\id 1JN - Biblica® Open Telugu Contemporary Version \ide UTF-8 \h 1 యోహాను పత్రిక \toc1 యోహాను వ్రాసిన మొదటి పత్రిక \toc2 1 యోహాను పత్రిక \toc3 1 యోహాను \mt1 యోహాను \mt2 వ్రాసిన మొదటి పత్రిక \c 1 \s1 శరీరధారియైన జీవవాక్యం \p \v 1 ఆది నుండి ఉన్న జీవవాక్యం గురించి మేము విన్నది, మా కళ్ళతో చూసింది, మా చేతులతో తాకింది మేము ప్రకటిస్తున్నాము. \v 2 ఆ జీవం ప్రత్యక్షమైంది; తండ్రి దగ్గర ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్యజీవాన్ని మేము చూసి, ఆ జీవాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ దాన్ని మీకు తెలియజేస్తున్నాము. \v 3 తండ్రితో కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడా మాతో చేరేలా మేము చూసినవాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము. \v 4 మన\f + \fr 1:4 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa మీ\fqa*\f* ఆనందం సంపూర్ణమవ్వాలని మేము దీనిని వ్రాస్తున్నాము. \s1 వెలుగు, చీకటి, పాపం, క్షమాపణ \p \v 5 మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. \v 6 ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే మనం అబద్ధం చెప్పినట్లే, సత్యంలో జీవించడం లేదు. \v 7 అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము. ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనల్ని శుద్ధి చేస్తుంది. \p \v 8 ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు. \v 9 ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనల్ని శుద్ధి చేస్తారు. \v 10 మనం పాపం చేయలేదని చెప్పుకుంటే, మనం ఆయనను అబద్ధికుని చేస్తాము; మనలో ఆయన వాక్యం లేదు. \c 2 \p \v 1 నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నారు. \v 2 ఆయనే మన పాపాలకు కూడా ఆయనే ప్రాయశ్చిత్త బలి. మన కోసం మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కోసం కూడా. \s1 తోటి విశ్వాసుల పట్ల ప్రేమ ద్వేషం \p \v 3 మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనకు తెలుస్తుంది. \v 4 కాని ఎవరైనా, “నేను ఆయనను తెలుసుకున్నాను” అని చెప్తూ, ఆయన ఆజ్ఞాపించింది చేయనివారు అబద్ధికులు, వారిలో సత్యం ఉండదు. \v 5 అయితే ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో వారిలో దేవుని పట్ల ప్రేమ\f + \fr 2:5 \fr*\fq ప్రేమ \fq*\ft లేదా దేవుని ప్రేమ\ft*\f* నిజంగా పరిపూర్ణమవుతుంది. మనం ఆయనలో ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాము. \v 6 ఆయనలో జీవిస్తున్నామని చెప్పేవారు యేసు క్రీస్తులా జీవించాలి. \p \v 7 ప్రియ స్నేహితులారా, నేను మీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ప్రారంభం నుండి మీరు కలిగి ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న సందేశమే. \v 8 అయినా నేను ఒక క్రొత్త ఆజ్ఞ వ్రాస్తున్నాను; చీకటి గతించిపోతుంది, ఇప్పటికే నిజమైన వెలుగు ప్రకాశిస్తున్నది కాబట్టి దాని సత్యం ఆయనలో మీలో కనిపిస్తూ ఉంది. \p \v 9 తాను వెలుగులో ఉన్నానని చెప్తూ తన సహోదరున్ని సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. \v 10 తన సహోదరిని సహోదరులను ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు; వారిలో అభ్యంతరం కలిగించేది ఏది ఉండదు. \v 11 అయితే తన సహోదరిని, సహోదరున్ని ద్వేషించేవారు చీకటిలో ఉండి, చీకటిలోనే తిరుగుతారు. ఆ చీకటి వారిని గ్రుడ్డివారిగా చేస్తుంది, కాబట్టి తాము ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు. \s1 వ్రాయడానికి గల కారణాలు \q1 \v 12 ప్రియ పిల్లలారా, ఆయన నామంలో మీ పాపాలు క్షమించబడ్డాయి, \q2 కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. \q1 \v 13 తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, \q2 కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. \q1 యవ్వనస్థులారా, మీరు దుష్టుని జయించారు, \q2 కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. \b \q1 \v 14 ప్రియ బిడ్డలారా, మీకు తండ్రి తెలుసు, \q2 కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. \q1 తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, \q2 కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. \q1 యవ్వనస్థులారా, మీరు బలవంతులు, \q2 దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది; \q2 మీరు దుష్టుని జయించారు; \q2 కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. \s1 లోకాన్ని ప్రేమించరాదు \p \v 15 ఈ లోకాన్ని లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల ప్రేమ\f + \fr 2:15 \fr*\fq ప్రేమ \fq*\ft లేదా \ft*\fqa తండ్రి ప్రేమ\fqa*\f* వారిలో ఉండదు. \v 16 ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం. ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి. \v 17 ఈ లోకం దాని ఆశలు గతించిపోతాయి కాని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు శాశ్వతంగా జీవిస్తారు. \s1 కుమారుని తిరస్కరించినందుకు హెచ్చరికలు \p \v 18 ప్రియ పిల్లలారా, ఇది చివరి గడియ; క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నట్లుగానే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీనిని బట్టి ఇదే చివరి గడియ అని మనకు తెలుస్తుంది. \v 19 వారు మనలో నుండి బయలుదేరారు, కాని నిజానికి వారు మనకు సంబంధించినవారు కారు. ఎందుకంటే వారు మనకు సంబంధించినవారైతే మనతోనే నిలిచి ఉంటారు; అయితే వారు అలా వెళ్లిపోవడం వల్ల వారిలో ఒక్కరు కూడా మనకు సంబంధించినవారు కారని తెలుస్తుంది. \p \v 20 అయితే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు, మీ అందరికి సత్యం తెలుసు.\f + \fr 2:20 \fr*\ft కొ.ప్ర.లలో \ft*\fqa మీకు సమస్తం తెలుసు\fqa*\f* \v 21 మీకు సత్యం తెలియదని నేను మీకు వ్రాయడం లేదు కాని సత్యం మీకు తెలుసు, సత్యం నుండి అబద్ధం పుట్టదని మీకు తెలుసు కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. \v 22 అయితే అబద్ధికులు ఎవరు? ఎవరైతే యేసును క్రీస్తు కాదంటారో వారే. తండ్రిని కుమారుని తిరస్కరించేవాడే క్రీస్తు విరోధి. \v 23 ఎందుకంటే, కుమారుని తిరస్కరించిన వారికి తండ్రి లేడు; కుమారుని అంగీకరించినవారికి తండ్రి ఉన్నాడు. \p \v 24 మీరైతే, మొదటి నుండి మీరు దేన్ని విన్నారో అది మీలో నిలిచి ఉండేలా చూసుకోండి. అది మీలో నిలిచివుంటే, మీరు కూడా కుమారునిలో తండ్రిలో నిలిచివుంటారు. \v 25 ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవము. \p \v 26 మిమ్మల్ని తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నించే వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాను. \v 27 మీరైతే, ఆయన నుండి మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది, కాబట్టి ఎవరు మీకు బోధించవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాని అబద్ధం కాదు; అదే అన్ని విషయాల గురించి మీకు బోధిస్తుంది. అది మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉండండి. \s1 దేవుని బిడ్డలు, పాపం \p \v 28 కాబట్టి, ప్రియ పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ముందు మనం సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండేలా మీరు ఆయనలో కొనసాగండి. \p \v 29 ఆయన నీతిమంతుడని మీకు తెలిస్తే, నీతిని జరిగించే ప్రతి ఒక్కరు ఆయన మూలంగా పుట్టారని మీరు తెలుసుకుంటారు. \c 3 \p \v 1 మనం దేవుని పిల్లలమని పిలువబడునట్లు, తండ్రి ఎంత గొప్ప ప్రేమను మనపై కురిపించాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఈ కారణంగానే లోకానికి మనం తెలియదు. ఎందుకంటే దానికి ఆయన తెలియదు. \v 2 ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు,\f + \fr 3:2 \fr*\ft లేదా \ft*\fqa అది తెలియజేయబడినప్పుడు\fqa*\f* ఆయన యథార్థ రూపాన్ని మనం చూస్తాము కాబట్టి, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము. \v 3 ఆయనలో నిరీక్షణ ఉంచు ప్రతివారు, ఆయన పవిత్రుడై ఉన్నట్లే తనను పవిత్రునిగా చేసుకుంటారు. \p \v 4 పాపం చేసే ప్రతివారు ఆజ్ఞను అతిక్రమిస్తారు; ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. \v 5 పాపాలను తొలగించడానికే క్రీస్తు ప్రత్యక్షమయ్యారని మీకు తెలుసు. ఆయనలో ఎలాంటి పాపం లేదు. \v 6 ఆయనలో జీవించేవారు ఎవరూ పాపంలో కొనసాగరు. పాపంలో కొనసాగేవారు ఆయనను ఎన్నడూ చూడలేదు తెలుసుకోలేదు. \p \v 7 ప్రియ పిల్లలారా, మీరు ఎవరిచేత మోసపోకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు, నీతిని జరిగించే ప్రతివారు నీతిమంతులే. \v 8 సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కాబట్టి పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు. \v 9 దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కాబట్టి వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి పాపం చేయలేరు. \v 10 దీనిని బట్టి దేవుని పిల్లలెవరో సాతాను పిల్లలెవరో మనకు తెలుస్తుంది; నీతిని జరిగించని వారు, తన సహోదరుని, సహోదరిని ప్రేమించనివారు దేవుని పిల్లలు కారు. \s1 ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ద్వేషం \p \v 11 మనం మొదటి నుండి వింటున్న సందేశం: మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి \v 12 కయీను వలె ఉండవద్దు, అతడు దుష్టునికి చెందినవాడై తన సహోదరుని చంపాడు. అతడు తన సహోదరుని ఎందుకు చంపాడు? ఎందుకంటే అతడు చేసిన పనులు చెడ్డవి, అతని సహోదరుని పనులు నీతి గలవి. \v 13 నా సహోదరి సహోదరులారా,\f + \fr 3:13 \fr*\ft దేవుని కుటుంబానికి చెందిన స్త్రీ పురుషులైన విశ్వాసులకు వర్తిస్తుంది.\ft*\f* ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి. \v 14 మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తున్నాము, కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమ లేనివారు మరణంలో నిలిచివుంటారు. \v 15 తన సహోదరిని, సహోదరుని ద్వేషించేవారు నరహంతకులు, ఏ నరహంతకునిలో నిత్యజీవం ఉండదని మీకు తెలుసు. \p \v 16 ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టారు, కాబట్టి దీని వలన ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా మన సహోదరి సహోదరుల కోసం మన ప్రాణాలను పెట్టాలి. \v 17 ఈ లోకపు ఆస్తులు కలిగినవారు అవసరంలో ఉన్న తన సహోదరుని సహోదరిని చూసి కూడా వారిపై కనికరం చూపించకపోతే, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? \v 18 ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము. \p \v 19 దీనిని బట్టి, మనం సత్యానికి సంబంధించినవారమని మనకు తెలుస్తుంది, మన హృదయాలు ఆయన సన్నిధిలో విశ్రాంతిగా ఉంటాయి; \v 20 మన హృదయం మనపై దోషారోపణ చేస్తే, మన హృదయం కంటే దేవుడు గొప్పవాడని ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం తెలుసుకుంటాము. \v 21 ప్రియ స్నేహితులారా, మన హృదయం మనపై దోషారోపణ చేయకపోతే, దేవుని ముందు ధైర్యంగా ఉంటాము. \v 22 ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే, మనం అడిగిన ప్రతిదాన్ని ఆయన నుండి పొందుకుంటాము. \v 23 ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. \v 24 దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నారని మనకు తెలుస్తుంది. \c 4 \s1 మోసపరచు ఆత్మలను తిరస్కరించుట \p \v 1 ప్రియ మిత్రులారా, అబద్ధ ప్రవక్తలు చాలామంది లోకంలో బయలుదేరారు, కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకుండా, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. \v 2 దేవుని ఆత్మను మనం ఈ విధంగా గుర్తించవచ్చు: యేసు క్రీస్తు మానవ శరీరాన్ని ధరించి వచ్చారని ఒప్పుకునే ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చిందే. \v 3 అయితే యేసు దేవుని నుండి వచ్చారని ఒప్పుకొనని ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధి ఆత్మ. అది వస్తున్నదని మీరు విన్నారు కాని ఇప్పటికే అది లోకంలోనికి వచ్చి ఉన్నది. \p \v 4 ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించారు. \v 5 వారు లోకానికి చెందినవారు కాబట్టి లోకరీతిగా మాట్లాడతారు, లోకం వారి మాటలు వింటుంది. \v 6 కాని మనం దేవునికి చెందినవారం, దేవుని ఎరిగిన ప్రతి ఒకరు మన మాటలు వింటారు. దేవునికి చెందనివారు మన మాటలు వినరు. కాబట్టి సత్యమైన ఆత్మను అబద్ధపు ఆత్మను దీనిని బట్టి మనకు తెలుస్తుంది. \s1 దేవుని ప్రేమ, మన ప్రేమ \p \v 7 ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కాబట్టి మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి వారు దేవున్ని ఎరిగినవారు. \v 8 దేవుడే ప్రేమ, కాబట్టి ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు. \v 9 ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ఈ విధంగా దేవుడు మన మధ్య తన ప్రేమను చూపించారు. \v 10 మనం దేవుడిని ప్రేమించామని కాదు కాని ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ఇదే ప్రేమంటే. \v 11 ప్రియ మిత్రులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి. \v 12 దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది. \p \v 13 మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని దీనిని బట్టి మనకు తెలుస్తుంది: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు. \v 