకు యెహోవా, ‘నీవు అతన్ని ప్రలోభపెట్టడంలో విజయం సాధిస్తావు, వెళ్లు అలాగే చేయి’ అన్నారు. \p \v 22 “కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తల నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.” \p \v 23 అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టాడు. “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా నుండి వెళ్లినప్పుడు ఏ మార్గాన వెళ్లాడు?” అని అతడు అడిగాడు. \p \v 24 మీకాయా జవాబిస్తూ, “నీవు దాక్కోడానికి లోపలి గదిలోకి చొరబడే రోజున నీవు తెలుసుకుంటావు” అన్నాడు. \p \v 25 అప్పుడు ఇశ్రాయేలు రాజు, “మీకాయాను నగర పాలకుడైన ఆమోను దగ్గరకు, అలాగే రాకుమారుడైన యోవాషు దగ్గరకు తీసుకెళ్లి, \v 26 వారితో ఇలా చెప్పండి, ‘రాజు ఇలా అన్నారు: నేను క్షేమంగా తిరిగి వచ్చేవరకు, ఇతన్ని చెరసాలలో ఉంచి అతనికి రొట్టె, నీరు తప్ప ఏమి ఇవ్వకండి’ ” అని ఆదేశించాడు. \p \v 27 మీకాయా, “ఒకవేళ మీరు క్షేమంగా వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడలేదని అర్థం. ప్రజలారా, మీరంతా నా మాట గుర్తు పెట్టుకోండి!” అని ప్రకటించాడు. \s1 రామోత్ గిలాదు దగ్గర అహాబు మరణం \p \v 28 కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు. \v 29 ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలో ప్రవేశించేటప్పుడు నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, మీరు మాత్రం మీ రాజవస్త్రాలు ధరించుకోండి” అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్లాడు. \p \v 30 సిరియా రాజు తన రథాధిపతులకు, “మీరు ఇశ్రాయేలు రాజు ఒక్కనితో తప్ప, చిన్నవారితో గాని గొప్పవారితో గాని యుద్ధం చేయకూడదు” అని ఆదేశించాడు. \v 31 అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూసి, “ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని అతనిపై దాడి చేయడానికి అతని మీదికి రాగా యెహోషాపాతు బిగ్గరగా కేక వేశాడు. అప్పుడు యెహోవా అతనికి సహాయం చేశారు. దేవుడే వారిని అతని దగ్గర నుండి తరిమివేశారు. \v 32 ఎలాగంటే, అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని వారు అతన్ని తరమడం ఆపివేశారు. \p \v 33 అయితే ఎవడో ఒకడు విల్లెక్కుపెట్టి బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు. \v 34 రోజంతా హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు రాజు సాయంత్రం వరకు అరామీయులకు ఎదురుగా తన రథాన్ని ఆసరాగా చేసుకున్నాడు. సూర్యాస్తమయ సమయంలో అతడు చనిపోయాడు. \c 19 \p \v 1 యూదా రాజైన యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములో తన భవనానికి తిరిగి వస్తున్నప్పుడు, \v 2 హనానీ కుమారుడు, దీర్ఘదర్శియైన యెహు అతన్ని కలుసుకోడానికి వెళ్లి రాజైన యెహోషాపాతుతో, “మీరు దుర్మార్గులకు సహాయం చేస్తూ యెహోవాను ద్వేషించేవారిని ప్రేమిస్తారా?\f + \fr 19:2 \fr*\ft లేదా \ft*\fqa జత కడతారా?\fqa*\f* యెహోవాకు మీమీద కోపం వచ్చింది. \v 3 అయితే మీలో కొంత మంచి కూడా ఉంది, మీరు దేశం నుండి అషేరా స్తంభాలను తొలగించి, యెహోవాను వెదికి ఆయనను అనుసరించడానికి హృదయపూర్వకంగా నిశ్చయించుకున్నారు” అని అన్నాడు. \s1 యెహోషాపాతు న్యాయాధిపతులను నియమించుట \p \v 4 యెహోషాపాతు యెరూషలేములో ఉంటూ, బెయేర్షేబ నుండి ఎఫ్రాయిం కొండసీమవరకు ప్రజల మధ్యకు వెళ్లి వారిని మరల వారి పూర్వికుల దేవుడైన యెహోవా వైపుకు త్రిప్పాడు. \v 5 యూదా దేశంలో కోటగోడలు గల అన్ని పట్టణాల్లో అతడు న్యాయాధిపతులను నియమించాడు. \v 6 అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే మీరు కేవలం మనుష్యుల కోసం కాదు, మీరు ఎప్పుడు తీర్పు ఇచ్చినా మీకు తోడుగా ఉన్న యెహోవా కోసం తీర్పు ఇస్తున్నారు. \v 7 యెహోవా భయం మీమీద ఉండాలి. జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా అన్యాయం చేయరు, పక్షపాతం చూపించరు, లంచం తీసుకోరు.” \p \v 8 యెహోషాపాతు, యెరూషలేములో కూడా కొంతమంది లేవీయులను, యాజకులను ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దలను యెహోవా ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, వివాదాలను పరిష్కరించడానికి నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు. \v 9 అతడు వారికి ఈ ఆజ్ఞలు జారీ చేశాడు: “యెహోవాయందు భయం కలిగి, మీరు నమ్మకంగా యధార్థహృదయంతో సేవ చేయాలి. \v 10 పట్టణాల్లో నివసించే మీ ప్రజలు మీ దగ్గరకు తెచ్చే ప్రతి ఫిర్యాదు అంటే అది హత్యకు సంబంధించినవైనా లేదా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, శాసనాలు, నిబంధనలకు సంబంధించిన ఇతర విషయాలైనా, వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పాపం చేయవద్దని మీరు వారిని హెచ్చరించాలి; లేకపోతే ఆయన కోపం మీ మీదికి మీ ప్రజలమీదికి వస్తుంది. ఇలా చేస్తే, మీరు అపరాధులు కారు. \p \v 11 “యెహోవాకు సంబంధించిన ప్రతి విషయంలోను ముఖ్య యాజకుడైన అమర్యా మీమీద అధికారిగా ఉంటాడు, అలాగే రాజుకు సంబంధించిన ప్రతి విషయంలోను యూదా గోత్ర నాయకుడు ఇష్మాయేలు కుమారుడైన జెబద్యా మీమీద అధికారిగా ఉంటాడు, లేవీయులు మీ ఎదుట అధికారులుగా ఉండి సేవ చేస్తారు. ధైర్యంగా ఉండండి, మంచిని జరిగించే వారికి యెహోవా తోడుగా ఉండును గాక.” \c 20 \s1 యెహోషాపాతు మోయాబును అమ్మోనును ఓడించుట \p \v 1 ఇలా జరిగాక మోయాబీయులు, అమ్మోనీయులు మెయునీయులలో\f + \fr 20:1 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa అమ్మోనీయులు\fqa*\f* కొందరితో కలిసి యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి వచ్చారు. \p \v 2 కొంతమంది మనుష్యులు వచ్చి యెహోషాపాతుతో, “మృత సముద్రం అవతలి వైపున ఉన్న ఎదోము\f + \fr 20:2 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa అరాము\fqa*\f* నుండి గొప్ప సైన్యం మీ మీదికి వస్తూ ఉంది. వారు ఇప్పటికే హససోన్ తామారులో (అనగా ఎన్-గేదీ) ఉన్నారు” అని చెప్పారు. \v 3 యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారణ చేద్దామని నిశ్చయించుకున్నాడు, అంతేగాక యూదా ప్రజలంతా ఉపవాసం ఉండాలని ప్రకటన చేయించాడు. \v 4 సాయం చేయమని యెహోవాను ప్రాధేయపడడానికి యూదా ప్రజలంతా సమకూడారు; ఆయనను సహాయం అడగడానికి యూదాలోని ప్రతి పట్టణం నుండి ప్రజలు వచ్చారు. \p \v 5 అప్పుడు యెహోషాపాతు యూదా, యెరూషలేము సమాజంలో క్రొత్త ప్రాంగణం ముందు ఉన్న యెహోవా మందిరంలో నిలబడి, \v 6 ఇలా ప్రార్థించాడు: \pm “యెహోవా మా పూర్వికుల దేవా, పరలోకంలో ఉన్న దేవుడు మీరు కాదా? మీరు ప్రజల రాజ్యాలన్నిటినీ పరిపాలిస్తున్నారు. బలప్రభావాలు మీ చేతిలో ఉన్నాయి, మీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు. \v 7 మా దేవా! మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశంలో కాపురమున్న వారిని మీరు వెళ్లగొట్టి, మీ స్నేహితుడైన అబ్రాహాము వారసులకు శాశ్వతంగా ఈ దేశాన్ని ఇవ్వలేదా? \v 8 వారు ఇక్కడ నివాసముండి మీ పేరట ఇక్కడ పరిశుద్ధాలయం కట్టారు. \v 9 వారు, ‘ఒకవేళ మా మీదికి విపత్తుగానీ, తీర్పు అనే ఖడ్గమే గాని తెగులే గాని కరువే గాని వస్తే మీ నామం కలిగిన ఈ మందిరం ముందు మేము మీ సన్నిధిలో నిలబడి మా ఆపదలో మీకు మొరపెడితే మీరు మా మొర విని మమ్మల్ని రక్షిస్తారు’ అన్నారు. \pm \v 10 “అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు వారిని అమ్మోను, మోయాబు, శేయీరు పర్వతం నుండి వచ్చిన వారితో యుద్ధం చేయడానికి మీరు అనుమతించలేదు; కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి నుండి వెళ్లిపోయారు. \v 11 మీరు మాకు వారసత్వంగా ఇచ్చిన స్వాస్థ్యం నుండి వారు మమ్మల్ని తోలివేయడానికి వచ్చి వారు మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి. \v 12 మా దేవా, మీరు వారికి తీర్పు తీర్చరా? ఎందుకంటే మాపై దాడి చేస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదు. ఏం చేయాలో మాకు తెలియదు, కానీ మీ సహాయం కోసమే చూస్తున్నాము.” \p \v 13 యూదా వారంతా తమ భార్యాపిల్లలు, పసివారితో సహా అక్కడ యెహోవా ముందు నిలబడి ఉన్నారు. \p \v 14 అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు పుట్టిన జెకర్యా కుమారుడును లేవీయుడునైన ఆసాపు సంతతివాడైన యహజీయేలు మీదికి యెహోవా ఆత్మ వచ్చాడు. \p \v 15 అప్పుడు యహాజీయేలు ఇలా ప్రకటించాడు: “యెహోషాపాతు రాజా, యూదా యెరూషలేము నివాసులారా మీరందరు వినండి! యెహోవా మీతో చెప్పే మాట ఇదే: ‘ఈ మహా సైన్యాన్ని చూసి భయపడకండి, నిరుత్సాహపడకండి. ఎందుకంటే యుద్ధం మీది కాదు, దేవునిది. \v 16 రేపు వారిని ఎదుర్కోడానికి వెళ్లండి. వారు జీజు ఎగువ దారిన వస్తూ ఉంటారు, మీరు వారిని యెరుయేలు ఎడారిలో కొండగట్టు చివరిలో కనుగొంటారు. \v 17 అయితే ఈ యుద్ధంలో మీరు పోరాడనవసరం ఉండదు. మీరు మీ స్థలాల్లో నిలబడి ఉండండి; యెహోవా మీకిచ్చే విడుదలను మీరు నిలబడి చూడండి. యూదా, యెరూషలేమా, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. రేపు వారిని ఎదుర్కోడానికి వెళ్లండి. యెహోవా మీతో ఉంటారు.’ ” \p \v 18 అప్పుడు యెహోషాపాతు నేలకు సాష్టాంగపడి నమస్కరించాడు; యూదా, యెరూషలేము ప్రజలందరూ యెహోవా సన్నిధిలో ఆరాధించారు. \v 19 కహాతు వంశానికి, కోరహీయుల వంశానికి చెందిన లేవీయులు కొందరు లేచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను పెద్ద స్వరంతో స్తుతించారు. \p \v 20 తెల్లవారుజామున వారు తెకోవా ఎడారికి బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు, యెహోషాపాతు నిలబడి, “యూదా, యెరూషలేము ప్రజలారా, నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడతారు; అతని ప్రవక్తలపై విశ్వాసముంచండి, మీరు విజయం సాధిస్తారు” \v 21 ప్రజలతో మాట్లాడిన తర్వాత యెహోషాపాతు, యెహోవాకు ఇలా పాడటానికి, ఆయన పవిత్రత యొక్క వైభవాన్ని స్తుతించడానికి మనుష్యులను నియమించాడు, వారు సైన్యానికి ముందుగా నడిచారు: \q1 “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, \q2 ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.” \p \v 22 వారు అలా పాటలు పాడడం, స్తుతించడం మొదలుపెట్టినప్పుడు యెహోవా యూదా వారి మీద దండెత్తుతున్న అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు కొండసీమవారి మీదా మాటుగాండ్రు ఉండేలా చేశారు. కాబట్టి వారు ఓడిపోయారు. \v 23 ఎలాగంటే, అమ్మోనీయులు, మోయాబీయులు శేయీరు కొండసీమవారి మీద దాడి చేసి వారిని హతమార్చి నాశనం చేశారు. శేయీరు కొండసీమవారిని హతమార్చిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. \p \v 24 యూదా మనుష్యులు ఎడారి వైపున ఉన్న ప్రదేశానికి వచ్చి విస్తారమైన సైన్యం వైపు చూసినప్పుడు, వారికి నేలమీద పడి ఉన్న మృతదేహాలు మాత్రమే కనిపించాయి; ఎవరూ తప్పించుకోలేదు. \v 25 కాబట్టి యెహోషాపాతు అతని మనుష్యులు వారి దోపుడుసొమ్మును దోచుకోవడానికి వెళ్లి, అక్కడ వారి మధ్య చాలా సామాగ్రి, వస్త్రాలు విలువైన వస్తువులు ఉండడం చూశారు. అవి వారు మోయలేనంతగా ఉన్నాయి. ఆ వస్తువులన్నీ పోగుచేయడానికి మూడు రోజులు పట్టింది. \v 26 నాలుగో రోజు వారు బెరాకా\f + \fr 20:26 \fr*\ft బెరాకా \ft*\ft అంటే \ft*\fqa స్తుతి\fqa*\f* లోయలో సమకూడి యెహోవాను స్తుతించారు. అందుకే ఆ చోటు నేటి వరకు బెరాకాలోయ అని పిలువబడుతుంది. \p \v 27 అప్పుడు, యెహోషాపాతు నేతృత్వంలో, యూదా యెరూషలేము ప్రజలందరూ సంతోషంగా యెరూషలేముకు తిరిగి వచ్చారు, ఎందుకంటే వారి శత్రువులపై యెహోవా వారికి విజయాన్ని ఇచ్చారు. \v 28 వారు యెరూషలేములో ప్రవేశించి, రకరకాల సితార వీణలతో, బూరలతో యెహోవా ఆలయానికి చేరుకున్నారు. \p \v 29 ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా ఎలా పోరాడారో విన్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ దేవుని భయం కలిగింది. \v 30 యెహోషాపాతు రాజ్యం సమాధానంతో ఉంది, ఎందుకంటే యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి అన్నివైపులా విశ్రాంతి ఇచ్చారు. \s1 యెహోషాపాతు పాలన యొక్క ముగింపు \p \v 31 యెహోషాపాతు యూదాను పరిపాలించాడు. అతడు యూదాకు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు.అతడు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె. \v 32 అతడు తన తండ్రి ఆసా విధానాలను అనుసరించాడు, వాటినుండి తొలగిపోలేదు; అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. \v 33 అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు తమ పూర్వికుల దేవుని అనుసరించాలని హృదయపూర్వకంగా ఇంకా నిశ్చయించుకోలేదు. \p \v 34 యెహోషాపాతు పరిపాలన గురించిన ఇతర విషయాలు, మొదటి నుండి చివరి వరకు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదు చేయబడిన హనానీ కుమారుడైన యెహు చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. \p \v 35 తర్వాత యూదా రాజైన యెహోషాపాతు, దుష్ట మార్గాల్లో నడిచే ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో సంధి చేసుకున్నాడు. \v 36 అతడు తర్షీషు ఓడలను నిర్మించడానికి అతనితో అంగీకరించాడు. ఎసోన్-గెబెరు దగ్గర అవి నిర్మించబడిన తర్వాత, \v 37 మరేషాకు చెందిన దోదవహు కుమారుడైన ఎలీయెజెరు యెహోషాపాతుకు వ్యతిరేకంగా, “నీవు అహజ్యాతో పొత్తు పెట్టుకున్నావు కాబట్టి, నీవు చేసిన దాన్ని యెహోవా నాశనం చేస్తారు” అని ప్రవచించాడు. ఓడలు బద్దలయ్యాయి, వాణిజ్యానికి తర్షీషుకు వెళ్లలేకపోయాయి. \c 21 \p \v 1 తర్వాత యెహోషాపాతు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు. \v 2 వీరు యెహోరాము సహోదరులు, అంటే యెహోషాపాతు కుమారులు: అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్యా. వీరంతా ఇశ్రాయేలు\f + \fr 21:2 \fr*\ft ఇది, తరచుగా 2 దినవృత్తాంతములో యూదా అని వాడబడింది.\ft*\f* రాజైన యెహోషాపాతు కుమారులు. \v 3 వారి తండ్రి వారికి అనేక వెండి, బంగారం విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చాడు, వాటితో పాటు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కూడా ఇచ్చాడు. అయితే యెహోరాము తనకు ప్రథమ పుత్రుడు, కాబట్టి అతనికి రాజ్యం ఇచ్చాడు. \s1 యూదా రాజైన యెహోరాము \p \v 4 యెహోరాము తన తండ్రి రాజ్యం మీద తన పరిపాలనను సుస్థిరం చేసుకున్న తర్వాత అతడు తన సోదరులందరినీ, ఇశ్రాయేలు అధికారులలో కొందరిని ఖడ్గంతో చంపేశాడు. \v 5 యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు. \v 6 అతడు అహాబు కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు, కాబట్టి అహాబు ఇంటివారిలా ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు. యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. \v 7 అయినప్పటికీ, యెహోవా దావీదుతో చేసిన ఒడంబడిక కారణంగా, దావీదు ఇంటిని నాశనం చేయడానికి యెహోవా ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం\f + \fr 21:7 \fr*\ft ఇక్కడ \ft*\fq దీపం \fq*\ft రూపకం, \ft*\fqa దావీదు యొక్క రాజవంశానికి ప్రతీక.\fqa*\f* ఎల్లప్పుడు వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు. \p \v 8 యెహోరాము కాలంలో, ఎదోమీయులు యూదాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ సొంత రాజును నియమించుకున్నారు. \v 9 కాబట్టి యెహోరాము తన సేనాధిపతులతో రథాలన్నిటితో అక్కడికి వెళ్లాడు. ఎదోమీయులు అతన్ని, అతని రథసారధులను చుట్టుముట్టారు, కాని అతడు రాత్రిలో లేచి వారిపై దాడి చేశాడు. \v 10 ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది. \p అదే సమయంలో లిబ్నా తిరుగబడింది, ఎందుకంటే యెహోరాము తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు. \v 11 అంతే కాదు, అతడు యూదా కొండల పైన క్షేత్రాలను కట్టించి, యెరూషలేము ప్రజలను వ్యభిచారుల్లా ప్రవర్తించేలా చేశాడు, యూదావారిని తప్పుత్రోవ పట్టించాడు. \p \v 12 అప్పుడు యెహోరాముకు ప్రవక్తయైన ఏలీయా నుండి ఈ లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది: \pm “మీ తండ్రియైన దావీదుకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నీవు నీ తండ్రియైన యెహోషాపాతు జీవిత విధానాలను యూదా రాజైన ఆసా జీవిత విధానాలను అనుసరించలేదు. \v 13 అయితే నీవు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించి, అహాబు ఇంటివారు చేసినట్లుగా, నీవు యూదా వారిని, యెరూషలేము వారిని వ్యభిచరించేలా చేశావు. నీవు నీ సొంత సోదరులను, నీ సొంత కుటుంబ సభ్యులను, నీ కంటే మెరుగైన పురుషులను కూడా హత్య చేశావు. \v 14 కాబట్టి గొప్ప తెగులుతో నీ ప్రజలను, నీ కుమారులను, భార్యలను, నీకు చెందినదంతటిని యెహోవా దెబ్బతో కొడతారు. \v 15 మీరు ప్రేగులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో అనారోగ్యం పాలవుతారు, ఆ వ్యాధిని బట్టి మీ ప్రేగులు జారిపోతాయి.’ ” \p \v 16 యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కూషీయులకు దగ్గరలో ఉన్న అరబీయులను పురికొల్పారు. \v 17 వారు యూదా పైకి దండెత్తివచ్చి, రాజభవనంలో ఉన్న వస్తువులన్నిటిని, అతని కుమారులను భార్యలను తీసుకెళ్లారు. అతని కుమారులలో చిన్నవాడైన యెహోయాహాజు\f + \fr 21:17 \fr*\ft హెబ్రీలో \ft*\fqa అహజ్యా \fqa*\ft ఇది మరో పేరు\ft*\f* ఒక్కడే మిగిలాడు. \p \v 18 ఇదంతా జరిగాక, యెహోవా యెహోరామును ప్రేగులలో నయంకాని జబ్బుతో మొత్తారు. \v 19 రోజు రోజుకు జబ్బు ఎక్కువవుతూ వచ్చింది. రెండేళ్ళ తర్వాత ఆ జబ్బువలన అతని ప్రేగులు బయటకు వచ్చాయి. మహాబాధతో అతడు చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వికులకు చేసినట్టు అతనికి అంత్యక్రియలు జరిగించలేదు. \p \v 20 యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలిస్తూ ఉండగా చనిపోయాడు అతని మృతికి ఎవరూ విచారపడలేదు. రాజుల సమాధుల్లో కాకుండ దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. \c 22 \s1 యూదా రాజైన అహజ్యా \p \v 1 యెరూషలేము ప్రజలు అతని స్థానంలో యెహోరాము చిన్న కుమారుడైన అహజ్యాను రాజుగా చేశారు, ఎందుకంటే అరబీయులతో పాటు శిబిరంలోకి వచ్చిన దోపిడి మూకలు పెద్ద కుమారులందరిని చంపారు. కాబట్టి యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలడం ప్రారంభించాడు. \p \v 2 అహజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు\f + \fr 22:2 \fr*\ft హెబ్రీలో \ft*\fqa నలభై రెండు \fqa*\ft అలాగే \+xt 2 రాజులు 8:26\+xt*\ft*\f* సంవత్సరాలు అతడు యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు, అతని తల్లి పేరు అతల్యా ఆమె ఒమ్రీ మనుమరాలు. \p \v 3 అతని తల్లి అతనికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది కాబట్టి అతడు కూడా అహాబు ఇంటివారి మార్గాలను అనుసరించాడు. \v 4 అహాబు కుటుంబంలా అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఎందుకంటే అతని తండ్రి చనిపోయిన తర్వాత వారు అతనికి సలహాదారులయ్యారు. ఇది అతని పతనానికి కారణమైంది. \v 5 ఇశ్రాయేలు రాజైన అహాబు కుమారుడైన యోరాముతో\f + \fr 22:5 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యెహోరాము\fqa*\f* కలిసి అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లినప్పుడు కూడా అతడు వారి సలహాను పాటించాడు. అరామీయులు యోరామును గాయపరిచారు; \v 6 కాబట్టి అతడు రామోతు\f + \fr 22:6 \fr*\ft హెబ్రీలో దీనిని \ft*\fqa రామా \fqa*\ft అని కూడా అంటారు\ft*\f* దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. \p అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా,\f + \fr 22:6 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa అజర్యా \fqa*\ft అని వాడబడింది; \+xt 2 రాజులు 8:29\+xt*\ft*\f* గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు. \p \v 7 అహజ్యా యోరామును దర్శించడం ద్వారా దేవుడు అహజ్యాను పతనానికి తెచ్చారు. అహజ్యా చేరుకున్నప్పుడు, అహాబు ఇంటిని నాశనం చేయడానికి యెహోవా అభిషేకించిన నిమ్షీ కుమారుడైన యెహు మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్లాడు. \v 8 యెహు అహాబు ఇంటిపై తీర్పును అమలు చేస్తున్నప్పుడు, అతడు యూదా అధికారులను, అహజ్యాకు సేవ చేస్తున్న అహజ్యా బంధువుల కుమారులను చూసి వారిని చంపాడు. \v 9 తర్వాత అతడు అహజ్యాను వెదకడానికి వెళ్లాడు. అహజ్యా సమరయలో దాక్కుని ఉండగా యెహు మనుష్యులు అతన్ని పట్టుకున్నారు. వారు అతన్ని యెహు దగ్గరకు తీసుకువచ్చి చంపారు. వారు, “ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికిన యెహోషాపాతు సంతానంలో ఒకడు” అని అంటూ అతన్ని సమాధి చేశారు. ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలించే సామర్థ్యంగల వాడెవడూ అహజ్యా కుటుంబంలో మిగల్లేదు. \s1 అతల్యా యోవాషు \p \v 10 అహజ్యా తల్లి అతల్యా తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని ఆమె యూదా రాజకుటుంబం వారందరినీ నాశనం చేయడానికి పూనుకుంది. \v 11 కాని, రాజైన యెహోరాము కుమార్తెయైన యెహోషేబ\f + \fr 22:11 \fr*\ft హెబ్రీలో దీనికి మరో రూపం \ft*\fqa యెహోషబేతు\fqa*\f* అహజ్యా కుమారుడైన యోవాషును, చావవలసిన రాకుమారుల నుండి రహస్యంగా తప్పించి అతన్ని, అతని దాదిని ఒక పడకగదిలో ఉంచింది. రాజైన యెహోరాము కుమార్తె, యాజకుడైన యెహోయాదా భార్యయైన ఈ యెహోషేబ అహజ్యాకు సోదరి కాబట్టి ఆ పసివాన్ని అతల్యా నుండి దాచిపెట్టింది; కాబట్టి అతడు చంపబడలేదు. \v 12 అతల్యా దేశాన్ని పరిపాలించే కాలంలో అతడు ఆరేళ్ళు దేవుని మందిరంలో వారితో దాక్కుని ఉన్నాడు. \c 23 \p \v 1 ఏడవ సంవత్సరంలో యెహోయాదా తనను బలపరచుకొని యెరోహాము కుమారుడైన అజర్యా, యెహోహనాను కుమారుడైన ఇష్మాయేలు, ఓబేదు కుమారుడైన అజర్యా, అదాయా కుమారుడైన మయశేయా, జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు అనే శతాధిపతులతో నిబంధన చేశాడు. \v 2 వారు వెళ్లి యూదా అంతటా తిరుగుతూ అన్ని పట్టణాల నుండి లేవీయులను, ఇశ్రాయేలు కుటుంబాల నాయకులను సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చినప్పుడు, \v 3 సమాజమంతా దేవుని మందిరంలో రాజుతో ఒక నిబంధన చేశారు. \p యెహోయాదా వారితో ఇలా అన్నాడు: “దావీదు వంశస్థుల విషయంలో యెహోవా వాగ్దానం చేసినట్లుగా రాజు కుమారుడు పరిపాలన చేయాలి. \v 4 ఇప్పుడు మీరు చేయాల్సింది ఇదే: సబ్బాతు దినాన విధులకు వెళ్లే యాజకులలో లేవీయులలో మూడవ వంతు మంది తలుపుల దగ్గర కాపలాగా ఉండాలి. \v 5 ఇంకొక మూడవ భాగం రాజభవనం దగ్గర, మరో మూడవ భాగం పునాది ద్వారం దగ్గర కాపలా కాయాలి. మిగతావారంతా యెహోవా ఆలయ ఆవరణాల్లో ఉండాలి. \v 6 విధుల్లో ఉన్న యాజకులు, లేవీయులు తప్ప ఇంకెవరు యెహోవా మందిరంలో ప్రవేశించకూడదు. యాజకులు, లేవీయులు ప్రతిష్ఠించబడ్డ వారు కాబట్టి వారు ప్రవేశించవచ్చు, అయితే మిగతావారంతా లోనికి ప్రవేశించకూడదనే\f + \fr 23:6 \fr*\ft లేదా \ft*\fqa యెహోవా వారిని నియమించిన చోట వారు కాపలాగా నిలబడాలి\fqa*\f* యెహోవా ఆజ్ఞను పాటించాలి. \v 7 లేవీయులు తమ ఆయుధాలు చేతపట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. ఎవరైనా మందిరంలోకి వస్తే వారిని చంపేయాలి. రాజు ఎక్కడికి వెళ్లినా అతనికి దగ్గరగా ఉండాలి.” \p \v 8 యాజకుడైన యెహోయాదా ఆదేశించినట్లే లేవీయులు, యూదా వారంతా చేశారు. ప్రతి ఒక్కరు సబ్బాతు దినం విధులకు వెళ్లేవారిని, సబ్బాతు దినం విధులకు వెళ్లని వారిని తీసుకువచ్చారు. ఎందుకంటే యాజకుడైన యెహోయాదా ఏ విభాగాల వారికి సెలవియ్యలేదు. \v 9 అప్పుడు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరంలో ఉన్న రాజైన దావీదుకు చెందిన ఈటెలు, పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, ఆ శతాధిపతులకు ఇచ్చాడు. \v 10 అతడు ఆయుధాలను పట్టుకుని ఉన్న సైనికులందరిని యెహోవా మందిరం దక్షిణ వైపు నుండి ఉత్తర వైపు వరకు బలిపీఠం దగ్గర, మందిరం దగ్గర, రాజు చుట్టూ ఉండేలా నిలబెట్టాడు. \p \v 11 అప్పుడు యెహోయాదా, అతని కుమారులు రాకుమారున్ని బయటకు తీసుకువచ్చి అతని తలమీద కిరీటం పెట్టి ధర్మశాస్త్రాన్ని అతనికి అందించి, వారు అతన్ని రాజుగా ప్రకటించారు. వారు అతన్ని రాజుగా అభిషేకించి, “రాజు చిరకాలం జీవించు గాక!” అని కేకలు వేశారు. \p \v 12 ప్రజలు పరుగులు పెడుతూ రాజును పొగుడుతూ చేసే ధ్వనిని అతల్యా విని, ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న వారి దగ్గరకు వెళ్లింది. \v 13 ఆమె చూడగా, అక్కడ రాజు తన అధికార స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు. అధిపతులు బూరలు ఊదేవారు రాజు ప్రక్కన ఉన్నారు దేశ ప్రజలంతా సంబరపడుతూ బూరలు ఊదుతూ ఉన్నారు సంగీతకారులు తమ వాయిద్యాలతో స్తుతి పాటలు పాడడం చూసి అతల్యా తన వస్త్రాలు చింపుకొని, “ద్రోహం! ద్రోహం!” అని అరిచింది. \p \v 14 అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యంలో శతాధిపతులైన వారిని పంపించి, “మీ వరుసల\f + \fr 23:14 \fr*\ft లేదా \ft*\fqa ఆవరణాల నుండి\fqa*\f* మధ్య నుండి ఆమెను బయటకు తీసుకురండి, ఆమె వెంట వచ్చేవారిని ఖడ్గంతో చంపేయండి” అని అన్నాడు. ఎందుకంటే యాజకుడు, “ఆమెను యెహోవా మందిరం దగ్గర చంపవద్దు” అని చెప్పాడు. \v 15 కాబట్టి ఆమె రాజభవన ఆవరణంలో గుర్రపు ద్వారం యొక్క ప్రవేశం దగ్గరకు చేరుకోగానే వారు ఆమెను పట్టుకుని చంపేశారు. \p \v 16 అప్పుడు యెహోయాదా, తాను ప్రజలు రాజు యెహోవా ప్రజలుగా ఉండాలని నిబంధన చేశాడు. \v 17 ప్రజలందరూ బయలు గుడి దగ్గరకు వెళ్లి దానిని పడగొట్టారు. వారు బలిపీఠాలను, విగ్రహాలను