\id 2JN - RELLI PROJECT \ide UTF-8 \h 2 యోహాను \toc3 2 యోహాను \toc2 2 యోహాను \toc1 యోహాను రాసిలా దీటో పత్రిక \mt2 యోహాను రాసిన రెండొ పత్రిక \mt1 యోహాను రాసిలా దీటో పత్రిక \imt అగరొ కొత \ip దీటో యోహాను పత్రిక అపోస్తులుడైలా యోహాను క్రీ .స. 50-100 బొచ్చురోనె మొజికల్రె రాసిసి. యోహాను రచయితగా గుర్తించిగిల్లాని. ఈనె సడకు బదులుగా సెయ్యె బొట్టా బులి డక్కిపించిగిచ్చి. 2 వ యోహానురొ సంగతీనె ఇంకా యోహాను సువార్తరొ సంగతీనె కూర్పురె సంబందము కలిక్కిరి తల్లాపనికిరి దిగదూసె. ఆండ్రె ముక్యముగా యేసు జొనుకు జొనె ప్రేమ కలిక్కిరి తమ్మాసిబుల్లా ఆజ్ఞకు కొయిలా పనికిరి యెయ్యె తా ఆజ్ఞానె పాటించివురొ యేసుకు ప్రేమించిలాలింకు కొయిసి \xt 1:5-6\xt*, \xt యోహాను 15:9-10\xt* యెడకుదరికిరి యోహానాక, యోహాను సువార్త ఇంకా 1 వ యోహాను 2 వ యోహాను 3 వ యోహాను ఎపెస్సిరె రొయితల్లాబెల్లె రాసిసిబులి నమ్ముసె. \ip యోహాను బచ్చిగిల్లా మొట్ట తా పిల్లానెకు యే ఉత్తరం రాసిలీసి. యెయ్యె సంగముకు ఉద్దేసించికిరి రాసిలీసి. యోహాను యే ఉత్తరము ద్వారా సంగముకు ప్రోత్సాహించుకుంటా సొరొబోదకులు గురించి హెచ్చరించిలీసి. \iot సంగతీనె \io1 1. యోహాను దండము కొయికుంటా, సెయ్యె కేసెవొ పాటకులుకు పరిచయం కొరిగిచ్చి \ior 1:1-3 \ior* \io1 2. తర్వాతరె సెయ్యె సంగముకు ప్రోత్సాహించుకుంటా, గొప్ప ఆజ్ఞానెకు గేపకం కొర్లీసి \ior 1:4-6\ior* \io1 3. ఇంకా సొరొ బోదకులు గురించి హెచ్చరించువురొ \ior 1:7-11\ior* \io1 4. యోహాను సెయ్యె రొల్లా సంగవిస్వాసులుకు దండము కొయికుంటా పత్రికకు ముగించువురొ \ior 1:12-13 \ior* \c 1 \s సుబం \p \v 1 బొట్ట యీలా మియి, పురువు ద్వారా బచ్చిగిల్లా మాకు తా పిల్లానుకు సుబం బులి కొయికిరి రాసిలించి. మియ్యాక, మియి మాత్రమాక నీ గని సత్యము జనిలా సొబ్బిలింకె, అమె, అం దీకిరి కెబ్బుకూ రొల్లాలింకె తొముకు ప్రేమించిలీసె. \v 2 కిరకుబుల్నే సత్యము అం దీకిరాక అచ్చి. సడ కెబ్బుకూ అం సంగరాక తాసి. \p \v 3 సొత్తైల ప్రేమానె అంబిత్తరె రొల్లాబెల్లె బో యీల పురువు పక్కరె దీకిరి, బోరొ పో యీలా యేసుక్రీస్తు పక్కరె దీకిరి క్రుప, కనికరము, సమాదానము అం సంగరె తాసి. \s సత్యము ఇంకా ప్రేమ \p \v 4 బో వల్లరె అమె ఆజ్ఞకు పొందిలా పనికిరి తో పిల్లానె కుండెలింకె సత్యముకు అనుసరించికిరి చలిగివురొ జనికిరి బడే సొరదపొడిలించి. \v 5 ఈనె మా, నో ఆజ్ఞ తొత్తె రాసిలాపనికిరి నీ గని, అగరెదీకిరి అముకు కలిగిలా ఆజ్ఞాక రాసికిరి, అమె జొనుకు జొనె ప్రేమించిమంచెబులి తొత్తె బతిమాలిగిల్లించి. \v 6 అమె తా ఆజ్ఞానె ప్రకారంగా చలువురాక ప్రేమ; తొమె అగరెదీకిరి సునిల పనికిరి ప్రేమరె చలిమంచె బుల్లాటాక సే ఆజ్ఞ. \p \v 7 యేసుక్రీస్తు దేకు దరించిగినికిరి అయిసిబులి నాఒప్పిగిల్లా సత్రువూనె బడేలింకె లోకమురె బయలుదేరికిరి అచ్చె. సాకిరినీబులి కొయిలాలింకె క్రీస్తుకు విరోదులైకిరి అచ్చె. \v 8 అమె తొం మొజిరె పూర్తికొరిలా పైటీనె నాచెడిదీకుంటా, తొమె‍ పూర్తిపలము పొందిలాపనికిరి జాగర్తగా దిగ్గునోండి. \p \v 9 క్రీస్తు బోదరె నాటారేకిరి సడకు సడికిరి అగురుకు జేతల్లా ప్రతి మనమ, పురువుకు నాఒప్పిగిల్లాట. సే బోదరె టారేలాట బోకు, పోకు ఒప్పిగిల్లాట. \p \v 10 కేసైనెను ఏ బోదకు నాదన్నెకిరి తొం పక్కు అయిలబెల్లె తాకు తో గొరొబిత్తరె చేరిగినితెనాండి; \v 11 సుబం బులి తాసంగరె కొయిలాట తా దుస్టపైటినిరె బంటిగునుసి. \s ఆకరి కొతానె \p \v 12 బడే సంగతీనె తొముకు రాసివురొ అచ్చి గని, సిరాసంగరె కాగితము సంగరె రాసితె మనస్సునీకిరి తొం సంతోసము పూర్తయిలాపనికిరి తొముకు మిసిగీకిరి ప్రత్యక్సంగా కొతలగితె ఆసగా అచ్చి. \p \v 13 బచ్చిగిల్లా తొం, ప్రియమైలా తొం అప్పబొయినిరొ పిల్లానె తొముకు సుబానె కొయిలీసె.