14 లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం మేము చూశాం సాక్ష్యమిచ్చాము. \v 15 యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు. \v 16 దేవునికి మనపై ఉన్న ప్రేమను తెలుసుకొని మనం దానిపైన ఆధారపడుతున్నాము. \p దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు. \v 17 తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము. \v 18 ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కాబట్టి భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు. \p \v 19 ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము. \v 20 అయితే ఎవరైనా తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ తన సహోదరుని సహోదరిని ద్వేషించేవారు అబద్ధికులు. తాము చూస్తున్న తన సహోదరుని లేదా సహోదరిని ప్రేమించలేనివారు తాము చూడని దేవుని కూడా ప్రేమించలేరు. \v 21 కాబట్టి దేవుని ప్రేమించే ప్రతివారు తమ సహోదరుని సహోదరిని కూడ ప్రేమించాలి అనేదే క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ. \c 5 \s1 దేవుని కుమారునిగా పుట్టిన వానిని విశ్వసించుట \p \v 1 యేసే క్రీస్తు అని విశ్వసించే ప్రతి ఒక్కరు దేవుని మూలంగా పుట్టినవారే. తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఆయన కుమారుని కూడా ప్రేమిస్తారు. \v 2 దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుట ద్వారా మనం దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నామని మనకు తెలుస్తుంది. \v 3 నిజానికి, దేవుని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఆయన ఆజ్ఞలు కష్టతరమైనవి కావు. \v 4 దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. \v 5 లోకాన్ని ఎవరు జయించగలరు? యేసు దేవుని కుమారుడని నమ్మినవారు మాత్రమే కదా. \p \v 6 నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే రాలేదు, కాని నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చారు. ఆత్మ సాక్ష్యమిస్తున్నాడు ఎందుకంటే ఆత్మ సత్యము. \v 7 దానికై ముగ్గురు సాక్ష్యమిస్తున్నారు: \v 8 ఆత్మ, నీరు, రక్తం; ఈ ముగ్గురు ఏకీభవిస్తున్నారు. \v 9 మనం మానవులిచ్చే సాక్ష్యాన్ని అంగీకరిస్తాం, కాని దేవుడిచ్చే సాక్ష్యం గొప్పది, ఎందుకంటే అది ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము. \v 10 కాబట్టి దేవుని కుమారుని విశ్వసించే ప్రతివారు ఈ సాక్ష్యాన్ని అంగీకరిస్తారు. దేవుని విశ్వసించనివారు తన కుమారుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని నమ్మలేదు, కాబట్టి దేవున్ని అబద్ధికునిగా చేస్తున్నారు. \v 11 ఆ సాక్ష్యం ఇదే: దేవుడు మనకు నిత్యజీవాన్ని ఇచ్చారు, ఈ జీవం ఆయన కుమారునిలో ఉంది. \v 12 కుమారుని కలిగిన ప్రతివారిలో ఈ జీవం ఉన్నది; దేవుని కుమారుని పొందని వారిలో జీవం లేదు. \s1 తుది ధ్రువీకరణలు \p \v 13 దేవుని కుమారుని నామాన్ని విశ్వసించే మీరు నిత్యజీవం గలవారని తెలుసుకుంటారని వీటిని మీకు వ్రాస్తున్నాను. \v 14 మనం దేవున్ని సమీపిస్తున్నప్పుడు మనకు ఉండే నమ్మకం ఇదే: ఆయన చిత్తప్రకారం మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారు. \v 15 మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారని మనకు తెలిస్తే, మనం ఆయనను ఏది అడిగామో అది కలిగి ఉన్నామని మనకు తెలుసు. \p \v 16 తన సహోదరుడు గాని సహోదరి గాని మరణానికి గురి చేయని పాపం చేయడం మీరు చూస్తే, మీరు తప్పక ప్రార్థించాలి. అప్పుడు దేవుడు వారికి జీవం ఇస్తారు. మరణానికి నడిపించే పాపం ఉంది. మీరు దాని గురించి ప్రార్థించాలని నేను చెప్పడం లేదు. \v 17 తప్పులన్నీ పాపమే, మరణానికి నడిపించని పాపం ఉంది. \p \v 18 దేవుని మూలంగా పుట్టిన వారెవరు పాపం కొనసాగించలేరని మనకు తెలుసు; దేవుని మూలంగా పుట్టిన వారు తమను తాము భద్రం చేసుకుంటారు, కాబట్టి దుష్టుడు వారిని ముట్టలేడు. \v 19 మనం దేవుని పిల్లలమని, లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉన్నదని మనకు తెలుసు. \v 20 మనం సత్యవంతుడైన వానిని తెలుసుకునేలా చేయడానికి, దేవుని కుమారుడు వచ్చాడని, మనకు తెలివిని ఇచ్చారని మనకు తెలుసు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఉండడం ద్వారా సత్యవంతునిలో మనం ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్యజీవము. \b \b \p \v 21 చిన్న పిల్లలారా, విగ్రహాలకు దూరంగా ఉండండి.