పగులగొట్టారు, బలిపీఠాల ముందున్న బయలు యాజకుడైన మత్తానును చంపారు. \p \v 18 అప్పుడు యెహోయాదా, దావీదు ఆదేశించిన ప్రకారం, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు సంతోషంతో పాడుతూ, యెహోవాకు దహనబలులను అర్పించడానికి, మందిరంలో దావీదు నియమించిన లేవీయులకు యాజకులకు యెహోవా ఆలయ పర్యవేక్షణ అప్పగించాడు. \v 19 ఏ విధంగానైనా అపవిత్రంగా ఉన్నవారు ఎవరూ లోపలికి రాకుండా అతడు యెహోవా ఆలయ ద్వారాల దగ్గర ద్వారపాలకులను కూడా నిలబెట్టాడు. \p \v 20 అతడు తనతో శతాధిపతులను, ప్రధానులను, ప్రజల అధికారులను, దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకొని రాజును యెహోవా మందిరం నుండి రాజభవనానికి తీసుకువచ్చాడు. వారు పై ద్వారం గుండా ప్రవేశించి, రాజ్యసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు. \v 21 అతల్యాను ఖడ్గంతో చంపిన తర్వాత పట్టణం ప్రశాంతంగా ఉంది, దేశ ప్రజలంతా సంబరపడ్డారు. \c 24 \s1 యోవాషు మందిరాన్ని మరమ్మత్తు చేయించుట \p \v 1 యోవాషు రాజైనప్పుడు అతని వయస్సు ఏడు సంవత్సరాలు. అతడు యెరూషలేములో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా; ఆమె బెయేర్షేబకు చెందినది. \v 2 యాజకుడైన యెహోయాదా బ్రతికిన కాలమంతా యోవాషు యెహోవా దృష్టికి సరియైనదే చేశాడు. \v 3 యెహోయాదా యోవాషుకు ఇద్దరు స్త్రీలతో పెళ్ళి చేశాడు, అతనికి కుమారులు కుమార్తెలు ఉన్నారు. \p \v 4 కొంతకాలం తర్వాత యోవాషు యెహోవా మందిరాన్ని మరమ్మత్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. \v 5 అతడు యాజకులను, లేవీయులను పిలిపించి, “మీ దేవుని మందిరాన్ని మరమ్మత్తు చేయాలి కాబట్టి మీరు యూదా పట్టణాలకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరనుండి ప్రతి సంవత్సరం రావలసిన డబ్బును సేకరించండి. అది వెంటనే చేయండి” అని ఆదేశించాడు. కాని లేవీయులు వెంటనే చేయలేదు. \p \v 6 కాబట్టి రాజు ముఖ్య యాజకుడైన యెహోయాదాను పిలిచి, “నిబంధన గుడారం కొరకై ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే విధించిన పన్నును యూదా నుండి యెరూషలేము నుండి లేవీయులు వెళ్లి తీసుకురావాలని నీవెందుకు అడగలేదు?” అని అన్నాడు. \p \v 7 ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరంలోకి చొరబడి దానిలోని పవిత్ర వస్తువులను కూడా బయలు కోసం ఉపయోగించారు. \p \v 8 రాజు ఆజ్ఞ ప్రకారం, ఒక పెట్టెను తయారుచేసి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు. \v 9 దేవుని సేవకుడైన మోషే అరణ్యంలో ఇశ్రాయేలీయులకు విధించిన పన్నును వారు యెహోవాకు తీసుకురావాలని యూదాలో యెరూషలేములో ప్రకటించారు. \v 10 దానికి అధికారులంతా ప్రజలంతా సంతోషించి, వారి కానుకలు తెచ్చి పెట్టె నిండేవరకు అందులో వేశారు. \v 11 అప్పుడప్పుడు లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరకు తెచ్చేవారు. పెట్టెలో చాలా డబ్బు కనబడితే రాజు కార్యదర్శి, ముఖ్య యాజకుని అధికారి వచ్చి, పెట్టె ఖాళీచేసి దాని స్థలంలో దానిని మళ్ళీ ఉంచేవారు. ఇలా వారు ప్రతిదినం చేయడం వలన వారు చాలా డబ్బు పోగుచేశారు. \v 12 రాజు యెహోయాదా ఆ డబ్బును యెహోవా మందిరంలో అవసరమైన పనులు చేసేవారికి ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి తాపీ మేస్త్రీలను, వడ్లవారిని, మందిరాన్ని మరమ్మత్తు చేయడానికి ఇనుముతో ఇత్తడితో పనిచేసేవారిని జీతానికి తీసుకున్నారు. \p \v 13 పనివారు శ్రద్ధగా పని చేస్తుంటే వారి ఆధ్వర్యంలో మరమ్మత్తులు ముందుకు కొనసాగాయి. వారు దేవుని మందిరాన్ని దాని అసలు నమూనా ప్రకారం పునర్నిర్మించి దానిని పటిష్టం చేశారు. \v 14 పని ముగించిన తర్వాత వారు మిగతా డబ్బును రాజు దగ్గరకు, యెహోయాదా దగ్గరకు తెచ్చారు. ఆ డబ్బుతో యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులు సేవా సంబంధమైన వస్తువులు, దహనబలికి ఉపయోగపడే వస్తువులు, గరిటెలు, వేరువేరు వెండి బంగారు వస్తువులు చేయించారు. యెహోయాదా బ్రతికి ఉన్నంతకాలం యెహోవా మందిరంలో ప్రతిరోజు దహనబలులు అర్పించబడ్డాయి. \p \v 15 యెహోయాదా వయస్సు నిండి ముసలితనంలో చనిపోయాడు. అప్పుడు అతని వయస్సు నూట ముప్పై సంవత్సరాలు. \v 16 అతడు ఇశ్రాయేలులో దేవునికి, ఆయన మందిరానికి చేసిన మేలును బట్టి దావీదు పట్టణంలో రాజులతో పాటు పాతిపెట్టబడ్డాడు. \s1 యోవాషు దుష్టత్వం \p \v 17 యెహోయాదా మరణించిన తర్వాత, యూదా అధికారులు వచ్చి రాజుకు నమస్కరించగా అతడు వారి మాట విన్నాడు. \v 18 అప్పుడు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి అషేరా స్తంభాలకు, విగ్రహాలకు పూజ చేశారు. వారు చేసిన ఈ అపరాధం కారణంగా దేవుని కోపం యూదా వారిమీదికి, యెరూషలేము వారిమీదికి వచ్చింది. \v 19 అయినా, వారిని తన వైపుకు మళ్ళించాలని యెహోవా తన ప్రవక్తలను వారి దగ్గరకు పంపాడు. ప్రవక్తలు సాక్ష్యమిస్తూ వారిని హెచ్చరించారు కాని వారు ప్రవక్త మాటలు పెడచెవిని పెట్టారు. \p \v 20 ఆ సమయంలో దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు ప్రజలు ముందు నిలబడి, “దేవుడు చెప్పే మాట ఇదే: ‘యెహోవా ఆజ్ఞలను మీరెందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టారు’ ” అన్నాడు. \p \v 21 అయితే వారు అతని మీద కుట్రపన్ని అతన్ని యెహోవా ఆలయ ఆవరణంలో రాళ్లతో కొట్టి చంపారు. రాజు జారీ చేసిన ఆజ్ఞ ప్రకారమే అలా జరిగింది. \v 22 జెకర్యా తండ్రియైన యెహోయాదా తనపై చూపిన దయను యోవాషు రాజు మరచిపోయే, అతని కుమారున్ని చంపించాడు. జెకర్యా చనిపోతూ చివరిగా, “యెహోవా ఇది చూసి విచారణ చేస్తారు” అన్నాడు. \p \v 23 ఆ సంవత్సరం చివరిలో సిరియా సైన్యం యోవాషు మీదికి దండెత్తి వచ్చింది. వారు యూదాపై యెరూషలేముపై దాడిచేసి ప్రజల నాయకులందరిని చంపారు. కొల్లసొమ్మంతా దమస్కులో ఉన్న వారి రాజుకు పంపారు. \v 24 వచ్చిన సిరియా సైన్యం చిన్నదే అయినా చాలా పెద్ద సైన్యాన్ని యెహోవా వారి వశం చేశాడు. యూదా తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి అలా జరిగింది. యోవాషు కూడా తీర్పుకు గురి అయ్యాడు. \v 25 సిరియావారు తిరిగి వెళ్లేటప్పుడు గాయాలతో ఉన్న యోవాషును వదిలేశారు. యాజకుడైన యెహోయాదా కుమారుడిని చంపినందుకు అతని అధికారులు అతనిపై కుట్రపన్ని అతన్ని అతని మంచం మీద చంపారు. కాబట్టి అతడు చనిపోయి దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు, అయితే రాజుల సమాధుల్లో కాదు. \p \v 26 అతనిపై అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడైన జాబాదు,\f + \fr 24:26 \fr*\fq జాబాదు \fq*\ft మరో రూపం \ft*\fqa యోజాబాదు\fqa*\f* మోయాబురాలైన షిమ్రీతు కుమారుడైన యెహోజాబాదు కుట్రపన్నారు. \v 27 యోవాషు కుమారుల గురించి, అతని గురించి చెప్పిన ప్రవచనాల విషయం, దేవుని మందిరాన్ని పూర్వస్థితికి తెచ్చిన విషయం రాజు గ్రంథ వ్యాఖ్యానంలో వ్రాసి ఉన్నాయి. అతని తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజయ్యాడు. \c 25 \s1 యూదా రాజైన అమజ్యా \p \v 1 అమజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను; ఆమె యెరూషలేముకు చెందినది. \v 2 అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కానీ హృదయమంతటితో ఆయనను అనుసరించలేదు. \v 3 రాజ్యం తన ఆధీనంలో స్థిరపడిన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు. \v 4 అయితే అతడు వారి సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు”\f + \fr 25:4 \fr*\ft \+xt ద్వితీ 24:16\+xt*\ft*\f* అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు. \p \v 5 అమజ్యా యూదా వారిని పిలిపించి, వారి కుటుంబాల ప్రకారం వారిని యూదా, బెన్యామీను వారందరికి సహస్రాధిపతులుగాను\f + \fr 25:5 \fr*\fq సహస్రాధిపతులుగాను \fq*\ft అంటే వేయిమంది సైనికులపై అధిపతులుగాను\ft*\f* శతాధిపతులుగాను\f + \fr 25:5 \fr*\fq శతాధిపతులుగాను \fq*\ft అంటే, వందమంది సైనికులపై అధిపతులుగాను\ft*\f* నియమించాడు. తర్వాత అతడు ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిని లెక్కిస్తే ఈటె డాలు పట్టుకుని యుద్ధానికి వెళ్లగలవారు 3,00,000 మంది ఉన్నారు. \v 6 అతడు ఇశ్రాయేలు నుండి వంద తలాంతుల\f + \fr 25:6 \fr*\ft అంటే, సుమారు 3.34 టన్నులు; \+xt 9|link-href="2CH 25:9"\+xt* వచనంలో కూడా\ft*\f* వెండికి లక్ష మంది పోరాట యోధులను కిరాయికి తీసుకున్నాడు. \p \v 7 అయితే ఒక దైవజనుడు అమజ్యా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “రాజా, ఇశ్రాయేలు సైనికులు నీతో తీసుకెళ్లకు. ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలీయులతో గాని, ఎఫ్రాయిం వారిలో ఎవ్వరితో గాని లేరు. \v 8 ఒకవేళ మీరు వెళ్లి ధైర్యంగా యుద్ధం చేసినా, దేవుడు మిమ్మల్ని శత్రువుల ముందు కూల్చివేస్తారు, ఎందుకంటే సహాయం చేయడానికైనా, కూల్చివేయడానికైనా దేవునికే శక్తి ఉంది.” \p \v 9 అమజ్యా దైవజనుని చూసి, “కాని ఇశ్రాయేలు సైనికుల కోసం నేను చెల్లించిన వంద తలాంతుల సంగతేంటి?” అని అడిగాడు. \p అందుకు దైవజనుడు, “యెహోవా అంతకంటే ఎక్కువ నీకివ్వగలరు” అని జవాబిచ్చాడు. \p \v 10 కాబట్టి అమజ్యా ఎఫ్రాయిం నుండి తన దగ్గరకు వచ్చిన సైన్యాన్ని వేరుచేసి ఇంటికి పంపివేశాడు. అందుకు వారు యూదా మీద కోప్పడి తీవ్ర కోపంతో ఇంటికి వెళ్లిపోయారు. \p \v 11 తర్వాత అమజ్యా బలం కూడగట్టుకొని తన సైన్యాన్ని ఉప్పు లోయకు నడిపించి అక్కడ 10,000 మంది శేయీరు వారిని చంపాడు. \v 12 అంతేగాక యూదా సైన్యం మరో 10,000 మందిని ప్రాణాలతో పట్టుకుని, వారిని ఒక కొండచరియపైకి తీసుకెళ్లి అక్కడినుండి క్రిందికి పడవేశారు. వారంతా ముక్కలైపోయారు. \p \v 13 ఈలోగా అమజ్యా తనతో కూడా యుద్ధానికి రానివ్వకుండా పంపివేసిన ఇశ్రాయేలు సైనికులు సమరయ నుండి బేత్-హోరోను వరకు ఉన్న యూదా పట్టణాల మీద దాడిచేశారు. వారు 3,000 మందిని చంపి, పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును ఎత్తుకెళ్లారు. \p \v 14 అమజ్యా ఎదోమీయులను హతమార్చి తిరిగి వచ్చినప్పుడు తమతో కూడా శేయీరు ప్రజల దేవుళ్ళను తెచ్చాడు. వాటిని తన సొంత దేవుళ్ళుగా నిలిపి, వాటి ఎదుట సాష్టాంగపడి వాటికి బలులు అర్పించాడు. \v 15 అందువల్ల అమజ్యా మీద యెహోవాకు కోపం రగులుకుంది. యెహోవా ఒక ప్రవక్తను అమజ్యా దగ్గరకు పంపాడు. అతడు అమజ్యాతో, “ఈ దేవుళ్ళు తమ సొంత ప్రజలనే నీ చేతిలో పడకుండా కాపాడలేకపోయారు. నీవు వారి దేవుళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నావు?” అని అడిగాడు. \p \v 16 ప్రవక్త తనతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజు, “నిన్ను రాజుకు సలహాదారునిగా నియమించామా? ఆపు! ఎందుకు చావాలనుకుంటున్నావు?” అని అన్నాడు. \p అప్పుడు ప్రవక్త, “నీవు అప్పుడు అలా చేసి, ఇప్పుడు నా సలహా అంగీకరించలేదు కాబట్టి దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడని నాకు తెలుసు” అని చెప్పి ఊరుకున్నాడు. \p \v 17 యూదా రాజైన అమజ్యా ఇతరులతో ఆలోచన చేశాక, “మనం యుద్ధంలో ఒకరితో ఒకరు తలపడదాం, రండి” అని యెహు మనుమడును యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషుకు సవాలు విసిరాడు. \p \v 18 అయితే ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “లెబానోను అడవిలోని ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు, ‘నీ కుమార్తెను నా కుమారునికి భార్యగా ఇవ్వు’ అని సందేశం పంపిందట. అప్పుడు లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళను త్రొక్కి పాడుచేసింది. \v 19 నీవు ఎదోమును ఓడించి నీలో నీవు గర్విస్తున్నావు. అయితే ఇంటి దగ్గరే ఉండు. నీవు ఎందుకు నీతో పాటు యూదావారు నాశనమవడానికి కారణమవుతావు?” \p \v 20 అయితే అమజ్యా వినలేదు, ఎందుకంటే వారు ఎదోము దేవుళ్ళను వెదకడం వల్ల దేవుడు వారిని యెహోయాషు చేతికి అప్పగించబడేలా చేశారు. \v 21 కాబట్టి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు దాడి చేశాడు. అతడు, యూదా రాజైన అమజ్యా యూదాకు చెందిన బేత్-షెమెషు దగ్గర ఒకరినొకరు ఎదుర్కొన్నారు. \v 22 ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయింది, ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు పారిపోయారు. \v 23 ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా\f + \fr 25:23 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యెహోయాహాజు\fqa*\f* మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు అతన్ని యెరూషలేముకు తెచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు\f + \fr 25:23 \fr*\ft అంటే, సుమారు 180 మీటర్లు\ft*\f* పడగొట్టాడు. \v 24 అతడు దేవుని మందిరంలో ఓబేద్-ఎదోము సంరక్షణలో ఉన్న కనిపించిన వెండి బంగారమంతటిని, ఇతర వస్తువులన్నిటిని, రాజభవన ఖజానాను బందీలను తీసుకుని సమరయకు తిరిగి వెళ్లాడు. \p \v 25 యెహోయాహాజు కుమారుడు, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు మృతి తర్వాత, యూదారాజు, యోవాషు కుమారుడైన అమజ్యా ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు. \v 26 అమజ్యా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు మొదటి నుండి చివరి వరకు, యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడలేదా? \v 27 అమజ్యా యెహోవాను వెంబడించడం మానివేసిన సమయం నుండి ప్రజలు యెరూషలేములో కొందరు అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషుకు పారిపోయాడు, కాని వారు అతని వెంట లాకీషుకు మనుష్యులను పంపి అతన్ని అక్కడ చంపారు. \v 28 అప్పుడు వారు గుర్రం మీద అతని శవాన్ని తెప్పించి, యూదా\f + \fr 25:28 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa దావీదు; \+xt 2 రాజులు 14:20\+xt* లో కూడా ఉంది.