\id 1PE - Biblica® Open Telugu Contemporary Version \usfm 3.0 \ide UTF-8 \h 1 పేతురు పత్రిక \toc1 పేతురు వ్రాసిన మొదటి పత్రిక \toc2 1 పేతురు పత్రిక \toc3 1 పేతురు \mt1 పేతురు \mt2 వ్రాసిన మొదటి పత్రిక \c 1 \po \v 1 యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు, \po దేవునిచేత ఎన్నుకోబడినవారు ఎవరైతే పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియ ప్రాంతాలకు చెదరిపోయి ప్రవాసులుగా జీవిస్తున్నారో వారికి వ్రాయునది. \v 2 తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి, మీరు యేసు క్రీస్తుకు విధేయులు కావడానికి ఆయన రక్తం ప్రోక్షణకు ఆయన మిమ్మల్ని ఎన్నుకుని తన ఆత్మ చేత పవిత్రులు చేశారు: \po మీకు కృపా సమాధానాలు సమృద్ధిగా కలుగును గాక. \s1 సజీవ నిరీక్షణ బట్టి దేవునికి స్తోత్రం \p \v 3 మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు. \v 4 ఎన్నడు నశించనిది, కొల్లగొట్టలేనిది, వాడిపోనిదైన వారసత్వాన్ని పరలోకంలో మన కోసం భద్రపరిచారు. \v 5 చివరి రోజుల్లో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కోసం భద్రపరచబడి ఉంది. \v 6 మీరు ఎదుర్కోవలసిన అనేక విధాలైన పరీక్షలవల్ల ఇప్పుడు తాత్కాలికంగా మీకు బాధ కలిగినప్పటికి వీటన్నిటిలో మీరు అధికంగా సంతోషించండి. \v 7 అవి మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం అగ్నిచేత పరీక్షించబడుతుంది; అలాగే బంగారం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడ పరీక్షింపబడాలి. అప్పుడే అది చెడిపోకుండా నిలిచి ఉంటుంది. దానివల్ల యేసు క్రీస్తు ప్రత్యక్షమైన రోజున కీర్తి, మహిమ, ఘనతలు కలుగుతాయి. \v 8 మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. \v 9 ఎలాగంటే, మీ విశ్వాసానికి ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు. \p \v 10 మీకు కలుగబోయే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి తీవ్రంగా చాలా జాగ్రత్తగా విచారించి పరిశోధించారు. \v 11 క్రీస్తు అనుభవించాల్సిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. \v 12 పరలోకం నుండి పంపబడి పరిశుద్ధాత్మచే ప్రభావితులై మీకు సువార్తను ప్రకటించినవారి ద్వారా మీకు ఇప్పుడు చెప్పబడిన సంగతులను వారు చెప్పినప్పుడు, తమ కోసం కాదు కాని మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతి వారికి వెల్లడి చేయబడింది. వీటిని దేవదూతలు సహితం చూడాలని ఆశించారు. \s1 పరిశుద్ధులుగా ఉండండి \p \v 13 కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. \v 14 మీరు విధేయత కలిగిన బిడ్డలు కాబట్టి, అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు గల చెడ్డకోరికలకు అనుగుణంగా ప్రవర్తించకండి. \v 15 మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. \v 16 ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి”\f + \fr 1:16 \fr*\ft \+xt లేవీ 11:44,45; 19:2\+xt*\ft*\f* అని వ్రాయబడి ఉంది. \p \v 17 పక్షపాతం లేకుండా ప్రతివారికి వారి వారి పనిని బట్టి తీర్పు తీర్చే దేవున్ని మీరు తండ్రీ అని పిలుస్తున్నారు కాబట్టి ఈ లోకంలో విదేశీయులుగా మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి. \v 18 ఎలాగంటే, మీ పితరుల నుండి మీకు లభించిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీకు విముక్తి ఇవ్వడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసు. అది నశించిపోయే వెండి బంగారాల వంటిది కాదు. \v 19 అయితే నిష్కళంకమైన లోపం లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారు. \v 20 లోకం సృజింపబడక ముందే ఆయన దేవునిచే ఎన్నుకోబడ్డారు కాని మీ కోసం ఈ చివరి కాలాల్లో బయలుపరచబడ్డారు. \v 21 మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవున్ని విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి. \p \v 22 ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు. తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగి ఉండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా\f + \fr 1:22 \fr*\ft కొ.ప్రా.ప్ర.లలో \ft*\fqa స్వచ్ఛమైన హృదయంతో\fqa*\f* అధికంగా ప్రేమించుకోండి. \v 23 ఎలాగంటే సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు క్షయబీజం నుండి కాక అక్షయబీజం నుండి తిరిగి జన్మించారు. \v 24 ఎందుకనగా, \q1 “ప్రజలందరు గడ్డి వంటివారు, \q2 వారి వైభవం అంతా పొలంలోని పువ్వు వంటిది; \q1 గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి, \q2 \v 25 కాని దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.”\f + \fr 1:25 \fr*\ft \+xt యెషయా 40:6-8\+xt*\ft*\f* \m ఈ వాక్యమే మీకు ప్రకటించబడింది. \c 2 \p \v 1 కాబట్టి, ప్రతి విధమైన దుష్టత్వానికి, కపటానికి, అసూయకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన దూషణ మానేయండి. \v 2 నూతనంగా జన్మించిన శిశువుల్లా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక పాలను ఆశించండి. దాన్ని త్రాగడం వలన మీరు పెరిగి పెద్దవారై రక్షించబడతారు. \v 3 ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి తెలుసుకోండి. \s1 సజీవమైన రాయి, ఎన్నుకోబడిన ప్రజలు \p \v 4 ఉపయోగం లేనిదిగా మనుష్యులచే తిరస్కరించబడిన, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ రాయియైన ప్రభువును సమీపించండి. \v 5 మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు. \v 6 ఎందుకంటే లేఖనాల్లో, \q1 “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని వేశాను \q2 అది ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయి; \q1 ఆయనలో నమ్మకం ఉంచేవారు \q2 ఎన్నడూ సిగ్గుపరచబడరు”\f + \fr 2:6 \fr*\ft \+xt యెషయా 28:16\+xt*\ft*\f* \m అని వ్రాయబడి ఉంది. \v 7 ఇప్పుడు విశ్వసించేవారికి ఈ రాయి అమూల్యమైనది. కాని విశ్వసించని వారికి, \q1 “ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి \q2 మూలరాయి అయ్యింది.”\f + \fr 2:7 \fr*\ft \+xt కీర్తన 118:22\+xt*\ft*\f* \m \v 8 అంతేకాదు, \q1 “అది ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయి, \q2 వారిని పడిపోయేలా చేసే అడ్డుబండ అయ్యింది.”\f + \fr 2:8 \fr*\ft \+xt యెషయా 8:14\+xt*\ft*\f* \m వారిని పడద్రోసేది ఈ రాయే, వారు ఆ వాక్యానికి అవిధేయులు అయినందుకు వారు పతనమయ్యారు. వారిని గురించిన దేవుని సంకల్పం అలాంటిది. \p \v 9 కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు. \v 10 ఒకప్పుడు మీరు ప్రజలు కారు కాని ఇప్పుడు మీరు దేవుని ప్రజలు; ఒకప్పుడు మీరు దేవుని కృపను ఎరుగరు కాని ఇప్పుడు మీరు ఆ కృపకు పాత్రులు. \s1 దేవుని ఎరుగని సమాజంలో దైవభక్తి కలిగి జీవించుట \p \v 11 ప్రియ మిత్రులారా, ఈ లోకంలో విదేశీయులుగా, ప్రవాసులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కాబట్టి వాటికి విడిచిపెట్టండి. \v 12 దేవుని ఎరుగనివారు మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు. \p \v 13 ప్రభువు కోసం మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. \v 14 దుష్టులను శిక్షించడానికి, మంచివారిని మెచ్చుకోవడానికి పంపబడిన పాలకులకు విధేయులై ఉండండి. \v 15 మీరు మీ సత్కార్యాల వలన మూర్ఖులైన జ్ఞానంలేని ప్రజల నోరు మూయించాలి, ఇది దేవుని చిత్తం. \v 16 