\fqa*\f* పట్టణంలో అతని పూర్వికుల దగ్గర పాతిపెట్టారు. \c 26 \s1 యూదా రాజైన ఉజ్జియా \p \v 1 అప్పుడు యూదా ప్రజలందరూ పదహారు సంవత్సరాల వయస్సు వాడైన ఉజ్జియాను\f + \fr 26:1 \fr*\ft లేదా \ft*\fqa అజర్యా \fqa*\ft అని కూడా పిలువబడేవాడు\ft*\f* అతని తండ్రియైన అమజ్యా స్థానంలో రాజుగా చేశారు. \v 2 రాజైన అమజ్యా చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరిన తర్వాత ఉజ్జియా ఏలతును పునర్నిర్మించి తిరిగి యూదాకు కలిపాడు. \p \v 3 ఉజ్జియా రాజైనప్పుడు అతని వయస్సు పదహారు సంవత్సరాలు, అతడు యెరూషలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. ఆమె యెరూషలేముకు చెందినది. \v 4 అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. \v 5 దేవుని భయం\f + \fr 26:5 \fr*\ft చాలా హెబ్రీ ప్రతులలో, కొ.ప్ర.లలో \ft*\fqa దర్శనం\fqa*\f* కలిగి ఉండాలని తనకు బోధించిన జెకర్యా దినాల్లో అతడు దేవున్ని అనుసరించాడు. అతడు యెహోవాను అనుసరించినంత కాలం దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చారు. \p \v 6 అతడు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్లి గాతు, జబ్నె, అష్డోదు పట్టణాల గోడలు పడగొట్టాడు. అష్డోదు ప్రాంతంలో, ఫిలిష్తీయుల మధ్య ఉన్న పట్టణాలను తిరిగి కట్టించాడు. \v 7 ఫిలిష్తీయులతో గూర్-బయలులో ఉన్న అరబీయులతో మెయునీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశారు. \v 8 అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించేవారు. అతడు చాలా శక్తివంతంగా అభివృద్ధి చెందాడు కాబట్టి, అతని గొప్పతనం ఈజిప్టు సరిహద్దు వరకు వ్యాపించింది. \p \v 9 ఉజ్జియా యెరూషలేములో మూల ద్వారం దగ్గర, లోయ ద్వారం దగ్గర, ప్రాకారం మూల దగ్గర బురుజులు నిర్మించి వాటిని పటిష్టం చేశాడు. \v 10 అతడు అరణ్యంలో బురుజులు కూడా నిర్మించాడు అనేక తొట్టెలను తవ్వాడు, ఎందుకంటే అతనికి పర్వత ప్రాంతాల్లో మైదానంలో చాలా పశువులు ఉన్నాయి. అతడు మట్టిని ప్రేమిస్తున్నందున కొండల్లో సారవంతమైన భూములలో తన పొలాలను ద్రాక్షతోటలను పని చేసేవారిని కలిగి ఉన్నాడు. \p \v 11 ఉజ్జియాకు సుశిక్షితులైన సైన్యం ఉంది, రాజ అధికారులలో ఒకరైన హనన్యా ఆధ్వర్యంలో కార్యదర్శియైన యెహీయేలు అధికారియైన మయశేయా వారిని లెక్కించిన ప్రకారం విభాగాలుగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. \v 12 ఆ యుద్ధవీరులపై 2,600 మంది అధికారులున్నారు. వారంతా పూర్వికుల కుటుంబాల పెద్దలు. \v 13 యుద్ధానికి బాగా శిక్షణ పొందిన 3,07,500 మంది వారి చేతి క్రింద ఉన్నారు. రాజుకు అతని శత్రువు పోరాడడానికి సహాయం చేయగల బలమైన సైన్యం అది. \v 14 ఉజ్జియా సైన్యమంతటికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిసెలు సరఫరాచేశాడు. \v 15 యెరూషలేములో సైనికులు బాణాలు వేయడానికి గోడల నుండి పెద్ద రాళ్లను విసిరేందుకు వీలుగా అతడు బురుజులపై మూలల రక్షణ కోసం కనిపెట్టిన పరికరాలను తయారుచేశాడు. అతని కీర్తి చాలా దూరం వ్యాపించింది, ఎందుకంటే అతడు స్థిరపడేవరకు యెహోవా అతనికి ఎంతో సహాయం చేశారు. \p \v 16 ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు విర్రవీగి పతనం అయ్యాడు. తన దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసి యెహోవా మందిరంలో ధూపవేదిక మీద ధూపం వేయడానికి ప్రవేశించాడు. \v 17 యాజకుడైన అజర్యా ఎనభైమంది ఇతర ధైర్యవంతులైన యెహోవా యాజకులతో అతన్ని అనుసరించాడు. \v 18 వారు ఉజ్జియా రాజును ఎదిరించి, “ఉజ్జియా, యెహోవాకు ధూపం వెయ్యడం నీ పని కాదు. అహరోను వారసులైన యాజకులే ఆ పని చేయాలి. ధూపం వేయడానికి వారే ప్రతిష్ఠించబడ్డారు. పరిశుద్ధాలయం నుండి వెళ్లు. నీవు నమ్మకద్రోహిగా ఉన్నావు. దానివలన యెహోవా దేవుని వలన ఘనపరచబడవు” అన్నారు. \p \v 19 ధూపం వేయడానికి చేతిలో ధూపం పెట్టుకున్న ఉజ్జియాకు కోపం వచ్చింది. అతడు యెహోవా మందిరంలో ధూపవేదిక ముందు యాజకుల సమక్షంలో వారి మీద విరుచుకుపడుతుండగా, అతని నుదుటిపై కుష్ఠురోగం\f + \fr 26:19 \fr*\ft హెబ్రీలో \ft*\fq కుష్ఠురోగం \fq*\ft అనే పదం రకరకాల చర్మ వ్యాధులను సూచిస్తుంది.\ft*\f* వచ్చింది. \v 20 ముఖ్య యాజకుడైన అజర్యా ఇతర యాజకులందరు అతనివైపు చూసినప్పుడు, అతని నుదిటిపై కుష్ఠురోగం ఉందని వారు చూసి, అతన్ని త్వరితంగా బయటకు తీశారు. నిజమే, యెహోవా అతన్ని బాధపెట్టారు కాబట్టి అతడు స్వయంగా బయలుదేరడానికి ఆసక్తిగా ఉన్నాడు. \p \v 21 ఉజ్జియా రాజు చనిపోయే రోజు వరకు కుష్ఠు వ్యాధితో ఉన్నాడు. అతనికున్న కుష్ఠురోగాన్ని బట్టి అతడు యెహోవా మందిరంలోనికి వెళ్లకుండ నిషేధించబడ్డాడు. కాబట్టి అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. అతని కుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు. \p \v 22 ఉజ్జియా పరిపాలన గురించిన ఇతర విషయాలు, ప్రారంభం నుండి చివరి వరకు, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తచేత నమోదు చేయబడ్డాయి. \v 23 ఉజ్జియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, రాజులకు చెందిన స్మశానవాటికలో వారి సమీపంలో పాతిపెట్టబడ్డాడు, ఎందుకంటే, “అతనికి కుష్ఠువ్యాధి ఉంది” అని ప్రజలు అన్నారు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము రాజయ్యాడు. \c 27 \s1 యూదా రాజైన యోతాము \p \v 1 యోతాము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూష. ఆమె సాదోకు కుమార్తె. \v 2 అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కానీ అతనిలా యెహోవా మందిరంలోకి ప్రవేశించలేదు. ప్రజలు మాత్రం తమ అవినీతి అక్రమాలను కొనసాగించారు. \v 3 యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు. ఓఫెలు కొండ దగ్గర గోడను చాలా వరకు కట్టించాడు. \v 4 అతడు యూదా కొండ ప్రాంతంలో పట్టణాలు అడవుల్లో కోటలు బురుజులు నిర్మించాడు. \p \v 5 యోతాము అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి వారిని జయించాడు. ఆ సంవత్సరం అమ్మోనీయులు అతనికి నూరు తలాంతుల\f + \fr 27:5 \fr*\ft అంటే, సుమారు 3 3/4 టన్నులు\ft*\f* వెండి, పదివేల కోరుల\f + \fr 27:5 \fr*\ft అంటే, సుమారు 1,800 టన్నులు\ft*\f* గోధుమలు, పదివేల కోరుల\f + \fr 27:5 \fr*\ft అంటే, సుమారు 1,500 టన్నులు\ft*\f* యవలు చెల్లించారు. అమ్మోనీయులు రెండవ మూడవ సంవత్సరాల్లో కూడా అదే మొత్తాన్ని అతనికి తీసుకువచ్చారు. \p \v 6 యోతాము తన దేవుడు యెహోవా దృష్టిలో యధార్థంగా ప్రవర్తించినందుచేత అతడు బలాభివృద్ధి చెందాడు. \p \v 7 యోతాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు అతడు చేసిన యుద్ధాలన్నీ, అతడు చేసిన ఇతర కార్యాలన్ని ఇశ్రాయేలు, యూదారాజు చర్రిత గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. \v 8 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. \v 9 యోతాము చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజయ్యాడు. \c 28 \s1 యూదా రాజైన ఆహాజు \p \v 1 ఆహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. తన పితరుడైన దావీదులా కాకుండా, అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేయలేదు. \v 2 అతడు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు, అతడు బయలును పూజించడానికి విగ్రహాలు చేయించాడు. \v 3 అతడు బెన్ హిన్నోము లోయలో బలులను కాల్చివేసి, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాలు చేసిన హేయక్రియలు చేసి, తన కుమారులను అగ్నిలో బలి ఇచ్చాడు. \v 4 అతడు క్షేత్రాల్లో, కొండలమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద బలులు అర్పిస్తూ ధూపం వేసేవాడు. \p \v 5 కాబట్టి అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించారు. సిరియనులు అతన్ని ఓడించి, అతని ప్రజల్లో చాలామందిని బందీలుగా పట్టుకుని దమస్కుకు తీసుకెళ్లారు. \p అతడు ఇశ్రాయేలు రాజు చేతికి కూడా అప్పగించబడ్డాడు, అతడు ఆహాజుకు భారీ ప్రాణనష్టాన్ని కలిగించాడు. \v 6 రెమల్యా కుమారుడైన పెకహు ఒకేరోజున యూదాలో 1,20,000 మంది సైనికులను చంపాడు, అలా జరగడానికి కారణం యూదా వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టడమే. \v 7 ఎఫ్రాయిమీయుల యోధుడైన జిఖ్రీ, రాజకుమారుడైన మయశేయాను, రాజభవనానికి అధికారియైన అజ్రీకామును, రాజు తర్వాత రెండవ స్థాయి వాడైన ఎల్కానాను చంపాడు. \v 8 ఇశ్రాయేలీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల నుండి రెండు లక్షలమంది భార్యలను, కుమారులను, కుమార్తెలను యూదా నుండి బందీలుగా తీసుకున్నారు. వారు గొప్ప దోపుడుసొమ్మును దోచుకుని తిరిగి సమరయకు తీసుకెళ్లారు. \p \v 9 అయితే యెహోవా ప్రవక్తయైన ఓదేదు అనే ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు సమరయకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్లి వారితో ఇలా చెప్పాడు, “మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు యూదా వారి మీద కోపం వచ్చి, వారిని మీ చేతికి అప్పగించారు. కానీ మీరు ఆకాశాన్నంటే క్రోధంతో వారిని చంపేశారు. \v 10 ఇప్పుడు యూదా, అలాగే యెరూషలేములోని స్త్రీ పురుషులను మీ బానిసలుగా చేసుకోవాలనేది మీ ఆలోచన. అయితే మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు కూడా అపరాధులు కారా? \v 11 ఇప్పుడు నా మాట వినండి! మీరు బందీలుగా పట్టుకున్న మీ తోటి ఇశ్రాయేలీయులను తిరిగి పంపించండి, ఎందుకంటే యెహోవా తీవ్రమైన కోపం మీపై ఉంది.” \p \v 12 ఎఫ్రాయిమీయుల పెద్దలైన యెహోహనాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాశా అనేవారు యుద్ధం నుండి తిరిగివస్తున్న వారికి ఎదురుగా నిలబడి. \v 13 వారితో, “మీరు ఈ బందీలను ఇక్కడకు తీసుకురాకూడదు, యెహోవా ఎదుట మేము దోషులమవుతాము. మీరు మా పాపాలను దోషాలను ఇంకా ఎక్కువ వేయాలనుకుంటున్నారా? ఇప్పటికే మా దోషం ఎంతో ఎక్కువగా ఉంది, యెహోవా రగులుతున్న కోపం ఇశ్రాయేలు మీద ఉంది” అని చెప్పారు. \p \v 14 కాబట్టి సైనికులు ఆ బందీలను, దోపుడుసొమ్మును అధికారులు, సమాజమంతటి సమక్షంలో విడిచిపెట్టారు. \v 15 పేరు బట్టి నియమితులైన వారు దోపిడిలో నుండి వస్త్రాలు, చెప్పులు తీసి నగ్నంగా ఉన్న బందీలకు ఇచ్చారు. తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు, ఔషధ తైలాన్ని ఇచ్చారు. నీరసించిన వారిని గాడిదల మీద ఎక్కించారు. అప్పుడు బందీలను ఖర్జూరపు చెట్ల పట్టణం అనే పేరున్న యెరికోకు తీసుకెళ్లి వారి స్వదేశస్థుల దగ్గర వదిలి, తిరిగి సమరయకు వచ్చారు. \p \v 16 ఆ కాలంలో అష్షూరుదేశపు రాజులను సాయం చేయమని ఆహాజు రాజు కబురు పంపాడు. \v 17 ఎందుకంటే, మరోసారి ఎదోమీయులు యూదా మీదికి దండెత్తివచ్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయారు. \v 18 ఫిలిష్తీయులు యూదాలోని దక్షిణ పర్వత ప్రాంతాలలోని పట్టణాలపై దాడి చేశారు. వారు బేత్-షెమెషు, అయ్యాలోను గెదెరోతు, అలాగే శోకో, తిమ్నా గిమ్జో వాటి చుట్టుప్రక్కల గ్రామాలను స్వాధీనం చేసుకుని ఆక్రమించారు. \v 19 ఆహాజు యూదా ప్రజల్లో దుష్టత్వం పెరిగేలా చేసి యెహోవాకు నమ్మకద్రోహం చేశాడు, కాబట్టి ఇశ్రాయేలు\f + \fr 28:19 \fr*\ft ఇది, తరచుగా 2 దినవృత్తాంతములో యూదా అని వాడబడింది\ft*\f* రాజైన ఆహాజు కారణంగా యెహోవా యూదా రాజ్యాన్ని అణచివేశారు. \v 20 అష్షూరు రాజు తిగ్లత్-పిలేసెరు\f + \fr 28:20 \fr*\ft హెబ్రీలో \ft*\fqa పిల్నేసెరు\fqa*\f* ఆహాజుకు సహాయం చేయడానికి వచ్చాడు గాని, అతని ద్వారా ఆహాజుకు కష్టమే కలిగింది కాని లాభం కాదు. \v 21 ఆహాజు యెహోవా మందిరంలో నుండి రాజభవనంలో నుండి, అధిపతుల దగ్గరనుండి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకు ఇచ్చాడు. కాని, దానివలన కూడా సాయం దొరకలేదు. \p \v 22 ఆ ఆపదకాలంలో ఆహాజు రాజు