స్వతంత్రులై బ్రతకండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగించకండి; దేవునికి దాసులుగా జీవించండి. \v 17 అందరిని గౌరవించండి, తోటి విశ్వాసులను ప్రేమించండి, దేవునిలో భయభక్తులు కలిగి ఉండండి, రాజులను గౌరవించండి. \p \v 18 దాసులారా, మీ యజమానులకు మీరు విధేయులై ఉండి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించండి. దయగల, సౌమ్యులైన యజమానులకే గాక కఠినులైన వారికి కూడా లోబడి ఉండండి. \v 19 ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని పట్ల నిష్కపటమైన మనస్సాక్షి కలిగి దాన్ని ఓర్పుతో సహిస్తే దేవుని అంగీకారం పొందుతారు. \v 20 పాపం చేసినందుకు ప్రతిఫలంగా వచ్చే శిక్షను ఓర్పుతో భరిస్తే దానిలో గొప్పతనమేంటి? అయితే మంచి చేసి బాధపడాల్సి వచ్చినపుడే మీరు ఓర్పుతో భరిస్తే అది దేవుని మెచ్చుకోదగిన విషయం. \v 21 దీని కోసమే మీరు పిలువబడ్డారు. ఎందుకంటే క్రీస్తు కూడా మీ కోసం బాధపడి మీరు ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఒక ఉదాహరణను ఉంచారు. \q1 \v 22 “ఆయన ఎలాంటి పాపం చేయలేదు, \q2 ఆయన నోటిలో ఏ మోసం లేదు.”\f + \fr 2:22 \fr*\ft \+xt యెషయా 53:9\+xt*\ft*\f* \m \v 23 తాను దూషించబడినా తిరిగి దూషించలేదు. తాను హింసించబడుతున్నా ఎవరిని బెదిరించలేదు. కాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నారు. \v 24 మనం పాపాల విషయంలో మరణించి నీతి కోసం జీవించేలా ఆయన, “మన పాపాలను తనపై ఉంచుకుని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు. \v 25 మీరు త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారు”\f + \fr 2:25 \fr*\ft \+xt యెషయా 53:4,5,6\+xt*\ft*\f* కాని ఇప్పుడు మీ ఆత్మల సంరక్షకుడు కాపరియైన వాని దగ్గరకు మీరు తిరిగి వచ్చారు. \c 3 \p \v 1 అలాగే భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. ఒకవేళ వారిలో ఎవరైనా దేవుని వాక్యాన్ని అంగీకరించనివారు ఉంటే, మీరు ఒక్క మాట కూడా పలకాల్సిన అవసరం లేకుండానే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. \v 2 ఎందుకంటే భయభక్తులతో, పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తనను వారు గమనిస్తారు. \v 3 తల వెంట్రుకలను అలంకరించుకోవడం, బంగారు ఆభరణాలను ధరించడం, విలువైన వస్త్రాలు వేసుకోవడం అనే బాహ్య సౌందర్యం వద్దు. \v 4 మృదువైన, సాధు స్వభావమనే అక్షయమైన అలంకారం గల హృదయపు సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అదే దేవుని దృష్టిలో అమూల్యమైనది. \v 5 ఎలాగంటే, పూర్వకాలంలో పరిశుద్ధులైన స్త్రీలు దేవునిలో నిరీక్షణ ఉంచి ఇలా తమ సౌందర్యాన్ని పోషించుకుంటూ, తమ భర్తలకు లోబడి ఉన్నారు. \v 6 అదే విధంగా శారా అబ్రాహాముకు లోబడి అతడిని యజమాని అని పిలిచింది. మీరు మంచి పనులు చేస్తూ దేనికి బెదరని వారైతే ఆమెకు పిల్లలవుతారు. \p \v 7 అలాగే భర్తలారా మీరు, మీ భార్యలు జీవమనే కృపావరంలో మీతో జతపనివారై ఉన్నారని ఎరిగి బలహీనులైన మీ భార్యలను గౌరవిస్తూ వారితో కాపురం చేయండి. అప్పుడు మీ ప్రార్థనలకు ఆటంకం ఉండదు. \s1 మంచి చేయడానికి శ్రమపడుట \p \v 8 చివరిగా మీరందరు ఏక మనసు కలిగి సానుభూతి కలవారై పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయంతో ఉండండి. \v 9 కీడుకు ప్రతిగా కీడును, దూషణకు ప్రతిగా దూషణ చేయకండి. దానికి బదులుగా ఆశీర్వదించండి. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు. \v 10 ఎందుకంటే, \q1 “ఎవరైనా జీవితాన్ని ప్రేమించి \q2 మంచి దినాలను చూడాలనుకుంటారో \q1 వారు చెడు మాట్లాడకుండ నాలుకను \q2 మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి. \q1 \v 11 వారు కీడు చేయడం మాని మేలు చేయాలి; \q2 వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. \q1 \v 12 ప్రభువు కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, \q2 ఆయన చెవులు వారి ప్రార్థనలను వింటున్నాయి, \q1 అయితే ప్రభువు ముఖం కీడు చేసేవారికి విరోధంగా ఉన్నది.”