యెహోవా పట్ల ఇంకా నమ్మకద్రోహం చేశాడు. \v 23 తనను ఓడించిన దమస్కు నగరవాసులకున్న దేవుళ్ళకు బలులు అర్పించాడు. “సిరియా రాజులకు వారి దేవుళ్ళు సహాయం చేసినట్లు నాకూ సాయం చేసేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అని అనుకున్నాడు. అయితే ఆ దేవుళ్ళ వలన అతనికి ఇశ్రాయేలు ప్రజలందరికి పతనం కలిగింది. \p \v 24 ఆహాజు యెహోవా మందిరంలో ఉన్న సామాగ్రిని పోగుచేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా ఆలయ ద్వారాలు మూసివేసి, యెరూషలేము అంతా బలిపీఠాలను కట్టించాడు. \v 25 యూదా దేశంలోని పట్టణాలన్నిటిలో అతడు ఇతర దేవుళ్ళకు ధూపం వేయడానికి బలిపీఠాలను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం తెప్పించారు. \p \v 26 ఆహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విధానాలన్నీ, మొదటి నుండి చివరి వరకు, యూదా, ఇశ్రాయేలు రాజు గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. \v 27 ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని యెరూషలేము పట్టణంలో పాతిపెట్టారు గాని, ఇశ్రాయేలు రాజు సమాధుల్లో కాదు. అతని తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు. \c 29 \s1 హిజ్కియా మందిరాన్ని శుద్ధి చేయుట \p \v 1 హిజ్కియా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా, ఆమె జెకర్యా కుమార్తె. \v 2 అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. \p \v 3 అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా ఆలయ ద్వారాలను తెరిచి వాటికి మరమ్మత్తు చేయించాడు. \v 4 అతడు యాజకులను, లేవీయులను పిలిపించి, వారిని ఆలయానికి తూర్పున ఉన్న విశాల స్థలంలో సమకూర్చి, \v 5 వారితో ఇలా చెప్పాడు: “లేవీయులారా! నేను చెప్పేది వినండి! ఇప్పుడు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకుని, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని పవిత్రపరచండి. పరిశుద్ధాలయంలో నుండి అపవిత్రమైన ప్రతిదీ తీసివేయండి. \v 6 మన తండ్రులు నమ్మకద్రోహులుగా ఉన్నారు; మన దేవుడైన యెహోవా దృష్టికి ఏది చెడ్డదో అదే చేసి, వారు ఆయనను విడిచిపెట్టారు. ఆయన నివాసస్థలం వైపు నుండి ముఖం త్రిప్పుకొని వారు ఆయనను నిర్లక్ష్యం చేశారు. \v 7 వారు మండపం తలుపులు మూసివేసి, దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవునికి పరిశుద్ధాలయం దగ్గర ధూపం వేయలేదు, దహనబలులు అర్పించలేదు. \v 8 కాబట్టి యెహోవా కోపం యూదా, యెరూషలేము మీద రగులుకుంది. మీరు కళ్ళారా చూస్తున్నట్లుగా ఆయన వారిని భయాందోళనలకు నిందకు గురి చేశారు. \v 9 అందుకే మన తండ్రులు కత్తివేటుకు గురయ్యారు, మన కుమారులు, కుమార్తెలు మన భార్యలు వారికి బందీలుగా ఉన్నారు. \v 10 ఇప్పుడు ఆయన కోపం మనమీద నుండి మళ్ళేలా ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాతో ఒడంబడిక చేయాలని ఉద్దేశించాను. \v 11 నా కుమారులారా! మీరు ఆయనకు పరిచారకులుగా ఉండి ధూపం వేయాలని తన ఎదుట నిలబడి సేవ జరిగించాలని యెహోవా మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చూపకండి.” \b \lh \v 12 అప్పుడు ఈ లేవీయులు పనికి నియమించబడ్డారు: \b \li1 కహాతీయుల నుండి: \li2 అమాశై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, \li1 మెరారీయుల నుండి: \li2 అబ్దీ కుమారుడైన కీషు, యెహల్లెలేలు కుమారుడైన అజర్యా, \li1 గెర్షోనీయుల నుండి: \li2 జిమ్మా కుమారుడైన యోవాహు, యోవాహు కుమారుడైన ఏదెను. \li1 \v 13 ఎలీషాపాను సంతతి నుండి: \li2 షిమ్రీ యెహీయేలు, \li1 ఆసాపు సంతతి నుండి: \li2 జెకర్యా, మత్తన్యా, \li1 \v 14 హేమాను సంతతి నుండి: \li2 యెహీయేలు, షిమీ, \li1 యెదూతూను సంతతి నుండి: \li2 షెమయా, ఉజ్జీయేలు. \b \p \v 15 వారు తమ సోదరులను తోటి లేవీయులను సమకూర్చి తమను పవిత్రం చేసుకున్నారు. అప్పుడు రాజు ఆదేశించిన ప్రకారం యెహోవా వాక్కును అనుసరించి, యెహోవా మందిరం శుద్ధి చేయడానికి లోపలికి వెళ్లారు. \v 16 యెహోవా గర్భాలయాన్ని శుద్ధి చేయడానికి యాజకులు లోనికి వెళ్లారు. యెహోవా మందిరంలో కనిపించిన అపవిత్రమైన ప్రతిదాన్ని వారు యెహోవా మందిరం నుండి ఆవరణంలోకి తెచ్చారు. లేవీయులు దాన్నంతా కిద్రోను లోయకు తీసుకెళ్లి పారవేశారు. \v 17 మొదటి నెల మొదటి రోజున పవిత్రం చేయడం వారు ఆరంభించారు. ఆ నెల ఎనిమిదో రోజున యెహోవా మంటపం వరకు చేరారు. మరో ఎనిమిది రోజులు వారు యెహోవా మందిరాన్ని పవిత్రం చేస్తూ వచ్చారు. మొదటి నెల పదహారో రోజు ఆ పని ముగించారు. \p \v 18 అప్పుడు వారు రాజైన హిజ్కియా దగ్గరకు వెళ్లి ఇలా చెప్పారు, “యెహోవా ఆలయమంతా మేము శుద్ధి చేశాము. దహనబలిపీఠాన్ని, దాని సామాగ్రిని, సన్నిధి రొట్టెలు ఉంచే బల్లను, దాని సామాగ్రిని శుద్ధి చేశాము. \v 19 ఆహాజు రాజు తన పరిపాలనలో నమ్మకద్రోహం చేసి తొలగించిన వస్తువులన్నిటిని కూడా సిద్ధం చేసి పవిత్రపరచాము. అవి ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు ఉన్నాయి.” \p \v 20 మరుసటిరోజు ఉదయమే లేచి రాజైన హిజ్కియా నగర అధికారులను సమకూర్చి యెహోవా ఆలయానికి వెళ్లాడు. \v 21 వారు రాజ్యం కోసం, పరిశుద్ధాలయం కోసం, యూదా వారి కోసం బలిగా ఏడు కోడెలు, ఏడు పొట్టేళ్లు, ఏడు గొర్రెలు, ఏడు మేకపోతులు తెచ్చారు. అది పాపపరిహారబలిగా తెచ్చారు. అహరోను వారసులైన యాజకులను, “యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించాలి” అని రాజు ఆదేశించాడు. \v 22 అప్పుడు వారు కోడెలను వధించారు. యాజకులు వాటి రక్తం తీసుకుని బలిపీఠం మీద చల్లారు. తర్వాత పొట్టేళ్ళను వధించి వాటి రక్తం బలిపీఠం మీద చల్లారు. గొర్రెపిల్లలను కూడా వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. \v 23 పాపపరిహారబలిగా ఉన్న మేకపోతులను రాజు ఎదుట సమకూడినవారి ఎదుటకు తెచ్చారు. వారు వాటి మీద చేతులుంచారు. \v 24 అప్పుడు యాజకులు వాటిని వధించి, ఇశ్రాయేలు ప్రజలు బలిగా వాటి రక్తం బలిపీఠం మీద పోశారు. ఇశ్రాయేలు ప్రజలందరి ప్రాయశ్చిత్తంగా దహనబలి, పాపపరిహారబలి అర్పించాలని రాజు ఆదేశించాడు, కాబట్టి వారు అలా చేశారు. \p \v 25 మునుపు దావీదు రాజు, అతని దీర్ఘదర్శియైన గాదు, ప్రవక్తయైన నాతాను ఆదేశించిన ప్రకారం, హిజ్కియా లేవీయులను తాళాలతో, స్వరమండలాలతో, తంతి వాయిద్యాలతో యెహోవా మందిరంలో ఉంచాడు. ఇలా చేయాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు. \v 26 దావీదు చేయించిన వాయిద్యాలను లేవీయులు, బూరలను యాజకులు చేతపట్టుకుని నిలబడ్డారు. \p \v 27 బలిపీఠం మీద దహనబలులను అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. బలిపీఠం మీద దహనబలులు అర్పించడం ఆరంభం కాగానే బూరలతో, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాకు స్తుతి పాటలు పాడడం ఆరంభమైంది. \v 28 గాయకులు పాటలు పాడుతూ, సంగీతకారులు వాయిద్యాలు వాయిస్తూ, బూరల ఊదుతూ ఉండగా సమాజమంతా తలలు వంచి ఆరాధించారు. దహనబలి అర్పణ ముగిసేవరకు ఇదంతా జరుగుతూ ఉండింది. \p \v 29 దహనబలులు ముగిసినప్పుడు రాజు, అతనితో ఉన్నవారంతా మోకరించి ఆరాధన చేశారు. \v 30 దావీదు, దీర్ఘదర్శియైన ఆసాపు వ్రాసిన కీర్తనలు పాడి యెహోవాను స్తుతించాలని లేవీయులకు హిజ్కియారాజు అధికారులు ఆదేశించారు. వారు ఆనందంతో స్తుతిగానం చేస్తూ తలలు వంచి ఆరాధించారు. \p \v 31 అప్పుడు హిజ్కియా ప్రజలతో, “యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకున్నారు, దగ్గరకు రండి, యెహోవా ఆలయానికి బలులు, కృతజ్ఞతార్పణలు తీసుకురండి” అన్నాడు, హిజ్కియా అలాగే సమకూడినవారు బలులు, కృతజ్ఞతార్పణలు తెచ్చారు. ఇష్టమున్న వారంతా దహనబలులు కూడా తెచ్చారు. \p \v 32 సమకూడినవారు తెచ్చిన దహనబలులు డెబ్బై కోడెలు, నూరు పొట్టేళ్లు, రెండు వంద గొర్రెపిల్లలు. అవన్నీ యెహోవాకు దహనబలులు. \v 33 బలి అర్పించబడిన జంతువులు ఆరువందల కోడెలు మూడు వేల గొర్రెలు మేకలు. \v 34 యాజకులు కొద్దిమందే ఉన్నారు కాబట్టి దహనబలిగా దహనబలి పశువులన్నిటి చర్మం ఒలువలేకపోయారు. పనంతా పూర్తయ్యే వరకు, ఇతర యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకునే వరకు, వారి వంశీయులు లేవీయులు సాయం చేశారు. యాజకులకంటే లేవీయులే ప్రతిష్ఠించుకునే విషయంలో యథార్థంగా ఉన్నారు. \v 35 సమృద్ధిగా దహనబలి పశువుల సమాధానబలుల ఉన్నాయి, దానితో పాటు దహనబలుల క్రొవ్వు దహనబలులతో పాటు పానార్పణలు ఉన్నాయి. \p ఆ విధంగా యెహోవా మందిరంలో సేవ మళ్ళీ ప్రారంభించడం జరిగింది. \v 36 అదంతా త్వరగానే జరిగింది కాబట్టి దేవుడు ప్రజలకు జరిగించిన దానిని చూసి హిజ్కియా, ప్రజలంతా ఆనందించారు. \c 30 \s1 హిజ్కియా పస్కా పండుగ ఆచరించుట \p \v 1 ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించడానికి యెరూషలేములో యెహోవా ఆలయానికి రమ్మని హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు అందరికి కబురు పంపాడు. ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలకు కూడా లేఖలు వ్రాసి పంపాడు. \v 2 రాజు, అతని అధికారులు, యెరూషలేములో ఉన్న సమాజమంతా రెండవ నెలలో పస్కాను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. \v 3 ఎందుకంటే, తగినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోకపోవడం, ప్రజలు యెరూషలేములో సమావేశం కాకపోవడం వలన ఎప్పుడు జరిపే సమయంలో వారు పండుగ జరుపుకోలేకపోయారు. \v 4 ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది. \v 5 ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు. \p \v 6 రాజు, అతని అధికారుల నుండి ఉత్తరాలు తీసుకుని వార్తాహరులు రాజాజ్ఞ ప్రకారం యూదా, ఇశ్రాయేలు దేశమంతా వెళ్లారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: \pm “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని మిగిలి ఉన్న మీ దగ్గరకు ఆయన తిరిగి వస్తారు. \v 7 తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసిన మీ తల్లిదండ్రుల్లా మీ తోటి ఇశ్రాయేలీయుల్లా ఉండకండి. మీరు చూస్తున్నట్లుగా ఆయన వారిని నాశనానికి అప్పగించారు. \v 8 మీ పూర్వికుల్లా మూర్ఖంగా ప్రవర్తించకుండ యెహోవాకు లోబడండి. ఆయన శాశ్వతంగా పవిత్రం చేసి ప్రత్యేకించుకున్న పరిశుద్ధాలయంలోకి రండి. మీ దేవుడైన యెహోవాను సేవించండి, అప్పుడు ఆయన తీవ్రమైన కోపం మీమీద నుండి మళ్ళవచ్చు. \v 9 మీరు యెహోవా వైపు తిరిగితే మీ తోటి ఇశ్రాయేలీయులపై మీ పిల్లలపై వారిని బందీలుగా తీసుకువెళ్లిన వారికి కనికరం కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దయ కరుణ గలవారు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ నుండి తన ముఖం త్రిప్పుకోరు.” \p \v 10 వార్తాహరులు జెబూలూను ప్రదేశం వరకు ఎఫ్రాయిం మనష్షేల దేశాల్లోని ప్రతి పట్టణానికి వెళ్లారు. అయితే ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు. \v 11 కాని, ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకొని యెరూషలేముకు వచ్చారు. \v 12 యెహోవా ఆదేశం ప్రకారం రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేటట్టు యెహోవా హస్తం యూదా వారి మీద ఉంది. ఆయన వారికి ఏక మనస్సు కలిగించారు. \p \v 13 రెండవ నెలలో పులియని రొట్టె పండుగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు. \v 14 యెరూషలేములో ఉన్న ఇతర బలిపీఠాలను వారు తొలగించారు. ధూపవేదికలు తీసివేసి కిద్రోను లోయలో పడవేశారు. \p \v 15 రెండవ నెల పద్నాలుగవ రోజున వారు పస్కాబలి గొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను పవిత్రం చేసుకుని యెహోవా ఆలయానికి దహనబలులు తెచ్చారు. \v 16 దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం వారికి నియమించిన స్థలంలో యధావిధిగా వారు నిలబడ్డారు. లేవీయులు యాజకుల చేతికి రక్తం అందించగా వారు దానిని బలిపీఠం మీద చల్లారు. \v 17 ఆ గుంపులో తమను పవిత్రం చేసుకోని వారు చాలామంది ఉన్నారు. అలా అపవిత్రంగా ఉండి తమ పస్కాబలి గొర్రెపిల్లలను యెహోవాకు ప్రతిష్ఠ చేయలేని ఆ వ్యక్తులందరి కోసం లేవీయులు వాటిని వధించవలసి వచ్చింది. \v 18 ఎఫ్రాయిం మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను ప్రదేశాల నుండి వచ్చిన వారిలో చాలామంది తమను పవిత్రం చేసుకోలేదు. అయినా లేఖనాలకు విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “మంచివారైన యెహోవా, ప్రతి ఒక్కరిని క్షమించును గాక! \v 19 పరిశుద్ధాలయ నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమించును గాక.” \v 20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు. \p \v 21 యెరూషలేములో హాజరైన ఇశ్రాయేలు వారు మహానందంతో పులియని రొట్టె పండుగ ఏడు రోజులు ఆచరించారు. ప్రతిరోజు లేవీయులు, యాజకులు యెహోవాకు పాటలు పాడారు. యెహోవాను స్తుతిస్తూ వాయిద్యాలు వాయించారు. \p \v 22 యెహోవా సేవ విషయంలో మంచి తెలివితేటలు చూపిన లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాడు. ఏడు రోజులు వారు తమ నియమిత భాగాలు తింటూ, సమాధానబలులు అర్పిస్తూ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించారు.\f + \fr 30:22 \fr*\ft లేదా \ft*\fqa పాపాలు ఒప్పుకున్నారు\fqa*\f* \p \v 23 సమాజమంతా మరో ఏడు రోజులు పండుగ జరుపుకోవాలని నిశ్చయించుకొని మరో ఏడు రోజులు ఆనందంగా జరుపుకున్నారు. \v 24 యూదా రాజైన హిజ్కియా సభకు 1,000 కోడెలను 7,000 గొర్రెలను మేకలను అందించాడు, అధికారులు వారికి 1,000 ఎద్దులను 10,000 గొర్రెలు మేకలను అందించారు. పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రం చేసుకున్నారు. \v 25 అప్పుడు యాజకులు, లేవీయులు, యూదావారిలో నుండి ఇశ్రాయేలీయులలో నుండి వచ్చిన సమాజపువారందరు, ఇశ్రాయేలు దేశం నుండి వచ్చి యూదాలో నివసిస్తున్న విదేశీయులు కూడా సంతోషించారు. \v 26 యెరూషలేమంతా ఎంతో సంతోషంగా ఉంది. ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడైన సొలొమోను కాలం నుండి అంతవరకు యెరూషలేములో ఇలాంటిది జరుగలేదు. \v 27 లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవించారు. వారి ప్రార్థన దేవుడు పవిత్ర నివాసమైన పరలోకానికి చేరింది. ఆయన వారి ప్రార్థన విన్నారు. \c 31 \p \v 1 ఇదంతా ముగిసిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలీయులు యూదా పట్టణాలకు వెళ్లి పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టారు. వారు యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం, మనష్షేలలో ఉన్న క్షేత్రాలను బలిపీఠాలను నాశనం చేశారు. వాటన్నిటినీ నాశనం చేసిన తర్వాత, ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాలకు వారి సొంత స్వాస్థ్యాలకు తిరిగి వచ్చారు. \s1 ఆరాధన కోసం విరాళాలు \p \v 2 హిజ్కియా ఎవరి సేవలను వారు జరిగించడానికి యాజకులను లేవీయులను వారి వారి వరుసల ప్రకారంగా నియమించాడు; దహనబలులు సమాధానబలులు అర్పించడానికి, ఇతర సేవలు జరిగించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, యెహోవా నివాసస్థలం యొక్క ద్వారాల దగ్గర స్తుతులు చెల్లించడానికి హిజ్కియా యాజకులను లేవీయులను నియమించాడు. \v 3 యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం ఉదయం, సాయంకాలం అర్పించిన వలసిన దహనబలుల కోసం, సబ్బాతు దినాలు అమావాస్య రోజులు నియమించబడిన పండుగ కాలాలు అర్పించవలసిన దహనబలుల కోసం రాజు తన ఆస్తినుండి ఇచ్చాడు. \v 4 యాజకులు, లేవీయులు యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసియున్న సేవ శ్రద్ధగా జరిగించేటట్టు, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని రాజు యెరూషలేము నగరవాసులను ఆదేశించాడు. \v 5 అలా ఆజ్ఞ జారీచేయడంతోనే ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ధారాళంగా ఇచ్చారు. ధాన్యంలో మొదటి పంట, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో, తేనెలో, పొలంలో పండే వాటిలో, కలిగిన వాటన్నిటిలో పదవ భాగాన్ని వారు తెచ్చారు. అది చాలా పెద్ద మొత్తము. \v 6 యూదా పట్టణాల్లో కాపురం ఉంటున్న యూదా వారు, ఇశ్రాయేలీయులు తమ పశువుల మందలో నుండి, గొర్రెల, మేకలమందలలో నుండి పదవ భాగాన్ని తెచ్చారు. తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులలో నుండి కూడా పదవ భాగాన్ని తెచ్చారు. వాటిని కుప్పలుగా పేర్చారు. \v 7 ఈ విధంగా చేయడం వారు మూడవ నెలలో ఆరంభించారు. ఏడవ నెలలో ముగించారు. \v 8 హిజ్కియా, అతని అధికారులు వచ్చి ఆ కుప్పలు చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు. \p \v 9 హిజ్కియా యాజకులను, లేవీయులను ఆ కుప్పలను గురించి అడిగాడు. \v 10 సాదోకు సంతతివాడు ముఖ్య యాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు, “యెహోవా తన ప్రజలను ఆశీర్వదించారు కాబట్టి ఇంత పెద్ద మొత్తం మిగిలిపోయింది, అవే ఈ కుప్పలు.” \p \v 11 అప్పుడు యెహోవా మందిరంలో గిడ్డంగులు కట్టాలని హిజ్కియా ఆదేశించాడు. వారు అలాగే చేశారు. \v 12 ఆ తర్వాత కానుకలను, పదవ భాగాలను, ప్రతిష్ఠచేసిన వస్తువులను నమ్మకంగా లోపలికి తెచ్చారు. వాటి మీద లేవీయుడైన కొనన్యా అధికారిగా ఉన్నాడు. అతని సోదరుడైన షిమీ అతని తర్వాత స్థానంలో ఉన్నాడు. \v 13 కొనన్యా చేతి క్రింద, అతని సోదరుడు షిమీ చేతి క్రింద తనిఖీ చేసేవారిగా యెహీయేలు అజజ్యాహు, నహతు, అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయా అనే వారున్నారు. వీరిని రాజైన హిజ్కియా, దేవుని మందిరానికి అధికారియైన అజర్యా నియమించారు. \p \v 14 ఇమ్నా కుమారుడైన కోరే అనే లేవీయుడు తూర్పు ద్వారానికి పాలకుడు. ప్రజలు దేవునికి స్వేచ్ఛగా అర్పించిన అర్పణ మీద అతడు అధికారిగా ఉన్నాడు. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలను, అతిపరిశుద్ధమైనవాటిని పంచిపెట్టడం అతని పని. \v 15 అతని చేతి క్రింద ఏదెను, మిన్యామీను, యెషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనే నమ్మకమైనవారు ఉన్నారు. యాజకుల పట్టణాల్లో తమ సాటి యాజకులని పెద్దలని పిన్నలని భేదం చూపకుండ వారి వారి వరసక్రమాల ప్రకారం వారి భాగాలను నమ్మకంగా పంచిపెట్టారు. \p \v 16 అంతేకాక, మూడేళ్ళు, ఆపైన వయస్సుండి, వంశావళిలో నమోదైన మగపిల్లలకు కూడా వారు పంచిపెట్టారు. వారి వారి వరుస ప్రకారం, బాధ్యత ప్రకారం సేవ చేయడానికి ప్రతిరోజు యెహోవా మందిరంలోకి వచ్చేవారందరికీ కూడా వారి భాగాలు పంచిపెట్టారు. \v 17 వారి వారి పూర్వికుల కుటుంబాల ప్రకారం వంశావళిలో నమోదైన యాజకులకు, వారి వారి పనుల ప్రకారం, వరుస ప్రకారం, ఇరవై సంవత్సరాలు, అంతకంటే పై వయస్సున్న లేవీయులకు కూడా వారు పంచిపెట్టారు. \v 18 వారు నమ్మకంగా తమను దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నారు కాబట్టి ఆ వంశావళిలో ఉన్న వారందరి చిన్నపిల్లలు, భార్యలు, కుమారులు, కుమార్తెల కోసం కూడా పంచిపెట్టారు. \p \v 19 తమ పట్టణాల చుట్టుప్రక్కల భూములలో, ఇతర పట్టణాల్లో అహరోను వారసులైన యాజకులు కొందరు కాపురముండేవారు. వారిలో మగవారందరికీ వంశావళిలో నమోదైన లేవీయులందరికి వారి భాగాలను పంచడానికి పేరుపేరున మనుష్యులు నియమించాడు. \p \v 20 హిజ్కియా ఆ విధంగా యూదా అంతటా చేశాడు. యెహోవా దృష్టిలో మంచిగా, సరియైన విధంగా, నమ్మకంగా ప్రవర్తించాడు. \v 21 యెహోవా ఆలయ సేవ కోసం, ధర్మశాస్త్రం, ఆజ్ఞ కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలోను అతడు తన దేవుని వెదికి అనుసరించాడు. మనస్పూర్తిగా పని చేశాడు కాబట్టి వర్ధిల్లాడు. \c 32 \s1 యెరూషలేమును భయపెట్టిన సన్హెరీబు \p \v 1 హిజ్కియా ఈ పనులను నమ్మకంగా జరిగించిన తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశం మీదికి దండెత్తి వచ్చాడు. అతడు తన కోసం స్వాధీనం చేసుకోవాలని ఆలోచించి, కోటగోడలున్న పట్టణాలను ముట్టడించాడు. \v 2 సన్హెరీబు వచ్చాడని, అతడు యెరూషలేముపై యుద్ధం చేయాలనుకున్నాడని హిజ్కియా చూసినప్పుడు, \v 3 అతడు తన అధికారులను, సైన్యాధిపతులను సంప్రదించాడు. పట్టణం బయట ఉన్న నీటి ఊటల నుండి నీరు సరఫరా కాకుండా చేయాలని వారు నిర్ణయించారు. వారు అతనికి తోడుగా నిలిచారు. \v 4 వారు పెద్ద గుంపుగా చేరి, “అష్షూరు రాజులు వచ్చి ఇక్కడ పుష్కలమైన నీరు ఉన్నట్లు తెలుసుకోవడం ఎందుకు?” అనుకుని ఆ ప్రాంతం గుండా ప్రవహించే నీటి ఊటలన్నిటిని, ప్రవాహాన్ని అడ్డుకున్నారు. \v 5 అప్పుడు అతడు గోడలో విరిగిన భాగాలన్నిటినీ మరమ్మత్తు చేసి, దానిపై బురుజులను నిర్మించాడు. అతడు దాని బయట మరొక గోడను కట్టించి, దావీదు నగరం మిద్దెలను బలోపేతం చేశాడు. అతడు పెద్ద సంఖ్యలో ఆయుధాలు డాళ్ళు కూడా తయారు చేయించాడు. \p \v 6 అతడు ప్రజలపై సైనిక అధికారులను నియమించి పట్టణ ద్వారం దగ్గర ఉన్న కూడలిలో తన ముందుకు వారిని పిలిపించి వారినిలా హెచ్చరించాడు: \v 7 “బలంగా ధైర్యంగా ఉండండి. అష్షూరు రాజును అతనితో ఉన్న పెద్ద సైన్యాన్ని చూసి భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. అతని దగ్గర కన్నా మన దగ్గర గొప్ప శక్తి ఉంది. \v 8 అతనికి కేవలం మానవ బలం మాత్రమే ఉంది,\f + \fr 32:8 \fr*\ft లేదా \ft*\fqa సైనిక శక్తి\fqa*\f* కానీ మనకు సహాయం చేయడానికి, మన యుద్ధాలలో పోరాడడానికి మన దేవుడైన యెహోవా మనతో ఉన్నారు” అని చెప్పాడు. అప్పుడు ప్రజలు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలనుబట్టి ధైర్యం తెచ్చుకున్నారు. \p \v 9 తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు అతని సైన్యాలన్నీ లాకీషును ముట్టడించినప్పుడు, అతడు యూదా రాజైన హిజ్కియాకు అక్కడ ఉన్న యూదా ప్రజలందరికి ఈ సందేశం ఇవ్వడానికి తన అధికారులను యెరూషలేముకు పంపాడు: \pm \v 10 “అష్షూరు రాజు సన్హెరీబు ఇలా అంటున్నాడు: మీరు ముట్టిడిలో ఉన్న యెరూషలేములో ఉన్నారు. దేన్ని చూసుకుని మీకు ఈ ధైర్యం? \v 11 హిజ్కియా, ‘మన దేవుడైన యెహోవా మనలను అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాడు’ అని చెప్తున్నాడంటే, మీరు ఆకలితో దాహంతో చనిపోయేలా అతడు మిమ్మల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడు. \v 12 హిజ్కియా స్వయంగా ఈ దేవుని ఉన్నత స్థలాలను బలిపీఠాలను తొలగించి, యూదా వారితో యెరూషలేము వారితో, ‘మీరు ఒక్క బలిపీఠం దగ్గర ఆరాధించి దానిపై బలులు అర్పించాలి’ అని చెప్పలేదా? \pm \v 13 “నేను నా పూర్వికులు ఇతర దేశాల ప్రజలందరికి ఏమి చేశామో మీకు తెలియదా? ఆ దేశాల దేవుళ్ళు ఎప్పుడైనా తమ దేశాన్ని నా చేతిలో నుండి విడిపించుకోగలిగారా? \v 14 ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తమ ప్రజలను నా నుండి రక్షించగలిగారా? అలాంటప్పుడు మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి ఎలా విడిపించగలడు? \v 15 ఇప్పుడు హిజ్కియా మిమ్మల్ని మోసం చేసి ఇలా తప్పుత్రోవ పట్టనివ్వకండి. అతన్ని నమ్మవద్దు, ఎందుకంటే ఏ దేశానికి ఏ రాజ్యానికి చెందిన ఏ దేవుడు కూడా తన ప్రజలను నా చేతిలో నుండి గాని నా పూర్వికుల చేతి నుండి గాని రక్షించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం అసాధ్యం!” \p \v 16 సన్హెరీబు అధికారులు దేవుడైన యెహోవాకు ఆయన సేవకుడైన హిజ్కియాకు వ్యతిరేకంగా ఇంకా మాట్లాడారు. \v 17 రాజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హేళన చేస్తూ ఉత్తరాలు వ్రాసి ఆయనకు వ్యతిరేకంగా ఇలా అన్నాడు: “ఇతర దేశాల ప్రజల దేవతలు తమ ప్రజలను నా చేతిలో నుండి రక్షించనట్లే, హిజ్కియా దేవుడు తన ప్రజలను నా చేతి నుండి రక్షించలేడు.” \v 18 అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో, గోడమీదున్న యెరూషలేముకు ప్రజలను బెదిరించడానికి భయపెట్టడానికి హెబ్రీ భాషలో బిగ్గరగా వారితో మాట్లాడారు. \v 19 వారు భూమిమీద ఇతర జనాంగాల కోసం మనుష్యులు తయారుచేసిన దేవతల గురించి మాట్లాడినట్లు యెరూషలేము యొక్క దేవుని గురించి మాట్లాడారు. \p \v 20 రాజైన హిజ్కియా, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొరపెట్టారు. \v 21 యెహోవా ఒక దూతను పంపారు. అతడు అష్షూరు రాజు శిబిరంలో ఉన్న పోరాట యోధులందరినీ, అధిపతులను, అధికారులందరినీ నాశనం చేశాడు. కాబట్టి అష్షూరురాజు అవమానంతో తన దేశానికి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళ్లినప్పుడు, అతని కుమారులలో కొందరు ఖడ్గంతో అతన్ని నరికివేశారు. \p \v 22 కాబట్టి యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజు సన్హెరీబు చేతి నుండి ఇతరులందరి చేతిలో నుండి రక్షించారు. ఆయన అన్ని వైపుల నుండి వారిని కాపాడారు. \v 23 చాలామంది యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు విలువైన వస్తువులు తెచ్చారు. అందువల్ల అతడు అప్పటినుండి అన్ని రాజ్యాల దృష్టిలో ఘనత పొందాడు. \s1 హిజ్కియా గర్వం, విజయం, మరణం \p \v 24 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థించగా ఆయన అతనితో మాట్లాడి, అతనికి ఒక అద్భుతమైన సూచన ఇచ్చాడు. \v 25 అయితే హిజ్కియా గర్వించి తన పట్ల చూపిన దయకు తగినట్లు ప్రవర్తించలేదు. కాబట్టి అతని మీదికీ యూదా యెరూషలేము మీదికీ యెహోవా కోపం వచ్చింది. \v 26 అయితే చివరకు హిజ్కియా తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టి తాను యెరూషలేము నివాసులు తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం ప్రజలమీదికి రాలేదు. \p \v 27 హిజ్కియాకు గొప్ప సంపదలు ఘనత లభించాయి. వెండి, బంగారం, ప్రశస్తమైన రాళ్లు, సుగంధద్రవ్యాలు, డాళ్లు, అన్ని రకాల విలువైన వస్తువులు భద్రం చేయడానికి గదులు కట్టించాడు. \v 28 ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, నూనె