\f + \fr 3:12 \fr*\ft \+xt కీర్తన 34:12-16\+xt*\ft*\f* \p \v 13 మంచి చేయాలని మీకు ఆసక్తి ఉంటే, మీకు హాని చేసేది ఎవరు? \v 14 మీరొకవేళ, నీతి కోసం శ్రమపడినా మీరు ధన్యులు. “వారి బెదిరింపుకు భయపడకండి,\f + \fr 3:14 \fr*\ft లేదా \ft*\fqa వారు భయపడే దానికి భయపడకండి\fqa*\f* కలవరపడకండి.”\f + \fr 3:14 \fr*\ft \+xt యెషయా 8:12\+xt*\ft*\f* \v 15 మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండండి. \v 16 మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో ఉన్న మీ మంచి ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడేవారు తమ మాటలకు తామే సిగ్గుపడతారు. \v 17 అదే దేవుని చిత్తమైతే, కీడు చేసిన బాధపడడం కంటే, మేలు చేసి బాధపడడమే మంచిది. \v 18 ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకురావడానికి, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు. \v 19 ఆయన సజీవుడైన తర్వాత,\f + \fr 3:19 \fr*\ft లేదా \ft*\fqa అయితే ఆత్మలో సజీవుడైన తర్వాత\fqa*\f* అనగా చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించారు; \v 20 నోవహు ఓడను నిర్మిస్తున్న రోజుల్లో, దేవునికి అవిధేయంగా ఉన్న వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కోసం సహనంతో వేచి ఉన్నారు. ఓడలోని కొద్దిమంది, అనగా ఎనిమిది మంది మాత్రమే నీటి నుండి రక్షించబడ్డారు. \v 21 ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది.\f + \fr 3:21 \fr*\ft లేదా \ft*\fqa స్వచ్ఛమైన మనస్సాక్షి కోసం దేవునికి మొర పెట్టుము\fqa*\f* \v 22 ఆయన పరలోకానికి వెళ్లి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు. \c 4 \s1 దేవుని కోసం జీవించుట \p \v 1 క్రీస్తు తన శరీరంలో శ్రమపడ్డారు, కాబట్టి మీరు అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే శరీరంలో శ్రమపడే వారు పాప జీవితాన్ని విడిచిపెడతారు. \v 2 కాబట్టి ఇప్పటినుండి మీరు ఈ లోకంలో మిగిలిన జీవితకాలాన్ని మానవ ఆశలను అనుసరించడానికి కాకుండా దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండేలా కొనసాగించండి. \v 3 ఎందుకంటే, మీరు గతకాలంలో దేవుని ఎరుగనివారిగా జీవించారు, సిగ్గుమాలిన వారై, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, అల్లరితో కూడిన ఆటపాటలు, అసహ్యకరమైన విగ్రహారాధనలు చేస్తూ జీవించారు. \v 4 మీరు ఆ యూదేతరులతో కలిసి విచ్చలవిడిగా నిర్లక్ష్యంగా జీవించకపోవడం చూసి వారు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. \v 5 కాని వారు దేవుని ఎదుట సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. \v 6 అందుకే చనిపోయినవారు శరీర విషయంలో మానవ ప్రమాణాల ప్రకారం తీర్పు పొందేలా, ఆత్మీయ జీవితంలో దేవుని బట్టి జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది. \p \v 7 అన్నిటికి అంతం సమీపించింది, కాబట్టి మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి. \v 8 అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది. \v 9 సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి. \v 10 అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు దేవుని నుండి తాము పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి. \v 11 ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్. \s1 క్రైస్తవునిగా ఉండడం వల్ల వచ్చే శ్రమలు \p \v 12 ప్రియ మిత్రులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చిన అగ్నివంటి పరీక్షను చూసి మీకేదో వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపడకండి. \v 13 క్రీస్తు మహిమ వెల్లడి అయినప్పుడు మీరు మహానందాన్ని అనుభవించేలా ఆయన బాధల్లో పాలుపొందామని ఆనందించండి. \v 14 క్రీస్తు నామం కోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమగల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావము. \v 15 ఒకవేళ మీరు శ్రమపడినా, హంతకునిగా దొంగగా దోషిగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకొన్న వారిగా ఆ శ్రమ ఉండకూడదు. \v 16 అయినా, మీరు క్రైస్తవునిగా శ్రమపడితే సిగ్గుపడకండి, కాని మీరు ఆ నామాన్ని మోస్తున్నవారిగా దేవున్ని స్తుతించండి. \v 17 తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైంది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు. అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి? \v 18 అలాగే, \q1 “నీతిమంతుడే రక్షించబడడం కష్టమైతే, \q2 భక్తిహీనులు, పాపాత్ముల గతి ఏంటి?”\f + \fr 4:18 \fr*\ft \+xt సామెత 11:31\+xt*\ft*\f* \p \v 19 కాబట్టి, దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవించేవారు మంచి కార్యాలను కొనసాగిస్తూ, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. \c 5 \s1 సంఘ పెద్దలకు సంఘానికి \p \v 1 తోటి సంఘపెద్దగా, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినై ఉండి, ప్రత్యక్షం కాబోతున్న మహిమలో భాగం పంచుకోబోతున్న నేను మీ సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే: \v 2 మీ స్వాధీనంలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. అయిష్టంతో కాక దేవుని చిత్తం అనుకుని ఇష్టపూర్వకంగా దాన్ని కాపాడండి. లాభం మీద దురాశతో కాక మనస్సు పూర్వకంగా దాన్ని కాయండి; \v 3 మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి. \v 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీరు ఎప్పటికీ తరిగిపోని మహిమ కిరీటం పొందుతారు. \p \v 5 అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా, \q1 “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు \q2 కాని దీనులకు దయ చూపిస్తారు.”\f + \fr 5:5 \fr*\ft \+xt సామెత 3:34\+xt*\ft*\f* \m \v 6 దేవుని బలమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. \v 7 ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి. \p \v 8 మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు. \v 9 దృఢ విశ్వాసులై వానిని ఎదిరించండి. ప్రపంచమంతా ఉన్న విశ్వాసుల కుటుంబం ఇలాంటి బాధలనే అనుభవిస్తుందని మీకు తెలుసు. \p \v 10 తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంతకాలం బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు. \v 11 ఆయనకే నిరంతరం ప్రభావం కలుగును గాక ఆమేన్. \b \s1 తుది శుభాకాంక్షలు \p \v 12 నేను నమ్మకమైన సహోదరునిగా భావించే సీల\f + \fr 5:12 \fr*\ft గ్రీకులో \ft*\fqa సిల్వాను \fqa*\ft సీల యొక్క మరో రూపం\ft*\f* సహాయంతో ఈ కొద్ది మాటలు వ్రాస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలని, ఇది దేవుని నిజమైన కృప మాత్రమే అని సాక్ష్యమిస్తున్నాను. మీరు దీనిలో నిలిచి ఉండండి. \b \p \v 13 బబులోనులో మీలా ఏర్పరచబడిన మీ సహోదర సంఘం, నా కుమారుడైన మార్కు కూడ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. \p \v 14 ప్రేమపూర్వకమైన ముద్దుతో ఒకరికొకరు శుభాలు చెప్పుకోండి. \b \p క్రీస్తులో ఉన్న మీకందరికి శాంతి కలుగును గాక.