నిల్వ ఉంచడానికి గిడ్డంగులు కట్టించాడు. వివిధ రకాల పశువులకు శాలలు, మందలకు దొడ్లు కట్టించాడు. \v 29 దేవుడు అతనికి అతివిస్తారమైన సంపద ఇచ్చారు కాబట్టి అతడు పట్టణాలను కూడా కట్టించుకున్నాడు. ఎన్నో గొర్రెల మందలు పశువుల మందలు అతడు సంపాదించాడు. \p \v 30 ఈ హిజ్కియా గిహోను ఊట కాలువకు ఎగువన ఆనకట్ట వేయించి దావీదు పట్టణపు పడమరగా దాన్ని మళ్ళించాడు. హిజ్కియా జరిగించిన ప్రతి పనిలోను వర్ధిల్లాడు. \v 31 అయితే, అతని దేశంలో జరిగిన అద్భుతమైన ప్రగతి గురించి తెలుసుకోవడానికి బబులోను పాలకులు అతని దగ్గరకు రాయబారులను పంపారు. అతని హృదయంలో ఉన్నదంతా తెలుసుకోవాలని దేవుడు అతన్ని పరీక్షకు విడిచిపెట్టారు. \p \v 32 హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, భక్తితో అతడు చేసిన పనులు ఆమోజు కుమారుడు ప్రవక్తయైన యెషయాకు కలిగిన దర్శనాల గ్రంథంలోనూ యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలోనూ వ్రాయబడ్డాయి. \v 33 హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు వారసుల శ్మశానభూమిలోని పై భాగంలో అతన్ని పాతిపెట్టారు. అతడు చనిపోయినప్పుడు యూదా వారంతా యెరూషలేము నివాసులంతా అతని అంత్యక్రియలు ఘనంగా జరిగించారు. అతని తర్వాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు. \c 33 \s1 యూదా రాజైన మనష్షే \p \v 1 మనష్షే రాజైనప్పుడు అతని వయస్సు పన్నెండేళ్ళు. అతడు యెరూషలేములో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. \v 2 అతడు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాలు చేసే హేయక్రియలు చేశాడు. \v 3 తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు. బయలు దేవతకు బలిపీఠాలను కట్టించాడు. అషేరా స్తంభాలను నిలిపాడు. అతడు ఆకాశనక్షత్రాలకు మ్రొక్కి వాటిని పూజించాడు. \v 4 యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు నిత్యం ఉంటుంది” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు. \v 5 యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు. \v 6 అతడు తన పిల్లలను బెన్ హిన్నోము లోయలో అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని, చేతబడిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ, ఆయనకు కోపం రేపాడు. \p \v 7 అతడు చెక్కించిన విగ్రహాన్ని ఆ ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను. \v 8 నేను ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన చట్టాలు, శాసనాలు, నిబంధనలను గురించి నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, నేను మీ పూర్వికులకు నియమించిన దేశంలో నుండి ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు. \v 9 కానీ మనష్షే యూదా వారిని, యెరూషలేము ప్రజలను తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు. \p \v 10 యెహోవా మనష్షేతో, అతని ప్రజలతో మాట్లాడారు గాని వారు పెడచెవిని పెట్టారు. \v 11 అందువల్ల యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. వారు మనష్షేను బందీగా పట్టుకుని, అతని ముక్కుకు గాలం తగిలించి, ఇత్తడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు. \v 12 బాధలో అతడు తన పూర్వికుల దేవుని ఎదుట తనను తాను చాలా తగ్గించుకుని తన దేవుడైన యెహోవాను దయచూపమని ప్రాధేయపడ్డాడు. \v 13 అతడు ప్రార్థించినప్పుడు యెహోవా అతని విన్నపం ఆలకించి అతని ప్రార్థన అంగీకరించారు. అతడు యెరూషలేముకు అతని రాజ్యానికి తిరిగి వచ్చేలా చేశాడు. అప్పుడు యెహోవాయే దేవుడు అని మనష్షే తెలుసుకున్నాడు. \p \v 14 ఇది జరిగిన తర్వాత మనష్షే లోయలోని గిహోను ఊటకు పడమరగా ఉన్న దావీదు నగర ప్రాకారాన్ని చేప ద్వారం వరకు, ఓఫెలు కొండ చుట్టూ కట్టించాడు. దానిని చాలా ఎత్తు చేయించాడు. యూదాలో కోటగోడలు గల ప్రతి పట్టణంలో అతడు సేనాధిపతులను నియమించాడు. \p \v 15 అతడు యెహోవా మందిరంలో నుండి ఇతర దేవుళ్ళ విగ్రహాలను తొలగించాడు. యెరూషలేములో, యెహోవా మందిర కొండమీద తాను కట్టించిన బలిపీఠాలు తీసివేసి పట్టణం బయట వాటిని పారవేయించాడు. \v 16 అప్పుడతడు యెహోవా బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించి, వాటి మీద సమాధానబలులు కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు. \v 17 అయినా ప్రజలు ఇంకా క్షేత్రాల్లో బలులు అర్పిస్తూనే ఉన్నారు అయితే అవి వారి దేవుడైన యెహోవాకే అర్పించారు. \p \v 18 మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు తన దేవునికి చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా పేరున అతనితో మాట్లాడిన దీర్ఘదర్శి మాటలు, అవన్నీ ఇశ్రాయేలు\f + \fr 33:18 \fr*\ft అంటే, 2 దినవృత్తాంతములో తరచుగా యూదా అని వాడబడింది\ft*\f* రాజు గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. \v 19 అతడు చేసిన ప్రార్థన, దేవుడు అతని విన్నపం ఎలా ఆలకించింది, తనను తగ్గించుకోక ముందు అతడు చేసిన పాపాలు, అతడు చేసిన నమ్మకద్రోహం, కట్టించిన క్షేత్రాలను, అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను గురించి దీర్ఘదర్శులు వ్రాసిన గ్రంథాల్లో ఉన్నాయి. \v 20 మనష్షే నిద్రపోయి (చనిపోయి) తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని పట్టణంలోనే అతన్ని సమాధి చేశారు. అతని స్థానంలో అతని కుమారుడు ఆమోను రాజయ్యాడు. \s1 యూదా రాజైన ఆమోను \p \v 21 ఆమోను రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు. అతడు యెరూషలేములో రెండేళ్ళు పరిపాలించాడు. \v 22 అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. తన తండ్రి మనష్షే చేయించిన విగ్రహాలన్నిటికి ఆమోను బలులు అర్పిస్తూ పూజిస్తూ ఉండేవాడు. \v 23 తన తండ్రి మనష్షేలా ఆమోను యెహోవా ఎదుట తనను తగ్గించుకోలేదు. పైగా అతడు తన దోషాన్ని పెంచుకున్నాడు. \p \v 24 ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, తన సొంత భవనంలోనే అతన్ని చంపారు. \v 25 అప్పుడు యూదా దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్రపన్నిన వారినందరిని చంపేశారు, అతని స్థానంలో అతని కుమారుడైన యోషీయాను రాజుగా చేశారు. \c 34 \s1 యోషీయా యొక్క సంస్కరణలు \p \v 1 యోషీయా రాజైనప్పుడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలించాడు. \v 2 అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు. \p \v 3 అతడు పాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో ఇంకా యువకునిగా ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని వెదకడం మొదలుపెట్టాడు. పన్నెండవ సంవత్సరంలో ఉన్నత స్థలాలను అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను తీసివేయడం, యూదాను యెరూషలేమును పవిత్రం చేయడం మొదలుపెట్టాడు. \v 4 అతని ఆదేశాల మేరకు ప్రజలు బయలు బలిపీఠాలను పడగొట్టారు. వాటికి పైగా ఉన్న ధూపవేదికలను సూర్యదేవతా విగ్రహాలను అతడు కూలగొట్టించాడు. అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను ముక్కలు చేయించాడు. వాటిని చూర్ణం చేయించి, వాటికి బలులర్పించినవారి సమాధుల మీద చల్లివేశాడు. \v 5 ఆ దేవత పూజారుల ఎముకలను వారి బలిపీఠాల మీద కాల్పించాడు. ఈ విధంగా అతడు యూదాను, యెరూషలేమును పవిత్రం చేశాడు. \v 6 మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను, నఫ్తాలి పట్టణాల వరకు వాటి చుట్టూ ఉన్న శిథిలాల్లో, \v 7 అతడు బలిపీఠాలను అషేరా స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలను దేవతాస్తంభాలను ధ్వంసం చేశాడు. ఇశ్రాయేలు దేశమంతట్లో ధూపవేదికలన్నిటినీ సూర్య దేవత విగ్రహాలన్నిటిని ముక్కలుగా నరికి వేయించాడు. ఆ తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వచ్చాడు. \p \v 8 యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో దేశాన్ని, మందిరాన్ని పవిత్రం చేద్దామని తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణ అధిపతియైన మయశేయా, లేఖికుడును యోవాహాజు కుమారుడునైన యోవాహును పంపాడు. \p \v 9 వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, అంతకుముందు దేవుని ఆలయానికి తెచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ఆ డబ్బును మనష్షేవారు, ఎఫ్రాయిమీయుల, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారందరు, యూదా వారు, బెన్యామీనీయులు, యెరూషలేము నగరవాసులు ఇస్తూ ఉంటే, ద్వారపాలకులైన లేవీయులు దానిని జమచేశారు. \v 10 అప్పుడు వారు ఆ డబ్బును యెహోవా మందిర పనులు చేయించడానికి నియమించబడిన మనుష్యులకు అప్పచెప్పారు. వారు మందిరాన్ని మరమ్మతు చేస్తూ బాగుచేస్తున్న వారికి ఆ డబ్బును జీతంగా ఇచ్చారు. \v 11 వారు యూదా రాజులు పాడుచేసిన భవనాలకు చెక్కిన రాళ్లు, చెక్కలు, దూలాలను కొనడానికి, వడ్రంగి వారికి, నిర్మించేవారికి ఆ డబ్బు ఇచ్చారు. \p \v 12 ఆ మనుష్యులు నమ్మకంగా పని చేశారు. వారితో పని చేయించడానికి నియమించబడిన వారెవరంటే, మెరారీయులైన లేవీయులు యహతు, ఓబద్యా, కహాతు వంశంవారు జెకర్యా, మెషుల్లాము. పని చేయించడానికి నియమించబడిన లేవీయులందరు వాయిద్యాలు వాయించడంలో నైపుణ్యం కలవారు. \v 13 వారు బరువులు మోసేవారి మీద, ప్రతి విధమైన పని చేసేవారి మీదా తనిఖీదారులుగా ఉన్నారు. లేవీయులలో కొంతమంది లేఖికులుగా, కార్యదర్శులుగా, ద్వారపాలకులుగా సేవ చేసేవారు. \s1 ధర్మశాస్త్ర గ్రంథం కనబడుట \p \v 14 యెహోవా మందిరంలోకి తేబడిన డబ్బును వారు బయటకు తీసుకువస్తున్నప్పుడు, యెహోవా మోషే ద్వారా అనుగ్రహించిన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనిపించింది. \v 15 హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అన్నాడు. అతడు దానిని షాఫానుకు ఇచ్చాడు. \p \v 16 షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరకు తీసుకెళ్లి ఇలా చెప్పాడు: “మీ అధికారులకు మీరు అప్పచెప్పిన పనులన్నీ చేస్తున్నారు. \v 17 వారు యెహోవా మందిరంలో ఉన్న డబ్బు జమచేసి, మందిరంలో పని చేస్తున్న వారికి, వారి పై అధికారుల చేతికి అప్పగించారు.” \v 18 అప్పుడు కార్యదర్శియైన షాఫాను, “యాజకుడైన హిల్కీయా ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చాడు” అని రాజుకు చెప్పాడు. షాఫాను దానిని రాజు సముఖంలో చదివాడు. \p \v 19 ధర్మశాస్త్రంలోని మాటలు విన్నప్పుడు రాజు తన బట్టలు చింపుకున్నాడు. \v 20 తర్వాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకా కుమారుడైన అబ్దోనుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు: \v 21 “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో వ్రాసిన మాటల గురించి నా కోసం, ఇశ్రాయేలు యూదాలో శేషించిన వారి కోసం, యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వికులు యెహోవా మాటను పాటించలేదు; ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం ప్రవర్తించలేదు.” \p \v 22 అప్పుడు హిల్కీయా, రాజు పంపినవారు హుల్దా అనే ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె షల్లూము భార్య, అతడు తోఖతు\f + \fr 34:22 \fr*\ft తిక్వా అని కూడా పిలువబడేవాడు\ft*\f* కుమారుడు, వస్త్రశాల తనిఖీదారుడైన హస్రా\f + \fr 34:22 \fr*\ft హర్హషు అని కూడా పిలువబడేవాడు\ft*\f* మనుమడు. ఆమె యెరూషలేములో నూతన భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు. \p \v 23 ఆమె వారితో ఇలా అన్నది, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: మిమ్మల్ని నా దగ్గరకు పంపిన వ్యక్తికి చెప్పండి, \v 24 ‘యెహోవా చెప్పే మాట ఇదే: యూదారాజు సమక్షంలో చదివించిన గ్రంథంలో వ్రాసి ఉన్న శాపాలన్నిటిని అలాగే విపత్తును నేను ఈ స్థలం మీదికి, దీని ప్రజలమీదికి రప్పిస్తాను. \v 25 ఎందుకంటే ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు, వారు చేతులతో చేసిన వాటన్నిటి బట్టి నాకు కోపం రేపారు. నా కోపం ఈ స్థలంపై కుమ్మరించబడుతుంది, అది చల్లారదు.’ \v 26 యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి, ‘నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: \v 27 వారు ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం మెత్తబడి నిన్ను నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు. \v 28 నేను నిన్ను నీ పూర్వికుల దగ్గరకు చేరుస్తాను, సమాధానంతో నీవు సమాధి చేయబడతావు. నేను ఈ స్థలం మీదికి, ఇక్కడ నివసించేవారి మీదికి రప్పించే విపత్తును నీ కళ్లు చూడవు.’ ” \p అప్పుడు వారు ఆమె జవాబును రాజు దగ్గరకు తీసుకెళ్లారు. \p \v 29 అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. \v 30 అతడు యూదా ప్రజలతో, యెరూషలేము వాసులతో, యాజకులతో, లేవీయులతో, అల్పుల నుండి ఘనులైన ప్రజలందరితో కలిసి యెహోవా ఆలయానికి వెళ్లాడు. అక్కడ రాజు, వారంతా వినేటట్టు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివి వినిపించాడు. \v 31 రాజు తన స్తంభం దగ్గర నిలబడి, తన పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో యెహోవాను అనుసరిస్తానని, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు పాటిస్తానని, ఈ గ్రంథంలో వ్రాయబడిన నిబంధన మాటలకు లోబడతానని యెహోవా సన్నిధిలో నిబంధనను పునరుద్ధరించాడు. \p \v 32 అప్పుడు యెరూషలేములో, బెన్యామీనులో ఉన్నవారందరిని ఆ నిబంధనకి సమ్మతించేటట్టు చేశాడు. యెరూషలేమువారు తమ పూర్వికుల దేవుని నిబంధన ప్రకారం అలా చేశారు. \p \v 33 యోషీయా ఇశ్రాయేలు ప్రజలకు చెందిన ప్రాంతమంతటిలో నుండి విగ్రహాలన్నిటిని తీసివేశాడు. అవి అసహ్యమైన విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలులో ఉన్నవారందరు తమ దేవుడైన యెహోవాను సేవించేటట్టు చేశాడు. అతడు బ్రతికినన్నాళ్ళు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. \c 35 \s1 యోషీయా పస్కాను ఆచరించుట \p \v 1 యోషీయా యెరూషలేములో యెహోవాకు పస్కా పండుగ ఆచరించాడు. మొదటి నెల పద్నాలుగవ రోజు ప్రజలు పస్కా గొర్రెపిల్లను వధించారు. \v 2 యోషీయా యాజకులను వారి విధులకు నియమించి యెహోవా ఆలయ సేవను జరిగించేలా వారిని ప్రోత్సహించాడు. \v 3 ఇశ్రాయేలీయులందరికి బోధించిన, యెహోవాకు ప్రతిష్ఠించబడిన లేవీయులతో అతడు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో పవిత్ర మందసాన్ని ఉంచండి. ఇది మీ భుజాలపై మోయకూడదు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు, ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకు సేవ చేయండి. \v 4 ఇశ్రాయేలు రాజైన దావీదు అతని కుమారుడు సొలొమోను వ్రాసిన సూచనల ప్రకారం, మీ కుటుంబాల విభాగాల ప్రకారం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. \p \v 5 “మీ తోటి ఇశ్రాయేలీయులు, సామాన్య ప్రజల కుటుంబాల్లోని ప్రతి ఉపవిభాగం కోసం లేవీయుల సమూహంతో పరిశుద్ధ స్థలంలో నిలబడండి. \v 6 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు, పస్కా గొర్రెపిల్లలను వధించి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. మీ తోటి ఇశ్రాయేలీయుల కోసం గొర్రెపిల్లలను సిద్ధం చేయండి.” \p \v 7 యోషీయా రాజు అక్కడున్న సామాన్యులందరికీ తన సొంత ఆస్తుల నుండి పస్కా అర్పణల కోసం మొత్తం 30,000 గొర్రెపిల్లలు మేకలను అందించాడు, అలాగే 3,000 కోడెలను అందించాడు. \p \v 8 అతని అధికారులు కూడా ప్రజలకు, యాజకులకు లేవీయులకు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. దేవుని ఆలయ బాధ్యత వహించిన హిల్కీయా, జెకర్యా, యెహీయేలు, యాజకులకు 2,600 గొర్రెపిల్లలు మేకలను పస్కా అర్పణలుగా అందించాడు, అలాగే 300 కోడెలను అందించాడు. \v 9 కొనన్యా, అతని సహోదరులైన షెమయా, నెతనేలు, లేవీయుల నాయకులైన హషబ్యా, యెహీయేలు, యోజాబాదులు లేవీయుల కోసం 5,000 గొర్రెపిల్లలు మేకలు 500 కోడెలను పస్కా అర్పణలుగా ఇచ్చారు. \v 10 సేవకు అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పుడు రాజు ఆజ్ఞ ప్రకారం యాజకులు స్థలాల్లో లేవీయులు తమ వరుసల్లో నిలబడ్డారు. \v 11 పస్కా గొర్రెపిల్లలు వధించబడ్డాయి, లేవీయులు జంతువుల చర్మం తీస్తూ ఉండగా, యాజకులు వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. \v 12 మోషే గ్రంథంలో వ్రాయబడినట్లుగా, యెహోవాకు అర్పించడానికి ప్రజల కుటుంబాల యొక్క ఉపవిభాగాలకు ఇవ్వడానికి వారు దహనబలులను ప్రక్కన పెట్టారు. పశువుల విషయంలోను అలాగే చేశారు. \v 13 నిర్దేశించబడిన ప్రకారం వారు పస్కా జంతువులను నిప్పుమీద కాల్చారు, అలాగే వారు పరిశుద్ధ అర్పణలను కుండల్లో, బానలలో, కడాయిలలో ఉడకబెట్టి, ప్రజలందరికి త్వరగా వడ్డించారు. \v 14 దీని తర్వాత, వారు తమ కోసం యాజకుల కోసం సిద్ధం చేశారు. ఎందుకంటే అహరోను వంశస్థులైన యాజకులు రాత్రి ప్రొద్దుపోయే వరకు దహనబలులను క్రొవ్వు భాగాలను అర్పించారు. కాబట్టి లేవీయులు తమ కోసం అహరోను యాజకుల కోసం సిద్ధం చేసుకున్నారు. \p \v 15 దావీదు, ఆసాపు, హేమాను, రాజుకు దీర్ఘదర్శియైన యెదూతూను నియమించిన ప్రకారం, ఆసాపు వారసులైన సంగీతకారులు తమ స్థలాల్లో ఉన్నారు. ప్రతి ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు తమ సేవను విడిచి రాకుండ వారి బంధువులైన లేవీయులు వారి కోసం మాంసం సిద్ధం చేశారు. \p \v 16 ఈ విధంగా రాజైన యోషీయా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ రోజు వారు పస్కా పండుగ ఆచరించాడు. యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించారు. యెహోవా సేవ ఏమీ లోపం లేకుండా జరిగింది. \v 17 అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ సమయంలో పస్కా పండుగను పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు. \v 18 సమూయేలు ప్రవక్త రోజులనుండి ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనంగా జరగలేదు. యాజకులు, లేవీయులు, హాజరైన యూదా వారందరూ, ఇశ్రాయేలు వారందరూ, యెరూషలేము కాపురస్థులందరితో కలిసి యోషీయా పస్కా ఆచరించిన విధంగా ఇశ్రాయేలు రాజులు ఎన్నడూ ఆచరించలేదు. \v 19 యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ పస్కా పండుగ జరిగింది. \s1 యోషీయా మరణము \p \v 20 ఇదంతా జరిగిన తర్వాత, యోషీయా మందిరాన్ని చక్కబెట్టిన తర్వాత ఈజిప్టు రాజైన నెకో యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న కర్కెమీషు మీదికి యుద్ధానికి వెళ్తుండగా యోషీయా అతని మీదికి బయలుదేరాడు. \v 21 కానీ నెకో అతని దగ్గరకు దూతలను పంపి, “యూదా రాజా, నీకు నాకూ మధ్య ఎలాంటి గొడవ ఉంది? ఈ సమయంలో నేను దాడి చేస్తున్నది మీపై కాదు, నేను యుద్ధం చేస్తున్న ఇంటిపై. దేవుడు నాకు త్వర పడమని చెప్పాడు; కాబట్టి నాతో ఉన్న దేవున్ని ఎదిరించడం మానేయండి, లేదంటే ఆయనే నిన్ను నాశనం చేస్తాడు” అని చెప్పాడు. \p \v 22 అయితే యోషీయా అతని దగ్గర నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అతనితో యుద్ధం చేయాలని మారువేషం వేసుకుని దేవుని ఆజ్ఞగా నెకో చెప్పిన దానిని వినక, మెగిద్దోను మైదానాల్లో యుద్ధం చేయడానికి వెళ్లాడు. \p \v 23 విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన అధికారులతో, “నేను తీవ్రంగా గాయపడ్డాను. ఇక్కడినుండి నన్ను తీసుకెళ్లండి” అని చెప్పాడు. \v 24 అతని సేవకులు అతన్ని తన రథం మీద నుండి దించి అతనికున్న వేరే రథం మీద ఉంచి యెరూషలేముకు తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వికుల సమాధుల మధ్య యోషీయాను పాతిపెట్టారు. అతని మృతికి యూదా, యెరూషలేము ప్రజలంతా దుఃఖించారు. \p \v 25 యిర్మీయా యోషీయా గురించి శోకగీతాన్ని రచించాడు. ఈ రోజు వరకు గాయనీ గాయకులందరు తమ విలాపవాక్కులలో యోషీయాను జ్ఞాపకం చేసుకుంటూ ఆలపిస్తారు. ఇలా చేయడం ఇశ్రాయేలులో ఒక ఆచారంగా మారింది. \p \v 26 యోషీయాను గురించిన ఇతర విషయాలు యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసిన మాట అనుసరించి అతడు దయతో చేసిన పనులు, \v 27 మొదటి నుండి చివరి వరకు అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. \c 36 \nb \v 1 అప్పుడు దేశ ప్రజలు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అతని తండ్రి స్థానంలో యెరూషలేములో రాజుగా చేశారు. \s1 యూదా రాజైన యెహోయాహాజు \p \v 2 యెహోయాహాజు\f + \fr 36:2 \fr*\ft హెబ్రీలో \ft*\fqa యోహాజు \fqa*\fq యెహోయాహాజు \fq*\ft యొక్క మరో రూపం; \+xt 4|link-href="2CH 36:4"\+xt* వచనంలో కూడా ఉంది\ft*\f* రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. \v 3 తర్వాత ఈజిప్టు రాజు యెరూషలేములో అతన్ని పదవి నుండి తొలగించి, యూదాపై వంద తలాంతుల\f + \fr 36:3 \fr*\ft అంటే, సుమారు 3.34 టన్నులు\ft*\f* వెండిని, ఒక తలాంతు\f + \fr 36:3 \fr*\ft అంటే, సుమారు 34 కి. గ్రా. లు\ft*\f* బంగారాన్ని పన్నుగా విధించాడు. \v 4 ఈజిప్టు రాజు యెహోయాహాజు సోదరుడైన ఎల్యాకీమును యూదా యెరూషలేము మీద రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే నెకో ఎల్యాకీము సోదరుడైన యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు. \s1 యూదా రాజైన యెహోయాకీము \p \v 5 యెహోయాకీము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. \v 6 బబులోను రాజైన నెబుకద్నెజరు అతని మీద దాడి చేసి అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు. \v 7 అంతేకాక యెహోవా మందిరంలో ఉన్న వస్తువులను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకెళ్లి అక్కడున్న తన దేవుని క్షేత్రంలో\f + \fr 36:7 \fr*\ft రాజభవనం\ft*\f* పెట్టాడు. \p \v 8 యెహోయాకీము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన అసహ్యకరమైనవి, అతనికి వ్యతిరేకంగా కనిపించినవన్నీ ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు. \s1 యూదా రాజైన యెహోయాకీను \p \v 9 యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు,\f + \fr 36:9 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa ఎనిమిది; \+xt 2 రాజులు 24:8\+xt* \fqa*\ft కూడా చూడండి.\ft*\f* అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు పరిపాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. \v 10 వసంతకాలం వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజు మనుష్యులను పంపి అతన్ని, అతనితో పాటు యెహోవా మందిరంలో ఉన్న విలువైన వస్తువులను బబులోనుకు రప్పించాడు. అతడు యెహోయాకీను పినతండ్రియైన\f + \fr 36:10 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa సోదరుడు అంటే బంధువు \fqa*\ft అని ప్రస్తావించబడింది; \+xt 2 రాజులు 24:17\+xt* \ft*\ft కూడా చూడండి.\ft*\f* సిద్కియాను యూదా, యెరూషలేము మీద రాజుగా చేశాడు. \s1 యూదా రాజైన సిద్కియా \p \v 11 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. \v 12 అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. యెహోవా వాక్కు పలికిన యిర్మీయా ప్రవక్త ముందు అతడు తగ్గించుకోలేదు. \v 13 అతడు దేవుని పేరిట తనతో ప్రమాణం చేయించిన రాజైన నెబుకద్నెజరు మీద కూడా తిరుగుబాటు చేశాడు. అతడు మెడవంచని వాడై తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగలేదు. \v 14 ఇంకా, యాజకుల నాయకులందరు, ప్రజలందరు ఇతర దేశాల అసహ్యమైన ఆచారాలన్నిటిని అనుసరించి, యెరూషలేములో ఆయన ప్రతిష్ఠించిన యెహోవా మందిరాన్ని అపవిత్రం చేస్తూ మరింతగా నమ్మకద్రోహులయ్యారు. \s1 యెరూషలేము పతనం \p \v 15 వారి పూర్వికుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాసస్థలం మీద జాలిపడి, వారికి తన దూతల ద్వారా పదే పదే సందేశాలు పంపించారు. \v 16 కానీ వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు, ఆయన మాటలను తృణీకరించారు, ఆయన ప్రజలపైకి నివారించలేని యెహోవా ఉగ్రత వచ్చేవరకు వారు ఆయన ప్రవక్తలను అపహాస్యం చేశారు. \v 17 యెహోవా వారి మీదికి బబులోనీయుల\f + \fr 36:17 \fr*\ft లేదా \ft*\fqa కల్దీయుల\fqa*\f* రాజును రప్పించారు. అతడు వారి పరిశుద్ధాలయంలో వారి యువకులను కత్తితో చంపాడు. యువకులను గాని యువతులను గాని వృద్ధులను గాని బలహీనులను గాని విడిచిపెట్టలేదు. దేవుడు వారందరినీ నెబుకద్నెజరు చేతికి అప్పగించారు. \v 18 అతడు యెహోవా మందిరం నుండి పెద్దవి చిన్నవి అని తేడా లేకుండా అన్ని వస్తువులను, యెహోవా మందిరం నిధులు, రాజు నిధులు, అతని అధికారుల నిధులన్నింటిని బబులోనుకు తీసుకెళ్లాడు. \v 19 వారు దేవుని ఆలయానికి నిప్పంటించి యెరూషలేము గోడలను పడగొట్టారు; వారు రాజభవనాలన్నిటిని తగలబెట్టి, అక్కడ విలువైన ప్రతీదానిని నాశనం చేశారు. \p \v 20 ఖడ్గం నుండి తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు. పర్షియా రాజ్యం అధికారంలోకి వచ్చేవరకు వారు అక్కడే ఉండి అతనికి అతని కుమారులకు దాసులుగా ఉన్నారు. \v 21 దేశం తన సబ్బాతు దినాలను ఆనందంగా గడిపింది; యిర్మీయా చెప్పిన యెహోవా వాక్కు నెరవేరేలా డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యే వరకు అది పాడైన సమయమంతా విశ్రాంతి తీసుకుంది. \p \v 22 పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా, దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు: \pmo \v 23 “పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: \pm “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు. మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా అక్కడికి వెళ్లవచ్చు, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక.’ ”